Activities calendar

17 June 2018

బాబుని ప్రశంసించిన మోదీ..సలహాలు తీసుకున్న సీఎంలు..

ఢిల్లీ : నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని మోదీ సైతం ఆయనను ప్రశంసించారు. విద్యుత్ రంగంలో చంద్రబాబు చేసిన కృషి అభినందనీయమని అన్నారు. మరోవైపు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగంతో అనుసంధానం చేయాలన్న చంద్రబాబు ప్రతిపాదనకు చాలా మంది సీఎంలు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రతిపాదనపై ముఖ్యమంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు. మరోవైపు, లంచ్ బ్రేక్ సమయంలో చంద్రబాబును ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిశారు. పాలనకు సంబంధించి ఆయన నుంచి సలహాలు తీసుకున్నారు.

ముత్యాలమ్మ బీచ్ లో విషాదం..

విశాఖపట్నం : ముత్యాలమ్మపాలెం బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. దీంతో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యల్ని ముమ్మరం చేయగా ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం గాలిస్తున్నారు. మృతులు మహేష్, నరేశ్, రామకృష్ణలుగా గుర్తించారు. 

మసీద్ కమీటీ సభ్యుల ఘర్షణ..

కర్నూలు : డోన్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈద్గా మసీద్‌కి సంబంధించిన రెండు కమిటీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ వర్గం ఇంటిపై మరో వర్గం దాడి చేసి వాహనాలు ధ్వంసం చేశారు. పాత కమిటీవారి ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. 

18:15 - June 17, 2018

విశాఖ : కొమ్మాదిలో అన్యాక్రాంతమైన కోట్ల విలువైన భూములను పరిరక్షించాలని... ఆక్రమణలపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణదారులు నిర్మించిన ప్రహారీ గోడను నారాయణ పగలగొట్టారు. గతంలో ఇదే భూమిలో ప్రహారీ నిర్మిస్తే.. కాలుతో గోడను తన్ని నారాయణ గాయాలపాలయ్యారు. ఆక్రమించిన శ్రీనివాసరెడ్డిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు నారాయణ. 

18:14 - June 17, 2018

విజయవాడ : మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఘాట్‌ రోడ్డు దిగువన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలతో కాలినడకన అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్వరమే నిర్మాణం జరిగేలా అమ్మవారిని కోరానని మంత్రి దేవినేని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందకు వివిధ రకాల కుట్రంలు చేస్తున్నారనీ..ఆ కుట్రలను తొలగించి పోలవరం ప్రాజెక్టును పూర్తి అయ్యేలా కరుణించమని కనకదుర్గమ్మను కోరుకున్నానని మంత్రి దేవినేని ఉమా తెలిపారు.

18:13 - June 17, 2018

సంగారెడ్డి : పఠాన్‌ చెరు మండలం ఐస్నాపూర్‌లో లారీ క్లీనర్‌ మృతి కలకలం రేపంది. పారిశ్రామికవాడలో లారీకి ఉరివేసుకొని క్లీనర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చత్తీస్‌గడ్‌ చెందిన వినోద్‌గా గుర్తించారు. అయితే.. మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

18:11 - June 17, 2018

నల్లగొండ : రైతులు వందల రోజులు దీక్షలు చేస్తే.. కాంగ్రెస్‌ నాయకులు డ్రామాలు ఆడారు తప్ప వారిని ఏనాడు పట్టించుకోలేదని మంత్రి జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్‌ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావుతో కలిసి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకులను తరిమికోట్టేందుకు ప్రజలు చూస్తున్నారని అన్నారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ నాయకులు ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాట పడుతున్నారే తప్ప.. సీట్లు గెలవటం కోసం ప్రయత్నించడం లేదని జగదీష్‌రెడ్డి అన్నారు. 

సీఎంలను సూచనలు, సలహాలు కోరిన ప్రధాని మోదీ..

ఢిల్లీ : ఉదయం 10గంటలకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత ప్రారంభమైన నీతి అయోగ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మోదీ సీఎంల సలహాలు, సూచనలు కోరారు. సీఎంలు ఇచ్చిన, సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ప్రధాని తెలిపారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను మూడు నెలల్లోగా తెలిపాలని కోరారు. ప్రభుత్వ భవనాలు, అధికారిక నివాసాలు, వీధి దీపాలకు ఎల్ఈడీ దీపాలను వినియోగించాలని తెలిపారు. నీటి పొదుపు, వ్యవసాయం, ఉపాధి హామీ పథకం అమలుపై ముఖ్యమంత్రుల సలహాలను ప్రధాని అభినందించారు. జమిలి ఎన్నికలపై చర్చ, సంప్రదింపులకు మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటం.

రసాభాసాగా ఎన్జీవోస్ హౌసింగ్ బోర్డు సమావేశం..

హైదరాబాద్ : ఏపీ ఎన్జీవోస్ హౌసింగ్ బోర్డు రసాభాసాగా సాగింది. ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపులపై చర్చ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. జన్ రల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు పలువుని అదుపులోకి తీసుకున్నారు.  

లారీ,ట్యాంకర్ ఢీ..ఒకరు మృతి..

