Activities calendar

30 June 2018

21:32 - June 30, 2018

జులై 2 'వంచనపై గర్జన దీక్ష' - వైసీపీ...

విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా వైసీపీ జూలై 2న వంచనపై గర్జన దీక్షను నిర్వహించనున్నట్లు అనంత వెంకటరామిరెడ్డి వెల్లడించారు.

వర్షంతో జమ్మూ అతాలకుతలం...

ఢిల్లీ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జమ్మూకశ్మీర్ అతలాకుతలవుతోంది. వరద ఉధృతి అంతకంతకూ తీవ్రమవుతుండటంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.

ఆకాశ్ అంబానీ...శ్లోకా మెహతా ఎంగేజ్ మెంట్...

ముంబై : ముఖేష్ అంబానీ, నీతా అంబానీల తనయుడు ఆకాశ్ అంబానీ నిశ్చితార్థం డైమండ్ కింగ్‌ రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాతో శనివారం ఘనంగా జరిగింది. ముంబైలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. 

గనుల శాఖపై కేటీఆర్ సమీక్ష...

హైదరాబాద్ : గనుల శాఖపై మంత్రి కేటీఆర్ శనివారం సమీక్ష చేపట్టారు. క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన ఈ భేటీకి గనులు, భూగర్భశాఖ విభాగపు అధికారులు పాల్గొన్నారు. 

గోమాత సంరక్షణ కోసం పాదయాత్ర...

ఆదిలాబాద్ : గోమాత సంరక్షణ కోసం దేశ వ్యాప్తంగా పాదయాత్ర చేపడుతున్న మహమ్మద్‌ ఫయాజ్‌ ఖాన్‌కు అదిలాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. పట్టణ శివారులో ఉన్న చౌడేశ్వరీ మాత ఆలయంలో ఫయాజ్‌ ఖాన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

21:21 - June 30, 2018
21:17 - June 30, 2018

కృష్ణా : గదిలోకి పిలిచారు. మత్తుపదార్థం కలిపిన కూల్‌ డ్రింక్‌ను ఆమెతో తాగించి, ఆత్యాచారం చేశారు. ఈ తతంగాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వేధించారు. విషయం బయటకి చెబితే వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించారు. జరిగిన అఘాయిత్యాన్ని బయటకు చెప్పుకోలేక ఏడాదికిపైగా మానసిక క్షోభ అనుభవించిదో యువతి. మానవ మృగాల బ్లాక్‌మెయిలింగ్‌ భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కృష్ణా జిల్లా ఆగిరిపల్లికి చెందిన ఓ యువతి స్థానిక ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. విజయవాడకు చెందిన వంశీకృష్ణ, సీనియర్‌ విద్యార్థి శివారెడ్డిలతో పరిచయం ఏర్పడింది. వారిద్దరినీ స్నేహితులుగానే భావించింది. అయితే వారిలోని దుర్భుద్దిని అర్థం చేసుకోలేకపోయింది. ఆగిరిపల్లిలో రూమ్‌ అద్దెకు తీసుకుని ఉంటున్న వంశీకృష్ణ, శివారెడ్డి.. స్నేహం ముసుగులో ఆమెను నమ్మించి, బర్త్‌డే పార్టీ ఉందంటూ ఆమెను తమ గదికి పిలిచారు. మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్‌ను తాగించి ఆత్యాచారానికి పాల్పడారు. ఈ తతంగాన్నంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. విషయం బయటకు చెబితే వీడియోను సోషల్‌ వీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఆ యువతి మౌనంగా ఉండిపోయింది. ఏడాది కాలం క్షోభను అనుభవించింది.

అయినా వారు ఊరుకోలేదు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. నిందితుల ముఖాలు కనిపించకుండా వీడియోను బ్లర్‌ చేసి తమ స్నేహితులకు షేర్‌ చేశారు. దీంతో బొద్దనపల్లికి చెందిన దొడ్ల ప్రవీణ్‌... బాధితురాలికి ఫోన్‌ చేసి, పది లక్షలు ఇవ్వాలని.. లేదంటే వీడియోనే బయట పెడతానని బెదిరించాడు. కొద్ది కాలం ప్రవీణ్‌ వేధింపులు భరించిన బాధితురాలు.. చివరకు తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

అయితే ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం దృషికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కళాశాల యాజమాన్యం స్పందించి, నిందితులతో బాధితురాలి కుటుంబానికి క్షమాపణ చెప్పించింది. అమ్మాయి జోలికి వెళ్లబోమని లిఖితపూర్వక హామీ కూడా తీసుకుంది. ఆ వీడియోను డిలిట్‌ చేయించింది.

వీడియో డిలీట్ చేయడంతో సమస్య తీరిపోయిందనుకుని కుమార్తెకు పెళ్లి చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు బాధితురాలి తల్లిదండ్రులు. కానీ డిలీట్‌ చేసినట్లు కనిపించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వాటిని చూసి నివ్వెరపోయిన బాధితురాలి తండ్రి ఆగిరిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

21:13 - June 30, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ప్రజలెవరూ సంతోషంగా లేరని, ప్రజాస్వామ్య హక్కులను కేసీఆర్‌ కాలరాస్తున్నారని బీఎల్ఎఫ్ నేతలు ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌లు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఉదృతం చేస్తామన్నారు. సర్వేలో తమ దృష్టికి వచ్చిన సమస్యలపై స్థానికంగా పోరాడతామన్నారు. ఎన్నికల విధానంలో సంస్కరణలు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసిన నేతలు, బహుజనుల ప్రభుత్వం కోసం ఓటు పాత్రపై చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ సమీక్షా సమావేశం హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. బీఎల్ఎఫ్ ఛైర్మన్‌ నల్లా సూర్యప్రకాశ్‌, కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం సమావేశానికి హాజరైన పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గ కన్వీనర్లకు దిశా నిర్దేశం చేశారు. గత నెల రోజుల కార్యక్రమాలను సమీక్షించి, రాబోయే కాలంలో నిర్వహించే పోరాట కార్యక్రమాలపై చర్చించారు. గతనెల 27వ తేదీన నిర్వహించిన చలో కలెక్టరేట్ కార్యక్రమానికి ప్రభుత్వ నిర్భందాన్ని సైతం ఎదిరించి వచ్చిన ప్రజలకు నేతలు ధన్యవాదాలు తెలిపారు. కేసిఆర్ పాలన పట్ల ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహానికి, నిరసనకు మహాధర్నాలు అద్దంపట్టాయన్నారు.

జూలై, ఆగస్టు నెలల్లో టీమాస్‌తో కలిసి ఎన్నికల సంస్కరణలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామని BLF ఛైర్మన్‌ సూర్యప్రకాశ్‌ అన్నారు. బహుజన ప్రభుత్వ ఏర్పాటుకు ఓటు ఎంత కీలకమో అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సమావేశం తీర్మానించిందన్నారు. అన్ని స్థాయిల్లోకి ఎన్నికల సంస్కరణలు, బహుజన ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్లాలని సమావేశం నిర్ణయం తీసుకుందని.. స్థానిక సమస్యలపై ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాటాలను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషిచేస్తామని నేతలన్నారు.

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడ్డ తర్వాత జరిగిన తొలి ఆందోళనా కార్యక్రమం నేతల అంచనాలను మించి సక్సెస్ కావడంతో ఫ్రంట్ లీడర్స్ లో కొత్త జోష్ నింపింది. దాని కొనసాగింపుగా మరింత దూకుడుగా వెళ్లేందుకు ప్రతీ గ్రామంలో బీఎల్ఎఫ్ కమిటీని ఏర్పాటు చేసే లక్ష్యంతో ముందుకు వెళ్లడానికి నిర్ణయించారు. ఇందుకోసం కొందరు కీలక వ్యక్తులను, సంస్థలను ఫ్రంట్ లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

21:10 - June 30, 2018

హైదరాబాద్ : ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై GHMC అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీస్, టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్, సిబ్బందితో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. అధునాతన యంత్రాలతో పుట్‌పాత్‌లపై ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గేది లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్ విశ్వజిత్‌ చెబుతుంటే.. మరోవైపు తమకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం అన్యాయమని చిరువ్యాపారులు అంటున్నారు. మరికొన్ని చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాల దురుసుతనం విమర్శలకు తావిస్తోంది.

హైదరాబాద్‌ నగర పరిధిలోని పాదచారుల బాటల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కన్నెర్ర చేస్తోంది. పుట్‌పాత్‌లపై ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు అధికారులు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న పాదచారుల బాటలు ఆక్రమించి దుకాణాలు పెట్టడంతో.. చాలా ప్రాంతాల్లో పాదచారుల బాటే కనుమరుగైంది. దీనిపై చాలా సార్లు ఉన్నత న్యాయ స్థానం కూడా తీవ్రంగా స్పందించింది. దీంతో పాదచారులకు ఇబ్బందులు తొలగించేందుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్‌లో సుమారు పదివేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. వాటిలో అతికొద్ది రహదారులకు మాత్రమే పాదచారుల బాట ఉంది. అది కూడా దుకాణదారులు, చిరువ్యాపారుల ఆక్రమణలో ఉంది. దీంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సిన దుస్థితి నెలకొంటోంది. కాగా గత కొంతకాలంగా పాదచారుల బాట ఆక్రమణలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందిస్తోంది. ఏమాత్రం ఉపేక్షించకుండా ఆక్రమణల్ని తొలగించి పాదచారుల హక్కుల్ని కాపాడాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. కోర్టు ఆదేశించిన ప్రతిసారీ బల్దియా యంత్రాంగం కూల్చివేతలకు దిగడం, రాజకీయ నేతల రంగప్రవేశంతో వెనకడుగు వేయడం పరిపాటిగా మారింది.

ఆక్రమణల్ని తొలగించే బాధ్యతను ఇటీవల ఏర్పడిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటికి అప్పగించింది జీహెచ్‌ఎంసీ. పాదచారుల బాటలు క్లియర్‌ చేసేందుకు... సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపారు. 120 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 127.5 కిలో మీటర్ల పొడవున ఆక్రమణలను గుర్తించిన అధికారులు.. మొదటి దశలో 4,133 నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. ప్రకటనల బోర్డులతోపాటు.. మెట్లు, ప్రహరీ గోడలను కూల్చివేస్తున్నారు. అధికారులు వచ్చేదాకా ఆగకుండా.. స్వతహాగా ఆక్రమణలు తొలగిస్తే మంచిదని సూచిస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళూ పనిచేయవని విశ్వజిత్‌ స్పష్టం చేశారు.

గ్రేటర్‌ పరిధిలోని స్ర్టీట్‌ వెండర్లకు ఇబ్బందులు రాకుండా.. కేవలం పూర్తిస్థాయిలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిపైనే చర్యలు తీసుకుంటామని GHMC కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చిరువ్యాపారులతో దురుసుగా ప్రవర్తించారు. మలక్‌పేట, బోరబండ ప్రాంతాల్లోని స్ర్టీట్‌ వెండర్స్‌పై తమ ప్రతాపం చూపించారు. నిస్సహాయులైన చిరువ్యాపారులు కన్నీరు పెట్టుకున్నారు. కొన్ని చోట్ల అధికారులపై నిరసన వ్యక్తం చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు. ఉన్నపళంగా దుకాణాలు కూల్చేస్తే.. తమ బతుకులు ఏంకావాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు చిరువ్యాపారులు.

అధికారులు చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టినట్లు తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి. వ్యాపారులను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు వారికి గుర్తింపు కార్డులు ఇచ్చామన్నారు. వెండింగ్‌ జోన్స్‌ ఫిక్స్‌ చేశాక వ్యాపారులందరినీ అక్కడికి తరలిస్తామని చెప్పారు. ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గకుండా తమ పని తాము చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతుంటే.. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం అన్యాయమని చిరువ్యాపారులు అంటున్నారు. 

21:06 - June 30, 2018

విజయవాడ : ఇటీవల కాలంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, ఆకతాయిల వేధింపులు, దాడులు పెరిగిపోయాయి. ఆకతాయిల వేధింపులతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఏపీ సర్కార్‌ ఒక అడుగు ముందుకు వేసింది. రాష్ట్రంలోనే మెదటి సారిగా గుంటూరు రూరల్‌లో సబల అనే ప్రత్యేక మహిళా పోలీసు విభాగాన్ని ప్రారంభించారు.

ఆడపిల్లలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి గుంటూరు రూరల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు రూరల్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు ఆలోచనలకు అణుగుణంగా సబల అనే మహిళా విభాగాన్ని రూపొందించారు. ఆడపిల్లలకు మేమున్నామంటూ భరోసా కల్పించడానికి సబల షీ టీమ్స్‌కు శ్రీకారం చూట్టినట్లు రూరల్‌ ఎస్పీ అప్పలనాయుడు తెలిపారు.

ఆకతాయిల వేధింపులనుంచి మహిళలను రక్షించడానికి సబల అనే మహిళా విభాగాన్ని ప్రారంభించామని రేంజ్‌ ఐజి గోపాలరావు తెలిపారు. తెలంగాణలో ఉన్న షీ టీమ్‌ మాదిరిగా సబల మహిళా విభాగం పనిచేస్తోందన్నారు. సబల టీమ్‌లో నూతనంగా 130 మంది మహిళా కానిస్టేబుళ్లును ఎంపిక చేశామన్నారు. వీరికి ప్రత్యేక డ్రస్‌ కోడ్‌ను ఉంటుందన్నారు. మహిళలు, బాలికలకు ఎటువంటి సమస్య ఎదురైనా 94409 00866 అనే వాట్సప్‌ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే సబల టీం వారి సమస్యను పరిష్కరిస్తుందని రేంజ్‌ ఐజీ గోపాలరావు అన్నారు.

