Activities calendar

02 July 2018

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా అర్చ‌కుల‌కు వేత‌నాలు...!

హైదరాబాద్ : తెలంగాణలో అర్చ‌కులు, ఆల‌య ఉద్యోగుల క్యాడ‌ర్ స్ట్రెంత్ నిర్ధార‌ణపై క‌స‌ర‌త్తు కొన‌సాగుతోంద‌ని, త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు.

యాత్రికుల ఇబ్బందులు...

ఢిల్లీ : కైలాస్‌ మానస సరోవర్‌కు వెళ్లిన యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో విజయవాడతో పాటు ఇతర తెలుగు ప్రాంతాల నుంచి వెళ్లిన యాత్రికులు కూడా ఉన్నారు. ఇండియా, నేపాల్‌ సరిహద్దులో వారు మొన్నటి నుంచి అవస్థలు పడుతున్నారు.

18:51 - July 2, 2018

విజయవాడ : బతికి ఉండగానే చనిపోయిందని సృష్టించి తన ఆస్తిని కాజేశారంటూ ఓ వృద్ధురాలు ఆందోళన చేపట్టింది. తన ఆందోళన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి చెప్పుకొనేందుకు..తనకు న్యాయం చేయాలని కోరేందుకు ఏపి సచివాలయానికి వచ్చింది. కానీ అక్కడున్న సెక్యూర్టీ అనుమతించలేదు. దీనితో ఆమె ఐదో బ్లాక్ ఎదుట రోడ్డుపై బైఠాయించింది. అనంతపురం జిల్లా తుళ్లూరు మండలం బత్తినేని నర్సమ్మకు71 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. తాను చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూమిని కాజేశారని వాపోయింది. గతంలో హత్యాయత్నం చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతోంది. 

18:41 - July 2, 2018

11న పోలవరానికి గడ్కరి - దేవినేని...

విజయవాడ : ఈనెల 11వ తేదీన పోలవరం పరిశీలనకు కేంద్ర మంత్రి గడ్కరి రానున్నట్లు మంత్రి దేవినేని వెల్లడించారు. మంత్రి దేవినేని మీడియాతో మాట్లాడుతూ...పోలవరంపై ఇప్పటి వరకు రూ. 13, 798 కోట్లు ఖర్చు చేసినట్లు, నాలుగేళ్లలో రూ. 8,660 కోట్ల పనులు జరిగాయన్నారు. 

దేవాదాయ శాఖపై ఇంద్రకిరణ్ రెడ్డి సమీక్ష...

హైదరాబాద్ : దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో దేవాదాయ శాఖపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధూప దీప నైవేద్య పథకంలో అనర్హులకు చోటు కల్పిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇక భారీ వర్షాలు..

 

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి శుక్రవారం వరకు.. జమ్మూకశ్మీర్, తమిళనాడు, అసోం, గుజరాత్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

 

జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సమావేశం...

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు..ఇతరత్రా సమస్యలపై ఆయన చర్చించారు. 

కేరళలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి హత్య...

కేరళ : ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నేత అభిమన్యు హత్యకు గురయ్యాడు. ఎర్నాకులం మహారాజ్‌ కాలేజీలో పోస్టర్‌ విషయంలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐకు చెందిన విద్యార్థి కాలేజీ ఆవరణలో పోస్టర్‌ పెట్టినందుకు క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా విద్యార్థులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కత్తిపోట్లకు గురైన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నేత అభిమన్యును వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అభిమన్యు మృతి చెందాడు. 

17:55 - July 2, 2018

కేరళ : ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నేత అభిమన్యు హత్యకు గురయ్యాడు. ఎర్నాకులం మహారాజ్‌ కాలేజీలో పోస్టర్‌ విషయంలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐకు చెందిన విద్యార్థి కాలేజీ ఆవరణలో పోస్టర్‌ పెట్టినందుకు క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్ ఇండియా విద్యార్థులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కత్తిపోట్లకు గురైన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నేత అభిమన్యును వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అభిమన్యు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇడుక్కికి చెందిన 20 ఏళ్ల అభిమన్యు బిఎస్‌సి ఎన్‌విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్‌ ఫ్రంట్‌కు చెందిన వ్యక్తులే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. ఈ హత్యను కేరళ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.రాజీవ్‌ తీవ్రంగా ఖండించారు. విద్యార్థి నేత హత్యకు నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది.

17:53 - July 2, 2018

హైదరాబాద్ : ముస్లిం రిజర్వేషన్ విషయంలో సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ డిమాండ్ చేశారు. ముస్లీంలకు 12శాతం రిజ్వేషన్లపై సీఎం కేసీఆర్‌ మాట తప్పారని, శాసన సభ సాక్షిగా ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తాను ప్రధానితో మాట్లాడానని చెప్పిన ముఖ్యమంత్రి ఇపుడు ఎందుకు సైలెంట్‌ అయ్యారని ఉత్తమ్ ప్రశ్నించారు. ముస్లీంల రిజర్వేషన్లపై ప్రధానితో ఏం మాట్లాడారో కేసీఆర్‌ బయటపెట్టాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ముస్లిం రిజర్వేషన్ల హామీలు అమలు కాకపోవడంపై టిపిసిసి పోస్టుకార్డు ఉద్యమం చేపట్టింది. గాంధీ భవన్ నుండి ఆబిడ్స్ పోస్టాపీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. 

సిరిసిల్లలో గొర్రెల పంపిణీ...

సిరిసిల్ల : రాష్ట్ర స్థాయి రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణలక్ష్మీ గార్డెన్స్‌లో లబ్దిదారులకు 30 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. గతేడాది 60 లక్షల గొర్రెల పంపిణీ చేశామని కేటీఆర్‌ చెప్పారు. 

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడ - పవన్...

విజయనగరం : ఏపీలో సరికొత్త ప్రభుత్వ పాలన రావాలన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. పరిశ్రమల పేరుతో వందల వేల ఎకరాల ప్రజల భూములను లాక్కున్నారని.. అయితే ఆ భూముల్లో ఇంత వరకూ పరిశ్రమలు రాలేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని ఆరోపించారు.

17:50 - July 2, 2018

విజయనగరం : ఏపీలో సరికొత్త ప్రభుత్వ పాలన రావాలన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. పరిశ్రమల పేరుతో వందల వేల ఎకరాల ప్రజల భూములను లాక్కున్నారని.. అయితే ఆ భూముల్లో ఇంత వరకూ పరిశ్రమలు రాలేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని ఆరోపించారు. ఉపాధి, పరిహారం అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఉన్న భూములను దున్నుకుందామంటే పెట్టుబడి పెట్టుకునే పరిస్థితిలో రైతులు లేరన్నారు. ట్రిపుల్‌ ఐటీ చదివిన విద్యార్థులు పరిస్థితికూడా దయనీయంగా తయ్యారయిందని అన్నారు. ఏపీలో దోపిడీ పాలన వ్యవస్తను మార్చాలని సూచించారు.

17:26 - July 2, 2018

చిత్తూరు : కార్మికులతో భారీ నిరసన ప్రదర్శన చేపడుతామని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు హేమలత పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు వచ్చిన ఆమెతో టెన్ టివితో మాట్లాడారు. దేశ చరిత్రలో తొలసారిగా కార్మికుల కోసం భారీ నిరసన చేపడుతామని, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్మికుల హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 5న ఢిల్లీలో ఆందోళన చేపడుతామని వెల్లడించారు. 

17:23 - July 2, 2018
17:21 - July 2, 2018

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ఫుట్ పాత్ లపై అక్రమంగా నిర్మితమయిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు మూడో రోజు సోమవారం కూల్చివేతలను కొనసాగించారు. ఆరు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. శని, ఆదివారాల్లో 2341 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ సోమవారం కూకట్ పల్లి, కాచిగూడలో సిబ్బంది, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వీరివల్ల చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికలాంగ మహిళ నడుపుకుంటున్న టీ స్టాల్ ను కూల్చివేయడంతో ఆమె లబోదిబోమంటోంది. కూకట్ పల్లిలోని ఓ ప్రాంతంలో అక్రమంగా నిర్మాణమైన రెండో అంతస్తు స్టేర్ కేస్ కూల్చివేశారు. దీనితో పైనున్న వారు కిందకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:20 - July 2, 2018

విజయనగరం : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం విజయనగరంలోని .కోటకు చేరుకున్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తనదైన శైలిలో ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పతంజలి సంస్థకు 200 ఎకరాలు ఇచ్చారని..ఎక్కడైనా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా ? అని నిలదీశారు. పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి భూమలు తీసుకుంటారు..కానీ పరిశ్రమలు వచ్చాయా అని తీవ్ర ఆగ్రహంగా ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవడానికి జనసేన కృషి చేస్తుందన్నారు. 23 వెనుకబాటు కులాలకు ప్రభుత్వం అండగా నిలబడలేదని...ఈ విషయంలో జనసేన అండగా ఉంటుందన్నారు. ఉపాధి అవకాశాలు చాలా ముఖ్యమని, తెలుగుదేశం ఒక మంత్రి ఒకరు దోపిడి చేశారని, మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఎస్.కోటలో పవన్...

విజయనగరం : ప్రజా పోరాట యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్‌ కోటకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆయన బహిరంగసభలో ప్రసంగిస్తున్నారు. బాబొస్తే జాబొస్తుందని అన్నారని..ఎవరికి జాబు వచ్చిందని ప్రశ్నించారు. ప్రాంతీయ అసమానతలకు లేకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. స్పెషల్ స్టేటస్ కోసం పోరాడకుండా పోరాడకుండా తనను దూషిస్తే ఏం లాభమన్నారు. 

