Activities calendar

21 June 2018

నర్సీపట్నంలో ఇద్దరు మందుబాబుల మధ్య గొడవ

విశాఖ : జిల్లా నర్సీపట్నంలో ఇద్దరు మందుబాబుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న వెంకటేశ్వర వైన్‌షాపు ముందు మందుబాబులు గొడవపడ్డారు. తాతారావు అనే వ్యక్తిపై బీరు సీసాతో దాడి చేశాడు మరో వ్యక్తి ..అతన్ని స్థానికులు చితక్కొట్టారు. తీవ్రగాయాలైన తాతారావును నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 

ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్

ఢిల్లీ : ఐదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదం పొందాయి. వారి రాజీనామాలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు.

 

మసాజ్ సెంటర్లపై పోలీసుల నిఘా..

హైదరాబాద్ : నగరంలోని మసాజ్ సెంటర్లపై నిఘా పెంచామని మాదాపూర్ డీసీపీ ఎ. వెంకటేశ్వరరావు తెలిపారు. లైసెన్స్ లేని మసాజ్ సెంటర్లపై దాడులు నిర్వహిస్తున్నామని, క్రాస్ మసాజ్ లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆన్ లైన్ ఫోరెక్స్ ట్రేడింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు. నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశామని, ఈ ముఠా దేశ వ్యాప్తంగా 120 మంది నుంచి రూ.5 కోట్లు వసూలు చేసిందని సైబరాబాద్ పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి రూ.13 లక్షల నగదు, 13 ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.

17:06 - June 21, 2018

తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవిని చిరంజీవి అనేవారు అరుదుగా వుంటారు. మోగాస్టార్ అని పిలుచుకోవటానికే అటు సినీ పరిశ్రమ..ఇటు అభిమానులు ఇష్టపడుతుంటారు. ఇప్పటికే ఈయన ఫ్యామిలోలో హీరోల సంఖ్య భారీగానే వుంది. చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్, కుమారుడు రామ్ చరణ్,తమ్ముడి కుమారుడు వరుణ్ తేజ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్, బావమరిది, ప్రొడ్యూసర్, నటుడు అల్లు అరవింద్ కుమారుడు బన్నీ, శిరీష్, ఇలా హీరోల లిస్ట్ పెద్దదే. ఈక్రమంలో మెగా స్టార్ చిన్న అల్లుడు 'కల్యాణ్ దేవ్' హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

వారాహి బ్యానర్ పై ఎంట్రీ ఇవ్వనున్న మెగాస్టార్ అల్లుడు..చికెన్ సాంగ్ రిలీజ్..
వారాహి చలన చిత్రం బ్యానర్ పై చిరూ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా 'విజేత' సినిమా రూపొందుతోంది. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా మాళవిక నాయర్ నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వదిలిన ఫస్టులుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు ఉదయం 8 గంటల 9 నిమిషాలకి ఈ సినిమా నుంచి కోడికి సంతాపాన్ని తెలియజేస్తూ హీరో పాడే 'కొక్కరోకో .. ' పాటను రిలీజ్ చేయనున్నారు.

మాస్ అడియన్స్ ను ఆకట్టుకునే పోస్టర్..
ఆ విషయాన్ని తేలియాజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ చాలా వెరైటీగా వుంది. చికెన్ షాప్ దగ్గర నుంచుని అలా మారిపోయిన కోడిని తలచుకుని ఏడుస్తూ ఈ పోస్టర్ లో కల్యాణ్ దేవ్ కనిపిస్తున్నాడు. చూస్తుంటే .. మాస్ ఆడియన్స్ ను అలరించడం కోసం 'కోడి' మీద మాంచి మసాలా సాంగ్ పెట్టినట్టుగానే కనిపిస్తోంది. ఈ నెల 24వ తేదీన ఆడియో వేడుకను ఘనంగా జరపనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

జూన్ 21 స్పెషల్ ఏమిటో తెలుసా?!..

హైదరాబాద్: నేడు జూన్ 21... ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈ రోజు ఈ సంవత్సరంలోనే అతిపెద్ద పగటి రోజు. దాదాపు 17 గంటలా 22 నిమిషాల పాటు పగటి సమయం ఉంటుంది. అంటే ఉదయం 4.27 నిమిషాల నుంచి రాత్రి 9.49 నిమిషాల వరకూ సూర్యకాంతి భూమిపై ఉంటుంది. ఉదయం 7 గంటలకే సూర్యకాంతి తీక్షణంగా తాకుతుంది. సాయంత్రం 6 గంటల సమయంలోనూ సూర్యుడు ఇబ్బంది పెడతాడు. ప్రతి సంవత్సరమూ జూన్ 21న లాంగెస్ట్ డే సంభవిస్తుంది. ఇక శీతాకాలంలో డిసెంబర్ 22వ తేదీన లాంగెస్ట్ నైట్ డే ఉంటుంది.