భూపాలపల్లి : లారీ, యాష్ ట్యాంకర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన సిరొంచ-ఆత్మకూరు 163 హైవేపై రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ మృతి చెందగా.. మరో డ్రైవర్ కు గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది..

నల్లగొండ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడుచుపెట్టుకుపోతుందని మంత్రి జగదీశ్ రెడ్డి జోస్యం చెప్పారు. నకిరేకల్ లో నిమ్మ మార్కెట్ ను ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతు..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడుచుపెట్టుకుపోతుందన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయాలని సీఎం కేసీఆర్ సాగు నీటి యజ్ఞం మొదలుపెట్టారు. అప్పు లేకుండా వ్యవసాయం చేసే రోజులు తెలంగాణలో వచ్చాయి. తెలంగాణకు కాంగ్రెస్ శాపంలా తయారైందన్నారు. పదవుల కోసమే కాంగ్రెస్ నేతల పోరాటం, ఆరాటమన్నారు.

రాష్ట్రంలో తొలి నిమ్మ మార్కెట్ : జగదీశ్

నల్లగొండ: రాష్ట్రంలో తొలి నిమ్మ మార్కెట్ ను, బత్తాయి మార్కెట్లను సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. నకిరేకల్ లో ఏర్పాటు చేసిన నిమ్మ మార్కెట్ ను, ప్రాధమిక వ్యవసాయ భవనం గోదామును మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..నిమ్మ రైతుల బాధలు కాంగ్రెస్ నేతలకు ఇన్నాళ్లు కనపడలేదని మండిపడ్డారు. ఫ్లోరైడ్ పాపం కాంగ్రెస్ నాయకులదేనని ఆరోపించారు. కాంగ్రెస్ లో అందరూ సీఎం అభ్యర్థులేనని.. ప్రజలు నవ్వుకుంటున్నారని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు.

17:00 - June 17, 2018

విజయవాడ : కనకదుర్గ కొండపై ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కలకలం సృష్టించింది. ఉదయం 7గంటల నుండి పాప కనిపించటంలేదంటు అధికారులకు ఫిర్యాదు చేయగా..సీసీ కెమెరాలు పనిచేయటంలేదని..పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోమని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు. శ్రీకాకుళం జిల్లా రాజామండలం నుండి కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన పైడిరాజు, శ్రీదేవి దంపతుల కుమార్తె అయిన నాలుగేళ్ నవ్యశ్రీ ఆచూకీ ఇంతవరకూ లభ్యం కాలేదు. ఉదయం దుర్గమ్మ భక్తుల రద్దీ నేపథ్యంలో నవ్యశ్రీ తప్పిపోయింది. దీంతో అధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, నవ్యశ్రీ బంధువులు నాలుగు బృందాలు విడిపోయి నవ్యశ్రీ కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. 

మట్టి పెళ్లలు విరిగిపడి మహిళా కూలీ మృతి..

విజయవాడ : పొట్టకూటిలో కూలీ పనికి వచ్చిన ఓ మహిళ మట్టిలో కలిసిపోయింది. విజయవాడ పటమట భవన నిర్మాణ పనుల్లో భాగంగా పనులు చేస్తున్న ఓ మహిళా కూలీపై మట్టి పెళ్లలు విరిగిపడి మహిళా కూలీ మృతి చెందిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నిండింది. పునాది పనులు చేస్తున్న సమయంలో మట్టి పెళ్లలు విరిగి పడి మృతి చెందింది. మరో 10మంది కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నగర మేయర కోనేరు శ్రీధర్‌ సంఘనాస్థలికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు.

కొనసాగుతున్న కేజ్రీవాల్ నిరసన..మద్దతుగా ఆప్ ర్యాలీ..

ఢిల్లీ : ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు సాయంత్రం భారీ ర్యాలీ తలపెట్టింది. సాయంత్రం నాలుగు గంటలకు మండి హౌస్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించనుంది. మోదీ నియంతృత్వాన్ని నిరసిస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మంత్రులు ఆరు రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ముందు బైఠాయించగా, వారికి మద్దతుగా పార్టీ ఈ రోజు భారీ ప్రదర్శన ర్యాలీ తలపెట్టింది.

నీతి అయోగ్ లో బాబు ప్రసంగానికి పలు సీఎంల మద్దతు..

ఢిల్లీ : ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో ప్రసంగించారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలు కొన్ని రాష్ట్రాలకు తీరని నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని, ఈ నేపథ్యంలో విధివిధానాలను మార్చాలని ఆయన ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాబు డిమాండ్ ను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమర్థించారు. ఏపీతో పాటు, బీహార్ కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రధాని మోదీని పట్టించుకోని చంద్రబాబు..

ఢిల్లీ : నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం వాడీవేడిగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ తీరును, 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎండగట్టారు. అంతకు ముందు సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ తన సీటులో కూర్చున్నారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు మోదీని పట్టించుకోకుండానే వెళ్లి, తన సీటులో ఆశీనులయ్యారు. ఎలాంటి పలకరింపులు చోటు చేసుకోలేదు. అనంతరం టీ బ్రేక్ సమయంలో నలుగురు ముఖ్యమంత్రులు చంద్రబాబు, మమతా బెనర్జీ, పినరయి విజయన్, కుమారస్వామిలు మాట్లాడుకుంటుండగా... మోదీనే వారి వద్దకు వచ్చి, పలకరించారు.

