Activities calendar

24 June 2018

21:52 - June 24, 2018

యాదాద్రి : జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంపై జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి జగదీష్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి... రోజు వారీ వ్యవసాయ కూలీలు మృత్యువాత పడటం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామన్న ఆయన..  సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు అన్ని పనులూ పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళతోపాటు ఎక్స్‌గ్రేసియా కూడా అందించి బాధిత కుటుంబాలను ఆదుకుంటాం అంటున్న మంత్రి జగదీష్‌రెడ్డితో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:50 - June 24, 2018

యాదాద్రి : వారంతా వ్యవసాయ పనులు చేసుకునే కూలీలు. రోజూ లాగే వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్‌లో వెళ్తున్న వారిని మృత్యువు కబలించింది. ఎదురుగా వస్తోన్న బైక్‌ను తప్పించబోయి ట్రాక్టర్‌ మూసీ కాలువలో బోల్తా పడింది. యాదాద్రి జిల్లా వేములకొండ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది మృత్యువాత పడ్డారు. 
ట్రాక్టర్‌ బోల్తా..16 మంది మృత్యువాత  
యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. వేములకొండ సమీపంలో ఎదురుగా వస్తోన్న బైక్‌ను తప్పించబోయి ట్రాక్టర్‌ మూసీ కాలువలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో మొత్తం 31 మంది ఉన్నారు. ట్రాక్టర్‌ కాలువలో బోల్తా పడటంతో రెండేళ్ల చిన్నారి సహా 16 మంది మృత్యువాత పడ్డారు.  
డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ప్రమాదం  
వర్షాకాలం ప్రారంభం కావడంతో వేములకొండ చెరువు పక్కన పొలాల్లో పత్తి విత్తనాలు నాటేందుకు వ్యవసాయ కూలీలు ట్రాక్టర్‌లో బయలుదేరిన సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని రామన్నగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. అయితే ప్రమాదం అనంతరం ఘటనా స్థలం నుండి డ్రైవర్‌ పరారయ్యాడు. 
ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి 
ఈ ఘోర ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. 
బాధిత కుటుంబాలకు మంత్రి జగదీశ్‌ రెడ్డి పరామర్శ 
బాధిత కుటుంబాలను మంత్రి జగదీశ్‌ రెడ్డి పరామర్శించారు. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని... ఈ ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు. క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను, ఎమ్మెల్యేను మంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 
మంత్రి ప్రకటనపై బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు మండిపాటు
అయితే మంత్రి ప్రకటనపై బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు మండిపడ్డారు. ఎక్స్‌గ్రేషియా 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబీకులపై మంత్రి మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. చనిపోయినవారి కుటుంబీకులకు సానుభూతి ప్రకటించాల్సిందిపోయి మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతో 16 మంది వ్యవసాయ కూలీలు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

 

21:43 - June 24, 2018

హైదరాబాద్ : చిల్లర రాజకీయాలతో తెలంగాణ అభివృద్ధి ఆగదన్నారు సీఎం కేసీఆర్. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. ఏ ఎన్నికలు వచ్చినా విజయం తమదే అన్నారు.  కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్‌ను సీఎం కేసీఆర్‌ సాదరంగా స్వాగతం పలికారు. దానంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దానంతో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. 

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్‌ గులాబీ గూటికి చేరారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలో దానంకు మంచి భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్‌ చెప్పారు. దానంతో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. 

కష్టపడటం కోసమే టీఆర్‌ఎస్‌లో చేరతారన్నారు సీఎం కేసీఆర్‌. రాష్ట్రం పునర్‌నిర్మాణం కోసం పార్టీలోకి వచ్చిన దానంకు సీఎం అభినందనలు తెలిపారు.  వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాలు టీఆర్ఎస్‌కు ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు సీఎం. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తున్నారన్నారు. గ్రేటర్ చరిత్రలోనే 99 సీట్లు గెలిచిన ఘనత టీఆర్‌ఎస్‌దే అన్నారు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా ప్రజలు తమకే పట్టం కడతారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. 

టీఆర్‌ఎస్‌ గెలుపును ఓర్వలేకే కాంగ్రెస్‌ పిచ్చి ఆరోపణలు చేస్తూ టీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేస్తుందని కేసీఆర్‌ విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలనను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామన్నారు. 

30 ఏళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేయని అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ చేసి చూపిందన్నారు సీఎం కేసీఆర్‌. టీఆర్‌ఎస్‌ చేపట్టిన ప్రతి పథకం ప్రజల ప్రత్యక్ష అనుభవాల్లో ఉన్నాయన్నారు. దేశ రాజకీయంలోనే మంచి కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయన్నారు. 

ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రగతి చక్రం ముందుకే సాగుతుందన్నారు సీఎం. అసంబద్ధమైన మాటలు మాట్లాడితే అభాసుపాలవుతారని హితవు పలికారు. మానవీయ కోణంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. 

21:39 - June 24, 2018

హీరోయిన్ ఆమనితో 10టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన సినిమా అనుభవాలను తెలిపారు. తన సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. శుభలగ్నం, మావిచిగురు, ఆ నలుగురు లాంటి హిట్ చిత్రాలతోపాటు ఇటీవల వచ్చిన భరత్ అనే నేను సినిమాలో నటించారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

21:22 - June 24, 2018

కర్నూలు : ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం తొమ్మిది మంది మృతికి కారణమైంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లెలో... రాంగ్‌ రూట్‌లో ఆటోను నడపడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

కంటి చూపు కోసం నాటు వైద్యం చేయించుకునేందుకు తెల్లవారు జామున మహానందికి ఆటోలో బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లాలోని కోడుమూరు, గూడూరు, డోన్‌ మండలాల పరిధిలోని కాళ్లపరి, చనుగొండ్ల, రామళ్ల కోట గ్రామాలకు చెందిన దాదాపు 50 మంది కలిసి 4 ఆటోలలో బయలుదేరారు.  ముందుగా వెళ్లిన 3 ఆటోలు సురక్షితంగా వెళ్లాయి. చివరగా బయలుదేరిన ఆటో రోడ్డు క్రాస్‌ చేసేందుకు రాంగ్‌ రూట్‌లో వెళ్లగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో కాళ్లపరి గ్రామ సర్పంచ్‌ సంజ పోగు గౌరమ్మ కూడా ఉంది. 

ఘటనా స్థలాన్ని ఓర్వకల్లు ఎస్సై మధుసూదన్‌, ఉలిందకొండ ఎస్సై శరత్‌ కుమార్‌లు సందర్శించారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌ సత్యనారాయణ ఆర్‌డీఓ హుస్సేన్‌ సాహెబ్‌ ఆస్పత్రిలో మృతదేహాలను సందర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై నివేదికను సిద్ధం చేయాలని కర్నూలు రేంజ్ డి ఐ జి ఘట్టమనేని శ్రీనివాస్,అడిషనల్ ఎస్పి షేక్షావలిలు పోలీసు యంత్రాగానికి ఆదేశించారు. 

బాధితులను పలువురు రాజకీయ పార్టీనేతలు సందర్శించారు. మృతదేహాలను సందర్శించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదానికి గురైన కుటుంబీకులను 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గౌస్‌ దేశాయ్‌ షడ్రక్‌ డిమాండ్‌ చేశారు. గాయపడ్డవారికి ఆస్పత్రి ఖర్చులు ప్రభుత్వమే భరించాలన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్పీలను ఆదేశించారు. 

