Activities calendar

04 July 2018

22:09 - July 4, 2018

చెన్నై : తమిళనాడులో దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసును కోర్టు విచారించింది. తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేశారు. 23 నుంచి 27 వరకు ప్రతిరోజు ఉదయం 10.30 గంటలకు విచారించాలని కోర్టు నిర్ణయించింది. 

22:05 - July 4, 2018
22:01 - July 4, 2018

తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన కొడుకుకు ప్రాణం పోసిన ఓ దివ్యాంగ తండ్రి, శరీరం సహకరించకపోయినా.. 8 కేజీల బరువు తగ్గి కొడుకు కాలేయ దానం, వైద్యం ఖర్చుల కోసం సహాయం అడుగుతున్న పేద కుటుంబం...'కన్న ప్రేమ' కార్యక్రమంలో తల్లిదండ్రులు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

21:55 - July 4, 2018
21:52 - July 4, 2018

ముంబై : బాలీవుడ్‌ అందాల నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె స్వయంగా వెల్లడించారు. 'నాకు ఇటీవల క్యాన్సర్‌ సోకింది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. అస్వస్థతగా అనిపిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నా. అప్పుడు క్యాన్సర్‌ ఉందని బయటపడిందని తెలిపారు.  కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను కలిసి ఆదరణ చూపుతున్నారు. వారంతా నా చుట్టూ ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు సోనాలి బింద్రే ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కాన్సర్‌పై పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సోనాలి బింద్రే 'హమ్‌ సాథ్‌ సాథ్‌ హై', 'సర్‌ఫరోష్‌' తదితర బాలీవుడ్‌ చిత్రాలతో పాటు 'ప్రేమికుల రోజు', 'మురారి', 'ఇంద్ర', 'ఖడ్గం' తదితర తెలుగు చిత్రాల్లోనూ నటించారు.

21:48 - July 4, 2018

ఢిల్లీ : 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం రైతులకు భారీ నజరానా ప్రకటించింది. ఖరీఫ్‌ పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధాని మోది అధ్యక్షతన జరిగిన కాబినెట్‌ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. వరితో సహా 14 ఖరీఫ్‌ పంటల కనీస మద్దతు ధర పెరగనుంది. క్వింటాల్‌ వరిపై మద్దతు ధర 2 వందల వరకు పెరిగింది. గ్రేడ్‌ ఏ రకం వరి క్వింటాల్‌ ధర 1,590 నుంచి 1,750కి పెంచారు. పత్తి ధర 4,020 నుంచి 5,150కి పెంచారు. కందులు క్వింటాల్‌ ధర  5,450 నుంచి 5,675, పెసర్ల ధర  5,575 నుంచి  6,975, మినుములు 5,400 నుంచి 5,600లకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. స్వాతంత్రం అనంతరం తొలిసారిగా MSP ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారని  హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. మద్దతు ధర పెంచడంతో ప్రభుత్వంపై 15 వేల కోట్ల అదనపు భారం పడనుందని ఆయన పేర్కొన్నారు.

21:45 - July 4, 2018

హైదరాబాద్ : చిన్నారి కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది.. రెండు రోజులుగా యాతన పడ్డ తల్లి ఒడికి బిడ్డ చేరింది. పాపను అక్కున చేర్చుకుని ఆ తల్లి మురిసిపోయింది. కిడ్నాప్‌ జరిగిన 40 గంటల్లోపే.. బిడ్డను మళ్లీ తన పొత్తిళ్లలోకి చేర్చిన పోలీసులకు.. ఆ తల్లి వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపింది. పాప ఆచూకీ కోసం స్వయంగా రంగంలోకి దిగి.. విశేషంగా కృషి చేసిన.. సుల్తాన్‌బజార్‌ ఏసీపీ డాక్టర్‌ చేతన పేరును.. తమ పాపకు పెట్టుకుంది.  
తల్లి ఒడికి బిడ్డ 
ప్రసవ వేదనను మించిన యాతన.. పురిట్లోనే కిడ్నాపైన బిడ్డ తిరిగి వస్తుందో లేదోనన్న వేదన.. బాలింత హృదయ భారాన్ని తగ్గించిన పోలీసులు.. కేవలం రెండంటే రెండు రోజుల్లో కిడ్నాప్‌ అయిన బిడ్డను తల్లి ఒడికి చేర్చారు హైదరాబాద్‌ పోలీసులు. వారి కృషితో.. ఆ తల్లి వేదన తీరింది. బిడ్డ మళ్లీ పొత్తిళ్లలోకి వచ్చి చేరింది. కోఠి ప్రసూతి ఆసుపత్రిలో కిడ్నాప్‌ అయిన పసిగుడ్డు కథను పోలీసులు సుఖాంతం చేశారు. దక్కుతుందో లేదో అన్న వేదనతో సతమతమైన ఆ తల్లి.. బిడ్డ చేతికి అందాక కూడా.. షాక్‌నుంచి తేరుకోలేదు. కొద్దిసేపటికే తన బిడ్డను పొదివి పట్టుకుని.. అక్కున చేర్చుకుని.. మురిసి పోయింది. 
నాలుగు బృందాలుగా పోలీసులు గాలింపు 
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా గాలింపు జరిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాప్‌ చేసిన మహిళ.. బిడ్డను బీదర్‌ తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు. కర్నాటక పోలీసులతో సంయుక్త ఆపరేషన్‌కు దిగారు. విషయం తెలిసి కిడ్నాప్‌ చేసిన మహిళ.. పాపను బీదర్‌ ప్రభుత్వాసుపత్రి బయట వదిలేసి వెళ్లిపోయింది. బీదర్‌ పోలీసుల సమాచారంతో హైదరాబాద్‌ పోలీసులు అక్కడికి వెళ్లి పాపను సురక్షితంగా తీసుకు వచ్చారు. బుధవారం తెల్లవారుఝామున మూడున్నర గంటల ప్రాంతంలో పాపను తల్లి ఒడికి చేర్చారు.  పాప ఆచూకీ కోసం విశేషంగా కృషి చేసిన.. సుల్తాన్‌బజార్‌ ఏసీపీ డాక్టర్‌ చేతన పేరును..  ఆ తల్లి తమ పాపకు పెట్టుకుంది.  
నీలోఫర్‌ ఆసుపత్రికి పాప తరలింపు
ప్రస్తుతం కామెర్లతో బాధపడుతోన్న పాపను, మెరుగైన చికిత్స కోసం నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. కోఠి ఆసుపత్రిలో కిడ్నాప్‌ ఘటనపై రీజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ జయలక్ష్మి.. విచారణకు ఆదేశించారు. వారంలోగా నివేదిక వస్తుందని, ఆ తర్వాత బాధ్యుతలపై చర్యలు తీసుకుంటామని జయలక్ష్మి చెప్పారు. 
పోలీసులకు శిశువు తల్లిదండ్రులు కృతజ్ఞతలు 
పాపను కిడ్నాప్‌ అయిన 40 గంటల్లోపే.. తమ ఒడికి మళ్లీ చేర్చిన పోలీసులకు శిశువు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది లంచాల మత్తులో మునిగిపోకుండా.. కాస్తంత అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని వారు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఎప్పట్లాగనే ఈ కేసు ఛేదనలో కూడా సీసీ టీవీ ఫుటేజీలే కీలకం కావడం విశేషం. ప్రస్తుతం కిడ్నాపర్‌ కోసం నాలుగు పోలీసు బృందాలు.. బీదర్‌ పరిసరాల్లోనే గాలిస్తున్నాయి. 

 

21:39 - July 4, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టు సాక్షిగా.. కేంద్రం అబద్ధాలు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి.. విభజన చట్టంలోని అన్ని హామీలనూ నెరవేర్చేశామని, ఇక చేయాల్సింది ఏమీ లేదని అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌ ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రైల్వే జోన్‌ కోసం.. కడప ఉక్కు కోసం పోరాటాలు జరుగుతున్న తరుణంలోనే కేంద్రం అఫిడవిట్‌ గురించిన సమాచారం వెలుగు చూడడంతో.. ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులోని మంత్రులతో భేటీ అయి సమీక్ష జరిపారు. 

విభజన చట్టంలోని అన్ని హామీలనూ నెరవేర్చామని.. ఇక ఏపీకి ఇచ్చేదేమీ లేదని.. కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ రాజకీయ కలకలాన్ని సృష్టిస్తోంది. పొంగులేటి సుధాకరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానంగా.. కేంద్ర ఆర్థికశాఖ ఈ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం అధికారికంగా సుప్రీంకోర్టుకు నివేదించింది. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయలేమని స్పష్టం చేసింది. 

ఏపీ విభజన చట్టంలోని అన్ని హామీలనూ నెరవేర్చామన్న కేంద్ర ప్రభుత్వం.. విశాఖ రైల్వే జోన్‌ ఊసే ఎత్తక పోవడం వివాదాస్పదమవుతోంది. అదేవిధంగా.. రాష్ట్రంలో సెంటిమెంట్‌గా మారుతోన్న కడప ఉక్కు కర్మాగారం అంశాన్ని, దుగరాజపట్నం పోర్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తామంటూ దాన్ని అటకెక్కించే ప్రయత్నం చేసింది. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం.. అసలు దీన్ని ఎంతవరకూ అమలు చేసిందో కూడా అఫిడవిట్‌లో వివరించలేదు. ఈఏపీలపైనా స్పష్టతను ఇవ్వలేదు. 

సుప్రీంకోర్టులో కేంద్ర ఆర్థికశాఖ దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌ అయింది. అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయి ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనేదానిపై సమాలోచనలు చేసినట్లు సమాచారం. కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగడుతూనే న్యాయపోరాటం చేయాలని ప్రభుత్వం యోచనగా చెబుతున్నారు. ఎల్లుండి క్యాబినెట్‌ భేటీలో చర్చ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తారు. 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మోసం చేసిందని.. ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తూ.. పక్కదారి పట్టిస్తోందని ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం మే నెలలోనే ఈ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అయితే వేసవి సెలవుల కారణంగా ఇంతకాలం ఆ అంశం వెలుగులోకి రాలేదు. కోర్టులు పునఃప్రారంభం కావడంతో.. కేంద్రం అఫిడవిట్‌ అంశం బయటికొచ్చింది. 

 

21:33 - July 4, 2018

సుప్రీంకోర్టులో మరో వివాదాస్పద అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం...పొంగులేటి పిటిషన్ లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం ఆర్థికశాఖ...అఫిడవిట్ లో విశాఖ రైల్వే జోన్ ఊసెత్తని కేంద్ర ఆర్థిక శాఖ..ఈఏపీలపై స్పష్టంగా ప్రస్తావించని ఆర్థిక శాఖ.., దుగ్గరాజపట్నం పోర్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం అంటూ కేంద్రం మెలిక, ప్రత్యేక ప్యాకేజీకి ఎంత వరకు అమలు చేసింది చెప్పని కేంద్రం, ఏపీకి హామీలన్నీ నెరవేర్చాం ఇక ఇచ్చేదేం లేదన్న కేంద్రం, ప్రత్యేకహోదా ఇవ్వలేమని అధికారికంగా సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం, రాజ్యసభలో మన్మోహన్ ఇచ్చిన హామీలను అమలు చేయలేమన్న కేంద్రం.. ఇదే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యకమ్రంలో విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొని, మాట్లాడారు. కేంద్రం వైఖరి అర్థరహితం, అన్యాయమని ఆయన అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : సీఎం చంద్రబాబు

అమరావతి : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విధులపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఫెడరల్ స్ఫూర్తికి అద్దం పట్టిందన్నారు. ప్రభుత్వ సలహా మేరకే లెఫ్లినెంట్ గవర్నర్ నిర్ణయాలు ఉండాలని చెప్పారు.

20:43 - July 4, 2018

చంద్రాలు అది నాల్కెనా తాటి మట్టనా..?..గడ్కోపారి ఫ్లెటు ఫిరాయిస్తున్నడుల్లా, ప్రజల మన్షినే అంటవ్ సెక్యూరిటెందుకు?...జగనాలు పాదయాత్ర కాకినాడ దిక్కైతుంది, ఓడ దాటినంక అమ్మగాదు బొమ్మనంట...కేటీఆర్ ఇజ్జత్ వుచ్చుకున్న అన్మంతన్న, నేరేళ్ల దళితుల గోసకు ఇయ్యాళ యాడాది...హామీలిచ్చి అవుతలవడ్డ బుడ్డ కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ లీడర్ కనరువట్టిన మాటలు..ఎన్ఎస్ఐయూ కార్యకర్తను సంపేస్తడట, మూడు ఎక్రాల భూమికి లంచాల తెగులు..శాలిగౌరారం మండలంల టీఆర్ఎస్ ఆటలు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

20:32 - July 4, 2018

కేంద్ర, రాష్ర్టాల అధికార పోరుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.  లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ప్రభుత్వం కలిసికట్టుగా పని చేయాలని,  లెఫ్టినెంట్ గవర్నర్‌ యాంత్రికంగా పని చేయకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. లెఫ్టినెంట్ గవర్నర్‌ ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోవొద్దని ఆదేశించింది. ఢిల్లీ పాలనలో లెఫ్టినెంట్ గవర్నర్‌ జోక్యంపై ఆప్‌ సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీం ఈ తీర్పును వెలువరించింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, ఆప్ నేత సుదర్శన్, టీడీపీ నేత మాల్యాద్రి, టీఆర్ ఎస్ నేత దేవిప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని వక్తలు అన్నారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

రైతులపై కేంద్రం నిర్లక్ష్యం : మంత్రి కాలువ

గుంటూరు : రైతులపై, సహాయంపై కేంద్రం, బీజేపీ నేతలకు నిర్లక్ష్య భావం ఉందని మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. రైతు ఉపశమనం డబ్బులు తిరిగి చెల్లించడం లేదన్నారు. రైతులపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పూనుకుంటుందన్నారు. రాజధాని నిర్మాణం కోసం 1500 కోట్ల రూపాయలు ఇచ్చారని.. మరో వెయ్యి కోట్లు ఇస్తామంటున్నారని తెలిపారు. 2500 కోట్లతో ఢిల్లీని తలదన్నే రాజధానిని ఎలా నిర్మించాలని ప్రశ్నించారు. కేంద్రం పటేల్ విగ్రహానికి 3 వేల కోట్లు,  శివాజీ విగ్రహానికి 4 వేల కోట్లు ఇచ్చారని కానీ ఏపీ రాజధాని నిర్మాణానికి మాత్రం 2500 కోట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రానికి ఇంగింత జ్ఞానం లేదని..