15:53 - June 17, 2018

విశాఖపట్నం : నైతికతో కూడిన విద్యను అందించినప్పుడే నవ సమాజాం ఉద్భవిస్తుందన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. విశాఖలో ఓ ప్రైవేట్ పాఠశాలలో.. పూర్వ విద్యార్ధుల సహకారంతో నిర్మించిన బ్లాక్‌ను ప్రారంభించిన జేడీ.. విద్యా కుసుమాలన్నీ ఒకేతాటిపైకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా.. విశాఖ జిల్లా తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ సమస్యలపై స్పందించిన జేడీ... ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు కేటాయిస్తే రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. 

15:52 - June 17, 2018

విశాఖపట్నం : జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాసరావుకు అంగన్‌ వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నేతలు వినతి పత్రం అందించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసింది. అయితే పథకాన్ని స్వచ్చంద సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ.. స్వచ్చంద సంస్థల ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థలకు ఇచ్చే ప్రయత్నం చేయవద్దని వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు పాల్గొన్నారు. మంత్రి స్వచ్చంద సంస్థలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించినా ఉపాధి హామీ పోదని హామీ ఇచ్చారు.

15:52 - June 17, 2018

నల్లగొండ : నకిరేకల్ లో నిమ్మ మార్కెట్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతు.. ఎన్నో ఏళ్ళ కన్న నిమ్మ మార్కెట్ ను ఈరోజు నెరవేర్చుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిమ్మకాల మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. అలాగే నిమ్మకాయలను స్టోర్ చేసుకునేందుకు ఓ కోల్ట్ స్టోరేజ్ ను కూడా మంజూరు చేశామని తెలిపారు. అలాగే భూమిని సేకరించి ఇస్తే సబ్ మార్కెట్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. రూ.60వేల కోట్లు మూసీనది ప్రక్షాళన కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెడుతోందన్నారు. ఇరిగేషన్ రంగంలో గత పాలకులు చేయని ఎన్నో పనులను విజయవంతంగా నెరవేర్చుకుంటున్నామని..కాళేశ్వం పూర్తి అయితే రైతన్నల కష్టాలు తీరిపోతాయనీ..రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తోందని హరీశ్ రావు తెలిపారు. 

15:51 - June 17, 2018

ఢిల్లీ : జరుగుతున్న నీతి ఆయోగ్‌ పాలకమండలి భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏడు అంశాలను ప్రస్తావించారు. రైతుబంధు పథకం కింద ఖరీఫ్‌లో ఎకరానికి 4 వేల రూపాయల పెట్టుబడిసాయం అందించిన విషయాన్ని సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ పథకం ద్వారా 98 శాతం చిన్న సన్నకారు రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. 18-60 ఏళ్ల వయసు మధ్య ఉన్న రైతుల కోసం ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఏ కారణంగానైనా రైతు మరణిస్తే.. .అతని కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా అందించే ఈ పథకాన్ని వెయ్యి కోట్ల రూపాయాల ప్రీమియం చెల్లిస్తున్నామన్నారు. 50 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. పట్టాదారు పాస్తుపుస్తకాల పంపిణీ, గొర్రెలు, పాడిగేదెల పంపిణీ వంటి పథకాలను కేసీఆర్‌ ప్రధానంగా ప్రస్తావించారు. భూరికార్డులు ప్రక్షాళన, సాగునీటి ప్రాజెక్టులు, గోదాముల నిర్మాణం, తదితర అంశాలను కేసీఆర్‌ ప్రస్తావించారు. 

15:16 - June 17, 2018

ఢిల్లీ : నీతి ఆయోగ్‌ పాలక మండలి భేటీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగంలో అసత్యాలు వల్లెవేశారని బీజేపీ ఎంపీ జీవీల్‌ నరసింహారావు విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రెండు నెలులుగా ఓ ఒక్క అధికారి కానీ, మంత్రికానీ అడగకపోవడాన్ని జీవీఎల్‌ తప్పుపట్టారు. కనీసం లేఖలు కూడా రాకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలేసి.. కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని జీవీఎల్‌ నరసింహారావు మండిపడ్డారు. 

15:10 - June 17, 2018

విజయవాడ : పొట్టకూటిలో కూలీ పనికి వచ్చిన ఓ మహిళ మట్టిలో కలిసిపోయింది. విజయవాడ పటమట భవన నిర్మాణ పనుల్లో భాగంగా పనులు చేస్తున్న ఓ మహిళా కూలీపై మట్టి పెళ్లలు విరిగిపడి మహిళా కూలీ మృతి చెందిన ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నిండింది. పునాది పనులు చేస్తున్న సమయంలో మట్టి పెళ్లలు విరిగి పడి మృతి చెందింది. మరో 10మంది కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నగర మేయర కోనేరు శ్రీధర్‌ సంఘనాస్థలికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు.

