Activities calendar

28 June 2018

21:25 - June 28, 2018

అమర్ నాథ్ యాత్రకు వర్షం అడ్డంకి...

ఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో వర్షం కారణంగా నలిచిపోయిన అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. వాతావరణం అనుకూలంగా మారడంతో యాత్రను తిరిగి కొనసాగుతోంది. అమర్‌నాథ్‌ యాత్రకు వర్షం అడ్డంకిగా మారడంతో.. భక్తులను బల్తాల్, పహెల్‌గావ్ క్యాంపులలో ఉంచారు. వర్షాల కారణంగా యాత్రికులు ఎవరూ కూడా గుడారాల నుంచి బయటకు రావొద్దని అధికారులు, పోలీసులు సూచించారు.

పది మంది సైనికులు ఎక్కడ ?

ఢిల్లీ : సరిహద్దు భద్రతా దళానికి చెందిన పది మంది సైనికులు అదృశ్యమయ్యారు. 83 మంది సైనికులు పశ్చిమ బెంగాల్‌ నుంచి జమ్ముకు ప్రత్యేక రైళ్లో వెళ్తున్నారు. మార్గమధ్యలో పది మంది సైనికులు మిస్సయినట్లు సైనిక కమాండర్‌ యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సర్జికల్ వీడియో..ప్రతిపక్షాల అభ్యంతరం...

ఢిల్లీ : సర్జికల్‌ దాడుల వీడియో రిలీజ్‌ చేయడంతో ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దేశం కోసం రక్తం చిందిస్తున్న భారత సైనికుల త్యాగాలను ఓట్ల కోసం వినియోగించుకోవాలని చూడడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ విమర్శించింది. 

21:04 - June 28, 2018

అనంతపురం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనంతపురం జిల్లా పర్యటన ఉద్రిక్తంగా సాగింది. టీడీపీ, సీపీఐ శ్రేణులు వేర్వేరుగా కన్నా పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. వారిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. పరస్పరం పిడిగుద్దులు విసురుకున్నారు. తమవారిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ.. అనంత అర్బన్‌ ఎమ్మెల్యే ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత మరింతగా పెరిగింది. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనంతపురం జిల్లా పర్యటన ఉద్రిక్తంగా మారింది. అనంతపురం ఆర్&బి అతిథిగృహంలో కన్నా లక్ష్మీనారాయణ నిర్వహిస్తున్న విలేకరుల సమావేశం దగ్గరకు టీడీపీ అనుబంధ విభాగం టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు చేరుకుని.. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశంపై వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అదే సందర్భంలో.. కొందరు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో.. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకారులపై విరుచుకుపడి.. పరుగులెత్తించారు. టీడీపీ కండువాను తగులబెట్టారు.

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ శ్రేణులపై దాడి జరిగిన కొద్దిసేపటికే.. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌ నేతృత్వంలోని కార్యకర్తలు ఆర్‌&బి అతిథిగృహానికి చేరుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణను కలిసే ప్రయత్నం చేశారు. బీజేపీ నేతలు, సీపీఐ కార్యకర్తలను అడ్డుకుంటూ.. వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇరువర్గాలనూ శాంతింప చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. ఇరు వర్గాలూ ఒక్కసారిగా దాడులు, ప్రతిదాడులకు దిగారు. రెండు ఘటనల్లోనూ.. పోలీసులు టిఎన్‌ఎస్‌ఎఫ్‌, సీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
టిఎన్‌ఎస్‌ఎఫ్‌, సీపీఐ శ్రేణులపై బీజేపీ నేతల దాడిని నిరసిస్తూ.. అనంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి.. నగర రెండో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. దాడికి దిగిన కడప గూండాలపై కేసులు నమోదు చేయాలని, బీజేపీ నేతలు బేషరతు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అటు సీపీఐ నేతలు.. తమపై దాడులకు నిరసనగా.. అనంతపురం బంద్‌కు పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు ఇదే తరహాలో వ్యవహరిస్తే తామూ ప్రతిదాడులకు దిగాల్సి వస్తుందని, వారిని జిల్లాలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.

టీడీపీ, సీపీఐ నేతల ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్‌లోనే తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణ రెండు రోజుల పర్యటనలో.. తొలిరోజే.. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ శ్రేణులు అడ్డుకుంటాయని పోలీసులకు సమాచారం ఉంది. దీంతో.. బీజేపీ శ్రేణులను ఒప్పించి, వారి ర్యాలీని దారిమళ్లించారు. అయితే.. రెండో రోజు.. తెలుగు విద్యార్థి, సీపీఐ శ్రేణులు కన్నా లక్ష్మీనారాయణ పర్యటనను అడ్డుకున్నాయి. కడప ఉక్కు, ప్రత్యేక హోదా అంశాలపై నిలదీసే ప్రయత్నం చేశాయి.

21:01 - June 28, 2018

కడప : ఉక్కు పరిశ్రమ కోసం 9 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీక్ష విరమించకపోతే ఆరోగ్యం విషమిస్తుందని వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చెప్పారు. షుగర్‌, బీపీ పడిపోవడంతో గుండెకు ప్రమాదం పొంచివుందని సూచించిన డాక్టర్లు... దీక్ష విరమించాలని కోరారు. వైద్యుల విన్నపాన్ని తిరస్కరించిన రమేశ్‌... కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంపై కేంద్రం నుంచి స్పష్టం ప్రకటన వచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని తేల్చిచెప్పారు.

దీక్ష చేస్తున్న సీఎం రమేశ్‌కు అమెరికా నుంచి వచ్చిన డాక్టర్‌ రాజా నేతృత్వంలోని రిమ్స్‌ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ తీశారు. షుగర్‌, బీపీ స్థాయిలు బాగా పడియినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందన్నడాక్టర్లు.. దీక్ష విరమించాలని రమేశ్‌కు సూచించారు. ఐసీయూ ఉండాల్సిన వ్యక్తి టెంట్‌ కింద దీక్ష కొనసాగిస్తుండటంతో గుండెకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. హృదయానికి ప్రమాదం ఏర్పడితే టెంట్‌లో వైద్యం చేయడం కష్టమని వైద్యులు చెప్పినా.. తన లక్ష్యం నెరవేరు వరకు దీక్ష కొనసాగుతుందని రమేశ్‌ తేల్చి చెప్పారు. దీంతో దీక్ష శిబిరం వద్ద నిరంతరం అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు.

దీక్ష చేస్తున్న రమేశ్‌ను మున్సిపల్‌ మంత్రి నారాయణ పరామర్శించారు. క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దీక్ష విరమించాలని కోరినా... కడప స్టీల్‌ ప్లాంట్‌ సాధించే వరకు ఉక్కు దీక్షను ఆపేదిలేదన్నారు. స్టీల్‌ ప్లాంట్ నిర్మాణం పై కేంద్ర ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ డిమాండ్‌ చేశారు. లేకపోతే 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మరోవైపు పోలీసులు దీక్ష భగ్నం చేయడంతో రిమ్స్‌లో చికిత్స పొందుతున్న టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని కూడా మంత్రి నారాయణ పరామర్శించారు. డాక్టర్లు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్న మంత్రి.. మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రస్తుతం రవికి ఫ్లూయిడ్స్‌ ఇస్తున్నారు. ఘనాహారం తీసుకోడానికి మరికొన్ని రోజులు పడుతుందని డాక్టర్లు తెలిపారు.

20:59 - June 28, 2018

ఢిల్లీ : కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ ఎంపీలు ఢిల్లీలో తమ ఆందోళన ఉధృతం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌తో బుధవారం నిర్వహించిన భేటీలో స్పష్టమైన హామీ రాకపోవడంతో.. గురువారం రెండో రోజు మంత్రి నివాసం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మంత్రిని కలిసి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి మేకాన్‌ సంస్థ నుంచి తుది నివేదిక వచ్చిన తర్వాత టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పాత పాటే పాడారు.
 

కడప ఉక్కు పరిశ్రమ కోసం ఓ వైపు సీఎం రమేశ్‌ దీక్ష చేస్తుంటే... మరోవైపు టీడీపీ ఎంపీలు ఢిల్లీలో తమ ఆందోళనను ఉధృతం చేశారు. బుధవారం కేంద్ర ఉక్కు మంత్రి బీరేంద్రసింగ్‌ని కలిసి చర్చించినా స్పష్టమైన హామీ లభించకపోవడంతో గురువారం రెండో రోజు మంత్రి నివాసం వద్ద బైఠాయించి, ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.

ఆ తర్వాత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌తో భేటీ అయిన టీడీపీ ఎంపీలు.. ఆయన ముందుకు కూడా ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ తొమ్మిదవ రోజు కూడా దీక్ష కొనసాగించడంతో ఆరోగ్యం క్షీణించిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌... సీఎం రమేశ్‌తో ఫోన్‌లో మాట్లాడి దీక్ష విరమించాలని కోరారు. స్టీల్‌ ప్లాంట్‌పై స్పష్టతరానిదే దీక్ష విరమించబోనని రమేశ్‌ స్సష్టం చేశారు. ప్రధాని మోదీతో చర్చించి రెండు మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన చేయకపోతే తమ డెడ్‌బాడీ చూస్తారని రమేశ్‌ .. కేంద్ర మంత్రితో అన్నారు.

కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించాలని టీడీపీ ఎంపీలు కోరారు. లేకపోతే ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కడప ఉక్కు కర్మాగారం సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేసిన మెకాన్‌ సంస్థ నుంచి తుది నివేదిక వచ్చిన తర్వాత టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో నిర్ణయం తీసుకుంటామని టీడీపీ ఎంపీలతో అన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్ర మంత్రి బీరేందర్‌సింగ్‌ నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోయినా... కచ్చితమైన హామీని పొందగలిగామని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. టాస్క్‌ ఫోర్స్‌ అడిగిన అంశాలపై స్పష్టత ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖనే మళ్లీ పంపాలన్న మంత్రి బీరేంద్రసింగ్‌ సూచనను అమలు చేస్తామన్నారు. కేంద్ర ఉక్కు మంత్రి బీరేంద్రసింగ్‌తో జరిపిన చర్చల వివరాలను టీడీపీ ఎంపీలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. 

20:49 - June 28, 2018

మోడీ విదేశాల ఖర్చు రూ. 355 కోట్లు...

ఢిల్లీ : భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన విదేశీ ప్రయాణాలకు అయిన ఖర్చులు రూ.355 కోట్లు అని తేలింది. పర్యటన ఖర్చుల వివరాలను తెలియజేయాలని బెంగళూరుకు చెందిన భీమప్ప గదాద్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు దరఖాస్తు చేశారు. ఈ మేరకు పీఎంఓ వాటి వివరాలను తెలిపింది. 

'బొగ్గు, జబ్బులు మాకు..డబ్బులు పోర్టుకు'...

విశాఖపట్టణం : విశాఖలోని పాతపట్నంలోని కోట వీధిలో జనసేన అధినేత పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలుష్య బాధితులు పవన్ ఎదుట సమస్యలు విన్నవించారు. ఈసందర్భంగా ఆయన వారికి అండగా ఉంటానని హామీనిచ్చారు. 

19:45 - June 28, 2018

నాకు ఒక ముచ్చట అర్థంగాదు.. కడపల ఉక్కు ఫ్యాక్టరీ వెట్టాలే అని దీక్ష జేస్తున్నోళ్లు తెల్గుదేశం పార్టోళ్లే.. తులం ముక్కుపుల్లను కన్కదుర్గమ్మకు ఇచ్చెతందుకు ఇంత ఇంతెజామా..? ఇప్పుడు డీశ్రీనివాసు.. కేసీఆర్ కథ ఒక్కపారి జూద్దాం.. నా ప్రాణం బొయ్యినా పర్వలేదు.. నాకు ప్రాణమంటే లెక్కలేదుగని..? అరే వారీ కులం ఉన్నదిరా ఇంకా ఈ భారతదేశంల అంటె ఎవ్వడు ఇనడు.. ఏడున్నది కులం..? బాలికాకకు బాగనే తీర్వాట్కం దొర్కినట్టుందిగదా..? అరే నీయక సర్కారు బడి అంటే అదోక దేవాలయంరా వారీ.. దొంగలందు తెల్వితక్వ దొంగలు వేరయా..? విశ్వదాభిరామా.? నీకు తెల్వదా వేమ..? గీ గరం గరం ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

19:40 - June 28, 2018

నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రం...

ఢిల్లీ : ఏపీలోని నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రానికి న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పర్యావరణ శాఖ ప్రకటించింది. తొలి విడతలో రూ. 600 కోట్లతో క్షిపణి ప్రయోగ కేంద్రానికి అనుమతినివ్వనున్నట్లు వెల్లడించింది. భూ సేకరణకు రూ. 35 కోట్లు, అటవీశాఖకు రూ. 85 కోట్లు..రెండు దశల్లో రూ. 1600 కోట్లతో క్షిపణి ప్రయోగ కేంద్రానికి రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ అక్టోబర్ నాటికి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

ఉక్కు పరిశ్రమకు 3000వేల ఎకరాలు సిద్ధం - జేసీ...

