Activities calendar

01 July 2018

21:32 - July 1, 2018

మహారాష్ట్ర : ధూలే జిల్లాలో దారుణం జరిగింది. రయిన్‌పడా తండా వాసులు ఐదుగుర్ని కొట్టి చంపారు. తండాలో ప్రవేశించిన ఐదుగురు వ్యక్తులను చిన్నారులను కిడ్నాప్‌చేసే ముఠాగా అనుమానించిన గ్రామస్థులు... వారిపై దాడిచేసి కొట్టిచంపేశారు. మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులో రయిన్‌పడా తండా దిగిన వ్యక్తులు అక్కడ జరుగుతున్న సంతలో ఓ చిన్నారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన సంతకు వచ్చిన గ్రామస్థులు మూకుమ్మడిగా కొత్త వ్యక్తులపై దాడి చేసి చితకబాదారు. రయిన్‌పడా తండా వాసుల ఆగ్రహానికి ఆ ఐదుగురు వ్యక్తులు ఘటనాస్థలంలోనే మరణించారు. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు సంచరిస్తున్నాయన్న వదంతులు వ్యాపించాయి. బాధితులు మృతదేహాలను సమీపంలోని పింపల్నేర్‌ ఆస్ప్రతికి తరలించారు. 

21:17 - July 1, 2018

ఢిల్లీ : స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఆయుధం అగ్ని-5. ఇది 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అంతటి సామర్థ్యం గల బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-5 త్వరలో భారత అమ్ములపొదలోకి చేరబోతోంది. త్వరలో భారత ఆర్మీచేతికి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-5 చేరబోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ అస్త్రం 5వేల కిలోమీటర్ల వరకు వెళ్లి....శత్రు లక్ష్యాలను నాశనం చేయగలదు. చైనాను వణికించే ఈ క్షిపణిని త్వరలోనే స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌కు అందజేస్తామని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఎస్‌ఎఫ్‌సీకి అందించే ముందు ఈ క్షిపణిని అన్ని స్థాయుల్లో పరీక్షిస్తున్నారు. గత నెలలో ఒడిశా తీరంలో ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగంలో నిర్దేశిత లక్ష్యాన్ని అగ్ని-5 సాధించింది. అయితే మిగిలిన క్షిపణుల కన్నా అగ్ని-5 చాలా అధునాతనమైనది. కొత్తగా సిద్ధం చేసిన అనేక పరిజ్ఞానాలను ఈ అస్త్రంలో వినియోగించారు. నేవిగేషన్‌ వ్యవస్థలు, కచ్చితత్వంతో కూడిన రింగ్‌ లేజర్‌ జైరో ఆధారిత ఇనర్షియల్‌ నేవిగేషన్‌ వ్యవస్థ, అధునాతన మైక్రో నేవిగేషన్‌ వ్యవస్థలు ఈ క్షిపణిని కచ్చిత లక్ష్యంతో చేరవేస్తాయి. ఈ క్షిపణిలో అత్యంత వేగంగా పనిచేసే కంప్యూటర్‌, సరికొత్త సాఫ్ట్‌వేర్‌, డిజిటల్‌ నియంత్రణ, అధునాతన కంపాక్ట్‌ ఏవియానిక్స్‌ వంటి వ్యవస్థలన్నీ ఉన్నాయి.

అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణితో చైనాలోని బీజింగ్‌ సహా షాంఘై, గాంఘూ, హాంకాంగ్‌లను టార్గెట్‌ చేయవచ్చు. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్‌, ఉత్తరకొరియాలు మాత్రమే ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని కలిగి ఉన్నాయి. ఇప్పుడు భారత్‌ కూడా ఈ దేశాల సరసన చేరింది.

21:12 - July 1, 2018

హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా బసంత్‌ నగర్‌ టోల్‌ గేట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బసంత్‌ నగర్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు.

నిర్మల్‌ జిల్లా ఎల్లపెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. 44 జాతీయ రహదారిపై ఇన్నోవా వాహనం బోల్తా కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు హైదరాబాద్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

సోమవారం కొనసాగనున్న ఆక్రమణల కూల్చివేతలు...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఆదివారం 1317 ఆక్రమణల తొలగించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. సోమవారం కూడా ఆక్రమణల కూల్చివేతలు కొనసాగనున్నాయని వెల్లడించారు. 

వైసీపీ గర్జన కార్యక్రమం...

అనంతపురం : అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో సీఎం చంద్రబాబు వంచనపై వైసీపీ గర్జన కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీలు, నేతలు పాల్గొననున్నారు. 

సోమవారం నుండి కొబ్బరి వ్యాపారుల బంద్...

తూర్పుగోదావరి : ఈ పర్మిట్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉభయ గోదావరి జిల్లాలో సోమవారం నుండి కొబ్బరి వ్యాపారులు బంద్ పాటించనున్నారు. దీనితో కొబ్బరి వ్యాపార లావాదేవీలు నిలిచిపోయానున్నాయి. పాత విధానాన్ని కొనసాగించకపోతే నిరవధిక సమ్మెకు పూనుకుంటామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. 

9 నుండి చాందీ జిల్లాల పర్యటన...

విజయవాడ : ఈనెల 9 నుంచి 31 వ తేదీలోగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పర్యటించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌చాందీ నిర్ణయించారు. ఈనెల 9న కృష్ణా, 10న గుంటూరు, 11న ప్రకాశం, 12న నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. 

యువకుడిని తగులబెట్టేందుకు టీఆర్ఎస్ నేతల యత్నం...

కరీంనగర్ : అధికార పార్టీ నేతల దౌర్జన్యం బయటపడింది. టీఆర్ఎస్ పార్టీలో చేరలేదని దళిత యువకుడు ఆనంద్ ని చితకబాది పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నించారు. తప్పించుకుని పోలీసులకు ఆనంద్ ఫిర్యాదు చేశాడు. 

21:06 - July 1, 2018

హైదరాబాద్ : ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు రోజులుగా అక్రమణలను తొలగించే పనిలో నిమగ్నమైయ్యారు జీహెచ్‌ఎంసీ సిబ్బంది. అధునాతన యంత్రాలతో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గేది లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్ విశ్వజిత్‌ చెబుతుంటే.. మరోవైపు తమకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం అన్యాయమని చిరువ్యాపారులు అంటున్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ ఆధ్వర్యంలో రెండో రోజూ ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మరీ రంగంలోకి దింపారు అధికారులు. దీంతో తొలగింపులు ముమ్మరంగా సాగుతున్నాయి. తొలిరోజు వేయికి పైగా అక్రమ నిర్మాణాలు తొలగించిన అధికారులు, రెండో రోజు కూడా వేయికి పైగా నిర్మాణాలను తొలగించారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

హిమాయత్‌నగర్‌తో పాటు నారాయణగూడ వంటి పలు ప్రాంతాల్లోని ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. ఉదయాన్నే ఆరు బృందాలుగా ఏర్పడిన సిబ్బంది పలు ప్రాంతాల్లో తొలగింపులు చేపట్టారు. జేసీబీల సాయంతో పాటు జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొని ఆక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ డ్రైవ్‌ను మూడు రోజుల పాటు నిర్వహిస్తామన్నారు.