15:09 - June 17, 2018

విజయవాడ : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా నాయీ బ్రహ్మణుల సమ్మె నేటితో మూడవ రోజుకు చేరుకుంది. తమకు 15 వేలు కనీస వేతనం ఇవ్వాలని క్షురకులు డిమాండ్‌ చేస్తున్నారు. తాము మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదంటున్న క్షురకులంటున్నారు. క్షురకుల ఆందోళనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహా అందిస్తారు. 

15:08 - June 17, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో దర్పల్లి మండల ఎంపీపీ ఇమ్మడి గోపి వీరంగం సృష్టించాడు. ఇందల్వాయి మండలం గౌరారంలో ఓ స్థల రిజిస్ట్రేషన్‌ విషయంలో ఒడ్డె రాజవ్వ అనే మహిళతో వాగ్వాదానికి దిగాడు. రిజిస్ట్రేషన్‌ విషయంలో వీరి మధ్య మాట మాట పెరగడంతో.. ఎంపీపీ అనుచరులు ఇంట్లోని సామాన్లు అన్నీ రోడ్డుపై పడేశారు. అంతేకాకుండా తోపులాటలో ఎంపీపీ మహిళను కాలుతో తన్నాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

15:06 - June 17, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతున్న నీతి ఆయోగ్‌ పాలకమండలి భేటీలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. అక్షరక్రమంలో ముందుగా ప్రసంగించిన చంద్రబాబు... విభజన సమస్యలతో సతమతమవుతున్న ఏపీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ఏకపక్షంగా రాష్ట్ర విభజన జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కావాలని పార్లమెంటు సాక్షిగా బీజేపీ కోరిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు నిధులు ఇవ్వాలన్నారు. ఏపీ ఎదుర్కొంటున్న రెవన్యూలోటు భర్తీకి ఇచ్చిన హామీని విస్మరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నీతి ఆయోగ్‌ పాలకమండలి వేదికగా ఎండగట్టారు. జీఎస్టీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. జీఎస్టీతో స్థానికంగా పన్నులు విధించే వెసులుబాటు లేకండా పోయిన అంశాన్ని నీతి ఆయోగ్‌ పాలకమండలి దృష్టికి తెచ్చారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత సమస్యలను కేంద్ర పరిష్కరించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నీతి ఆయోగ్‌ పాలక మండలి భేటీకి సమన్వయకర్తంగా వ్యవహరిస్తున్న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.. ఏపీ సీఎం బాబు ప్రసంగం ఏడో నిమిషంలోనే అడ్డుకున్నారు. కేటాయించిన సమయం అయిపోందని రాజ్‌నాథ్‌ గుర్తు చేశారు. దీనిపై బాబు స్పందిస్తూ.. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితల నేపథ్యంలో ఎక్కువ సమయం కావాలని కోరిన చంద్రబాబు... దాదాపు 20 నిమిషాల పాటు ప్రసంగించారు. 

ఎంపీపీ వీరంగం...

నిజామాబాద్ : దర్పల్లి మండలం ఎంపిపి ఇమ్మడి గోపి వీరంగం సృష్టించాడు. గౌరారంలో రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఒడ్డె రాజవ్వతో వాగ్వాదానికి దిగాడు. అదనపు డబ్బులు ఇవ్వాలని ఎంపీపీ డిమాండ్ చేశాడు. తన అనుచరులతో వచ్చి ఇంట్లో సామాన్లు చిందరవందరగా పడేశాడు. 

నీతి ఆయోగ్ లో కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణలో 98శాతం మంది సన్న, చిన్నకారు రైతులున్నారని సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశంలో పేర్కొన్నారు. అన్నదాతలను ఆదుకునేందుకు రైతుబంధు పేరుతో ఎకరాకు రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామని, రైతు బంధు పథకం రుణ లభ్యత, వ్యవసాయోత్పత్తుల ధరలు, పంటల సాగుపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. రైతు బీమా యోజన ద్వారా 18 నుంచి 60ఏళ్ల లోపు రైతులకు రూ.5లక్షల బీమా కల్పించామని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు.

11:34 - June 17, 2018

ఢిల్లీ : ప్రణాళిక సంఘం రద్దు చేసి తీసుకొచ్చిన నీతి ఆయోగ్ 4వ పాలక మండలి సమావేశం కాసేపట్లో జరుగనుంది. రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత నీతి అయోగ్‌ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు పలు సమస్యలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నట్లు సమాచారం.

