Activities calendar

19 June 2018

21:10 - June 19, 2018

జమ్మూకశ్మీర్‌: రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా వైఫల్యం చెందిందని సీపీఎం ఆరోపించింది. ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడం వల్ల జమ్మూ కశ్మీర్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని అభిప్రాయపడింది. ఏ అంశంలోనూ ఒకరికొకరు పొసగని రెండు విరుద్ద భావాలున్న పార్టీలు అవకాశవాదం కోసం ఒకటై పరిపాలనను బ్రష్టు పట్టించారని సీపీఎం మండిపడింది. ఇంతకాలం జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు బిజెపి భాగస్వామిగా ఉందని.. భవిష్యత్తులో కశ్మీర్‌లో జరిగే పరిణామాలకు బీజేపీ బాధ్యత వహించాలిని డిమాండ్‌ చేసింది. కాల్పుల విరమణ నిర్ణయాన్ని ప్రారంభించడం ఉపసంహరించుకోవడం రెండూ బీజేపీ ఏకపక్ష నిర్ణయాలేనని సీపీఎం అభిప్రాయపడింది. జమ్మూ కశ్మీర్‌ను మరింత అస్థిరతలోకి నెట్టేసి రాష్ట్రపతి పాలన విధించడం అక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టడమేనని సీపీఎం పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది.

21:05 - June 19, 2018

మన చరిత్ర తిరగరాయబడుతుందా? మన పుస్తకాలలో కాషాయీకరణ రంగు పులుముకోనున్నాయా? అశాస్త్రీయ భావజాన్ని మన మెదళ్లలో జొప్పించనున్నాయా? బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వీటికి బలం చేకూరుస్తోంది. స్కూల్ స్థాయి నుండి యూనివర్శిటీల వరకూ సిలబస్ లను మార్చి బీజేపీ, ఆర్ఎస్ ఎస్ ల భావజాలాన్ని విద్యలో జొప్పించేందుకు కేంద్ర వ్యవహరించబోతోందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. విద్య కాషాయీకరణ కాబోతోందా? అనే అంశంపై 10టీవీ ప్రత్యేక చర్చ. ఈచర్చలో ప్రొ.కంచె ఐలయ్య విశ్లేషణలో చూద్దాం..

రాజ్ నాథ్ తో అజిత్ ధోవల్ భేటీ..

ఢిల్లీ : హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో జాతీయ భద్రతా దళాల సలహాదారు అజిత్ ధోవల్ భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గాబా కూడా పాల్గొన్నారు. 

కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ..

వికారాబాద్ : యాలాల మండలం మండల పరిషత్ కార్యాలయంలో 27మందికి రూ.27 లక్షల కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులకు మంత్రి మహేందర్ రెడ్డి అందజేశారు. రాష్ట్ర సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలకు ఖర్చు చేస్తున్నారన్నారు. కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు గర్భిణులకు పౌష్ణికాహారం వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు మహిళా సాధికారతకు తోడ్పడతాయన్నారు. 

ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు కోర్టు ఫైన్..

హైదరాబాద్ : తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు హైకోర్టు జరిమానా విధించింది. పెన్షన్ల బెనిఫిట్స్ పై కోర్పు తీర్పును అమలు చేయనందుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జరిమానా విధించింది. తీర్పు ఇచ్చి ఏడాది గడిచిపోయినా ఆ దిశగా చర్యలు తీసుకోనందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు హైకోర్టు జరిమానా విధించింది.

హక్కుదారులకు న్యాయం చేయాలి : తమ్మినేని

హైదరాబాద్ : రాష్ట్రంలో వాస్తవ హక్కుదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని..రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. భూ రికార్డులు సరిచేసి హక్కుదారులకు న్యాయం కోరారు.

 

అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు : మహబూబా ముఫ్తీ

జమ్ముకశ్మీర్‌ : పీడీపీతో బీజేపీ బంధం తెంచుకోవడంతో ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో జాతీయ భద్రతా దళాలు భద్రతను పర్యవేక్షించనున్నాయి. ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఐబీ, రా అధికారులతో ఎన్‌ఎస్‌ఏ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సైన్యాధికారులు కూడా హాజరవుతారు. కాగా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కొద్ది సేపటి క్రితం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చలు జరిపారు. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిలో గవర్నర్‌కు సహకరించేందుకు ఓ అధికారిని పంపాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ నిర్ణయం తీసుకున్నారు.

19:51 - June 19, 2018

కశ్మీర్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పీడీపీ, బీజేపీ కూటమికి తెరపడింది. పీడీపీ ప్రభుత్వానికి తమ మద్దతును బీజేపీ ఉపసంహరించుకుంది. దీంతో సీఎం మహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగిపోవడంతో ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ జనరల్‌ సెక్రటరీ రాంమాధవ్‌ అన్నారు. దీనికి సుజాత్‌ బుకారీ హత్యే ఒక ఉదాహరణ అన్నారు. దేశ దీర్ఘకాలిక రక్షణ, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అధికారాలను గవర్నర్‌కు బదలాయిస్తున్నట్లు తెలిపారు. కశ్మీర్‌లో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం అన్ని విధాలా ప్రయత్నించిందన్నారు. పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు చరమగీతం పాడేందుకు ప్రయత్నించామని చెప్పారు. పీడీపీ మాత్రం తన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. జమ్ము-లడక్‌ల అభివృద్ధి విషయంలో పీడీపీ నుంచి బీజేపీ నేతలకు ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ ను కలిసారు. రాష్ట్రంలో ఏ పార్టీకి తగిన మెజారిటీ లేనందున వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన ఉండడం సరికాదని... త్వరగా ఎన్నికలు నిర్వహించేలా చూడాలని గవర్నర్‌ను కోరామన్నారు. 

19:50 - June 19, 2018

జమ్మూకశ్మీర్‌ : రాష్ట్రంలో.. బీజేపీ, పీడీపీ బంధం తెగిపోయింది. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతును కమలనాథులు ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో.. ముఫ్తీ.. తన పదవికి రాజీనామా సమర్పించారు. అటు అక్కడి ప్రధాన ప్రతిపక్షం నేత ఒమర్‌ అబ్దుల్లా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించే దిశగా అడుగులు పడుతున్నాయి.

పీడీపీతో పొత్తుకు బీజేపీ గుడ్‌బై
జమ్మూకశ్మీర్‌లో పీడీపీతో పొత్తుకు బీజేపీ గుడ్‌బై చెప్పింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాల మేరకు.. జమ్మూకశ్మీర్‌ బీజేపీ మంత్రులు సోమవారమే ఢిల్లీ వచ్చారు. మంగళవారం ఉదయం ఆయన సారథ్యంలో భేటీ అయి.. ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని నిర్ణయించారు.

మెహబూబా ముఫ్తీ.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
బీజేపీ నిర్ణయం వెలువడిని కొద్ది నిమిషాల్లోనే మెహబూబా ముఫ్తీ.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌ ఎన్‌ఎన్‌ ఓరాకు పంపారు. రంజాన్‌ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో.. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణను పాటించింది. అయితే ఈసమయంలోనే.. రాష్ట్రంలో ఉగ్రవాదుల దాడులు బాగా పెరిగాయి. ప్రముఖ జర్నలిస్టు సుజాత్‌ బుఖారీని ఈద్‌ రోజునే ఉగ్రవాదులు హత్య చేశారు. రంజాన్‌ పండుగ అయిన రెండు రోజులకే కాల్పుల విరమణను ఆపేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని పీడీపీ విభేదించింది. రెండు పక్షాల మధ్య బంధం తెగడానికి ఇదే ప్రధాన కారణమని సమాచారం. పీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించగానే.. రాష్ట్రంలో ఉగ్రవాదం పెరిగి.. ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ విమర్శలు ప్రారంభించింది.

జమ్మూ లడక్‌ అభివృద్ధి విషయంలో పీడీపీ నుంచి బీజేపీ నేతలకు ఇబ్బందులు: బీజేపీ
జమ్మూ లడక్‌ అభివృద్ధి విషయంలో పీడీపీ నుంచి బీజేపీ నేతలకు ఇబ్బందులు ఎదురయ్యాయని కమలనాథులు ఆరోపిస్తున్నారు. 87 మంది సభ్యులున్న జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో.. పీడీపీకి 28 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలున్నారు. జమ్మూకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌కి 15, కాంగ్రెస్‌కు 12 మంది సభ్యులు, ఐదుగురు ఇండిపెండెంట్లు, సీపీఎం, పీడీఎఫ్‌లకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులున్నారు. ఇద్దరు నామినేటెడ్‌ సభ్యులున్నారు.

రాష్ట్రపతి పాలన తప్పదనే సూచనలు..
జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 44 మంది సభ్యులుంటే సరిపోతుంది. ఇక్కడి ఐదుగురు ఇండిపెండెంట్లను కలుపుకుని.. ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోని జెకెనేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌లు జతకడితే.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయితే.. మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయగానే.. గవర్నర్‌ ఓరానుకలిసిన ఒమర్‌ అబ్దుల్లా.. తాను ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖంగా లేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనే సరైనదని ఒమర్‌ అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో శరవేగంగా మారుతున్న పరిణామాలన్నీ.. రాష్ట్రపతి పాలన వైపే అడుగులు పడుతున్నాయన్న భావనను కలిగిస్తున్నాయి.

జమ్మూకశ్మీర్‌లో బీజేపీ రాజకీయంగా వైఫల్యం చెందింది : సీపీఎం
జమ్మూకశ్మీర్‌లో బీజేపీ రాజకీయంగా వైఫల్యం చెందిందని సీపీఎం ఆరోపించింది. ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగడం వల్ల జమ్మూ కశ్మీర్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని అభిప్రాయపడింది. ఏ అంశంలోనూ ఒకరికొకరు పొసగని రెండు విరుద్ద భావాలున్న పార్టీలు అవకాశవాదం కోసం ఒకటై పరిపాలనను బ్రష్టు పట్టించారని సీపీఎం మండిపడింది. ఇంతకాలం జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు బిజెపి భాగస్వామిగా ఉందని.. భవిష్యత్తులో కశ్మీర్‌లో జరిగే పరిణామాలకు బీజేపీ బాధ్యత వహించాలిని డిమాండ్‌ చేసింది. కాల్పుల విరమణ నిర్ణయాన్ని ప్రారంభించడం ఉపసంహరించుకోవడం రెండూ బీజేపీ ఏకపక్ష నిర్ణయాలేనని సీపీఎం అభిప్రాయపడింది. జమ్మూ కశ్మీర్‌ను మరింత అస్థిరతలోకి నెట్టేసి రాష్ట్రపతి పాలన విధించడం అక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టడమేనని సీపీఎం పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది.

19:22 - June 19, 2018

అనంతపురం : ఫుడ్‌బాల్‌ క్రీడా అభివృద్ధి కోసం స్పెయిన్‌లోని అతి పెద్ద లీగ్‌ స్పాన్సర్‌ లలీగా సంస్థ స్పాన్సర్‌ చేస్తోంది. ఈ సందర్భంగా క్రీడకు సంబంధించి జిల్లాలో ఉన్న సౌకర్యాలు పరిశీలించారు లలీగా సంస్థకు చెందిన సభ్యులు. అనంత క్రీడా అకాడమి నుండి 19 వందల మందికి లలీగా సంస్థ నుండి స్పాన్సర్‌షిప్‌ ఇస్తామన్నారు. 

19:20 - June 19, 2018

పశ్చిమగోదావరి : పట్టిసీమ వల్ల మూడు సంవత్సరాల్లో 5 వేల 500 టీఎంసీల నీరు ఇచ్చామన్నారు మంత్రి దేవినేని ఉమ. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే 8 వేల 500 కోట్లు ఖర్చు పెట్టామని, ఇంకా 1400 కోట్లు కేంద్రం నుంచి రావల్సి ఉందని మంత్రి తెలిపారు. పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి 12 పంపుల ద్వారా 4 వేల 200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. జలసిరిలో భాగంగా జానంపేట కుడికాలువలో నీటి ప్రవాహానికి పూజ చేసి హారతి ఇచ్చారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని.. సీఎం చంద్రబాబు విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. ఈ జలసిరి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌, కాటమనేని భాస్కర్‌, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

19:19 - June 19, 2018

గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యమకారులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు. చంద్రబాబు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అందుకే నాయీ బ్రాహ్మణుల మీద విరుచుకు పడ్డారన్నారు. సమస్యలను పరిష్కరించమని కోరిన వారితో చంద్రబాబు విధానం దారుణంగా ఉందన్నారు. సమస్యను పరిష్కరించకుండా పోలీసులను అడ్డు పెట్టి ఉద్యమకారుల గొంతు నొక్కేస్తున్నారని అంబటి విమర్శించారు. 