వీధి వ్యాపారుల ఆక్రమణలే కాకుండా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, నీటి సరఫరా పైప్‌లైన్లు కూడా వీటిపైనే ఏర్పాటుయ్యాయని జీహెచ్‌ఎంసీ అధికారులు మండిపడుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న ఆక్రమణలకు తొలగించడానికి మొత్తం 120 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 127.5 కిలో మీటర్ల పొడవున ఆక్రమణలను గుర్తించిన అధికారులు.. కూల్చివేతలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే జీహెచ్‌ఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం అన్యాయమని చిరువ్యాపారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

21:04 - July 1, 2018

విజయవాడ : 2019 ఎన్నికల కోసం ఏపీలో పార్టీని పటిష్టపరచాలని కాంగ్రెస్‌ అధినాయకత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఉమెన్‌చాందీ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఈనెల 9 నుంచి 31 వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటించే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి వెళ్లిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ నాయకత్వం సిద్ధమైంది. వచ్చే ఎన్నికలకు ఏపీలో కాంగ్రెస్‌ను సమాయత్తం చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం నడుంబిగించింది. దీనిలో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌చాందీ హైదరాబాద్‌లో ఏపీ కాంగ్రెస్‌ నాయకులతో భేటీ అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఏఐసీసీ కార్యదర్శులు హోదాలో ఏపీకి ఇన్‌చార్జ్‌లుగా నియమితులైన కిస్టోఫర్‌, అయ్యప్పన్‌ కూడా సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈనెల 9 నుంచి 31 వ తేదీలోగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పర్యటించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌చాందీ నిర్ణయించారు. ఈనెల 9న కృష్ణా, 10న గుంటూరు, 11న ప్రకాశం, 12న నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. ఆ తర్వాత మిగిలిన జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సమావేశాలకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులను ఆహ్వానించారు. జిల్లా స్థాయిలో జరిగే సమావేశాల్లో పార్టీ బలాబలాలను అంచనా వేసి, లోపాలు సరిదిద్దుకునే విధంగా దిశానిర్దేశం చేస్తారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఫైలుపై తొలి సంతకం చేస్తామని రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ అంశంపై యూపీఏ ఇచ్చిన హామీ ఎన్డీయే అమలు చేయకపోవడాన్ని ఊమెన్‌చాందీ తప్పుపట్టారు. పార్టీ పటిష్టత కోసం కొత్తగా అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయించింది. వివిధ కారణాలతో 2014 ఎన్నికల ముందు పార్టీని వీడివెళ్లిన వారంతా తిరిగి వస్తే చేర్చుకునే విధంగా పార్టీ నాయకులను ఊమెన్‌చాందీ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కేరళలో సీపీఎం కార్యకర్తలపై దాడులు...

కేరళ : నలుగురు సీపీఎం కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కన్నూరు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

వైసీపీ మాజీ ఎంపీల సమావేశం...

అనంతపురం : వైసీపీ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు సమావేశమయ్యారు. సోమవారం అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో సీఎం చంద్రబాబు వంచనపై గర్జన కార్యక్రమంపై చర్చించారు. 

కొబ్బరి వ్యాపారుల బంద్...

తూర్పుగోదావరి : ఈ పర్మిట్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఉభయ గోదావరి జిల్లాలో సోమవారం నుండి కొబ్బరి వ్యాపారులు బంద్ పాటించనున్నారు. దీనితో కొబ్బరి వ్యాపార లావాదేవీలు నిలిచిపోయానున్నాయి. పాత విధానాన్ని కొనసాగించకపోతే నిరవధిక సమ్మెకు పూనుకుంటామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

 

4న టిడిపి నేతల నిరహార దీక్ష...

విశాఖపట్టణం : రైల్వే జోన్ సాధన కోసం ఈనెల 4వ తేదీన టిడిపి నేతలు నిరహార దీక్ష చేయనున్నారు. జ్ఞానాపురం రైల్వే స్టేషన్ ఎదుట నిరహార దీక్ష చేయనున్నట్లు హోం మంత్రి చిన రాజప్ప పేర్కొన్నారు.

 

1317 ఆక్రమణల తొలగింపు...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఆదివారం 1317 ఆక్రమణల తొలగించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. సోమవారం కూడా ఆక్రమణల కూల్చివేతలు కొనసాగనున్నాయని వెల్లడించారు. 

19:10 - July 1, 2018

హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 3 లేదా 4వ తేదీల్లో రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌చాందీ కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయి, పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఇందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పంచిందించినట్టు సమాచారం.

కిరణ్‌కుమార్‌రెడ్డితో ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఊమెన్‌చాందీ భేటీ అయ్యారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌లోని కిరణ్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ఊమెన్‌చాందీ... ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించారు. ఏపీలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు పార్టీలో చేరాలని చాందీ కోరారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. విభేదాలను పక్కనపెట్టి ఏపీలో కాంగ్రెస్‌ పటిష్టత కోసం ఆలోచించాలని ఊమెన్‌చాంధీ కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే ఏఐసీసీలో కీలకపదవి కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్సుకే కాదు.. యావత్‌ దేశానికి కీలక సమయమని... సత్వరం నిర్ణయం తీసుకోవాలని ఊమెన్‌చాందీ కోరగా... కిరణ్‌కుమార్‌ సుముఖతవ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

ఊమెన్‌చాందీ ఆహ్వానంపై కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ... సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానన్నారు. కాంగ్రెస్‌లో చేరాలని కిరణ్‌కుమార్‌రెడ్డిని ఇంతకు ముందే కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, సుబ్బరామిరెడ్డి కూడా రోరారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ కుటుంబంలోని వ్యక్తేనని పల్లంరాజు మరోసారి స్పష్టం చేశారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 2014 ఫిబ్రవరి 19న ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి పదవితోపాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. 2014 మార్చి 10న జై సమైఖ్యాంధ్ర పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. గత ఎన్నికల్లో ఏపీలో చిత్తుగా ఓడియిన తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2009లో 13వ ఏపీ శాసనసభకు కొంతకాలం పాటు స్పీకర్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి రోశయ్య రాజీనామా తర్వాత 2011లో ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన సమయం వరకు పని చేశారు.

19:03 - July 1, 2018

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిన ఘటనలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. పౌడిగర్వాల్‌ జిల్లా నైనిదండ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. 28 సీట్ల సామర్థ్యం కలిగిన బస్సులో 50 మందిని ఎక్కించారు. ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సు అదుపుతప్పి 200 మీటర్ల లోతు లోయలోపడింది. బస్సు రామ్‌నగర్‌ నుంచి భోయాన్‌ వెళ్తుండగా పౌడిగర్వాల్‌ జిల్లా నైనిదండ బ్లాక్‌ పరిధిలోని పిపాలి-భోయాన్‌ మోటార్‌ వే మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. సామర్థ్యాన్ని మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పౌడిగర్వాల్‌ జిల్లా ఎస్పీ జగత్‌రామ్‌ జోషి చెప్పారు.

బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఉత్తరాఖండ్‌ బస్సు ప్రుమాదంపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ట్విటర్‌ ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

18:58 - July 1, 2018

విజయనగరం : జిల్లాలో వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరన్నదానిపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఔట్‌ అవుతారు.. కొత్త ముఖాలు ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ముందస్తు గంట మోగుతుండడంతో ఎమ్మెల్యేల్లో కలకలం మొదలైంది. మళ్లీ తమ అభ్యర్థిత్వాన్ని, స్థానాన్ని నిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మూడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపొందగా... మిగిలిన ఆనే స్థానాల్లోనూ అధికారపార్టీ విజయబావుటా ఎగురవేసింది. బొబ్బిలి నుంచి వైసీపీ తరుపున గెలుపొందిన ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు పెరిగింది.

