Activities calendar

22 June 2018

హైదరాబాద్ లో వర్షం

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్ బీ స్టేడియం, పాతబస్తీ, కోఠి, గోషామహల్, రామ్ నగర్, విద్యానగర్, అంబర్ పేట్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, నల్లకుంట, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.

 

ఏఐసీసీలో కొనసాగుతున్న కీలక మార్పులు

ఢిల్లీ : ఏఐసీసీలో కీలక మార్పులు కొనసాగుతున్నాయి. సంస్థాగత మార్పులు చేస్తూ అశోక్ గెహ్లట్ ప్రకటనలు విడుదల చేశారు. తెలంగాణకు చెందిన సంపత్ కుమార్ ను ఏఐసీసీ కార్యదర్శిగా, మహారాష్ట్ర బాధ్యుడిగా నియమించారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం ఏఐసీసీ కార్యదర్శిగా నియామకం అయ్యారు. ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లట్ ను నియమించారు. 

కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ గుడ్ బై

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు.

12:19 - June 22, 2018
12:18 - June 22, 2018

నెల్లూరు : తాము రాజీనామాలు చేసిన స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని వైసీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన కోరుతూ వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. చాలా రోజుల పాటు పెండింగ్ లో ఉంచి గురువారం లోక్ సభ కార్యాలయంలో ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా మేకపాటితో టెన్ టివి ముచ్చటించింది. ప్రత్యేక హోదా కోసం వైసీపీ చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా సీఎం చంద్రబాబు నాయుడు తమపై అభ్యర్థులను నిలబెట్టలేరని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

టి.పిసిసిలో మార్పులు...

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీలో మార్పులపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టి సారించారు. ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ లను నియమిస్తారని తెలుస్తోంది. ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్ కు 40 అసెంబ్లీ స్థానాల బాధ్యతలు అప్పచెప్పనున్నారని సమాచారం. సీఎల్పీ నేతగా మల్లుభట్టి విక్రమార్కను నియమించడం..ఇతర రాష్ట్ర మాజీ సీఎంకు పార్టీ ఇన్ ఛార్జీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వీహెచ్ కు ప్రచార కమిటీ బాధ్యతలు ఇవ్వాలని ఉత్తమ్ ఒత్తిడి చేస్తున్నట్లు వినికిడి. రేవంత్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. 

ప్రగతి భవన్ ముట్టడికి...

హైదరాబాద్ : ప్రగతి భవన్ ముట్టడికి గిరిజన ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు టీచర్లు యత్నించారు. కాంట్రాక్ట్ టీచర్లను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. 

సీబీఐ కోర్టుకు జగన్...సబిత...

హైదరాబాద్ : ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు వైసీపీ అధ్యక్షుడు జగన్, టి.కాంగ్రెస్ నేత సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మీలు హాజరయ్యారు. 

11:31 - June 22, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా పవన్ పోరు యాత్ర జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో చంద్రబాబు, ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం అమరావతిలో వెంకటేశ్వర దశావతార విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాబు..పవన్ లు పాల్గొన్నారు. గణపతి సచ్చిదానంద చేతుల మీదుగా కుంభాభిషేకం జరిగింది. బాబు, పవన్ లు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ స్కీర్ నాదెండ్ల మనోహర్, ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు. లింగమనేని వంశీయులు ఆలయ ఏర్పాటుకు సహకరించారు. 

అమరావతిలో దశావతారా విగ్రహానికి బాబు పట్టువస్త్రాలు...

విజయవాడ : దశావతార వెంకటేశ్వర సన్నిధానానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. కాసేపటి క్రితం వెంకటేశ్వర స్వామి దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. లింగమనేని వంశీయులు సీఎం చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికారు. 

ఉగ్రవాదులకు..భారత బలగాల మధ్య కాల్పులు...

జమ్మూ కాశ్మీర్ : అనంతనాగ్ లో ఎన్ కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. భద్రతా బలగాలు..ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు..పౌరుడు చనిపోయారు. 

ఎన్నార్టీ ఐకానిక్ టవర్ కు భూమి పూజ చేసిన బాబు...

విజయవాడ : అన్ని దేశాల్లో ఆంధ్రప్రదేశ్ జెండా ఎగురాలని, ఇందుకు అందరూ ముందుండాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతి పరిధిలో ఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. 

