Activities calendar

03 July 2018

రేషన్ డీలర్లు సమ్మె విరమణ

హైదరాబాద్ : మంత్రుల కమిటీతో రేషన్ డీలర్ల భేటీ ముగిసింది. రేషన్ డీలర్లు సమ్మె విరమించారు. దశల వారీగా బకాయిల విడుదలకు సర్కార్ అంగీకారం తెలిపింది. కనీస వేతనంపై కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

21:15 - July 3, 2018

తెలంగాణలో కౌలురైతుల చట్టం రద్దు కాబోతోందా ? ప్రభుత్వ వైఖరీతో కలుగుతున్న అనుమానాలు.. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కౌలు రైతు.., పంట రుణాల నుంచి గిట్టుబాటు ధర వరకు కౌలు రైతులకు అన్నీ సమస్యలే.., జరుగుతున్న ఆత్మహత్యల్లో కౌలు రైతులవే అధికం... ఒకవేల కౌలురైతుల చట్టం రద్దు అయితే ఏం జరుగుతుంది ? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి ? ఇదే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక కార్యదర్శి 
కొండల్ పాల్గొని, మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం... 

20:55 - July 3, 2018

కేసీఆర్ ముస్లింలను మోసం జేశిండట..మరి మరు పన్నెండు శాతం సీట్లియ్యుండ్రి, కత్తి మహేష్ అరెస్టుపై బహుజనుల ఫైర్...అగ్రవర్ణ బ్రాహ్మణ కుట్రల మీద కండ్లెర్ర, పేదోళ్ల భూములు గుంజి ప్రాజెక్టులు గట్టాలే...పెద్దోళ్ల భూములను పారవెట్టాలే అంతేనా?, తెలంగాణల చీలిపోతున్న కులాలు..పాలకుల కుఠిల నీతికి బలిపశువులు, భూములు వంచిన నక్సలైటు అక్కకు ఆపద...తనభూమినే కబ్జావెట్టేశి కబ్జారాయుళ్లు, జనగాం కలెక్టరేట్ ఆఫీసు ముంగట ఆట.. ఎన్నడు మార్తదో గదా..? వీళ్ల బత్కుబాట.... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

20:39 - July 3, 2018

మన ఆధార్ సమాచారం లీకవుతుందా ? ప్రతిదానికి ఆధార్ తో లింకు పెడుతున్న ప్రభుత్వాలు.. వ్యక్తిగత సమాచార గోప్యతపై పెరుగుతున్న డిమాండ్.. ఇంటర్నెట్ కేంద్రాల సాక్షిగా వెల్లువెత్తుతున్న అనేక అనుమానాలు....ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్, మాజీ పోలీసు అధికారి రెడ్డన్న, ఐటీ నిపుణులు కొడాలి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం... 

20:13 - July 3, 2018

ఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో మాజీ ఆర్థికమంత్రి చిదంబరంకు ఊరట లభించింది. ఆగస్టు 1 వరకు ఆయనను అరెస్ట్‌ చేయొద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు కోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. దీంతో మరో నెలరోజుల పాటు గడువును పొడిగించాలని చిదంబరం చేసిన విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. ఈ కేసు విచారణలో సిబిఐకి సహకరించాలని చిదంబరంకు కోర్టు స్పష్టం చేసింది. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు 305 కోట్ల విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఎఫ్‌ఐపిబి క్లియరెన్స్‌ కోసం భారీ ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందులో చిదంబరం కుమారుడు కార్తీకి కూడా వాటా ఉన్నట్లు సిబిఐ ఆరోపిస్తోంది.

 

20:08 - July 3, 2018

ఢిల్లీ : గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. గోరక్షణ పేరిట చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని  హెచ్చరించింది. గోరక్షణ పేరుతో హింసాత్మక ఘటనలు జరగకుండా  రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు జరగకూడదని కోర్టు స్పష్టం చేసింది. కుల, మతాలకతీతంగా బాధితులకు పరిహారం చెల్లించాలని పేర్కొంది. గోరక్షణ పేరిట జరుగుతున్న దాడులను నిరసిస్తూ మహాత్మాగాంధీ మనవడు తుషార్‌ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. హింసాత్మక ఘటనలను ఆపేందుకు జిల్లాకు ఓ నోడల్‌ అధికారిని నియమించాలని గత ఏడాది సెప్టెంబర్‌ 6న సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

 

20:06 - July 3, 2018

ఢిల్లీ : బురారీలో 11 మంది కుటుంబసభ్యుల ఆత్మహత్యలపై విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుల్లో ఒకడైన లలిత్‌ భాటియాకు ఉన్న భ్రమలే అతనితో పాటు కుటుంబ సభ్యులను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని బాటియా ఇంట్లో దొరికిన డైరీ ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నారాయణ్‌ దేవి చిన్న కుమారుడు 45 ఏళ్ల లలిత్‌ భాటియాకు కొంతకాలం క్రితం ప్రమాద వశాత్తు మాట పడిపోయింది. ఇటీవలే అతడు తిరిగి మాట్లాడుతున్నాడు. తన తండ్రి గురించి కలలు కన్నట్లుగా డైరీలో రాసుకున్నాడు. పదేళ్ల క్రితమే చనిపోయిన తండ్రి నుంచి తనకు ఆదేశాలు వస్తున్నాయని డైరీలో పేర్కొన్నాడు. ఆస్తులు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతల వ్యవహారాలపై తండ్రి నుంచి ఆదేశాలు తీసుకున్నట్లు  ఇంట్లో అందరూ వాటిని పాటించాలని చెప్పేవాడు. 2015 నుంచి లలిత్‌ డైరీ రాస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జూన్‌ 25న చివరిసారిగా రాశాడు. అందులో ఒకచోట 'దేవుడు మమ్మల్ని కాపాడుతాడు' అని రాసి ఉంది. ఆత్మహత్యలు చేసుకోవడానికి ముందు రిహార్సల్స్‌ జరిపినట్లు కూడా డైరీ ద్వారా తెలిసింది. ఈ ఆత్మహత్యలకు లలిత్‌ భ్రమలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

20:02 - July 3, 2018

గుంటూరు : విశాఖ రైల్వేజోన్‌, కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకుందని... టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అన్నారు. ఎంపీ సీఎం రమేశ్‌ దీక్ష బూటకపు దీక్ష అని, ఆయన దీక్షకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఎక్కించాలన్నారు. ఎన్నికల కోసమే టీడీపీ ఇలాంటి దీక్షలు చేస్తుందంటున్న విష్ణుకుమార్‌ రాజుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

19:56 - July 3, 2018

హైదరాబాద్‌ : కోఠి ప్రసూతి ఆస్పత్రిలో నిన్న అదృశ్యమైన 6 రోజుల చిన్నారి ఆచూకీ లభ్యమైంది. బీదర్‌లోని ఓ ఆస్పత్రిలో పసికందును కిడ్నాపర్లు వదిలివెళ్లారు. సీసీ టీవీ ఫుటేజి ద్వారా మహిళ బీదర్‌ వెళ్లినట్లు గుర్తించినట్లు పోలీసులు... బీదర్‌కు మూడు బృందాలు వెళ్లి గాలించాయి. దీంతో భయపడిన మహిళ పాపను ఓ ఆస్పత్రి సమీపంలో వదిలివెళ్లినట్లు గుర్తించారు. పాప క్షేమంగా ఉందని పోలీసులు తెలిపారు. పసికందు కోసం పాప తల్లిదండ్రులు బీదర్‌ కు బయల్దేరారు.

 

2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం : సీఎం చంద్రబాబు

ప.గో : 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇసుక ధరలను నియంత్రించామని చెప్పారు. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

మంత్రి ఈటలతో ముగిసిన రేషన్ డీలర్ల సమావేశం

హైదరాబాద్ : మంత్రి ఈటల రాజేందర్ తో రేషన్ డీలర్ల సమావేశం ముగిసింది. మినిస్టర్స్ క్వార్టర్స్ లో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

 

18:48 - July 3, 2018

హైదరాబాద్ : తిరుమల తిరుపతి వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. శ్రీవారి నగలు మాయమయ్యాయని, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయయని అనిల్‌ అనే వ్యక్తి పిటిషన్‌ వేశాడు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. తిరుమలలో జరుగుతున్న అక్రమాల పై న్యూస్‌ పేపర్లో వచ్చిన కథనాలను కోర్టుకు పిటిషనర్‌ సమర్పించారు. అయితే సుప్రీంకోర్టు జడ్జ్‌మెంట్‌ ప్రకారం న్యూస్‌ పేపర్లో వచ్చిన వాటిని కోర్టు పరిగణించదని హైకోర్టు.. పిటిషనర్‌కు స్పష్టం చేసింది. 