16:15 - July 2, 2018
16:14 - July 2, 2018

సిరిసిల్ల : గొర్రెల పంపిణీ పథకంపై లోతుగా వెళ్లి అధ్యయనం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ...మూడు, నాలుగు నెలల్లో ఈ పథకంపై లోతుగా వెళ్లి అధ్యయనం చేయడం జరిగిందని..గోర్రె ఏం తింటది..మందులు..దవాఖానాలు..అంబులెన్స్ ల గురించి ఎవరైనా ఆలోచించారా ? అని ప్రశ్నించారు. దేశంలోనే ధనవంతుడైన యాదవులు ఎక్కడైనా ఉన్నారా ? అంటే తెలంగాణలో అని చూపించారని, చివరి మనిషికి దక్కేవరకు గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. చిల్లరమల్లర రాజకీయాలు చేస్తున్నారని, గొర్రెలు చనిపోయాయా ? అని సదరు మంత్రిని అడగడం జరిగిందన్నారు. కేవలం గొర్రెల పంపిణీ మాత్రమే కాదని..తాను, తలసానిలు ఎన్నో అంశాలపై మాట్లాడు కోవడం జరుగుతోందన్నారు. వేయి కోట్లతో చేప పిల్లల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. పాడి..పంట రెండు బాగుంటనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందన్నారు.

 

ఏయూలో మద్యం సీసీలు..క్షమించారని అంశం - గంటా...

విశాఖపట్టణం : ఏయూలో మద్యం సీసాలు దొరకడం క్షమించారని అంశమని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వార్డెన్ పై చర్యలు తప్పవని, ఏయూలో ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు తావు లేదన్నారు. హాస్టల్స్ లోపల..బయట దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, సీసీ కెమెరాలు అమరుస్తామన్నారు. 

కోఠిలో పసికందు కిడ్నాప్...

హైదరాబాద్ : కోఠి మెటర్నీటీ ఆసుపత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళ ఆరు రోజుల పసికందును తీసుకెళ్లడం కలకలం సృష్టిస్తోంది. సమాచారం తెలుసుకున్న మీడియాను అక్కడున్న సెక్యూర్టీ లోనికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 

15:30 - July 2, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ముస్లింలను మోసం చేసిండని..నాలుగు నెలల్లో ముస్లిం వర్గాలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీనిచ్చారని..ఎక్కడ అమలు చేశారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ గుర్తు చేశారు. ఈ మేరకు పోస్టు ఉద్యమం చేపట్టారు. అందులో భాగంగా సోమవారం గాంధీభవన్ నుండి ఆబిడ్స్ పోస్టాపీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టెన్ టివితో ఉత్తమ్ మాట్లాడారు. నాలుగేండ్లు అయినా కూడా ముస్లింలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. అసెంబ్లీలో నరేంద్ర మోడీ ఒప్పుకున్నాడని చెప్పాడా ? లేదా ? అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల హామీగానే నిలిచిపోయిందని విమర్శించారు. 

15:19 - July 2, 2018

హైదరాబాద్ : కోఠి మెటర్నీటీ ఆసుపత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళ ఆరు రోజుల పసికందును తీసుకెళ్లడం కలకలం సృష్టిస్తోంది. సమాచారం తెలుసుకున్న మీడియాను అక్కడున్న సెక్యూర్టీ లోనికి అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన ఓ మహిళ కోఠి ఆసుపత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. వార్డుకు షిప్టు చేశారు. టీకా వేయాలని అనుకుంటుండగా గుర్తు తెలియని మహిళ ఎత్తుకుంటానని చెప్పి పసికందును తీసుకెళ్లిపోయింది. దీనితో మహిళ ఆసుపత్రి యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనను చిత్రీకరించడానికి వెళ్లిన మీడియాను అక్కడున్న సెక్యూర్టీ అనుమతించలేదు. దీనితో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రధాన ద్వారం వద్దనున్న సీసీ టీవీ ఫుటేజ్ కు కనెక్షన్ లేదని తెలుస్తోంది. 

15:15 - July 2, 2018

తూర్పుగోదావరి : తెలుగు రాష్ట్రాల్లో భర్తలు దుర్మార్గులు మారుతున్నారు. ఏడడుగులు నడిచి...జీవితకాలం తోడుగా ఉంటానని చెబుతూ భార్యలను తెగనరికేస్తున్నారు...దీనితో అత్తింటిలో ఎంతో సుఖంగా..భర్తలతో ఆనందంగా..సంతోషంగా ఉంటుందని అనుకుంటున్న పుట్టింటి వారు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా పెళ్లి అయి మూడు నెలలు కాలేదు..ఓ భర్త కట్టుకున్న భార్యను గొంతు కోసి దారుణంగా చంపేశాడు.

ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని లింగంపర్తిలో చోటు చేసుకుంది. మూడు నెలల క్రితం స్వరూపారాణి కి ఈశ్వరరావు వివాహం జరిగింది. కానీ వివాహమైన కొద్ది రోజులకే ఈశ్వరరావు భార్యను వేధిస్తున్నట్లు సమాచారం. భారీగా కట్నం తీసుకున్న ఈశ్వరరావు వేధిస్తుండడంతో ఇద్దరి మధ్య తగాదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సోమవారం స్వరూపారాణి గొంతు కోసి దారుణంగా చంపేసిన ఈశ్వరరావు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు అతడి కోసం గాలింపులు చేపడుతున్నారు. 

14:55 - July 2, 2018

ఏసీబీ అదుపులో వ్యవసాయ అధికారి...

శ్రీకాకుళం : సంతకవిటి వ్యవసాయ అధికారి రంగరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 50వ వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. 

కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం - నాగం...

హైదరాబాద్ : ప్రాజెక్టులపై కేసులు వేస్తూ కాంగ్రెస్ అడ్డుకొంటోందని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు. సీఎం దోపిడిపైనే తాము కోర్టుకు వెళ్లడం జరిగిందని, కేసీఆర్ అవినీతితో అడ్డగోలుగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. 

ముస్లింలను మోసం చేసిన కేసీఆర్ - ఉత్తమ్...

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ముస్లింలను మోసం చేశారని టెన్ టివితో టిపిసిసి చీఫ్ ఉత్తమ్ తెలిపారు. 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని, ఓట్ల కోసమే కేసీఆర్ ముస్లింకు రిజర్వేషన్లు ఇస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మోసాన్ని ముస్లింలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. 

14:47 - July 2, 2018
14:42 - July 2, 2018

సంగారెడ్డి : ఏ పాపం చేశాం ? తమకు కేటాయించిన భూముల్లో పొజిషన్ చూపించాలని కోరడం తప్పా ? కోరితే గుడెసెలను తగులబెడుతారా ? అంటూ దళితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సహకారంతో ఎమ్మార్వో గుడిసెలను తగలబెట్టారని ఆరోపిస్తూ బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో దళితులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టడంతో మొగుడంపల్లి మండల కేంద్రంలో  ఉద్రిక్తత నెలకొంది.

1973లో సర్వే నెంబర్ 116/2లో దళితులకు భూములు కేటాయించారు. కాని పొజిషన్ చూపించలేదు. దీనితో దళితులు పలు రకాలుగా నిరసనలు..ఆందోళనలు చేపట్టారు. సమస్య పరిష్కరిస్తామని ఆర్డీవో హామీలిచ్చారు. దీనితో దళితులు ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ హామీ నెరవేర్చకపోడంతో బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో దళితులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్వో పోలీసుల సహాయంతో చేరుకుని గుడిసెలను తగబెట్టారని దళితులు పేర్కొన్నారు. వెంటనే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:38 - July 2, 2018

నిర్మల్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం..శుభం..తెలియని ఓ విద్యార్థిపై కత్తిపోట్లకు గురి కావడం తీవ్ర సంచలనం రేకేత్తిస్తోంది. ఈ ఘటన ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకోవడం మరింత కలకలం సృష్టిస్తోంది. హర్షవర్దన్ అనే బాలుడు మహాత్మాగాంధీ పూలే ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాడు. సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని ఆగంతకుడు హర్షవర్ధన్ పై కత్తితో దాడికి దిగారు. వీపు వెనుక భాగంలో కత్తిపోట్లు పడ్డాయి. తీవ్ర గాయాలతో బాలుడు కేకలు వేయడంతో ఆశ్రమంలో ఉన్న ఇతర విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కానీ ఘటన జరిగిన అనంతరం విషయాన్ని గోప్యం ఎందుకు ఉంచారు ? అనేది తెలియరావడం లేదు. అలాగే తల్లిదండ్రులకు కూడా ఆలస్యంగా సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. సిబ్బంది నిర్లక్ష్యం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల కిందట గురుకుల పాఠశాలలో చేరిపించడం జరిగిందని, కత్తిపోట్ల అనంతరం బాలుడి కాళ్లు..చేతులు పనిచేయడం లేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు వచ్చారు ? బాలుడిని ఎందుకు పొడిచాడనే తెలియాల్సి ఉంది. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

 

14:37 - July 2, 2018

ఢిల్లీ : చేతులు కట్టేసుకుని.కళ్లకు గంతలు..కట్టుకుని ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా ? లేదని సమాధానం వస్తుంది కదా...కానీ దేశ రాజధానిలో మురారీలో 11 మంది మృతదేహాలు బయటపడడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మృతి చెందిన వారిలో 7 మహిళలు..4 పురుషులున్నారు. వీరంతా కళ్లకు గంతలు కట్టుకుని..చేతులు కట్టేసి ఉరి వేసుకున్న మృతదేహాలు బయటపడ్డాయి. ఎలా ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై మిస్టరీ నెలకొంది. ఎవరైనా పది మందిని హత్య చేసిన అనంతరం ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటనలో ఎన్నో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇంటి బయట 11 పైపులు కనిపించడం..చనిపోవడానికి అవలంబించాల్సిన పది సూత్రాలతో కూడిన ఓ నోట్ బయపడడం సంచలనం సృష్టిస్తోంది. హత్యలా ? ఆత్మహత్యలా ? అనేది తెలియరావడం లేదు.

ఏ విధంగా చనిపోవాలని దానిపై నిర్ణయం తీసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చునని..ఒకటే బట్టను ఉపయోగించుకుని ఉరి వేసుకోవడం గమనార్హం. దీనికంతటికీ మూఢత్వమే కారణమని ప్రచారం జరుగుతోంది. మోక్షం కోసం..ఆత్మహత్య చేసుకుంటే పరమాత్మలో కలిసి పోవచ్చని భావించే ఈ అఘాయిత్యానికి పాల్పడివచ్చని తెలుస్తోంది. కుటుంబం మొత్తం ఒక పుస్తకాన్ని ఫాలో అవుతున్నారని సమాచారం.