కేంద్రంపై మంత్రి కాలువ విమర్శలు

గుంటూరు : ఏపీ మంత్రి కాలువ శ్రీనివాసులు కేంద్రంపై విమర్శలు చేశారు. అఫిడవిట్ లోని అంశాలను గమనిస్తే బాధనిపిస్తుందన్నారు. కేంద్రం సత్యదూరంగా ఉందన్నారు. కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం ఏపీ ప్రయోజనాలను కాలరాయడమే అవుతుందన్నారు. సమాచారం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. సమాచారం తప్పులతడకని,.. బాధ్యతారహిత్యంగా ఉందని విమర్శించారు. ఆర్థిక సమ్యల మధ్య..రాజధాని లేకుండా.. అప్పల భారంతో ఏర్పడిన రాష్ట్రం ఏపీ అన్నారు. ఆర్థిక లోటు 16 వేల కోట్లుగా ఉందన్నారు. 

20:22 - July 4, 2018

గుంటూరు : ఏపీ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన అఫిడవిట్ లోని అంశాలను గమనిస్తే బాధనిపిస్తుందని.. కేంద్రం సత్యదూరంగా ఉందన్నారు. కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం చూస్తే ఏపీ ప్రయోజనాలను కాలరాయడమే అవుతుందన్నారు. సమాచారం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. సమాచారం తప్పులతడకని,.. బాధ్యతారహిత్యంగా ఉందని విమర్శించారు. ఆర్థిక సమ్యల మధ్య..రాజధాని లేకుండా.. అప్పుల భారంతో ఏర్పడిన రాష్ట్రం ఏపీ అన్నారు. ఆర్థిక లోటు 16 వేల కోట్లుగా ఉందన్నారు. స్టాండెడైజ్డ్ ఎక్స్ పెండేచర్ అంటే ఏమిటో కేంద్రమే చెప్పాలన్నారు. రైతులపై, సహాయంపై కేంద్రం, బీజేపీ నేతలకు నిర్లక్ష్య భావం ఉందని విమర్శించారు. రైతు ఉపశమనం డబ్బులు తిరిగి చెల్లించడం లేదన్నారు. రైతులపై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పూనుకుంటుందన్నారు. రాజధాని నిర్మాణం కోసం 1500 కోట్ల రూపాయలు ఇచ్చారని.. మరో వెయ్యి కోట్లు ఇస్తామంటున్నారని తెలిపారు. 2500 కోట్లతో ఢిల్లీని తలదన్నే రాజధానిని ఎలా నిర్మించాలని ప్రశ్నించారు. కేంద్రం పటేల్ విగ్రహానికి 3 వేల కోట్లు,  శివాజీ విగ్రహానికి 4 వేల కోట్లు ఇచ్చారని కానీ ఏపీ రాజధాని నిర్మాణానికి మాత్రం 2500 కోట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రానికి ఇంగింత జ్ఞానం లేదని.. దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ఏపీకి నమ్మక ద్రోహం చేస్తుందని చెప్పారు. 

 

కన్నా లక్ష్మీనారాయణపై చెప్పులు విసిరిన టీడీపీ కార్యకర్తలు

నెల్లూరు : టీడీపీ, బీజేపీ మధ్య రోజురోజుకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నెల్లూరు జిల్లా కావలిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీంతో బీజేపీ కార్యకర్తలు చెప్పు విసిరిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పీఎస్‌ ఎదుట బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. 

20:06 - July 4, 2018

నెల్లూరు : టీడీపీ, బీజేపీ మధ్య రోజురోజుకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నెల్లూరు జిల్లా కావలిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీంతో బీజేపీ కార్యకర్తలు చెప్పు విసిరిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పీఎస్‌ ఎదుట బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. 

20:03 - July 4, 2018

జనగాం : జిల్లాలోని నర్మెట్ట ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో టీచర్‌ విద్యార్థులతో సేవలు చేయించుకుంది. ఫిజిక్స్‌ టీచర్‌ పార్వతి క్లాస్ రూంలోనే విద్యార్థినులతో జడ వేయించుకుంది. తలనొప్పి అంటూ 9వ తరగతి విద్యార్థినితో ఆయిల్‌ మసాజ్‌ చేయించుకుని తర్వాత జడ వేయించుకుంది. మరోవైపు టీచర్‌ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

మోడల్ పాఠశాలలో టీచర్‌ నిర్వాకం

జనగాం : జిల్లాలోని నర్మెట్ట ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో టీచర్‌ విద్యార్థులతో సేవలు చేయించుకుంది. ఫిజిక్స్‌ టీచర్‌ పార్వతి క్లాస్ రూంలోనే విద్యార్థినులతో జడ వేయించుకుంది. తలనొప్పి అంటూ 9వ తరగతి విద్యార్థినితో ఆయిల్‌ మసాజ్‌ చేయించుకుని తర్వాత జడ వేయించుకుంది. మరోవైపు టీచర్‌ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

టీడీపీ దీక్షలపై బొత్స విమర్శలు

హైదరాబాద్ : విశాఖ రైల్వే జోన్ కావాలని ఉద్యమం, దీక్షలు చేసిన విపక్షాలను అవహేళన చేసిన టీడీపీ నేతలు ఏ మొఖం పెట్టుకుని ఇప్పుడు దీక్షలు చేస్తారని వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో విశాఖ రైల్వే జోన్ కావాలని ఉద్యమం చేస్తే టీడీపీ హేలన చేసిందని, కేసులు పెట్టిందని తెలిపారు. చంద్రబాబు హేళనగా మాట్లాడారని పేర్కొన్నారు. ఉద్యమాలు, దీక్షల పట్ల మురళీమోహన్ లాంటి టీడీపీ పార్లమెంట్ సబ్యులు చులకన భావంతో ఉక్కు లేదు..తుక్కు లేదు అని వ్యాఖ్యానించారని చెప్పారు. మళ్లీ ఏ మొఖం, పెట్టుకుని టీడీపీ నేతలు విశాఖలో దీక్షలు చేస్తారని నిలదీశారు. 

19:56 - July 4, 2018

 హైదరాబాద్ : విశాఖ రైల్వే జోన్ కావాలని ఉద్యమం, దీక్షలు చేసిన విపక్షాలను అవహేళన చేసిన టీడీపీ నేతలు ఏ మొఖం పెట్టుకుని ఇప్పుడు దీక్షలు చేస్తారని వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో విశాఖ రైల్వే జోన్ కావాలని ఉద్యమం చేస్తే టీడీపీ హేలన చేసిందని, కేసులు పెట్టిందని తెలిపారు. చంద్రబాబు హేళనగా మాట్లాడారని పేర్కొన్నారు. ఉద్యమాలు, దీక్షల పట్ల మురళీమోహన్ లాంటి టీడీపీ పార్లమెంట్ సబ్యులు చులకన భావంతో ఉక్కు లేదు..తుక్కు లేదు అని వ్యాఖ్యానించారని చెప్పారు. మళ్లీ ఏ మొఖం, పెట్టుకుని టీడీపీ నేతలు విశాఖలో దీక్షలు చేస్తారని నిలదీశారు. 6 నెలల సమయంలో సాధ్యాసాధ్యాలు గుర్తించమని..వాటిని ఏర్పాటు చేయాలని చట్టంలో పెట్టిన నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉంటూ ఏం ఒరగపెట్టారని, ఏం సాధించారని నిలదీశారు. అవినీతి కార్యక్రమాల కోసం కాలాన్ని వెల్లబుచ్చారని విమర్శించారు. 

19:47 - July 4, 2018

హైదరాబాద్ : కిడ్నాపైన పసికందు తల్లి ఒడికి చేరింది. కోటి మెటర్నిటీలో పసికందును తల్లికి అప్పగించారు. పాప తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీదర్ లో పోలీసులు  పాపను స్వాధీనం చేసుకున్నారు. 

 

19:40 - July 4, 2018

సిరిసిల్ల : కాలంతోపాటు.. ఒంటిపై తగిలిన దెబ్బలు మానిపోయినా... గుండెలకైన గాయాలు మాత్రం సలుపుతూనే ఉన్నాయి. విచారణ పేరుతో పోలీసులు 8 మందిపై పోలీసులు ప్రదర్శించిన  పైశాచికత్వానికి యేడాది పూర్తయింది. జాతీయ స్థాయిలో నెరేళ్ల బాధితులకు మద్దతు లభించినా.. రాష్ట్ర స్థాయిలో మాత్రం న్యాయం జరగలేదు. మానని గాయంలా సలుపుతున్న నేరెళ్ల దురాగతంపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం.
విచారణ పేరుతో పోలీసుల చిత్ర హింసలు
కాలం గడిచే కొద్దీ పోలీసులు ఒంటిపై కొట్టిన దెబ్బలైతే మానాయి గానీ.. గుండెలకు తగిలిన గాయాలు మాత్రం ఇంకా పచ్చి పుండును తలపిస్తూనే ఉన్నాయి. నేరెళ్ళలో పోలీసులు విచారణ పేరుతో నిందితులను చిత్రహింసలు పెట్టిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ స్థాయిలో దళిత ఉద్యమానికి దారితీసింది.
లారీలకు నిప్పు పెట్టిన  ఘటనలో..12 మంది పై కేసు
నేరెళ్ళ ఘటన జరగడానికి ఏడాది ముందు.. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయన్న కారణంతో.. ఐదు లారీలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో తంగళ్ళపల్లి పోలీసులు 12 మంది పై కేసు నమోదు చేశారు. నేరెళ్ల, జిల్లెల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన పెంట బాణయ్య, హరీష్, బాలరాజు, పసుల ఈశ్వర్, గోపాల్, మహేష్, గణేష్, చీకోటి శ్రీనివాస్‌ను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. ఇంటరాగేషన్‌ చేసిన  జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి, సీసీఎస్ ఎస్సై రవీందర్‌పైనా సరైన చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.  
జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామన్న ప్రతిపక్షాలు 
గాయపడ్డ బాధితులను చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. దీంతో దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు  ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ స్పీకర్ మీరా కుమారి నేరెళ్ల ఘటన పై తీవ్ర స్థాయిలో స్పందించారు.  భాదితుల కుటుంబ సభ్యులను కలుసుకున్న మీరా కుమారి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో హెచ్చరించాయి. 
జూలై 2న కండీషన్‌ బెయిల్ మంజూరు
ఓవైపు న్యాయ పోరాటం జరగుతుండగానే.. నిందితులకు కరీంనగర్‌ కోర్టు జూలై 2న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  జైలు నుంచి విడుదలైన నిందితులు తమ కుటుంబ సభ్యులను చూడగానే.. ఉద్వేగానికి లోనయ్యారు. ఆపుకోలేని దు:ఖంతో వెక్కి వెక్కి ఏడ్చారు. తమకు న్యాయం చేయాలంటూ ధీనంగా వేడు కున్నారు. 
పోలీసు చర్యల వెనుక టీ.ప్రభుత్వం : బాధితులు
నేరెళ్ల ఘటనలో పోలీసుల అత్యుత్సాహం స్పష్టంగా తెలుస్తున్నా.. పోలీసు చర్యల వెనుక ఉన్నది మాత్రం టీఆర్ఎస్‌  ప్రభుత్వమే అన్నది మరింత స్పష్టంగా తెలుస్తోందని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఇంత జరిగినా .. సిరిసిల్లలో ఇసుక లారీల వేగం ఇప్పటికీ తగ్గనేలేదు.. న్యాయ పోరాటం చేస్తున్న భాదిత కుటుంబాలకు పోలీసు వేదింపులు ఆగనూలేదు. 

19:34 - July 4, 2018

గుంటూరు : ఒకేసారి 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశం చేసి ఏపీ సర్కార్‌ రికార్డ్‌ సృష్టించబోతుంది. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి సీఎం చంద్రబాబు ఒకేసారి 3 లక్షల పక్కా ఇళ్లకు గృహ ప్రవేశం చేయనున్నారు. 2019 నాటికి 50వేల కోట్లతో 19 లక్షల ఇళ్లు నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నామని... అయితే కోటి ఇళ్లు నిర్మిస్తామన్న కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదంటున్న మంత్రి కాలువతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. కేంద్రం సహకరించకపోయినా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని విమర్శించారు. కోటి ఇళ్లు నిర్మిస్తామంటున్న కేంద్రం.. రాష్ట్రంలో పేదలకు నిర్మిస్తున్న ఇళ్లకు..ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నించారు. 

