Activities calendar

05 July 2018

21:38 - July 5, 2018

హైదరాబాద్ : ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు వేలేటీ వాసుబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాసుబాబు శ్రీచైతన్య కళాశాల డీన్‌గా పనిచేస్తున్నాడు. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల ఏజెంట్ క‌మ్మ వెంక‌ట శివ‌నారాయ‌ణ‌ని కూడా అరెస్ట్ చేశారు. నిందితులు మొత్తం ఆరుగురు విద్యార్థులకు ప్రశ్నపత్రం లీక్ చేశారని పోలీసులు తెలిపారు. విద్యార్థుల నుంచి 36 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడించారు. వేలేటీ వాసుబాబును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. భువనేశ్వర్ కేంద్రంగా జరిగిన పేపర్ లీకేజీలో వాసుబాబు కీలకపాత్ర పోషించారు. ఆరుగురు విద్యార్థులతో భువనేశ్వర్‌లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. పేప‌ర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడితో వాసుబాబు, శివ‌నారాయ‌ణ నిరంత‌రం ట‌చ్‌లోనే ఉన్నారు. 2016లో ప్రధాన నిందితుడిని వాసుబాబు క‌లిశాడ‌ని పోలీసులు గుర్తించారు.లీకేజీపై ఆధారాల కోసం వాసుబాబుతో పాటు నారాయ‌ణ‌, శ్రీచైత‌న్య క‌ళాశాల‌ల ఏజెంట్ క‌మ్మ వెంక‌ట శివ‌నారాయ‌ణని పోలీసులు విచారిస్తున్నారు.

 

పీఆర్పీ కమిషన్ చైర్మన్ ను కలిసిన టీ.ఉద్యోగ సంఘాల నేతలు

హైదరాబాద్ : పీఆర్పీ కమిషన్ చైర్మన్ ను తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు కలిశారు. సీపీఎస్ ను రద్దు చేయాలని, మెటర్నిటీ సెలవులు పెంచాలని.. 48 అంశాలతో నివేదికను పీఆర్సీ చైర్మన్ కు నేతలు అందజేశారు. పెరిగిన ధరల దృష్ట్యా 63 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నేతలు కోరారు. 

21:07 - July 5, 2018

వివాహబంధాల్లో తగ్గుతున్న ప్రేమలు..హింసకు కారణమవుతున్న వివాహేతర సంబంధాలు.. మనుషుల ఆలోచనల్లో తగ్గుతున్న మానసిక పరివర్తన..భయంకరంగా కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితులు.. ఈ బంధానికి ఏమైంది ? ఇదే అంశంపై నిర్వహించిన విశ్లేషణ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్టు డా.జవహర్ లాల్ నెహ్రూ పాల్గొని, మాట్లాడారు. ఆయన తెలిపిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.... 

20:59 - July 5, 2018

హాయ్ ఆల్  ..వెల్కమ్ టు రివ్యూ అండ్ రేటింగ్ ప్రోగ్రాం నేడే విడుదల. రిలీజ్ ఐన సినిమాల రివ్యూ ఇస్తూ రేటింగ్ ని అనలైజ్ చేసే నేడే విడుదల ఇవాళ కూడా రీసెంట్ సినిమాల రిలీజ్ తో మీ ముందుకు వచ్చింది. లేట్ లేకుండా ఆ సినిమా  టాక్ ఏంటో తెలుసుకుందాం.. 

టుడే అవర్ రీసెంట్ రిలీజ్ లో ఉన్న మూవీ పంతం. వరుస ప్లాప్ లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న గోపీచంర్ ఎన్నో ఆశలతో.. రిలీజ్ కి రెడీగా ఉన్న మూవీ పంతం.. మరి ఈ మూవీ అయిన గోపీచంద్ కి ఊరటనిస్తుందో లేదో చూడాలి...

గోపీ చంద్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాడు.. లుక్స్ పరంగా.. యాక్టింగ్ పరంగా తనను తాను కొత్తగా చూపించుకోవడానికి  తాపత్రేయపడుతూనే  ఉన్నాడు.. అలా అనుకునే ఇంతకు మందు సినిమాలు రిలీజ్ చేశాడు .. కాని అవి అనుకున్న ఫలితాలు ఇవ్వకుండా నిరాశపరిచాయి.. 

గోపీ చంద్ లుక్ మార్చుకుని కొత్తగా మారిపోయాడు.. అలానే ఆక్సీజన్, గౌంతమ్ నంద, సౌఖ్యం మూవీస్ తో ఇంప్రస్ చేయడానికి ప్రయత్నించాడు.. కాని అవేవి ప్రభావం చూపించలేకపోయాయి.. వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.. దాంతో హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు గోపి

గోపీ చంద్  25వ మూవీ పంతం.. అటు  25వ మూవీ అన్న ఆనందం కంటే, ఈ మూవీ హిట్ అయితే చాలు అన్న టెన్షన్ ఉంది హీరోకి..  ఈ మూవీ మంచి విజయం సాధిస్తే తన  25వ  మూవీ సంబరంతో పాటు, చాలా కాలం తరువాత హిట్ కొట్టిన ఆనందం  దక్కుతుంది గోపీచంద్ కి..

గోపీచంద్ , మెహరీన్ జంటగా నటించిన ఈ మూవీకి కె చక్రవర్తి దర్శకుడు.. దర్శకుడికి ఈ మూవి ఫస్ట్ మూవి అయిన సరే..అతని మీద ఉన్న నమ్మకంతో..గోపీచంద్ ఈ అవకాశం ఇచ్చాడు.. మరి తన  25వ మూవీని కొత్త దర్శకుడు మెమరబుల్ చేస్తాడో లేదో చూడాలి.. 

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మించిన ఈ మూవీకి ఎన్నో హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన గోపీ సుందర్ సంగీతాన్ని అందించారు.. మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫామ్ లో ఉన్న గోపీ సుందర్ ఎలా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడో చూడాలి..

ఈ మూవీలో హీరో గోపీచంద్, హీరోయిన్ మెహరిన్ లతో పాటు స్టార్ యాక్టర్స్ నటించారు.. ప్రముఖ విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ సంపత్ రాజ్ తో పాటు జయప్రకాశ్ రెడ్డి, కమెడియన్ పృధ్వీలాంటి వారు ఈ మూవీకి ప్లస్ అవుతారు అని భావించవచ్చు..

ఇంతకు ముందు సినిమాల ప్రభావం తో ఈ మూవీకి సంబంధించిన ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాడు గోపీచంద్, మూవీ ప్రమోషన్స్ కూడా ఓ ఆర్డర్ లో ఉండేట్టు చూసుకుంటున్నాడు.. అంతే కాదు ఇది తన  25 మూవీ కావడంతో  ప్రస్టేజ్ గా తీసుకున్నాడు... 

ఇన్ని ఎక్స్ పర్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన పంతం సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.. అంతే కాదు ఈ మూవీతో పాటు ఈ నెలలో నాలుగైదు రిలీజ్ లు ఉన్నాయి.. మరి వాటిని తట్టుకుని నిలుస్తుందా లేదా చూడాలి... 

రేటింగ్..1.5/5 

20:46 - July 5, 2018

మోడీ నమ్మించి మోసం జేశిండన్న చంద్రాలు..మరి నువ్వు మేనిఫెస్టోతోని నమ్మియ్యలేదా..?, మీడియాకు క్లాసులు జెప్తున్న కుందురు జానాలు..ఏవార్తలు ఏయాలే ఏది ఎయ్యొద్దు అనే టాపిక్, కౌన్సిలర్లను బెదిరిస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే..కాల్ రికార్డు లీకై.. కంపు కంపైన కారు పార్టీ, లంచం ఇస్తెనే పాసు బుక్కులు ఇస్తరట..
చిట్యాల ఎమ్మార్వో ఆఫీసుల బాగోతాలు, అనారోగ్యం పాలై గ్యారేజీకి జేర్న అంబులెన్సు...డాక్టరుగారికే జరమొచ్చినట్టున్నది కథ, పిల్లలతోని జెడలేపిచ్చుకుంటున్న టీచర్..విద్యాశాఖ మంత్రి జిల్లాల పార్వతి టీచర్... ఈ అంశాలను మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

20:19 - July 5, 2018

ఉద్యోగ కల్పనలో టీసర్కార్ విఫలమైందని వక్తలు విమర్శించారు. రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో డివైఎఫ్ ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, కాంగ్రెస్ నేత మానవతారాయ్, బీజేపీ నేత రవీందర్, టీఆర్ ఎస్ నేత సత్యనారాయణగుప్త పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఎంసెట్ పేపర్ 2 లీకేజీ కేసులో ఇద్దరు అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్ : ఎంసెట్ పేపర్ 2 లీకేజీ కేసులో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు వాసుబాబు ఏ.. 89, శివనారాయణరావు ఏ..90లను అరెస్టు చేశారు. కీలక నిందితులు.. ధనుంజయ్ ఠాకూర్, సందీప్ కుమార్ తో ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి 36 లక్షలు వసూలు చేశారు. ఆరుగురిలో ముగ్గురికి టాప్ ర్యాంక్స్ వచ్చాయి. ఇద్దరు నిందితులను భువనేశ్వర్ కు క్యాంపుకు తరలించారు.