19:18 - June 19, 2018

అమరావతి : హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ తొలగించిన 21 వేల సాక్షాత్‌ భారత్‌ కో-ఆర్డినేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి విష్ణుకుమార్‌రాజు వినతిపత్రం సమర్పించారు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న వారిని ఎలాంటి నోటీసు లేకుండా తొలగించి వారిని రోడ్లపై పడేశారని... వారిని విధుల్లోకి తీసుకునే విషయాన్ని పరిశీలించాలని సీఎంను కోరినట్లు విష్ణుకుమార్‌రాజు తెలిపారు. 

19:17 - June 19, 2018

యాదాద్రి : ఎన్నికల హామీలను నెరవేర్చడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందన్నారు బిఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్. ఈ హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ల ముందు ధర్నా కార్యక్రమం చేపడుతామని తెలిపారు. సంక్షేమ పథకాలతో సామాజిక న్యాయం కాదన్నారు బీఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం. తాము చేపట్టిన పల్లెకు పోదాం కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తెలుసుకోగలిగామన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం పోరాడతామన్నారు.

 

19:16 - June 19, 2018

యాదాద్రి భువనగిరి : జిల్లా మోటకొండూరు మండలం పిట్టలగూడెం ప్రజలు బీఎల్‌ఎఫ్‌ కమిటీ ఆధ్వర్యంలో జనం గోస పాదయాత్రను చేపట్టారు. పిట్టల గూడెం గ్రామ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేవారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా అక్కడి వారికి కుల ధ్రువీకరణ పత్రం కూడా అందజేయలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. రేషన్‌ సరుకులు తెచ్చుకోవాలన్నా 5 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు చదువుకోవడానికి ఆత్మకూరుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. పిట్టలగూడెం ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించాలని బీఎల్‌ఎఫ్‌ నాయకుడు మల్లేశం డిమాండ్‌ చేశారు. 

19:14 - June 19, 2018

అనంతపురం : బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి అన్ని పార్టీలతో కలిసి నడుస్తామన్నారు ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి. 2019 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ పుట్టినరోజు సందర్భంగా అనంతపురం కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రఘువీరా పాల్గొన్నారు. పేదలకు బట్టలు పంపిణీ చేశారు. 

19:14 - June 19, 2018

వరంగల్ : ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వరంగల్‌లోని స్వగృహంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1932, డిసెంబర్‌ 28న వరంగల్‌లో వేణుమాధవ్‌ జన్మించారు. 1947లో తన 16 ఏటనే మిమిక్రీ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన దేశవిదేశాల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ భాషల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. భారత మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, జైల్ సింగ్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఎందరో ప్రముఖులు ఆయన ప్రదర్శనలు వీక్షించారు. ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో వేణుమాధవ్‌ దిట్ట. 2001లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. 1978లో ఆంధ్రా యూనివర్శిటీ ఆయనకు కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చింది. ఏయూ, కేయూ, ఇగ్నో నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు.

19:13 - June 19, 2018

జమ్ముకశ్మీర్‌ : జమ్మూ కశ్మీర్‌ : మెహబూబా ముఫ్తీ రాజీనామా అనంతరం మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా గవర్నర్‌ను కలిశారు. ఇరవై నిమిషాల పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్రంలో ఏ పార్టీకి సరైన మెజారిటీ లేదని.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరినట్లు ఒమర్‌ తెలిపారు. అయితే.. రాష్ట్రంలో ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన ఉండడం సరికాదని... త్వరగా ఎన్నికలు నిర్వహించేలా చూడాలని గవర్నర్‌ను కోరామన్నారు ఒమర్‌. మూడేళ్లు కలిసి అధికారం చలాయించిన బీజేపీ-పీడీపీలు ఎందుకు ఈ సమయంలో విడిపోయారో సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు ఒమర్‌ అబ్దుల్లా. 

19:12 - June 19, 2018

జమ్ము కశ్మీర్ : పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించినట్లు మెహబూబా ముఫ్తీ తెలిపారు. బీజేపీతో దీర్ఘకాలిక దృష్టితోనే పొత్తు పెట్టుకున్నామని.. అధికారం కోసం కాదన్నారు మెహబూబా. శాంతి నెలకొల్పేందుకు కాల్పుల విరమణ పాటించాలనుకున్నామన్నారు. పాక్‌తో చర్చల పునరుద్దరణ జరగాలని మేము కోరుకుంటున్నామన్నారు మెహబూబా ముఫ్తీ. తమ రాష్ట్ర గవర్నర్ కు తన రాజీనామా లేఖ అందించానని, అలాగే తాము ఇక ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుఓమని తెలిపారు. తాజా పరిణామాలతో తానేమీ షాక్ కి గురవ్వలేదని, తాము గతంలో బీజేపీతో కలిసింది అధికారం కోసం కాదని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు చక్కదిద్ది, అభివృద్ధి పథంలో నడిపించడానికే ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్నామని అన్నారు. తమ పాలనలో 11,000 కశ్మీర్ యువతపై కేసులను ఉపసంహరించామని చెప్పారు. ఎన్నో గొప్ప ఆలోచనలు, ఆశయాలతో తాను పదవిని చేపట్టానని, శాంతి నెలకొల్పడానికి కృషి చేశానని అన్నారు. పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడం వల్ల కశ్మీర్‌లో అశాంతి నెలకొందని మహబూబా ముఫ్తీ తెలిపారు.    

18:33 - June 19, 2018

అమరావతి : ఏపీలో నాలుగు నెలల పాటు నిర్వహించిన తెలుగుదేశం దళితతేజం కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30న నెల్లూరులో లక్ష మంది దళితులతో ముగింపు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఎన్నడూలేని విధంగా దళితులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టీడీపీ ప్రభుత్వమేని ఏపీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, జవహర్‌, నారాయణ చెప్పారు. 

హక్కుదారులకు న్యాయం చేయాలి : తమ్మినేని

హైదరాబాద్ : రాష్ట్రంలో వాస్తవ హక్కుదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని..రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. భూ రికార్డులు సరిచేసి హక్కుదారులకు న్యాయం కోరారు. 

బీజేపీతో పొత్తు అధికారం కోసం కాదు, అభివృద్ధి కోసం : ముఫ్తీ

జమ్ము కశ్మీర్ : పీడీపీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడారు. తమ రాష్ట్ర గవర్నర్ కు తన రాజీనామా లేఖ అందించానని, అలాగే తాము ఇక ఏ పార్టీతోనూ జత కట్టడం లేదని తెలిపారు. తాజా పరిణామాలతో తానేమీ షాక్ కి గురవ్వలేదని, తాము గతంలో బీజేపీతో కలిసింది అధికారం కోసం కాదని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు చక్కదిద్ది, అభివృద్ధి పథంలో నడిపించడానికే ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్నామని అన్నారు. తమ పాలనలో 11,000 కశ్మీర్ యువతపై కేసులను ఉపసంహరించామని చెప్పారు.

17:30 - June 19, 2018

అమరావతి : ఏపీలో నాలుగు నెలల పాటు నిర్వహించిన తెలుగుదేశం దళితతేజం కార్యక్రమం విజయవంతమైందని రాష్ట్ర మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 30న నెల్లూరులో లక్ష మంది దళితులతో ముగింపు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ఎన్నడూలేని విధంగా దళితులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టీడీపీ ప్రభుత్వమేని ఏపీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, జవహర్‌, నారాయణ చెప్పారు. 

17:00 - June 19, 2018

జనగామ : జిల్లా లో ఓ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకొని కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం విద్యార్థుల కోసం నూతన భవన నిర్మాణానికి 2011-12 లో 31 లక్షల నిధులు విడుదల చేసింది. అయితే ఇన్ని రోజుల గడుస్తున్నా అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా ఆ పాఠశాల భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. విద్యా బోధనతో దేవాలయంగా ఉండాల్సిన ఆ పాఠశాల పేకాట రాయుళ్లకు అడ్డాగా మారింది.

పాఠశాల కూలిపోతుందోనని భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు దులో చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు ఉన్నారు... చదువుకోవడానికి బడి నిండా పిల్లలు ఉన్నారు కాని పాఠశాల భవనం పరిస్థితి మాత్రం అద్వానంగా ఉంది. దీనితో పాఠశాల ఎప్పుడు కూలిపోతుందోనని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ అయోమయ పరిస్థితికి భయపడి విద్యార్థుల తల్లి దండ్రులు జంకుతున్నారు. ఇవేకాకుండా పాఠశాలలో ఉండాల్సిన కనీస వసతులు మూత్రశాలలు, తాగడానికి నీళ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

2012 లో పాఠశాల భవనం కోసం స్థలం కేటాయింపు
2011-12 సంవత్సరంలో ప్రభుత్వం పాఠశాల భవనం కోసం కొంత స్థలాన్ని కేటాయించి. నూతన భవనం కోసం 31 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసింది. కానీ అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో భవన నిర్మాణం చేయించాల్సిన అధికారులు పాఠశాలను గాలికొదిలేశారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పోయిన రెండు సంవత్సరాలలో 500 మంది పిల్లలతో ఉన్న స్కూల్‌ స్టెన్త్‌ ఈ ఏడాది 350 మందికి పడిపోయిందని. పాఠశాలలో గదుల కొరతతో పిల్లలను చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెప్పే పరిస్థితి వచ్చిందని ఇది అధికారుల నిర్లక్ష్యానికి మచ్చుతునకగా పిల్లలు, ఉపాధ్యాయులు ఆవేదన్య వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని పాఠశాల భవనం పూర్తిచేయాలని గ్రామస్తులు, పిల్లల తల్లి దండ్రులు కోరుతున్నారు.

16:57 - June 19, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మండుతున్న ఎండల కారణంగా పాఠశాలకు ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ప్రైవేటు పాఠశాలలు బేఖాతరు చేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలు తెలిస్తే గుర్తింపు రద్దు చేస్తామని మంత్రి గంటా ఆదేశాలు జారీ చేసినప్పటికీ పాఠశాల యాజమాన్యాలు పెడచెవిన పెట్టాయి. పాఠశాలలు తెరచి తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల యాజమాన్యాలకు సెలవు విషయాన్ని సోమవారమే చేరవేశామని మండల విద్యాశాఖాధికారులు తెలిపారు. 

16:54 - June 19, 2018

జమ్ముకాశ్మీర్‌ : రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరిగిపోవడంతో ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ జనరల్‌ సెక్రటరీ రాంమాధవ్‌ అన్నారు. దీనికి సుజాత్‌ బుకారీ హత్యే ఒక ఉదాహరణ అన్నారు. దేశ దీర్ఘకాలిక రక్షణ, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అధికారాలను గవర్నర్‌కు బదలాయిస్తున్నట్లు తెలిపారు. కశ్మీర్‌లో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం అన్ని విధాలా ప్రయత్నించిందన్నారు. పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు చరమగీతం పాడేందుకు ప్రయత్నించామని చెప్పారు. పీడీపీ మాత్రం తన వాగ్దానాలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. జమ్ము-లడక్‌ల అభివృద్ధి విషయంలో పీడీపీ నుంచి బీజేపీ నేతలకు ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. 

16:50 - June 19, 2018

విజయనగరం : బొబ్బిలి యుద్ధం చారిత్రకంగా సుప్రసిద్ధమైనది. విజయనగరం, బొబ్బిలి సంస్థానాల మధ్య ఆనాడు ఆధిపత్యం కోసం పోరు సాగింది. నేడు అదే తరహాలో మరోసారి యుద్ధం జరగబోతుంది. కానీ ఇప్పుడు జరగబోయేది కత్తుల యుద్ధం కాదు.. ఓట్ల యుద్ధం. అది కూడా బొబ్బిలి రాజవంశీకులు... బొత్స కుటుంబీకులకు మధ్య. ఈ సారి ఎలాగైనా సరే విజయం సాధించి బొబ్బిలి కోటలో జెండా ఎగరేయాలని చూస్తోంది వైసీపీ. బొబ్బిలిలో జరగబోతున్న పొలిటికల్‌ వార్‌పై టెన్‌టీవీ ప్రత్యేక కథనం..