సబల విభాగం అధునిక సాంకేతికత పరిజ్ఞానంతో పాటు ప్రత్యేకమైన శిక్షణను పొంది... పలు ప్రాంతాల్లో సైకిళ్లపై పర్యటిస్తోంది. విద్యార్థులతో, మహిళలతో మాట్లాడి వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తారని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. సబల కార్యక్రమానికి సంబంధించిన లోగోను, సైకిళ్లను మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, రూరల్‌ ఎస్పీ సతీమణి కిరణ్మయినాయుడు ప్రారంభించారు.

21:04 - June 30, 2018

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకూ వర్తింపజేయాలనడం అర్థరహితమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. రైతుబంధు పథకం అమలు తీరు, చెక్కుల పంపిణీలో పురోగతిపై కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కౌలు రైతులకు రైతుబంధు పథకం అమలు చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై సీఎం కేసీఆర్‌ స్పందించారు. కౌలు రైతులు ఎవరన్నది ఎవరూ చెప్పలేరని అందుకే వారికి పంట పెట్టుబడి పథకాన్ని అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా కౌలు రైతుల వివరాలు కూడా నమోదు కాలేదన్నారు. ఏ హక్కు, ఆధారం లేనివారికి ప్రభుత్వ సాయం ఎలా అందిస్తాం అని ప్రశ్నించారు. భూమి పట్టాలున్న ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందిస్తామని స్పష్టంచేశారు. ఈ పథకం అమలు కోసం బడ్జెట్‌లో రూ.12వేల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. కౌలు రైతుల పేరిట అసలు రైతుకు అన్యాయం చేయాలని చూడటం మంచిది కాదన్నారు.

21:02 - June 30, 2018

కడప : కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మేరకు కడపలో ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్‌ దీక్షను చంద్రబాబు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. సీఎం రమేశ్‌, బీటెక్‌ రవిల దీక్ష జిల్లాకే పరిమితం కాలేదని....కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఇదే సంకల్పంతో ముందుకు సాగుదామన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆమరణ దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ దీక్ష విరమించారు. సీఎం రమేశ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.... రమేశ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవిలు జూన్‌ 19న ఆమరణ దీక్ష చేపట్టారు. ఏడు రోజులు దీక్ష అనంతరం బీటెక్‌ రవి ఆరోగ్యం క్షీణించగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 11 రోజులు దీక్ష అనంతరం రమేశ్‌, రవిల దీక్షను సీఎం చంద్రబాబు విరమింపజేశారు.

ఆమరణ దీక్షతో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి చాలా వరకు దెబ్బతినే పరిస్థితి వచ్చిందన్నారు సీఎం. పవిత్రమైన భావం, చిత్తశుద్ధితో రమేశ్‌ దీక్ష చేశారన్నారు. దీక్షలపై ప్రతిపక్ష నేతలు అనవసర విమర్శలు మానుకోవాలని చంద్రబాబు సూచించారు. విభజన చట్టం ప్రకారం ఆరు నెలల్లో పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉందని... ఏపీకి అన్యాయం చేస్తే వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు.

రెండు నెలల్లోపు ఉక్కు పరిశ్రమపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే సగం ఖర్చు భరిస్తామన్నారు. కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏదేమైనా ఓ కమిటీ వేస్తామని.. పార్లమెంట్‌లో పోరాడతామని చంద్రబాబు అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పి తీరుతామని.....ప్రజలు అధైర్యపడవద్దని సూచించారు. వ్యక్తిగత ప్రయోజనం కోసం దీక్ష చేయలేదన్నారు ఎంపీ సీఎం రమేశ్‌. చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకే దీక్ష విరమించామని స్పష్టం చేశారు. తన దీక్షకు సహకరించిన వారందరికీ సీఎం రమేష్‌ ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ సీఎం రమేశ్, బీటెక్‌ రవిలు దీక్ష విరమించి సంఘటితంగా పోరాటానికి సిద్ధమవుతున్నారని సీఎం తెలిపారు. ఉక్కు సంకల్పం కోసం పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోతామన్నారు.

21:00 - June 30, 2018

నెల్లూరు : దళితులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇందుకు దళితులు ప్రభుత్వానికి సహకారంగా ఉండాలని కోరారు. నెల్లూరు జిల్లాలో దళిత తేజం-తెలుగుదేశం కార్యక్రమం ముగింపు సభలో పాల్గొన్న చంద్రబాబు.. దళితుల ఐక్యతే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. నెల్లూరు జిల్లాలో దళితతేజం-తెలుగు దేశం ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. దళితుల అభివృద్ధే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దళితుల్లో ఐక్యత వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఎస్సీ కాలనీలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కావాలని గతంలోనే ఆదేశాలిచ్చామన్నారు సీఎం చంద్రబాబు. దళితుల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో 40వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు.

ప్రస్తుతం దేశంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళితులపై దాడుల నిరోదానికి కేంద్రం కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. దళితుల ఐక్యతే టీడీపీ ప్రభుత్వం లక్ష్యమని చంద్రబాబు అన్నారు. దళితులకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు సీఎం. ఆర్థిక అసమానతలు తగ్గేవిధంగా ముందుకు సాగాలన్నారు. దళిత తేజం-తెలుగుదేశం ముగింపు కార్యక్రమం సందర్భంగా దళితులపై సీఎం వరాల జల్లు కురిపించారు. 250 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్క దళిత కుటుంబానికీ ఇంటి జాగా ఇప్పించే బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. సాధికార మిత్ర లాగే దళిత మిత్ర కార్యక్రమం పెట్టి దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు సీఎం. దళితులందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వానికి సహకరించాలని చంద్రబాబు కోరారు.  

20:51 - June 30, 2018

గౌతంసవాంగ్ ను కలిసిన ఠాకూర్...

విజయవాడ : నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆర్పీ ఠాకూర్ విజయవాడ నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ను కలిశారు. ఆయన కార్యాలయానికి వెళ్లిన ఠాకూర్ అరగంట సేపు భేటీ అయ్యారు. 

ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఛార్జీల సవరణ...

విజయవాడ : ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఛార్జీలను సవరించారు. ఆర్టీసీ పల్లె వెలుగు కనీస ఛార్జీ రూ. 6 నుండది రూ. 5కి తగ్గించారు. పల్లె వెలుగు రూ. 8 ఛార్జీని రూ. 10కి పెంపు...రూ. 11 టికెట్ ధరను రూ. 10కి తగ్గింపు...రూ. 13 టికెట్ రూ. 15కి పెంపు...రూ. 16 ఛార్జీని రూ. 15కి తగ్గింపు...రూ. 18 టికెట్ ధరను రూ. 20కి పెంచారు. చిల్లర సమస్యను అధిగించేందుకు అని అధికారులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

ముమ్మిడిరంలో జగన్ బహిరంగసభ...

తూర్పుగోదావరి : ముమ్మిడివరంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ బహిరంగసభ నిర్వహించారు. ముమ్మిడివరంలో ఇసుక దోపిడి జరుగుతోందని జగన్ పేర్కొన్నారు. అడ్డుకున్న వారిపై కేసులు పెడుతున్నారని, గోదావరి ప్రవహిస్తున్నా తాగడానికి నీళ్లు ఉండవన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని 40 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందన్నారు. 

20:16 - June 30, 2018

కృష్ణా : అత్యంత విషాదకరం..తండ్రి చేతిలో కూతురు హత్యకు గురైంది..కేవలం ఫోన్ లో మాట్లాడుతుండడం..ఎవరినో ప్రేమిస్తుందని అనుమానించిన ఆ కసాయి తండ్రి కన్నుకూతుని హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన తోటరావులపాడు గ్రామంలో చోటు చేసుకుంది. ప్రైవేటు కళాశాలలో చంద్రిక బీ ఫార్మసీ చదువుతోంది. తరచూ ఫోన్ లో మాట్లాడుతుండడం తండ్రి గమనించినట్లు సమాచారం. శనివారం చంద్రిక ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుండడం గమనించాడు. క్షణికావేశంలో గొడ్డలి కర్రతో చంద్రిక తలపై విపరీతంగా కొట్టాడు. తీవ్ర రక్తపు మడుగులో చంద్రిక కుప్పకూలిపోయింది. శుక్రవారం పుట్టిన రోజు జరుపుకున్న చంద్రిక తండ్రి చేతిలో హతమైంది. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అసలు ఫోన్ లో ఎవరితో మాట్లాడిందో కనుక్కొంటే ఇంత దారుణం చోటు చేసుకొనేది కాదని కుటుంబసభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

20:14 - June 30, 2018

మంత్రి లక్ష్మారెడ్డిని కలిసిన వైద్యులు...

హైదరాబాద్ : మంత్రి లక్ష్మారెడ్డిని ప్రభుత్వ డెంటల్ కాలేజీలో నియమితులైన 20మంది వైద్యులు కలిశారు. ప్రభుత్వ వైద్యులుగా పనిచేయడం అదృష్టమని, డాక్టర్లుగా సేవలందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. 

కృష్ణాలో పరువు హత్య...

కృష్ణా : జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమలో పడిందని తట్టుకోలేని ఓ తండ్రి కన్నకూతరిని హత్య చేశాడు. ఈ ఘటన తోటరావులపాడు గ్రామంలో చోటు చేసుకుంది. 

భర్త మృతి..తట్టుకోలేక భార్య మృతి...

విశాఖపట్టణం : పరవాడ మండలం లంకెలపాలెంలో విషాదం చోటు చేసుకుంది. భర్త మరణవార్తను తట్టుకోలేక భార్య భాగ్యలక్ష్మీ మృతి చెందింది. 

19:36 - June 30, 2018
19:05 - June 30, 2018

ఆగిరిపల్లి అత్యాచార నిందితుల అరెస్టు...

కృష్ణా : ఆగిరిపల్లి అత్యాచార నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్ఆర్ఐ ఇంజినీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థినిపై ముగ్గురు సీనియర్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. 

రైతు బంధు పథకంపై కేసీఆర్ సమీక్ష...

హైదరాబాద్ : రైతులు ఒక్కో పంట కాలానికి ఒక్కొక్కరికి తమ భూమిని కౌలుకు ఇస్తారని..ఒకే ఏడాది ఇద్దరు ముగ్గురికి కూడా కౌలుకు ఇస్తారని..అలాంటప్పుడు ప్రభుత్వం కౌలుదారును ఎలా గుర్తిస్తుందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. అలాంటప్పుడు ప్రభుత్వానికి కౌలు రైతును గుర్తించడం ఎలా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 

హైదరాబాద్ కు దేవగౌడ..కేసీఆర్ తో భేటీ...

హైదరాబాద్ : మాజీ ప్రదాని దేవెగౌడ హైదరాబాద్ కు రానున్నారు. బేగంపేట విమానాశ్రయంలో దేవెగౌడకు మంత్రి తలసాని, అధికారులు స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో దేవెగౌడ సమావేశమవుతారు.

18:23 - June 30, 2018

నెల్లూరు : వచ్చే ఎన్నికల్లో 25 సీట్లు గెలిపిస్తే టిడిపి ప్రత్యేక హోదా తేవడమే గాకుండా ఏపీని మరింత అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం దళిత తేజం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దళితులకు అండగా టిడిపి ఉంటుందని, దళితుల చైతన్యం కోసమే ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దళితుల్లో సమర్థవంతమైన నాయకత్వం రావాలని పిలుపునిచ్చారు. దళితులకు ముందడుగు కార్యక్రమం తాను పెట్టడం జరిగిందని,

అమరావతిలో దళిత పార్లమెంట్ పెట్టి ఒక స్పూర్తిని నింపేందుకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దళిత మిత్ర త్వరలో తీసుకొస్తామని, దళితులు ఇళ్లు కట్టుకొనే వారికి ప్రభుత్వం రూ. 2లక్షలు ఇచ్చేందుకు కృషి చేస్తామని...75 యూనిట్ల నుండి 100 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామన్నారు. రూ. 250 కోట్లతో దళితుల ఇళ్ల జాగాల కోసం ఖర్చు చేస్తామన్నారు. చెప్పులు కుట్టుకొనే వారికి నెలకు రూ. 1000 ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దళితులందరూ టిడిపి వైపు వెళ్లారని..ఇతర పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. దళితులను టిడిపి పార్టీ గుండెల్లో పెట్టుకుని చూస్తుందన్నారు. 

25 సీట్లు గెలిపించండి..హోదా తెస్తాం - బాబు..

నెల్లూరు : వచ్చే ఎన్నికల్లో వచ్చే 25 సీట్లు గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని...అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దళితులను టిడిపి పార్టీ గుండెల్లో పెట్టుకుని చూస్తుందన్నారు. 

ఏలూరులో భారీ వర్షం...

పశ్చిమగోదావరి : ఏలూరులో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లు జలమయమయ్యాయి. ఇండర్ స్టేడియం వద్ద చెట్టు విరిగిపడిపోయింది. జులై 3న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇండోర్ స్టేడియం ఏర్పాట్లకు అంతరాయం కలిగింది. 

దళితుల కోసం రూ. 40వేల కోట్ల ఖర్చు - లోకేష్...