మరో ఏడాదిలోపే ఎన్నికలు రాబోతున్నాయి. జిల్లాలో అధికారపార్టీ నుంచి సిట్టింగ్‌ల్లో ఎంతమందికి చాన్స్‌ ఇస్తారు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎంతమంది ఉంటారు... ఎంతమంది అవుట్‌ అవుతారన్న సందిగ్దత నెలకొంది. అధికారపార్టీకి చెందిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో కొంతమందికి రానున్న ఎన్నికలు గుబులు పుట్టిస్తున్నాయి. తమకు మళ్లీ టికెట్‌ వస్తుందో లేదోన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. సుజయ కృష్ణ రంగారావు, ఎస్‌. కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తప్పితే.. మిగిలిన అధికారపార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉంది. గడిచిన నాలుగేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

నెలిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడు పనితీరుపట్ల అంతగా విమర్శలేవీ లేవు. కానీ వయోభారం రీత్యా ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ప్రశ్నార్థకమే. వచ్చే ఎన్నికల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడి నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే దీనిని గంటాతోపాటు పార్టీ శ్రేణులు కూడా కొట్టిపారేశాయి. చీపురుపల్లి నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న మాజీమంత్రి కిమిడి మృణాళిని భవిష్యత్‌ కూడా ప్రశ్నార్థకంగా మారింది. మృణాళిపై ఎక్కడా అవినీతి, అక్రమాల ఆరోపణలు లేనప్పటికీ... పార్టీ శ్రేణులకు ఆమె దూరంగా ఉంటారన్న అపవాదును మూటగట్టుకుననారు. ఏదో ప్రభుత్వ ఉద్యోగిలా తన పని తాను చేసుకోవడమే తప్ప... పార్టీ నేతలను , కార్యకర్తల అవసరాలను పట్టించుకోరన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగా ఆమె మంత్రి పదవి కూడా కోల్పోవాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మృణాళికి సీటు దక్కుతుందా అంటే అనుమానమేనని చెప్పాలి.

విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత పనితీరుపై మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆమె పాలనలో పట్టుబిగించారు. విజయనగరం మున్సిపాలిటీ చైర్‌పర్స్‌కు.. గీత మధ్య తలెత్తిన ఆధిపత్యపోరు పార్టీ శ్రేణులను కొంత ఇబ్బందికి గురిచేసింది. ప్రస్తుతం విభేదాలేవీ కనిపించకపోయినప్పటికీ లోలోన మాత్రం ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి గంటా సూచనలు, సలహాలతో ఆమె పాలన సాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె అశోక్‌గజపతిరాజకు దూరమవుతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో ఆమె అభ్యర్థిత్వంపై స్పష్టత లేనట్టే.

గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్‌ కె.ఎ. నాయుడు పనితీరుపై మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. అవినీతి, ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నుంచే ఆయనపై నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ప్రతి పనిలో కమీషన్లు తీసుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా అధికారులపై శివాలెత్తడంతోపాటు.. పార్టీ సీనియర్లను పెద్దగా పట్టించుకోరన్న అపవాదు ఉంది. మంత్రి సుజయ కృష్ణరంగారావుతో ఆయన సఖ్యతతో ఉంటారన్న పేరుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవుల పనితీరు కూడా ఏమాత్రం సంతృప్తిగా లేదన్న వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ కనుసన్నల్లోనే ఎమ్మెల్యే పాలన సాగుతోందన్న విమర్శలు లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవులకే టిక్కెట్టు వస్తుందని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు.

విజయనగరం జిల్లాలోని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై అధిష్టానం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది.  ఇంటలీజెన్స్‌ రిపోర్ట్స్‌ను కూడా తీసుకుంటూ పరిస్థితిని గమనిస్తోంది. పార్టీ బలోపేతంతోపాటు కార్యకర్తలు, ప్రజల అవసరాలు గుర్తించని ఎమ్మెల్యేలకు మరోసారి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు.  మొత్తానికి జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో... ఎంతమంది కొంతమంది వస్తారో అన్నది ఆసక్తి రేపుతోంది.

కురియన్ కు వీడ్కోలు కార్యక్రమం...

ఢిల్లీ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాసంలో రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ కురియన్ కు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్ పాల్గొన్నారు. 

ఏపీ కాంగ్రెస్ నేతలతో ఉమెన్ చాందీ భేటీ...

హైదరాబాద్ : ఇందిరా భవన్ లో ఏపీ కాంగ్రెస్ నేతలతో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ ఉమెన్ చాందీ భేటీ అయ్యారు. రఘువీరా, కేంద్ర మాజీ మంత్రులు పళ్లం రాజు, కోట్ల సూర్యప్రకాష్, జేడీ శీలం, ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

పోలీసుల నియామకాలకు దరఖాస్తుల గడువు...

హైదరాబాద్ : పోలీసుల నియామకాలకు దరఖాస్తుల గడువు ముగిసిందని తెలంగాణ పోలీసు నియామక బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టులకు 7.19 లక్షల దరఖాస్తులు..1271 సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు 1.88 లక్షల దరఖాస్తులు...29 కమ్యూనికేషన్ ఎస్ఐ పోస్టులకు 13944 దరఖాస్తులు...26 ఫింగర్ ప్రింట్ ఎస్ఐ పోస్టులకు 14986 దరఖాస్తులు..అందాయన్నారు. 

17:20 - July 1, 2018

గుంటూరు : జిల్లాలోని మంగళగిరి వద్ద పెను ప్రమాదం తప్పింది. సల్ఫ్యూరిక్ యాసిడ్ తో వెళుతున్న ట్యాంకర్ బోల్తా పడింది. ఓ ట్యాంకర్ కాకినాడ నుండి సల్ఫ్యూరిక్ యాసిడ్ లోడ్ తో చెన్నైకి వెళుతోంది. కానీ కాజా టోల్ గేట్ వద్దకు రాగానే ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీనితో డ్రైవర్ చాకచక్యంతో నడిపి రోడ్డు పక్కన పోనిచ్చాడు. చివరకు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. బోల్తా కొట్టడంతో యాసిడ్ లీక్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టారు. 150 దూరంలో వాహనాలను మళ్లించారు. వాహనాలను బయటకు తీసేందుకు రెండు క్రేన్ లను ఉపయోగిస్తున్నారు. ముందస్తు జాగత్రలో భాగంగా మూడు అగ్నిమాపక ఇవాహనాలను తీసుకొచ్చారు. 

ఢిల్లీలో స్వల్ప భూకంపం...

ఢిల్లీ : దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.0గా గుర్తించారు. హర్యానాలోని సోనిపట్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 

16:37 - July 1, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. గాంధీ భవన్ లో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టెన్ టివితో ఆయన ముచ్చటించారు. పార్టీని వీడుతున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని, తాను ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేయలేదన్నారు. దానం ఒక టైపు..మనం ఒక టైపు..అని అభివర్ణించారు. డివిజన్ లోకి వెళ్లలేదని..డివిజన్..ఇతర నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. 

16:32 - July 1, 2018

హైదరాబాద్ : నాలుగేళ్ల మోడీ పాలనలో కార్పొరేర్లకు, సంపన్నులకు మాత్రమే మేలు జరిగిందిని మండిపడ్డారు సీఐటీయు అఖిల భారత ప్రధాన కార్యదర్శి హేమలత. దేశంలో ఉపాధి సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు కార్మికులతో పాటు అన్ని తరగతుల ప్రజలను కలుపుకొని ఐక్యపోరాటాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. .

