Activities calendar

20 June 2018

సంక్షేమ పథకాల్లో 'సాధికారమిత్ర'లు కీలకం : చంద్రబాబు

అమరావతి : ప్రభుత్వ శాఖలతోపాటు వ్యాపారంలో అవినీతి ప్రక్షాళనకు సాధికార మిత్రలు కృషి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇచ్చారు. అమరావతిలో సాధికరమిత్ర స్వయం సహాయ బృందాలతో సమావేశమైన చంద్రబాబు.. ప్రభుత్వ కార్యక్రమల అమల్లో వీరి పాత్రను ప్రశంసించారు. చంద్రన్న పెళ్లికానుక, చంద్రన్న బీమా సహా పలు పథకాల అమల్లో సాధికార మిత్రలు ఇంకా ఎక్కువ చొరవ తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ శాఖలు, వ్యాపారంలో అవినీతి ప్రక్షాళనకు సాధికర మిత్రలు ప్రజలకు అవగాహన కల్పించాలని చంద్రబాబు కోరారు. 

విజయవాడ వెళ్లనున్న మంత్రి కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ రేపు విజయవాడకు వెళ్లనున్నారు. కుటుంబంతో కలిసి ఆయన వెళ్తున్నారు. ఈ సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మను కేటీఆర్ దంపతులు దర్శించుకోనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పున్నమి ఘాట్ లోని టూరిజం రిసార్ట్స్ లో కేటీఆర్ కుటుంబం బసచేయనుంది.

 

రాహుల్ గాంధీకి నోటీసులిచ్చిన బాలల హక్కుల సంఘం..

ఢిల్లీ : మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా వకడి అనే గ్రామంలో ఇటీవల జరిగిన అమానవీయ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఆ రాష్ట్ర బాలల హక్కుల సంఘం నోటీసులు పంపించింది. ముంబయికి చెందిన ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు స్వీకరించిన ఆ సంఘం... మైనర్‌ బాలుర గుర్తింపును బయట పెట్టడం నేరమని, అందుకే ఈ నోటీసులు పంపినట్లు పేర్కొంది. నోటీసులపై స్పందిచేందుకు పది రోజుల సమయం ఇచ్చింది. కాగా, ఇద్దరు దళిత బాలలు ఓ అగ్ర కులస్తుడి బావిలో స్నానం చేయగా వారిని పట్టుకున్న కొందరు అగ్రకులస్తులు నగ్నంగా ఊరేగించి కొట్టారు.

అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాల పెంపు : చంద్రబాబు

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను భారీగా పెంచారు. టీచర్ల వేతనాలు రూ.7,500ల నుండి రూ.10,000లకు పెంచారు. ఆయాల వేతనాలు రూ.4,500ల నుండి రూ.6వేలకు పెంచుతున్నట్లుగా చంద్రబాబు తెలిపారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత అంగన్వాడీ వేతలను రెండోసారి పెంచామని చంద్రబాబు తెలిపారు. తాజాగా అంగన్వాడీల వేతలు పెంచటంతో ప్రభుత్వంపై రూ.305 కోట్ల భారం పడుతుందన్నారు. 

అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాల పెంపు : చంద్రబాబు

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను భారీగా పెంచారు. టీచర్ల వేతనాలు రూ.7,500ల నుండి రూ.10,000లకు పెంచారు. ఆయాల వేతనాలు రూ.4,500ల నుండి రూ.6వేలకు పెంచుతున్నట్లుగా చంద్రబాబు తెలిపారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత అంగన్వాడీ వేతలను రెండోసారి పెంచామని చంద్రబాబు తెలిపారు. తాజాగా అంగన్వాడీల వేతలు పెంచటంతో ప్రభుత్వంపై రూ.305 కోట్ల భారం పడుతుందన్నారు. 

బోటు ప్రమాదంలో 180మంది గల్లంతు..

ఇండోనేషియా : ఓ బోటు ప్రమాదానికి గురైంది. దీంతో దాంట్లో ప్రయాణిస్తున్న 180 ప్రయాణికులు ఆచూకీ లేకుండాపోయింది. లేక్ తోబాలో ఈ దుర్ఘటన జరిగింది. ఈద్ సంబరాల నేపథ్యంలో భారీ స్థాయిలో సరస్సు పర్యాటకులు వచ్చారు. వీరిలో ప్రస్తుతానికి 18 మందిని సురక్షితంగా రక్షించారు. గజ ఈతగాళ్లు, అండర్‌వాటర్ డ్రోన్‌లతో అధికారులు గల్లంతైనవారి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. కాగా లేక్ తోబా సుమారు 450 మీటర్ల లోతు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

గోవులకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలట!..

మధ్యప్రదేశ్ : గోవులను రక్షించుకునేందుకు ప్రత్యేకంగా ఆవుల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ గో సంరక్షణ బోర్డు చైర్మన్ అఖిలేశ్వరానంద గిరి ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గోవుల సంరక్షణకు ఈ చర్యలు తీసుకుంటే సీఎం శివరాజ్‌ను భవిష్యత్తులో ప్రజలు గుర్తు చేసుకుంటారన్నారు. సీఎం చౌహాన్ తన నివాసంలో గోశాలను ఏర్పాటు చేసుకున్నారు. అదే తరహాలో ఆయన రాష్ట్రంలో ఉన్న గోవులను కాపాడాలని అభిలేశ్వరానంద డిమాండ్ చేశారు. గోమంత్రిత్వశాఖతో మధ్యప్రదేశ్ బంగారు రాష్ట్రంగా వర్ధిల్లుతుందన్నారు. రాజస్థాన్‌లో గో సంరక్షణ కోసం డైరక్టరేట్ ఉందన్నారు.

