Activities calendar

18 June 2018

21:46 - June 18, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న లైంగికదాడులను అరికట్టాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టి భద్రత కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని ... దేశంలోనే నేరాలలో రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. అసభ్య, అశ్లీల సినిమాలు, వెబ్‌సైట్లు, ప్రసార మాద్యమాలలో మహిళలను కించపరిచే విధంగా చూపడం వల్లే వేధింపులు పెరుగుతున్నాయని అన్నారు. వాటి నివారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని దోషులను శిక్షించాలని సీపీఎం ప్రభుత్వాన్ని కోరింది. 

చుక్కల భూముల పరిష్కారానికి గ్రామకమిటీలు : కేఈ

అమరావతి : రాష్ట్రంలో చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందుకోసం ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వ తేదీ వరకూ 16 రోజుల పాటు గ్రామ సభల ద్వారా ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నామని, ఈ గ్రామ సభల్లో చుక్కల భూ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్, ఉప తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

21:26 - June 18, 2018

అమరావతి : నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోడీతో చంద్రబాబు మాట్లాడిన మాటలను వైసీపీ నేతలు వక్రీకరించడంపై టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. దైవ దర్శనానికి వెళ్లిన రోజా దేవాలయంలో రాజకీయాలను మాట్లాడటాన్ని అనిత తప్పుబట్టారు. వైసీపీ ఎంపీలు కేసుల మాఫీ కోసం పీఎంవో ఆఫీసులో ప్రధాని కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. ఒంగి ఒంగి దండాలు పెట్టటంలో సీఎం చంద్రబాబు ఒలింపిక్స్ లో మెడల్ ఇవ్వవచ్చు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేయగా..దీనికి ఎమ్మెల్యే అనిత అంతే తీరుగా సమాధానమిచ్చారు. పాదయాత్రలో జగన్ అందరికి ముద్దులు పెడుతున్నారనీ..మరి జగన్ కు ఏ మెడల్ ఇవ్వాలో అని కౌంటరిచ్చారు.

 

21:26 - June 18, 2018

హైదరాబాద్ :ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీతి ఆయోగ్‌ సమావేశంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి వచ్చారని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సమావేశంలో తెలంగాణ ప్రయోజనాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కేసీఆర్‌ స్వప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లారని అన్నారు భట్టి విక్రమార్క. 

21:24 - June 18, 2018

విజయవాడ : ఏపీలో దేవాలయ క్షురకుల వివాదం ముదిరింది. కనీస వేతనం నెలకు 15 వేల రూపాయలు చెల్లించి.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్చించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె చేస్తున్న క్షురకులపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. కేశఖండనకు 25 రూపాయలు చెల్లిస్తామన్న సీఎం.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్చించడం వీలుకాదన్నారు. క్షురకులు సమస్యలను సానుభూతితో పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి హామీ ఇచ్చినా ... ముఖ్యమంత్రి చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వివాదం ముదిరింది. దీంతో క్షరుకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఖరిని తప్పుపట్టిన దేవాలయ క్షురకులు సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.

కనీస వేతనం 15 వేలు చెల్లించాలన్న డిమాండ్‌
ఏపీలోని దేవాలయాల్లో క్షురకులు చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాల్చింది. తమను దేవాలయ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం 15 వేలు చెల్లించాలన్న డిమాండ్‌తో విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. దీంతో విజయవాడ దుర్గగుడితోపాటు పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వంటి ప్రముఖ దేవాలయాలల్లో కేశఖండనలు నిలిచిపోయాయి. దీంతో మొక్కు తీర్చుకోడానికి వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

క్షురకులతో విఫలమయిన చర్చలు..
దేవాలయ క్షురుకుల సమ్మె నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని గ్రహించిన ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చొరవతీసుకుంది. క్షురకులతో దేవాదాయ శాఖ మంత్రి కేఈ కష్ణమూర్తి చర్చలు జరిపారు. దేవాలయ ఉద్యోగులుగా గుర్తించి 15 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలన్న డిమాండ్లపై చర్చించారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్న కేఈ హామీతో సంతృప్తిచెందని క్షురకులు... అర్థాంతరంగా చర్చలను బహిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో విధులు ముగింపుచుకొని క్యాంపు కార్యాలయాలనికి బయలుదేరిన సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో క్షురకులపై చంద్రబాబు మండిపడ్డారు.

క్షురకులపై మండిపడ్డ సీఎం చంద్రబాబు
సచివాలయం ప్రజా సమస్యలు పరిష్కరించే దేవాలయమని... ఇక్కడ అల్లరిచేస్తే కుదరదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశఖండనకు ప్రస్తుతం ఇస్తున్న 13 రూపాయలను 25 రూపాయలు పెంచుతున్నట్టు చంద్రబాబు ప్రకటించినా.. క్షరకులు వినిపించుకోవడంతో చంద్రబాబుకు కోపం కట్టలు తెంచుకుంది. కొన్ని దేవాలయాల్లో కేశఖండనకు ఐదు రూపాయలే చెల్లిస్తున్నారని క్షురకులు చెప్పగా.... ఇక నుంచి అన్ని గుళ్లలో కూడా 25 రూపాయలు ఇస్తామని చెప్పారు. క్షురకులను ఉద్యోగులుగా గుర్తించాలన్న డిమాండ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని దేవాదాయ శాఖ మంత్రి కేఈ కష్ణమూర్తి తేల్చి చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కేఈ కృష్ణమూర్తి వైఖరిని క్షురకలు తప్పుపట్టారు. సమ్మెను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్ల బంద్‌తోపాటు టీటీడీ క్షురకులను కూడా సమ్మెలోకి తేచ్చేందుకు ప్రయత్నిస్తామని నాయీబ్రాహ్మణ సంఘాలు ప్రకటించాయి. 

21:17 - June 18, 2018

అమరావతి : ఏపీలో అధిక ఉష్ణోగ్ర‌త‌ల నేప‌థ్యంలో విద్యాశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విద్యార్థుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా మూడు రోజుల పాటు అన్ని పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌ల‌కు రేప‌టి నుంచి ఈ నెల‌ 21 వ‌ర‌కు సెల‌వులు ఇస్తున్న‌ట్లు రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఈరోజు ప్ర‌క‌టించారు. అధిక ఉష్ణోగ్ర‌త‌లు, వేడిగాలులు నేప‌థ్యంలో పాఠశాల‌ల‌కు సెల‌వుల ఇస్తున్నామ‌ని చెప్పారు. మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు ఉంటాయ‌ని వాతావ‌ర‌ణశాఖ హెచ్చ‌రికలు చేసిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. ఈరోజు కూడా అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యాయ‌ని, వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌లు, హెచ్చ‌రింపుల‌ నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌కు సెల‌వుల ప్ర‌క‌టిస్తున్నామ‌ని మంత్రి గంటా తెలిపారు. త‌ప్ప‌నిస‌రిగా ప్రైవేట్, కార్పోరేట్ పాఠ‌శాల‌లు కూడా విద్యార్థుల‌కు సెల‌వులు ఇవ్వాల్సిందేన‌న్నారు. సెల‌వుల్లో ప్రైవేట్, కార్పోరేట్ పాఠ‌శాల‌లు త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తే గుర్తింపు ర‌ద్దు చేస్తామ‌ని మంత్రి గంటా శ్రీనివాస‌రావు హెచ్చరించారు. 

ఏపీలో ఎండలు..స్కూల్స్ సెలవులు..

అమరావతి : ఏపీలో అధిక ఉష్ణోగ్ర‌త‌ల నేప‌థ్యంలో విద్యాశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విద్యార్థుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా మూడు రోజుల పాటు అన్ని పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌ల‌కు రేప‌టి నుంచి ఈ నెల‌ 21 వ‌ర‌కు సెల‌వులు ఇస్తున్న‌ట్లు రాష్ట్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఈరోజు ప్ర‌క‌టించారు. అధిక ఉష్ణోగ్ర‌త‌లు, వేడిగాలులు నేప‌థ్యంలో పాఠశాల‌ల‌కు సెల‌వుల ఇస్తున్నామ‌ని చెప్పారు.మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్ర‌త‌లు ఉంటాయ‌ని వాతావ‌ర‌ణశాఖ హెచ్చ‌రికలు చేసిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. 

20:47 - June 18, 2018

కర్ణాటకలో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్‌పై శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లంకేశ్ హత్య కేసులో ప్రధాని మౌనం వీడాలంటూ వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించిన ఆయన.. ‘‘కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే, దానికి మోదీ ఎందుకు స్పందించాలి?’’ అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో రెండు, మహారాష్ట్రలో రెండు హత్యలు జరిగాయని, అప్పుడెవరూ కాంగ్రెస్‌ను తప్పుబట్టలేదు కానీ కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా ప్రమోద్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. కర్ణాటకలో జరిగే ప్రతీ హత్యకు ప్రధాని సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతోనే అలా అన్నాను తప్పతే, లంకేశ్‌ను నేరుగా కుక్క అని ప్రస్తావించలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు, లంకేశ్‌ను హత్య చేసిన నిందితుడు పరశురామ్‌ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు, శ్రీరామ్ సేనతో అతడికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

20:27 - June 18, 2018

దొంగలకు సర్ధి కడుతున్న దేశం..భారతదేశపు దొంగలకు ఆశ్రయమిస్తున్న ఇంగ్లండ్..ఎమ్మార్వో ఆపీసుకాడికి ఇనిపించేత దూరంలో వున్న చెరువు. అక్కినేని నాగార్జునను గతంతో గ్రీకు వీరుడు కాదు తెలంగాణ గీకుల వేరుడు అన్న కేసీఆర్ ఇప్పుడు తండ్రీ,కుమారుడు కలిసి అలయ్ బలయ్ తిరుర్గతన్నరు. అధికార పార్టీ ఎంపీపీ కావరం..మహిళలను గుండెలపై తన్నిన ఎంపీపీ ఇమ్మడి గోపి..బహుజనులంతా ఒకటైన బహుజనులు..నిజామాబాద్ జిల్లాల ఏకతాటిపైకొచ్చి 30ఏళ్ల సంది బహుజనులే సర్పంచులుగా నెగ్గుతుండట..తొవ్వంటా బోయే జనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్న వసూలు రాజా..వసూలు రాజాగా మారిన ఏఆర్ కానిస్టేబులు బాలూ నాయక్.