16:30 - July 1, 2018

హైదరాబాద్ : HICCలో జరిగిన ఎంపీ సుబ్బిరామరెడ్డి మనవడు అనిరుద్‌, నేహాల వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి కేటీఆర్‌, టీఆర్‌ఎస్ నేతలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహానికి ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

 

16:28 - July 1, 2018

హైదరాబాద్‌ : జియాగూడలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను మంత్రి కేటీఆర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారీ ప్రాజెక్టు నమూనా, నాణ్యత, ఆధునిక హంగులతో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. గతేడాది జులైలో జియాగూడలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఒక్కో ఇంటికి 8.50లక్షల వ్యయంతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 

16:27 - July 1, 2018

హైదరాబాద్ : మహిళలకు డ్యాన్స్‌ ద్వారా ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నారు ఎరోక్‌ డ్యాన్స్‌ ఫిట్‌ సంస్థ నిర్వాహకులు. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో 10 రోజులుగా ఫిట్‌ నెస్‌ ట్రైనింగ్‌ ఇస్తున్నారు. డ్యాన్స్‌ ద్వారా మహిళలు ఫిట్‌నెస్‌ అవుతారనే ఉద్దేశ్యంతో ఈ ట్రైనింగ్‌ ఇస్తున్నామని ఎరోక్‌ డ్యాన్స్‌ ఫిట్‌ సంస్థ నిర్వాహకులు అన్నారు. ట్రైనింగ్‌ పూర్తి అయిన మహిళలతో ఈ రోజు ఫిట్‌ నెస్‌ పోగ్రామ్‌ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

16:25 - July 1, 2018

మహారాష్ట్ర : బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు అధికారులు తెరిచారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలవనరుల సంఘాల ఒప్పందం ప్రకారం నేటి నుంచి అక్టోబర్‌ 28 వరకు గేట్లు తెరుచుకొని ఉంటాయి. మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు జూన్‌ 11న బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తడంతో ఎస్‌.ఆర్‌.ఎస్‌పీ లోకి 4టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం ఆర్‌.ఎస్‌.పీలో 90 టీఎంసీలకు 10 టీ.ఎం.సీల నీరు నిల్వఉంది. 14 గేట్ల ద్వారా నీరు దిగువకు పరవళ్లు తొక్కుతుండడంతో గోదావరి తీర ప్రాంత ప్రజలను అధికారులను అప్రమత్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:11 - July 1, 2018

మహబూబాద్ : జిల్లా తొర్రూరులో నకిలీ వైద్యులు చలామణి కలకలం రేపుతోంది. ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్ పై ఇద్దర వైద్యులు చలామణి అవుతున్నారు. డా.పి.రాంబాబు పేరు ఉన్న వైద్యులకు ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండడం గమనార్హం. వైద్య విధాన పరిషత్ పరిధిలో డాక్టర్ల నియామకంతో ఈ అనుమానం తలెత్తాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు డాక్టర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

తొర్రూరులో నకిలీ వైద్యులు...

మహబూబాద్ : జిల్లా తొర్రూరులో నకిలీ వైద్యులు చలామణి కలకలం రేపుతోంది. ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్ పై ఇద్దర వైద్యులు చలామణి అవుతున్నారు. డా.పి.రాంబాబు పేరు ఉన్న వైద్యులకు ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండడం గమనార్హం. వైద్య విధాన పరిషత్ పరిధిలో డాక్టర్ల నియామకంతో ఈ అనుమానం తలెత్తాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు డాక్టర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. 

కిరణ్ నివాసానికి ఉమెన్ చాందీ...

విజయవాడ : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నివాసానికి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కిరణ్ కు ఆహ్వానం పలుకునున్నారు. 3-4 తేదీల్లో కాంగ్రెస్ లో కిరణ్ చేరనున్నట్లు సమాచారం. 

15:10 - July 1, 2018

ఉత్తరాఖండ్ : ఎన్నో ప్రమాదాలు..అయినా అధికారుల నిర్లక్ష్యం..అవే ఘటనలు..ఎంతో మంది మృతి చెందుతున్నా పాలకులు స్పందించడం లేదు.. ఉత్తరాఖండ్ లో మరో ఘోరం చోటు చేసుకుంది. ఓ బస్సు లోయలో పడిపోవడంతో 48 మంది ప్రయాణీకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. పారిగల్వార్ జిల్లా నానిదండ దగ్గర బస్సు లోయలో పడిపోయింది. దాదాపు 60అడుగుల లోతులో బస్సు పల్టీలు కొడుతూ పడిపోయింది. దీనితో 48 మందికి మృతి చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సుమారు 50 మంది ప్రయాణీకులున్నట్లు తెలుస్తోంది. కెపాసిటీకి మించి ప్రయాణీకులను ఎక్కించుకున్నట్లు సమాచారం. మలుపులు తిరిగే రోడ్ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

కిరణ్ కుమార్ బ్యాక్ ఇన్ కాంగ్రెస్...!

విజయవాడ : ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈనెల 3 లేదా 4వ తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 

14:35 - July 1, 2018

విజయవాడ : ఏపీ కాంగ్రెస్ ను మళ్లీ గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్ర వ్యహారాల ఇన్ చార్జీ ఊమెన్ చాందీ ప్రత్యేకంగా ఏపీపై దృష్టి పెట్టారు. గతంలో పార్టీ నుండి వెళ్లిపోయిన నాయకులను దగ్గర తీసుకొనేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. ఉమ్మడి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు సీనియర్ నేతలు భేటీ అయిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈనెల 3 లేదా 4వ తేదీల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 

14:29 - July 1, 2018

తూర్పుగోదావరి : నిత్యం వివాద అంశాలతో వార్తల్లో ఉండే సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై పోలీసు కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతున్నాయి. భారతీయుల ఆరాధ్యదైవం శ్రీరాముడిని ఉటంకిస్తూ ఓ టీవీ ఛానెల్ లో కత్తి మహేష్ వ్యాఖ్యలు చేశారంటూ అమలాపురంలో హిందూ ఆజాద్ ఫౌండేషన్ నేతలు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కత్తి మహేష్ తో పాటు ప్రసారం చేసిన టీవీ ఛానెల్ పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

14:23 - July 1, 2018

రాజన్న సిరిసిల్ల : ప్రేమ హత్యలు..ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకోలేదంటూ పలువురు ఆందోళన కొనసాగిస్తున్న ఘటనలు వెలుగు చూస్తుంటాయి. ప్రేమ పెళ్లికి అంగీకరించకపోవడంతో ప్రేమ జంటలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించడం లేదంటూ..సమస్యను పరిష్కరించడం లేదంటూ ఓ యువతి వాటర్ ట్యాంకర్ ఎక్కి ఆందోళన చేపట్టింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెందుర్తి మండలం మర్రిగడ్డలో చోటు చేసుకుంది.

హైదరాబాద్ లో పనిచేస్తున్న యువతి...ప్రశాంత్ ల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ తరువాత ఏమైందో తెలియదు కానీ...ప్రశాంత్ పెళ్లికి అంగీకరించలేదు. దీనితో అప్పటి నుండి యువతి ఆందోళన చేపట్టింది. గతంలో ఒకసారి ప్రియుడు ఇంటి ఎదుట యువతి ఆందోళన చేపట్టినట్లు సమాచారం.

తరువాత మాట్లాడుదామని చెప్పి తాత్కాలికంగా సమస్యను పెద్దలు పక్కకు పెట్టినట్లు సమాచారం. తన సమస్యను ఎంతకు పరిష్కారం కాకపోవడంతో ఆదివారం మర్రిగడ్డకు చేరుకున్న యువతి స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంకర్ ఎక్కింది. తనకు ప్రశాంత్ తో వివాహం చేయాలని..తన సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఆమెకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యువతి వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ భయపడి పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిద్రమాత్రలు మింగానని చెప్పిన యువతిని కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మర్రిగడ్డలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం...

రాజన్న సిరిసిల్ల : చెందుర్తి మండలం మర్రిగడ్డలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలంటూ యువతి వాటర్ ట్యాంకర్ ఎక్కింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ నిద్రమాత్రలు మింగింది. విషయం తెలుసుకున్న యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

బాబ్లీ గేట్లు ఎత్తివేత...

మహారాష్ట్ర : బాబ్లీ వద్ద గేట్లను అధికారులు ఎత్తారు. గోదావరి నీటిని దిగువకు విడుదల చేశారు. కేంద్ర జలసంఘం, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నీటిని విడుదల చేశారు. 

లోయలో పడిన బస్సు 45 మంది మృతి...