తొలుత సమావేశం ప్రారంభం కాగానే ఏజెండా ప్రకారం చర్చించనున్నారు. గతేడాది చేసిన అభివృద్ధి...భవిష్యత్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి...5వ ఆర్ధిక సంఘం సిఫార్సులు...జీఎస్టీతో రాష్ట్రాలకు కలుగుతున్న ఇబ్బందులు...రైతులకు రెట్టింపు ఆదాయం...ఆయుష్మాన్‌ భారత్‌...నేషనల్‌ న్యూట్రిషన్‌ పధకాలతో పాటు మహాత్మాగాంధీ 150వ జయంతి సంబరాలు...లాంటి మొత్తం ఆరు అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

అనంతరం మధ్యాహ్నం రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఓ నివేదిక తయారు చేసుకున్నట్లు సమాచారం. ఏపీకి జరిగిన అన్యాయంపై ఈ సమావేశంలోనే ప్రస్తావించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు కేంద్రం అమలు చేయకపోవడం, వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తిచూపే అవకాశం ఉంది. చంద్రబాబు 20 పేజీల నివేదిక సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ సీఎంలకు అవకాశం ఇవ్వకపోతే ప్రధాని మోడీ ముగింపు ఉపన్యాసాన్ని బహిష్కరించాలని బాబు నేతృత్వంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఇవాళ జరిగే నీతి అయోగ్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది. 

ఆమరణ నిరహార దీక్ష చేస్తా - సీఎం రమేష్...

ఢిల్లీ : కడప స్టీల్ ప్లాంట్ కోసం తాను ఆమరన నిరహార దీక్షకు పూనుకుంటున్నట్లు ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. 16-17వ తేదీల్లో ప్రధాని అపాయింట్ ఇస్తామని చెప్పారని..కానీ ఇంతవరకు ఇవ్వలేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం తాను లేఖ రాయడం జరిగిందని..మెయిల్ కూడా పంపించడం జరిగిందన్నారు. ఆయన సమయం ఇవ్వడం లేకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం నుండి ఆమరణ నిరహార దీక్షకు కూర్చొంటానని ప్రకటించారు. కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు.

పరిష్కార మార్గాలను అన్వేషించాలి - ఎంపీ జేసీ...

ఢిల్లీ : పరిష్కార మార్గాలను అన్వేషించించడం ప్రధాన కర్తవ్యమని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. నీతి..నిజాయితి..రాజ్యాంగాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరిచిపోయారని..ఇలా చేయడం దురదృష్టకరమన్నారు.

నీతి ఆయోగ్ సమావేశంపై యనమల అసంతృప్తి...

ఢిల్లీ : నీతి ఆయోగ్ సమావేశంపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత ఇష్యూలతో కూడిన ఏజెండాను కేంద్రం ఫిక్స్ చేసిందని కలుగుతోందన్నారు. దేశానికి..రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు..కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయి...తదితర వాటిపై చర్చించాలన్నారు. కానీ తాము పెట్టిన ఏజెండాపైనే చర్చించాలని చెప్పడం అప్రజాస్వామికమని తెలిపారు. ప్రాంతీయ పార్టీలను నిర్లక్ష్యం చేస్తున్నారని అనుమానం కలుగుతోందన్నారు. 

11:21 - June 17, 2018

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ఏజెండా ప్రకారం సమావేశంలో చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్..చంద్రబాబు నాయుడులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఏపీ నేతలు మీడియాతో మాట్లాడారు.

యనమల అసంతృప్తి...
నీతి ఆయోగ్ సమావేశంపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత ఇష్యూలతో కూడిన ఏజెండాను కేంద్రం ఫిక్స్ చేసిందని కలుగుతోందన్నారు. దేశానికి..రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు..కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా అమలవుతున్నాయి...తదితర వాటిపై చర్చించాలన్నారు. కానీ తాము పెట్టిన ఏజెండాపైనే చర్చించాలని చెప్పడం అప్రజాస్వామికమని తెలిపారు. ప్రాంతీయ పార్టీలను నిర్లక్ష్యం చేస్తున్నారని అనుమానం కలుగుతోందన్నారు.

పరిష్కార మార్గాలను అన్వేషించాలి - ఎంపీ జేసీ...
పరిష్కార మార్గాలను అన్వేషించించడం ప్రధాన కర్తవ్యమని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. నీతి..నిజాయితి..రాజ్యాంగాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరిచిపోయారని..ఇలా చేయడం దురదృష్టకరమన్నారు. సీఎం కేజ్రీవాల్ ను కలుసుకొనేందుకు అపాయింట్ కావాలని లెఫ్టినెంట్ గవర్నర్ ను నలుగురు ముఖ్యమంత్రులు కోరినా..కలవాలని ప్రయత్నించి విఫలం చెందారని...ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా ? అని ప్రశ్నించారు.

దీక్ష చేస్తా - సీఎం రమేష్...
కడప స్టీల్ ప్లాంట్ కోసం తాను ఆమరన నిరహార దీక్షకు పూనుకుంటున్నట్లు ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు. 16-17వ తేదీల్లో ప్రధాని అపాయింట్ ఇస్తామని చెప్పారని..కానీ ఇంతవరకు ఇవ్వలేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం తాను లేఖ రాయడం జరిగిందని..మెయిల్ కూడా పంపించడం జరిగిందన్నారు. ఆయన సమయం ఇవ్వడం లేకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం నుండి ఆమరణ నిరహార దీక్షకు కూర్చొంటానని ప్రకటించారు. కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు. 

నీతి ఆయోగ్ సమావేశంలో కేసీఆర్...

