Activities calendar

23 June 2018

మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు : కుంతియా

ఢిల్లీ : కాంగ్రెస్ వార్ రూంలో కీలక సమావేశం ముగిసింది. టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ కుంతియా అన్నారు. నేతలు పార్టీని వీడటం వల్ల కాంగ్రెస్ కు నష్టం లేదని చెప్పారు. పార్టీలో విభేదాలు ఉంటే అధిష్టానానికి చెప్పవచ్చు...మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ముగిసిన కాంగ్రెస్‌ కీలక సమావేశం

ఢిల్లీ : కాంగ్రెస్‌ వార్‌రూంలో కీలక సమావేశం ముగిసింది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనసాగుతారని ఇన్‌ఛార్జ్‌ కుంతియా తెలిపారు. 

 

ఎవరి ప్రయోజనాలకోసం కన్నా, బీజేపీ పనిచేస్తుందో చెప్పాలి : మంత్రి కాల్వ

గుంటూరు : 'చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇస్తే లూటీ చేస్తాడు' అని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనడం ఎంతవరకు సమంజసమని మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాలకోసం కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ పని చేస్తుందో చెప్పాలన్నారు. కన్నాను అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన రోజే..బీజేపీ ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తుందో చెప్పకనే చెప్పినట్లైందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అవినీతి కేబినెట్ లో అగ్రభాగాన నిలిచే వారిలో కన్నా ఒకరని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి.. రాజకీయ కక్ష సాధింపుకు కన్నాను ఒక ఆయుధంగా ఉపయోగించారని పేర్కొన్నారు.

 

ప్రతిపక్ష నాయకుడు నిర్మాణాత్మక సలహాలివ్వాలి : మంత్రి కాల్వ శ్రీనివాసులు

గుంటూరు : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షపార్టీ, ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని, ప్రజల గొంతుకయి వినిపించాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. బీజేపీ నేతలు, జగన్, పవన్ కళ్యాణ్ లు ఎక్కడ కూడా ఇసుమంత మాత్రం ఆధారాలు లేకుండా చేస్తున్నారని...అది వారి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనంగా కనిపిస్తుందన్నారు. 

ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలో నలుగురు గల్లంతు

కృష్ణా : జిల్లాలోని ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలో నలుగురు బీటెక్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. వీరంతా కంచికచర్ల మిక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నారు. కృష్ణానదిలో స్నానం చేస్తున్న స్నేహితుడు..ప్రమాదవశాత్తు నదిలో పడిపోవడంతో రక్షించేందుకు మరో ముగ్గురు స్నేహితులు ప్రయత్నించారు. దీంతో వారు కూడా కృష్ణానదిలో గల్లంతయ్యారు. 

చిలుపూర్‌లో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు

జనగామ : చిలుపూర్‌లో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీఆర్‌ఎస్‌ నేత రాజారపు ప్రతాప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్సిడీ ట్రాక్టర్ల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజయ్య వర్గీయులు అడ్డుకున్నారు. చిలుపూరు గుట్ట గ్రామ పంచాయతీ ఏర్పాటును రాజారపు ప్రతాప్‌ అడ్డుకున్నారంటూ రాజయ్య వర్గీయులు ఆరోపిస్తున్నారు. 

బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

కృష్ణా : కంకిపాడు మండలం పునాదిపాడులో బీటెక్‌ విద్యార్థిని లోయ రాణి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ విఫలమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

15:50 - June 23, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని కొవ్వూరు లాంచీల రేవులో మృతదేహాలు కొట్టుకువచ్చాయి. గోదావరిలో మూడు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతులు వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు. 

 

కాంగ్రెస్‌ వార్ రూంలో కొనసాగుతోన్న కీలక సమావేశం

ఢిల్లీ : కాంగ్రెస్‌ వార్‌రూంలో కీలక సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్‌ కుంతియా, అశోక్‌ గెహ్లాట్‌తో పాటు నూతనంగా నియమితులైన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. టీపీసీసీలో మార్పులు, నేతల రాజీనామాలు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

15:45 - June 23, 2018

హైదరాబాద్ : తిరుమల దేవస్థానంలో జరుగుతోన్న అవకతవకలపై రమణదీక్షితులు మీడియాకు సవాల్‌ విసిరారు. అర్చకుల భోజనం పేరిట కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడంలేదన్నారు. ఈ విషయాన్ని వెలికి తీయాలని మీడియాకు సవాల్ విసిరారు. శ్రీవారి ఆలయ పరిరక్షణకై సాగుతోన్న మహాయజ్ఞంలో భక్తులు తనకు సహకరించాలని కోరారు. ప్రెస్‌ మీట్‌లో తనతో పాటు అన్యమతస్తుడు ఉండటం చాలా చిన్నవిషయం అన్నారు. తాను లేవనెత్తిన అంశాలను పక్కదారి పట్టించేలా అనిల్‌ అనే వ్యక్తి గురించి కథనాలు రావడం బాధాకరమన్నారు. 