నెల్లూరు : దళితులను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ దని, దళిత మహిళను శాసనసభ స్పీకర్ గా చేసిన ఘనత చంద్రబాబుదని మంత్రి లోకేష్ తెలిపారు. నాలుగేళ్లలో రూ. 40వేల కోట్లు దళితుల కోసం ఖర్చు చేయడం జరిగిందన్నారు. పంచాయతీల అభివృద్ధి తమ హాయాంలోనే జరిగిందని ఇందుకు సంతోషంగా ఉందన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా జగన్..పవన్ పాదయాత్రలు చేయాలని హితవు పలికారు.

 

 

నెల్లూరులో దళిత తేజ సభ...

నెల్లూరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దళిత తేజ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం దళితులకు అండగా ఉంటుందని...వారి సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. 

17:27 - June 30, 2018

కేటీఆర్ నోరు జారావో..నీ సంగతి చూస్తా : వీహెచ్

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్రంగా మండిపడ్డారు. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీపై మరోసారి నోరు జారితే తాను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంగతి చూస్తానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు హెచ్చరించారు. 'తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అమ్మా కాదు, బొమ్మా కాదు' అని కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన వీహెచ్‌ తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... తాను కేటీఆర్‌ ఇంటికే వెళతానని, తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమని, ఖబడ్దార్ అని అన్నారు.

రాష్ట్రంలో రౌడీయిజం లేకుండా చేస్తా : డీజీపీ ఠాకూర్

విజయవాడ : ఈరోజు ఏపీ డీజీపీ పూనం మాలకొండయ్య పదవీ విరమణ చేశారు. అనంతరం ఏపీ డీజీపీగా ఆర్పీ ఠాకూర్ ను నియమితులయ్యారు. అనంతరం ఠాకూర్ మాట్లాడుతు..డీజీపీగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ఏపీ కొత్త డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రుల ఆశీస్సులతో డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టానని అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి కృషి చేస్తానని, రాష్ట్రంలో రౌడీయిజం లేకుండా చేస్తానని ఠాకూర్ అన్నారు.

17:20 - June 30, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ నేత సోనియాగాంధీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టి.కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీని అమ్మనా..బొమ్మనా..అంటవా ? దొరల పాలన అనుకుంటున్నవా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మహిళా సంఘం నేతలు గాంధీ భవన్ ఎదుట కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 

రైతుబంధు పథకంపై క్లారిటీ ఇచ్చిన కేసీఆర్..

హైదరాబాద్ : రైతుబంధు పథకంపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. రైతుబంధు పథకం కేవలం రైతుల కోసమే కానీ కౌలు రైతుల కోసం కాదని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కౌలు రైతులకు రైతుబంధు పథకం వర్తించదని కేసీఆర్ స్పష్టం చేశారు. కౌలు రైతులకు రైతుబంధు పథకం వర్తించాలని డిమాండ్ చేయటం అర్థరహితమన్నారు. 

ఉభయ కమ్యూనిస్టులు జనసేనతోనే : రామకృష్ణ

విజయవాడ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులకు ఇది శ్రీకారం చుడుతుందన్నారు. సెప్టెంబర్‌ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మూడు అంశాల్లో తాము కలిసి పోరాడతామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు జరగడం లేదని, ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగడం లేదన్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో విషయంలో చంద్రబాబు విఫలం చెందారన్నారు.

17:09 - June 30, 2018

హైదరాబాద్ : పాలించడం చేతకాకనే ముందస్తు ఎన్నికలు అంటూ మాట్లాడుతున్నారని టీజేఎస్ వ్యవస్థాకుడు కోదండరాం పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే సంకేతాలపై టీజేఎస్ అభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. అందులో భాగంగా కోదండరాంతో మాట్లాడింది. పాలించడం చేతకాక సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలకు టీజేఎస్ ఎప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు. రైతు బంధు పథకంతో నిజమైన లబ్దిదారుడికి న్యాయం జరగడం లేదని, టీజేఎస్ క్షేత్ర స్థాయిలో నిజాలు బహిర్గతమయ్యాయని తెలిపారు. 

16:36 - June 30, 2018

పశ్చిమగోదావరి : నకిలీ పత్రాలతో పేదల భూములు కాజేయాలని చూస్తే సహించేది లేదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. జంగారెడ్డి గూడెం మండలంలోని పంగిడిగూడెంలో ల్యాండ్ సీలింగ్ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన పోరాటం చేస్తున్న 15 రోజులుగా సీపీఎం కార్యకర్తలకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం పంగడిగూడెంకు నేతలు, మధు చేరుకుని గతంలో పేదలకు పంచిన భూముల్లో నాగలితో దున్నారు. అర్హులైన పేదలకు సీలింగ్ భూములిచ్చేంతవరకు పోరాటం చేస్తామని, జంగారెడ్డి గూడెంలో బహిరంగసభ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మధు ప్రకటించారు. 

16:35 - June 30, 2018

 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీఎం సొంత డబ్బా కొట్టుకుంటున్నారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. వారి పాలనలో బంగారు తెలంగాణ ఏర్పడలేదని, ప్రస్తుతం దేశ, రాష్ట్ర రాజకీయాలు రొచ్చుగా మారాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అవినీతి..డబ్బు...పదవీ కాంక్షలు ఎక్కువ అయ్యాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు విలువ లేకుండా పోయిందని, ఎన్నికలు అనగానే డబ్బుగా మారాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. 543 మంది పార్లమెంట్ సభ్యుల్లో 90 శాతానికి పైగా శతకోటీశ్వరులున్నారని వెల్లడించారు. ఎన్నికులు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ఎంత ఖర్చు చేయాలనే దానిపై యోచిస్తున్నారని విమర్శించారు. 

 

గట్టు పథకానికి విత్తనం వేసింది కాంగ్రెస్సే : డీకే అరుణ

మహబూబ్ నగర్ : గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపనసభలో సీఎం కేసీఆర్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ. గట్టు ఎత్తిపోతల పథకానికి విత్తనం వేసింది తానేనని డీకే అరుణ అన్నారు. వేలంపాడు ప్రాజెక్ట్‌కు కూడా కాంగ్రెస్‌ హయాంలోనే శంకుస్థాపన జరిగిందన్నారు. ప్రాజెక్టులపై కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని డీకే అరుణ విమర్శించారు.

కడప ఉక్కు కోసం వైసీపీ ఎంపీలు పోరాడారా? : లోకేశ్

కడప : ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు కొన్ని హామీలిచ్చారని, అందులో ఉక్కు కర్మాగారం కూడా ఉందని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేస్తోన్న ఎంపీ సీఎం రమేష్‌ ఈరోజు తన దీక్షను విరమించిన విషయం తెలిసిందే. అంతకు ముందు మంత్రి నారా లోకేశ్‌ ఆయనను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైసీపీ ఎంపీలు ఏనాడైనా ఉక్కు పరిశ్రమ కోసం పోరాడారా? అని ప్రశ్నించారు.

ఫార్మా కంపెనీలకు తెలంగాణలో ఆదరణ: కేటీఆర్

హైదరాబాద్ : ఫార్మాకంపెనీలకు తెలంగాణలో మంచి ఆదరణ ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌లో ఫెర్రింగ్‌ ల్యాబరేటరీకి భూమిపూజ చేసిన కేటీఆర్‌.. హైదరాబాద్‌లోని జినాన్‌వాలీ ఆసియాలోనే పెద్ద ఫార్మా కంపెనీలలో ఒకటని తెలిపారు. 200లకు పైగా ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. వీటితో పాటుగా ఇప్పుడు ఫెరింగ్‌ ఫార్మా కంపెనీ చేరిందన్నారు. ఫార్మాకంపెనీల ద్వారా ప్రత్యేక్షంగా రెండు లక్షలమంది ఉద్యోగాలు పొందారని,.. పరోక్షంగా 4 లక్షల మంది ఉపాధి లబిస్తుందన్నారు. వచ్చే 10 సంవత్సరాలలో ఈ సంఖ్య రెంట్టింపు అయ్యే అవకాశం వుందన్నారు కేటీఆర్‌. 

దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీలో పోరాడండి : లోకేశ్

కడప : ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేస్తోన్న ఎంపీ సీఎం రమేష్‌ ను మంత్రి లోకేశ్ పరామర్శించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతు..ఉక్కు కర్మాగారం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కానీ ఏనాడూ కేంద్రాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీని నిలదీయడం లేదని, వారు చేయాల్సిన పోరాటాలు ఇక్కడ కాదని.. దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీలో చేయండని లోకేశ్‌ సవాలు విసిరారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలకు స్క్రిప్టు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రాసిస్తున్నారని అన్నారు.

దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీలో పోరాడండి : లోకేశ్

కడప : ఉక్కు కర్మాగారం కోసం దీక్ష చేస్తోన్న ఎంపీ సీఎం రమేష్‌ ను మంత్రి లోకేశ్ పరామర్శించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతు..ఉక్కు కర్మాగారం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కానీ ఏనాడూ కేంద్రాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీని నిలదీయడం లేదని, వారు చేయాల్సిన పోరాటాలు ఇక్కడ కాదని.. దమ్ము, ధైర్యం ఉంటే ఢిల్లీలో చేయండని లోకేశ్‌ సవాలు విసిరారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలకు స్క్రిప్టు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రాసిస్తున్నారని అన్నారు.

చంద్రబాబును నమ్మటానికి వీల్లేదు : మోత్కుపల్లి

హైదరాబాద్ : మొసలి కన్నీరు కార్చే మోసగాడు చంద్రబాబునాయుడని ధ్వజమెత్తారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు . బాబు వెయ్యి రూపాయలు పెన్షన్‌ ఇచ్చి వేలకోట్లు రూపాయలు దోచుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును నమ్మటానికి వీల్లేదన్నారు మోత్కుపల్లి. చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ఏ రోజూ చిత్తశుద్ధితో పనిచేయలేదని మండిపడ్డారు.  

ఎన్నికల్లో సంస్కణలు అమలు చేయాలి : బీఎల్ఎఫ్

హైదరాబాద్ : బీఎల్ఎఫ్ రాష్ట్రస్థాయి సమీక్ష నగరంలో కొనసాగుతోంది. ఈ సమీక్షకు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల కన్వీనర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలు, స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడతామని బీఎల్ ఎఫ్ చైర్మన్ నల్లా సూర్య ప్రకాశ్, కన్వీనర్ తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఎన్నికల్లో సంస్కణలు అమలు చేయాలన్నారు. ఓటు ప్రభావంపై ప్రజలకు చైతన్యం కల్పిస్తామన్నారు. బహుజనుల ప్రభుత్వం ఏర్పాడేందుకు ఓటు ప్రాతలపై ప్రచారం చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నాయని వారు ఆరోపించారు. 

2 నెలల్లో కడప ఉక్కు నిర్ణయం తీసుకోవాలి లేదా.. : చంద్రబాబు

కడప : రెండు నెలలలోపు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని..ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజల తరపున కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నానని సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే సగం ఖర్చు రాష్ట్రమే భరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసుకోవాల్సి వుంటుందన్నారు. కేంద్రానికి చేతకాకుంటే రాష్ట్రమే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసిన తీరుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు.

గిడ్డంగులు,ఇరిగేషన్ లో మనమే నంబర్ వన్ : మంత్రి హరీశ్

హైదరాబాద్ : లక్డికపూల్ లోరాష్ట్ర గిడ్డంగులపై మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. నాలుగేళ్లలోనే మన గిడ్డంగుల సామర్థం రెట్టింపుకు చేరిందని హరీశ్ రావు తెలిపారు. గిడ్డంగుల నిల్వలు 2017,18లో దేశంలో తెలంగాణ ప్రథమస్థానంలో వుందని తెలిపారు. రైతుల కోసం పనిచేసే మన ప్రభుత్వంలో ముందుగా ప్రభుత్వం గోడౌన్ లు నిండిన తరువాతనే ప్రయివేటు గిడ్డంగులలో నిల్వ చేయాలని మంత్రి పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖతో నిర్మించిన గిడ్డంగులతో రాష్ట్రానికి అదనపు ఆదాయం లభిస్తోందన్నారు. అలాగే ఇరిగేషన్ నిర్మాణంలో కూడా మనమే నంబర్ వన్ గా వున్నామన్నారు.

ఉపాధ్యాయుల బదిలీలలో అక్రమాలు : కోదండరాం

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతు..ఉపాధ్యాయుల బదిలీల విషయంలో అక్రమాలు జరిగాయని..అధికార పార్టీ నేతలు ఉపాధ్యాయుల బదిలీల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కొందరు మంత్రులు ఉపాధ్యాయుల వద్ద రూ.3 లక్షల వరకు వసూలు చేసి..బదిలీలను నిలిపివేయటం..ఇష్టమైన ప్రాంతాలకు బదిలీలు చేయటంవంటి అక్రమాలకు పాల్పడ్డారని కోదండరామ్ ఆరోపించారు. వెబ్ ఆప్షన్ల అక్రమాలపై విచారణ జరిపి వారిపై తగిన చర్యలుతీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు. వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ అంతా గందరగోళంగా వుందన్నారు. 

'నిఖా హలాల' రద్దు దిశాగా కేంద్రం..