మరోవైపు వీరంతా ఎలా చనిపోయారన్నదే మిస్టరీగా మారింది. చనిపోయే ముందు వీరి నోట్లో బట్టలు ఎవరు కుక్కారు ? చేతులు ఎవరు కట్టేశారు ? ఎవరు ఉరి వేశారు ? అనేది బయటపడాల్సి ఉంది. ఈ పదకొండు పైపులను ఎందుకు అమర్చారు ? అనేది మిస్టరీగా మారింది. మరి పోలీసులు ఈ కేసును ఎలా చేధిస్తారో చూడాలి. 

13:46 - July 2, 2018

కృష్ణా : జిల్లా చీమలపాడులో కిడ్నీ వ్యాధితో మరణించిన జమలయ్య కుటుంబాన్ని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పరామర్షించారు. రఘువీరాతో పాటు ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ రతన్‌ కూడా జమలయ్య కుటుంబాన్ని ఓదార్చారు.

13:44 - July 2, 2018

అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు దగాకోరు రాజకీయాలతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని వైసీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు వంచనపై గర్జన దీక్ష పేరుతో వైపీసీ ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన సభలో నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నల్లచొక్కాలు, కండువాలతో ధర్నాచేసి, నిరసన వ్యక్తం చేశారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు...ప్రత్యేక హోదాపై ఇప్పుడు నీతులు చెబుతున్నారని వైసీపీ నాయకులు మండిపడ్డారు.

13:41 - July 2, 2018

రంగారెడ్డి : ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఇంకా సంధిగ్ధమే... కానీ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో మాత్రం అప్పుడే ఎన్నికల వాతవారణాన్ని సృష్టించారు ప్రస్తుత ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌. రాజకీయ విమర్శలతోనే కాదు.. వ్యక్తగత దూషణలతోనూ రాజకీయ రచ్చ చేస్తున్నారు.

పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల వాతావరణం మొదలైంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడి తాజా, మాజీ ఎమ్మెల్యేలు మాటల యుద్ధానికి దిగారు. ప్రస్తుత ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్‌ రాజకీయ విమర్శలకే కాదు.. వ్యక్తిగత దూషణలతో ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఏ ఇద్దరు వ్యక్తులు కలుసుకున్న వీరి విమర్శలపైనే చర్చించుకుంటున్నారు.

మహిపాల్‌ రెడ్డిపై నందీశ్వర్‌ భూ కబ్జాల ఆరోపణలు
బీజేపీ తలపెట్టిన జన చైతన్యయాత్ర బహిరంగసభలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ చేసిన వ్యాఖ్యలతో ఈ రాజకీయ రచ్చ ప్రారంభమైంది. అధికార పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అంతులేని భూకబ్జాలకు పాల్పడుతున్నారని.. పరిశ్రమల వాళ్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని నందీశ్వర్‌గౌడ్‌ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేపై జరగని ఐటీ దాడులు ఒక్క మహిపాల్‌రెడ్డిపై మాత్రమే జరిగాయన్నారు.

110 ఎకరాల భూకబ్జాలో నందీశ్వర్ పాత్ర : మహిపాల్‌రెడ్డి

నందీశ్వర్‌గౌడ్‌ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఘాటుగానే స్పందించారు. నందీశ్వర్ గౌడ్‌ చరిత్ర అందరికీ తెలుసని.. జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెంలో సర్వేనెంబర్ 343లో గల కోట్లాది రూపాయల భూములను కబ్జా చేశాడని ఆరోపించారు. దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తుదన్నారు. దిల్‌ కంపెనీ భూ కుంభకోణం, గుమ్మడిదల మండలం నల్లవల్లిలో 110 ఎకరాల భూకబ్జా వ్యవహారంలో నందీశ్వర్ పాత్ర ఉందని మండిపడ్డారు. తాజా, మాజీ ఎమ్మెల్యేల ఈ మాటల యుద్ధం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయంశంగా మారింది. రాజకీయ విమర్శలే కాక వ్యక్తిగత దూషణలకు దిగుతుండటంతో పటాన్‌చెరు పాలిటిక్స్‌ హీటెక్కాయి. 

13:38 - July 2, 2018

అనంతపురం : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనంతపురం వచ్చారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు నాయకులు నీలం రాజశేఖర్‌రెడ్డి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనంతపురం చేరుకున్న ఏచూరికి సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ ఏచూరికి పుష్ఫగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి సీపీఎం నాయకులను అడిగి ఏచూరి తెలుసుకున్నారు. 

చెట్ల నరికివేతపై కేంద్రానికి ఎన్జీటీ నోటీసులు..

ఢిల్లీ : ఢిల్లీలో చెట్ల నరికివేతపై ఎన్జీటీ కేంద్రానికి నోటీసులు జారీచేసింది. ఎన్నడీసీసీ, ఎన్ డీఎంసీ, డీడీఏకూ కూడా ఎన్జీటీ నోటీసులు జారీచేసింది. జులై 9 వరకు చెట్లను నరకకూడదని ఎన్జీటీ ఆదేశించింది. ఏడు కాల‌నీల అభివృద్ధి కోసం చెట్ల‌ను న‌రికివేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఎన్‌జీటీ పేర్కొన్న‌ది. ఈ అంశంపై త‌దుప‌రి విచార‌ణ జూలై 19వ తేదీన ఉంటుంద‌ని కోర్టు తెలిపింది. వివాదాస్పద ప్రాజెక్టు కింద ఢిల్లీ ప్రభుత్వం సుమారు 1700 చెట్లను నరికివేసేందుకు ఇటీవ‌ల ప్లాన్ వేసింది. ప్రభుత్వ అధికారుల నివాసాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల కోసం ఆ చెట్లను కొట్టివేయాలని భావించారు.

13:17 - July 2, 2018

హైదరాబాద్ :   బదిలీల కోసం తెలంగాణ ఉపాధ్యాయులు ఇచ్చిన వెబ్‌ ఆప్షన్లలో దొర్లిన పొరపాట్లను సరిదిద్దే అవకాశాన్ని పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ట్రాన్స్‌ఫర్‌ కోసం 75 వేల మంది ఉపాధ్యాయులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారు. కంప్యూటర్‌ ముందు మొదటిసారి కూర్చోవడం వలన కొందరు పొరపాట్లు చేశారు. దీంతో ఉపాధ్యాయులు తాము కోరుతున్న ప్రాంతాలకు కాకుండా దూరప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని సరిదిద్దాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ప్రొవైడర్లతో చర్చించిన తర్వాత అవకాశం ఉంటే వెబ్‌ ఆప్షన్లలో దొర్లిన పొరపాట్లను సవరించే అంశాన్ని పరిశీలిస్తామని కడియం శ్రీహరి హామీ ఇచ్చారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. 

ఆ 11 మంది నేత్రాలను దానం చేశారు!!..

ఢిల్లీ : దేశరాజధానిలో 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం యావత్ దేశాన్ని కుదిపివేస్తోంది. వివరాలు తెలుసుకున్న వెంటనే వారి ఆత్మహత్యలు హృదయాలకు కలిచివేస్తున్నారయి. అందులో ఆరుగురు ఉరి వల్ల చనిపోయినట్లు ఇవాళ పోస్టుమార్టమ్ తేల్చింది. అయితే చనిపోయినవారి కండ్లను దానం చేశారు. మొత్తం 11 మంది నేత్రాలను దానం చేయాలని వారి కుటుంబసభ్యులు నిర్ణయించారు. సుమారు 22 మందికి ఆ నేత్రాలు ఉపయోగపడనున్నాయి. భాటియా ఫ్యామిలీ మంచి కుటుంబం అని, ఇతరులకు సహాయం చేయాలన్న తపనతో ఉండేవారని, అందుకే ఆ 11 మంది కండ్లను దానం చేసేందుకు అంగీకరించామని ఫ్యామిలీ ఫ్రెండ్ నవ్‌నీత్ బత్రా తెలిపారు.

11 ఆత్మహత్యల పోస్టుమార్టంలో ఆసక్తికర విషయాలు..

ఢిల్లీ : నగరంలో సామూహిక ఆత్మహత్యలు తీవ్ర భయాందోళనలను కలిగిస్తున్నాయి. ఈ ఆత్మహత్యల వెనుక మరిన్ని వివరాలు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడయ్యాయి. వీరిలో ఆరుగురు కేవలం మెడకు ఉరి బిగుసుకున్న కారణంతోనే మరణించారని మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన వైద్యులు తేల్చారు. మరో నలుగురికి తినే ఆహారంలో విషం పెట్టి హత్య చేశారని, ఓ వృద్ధురాలిని దారుణంగా చంపారని వైద్యులు వెల్లడించారు. వృద్ధురాలిని బలంగా కొట్టి, ఊపిరి ఆడకుండా చేసి చంపారని అన్నారు. నలుగురి కడుపులో విషపు ఆనవాళ్లు గుర్తించామని తెలిపారు.

గుడిసెలు వేసుకుని బీఎల్ఎఫ్ ఆందోళన..

సంగారెడ్డి : మొగుడంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. దళితులకు కేటాయించిన భూమిని వారికే ఇవ్వాలని బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని ఆందోళన చేపట్టింది. దీంతో మున్సిపల్ సిబ్బంది అధికారుల ఆదేశాల మేరకు సంఘటానాస్థలికి చేరుకుని గుడిసెలను తొలగించారు. మున్సిపల్ సిబ్బందికి, బీఎల్ఎఫ్ నేతలకు మధ్య వాగ్వాగం చోటుచేసుకోవటంతో పోలీసులు భారీగా మోహరించారు.దీంతో ఆప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. 

ఉపాధ్యాయ బదిలీలకు లైన్ క్లియర్..

హైదరాబాద్ : ఉపాధ్యాయ బదిలీలపై లైన్ క్లియర్ అయ్యింది. ఉపాధ్యా బదిలీలపై వున్న పిటీషన్స్ అన్నింటిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కొట్టివేసింది. ఈ బదిలీలకు సంబంధించిన ఆర్డర్ ను ఉమ్మడి జిల్లా డీఈఓలు కాకుండా ఆర్జేడీలకు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయ బదిలీలపై లైన్ క్లియర్ అయ్యింది. కాగా ఉమ్మడి జిల్లాలలో డీఈవోలకు మాత్రమే వుండేది కానీ ఇప్పుడు ఆర్జేడీలకు ఇవ్వాలని..వారికి మాత్రమే న్యాయస్థానం స్పష్టంచేసింది.