19:28 - June 18, 2018

కేంద్రం రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని మెజారిటీ రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీతి అయోగ్ సమావేశంలో దీనికి సమాధానం లభించిందా? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేవనెత్తిన అంశాలపై మరోసారి కేంద్రం సానుకూలంగా ఎందుకు స్పందించలేదు? మరోపక్క విభజన హామీల అమలుపై ప్రధాని మోదీ కట్టుబడి వున్నారని నీతి అయోగ్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. కాగా దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాని వివక్ష చూపుతున్నారనే విమర్శలు కూడా వున్న నేపథ్యంలో నీతి అయోగ్ సమావేశంలో మరోసారి ప్రధాని ద్వంద వైఖరి అవలంభించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సమస్యలకు నీతి అయోగ్ లో సమాధానం లభించిందా? అనే అంశంపై చర్చ. ఈ చర్చలో టీఆర్ఎస్ నేత రాజమోహన్, టీడీపీ బాబు రాంప్రసాద్ పాల్గొన్నారు.

19:05 - June 18, 2018

ఢిల్లీ : నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం గురించే యావత్తు దేశం చర్చించుకుంటోందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంతో రాష్ట్రంలో సమస్యల గురించి దేశమంతటా చర్చించుకుంటున్నారని, చంద్రబాబు స్పీచ్ ‘టాక్ ఆఫ్ ది నేషన్’ అని ప్రశంసించారు. ఈ సమావేశం ద్వారా మోదీ ద్వంద్వ వైఖరి మరోసారి స్పష్టమైందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. బీజేపీ-వైసీపీ కుమ్మక్కయ్యాయని.. ఈ రెండు పార్టీలను ప్రజలు త్వరలో తిప్పికొడతారని అన్నారు. కృష్ణుడి లాంటి చంద్రబాబు దగ్గర వీరి డ్రామాలు సాగవని డొక్కా పేర్కొన్నారు.

19:01 - June 18, 2018

విజయవాడ : వేతనాలు పెంచాలని డిమాండ్ తో పాటు మరికొన్ని డిమండ్స్ తో గత కొన్ని రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న క్షురకులతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అమరావతిలోని సచివాలంలో చర్చించారు. గత కొంతకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో క్షురకులకు పీఎఫ్ సౌకర్యం, రూ.15వేలు కనీసన వేతనం చెల్లించాలని క్షురకులు డిమాండ్ చేస్తు నిరసన దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో కేసీ కృష్ణమూర్తి వారి నాయకులతో చర్చించిన చర్చలు విఫలమయ్యాయి. సీఎం చంద్రబాబు దృష్టికి క్షురకుల సమస్యలను తెలిపి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని..దానికి సమయం ఇవ్వాలనీ..ఈలోపు నిరసన విరమించాలని కోరారు. అయినా క్షురకుల నాయకులు వినకుండా చర్చలు మధ్యలోనే వెళ్లిపోయారని కేఈ తెలిపారు. కేఈతో చర్చల అనంతరం వెళ్లిపోతున్న సమయంలో సీఎం కాన్వాయి సచివాలయానికి రావటంతో క్షురకులు కాన్వాయ్ ని అడ్డుకున్నారు. ప్రతీ తలనీలాలకు రూ.25 చొప్పున ఇవ్వాలని క్షురకులు డిమాండ్ చేశారు. దీనిపై అంగీకరించని సీఎం చంద్రబాబు రూ.15 చొప్పున ఇస్తామని మొదట్లో చెప్పినా తరువాత రూ.25 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో క్షురకులు వాగ్వాదానికి దిగిన నేపథ్యంలో క్షురకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.25లు కనీసవేతనం కంటే ఎక్కువే వస్తుందని సీఎం చంద్బరాబు స్పష్టంచేశారు రెగ్యులర్ చేసే అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహంచిన క్షురకులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ డిమాండ్స్ నెరవేర్చేంత వరకూ తమ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

ప్రభుత్వంతో క్షురకుల చర్చలు విఫలం..

విజయవాడ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాయీ బ్రాహ్మణులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈరోజు అమరావతిలోని ఏపీ సచివాలయంలో వారు ఆందోళన కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కారులోంచి బయటకు వచ్చిన చంద్రబాబు వారితో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించుకునే పద్ధతి ఇది కాదని చంద్రబాబు అన్నారు. ఒక్కో కేశఖండన టిక్కెట్‌పై నాయీ బ్రాహ్మణులకు రూ.25 చొప్పున ఇస్తామని అన్నారు. సమస్యను అర్థం చేసుకుని విధుల్లో చేరాలని అన్నారు. రూ.12 నుంచి 25 వరకు అంటే చాలా ఎక్కువని అన్నారు.

18:52 - June 18, 2018
18:29 - June 18, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 15 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మోది ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో విద్యాభివృద్ధి కోసం 33 కొత్త కార్యక్రమాలు తీసుకువచ్చామని... అందరికి విద్య - నాణ్యమైన విద్య నినాదంతో ముందుకు సాగుతున్నామని మంత్రి చెప్పారు. మధ్యాహ్న భోజనానికి ఏటా 17 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఏడాదిలో బాలికల కోసం 2 లక్షల మరుగుదొడ్లు నిర్మించామన్నారు. వచ్చే ఏడాది నుంచి 5, 8 తరగతులకు బోర్డు పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించినట్లు జవదేకర్‌ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపికే ఎక్కువ స్థాయిలో విద్యాలయాలు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

18:25 - June 18, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్‌ ప్రభంజనంలో కూడా జహీరాబాద్‌ నుంచి గెలుపొందిన నేత గీతారెడ్డి. అలాంటి కీలక నేతకే టీఆర్ఎస్‌ చెక్‌ పెట్టనుందా... అంటే.. అవుననిపించేలా కనిపిస్తున్నాయి పరిణామాలు. నేరుగా మంత్రి హరీష్‌రావే గీతారెడ్డిని టార్గెట్‌ చేసినట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా మారుతున్న జహీరాబాద్‌ నియోజకవర్గ పాలిటిక్స్‌పై టెన్‌టీవీ ప్రత్యేక కథనం.

కాంగ్రెస్‌ కోటలో జెండే పాతే యోచనలో టీఆర్ఎస్‌
కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట లాంటిది జహీరాబాద్‌ నియోజకవర్గం. అలాంటి కోటకు ఇప్పుడు బీటలు వారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కాంగ్రెస్‌కోటలో జెండా ఎగరేసేందుకు వ్యూహం రచిస్తోంది టీఆర్ఎస్‌ పార్టీ. కాంగ్రెస్‌లో కీలక నేత గీతారెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతోంది ఆ పార్టీ. డైరెక్టుగా మంత్రి హరీష్‌రావే.. టార్గెట్‌ గీతారెడ్డి ఆపరేషన్‌ చేపట్టారు.

ప్రాభవం కోల్పోయిన ఫరీదుద్దీన్‌..జైపాల్‌ రెడ్డికీ మొదలైన కష్టాలు
జహీరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను తిరుగులేని శక్తిగా మలిచిన బాగారెడ్డి.. ఇక్కడనుంచి ఏడు సార్లు ఎంపీగా గెలిచారు. 2009లో ఈ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్‌ అయ్యింది. దీంతో గజ్వేల్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న జె. గీతారెడ్డిని.. జహీరాబాద్‌ నుంచి పోటీ చేయించారు అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి. దాంతో కాంగ్రెస్‌లో బలమైన నేతగా పేరున్న ఫరీదుద్దీన్‌ ప్రాభవం తగ్గిపోయింది. అదే సమయంలో బాగారెడ్డి కుమారుడు జైపాల్‌ రెడ్డికి కూడా కష్ట కాలం మొదలైంది. గీతారెడ్డి అటు ఫరీదుద్దీన్‌ను, ఇటు జైపాల్‌ను కూడా వెనక్కి నెట్టి దూసుకెళ్ళారు.

టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్న ఫరీదుద్దీన్‌..
ఈ నేపథ్యంలో ఇటీవల టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్న ఫరీదుద్దీన్‌.. ఎమ్మెల్సీగా ఎన్నికై తన ఉనికిని కాపాడుకోగా.. జైపాల్‌రెడ్డి వర్గం మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నా.. గీతారెడ్డి తమను కలుపుకుని పోవడం లేదన్న ఆవేదన బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ వర్గపోరుతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్‌ విజయానికి హరీష్‌రావు వ్యూహం రచిస్తున్నారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం.. మాలో గ్రూపుల్లేవంటోంది.

