Activities calendar

15 June 2018

19:56 - June 15, 2018

కరీంనగర్ : ప్రేమోన్మాది దాడికి మరో యువతి బలైంది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో యువతిని దారుణంగా హత్య చేసాడు ఓ ఉన్మాది. కరీంనగర్‌ కలెక్టరేట్‌ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతు రసజ్న మృతి..
కరీంనగర్‌ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో వేధిస్తూ రసజ్ఞ అనే యువతిని దారుణంగా గొంతు కోసి చంపాడు వంశీధర్‌ అనే యువకుడు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కరీంనగర్ కలెక్టరేట్‌ ఎదుట ఉన్న మీసేవ కార్యాలయంలో రసజ్ఞ రెండు నెలల నుండి ట్రైనీ ఆపరేటర్‌గా పని చేస్తుంది. రోజు లాగే మీసేవలో విధులు నిర్వహించేందుకు వచ్చిన రసజ్ఞతో వంశీధర్‌ గొడవ పడినట్లు తెలుస్తోంది. గొడవ పెద్దది కావడంతో మీసేవ వద్దే వంశీ తన వద్ద ఉన్న కత్తితో యువతి గొంతు కోశాడు. అడ్డుకోబోయిన వారిపై కూడా దాడికి దిగాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడ్డ రసజ్ఞను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

ప్రేమ పేరుతో రసజ్ఞను వేధిస్తున్న వంశీధర్..
కాటారం మండలం శంకరంపల్లికి చెందిన నిందుతుడు వంశీధర్‌.... ప్రస్తుతం గోదావరిఖని మార్కండేయ కాలనీలో నివాసం ఉంటున్నాడు. వంశీ 3 ఏళ్ల నుండి ప్రేమ పేరుతో రసజ్ఞను వేధిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వేధింపులు భరించలేకే..... రసజ్ఞ కరీంనగర్‌లోని బంధువుల ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. రసజ్ఞ మరణంతో ఆమె కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు. మరణ వార్త తెలుసుకున్న వెంటనే ఆమె బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకొని రసజ్ఞను హత్య చేసిన వంశీధర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

19:28 - June 15, 2018

విజయవాడ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయన్నారు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈ మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి చేర్చేందుకు జులై 17న సింహ గర్జన పేరుతో ఢిల్లీలో కార్యక్రమం చేపట్టబోతున్నామని మందకృష్ణ పేర్కొన్నారు. 

19:26 - June 15, 2018

అమరావతి : పౌరసరఫరాల్లో అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లు, మండల స్థాయి స్టాక్‌ పాయింట్ల ఇన్‌చార్జ్‌లపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో రెండు నెలల్లో 95 శాతం సంతృప్తి తీసుకొచ్చేందుకు ఈ అంశాన్ని ప్రాధాన్యత ఇస్తోంది. 1256 షాపుల్లో 40 శాతం సంతృప్తి కూడా లేదు. ఈ డీలర్లు పది రోజుల్లో పద్ధతులు మార్చుకోతే చౌకధరల దుకాణాలను డ్వాక్రా గ్రూపులు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. 

19:19 - June 15, 2018

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత నీతి అయోగ్ సమావేశం 17వ తేదీన జరుగనుంది. తెలుగు రాష్ట్రాలకు నిధుల విడుదల విషయంలో కేంద్రం అవలంభిస్తున్న తీరుపై తెలుగు రాష్ట్రాల సీఎంలు అసహనం వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలో నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, కర్ణాటక సీఎం కుమారస్వామిలతో మాట్లాడారు. కాగా ఈ సమావేశాన్ని కొందరు సీఎంలు బహిష్కరించాలనే యోచనలో వున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో నీతి అయోగ్ సమావేశం ఎలా జరగనుంది? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 'న్యూ ఇండియా 2022' అనే ప్రధాన ఎజెండాతో ఈ నీతి అయోగ్ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో నీతి అయోగ్ సమావేశం ఎలా జరగనుంది? దీనిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా స్పందించనున్నారు? అనే అంశాలపై చర్చ. ఈచర్చలో సీపీఎం రాష్ట్రకమిటీ సభ్యులు నంద్యాల నర్శింహారెడ్డి,టీఆర్ఎస్ నేత శేఖర్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిథి ప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత మాల్యాద్రి పాల్గొన్నారు. 

18:28 - June 15, 2018

హైదరాబాద్ : వర్ధమాన సంగీత దర్శకుడు అనురాగ్ వినిల్ ఆత్మహత్య ఉదంతం కలకలం రేపుతోంది. వారం క్రితమే అనురాగ్ నాగోల్ లోని మమతా నగర్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అనురాగ్ కు గత కొంతకాలంలో కొంతమంది నుండి వేధింపులు ఎదురవుతున్నాయనీ..అందుకే అనురాగ్ డ్రగ్స్ కు బానిస అయినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఆత్మహత్య వెనుక బలమైన కారణం ఏమిటో తెలియాల్సివుంది.

17:58 - June 15, 2018

అష్టా చమ్మా నుండి క్లాస్ కథలకు తనదైన శైలిలో హ్యూమర్ జోడిస్తూ.. విజయాలు అందుకుంటున్న మోహన్ కృష్ణ ఇంద్రగంటి నుండి వచ్చిన మరో మెచ్యూర్డ్ కూల్ బ్రిజ్ లవ్ ఎంటర్టైనర్ సమ్మోహనం.. ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమాలో సుధీర్ బాబు, అథితిరావ్ హైదరీ హీరో హీరోయిన్స్ గా నటించారు.. సమ్మోహనం పేరుకు తగ్గట్టే ఆడియన్స్ ను సమ్మోహన పరిచిందా.. లేదా.. నిరాశపరిచిందా.. అనేది ఇప్పుడు చూద్దాం..

కథ విషయానికి వస్తే.. సినిమాలు అన్నా సినిమా మనుషులు అన్నా.. సదాభిప్రాయం లేని విజయ్.. ఆర్ట్ ని తన కెరీర్ ను ఎంచుకుంటాడు.. అయితే అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల వలన టాప్ స్టార్ హీరోయిన్ సమీరా తో ఒక చిన్న జర్నీ ఏర్పడుతుంది.. ఆ జర్నీలో అనుకోకుండా ఆమెతో ప్రేమలో పడతాడు విజయ్. అదే విషయాన్ని సమీరాకు చెపుతాడు.. ఆమె కూడా విజయ్ ను లవ్ చేసినప్పటికి, విజయ్ ప్రపోజల్ ను రిజక్ట్ చేస్తుంది.. అసలు సమీర విజయ్ లవ్ ను ఎందుకు రిజక్ట్ చేసింది.. దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి.. చివరకు సమీరా, విజయ్ ఎలా ఒకటి అయ్యారు అన్నది సినిమా చూసి తెలుసుకోవలసిందే..

నటీనటుల విషయానికి వస్తే.. ఈ మూవీకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది.. అథితీరావ్ హైదరీ. ఈ సినిమా పరంగా చూసుకుంటే.. హీరోయిన్ అయినప్పటికీ.. సినిమా మొత్తానికి బ్యాక్ బోన్ గా ఉండి నడిపించింది.. ఇంతకు ముందు చెలియా.. పద్మావత్ సినిమాలలోని తన అభినయంతో ఆకట్టుకున్న అథితీ.. ఈ సినిమాలో చాలా ఫ్రెష్ లుక్ తో సినిమాకు అవసరం అయిన మ్యాజిక్ క్రియేట్ చేయడంలో 100% సక్సెస్ అయ్యింది.. ముఖ్యంగా లవ్ సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో ఆమె పండించిన సటిల్డ్ ఎక్స్ ప్రెషన్స్ మెన్మరైజింగ్ గా ఉన్నాయి.. ఇక హీరో సుధీర్ బాబు విషయానికి వస్తే.. ఈ సినిమాలో నటన పరంగా చాలా మెచ్యూరిటీ చూపించాడు.. లవ్ డ్రామాను పండించడానికి ఇబ్బంది పడే సుధీర్ బాబు.. ఈ సినిమాలో మాత్రం.. ఆ డ్రా బ్యాక్ ను ఓవర్ కమ్ చేయగలిగాడు.. ఎమోషనల్ సీన్స్ లో సైతం మెలో డ్రామాను పండించగలిగాడు.. ఇక సీనియర్ ఆర్టిస్ట్ నరేష్ కి చాలా కాలం తరువాత సినిమాను నిలబెట్టే పాత్ర దక్కింది.. అతని క్యారక్టర్, ఆక్యారక్టర్ లో అతని పర్ఫామెన్స్ సమ్మోహనానికి సేవియర్ పాయింట్. ఇక రాహుల్ రామకృష్ణ, కాదంబరీ అభయ్, ఇలా వీళ్లంతా కలసి... తలో చేయి వేసి ఆడియన్స్ ను నవ్వించారు.. సినిమాను ముందుకు నడిపించారు.. పవిత్రా లోకేష్.. హరితేజ,. తనికెళ్ళ భరణీ.. తదితరులంతా.. పాత్రల పరిధి మేర డిగ్నిఫైడ్ పర్ఫామెన్స్ ఇచ్చారు..

టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఈ సినమాకు కర్తా, కర్మా, క్రియా అయిన మోహన కృష్ణ ఇంద్రగండి.. ఫస్ట్ పాయింట్ నుండి తన గ్రిప్ ను చూపించారు.. తన స్టైల్, హ్యూమర్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ.. లీడ్ పేయిర్ తో కనెక్ట్ అయ్యేలా మెచ్యూర్డ్ గా ఫస్ట్ ఆఫ్ ను నీట్ గా తీర్చి దిద్దాడు.. సెకండ్ ఆఫ్ కి వచ్చేప్పటికి.. హ్యూమర్ కంటెన్ట్ తగ్గడం తో పాటు హీరోయిన్ ప్లాష్ బ్యాక్ సీన్స్ అలాగే.హీరో రియలైజేషన్ సీన్స్ కాస్త సాగదీతగా అనిపించాయి అక్కడక్కడ కాస్త బ్రేక్స్ వేసినప్పటికీ.. ఓవర్ ఆల్ గా ముందు చెప్పినట్టుగా క్లాస్ అండ్ నీట్ ఎంటర్టైనర్ అందించడంలో సక్సెస్ అయ్యారు డైరక్టర్ ఇంద్రగంటి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే.. పెళ్ళిచూపులు ఫేమ్ వివేక్ సాగర్ ఈ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ కావాలో అలాంటి మ్యూజిక్ తో లవ్ ఫీల్ ను పదిరెట్లు పెంచాడు.. సాంగ్స్ కూడా సినిమాలో కలిసి పోయి, పోయిటిక్ గా సాగిపోయాయి..లిరిక్స్ కూడా చాలా మీనింగ్ ఫుల్ గా ఉన్నాయి.. ఇక ఆర్ట్ డైరక్షన్ వర్క్ ఇంప్రసీవ్ గా ఉంది.. సినిమాటోగ్రర్ పి.జి.విందా.. ఈ సినిమాకు ఎసెట్.. డైరక్టర్ ఇంద్రగంటితో అతనికి ఉన్న వేవ్ లెంత్ మాచింగ్ వల్ల కలర్ ప్లేవర్ మిస్ కాలేదు.. ముఖ్యంగా టెర్రస్ సీన్స్, క్లైమాక్స్ లో అతని వర్క్ స్పష్టంగా కనిపిస్తుంది.. ఎడిటింగ్ బాగుంది కాని ఇంకాస్త షార్ప్ గాఉంటే బెటర్ గా ఉండేది.. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.. ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే ఒక క్లాస్ అప్పీలింగ్ లవ్ ఎంటర్టైనర్.. గా తెరకెక్కిన సమ్మోహనం లవ్ ఎలిమెంట్స్ పరంగా, హ్యూమర్ ఎలిమెంట్స్ పరంగా, బాగా ఎంటర్టైన్ చేసినప్పటికి. స్లో నేరేషన్ అడ్డంకిగా నిలిచింది. మరి సమ్మోహన పరిచింది అని అనలేక పోయిన అలరిస్తుంది అని మాత్రం చెప్పవచ్చు..

 

ప్లస్ పాయింట్స్

లవ్ సీన్స్, డైరక్షన్

హీరో,హీరోయిన్ కెమిస్ట్రీ

కామెడీ, మ్యూజిక్

సినిమాటోగ్రఫి

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

నావెల్టి లేని కథ

స్లో నేరేషన్

ఊహాజనిత క్లైమాక్స్

కొన్ని డ్రాగింగ్ సీన్స్

సినిమా, సమ్మోహనం, అదితీ రావు హైదరీ, సుధీర్ బాబు,

 

 

 

మనవత్వాన్ని మేలు కొలిపేది రంజాన్ : పవన్

అమరావతి : మానవత్వాన్ని మేలుకొలిపేది, మానవులను మంచిగా బతకమని చెప్పేది రంజాన్ అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రంజాన్ పండగ నేపథ్యంలో ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పేది రంజాన్..ఇటువంటి గొప్ప సందేశాన్ని అందించే రంజాన్ మాసాన్ని ఎంతో నిష్ఠతో ఆచరించే ముస్లిం సోదర, సోదరీమణులు అందరికీ నా తరపున, జనసైనిక్స్ తరపున రంజాన్ శుభాకాంక్షలు.

24 నుండి సీఎం రమేశ్ ఆమరణ దీక్ష..

కడప : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తోన్న కేంద్ర సర్కారు తీరుకి నిరసనగా తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ... తన ఆమరణ దీక్ష ఈనెల 24 నుంచి ఉంటుందని, ఈ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు. తాము ఈనెల 17న ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి ఈ విషయంపై వినతిపత్రం ఇస్తామని, ఒకవేళ మోదీ స్పందించకపోతే తన ఆమరణ దీక్ష ఉంటుందని రమేష్‌ అన్నారు.

అసెంబ్లీ కార్యదర్శి, లా కార్యదర్శులకు హైకోర్టు నోటీసులు..

హైదరాబాద్ : శాసనసభలో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌లపై స్పీకర్‌ మధుసూదనాచారి సస్పెన్షన్‌ వేటు వేసిన వేయగా, సదరు కాంగ్రెస్‌ నేతలకి హైకోర్టులో ఊరట లభించిన విషయం తెలిసిందే. అయితే, హైకోర్టు నుంచి తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ తమను ఎమ్మెల్యేలుగా పరిగణించకుండా కోర్టు తీర్పును ధిక్కరిస్తున్నారని కాంగ్రెస్‌ సభ్యులు పిటిషన్‌ వేశారు. దీనిపై ఈరోజు విచారణ జరిపిన న్యాయస్థానం తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

16:44 - June 15, 2018

హైదరాబాద్ : టీడీపీ నేతలపై వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఒక్క రూల్‌ను కూడా పాటించడం లేదని ఆరోపించారు. ఓవైపు రూల్స్‌ను తుంగలో తొక్కుతూ మరోవైపు వైసీపీ నేతలను విమర్శించడం ఏంటని బుగ్గన ప్రశ్నించారు. ఢిల్లీలో బీజేపీ నేతలను రహస్యంగా కలవాల్సిన అవసరం తనకు లేదన్నారు. 

16:43 - June 15, 2018

అమరావతి : పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీటీపీపీ సమావేశంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం అనంతపురంలో సభ నిర్వహిస్తారు. రైల్వే జోన్‌ కోసం విశాఖలో దీక్ష చేపడతారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఎంపీ సీఎం రమేశ్‌ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. వైసీపీ... బీజేపీతో కుమ్మక్కై రాష్ట్రానికి ద్రోహం చేస్తోందంటున్న టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. 

16:37 - June 15, 2018

జమ్ము కశ్మీర్ : గురువారం సాయంత్రం ఉగ్రవాద తూటాలకు బలైపోయిన రైజింగ్‌ కశ్మీర్‌ దినపత్రిక ఎడిటర్‌ 52 ఏళ్ల షుజాత్‌ బుఖారీ అంత్యక్రియలు బారముల్లాలో పూర్తయ్యాయి. బుఖారీ అంతిమ యాత్రకు వందలాది మంది హాజరయ్యారు. బుఖారీ హత్యకు సంబంధించి సిసిటివి ఫుటేజీ అధారంగా ముగ్గురు అనుమానితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. నిన్న సాయంత్రం ఇఫ్తార్‌ విందులో పాల్గొనడానికని శ్రీనగర్‌లోని ప్రెస్‌ కాలనీలో ఉన్న పత్రికా కార్యాలయం నుంచి బుఖారి బయటకు వచ్చారు. కారులో బయలుదేరి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు జరపడంతో ఆయన కారులోనే కుప్పకూలారు. ఈ ఘటనలో బుఖారి వెంట ఉన్న ఇద్దరు సెక్యూరిటీ అధికారులు కూడా మరణించారు. కశ్మీర్‌లో శాంతియుత పరిస్థితులను నెలకొల్పడానికి బుఖారీ విశేషంగా కృషి చేశారు. గతంలో హిందూ దినపత్రికలో కశ్మీర్‌ కరస్పాండెంట్‌గా పనిచేశారు. బుఖారి హత్యను జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, మాజీ సిఎం ఒమర్‌ అబ్దుల్లా, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పలు పత్రిక సంఘాలు, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించాయి.

16:34 - June 15, 2018

తూర్పుగోదావరి : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు వైసీపీ నేత విజయచందర్‌. ఈ సందర్భంగా రాజమండ్రిలో పుష్కరాల రేవులో వైసీపీ నేతలు జలదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక హోదా వైసీపీతోనే సాధ్యమని విజయచందర్‌ అన్నారు. భావితరాలకు బంగారు భవిష్యత్‌ రావాలంటే విభజన హామీలతో పాటు, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

16:33 - June 15, 2018

విజయవాడ : దుర్గమ్మ దేవస్థానం వద్ద నాయీ బాహ్మణులు సమ్మె చేస్తున్నారు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఇంద్రకీలాద్రి వద్ద నాయీ బ్రహ్మణుల సమ్మె తాజా పరిస్థితి కోసం ఈ వీడియో చూడండి.

