Activities calendar

27 June 2018

జూన్ 28 నుండి అమర్ నాథ్ యాత్ర...

ఢిల్లీ : జూన్‌ 28 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్‌ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 వేల మంది భక్తులతో కూడిన మొదటి బ్యాచ్‌ భారీ భద్రత నడుమ బయలుదేరి వెళ్లింది. అమర్‌నాథ్‌ యాత్రకు ప్రభుత్వం ఈసారి కనీ వినీ ఎరుగని రీతిలో భద్రతా చర్యలు చేపట్టింది.

ప్రొఫెసర్ పై దాడి చేసిన ఏబీవీపీ స్టూడెంట్స్...

గుజరాత్‌ : భుజ్‌లో ఏబివిపి విద్యార్థులు ఓ ప్రొఫెసర్‌పై దాడి చేశారు. కఛ్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబివిపి విద్యార్థులు ఓ ప్రొఫెసర్‌ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. అధ్యాపకుడి ముఖంపై నలుపు రంగు పోశారు. 

జర్నలిస్టును చంపిన ఉగ్రవాదులను గుర్తించిన ఖాకీలు...

జమ్ముకశ్మీర్‌ : సీనియర్‌ జర్నలిస్ట్‌ షుజాత్ బుఖారిని చంపిన ఉగ్రవాదులను పోలీసులు గుర్తించారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్‌ లష్కరే తోయిబాకు చెందినవాడు కాగా మరో ఇద్దరు స్థానికులున్నట్లు సమాచారం. జూన్‌ 14న షుజాత్‌ బుఖారిని ఉగ్రవాదులు కాల్చి చంపారు.

యూజీసీ స్ధానంలో భారత ఉన్నత విద్యా కమిషన్‌ ఏర్పాటు...

ఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ స్ధానంలో మరో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థకు కేంద్రం శ్రీకారం చుట్టింది. యూజీసీ స్ధానంలో భారత ఉన్నత విద్యా కమిషన్‌ ఏర్పాటు కానుంది. 

కూతుళ్లకు రక్షణ కల్పించాలంటూ మోడీకి లేఖ...

ఉత్తరప్రదేశ్‌ :  ఓ తండ్రి తన నలుగురు కూతుళ్లకు రక్షణ కల్పించమని కోరుతూ ప్రధాని మోది, సిఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశాడు. మీరట్‌ జిల్లా మవానాలో నలుగురు కూతుళ్లతో కలిసి ఆయన ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఆ ఏరియాలో ఉండే ఆకతాయిలు అమ్మాయిలను నిత్యం వేధిస్తున్నారు. 

21:16 - June 27, 2018

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను తోసిరాజన్న బిఎల్‌ఎఫ్‌.. నిర్బంధాన్ని చీల్చుకుని కలెక్టరేట్లు ముట్టడించిన బిఎల్‌ఎఫ్‌.. తెలంగాణ జిల్లాలన్నింటా.. బిఎల్‌ఎఫ్‌ శ్రేణులు నిరసన గళమెత్తాయి. అన్ని కలెక్టరేట్ల వద్దా.. ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్రంలో కార్మికుల సమస్యల పరిష్కారం.. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల కేటాయింపు, పెన్షన్లు, కౌలు, పోడు రైతులకు రైతుబంధు వర్తింపు తదితర డిమాండ్లతో బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలోని వివిధ వామపక్ష, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు .

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. బిఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ నల్లా సూర్యప్రకాశ్‌ ఆధ్వర్యంలో నాయకులు కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్‌ తక్షణమే మేల్కొని.. ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో బిఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో వివిధ పక్షాల కార్యకర్తలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించాయి. కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో బిఎల్‌ఎఫ్‌ శ్రేణులు కదం తొక్కాయి. కరీంనగర్‌ జిల్లాలో బిఎల్‌ఎఫ్‌ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన అనంతరం లోనికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో.. తోపులాట జరిగింది. పోలీసులు పిడిగుద్దులతో ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. విద్యార్థినులను ఈడ్చుకుంటూ వెళ్లారు. దీంతో అమ్మాయిలు గాయాలపాలయ్యారు. పోలీసుల తీరును ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి.

మహబూబ్‌నగర్‌, గద్వాల, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లోనూ బిఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. ప్రజాసమస్యలు, కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ.. పాలిటెక్నిక్‌ కాలేజీ నుంచి కలెక్టరేట్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. సామాజిక తెలంగాణ సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, బిఎల్‌ఎఫ్‌ నాయకులు హెచ్చరించారు. బిఎల్‌ఎఫ్‌ పిలుపు మేరకు నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. అర్ధరాత్రి నుంచే బిఎల్‌ఎఫ్‌ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసుల చర్యకు నిరసనగా.. ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పోలీసుల నిర్బంధాన్ని అధిగమించి.. బిఎల్‌ఎఫ్‌ పక్షాల నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్లకు తరలి వచ్చారు. ధర్నాలు చేపట్టారు. కలెక్టరేట్‌ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్డుకిరువైపులా బారికేడ్స్‌ ఏర్పాటు చేసి.. ట్రాఫిక్‌ను మళ్లించారు. అయినా వందలాదిగా కార్మికులు తరలివచ్చారు. ర్యాలీగా వెళుతున్న బిఎల్‌ఎఫ్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.

నమ్మి గెలిపిస్తే కేసీఆర్‌ ప్రజలను వంచిస్తున్నారని నాయకులు విమర్శించారు. ప్రజల మౌలిక సమస్యలు తీర్చని ప్రభుత్వాలు పతనం కాక తప్పదని హెచ్చరించారు. వరంగల్‌, జనగాం, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోనూ బిఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా తాము నిర్వహించిన సర్వేలో 40 రకాల సమస్యలు బిఎల్‌ఎఫ్‌ దృష్టికి వచ్చాయని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ప్రభుత్వం వాటి పరిష్కారానికి తక్షణమే చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోనూ బిఎల్‌ఎఫ్‌ శ్రేణులు కదం తొక్కాయి. జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపట్టాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో కేసీఆర్‌ సర్కారు విఫలమైందని నేతలు ఆరోపించారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోనూ బిఎల్‌ఎఫ్‌ శ్రేణులు ధర్నాలు చేపట్టారు. కలెక్టరేట్‌ వద్ద పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నిజామాబాద్‌లో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

విజయవాడకు కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గురువారం విజయవాడ వెళుతున్నారు. కుటుంబ సమేతంగా రేపు ఉదయం పదకొండున్నర గంటలకు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా.. అమ్మవారికి ముడుపు సమర్పిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే.. ముక్కుపుడక చెల్లిస్తానని కేసీఆర్‌ గతంలో మొక్కుకున్నారు. 

21:12 - June 27, 2018

విశాఖపట్టణం : రాష్ట్రాన్ని అభివృద్ధిచేసి, ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇస్తే... అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పాలకులు, నాయకులు భూ కబ్జాలకు ప్రాధాన్యత ఇచ్చారని జనసేన అధినేత వపన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు పాలకుల నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. 2019 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర మేధావుల సమావేశంలో జనసేనాని హామీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్ర మేధావులతో భేటీ అయ్యారు. ఆంధ్రాయూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె ఎస్‌ చలం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వామపక్షాల ప్రతినిధులతోపాటు విద్యావేత్తాలు, ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణాలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఉత్తరాంధ్ర వెనుకబాటుతో ఈ ప్రాంత ప్రజలు అటు తెలంగాణ, ఇటు ఒడిశాతోపాటు ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్న అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. సాగునీరు, తాగునీరు సౌకర్యాలు కల్పించడంతో పాలకుల నిర్లక్ష్యంతో ఉత్తరాంధ్ర సమస్యల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని మేధావులు జనసేనాని దృష్టికి తెచ్చారు. సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో కిడ్నీ, మలేరియా, ఫైలేరియా వంటి వాధ్యులు విజృంభిస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తమైంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ప్రాంతంలో భూకబ్జాలు పెరిగిపోయిన విషయాన్ని సమావేశానికి హాజరైన కొందరు ప్రతినిధులు పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తెచ్చారు. వీటిన్నింటపై తనదైన శైలిలో స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. వైసీపీ అధికారంలోకి వస్తే భూకబ్జాలు పెరుగుతాయని టీడీపీ నాయకులు తనతో చెప్పడంతో... 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే టీడీపీ నేతలు భూ దోపిడీకి అంతులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేరళను తలపించే ఉత్తరాంధ్రలో వనరుల దోపిడీ ఎక్కువగా ఉందని, బాక్సైట్‌ ఖనిజాన్ని అక్రమంగా తరలించుకుపోతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడంలేదని జనసేనాని విమర్శించారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర నుంచి వలసపోయినవారిని వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతుందని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి హెక్టారు భూమి ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని సమావేశం దృష్టికి తెచ్చారు.

మతాన్ని మార్క్సిజాన్ని అర్థం చేసుకోకుండా మన దేశంలో రాజకీయాలు నడపలేమన్న పవన్‌ కల్యాణ్‌.. మార్క్సిజం, సోషలిజం, గాంధీయిజాన్ని మధ్యేమార్గంగా తీసుకుని జనసేన సిద్ధాంతాలు తయారు చేసిన విషయాన్ని సమావేశం దృష్టికి తెచ్చారు. మరోవైపు రంజాన్‌ సందర్భంగా విరామం ప్రకటించిన జనసేన పోరాట యాత్రను గురువారం నుంచి విశాఖ జిల్లాలో పునఃప్రారంభించాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. అనకాపల్లి, చోడవరం, గాజువాక, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాలతోపాటు విజయనగరం జిల్లాలోని ఎస్‌.కోట అసెంబ్లీ స్థానంలో పవన్‌ పర్యటిస్తారు. జులై 8న విశాఖలో నిర్వహించే భారీ బహిరంగ సభతో జిల్లాలో పవన్‌ పర్యటన ముగుస్తుంది. వచ్చే నెల 14 నుంచి తూర్పుగోదారి జిల్లాలో పోరాట యాత్ర చేస్తారు. 

21:10 - June 27, 2018

విజయవాడ : ప్రభుత్వ కార్యక్రమాల్లో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించడం ద్వారా ఏపీని అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రజల నుంచి ఒక్క పైసా లంచం తీసుకోకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు నిజాయితీగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలను దోపిడీ చేసి సంపాదించే నేతల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటే అవినీతిపరులకు భయం ఉంటుందన్నారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రం నుంచి విజయవాడ, గుంటూరు రేంజ్‌ ఏసీబీ కార్యాలయాలను రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా చంద్రబాబు ప్రారంభించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సమాజాన్ని పట్టిపీడిస్తున్నఅవినీతి జాడ్యం నివారణకు టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి జరుగుతున్న నియంత్రిచే బాధ్యతను ఏసీబీ తీసుకోవాలని ఆదేశించారు. అవినీతికి పాల్పడేవారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన చంద్రబాబు... ప్రజలను దోపిడీచేసి అక్రమ మార్గాల్లో సంపాదించే డబ్బును స్వాధీనం చేసుకుంటే.. అవినీతిపరులకు సింహస్వప్నంగా మారుతుందన్నారు.