12:41 - July 2, 2018

కుమురం భీం : తెలంగాణలో పులుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన పులులు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా అడవుల్లో స్థిర నివాసాలు ఏర్పర్చుకుంటున్నాయి. తాజాగా మరో రెండు పులిపిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారులు గుర్తించారు. సిర్పూర్‌ పెద్దపులుల ఆవాసం పై స్పెషల్‌ స్టోరీ.

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పెరుగుతున్న పులుల సంఖ్య
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో పెద్దపులుల సంఖ్య పెరుగుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ పరిధిలో తొమ్మిది పులులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే ఈ పులులు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వలస వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని తాడోబా టైగర్‌ రిజర్వులో అత్యధికంగా 70 నుంచి 85 వరకు పులులు ఉన్నాయి. అడవుల కొరత, వేటగాళ్లు బెడద వంటి వివిధ కారణాలతో అక్కడి నుంచి కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పుర్‌ (టి), కాగజ్‌నగర్‌, బెజ్జూరు అడవుల్లోకి ఇవి వలస వస్తున్నాయి. 2014 లో చైత్ర, వైశాఖ అనే రెండు పులులు మహారాష్ట్ర నుంచి ఈ ప్రాంతానికి వలసగా వచ్చాయి.

2015లో పాల్గుణ1, పాల్గుణ2 అనే మరో రెండు పులుల వలస
ఇవే కాకుండా 2015లో పాల్గుణ 1, పాల్గుణ 2 అనే మరో రెండు పులులు కూడా వలస రావడంతో వీటి సంఖ్య నాలుగుకు చేరింది. ఆ తరువాత వీటికి మరో నాలుగు పిల్లలు పుట్టడంతో వీటి సంఖ్య ఎనిమిదికి చేరినట్టు అధికారులు గుర్తించారు. వీటితో పాటుగా కాగజ్‌నగర్‌ అడవుల్లో మరో పులికూడా సంచరిస్తున్నట్టు గుర్తించారు. తాజాగా వాటికి మరో రెండు పులి పిల్లలు జన్మించినట్టు అధికారులు గుర్తించారు.

పులుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
అంతరించిపోతున్న జీవజాతులలో పెద్దపులులు కూడా ఉండటంతో... సిర్పూర్‌ అడవుల్లోకి వస్తున్న పులుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పులుల సంరక్షణకు నిధులు కేటాయించింది. అడవుల్లో పులులు ఎక్కడ నివాసం ఏర్పర్చుకున్నాయనే దానిపై అధికారులు నిఘా పెట్టారు. సిర్పూర్‌ అటవీ ప్రాంతంలోని పెన్‌గంగ, ప్రాణహిత నదులతో పాటు పెద్దవాగు పరిసరాల్లోని గుహల్లో స్థావరం ఏర్పర్చుకున్నట్లు గుర్తించారు. కాగజ్‌ నగర్‌ మండలం కడంబ అటవీ ప్రాంతం- పెద్దగుహలో మరో స్థావరం ఏర్పర్చుకొన్న ఆరు పెద్దపులులును సీసీ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు. వీటి కనుగుణంగా ప్రత్యేక సంరక్షణ సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ సహకారంతో వలస పులుల సంఖ్య క్రమంగా పెరగడంతో... కాగజ్‌నగర్‌ కడంబ అడవుల్లో గుహాలో పెద్దపులుల స్థావరం ఫోటోను స్థానిక సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు అందించారు. ఈ ప్రాంతంలో ఉండే పెద్దపులులను గురించి సీఎం కేసీఆర్‌కు వివరించారు.

పెద్దపులుల కోసం ప్రత్యేక ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఒక ప్రాంతాన్ని కవ్వాలు టైగర్‌జోన్‌గా గుర్తించి అక్కడి పెద్దపులుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కానీ ఆ ప్రాంతంలో పెద్దపులులు సంచారం కనుమరుగైనట్టు అధికారులు గుర్తించారు. అయితే ఇప్పుడు కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ పరిధిలోని సిర్పుర్‌ నియోజకవర్గంలో దట్టమైన అడవులు ఉండటంతో పులులకు మంచి నివాస కేంద్రంగా మారింది. ప్రభుత్వం సిర్పూర్‌ అడవుల్లో వలస వచ్చిన పులులకు మరింత నిధులు కేటాయించి వాటి సంరక్షణ కోసం చర్యలు చేపడితే పెద్దపులులు ఇక్కడే స్థిరంగా ఉంటాయని.. సఫారీ టూరిస్టు కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని నిపుణులు చెప్తున్నారు.

12:33 - July 2, 2018

హైదరాబాద్ : ఉపాధ్యాయ బదిలీలపై లైన్ క్లియర్ అయ్యింది. ఉపాధ్యా బదిలీలపై వున్న పిటీషన్స్ అన్నింటిని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కొట్టివేసింది. ఈ బదిలీలకు సంబంధించిన ఆర్డర్ ను ఉమ్మడి జిల్లా డీఈఓలు కాకుండా ఆర్జేడీలకు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయ బదిలీలపై లైన్ క్లియర్ అయ్యింది. కాగా ఉమ్మడి జిల్లాలలో డీఈవోలకు మాత్రమే వుండేది కానీ ఇప్పుడు ఆర్జేడీలకు ఇవ్వాలని..వారికి మాత్రమే న్యాయస్థానం స్పష్టంచేసింది.

12:25 - July 2, 2018

ఢిల్లీ : భారతదేశంలో వేలాది కోట్ల కుంభకోణాల్లో ఇరుక్కున్న పలువురు విదేశాలకు చెక్కేసి హాయి ఎంజాయ్ చేస్తున్నా భారత ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లుగా కూడా పట్టదు. ఈ క్రమంలో విజయ్ మాల్యా, నీవర్ మోదీ, లలిత్ మోదీ వంటి ఘరానా ప్రముఖులకు కొదవ లేదు. మాల్యాపై చర్యలు తీసుకుంటున్నామని నమ్మించిన కేంద్రం మాల్యా నుండి ఒక్క రూపాయి కూడా రాబట్టలేకపోయింది. కానీ ఇప్పుడు ప్రముఖ వజ్రాల వ్యాపారి పంజాబ్ నేషన్ బ్యాంక్ ను మోసం చేసిన కూడా నీరవ్ మోదీ కూడా బ్రిటన్ కు పారిపోయాడు. ఈ విషయం తేటతెల్లంగా వినిపిస్తున్నా నీరవ్ మోదీ ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఈ నేపథ్యంలో సీబీఐ అభ్యర్థన మేరకు నీరవ్ మోదీ కి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. బ్యాంకులకు రూ.13వేల కోట్లు ఎగ్గొట్టి నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్ రాజధాని లండన్ కు పారిపోయాడు. ఈ క్రమంలో నీరవ్ మోదీకి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీచేసింది. మొత్తం 192 దేశాల్లో సేవలందిస్తున్న ఇంటర్ పోల్, ఎక్కడ అరెస్టయినా, తమకు అప్పగించాలని ఇండియా కోరవచ్చు. అయితే, భారత్ తో సత్సంబంధాలు, నేరస్తుల అప్పగింత ఒప్పందాలు ఉన్న దేశాల్లో నీరవ్ అరెస్ట్ అయితే, సులువుగా ఇండియాకు రప్పించవచ్చు.మొత్తం 192 దేశాల్లో సేవలందిస్తున్న ఇంటర్ పోల్, ఎక్కడ అరెస్టయినా, తమకు అప్పగించాలని ఇండియా కోరవచ్చు. అయితే, భారత్ తో సత్సంబంధాలు, నేరస్తుల అప్పగింత ఒప్పందాలు ఉన్న దేశాల్లో నీరవ్ అరెస్ట్ అయితే, సులువుగా ఇండియాకు రప్పించవచ్చు.కాగా ఈ నోటిస్ మేరకు నీరవ్ మోదీపై చర్యలు తీసుకుంటారా లేదా? అనే విషయంపై వేచి చూడాల్సిందే. 

హోంగార్డులు క్రమశిక్షణకు మారుపేరు : చంద్రబాబు

విజయవాడ: హోంగార్డులు క్రమశిక్షణకు మారుపేరుగా వుంటున్నారని సీఎ చంద్రబాబు ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే హోంగార్డులకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. అందుకనే హోంగార్డుల జీతాలను రూ.9వేల నుండి రూ.18 వేలకు పెంచామని సీఎం చంద్రబాబు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో హోంగార్డుల ఆత్మీయ అభినందన సభను నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు..విధుల నిర్వహణలో పోలీసులకు, హోంగార్డులకు మేమాత్రం వ్యత్యాసం లేదన్నారు.

ఏపీ టెట్ ఫలితాలు విడుదల..

విశాఖపట్నం : ఏపీ టెట్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. టెట్ ఫలితాల్లో 57.48 శాతంఉత్తీర్ణత సాధించారని మంత్రి గంటా తెలిపారు. టెల్ పేపర్ 1లో మేమన కుసుమకు 146 మార్కులు సాధించారనీ..పేప్ 2లో సోషల్ స్టడీస్ లో అర్ల విష్ణుప్రియకు 136 మార్కులు, పేపపర్ ఏ లెక్కలు, సైన్స్ లో ఇమ్మంది విజయలక్ష్మీ 135 మార్కులు, సాధించారని మంత్రి గంటా తెలిపారు.

సీఎం చంద్రబాబుని సత్కరించిన హోం గార్డులు..

విజయవాడ: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో హోంగార్డుల ఆత్మీయ అభినందన సభను నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబును హోంగార్డులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో హోమంత్రి చినరాజప్ప, డీజీపీ ఆర్పీ ఠాకూర్, హోంగార్డ్స్ ఐ.జి త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

నీరవ్ మోదీకి రెడ్ కార్నర్ నోటీస్..