 

18:22 - July 3, 2018

హైదరాబాద్ : గ్రేటర్ లో మురుగునీటి సమస్యకు బల్దియా చెక్ పెట్టనుంది. జీహెచ్ ఎంసీ ఆధునాతన యంత్రాలను సిద్ధం చేసింది. 60కి పైగా సివరేజ్ జెట్టింగ్ యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. మురుగునీటిని, సిల్ట్ ను వేరు చేసే యంత్రాలను కొనుగులు చేసింది. ఈ యంత్రాలను సిటీలోని సివరేజ్ సమస్య పరిష్కారానికి ఉపయోగిస్తామని బల్దియా చెప్పింది. ఈ సందర్భంగా మేయర్ బొంత రామ్మోహన్ రావు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

పీఆర్పీలో నెరవేరని ఆశయాలు సాధించడానికే జనసేన స్థాపించా : పవన్ కళ్యాణ్

విశాఖ : చోడవరంలో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పీఆర్పీలో నెరవేరని ఆశయాలు సాధించడానికే జనసేన స్తాపించామని చెప్పారు. విభజన సమయంలో ఉత్తరాంధ్రకు కావాల్సిన అంశాలను ఏ నాయకుడు అడగలేదన్నారు. జన సైనికులు మన హక్కుల కోసం పోరాడాలని..భయపడి పారిపోకూడదని సూచించారు.

రికార్డుస్థాయిలో పనులు పూర్తి : మంత్రి దేవినేని

అమరావతి : ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు రికార్డుస్థాయిలో పనులు పూర్తి చేస్తున్నామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు రూ.1590 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గతంలో పదవులు వెలగబెట్టిన వ్యక్తులు ఉత్తరాంధ్రకు ఏం చేశారని ప్రశ్నించారు. చిన్ననీటి ప్రాజెక్టులకు రూ.3.141 కోట్లు, పెద్ద ప్రాజెక్టులకు రూ.2700 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గతంలో మట్టి పనులు చేసి డబ్బులు కాజేశారని విమర్శించారు. పదేశ్లలో తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారన్నారు.

17:43 - July 3, 2018

హైదరాబాద్ : కోఠి ప్రసూత్రి ఆస్పత్రిలో అద్యశ్యమైన పసికందు ఆచూకీ లభ్యం అయింది. బీహార్ లోని ఓ ఆస్పత్రిలో పసికందును కిడ్నాపర్లు వదిలి వెళ్లారు. పాపం సురక్షితంగా ఉందని పోలీసులు తెలిపారు. పాప ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. పసికందుకు తీసుకెళ్లన మహిళ ఎంజీబీఎస్‌ నుంచి కర్నాటకలోని బీదర్‌ వెళ్లినట్టు గుర్తించారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు నగరం నుంచి బీదర్‌ వెళ్లాయి. బస్సు నంబర్‌ ఆధారంగా కండక్టర్‌, డ్రైవర్‌ను విచారించారు. పసికందు కోసం బీదర్‌లో ప్రత్యేక పోలీసు బృందాలు విస్తృతంగా గాలించారు. 
నిన్న పసికందు ఆదృశ్యం 
నిన్న కోఠి ప్రసూతి ఆసుపత్రిలో పసికందు ఆదృశ్యమైన ఘటన కలకలం రేపింది. టీకా ఇప్పిస్తానంటూ చెప్పి ఓ గుర్తు తెలియని మహిళ శిశువును తీసుకెళ్లింది. ఎంతసేపటికీ ఆ మహిళ బిడ్డను తీసుకురాకపోవడంతో ఆస్పత్రికి సిబ్బందికి తెలియజేసింది. దీంతో అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ... ప్రసూతి కోసం గతవారం కోఠి సుల్తాన్‌ బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చింది. ఆరు రోజుల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. తల్లి కదల్లేని స్థితిలో ఉండటంతో పక్కనే ఉన్న ఓ గుర్తుతెలియని మహిళ శిశువుకు టీకా ఇప్పిస్తానని తీసుకెళ్లింది. సీసీ ఫుటేజి ఆధారంగా మహిళ కోసం గాలిస్తున్న నేపథ్యంలో సదరు మహిళ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుండి బీదర్ బస్ ఎక్కినట్లుగాను..బస్ కండక్టర్ తో కన్నడలో మాట్లాడిన ఆధారంగా పోలీసులు బృందాలు పసిబిడ్డ ఆచూకీ కోసం బీదర్ పోలీసులతో చర్చలు జరిపాయి. ఈ గాలింపులో ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.

17:31 - July 3, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటుందని టీఆర్ ఎస్ ఆరోపిస్తుంది. టీఆర్ ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు నాగం జనార్ధర్ రెడ్డి ఖండించారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల పనులలో దాదాపు రూ.1600 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి బయటపెట్టేందుకే కోర్టుకు వెళ్లామని చెప్పారు. 

17:24 - July 3, 2018
17:18 - July 3, 2018

ఢిల్లీ : మానస సరోవర్‌ యాత్రకు వెళ్లినవారు మంచు తుపాను బారినపడ్డారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నేపాల్‌-చైనా సరిహద్దుల్లో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. హిల్సా, సిమికోట్‌, టిబెట్‌ ప్రాంతాల్లో 1500 మంది భారత యాత్రికులు చిక్కుకున్నారు. సిమికోట్‌లో 525 మంది, హిల్సాలో 550, టిబెట్‌లో మరో 500 మంది చిక్కుపోయారు. వీరిలో తెలుగువారు వంద మంది వరకు ఉన్నారు. యాత్రికులందర్నీ తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. యాత్రికుల తరలింపు కోసం సహాయక చర్యలు ప్రారంభం అయ్యాయి. ఆర్మీ హెలికాప్టర్లు సమకూర్చాలని మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌... నేపాల్‌ ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు మానస సరోవర్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా టిబెట్ ప్రాంతంలో కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు మరణించారు. సుబ్బారావు మృతదేహాన్ని హిల్సా నుంచి సిమికోట్‌కు తరలించి అక్కడ నుంచి నేపాల్‌గంజ్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. శవపరీక్ష తర్వాత స్వస్థలానికి పంపుతారు.   

 

17:13 - July 3, 2018

ఢిల్లీ : గంగా ప్రక్షాళన చేయాలని కోరుతూ పర్యావరణ వేత్త, యాక్టివిస్ట్‌ స్వామి జ్ఞాన్‌ స్వరూప్‌ సానంద్‌ అలియాల్‌ జీడీ అగర్వాల్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. హరిద్వార్‌లో గత 13 రోజులుగా ఆయన ఆమరణ దీక్షలో ఉన్నారు. గంగా ప్రక్షాళనపై ప్రధానమంత్రి మోదికి లేఖ రాసినప్పటికీ ఆయన స్పందించకపోవడంతో తాను దీక్షకు దిగినట్లు స్వామి జ్ఞాన్‌ స్వరూప్‌ తెలిపారు. గంగా ప్రక్షాళన కోరుతూ 2012లో కూడా ఆయన ఆణరణ దీక్ష చేశారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో తన దీక్షను విరమించారు. 2009లో భాగీరథిపై డ్యామ్‌ నిర్మాణాన్ని నిలిపివేసేందుకు కూడా స్వామి సానంద్‌ ఆమరణ దీక్ష చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన నేషనల్‌ గంగా బేసిన్ అథారిటీపై కూడా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ మాజీ ప్రొఫెసర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

17:11 - July 3, 2018

విజయవాడ : ఐఏఎస్‌ అధికారి గంధం చంద్రుడుపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. కొంత కాలంగా ఐఎస్‌ అధికారి గంధం చంద్రుడు వరకట్నం కోసం వేధిస్తున్నట్టు ఆయన భార్య... మాచవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  ప్రస్తుతం ట్రైబల్‌ వెల్ఫెర్‌ డిపార్టు మెంట్‌లో డైరెక్టర్‌గా గంధం చంద్రుడు పనిచేస్తున్నారు. 

 

17:04 - July 3, 2018

హైదరాబాద్‌ : కోఠి ప్రసూతి ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్‌ అవడంపై పసికందు బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో భద్రత కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సూపరిండెంట్‌ను తొలగించి ప్రభుత్వం పూర్తి భాద్యత వహించాలని బీఎల్‌ఎఫ్‌ గిరిజన సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో భద్రత కరువైందని యాదయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. 

కోఠి ప్రసూతి ఆస్పత్రిలో అద్యశ్యమైన పసికందు ఆచూకీ లభ్యం

హైదరాబాద్ : కోఠి ప్రసూతి ఆస్పత్రిలో అద్యశ్యమైన పసికందు ఆచూకీ లభ్యం అయింది. బీదర్ లోని ఓ ఆస్పత్రిలో పసికందును కిడ్నాపర్లు వదిలి వెళ్లారు.   