 

15:22 - June 23, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ వార్‌రూంలో కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్‌ కుంతియా, అశోక్‌ గెహ్లాట్‌తో పాటు నూతనంగా నియమితులైన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. టీపీసీసీలో మార్పులు, నేతల రాజీనామాలు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

 

కేంద్రం సహకరించకపోయినా అంగన్ వాడీలకు జీతాలు పెంచాం : సీఎం చంద్రబాబు

హైదరాబాద్ : 4ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అంగన్ వాడీలకు జీతాలు పెంచామని సీఎం చంద్రబాబు చెప్పారు. అంగన్ వాడీలు ఆనందంగా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అంగన్ వాడీ టీచర్ల సమస్యలు తొలగించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

వ్యవసాయాన్ని భ్రష్టుపట్టించిన కేంద్రం : చంద్రబాబు

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని భ్రష్టుపట్టించిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. జీఎస్టీ, నోట్ల రద్దు వల్ల ప్రజలందరికీ కష్టాలు వచ్చాయన్నారు. 

కాంగ్రెస్‌ వార్‌రంలో కీలక సమావేశం ప్రారంభం

ఢిల్లీ : కాంగ్రెస్‌ వార్‌రంలో కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్‌ కుంతియా, అశోక్‌ గెహ్లాట్‌తో పాటు నూతనంగా నియమితులైన ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. టీపీసీసీలో మార్పులు, నేతల రాజీనామాలు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

 

పవన్ తో నాదెండ్ల భేటీ...

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పని చేసిన కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాదులో జరిగిన ఈ సమావేశంలో, వారిద్దరూ దాదాపు అరగంట సేపు చర్చలు జరిపారు. 

12:59 - June 23, 2018
12:50 - June 23, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు జరుగుతున్నా అన్యాయం చూడలేక...కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వివక్ష చూడలేక పార్టీకి రాజీనామా చేయడం జరిగిందని దానం నాగేందర్ పేర్కొన్నారు. రాజీనామాకు గల కారణాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. తాను 30 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం జరిగిందని, ఎన్నో పదవులు అనుభవించానన్నారు. కానీ తనకు తెలియకుండానే గ్రేటర్ లో చాలా టికెట్లు ఇచ్చారని... ఈ విషయం తెలిసినా తాను పార్టీని..నేతలను విమర్శించలేదని తెలిపారు. పార్టీలో ఒకే వర్గానికి పెద్దపీఠ వేస్తున్నారని తెలిపారు.

కానీ పార్టీలో బీసీలకు పక్కన పెడుతున్నారని, ఇటీవలే నిర్వహించిన సభల్లో బీసీలకు చెందిన నేతలతో మాట్లాడించారా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కోటి 67 లక్షల బీసీలున్నారని, దీనికి సంబంధించిన నివేదికను ఇటీవలే నిర్వహించిన బీసీ సమావేశంలో రాహుల్ గాంధీకి ఇవ్వడం జరిగిందని తెలిపారు. పార్టీలో అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం జరిగిందన్నారు.

ఇటీవలే కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో ఎందుకు చేరుతున్నారో వివరించడం జరిగిందని, డీఎస్, కేకే లాంటి వారు పార్టీ ఎందుకు వీడారో రాహుల్ కు తెలియచేసినట్లు తెలిపారు. బలహీన వర్గాలను నిర్లక్ష్యం చేయడం తగదని, పొన్నాలకు పార్టీలో ప్రాధాన్యత లేదని..వరంగల్ లో సమావేశం జరిగితే కనీసం ఆయనకు సమాచారం కూడా ఇవ్వడం లేదని.. వీహెచ్ మింగలేక..కక్కలేక గా ఉన్నారన్నారు. ఎదుటి వారిని ఎదగనివ్వకుండా ఉత్తమ్ చూస్తున్నారని ఆరోపించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతోందని..వారి అభివృద్ధికి కృషి జరుగుతోందని..టీఆర్ఎస్ లో ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానన్నారు. 

12:38 - June 23, 2018
11:37 - June 23, 2018

కరీంనగర్ : జిల్లాలో 29ఏళ్ల క్రితం మిస్టరీ వీడింది. ఇరుకుల్ల వాగులో వరద ఉధృతికి ఆనాడు ఓ లారీ కొట్టుకపోయింది. అందులో ఉన్న దౌలత్ ఖాన్, శంకర్, వెంకట స్వామిలు గల్లంతయ్యారు. వీరి ఆచూకి కనుగొనాలంటూ పోలీసులను కుటుంబసభ్యులు కోరారు. కానీ ఇసుక మేటలు వేయడంతో లారీ ఆనవాళ్లు కనిపించలేదు. దీనితో అప్పటి నుండి ఈ మిస్టరీ అలాగే ఉండిపోయింది. తాజాగా ఆ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నాడు. ఒక్కసారిగా లారీ క్యాబిన్ బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తవ్వకాలు జరుపగా ఇద్దరి అస్థిపంజరాలు బయటపడ్డాయి. మరో అస్థి పంజరం కోసం సిబ్బంది తవ్వకాలు జరుపుతున్నారు. 

29 ఏళ్ల మిస్టరీ వీడింది...

కరీంనగర్ : జిల్లాలో 29ఏళ్ల క్రితం మిస్టరీ వీడింది. ఇరుకుల్ల వాగులో వరద ఉధృతికి ఆనాడు ఓ లారీ కొట్టుకపోయింది. అందులో ఉన్న ముగ్గురు గల్లంతయ్యారు. నేడు ఇసుక తవ్వకాలు జరుపుతుండగా లారీ..ముగ్గురు అస్థి పంజరాలు బయటపడ్డాయి. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తవ్వకాలు జరుపుతున్నారు.