ఉత్తరాఖండ్ : పారిగర్వాల్ జిల్లా నానిదండ వద్ద లోయలో బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది దుర్మరణం చెందారు. ప్రమాదాలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. 

విజయవాడలో బసవతారకం ఇండో అమెరికన్...

విజయవాడ : బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో సమాచార కేంద్రం, క్లినిక్ ను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. 

14:00 - July 1, 2018

కాకినాడ : ధర్మపోరాట దీక్ష విజయవంతం చేసింది కార్యకర్తలేనని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. దళితుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 

ఉత్తరాఖండ్ లో రోడ్డు ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్ : ఘోర ప్రమాదం జరిగింది. పారిగల్వార్ జిల్లా నానిదండ లోయలో బస్సు పడిపోయింది. 40 మందికి ప్రయాణికులు పైగా మృతి చెందారు. అదుపుతప్పి బస్సు 60 అడుగుల లోతులో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. 

13:54 - July 1, 2018

ఉత్తరాఖండ్ : ఘోర ప్రమాదం జరిగింది. పారిగల్వార్ జిల్లా నానిదండ లోయలో బస్సు పడిపోయింది. 40 మందికి ప్రయాణికులు పైగా మృతి చెందారు. అదుపుతప్పి బస్సు 60 అడుగుల లోతులో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. రాంనగర్ కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి పోలీసులు, సహాయక సిబ్బంది చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, ఉత్తరాఖండ్ సీఎం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.  

13:42 - July 1, 2018

రాజమండ్రి : ఎస్సీ, ఎస్టీ చట్టం పరిరక్షణతోపాటు.. పలు సమస్యల పరిష్కారానికి.. ఈనెల 21న మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నామని ప్రకటించారు మాజీ ఎంపీ హర్షకుమార్‌. చిత్తశుద్ధి ఉంటే మిలియన్‌ మార్చ్‌లో పాల్గొనాలని పాలక, ప్రతి పక్షాల అథినేతలకు పిలుపునిచ్చారు. వామపక్షాలతో పాటు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా తమకు మద్ధతు తెలిపారని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ తో మాజీ ప్రధాని దేవెగౌడ భేటీ

హైదరాబాద్ : మాజీ ప్రధాని దేవెగౌడ ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించనున్నారు. 

 

13:38 - July 1, 2018

హైదరాబాద్ : మాజీ ప్రధాని దేవెగౌడ ఇవాళ తలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించనున్నారు. 

చిక్కాలలో ఉద్రిక్తత

పశ్చిమగోదావరి : చాగల్లు మండలం చిక్కాలలో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో..  పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.  శివాలయంలో ధ్వజ స్తంభం ఏర్పాటు సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వివాదం.. ఘర్షణకు దారితీసింది. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.

13:27 - July 1, 2018

పశ్చిమగోదావరి : చాగల్లు మండలం చిక్కాలలో టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో..  పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.  శివాలయంలో ధ్వజ స్తంభం ఏర్పాటు సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన వాగ్వివాదం.. ఘర్షణకు దారితీసింది. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.

 

13:25 - July 1, 2018

వరంగల్‌ అర్బన్‌ : ధర్మసాగర్‌ మండలం నారాయణగిరిలో ఉద్రిక్తత నెలకొంది. భూవివాదంలో జక్కుల సుధీర్‌ను ఎంపీపీ భర్త వల్లపురెడ్డి రమణారెడ్డి చితకబాదాడు. ఈ ఘటనలో సుధీర్‌కు తీవ్రగాయాలు కావడంతో... ఎంజీఎంకు తరలించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు... ఎంపీపీ ఇంటిపై రాళ్లదాడి చేశారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. 

 

నారాయణగిరిలో ఉద్రిక్తత..

వరంగల్‌ అర్బన్‌ : ధర్మసాగర్‌ మండలం నారాయణగిరిలో ఉద్రిక్తత నెలకొంది. భూవివాదంలో జక్కుల సుధీర్‌ను ఎంపీపీ భర్త వల్లపురెడ్డి రమణారెడ్డి చితకబాదాడు. ఈ ఘటనలో సుధీర్‌కు తీవ్రగాయాలు కావడంతో... ఎంజీఎంకు తరలించారు. 

13:19 - July 1, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌తో సీపీఎంకు, బీఎల్‌ఎఫ్‌కు లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్‌తో సహా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావ్యతిరేక విధానాలపై మిలిటెంట్‌ తరహా ఉద్యమాలు చేసిన ఏకైక పార్టీ సీపీఎం అని... అలాగే బీఎల్‌ఎఫ్‌, టీ-మాస్‌ కూడా ప్రజలపక్షాన నిలిచాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌తో సీపీఐ, కోదండరామ్‌ పార్టీ జతకడతారని ప్రచారం జరుగుతుందని ఆ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత ఆయా పార్టీలపైనే ఉందని తమ్మినేని అన్నారు. 

13:07 - July 1, 2018

ఉత్తరాఖండ్‌ :  ఘోర ప్రమాదం జరిగింది. పారిగల్వార్‌ జిల్లా నానిదండ దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో లోయలో పడింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకుని పోలీసులు, సహాయకసిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

 

13:02 - July 1, 2018

మంచిర్యాల : జిల్లలోని వేవనపెళ్ళి మండలంలో దారుణ హత్య జరిగింది. క్యాతన పెళ్ళి గ్రామంలో మద్యం తాగొద్దు అన్నందుకు ఓవ్యక్తి తన తండ్రిని హతమార్చాడు. శనివారం రాత్రి సాగర్‌ అనే వ్యక్తి తన తండ్రి బాలయ్యపై కర్రతో దాడిచేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే నిందితుడు పారిపోయాడు. 

 

12:52 - July 1, 2018

 హైదరాబాద్‌ : నగరంలో రెండో రోజూ ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగిస్తున్నారు.  నిన్న పలు ప్రాంతాల్లో ఆక్రమణలను కూల్చివేసిన అధికారులు... ఈరోజు కూడా కూల్చివేతలు చేపట్టారు. ఈ కూల్చివేతలు రేపు కూడా కొనసాగుతాయని అధికారులంటున్నారు. 

 