 

16:10 - July 3, 2018

విజయనగరం : జిల్లా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్న జెడ్పీ ఛైర్‌ పర్సన్‌ శోభా స్వాతిరాణి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందా? పార్టీకి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్న శోభ రాజకీయ భవిష్యత్ ఏమిటి? రాజకీయాల్లో శోభ వ్యూహం ఏమిటి? ఇప్పుడు ఈ విషయంపైనే ఆసక్తి చూపుతున్నారు విజయనగరం జిల్లా ప్రజలు. 
జెడ్పీ ఛైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణికి ప్రత్యేక గుర్తింపు 
విజయనగరం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుత జెడ్పీ ఛైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణికి ప్రత్యేక గుర్తింపు ఉంది. టీడీపీ సీనియర్‌ నాయకురాలు శోభా హైమావతి కుమార్తెగా తెరపైకి వచ్చిన స్వాతిరాణి.. అనతి కాలంలోనే విజయనగరం రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వేపాడు నుంచి జెడ్పీటీసీ సభ్యురాలుగా ఎన్నికైన స్వాతిరాణి.. రిజర్వుడు కోటాలో జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు ఇటు పాలన పరంగానూ, అటు టీడీపీ వ్యవహారాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ జిల్లా రాజకీయాల్లో మంచి గుర్తింపును సాధించారు. పాలనలో సమర్థ జెడ్పీఛైర్‌పర్సన్‌గా అతికొద్ది కాలంలోనే గుర్తింపు పొంది.. యువనేత, మంత్రి లోకేష్‌టీమ్‌లో స్థానం సంపాదించుకున్నారు. భర్త గుల్లిపిల్లి గణేష్‌ తోడుతో.. పార్టీకి పెద్ద దిక్కు అశోక్‌గజపతిరాజు అండతో  పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికి మరో ఏడాదిలో ఛైర్‌పర్సన్‌ పదవి కాలం ముగియటంతో.. తదుపరి స్వాతిరాణి భవిష్యత్‌ ఏమిటన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
చట్టసభల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో ఉన్న స్వాతిరాణి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి చట్టసభల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో శోభ స్వాతిరాణి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా భర్త గణేష్‌తో కలిసి పావులుకదుపుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్టీ రిజర్వుడు స్థానమైన సాలూరు నియోజకవర్గం నుంచి స్వాతిరాణిని పోటీ చేయించేందుకు భర్త గణేష్‌, తల్లి హైమావతి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పీడిక రాజన్న దొర సాలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవటంతో ఆ స్థానాన్ని స్వాతిరాణితో భర్తీ చేయించాలని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. కార్యకర్తల యోచనకు అనుగుణంగా స్వాతిరాణి పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 
అరకు ఎంపీ సీటుపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న స్వాతిరాణి
ఎట్టిపరిస్థితుల్లో ఏదో ఒక స్థానం నుంచి సీటు సాధించాలని పట్టుదలతో ఉన్న స్వాతిరాణి ఎంపీ సీటైనా పొందాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా అరకు ఎంపీ సీటుపై పట్టు సాధించేందుకు స్వాతిరాణి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కూడా టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవటంతో తనకు కలిసివస్తోందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పదవుల పంపిణీలో అశోక్‌గజపతిరాజుదే తుది నిర్ణయం
విజయనగరం జిల్లాలో పదవుల పంపిణీలో అశోక్‌గజపతిరాజుదే తుది నిర్ణయం. ఆయన ఆశీస్సులున్న వారికే పదవులు, టిక్కెట్లు వస్తాయనేది బహిరంగ రహస్యం. దీంతో స్వాతిరాణి కుటుంబం అశోక్‌గజపతిరాజుకు విధేయులుగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. అశోక్‌ గజపతిరాజు పాల్గొనే కార్యక్రమాల్లో ముందుంటూ.. ఏర్పాట్లను చేస్తూ.. ఆయన దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.  మొత్తం మీద వివాదాలకు, ఆరోపణలకు దూరంగా ఉంటూ అధికార పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్వాతిరాణి భవిష్యత్‌ ఇకపై ఎలా ఉంటుదో వేచి చూడాలి.
 

 

15:52 - July 3, 2018

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల దిశగా గులాబీ పార్టీ అడుగులు వేస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రచార సామాగ్రిని సిద్ధం చేస్తోంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి పరిస్థితులపై గులాబీ బాస్‌ దృష్టి సారించారు.
వచ్చే మార్చి, ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు
వచ్చే మార్చి, ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగాల్సి ఉంది. జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం పావులుకదుపుతోంది.  దీంతో ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది.  జమిలి ఎన్నికలపై కేంద్రం రాష్ట్ర అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఆరు నెలల పదవీ కాలాన్ని వదులుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామ్న సంకేతాలను గులాబీ బాస్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రచార సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమైతే... అందుకు తాము కూడా రెడీ ఉన్నామని గులాబీ దళపతి తేల్చిచెప్పినట్టు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  జమిలి ఎన్నికలకు వెళితే ప్రయోజనం ఉంటుందని కేంద్రం భావిస్తే.. తాము కూడా కలిసి వస్తామని కేసీఆర్‌ ప్రధానితో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో కూడా రాజకీయంగా అధికారపార్టీ అడుగులు వేయడం మొదలు పెట్టింది. పార్టీ ప్రచార సామాగ్రిని సిద్ధం చేసుకుంటుంది.  అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు  గులాబీ బాస్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు.
పార్లమెంట్‌ సమావేశాల నాటికి జమిలి ఎన్నికలపై స్పష్టత
త్వరలోనే రాజకీయ పార్టీలతో లా కమిషన్‌ కూడా మరోసారి జమిలి ఎన్నికలపై అభిప్రాయాన్ని సేకరించనుంది. అయితే ఈ విడత జరిగే పార్లమెంట్‌ సమావేశాల నాటికి జమిలీ ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోతే.. రాష్ట్రం వెనకడుగు వేసే అవకాశం లేకపోలేదు.

 

15:48 - July 3, 2018

తూర్పు గోదావరి : సామర్లకోటలో జరిగిన రోడ్డు ప్రమాదంపై హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తంచేశారు. ఆస్పత్రిలో క్షతగ్రాతులను, మృతుల బంధువులను పరామర్శించారు . మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను ఆదేశించారు. మృతి చెందిన వారికి చంద్రన్న పథకం కింది 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పారు. కాకినాడలో జరిగిన ఆర్‌టీసీ బస్సు, ప్రైవేటు బస్సు  ప్రమాదంపై కూడా ఆయన స్పందించారు. ప్రమాదంలో గాయపడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి చినరాజప్ప  పరామర్శించారు. 

 

15:46 - July 3, 2018

హైదరాబాద్‌ : కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన పసికందు కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. పాప ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. పసికందుకు తీసుకెళ్లన మహిళ ఎంజీబీఎస్‌ నుంచి కర్నాటకలోని బీదర్‌ వెళ్లినట్టు గుర్తించారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు నగరం నుంచి బీదర్‌ వెళ్లాయి. బస్సు నంబర్‌ ఆధారంగా కండక్టర్‌, డ్రైవర్‌ను విచారించారు. పసికందు కోసం బీదర్‌లో ప్రత్యేక పోలీసు బృందాలు విస్తృతంగా   గాలిస్తున్నారు.

15:42 - July 3, 2018

ప.గో : ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత సరఫరా విధానానికి తూట్లు పొడిచేసేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని బాబు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఏలూరు రూరల్‌ మండలం కలపర్రులో విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏలూరులో జరిగిన ఎస్వీఆర్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు... సినిమాల్లో  ఆయన నటన అద్భుతమని ప్రశంసించారు. సినీరంగంలో ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌ కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏలూరులో అమరావతి తరహాలో శాటిలైట్‌ టౌన్‌షిప్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాల  మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. 2019 మార్చిలోగా పేదలకు 19 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఇసుక అక్రమ రవాణంపై చంద్రబాబు మండిపడ్డారు.

 

ప్రజా పోరాట యాత్ర సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్

 విశాఖ : అనకాపల్లిలో ప్రజా పోరాట యాత్ర సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొని, మాట్లాడారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. అక్రమ క్వారీలు, ఇసుక మాఫియాకు కొమ్ముకాస్తున్నారని పేర్కొన్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడంలో విఫలం అయ్యారని విమర్శించారు. 

 

వివాదంలో చిక్కుకున్న సత్యమేవ జయతే సినిమా

హైదరాబాద్ : సత్యమేవ జయతే సినిమా వివాదంలో చిక్కుకుంది. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని డబిర్ పురా పీఎస్ లో అడ్వకేట్ జాఫర్ నదీం ఫిర్యాదు చేశారు. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని ఫిర్యాదు చేశారు. సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో జాన్ అబ్రహంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

15:27 - July 3, 2018

మహారాష్ట్ర : ముంబైలో భారీ వర్షం కారణంగా అంధేరీ రైల్వే స్టేషన్‌లో పాదాచారుల బ్రిడ్జి కూలింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కూలిన బ్రిడ్జిని గోఖలే బ్రిడ్జిగా పిలుస్తారు. ఉదయం ఏడున్నరకు ఈ ఘటన చోటుచేసుకుంది. బ్రిడ్జి కూలడంతో రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో పశ్చిమ రైల్వే సర్వీసులన్నీ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు స్టేషన్లలోనే చిక్కుకుపోయారు. బ్రిడ్జి కూలిన సమయంలో కింద రైలు వెళ్లక పోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది, ఇతర రెస్క్యూ ఏజెన్సీలు సహాయక చర్యలు చేపట్టాయి. రైల్వే ట్రాక్‌పై కూలిన బ్రిడ్జి శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో వెస్ట్రన్‌ రైల్వే రూట్‌లో డబ్బావాలా సేవలు కూడా నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలోని కొన్ని ఆఫీసులకు సెలవు ప్రకటించారు. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబైలోని శ్యామ్‌ తలావ్‌, హింద్‌మాతా, ఒబెరాయ్‌ మాల్‌, డబ్ల్యుఈహెచ్‌, సీఎస్‌టీ రోడ్‌, కుర్లా, మహిమ్‌ జంక్షన్‌, నెహ్రూ నగర్‌ బ్రిడ్జి తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.

