Activities calendar

29 June 2018

21:14 - June 29, 2018

విజయవాడ : కడప స్టీల్స్‌పై టీడీపీ చేస్తోన్న ఉద్యమంపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి కౌంటర్‌గా.. సుజనాచౌదరి ప్రస్తావనను తెరపైకి తెస్తున్నారు. అంతే కాదు.. చంద్రబాబు అడిగితే.. కడప స్టీల్స్‌, విశాఖ రైల్వే జోన్‌ ప్రాజెక్టులను రాష్ట్రానికి ఇచ్చే ప్రసక్తే లేదని వివాదాస్పద ప్రకటనలు గుప్పిస్తున్నారు. కడప ఉక్కు కర్మాగారం అంశం.. బీజేపీ, టీడీపీ నేతల మధ్య కాకను పెంచుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. టీడీపీ నేతల తీరుపై కమలనాథులు మండిపడుతున్నారు. కడప ఉక్కు కోసం టీడీపీ ఎంపీ.. సీఎం రమేశ్‌ చేస్తోన్న దీక్షకు కౌంటర్‌గా బీజేపీ నాయకులు.. మరో అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఎందుకు తెరమరుగయ్యారంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

కడప ఉక్కు కోసం టీడీపీ నేతలు చేస్తోన్న దీక్షల్లో నిజాయితీ లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు కోరితే కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్‌లను ఇచ్చే ప్రసక్తే లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తమను నేరుగా ప్రజలు అడిగితే ఆ ప్రాజెక్టులు ఇస్తామంటూ కొత్త వాదనను వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయన్నది కమలనాథుల మరో ఆరోపణ. అమిత్‌షా, సోమువీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలపై టీడీపీ నేతల దాడులను ఉదహరిస్తున్నారు. విపక్ష నేతలు ప్రజలను కలవరాదని టీడీపీ శాసిస్తోందని, అనంతపురంలో కన్నా లక్ష్మీనారాయణపై దాడికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. జగన్‌ పాదయాత్ర, పవన్‌ పోరాట యాత్ర, బీజేపీ అభివృద్ధి చూసి టీడీపీ నేతలు అసహనంతో రగిలిపోతున్నారన్నది బీజేపీ నాయకుల వాదన. కేంద్రం ఏదన్నా ఇవ్వాలని భావించగానే.. టీడీపీ నేతలు దీక్షలు, ఉద్యమాలు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. క్రెడిట్‌ కోసమే కడప స్టీల్‌ డ్రామా ఆడుతున్నారని టీడీపీపై విరుచుకుపడుతున్నారు. మొత్తానికి, ప్రత్యేక హోదాతో మొదలైన బీజేపీ-టీడీపీ నేతల వాగ్యుద్ధం.. ఇప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్‌లపై సాగుతోంది. భవిష్యత్తులో వీరి ఆరోపణ ప్రత్యారోపణలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి. 

21:05 - June 29, 2018

విజయవాడ : తెలుగుదేశం పార్టీ సాగిస్తోన్న పోరాటంపై బురద చల్లేందుకు.. కుట్రలు సాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రమంతా తమ ధర్మపోరాటం వైపే చూస్తోందన్న చంద్రబాబు.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. పార్టీ ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉక్కు కోసం దీక్షలను టీడీపీ ఎంపీలు ఎద్దేవా చేస్తూ మాట్లాడారంటూ.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న వీడియోను చంద్రబాబు ప్రస్తావించారు. పార్టీ ఎంపీల ఉద్యమంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి దృష్టిని మళ్లించేందుకు తప్పుడు వీడియో క్లిప్పింగ్‌లను ప్రచారంలోకి తెస్తున్నారని చంద్రబాబు అన్నారు. టీడీపీ పోరాటంపై బురద చల్లేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. ఎంపీలు బాధ్యతగా వ్యవహరించాలని, ఎవరూ సరదాగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబు సూచించారు.

పార్లమెంటులో ఆందోళన సందర్భంగా మురళీమోహన్‌ స్పృహ కోల్పోయారని, కొనకళ్లకు గుండెపోటు వచ్చిందని.. అప్పుడు వాస్తవాన్ని ప్రచారం చేయని వారు.. ఇప్పుడు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీలు.. చంద్రబాబు దృష్టికి తెచ్చారు. గతంలోనూ జేసీ దివాకరరెడ్డి ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇప్పుడు కూడా.. 75 ఏళ్ల వయసున్న తాను వారం రోజులు దీక్ష చేయగలను అన్న వ్యాఖ్యలను కత్తిరించారని, వాళ్లకు కావలసిన వ్యాఖ్యలను అతికించారని ఎంపీలు సీఎంకు వివరించారు. టీడీపీ ఎంపీల వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఎవరు చిత్రీకరించారో.. ఎందుకు ప్రసారం చేశారో విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

కేంద్రం చేస్తోన్న అన్యాయాన్ని ఎదుర్కోవాలని, ప్రతిపక్షాల అడ్డంకులను అధిగమిస్తూ.. వారి కుట్రలను భగ్నం చేయాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు సూచించారు. నేరస్తులు, బ్లాక్‌మెయిలర్లతో పోరాటం ఆషామాషీ కాదని, పార్టీ నేతలంతా ఇకపైనా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు. 

20:32 - June 29, 2018

కడప : ఉక్కు పరిశ్రమ కోసం పది రోజులుగా దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆరోగ్యం అంతకంతకు క్షీణిస్తోండటంతో తక్షణం దీక్ష విరమించి వైద్యం చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. దీనిని సున్నితంగా తిరస్కరించిన రమేశ్‌.. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ.. ఉక్కు పరిశ్రమపై స్పష్టమైన హామీ రాకుండా దీక్ష విరమించేదిలేదని తేల్చి చెప్పారు. రమేశ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన రిమ్స్‌ డాక్టర్లు షుగర్‌ స్థాయి, బీపీ పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీక్ష విరమించాలని డాక్టర్లు చెప్పినా... ససేమిరా.. అన్నారు. లక్ష్యం నెరవేరే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

దీక్ష చేస్తున్నసీఎం రమేశ్‌ నడవలేని స్థితికి చేరుకున్నారు. స్నానాల గదికి వెళ్లాలన్నా వీల్‌ చైర్‌ పై తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. దీక్షా శిబిరంలో పూర్తిగా పడుకునే ఉంటున్నారు. పరామర్శించడానికి వస్తున్న వారితో సరిగా మాట్లాడలేదకపోతున్నారు. రమేశ్‌ దీక్షకు మద్దతుగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ రమేశ్‌ని కలిసి దీక్షకు మద్దతు తెలిపారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రమేశ్‌ను పరామర్శించి, దీక్షకు సంఘీభావం ప్రకటించారు. క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీక్ష విరమించడం మంచిదని లక్ష్మీనారాయణ సూచించగా ... రమేశ్‌ సున్నితంగా తిరస్కరించారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న సీఎం రమేశ్‌ను పరామర్శించి, సంఘీభావం ప్రకటించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కడప వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

20:30 - June 29, 2018

విజయవాడ : కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో అఖిలపక్షం పిలుపు మేరకు నిర్వహించిన జిల్లా బంద్‌ సంపూర్ణంగా జరిగింది. జనమంతా స్వచ్చంధంగా బంద్‌లో పాల్గొనడంతో ప్రశాంతంగా ముగిసింది. ర్యాలీలు, ధర్నాలతో జిల్లా కడప జిల్లా హోరెత్తింది. వ్యాపార, విద్యాసంస్థలు మూతపడ్డాయి. బస్సులు, ఇతర వాహనాలు తిరగకపోవడంతో జనజీవనం స్తంభించింది. బంద్‌కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్‌ సందర్భంగా కడప జిల్లాలోని ఎనిమిది ఆర్టీసీ డిపోల్లో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు లేక బస్‌ స్టేషన్లు వెలవెలపోయాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు దుకాణాలను స్వచ్చంధంగా మూసివేశారు. అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. రోడ్లపైకి వచ్చిన వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. కడప నగరమంతా నిర్మానుష్యంగా మారింది.

కడపలో జరిగిన బంద్‌లో సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోపాటు రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాఘవులు ఆధ్వర్యంలో కడపలో బైక్‌ ర్యాలీ జరిగింది. కడపకు స్టీల్‌ ప్లాంట్‌ను వెంటనే ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోతే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఏపీ విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ హెచ్చరించారు. పులివెందులతో సంపూర్ణంగా బంద్‌ జరిగింది. వైసీపీ, వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బద్వేల్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమకారులు జెండాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చిన బంద్‌ జరిపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ప్రొద్దూటూరు బంద్‌ సంపూర్ణంగా జరిగింది. జమ్మలమడుగు, రాయచోట, పోరుమామిళ్ల, ముద్దనూరు, రైల్వేకోడూరుతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బంద్‌ నిర్వహించారు.

కడప జిల్లా బంద్‌కు సంఘీభావంగా రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లో కూడా వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు జరిగాయి. తిరుపతిలో నిర్వహించిన ర్యాలీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. కేంద ప్రభుత్వం దిగొచ్చిన కడప ఉక్కు కర్మాగారం ఇవ్వకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇవ్వాలన్న నిర్ణయానికి వామపక్షాలు వచ్చాయి. 

20:27 - June 29, 2018

గద్వాల : ఎందరో ప్రాణత్యాగాలతో సాకారమైన తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్‌. దేశంలోనే రైతాంగానికి 24 గంటలు కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన సీఎం.. జిల్లాపై వరాల జల్లు కురిపించారు. 454 కోట్లతో చేపట్టిన ఈ పథకంతో 33వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.

ఈ సందర్భంగా గద్వాలలో ఏర్పాటు చేసిన నడిగడ్డ ప్రగతి సభకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. గద్వాల ఆస్పత్రిని 300 పడకల ఆస్పత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. గద్వాల అభివృద్ధి కోసం 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఏడాదికి రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందించేవరకు టీఆర్ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నామన్నారు.