బ్బిలి కోటపై జెండా పాతాలని చూస్తున్న వైసీపీ
ఎన్నికలు దగ్గరపడేకొద్దీ విజయనగరం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు తమదైన శైలిలో ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. జిల్లాలో ఈ సారి బొబ్బిలి కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాజవంశీయులకు నిలయమైన బొబ్బిలి కోటపై ఈసారి జెండా ఎగరేయాలని వైసీపీ ఉవ్విళ్ళూరుతోంది. బొత్స సత్యనారాయణ కుటుంబం ఈసారి బొబ్బిలి కోటలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. బొబ్బిలి రాజవంశీయులను ఓడించేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఒకప్పుడు బొబ్బిలి రాజకుటుంబీకులు, బొత్స కుటుంబం.. చాలాకాలం కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగారు. కానీ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో బొత్సకు మంత్రి పదవి రావడంతో.. రాజకీయాల్లో ఆయన ప్రాభవం పెరిగిపోయింది.

బొబ్బిలి రాజులను దెబ్బతీసేందుకు వైసీపీ వ్యూహం

బొబ్బిలి రాజులను రాజకీయంగా దెబ్బతీసేందుకు శంబంగి వెంకట చిన అప్పలనాయుడును వైసీపీ నేతలు తెరపైకి తెచ్చారు. ఆయనకు టీడీపీపాలనలో ప్రభుత్వ విప్‌గా పనిచేసిన అనుభవమూ ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన శంబంగిని, బొత్స వైసీపీలోకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో బొబ్బిలి నుంచి అప్పలనాయుడును వైసీపీ అభ్యర్థిగా నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. మరోవైపు మంత్రి సుజయ కృష్ణ రంగారావుపై ఆరోపణలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. పలు భూముల వ్యవహరాల్లో అక్రమాలతోపాటు.. అక్రమ ఇసుక రవాణా, అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.

బొబ్బిలి కోట రాజుల కంచుకోటగా..
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బొబ్బిలి కోటను మాత్రం తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ శ్రేణులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. చారిత్రకంగా, రాజకీయంగా రాజులకు పట్టున్న బొబ్బిలి కోటలో పాగా వేయడం అంత తేలికేం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బొబ్బిలి కోట రాజుల కంచుకోటగానే నిలుస్తుందా...లేక వైసీపీ వశమవుతుందా అన్నది తేలాలంటే... వేచి చూడాల్సిందే.

16:45 - June 19, 2018

నిజామాబాద్ : ముగ్గురు పాకీస్థానీ పౌరులకు భారత దేశ పౌరసత్వం లభించింది. నిజామాబాద్‌ ఆర్డీవో వినోద్‌ కుమార్‌ ఈ మేరకు తన కార్యాయలంలో వారికి పౌరసత్వ పత్రాలను అందించారు. నిజమాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన ఫయాజ్‌ ఉన్నీస పాకీస్థాన్‌కి చెందిన నదీమ్‌ జావిద్‌ని 1988లో వివాహం చేసుకుంది. కుటుంబకలహాలతో 2004లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అనంతరం ఫయాజ్‌ భారత్‌కు తిరిగివచ్చింది. లాంగ్‌టర్మ్‌ వీసాపై 7 సంవత్సరాలుగా భారత్‌లో ఉంటుంది. 2016లో భారత పౌరసత్వం తీసుకున్న ఫయాజ్‌ ఉన్నీస తన ముగ్గురు కుమారులకు కూడా భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. వివరాలు పరిశీలించిన భారత ప్రభుత్వం ముగ్గరికీ ఏప్రిల్‌ 24న భారత పౌరసత్వం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో జిల్లా అధికారులు పౌరసత్వాన్ని ఆ ముగ్గురు పాకిస్తానీ యువకులకు అందజేశారు. 

కశ్మీర్ ప్రజలకు ఇది మంచిదే : గులాంనబీ

ఢిల్లీ : జమ్ముకశ్మీర్ లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ కూటమికి తెరపడిన సంగతి తెలిసిందే. కూటమి నుంచి బీజేపీ బయటకు రావడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ స్పందించారు. జరిగిందంతా మంచికే అనుకోవాలని ఆయన చెప్పారు. ఇప్పుడు జమ్ముకశ్మీర్ ప్రజలు కొంచెం ఉపశమనం పొందుతారని అన్నారు. కశ్మీర్ ను బీజేపీ నాశనం చేసిందని మండిపడ్డారు. గత మూడేళ్ల కాలంలో ఎంతో మంది కశ్మీరీ ప్రజలు, జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందా? అనే ప్రశ్నకు సమాధానంగా ఆ ప్రశ్నే తలెత్తదని బదులిచ్చారు. 

సీఎం పదవికి మహబూబా ముఫ్తీ రాజీనామా..

జమ్ముకశ్మీర్ : రాష్ట్ర రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కాసేపటి క్రితమే... పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ తో ఉన్న సంకీర్ణ బంధాన్ని బీజేపీ తెగతెంపులు చేసుకుంది. దీంతో, ముఫ్తీ ప్రభుత్వం మైనార్టీలోకి పడిపోయింది. ఈ నేపథ్యంలో, వెంటనే మెహబూబా రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తలు వేడి పుట్టిస్తున్నాయి. జమ్ముకశ్మీర్ మరోసారి రాష్ట్రపతి పాలన కిందకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

15:47 - June 19, 2018

వరంగల్ అర్బన్ : కాజీపేటలో మరో విద్యాకుసుమం రాలిపోయింది. ప్రతిష్టాత్మక ఎన్ఐటీలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. కాలేజ్ లో ఎలాక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదివే అమిత్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను వుంటున్న హాస్టల్ రూమ్ లో అమిత్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత మూడు సంవత్సరాల క్రితం మానసిక ఒత్తిడితో ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరచిపోకముందే ఇదే కాలేజ్ లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటంతో నిట్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీహార్ కు చెందిన అమిత్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుసుకున్న నిట్ నిర్వాహకులు వెంటనే సంఘనాస్థలికి చేరుకుని తక్షణం వరంగల్ లోని అల్ట్రా మెడా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అమిత్ మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. కాగా అమిత్ ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే కారణమని ప్రాథమికంగా తెలిసింది. 

కశ్మీర్ లో తెగిన బీజేపీ, పీడీపీ బంధం..

జమ్ముకశ్మీర్‌ : బీజేపీ-పీడీపీ బంధం తెగిపోయింది. ఈ విషయంపై బీజేపీ అధికారికంగా ప్రకటన చేసింది. ఈరోజు న్యూఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ... పీడీపీతో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగించే పరిస్థితులు ఇకలేవని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రపతి పాలనకు తాము డిమాండ్ చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం, హింస, తిరుగుబాట్లు అధికమయ్యాయని, అక్కడి పౌరుల ప్రాథమిక హక్కులు కూడా ప్రమాదంలో పడ్డాయని, ఇటీవల పత్రికా సంపాదకుడు షుజాత్‌ బుఖారిని హత్య చేయడమే అందుకు ఉదాహరణని అన్నారు.

15:27 - June 19, 2018

అమరావతి : మధ్యాహ్నాం 3గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అగ్రిగోల్డ్ లో చిన్న మొత్తాల డిపాజిటర్లకు సర్కారు ఖజానా నుండి చెల్లింపులు, హైకోర్టులో ఎలా వ్యవహరించాలి, నిరుద్యోగులకు చెల్లించనున్న నిరుద్యోగభృతి ఎపపటి నుండి చెల్లించాలని అనే పలు అంశాలపై కేబినెట్ చర్చించనుంది. అలాగే ఏపీ సలహాదారుగా వ్యవహరిస్తున్న ప్రరకాల ప్రభాకర్ రాజీనామా విషయాన్ని కూడా క్యాబినెట్ చర్చించనుంది. 

15:20 - June 19, 2018

విజయవాడ : కుటుంబ కలహాలతో ఓ టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెజవాడలో కలకలం రేపిన విషయం తెలిసిందే. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లుకు చెందిన తేజస్విని అనుమానస్పద స్థితిలో కొన్ని రోజుల క్రితం మృతి చెందింది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. కాగా ఇప్పుడు తాజాగా తేజస్విని సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తేజస్విని అత్తమామల వేధింపులే తేజస్విని మృతికి కారణమని తల్లిదండ్రులు కంకిపాడు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో తేజస్విని భర్త పవన్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్న తేజస్విని..
రెండేళ్ల క్రితం ఆమె ప్రేమ వివాహం చేసుకోగా, తేజస్విని భర్త పవన్ కుమార్ కుటుంబీకులకు ఈ వివాహం ఇష్టం లేని నేపథ్యంలో తేజస్వినిపై పలు వేధింపులకు పాల్పడినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే భర్త కుటుంబీకులతో తేజస్వినికి ఘర్షణ చోటుచేసుకోవటంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తేజస్విని సూసైడ్ లేఖ బైటపడటం..దానికి పోలీసులు స్వాధీనం చేసుకోవటం..తేజస్విని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటం వంటి పరిస్థితుల్లో తేజస్విని భర్త పవర్ కుమార్ ను అరెస్ట్ చేశారు. కాగా సూసైడ్ నోట్ లో పలు కీలక విషయాలు బైటపడే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. అలాగే పోలీసుల దర్యాప్తుకు ఈ నోట్ ఉపయోగపడే అవకాశాలున్నాయి. 

15:16 - June 19, 2018

జమ్ముకశ్మీర్‌ : సీఎం మహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాల బంధం తెగిపోయింది. పీడీపీ సర్కార్ కు తమ మద్దతు ఉపసంహరించుకుంది. కశ్మీర్ లో కాల్పుల విరమణ ఒప్పందంపై మిత్ర పక్షాల మధ్య విభేదాలు రావటమే ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. కశ్మీర్ లో కాల్పుల విమరమణ కొనసాగించాలని పీడీపీ పట్టుబట్టింది. దీనికి బీజేపీ ఒప్పుకోలేదు. దీంతో బీజేపీ, పీడీపీ బంధం తెగిపోయింది. పీడిపీ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లుగా గవర్నర్ కు లేఖ బీజేపీ అందజేసింది. ఈ విషయంపై బీజేపీ అధికారికంగా ప్రకటన చేసింది. పీడీపీతో మిత్రత్వం కొనసాగించే పరిస్థితులు ఇకలేవని ఈరోజు న్యూఢిల్లీలో బీజేపీ జనరల్‌ సెక్రటరీ రామ్‌ మాధవ్‌ స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో గవర్నర్‌ పాలనకు తాము డిమాండ్ చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం, హింస, తిరుగుబాట్లు అధికమయ్యాయని, అక్కడి పౌరుల ప్రాథమిక హక్కులు కూడా ప్రమాదంలో పడ్డాయని, ఇటీవల పత్రికా సంపాదకుడు షుజాత్‌ బుఖారిని హత్య చేయడమే అందుకు ఉదాహరనగా పేర్కొన్నారు. తాము జమ్ముకశ్మీర్‌లో శాంతి స్థాపనకు కృషి చేశామని, అభివృద్ధి కోసం ప్రయత్నం చేశామని రామ్ మాధవ్‌ అన్నారు. అలాగే, అమర్‌నాథ్‌ యాత్రకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సెర్చ్‌ ఆపరేషన్‌ నిలిపేశామని రామ్ మాధవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో తన ముఖ్యమంత్రి పదవికి మహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు.

సలహారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా..

విజయవాడ: ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను కలచివేశాయని, అందుకే రాజీనామా చేస్తున్నానని పరకాల ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపించినట్లు డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్పారు. జగన్ కొన్ని రోజులుగా తనపై చేస్తున్న నిందా ప్రచారంపై కలత చెందానని, తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.