తల్లిదండ్రుల ముందే భవనంపైనుండి దూకేసింది..

హైదరాబాద్ : ముషీరాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ భవనం పైనుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రభుత్వ హాస్టల్ వుంటు పాలిటెక్నిక్ రెండవ సంవత్సరం చదువుకుంటున్న సనా అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దపల్లి జిల్లా రొంపిగుంటకు చెందిన మహ్మద్ సనా అనే యువతి హాస్టల్ లో వుండి పాలిటెక్నిక్ రెండవ సంవత్సరం చదువుకుంటోంది. ఈక్రమంలో ఆమె ప్రేమలోపడింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్ వచ్చి ఆమెను తీసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో సనా తల్లిదండ్రుల కళ్ళముందే హాస్టల్ భవనం మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

రాహుల్ గాంధీతో టీ.కాంగ్రెస్ నేతల భేటీ పూర్తి..

ఢిల్లీ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీ.కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. ఈ భేటీలో డీకే అరుణ, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, కేఎల్ ఆర్, బండ కార్తీకరెడ్డి, బండ చంద్రారెడ్డి పాల్గొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, పార్టీలో సంస్థాగత మార్పులు వంటి అంశాలపై నేతలతో రాహుల్ గాంధీ చర్చించారు. టీ.కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతంర రాహుల్ ఏపీ నేతలతో భేటీ అయ్యారు.

కుంగిపోయిన రోడ్డు..ఆందోళనలో ప్రయాణీకులు..

హైదరాబాద్ : నిత్యమూ బిజీగా ఉండే బోయినపల్లి రహదారి ఒక్కసారిగా కుంగిపోగా, ఆరు అడుగుల లోతైన సింక్ హోల్ ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక్కడి బాపూజీ నగర్ లో ఈ ఘటన జరుగగా, చాలాసేపు ట్రాఫిక్ ఆగిపోయింది. నాలుగు అడుగుల వెడల్పుతో ఆరు అడుగుల లోతైన గుంత పడినట్టు తెలుస్తోంది. ఈ రహదారి కింద శతాబ్దం నాటి రామన్నకుంట చెరువుకు దారితీసే మురుగునీటి పైప్ లైన్ ఉండగా, అది పగిలిందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా గుంత ఏర్పడగా, ఆ సమయంలో ఏ మోటరిస్టు లేదా పాదచారులు అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

నారా లోకేశ్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డ్..

అమరావతి : ఏపీ పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. లోకేశ్ ను స్కోచ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక చేశారు. పంచాయతీరాజ్ శాఖలో టెక్నాలజీ వినియోగం ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినందుకు గాను ఈ అవార్డు లభించింది. గవర్నెన్స్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖకు మరో 3 అవార్డులు లభించాయి. ఈ నెల 23న ఢిల్లీలో జరగనున్న స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును లోకేశ్ అందుకోనున్నారు.

తెలంగాణ దేశానికే దిక్సూచి : పోచారం

హైదరాబాద్ : ఇండియా టుడే అందించే ప్రతిప్ఠాత్మక అగ్రి అవార్డు ఈ ఏడాది తెలంగాణ వ్యవసాయ శాఖకు లభించింది. ఈ అవార్డు రావడం పట్ల తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయం, రైతుల అభివృద్ధి కోసం తాము అమలు చేస్తోన్న పథకాలతో వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. తమ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్తు, పంట పెట్టుబడిగా ఎకరాకు రూ. 8000 ను ఇచ్చే రైతుబంధు పథకం ఇస్తోందని చెప్పారు. రైతుల సంక్షేమానికి కేసీఆర్‌ చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.        

తెలంగాణకు 'అగ్రి'అవార్డ్..

హైదరాబాద్ : ఇండియా టుడే అందించే ప్రతిప్ఠాత్మక అగ్రి అవార్డు ఈ ఏడాది తెలంగాణ వ్యవసాయ శాఖకు లభించింది. తెలంగాణలో వ్యవసాయ రంగంలో అభివృద్ధికి గానూ ఈ అవార్డు లభించింది. వ్యవసాయంలో దేశంలోనే అత్యధిక వేగంగా వృద్ధి చెందుతోన్న రాష్ట్రంగా తెలంగాణకు ఇండియా టుడే గుర్తింపునిచ్చింది. ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ఈ అవార్డును తెలంగాణకు ప్రదానం చేయనున్నారు.

అమీర్ పేట, ఎల్బీ నగర్ మధ్య మెట్రో ట్రయల్..

హైదరాబాద్ : ఎల్బీనగర్ ప్రజల నిరీక్షణకు ఫలితం దక్కనుండి. మరో నెలరోజుల్లో అమీర్‌పేట-ఎల్బీనగర్ మధ్య మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. ఈ క్రమంలో అమీర్ పేట, ఎల్బీ నగర్ ప్రాంతాల మధ్య మెట్రో ట్రయల్ రన్ ను మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, మేయర్ రామ్మెహన్ పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 16 కిలోమీటర్ల దూరానికి ట్రయల్ రన్‌ ముగిసి అనుమతులు వచ్చిన వెంటనే ప్రయాణికులకు అందుబాటులో తీసుకురానున్నారు. ఆగస్టు నాటికి ఈ రెండు ప్రాంతాల ప్రయాణికుల కష్టాలు గట్టెక్కనున్నాయి. కాగా, నేడు మెట్రో రైలు ప్రాజెక్టు పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించనున్నారు.