అధికారులైనా, ప్రజ్రాప్రతినిధులైనా ఒక్కపైసా తీసుకోకుండా అన్నిపనులు కచ్చితమైన సమయంలో చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పారదర్శకంగా పాలన అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు కూడా సహకరించాలని చంద్రబాబు కోరారు. అధికారులు కానీ, ఉద్యోగులు కానీ డబ్బులు అడిగితే 1100 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. 

21:08 - June 27, 2018

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌పై నిజామాబాద్‌ జిల్లా టీఆర్ఎస్‌ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. డి.శ్రీనివాస్‌.. సొంతపార్టీలోనే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌కూ ఫిర్యాదు చేశారు. తనపై జిల్లా నేతల ఫిర్యాదు నేపథ్యంలో.. వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఆయనకు సీఎం అపాయింట్‌ లభించలేదు. రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ పొలిటీషియన్‌ ధర్మపురి శ్రీనివాస్‌ కేంద్రంగా.. నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ రాజకీయాలు రచ్చకెక్కాయి. ఎంపీ కవిత నేతృత్వంలో.. పార్టీ జిల్లా నాయకులు.. బుధవారం నిజామాబాద్‌లో భేటీ అయి.. డిఎస్‌ పనితీరును తప్పుబట్టారు. డిఎస్‌ వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీని దెబ్బ తీస్తున్నారని వారు ఆరోపించారు. అంతేకాదు.. డిఎస్‌ అక్రమార్కుడని.. అందుకే తమ పార్టీలో ఇమడలేక పోతున్నారనీ ఆరోపించారు.
డి.శ్రీనివాస్‌ వ్యవహారశైలపై.. నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు.. పార్టీ అధినేత కేసీఆర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అయితే.. ఈ ఆరోపణలను డి.శ్రీనివాస్‌ తోసిపుచ్చారు. తానున్న పార్టీకి వ్యతిరేకంగా ఎన్నడూ పనిచేయలేదని, పద్ధతిగానే ఉంటానని డిఎస్‌ చెప్పుకొచ్చారు. తనతో మాట్లాడితే సరిపోయేదానికి సీఎంకు లేఖ ఎందుకు రాశారో అర్థం కావడం లేదని అన్నారు. తనపై నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు నేపథ్యంలో.. డిఎస్‌.. సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ను కోరారు. సాయంత్రం ఆరు గంటలకు సీఎంతో భేటీకి సమయం కుదిరిందని తొలుత ప్రచారం జరిగింది. అయితే.. డిఎస్‌కు సీఎం నుంచి ఎలాంటి అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతో.. డిఎస్‌ కాస్త మనస్తాపానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. 

21:06 - June 27, 2018

హైదరాబాద్‌ : ఐటీఐఆర్‌ ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించాలని.. తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్‌ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌తో పాటు... విభజన చట్టంలోని హామీలనూ సత్వరమే అమలు చేయాలని కోరారు. తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు.. బుధవారం, ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రధానిని కలిసిన కేటీఆర్‌... సుమారు పదిహేను నిమిషాల పాటు వివిధ అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. విభజన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరినట్లు.. ప్రధానితో భేటీ అనంతరం, కేటీఆర్‌ మీడియాకు చెప్పారు. ఐటీఐఆర్‌కు కేంద్రం సహకరిస్తే.. మరింత వేగంగా ముందుకు వెళతామని చెప్పానన్నారు.

ప్రధానితో భేటీ సందర్భంగా.. కేటీఆర్‌, కేంద్రప్రభుత్వ హామీలు, పది ప్రతిపాదనలను ఆయన ముందుంచారు. బయ్యారం ఉక్కు కర్మాగారం కోరుతూ ప్రధానికి ఓ నివేదికను అందజేశారు. ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే 15వేల మంది గిరిజనులకు ఉపాధి లభిస్తుందని కేటీఆర్‌ ప్రధానికి వివరించారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధానిని కలిసినప్పుడు.. బయ్యారం, ఐటీఐఆర్‌ల గురించి ప్రస్తావించారని కేటీఆర్‌ గుర్తు చేశారు. సంబంధిత మంత్రి ద్వారా నివేదికలు పంపాలన్న ప్రధాని సూచన మేరకే.. ముఖ్యమంత్రి తనను పంపారని కేటీఆర్‌ వివరించారు. 

21:04 - June 27, 2018

కడప : ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని టీడీపీ నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాకు టీడీపీ ఎంపీలు సిద్ధమయ్యారు. కేంద్ర ఉక్కు మంత్రి బీరేంద్రసింగ్‌కు కలిసిన టీడీపీ ఎంపీలకు స్టీల్‌ ప్లాంట్‌పై స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆందోళన చేయాలని నిర్ణయించారు. గురువారం హస్తినలో ధర్నాకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే కడప ఉక్కు కర్మాగారం అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం టీడీపీ ఉపయోగించుకొంటోదన్న వాదాన్ని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తోసిపుచ్చారు. --------

21:03 - June 27, 2018

ఢిల్లీ : టాస్స్‌ఫోర్స్‌ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉక్కు కర్మాగారం కోసం ప్రభుత్వ, ప్రైవేటు భూమి, ఇనుప ఖనిజం లభ్యత వంటి అంశాలపై అధ్యయం నివేదిక త్వరలోనే వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌ చెప్పారు. ఏడాదికి లక్షన్నర మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్రతిపాదించిన కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ ఎంపీలకు కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌ స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌తో భేటీ అయ్యారు. స్టీట్‌ ప్లాంట్‌ కోసం ఎనిమిది రోజులుగా టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయాన్ని మంత్రి దృష్టికి తెచ్చారు. ఇద్దరి ఆరోగ్యం క్షీణించిడంతో కుటుంబ సభ్యులతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో నెలకొన్న ఆందోళన గురించి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌..సీఎం రమేశ్‌కు ఫోన్‌ చేసి దీక్ష విరమించాలని కోరారు. అయితే ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే దీక్ష విరమించేదిలేదని రమేశ్‌.. కేంద్ర మంత్రికి స్పష్టం చేశారు.

ఆ తర్వాత స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌తో చర్చించిన టీడీపీ ఎంపీలు... ప్రభుత్వ నిర్ణయంలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. కడప స్టీల్‌ప్లాంట్‌ సాధ్యంకాదంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడంపై మంత్రి బీరేంద్రసింగ్‌తో టీడీపీ ఎంపీలు వాగ్వాదానికి దిగారు. దీనిపై కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌ స్పందిస్తూ... కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందని టీడీపీ ఎంపీల దృష్టికి తెచ్చారు. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించాలని బీరేంద్రసింగ్‌ కోరారు. మరోవైపు కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌ స్పష్టమైన హామీ ఇవ్వకపోడంపై టీడీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ అంశంపై కేంద్రం మళ్లీ పాతపాటే పాడటాన్నితప్పుపట్టారు. భూమి లభ్యత, మైనింగ్‌ లింక్‌పై స్పష్టత ఇచ్చినా.. ఇంకా సమాచారం కావాలని కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌ కోరడంలోని ఔచిత్యాన్ని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రశ్నించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి చెప్పడంపై టీజీ వెంకటేశ్‌ మండిపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యమేనంటూ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మెకాన్‌ సంస్థ ఇచ్చిన నివేదికను ప్రధాని మోదీ ప్రభుత్వం తొక్కిపెట్టడంపై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

21:00 - June 27, 2018

కడప : స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బీటెక్‌ రవి దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. బీటెక్‌ రవి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఆస్పత్రికి తరలించకపోతే అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదముందని వైద్యులు సూచించడంతో.. పోలీసులు దీక్షను భగ్నం చేశారు. బీటెక్‌ రవిని రిమ్స్‌కు తరలిస్తుండగా... టీడీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రికి తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు సీఎం రమేష్‌ మాత్రం దీక్ష కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష విరమించేది లేదని సీఎం రమేష్‌ స్పష్టం చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఆస్పత్రిలో కూడా దీక్ష చేస్తానని బీటెక్‌ రవి తెలిపారు. ప్రాణాలు పోయినా ఉక్కు ఫ్యాక్టరీ సాధనే తమ ధ్యేయమంటున్నారు బీటెక్‌ రవి. 

బీజేపీని ఓడించాలన్న ఏచూరి...

నెల్లూరు : మోడీ ప్రభుత్వం దేశంలో మతఘర్షణలు పెంచి హిందుత్వ నినాదంతో ఓటింగ్ పెంచుకొనే ప్రయత్నం చేస్తోందని సీపీఎం నేత ఏచూరి పేర్కొన్నారు. నిరంకుశత్వం, అప్రకటిత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాపోరాటాలను ఉధృతం చేసి ప్రత్యామ్నాయ విధానాలతో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. మోడీకి ఎవరూ అల్టర్ నేట లేరని అంటున్నారని, దేశానికి కావాలాఇ్సంది నేతలు కాదని...ప్రజలకు అనుకూలమైన విధానాలన్నారు. 

20:47 - June 27, 2018
20:46 - June 27, 2018

నేను జెప్పలే మొన్ననే.. పంచాయతీ ఎన్నికలను పంచాది జేశి వాయిదా ఏశే ఉపాయం జేస్తయ్ ఈ పార్టీలని అన్నట్టే జేశిండ్రు సూడుండ్రి.. హురక ఇంక అయిపోలేదా మన సారు వారి మొక్కులు.. ఇంటిరా గురువారం అమ్మటాళ్లకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడకు వోతున్నడు..ఇంకో నాల్గొద్దులు ఈ కేసీఆర్ పరిపాలన ఇట్లనే కొనసాగెనాంటే.. కారు కర్తలు తెలంగాణ రాష్ట్రాన్నే అమ్మేస్తట్టున్నరుగని..ఓ అయ్యా గుణాత్మక గుర్వయ్యగారూ.. వరంగల్ బస్తీ జనాన్ని దావత్ అడ్గితివిగదా..?.. అయ్యా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సారూ.. మీరే ఆదుకోవాలె ఇగ ఈ జనాన్ని.. సూస్తిరా భారతదేశాన్ని మోడీ ఎంత ముంగటికి గొంచవొయ్యిండో..మొన్న జూపెట్టలే.. నర్సాపూర్ కాడ ఎస్ఐ తెల్వితక్వోడున్నడు చట్టాలు తెల్వకుంటనే పోలీసు అయ్యిండు అని.. గీ గరం గరం ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

కేంద్రంతో వెళ్లమన్న లోకేష్...

విజయవాడ : ముందస్తు ఎన్నికలు జరిగినా కేంద్రంతో కలిసి వెళ్లేది లేదని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఐదేళ్లు ఖచ్చితంగా టిడిపి ప్రభుత్వం ఉంటుందని, ఇతర రాష్ట్రాలు జమిలి ఎన్నికలకు వెళ్లినా తమకు ఇబ్బంది లేదన్నారు. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. పార్టీ క్యాడర్ ని ఇప్పటి నుండే సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. 

20:09 - June 27, 2018

నకిలీ వేలి ముద్ర స్కాం..కేంద్రం అప్రమత్తం...

ఢిల్లీ : నకిలీ వేలి ముద్ర స్కాంలో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల ఐటీ డిపార్ట్ మెంట్లను కేంద్రం అప్రమత్తం చేసింది. డాక్యుమెంట్లు డౌన్ లోడ్ చేసే సర్వర్లను నిలిపివేయాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్, మున్సిపల్ శాఖల సర్వర్ లలో ఓ లింక్ ను డౌన్ లౌడ్ చేసింది. 