నిజామాబాద్ లో గ్యాంగ్ రేప్...

నిజామాబాద్ : నగరంలో ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. 

11:28 - June 23, 2018

హైదరాబాద్ : జాతీయ స్థాయి స్కేటింగ్ క్రీడాకారిణి రుచిక తన భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సదరు మహిళతో తన భర్త చేసిన సెల్‌ఫోన్‌ చాటింగ్‌ ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా సదరు యువతితో తన భర్త జరిపిన సెల్‌ఫోన్‌ చాటింగ్‌ వివరాలను ఆమె బయటపెట్టారు. అయితే దీనిని ఆమె భర్త అక్షయ్ కుటుంబం కొట్టిపారేసింది. ఆమె చెప్పినవన్నీ అబద్ధాలేనని, పెళ్లయిన నాటి నుంచి ఆమె తనతో 2 నెలలే ఉందని భర్త పేర్కొన్నారు. 

11:07 - June 23, 2018

సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు..సెకండ్ డే...

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కార్యాలయంలో రెండో రోజు కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 22వ సీపీఎం అఖిల భారత మహాసభల తరువాత తొలిసారి సీపీఎం కేంద్ర కమిటీ భేటీ జరుగుతోంది. సీపీఎం మహాసభల్లో తీసుకున్న నిర్ణయాల అమలు, బాధ్యతల అప్పగింతపై చర్చ జరుగుతోంది. 

సీఎం రమేష్ కు వైద్య పరీక్షలు...

కడప : రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఎంపీ రమేష్, ఎమ్మెల్సీ రవికి రిమ్స్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. 

10:35 - June 23, 2018
10:33 - June 23, 2018
10:28 - June 23, 2018

హైదరాబాద్ : తెలంగాణలో రేషన్ డీలర్లు ఆందోళన బాట పట్టనున్నారు. గౌరవ వేతనం ఇవ్వాలని.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు.. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించపోతే జులై 1 నుంచి సమ్మె చేస్తామని... ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వంలోని మరోశాఖలో సమ్మె సైరన్‌ మోగింది. పౌరసరఫరాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న రేషన్ డీలర్లు ఆందోళన బాట పట్టారు. గౌరవ వేతనం ఇవ్వటంతో పాటు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించపోతే జూలై 1 నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించింది రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం. డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

దిక్కులేని పరిస్ధితుల్లోనే తాము సమ్మెకు దిగుతున్నామని రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు తెలిపారు. సివిల్ సప్లయ్ శాఖలో కీలక పాత్ర పోషిస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్‌ బకాయిలను చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లోని డీలర్లకు నెలకు 40 వేల నుంచి 80 వేల ఆదాయం వస్తుందని.. కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదన్నారు. 17,200 మంది రేషన్ డీలర్లు బయోమెట్రిక్ పోర్టబిలిటీకి మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా.. ప్రభుత్వం తమను గుర్తించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈపాస్ విధానం ద్వారా వందల కోట్ల రూపాయలు మిగులుతున్నాయని ఆరోపించారు మరికొంత మంది రేషన్ డీలర్లు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం 2015 అక్టోబర్ నుంచి రావాల్సిన సుమారు 6 వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించపోవటం వల్ల తాము అప్పుల ఉబిలో చిక్కుకున్నామని.. డీడీలు కట్టలేని పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017 నవంబర్‌లోనూ సమ్మె చేశామని.. అప్పడు ఇచ్చిన హామీలను కూడా ఇంత వరకు నెరవేర్చలేదని తెలిపారు. ఈ సారి హామీలతో సరిపెడితే ఊరుకోబోమని.. వాటిని అమలు చేసే వరకు పోరాడుతామని రేషన్‌ డీలర్లు స్పష్టం చేశారు.

మరోవైపు రేషన్‌ డీలర్ల సమ్మెకు హమాలీలు మద్దతు ప్రకటించారు. అయితే రెండు రోజుల క్రితం వారిచే చర్చలు జరిపి సమ్మెను విరమింపజేశారు అధికారులు. ఇక ఈ నెల 24న రేషన్‌ డీలర్లతో చర్చలు జరిపేందుకు పౌరసరఫరాల కమిషనర్‌ అకున్‌ సబర్వాల్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు చర్చలు జరపగా అవి విఫలమయ్యాయి. అయితే ఈసారి చర్చల్లో ప్రభుత్వం మెడలు వంచైనా తమ డిమాండ్లను నెరవేర్చకోవాలని చూస్తున్నారు రేషన్ డీలర్లు. చర్చలు విఫలమైతే సమ్మెకు దిగుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఈ చర్చలు సఫలమయేటట్లు ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు. దీంతో రేషన్‌ డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందా ? లేదా ? అనేది సందిగ్ధం నెలకొంది. 