టీఆర్ఎస్‌లో చేరిన టీడీపీ నేత ఉగ్గెల్లి రాములు
కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టాలన్న యోచనతో తరచూ ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు హరీష్‌రావు. జిల్లా మొత్తానికి టీడీపీకి కాస్త బలమున్నది కూడా ఈ స్థానంలోనే. కానీ ఇక్కడి టీడీపీ నేత ఉగ్గెల్లి రాములు కూడా మంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో టీఆర్ఎస్‌ బలం మరింత పెరిగింది. ఇక కాంగ్రెస్‌లోని అసమ్మతి నేతలను కూడా తమ వైపు తిప్పుకునే వ్యూహంలో ఉన్నారు మంత్రి. గీతారెడ్డి ఒంటెద్దు పోకడతో నష్టపోతోంది కాంగ్రెస్‌. దీనికి తోడు హరీష్‌రావు వ్యూహంతో ఆ పార్టీ మరింత చతికిలపడే అవకాశం కనిపిస్తోంది. ఇంతవరకూ నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేబాధ్యత తనదేనని హామీ ఇచ్చారు మంత్రి. కానీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థినే గెలిపించాలన్నారు మంత్రి.

జహీరాబాద్‌ను టీఆర్ఎస్‌ ఖాతాలో వేయాలన్న పట్టుదలతో హరీశ్ రావు
గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌ జిల్లావ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినా.. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్‌ నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. కాగా.. నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఎన్నికల్ని అవకాశంగా తీసుకున్న మంత్రి హరీష్‌రావు... తన చతురతతో టీఆర్ఎస్‌ జెండా ఎగిరేలా చేశారు. ఇక మిగిలిన జహీరాబాద్‌ను కూడా టీఆర్ఎస్‌ ఖాతాలో వేయాలన్న పట్టుదలతో ఉన్నారు హరీష్‌రావు. అందుకోసం ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు.మొత్తానికి వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు గడ్డుకాలంగానే కనిపిస్తోంది. కాగా.. కాంగ్రెస్‌ బలహీనతను అనుకూలంగా మలుచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది టీఆర్ఎస్. కాగా.. మంత్రి హరీష్‌రావు చేపట్టిన టార్గెట్‌ గీతారెడ్డి ఆపరేషన్‌ ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే... 

18:16 - June 18, 2018

ఢిల్లీ : లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో గత 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఆరోగ్యం క్షీణించింది. కెటోన్‌ స్థాయి 7.4కి పడిపోవడంతో ఆయనను ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు మంత్రి సత్యేంద్ర జైన్‌ ఆరోగ్యం కూడా క్షీణించడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఎల్జీ అనిల్‌ బైజల్‌ కార్యాలయంలో కేజ్రీవాల్‌, మంత్రుల ధర్నా 8 రోజుకు చేరింది. ఐఏఎస్‌ అధికారులు అప్రకటిత సమ్మెకు ముగింపు చెప్పేలే ఎల్జీ ఆదేశించాలన్న డిమాండ్‌పై కేజ్రీవాల్‌, నలుగురు మంత్రులు ఈ నెల 11 నుంచి ఎల్జీ కార్యాలయంలో బైఠాయించారు. ఢిల్లీ అధికారులెవ్వరూ సమ్మెలో లేరని ఐఏఎస్‌ అసోసియేషన్ చెబుతోంది.

18:14 - June 18, 2018

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌ వార్‌ భయభ్రాంతులకు గురిచేసింది. బురాడీలోని సంత్‌నగర్‌లో టిల్లు, గోగి గ్యాంగ్‌లు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళతో పాటు ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో టిల్లు గ్యాంగ్‌కు చెందిన రాజు కూడా ఉన్నాడు. వార్‌కు సంబంధించిన విజువల్స్‌ సిసిటివీలో రికార్డ్‌ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇరువర్గాలు వారు స్కార్పియో, ఫార్చునర్‌ వాహనాల్లో వచ్చారు. స్కార్పియో వచ్చిన యువకులు ప్రతిరోజూ జిమ్‌కు వెళ్తారు. జిమ్‌ నుంచి వెళ్లే సమయంలో ఫార్చునర్‌లో వచ్చిన దుండగులు ఇద్దరు యువకులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. గోగి, టిల్లు గ్యాంగ్‌ల మధ్య చాలాసార్లు గ్యాంగ్‌ వార్‌ జరిగింది. అలీపూర్‌కు చెందిన గోగిపై ఎన్నో కేసులున్నాయని పోలీసులు చెప్పారు. 

18:02 - June 18, 2018

విజయవాడ : చంద్రబాబు ప్రసంగాన్ని తప్పుపడుతున్న బీజేపీ, వైసీపీలపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్‌ ఫైర్‌ అయ్యారు. 7 నిమిషాలే మాట్లాడేందుకు సమయమిచ్చినా... రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా 20 నిమిషాలు సమయమివ్వాలని మాట్లాడిన చంద్రబాబుపై.. కన్నా లక్ష్మీనారాయణ వైసీపీతో కుమ్మక్కై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైసీపీ, బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాల కన్నా... రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ఉన్నాయన్నారు జూపూడి. 

17:57 - June 18, 2018

కరీంనగర్‌ : ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో మల్టీప్లెక్స్‌ వస్తుందన్న ప్రచారం అవాస్తవమన్నారు మంత్రి ఈటల రాజేందర్‌. వ్యవసాయ రంగంలో కరీంనగర్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. రైతులు, వ్యవసాయ అభివృద్ధి పట్ల తమకు చిత్తశుద్ది ఉందని... అందుకే 12 వేల కోట్ల పెట్టుబడి సాయం చేశామన్నారు ఈటల. 

17:54 - June 18, 2018

చిత్తూరు : నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై ప్రధాని మోదీని నిలదీయని ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి వైసీపీ ఎమ్మెల్యే రోజా తప్పుపట్టారు. ధర్మపోరాట దీక్షల్లో మోదీని విమర్శించిన చంద్రబాబు... ప్రధాని ఎదురుగా ఉన్నప్పుడు విభజన హామీలపై ఎందుకు ప్రశ్నించలేని నిలదీశారు. శ్రీకాళహస్తిలో ముక్కింటిని దర్శించుకున్న రోజా... ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు. బయట ప్రగల్బాలు పలికే చంద్రబాబు... నీతి ఆయోగ్‌ సమావేశంలో రాష్ట్ర వాదనలు సరిగా వినిపించలేదని విమర్శించారు. 

17:53 - June 18, 2018

అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం పనుల పురోగతిపై 64వ సారి వర్చువల్ ఇన్‌స్పెక్షన్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు ఇప్పటివరకు 55 శాతంపూర్తి అయ్యాయని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. కుడి కాలువ నిర్మాణం 90 శాతం.. ఎడమ కాలువ నిర్మాణం 61 శాతం పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌ తవ్వకం పనులు 75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు 26 శాతం.. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61 శాతం.. కాఫర్ డ్యాం జెట్ గ్రౌంటింగ్ 86.6 శాతం పూర్తి అయినట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. 

క్షురకులతో కేఈ చర్చలు విఫలం..

విజయవాడ : వేతనాలు పెంచాలని డిమాండ్ తో పాటు మరికొన్ని డిమండ్స్ తో గత కొన్ని రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న క్షురకులతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చర్చించారు. గత కొంతకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో క్షురకులకు పీఎఫ్ సౌకర్యం, రూ.15వేలు కనీసన వేతనం చెల్లించాలని క్షురకులు డిమాండ్ చేస్తు నిరసన దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో కేసీ కృష్ణమూర్తి వారి నాయకులతో చర్చించిన చర్చలు విఫలమయ్యాయి. సీఎం చంద్రబాబు దృష్టికి క్షురకుల సమస్యలను తెలిపి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని కేఈ వారికి హామీ ఇచ్చారు. 

దేశమంతా చంద్రబాబు ప్రసంగం గురించి చర్చిస్తోంది: డొక్కా

ఢిల్లీ : నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం గురించే యావత్తు దేశం చర్చించుకుంటోందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశంతో రాష్ట్రంలో సమస్యల గురించి దేశమంతటా చర్చించుకుంటున్నారని, చంద్రబాబు స్పీచ్ ‘టాక్ ఆఫ్ ది నేషన్’ అని ప్రశంసించారు.

 

కేజ్రీవాల్ నిరసనకు శివసేన సంఘీభావం..

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్‌ తమ రాష్ట్ర మంత్రులతో కలిసి నిరసన ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారులు చేస్తోన్న ఆందోళనను విరమింపజేసేలా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ చొరవ తీసుకోవాలని, అలాగే పలు సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో ఆయన చేస్తోన్న ఈ నిరసన ధర్నా ఈరోజు కూడా కొనసాగుతోంది. ఈ విషయంలో ఆయనకు ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు మద్దతు తెలుపగా, తాజాగా శివసేన పార్టీ కూడా సంఘీభావం తెలిపింది.