కాళేశ్వరం సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు అన్నారు మంత్రి హరీష్‌ రావు. ఎస్సారెస్పీ ద్వారా యాదాద్రి భువనగిరి, సూర్యాపేటకు అలాగే కృష్ణానీటితో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను నీరందించి ఆయా జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని హరీశ్‌రావు వెల్లడించారు. ఈ సందర్భంగా తుంగభద్ర నది నుండి నీటిని ఎత్తిపోసి ఆర్డీఎస్‌ కాలువకు అందించే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు తదితరులు పరిశీలించారు. రూ. 783 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ పథకం ద్వారా 87వేల 5 వందల ఎకరాలకు సాగునీరు అందనుంది. 

20:25 - June 29, 2018

హురక చంద్రబాబు ఏశం గట్టిగనే గట్టినట్టుండుగదా.?. నాకు తెల్సిన కాడికి కేసీఆర్ భారతదేశంల నెంబర్ వన్ ముఖ్యమంత్రి అంటే.. మొత్తానికి బాలికాకయ్యను మొచ్చుకోవచ్చుపోండ్రి..మందియే పిత్తులు మందియే కత్తులు.. నీదేం బొయ్యింది.. పెట్టు వందల కోట్లు గాకపోతో వేల కోట్ల రూపాలు ఖర్చు వెట్టుండ్రి...అగో ఆడలేక పాతగజ్జలన్నట్టే ఉన్నదిగదా..? తెలంగాణ సర్కారు ముచ్చట..ఆ మొత్తానికి మన గుణాత్మక గుర్వయ్య పేరు మీద సీన్మ కట్క ఒత్తిండ్రు... సూస్తిరా తెల్గుదేశం పార్టీ ఎంపీల మాటలు..?భూమి మీద జాగలు అయిపోయినట్టున్నయ్.. అందుకే ఇప్పుడు చంద్రుని మీద గూడ రియలెస్టేట్ వ్యాపారం సుర్వైంది.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:15 - June 29, 2018

కొమరం భీం : ఆసిఫాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ హాస్టల్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ లో చదువుకుంటున్న విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్న భోజనంలో తోటకూర పప్పు తిన్నారు. తిన్న 60 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వాంకిడి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స అందించేందుకు సరియైన ఏర్పాట్లు లేకపోవడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థులకు వైద్యులు చికిత్స అందించారు. కానీ ప్రకాష్ అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగి గంటలవుతున్నా అధికారులు స్పందించలేదని తెలుస్తోంది. నీటి వల్ల జరిగిందా ? ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా ? అనేది తెలియరాలేదు. 

బీటెక్ విద్యార్థినిపై సీనియర్ల అత్యాచారం...

కృష్ణా : జూనియర్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. సోషల్ మాధ్యమాల్లో అత్యాచారానికి పాల్పడిన వీడియోను బయటపెడుతామని బెదిరించారు. ఈ ఘటన జరిగి రెండేళ్లు అయ్యింది..ఆ నాటి నుండి ఆ యువతి మనోవేదనకు గురయితూనే ఉంది. చివరకు వారి చేసిన దారుణాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆగిరిపల్లిలో చోటు చేసుకుంది. 

20:11 - June 29, 2018

కృష్ణా : జూనియర్ విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. సోషల్ మాధ్యమాల్లో అత్యాచారానికి పాల్పడిన వీడియోను బయటపెడుతామని బెదిరించారు. ఈ ఘటన జరిగి రెండేళ్లు అయ్యింది..ఆ నాటి నుండి ఆ యువతి మనోవేదనకు గురయితూనే ఉంది. చివరకు వారి చేసిన దారుణాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆగిరిపల్లిలో చోటు చేసుకుంది.

బీటెక్ మొదటి సంవత్సరం చదువుకుంటున్న యువతిని శివారెడ్డి..కృష్ణారెడ్డిలు లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో చిత్రీకరించారు. అనంతరం పదే పదే బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయటకు చెబితే వీడియోని సామాజిక మాధ్యమాల్లో పెడుతామని బెదిరించారు. మూడో వ్యక్తి ప్రవీణ్ కు కూడా చూపించడంతో అతను కూడా యువతిని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. గత రెండేళ్లుగా ఈమె తీవ్ర మనస్థాపానికి గురైంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక..ఎలా చెప్పాలో తెలియకపోవడంతో తనలో తానే కుమిలిపోయింది. ఇదంతా గమనించిన యువతి తండ్రి శుక్రవారం ప్రశ్నించాడు. దీనితో తాను పడుతున్న బాధ..తనకు ఎదురైన ఘటనను వివరించింది. చివరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారానికి పాల్పడిన నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. 

20:06 - June 29, 2018

హైదరాబాద్ : సివిల్‌ సప్లయ్‌ అధికారులు రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించక పోవడంతో సమ్మెను కొనసాగిస్తామంటున్నారు రేషన్‌ డీలర్లు. రేషన్‌ డీలర్లను తొలగించి నోటీసులు జారీ చేశారు సివిల్‌ అధికారులు. మహిళా సంఘాలకు రేషన్‌ వ్యవస్థను అందిస్తామని సివిల్‌ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యలో రేషన్‌ డీలర్లు నిరసన కార్యక్రమాలు ఉధృతం చేశారు. ప్రభుత్వం త్వరగా స్పందించక పోతే ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని రేషన్‌ డీలర్లు ప్రకటించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:05 - June 29, 2018

హైదరాబాద్ : దశాబ్దాల కాంగ్రెస్‌ పాలకులపై మండి పడ్డారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంటనగరాలకు చెందిన ఆర్యవైశ్యులు టీఆర్‌ఎస్‌లో చేరిన.. ఈ సందర్భంగా మాట్లాడిన.. కేటీఆర్‌ కాంగ్రెస్‌ నేతల తీరును దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పాలకుల పుణ్యమా అని ఇంకా వేలాది గ్రామాలకు విద్యుత్, రోడ్లు లేవని విమర్శించారు.

20:03 - June 29, 2018

విజయవాడ : ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాల్‌లో ఆశాలకు బాసట కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు-ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఆశా వర్కర్స్‌ వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. అంగన్‌వాడీ, ఏఎన్‌ఎంలతో కలసి ఆశాలు పనిచేస్తున్నారని.. వారికి గౌరవవేతనం కోసం జనరల్‌ గైడ్‌లైన్స్‌ రూపొందిస్తున్నామని చెప్పారు. చంద్రన్నబీమా వర్తింప చేయడంతో పాటు.. భవిష్యత్తులో ఏఎన్‌ఎం పోస్టుల భర్తీలో ఆశాలకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఆరోగ్య సూచికలో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపాలని చంద్రబాబు ఆశాలకు సూచించారు. గర్భిణులు, నవజాత శిశు మరణాలు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రపంచ బ్యాంక్‌ నిధులు అందగానే.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దీటుగా.. ఏఎన్‌ఎం సెంటర్‌లను తీర్చిదిద్దుతామన్నారు. అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే.. ప్రభుత్వంపై 156 కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నా.. ఆశాలకు గౌరవ వేతనం ఫిక్స్‌ చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. సీఎం ప్రకటన పట్ల ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేశారు.

20:01 - June 29, 2018

కర్నూలు : ఉక్కు ఫ్యాక్టరీపై టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నరని ఆరోపించారు బీజేపీ ఏపీ రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. కర్నూలు జిల్లా బీజేపీ నేతలతో మొదటి సారి సమావేశమైన సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలనకొనసాగుతోందని విమర్శించారు. అవితీని ఎండగట్టే వారిపై చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా.. ఛత్రపతిశివాజీలాగా ముందుకెళుతామన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:59 - June 29, 2018

విశాఖపట్టణం : అవకాశవాద రాజకీయాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని దివాలా తీయించారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. చంద్రబాబు అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడని 2014లో టీడీపీకి మద్దతు ఇస్తే.. దోపిడీతో నాలుగేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై రోజుకో మాట మార్చిన చంద్రబాబుకు విభజనచట్టంలోని ఏ అంశంపైనా స్పష్టతలేదని విశాఖ పర్యటనలో పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖలో పర్యటించారు. విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌... విమ్స్‌ ఆస్పత్రిని సందర్శించి.. అక్కడ నెలకొన్న సమస్యలను పరిశీలించారు. విమ్స్‌ను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పలు సంఘాల నాయకులు పవన్‌ దృష్టికి తీసుకురాగా... సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఐటీ సంస్థలకు కేటాయించిన భూములను పరిశీలించారు. సాగర నగరానికి ఐటీ సంస్థలు వస్తున్నా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదని చెప్పడంతో ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

విశాఖలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన పవన్‌ కల్యాణ్‌... జనసేన స్థాపనకు దారితీసిన పరిస్థితుల నుంచి 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజీపీకి మద్దతు ఇవ్వడానికి గల కారణాలను వివరించారు. అనుభవజ్ఞుడైన నాయకుడని చంద్రబాబుకు మద్దతు ఇస్తే.. అవినీతి, దోపిడీతో రాష్ట్రానికి లూటీ చేశారాని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సుపరిపాలన అందించకపోగా.. అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నాయకులు భూకబ్జాలకు పాల్పడ్డారని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. పాలకుల తప్పిదాలు, నిర్లక్ష్యానికి ప్రజలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చిందని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. జనం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్న పవన్‌ కల్యాణ్‌.... 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. 

19:20 - June 29, 2018

కాకినాడ : తెలుగు జాతితో పెట్టుకోవద్దని, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చూసింది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, 2019లో అసలైన సినిమా చూస్తుందని ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కాకినాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొని మోడీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బాబు కృషి చేస్తుంటేను విమర్శించడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం అభినందించి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉండేదని..బాబుపై అనేక ఆరోపణలు చేస్తున్నారని..ఏపీ ప్రజల కోసం కష్టపడుతున్నారని తెలిపారు. 

తెలుగు జాతితో పెట్టుకోవద్దు - నారా లోకేష్...

కాకినాడ : తెలుగు జాతితో పెట్టుకోవద్దని, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చూసింది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, 2019లో అసలైన సినిమా చూస్తుందని ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంటూ కేంద్ర సర్కారు మోసం చేసిందని, మోదీ వెన్నుపోటు పొడిచారని అన్నారు. 

జులై 6న ఏపీ కేబినెట్...

విజయవాడ : ఏపీ కేబినెట్ జులై నెల 6 తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఉదయం 10 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోని ఒకటో బ్లాక్ లో కేబినెట్ మీటింగ్ హాల్ లో ఈ సమావేశం జరుగనుంది. 