16:54 - June 21, 2018

వివాదాస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకుడే కాదు నిర్మాత కూడా. వర్మ ద్విభాషా చిత్రానికి నిర్మించాడు. తెలుగు కన్నడ భాషల్లో ఈ సినిమా రానుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమయ్యింది. తెలుగులో 'భైరవగీతం' .. కన్నడలో 'భైరవగీత' అనే టైటిల్స్ ను ఖరారు చేశాడు. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ వేడుకలో క్రిటిక్ కేటగిరి నుంచి ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్న 'ధనుంజయ' ను ఆయన కథానాయకుడిగా వర్మ సెలక్ట్ చేసుకున్నాడు. ఈ సినిమా నుంచి ఆయన మోషన్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇది లవ్ స్టోరీ అని ఈ మోషన్ టీజర్ ద్వారా వర్మ చెప్పినప్పటికీ .. అప్పటికే కొంతమందిని నరికేసిన గొడ్డలితో పగతో రగిలిపోతూ ఒక వ్యక్తి కనిపిస్తుండటం విశేషం. ఇక నేపథ్య సంగీతం కూడా భయపెట్టేదిగానే వుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ఒక యువకుడు ఎలా రెబల్ గా మారాడనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోందనీ, సిద్ధార్థ దర్శకుడిగా వ్యవహరిస్తాడని ఆయన చెప్పాడు.

ఏపీలో ఎండలని సెలవులిస్తే..ఉన్నట్లుండి వానలు!..

అమరావతి : ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పాఠశాలలకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఉన్నట్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెద్దకొండూరులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. మరోవైపు మంగళ గిరిలోనూ ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. విశాఖపట్నం జిల్లా పాడేరులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. కృష్ణా జిల్లా మైనవరంలో ఓ మోస్తరు వర్షం పడుతోంది.            

16:44 - June 21, 2018

అదితీ రావు నటన గురించి చెప్పాలంటే ఒక్క మాట చాలదు. కళ్లతో పలికించే హావభావాలు చాలు ఆమె నటన ఏమిటో చెప్పేందుకు. ముగ్ధమనోహరంగా కనిపించే అదితీ అందంలోనే కాదు అభినయంలో కూడా విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. మనిషికి కావాల్సింది అందం ప్రధానం కాదు మనస్సు కూడా అందంగా వుంటేనే మనిషికి పరిపూర్ణత అని చెప్పే అరుదైన, అందాల, ఆత్మవిశ్వాసం కలిగిన నటి అదితీరావు. మణిరత్నం సినిమా 'చెలియా'లో కార్తీ సరసన నటించి నటనాభిమానుల గుండెల్లో నిలిచిపోయింది. తెలుగు అదితీ మొదటి సినిమా 'సమ్మోహనం'లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని మరింతగా ఆశ్చర్యపరిచింది. ఆ అరుదైన అందాల నటి ఇప్పుడు ప్రిన్స్ మహేశ్ బాబు సినిమాలో కీలకపాత్రలో నటించనున్నట్లుగా సమాచారం.

మహేశ్ సినిమాలో అదితీరావు
వంశీ పైడిపల్లి .. మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'డెహ్రాడూన్'లో జరుగుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్ర కోసం అదితీ రావును తీసుకున్నారనేది తాజా సమాచారం.

'సమ్మోహనం'లో మార్కులు కొట్టేసిన అదితి
రీసెంట్ గా రిలీజైన 'సమ్మోహనం' సినిమాలో అదితీ రావు కథానాయికగా నటించింది. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. అదితీ రావు నటనను మహేశ్ బాబు అభినందించడం .. 'సమ్మోహనం' సక్సెస్ టాక్ తెచ్చుకోవడం ఆమెకి ఈ ఛాన్స్ వచ్చేలా చేశాయనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. అదితీ రావు మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నవారి సంఖ్య ఎక్కువగానే వుంది.