14:39 - June 19, 2018

అమరావతి : ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. తన రాజీనామాను సీఎం చంద్రబాబుకు పంపించారు. తక్షణమే తన రాజీనామాకు ఆమోదించాలను ప్రభాకర్ కోరారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తనను కలచివేశాయని, అందుకే రాజీనామా చేస్తున్నానని పరకాల ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపించారు.జగన్ కొన్ని రోజులుగా తనపై చేస్తున్న నిందా ప్రచారంపై కలత చెందానని, తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. కాగా బీజేపీకి మిత్రపక్షంగా వున్న టీడీపీ ఇటీవల కాలంలో ఎన్డీయే కేబినెట్ నుండి బీజేపీ నుండి టీడీపీ ఇప్పుడు శతృపక్షంగా తయారయిన నేపథ్యంలో పరకాల ప్రభాకర్ భార్య కేంద్రంలో రక్షణశాఖ మంత్రిగా వున్న నేపథ్యం..పవన్ జనసేన అధినేత కళ్యాణ్ సోదరుడు చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీలో కూడా ప్రభాకర్ పనిచేశారు. తన అన్నను మోసం చేసినవారిని విడిచిపెట్టనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించటం..బీజేపీకి టీడీపీ దూరం కావటం వంటి పలు పరిస్థితిల మధ్య ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై మనస్తాపం చెందినట్లుగా ప్రభాకర్ లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

నాలుగేళ్లుగా ప్రభుత్వానికి అండగా నిలబడిన డాక్టర్ పరకాల రాజీనామా చేశారు.

విపక్షానికి చెందిన కొంతమంది నాయకులు నేను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలలో ఉండడాన్ని పదే పదే ఎత్తి చూపుతున్నారనీ..కేంద్రంపై, బీజేపీపై జరుగుతున్న ధర్మ పోరాటం మీద ప్రజలలో అనుమానాలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. - ప్రభుత్వంలో నా ఉనికిని, మీ చిత్తశుద్ధిని శంకించడానికి వాడుకుంటున్నారన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని లేవనెత్తి మీరు చేస్తున్న పోరాటాన్ని శంకించేలా మాట్లాడారనీ..నా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు, రాజకీయ ప్రయోజనాలనూ, ప్రాతిపదికనూ ఆపాదించటానికి పూనుకోవడం, వాటిని తెరవెనుక మంతనాలకు బేరసారాలకూ మీరు వినియోగిస్తారని ఆరోపించడం ప్రతిపక్ష నాయకుల నీచ స్థాయి ఆలోచనలకు నిదర్శనమి లేఖలో పేర్కొన్నారు. నా కుటుంబం లోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉన్నందు వల్ల, నాకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందు వల్ల మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడతాను అని కొందరు ప్రచారం చేయడం చాలా బాధిస్తోందని పరకాల తన రాజీనామాల లేఖలో పేర్కొన్నారు. కాగా సీఎం చంద్రబాబు  పలు నిర్ణయాలలో  కీలకంగా వ్యవహరించే పరకాల ప్రభాకర్ రాజీనామాను సీఎం చంద్రబాబు ఆమోదిస్తారా? లేదా. అనే విషయం తెలవాల్సివుంది. 

నవాజ్ షరీష్ భార్య ఆరోగ్యం విషమం..

పాకిస్థాన్ : మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సూమ్ నవాజ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆమె కండిషన్ 'హైలీ క్రిటికల్' అంటూ లండన్ లోని హార్లీ స్ట్రీట్ క్లినిక్ వైద్యులు స్పష్టం చేశారు. ఐదుగురితో కూడిన వైద్య బృందం ఈరోజు కుల్సూమ్ ఆరోగ్య పరిస్థితిని వివరించింది. ఆమె వెంటిలేటర్లపైనే ఉన్నారని వారు తెలిపారు. మరో సమీక్ష వరకు వేచి చూడాలని నవాజ్ షరీఫ్ ను కోరారు. ఈ మేరకు జియో టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. గత గురువారం నుంచి కుల్సూమ్ ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు పడలేదని వైద్యులు తెలిపారు. కార్డియాక్ అరెస్ట్ కు గురైన ఆమెను జూన్ 14న ఇంటెన్సివ్ కేర్ లోకి తరలించారు.

ఆరేళ్ల బాలికపై వ్యక్తి బ్లేడ్ తో దాడి

తూ.గో : రాజమహేంద్రవరంలో దారుణం జరిగింది. దివాన్ చెరువు వద్ద ఆరేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్ తో దాడి చేశాడు. బాలిక శరీరంలోని అవయవాలను దుండగుడు కోశాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. పైద్యులు పట్టించుకోవడం లేదు. 

రామగుండం సింగరేణిలో వెలువడుతున్న విషవాయువులు, మంటలు

పెద్దపల్లి : రామగుండం సింగరేణిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్టులో విషవాయువులు, మంటలు వెలువడుతున్నాయి. గతంలో మూసివేసిన 8.8ఏ బొగ్గు గని నుంచి విషవాయువులు వెలువడుతున్నాయి. సింగరేణి అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలను అదుపు చేసేందుకు యాజమాన్యం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.

 

13:46 - June 19, 2018

పెద్దపల్లి : రామగుండం సింగరేణిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓపెన్ కాస్ట్ 3 ప్రాజెక్టులో విషవాయులు, మంటలు వెలువడుతున్నాయి. గతంలో మూసివేసిన 8.8ఏ బొగ్గు గని నుంచి విషవాయులు వెలువడుతున్నాయి. సింగరేణి అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలను అదుపు చేసేందుకు యాజమాన్యం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది.

 

13:37 - June 19, 2018

వరంగల్ : మిమిక్రీ మాంత్రికుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూశారు. ఇవాళ ఉదయం వరంగల్ లో కన్నుమూశారు. కొంతకాలంగా అనార్యోగంతో వేణుమాధవ్ బాధపడుతున్నారు. 1932 డిసెంబర్ 28న వరంగల్ లో ఆయన జన్మించారు. 1947లో తన 16వ ఏటనే తొలి ప్రదర్శన ఇచ్చారు. దేశ, విదేశాల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ భాషల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో వేణమాధవ్ దిట్ట.
1978లో ఆంధ్రా యూనివర్సిటీ అయనకు కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చింది. భారత ప్రభుత్వం 2001లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. కేయూ, ఈయూ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. నేరెళ్ల వేణుమాధవ్ మృతిపై పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ ఆర్టిస్టు, నటుడు శివారెడ్డి, కమెడియన్ వేణుమాధవ్ సంతాపం తెలిపారు.
మిమిక్రీ ఆర్టిస్టు, నటుడు శివారెడ్డి
'నేరెళ్ల వేణుమాధవ్ మృతి బాధాకరం. తీరని లోటు. ఆయన మిమిక్రీని చూసి మిమిక్రీ కళ ఉందని నేను తెలుసుకున్నాను.  
ఆయనకు నేను ఏకలవ్య శిశ్యున్ని. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేను కూడా మిమిక్రీ ఆర్టిస్టు అయ్యాను. మంచి మనిషి ఉన్న గొప్ప వ్యక్తి.
కమెడియన్ వేణుమాధవ్...
ఆయనకు పద్మశ్రీ, 3 డాక్లరేట్లు వచ్చాయి. ఆయనకు నేను ఏకలవ్య శిశ్యున్ని. ప్రపంచాన్ని చుట్టివచ్చిన మహానుభావుడు. ఆయన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు' అని అన్నారు. 

 

13:17 - June 19, 2018

విజయవాడ : మోదీ నాలుగేళ్ల పాలనలో అన్ని రంగాల్లో సంక్షోభం తలెత్తిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా విమర్శించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.  దళితుల హక్కులకు మోదీ ప్రభుత్వం తూట్లు  పొడుస్తోందని మండిపడ్డారు. దేశంలో జమిలీ ఎన్నికలు అసాధ్యమన్నారు. సీఎం చంద్రబాబుకు మోదీపై ఇంకా భ్రమలు తొలగిపోలేదని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. మోదీతో కరచాలనం చేయడానికి బాబు చాలా ఆతృత పడ్డారని ఎద్దేవా చేశారు.

 

13:11 - June 19, 2018

వరంగల్ : మిమిక్రీ మాంత్రికుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూశారు. ఇవాళ ఉదయం వరంగల్ లో కన్నుమూశారు. కొంతకాలంగా అనార్యోగంతో వేణుమాధవ్ బాధపడుతున్నారు. 1932 డిసెంబర్ 28న వరంగల్ లో ఆయన జన్మించారు. 1947లో తన 16వ ఏటనే తొలి ప్రదర్శన ఇచ్చారు. దేశ, విదేశాల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ భాషల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో వేణమాధవ్ దిట్ట.
1978లో ఆంధ్రా యూనివర్సిటీ అయనకు కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చింది. కేంద్రప్రభుత్వం 2001లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. 

 

అనార్యోగంతో మిమిక్రీ మాంత్రికుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత

హైదరాబాద్ : మిమిక్రీ మాంత్రికుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూశారు. ఇవాళ ఉదయం వరంగల్ లో కన్నుమూశారు. కొంతకాలంగా అనార్యోగంతో వేణుమాధవ్ బాధపడుతున్నారు. 

12:46 - June 19, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన పోలీస్‌ బాస్‌ ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. రానున్న ఎన్నికలను దృష్టగిలో ఉంచుకుని ప్రభుత్వం... డీజీపీ పోస్టుకు ఎవరి పేరును ఖరారు చేస్తుందన్న  అంశం ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న మాలకొండయ్య ఈనెల 30తో పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ రేస్‌లో పలువురి పేర్లు వినబడుతున్నాయి.
సమర్ధవంతమైన అధికారి కోసం అన్వేషణ
మరో పది రోజుల్లో ఏపీ డీజీపీ పదవి వీరమణ చేయనున్నారు. దీంతో పోలీస్‌ కొత్తబాస్‌ ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. గత అనుభవాలతోపాటు ప్రస్తుత పరిస్థితుల్లో సమర్ధవంతమైన అధికారి కోసం ప్రభుత్వం అన్వేషిస్తోంది. అయితే డీజీపీకి అర్హులయ్యే వారిలో ఎన్వీ సురేంద్రబాబు, గౌతవ్‌ సవాంగ్‌తోపాటు  మహిళా అధికారిణి అయిన అనురాధా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గతంలో అధికారి స్థాయిలో ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు విధి నిర్వహణలో తనదైన శైలిల రాణించడం, శాంతిభద్రతల విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరించడం, కిందిస్థాయి అధికారులతో, సిబ్బందితో సమన్వయంగా వ్యవహరించడం, సీఎం భద్రత చర్యలను సరిగ్గా పర్యవేక్షించే వారి జాబితా ఇప్పటికే సీఎం పేషీకి చేరాయి.  డీజీపీ ఎంపికకు గతంలో మాదిరిగా కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకునేలా పోలీస్‌ యాక్ట్‌కు 2017లోనే రాష్ట్ర సర్కార్‌ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.  దీంతో కీలకమైన డీజీపీ పదవిని సమర్ధుడైన , సమర్థవంతంగా నిర్వహించే అధికారికే అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. 
ఏపీకి చెందిన వారినే డీజీపీగా నియమించే చాన్స్‌
డీజీపీ ఎంపిక ప్రక్రియలో  భాగంగా సీరియార్టీ ప్రకారం 1983 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి ఎస్వీ రమణమూర్తి, 1986 బ్యాచ్‌కు చెందిన వీఎస్కే కౌముది, వినయ్‌రంజన్‌, ఆర్పీ ఠాకూర్‌, గౌతమ్‌సవాంగ్‌ రేస్‌లో ఉన్నారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు, వచ్చే ఎన్నికలను బేరీజు వేసుకోవడంతోపాటు ముఖ్యంగా ప్రజలలో మంచి అధికారిగా సుస్థిర స్థానాన్ని పొందినవారినే డీజీపీకి అర్హులుగా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇలా చేస్తే అటు ప్రజలతోపాటు పోలీస్‌ శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరుంటుందని భావిస్తున్నారు. అయితే ఏపీకి చెందిన వారినే డీజీపీకి అవకాశం మంచిదనే అభిప్రాయాలు అధికారవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. 
కేంద్ర సర్వీసులకు వెళ్లాలనుకుంటున్న కొందరు సీనియర్ ఐపీఎస్ లు 
రాష్ట్ర డీజీపీగా ఎవరిని ఎంపిక చేసినా ఏపీలోని కొందరు సీనియర్ ఐపీఎస్ లు కేంద్ర సర్వీసులకు వెళ్లాలని చూస్తున్నారు. మరోవైపు పాలనాపరంగాను ఎన్వీ సురేంద్రబాబు, ఏఆర్ అనురాధ, గౌతమ్ సవాంగ్ పట్ల మంత్రులు సానుకూలంగా ఉన్నారు. కొందరు మంత్రులు ఎన్వీ సురేంద్రబాబును డీజీపీగా నియమిస్తేనే మంచిదని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఏదిఏమైనా ప్రస్తుత డీజీపీ ఎంపిక ప్రక్రియ సస్పెన్స్ గా మారింది. 