 

గుంటూరు జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు భేటీ

గుంటూరు : జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితి, నేతల మధ్య విభేదాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. 

సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఏపీకి ఎలాంటి ఇబ్బంది లేదన్న చినరాజప్ప

అమరావతి : రాష్ట్రంలో హోంగార్డు పోస్టుల ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఏపీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 

 

19:55 - July 5, 2018

హైదరాబాద్‌ : నగరంలో చిన్న పిల్లలే టార్గెట్‌గా మహిళ ముఠాలు రెచ్చిపోతున్నాయి. కోఠి ప్రసూతి ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్‌ ఘటన మరవకముందే దుండిగల్‌ పీఎస్‌ సూరారం కాలనీ పరిధిలో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. స్కూల్‌కి వెళ్తున్న శాన్విత అనే చిన్నారితో పాటు జాహ్నవి అనే మరో రెండేళ్ల పాప చెవి కమ్మలు పట్టీలు అహరించి, చిన్నారులను దూరంగా విడిచిపెట్టి పరారైంది. నిందితురాలు కొన్ని రోజులుగా పరిసర ప్రాంతాల్లో  రెక్కీ నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. నిందితురాలు సీసీ కెమెరాలకు చిక్కకుండా చాకచక్యంగా అదృశ్యమైంది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

 

19:51 - July 5, 2018

హైదరాబాద్ : ఆగస్టులో ఎల్బీనగర్ రూట్‌లో మెట్రో రైల్‌ను అందుబాటులోకి తెస్తామని ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు ఫస్ట్ మైల్ టూ లాస్ట్ మైల్ కనెక్టివ్‌లో భాగంగా ఇప్పటికే... మెట్రో స్మార్ట్  బైక్‌లు... ఎలక్ట్రిక్  బ్యాటరీ కార్లను అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. తాజాగా డ్రైవ్ ఈజీ పేరుతో మోటార్ బైక్‌లను మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి  ప్రారంభించారు. హైదరాబాద్ మెట్రో రైల్  వినూత్న ప్రయోగమన్నారు. త్వరలో ఫీడర్ బస్‌లను కూడా అందుబాటులోకి తెస్తామని, మెట్రో కారిడార్లో చారిత్రక కట్టడాలు పరిరక్షించడం కోసం ప్రత్యేక చ‌ర్యలు చేప‌డుతున్నామని చెప్పారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి మెట్రో స్టేషన్‌కు లింక్ చేస్తూ స్కై వాక్ ఏర్పాటు చేస్తామని ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. 

19:49 - July 5, 2018

హైదరాబాద్ : పీఆర్సీ నివేదికను రాష్ట్ర ప్రభత్వం ఏర్పాటు చేసిన కమిటీకి తెలంగాణ ఎన్జీవో  సంఘం అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగుల అభిప్రాయాల అనుగుణంగా.. వారి మనోభవాలకు అనుగుణంగా ఈ నివేదికను రూపొందించామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పీఆర్సీ నివేదిక కాబట్టి రేపు రాబోయే తరాలకు ఈ నివేదిక ఒక మార్గదర్శకంగా ఉండాలని ఎన్జీవో సంఘం నేతలు అన్నారు. 

 

గాజువాకలో పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర

విశాఖ : గాజువాకలో పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ గాజువాకలో ఎంతో మంది యువత ఉందన్నారు. 

 

19:45 - July 5, 2018

విజయవాడ : ఏపీకి విభజన హామీలన్నీ ఇచ్చేశామన్న కేంద్ర ఆర్థిక శాఖ అఫిడవిట్‌పై.. ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టును కూడా తప్పుబట్టేలా ఉందన్న యనమల.. పోలవరంలో ఆర్‌ అండ్‌ ఆర్‌ గురించి ఎందుకు స్పష్టత ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆర్థిక లోటు భర్తీకి కేంద్రం ఒక ఫార్ములా రూపొందిస్తోందని జైట్లీ చెప్పారని, కానీ అఫిడవిట్‌లో ఆ ఫార్ములా ప్రస్తావన ఎందుకు తేలేదని యనమల ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి కేవలం వెయ్యి కోట్లే ఇస్తామనడం ద్రోహమేనని అన్నారు చట్టంలో పేర్కొన్న బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీలో అక్కడ తలసరి నాలుగున్నర వేల రూపాయలిస్తే.. ఏపీకి కేవలం 450 రూపాయలే ఇచ్చి.. అదే గొప్ప అనడం దారుణమని యనమల ఆక్షేపించారు. కేంద్రం వంచనపై జగన్‌, పవన్‌ ఎందుకు నిలదీయరని ప్రశ్నించిన యనమల.. కేంద్రం అఫిడవిట్‌కు వ్యతిరేకంగా కౌంటర్‌ అఫిడవిట్‌ వేయనున్నామని చెప్పారు. 

 

19:41 - July 5, 2018

విజయవాడ : ప్రత్యేక హోదాతో పాటు.. విభజన హామీల అమలులో కేంద్రప్రభుత్వం.. ఏపీకి నమ్మకం ద్రోహం చేసిందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను చంద్రబాబు తప్పుబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై దాడిని ఖండిస్తూ.. తమ పోరాటం వ్యక్తులపై కాదని, వ్యవస్థలపైనే అని పార్టీ శ్రేణులకు సూచించారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం.. సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రంలోని 174 నియోజకవర్గాల్లో.. నిర్మాణం పూర్తయిన 3 లక్షల ఎన్టీఆర్‌ ఇళ్లల్లోకి.. లబ్దిదారుల చేత గృహప్రవేశం చేయించారు... ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో.. ఏపీకి కేంద్రం చేసిన మోసాన్ని చంద్రబాబు ప్రజలకు మరోసారి వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ను చంద్రబాబు తప్పుబట్టారు. 

రాష్ట్రాభివృద్ధికి తాను అహర్నిశలు కష్టపడుతుంటే... కోర్టుల్లో కేసులు వేస్తూ విపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పుడు విధానాలు అవలంబిస్తున్నాయని, ప్రజలకు అన్యాయం చేస్తే ఎవరినీ సహించబోనని చంద్రబాబు హెచ్చరించారు. 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా కమలనాథుల పట్ల  మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వకుండా మోసం చేసిన కేంద్రంతో పోరాడాల్సిన వపన్‌, జగన్‌... బీజేపీతో లాలూచీపడ్డారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. జిల్లాల పర్యటనల్లో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీద జరిగిన దాడులపై చంద్రబాబు స్పందించారు. టీడీపీ పోరాటం వ్యవస్థలపైనే తప్ప.. వ్యక్తులపై కాదని పార్టీ శ్రేణులకు సూచించారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోణలు చేస్తున్నాయని సభలో మాట్లాడిన మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు 14 లక్షల ఇళ్లను మాయంశారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గృహప్రవేశ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. సభా వేదిక నుంచే ఆన్‌లైన్‌లో సమీక్షించారు. వచ్చే జనవరిలో మరో మూడు లక్షల ఇళ్లల్లో గృహప్రవేశాలు నిర్వహింపచేస్తామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. 

19:38 - July 5, 2018

మెదక్ : ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు..పర్భనీ శక్తి అనే కొత్తరకం జొన్నవంగడాన్ని సృష్టించారు. పదిహేనేళ్ల కృషి మూలంగా వచ్చిన ఈ వంగడం దేశంలోని పేద రైతులకు వరమని, అత్యంత పోషక విలువలున్న ఈ జొన్న అందరికీ అందుబాటులో వచ్చే విధంగా కృషి చేస్తామంటున్న ఇక్రిశాట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అశోక్ కుమార్ తో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

19:34 - July 5, 2018

హైదరాబాద్ : తమ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలంటూ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తోన్న ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

విషజ్వరాలతో ఇద్దరు మృతి

ఆదిలాబాద్ : జిల్లాలోని తాంసి మండలం అత్నంగూడలో విషజ్వరాలు ప్రభలాయి. విషజ్వరాలతో ఇద్దరు మృతి చెందారు. రిమ్స్ లో 16 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వైద్య సిబ్బంది అతిసారంగా భావిస్తోంది. హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి...బాధితులకు సిబ్బంది వైద్యం అందిస్తోంది. గ్రామంలో జిల్లా కలెక్టర్ దివ్య పర్యటించారు. హెల్త్ క్యాంపు ఏర్పాటును కలెక్టర్ పరిశీలించారు. 