10:30 - June 22, 2018

విజయవాడ : అన్ని దేశాల్లో ఆంధ్రప్రదేశ్ జెండా ఎగురాలని, ఇందుకు అందరూ ముందుండాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతి పరిధిలో ఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..ఐటీకి విత్తనం వేయడం జరిగిందని, నిరంతరం ఆలోచన విధానాన్ని పెంచుకుంటూ పోవాలని, రాష్ట్ర విభజన అనంతరం దిక్కుతోచని పరిస్థితి నెలకొందన్నారు. రాజధాని..పరిశ్రమలు..సర్వీస్ సెక్టార్ ..ఇలాంటివి ఎన్నో లేకపోయినా తాను అధైర్యపడలేదన్నారు. రాజధాని అమరావతికి మాస్టర్ ప్లాన్ వేసి ఇవ్వాలని కోరగా కేవలం ఆరు నెలల్లోనే ప్లాన్ ఇచ్చారన్నారు. రాజధానికి సహకరించాలని కోరగా 33వేల ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులు ఇచ్చారన్నారు. టాప్ 5లో ఒకటిగా ఏపీని ఉంచాలన్నదే తన లక్ష్యమని, అదేం పెద్ద సమస్య కాదన్నారు. ఎన్నారైలకు కష్టం వస్తే దేశం..ఒక రాష్ట్రం అండగా ఉండాల్సినవసరం ఉందన్నారు. 

10:18 - June 22, 2018

హైదరాబాద్ : వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణీకుల నుండి విలువైన నగలు..నగదును అపహరించారు. గురువారం రాత్రి కాచిగూడ నుండి చిత్తూరుకు వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. అర్ధరాత్రి అనంతరం ట్రైన్ లోకి ప్రవేశించిన దొంగలు ప్రయాణీకులను భయపెట్టారు. కత్తులు, రాడ్లు పట్టుకుని స్వైర విహారం చేశారు. మొత్తం 9 బోగీల్లో దోపిడీ జరిగిందని తెలుస్తోంది. రైలు ఆగిన నిమిషాల్లోనే చీకట్లో పారిపోయారని ప్రయాణికులు వాపోయారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు గుత్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. 

10:11 - June 22, 2018

సంగారెడ్డి : సదాశివపేటలో పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ బంక్ లోకి కావేరీ ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో క్లీనర్ ఆనంద్ మృతి చెందాడు. ముగ్గురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి పూణెకు బస్సు వెళుతోంది. గురువారం అర్ధరాత్రి అతివేగంతో వెళుతుండడంతో సదాశివపేట వద్ద అదుపు తప్పింది. నేరుగా పెట్రోల్ బంక్ లోకి దూసుకెళ్లింది. బంక్ లో ఉన్న షెడ్డుకు ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో క్లీనర్ ఆనంద్ మృతి చెందగా ముగ్గురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. పెట్రోల్ బంక్ కు ఢీకొంటే మాత్రం పెద్ద ప్రమాదం సంభవించేది. ప్రమాదం జరిగిన అనంతరం కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం స్పందించలేదని ప్రయాణీకులు పేర్కొంటున్నారు. ఘటనపై కావేరీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొంటున్నారు. 

ఎన్నార్టీ ఐకానిక్ టవర్...

విజయవాడ : అమరావతి పరిధిలో ఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. 

సదాశివపేటలో ప్రమాదం...

సంగారెడ్డి : సదాశివపేటలో పెద్ద ప్రమాదం తప్పింది. పెట్రోల్ బంక్ లోకి కావేరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో క్లీనర్ ఆనంద్ మృతి చెందాడు. ముగ్గురికి గాయాలయ్యాయి. ముంబై నుండి పూణేకు బస్సు వెళుతోంది. మరో బస్సును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సదాశివపేటలో ప్రమాదం...

సంగారెడ్డి : సదాశివపేటలో పెద్ద ప్రమాదం తప్పింది. పెట్రోల్ బంక్ లోకి కావేరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో క్లీనర్ ఆనంద్ మృతి చెందాడు. ముగ్గురికి గాయాలయ్యాయి. ముంబై నుండి పూణేకు బస్సు వెళుతోంది. మరో బస్సును ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

గృహ ప్రవేశం చేసిన పవన్...

విజయవాడ : పటమట ప్రాంతంలో అద్దె ఇంటిని తీసుకున్న పవన్ కల్యాణ్ శుక్రవారం, ఉదయం గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. 

09:41 - June 22, 2018
09:40 - June 22, 2018
09:38 - June 22, 2018
09:36 - June 22, 2018

కరీంనగర్ : పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మంథనికి చెందిన అరుణ్, సౌమ్య దంపతులు కారులో వెళుతున్నారు. వీరితో పాటు వారి సంతానం అఖిలేష్ శాన్వి (8) కూడా ప్రయాణిస్తున్నారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొంది. దీనితో అక్కడికక్కడనే నలుగురూ మృతి చెందారు. అరుణ్ మంథని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్స్ పాల్ గా పనిచేస్తున్నారు. వీరు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న కుటుంబీకులు విషాదంలో మునిగిపోయారు.