16:22 - June 15, 2018

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. గృహనిర్మాణం, చెట్టు-నీరు వంటి పథకాల్లో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పథకాల్లో చంద్రబాబు అవినీతి పై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ప్రధాని మోదీ లేకుంటే చంద్రబాబు జీరోఅంటూ ఎద్దేవా చేశారు. అవినీతిమయమైన ఏపీలో సంపూర్ణ విప్లవం వస్తే తప్ప.. ప్రజలకు మంచి రోజులు రావన్నారు సోము వీర్రాజు.    

16:21 - June 15, 2018

అమరావతి : వైసీపీ నేతలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని టీడీపీ ఎంపీలు విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిని బీజేపీతో వైసీపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతోందని ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేసినేని నాని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని వైసీపీకి విజ్ఞప్తి చేస్తున్నామని ఎంపీలు తెలిపారు. 

16:17 - June 15, 2018

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలుగు రాష్ర్టాల గవర్నర్‌ నరసింహన్‌ కలిశారు. ఇరు రాష్ర్టాల్లో పరిస్థితులను హోంమంత్రికి వివరించినట్టు తెలుస్తోంది. సాయంత్రం నాలుగున్నరకు గవర్నర్‌ ప్రధాని మోదీని కలవనున్నారు.

15:49 - June 15, 2018

రొటీన్ రోత సినిమాల నుండి బయటపడేందుకు కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం ‘నా నువ్వే’ మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసిన నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డుతూ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్, ప్రమోషన్‌ సాంగ్స్ సినిమా అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ.. స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ అందించిన అమేజింగ్ విజువ‌ల్స్‌.. శ‌ర‌త్ అందించిన మెలోడియ‌స్ ఆల్బమ్ సినిమాకు మేజ‌ర్ ఎసెట్‌గా నిలుస్తున్నాయి. ఈ సినిమా గురించి మరింతగా తెలుసుకునేందుకు రివ్వ్యూను చూడాల్సిందే..

15:43 - June 15, 2018

కర్నూలు : బనగాన పల్లెలో విషాం చోటుచేసుకుంది. ఎమ్మల్యే కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బనగానపల్లె వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పెద్ద కుమారుడు నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. దీంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గురువారం రాత్రి తన గదిలో నిద్రించిన నాగార్జునరెడ్డి ఉదయం లేచి కుటుంబ సభ్యులు చూసే సమయానికి ఉరివేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. కాగా నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. 

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి..

ఛత్తీస్‌గఢ్ : సుక్మా జిల్లాలోని చిత్రగుఫా ఏరియాలో ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సుక్మా జిల్లా రిజర్వ్ గార్డ్ పోలీసులు, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి.. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చిత్రగుఫా ఏరియాలో మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తుంది. అయితే ఘటనాస్థలి వద్ద మావోయిస్టులకు చెందిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నవాజ్ ఫరీఫ్ భార్యకు గుండెపోటు..

ఢిల్లీ : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ నవాజ్‌కు గుండెపోటు వచ్చింది. గొంతు క్యాన్సర్ సర్జరీ తర్వాత ఆమె ప్రస్తుతం బ్రిటన్‌లో చికిత్స పొందుతున్నారు. కుల్సుమ్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ఆమెను లండన్ హాస్పటల్‌లోని ఐసీయూ యూనిట్‌కు తరలించినట్లు ఆమె కూతురు మరియమ్ నవాజ్ తెలిపారు. తల్లి కుల్సుమ్ కోలుకునేందుకు ప్రార్థనలు చేయాలని దేశ ప్రజలను మరియం కోరారు.

15:10 - June 15, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆన్ సమావేశం సుమారు గంట సమయం పాటు ఈ సమావేశం కొనసాగింది. రాష్ర్టానికి సంబంధించిన పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రధానికి కేసీఆర్ కోరారు. అలాగే రాష్ట్రంలో తాము ప్రవేశపెట్టిన..అమలు చేస్తున్న సంక్షేమపథాకాల గురించి ప్రధానికి వివరించారు. అలాగే ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని సీఎం కోరారు. కొత్త జోనల్ వ్యవస్థ, రిజర్వేషన్ల పెంపునకు ఆమోదం తెలపాలని..ఏపీ భవన్ ను తెలంగాణకు ఇవ్వాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా పథకం వంటి పలు సంక్షేమ పథకాల గురించి కేసీఆర్ ప్రధాని మోదీకి వివరించారు. 

13:32 - June 15, 2018

హైదరాబాద్ : టీడీపీకి మ్యాటర్ వీక్...పబ్లిసిటీ పీక్ అని వైసీపీ నేత రాజేంద్రనాధ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. చీమ, దోమకు టీడీపీ నేతలు భయపడుతున్నారని పేర్కొన్నారు. తాను హోటల్ కు భోజనానికి వెళ్తే కూడా ఇంత భయపడితే ఎలా అన్నారు. టీడీపీ నేతలు రాజ్యాంగం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

 

13:30 - June 15, 2018

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను తెలుగు రాష్ర్టాల గవర్నర్‌ నరసింహన్‌ కలిశారు. ఇరు రాష్ర్టాల్లో  పరిస్థితులను హోంమంత్రికి వివరించినట్టు తెలుస్తోంది. సాయంత్రం నాలుగున్నరకు గవర్నర్‌ ప్రధాని మోదీని కలవనున్నారు.

 

13:24 - June 15, 2018

కరీంనగర్‌ : ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. కలెక్టరేట్‌ వద్ద రసజ్ఞ అనే యువతి గొంతుకోశాడు. త్రీవంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. దాడి అనంతరం ప్రేమోన్మాది వంశీధర్‌ కూడా ఆత్మహత్యకు యత్నించడంతో స్థానికులు అడ్డకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు  నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. కలెక్టరేట్‌కు సమీపంలో మీసేవా కేంద్రంలో యువతి పనిచేస్తోంది.

 

12:22 - June 15, 2018

మహబూబ్ నగర్ : ఖరీఫ్‌ సీజన్‌ రావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్నదాతలు పొలం బాట పట్టారు. తొలకరి చినుకులు పడటంతో పంట పొలాల్లో నిమగ్నమయ్యారు. గతేడాదిలాగే ఈ సారి కూడా రుతుపనాలు ముందుస్తుగానే పలకరించడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, అనేక చోట్ల వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ 
పనులు ప్రారంభమయ్యాయి. రైతులు పంటపొలాల్లో దుక్కులు దున్నడం ప్రారంభించారు. విత్తనాలు, ఎరువుల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. జూన్‌ తొలి వారంలోనే వర్షాలు కురవడంతో రైతుల్లో సంతోషం కనిపిస్తోంది. గతేడాది మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలో ఏడు లక్షల ఎకరాల్లో పంటను సాగు చేశారు. దీంతో ఈ సారి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 

పాలమూరు జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, మొక్కజొన్న పంటలను పండిస్తారు. ఇదే క్రమంలో ఈ సారి కూడా ఆ పంటలకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 లక్షల ఎకరాల్లో పంటను సాగు చేసే అవకాశం ఉంది.. రైతుబంధు పథకం ద్వారా వచ్చిన డబ్బులతో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. రైతుబంధు పథకం కింద ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా వ్యాప్తంగా 2 లక్షల 59 వేల మంది రైతులకు 272 కోట్ల 34 లక్షల రూపాయల పెట్టుబడి సాయాన్ని  ప్రభుత్వం అందించింది. తొలివిడతో 448 గ్రామాలను ఎంపిక చేసుకుని 87 వేల మందికి నూతన పాస్ బుక్కులను మరియు చెక్కులను అందజేసారు.

ఒకప్పుడు వానకాల వచ్చిందంటే పంటసాగు చేయడానికి పెట్టుబడుల కోసం బ్యాంకులు చుట్టూ తిరుగుతూ.., వడ్డివ్యాపారులు వద్ద అప్పులు చేసి వ్యవసాయం చేసేవారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకం కొంత ఆసరా కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే రాష్ట్ర వ్యవసాయ అధికారులు మాత్రం రైతులకు ఖరీఫ్‌సాగుపై సరియైన అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. తూతూమంత్రంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నరనే విమర్షలుకూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ ఏడు రైతుల కళ్లలో సంతోషం కన్పిస్తుంది.. వర్షాలు సంపూర్ణంగా కురిస్తే వారి పంట పండిన్నట్లే