శాంతి భద్రతలపై సమీక్షించనున్న కశ్మీర్ గవర్నర్..

జమ్ము కశ్మీర్ : రాష్ట్రంలో ముఖ్యంగా కశ్మీర్ లో శాంతి భద్రతలపై మ.2.30లకు గవర్నర్ సమీక్ష నిర్వహించనున్నారు. కాగా బీజేపీ - పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన 24 గంటల్లోపే, పాలనను గవర్నర్ చేతుల్లో పెడుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దస్త్రాలపై సంతకం చేశారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీతో తమకున్న అనుబంధాన్ని నిన్న బీజేపీ తెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యంగా కశ్మీర్ లో శాంతి భద్రతలపై మ.2.30లకు గవర్నర్ ఓరా సమీక్ష నిర్వహించనున్నారు. 

పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య..

హైదరాబాద్ : ముషీరాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ భవనం పైనుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా విద్యార్ధిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాల్సివుంది. 

ఫిజియోథెరపీలో విరిగిన చిన్నారి కాళ్లు..

హైదరాబాద్ : రామంతాపూర్ లో దారుణం జరిగింది. ఫిజియోథెరపీ చేస్తు..చిన్నారి కాళ్లను విరగ్గొట్టిన విషాదం ఘటన చోటుచేసుకుంది. రెండున్నరేళ్ల చిన్నారికి ఫిజియోథెరపీ వైద్యం చేస్తున్న డాక్టర్ కిరణ్ ప్రమాదవశాత్తు చిన్నారి కాళ్లను విరగ్గొట్టినట్లుగా తెలుస్తోంది.   

కృష్ణా డెల్టా తూర్పు కాలువకు నీటి విడుదల..

విజయవాడ : విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా డెల్టా తూర్పు కాలువకు సీఎం చంద్రబాబు నాయుడు నీటిని విడుదలు చేశారు. రెండు వేల క్యూసెక్కుల నీటిని సీఎం విడుదల చేశారు. అనంతరం కృష్ణా డెల్టా హెడ్ వర్క్స్ ను చంద్రబాబు ప్రారంభించారు. డెల్టా ఆధునీకరణలో భాగంగా తూర్పు డెల్టా హెడ్ రెగ్యులేటర్ నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పట్టిసీమ నుండి పోలవరం కుడి కాలువ ద్వారా 5600 కూసెక్కుల గోదావరి జలాలను మళ్లించారు. 

రాహుల్ గాంధీతో టీ.కాంగ్రెస్ నేతల భేటీ..

ఢిల్లీ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీ.కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. ఈ భేటీలో డీకే అరుణ, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి, కేఎల్ ఆర్, బండ కార్తీకరెడ్డి, బండ చంద్రారెడ్డి పాల్గొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, పార్టీలో సంస్థాగత మార్పులు వంటి అంశాలపై నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్ధేశం చేస్తున్నారు. టీ.కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతంర రాహుల్ ఏపీ నేతలతో భేటీ కానున్నారు.

పట్టపగలు సినీ ఫక్కీలో బ్యాంకు దోపిడీ..

ఒడిశా: రూర్కెలాలో పట్టపగలు జరిగిన బ్యాంకు దోపిడీ సంచలనమైంది. నగరంలోని మధుసూదన్ లేన్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 8 మంది దోపిడీ దొంగలు ముఖాలకు మాస్క్‌లు, హెల్మెట్‌లు ధరించి మారణాయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించి సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సినిమా ఫక్కీలో బ్యాంకు సిబ్బందిని, బ్యాంకులోని వినియోగదారులను తుపాకితో బెదిరించారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లను తీసుకుని అందరినీ ఓ గదిలో బంధించారు. అనంతరం లాకర్లను పగలగొట్టి అందులో ఉన్న రూ.44 లక్షలు దోచుకున్నారు.

ఉక్కు కోసం ఉద్యమిస్తున్న ఎంపీ సీఎం రమేశ్..

కడప : జిల్లాలో వెంటనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. ఆయన చేస్తున్న దీక్షకు 'ఉక్కు దీక్ష' అని పేరు పెట్టిన టీడీపీ శ్రేణులు, దీక్షా వేదికను ఇప్పటికే సిద్ధం చేయగా, రమేష్ వేదిక వద్దకు చేరుకున్నారు.  స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో సీఎం రమేష్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి మెకాన్ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల నివేదికను పరిశీలించాలని కూడా ఆయన కోరారు.

కశ్మీర్ పాలన గవర్నర్ చేతుల్లోకి...

జమ్మూ కశ్మీర్ : బీజేపీ - పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన 24 గంటల్లోపే, పాలనను గవర్నర్ చేతుల్లో పెడుతూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దస్త్రాలపై సంతకం చేశారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీతో తమకున్న అనుబంధాన్ని నిన్న బీజేపీ తెంచుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయగా, రాష్ట్రంలోని పరిస్థితిని వివరిస్తూ, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా తన నివేదికను రాష్ట్రపతికి పంపుతూ, కేంద్ర పాలనకు సిఫార్సు చేశారు.

ఇడ్లీ బాగాలేదు అన్నందుకు యువకులపై దాడి..