 

రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం

కరీంనగర్‌ : జిల్లాలో రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన దంపతులు తిరుపతి (40), నిర్మల( 35) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.  తమ ఎకరం పొలాన్ని పక్కింటివారే కబ్జా చేయడంతో  మనస్తాపం చెంది ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారని గ్రామస్తులు తెలిపారు. 

12:35 - June 19, 2018

ప్రకాశం : ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్‌ ప్రకాశంజిల్లాలో పర్యటిస్తున్నారు. మంత్రి రాక సందర్భంగా చీరాలలో టీడీపీ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని  సర్వజన వైద్యశాలలో 2కోట్లతో నిర్మించిన ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. మంత్రి రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

12:32 - June 19, 2018

వరంగల్‌ : జిల్లా హసన్‌పర్తిలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. గొంతుకోసి, గుర్తుపట్టకుండా వారిపై కారం చల్లి హత్య చేశారు. మృతులు పద్మ, దామోదర్‌గా గుర్తించారు పోలీసులు

12:30 - June 19, 2018

కరీంనగర్‌ : జిల్లాలో రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన దంపతులు తిరుపతి (40), నిర్మల( 35) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.  తమ ఎకరం పొలాన్ని పక్కింటివారే కబ్జా చేయడంతో  మనస్తాపం చెంది ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారని గ్రామస్తులు తెలిపారు. పురుల మందు తాగడంతో పరిస్థితి విషమించింది. జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

12:28 - June 19, 2018

ఢిల్లీ : ఫిఫా ప్రపంచకప్‌ 'గ్రూప్‌ ఎఫ్'‌ మ్యాచ్‌లో  స్వీడన్‌ బోణీకొట్టింది.  దక్షిణ కొరియాపై  1-0 తేడాతో స్వీడిష్‌ జట్టు విజయం సాధించింది. మ్యాచ్‌ 65వ నిమిషంలో స్వీడన్‌కు పెనాల్టీ లభించింది. దీనిని స్వీడన్‌ డిఫెండర్‌ ఆండ్రియాస్‌ గ్రాన్‌క్విస్ట్‌ గోల్‌గా మలిచాడు. దీంతో స్వీడన్‌కు 1-0 ఆధిక్యం లభించింది. మ్యాచ్‌ చివరి వరకు స్వీడన్‌ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకొంది. 2002లో నైజీరియాతో జరిగిన మ్యాచ్‌ తర్వాత ప్రపంచ కప్‌లో స్వీడన్‌ గోల్‌ కొట్టిన తొలి పెనాల్టీ ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌కు మరో విశేషం కూడా ఉంది. 1958లో జరిగిన ప్రపంచకప్‌లో స్వీడన్‌ ఆడిన తొలిమ్యాచ్‌లో మెక్సికోపై 3-0తేడాతో గెలిచింది. ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌ల్లో స్వీడన్‌ నెగ్గలేదు. తాజాగా తొలిమ్యాచ్‌లోనే స్వీడన్‌ జట్టు విక్టరీ కొట్టడంతో అభిమానుల సంబరాలు మిన్నంటాయి.  

 

12:24 - June 19, 2018

వరంగల్‌ : జిల్లాలోని హసన్‌పర్తిలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. గొంతుకోసి, గుర్తుపట్టకుండా వారిపై కారం చల్లి హత్య చేశారు. మృతులు పద్మ, దామోదర్‌గా పోలీసులు గుర్తించారు.

 

12:09 - June 19, 2018

విజయనగరం : బొబ్బిలి యుద్ధం చారిత్రకంగా సుప్రసిద్ధమైనది. విజయనగరం, బొబ్బిలి సంస్థానాల మధ్య ఆనాడు ఆధిపత్యం కోసం పోరు సాగింది. నేడు అదే తరహాలో మరోసారి యుద్ధం జరగబోతుంది. కానీ ఇప్పుడు జరగబోయేది కత్తుల యుద్ధం కాదు.. ఓట్ల యుద్ధం. అది కూడా బొబ్బిలి రాజవంశీకులు... బొత్స కుటుంబీకులకు మధ్య. ఈ సారి ఎలాగైనా సరే విజయం సాధించి బొబ్బిలి కోటలో జెండా ఎగరేయాలని చూస్తోంది వైసీపీ. బొబ్బిలిలో జరగబోతున్న పొలిటికల్‌ వార్‌పై టెన్‌టీవీ ప్రత్యేక కథనం..
బొబ్బిలి కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు 
ఎన్నికలు దగ్గరపడేకొద్దీ విజయనగరం జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు తమదైన శైలిలో ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. జిల్లాలో ఈ సారి బొబ్బిలి కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. రాజవంశీయులకు నిలయమైన బొబ్బిలి కోటపై ఈసారి జెండా ఎగరేయాలని వైసీపీ ఉవ్విళ్ళూరుతోంది. బొత్స సత్యనారాయణ కుటుంబం ఈసారి బొబ్బిలి కోటలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. బొబ్బిలి రాజవంశీయులను  ఓడించేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఒకప్పుడు బొబ్బిలి రాజకుటుంబీకులు, బొత్స కుటుంబం.. చాలాకాలం కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగారు. కానీ 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో బొత్సకు మంత్రి పదవి రావడంతో.. రాజకీయాల్లో  ఆయన ప్రాభవం పెరిగిపోయింది. 
బొబ్బిలి రాజులను దెబ్బతీసేందుకు వైసీపీ వ్యూహం
బొబ్బిలి రాజులను రాజకీయంగా దెబ్బతీసేందుకు శంబంగి వెంకట చిన అప్పలనాయుడును వైసీపీ నేతలు తెరపైకి తెచ్చారు. ఆయనకు టీడీపీపాలనలో ప్రభుత్వ విప్‌గా పనిచేసిన అనుభవమూ ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన శంబంగిని, బొత్స  వైసీపీలోకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో బొబ్బిలి నుంచి అప్పలనాయుడును వైసీపీ అభ్యర్థిగా నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. మరోవైపు మంత్రి సుజయ కృష్ణ రంగారావుపై  ఆరోపణలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు.  పలు భూముల వ్యవహరాల్లో అక్రమాలతోపాటు..  అక్రమ ఇసుక రవాణా, అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని  వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. చారిత్రకంగా, రాజకీయంగా రాజులకు పట్టున్న బొబ్బిలి కోటలో పాగా వేయడం అంత తేలికేం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బొబ్బిలి కోట రాజుల కంచుకోటగానే నిలుస్తుందా...లేక వైసీపీ వశమవుతుందా అన్నది తేలాలంటే... వేచి చూడాల్సిందే.
వైసీపీ శ్రేణులు ముమ్మర ప్రయత్నాలు 
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బొబ్బిలి కోటను మాత్రం తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ శ్రేణులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. చారిత్రకంగా, రాజకీయంగా రాజులకు పట్టున్న బొబ్బిలి కోటలో పాగా వేయడం అంత తేలికేం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బొబ్బిలి కోట రాజుల కంచుకోటగానే నిలుస్తుందా...లేక వైసీపీ వశమవుతుందా అన్నది తేలాలంటే... వేచి చూడాల్సిందే.

 

12:02 - June 19, 2018

కరీంనగర్ : కలెక్టర్ ఎదుట దళితుల పేరిట వెలసిన ఓ ప్లెక్సి చర్చనీయంశంగా మారింది.  రామడుగు గ్రామ దళితుల పేరిట  ప్లెక్సీని సోమవారం రాత్రి  ఏర్పాటు చేశారు. 62 ఏళ్లుగా గ్రామసర్పంచ్ రిజర్వేషన్ దళితులకు కేటాయించకుండా బీసీలకు కేటాయిస్తుండడంతో తమకు అన్యాయం జరుగుతుందని ఇందులో పేర్కొన్నారు. దళితుల సంఖ్య అధికంగా ఉన్న గ్రామంలో దళితులకు రిజర్వేషన్ ఎందుకు కల్పించడం లేదని  ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. అయితే ప్లెక్సి ని ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీని వెనుక ఉన్న రాజకీయ కోణం పై పోలీస్ నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.

 

12:01 - June 19, 2018

నల్లగొండ : జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి రాత్రి చీరాలకు బయలుదేరిన ట్రావెల్స్‌ బస్సు.. నల్లగొండజిల్లా వేములపల్లి మలుపు వద్ద అదుపు తప్పి పొలాల్లో దూసుకెళ్లింది. గాయపడ్డవారిని మిర్యాల గూడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగానే బస్సు ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. 

11:37 - June 19, 2018

చంద్రబాబు మోడీకి మోకరిల్లినట్లుగా అనుమానం వస్తుందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి, టీడీపీ నేత చందూసాంబశివరావు, బీజేపీ నేత రమేష్ నాయుడు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

వరంగల్ జిల్లాలో దారుణం

వరంగల్‌ : జిల్లాలోని హసన్‌పర్తిలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. గొంతుకోసి, గుర్తుపట్టకుండా వారిపై కారం చల్లి హత్య చేశారు. మృతులు పద్మ, దామోదర్‌గా పోలీసులు గుర్తించారు.

 

11:30 - June 19, 2018

ఢిల్లీ : చాలా దేశాలను సాకర్‌ ఫీవర్‌ కుదిపేస్తోంది. సాకర్‌ ఫీవర్‌ కేవలం మైదానంలోనే కాదు... బయట కూడా కొనసాగుతోంది. విదేశంలో రోడ్డు పక్కన ఓ అభిమాని చేస్తున్న ఫుట్‌బాల్‌ విన్యాసాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బంతిని చేతితో తాకకుండా శరీరంపై అవలీలగా ఆడిస్తూనే ఔరా అనిపిస్తున్నాడు. 

 

11:29 - June 19, 2018

ఢిల్లీ : పెరిగిన డీజిల్‌ ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా ట్రక్కు యజమానులు, ఆపరేటర్లు నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో  90లక్షల ట్రక్కుల రాకపోకలు నిలిచిపోయాయి. ధరలు తగ్గించే వరకు సమ్మె కొనసాగిస్తామని ట్రక్కు అసోసియేషన్‌ స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన 90 లక్షల ట్రక్కుల రాకపోకలు 
కేంద్ర ప్రభుత్వం డీజిల్‌ ధరలను పెంచటాన్ని నిరసిస్తూ ట్రక్కు యజమానులు సమ్మెకు దిగారు. దీంతో దేశవ్యాప్తంగా  90 లక్షల ట్రక్కుల రాకపోకలు నిలిచిపోయాయి. అంతర్జాతీయంగా డీజిల్‌ ధరలు తగ్గుతున్నా... కేంద్రప్రభుత్వం డీజిల్‌పై అదనపు టాక్సులు వేస్తూ.. భారం మోపుతుండంతో సమ్మెకు దిగామని ఆల్‌ ఇండియా కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ గూడ్స్‌ వెహికల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌  ప్రకటించింది. పెంచిన డీజిల్‌ ధరలు తగ్గించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల వల్లే డీజిల్‌ ధరలు పెరిగాయి: అసోసియేషన్‌ 
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న అత్యధిక పన్నుల వల్లే చమురు ధరలు పెరుగుతున్నాయని అసోసియేషన్‌ ఆరోపించింది. లీటర్ డీజిల్‌పై 8 రూపాయల సెస్సు.. కిలో మీటర్‌కు 8 రూపాయల టోల్‌ టాక్స్ సహా అదనపు టాక్సులు వసూలు చేస్తున్నాయని అసోసియేషన్‌ సభ్యులు అన్నారు. డీజిల్ ధరలు, టాక్స్‌లతో రోజుకు మూడు కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిపారు. 2013లో 53 రూపాయలు ఉన్న డీజిల్‌ ధర ప్రస్తుతం 74 రూపాయలకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర తగ్గినా కేంద్ర ప్రభుత్వం అదనపు టాక్సులతో భారాలు మోపుతున్నందునే ఆందోళన చేపట్టామని అసోసియేషన్ సభ్యులు అన్నారు. డీజిల్‌, పెట్రోల్‌ ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని ట్రక్కు ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. 
థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం సంప్రదాయాన్ని మార్చాలి: అసోసియేషన్‌ 
ఇక థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియంను కూడా ఏటా పెంచే సంప్రదాయాన్ని మార్చాలని అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చేదాకా సమ్మె ఆపబోమని స్పష్టం చేశారు. అత్యవసర వస్తువుల తరలింపునకు ఆటంకం కలగకుండా సమ్మె చేస్తున్నామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

 

11:25 - June 19, 2018

ఢిల్లీ : ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ధర్నా 8వ రోజుకు చేరింది. గత 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఇద్దరు మంత్రులు మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ల ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.  ఎల్జీ ఆఫీసులో ధర్నా ఎలా చేస్తారని ఢిల్లీ హైకోర్టు ఆప్‌ సర్కార్‌ను ప్రశ్నించింది. కేజ్రీవాల్‌ ఆందోళనకు శివసేన కూడా మద్దతు తెలిపింది.