కేంద్ర విధానాలతో కష్టాలు - బాబు...

తూర్పుగోదావరి : బ్యాంకుల్లో కుంభకోణాలు వచ్చాయని, ఒకపక్క కుంభకోణాలు..మరోపక్క నోట్ల రద్దు...ఇలా ఎన్నో వాటితో ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. నల్లడబ్బులు కక్కిస్తామని చెప్పి పేదలకు న్యాయ చేస్తామని చెప్పి చేశారా ? అని ప్రశ్నించారు.

బాబు ధర్మపోరాట దీక్ష...

తూర్పుగోదావరి : నమ్మక ద్రోహం..కుట్ర రాజకీయాలపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కాకినాడ జేఎన్టీయూలో ఆయన దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఖబడ్దార్...మోసం చేస్తే వదిలి పెట్టేది లేదని మరోసారి హెచ్చరించారు. ధర్మపోరాటం దీక్షలను తిరుపతిలో ప్రారభించడం జరిగిందన్నారు.

గద్వాలకు కేసీఆర్ వరాలు...

జోగులాంబ గద్వాల : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గద్వాలపై వరాల జల్లు కురిపించారు. గట్టు మండలంలోని రూ. 554 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గద్వాలకు వరలా జల్లు కురిపించారు. 300 పడకల ఆసుపత్రిగా తయారు చేసేందుకు ఆదేశాలిస్తున్నట్లు..వంద కోట్ల రూపాయల గద్వాల కోసం విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్ గద్వాలకు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. గట్టు ఎత్తిపోతల పథకానికి 'నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం'గా పేరు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు

18:09 - June 29, 2018

జోగులాంబ గద్వాల : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గద్వాలపై వరాల జల్లు కురిపించారు. గట్టు మండలంలోని రూ. 554 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గద్వాలకు వరలా జల్లు కురిపించారు. 300 పడకల ఆసుపత్రిగా తయారు చేసేందుకు ఆదేశాలిస్తున్నట్లు..వంద కోట్ల రూపాయల గద్వాల కోసం విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్ గద్వాలకు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. గట్టు ఎత్తిపోతల పథకానికి 'నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం'గా పేరు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. లక్షా 20వేల రూపాలయను ఒక్కో విద్యార్థిపై ఖర్చు పెడుతున్నామని...

584 మండాలకు బీసీ గురుకుల పాఠశాల రావాల్సి ఉందని...రాష్ట్రంలో 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేస్తున్నట్లు, వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభించడం జరుగుతుందని...అందులో గట్టు మండలానికి ఒకటి వస్తుందన్నారు. కేటి దొడ్డి మండల కేంద్రంలో గిరిజన గురుకుల పాఠశాల మంజూరు చేస్తామన్నారు. గుర్రంగడ్డ బ్రిడ్జీ 8 కోట్ల రూపాయలవుతాయని...పది కోట్ల అయినా సరే..సాయంత్రంలోగా ఆర్డర్ ఇస్తున్నామని...నాలుగైదు నెలల్లో గుర్రగూడ బ్రిడ్జీ నిర్మాణం పూర్తి కావాలన్నారు. గద్వాల బస్టాండు అభివృద్ధి కోసం రూ. 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. జూరాల వద్ద బృందావనం పార్కుకు రూ. 15 కోట్ల నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాలని ఎంతో మంది చనిపోయారని..తాను కూడా మృత్యు ముఖంలోకి వెళ్లి వచ్చానన్నారు. కోటి ఎకరాలకు నీరు పారే యజ్ఞమని...ఆర్డీఏ తూములను బాంబులతో పేల్చారని...ప్రాజెక్టుల వద్ద పడుకుని హరిష్ రావు ఇతర మంత్రులు పని చేయిపిస్తున్నారన్నారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని...కరెంటు సమస్య తీరిందన్నారు. దేశంలో ఉచితంగా 24గంటల కరెంటు ఇచ్చేది తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనని ప్రకటించారు. తాను స్వయంగా 60 ఎకరాల మొక్కజొన్న పెట్టినట్లు తెలిపారు. తెలంగాణలో భూ స్వామి ఉన్నాడా ? అని ప్రశ్నించారు. గతంలో ఈ ప్రాంతంలో ఉన్న బీడు భూములను చూసి జయశంకర్..తాను చలించిపోయేవాళ్లమని కేసీఆర్ తెలిపారు. 

18:06 - June 29, 2018

తూర్పుగోదావరి : నమ్మక ద్రోహం..కుట్ర రాజకీయాలపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కాకినాడ జేఎన్టీయూలో ఆయన దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఖబడ్దార్...మోసం చేస్తే వదిలి పెట్టేది లేదని మరోసారి హెచ్చరించారు. ధర్మపోరాటం దీక్షలను తిరుపతిలో ప్రారభించడం జరిగిందన్నారు. తిరుపతిలో ఆనాడు జరిగిన సభలో అన్నీ చేస్తామని మోడీ హామీనిచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గతంలో మోడీ ఎలాంటి హామీలు గుప్పించారో వీడియోలతో చూపించారు. 

17:57 - June 29, 2018

జోగులాంబ గద్వాల్ : తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ కలిసి రాలేదని...అభివృద్ధిలో కూడా కలిసి రావడం లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గట్టు మండలంలోని రూ. 554 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీష్ మాట్లాడుతూ...కాంగ్రెస్ మాయమాటలు చెబుతున్నారని, కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు తెచ్చుకుంటున్నామని పేర్కొన్నారు. గట్టు ఎత్తిపోతల పథకం భూమి పూజకు ఎమ్మెల్యే రాకపోవడం...కావాలని రాద్ధాంతం చేయడం సబబు కాదన్నారు. 25వేల ఎకరాలకు మంజూరు చేసినట్లు జీవో..చూపించాలని, లేనిపక్షంలో గద్వాల ప్రజలను మోసం చేసినందుకు డీకే అరుణ క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. వెనుకబడిన మూడు మండలాలకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించడం జరిగిందని, ప్రజలు ఆశీర్వదిస్తే లక్ష ఎకరాలకు నీళ్లందించే విధంగా కృషి చేస్తామన్నారు. 

గొర్రెలు, బర్రెలు ఇచ్చి బీసీలకు మోసం చేస్తున్నారు : వీహెచ్

హైదరాబాద్ : గొర్రెలు, బర్రెలు ఇచ్చి బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభా 52 శాతం అని సమగ్ర కుటుంబ సర్వేలో తేలిందనీ..కానీ రాజకీయ అంశలకు వచ్చేసరికి మాత్రం బీసీలకు 34 శాతం మాత్రమే రిజర్వేషన్ ఇస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పేర్కొన్నారు. 

16:34 - June 29, 2018

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. పబ్ లో ఓ యువతిపై బ్లేడ్ పై ఓ యువకుడు...అతని స్నేహితుడు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన వ్యక్తి ఫిరోజ్ అని తేలింది. అంతేగాకుండా బంజారాహిల్స్ లోని ఓ నివాసంలో నిర్భందించి దాడికి పాల్పడ్డాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

16:33 - June 29, 2018

త్రిపుర : సోషల్‌ మీడియాలో పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారన్న వదంతులు ఈశాన్య రాష్ట్రాల్లోనూ వ్యాపించాయి. త్రిపురలో పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారన్న అనుమానంతో రెండు వేర్వేరు చోట్ల జరిగిన సామూహిక దాడిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ముగ్గురు వ్యాపారులు వ్యాపారం కోసం వాహనంలో ఓ గ్రామానికి వెళ్లగా వారిని గ్రామస్థులు అనుమానించారు. పిల్లల్ని ఎత్తుకెళ్లే గ్యాంగ్‌గా భావించి వారిపై దాడి చేశారు. వాహనాన్ని ధ్వంసం చేశారు. మూకుమ్మడి దాడిలో ఓ వ్యక్తి మృతి చెందగా...తీవ్ర గాయాలైన మరో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. మృతుడిని జహీర్‌ఖాన్‌గా గుర్తించారు. దక్షిణ త్రిపురలో జరిగిన మరో ఘటనలో గ్రామీణ ప్రాంత ప్రజలను జాగృతం చేయడానికి వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగి 33 ఏళ్ల సుశాంత్‌ చక్రవర్తిని గ్రామస్థులు కొట్టి చంపారు. ఓ విషయంలో గ్రామస్థులతో మాట మాట పెరగడంతో ఈ దాడి జరిగినట్లు సమాచారం. త్రిపురలో పిల్లల్ని కిడ్నాప్‌ చేస్తున్నారన్న పుకార్లు షికార్లు చేయడంతో రెండురోజుల పాటు ఇంటర్నెట్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌ సేవలను నిలిపివేశారు.

16:31 - June 29, 2018

ఉత్తరాఖండ్‌ : ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ నిర్వహించిన జనతాదర్బార్‌లో ఓ మహిళా టీచర్ తన బదిలీపై మాట్లాడుతూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో టీచర్‌ను అదుపులోకి తీసుకోమని సిఎం ఆదేశించారు. ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపటి తర్వాత టీచర్‌ను పోలీసులు వదిలి పెట్టారు. ఉత్తరా బహుగుణ పంత్‌ గత 25 ఏళ్లుగా మారుమూల ప్రాంతంలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తన పిల్లలతో కలిసి ఉండడానికి తనను డెహ్రాడూన్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటూ సిఎం రావత్‌ను ఆమె డిమాండ్‌ చేశారు. ఆమె విజ్ఞప్తిని సిఎం తోసిపుచ్చడంతో తీవ్ర ఆవేశానికి లోనై రావత్‌తో వాదనకు దిగారు. ప్రజాసమస్యలపై ఏర్పాటు చేసిన జనతా దర్బార్‌లో బదిలీ అంశాలు ప్రస్తావించడం సరికాదని సిఎం అన్నారు. టీచర్‌ నానా దుర్భాషలాడడం వల్లే సస్పెండ్‌ చేసినట్లు సిఎం చెప్పారు.