16:42 - June 21, 2018

సినీ పరిశ్రమ ఏదైనా వారసుల హవా మాత్రం కొనసాగుతోంది. తెలుగు, తమిళ,మలయాళం భాష ఏదైనా ఆయా సినీ పరిశ్రమలో వారసుల హవా కొనసాగుతోంది. తెలుగు పరిశ్రమలో సీనియర్ హీరోలు తమ కుమారులను హీరోలుగా రంగంలోకి దింపడమనేది చాలాకాలం నుంచి జరుగుతున్నదే. తెలుగులో చిరూ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ .. కృష్ణ వారసుడిగా అడుగుపెట్టిన మహేశ్ బాబు స్టార్ హీరోలుగా వెలుగుతున్నారు. ఇక మలయాళంలో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు. తమిళంలో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. విక్రమ్ తనయుడు 'ధృవ్' కూడా తండ్రిబాటలో నడవడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ హీరో విజయ్ తనయుడు సంజయ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఇటీవలే ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన ఈ కుర్రాడు, కొంతకాలం పాటు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పై దృష్టి పెడతాడట. అందుకోసం త్వరలో కెనడా వెళుతున్నాడు. ఆ తరువాత నటన .. డాన్స్ .. ఫైట్స్ లో శిక్షణ పొంది ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. ఇది విజయ్ అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే.

సోనియా గాంధీతో కమల్ భేటీ..

ఢిల్లీ : కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలు సోనియాగాంధీతో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ భేటీ అయ్యారు. తన రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఢిల్లీలో ఉన్న కమల్... నిన్న రాహుల్ గాంధీతో కూడా భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే సోనియాను కలిశానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా... తమ మధ్య పొత్తుకు సంబంధించిన చర్చ రాలేదని స్పష్టం చేశారు. దీని గురించి ఇప్పుడు మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని చెప్పారు. తమిళనాడు రాజకీయాల గురించే మాట్లాడామని తెలిపారు.

వైఎస్సార్ కాలనీలో వ్యభిచార దందా..

పశ్చిమగోదావరి : జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో వ్యభిచార దందా వెలుగులోకి వచ్చింది. కూలిపని ఇప్పిస్తానని చెప్పి ఓ యువతిని నమ్మించిన ఆటోడ్రైవర్ వ్యభిచార నిర్వాహకురాలికి రూ.20వేలకు అమ్మివేశాడు. ఏడాది నుండి వ్యభిచార గృహంలో యువతి నరక యాతన అనుభిస్తోంది. ఓ సమయంలో ఆ యువతిని స్థానిక మహిళలకు వ్యభిచారం కూపం నుండి కాపాడారు. యువతి రక్షింపబడటంతో సదరు వ్యభిచార దందా వెలుగులోకి వచ్చింది. దీంతో సదరు యువతి ఫిర్యాదుతో పోలీసులు వ్యభిచారం గృహంపై రైడ్ చేశారు. నిర్వాహకురాలు శోభారాణి పరాయ్యింది. దీంతో పోలీసులు శోభారాణి కోసం గాలిస్తున్నారు. 

హెల్త్ ఫెస్టివల్ ను ప్రారంభించిన చంద్రబాబు..

విశాఖపట్నం : సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తున్నారు. మధురవాడలో అమృతవ్యాలిని చంద్రబాబు ప్రారంభించారు . అనంతరం ఏపీ హెల్త్ ఫెస్టివల్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 

12మంది మృతికి కారణమైన ట్రాక్టర్..

మధ్యప్రదేశ్ : కుటుంబ వేడుక కోసం జీపులో వెళుతున్న వారిని మృత్యువు కబళించింది. అదుపు తప్పిన ఓ ట్రాక్టర్ జీపుపైకి దూసుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మొరెనాకు 4 కిలోమీటర్ల దూరంలో గంజ్రాంపూర్ వద్ద ఈ ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన ఆరుగురిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని కారణాలపై దర్యాప్తు మొదలు పెట్టారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ఈ ప్రమాాదానికి కారణమని స్థానికుల కథనంగా ఉంది.

నాయా బ్రాహ్మలపై చంద్రబాబు వైఖరిపై జనసేనాని స్పందన..

అమరావతి : నాయీ బ్రహ్మణులపై సీఎం చంద్రబాబు ఆగ్రహించటం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వారి డిమాండ్లు సరైనవేనని... వారికి జనసేన అండగా ఉంటుందని తెలిపారు. భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే... భూకబ్జాలకు అండగా ఉంటోందని ఆరోపించారు. రాజధాని కోసం ఇప్పటికే సరిపడా భూములను సేకరించారని... మరోసారి భూసేకరణకు దిగితే, భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే తాము పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. అమరావతి ప్రాంత రైతులతో తాను సమావేశం కానున్నానని చెప్పారు. ఈ నెల 23న పవన్ విజయవాడకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

హడలెత్తించిన ఇండిగో..