ఢిల్లీ : నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలని ప్రస్తావించనున్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కోరనున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం పట్టుబడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇబ్రహింపట్నంలో కార్డన్ సెర్చ్...

రంగారెడ్డి :  జిల్లాలోని ఇబ్రహీంపట్నం గోకుల్ నగర్, కుమ్మరి బస్తీ, పోచమ్మగడ్డలో పోలీసులు కార్చన్ సెర్చ్ నిర్వహించారు. 250 మంది పోలీసులు ఇంటింటి సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో 12 ద్విచక్రవాహనాలు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

నీతి ఆయోగ్ సమావేశం...

ఢిల్లీ : నీతి ఆయోగ్ 4వ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత నీతి అయోగ్‌ సమావేశం జరుగుతోంది. 

కాసేపట్లో నీతి ఆయోగ్...

ఢిల్లీ : ప్రణాళిక సంఘం రద్దు చేసి తీసుకొచ్చిన నీతి ఆయోగ్ 4వ పాలక మండలి సమావేశం కాసేపట్లో జరుగనుంది. రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత నీతి అయోగ్‌ సమావేశం జరగనుంది.

09:06 - June 17, 2018

ఢిల్లీ : భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన విజయ్‌ మాల్యాకు బ్రిటన్‌ హైకోర్ట్‌ షాకిచ్చింది. 13 భారతీయ బ్యాంకులకు రెండు లక్షల పౌండ్లు చెల్లించాలని మాల్యాను కోర్టు ఆదేశించింది. తమ రుణాలను రాబట్టేందుకు బ్యాంకులు చేస్తున్న చట్టబద్దమైన పోరాట వ్యయాల కింద ఈ డబ్బు చెల్లించాలని స్పష్టం చేసింది. మాల్యా ఆస్తుల జప్తుకు సంబంధించిన ఆర్డర్‌ను కోర్టు తిరస్కరించింది. విజయ్‌ మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నం చేస్తోంది. విజయ్‌ మాల్యా 2016లో లండన్‌కు పారిపోయాడు.

09:05 - June 17, 2018

తమిళనాడు : చెన్నైలో ప్రముఖనటి కస్తూరి నివాసం ముందు హిజ్రాలు ఆందోళన చేపట్టారు. భారతీయుడు, అన్నమయ్య, సోగ్గాడి పెళ్లాం వంటి పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిగా గుర్తింపు పొందిన నటి కస్తూరి ఇటీవల చేసిన వ్యాఖ్యలు హిజ్రాలకు ఆగ్రహం తెప్పించాయి. దినకరన్‌కు చెందిన 18 ఎమ్మెల్యేలను సగంగా చీలిస్తే హిజ్రాలవుతారంటూ కస్తూరి తన ట్విట్టర్‌లో కామెంట్స్‌ చేసింది. దీంతో భగ్గుమన్న హిజ్రాలు ఆమె తమకు క్షమాపణలు చెప్పాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

09:03 - June 17, 2018

ఢిల్లీ : ఇండోనేషియాలో భారీ కొండచిలువ ఓ మహిళను మింగింది. మునా ఏజెన్సీలో ఈ విషాదం జరిగింది. 8 మీటర్ల కొండచిలువను కోయగా.. దాని కడుపులో 54 ఏళ్ల వాతిబా అనే మహిళ మృతదేహం బయటపడింది. గురువారం అర్థరాత్రి ఆ మహిళ అదృశ్యమైనట్లు మునా పోలీస్ అధికారులు తెలిపారు. ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న మొక్క జొన్న చేనుకు వెళ్లిన తర్వాత ఆమె కనిపించకుండాపోయింది. అడవి పందులు పంటను నాశనం చేస్తున్నాయని, వాటిని వెళ్లగొట్టాలన్న ఉద్దేశంతో ఆమె అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో ఆమె అదృశ్యమైంది. అదే ప్రాంతంలో ఓ భారీ కొండచిలువను స్థానికులు గుర్తించారు. ఆ కొండచిలువను కోయడంతో దాని కడుపులో నుంచి ఆ మహిళ మృతదేహం బయటపడింది.

09:02 - June 17, 2018

హైదరాబాద్ : ఎంబీబీఎస్‌, బిడిఎస్‌ కోర్సుల కోసం పారదర్శకంగా సీట్ల కేటాయింపులు జరగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేకమైన పద్ధతి ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా ఒకేసారి పరీక్ష నిర్వహించాలని నీట్ ని ప్రారంభించారు. కాని నీట్ ఉద్దేశమే ప్రశ్నార్ధంగా మారబోతోందనే అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. నిజానికి దేశవ్యాప్తంగా విద్యార్ధులకు అన్యాయం జరగకూడదని ఏర్పాటు చేసిన ఈ పరీక్ష ఇప్పుడు పరీక్షలు ఎదుర్కోవాల్సివస్తోంది. నేషనల్ ఎలిజిలిబులిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్..నీట్‌ను ... ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల కోసం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అందరికీ ఒకే పరీక్ష నిర్వహించి అందరికీ న్యాయం జరిగే విధంగా ఎంట్రన్స్ నిర్వహించారు. అయితే నేషనల్ పూల్‌లో ఏ రాష్ట్రానికి చెందిన విద్యార్ధులు అయినా సరే అన్నీ మెడికల్ కాలేజీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే నాన్ లోకల్ కోటా లో 15శాతం సీట్లు నేషనల్ పూల్ లో రిజర్వు అయింటాయి. కాని నీట్ ఉద్దేశానికే తూట్లు పొడిచేవిధంగా మెడికల్ కాలేజీల తీరు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌ల తీరు ఉందంటున్నారు విద్యార్ధులు తల్లిదండ్రులు.