 

09:34 - June 22, 2018

తెలంగాణలో రేషన్ డీలర్లు ఆందోళన బాట పట్టారు. గౌరవ వేతనం ఇవ్వాలని.. తమను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని.. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ.. వారు ఆందోళన బాట పట్టారు. అవసరమైతే తమ సమస్యల పరిష్కారం కోసం జూలై 1 నుంచి సమ్మె చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సమ్మెకు గల కారణాలు.. వారి డిమాండ్లపై టెన్ టివి జనపథంలో వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్‌ రాములు విశ్లేషించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:30 - June 22, 2018

ఢిల్లీ : మలేషియాలో స్మార్ట్‌ ఫోన్‌ పేలి సిఈఓ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. క్రాడిల్ ఫండ్‌ కంపెనీ సిఈఓ 45 ఏళ్ల నజ్రీన్‌ హసన్‌ తన ఇంటిలోని పడక గదిలో బ్లాక్‌బెరీ, హువాయ్‌ స్మార్ట్‌ ఫోన్లను చార్జింగ్‌ పెట్టి పడుకున్నారు. అందులో ఒకఫోను అకస్మాత్తుగా పేలడంతో అందులోని పరికరాలు మెడ వెనుక భాగం, తలలోనూ గట్టిగా గుచ్చుకోవడంతో తీవ్ర రక్త స్రావమై సిఈఓ మృతి చెందారు. సెల్‌ఫోన్‌ పేలి బెడ్‌కు మంటలు అంటుకోవడంతోనే అగ్ని ప్రమాదం వల్ల మరణించారని అందరూ భావించారు. అగ్ని ప్రమాదం వల్ల మరణించలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక నజ్రీన్‌ హసన్ చనిపోయారని పోలీసులు చెప్పారు. సిఈవో మృతిని నజ్రీన్‌ బంధువు ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

07:33 - June 22, 2018

విశాఖపట్టణం : ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో హైడ్రామా చోటుచేసుకుంది. గత మూడు రోజులుగా అలకపాన్పు ఎక్కిన మంత్రి గంటా శ్రీనివాసరావును టీడీపీ నేతలు బుజ్జగించారు. డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప ఇతర ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్‌ రావు నివాసానికి చేరుకొని గంటాతో మంతనాలు జరిపారు. దీంతో శాంతించిన గంటా తన నియోజక వర్గంలో సీఎం చేపట్టిన పర్యటనలో పాల్గొన్నారు.

రోజూ మీడియాలో హల్‌చల్‌ చేసే మంత్రి గంటా శ్రీనివాసరావు మూడు రోజులుగా అలకపాన్పు ఎక్కారు. తన నియోజక వర్గంలో తాను ఓడిపోతానని వస్తున్న వార్తలు తీవ్రంగా బాధించాయని ఆయన తన అనుచరులతో చెప్పుకున్నారు. తనను పోమ్మనకుండా పొగబెడుతున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పార్టీలో ఎవరితో టచ్‌లో లేకుండా పోయారు.

మరోవైపు పార్టీలో అసంతృప్తిగా ఉన్న టీడీపీ నేతలతో ఫోన్‌లో గంటా శ్రీనివాస్ మాట్లాడుతున్నట్లు అధిష్టానాకి సమాచారం అందింది. దీంతో టీడీపీ ఆధిష్టానం గంటాను బుజ్జగించే పనిలో పడింది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం చినరాజప్పను రంగంలోకి దింపింది. డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌ బాబు, పల్లా శ్రీనివాస్‌, వాసుపల్లి గణేశ్‌ కుమార్‌లు గంటా శ్రీనివాసరావుతో దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. పార్టీలో తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో తాను ఓడిపోతాననే వార్తలు ఎలా వస్తున్నాయని గంటా వారిని ప్రశ్నించినట్లు సమాచారం. తన నియోజకవర్గం నుంచి వేరే వారు పోటీ చేయిస్తున్నట్లు వస్తున్న ప్రచారాలపై ప్రశ్నించారు. దీంతో డిప్యూటీ సీఎం స్వయంగా సీఎంతోనే మాట్లాడించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు రానున్న ఎన్నికలలో బీమిలి నుంచి పోటీ చేస్తున్నారని డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప వెల్లడించారు.