16:54 - June 18, 2018

హైదరాబాద్ : భాగ్యనగరంలో మరో నెల రోజుల్లో బోనాల ఉత్సవాల సందడి మొదలు కానుంది. జులై 15వ తేదీ నుంచి జంటనగరాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. జులై 29న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, 30న రంగం జరుగుతుందంన్నారు. కోటి రూపాయలతో 3.80 కిలోల బంగారంతో అమ్మవారికి బోనం తయారు చేయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బోనాల ఉత్సవాలపై మంత్రి తలసాని, పద్మారావు వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. ఉత్సవాల సందర్భంగా జంటనగరాల్లోని 145 ఆలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. 

16:53 - June 18, 2018

హైదరాబాద్ : విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్‌ చంద్రకుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సిఐటియు, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన జస్టిస్‌ చంద్రకుమార్‌.... ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు బయ్యారంలో ఉన్నాయని.... వెంటనే స్టీల్ ఫ్యాక్టరీ నెలకొల్పాలన్నారు జస్టిస్‌ చంద్రకుమార్‌. 

టీచర్లు లేని స్కూల్లో మేం చదువుకోం..

భద్రాద్ది కొత్తగూడెం : ఓ పక్కన ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మూయించివేస్తోంది. వున్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత సమస్యగా తయారయ్యింది. ఈ నేపథ్యంలో టీచర్లు లేని పాఠశాలలో మేం చదుకోబోమని విద్యార్ధినులు ఆందోళన చేపట్టారు. ఇల్లందు బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో టీచర్లు లేని పాఠశాలలో మేం చదుకోలేమని..తమకు టీసీలు ఇచ్చేమని గిరిజన విద్యార్ధినిలు డిమాండ్ చేసారు. రెగ్యులర్ టీచర్లను నియమించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే తమకు టీసీలు ఇచ్చేయాలని విద్యార్ధులు క్లాసులకు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.

16:43 - June 18, 2018

భద్రాద్ది కొత్తగూడెం : ఓ పక్కన ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మూయించివేస్తోంది. వున్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత సమస్యగా తయారయ్యింది. ఈ నేపథ్యంలో టీచర్లు లేని పాఠశాలలో మేం చదుకోబోమని విద్యార్ధినులు ఆందోళన చేపట్టారు. ఇల్లందు బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో టీచర్లు లేని పాఠశాలలో మేం చదుకోలేమని..తమకు టీసీలు ఇచ్చేమని గిరిజన విద్యార్ధినిలు డిమాండ్ చేసారు. రెగ్యులర్ టీచర్లను నియమించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే తమకు టీసీలు ఇచ్చేయాలని విద్యార్ధులు క్లాసులకు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.

భార్య చంపి ఇంట్లోనే పూడ్చేశాడు...

విజయనగరం : విజయనగరం జిల్లాలోని మక్కువ మండలం వేంకంపేటలో నివాసముంటున్న నరసయ్య మద్యానికి బానిసవటంతో భార్య రమణమ్మను నరసయ్య హత్య చేసిన బాత్రూమ్ గోడలో పూడ్చిపెట్టేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరువాత పరారయ్యాడు. ఫిర్యాదు అనంతరం నరసయ్య కనిపించకుండా పోవటంతో అనుమానించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇంటిని పరిశీలించగా అనుమానంతో గోడను తవ్వి చూడగా..బాత్రూమ్ కోసం నిర్మించిన స్థలంలో రమణమ్మ మృతదేహం బైటపడింది.

16:32 - June 18, 2018

విజయనగరం : మద్యం కుటుంబాలలో చిచ్చులు రేపుతోంది. ప్రాణాలు తీసేంత దారుణాలకు పురిగొలుపుతోంది. ఈ నేపథ్యంలో మద్యానికి బానిసయిన భర్తను భార్య మందలిస్తోందనే కారణంతో భార్య దారుణంగా చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విజయనగరం జిల్లాలోని మక్కువ మండలం వేంకంపేటలో నివాసముంటున్నారు. నరసయ్య మద్యానికి బానిసవటంతో భార్య రమణమ్మను నరసయ్య హత్య చేసిన బాత్రూమ్ గోడలో పూడ్చిపెట్టేశాడు. అనంతరం ఏమీ తెలియనట్లుగా కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరువాత పరారయ్యాడు. ఫిర్యాదు అనంతరం నరసయ్య కనిపించకుండా పోవటంతో అనుమానించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఇంటిని పరిశీలించగా అనుమానంతో గోడను తవ్వి చూడగా..బాత్రూమ్ కోసం నిర్మించిన స్థలంలో రమణమ్మ మృతదేహం బైటపడింది. ఈ ఘటన జరిగిన సంవత్సరానికి ఇటీవల హాస్టల్ వున్న కుమారుడి వద్దకు నరసయ్య రావటంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

16:07 - June 18, 2018

తూర్పుగోదావరి : ఈరోజు ఎన్నికలు జరిగితే వైసీపీ ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. కానీ ప్రజల్లో వుండే వేవ్ ను మార్చే సత్తా,సామర్త్యం సీఎం చంద్రబాబుకు వుందన్నారు. జగన్ వైపు సరైన ఎన్నికల బృందం లేదనీ..పవన్ కళ్యాణ్ బలంపై ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. పోలరం పూర్తి అయ్యేందుకు ఇంకా ఐదారు సంవత్సరాలు పడుతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలపై దృష్టి పెట్టకుండా పట్టిసీమ ప్రాజెక్టుమీదనే పెట్టారన్నారు. తెలంగాణ నుండి ఆంధ్రాకు మండలలాలను కలిపినప్పుడు కేంద్రంపై ప్రత్యేక హోదా గురించి పట్టుపట్టాల్సింవుందన్నారు. తాను రాజకీయాల్లో కొనసాగుతాననీ..కానీ ఏపార్టీలోను చేరనని ఉండపల్లి స్పష్టం చేశారు. పదవీ రాజకీయాలు చేపట్టననీ..తనకు వైసీపీలోను, టీడీపీలోను మిత్రఉలున్నారని పేర్కొన్నారు.  

ముగిసిన దుర్గగుడి మండలి సమావేశం..

విజయవాడ : దుర్గగుడి పలకమండలి సమావేశం ముగిసింది. ఇంద్రకీలాద్రిపై పనిచేయని సీసీ కెమెరాల గురించి పాలకమండలి సమావేశంలో చర్చించింది. ఆదివారం నాడు దుర్గమ్మను దర్శించేందుకు వచ్చిన శ్రీకాకుళం నుండి వచ్చిన దంపతు నాలుగేళ్ళ చిన్నారి నవ్యశ్రీ కిడ్నాప్ గురవ్వటం అధికారులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాలు పరిచేయటం లేదనే విషయం తెలయటంతో పాలకమండలిలో చర్చ జరిగింది.

15:59 - June 18, 2018

విజయవాడ : దుర్గగుడి పలకమండలి సమావేశం ముగిసింది. ఇంద్రకీలాద్రిపై పనిచేయని సీసీ కెమెరాల గురించి పాలకమండలి సమావేశంలో చర్చించింది. ఆదివారం నాడు దుర్గమ్మను దర్శించేందుకు వచ్చిన శ్రీకాకుళం నుండి వచ్చిన దంపతు నాలుగేళ్ళ చిన్నారి నవ్యశ్రీ కిడ్నాప్ గురవ్వటం అధికారులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాలు పరిచేయటం లేదనే విషయం తెలయటంతో పాలకమండలిలో చర్చ జరిగింది. నవ్యశ్రీ కిడ్నాప్ గురించి పోలీసులు లకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా..కనకదుర్గా నగర్ లో వున్న సీసీ కెమెరాలలో నవ్యశ్రీని కిడ్నాప్ చేసి తీసుకెళుతున్న ఇద్దరు పురుషులు, ఒక మహిళ దృశ్యాలు పరిశీలించటంతో నవ్వశ్రీ కోసం పోలీసులు గాలింపుని ముమ్మరం చేయటంతో ఉదయం 7 గంటలకు కిడ్నాప్ అయిన నవ్యశ్రీ సాయంత్రం గుంటూరు పేట నరసరావు పేటలో ఆచూకీ లభ్యమయ్యింది. దీంతో నవ్యశ్రీని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో నవ్యశ్రీ కిడ్నాప్ సందర్భంగా సీసీ కెమెరాల వైఫల్యం బైటపడటంతో పాలకమండలి సమావేశయి పలుఅంశాలపై చర్చించింది. ఈ క్రమంలో కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని..భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా వుండాలని దానికి తగిన చర్యలను చేపట్టాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

ఎస్ ఆర్ నగరలో యూపీ దొంగలు అరెస్ట్..

హైదరాబాద్‌ : వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను SR నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల బంగారం, ఓ స్కార్పియో వాహనం సీజ్‌ చేశారు. 

కంకూరులో ఉద్రిక్తత..

ఆదిలాబాద్‌ : జిల్లా కంకూరులో ఉద్రిక్తత నెలకొంది . గ్రామంలో వివాదాస్పద భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటిస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి మొక్కలు నాటిస్తున్నారు. తమ భూములు అటవీ అధికారులు కబ్జా చేస్తున్నారని గ్రామస్థుల ఆందోళనకు దిగారు. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలుపుతున్నారు. మిగులు భూముల జోలికి అధికారులు రాకూడదని 2008లో కాంకూరు గ్రామసభలో తీర్మానం చేశారు. కాని గ్రామసభ నిర్ణయాలను పట్టించుకోని అటవీశాఖ అధికారులు వివాదస్పద భూముల్లో మొక్కలు నాటిస్తున్నారు. 