ఢిల్లీ : కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం 3,000 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పిందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ తెలిపారు. మెకాన్‌ వారు వచ్చి తమకు అంత భూమి అవసరం లేదని..1,800 ఎకరాలు చాలని పేర్కొనడం జరిగిందన్నారు. కానీ మళ్లీ 1,800 ఎకరాలు కాకుండా, దాని పక్కన ఉన్న 500 ఎకరాల భూమి కూడా ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అంతా దుర్బుద్ధి.. ఆలస్యం చేయాలని, మభ్య పెట్టాలని చూస్తున్నారని, వారు కోరుకున్న ఆ 500 ఎకరాలు కూడా ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. 

కాలు జారి కిందపడిన మంత్రి దేవినేని...

కృష్ణా : జిల్లాలోని గొల్లపూడిలో జరిగిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. కాడెద్దులు బెదిరి పరుగులు తీయడంతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కాలు జారి కిందపడ్డారు. 

18:44 - June 28, 2018
18:40 - June 28, 2018

కర్నూలు : జిల్లా ఆత్మకూరులో విషాదం చోటుచేసుకుంది. ఆత్మకూరులోని ఓ పాడుబడిన భవనం గుమ్మానికి ఓ బాలిక, ఓ యువకుడు చున్నితో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అనిత, జయారాం లు కర్నూలు మండలం నూతన పల్లె గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

 

18:38 - June 28, 2018

తూర్పు గోదావరి : జిల్లా కాకినాడలో శుక్రవారం జరిగే ధర్మ పోరాటం దీక్ష ఏర్పాట్లను హోమ్‌ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పలు కార్యక్రమాల కోసం టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు లక్ష మంది ప్రజలు ఈ దీక్షకు హాజరుకానున్నట్లు మంత్రి నిమ్మకాయల తెలిపారు. భద్రత ఏర్పాట్ల దృష్ట్యా 3 వేల మంది పోలీసులతో బందోబస్తు చేస్తున్నామన్నారు.

18:37 - June 28, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని.. ఉద్యమకాలం నాటి మొక్కు చెల్లించుకున్నారు. సుమారు పదకొండున్నర గ్రాముల బంగారంతో చేయించిన ముక్కుపుడకను అమ్మవారికి సమర్పించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి.. దాదాపు నలభై నిమిషాల పాటు అమ్మవారి సన్నిధిలో గడిపారు. ఎయిర్‌పోర్టు నుంచి గేట్‌వే హోటల్‌కు వెళ్లిన కేసీఆర్‌.. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల సమయంలో.. దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. సొంత కాన్వాయ్‌లో సీఎం దుర్గగుడికి వచ్చారు. మహామండపం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

కుటుంబసమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న కేసీఆర్‌.. అమ్మవారికి పట్టువస్త్రాలతో పాటు.. ముక్కుపుడకను సమర్పించారు. సహచర మంత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి.. కేసీఆర్‌ దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు పదకొండున్నర గ్రాముల బంగారంతో చేయించిన ముక్కుపుడకలో 57 వజ్రాలను పొదిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కుకున్న ప్రకారం దుర్గమ్మకు ముక్కుపుడకను సీఎం సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాక సందర్భంగా.. ఆలయ ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రప్రభుత్వం సీఎంకు జడ్ ప్లస్ సెక్యురిటీ కల్పించింది. అమ్మవారి దర్శనం తర్వాత వెటర్నరీ గెస్ట్‌హౌస్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్‌... రెండున్నర గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ తిరుగుప్రయాణమయ్యారు. 

18:35 - June 28, 2018

ఢిల్లీ : కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌తో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై చర్చించారు. స్టీల్‌ ప్లాంట్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర మంత్రి ముందు టీడీపీ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. భేటీ అనంతరం బీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడారు. మరోసారి ఎంపీలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించడం జరిగిందని, రెండు అంశాలపై సమగ్ర వివరణాలతో ఎంపీలు వచ్చారన్నారు. రెండు అంశాల వివరణనలను మెకాన్ ను ఇవ్వాలని కోరడం జరిగిందని, మెకాన్ సంస్థ టాస్క్ ఫోర్స్ నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. ఆ నివేదికలోని సాధ్యసాధ్యాలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతామన్నారు. 

18:32 - June 28, 2018

శ్రీకాకుళం : విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్మపోరాటం కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మి నాలుగేళ్లు సహకరిస్తే చివరికి నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం బీజేపీతో లాలూచీపడ్డ వైసీపీ అధినేత జగన్‌... రాజకీయాలు పక్కనపెట్టి... కేంద్రంతో టీడీపీ చేస్తున్న పోరాటానికి కలిసిరావాలని శ్రీకాకుళం జిల్లా ఏరువాక ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఆమదాలవలస మండలం రావికంపేటలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా సంప్రదాయబద్ధంగా వ్యవసాయ పనులు ప్రారంభించడం ఏపీలో ఆనవాయితీ. రావికంపేట చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. పంచకట్టి, తలపాగా చుట్టి..భూమికి పూజ చేశారు. ట్రాక్టర్‌తో పొలందున్నారు. మహిళా రైతులతో కలిసి విత్తనాలు చల్లారు. కల్టివేటర్‌తో వరినాట్లు వేశారు.

రావికంపేటలో జరిగిన సభలో చంద్రబాబు... కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుకుపడ్డారు. విభజన సమస్యలతో సతమతమవుతున్న ఏపీని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రధాని మోదీ నమ్మకద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ రైల్వే జోన్‌, రెవెన్యూలోటు భర్తీ, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా మోదీ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీల సాధన కోసం కేంద్రంతో పోరాడేందుకు విపక్షాలు టీడీపీతో కలిసిరావాలని చంద్రబాబు కోరారు. ఉత్తరాంధ్ర నుంచి విప్లవం వస్తుందంటూ ఒక పార్టీ ప్రచారం చేస్తోందని పరోక్షంగా జనసేనపై సీఎం మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీకి సొంత మైకులా, బీజేపీకి అద్దెమైకులా పనిచేస్తున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో వ్యసాయరంగం కుదేలైందని, రైతుకు ధీమా ఇవ్వని పంటల బీమా పథకంతో అన్నదాతలు ఆత్మహత్యల బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రెండువేల కోట్లతో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. పోలవరం ఎడమ కాల్వను వంశధార ప్రాజెక్టుతో అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా అన్నదాతలు రాష్ట్ర వ్యాప్తంగా సంప్రదాయబద్ధంగా వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఎడ్లు, నాగలితోపాటు వ్యవసాయ ఉపకరణాలన్నింటికీ పూజలు చేసి సాగు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులూ ఉత్సాహంగా పాల్గొన్నారు. 

17:56 - June 28, 2018
17:55 - June 28, 2018

నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం ఫాసిస్టు చర్యలకు పాల్పడుతోందని బీఎల్ఎఫ్ నేతలు విమర్శలు గుప్పించారు. కలెక్టరేట్ల ముట్టడిని ప్రభుత్వం అడ్డుకున్నందుకు...నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటిని గృహ నిర్భందం..కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు అనుమతినివ్వకపోవడంపై నిరసిస్తూ జూలకంటి చేపట్టిన నిరహారదీక్షను సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. అనంతరం మిర్యాలగూడలో బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్శంగా తమ్మినేని వీరభద్రంతో టెన్ టివి మాట్లాడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం అమలు కావడం లేదని..కేసీఆర్ లో భయం ఉందని..అందుకే నిర్భందం..పోలీసు రాజ్యం నడిపిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేస్తామని కేవలం బీఎల్ఎఫ్ మాత్రమే ప్రకటించిందన్నారు. అధికారపక్షం..ప్రతిపక్ష కాంగ్రెస్..ఏవీ మాట్లాడడం లేదన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:32 - June 28, 2018

స్పష్టమైన ప్రకటన చేస్తే దీక్ష విరమిస్తా : సీఎం రమేశ్

ఢిల్లీ : ఎంపీ సీఎం రమేశ్ తో కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ ఫోన్ చేసి మాట్లాడారు. దీక్ష విరమించాలని సీఎం రమేశ్ ను మంత్రి బీరేంద్ర సింగ్ కోరారు. కడపలో ఉక్కు కర్మాగానికి స్పష్టమైన ప్రకటన చేస్తేనే దీక్ష విరమిస్తానని సీఎం రమేశ్ స్పష్టం చేశారు. కాగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని గత తొమ్మిది రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సీఎం రమేశ్, బీటెక్ రవిలు దీక్షకు అనూహ్యమైన స్పందన వస్తోంది.

16:59 - June 28, 2018

ఢిల్లీ : స్త్రీ సాధికారత కోసం ఎన్నో చేస్తామని పాలకులు, నేతలు ఎప్పటికప్పుడు గప్పాలు పలుకుతుంటారు. కానీ స్త్రీ సాధికారత కోసం స్త్రీలు పోరాటాలతోనే సాధించుకుంటున్నారు. కానీ రక్షణ విషయంలో మాత్రం భారత సమాజం మహిళలపై హింస కొనసాగుతునే వుంది. రోజు రోజుకీ చులకన భావం,హింస,అణచివేత, ఆంక్షలు పెరుగుతున్నాయి.

భారత మహిళల కన్నీటి వెతలకు అంతం లేదా?
భారతదేశంలో చాలామంది మహిళలను కదిలిస్తే వారి కన్నీటిగాధలు, వెతలు, వేదనలు ఎన్నో, ఎన్నెన్నో. కటుంబం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం అహోరాత్రులు కష్టపడే మహిళల స్థితిగతులు భారత్ లో వున్న పరిస్థితులు తవ్వినకొద్దీ వెలుగులోకి వస్తున్న హింసా భారతాలు లెక్కలేనన్నిగా వుంటాయి. ఉబికి వస్తున్న కన్నీంటి సముద్రాలను కనురెప్ప దాటనీయకుండా లోలోపలే అణిచివేసుకుంటు ముందుకు సాగేందుకు మహిళలు పోరాడుతునే వున్నారు. తమ శక్తిని, యుక్తిని నిరూపించుకుంటు, హింసలను తట్టుకుంటు..అవమానాలను అనుభవాలుగా తీర్చిదిద్దుకుంటు సాధికారత కోసం కొట్లాడుతున్నారు. తమతో తామే ధైర్యాన్ని కూడగట్టుకుని ఎదరవుతున్న పరిస్థితులను తట్టుకుని జారిపోతున్న గుండె ధైర్యాన్ని ఆత్మస్థైర్యంగా చేసుకుని ఆత్మవిశ్వాసన ఆయుధంతో హింసా భారతంలో తమ శక్తి యుక్తులకు పదును పెట్టుకుంటు..నిరూపించుకుంటు ముందుకు విజయదరహాసంతో సాగిపోతున్న మహిళా శక్తికి ఈ భారతదేశం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు.
థామన్స్ రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ సర్వే..
భారతదేశంలో ప్రస్తుతం మహిళల రక్షణ అంశం తీవ్ర భయాందోళనను రేకిత్తిస్తుంది. థామన్స్ రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ సర్వేలో మహిళా రక్షణ విషయంలో ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన దేశంగా భారత్ మొదటిస్థానంలో నిలిచింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2007-2016 మధ్య కాలంలో దేశంలో మహిళలపై హింస 80 శాతం పెరిగింది. కానీ అనధికారిక లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఫిర్యాదు చేసేందుకు కూడా బైటకు రాని హింసలకు లెక్కేలేదు. ఇంచుమించు ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరు హింసల బారిన పడుతునే వున్నారు. అది కుటుంబ హింస కావచ్చు. సామాజిక హింస కావచ్చు. అది మానసికంగా కావచ్చు. శారీరకంగా కావచ్చు. హింస అనేది మాత్రం మహిళ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.

మహిళకు రక్షణ లేని దేశరాజధాని ఢిల్లీ
ఢిల్లీలోని ఓ యువతి ముఖానికి స్కార్ప్, మొబైల్ ఫోన్‌లో సేఫ్టీ యాప్స్, హ్యాండ్ బ్యాగులో పెప్పర్ స్ప్రే ఇవి లేనిదే ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టదు. ఇటువంటి ఎంతోమంది విద్యార్థినుల, యువతుల, మహిళల దుస్థితి నేడు దేశ రాజధాని నగరం ఢిల్లీలో. దేశం మొత్తం మీద ఇంచుమించుగా ఇటువంటి స్థితిగతులే నెలకొన్నాయి. ఇది అత్యంత సిగ్గుపడాల్సిన పరిస్థితి.
గంటకు మహిళలపై 40 నేరాలు..
అధికారిక లెక్కల ప్రకారం దేశంలో మహిళలపై హింస వివిధ రూపాల్లో ప్రతి గంటకు 40 నేరాలు నమోదు అవుతున్నాయి. వీధుల్లో నడిచేటప్పుడు, బస్సుల్లో, మెట్రోల్లో ప్రయాణించేటప్పుడు ఎదుర్కొనే లైంగిక వేధింపులను తట్టుకుని ఆఫీసులకు చేరుకుంటే అక్కడా సహ ఉద్యోగులతోనూ, బాస్‌లతోనూ ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా పనిచేసే జోహ్రీ అనే 28 సంవత్సరాల మహిళ తన ఎదుర్కొన్న భయంకర అనుభవాలను పంచుకుంది. వీటన్నింటితో విసిగి వేసారి తట్టుకోలేక చివరికి ఆమె ఉద్యోగం మానేసింది.