ఢిల్లీ : భారతదేశంలో వేలాది కోట్ల కుంభకోణాల్లో ఇరుక్కున్న పలువురు విదేశాలకు చెక్కేసి హాయి ఎంజాయ్ చేస్తున్నా భారత ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లుగా కూడా పట్టదు. ఈ క్రమంలో విజయ్ మాల్యా, నీవర్ మోదీ, లలిత్ మోదీ వంటి ఘరాని ప్రముఖులకు కొదవ లేదు. ఈ క్రమంలో సీఎన్ బీ కుంభకోణం కేసులో నీరవ్ మోదీ కి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. బ్యాంకులకు రూ.13వేల కోట్లు ఎగ్గొట్టి నీరవ్ మోదీ ప్రస్తుతం బ్రిటన్ రాజధాని లండన్ కు పారిపోయాడు. ఈ క్రమంలో నీరవ్ మోదీకి ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీచేసింది.

11:39 - July 2, 2018

కరీనగర్ : సెల్ఫీల మోజులో పడి పలు ప్రాణాలు బలైపోతున్న ఘటనలో అనేకం విన్నాం. కానీ ఓ యువతి తీసుకున్న ఓ సెల్ఫీ వల్ల తన వివాహం ఆగిపోయిన ఘటన చోటుచేసుకుంది. గతంలో తన స్నేహితుడితో కలసి తీసుకున్న ఓ సెల్ఫీ పెళ్లిని ఆపిన సంఘటన హుజూరాబాద్ లో జరిగింది. వరంగల్‌ జిల్లా సూరారం గ్రామానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌ లోని ఓ సూపర్‌ మార్కెట్‌ లో పనిచేస్తున్న వేళ, అక్కడే క్యాషియర్‌ గా పనిచేస్తున్న మల్లబోయిన ప్రశాంత్‌ అనే యువకుడితో సెల్ఫీలు దిగింది. కొంతకాలానికి ఆ యువతికి మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌ కు చెందిన ఆడెపు అనిల్‌ కుమార్‌ తో వివాహం నిశ్చయం అయి పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. హుజురాబాద్‌ లోని బీఎస్ఆర్‌ గార్డెన్స్ లో వీరి పెళ్లి ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. కాసేపట్లో వరుడు తాళి కడతాడనగా, అతని ఫోన్‌ కు ప్రశాంత్‌, వధువు కలిసున్న సెల్ఫీ ఫొటోలు వచ్చాయి. ఆపై వరుడికి ఫోన్‌ చేసిన ప్రశాంత్, తామిద్దరం చాలా కాలంగా ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అనిల్ కుమార్, తనను దారుణంగా మోసం చేశారని ఆరోపిస్తూ, ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. వధువుపై, ఆమె కుటుంబ సభ్యులపై ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు వధువు కూడా ప్రశాంత్‌ పై ఫిర్యాదు చేస్తూ, ఎప్పుడో తీసుకున్న సెల్ఫీలను అడ్డుపెట్టుకుని తన పెళ్లి ఆగిపోయేలా చూశాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. రెండు కేసులనూ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

11:29 - July 2, 2018

కృష్ణా : భారతీయ యువకుడి పాలిట అమెరికా జలపాతం యమపాశంలా మారింది. కృష్ణా జిల్లా గొట్టెముక్కలకు చెందిన ఓ యువకుడు అమెరికాలోని వాటర్ ఫాల్స్ లో పడి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. నార్త్ కరోలినాలో ప్రాంతంలో ఓ వాటర్ ఫాల్స్ కు మిత్రులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన నాగార్జున అనే యువకుడు మృతి చెందాడు. ఈ విషయాన్ని నాగార్జున మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గొట్టెముక్కల గ్రామంలో విషాదం నెలకొంది. కాగా అమెరికాలోని ఫార్మాలిటీస్ పూర్తి అయిన వెంటనే నాగార్జున మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

 

11:14 - July 2, 2018
11:08 - July 2, 2018

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ పరిధిలోమూడోరోజు ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసి అధికారులు తొలగిస్తున్నారు. నగరంలోని ఆరు ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. శని, ఆదివారాల్లో 2 వేల మూడు వందల 41 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

11:04 - July 2, 2018

నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా గుండాల మండలం మసానుపల్లిలో గుప్తనిధులు దొరికినట్లు ప్రచారం సాగుతోంది. బిరప్ప గుడి ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు జరిపిన తవ్వకాల్లో విలువైన బంగారం దొరికిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.పక్క జిల్లానుంచి ఓ పూజరిని తెచ్చి.. గుడిప్రాంతంలో పూజలు చేసి.. తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ తవ్వకాల్లో దొరికిన విలువైన ఆభరణాన్ని పంచుకునే విషయంలో.. గొడవ జరగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూజారితోపాటు వారిరువురూ పరారీలో ఉన్నారు.

11:01 - July 2, 2018

కృష్ణా : నందిగామలో మున్సిపల్‌ కార్మికుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్న డిమాండ్‌తో మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో అధికారులు ఇవాళ పారిశుద్ధ్య పనులకోసం కిరాయి కూలీలను రప్పించారు. పని చేస్తున్న కిరాయి కూలీలను మున్సిపల్‌ కార్మికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే కూడా తమని అణగదొక్కేందుకు చూస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

10:59 - July 2, 2018

అనంతపురం : దశాబ్దాల తరబడి నెలకొన్న చుక్కల భూముల వివాదానికి  ఏపి ప్రభుత్వం తెరదింపనుంది.గత మూడురోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తూ భూముల వివాదాలకు చెక్ పెడుతున్నారు. అనంతపురం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చుక్కల భూములున్న నేపథ్యంలో... జాయింట్ కలెక్టర్ స్వయంగా హాజరవుతూ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఈ వివాదాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొలిక్కిరాని చుక్కల భూమి సమస్య
అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాలు చుక్కల భూములున్నాయి.వాటి సమస్యల పరిష్కారినికి అనేక ఏళ్లుగా అందరూ ప్రయత్నిస్తున్నప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. గతంలో 22 ఏ లిస్టు పేరుతో సబ్ రిజిష్ట్రార్లకు లిస్టుపంపినా .. అవి నిషేధిత జాబితాలో వుండడంతో రిజిష్ట్రేషన్లు చేయకుండా ఆపేశారు. దీంతో చాలామంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీటిపై ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడిరావటంతో ఈ సమస్యకు చెక్ పెట్టెందుకు గ్రామస్థాయిలో సభలునిర్వహిస్తున్నారు. ఆయాగ్రామాల్లో వున్న చుక్కల భూముల వివరాలతోపాటు మిగిలిన బంజరు భూముల వివరాలను కూడా ఆయా గ్రామపంచాయతీల్లో ప్రదర్శిస్తున్నారు. రైతులు అర్జీలు ఇస్తే వాటిని అక్కడే మీసేవ ద్వారా ఎంటర్ చేసి నలబైఐదురోజుల్లోపు సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఇంకా గ్రామంలో ఏవైన సమస్యలున్నా కూడా ఫీల్డ్ విజిట్ చేసి వాటి పరిష్కారినికి కూడా కృషిచేస్తామని తెలిపారు అనంతపురం జాయింట్ కలెక్టర్ డీల్లీరావు.

భూ వివాదాల పరిష్కారం, రిజిస్ట్రేషన్లకు రైతులకు గ్రామాల్లోనే అవకాశం
ఇప్పటికే జిల్లా ప్రజలు పెధ్ద ఎత్తునఈ గ్రామసభలను వినియోగించుకొంటున్నారని అధికారులు అంటున్నారు. ఇప్పటివరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా రెండువేలకు పైగా ఆర్జీలు వచ్చాయని,ఇంకా దాదాపు గా పదిహేనువేలకు పైగా చుక్కల భూములకు సంబంధించి రైతులనుంచి వినతులు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోందన్నారు జాయింట్ కలెక్టర్. గ్రామస్థాయి సభలతో పూర్తిస్థాయిలోకాకపోయినా ఎనబైశాతం వరకు భూములకు సంబంధించిన వివాదలు తొలిగిపోయే అవకాశాలు ఉన్నాయని జిల్లా అధికారులు అంటున్నారు. ఇవే కాకుండా అన్ రిజిష్టర్డ్ డాక్యుమెంట్లతో చుక్కల భూములను కొన్నట్లు ఆధారాలు చూపిస్తే వాటిపై కూడా హక్కులు కల్పిస్తున్నట్టు చెబుతున్నారు.

భూ వివాదాల పరిష్కారనికి గ్రామసభలు నిర్వహిస్తున్న అధికారులు
ఈ గ్రామసభల ద్వారా పరిష్కారమైన భూములపై సన్న,చిన్నకారు రైతులకు రిజిష్ట్రర్ చార్జీల నుంచి కూడా పూర్తిమినహాయింపు ఇస్తున్నట్టు జిల్లా అధికారులు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని రైతులు పూర్తి స్థాయిలో వినియోగించుకొవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ అవకాశం డిఫారం పట్టాలకు లేకపోవడంతో చాలామంది రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పన్నెండేళ్లకుకు పైగా సాగులో వున్న డిఫాం పట్టాల రైతులకు కూడా ఇదే అవకాశాన్ని ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు డిఫాం పట్టాల రైతులకు కూడా రిజిస్ట్రేషన్‌ అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు. 

పెళ్లిని ఆపివేసిన వధువు సెల్ఫీ సరదా..

కరీనగర్ : సెల్ఫీల మోజులో పడి పలు ప్రాణాలు బలైపోతున్న ఘటనలో అనేకం విన్నాం. కానీ ఓ యువతి తీసుకున్న ఓ సెల్ఫీ వల్ల తన వివాహం ఆగిపోయిన ఘటన చోటుచేసుకుంది. గతంలో తన స్నేహితుడితో కలసి తీసుకున్న ఓ సెల్ఫీ పెళ్లిని ఆపిన సంఘటన హుజూరాబాద్ లో జరిగింది. వరంగల్‌ జిల్లా సూరారం గ్రామానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌ లోని ఓ సూపర్‌ మార్కెట్‌ లో పనిచేస్తున్న సమయంలో క్యాషియర్‌ గా పనిచేస్తున్న యువకుడితో సెల్ఫీలు దిగింది.