హైదరాబాద్ : చాదర్ ఘాట్ పీఎస్ పరిధిలో ముగ్గురు యువకులపై ఫుట్ పాత్ వ్యాపారులు దాడికి పాల్పడ్డారు. ఇడ్లీ సరిగ్గా లేదని అడినందుకు యువకులపై వ్యాపారులు కర్రలు, ఐరన్ రాడ్లతో దాడికి పాల్పడ్డారు. వ్యాపారుల దాడిలో అశ్విన్ ,కిరణ్, మోహన్ అనే యువకులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. దాడికి పాల్పడ్డవారిని అదుపులోకి తీసుకోకుండా పోలీసులు బాధితులను నిర్భంధించి కేసులు నమోదు చేశారు. 

యువతి గొంతు కోసిన మరో ఉన్మాది...

పశ్చిమగోదావరి : పోలవరం బాపూజీ కాలనీలో దారుణం జరిగింది. కిరణ్ అనే యువకుడు ప్రేమించిన యువతి గొంతు కోసి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం నిశ్చయం అయిందనే కోపంతో కిరణ్ సదరు యువతి గొంతు కోసిన అనంతరం జామాయిల్ తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్థితిగతులపై రాహుల్ దృష్టి..

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ వరుసగా భేటీ కానున్నారు. ఉదయం 10.30 టీ కాంగ్రెస్ నేతలతోను, 11.30 గంటలకు ఏపీ నేతలతోను తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులపై రాహుల్ గాంధీ చర్చించనున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ పై నేతలు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయనున్నారు. ఉత్తమ్ లేకుండానే నేతలు రాహుల్ తో నిన్న రాహుల్ ను కలిసారు. 

రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి ఎక్కడ? : రాఘవులు

విజయవాడ : వామపక్షాల రాష్ట్ర రాజకీయ సదస్సు ప్రారంభం కానుంది. సిద్దార్థ ఆడిటోరియంలో ఈ వామపక్షాల రాష్ట్ర రాజకీయ సదస్సు మరికాసేపట్లో ప్రారంభం కానునంది. ఈ సందర్భంగా సీపీఎం పోలిట్ బ్యూరో బీవీ రాఘవులు మాట్లాడుతు..సుదీర్ఘ కాలంలో పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలు పరిపాలించారనీ..కానీ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని సీపీఎం పోలిట్ బ్యూరో బీవీ రాఘవులు విమర్శించారు. సామాజిక న్యాయం, దళితుల సమస్యలు, భూ పంపిణీ వంటి పలు సమస్యలపై ఏ పాలకులు దృష్టి పెట్టలేదన్నారు.

వామపక్షాల రాష్ట్ర రాజకీయ సదస్సు..

విజయవాడ : వామపక్షాల రాష్ట్ర రాజకీయ సదస్సు ప్రారంభం కానుంది. సిద్దార్థ ఆడిటోరియంలో ఈ వామపక్షాల రాష్ట్ర రాజకీయ సదస్సు మరికాసేపట్లో ప్రారంభం కానునంది. రాష్ట్ర రాజకీయ అంశాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి పలు అంశాలపై వామపక్ష నేతలు చర్చించనున్నారు. ఈ సదస్సుకు ఏపీ కార్యదర్శులు పి. మధు, రామకృష్ణ హాజరయ్యారు. వీరితో పాటు జనసేన పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. 

బాపూజీ కాలనీలో దారుణం...

పశ్చిమగోదావరి : పోలవరం బాపూజీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమను నిరాకరించిందని ప్రేమోన్మాది గొంతు కోశాడు. అనంతరం పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం బైక్ ర్యాలీలు...

హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం బైక్ ర్యాలీలు నిర్వహించనుంది. కమీషన్లు కాకుండా ప్రభుత్వమే జీతాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

సిక్కోలులో కన్నా పర్యటన...

శ్రీకాకుళం : బుధ, గురువారాల్లో జిల్లాలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పర్యటించనున్నారు. నేడు పాలకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 

ఏపీ..తెలంగాణ నేతలతో రాహుల్ భేటీ...

ఢిల్లీ : ఉదయం 10.15 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టి.కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. అనంతరం ఉదయం 11గంటలకు ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా భేటీ కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలోపేతంపై చర్చించనున్నారు. 

07:31 - June 20, 2018

ఢిల్లీ : ప్రపంచ కుబేరుడిగా మళ్లీ అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్‌ బెజోస్‌నే నిలిచారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచ బిలియనీర్స్‌ జాబితాలో 141.9 బిలియన్‌ డాలర్ల సంపదతో బెజోస్‌ అపర కుబేరుడిగా అగ్రస్థానంలో ఉన్నారు. గతేడాది కూడా ఈయనే బిలియనీర్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. తాజాగా విడుదల చేసిన జాబితాలోనూ జెఫ్‌ బెజోస్‌నే అపర కుబేరుడిగా నిలిచారు. 92.9 బిలియన్‌ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్లలో ఒకరైన వారెన్‌ బఫెట్‌ మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఆపిల్‌ తర్వాత అమెజాన్‌ ఉంది. అమెరికాలో అతిపెద్ద కంపెనీల్లో 177.87 బిలియన్‌ డాలర్లతో అమెజాన్‌ 8వ స్థానంలో ఉంది. మరోవైపు ఫోర్బ్స్‌ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో టాప్‌ 100మందిలో నలుగురు భారతీయులకు మాత్రమే చోటు దక్కింది. వారిలో ముఖేష్ అంబానీ, అజిమ్‌ ప్రేమ్‌జీ, లక్ష్మి మిట్టల్‌, శివ నాడర్‌ ఉన్నారు. 