ప్రజల 'వేవ్' ను మార్చే సామర్త్యం చంద్రబాబుకుంది: ఉండవల్లి

తూర్పుగోదావరి : ఈరోజు ఎన్నికలు జరిగితే వైసీపీ ఎక్కువ సీట్లు వస్తాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. కానీ ప్రజల్లో వుండే వేవ్ ను మార్చే సత్తా,సామర్త్యం సీఎం చంద్రబాబుకు వుందన్నారు. జగన్ వైపు సరైన ఎన్నికల బృందం లేదనీ..పవన్ కళ్యాణ్ బలంపై ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. పోలరం పూర్తి అయ్యేందుకు ఇంకా ఐదారు సంవత్సరాలు పడుతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలపై దృష్టి పెట్టకుండా పట్టిసీమ ప్రాజెక్టుమీదనే పెట్టారన్నారు. తెలంగాణ నుండి ఆంధ్రాకు మండలలాలను కలిపినప్పుడు కేంద్రంపై ప్రత్యేక హోదా గురించి పట్టుపట్టాల్సింవుందన్నారు.

కలెక్టరేట్ ముందుకు మహిళ ఆత్మహత్యాయత్నం..

సిరిసిల్ల : జిల్లా కలెక్టరేట్‌ ముందు సువర్ణ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పట్టణంలోని బీవీ నగర్‌లో తన భూమిని వార్డ్‌బెంబర్‌ కబ్జాచేశాడని ఆరోపిస్తోంది. తన భూమిని కాపాడాలని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని సువర్ణ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోడానికి ప్రత్నించడంతో అక్కడున్న వారు అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు.

15:33 - June 18, 2018

నెల్లూరు : తండ్రీ, కుమారులు చెరువులో పడి మృతి చెందిన ఘటన మనుబోలు మండలంలో చోటుచేసుకుంది. మేకలు కడిగేందుకు వెళ్లిన తండ్రి రమణయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయాడు. దీన్ని గమనించిన కుమారుడు హరికృష్ణ తండ్రిని కాపాడే యత్నంలో తను కూడా చెరువులోపడి మృతి చెందిన విషాద ఘటన మనుబోలు మండలం గురువిందపూడిలో చోటుచేసుకుంది. వీరిద్దరిని కాపాడేందుకు రమణయ్య భార్య తన చీరతను చెరువులోకి విసిరినా లాభం లేకపోయింది. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయటంతో దారినపోయేవారు వచ్చి ఇద్దరిని బైటకు తీయగా అప్పటికే వారిద్దరు మృతి చెందారు. దీంతో ఇంటి యజమాని, చేతికి అంది వచ్చిన కుమారుడు ఒకేసారి మృతి చెందటంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. 

15:29 - June 18, 2018

హైదరాబాద్ : మక్కా మసీద్‌ బ్లాస్ట్‌ కేసులో.. తుదితీర్పు ప్రకటించిన న్యాయమూర్తి రవీందర్‌ రెడ్డి ఇటీవల స్వచ్చంద పదవీ విరమణ ప్రకటించారు... ఇవాళ రవీందర్‌ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం హైదరాబాద్‌ నాగోల్‌లోని కళ్యాణ లక్ష్మీ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్‌, ఎమ్మెల్సీ రామచందర్‌ రావుతో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 24 ఏళ్లుగా న్యాయమూర్తి గా సేవలు అందించి స్వచ్చంద పదవీ విరమణ పొందుతున్న రవీందర్‌ రెడ్డిని పలువురు అభినందించారు. పదవీ విరమణ అనంతరం న్యాయమూర్తులపై ఏసీబీ సోదాలు చేయడం తనను కలిచివేసిందన్నారు జడ్జి రవీందర్‌రెడ్డి. ఇకపై తన శేష జీవితం ప్రజాసేవకు అంకితం చేస్తానన్నారు. 

15:22 - June 18, 2018

హైదరాబాద్‌ : వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను SR నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల బంగారం, ఓ స్కార్పియో వాహనం సీజ్‌ చేశారు. 

14:50 - June 18, 2018

హైదరాబాద్‌ : వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను SR నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 270 గ్రాముల బంగారం, ఓ స్కార్పియో వాహనం సీజ్‌ చేశారు. 

14:46 - June 18, 2018

జమ్మూకశ్మీర్‌ : బందిపోరా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బిజ్‌బేహరా ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఎలాంటి ఆపరేషన్స్ చేపట్టవద్దని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆపరేషన్స్ నిర్వహించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. జమ్ముకశ్మీర్‌లో కాల్పుల విరమణను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించడంతో మళ్లీ ఆర్మీ ఆపరేషన్లు మొదలయ్యాయి.

కేసీఆర్ పై వీహెచ్ ఫైర్...

హైదరాబాద్ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో గ్రౌండ్‌లో సెక్రెటేరియట్‌ నిర్మిస్తామనడాన్ని వీహెచ్‌ తప్పుబట్టారు. ముఖ్యమంత్రి తన వాస్తు కోసం బైసన్ పోలో గ్రౌండ్‌ను ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కంకూరులో ఉద్రిక్తత...

ఆదిలాబాద్‌ : జిల్లా కంకూరులో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వివాదాస్పద భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటిస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి మొక్కలు నాటిస్తున్నారు. తమ భూములు అటవీ అధికారులు కబ్జా చేస్తున్నారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. 

కేజ్రీ దీక్షపై హైకోర్టు విచారణ...

ఢిల్లీ : లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆఫీసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ధర్నా చేయడంపై రాష్ట్ర హైకోర్టు సీరియస్‌ అయింది. ధర్నా చేయడానికి ముందు ఎల్జీ అనుమతి ఎందుకు తీసుకోలేదని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఒకరి ఇంట్లో కానీ కార్యాలయంలోకి వెళ్లి ధర్నా చేయడం విరుద్ధమని పేర్కొంది. 

ఎమ్మెల్యే తాటి వెంకటేశర్లును నిలదీసిన గ్రామస్తులు...

భద్రాద్రి : ఎమ్మెల్యే తాటి వేంకటేశ్వర్లుకు చేదు అనుభవం ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యేను... మాకు మీరు ఏం చేశారని గ్రామస్తులు నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. 

13:30 - June 18, 2018

భద్రాద్రి : ఎమ్మెల్యే తాటి వేంకటేశ్వర్లుకు చేదు అనుభవం ఎదురైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యేను... మాకు మీరు ఏం చేశారని గ్రామస్తులు నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు పంపించారో మాకు తెలుసు అని టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ యువనేత ప్రశ్నించడంతో మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేయడంతో..ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ గ్రామంలో నెలకొంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:28 - June 18, 2018

ఢిల్లీ : లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆఫీసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ధర్నా చేయడంపై రాష్ట్ర హైకోర్టు సీరియస్‌ అయింది. ధర్నా చేయడానికి ముందు ఎల్జీ అనుమతి ఎందుకు తీసుకోలేదని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఒకరి ఇంట్లో కానీ కార్యాలయంలోకి వెళ్లి ధర్నా చేయడం విరుద్ధమని పేర్కొంది. ధర్నా నిర్ణయం వ్యక్తిగతమైనదా ? లేక మంత్రిమండలి అనుమతితోనే ఆందోళనకు దిగారా ? అని ప్రశ్నించింది. ఎల్జీ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, మంత్రులు ఆందోళన విరమించాలని కోరుతూ బిజెపి ఎమ్మెల్యే విజేందర్‌ గుప్తా వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

13:26 - June 18, 2018

ఆదిలాబాద్‌ : జిల్లా కంకూరులో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో వివాదాస్పద భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటిస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి మొక్కలు నాటిస్తున్నారు. తమ భూములు అటవీ అధికారులు కబ్జా చేస్తున్నారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపారు. మిగులు భూముల జోలికి అధికారులు రాకూడదని 2008లో కాంకూరు గ్రామసభలో తీర్మానం చేశారు. కాని గ్రామసభ నిర్ణయాలను పట్టించుకోని అటవీశాఖ అధికారులు వివాదస్పద భూముల్లో మొక్కలు నాటిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:24 - June 18, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో గ్రౌండ్‌లో సెక్రెటేరియట్‌ నిర్మిస్తామనడాన్ని వీహెచ్‌ తప్పుబట్టారు. ముఖ్యమంత్రి తన వాస్తు కోసం బైసన్ పోలో గ్రౌండ్‌ను ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్‌ గ్రౌండ్‌ను కాపాడుకోడానికి ఎంతకైనా తెగిస్తామన్నారు. మరోసారి కేంద్రానికి లేఖ అందిస్తామన్నారు. అప్పటికి కూడా ప్రభుత్వం దిగిరాకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వీహెచ్‌ స్పష్టం చేశారు. 

12:43 - June 18, 2018

విజయవాడ : కంకిపాడు ఈడుపుగళ్లులో ఓ యాంకర్‌ అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే... కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

12:41 - June 18, 2018

పశ్చిమగోదావరి : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. తుందుర్రులోని ఆక్వాఫుడ్‌ పరిశ్రమ బాధిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వం ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేస్తే ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. 