హైదరాబాద్ : శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతి వెళ్లేందుకు బయలుదేరిన ఇండిగో విమానం కాసేపు ప్రయాణికులకు చుక్కలు చూపింది. విమానం లేకాఫ్ తీసుకున్న కేవలం 15 నిమిషాలకేపైలట్ టెక్నికల్ ఫాల్ట్ ను గుర్తించారు. దీంతో విమానానాన్ని అత్యంసరంగా ల్యాండ్ చేయాల్సివచ్చింది. విమానం ఎందుకు వెనక్కు వస్తోందో తెలియని 65 మంది ప్రయాణికులు ఆ పావుగంట పాటు భయంతో ఆందోళనకు గురయ్యారు. అనంతరం మరో ప్రత్యామ్నాయం చూపాలని ఇండిగో సిబ్బందిని ప్రయాణీకులు అడిగినా వారు ఏ మాత్రమూ స్పందించలేదని ప్రయాణికులు వాపోతున్నారు. 

చిన్నారులను గొంతునులిమి చంపేసిన తల్లిదండ్రులు..

సిద్ధిపేట : ఇద్దరు చిన్నారులను తలిదండ్రులు గొంతు నులిమి నిర్ధాక్షిణ్యంగా చంపేసారు. అనంతరం వారిద్దరు కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.రిపోర్టర్ గా పనిచేసిన హన్మంతరావు మృతి చెందగా భార్య మీనా పరిస్థితి విషమంగా వుంది. ఆర్థిక సమస్యలతోనే హన్మంతరావు కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడినట్లుగా సమాచారం. రాత్రి వరకూ అందరితోను కలివిడిగా మసలిని హన్మంతరావు తెల్లారేసరికల్లా ఆత్మహత్య చేసుకోవటంతో స్థానికంగా విషాదం నిండింది. 

ఫింగర్ ప్రింట్స్ టెక్నాలజీలో ముందున్నాం : డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్ : 19వ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో జాతీయ సదస్సు నగరంలో జరుగుతోంది. ఈ సదస్సులో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతు.. ఫింగర్ ప్రింట్స్ టెక్నాలజీని ఉపయోగించటంలో ముందున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఫింగర్ ప్రింట్స్ సదస్సు జరగటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఫింగర్ ప్రింట్స్ తో 858 కేసులను ఛేదించామన్నారు. 480 పాత కేసులు, 42 గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించామని మహేదర్ రెడ్డి తెలిపారు. పాపిలాన్ టెక్నాలజీ ద్వారా 7వేల మవంది పాతనేరస్తులను గుర్తించామన్నారు.

రైతుబంధు చెక్కుల స్వాహా..

భద్రాద్ది కొత్తగూడెం : రైతు బంధు పథకం చెక్కుల విషయంలో గోల్ మాల్ జరిగింది. జిల్లాలోని ఇల్లందు మండలం నెహ్రూ నగర్ లో రైతు బందు చెక్కులను అధికారులు స్వాహా చేశారు. దళారులతో వీఆర్వో మిలాఖత్ అయి రైతుబంధు చెక్కుల గోల్ మాల్ కు పాల్పడ్డారు. దీంతో బాధిత కుటుంబాల రైతులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయమని..వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

యువకుడు వేధింపులు..యువతి ఆత్మహత్య..

కడప : పెండ్లిమర్రి మండలం మొయిళ్లలో వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆదే గ్రామానికి చెందిన సమరసింహారెడ్డి అనే యువకుడు ప్రేమ పేరుతో యువతిని కొద్దిరోజులుగా వేధింపులకు పాల్పడటంతో వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

రవీంద్ర భారతిలో షీ టీమ్స్ అవగాహన సదస్సు..

హైదరాబాద్ : రవీంద్ర భారతిలో షీ టీమ్స్ అవగాహన సదస్సు నిర్వహించబడుతోంది. మహిళలు, అమ్మాయిల పట్ల అవగాహన సదస్సులో అవగాహన కల్పిస్తున్నారు. పోకిరీలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాటికల రూపంలో ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు సీపీ అంజనీ కుమార్, మెడ్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి,రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ వర్మ, ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పాల్గొన్నారు.  

5 వేల ప్రాంతాల్లో 'శాంతి కోసం యోగా'..