07:25 - June 20, 2018

హైదరాబాద్‌ : పాతబస్తీలో అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. మదీనాసెంటర్‌లోని ఓ బ్యాగుల షోరూమ్‌లో మంటలు ఎగసిపడ్డాయి. క్షణాల్లోనే షాప్‌ మొత్తం వ్యాపించాయి. దీంతో ఫైర్‌ సిబ్బంది రెండు గంటలు కష్టపడి మంటలను అదుపుచేశారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.

 

07:24 - June 20, 2018

హైదరాబాద్ : డిగ్రీ రెండో విడతలో సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. దీంతో మొత్తం లక్షా 51వేల 603 సీట్లు కేటాయించింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. అయితే సాంకేతికంగా అనేక ఇబ్బందుల అనంతరం.. రెండో విడత కూడా పూర్తి చేసుకుని మూడో విడత సీట్ల కేటాయింపుకు సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా దోస్త్‌ ద్వారా సీట్ల కేటాయింపులు పూర్తిచేసి.... జూలై మొదటి వారంలో తరగతులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యామండలి రెడీ అయ్యింది. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో కోర్సులకు సీట్ల కేటాయింపు దాదాపుగా పూర్తయ్యింది. డిగ్రీ రెండో విడత సీట్ల కేటాయింపు ముగిసింది. ఇక మూడో విడత సీట్ల కేటాయింపుకు ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 51వేల 603 సీట్లు నిండాయి. వచ్చే నెల మొదటి వారంలో క్లాసులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యామండలి సస్నద్దమవుతోంది. మొదటి ఆప్షన్‌లో సీటు వచ్చిన వారు రెండో విడత కౌన్సెలింగ్‌కు అర్హత లేదన్న నిబంధనను వచ్చే ఏడాది నుంచి తొలగించనున్నట్టు ఉన్నత విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. నిజానికి మొదటి ఆప్షన్‌లో సీటు వచ్చిన వారు.. 717 మంది విద్యార్థులు మళ్లీ మార్చుకుంటామని కోరారన్నారు. ఇప్పటి వరకు జీరో అడ్మిషన్ల కాలేజీలు మొత్తం 44 ఉన్నట్టు తెలిపారు.

నేటి నుంచి ఈనెల 27 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. కొత్తవారు... గతంలో కాలేజీల్లో చేరని వారందరూ మూడో విడతలో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈనెల 30న మూడో విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ముగియనుంది.

07:23 - June 20, 2018

మెదక్ : ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గంజాయి దందా యధేచ్చగా సాగుతోంది. యువతను, విద్యార్థులే లక్ష్యంగా స్మగ్లర్లు గంజాయిని విక్రయిస్తున్నారు. గంజాయి దందాను అరికట్టాల్సిన అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతోన్న గంజాయి దందాపై స్పెషల్‌ స్టోరీ..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గంజాయి మాఫియా చెలరేగిపోతోంది. అక్రమంగా గంజాయి విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. నారాయణఖేడ్‌ ప్రాంతం ఒకప్పుడు గంజాయి సాగుకు, రవాణాకు కేరాఫ్‌ అడ్రస్‌. అయితే అదే ప్రాంతంలో గంజాయి సాగు ఇప్పుడు దాదాపుగా కనుమరుగై పోయింది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక నుంచి దొడ్డిదారిన స్మగ్లర్లు మెదక్‌ జిల్లాకు చేర్చుతున్నారు. అంతేకాదు.. హైదరాబాద్ మహానగరానికి కూడా ఇదే ప్రాంతం నుంచి తరలిస్తున్నారు. గడిచిన వారంలో రోజుల్లో రెండు కేసులు కూడా నమోదయ్యాయి. ఈనెల 12న జహీరాబాద్‌లో ఓ ప్రభుత్వ పాఠశాల దగ్గర గంజాయి అమ్ముతూ ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. విచారణలో వాళ్లు వెల్లడించిన విషయాలు విస్మయాన్ని కలిగించాయి.

జహీరాబాద్‌లోని నాలుగు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని గంజాయి ముఠా సభ్యులు విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని జహీరాబాద్‌ టౌన్‌ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. గంజాయి అమ్మకందారులు ఒక్క నారాయణఖేడ్‌కే పరిమితం కాలేదు. జిల్లాలోని ఇతర ప్రాంతాలపైనా కన్నేశారు. పటాన్‌చెరు, పాశమైలారం, జిన్నారం, ఇస్నాపూర్‌ పారిశ్రామిక వాడల్లో కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా కార్మికులకు గంజాయిని చేరవేస్తున్నారు. సంగారెడ్డిలోని శాంతినగర్‌లో ఓ పాఠశాల దగ్గర కూడా గంజాయి విక్రయాలు కొనసాగుతున్నాయి. జిల్లా అంతటా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టు వరుస ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో వందమంది గంజాయి స్మగ్లర్లను, విక్రయదారులను ఎక్సైజ్‌శాఖ అరెస్ట్‌ చేసింది. అయినా పారిశ్రామిక ప్రాంతాలను, విద్యా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. ఇంతగా విస్తరించినా ఈదందాను అరికట్టేందుకు ఎక్సైజ్‌శాఖ నిఘాను కఠినతరం చేయాల్సిన అవసరమైతే ఉంది. అయితే ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తుందా .. లేదా అంటే ఏమీ చెప్పలేం.