ఇదిలా ఉంటే ..ఇంత జరిగినా ఈ విషయాలపై మాట్లాడానికి మంత్రి గంటా శ్రీనివాసరావు నిరాకరించారు. సమయం వచ్చినప్పుడు పూర్తి సమాచారం తెలియచేస్తానన్నారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న మూడు కార్యక్రమాల్లో పాల్గొంటానికి చిన్నరాజప్పతో కలిసి ఎయిర్‌ పోర్ట్‌కు వెళ్లారు. మరోవైపు నిజంగా గంటా శ్రీనివాసరావు శాంతించారా అని పార్టీ శ్రేణుల్లో అనుమానం వెల్లువెత్తుతోంది. రానున్న రోజుల్లో గంటా శ్రీనివాసరావు దారి ఎటు పోతుందోనని ఉత్కంఠ టీడీపీలోనూ... గంటా అనుచరులోనూ నెలకొంది.

07:31 - June 22, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అమానుషంగా ఉందని.. వామపక్షాల ఐక్య పోరాట సమితి అభిప్రాయపడింది. బీజేపీ నేతలు.. అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. ప్రజలను వంచిస్తున్నారని సమితి నాయకులు మండిపడ్డారు. వారు చెప్పేవన్నీ అబద్ధాలేనని నిరూపిస్తామని.. బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన దిశగా.. విజయవాడలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ అధ్యక్షతన సాగిన ఈ సమావేశానికి, సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌ నాయకులతో పాటు.. వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఏపీ ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని రౌండ్‌ టేబుల్‌ సమావేశం తప్పుబట్టింది. బీజేపీ నాయకులందరూ.. విభజన హామీల గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని సమావేశంలో పాల్గొన్న నేతలు మండిపడ్డారు. దీనిపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ నాయకులకు సవాల్‌ విసిరారు.

ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం.. ఈనెల 29న కడప జిల్లా బంద్‌కు సంపూర్ణ మద్దతునివ్వాలని వామపక్షాల ఐక్యపోరాట సమితి నిర్ణయించింది. దీంతోపాటే.. అన్ని జిల్లాల్లోనూ నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం సాగిన తరహాలోనే ఉద్యమాలు నిర్మించి.. ప్రభుత్వాల మెడలు వంచాలని సమితి తీర్మానించింది. రాజకీయ వైరుధ్యాలను ప్రజలపై రుద్దొద్దని సమావేశంలో వక్తలు కేంద్రానికి హితవు పలికారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ అంశంపై.. టీడీపీ నాయకులు రాజకీయంగా అనుకూలంగా మలచుకునేందుకే ఇప్పుడు హడావుడి చేస్తున్నారని, సమావేశానికి హాజరైన నేతలు విమర్శించారు. ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు విపక్ష పార్టీలన్నీ ఒకే తాటిపైకి రావాలని అభిప్రాయపడ్డారు.

07:28 - June 22, 2018

నిజామాబాద్ : నిజమైన ప్రేమకు ఎప్పుడూ చావుండదు. అది ఎప్పుడూ విజయమే సాధిస్తుంది అంటారు. ఇదే అంశాన్ని నిజామాబాద్‌కు చెందిన ప్రాణదీప్‌- సౌజన్య మరోసారి నిరూపించారు. అయినవారు వారిద్దరినీ విడదీయాలని చూసినా.... పోలీసుల సాయంతో ఒక్కటయ్యారు. దీంతో వారి ప్రేమకథ సుఖాంతమైంది. చివరకు ప్రేమే గెలిచింది. వీరిద్దరూ గుర్తున్నారా. అదేనండి మంగళవారం వీరిని అమ్మాయి తరపువాళ్లు విడదీసేందుకు ప్రయత్నించారు. అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఆ ఘటన గుర్తుకొచ్చిందా...

నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం వీరన్నగుట్టకు చెందిన ప్రాణదీప్‌... మక్లూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్య మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది. అయితే సౌజన్య తల్లిదండ్రులు వీరి పెళ్లికి నిరాకరించారు. దీంతో ఈ ప్రేమజంట పెళ్లికి సిద్ధపడింది. ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. మరికొద్దిసేపట్లో పెళ్లి జరుగుతుందనగా.... సౌజన్య కుటుంబం ఈ సమాచారం తెలుసుకుని ఆర్యసమాజ్‌ దగ్గరికి వచ్చింది. ఆర్యసమాజ్‌లో చొరబడి ప్రేమజంటపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.. సౌజన్యను బలవంతంగా లాక్కెళ్లారు.