నిజానికి ఇవన్నీ చూసుకోవాల్సిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఎంసీసీ వెబ్‌సైట్స్‌లో అనేక పొరపాట్లు దొర్లాయి. వారి వెబ్‌సైట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల వివరాలన్నీ ఉండాలి. నిజానికి తెలంగాణ లో ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. వాటిలో కేవలం రెండింటిని మాత్రమే వెబ్‌సైట్ లో చూపించారు. గాంధీ మెడికల్, ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీ మాత్రమే చేర్చారు. మిగితా ఆరు కాలేజీలను విస్మరించారు. అంతేకాదు ఏపీలో కూడా అనంతపురం‌ మెడికల్ కాలేజీ వివరాలను వెబ్‌సైట్ లో పొందపరచలేదు. దీంతో ఎంతోమంది విద్యార్ధులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.

అయితే ఇప్పటికే ఎంసీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక ఫోన్ కాల్స్.. ఈమెయిల్స్.. పంపినా కూడా కనీస స్పందన లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే నీట్ మొదటి విడుత కౌన్సెలింగ్ ఈనెల 19న ముగిస్తుండటంతో తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల పట్ల చిన్న చూపుమాని మెరిట్ విద్యార్ధులకు న్యాయం జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఓపెన్ క్యాటగిరిలో విద్యార్ధులు టాప్ కాలేజీల్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు.. కాని టాప్ కాలేజీలనే వెబ్‌సైట్‌లో లేకుండా చేస్తే తమ గోడు ఎవరికి చెప్పాలని అంటున్నారు. ఇప్పటికైనా ఎంసీసీ అధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

08:19 - June 17, 2018

హైదరాబాద్ : ఎన్నికలు ఎపుడు వచ్చినా తాము సిద్ధమే అంటున్నారు అధికాపార్టీ నేతలు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలస్తాయన్న అంచనాల నేపథ్యంలో ఇప్పటికే నియోజకవర్గాలపై టీఆర్‌ఎస్‌ అధినేత దృష్టిసారించారు. నిర్ణీత గడువు ప్రకారం వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ నెలలో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అన్న ప్రతిపాదనలు తెరపైకి తేవడంతో.. ఈ ఏడాది చివరి నాటికే ఎన్నికలు వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. గడువుకంటే ఆరు నెలలు ముందుగానే ఎన్నికలు వచ్చినా రెడీ గా తమ పార్టీ సిద్ధంగా ఉందని గులాబి దళపతి కేసిఆర్ సంకేతాలు ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమకు లబ్ది చేకూరుస్తాయన్న ధీమా అధికారపార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే తమను గెలిపిస్తాయని టీఆర్‌ఎస్‌ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే రైతుల కోసం అమల్లోకి తెచ్చిన రైతుబంధు పథకంతో అన్నదాతల మద్దతు తమకే ఉంటుందని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. అటు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం పథకాన్ని సైతం ఈ ఏడాదే ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తూ ఇంజనీర్లను పరుగులు పెట్టిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకుతోడు ముఖ్యమంత్రి కేసిఆర్ రాజకీయ వ్యూహాలను ప్రతిపక్ష పార్టీలు అంచనా వేయడంలో విఫలమవుతాయన్నది గులాబి నేతల ధీమా. ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌ నేతల్లో ఉన్న అంతర్గత విభేదాలు తమకు కలిసి వస్తాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. అయితే పలు నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం కావడం గులాబీనేతలను ఆందోళనకు గురిచేస్తోంది. అసంతృప్తి ఉన్న స్థానాల్లో కొత్తవారిని రంగంలోకి దించితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని అధికారపార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తానికి రానున్న పంచాయతీ ఎన్నికలతోనే తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ వాతావరణం హీట్ ఎక్కే అవకాశం కనిపిస్తోంది.