యుద్ధదేశాల్లో దిగజారిన స్థితిగతులు..
యుద్ధాలతో చితికిపోయిన దేశాల్లో మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రపంచంలోనే మహిళలకు అపాయకరమైన దేశంగా రెండవస్థానంలో ఆప్ఘనిస్థాన్ నిలిచింది. ఏడేండ్లుగా అంతర్యుద్ధంలో నలుగుతున్న సిరియా కూడా ఈ జాబితాలో మూడోదేశంగా నిలిచింది. ఇక రెండు దశాబ్దాలుగా యుద్ధానికి ఛిన్నాభిన్నమైన సోమాలియా మహిళలకు సురక్షితంకాని దేశాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో నిలిచిన సౌదీ అరేబియాలో ఇటీవలికాలంలో మంచి పురోగామిచర్యలు కనిపిస్తున్నాయి.

టాప్ 10లో కొన్ని దేశాలు..
యెమెన్, నైజీరియా, పాకిస్థాన్ దేశాలు కూడా టాప్-10 జాబితాలో ఉన్నాయి. మహిళలకు సురక్షితం కాని టాప్-10 దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఉంది.మీటూ ఉద్యమం కారణంగా మహిళలు స్వచ్ఛందంగా తమపై జరిగిన లైంగిక వేధింపులను వెల్లడించడంతో అమెరికా ఈ జాబితాలో చేరినట్లు నిపుణులు చెబుతున్నారు.

బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది..
ఇంటినుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని ఢిల్లీకి చెందిన కనిక జోహ్రా చెప్పారు. అత్యాచారాల రాజధానిగా మారిన ఢిల్లీలో.. ముఖానికి స్కార్ఫ్, బ్యాగులో పెప్పర్ స్ప్రే, మొబైల్‌లో సేఫ్టీ యాప్స్‌తో ఇంటినుంచి బయల్దేరుతుంది. సగటున ప్రతీ గంటకు మహిళలపై 40 నేరాలు రికార్డవుతున్న దేశంలో ఇవన్నీ తప్పనిసరి అంటున్నారు 28 ఏండ్ల జోహ్రి. మార్కెటింగ్ ఉద్యోగిగా పనిచేసే ఆమె సర్వే నిర్వహించిన థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్‌తో తన అనుభవాలను, ఆవేదనను పంచుకున్నారు. మీరు సిటీ బస్సులో వెళ్తుంటే ఎవరో వెనకనుంచి తోస్తారు. పక్కనుంచి మరొకరు పైపైకి వస్తారు. మీరేమైనా అంటే, అక్కడున్నవారంతా మిమ్మల్నే దోషిగా చూస్తారు. అకస్మాత్తుగా ఓ చేయి మీ భుజం మీదో, తొడమీదో పడుతుంది. ఏడేండ్లలో అలా కన్నీళ్లు కార్చిన రోజులెన్నో ఉన్నాయి అని ఆమె తెలిపారు.
హింసలేని మహిళా భారతం కోసం..
ప్రపంచ దేశాలలో భారత మహిళలు ఎగురవేస్తున్న విజయబావుటాలను చూసైనా ఈ భారతం మహిళలపై వున్న దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవుసరం వుంది. ఆరోజులు త్వరలో రావాలని కోరుకుందాం..భారతదేశం అంటే మహిళలపై హింస సాగిస్తున్న భారతం అనే మాటను తుడిపెట్టి మహిళా విజయభారతి అని చాటిచెప్పే నవయుగ భారతం రావాలని కోరుకుందాం!!

16:15 - June 28, 2018

కడప : అటు ఏపీ రాష్ట్రంలో..ఇటు హస్తినలో టిడిపి పోరాటం కొనసాగుతోంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వీరు చేపడుతున్న నిరసనలు..దీక్షలపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల అనంతరం..ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటివి చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కడపలో సీఎం రమేశ్ ఆమరణ నిరహార దీక్ష 9వ రోజుకు చేరుకుంది. మరోవైపు కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన తీసుకోవాలని టిడిపి ఎంపీలు భావిస్తున్నారు. ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ కోరినా దొరకకపోవడంతో కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ తో మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు.

గురువారం ఉదయం మంత్రి బీరేంద్ర సింగ్ లేని సమయంలో ఆయన నివాసంలోనే ప్లకార్డులు పట్టుకుని మంత్రులు నిరసన తెలియచేశారు. మధ్యాహ్నాం అనంతరం నివాసానికి వచ్చిన బీరేంద్ర సింగ్ తో ఎంపీలు భేటీ అయ్యారు. ఆయన ఎదుటే ప్లకార్డులు పట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు..ఇతరత్రా వివరాలతో కూడిన ఒక నివేదికను మంత్రికి అందచేశారు. వెంటనే కేంద్రం ప్రకటన చేయాలని కేంద్ర మంత్రిని డిమాండ్ చేశారు.
మెకాన్ సంస్థ నుండి తమకు నివేదిక రాలేదని కేంద్రం పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టిడిపి ఎంపీలు డిమాండ్ పై కేంద్రం ఎలాంటి స్పందిస్తుందో వేచి చూడాలి. 

16:07 - June 28, 2018

ఇప్పుడు మార్కెట్ స్లైల్ అంతా ప్రజంటేషన్ పై నడుస్తోంది. ఒక హొటల్ కి వెళ్లామనుకోండి..అక్కడ మనం ఇచ్చే ఆర్డర్ ఆహారం తినేందుకు ఎలా వున్నా చూసేందుకు కలర్ ఫుల్ గా వుండేలా హోటల్ మేనేజ్ మెంట్ జాగ్రత్తలు తీసుకుంటుంది. డ్రింక్, ఐస్ క్రీమ్, టిఫిన్స్ ఇలా ఏదైనా కలర్ ఫుల్ లుక్ తో వుంటే వాటికి డిమాండ్ పెరుగుతంది. ఇది ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. కటెంట్ కంటే కలర్ ముఖ్యం, టేస్ట్ కంటే లుక్ ముఖ్యం, క్వాలిటి కంటే కలర్ ఫుల్ లుక్ ముఖ్యం. ఇలా ఏ వ్యాపారమైనా మాటలతోను, చూపులతోను ఆకట్టేసుకోవాలి. అప్పుడే ఆ ప్రొడక్ట్స్ కు డిమాండ్ పెరుగుతుంది.

బట్టల షాప్స్ లో ఆకట్టుకునే నమూనా బొమ్మలు..
అలాగే ఏ బట్టల షాపులకు వెళ్లినా అక్కడ చీరలు, డ్రెస్సులు వంటి మెటీరియల్స్ ధరింపజేసిన అందమైన అమ్మాయిల బొమ్మలు డిస్ ప్లేగా కనిపిస్తుంటాయి. ఆ బొమ్మలు మహిళల ప్రభావం మార్కెట్ పై వుంటుంది. మరి అటువంటి డిప్లే బొమ్మలపై ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. దుకాణాల ముందు ప్రదర్శనకు ఉంచే అందమైన అమ్మాయల బొమ్మల ప్రభావం మహిళల్లో ఎలా ఉంటుందనే విషయంపై టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సర్వే నిర్వహించి పలు చేదు నిజాలను వెల్లడించింది. కస్టమర్లను ఆకర్షించేందుకు పెట్టే ఆ బొమ్మల కారణంగా మహిళలపై హీనభావం పెరుగుతోందని సర్వేలో వెల్లడయ్యింది.

మహిళల్లో ఆత్మనూన్యత పెరుగుతోందా?..
ఈ బొమ్మలను చూస్తే మహిళలు తాము ఆ బొమ్మలంత అందంగా, నాజూగ్గా లేమని ఫీలవుతుంటారని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తేలిందట. భారత్‌లోని 420 పట్టణాల్లో సర్వే నిర్వహించి, ఇటువంటి బొమ్మలపై మహిళల అభిప్రాయాలు తీసుకుని టీఐఎస్‌ఎస్ ఈ నివేదిక రూపొందించింది. అభిప్రాయాలు చెప్పిన మహిళల్లో చాలా మంది ఈ బొమ్మలు తమ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని అన్నారు.

15:42 - June 28, 2018

విజయవాడ : తెలుగుదేశం పార్టీ పాలనలో మహిళలరకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలపై జరగుతున్న దాడులతో సీఎం చంద్రబాబు నాయుడు తలదించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. గురువారం విజయవాడలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ...ఉక్కు పరిశ్రమ కోసం దీక్షలు చేస్తే ప్రజలు నమ్మరని తెలిపారు. తెలుగుదేశం నాయకుల వల్లే మహిళలకు రక్షణ లేదన్నారు. విభజన చట్టంలో ఏవీ రాకపోయినా నాలుగేళ్లు బీజేపీతో టిడిపి అంటకాగిందని..మంత్రి పదవులు అనుభవించారని గుర్తు చేశారు. ఇప్పుడు దీక్షలు అంటూ చేస్తున్నారని విమర్శించారు. కడప ఉక్కు..విశాఖ రైల్వే జోన్..వెనుకబడిన జిల్లాల అభివృద్ధి..తదితర అంశాలపై వైసీపీ పోరాడిందన్నారు. 

15:38 - June 28, 2018

నిజామాబాద్ : 'తెలంగాణ రాష్ట్ర సమితి లెక్క డ్రామ కంపెనీ కాదు...బతుకమ్మ కాదు..దొంగ జాగృతి కాదు...బీజేపీలో ఎదగడానికి మతిలేని మాట...మూర్ఖత్వం...డి.శ్రీనివాస్ గురించి తెలుసుకో..ఎదగడానికి తండ్రి సహకారం అవసరం లేదు..నేను కల్వకుంట కవిత కాదు..బతుకమ్మ చీరలో దందా చేస్తే అన్న వచ్చి కాపాడిండు...అసొంటి తప్పులు తమలో లేవు...ఫ్యామిలీని కంట్రోల్ చేసుకోని డి.శ్రీనివాస్ అంట...ఏమన్నా తలకాయ ఉందా ? రాజకీయాల్లోకి కుటుంబాన్ని తీసుకొస్తవా ? నీకు కల్చర్ ఉందా ?

నీ కుటుంబం ఫ్యూడిలిక్ కుటుంబంమేమో..తమది .డెమోక్రటిక్ కుటుంబం..ఇక్కడ స్వేచ్ఛా భావం ఉంటది..డి.శ్రీనివాస్ ఆలోచన విధానం వేరే విధంగా ఉంటుంది...అరవింద్ ఆలోచన వేరే విధంగా ఉంటది...ఎవరు కంట్రోల్ చేస్తరు..నన్ను కంట్రోల్ చేయడానికి డి.శ్రీనివాస్ హిట్లర్ కాదు...నేను ఆయన బానిస కాదు..నియంతృత్వం పోకడ కులంతో రాదు...గుణంతో వస్తుంది. నీ గుణం మంచగా లేదు..గుణం సరిచేసుసుకో..డబ్బు పిచ్చి వదిలేయి..నిజామాబాద్ అభివృద్ధిపై దృష్టి సారించు...నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించు...నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూంలు లేవు...కాంట్రాక్లర్లను డబ్బులు ఇవ్వాలంటూ పీడిస్తావంట...ఇవన్నీ బంద్ చేయి...భూపతి రెడ్డిని ఆర్నెళ్ల కింద లెటర్ రాసినవు..ఏమైంది..అధ్యక్షుడు చెత్తబుట్టలు దాఖలు చేసిండు..నిన్న రాసిన లెటర్ ఏమవుతదో చూద్దాం'... అంటూ బీజేపీ నేత అరవింద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

15:30 - June 28, 2018

ఢిల్లీ : కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ టిడిపి ఆందోళన కొనసాగుతోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేశ్ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని టిడిపి నిర్ణయించింది. అందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తో టిడిపి ఎంపీలు భేటీ అయిన సంగతి తెలిసిందే. టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదిక వచ్చిన తరువాతే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

కానీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై టైమ్ బాండ్ చెప్పకపోవడంపై ఎంపీలు ఆగ్రహంగా ఉన్నారు. ప్రధాన మంత్రితో విషయం చెప్పాలని ఎంపీలు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ వారికి దొరక లేదు. దీనితో గురువారం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ నివాసంలోనే టిడిపి ఎంపీలు నిరసన చేపట్టారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన చేయాలని, టైమ్ బాండ్ ప్రకటించాలని కోరుతున్న ఎంపీల డిమాండ్ పై కేంద్రం..ఉక్కు శాఖ మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి. 