వామపక్ష ప్రజాతంత్ర, ప్రత్యామ్నాయ ఏర్పాటు అవశ్యకతపై బహిరంగసభ

నెల్లూరు : నర్తకీ సెంటర్ లో వామపక్ష ప్రజాతంత్ర, ప్రత్యామ్నాయ ఏర్పాటు అవశ్యకతపై బహిరంగసభ జరిగింది. సీపీఎం నేత సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి మధు, కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, సీపీఎం, జిల్లా కార్యదర్శులు రాజగోపాల్, ప్రభాకర్, ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం, పలువురు నాయకులు పాల్గొన్నారు. 

19:35 - June 27, 2018

హైదరాబాద్ : సమాజంలో కుల వివక్ష రూపుమాపడానికి ఎంతో కష్టపడి చదివి ఐఏఎస్ కు ఎంపికయ్యాం. కుల రహిత సమాజాన్ని నిర్మించాలని అనుకున్నాం..కానీ చివరకు తమపైనే వివక్ష చూపుతున్నారు..ఎందుకింత చిన్న చూపు...దళిత, గిరిజనులుగా పుట్టడమే నేరమా ? అంటూ ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ లు ఆందోళన చెందుతున్నారు. కీలక శాఖల్లో అగ్రకుల ఐఏఎస్ లు అవకాశాలిస్తూ తమకు లూప్ లైన్ లు వేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వమే తమను చిన్న చూపు చూస్తుంటే తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని..వెంటనే ప్రభుత్వం స్పందించి తమతో సమావేశం ఏర్పాటు చేయాలని దళిత, గిరిజన ఐఏఎస్ లు డిమాండ్ చేస్తున్నారు. 

బిటెక్ రవి దీక్ష భగ్నం...

కడప : ఉక్కు ఫ్యాక్టరీ కోసం 8 రోజులుగా దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీ బి.టెక్ రవిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సీఎం రమేశ్ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు యత్నిస్తున్నారు. 

18:50 - June 27, 2018
18:28 - June 27, 2018

హైదరాబాద్ : నిజామాబాద్ టీఆర్ఎస్ నేత డీఎస్ పార్టీ నుండి బహిష్కరిస్తారా ? గత కొన్ని రోజులుగా ఆయనపై గత కొన్ని రోజులుగా పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం కేసీఆర్ ను కలుస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ డీఎస్ కు సీఎంవో నుండి ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. దీనితో కేసీఆర్ తో డీఎస్ భేటీ లేదని సమాచారం. ఈ విషయంపై డీఎస్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నుండి పిలుపు వస్తే కలుస్తానని తెలిపారు. తన కొడుకు విషయంలో తనపై ఆరోపణలు చేయడం తగదన్నారు. తాను ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడడం లేదని డీఎస్ పేర్కొన్నట్లు సమాచారం. 

18:21 - June 27, 2018

కడప : జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలంటూ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ నిరహార దీక్షను పోలీసులు భగ్నం చేసినట్లు వార్తలొస్తున్నాయి. టిడిపి ఎంపీ సీఎం రమేశ్ దీక్షను సైతం భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ భారీగా మోహరించిన కార్యకర్తలు పోలీసులను అడ్డుకుంటున్నారు. గత ఎనిమిది రోజులుగా వారు జడ్పీ ప్రాంగణంలో దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో వారి ఆరోగ్యాలు క్షీణించాయి. దీక్షలను విరమణ చేయాలని వైద్యులు సూచనలు వారు వ్యతిరేకిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:16 - June 27, 2018
18:14 - June 27, 2018

హైదరాబాద్ : భర్తల రాసలీలలను భార్యలు బయటపెడుతుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. భార్య రాసలీలలను ఓ భర్త బయటపెట్టాడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. సుధీర్, సౌజన్య దంపతులు. వీరు వ్యాపారం చేస్తుంటారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఇటీవలే కారు సర్వీసింగ్ ఇచ్చేందుకు ఓ షెడ్ కు సౌజన్య వెళ్లింది. అక్కడ సర్వీసింగ్ సెంటర్ నిర్వాహకుడి కుమారుడు మాధవ్ లు ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు గమనించి సౌజన్యను సుధీర్ హెచ్చరించాడు. కానీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఆధారాలతో సహా బయటపెట్టేందుకు రహస్యంగా సౌజన్య కారులో జీపీఎస్ విధానాన్ని అమర్చాడు.

భర్త, ఇద్దరు కూతుళ్లను వదిలి ప్రియుడితో వెళ్లిపోయింది. హైదరాబాద్ నుండి కారులో గోవాకు వెళ్లిందని భర్త గమనించాడు. వెంటనే ఆధారాలతో సహా వెస్ట్ జోన్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 356/2008 ఐపీఎస్ సెక్షన్, 497, 506 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఒక పోలీసు బృందం గోవాకు బయలుదేరినట్లు సమాచారం. 

ఏపీలో ఉమెన్ చాందీ పర్యటన షెడ్యూల్..

ఢిల్లీ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జీ ఊమెన్ చాందీ రాష్ట్రంలో తొలివిడత పర్యటించనున్నారు. ఉమెన్ చాంది పర్యటన షెడ్యూల్ కూడా ఖరారయ్యింది. వచ్చేనెల 9న కృష్ణా జిల్లా, 10న గుంటూరు జిల్లా, 11న ఒంగోలు, 12న నెల్లూరు, 13న చిత్తూరు జిల్లాలో ఆయన పర్యటిస్తారని తెలిపారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు ఊమెన్‌ చాందీతో ఈ అంశంపై ఈరోజు చర్చలు జరిపారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన పర్యటన ఉంటుంది. 

ఏపీలో ఉమెన్ చాందీ పర్యటన..

ఢిల్లీ : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జీ ఊమెన్ చాందీ రాష్ట్రంలో తొలివిడత పర్యటనలో భాగంగా వచ్చేనెల 9 నుంచి 13వ‌ర‌కు జిల్లాల్లో పర్యటిస్తార‌ని ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జంగా గౌత‌మ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా కార్య‌క‌ర్త‌ల స‌మావేశం అనంత‌రం నియోజక వర్గాల వారీగా సమీక్షలు నిర్వ‌హిస్తార‌ని ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జంగా గౌత‌మ్ తలెఇపారు.

టెక్నాలజీతో భార్య వివాహేతర సంబంధం బట్టబయలు..

హైదరాబాద్ : తనకన్నా పదేళ్లు చిన్నవాడైన అవివాహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ, పుట్టింటికి వెళుతున్నానని చెప్పి ప్రియుడితో కలసి గోవాకు వెళ్లింది. జీపీఎస్ సాయంతో గుర్తించిన ఆమె భర్త హైదరాబాద్, ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ లో వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి తరచూ క్యాంపుల నిమిత్తం బయటి ప్రాంతాలకు వెళ్లేవాడు..ఆ సమయంలో వ్యాపారాలను భార్య నిర్వహించేది. ఈ క్రమంలో కారును సర్వీసింగ్ కు తీసుకెళ్లిన ఆమెకు షాపు యజమాని మాధవ్ పరిచయం అయ్యింది. ఈ పరిచయంతో తనకన్నా పదేళ్లు చిన్నవాడైన మాధవ్ తో ఆమె వివాహేతర బంధాన్ని పెట్టుకుంది.

అధికారులతో మిర్చి రైతుల చర్చలు విఫలం..

కృష్ణా : వెలగలేరు వద్ద అధికారలుతో మిర్చి రైతుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో మిర్చి రైతులు మళ్లీ తమ పాదయాత్రను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో సీపీఎం నేతలు కృష్ణ, నాగేశ్వర్ రెడ్డి, కౌలు రైతు సంఘం నేత జమ్మలయ్య, ఆంజనేయులు వున్నారు. అక్రమ అరెస్ట్ లను సీపీఎం ఖండించింది. కాగా జి.కొండూరు మండలం వెలగటేరు వద్ద మిర్చి రైతులు పాదయాత్ర చేపట్టగా వీరి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.

పతనావస్థలో కేసీఆర్ ప్రభుత్వం : రేవంత్

హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వ పతనావస్థకు చేరుకుందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా వున్నారు అంటే అది ఒక్క కేసీఆర్ మాత్రమేనని రేవంత్ ఎద్దేవా చేశారు. సెక్రటేరియట్ శిథిల భవనాన్ని తలపిస్తోందని..ఏ ఫైలు ఎక్కడ వుందో కూడా తెలియని దుస్థితిలో అధికారులకు కూడా క్లారిటీ లేదన్నారు.

పాలకుల నిర్లక్ష్యంతోనే ఉత్తరాంధ్రకు సమస్యలు :పవన్

విశాఖపట్నం : ఉత్రరాంధ్ర వెనుకబాటుకు పాలకులే కారకులని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.ఈరోజు విశాఖలో ఉత్తరాంధ్ర మేధావులతో పవన్ ఉత్తరాంధ్ర సమస్యలపై చర్చించారు. పాలకుల నిర్లక్ష్యంతోనే ఉత్తరాంద్ర వాసులకు సమ్యలనీ..కనీసం తాగునీటి సౌకర్యాన్ని కూడా పాలకులు కల్పించలేకపోయారని పవన్ అవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక భూ కబ్జాలు పెరిగిపోయాయని ప్రభుత్వంపై పవన్ విమర్శలు సంధించారు. 

హామీలను అమలు చేయమని ప్రధానిని కోరాం : కేటీఆర్

ఢిల్లీ : విభజ హామీలను అమలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీని కోరామని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీఐఆర్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరామనీ..కేంద్రం సహకరిస్తే మరింత వేగంగా ముందుకెళతామని తెలిపామన్నారు. కేంద్రం హామీలు, పది ప్రతిపాదనలను ప్రధాని ముందుంచామని హామీల విషయంలో చొరవ తీసుకుని పరిష్కరించాలని కోరమని..ఐటీఐఆర్ కు మౌలిక వసతులు కల్పించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరామన కేటీఆర్ తెలిపారు. వీటిపై ప్రధాని సానుకూలంగా స్పందించారని కేటీఆర్ తెలిపారు.   

సీఎం చంద్రబాబును సత్కరించిన ఉద్యోగులు..

అమరావతి : పీఆర్సీ బకాయిలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోలు సీఎం చంద్రబాబుకు కృతజ్నతలు తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్ని సీఎం చంద్రబాబును ఎన్జీవోలు సత్కరించారు. ఈ సందర్భంగా ఎన్జీవోలతో చంద్రబాబు మాట్లాడుతు..రెండంకెల సుస్థిర వృద్ధికి తోడ్పడాలని ఉద్యోగ సంఘాలను చంద్రబాబు కోరారు. పీఆర్సీ బకాయిల్లో రూ.200 కోట్ల మేర అమరావతి అభివృద్ధికి అందిస్తామని ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు తెలిపారు. 