19:30 - July 5, 2018

హైదరాబాద్ : ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడానికి ప్రధాని మోదీకి ఎంత బాధ్యత ఉందో సీఎం చంద్రబాబుకు అంతే బాధ్యత ఉందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని మోసం చేశారని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసులంటే జగన్‌ భయం లేదని .. చంద్రబాబే బయపడుతున్నారని అంబటి విమర్శించారు.

 

19:27 - July 5, 2018

వరంగల్‌ : నగరంలోని భద్రకాళి ఫైర్‌ వర్కర్స్‌లో జరిగిన ప్రమాదంలో నిఘా లోపం స్పష్టంగా కనిపింస్తుందని స్థానికులు మండిపడ్డుతున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం, పోలీసుల వైఫల్య వల్ల నిరుపేదల నిండుప్రాణాలు బలి అయ్యాయని స్థానికులు అంటున్నారు. దీనికి సంబందించి మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

19:25 - July 5, 2018
17:14 - July 5, 2018

ఆదిలాబాద్ : జిల్లాలోని తాంసి మండలం అత్నంగూడలో విషజ్వరాలు ప్రభలాయి. విషజ్వరాలతో ఇద్దరు మృతి చెందారు. రిమ్స్ లో 16 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వైద్య సిబ్బంది అతిసారంగా భావిస్తోంది. హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి...బాధితులకు సిబ్బంది వైద్యం అందిస్తోంది. గ్రామంలో జిల్లా కలెక్టర్ దివ్య పర్యటించారు. హెల్త్ క్యాంపు ఏర్పాటును కలెక్టర్ పరిశీలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:00 - July 5, 2018

ఢిల్లీ : లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా ఢిల్లీలో పరిస్థితి మారలేదు.  ప్రభుత్వ అధికారులు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తున్నారని డిప్యూటి సిఎం మనీష్‌ సిసోడియా ఆరోపించారు. సుప్రీం ఆదేశాలను పాటించేది లేదని చీఫ్‌ సెక్రెటరీ లిఖితపూర్వకంగా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, కోర్టు తీర్పును అవమానించడమేనని మనీష్‌ అన్నారు.  భూములు, పోలీస్‌, లా అండ్‌ ఆర్డర్‌ అంశాల్లో కేంద్రానికి అధికారాలు ఉంటాయని...ఇంతకు మించి ఎల్జీకి ఇతర అధికారాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు.  బదిలీలు, పోస్టింగుల వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వానికే అధికారం ఉంటుందని మనీష్‌ సిసోడియా స్పష్టం చేశారు. పరస్పర సహకారంతో పని చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచిందని ఆయన గుర్తు చేశారు. ఎల్జీ సంతకం చేసినా అధికారులు పనిచేయకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఎల్జీ, అధికారులు సహకరించాలని డిప్యూటి సిఎం విజ్ఞప్తి చేశారు.

 

16:58 - July 5, 2018

ఢిల్లీ : సునంద పుష్కర్‌ మృతి కేసులో మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌కు ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచికత్తుపై కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని శశిథరూర్‌కు షరతు విధించింది. సునంద మృతిలో కేసులో శశిథరూర్‌ను నిందితుడిగా పేర్కొంటూ 3 వేల పేజీల చార్జిషీట్‌ను  ఢిల్లీ పోలీసులు రూపొందించారు. సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని, హింసించారని శశిథరూర్‌పై కేసు నమోదు చేశారు.  శశిథరూర్‌ జూలై 7న కోర్టు ఎదుట హాజరు కావాలని ఇప్పటికే కోర్టు సమన్లు జారీ చేసింది.  భార్య సునందా పుష్కర్‌ మృతి కేసులో శశిథరూర్‌ ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ వేశారు. బెయిల్‌ దొరికితే శశిథరూర్‌ దేశం విడిచి పారిపోతారని పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించలేదు. సునంద పుష్కర్‌ 2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ గదిలో మృతి చెందారు. 

 

16:55 - July 5, 2018

ఢిల్లీ : బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యలకు సంబంధించి ఓ సిసిటివి వీడియో ఫుటేజీ బయటకొచ్చింది. అందులో ఆత్మహత్యలు చేసుకోవడానికి కొద్ది గంటల ముందు భాటియా కుటుంబంలోని ఇద్దరు మహిళలు బయట నుంచి స్టూళ్లు, వైర్లు తీసుకెళ్లడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో నారాయణ్‌ దేవి పెద్ద కోడలు, మరో యువతి బయట నుంచి స్టూళ్లు, వైర్లు తీసుకొచ్చారు. వీటిని ఉరి వేసుకోవడానికి వారు ఉపయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.  11 నెంబర్‌కు సంబంధించిన దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 11 పైపులు, 11 కిటికీల తర్వాత ఆ ఇంట్లో 11 డైరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11 ఏళ్ల క్రితం నుంచి ఆ డైరీలో రాస్తున్నారు. గత 11 ఏళ్లుగా లలిత్‌కు అతని తండ్రి కలలోకి వస్తున్నాడు.  డైరీలో రాసిన విధంగానే  సామూహిక ఆత్మహత్యలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వీరంతా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

16:40 - July 5, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకోకుండా దూకుడు పెంచుతున్న హ‌స్తం పార్టీకి  హైదరాబాద్ టెన్షన్ పుట్టిస్తోంది. సీటీకి పార్టీ సార‌థిని ప్రక‌టించినా.. పార్టీలో జోరు పెర‌గ‌డం లేదు.. ? గ్రేట‌ర్ లో ఇంత‌గా పార్టీ డీలా ప‌డ‌టానికి కార‌ణమేంటీ..? ఇంత‌కు గ్రేట‌ర్‌లో పార్టీకి ఏమైంది..? ఇదే ఇప్పుడు టీపీసీసీకి స‌వాల్‌గా మారింది. 
హైద్రాబాద్‌లో క‌నిపించ‌ని కాంగ్రెస్ జోరు..
తెలంగాణలో వచ్చే ఎన్నిక‌ల్లో విక్టరీ కొట్టి.. కేసీఆర్‌కు గ‌ట్టి ఝల‌క్ ఇవ్వాల‌ని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ.. అయితే దానికి అనుగుణంగానే ముందువెళ్తోంది. ఎన్నిక‌లు మరో ఏడాదిలో మొద‌లు కావ‌డంతో దూకుడు పెంచుతోంది. ఇప్పటికే బ‌స్సు యాత్రల‌తో రాష్ట్ర వ్యాప్తంగా క్యాడ‌ర్‌లో జోరు పెంచారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతేకాదు అందివ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోకుండా దూకుడు పెంచుతున్న హ‌స్తం పార్టీకి హైద‌రాబాద్‌లో మాత్రం టెన్షన్ పుట్టిస్తోంది.
హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ కు స్పీడ్ బ్రేక్ 
రాష్ట్ర వ్యాప్తంగా జోరు పెరిగినా.. పార్టీకి గుండెకాయలాంటి హైద‌రాబాద్‌లో పార్టీ స్పీడ్ పెర‌గ‌కపోవ‌డం పీసీసీ నాయకుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. గ‌త గ్రేట‌ర్ ఎన్నిక‌ల నుండి డీలాప‌డ్డ క్యాడ‌ర్‌లో.. జోష్ పెంచి గాడిలో పెట్టేందుకు సీటి పార్టీ ప‌గ్గాల‌ను మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్‌కు అప్పగించారు. అయినా పార్టీ కార్యక్రమాలలో జోష్ క‌నిపించ‌డం లేదు. సీటి అధ్యక్షుడిగా అంజ‌న్ కుమార్ క‌మిటీల‌ను వేయ‌కుండా సీటీ సీనియ‌ర్స్ అడ్డుకుంటున్నార‌ంటూ ఓ వాదన వినిపిస్తోంది. అయితే అధ్యక్షుడిగా బాధ్యత‌లు తీసుకుని  రెండు నెల‌లు కావాస్తున్నా... క‌మిటీలపై అడుగు ముందుకు ప‌డ‌టంలేద‌న్నది అంజ‌న్ వ‌ర్గం వాద‌న‌.
డీలా పడ‌టానికి పెద్ద నేత‌ల వ్యవహర శైలీ కారంణం !
గ్రేట‌ర్‌లో పార్టీ ఇంత‌లా డీలా పడ‌టానికి న‌గ‌రంలోని పెద్ద నేత‌ల వ్యవహర శైలీ ఓ కార‌ణ‌మని గాంధీభ‌వ‌న్ వ‌ర్గాల్లో చ‌ర్చ జరుగుతోంది. దానం నాగేంద‌ర్ తాను కారెక్కే దాకా.. పార్టీని కన్ఫ్యూజన్‌లో పెట్టి.. పార్టీని కొలుకోలేని విధంగా డ్యామెజ్ చేశార‌న్న చ‌ర్చ ఉంది. మ‌రోవైపు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పేరుకు  పార్టీలో ఉన్నార‌న్నదే కానీ.. ఆయ‌న ఇప్పటి  వ‌ర‌కు ఏ ఒక్కపార్టీ కార్యక్రమంలో పాల్గొన‌డం లేదు. క‌నీసం గాంధీభ‌వ‌న్ వైపు క‌న్నెత్తి చూడ‌టంలేదు. దీనికి తోడు రేపో మాపో ముఖేష్ కూడా గులాబి గూటికి చేరుతార‌న్న చ‌ర్చ కూడా సిటి క్యాడ‌ర్‌ను అయోమ‌యానికి గురి చేస్తుందంటున్నారు కొంద‌రు సీనియ‌ర్లు. ఇక మ‌రో మాజీ మంత్రి మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి మాత్రం అడ‌పాద‌డ‌పా పార్టీ కార్యక్రమాల‌కు హ‌జ‌రవుతున్నారు. ఇదే బాటలో మాజీ హోంమంత్రి, స‌బితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డిలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మై కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే విష్ణువ‌ర్ధన్ రెడ్డి పార్టీలో ఉన్నారా అన్న సందేహం క‌లుగుతోంది.  ఇక మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, బిక్షప‌తి యాద‌వ్, కేఎల్ఆర్ పార్టీ కార్యక్రమాల్లో మెరుపులా మెర‌వ‌డం.. అ త‌ర్వాత గ‌యాబ్ అవుతున్నారు. ఇవన్నీ కూడా గ్రేట‌ర్‌లో కాంగ్రెస్ క్యాడ‌ర్ ను డీలా ప‌డేలా చేశాయ‌ని సీనియర్ నాయకులు అంటున్నారు. 
పీసీసీ ఆదేశాల‌ను సిటీ లీడ‌ర్స్ ఏ మేరకు పాటిస్తారో ? 
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెర‌గుతున్నా.. సీటిలో మాత్రం గ్రాఫ్ పెంచుకోలేక పోతోంది. ఒక‌వైపు ముంద‌స్తూ ఘంటికలు మ్రోగుతున్నా సిటీ నేత‌లు అలర్ట్ కాక‌పోవ‌డంపై ఉత్తమ్‌ గుర్రుగా ఉన్నారు. సీటిలో ప్రార్టీ స్పీడ్  పెంచాల‌ని అంజన్ కు ఆదేశించిన‌ట్లు స‌మాచారం. మ‌రి ఉత్తమ్ ఆదేశాలు ఏ మేర‌కు ప‌నిచేస్తాయో.. సిటీ లీడ‌ర్స్ పీసీసీ ఆదేశాల‌ను ఏ మేరకు పాటిస్తార‌న్నది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