ఉక్కు మంత్రి బీరేంద్ర నివాసంలో టీడీపీ ఉక్కు నిరసన..

ఢిల్లీ : కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ నివాసంలో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తంచేస్తున్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటు ప్లకార్డులు ప్రదర్శిస్తున్న ఎంపీలు నిరసనను వ్యక్తంచేస్తున్నారు. బుధవారం మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను కలిసిన క్రమంలో కడప స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి వివరాలు అందించాలని కేంద్ర మంత్రి కోరాగా ఈరోజు అన్ని వివరాలను అందించారు. సమగ్ర వివారాలన్ని అందించి కపడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం నుంచి క్లారిటీ రావాలని పట్టుదలగా ఉన్నారు.

15:23 - June 28, 2018

అనంతపురం : సమాజానికి వెలుగునిచ్చే సూర్యుడిలా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థునుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన పుట్లూరు మండలం కడవకల్లులో చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిలను ఉపాధ్యాయుడు వేములబాబు లైంగికంగా వేధించాడు. ఈ నెల రోజులుగా ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు వేములబాబుకు దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని వెళుతుండగా వ్యాన్ ను తల్లిదండ్రులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసుల సమక్షంలోనే చెప్పులతో దాడి చేశారు. దీనితో కడవకల్లులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

విద్యార్ధినులపై కీచక ఉపాధ్యాయుడి నిర్వాకం..

అనంతపురం : పుట్టూరు మండలం కడవకల్లులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ కీచక ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకంతో కడవకల్లులో ఉద్రిక్తత నెలకొంది. ఓ స్కూల్లో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న చాల వేములబాబు అనే వ్యక్తి విద్యార్ధినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించటంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. వేములబాబుపై చెప్పులతోను, చేతికందిన వస్తువులతో దాడి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వేములబాబును అరెస్ట్ చేసేందకు వెళ్లగా గ్రామస్తులు పోలీసులపై తిరగబడ్డారు.

15:11 - June 28, 2018

రజనీకాంత్ ఆ పేరు చెబితే చాలు అభిమానులు నిలువెల్లా పులకించిపోతారు. సినిమాలో ఒక స్లైల్ కు కేరాఫ్ అడ్రస్ గా రజనీకాంత్ ప్రముఖులుగా చెప్పవచ్చు. అసలు స్లైల్ అంటే రజనీదే అంటారు సినిమా పరిశ్రమతో పాటు అభిమానులు, ప్రేక్షకులు. ఒక సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుండి స్వశక్తితో కష్టపడి 'సూపర్ స్టార్ ' స్థాయికి ఎదిగిన మనసున్న, మానవత్వం వున్న నటుడు రజనీకాంత్. అటువంటి రజనీ కెరీర్లో 'బాషా' చిత్రానికొక ప్రత్యేకత వుంది. ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ మూవీ అది. దీనికి సీక్వెల్ చేసే ఉద్దేశంతో సాయిరమణి అనే దర్శకుడు ఇటీవల రజనీని కలసి, కథ వినిపించాడట. రజనీకి కథ నచ్చినప్పటికీ, సీక్వెల్ చేయడానికి ఆయన అంగీకరించలేదని సమాచారం. క్లాసిక్స్ వంటి కొన్ని సినిమాలకు సీక్వెల్స్ చేయకూడదన్నది రజనీ అభిప్రాయమట.

15:05 - June 28, 2018

తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ కు సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా వారి గ్లామర్ కు మాత్రం సినిమాల్లో పెద్దపాత్ర వుంటుంది. అందులోను కొంతమంది హీరోయిన్స్ తో ముందు జాబితాలో వుండే అందాల భామలు కాజల్, తమన్నాలు. ప్రస్తుతం గ్రీస్ లోని ఏథెన్స్ లో వున్నారు. 'క్వీన్' హిందీ సినిమా తెలుగు రీమేక్ షూటింగ్ కోసం తమన్నా, తమిళ రీమేక్ కోసం కాజల్ ప్రస్తుతం ఏథెన్స్ నగరంలో వున్నారు. తమిళ వెర్షన్ కి రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తుండగా, తెలుగు వెర్షన్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

15:02 - June 28, 2018

హైదరాబాద్ : బహుళంతస్తుల భవనాల నుండి దూకి ఆత్మహత్యలు చేసుకోవడం కామన్ అయిపోయింది. మానిసక ఒత్తిడి...ఇతరత్రా కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతూ తోటి వారికి తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. తాజాగా మాదాపూర్ లోని మిలాంజ్ టవర్ 9వ అంతస్తు పై నుండి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లాకు చెందిన శ్రావణి భర్త కృష్ణారెడ్డితో కలిసి మాదాపూర్ లోని మదీనాగూడలో నివాసం ఉంటోంది. వీరికి ఒక బాబున్నాడు. శ్రావణి ప్రైమ్ ఏరా మెడికల్ టెక్నాలజీ ఉద్యోగిగా పనిచేస్తోంది. గురువారం కార్యాలయానికి వచ్చిన శ్రావణి 9 అంతస్తుకు వెళ్లి పై నుండి కిందకు దూకేసింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించడంతో స్థానికులు బయటకు వచ్చి చూడగా శ్రావణి కుప్పకూలి విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

14:58 - June 28, 2018

సినిమా పరిశ్రమలో జక్కన్నగా పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. దర్శకుడిగా ఇప్పటి వరకూ ఒక్క ప్లాప్ కూడా రాజమౌళివైపు కన్నెత్తికూడా చూడలేదు. స్టూడెంట్ నంబర్ వన్ నుండి అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన బాహుబలి వరకూ విజయాల పరంపరం జక్కన్నకు ఒక్కడికే సొంతమయ్యింది. హిట్ దర్శకులు ఎంతమంది ఉన్నా ఒక్క ప్లాప్ కూడా లేని ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి. అందుకే అతనితో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద హీరోలు కూడా వేచి చూస్తుంటారు. బాహుబలి స్వీక్వెల్స్ తో దాదాపు ఐదు సంవత్సరాల పాటు బైటప్రపంచం గురించి కూడా పట్టించుకోని జక్కన్న నెక్ట్స్ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అటువంటి జక్కన్న మెగా మెగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదికూడా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ తో . ఇక ప్రేక్షకుల అంచనాలు ఊహకు అందకుండా వున్నాయి. మరి ఈ మెగా మల్టీ స్టారర్ లో ఆ బిగ్గెస్ట్ హీరోలు ఎవరో ప్రేక్షకులకు తెలిసిపోయింది. మరి వారి రేంజ్ కు తగినట్లుగా హీరోయిన్స్ కూడా వుండాలి కదా మరి!. మరి ఆ హీరోయిన్స్ ఎవరాని ప్రేక్షకులు ఆసక్తికి అంతులేకుండా వుంది.

డిసెంబర్లో షూటింగులో పాల్గొననున్న చరణ్
రాజమౌళి తాజా చిత్రంగా భారీ మల్టీ స్టారర్ చిత్రానికి అందుకు సంబంధించిన సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా నటించనున్న ఈ సినిమా, అక్టోబర్లో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. నవంబర్లో ఎన్టీఆర్ .. డిసెంబర్లో చరణ్ షూటింగులో జాయిన్ కానున్నారు. ఈ ఇద్దరు హీరోల సరసన కథానాయికలుగా ఎవరు నటించనున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ వస్తోంది.

14:57 - June 28, 2018

శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పొలం దున్నారు. ఆముదాల వలస మండలం రావికంపేటలో సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఏరువాక ప్రారంభించారు. కల్టివేటర్ తో వరినాట్లు వేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాబు మాట్లాడారు...ఎన్ని విత్తనాలు కావాలో అన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భూగర్భజలాలు పెంచడం, నదుల అనుసంధానం చేయడం జరుగుతోందని, శ్రీకాకుళం జిల్లాలో తమ హాయాంలోనే ప్రాజెక్టుల పూర్తి చేయడం జరిగిందన్నారు. 84వేల ఎకరాలు నీళ్లిచ్చే అవకాశం ఉందని, 13 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో 2వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. 8లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. నీళ్లు సరిపోకపోతే ఉత్తరాంధ్ర సృజల స్రవంతిని ఇక్కడకు తీసుకరావడం జరుగుతుందన్నారు. గోదావరి - కృష్ణా రెండు నదుల అనుసంధానం చేయడం జరిగిందని, గోదావరి నుండి పెన్నా అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నామని, జిల్లాకు నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తనదన్నారు.

ఏ పంట వేస్తే ఆదాయం వస్తుంది ? అనేది రైతులు తెలుసుకోవాలన్నారు. పాడి పరిశ్రమలో రూ. 77వేల కోట్ల ఆదాయం..వ్యవసాయం మొత్తం కలుపుకుంటే రూ. 40వేల కోట్ల ఆదాయం...హర్టికల్ రంగంలో రూ. 76వేల కోట్ల ఆదాయం..చేపల్లో రూ. 50-55 వేల కోట్ల ఆదాయం వస్తోందన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లు మారిన సమయంలో ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించడం జరుగుతుందన్నారు. 

14:39 - June 28, 2018

మెగా ఫ్యామిలీ నుండి ఎంతమంది హీరోలు వచ్చినా..చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ను చూడగానే చిరంజీవి ఠక్కున గుర్తుకొస్తారు. చిరంజీవి కొడుకు చరణ్ కు పెద్దగా పోలికలు లేకపోవయినా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు మాత్రం మేనమామ పోలికలు వచ్చాయి. అతని బ్యాడీ లాంగ్వేజ్ కూడా చిరంజీవిని తలపించేలా వుంటుంది. పోలికలు కూడా కలిసి రావటంతో సాయి మాస్ ఆడియన్స్ ను బాగా మెప్పిస్తున్నాడు. తేజ్, మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేస్తూ వచ్చాడు. చిరంజీవి స్టైల్ ను అనుకరిస్తూ .. ఆయన హిట్ సాంగ్స్ ను రీమిక్స్ చేస్తూ మెగా అభిమానుల దృష్టిని తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కానీ తేజ్ సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోయినా త్వరలో సరైన హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు.

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న తేజ్ తమ్ముడు వైష్టవ్ తేజ్..
ఈ నేపథ్యంలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ రెడీ అవుతున్నాడు. నటన పట్ల ఆసక్తి కలగడంతో ఇతర మెగా హీరోల సలహాలను .. సూచనలను వైష్ణవ తేజ్ తీసుకున్నాడట. ఆ ప్రకారం ఒక వైపున చదువును పూర్తి చేస్తూనే, మరో వైపు నటన,డాన్స్,ఫైట్స్ విషయంలో ట్రైనింగ్ తీసుకున్నట్లుగా సిని పరిశ్రమ సమాచారం. ఈ క్రమంలో ఎంట్రీకోసం కథలు వింటూ వస్తోన్న వైష్ణవ్ తేజ్ కి, దర్శకుడు సాగర్ కె. చంద్ర వినిపించిన కథ తెగ నచ్చేసిందట. దాంతో వెంటనే వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది. 

14:38 - June 28, 2018

ముంబై : నిర్మితమౌతున్న బిల్డింగ్ ల మధ్య ఒక చార్టర్ విమానం కుప్పకూలిపోయిన ఘటన కలకలం రేపింది. భారీ పేలుడు శబ్ధం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన ఘట్ కోపర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కుప్పకూలిన ఫ్లైట్ ప్రైవేటు ఎయిర్ లైన్స్ కు చెందినదిగా తెలుస్తోంది. ఫ్లైట్ కుప్పకూలిపోవడంతో విమానంలో ఉన్న నలుగురు, పాదాచారుడు మృతి చెందారు. కానీ విమానంలో ఎవరున్నారో తెలియడం లేదు. 

14:32 - June 28, 2018

మెగా ఫ్యామిలి నుండి వచ్చిన ఒకే ఒక్క మోగా హీరోయిన్ నిహారిక. యాంకర్ గా,హీరోయిన్ గా అలరిస్తున్న నిహారిక తన పెళ్లి మాత ఎత్తితే చాలు మండి పడిపోతోంది. యూత్ లో నిహారికకు విపరీతమైన ఫాలోయింగ్ వున్న ఈ మెగా హీరోయిన్ సినిమా కోసం ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిహారిక తాజా చిత్రంగా 'హ్యాపీ వెడ్డింగ్' సిద్ధమయిపోయింది. సుమంత్ అశ్విన్ జోడీగా ఆమె నటించిన ఈ సినిమాకి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను కొత్త కాన్సెప్ట్ తో రిలీజ్ చేశారు.