12:39 - June 18, 2018

భద్రాద్రి : భర్త కత్తితో దాడి చేయడంతో భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మోడల్‌ కాలనీలో ఈ ఘటన జరిగింది. తాగుడుకు అలవాటు పడిన శ్రీనివాసరావు భార్య పద్మను నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని స్థానికలు అంటున్నారు. భర్త వేధింపులను భరించలేక పిల్లలను తీసుకుని పద్మ పుట్టింకి చేరింది. కాగా ఇవాళ పద్మ దగ్గరకు వెళ్లిన శ్రీనివాసరావు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన పద్మను బంధువులు ఆస్పత్రికి చేర్చారు. ఆమెకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

 

12:38 - June 18, 2018

అనంతపురం : పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అనంతపురం జిల్లా పామిడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి అరకిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారుజ. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామానికి చెందిన బిసిరెడ్డి రమేశ్‌రెడ్డిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, చోరీల తోపాటు మూడు హత్యకేసులు కూడా రమేశ్‌రెడ్డిపై ఉన్నాయని పోలీసులు తెలిపారు. 

చెరువులో పడి తండ్రి కొడుకు మృతి....

నెల్లూరు : మనుబోలు (మం) గురివిందపూడిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి తండ్రికొడుకు మృతి చెందాడు. మృతులు రమణయ్య, హరికష్ణలుగా గుర్తించారు. 

నగర హామీలపై సమీక్ష...

హైదరాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలో మన నగరంలో ఇచ్చిన హామీలపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రెవెన్యూ భూ వివాదాల పరిష్కారంపై సమీక్షించారు. డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నె, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. 

రక్షణ దళంలోలకి రోష్మణీ నౌక...

విశాఖపట్టణం : భారత తీరప్రాంత రక్షణ దళంలోకి రాణి రోష్మణి నౌక ప్రవేశించింది. నౌకను కోస్టుగార్డు అదనపు డీజీ వీఎస్ఆర్ మూర్తి జాతికి అంకితం చేశారు. 51 మీటర్ల పొడవైన నౌకను విశాఖ హిందుస్థాన్ షిప్ యార్డు తయారు చేసింది.

 

12:13 - June 18, 2018

ఢిల్లీ : దేశ రాజధానిలో పరిపాలన స్తంభించింది. ఐఏఎస్ అధికారులను విధుల్లోకి హాజరయ్యేలా చూడాలని ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఎల్జీ నివాసంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. దీనితో పరిపాలన స్తంభించింది. తాము సమ్మె చేయడం లేదని ఐఏఎస్ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ఎల్జీ, కేంద్రం స్పందించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆప్ నేతలు సోమవారం అత్యవసరంగా భేటీ కానున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కాసేపట్లో ఆప్ నేతల అత్యవసర భేటీ...

ఢిల్లీ : ఐఏఎస్ అధికారులు విధులకు హాజరయ్యేలా చూడాలంటూ సీఎం కేజ్రీవాల్...ఇతర మంత్రులు వారం రోజులుగా దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఆప్ నేతలు అత్యవసరంగా భేటీ కానున్నారు. 

11:48 - June 18, 2018
11:15 - June 18, 2018

నిర్మల్ : సోన్ మండలంలో జరిగిన బాలికపై హత్యాచారం ఘటనపై జిల్లా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికపై ఓ యువకుడు అత్యాచారం జరిపి తలపై బండరాయితో మోది దారుణంగా చంపేశాడు. దీనిపై కుటుంబసభ్యులు...గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నిందతుడిని అప్పగించాలంటూ తామే శిక్షిస్తామని జాతీయ రహదారిపై ఆదివారం ఆందోళన జరిపారు. పోలీసులు నచ్చచెప్పడంతో వారు శాంతించారు. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక హత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘలు స్కూల్స్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీనితో పలు స్కూల్స్ బంద్ అయ్యాయి. 

11:07 - June 18, 2018

కరీంనగర్ : ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పురాతన ఆర్ట్స్ కాలేజీలో ఉన్న నిర్మాణల కూల్చివేతను నిలిపివేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. మంత్రి ఈటెలను అడ్డుకొనే ప్రయత్నించారు. అక్కడనే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇందులో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులతో కనీసం మాట్లాడనీయకుండా మంత్రి ఈటెల వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రక కట్టడాలను నగర పాలక సంస్థ కూల్చివేస్తోంది. చారిత్రాత్మక కట్టడాలను రక్షించాల్సింది పోయి కూల్చివేయడం సబబు కాదని అఖిలపక్షం పేర్కొంటోంది. కూల్చివేతలు చేస్తున్న స్థలాలను ప్రవేటు వారికి అప్పగించి హోటల్స్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని నేతలు పేర్కొంటున్నారు. 

మంత్రి ఈటెలను అడ్డుకొనేందుకు యత్నం...

కరీంనగర్ : ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పురాతన ఆర్ట్స్ కాలేజీలో ఉన్న నిర్మాణల కూల్చివేతను నిలిపివేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. మంత్రి ఈటెలను అడ్డుకొనే ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకుని పలువురిని అరెస్టు చేశారు. 

బాబు టెలీకాన్ఫరెన్స్...

విజయవాడ : నీరు - ప్రగతి, వ్యవసాయంపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ లో ఏపీ వృద్ధిని దేశం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఏపీ రాష్ట్రంలో జల సంరక్షణ, పంట మార్పిడి...పండ్ల తోటల వృద్ధిపై ప్రజంటేషన్ ఇచ్చామన్నారు. ఏపీ విధానాలను జాతీయ స్థాయిలో ఒక నమూనాగా మారాయన్నారు. పంటల మద్దతు ధరలో లోపాలను చర్చనీయాశం చేయడం జరిగిందన్నారు. స్వామి నాథన్ సిఫార్సులు అమలు చేయకపోవడాన్ని నిలదీసినట్లు చెప్పుకొచ్చారు. నరేగాను వ్యవసాయానికి అనుసంధనించాలని..నీటి నిర్వాహణలో మొదటి స్థానం పొందేందుకు కృషి చేయాలన్నారు. 

10:17 - June 18, 2018

రాహుల్ తో కుమార స్వామి...

ఢిల్లీ : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార స్వామి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి చేరుకున్నారు. ఆయనతో కుమార స్వామి భేటీ కానున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు కుమార స్వామి ఆదివారం ఢిల్లీకి వచ్చిన సంగతి తెలిసిందే. 

10:07 - June 18, 2018

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా అఖిల భారత లారీల యజమానుల సంఘం చేపట్టిన సమె ్మ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా లారీలు..ట్రక్కులు..కంటెనర్లు నిలిచిపోయాయి. సుమారు 90 లక్షల ట్రక్కులు నిలిచిపోయాయి. అత్యవసర వస్తువులు, పాలు..కూరగాయాలకు మినహాయింపు ఇచ్చారు. సమ్మె చేస్తుండడంతో పారిశ్రామిక రంగంపై ప్రభావం పడనుంది. ఏప్రిల్ 23వ తేదీన నోటీసు ఇవ్వడం జరిగిందని, కానీ కేంద్రం నుండి ఇతర విభాగాల నుండి స్పందన రాలేదని యజమానులు పేర్కొంటున్నారు. టోల్ ట్యాక్స్..డీజిల్ ధర పెంపు..ఇతరత్రా సమస్యలపై వారు సమ్మె చేపడుతున్నారు. జీఎస్టీ భారం కూడా తమపై పడుతోందని, ఓ హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసి తమ డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

లారీల యజమానుల సమ్మె...

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా అఖిల భారత లారీల యజమానుల సమ్మె కొనసాగుతోంది. లక్షలాది లారీలు..ట్రక్కులు..కంటెనర్లు నిలిచిపోయాయి. పారిశ్రామిక రంగాలపై ప్రభావం పడుతోంది. 

ఆసుపత్రికి మంత్రి సత్యేంద్ర జైన్...

ఢిల్లీ :్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్..ఇతర మంత్రులు ఎల్జీ నివాసంలో దీక్షలు చేపడుతున్నారు. సోమవారానికి 8వ రోజుకు చేరుకుంది. కానీ దీక్ష చేస్తున్న మంత్రి సత్యేంద్ర జైన్ పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్ధరాత్రి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. 

ఇందల్ వాయి బంద్...

నిజామాబాద్ : ఇందల్ వాయి బంద్ కొనసాగుతోంది. ఓ మహిళ పట్ల ఎంపీపీ దురుసు ప్రవర్తన చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నేత, దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి ...మహిళ పట్ల స్థల వివాదం నెలకొంది. ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తడం..వెంటనే గోపి తన కాలితో మహిళ ఛాతిపై తన్నాడు. 

09:44 - June 18, 2018
09:42 - June 18, 2018
09:39 - June 18, 2018

నిజామాబాద్ : ఇందల్ వాయి బంద్ కొనసాగుతోంది. ఓ మహిళ పట్ల ఎంపీపీ దురుసు ప్రవర్తన చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నేత, దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి ...మహిళ పట్ల స్థల వివాదం నెలకొంది. ఇరువురి మధ్య ఘర్షణ తలెత్తడం..వెంటనే గోపి తన కాలితో మహిళ ఛాతిపై తన్నాడు. ఎంపీపీ వ్యవహర శైలిని ప్రతిపక్ష నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే అతడిపై కేసు నమోదు చేయాలని...పార్టీ నుండి ఎంపీపీ పదవి నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇందల్ వాయి బంద్ కొనసాగుతోంది. 