10:24 - June 23, 2018

ఢిల్లీ : అధిష్టానం పిలుపుతో టిపిసిసి చీఫ్ ఉత్తమ్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. అత్యవసరంగా ఢిల్లీలోని వార్ రూంకు హాజరు కావాలని పిలుపువచ్చింది. దీనితో ఆయన హస్తినకు బయలుదేరారు. రాహుల్ ఏం చర్చిస్తారనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీలో మార్పులు...రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ట ఇనుమడింప చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ పీసీసీలో అంతర్గత విబేధాలకు చెక్ పెట్టాలని రాహుల్ యోచిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవలే కుంతియాకు సహాయకులుగా ఉండాలని మూడు రాష్ట్రాలకు చెందిన నేతలకు బాధ్యతలు అప్పచెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాహుల్ తో భేటీ అయిన నేతలు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పై ఫిర్యాదులు చేశారు. ఉత్తమ్ ఉంటే రాష్ట్రంలో 15 సీట్ల కంటే ఎక్కువ రావని నేతలు ఫిర్యాదు చేశారని సమాచారం. కానీ దీనిని ఉత్తమ్..అధిష్టానం ఖండించింది.

ఇదిలా ఉండగానే ఒక్కసారిగా గ్రేటర్ హైదరాబాద్ లో కీలక నేతల అయిన దానం నాగేందర్ రాజీనామా చేయడం..టీఆర్ ఎస్ లో చేరుతున్నారనే వార్త కలకలం సృష్టించింది. ఆయనతో పాటు ముఖేష్ గౌడ్ కూడా గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీనితో రాహుల్ అత్యవసరంగా ఉత్తమ్ ని పిలుపించుకున్నారని తెలుస్తోంది. వీరి భేటీలో ఎలాంటి కీలక నిర్ణయాలు వెలువడుతాయో చూడాలి.

ఢిల్లీకి ఉత్తమ్...

హైదరాబాద్ : టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కు అధిష్టానం నుండి పిలుపువచ్చింది. అత్యవసరంగా ఢిల్లీలోని వార్ రూంకు హాజరు కావాలని అధిష్టానం పిలుపువచ్చింది. దీనితో ఉత్తమ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. 

09:57 - June 23, 2018

పెద్దపల్లి : అల్లనేరేడు పండ్లు ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది. పండ్లు కోసుకుంటూ ఓ బావిలో పడి మృతి చెందారు. ఈ విషాద ఘటన కుర్మపల్లిలో చోటు చేసుకుంది. ప్రణీత్, అరవింద్ విద్యార్థులు శుక్రవారం సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లారు. అల్లనేరేడు పండ్లు తెంపుకుంటూ ప్రమాదవశాత్తు బావిలో జారి పడిపోయారు. రాత్రి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు వెతికారు. ఫలితం కనబడడం లేదు. బావిలో ఒకరి మృతదేహం వెలుగు చూడడం గ్రామస్తులు గమనించారు. బావిలోకి దిగి ప్రణీత్, అరవింద్ మృతదేహాలు బయటకు తీశారు. విషయం తెలుసుకున్న ఇరువురు కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. 

09:50 - June 23, 2018

కరీంనగర్ : ఓ కౌలు రైతు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. దీనితో భార్యను చంపేసిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇల్లందుకుంట మండలం సిరిసేడు గ్రామంలో స్వామి మల్లయ్య, పుట్ట రాధ దంపతులు నివాసం ఉంటున్నారు. స్వామి కౌలు రైతు. పంటలకు తీవ్ర నష్టం రావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీనితో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. శుక్రవారం మద్యం సేవించిన స్వామి భార్య రాధతో గొడవకు దిగాడు. తీవ్ర ఆగ్రహంతో రోకలి బండతో రాధ తలపై మోదడంతో ఆమె అక్కడికక్కడనే మృతి చెందింది. తీవ్ర భయాందోళనకు గురైన స్వామి ఉరి వేసుకుని తనువు చాలించాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపింది. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. 

భార్యను చంపేసి..తాను...

కరీంనగర్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్వామి మల్లయ్య అనే వ్యక్తి భార్యను రోకలి బండంతో మోది చంపేశాడు. అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఇల్లందుకుంట మండలం సిరిసేడు గ్రామంలో చోటు చేసుకుంది. 

09:44 - June 23, 2018

హైదరాబాద్ : నగరంలో కురిసిన భారీ వర్షానికి ఒక వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సెల్లార్ లో భారీగా నీరు చేరడంతో నీట మునిగి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. నీటిని తోడేందుకు జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీంను రంగంలోకి దింపింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:39 - June 23, 2018
09:35 - June 23, 2018
09:31 - June 23, 2018
08:12 - June 23, 2018
08:11 - June 23, 2018
08:10 - June 23, 2018

హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా ఎండలు..ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు కొంత ఉపశమనం పొందారు. శుక్రవారం రాత్రి నగరంలో భారీ వర్షం కురిసింది. దీనితో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కానీ పలు ప్రాంతాల్లో వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీటిని తొలగించడం కోసం ఎమెర్జీన్సీ టీంలు రంగంలోకి దిగాయి. మ్యాన్ హోళ్లు, డ్రైనేజీలు పొంగి పొర్లాయి. బేగం పేటలో 6.3 సెం.మీ, ఉప్పల్ లో 5.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్, అంబర్ పేట, హిమాయత్ నగర్, ముషిరాబాద్ లో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. కూకట్ పల్లి, ఆసిఫ్ నగర్, గొల్కోండ, రాజేంద్రనగర్ లో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. 

తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా రుతుపవనాలు...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా రుతుపవనాలు కదులుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురువనున్నాయి. 