12:48 - July 1, 2018

సంగారెడ్డి : కొత్త కొత్త రుచుల కోసం ప్రజలు రెస్టారెంట్లు, దాబాలపై వైపు వెళ్లడం ఇప్పుడు సహజంగా మారింది. వీకెండ్ వచ్చిదంటే చాలు...  కుటుంబం అంతా బయటి ఫుడ్ ను అస్వాదించడానికే ఆసక్తి చూపుతున్నారు. కాని సంగారెడ్డిలోని పలు హోటల్స్‌, రెస్టారెంట్స్, దాబాలు, తోపుడు బండ్లు.... ఎక్కడ చూసిన ఆహార పదార్ధాలను కల్తీ చేస్తున్నారు. ప్రజలు డబ్బులిచ్చి మరీ అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు.  ఆహార పదార్థాలు కల్తీమయం అవుతుంటే .. పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం ఏమైనట్లు?  ప్రజారోగ్యం పాడవుతోంటే ఆహార తనిఖీశాఖ ఏం చేస్తోంది? 
జంతు కళేబరాల నుండి తీస్తున్న నూనెలను వాడుతున్న హోటల్స్‌ 
బీజీ లైఫ్ తో ప్రజలు కొత్త రుచుల కోసం రెస్టారెంట్స్ ,దాబాలకు వెళ్తున్నారు.  వీకెండ్ వచ్చిదంటే చాలు కుటుంబ సభ్యులు అంతా కలిసి హోటల్ ఫుడ్స్‌ను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతున్నారు. భిన్నమైన వంటకాల రూచి చూసేందుకు  ఇంట్రెస్ట్‌ కనబర్చుతున్నారు. అయితే జనాల అవసరాన్ని ఆసరా చేసుకుని సంగారెడ్డి జిల్లాలో పలు హోటల్స్‌, రెస్టారెంట్స్‌, దాబాలు ఆహార పదార్థాల కల్తీలకు పాల్పడుతున్నాయి. నూనె, ఉప్పు,పప్పు, కారం ఇలా ప్రతీదాన్ని కల్తీమయం చేసేస్తున్నాయి.
వందల సంఖ్యలో దాబాలు  
సంగారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని జాతీయ రహదారి వెంట దాబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అందులో ఆహార పదార్ధాలు ఎలా తయారువుతున్నాయి, ఏ ఏ మిశ్రమాలతో మన మందుకు వస్తున్నాయి, అన్న అలోచన ఎవరూ చేయడం లేదు.  కొన్ని రోజుల కిత్రం అనేక హోటల్స్‌  జంతు కళేబరాల నుండి తీస్తున్న నూనెలను వాడుతూ దొరికిన సందర్భాలు ఉన్నాయి.  హోటల్ యాజమాన్యాలు  కల్తీ నూనెలు, ఉప్పు, పప్పు, కారం ఉపయోగిస్తూ లాభాలను అర్జిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు.  ఆహార పదార్థాల కల్తీతోపాటు హోటల్‌ సిబ్బంది ఆహార పదార్థాల తయారీ విషయంలో శుభ్రతను అసలు పట్టించుకోవడం లేదు.  హోటల్‌ ముందు అలంకరుణ అద్భుతంగా ఉంటుననా... లోన కిచెన్‌మాత్రం పరమ చెత్తగా దర్శనమిస్తున్నాయి.  ఒకవైపు ఆహార కల్తీ... మరోవైపు అపరిశుభ్రతతో... హోటల్‌కు వచ్చే జనం గుప్పెడు రోగాలను వెంటబెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించాయి. అయితే హోటల్‌ నిర్వహణ ఇలా ఉండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
ఆహార తనిఖీ శాఖ ఏం చేస్తున్నట్టు? 
హోటల్స్‌, రెస్టారెంట్లలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే... ఆహార తనిఖీ శాఖ ఏం చేస్తున్నట్టు? వాస్తవానికి  మెదక్ జిల్లాకు ఒకే ఒక ఫుడ్ ఇన్స్ పెక్టర్ ఉన్నారు.  అసలు రాష్ట్రం మొత్తం కలిపి కేవలం ఆ శాఖకు వివిధ హోదాలతో 13 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. అయితే ఇంత పెద్ద రాష్ట్రంలో ఆహార తనిఖీ శాఖ దుస్థితి ఇలా ఉంటే పొరుగు రాష్ట్రమైన కర్నాటక లో 550 మంది ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్‌ నిత్యం ఆహార తనిఖీలు చేస్తూ కల్తీ ఆహారాన్ని అరికట్టే పనిలో ఉంటున్నారు.  పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆహార తనిఖీశాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. కనీసం ఐదు మండలాలకు ఒక ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ను  నియమించి విస్తృత తనిఖీలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజారోగ్యాన్ని బహిరంగంగా దెబ్బతిస్తున్న హోటల్స్‌, దాబాలు, రెస్టారెంట్లపై  ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 

12:25 - July 1, 2018

ఢిల్లీ : బురారీ ప్రాంతంలో మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ ఇంట్లో ఏడుగురు మహిళలతో సహా 11 మృతదేహాలను గుర్తించారు. మృతదేహాల కళ్లకు గంతలు కట్టి ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. హత్యా...? ఆత్మహత్యా.. ?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

కొనసాగుతున్న ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపు

హైదరాబాద్‌ : నగరంలో రెండో రోజూ ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగిస్తున్నారు. నిన్న పలు ప్రాంతాల్లో ఆక్రమణలను కూల్చివేసిన అధికారులు... ఈరోజు కూడా కూల్చివేతలు చేపట్టారు. ఈ కూల్చివేతలు రేపు కూడా కొనసాగుతాయని అధికారులంటున్నారు. 

 

11:48 - July 1, 2018

 హైదరాబాద్‌ : నగరంలో రెండో రోజూ ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగిస్తున్నారు. నిన్న పలు ప్రాంతాల్లో ఆక్రమణలను కూల్చివేసిన అధికారులు... ఈరోజు కూడా కూల్చివేతలు చేపట్టారు. ఈ కూల్చివేతలు రేపు కూడా కొనసాగుతాయని అధికారులంటున్నారు. 

11:45 - July 1, 2018

హైదరాబాద్ : ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీస్, టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్,  సిబ్బందితో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. అధునాతన యంత్రాలతో పుట్‌పాత్‌లపై ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గేది లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిషనర్ విశ్వజిత్‌ చెబుతుంటే.. మరోవైపు తమకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం అన్యాయమని చిరువ్యాపారులు అంటున్నారు. మరికొన్ని చోట్ల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాల దురుసుతనం విమర్శలకు తావిస్తోంది.
పుట్‌పాత్‌లపై ఆక్రమణల కూల్చివేతకు స్పెషల్‌ డ్రైవ్‌
హైదరాబాద్‌ నగర పరిధిలోని పాదచారుల బాటల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కన్నెర్ర చేస్తోంది. పుట్‌పాత్‌లపై ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు అధికారులు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న పాదచారుల బాటలు ఆక్రమించి దుకాణాలు పెట్టడంతో.. చాలా ప్రాంతాల్లో పాదచారుల బాటే కనుమరుగైంది. దీనిపై చాలా సార్లు ఉన్నత న్యాయ స్థానం కూడా తీవ్రంగా స్పందించింది. దీంతో పాదచారులకు ఇబ్బందులు తొలగించేందుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. 
పాదచారులు రోడ్డుపై నడవాల్సిన దుస్థితి
హైదరాబాద్‌లో సుమారు పదివేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. వాటిలో అతికొద్ది రహదారులకు మాత్రమే పాదచారుల బాట ఉంది. అది కూడా దుకాణదారులు, చిరువ్యాపారుల ఆక్రమణలో ఉంది. దీంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సిన దుస్థితి నెలకొంటోంది. కాగా గత కొంతకాలంగా పాదచారుల బాట ఆక్రమణలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందిస్తోంది. ఏమాత్రం ఉపేక్షించకుండా ఆక్రమణల్ని తొలగించి పాదచారుల హక్కుల్ని కాపాడాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. కోర్టు ఆదేశించిన ప్రతిసారీ బల్దియా యంత్రాంగం కూల్చివేతలకు దిగడం, రాజకీయ నేతల రంగప్రవేశంతో వెనకడుగు వేయడం పరిపాటిగా మారింది. 
ఎన్‌ఫోర్స్‌మెంట్‌  డైరెక్టర్‌ విశ్వజిత్‌కు కూల్చివేతల బాధ్యత
ఆక్రమణల్ని తొలగించే బాధ్యతను ఇటీవల ఏర్పడిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటికి అప్పగించింది జీహెచ్‌ఎంసీ.   పాదచారుల బాటలు క్లియర్‌ చేసేందుకు... సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపారు. 120 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 127.5 కిలో మీటర్ల పొడవున ఆక్రమణలను గుర్తించిన అధికారులు.. మొదటి దశలో 4,133 నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. ప్రకటనల బోర్డులతోపాటు.. మెట్లు, ప్రహరీ గోడలను కూల్చివేస్తున్నారు. అధికారులు వచ్చేదాకా ఆగకుండా.. స్వతహాగా  ఆక్రమణలు తొలగిస్తే మంచిదని సూచిస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళూ పనిచేయవని విశ్వజిత్‌ స్పష్టం చేశారు. గ్రేటర్‌ పరిధిలోని స్ర్టీట్‌ వెండర్లకు ఇబ్బందులు రాకుండా.. కేవలం పూర్తిస్థాయిలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిపైనే చర్యలు తీసుకుంటామని జీహెచ్ ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
అధికారులు అత్యుత్సాహం 
క్షేత్ర స్థాయిలో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చిరువ్యాపారులతో దురుసుగా ప్రవర్తించారు. మలక్‌పేట, బోరబండ ప్రాంతాల్లోని స్ర్టీట్‌ వెండర్స్‌పై తమ ప్రతాపం చూపించారు. నిస్సహాయులైన చిరువ్యాపారులు కన్నీరు పెట్టుకున్నారు. కొన్ని చోట్ల అధికారులపై నిరసన వ్యక్తం చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు. ఉన్నపళంగా దుకాణాలు కూల్చేస్తే.. తమ బతుకులు ఏంకావాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కూల్చివేతలు అన్యాయం : చిరువ్యాపారులు
అధికారులు చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టినట్లు తమ దృష్టికి కూడా వచ్చిందన్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి. వ్యాపారులను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు వారికి గుర్తింపు కార్డులు ఇచ్చామన్నారు. వెండింగ్‌ జోన్స్‌ ఫిక్స్‌ చేశాక వ్యాపారులందరినీ అక్కడికి తరలిస్తామని చెప్పారు. ఎలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గకుండా తమ పని తాము చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతుంటే.. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేయడం అన్యాయమని చిరువ్యాపారులు అంటున్నారు. 