ఊహించని ఘటనతో ప్రేమికుడు ప్రాణదీప్‌ అయోమయానికి గురయ్యాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రియురాలిని బలవంతంగా లాక్కెళ్లాలరని కేసు పెట్టాడు. దీంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. అమ్మాయిని... ఆమె తల్లిదండ్రులను విచారించారు. ప్రాణదీప్‌తోనే తాను ఉంటానని.. తన తల్లిదండ్రులు ఇద్దరినీ విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని సౌజన్య పోలీసులకు స్పష్టం చేసింది. దీంతో పోలీసులు సౌజన్యను ప్రాణదీప్‌ చెంతకు చేర్చారు. సౌజన్యను బలవంతంగా లాక్కెళ్లిన ఆమె తల్లిదండ్రులపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. తాము మళ్లీ కలుస్తామని అనుకోలేదని ప్రేమికులిద్దరూ చెప్తున్నారు. తాము కలవడానికి మీడియానే కారణమని కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి సౌజన్య , ప్రాణదీప్‌ ప్రేమ కథ సుఖాంతం అయ్యింది. ప్రేమికులిద్దరినీ పెద్దలు విడదీయాలని ప్రయత్నించినా... చివరకు ప్రేమదే విజయమని చాటారు.

07:26 - June 22, 2018

హైదరాబాద్ : నీట్‌, జేఈఈ పరీక్షల్లో.. అధిక సీట్లు సాధించేలా గురుకుల విద్యార్థులకు కోచింగ్‌ ఇవ్వాలని ఆదేశించారు ఉపముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి. అందుకోసం గురుకుల, మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ విద్యార్థులకు ఇంటర్‌ నుంచే కోచింగ్‌ ఇవ్వాలని ఆయా కార్యదర్శులను ఆదేశించారు. విద్యాశాఖతోపాటు ఇతర గురుకులాలపై సమీక్షించిన మంత్రి కడియం శ్రీహరి.. గురుకులాల విద్యార్థులే ఈ సారి మంచి ఫలితాలు సాధించారని అన్నారు. గురుకుల విద్యాలయాల్లో ఆడపిల్ల ఆరోగ్యం, విద్య పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

06:54 - June 22, 2018

శ్రీకాకుళం : చంద్రబాబు చెప్పేవన్నీ అవాస్తవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బాబుకు చిత్తశుద్ది ఉంటే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. టీడీపీ పాలనలో అవినీతి ఎక్కువగా జరుగుతుందని మండిపడ్డారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ప్రాణత్యాగం అవసరం లేదని కేంద్రం ఇచ్చిన హామీలపై చిత్తశుద్ది ఉందని కన్నా తెలిపారు.--

06:53 - June 22, 2018

విజయవాడ : ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్‌ వేదికగా ఫైర్‌ అయ్యారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం భూకబ్జాదారులకు అండగా నిలుస్తోందని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. భూముల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే ఆక్రమణదారులకు వత్తాసుపలకడం దారుణమని జనసేనాని విమర్శించారు. అమరావతి నిర్మాణం కోసం భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే సహించబోనని పవన్‌ ట్విటర్‌ ద్వారా హెచ్చరించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేధికగా ఏపీ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. అమరావతి నిర్మాణం కోసం చేపట్టిన భూ సమీకరణలో భూములు ఇవ్వని రైతుల నుంచి చట్టం ద్వారా సేకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, దేవాలయ క్షురకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన అంశాలపై ట్విటర్‌ ద్వారా స్పందించారు.

అమరావతి కోసం ఇప్పటికే చాలినంత భూమిని సమీకరించిన విషయాన్ని పవన్‌ ప్రస్తావించారు. సమీకరణలో భూములు ఇవ్వని రైతులు నుంచి బలవంతంగా తీసుకునేందుకు భూసేకరణ చట్టాన్ని ప్రయోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జనసేనాని తప్పుపట్టారు. భూసేకరణ చట్టం ప్రయోగిస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ విషయాన్ని చర్చించేందుకు అమరావతి ప్రాంత రైతులతో సమావేశం కావాలని నిర్ణయించిన విషయాన్ని ట్విటర్‌లో పవన్‌ ప్రస్తావించారు. ఈనెల 23న జనసేనాని విజయవాడ వెళ్లనున్న నేపథ్యంలో ఈ అంశాలకు ప్రాధాన్యత సంతరించుకొంది.