స్థానికంగా న్యాయం చేసినవారికే జనసేన సీటు : వవన్

విశాఖపట్నం : ఉత్తరాంధ్ర మేధావులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ఈరోజు ఉయదం పలు సమస్యలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి వుందనీ..కానీ నాయకుల్లో లేదని పవన్ ఎద్దేవా చేశారు. స్థానికంగా న్యాయం చేసినవారికే వచ్చే ఎన్నికల్లో జనసేన సీటు ఇస్తానని వవన్ తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే భూ కబ్జాలు చేస్తారని టీడీపీ అంటోందనీ..కానీ టీడీపీ నేతలు విశాఖలో లక్ష ఎకరాలు కబ్జా చేయడం దారుణమన్నారు. తెలంగాణకు వలస వెళ్లిన 26 కులాలను స్థానికంగా గుర్తించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరతానని పవన్ తెలిపారు. 

ఉత్తరాంధ్ర వలసదారులకు ఎకరం భూమి ఇస్తా : పవన్

విశాఖపట్నం : ఉత్తరాంధ్ర మేధావులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ఈరోజు ఉయదం పలు సమస్యలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ఉత్తరాంద్రలో వున్న సమ్యలు మరో రాష్ట్ర ఉద్యమానికి దారి తీసేలా వున్నాయని పవన్ పేర్కొన్నారు. ఉత్రరాంధ్ర నుండి వలస వెళ్లిన వారికి ఎకరం భూమి చొప్పున కొనస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వున్న ప్రజల సమ్యలు తెలుసుకోవటానికే ఉత్తరాంధ్ర పర్యటనను చేపట్టానని పవన్ తెలిపారు. ఈ యాత్రలో నేను ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నాని సీఎం చంద్రబాబు భావిస్తున్నారనారని వపన్ తెలిపారు. 

16:46 - June 27, 2018
16:38 - June 27, 2018

నెల్లూరు : బర్మశాల గుంట రైల్వే పట్టాల సమీపంలోని ఇళ్లను ప్రభుత్వం తొలగించాలని చూస్తోందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఆయన ఆ ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడ నివాసం ఉంటున్న వారితో మధు, ఇతర నేతలు మాట్లాడారు. ఇక్కడ 800 ఇళ్లలో నివాసం ఉంటున్నారని, ప్రత్యామ్నాయం చూపెట్టకుండా ఇళ్లు తొలగించాలని చూడడం అన్యాయమన్నారు. ప్రభుత్వం బాధితులకు ఇళ్లను కేటాయించాలని కోరారు. 

ఖమ్మంలో బీఎల్ఎఫ్ భారీ ర్యాలీ..

ఖమ్మం : జిల్లా కలెక్టరేట్ వరకూ బీఎల్ఎఫ్ భారీ ర్యాలీని చేపట్టింది. ప్రజా సమస్యలను పరిష్కరించాలంటు డిమాండ్ చేసింది. ఈ ర్యాలీలో వేలాది బీఎల్ ఎప్ కార్యకర్తలు, సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎల్ఎఫ్ నేత నల్లారి సూర్యప్రకాశ్ మాట్లాడుతు..టీఆర్ఎస్ పభుత్వం వాగ్ధానం చేసిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. 

16:34 - June 27, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలనపై పట్టు లేదని, సచివాలయానికి రానీ సీఎం ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ అని కాంగ్రెస్ నేత రేవంత్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...సెక్రటేరియట్ లో ఏ ఫైల్ ఎక్కడుందో అధికారులకు తెలియదని, పాలన పతనావస్థలోకి చేరుకుందన్నారు. సెక్రటేరియట్ శిథిల భవనాన్ని తలపిస్తోందన్నారు. తన నియోజవకర్గంలో కాలేజీల విషయంలో ఇంతవరకు స్పందించలేదన్నారు. 

ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి వుంది : బీరేంద్ర సింగ్

ఢిల్లీ : ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌తో ఈరోజు ఢిల్లీలో టీడీపీ ఎంపీలు సమావేశమై చర్చించారు. కడపతో పాటు ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం బీరేంద్రసింగ్‌ మాట్లాడుతు.. విభజన చట్టంలోని హామీల అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిందని కేంద్రమంత్రి బీరేందర్ సింగ్ తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తోందని బీరేంద్ర సింగ్ తెలిపారు. టాస్క్ ఫోర్స్ అడిగినవాటిలో కొన్నింటికి ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పిందన్నారు.

16:22 - June 27, 2018
16:20 - June 27, 2018

ఢిల్లీ : కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై టిడిపి ఎంపీలు పోరాటం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఎనిమిది రోజులుగా దీక్షలు చేస్తుండడంతో వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. దీనిపై టిడిపి ఎంపీలు కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. బుధవారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ ను టిడిపి ఎంపీలు కోరారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై చర్చించారు. టైం బాండ్ గురించి ఎలాంటి హామీనివ్వలేదని సమాచారం. సీఎం రమేష్ తో మాట్లాడుతానని మంత్రి హామీనిచ్చారని ఏపీ ఎంపీలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు టెన్ టివితో మాట్లాడారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

రైతన్నల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు..

కృష్ణా : జి.కొండూరు మండలం వెలగటేరు వద్ద మిర్చి రైతులు పాదయాత్ర చేపట్టారు. వీరి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. నకిలి విత్తనాలతో పంట నష్టపోయమని మూడురోజుల నుంచి గంపలగూడెం మండలం పెనుగొలను రైతులు సీపీఎం నేతలు జీవి కృష్ణ, నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెలగటేరు వద్దకు చేరుకున్న పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. 

16:15 - June 27, 2018

హైదరాబాద్ : నిజామాబాద్ టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ పై పార్టీ అధిష్టానం ఏదైనా నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ డీఎస్ పై నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆయనపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఉన్న డీఎస్ సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే అందుబాటులో ఉండాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. సాయంత్రం హైదరాబాద్ కు వస్తున్నట్లు, రాగానే కలుస్తానని డీఎస్ బదులిచ్చినట్లు సమాచారం. దీనితో కేసీఆర్ - డి.శ్రీనివాస్ భేటీలో ఎలాంటి నిర్ణయం వెలువడుతందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. డీఎస్ ను పార్టీ బహిష్కరిస్తుందా ? లేక డీఎస్ రాజీనామా చేస్తారా అనేది చూడాలి. 

ఆర్థిక అవగాహనతోనే మహిళ జీవితాల్లో వెలుగులు : మంత్రి నారాయణ

అమరావతి : ఆర్థిక పరమైన అవగాహన ద్వారానే పట్ణణ పేద మహిళల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ఆంధ్రప్రదేశ్‌ పురపాలక మంత్రి నారాయణ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి 2014లో మెప్మాలోని మహిళల వార్షిక సగటు ఆదాయం రూ.36,000 కాగా, 2018కి వారి ఆదాయం గణనీయంగా పెరిగి 68,000 లకు చేరిందని పురపాలక మంత్రి నారాయణ అన్నారు.

16:11 - June 27, 2018

ఖమ్మం : నాలుగేళ్లు పాలనలో సమస్యలను పరిష్కరించాలని, డబుల్ బెడ్ రూం నివాసాలను కేటాయించాలని..తదితర సమస్యలపై బీఎల్ఎఫ్ గళమెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ ను బీఎల్ఎఫ్ ముట్టడించింది. కానీ పోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

కలెక్టర్ కు మెమోరాండం సమర్పించి తమ సమస్యలను విన్నవించుకుంటామని నేతలు పేర్కొన్నారు. కానీ దీనికి పోలీసులు సమ్మతించలేదు. దీనితో అసహనానికి గురైన నేతలు, కార్యకర్తలు బారికేడ్లను నెట్టివేసి లోనికి వెళ్లేందుకు యత్నించేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే సున్న రాజయ్య బైఠాయించారు. బలవంతంగా నేతలను, కార్యకర్తలను నెట్టివేశారు. మహిళలని చూడకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీ.ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులు ఆవేదన..

హైదరాబాద్ : తమకు ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్టులే ఇస్తున్నారంటూ తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశ పూర్వకంగానే తమకు ప్రాధన్యత లేని పోస్టులు ఇస్తున్నారని ఆరోపిప్తు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని వారు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లామని మీడియా ముఖంగా వారు తెలిపారు. సీనియారిటీ ఎక్కువ ఉన్న ఎస్సీ, ఎస్టీ అధికారులకు కూడా కీలకమైన పోస్టింగులు ఇవ్వడం లేదని వాపోయారు. తమ సమస్యలను రాతపూర్వకంగా ఇవ్వాలని సీఎస్ తమను కోరారని చెప్పారు.

16:05 - June 27, 2018

రాజమండ్రి : కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు జిల్లాలోని జాతీయ రహదారుల దిగ్బంధం చేశారు. టీడీపీ, బీజేపీ ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరింస్తున్నాయని అఖిలపక్షనేతలు మండిపడ్డారు. ఏనాడు ఉక్కు ఫ్యాకర్టీ గురించి ప్రస్తావించని నాయకులు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మించే వరకు ఉద్యమాని కొనసాగిస్తామంటున్నారు అఖిలపక్షనేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్‌ అందిస్తారు.

కడప ఉక్కు కర్మాగారం కోసం ఎంపీ సీఎం రమేష్‌ చేపట్టిన దీక్షకు మద్దతుగా విజయవాడలోని భారతినగర్‌ స్టీల్‌ అథారిటీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. విభజన హామీల్లో ఉన్న ఉక్కు ప్యాక్టరీని కేంద్రం విస్మరించిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఏపీ ప్రజల పట్ల మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం విభజన హామీలను నెరవేర్చి, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. 

కేసీఆర్ తో భేటీ కానున్న డీఎస్..

హైదరాబాద్ : సాయంత్రం 6గంటలకు సీఎం కేసీఆర్ తో డీఎస్ భేటీ కానున్నారు. తమపై వచ్చిన ఆరోపణల అంశంపై డీఎస్ కేసీఆర్ తో మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. కాగా నిజామాబాద్ రాజకీయాలలో డీఎస్ వల్ల వర్గ విభేదాలు జరుగుతున్నట్లుగా ఆ జిల్లా నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలోను..తనపై వేటు వేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం యోచనలో వున్నట్లుగా వార్తలు వినవస్తున్న క్రమంలో డీఎస్ కేసీఆర్ తో భేటీకావటం విశేషంగా చెప్పవచ్చు..

16:03 - June 27, 2018

రాజమండ్రి : ఏపీలో ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రాజకీయాలను చంద్రబాబు భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కార్పొరేట్‌ వ్యవస్థలకు అనుకూలంగా పాలన సాగుతుందని మండిపడ్డారు. సంతలో పశువుల మాదిరి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ, వైపీసీలు సామాజిక న్యాయం పాటించడం లేదన్నారు. ప్రజాసమ్యస్యలపై పవన్‌ కళ్యాణ్‌ స్పష్టంగా ఉన్నాడని, రానున్న ఎన్నికలల్లో జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని రామకృష్ణ స్పష్టం చేశారు. 

మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తో టీడీపీ ఎంపీలు భేటీ..