ఇంకో 15 ఏళ్లు టీఆర్ఎస్ దే అధికారం : కేటీఆర్

యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో చారిటబుల్ ఆసుపత్రులు కోసం సీఎం కేసీఆర్ ను ఒప్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గత ప్రబుత్వాల హయాంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణకు ద్రోహం చేసిందని ఆరోపించారు. ఆంధ్రాకు, తెలంగాణకు బలవంతంగా కలిపింది కాంగ్రెస్సేనని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో ఇంకో 15 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీదే అధికారమని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల సమయం వస్తే ఎక్కడ లేని గాలి మాటలు వినిపిస్తుంటాయని అటువంటి గాలి మాటలను పట్టింకోవాల్సిన అవుసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు.  

16:13 - June 29, 2018

హైదరాబాద్ : రేషన్ షాపుల నిర్వాహణ మహిళా సంఘాలకు అప్పచెబుతామని ప్రభుత్వం యోచిస్తోందని..ఇందులో మహిళా సంఘాలు ఆలోచించాలని కాంగ్రెస్ నేత పొన్నం సూచించారు. రేషన్ డీలర్ల సమ్మెతో టి.సర్కార్ మహిళా సంఘాలను తెరమీదకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పొన్నం శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...9 నెలల్లో ప్రభుత్వం కూలిపోక తప్పదని జోస్యం చెప్పారు. మహిళా సంఘాలకు అప్పచెబుతామని అంటున్నారని...నోటిని..కడుపు కొట్టి పెడుతామని అంటున్నారని..ఒక్కసారి మహిళా సంఘాలు ఆలోచించాలని సూచించారు. వారి ఆందోళనకు మద్దతుగా ముందుకు రావాలని..వారికి సహకరించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, మహిళలు..పారిశుధ్య కార్మికులు..జర్నలిస్టులు..ఎంతో మంది ఆందోళనలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 

ముందస్తు ఎన్నికలు ఎందుకో కేసీఆర్ చెప్పాలి : జానారెడ్డి

హైదరాబాద్ : ఏ కారణంతో ముందస్తు ఎన్నికలకు వెళ్తారో సీఎం కేసీఆర్ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ సవాల్ చేయడం హాస్యాస్పదమని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని, తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన జానారెడ్డి, ఎన్ని సీట్లు వస్తాయో మాత్రం చెప్పనని, కర్ణాటక తరహా సర్కార్ ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదని జానారెడ్డి అన్నారు. 

బీజేపీ కుట్రలో భాగమే ఫేక్ వీడియోలు : గల్లా జయదేశ్

ఢిల్లీ : ఓ గదిలో కూర్చున్న టీడీపీ ఎంపీలు 'బరువు తగ్గాలనుకుంటే నిరాహార దీక్ష చేస్తాను' అంటూ సరదాగా మాట్లాడుకుంటుండగా తీసిన వీడియో బయటకు రావడంతో విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆ వీడియోపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతు..ఎన్నికలు రానున్న రోజుల్లో ఇటువంటి ఫేక్‌ వీడియోలు ఎక్కువవుతాయని, ఆ వీడియో బీజేపీ కుట్రలో భాగమని ఆయన అన్నారు. వైసీపీ, జనసేనలను బీజేపీ ఇటువంటి చర్యలకు ఉపయోగించుకుంటోందని అన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా చేసే రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయని అన్నారు. ఇటువంటివి ప్రసారం చేసే ముందు మీడియా నిర్ధారించుకోవాలని గల్లా జయదేవ్ తెలిపారు. 

గత్యంతరం లేకనే రేషన్ డీలర్ల సమ్మె బాట: జానారెడ్డి

హైదరాబాద్ : ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకుంటే సమ్మె బాట పడతామని రేషన్ డీలర్లు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ నేత జానారెడ్డి స్పందిస్తు రేషన్ డీలర్లు గత్యంతరం లేక సమ్మె బాట పట్టనున్నారని పేర్కొన్నారు. రేషన్ డీలర్ల ఆవేదన అర్థం చేసుకోకుండా ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవటం సరికాదని జానారెడ్డి సూచించారు. డీలర్లతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలలో నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ రాజ్యాంగబద్దంగా ఐదేళ్లు పాలించకుండా ముందస్తు ఎన్నికలకు వెళదామని అని అడగటం ఎంత వరకూ సమంజసం అని జానారెడ్డి ప్రశ్నించారు.

15:51 - June 29, 2018

తూర్పుగోదావరి : గోదావరి జిల్లాలో ఓ అంగన్‌వాడీ కార్యకర్త కులవివక్షను ఎదుర్కొంటోంది. గ్రామ సర్పంచే తన విధులను అడ్డుకుంటున్నారంటూ ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో... కులవివక్ష మరోసారి తెరపైకి వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ మహిళ పేరు మంగాదేవి. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ పరిధిలోని యస్సీ కాలనీలో నివాసముంటోంది. తోటపేటలో మంగాదేవి 16 సంవత్సరాలుగా అంగన్‌వాడీ ఆయాగా పనిచేసింది. పోలేకుర్రులో అంగన్‌వాడీ కార్యకర్త ఈ మధ్యే మరణించారు. దీంతో 15 నెలలుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. మంగాదేవి ఇంటర్‌ వరకు చదువుకోవడంతో... ఆమెకు ఐసీడీఎస్‌ అధికారులు పదోన్నతి కల్పించారు. పోలేకుర్రులోని అంగన్‌వాడీ సెంటర్‌కు ఆమెను గత ఏప్రిల్‌ 1న కార్యకర్తగా నియమించారు. ఇదే ఇప్పుడు మంగాదేవికి శాపంగా మారింది.

తన పదోన్నతి ఉత్తర్వు పత్రాలు తీసుకుని పోలెకుర్రుకు ఉత్సాహంగా వెళ్లిన మంగాదేవికి ఆ గ్రామ సర్పంచ్‌ మొండి హరిచిన్నారావు నుంచి ప్రతిబంధకం ఎదురైంది. పోలేకుర్రు సెంటర్‌లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్త పనిచేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. అప్పటి నుంచి మంగాదేవి విధులకు ఏదో ఒక రకంగా ఆటంకం కలిగిస్తూనే ఉన్నారు. గ్రామంలోని రజక, యాదవ, శెట్టిబలిజతోపాటు ఇతర బీసీలను ఆమెపైకి ఎగదోశారు. అంగన్‌వాడీ సెంటర్‌కు తాళం వేయించాడు. అప్పటి నుంచి మంగాదేవి అంగన్‌వాడీ సెంటర్‌ ఆరుబయటే కూర్చొంటోంది. మూడు నెలలుగా ఇదే వరుస. అంతేకాదు... మంగాదేవిని అక్కడి నుంచి పంపించేందుకు కులం పేరుతో దూషిస్తున్నట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయింది.

తనకు జరుగుతున్న అన్యాయంపై మంగాదేవి స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు ఫిర్యాదు చేసింది. ఇంతవరకు ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. అంతేకాదు.. మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌కు, ఎంపీపీకి, జెడ్పీటీసీ సభ్యులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరు కూడా పట్టించుకోలేదు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్‌ను ఆశ్రయించారు. కులం పేరుతో దూషిస్తూ , విధులకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్‌ చేసింది. గ్రామ సర్పంచ్‌తోపాటు ఇతరులపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె కోరుతోంది. 

ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్న టీ.కాంగ్రెస్

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రేపు 119 అసెంబ్లీ నియోజక వర్గ ఇన్ చార్జ్ లు, డీసీసీ అధ్యక్షులతో తెలంగాణ కాంగ్రెస్ సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో కుంతియా, ముగ్గురు కార్యదర్శులు, పార్లమెంటరీ నియోకవర్గ స్థాయి నేతలకు కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానాలు పంపింది.  

15:46 - June 29, 2018

కాకినాడ : మధ్యాహ్నం భోజన పథకంలో ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మధ్యాహ్నం భోజన పథకం నిర్వాహకులు..కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాకినాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టెన్ టివితో సీఐటీయూ నాయకురాలు బేబిరాణి మాట్లాడారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

సీఎం సమావేశంలో మహిళా టీచర్ హల్ చల్..

ఉత్తరాఖండ్ : సీఎం నిర్వహించిన జనతా దర్బార్ లో ఓ మహిళా టీచర్ హల్ చల్ చేసింది. టీచర్ గా తన ట్రాన్స్ ఫర్ గురించి దర్భార్ హాల్లో మాట్లాడుతు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. దీంతో పోలీసులు అమెను అడ్డుకున్నా ఆమె మాట్లాడటం మానలేదు . దీంతో సదరు మహిళా టీచర్ ను సస్పెండ్ చేస్తు సీఎం రావత్ ఆదేశాలు జారీచేసారు. టీచర్ నానా దుర్భాషలాటం వల్లను సస్పెండ్ చేసినట్లుగా సీఎం రావత్ ప్రకటించారు.

 

15:45 - June 29, 2018

హైదరాబాద్ : విభజన హామీల అమలు కోసం టీడీపీ నాయకులు చేస్తున్న పోరాటంలో చిత్తశుద్ధి, నిజాయితీలేదని వైసీపీ విమర్శించింది. తనపై కేసులు పెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అటు కేంద్రం, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో లాలూచీ పడ్డారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. కేసులకు భయపడుతున్నది బాబా..జగన్ ? ఎవరని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ కు వెళ్లిన సమయంలో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని...దీక్షలన్నీ డ్రామాలని కొట్టిపారేశారు. బాబుకు గట్టిబుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు ఉందన్నారు. 

15:43 - June 29, 2018

కడప : జిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ గుంటూరులో వామపక్షాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. గత నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న టీడీపీ - బీజేపీలు జాయింట్‌గా ఏపికి అన్యాయం చేశాయని లెఫ్ట్‌నేతలు విమర్శించారు. కడపలో టీడీపీ నేతలు దీక్షలు చేస్తూ గాలి జనార్దన్‌రెడ్డి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆరోపించారు. కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం చేపట్టకుంటే.. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సీపీఎం నేతలు కేంద్రాన్ని హెచ్చరించారు.

 పులివెందులలో...
 పులివెందులలో అఖిలపక్షాలు పూర్తి బంద్‌ పాటిస్తున్నాయి. ఉదయం నుంచి వామపక్షాల, వైసీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చిన నిరసన తెలుపుతున్నారు. డిపోల ముందు ఆందోళనకుదిగి ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. వ్యాపారులు తమ షాపులను స్వచ్చందంగా మూసివేశారు. వేలదా మంది అఖిలపక్షాల కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కడప ఉక్కు పరిశ్రమతో జిల్లాలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి దొరకుతుందని వామపక్షాలు, వైసీపీ నేతలు అన్నారు.

