Activities calendar

25 June 2018

21:14 - June 25, 2018
21:11 - June 25, 2018

కాంగ్రెస్ ది కుంభకోణాల చర్రిత : కేటీఆర్

హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ ను రద్దు చేయాలని గాంధీజీ చెప్పినా పార్టీని ఇంకా కొనసాగిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో 10మంది సీఎం అభ్యర్ధులున్నారని... అన్ని రంగాలల్లోను కుంభకోణాల చర్రిత కాంగ్రెస్ దేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వందలాది మంది పోరాటయోధుల్ని కాల్చి చంపిన ఘనత కాంగ్రెస్ దని విమర్శించారు. కమిషన్లు మోసుడు వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ దద్దమ్మలకు బాగా తెలుసని హేళన చేశారు. డిపాజిట్లు కూడా రావని చిల్లర రాజకీయాలకు కాంగ్రెస్ నాయకులు పాల్పడుతున్నారన్నారు.

భర్త నుండి మహిళా సర్పంచ్ కు ప్రాణహాని,ఫిర్యాదు..

కృష్ణా : సామాన్యులే కాదు... మహిళా నాయకురాళ్లు సైతం భర్తల చేతిలో దాడులకు గురవుతున్నారు. ఇలాంటి ఘటన కృష్ణాజిల్లా గన్నవరంలో చోటు చేసుకుంది. తన భర్త దాడి చేయడంతో పాటు... హింసిస్తున్నాడని ఆరోపిస్తూ తేలప్రోలు సర్పంచ్‌ హరిణికుమారి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త రామకృష్ణ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది. అయితే... ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదని.. తన పరిస్థితే ఇలా వుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని హరిణికుమారి ప్రశ్నిస్తోంది. 

అప్పుడు సోనియా వరం, ఇప్పుడు మోదీ వరమా? దేవినేని

అమరావతి : ఆంధ్రప్రదేశ్ కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పోలవరంను బీజేపీ నేతలు సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, ఏపీకి ప్రధాని మోదీ ఇచ్చిన వరం పోలవరం అని అన్నారు. నిర్మాణానికి అవుతున్న ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి పైసా.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినదే అని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణలు బీజేపీలోకి ఎప్పుడు వచ్చారని ఉమ ప్రశ్నించారు.

మంత్రి మహేందర్ రెడ్డిపై రాళ్లదాడి..

హైదరాబాద్ : తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, ఈ ఉదయం రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం లింగంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చెన్నారెడ్డిగూడెంకు చెందిన పదిమంది మహిళలు కూరగాయలను ఆటోలో వేసుకుని, హైదరాబాద్ బయలుదేరారు. లింగంపల్లి వద్దకు రాగానే... ఎదురుగా వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తో పాటు ముందు భాగంలో కూర్చున్న మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో యువకులు కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

ఉక్కు దీక్షకు మద్దతుగా నిరసనలు : చంద్రబాబు

అమరావతి : కడప ఉక్కు దీక్షపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప ఉక్కు దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజుల్లో ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. రేపు అన్ని జిల్లాలలోను బైక్ ర్యాలీలు నిర్వహించాలని..27వ తేదీన అన్ని జిల్లాల్లోను ధర్నాలు, 28న ఢిల్లీలో ఎంపీలు ధర్నాలు చేపట్టాలని ఆదేశించారు. బీజేపీ, వైసీపీ, జనసేన కుట్ర రాజకీయాలను ఈ నిరసనల ద్వారా ఎండగట్టాలన్నారు. ఆ మూడు పార్టీల టార్గెట్ టీడీపీయేనని అందుకనే వారిని ప్రజల్లో ఎండగట్టాలని చంద్రబాబు తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రానికి ఎన్నో లేఖలు రాసామని తెలిపారు.

చికాగో సెక్స్ రాకెట్ లో సీనీ ప్రముఖులు..

హైదరాబాద్ : సెక్స్ రాకెట్ లో సీనీ ప్రముఖపేర్లు వున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో చికాగో సెక్స్ రాకెట్ పై ఓ న్యాయవాది హెచ్ ఆర్సీలో పిటీషన్ వేశారు. ఈ సెక్స్ రాకెట్ అంశం సమాజంపై తీవ్రంగా ప్రభావం చూపెట్టే అకాశమందని..విదేశాలకు ఉమెన్ ట్రాఫికింగ్ పై విచారణ జరపాలని తెలుగు రాష్ట్రాల డీజీపీలకు, సీఎస్ లకు ఆదేశించాలని పిటీషన్ లో అరుణ్ అనే న్యాయవాది పేర్కొన్నారు. చికాగో సెక్స్ రాకెట్ లో సినీ పరిశ్రమకు చెందిన పలువురి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశముందని పిటీషనర్ తను దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు.

ముంబైలో వానలు, ఇద్దరు మృతి..

ముంబై : ముంబై నగరాన్ని వానలు ముంచెత్తుతున్నాయి. ఈ వానలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లన్నీ భారీగా వర్షపు నీరు నిలిచిపోవటంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఎంజీ రోడ్డులో ఓ భారీ వృక్షం కూలిపోవటంతో ఇద్దరు మృతి చెందారు. 

నరోడా పాటియా కేసులో ముగ్గురికి 10ఏళ్ల జైలుశిక్ష..