ఢిల్లీ : ముస్లిం సమాజంలో ఉన్న ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని ఆమధ్య సుప్రీంకోర్టు చట్ట విరుద్ధమంటూ తీర్పు చెప్పిన నేపథ్యంలో, ఇప్పుడు ముస్లింలలోనే ఉన్న మరో వివాదాస్పద ఆచారం ‘నిఖా హలాల’ రద్దు దిశగా కేంద్రం పావులు కదుపుతోంది. ఈ ఆచారానికి ఉన్న చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగం కావాలనుకుంటోందన్నది తాజా సమాచారం. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా 'భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్' అనే స్వచ్చంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.

అవినీతి కేసుల నుండి బైటపడేందుకు బీజేపీకి వంత : చంద్రబాబు

కడప : అవినీతి కేసుల్లో ఇరుక్కుని, వాటినుంచి బయటపడేందుకు యత్నిస్తున్న వారు బీజేపీకి వంత పాడుతున్నారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. కడప సీఎం రమేశ్ దీక్ష విరమింపజేసిన చంద్రబాబు అనంతరం మాట్లాడుతు..అవినీతి నాయకుల వల్లనే ఏపీపై కేంద్రానికి చులకన భావం ఏర్పడిందని అన్నారు. నాలుగైదు రోజులు కూడా దీక్ష చేయలేని నేతలు, సీఎం రమేష్ దీక్షపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా వైసీపీ నాటకాలు ఆడుతోందని దుయ్యబట్టారు. కేసుల మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడి, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని అన్నారు.

15:19 - June 30, 2018

హైదరాబాద్ : గ్రామాల వారీగా ఉన్న సమస్యల పరిష్కారించాలంటూ ధర్నాలు చేయడం..ప్రజలను చైతన్యవంతులం చేయడం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రధానంగా ఓటు చైతన్య సభలను నిర్వహిస్తామని, జులై, ఆగస్టు రెండు నెలల పాటు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. మహిళలు...దళితులకు వ్యతిరేకంగా జరుగుతున్న వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని పేర్కొన్నారు. చిన్నారులపై దాడులు జరగడం దారుణమన్నారు. 

కడప ఉక్కు సాధించి తీరతాం : చంద్రబాబు

కడప : కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ అలుపెరుగని పోరాటం చేస్తోందని అన్నారు. ఆరోగ్యం బాగోలేకపోయినా బీటెక్ రవి ఏడు రోజులు నిరాహార దీక్ష చేశారని... 11 రోజులుగా సీఎం రమేష్ దీక్ష చేస్తున్నారని చెప్పారు. సీఎం రమేష్ ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. దీక్ష సంకల్పాన్ని దెబ్బతీసేందుకు విపక్ష పార్టీలు యత్నిస్తున్నాయని... కుట్రలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని విభజన చట్టలో ఉన్నప్పటికీ... కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.

సీఎం రమేశ్ దీక్షను విరమింపజేసిన సీఎం చంద్రబాబు..

కడప : కడప ఉక్కు ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేపట్టిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షను విరమింపజేశారు. నిమ్మరసం ఇచ్చి రమేష్, బీటెక్ రవిల దీక్షలను విరమింపజేశారు. అనంతరం ఇద్దరికీ శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ కోసం దీక్షను చేపట్టిన సీఎం రమేష్, బీటెక్ రవిలను అభినందించారు. మీరు చేపట్టిన దీక్ష యావత్ దేశం దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. మీ దీక్షలు వృథాగా పోవని... కడప ఉక్కు ఫ్యాక్టరీ మీ వల్లే వచ్చిందనే విషయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం మన పోరాటం ఇంతటితో ఆగిపోలేదని...

14:44 - June 30, 2018

కడప : జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం గత 11 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న సీఎం రమేశ్ దీక్షను విరమింప చేశారు. బాబు నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. అనంతరం రమేశ్ మాట్లాడుతూ...'రెండు నెలల కిందటే కొత్తగా ఎంపికయ్యాను. వ్యక్తిగత ప్రయోజనం కోసమే చేయాలని అనుకంటే గతంలో ఇలా చేసి ఉండేవాడిని. జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించే తాను రాజ్యసభలో చట్టం చేశారో చట్టం..అమలు చేయలేకపోతే జిల్లా ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్పాలని బాధేసిందని..అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ దీక్షపై మిత్రులు..కుటుంబసభ్యులు..ఎంతో మంది వ్యతిరేకించారని, ఆరోగ్యం బాగుంటే రాజ్యసభలో కొట్లాడవచ్చు...వద్దని వారించారు. కానీ దీనికి తాను సమ్మతించలేదు. ముఖ్యమంత్రి బాబు, నారా లోకేష్ ఇక్కడకు వచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రెండు నెలల్లో చేయాలి..50 శాతం రాష్ట్రం 50 శాతంక ఏంద్రం...ఉంటుంది..రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనితో తనకు తృప్తి కలిగిందని..రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులము కాదు'. అని తెలిపారు. 

14:39 - June 30, 2018

కృష్ణా : జిల్లా ఆగిరిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఏడాది క్రితం ఆగిరిపల్లి ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ విద్యార్ధినిపై సీనియర్‌ విద్యార్ధులు శివారెడ్డి, కృష్ణారెడ్డి అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా... అఘాయిత్యాన్ని వీడియోలో చిత్రీకరించారు. అయితే ఆ వీడియో మరో విద్యార్ధి ప్రవీణ్‌కు పంపించడంతో.. విద్యార్ధినిని బెదిరించడం ప్రారంభించాడు. 10 లక్షల రూపాయలు ఇవ్వాలని లేకపోతే... వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బ్లాక్‌ మెయిలింగ్‌ చేశాడు. దీంతో బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కృష్ణారెడ్డి, శివారెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. మరో విద్యార్ధి ప్రవీణ్‌ కోసం గాలింపు చేపట్టారు. 

14:36 - June 30, 2018

ఒంగోలు : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులకు ఇది శ్రీకారం చుడుతుందన్నారు. సెప్టెంబర్‌ 15న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మూడు అంశాల్లో తాము కలిసి పోరాడతామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు జరగడం లేదని, ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగడం లేదన్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో విషయంలో చంద్రబాబు విఫలం చెందారన్నారు. ఏపి విభజన అంశాలను అమలు చేయకుండా నరేంద్రమోది ప్రభుత్వం ఏపీ ప్రజలను తీవ్రంగా అన్యాయం చేసిందన్నారు.

 

14:33 - June 30, 2018

హైదరాబాద్ : ఫార్మా కంపెనీలకు తెలంగాణలో మంచి ఆదరణ ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌లో ఫెర్రింగ్‌ ల్యాబరేటరీకి భూమిపూజ చేసిన కేటీఆర్‌.. హైదరాబాద్‌లోని జినాన్‌వాలీ ఆసియాలోనే పెద్ద ఫార్మా కంపెనీలలో ఒకటని తెలిపారు. 200లకు పైగా ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. వీటితో పాటుగా ఇప్పుడు ఫెరింగ్‌ ఫార్మా కంపెనీ చేరిందన్నారు. ఫార్మాకంపెనీల ద్వారా ప్రత్యేక్షంగా రెండు లక్షలమంది ఉద్యోగాలు పొందారని,.. పరోక్షంగా 4 లక్షల మంది ఉపాధి లబిస్తుందన్నారు. వచ్చే 10 సంవత్సరాలలో ఈ సంఖ్య రెంట్టింపు అయ్యే అవకాశం వుందన్నారు కేటీఆర్‌. 

14:27 - June 30, 2018

విజయవాడ : ఏపీ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ నియామకమయ్యారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఐదుగురు సభ్యులను పరిశీలించిన ప్రభుత్వం... చివరకు ఠాకూర్‌ను నియమించింది. తనను డీజీపీగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు ఆర్పీ ఠాకూర్‌ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఠాకూర్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఠాకూర్‌... జోనల్‌ హైదరాబాద్‌ డీసీపీగా,.. అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. పాట్నాలోని సీఐఎస్‌ఎఫ్‌ డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు.

 

14:25 - June 30, 2018

హైదరాబాద్ : 'వాడుకొని వదిలేస్తాడు..మొసలి కన్నీరు కారుస్తాడు..వెయ్యి రూపాయలు ఇచ్చి తండ్రి..కొడుకులు వేయ్యి కోట్లు దోచుకుంటున్నాడు..పెద్ద పెద్ద బిల్డింగ్ లో వారు నివాసం ఉంటున్నారు'...అంటూ టిడిపి నుండి బహిష్కృతమైన మోత్కుపల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొసలి కన్నీరు కార్చే మోసగాడు చంద్రబాబునాయుడని ధ్వజమెత్తారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు . బాబు వెయ్యి రూపాయలు పెన్షన్‌ ఇచ్చి వేలకోట్లు రూపాయలు దోచుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును నమ్మటానికి వీల్లేదన్నారు మోత్కుపల్లి. చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం ఏ రోజూ చిత్తశుద్ధితో పనిచేయలేదని మండిపడ్డారు.  

14:22 - June 30, 2018

కడప : జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం గత 11 రోజులుగా ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న సీఎం రమేశ్ దీక్ష ను విరమింప చేశారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణమౌతుందని..స్పష్టమైన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు దీక్షను విరమింప చేయాలని రమేశ్ కు సూచించారు. కేంద్రం సహకరించకోపయినా అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, సహకరించకపోయిన కేంద్రంతో పోరాడుతామని పేర్కొన్నారు. వైసీపీని చంకన పెట్టుకుని ఊరేగినా తమ పోరాటం మాత్రం ఆగదని బాబు స్పష్టం చేశారు. దీక్ష చేసి దేశాన్ని మొత్తం ఆకర్షించారని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పూర్తయ్యే వరకు ఇదే పోరాట స్పూర్తిని కొనసాగించాలని సూచించారు. అంతకంటే ముందు దీక్షా స్థలికి సీఎ చంద్రబాబు, ఏపీ మంత్రి లోకేష్ చేరుకున్నారు. రమేశ్ వైద్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు ఇచ్చిన నివేదికలను వారు పరిశీలించారు.

14:03 - June 30, 2018

హైదరాబాద్ : కేటీఆర్ పిచ్చి మాటలు మానుకో అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు హితవుపలికారు. భాష మార్చుకోవాలని మంత్రి కేటీఆర్ కు సూచించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని అమ్మ.. బొమ్మ అంటావా అని మండిపడ్డారు. 'నీవు చదుకున్నవా..? దొరల అహంకారంతో మాట్లాడుతున్నావు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బర్ల కాపరి, రిక్షా పుల్లర్ కూడా నీలాంటి మాటలు మాట్లడరని ఎద్దేవా చేశారు. 'నీ భాషను ప్రజలు అందరూ గమనిస్తున్నారు.. మేం మాట్లడితే నీవు అండన్ కు పారిపోవాలి' అని అన్నారు. 'తెలంగాణ కోసం గతంలో పోరాటాలు, త్యాగాలు చేసిన వారు మనుషులుకారా...నీ నాయినా ఒక్కడే మనిషా' అని అన్నారు. ఇకముందు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. తాము కూడా కిందిస్థాయికి దిగి మాట్లాడాల్సివస్తుందన్నారు. బర్ల కాపరిలాగే మాట్లాడుతామన్నారు. 'మీ నాన్న హిస్టరీ మొత్తం తెలుసు అన్నారు. గతంలో నీ కుటుంబం మొత్తం సోనియా గాంధీ కాళ్లు మొక్కలేదా..అని కేటీఆర్ ను నిలదీశారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఖబడ్దార్...తాడోపేడో తేల్చుకుందామన్నారు. సోనియా గాంధీ ఎప్పుడైనా సీఎం కేసీఆర్ ను పల్లెత్తు మాట అనలేదన్నారు. 'మళ్లీ సోనియా గాంధీని తిడితే నీ ఇంటి మీదికే వస్తానని..రాకపోతే నా పేరు హనుమంతురావు కాదు అని కేటీఆర్ ను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.

 

13:51 - June 30, 2018

హైదరాబాద్ : ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల వయో పరిమితి పెంచాలని డిమాండ్‌ చేస్తూ.. పోలీసు అభ్యర్థులు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్ర దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అభ్యర్థులు గత మూడు రోజులుగా ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. అభ్యర్థుల దీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

13:48 - June 30, 2018

గుంటూరు : ఏపీ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ నియామకమయ్యారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఐదుగురు సభ్యులను పరిశీలించిన ప్రభుత్వం... చివరకు ఠాకూర్‌ను నియమించింది. తనను డీజీపీగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు ఆర్పీ ఠాకూర్‌ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఠాకూర్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఠాకూర్‌... జోనల్‌ హైదరాబాద్‌ డీసీపీగా,.. అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. పాట్నాలోని సీఐఎస్‌ఎఫ్‌ డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. 

 

13:46 - June 30, 2018

కృష్ణా : ఆగిరిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఏడాది క్రితం ఆగిరిపల్లి ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ విద్యార్ధినిపై సీనియర్‌ విద్యార్ధులు శివారెడ్డి, కృష్ణారెడ్డి అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా... అఘాయిత్యాన్ని వీడియోలో చిత్రీకరించారు. అయితే ఆ వీడియో మరో విద్యార్ధి ప్రవీణ్‌కు పంపించడంతో.. విద్యార్ధినిని బెదిరించడం ప్రారంభించాడు. 10 లక్షల రూపాయలు ఇవ్వాలని లేకపోతే... వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బ్లాక్‌ మెయిలింగ్‌ చేశాడు. దీంతో బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కృష్ణారెడ్డి, శివారెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. మరో విద్యార్ధి ప్రవీణ్‌ కోసం గాలింపు చేపట్టారు.