 

16:28 - July 5, 2018

విజయవాడ : ఏపీ టీడీపీ యువరాజు నారా లోకేష్‌ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరికీలోకి దిగబోతున్నారా..? ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు.. ? రాయలసీమా లేక కోస్తా ప్రాంతమా ? ఏ స్థానం నుంచి పోటీపడతారు..? అక్కడ ఎదురయ్యే సవాళ్లు ఏంటి..?  వాచ్‌ దిస్‌స్టోరీ. 
ఎమ్మెల్సీ ద్వారా లోకేశ్‌ కు మంత్రి పదవి
నారా లోకేశ్‌.. ఇపుడు ఏపీ టీడీపీలో పవర్ పుల్ నేమ్. 2014కు ముందు వరకూ పార్టీకి సంబంధించి తెరవెనుక వ్యవహారాలు చక్కదిద్దటంలో కీలకంగా వ్యవహరించిన లోకేశ్‌... ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి చేజిక్కించుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అయినా.... ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేరనే విమర్శను మూటగట్టుకున్నారు. ఇప్పుడు 2019 సార్వత్రికల్లో ప్రత్యక్ష పోరుకు సై అని చెప్పటంతో లోకేశ్ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
రాయలసీమ నుంచే బరిలోకి దిగుతారనే ప్రచారం 
తండ్రి చంద్రబాబునాయుడు, మావయ్య బాలకృష్ణ రాయలసీమ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నందున లోకేశ్ కూడా రాయలసీమ నుంచే బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే రాజధాని ప్రాంతం నుంచి కూడా  పోటీలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే చర్చ తెలుగుదేశం వర్గాల్లో నడుస్తోంది. అధిష్ఠానం ఎక్కడి నుంచి బరిలోకి దింపితే అక్కడ నుంచి పోటీకి సై అంటున్న లోకేశ్ అందుకు తగ్గ కసరత్తు తెరవెనుక ముమ్మరం చేశారు. 
చంద్రగిరి నియోజకవర్గంపై లోకేశ్ ఊగిసలాట 
నారా లోకేశ్ బలబలాలు పరిశీలిస్తే..., తండ్రి చంద్రబాబు కుప్పం నుంచి 6సార్లు పోటీ చేసి తిరుగులేని అభ్యర్థిగా ఉన్నారు. లోకేశ్ కు అత్యంత సేఫ్ జోన్ కూడా అదే నియోజకవర్గం అని అంతా భావిస్తున్నారు. లోకేశ్ కోసం చంద్రబాబు కుప్పం స్థానాన్ని త్యాగం చేస్తే..  చంద్రబాబు ఎక్కడి నుంటి పోటీ చేస్తారన్నది సర్వత్రా చర్చ జరుగుతోంది. నంద్యాలలో చంద్రబాబు పోటీ చేయాలనే డిమాండ్ స్థానికంగా బలంగా ఉంది. అయితే తనను తాను నిరూపించుకోవటానికి లోకేశ్ వేరే స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలే ఎక్కువని తెలుస్తోంది. అటు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో పోటీచేయాలని లోకేశ్ గతంలో భావించారు.  ఈ మేర ఆ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టి బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. అయితే ఆ నియోజకవర్గం ఎప్పుడూ ఒకేలా ఉండదని .. స్థానిక నాయకులను సెట్ చెయ్యటం కాస్త క్లిష్టమైన పని అని తండ్రి చంద్రబాబే హెచ్చరించటంతో ఆ నియోజకవర్గంపై లోకేశ్ ఊగిసలాడుతున్నట్లు తెలుస్తోంది. మావయ్య బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపూరం నియోజకవర్గం నుంచి కూడా లోకేశ్‌ పోటీ చేస్తారనే చర్చకూడా కొంతకాలం నడిచింది. అయితే ఇప్పుడు ఆ స్థానం నుంచి బరిలో ఉన్న బాలకృష్ణకు తగు ప్రత్యామ్నాయం చూపిస్తేనే ఇక్కడ లోకేశ్ పోటీ చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. 
కోస్తా ప్రాంతంలో లోకేశ్ పోటీ చేస్తే..
రాయలసీమ కాకుండా కోస్తా ప్రాంతంలో లోకేశ్ పోటీ చేస్తే.. రాజధాని ప్రాంతంపై పట్టు ఉంటుందని పార్టీ వర్గాల్లో అభిప్రాయం  వ్యక్తమవుతోంది. ఇందుకు తగిన స్థానం పెనమలూరు నియోజకవర్గమేని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు మంచి పేరు ఉండటంతో... లోకేశ్ పెనమలూరు నుంచి పోటీ చేయాలనుకుంటే బోడేప్రసాద్‌కు తగు ప్రత్యామ్నాయం చూపించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి లోకేశ్‌ అసెంబ్లీ బరిలోకి దిగుతారనే ప్రచారంతో పార్టీలో జోరుగా జర్చలు సాగుతున్నాయి.  ఇప్పటి  పరిస్థితులను బట్టి లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావాలంటే ఒకే ఇంటి నుంచి మూడు టిక్కెట్లు ఇచ్చే అంశం కూడా చర్చలకు రావచ్చు. ఒకే ఇంట్లో  ముగ్గురికి టిక్కెట్లు ఇస్తే విమర్శలు ఎదురవుతాయా..? దీనిపై  పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 

 

16:00 - July 5, 2018

విజయవాడ : ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదంటూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ వేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. యూపీఏ ప్రభుత్వం అన్యాయంగా  రాష్ట్రాన్ని విభజిస్తే.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వియవాడలో ఎన్టీఆర్‌ గృహాలను ప్రారంభించిన చంద్రబాబు... కేంద్ర ప్రభుత్వంపై పండిపడ్డారు. 
బీజేపీతో అంటకాగుతున్న జగన్‌ : చంద్రబాబు 
రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో ప్రతిపక్ష నేత జగన్‌ బీజేపీతో అంటకాగుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. జనసేన అధినేత పవన్‌ కూడా కమలనాథుల పట్ల  మెతక వైఖరి అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వకుండా మోసం చేసిన కేంద్రంతో పోరాడాల్సిన వపన్‌, జగన్‌... బీజేపీతో లాలూచీపడ్డారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. విజయవాడలో ఎన్టీఆర్‌ గృహాలను ప్రారంభించించిన చంద్రబాబు.. కన్నా, పవన్‌, జగన్‌పై  ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నా : చంద్రబాబు
రాష్ట్రాభివృద్ధికి తాను అహర్నిశలు కష్టపడుతుంటే... కోర్టుల్లో కేసులు వేస్తూ విపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్పుడు విధానాలు అవలంభిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు అన్యాయం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. విజయవాడలో ఎన్టీఆర్‌ గృహాలను ప్రారంభించిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తుందో  చెప్పాలని నిలదీశారు. 
కన్నా లక్ష్మీనారాయణపై చెప్పు విసిరిన ఘటనపై సీఎం స్పందన 
నెల్లూరు జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లక్ష్యంగా  చెప్పు విసిరిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. విజయవాడలో ఎన్టీఆర్‌ గృహాలను ప్రారంభించిన చంద్రబాబు... టీడీపీ పోరాటం వ్యవస్థలపైనే కానీ, వ్యక్తులపై కాదన్నారు.