ఢిల్లీ : కేంద్రమంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. కడప ఉక్కు పరిశ్రమ గురించి ఎంపీలు మంత్రిని అడగనున్నారు. అలాగే ఉక్కు పరిశ్రమ గురించి సీఎం రమేశ్, రవిల ఆమరణ నిరాహార దీక్ష గురించి తెలుపనున్నారు. మంత్రి సానుకూలంగా స్పందించని పక్షంలో ఎంపీలు తమ తదుపరి కార్యాచరణను వెల్లడించనున్నారు. ఈ క్రమంలో కేంద్రం సానుకూలంగా స్పందించకుంటే ఎంపీలు  సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు  నిరసన కార్యక్రమాలు చేపట్టే యోచనలో వున్నట్లుగా తెలుస్తోంది. 

16:00 - June 27, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో పాలకపక్షం టీఆర్ఎస్‌లో అంతర్గత రాజకీయం రసవత్తరంగా మారింది. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తీరుపై పార్టీ జిల్లా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ.. జిల్లా టీఆర్ఎస్‌ నేతలు అధినేత కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం.. ఎంపీ కవిత ఇంట్లో సమావేశమైన టీఆర్ఎస్‌ జిల్లా నేతలు.. డిఎస్‌ తీరుపై చర్చించారు. ఈ భేటీకి బీపీ పాటిల్‌, ప్రశాంత్‌రెడ్డి, తుల ఉమ తదితరులు హాజరయ్యారు. మరోవైపు తనపై వచ్చిన అభియోగాలను డిఎస్‌ తోసిపుచ్చారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో.. ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సమావేశం వివరాలు ఇంకా బయటకు రాలేదు. డిఎస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

బయ్యారం ఉక్కు గురించి కేసీఆర్ ప్రధానిని ప్రశ్నించరే : తమ్మినేని

మహబూబాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లయినా మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్ధానాలను నెరవేర్చలేదని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ఒక్క మాట కూడా అడగటంలేదని ఆరోపించారు. కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాకు చేసిందేమీ లేదనీ..దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎవరికీ ఇవ్వలేదని విమర్శించారు. గిరిజనుల వద్ద పోడు భూములను లాక్కుంటున్నారనీ..కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయలేదని ఆరోపించారు.

15:55 - June 27, 2018

విశాఖపట్టణం : ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. డ్రెయినేజీ, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు వలసపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఉత్తరాంధ్ర మేధావులతో సమావేశమైన పవన్‌... ఈ ప్రాంత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వైసీపీ అధికారంలోకి వస్తే భూకబ్జాలు పెరుగుతాయని టీడీపీ నాయకులు చెప్పడంతో... 2014 ఎన్నికల్లో తెలుగుదేశంకు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు ఉత్తరాంధ్రలోనే భారీగా భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. 

మరోసారి దోపిడీకి జగన్, గాలి యత్నాలు : బోండా ఉమ

కడప : బీజేపీ రాష్ట్ర హక్కులను కాలరాస్తోందని..గాలి జనార్థన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టి కోట్లాది రూపాయలను మరోసారి దోపిడీ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు.బీజేపీతో వైసీపీ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని అందరు ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. టీడీపీ కడప ఉక్కుపై చిత్తశుద్ధితో పనిచేస్తుంటే..కొందరు అర్ధం పర్థం లేని విమర్శలు చేస్తున్నారన్నారు. కేంద్రంపై తిరుగుబావుటా ఎగురవేసిన మొదటి వ్యక్తి సీఎం చంద్రబాబేనని ఉమా తెలిపారు. 

ఏపీపై ప్రధాని మోదీకి ఎందుకంత కక్ష? : సోమిరెడ్డి

కడప : ఏపీపై ప్రధాని మోదీ ఎందుకంత కక్షో అర్థం కావటంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విభజన చట్టంలో వున్న ఒక్క హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్సీ రవి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షపై కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవటం దారుణమన్నారు. వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నా పట్టించుకోకపోగా..విమర్శిస్తున్నారన్నారు. ఈ విషయంలో జగన్ ఒక్క మాట కూడా మాట్లాడటంలేదని ఆరోపించారు. 

రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక : సోమిరెడ్డి

నెల్లూరు : రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. శ్రీకాకుళంలో జరిగే ఏరువాక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని సోమిరెడ్డి తెలిపారు. చైతులను చైతన్యపరిచేలా ఏరువాకలో పలు కార్యక్రమాలను చేస్తామన్నారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి హామీ ఇచ్చారు. లోటు బడ్జెట్ లో కూడా రైతు రుణమాఫీ చేసి దేశంలోనే టీడీపీ ప్రభుత్వం రికార్డు సాధించిందన్నారు. ఈ ఏడాది 4,5 విడతల్లో రూ.8,100 కోట్లు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 

నిజామాబాద్ రాజకీయాలు వారసుల కోసమే : రేవంత్ రెడ్డి

నిజామాబాద్ : జిల్లా రాజకీయాలు వారసుల కోసం తండ్రులు పడుతున్న ఆరాటమేనని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎంపీ కవిత కోసం కేసీఆర్ తాపత్రాయపడుతుంటే..కొడుకు కోసం డీఎస్ ఆరాటపడుతున్నారన్నారు. ముందస్తు ఎన్నికల వస్తున్నాయనే వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు విజయవాడ కనకదుర్గమ్మ మొక్కులు గుర్తుకొచ్చాయని రేవంత్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు జరిగిన అవమాలనాలపై మాట్లాడిన దానం నాగేందర్ ఇప్పుడు డీఎస్ కు జరిగిన అవమానంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. 

15:12 - June 27, 2018
15:03 - June 27, 2018
14:55 - June 27, 2018
14:54 - June 27, 2018
14:53 - June 27, 2018

గుంటూరు : ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లతో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 652 మంది ఎస్‌ఐలు శిక్షణ పొందారు. వీరిలో 163 మంది మహిళలు కూడా ఉన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న ఎస్‌ఐలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖాముఖి మాట్లాడుతున్నారు. విలువలు పడిపోతాయన్నారు. పోలీసులు సైకలాజి స్టడీ చేయాలని...పాజిటివ్ ఆటిట్యూడ్ ను అలవర్చుకోవాలని సూచించారు.

 

14:50 - June 27, 2018

హైదరాబాద్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కలిశారు. విభజన చట్టంలోని హామీలు సహా పలు అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ...విభజన హామీల అమలు చేయాలని కోరడం జరిగిందని, ఐటీఐఆర్ ఏర్పాటును వేగవంతం చేయాలని ప్రధాని మోదీని కోరామని తెలిపారు. ఐటీఐఆర్‌కు కేంద్రం సహకరిస్తే మరింత వేగంగా ముందుకెళ్తామని ప్రధానికి తెలిపామన్నారు. ఐటీఐఆర్‌కు మౌలిక వసతులు కల్పించాలని కోరినట్లు చెప్పారు. హామీల విషయంలో చొరవ తీసుకుని పరిష్కరించాలని కోరినట్లు పేర్కొన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం అంశంలో ఇటీవలే ప్రధాని మరింత సమాచారం అడిగారని, ఇందుకు బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో ప్రధానికి నివేదిక అందజేసినట్లు తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరారు. 

14:44 - June 27, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో కుటుంబసమేతంగా ఆయన వెళ్లి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఉదయం 11.30గంటలకు దర్శనం చేసుకోనున్నారని సమాచారం.

తెలంగాణ రాష్ట్రం వస్తే మొక్కులు చెల్లించుకుంటానని సీఎం కేసీఆర్ మొక్కుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన అనంతరం మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటీవలే తిరుమల వెంకటేశ్వర స్వామికి బంగారు సాలిగ్రామ హారం, పేటల కంటె...వరంగల్ భద్రకాళీ అమ్మవారికి బంగారు పూతగల కిరీటం..తిరుచానూరు పద్మావతి అమ్మవారికి బంగారు ముక్కుపడక..కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు..మొక్కులు చెల్లించుకున్నారు. తాజాగా విజయవాడ కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడక చెల్లించుకోనున్నారు. ఈ మొక్కుల కోసం డబ్బులను రాష్ట్ర ఖజానా నుండే వినియోగిస్తున్నట్లు సమాచారం. 

14:37 - June 27, 2018

విజయవాడ : పార్టీ నుండి వెళ్లిపోయిన సీనియర్లను మళ్లీ పార్టీలోకి చేర్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఇటీవలే కొత్త కార్యదర్శులుగా నియమితులైన వారు పనులను మొదలు పెట్టారు. ప్రధానంగా ఏపీలో కాంగ్రెస్ ను మళ్లీ గాడిలో పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ రాష్ట్ర వ్యవహాల ఇన్ ఛార్జీ ఉమెన్ చాందీ రూపొందిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నుండి వెళ్లిపోయిన సీనియర్లను పార్టీలోకి తిరిగి రావాలని, పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలని సూచిస్తున్నారు. క్రియాశీలక పాత్ర పోషించాలని అధిష్టానం కోరుతుతోంది. గురువారం ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు, పళ్లం రాజు టి.సుబ్బిరామిరెడ్డిలు వేర్వేరుగా కలిశారు. కిరణ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం ఖాయమని తెలుస్తోంది. లగడపాటి రాజగోపాల్ తోనూ పార్టీ అధిష్టానం మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. కిరణ్ కుమార్ త్వరలోనే అధిష్టానాన్ని కలుస్తారని, మాజీ సీఎంగా ఆయనకు జాతీయస్థాయిలో సుముచితస్థానం కల్పిస్తుందని టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. మరి సీనియర్లు పార్టీలో చేరుతారా ? లేదా ? అనేది చూడాలి. 

14:28 - June 27, 2018

వరంగల్ : జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది. దీనితో ప్రమాదవశాత్తు వెంకన్న అనే యువకుడు లారీ కింద మట్టిదిబ్బలో కూరుకపోయాడు. సుమారు నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. రెస్క్యూటీం వచ్చే వరకు స్థానికులు అతనికి సహాయక చర్యలు చేపట్టారు. వెంకన్నకు లారీ కిందే ఆక్సిజన్, సైలైన్ లను వైద్య సిబ్బంది అందించారు. రెండు క్రేన్ ల సహాయంతో లారీని రెస్క్యూ టీం పక్కకు లాగారు. వెంకన్నతో సహా మరో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. 

వరంగల్ జిల్లాలో హృదయ విదారకర ఘటన...

వరంగల్ : జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు వెంకన్న అనే యువకుడు లారీ కింద మట్టిదిబ్బలో కూరుకపోయాడు. సుమారు నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. వెంకన్నకు లారీ కిందే ఆక్సిజన్, సైలైన్ లను వైద్య సిబ్బంది అందించారు. రెండు క్రేన్ ల సహాయంతో లారీని రెస్క్యూ టీం పక్కకు లాగారు. వెంకన్నతో సహా మరో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. 

నటుడు ప్రకాశ్ రాజ్ హత్యకు కుట్ర..సిట్ దర్యాప్తులో..

కర్ణాటక : నటుడు ప్రకాష్ రాజ్ ను అంతమొందించేందుకు కుట్ర జరిగినట్టు కర్ణాటక సిట్ పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకు పాల్పడినవారే ప్రకాశ్ రాజ్ హత్యకు పథకం వేశారు. ప్రధాని మోదీని, బీజేపీని ప్రజా వేదికలపై ప్రకాష్ రాజ్ విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన్ను చంపేందుకు గౌరీలంకేష్ హత్యా నిందితులు పథకం వేసినట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అంతేకాదు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ ను కూడా అంతమొందించాలని కుట్ర పన్నినట్టు తెలిసింది.