 

19:29 - July 4, 2018

పెద్దపల్లి : సింగరేణి సిరుల తల్లి ఒడిన మరో ఓపెన్‌కాస్ట్‌ పురుడుపోసుకోనుంది. అన్ని రకాల అనుమతుల కోసం సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. 2019 నాటికి బొగ్గు ఉత్పత్తిని వెలికితీసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని యోచిస్తోంది సింగరేణి సంస్థ. 
మరో ఓపెన్‌ కాస్ట్‌ ప్రారంభానికి ప్రణాళికలు 
పెద్దపల్లి జిల్లాలోని రామగుండలో మరో ఓపెన్‌ కాస్ట్‌ను ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక్కడ నాలుగు ఓపెన్‌కాస్ట్‌లు నడుస్తుండగా... 2019నాటికి మరొకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే నడుస్తున్న వాటిలో 2019-20 నాటికి బొగ్గు నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో... జీడీకే-5ఏ ఓపెన్‌కాస్ట్‌ స్థానంలో కొత్తది ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పూర్తిస్థాయి నివేదికలు తయారు చేసి కేంద్రప్రభుత్వానికి పంపించారు. 
మొదటి ఏడాదిలో 10లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌
కొత్తగా ఏర్పాటు కానున్న ప్రాజెక్టులో మొదటి ఏడాదిలోనే 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌గా నిర్ధేశించారు. ప్రస్తుతం 5వ బొగ్గుగని నడుస్తుండగా, 5ఏ గని మాత్రం మూసివేశారు. వీటి భూగర్భంలో పెద్ద ఎత్తున బొగ్గు నిల్వలున్నట్లు సంస్థ గుర్తించింది. 50 ఏళ్లకు సరిపడా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని సమాచారం. మొదటి సంవత్సరంలోనే పది లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిగా టార్గెట్‌ చేసిన సంస్థ రానున్న రోజులలో 4మిలియన్‌ టన్నుల లక్ష్యాలను ఎంచుకోనుంది. 
నవంబర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ
ఓపెన్‌ కాస్ట్‌ ఏర్పాటు కోసం నవంబర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సింగరేణి భావిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుకు కావలసిన భూమిని కూడా సేకరించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఓపెన్‌కాస్ట్‌కు 1400 ఎకరాల స్థలం కావాల్సి ఉండగా... సింగరేణి  పరిధిలో 920 ఎకరాల స్థలం మాత్రమే ఉంది. మిగతా 480 ఎకరాల భూమి పరిసర గ్రామాల నుంచి సేకరించాల్సి ఉంది. వీటికోసం కూడా నివేదికలు సిద్దం చేసినట్లు సింగరేణి ఉన్నతాధికారులు తెలిపారు. 
పరిసర ప్రాంతాల మార్పునకు సర్వేలు 
ఇక కొత్త ప్రాజెక్టు ఏర్పాటు నేపథ్యంలో... పరిసర ప్రాంతాల్లో రహదారులు, మురికి కాలువలు, విద్యుత్‌, రవాణాలకు సంబంధించి మార్పులు చేసేందుకు సంస్థ సర్వేలు పూర్తి చేసింది. ప్రధానంగా గోదావరిఖని నుంచి మంథనికి వెళ్లే రహదారి మార్పునకు, తదితర నిర్మాణాల కోసం సుమారు 350 కోట్ల రూపాయలు వ్యయం కానుందని అంచనా వేశారు. అన్ని అనుకూలిస్తే 2019 నాటికి కొత్త ఓపెన్‌కాస్ట్‌ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానుంది. 

 

19:25 - July 4, 2018

గుంటూరు : బీజేపీ నేతలు చెప్పేవన్నీ అవాస్తవాలేనని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. బీజేపీ జాతీయ నేతలు రాష్ట్రానికి వేల కోట్లు ఇస్తున్నామని చెప్తున్నారే కానీ... వాస్తవానికి ఇచ్చే ఏమీ లేదంటున్నారు. సాగర్‌మాల ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్రానికి 5 కోట్లు ఇచ్చి 1800 కోట్లు ఇచ్చామని జీవీఎల్‌ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. 

 

19:23 - July 4, 2018

వరంగల్‌ : జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదం.. పన్నెండు నిండు ప్రాణాలను బలిగొంది. బాణసంచా నిల్వ ఉంచిన గోడౌన్‌లో మంటలు చెలరేగి.. భారీ పేలుడు సంభవించింది. దీంతో 11 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలు గుర్తించడానికి వీల్లేని విధంగా ఛిద్రమయ్యాయి. ఘటనపై ముఖ్యమంత్రి సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదేసి లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది.
భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ ఫ్యాక్టరీ
ఉదయం పదకొండు గంటలు.. భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ ఫ్యాక్టరీలో రోజులానే పనిలోకి దిగిన పాతిక మంది కార్మికులు ఒక్క సారిగా చెలరేగిన మంటలు.. ఆ వెంటనే పేలిపోయిన బాణసంచా..పేలుడు ధాటికి 12 మంది మృతి.. ఛిద్రమైన కార్మికుల మృతదేహాలు..వరంగల్‌ జిల్లా కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్‌ వర్స్క్ గోడౌన్‌లో బుధవారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పన్నెండు మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో పాతిక మంది వరకూ కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి.. వెన్వెంటనే పేలుడు సంభవించడంతో.. దగ్గర్లోనే ఉన్న కార్మికులు ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో.. అగ్నికి ఆహుతయ్యారు. ఘటనాస్థలిలోనే పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు ఛిద్రమై.. గుర్తుపట్టడానికి వీల్లేకుండా మారాయి.
స్థానికులు తీవ్ర భయాందోళన 
భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ గోడౌన్‌లో ప్రమాదం గురించి తెలియగానే.. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అసలు విషయం తెలియగానే.. ఘటనాస్థలికి వెళ్లి.. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదంలో గాయపడ్డవారిని వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గోడౌన్‌లో ప్రమాదం గురించి తెలియగానే.. కార్మికుల కుటుంబ సభ్యులు అక్కడికి తరలి వచ్చారు. తమవారిని కోల్పోయి.. వారు చేసిన రోదనలతో ఆప్రాంతం విషాదమయమైంది.
ప్రమాదం పట్ల కేసీఆర్‌ దిగ్భ్రాంతి
వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.విశ్వనాథర్‌ రవీందర్‌, డీసీపీ, ఏసీపీ తదితరులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాద స్థలాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సందర్శించారు. ఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, సీఎల్పీ నేత జానారెడ్డి తదితరులు ప్రమాదం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదేసి లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

 

దినకరన్‌ వర్గం 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసును విచారించిన కోర్టు

చెన్నై : తమిళనాడులో దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసును కోర్టు విచారించింది. తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేశారు. 23 నుంచి 27 వరకు ప్రతిరోజు ఉదయం 10.30 గంటలకు విచారించాలని కోర్టు నిర్ణయించింది. 

 

18:31 - July 4, 2018

ఖమ్మం : సర్కార్ దావాఖానకు నేను పోను బిడ్డో అన్న రోజులు పోయాయి. కార్పోరేట్ ఆస్పత్రికి దీటుగా ఖమ్మం ప్రభుత్వం ఆస్పత్రిలో వైద్యసేవలు అందిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా మాతా శిశు కేంద్రం నిలుస్తోంది. కేసీఆర్ కిట్ ప్రభావం కూడా పని చేస్తోందని వైద్యులు అంటున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

18:24 - July 4, 2018

విశాఖ : ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ విశాఖలో టీడీపీ ఎంపీలు ఒక్క రోజు దీక్ష చేపట్టారు. తాము విశాఖ రైల్వే జోన్ కోసం పార్లమెంట్ లోపల బయట ఉద్యమాలు చేశామన్నారు. తమ దీక్షలపై విమర్శలు చేస్తున్న వారిపై టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. ప్రత్యేక రైల్వే జోన్ దీక్షకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు.
 

 

18:03 - July 4, 2018

నెల్లూరు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెడు మార్గంలో వెళ్తున్న భార్యను తీరు మార్చుకోవాలని సూచించినా పట్టించుకోకపోవడంతో ఇంటికి నిప్పుపెట్టి సజీవ దహనం చేసిన ఘటన  ముత్తుకూరు మండలం కొల్లమిట్టలో చోటు చేసుకుంది. నరేంద్ర ప్రతిరోజు పనుల వెళ్లిన తర్వాత భార్య కవిత వేరే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. నరేంద్రకు విషయం తెలిసి... తీరు మార్చుకోవాలని మందలించాడు. అయితే ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. ఈరోజు మళ్లీ ప్రియుడు శ్రీనుతో కవిత కలిసి ఉండడాన్ని తట్టుకోలేకపోయిన నరేంద్ర.... గుడిసెకు తాళం పెట్టి నిప్పంటించాడు. దీంతో కవిత, శ్రీనులిద్దరూ మంటల్లో సజీవ దహనమయ్యారు. మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్‌, పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

17:49 - July 4, 2018

ఢిల్లీ : ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే అధికారం ఉంటుందని, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆప్ స్వాగతించింది. ఇది చారిత్రాత్మక విజయమని డిప్యూటి సిఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా ఎల్జీ అడ్డుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు తమకు ఎంతో ఊరట నిచ్చిందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజలే సుప్రీమ్‌ అని చెప్పిన సుప్రీంకోర్టుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే అధికారం ఉంటుందని ఎల్జీకి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఉండవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని మనీష్‌ సిసోడియా పేర్కొన్నారు.

17:46 - July 4, 2018

విడాకులు తీసుకునే వారికి సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతుంది. ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు ? ఇదే నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భార్యభర్తలకు ఈగో ప్రాబ్లమ్స్, అసహనం, అనుభవ రాహిత్యం, వైవాహికేతర సంబంధాలు, భర్త భార్యను, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం, వరకట్న వేధింపులు, అదనపు వరకట్నం వేధింపులతో విడాకులు తీసుకుంటున్నారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:38 - July 4, 2018

వరంగల్‌ అర్బన్‌ : కోటిలింగాలలోని  భద్రకాళి బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా తయారు చేస్తుండగా  ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి.  మృతుల సంఖ్య పెరగవచ్చని అనుమానిస్తున్నారు.  మరోవైపు పేలుడులో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...
 

16:59 - July 4, 2018

ఢిల్లీ : భారతదేశంలో వివాహ వ్యవస్థకు చాలా ప్రాముఖ్యత వుంది. మిగిలిన దేశాల వివాహ వ్యవస్థ, సంస్కృతులు, సంప్రదాయాలకు భారతీయ వివాహ వ్యవస్థకు చాలా తేడా వుంటుంది. దేశ సంస్కృతి.. సంప్రదాయాలకు అనుగుణంగా ఆయా పద్ధతుల్లో వివాహాలు జరుగతుంటాయి. వివాహం ఎలా జరిగినా..వివాహ సమయంలో ఖర్చులు మాత్రం గత కొంతకాలంగా విపరీతంగా ఖర్చు కావటం సర్వ సాధారణంగా మారిపోయింది. సంపన్నులు కోట్లు ఖర్చు పెడుతుంటే..సామాన్యుడు కూడా తానేమీ తక్కువకాదని అప్పులు చేసి మరీ ఆర్భాటపు ఖర్చులు పెడుతున్నాడు. తద్వారా అప్పులపాలయి ఇబ్బందులకు లోనవుతున్నా పరిస్థితులకు నెట్టబడుతున్నారు సామాన్యులు. కానీ ఇకపై వివాహాలకు ఇష్టమొచ్చినట్లుగా ఖర్చులు చేసేందుకు వీలులేదంటోంది కేంద్రప్రభుత్వం.

పెళ్లి ఖర్చులు..సబ్ రిజిస్ట్రార్ కు సమర్పించాలంటున్న కేంద్రం
పెళ్లి చేస్తే, వధూవరుల తరఫున ఎంత ఖర్చయిందన్న విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ కు సమర్పించాల్సిందేనన్న కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పరిశీలించనుంది. సంబంధిత ప్రభుత్వ అధికారికి ఖర్చుల విషయమై అఫిడవిట్ ఇవ్వాలా? అక్కర్లేదా? అన్న విషయాన్ని తేల్చేందుకు జస్టిస్‌ ఆదర్శ్‌ గోయెల్‌, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ ల ధర్మాసనం ముందుకు కదిలింది. ఈ మేరకు బెంచ్ కు సాయపడాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నర్సిహను బెంచ్ కోరింది.

వివాహాన్ని రిజిస్టర్ కు పెళ్లి ఖర్చుల వివరాలు చెప్పాలి..
ఇక పెళ్లి తరువాత వివాహాన్ని రిజిస్టర్ చేయించుకునే సమయంలో ఖర్చుల వివరాలు సబ్ రిజిస్ట్రార్ కు చెప్పాలన్న నిబంధన ఇంతవరకూ ఏమీ లేకపోగా, కేంద్ర ప్రభుత్వం ఖర్చుల వివరాలు నమోదు చేసేలా చట్ట సవరణకు ప్రయత్నిస్తోంది. భవిష్యత్తులో కట్న కానుకల విషయంలో విభేదాలు తలెత్తుకుండా చూసేందుకే ఇరు వైపులా ఖర్చు గురించిన వివరాలు ప్రభుత్వానికి చేరితే మంచిదన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఈ విషయాన్ని పరిశీలించడంతో పాటు, పెళ్లి ఖర్చులో కొంత భాగాన్ని వధువు పేరిట జమ చేయించాలన్న అభ్యర్థనలపైనా విచారిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం తెలిపింది.

16:48 - July 4, 2018

సంగారెడ్డి : ఆర్టీసీ డిపోలో మహిళా ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. డిఎం, సీఐలు తమను వేధిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్న తమను.. ఓటీలు చేయాలంటూ.. మరింత పనిభారం మోపుతున్నారని మహిళా ఉద్యోగులు వాపోతున్నారు. పైగా మహిళా ఉద్యోగుల వల్ల డిపో నష్టాల్లో ఉందంటూ తమను అవమానిస్తున్నారని ఆక్షేపిస్తున్నారు. ముడుపులు తీసుకుని ఓవైపు కర్నాటక బస్సులను ప్రోత్సహిస్తూనే.. తమను కలెక్షన్‌లు పెంచాలంటూ వేధిస్తున్నారని ఆర్టీసీ మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 

16:46 - July 4, 2018

ఢిల్లీ : కేంద్ర, రాష్ర్టాల అధికార పోరుపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.  లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ప్రభుత్వం కలిసికట్టుగా పని చేయాలని,  లెఫ్టినెంట్ గవర్నర్‌ యాంత్రికంగా పని చేయకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. లెఫ్టినెంట్ గవర్నర్‌ ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకోవొద్దని ఆదేశించింది. ఢిల్లీ పాలనలో లెఫ్టినెంట్ గవర్నర్‌ జోక్యంపై ఆప్‌ సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీం ఈ తీర్పును వెలువరించింది. 