గుజరాత్ : నరోడా పాటియా కేసులో గుజరాత్ కోర్టు తీర్పునిచ్చింది. ముగ్గురు దోషులకు పదేళ్ల జైలు శిక్షను విధించింది. వెయ్యి రూపాయిల చొప్పున ముగ్గురికి జరిమానా విధించింది. ఈ కేసులో ఉమేశ్‌ భర్వాద్‌, పద్మేంద్ర సిన్హ్‌, రాజ్‌కుమార్‌ చౌమాల్‌ అనే ముగ్గురు దోషులకు శిక్ష విధించింది. 2002లో జరిగిన అల్లర్లలో 97మంది మృతి చెందారు. ఈ ఘటన 2002 ఫిబ్రవరిలో జరిగింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకొన్న ఘటనకు కొనసాగింపుగా ఈ ఘటన జరిగింది. అయోధ్య నుండి తిరిగి వస్తున్న కరసేవకులు 57 మందిని అదే ఏడాది ఫిబ్రవరి 26వ తేదిన హత్యకు గురయ్యారు.

వైసీపీ నేత యార్లగడ్డపై అట్రాసిటీ కేసు..

కృష్ణా : వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, బాపులపాడు మండలం ఏ.సీతారామపురంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి దండ వేయకుండా వెళ్లారనే అంశానికి సంబంధించి టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తమను కర్రలతో వెంటబడి కొట్టారని... కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ నూజివీడు పోలీసులకు టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆయనపై అట్రాసిటీ కేసును నమోదు చేశారు. 

వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలు..

ఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈ సమావేశాలుజూలై 18 నుంచి ఆగస్ట్ 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొత్తం 18 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ప్రవేశపెట్టనుంది. దీంతో పాటు జాతీయ ఓబీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించే బిల్లు, ట్రాన్స్ జెండర్ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. 

దుర్గగుడి..మహిళల రూంలో సీసీ కెమెరాలు...

విజయవాడ : ఇంద్రకీలాద్రి సీవీ రెడ్డి ఛారీటీస్ లో దుర్గగుడి అధికారుల నిర్వాకం బయటపడింది. మహిళల డార్మిటరీ, బట్టలు మార్చుకొనే గదిలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం బహిర్గతమైంది. నాలుగు నెలలుగా కెమెరాలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని బట్టబయలైంది. ఈ విషయం బయటకు పొక్కడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు ప్రశ్నించినా అధికారులు పొంతన లేని సమాధానం ఇస్తున్నారు. కెమెరాలకు కనెక్షన్ ఇవ్వలేదని సమాధానం ఇస్తున్నారు. 

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆమోదించని ఐఎంఏ..

ఢిల్లీ : ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆమోదించడం లేదని ఐఎంఏ పేర్కొంది. పథకం కింద ప్రకటించిన ప్యాకేజీ ఆమోదయోగ్యంగా లేదని ఐఎంఏ వెల్లడించింది. 

12:26 - June 25, 2018

కడప : ఉక్కు పరిశ్రమ కోసం దీక్షలు చేస్తున్నా కేంద్రం దిగొస్తలేదని ఏపీ మంత్రి జవహార్ పేర్కొన్నారు. పరిశ్రమ ఏర్పాటు కోసం ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు ఆమరణ నిరహార దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆరో రోజు సోమవారం మంత్రి జవహార్ ఇతరులు సంఘీభావాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈడీ అటాచ్ మెంట్స్ చూస్తే ఎవరు దొంగ దీక్షలు చేస్తున్నారు..ఎవరు దివిటి దొంగలు తయారు చేశారనేది ప్రజలకు తెలుసన్నారు. జగన్ లో కడప పౌరుషం లేదని..గనులు..ఏ విధంగా దోపిడి చేయాలనేది తెలుసుకున్నాడన్నారు. జగన్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ కోసం చేస్తున్న దీక్షకు ప్రభుత్వం సంఘీభావం తెలియచేస్తుందని, వీరి చేస్తున్న దీక్షలతో కేంద్రం దిగొస్తుందని అనుకున్నానన్నారు. ఈ దీక్షలతో కేంద్రం దిగొస్తుందని అనుకున్నానని..కానీ కేంద్రానికి చలనం లేదన్నారు. 

12:22 - June 25, 2018

బాబు నమ్మకాన్ని వమ్ము చేయను - గాలి సరస్వతి...

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని వమ్ము చేయనని, కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి శ్రేయస్సు కోసం పాటు పడుతానని గాలి సరస్వతి పేర్కొన్నారు. 

11:44 - June 25, 2018

హైదరాబాద్ : 2019 ఎన్నికల కోసం గ్రామం నుండి రాష్ట్రం వరకు పార్టీని పటిష్ట పరచాలని టీజేఎస్ నిర్ణయించింది. అందులో భాగంగా మల్లాపూర్ లో ఉప్పల్ నియోజకవర్గం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు కోదండరాం కమిటీల ఏర్పాటు..అవశ్యకతపై కార్యకర్తలకు దిశా..నిర్ధేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఎన్నికలకు పార్టీ నేతలు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేయాలన్నారు. 

11:39 - June 25, 2018

యాదాద్రి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో అవినీతి చోటు చేసుకొంటోందని..పలువురు డబ్బులు దండుకుని రైతులకు పథకాన్ని వర్తింప చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా తాను కష్టపడి సంపాదించుకున్న భూమి తనకు దక్కదేమోనన్న భయంతో..మనస్థాపానికి గురైన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలో చోటు చేసుకుంది. ఎర్రగోని అంజయ్య అనే రైతు తన భూమి తనకు చెందుతుందో లేదోనని, ఇందుకు రైతు బంధు పథకమే కారణమని మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. అధికారుల వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా సరైన సమాచారం ఇవ్వడం లేదని..తన భూమికి డిజిటల్ పాసు పుస్తకం ఇవ్వలేదని పలువురి ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వేదనతోనే అతను చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

రైతు ఆత్మహత్య...