12:18 - June 15, 2018

కరీంనగర్ : తూపాకి గోట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని నమ్మిన వ్యక్తి గద్దర్‌.. ఇప్పుడు ఓటు రాజకీయాల వైపు అడుగులేస్తున్నారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ ప్రచారంపై గద్దర్‌ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు.
మనసులోని మాటను పరోక్షంగా బయటపట్టిన గద్దర్‌ 
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాల రాష్ట్రాలకు పరిచయం అక్కరలేని వ్యక్తి గద్దర్‌. తూపాకి గోట్టంతోనే రాజ్యాధికారం వస్తుందని నమ్మిన వ్యక్తి. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అంటూ తన పాటలతో అడవి బిడ్డల్లో చైతన్యం తెచ్చిన వ్యక్తి గద్దర్. తెలంగాణ ఉద్యమంలో తన ఆట పాటలతో లక్షల మందిని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు మళ్లించారు. అయితే ఇప్పటి వరకు తాను నమ్మిన సిద్ధాంతంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు గద్దర్. కానీ వచ్చే సాధారణ ఎన్నికల్లో గద్దర్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందుకు గద్దర్ కూడా సానుకూల స్పందననే వ్యక్తం చేశారు. గద్దర్‌పై కాల్పులు జరిపి పాతికేళ్లు అయిన సందర్భంగా కరీంనగర్‌లో దళిత సంఘాలు, అభిమానులు పునర్జన్మ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తన మనసులోని మాటను గద్దర్‌ పరోక్షంగా బయటపట్టాడు.
గద్దర్‌ సీపీఎం పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం
అయితే గద్దర్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. గద్దర్‌ చాల కాలం నుంచి కమ్యూనిస్ట్‌వాదిగా ఉండటంతో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ విషయాన్ని కమ్యూనిస్ట్‌ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. కమ్యూనిస్ట్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం కోసం 25 సంఘాలతో బీఎల్‌ఎఫ్‌ ప్రంట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో గద్దర్‌ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి కూడా గద్దర్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు గద్దర్‌ లాంటి నాయకుల అవసరం ఉందని.. అందుకే గద్దర్‌ లాంటి ఉద్యమకారులను పార్టీలోకి ఆహ్వనించాలని కాంగ్రెస్‌ నేతలు చూస్తోన్నట్లు తెలుస్తోంది. అలాగే గద్దర్ కుమారుడు కూడా కాంగ్రెస్‌లో ఉండటంతో గద్దర్ కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తాలకు బలం చేకూర్చుతున్నాయి. 
ప్రజలు తనని ఆదరిస్తారని భావిస్తున్న గద్దర్‌
గద్దర్ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని చోప్పదండి, మానకోండూర్‌, ధర్మపురి నియోజవర్గాల్లో ఏదో ఒకదాని నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ మూడు నియోజవర్గాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో ఇద్దరు నేతలు ఉద్యమం నుంచి వచ్చిన వారే ఉన్నారు. మానుకోండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి ఎమ్మెల్యేగా ఉన్న బొడిగే శోభ ఇద్దరు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి.. 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అలాగే ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ పొరుగు నియోజకవర్గం నుంచి వచ్చి పోటీ చేయటంతో ప్రజలు ఆదరించారని.. తనని కూడా వీరి లాగే ప్రజలు ఆదరిస్తారనే గద్దర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మూడు నియోజకవర్గాల్లో ఒక దాని నుంచి పోటీ చేయాలని గద్దర్‌  ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 
గద్దర్ రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని యోచన 
మొత్తానికి గద్దర్ లాంటి విప్లవకారులు, ఉద్యమ నేతలు రాజకీయాల్లోకి వస్తే.. భ్రష్టు పట్టిన రాజకీయాలను కొంతలో కొంతైన మారుస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే మెజారిటీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం కూడా. అందుకే గద్దర్ రాజకీయ ఎంట్రీ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి గద్దర్ రాజకీయ ఎంట్రీ ఏ విధంగా ఉంటుందో తెలసుకోవాలంటే మరింత కొంత కాలం వెయిట్‌ చేయాల్సిందే.

12:16 - June 15, 2018

హైదరాబాద్ : రంజాన్‌ మాసంలో చివరి శుక్రవారం కావడంతో పాతబస్తీలోని మక్కా మసీదులో కాసేపట్లో జుమ్మ అల్‌విద చివరి నమాజ్‌ కార్యక్రమం జరగనుంది. 12 గంటలకు జొహర్‌ నమాజ్‌లో ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. ఇందుకుగాను సౌత్ జోన్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

12:14 - June 15, 2018

ఢిల్లీ : సీఎం చంద్రబాబు, మంత్రులు, లోకేశ్‌, అచ్చెన్నాయుడులపై బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ ఫైర్‌ అయ్యారు. అమిత్‌షాతో  బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీలో తన ప్రమేయం ఉందని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆకుల మండిపడ్డారు. గత మూడేళ్లుగా  వైసీపీ ఎమ్మెల్యేలను తనపార్టీలో చేర్చుకుని చంద్రబాబే కుట్రరాజకీయాలు నడుపుతున్నారని ఆకుల సత్యనారాయణ విమర్శించారు. తనపై చేస్తున్న ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని  టీడీపీ నేతలకు ఆకుల సవాల్‌ విసిరారు.  

 

11:56 - June 15, 2018

ఢిల్లీ : హస్తినను దట్టమైన దుమ్ము పొరలు కమ్ముకోవడంతో ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాజస్థాన్‌లో మొదలైన ఇసుక తుపాను  దేశ రాజధానిపై తీవ్ర ప్రభావం చూపింది.  రాజధాని ప్రాంతంలోని వాతావరణంలో ప్రమాదకరరీతిలో పిఎం స్థాయిలు ఉన్నాయని కాలుష్య నియంత్రణ బోర్డు హెచ్చరించింది. మరికొన్ని రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ గాలిని పీల్చడం వల్ల ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రజలు ముక్కుకు మాస్కులు ధరించాలని, ఇళ్లలో నుంచి బయటకు రావద్దని సూచించింది. కాలుష్యంతో నిండిన గాలిని పీల్చుకోవడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. దుమ్ము కాలుష్యం కారణంగా ఢిల్లీ భవన నిర్మాణపు పనులను నిలిపివేశారు. వాతావరణ కాలుష్యం, వెలుతురు లేని కారణంగా ఛండీగర్‌ విమానాశ్రయంలో అన్ని విమానాలను నిలిపివేశారు.

 

11:55 - June 15, 2018

ఢిల్లీ : కేరళ, ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కేరళలో ఇప్పటి వరకు 27 మంది మృతి చెందారు. త్రిపుర, మణిపూర్‌లో కొండ చరియలు విరిగి పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేకుండా వానలు పడడంతో జనజీవనం స్తంభించింది.

నైరుతి రుతు పవనాల ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని భారతపుజ, భావ్ని, సిరువాని తదితర నదులన్నీ పొంగి పొర్లుతున్నాయి. కోజికోడ్‌ జిల్లాలోని కట్టిపర ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడంతో 9 ఏళ్ల బాలికతో పాటు ముగ్గురు మృతిచెందారు. మరో 9 మంది గల్లంతయ్యారు. 

ఇడుక్కి, వేనాడ్, కోజికోడ్ జిల్లాల్లో వర్షాలకు కొండ చరియలు, చెట్లు విరిగి పడి రోడ్లు ధ్వంసమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఇళ్లు  దెబ్బతిన్నాయి. కేరళలో మే 29వ తేదీన రుతుపవనాలు ప్రవేశించిన నాటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.  భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 27 మంది మృతి చెందారు. ప్రభుత్వ అధికారులు, నేషనల్ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. 

తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరి కోసం కేరళ ప్రభుత్వం 45 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. కన్నూరు, కోజికోడ్, కొట్టాయం, అలప్పుజా జిల్లాల్లో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా కొట్టాయం, అలఫుజ, కోజికోడ్‌ తదితర ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇడుక్కి జిల్లాలోని కొండ ప్రాంతాల ప్రజలు రాత్రివేళ ప్రయాణాలు చేయరాదని అధికారులు హెచ్చరించారు. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మణిపూర్‌, అస్సాంలలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి త్రిపురలో నలుగురు, మణిపూర్‌లో ఇద్దరు మృతి చెందారు. అస్సాంలో కూడా వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. నాలుగు రైళ్లను రద్దు చేశారు. అస్సాంలో లక్షా 50 వేల మందికి ఆశ్రయం ఇవ్వడానికి ప్రభుత్వం 10 వేల 7 వందల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం పేర్కొంది.

మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌పై వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. 6 వేల మంది ప్రజలు 180 పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. విద్యుత్‌ నిలిచిపోవడంతో ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. మణిపూర్‌లో అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

11:54 - June 15, 2018

ఢిల్లీ : హస్తిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని నరేంద్రమోదికి లేఖ రాశారు. ఐఏఎస్‌ అధికారుల సమ్మెను విరమింపజేసేలా తక్షణ చర్యలు చేపట్టాలని మోదిని కోరారు. ఢిల్లీలో మూడు రోజుల నుంచి వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చిందని లేఖలో వివరించారు. సమ్మె కారణంగా కాలుష్య నియంత్రణపై గత 3 నెలలుగా ఒక్క సమావేశం కూడా నిర్వహించలేకపోయామని తెలిపారు. మురుగు కాలువలను శుభ్రం చేయడానికి వీల్లేకుండా పోయిందని... వీథి క్లినిక్‌ల ఏర్పాటు, వాయు కాలుష్య నియంత్రణ చర్యలు కూడా నిలిచిపోయాయని పేర్కొన్నారు.  రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఏమీ చేయడం లేదని కేజ్రీవాల్‌ ఆరోపించారు.  కేజ్రీవాల్‌, ఆయన మంత్రులు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో నాలుగు రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. పనులు నిలిపేసిన ఐఏఎస్ అధికారులపై చర్య తీసుకోవాలని, వారు విధులు నిర్వహించేలా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆదివారం ప్రధాని కార్యాలయం వరకు మార్చ్‌ నిర్వహిస్తామని ఆప్‌ హెచ్చరించింది. కేజ్రీవాల్ ఆందోళనకు ఆర్జేడి, ఆర్‌ఎల్‌డి, టిఎంసి మద్దతు ప్రకటించాయి.