13:32 - July 5, 2018

పెద్దపల్లి : జిల్లాలో ఓ కండక్టర్ పై మద్యం సేవించిన కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఓ బస్సులో నలుగురు యువకులు మద్యం సేవించి బస్సు ఎక్కారు. లోనికి రావాలని కండక్టర్ సూచనలు పట్టించుకోలేదు. పైగా కండక్టర్ పై దురుసుగా ప్రవర్తించారు. అసభ్యకరంగా మాట్లాడారు. తోటి ప్రయాణీకులు వారించగా ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఏం చేసుఏకుంటారో చేసుకోవాలని చెబుతూ వారు పారిపోసాగారు. దీనితో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. 

'జియో'..మాన్ సూన్ హంగామా...

ముంబై : మాన్ సూన్ హంగామా' పేరిట ఓ సరికొత్త ఆఫర్ ను ప్రకటించారు ముఖేష్ అంబానీ. జియో ఫోన్ ను వాడుతున్న వారు, ఆ ఫోన్ ను తిరిగి ఇచ్చి కొత్త ఫోన్ తీసుకోవచ్చని తెలిపారు. జూలై 21 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఫోన్ తో పాటు రూ. 501 చెల్లించాలని చెప్పారు. 

13:21 - July 5, 2018

విజయవాడ : తాను ఇళ్లు కట్టించి ఇచ్చానని...తనను మరిచిపోతారా ? అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ రాష్ట్రంలో ఒకేసారి 3లక్షల గృహ ప్రవేశాలు జరిగాయి. విజయవాడలో ఇందిరా గాంధీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని సీఎం బాబు ప్రారంభించారు. అనంతరం వివిధ జిల్లాల కలెక్టర్లు..ఎమ్మెల్యేలు..లబ్దిదారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:19 - July 5, 2018

ఢిల్లీ : మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్న వారంతా నేపాల్ గంజ్ కు చేరుకుంటున్నారు. మానససరోవర్ యాత్రలో భారీ వర్షం..కొండచరియలు విరిగిపడుతుండడంతో యాత్రకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వెళ్లిన వారిలో చాలా మంది చిక్కుకున్నారు. చిక్కుకున్న వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

సమాచారం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా వారి వారి స్వగ్రామాలకు తరలించాలని ఏపీ భవన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనితో నలుగురు బృందం నేపాల్ గంజ్ కు బయలుదేరింది. అక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో 74 మందిని సురక్షితంగా నేపాల్ గంజ్ కు తరలించారు. వారు క్షేమంగా ఉన్నట్లు తెలుసుకున్న కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. తమకు అన్ని సౌకర్యాలు కల్పించాన అధికారులకు యాత్రికులు కృతజ్ఞతలు తెలిపారు. 

13:18 - July 5, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ కింద ఒకేసారి 3 లక్షల ఎన్టీఆర్ నూతన గృహ ప్రవేశాలు జరిగాయి. ఇందిరా గాంధీ స్టేడియం నుండి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకంటే ముందు గృహాలు పొందిన లబ్దిదారులతో సీఎం బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రసంగించారు. ఏపీ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించడానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా మూడు లక్షల గృహ ప్రవేశాలు ఏపీ రాష్ట్రంలో జరిగాయన్నారు. 

11:53 - July 5, 2018

తెలుగు సినిమా తెరపై ఇలవేలుపుగా నిలిచిన గొప్ప నటుడు..యుగపురుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఎన్ని తరాలు గడిచినా ఆయన సినీ నట జీవితంలోను..రాజకీయ రంగంలోను ఆయన ఒక దృవతార అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ పాత్రతో పాటు ఆయన చుట్టు అల్లుకున్న అన్ని పాత్రలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆ పాత్రల్లో ఏ పాత్రకు ఎవరు సరిపోలతారనే సెలక్షన్..వారిని నటింపజేయటం కూడా కత్తిమీద సామువంటిదే. ఈక్రమంలో ఎన్టీఆర్ జీవన సహచరి బసవ తారకం పాత్రలో బాలివుడ్ నటి విద్యాబాలన్ అయితే ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. నటనలో విద్యా బాలన్ ఎటువంటి సమర్థత వున్న నటో కొత్తగా చెప్పనక్కరలేదు.

ప్రఖ్యాత నటుడు దివంగత ఎన్టీ రామారావు బయోపిక్ గా 'ఎన్టీఆర్' చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఇందులో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

11:27 - July 5, 2018

వరంగల్ : అక్కను పొగొట్టుకున్న చెల్లి..తల్లిని పొగొట్టుకున్న కొడుకు..తమ్ముడిని పొగొట్టుకున్న ఓ చెల్లి...ఇలా ఒక్కరు కాదు..ఇద్దరు కాదు...12 మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. భద్రకాళి ఫైర్ వర్క్స్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కానీ 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారికి ఎంజీఎం ఆసుపత్రికి తరలించి పోస్టుమాస్టం నిర్వహిస్తున్నారు. దీనితో తమ వారిని పొగొట్టుకున్న కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో మిన్నంటిపోయింది. పలువురు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. ఎంజీఎం వద్ద పరిస్థితిని తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. ఈ సందర్భంగా పలువురితో మాట్లాడింది. వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లు తెప్పించే ఈ ఘటనపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:18 - July 5, 2018

మంచిర్యాల : జిల్లాలో బెల్లంపల్లి మున్సిపల్ రాజకీయాలు ఉత్కంఠను తలపిస్తున్నాయి. మున్సిపల్ ఛైర్ పర్సన్ పసుల సునీతారాణిపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు...ప్రతిపక్ష కౌన్సిలర్లతో చేతులు కలపడం చర్చనీయాంశమైంది. కౌన్సిల్‌లోని మరోవర్గం ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గాలనే పట్టుదలను ప్రదర్శిస్తుండగా అవిశ్వాసం వీగాలని మరో వర్గం ప్రయత్నిస్తోంది. దీనితో కౌన్సిలర్లను క్యాంపుకు తరలించారు. ఇందులో ఓ కౌన్సిలర్ భర్త కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి వ్యతిరేకంగా ఉన్న కౌన్సిలర్లను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. బెదిరింపు ధోరణలకు దిగుతున్నట్లు సమాచారం. బుజ్జగింపులకు..బెదిరింపులకు తలొగ్గి మున్సిపల్ ఛైర్ పర్సన్ సునీతారాణికి అనుకూలంగా ఉంటారో...అవిశ్వాసానికి తెరతీసి తమ పంతం నెగ్గించుకుంటారోనన్న ఉత్కంఠ బెల్లంపల్లిలో కొనసాగుతోంది..వీగుతుందా ? నెగ్గుతుందా చూడాలి. 

11:08 - July 5, 2018

హైదరాబాద్ : అలనాటి ఓల్డ్ సీబీఎస్ బస్టాండు కుప్పకూలిపోయింది. గురువారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది. ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. 1994 తరువాత 20 ఎకరాల్లో ఎంజీబీఎస్ బస్టాండును నిర్మించారు. కమర్షియల్ కాంప్లెక్స్ గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉన్నతాధికారులు పాత బస్టాండును సందర్శించి పలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. కానీ అంతలోనే సీజీబీఎస్ షెడ్డు కూలిపోవడం చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న అప్జల్ గంజ్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొత్త ఎంజీబీఎస్ నిర్మించకముందు ఇక్కడి నుండే దూర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగించేవి. నిజాం పాలకుల పాలనలో ఇది నిర్మితమైంది. 

అమ్మకానికి నెలరోజు పసికందు..పట్టుకున్న పోలీసులు..

హైదరాబాద్ : నగరంలో పసికందులను కూరగాయలు అమ్ముతున్నట్లుగా అమ్మేస్తున్నారు. ఈ క్రమంలో నెల రోజుల పసికందును రూ.50 వేలకు విక్రయించిన నలుగురు వ్యక్తులను పంజాగుట్టు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్‌కు చెందిన సుజాత-భజన్ దంపతులకు పాప పుట్టింది. ఇప్పటికే వారికి ఇద్దరు అమ్మాయిలు ఉండడంతో చిన్నారిని వదిలించుకోవాలని చూశారు.

భార్య మృతి కేసులో శశీథరూర్ రు బెయిల్ మంజూరు..