యాదాద్రి : భువనగిరి చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎర్రగోని అంజయ్య చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించాడు. తన భూమి తనకు చెందుతుందో లేదోనని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

11:31 - June 25, 2018

రంగారెడ్డి : నాన్న..అని అనుకుంటూ వెళ్లిన ఐదేళ్ల చిన్నారి తీరనిలోకాలకు వెళ్లిపోయింది. తన కళ్లెదుటే కుమార్తె మృతి చెందడంతో ఆ తండ్రి ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ విషాద ఘటన షాబాద్ మండలం గోపిగూడలో చోటు చేసుకుంది. కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లిన తండ్రి వెంట చిన్నారి అవ్య (5) పరుగెత్తింది. బస్సు దగ్గర చిన్నారి ఉన్నట్లు డ్రైవర్ కనిపించక ముందుకు పోనిచ్చాడు. దీనితో టైర్ల కింద పడి అవ్య నలిగి చనిపోయింది. దీనితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

బస్సు కింద పడి ఐదేళ్ల చిన్నారి మృతి...

రంగారెడ్డి : షాబాద్ మండలం గోపిగూడలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఐదేళ్ల చిన్నారి అవ్య మృతి చెందింది. 

11:06 - June 25, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. ఎన్నికల వాతావరణం వచ్చేసినట్లైంది. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి రాజేసింది. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమా ? ముందుకు రావాలని కేసీఆర్ విసిరిన సవాల్ పై టిపిసిసి చీఫ్ ఉత్తమ్ సోమవారం స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు ట్వీట్స్ చేశారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమని, కేసీఆర్ ను త్వరగా ఇంటికి పంపిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికలు ఇప్పుడు వచ్చినా..డిసెంబర్ లో వచ్చినా...2019లో వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్..మోడీ భేటీ అయిన అనంతరం ముందస్తు ఎన్నికలు వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

11:00 - June 25, 2018

విజయవాడ : పోలవరం సందర్శించిన అనంతరం టిడిపి ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు చేయడాన్ని ఏపీ మంత్రి దేవినేని ఉమ తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరాన్ని పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, పోలవరానికి సంబంధించిన అన్ని విషయాలు ఆన్ లైన్ లో పొందుపర్చడం జరిగిందన్నారు. దేశంలోని 15 జాతీయ ప్రాజెక్టుల్లో వేగంగా నిర్మాణం జరుగుతున్నది కేవలం పోలవరం మాత్రమేనని తెలిపారు. కానీ బీజేపీ నాయకులు విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని జాతీయ ప్రాజెక్టు అయినా రాష్ట్ర ప్రభుత్వ నిధులుతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతోందన్నారు. కేంద్రం ఎప్పుడో నిధులు ఇచ్చేసిందని..రూపాయి కూడా బాకీ లేదని బీజేపీ నేతలు పేర్కొనడం అసత్యమన్నారు. దేశంలోని 15 ప్రాజెక్టుల విషయం ఏమిటో చెప్పాలని..ఇందుకు 15 రోజుల సమయం ఇస్తున్నానని, లేనిపక్షంలో ప్రాజెక్టుల నిర్మాణం..తదితర విషయాలను తానే ప్రజలకు వెల్లడిస్తానని తెలిపారు.

10:56 - June 25, 2018

గోడ కూలి ఏడు కార్లు ధ్వంసం...

ముంబై : విద్యాలంకర్ రోడ్డులో ఉన్న వాద్లా అన్ టోప్ హిల్ గోడ కూలిపోవడంతో ఏడు కార్లు ధ్వంసమయ్యాయి. గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. 

10:50 - June 25, 2018

కరీంనగర్ : భవిష్యత్‌ తరాలకు అందాల్సిన వారసత్వ సంపద అది. లక్షలాది మందికి విద్యా బుద్ధులు నేర్పిన భవనాలు ప్రభుత్వ జారీ చేసిన ఒక్క జీవోతో నేలమట్టం అవుతున్నాయి. స్మార్ట్‌సిటీ పేరుతో భవనాల కూల్చి వేత వెనుక దాగి ఉన్న కుట్ర ఏంటీ..? కరీంనగర్‌ సిటీలో నిజాం కాలంనాటి విద్యాసంస్థలను కూల్చివేయడంపై ప్రజల్లో వ్యతిరేక వ్యవక్తం అవుతోంది. కరీంనగర్‌ పట్టణంలో చారిత్రత్మక కట్టడాల కూల్చి వేత రాజకీయ వివాదానికి తెర తీసింది. స్మార్ట్ సిటీ పేరిట ప్రభుత్వం చేపట్టిన కూల్చివేతలపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. నగరం నడి బొడ్డున కట్టడాలను కూల్చివేసి వ్యాపార సంస్థలకు అప్పగిస్తారని ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. నిజాం కాలంనాటి చారిత్ర కట్టడాలు ఆనవాళ్లు లేకుండా పోతున్నయంటూ విద్యార్ధి సంఘాలు అంటున్నాయి.