సరిహద్దు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల దగ్గర తనిఖీలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. దీంతో స్మగ్లర్ల పని సులువు అవుతోంది. సరిహద్దు దాటిన గంజాయిని నిర్మానుష్య ప్రాంతంలో ఉంచి అక్కడి విక్రయిస్తున్నారు. 50 గ్రాముల నుంచి కిలో వరకు ప్యాకెట్లుగా చేసి వివిధప్రాతాలకు తరలిస్తున్నారు. యాబై గ్రాముల ప్యాకెట్‌ ధర వంద రూపాయాలుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయి దందాను పూర్తిగా అరిక్టకపోతే ముఖ్యంగా యువకులు, విద్యార్థులు పూర్తిగా చెడు వ్యసనాలకు అలవాటుపడే అవకాశం ఉంది.

07:21 - June 20, 2018

వరంగల్ : ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత నేరెళ్ల వేణుమాధవ్‌ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవ్‌ వరంగల్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జాతీయ, అంతర్జాతీయంగా మిమిక్రీలో ఎందరో స్వరాలను అనుకరించిన వేణుమాధవ్‌... ప్రముఖల ప్రశంసలు అందుకున్నారు. వేణుమాధవ్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్‌ ఇకలేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణుమాధవం మంగళవారం ఉదయం వరంగల్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఎందరో ప్రముఖుల స్వరాలను అనుకరించి, ప్రశంసలందుకున్న... వేణుమాధవ్‌ స్వరం శాశ్వతంగా మూగపోయింది. నేరెళ్ల మృతితో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

నేరెళ్ల వేణమాధవ్‌ స్వస్థలం వరంగల్‌. 1932 డిసెంబర్‌ 28న వేణుమాధవ్‌ జన్మించారు. 1947లో తన 16వ ఏటనే మిమిక్రీ వృత్తిజీవితాన్ని ప్రారంభించిన ఆయన దేశవిదేశాల్లో తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ భాషల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు.సినిమాలంటే ఆసక్తి చూపే వేణుమాధవ్‌.. సి.నాగయ్య, గుమ్మడి వెంకటేశ్వర్రావు, అక్కినేని నాగేశ్వరరావు తదితర ప్రముఖులతో సన్నిహితంగా ఉండేవారు. ప్రముఖ నిర్మాత బీఎన్‌ రెడ్డి ప్రోత్సాహంతో కొన్ని సినిమాల్లో నటించారు. 12 సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు.

భారత మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, జైల్ సింగ్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వంటి ఎందరో ప్రముఖులు నేరెళ్ల వేణుమాధవ్‌ ప్రదర్శనలు వీక్షించారు. ప్రసిద్ధులైన వ్యక్తులను, నాయకులను అనుకరించడంలో వేణుమాధవ్‌ దిట్ట. 2001లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. 1978లో ఆంధ్రా యూనివర్సిటీ ఆయనకు కళాప్రపూర్ణ బిరుదు ఇచ్చింది. ఏయూ, కేయూ, ఇగ్నో నుంచి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. 1981లో రాజాలక్ష్మి ఫౌండేషన్‌ అవార్డు అందుకొన్నారు. ధ్వని అనుకరణ ప్రక్రియ... మిమిక్రీ కళ పుస్తకాన్ని రాసిన వేణుమాధవ్‌.. మిమిక్రీ కళలో ఎందరో శిష్యులను తయారు చేశారు.

మిమిక్రీ ప్రదర్శనల కోసమే వేణుమాధవ్‌ ఎన్నో దేశాలు తిరిగారు. ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శన ఇచ్చిన ఏకైక తెలుగు కళాకారుడాయన. వేణుమాధవ్‌ ప్రదర్శన ముగిసిన వెంటనే ఐక్యరాజ్యసమితిలో అప్పుడు ఆసీనులైన ప్రతి ఒక్కరూ లేచి కరతాళధ్వనులు చేశారంటే ఆయన ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ఓ సారి ప్రదర్శన ఇస్తున్నప్పుడు మిమిక్రీ ఎప్పుడు పుట్టిందని ఓ వ్యక్తి ప్రశ్నించగా.. మీ దేశం పుట్టకముందే పుట్టిందని సమాధానం ఇచ్చారు నేరెళ్ల. 10 కమాండ్‌మెంట్స్ ఇంగ్లీషు సినిమాలో ఓ ఎపిసోడ్‌ను ఆయన ప్రదర్శించిన తీరు నేరెళ్ల వేణుమాధవ్‌లోని అసమాన ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

నేరెళ్ల స్వరంలో వినిపించని గళం లేదంటే అతిశయోక్తి కాదు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌. కెనడీ దగ్గరి నుంచి భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వరకు హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ చిత్రాల్లోని నటీనటులు... ఇలా ఎందరో గొంతుకలను ఆయన తన స్వరంతో పలికించారు. వేల ప్రదర్శనలు ఇచ్చి అందరితోనూ శభాష్‌ అనిపించుకున్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, అమితాబ్‌ బచ్చన్‌, రేలంగి, రమణారెడ్డి, సుభాష్‌ చంద్రబోస్‌, ఎంఎస్‌ సుబ్బలక్ష్మి, గౌతు లచ్చన్న, ఎంజీఆర్‌, కరుణానిధి వంటి ప్రముఖుల స్వరాలను అనుకరించారు. ముఖ్యంగా ఆయన అనేక చోట్ల ప్రదర్శించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎప్‌..కెనడీ మన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మధ్య జరిగిన సంభాషణ చాలా ప్రాచుర్యం పొందింది.