నా పెళ్లి గురించి మీకెందుకయ్యా అంటోంది మెగా హీరోయిన్
షూటింగ్ ముగించుకుని బయల్దేరుతోన్న నిహారిక దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. తాను ఓ యూ ట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినట్టు చెప్పి .. 'సోషల్ మీడియాలో మీ వెడ్డింగ్ విషయం బాగా వైరల్ అవుతోంది .. దాని గురించి చెబుతారా?' అని అడుగుతాడు. దాంతో .. "నా పెళ్లి గురించి మీకెందుకయ్యా .. ఎవరిని చేసుకుంటుంది .. ఎప్పుడు చేసుకుంటుంది .. చూస్తే షాక్ అవుతారు .. షేక్ అవుతారు అంటూ రాస్తారు. మీ థంబ్ నెయిల్స్ కోసం నన్ను వాడుకుంటారా?" అంటూ కోపాన్ని ప్రదర్శిస్తుంది. తాను అడిగేది 'హ్యాపీ వెడ్డింగ్' మూవీ గురించి అని ఆ వ్యక్తి అనడంతో వెంటనే శాంతించింది. వెంటనే సారీ, సారీ 'హ్యాపీ వెడ్డింగ్' ట్రైలర్ ఈ నెల 30 వ తేదీన రిలీజ్ అవుతుంది. ఆ రోజునే సినిమా రిలీజ్ ఎప్పుడనేది చెబుతాను బాయ్ అంటూ వెళ్లి పోతుంది'. కాగా గురువారం దుయం 10గంటల 35 నిమిషాలకి ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

దుర్గమ్మ మొక్కు తీర్చుకున్న సీఎం కేసీఆర్..

విజయవాడ: తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను మొక్కిన దేవుళ్లకు వరుసగా మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు సీఎం కేసీఆర్. ఇదివరకే తిరుపతి వెంకన్నకు కంఠహారం, సాలగ్రామహారం సమర్పించారు. కురవి వీరభద్రస్వామికి కోరమీసం మొక్కు చెల్లించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి కిరీటం సమర్పించారు. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించిన ముక్కు పుడకను సమర్పించారు. బంగారం, విలువైన రాళ్లు, రతనాలు పొదిగి ఉన్న దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ ముక్కు పుడక 11.29 గ్రాముల బరువు ఉంది.

ఘట్ కోపర్ లో కుప్పకూలిన చార్డెడ్ ఫ్లైట్..

ముంబై : ఘట్ కోపర్ లో చార్డెడ్ ఫ్లైట్ కుప్పకూలింది. ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఓ చార్డెడ్ ఫ్లైట్ నివాసాల మధ్య కుప్పకూలిపోయింది. దీంతో ఫ్లైట్ లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు. 

14:00 - June 28, 2018

విజయవాడ : తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. పూర్ణకుంభంతో వేదపండితులు కేసీఆర్ కు స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించారు.

 

 

13:49 - June 28, 2018

శ్రీకాకుళం : ఆముదాలవలస నియోజకవర్గంలో ఏరువాక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడిపారు. 

13:45 - June 28, 2018

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ సొంత గూడు కాంగ్రెస్ లో చేరనున్నారు. డీఎస్ రాకకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన చేరికను రాష్ట్ర నేతలు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. డీఎస్ కు పీసీసీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ ఛైర్మన్ బాధ్యతను అప్పగించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. 

 

13:35 - June 28, 2018

అనంతపురం : పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్ ఆండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువర్గాలు పిడిగుద్దులు కురిపించుకున్నారు. 

13:13 - June 28, 2018

విజయవాడ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ విజయవాడకు వెళ్తున్నారు. కనకదుర్గమ్మ మొక్కు తీర్చుకునేందుకు ఆయన కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. అమ్మవారిని దర్శించుకుని, ముక్కుపుడక సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు.

13:10 - June 28, 2018

ఢిల్లీ : భారత కరెన్సీ రూపాయి భారీగా పతనమైంది. మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా రూ. 69 మార్క్‌కు చేరి జీవనకాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ.. 24 గంటల వ్యవధిలోనే సుమారు 70 పైసల దాకా పడిపోయింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో 37 పైసలు పడిపోయిన రూపాయి మారకం విలువ... గురువారం ఆరంభ ట్రేడింగ్‌లో మరో 49 పైసలు పడిపోయింది. ఆ తర్వాత కాస్త మెరుగుపడినప్పటికీ రూ. 69 మార్క్‌ వద్దే ఊగిసలాడుతోంది.

 

13:08 - June 28, 2018

విజయవాడ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ విజయవాడకు వెళ్తున్నారు. కనకదుర్గమ్మ మొక్కు తీర్చుకునేందుకు ఆయన కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. అమ్మవారిని దర్శించుకుని, ముక్కుపుడక సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు.

 

13:06 - June 28, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో ప్రేమ జంట అదృశ్యం మిస్టరీ వీడింది. ప్రేమ జంట మృతదేహాలను పోలీసులు  కరీంనగర్‌ జిల్లా కోడిమ్యా మండలం నల్లగొండ గుట్టల్లో గుర్తించారు. ఓ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను అక్కడ లభించిన సిమ్‌ కార్డు ఆధారంగా గుర్తించారు. నిజామాబాద్ జొల్లా హస్తకుతూర్‌కు చెందిన ప్రేమికులు ప్రశాంత్‌, గౌతమి తమ పెళ్లికి పెద్దలు అంగీకరిచడం లేదని రెండు నెలల క్రితం ఊరు నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి వీరి ఆచూకి లభించలేదు. నల్లగొండ గుట్టల్లో బాదాం మిల్క్‌లో విషం కలుపుకొని తాగి చెట్టుకు ఊరి వేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

12:58 - June 28, 2018

కడప : ఎంపి సీఎం రమేశ్‌ దీక్ష తొమ్మిదో రోజు కొనసాగుతోంది. సీఎం రమేశ్‌ ఆరోగ్యం మరింత క్షీణించింది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ కొనసాగుతున్న ఈ దీక్షకు భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది.

 

12:56 - June 28, 2018

ఢిల్లీ : ఇవాళ మరోసారి కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను కలవడానికి  టీడీపీ ఎంపీలు సిద్దమయ్యారు. నిన్నటి భేటీలో కడప స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి వివరాలు అందించాలని కేంద్ర మంత్రి కోరారు. దీంతో 24 గంటల్లోనే అన్ని వివరాలు అందిస్తామని చెప్పిన ఎంపీలు అనుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు తెప్పించుకున్నారు. సమగ్ర వివారాలన్ని అందించి కపడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం నుంచి క్లారిటీ రావాలని పట్టుదలగా ఉన్నారు. 

 

నిలిచిపోయిన అమర్ నాథ్ యాత్ర..

జమ్ము కశ్మీర్ : భారీ వర్షాలు అమర్ నాథ్ యాత్రకు ఆటంకం కలిగించాయి. దీంతో అమర్ నాథ్ యాత్రకు బయల్దేరిన తొలి బృందం బల్తాల్ వద్ద ఆగిపోవాల్సి వచ్చింది. గురువారం ఉదయం నుంచి భారీ వర్షాలు కరుస్తుండటంతో బల్తాల్ బేస్ క్యాంపు వద్ద ప్రారంభమైన అమర్ నాథ్ యాత్రికులను అధికారులు నిలిపివేసారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాతే తిరిగి ముందుకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లుగా అధికారులు తెలిపారు.

12:51 - June 28, 2018

విజయవాడ : ఏపీ పోలీస్‌ బాస్‌ ఎవరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఇందుకోసం ప్రభుత్వం సెలక్షన్‌ కమిటీని నియమించింది. ఇంచార్జీ సీఎస్‌ ఏసీ పునేఠా నేతృత్వంలోని ఈ కమిటీ టాప్‌ -3 జాబితాను సిద్దం చేసి రేపు నివేదిక అందజేస్తుంది. ఈ జాబితాలోని ఒకరికి డీజీపీ పదవి దక్కనుంది. 
ఈనెల 30న మాలకొండయ్య పదవీ విరమణ
ఏపీ ప్రస్తుత డీజీపీ  మాలకొండయ్య ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త డీజీపీ ఎవరన్న దానిపై జోరుగా చర్చ సాగుతోంది.  నూతన డీజీపీని నియమించేందుకు ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభించింది. కొత్త డీజీపీ ఎంపికపై సెలక్షన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఇంచార్జీ సీఎస్‌ పునేఠా నేతృత్వంలో  సీనియర్‌ ఐఏఎస్‌లు మన్మోహన్‌సింగ్‌, సాంబశివరావు,జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్‌ సభ్యులుగా కమిటీ ఏర్పాటు అయ్యింది. ఈ కమిటీ రేపటికల్లా ప్రభుత్వానికి టాప్‌-3 జాబితాను సిద్దం చేసి నివేదిక అందజేయనుంది. దీనిని బట్టి ప్రభుత్వం కొత్త డీజీపీని నియమించనుంది.
కొత్త డీజీపీ ఎవరన్న దానిపై పోలీస్‌ వర్గాల్లో చర్చ
ఏపీ డీజీపీ పగ్గాలకు ధీటైన అధికారి ఎవరన్నది పోలీస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే డీజీపీ రేస్‌లో పలువురు ఐపీఎస్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.  మరో ఏడాదిలో ఎన్నికలు, రాష్ట్రంలో శాంతిభద్రతలు, సీఎం భద్రత, జిల్లాల పర్యటనలు అన్ని సక్రమంగా సాగేలా చూసుకునే సమర్ధుడైన అధికారికే డీజీపీ పగ్గాలు అప్పగించాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు. డీజీపీగా ఐజీ రేంజ్‌లో ఉన్న విజయవాడ సీపీ గౌతమ్‌ సవాంగ్‌కే తొలి ప్రాధాన్యతగా ప్రచారం సాగుతోంది. 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారులుగా ఆర్పీ ఠాకూర్‌, వీఎస్కే కౌముది, వినయ్‌ రంజన్‌ రే, గౌతమ్‌ సవాంగ్‌ ఉన్నారు. వీరిలో ఒకరికి డీజీపీ పదవి దక్కే చాన్స్‌ పుష్కలంగా ఉన్నాయి. 1982 బ్యాచ్‌కు చెందిన ఎస్వీ రమణమూర్తి కూడా డీజీపీ రేస్‌లో ఉన్నారు. అంతేకాదు... ఆర్టీసీ ఎండీగా ఉన్న ఎన్‌.వి. సురేంద్రబాబు, హోంశాఖ కార్యదర్శిగా ఉన్న అనురాధపట్ల సీఎం సానుకూలంగా ఉన్నారు.  మహిళా అధికారిణిని డీజీపీగా నియమిస్తే మంచిదనే చర్చ జోరుగా సాగుతోంది.  ఇప్పటి వరకు మహిళలకు డీజీపీ పగ్గాలు అప్పగించిన దాఖలాలు ఏ రాష్ట్రంలోనూ లేనందున.. తొలిసారి ఏపీలో మహిళకు ఈ అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న అభ్యర్థననూ సీఎం నిశితంగా పరిశీలిస్తున్నారు.  ఇదే జరిగితే ప్రజల్లో టీడీపీకి ప్లస్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు.
నూతన డీజీపీ ఉత్కంఠకు రేపటితో తెర
ఏపీ నూతన డీజీపీ ఎవరన్నది దాదాపు రేపు తేలిపోనుంది. పోలీస్‌ శాఖపై పట్టున్న అధికారికే  డీజీపీ పదవి అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇక చివరి దశలో చంద్రబాబు వ్యూహాలకు అనుగుణంగా కొత్త పేరును తెరపైకి తీస్తారా అన్నది వేచిచూడాలి.

మిలింగా టవర్స్ పైనుండి దూకి మహిళ ఆత్మహత్య..

హైదరాబాద్ : మాదాపూర్ లో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మిలింగా టవర్స్ పైనుండి దూకి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కాగా ఆ మహిళ ఎవరు? ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఏరువాకలో సీఎం చంద్రబాబు..

శ్రీకాకుళం : ఆముదాల వలస మండలం రావికంటిపేటలో ఏరువాక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పొలంలో విత్తనాలు నాటి, ట్రాక్టర్ ను నడిపారు. ప్రతీ ఏడాది ఏరువాక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే ఏపీ ప్రభుత్వం ఈ ఏడాదికూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజక వర్గాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు వారి వారి ప్రాంతాలలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

డీఎస్ కాంగ్రెస్ లోకి చేరేందుకు గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియన్ నేత డీఎస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు అధిష్టానం దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దీనికి కాంగ్రెస్ నేతలు కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పటంలేదు. దీంతో డీఎస్ తన సొంత గూడు అయిన కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధమైపోయారు. డీఎస్ కు పీసీసీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించే యోచలనో కాంగ్రెస్ అధిష్టానం వున్నట్లుగా సమాచారం.  