1905లో నిజాం రాజు కరీంనగర్‌లో పర్యటించినప్పుడు.. మానేరు బ్రిడ్జి తోపాటు, కమాన్‌, అలాగే నది ఒడ్డున ఓ పెద్ద గడియారం నిర్మించారు. ఈ ప్రాంతంలో విద్యవ్యవస్థను అభివృద్ది చేయాలనే సంకల్పంతో 1935లో న్యాయవాది మహమ్మద్ అలి 10ఎకరాల స్థలాన్ని విరాళం ఇచ్చారు. అదే స్థంలో నిజాం పాలకులు హై స్కూల్ తో పాటు హకీ,పుట్ బాల్,బాస్కట్ బాల్ కోర్టులను ఏర్పాటు చేశారు. తర్వాత 1969 లో విద్యావ్యస్థను పటిష్టం చేయాలనే ఉద్ధేశ్యంతో జానియర్ కళాశాల,ఉర్దూ,ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళతో పాటు,సోషల్ వెల్పెర్ భవనాల నిర్మాణాలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విద్యసంస్థల్లో లక్షలాది మంది పిల్లలు విద్యావంతులుగా మారారు.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్‌ అవార్డ గ్రహిత రచయిత డాక్టర్ సి.నారాయణ రెడ్డి.. ప్రస్తుత మహారాష్ర్ట గవర్నర్ విద్యాసాగర్ రావు లాంటి ప్రముఖులు ఇక్కడే ఓనమాలు దిద్దుకున్నారు. మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తోపాటు ప్రస్తుతం రాజకీయంగా ఎదిగిన ఎందరో నేతలకు ఈ విద్యాలయంలోనే చదువుకున్నారు. అయినా వారేవరు కనుమరుగవుతున్న విద్యాసంస్థల బాగోగులను పట్టించుకోకపోవడం బాధాకరం అంటున్నారు కరీంనగర్‌ వాసులు. వామపక్ష నేతలతో పాటు స్టూడెంట్‌ యూనియన్‌లు విద్యాసంస్థల కూల్చివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వారసత్వ సంపదను కూల్చివేసి ఈ స్థలానలు ప్రైవేటు వారికి అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

అయితే ప్రతిపక్షాల ఆరోపణలను మంత్రి ఈట రాజేందర్‌ ఖండిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం పార్క్ నిర్మాణం మాత్రమే చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఇక్కడ ఎలాంటి హోటళ్లను నిర్మించడం లేదన్నారు. అయితే నగరాన్ని పూలవనగం మార్చడానికి లోయర్‌ మానేర్‌డ్యాం తీరంలోను, నగరం చుట్టుపట్టు ప్రాంతాల్లో చాలా స్థలాలు ఉన్నాయని వామపక్షనేతలు అంటున్నారు. మొత్తానికి స్మార్ట్ సీటీ పనులను రాజకీయం చేయవద్దని అధికార పార్టీ అంటుంటే... చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన అవసరం తమపై ఉందంటున్నారు ప్రతిపక్ష నాయకులు. ఎవరి వాదన ఎలా ఉన్నా...చరిత్ర కనుమరుగవుతుందనేది మాత్రం వాస్తవం. దీనిపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కరీంనగర్‌ వాసులు కోరుతున్నారు. 

ముందస్తు ఎన్నికలకు సిద్ధమన్న ఉత్తమ్...!

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు సిద్ధమని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ ప్రకటించారు. కేసీఆర్ ను తొందరగా దించేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మొత్తానికి కేసీఆర్ సవాల్ ఉత్తమ్ సై కొట్టినట్లే చెప్పవచ్చు.

 

క్షీణిస్తున్న సీఎం రమేష్..బీటెక్ రవి ఆరోగ్యం...

కడప : ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిన ఆమరణ దీక్ష కొనసాగుతోంది. ఆరవ రోజు. కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత ఆరు రోజులుగా దీక్ష చేస్తుండటంతో వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. 

ముంబైలో భారీ వర్షాలు...

ముంబై : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించింది. రహదారులు జలమయమయ్యాయి. సియాన్, థానే, చెంబూర్ ప్రాంతాల్లోని లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. 

బాబు టెలీకాన్ఫరెన్స్...

విజయవాడ : నీరు-ప్రగతి, వ్యవసాయంపై సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది రాష్ట్రానికి 60పైగా అవార్డులు రావడం గర్వకారణమని, నదుల అనుసంధానం, భూగర్భ జలాల పెంపు, ప్రాజెక్టుల పూర్తిపైనే దృష్టి సారించాలని సూచించారు. గత ఏడాది కన్నా వ్యవసాయ దిగుబడులు పెరగాలని, ఆర్టీజీ, రెవెన్యూ, సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు తెలిపారు. 

ట్రావెల్స్ బస్సుకు తగిలిన విద్యుత్ తీగలు...

తూర్పుగోదావరి : జిల్లా తుని మండలం వెలమకొత్తూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు 11కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి. దీనితో బస్సు డ్రైవర్ మృతి చెందాడు. పలువురు యాత్రికులు కాశి యాత్ర ముగించుకుని తలుపులమ్మ దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...

రంగారెడ్డి : జిల్లా మంచాల మండలం లింగంపల్లి గేట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలున్నారు. 

09:19 - June 25, 2018

తూర్పుగోదావరి : తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు అధికమౌతున్నాయి. పలు కుటుంబాల్లో విషాదాలు నెలకొంటున్నాయి. నిండు జీవితాలు అనంతలోకాలకు వెళ్లిపోతున్నాయి. తాజాగా ఏపీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. తుని మండలంలో వెలమకొత్తూరులో ప్రైవేటు ట్రావెల్స్ కు 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి. దీనితో డ్రైవర్ మృతి చెందాడు. మరో ముగ్గురు యాత్రీకులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. పలువురు కాశీ యాత్ర చేసుకుని తలుపులమ్మ లోవకు చేరుకుంటుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులు గోదావరి జిల్లాల వాసులుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:09 - June 25, 2018

ఢిల్లీ : ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ అదరగొడుతోంది. గ్రూప్‌-జిలో పనామాతో జరిగిన మ్యాచ్‌లో 6-1తో ఇంగ్లీష్‌టీమ్‌ ఘనవిజయం సాధించింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కెప్టెన్‌ కేన్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించడంతో పనామా జట్టు చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్‌ 22వ నిముషంతోపాటు, 45, 62వ నిముషంలో కేన్‌ గోల్స్‌తో స్టేడియం హోరెత్తింది. కేన్‌కు తోడుగా డిఫెండర్‌ స్టోన్స్‌ రెండు, లింగార్డ్‌ 1 గోల్‌ కొట్టడంతో ఇంగ్లాండ్‌ అద్భుత విజయాన్ని సాధించింది.