మరోసారి తెరపైకి టీటీడీ పురావస్తుశాఖలోకి..

తిరుమల : మరోసారి టీటీడీ పురావస్తు శాఖ వ్యవహారం తెరపైకి వచ్చింది.తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పురావస్తు శాఖ పరిధిలోకి తేవాలంటు డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. టీటీడీ కట్టడాల పరిరక్షణ బాధ్యతను తమకు అప్పగించాలంటు మే 4న పురావస్తు శాఖ టీటీడీకి లేఖలు రాసింది. ఈ లేఖలోని అంశాలను అమలు చేయాలని..టీటీడీ ఆదాయ వ్యవయాలపై సీబీఐ దర్యాప్తు కోరుతు..పిటీషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. తిరుమల నేలమాళిగల్లోని గుప్త నిధుల పరిరక్షణకు కమిషన్ వేయాలని గుంటూరుకు చెందిన అనిల్, గుజరాత్ కు చెందిన భూపేంద్ర స్వామి అనే ఇద్దరు వ్యక్తులు కోర్టులో పిటీషన్ వేశారు.

10:27 - July 2, 2018

తిరుమల : మరోసారి టీటీడీ పురావస్తు శాఖ వ్యవహారం తెరపైకి వచ్చింది.తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పురావస్తు శాఖ పరిధిలోకి తేవాలంటు డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. టీటీడీ కట్టడాల పరిరక్షణ బాధ్యతను తమకు అప్పగించాలంటు మే 4న పురావస్తు శాఖ టీటీడీకి లేఖలు రాసింది. ఈ లేఖలోని అంశాలను అమలు చేయాలని..టీటీడీ ఆదాయ వ్యవయాలపై సీబీఐ దర్యాప్తు కోరుతు..పిటీషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. తిరుమల నేలమాళిగల్లోని గుప్త నిధుల పరిరక్షణకు కమిషన్ వేయాలని గుంటూరుకు చెందిన అనిల్, గుజరాత్ కు చెందిన భూపేంద్ర స్వామి అనే ఇద్దరు వ్యక్తులు కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారణ న్యాయస్థానం ఈరోజు విచారించనుంది.  

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అంతే : సీపీఐ రామకృష్ణ

అమరావతి : ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 85 శాతం నిధులు ఇచ్చిందంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో ఏ పార్టీ అయినా ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని పొత్తులు పెట్టుకుంటే... వారికి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తనకు రెండేళ్ల సమయం ఇస్తే... కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తానంటూ గాలి జనార్దనరెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని...

మాకూటమి సీఎం అభ్యర్థి పవన్ : రామకృష్ణ

అమరావతి : రానున్న ఎన్నికల నేపథ్యంలో మహా కూటమి ఏర్పడితే ముఖ్యమంత్రి అభ్యర్థి జనసేన అధినేత పవన్ కల్యాణే అని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజకీయాలపై పవన్ కు స్పష్టమైన అవగాహన ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. పవన్ కు ఇమేజ్, క్రేజ్ రెండూ ఉన్నాయని... అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. 

మావోయిస్టు పేరుతో బెదిరింపులు..అరెస్ట్..

సూర్యాపేట : మావోయిస్టుల పేరుతో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తి దందా బైటపడింది. మావోల సానుభూతిపరులకు ఆలవాలంగా వున్న చింతలపల్లిలో నరసింహారావు అనే వ్యక్తి ఓ పత్తిమిల్లు యజమనానికి ఫోన్ చేసి డబ్బులివ్వాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. పత్తిమిల్లు జయమాని రాంరెడ్డికి తరచు ఫోన్ చేసి డబ్బుల కోసం బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి రాంరెడ్డికి ఫోన్ చేసి రూ.3లక్షలు ఇవ్వాలని..గతంలో కూడా ఓ సర్పంచ్ కు ఫోన్ చేస్తే..తనకు డబ్బులు ఇచ్చాడని పత్తిమిల్లు యజమాన రాంరెడ్డిని బెదిరించాడు.

09:46 - July 2, 2018

మహబూబాబాద్‌ : రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఒక్కటే.... కాని డాక్టర్లు మాత్రం ఇద్దరు. అందులో అసలు ఎవరో, నకిలీ ఎవరో మాత్రం తెలీదు. ఇదీ మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకున్న నకిలీ డాక్టర్ల వ్యవహారం. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌తో వైద్య విధాన పరిషత్‌ ద్వారా ఆస్పత్రుల్లో డాక్టర్ల నియామకం చేపట్టడంతో.....దరఖాస్తుదారుల ప్రొవిజన్‌ మెరిట్‌ లిస్ట్‌ పరిశీలనలో ఈ ఉదంతం వెలుగు చూసింది.

తొర్రూరు పట్టణంలో నకిలీ డాక్టర్ల ఉదంతం
మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో నకిలీ డాక్టర్ల ఉదంతం వెలుగు చూసింది. ఒకే రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ఇద్దరు వైద్యులు చలామణి అవడం జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

దరఖాస్తు దారుల పరిశీలనలో వెలుగు చూసిన ఉదంతం
ఆస్పత్రిలో ఖాళీల భర్తీ కోసం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనికి అప్లై చేసుకున్న దరఖాస్తుదారుల పరిశీలనా ప్రక్రియలో ఒకే పేరుతో ఉన్న ఇద్దరు వైద్యుల ఉదంతం వెలుగు చూసింది. దీంతో అసలు ఎవరు, నకిలీ ఎవరు అనే విషయం తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయంపై విచారణ జరిపి అసలు విషయం నిగ్గు తేల్చేందుకు స్థానిక డాక్టర్స్‌ అసోసియేషన్‌..... జిల్లా వైద్య ఆరోగ్య అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు.

అమృత ఆస్పత్రిలో 48047 రిజిస్ట్రేషన్‌ నంబర్ కలిగిన డాక్టర్‌. పి. రాంబాబు
తొర్రూరు పట్టణ కేంద్రంలోని చింతలపల్లి రహదారిలో ఉన్న అమృత హాస్పిటల్‌లో 48047 రిజిస్ట్రేషన్‌ నంబర్ కలిగిన డాక్టర్‌. పి. రాంబాబు ఎంబీబీఎస్‌ నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఆ డాక్టర్‌ నాలుగు నెలల పాటు ప్రైవేటు ఆస్పత్రిలో పని చేసి మళ్లీ తిరిగి తొర్రూరులోనే ప్రైవేటు వైద్యుడిగా పని చేస్తున్నాడు. వైద్య విధాన పరిషత్‌ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నియామకానికి సంబంధించిన రాంబాబు దొరా అనే డాక్టర్‌ పి. రాంబాబు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ అయిన 48047తోనే ఉద్యోగాన్ని పొందడంతో విషయం బయటపడింది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు దారుల ప్రొవిజన్‌ మెరిట్‌లిస్ట్‌
వైద్య విధాన పరిషత్‌లోని సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వైద్యుల ప్రొవిజన్ మెరిట్‌లిస్టును ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. ఈ జాబితాలో సీరియల్‌ నంబర్‌ 39లో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ గుర్తింపు సంఖ్య tvvp 0978051 నంబర్‌పై రాంబాబు దొర తండ్రి పేరు పి. సుబ్బారావుతో పాటు పుట్టిన తేది, కులం, వివరాలను నమోదు చేస్తూ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ 48047గా చూపించారు. పీజీ డిప్లోమా పూర్తి చేసిన ఈ వైద్యుడు వెయిటేజీ మార్కులు తదితర వివరాలు కూడా ఈ జాబితాలో ఉంచారు. ప్రస్తుతం నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేటు వైద్యుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఇదే పేరు రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో తొర్రూరులోని అమృత హాస్పిటల్‌ లైసెన్స్‌ కోసం డాక్టర్. పి. రాంబాబు ధృవీకరణ పత్రాలను వైద్య ఆరోగ్యశాఖలో అందజేశారు. కాని ఆన్‌లైన్‌లో ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రి లైసెన్సు జాబితాలో మాత్రం ప్రస్తుతం పి. రాంబాబు ఫోటోకు బదులు....రాంబాబుదొర ఫోటో ఉండటంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.

అసలు ఎవరో నకిలీ ఎవరో తేల్చలేకపోతున్న అధికారులు
ఒకే నంబర్‌తో ఉన్న ఇద్దరు వైద్యుల్లో అసలు ఎవరో, నకిలీ ఎవరో తేల్చలేకపోతున్నారు అధికారులు. వాస్తవానికి లైసెన్సు తీసుకునే సమయంలో ప్రైవేటు భవనాల్లో పనిచేసే వైద్యుల పూర్తి వివరాలు పరిశీలించి సర్టిఫికేట్‌ల జిరాక్స్‌లను వైద్య ఆరోగ్య శాఖలో భద్రపరచుకొని నిబంధనలతో లైసెన్స్‌ జారీ చేస్తారు. మరి ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపితే గాని అసలు నిజం ఏంటో తెలియదు. 

09:26 - July 2, 2018

సూర్యాపేట : మావోయిస్టుల పేరుతో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తి దందా బైటపడింది. మావోల సానుభూతిపరులకు ఆలవాలంగా వున్న చింతలపల్లిలో నరసింహారావు అనే వ్యక్తి ఓ పత్తిమిల్లు యజమనానికి ఫోన్ చేసి డబ్బులివ్వాలని బెదిరింపులకు పాల్పడ్డాడు. పత్తిమిల్లు జయమాని రాంరెడ్డికి తరచు ఫోన్ చేసి డబ్బుల కోసం బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరోసారి రాంరెడ్డికి ఫోన్ చేసి రూ.3లక్షలు ఇవ్వాలని..గతంలో కూడా ఓ సర్పంచ్ కు ఫోన్ చేస్తే..తనకు డబ్బులు ఇచ్చాడని పత్తిమిల్లు యజమాన రాంరెడ్డిని బెదిరించాడు. కాగా గతంలో కూడా అదే నంబర్ నుండి ఫోన్ రావటంతో అనుమానించిన రాంరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు సదరు సర్పంచ్ ను విచారించారు. తాను ఎవరికి ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదని స్ఫష్టం చేశాడు. దీంతో నరసింహకు మావోయిస్టులకు ఎటువంటి సంబంధాలు లేవని పోలీసులు గుర్తించారు. అనంతరం నరసింహారావును పోలీసులు అరెస్ట్ చేసారు. 