 

13:42 - June 30, 2018

విజయనగరం : నగరంలోని సంతకాల బ్రిడ్జిచుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. మాజీ కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు సభల్లోతరచుగా ప్రస్తావించే అంశాలలో సంతకాల బ్రిడ్జి ఒకటి. అలాంటి బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా ఎందుకు ప్రారంభానికి నోచుకోలేదు? ఇదే ప్రశ్నను వైసీపీ నేతలు లేవనెత్తుతున్నారు. అక్కడితో ఆగకుండా ధర్నాలు చేస్తూ మరింత ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇంతకీ ఆ బ్రిడ్జి వెనుక దాగి ఉనన అసలు రాజకీయం ఏంటి? లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ...
వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీ
విజయనగరంలో రెండున్నర లక్షల మంది జనాభా ఉన్నారు. వాహనాల రాకపోకలతో నిత్యం  పట్టణం రద్దీగా ఉంటుంది.   ఎటూ తేలని ట్రాఫిక్ సమస్య ఉండనే ఉంది.  విజయనగరం పట్టణం  ప్రధాన వ్యాపార కేంద్రం కూడా కావడంతో వచ్చి పోయే వాహనాల రద్దీ కూడా ఎక్కువే. దీంతో పట్టణంలో ఎటు చూసినా వాహనాల హడావుడే.   నగరంలోని మయూరి జంక్షన్, ఆర్ అండ్ బి, కంటోన్మెంట్ రోడ్లలో తరచుగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.  విశాఖ నుంచి విజయనగరం వచ్చే వాహనాల రద్దీ ఓ  వైపు ,   రాయపూర్ , సాలూరు నుంచి  రాకపోకలు  సాగించే  వాహనాల రద్దీ మరో వైపు.  మయూరి జంక్షన్ ప్రాంతంలో ట్రాఫిక్స్‌ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. అక్కడ ఉన్న వంతెన పాతది కావడం, తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పక్కనే రెండో వంతెన నిర్మించాలని అశోక్ గజపతిరాజు భావించారు. 
వంతెన కోసం సంతకాలు సేకరించిన అశోక్‌గజపతిరాజు
మయూరి కూడాలి దగ్గర వంతెన నిర్మించాలని అశోక్‌ గజపతిరాజు భావించారు. ఇందుకోసం ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. కేంద్రమంత్రి అయిన తర్వాత  వంతెన నిర్మాణానికి అనుమతిని కూడా సాధించారు.  అశోక్‌గజపతిరాజు ఆసక్తి చూపడంతో వంతెన నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. ఈ వంతెనకు సంతకాల వంతెనగా నామకరణం   చేశారు. అశోక్ గజపతిరాజు స్వయంగా ఆసక్తి చూపడంతో వంతెన పనులు   త్వరితగతిన పూర్తయ్యాయి.  దీంతో వంతెనను  నేడో రేపో ప్రారంభిస్తారని అంతా భావించారు. కాని నాటి నుంచి నేటి వరకు సంతకాల వంతెన ప్రారంభానికి నోచుకోలేదు. 
వంతెన ఎందుకు ప్రారంభించడం లేదని వైసీపీ ప్రశ్న
వంతెన నిర్మాణం పూర్తయినా ఎందుకు  ప్రారంభించడం లేదని వైసిపి నేతలు   అధికారపార్టీ నేతలను ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి త్వరగా ప్రారంభించాలని వంతెన దగ్గర ధర్నా చేపట్టారు. త్వరితగతిన వంతెన ప్రారంభించాలని అధికారులకు వినతి పత్రాలు అందించారు.  అధికార , విపక్ష పార్టీలు పరస్పర విమర్శలు  చేసుకోవడంతో వంతెన రాజకీయం మరింత వేడెక్కింది. అయితే వంతెన ప్రారంభించకపోవడానికి విజయనగరం పురపాలక సంఘం మరో కారణం చెపుతోంది. వంతెన పనులు పూర్తయినా, దాని కింద 50 అడుగుల అండర్ పాస్ లైన్ నిర్మాణం చేయాల్సి ఉందని చెబుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి  అండర్ పాస్ లైన్ పూర్తవుతుందని, ఆ తర్వాతే వంతెన ప్రారంభిస్తామని చెబుతున్నారు. దీంతో వైసీపీ నేతలు వంతెనపై ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో  సంతకాల వంతెనపై రాజకీయాలు మొదలయ్యాయి.
నిరుపయోగంగా మిగిలిన వంతెన 
సంతకాల వంతెన కింద అండర్ పాస్ లైన్ నిర్మాణం పనులు ప్రారంభించకపోవడంతో వంతెన పూర్తయినా నిరుపయోగంగా మిగిలింది. దీంతో విపక్షం విమర్శలకు దిగడం, అధికార పక్షం ప్రతి విమర్శలు చేయడంతో రాజకీయాలు సంతకాల వంతెనపైకి  చేరాయి. విజయనగరం రాజకీయాలు వంతెన చుట్టూ తిరుగుతున్నాయి.

 

13:35 - June 30, 2018

గుంటూరు : 107 సంవత్సరాల చరిత్ర గల అంధుల పాఠశాల ఇది. అతిపెద్ద క్యాంపస్‌తో దేశంలోనే  అంధుల పాఠశాలలో 2వ స్థానంలో నిలిచింది. దీన్ని ఇప్పుడు కొంత మంది దళారీలు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. వీరికి రాజకీయ నేతల సపోర్ట్‌ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు దళారులపై విద్యార్థులు పోరాటానికి దిగారు. కానీ విద్యార్థుల పోరాటంపై అధికారులు కనికరం చూపట్లేదు. గుంటూరు జిల్లా నరసరావుపేట అంధుల పాఠశాల కబ్జాపై టెన్‌ టీవీ ప్రత్యేక కథనం.
కబ్జాదారులకు అండగా ఎమ్మెల్యే సపోర్ట్‌..
107 సంవత్సరాల చరిత్ర గల అంధుల పాఠశాల అదీ.. అతిపెద్ద క్యాంపస్‌తో దేశ అంధుల పాఠశాలలో 2వ స్థానంలో ఉంది. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన లూధరస్‌ పాఠశాల చరిత్ర ఇది. అయితే ఇప్పుడు దీనిపై కొందరి దళారుల కన్ను పడింది. సానీకొమ్మ కోటిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీపాల్‌ అనే వ్యక్తులతో పాటు మరికొంత మంది పాఠశాల స్థలంలో డెవలప్‌మెంట్ పేరుతో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, సినిమా హాల్స్‌ను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దళారులకు స్థానిక ఎమ్మెల్యే అండగా ఉన్నారనే ఆరోపణ వస్తున్నాయి.
ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్స్‌తో పాఠశాలకు నోటీసులు పంపిన దళారులు
ఇన్కంటాక్స్ టాక్స్‌ ఆఫీసర్స్ ద్వారా పాఠశాలకు పన్ను విధించి స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే దళారులకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో దళారులు ఇన్కంటాక్స్ అధికారుల ద్వారా పాఠశాల యాజమాన్యానికి నోటీసు పంపారు. యాజమాన్యం నోటీసులను తేలిగ్గా తీసుకోవటంతో ఈ సారి అరెస్ట్‌ వారెంట్‌ ఇష్యూ చేయించారు. దీనికి భయపడిన పాఠశాల యాజమాన్యం దళారులకు రాయించిన అగ్రిమెంట్లపై సంతాలు చేశారు. యాజమాన్యం తీరుతో విద్యార్థుల భవిష్యత్‌ అంధకారం అయింది. 
దళారులపై పోరాటానికి దిగిన విద్యార్థులు
అయితే విద్యార్థులు దళారులపై పోరాటం చేస్తున్నారు. యాజమాన్యం చేసిన పనికి తల్లడిల్లిన వికలాంగ, అంధ విద్యార్థులు పోరాటానికి దిగారు. ఇన్నాళ్లు తమకు ఆశ్రయం కల్పించిన పాఠశాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని తేల్చి చెపుతున్నారు. తమకు అండగా నిలవాల్సిన వారు తమ స్థలాన్ని చేజిక్కించుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తమ స్థలానికి సంబంధించి ఒక్క అడుగు కూడా వదులుకునే లేదని.. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని.. అవసరమైతే ప్రాణ త్యాగానికైన సిద్ధమని విద్యార్థులు తెగేసి చెపుతున్నారు. తమ సమస్యపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
విద్యార్థుల పోరాటంపై కనికరం చూపని అధికారులు
అయితే విద్యార్థుల పోరాటంపై అధికారులు మాత్రం కనికరం చూపట్లేదు. స్థానిక ఎమ్మెల్యే పైకి విచారణ చేయమని కలెక్టర్‌కు చెప్పిన లోపల మాత్రం రహస్య ఒప్పందాలు ఉన్నయనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు అధికార పార్టీ నేతలు ఈ అంశాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. దీంతో ఈ పాఠశాలకు రాజకీయ రంగు పులిమారు. విమర్శలు చేసుకుంటూ విద్యార్థులు జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇక నేతలపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. 

13:28 - June 30, 2018

గుంటూరు : ఏపీ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ నియామకమయ్యారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను డీజీపీగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు సభ్యులను పరిశీలించిన ప్రభుత్వం... చివరకు ఠాకూర్‌ను నియమించింది. ఠాకూర్‌ 1986 బ్యాచ్‌కు చెందినవాడు.

 

13:20 - June 30, 2018

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి మోత్కుపల్లి నర్సింహులు ఫైర్ అయ్యారు. దళితులందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. దళితులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మనిషి అయితే దళితులకు క్షమాపణ చెప్పిన తర్వాతే నెల్లూరు మీటింగ్ లో మాట్లాడాలని అన్నారు. దళిత వర్గాలకు బాబు అన్యాయం చేశారని మండిపడ్డారు. మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల, మాదిగలు బాబును నమ్మరని తెలిపారు. దళితులను అడుగడుగనా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ టీఆర్ ఆలోచనా విధానాలకు బాబు తిలోదకాలిచ్చారని విమర్శించారు. టీడీపీని సర్వపాపాలమయంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు.

క్యాడర్‌ టూ లీడర్‌ను సిద్ధం చేస్తోన్న కాంగ్రెస్‌..

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు రెడీనా అంటూ కేసీఆర్‌ విసిరిన సవాల్‌కు కాంగ్రెస్‌ కూడా ధీటుగా కౌంటర్‌ ఇచ్చింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అని ఉత్తమ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ముందస్తు ఎన్నికల కోసం ఆయన క్యాడర్‌ టూ లీడర్‌ను సిద్ధం చేస్తున్నారు. వంద రోజుల కార్యాచరణను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఇవాళ అన్ని నియోజకవర్గ ఇంచార్జీలు, డీసీసీలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రానికి కొత్తగా నియమించిన ఏఐసీసీ కార్యదర్శులు హాజరవుతున్నారు. ఈ సమావేశానికి కుంతియా, ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు హాజరుకానున్నారు.

11:54 - June 30, 2018

ఢిల్లీ : నల్లధనం అంశంలో మోది సర్కార్‌ ఫెయిల్‌ అయిందా? అంటే ఔననే చెబుతోంది తాజాగా విడుదలైన స్విస్‌ బ్యాంకు నివేదిక. స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 50 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. నల్లధనాన్ని నియంత్రించడంలో కేంద్ర విఫలమైందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు 2019 నాటికి నల్ల కుబేరుల జాబితాను బయట పెడతామని కేంద్రం చెబుతోంది.
మోది ప్రభుత్వానికి స్విట్జర్లాండ్‌ బ్యాంకులు షాక్ 
నోట్లరద్దుతో నల్లధనాన్ని అరికడతామని చెప్పిన మోది ప్రభుత్వానికి స్విట్జర్లాండ్‌ బ్యాంకులు షాకిచ్చాయి. తాజాగా స్విట్జర్లాండ్‌ జాతీయ బ్యాంకు ఓ నివేదికను విడుదల చేసింది.  స్విస్‌  బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 50 శాతం పెరిగాయని, 2017 లో నల్ల కుబేరుల డిపాజిట్లు 7 వేల కోట్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది.
పెరుగుతున్న భారతీయ నల్ల కుబేరుల డిపాజిట్లు 
2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోది ప్రభుత్వం నల్లధనం నియంత్రణపై పలు చర్యలు చేపట్టింది. నల్లకుబేరుల జాబితాను అందజేసేందుకు స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం సంసిద్ధత కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 2014, 2015లో స్విస్‌ బ్యాంకుల్లో భారత డిపాజిట్లు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. 2016 నుంచి భారతీయ నల్ల కుబేరుల డిపాజిట్లు మళ్లీ పెరగడం మొదలెట్టాయి. 2016లో 4 వేల 5 వందల కోట్లు జమ అయ్యాయి.
స్విస్‌ తాజా నివేదికపై స్పందించిన కాంగ్రెస్‌  
స్విస్‌ తాజా నివేదికపై కాంగ్రెస్‌ స్పందించింది. స్విస్‌ బ్యాంకుల్లో నల్లధనం 50 శాతం పెరిగి 7 వేల కోట్లకు చేరుకోవడంపై మోది ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని భారత్‌కు రప్పిస్తామన్న హామీ ఏమైందని కేంద్రాన్ని నిలదీసింది. మంచి రోజులంటే ఇవేనా అంటూ ప్రశ్నించింది. 
స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు పెరగడంపై స్పందించిన కేంద్రం 
స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు పెరగడంపై కేంద్రం స్పందించింది. దీనిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ చెప్పారు. 2018 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నల్లధనానికి సంబంధించిన పూర్తి డాటా బయటకు వస్తుందని మంత్రి తెలిపారు.
వంద లక్షల కోట్ల నల్లధనం డిపాజిట్‌ 
నల్లధనం దాచుకునేందుకు స్విస్‌ బ్యాంకులు సురక్షితమైనవిగా భావించే ప్రపంచదేశాల్లోని ప్రముఖులు ఇక్కడ డిపాజిట్లు చేస్తుంటారు. ఖాతాదారుల వివరాలు రహస్యంగా ఉంచడంతో అక్రమాలకు పాల్పడే వారు తమ డబ్బును స్విస్‌ బ్యాంకుల్లో దాచుకునేందుకు ఆసక్తి చూపుతారు. ప్రపంచవ్యాప్తంగా వంద లక్షల కోట్ల నల్లధనం ఇక్కడ డిపాజిట్‌ చేసినట్లు నివేదిక వెల్లడించింది.