06:59 - June 23, 2018

జగిత్యాల : ఏపీలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును నిలివేయాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాయడాన్ని హరీశ్‌ తప్పుపట్టారు. జగిత్యాల జిల్లా హలికోటలో సూరమ్మ చెరువు, నాగారం చెరువు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. హలికోటలో 202 కోట్ల రూపాయల అంచనావ్యయంతో చేపడుతున్న సూరమ్మ చెరువు, నాగారం చెరువు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌తోపాటు మేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హలికోటలో జరిగిన సభలో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని హరీశ్‌ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాయడాన్ని హరీశ్‌తప్పుపట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు.

కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లో 43 వేల ఎకరాలకు సాగునీరు అందించే సూరమ్మ చెరువు, నాగారం చెరువు జలాశయాన్ని వచ్చే దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నవిషయాన్ని హరీశ్‌ ప్రస్తావించారు. అయితే హలికోట ప్రజలు 300 ఎకరాల భూమి ఇస్తేనే ఇది సాధ్యమని లింకుపెట్టారు.

ప్రపంచంలో వేగవంతంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నది తెలంగాణలోనేనని కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. మహిళలకు వడ్డిలేని రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రులు హరీశ్‌, ఈటల చెప్పారు. గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన 954 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే వరకు ప్రాజెక్టులు చేపడతామన్నారు. 

06:56 - June 23, 2018

చిత్తూరు : తిరుమలేశుని ఆభరణాలపై రమణదీక్షితులు చేసిన విమర్శలను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. అవసరమైతే ఈ అంశంపై గతంలో నిపుణులు సమర్పించిన నివేదికలను బహిర్గతం చేస్తామని ప్రకటించింది. అటు టీటీడీ అధికారులు కూడా.. వెంకన్న సేవలు త్వరగా ముగించాలని అర్చకులపై ఒత్తిడి తెస్తున్నారన్న రమణ దీక్షితులు ఆరోపణలను ఖండించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై.. మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు.. సంధించిన ఆరోపణాస్త్రాలు కలకలం సృష్టిస్తున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని భావిస్తోన్న ప్రభుత్వం.. దీక్షితులు ఆరోపణలపై శుక్రవారం స్పందించింది. దీక్షితులు చెబుతున్నట్లు ఏ వైఢూర్యమూ ఎక్కడికీ తరలిపోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో దీనిపై విచారణ జరిపిన నిపుణుల నివేదికను బయటపెట్టేందుకూ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

టీటీడీని అడ్డు పెట్టుకుని.. బీజేపీ నేతృత్వంలో రాష్ట్రప్రభుత్వంపై కుట్ర సాగుతోందని కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. రమణదీక్షితులు కూడా ఈ కుట్రలో భాగంగా మారారని, అక్కడ అవకతవకలు జరుగుతుంటే నాలుగు దశాబ్దాలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. స్వామివారి సేవలు త్వరగా ముగించాలంటూ అర్చకులపై ఒత్తిడి తెస్తున్నారన్న రమణదీక్షితుల అభియోగం సత్యదూరమని టీటీడీ అధికారులు ఖండించారు. ఎన్డీయే కూటమి నుంచి బయటికి వచ్చాకే.. బీజేపీ డైరెక్షన్‌లో.. తిరుమల తిరుపతి దేవస్థానంపై.. అభియోగాలు మోపుతున్నారని ప్రభుత్వం వాదిస్తోంది. 

06:54 - June 23, 2018

విజయనగరం : చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్న గజదొంగని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని చంద్రబాబును గెలిపిస్తే.. ఆయన రాష్ట్రం కోసం చేసిందేమి లేదని విమర్శించారు. విజయనగరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను కేంద్ర నెరవేర్చిందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పుడు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. తరువాత హోదా అంటూ మాటమార్చారని విమర్శించారు. తాజాగా కడప ఉక్కు కర్మాగారంపై ఎంపీలతో డ్రామాలు ఆడిస్తున్నారని మండిపడ్డారు కన్నా లక్ష్మీనారాయణ.

06:53 - June 23, 2018

కడప : ఎంపీ జేసీ దివాకరరెడ్డి మరోమారు తన వ్యాఖ్యలతో సొంత పార్టీ వారినే ఇరకాటంలో పడేశారు. దీక్షలు చేసినంత మాత్రాన కడప ఉక్కు రాదని.. సీఎం రమేశ్‌ దీక్ష అనవసరమని అన్నారు. అయితే.. మంత్రి ఆదినారాయణరెడ్డి.. జేసీ వ్యాఖ్యలను సభావేదిక నుంచే తిప్పికొట్టారు. శ్రేణులు నిరాశ చెందేలా వ్యాఖ్యలు చేయవద్దని జేసీ దివాకరరెడ్డికి సూచించారు. కడప ఉక్కు కర్మాగారం కోసం.. రాజ్యసభ సభ్యుడు సీఎంరమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడోరోజూ కొనసాగింది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు, మంత్రులు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా.. అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏమీ చేయరని మూడేళ్ల కిందటే చంద్రబాబుకు చెప్పానని.. ఇప్పుడు ఆయనకు వాస్తవం అర్థమైందని జేసీ దివాకరరెడ్డి అన్నారు. మోదీ ప్రధానిగా ఉన్నంత వరకూ.. సీఎం రమేశ్‌ దీక్ష చేసినా.. ప్రయోజనం లేదని.. ఉక్కు ఫ్యాక్టరీ రాదని జేసీ స్పష్టం చేశారు.