 

21:17 - June 24, 2018

కృష్ణా : ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు విస్తృత గాలింపు అనంతరం లభ్యమయ్యాయి. నిన్న మధ్యాహ్నం నుంచి గాలించిన రెస్క్యూ టీమ్స్ ఇవాళ మృతదేహాలను వెలికితీశాయి. దీంతో పవిత్ర సంగమం శోక సంద్రంగా మారింది. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 
నలుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం కృష్ణానది పవిత్ర సంగమం వద్ద గల్లంతైన నలుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్నటి నుంచి మృతదేహాల కోసం గాలింపు చేపట్టిన రెస్క్యూ టీం.. ఇవాళ మృతదేహాలను వెలికితీశాయి. ప్రవీణ్‌, చైతన్యరెడ్డి, శ్రీనాథ్‌, రాజ్‌కుమార్‌ మృతదేహాలను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతదేహాలకు... విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించారు.  
మృతుల కుటుంబసభ్యులను పరామర్శించిన మంత్రి దేవినేని 
సంఘటనాస్థలంలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రి దేవినేని పరామర్శించారు. సీఎం చంద్రబాబు ఆదేశంతో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలుతో పాటు కలెక్టర్‌, అధికారులు గాలింపులో పాల్గొన్నారన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో ప్రభుత్వం 5 లక్షలు.. కళాశాల యాజమాన్యం 5 లక్షలు చెల్లిస్తుందని తెలిపారు. 
ప్రమాదంపై తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు మండిపాటు 
మరోవైపు ఈ ప్రమాదంపై తల్లిదండ్రులతో పాటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సరైన భద్రత చర్యలు లేకపోవటం వల్లే తమ పిల్లలు మృత్యువాత పడ్డారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం వల్లే ప్రమాదాలు కొనసాగుతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. హంగామా కోసమే ఫెర్రీ ఘాట్‌ కట్టారని.. టూరిజం, ఇరిగేషన్‌ శాఖ మంత్రులు మొద్దు నిద్రలో ఉన్నారని మండిపడ్డారు.  మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు. 

 

20:58 - June 24, 2018

కడప : కడప ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ ఎంపీ  సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి చేస్తున్న దీక్షలో చిత్తశుద్ధి లేదని వైసీపీ విమర్శించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే టీడీపీ నాయకులు దీక్ష చేస్తున్నారని వైసీపీ నాయకులు మండిపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం శనివారం కడపలో ధర్నా చేసిన వైసీపీ నాయకులు ఆదివారం బద్వేల్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నాయకుల దీక్షపై తీవ్ర విమర్శలు చేశారు.     

కడప ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, ఆ పార్టీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి  కడపలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే... దీనికి పోటీగా ప్రతిపక్ష వైసీపీ నేతలు రోజుకోచోట  ధర్నాలు నిర్వహిస్తున్నారు. శనివారం కడపలో ఆందోళన నిర్వహించిన వైసీపీ నాయకులు... ఆదివారం బద్వేల్‌లో ధర్నా చేశారు. 

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం టీడీపీ నాయకులు చేస్తున్న దీక్షలు బూటకమని,  వారి ఆందోళనలో చిత్తశుద్ధిలేదని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు విమర్శించారు. నాలుగేళ్లపాటు బీజేపీతో అంటకాగిన టీడీపీ నాయకులకు ఇప్పుడు ఉక్కు కర్మాగారం గుర్తుకొచ్చిందని కడప ఎమ్మెల్యే అంజాద్‌ పాషా మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే టీడీపీ నాయకులు దీక్షలు చేస్తున్నారని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఉనికి కోసమే టీడీపీ నాయకులు దీక్షలు చేస్తున్నారని కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. 

కడప ఉక్కు కర్మాగారం సాధ్యంకాదని 2015లోనే ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పినా... నాలుగేళ్లు నిర్లక్ష్యం చేశారని మాజీ  ఎంపీ అవినాశ్‌రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ  నాయకులు దీక్షలు చేస్తున్నారని అవినాశ్‌రెడ్డి మండిపడ్డారు. కడప ఉక్కు కర్మాగారం, ఏపీకి ప్రత్యేక హోదా సాధించి, విభజన హామీలు అమలు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వైపీసీ నాయకులు స్పష్టం చేశారు.
కడప ఉక్కు కర్మాగారం కోసం బద్వేల్‌లో వైసీపీ నాయకుల ధర్నా 

టీఆర్ ఎస్ పథకాలు గుప్తంగా లేవు... డైరెక్టర్ గా ఉన్నాయన్న సీఎం

హైదరాబాద్ : టీఆర్ ఎస్ ప్రభుత్వ పథకాలు ప్రజల యొక్క అనుభవంలో ఉన్నాయని..గుప్తంగా లేవని డైరెక్టర్ గా ఉన్నాయన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరులో 10 లక్షల ఎకరాలకు నీరు పారుతుందన్నారు. 12 వేల కోట్ల రూపాయలను రైతులకు పంచామని చెప్పారు. రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని..అయితే జరిగింది తక్కువ, జరగాల్సింది ఎక్కువగా ఉందన్నారు. 

ప్రజల కోసం ఎన్నో పథకాలు చేపట్టాం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల కోసం ఎన్నో పథకాలు చేపట్టామని చెప్పారు. సీఎం కేసీఆర్ సమక్షంలో దానం నాగేందర్ టీఆర్ ఎస్ లో చేరారు. కేసీఆర్ కండువా కప్పి దానం నాగేందర్ ను ఆహ్వానించారు. నాగేందర్ పాజిటివ్ స్టెప్ తీసుకున్నారుని...ఆయన తన సహకారం పూర్తిగా ఉంటుందని సీఎం అన్నారు. తెలంగాణలో అద్భుతమైన వనరులున్నాయని చెప్పారు. 

20:34 - June 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల కోసం ఎన్నో పథకాలు చేపట్టామని చెప్పారు. సీఎం కేసీఆర్ సమక్షంలో దానం నాగేందర్ టీఆర్ ఎస్ లో చేరారు. కేసీఆర్ కండువా కప్పి దానం నాగేందర్ ను ఆహ్వానించారు. నాగేందర్ పాజిటివ్ స్టెప్ తీసుకున్నారుని...ఆయన తన సహకారం పూర్తిగా ఉంటుందని సీఎం అన్నారు.    తెలంగాణలో అద్భుతమైన వనరులున్నాయని చెప్పారు. టీఆర్ ఎస్ ప్రభుత్వ పథకాలు ప్రజల యొక్క అనుభవంలో ఉన్నాయని..గుప్తంగా లేవని డైరెక్టర్ గా ఉన్నాయన్నారు. పాలమూరులో 10 లక్షల ఎకరాలకు నీరు పారుతుందన్నారు. 12 వేల కోట్ల రూపాయలను రైతులకు పంచామని చెప్పారు. రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని..అయితే జరిగింది తక్కువ, జరగాల్సింది ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్ర అదాయం మంచిగా ఉందని తెలిపారు. తెలంగాణకు సొంత వనరుల ద్వారా వచ్చే ఆదాయం 20 శాతం పైగా ఉందన్నారు. నిబద్ధతతో పని చేయాలని సూచించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పశువులకు అంబులెన్స్ తెచ్చారని మెచ్చుకున్నారు. మిషన్ భగీరథ పనులు దగ్గర పడ్డాయని...పూర్తి అవుతాయన్నారు. మళ్లీ టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో కంపు పోవాలని, మురికి పోవాలన్నారు. హైదరాబాద్ సిటీ స్వర్గసీమ కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ ను సుందరమైన నగరంగా తయారు చేస్తామన్నారు. నగరంలో బతకగల్గే విధంగా ఉండాలన్నారు. బంగారు తెలంగాణ తయారు కావాలని పేర్కొన్నారు. నాలుగు ఏండ్లలో తెలంగాణ ప్రశాంతంగా ఉందని చెప్పారు. మైనారిటీలకు 204 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని తెలిపారు. బీసీలకు 119 పాఠశాలలు ఏర్పాటు చేశామని...మొత్తం 594 బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ 
ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రగతిచక్రం ముందుకే పోతుంది తప్ప వెనక్కి పోదన్నారు. పట్టుదలతో చేస్తే ఎదైనా సాధ్యమేనని చెప్పారు. పిచ్చిమాటలు, అసంబద్దంగా మాట్లాడితే అభాసుపాలవుతారని సూచించారు. వచ్చిన భాషలో మాట్లాడాలని..రాని భాషలో మాట్లాడకూడదన్నారు. ఏపీలో డంకీలు తప్ప ఏమీ లేదని ఎద్దేవా చేశారు. 