09:34 - June 18, 2018

విజయవాడ : ఏపీలోని దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకుల సమ్మె కొనసాగుతోంది. దీనితో తలనీలాలు సమర్పించడానికి వచ్చిన భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు. రూ. 15వేల వేతనం..దేవాదాయశాఖ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న అధికారుల వేధింపులు..ఇతరత్రా వాటి నుండి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తుండడంతో ప్రధాన సమస్యగా మారిపోయింది. దీనితో డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి రంగంలోకి దిగారు. సమస్యను పరిష్కరించేందుకు సోమవారం దేవాదాయ శాఖ అధికారులు, క్షురకుల జేఏసీ నేతలతో భేటీ కానున్నారు. 

09:23 - June 18, 2018

ఢిల్లీ : ఒక రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి...ఆయన గత కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్నారు..ప్రజల హక్కుల కోసం...రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయనివ్వాలంటూ ఆయన దీక్ష చేపట్టడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఢిల్లీ రాష్ట్రంలో ఐఏఎస్ లు విధులకు హాజరయ్యేలా చూడాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్..ఇతర మంత్రులు ఎల్జీ నివాసంలో దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. సోమవారానికి 8వ రోజుకు చేరుకుంది. కానీ దీక్ష చేస్తున్న మంత్రి సత్యేంద్ర జైన్ పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్ధరాత్రి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ఐఏఎస్ అధికారులు పరిపాలనకు సహకరించడం లేదని..విద్య, రేషన్, నీటి సమస్యలు ఇతరత్రా ఎన్నో పెండింగ్ లో ఉన్నాయని...పని చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ జూన్ 11వ తేదీన ఎల్జీ నివాసానికి కేజ్రీవాల్ వెళ్లారు. కానీ ఆయన ఇచ్చిన సమాధానంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కేజ్రీవాల్ అక్కడే తన మంత్రులతో దీక్ష చేపట్టారు.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ కు మద్దతుగా వేలాది మంది ఆప్ కార్యకర్తలు...ఇతరులు ఆదివారం ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. మరి ఈ సమస్యను కేంద్రం పరిష్కరిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

08:08 - June 18, 2018
07:32 - June 18, 2018

తెలంగాణలో యువజనుల సమస్యల పరిష్కారం కోరుతూ... అఖిలభారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) ఆధ్వర్యంలో స్తూర్పి యాత్ర పేరుతో మోటర్‌ సైకిల్‌ యాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో అనేక మంది యువతను కలిసి వారితో మాట్లాడి వారు సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరి తెలంగాణలో యువత కోరుకుంటుందేంటి ? తెలంగాణ ప్రభుత్వ విధానాల పట్ల వారి వైఖరి ఎలా ఉంది ? ఈ యాత్రలో పాల్గొన్న DYFI తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విప్లవ్‌, విజయ్‌కుమార్‌ లు టెన్ టివి జనపథంలో విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

క్షురకుల జేఏసీతో డిప్యూటి సీఎం సమావేశం...

విజయవాడ : నేడు క్షురకుల జేఏసీ ప్రతినిధులతో డిప్యూటి సీఎం కేఈ కృష్ణమూర్తి సమావేశం కానున్నారు. క్షురకుల సమస్యలపై కృష్ణమూర్తి చర్చించనున్నారు. గత కొన్ని రోజులుగా క్షురకులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ లు...

ఢిల్లీ : ఫిఫా వరల్డ్ కప్ లో సాయంత్రం 5.30గంటలకు స్వీడన్ - దక్షిణ కొరియా జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 8.30గంటలకు బెల్జియం - పనామా...రాత్రి 11.30గంటలకు ట్యూనీషియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ లు జరుగనున్నాయి. 

ప.గోదావరిలో జేడీ లక్ష్మీ నారాయణ పర్యటన...

పశ్చిమగోదావరి : నేడు జిల్లాలో మాజీ సీబీఐ అధికారి లక్ష్మీ నారాయణ పర్యటించనున్నారు. పోలవరం, తుందుర్రు, కొల్లేరు, పట్టిసీమ ప్రాంతాల్లో ఈ పర్యటన కొనసాగనుంది. ప్రజలు, రైతులతో ఆయన భేటీ కానున్నారు.

 

06:49 - June 18, 2018

శ్రీకాకుళం : జిల్లాలో దళారులతో.. కుదేలైన గిరిజన ప్రాంత పండ్ల రైతులకు మార్కెటింగ్ సౌకర్యంతో కాసుల వర్షం కురుస్తోంది.. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పేరున్న సీతంపేట పైనాపిల్‌, అనాస పండ్లకు మహర్దశ పట్టింది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐ.టి.డి.ఏ పరిధిలో ఈ సీజన్‌లో పైనాపిల్ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇదే అదనుగా భావించే పలు జిల్లాల దళారులు రంగప్రవేశం చేస్తారు. పైనాపిల్‌ కొనుగోళ్ళలో అమాయక గిరిజనులను ఈ దళారులు మోసం చేయడం ఆనవాయితీగా వస్తోంది.. కానీ అధికారుల చొరవతో.. దళారుల దందా బంద్‌ అయ్యింది. రైతులకు మహర్దశ పట్టింది.

సీతంపేట పైనాపిల్‌కు ఇతర రాష్ట్రాలలో సైతం మంచి గిరాకీతో పాటు, గిట్టుబాటు ఉండేది. అయితే ఈ సారి దళారులంతా ఏకమై రైతుకు ధరలేకుండా చేసి, మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోయేలా చేశారు. దీనికి తోడు జి.సి.సితో పాటు, సంతల్లోనూ క్రయవిక్రయాలు డీలా పడ్డాయి. సరిగ్గా ఇదే సమయంలో నాబార్డ్ ఏ.జి.ఎం.. జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డిని సంప్రదించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు.

అధికారుల ప్రోత్సాహంతో జిల్లా కేంద్రంలోని రైతు బజార్‌తో పాటు, మరో మూడు సెంటర్లలో గిరిజన రైతు సమాఖ్యలతోనే విక్రయాలు ప్రారంభించారు. బహిరంగ మార్కెట్ లో నలభై రూపాయలు పలికే పైనాపిల్‌ను కేవలం ఇరవై రూపాయలకే అమ్మారు. దీంతో వినియోగదారులను సైతం ఆకట్టుకున్నారు. దళారుల బెడద తప్పి.. గిట్టుబాటు ధర దొరకడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. గిరిజన సమాఖ్యల ద్వారా విక్రయాలు జరపడంతో ఇటు రైతులకు, అటు వినియోగదారులకు లాభదాయకంగా మారింది. సమాఖ్య ప్రతినిధులతోపాటు.. వినియోగదారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

06:44 - June 18, 2018

హైదరాబాద్ : ఇళ్లు లేని పేదవారి ఇంటి కలను సాకారం చేసేందుకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీని చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం గ్రేటర్‌లో చాలా చోట్ల నిర్మాణాలు చేపట్టింది. దీంతో తమకు గూడు వస్తుందని ఆశపడ్డారు పేదవారు. కలెక్టరేట్‌లో దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. రోజులు...నెలలు...సంవత్సరాలు గడుస్తున్నాయి. ఫైలు కదలడం లేదు,.. లబ్దిదారుల ఎంపిక జరగడం లేదు. దరఖాస్తు చేసుకున్న పేదలు మాత్రం తమకు ఎప్పుడు ఇళ్లు కేటాయిస్తారా అని ఎదురుచూస్తున్నారు. పేదవారి ఇళ్ల కలను సాకారం చేస్తూ లక్ష డబుల్‌ బెడ్రూం ఇల్లు నిర్మాణం చేపడుతామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం ప్రభుత్వ ఖాళీ స్థలాలతోపాటు మురికివాడలు, బస్తీలలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. మురికివాడల్లో నిర్మించిన ఇళ్లను అక్కడి పేదవారికే కేటాయించనున్నారు. అయితే ఓపెన్‌ ల్యాండ్స్‌తో పాటు సిటీ అవతల నిర్మిస్తున్న ఇళ్ల కేటాయింపులపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. ఈ ఏడాది చివరి నాటికి 40వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఎన్నికల నాటికి లక్ష ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం లబ్దిదారుల ఎంపికను మాత్రం ఇప్పటికీ చేపట్టలేదు.

ఇక ఎన్నో ఏళ్లుగా సొంత ఇళ్లు లేని సిటీజన్స్‌ లక్షల్లో ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో రెండు లక్షల 50వేల మంది ఈ జాబితాలో ఉన్నట్లు గుర్తించింది. అయితే ఇల్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో కార్పొరేషన్‌ పరిధిలో 7 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

అయితే గ్రేటర్‌లో ఇప్పటివరకు అధికారికంగా పూర్తయిన ఇళ్లు 572 మాత్రమే. వందకు పైగా ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో కొన్ని కోర్టు కేసులతో, మరికొన్ని కాంట్రాక్టర్లు, అధికారుల చర్యల కారణంగా పనులు ప్రారంభం కాలేదు. బోయగూడలో 396, సిగం చెరువు తండాలో 176 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 2017లో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా డిసెంబర్‌ నాటికి లక్ష ఇళ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్‌ ఈ ఏడాది చివరి నాటికి 40 వేల ఇళ్లు పూర్తి చేసి ఇస్తామని వచ్చే జూన్‌ నాటికి లక్ష ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. దీంతో ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లలో ఎక్కువ భాగం శివారు ప్రాంతాల్లోనూ లేక జీహెచ్‌ఎమ్సీ పరిధి అవతల ఉన్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో మాత్రం ఇళ్ల నిర్మాణమే జరగడంలేదు. అలాంటి ప్రాంతాల్లో ఇళ్ల కేటాయింపులు చేపట్టడంలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారు అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు ప్రజా సంఘాలు. ఆయా బస్తీల్లోనే సభలు పెట్టి లబ్దిదారులను గుర్తించాలని అప్పుడే నిజమైన లబ్ది దారులకు న్యాయం జరుగుతుందంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వాటి కేటాయింపులో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోంది. ముందుగానే లబ్దిదారులను గుర్తిస్తే తప్పా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ లోగా ఎన్నికలు సమీపిస్తే మాత్రం ఇళ్ల కేటాయింపులో గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. 