 

11:51 - June 15, 2018

హైదరాబాద్ : మోత్కుపల్లి దారెటు..? ఇప్పుడీ ప్రశ్న రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీలో రాజకీయ నేతగా ఎదిగిన మోత్కుపల్లి నరసింహులు.. ఇప్పుడు వైసీపీ నేతలతో చెట్టపట్టాలు వేసుకోవడం దేనికి సంకేతం..? ఆయన ఎవరి డైరెక్షన్‌లో సాగుతున్నారు..? 

మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న మోత్కుపల్లి నరసింహులు.. భవిష్యత్తు కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. మోత్కుపల్లి సరికొత్త దారి ఏదన్నదానిపై ఓ స్పష్టత వచ్చినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి బద్ధ శత్రువులుగా భావించే వ్యక్తులు.. మోత్కుపల్లి నరసింహులును కలుస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారంనాడు,  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. మోత్కుపల్లితో భేటీ కావడం.. ఆయన తలపెట్టిన తిరుమల యాత్రకు మద్దతు ప్రకటించడం.. మోత్కుపల్లి పయనం ఎటో తేటతెల్లమైనట్లేనని అంటున్నారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో విభేదించి.. ఆయనపై తీవ్రస్థాయి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి.. పార్టీ నుంచి బహిష్కృతుడైన మోత్కుపల్లి నరసింహులు.. ఆ తర్వాత, చంద్రబాబు వ్యతిరేకులతోనే ఎక్కువగా సాగుతున్నారు. నరసింహులు పార్టీ నుంచి బయటకు రాగానే.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం హైదరాబాద్‌ వచ్చి మరీ ఆయన్ను కలిశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. 

మోత్కుపల్లికి తెలంగాణ వైసీపీ బాధ్యతలు అప్పగించే విషయం కూడా విజయసాయిరెడ్డితో భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రతిగా.. చంద్రబాబును వీలైనంత మేర ఇరుకున పెట్టేలా మోత్కుపల్లితో విమర్శనాస్త్రాలు సంధించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోత్కుపల్లి ఇప్పటి వరకూ రాజకీయంగా నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదు. కాంగ్రెస్‌,  టీఆర్ఎస్‌ల నుంచి స్పందన రాకపోవడం.. ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. రాజకీయంగా ఎటు వెళ్లాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. చంద్రబాబుపై విమర్శల దాడి కొనసాగిస్తూనే.. స్వతంత్రంగా ఎన్నికల బరిలో ఉండాలన్న యోచనలోనూ మోత్కుపల్లి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట యువకుడు ఘాతుకం

సంగారెడ్డి : జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. యువకుడు యువతి గొంతుకోశాడు. తీవ్ర గాయాలతో యువతి మృతి చెందింది. యువకుడిని స్థానికులు చితకబాది పోలీసులు అప్పగించారు.

10:57 - June 15, 2018

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి మధన్ మోహన్ రెడ్డి, బీజేపీ ఏపీ ప్రతినిధి విష్ణుశ్రీ, టీడీపీ అధికార ప్రతినిధి మణ్యం సుబ్బారావు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:53 - June 15, 2018

కేంద్రం ప్రభుత్వం ఆశ పథకాన్ని మూసివేయ్యాలని చూస్తుందా ? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సామాజిక బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? ఇదే అనుమానాన్ని ఆశ వర్కర్స్‌ వ్యక్తం చేస్తున్నారు. 10సంవత్సరాలు పనిచేసిన ఆశ వర్కర్లు తమ విధులోనుంచి తప్పుకుంటే 20వేలు ఇస్తామని కేంద్రం నిర్ణయం తీసుకోవటం, దానినే ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో పెట్టే పని చేయ్యటం వారిలో ఈ అనుమానానికి కారణమైంది. ఇదే అంశంపై ఆశా వర్కర్స్ యూనియన్‌ నాయకురాలు జయలక్ష్మీ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

10:47 - June 15, 2018

విజయవాడ : నాగవైష్ణవి హత్య కేసు విచారణ... ముందు నుంచీ పలు ట్విస్ట్‌లతో సాగింది. కేసును ఎక్కడికక్కడ నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్న వాదనలూ వినిపించాయి. ఇందులో కీలక నిందితుడు వెంకటరావు స్వయంగా న్యాయవాది కావడంతో.. చట్టంలోని లొసుగులను తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలూ వెలువడ్డాయి. చివరికి.. నిందితులు న్యాయస్థానం ముందు దోషులుగా నిలిచి.. శిక్షను ఎదుర్కొన్నారు. నాగవైష్ణవి హత్య పూర్వాపరాలపై ఓ కథనం.
2010లో నాగవైష్ణవి హత్య 
2010... జనవరి 30... కారులో పాఠశాలకు బయలుదేరిన నాగవైష్ణవిని కిడ్నాప్‌ చేసిన దుండగులు.. అడ్డొచ్చిన కారు డ్రైవర్‌ను హత మార్చారు. దుండగుల బారి నుంచి నాగవైష్ణవి సోదరుడు కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకున్నారు. అనంతరం.. అదే కారులో వైష్ణవిని తీసుకెళ్లి హత్య చేసి.. నగర శివారులోని ఓ ఫర్నేస్‌లో పడేసి బూడిద చేశారు. కుమార్తె మరణవార్త తెలియగానే.. తండ్రి పలగాని ప్రభాకర్‌.. గుండెపోటుతో కుప్పకూలిపోయి... తనువు చాలించారు. ఈ వేదనతో.. రెండేళ్ల క్రితమే నాగవైష్ణవి తల్లి కూడా మరణించారు. ఈ విషాదాంతాలు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించాయి.
నాగవైష్ణవి హత్యకు ఆస్తి తగాదాలే కారణం.. 
ముక్కుపచ్చారని నాగవైష్ణవి హత్యకు.. ఆస్తి తగాదాలే కారణమని కేసు దర్యాప్తు క్రమంలో తేలింది. విజయవాడకు చెందిన బీసీ నాయకుడు.. మద్యం వ్యాపారి పలగాని ప్రభాకర్‌.. తన అక్క కుమార్తె వెంకటరామమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి దుర్గాప్రసాద్‌ అనే కుమారుడున్నాడు. కొన్నాళ్లకు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నర్మదను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ద్వారా..  సాయితేజస్‌, నాగవైష్ణవి జన్మించారు. వైష్ణవి పుట్టాకే తన దశ తిరిగిందని ప్రభాకర్‌ బలంగా నమ్మేవాడు. ఆ నమ్మకంతోనే.. ఆస్తులన్నీ నాగవైష్ణవి పేరిట పెడుతున్నాడని మొదటి భార్య సోదరుడు పంది వెంకటరావు తన బావ ప్రభాకర్‌పై అక్కసు పెంచుకున్నారు. ఈ క్రమంలో.. పిన్ని కుమారుడు శ్రీనివాసరావుతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని.. నాగవైష్ణవిని అతి క్రూరంగా హతమార్చాడన్నది పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. 
చట్టం నుంచి తప్పించుకునేందుకు రకరకాల కుట్రలు 
ఒకే ఘటనతో ముగ్గురి మరణాలకు కారణమైన నిందితులు చట్టం నుంచి తప్పించుకునేందుకు రకరకాల కుట్రలు పన్నారు. కేసును ట్రయల్‌ దశకు రాకుండా తరచూ న్యాయవాదులను మార్చేవాడు. దీంతో పోలీసులు అభియోగాల పిటిషన్‌ను పదే పదే దాఖలు చేయాల్సి వచ్చేది. వెంకటరావు చీటికి మాటికీ లాయర్లను మార్చుతుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ధర్మాసనం సొంత న్యాయవాదిని నియమించింది. అయితే.. కోర్టు కేటాయించిన లాయర్లు కూడా తమకు సహకరించడం లేదంటూ వెంకటరావు.. పదే పదే పిటిషన్లు వేస్తూ.. కేసు జాప్యం జరిగేలా చేస్తూ వచ్చాడు. 
2011లో కేసు విచారణపై హైకోర్టు స్టే 
వెంకటరావు పిటిషన్‌ల నేపథ్యంలో హైకోర్టు 2011 ఆగస్టు నెల్లో  కేసు విచారణపై స్టే విధించింది. పోలీసులు మళ్లీ అభియోగాలు నమోదు చేశాక.. వాదనలు ప్రారంభమయ్యాయి. సప్టెంబర్‌లో స్టే ఎత్తివేసిన న్యాయస్థానం.. 2012 జనవరి 23 నుంచి మార్చి 9లోపు శిక్ష ఖరారు చేయాలని మహిళా సెషన్స్‌ న్యాయస్థానాన్ని ఆదేశించింది. నిందితుడు వెంకటరావు మళ్లీ కోర్టుకు వెళ్లాడు. అయితే.. తాజాగా మరోసారి అభియోగాలు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం.. ఈ కేసు ట్రయల్‌ పూర్తి కాకుండా వెంకటరావే అడ్డంకులు సృష్టిస్తున్నారని నమ్మింది. అందుకే.. కేసు తెగేవరకూ నిందితులెవరికీ బెయిల్‌ ఇవ్వరాదంటూ 2012లో స్పష్టం చేసింది.
ముగ్గురికీ యావజ్జీవ కారాగార శిక్ష 
ట్రయల్‌ దశలోనూ ప్రధాన నిందితుడు వెంకటరావు.. కేసును ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌లలోని ఏదో ఒక కోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే.. కోర్టు అంగీకరించలేదు. మళ్లీ నిందితుల బదిలీ పిటిషన్‌ వేశారు. దాన్నీ కోర్టు కొట్టేస్తూ.. ఈ కేసు విజయవాడ మహిళా సెషన్స్ కోర్టులోనే విచారణ జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిందితులందరితో కలసి.. పంది వెంకటరావు.. గడచిన ఎనిమిదేళ్లలో పదకొండు సార్లు హైకోర్టులోనూ. ఓ సారి సుప్రీం కోర్టులోనూ బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు. అన్నిసార్లూ న్యాయస్థానాలు ఆ పిటిషన్‌లను తోసిపుచ్చాయి. పైగా.. ఈ కేసులో వెంకటరావు పదేపదే పిటిషన్‌లు వేస్తూ.. కాలయాపన చేస్తున్నాడంటూ.. హైకోర్టు, 2012 ఫిబ్రవరి నెల్లో యాభైవేల రూపాయల జరిమానా విధించింది. మొత్తమ్మీద 95 మంది సాక్షులను విచారించిన ఈ కేసులో.. ఎట్టకేలకు, నిందితుడు పంది వెంకటరావుతో పాటు, మోర్ల శ్రీనివాసరావు, జగదీశ్‌లను దోషులుగా నిర్ధరించిన న్యాయస్థానం.. ముగ్గురికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 