కేసీఆర్ కు స్వాగతం పలికిన మంత్రి దేవినేని..

విజయవాడ : తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఏపీ మంత్రి దేవినేని ఉమ స్వాగతం పలికారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మవారికి ముక్కుపుడక చేయిస్తానని ఉద్యమం సమయంలో కేసీఆర్ మొక్కకున్న నేపథ్యంలో రాష్ట్ర ఏర్పడిన నాలుగేళ్లకు కేసీఆర్ తన మొక్కును తీర్చుకునేందుకు విజయవాడకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కేసీఆర్ దుర్గమ్మ మొక్కు తీర్చుకోనున్నారు. 

జూలకంటి దీక్ష విరమణ..

నల్లగొండ : మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అయిన జూలకంటి రంగారెడ్డి దీక్షను విరమించారు. జూలకంటి దీక్షను తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నల్లా సూర్యప్రకాశ్ దీక్షను విరమింపజేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలంటు నిన్న కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందుస్తు చర్యలుగా పోలీసులు జూలకంటిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిలోనే 24 గంటలు దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో జూలకంటి దీక్షను తమ్మినేని వీరభద్రం, నల్లా సూర్యప్రకాశ్ దీక్షను విరమింపజేశారు.

టీడీపీ పార్టీ కండువాను దగ్థం చేసిన బీజేపీ..ఉద్రిక్తత..

అనంతపురం : ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ ను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. వారిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం టీడీపీ కండువాను బీజేపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. దీంతో ఇరు పార్టీల వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. 

మోదీ కోసం నా ప్రాణం ఇస్తా : డీఎస్ కుమారుడు అరవింద్

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు ప్రాణమని డీఎస్ కుమారుడు అరవింద్ తెలిపారు. కాగా టీఆర్ఎస్ పార్టీ నుంచి డీఎస్ ను బహిష్కరించాలంటూ నిజామాబాద్ జిల్లా పార్టీ నేతలు కేసీఆర్ ను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేసీఆర్ ను కలిసేందుకు డీఎస్ ప్రయత్నించినప్పటికీ... ఆయనకు అపాయింట్ మెంట్ దొరకలేదు. ఈ నేపథ్యంలో డీఎస్ కుమారుడు అరవింద్ స్పందిస్తూ, తన తండ్రి తనను బీజేపీలోకి పంపారంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఈ ఆరోపణలను తాను ఖండిస్తున్నానని తెలిపారు. అర్థం లేకుండా తన కుటుంబంపై విమర్శలు చేయడం తగదని అన్నారు.

మంత్రి పోచారాన్ని పరామర్శించిన కేటీఆర్..

హైదరాబాద్ : వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని మరో మంత్రి కేటీఆర్ ఈ రోజు పరామర్శించారు. నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో మంత్రి పోచారం మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలసి ఆస్పత్రికి వెళ్లి పోచారం శ్రీనివాసరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రి పోచారం ఆస్పత్రిలో ఉన్నప్పటికీ తన బాధ్యతలను కొనసాగిస్తూనే ఉన్నారు. 

మేళ, తాళాలతో అమర్ నాథ్ యాత్ర ప్రారంభం..

జమ్ము కశ్మీర్ : జూన్‌ 28 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్‌ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 వేల మంది భక్తులతో కూడిన మొదటి బ్యాచ్‌ భారీ భద్రత నడుమ బయలుదేరి వెళ్లింది. అమర్‌నాథ్‌ యాత్రకు ప్రభుత్వం ఈసారి కనీ వినీ ఎరుగని రీతిలో భద్రతా చర్యలు చేపట్టింది. జూన్‌ 28 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్‌ యాత్రకు మొదటి బ్యాచ్‌ బయలుదేరి వెళ్లింది. భక్తులకు స్థానికులు అధికారులు స్వాగతం పలికారు. జమ్ములోని బేస్‌క్యాంప్‌ నుంచి అధికారులు పచ్చ జెండా ఊపి అమర్‌నాథ్‌ యాత్రను ప్రారంభించారు.

ప్రొఫెసర్‌పై దాడి చేసిన ఏబీవీపీ స్టూడెంట్స్..

గుజరాత్‌ : రాష్ట్రంలోని భుజ్‌లో ఏబివిపి విద్యార్థులు ఓ ప్రొఫెసర్‌పై దాడి చేశారు. కఛ్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబివిపి విద్యార్థులు ఓ ప్రొఫెసర్‌ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. అధ్యాపకుడి ముఖంపై నలుపు రంగు పోశారు. అంతేకాదు... ఆ ప్రొఫెసర్‌ను రోడ్డుపై ఊరేగించారు. ఈ ఘటనపై పోలీసులు ఏబివిపి విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రొఫెసర్‌పై దాడి చేయడాన్ని అధ్యాపక బృందం తీవ్రంగా ఖండించింది. విద్యార్థులపై విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. ఈ ఘటన నేపథ్యంలో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

జర్నలిస్ట్‌ షుజాత్ చంపిన ఉగ్రవాదులు గుర్తింపు..

జమ్ముకశ్మీర్‌ : సీనియర్‌ జర్నలిస్ట్‌ షుజాత్ బుఖారిని చంపిన ఉగ్రవాదులను పోలీసులు గుర్తించారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్‌ లష్కరే తోయిబాకు చెందినవాడు కాగా మరో ఇద్దరు స్థానికులున్నట్లు సమాచారం. జూన్‌ 14న షుజాత్‌ బుఖారిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు ముసుగులు ధరించి ఉన్నట్లు సిసిటివిలో రికార్డ్‌ అయింది. షుజాత్‌ ఇఫ్తార్‌ విందులో పాల్గొనడానికి పత్రికా కార్యాలయం నుంచి కారులో బయలుదేరుతుండగా ఉగ్రవాదులు కాల్చి చంపారు. కాల్పుల్లో షుజాత్‌తో పాటు ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కూడా మృతి చెందారు.

బీటెక్‌ రవి ఆమరణ నిరాహార దీక్ష భగ్నం..

కడప : స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బీటెక్‌ రవి దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. బీటెక్‌ రవి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఆస్పత్రికి తరలించకపోతే అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదముందని వైద్యులు సూచించడంతో.. పోలీసులు దీక్షను భగ్నం చేశారు. బీటెక్‌ రవిని రిమ్స్‌కు తరలిస్తుండగా... టీడీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రికి తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు సీఎం రమేష్‌ మాత్రం దీక్ష కొనసాగిస్తున్నారు.

జగన్ 201వ రోజు పాదయాత్ర రద్దు..

తూర్పుగోదావరి : వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర నిన్నటితో 200వ రోజు మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు 201వ రోజు పాదయాత్ర వర్షం కారణంగా రద్దయింది. షెడ్యూలు ప్రకారం నేటి పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా భీమనపల్లి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో... పాదయాత్ర సాధ్యం కాలేదు. దీంతో, యాత్రకు విరామం ప్రకటించారు. మరోవైపు, పాదయాత్ర 200వ రోజు పూర్తయిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దేవుడి దయ వల్ల అధికారంలోకి వస్తే రాజన్న పాలనను తీసుకొస్తానని చెప్పారు. 

భారీగా పతనమైన రూపాయి విలువ..

ముంబై : డాలర్ మారకంతో రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 68.89తో ప్రారంభమైంది. ఇది రూపాయి చరిత్రలోనే అత్యంత తక్కువ. బ్యాంకులు, చమురు దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ ఏర్పడడంతో రూపాయి పతనాన్ని చవిచూసింది. రూపాయి నిన్న డాలర్ తో 37 పైసలు తగ్గి 19 నెలల కనిష్ట స్థాయిలో 68.61 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు మరింత బలహీనత కనిపిస్తోంది. రూపాయి విలువను నిలబెట్టేందుకు ఆర్ బీఐ 68.80-68.85 స్థాయిలో జోక్యం చేసుకుంటుందని తాము భావిస్తున్నట్టు ఆనంద్ రాఠి కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ రుషబ్ మారు తెలిపారు.

11:26 - June 28, 2018

ఢిల్లీ : కడప ఉక్కుపై కేంద్రం నుంచి కచ్చితమైన ప్రకటన రావాలని టీడీపీ ఎంపీలు పట్టుదలగా ఉన్నారు. ఎంపీలు ప్రధానమంత్రిని అపాయింట్ మెంట్ కోరారు. టీడీపీ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి ప్రధాని నిరాకరించారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే ఢిల్లీలోనే దీక్ష చేసేందుకు ఎంపీలు రెడీ అవుతున్నారు. ఇవాళ మరోసారి కేంద్రమంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ ను టీడీపీ ఎంపీలు కలవనున్నారు. కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వివరాలను మంత్రికి అందించనున్నారు. నిన్నటి భేటీలో స్టీల్ ప్లాంట్ వివరాలు అందించాలని కేంద్రమంత్రి ఎంపీలను కోరారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

10:51 - June 28, 2018

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌పై నిజామాబాద్‌ జిల్లా టీఆర్ఎస్‌ నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. డి.శ్రీనివాస్‌ సొంతపార్టీలోనే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌కూ ఫిర్యాదు చేశారు. తనపై జిల్లా నేతల ఫిర్యాదు నేపథ్యంలో.. వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఆయనకు సీఎం అపాయింట్‌ లభించలేదు. ఇదే అంశంపై నిర్వహిచిన చర్చా కార్యక్రమలో విశ్లేషకులు వినయ్ కుమార్, కాంగ్రెస్ నేత గోస్ల శ్రీనివాస్, టీఆర్ ఎస్ నేత సత్యనారాయణ గుప్త పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

ఇంద్రకీలాద్రి దుర్మమ్మను దర్శించుకోనున్న కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ విజయవాడకు వెళ్తున్నారు. కనకదుర్గమ్మ మొక్కు తీర్చుకునేందుకు ఆయన కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. అమ్మవారిని దర్శించుకుని, ముక్కుపుడక సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో ఎంతో మంది దేవతలను వేడుకున్నారు. స్వరాష్ట్రం సిద్ధించాలని మొక్కులు మొక్కారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఫలానాది చేయిస్తానని తెలుగు రాష్ట్రాల్లోని దేవతలకు మొక్కుకున్నారు. కేసీఆర్‌ కోరుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.

అదృశ్యమైన ప్రేమజంట మృతి...

జగిత్యాల : జిల్లాలో కొంతకాలం క్రితం ఓ ప్రేమజంట అదృశ్యమైంది. ప్రేమజంట ప్రశాంత్, గౌతమిలు కొంతకాలం క్రితం అదృశ్యమయ్యారు. ఇప్పుడు కొడమ్యాల మండలం నల్లగొండ శివారులో ప్రశాంత్, గౌతమిల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం అస్తకుతర్ వాసులుగా వున్న వారు ప్రేమించుకున్నారు. రెండు నెలల క్రితం వారు మిస్ అయినట్లుగా కమ్మరపల్లి పీఎస్ లో కేసు నమోదయ్యింది.

10:34 - June 28, 2018

హైదరాబాద్‌ : మానవత్వం మంటగలిసిపోతోంది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కన్నకొడుకు కడతేర్చాడు. దారుణం ఘటన ఎల్లారెడ్డిగూడలో జరిగింది. కసాయి కొడుకు కన్నతల్లిని హత్య చేశాడు. తల్లిని అర్ధరాత్రి అపార్ట్‌మెంట్‌ టెర్రాస్‌పైకి తీసుకెళ్లిన కుమారుడు మదన్‌ ..  తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. కొనఊపిరితో ఉన్న తల్లి మమతను గొంతు నులిమి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. చిట్టీల వ్యాపారంలో మమత నష్టపోయిందని.. బాకీ డబ్బు చెల్లించాలంటూ ఇంటి వద్ద అప్పుల వాళ్ల ఒత్తిళ్లు చేయటంతో అవమానభారాన్ని తట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టానని మదన్‌ తెలిపాడు. అయితే మమత హత్యలో ఆమె భర్త హస్తం కూడా ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 

 

భార్య, 4గురు ఆడపిల్లలను అమ్మకానికి పెట్టిన తండ్రి..

కర్నూలు : జిల్లాల అభినవ హరిశ్చంద్రుడి కథ వెలుగులోకి వచ్చింది. ఆనాటి హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట కోసం భార్యా బిడ్డలను వేలంలో విక్రయించాడు. ఈనాటి ఓ అభినవ హరిశ్చంద్రుడు భార్య, నలుగురు ఆడపిల్లలను అమ్మకానికి పెట్టాడు. ఈ ఘటన నంద్యాలలో చోటుచేసుకుంది. తన బిడ్డలను కాపాడాలని తల్లి అల్లాడుతోంది. ఈ క్రమంలో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవటంలేదని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. భార్యను అన్నకు రూ.5లక్షలకు, కుమార్తెను, రూ.50వేలకు అమ్మకానికి పెట్టాడు మద్దిలేటి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవటంతో ఆమె ఐసిడిఎస్ అధికారులను ఆశ్రయించింది. 