 

15:09 - July 3, 2018

ఢిల్లీ : మానస సరోవర్‌ యాత్రకు వెళ్లి హిమాలయాల్లో మంచు తుపానులో చిక్కుపోయిన తెలుగు యాత్రికులు తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బేస్‌ క్యాంపుల్లో ఉన్నవారిని హెలికాప్టర్లు, రోడ్డు మార్గం ద్వారా  సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేపాల్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. యాత్రలో చిక్కుకున్న వారిని ముందుగా నేపాల్‌ గంజ్‌ తరలిస్తారు. అక్కడ నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలోని బరాజ్‌ ప్రాంతానికి తీసుకొస్తారు. బరాజ్‌ నుంచి 180 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్నోకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటున్న ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. తెలుగు యాత్రికులందరూ సుక్షితంగా ఉన్నారని తెలిపారు. బేస్‌ క్యాంపుల నుంచి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వాతావరణం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోందన్నారు.

 

15:04 - July 3, 2018

ఢిల్లీ : మానస సరోవర్‌ యాత్రకు వెళ్లినవారు మంచు తుపాను బారినపడ్డారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నేపాల్‌-చైనా సరిహద్దుల్లో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. హిల్సా, సిమికోట్‌, టిబెట్‌ ప్రాంతాల్లో 1500 మంది భారత యాత్రికులు చిక్కుకున్నారు. సిమికోట్‌లో 525 మంది, హిల్సాలో 550, టిబెట్‌లో మరో 500 మంది చిక్కుపోయారు. వీరిలో తెలుగువారు వంద మంది వరకు ఉన్నారు. యాత్రికులందర్నీ తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆర్మీ హెలికాప్టర్లు సమకూర్చాలని మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌... నేపాల్‌ ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు మానస సరోవర్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా టిబెట్ ప్రాంతంలో కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు మరణించారు. సుబ్బారావు మృతదేహాన్ని హిల్సా నుంచి సిమికోట్‌కు తరలించి అక్కడ నుంచి నేపాల్‌గంజ్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. శవపరీక్ష తర్వాత స్వస్థలానికి పంపుతారు.   

 

మంచు తుపానులో చిక్కుకున్న మానస సరోవర్ యాత్రికులు

ఢిల్లీ : మానస సరోవర్ యాత్రకు మంచు తుఫాన్ దెబ్బ తగిలింది. మంచు తుపానులో మానస సరోవర్ యాత్రికులు చిక్కుకున్నారు. 

జనసేనలోకి దాడి ?!!

విశాఖపట్నం : పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలోకి పలువురు నేతలు చేరికలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మాజీ టీడీపీ నేత దాడి వీరభద్రరావు పవన్ కళ్యాన్ తో మంతనాలు ప్రారంభించారు. దీంతో కాసేపట్లో దాడి వీరభద్రరావుతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. జనసేన పార్టీలోకి చేరేందుకు పవన్ తో దాడి వీరభద్రరావు చర్చలు జరపనున్నారు. అనంతరం పార్టీలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో కుమారుడు రత్నాకర్ ను దాడి బరిలోకి దించారు.

13:54 - July 3, 2018

విశాఖపట్నం : పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలోకి పలువురు నేతలు చేరికలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మాజీ టీడీపీ నేత దాడి వీరభద్రరావు పవన్ కళ్యాన్ తో మంతనాలు ప్రారంభించారు. దీంతో కాసేపట్లో దాడి వీరభద్రరావుతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. జనసేన పార్టీలోకి చేరేందుకు పవన్ తో దాడి వీరభద్రరావు చర్చలు జరపనున్నారు. అనంతరం పార్టీలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో కుమారుడు రత్నాకర్ ను దాడి బరిలోకి దించారు. ఓటమిపాలవ్వటంతో అప్పటి నుండి దాడి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నారు. ఈ నేపథ్యంలో నేడు పవన్ తో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 

13:40 - July 3, 2018

తిరుమల : మరోసారి టీటీడీ పురావస్తు శాఖ వ్యవహారం తెరపైకి వచ్చింది.తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పురావస్తు శాఖ పరిధిలోకి తేవాలంటు డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. టీటీడీ కట్టడాల పరిరక్షణ బాధ్యతను తమకు అప్పగించాలంటు మే 4న పురావస్తు శాఖ టీటీడీకి లేఖలు రాసింది. ఈ లేఖలోని అంశాలను అమలు చేయాలని..టీటీడీ ఆదాయ వ్యవయాలపై సీబీఐ దర్యాప్తు కోరుతు..పిటీషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. తిరుమల నేలమాళిగల్లోని గుప్త నిధుల పరిరక్షణకు కమిషన్ వేయాలని గుంటూరుకు చెందిన అనిల్, గుజరాత్ కు చెందిన భూపేంద్ర స్వామి అనే ఇద్దరు వ్యక్తులు కోర్టులో పిటీషన్ వేశారు. ప్రస్తుతం నిర్మిస్తున్న దేవాలయం గోపురం బంగారం కాదని పిటీషన్ పేర్కొన్నారు. కానీ బంగారాన్నే తాపడానికి వినియోగిస్తున్నామని టీటీడీ తెలిపింది. దీనిపై విచారణ న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది. గుడిలో తవ్వకాలు వంటి విషయాలపై టీటీడీ వివరణ ఇచ్చింది. దేవాలయంలో ఎటువంటి తవ్వకాలు జరపలేదని కేవలం మరమ్మత్తులు మాత్రమే జరిపామని టీటీడీ న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది. దీంతో పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంరర్ దాఖలు చేయాలని టీటీడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

13:27 - July 3, 2018

విజయవాడ : హిందువులు అతి పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్రంలో విషాదం చోటుచేసుకుంది. మానస సరోవరంలో వున్న అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన వందలాదిమంది మంచు తుపాను లో చిక్కుకున్నారు. నేపాలు, చైనా సరిహద్దులో వందలాదిమంతి యాత్రీలు చిక్కుకున్నారు. హిల్సా లో 550 మంది,సిమికోట్ లో 525 మంది , టిబెట్ లో 500లమంది ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. 1500ల మందికి పైగా తెలుగు యాత్రీకులు నానా అవస్థలకు గురవుతున్నారు. పలు ఆరోగ్యం సమస్యలకు లోనయ్యారు. వీరిలో తెలుగువారు కూడా వున్నారు. వీరిలో ఆంధ్రపదేశ్ చెందిన కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు గుండెపోటుతో మృతి చెందారు. మానస సరోవర్ నుండి తిరిగి వస్తుండగా టిబెలట్ ప్రాంతంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లుకు చెందిన తోట రత్నం అనే మహిళ కూడా అమర్ నాథ్ యాత్రలో మృతి చెందారు. వీరి మృతితో వారి కుటుంబాలలో విషాదం చోటుచేసుకుంది. యాత్రీకులను రక్షించేందుకు ఆర్మీ హెలికాప్టర్లను సమకూర్చాలను నేపాల్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. 

13:09 - July 3, 2018

పశ్చిమగోదావరి : కలపర్రు టోల్ గేట్ వద్ద నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో నటు ఎస్వీ రంగారావు 100 వ జయంతి సందర్భంగా కలపర్రు టోల్ గేట్ వద్ద నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు.. ఎస్వీఆర్ మ్యూజియంను కూడా త్వరలో ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని టూరిస్ట్ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ పార్టీని విజయవంతంగా గెలిపించిన పశ్చిమగోదావరి జిల్లా అంటే తనకు ఎంతో ఇష్టమనీ..గౌరవమనీ చంద్రబాబు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాను టూరిస్టు ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పితాని, కేఎస్ జవహర్ , ఎమ్మెల్యే బడేటి బుజ్జి, చింతమనేని ప్రభాకర్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నాడు.  

యాత్రీకులను రక్షించేందుకు హెలీకాఫ్టర్లు : కలెక్టర్ లక్ష్మీకాంతం

జమ్ము కశ్మీర్ : అమర్ నాథ్ యాత్ర కోసం వెళ్లి వాతావరణం అనుకూలించక నానా అవస్థలు పడుతున్న యాత్రీలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. నేపాల్, చైనా సరిహద్దులోని బేస్ క్యాంప్ లో 1000మంది యాత్రీకులున్నారని కలెక్టర్ యాత్రీకుల కోసం నాలుగు హెలీకాప్టర్లు సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. బాధితులకు సహాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. 