జేసీ దివాకరరెడ్డి వ్యాఖ్యలపై.. అదే వేదిక నుంచి మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించారు. ఎంపీ జేసీ మాటలు ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఉక్కు ఫ్యాక్టరీ సాధించేవరకూ పోరాడతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-వైసీపీలకు కడప పౌరుషంతోపాటు.. తెలుగోడి సత్తా ఏంటో చూపుతామని దీక్ష శిబిరంలో మాట్లాడిన ఇతర నాయకులు అన్నారు. మొత్తానికి.. కడప ఉక్కు కోసం తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరంలో.. తమ పార్టీకే చెందిన సీనియర్‌ నాయకులు భిన్నమైన ప్రకటనలు చేయడం.. టీడీపీ శ్రేణులను గందరగోళం పడేశాయి. 

06:51 - June 23, 2018

విజయవాడ : ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ఏఏ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అన్న చర్చ అప్పుడే మొదలైంది. ఆయా పార్టీల అగ్రనాయకుల కదలికలూ దీనికి తగ్గట్లే ఉంటున్నాయి. వైరి పక్షంపై వాడి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అవసరం అనుకున్నవారిని కలుపుకు పోయే చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఏడాది ముందే రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పాలక తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టగలడని భావిస్తోన్న పవన్‌ కల్యాణ్‌తో సఖ్యతకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వైసీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఉందన్న భావనతో.. పవన్‌తో కలిసి వెళ్లాలనే వైసీపీ కిందిస్థాయి నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌కల్యాణ్‌కు మంచి మిత్రుడని పేరున్న వైసీపీ ఎంపీ వరప్రసాద్‌.. శుక్రవారం చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

అటు తెలుగుదేశం అధినాయకత్వం.. పవన్‌ కల్యాణ్‌తో సఖ్యత ఇక అసాధ్యమన్న రీతిలోనే సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. గుంటూరు జిల్లా నంబూరులో శుక్రవారం జరిగిన శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చాలా సేపటివరకూ పలుకరించుకోక పోవడం ప్రత్యేకంగా కనిపించింది.

విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చివర్లో నవధాన్యాల సమర్పణ వేళ.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మొక్కుబడిగా కుశల ప్రశ్నలు వేసుకున్నారు. దీన్నిబట్టి.. తెలుగుదేశం పార్టీ... గత ఎన్నికల నాటి మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ను పూర్తిగా దూరంగా చేసుకున్నట్లే అని అర్థమవుతోంది. ఈ దశలో... ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి.. పవన్‌ కల్యాణ్‌ గురించి చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగానే భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికల పొత్తుల అంశం చర్చకు రాకున్నా.. ఆయా పార్టీల నాయకులు.. మద్దతు సమీకరణలపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో ఏ పార్టీ మరే పార్టీతో జతకడుతుందో తెలియాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే.

06:49 - June 23, 2018

హైదరాబాద్‌ : నగరంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు భారీగా చేరింది. మ్యాన్‌ హోళ్ళతోపాటు.. డ్రైనేజీలు పొర్లిపొంగాయి. గత వారం రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. 

06:47 - June 23, 2018

విజయవాడ : ప్రతిపక్ష పార్టీలన్నీ టీడీపీపై విష‌ప్రచారం చేస్తున్నాయ‌ని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ పరిస్థితిపై సమీక్షించిన చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసుల మాఫీ కోసం జగన్‌ బీజేపీతో అంటకాగుతున్నారని విమర్శించారు. వైసీపీ ఉపఎన్నికలు రాకుండా అన్నిజాగ్రత్తలు తీసుకుని.. రాజీనామాలతో డ్రామా ఆడుతోందన్నారు. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు టీడీపీని ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తున్నాయని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు చంద్రబాబు.

06:46 - June 23, 2018

తూర్పుగోదావరి : ఏపీలో వైసీపీ యాత్రతో ఊపు వస్తుందని ఆశించిన విపక్ష శ్రేణులకు కొత్త చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనప్రవాహంతో మురిసిపోతున్న పార్టీకి సొంత పార్టీ నేతలే ఝలక్‌ ఇస్తున్నారు. జగన్‌ పాదయాత్రకు దూరంగా పార్టీ నేతలు ఉండటంతో... వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇరకాటంలో పడేలా కనిపిస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో జగన్‌ పాదయాత్ర తర్వాత పెనుమార్పులు వస్తాయని అందరు భావించారు. దానికి తగ్గట్టుగానే రాజమహేంద్రవరం గోదావరి వంతెన పై జరిగిన పాదయాత్రకు విశేషంగా ఆదరణ లభించడం ఆ పార్టీ నేతలకు ఆనందాన్ని కల్గించింది. కానీ అంతలోనే జగన్‌ తీరు... పార్టీకి కీలకమైన కొందరు నేతలను దూరం చేసేలా చేసింది. ముఖ్యంగా జక్కంపూడి రామ్మోహన్‌ రావు వారసులు ఇప్పుడు జగన్‌పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది

వాస్తవానికి జగన్‌ పట్ల వ్యతిరేకత లేదని, చివరి వరకూ తాము జగన్‌తోనే ఉంటామని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా గతంలో ప్రకటించారు. అయితే రాజమండ్రి లో జరిగిన జగన్‌ పాదయాత్రకు ఆయన డుమ్మా కొట్టారు. వైసీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కూడా పాదయాత్రకు దూరంగా ఉండడంతో రాజకీయవర్గాల్లో అనుమానాలు రేకెత్తాయి.