ఢిల్లీ : కాంగ్రెస్ నేత శశిథరూర్ కు పటియాలా హౌస్ కోర్టు ఊరటను ఇచ్చింది. మాజీ కేంద్ర మంత్రి శశీథరూర్ భార్య సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో శశీథరూర్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరయ్యింది. 2014లో జరిగిన సునంద పుష్కర్ మృతి కేసులో భర్త శశీ థరూర్ కు రూ.లక్ష పూచీ కత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ 2014 జనవరి 17న ఢిల్లీ చాణక్యపురిలోని లీలా ప్యాలెస్ హోటల్‌కు చెందిన 345 గదిలో సునందా పుష్కర్ అనుమానాస్పదంగా చనిపోయారు.

కుప్ప కూలిన సీబీఎస్ బస్ షెడ్..

హైదరాబాద్ : నగరంలోని గౌలిగూడలో వున్న పురాతనమైన ఎంజీబీఎస్ బస్ స్టేషన్ షెడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిజాం పాలకుల నాటి కాలంలో నిర్మించిన సీబీఎస్ బస్ స్టేషన్ కూలిపోయింది. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నిర్మించకముందకు ఈ సీబీఎస్ బస్ స్టేషన్ నుండే బస్సులు రాకపోకలు కొనసాగిస్తుండేవి. కాగా ఈ షెడ్ కూలిపోయిన సమయంలో ప్రయాణీలు ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. 

11కు చేరిన అమర్ నాథ్ మృతుల సంఖ్య..

జమ్ము కశ్మీర్ : అమర్ నాథ్ యాత్ర కోసం వెల్లి వాతావరణం అనుకూలించకపోవటంతో కష్టాల పాలైయి..ఆరోగ్యం పోగొట్టుకునే పరిస్థితుల్లో వున్న యాత్రీకుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతికూల వాతావరణానికి తట్టుకోలేక ఇప్పటి వరకూ 11మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తెలుగువారు కూడా వున్నారు. కాగా తెలుగువారిని కాపాడేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు ముమ్మరంగా చర్యల్ని చేపట్టారు. కాగా ఏపీ భవన్ నుండి నలుగురు అధికారులు నేపాల్ కు చేరుకున్న నేపథ్యంలో తెలుగువారి కోసం సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.

10:18 - July 5, 2018

బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా...అతి పెద్ద మున్సిపాల్టీగా బెల్లంపల్లి ఉంది. మున్సిపాల్టీలో అధికార పార్టీకి అసమ్మతి బెడద పెరిగిపోతోంది. బెల్లంపల్లి రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు ప్రతిపక్ష కౌన్సిలర్లతో చేతులు కలుపుతూ ఛైర్ పర్సన్ కు చెక్ పెట్టేందుకు సిద్ధమౌతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత ఇందుకు వ్యూహాలు రచించినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం బెల్లంపల్లిలో గ్రూపు పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పవచ్చు. 29 మంది టిడిపి, కాంగ్రెస్, సీపీఐ కౌన్సిలర్లు సునీతారెడ్డిపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. వీరందరినీ ఓ కౌన్సిలర్ భర్త క్యాంపుకు తరలించినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా వీరంతా క్యాంపులోనే ఉంటున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. కానీ వారంతా సునీతారెడ్డిపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమౌతున్నట్లు సమాచారం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇక లాభం లేదనుకుని బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. తన తండ్రి కిడ్నాప్ కు గురయినట్లు 18వ వార్డు రాములు తనయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో కౌన్సిలర్ భర్త అయిన రమేశ్ పై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కౌన్సిలర్ కూతురికి ఫోన్ చేసి బెదిరించిన వాయిస్ రికార్డు టెన్ టివికి చిక్కింది. ఛైర్ పర్సన్ భర్త వ్యవహార శైలి దీనికంతటికీ కారణమని తెలుస్తోంది. మరి క్యాంపు రాజకీయాలకు అధిష్టానం చెక్ పెడుతుందా ? లేక కీలక నేతకు తలొగ్గుతుందా ? అనేది చూడాలి.

 

బెల్లంపల్లి మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు..

నిర్మల్ : బెల్లంపల్లి మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓ కౌన్సిలర్ భర్త ఆధ్వర్యంలో రహస్య ప్రాంతంలో క్యాంపు రాజకీయాలకు తెరతీసారు. కొనసాగుతున్నాయి. 10 రోజులుగా క్యాంపులోనే వుండి 29మంది టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ కౌన్సిలర్లు రాజకీయాలను నడుపుతున్నారు. చైర్ పర్సన్ సునీతరాణిపై అవిశ్వాసానికి మెజార్జీ కూడగట్టేందుకు ఈ 29మంది కౌన్సిలర్లు ప్లాన్ వేస్తున్నారు. ఓ కౌన్సిలర్ కుమార్తెతో ఓ ఎమ్మెల్యే మాట్లాడిన ఓ ఆడియో వైరల్ గా మారింది. దీంతో చైర్ పర్సన్ సునీతరాణిపై అవిశ్వాసం ఇచ్చే అవకాశాలున్నట్లుగా సమాచారం. 

'బ్యాంక్‌ ఆఫ్‌ చైనా'కు లైన్ క్లియర్..

ఢిల్లీ : చైనా ప్రభుత్వ రంగ దిగ్గజం 'బ్యాంక్‌ ఆఫ్‌ చైనా' త్వరలోనే భారత్‌లో తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈమేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లైసెన్స్‌ జారీ చేసింది. ఇప్పటికే 'ఇండస్ట్రీయల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్ ఆఫ్‌ చైనా లిమిటెడ్‌' భారత్‌లో పనిచేస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిపిన చర్చల్లో బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ప్రస్తావన రాగా, ఆ బ్యాంక్‌ కార్యకలాపాలు జరిపేందుకు అనుమతినిస్తామని మోదీ హామీ ఇచ్చారు.

పైలేరియా బాధితులకు మధు పరామర్శ..

విజయనగరం : జిల్లాలో ప్రబలిన పైలేరియా వ్యాధిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. పైలేరియా ప్రబలిన బలిజపేట మండలం పెదపంకిలో పార్టీ నాయకులతో కలిసి మధు పర్యటించారు. బాధితులను, వారి కుటుంబాలను పరామర్శించారు. వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పైలేరియా ప్రబలడానికి గల కారణాలపై అధ్యయనం చేయాలని కోరారు. గ్రామస్థులు పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పెదపంకిలో 500 మందికి వ్యాధి ప్రబలిందని అధికారులు చెబుతున్నా...

మన్యం వీరుడి విషయంలో లాలూచీ రాజకీయాలు : బాబు

అమరావతి : ఆంగ్లేయుల పాలనపై పోరాడిన అల్లూరి సీతారామారాజుకు వ్యతిరేకంగా.. ఆనాడు కూడా కొందరు వ్యక్తులు లాలూచీ రాజకీయాలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అల్లూరి సీతారామారాజు జయంతి సందర్భంగా సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తాము అల్లూరి స్పూర్తితో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పోరాడుతుంటే.. కొందరు లాలూచీ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. 

09:55 - July 5, 2018

ఢిల్లీ : అమర్ నాథ్ యాత్ర పలువురి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. భారీ వర్షాలు కురుస్తుండడం..ప్రతికూల వాతావరణానికి తట్టుకోలేక పలువురు మృత్యువాత పడుతున్నారు. కొండచరియలు విరిగిపడుతుండడం కూడా మరణాలకు కారణమౌతున్నాయి. ఇప్పటి వరకు యాత్రలో 11 మంది మృతి చెందారు. ఇందులో తెలుగు వారు ముగ్గురున్నారు. రెండు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోటరత్నం మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా తణుకు పట్టణానికి చెందిన చీమకుర్తి సత్యనారాయణ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. అలాగే హైదరాబాద్ కు చెందిన లక్ష్మీ కన్నుమూసింది.

ఇదిలా ఉంటే భారీ వర్షాలు కురుస్తుండడంతో అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. తెలుగు యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిల్సా, సిమికోట్ నుండి కొంతమందిని నేపాల్ గంజ్ కు తరలిస్తున్నారు. నేపాల్ గంజ్ నుండి ఢిల్లీకి తీసుకొచ్చేందుకు ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

జేఎన్టీయూలో వర్శిటీ సిబ్బంది చీట్ల పేకాటలు..

తూర్పుగోదావరి : కాకినాడ జేఎన్టీయూలో.. వర్శిటీ సిబ్బంది పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇందులో ఐదుగురు రెగ్యూలర్ సిబ్బందితో పాటు ఒక రిటైర్డ్‌ ఉద్యోగి,ఓ కాంట్రాక్ట్‌ సిబ్బంది ఉన్నారు. వర్శిటీ రిక్రియేషన్‌ హాలులో పేకాట ఆడుతుండగా సర్పవరం పోలీసులు వీరిని అరెస్ట్‌ చేశారు. మరోవైపు వర్సిటీ సిబ్బంది నిర్వాహకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతారాహిత్యంగా ప్రవరిస్తూ వర్శిటీని జూద కేంద్రంగా మార్చారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. జేఎన్టీయూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

11కు చేరిన బాణసంచా అగ్నిప్రమాద మృతుల సంఖ్య..