ఐఏఎస్ అధికారిపై వరకట్నం వేధింపుల కేసు..

విజయవాడ : ఓ ఐఏఎస్ అధికారిపై వరకట్నం వేధింపుల కేసు నమోదయ్యింది. వరకట్నం గురించి వేధిస్తున్నాడంటు ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడుపై మాచవరం పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. చంద్రుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని చంద్రుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు..

పశ్చిమగోదావరి : కలపర్రు టోల్ గేట్ వద్ద ఎస్వీ రంగారావు విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పితాని, కేఎస్ జవహర్ , ఎమ్మెల్యే బడేటి బుజ్జి, చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నాడు.  

12:42 - July 3, 2018

తెలుగులో బిగ్ బాస్ 2 రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారంలో కామన్ మెన్ కేటగిరిలో నామినేట్అయిన సంజన ఎలిమినేట్ అవ్వగా రెండవ వారంలో నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలో మూడవ వారంలో నటుడు కిరీటి ఎలిమినేట్ అయ్యారు. మరి కిరీటి ఎలిమినేట్ కు కారణాలేమిటి? బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతోంది? బిగ్ బాస్ కంటెస్టెన్ కిరిటీలో స్పెషల్ ఇంటర్వ్యూ..

12:21 - July 3, 2018

విజయవాడ : మరో సెల్ఫీ ఆత్మహత్య చోటుచేసుకుంది. తన చావుకు భార్య, అత్తమామలు, బావమరిదే కారణం అని గురవారెడ్డి అనే వ్యక్తి ఓ సెల్ఫీ వీడియో తీసి కన్నవారికి, అత్తవారికి పోస్ట్ చేసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడ కృష్ణలంకు చెందిన గురవారెడ్డి పై గతకొన్ని రోజుల క్రితం గురవారెడ్డి వేధిస్తున్నాడని భార్య తల్లిదండ్రుల సహాయంతో ఫిర్యాదు చేశారు. 48 గంటల పాటు కృష్ణలంక పోలీసులు గురవారెడ్డిని విచారణ నిమిత్తం పిఎస్ లోనే నిర్భంధించారు. దీంతో మనస్తాపం చెందిన గురవారెడ్డి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

12:10 - July 3, 2018

హైదరాబాద్ : మంత్రులందరిలో ఆ మంత్రి తీరే వేరు. తన శాఖ ప‌నులు కాకపోయినా ఆయన జోక్యం త‌ప్పనిస‌రి. న‌గ‌రంలో ఎలాంటి కార్యక్రమం అయినా ఆయ‌న హాజ‌రు ఉండాల్సిందే. హైదరాబాద్ కు చెందిన మంత్రి కాకపోయినా... నగరంలో పలువురు మంత్రులున్నా ఆయనే స్పెషల్ అట్రాక్షన్. ప్రభుత్వ కార్యక్రమాలు , సభలతో ప్రజల్లోకి దూసుకెళ్లుతున్నారు. సీనియర్ మంత్రులు సైతం ఆయ‌న‌ పనితీరుపై ఒకింత‌ అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరు..? వాచ్‌ దిస్‌ స్టోరీ.

కేటీఆర్‌ ముందు మిగతా మంత్రులు బలాదూర్‌ !
డుబుల్ బెడ్స్ రూం పనుల‌కు శంకు స్థాప‌న అయినా, ప్రారంబోత్సంవం అయినా మంత్రి కేటీఆర్‌ ఉండాల్సిందే. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బ‌స్తీ దావాఖానా అయినా... ర‌హ‌దారులు భ‌వ‌నాల శాఖ‌కు చెందిన రోడ్డైనా... ఈ మంత్రినే ప్రారంభిస్తారు. విద్యుత్ శాఖ‌కు చెందిన స‌బ్ స్టేష‌న్ అయినా.. రెవిన్యూ శాఖ‌కు చెందిన స‌మీక్ష అయినా అంతా తానై వ్యవ‌హ‌రిస్తారు. వివిధ శాఖ‌ల‌కు మంత్రులు ఉన్నా మంత్రి కేటీఆర్‌ ముందు బ‌లాదూర్. వారంతా కేవ‌లం ఉత్సవ విగ్రహాలుగానే మారిపోయారని ప్రజల్లో కామెంట్లు వస్తున్నాయి.

గల్లిరోడ్డు నుంచి కుళాయి పైపు లైన్ల వరకు
హైదరాబాద్ లో జ‌రిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించేది మంత్రి కేటిఆరే. గ్రేట‌ర్ ప‌దిరిలో జిహెచ్ఎంసి నిర్మించే గ‌ల్లీలో రోడ్డైనా, వాట‌ర్ బోర్డు నిర్మించే కుళాయి పైపు లైన్ అయినా, బ‌స్టాపుల‌యినా .. అన్నింటిలో మంత్రిదే పై చేయి. వారాని కోసారి సిటిలో ఎదో మూలా ఎదో ఒక కార్యక్రమంతో మంత్రి కేటిఆర్ సుడిగాలి ప‌ర్యట‌న‌లు చేస్తుంటారు. నగర పాలన, పట్టణాభివృద్ధి, ఐటి, పరిశ్రమలు, మైనింగ్ వంటి శాఖలను నిర్వహిస్తున్నా మంత్రి కేటిఆర్.. ఇత‌ర మంత్రుల శాఖ‌ల‌కు చెందిన ప‌నుల‌ను కూడా చ‌క్కబెడుతున్నారు.

కేటీఆర్‌ తీరుపై అధికాపార్టీ నేతల్లో అసంతృప్తి
మంత్రి కేటీఆర్‌ దూకుడు చాలామంది అధికారపార్టీ ప్రజా ప్రతినిధులుకు నచ్చడం లేదు. తమ పనుల్లో కూడా మంత్రి వేలు పెడుతున్నారని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. కార్పొరేట‌ర్లు, ఎమెల్యేలు అభివృద్ది ప‌నుల సంద‌ర్భంగా ప్రజ‌ల‌తో మమేకం కాలేక‌పోతున్నామ‌ని మ‌ద‌న ప‌డుతున్నారు.

ఎల్బీనగర్‌లో రెవెన్యూ అధికారులతో సమీక్ష
ఇటివ‌ల ఎల్బీన‌గ‌ర్ లోని భూముల‌పై రెవిన్యూ ఉన్నతాధికారులు ఉపముఖ్యమంత్రి స‌మక్షంలో ఉన్నత స్థాయి స‌మీక్ష జ‌రిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేఆటిర్ అన్నీ తానై వ్యవహరించడం ఉప‌ముఖ్యమంత్రికి నచ్చలేదని గులాబీపార్టీలోనే చెప్పుకుంటున్నారు. అన్ని కార్యక్రమాల్లో మంత్రి క‌లుగ చేసుకోవ‌డంతో త‌మ‌కు ప్రాధాన్యత లేకుండా పోతుంద‌ని న‌గ‌ర మంత్రులు, ఎమ్మెల్యేలు, బ‌ల్దియా ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు.

మంత్రి ప్రోగ్రామ్స్‌కే ప్రభుత్వ పబ్లిసిటీ
మంత్రి కేటిఆర్ ప్రొగ్రామ్స్ కు లైవ్ కవరేజ్ అరెంజ్ మెంట్స్ ఉండ‌టంతో సాద‌ర‌ణంగా ప‌బ్లీసిటి కూడా ఎక్కువ‌గా వ‌స్తుంది. కాని ఇత‌ర మంత్రులు నిర్వహించే కార్యక్రమాల‌కు మాత్రం ప్రభుత్వం నుండి క‌ల్పించే లైవ్ క‌వ‌రేజ్ ఉండ‌టం లేదు. దీంతో తాము ప్రజల దృష్టిలో ఉత్సవ విగ్రహాలుగా మిగిలపోతున్నామనే బాధ నగర గులాబీపార్టీ ప్రజాప్రతినిధులను వేధిస్తోంది. మరి ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌... మంత్రి కేటీఆర్‌ దూకుడుకు కళ్లెం వేస్తారా..? అనేది ఇపుడు గులాబీపార్టీ లీడర్లను వేధిస్తున్న పెద్ద ప్రశ్న. 

పసిపాప కోసం పోలీసుల ముమ్మర గాలింపు..

హైదరాబాద్‌: కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో కిడ్నాప్‌కు గురైన పసికందు కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. పసికందుకు తీసుకెళ్లన మహిళ ఎంజీబీఎస్‌ నుంచి కర్నాటకలోని బీదర్‌ వెళ్లినట్టు గుర్తించారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు నగరం నుంచి బీదర్‌ వెళ్లాయి. బస్సు నంబర్‌ ఆధారంగా కండక్టర్‌, డ్రైవర్‌ను విచారించారు. పసికందు కోసం బీదర్‌లో గాలిస్తున్నారు. 