అసలు విషయానికొస్తే.. రాజమహేంద్రవరంలో జరిగిన పాదయాత్ర సభలో జగన్‌ జక్కంపూడి పేరు ప్రస్తావించ లేదు. పైగా జక్కంపూడి ప్రత్యర్ధి వడ్డి వీరభద్రరావుని ప్రత్యేకంగా గుర్తు చేశారు. దీంతో జగన్‌ తీరుపై జక్కంపూడి కుటుంబ ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం సాగింది. గడిచిన ఎన్నికల్లో జక్కంపూడి విజయలక్ష్మి పోటీ చేసిన రాజానగరం నియోజకవర్గం అభ్యర్థిత్వం విషయంలో భిన్నాభిప్రాయాలే సమస్యకు కారణంగా తెలుస్తోంది. రాజానగరం నుంచి ఈసారి ఒక్కంపూడి రాజా పోటీ చేయాలని, విజయలక్ష్మీ కి తగిన స్థానం కేటాయించాలని జక్కంపూడి వర్గం ఆశిస్తోంది. కానీ దీనికి భిన్నంగా జగన్‌ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జక్కంపూడి, జగన్‌ మధ్య మొదలైన గ్యాప్‌ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా జగన్‌ తీరు తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. వైసీపీ వ్యవహారాలపై ప్రభావం చూపిస్తోంది.

06:42 - June 23, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ వలసల సుడిగుండంలో చిక్కుకుంది. మరోసారి టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో హస్తంపార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. పార్టీలో పెద్ద తలకాయలు కారెక్కుతుండడం కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌ గులాబీ కండువా కప్పుకోవడం ఖరారు కావడంతో... అదే దారిలో మరికొంత మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న వార్త పార్టీ ముఖ్యనేతలకు కంటిమీద కనుకులేకుండా చేస్తోంది.

తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్‌కు.. టీఆర్‌ఎస్‌ చెక్‌పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇతర పార్టీల ముఖ్య నేతలకు గాలం వస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి.... ఊహించని విధంగా గులాబీ పార్టీ షాక్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలను, వర్గపోరును అదునుగా తీసుకున్న టీఆర్‌ఎస్‌.. పలువురు నేతలకు గాలెం వేసింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు పెద్దదిక్కైన దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌ కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్దమయ్యారు. పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్న దానం నాగేందర్‌... పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన దారిలోనే మరోమాజీ మంత్రి ముఖేష్‌, ఆయన తనయుడు విక్రమ్‌లు వెళ్లనున్నట్టు ప్రచారం సాగుతోంది.

దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌లు గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దానం నాగేందర్‌ను గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనకు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కావాలని పార్టీలో డిమాండ్‌ పెట్టిన దానం.. పదవుల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే వస్తున్నారు. తాజాగా ఆలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌కు ఏఐసీసీ కార్యదర్శి పదవి దక్కడం, దానంకు పుండుమీద కారం చల్లినట్టు అయ్యింది. తనకంటే జూనియర్‌ అయిన వ్యక్తికి ఏఐసీసీ పదవి దక్కడం జీర్ణించుకోలేకపోయారు. తాను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అడుగుతున్నా పార్టీ పట్టించుకోకపోవడం ఆయన ఆగ్రహానికి కారణమైంది.

మరోమాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ పార్టీ మారుతాడని వస్తున్న వార్తలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. ఆయన తన కుమారుడితో కలిసి త్వరలోనే కారెక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇద్దరు నేతలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ మధ్యవర్తిత్వం నడిపినట్టు తెలుస్తోంది. దానం, ముఖేష్‌తోపాటు గ్రేటర్‌ పరిధిలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కారెక్కేందుకు క్యూలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ సీనియర్లు దానం నాగేందర్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేశారు. మరోవైపు సీఎల్పీనేత జానారెడ్డి నివాసంలో సీనియర్లు అత్యవసరంగా భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై చర్చించారు. ఇటీవలే కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కారెక్కారు. ఇప్పుడు ఇద్దరు మాజీ మంత్రులు అదే దారిలోఉన్నారు. ఇది కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద కుదుపుగా మారింది. 2019 ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. కేసీఆర్‌ ఆడుతున్న పొలిటికల్‌ డ్రామాలో కాంగ్రెస్‌ నేతలు విలవిల్లాడుతున్నారు. మరికొంత మంది నేతలు కారెక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