 

19:39 - June 24, 2018

యాదాద్రి : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేములకొండ సమీపంలో మూసీ కాలువలోకి ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 31 మంది ఉన్నట్లు సమాచారం. మృతులంతా వ్యవసాయ కూలీలే. వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా బైక్‌ను తప్పించబోయి ట్రాక్టర్‌ మూసీ కాలువలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. మృతులంతా వేములకొండకు చెందినవారే. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, తక్షణ సహాయకచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 
ప్రత్యక్ష సాక్షితో ఫేస్ టు ఫేస్ 
యాదాద్రి భువనగిరి జిల్లా వేముల కొండలో జరిగిన ఘోర ప్రమాదంలో మొత్తం 16 మంది మృతి చెందారు. అయితే ప్రమాద స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి గీతాకార్మికుడు ప్రమాద ఘటనను వివరించారు. ఆయనతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌
నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

19:25 - June 24, 2018

విజయవాడ : వైఎస్‌ జగన్‌పై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్‌ అయ్యారు. జగనమోహన్‌రెడ్డి లాంటి అవినీతి పరున్ని ఎక్కడా చూడలేదన్నారు. ఇరిగేషన్‌ మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిర్మాణాత్మకమైన అవగాహన లేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులకు అవార్డులు వస్తుంటే ఓర్వలేక జగన్‌ తిట్ల కార్యక్రమం మొదలుపెట్టారన్నారు.

19:23 - June 24, 2018

విజయవాడ : దేశంలో ఏ ప్రాజెక్టులకు దక్కని అవార్డులు ఏపీలోప్రాజెక్టులకు దక్కాయన్నారు మంత్రి దేవినేని.  స్కోచ్‌ అవార్డులో రాష్ట్ర జలవనరుల శాఖ 12 అవార్డులను దక్కించుకుందన్నారు. తొమ్మిది ప్రాజెక్టులను జ్యూరీ ముందు పెడితే.. అవార్డులకు తొమ్మిది ప్రాజెక్టులు ఎంపికయ్యాయన్నారు. స్కోచ్‌ శాఖలో ఇన్ని అవార్డులు రావడమనేది రాష్ట్ర ప్రజలు హర్షించాల్సిన విషయమన్నారు. 

 

సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన దానం నాగేందర్

హైదరాబాద్ : దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో దానం చేరారు. తన అనుచరులతో కలిసి దానం గులాబీ పార్టీలో చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

 

మీడియాపై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి

యాదాద్రి : వేములకొండ ట్రాక్టర్ ప్రమాద బాధితులను మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. మీడియాపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మీడియాకు చెప్పాలా అంటూ లోగోను నెట్టారు. నాటకాలు ఆడుతున్నారా... అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

16:14 - June 24, 2018

యాదాద్రి : జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేములకొండ సమీపంలో మూసీ కాలువలోకి ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 25 మంది ఉన్నట్లు సమాచారం. మృతులంతా వ్యవసాయ కూలీలే. వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి ట్రాక్టర్‌ మూసీ కాలువలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. మృతులంతా వేములకొండకు చెందినవారే. మృతదేహాలు రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, తక్షణ సహాయకచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇదిలావుంటే... ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ పరారయ్యాడు. 
మీడియాపై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి 
వేములకొండ ట్రాక్టర్ ప్రమాద బాధితులను మంత్రి పరామర్శించారు. మీడియాపై మంత్రి జగదీష్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. మీడియాపై జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మీడియాకు చెప్పాలా అంటూ లోగోను నెట్టారు. నాటకాలు ఆడుతున్నారా.. అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి జగదీష్ రెడ్డిది బాధ్యతారాహిత్యం
ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు అని స్థానికులు, మృతుల బంధువులు అంటున్నారు. ఈ ఘటనకు ప్రభుత్వామే బాధ్యత వహించాలని అన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని..దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.  

 

 

12:59 - June 24, 2018

కొమరం భీం : ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా మండలంలో 33 ప్రభుత్వ పాఠశాలల తలుపులు తెరుచుకోలేదు. అయినా విద్యాశాఖాధికారులు మౌనంగానే ఉండిపోయారు. కానీ.. ఒక పోలీసు అధికారి విద్యార్ధులకు విద్యను అందించాలని పట్టుపట్టాడు. టీచర్లు, స్థానికులతో మాట్లాడి ఏకంగా 30 పాఠశాలలను తెరిపించాడు. పోలీసు అధికారి స్పందించిన తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కుమురం భీం అసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌ మండలంలో ఎస్‌ఐ రామారావు పేరు మారుమోగుతుంది. ఇలాంటి పోలీసును ఇప్పటి వరకు చూడలేదని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మారుమూల గ్రామాలలోని పిల్లల జీవితాల్లో కొత్త వెలుగు నింపడానికి మూతపడిన 30 స్కూళ్లను తెరిపించాడు ఎస్ఐ రామారావు. విద్యార్థుల చదువులు అర్థాంత్రంగా ఆగిపోకుండా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాడు.

బెజ్జూర్‌ మండలంలో సుమారు ముప్పైమూడు పాఠశాలలు టీచర్స్‌ లేక ఈ సంవత్సరం ఇప్పటికీ తెరుచుకోలేదు. గతంలో విద్యావాలంటరీలతో పాఠశాలలను నడిపిన అధికారులు ఈ ఏడాది అలాంటి చర్యలు చేపట్టలేదు. ఉన్న కొద్దిమంది ప్రభుత్వ టీచర్లు బదిలీల కోసం వేచి చూస్తున్నారు. దీంతో మండలంలోని స్కూల్స్ మూతపడిపోయాయి. దీంతో ఎస్‌ఐ రామారావు విద్యార్థులకు ఎలాగైనా విద్యనందించాలని నిర్ణయించుకున్నాడు. బెజ్జూర్‌ మండలంలో విద్యార్థుల తల్లిదండ్రులతో, అధికారులతో, గతంలో పనిచేసిన విద్యవాలంటరీలతో సమావేశం ఏర్పాటు చేశాడు. విద్యార్థుల భవిష్యత్‌ దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు చదువులో వెనకబడకుండా చూడాలన్నాడు. విద్యవాలంటరీలకు వేతనం అందిచాలని కోరాడు. దీనికి ప్రైవేటు టీచర్స్ కూడా సహకరించాలని తెలిపాడు. దీంతో మూసి ఉన్న మూప్పై స్కూల్స్‌ మళ్ళీ తెరుచుకున్నాయి.

ఎస్‌ఐ రామారావు చొరవతో మారుమూల గ్రామాలలో విద్యార్థులు మళ్లీ స్కూల్స్‌కి వెళ్తున్నారు. స్కూళ్ల ప్రారంభానికి కృషి చేసిన ఎస్‌ఐ రామారావు పనితీరు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌ఐ రామారావు గతంలోనూ పని ప్రతిచోట ఎన్నో సామాజికి కార్యక్రమాలు చేపట్టారు. ఎస్‌ఐ రామారావు పనితీరు మెచ్చిన పలువురు ఆయనకు హ్యాట్సాప్‌ చెబుతున్నారు. 