12:01 - July 3, 2018

తిరుమల : ఏపీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తిరుమల వచ్చిన డీజీపీకి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న ఆర్పీ ఠాకూర్‌కు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రజలకు మరింత సేవచేసే విధంగా ఆశీర్వదించాలని శ్రీవారిని కోరుకున్నట్టు ఠాకూర్‌ చెప్పారు. 

11:58 - July 3, 2018

సంగారెడ్డి : కేంద్రంలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు అనే తేడా లేకుండా కబ్జాలకు పాల్పడుతున్నారు. వివిధ భవనాల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలాలతోపాటు అసైన్డ్‌ భూములనూ ఆక్రమిస్తున్నారు. ఆక్రమించిన స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. సంగారెడ్డిలో జరుగుతున్న భూ అక్రమణలపై టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ.

సంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోతున్న అక్రమార్కులు
వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డి జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం జోరుగాసాగుతుంది. దీంతో పట్టణంలోనే కాక చుట్టుప్రక్కల ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా భావించి.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు భూములు అనే తేడా లేకుండా విచ్చిలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు చేపడుతూ కోట్లు గడిస్తున్నారు. సంగారెడ్డిలో గల సర్వే నెంబర్ 159/AA2తో పాటు మరికొన్ని సర్వేనెంబర్లలో ఉన్న 244 ఎకరాల భూమిని సాగుకోసం ప్రభుత్వం దళితులకు ఇచ్చింది. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో.. జాతీయ రహదారికి సమీపంలో ఈ భూమి ఉంది. ఈ భూమిని కొంత మంది అక్రమార్కులు ఆక్రమించి.. నిర్మాణాలు చేపట్టారు.

పోతిరెడ్డిపల్లి భూమిలో యథేచ్చగా అక్రమ నిర్మాణాలు
పోతిరెడ్డిపల్లిలో గల మరో భూమిలో అక్రమనిర్మాణాలు యథేచ్చగా జరుగుతున్నాయి. బాల్‌రాజు అనే ఓ వ్యక్తి ఈ భూమిలో ఫంక్షన్‌ హాల్‌ను నిర్మించారు. ఈ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణంలో 24 గుంటల అసైన్డ్ భూమి ఉంది. దీన్ని గుర్తించిన అధికారులు బాల్‌రాజ్‌కు నోటీసులు ఇచ్చారు. అధికారుల నోటీసులతో బాల్‌రాజ్‌ కోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. అయితే కోర్టు తీర్పుకు లోబడి తాను వ్యవహరిస్తానని బాల్‌రాజ్‌ అంటున్నారు.

12 ఎకరాల అసైన్డ్‌ భూమిలో అక్రమ నిర్మాణాలు గుర్తింపు
ఇటీవల ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో సుమారు 12 ఎకరాల అసైన్డ్‌ భూమిలో అక్రమ నిర్మాణాలు వెలసినట్లు అధికారులు గుర్తించారు. అసైన్డ్‌ భూములని గుర్తించిన అధికారులు అక్రమార్కులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దీంతో పట్టణ ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

అధికారుల్లో చలనం లేకపోవటంపై భిన్నాభిప్రాయాలు
అక్రమాలపై అధికారుల్లో చలనం లేకపోవటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు తలొగ్గి అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారా అనే అభిప్రాయాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంతపెద్ద నిర్మాణాలకు అనుమతులు ఎవరిచ్చారు అనే ప్రశ్నలు కూడ వెల్లువెత్తున్నాయి. వీటిపై స్పందించిన అధికారులు విషయాన్ని ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై ఈ భూ అక్రమాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది.

11:52 - July 3, 2018

జమ్ము కశ్మీర్ : కైలాస్‌ మానస్‌ సరోవర్‌యాత్రపై మంచు తుపాను పగడ విప్పింది. తీవ్రమైన మంచువర్షంతో యాత్రకు అంతరాయం కలగడంతో తెలుగు భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బేస్‌ క్యాంపులో వసతులులేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం అందకపోవడంతో పలువురు భక్తులు అనారోగ్యంబారిన పడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు రంగంలోకి దిగారు. 

11:49 - July 3, 2018

తూర్పుగోదావరి : జిల్లా సామర్లకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోని లారీ ఢీ కొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 9 మందిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు మహిళల పరిస్థితి విషమంగా ఉంది. మృతులు, క్షతగాత్రుల అంతా పెదపూడి మండలం రామేశ్వరం వాసులుగా గుర్తించారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఆటోని ఢీ కొట్టిన తర్వాత డ్రైవర్‌ లారీని ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంపై ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈఘన పట్ల విచారం వ్యక్తంచేసి, మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిచాలని పెద్దాపురం పోలీసులు ఆదేశించారు.  

అమర్ నాథ్ యాత్రలో ఏపీ వాసి మృతి..

జమ్ము కశ్మీర్ : భారీ వర్షాలు, మంచు కారణంగా అమర్ నాథ్ యాత్రకు ఇబ్బందులు కలుగుతుండగా, పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు నుంచి యాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. నాలుగు రోజుల క్రితం అమర్ నాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లిన తోట రత్నం మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందగా, చాగల్లులో విషాదకర వాతావరణం నెలకొంది. బలకేజ్ బేస్ ప్రాంతంలో గత మూడు రోజులుగా చిక్కుపోయిన తెలుగు బృందంలో తోట రత్నం ఉన్నారని, చలికి తట్టుకోలేక ఆయనకు గుండెపోటు వచ్చిందని అధికారుల నుంచి సమాచారం అందింది.

ముంబైలో భారీ వర్షాలకు కూలిన ఓవర్ బ్రిడ్జ్ ..

ముంబై : భారీ వర్షాలతో ముంబై మహానగరం భీతిల్లుతోంది. వర్ష బీభత్సానికి అంధేరీ రైల్వే స్టేషన్లోని ఓవర్ బ్రిడ్స్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బ్రిడ్సి అంధేరీ ఈస్ట్-అంధేరీ వెస్ట్ లను కలుపుతుంది. ఈ ప్రమాదం నేపథ్యంలో, అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎస్ సిబ్బంది సమాయక చర్యలను చేపట్టారు. రైలు పట్టాలపై బ్రిడ్స్ కూలిపోవడంతో, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే స్టేషన్లో భారీ సంఖ్యలో ప్రయాణికులు నిలిచిపోయారు. బ్రిడ్జ్ కూలిపోవడంతో రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ రూఫ్ కూడా పాక్షికంగా దెబ్బతింది.

11:37 - July 3, 2018

హైదరాబాద్‌ : కోఠీ ప్రసూతి ఆసుపత్రిలో పసిగందు ఆదృశ్యమైన ఘటన కలకలం రేపింది. టీకా ఇప్పిస్తానంటూ చెప్పి శిశువును తీసుకెళ్లింది ఓ గుర్తు తెలియని మహిళ. ఎంతసేపటికీ ఆ మహిళ బిడ్డను తీసుకురాకపోవడంతో ఆస్పత్రికి సిబ్బందికి తెలియజేసింది. దీంతో అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. రంగరెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ... ప్రసూతి కోసం గతవారం కోఠి సుల్తాన్‌ బజార్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆరు రోజుల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. తల్లి కదల్లేని స్థతిలో ఉండటంతో పక్కనే ఉన్న ఓ గుర్తుతెలియని ఓ మహిళ శిశువుకు టీకా ఇప్పిస్తానని తీసుకెళ్లింది.సిసీ ఫుటేజి ఆధారంగా మహిళ కోసం గాలిస్తున్న నేపథ్యంలో సదరు మహిళ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుండి బీదర్ బస్ ఎక్కినట్లుగాను..బస్ కండక్టర్ తో కన్నడలో మాట్లాడిన ఆధారంగా పోలీసులు బృందాలు పసిబిడ్డ ఆచూకీ కోసం బీదర్ పోలీసులతో చర్చలు జరిపాయి. ఈ గాలింపులో ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. 

11:28 - July 3, 2018

ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి చెందడం మిస్టరీగా మారింది. ఇందులో ఆరుగురు ఉరి వల్లే మరణించినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. మూఢ విశ్వాసాలతో మోక్షం కోసం చనిపోయినట్లు మృతుల ఇంట్లో లభించిన కీలక పత్రాలు సూచిస్తున్నాయి. మూఢవిశ్వాసంతో వారు ఆత్మహత్యలకు పాల్పడలేదు...ఇది హత్యేనని మృతుల బంధువులు చెబుతున్నారు. ఇది సామూహిక ఆత్మహత్యా...? లేక హత్యా...? దేశ రాజధాని ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానస్పద స్థితి మృతిపై సస్పెన్స్‌ ఇంకా వీడలేదు. వీరికి మృతికి సంబంధించిన పోస్టుమార్టమ్‌ రిపోర్టులో మాత్రం ఆరుగురు కుటుంబసభ్యులు ఉరి వేసుకోవడంవల్లే మరణించినట్లు వెల్లడైంది. మృతులపై ఎలాంటి అఘాయిత్యం జరిగినట్లు ఆనవాళ్లు లేవని నివేదిక పేర్కొంది. ఈ అంశంపై 10టీవీ చర్చ..ఈ చర్చలో జనవిజ్నాన వేదిక నుండి రమేశ్, సైకాలజిస్ట్ జవహర్ లాల్ నెహ్రూ పాల్గొన్నారు.

పోలవరానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి..

పశ్చిమగోదావరి : కేంద్ర రోడ్డు రవాణా, జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 11న పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. ప్రపంచంలోనే రెండవ అతి పెద్దదయిన పోలవరం ప్రాజెక్ట్ ని నిర్ణయించిన సమయంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 56 శాతం పూర్తయినట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు 66వ సారి వర్చువల్ సమీక్ష నిర్వహించారు.

బీజేపీ పాచిక..పీడీపీలో చీలిక..

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్రంలో పీడీపీ - బీజేపీ మధ్య ఉన్న బంధం తెగిపోయి, ప్రభుత్వం పడిపోయిన తరువాత, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పన్నిన ఎత్తుగడలు ఫలించేలా కనిపిస్తున్నాయి. పీడీపీలో చీలిక రావచ్చని గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీలో కనీసం ముగ్గురు ప్రజా ప్రతినిధిలు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కు వ్యతిరేకంగా ఉన్నారని సమాచారం. ప్రభుత్వం పడిపోవడానికి ముఫ్తీ విధానాలే కారణమని వీరు విమర్శిస్తున్నారు.

11:21 - July 3, 2018

హైదరాబాద్ : హిందూ దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ చానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా మాట్లాడిన కత్తి మహేశ్ హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో హిందూ సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. కత్తి వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మహేశ్‌ను సోమవారం రాత్రి ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రోజు ఆయనను రిమాండ్‌కు తరలించనున్నారు. కత్తిపై వివిధ స్టేషన్లలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి.

11:18 - July 3, 2018

జమ్ము కశ్మీర్ : కైలాస్‌ మానస సరోవర్‌కు వెళ్లిన యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వారిలో విశాఖ, విజయవాడతో పాటు ఇతర తెలుగు ప్రాంతాల నుంచి వెళ్లిన యాత్రికులు కూడా ఉన్నారు. ఇండియా, నేపాల్‌ సరిహద్దులో వారు మొన్నటి నుంచి అవస్థలు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల హెలికాప్టర్లు కూడా నిలిచిపోయాయి. దీంతో ఆహారం దొరక్క దాదాపు 1000 మంది యాత్రికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వారిలో కొందరు అనారోగ్యానికి గురైయినట్లుగా సమాచారం. తెలుగు యాత్రలో చిక్కుకుని అవస్థలు పడుతున్న తెలుగు యాత్రీకుల గురించి చంద్రబాబు ఆరా తీసారు. చైనా, నేపాళ్ సరిహద్దులో చిక్కుకుపోయిన తెలుగు యాత్రీకుల ఆరోగ్య సమస్యలపై చంద్రబాబు అధికారులతో చర్చించి వారికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. 

11:16 - July 3, 2018

2014లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగం ప్రకారంగా చూస్తే మళ్లీ ఎన్నికలు 2019లో జరిగాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ముందస్తు ఎన్నికలకు నాయకులు సిద్ధపడిపోతున్నారు. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. దాదాపుగా అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తుల్లో బిజి బిజీగా వ్యూహాలు రచించుకుంటున్నాయి. తెలంగాణలో అయిన నవంబర్ నెలలోనే ముందస్తు ఎన్నికలు జరిగే వాతావరణం నెలకొంది. దీంతో అధికార, ప్రతిపక్షాలు ఎన్నికల హడావిడిలో కసర్తులు చేసుకుంటున్నారు. అటు ఏపీలో కూడా అధికార పార్టీ రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాలపై వంచన దీక్షలు చేస్తుంటే..ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రతో ప్రజలకు ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. మరోపక్క కొత్తపార్టీగా అవతరించిన జనసేన పార్టీ కూడా ఎన్నికల నేపథ్యంలో సభలు, బహిరంగ సభ, మేధావులతో చర్చలతో జనసేనాని పనవ్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు రాష్ట్రాల హక్కులపై దాడి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ చర్చను చేపట్టింది. ఈ చర్చలో టీడీపీ అధికార ప్రతినిథి మన్నెం సుబ్బారావు, జనసేన అధికార ప్రతినిథి పార్థసారథి పాల్గొన్నారు. 

11:15 - July 3, 2018

తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీని నిన్న మంత్రి కేటీఆర్ ఘనంగా ప్రారంభించారు. కానీ ఈ పథకం అమలు తీరుపై గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మొదటి విడతలో అనుకున్న లక్ష్యాన్ని ఈ పథకం చేరలేదని గొర్రెల పంపిణీ తరువాత ఆ గొర్రెల పెంపకానికి కావాల్సిన మేత, ఆరోగ్యం విషయాలను సర్కార్‌ పట్టించుకోవడం లేదని వారు విమర్షిస్తున్నారు. మొదటి విడతలో జరిగిన లోపాలను వచ్చిన విమర్షలను సరి చేసుకొని చిత్త శుద్ధితో ఈ పథకాన్ని అమలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే అంశం పై మాట్లాడేందుకు గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్‌ వారి వారి వృత్తుల్లో వుండే సాధక బాధకాలేమిటో తెలుసుకుందాం..

11:14 - July 3, 2018

తూర్పుగోదావరి : రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా..రోడ్డు ప్రమాదాలలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వేళకాని వేళల్లో ప్రయాణాలు, నిద్ర మత్తు, మద్యం మత్తు, అతివేగం కారణం ఏదైనా ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వివాహా వేడుకలో ఆనందంగా పాల్గొని తిరిగి స్వగ్రామాలకు బయలుదేరుతున్నా ఒకే కుటుంబంలో తీరని విషాదాన్ని కలిగించింది రోడ్డు ప్రమాదం. పెద్దాపురంలో మండలం వడ్లమూరులోని బంధువుల ఇంటిలో జరిగిన కాకినాడు రూరల్ మండలం రామేశ్వరానికి చెందిన ఒకే కుటుంబం ఓ వివాహానికి హజరయి అర్థరాత్రి ఆటోలో తిరుగు ప్రయాణంలో సామర్లకోట వద్ద జరిగన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. సామర్లకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువులంతా కలిసి వస్తున్న ఆటోని ఓ లారీ ఢీ కొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని చికిత్స నిమిత్తం తీవ్రంగా గాయపడిన 9 మందిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఆటోని ఢీకొన్న లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. కాగాఈ ప్రమాదంలో 50 సంవత్సరాల ఆటో డ్రైవర్ పెంకె రాజు సలాది నాగమణి, నొక్కు కమలమ్మ,మూడు సంవత్సరాల చిన్నారి పండు లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

07:30 - July 3, 2018

అనంతపురం : దేశంలో ముందస్తు ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నామన్నారు వామపక్ష జాతీయ నేతలు. అధికారంలోకి వస్తే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకోస్తామని హామీ ఇచ్చిన బీజేపీ... అధికారంలోకి వచ్చాక పెద్దనోట్లను రద్దు చేసి... దేశంలో ఉన్న అక్రమ సంపాదనంతా విదేశాలకు తరలించారన్నారు. దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని అంతం చేయాలంటే... మోదీ సర్కార్‌ను గద్దె దించాల్సిన అవసరముందన్నారు. అనంతపురంలో స్వాత్రంత్య సమరయోధుడు, కమ్యూనిస్ట్‌ నేత నీలం రాజశేఖర్‌రెడ్డి విగ్రహ ఆవిష్కరణలో సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

లం రాజశేఖర్‌రెడ్డి జయంతి ఉత్సవాల్లో వామపక్ష జాతీయ నేతలు..
సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, సురవరం సుధారకర్‌రెడ్డి అనంతపురంలో పర్యటించారు. స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్ట్‌ నేత నీలం రాజశేఖర్‌రెడ్డి జయంతి ఉత్సవాల్లో పాల్గొని.. సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాజశేఖర్‌రెడ్డి జీవిత విశేషాలతో కూడిన శతజయంతి సంచికను విడుదల చేశారు.

ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తాం : సీతారాం ఏచూరి
ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని... ఇందుకు వామపక్షాల ఐక్యత అవసరమన్నారు సీతారాం ఏచూరి. దేశంలో అవినీతి పెరిగిపోయిందని.. మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుండి దించడమే లక్ష్యంగా పోరాటం చేస్తామన్నారు.

మోదీ సర్కార్‌లో అవినీతి పెచ్చుమీరిపోయింది : సురవరం
దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మైనారిటీల్లో అభద్రతను బీజేపీ నెలకొల్పుతుందన్నారు సురవరం సుధాకర్‌రెడ్డి. మోదీ సర్కార్‌లో అవినీతి పెచ్చుమీరిపోయిందన్నారు. అమిత్‌షా డైరెక్టర్‌గా ఉన్న బ్యాంక్‌లో.. నోట్ల రద్దు చేసిన ఐదు రోజుల్లోనే 570 కోట్లు మార్చుకున్నారన్నారని ఆరోపించారు. స్విస్‌ బ్యాంక్‌లో నల్లధనాన్ని రాబట్టడంలో కేంద్రం విఫలమైందని సురవరం అన్నారు.

మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వామపక్షాల వ్యూహాలు
సార్వత్రిక ఎన్నికలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు వామపక్షాలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పోరాటాలకు సిద్దమవుతున్నారు. 

07:02 - July 3, 2018

హైదరాబాద్ : ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ తొలి విడత స్పెషల్‌ డ్రైవ్‌ ముగిసింది. మూడు రోజులపాటు నిర్వహించిన కార్యక్రమంలో అనేక ఆక్రమణలను తొలగించారు. అయితే... కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. కూల్చివేతల్లో వివక్ష కొనసాగించారని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు చిరువ్యాపారాలు తమ జీవనాధారం కోల్పోయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడోరోజు ఫుట్‌ పాత్‌ ఆక్రమణల తొలగింపు
హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోమూడోరోజు ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసి అధికారులు తొలగిస్తున్నారు. నగరంలోని ఆరు ప్రాంతాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. శని, ఆదివారాల్లో 2 వేల మూడు వందల 41 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మూడోవరోజు కూడా అదే స్థాయిలో తొలగింపులు కొనసాగాయి. మూడోరోజు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఫుట్‌ పాత్‌ ఆక్రమణల తొలగింపు జరిగింది. ముఖ్యంగా ఈరోజు జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి రహదారిలో ఉన్న ఆక్రమణలను తొలగించారు. జేసీబీల సహాయంతో పనులు సాగుతున్నాయి. ఫుట్‌పాత్‌లపై నడవడానికి పాదచారులకు ఇబ్బంది కలగకుండా ఈ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.

కూకట్‌పల్లి, కాచిగూడల్లో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు
ఈ ఆక్రమణల తొలగింపులో జీహెచ్‌ఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూకట్‌పల్లి, కాచిగూడల్లో అధికారుల అత్యుత్సాహంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాచిగూడలో వికలాంగ మహిళ నిర్వహిస్తున్న టీ స్టాల్‌ బండిని పూర్తిగా ధ్వంసం చేశారు బల్దియా సిబ్బంది. మరోవైపు కూకట్‌పల్లిలోని రెండు అంతస్తుల్లో షాపులకు ఉన్న మెట్లను తొలగించారు అధికారులు. దీంతో షాపుల్లో ఉన్న వినియోగదారులు పైనుంచి కిందికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఆక్రమణల తొలగింపుతో ఇబ్బంది పడుతున్న చిరువ్యాపారులు
మూడురోజులుగా సాగుతున్న తొలగింపులపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొన్నిఆక్రమణలను తొలగించి.. మరికొన్ని కూల్చకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవనాధారం కోల్పోయామని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జీహెచ్‌ఎంసీ చేపట్టిన తొలిదశ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం సక్సెస్‌ అయ్యింది.

 

07:01 - July 3, 2018

విశాఖపట్నం : రాజకీయ నేతల అండదండలు.. అధికారుల సమర్ధనతో విశాఖ ఏజన్సీలో విలువైన ఖనిజ సంపద పక్కదారి పడుతోంది. అంతేకాదు.. ఈ అక్రమ మైనింగ్‌ వల్ల.. గిరిజనులు గ్రామాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బ్లాస్టింగ్ వల్ల ఏ రోజు ఏ వైపు నుంచి ఏ రాయి వచ్చి ప్రాణం తీస్తుందోనని ఈ ప్రాంత గిరిజనులు కలవర పడుతున్నారు. ఏజెన్సీలో మైనింగ్‌ వల్ల గిరిజనుల వెతలపై 10టీవీ స్పెషల్‌ స్టోరీ.

విశాఖ ఏజెన్సీలో ఖనిజాన్ని దోచేస్తున్న అక్రమార్కులు
ఏజెన్సీలోని ఖనిజాన్ని దోచేస్తున్న అక్రమార్కులు...అనుమతులు లేని ప్రాంతాల్లోనూ యథేచ్ఛగా తవ్వకాలు..అక్రమార్కులకు నేతలు, అధికారుల అండదండలు..విశాఖ ఏజెన్సీలోని.. హుకుంపేట మండలం పుల్పాడ , గ్రూడ గ్రామాల పరిధిలో సర్వే నెంబర్ 1/14లో మెటల్‌ క్వారీ ఉంది. సుమారు 2.1 హెక్టార్లలో తవ్వకాల కోసం.. 2008 లో ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. పదేళ్ల వరకు మాత్రమే తవ్వకాలకు అనుమతినిచ్చింది. అయితే.. తవ్వకాలకు గడువు ముగిసినా.. అక్రమార్కులు క్వారీ పనులను ఆపడం లేదు. రాజకీయులు, అధికారుల అండదండలతో వీరు తమకు కేటాయించిన స్థలంలోనే కాదు.. దాదాపు 10 హెక్టార్ల మేర తవ్విపోస్తున్నారు .

భయం నీడలో గిరిజనులు
అనుమతులు ఉన్న ప్రాంతాల్లోనే కాకుండా.. క్వారీలో వంద నుంచి 150 అడుగుల లోతులో బాంబులు పెట్టి బ్లాస్ట్‌ చేస్తున్నారు. దీంతో.. విసురుగా ఎగిరివచ్చే రాళ్లు.. సమీపంలోని జనావాసాలపై పడుతున్నాయి. క్వారీ సమీపంలోని గూడ, లకేయిపుట్టు, వల్లంగిపుట్టు, మర్రిపుట్టు, గబ్బంగి, గుత్తులపుట్టు గ్రామాల ప్రజలు మీద పడే క్వారీ రాళ్లతో నిత్యం భయం నీడలో బతుకుతున్నారు.

పంట పోలాలు నాశనం,తాగునీరు కూడా కలుషితం
క్వారీలో బ్లాస్ట్‌ కారణంగా వెలువడే ధూళి సమీప గ్రామాల్లో పడటం వల్ల అటు పంట పోలాలు నాశనం కావడంతో పాటుగా తాగునీరు కూడా కలుషితం అవుతోంది. ధూళితో నిండిన నీటిని తాగడం వల్ల.. అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. అంతేనా.. ఇళ్ళ గోడలూ బీటలు వారుతున్నాయి. తమ వెతల గురించి గిరిజనులు ప్రభుత్వ ధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకు వచ్చినా స్పందన లేదు. నిజానికి ఏజన్సీ ప్రాంతంలో ఏ ఖనిజాన్ని తవ్వాలన్నా.. సెక్షన్ 11 ప్రకారం గ్రామ సభ అనుమతులు తీసుకోవాలి. కానీ, ప్రజా ప్రతినిధుల అండదండలు ఉండటంతో ఎటువంటి గ్రామ సభలను నిర్వహించడం లేదు.. తమ వెతల గురించి గిరిజనులు, ఆమధ్య తమ గ్రామ పరిసరాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ దృష్టికీ తీసుకు వెళ్లారు. అంతేకాదు.. తమ వెతలను బాహ్యప్రపంచానికి తెలియజెప్పేందుకు వారం పాటు ఐటీడీఏ కార్యాలయం వద్ద ధర్నా కూడాచేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో.. ఇప్పుడు విశాఖనగరానికే తమ దీక్షను షిఫ్ట్‌ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు కూర్చుని.. తమ గోడును వినాలని విన్నవిస్తున్నారు. 

ఆటో, లారీ ఢీ..6గురు మృతి..

తూర్పుగోదావరి : సామర్లకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోని లారీ ఢీ కొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 9 మందిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

06:48 - July 3, 2018

జగిత్యాల : నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత. జగిత్యాల మండలం కల్లెడలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆమె అనంతర బహిరంగసభలో ప్రసంగించారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ సైనికుడిలా పనిచేస్తున్నారని.. ఆయనకి అందరు సహకరించాలని కవిత కోరారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలను కవిత ప్రజలకు వివరించారు. 

06:46 - July 3, 2018

జగిత్యాల : జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటానికి వచ్చిన మంత్రి ఈటెల రాజేందర్‌కు గంగపుత్రుల సెగ తగిలింది. మొన్న జనగామ జిల్లా కేంద్రంలో ఓ సభలో పాల్గొన్న ఈటెల.. రైతులకు, రజక, ముదిరాజ్ కులాలకు చెరువులపై పూర్తి హక్కులను కల్పిస్తామని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. గంగపుత్రులు భారీ ర్యాలీ చేపట్టారు. అటుగా వచ్చిన ఈటెల కాన్వాయిని గంగపుత్రులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు గంగపుత్ర నాయకులను అరెస్ట్‌ చేశారు. నాయకులను అరెస్ట్‌ చేయటంతో గంగపుత్రులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తోపులాట జరగటంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెరగొట్టారు. చెరువులపై పూర్తిస్థాయి హక్కులను తమకే కల్పించాలని గంగపుత్రులు ఆందోళన అనంతరం డిమాండ్‌ చేశారు. 

Don't Miss