 

ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోన్న గులాబీ దళం..

హైదరాబాద్ : సాధారణ ఎన్నికలకు మరో 9 నెలలు సమయం ఉంది. అయితే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ మాత్రం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండేందుకు అధికారపార్టీ సన్నద్దమవుతోంది. గులాబీ నేతలంతా ప్రజాక్షేత్రానికే పరిమితంకావాలన్న సూచనలు కేసీఆర్‌ నుంచి అందుతున్నాయి. జమిలీ ఎన్నికలకు కేంద్రం ఆసక్తి చూపుతోందన్న ప్రచారం ఉన్నా... మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లాంటి పెద్ద రాష్ట్రాలకు ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటితోపాటే కేంద్రం పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి.

11:44 - June 30, 2018

హైదరాబాద్‌ : నగరంలోని అబిడ్స్‌లో ఆర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆర్‌ఎస్ బ్రదర్స్ షాపింగ్‌మాల్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది... నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దుస్తులు, ఫర్నిచర్‌ పూర్తిగా దగ్దమైంది. ప్రమాదంలో 3 కోట్ల రూపాయల వరకు ఆస్తినష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు.. ప్రమాదం షార్ట్‌ సర్క్యూట్‌ వలన జరిగింది.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అగిరిపల్లి బీటెక్ విద్యార్థిని రేప్ కేసులో పురోగతి..

కృష్ణా : అగిరిపల్లిలో బీటెక్ విద్యార్థిని రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బ్లాక్ మెయిల్ చేసిన ప్రవీణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2017లో బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ గా పరిచేస్తున్న కృష్ణవంశీ, శివారెడ్డిలు ముగ్గురు కలిసి వాట్సాప్ గ్రూప్ లో వీడియోలను పోస్ట్ చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు.

11:40 - June 30, 2018

కడప : ఎంపీ సీఎం రమేష్ నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది. సీఎం రమేష్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇవాళ సీఎం చంద్రబాబు ఆయన్ను పరామర్శించనున్నారు. దీక్ష వేదిక నుంచి సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రమేష్ దీక్ష  చేపట్టిన సంగతి తెలిసిందే.

 

ఆర్ ఎస్ బ్రదర్స్ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు..

హైదరాబాద్ : అబిడ్స్‌లో ఆర్ధరాత్రి షాపింగ్ మాల్ ఆర్ ఎస్ బ్రదర్స్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హోటల్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో క్లోజ్ చేసిన 15 నిమిషాలకే అగ్ని ప్రమాదం జరగటం పట్ల పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి ఆర్‌ఎస్ బ్రదర్స్ షాపింగ్‌మాల్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది... నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దుస్తులు, ఫర్నిచర్‌ పూర్తిగా దగ్దమయ్యాయి.

అవినీతిపరులకు టెర్రర్ ఏపీ కొత్త బాస్ ఠాకూర్..

గుంటూరు : 1986వ బ్యాచ్ కు చెందిన ఆర్పీ ఠాకూర్ ను డీజీపీగా నియమిస్తు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి ఏపీలో ఠాకూర్ కీలక బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేశారు. 1961 జులై 1న జన్మించిన ఠాకూర్ పూర్తిపేరు రామ్ ప్రవేశ్ ఠాకూర్ ఐఐటీ ఖరగ్ పూర్ లో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్రాలజీ లో పట్టా పొందారు. అనంతరం సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించి 1986 డిసెంబర్ 15న ఐపీఎస్ అధికారిగా బాధ్యత్లో చేరారు. బాధ్యతల్లో చేరిననాటి నుండి అవినీతి పరులకు టెర్రర్ గా ఠాకూర్ పేరుతెచ్చుకున్నారు.

ఏపీ డీజీపీగా ఠాకూర్ నియామకం..

గుంటూరు : ఏపీ డీజీపీగా ఠాకూర్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఠాకూర్ నియమితులయ్యారు. డీజీపీగా విధులు నిర్వహించి ఈరోజు పదవీ విరమణ చేసిన డీజీపీ పూనం మానకొండయ్య స్థానంలో ఠాకూర్ ను నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీకి కొత్త బాస్ ఎవరు అనే ప్రశ్నకు తెరపడింది. డీజీపీగా విధులు నిర్వహించి ఈరోజు పదవీ విరమణ చేసిన డీజీపీ పూనం మానకొండయ్య స్థానంలో 1986వ బ్యాచ్ కు చెందిన ఆర్పీ ఠాకూర్ ను నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అవినీతి ఎక్కువగా ఉందని జాతీయస్థాయిలో సర్వేలు వెల్లడించాయి.

11:03 - June 30, 2018

కరీంనగర్‌ : జిల్లాలోని రామగుండం టీఆర్‌ఎస్‌లో అధిపత్యపోరు రాజుకుంది. ఇద్దరు నేతల మధ్య నెలకొన్ని వివాదం గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. రామగుండం ఎమ్మెల్యే, నగర పాలక సంస్థ మేయర్‌ మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. అది  మేయర్‌ అవిశ్వాస తీర్మానానికి దారితీసింది. మరి పోరులో ఎమ్మెల్యే  వేస్తున్న ఎత్తులు ఫలిస్తాయా? టీఆర్‌ఎస్‌ అవిశ్వాసానికి కాంగ్రెస్‌ మద్దతిస్తుందా? మరి మేయర్‌ వ్యూహమేంటి? రామగుండం టీఆర్‌ఎస్‌ రాజకీయాలపై ప్రత్యేక కథనం...
ఎమ్మెల్యే, మేయర్ మధ్య ఆధిపత్య పోరు
కరీంనగర్‌ జిల్లా రామగుండం నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు టీఆర్‌ఎస్‌ పార్టీ పరువును బజారుకీడ్చుతున్నాయి.  నేతల మధ్య విభేదాలు ఆధిపత్య పోరుకు తెరలేపాయి. స్థానిక ఎమ్మెల్యే, రామగుండం నగరపాలక సంస్థ మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ మధ్య విభేదాలు తార స్థాయికి చేరాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.  దీంతో లక్ష్మీనారాయణకు గద్దె దించేందుకు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సొంతపార్టీ మేయర్‌పైనే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెడీ అయ్యారు. జూలైలో అవిశ్వాసానికి మహూర్తం కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది. 
శృతి మించుతున్న మేయర్‌ ఆగడాలు : కార్పొరేటర్లు
పార్టీలో మేయర్‌ ఆగడాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయని కొంతమంది కార్పొరేటర్లు చేస్తున్న వాదన. ఎమ్మెల్యే సోమారపు మాటలను మేయర్‌ పెడచెవిన పెడుతున్నారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్పొరేటర్లపట్ల వివక్ష చూపెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  కాంట్రాక్ట్‌లు ఇవ్వడంలోనూ మేయర్‌ ఏకపక్షంగా వ్యవహరించడం వివాదాలకు కారణమవుతోంది. తాను పార్టీలోకి తీసుకొచ్చిన వ్యక్తే.. తనకు వ్యతిరేకంగా మారడంతో సోమారపు సత్యనారాయణకు మింగుడు పడటంలేదు. దీంతో మేయర్‌ను ఆ పదవి నుంచి దింపాలని నిర్ణయించుకుని... అందుకోసం పావులు కదుపుతున్నారు.
స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో తారస్థాయికి చేరిన వివాదం
ఇటీవల జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు మేయర్‌, ఎమ్మెల్యే మధ్య వివాదం తారస్థాయికి చేరడానికి కారణం అయ్యింది. టీఆర్‌ఎస్‌లో మొత్తం 37 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఎమ్మెల్యే, మేయర్‌ శిబిరాల్లో చెరిసగం ఉన్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ మేయర్‌ వర్గం 3 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే... మేయర్‌తోపాటు డిప్యూటీ మేయర్‌ శంకర్‌పైనా అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించారు. మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలంటే మొత్తం సభ్యుల్లో సగం మంది నోటీసులు ఇచ్చి... వారి సంతకాలతో జిల్లా కలెక్టర్‌కు అందజేయాల్సి ఉంటుంది. వీరిలో 26 మంది సంతకాలతో నోటీసులు ఇస్తే 30 రోజుల్లో కలెక్టర్‌ సమావేశం నిర్వహించి అవిశ్వాసానికి సంబంధించిన ప్రక్రియ చేపడుతారు. ఎమ్మెల్యే సోమారపు సత్యనారయణ ,మేయర్ లక్ష్మినారాయణ మధ్య నెలకొన్న  వివాదాలు సొంత పార్టీలో అలజడి సృష్టిస్తున్నాయి. మరి ఈ ఆధిపత్య పోరులో గెలుపు ఎవరిదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

 

10:55 - June 30, 2018

హైదరాబాద్ : ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. నేటినుంచి ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు చేపట్టింది. అధికారులు మూడు రోజుల స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించనున్నారు. బల్దియా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో ఆక్రమణలను కూల్చివేయనున్నారు. 48 ప్రాంతాల్లో ఫుట్‌ఫాత్‌లపై 5వేల ఆక్రమణలను అధికారులను తొలగించనున్నారు.

 

ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు : డీజీపీ మాలకొండయ్య

గుంటూరు : ఏపీ డీజీపీ మాలకొండయ్య నేడు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పరేడ్ గ్రౌండ్లో ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీజీపీగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. తన హయాంలో కొత్తగా 6వేల మంది సిబ్బందిని నియమించామని చెప్పారు. రాష్ట్రంలో క్రైమ్ ను తగ్గించగలిగామని తెలిపారు. వీడ్కోలు కార్యక్రమంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు గౌతమ్ నవాంగ్, ఆర్పీ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

10:49 - June 30, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో సీక్రెట్‌ మీటింగ్స్‌ సెగలు రేపుతున్నాయి. ఉత్తమ్‌కు వ్యతిరేకంగా ఆయన వ్యతిరేక వర్గం రహస్య మీటింగ్‌లకు తెరలేపింది. దీనిపై ఉత్తమ్‌ వర్గం కూడా గరంగరం అవుతోంది. ఇదేం పద్దతని నిలదీస్తోంది. కాంగ్రెస్‌లో రహస్య మీటింగ్‌లపై ఢిల్లీకి ఫిర్యాదులు చేరడం ఇప్పుడు పార్టీలో హాట్‌టాఫిక్‌గా మారింది.
ఉత్తమ్‌ వర్సెస్‌ యాంటి గ్యాంగ్‌ మీటింగ్స్‌
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు రహస్య మీటింగ్‌లు హాట్‌టాఫిక్‌గా మారాయి. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు వ్యతిరేకంగా కొందరు సీనియర్‌ నేతలు రహస్యంగా సమావేశం కావడం కాంగ్రెస్‌లో కలవరం రేపుతోంది. ఉత్తమ్‌ పనితీరుపై గుర్రుగా ఉన్న కొంతమంది సీనియర్లు... ఆయన తీరుపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు... ఉత్తమ్‌ తీరుపై త్వరలోనే రాహుల్‌గాంధీని కూడా కలిసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరోవైపు రహస్య మీటింగ్‌లపై కొందరు సీనియర్లు మండిపడుతున్నారు. ఈ సీక్రెట్‌ మీటింగ్స్‌ క్యాడర్‌ను గందరగోళానికి గురిచేస్తాయని.. ఇది పార్టీకి మంచిదికాదని సూచిస్తున్నారు. రహస్య మీటింగ్‌పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వీహెచ్‌ అంటున్నారు.
రహస్య మీటింగ్‌లపై జానారెడ్డి స్పందన 
రహస్య మీటింగ్‌లపై సీఎల్పీ నేత జానారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. సమావేశాలు ఎవరైనా... ఎప్పుడైనా , ఎక్కడైనా నిర్వహించుకోవచ్చన్నారు. అయితే ఏ సమావేశమైనా పార్టీకి ప్రయోజనకరంగా ఉండాలని సూచించారు.  ఉత్తమ్‌ పనితీరును సమర్ధిస్తూనే .. అధిష్టానం ఎవరిని నాయకుడిగా నియమిస్తే వారికి మద్దతు, గౌరవం ఇస్తామన్నారు.
రహస్య మీటింగ్‌లపై రెండుగా విడిపోయిన పీసీసీ
ప్రస్తుతం పీసీసీ రహస్య మీటింగ్స్‌పై రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ సీక్రెట్‌ మీటింగ్స్‌పై హస్తినలోని అధిష్టాన పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

డీజీపీగా మాలకొండయ్య విశేష కృషి : సీపీ గౌతమ్ సవాంగ్

గుంటూరు : గత ఆరునెలలుగా డీజీపీగా పూనం మాలకొండయ్య విశేష్ కృషి చేసారని సీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. డీజీపీ పూనం మాలకొండయ్య పదవీ విరణమ కార్యక్రయాన్ని పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు మాలకొండయ్యకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతు..ఏపీ విభజన అనంతరం ఏపీలో ఎన్నో సమస్యలున్నాయనీ..రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతల విషయంలో కష్ట సమయంలో మాలకొండయ్య చక్కగా పరిచేసారని ప్రశంసించారు. 