 

11:15 - July 1, 2018

పశ్చిమ గోదావరి : జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం వద్ద పెట్రోల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. దీంతో ట్యాంకర్‌లోని పెట్రోల్‌ అంతా రోడ్డుపై వృధాగా పోతోంది. ట్యాంకర్‌ రోడ్డుపై అడ్డంగా పడడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. మరోవైపు రోడ్డుపై పెట్రోల్‌ పడిపోవడంతో... ఏదైనా ప్రమాదం సంభవిస్తుందోనని పలువురు భయపడుతున్నారు. 

11:12 - July 1, 2018

ఢిల్లీ : ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ ఇంట్లో ఏడుగురు మహిళలతో సహా 11 మృతదేహాలను గుర్తించారు. మృతదేహాల కళ్లకు గంతలు కట్టి ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. హత్యా...? ఆత్మహత్యా.. ?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

 

09:39 - July 1, 2018

పెద్దపల్లి : ఓదెల మండలం ఉప్పరపల్లిలో యువకుడు విజయ్ రెడ్డి దారుణ హత్య గావించబడ్డారు. దుండగులు పారతో కొట్టి చంపారు. హత్య జరిగిన తర్వాత తండ్రి కనిపించకుండా పోయారు. తండ్రి కొడుకుల మధ్య నెలరోజులుగా ఘర్షణ జరుగుతోంది. కుటుంబ సభ్యులపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ రెడ్డిని అతడి తండ్రి హత్య చేశాడని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. మరిన్ని వివరాలరను వీడియోలో చూద్దాం..

నేడు బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

హైదరాబాద్ : నేడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయనున్నారు. ఈరోజు ఉదయం అధికారులు ప్రాజెక్టు గేట్లను తెరవనున్నారు.
 

ఢిల్లీలోని ఓ ఇంట్లో 11 మృతదేహాలు లభ్యం

ఢిల్లీ : బురారీ ప్రాంతంలోని ఓ ఇంట్లో 11 మృతదేహాలు లభ్యం అయ్యాయి. 11 మృతదేహాల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

09:11 - July 1, 2018

నెల్లూరు : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు టీఎన్ 07 బీవై 7818 నెంబర్ గల కారులో చెన్నై నుంచి గుంటూరుకు వెళ్తున్నారు. మార్గంమధ్యలో దగదర్తి మండలం రాచర్లపాడు గమేషా ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మామ, కోడలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108అంబులెన్స్ లో స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు నెంబర్ ఆధారంగా మృతులు చెన్నైవాసులుగా గుర్తించారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయిడంతో ప్రమాదం జరిగిందని గాయాలైన ప్రయాణికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

 

09:06 - July 1, 2018

నల్లగొండ : పట్టణంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో సరైన పత్రాల్లేని వందలాది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పెళ్ళి బృందంతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో..  వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద నవ దంపతులు, వారి బంధువులు పడిగాపులు కాస్తున్నారు. 

08:50 - July 1, 2018

కడప : జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. బద్వేల్‌ జాతీయ రహదారి నెం 67పై కారు లారీని ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో.. కంభం వెంకటరామిరెడ్డి, ఆయన భార్య సుజాత, డ్రైవర్‌ మధు మరణించారు. మృతులు అనంతపురం జిల్లా వాసులుగా గుర్తించారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండడంవల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

 

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..

నెల్లూరు : దగదర్తి మండలం రాచర్లపాడు గమేషా ఫ్యాక్టరీ వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.  

 

07:48 - July 1, 2018
07:46 - July 1, 2018

కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వక్తలు అన్నారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత గంగాధర్, బీజేపీ నేత బాజీ, టీడీపీ నేత నాగుల్ మీరా పాల్గొని, మాట్లాడారు. ఎంపీ సీఎం రమేష్ దీక్ష ఎన్నికల స్టంట్ అని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:42 - July 1, 2018

ఢిల్లీ : అమెరికాకు కెనడా షాకిచ్చింది. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారీగా సుంకాలను విధిస్తూ కెనడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్లోరిడా నారింజపండ్ల రసం, కెచప్, కెంటుకి బోర్బోన్, విస్కీ తదితర 250 అమెరికా వస్తువులపై సుంకాలను పెంచుతున్నట్లు కెనడా తెలిపింది.  కెనడా నుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం, స్టీల్‌ ఉత్పత్తులపై అమెరికా  టారిఫ్‌లు పెంచడంతో తాము కూడా తప్పనిసరి పరిస్థితుల్లో సుంకాలను పెంచాల్సి వస్తోందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రకటించారు. జూలై ఒకటి నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి. అల్యూమినియం, స్టీల్‌ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన టారిఫ్‌లపై ప్రపంచ దేశాలన్నీ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చైనా, భారత్‌, యూరోపియన్‌ దేశాలు అమెరికా దిగుమతులపై భారీగా సుంకాలను విధించాయి.

07:40 - July 1, 2018

ఈటానగర్ : అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడి ఐటిబిపికి చెందిన ఐదుగురు జవాన్లు మృతి చెందారు. భారీ వర్షాలు కారణంగా అకాజన్‌ మార్గంలో పెద్ద బండరాయి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు జవాన్లు అక్కడికక్కడే మరణించారు. భారత్‌ టిబెట్‌ సరిహద్దుకు ఐటిబిపి జవాన్లు బసర్‌ నుంచి లోయర్‌ సివాంగ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐటిబిపి మినీ బస్సులో 20 మంది సిబ్బంది  ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ 8 మంది జవాన్లను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో గత ఐదు రోజుల్లో ఇది రెండో ఘటన. కొండ చరియలు విరిగి పడ్డ ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

 

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో డ్రంక్ ఆండ్ డ్రైవ్

హైదరాబాద్ : జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 13 మందిపై కేసులు నమోదు చేశారు. 65 కార్లు, 48 బైకులను స్వాధీనం చేసుకున్నారు. 

నేటి నుంచి హైదరాబాద్ సెయిలింగ్ వారోత్సవాలు

హైదరాబాద్ : నేటి నుంచి హైదరాబాద్ సెయిలింగ్ వారోత్సవాలు జరుగనున్నాయి. ఈనెల 8వరకు సెయిలింగ్ వారోత్సవాలు కొనసాగనున్నాయి. 