తన అద్భుత ప్రతిభతో నేరెళ్ల వేణుమాధవ్‌ ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన ప్రతిభకు మెచ్చి కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ శివదర్పణం పుస్తక సంపుటిని అంకితం ఇచ్చారు. ఐవీ చలపతిరావు, పురాణం సుబ్రమణ్యశర్మ వేణుమాధవ్‌ ప్రస్థానంపై పుస్తకాలు రాశారు. నేరెళ్ల ప్రతిభను గుర్తించిన అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పీవీ నరసింహరావు ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయడం విశేషం. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ఆడిటోరియానికి నేరెళ్ల వేణుమాధవ్‌ కళా ప్రాంగణంగా ప్రభుత్వం పేరు పెట్టింది. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రీలో డిప్లొమా కోర్సును ప్రారంభించేందుకు కృషి చేసిన వేణుమాధవ్‌, ఆ శాఖలో అధ్యాపకుడిగా సేవలు అందించారు. వేణుమాధవ్‌ తన నలుగురి సంతానంలో కుమార్తె తులసిని మిమిక్రీ కళాకారిణిగా తీర్చిదిద్దారు.

వేణుమాధవ్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా పలువురు సంతాపం ప్రకటించారు. మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి నేరెళ్ల అని కొనియాడారు. మిమిక్రీని పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి.. ఆ కళకు పితామహుడిగా ఖ్యాతి గడించిన మాంత్రికుడు నేరెళ్ల వేణుమాధవ్‌ అని... ఆయన సేవలను ప్రశంసించారు. వరంగల్‌లోని నివాసంలో ఉంచిన వేణుమాధవ్‌ భౌతికకాయాన్ని పలువురు దర్శించి, నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

07:17 - June 20, 2018

విజయవాడ : కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఈనెల 29న కడప బంద్‌ పాటిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందన్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై మూడు నెలల పాటు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. 'కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదంతో ఆందోళనలు ఉధృతం చేసేందుకు నిర్ణయించినట్లు మధు తెలిపారు.

 

07:17 - June 20, 2018

విజయవాడ : కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. కడప జిల్లా పరిషత్‌ ఆవరణలో చేపట్టే దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రమేశ్‌ దీక్ష కోసం భారీ టెంట్లు వేశారు. పదివేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. కడప ఉక్కు కర్మాగారం సాధన కోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ బుధవారం నుంచి చేపట్టే దీక్షకు సర్వంసిద్ధమైంది. కడపలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో దీక్షకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోజుకో నియోజకవర్గం నుంచి టీడీపీ కార్యకర్తలను దీక్షా శిబిరానికి తరలించే విధంగా ప్రణాళికలు రూపొదించారు.

విభజన చట్టంలో ఇచ్చిన కడప స్టీల్‌ ప్లాంట్‌ హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. నాలుగేళ్లుగా దీనిపై రకరకాల ప్రకటనలు చేసిన కేంద్ర ప్రభుత్వం... ఓ కేసులో ఇటీవల సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కడప స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యంకాదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సీఎం రమేశ్‌ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. అదిగో, ఇదిగో అంటూ నాలుగేళ్లు నాన్చి ఇప్పుడు సాధ్యంకాదని చెప్పడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆర్థికంగా ఈ పరిశ్రమ సాధ్యంకాదన్న నెపంతో కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్ నిర్మాణ బాధ్యతల నుంచి వైదొలగాలని భావిస్తోందని తప్పుపట్టారు. ఉక్కు ధరలు రోజు రోజుకు పైపైకి ఎగబాకుతున్న తరుణంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యమేనన్నవాదాన్ని రమేశ్‌ వినిపిస్తున్నారు.

దీక్ష ప్రారంభ కార్యక్రమానికి వేలాది మంది వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్న టీడీపీ నాయకులు.. అందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కడప ఉక్కు కోసం చేపట్టే దీక్షలో విజయమో... వీరస్వర్గమో.. తేల్చుకుంటామని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. రమేశ్‌ దీక్షకు సంఘీభావంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా నిరాహార దీక్ష చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. 

06:43 - June 20, 2018

విజయవాడ : ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్‌ చేసిన రాజీనామాను ఆమోదించబోమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలను పరకాల పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. భార్యాభర్తలు వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నట్టే... రాజకీయాల్లో కూడా వేర్వేరు పార్టీల్లో ఉండటం తప్పులేదన్నారు. పరకాల ప్రభాకర్‌ ప్రభుత్వ సలహాదారే కానీ, టీడీపీ నాయకుడుకాదన్నారు సోమిరెడ్డి. 

06:42 - June 20, 2018

విజయవాడ : ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత జగన్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రజలు, మేధావులే జగన్‌కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పరకాల వంటి మేధావిని జగన్‌ అవమానించడం తగదన్నారు.

 

06:40 - June 20, 2018

విజయవాడ : ఏపీ కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతి సమీపంలోని వికృతమాల గ్రామంలో రెండో ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని తొండంగిలో వాణిజ్య ఓడరేపు నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని పది పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాల్లో ఎన్టీఆర్‌ గృహ పథకం యూనిట్‌ వ్యయాన్ని లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాలయకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాల్లో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం వ్యయాన్ని రెండు లక్షల రూపాలయకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కాకినాడ సమీపంలోని తొండంగిలో వాణిజ్య ఓడరేవు నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కాకినాడ సెజ్‌కు ఈ బాధ్యత అప్పగించారు. ఒంగోలు డెయిరీ పునరుద్ధరణకు 35 కోట్ల రూపాయలు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సమాచార మౌలిక సదుపాయాల విస్తరణకు జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ప్రైవేటు పాలిటెక్నికల్‌ కాలేజీల్లో పరిమితంగా ఫీజులు పెంచుకునేందుకు ఆయా విద్యాసంస్థ యాజమాన్యాలకు అనుమతి ఇచ్చింది. అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటువుతున్న ఎర్రమంచి వద్ద కొత్త పోలీసు స్టేషన్‌ను మంజూరు చేసింది. 