10:43 - June 30, 2018

గుంటూరు : ఏపీ డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేశారు. మంగళగిరి ఆరవ బెటాలియన్‌లో పెరేడ్‌ గ్రౌండ్స్‌లో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. మాలకొండయ్యకు ఘనంగా పోలీస్‌ దళాలు వీడ్కోలు పలికాయి. ఇదిలావుంటే కొత్త డీజీపీ ఎవరనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. 

 

సిబ్బంది కొరత వున్నా లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేశాం : మాలకొండయ్య

గుంటూరు : ఈ సందర్భంగా డీజీపీ పూనం మాలకొండయ్య మాట్లాడతు.. ఆరు నెలల్లో మంచి పాలన అందించామనీ..లా అండ్ ఆర్డర్ ను బాగా కంట్రోల్ చేశామని తెలిపారు. డీజీపీ పూనం మాలకొండయ్య పదవీ విరణమ కార్యక్రయాన్ని పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు మాలకొండయ్యకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతున్నారు. సిబ్బంది కొరత వున్నా గానీ స్టాఫ్ అంతా కష్టపడి పనిచేసారన్నారు. ఏపీ పోలీసులకు మంచి పేరుందనీ..రాయలసీమ గొడవలు, నక్సల్స్ ప్రభావం నుండి ఏపీ ఎప్పుడో బైటపడిందన్నారు.

10:41 - June 30, 2018

సంగారెడ్డి : జిల్లాలోని జోగిపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సెర్చ్‌లో 100 మంది పోలీసులు పాల్గొన్నారు. సరైన ధృవ పత్రాలు లేని 15 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్త వ్యక్తులు జోగిపేటకు వచ్చారనే సమాచారంతో ఈ కార్డన్ సర్చ్‌ నిర్వహించామన్నారు సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిని.. పాత నేరస్థులు ఎవరైనా ఉన్నారా అనే సమాచారం సేకరించామని ఎస్పీ తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో నిరంతరం ఈ కార్డన్ సర్చ్‌ నిర్వహిస్తామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. 

10:40 - June 30, 2018

హైదరాబాద్‌ : నగరంలోని అబిడ్స్‌లో ఆర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆర్‌ఎస్ బ్రదర్స్ షాపింగ్‌మాల్‌లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకుని రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది... నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దుస్తులు, ఫర్నిచర్‌ పూర్తిగా దగ్దమైంది. ప్రమాదంలో 3 కోట్ల రూపాయల వరకు ఆస్తినష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు.. ప్రమాదం షార్ట్‌ సర్క్యూట్‌ వలన జరిగింది.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

 

డీజీపీ పూనం మాలకొండయ్య ఆత్మీయ వీడ్కోలు..

గుంటూరు : డీజీపీ పూనం మాలకొండయ్య పదవీ విరణమ కార్యక్రయాన్ని పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. మంగళగిరిలోని ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు మాలకొండయ్యకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతున్నారు. విదాయి పరేడ్ తో పోలీసులు కవాతుతో మాలకొండయ్యకు లాంఛనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 1985వ బ్యాచ్ కు చెందిన మాలకొండయ్య ఐసీఎస్ అధికారిగా వరంగంల్ జిల్లాలోని ములుగులో ఎస్పీగా విధులు చేపట్టి డీజీపీ స్థాయికి చేరుకున్నారు. మావోయిస్టుల నిహా ఏర్పాటు చేసిన మాలకొండయ్య పలు మావోల ఆపరేషన్లు నిర్వహించారు.  

10:32 - June 30, 2018

హైదరాబాద్ : గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపనసభలో సీఎం కేసీఆర్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ. గట్టు ఎత్తిపోతల పథకానికి విత్తనం వేసింది తానేనని డీకే అరుణ అన్నారు. వేలంపాడు ప్రాజెక్ట్‌కు కూడా కాంగ్రెస్‌ హయాంలోనే శంకుస్థాపన జరిగిందన్నారు. ప్రాజెక్టులపై కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. 

 

చెట్టును ఢీకొన్న కారు, 4గురు మృతి..

ఒడిశా : కెంజర్ జిల్లా ఆనందపూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఓ కాకు చెట్టును ఢీకొంది.ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. 

ఉక్కు దీక్షా వేదిక నుండి చంద్రబాబు కీలక ప్రకటన?!..

కడప : కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. 11వ రోజుకు చేరిన రమేశ్ దీక్షకు చంద్రబాబు సంఘీభావం తెలపనున్నారు. కాగా సీఎం ఆరోగ్యం మరింతగా క్షీణించటంతో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రమేశ్ ను పరామర్శించి దీక్షా వేదికనుండి కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లుగా సమాచారం.

చాకచక్యంగా మందు బాబులను పట్టేస్తున్న పోలీసులు..

హైదరాబాద్ : మందు కొట్టి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు భారీ ఎత్తున రంగంలోకి దిగిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అష్టదిగ్బంధమే చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టుకు సమీపంలోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు, ఏ వాహనం ఎటునుంచి వచ్చినా, అదే దారిలో వచ్చేలా చేశారు. మాదాపూర్ నుంచి వచ్చే వాహనాలు బ్లడ్ బ్యాంక్ ముందు నుంచి యూటర్న్ తీసుకుని పంజాగుట్ట వైపు వెళ్లేలా చూడటంతో పాటు, బంజారాహిల్స్, అపోలో ఆసుపత్రి నుంచి వచ్చే వాహనాలనూ అదేవైపు మళ్లించారు.

నెల్లూరు జిల్లాలో కంపించిన భూమి..

నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గత అర్ధరాత్రి స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూమి కంపిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనతో రోడ్లపైకి వచ్చి రాత్రంతా భయంతో గడిపారు. జిల్లా పరిధిలోని బోగోలు మండలంలో రెండు సెకన్ల నుంచి మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతం భూకంపం జోన్ లో ఉందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ తరచూ భూ ప్రకంపనలు నమోదవుతుండటంతో, ఎప్పుడు పెద్ద భూకంపం వస్తుందోనని ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.

ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ ఎంపీ ఉక్కుపాదం..

హైదరాబాద్ : ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ ఎంపీ ఉక్కుపాదం మోపింది. నేటి నుండి ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపులపై జీహెచ్ ఎంసీ దృష్టి పెట్టింది. మూడు రోజులపాటు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించనుంది. బల్దియా ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఆక్రమణలకు బల్దియా అధికారులు కూల్చివేస్తున్నారు. 48 ప్రాంతాల్లో ఫుట్ పాత్ లపై 5 వేల ఆక్రమణలను అధికారులు తొలగిస్తుఆన్నరు. దీంతో చిరు వ్యాపారస్తులు గగ్గోలు పెడుతున్నారు. పెద్ద పెద్ద ఆక్రమణదారులను వదలివేసి చిరు వ్యాపారులపై బల్దియా ప్రతాపాన్ని చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

09:07 - June 30, 2018

శ్రీకాకుళం : అదొక అంతర్జాతీయ స్థాయి సమస్య. స్థానికులు జీవన్మరణ పోరాటంతో సతమతమవుతుంటే, పార్టీల నేతలు మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. రెండు దశాబ్దాలుగా సమస్యకు పరిష్కారం మాత్రం లభించడంలేదు. దీంతో పొలిటికల్‌ పరామర్శలపై ఉద్దానం మూత్రపిండాల బాధితులు ఫైర్‌ అవుతున్నారు. టెన్‌ టీవీ చొరవతో సమస్య మూలాలు పరిశోధించేందుకు ఒమిక్స్ ఇంటర్నేషల్‌ సంస్థ ముందుకొచ్చింది. 
రెడున్నర దశాబ్దాలుగా పీడిస్తున్న మూత్రపిండాల వ్యాధి
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం గడిచిన రెండున్నర దశాబ్దాలుగా మూత్రపిండాల వ్యాధులతో సతమతమవుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని పాలకులు చెబుతున్నప్పటికీ సమస్య మాత్రం దూరం కావడం లేదు. సర్వేలు, రక్తపరీక్షలు, రాజకీయ పక్షాల పరామర్శలతో ఇబ్బందులు పడుతున్నామని ఇచ్చాపురం నియోజకవర్గ వాసులు అంటున్నారు. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం, వజ్రపుకొత్తూరు, మందస ప్రాంతాలలో ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. మరో వైపు ఉద్దాన ప్రాంతంలోని ప్రజలును రకరకాల వదంతులతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్దాన ప్రాంతంలో నేతల ఓటు బ్యాంక్‌ రాజకీయం
ప్రజాప్రతినిధులు మారుతున్నారు తప్ప తమ ఆవేదన అర్థం చేసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. పార్టీ నేతలు ఓటు బ్యాంక్‌ రాజకీయం కోసం హడావిడి చేస్తున్నారు తప్ప మూత్రపిండాల వ్యాధులపై అధ్యయనం చెయ్యడం లేదంటూ ఉద్దాన ప్రాంతీయులు మండిపడుతున్నారు. పర్యటన పేరుతో రాజకీయ నేతలు చేస్తున్న ఖర్చు డయాలసిస్‌, యూనిట్లు నెలకొల్పడం, నెఫ్రాలజిస్ట్‌లను రప్పించడానికి వినియోగించాలని కోరుతున్నారు.
గుర్తించని కిడ్నీ వ్యాధుల మూలాలు 
ఇదిలా ఉంటే ఉద్దానం మూత్రపిడాల వ్యాధుల అధ్యయనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మక మార్పులు వస్తున్న కిడ్నీ వ్యాధుల తీవ్రతకు మూలలు గుర్తించకపోవడం దురదృష్టకరమని బాధితులు అంటున్నారు. ఈ దశలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థను టెన్‌ టీవీ సంప్రదించింది. ప్రభుత్వాలు సహకరిస్తే స్థానికంగా సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని ఒమిక్స్‌ సంస్థ సి.ఈ.ఓ. శ్రీనుబాబు గేదెల స్పష్టం చేశారు. 6 నుంచి 18 నెలల వ్యవధిలో నిపుణుల సహకారం అందిస్తే, ప్రభుత్వం ప్రోత్సాహంతో పరిశోధన జరిపేందుకు తమ సంస్థ సిద్ధమని శ్రీనుబాబు గేదెల టెన్‌ టీవీతో అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిన కిడ్నీ వ్యాధి సమస్య 
నేతల పర్యటనలు, పార్టీ నేతల ప్రచారంతో ఉద్దానం మూత్రపిండాల వ్యాధుల సమస్య అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. కానీ బాధితులకు పూర్తి భరోసా, మూలలు కనుగోనడంలో సమన్వయం లేకపోవడంతో ఉద్దాన ప్రాంతాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ఉద్దాన ప్రాంతంలో నేతలు పర్యటనలు ఆపి సమస్య పరిష్కారానికి కృషి చెయ్యాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