5వ తేదీన తెలంగాణ విద్యాసంస్థల బంద్..

హైదరాబాద్ : ఈ నెల 5వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి బంద్ పాటించబోతున్నట్టు కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐడీఎస్ఓ, టీవీవీ, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎస్బీలు ఐక్య కార్యాచరణ కమిటీ పోస్టర్ ను విడుదల చేశాయి. ఈ సందర్భంగా కమిటీ నేతలు మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలల్లో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

11 మంది సామూహిక ఆత్మహత్యల్లో ఆసక్తిక అంశాలు!!..

ఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో నిన్న వెలుగులోకి వచ్చి కలకలం రేపిన సామూహిక ఆత్మహత్యల వెనుక కారణాన్ని కనుగొనే క్రమంలో పోలీసులు పలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చారు. మొత్తం 11 మృతదేహాలు ఇంట్లో కనిపించగా, ఆ ఇంట్లో సోదాలు జరిపిన అనంతరం, పోలీసులకు కొన్ని పుస్తకాల్లో క్షుద్ర పూజలు, మోక్షం పొందేందుకు ఉన్న మార్గాల గురించిన వివరాలు ఉన్నాయి. ఎలా మరణిస్తే మోక్షం లభిస్తుందన్న విషయాలు రాసుండటాన్ని చూసి, అందులో చెప్పిన విధంగానే మృతదేహాలు ఉండటంతో, వీరి ఆత్మహత్యకు అదే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

మద్యం కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు..

నిర్మల్ : ముథోల్ జిల్లాలో మద్యానికి బానిసైన నగేశ్ తండ్రి పోతన్నను కర్రతో కొట్టి చంపాడు. మద్యానికి డబ్బులివ్వాలని తండ్రితో గొడవ పడ్డ నగేశ్ తండ్రి డబ్బులు ఇవ్వకపోవటంతో ఘర్షణకు దిగాడు. అనంతరం కర్రతో తీవ్రంగా దాడి చేయగా పోతన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పోతన్న భార్య, స్థానికులు కలిసి భైంసా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పోతన్న మృతి చెందాడని వైద్యులు తెలిపారు. తండ్రిపై దాడి చేసిన వెంటనే నగేశ్ పరారయ్యాడు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పరారీలో వున్న నగేశ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

08:44 - July 2, 2018

నిర్మల్ : రక్తపాశాలను కూడా మద్యం ప్రభావితం చేస్తోంది. మద్యం మత్తులో కన్న తండ్రులను, తల్లులను దారుణంగా హత్య చేస్తున్న సందర్భాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అలాగే కన్న కొడుకులను హత్య చేస్తున్న తండ్రుల ఉదంతాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓదెల మండలం ఉప్పరపల్లిలో మద్యం డబ్బుల కోసం కన్న కుమారుడిని కన్నతండ్రి కొట్టి చంపిన ఘటన మరచిపోకముందే..మద్యం డబ్బుల కోసం కన్న తండ్రిని దారుణంగా చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముథోల్ జిల్లాలో మద్యానికి బానిసైన నగేశ్ తండ్రి పోతన్నను కర్రతో కొట్టి చంపాడు. మద్యానికి డబ్బులివ్వాలని తండ్రితో గొడవ పడ్డ నగేశ్ తండ్రి డబ్బులు ఇవ్వకపోవటంతో ఘర్షణకు దిగాడు. అనంతరం కర్రతో తీవ్రంగా దాడి చేయగా పోతన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పోతన్న భార్య, స్థానికులు కలిసి భైంసా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పోతన్న మృతి చెందాడని వైద్యులు తెలిపారు. తండ్రిపై దాడి చేసిన వెంటనే నగేశ్ పరారయ్యాడు. మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పరారీలో వున్న నగేశ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

08:35 - July 2, 2018

ఢిల్లీ : స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఆయుధం అగ్ని-5. ఇది 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అంతటి సామర్థ్యం గల బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-5 త్వరలో భారత అమ్ములపొదలోకి చేరబోతోంది.

5 వేల కి.మీ వరకు దూసుకెళ్లి శత్రువులను నాశనం చేసే సత్తా
త్వరలో భారత ఆర్మీచేతికి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-5 చేరబోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ అస్త్రం 5వేల కిలోమీటర్ల వరకు వెళ్లి....శత్రు లక్ష్యాలను నాశనం చేయగలదు. చైనాను వణికించే ఈ క్షిపణిని త్వరలోనే స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌కు అందజేస్తామని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

అన్ని స్థాయిల్లో క్షిపణి పరిశీలన, నిర్దేశిత లక్ష్యాన్ని సాధించిన అగ్ని-5
ఎస్‌ఎఫ్‌సీకి అందించే ముందు ఈ క్షిపణిని అన్ని స్థాయుల్లో పరీక్షిస్తున్నారు. గత నెలలో ఒడిశా తీరంలో ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగంలో నిర్దేశిత లక్ష్యాన్ని అగ్ని-5 సాధించింది. అయితే మిగిలిన క్షిపణుల కన్నా అగ్ని-5 చాలా అధునాతనమైనది. కొత్తగా సిద్ధం చేసిన అనేక పరిజ్ఞానాలను ఈ అస్త్రంలో వినియోగించారు. నేవిగేషన్‌ వ్యవస్థలు, కచ్చితత్వంతో కూడిన రింగ్‌ లేజర్‌ జైరో ఆధారిత ఇనర్షియల్‌ నేవిగేషన్‌ వ్యవస్థ, అధునాతన మైక్రో నేవిగేషన్‌ వ్యవస్థలు ఈ క్షిపణిని కచ్చిత లక్ష్యంతో చేరవేస్తాయి. ఈ క్షిపణిలో అత్యంత వేగంగా పనిచేసే కంప్యూటర్‌, సరికొత్త సాఫ్ట్‌వేర్‌, డిజిటల్‌ నియంత్రణ, అధునాతన కంపాక్ట్‌ ఏవియానిక్స్‌ వంటి వ్యవస్థలన్నీ ఉన్నాయి.

అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం
అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణితో చైనాలోని బీజింగ్‌ సహా షాంఘై, గాంఘూ, హాంకాంగ్‌లను టార్గెట్‌ చేయవచ్చు. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్‌, ఉత్తరకొరియాలు మాత్రమే ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని కలిగి ఉన్నాయి. ఇప్పుడు భారత్‌ కూడా ఈ దేశాల సరసన చేరింది. 

గోదావరి జిల్లాలో కొబ్బరి వ్యాపారాలు బంద్..

పశ్చిమగోదావరి : ఉభయ గోదావరి జిల్లాల్లో నేటి నుండి కొబ్బరి వ్యాపారులు బంద్ చేపట్టనున్నారు. ఈ పర్మిట్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్ తో కొబ్బరి వ్యాపారులు బంద్ చేపట్టనున్నారు. 

టెట్ ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి గంటా..

అమరావతి : ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు నేడు టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉదయం 11గంటలకు గంటా టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. 

దేవి కూడలిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ..

విజయనగరం : శృంగవరపు కోటలో జనసేనాని పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర కొనసాగనుంది. మ.3 గంటలకు దేవి కూడలిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.  

మళ్లీ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం : కేటీఆర్

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంతో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారని... ఆయన మాట నిలబెట్టుకున్నా, నిలబెట్టుకోక పోయినా, తాను మాత్రం మాటపై నిలబడతానని చెప్పారు. సోనియాగాంధీపై తాను చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టడంపై స్పందిస్తూ... తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ది మోసాల చరిత్ర అని చెప్పారు.

07:38 - July 2, 2018

తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు పడలపై ప్రయాణం చేసేందుకు యత్నిస్తున్నారు? ఫెడరల్ ఫ్రంట్ అంటు ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలతోను, పలు పార్టీల అధినేతలతోను భేటీ అయిన కేసీఆర్ తాజా ఢిల్లీ ప్రర్యటనతో బీజేపీకి ,టీఆర్ఎస్ కు స్నేహపూర్వక వాతావరణం వున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో జేడీఎస్ నేత, మాజీ ప్రధాని దేవగౌడ సీఎం కేసీఆర్ తో భేటీ అయిన నేపథ్యంలో మరో విధమైన మాటలతో కేసీఆర్ నిజమైన ఫెడరల్ ఫ్రంట్ కోసం యత్నిస్తున్నారా? లేదా కేవలం కాంగ్రెస్ ఏతర పార్టీలతో మాత్రమే జతకడుతున్నారా? అనే అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ మూడు పడవలపై ప్రయాణిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ చర్చను చేపట్టింది .. ఈచర్చలో జనసేన అధికార ప్రతినిథి అద్దేపల్లి శ్రీదర్, టీఆర్ఎస్ నేత శేఖర్ రెడ్డి,టీడీపీ దుర్గాప్రసాద్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొన్నారు.  