రేపు విజయవాడ వెళ్లనున్న కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు విజయవాడ వెళ్లనున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై వున్న కనకదుర్మమ్మ అమ్మవారిని కేసీఆర్ దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కనకదుర్గమ్మకు పుక్కుపుడక చేయిస్తానని కేసీఆర్ ఉద్యమ సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకోనున్నారు.  

డీఎస్ ఇంటి వద్ద సందడి..త్వరలోనే ప్రెస్ మీట్..

నిజామాబాద్ : టీఆర్ఎస్ లో తనకు కనీస ప్రాధాన్యత దక్కలేదని, నిజామాబాద్ జిల్లాలో జరిగే కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని గత కొంతకాలంగా మనస్తాపంతో ఉన్న ఆయన, పార్టీ మారే ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించినట్టు సమాచారం. ఇక నేడో రేపో ఆయన కీలక నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తుండగా, ప్రస్తుతం ఆయన తన ఇంట్లో పెద్ద కుమారుడితో సమావేశమై, రాజకీయ భవిష్యత్తుపై చర్చలు సాగిస్తున్నారు. డీఎస్ ఇంటికి ఆయన అనుచరులు ఒక్కొక్కరుగా చేరుకుంటుండగా, ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. కాసేపట్లో అనుచరులతో మరోసారి మాట్లాడిన తరువాత డీఎస్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

సొంత గూటికి చేరనున్న డీఎస్?..

నిజామాబాద్ : జిల్లా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి తానింక బయటకు వెళ్లక తప్పదని కొద్ది రోజుల క్రితమే ఓ నిర్ణయానికి వచ్చిన డీఎస్, రెండు రోజుల క్రితం తన అనుచరులతో మాట్లాడి, ఆపై గులాం నబీ ఆజాద్ తో రహస్యంగా మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. సీఎం అభ్యర్థిగా ఉన్న మీరు అసలు టీఆర్ఎస్ లో చేరడం ఏంటని తన సన్నిహితుల నుంచి గతంలోనే ప్రశ్నలను ఎదుర్కొన్న ఆయన, పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

టెక్నాలజీని వినియోగిస్తే పోలిసింగ్ సులువు : చంద్రబాబు

అమరావతి : ప్రజా దర్భార్ హాల్లో ఎస్ ఐలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతు..రాయలసీమలో ఫ్యాక్షనిజం వుండేదనీ..హైదరాబాద్ లో వీధికో గూండా వుండేవారని..నగరాల్లో రౌడీ యిజం ఉండేదనీ..నక్సలిజం కూడా హైదరాబాద్ నగరం వరకూ వచ్చేసిందని టీడీపీ అధికారంలోకి వచ్చాక వీటన్నింటిని అరికట్టామని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఎస్ ఐల సమావేశంలో చంద్రబాబు తెలిపారు. దీనికి పర్యవసానంగా తిరుమల అలిపిరి వద్ద తనపై హత్యకు దాడి జరిగిందని చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించుకుని పరిశోధించటమే కాక నేరాలు జరగకుండా అరికట్టాలని వారిని దిశానిర్ధేశం చేశారు.

డీఎస్ వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం లేదు : ఎంపీ కవిత

హైదరాబాద్ : ఆయన పార్టీలో చేరిన తరువాత ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోయిందని ఆమె అన్నారు. ఆయన పనులతో పార్టీకి నష్టం వాటిల్లిందని, తన ఉనికిని చాటుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ కు నష్టం కలిగిందని ఎంపీ కవిత పేర్కొన్నారు. డీఎస్ వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదన్నారు. డీఎస్ పార్టీలో వర్గాలను పెంచి పోషించారని, మిగతా నేతలంతా ఏకతాటిపై ఉంటే, ఈయనొక్కరే మరో దారిలో వెళుతున్నారని ఆరోపించారు. కాగా, డీఎస్ తిరిగి కాంగ్రెస్ లో చేరుతారన్న అనుమానాలు పెరగడంతోనే ఆయనపై వేటు వేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

డీఎస్ తో ఎటువంటి ఉపయోగం లేదు : ఎంపీ కవిత

హైదరాబాద్ : టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ పై నిజామాబాద్ ఎంపీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్ల పార్టీకి జరిగిన ఉపయోగం ఏమీ లేదని, ఆయన ఉన్నా లేకున్నా ఒకటేనని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం నుంచి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతల సమావేశం జరుగగా, సమావేశం అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. వెంటనే ఆయన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని జిల్లా కమిటీ తీర్మానించిందని, ఈ తీర్మానాన్ని అధ్యక్షుడు కేసీఆర్ కు ఇప్పటికే పంపించామని కవిత తెలిపారు. ఆయనపై క్రమశిక్షణా చర్యలకు కూడా సిఫార్సు చేశామని చెప్పారు. కాగా డీఎస్ కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

ఎస్ ఐలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి..

అమరావతి : ప్రజా దర్భార్ హాల్లో ఎస్ ఐలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న 652 మంది ఎస్సైలు, 342 మంది సివిల్ ఎస్సైలు, 108మంది ఏఆర్ ఎస్సైలు, 8మంది ఎస్ఏఆర్, సీపీఎల్ ఎస్సైలు,194మంది ఏసీఎస్పీ ఎస్సైలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. మొత్తం 789 మంది పురుషులు, 163మంది మహిళా ఎస్సైలు శిక్షణ పూర్తిచేసుకున్నవారిలో వున్నారు. వీరితో సీఎం చంద్రబాబు నాయుడు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. 

డీఎస్ పై కేసీఆర్ వేటుకు సిద్ధపడుతున్నారా?..

హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపీలు, ఎమ్మెల్యేల డీఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం కొనసాగుతుండగా, డీఎస్ తీరు సరిగ్గా లేదని, ఆయనపై వేటు వేయాలన్న డిమాండ్ చర్చకు వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గత కొంతకాలంగా డీఎస్ పై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కేసీఆర్ సైతం ఇటీవలి కాలంలో డీఎస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నేడు ఆయన్ను పార్టీ నుంచి, సలహాదారు పదవి నుంచి తొలగిస్తూ పార్టీ అధిష్ఠానం నుంచి ప్రకటన వెలువడుతుందని సమాచారం.

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ..

హైదరాబాద్ : తెలంగాణలో మరో కొత్త పార్టీ అవతరించింది. ఆ పార్టీ పేరు 'ధమ్మ ప్రజా పార్టీ'. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ మేడే శాంతికుమార్ మాట్లాడుతూ, దేశంలో ఇన్నాళ్లూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం చేసే పార్టీలు మాత్రమే ఆవిర్భవిస్తూ వచ్చాయని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు. త్వరలోనే పార్టీ విధివిధానాలను, మేనిఫెస్టోను వెల్లడిస్తామని చెప్పారు.

డీఎస్ పై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం..

హైదరాబాద్ : డీఎస్ పై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు డీఎస్ పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సీఎం కేసీఆర్ కు నిజామాబాద్ జిల్లా ఎంపీలు,ఎమ్మెల్యేలు లేఖలు రాశారు. డీఎస్ పై చర్యలు తీసుకోవాలని లేఖలో ఎంపీలు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కోరారు. 

బందర్ పోర్టు భూసేకరణ ఉపసంహరణ..

కృష్ణా : బందర్ పోర్టు పరిశ్రమల భూ సేకరణ నోటిఫికేషన్ ఉప సంహరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ భూముల్లోనే ఇండ్రస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బందర్ ప్రాంతంలోని 21 గ్రామాల రైతుల విముక్తికానున్నాయి. 

సీఎం రమేశ్, రవిల దీక్షకు మద్దతు : కోడెల

విజయవాడ : కడప ఉక్కు పరిశ్రమ కోసం పోరాడతున్న సీఎం రమేశ్, బీటెక్ రవిలకు పూర్తి మద్దతునిస్తున్నానంటు స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. విభజన హామీలను నెరవేర్చాలని..దీక్ష విజయవంతం కావాలని కోరుకుంటున్నానని స్పీకర్ కోడెల తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రమేశ్, బీటెక్ రవి ఆరోగ్యం క్షీణిస్తోందని వారి బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వుందన్నారు. 

ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం నొక్కేస్తోంది : జూలకంటి

నల్లగొండ : బీఎల్ఎఫ నాయకుల ముందస్తు అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. స్థానిక సమస్యల పరిష్కారానికి బీఎల్ఎఫ్ కలెక్టరేట్లకు పిలుపినిచ్చిన నేపథ్యంలో మిర్యాల గూడలో మాజీ ఎమ్మెల్యే, బీఎల్ ఎఫ్ నాయకుడు జూలకంటి రంగారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా ఇంటి వద్దే జూలకంటి నిరాహార దీక్షను చేపట్టారు. ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం నొక్కేస్తోందని జూలకంటి విమర్శించారు. అరెస్ట్ లతో ఉద్యమాలను ఆపరేరని జూలకంటి పేర్కొన్నారు. 

గంటాకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..

కడప : టీడీపీ ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల ఉక్కు ఉద్యమం కోసం ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష ఎనిమిదవ రోజు కొనసాగుతోంది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన విభజన హామీలలో ఒకటైన కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం వారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం వీలు కాదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో వారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో వారి దీక్ష ఎనిమిదవరోజుకు చేరుకుంది. కడపలో వుండి దీక్షను సమీక్షించాలని సీఎం చంద్రబాబు మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఆదేశించారు. 

సైబర్ క్రైమ్ ను ఆశ్రయించిన దర్శకుడు శేఖర్ కమ్ముల..

హైదరాబాద్ : ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఓ వ్యక్తి తన అసిస్టెంట్ నని చెప్పుకుంటు సినీ అవకాశాలు ఇప్పిస్తానని యాడ్స్ ఇస్తున్నాడనీ..సినిమాలో ఛాన్స్ ల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టాడు.  

నల్లగొండ జిల్లాలో బీఎల్ ఎఫ్ నాయకుల ముందస్తు అరెస్టులు

నల్లగొండ : జిల్లాలో బీఎల్ ఎఫ్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.  ఇవాళ కలెక్టరేట్ ముట్టడికి బీఎల్ ఎఫ్ పిలుపు ఇచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారానికి బీఎల్ ఎఫ్ జిల్లా వ్యాప్త ఆందోళన చేపట్టింది. మిర్యాలగూడలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హౌజ్ అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది నేతలను అరెస్టు చేశారు. 

 

మావోలు పేల్చిన మందుపాతర..6గురు జవాన్లు మృతి..

జార్ఖండ్ : మావోయిస్టులు పేల్చిన శక్తిమంతమైన మందుపాతర ఆరుగురు జవాన్లను బలితీసుకుంది. గర్హ్వా జిల్లాలో ఈ ఘటన జరిగిందని ఆరుగురు జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్ దళ సభ్యులు మరణించారని డిప్యూటీ ఐటీ విపుల్ శుక్లా తెలిపారు. జిల్లాలోని చింజో ప్రాంతంలో మావోలు సంచరిస్తున్నారని తెలుసుకుని జాగ్వార్ ఫోర్స్ అక్కడికి వెళ్లిందని, తొలుత ల్యాండ్ మైన్ ను పేర్చిన మావోలు, ఆపై కాల్పులకు దిగారని, ఈ ఘటనలో పలువురు జవాన్లకు గాయాలు అయ్యాయని వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, ఆ ప్రాంతానికి అదనపు బలగాలు పంపించామని ఆయన తెలిపారు.