మ్యాచ్‌ ఆరంభం నుంచి ఎటాకింగ్‌ గేమ్‌ మొదలుపెట్టిన ఇంగ్లాండ్‌కు 8వ నిమిషంలోనే తొలి గోల్‌ లభించింది. డిఫెండర్‌ స్టోన్స్‌ కార్నర్‌షాట్‌ను హెడర్‌గోల్‌గా మలిచి ఇంగ్లాండ్‌కు ఆధిక్యాన్ని ఇచ్చాడు. బంతిని ఎక్కువగా తన నియంత్రణలోనే ఉంచుకున్న ఇంగ్లాండ్‌.. పనామా డిఫెన్స్‌ను ఛేదిస్తూ సులభంగా గోల్స్‌ సాధిస్తూ వచ్చింది. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి ఇంగ్లాండ్‌ 5-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో అర్ధభాగంలోనూ ఇంగ్లాండ్‌ అదే జోరు కొనసాగించింది. కెప్టెన్‌ కేన్‌ 62వ నిమిషంలో హ్యాట్రిక్‌ గోల్‌తో ఇంగ్లాండ్‌ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. ఆ తర్వాతి నుంచి ఇంగ్లాండ్‌ పదేపదే గోల్‌ కోసం దాడి చేస్తూ పనామాను ఒత్తిడిలోకి నెట్టేసింది. ఐతే చివర్లో ఈ జట్టు పోరాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే 78నిమిషంలో పనామా ఆటగాడు బల్వోయి ప్రపంచకప్‌ చరిత్రలో తమ జట్టుకు తొలి గోల్‌ అందించి ఆకట్టుకున్నాడు. 

09:08 - June 25, 2018

ఢిల్లీ : హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో 2-1 గోల్స్‌ తేడాతో ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనాపై భారీ విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మ్యాచ్‌లో ఆరంభం నుంచి కెప్టెన్ శ్రేజేశ్ సారథ్యంలోని భారత్ జట్టు దూసుకుపోతోంది. 17వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ తొలి గోల్‌కొట్టి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. అనంతరం 28వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ మరో గోల్ కొట్టి స్కోరును 2-0కు పెంచాడు. మ్యాచ్ ముగిసేవరకు ఏ జట్టూ గోల్ చేయకపోవడంతో భారత్ విజేతగా నిలిచింది. సీనియర్ హాకీ ప్లేయర్ సర్దార్ సింగ్ భారత్ తరఫున అంతర్జాతీయస్థాయిలో 300వ మ్యాచ్ ఆడాడు.

09:01 - June 25, 2018

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్ర ప్రభుత్వంలో తానొక కేబినెట్ మంత్రి. తన నివాసంతో పాటు చుట్టుప‌క్కల‌ ఇళ్లకు వెళ్లేందుకు రోడ్డు మార్గం సరిగ్గా లేదని రోడ్డు వేయాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నాడు. ఇక చేసేది లేక స్థానికులతో కలిసి ఆయనే రోడ్డు నిర్మాణంలో భాగమై రహదారిని నిర్మించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సాక్షాత్తూ మంత్రి సమస్యకే పరిష్కరం లేకుండా పోయిందని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై సోషల్‌మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. యూపీ ప్రభుత్వంలో మంత్రి అయిన ఓం ప్రకాశ్ రాజ్‌భర్ స్వగ్రామం వారణాసిలోని ఫ‌తేపూర్ జిల్లాలో ఉంది. జూన్ 21న అతని పెద్ద కుమారుడు అరవింద్ రాజ్‌భర్ వివాహం జరిగింది. తన సొంతూరులోనే గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రాష్ట్ర సీఎం యోగి, వీఐపీలు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తన ఇద్దరు కుమారులు, స్థానికులతో కలిసి రహదారిని సిద్ధం చేశారు. మాకు ఇక వేరే అవకాశం లేకపోయింది. రిసెప్షన్‌కు తక్కువ సమయం ఉన్నందున తమ రోడ్డును తామే వేసుకున్నామని రాజ్‌భర్ తెలిపారు.

08:30 - June 25, 2018

ఢిల్లీ : ఇజ్రాయిల్‌కు చెందిన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ సిరియాకు చెందిన ఒక డ్రోన్‌ను పేల్చింది. సిరియా వైపు నుంచి దూసుకొస్తున్న డ్రోన్‌ను ఇజ్రాయిల్‌ గగనతల రక్షణ వ్యవస్థ గుర్తించి పేల్చివేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్‌ సైన్యం స్పష్టం చేసింది. తమ భూభాగంలోకి ఎటువంటి చొరబాట్లను అనుమతించేదిలేదని ఆ దేశ సైనిక విభాగం తెలిపింది. జనావాస ప్రాంతంలో ఒక్కసారిగా క్షిపణి పైకి లేచిన పొగ ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

08:29 - June 25, 2018

జమ్మూ కాశ్మీర్ : అనంతనాగ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. కుల్గాంలో ఆదివారం మరో ఎన్‌కౌంటర్‌.. అనంతనాగ్‌లో ఇద్దరు వ్యక్తుల నుంచి గ్రెనేడ్ల స్వాధీనం.. గత నాలుగు రోజుల్లో అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో జరిగిన ఘటనలు ఇవి . అమర్‌నాథ్‌ యాత్రపై భారీ దాడులు చేయాలని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ వంటి ఉగ్ర సంస్థలు కుట్రలు పన్నినట్లు వచ్చిన ఇంటెలిజెన్స్‌‌ సమాచారంతో... భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. అమర్‌నాథ్‌ యాత్రపై ఆత్మాహుతి దాడులు చేయాలని ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌ పిలుపునిచ్చాయన్న సమాచారంతో కశ్మీర్‌లో భద్రతాదళు అప్రమత్తం అయ్యాయి. ఉగ్రవాద ఫిదాయిలు కారుబాంబులను వినియోగించి దాడులు చేయొచ్చన్న ని భారత ఇంటిలిజెన్స్‌ వర్గాలు పసిగట్టాయి.

ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రపై భద్రతాంశాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో పక్క అమర్‌నాథ్‌ యాత్ర బోర్డు ఛైర్మన్‌ స్థానంలో ఉన్న గవర్నర్‌ వోహ్రా కూడా శనివారం సమీక్ష నిర్విహించారు. యాత్రికుల కోసం విశ్రాంతి మందిరాలు, వసతులు, మంచినీరు, హెలిప్యాడ్లను ఆయన పరిశీలించారు. సైనిక బలగాల చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో కూడా గవర్నర్‌ సమావేశమయ్యారు.

అమర్‌నాథ్‌ యాత్ర భద్రత కోసం దాదాపు 24,000 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, జమ్ముకశ్మీర్‌ పోలీసులను నియమించారు. వీరికి అండగా సైన్యం, ఇతర ప్రత్యేక దళాలు ఆపరేషన్‌ నిర్వహించనున్నాయి. 60రోజులపాటు జరగనున్న యాత్రలో అవసరాన్నిబట్టి మరిన్ని బలగాలు మోహరించనున్నాయి. మొత్తం 40వేల మందికిపైగా భద్రతా సిబ్బంది రక్షణ విధులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఉగ్రమూకలు యాత్రీకులను బందీలుగా పట్టుకుంటే వారిని విడిపించడానికి ప్రత్యేక ఎన్‌ఎస్‌జీ ప్రత్యేక దళాలను ఇప్పటికే శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు వద్ద సిద్ధంగా ఉంచారు. వీరికి అండగా ఎన్‌ఎస్‌జీ స్నైపర్‌ బృందాన్ని కూడా రెడీగా ఉంచారు.

ఈ నేపథ్యంలో ఆదివారం కుల్గాంలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కర్‌ డివిజన్‌ కమాండర్‌ షుకూర్‌దార్‌తో సహా మరో ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాది లొంగిపోయాడు. ఇతని వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. అంతకు ముందు రెండు రోజుల క్రితం అనంతనాగ్‌లో ఐఎస్‌జేకీ చీఫ్‌ దావూద్‌ సోఫీతో సహా మరో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు తుదముట్టించాయి. మరోవైపు యాత్రా మార్గాన్ని పర్యవేక్షించేందుకు పలు అంచెల్లో భద్రతా వలయాలను నిర్మించారు. సీసీటీవీలను, జామర్లను , బుల్లెట్‌ప్రూఫ్‌ బంకర్లు, డాగ్‌స్క్వాడ్‌, క్విక్‌ రీయాక్షన్‌ బృందాలతోపాటు 15 డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారు.మొత్తంగా భక్తులు ప్రయాణించే మార్గాలపై ఉపగ్రహాల సమాచారం ఆధారంగా భద్రతను పర్యవేక్షించనున్నారు.

08:26 - June 25, 2018

విజయవాడ : అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. పవన్‌ కల్యాణ్‌తో కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీచేస్తామని వామపక్షనేతలు ప్రకటించారు. ఆదివారం విజయవాడలో లెఫ్ట్‌నేతలో భేటీ అనంతరం వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. జగన్‌ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలు పెనంమీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని వ్యాఖ్యానించారు. ఆదివారం విజయవాడలో పవన్‌ కల్యాణ్‌తో భేటీ అయిన వామపక్ష నేతలు .. జనసేనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించామన్న సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ...జనసేన, లెఫ్ట్‌ పార్టీల పొత్తుపై రాబోవు రెండు, మూడు నెలల్లో పూర్తి స్పష్టత వస్తుందన్నారు. కడప ఉక్కు కర్మాగారం కోసం ఈ నెల 29న జరిగే బంద్‌కు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు సీపీఐ నాయకుడు రామకృష్ణ తెలిపారు. ఈ సారి జగన్‌ వస్తే ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

అంతకు ముందు గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో జనసేనాని పర్యటించారు. చినకాకాని వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ సన్నిహితులు, కృష్ణా, గుంటూరు జిల్లాకు చెందిన కొద్దిమంది నేతలతో పవన్‌ సమావేశమయ్యారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు, అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు. కాజలోని నిర్మిస్తున్న తన నివాసం, పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పవన్‌ పరిశీలించారు. 

08:14 - June 25, 2018

రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికమౌతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్..అతివేగంగా ప్రయాణిస్తూ మృత్యులోకాలకు వెళుతున్నారు. ఆదివారం యాదాద్రి వేములకొండ వద్ద జరిగిన ప్రమాదంలో 15 మంది దుర్మరణం చెందిన సంగతి మరిచిపోకముందే రంగారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు - ఆటో ఢీకొన్న ఘటనలో ఐదుగురు మహిళలు మృతి చెందారు. ఈ విషాద ఘటనతో కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. మంచాల మండలానికి చెందిన పలువురు మహిళలు హైదరాబాద్ లో కూరగాయాలు అమ్మేందుకు వస్తుంటారు. ఎప్పటిలాగానే సోమవారం ఉదయం మహిళలు ఆటోలో బయలుదేరారు. లింగంపల్లి వద్దకు రాగానే వేగంగా వస్తున్న కారు ఢీకొంది. దీనితో నలుగురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కారు రోడ్డుపై పల్టీలు కొట్టడంతో నుజ్జునజ్జైంది. కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. తమవారు మృతి చెందారన్న వార్త తెలుసుకుని కుటుంబసభ్యులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోడ్డు కూరగాయాలు..మృతదేహాలు..రక్తపు మడుగులతో భీతావహంగా మారిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. 