ఢిల్లీ : ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 5 వేల ప్రాంతాల్లో 'శాంతి కోసం యోగా' పేరిట ఈ ఉత్సవాలు సాగుతున్నాయి. ఢిల్లీలో ఎనిమిది చోట్ల యోగా డే జరుగుతుండగా, రెడ్ ఫోర్ట్ వద్ద బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరుగుతోంది. ఇక, అమరావతిలోని ప్రజా దర్బార్ హాల్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పలువురు మంత్రులు, అధికారులతో కలసి ఆయన యోగాసనాలు వేశారు.

బాబు నుండి మోదీ వరకూ యోగా..

ఉత్తరాఖండ్ : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో 55 వేల మంది ఔత్సాహికులతో కలసి ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. ఓ భారీ మైదానంలో వయోభేదం లేకుండా బారులు తీరిన ప్రజలు పలు రకాల ఆసనాలు వేసి, తమ ఫిట్ నెస్ ను చూపారు. ఇక వివిధ రాష్ట్రాల్లో జరిగిన యోగా డే వేడుకల్లో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 

ఉక్కు కర్మాగాయం ఎజెండాతో అఖిలపక్షం రౌండ్ లేబుల్..

విజయవాడ : నేడు రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరగనుండగా, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు హాజరు కానున్నారు. కడపలో ఉక్కు కర్మాగారం, రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అన్ని పార్టీల నేతలూ చర్చించనున్నారు. కడప సహా తెలంగాణలోని బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ల ఏర్పాటు సాధ్యం కాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

కోర్టులోనే భార్యపై పోసిన భర్త..

మహారాష్ట్ర : ట్రిపుల్ తలాక్ కేసులో తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిన భార్యను కోర్టు ఆవరణలోనే హత్య చేసేందుకు ప్రయత్నించాడో భర్త. ఆమెపై పెట్రోలు గుమ్మరించి అంటించబోయాడు. పూణేలోని శివాజీనగర్ కుటుంబ న్యాయస్థానంలో జరిగిందీ ఘటన. పారిపోయేందుకు ప్రయత్నించిన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గంటా అలక..సీఎం,హోం బుజ్జగింపు..

విజయనగరం : విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అలకబూనారు. హోంమంత్రి నిమ్మకాలయ చినరాజప్ప గంటాను బుజ్జగిస్తున్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు ఫోన్ చేసిన నచ్చ చెప్పారు. మనసులో ఏమీ పెట్టుకోవద్దని చంద్రబాబు గంటాను నచ్చచెప్పారు. కాగా పత్రికల్లో సర్వేల గురించి వేస్తునే వుంటారు కానీ మన పని మనం చేసుకుంటు పోవాలని చంద్రబాబు గంటా శ్రీనివాస్ కు నచ్చచెప్పారు. దీంతో గంటా అలక వీడినట్లుగా తెలుస్తోంది. కాగా సర్వేల పేరుతో తనను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం జరుగుతోందంటూ అలకబూనారు. తన నియోజకవర్గమైన భీమిలిలో గంటా పనితీరుపై అసంతృప్తి ఉందంటూ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది.

ఒంగోలులో యోగా దినోతవ్సం..

ప్రకాశం : ఒంగోలు పోలీసులు పరేడ్ గ్రౌండ్ లో యోగా దినోతవ్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ పాల్గొన్నారు.

చెట్టును ఢీకొన్న బైక్, ఇద్దరు మృతి..

రంగారెడ్డి : కొత్తూరు మండలం తిమ్మాపూర్ సమీపంలో ఓ బైక్ చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 

లారీ, బైక్ ఢీ..కానిస్టేబుల్ మృతి..

సంగారెడ్డి : పటాన్ చెరు మండలం ఇంద్రేశంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఓ లారీ బైక్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. కానిస్టేబుల్ పేరు మోహన్ రెడ్డిగా గుర్తించారు.

విద్యుత్ శాఖ ఏఈ సూర్యలక్ష్మీరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు..

నెల్లూరు : కావలి రూరల్ పరిధిలోని విద్యుత్ శాఖ ఏఈ సూర్యలక్ష్మీరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు వున్నాయనే ఆరోపణలతో జలదంకిలో వున్న సూర్యలక్ష్మీరెడ్డి తల్లి ఇంట్లోను, కావలిలోని రెండు ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా గతంలో కూడా సూర్యలక్ష్మీరెడ్డి లోకాయుక్తలో కొందరు ఫిర్యాదు చేసారు. ఒక యూనియన్ లో పనిచేస్తున్న ఏఈ సూర్యలక్ష్మీరెడ్డికు యూనియన్ అండగా పెద్దగా వుంది.

Don't Miss