06:33 - June 20, 2018

ప్రకాశం : కర్నాటక ఎన్నికలు బీజేపీ ప్రభుత్వానికి ట్రైలర్‌ మాత్రమేనని ఏపీ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. బీజేపీకి అసలైన సినిమా 2019లో ఉంటుందన్నారు. తెలుగు జాతితో ఎవరు పెట్టుకున్నా.. మాడిమసై పోతారని... ప్రధాని మోదీకి కూడా అదే గతిపడుతుందని ఆయన హెచ్చరించారు. దేశంలో బీజేపీ భవిష్యత్‌ గల్లంతైందన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో పర్యటించిన లోకేష్‌.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ప్రకాశం జిల్లా చీరాలలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. చీరాలకు ఉదయమే చేరుకున్న లోకేష్‌.... మధ్యాహ్నం వరకు తన పర్యటనను కొనసాగించారు. తొలుత చీరాల ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం చేనేతపురి కాలనీలో చేనేత కార్మికుల గృహాలను పరిశీలించారు. చేనేత మగ్గం నేసిన లోకేష్‌... చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం రామాపురంలో మత్స్యకారులకు బోట్లు, వలలు పంపిణీ చేశారు. 50ఏళ్లు దాటిన మత్స్యకారులకు వెయ్యి రూపాయల చొప్పున పించను పంపిణీ చేశారు.

కొత్తపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన జంజనం శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారోత్సవ సభలో లోకేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ, వైసీపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్నాటక ఎన్నికలు బీజేపీకి ట్రైలర్‌లాంటివని... 2019లో అసలైన సినిమా ఉంటుందన్నారు. ఏపీ పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నిక చేసిన వారే దేశ ప్రధాని అవుతారని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని లోకేష్‌ అన్నారు. వైసీపీ బీజేపీతో చేతులు కలిపి ఆ అభివృద్ధిని అడ్డుకునేందుఉ ప్రయత్నిస్తోందని విమర్శించారు. 

తెగిన బీజేపీ - పీడీపీ బంధం...

ఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో.. బీజేపీ, పీడీపీ బంధం తెగిపోయింది. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి మద్దతును కమలనాథులు ఉపసంహరించుకున్నారు. ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో.. ముఫ్తీ.. తన పదవికి రాజీనామా సమర్పించారు. అటు అక్కడి ప్రధాన ప్రతిపక్షం నేత ఒమర్‌ అబ్దుల్లా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించే దిశగా అడుగులు పడుతున్నాయి. 

నేటి నుండి సీఎం రమేశ్ ఆమరణ నిరహార దీక్ష...

కడప : కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆమరణ నిరహార దీక్షకు సిద్ధమయ్యారు. కడప జిల్లా పరిషత్‌ ఆవరణలో బుధవారం నుంచి చేపట్టే దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రమేశ్‌ దీక్ష కోసం భారీ టెంట్లు వేశారు. పదివేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు.

29న కడప బంద్ - సీపీఎం...

విజయవాడ : కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఈనెల 29న కడప బంద్‌ పాటిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందన్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై మూడు నెలల పాటు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. 'కడప ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదంతో ఆందోళనలు ఉధృతం చేసేందుకు నిర్ణయించినట్లు మధు తెలిపారు. 

యాంకర్ ఆత్మహత్యకు భర్తే కారణం...

విజయవాడ : మాజీ యాంకర్‌ తేజస్విని ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. భర్త వేధింపులే తన ఆత్మహత్యకు కారణం అంటూ తేజస్విని రాసిన సూసైడ్‌ నోట్‌ దొరికింది. దీంతో సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు తేజస్విని భర్త పవన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలో పాఠశాలలకు సెలవులు...

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో మండుతున్న ఎండల కారణంగా పాఠశాలకు ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ప్రైవేటు పాఠశాలలు బేఖాతరు చేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలు తెలిస్తే గుర్తింపు రద్దు చేస్తామని మంత్రి గంటా ఆదేశాలు జారీ చేసినప్పటికీ పాఠశాల యాజమాన్యాలు పెడచెవిన పెట్టాయి.

కేజ్రీ దీక్ష విరమణ...

ఢిల్లీ : ఐఏఎస్‌ అధికారులు విధులకు హాజరుకావాలని కోరుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ 9 రోజుల పాటు చేసిన దీక్షను విరమించారు. ఐఏఎస్‌లు విధులకు హాజరుకావాలని ఎల్జీ సూచించడంతో కేజ్రీవాల్‌ దీక్షను విరమించారు. సచివాలయంలో అధికారులతో సమావేశం కావాలని ఎల్జీ కేజ్రీవాల్‌కు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు పరిపాలనను అందించాలన్నారు ఎల్జీ. 

ప్రపంచ కుబేరుడు...

ఢిల్లీ : ప్రపంచ కుబేరుడిగా మళ్లీ అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్‌ బెజోస్‌నే నిలిచారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచ బిలియనీర్స్‌ జాబితాలో 141.9 బిలియన్‌ డాలర్ల సంపదతో బెజోస్‌ అపర కుబేరుడిగా అగ్రస్థానంలో ఉన్నారు. గతేడాది కూడా ఈయనే బిలియనీర్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. తాజాగా విడుదల చేసిన జాబితాలోనూ జెఫ్‌ బెజోస్‌నే అపర కుబేరుడిగా నిలిచారు. 

Don't Miss