 

నేడు ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్ మ్యాచ్

నెదర్లాండ్ : నేడు ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టైటిల్ కోసం తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

నేడు 202 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర

తూ.గో : నేడు 202 వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్ర జరుగనుంది. నేడు ముమ్మిడివరం నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ముమ్మిడివరం శివారు పాదయాత్ర ప్రారంభంకానుంది.

07:24 - July 1, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ నియామకమయ్యారు. ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను ప్రభుత్వం డీజీపీగా నియమించింది. ఐదుగురు సభ్యులను పరిశీలించిన ప్రభుత్వం... చివరకు ఠాకూర్‌ను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ నియమితులయ్యారు. ఏసీబీ డీజీగా పనిచేస్తున్న ఆర్పీ ఠాకూర్‌ను ప్రభుత్వం డీజీపీగా నియమించింది. ఐదుగురు సభ్యులను పరిశీలించిన ప్రభుత్వం... చివరకు ఠాకూర్‌ను డీజీపీగా ఎంపిక చేసింది. 1986 బ్యాచ్‌కు చెందిన ఠాకూర్‌ పోలీసు శాఖలో వివిధ హోదాలో పనిచేశారు. తనను డీజీపీగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు ఆర్పీ ఠాకూర్‌ కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. 
1961 జూలై 1న ఠాకూర్‌ జననం
ఆర్పీ ఠాకూర్‌ పూర్తి పేరు రామ్ ప్రవేశ్‌ఠాకూర్‌. ఈయన 1961 జూలై 1న జన్మించారు. ఐఐటీ కాన్పూర్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్‌ టెక్నాలజీ చదివారు. 1986 డిసెంబర్ 15న ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఠాకూర్‌.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో ఠాకూర్ తొలిసారి అదనపు ఎస్పీగా నియాకమయ్యారు. అనంతరం గుంటూరు, వరంగల్‌ జిల్లాల్లో ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. అలాగే పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్‌ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. 
వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ఠాకూర్ 
అలాగే జోనల్‌ హైదరాబాద్‌ డీసీపీగా, అనంతపురం, చిత్తూరు జిల్లాల డీఐజీగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం పాట్నాలోని ఈస్ట్రన్‌ జోన్‌ హెడ్‌ క్వాటర్స్‌లో సీఐఎస్ఎఫ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. దీని తర్వాత ఉమ్మడి ఏపీలో కంట్రోలర్‌ ఆఫ్‌ లీగల్‌ మెట్రాలజీ అధిపతిగా బాధ్యతలను నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా బాధ్యతలను స్వీకరించారు. 2016 నవంబర్‌ నుంచి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖలో డీజీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 
2003లో ఠాకూర్ కు ఇండియన్‌ పోలీసు మెడల్‌
ఇక వివిధ హోదాల్లో పని చేసిన ఠాకూర్‌ పలు ప్రతిభ పురస్కారాలను అందుకున్నారు. 2003లో ఇండియన్‌ పోలీసు మెడల్‌ను, 2004లో ఏఎస్ ఎస్ పీ మెడల్‌ను ఆర్పీ ఠాకూర్ సాధించారు. పోలీసుశాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్‌ పొందారు. 

 

07:16 - July 1, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయపార్టీలు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికారపార్టీ ముందస్తుకు సై అంటోంటే.. అదేబాటలో ప్రతిపక్షం సైతం తాము కూడా రెడీ అంటోంది.తెలంగాణ జన సమితి కూడా ముందస్తు ముహూర్తానికి రెడీ అవుతోంది.
క్యాడర్‌పై టీజేఎస్‌ దృష్టి
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 9 నెలలు మిగిలి ఉండగానే.. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార టీఆర్‌ఎస్‌ ముందస్తు రాగం ఎత్తుకోవడంతో... ప్రతిపక్షాలు కూడా ముందస్తు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ముందస్తు ఎన్నికల సవాల్‌ను స్వీకరించేందుకు  తెలంగాణ జన సమితి కూడా రెడీ అవుతోంది.  పార్టీ ఆవిర్భావం నుంచే క్షేత్రస్థాయిలో క్యాడర్‌పై దృష్టి పెట్టిన టీజేఎస్‌...  పంచాయతీ ఎన్నికల్లో తమ బలానని బేరీజు వేసుకుందామని అనుకుంది. కానీ బీసీ రిజర్వేషన్‌ ఎటూ తేలకపోవడంతో ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు వచ్చేలా కనిపించడం లేదు. దీంతో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేలా పార్టీని బలోపేతం చేయడంపైనే కోదండరాం దృష్టి సారించారు.
వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేసిన కాంగ్రెస్‌
వారం పది రోజులుగా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ తెలంగాణలో ప్రచారం జోరుగా సాగుతోంది. ముందస్తు సవాల్‌ను ఎదుర్కొనేందుకు అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్‌ వంద రోజుల ప్రణాళికలతో సిద్ధం అవుతోంది. టీజేఎస్‌ కూడా ముందస్తుకు రెడీ అవుతోంది. ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనని కోదండరాం చెప్పారు.
టీజేఎస్‌లోకి వలసలు
క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను పెంచుకునే పనిలో టీజేఎస్‌ పడింది. ఆ పనుల్లోనే నేతలంగా బిజీబిజీగా ఉన్నారు. పలువురు టీజేఎస్‌లో చేరుతున్నారు.  అధికార పార్టీ నుంచి మాత్రం ఎవరూ చేరులేదు. ఒకవేళ రాష్ట్రంలో మస్తు ఎన్నికలు డిసెంబర్‌ నీటికి వస్తే ఎలా ముందుకు వెళ్లాలని టీజేఎస్‌ వ్యూహరచన చేస్తోంది.వాటిని ఎదుర్కొని విజయం సాధించడంపై దృష్టి సారించింది. 
 

 

07:11 - July 1, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు సిద్దంగా ఉండండి. నేతలంతా సమన్వయంతో ముందుకెళ్లండి. విజయమే లక్ష్యంగా పనిచేయండి. ఇదీ కాంగ్రెస్‌ హైకమాండ్‌ తెలంగాణ నేతలకు ఇచ్చిన సందేశం. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాలపై సమీక్షించిన ఢిల్లీ దూతలు... వారికి ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు హీట్‌ పెంచుతున్నాయి. ముందస్తు ఎన్నికల ఘంటికలు మోగుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తుకు సిద్ధమా అని కాంగ్రెస్‌ సవాల్‌ విసరడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. కేసీఆర్‌ సవాల్‌లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. దీంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ కూడా అలర్ట్‌ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ క్యాడర్‌ను సన్నద్దం చేసే పనిలో పడింది.
తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్‌ హైకమాండ్‌
తెలంగాణపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ కూడా ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఎన్నికలను అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముందస్తు ఎన్నికలకు పార్టీని సిద్దం చేసేందుకు హైకమాండ్‌ రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్ర ఇంచార్జ్‌ కుంతియాకు తోడుగా మరో ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులను అధిష్టానం నియమించింది. కొత్తగా నియమించిన ఏఐసీసీ కార్యదర్శులు ముగ్గురు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షించారు.
నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చర్చ
అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలు, నేతల మధ్య ఉన్న సమన్వయ లోపాలను చక్కదిద్దేందుకు హైకమాండ్‌ దూతలు దిశానిర్దేశం చేశారు. పార్టీని సంస్థాగతంగా బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేయడంతోపాటు శక్తియాప్‌ వాడకంపై పలు సూచనలు చేశారు. మొత్తానికి ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తాయని భావిస్తున్న హస్తం నేతలు.. పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయాత్తం  చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తున్నారు.
 

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం

కడప : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మడకలవారిపల్లె సుదర్శన ఆశ్రమం వద్ద కారు, లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అనంతపురం వాసులుగా గుర్తించారు. 

బీహార్ లో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి

పాట్నా : బీహార్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. సరన్ వద్ద పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి,

 

Don't Miss