 

16:43 - July 4, 2018

హైదరాబాద్‌ : నగరంలో ఆర్టీసీ డ్రైవర్‌ వీరేశం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బర్కత్‌ పురా ఆర్టీసీ డిపో మేనేజర్‌ శంకర్‌ నాయక్‌ వేధింపులు భరించలేక డ్రైవర్‌ ఆత్మహత్యా యత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో.. సికింద్రాబాద్‌ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిపో మేనేజర్‌ తీరుకు నిరసనగా.. బర్కత్‌పురా డిపోలో కార్మికులు విధులు బహిష్కరించారు. నిరసనగా 80 బస్సులను నిలిపేశారు. డిపో మేనేజర్‌ను సస్పెండ్‌ చేయకుంటే రాష్ర్ట వ్యాప్తంగా ఆందోన చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

 

భార్య, ప్రియుడు వుండగా ఇంటికి నిప్పు పెట్టిన భర్త..

నెల్లూరు : ముత్తూకూరు మండలం కొల్లమిట్టలో దారుణం చోటుచేసుకుంది. వివాహేత సంబంధం పెట్టుకున్న భార్యను భర్త కడతేర్చాడు. ప్రియుడితో కలిసి వున్న సమయంలో భర్త నరేంద్ర ఇంటికి నిప్పు పెట్టాడు. దీంతో మంటలు వ్యాపించటంతో భార్య కవతి, ప్రియుడు శ్రీను సజీవదహనమయ్యారు. ఇంటికి నిప్పంటిన నరేంద్ర పరారీలో వున్నట్లుగా సమాచారం. 

16:36 - July 4, 2018

 వరంగల్‌ అర్బన్‌ : కోటిలింగాలలోని భద్రకాళి బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా తయారు చేస్తుండగా  ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 15 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలయ్యాయి.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.  

 

16:35 - July 4, 2018

ఢిల్లీ : ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. వరి ధాన్యం మద్దతు ధరను ఒకటిన్నర రెట్లు పెంచింది. ఇతర పంటలకు 50 శాతం మద్దతు ధర పెంచాలని నిర్ణయించింది. 

 

14:40 - July 4, 2018

దేశం మనదే.. జాతీ మనదే.. ఎగురుతున్న జెండా మనదే.. అంటూ ప్రతి భారతీయుడు గర్వంగా ఎగురవేసే జాతీయజెండా రూపశిల్పి తెలుగువాడు కావటం తెలుగువారంతా గర్వించతగ్గ విషయం. ఎంతోమంది స్వాతంత్ర్య సమయంలో పాల్గొని తమ ప్రాణాలను అర్పించారు. వారందరి త్యాగాల ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్య ఫలితాలు. ఎంతో మంది స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నా కొందరు మాత్రమే చరిత్రలో ఆచంద్ర తారార్కం నిలిచిపోతారు. మనకు దేశం వుంది. స్వాతంత్ర్యం లేదు. కానీ బ్రిటీస్ వారితో పోరాడాం. గెలిచాం. నిలిచాం. కానీ ఇది మన భారతదేశం అని చెప్పుకునేందుకు ఓ పతాకం కావాలి. దాంతోనే మన ఉనికిని, శక్తిని, సత్తాను, పోరాటపటిమను చాటుకోవాలి. మరి భారతదేశం శక్తి సామర్థ్యాలను, యుక్తులను,సమయస్ఫూర్తి, పోరాటపటిమను ఎలుగెత్తి చాటేందుకు ఓ ఆయుధం కావాలి..ఆ ఆయుధం తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించాలి. భారతీయు త్యాగనిరతికి, దేశభక్తిని చాటి చెప్పాలి. అలాగే ఆ శక్తి భారతదేశపు ఔన్నత్యాన్ని, భరతఖండపు భావజాలాన్ని..అభిప్రాయాలను..దేశపు ప్రతినిథిగా నిలిచేలా వుండాలి..ఈ ఆలోచనలను నుండి ఉద్భవించిందే మన మువ్వన్నెల జాతీయ జెండా..

బ్రిటీష్ జెండా చూసి కలత చెంది త్రివర్ణ పతాయాన్ని రూపొందించిన పింగళి
భారత దేశ కార్యాలయాలపై బ్రిటీష్‌ ప్రభుత్వ జెండాలు ఎగురవేయడంపై కలత చెంది మనకు ఒక జాతీయ జెండా ఉండాలని మన జాతిపిత గాంధీజీ కోరుకున్నారు. ఆయన ఆలోచనలకు ఊతమిస్తూ గాంధీజీ పతాక రూపకల్పన చేయాల్సిందిగా పింగళిని కోరారు. ఎన్నో ఆలోచనలను..మేధో మధనం తరువాత మన మువ్వన్నెల పతాకానికి తుది రూపునిచ్చారు మన పింగళి వెంకయ్యగారు. అదే మన జాతీయ జెండా...పలువురి సూచనలు సలహాల మేరకు నేడు మనం వందనం చేసే జాతీయ జెండా రూపొందింది.

మొవ్వ మండలం భట్లపెనుమర్రులో జన్మించిన భరతజాతి రత్నం...
స్వాతంత్య్రం రాకముందు భారతదేశంలోని కార్యాలయాలపై బ్రిటీష్‌ దేశ యూనియన్‌ జాక్‌ జెండాలు ఎగురవేస్తుండేవారు. వీటిని చూసి జాతీయోద్యమకారులు కలత చెందేవారు...రగిలిపోయేవారు...వాటిని చూస్తే చాలు తెల్లవారి పెత్తనం గుర్తుకు వచ్చి పిడికిళ్లు బిగుసుకునేవి..వారిని పారద్రోలాలని రగిలిపోయేవారు. కానీ పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల పతాకం చూసిన తరువాత ప్రతీ భారతీయుడు గుండెల్లోను దేశభక్తి తాండవించింది. ప్రతీ ఒక్కరూ భరతమాత సంకెళ్లు తెంచి స్వేచ్ఛా వాయుడు అందించాలని పూనుకున్నారు. ఇదంతా జెండాకు వున్న శక్తి. ఇది మనదేశానికి చెందిన చిహ్నం..అంటే ఈ దేశం మనది..ఈ జెండా మనది..అనే భావన రేకెత్తించింది మన జాతీయ జెండా..పింగళి రూపొందించిన మువ్వన్నెల జెండాను స్వాతంత్ర్యం అనంతరం భారత రాజ్యాంగం ఆమోదించింది. పింగళి వెంకయ్య రూపొందించిన ఆ జాతీయ పతాక నేడు రెపరెపలాడుతోంది. ఇలా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య అందరి హృదయాలలో చెరగని ముద్ర వేశారు.

పింగళి హనుమంతరాయుడు,వెంకటరత్నమ్మల బిడ్డ మన పింగళి
జిల్లాలోని మొవ్వ మండలం భట్లపెనుమర్రు లో 1878 ఆగస్టు 2న పింగళి హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు పింగళి వెంకయ్య జన్మించారు. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య పూర్తి చేసి..19వ సంవత్సరంలోనే దక్షిణాఫ్రికా వెళ్ళారు. అక్కడ జరుగుతున్న బోయర్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. అక్కడే గాంధీ మహాత్మునితో పింగళికి పరిచయం ఏర్పడింది. గాంధీజీ నిర్వహించిన సత్యాగ్రహ ఉద్యమంలో పింగళి పాల్గొన్నారు. నల్లవారి హక్కుల కోసం గాంధీ జరిపిన పోరాటం వెంకయ్య మనస్సులో నాటుకుపోయింది.

పలు భాషలపై పింగళి అధ్యయనం
భారత దేశానికి తిరిగి వచ్చిన వెంకయ్య కొంతకాలం మద్రాసులో ప్లేగు వ్యాధి నిరోధక అధికారిగా పనిచేశారు. చదువుకోవాలనే కోరికతో కొలంబోలో అర్ధశాస్త్రం చదివారు. అక్కడే సంస్కృతం, ఉర్దూ భాషలపై పట్టు సాధించమేకాక లాహోర్‌లో జపనీస్‌ నేర్చుకుంటున్న తరుణంలో ఆంధ్రజాతీయ కళాశాల వ్యవస్థాపకుడు కోపల్లె హనుమంతరావుతో మొదటి పరిచయం ఏర్పడింది.

1911 నుంచి ఏజే కళాశాల లెక్చరర్‌గా...
పింగళి వెంకయ్యకు కోపల్లె హనుమంతరావు జాతీయ భావాలు నచ్చాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పింగళి హనుమంతరావు కోరిక మేరకు కాలేజ్ లెక్చరర్ గా చేరి విద్యార్థులకు వ్యవసాయ రంగంలో మెలకువలు నేర్పించి విద్యార్థులతో పలు వ్యవసాయ పరిశోధనలు చేయించేవారు. అంతేకాదు విద్యార్థులకు భారతదేశ చరిత్రపై పాఠాలు చెప్పటం..జాతీయ భావాలు నూరిపోస్తుండటమేకా గుర్రపుస్వారి, వ్యాయామం నేర్పించేవారు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది విద్యార్థులు పింగళి ఉపన్యాసాలకు ప్రభావితులై జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు.

జాతీయ పతాకానికి పలు మార్పులు చేర్పులు..
1916లో లక్నోలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. 1919లో జలంధర్‌ వాస్తవ్యులైన లాలాహన్స్‌ రాజ్‌ జాతీయ పతాకంపై ఏదైనా గుర్తు ఉంటే బాగుంటుందని సూచనకు గాంధీజీ అంగీకరించారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాలు బెజవాడలో జరిగిన సమావేశాలకు పింగళి వెంకయ్యను గాంధీజీ ఆహ్వానించారు. జాతీయ జెండాలో కాషాయ, ఆకుపచ్చ రంగుల మధ్య రాట్నం చిత్రించమని సూచించారు. ఆయన సూచన మేరకు పింగళి వెంకయ్య మార్పు చేశారు. అనంతరం వచ్చిన ఆలోచనల ప్రకారం సత్యం, అహింసలకు ప్రత్యేక నిదర్శనమైన తెలుపురంగు ఉండాలని గాంధీజీ వెలిబుచ్చిన అభిప్రాయం మేరకు వెంకయ్య ఆ వర్ణాన్ని జోడించి త్రివర్ణపతకాన్ని రూపొందించారు.

త్రివర్ణపతాకంలో రాట్నంకు బదులు ఆశోకుని ధర్మ చక్రం సూచన
స్వాతంత్య్రం అనంతరం 1947 జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూజాతీయ జెండాపై ఒక తీర్మానం చేస్తూ త్రివర్ణపతాకంలో రాట్నంకు బదులు ఆశోకుని ధర్మ చక్రం ఉంచాలని తీర్మానించారు. ఆ మేరకు జాతీయ జెండాలో రాట్నంకు బదులు అశోకచక్రం ఏర్పడింది. కాషాయ రంగు త్యాగానికి, తెలుపు రంగు పవిత్రతకు, ఆకుపచ్చ రంగు విశ్వాసానికి, శౌర్యానికి ప్రతీకగా నిలిచాయి. సార్‌నాధ్‌ స్థూపంలోని అశోకుని ధర్మచక్రం భారతీయులు ధర్మమార్గాన పయనించాలని సందేశం ఇస్తోంది. ఇంత గొప్ప జాతీయ పతాకాన్ని దేశానికి అందించిన ఘనత మన తెలుగు నేత అని చెప్పుకోవటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈరోజు మన భరతజాతి రత్నం..ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా జాతీయ జెండా ఇచ్చిన ఆ గొప్ప మేధావికి..భరతజాతి యావత్తు వందనం..అభివందనం చేస్తోంది.

భారీ పేలుడు..తునాతునకలుగా మృతదేహాలు!!..

వరంగల్ : భద్రకాళి ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జరిగిన పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలుగా ఎగిరిపడ్డాయి. బాణసంచా తయారుచేస్తుండగా మంటలు భారీగా ఎగిరిపడ్డాయి. దీంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు తీవ్రంగా భయాందోళనలకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదంలో 15మంది బాణసంచా కార్మికులు మృతి చెందారు. 

వరి ధాన్యం మద్దతు ధర పెంచుతు కేంద్రం నిర్ణయం..

ఢిల్లీ : రైతన్నలకు కేంద్రం ప్రభుత్వం శుభవార్తనందించింది. వరి ధాన్యానికి ఒకటిన్నర రెట్లు ధరను పెంచుతు కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇతర పంటలకు కూడా 50 శాతం మద్దతు ధర పెంచాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఏడాదికి సుమారు రూ.15వేల కోట్ల వెచ్చించామని కేంద్రం తెలిపింది. 

ఏపీకి కేంద్రం తీరని అన్యాయం..సుప్రీంకోర్టులో తేల్చేసింది

ఢిల్లీ : ఏపీకి తీరని అన్యాయం చేస్తున్న కేంద్రం ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం దీసుకుంది. సుప్రీంకోర్టులో మరో వివాదాస్పద అఫిడవిట్ ను కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసింది. ఏపీకి ఇస్తామన్న విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేసేసామని పొంగులేటి కౌంటర్ అఫిడవిట్ లో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం అధికారికంగా తేల్చి చెప్పేసింది. రాజ్యసభలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన విభజన హామీలను అమలు చేయలేమని తేల్చేసింది. ఈ అఫిడవిట్ లో విశాఖ రైల్వే జోన్ విషయంపై ఎటువంటి అంశం పేర్కొనలేదు.