12:56 - June 24, 2018

హైదరాబాద్ : రాష్ర్టవ్యాప్తంగా వేబ్రిడ్జీలపై తెలంగాణ తూనికలు, కొలతల శాఖ మెరుపు దాడి చేసింది. వేబ్రిడ్జీల్లో మోసాలపై అందిన ఫిర్యాదుల మేరకు అ ధికారులు తనిఖీలు హించారు. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జీలను సీజ్‌ చేశారు. తూనికలు, కొలతల శాఖ రాష్ర్ట వ్యాప్తంగా వేబ్రిడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న 35 వేబ్రిడ్జీలను సీజ్‌ చేశారు.రీజనల్‌ డిప్యూటీ కంట్రోలర్‌ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్‌ జగన్‌మోహన్‌ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ తనిఖీలు నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా ఆటోనగర్‌లోని పంతంగి వేబ్రిడ్జీ, సాగర్‌ రింగ్‌రోడ్డులోని జై హనుమాన్‌ వేబ్రిడ్జీ, కర్మన్‌ఘాట్‌లోని పైసల్‌ వేబ్రిడ్జీ, శంషాబాద్‌లోని రామ ధర్మకాంట, గోల్డెన్‌ వేబ్రిడ్జీలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం గుర్తించిన అధికారులు కేసు నమోదు చేశారు.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 5, మేడ్చల్‌లో 4, భూపాలపల్లిలో 3, నిర్మల్‌లో 2, కరీంనగర్‌లో 2, సిరిసిల్ల 1, వరంగల్‌ రూరల్‌లో 2, జనగామ్‌లో 2, జయశంకర్‌ భూపాలపల్లిలో 3, ఖమ్మంలో 2, కొత్తగూడెం 2, నిజామాబాద్‌లో 1, సంగారెడ్డిలో 3, సిద్ధిపేట్‌లో 1, సూర్యాపేటలో 1, యాదాద్రి భువనగిరిలో 1, మహబూబ్‌నగర్‌లో 1, నాగర్‌కర్నూలులో 2 కేసులు నమోదు చేశారు.

జైహనుమాన్‌ వేబ్రిడ్జీ యజమాని, కంప్యూటర్‌ ఆపరేటర్‌, లారీ డ్రైవర్లు కుమ్మక్కైనట్లు ఈ తనిఖీల్లో తేలింది. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలింది. వేబ్రిడ్జీ కంప్యూటర్‌లో ఎంత బరువు నమోదు చేస్తే అంతే బరువు చూపించేలా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో వేబ్రిడ్జీలోఉన్న ఓ లారీని సీజ్‌ సీజ్‌ చేశారు. మొత్తానికి రాష్ర్ట వ్యాప్తంగా మెరుపు దాడులు చేసిన అధికారులు.. మోసాలకు పాల్పడుతున్న వేబ్రిడ్జీలపై కొరడా ఝులిపించారు.

12:52 - June 24, 2018

చిత్తూరు : తిరుమలలో బెలూన్లు విక్రయిస్తున్న 17 మంది బాల కార్మికులను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. బెలూన్లు విక్రయిస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని భక్తులు టీటీడీ ఈవోకు ఫిర్యాదు చేయడంతో... దాడులు నిర్వహించి పిల్లలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

12:50 - June 24, 2018

విజయవాడ : ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీకి ఓటు వేయమని అడగడం రాజ్యాంగ విరుద్ధమని వైసీపీ నాయకుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఇక్బాల్‌ విమర్శించారు. నాలుగేళ్లపాటు సామాన్యులను విస్మరించిన చంద్రబాబుకు ఎన్నికల ముందు వీరు గుర్తు వస్తున్నారని ఇక్బాల్‌ మండిపడ్డారు. 

12:49 - June 24, 2018

చిత్తూరు : ఏపీ హెచ్ఆర్డీ మంత్రి గంటా శ్రీనివాసరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గంటాకు వేదపడిందితులు ఆశీర్వచనాలు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన అన్ని కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగాలని స్వామిని కోరుకున్నట్టు ఈ సందర్భంగా గంటా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ పాటిస్తున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ధృడసంకల్పంతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. విభజన చట్టంలోని హామీలు అలయ్యే విధంగా చూడాలని శ్రీవారిని ప్రార్థించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షలు నిర్విగ్నంగా కొనసాగాలని శ్రీవారిని ప్రార్థించినట్టు గంటా చెప్పారు. 

12:23 - June 24, 2018

విశాఖపట్టణం : ఏజెన్సీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. అరకులో డెంగ్యూ వ్యాధితో ఓ మహిళ మృతి చెందడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అరకు, పాడేరు మండలాల్లో 50 మందికి డెంగ్యూ వ్యాధి సోకినట్లు గుర్తించి విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. విష జ్వరాలు ప్రబలడంతో ఏజెన్సీ వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

క్షీణిస్తున్న సీఎం రమేశ్ ఆరోగ్యం..

కడప : జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని వైద్యులు వెల్లడించారు. 

12:11 - June 24, 2018

యాదాద్రి : జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో దద్దరిల్లింది. తమ వారు ఇక లేరని జీర్ణించుకోలేకపోతున్నారు. వెళ్లి వస్తామని చెప్పిన వారు ఇక తీరని లోకాలకు వెళ్లిపోవడంతో వారి రోదన వర్ణనాతీతంగా ఉంది. యాదాద్రి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఏకంగా 15 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో 14 మంది మహిళలు, ఓ బాలుడున్నారు. 

వేములకొండ సమీపంలో ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులంతా వ్యవసాయ కూలీలు. వీరంతా వేములకొండ వాసులు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 19 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన అనంతరం డ్రైవర్ పరారయ్యాడని తెలుస్తోంది. మృతదేహాలను రామన్న పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి ట్రాక్టర్ అదుపు తప్పినట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. 

కేసీఆర్ దిగ్ర్భాంతి...

యాదాద్రి : జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వేములకొండ ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో 17 మంది మృతి చెందారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. 

మృతుల కుటుంబాలను పరామర్శించిన సీపీఎం నేతలు...

కర్నూలు : రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలను సీపీఎం నేతలు గౌస్ దేశాయ్, షడ్రక్ లు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇవి ప్రభుత్వ హత్యలే తప్ప ప్రమాదం కాదన్నారు. 

11:23 - June 24, 2018

యాదాద్రి : వలిగొండ..బలిగొండగా మారిపోయింది. రోడ్డు ప్రమాదంలో 10 మంది వ్యవసాయ కూలీలు మృతి చెందడం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. వ్యవసాయ పనుల నిమిత్తం పలువురు కూలీలు ట్రాక్టర్ లో వెళుతున్నారు. లక్ష్మాపూర్ సమీపంలో కల్వర్టు పై నుండి వెళుతుండగా అదుపుతప్పిన ట్రాక్టర్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. మూసీ కాల్వలో పడిపోవడంతో ట్రాక్టర్ కింద చిక్కుకపోయారు. అక్కడికక్కడనే పది మంది చనిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద విషయాన్ని పోలీసులకు, అధికారులకు తెలియచేశారు. కానీ సహాయక చర్యలు ఆలస్యంగా కొనసాగాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఏడు మృతదేహాలను బయటకు తీశారు. మరో 15 మంది ఆచూకి తెలియడం లేదు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 30 మంది ఉన్నట్లు సమాచారం. దీనితో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

11:19 - June 24, 2018

విజయవాడ : ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పవిత్రసంగమం వద్దకు వెళ్లి మృతి చెందిన నలుగురు విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీనితో మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాలేజీ యాజమాన్య తీరును తీవ్రంగా నిరసిస్తున్నారు. మంత్రి దేవినేని ఉమ ఆసుపత్రికి చేరుకుని కుటుంబసభ్యులను పరమార్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ తరపున రూ. 5 లక్షలు, కాలేజీ యాజమాన్యం తరపు నుండి రూ. 5లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనిపై తల్లిదండ్రులు ఆక్షేపించినట్లు సమాచారం. కాలేజీలోని విద్యార్థులకు సరియైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, కాలేజీ యాజమాన్యాలపై సరియైన దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే 22గంటల పాటు 120 మంది సిబ్బంది గాలించి నలుగురు మృతదేహాలను బయటకు తీశారు. పట్టిసీమ నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నా..గుర్రపు డెక్క ఉన్నా...గాలింపు చర్యలు మాత్రం చేపట్టారు. ప్రవీణ్‌, చైతన్య, శ్రీనాథ్‌ మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో రాజ్‌కుమార్‌ మృతదేహం కూడా చేరుకోనుంది. 