07:59 - June 25, 2018

జగన్ 198వ రోజు...

తూర్పుగోదావరి : వైసీపీ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. 198వ రోజు మామిడికుదురు, అప్పన్నపల్లి, కికలపేటలో పాదయాత్ర జరుగనుంది. 

లింగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం...

రంగారెడ్డి : మంచాల (మం) లింగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో - కారు ఢీకొన్నాయి. ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. 

తమిళ కూలీలు పరార్...

చిత్తూరు : శేషాలచం అటవీ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. పుట్టపాయింట్ వద్ద 15 మంది తమిళకూలీలు తారసపడ్డారు. కూలీలు పరారయ్యారు. 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 

3వ ఏఐఐబీ సమావేశాలు...

ముంబై : నేటి నుండి రెండు రోజుల పాటు 3వ ఏఐఐబీ సమావేశాలు జరుగనున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమావేశాలను ప్రారంభించనున్నారు. ఏఐఐబీ సమవేశాలకు 20 దేశాల ఒప్పందం జరిగింది. ఆసియన్ మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు సమావేశాలు నిర్వహించనున్నాయి. 

07:22 - June 25, 2018

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంవత్సరం ప్రారంభమై నడుస్తున్న ప్రభుత్వ విధానాల ఫలితంగా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జూన్‌ నెల ముగుస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో నలభై శాతం పాఠ్య పుస్తకాలు మాత్రమే అందాయని, ప్రభుత్వ పాఠశాలలో ప్రతి ముప్పై మంది విద్యార్థులకు ఒక టీచర్‌ అనే నిబంధన అమలు చేయడంలేదని, మౌళిక వసతులు కూడా కల్పించడం లేదని, ఇంకో వైపు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో ఫీజులు అధికంగా వసూలు చేస్తుంటుంటే వాటిని నియంత్రణ కూడా చేయడం లేదని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న విద్యారంగ సమస్యలు, వాటిపట్ల ప్రభుత్వ వైఖరిపై టెన్ టివి జనపథంలో భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్ట సహాయక కార్యదర్శి మహేష్‌ విశ్లేషించారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:40 - June 25, 2018

హైదరాబాద్ : ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో గ్రేటర్‌ సిటీ పరిధిలో గరిష్ఠ ఉష్ణోగ్రత 31డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయిందని అధికారులు వివరించారు. 

06:39 - June 25, 2018

రంగారెడ్డి : మహేశ్వరం నియోజకవర్గంలో చెరువుల పరిస్థితి దయనీయంగా మారింది. అందులో మీర్‌పేట మంత్రాల చెరువు, పెద్ద చెరువు, జిల్లెలగూడ సంద చెరువులు డ్రైనేజీలు, రసాయన వ్యర్థాలతో నిండిపోయాయి. దీంతో ఆ చెరువులను శుద్ధి చేసేందుకు ప్రత్యేక ట్రంక్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఆ ప్రాంతం వాసులు. చెరువు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న 3 లక్షల మంది ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ చెరువులో చర్చ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న మీరుపేట మంత్రాల చెరువు, పెద్ద చెరువు, జిల్లెలగూడ సంద చెరువులు రసాయనిక వ్యర్థాలతో నిండిపోయాయి. ప్రతినిత్యం చెరువులో కలుస్తున్న మురుగునీరు, రసాయన వ్యర్థాలకు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు విసిగిపోయారు. చెరువుల సమస్యను పరిష్కరించడానికి చెరువులో చర్చా కార్యక్రమాని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌తోపాటు చెరువుల చుట్టూ ఉన్న సుమారు 50 కాలనీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చెరువుల పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న 3 లక్షల మంది నిత్యం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, చెరువులను ప్రక్షాళన చేసి అందులో ఉన్న వ్యర్థాలను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. చెరువులలో పెరుగుతున్న కలుషితాల గురించి అనేక సార్లు ప్రజా ప్రతినిధులకు, మున్సిపాలిటీ అధికారులకు చెప్పినా ఎవరూ స్పందించడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. చెరువుల ప్రక్షాళన అయేంత వరకు తాము చేసే పోరాటం ఆగదని హెచ్చరించారు.

తెలంగాణ ప్రభుత్వం ఒక వైపు హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా చేస్తామని ప్రచారం చేస్తోంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉందన్నారు ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌. తెలంగాణ రాష్ట్ర కోసం టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ఎలా రాజీనామా చేశారో అలాగే స్థానిక సమస్యల కోసం కార్పోరేటర్లు రాజీనామా చేసి సమస్యల సాధనకు కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చెరువులను ప్రక్షాళన చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.

06:35 - June 25, 2018

నెల్లూరు : ఏపీ మినిస్టర్‌ గంటా శ్రీనివాసరావు.. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రహస్య భేటీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నెల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం.. మంత్రి ఒంటరిగా వెళ్ళి మాజీ మంత్రి ఆనంను కలిశారు. అధికార టీడీపీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ఆనం.. ఏకాంతంగా సమావేశం కావడం పలురకాల ఊహాగానాలకు తావిస్తోంది.