13:01 - July 4, 2018
13:00 - July 4, 2018

విజయవాడ : బీజేపీతో సంబంధాలపై సీఎం చంద్రబాబు నాయుడు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని వైసీపీ నేత పార్థసారధి విమర్శించారు. కమళనాథులతో తెగదెంపులు చేసుకున్నట్లు బయటకు చెబుతూ లోపాయికారి ఒప్పందాలు చేసుకొంటోందని పేర్కొన్నారు. ప్రజలు శాశ్వతంగా బాబును ఇంటికి పంపిస్తారని, బాబు మోసాలకు...దాష్టీకాలకు చరమగీతం పాడాల్సిన రోజు వచ్చిందన్నారు.

 

12:36 - July 4, 2018

గొడ్డలితో సైకో వీరంగం..పలువురికి గాయాలు..

కొమురం భీం : అసిఫాబాద్ జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. గొడ్డలి చేతపట్టి పలువురిపై దాడికి దిగాడు. దాడిలో ఓ కుటుంబం గాయాలపాలయ్యింది. పాలెగూడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరైనా సరే తను చెప్పిందే చేయాలని బెదిరిస్తు గొడ్డలితో ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో లేదో తెలుసుకునేలోగా వారిపై గొడ్డలితో దాడికి దిగి వారిని చితకబాదాడు. ఈ ఘటనలో గ్రామస్థులంతా భయాందోళనలకు గురవుతున్నారు. అడ్డుకున్న గ్రామ పెద్దలపై మారణాయుధాలతో దాడికి యత్నించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనాస్థలికి చేరుకుని సైకోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సుప్రీం తీర్పు ప్రజల విజయం : కేజ్రీవాల్

ఢిల్లీ : సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య నెలకొన్న వివాదంతో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. సుప్రీం తీర్పుపై సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది ఢిల్లీ ప్రజలు సాధించిన విజయమని..ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. కేజ్రీవాల్ కు పాలనా పరంగా మరింత స్వేచ్ఛను ఇచ్చేలా తీర్పును వెలవరించింది. లెఫ్ట్ నెంట్ పాత్ర పరిమితమేనని..పెత్తనం చెలాయించేందుకు గవర్నర్ కాదనీ గవర్నర్ కు సుప్రీంకోర్టు చురకలేసింది. 

12:12 - July 4, 2018

వరంగల్ : జిల్లాలోని బాణసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్ ఆర్ నగర్ లో భద్రకాళి ఫైర్ వర్క్స్ కర్మాగారం ఉంది. బుధవారం ఉదయం బాణాసంచా తయారు చేస్తుండగా భారీగా మంటలు చెలరేగాయి. భారీగా టపాసులు తగలబడ్డాయి. దీనితో ముగ్గురు కార్మికులు సజీవదహనం కాగా మరికొంతమంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు. 12 మంది కార్మికులు పనులు చేస్తున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. 

 

12:09 - July 4, 2018

టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది వారసులు హల్ చల్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ వారసుడి ఎంట్రీ కోసం ఎప్పటి నుండో ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతున్నండగా తాతగారి బయోపిక్ ద్వారా నందమూరి వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. అందరు సినిమా క్లైమాక్స్ లో అద్బుతమైన ఎంట్రీతో అలరించిన అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా ఇప్పటికే రెండు సినిమాలు చేసాడు. మరి బాలయ్య వారసుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి..

యంగ్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞ..
క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో యంగ్ ఎన్టీఆర్ గా శర్వానంద్ కనిపించే అవకాశం వున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. యంగ్ ఎన్టీఆర్ గా మోక్షజ్ఞ కనిపిస్తేనే నందమూరి అభిమానులు సంతృప్తి చెందుతారని బాలకృష్ణతో క్రిష్ చెప్పారట.

బాలయ్య ఆమోదంతో సింగపూర్ కు మోక్షజ్ఞ
ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే బాగుటుందని భావించిన బాలకృష్ణ .. అందుకు మోక్షజ్ఞను సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. మోక్షజ్ఞ కాస్త బొద్దుగా ఉంటాడు .. ఈ సినిమాలో పాత్ర కోసం ఆయన కాస్త సన్నబడితే బాగుటుందని క్రిష్ సూచించాడని చెబుతున్నారు. దాంతో తన పోర్షన్ షూటింగ్ సమయానికి సన్నబడి ఫిట్ నెస్ ను సాధించడం కోసం మోక్షజ్ఞ సింగపూర్ వెళ్లాడని అంటున్నారు. ఈ సినిమాలో హరికృష్ణ .. కల్యాణ్ రామ్ కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.   

11:52 - July 4, 2018

యాత్రలో ఆచూకీ లేని తెలుగు దంపతులు

జమ్ము కశ్మీర్ : అమర్ నాథ్ యాత్రలో భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. భారీ వర్షాలు అననుకూల వాతావరణ పరిస్థితుల్లో చిక్కుకుని ఆహారపానీయాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు అస్వస్థతకు గురి మృతి చెందగా అనంతపురం నగరానకి చెందిన శ్రీనేత్ర ఆసుపత్రి డైరెక్టర్ కేదార్ నాథ్ం ఆయన భార్య స్వరాజ్య లక్ష్మి ఎక్కడున్నారన్న ఆచూకీ తెలియడం లేదు. దాదాపు 1500 మంది మంచుకొండల్లో చిక్కుకున్నట్టు తెలుస్తుండటంతో సైన్యం రంగంలోకి దిగింది.

గ్రంథి సుబ్బారావు డెడ్ బాడీ తరలింపుకు యత్నాలు..

జమ్ము కశ్మీర్: అమరనాథుడిని, కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని వెళ్లిన భక్తులకు తీవ్ర కష్టాల్లో పడ్డారు. భారీ వర్షాలు, అనుకూలించని వాతావరణంతో బేస్ క్యాంపుల్లోనే చిక్కుపోయి, వేలాది మంది ఎటూ కదల్లేక అవస్థలు పడుతుండగా, వివిధ కారణాలతో పలువురు మరణించారు. వీరిలో ఐదుగురి తెలుగువారు కూడా ఉండగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఏపీ భవన్ ఓఎస్డీ తేలప్రోలు శ్రీనివాస్ నేపాల్ గంజ్ కు బయలుదేరారు.

11:30 - July 4, 2018

కొమరం భీం : సాలెంగూడ గ్రామం భయపడుతోంది. ఓ వ్యక్తి హల్ చల్ తో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చేతిలో గొడ్డలి పట్టుకుని భయపెడుతున్నాడు. తాను చెప్పినట్లు నడుచుకోవాలని..లేనిపక్షంలో గొడ్డలితో నరికేస్తానంటూ హెచ్చరిస్తున్నాడు. ఆదివారం ఓ కుటుంబ సభ్యులపై దాడి చేశారు. గ్రామ పెద్దలపై కూడా దాడికి యత్నించాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బెదిరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

11:15 - July 4, 2018

హైదరాబాద్ : ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. మేనేజర్ వేధింపులకు తట్టుకోలేక డ్రైవర్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న డ్రైవర్లు బర్కత్ పురా ఆర్టీసీ డిపో గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. వెంటనే డీఎంను అరెస్టు చేయాలని...చర్యలు తీసుకోవాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బర్కత్ పురా డిపోలో ఆర్టీసీ డ్రైవర్ గా వీరేశం విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ డిపో మేనేజర్ గా శంకర్ ఉన్నారు. కానీ వీరేశం విధులకు గైర్హాజర్ అయ్యాడని పేర్కొంటూ రెండు సంవత్సరాల క్రితం ఇంక్రిమెంట్ లను కట్ చేయడం...డిపో మేనేజర్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దీనిపై వీరేశం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం బంధువు చనిపోవడంతో వీరేశం విధులకు మళ్లీ గైర్హాజరయ్యారు. తాను విధులకు హాజరు కావడం లేదని ఉన్నతాధికారులకు తెలియచేసినట్లు సమాచారం. కానీ వీరేశంపై డిపో మేనేజర్ శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపైనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తావా ? షోకాజ్ నోటీసు జారీ చేసి రిమూవ్ చేస్తానని హెచ్చరించడంతో శంకర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. కార్యాలయం ఎదుట విషం తీసుకున్నాడు. తార్నాకా ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న తోటి డ్రైవర్లు బస్సులను నిలిపివేశారు. గేటు ఎదుట ధర్నా చేశారు. పలు రూట్లలో సర్వే చేయించాలి..ఛార్జీషీట్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

11:11 - July 4, 2018

ఢిల్లీ : రాష్ట్రంలో లెఫ్టినెంట్ గవర్నర్..ఆప్ ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేయాలని సుప్రీం పేర్కొంది. కేంద్ర, రాష్ట్రాల అధికార పోరుపై...పాలనలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యంపై సుప్రీం కోర్టును ఆప్ ఆశ్రయించింది. కాసేపటి క్రితం చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ వెలువరించింది.

2015 ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండి పాలనలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని ఆప్ పేర్కొంటూ వస్తోంది. 2016లో హైకోర్టును ఆప్ ఆశ్రయించింది. కేంద్ర, రాపోలీసుల నియామకాలు..ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలు తీసుకుంటుంటే...లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకంటూ పాలనను అడ్డుకుంటున్నారని ఆప్ పేర్కొంటోంది. కేంద్రం చేతిలో లెఫ్టినెంట్ గవర్నర్ కీలుబొమ్మగా మారిపోయారని ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ సుప్రీంని ఆశ్రయించింది. లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రంగా ఎలాంటి అధికారాలు ఉండవని..యాంత్రికంగా పనిచేయవద్దని సూచించింది. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా ఉండవద్దని..గుడ్డిగా నిర్ణయాలు తీసుకోవద్దని పేర్కొనడం గమనార్హం. 

గవర్నర్, ప్రభుత్వం కలిసి పనిచేయాలి : సుప్రీంకోర్టు

ఢిల్లీ : కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై కాసేపట్లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం తీర్పు నిచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ యాంత్రికంగా పరిచేయకూడదని..గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీం లెఫ్టినెంట్ గవర్నర్ కు చురకలు వేసింది. గవర్నర్, ప్రభుత్వ కలిసికట్టుగా పనిచేయాలని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పునిచ్చింది. కాగా ఢిల్లీ పాలనలో లెఫ్ట్ నెంట గవర్నర్ జోక్యంపై సుప్రీంకోర్టును ఆప్ పార్టీ ఆశ్రయించింది.

11:00 - July 4, 2018

మధ్యప్రదేశ్ :    ఇళ్లు అద్దెకిస్తాం..షాప్స్ అద్దెకిస్తాం..కార్యాలయాలు అద్దెకిస్తాం..ఇలా వస్తువులు..ఆస్తులు వంటివి అద్దెకివ్వటం మనం చూస్తుంటాం..వింటుంటాం. కానీ మనుష్యులను అందులోని మహిళలను అద్దెకివ్వటం అనే అమానవీయ సంఘటనలు కూడా సభ్య సమాజంలో చోటుచేసుకుంటున్న దుస్థితి గురించి వింటేనే ఒళ్లు గగ్గుర్పొడిచేలా చేస్తున్నాయి.

ఈ పరిస్థితులకు కారణమేమిటి?..
పశువులను విక్రయిస్తున్నట్లుగా..అద్దెకిస్తున్నట్లుగా కొనసాగుతున్న ఈ అమానవీయ పరిస్థితులకు కారణం ఏమిటి? ఎవరు కారణం? పాలకులా? సమాజమా? పేదరికమా? జల్సాలకు అలవాటు పడుతున్న వైనమా? డబ్బు కోసం దేనికైనా దిగజారే అమానవీయతా? లేక ఏ దారీ లేక కుటుంబం కోసం కొనసాగుతున్న బలిదానమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? ఈ పరిస్థితులకు బాధ్యులెవరు? అనే ప్రశ్నలు ఉద్భవించకమానవు. పరిస్థితులు ఏవైనా బలి పశువుగా మారేది మాత్రం మహిళలే అనే వాస్తవం మరోసారి ఇటువంటి పరిస్థితుల ద్వారా, ఘటనల ద్వారా బైటపడింది.

చరిత్రలో గ్వాలియర్ ప్రసిద్ధి..
దక్షిణాన 122 కి.మీ. దూరానవున్నది. భారత్‌లోని అత్యధిక జనాభాగల నగరాలలో దీని స్థానం 46వది. ఇంతి జనాభా కలిగిన నగరం గ్వాలియర్. స్వాతంత్ర్య సమరం జరుగుతున్న సమయంలో గ్వాలియర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఝాన్సీ బ్రిటిష్ పరం అయ్యాక ఝాన్సీ లక్ష్మీభాయి గ్వాలియర్ కోటలో ఆశ్రయం కోరాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి భయపడి గ్వాలియర్ రాజు రాణిభాయికి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించాడు. అయినప్పటికీ సైన్యం రాణిభాయి మీద గౌరవంతో కోటలో ఆశ్రయం ఇవ్వడానికి మద్దతు తెలిపారు. ఏమాత్రం ఎదిరింపు లేకుండా రాణిభాయి కోటలో ప్రవేశింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాణిభాయి కొరకు గ్వాలియర్ కోటమీద దాడి చేసింది. ఝాన్సీరాణి అపారమైన బ్రిటిష్ సైన్యంతో తన స్వల్పసైన్యం సాయంతో అత్యంత సాహసోపేతంగా పోరాడి చరిత్రలో నిలిచిపోయింది. గ్వాలియర్ కోట బ్రిటిష్ స్వాధీనం చేసుకుంది. ఆనాటి మరపురాని చారిత్రక సంఘటనకు గ్వాలియర్ కోట సాక్ష్యంగా నిలబడింది. ఇంతటి చరిత్ర కలిగిన గ్వాలియర్ లో ఇటువంటి అమానవీయ ఘటనలకు భారత దేశ చరిత్రకు..వివాహ వ్యవస్థకు మాయని మచ్చను కలిగిస్తున్నాయి.