నాలుగేళ్లలో విద్యా వ్యవస్థ మెరుగైంది - గంటా...

చిత్తూరు : నాలుగేళ్లలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడం జరిగిందని, 2014లో 17వ స్థానంలో ఉంటే ప్రస్తుతం మూడో స్థానంలో ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌళిక సదుపాయాలు, పోస్టుల భర్తీలు చేపట్టడం జరిగిందన్నారు. అన్ని స్కూల్స్, కాలేజీల్లో టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. 

యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం...

యాదాద్రి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేములకొండ సమీపంలో మూసీ కాలువలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో పది మంది వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో 30 మంది కూలీలున్నారు. 

10:33 - June 24, 2018

కరీంనగర్‌ : జిల్లాలో దాదాపు మూడు దశాబ్దాల డెత్‌ మిస్టరీలు వీడాయి. 29 ఏళ్ల క్రితం వరద ఉధృతికి వంతెన పై నుంచి లారీ కొట్టుకు పోయింది. ఆ నాటి నుంచి తమ వారిని వెతకాలని మృతుల కుటుంబీకులు చేసిన ఆందోళనలు ఎట్టకేలకు ఫలించి వారిని శోకసముద్రంలో ముంచ్చెత్తాయి. వరద ఉధృతిలో జల సమాధి అయిన నలుగురి మృతదేహాల ఆనవాళ్లను పోలీసులు గుర్తించి వారి అస్థిపంజరాలను బయటకు తీశారు. కరీంనగర్‌ జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగిన ఈ విషాదం ఘటనపై 10 టీవీ ప్రత్యేక కథనం. కరీంగనర్‌ జిల్లాలో 29 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన లారీ మిస్టరీ వీడింది. ఆనాడు పెద్దపల్లి నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న లారీ ఇరుకుల్ల వంతెనకు చేరే సరికి వాగు ఉప్పొంగడంతో.. వంతెన పై లారీ కొట్టుకు పోయింది. ప్రమాద సమయంలో లారీలో ఆరుగురు ప్రయాణిస్తుండగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఒక వ్యక్తి మృతదేహం మాత్రమే బయటపడింది. మిగతా నలుగురు ఆచూకీ మిస్టరీగా మారింది. అప్పట్లో చనిపోయిన వారిలో కేశవపట్నంకు చెందిన అన్నదమ్ములు దౌలత్‌ ఖాన్‌, ముగ్దూంఖాన్‌లతో పాటు కరీంనగర్‌ చెందిన శంకర్, వెంకట స్వామిలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతులు నలుగురు పశువుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. వ్యాపార రిత్యా పెద్దపల్లి నుంచి కరీంనగర్‌ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

లారీ కొట్టుకు పోయిన ఘటనతో అప్పటి జిల్లా యంత్రాంగం లారీని బయటకు తీసే ప్రయత్నం చేసింది. లారీకి సంబంధించిన బాడీ మాత్రమే బయటకు తీసి క్యాబిన్‌ను మాత్రం బయటకు తీయలేకపోయింది. ఇసుకలో పూడుకు పోయిన క్యాబిన్‌ ఆచూకీని కనిపెట్టడం కష్టంగా మారిందని అధికారులు అన్నారు. అయితే మృతుల కుటుంబీకులు తమ వారి మృతదేహాలను బయటకు తీయాలని అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. 29 ఏళ్లుగా తమ వారిని కడసారి చూసుకోలేక కుటుంబ సభ్యులు తీరని శోకాన్ని అనుభవించారు.

ప్రస్తుతం ఇరుకుల్ల వాగులో ఇసుక తవ్వకాలు జరుగుతుండడంతో తుప్పు పట్టిన లారీ క్యాబిన్‌ బయట పడింది. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీస్‌, రెవెన్యూ అధికారులు తవ్వకాలు చేపట్టారు. ఇసుకలో కూరుకు పోయిన ముగ్గురి అస్థి పంజరాలను బయటకు తీసి పంచనామ నిర్వహించారు. ఒక పుర్రె అస్థికలు, బ్లూ కలర్‌ షర్టు ఉండటంతో అది దౌలత్‌ ఖాన్‌దిగా గుర్తించారు. మరో రెండు అస్థికలకు తెల్ల చొక్కాలు ఉండటంతో అవి ముగ్దుంఖాన్‌, శంకర్‌లుగా గుర్తించారు. మరో మృతుడు వెంకటస్వామి అస్థికల కోసం గాలింపు కొనసాగుతోంది.

ఆనాటి ప్రమాద ఘటనలో బయటపడ్డ శ్రీనివాస్‌ మృతులను తలుచుకొని బాధపడ్డాడు. ప్రాణాలను రక్షించుకోవడానికి నీటిలో ఈదుకుంటూ ఒడ్డున చేరినప్పటికీ.. కళ్ల ముందే తనతో ప్రయాణం చేసిన మిత్రులంతా గల్లంతయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ముగ్గురి అస్థి పంజరాలు లభించడంతో మరో అస్థిపంజరం కోసం గాలింపు కొనసాగుతోంది. వెంకటస్వామి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీటి పర్యాంతం అయ్యారు. 29 ఏళ్ల కిందట జరిగిన ఘటనను తలుచుకొని కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు అక్కడున్నవారిని కలచివేసింది. మొత్తానికి గత 29 ఏళ్లుగా మిస్టరీగా మారి కొనసాగుతూ వచ్చిన ఈ విషాద ఘటన ఇసుక తవ్వకాలతో ముగిసింది. 

10:25 - June 24, 2018

కృష్ణా : జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు నదిలో విస్తృతంగా గాలింపుచేపట్టాయి. అయితే రాత్రి వరకు విద్యార్థుల ఆచూకీ లభించలేదు. చీకటిపడటంతో గాలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. ఆదివారం ఉదయం గల్లంతైన ప్రవీణ్‌, చైతన్య, శ్రీనాథ్‌, రాజ్‌కుమార్‌ మృతదేహాలను వెలికి తీశారు. వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయాయి. 

10:13 - June 24, 2018

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం...

కర్నూలు : కోడుమూరు మండలం కల్లపాడుకు చెందిన 13 మంది నాటు వైద్యం కోసం మహానందికి బయలుదేరిన ఆటోను ఆర్టీసీ హైటెక్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 7మృతి చెందగా 5మందికి గాయాలయ్యాయి.

 

 

09:01 - June 24, 2018
09:00 - June 24, 2018
08:58 - June 24, 2018
08:56 - June 24, 2018

కర్నూలు : అతివేగం..డ్రైవింగ్ లో నిర్లక్ష్యం...తో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధిక మంది ప్రయాణీకులను ఎక్కించుకొని ప్రయాణీంచవద్దని చ చెబుతున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు. దీనితో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ తనిఖీలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోడుమూరు మండలంకల్లపాడుకు చెందిన 13 మంది నాటు వైద్యం కోసం మహానందికి ఆటోలో బయలుదేరారు. ఓర్వకల్లు మండలం సోమయాజుపల్లె వద్దకు రాగానే మహానంది నుండి హైదరాబాద్ కు వెళుతున్న హై టెక్ బస్సు - ఆటోలు ఢీకొన్నాయి. దీనితో అక్కడికక్కడనే ఏడుగురు మృత్యువాతపడగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలు, ఒక వ్యక్తి మృతి ఉన్నారు. అధిక మందిని ఎక్కించుకోవడం..ఆటో వేగంతో ప్రయాణించడం..ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా అధిక వేగంతో ప్రయాణించడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 

ఓర్వకల్లు వద్ద ఘోర ప్రమాదం...

కర్నూలు : ఓర్వకల్లు మండలం సోమయాజుపల్లె వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఆర్టీసీ హైటెక్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో ఐదు మందికి గాయాలయ్యాయి. కోడుమూరు మండలం కల్లపాడు వాసులుగా గుర్తించారు. 