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఏకాంతంగా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేసిన మంత్రి గంటా ఒంటరిగా వెళ్ళి మాజీ మంత్రి ఆనంను కలిశారు. సంతపేటలోని రామనారాయణరెడ్డి నివాసంలో గంటపాటు సమావేశమయ్యారు. ఇతర మంత్రులుగానీ.. పార్టీ ముఖ్య నేతలుగానీ లేకుండా రహస్యంగా సమావేశమైన గంటా, ఆనం భవిష్యత్‌ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

టీడీపీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన మాజీ మంత్రి ఆనం.. త్వరలోనే పార్టీ మారతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఆనం కుటుంబంతో పెరుగుతున్న దూరం తగ్గించేందుకు సీఎం కూడా ప్రయత్నించారు. ఆనం వివేకానందరెడ్డిని అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడమే కాకుండా.. ఆయన అంతిమయాత్రకు కూడా హాజరయ్యారు. పలువురు మంత్రులు సైతం ఆనంను బుజ్జగించే యత్నం చేసినా ఫలితం కనిపించలేదు.

ఇదిలా ఉంటే.. రాష్ట్ర మంత్రి గంటా కూడా కొద్దిరోజులుగా సొంత పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా గంటా హాజరు కాలేదు. పార్టీ అధిష్టానం బుజ్జగించినప్పటికీ.. గంటా మాత్రం టీడీపీని వీడుతారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి గంటా, మాజీ మంత్రి ఆనం భేటీ మరింత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆనంను బుజ్జగించేందుకే మంత్రి గంటా వెళ్ళారన్న వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే ఇతర మంత్రులు, నేతలు ఎవ్వరూ లేకుండా గంటా ఒక్కరే ఎందుకెళ్లారన్న ప్రశ్న తలెత్తుతోంది.

మంత్రి గంటా.. మాజీ మంత్రి ఆనం భేటీతో రాజకీయ దుమారానికి తెరలేచినట్లైంది. దీంతో రాష్ర్టవ్యాప్తంగా టీడీపీ అసమ్మతి నేతలను ఏకం చేసే పనిలో ఆనం ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆనం.. గంటా సీక్రెట్‌గా మీట్‌ అయ్యారన్న వాదన వినిపిస్తోంది. ముందు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

06:32 - June 25, 2018

కడప : ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలన్న డిమాండ్‌తో సీఎం రమేష్‌ చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని డాక్టర్లు తెలిపారు. గంట గంటకు వైద్యులు రమేష్‌కు, బీటెక్ రవికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎం రమేష్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. మరోవైపు రమేష్ ఆరోగ్యంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

06:30 - June 25, 2018

మంచిర్యాల : సీఎం కేసీఆర్‌ పాలనను తీవ్రంగా దుయ్యబట్టారు సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. నాలుగేళ్ళుగా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. కేసీఆర్‌ అన్ని పార్టీల్లో ఉన్న ఉద్యమ ద్రోహుల్ని టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని.. దీంతో ఆ పార్టీ ఓవర్‌ లోడై మునిగిపోతుందన్నారు చాడ వెంకటరెడ్డి.

దానం నాగేందర్ ఇక టీఆర్ఎస్ నేత...

హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్‌ గులాబీ గూటికి చేరారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆయన టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలో దానంకు మంచి భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్‌ చెప్పారు. దానంతో పాటు ఆయన అనుచరులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు.

సీఎం రమేష్ దీక్ష..ఆరో రోజు...

కడప : ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలన్న డిమాండ్‌తో సీఎం రమేష్‌ చేపట్టిన దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది. సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని డాక్టర్లు తెలిపారు. గంట గంటకు వైద్యులు రమేష్‌కు, బీటెక్ రవికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

ఉగ్రవాదులకు...భారత బలగాలకు కాల్పులు...

ఢిల్లీ : దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు. చద్దర్‌ ప్రాంతంలో గస్తీ బృందంపై ఉగ్రవాదులు దాడిచేయడంతో భధ్రతా దళాలు ఎదురుదాడికి దిగాయి. 

మంత్రి సమస్యనే పరిష్కరించకపోయారు...

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్ర ప్రభుత్వంలో తానొక కేబినెట్ మంత్రి. తన నివాసంతో పాటు చుట్టుప‌క్కల‌ ఇళ్లకు వెళ్లేందుకు రోడ్డు మార్గం సరిగ్గా లేదని రోడ్డు వేయాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నాడు. ఇక చేసేది లేక స్థానికులతో కలిసి ఆయనే రోడ్డు నిర్మాణంలో భాగమై రహదారిని నిర్మించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సాక్షాత్తూ మంత్రి సమస్యనే పరిష్కరించకపోయారని, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై సోషల్‌మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

హాకీ..భారత్ జోరు...

ఢిల్లీ : హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ జోరు కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో 2-1 గోల్స్‌ తేడాతో ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనాపై భారీ విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

డ్రోన్ ను పేల్చిన సిరియా...

ఢిల్లీ : ఇజ్రాయిల్‌కు చెందిన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ నేడు సిరియాకు చెందిన ఒక డ్రోన్‌ను పేల్చింది. దీనికోసం సిరియా గగనతలంలోకి పేట్రియాట్‌ క్షిపణిని ప్రయోగించింది. సిరియా వైపు నుంచి దూసుకొస్తున్న డ్రోన్‌ను ఇజ్రాయిల్‌ గగనతల రక్షణ వ్యవస్థ గుర్తించి, పేట్రియాట్‌ క్షిపణిని దీనిపైకి ప్రయోగించింది సిరియా. 

Don't Miss