గ్వాలియర్ లో బైటపడిన అమానవీయత..
మధ్యప్రదేశ్‌ లో తాజాగా వెలుగు చూసిన విషయాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. విషయం తెలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. గ్వాలియర్ డివిజన్‌లో పలువురు పురుషులు తమ భార్యలను సంపన్నులకు అద్దెకిస్తున్న విషయం తెలిసి సభ్యసమాచారం ఒక్కసారిగా నివ్వెరపోయింది.

విలాస వస్తువుగా మారుతున్న ఆడపుట్టుక..
ఆడ పుట్టుక ఓ విలాస వస్తువుగా మారబడుతున్న క్రమంలో మానవ విలువలు పాతరేయబతున్నాయి. వస్తువులను అద్దెకు తెచ్చుకున్నట్లుగా మహిళలను అద్దెకు తెచ్చుకుని వారి అవసరాలకు వాడుకుంటున్న ఘటనలు సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇదేనా మహిళలకు ఇచ్చే విలువ అనే ప్రశ్నిస్తున్నాయి. కానీ వారికి మాత్రం ఎన్నటికీ సమాధానం దొరకని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి.

సంపన్నులకు భార్యలను అద్దెకిస్తున్న ప్రబుద్ధులు..
సంపన్న కుటుంబాలకు చెందిన అవివాహితులు, భార్యలను కోల్పోయిన వారికి శివపురి జిల్లాలోని భర్తలు తమ భార్యలను రోజు, నెల వారీ, ఏడాది పద్ధతిలో అద్దెకు ఇస్తున్నారు. స్టాంప్‌ పేపర్‌పై రాసుకుని మరీ ఒప్పందాలు కుదర్చుకుంటుండడం విశేషం. ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఆ మహిళతో సంబంధాన్ని కోరుకుంటే ఆ ఒప్పందం పునరుద్ధరిస్తారు. గతంలో గుజరాత్‌లోనూ ఇటువంటి ఉదంతాలు వెలుగు చూశాయి. ఓ వ్యక్తి తన భార్యను నెలకు రూ. 8 వేలకు మరో వ్యక్తికి అద్దెకివ్వడం అప్పట్లో సంచలనమైంది.

పెళ్లి పేరుతో శ్రుతి మించుతున్న అరాచకాలు..
మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో పెళ్లి పేరుతో జరుగుతున్న అరాచకాలు ఇటీవల శ్రుతి మించాయి. గిరిజన బాలికలపై కన్నేసిన బ్రోకర్లు వారికి పెళ్లిళ్లు చేస్తామని, చక్కని వరుడు ఉన్నాడని వారి తల్లిదండ్రులను ఒప్పిస్తారు. అబ్బాయి నుంచి వేలాది రూపాయలు తీసుకుని కొంత మొత్తాన్ని అమ్మాయి తల్లిదండ్రుల చేతుల్లో పెడతారు. నిజానికి ఇవి పెళ్లిళ్లు ఎంతమాత్రమూ కాదు. పెళ్లి పేరుతో జరుగుతున్న విక్రయాలు మాత్రమే. ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్న ఈ అరాచకాలు విస్మయపరుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. 

ఆడపుట్టుకపై అరాచకాలు..
కడుపులో వుండగానే ఆడపుట్టుకని చిదిమేస్తున్న వైనం ఒకవైపు. పుట్టిన తరువాత బతికేందుకు..మనుగడ సాగించేందుకు..ఉనికి నిలుపుకునేందుకు..వ్యక్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇలా ప్రతి క్షణం ఆడపుట్టుక పోరాటం చేస్తునే వుంది. వీటి మధ్య ఎన్నో వేధింపులు, హింసలు, అరాచకాలు..దాడులు..హత్యలు..ఆంక్షలు..అక్రమ రవాణా..పండంటి బతుకులను బుగ్గిపాలు చేస్తు పడుపు వృత్తుల్లోకి నెట్టబడుతున్న అఘాయిత్యాలు.. ఇలా చెప్పుకుంటు పోతే ఈ భూగోళం కూడా సరిపోదేమో. వీటికి తోడు మహిళలను బలి పశువులుగా మార్చేస్తు..ప్రాణం లేని,చలనం లేని వస్తువులను విక్రయిస్తున్నట్లుగా..అద్దెకిస్తున్నట్లుగా రోజుకు, వారానికి, నెలకు,సంవత్సరానికి భార్యలను అద్దెకిస్తున్న దౌర్భాగ్యపు పరిస్థితుల పట్ల పాలకులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవుసరముంది. మహిళ ఓట్లపై గెలిచి మహిళ మానాభిమానాలతో వ్యాపారం చేస్తున్న ప్రభుత్వాలు ఈ దౌర్భాగ్యపు దుస్థితికి సమాధానం చెప్పాలి..చెప్పి తీరాలి. దీనికి సమాజం కూడా బాధ్యత వహించాల్సిన అవుసరం కూడా ఎంతైనా వుంది. 

కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై సుప్రీం తీర్పుపై ఉత్కంఠ..

ఢిల్లీ : కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై కాసేపట్లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం తీర్పు ఇవ్వనుంది. ఢిల్లీ పాలనలో లెఫ్ట్ నెంట గవర్నర్ జోక్యంపై సుప్రీంకోర్టును ఆప్ పార్టీ ఆశ్రయించింది.ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై కాసేపట్లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం తీర్పు ఇవ్వనుంది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పును వెలవరించనుంది. ఢిల్లీ పాలక కేబినెట్ నిర్ణయాలను లెఫ్ట్ నెంట్ గవర్నర్ వ్యతిరేకిస్తున్న క్రమంలో ఢిల్లీ ప్రభుత్వానికి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని కేంద్రం పేర్కొంది.

మేనేజర్ వేధింపులు..ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్ : ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం కలకలం సృష్టించింది. బర్కత్ పురా డిపో మేనేజర్ వేధిపులకు పాల్పడుతున్నాడనే మనస్తాపంతో డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. అతని పరిస్థితి విషమంగా వుండటంతో సమీపంలోని యశోద ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. డిపో మేనేజర్ వేధింపులకు నిరసనగా ఆర్టీసీ బస్సులను నిలిపివేసి సిబ్బంది ఆందోళన చేపట్టారు. 

10:14 - July 4, 2018

 

విశాఖపట్టణం : మొన్నటి దాక 'ప్రత్యేక హోదా' కోసం దీక్షలు..నిన్న కడప ఉక్కు పరిశ్రమ కోసం...నేడు విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కోసం దీక్షలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీ, అధికార పార్టీ టిడిపికి చెందిన నేతలు ఈ దీక్షలు చేస్తుండడం గమనార్హం. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలంటూ ఎంపీలు ఒక రోజు దీక్ష చేస్తున్నారు. కాన్వెంట్ జంక్షన్ వద్ద దీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 నుండి సాయంత్రం 5గంటల వరకు ఈ దీక్షలు చేయనున్నారు. ఇందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. టిడిపి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, టిడిపి విశాఖ ఎమ్మెల్యేలు ఈ దీక్షలో పాల్గొననున్నారు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు పరీక్షలు రాసేందుకు ఒడిశా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని...ప్రాంతీయ వివక్షతో తెలుగు అభ్యర్థులను ఒడిశా వాసులు అడ్డుకుంటున్నారని, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు అని సమస్యలకు పరిష్కారమని టిడిపి పేర్కొంటోంది. 

 

అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో దీక్ష : ఎంపీ అవంతి

విశాఖపట్నం : విశాఖ రైల్వే జోన్ కోసం దీక్ష చేపడుతున్న ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతు..మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిగా దీక్ష చేపడుతున్నట్టు చెప్పారు. రైల్వే జోన్‌కు కావాల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయన్నారు. కేకే లైన్‌తో జోన్ కావాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. దీక్షలో పలువురు ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలు కూడా కూర్చోనున్నారు. కాగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఇటీవల ఎంపీ సీఎం రమేష్ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 

విశాఖ రైల్వే జోన్ కోసం ఎంపీ అవంత దీక్ష..

విశాఖపట్నం : ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీడీపీలో దీక్షల పర్వం కొనసాగుతోంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఇటీవల ఎంపీ సీఎం రమేష్ నిరాహార దీక్ష చేపట్టగా, నేడు ఆ పార్టీకే చెందిన మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ మరో దీక్ష చేపట్టనున్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ విశాఖలో ఈ ఉదయం ఆయన దీక్షకు కూర్చోనున్నారు. ఉదయం 9 గంటలకు దీక్ష ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.

కలకలం సృష్టిస్తున్న ముగ్గురు యువతుల అదృశ్యం..

తూర్పు గోదావరి : జిల్లాలో యువతుల అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. కడియంలో ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నిన్న స్కూలుకు వెళ్లిన వీరంతా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో గత రాత్రి వీరి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన విద్యార్థినులు సునీత, సుమిత్ర, అనూషగా గుర్తించిన పోలీసులు వారు ఎటు వెళ్లారన్న విషయమై విచారణ ప్రారంభించారు. కడియం నుంచి రాజమండ్రి వైపు వీరు వెళ్లినట్టుగా భావిస్తున్న పోలీసులు, రాజమండ్రి బస్టాండు, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.

బాలుడిపై లైంగిక దాడి..దారుణ హత్య!..

హైదరాబాద్‌ : నగరంలోని లంగర్‌హౌజ్‌లో దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

09:35 - July 4, 2018

ఢిల్లీ : మానసరోవర్ యాత్ర పలువురి కుటుంబాల్లో విషాదం నింపింది. తీవ్రమైన మంచు కురుస్తుండడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో నేపాల్‌- భారత్‌ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా యాత్రికులు అవస్థలు పడుతున్నారు. పలువురు చిక్కుకపోయారు. ఇదిలా ఉంటే పలువురు మృతి చెందడం యాత్రికుల కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. మానససరోవర్ యాత్రలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. మృతులు ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారు. గ్రంథి సుబ్బారావు, లీలాల నారాయణ్, రామచంద్రన్ మృతదేహానలు నేపాల్ గంజ్ కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్న యాత్రికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేడు నేపాల్ గంజ్ కు ఏపీ భవన్ అధికారుల బృందం రానుంది. యాత్రలో వంద మందికిపైగా తెలుగు వారు చిక్కుకున్నారు. తెలుగు వారికి నలుగురు అధికారులు సహాయపడనున్నారు. 

రికార్డుల కోహ్లీ ఖాతాలో మరో అరుదై ఘనత..

హైదరాబాద్ : టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన ఘనత వచ్చి చేరింది. పురుషుల టీ20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా, తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన తొలి టీ20లో 20 పరుగులు చేసిన కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. మెకల్లమ్ 66 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, కోహ్లీ అతడి కంటే పది మ్యాచ్‌ల ముందే.. అంటే 56వ ఇన్నింగ్స్‌లోనే ఆ రికార్డును అందుకున్నాడు.

పిల్లను విక్రయించే ముఠా గుట్టు రట్టు..

హైదరాబాద్ : నగరంలో పిల్లను విక్రయించే ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. అమీర్ పేటలో ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రూ.70 వేలకు ఓ శిశువును విక్రయిస్తున్న దంపతులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిశువును ఎక్కడ నుండి అపహకరించారనే విషయంపై దంపతులు లక్ష్మీ, భరత్ లను పోలీసులు విచారిస్తున్నారు. 

09:27 - July 4, 2018

సంగారెడ్డి : జిల్లాలో భారీ చోరీ జరిగింది. అమీన్ పూర్ పీఎస్ పరిధిలోని జై భవానీ జ్యువెలరీ దుకాణంలో దుండగులు ప్రవేశించారు. యజమాని కళ్లలో కారం చల్లి గన్ తో దుండగులు బెదిరించారు. ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనితో దుకాణం యజమానికి గాయాలయ్యాయి. అనంతరం దుకాణం యజమానిని బాత్ రూంలో బంధించారు. రూ. 4 లక్షల నగదు, కేజీ బంగారాన్ని దోచుకున్నారు. దాడి చేసిన దృశ్యాలు..చోరీ చేస్తున్న దృశ్యాలన్నీ సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. సమాచారం తెలుసుకన్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. 

టిడిపి ఒక్క రోజు దీక్ష...

విశాఖపట్టణం : విశాఖ కేంద్రంగా రైల్వే జోనప్ ఏర్పాటు చేయాలంటూ టిడిపి ఒక్క రోజు దీక్ష చేపట్టనున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని కాన్వెంట్ కూడలిలో దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. 

నేపాల్ గంజ్ కు ఏపీ భవన్ అధికారుల బృందం...

ఢిల్లీ : మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్న యాత్రికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేడు నేపాల్ గంజ్ కు ఏపీ భవన్ అధికారుల బృందం రానుంది. యాత్రలో వంద మందికిపైగా తెలుగు వారు చిక్కుకున్నారు. 

07:38 - July 4, 2018

నేడు ఆర్టీసీ కార్మిక సంఘాల ధర్నా...

విజయవాడ : ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వాహణపై కార్మిక శాఖ కమిషనర్ తో బుధవారం జరగాల్సిన సమావేశం వాయిదాపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, జోనల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నాయి. 

విజయనగరంలో మధు పర్యటన...

విజయనగరం : నేడు విజయనగరం జిల్లాలో సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించనున్నారు. బలిజపేట మండలం పెదపెంకిలో పైలేరియా వ్యాధి బాధితులను మధు పరామర్శించనున్నారు. సాలూరు (మం) తామరకొండలో మైనింగ్ బాధిత గిరిజన గ్రామాలను మధు సందర్శించనున్నారు. 