కొత్త రూ.125 నాణాన్ని విడుదల చేయనున్న ఉపరాష్ట్రపతి..

ఢిల్లీ : గణాంకాల నిపుణుడు పీసీ మహాలనోబిస్‌ తన జయంతి వేడుక సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా జూన్‌ 29న గణాంకాల దినోత్సవంగా నిర్వహించాలని 2007లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. రేపు మహాలనోబిస్‌ 125వ జయంతి వేడుక సందర్భంగా ఆయన గౌరవార్థం కొత్త రూ.125 నాణెంతో పాటు కొత్త రూ.5 నాణెంని కూడా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేయనున్నారు. సామాజిక-ఆర్థిక ప్రణాళికలు, పాలసీ రూపకల్పనలో ప్రాధాన్యతను దేశ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

10:19 - June 28, 2018

ఢిల్లీ : ఇవాళ మరోసారి కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను కలవడానికి టీడీపీ ఎంపీలు సిద్ధమయ్యారు. నిన్నటి భేటీలో కడప స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి వివరాలు అందించాలని కేంద్ర మంత్రి కోరారు. దీంతో 24 గంటల్లోనే అన్ని వివరాలు అందిస్తామని చెప్పిన ఎంపీలు అనుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు తెప్పించుకున్నారు. సమగ్ర వివరాలన్ని అందించి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం నుంచి క్లారిటీ రావాలని పట్టుదలగా ఉన్నారు. 

 

టీడీపీ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇవ్వని ప్రధాని..

పశ్చిమగోదావరి : ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఢిల్లీ వెళ్లిన టీడీపీ ఎంపీలకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న మంత్రి బీరేంద్ర సింగ్ తో భేటీ అయిన ఎంపీలు ఈరోజు మరోసారి మంత్రి బీరేంద్ర సింగ్ తో భేటీకానున్నారు. ఈక్రమంలో ప్రధానితో కూడా భేటీ అయ్యేందుకు అపాయింట్ మెంట్ కోరాగా ప్రధాని టీడీపీ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో కడప ఉక్కుపై కేంద్రం నుండి స్పష్టమైన, ఖచ్చితమైన ప్రకటన రావాలనే పట్టుదలతో ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ క్రమంలో రెండవసారి మంత్రి బీరేంద్ర సింగ్ తో భేటీకానున్నారు.

నేడు గుడివాడలో మంత్రి నారా లోకేష్ పర్యటన

కృష్ణా : నేడు గుడివాడలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

 

నేడు 201వ రోజు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర

తూ.గో : నేడు 201వ రోజు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర జరుగనుంది. అమలాపురం నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర సాగనుంది.

 

హైదరాబాద్‌ ఎల్లారెడ్డిగూడలో దారుణం

హైదరాబాద్‌ : ఎల్లారెడ్డిగూడలో దారుణం జరిగింది. ఓ కసాయి కొడుకు కన్నతల్లిని హత్య చేశాడు. తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. కొనఊపిరితో ఉన్న తల్లి మమతను గొంతు నులిమి చంపాడు. 

నేడు ఢిల్లీలో టీడీపీ ఎంపీల ధర్నా

ఢిల్లీ : నేడు ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ధర్నా చేయనున్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రమంత్రి నుంచి స్పష్టత రాకపోవడంతో మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. 

 

09:36 - June 28, 2018

తిరుపతిలో టీటీడీ పాలకమండలి తీసుకుంటన్న నిర్ణయాలపై అక్కడి ఉద్యోగ, కార్మిక సంఘాలనుంచి నిరసన వ్యక్తం అవుతోంది. సలహా మండళ్ళకు అధికారాలివ్వడం, ప్రైవేైటు ఆలయాలకు టీటీడీ నిధులను కేటాయించడం, కళ్యాణమండపాల నిషయంలో అనుసరిస్తున్న వైఖరి తదితర నిర్ణయాలపై వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీటీడీకి భక్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని సరైన మార్గంలో ఖర్చు పెట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో సీఐటీయూ నాయకులు మురళీ మాట్లాడారు. 

 

09:30 - June 28, 2018

కర్నూలు : నంద్యాలలోని వైఎస్ నగర్ లో దారుణం జరిగింది. భార్య, నలుగురు పిల్లలను ఓ ప్రబుద్ధుడు అమ్మకానికి పెట్టాడు. ఒక్కో కూతురిని లక్షా 50 వేలకు తండ్రి మద్దిలేటి అమ్మకానికి పెట్టాడు. భార్యను ఐదు లక్షలకు తన అన్నకు అమ్మకానికి పెట్టాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. చివరకు ఆమె ఐసీడీఎస్ అధికారులను ఆశ్రయిచింది. తన బిడ్డలను రక్షించాలని వేడుకుంటోంది. 

 

08:56 - June 28, 2018

ఢిల్లీ : జూన్‌ 28 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్‌ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 వేల మంది భక్తులతో కూడిన మొదటి బ్యాచ్‌ భారీ భద్రత నడుమ బయలుదేరి వెళ్లింది. అమర్‌నాథ్‌ యాత్రకు ప్రభుత్వం ఈసారి కనీ వినీ ఎరుగని రీతిలో భద్రతా చర్యలు చేపట్టింది.
నేటి నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం  
జూన్‌ 28 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్‌ యాత్రకు మొదటి బ్యాచ్‌ బయలుదేరి వెళ్లింది. భక్తులకు స్థానికులు అధికారులు స్వాగతం పలికారు. భక్తుల భజనలు, మేళ తాళాలతో అమర్‌నాథ్‌ యాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జమ్ములోని బేస్‌క్యాంప్‌ నుంచి అధికారులు పచ్చ జెండా ఊపి అమర్‌నాథ్‌ యాత్రను ప్రారంభించారు.
భారీ ఎత్తున భద్రతా చర్యలు 
బుధవారం ఉదయం 5 గంటలకు భారీ భద్రత నడుమ జమ్ము నుంచి కశ్మీర్‌కు 2,995 మంది భక్తులతో కూడిన వాహనాలు బయలు దేరాయి. ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే మొదటి బ్యాచ్‌లో వెళ్తున్న భక్తులు గురువారం హిమలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంది. ఉగ్రముప్పు నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రకు అధికారులు భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు, ఎలక్ట్రోమెగ్నటిక్‌ చిప్‌, బుల్లెట్‌ ప్రూఫ్‌ బంకర్లను ఏర్పాటు చేశారు. జమ్ము నుంచి కశ్మీర్‌కు వెళ్లే మార్గంలో సిఆర్‌పిఎఫ్‌, స్థానిక పోలీసులతో పాటు 40 వేల మంది సాయుధ బలగాలని భద్రత కోసం నియమించారు. సిసిటీవీ కెమెరాలతో పాటు డ్రోన్‌ ద్వారా యాత్రను పర్యవేక్షించనున్నారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉండడంతో వాటిని ఎదుర్కొనేందుకు అదనపు బలగాలను మోహరించేందుకు కూడా సన్నద్ధం చేశారు. భక్తులను తీసుకెళ్లే వాహనాలకు ఆర్‌ఎఫ్‌ఐడి ట్యాగ్‌లను ఏర్పాటు చేశారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిపికేషన్‌పై కంట్రోల్‌ రూమ్‌ నిఘా ఉంటుంది. 
ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు 
అమర్‌నాథ్‌ యాత్రకు ప్రకృతి విపత్తులు సంభవించినా వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అలర్ట్‌ చేశారు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3 వేల 880 మీటర్ల ఎత్తున అమర్‌నాథ్‌ గుహలో వెలసిన మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఈయేడు 2 లక్షలకు పైగా భక్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. పహల్‌గామ్‌, బాల్‌టాల్‌ నుంచి ప్రతిరోజు 15 వేల మంది భక్తులను యాత్రకు వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ఆగస్టు 26న అమర్‌నాథ్‌ యాత్ర ముగుస్తుంది.

 

నంద్యాలలో దారుణం

కర్నూలు : నంద్యాలో దారుణం జరిగింది. భార్యను, నలుగురు కూతుళ్లను ఓ కసాయి అమ్మకానికి పెట్టాడు. కూతురిని 1.5 లక్షలకు అమ్మకానికి సిద్ధపడ్డాడు. భార్యను 5 లక్షలకు అన్నకు అమ్మడానికి సిద్ధమయ్యాడు. బాధితుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఐసీడీఎస్ అధికారులను బాధితులు ఆశ్రయించారు. 

నంద్యాలలో దారుణం _

కర్నూలు : నంద్యాలలో దారుణం జరిగింది. భార్యను, నలుగురు కూతుళ్లను ఓ కసాయి అమ్మకానికి పెట్టాడు. కూతుళ్లను 1.5 లక్షలకు అమ్మకానికి సిద్ధపడ్డాడు. భార్యను 5 లక్షల రూపాయలకు తన అన్నకు అమ్మకానికి సిద్ధమయ్యాడు. బాధితుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఐసీడీఎస్ అధికారులను బాధితులు ఆశ్రయించారు. 

 

సీపీఎం నేత రామ్ భూపాల్ దీక్షను భగ్నం చేసిన పోలీసులు

అనంతపురం : సీపీఎం అనంతపురం జిల్లా కార్యదర్శి రామ్భూపాల్ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రామ్భూపాల్ ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. రైతుల కోసం రామ్భూపాల్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.

 

08:24 - June 28, 2018

గుజరాత్‌ : భుజ్‌లో ఏబివిపి విద్యార్థులు ఓ ప్రొఫెసర్‌పై దాడి చేశారు. కఛ్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏబివిపి విద్యార్థులు ఓ ప్రొఫెసర్‌ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. అధ్యాపకుడి ముఖంపై నలుపు రంగు పోశారు. అంతేకాదు... ఆ ప్రొఫెసర్‌ను రోడ్డుపై ఊరేగించారు. ఈ ఘటనపై పోలీసులు ఏబివిపి విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రొఫెసర్‌పై దాడి చేయడాన్ని అధ్యాపక బృందం తీవ్రంగా ఖండించింది. విద్యార్థులపై విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. ఈ ఘటన నేపథ్యంలో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

08:21 - June 28, 2018

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో సీనియర్‌ జర్నలిస్ట్‌ షుజాత్ బుఖారిని చంపిన ఉగ్రవాదులను పోలీసులు గుర్తించారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తాన్‌ లష్కరే తోయిబాకు చెందినవాడు కాగా మరో ఇద్దరు స్థానికులున్నట్లు సమాచారం. జూన్‌ 14న షుజాత్‌ బుఖారిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు ముసుగులు ధరించి ఉన్నట్లు సిసిటివిలో రికార్డ్‌ అయింది. షుజాత్‌ ఇఫ్తార్‌ విందులో పాల్గొనడానికి పత్రికా కార్యాలయం నుంచి కారులో బయలుదేరుతుండగా ఉగ్రవాదులు కాల్చి చంపారు. కాల్పుల్లో షుజాత్‌తో పాటు ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కూడా మృతి చెందారు.

 

08:18 - June 28, 2018

ఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ స్ధానంలో మరో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థకు కేంద్రం శ్రీకారం చుట్టింది. యూజీసీ స్ధానంలో భారత ఉన్నత విద్యా కమిషన్‌ ఏర్పాటు కానుంది. ఇందుకు మార్గం సుగమం చేస్తూ యూజీసీ చట్టం, 1956ను తొలగిస్తూ నూతన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నూతన ముసాయిదా చట్టంపై జులై 7లోగా విద్యాసంస్థలు, మేథావులు, నిపుణులు, తల్లితండ్రులు తమ విలువైన సూచనలు, సలహాలను పంపాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కోరింది. విశ్వవిద్యాలయాలకు నిధులను సమకూర్చడంలో యూజీసి కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇకపై ఈ బాధ్యతలను ఉన్నత విద్యా కమిషన్‌ తలకెత్తుకోనుంది. 