జమ్మలమడుగులో...
జమ్మలమడుగులోఅఖిలపక్షాల బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. సి.పి.ఐ, సిపిఎం వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనలో పాల్గొంటున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులను అడ్డుకున్నారు. ప్రజలు సైతం స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేసి బందులో పాల్గొంటున్నారు. పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించాయి. ఈ సందర్భంగా కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం వచ్చేంతవరకు తమ పోరాటం ఆగదని అఖిలపక్షం నాయకులు అన్నారు.

15:39 - June 29, 2018

కృష్ణా : కృష్ణా జిల్లా ఎ కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధితో రోజుకొకరు మృత్యువాత పడుతున్నారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కిడ్నీ బాధితులు మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

ఐటీలో మెరుగ్గా వున్నాం హార్డ్ వేర్ లో మెరుగుపడాలి : చంద్రబాబు

గుంటూరు : విద్యానగర్ లో ఇన్ వెకాస్ వేద సంస్థను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా సెమీ కండర్టర్ల తయారీ, శిక్షణ సంస్థ ఇన్ వెకాస్ వేద సంస్థను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతు..ఇప్పటి వరకూ మనం ఐటీ రంగంలో మెరుగ్గా వున్నామనీ..కానీ హార్డ్ వేర్ రంగంలో ఎదగాల్సి వుందన్నారు. ఎలాక్ట్రానిక్, ఇన్నోవేషన్ పాలసీలను తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు.

ఏపీకి కొత్త డీజీపీ ఎంపికపై సీఎంకు నివేదిక..

అమరావతి : ఏపీకి కొత్త డీజీపీ ఎంపికపై సెలక్షన్ కమిటీ ప్రభుత్వానికి నివేదికను అంజేసింది. గౌతమ్ సవాంగ్, ఠాకూర్, కౌముది, అనురాధ, సురేంద్రబాబు పేర్లను నివేదికలో సెలక్షన్ కమిటీ పొందుపరిచింది. ఐదుగురు అధికారుల ట్రాక్ రికార్డ్, సర్వీసు వివరాలతో ఈ నివేదికను సెలక్షన్ కమిటీ రూపొందించింది. సెలక్షణ్ కమిటీ నివేదికపై సీఎం రేపు నిర్ణయం తీసుకోనున్నారు. 

మోదీహయాంలో స్విస్ లో ఇండియన్స్ ఖాతాలు పెరిగాయి : డొక్కా

అమరావతి : మోదీ ప్రధాని అయ్యాక హయాంలో స్విస్ బ్యాంక్ లో ఇండియన్స్ ఖాతాలు పెరిగాయని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. మోదీ స్విస్ బ్యాంక్ లో వున్న నల్లధన్నాన్ని వెనక్కి తెస్తానని దేశ ప్రజలకు వాగ్ధానం చేసారని..కానీ ఇప్పుడు ఆయన ప్రధాని అయ్యాక స్విస్ బ్యాంక్ లో ఇండియన్స్ ఖాతాలు పెరిగాయని డొక్కా విమర్శించారు. ఆర్థిక స్కామ్ లకు పాల్పడ్డ లలిత్ మోదీ, నీరవ్ మోదీలన విదేశాలకు సాగనంపారని డొక్కా ఎద్దేవా చేశారు. మోదీ పాలన అంతా బడా బాబులను పోషించేందుకేనన్నారు. 

ఎలాక్ట్రానిక్ రంగంలో 2లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా : లోకేశ్

గుంటూరు : ఏపీని ఎలక్ట్రానికి హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్నో కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా వున్నాయని ఏపీకి ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని లోకేశ్ తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో ఐటీ పార్క్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎలాక్ట్రానిక్ రంగంలో 2 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి లోకేశ్ తెలిపారు. దేశంలో 50 శాతం ఎలక్ట్రానిక్ తయారీ రంగం ఏపీ నుండే వచ్చేలా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

వీడియోలు మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారు : టీడీపీ ఎంపీలు

ఢిల్లీ : వీడియోలు మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటువంటి అసత్య ప్రచారాలకు పూనుకుంటున్నారని ఎంపీలు ఆరోపించారు. ఏపీ అభివృద్ధి కోసం అందరూ కలిసి పోరాడాలని వారు పిలుపునిచ్చారు. కాగా ఉక్కు పరిశ్రమ కోసం ఎంపీ సీఎం రమేశ్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షపై టీడీపీ ఎంపీలు సెటైర్లు వేసినట్లుగా ఓ వీడియో వైరల్ గా మారటం సంచలనంగా మారింది. దీనిపై తక్షణం అప్రమత్తమైన టీడీపీ వివరణ ఇచ్చుకుంది.

చంద్రబాబుని ప్రశంసిస్తు 'న్యూయార్క్ టైమ్స్' కథనం..

అమరావతి : ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ పై ప్రముఖ పత్రిక 'న్యూయార్క్ టైమ్స్' లో కథనం వచ్చింది. రసాయన రహిత వ్యవసాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని తన కథనంలో ప్రశంసించింది. ఇండియాలోనే మొట్టమొదటి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ రాష్ట్రం అంటూ కితాబిచ్చింది. వ్యవసాయాన్ని ప్రకృతికి చేరువ చేయాలంటూ ప్రచురించిన కథనంలో ఈ మేరకు ఏపీ గురించి ప్రస్తావించింది. ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం కోసం ఏపీ ప్రభుత్వం సుమారు రూ. 2500 కోట్లు వెచ్చిస్తోందంటూ కథనంలో పేర్కొంది.

సీఎం రమేశ్ కు లక్ష్మీనారాయణ సంఘీభావం..

కడప : ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేష్ కు మద్దతు పలుకుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ, నిర్మాత బండ్ల గణేశ్ లు రమేష్ ను పరామర్శించి తమ మద్దతు తెలిపారు. అనంతరం, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రమేష్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్న ఉక్కు దీక్షను కొనసాగించడం హర్షణీయమని అన్నారు.

14:40 - June 29, 2018

విశాఖపట్టణం : తాను అందుబాటులో ఉండే వ్యక్తిని అని..పారిపోయే వ్యక్తిని కాదని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విశాఖలో మాట్లాడారు. పెద్ద పెద్ద నాయకులు ఎంతమంది ఉన్నా...అభివృద్ధిలో ఉత్తరాంధ్ర వెనుకబడి పోయిందని విమర్శించారు. కాంగ్రెస్..బిజెపి పార్టీలు అధిష్టానం చుట్టూ తిరగడానికే సమయం సరిపోతోందని..రాజకీయ అనుభవం కోసం గత ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. ఎలాంటి అర్హత లేకున్నా..డబ్బు..బలంతో రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొందుతున్నారన్నారు.

ఏ ఒక్కరూ కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది..ఉద్యోగాలు లేవు..సాగునీటి ప్రాజెక్టులు..నిధులు లేవని నిలదీయలేదన్నారు. హై కమాండ్ చెప్పిందే శిరోధార్యమని చెబుతుంటారని...కడుపు మండేది అధిష్టానానికి కాదని..ప్రజలకని తెలిపారు. స్థానికంగా నాయకత్వం ఉండాలని పిలుపునిచ్చారు. స్పెషల్ కేటగిరి కింద ఎన్నోమార్లు మాట మార్చారని...అనుభవం ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారకులైన వారయ్యారని...తెలంగాణ ఉద్యమం లాగా మళ్లీ వచ్చే పరిస్థితి చేస్తున్నారని పేర్కొన్నారు. 

14:34 - June 29, 2018

కడప : ఉక్కు ఉద్యమం మరింత ఉధృతమౌతోంది. శుక్రవారం అఖిలపక్షం జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. దీనితో ఎక్కడికక్కడనే బస్సులు నిలిచిపోయాయి. సీపీఎం, సీపీఐ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు బంద్ కు మద్దతు పలికాయి. ఉదయం నుండే పలు పార్టీల నేతలు ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించాయి. పలు ప్రాంతాల్లో నేతలు బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ 'కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు' అంటూ పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే టిడిపి ఎంపీ రమేశ్ దీక్ష పదో రోజుకు చేరుకుంది. దీక్ష విరమింప చేయాలని కేంద్ర మంత్రి కోరినా స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని రమేశ్ స్పష్టం చేశారు.

ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ విశాఖలో వామపక్షాలు ర్యాలీని నిర్వహించాయి. ఇందుకు టిడిపి, బిజెపి మినహా ఇతర పార్టీలు మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నాయి. ప్రజా ఉద్యమం ద్వారానే సాధిస్తామని వామపక్ష నేతలు తెలిపారు. దొంగ దీక్షలు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేశారు. 

14:32 - June 29, 2018

పశ్చిమగోదావరి : తమ వీడియోలను తీసుకుని మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని టిడిపి ఎంపీలు మండిపడ్డారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం టిడిపి ఎంపీ రమేశ్ ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇతర ఎంపీలు సరదాగా సంభాషణలు చేసుకున్న వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయిపోయింది. దీనిపై బాబు సీరియస్ అయ్యారు.

శుక్రవారం ఎంపీలు మురళీ మోహన్, గల్లా జయదేవ్ లు మీడియాతో మాట్లాడారు. అసత్య ప్రచారాలు మాని ఏపీ అభివృద్ధికి సహకరించాలని మురళీ మోహన్ కోరారు. మీడియా మిత్రులు శ్రేయోభిలాషులు అనుకుంటామన్నారు. ఎవరిమీదో బురద చల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ ఘటన వెనుక ఎవరున్నారో తెలియడం లేదని తెలిపారు. ఎన్నికల సమయంలో అమిత్ షా ఇలాంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతారని...ఇలాంవి మానుకోవాలని గల్లా జయ్ దేవ్ హితవు పలికారు. 