మూడో జడ్జీ తీర్పు ఏం చెప్పనున్నారు ?

చెన్నై : నేడు మూడో జడ్జీ ఎదుట ఎమ్మెల్యేల అనర్హత కేసు రానుంది. ఎమ్మెల్యేల అనర్హత కేసులో ఇద్దరు జడ్జీల పరస్పర వేర్వేరు తీర్పుతో మూడో జడ్జీ ఈ కేసును సమీక్షించనున్నారు. 

కరీంనగర్ లో బీజేపీ జనచైతన్య యాత్ర...

కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ లో బీజేపీ జనచైతన్య యాత్ర జరుగనుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరు కానున్నారు. 

06:52 - July 4, 2018

ఆంధ్రప్రదేశ్‌లో ఆయూష్‌ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఒకవైపు దేశీయ వైద్యాన్ని ప్రోత్సహిస్తామని మాటలు చెబుతూ.. యోగా డే లు ఘనంగా నిర్వహిస్తున్న పాలకులు ఆచరణలో మాత్రం ఆ వైద్యాన్ని అసలు పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. హోమియో, ఆయుర్వేద, యునాని డిస్పెన్సరీల్లో పనిచేస్తున్న తమకు గత 15 నెలలుగా జీతాలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కుంటిసాకులు చెబుతూ కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. దీనిపై టెన్ టివి జనపథంలో సీఐటీయూ నాయకులు ఏవీ నాగేశ్వర్‌గారు విశ్లేషించారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:48 - July 4, 2018

ఢిల్లీ : సామూహిక ఆత్మహత్యలపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆత్మహత్యలకు కారణం కుటుంబంలోని మృతి చెందిన ఓ వ్యక్తి భ్రమలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పదేళ్ల క్రితం చనిపోయిన తండ్రితో అతను కలలో మాట్లాడడం...ఆయన ఆదేశాల మేరకే సామూహిక సుసైడ్‌కు ప్లాన్‌ వేసినట్లు నిర్ధారణకు వచ్చారు.

మృతులు 11... ఇంట్లో కిటికీకి 11 ఊచలు... గోడకు 11 పైపులు... ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 11 పైపుల్లో ఏడు పైపులు నిటారుగా ఉంటే నాలుగు పైపులు వంగి ఉన్నాయి. ఇది తాంత్రిక ప్రభావమా...? పదకొండు నెంబర్‌ వెనక ఉన్న రహస్యం ఏంటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

11 పైపుల వెనక ఎలాంటి మంత్ర, తంత్రాలు లేవని మృతుల సమీప బంధువు సుజాత స్పష్టం చేశారు. సోలార్‌ ప్రాజెక్ట్‌, వెంటిలేషన్‌ కోసం పైపులను ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. మీడియా దీన్ని పదే పదే చూపుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. బురారీలో 11 మంది కుటుంబసభ్యుల ఆత్మహత్యల వెనక బాబాలు కానీ... తాంత్రిక విద్యలున్నట్లు కానీ ఇంతవరకు బయటపడలేదు. సామూహిక ఆత్మహత్యలకు కుటుంబంలో ఒకడైన లలిత్‌ భాటియా వేసిన ప్లానే కారణమని తెలుస్తోంది. లలిత్‌ భాటియాకు ఉన్న భ్రమలే అతనితో పాటు కుటుంబ సభ్యులను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని ఇంట్లో దొరికిన డైరీ ఆధారంగా పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.

నారాయణ్‌ దేవి చిన్న కుమారుడు 45 ఏళ్ల లలిత్‌ భాటియా పదేళ్ల క్రితం చనిపోయిన తండ్రి గోపాల్‌దాస్‌తో కలలో మాట్లాడేవాడు. తండ్రి కలలో చెప్పిన మాటలను డైరీలో రాసుకునేవాడు. ఆస్తులు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతల వ్యవహారాలపై తండ్రి నుంచి ఆదేశాలు తీసుకున్నట్లు.... ఇంట్లో అందరూ వాటిని పాటించాలని చెప్పేవాడు. 2015 నుంచి లలిత్‌ డైరీ రాస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జూన్‌ 25న చివరిసారిగా రాశాడు. అందులో ఒకచోట 'దేవుడు మమ్మల్ని కాపాడుతాడు' అని రాసి ఉంది. ఆత్మహత్యలు చేసుకోవడానికి ముందు రిహార్సల్స్‌ జరిపినట్లు కూడా డైరీ ద్వారా తెలిసింది.

11 మంది మృతికి సంబంధించిన పోస్టుమార్టమ్‌ రిపోర్టు బయటకు వచ్చింది. ఉరి వేసుకోవడంవల్లే వారు మరణించినట్లు వెల్లడైంది. మృతులపై ఎలాంటి అఘాయిత్యం జరిగినట్లు ఆనవాళ్లు లేవని నివేదిక పేర్కొంది. బాటియా కుటుంబం ఎంతో ప్రశాంతంగా ఉండేదని నారాయణ్‌దేవి మనవరాలు ప్రియాంకతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న వ్యక్తి చెప్పాడు. ఆత్మహత్య గురించి ముందే తెలిస్తే ప్రియాంక ఎంగేజ్‌మెంట్‌ ఎందుకు చేసుకుంటుందని, ఇంట్లో పెళ్లి పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

ఆత్మహత్యకు ముందు బాటియా కుటుంబ సభ్యులను చూసిన ఒకే ఒక వ్యక్తి ఫుడ్‌ డెలివరి బాయ్. శనివారం రాత్రి పదిన్నర సమయంలో 20 రోటీలు ఆర్డర్‌ చేశారని రుషి చెప్పాడు. కూతురు ఆర్డర్‌ చేయగా తండ్రి బిల్లు పేమెంట్‌ చేశారని... ఆ సమయంలో అందరూ మామూలుగానే ఉన్నట్లు పేర్కొన్నాడు. తెల్లవారే సరికి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు.

06:44 - July 4, 2018

చిత్తూరు : తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం ఇంకా ముదురుతోంది. టీటీడీలో తీవ్రస్థాయిలో అవినీతి జరుగుతోందంటూ.. హైకోర్టును ఆశ్రయించారు ఇద్దరు పిటీషనర్లు. గుడి లోపల తవ్వకాలు, నగల మాయంపై పిటీషన్‌ వేశారు. పిటీషన్‌ను స్వీకరించిన హైకోర్టు మూడు రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీ ఆదేశించింది. రమణ దీక్షితులు అంశంతో వివాదంలోకెక్కిన తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారం హైకోర్టుకు చేరింది. దేవస్థానంలో నగలు మాయం, తవ్వకాలు, హెరిటేజ్‌ ప్రాపర్టీని కాపాడాలని అనిల్‌కుమార్‌, గోస్వామి ఇద్దరు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. టీటీడీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించి హైకోర్టు.. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

నగలు మాయం అవ్వడం, గుడిలోపల తవ్వకాలు తదితర అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు పిటిషనర్లు. ఇదిలావుంటే... టీటీడీ మాత్రం గుడిలో ఎలాంటి తవ్వకాలు చేపట్టలేదని... కొన్ని మరమ్మతులు మాత్రమే చేశామని కోర్టుకు విన్నవించింది. ఇక తాజాగా నిర్మిస్తున్న గుడిగోపురం బంగారం కాదని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించగా... గోపురం బంగారంతోనే నిర్మిస్తున్నట్లు టీటీడీ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరామని పిటిషనర్‌ తరుపు న్యాయవాది తెలిపారు. మరోవైపు టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్‌ కోరతున్నారు.

నిత్యం గోవింద నామస్మరణలతో కళకళలాడే టీటీడీ ఇప్పుడు వివాదాస్పదం కావడంతో... శ్రీవారి ఆస్తులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీని కోర్టు ఆదేశించడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

06:43 - July 4, 2018

కృష్ణా : వారిద్దరిదీ ప్రేమ వివాహం. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఉన్నట్టుండి అమ్మాయి రివర్స్‌ అయింది. పైగా తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి భర్తనే వేధించడం మొదలు పెట్టింది. దీంతో.. ఆ యువకుడు తన వేదనను సెల్ఫీ వీడియోలో రికార్డ్‌ చేసి.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

విజయవాడలో గురువారెడ్డి అనే యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి.. మరో వ్యక్తితో ప్రేమాయణం నడుపుతోందన్న సమాచారంతో.. పంచాయతీ పెట్టడమే గురువారెడ్డి తప్పయింది. ఆ యువతి తన తల్లితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ కేసులో పోలీసులు గురువారెడ్డిని స్టేషన్‌కు తీసుకు వెళ్లి విచారించారు. దీంతో.. తన వేదనను సెల్ఫీ వీడియో రికార్డ్‌ చేసి.. గురువారెడ్డి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే గురువారెడ్డి సెల్ఫీ వీడియోలో తన వేదనను వ్యక్తం చేయడంతో.. పోలీసులు అతడి దృష్టికోణంలో విచారణ ప్రారంభించారు. దీంతో ఈ కేసులో కొత్త ట్విస్ట్‌ బయటపడింది. పోలీసులు చెబుతోన్న ప్రాథమిక సమాచారం ప్రకారం, గురువారెడ్డి ఐదేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన భార్యను బీటెక్‌ వరకూ చదివించి ఉద్యోగంలో చేర్పించాడు గురువారెడ్డి. అయితే.. ఆమె మరో అబ్బాయితో ప్రేమా యాణం సాగించడంతో ఇద్దరి మధ్యా వివాదాలు తలెత్తాయి. ఈ విషయమై ఆమె తల్లిదండ్రుల వద్ద గురువారెడ్డి పంచాయతీ పెట్టాడు. అయితే కూతురికి నచ్చ జెప్పాల్సిన తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గురువారెడ్డిని బెదిరించినట్లు విచారణలో తేలింది. అత్తమామల ఆత్మహత్యాయత్నం కేసులో గురువారెడ్డిని స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు విచారించారు. తల్లిదండ్రులను కూడా స్టేషన్‌కు పిలిపించడంతో గురువారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చేయని తప్పునకు తనను స్టేషన్‌కు పిలిపించి కేసు పెట్టి మానసికంగా వేధించినందుకే గురువారెడ్డి చనిపోయాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గురువారెడ్డి సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

06:40 - July 4, 2018

విజయవాడ : వాతావరణం అనుకూలించకపోవడంతో మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన వసతి, ఆహార సదుపాయాలు లేక అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యంతో ఇద్దరు యాత్రికులు మృతి చెందడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మానస సరోవర్‌లో చిక్కుకుపోయిన యాత్రికులను సురక్షితంగా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరడంతో... ఆర్మీ, హెలికాప్టర్లను రంగంలోకి దించింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయకచర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు నేపాల్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న ఉన్నతాధికారులు... యాత్రికులందరినీ సురక్షితంగా స్వస్థలాలకు తరలిస్తామంటున్నారు.

మానస సరోవర్‌ యాత్రలో తెలుగువారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతికూల వాతావరణంతో యాత్రికులు నేపాల్‌-చైనా సరిహద్దులో చిక్కుకుపోయారు. మరోవైపు వాతావరణం అనుకూలించకపోవడం మూడు రోజులుగా విమానాలు సైతం తిరగలేని పరిస్థితి నెలకొంది. యాత్రకు అనుకూలంగా లేకపోవడంతో యాత్రికులంతా చైనా సరిహద్దు సమీపంలో నేపాల్‌ పరిధిలోని హిస్సా సరిహద్దు శిబిరంలో ఉండిపోయారు. అయితే అక్కడ సరైన వసతులు లేకపోవడంతో యాత్రికులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావుతో పాటు.. కేరళకు చెందిన మంద్రెదత్‌ నారాయణలీలా ప్రాణాలు కోల్పోయారు. సుబ్బారావు మృతదేహాన్ని హిల్సా నుంచి సిమిల్‌కోట్‌కు తరలించి... అక్కడినుంచి నేపాల్‌గంజ్‌కు తీసుకువచ్చారు. పోస్ట్‌మార్టం అనంతరం లక్నో మీదుగా స్వస్థలానికి తరలించనున్నారు.

ఇక మానస సరోవర్‌ యాత్రలో చిక్కుకున్న యాత్రికులను రక్షించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. యాత్రికులకు అందించే సహాయకచర్యలను కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ పర్యవేక్షించారు. కాట్మాండ్‌లోని భారత ఎంబసీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సిమికోట్‌లో 525 మంది... హిల్సాలో 550 మంది, టిబెట్‌ సమీపంలో మరో 500 మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు విదేశాంగశాఖ తెలిపింది. యాత్రికులను కాపాడేందుకు ఆర్మీ హెలికాప్టర్లు ఇవ్వాలని నేపాల్‌ ఆర్మీని భారత ప్రభుత్వం కోరింది. అలాగే యాత్రికులకు ఆహారం, వసతి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. వృద్ధులకు సిమ్‌కోట్‌లో మెడికల్‌ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. యాత్రికుల సమాచారాన్ని బంధువులు తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశామన్నారు సుష్మా.

మరోవైపు తెలుగు యాత్రికులను స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు యత్నాలు ప్రారంభించాయి. నేపాల్‌లోని రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఫోన్లు చేసి యాత్రికులతో మాట్లాడారు. ఇక తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ కార్యాలయ అధికారులు సైతం నేపాల్‌లోని రాయబారి కార్యాలయ అధికారులతో మాట్లాడారు. ఎంపీ వినోద్‌ ఢిల్లీలో ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు.