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ బైఠాయింపు కొనసాగుతోంది. గత 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఆరోగ్యం క్షీణించింది. కెటోన్‌ స్థాయి 7.4కి పడిపోవడంతో ఆయనను ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు మంత్రి సత్యేంద్ర జైన్‌ ఆరోగ్యం కూడా క్షీణించడంతో ఆయనను కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేజ్రీవాల్‌, మరో మంత్రి గోపాల్‌ రాయ్‌ ధర్నా కొనసాగిస్తున్నారు.

ఎల్జీ కార్యాలయంలో  కేజ్రీవాల్‌, మంత్రులు ఆందోళన విరమించాలని కోరుతూ బిజెపి ఎమ్మెల్యే విజేందర్‌ గుప్తా వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ధర్నా చేయడానికి ముందు ఎల్జీ అనుమతి ఎందుకు తీసుకోలేదని కోర్టు కేజ్రీవాల్‌ను ప్రశ్నించింది. ఒకరి ఇంట్లో లేదా...కార్యాలయంలోకి వెళ్లి  ధర్నా చేయడాన్ని కోర్టు తప్పుపట్టింది.  ధర్నా చేయాలన్న నిర్ణయం వ్యక్తిగతమైనదా...లేక మంత్రిమండలి అనుమతితోనే ఆందోళనకు దిగారా...అంటూ నిలదీసింది. 

ఢిల్లీలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని ఆప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ ఆందోళనను ప్రజల మధ్యకు తీసుకెళ్తామని ఆప్‌ ఎంపి సంజయ్‌సింగ్‌ స్పష్టం చేశారు. తాము ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చిందో కోర్టుకు వివరణ ఇస్తామని చెప్పారు.

కేజ్రీవాల్ చేపట్టిన బైఠాయింపు దీక్షకు పార్టీల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే నలుగురు ముఖ్యమంత్రులు చంద్రబాబు, మమతా బెనర్జీ, పినరయి విజయన్, కుమారస్వామి మద్దతు ప్రకటించారు. ఆదివారం నాడు జరిగిన మార్చ్‌లో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా పాల్గొన్నారు. తాజాగా కేజ్రీవాల్‌ నిర్ణయాన్ని బిజెపి మిత్రపక్షం శివసేన కూడా సమర్థించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వారి కోసం పనిచేసే హక్కు ఉంటుందని శివసేన ఎంపి సంజయ్‌రౌత్ స్పష్టం చేశారు.

ఢిల్లీలో జరుగుతున్న ధర్నా రాజకీయాలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఢిల్లీ సిఎంతో పాటు బిజెపి, ప్రధాని మోదియే ఇందుకు బాధ్యులని పేర్కొన్నారు. ఎల్జీ ఆఫీసులో కేజ్రీవాల్‌ ధర్నా చేస్తారు... సిఎం ఇంటివద్ద బిజెపి ధర్నా చేస్తోంది...ఐఏఎస్ అధికారులు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెడతారు.. ఈ డ్రామా ఏంటి? అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఈ అరాచకత్వాన్ని ప్రధాని మోది పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎల్జీ అనిల్‌ బైజల్‌ కార్యాలయంలో కేజ్రీవాల్‌ ధర్నా 8వ రోజుకు చేరింది. ఐఏఎస్‌ అధికారులు అప్రకటిత సమ్మెకు ముగింపు చెప్పేలా ఎల్జీ ఆదేశించాలని ఆప్ డిమాండ్‌ చేస్తోంది.  

11:23 - June 19, 2018

ఢిల్లీ : ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందాకొచ్చర్‌ దీర్ఘ కాలిక సెలవుపై వెళ్ళనున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌- వీడియోకన్‌ కేసు దర్యాప్తు పూర్తి అయ్యేవరకూ ఆమెను సెలవుమీద పంపించాలని బోర్డ్‌నిర్ణయించింది. ఆమె స్థానంలో నూతన సీఒఒగా సందీప్‌భక్షి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళనుంచే ఆయన నియామకం అమల్లోకి రానుంది. భక్షి ప్రస్తుతం ఐసీఐసీఐ జీవిత బీమా విభాగం హెడ్‌గా పనిచేస్తున్నారు. చందాకొచ్చర్‌ సెలవులో ఉన్నంతవరకూ ఆయన బ్యాంక్‌ బోర్డుకు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్పొరేట్‌ కేంద్రంలోని పనులతోపాటు వ్యాపారాలను ఆయన పర్యవేక్షిస్తారు. బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు,, ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్లు ఆయనకు రిపోర్టు చేయాలని బ్యాంక్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనింది. 

 

11:20 - June 19, 2018

విశాఖ : పుట్టిన రోజున దీక్ష. నెలకో దీక్ష. అంతేనా... ఏదైనా స్పెషల్‌ డే ఉంటే.. ఆరోజూ దీక్ష. ఇలా పొలిటికల్‌ దీక్షలతో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ప్రజలముందు ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజాక్షేత్రంలో ఓటుబ్యాంకును పెంచుకునేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు అవంతి దీక్షలను విపక్షాలు పబ్లిసిటీ స్టంట్‌గా కొట్టిపారేస్తున్నాయి. ప్రత్యేకహోదా కోసం ఏనాడు పార్లమెంట్‌లో మాట్లాడని ఆయన... ఇప్పుడు రోజుకో పేరుతో దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేస్తున్నాయి.
2009లో అవంతి శ్రీనివాస్‌ రాజకీయ జీవితం ఆరంభం
ముత్తంసెట్టి శ్రీనివాసరావు.  ఈ పేరు చెబితే ఆయన ఎవరికీ తెలియదు. కాని అవంతి శ్రీనివాస్‌ అని చెప్తే ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్నవారైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు.  అవంతి గ్రూప్‌ ఆఫ్‌ కాలేజస్‌ వ్యవస్థాపకుడిగా.. విద్యావేత్తగా ఉన్న అవంతి శ్రీనివాసరావు...2009 ఎన్నికల్లో భీమిలి నుంచి ప్రజారాజ్యంపార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ జీవితం ప్రారంభించారు.  ఆరంభం నుంచీ ఆయన గంటా శ్రీనివాసరావుకు అనుంగు అనుచరుడిగా ఉంటూ వస్తున్నారు.  2014 ఎన్నికల్లో తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావుకు భీమిలి నియోజకవర్గం అప్పగించి... ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. పేరుకు అనకాపల్లి ఎంపీ అయినా... ఆయన మకాం మాత్రం విశాఖలోనే. 
నాలుగేళ్లుగా జనంలో లేని అవంతి శ్రీనివాస్‌
గెలిచినప్పటి నుంచి ఆయన పెద్దగా జనంలో తిరిగింది లేదు. క్షేత్రస్థాయిలో పెద్దగా కార్యక్రమాలు చేపట్టింది కూడా అంతంతమాత్రమే. నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇక సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేదు. దీంతో మళ్లీ గెలవాలన్న తపనతో ఆయన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే దీక్షా అస్త్రాన్ని ఎంచుకున్నారు.  ఆయన కొద్ది రోజులుగా.. ఒక్క రోజు దీక్ష పేరుతో కేంద్రంపై నిరసనకు దిగుతున్నారు. ప్రతిపక్షాలు ఏ డిమాండ్‌తో దీక్షలు చేస్తున్నాయో... ఆయన కూడా అదే డిమాండ్‌ను ఎత్తుకున్నారు. విశాఖకు రైల్వేజోన్‌ కావాలంటూ 2016లోనే ఆయన జీవీఎంసీ ఎదుట ఒక్కరోజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. అంతటితో ఆగలేదు.. ఏడాదిలోగా విశాఖకు రైల్వేజోన్‌ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని శపథం కూడా చేశారు. రెండు సంవత్సరాలు గడిచింది... విశాఖకు రైల్వేజోన్‌ రాలేదు. మరి ఎంపీగారి శపథం కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ మళ్లీ ప్రత్యేకహోదా గురించి మాట్లాడలేదు.  కానీ గతనెల 6న విశాఖ రైల్వేస్టేషన్‌ దగ్గర ఒక్కరోజు నిరాహార దీక్ష చేశారు. ఈనెల 12న తన పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లిలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేశారు. ఈ దీక్షల్లో ఆయన చేసిన డిమాండ్స్‌ కూడా పెద్దగా లేవు.
అవంతి దీక్షలపై విపక్షాల మండిపాటు
అవంతి చేస్తున్న ఒక్కరోజు దీక్షలపై విపక్షపార్టీల నేతలు మండిపడుతున్నారు. అవంతి చేసే దీక్షలన్నీ పబ్లిసిటీ స్టంట్‌గా కొట్టిపారేస్తున్నాయి. నాలుగేళ్లుగా ప్రత్యేకహోదా, విశాఖరైల్వే జోన్‌,తోపాటు  ప్రజాసమస్యలపై ఏనాడు మాట్లాడని అవంతి శ్రీనివాస్‌కు... ఇప్పుడు హఠాత్తుగా గుర్తుకొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే ఆయన దీక్షలు చేస్తున్నాని ధ్వజమెత్తారు. మొత్తానికి అవంతి చేస్తున్న దీక్షలను విపక్షాలన్నీ తప్పుపడుతున్నాయి. పబ్లిసిటీ స్టంట్‌గా కాకుండా... ప్రజాసమస్యల పరిష్కారం దిశగా దీక్షలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని సలహా ఇస్తున్నాయి. మరి ప్రతిపక్షాల సలహాలపై అవంతి ఎలా రియాక్ట్‌ అవుతారో వేచి చూడాలి.
 

 

11:15 - June 19, 2018

ఢిల్లీ : మొన్న రాష్ట్రపతి, నిన్న ఉపరాష్ట్రపతి, నేడు రాజ్యసభ ఉపసభాపతి.. ఎన్నికలు ఏవైనా కేంద్రం మెడలు వంచేందకు విపక్షాలు ఏకమౌతున్నాయి. రాబోయే ఎన్నికలకు అన్నివిధాలుగా సిద్ధమవుతూ..  ఏ అవకాశాన్ని కూడా వదలకుండా తమ తమ వ్యుహాలు రచిస్తున్నాయి. జరగబోయే రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికల నేపథ్యంలో హస్తినలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. కొత్త రాజకీయ సమీకరణాలు
కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత కొత్త రాజకీయ సమీకరణాలు తెరలేస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ తమ సొంత ఎజెండాలను పక్కనబెట్టి జాతీయస్థాయిలో కేంద్రాన్ని ఢీ కొట్టడానికి సిధ్దమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ, కాంగ్రెస్‌లకు  దూరంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసే దిశగా ఏకమయ్యాయి. ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం నీతిఆయోగ్‌ సమావేశం తరువాత ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు మొదటి అడుగుగా డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక అంశాన్ని తీసుకున్నాయి.
ఓటింగ్‌లో పాల్గొనున్న రాజ్యసభ సభ్యులు  
రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికల క్రమంలో.. రాజ్యసభ సభ్యులంతా ఓటింగ్‌లో పాల్గొంటారు. 245 మంది సభ్యుల్లో డిప్యూటీ ఛైర్మన్‌ పదవి చేజిక్కించుకోవాలంటే.. 122 మంది సభ్యుల బలం ఉండాలి...  ప్రస్తుతం రాజ్యసభలో అన్నాడీఎంకే 14 సభ్యులు, బీజేపీ 69 సభ్యులు కలిపి ఎన్డీయేకు 106 బలం ఉంది, అయితే ఎన్డీయే నుంచి బయటికి వచ్చిన ఆరుగురు టీడీపీ సభ్యులతో కలిసి ప్రతిపక్షాల సంఖ్యాబలం 117గా ఉంది. మరోవైపు ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పత్యేక పరిస్థితుల దృష్ట్యా... కాంగ్రెస్‌తో దూరంగా ఉంటున్న బీజేడీ, టీఆర్‌ఎస్‌ ఎటువైపు మొగ్గుచూపుతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉపసభాపతి ఎన్నికల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ 122కి అవసరమైన బలం తమకు లేకపోవడంతో బీజేడీ, టీఆర్‌ఎస్‌లను తమవైపు తిప్పుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభలో 9 మంది సభ్యులు బీజేడీకి, 6 గురు సభ్యులు టీఆర్‌ఎస్‌కు ఉన్న పరిస్థితుల్లో వీరి నిర్ణయం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి కీలకంగా మారింది.  
బీజేపీకి సవాలుగా మారిన రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికలు  
ఇప్పటికే కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ బీజేపీకి.. మూడు రాష్ట్రాల ఎన్నికల ముందు వస్తున్న రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికలు సవాలుగా మారాయి. ఇదే సమయంలో అధికార, ప్రతిపక్షాల గొడవల మధ్య తటస్థంగా వ్యవహరిస్తున్న  బీజేడీ, టీఆర్ఎస్‌లు ఇదే అదునుగా భావించి ఉపసభాపతి ఎన్నికల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ బీజేపీ...  బీజేడీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతు ఇస్తే 2019 ఎన్నికల ముందు మరోసారి ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటున్న విపక్షాల ఐక్యతకు బీజేపీ గండికొట్టినట్లే అవుతుంది.  ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌ రెండు పార్టీలను శత్రువులుగా భావిస్తోన్న టీఆరెస్‌, బీజేడీలు ఎవరివైపు మొగ్గుచూపుతాయో త్వరలో తేలనుంది.