 

08:16 - June 28, 2018

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ తండ్రి తన నలుగురు కూతుళ్లకు రక్షణ కల్పించమని కోరుతూ ప్రధాని మోది, సిఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశాడు. మీరట్‌ జిల్లా మవానాలో నలుగురు కూతుళ్లతో కలిసి ఆయన ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఆ ఏరియాలో ఉండే ఆకతాయిలు అమ్మాయిలను నిత్యం వేధిస్తున్నారు. వారి వేధింపులు తట్టుకోలేక నలుగురు అక్కాచెల్లెళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లడం మానేశారు. అమ్మాయిలు మదర్సాలకు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉంటున్నప్పకీ ఇరుగు పొరుగున ఉండే ఆ ఆకతాయిల ఆగడాలు మాత్రం ఆగలేదు. ఇంటికి వచ్చి వేధింపులకు గురి చేస్తుండడంతో ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆకతాయిలు  యాసిడ్‌తో దాడి చేస్తామని ఆ కుటుంబాన్ని హెచ్చరించారు. పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదికి విజ్ఞప్తి చేశారు. బాధితుల ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

08:09 - June 28, 2018

హైదరాబాద్ : టీఆర్ఎస్‌కు.. ఎన్నికలకు ముందే గ్రూపుల సెగ తగులుతోంది. బయటి పార్టీల నుంచి నేతల వలసలతో.. బలోపేతంగా మారిన టీఆర్‌ఎస్‌లో గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. వ్యతిరేకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్న ఒత్తిళ్లు సీఎంపై పెరుగుతున్నాయి. 
కేసిఆర్‌కు కుమ్ములాట‌ల వేడి 
తెలంగాణాలో రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ పేరుతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ నేత‌ల‌ను సైతం కారెక్కించుకున్న గులాబీ ద‌ళ‌ప‌తి కేసిఆర్‌కు కుమ్ములాట‌ల వేడి త‌గ‌ల‌డం మొద‌లైంది. పార్టీకి గట్టి  ప‌ట్టున్న నిజామాబాద్ జిల్లాలో నేత‌ల మ‌ధ్య విబేధాలు రోజురోజుకీ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై.. నిజామాబాద్‌ నేతలు ముఖ్యమంత్రికి ఈమధ్యనే ఫిర్యాదు చేశారు. ఆ అంశం ఇంకా పెండింగ్‌లో ఉండగానే.. ఇప్పుడు డి.శ్రీనివాస్‌ వంతు వచ్చింది. రాజ‌కీయాల్లో  సీనియ‌ర్ నేత‌గా గుర్తింపు తెచ్చుకున్న డిఎస్‌.... టీఆర్ఎస్‌లో చేరింది మొదలు.. తన ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని తన అనుచరులతో తరచూ ప్రస్తావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు.. తనయుడు సంజయ్‌ కమలం గూటికి చేరినప్పటి నుంచి అధికార పార్టీకి ఆయన క్రమంగా దూరమవుతూ వస్తున్నారు. 
టీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తోన్న డిఎస్‌.. 
టీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తోన్న డిఎస్‌.. కొన్నిరోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. కొంతకాలంగా, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న డిఎస్‌.. ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానంతో సీరియస్‌గానే టచ్‌లోకి వెళ్లారన్న విషయం గులాబీ బాస్‌ దృష్టికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. నిజామాబాద్‌ జిల్లా నేతలు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. తనయుడు సంజయ్‌ కోసం డిఎస్‌ పనిచేస్తున్నారన్న విమర్శలను తెరపైకి తెచ్చారు. 
డీఎస్ పై టీఆర్ ఎస్ నేతలు ఆరోపణలు 
టిఆర్ఎస్ పార్టీలో చేరిన త‌ర్వాత ప్రభుత్వ ప‌ద‌వులు ద‌క్కినా.....డిఎస్ తీరు మార‌లేద‌ని ఇప్పటిదాకా అంతర్గత విమర్శలు చేసిన టీఆర్ఎస్‌ నేతలు.. ఇప్పుడు బాహాటంగానే ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ఆయ‌న‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని ఎంపీ కవిత నేతృత్వంలో.. జిల్లా నేతలు సీఎంపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధనరెడ్డితో విభేదించిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరినా.. ఇప్పటివరకూ అధిష్ఠానం నుంచి స్పందన లేదు. అయితే.. డిఎస్‌ విషయంలో మాత్రం పార్టీ అధినేత కేసీఆర్‌ ఉదాసీనంగా ఉండరని, సీరియస్‌గానే చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 

07:56 - June 28, 2018

హైదరాబాద్ : సామాజిక వర్గాలకు పెద్దపీట..అట్టడుగు వర్గాలకు అన్యాయం కానివ్వం..ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో సామాజిక అభివృద్ధిపై నిత్యం చెప్పే మాటలు. కానీ వాస్తవానికి సామాన్యుడు సంగతి పక్కకు పెడితే..ప్రభుత్వ పరిపాలనకు వెన్నెముకలాంటి ఐఏఎస్ అధికారులకే దిక్కు లేకుండా పోయింది. తాము తక్కువ వర్గానికి చెందినవారం కాబట్టే వివక్ష చూపుతున్నారని సీనియర్ ఆధికారులు ఆరోపిస్తున్నారు. 
అంటరాని తనంపై  దళిత ఐఏఎస్‌ల నిరసన 
కేసీఆర్‌ తమ ప్రభుత్వం ఎంతో ఫ్రేండ్లీ అని చెప్పుకుంటున్నా... అచరణ మాత్రం ఇందుకు విరుద్ధంగా తయారైంది. ఇన్నాళ్లు ఆయా సామాజిక వర్గాలు, రాజకీయ పార్టీలే.. సామాజిక వివక్షపై గళమెత్తుతున్నాయని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా పరిపాలనలో భాగస్వాములైన ఐఏఎస్ అధికారులే అంటరానితనంపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్రప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దళితులమని కీలక పోస్టులు ఇవ్వడం లేదన్న దళిత ఐఏఎస్ లు 
దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ కావడానికి అధికారులే కీలకమని సీఎంతోపాటు మంత్రులంతా చెబుతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులదే కీలకపాత్ర. అందులోనూ ఐఏఎస్‌లు కీరోల్‌ ప్లే చేస్తారు. అలాంటి అధికారుల్లో దళితులకు అన్యాయం జరుగుతుందన్న వాదన తెరపైకి వచ్చింది. సీనియర్లమైనా తాము దళితులమనే కారణంగా కీలక పోస్టులు ఇవ్వడం లేదని వారి వాదన. తమకంటే జూనియర్లకు కీలక పోస్టులు అప్పగిస్తూ.. తమను అవమానిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.  ఐఏఎస్ అధికారులైనా మురళి, ప్రీతిమీనా, భారతి హొలికేరి, భారతి లక్పతి నాయర్, శ్యామ్ నాయక్, చంపాలాల్ తో పాటు మరికొంత మంది ఐఏఎస్ లు తమకు సరైన పోస్టింగ్ లు ఇవ్వలేదంటూ ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషికి ఫిర్యాదు చేశారు.  సీనియర్ ఆధికారులుగా ఉన్న బీ ఆర్ మీనా, బీపీ ఆచార్య, సురేష్ చందా లాంటి అధికారులను పూర్తిగా విస్మరించి..జూనియర్లు చేయాల్సిన బాధ్యతలను అప్పగించారు. ఇది ఉన్నతాధికారులను అవమానించడం తప్ప...మరేమీకాదని ఓ సీనియర్ అధికారి బహిరంగానే చెబుతున్నారు.
ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వల్లే ఈ పరిస్థితని మండిపాటు
ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ కోరినా.. ఆ సమాచారం కూడా ఆయన వరకు చేరకుండా కొంత మంది అడ్డుకుంటున్నారని సీనియర్ ఆధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటూ మండిపడుతున్నారు.  సీఎం సచివాలయానికి రాకపోవటం ఒక ఎత్తు అయితే..నెలలో కొన్ని సార్లు కూడా అసలు సీనియర్ అధికారులతో సమావేశం కాకపోవడంతో మరో సమస్య. దీంతో అసలు క్షేత్రస్థాయిలో ఏమీ జరుగుతుందో ఆయనకు సమాచారం చేరటంలేదని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది పరిపాలనపై ప్రభావం చూపెడుతోందని  సీనియర్‌లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వానికి వెన్నెముకలాంటి ఐఏఎస్‌ల అధికారుల పరిస్థితే ఇలా ఉంటే... ఇక ఆ కింది స్థాయి అధికారుల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి మారాలని వారు కోరుతున్నారు. 

 

07:46 - June 28, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ విజయవాడకు వెళ్తున్నారు. కనకదుర్గమ్మ మొక్కు తీర్చుకునేందుకు ఆయన కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. అమ్మవారిని దర్శించుకుని, ముక్కుపుడక సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు.
కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించునున్న కేసీఆర్‌
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో ఎంతో మంది దేవతలను వేడుకున్నారు. స్వరాష్ట్రం సిద్ధించాలని మొక్కులు మొక్కారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఫలానాది చేయిస్తానని తెలుగు రాష్ట్రాల్లోని దేవతలకు మొక్కుకున్నారు. కేసీఆర్‌ కోరుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి కేసీఆరే సీఎం అయ్యారు. దీంతో ఆయన నాటి మొక్కులు మొక్కిన దేవతలను తలచుకుంటూ మొక్కులు  చెల్లిస్తున్నారు. ఇప్పటికే వరంగల్‌ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, తిరుపతి వెంకన్నకు కంఠహారం , కురవి వీరభద్ర స్వామికి బంగారు కోరమీసాలు సమర్పించారు. ఇవాళ ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లిస్తారు.
ఉద్యమ సమయంలో దుర్గమ్మను మొక్కుకున్న కేసీఆర్‌
తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్‌ రాష్ట్రం ఏర్పడితే ముక్కుపుడక చేయిస్తానని మొక్కుకున్నారు. ఇవాళ ఆ మొక్కును తీర్చుకోనున్నారు. 11.29గ్రాముల బంగారంతో ముక్కుపుడకను తయారు చేయించారు. ఇందులో సుమారు 55 చిన్న చిన్న డైమండ్‌ ముక్కల్ని వినియోగించారు. ముక్కుపుడక మధ్యలో తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట బొమ్మను ఏర్పాటు చేశారు.  దీన్ని అమ్మవారికి సమర్పించేందుకు ఇవాళ ఆయన కుటుంబ సమేతంగా విజయవాడకు వెళ్తున్నారు. 
ఉ.11.20గం.లకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న కేసీఆర్‌  
ఉదయం 11.20కు ప్రగతి భవన్‌ నుంచి కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి 12 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు కేసీఆర్‌కు స్వాగతం పలుకుతారు. 12.20 కు గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న ఏపీ వెటర్నరీ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం 12.50కి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి ముక్కుపుడక సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. 1.30 నుంచి 2.10 వరకు ఏపీ వెటర్నరీ  యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో సేదతీరుతారు. అనంతరం 2.30కు హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు.

 

07:40 - June 28, 2018

శ్రీకాకుళం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.  రావికంటిపేటలో నిర్వహించే ఏరువాక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఏపీ సీఎం
సాగును సామూహిక సంబరంగా చేసుకునేందుకు ఏపీ రైతాంగం సమాయాత్తమవుతోంది. వానాకాలం ప్రారంభం కావడంతో... ఏరువాక కార్యక్రమాన్ని ప్రభుత్వం తలపెట్టింది.  ఈ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రకృతిని ఆరాధించే భారతీయ సంస్కృతిలో ఏరువాక ఒక కీలకఘట్టంగా..ఒక పండుగలా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లా రావికంటిపేట గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయడానికి జిల్లాల వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం కమిటీలు వేసింది.  జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా.. వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇతర కీలకమైన జిల్లా స్థాయి ఉన్నతాధికారులను సభ్యులుగా నియమించింది. ఆ కమిటీల పర్యవేక్షణలోనే జిల్లా, గ్రామస్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 
రావికంటిపాడులో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించనున్న సీఎం
శ్రీకాకుళం జిల్లాలో జరిగే ఏరువాక కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 9.45కు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి పదిన్నరకు హెలికాప్టర్‌లో ఆముదాలవలస మండలంలోని పార్వతీశంపేటలో ఉన్న సెయింట్స్‌ ఆన్స్‌ పాఠశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.45కు రావికంటిపాడులోని  వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తారు.  అక్కడే ఏరువాక కార్యక్రమంలో పాల్గొని ప్రారంభిస్తారు.  అనంతరం అక్కడి నుంచి బయలుదేరి పదకొండున్నరకు జగ్గుశాస్త్రులపేటలోని ఎన్టీఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ మైదానానికి చేరుకుంటారు. అక్కడ ఎడ్లబండ్ల ప్రదర్శనతోపాటు వివిధ ప్రదర్శనశాలలను పరిశీలిస్తారు. అనంతరం చంద్రన్న రైతుబీమా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.30కు బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సభ అనంతరం తిరిగి విజయవాడకు  తిరుగుపయనమవుతారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం విత్తనాలు విత్తేందుకు, దుక్కులు దున్నేందుకు పొలాన్ని సిద్ధం చేశారు. సీఎం భద్రత కోసం పోలీసులను భారీగా మోహరించారు.

 

నేడు విజయవాడకు వెళ్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌

విజయవాడ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ విజయవాడకు వెళ్తున్నారు. కనకదుర్గమ్మ మొక్కు తీర్చుకునేందుకు ఆయన కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. అమ్మవారిని దర్శించుకుని, ముక్కుపుడక సమర్పించి మొక్కు తీర్చుకుంటారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు.

 

నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

శ్రీకాకుళం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రావికంటిపేటలో నిర్వహించే ఏరువాక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Don't Miss