07:01 - June 17, 2018

ఢిల్లీ : వారం రోజులుగా దీక్ష చేస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు పలువురు ముఖ్యమంత్రులు సంఘీభావం ప్రకటించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆఫీసులో ఏడు రోజులుగా కేజ్రీవాల్‌ దీక్ష చేస్తున్నా.. కేంద్రం ఉలుకూపలుకూ లేకుండా ఉంటోందని సీఎంలు మండిపడ్డారు. చివరికి తమకు కూడా ఢీల్లీ సీఎం ను కలుసుకునే అవకాశం ఇవ్వకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లిన ఏపీ, కేరళ, కర్నాటక, బెంగాల్‌ సీఎంలు ప్రధాని మోదీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వంపై వివిధ రాష్ట్రాల సీఎంలు విమర్శలు ఎక్కుపెట్టారు. నీతి ఆయోగ్‌ సమావేశం కోం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రులు... ఢీల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పోరాటానికి మద్దతు తెలిపారు. అధికారులను గుప్పిట్లో పెట్టుకున్న కేంద్రం... ఢిల్లీలో ప్రమాదకర ఆట ఆడుతోందన్నారు. ఎల్జీ కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌ను కలుసుకోడానికి అధికారులు అనుమతించకపోవడంపై ముఖ్యమంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీతిఆయోగ్‌ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు తనదైన శైలిలో మోదీ ప్రభుత్వంపై మొదటి దాడి మొదలు పెట్టారు. దీనికి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ చేస్తున్న దీక్షను ఆయుధంగా మలచుకున్నారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్‌, కర్నాకట ముఖ్యమంత్రి కుమారస్వామిని కలుపుకుని కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లారు. ఢీల్లీ సీఎం పట్ల లెఫ్టినెంట్‌ గవర్నర్‌, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నా తీరును చంద్రబాబు తప్పుబట్టారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని చంద్రబాబు హెచ్చరించారు.

గత నాలుగు నెలలుగా అధికారులెవరూ ఢిల్లీ సీఎం మాటవినక పోవడంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విస్మయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో వివిధ మంత్రిత్వశాఖల అధికారులు శాఖాపరమైన సమీక్షలకు హారవకుండా .. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని పినరయి మండిపడ్డారు. కేజ్రీవాల్‌కు అండగా ఉంటామన్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కేజ్రీవాల్‌ను కలుసుకోడానికి తమకు అనుమతి ఇవ్వలేదంటూ ఢిల్లీ అధికారులపై ఆమె నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం చేతిలో ఢిల్లీ ఐఏఎస్‌ అధికారులు కీలుబొమ్మల్లా మారిపోయారని విమర్శించారు. ఇది ఒక్క కేజ్రీవాల్‌ సమస్యే కాదని, అన్ని రాష్ట్రాల్లో సీఎంలను కలుపుకుని ఉద్యమిస్తామని మమత అన్నారు.

మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై పటేల్‌నగర్‌ పీఎస్‌లో కేసు నమోదయింది. దీక్ష పేరుతో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ విధులకు ఆటంకం కలిగించారంటూ అధికారులు ఫిర్యాదు చేయడంతో సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మంత్రులు సంత్యేంద్రజైన్, గోయల్ రాయ్‌పై పోలీసులు 124 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఇవాళ జరిగే నీతి ఆయోగ్‌ భేటీకి తాను హాజరు కాలేనని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ తెలిపారు. ఏడు రోజులుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలోనే నిరసన తెలుపుతున్న ఆయన దీక్షను కొనసాగించి కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని నిర్ణయంచుకున్నారు. మొత్తానికి ఈ అవకాశాన్ని అస్త్రంగా మలచుకున్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగానే కేజ్రీవాల్‌ దీక్షకు మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన ప్రధాని మోదీని మరింత ఇరుకున పెట్టడానికి చంద్రబాబు చక్రం తిప్పుతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.

06:59 - June 17, 2018

చిత్తూరు : జిల్లా కుప్పం మండలం నాయనూరు, పెద్దవంక సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మామిడికాయలతో లోడుతో తమిళనాడు వైపు వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో లారీలో 33 మంది ప్రయణిస్తున్నారు. ఈ ప్రమాదంలో 7గురు కూలీలు మృతి చెందారు. 21 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని కుప్పం ఏరియా ఆస్పత్రికి, మరి కొంత మందిని తమిళనాడులోని వేలూరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిని ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఏపీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా తమిళనాడు వేలూరు జిల్లా కల్లనరసంభట్టు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. అధికారులతో ఫోనులో మాట్లాడి అన్ని రకాల సహయాక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌, ఎస్పీని ఆదేశించారు.

 

నీతి ఆయోగ్ సమావేశం...

ఢిల్లీ : ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ పాలకమండలి నాలుగో సమావేశం జరుగనుంది. పలు రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ముగియనుంది. 

చిత్తూరులో ప్రమాదం..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ?

చిత్తూరు : కుప్పం (మం) పెద్దవంక వద్ద లారీ లోయలో పడిపోయింది. ఏడుగురు మృతి చెందగా 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను వెలికి తీశారు. క్షతగాత్రులను తమిళనాడులోని వాణియంబాడి ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యల్లో ఆంధ్ర..తమిళనాడు పోలీసులు పాల్గొంటున్నారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్...

హైదరాబాద్ : జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఐదు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 122 మందిపై కేసులు నమోదు చేశారు. 60 కార్లు, 60 బైక్ లు, రెండు ఆటోలను సీజ్ చేశారు. 

జగన్ 191వ రోజు...

తూర్పుగోదావరి : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. 191వ రోజు కొత్తపేట నియోజకవర్గంలో పాదయాత్ర జరుగనుంది. రావులపాలెం (మం) వెదిరేశ్వరం మీదుగా కొనసాగనుంది. 

Don't Miss