వరంగల్‌ : జరిగిన భారీ అగ్నిప్రమాదం.. పన్నెండు నిండు ప్రాణాలను బలిగొంది. బాణసంచా నిల్వ ఉంచిన గోడౌన్‌లో మంటలు చెలరేగి.. భారీ పేలుడు సంభవించింది. దీంతో 11 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలు గుర్తించడానికి వీల్లేని విధంగా ఛిద్రమయ్యాయి. ఘటనపై ముఖ్యమంత్రి సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని ప్రకటించారు.

కన్నాపై టీడీపీ చెప్పులు..

నెల్లూరు : టీడీపీ, బీజేపీ మధ్య రోజురోజుకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నెల్లూరు జిల్లా కావలిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీంతో బీజేపీ కార్యకర్తలు చెప్పు విసిరిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పీఎస్‌ ఎదుట బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. 

అన్నీ ఇచ్చేసామన్న కేంద్రం..చంద్రబాబు సమీక్ష..

అమరావతి : సుప్రీంకోర్టు సాక్షిగా.. కేంద్రం అబద్ధాలు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి.. విభజన చట్టంలోని అన్ని హామీలనూ నెరవేర్చేశామని, ఇక చేయాల్సింది ఏమీ లేదని అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్‌ ఇప్పుడు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రైల్వే జోన్‌ కోసం.. కడప ఉక్కు కోసం పోరాటాలు జరుగుతున్న తరుణంలోనే కేంద్రం అఫిడవిట్‌ గురించిన సమాచారం వెలుగు చూడడంతో.. ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులోని మంత్రులతో భేటీ అయి సమీక్ష జరిపారు. 

పసికందును అపహరించిన మహిళ నయనారాణి అరెస్ట్..

హైదరాబాద్ : నగరంలోని కోఠి ప్రసూతి ఆసుపత్రిలో ఆరు రోజుల పసికందును అపహకరించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసవం తరువాత కదలలేని స్థితిలో వున్న మహిళకు పుట్టిన ఓ పసికందును నయనారాణి అపహరించటం..ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు పసికందు కోసం తీవ్రంగా గాలించి ఎట్టకేలకు తల్లి ఒడికి చేర్చారు అనంతరం పసికందుకు అపహకరించిన మహిళా నయానారాణిని..ఆమెతో పాటు మరో నలుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ లో నయనారాణికి సహకరించిన మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు.

ఐదు రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత..

తిరుమల : పుష్కరానికి ఓమారు జరిగే అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు నెలల 5 రోజుల పాటు తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శనం పూర్తిగా రద్దు కానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రతి 12 సంవత్సరాలకూ ఓసారి మహా సంప్రోక్షణ జరుగుతుండగా, చివరిగా 2006లో ఈ క్రతువు జరిగింది. ఇందులో భాగంగా వైఖానస ఆగమ నిబంధనల మేరకు గర్భాలయం, ఆనందనిలయం చుట్టూ పలు కార్యక్రమాలు జరుగుతాయి. గర్భగుడిలో మరమ్మతులను స్వయంగా అర్చకులే చేస్తారు. కాగా గతంలో ఆలయాన్ని గంటల తరబడి మూసివేసినా, పరిమిత సమయం పాటు భక్తులకు దర్శనాన్ని కల్పించేవారు.

09:19 - July 5, 2018

ఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్‌లో నేత‌ల కుమ్ములాట‌ల‌పై హైక‌మాండ్ అల‌ర్ట్ అయ్యింది. నాయకులను గాడిలో పెట్టక పోతే .. వచ్చే ఎన్నికల్లో పార్టీ పుట్టి మునుగుతుంద‌ని భావిస్తున్న డిల్లీ పెద్దలు నేరుగా రంగంలోకి దిగారు. అసంతృప్తి నేత‌ల‌తో విడివిడిగా మంత‌నాలు జ‌రుపుతున్నారు. కస్సుబుస్సు నేతలకు స‌మ‌న్వయ మంత్రాన్ని ఉప‌దేశిస్తూ రాహుల్‌దూతలు బిజీగా ఉన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య కస్సుబుస్సుల పంచాయతీలు హైకమాండ్‌ను కలవరపెడుతున్నాయి.  ఓ వైపు ముంద‌స్తు ఎన్నికల  ఘంటిక‌లు మ్రోగుతుండ‌టంతో అసంతృప్త సెగలను చల్లబరిచేందుకు ఢిల్లీనాయకత్వం రంగంలోకి దిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో  అధికారం సాధించాలని పట్టుదలగా ఉన్న హస్తం పెద్దలు దూకుడు నేతలకు కళ్లెంవేసే వ్యూహాన్ని  అమల్లో పెట్టారు. 

ఇటివ‌ల టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు వ్వతిరేకంగా కొంద‌రు నేత‌ల సీక్రెట్ గా మీటింగ్‌ పెట్టడంపై డిల్లీ పెద్దలు సిరియ‌స్ అవుతున్నారు. వ‌రుస‌గా జ‌రుగుతున్న ఈ భేటిల‌పై ఆరా తీసిన రాహుల్ కార్యాల‌యం.. నేత‌ల అభిప్రాయాల‌ను వినాల‌ని నిర్ణయించింది. ఇప్పటికే ర‌హ‌స్య భేటిలు పెట్టుకున్న నేత‌లు రాహుల్ అపాయింట్ మెంట్ కోరిన నేప‌థ్యంలో .. ఆ భేటికంటే ముందే అసంతృప్త నేత‌ల మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు ఢిల్లీ దూతలు.  

అసంతృప్తి నేత‌ల‌తో వ‌రుస‌గా మూడు రోజులుగా సంప్రదింపులు సాగిస్తున్న అధిష్టానం దూతలు స‌లిం అహ్మద్, బోస్ రాజు,శ్రినివాస‌న్ లు.  అసంతృప్త నేతల అభిప్రాయాల‌ను క్రోడీక‌రించి ఓ నివేదిక‌ను రాహుల్ గాంధీ కి అందించనున్నారు. అయితే ఎన్నిక‌ల సీజ‌న్ మొద‌లైయ్యిన వేళ... పీసీసీ మార్పు అంశం స‌రికాద‌ని చెబుతున్న హైక‌మాండ్ దూత‌లు .. నేత‌ల ప‌ద‌వుల పంప‌కాల్లో అంద‌రినీ సంతృప్తిప‌రిచేలా నిర్ణయాలు ఉంటాయంటున్నారు.  టికెట్ల కేటాయింపులో ఎవ‌రి డిమాండ్స్ ఏంటీ ..? ఎవ‌రికి ఏ ప్రాంతంలో బ‌ల‌ముంది .. ?ఎవ‌రికి ఎక్కడ ప్రాధాన్యత క‌ల్పించాల‌నే అంశంలో డిల్లీ దూత‌లు క్లీన్ గా అబ్జ‌ర్వు చేస్తున్నట్లు స‌మాచారం.

నాయ‌కుల మ‌ద్య స‌మ‌న్వయం కుద‌ర్చడ‌మే ప్రధాన ఎజెండాగా సాగుతున్న ఏఐసీసీ కార్యద‌ర్శుల మంత్రాంగం .. రాహుల్ సందేశాన్ని నేత‌ల‌కు ఇంజెస్ట్ చేసే ప్రయ‌త్నం చేస్తున్నారు . ఏఐసీసీ దూత‌ల‌తో భేటి అయ్యిన వారిలో రేవంత్ రెడ్డి .. డీకే అరుణ .. కోమ‌టి రెడ్డి .. శ్రీ‌ధ‌ర్ బాబు .. భ‌ట్టి విక్రమార్కల‌తో పాటు మ‌రికొంద‌రు ఇత‌ర నేత‌లు ఉన్నారు . అయితే .. రాష్ట్ర స్థాయిలో అసంతృప్తి నేత‌ల అభిప్రాయాల‌ను తెల‌సుకుంటూనే .. క్షేత్రస్థాయిలో ద్వితీయ‌శ్రేణి నేత‌ల అభిప్రాయాల‌ను కూడా తెలుసుకునేందుకు రెడీ అవుతోంది  రాహుల్ టీమ్‌. 

మొత్తానికి నేత‌ల అసంతృప్తి జ్వాల‌లు భ‌విష్యత్తు కు ప్రమాధ ఘ‌టిక‌లు మోగిస్తుండ‌టంతో అల‌ర్టయిన హైక‌మాండ్ ఆప‌రేష‌న్ షురూ చేసింది. అయితే  ఈ డిల్లీ ఆప‌రేష‌న్ మంత్రాంగానికి అసంతృప్త నేత‌లు ఏమేర‌కు మొత్తబ‌డ‌తారో అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది. 