 

10:39 - June 15, 2018

విజయవాడ : చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. వైష్ణవి మేనమామ వెంకటరావుగౌడ్‌ సహా ముగ్గురికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఎనిమిదేళ్ల క్రితం తెలుగువారందరి కంటా నీరు తెప్పించిన ఈ హృదయ విదారమైన కేసులో.. నిందితుల చర్యను అతి నీచం.. హేయమైనదిగా న్యాయస్థానం అభివర్ణించింది. 

చిన్నారి నాగవైష్ణవి హత్యకేసులో తీర్పు వెల్లడి.. మేనమామ సహా ముగ్గురిని నిందితులుగా తేల్చిన కోర్ట్‌...నిందితులు ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష... విజయవాడకు చెందిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో దోషులకు కఠిన శిక్ష పడింది. నిందితులు మోర్ల శ్రీనివాసరావు, జగదీశ్‌, పంది వెంకటరావు గౌడ్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ.. మహిళా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బబిత తీర్పునిచ్చారు. 

ఎనిమిది సంవత్సరాల క్రితం.. 2010 జనవరి నెలలో.. పలగాని నాగవైష్ణవిని.. సొంత బంధువులే కిడ్నాప్‌ చేసి హతమార్చారు. మృతదేహం ఆచూకీ తెలియనీయకుండా.. నిందితులు.. ఇనుప వస్తువులను కరిగించే బాయిలర్‌లో వేసి బూడిద చేసేశారు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కుమార్తె మరణించిందన్న సమాచారం అందగానే.. నాగవైష్ణవి తండ్రి పలగాని ప్రభాకర్‌ గుండెపోటుతో మరణించాడు. ఈ రెండు ఉదంతాలు.. అప్పట్లో ప్రతి తెలుగు లోగిలినీ కంటనీరు పెట్టించింది. ఈ కేసులో తీర్పు వెలువరించిన న్యాయమూర్తి కూడా.. నిందితుల చర్యను హేయమూ.. నీచమైనదిగానూ అభివర్ణించారు. 

నాగవైష్ణవి కేసులో తీర్పు నేపథ్యంలో.. నిందితులు ముగ్గురినీ జిల్లా జైలు నుంచి.. న్యాయస్థానానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ తీసుకు వచ్చారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో న్యాయమూర్తి తీర్పు ప్రకటించగానే.. కోర్టు ప్రాంగణంలో ఉత్సాహభరితమైన వాతావరణం కనిపించింది. తీర్పును అన్ని వర్గాల వారూ స్వాగతించారు. ప్రస్తుత తీర్పు ప్రకారం నిందితులు జీవితాంతమూ కటకటాల వెనుకే జీవించాల్సి ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం.  కేసులో శిక్ష పడ్డ నిందితులు.. పైకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

10:34 - June 15, 2018

హైదరాబాద్ : మోత్కుపల్లి నర్సింహులుతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఏపీలో మోత్కుపల్లి యాత్రకు వైసీపీ మద్దతిస్తుందన్న విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. మోత్కుపల్లి భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు. దళితుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమే కాకుండా.. ఆరోపణలు చేయడం దారుణమన్నారు విజయసాయిరెడ్డి. మరోవైపు చంద్రబాబుపై మోత్కుపల్లి మరోసారి విరుచుకుపడ్డారు. ఏనాడు తాను పదవులు అడగలేదని.. తన రాజకీయ జీవితమంతా టీడీపీలో ఉంటే తనను మోసం చేశారన్నారు మోత్కుపల్లి. 

 

10:31 - June 15, 2018

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ కార్యక్రమాల్లో ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాలు  భాగస్వాములు  కావాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు ఇచ్చారు. ప్రతి పని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యంకాదన్న వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరారు. రోడ్డు మీద చిన్న చెట్టుకొమ్మలు విరిగిపడినా జీహెచ్‌ఎంసీ సిబ్బందే వచ్చే తీయాలన్న ధోరణి మార్చుకోవాలని నాగోల్‌లో జరిగిన మన నగరం కార్యక్రమంలో కేటీఆర్‌ సూచించారు. 

నాగోల్‌లో జరిగిన మన నగరం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. నగరాభివృద్ధికి ప్రభుత్వపరంగా చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. కోటి మంది ప్రజలున్న నగరంలో అన్నీ అధికారులే చేయాలంటే కుదరదన్న వాస్తవాన్ని గ్రహించాలని  విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రజల దృష్టికి తెచ్చారు.  ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా పౌరుల నుంచి కనీస సహకారం అందని విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు. పౌరులు బాధ్యతలు ఎలా విస్మరిస్తున్నారో గుర్తు చేశారు. 

విజయనగర్‌ కాలనీ నుంచి వచ్చిన ట్విటర్‌ మేసేజ్‌ని కేటీఆర్‌ ప్రస్తావించిన కేటీఆర్‌.. ప్రతి పని ఎవరో వచ్చి చేయాలనుకునే ధోరణి మార్చుకోవాలని కోరారు. హరితహారం కార్యక్రమం ద్వారా ప్రజలు ఉచితంగా మొక్కలను అందచేస్తున్నా.. వాటిని సంరక్షించుకోలేని దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయని కేటీఆర్‌ ఆవేదన వెలిబుచ్చారు. సకాలంలో పన్నులు చెల్లించాలన్న కనీస బాధ్యతను పౌరులు నెరవేర్చకపోతే జీహెచ్‌ఎంసీ నిర్వహణ ఎలా సాధ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కేటీఆర్‌ హితబోధ చేశారు. 

కాసేపట్లో పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ....

గుంటూరు : కాసేపట్లో టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు.  ఉదయం 10.30కు ఎంపీలతో బాబు సమావేశం అవుతారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన పోరాటంలో భాగంగా  ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ్టి భేటీలో ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. 

10:24 - June 15, 2018

గుంటూరు : ఇవాళ టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఉదయం 10.30కు ఎంపీలతో బాబు సమావేశం అవుతారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన పోరాటంలో భాగంగా  ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ్టి భేటీలో ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. విభజన హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా ఎంపీలకు కార్యాచరణ వివరించనున్నారు. మరోవైపు ఈనెల 17న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు. నితి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో బాబు  పాల్గొంటారు. ఈ వేదికపైకూ ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం  గళం వినిపించడానికి సిద్ధం అవుతున్నారు. 

 

10:22 - June 15, 2018

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఇరువురూ సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జోనల్‌ వ్యవస్థ, విభజన చట్టంలోని హామీల అమలు సహా  రాష్ట్రానికి నిధుల కేటాయింపు వంటి అంశాలపై ప్రధానితో మాట్లాడే అవకాశం ఉంది. ఏపీ పునర్విభజన చట్టంలోని 9,10 షెడ్యూలు సంస్థలపై చర్చించనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం మోదీకి విజ్ఞప్తి చేయనున్నారు. ఏపీ భవన్‌ను తెలంగాణకు ఇవ్వాలని సీఎం కోరనున్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలను కేసీఆర్‌ మోదీకి వివరించనున్నారు.