అమరావతి- సచివాలయంలో దేవాలయ క్షురకులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన తీరుపై కూడా జనసేనాని స్పందించారు. ప్రేమ, అభిమానంతో ఎన్నుకున్న ప్రజలనే నాయకులు భయపెట్టాలని చూడటం సరికాదన్నారు. క్షురకుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు పలికిన పవన్‌.. వీరి సమస్యల పరిష్కారానికి జనసేన కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పవన్‌ తప్పుపట్టారు. శ్రీవారి గులాబీ రంగు వజ్రం, విలువైన ఇతర ఆభరణాలు మాయమైనట్టు దీక్షితులు చేసిన ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఉత్సవాల్లో భక్తులు విసిరిన నాణేలకు వజ్రం పగిలిపోయిందా అని జనసేనాని ప్రశ్నించారు. అలా జరుగుతుందో... లేదో.. ఓసారి ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో చేసి చూపించాలని కోరారు.

మరోవైపు పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన పోరాట యాత్ర ఈనెల 26 నుంచి పునఃప్రారంభం కానుంది. రంజాన్‌ సందర్భంగా యాత్రకు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. మూడు నెలలుగా కంటి సమస్యతో బాధపడుతున్న పవన్‌ కల్యాణ్‌కు ఈనెల 24న ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాలలో శస్త్రచికిత్స జరుగనుంది. శస్త్రచికిత్స తర్వాత ఒకరోజు విశ్రాంతి తీసుకుని... ఈనెల 26 నుంచి యాత్ర పునఃప్రారంభిస్తారు. విశాఖలో నాలుగు రోజులు పాటు పర్యటించి తూర్పుగోదావరి ప్రవేశిస్తారు. 

06:50 - June 22, 2018

విశాఖపట్టణం : ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 23 వేల ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదివేల మంది ఉపాధ్యాయ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అలాగే పోలీసు, ఇతర శాఖల్లో మరో 10 వేల మందిని నియమిస్తామన్నారు. సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లలో మరో మూడువేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని విశాఖపట్నంలో జరిగిన మూడో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు చెప్పారు.

ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటించారు. ముందుగా ఏపీ హెల్త్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత మూడవ విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు 9 వేల 54 పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొంత మంది లబ్ధిదారులకు తన చేతుల మీదుగా పట్టాలు ఇచ్చిన చంద్రబాబు... మిగిలినవి ప్రజాప్రతినిధులు, అధికారులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. పట్టాల పంపిణీలో అవినీతికి తావులేకుండా పకడ్బందీ ఏర్పాటు చేసిన విషయాన్ని చంద్రబాబు లబ్ధిదారుల దృష్టికి తెచ్చారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మత్స్యకారులను ఎస్టీల జాబితాలో, రజకులను ఎస్సీల జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. అంతకుముందు ఏపీ హెల్త్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించిన చంద్రబాబు... అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ తరహాలో విశాఖను ఇన్నోవేషన్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతామన్నారు. నూతన ఆవిష్కరణకు విశాఖ కేంద్రంగా మారుతున్న విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు మూడు రోజులుగా అలకవహించి విధులకు దూరంగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

06:48 - June 22, 2018

హైదరాబాద్ : టీపీసీసీ నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ రామచంద్ర కుంతియా స్పష్టత ఇచ్చారు. నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదన్నారు. గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ సమావేశంలో కేసీఆర్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ సమావేశం వాడీవేడిగా జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. ఏఐసీసీ ఆదేశాలతో అత్యవసరంగా సమావేశమైన పీసీసీ.. శక్తియాప్‌ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం, ప్రతి కార్యకర్త ఏఐసీసీకి అనుసంధానం చేసేదిశగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. జూన్‌ 30లోగా బూత్‌స్థాయి కమిటీలు, రాష్ట్ర వ్యాప్తంగా 30వేల 8 వందల బూత్‌ల్లో 14మంది చొప్పున కమిటీల నియామకాన్ని పూర్తిచేయాలని ఏఐసీసీ నిర్దేశించింది.

పార్టీలో సమన్వయ లోపంపై పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీరియస్‌ చర్చ జరిగింది. ఇన్నాల్లూ కష్టపడి పెంచిన పార్టీకి నష్టం చేస్తున్నారని మాజీమంత్రి డీకె అరుణ ఫైర్‌ అయ్యారు. పార్టీ నుంచి వలసలు వెళ్తున్నా పట్టించుకోవడం లేదని.. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవారి పట్ల మాత్రం స్పందించకపోవడానికి కారణమేంటని ఆమె నిలదీసినట్టు తెలుస్తోంది. నాయకుల ఢిల్లీ పర్యటనపై మాట్లాడిన వీహెచ్‌ , పొంగులేటి ... మీడియాలో వస్తున్న వార్తలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రాహుల్‌గాంధీ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకే వెళ్లామని ఢిల్లీ వెళ్లామని... మీడియాలో వచ్చిన వార్తలతో తమకేమి సంబంధమని భట్టి, డీకె అరుణ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. సమావేశానంతరం స్పందించిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ రామచంద్ర కుంతియా.. పీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్ష పదవుల్లో ఉత్తమ్‌, భట్టి విక్రమార్కే కొనసాగుతారని స్పష్టం చేశారు. నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు ఆయన చెక్‌ పెట్టారు.