07:02 - June 24, 2018

ఢిల్లీ : హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. టోర్నీ ఏదైనా.. ప్రత్యర్థి పాకిస్థాన్ అయితే ఆధిపత్యం భారత్‌దేనని మరోసారి రుజువైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-0 తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ఆద్యంతం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ ప్రత్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించింది. మన్‌దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా.. దిల్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ చెరో గోల్ కొట్టి భారత్‌ను విజయపథంలో నడిపించారు. తొలి క్వార్టర్ 25వ నిమిషంలో ఫస్ట్‌గోల్ చేసిన టీమిండియా ప్లేయర్లు.. ఆట చివరి ఐదు నిమిషాల్లో చెలరేగిపోయారు. భారత్‌ దూకుడుకు పాక్‌ ఆటగాళ్ల నుంచి సమాధానమే లేకుండా పోయింది. గోల్ చేసేందుకు పాకిస్థాన్‌ ప్లేయర్లకు భారత డిఫెండర్లు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన పాకిస్థాన్ చేతులెత్తేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ పోటీల్లో బెల్జియం, హాలెండ్, భారత్, పాక్, అర్జెంటైనా, ఆస్ట్రేలియా దేశాలు తలపడుతున్నాయి. కాగా ఇవాళ ఒలింపిక్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాతో భారత్‌ తలపడనుంది. 

06:56 - June 24, 2018

విజయనగరం : ప్రభుత్వ పథకాల అమలులో చంద్రబాబు అవినీతికి పాలు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. చంద్రబాబు తనపై విచారణ చేయించుకుంటే అవినీతిని నిరూపిస్తానని సవాల్‌ విసిరారు. విజయనగరం జిల్లాలో జరుగుతున్న మహాసంపర్క్‌ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబు రాష్ట్ర ప్రజలతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశారని అన్నారు. కులాలకు హామీలు ఇస్తూ... వారిని మోసం చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. 

06:52 - June 24, 2018

కడప : ఉక్కు పరిశ్రమ కోసం ప్రాణం పోయినా లెక్క చేయనని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ అన్నారు. ఆరోగ్యం క్షీణించినా దీక్ష కొనసాగిస్తామన్నారు. ఉక్కు పరిశ్రమ సాధన కోసం సీఎం రమేశ్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజు కొనసాగుతోంది. విభజన హామీలను కేంద్రం విస్మరించిందని రమేష్‌ మండిపడ్డారు. ప్రజల సహకారంతో దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. దీక్షలో ఉన్న ఎంపీ రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి రిమ్స్‌వైద్యులు పరీక్షించి వారి షుగర్‌ లెవల్స్‌ తగ్గుతున్నాయని తెలిపారు. ఇద్దరూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీక్షా శిబిరంలో సీఎం రమేష్‌ వెంట ఆయన కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు.

06:49 - June 24, 2018

జనగామ : జిల్లా చిలుపూర్‌లో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీఆర్‌ఎస్‌ నేత రాజారపు ప్రతాప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్సిడీ ట్రాక్టర్ల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజయ్య వర్గీయులు అడ్డుకున్నారు. చిలుపూరు గుట్ట గ్రామ పంచాయతీ ఏర్పాటును రాజారపు ప్రతాప్‌ అడ్డుకున్నారంటూ రాజయ్య వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే... ఏ పదవి లేని ప్రతాప్‌ పంచాయతీ ఏర్పాటును ఎలా అడ్డుకుంటారని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. దీంతో రాజారపు ప్రతాప్‌, రాజయ్య వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. ప్రతాప్‌ వర్గంపై రాజయ్య వర్గీయులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మార్గడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

 

06:46 - June 24, 2018

హైదరాబాద్ : పంచాయితీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్‌పై సీఎం కేసీఆర్ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్స్‌ను జనాభా ప్రతిపాదికన కేటాయించినప్పుడు బీసీ రిజర్వేషన్స్‌ను ఎందుకు కేటాయించారని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. 

06:43 - June 24, 2018

కరీంనగర్ : పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలో చేర్చాలన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన సీపీఐ సమావేశంలో పాల్గొన్న నారాయణ... డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు పెరుగుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్‌ నెరవేర్చాలన్నారు నారాయణ. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న చాడ వెంకటరెడ్డి... 2019 ఎన్నికల్లో హుస్నాబాద్‌లో సీపీఐ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 

06:41 - June 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ వ్యవసాయ శాఖకు ప్రతిష్టాత్మక ఇండియా టుడే అవార్డు లభించింది. వ్యవసాయ రంగంలో వేగవంతమైన ప్రగతిని సాధిస్తున్నందుకు గాను రాష్ట్రానికి ఈ అవార్డును ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ చేతుల మీదుగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అవార్డును అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అయినా వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వ్యవసాయరంగం ప్రభుత్వం కృషికి గుర్తింపుగా ప్రకటించిన అవార్డును ఆయన ఢిల్లీలో అందుకున్నారు.

వ్యవసాయానికి కీలకమైన వనరులు విద్యుత్తు, సాగునీరు, పెట్టుబడి. రాష్ట్రంలో 23 లక్షల కరంటు మోటార్లకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నామన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. కోటి ఎకరాలకు సాగునీరందించడానికి లక్షా యాబైవేల కోట్లతో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. అంతేకాదు రాష్ట్రంలో రైతన్నలకు అండగా నిలిచేందుకే రైతుబంధు పథకం చేపట్టాంన్నారు. పంట పెట్టుబడిగా ప్రతి సీజన్ కు 4000 వేలు అందిస్తున్నామన్నారు. అలాగే 18 నుండి 60 ఏళ్ళ వయస్సు కలిగిన ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల బీమాను అందిస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నారని మంత్రి పోచారం అన్నారు. రైతులకు సలహాలు, సూచనలను అందించడానికి ప్రతి 5000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించామన్నారు. పంటఉత్పత్తులను దాచుకోవడానికి 1174 కోట్లతో పద్దెనిమిదిన్నర లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములను నూతనంగా నిర్మించామన్నారు. అంతేకాదు ప్రతి రైతు భూమిని పరీక్ష చేసి సాయిల్ హెల్త్ కార్డులను అందిస్తున్నాం. భవిష్యత్తులో కూలీల కొరత అధికంగా ఉంటుందని, వ్యవసాయ యంత్రీకరణకు ప్రాముఖ్యతను ఇస్తున్నామని మంత్రి పోచారం తెలిపారు.

వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని మంత్రి తెలిపారు. 75 శాతం సబ్సిడీతో రాష్ట్రంలోని ఏడు లక్షల మందికి గొర్రెలను సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. అలాగే మత్స్య పరిశ్రమ అభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. దీనికోసం రాష్ట్రంలోని లోని 78 మీడియం ప్రాజెక్టులు, 46వేల చెరువులలో ఉచితంగా చేప విత్తనాన్ని సరఫరా చేసి మత్య్సకారులకు లాభాలు వచ్చే విదంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అహర్నిషలు చేస్తున్న కృషికి దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తోందని ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

06:39 - June 24, 2018

హైదరాబాద్ : దానం నాగేందర్‌ రాజీనామాతో కాంగ్రెస్‌ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. హుటాహుటిన తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జులు, టీ-పీసీసీ చీఫ్‌ వార్‌రూమ్‌లో సమావేశమై... తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. బీసీలకు అన్యాయం జరుగుతుందన్న దానం వ్యాఖ్యలను ఖండించిన నేతలు... పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు దానం రాజీనామా చేయడం.. మరికొంత మంది పార్టీ వీడుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలు భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియాతో పాటు కొత్తగా నియమితులైన ముగ్గురు ఇన్‌చార్జులు, టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

దానం పార్టీ వీడడంపై కుంతియా స్పందించారు. కొంతమంది వారి వ్యాపారాల కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ వీడుతున్నారన్నారు. పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న దానం ఆరోపణలను ఆయన ఖండించారు. ఏఐసీసీలో మెజారిటీ సభ్యులు బీసీ, ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారన్నారు కుంతియా.

పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యచరణపై సమావేశంలో చర్చించామన్నారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల టికెట్ల కేటాయింపు కోసం ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులను నియమించారని... వారి పరిశీలన అనంతరం టికెట్లు ఇవ్వమన్న అభ్యర్థులకే కేటాయిస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలని రాహుల్‌ సూచించారన్నారు. ఎన్నికలకు పార్టీని సిద్దం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాహుల్ దిశానిర్దేశం చేశారన్నారు ఉత్తమ్‌.

మరోవైపు దానం పార్టీ మారడంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. దానం రెండేళ్లుగా టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నారన్నారు. దానం పార్టీలు మారడం కొత్త కాదని... ఇప్పుడు బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దానం సొంత ఎజెండా కోసమే పార్టీ మారారు తప్ప... మరో సమస్య లేదన్నారు కోమటిరెడ్డి. దానం పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు కోమటిరెడ్డి.

మొత్తానికి దానం పార్టీకి గుడ్‌బై చెప్పడంతో... గ్రేటర్‌ హైదరాబాద్‌లో పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునేందుకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. మరి ఈ ప్రయత్నాలతోనైనా ఇంకా కొంతమంది కారెక్కుతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అడ్డుకట్ట పడుతుందా ? లేదా అనేది చూడాలి. 

06:35 - June 24, 2018

హైదరాబాద్ : ఆత్మాభిమానం దెబ్బతినేందుకే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశానన్నారు దానం నాగేందర్‌. తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం... తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేసేందుకే పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని జెండా మోస్తున్న వారికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదని.. ఓ వర్గం పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు దానం. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి, సిటీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్‌.. తాను రాజీనామా చేయడానికి గల కారణాలను మీడియాకు వివరించారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సేవ చేశానని.. కానీ రానురాను బీసీలకు అన్యాయం జరుగుతుందని.... ఒకే వర్గానికి చెందిన వారు పార్టీని ఏలుతున్నారని ఆరోపించారు. అందుకే ఆత్మగౌరవం లేని చోట ఉండటం సరికాదని రాజీనామా చేసినట్లు తెలిపారు దానం.

ఇక బీసీలైన డీఎస్‌, కె.కేశవరావులు పార్టీ మారేందుకు కారణం ఏంటని ప్రశ్నించారు. పొన్నాల లక్ష్మయ్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. పార్టీలో జరుగుతున్న వివరాలన్నీ రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను పట్టించుకోకపోవడం సరికాదని తెలిపానని... అయినా ఎలాంటి మార్పు రాలేదన్నారు. బస్సు యాత్రలో కూడా ఒకే వర్గానికి చెందినవారు మాట్లాడుతున్నారన్నారు. సీనియర్‌ నేత అయిన వీహెచ్‌ను పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. వరంగల్‌లో సమావేశం జరిగితే పొన్నాలకు సమాచారం ఇవ్వలేదన్నారు. పార్టీలో బీసీలకు జరిగిన అన్యాయంపై తన దగ్గర ఆధారాలున్నాయన్నారు దానం.

ఇక జీహెచ్‌ఎంసీలో తనకు తెలియకుండానే టికెట్లు కేటాయించారన్నారు దానం. పార్టీని ఎవరు నాశనం చేశారో... పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు తెలుసు అన్నారు. తనకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి రాలేదని పార్టీ వీడుతున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి తనకెప్పుడో ఆహ్వానం అందిందని... కానీ పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లు ఉన్నానన్నారు. అయితే... రోజురోజుకు బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పార్టీ మారుతున్నట్లు చెప్పారు. రాజీనామా నిర్ణయంపై తనతో ఢిల్లీ నేతలు కూడా మాట్లాడారని... అయితే నిర్ణయం తీసుకున్నానని దానం స్పష్టం చేశారు.

ఇక పార్టీ మారుతున్న దానం కాంగ్రెస్‌లోని కొంతమంది నేతలపై విమర్శలు గుప్పించారు. వైఎస్‌లాగా పార్టీని ధైర్యంగా ముందుకు నడిపించే నేత లేరన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తర్వాత బీసీలకు పెద్దపీట వేసిన వ్యక్తి కేసీఆర్‌ అని పొగిడారు దానం. నేనేప్పుడూ కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించలేదన్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపికలో బీసీలకు కేసీఆర్‌ పెద్దపీట వేశారని.. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ వంటి పథకాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్‌లో బీసీలకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానన్నారు. తాను టీఆర్‌ఎస్‌లో ఎలాంటి పదవులు ఆశించడం లేదని.. సాధారణ కార్యకర్తలా పని చేస్తానన్నారు. అలాగే నాకు టీఆర్‌ఎస్‌ నుంచి ఎలాంటి హామీ రాలేదన్నారు. పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు దానం. మొత్తానికి ఎన్నాళ్లనుంచో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నా పరిస్థితులు అనుకూలించిక వేచివున్న దానం... ఎట్టకేలకు కారెక్కేందుకు సిద్దమయ్యారు. అయితే... ఇన్నాళ్లపాటు పార్టీలో ఉండి ఎన్నో పదవులు నిర్వహించిన దానం... బీసీలకు అన్యాయం జరుగుతుందని పార్టీ మారడం విచిత్రంగా కనిపిస్తోంది.

06:33 - June 24, 2018

విజయవాడ : అమలు కాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏదైనా పార్టీ వరుసగా ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. కేంద్రం సహకరించకున్నా.. ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో.. అంగన్‌వాడీ టీచర్లు.. చంద్రబాబును కలిశారు. తమ వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు.. సీఎంకు ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. ఈ సందర్భంలో.. విపక్షాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమలు కాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే.. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందన్నారు. ఏదైనా ఒకపార్టీ.. వరుసగా ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. చంద్రన్న ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని గ్రామాల్లో చాటాలని అంగన్‌వాడీ టీచర్లకు చంద్రబాబు సూచించారు.

ఎన్నో కష్టాలు ఉన్నా.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడుపుతున్నామని అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా.. ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కినా.. ఎక్కడా వెనుకడుగు వేయకుండా అభివృద్ధి దిశగా సాగుతున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, తద్వారా.. అభివృద్ధి శరవేగం పుంజుకుంటుందని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లాను కరవు కోరలనుంచి బయట పడేయగలుగుతున్నామని, ఆ జిల్లాలో మండువేసవిలో కూడా చెరువుల్లో నీరుందంటే అది తమ ప్రభుత్వ దూరదృష్టి, చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. గర్భిణులు, గర్భస్థ, నవజాత శిశువులు మరణించకుండా చూడడం కూడా అభివృద్ధిలో భాగమేనని అన్నారు. ఆ దిశగా ప్రతి గ్రామ పంచాయతీలోనూ అంగన్‌వాడీలు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.

స్విస్ బ్యాంక్ నుంచి నల్లడబ్బు తెచ్చి ప్రతి పౌరుడికీ 15 లక్షల రూపాయలు ఇస్తానన్న ఎన్నికల హామీని ప్రధాని మోదీ నెరవేర్చలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇరవై వేలకుపైగా విద్యావాలంటీర్ల ఉపాధిని దెబ్బతీసిందని ఆరోపించారు. కేంద్రం మాటలే తప్ప ఆచరణలో హామీలను నెరవేర్చడం లేదని అన్నారు. 