06:42 - June 18, 2018

చిత్తూరు : తిరుమల పరిశుభ్రతే మా నినాదం అంటోంది టీటీడీ. ఇప్పటికే శుభ్రత విషయంలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది తిరుమల తిరుపతి దేవస్థాం. ఇదంతా ఒకవైపు మాత్రమే... మరో వైపు చూస్తే తిరుమలను ప్లాస్టిక్‌ భూతం క్రమంగా కమ్మేస్తోందన్న అనుమానం కలుగుతోంది. తిరుమలను సందర్శించే భక్తులకు ఎటుచూసినా అందమైన రోడ్లు, పరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తుంది. రోడ్లపై భూతద్దం వేసి వెదికినా చెత్త కనిపించదు. అంతగా పరిశుభ్రతను పాటిస్తూ వస్తోంది టీటీడీ. అంతేకాకుండా..పారిశుధ్య విభాగం సిబ్బంది తిరుమల రోడ్లను పరిశుభ్రంగా ఉంచడానికి నిరంతరం తీవ్రంగా శ్రమిస్తుంటారు. శ్రీవారి ఆలయం, మాడవీధులు, తరిగొండవెంగమాంభ, అన్నప్రసాద కేంద్రం, కళ్యాణకట్ట, కాటేజీలు, అతిధి గృహాలు ఒక్కటేమిటి అన్నీ కూడా ఎంతో పరిశుభ్రంగా కనబడుతాయి.

ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే.. తిరుమలలో ఉన్న అందమైన శేషాచలం అడవులను క్రమంగా ప్లాస్టిక్‌ భూతం కమ్మేస్తోందన్న అనుమానం కల్గుతోంది. తిరుమల శుభ్రత ఇప్పుడు పైనపటారం లోనలొటారం అన్నచందంగా తయారైంది. వీఐపీలు బసచేసే అతిధి గృహాల వెనుక విపరీతంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అతిధి గృహాల్లో బసచేసిన భక్తులు వినియోగించిన ప్లాస్టిక్‌ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. దీనితో నిత్యం రద్దీగా ఉండే తిరుమల వాతావరణం కలుషితంగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో సిబ్బంది ప్లాస్టిక్‌ వ్యర్థాలు తొలగించడంలేదు. టీటీడీ అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తిరుమల్లో పేరుకు పోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించాలని భక్తులు కోరుతున్నారు.

06:40 - June 18, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో నాయీ బ్రాహ్మణుల సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె విరమించేదిలేదని క్షురకులు తేల్చి చెబుతున్నారు. మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె ఆపేది లేదని ఏపీలో నాయీ బ్రాహ్మణులు తేల్చి చెప్పారు. ఏపీలో క్షురకులు చేపట్టిన సమ్మె మూడవరోజుకు చేరుకుంది. ఈ సమ్మెతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వానికి వెంట్రుకల వ్యాపారమే తప్ప క్షురకుల సంక్షేమం అవసరంలేదని నాయీ బ్రాహ్మణులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు విజయవాడ దుర్గగుడిలో నాయీ బ్రాహ్మణుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తేనే సమ్మె విరమిస్తామని నాయిబ్రాహ్మణులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం పిలిచే చర్చలకు తాము వెళ్తామని, చర్చలు ఫలించని పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

అటు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నాయీ బ్రాహ్మణుల సమ్మె కొనసాగుతోంది. నెలకు 15వేల రూపాయల జీతం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమండ్‌ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే గ్రామస్థాయిలో నాయీ బ్రాహ్మణ పనిని నిలిపి వేసి సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. కత్తి డౌన్‌ కార్యక్రమానికి సీఐటీయూ సంఘీభావం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా నాయీ బ్రాహ్మణుల సమ్మెతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తుల మనోభావాలను గౌరవించి శాంతియుతంగా సమ్మె జరపాలని అధికారులు సూచిస్తున్నారు. 

06:37 - June 18, 2018

అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజికవర్గం తరహాలోనే.. తమ కులం వారినీ సమైక్య పరుస్తున్నామని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ దిశగా.. ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, వచ్చే ఎన్నికలకు ఆరు నెలల ముందే.. తమ ప్రయత్నాలు సఫలం అవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమకు రిజర్వేషన్‌లు కల్పిస్తామని మోసం చేసిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతామని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ తడాఖా చూపుతామని ముద్రగడ అన్నారు.

06:32 - June 18, 2018

హైదరాబాద్ : బయ్యారం ప్లాంటు ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం ముందుకే పోతుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ ఏర్పాటుకు సహకరించినా... లేకున్నా తమ ప్రభుత్వం వెనకడుగు వేయబోదన్నారు. బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మరోమంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి ఆయన బయ్యారం ప్లాంటు ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బయ్యారంలో ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని... ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరం అయిన అధ్యయనాన్ని చేసేందుకు మైన్స్‌, టీఎస్‌యండీసీ, సింగరేణి ,ఇంధన , పరిశ్రమలశాఖల ముఖ్య కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. ఈ కమిటీ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుతోపాటు అవసరమైన భూమి, నీరు, బొగ్గు, విద్యుత్తులాంటి కీలకమైన అంశాలపైన సవివరమైన నివేదికను ఇస్తుందన్నారు. కమిటీ నెల రోజుల్లో అధ్యయనం పూర్తి చేస్తుందని, కమిటీ నివేదికనుబట్టే బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై ముందుకు వెళ్తామన్నారు.

పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్రపైన ఉన్నదన్నారు. కానీ గత నాలుగు సంవత్సరాలుగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం తరపున అనేకమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతోపాటు నేరుగా పలుమార్లు కలిసి విన్నవించామని గుర్తు చేశారు. అయితే బయ్యారంలో అందుబాటులో ఉన్న ఇనుము నాణ్యత పేరుతో మెలిక పెడుతున్నారన్నారు. అయినా తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే ఈ ప్లాంటు ఏర్పాటుపై ప్రభుత్వం నిబద్దతతో ముందుకు పోతుందన్నారు. ఎలా చూసినా బయ్యారంలో ప్లాంటు ఏర్పాటుకు అనేక సానుకూలాంశాలు ఉన్నాయని... కావాల్సింది కేంద్ర ప్రభుత్వ సానుకూల నిర్ణయమేనని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. బయ్యారం ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా.. రాకున్నా తెలంగాణ ప్రభుత్వం ముందుకే పోతుందని ఆయన స్పష్టంచేశారు. 

కొత్త ప్రదేశాలకు ఉద్యోగులు...

హైదరాబాద్ : ఉద్యోగుల బదిలీల ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. 95 శాతం మంది ఉద్యోగులు సోమవారం కొత్త ప్రదేశాల్లో విధుల్లో చేరనున్నారు. 

26 నుండి వర్షాలు...

ఢిల్లీ : నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం బలహీనంగా మారాయని..రానున్న ఐదారు రోజుల్లో అవి పుంజుకుంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 26 నుండి తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

పోచారం నేతృత్వంలో జిల్లాల పర్యటన...

హైదరాబాద్ : రైతు బంధు పథకంపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో బృందం జిల్లాల్లో పర్యటించనుంది. బృందంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి, కమిషనర్ డాక్టర్ ఎం జగన్‌మోహన్ లున్నారు. సోమవారం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. 

సెల్ఫీ సూసైడ్...

సిద్ధిపేట : ఇందిరాకాలనీలో దారుణం చోటు చేసుకుంది. బావమరుదులు దాడి చేశారన్న మనస్థాపంతో కనకరాజు అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలను సెల్ఫీ వీడియోలో రికార్డు చేసి బంధువులకు పోస్టు చేశాడు. 

ముత్యాలమ్మ బీచ్ లో విషాదం...

విశాఖపట్టణం : ముత్యాలమ్మ బీచ్ లో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. మూడు మృతదేహాలను వెలికి తీయగా మరొకరి కోసం గాలిస్తున్నారు. మహేష్, నరేష్, రామకృష్ణలు మృతులుగా గుర్తించారు. 

నవ్యశ్రీ ఆచూకి లభ్యం...

విజయవాడ : దుర్గగుడిలో అదృశ్యమైన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. నరసరావుపేటలో చిన్నారి నవ్యశ్రీని పోలీసులు గుర్తించారు. నవ్యశ్రీని గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయానికి తరలించారు. పాపను పెంచుకొనేందుకు తీసుకెళ్లామని దంపతులు పేర్కొన్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

Don't Miss