11:11 - June 19, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఏర్పాటైన టీజేఎస్‌ నేతలపై... టీ కాంగ్రెస్‌ కన్ను పడిందా...? కోదండరామ్‌ నేతృత్వంలోని టీజేఎస్‌ నేతలను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందా...? టీజేఎస్‌లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే... అవుననే సమాధానం వస్తోంది. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భూసేకరణపై కేసులువేసి.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన టీజేఎస్‌ నాయకురాలు, మహిళా న్యాయవాదిని తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ పావులుకదపడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

2019 ఎన్నికల్లో అటు అధికార టీఆర్‌ఎస్‌, ఇటు ప్రతిపక్షాలకు దీటైన జవాబు ఇవ్వాలనుకొంటున్న తెలంగాణ జనసమితికి టీ కాంగ్రెస్‌ నుంచి కొత్త సవాల్‌ ఎదురువుతోంది. టీజేఎస్‌లోని బలమైన నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రయత్నాలు కోదండరామ్‌ను కలవారానికి గురిచేస్తోంది. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై కేసులు వేసి... తెలంగాణ సర్కారును ముప్పతిప్పులు పెట్టిన న్యాయవాది రచనారెడ్డి  టీజేఎస్‌ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావ వేదిక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన రచనారెడ్డిని తమవైపు తిప్పుకొనేందుకు టీ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. మంచి వాద్దాటి  కలిగివున్న రచనారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టొచ్చనే ఉద్దేశంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు...ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... రచనారెడ్డిని కలిసి చర్చించినట్టు  అటు టీజేఎస్‌, ఇటు కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. 

ఇటీవల టీజేఎస్‌ తమ అధికార ప్రతినిధులతోపాటు టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే ప్యానెల్‌కు రచనారెడ్డిని ఎంపిక చేసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న రచనారెడ్డి... కామారెడ్డి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ఎల్లారెడ్డిలో పలుసార్లు పర్యటించి టీజేఎస్‌ తరుపున ప్రచారం కూడా చేశారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆమె టీజేఎస్‌కు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు.. టీజేఎస్‌ అధికార ప్రతినిధి, టీవీ చర్చా కార్యక్రమాల ప్యానెల్‌ నుంచి తన పేరు తొలగించాలని పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌కు లేఖ రాయడంపై ఇప్పుడు చర్చోపచర్చలు సాగుతున్నాయి. 

టీజేఎస్‌లోని బలమైన నేతలను తమ పార్టీ వైపు తిప్పుకొనేందుకు టీ కాంగ్రెస్‌ నేతలు తెరతీసిన ఆపరేషన్‌ ఆకర్ష్‌... ఇంతటితోనే ఆగుతుందా... లేక ఇంకా ఎవరిపైనా లక్ష్యాన్ని గురిపెడతారా.. అన్న అంశం తెలంగాణ జనసమితి నాయకులను కలవరానికి గురిచేస్తున్నట్టు కనిపిస్తోంది. భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.  
-----------------------------------------------

11:07 - June 19, 2018

హైదరాబాద్ : జలమండలి...  హైద‌రాబాద్ అంతటికీ  తాగునీటిని అందించే సంస్థ ఇది. అందులో పనిచేసే సిబ్బంది తాగేందుకు మాత్రం మినరల్‌ వాటర్‌ కొనాల్సిందే. తాము స‌ర‌ఫ‌రా చేసే తాగునీరు చాలా సురక్షితం అని చెప్పే జ‌ల‌మండ‌లి తమ సిబ్బందికోసం కోట్లాది రూపాయలతో మినరల్‌ వాటర్‌ ఎందుకు కొంటోంది.

నగరంలో కోటి మందికి తాగు నీరందిస్తున్న సంస్థ జలమండలి. తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాం, ప్రతి ఇంటికీ ర‌క్షిత మంచినీరు అందించ‌డ‌మే త‌మ లక్ష్యం అంటూ గుప్పించే ప్రక‌టనలకూ కొదవేం ఉండదు. కానీ వారి ఆచరణ చూస్తేనే అనుమానాస్పదంగా ఉంటుంది. తామందించే స్వచ్ఛమైన నీటిని నిర్భయంగా తాగొచ్చని చెప్పే జలమండలి అధికారులు మాత్రం.. వాటిని ఎందుకు తాగరన్నది అంతు చిక్కని ప్రశ్న. 

ప్రతి రోజూ ల‌క్షలాది లీట‌ర్ల నీటిని ప్రజలకు స‌ర‌ఫ‌రా చేస్తున్న జ‌ల‌మండ‌లి... త‌మ కార్యాల‌యంలో మాత్రం  ఇలా మిన‌ర‌ల్ వాట‌ర్‌నే వాడుతుంది. ప్రతి రోజూ వంద‌ల‌ కొద్దీ టిన్నుల నీరు బోర్డు కార్యాల‌యాల్లోకి వ‌స్తుంటాయి. అన్ని విభాగాల్లోనూ అధికారులంతా ఈ వాట‌ర్ టిన్నులనే ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాన కార్యాల‌యంలో ఎక్కడ చూసినా ఇవే ద‌ర్శన‌మిస్తాయి.

వాట‌ర్ బోర్డు కార్యాల‌యంలో నిర్వహించే అధికారిక, వీవీఐపీల సమావేశాలకు బ్రాండెడ్‌ ప్యాక్డ్ వాట‌ర్ బాటిల్సునే స‌మ‌కూర్చుతారు. అర‌లీట‌ర్‌ నీటికి 16 నుంచి 20 రూపాయ‌లు వరకూ చెల్లించిన సంద‌ర్బాలు కూడా ఉన్నాయి. ఒక్కో స‌మావేశానికి 50 నుంచి 100 బాటిళ్లు వాడుతుంటారు. ఇలా వాటర్‌ టిన్నులు, బాటిళ్ళకోసం నెల నెలా ల‌క్షలాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తోంది జ‌ల‌మండ‌లి. ఈ ఖర్చు ఏడాదికి ఆరు కోట్లు రూపాయలకు పైగానే ఉంటుంది. అంటే స‌రాస‌రి రోజుకు 2ల‌క్షల రూపాయ‌ల‌తో  తాగునీటిని కొంటోంది జ‌ల‌మండ‌లి. నగర ప్రజానీకానికి తాగు నీరందించే జలమండలి..  తమ  సిబ్బందికి మాత్రం మినరల్‌ వాటర్‌ కొనడం వెనుక మర్మం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. 

11:01 - June 19, 2018

విశాఖ : భూబకాసురులు రెచ్చిపోతున్నారు. వందల కోట్ల విలువైన భూములను కాజేస్తున్నారు. మాజీ సైనికుల పేరిట పత్రాలు సృష్టించి, వారి నుంచి ఎప్పుడో పట్టాలు పొందినట్లుగా రికార్డులు తరుమారు చేస్తున్నారు. ఎన్‌వోసీలను అడ్డుపెట్టుకొని భూమి తమ పేరిట మార్చేసుకున్నారు. 

విశాఖ రూరల్ మండలం కొమ్మాదిలో సర్వే నంబర్‌ 28/2లో 10.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీని విలువ సమారు 150 కోట్ల పై మాటే. ఈ భూమిని దాకవరపు రాములు అనే స్వాతంత్ర్య సమరయోధుడు పేరిట 1978 జూన్‌ 8న విశాపట్నం రూరల్‌ మండలం తహశీల్దార్‌ జారీ చేసినట్లుగా పట్టా సృష్టించారు. ఆయన చనిపోయారని చూపిస్తూ అతని కుటుంబ సభ్యులకు 7.68 ఎకరాలకి, 6.02 కోట్లు రూపాయలు చెల్లించి హైదరాబాద్‌కు చెందిన జీ. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్ని రాసిచ్చారు. ఈ మేరకు భూమిని రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారు. మిగిలిన 2.05 ఎరాల భూమిని విశాఖకు చెందిన ఎం. సుధాకర్‌ రావు పేరిట రిజిష్టరు చేయించారు.

ఈ బాగోతం వామపక్షనాయకులు, సీపీఐలోతైన పరిశీలన చేయగా అనేక వాస్తవాలు వెలుగుచూశాయి. ఎన్డీఆర్‌ హయంలో తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ ఇక్కడ విచిత్రమేమిటంటే దాకవరపు రాములుకు 1978లోనే రూరల్‌ మండల తహశీల్దార్‌ జారీ చేసినట్లు పట్టా పొందడం,... రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌ 346/87లో కూడా చూపడంతో ఈ బాగోతం బయటపడింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డిని, సుధాకరావుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సిట్‌కు సైతం ఫిర్యాదుల వెల్లవెత్తాయి. 

అక్రమాలతో చేజిక్కించుకున్న రిజిస్ట్రేషన్లు అన్నీ రద్దు చేయడమే కాకుండా.. బాధ్యులమై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. వెంటనే సిట్‌ నివేదిక ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భుకబ్జాదారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు.  గతంలోనూ ఆక్రమణలను అడ్డుకున్న సీపీఐ కార్యకర్తలు... తాజాగా ప్రహారీ గోడను కూల్చివేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళనలు ఆగవని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోకపోతే... ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. 

10:44 - June 19, 2018

విజయవాడ : ఊరించిన రుతుపవనాలు ముఖం చాటేశాయి. మండు వేసవి చల్లబడిందని బడిబాట పట్టిన చిన్నారులకు.. ఎండలు కష్టం తెచ్చిపెట్టాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో ఏపీలోని పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ఏపీ సర్కార్‌. ఈనెల 21 తర్వాతే మళ్లీ పాఠశాలలు తెరుచుకుంటాయని  మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ప్రభుత్వంతోపాటు అన్ని ప్రైవే స్కూళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని మంత్రి గంటా చెప్పారు. ఉత్తర్వులను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తే  పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. 

 

10:41 - June 19, 2018

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై చిన్నారి మిస్సింగ్‌ కేసుతో దుర్గగుడి భద్రతా వైఫల్యాలు వెలుగులోకి వచ్చాయి. కొండ దిగువన ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదని బయటపడింది. దీంతో పాలకమండలి సమావేశంలో.. సీసీ కెమెరాలపై సమీక్ష నిర్వహించారు. పాతబడ్డ సీసీ కెమెరాలను మార్చడమే కాకుండా నిరంతరం వాటిని పర్యవేక్షించేలా నిర్ణయం తీసుకున్నారు. 