07:06 - July 2, 2018

అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి వచ్చే నెలలో భూమిపూజ చేయాలని నందమూరి బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ రిసర్స్‌ ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం 15 ఎకరాల భూమిని కేటాయించింది. మూడుదశల్లో వెయ్యి పడకల సామర్థ్యంతో దీనిని నిర్మిస్తామని ఆస్పత్రి చైర్మన్‌ బాలకృష్ణ చెప్పారు. విజయవాడలో వారంలో రెండు రోజులు పనిచేసే క్యాన్సర్‌ క్లినిక్‌ను బాలకృష్ణ ప్రారంభించారు. గవర్నర్‌పేటలో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్‌లో క్యాన్సర్‌ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 

07:02 - July 2, 2018

భద్రాద్రి : జిల్లాలో 8 వందల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన కేటీపీఎస్‌ ఏడవ దశ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. శరవేగంగా నిర్మితమైన ఈ విద్యుత్ ప్రాజెక్ట్‌ దేశ విద్యుత్ రంగంలో సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. తెలంగాణ జెన్కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు పాల్వంచలో ఈ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. రికార్డ్ సమయంలో విద్యుత్‌ ప్లాంటును నిర్మించి.. ప్రారంభించటంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో కేటీపీఎస్‌-7
భద్రాద్రి జిల్లాలో 8 వందల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన కేటీపీఎస్‌ ఏడవ దశలో విద్యుత్‌ ఉత్పత్తి శనివారం ప్రారంభమైంది. తెలంగాణ జెన్కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు పాల్వంచలో ఈ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్ట్‌ను ప్రారంభించి.. పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఈ ప్లాంటు ప్రారంభంతో తెలంగాణకు అందుబాటులో ఉండే విద్యుత్‌ 16 వేల మెగావాట్లు దాటింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రారంభించి.. పూర్తి చేసిన తొలి విద్యుత్ ప్రాజెక్ట్‌గా కేటీపీఎస్‌7 నిలిచింది. 5,700 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు నిర్మాణ పనులను 2015 ఫిబ్రవరి 1న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రారంభించిన 40 నెలల్లోనే ప్రాజెక్ట్‌ పూర్తి కావటంతో ప్లాంట్ల నిర్మాణంలో ఈ ప్లాంటు కొత్త చరిత్ర సృష్టించింది.విద్యుత్ కేంద్రం ప్రారంభించిన 48 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రీయ విద్యుత్‌ మండలి నిబంధనలు ఉన్ననేపథ్యంలో.. ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు అంతకన్న తక్కువ సమయంలోనే నిర్మాణం పూర్తి చేశారు.

ఐడీసీ భారం ఎక్కువ పడకుండా చరిత్రలో నిలిచిన కేటీపీఎస్‌- 7
అలాగే ఐడీసీ భారం అధికంగా పడకుండా నిర్మాణం చేపట్టిన ప్రాజెక్ట్‌గా కేటీపీఎస్‌ 7 చరిత్రలో నిలిచింది. కేంద్రీయ విద్యుత్‌ మండలి నిబంధనలకు అనుగుణంగా 8 నెలల ముందే ప్లాంటు పూర్తి కావటంతో ఈ ఘనత సాధించింది. దీంతో ఆర్థికంగా 300 కోట్ల రూపాయల మేలు కలగనున్నట్లు తెలుస్తోంది. ఇక కేటీపీఎస్‌7లో విద్యుత్‌ ఉత్పత్తికి అయ్యే ఖర్చు కూడా తక్కువగానే ఉండబోతుంది. ప్రభుత్వం రంగ సంస్థలను ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వం విధానానికి అనుగుణంగా.. జెన్కో సింగరేణితో అంగీకారం కుదుర్చుకుంది. ఈ అంగీకారం ప్రకారం జెన్కో ఉత్పత్తి చేసే విద్యుత్‌కు సింగరేణి సంస్థ బొగ్గును సరఫరా చేస్తుంది. దీని వల్ల సింగరేణికి లాభం జరగటంతో పాటు జెన్కోకు తక్కువ ధరకు బొగ్గు లభిస్తుంది. దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. అంతిమంగా ప్రభుత్వ రంగ సంస్థలు వర్థిల్లడానికి కేటీపీఎస్‌ 7 ఉపయోగపడుతుంది.

సీఎం ప్రోత్సాహం, అధికారులు, సిబ్బంది కృషితో వేగంగా ప్లాంటు నిర్మాణం
సీఎం కేసీఆర్‌ అందించిన ప్రోత్సాహం, విద్యుత్‌ అధికారులు, సిబ్బంది చేసిన సమిష్టి కృషివల్లే.. రికార్డు సమయంలో ప్లాంటు నిర్మాణం పూర్తి చేశామన్నారు జెన్కో-ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌. తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఎదుర్కొంటున్న తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చాలనే ధృడ సంకల్పంతో.. ప్రభుత్వం ఉందని అందుకనుగుణంగా విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రికార్డు సమయంలో 800 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటు నిర్మించటం జెన్కోకు గర్వకారణమన్నారు. ఈ రికార్డుతో తెలంగాణ జెన్కో కీర్తి ప్రతిష్టలు పెరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభాకర్‌రావు చెప్పారు. ప్లాంటు నిర్మాణం కోసం కష్టపడిన అధికారులకు, ఉద్యోగులకు ప్రభాకర్‌రావు అభినందనలు తెలిపారు.

ప్లాంటును ప్రారంభించటంపై సీఎం కేసీఆర్ హర్షం
రికార్డు సమయంలో విద్యుత్‌ ప్లాంటును నిర్మించి.. ఉత్పత్తి ప్రారంభించటం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జెన్కో కృషి ప్రశంసనీయం అని కొనియాడారు. పారదర్శకత, పనుల్లో వేగం సాధించాలనే లక్ష్యంతో విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించామన్నారు. ఆ లక్ష్యాలు నెరవేరడం ఆనందంగా ఉందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని కేసీఆర్ అభినందించారు. 

06:57 - July 2, 2018

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి ఆందోళన బాటపట్టారు. కో-ఆపరేటివ్‌ సొసైటీకి ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సిన డబ్బును వెంటనే చెల్లించాలని.. ఆర్టీసీలో ఉన్న స్కీమ్‌లను అమలు చేయాలని.. మొన్న సమ్మె చేపట్టకుండా ఉండటం కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే సకల జనుల సమ్మెనాటి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారి డిమాండ్‌లను నెరవేర్చాలంటూ.. ఇవాళ స్టాప్‌ అండ్‌ వర్కర్స్ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నారు. ఈ ఆందోళనకు గల కారణాలు, యాజమాన్యం, ప్రభుత్వ వైఖరిపై మనతో మాట్లాడేందుకు ఎస్‌డబ్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌రావు తెలిపే సమాచారాన్ని ఈరోజు జనపథంలో తెలుసుకుందాం..

ఆత్మాహుతి దాడిలో 12మంది భారతీయులు..

ఆఫ్ఘనిస్థాన్‌ : నంగర్హర్‌ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 19 మంది చనిపోయారు. వీరిలో 12 మంది భారతీయులున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో సిక్కులు, హిందువులున్నట్లు సమాచారం. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని కలిసేందుకు సిక్కులు వెళ్తుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడితో ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు భారత్ కూడా ఉలిక్కిపడింది.

కాంగ్రెస్ ఎంపీ మృతి..

పశ్చిమగోదావరి : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కమ్ముల బాలసుబ్బారావు తన 79వ సంవత్సరంలో గుండెపోటుతో ఏలూరులోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. బాలసుబ్బారావు 1981లో ఎమ్మెల్సీగా, 1982లో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 1987 నుండి 1992 వరకు పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఎంపీగా చేసిన కాలంలో కౌన్సిల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ సభ్యులుగా పనిచేసి తొమ్మిదో ఆసియా క్రీడలు ఘనంగా నిర్వహించడంలో తనవంతు పాత్ర పోషించారు. ఏపీ ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్షులుగా పనిచేసిన కాలంలో జాతీయస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించారు.

వందలాదిమంది 'మందుబాబు'లకు జైలు..

హైదరాబాద్ : పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. జూన్‌లో ప్రత్యేక డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించి 2,735 కేసులు నమోదు చేశారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా 454 మందికి జైలు శిక్ష విధించింది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ.. పదే పదే పోలీసులు తనిఖీల్లో పట్టుబడుతున్న 101 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లను రద్దు చేసింది. ఒక్కొక్కరికి రెండు నుంచి గరిష్టంగా 30 రోజుల జైలు శిక్ష విధించింది. 12 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లను శాశ్వతంగా... 89 మంది లైసెన్స్‌లను కనిష్టంగా 3 నెలల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు రద్దు చేశారు.

తుంగభద్రకు జలకళ..

కర్ణాటక : రాష్ట్రంలోని తుంగభద్ర డ్యామ్‌కు వరద భారీగా పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగ నది నుంచి భారీగా వరద నీరు డ్యాంలోకి వచ్చి చేరుతోంది. ఆదివారం తుంగ ప్రాజెక్టు నుంచి 49,424 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం టీబీ డ్యాంలోకి 49,424 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, ఔట్‌ఫ్లో 160 క్యూసెక్కులుగా నమోదైంది. 1610.10 అడుగుల నీటిమట్టం ఉండగా, 35.436 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తుంగభద్ర బోర్డు సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.

అమర్ నాథ్ యాత్రకు సుగమమం..

జమ్ము కశ్మీర్ : వాతావరణం అనుకూలించడంతో అమర్‌నాథ్ యాత్రికులకు మార్గం సుగమమైంది. జమ్ములో కురుస్తున్న భారీవర్షాలతో అమర్‌నాథ్‌కు వెళ్లే పహల్‌గాం, బాల్తాల్ రహదారులను శనివారం అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. కాగా వర్షాలు తగ్గి.. జీలం నదిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో రహదారులను పునరుద్ధరిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. భారీ వరదలతో రహదారులు జలమయం కావడంతో జమ్ము-శ్రీనగర్ రహదారిని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా ఈ రహదారులను పునరుద్ధరిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

రైల్వే జోన్ దీక్ష కోసం చినరాజప్ప సమీక్ష..

విశాఖపట్నం : విభజన హామీలలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన విశాఖ రైల్వే జోన్ సాధన కోసం టీడీపీ దీక్ష చేపట్టనుంది. ఈ అంశంపై హోంమంత్రి నిమ్మకాల చినరాజప్ప సమీక్షించారు. విశాఖ జోన్ సాధన కోసం 4న జ్నానాపురం గేట్ వద్ద దీక్ష జరుగనుంది. ఉదయం 9 గంటలకు నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష సాగనుందని చినరాజప్ప తెలిపారు. 

దళిత యువకుడిపై టీఆర్ఎస్ పార్టీ నేతల దౌర్జన్యం..

కరీంనగర్ : టీఆర్ఎస్ పార్టీ నేతల దౌర్జన్యం మరోసారి బైటపడింది. టీఆర్ఎస్ పార్టీలో చేరలేదని ఆనంద్ అనే ఓ దళిత యువకుడిపై దాడి చేసిన దారుణంగా చితకబాదారు. అనంతరం ఒంటిపై పోట్రోల్ పోని నిప్పంటించేందుకు యత్నించారు. వారిబారి నుండి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Don't Miss