06:30 - June 24, 2018

కృష్ణా : జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద గల్లంతైన విద్యార్థులకోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు నదిలో విస్తృతంగా గాలింపుచేపట్టాయి. అయితే రాత్రివరకు విద్యార్థుల ఆచూకీ లభించలేదు. చీకటిపడటంతో గాలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు గాలింపునకు వరద ప్రభావం ప్రధాన అడ్డంకిగా మారింది. అటు గల్లంతైన ప్రవీణ్‌, చైతన్య, శ్రీనాథ్‌, రాజ్‌కుమార్‌ కుటుంబాలు తీవ్రశోకంలో మునిగిపోయాయి. తమ వాళ్లు క్షేమంగా తిరిగి వస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇదిలావుంటే అటు గోదావరిలో నదిలో మృత దేహాలు కనిపించడం కలకలంగా మారింది. కొవ్వూరు లాంచీల రేవులో నాలుగు మృతదేహాలను వెలికి తీసిన అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

విషాదం నెలకొంది. కంచికచర్ల మిక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన నలుగురు బీటెక్‌ విద్యార్థులు కృష్ణానదిలో గల్లంతయ్యారు. స్నేహితుడు ప్రమాదవశాత్తు నదిలో పడిపోవడంతో రక్షించేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు మిత్రులు కూడా గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గల్లంతైనవారిని ప్రవీణ్‌, చైతన్య, శ్రీనాథ్‌, రాజ్‌కుమార్‌గా గుర్తించారు. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు కొవ్వూరు లాంచీల రేవులో మృతదేహాల కలకలం నెలకొంది.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం కృష్ణానది పవిత్ర సంగమం వద్ద విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానం కోసం దిగిన నలుగురు బీటెక్‌ విద్యార్థులు గల్లంతయ్యారు. కంచికచర్లలోని మిక్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు పవిత్ర సంగమం వద్ద స్నానానికి వెళ్లారు. తొలుత ఓ విద్యార్థి నీటిలోకి దిగి ప్రమాదవశాత్తు మునిగి కొట్టుకుపోతుండగా.. మరో ముగ్గురు కాపాడే ప్రయత్నంలో నీటిలోకి దూకారు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారితో వచ్చిన మరో విద్యార్థి స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇవ్వటంతో గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. గజ ఈతగాళ్లు విద్యార్థులు కోసం గాలింపు చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న ఉన్నతాధికారులు సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.

విద్యార్థి ఇచ్చిన సమాచారంతో పోలీసులు గల్లంతైన వారి వివరాలను సేకరించారు. గల్లంతైన విద్యార్థులను ప్రవీణ్‌ , చైతన్య, శ్రీనాథ్‌, రాజ్‌కుమార్‌లుగా గుర్తించారు. ఈ నలుగురు విద్యార్థులు మైలవరం, తిరువూరు, గుంటూరు, మరో విద్యార్థి విజయవాడ నగరానికి చెందినవారిగా గుర్తించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, తదితర బృందాల సిబ్బందిని కూడా ఉన్నాతాధికారులు రంగంలోకి దింపారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు స్పీడ్‌ బోట్లతో గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నాయి.

ఇక కళాశాలకు ఈ రోజు విద్యార్థులు వచ్చారా? లేదా? అనే వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. విద్యార్థుల కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల గల్లంతు విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఇంఛార్జి కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌తో మాట్లాడారు. వారి ఆచూకీ తెలుసుకొనేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని రప్పించి ఆచూకీ కోసం ప్రయత్నించాలన్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని చంద్రబాబు అధకారులను ఆదేశించారు.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు లాంచీ రేవులో మృతదేహాల కలకలం నెలకొంది. గోదావరినదిలో నాలుగు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాలను వెలికితీసిన పోలీసులు.. మృతులు వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఒకే రోజు నలుగురు గల్లంతవ్వడం.. మరో నాలుగు నాలుగు మృతదేహాలు పోలీసులకు లభ్యమవ్వటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. 

పవిత్ర సంగమం వద్ద విషాదం...

కృష్ణా : జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద విషాదం నెలకొంది. కంచికచర్ల మిక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన నలుగురు బీటెక్‌ విద్యార్థులు కృష్ణానదిలో గల్లంతయ్యారు. నదిలో స్నానం చేస్తున్న స్నేహితుడు..ప్రమాదవశాత్తు నదిలో పడిపోవడంతో రక్షించేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు స్నేహితులు గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గల్లంతైనవారిని ప్రవీణ్‌, చైతన్య, శ్రీనాథ్‌, రాజ్‌కుమార్‌గా గుర్తించారు. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. 

29న సికింద్రాబాద్ బోనాలు...

హైదరాబాద్ : సికింద్రబాద్‌లో ఉజ్జయినీ మహంకాళీ బోనాల సందర్భంగా పండగ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి కోటి రూపాయలతో బంగారు బోనం, వెండి తాపడం చేయించిందని తెలిపారు. వచ్చే నెల 15 తేదీన ఘటాల ఊరేగింపుతో పండగ ప్రారంభమవుతుందన్నారు. 29వ తేదీన బోనాలు, 30వ తేదీన రంగం జరగుతుందని తెలిపారు.

పాక్ లో భారత హై కమిషనర్ కు చేదు అనుభవం...

ఢిల్లీ : పాకిస్తాన్‌లో భారత హై కమిషనర్ అజయ్‌ బిసారియాకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం తన బర్త్‌డే సందర్భంగా ఆయన తన భార్యతో కలిసి ఇస్లామాబాద్‌లోని గురుద్వారాలో ప్రార్థనలు చేయడానికి వాహనంలో బయలుదేరారు. ఆయనను వాహనం నుంచి కిందికి దిగేందుకు అక్కడి అధికారులు అనుమతించలేదు. 

దాతీ మహారాజ్‌ బాబాకు పొటెన్సీ టెస్ట్‌...

ఢిల్లీ : అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఆధ్మాత్మిక గురువు దాతీ మహారాజ్‌ బాబాకు పొటెన్సీ టెస్ట్‌ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. 2016లో దాతీ మహారాజ్‌ తనపై అత్యాచారం జరిపాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాణ భయంతో ఈ విషయం బయటకు చెప్పలేదని ఆమె పేర్కొన్నారు.

మహారాష్ట్రలో ప్లాస్టిక్ నిషేధం...

మహారాష్ట్ర : రాష్ట్రంలో ప్లాస్టిక్‌ నిషేధం అమలులోకి వచ్చింది. ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్‌ కవర్లు, ప్లేట్లు, స్పూన్లు, కొన్ని రకాల బాటిళ్లు, థర్మాకోల్‌ వస్తువులపై ఫడ్నవిస్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. అప్పటికే ఉన్న స్టాక్‌ను డిస్పోజ్‌ చేయడం కోసం తయారీదారులకు 3 నెలల సమయం ఇచ్చింది. 

గోమాంసం పేరిట దాడి..మరో వీడియో...

ఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ హాపుర్‌ లో ఐదు రోజుల క్రితం గోమాంసం పేరిట జరిగిన దాడికి సంబంధించిన మరో వీడియో వెలుగుచూసింది. 65 ఏళ్ల వృద్ధుని గడ్డం పట్టుకుని లాగి మరీ కొట్టారు. ఆవును చంపినట్లు ఒప్పించేందుకు ఆ వృద్ధుడిపై తీవ్ర ఒత్తిడి చేశారు. స్థానికుల దాడిలో గాయపడ్డ సమయుద్దీన్‌ దుస్తులపై రక్తపు మరకలు కనిపించాయి. 

గుజరాత్ లో సీనియర్ విద్యార్థి అరెస్టు...

గుజరాత్‌ : 9వ తరగతి విద్యార్థి హత్య కేసులో పోలీసులు ఓ సీనియర్‌ విద్యార్థిని అరెస్ట్‌ చేశారు. వడోదరలోని భారతి విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల దేవ్‌ తదవీ శుక్రవారం హత్యకు గురయ్యాడు. వాష్‌రూమ్‌లో విద్యార్థి శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

5వీసాలపై ట్రంప్ టార్గెట్...

ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈబీ-5 వీసాలపై టార్గెట్‌ చేశారు. ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేయడమో లేదా సంస్కరణలు చేపట్టాలని ట్రంప్‌ యంత్రాంగం యూఎస్‌ కాంగ్రెస్‌ను కోరింది. ఈ వీసా ద్వారా అమెరికాలో కనీసం పది లక్షల పెట్టుబడి పెడితే ఆ విదేశీ వ్యాపారికి గ్రీన్‌ కార్డ్‌ జారీ చేస్తారు.

Don't Miss