06:40 - June 23, 2018

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి దానం నాగేందర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాజీనామా లేఖను పంపారు. నేడు తన అనుచరులతో కలిసి దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశంవుందని భావిస్తున్నారు. చాలా కాలంగా దానం కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2015 గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగానే టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాలని భావించి, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ రాకపోవడంతో... మంత్రి కేటీఆర్‌ లేదా హరీశ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాలని అధికార పార్టీల పెద్దల నుంచి అప్పట్లో సంకేతాలు అందాయి. దీంతో మనస్తాపానికి గురైన దానం తన ప్రయత్నాలను విరమించుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలు బుజ్జగించడంతో మెత్తపడ్డ దానం... అప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల పట్ల అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత దానం నాగేందర్‌ తన అనుచరులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్‌లో గుర్తింపు, గౌరవంతోపాటు పార్టీకి భవిష్యత్‌ కూడా లేదన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీలో జరిగిన పరిణామాలను తన అనుచరులకు వివరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంలో పార్టీ అధిష్టానం తాను సూచించిన నాయకుణ్ని కాకుండా సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ను నియమించడాన్ని అవమానంగా భావిస్తున్నారని అనుచరులతో చెప్పినట్టు సమాచారం. పార్టీ సీనియర్‌ నేతగా తన మాటకు విలువలేనప్పుడు కాంగ్రెస్‌లో ఉండకూడదని రాజీనామా చేసినట్టు అనుచరుల దృష్టికి తెచ్చారని వినిపిస్తోంది.

మరోవైపు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న తర్వాతే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. రాజీనామా తర్వాత దానంను కలిసి బుజ్జగించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నించినప్పటికీ ఫలితంలేకపోయింది. 1999, 2004లో ఆసిఫ్‌నగర్‌, 2009లో ఖైరతాబాద్‌ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన నాగేందర్ రాజీనామాతో సిటీ కాంగ్రెస్‌కు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం కష్టమని భావిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి.. నగరానికి చెందిన కాంగ్రెస్‌ నేత ముఖేష్‌గౌడ్‌ కూడా దానం బాటలోనే నడవనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి దానం, ముఖేష్‌గౌడ్‌లిద్దరూ ఒకేచోట ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం రాజీనామాకు గల కారణాలను దానం మీడియాకు వివరించనున్నారు. 

బీజేపీ జన చైతన్య యాత్రలు...

ఢిల్లీ : నేటి నుండి తెలంగాణ బిజెపి నేతలు యాత్ర చేపట్టనున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుండి జనచైతన్య యాత్రను బీజేపీ ప్రారంభించనుంది. భువనగిరిలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగసభ జరుగనుంది. 

ఛాంపియన్స్ ట్రోఫి హాకీ మ్యాచ్ లు...

నెదర్లాండ్స్ : నేటి నుండి ఛాంపియన్స్ ట్రోఫి హాకీ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 5.30గంటలకు జరిగే తొలి మ్యాచ్ లో పాక్ తో భారత్ తలపడనుంది. 

నేడు దానం భవిష్యత్ కార్యాచరణ ప్రకటన...

హైదరాబాద్ : టి.కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో ఆయన భేటీ అయ్యారు. తలసాని నివాసంలో టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపై చర్చించారు. నేడు మధ్యాహ్నం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు దానం తెలిపారు. దానం టీఆర్‌ఎస్‌లో చేరితే పూర్తిగా సహకారం అందిస్తామని... బీసీలకు టీఆర్‌ఎస్‌ పూర్తి న్యాయం

కొనసాగుతున్న సీఎం రమేశ్ దీక్ష...

కడప : ఉక్కు కర్మాగారం కోసం.. రాజ్యసభ సభ్యుడు సీఎంరమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడోరోజూ కొనసాగింది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు, మంత్రులు దీక్షకు సంఘీభావం తెలిపారు. 

జులై 1 నుండి టి.రేషన్ డీలర్ల సమ్మె...

హైదరాబాద్ : తెలంగాణలో రేషన్ డీలర్లు ఆందోళన బాట పట్టనున్నారు. గౌరవ వేతనం ఇవ్వాలని.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు.. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించపోతే జులై 1 నుంచి సమ్మె చేస్తామని... ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.

 

విజయ్ మాల్యాపై కొత్త చట్టం...

ఢిల్లీ : బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌లో తల దాచుకుంటున్న లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాపై ఈడీ కొత్త చట్టం ప్రయోగించేందుకు సిద్ధమైంది. మాల్యాను పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించాలని, నేరస్థుడి ట్యాగ్‌ ఇవ్వాలని కోరుతూ ముంబై ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. 

కాశ్మీర్ అంశంపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు...

ఢిల్లీ : కశ్మీర్‌ అంశంపై మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సైఫుద్దీన్‌ సోజ్‌ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. కశ్మీరీలు స్వాతంత్రానికే ప్రాధాన్యమిస్తారని పదేళ్ల క్రితం పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషరఫ్‌ చేసిన వ్యాఖ్యలను సైఫూద్దీన్‌ సమర్థించడం వివాదానికి దారి తీసింది

సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు..రెండో రోజు...

ఢిల్లీ : సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ భేటీలో జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. 

మహిళలపై సామూహిక అత్యాచారం...

జార్ఖండ్ : మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్న మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన జార్ఖండ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. స్వచ్ఛంద సంస్థ ఆశాకిరణ్‌కు చెందిన 11 మంది సభ్యుల బృందం ఈ నెల 19న రాంచీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొచాంగ్‌ ప్రాంతానికి వెళ్లింది. 

అమెరికాలో అక్రమంగా ప్రవేశించారని...

ఢిల్లీ : అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించారన్న కారణంతో మరో 42 మంది భారతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది సిక్కులు ఉన్నారు. వీరంతా న్యూమెక్సికోలో పట్టుబడ్డారు. వీరంతా మెక్సికో నుంచి ఎల్‌ పాసో వద్ద సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు.

Don't Miss