ఆదివారం ఇంద్రకీలాద్రిపై చిన్నారి తప్పిపోవడంతో దుర్గ గుడి వైఫల్యాలు బయటపడ్డాయి. విజయవాడలో ఉంటున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి వచ్చారు. దర్శనానంతరం చెప్పుల స్టాండ్‌ వద్ద చిన్నారి తప్పిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెతికినా చిన్నారి కనిపించకపోవడంతో అధికారులకు సమాచారమిచ్చారు. 

అయితే... పోలీసులు రంగంలోకి దిగి సీసీ టీవీ ఫుటేజి పరిశీలిస్తుండగా భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. ఇంద్రకీలాద్రిపై పలుచోట్ల సీసీ టీవీ కెమెరాలు పని చేయడం లేదని తేలింది. అంతేకాకుండా... కొండ కింది భాగంలో సీసీ టీవీ కెమెరాలు లేకపోవడంతో చిన్నారి అదృశ్యం కేసును చేధించేందుకు 14 గంటల సమయం పట్టింది. దీంతో పాలకమండలి సమావేశంలో ప్రధానంగా గంటన్నరసేపు సీసీ టీవీ కెమెరాలపై చర్చించారు. పాతవాటి స్థానంలో కొత్త కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా కొండ దిగువన కూడా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు.. దృశ్యాలు రికార్డింగ్‌, స్టోర్‌ చేసేందుకు అవసరమైన నెట్‌వర్క్‌, సర్వర్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 8 లక్షల రూపాయలు కేటాయించాలని ఆమోదించారు. ఇక వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు సిబందిని కూడా నియమిస్తున్నట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు. 

ఇక పాలకమండలి సమావేశంలో అగ్నిమాపక సామాగ్రితో పాటు సంప్‌ నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. దేవస్థానంలోని కొన్ని కట్టడాలకు రంగులు వేయాలని, మల్లికార్జున మహామండపం వద్ద పవిత్ర వనం పరిసరాలు అభివృద్ధిపరిచేందుకు 58 లక్షల రూపాయలతో అంచనాలను ఆమోదించారు. మొత్తానికి చిన్నారి అదృశ్యంతో దుర్గ గుడి భద్రత వైఫల్యంపై మరోసారి చర్చనీయాంశమైంది. 

నాయిబ్రాహ్మణుల డిమాండ్లపై సీఎం చంద్రబాబు సానుకూల స్పందన

గుంటూరు : ఎట్టకేలకు నాయిబ్రాహ్మణుల కత్తిడౌన్‌ సమ్మెకు తెరపడింది. ముఖ్యమంత్రితో నాయిబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు నిన్న జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.15000 వేతనం ఇవ్వాలని డిమాండ్‌తో క్షురకులు సమ్మెకు దిగారు. నాయిబ్రాహ్మణుల డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించడంతో.. ఇవాళ్టి నుంచి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు.

10:37 - June 19, 2018

గుంటూరు : ఎట్టకేలకు నాయిబ్రాహ్మణుల కత్తిడౌన్‌ సమ్మెకు తెరపడింది. ముఖ్యమంత్రితో నాయిబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు నిన్న జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.15000 వేతనం ఇవ్వాలని డిమాండ్‌తో క్షురకులు సమ్మెకు దిగారు. నాయిబ్రాహ్మణుల డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించడంతో.. ఇవాళ్టి నుంచి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు.

 

ఉత్తర్వులు ఉల్లంఘించే స్కూల్స్ పై కఠిన చర్యలు : మంత్రి గంటా

హైదరాబాద్ : ఏపీలో మళ్లీ ఎండలు మండుతున్నాయి. ఎండల ధాటికి స్కూల్ చిన్నారులు విలవిల్లాడుతున్నారు. ఏపీ ప్రభుత్వం మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి 21 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 3 రోజులు సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. ఉత్తర్వులు ఉల్లంఘించే స్కూల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. 

 

ఏపీలో 3 రోజులపాటు స్కూళ్లకు సెలవులు

హైదరాబాద్ : ఏపీలో మళ్లీ ఎండలు మండుతున్నాయి. రుతుపవనాలు మందగించాయి. గత మూడు రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఎండల ధాటికి స్కూల్ చిన్నారులు విలవిల్లాడుతున్నారు. ఏపీ ప్రభుత్వం మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి 21 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. 

09:39 - June 19, 2018

గుంటూరు : ఏపీలో మళ్లీ ఎండలు మండుతున్నాయి. రుతుపవనాలు మందగించాయి. గత మూడు రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. ఎండల ధాటికి స్కూల్ చిన్నారులు విలవిల్లాడుతున్నారు. ఏపీ ప్రభుత్వం మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఇవాళ్టి నుంచి 21 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 3 రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. ఉత్తర్వులు ఉల్లంఘించే స్కూల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

 

09:13 - June 19, 2018

నల్గొండ : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇద్దరు మృతి చెందారు. ఏపీ 04వై7191 నంబర్ గల ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తోంది. నల్గొండ జిల్లా వేములపల్లి మలుపు వద్ద బస్సు అదుపు తప్పి పొలాల్లోకి వెళ్లి పల్టీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో పదిమందికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తుతోనే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:24 - June 19, 2018

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ చూపించారు. రెండు మూడు రోజుల క్రితం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వారి వద్దకే వెళ్లి క్షేత్రస్థాయిలోని ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, బాధితులతో సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి తనదైన శైలిలో పరిష్కారం చూపించారు. ఇకనైనా  సమస్యకు పరిష్కారం లభిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
నగరంలో భూ సమస్యలు
రోజురోజుకు విస్తరిస్తోన్న హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడ జాగా ఉంటే... అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా  భూముల్లో అనేక సమస్యలు ఉండడంతో వాటి పరిష్కారం కోసం ఆయా కాలనీలు, బస్తీల ప్రజలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.  అయితే భూముల వివాదాలతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పర్మిషన్లకు నోచుకోక.. మళ్లీ అమ్మాలంటే  రిజిస్ట్రేషన్లకు నోచుకోక ప్రజలు నానా యాతన పడ్డారు. తమ సమస్యకు పరిష్కారం చూపాలని ఎన్నోఏళ్లుగా సర్కార్‌కు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. అయినా వారిమొర ఆలకించిన వారే లేరు.  ఇటీవల ఈ సమస్యను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకుపోవడంతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
మన నగరం కార్యక్రమం
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నియోజకవర్గాల వారీగా మంత్రి కేటీఆర్‌ మన నగరం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గతవారం నిర్వహించిన మన నగరం కార్యక్రమంలో దశాబ్దాలుగా ఎల్‌బీ నగర్‌ నియోజకవర్గంలోని బీఎన్‌ రెడ్డి నగర్‌, సాహెబ్‌నగర్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ సంబంధ సమస్యలు మంత్రి కేటీఆర్‌ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. ఇళ్లు కట్టుకోవడానికి పర్మిషన్లురాక.. కట్టుకున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు అనధికార నిర్మాణం పేరుతో రెండు మూడు రెట్లు ట్యాక్స్‌ వసూళ్లు చేస్తున్నారని వివరించారు. తమ దీర్ఘకాలిక సమస్యను కొలిక్కి తేవాలని మంత్రిని కోరారు. దీంతో ఆయన ఎల్‌బీ నగర్‌ జోనల్‌ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.సమస్యల వారీగా ఆరా తీసి.. కొన్నింటికి క్షేత్రస్థాయిలో పరిష్కారం చూపగా... మిగతా భూముల అంశాలకు కేబినెట్‌ స్థాయిలో పరిష్కరించనున్నారు. అయితే న్యాయ పరమైన ఇబ్బందులు ఉన్న భూములకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని కేటీఆర్‌ హామీఇచ్చినట్టు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు.
మేయర్‌ తీరుపట్ల ప్రజలు అసంతృప్తి 
తమ సమస్యలు చెప్పుకోవడానికి చాలా మంది ప్రజలు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయానికి వచ్చారు. కానీ అక్కడ వారికి నిరాశే ఎదురైంది. కొద్దిమందిని మాత్రమే లోపలికి అనుమతించి... మిగిలినవారిని పంపలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులకు సర్ది చెప్పేందుకు మేయర్ ప్రయత్నించారు. అయితే మేయర్‌ వ్యవహరించిన తీరుపట్ల అక్కడికి వచ్చిన ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తానికి మన నగరం పేరుతో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న సమావేశాలు కొంతమంది లబ్ది కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీటికితోడు ఆయా సమావేశాలకు సామాన్యులెవరినీ అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

 

08:21 - June 19, 2018

గుంటూరు : ఎట్టకేలకు నాయిబ్రాహ్మణుల కత్తిడౌన్‌ సమ్మెకు తెరపడింది. ముఖ్యమంత్రితో నాయిబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు నిన్న జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నాయిబ్రాహ్మణుల డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించడంతో.. ఇవాళ్టి నుంచి విధులకు హాజరవుతున్నట్లు ప్రకటించారు.

అనూహ్య మలుపులు తిరిగిన కత్తిడౌన్‌ సమ్మె ముగిసింది. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, నెలకు 15వేలు కనీస వేతనం ఇవ్వాలన్న డిమాండ్‌తో విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. కాగా నాయిబ్రాహ్మణ సంఘాల జేఏసీ నేతలు సీఎంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో.. సమ్మెవిరమించి విధుల్లోకి వెళ్ళనున్నారు.. 

ఆంధ్రప్రదేశ్‌లో నాయిబ్రాహ్మణుల సమ్మెతో రాష్ర్టవ్యాప్తంగా దేవాలయాల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  కేశఖండనలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

నాయిబ్రాహ్మణుల వివాదం ఓ దశలో తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపించింది. వారి డిమాండ్లపై సరైన నిర్ణయం తీసుకొంటామని  దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. కానీ నిరసనకారులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సీన్‌ రివర్స్‌ అయ్యింది. వారిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు నాయిబ్రాహ్మణులు సైతం సీఎం తీరును నిరసించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని ప్రకటించారు.

అనూహ్య మలుపుల నేపథ్యంలో నాయిబ్రాహ్మణుల వివాదానికి తెరపడింది. నాయిబ్రాహ్మణుల జేఏసీ ప్రతినిధులు మరోసారి సీఎంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తమ డిమాండ్ల పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారని నాయిబ్రాహ్మణుల జేఏసీ ఛైర్మన్‌ గుంటుమల్ల రాందాస్‌ తెలిపారు. వీలైనంత త్వరలోనే సమస్యల పరిష్కారాని సీఎం హామీ ఇవ్వడంతో సమ్మెవిరమిస్తున్నామని రాందాస్‌ పేర్కొన్నారు. 

సెక్రటేరియట్‌లో జరిగిన వ్యవహారంపై నాయిబ్రాహ్మణ జేఏసీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు.  సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు ఇవ్వడంపై వారు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చర్చలకు కొద్దిమందిని మాత్రమే పిలిచారని, ఆందోళనకారులు ఎలా వచ్చారో తమకు తెలియదన్నారు.  తెలుగుదేశం పార్టీ మాత్రమే నాయిబ్రాహ్మణులకు న్యాయం చేసిందని పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో నాయిబ్రాహ్మణుల వివాదానికి తెరపడింది. దీంతో  నాయిబ్రాహ్మణుల్లో ఆనందం వ్యక్తవవుతోంది. మరోవైపు నాయిబ్రాహ్మణులు విధుల్లోకి వెళ్తున్నట్లు ప్రకటించడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

నేడు ప్రకాశం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన

ప్రకాశం : జిల్లాలో నేడు మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. చీరాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో లోకేష్ పాల్గొననున్నారు.

193 వ రోజుకు చేరుకున్న జగన్ ప్రజా సంకల్పయాత్ర

తూ.గో : జగన్ ప్రజా సంకల్పయాత్ర 193 వ రోజుకు చేరుకున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో నేడు పాదయాత్ర చేయనున్నారు. 

 

ఫిఫా ప్రపంచకప్ లో నేటి మ్యాచ్ లు

ఢిల్లీ : ఫిఫా ప్రపంచకప్ లో నేటి మ్యాచ్ లు. రాత్రి 8.30 పోలాండ్ లో సెనెగల్ ఢీ కొట్టనుంది. రాత్రి 11.30 రష్యాతో ఈజిప్ట్ తలపడునుంది.

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

నల్గొండ : వేములపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందారు. మరో 16 మందికి గాయాలు అయ్యాయి. బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 

 

Don't Miss