ఊపందుకున్న ఉక్కు ఉద్యమం..

కడప : జిల్లాలో ఎంపీ సీఎం రమేశ్, బీటెక్ రవి చేస్తున్న ఉక్కు ఉద్యమం ఊపందుకుంది. ఈ దీక్షలకు అనూహ్యంగా స్పందన వస్తోంది. ఈనేపథ్యంలో ఇవాళ కేంద్ర ఉక్కు శాఖా మంత్రిని టీడీపీ ఎంపీలు కలవనున్నారు. ఉదయం 11.30గంటలకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలు కేంద్రమంతితో భేటీ కానున్నారు. మధ్నాహ్నం 1గంటకు కేంద్రమంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ ను టీడీపీ ఎంపీలు కలసి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయమనీ..దానికి సంబంధించి లిఖిత పూర్వక హామీకి కోరనున్నారు. మంత్రి నుండి సానుకూలంగా స్పందన రాకుంటే తదుపరి కార్యాచరణను ఎంపీలు వెల్లడించనున్నారు. 

09:27 - June 27, 2018

ఢిల్లీ : బ్యాంకులకు కోట్లాది రూపాయలు రుణాలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన విజయ్‌ మాల్యా 2016 ఏప్రిల్‌ 15న ప్రధాని మోది, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి రాసిన లేఖను బహిర్గతం చేశారు. బ్యాంకు రుణాలను చెల్లించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. తనను బ్యాంకుల ఎగవేతకు ఓ ప్రచారకర్తగా చిత్రీకరించి ప్రజల ఆగ్రహానికి గురిచేశారని మాల్యా వాపోయారు. తన వాదనను వివరిస్తూ మోదికి, జైట్లీకి లేఖలు రాసినా వారి నుంచి స్పందన రాలేదన్నారు. రుణాలిచ్చిన కొన్ని బ్యాంకులు సైతం ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా నాపై ముద్ర వేశాయన్నారు. సిబిఐ, ఈడీలు గుడ్డిగా నిరాధారమైన ఆరోపణలతో చార్జిషీట్లు దాఖలు చేశాయని ఆయన ఆరోపించారు. బ్యాంకులతో సెటిల్‌మెంట్‌కు తాను సిద్ధమేనని తెలిపారు. విజయ్‌ మాల్యా వివిధ బ్యాంకుల్లో 9 వేల కోట్ల రుణం తీసుకుని 2016లో  దేశం విడిచి పారిపోయాడు. 

 

09:24 - June 27, 2018

హైదరాబాద్ : లవ్‌..! జీవితంలో ఒక్కసారే పుడుతుంది. పదేపదే  ప్రేమలో పడలేం.. మళ్లీ పెళ్లి  చేసుకోబోతున్నందుకు సంతోషంగానే ఉన్నా.. అంత ఉత్సాహంగా మాత్రం లేదు.. రేణుదేశాయ్‌ మనసులో మాటలు ఇవి.  తాను పెళ్లి చేసుకుంటున్నట్టు  రేణు ప్రకటించడంతో అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు. దీనిపై రేణు మాజీభర్త పవన్‌కూడా స్పందించారు. రేణుదేశాయ్‌కి శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేయడం ఆసక్తిగా మారింది. 

తాను పెళ్లికి రెడీ అవుతున్నట్టు ఓ ఇంగ్లీషు పత్రికకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో నటి రేణుదేశాయ్‌ తెలిపారు. ఈ పెళ్లిని పెద్దలే కుర్చారని ఆమె తెలిపారు. కాని పెళ్లి చేసుకోవడం సంతోషంగానే ఉన్నా.. ఏదో కొంత వెలితిగానే ఉందని ఆమె వ్యాఖ్యానించింది. జీవితంలో ప్రేమ అనేది ఒకేసారి పుడుతుందని.. పదే పదే ప్రేమలో పడలేమని రేణు అనడం ఆసక్తిగా మారింది.అయితే తనకు కాబోయే భర్త చాలా ప్రశాంతంగా ఉంటారని, జీవితంలో కొత్తమలుపు తనలో ఉద్వేగం కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు. 

అయితే  సహజీవనం ఎందుకు చేయకూడదంటూ తన స్నేహితులు కొందరు సలహా ఇచ్చారని ..కాని తనకు అలాంటి సంబంధాలపై నమ్మకం లేదన్నారు రేణుదేశాయి్‌.  భారతీయ సంప్రదాయం ప్రకారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి అనుకుంటున్నాని.. పెళ్లిపై తనకు  నమ్మకం ఉందన్నారు. ఇక  తాను రెండో పెళ్లి చేసుకుంటున్నందుకు అకీరా ఎలాంటి బాధపడటం లేదని.. నిజానికి తను చాలా ఉత్సాహంగా ఉన్నాడని రేణుదేశాయ్‌ తెలిపారు.

రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు రేణుదేశాయ్‌ ప్రకటించడంతో.. మాజీ భర్త పవన్‌ కల్యాణ్‌ విషెస్‌ చెప్పారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్న రేణూ గారికి  హృదయపూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్‌ చేశారు. పెళ్లి చేసుకోబోతున్న సమయంలో రేణుదేశాయి్‌ ట్విటర్‌  నుంచి తప్పుకుంది. తాను  నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నాని, ఈ సమయంలో వివాదాలు సృష్టించే వారికి దూరంగా ఉండేందుకే ట్విటర్‌ అకౌంట్‌ను డియాక్టివేట్‌ చేస్తున్నట్టు రేణు తెలిపారు. అయితే, రేణు దేశాయ్‌ కాబోయే భర్త ఎవరన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.  

09:02 - June 27, 2018

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు  కొన్ని వాస్తవాలను దాస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంకు నిధులు ఇవ్వాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి చంద్రబాబు లేఖ రాయడాన్ని కేవీపీ తప్పుపట్టారు.  భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు కేంద్ర ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా అమలు జరిగేలా చూడాలని కోరుతూ చంద్రబాబుకు లేఖ రాశారు. ఇలాచేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం కొంతవరకైనా తగ్గుతుందని కేవీపీ సూచించారు. 
 

08:54 - June 27, 2018

కడప : జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం ఊపందుకుంది. ఓ వైపు టీడీపీ నాయకులు సీఎం రమేశ్‌, బీటెక్‌ రవి దీక్షలు ఏడవ రోజుకు చేరుకుంటే.. మరో వైపు వీరికి పోటీగా వైసీపీ నాయకులు రోజూ నియోజకవర్గాల్లో ధర్నాలు చేస్తున్నారు. కడపకు ఉక్కు  కర్మాగారం రాకపోవడానికి బీజేపీ, వైసీపీలే కారణమని టీడీపీ విమర్శిస్తుంటే..  నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ నేతలకు ఎన్నికల ఏడాదిలోనే కడప స్టీల్‌ ప్లాంట్‌ గుర్తుకు వచ్చిందా.. ? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంకోవైపు టీడీపీ నేతలు దొంగ దీక్షలు, కొంగజపం చేస్తున్నారని బీజేపీ, జనసేన పార్టీలు మండిపడ్డాయి.

కడప ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌, ఆ పార్టీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షలు ఏడో రోజూ కొనసాగింది. వారం రోజులుగా దీక్షలు చేస్తుండటంతో ఈ ఇద్దరు నేతల ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు చెబుతున్నారు.  దీక్ష విరమించాలన్న వైద్యుల సలహాను తిరస్కరిస్తున్నారు.  దీంతో సీఎం రమేశ్‌, బీటెక్‌ రవికి ఏమవుతుందోనని వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. 

కడప జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో దీక్ష చేస్తున్న సీఎం రమేశ్‌, బీటెక్‌ రవికి సంఘీభావం ప్రకటించేందుకు జిల్లా నలుమూల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ, సినీనటుడు శివాజీ దీక్షా శిబిరాకి వచ్చి సీఎం రమేశ్‌, బీటెక్‌ రవిని పరామర్శించారు.  ఈ సందర్భంగా కేఈ కృష్ణమూర్తి.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. స్టీల్‌ ప్లాంట్‌ ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. 

కడప ఉక్కు కర్మాగారాన్ని విస్మరించిన రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో పుట్టగతులుండవని మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. 

బీజేపీతో అంటకాగుతున్న వైసీపీ అధినేత  వైఎస్‌ జగన్‌.. కడప స్టీల్‌ ప్లాంట్‌ను  రాకుండా అడ్డుపుడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల  నుంచే వైసీపీ పతనం ప్రారంభమయ్యే విధంగా నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామన్నారు. కేంద్రంతో అంటకాగే వారిని వచ్చే ఎన్నికల్లో తొక్కి పడేస్తామని.. ఉక్కు దీక్షకు సంఘీభావం ప్రకటించిన సినీనటుడు శివాజీ హెచ్చరించారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమన్నారు. 

కడప ఉక్కు ఆంధ్రుల హక్కని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ మరోసారి స్పష్టం చేశారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలని ట్విటర్‌ ద్వారా డిమాండ్‌ చేశారు. సీఎం రమేశ్‌, బీటెక్‌ రవి చేస్తున్న నిరాహార దీక్ష ఏడోవ రోజుకు చేరుకున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడాన్ని లోకేశ్‌ తప్పుపట్టారు. 

మరోవైపు కడప జిల్లా జమ్మలమడుగులో ఉక్కు సంకల్పదీక్ష చేసిన వైసీపీ నాయకులు.... టీడీపీ నేతల దీక్షలు బూటకమని విమర్శించారు.  వైసీపీ దీక్షకు సంఘీభావం ప్రకటించిన సీపీఐ నాయకుడు ఈశ్వరయ్య... వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్‌ స్టైల్‌లో దీక్షలు చేస్తున్న టీడీపీ నేతల వైఖరి ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ విరమ్శించింది. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా రాయలసీమను బందేల్‌ఖండ్‌, కలహండి స్థాయికి దిగజార్చారని మండిపడ్డారు. 

టీడీపీ నేతల దీక్షలపై జనసేన కూడా మండిపడింది. సీఎం రమేశ్‌, బీటెక్‌ రవి దీక్షల్లో చిత్తశుద్ధిలేదని విమర్శించిన జనసేన.. కడప ఉక్కు కోసం ఈనెల 29న విపక్షాల ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర బంద్‌కు మద్దతు ఉంటుందని ప్రకటించింది. ఈమేరకు  జనసేన  రాజకీయ వ్యవహారాల  కమిటీ కన్వీనర్‌ మాదాసు గంగాధరం ఓ లేఖను విడుదల చేశారు.

08:38 - June 27, 2018

గుంటూరు : ఏపీని ఎలక్ట్రానిక్స్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్న సీఎం చంద్రబాబు మరో విజయం సాధించారు. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన "ఫ్లెక్స్‌" సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర మంత్రి లోకేష్‌ సమక్షంలో ఫ్లెక్స్‌ కంపెనీ పలు ఎంవోయోలు కుదుర్చుకుంది. 