14:15 - June 29, 2018

తూర్పుగోదావరి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధర్మపోరాట దీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగో దీక్ష కాకినాడలోని జేఎన్టీయూ గ్రౌండ్ లో జరుగనుంది. ఇందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకహోదా...విభజన హామీలు అమలు చేయకపోవడంపై కేంద్రంపై నిరసన వ్యక్తం చేస్తూ బాబు ధర్మపోరాట దీక్షలను చేపడుతున్న సంగతి తెలిసిందే. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. కార్యకర్తలను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. సుమారు లక్షన్నర మంది వస్తారని నేతలు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:14 - June 29, 2018

జోగులాంబ గద్వాల్ : జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తుమ్మిళ్లకు చేరుకున్న ఆయన అక్కడ జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఎత్తిపోతల పథకం పనులను ఆయన పరిశీలించనున్నారు. గట్టు మండలంలోని రూ. 554 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కుంతియాను అడుగుతా..ఫిర్యాదు చేస్తా - వీహెచ్...

హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు పెట్టాలని కేసీఆర్ కు ఉందా ? లేదా ? అని కాంగ్రెస్ నేత వీహెచ్ ప్రశ్నించారు. సమగ్ర సర్వేలో 54 శాతం బీసీలు ఉన్నారని చెప్పకనే చెప్పారని, దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తున్నావ్...తమకిచ్చిన హామీలు అమలు చేయవా ? అని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కొనసాగుతారని కుంతియా చెప్పారని..కానీ పార్టీలో కొందరు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. కుంతియాను అడుగతానని..ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ రహస్య సమావేశాల వెనకున్న కుట్రదారుడు బయటకు రావాలన్నారు. 

తుమ్మిళ్లలో కేసీఆర్...

జోగులాంబ గద్వాల్ : జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. తుమ్మిళ్లకు ఆయన చేరుకున్నారు. ఎత్తిపోతల పథకం పనులను ఆయన పరిశీలించనున్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేయనున్నారు. 

బాబు అడిగితే అస్సలు ఇవ్వం - సోము వీర్రాజు...

రాజమండ్రి : కన్నా లక్ష్మీనారాయణపై దాడిని ఖండిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. చంద్రబాబు ఎప్పుడూ మిత్రపక్షంగా లేరని, క్యాపిటల్ ప్రారంభానికి ప్రధాని మోడీ వచ్చిన సమయంలో పీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారని, ఈ ఘటనలో ఒక్క కేసు నమోదు కాలేదన్నారు. ప్రజల కోసమైతే స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ లు ఇవ్వగలమని...బాబు అడిగితే అసలు ఇవ్వమన్నారు. ధర్మపోరాటం దీక్షతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.

 

ఆంధ్రా పాలకుల వల్ల ఆంధ్రా ప్రజలు అవమానించబడ్డారు : పవన్

విశాఖపట్నం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మేధావులతో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ రెండరోజుకూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పనవ్ మాట్లాడుతు.. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఆంధ్రులు చెమటోడ్చారని..పాలకుల వల్ల ప్రజలకు చెడ్డ పేరొచ్చిందన్నారు. ఆంధ్రా పాలకులు దోపిడీదారులేమోగానీ..ఆంధ్రా ప్రజలు మాత్రం దోపిడీదారులు కాదనీ..ఆంధ్రావారికి కష్టపడి పనిచేయటం వచ్చుగానీ దోపిడీ చేయటం చేతకాదన్నారు. ఆంధ్రా పాలకులను, ప్రజలను ఒకటిగా చూడవద్దని పవన్ అన్నారు.

రాజకీయల్లో జవాబుదారీ తనం రావాలి : పవన్

విశాఖపట్నం : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మేధావులతో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ రెండరోజుకూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పనవ్ మాట్లాడుతు..ఏ ఉద్యోగానికైనా చదువులు కావాలి గానీ రాజకీయాల్లోకి రావాలంటే కావాల్సింది డబ్బుంటే చాలు రాజకీయాల్లోకి వచ్చేసేలా నేటి రాజకీయాలున్నాయని పవన్ ఎద్దేవా చేశారు. ఇది సరకాదన్నారు. రాజకీయాల్లో జవాబుదారీతనం రావాలని పవన్ పిలుపునిచ్చారు.

నకిలీ వేలిముద్రల కేసులో మరో కోణం..

హైదరాబాద్ : నకిలీ వేలిముద్రల కేసులో మరో కోణం బైటపడింది. రేషన్ డీలర్లతో ఒప్పందం పెట్టుకని నకిలీ వేలిముద్రలతో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మారం నలుగురు రేషన్ డీలర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సంతోష్ ను ఎస్ ఆర్ నగర్ పోలీసులు ధర్మారం తరలించినట్లుగా సమాచారం. ధనలక్ష్మీ కమ్యూనికేషన్ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. రబ్బర్ స్టాంపుల తయారీ యంత్రం, నకిలీ వేలిముద్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో నేటితో సంతోష్ పోలీస్ కస్టడీ ముగియనుంది.

పాలేకుర్రులో కుల వివక్ష ..

తూర్పగోదావరి : పాలేకుర్రులో కుల వివక్ష వెలుగులోకి వచ్చింది. దళిత అంగన్వాడీ కార్యకర్తను విధుల్లోకి రాకుండా పాలేకుర్రు సర్పంచ్ అడ్డుకున్నారు. మూడు నెలలుగా అంగన్వాడీ సెంటర్ కు తాళాలు వేసిన అంగన్వాడీ కార్యకర్త మంగావేవిని విధుల్లోకి రానివ్వకుండా సర్పంచ్ అడ్డుకుంటున్నారు. దీంతో మంగాదేవి అంగన్వాడీ సెంటర్ బైటనే కూర్చుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. తనకు జరిగిన అవమానం, అన్యాయంపై నియోజక వర్గ ఎమ్మెల్యేతో సహా ఇతర ప్రజాప్రతినిధులకు, కలెక్టర్ కూడా మంగాదేవి ఫిర్యాదు చేసింది.

12:21 - June 29, 2018

కడప : జిల్లాలోని జమ్మలమడుగులో అఖిలపక్షాల బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. సి.పి.ఐ, సిపిఎం  వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనలో పాల్గొంటున్నారు. స్థానిక  ఆర్టీసీ బస్టాండ్ వద్ద  బస్సులను అడ్డుకున్నారు. ప్రజలు సైతం స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేసి బందులో పాల్గొంటున్నారు. పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించాయి. ఈ సందర్భంగా  కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం వచ్చేంతవరకు తమ పోరాటం ఆగదని అఖిలపక్షం నాయకులు అన్నారు. 

 

కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని బంద్ చేస్తాం : మధు

తిరుపతి : టీడీపీ, బీజేపీ కుమ్మక్కు వల్లనే రాష్ట్ర విభజన హామీలను నెరవేరలేదని సీపీఎం ఏపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మధు ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లుగానే కడపకు ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మధు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తామని మధు తెలిపారు. ఉక్కు పరిశ్రమ కోసం నాలుగేళ్లగా తాము పోరాటం చేస్తున్నామనీ..కానీ టీడీపీ ప్రభుత్వం ఇప్పుడే మేలు కుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యలను సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని మదు విమర్శించారు.

తప్పుడు వీడియోల కుట్రలను తిప్పికొట్టాలి : చంద్రబాబు

అమరావతి : ఢిల్లీలో వున్న ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వారికి దిశానిర్ధేశం చేశారు. సీఎం రమేశ్ ఉక్కు పరిశ్రమ కోసం చేపట్టిన నిరాహారదీక్షపై టీడీపీ ఎంపీలు సెటైర్లు వేసినట్లుగా ఓ వీడియో వైరల్ గా మారటంతో సీఎం చంద్రబాబు వారికి దిశానిర్ధేశం చేశారు. టీడీపీ చేస్తున్న పోరాటంపై ప్రతిపక్షాలు తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తున్నాయనీ..ఇటువంటి ప్రతిపక్షాలు సృష్టిస్తున్న అడ్డంకులను, కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కోని అధిగమించాలని ..కేంద్రంతో పట్టువిడువక పోరాటం చేయాలని తెలిపారు.

రెండవ రోజు కూడా అమర్ నాథ్ యాత్ర నిలిపివేత..

జమ్ము కశ్మీర్ : హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో వ్యవప్రసాయసకోర్చి చేసే అమర్ నాథ్ యాత్రకు ఈ సంవత్సరం పలు ఆటంకాలు ఏర్పాడుతున్నాయి. గురువారం మేళతాళాలతో భక్తిప్రపత్తులతో ప్రారంభమైన కొద్ది సేపటికే అమర్ నాథ్ యాత్రను వాతావరణం అనుకూలించని క్రమంలో అధికారులు నిలిపివేశారు. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ లో రెండు రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో రెండవ రోజు కూడా అమర్ నాథ్ యాత్ర నిలిపివేశారు. బల్తాల్, పహెల్ గావ్ క్యాంపులకే అమర్ నాథ్ యాత్రీకులు పరిమితం అయిపోయారు. టెంట్ల లోనుండి యాత్రికులు బైటకు రావద్దని అధికారులు సూచించారు.

11:22 - June 29, 2018

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో రెండు రోజులుగా ఎడతెరిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రెండో రోజు కూడా అమర్ నాథ్ యాత్ర ముందుకు సాగలేదు. వర్షం కారణంగా యాత్రను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అమర్ నాథ్ యాత్రికులు బల్తాల్, పహెల్ గావ్ క్యాంపులకే పరిమితం అయ్యారు. టెంట్ల నుంచి యాత్రికులు బయటకు రావొద్దని అధికారులు సూచించారు. అమర్ నాథ్ యాత్ర మార్గంలో 15 వేల మంది కశ్మీర్ పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. 

 

ఏపీలో మరోకంపెనీ ఏర్పాటు..భారీగా ఉద్యోగాలు..

అమరావతి : ఏపీలో మరో కంపెనీ ఏర్పాటు కానుంది. సెమీ కండక్టర్ల తయారీలో పేరు గాంచిన ఇన్వెకాస్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటుతో ఉద్యోగాల కల్పన భారీగా జరగనుంది. ఇటీవల అమెరికాలో పర్యటించిన ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇన్వెకాస్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని, ఎటువంటి అడ్డంకులు లేకుండా అన్నీ దగ్గరుండి చూసుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఇన్వెకాస్ ప్రతినిధులు ఇందుకు అంగీకరించారు.

ట్రైన్ లో ప్రయాణిస్తున్న జవాన్లు అదృశ్యం..కలకలం..