జమ్మలమడుగులో ఎన్టీఆర్ గృహాల ప్రారంభం...

కడప : జమ్మలమడుగు (మం) మోరగుడిలో ఎన్టీఆర్ గృహాలను మంత్రి ఆది నారాయణరెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహాలను ప్రారంభించనున్నారు. 

అమర్ నాథ్ యాత్రలో గుండెపోటుతో తణుకు వాసి మృతి...

పశ్చిమగోదావరి : తణుకుకు చెందిన చీమకుర్తి సూర్యనారాయణ (63) అమర్ నాథ్ యాత్రలో గుండెపోటుతో మృతి చెందాడు. 

08:55 - July 5, 2018

ఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తన భార్య సునంద పుష్కర్‌ మృతి కేసులో శశిథరూర్‌ ముందస్తు బెయిల్‌ కోరుతూ వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. శశిథరూర్‌కు బెయిల్‌ మంజూరు చేస్తే ఆయన దేశం విడిచి వెళ్లే ప్రమాదం ఉందని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. వాదోపవాదాలు విన్న అనంతరం ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌ తీర్పును రిజర్వ్‌లో పెట్టారు. దీనిపై గురువారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని, హింసించారని శశిథరూర్‌పై ఆరోపణలున్నాయి. సునంద పుష్కర్‌ 2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్‌ గదిలో మృతి చెందారు.

08:27 - July 5, 2018

ఢిల్లీ : మానస సరోవర్ యాత్రలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతికూల వాతావరణంతో యాత్రికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. గురువారం కొంత వాతావరణం అనుకూలించడంతో విమానాలను భారీగా ఏర్పాటు చేసి యాత్రికులను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిల్సా, సిమికోట్ నుండి కొంతమందిని నేపాల్ గంజ్ కు తరలిస్తున్నారు. నేపాల్ గంజ్ నుండి ఢిల్లీకి తీసుకొచ్చేందుకు ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

08:26 - July 5, 2018

హైదరాబాద్ : పసికందును కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కోఠి ప్రసూతి ఆసుపత్రిలో ఆరు రోజుల పసికందును అపహరణకు గురైన సంగతి తెలిసిందే. పసికందును రక్షించిన పోలీసులు కిడ్నాప్ చేసిన మహిళ కోసం బీదర్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. పసికందును అపహరించిన మహిళ పేరు నావికా రాణి అని తేలింది. ఈమె ఓ ఇంట్లో తలదాచుకుందని పోలీసులు గుర్తించి దాడి చేశారు. అనంతరం ఆమెతో పాటు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని తెల్లవారుజామున 3.20గంటలకు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను కమిషనర్ అంజనీకుమార్ మీడియాకు తెలియచేయనున్నారు. ఇప్పటికే పసికందును పోలీసులు మాతృమూర్తికి అప్పగించిన సంగతి తెలిసిందే. 

మేయర్ లక్ష్మీనారాయణ రాజీనామా ?

పెద్దపల్లి : రామగుండం మేయర్ లక్ష్మీ నారాయణపై ఎమ్మెల్యే సోమరపు వర్గీయులు అవిశ్వాసం ప్రకటించనున్నారు. నేడు పెద్దపల్లి కలెక్టర్ కు అవిశ్వాసం లేఖను అందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనితో మేయర్ లక్ష్మీనారాయణ రాజీనామా చేసే యోచన చేస్తున్నట్లు సమాచారం. 

మూడు లక్షల గృహా ప్రవేశాలు...

విజయవాడ : నేడు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహ ప్రవేశాలు జరుగనున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుండి ఎన్టీఆర్ గృహాల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. 

జమ్మూకు రాజ్ నాథ్...

ఢిల్లీ : నేడు జమ్మూ కాశ్మీర్ లో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ పర్యటించనున్నారు. అమర్ నాథ్ మంచులింగాన్ని దర్శించుకోనున్నారు. కాశ్మీర్ లో పరిస్థితులపై సమీక్షించనున్నారు. 

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి - జనసేన...

హైదరాబాద్ : వరంగల్ జిల్లా కోటిలింగాల వద్ద చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలతో 11 మంది కార్మికులు మృత్యువాత పడడం పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ సంతాపం వ్యక్తం చేశారు. బాణాసంచా గోదాములో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఇలాంటి దుర్ఘటనలకు తావు లేకుండా కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

06:35 - July 5, 2018

బీసీలను ఏబీసీడీలుగా వర్గీకరించి వారికి బీసీ రిజర్వేషన్లు పంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ఎంబీసీ సంఘం డిమాండ్‌ చేస్తోంది. ఈ అంశాన్ని కోర్టు వరకూ తీసుకెళ్లింది. ఇప్పటికీ స్థానిక సంస్థల్లో అధికారాన్ని అందుకోలేని బీసీ కులాలు చాలా ఉన్నాయని వారికి కూడా అధికారంలో సమాన అవకాశాలు దక్కాలని వారు కోరుతున్నారు. ఇదే డిమాండ్‌తో ఎంబీసీ సంఘం ఆందోళన చేస్తోంది. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ ఎంబీసీ సంఘం నాయకులు ఆశయ్య విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:28 - July 5, 2018

విజయవాడ : ఆంగ్లేయుల పాలనపై పోరాడిన అల్లూరి సీతారామారాజుకు వ్యతిరేకంగా.. ఆనాడు కూడా కొందరు వ్యక్తులు లాలూచీ రాజకీయాలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తాము అల్లూరి స్పూర్తితో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పోరాడుతుంటే.. కొందరు లాలూచీ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. 

06:27 - July 5, 2018

తూర్పుగోదావరి : కాకినాడ జేఎన్టీయూలో.. వర్శిటీ సిబ్బంది పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇందులో ఐదుగురు రెగ్యూలర్ సిబ్బందితో పాటు ఒక రిటైర్డ్‌ ఉద్యోగి, ఓ కాంట్రాక్ట్‌ సిబ్బంది ఉన్నారు. వర్శిటీ రిక్రియేషన్‌ హాలులో పేకాట ఆడుతుండగా సర్పవరం పోలీసులు వీరిని అరెస్ట్‌ చేశారు. మరోవైపు వర్సిటీ సిబ్బంది నిర్వాహకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతారాహిత్యంగా ప్రవరిస్తూ వర్శిటీని జూద కేంద్రంగా మార్చారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. జేఎన్టీయూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 

06:24 - July 5, 2018

విజయవాడ : టీడీపీ, బీజేపీ మధ్య రోజురోజుకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నెల్లూరు జిల్లా కావలిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీంతో బీజేపీ కార్యకర్తలు చెప్పు విసిరిన వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పీఎస్‌ ఎదుట బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.

తనపై జరిగిన దాడిపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆధరణను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. ఈ దాడి వెనుక టీడీపీ పెద్దలు ఉన్నట్టు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

రైతులకు భారీ నజరానా...

ఢిల్లీ : 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రభుత్వం రైతులకు భారీ నజరానా ప్రకటించింది. ఖరీఫ్‌ పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ ప్రధాని మోది అధ్యక్షతన జరిగిన కాబినెట్‌ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. 

రెండు రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శుల సమావేశం...

హైదరాబాద్ : నేడు రెండు రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శుల సమావేశం జరుగనుంది. టీచర్లు, లెక్చరర్లు బదిలీల వ్యవహారంపై చర్చించనున్నారు. 

కోర్టుకు అగ్రిగోల్డ్ నిందితులు...

విజయవాడ : ఏలూరు కోర్టుకు అగ్రిగోల్డ్ నిందితులను ప్రవేశ పెట్టనున్నారు. హైదరాబాద్ లో బుధవారం ఇద్దరినీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 

నేడు వరంగల్ లో జనచైతన్య యాత్ర...

వరంగల్ : బీజేపీ జనచైతన్య యాత్ర కొనసాగుతోంది. వరంగల్ జిల్లాలో యాత్ర జరుగనుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ యాత్రలో పాల్గొననున్నారు. 

ఇండియా రావడం లేదన్న జకీర్ నాయక్...

ఢిల్లీ : తాను ఇండియాకు తిరిగి వస్తున్నానంటూ వస్తున్న వార్తలపై వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్ స్పందించారు. తాను ఇండియాకు తిరిగి రావడం లేదని ఆయన స్పష్టం చేశారు. తన పట్ల భారత ప్రభుత్వం న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్న భరోసా కలిగినపుడు మాత్రమే స్వదేశానికి తిరిగి వస్తానని తెలిపారు.

రిజర్వులో శశి థరూర్ బెయిల్ పిటిషన్..

ఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తన భార్య సునంద పుష్కర్‌ మృతి కేసులో శశిథరూర్‌ ముందస్తు బెయిల్‌ కోరుతూ వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. శశిథరూర్‌కు బెయిల్‌ మంజూరు చేస్తే ఆయన దేశం విడిచి వెళ్లే ప్రమాదం ఉందని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. 

Don't Miss