 

10:18 - June 15, 2018

గుంటూరు : చిలకలూరిపేటలోని కోల్డ్‌ స్టోరేజీలో అగ్నిప్రమాదం. బొప్పూడి కోల్డ్‌ స్టోరేజీలో తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట, నరసరావుపేట, చీరాల పట్టణాలనుంచి వచ్చిన పది ఫైర్‌ ఇంజిన్లతో మంటలు అదుపు చేస్తున్నాయి. ఈ కోల్డ్ స్టోరేజీలో రైతులకు సంబంధించిన మిర్చి, శనగ, నువ్వులు ధాన్యం నిల్వలు ఉన్నాయి. అయితే అగ్నిప్రమాంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రి తనపై దాడిచేసిన దుండగులు పెట్రోల్‌పోసి నిప్పుపెట్టినట్టు వాచ్‌మన్‌ ఆరోపిస్తున్నాడు. 

10:15 - June 15, 2018

గుంటూరు : ఇవాళ టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు.  ఉదయం 10.30కు ఎంపీలతో బాబు సమావేశం అవుతారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన పోరాటంలో భాగంగా  ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ్టి భేటీలో ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. విభజన హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా ఎంపీలకు కార్యాచరణ వివరించనున్నారు. మరోవైపు ఈనెల 17న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు. నితి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో బాబు  పాల్గొంటారు. ఈ వేదికపైకూ ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం  గళం వినిపించడానికి సిద్ధం అవుతున్నారు. 

 

10:12 - June 15, 2018

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఇవాళ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఇరువురూ సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన  పలు అంశాలపై మోదీతో చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జోనల్‌ వ్యవస్థ, విభజన చట్టంలోని హామీల అమలు సహా  రాష్ట్రానికి నిధుల కేటాయింపు వంటి అంశాలపై ప్రధానితో మాట్లాడే అవకాశం ఉంది. ఏపీ పునర్విభజన చట్టంలోని 9,10 షెడ్యూలు సంస్థలపై చర్చించనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోసం మోదీకి విజ్ఞప్తి చేయనున్నారు. ఏపీ భవన్‌ను తెలంగాణకు ఇవ్వాలని సీఎం కోరనున్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలను కేసీఆర్‌ మోదీకి వివరించనున్నారు.

 

10:06 - June 15, 2018

హైదరాబాద్ : అల్వాల్ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ రాజశేఖర్ ఆధ్వర్యంలో 120 మంది పోలీసులతో మచ్చబొల్లారలంలో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

కోల్డ్‌ స్టోరేజీలో అగ్నిప్రమాదం

గుంటూరు : చిలకలూరిపేటలోని కోల్డ్‌ స్టోరేజీలో అగ్నిప్రమాదం జరిగింది. బొప్పూడి కోల్డ్‌ స్టోరేజీలో తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట, నరసరావుపేట, చీరాల పట్టణాలనుంచి వచ్చిన పది ఫైర్‌ ఇంజిన్లతో మంటలు అదుపు చేస్తున్నాయి. 

10:02 - June 15, 2018

గుంటూరు : చిలకలూరిపేటలోని కోల్డ్‌ స్టోరేజీలో అగ్నిప్రమాదం. బొప్పూడి కోల్డ్‌ స్టోరేజీలో తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట, నరసరావుపేట, చీరాల పట్టణాలనుంచి వచ్చిన పది ఫైర్‌ ఇంజిన్లతో మంటలు అదుపు చేస్తున్నాయి. ఈ కోల్డ్ స్టోరేజీలో రైతులకు సంబంధించిన మిర్చి, శనగ, నువ్వులు ధాన్యం నిల్వలు ఉన్నాయి. అయితే అగ్నిప్రమాంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రి తనపై దాడిచేసిన దుండగులు పెట్రోల్‌పోసి నిప్పుపెట్టినట్టు వాచ్‌మన్‌ ఆరోపిస్తున్నాడు. 

 

09:58 - June 15, 2018

కడప : అంతకుముందు కడప ఉక్కు కర్మాగారం నిర్మించడం సాధ్యం కాదంటూ.. కేంద్రం తేల్చి చెప్పడంతో.. రాయలసీమ వాసులు రగిలిపోతున్నారు. ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. వామపక్షాల నేతలు.. సీమ నాలుగు జిల్లాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కడప జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతలు.. వేర్వేరుగా ఆందోళనలు చేపట్టారు. 

కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం.. యూ టర్న్‌ తీసుకోవడంతో రాయలసీమ జిల్లా ప్రజల్లో ఆగ్రహం రగులుతోంది. ప్రజలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 

కడపలోని అంబేడ్కర్‌ కూడలి వద్ద వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు.  అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి అక్కడే బైఠాయించారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నేతలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై విరుచుకుపడ్డారు.  

ప్రొద్దటూరులో టీడీపీ ఇంచార్జి నంద్యాల వరదరాజుల రెడ్డి నేతృత్వంలో.. టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కంటూ నినదించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలంటే.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులనే గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

అటు జమ్మలమడుగులోనూ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మైదుకూరులో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సాగిన ర్యాలీలో తెలుగుదేశం నాయకులూ పాల్గొన్నారు. జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ టి . తులశమ్మ ఆద్వర్యంలో స్థానిక గాంధీ సర్కిల్ నుండి ఆర్.డి.ఒ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్.డి.ఒ నాగన్న కు వినతి పత్రం సమర్పించారు. కడప నగరంలో సీపీఎం నాయకులు కేంద్ర ప్రభుత్వ శవయాత్ర నిర్వహించారు. బుగ్గవంకలో దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. 

కర్నూలులో సీపీఎం నేతలు కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం దిగొచ్చేవరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. 

అటు అనంతపురంలోనూ సీపీఐ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. టవర్‌క్లాక్‌ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు .

09:54 - June 15, 2018

కడప : కడపలో బ్రాహ్మణి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు వ్యవహారం.. ఏపీలో.. రాజకీయ కాకను తారస్థాయికి చేర్చింది. ఈ అంశం పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి దారి తీసింది. బ్రాహ్మణి స్టీల్స్‌ నిర్మాణం సాధ్యం కాదంటూ.. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌పై.. అన్ని పక్షాలూ మండిపడ్డాయి. తెలుగుదేశం సహా.. అన్ని రాజకీయ పార్టీలూ విడివిడిగా ఆందోళనలు చేపట్టాయి. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగొచ్చింది. బ్రాహ్మణి స్టీల్స్‌ ఏర్పాటు పై ఇంకా కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని, దీని సాధ్యాసాధ్యాలపై టాస్క్‌ఫోర్స్‌ అధ్యయనం చేస్తుందని ప్రకటించింది.  

కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్‌ అంశం.. ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తోంది. ఈ అంశంపై పాలక, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం తారస్థాయికి చేరింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని.. తెలుగుదేశం పార్టీ నాయకులు.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా 2014లో సమర్పించిన నివేదికనే కేంద్రం కోర్టులో అఫిడవిట్‌గా దాఖలు చేయడాన్ని టీడీపీ తప్పుబట్టింది. టాస్క్‌ఫోర్స్‌ నివేదిక రానిదే స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యం కాదని ఎలా చెబుతారంటూ ప్రశ్నించింది. 

బ్రాహ్మణి స్టీల్స్‌ వ్యవహారంలో.. వైసీపీ నాయకులు తెలుగుదేశం శైలిని తప్పుబట్టారు. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ సాధ్యం కాదంటూ సెయిల్‌ నివేదిక ఇచ్చినప్పుడు మౌనంగా ఉన్న సీఎం చంద్రబాబు.. ఇప్పుడు ఆక్రోశించడం ఏంటని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు .

మరోవైపు.. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడే ఉందని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌ను తెలుగుదేశం నాయకులు తప్పుగా అన్వయిస్తూ.. బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఏపీలో బ్రాహ్మణి స్టీల్స్‌ ఏర్పాటు అంశంపై.. రాష్ట్రంలోని అన్ని పక్షాల నుంచి ఆందోళనలు వ్యక్తం కావడంతో.. కేంద్ర ప్రభుత్వం.. గురువారం సాయంత్రానికి నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. కడప, బయ్యారం ఫ్యాక్టరీల ఏర్పాటును టాస్క్‌ఫోర్స్‌ పరిశీలిస్తోందని.. వీటిపై ఇప్పటి వరకూ కచ్చితమైన నిర్ణయానికి రాలేదని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు సాధ్యమయ్యేలా పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆ ప్రకటనలో తెలిపింది. 