మానస సరోవర్‌ యాత్రలో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేయడంతో... సహాయకచర్యలు చేపట్టారు. హిల్సా బేస్‌క్యాంప్‌ నుంచి వందకుపైగా యాత్రికులను సిమికోట్‌కు తరలించారు. వీరిని నేపాల్‌గంజ్‌కు తరలిస్తారు. ఇందుకోసం ఏడు విమానాలు సిమికోట్‌కు చేరుకున్నాయి. వాతావరణం అనుకూలిస్తే విమానాల ద్వారా యాత్రికులను సురక్షితంగా తరలిస్తామని అధికారులంటున్నారు.

మానస సరోవర్‌ యాత్రలో మృతి చెందిన గ్రంధి సుబ్బారావు కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పరామర్శించారు. ప్రముఖ ఇంజనీర్‌ మృతి తనకు కలత కలిగించిందన్నారు చినరాజప్ప. సుబ్బారావు మృతదేహాన్ని కాకినాడకు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే... తమ కుటుంబ సభ్యులు నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో చిక్కుకుపోవడంతో.. యాత్రికుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. 

06:37 - July 4, 2018

హైదరాబాద్ : జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని కేసీఆర్‌ భావిస్తున్నారా? ఇందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారా? వచ్చే ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ భాగస్వామ్యం అవుతుందా? అందుకే ఇరుపార్టీల నేతలతో కేసీఆర్ టచ్‌లో ఉంటున్నారా? జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఇరు పార్టీలతో కేసీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాజకీయ వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తోన్న కేసీఆర్‌.. ఇప్పుడు కొత్త టార్గెట్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలను పరిశీలిస్తున్న గులాబీ దళపతి... వచ్చే ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలను కలుపుకునే యత్నం ఓ వైపు చేస్తూనే... మరోవైపు ఆ రెండు పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. ఎన్నికల ఫలితాల్లో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశం గులాబీ నేతల్లో కనిపిస్తోంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సాధించేందుకు జాతీయ స్థాయిలో లాబీయింగ్‌ చేసేందుకు కేంద్ర కేబినెట్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. అప్పట్లో కేంద్రమంత్రిగా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతునిస్తూ... కొన్ని అంశాలు వ్యతిరేకిస్తూ కాలంవెల్లదీశారు. రాష్ట్ర విభజన సందర్భంగా.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌ చేస్తూనే.. రిజర్వేషన్ల వ్యవహారం రాష్ట్రాల పరిధిలో ఉండాలన్న డిమాండ్‌ను టీఆర్‌ఎస్‌ చేస్తోంది. ఈ అంశాలపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై గులాబీ బాస్‌ మండిపడుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ్ల మరోసారి కేంద్ర ప్రభుత్వంలో చేరడంపై గులాబీ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

రాబోయే ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినా... రాష్ట్ర ప్రయోజనాలను నేరవేర్చాలన్న డిమాండ్‌ను ముందు ఉంచాలని గులాబీ దళపతి డిసైడ్‌ అయ్యారు. పనిలో పనిగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకంటే తమకు ఏదీ ముఖ్యం కాదన్న సంకేతాలను టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పటికే ఇస్తుననారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే.. జాతీయ స్థాయిలోనూ చక్రం తిప్పుతామని అధికారపార్టీ నేతలు చెప్పకనే చెబుతున్నారు.

06:36 - July 4, 2018

హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు తెరుచుకోవటంతో తెలంగాణలో గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. 8 నెలలుగా నీరులేక దర్శనమిస్తున్న శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌లోకి గోదావరి ఉరకలు వేస్తుంది. దీంతో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు తెరుచుకోవటంతో గోదావరి నీళ్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతున్నాయి. మొత్తం 14 గేట్లు ఎత్తివేయటంతో ఇప్పటి వరకు 1.5 టీయంసీల నీరు దిగువకు చేరుకుంది. గత సంవత్సరం వర్షాభావ పరిస్థితుల కారణంగా బాసర వద్ద ఎండిపోయిన గోదావరి ఇప్పుడు జళకళ సంతరించుకుంది. గేట్లు తెరుచుకోవటంతో ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలకు నీళ్లు వస్తాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి సంత్సరం జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి ఉంచాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు అధికారులు బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లను తెరిచి ఉంచుతారు. వర్షకాలంలో నదీ ప్రవాహనికి ఆటంకం లేకుండా.. ఎస్ఆర్‌ఎస్పీ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ తీర్పుకు కట్టుబడి ప్రతి సంవత్సరం మహారాష్ట్ర ప్రభుత్వం గేట్లను తెరిచి ఉంచుతుంది. ఇక నీటి విడుదలపై నీటిపారుదల శాఖ అధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల పాటు బాబ్లీ నుంచి నీటి ప్రవాహం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు బాసరలో నీటి ప్రవాహం పెరగటంతో భక్తులు నదిలోకి వెళకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. 

06:31 - July 4, 2018

ఏలూరు : టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక ఉచిత సరఫరా విధానానికి తూట్లు పొడిచేందుకు దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఏలూరులో జరిగిన ఎస్వీఆర్‌ శత జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు.

రైతులకు ఒకేసారి 50వేల రుణమాఫీ ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు సీఎం చంద్రబాబు. దేశంలో 11 శాతం వృద్ధి రేటు సాధించింది ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే అన్నారు. అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఆదాయం పెరిగిందని, రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. నాలుగేళ్లలో రైతుల కోసం 80వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించామన్నారు.

ప్రతి ఒక్క పేదవారికి ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామన్నారు సీఎం. ఒక్కరూపాయి అవినీతి లేకుండా రాష్ట్రంలో అన్ని పనులూ చేపడుతున్నామని తెలిపారు. 2019 మార్చిలోగా పేదలకు 19 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఇసుక అక్రమ రవాణపై చంద్రబాబు మండిపడ్డారు. ఏలూరులో అమరావతి తరహాలో శాటిలైట్‌ టౌన్‌షిప్‌ నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఏలూరు రూరల్‌ మండలం కలపర్రులో విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏలూరులో జరిగిన ఎస్వీఆర్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు... సినిమాల్లో ఆయన నటన అద్భుతమని ప్రశంసించారు. సినీరంగంలో ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌ కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేశారు.

బీజేపీని ఏదైనా అడిగితే ఎదురు దాడి చేయిస్తున్నారని ఆరోపించారు సీఎం. వైఎస్సార్‌, జనసేన పార్టీలు బీజేపీలో కలిసిపోయాయన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో టూరిజాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. టూరిజం అభివృద్ధితో జిల్లాలో యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు సీఎం. 

06:28 - July 4, 2018

విశాఖపట్టణం : ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేసే దిశగా సాగుతున్నారు... జనసేనాని పవన్‌ కల్యాణ్‌. సీనియర్‌ నేతలను కలుపుకు పోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. మంగళవారం, దాడి వీరభద్రరావుతో పవన్‌ భేటీ అయ్యారు. లంచ్‌భేటీలో.. జనసేనలో చేరాల్సిందిగా.. దాడిని కోరారు. దీనికి వీరభద్రరావు కూడా సానుకూలంగానే స్పందించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్‌.. సీనియర్‌ నాయకుడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో భేటీ అయ్యారు. స్వయంగా దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లిన పవన్‌ రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారు. విలువలతో కూడిన రాజకీయం చేసిన దాడి వంటి నాయకులు నేటి తరం రాజకీయాలకు అవసరమని పవన్‌ అన్నారు. తమ పార్టీలోకి దాడి వీరభద్రరావును మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నట్టు పవన్‌ తెలిపారు.

పవన్‌ విజ్ఞప్తికి దాడి వీరభద్రరావు సానుకూలంగా స్పందించారు. తన నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం అయి తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మరోవైపు.. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా.. పవన్‌... విశాఖ జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో పర్యటించారు. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న తమ గ్రామాన్ని రక్షించాలని స్థానికులు పవన్‌కు విన్నవించారు. త్వరలోనే తాడి గ్రామాన్ని తమ పార్టీ నాయకులు సందర్శిస్తారని, అందరి సమస్యలను పరిష్కరించే మార్గం ఆలోచిస్తారని పవన్‌ హామీ ఇచ్చారు. గ్రామంలో ఫార్మాకంపెనీల వల్ల కలిగే ఇబ్బందులపై ప్రభుత్వంతో పోరాడతామని పవన్‌ అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు.

06:25 - July 4, 2018

హైదరాబాద్ : బీఈడీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీఈడీ చదివిన అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకూ అర్హులను ప్రకటించింది. 2010 నాటి గెజిట్‌ను సవరిస్తూ.. కొత్త గెజిట్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే.. కొన్ని షరతులు విధించింది. బీఈడీ చేసిన వాళ్లు ఎస్జీటీలుగా నియమితులైతే... రెండేళ్లలో ఆరు నెలల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని ఆదేశించింది. డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్జీటీలుగా ఇప్పటివరకు డీఈడీ చేసిన వారికి మాత్రమే అర్హత ఉండటంతో. ఓవైపు కేంద్రం నిర్ణయం పట్ల బీఈడీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే... డీఈడీ విద్యార్థులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

06:24 - July 4, 2018

హైదరాబాద్ : రేషన్‌ డీలర్ల సమస్యలపై ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది. మంత్రి ఈటెలతో రేషన్‌ డీలర్లు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో రేషన్‌ డీలర్లు సమ్మె విరమించారు. మంత్రులు రంగంలోకి దిగిన డీలర్ల సమస్యలకు పరిష్కారం చూపడంతో సమ్మెకు బ్రేక్‌ పడింది. తెలంగాణలో ఉత్కంఠ రేపిన రేషన్‌ డీలర్ల సమ్మెకు బ్రేక్‌ పడింది. రేషన్‌ డీలర్లు సమ్మెను విరమించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరిస్తామని హామీనివ్వడంతో డీలర్లు సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ముగ్గురు మంత్రులు మంగళవారం రేషన్‌ డీలర్లతో చర్చలు జరిపారు. వారి చర్చలు సఫలం అయ్యాయి. దీంతో జూన్‌ 18 నుంచి నుంచి కొనసాగుతున్న రేషన్‌ డీలర్లు.. సమ్మెను విరమించారు.

డీలర్లు డీడీలు కట్టకుండా మొండికేయడం, ఓవైపు పౌరసరఫరాలకు సమయం దగ్గర పడుతుండడంతో సివిల్‌ సప్లై అధికారులు ఆందోళన చెందారు. డీలర్ల సమ్మె చట్ట విరుద్దమంటూ... డీలర్‌షిప్‌ను రద్దు చేస్తామంటూ ప్రకటన జారీ చేశారు. పౌరసరఫరాల్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సివిల్‌ సప్లై అధికారులు మహిళా సంఘాలు, అంగన్‌వాడీలతో రేషన్‌ సరఫరాకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జేసీలు, సివిల్‌ సప్లై అధికార్లతో ప్రత్యామ్నాయాలపై చర్చలు జరిపారు. ఈనెల 5 నుంచి 15 వరకు రేషన్‌ సప్లై చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

ఓవైపు పౌరసరఫరాల శాఖ అధికారులు రేషన్‌ సరఫరాకు ఏర్పాట్లు చేసుకుంటోంటే... డీలర్లు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు. వారం పది రోజులుగా ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. ఓ రేషన్‌ డీలర్‌కు సస్పెన్షన్‌ నోటీసులు జారీ చేయడంతో అతడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో డీలర్ల సమ్మెకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభించింది. ప్రభుత్వం దిగిరాకపోతే... చివరగా ఆమరణ దీక్ష చేస్తామంటూ డీలర్ల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓ వైపు డీలర్లకు అన్ని పక్షాల నుంచి మద్దతు లభిస్తుండడంతో.. ముగ్గురు మంత్రులు రంగంలోకి దిగారు. పెండింగ్‌ బకాయిలు విడతల వారీగా విడుదల చేస్తామని హామీనిచ్చారు. డీలర్ల కమిషన్‌ పెంపుపై హామీనిచ్చారు. మరికొన్న ప్రధాన డిమాండ్స్‌ను నెరవేర్చుతామని మంత్రులు హామీనివ్వడంతో రేషన్‌ డీలర్లు సమ్మెను విరమించారు. 

పసికందు కథ సుఖాంతం....

హైదరాబాద్ : కోఠి ప్రసూతి ఆస్పత్రిలో అపహరణకు గురైన ఆరు రోజుల పసికందు కథ సుఖాంతమైంది. కిడ్నాప్‌ చేసిన మహిళ బీదర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో శిశువును వదిలి పారిపోయింది. కేసు విచారణలో భాగంగా.. బీదర్‌ వెళ్లిన హైదరాబాద్‌ పోలీసులు పాపను స్వాధీనం చేసుకున్నారు. 

జగన్ 205వ రోజు పాదయాత్ర...

తూర్పుగోదావరి : వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. 205వ రోజు రామచంద్రాపురంలో పాదయాత్ర కొనసాగనుంది. ద్రాక్షారామం, ఎర్రపోతవరం, వేగాయమ్మపేటలో పాదయాత్ర జరుగనుంది. 

టిడిపి ఎంపీల దీక్షలు...

విశాఖపట్టణం : రైల్వే జోన్ కోసం నేడు టిడిపి ఎంపీలు నిరహార దీక్ష చేయనున్నారు. అల్లూరి సీతరామరాజుకు నివాళలర్పించి దీక్షా వేదిక వద్దకు ఎంపీలు చేరుకోనున్నారు. 

తెలంగాణ ఫారెస్టు ఆఫీసర్స్ ఉద్యోగాలకు టెస్టులు...

హైదరాబాద్ : తెలంగాణ ఫారెస్టు ఆఫీసర్స్ ఉద్యోగాలకు నేటి నుండి ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు. ఫారెస్టు ఆఫీసర్స్ ఫిజికల్ టెస్టులో బాలింతలు, గర్భవతులకు మినహాయింపు ఇచ్చారు. 

Don't Miss