పశ్చిమ బెంగాల్ : రైలులో వెళుతున్న జవాన్లలో పదిమంది అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మొత్తం 83 మంది జవాన్లతో పశ్చిమ బెంగాల్ నుంచి జమ్ముకశ్మీర్‌లోని సాంబ సెక్టార్‌కు ప్రత్యేక రైలు బయలుదేరింది. మార్గమధ్యంలో జవాన్ల హాజరును తీసుకున్న అధికారులు అందులో పదిమంది అదృశ్యమైనట్టు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ కమాండర్.. ముఘల్‌సరాయ్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైలు నుంచి పదిమంది ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అదృశ్యమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న జవాన్ల కోసం గాలింపు చేపట్టారు.

ఉక్కు దీక్షపై టీడీపీ ఎంపీలపై చంద్రబాబు ఆగ్రహం..

అమరావతి : కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరేందుకు ఢిల్లీ వెళ్లిన టీడీపీ ఎంపీలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. వారితో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈసందర్భంగా ఏపీ భవన్ లో పార్టీ ఎంపీల మాట తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రమేశ్ నిరాహాద దీక్షపై ఎంపీలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటంపై చంద్రబాబు ఎంపీలకు క్లాస్ పీకారు. టీడీపీ ఎంపీటు ఎంపీ సీఎం రమేశ్ నిరాహార దీక్షపై సెటైర్లు వేసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోపై చంద్రబాబు ఎంపీలను ఆరా తీశారు. తమ మాటలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఎంపీ మురళీ మోహన్ చంద్రబాబుకు వివరణ ఇచ్చారు. 

దేశంలో ముందస్తు ఎన్నికలు తప్పేలా లేవట..

కర్ణాటక : దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశం ఉందని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ అభిప్రాయపడ్డారు. బీజేపీ సన్నాహాలు చూస్తుంటే ఎన్నికలు ముందుగా రావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీకి డిసెంబరులో ఎన్నికలు జరగనున్నాయని, వీటితోపాటు లోక్‌సభ ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని దేవగౌడ పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలను ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా సమర్థించిన విషయాన్ని ఈ సందర్భంగా దేవెగౌడ గుర్తు చేశారు.

కుంగిపోయిన షాపూర్ నగర్ రోడ్డు..

హైదరాబాద్ : వర్షాకాలం వచ్చింది. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్లపై ప్రయాణించేందుకు వాహనదారులు భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లోని జీడిమెట్ల-షాపూర్ నగర్ రహదారిపై రోడ్డు కుంగిపోయింది. ఇటీవలే ఆ రోడ్డుపై గోదావరి నీటి కోసం పైప్ లైన్ వేశారు. అయితే, నిర్లక్ష్యంగా ఆ గుంతలను పూడ్చడంతో... రోడ్డు కుంగిపోయింది. విషయం తెలిసిన వెంటనే జీడిమెట్ల సీఐ శంకర్ రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకుని... వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు.

జులై 2 నుండి హైకోర్టు పనివేళల్లో మార్పులు..

హైదరాబాద్ : జులై 2 నుండి ఉమ్మడి హైకోర్టు పనివేళల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఉ.10.30 నుండి సా.4.30గంటల వరకు పనిచేస్తున్న హైకోర్టు విధులు నిర్వహిస్తుండగా..జులై 2 నుండి ఉదయం 10.15 నుండి సా.4.15 వరకు హైకోర్టు పనివేళలు జరుగనున్నాయి. ట్రాఫిక్ సమస్యలపై హైకోర్టుకు పలు విజ్నప్తులు రాగా పరివేళ్లల్లో మార్పులు చేర్పులు చేసినట్లుగా సమాచారం. 

11:01 - June 29, 2018

జోగులాంబ గద్వాల : ఇవాళ జోగులాంబ జిల్లాలో గట్టు ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చెప్పారు. పుష్కరాల సమయంలో కేసీఆర్ జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సంపత్ విమర్శించారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సంపత్ కుమార్ ను ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. సంపత్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. 

 

కేసీఆర్ నిరంకుశత్వంవల్లే ఎమ్మెల్యే సంపత్ హౌస్ అరెస్ట్ : ఉత్తమ్

హైదరాబాద్ : ఎమ్మెల్యే సంపత్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయటం కేసీఆర్ నిరంకుశత్వ పరిపాలనకు పరాకాష్ట అని టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ విమర్శించారు. తుమ్మిళ ఎత్తిపోతల ప్రాజెక్టును సంపత్ కుమార్ పోరాడి సాధించారనీ.. గట్టు ఎత్తిపోతలకు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినా..టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పకీ ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు పనులు చేయటం లేదరో సీఎం తెలియజేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సంపత్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని హైకోర్టు రెండుసార్లు ఆదేశించినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవటం దారుణమని ఉత్తమ్ విమర్శించారు.

10:51 - June 29, 2018

కడప : జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలంటూ కోసం అఖిలపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. ఇందులో  భాగంగా ఇవాళ కడపజిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు  రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు ఆందోళనకారుల  బైఠాయించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ బంద్‌కు సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలు మద్దతు పలికాయి.  

10:48 - June 29, 2018

విశాఖ : జనసేన పోరాటయాత్రలో భాగంగా విశాఖలో జనసేనాని సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. ఇందులో ప్రముఖ వ్యాపార వేత్త బాలాజీ సంస్థల అధినేత మండవ రవికుమార్‌ తన అనుచరులతో కలిసి చేరారు. అయితే చిత్తశుద్ధితో ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తన వంతు కృషి చేస్తానంటున్న మండవ రవికుమార్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం.. 

తుమ్మిళ కార్యక్రమంలో పాల్గొనటం నా హక్కు : ఎమ్మెల్యే సంపత్

జోగులాంబ : టీఆర్ఎస్ ప్రభుత్వం నాపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అలంపూర్ నియోజకవర్గపు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పేర్కొన్నారు. నా పోరాటంతోనే తుమ్మిళ ప్రాజెక్టును సాధించామని సంపత్ తెలిపారు. తుమ్మిళ కార్యక్రమంలో పాల్గొనటం నా హక్కు అని సంపత్ పేర్కొన్నారు. ఈరోజు జోగులాంబ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో పుష్కరాల సమయంలో సీఎం ఇచ్చిన వాగ్ధానాలేవి అమలు చేయలేదనని అందుకే సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ ప్రకటించారు.

10:44 - June 29, 2018

కడప : విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా కడప జిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని వెంటనే పరిశ్రమను స్థాపించాలని ఆయన అన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి సంసారం చేసిన టీడీపీ విభజన హామీలను గాలికోదిలేసిందని విమర్శించారు.

 

సెప్టిక్ ట్యాంక్ లో మట్టిపెళ్లలు మీదపడి ఇద్దరు మృతి..

పశ్చిమగోదావరి : నల్లజర్ల మండలం పోతవరంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో వున్న సెప్టిక్ ట్యాంక్ లో పనిచేస్తున్న నేథ్యంలో ట్యాంక్ లోకి దిగిన ఇద్దరు మృతి చెందారు. సెప్టిక్ ట్యాంక్ లో వరలు అమర్చే క్రమంలో మట్టిపెళ్లలు మీద పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతులిద్దరు కొయ్యలగూడెం మండలం పొంగుటూరు వాసులుగా గుర్తించారు.  

10:38 - June 29, 2018

కడప : కడప ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజల హక్కు అని సీపీఎం పొలిటీబ్యూరో మెంబర్ బీవీ రాఘవులు అన్నారు. విభన చట్టంలో పేర్కొన్న ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయకుండా మోదీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఉక్కు పరిశ్రమ సాధించే వరకు వామపక్షాల ఉద్యమాన్ని కొనసాగిస్తాయంంటున్న రాఘవులుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై మోదీ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఎల్లారెడ్డిగూడ తల్లి హత్యకేసులో కొత్తకోణం..

హైదరాబాద్ : ఎల్లారెడ్డిగూడ తల్లి హత్యకేసులో కొత్తకోణం బైటపడింది. జల్సాలకు అలవాటు పడి కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు మదన్ ఉదంతంతో బైటపడిన హత్యలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. తల్లి మమత అప్పులు చేసి మరీ కొడుకు జల్సాలకు డబ్బులు ఇచ్చింది. తల్లి దగ్గర నుంచి రూ.15 లక్షలు తీసకున్న మదన్ ను తీసుకున్న డబ్బులు ఇవ్వమని మమత అడిగింది. దీంతో కోపోద్రిక్తుడైన మదన్ తల్లిని దారుణంగా హత్య చేశారు. చిట్టీ వాళ్ల గొడవలకు తట్టుకోలేకే తల్లిని హత్య చేశానని మదన్ మొదట చెప్పాడు. కానీ పోలీసుల ఇంటరాగేషన్ లో అసలు విషయాన్ని మదన్ బైటపెట్టాడు.  

10:32 - June 29, 2018

కడప : జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలంటూ కోసం అఖిలపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. ఇందులో  భాగంగా ఇవాళ కడపజిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు  రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు ఆందోళనకారుల  బైఠాయించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ బంద్‌కు సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలు మద్దతు పలికాయి.  

కడప జిల్లా బంద్ కార్యక్రమంలో పాల్గొన్న బివి.రాఘవులు, రామకృష్ణ

కడప : ఉక్కు పోరాటం ఉధృతమైంది. అఖిలపక్షాలు తలపెట్టిన కడప జిల్లా బందు కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తెల్లవారు జాము నుంచే అఖిలపక్షాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు ఆందోళనకారులు బైఠాయించారు. బంద్ కు సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్ మద్దతు పలికాయి. 

 

కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ హౌస్ అరెస్ట్..

పశ్చిమగోదావరి : ఈరోజు జోగులాంబ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీంతో పుష్కరాల సమయంలో సీఎం ఇచ్చిన వాగ్ధానాలేవి అమలు చేయలేదనని అందుకే సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. సంపత్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో జోగులాంబ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

కొనసాగుతున్న కడప జిల్లా బంద్

కడప : ఉక్కు పోరాటం ఉధృతమైంది. ఇవాళ అఖిలపక్షాలు తలపెట్టిన కడప జిల్లా బందు కొనసాగుతుంది. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే అఖిలపక్షాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు ఆందోళనకారులు బైఠాయించారు. బంద్ కు సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్ మద్దతు పలికాయి. 