09:51 - June 15, 2018

హైదరాబాద్ : నిర్ణీత గడువులోగా పంచాయితీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి కావోచ్చాయన్నారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ నెల 25లోగా పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తామన్నారు. గడువులోగా ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ఈ నెల 25లోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి : జూపల్లి 
తెలంగాణలో నిర్ణీత గడువులోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి కావోచ్చాయని అన్నారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. గత రెండు మూడు నెలల నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 25లోగా పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. పూర్తి పారదర్శకంగా నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 
ప్రతి కేటాగిరిలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్: జూపల్లి
గత ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నామన్నారు జూపల్లి. ఎన్నికల కోసం చేపట్టిన బీసీ ఓటర్ల గణన పూర్తి కావచ్చిందన్నారు మంత్రి. జనాభా ప్రాతిపాదికన ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లను కేటాయించమన్నారు. 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న1170 పంచాయితీలతో పాటు.. మరో 1300 షెడ్యూల్డ్ ఏరియాల్లోని పంచాయితీలను కూడా ఎస్టీలకే రిజర్వ్‌ చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రతి కేటాగిరిలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుందన్నారు. రిజర్వేషన్ల విషయంలో సర్పంచ్‌లకు మండలం యూనిట్‌గా, వార్డ్ మెంబర్‌లకు గ్రామం యూనిట్‌గా ఉంటుందన్నారు. ఇక ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులకు 3 నెలల పాటు నూతన పంచాయితీ రాజ్‌ చట్టంపై అవగాహన కల్పించటంతో పాటు పరిపాలనకు సంబంధించిన శిక్షణను ఇస్తామని తెలిపారు. 

09:20 - June 15, 2018

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఇవాళ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఇరువురూ సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన  పలు అంశాలపై మోదీతో చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జోనల్‌ వ్యవస్థ, విభజన చట్టంలోని హామీల అమలు సహా  రాష్ట్రానికి నిధుల కేటాయింపు వంటి అంశాలపై ప్రధానితో మాట్లాడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి హస్తిన చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న సీఎంకు నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్లారు. 


శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు కేసీఆర్‌... ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జోనల్‌ వ్యవస్థకు మంత్రివర్గం ఇటీవల ఆమోదించి, కేంద్రానికి పంపింది. కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సరవణకు సిఫారసు చేయాలని కేసీఆర్‌... ప్రధాని మోదీని కోరతారు. అలాగే ఏపీ పునర్విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విభజనపై చర్చిస్తారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌ మొత్తాన్ని తెలంగాణకే ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. హస్తినలో నిజాం నవాబులు నిర్మించిన హైదరాబాద్‌ హౌస్‌ను తీసుకున్న కేంద్రం... దానికి బదులుగా ప్రస్తుతం ఏపీ, తెలంగాణ భవనాలు ఉన్న భూమిని కేటాయించిన విషయాన్ని మోదీ దృష్టికి తీసుకొళ్లొచ్చని భావిస్తున్నారు. 


మైనారిటీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభ ఆమోదించి, కేంద్రానికి పంపిన బిల్లులపై మోదీతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం తెలంగాణకే ఇవ్వాలని కేసీఆర్‌ కోరొచ్చని భావిస్తున్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న రైతుబంధు పథకం, వచ్చే ఆగస్టు 15 నుంచి ప్రారంభించే  రైతు బీమా పథకం అంశాలను మోదీకి వివరిస్తారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయడంతోపాటు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కళ్ల పరీక్షల కోసం ప్రభుత్వం ప్రారంభించనున్న తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని మోదీని వివరించనున్నారు. 

హైకోర్టు విభజన, ఎయిమ్స్‌కు నిధులు, పన్నుల్లో  రాష్ట్రానికి వాటా పెంపు, సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సహకారంపై ప్రధాని మోదీతో కేసీఆర్‌ చర్చించే అవకాశం ఉంది. మొత్తం 68 అంశాలకు సంబంధించి ప్రధానికి వినతి పత్రం ఇస్తారు. ఈనెల 17న జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో కేసీఆర్‌ పాల్గొనే అవకాశం ఉంది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు  కోసం ఇటీవల ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనను కేసీఆర్‌ ముందుకు తెచ్చి, వివిధ పార్టీల నేతలను కలిశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రధాని మోదీతో భేటీ ఆసక్తికరంగా మారింది. 

08:11 - June 15, 2018

గుంటూరు : ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ప్రత్యేకహోదాసహా విభజన హామీలపై చంద్రబాబు ప్రత్యక్ష కార్యాచరణ రూపొందిస్తున్నారు.  విభజన హామీల అమలు బాధ్యత ఎంపీలకు అప్పజెప్పేందుకు సిద్ధమయ్యారు. కడప స్టీల్‌ప్లాంట్‌తోపాటు.... మిగిలిన అంశాలపైనా కేంద్రంపై ఎంపీలు ఒత్తిడి పెంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఈనెల 17న చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉన్నందున.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపైనా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఆయన ఎంపీలతో భేటీ అవుతున్నారు.
కడప స్టీల్‌ ప్లాంట్‌తోనే మొదలు పెట్టాలని ప్రణాళికలు సిద్ధం 
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ అమరావతిలో పార్టీ ఎంపీలతో భేటీకానున్నారు. ప్రజాదర్బార్‌ హాల్‌లో వారితో అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించారు. వచ్చే నెలలో పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నందున ఇప్పటి నుంచే ఎంపీలను ఆ దిశగా సన్నద్దం చేయాలని ఆయన భావిస్తున్నారు.  ఇప్పటికే ఆయన విభజన హామీలపై ఎంపీలను క్షేత్రస్థాయిలో ఉద్యమాలు  నిర్వహించాలని ఆదేశించారు. ఈలోగానే కడప స్టీల్‌ప్లాంట్‌ అంశం తెరమీదకు వచ్చింది. దీంతో ఎంపీల రెండో విడత పోరాటాన్ని కడప స్టీల్‌ ప్లాంట్‌తోనే మొదలు పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సీఎం ఆమరణ దీక్షకు సన్నద్ధం అవుతున్నారు.  ఇదే తరహాలో మిగిలిన జిల్లాల్లో కూడా విభజన హామీలకు సంబంధించిన అంశాలపై ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలు పోరాడేలా టీడీపీ కసరత్తు ముమ్మరం చేసింది. రైల్వేజోన్‌ అంశంలో ఉత్తరాంధ్రకు  చెందిన ఎంపీలు కూడా క్షేత్రస్థాయి ఉద్యమాలకు కార్యాచరణ సిద్దం చేసుకునేపనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీల పోరాటాలపై చర్చించేందుకు చంద్రబాబు ఇవాళ వారితో భేటీ అవుతున్నారు. విభజన చట్టంలోని హామీలతోపాటు.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఎంపీల బృందాన్ని దృష్టి సారించేలా ఆయన ఆదేశించనున్నారు. క్షేత్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించమేకాదు... ఢిల్లీ స్థాయిలో మళ్లీ ఏపీ గళం వినిపించేలా పోరాడాలని దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అటు ఢిల్లీలోనూ.. ఇటు క్షేత్రస్థాయిలోనూ రాజకీయవేడి పెంచే ప్రయత్నాల్లో చంద్రబాబ ఉన్నారు.
ఈనెల 17న చంద్రబాబు ఢిల్లీ పర్యటన
చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో ప్రస్తావించాల్సిన అంశాలపైనా ఎంపీలతో చర్చించనున్నారు. ఈనెల 17న నీతి ఆయోగ్‌ గవర్నింగ్ కౌన్సిల్‌ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు చెందిన సీఎంలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఏపీకి జరిగిన అన్యాయం, ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు, పెండింగ్‌ ప్రాజెక్టులు, రాష్ట్రాలపై కేంద్ర పెత్తనంలాంటి అంశాలపై చంద్రబాబు కొద్దిరోజులుగా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. స్వయంగా ప్రధాని ఎదుటే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ... కేంద్రం తీరును ఎండగడుతూ జాతీయ స్థాయిలో ప్రాధాన్యత వచ్చేలా ప్రజెంటేషన్‌ ఇవ్వాలని చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తన ఢిల్లీ పర్యటనలో ఏయే అంశాలు ప్రస్తావిస్తే బాగుంటుందనే అంశాలను ఆయన ఎంపీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. 
వైసీపీ - బీజేపీ కుమ్మక్కని టీడీపీ ఆరోపణ
వైసీపీ -బీజేపీ కుమ్మక్కు అయ్యాయని టీడీపీ నేతలు కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తున్నారు.  స్టీల్‌ప్లాంట్‌ విషయంలో  కేంద్రం అన్యాయం చేస్తున్నా వైసీపీ నోరుమెదపడం లేదన్నది టీడీపీ వాదన. జగన్‌ సొంత జిల్లాకు అన్యాయం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తి ఉండడం కేసుల మాఫీ కోసమేనంటూ టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. వైసీపీ- బీజేపీ రహస్య పొత్తుపైనా చంద్రబాబు ఫోకస్‌పెట్టారు. దీనిపై ఢిల్లీ స్థాయిలోనే గళమెత్తాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు ముందస్తు వ్యూహాలు 
మొత్తంగా ఢిల్లీలోటూ.... ఏపీలోనూ మారుతున్న రాజకీయ వేడిని మరింతగా పెంచే దిశలో టీడీపీ వడివడిగా అడుగులేస్తోంది. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చనే అంచనాతో చంద్రబాబు.. అందుకుతగ్గట్టుగానే ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఆయన ఇవాళ ఎంపీలతో జరిగే భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Don't Miss