సమావేశంలో నేతలు సమన్వయలోపంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో సీనియర్లు జోక్యం చేసుకున్నారు. ముందు పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పనిచేయాలని సూచించినట్టు తెలుస్తోంది. పార్టీ కార్యకలాపాలను విస్తృత పరచడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, సమన్వయం చేసుకునేందుకు ఏఐసీసీ అదనంగా ముగ్గురు కార్యదర్శులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్నాటకకు చెందిన ఎన్‌ఎస్‌ బోస్‌రాజ్‌, సలీం అహ్మద్‌, కేరళకు చెందిన శ్రీనివాసన్‌ కృష్ణన్‌లను కుంతియాతో కలిసి పనిచేసేందుకు నియమించారు.

06:44 - June 22, 2018

ఢిల్లీ : వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు ఎట్టకేలకు ఆమోదం పొందాయి. ఏప్రిల్‌ 6న వారు ఇచ్చిన రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఉప వైసీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలపై ఉత్కంఠకు తెరపడింది. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి చేసిన రాజీనామాలను రెండున్నర నెలల తర్వాత స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ ఎట్టకేలకు ఆమోదించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం లోక్‌సభ సచివాలయం బులెటిన్‌ విడుదల చేసింది.బుధవారం నుంచే రాజీనామాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా వైసీపీ ఎంపీలు ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్‌ 6న విడివిడిగా రాజీనామా లేఖలను స్పీకర్‌ సుమిత్రామహాజన్‌కు అందించారు. అయితే అప్పటి నుంచి వాటిని ఆమోదించకుండా స్పీకర్‌ పెండింగ్‌లో ఉంచారు. ప్రత్యేకహోదా కోసం తాము పదవీత్యాగం చేశామని, ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్‌, ఎంపీలు చెబుతూ వచ్చారు. కానీ ఆ రాజీనామాలు ఆమోదం పొందలేదు. అంతేకాదు.. కర్నాటక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన ముగ్గురు ఎంపీల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్‌... అంతకుముందే రాజీనామాలు సమర్పించిన వైసీపీ ఎంపీలపై నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత మే 29న రాజీనామాలపై చర్చించడానికి వైసీపీ ఎంపీలను ఆహ్వానించారు. భావోద్వేగ పరిస్థితుల నేపథ్యంలో రాజీనామాలు చేశారని... పునరాలోచించుకుని రావాలని స్పీకర్‌ సూచించారు. ఈనెల 6న వారితో మరోసారి భేటీ అయ్యారు. అయితే రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని వైసీపీ ఎంపీలు స్పష్టం చేశారు. దీంతో ఎట్టకేలకు వారి రాజీనామాలు ఆమోదంపొందాయి.

ఐదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామాలను ఆమోదించడంతో.. ఇప్పుడు వారి స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయా... లేదా అన్నది సర్వత్రా విస్తృతంగా చర్చ నడుస్తోంది. అయితే ఉప ఎన్నికలు రావన్నదే నిపుణుల మాట. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని 151 (ఏ)సెక్షన్‌ ప్రకారం ఎంపీల పదవీకాలం మరో ఏడాదిలోపు మాత్రమే మిగిలి ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించకూడదు. ఏ స్థానమైనా ఖాళీ అయిన 6 నెలల్లో ఉప ఎఎన్నిక నిర్వహించాలన్న నిబంధన ఉన్నప్పటికీ అది చివరి ఏడాదికి వర్తించదని అదే చట్టం చెబుతోంది. దీన్ని ఈసీ వర్గాలు కూడా ధృవీకరించాయి. గతంలోనూ లోక్‌సభ చివరి ఏడాదిలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నడూ ఎన్నికలు జరుగలేదని గుర్తు చేస్తున్నాయి. దీని ప్రకారం జూన్‌ 5 తర్వాత ఖాళీ అయిన ఏ లోక్‌సభ సీటుకూ ఉప ఎన్నిక జరిగే అవకాశం లేనట్లే. వైసీపీ ఎంపీల రాజీనామాలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి కాబట్టి ఈ స్థానాలకు ఎప ఎన్నికలు జరగవని అధికారవర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఆ ఐదుగురు ఎంపీలు మాజీలు కావడంతప్ప ఏమీ ఉండబోదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

గన్నవరంలో పవన్ కళ్యాణ్...

విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్నారు. అమరావతిలో పవన్‌ కల్యాణ్‌ రెండు రోజులు పర్యటిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వస్తారు. విశాఖపట్నం జిల్లాలో జనసేన పోరాట యాత్రను ఈ నెల 26 నుంచి తిరిగి ప్రారంభిస్తోన్న విషయం తెలిసిందే.

స్మార్ట్ ఫోన్ పేలి సీఈవో మృతి...

ఢిల్లీ : మలేషియాలో స్మార్ట్‌ ఫోన్‌ పేలి సిఈఓ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. క్రాడిల్ ఫండ్‌ కంపెనీ సిఈఓ 45 ఏళ్ల నజ్రీన్‌ హసన్‌ తన ఇంటిలోని పడక గదిలో బ్లాక్‌బెరీ, హువాయ్‌ స్మార్ట్‌ ఫోన్లను చార్జింగ్‌ పెట్టి పడుకున్నారు. అందులో ఒకఫోను అకస్మాత్తుగా పేలడంతో అందులోని పరికరాలు మెడ వెనుక భాగం, తలలోనూ గట్టిగా గుచ్చుకోవడంతో తీవ్ర రక్త స్రావమై సిఈఓ మృతి చెందారు.

ఆప్ ఎమ్మెల్యేపై ఇసుక మాఫియా దాడి...

పంజాబ్ : రాష్ట్రంలో మైనింగ్‌ మాఫియా రెచ్చిపోయింది. అక్రమ గనుల తవ్వకాలను అడ్డుకున్న ఆప్ ఎమ్మెల్యేపై దాడికి దిగింది. బీహరా గ్రామ సమీపంలో కొంతమంది అక్రమ తవ్వకాలను కొనసాగిస్తున్న సమాచారం మేరకు ఆప్ ఎమ్మెల్యే అమర్‌జీత్ సింగ్ సండోయ మీడియా ప్రతినిధులను వెంట బెట్టుకుని అక్కడకు వెళ్లారు. ఎమ్మెల్యే వస్తున్న సమాచారం ముందే తెలుసుకున్న మాఫియా ముఠా తవ్వకాలు జరుపుతున్న యంత్రాలు, పరికరాలను అక్కడి నుంచి తరలించారు. అమర్‌జీత్‌ సింగ్‌ అక్కడకు చేరుకోగానే రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. 

ఆటో డ్రైవర్ పై మహిళ కాల్పులు...

గుర్గావ్ : 34 ఏళ్ల మహిళ ఆటోడ్రైవర్‌పై పిస్తోల్‌తో కాల్పులు జరిపిన ఘటన గుర్గావ్‌లోని భవానీ ఎన్‌క్లేవ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ కాల్పుల నుంచి ఆటో డ్రైవర్‌ సునీల్ తృటిలో తప్పించుకున్నారు. ఆయన చెవి పక్క నుంచి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది.

 

క్షమాపణలు చెప్పిన ఎయిర్ ఏషియా...

ఢిల్లీ : ప్రముఖ విమానాయాన సంస్థ ఎయిర్‌ ఏషియాకు చెందిన విమాన సిబ్బంది ప్రవర్తనపై ప్రయాణికులు మండిపడుతున్నారు. కోల్‌కతా నుంచి బగోగాకు వెళ్లాల్సిన ఎయిర్‌ ఏషియా విమానం 4 గంటల ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 9 గంటలకు వెళ్లాల్సిన విమానం అరగంట ఆలస్యం అవుతోందని ప్రయాణికులంతా దిగిపోవాలని కెప్టెన్ సూచించారు. బయట వర్షం పడుతుండడంతో విమానం దిగడానికి ప్రయాణికులు నిరాకరించడంతో వాగ్వాదం చోటుచేసుకుందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దీపాంకర్‌ రే ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. 

వేర్పాటు వాదులపై చర్యలు...

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన అమలు కావడంతో వేర్పాటువాదులపై చర్యలు ఊపందుకున్నాయి. జమ్ము కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్ చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే హురియత్‌ నేత గిలానీ గృహ నిర్బంధంలో ఉన్నారు. త్వరలోనే మరికొంత మంది వేర్పాటు వాదులపై కూడా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.  

వెనక్కి తగ్గిన ట్రంప్...

ఢిల్లీ : అక్రమ వలసదారుల నుంచి వారి పిల్లలను వేరు చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెనక్కి తగ్గారు. అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో తల్లితండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి నిర్భందించే విధానానికి స్వస్తి పలుకుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. 

Don't Miss