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో పోలీసుల కార్డన్ సర్చ్

హైదరాబాద్‌ : ఎల్బీనగర్‌లోని సాయినగర్‌లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సర్చ్‌లో 272 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన ధృవ పత్రాలు లేని 25 బైక్‌లు, 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 70 మద్యం బాటిళ్లు, 100 గుట్కా ప్యాకెట్లలను స్వాధీనం చేసుకున్నారు. 14 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

10:21 - June 29, 2018

హైదరాబాద్‌ : ఎల్బీనగర్‌లోని సాయినగర్‌లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సర్చ్‌లో 272 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన ధృవ పత్రాలు లేని 25 బైక్‌లు, 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 70 మద్యం బాటిళ్లు, 100 గుట్కా ప్యాకెట్లలను స్వాధీనం చేసుకున్నారు. 14 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

జల్సాలకు అలవాటుపడి తల్లిని హత్యచేసిన కొడుకు

హైదరాబాద్‌ : ఎల్లారెడ్డిగూడ తల్లి హత్యకేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. జల్సాలకు అలవాటుపడి  తల్లిని హత్యచేశానని కొడుకు మదన్‌ పోలీసు విచారణలో తెలిపాడు. అప్పులు చేసి తన జల్సాలకు తల్లి మమత డబ్బులు ఇచ్చేదని.. అలా 15లక్షలు రూపాయలు తీసుకున్ననని మదన్‌ అన్నాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయటంతో తల్లిని హత్యచేశానని మదన్‌ విచారణలో ఒప్పుకున్నాడు. మొదట చిట్టీల వాళ్ల గొడవలకు తట్టుకోలేకే తల్లిని హత్యచేశానని మదన్‌ చెప్పిన విషయం తెలిసిందే.   

 

నేడు మంత్రి లోకేష్ తో ఇన్వెకాస్ ప్రతినిధులు భేటీ

గుంటూరు : ఇవాళ మంత్రి లోకేష్ తో ఇన్వెకాస్ ప్రతినిధులు భేటీ కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నారు. 

నేడు గంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

గంటూరు : జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.

అమెరికాలో జర్నలిస్టులే టార్గెట్ గా కాల్పులు

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ దుండగులు చెలరేగారు. జర్నలిస్టులను టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. మేరిల్యాండ్ లోని ''క్యాపిటల్ గెజిట్'' దినపత్రికా కార్యాలయంలో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలు అయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని మేరిల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పత్రిక కార్యాలయంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.  

 

09:34 - June 29, 2018

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ దుండగులు చెలరేగారు. జర్నలిస్టులను టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. మేరిల్యాండ్ లోని ''క్యాపిటల్ గెజిట్'' దినపత్రికా కార్యాలయంలో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలు అయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని మేరిల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పత్రిక కార్యాలయంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు.  

 

09:20 - June 29, 2018

తూర్పుగోదావరి : ఇవాళ కాకినాడలో టీడీపీ ధర్మపోరాట దీక్ష చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు దీక్ష ప్రారంభం కానుంది. దీక్షలో సీఎం చంద్రబాబు, మంత్రులు పాల్గొననున్నారు. లక్షమందితో దీక్ష నిర్వహణకు జిల్లా టీడీపీ ఏర్పాటు చేసింది. కాకినాడలో ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాకినాడ సిటీలో ఇవాళ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. 

 

నేడు కాకినాడలో లక్షమందితో టీడీపీ దీక్ష

తూర్పుగోదావరి : ఇవాళ కాకినాడలో టీడీపీ ధర్మపోరాట దీక్ష చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు దీక్ష ప్రారంభం కానుంది. దీక్షలో సీఎం చంద్రబాబు, మంత్రులు పాల్గొననున్నారు. లక్షమందితో దీక్ష నిర్వహణకు జిల్లా టీడీపీ ఏర్పాటు చేసింది. కాకినాడలో ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాకినాడ సిటీలో ఇవాళ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. 

 

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అఖిలపక్షాలు బంద్ కు పిలుపు

కడప : ఉక్కు పోరాటం ఉధృతమైంది. ఇవాళ అఖిలపక్షాలు కడప జిల్లా బందు పాటిస్తున్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామయి. తెల్లవారు జాము నుంచే అఖిలపక్షాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు ఆందోళనకారులు బైఠాయించారు. బంద్ కు సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్ మద్దతు పలికాయి. 

08:50 - June 29, 2018

కడప : ఉక్కు పోరాటం ఉధృతమైంది. ఇవాళ అఖిలపక్షాలు కడప జిల్లా బందు పాటిస్తున్నాయి. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామయి. తెల్లవారు జాము నుంచే అఖిలపక్షాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు ఆందోళనకారులు బైఠాయించారు. బంద్ కు సీపీఎం, సీపీఐ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్ మద్దతు పలికాయి. 

08:44 - June 29, 2018

రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని వక్తలు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారాల ఏర్పాటు విషయంలో కేంద్రం జాప్యం చేస్తోందని విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు లక్ష్మీనారాయణ, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత చందూ సాంబశివరావు పాల్గొని, మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో బయ్యారం ఉక్కు కర్మాగారం, కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:39 - June 29, 2018

మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నడిపిస్తోంది.. ఇది మన తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్‌ పదేపదే చెప్పేమాట. కానీ మైనార్టీ సంక్షేమం విషంయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవాజ్‌ విమర్శిస్తోంది. మైనార్టీలకు రుణాలిస్తామని చెప్పి... దరఖాస్తు పెట్టుకున్నాక ఇంతవరకూ చాలా మందికి రుణాలివ్వలేదని, ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోమంటున్నారని, ఇదెక్కడి పద్ధతంటూ ఆవాజ్‌ ప్రశ్నిస్తోంది. అన్యాక్రాంతమైన వక్ఫ్‌ బోర్డ్‌ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద ముస్లీంలకు ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ఆ సంఘం డిమాండ్‌ చేస్తోంది. మైనార్టీల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ్టి జనపథంలో ఆవాజ్‌ తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి అబ్బాస్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీసర్కార్ చేతల ప్రభుత్వం కాదని.... మాటల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:33 - June 29, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్ధిక రంగాల్లో సాధిస్తున్న ప్రగతి అద్భుతంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శవంతంగా ఉన్నాయని యూఏఈ విదేశాంగశాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయేద్ ఆల్ నహ్యాన్ అన్నారు.  ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో  ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అరబ్ దేశాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి ఉపాధి పొందుతున్న కార్మికులు, ఉద్యోగుల స్థితిగతులు, ఆర్ధిక పరమైన అంశాలు, పరిశ్రమల స్థాపన, సామాజిక, విద్యా,వైద్య రంగాల్లోపెట్టుబడులు, సంస్కరణల అమలు వంటి పలు అంశాల పై ఇరువురూ చర్చించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించాలని కేసీఆర్‌ యూఏఈ  ప్రతినిధుల్ని కోరారు. అయితే తాము మరోసారి వస్తామని,, అప్పుడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. హైదరాబాద్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలను సాధ్యమైనంత త్వరగా సమకూర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషిని కేసీఆర్‌ ఆదేశించారు. 

 

08:13 - June 29, 2018

హైదరాబాద్ : ప్రపంచ స్థాయికి ధీటైన పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, అద్భుతమైన పుణ్యక్షేత్రాలు తెలంగాణలో కొలువై ఉన్నాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. సమైక్య పాలనలో అవి ఆదరణకు నోచుకోలేదన్నారు. కామారెడ్డిలో ఉన్న అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువుకట్టను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సీఎం  అన్నారు. చెరువు కింద అయకట్టు పెంపు, ప్రజలకు సౌకర్యవంతమైన పద్ధతిలో ట్యాంక్ బండ్ సుందరీకరణపై కామారెడ్డి ప్రజాప్రతినిధులు, కలెక్టర్, సంబంధిత అధికారులతో  ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్య,వైద్య,పర్యాటక రంగాభివృద్ధికి కృషి చేస్తామని..తెలంగాణలో ఉమ్మడి పాలనలో విస్మరించబడిన పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయిలో వెలుగులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
 

 

నేడు గద్వాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

గద్వాల : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. గట్ట మండలంలోని పెంచికలపాడు దగ్గర గట్టు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు.  33వేల ఎకరాల భూమిని సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది.

08:06 - June 29, 2018

గద్వాల : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. గట్ట మండలంలోని పెంచికలపాడు దగ్గర గట్టు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు.  33వేల ఎకరాల భూమిని సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది.
కరువు, వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరు
ఉమ్మడి పాలమూరు అనగానే కరువుకు, వలసల జిల్లాకు కేరాఫ్‌ అడ్రస్‌గా చరిత్రకెక్కింది. జిల్లాలోని పేదలు ఉపాధిలేక,  జీవనం సాగించేందుకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. అంతేకాదు... పాలమూరు జిల్లా ఎప్పుడూ కరువు పీడిత జిల్లాగానే పిలవబడుతోంది. సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడు అక్కడి ప్రజల బాధలన్నీ తెలుసుకున్నారు. వలసలను నివారించాలని అప్పుడే లక్ష్యం నిర్దేశించుకున్నారు.
తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం
పాలమూరులో వలసలను నివారించేందుకు  తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు.  రైతుల వెతలు తీర్చేందుకు జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు, దరూర్‌, కెటి దొడ్డి మండలాల్లోని 33 వేల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేసేందుకు గట్టు ఎత్తిపోతల పథకానికి సరికొత్తగా రూపకల్పన చేశారు.  553.98 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. దీనికి కేసీఆర్‌ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.
కేసీఆర్‌ పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి 
కేసీఆర్‌ పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పాలమూరు ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు. దాదాపు 50 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు.  లక్షా 60వేల మందిని సమీకరించేలా లక్ష్యం పెట్టుకున్నారు.  జిల్లా కేంద్రంతోపాటు అంతటా గులాబీ జెండాలతో నింపివేశారు. మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఇతర టీఆర్‌ఎస్‌ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.  

నేడు సీఎం రమేష్ దీక్షకు మంత్రి లోకేష్ సంఘీభావం

కడప : నేడు సీఎం రమేష్ దీక్షకు మంత్రి లోకేష్ సంఘీభావం తెలపనున్నారు. ఈ సందర్భంగా మంత్రి దీక్షను ఉద్ధేశించి మాట్లాడనున్నారు. 

 

Don't Miss