08:43 - June 30, 2018

హైదరాబాద్ : ఒకవైపు ప్రభుత్వమేమో దిగిరానంటోంది. మరోవైపు తామేమో సమ్మె చేసితీరుతామంటున్నారు. సమ్మె విరమించకుంటే మూకుమ్మడి సస్పెన్షన్‌కు సిద్ధమని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా సర్కార్‌ దృష్టి సారించింది. జూలై 5వ తేదీలోగా ప్రభుత్వం దిగిరాకుంటే.. ఆమరణ దీక్షకు సైతం సిద్ధమంటున్నారు రేషన్‌ డీలర్లు. ఇంతకీ ప్రభుత్వం దిగివస్తుందా? లేక సర్కార్‌ హెచ్చరికలకు రేషన్‌ డీలర్లు తలొగ్గుతారా? రేషన్‌ డీలర్ల సమ్మెపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం...
సమస్యల పరిష్కారానికి రేషన్‌ డీలర్లు ఆందోళనబాట
కొన్ని రోజులుగా తెలంగాణలో రేషన్‌ డీలర్లు సమ్మె చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారానికి ఆందోలనకు పూనుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వారి డిమాండ్లకు ససేమిరా అంటోంది.  డీలర్ల డిమాండ్లపై పలుమార్లు చర్చించిన ప్రభుత్వం సమస్యను మాత్రం పరిష్కరించలేదు. పైగా మూకుమ్మడి సస్పెషన్లు చేస్తామని హెచ్చరిస్తోంది. రేషన్‌ డీలర్లు చివరి ప్రయత్నంగా సివిల్‌ సప్లై కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌తో భేటీ అయ్యారు. మూడు రోజుల్లో పాత బకాయిలతోపాటు.. గౌరవ వేతనం అంశంపై కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని అకున్‌ సబర్వాల్‌ వారికి హామీనిచ్చారు. గడువు దాటింది. అయినా కమిటీ నివేదిక మాత్రం బహిర్గతం కాలేదు.
రేషన్‌ డీలర్ల సమ్మెపై ప్రభుత్వం గుర్రు
రేషన్‌ డీలర్ల సమ్మెపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ప్రజాపంపిణీ వ్యవస్థ కంట్రోలర్‌ ఆర్డర్ 2016 ప్రకారం.. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం ఉందంటూ ప్రభుత్వం వారిని హెచ్చరిస్తోంది. గడువులోగా డబ్బుకట్టి రిలీజ్‌ ఆర్డర్‌ తీసుకోని డీలర్లకు ముందు నోటీసులిచ్చి... ఆ తర్వాత సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది. మహిళా సంఘాల ద్వారా సరుకులు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌సబర్వాల్‌ జాయింట్‌ కలెక్టర్లు, డీసీఎస్‌వోలు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మహిళా సంఘాలకు డీలర్‌షిప్‌ బాధ్యతలు
జూలై 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ పంపిణీ చేయాలని కమిషనర్‌ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిఆర్‌డిఎ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా అధికారులు పర్యవేక్షించనున్నారు. రికార్డుల నిర్వాహణలో మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నారు అధికారులు. డీలర్‌షిప్‌ బాధ్యతలు తీసుకున్న మహిళా సంఘాలతో జులై 1వ తేదీన మీసేవ కేంద్రాల్లో డీడీలు కట్టించాలని నిర్ణయించారు.  గ్రామ పంచాయతీ, ఐకెపి, కమ్యూనిటీ హాల్స్‌, యూత్‌ బిల్టింగ్‌ల్లో సరుకులు నిల్వ చేయాలని యోచిస్తున్నారు. వేయింగ్‌ మెషిన్లకోసం తూనికలు కొలతల శాఖ అధికారుల సహకారం తీసుకోవాలని సూచించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పౌరసరఫరాలు, రెవెన్యూ, గ్రామీణ అభివృద్ధిశాఖలు సమన్వయంతో పనిచేయాలని అదేశించారు. 
సమ్మెపై వెనక్కి తగ్గని రేషన్‌ డీలర్లు
ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నా... రేషన్‌ డీలర్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 2015 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. తమ సమ్మెకు అల్ ఇండియా రేషన్ డీలర్స్ అసోషియేషన్  మద్దతు కూడా ఉందని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా  ఐదు లక్షల మంది డీలర్లు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. 5వ తేదీ లోపు బకాయిలు  చెల్లించకుంటే.. ఆమరణ నిరాహారదీక్ష  చేస్తామని ప్రకటించారు.  శాంతియుతంగా పోరాడుతున్న తమకు ఓపిక నశిస్తే.. జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం  
సమ్మె విరమించే ప్రసక్తే లేదని డీలర్లు అంటుంటే.. మరో వైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం, రేషన్ డీలర్ల పంతంతో పేదల కడుపు మాడుతుందో... లేక ప్రభుత్వం దిగివచ్చి.. డీలర్ల సమ్మె విరమింప జేస్తుందో చూడాల్సిందే. 

08:15 - June 30, 2018

హైదరాబాద్ : నగరంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆబిడ్స్ లోని ఆర్ ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దస్తులు, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ.3 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైరింజన్లతో మంటలార్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇతర కారణాలేమైన ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే షోరూమ్ యాజమాన్యం ఎలాంటి ఫైర్ సేఫ్టి నిబంధనలు పాటించనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

08:15 - June 30, 2018

హైదరాబాద్ : నగరంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆబిడ్స్ లోని ఆర్ ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ లో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దస్తులు, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ.3 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైరింజన్లతో మంటలార్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇతర కారణాలేమైన ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే షోరూమ్ యాజమాన్యం ఎలాంటి ఫైర్ సేఫ్టి నిబంధనలు పాటించనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

కొత్త డీజీపీ ఎంపికపై నేడు నిర్ణయం తీసుకోనున్న బాబు

హైదరాబాద్ : కొత్త డీజీపీ ఎంపికపై నేడు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు.

 

07:50 - June 30, 2018

నల్లధనం అంశంలో మోది సర్కార్‌ ఫెయిల్‌ అయిందా? అంటే ఔననే చెబుతోంది తాజాగా విడుదలైన స్విస్‌ బ్యాంకు నివేదిక. స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 50 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. నల్లధనాన్ని నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు 2019 నాటికి నల్ల కుబేరుల జాబితాను బయట పెడతామని కేంద్రం చెబుతోంది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు వినయ్ కుమార్, కాంగ్రెస్ నేత రామ్మోహన్, బీజేపీ నేత ఆచారి పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్విస్ బ్యాంకులో భారతీయుల నగదు పెరుగుతుందన్నారు. భారతీయుల డిపాజిట్లు 50 శాతం పెరిగాయని తెలిపారు. విదేశాల నుంచి నల్లధనం వెనక్కితేవడంలో మోడీ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

07:43 - June 30, 2018
07:42 - June 30, 2018

ఢిల్లీ : రెండో టీ 20లో పసికూన ఐర్లాండ్ ను భారత్ చిత్తుగా ఓడించింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 12.3 ఓవర్లలో 70 పరుగులకే చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 భారీ స్కోర్ చేసింది. భారత్ ఆటగాళ్లు రాహుల్ 70 పరుగులు, రైనా 69, హార్ధిక్ 32, మనీష్ 21 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో ఓబ్రెయిన్ మూడు తీయగా... ఛైజ్ ఒక వికెట్ తీశాడు. భారత్ బౌలర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ చెరి మూడు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ రెండు, సిద్ధార్ద్ కౌల్, హార్ధిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు.

 

07:39 - June 30, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ కూడా రెడీ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉ న్న క్యాడర్‌ టూ లీడర్‌ను ఇందుకోసం సిద్ధం చేసతోంది. ఇప్పటికే యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసిన హస్తంపార్టీ....  దాని అమలు కోసం నియోజకవర్గ ఇంచార్జీలు, డీసీసీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
దేశ వ్యాప్తంగా ముందస్తు ఎన్నికల రాగం
దేశవ్యాప్తంగా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. ఏఐసీసీ కూడా అన్ని రాష్ట్రాలకు ముందస్తు ఎన్నికలపై  ఆదేశాలను ఇచ్చింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతోంది.  
కేసీఆర్‌ సవాల్‌కు కాంగ్రెస్‌ ధీటుగా కౌంటర్‌ 
ముందస్తు ఎన్నికలకు రెడీనా అంటూ కేసీఆర్‌ విసిరిన సవాల్‌కు కాంగ్రెస్‌ కూడా ధీటుగా కౌంటర్‌ ఇచ్చింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అని ఉత్తమ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ముందస్తు ఎన్నికల కోసం ఆయన క్యాడర్‌ టూ లీడర్‌ను సిద్ధం చేస్తున్నారు.  వంద రోజుల కార్యాచరణను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఇవాళ అన్ని నియోజకవర్గ ఇంచార్జీలు, డీసీసీలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రానికి కొత్తగా నియమించిన ఏఐసీసీ కార్యదర్శులు హాజరవుతున్నారు.
బలోపేతానికి క్యాడర్ నుంచి సూచనలు స్వీకరణ
నేడు జరిగే సమావేశంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించనున్నారు. క్యాడర్‌కు అవసరమైన సూచనలు చేయనున్నారు. అంతేకాదు.. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శక్తియాప్‌ రిజిస్ట్రేషన్‌కు క్యాడర్‌ను  ఎలా దగ్గర చేయాలన్నదానిపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.  దీంతోపాటు నియోజకవర్గాల్లో నేతల మధ్య గ్యాప్‌ తగ్గించేందుకు ఈ సమావేశాన్ని పీసీసీ ఉపయోగించుకుంటోంది. మొత్తానికి ముందస్తు ఎన్నికలకు సై అంటోన్న కాంగ్రెస్‌... పార్టీ క్యాడర్‌ను కదలించే పనిలో పడింది.

 

07:36 - June 30, 2018

హైదరాబాద్‌ : తెలంగాణలో అధికారపార్టీ ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ధీమాతో అడుగులు వేస్తోంది. ప్రతిపక్ష పార్టీల ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్దం కాకముందే.. ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో గులాబీబాస్‌ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి ముందస్తు ఎన్నికలపై సవాల్‌ విసిరిన కేసీఆర్‌.... అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు.
ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ ఆసక్తి 
సాధారణ ఎన్నికలకు మరో 9 నెలలు సమయం ఉంది. అయితే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ మాత్రం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండేందుకు అధికారపార్టీ సన్నద్దమవుతోంది. గులాబీ నేతలంతా ప్రజాక్షేత్రానికే పరిమితంకావాలన్న సూచనలు కేసీఆర్‌ నుంచి అందుతున్నాయి. జమిలీ ఎన్నికలకు కేంద్రం ఆసక్తి చూపుతోందన్న ప్రచారం ఉన్నా... మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లాంటి పెద్ద రాష్ట్రాలకు ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటితోపాటే కేంద్రం పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి. దీంతో తెలంగాణలోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ ఆసక్తి చూపిస్తోంది. ప్రధాని మోదీతో బేటీ అనంతరం సీఎం కేసీఆర్‌ ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నట్టు కనిపిస్తోంది.
పార్టీని బలోపేతం చేసుకునే పనిలో టీఆర్‌ఎస్‌ 
ముందస్తు అంచనాలతో అధికారపార్టీ బలోపేతం చేసుకునే పనిలో పడింది. బలమైన నేతలను కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు.  వారం రోజులుగా ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు గులాబీ గూటికి చేరుతున్నారు. నవంబర్‌, డిసెంబర్‌ నాటికి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న స్పష్టమైన సంకేతాలను గులాబీ దళపతి తమ ఎమ్మెల్యేలకు ఇస్తున్నట్టు సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కొంత మందికి తమ నియోజకవర్గాల్లో పరిస్థితులు చక్కదిద్దుకోవాలని సూచనలను కూడా కేసీఆర్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు అభ్యర్థులపై స్పష్టత ఇచ్చేందుకు కూడా సీఎం నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే గద్వాల నియోజకవర్గంలో కృష్ణమోహన్‌రెడ్డిని సభపై ప్రకటించారు కేసీఆర్‌. 
ఇబ్బందులు అధిగమించే పనిలో గులాబీ బాస్‌
రానున్న రోజుల్లో టీఆర్ ఎస్ లో మరిన్ని చేరికలు
గులాబీ పార్టీకి ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముందస్తు ఎన్నికల అంచనాతో కీలక నేతలను కారెక్కించుకుకోవడంపై అధికారపార్టీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. రాబోయే రోజుల్లో మరింత మంది విపక్షనేతలు అధికారపార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

 

07:28 - June 30, 2018

తూర్పుగోదావరి : ఏపికి అన్యాయం చేసిన రాజకీయల పార్టీలను వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు. కొత్త రాష్ట్రానికి న్యాయం చేస్తారని ప్రధాని మోదీని నమ్ముకుంటే... చివరికి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీలకు వచ్చే ఎన్నికల్తో తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో టీడీపీయే కీలకపాత్ర పోషిస్తుందని కాకినాడలో జరిగిన ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు జోస్యం చెప్పారు. 
కాకినాడలో ధర్మపోరాట దీక్ష సభ 
కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా టీడీపీ కాకినాడలో ధర్మపోరాట దీక్ష సభ నిర్వహించింది. జేఎస్‌టీయూ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.  ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతోపాటు, రాష్ట్రంలోని వైసీపీ, బీజేపీ, జనసేన  పార్టీలు అవలంభిస్తున్న వైఖరిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా అన్యాయం చేసిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వపై ధర్మపోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలను వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. 
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో చక్రం తిప్పుతామన్న చంద్రబాబు 
2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ సీట్లను టీడీపీ గెలుచుకుని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో చక్రం తిప్పుతామని చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోదీకి దమ్ము, ధైర్యం ఉంటే అవినీతి, అక్రమ పద్ధతుల్లో జగన్‌ సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. టీటీడీ మాజీ అర్చకుడు రమణ దీక్షితులును అడ్డంపెట్టుకుని వైసీపీ, బీజేపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. 
కన్నా వైసీపీకి సొంతమైకు, బీజేపీకి అద్దెమైకు : సీఎం చంద్రబాబు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీకి సొంతమైకు, బీజేపీకి అద్దెమైకులా మారాయని చంద్రబాబు విమర్శించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం రమేశ్‌ దీక్ష చేస్తున్నా... కేంద్ర పట్టించుకోపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన బంద్‌ను తప్పుపట్టారు. బంద్‌లో రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని వాస్తవాన్ని గ్రహించాలని కోరారు.

 

నేడు 119 నియోజకవర్గ ఇంచార్జ్ లతో డీసీసీ అధ్యక్షుల సమావేశం

హైదరాబాద్ : నేడు 119 నియోజకవర్గ ఇంచార్జ్ లతో డీసీసీ అధ్యక్షుల సమావేశం జరుగనుంది. 

నేడు 201వ రోజుకు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర

తూర్పుగోదావరి : నేడు 201వ రోజుకు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చేరుకుంది. నేడు భీమనపల్లి నుంచి ప్రారంభం జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. సింగరాయపాలెం, అనంతవరం, మహిపాలెంచెరువులో పాదయాత్ర కొనసాగనుంది. 

 

నేడు సీఎం రమేష్ దీక్షకు సంఘీభావం తెలుపనున్న సీఎం చంద్రబాబు

కడప : నేడు సీఎం రమేష్ దీక్షకు సీఎం చంద్రబాబు సంఘీభావం తెలుపనున్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం 11 రోజులుగా సీఎం రమేష్ దీక్ష చేస్తున్నారు. 

Don't Miss