ఏపీని ఎలక్ట్రానిక్స్‌ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామన్నసీఎం చంద్రబాబు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎలక్ట్రానిక్‌  పరిశ్రమలకు అవసరమైన అన్ని మౌళిక వసతులను కల్పిస్తామన్న హామీతో.. వివిధ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఎలక్ట్రానిక్స్‌ హార్డ్‌ వేర్‌ విడిభాగాల తయారీ సంస్థ "ఫ్లెక్స్‌" ముందుకు వచ్చింది. ఫ్లెక్స్‌ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రపంచలో 30కి పైగా దేశాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగస్తులతో "ఫ్లెక్స్‌" సంస్థ తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

దీనికి అనుగుణంగానే ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్‌తోనూ "ఫ్లెక్స్‌" సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. తిరుపతి సమీపంలో సుమారు 585 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఎలక్ట్రానిక్స్‌, హర్డ్‌వేర్‌ విడిభాగాల తయారీ సంస్థ ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకున్నారు. సంస్థ ద్వారా సుమారుగా 6,600 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని లోకేష్‌ తెలిపారు. రానున్న రోజుల్లో  పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని లోకేష్‌ చెప్పారు. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో నిరుద్యోగులకు కొన్ని అవకాశాలు కలసి వస్తున్నాయి.

08:33 - June 27, 2018

గుంటూరు : విభజన చట్టంలోని హామీలు అమలు చేసే వరకూ కేంద్రంతో రాజీలేనిపోరాటం చేయాలని టీడీపీ నిర్ణయించింది. కేంద్రం మెడలు వంచి విభజన హామీలు సాధించుకోవాలని అమరావతిలో జరగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఏడు రోజులుగా దీక్ష చేస్తున్న సీఎం రమేశ్‌, బీటెక్‌ రవి ఆరోగ్యం క్షీణించడం పట్ల  సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు హాజరైన ఈసమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ముందస్తు ఎన్నికలు, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేశ్‌, బీటెక్‌ రవి దీక్ష, ధర్మపోరాట దీక్షల కొనసాగింపు, తెలుగుదేశం-దళితతేజం ముగింపు కార్యక్రమం తదితర అంశాలపై చర్చించారు. 
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుతందని జరుగుతున్న ప్రచారంపై  టీడీపీ సమన్వయ కమిటీ సమావేశలో చర్చించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కోరారు. గెలుపు టీడీపీదేనన్న ధీమా వ్యక్తం చేశారు.  టీడీపీ విజయంపై ఇటీవల వచ్చిన సర్వేలపై సమీక్షించిన చంద్రబాబు.. దీనిపై విపక్షాలు ఉలిక్కిపడుతున్నాయని పార్టీ నాయకుల దృష్టికి తెచ్చారు.  ఇదే సమయంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై అనుమానం వ్యక్తం చేసిన చంద్రబాబు.. దీనిపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. కొత్త తరం ఈవీఎంలపైనా పలు అనుమానాలు  ఉన్నాయని.. అవి ఏమేరకు సత్ఫలితాలిస్తాయో చూడాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో టీడీపీ కమిటీలను పటిష్టం చేయాలని నిర్ణయించారు. 

కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం సీఎం రమేశ్‌, బీటెక్‌ రవి చేస్తున్న దీక్షలపై సమావేశంలో చర్చించారు. ఇద్దరు నేతలు ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారని కొనియాడారు. రమేశ్‌, రవి పోరాటం వృధాగా పోదని చెప్పిన చంద్రబాబు... వీరి దీక్షకు మద్దతుగా ఆందోళనలు, బైక్‌ ర్యాలీలు కొనసాగించాలని  పార్టీ నాయకులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్‌ ర్యాలీలు, గురువారం ధర్నాలు నిర్వహించాలని  నిర్ణయించారు. ఉక్కు ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లాలని టీడీపీ సమన్వయ కమిటీలో చర్చించారు. ఈనెల 28న టీడీపీ ఎంపీలు ఢిల్లీలో పోరాటం  చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఆ రోజు రాష్ట్రంలో కూడా ధర్నాలు కొనసాగించాలని నిర్ణయించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం సీఎం రమేశ్‌, బీటెక్‌ రవి ఏడు రోజులుగా దీక్ష చేస్తున్నా.. కేంద్రం స్పందించకపోవడంపై సమావేశంలో ఆగ్రహం వ్యక్తమైంది. 

కేంద్ర ప్రభుత్వ కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా చేపట్టిన ధర్మపోరాట దీక్షలను కొనసాగించాలని టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో  నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈనెల 29న కాకినాడలో ధర్మపోరాట దీక్ష నిర్వహించాలని తలపెట్టారు. మత్స్యకారులు, రజకులు, వడ్డెర్లను ఎస్టీ, ఎస్సీ జాబితాలో చేరుస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కమిటీ ఏర్పాటు చేసేందుకు జీవో జారీకి చర్యలు తీసుకోవాలని ఆయా మంత్రులను చంద్రబాబు ఆదేశించారు. వచ్చే నెల 16 నాటికి చంద్రబాబు పాలన 1500 రోజులు పూర్తవుతుంది. ఆరోజు నుంచి గ్రామదర్శిని కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

నాలుగు నెలలుగా రాష్ట్రంలో చేపట్టిన తెలుగుదేశం-దళితేజం కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. దీనిలో భాగంగా ఈనెల 30న నెల్లూరులో భారీ సభ నిర్వహించాలని టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులను ఆదేశించిన చంద్రబాబు... ఈనెల 28న శ్రీకాకుళం జిల్లాలో జరిగే ఏరువాక కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించారు. 

సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ భేటీ 

08:27 - June 27, 2018

హైదరాబాద్ : హైదరాబాద్‌ పరిధిలోని రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో కొత్తగా ఐటీ హబ్‌ను అభివృద్ధి చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ పరిశ్రమలకు భూమి కొరత వేధిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ అంశాన్ని ముందుకు తెచ్చింది. బుద్వేల్‌ కిస్మత్‌పూర్‌ ప్రాంతంలో ఐటీ పరిశ్రమలకు భూమి కేటాయించాలని నిర్ణయించినట్టు రాజేంద్రనగర్‌లో పర్యటించిన మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే జీహెచ్‌ఎంసీతోపాటు హెచ్‌ఎండీఏ ప్రాంతాల్లో వంద కోట్ల రూపాయల అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టారు.  రాజేంద్రనగర్‌ పరిధిలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం, సీసీ రోడ్ల ఏర్పాటు, కిస్మత్‌పూర్‌లో వంతెన నిర్మాణం, మల్కం చెరువు పునరుద్ధరణ పనులకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.  కొద్ది రోజులు నగర శివారు ప్రాంతాల్లో కేటీఆర్‌ చేస్తున్న పర్యటనలు, నిర్వహిస్తున్న సభలు ఎన్నికల ప్రచారాన్ని తలిపిస్తున్నాయి. 

నియోజకవర్గ పర్యటనలో భాగంగా శంషాబాద్‌లో నిర్వహించిన సభలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్‌..  శేరిలింగంపల్లిని తలదన్నే రీతిలో రాజేంద్రనగర్‌ను ఐటీ హబ్‌గా మారుస్తామని చెప్పారు. రాజేంద్రనగర్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో లాజిస్టిక్స్‌ పార్క్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు. 

మరోవైపు ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్‌ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు కేటీఆర్‌ ప్రకటించారు. గండిపేట చెరువును తవ్వి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వంద కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

08:24 - June 27, 2018

హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్‌ వేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం తేలే వరకు ఎన్నికలు ఆపాలని హైకోర్టు  ఆదేశించింది. బీసీల జనాభాపై ప్రభుత్వమే పలురకాల సమాచారం ఇవ్వడంతో గందరగోళం నెలకొంది.  బీసీల గణాకాలన్నీ సమగ్రంగా రూపొందించిన  తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకోసం ప్రభుత్వం చేస్తున్న హడావిడికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బ్రేక్‌ వేసింది. బీసీ రిజర్వేషన్లతోపాటు ఏబీసీడీ వర్గీకరణపై కచ్చితమైన సర్వే చేపట్టాలని దాఖలైన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌, ఇతర బీసీ సంఘాలు  దాఖలు చేసిన పటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. 2018 గ్రామపంచాయతీ చట్టంలో రాష్ట్రంలో బీసీ జనాభా 34శాతంగా ఉంది. అలాగే  ప్రభుత్వం శాసన సభలో ప్రవేశపెట్టిన బిల్లులో 37శాతంగా పేర్కొన్నారు. ఇక  ప్రభుత్వం ఒక రోజులో చేపట్టిన సమగ్రసర్వేలో ఏకంగా బీసీల జనాభా 54శాతంగా ఉన్నట్టు తేలింది.  ఈ వివరాలన్నీ పిటిషన్‌దార్లు కోర్టుకు అందించారు. 

ప్రభుత్వం తరపున డిప్యూటీ అటార్నిజనరల్‌ వాదనలు వినిపించారు. పంచాయతీరాజ్‌ చట్టంలో పేర్కొన్న 34శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించడానికి అనుమతించాలని హై కోర్టును అభ్యర్థించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. బీసీ జనాభా వివరాలన్నీ గందరగోళంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో మరోసారి సర్వే జరిపించి బీసీ జనాభా వివరాలను సమగ్రంగా రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి వరకు ఎన్నికలకు వెళ్లొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రంలో  పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. మరోసారి బీసీ జనాభా వివరాలు సేకరించి.. రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే ఎన్నికలు జరగనున్నాయి.

నేడు బంగ్లాదేశ్ తో భారత్ తొలి టీ20 మ్యాచ్

డబ్లిన్ : నేడు బంగ్లాదేశ్ తో భారత్ తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

 

200వ రోజుకు చేరుకున్న జగన్ ప్రజా సంకల్పయాత్ర

తూ.గో : జగన్ ప్రజా సంకల్పయాత్ర 200వ రోజుకు చేరుకుంది. నేడు అమలాపురం నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర కొనసాగనుంది. కామనగురువు నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. 

 

నేడు సీఎస్ ను కలవనున్న ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్

హైదరాబాద్ : నేడు ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ లు సీఎస్ ను కలవనున్నారు. నియామకాల్లో జరుగుతున్న అన్యాయంపై ఐఏఎస్ లు ఫిర్యాదు చేయనున్నారు.  

 

ఫిఫా ప్రపంచ కప్ లో నేటి మ్యాచ్ లు

హైదరాబాద్ : ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా నేడు పలు మ్యాచ్ లు జరుగనున్నాయి. రాత్రి 7.30 గంటలకు దక్షిణకొరియా, జర్మనీ ఢీకొట్టనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మెక్సికో వర్సెస్ స్వీడన్ మ్యాచ్ జరుగనుంది. రాత్రి 11.30 గంటలకు సెర్బియాతో బ్రెజిల్ తలపడనుంది. రాత్రి 11.30 గంటలకు స్విట్జర్లాండ్ వర్సెస్ కోస్టారికా ఢీకొననున్నాయి. 

Don't Miss