Activities calendar

06 July 2018

22:07 - July 6, 2018

కర్నూలు : ఏపీలో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కర్నూలు జిల్లాలో మెడికో ఆత్మహత్యకు పాల్పడగా తిరుపతిలో ఇంటర్మీడియట్‌ విద్యార్థిని సూసైడ్‌ చేసుకుంది. అయితే ఈ రెండు మరణాల వెనుక కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

చదువుల ఒత్తిడో, ర్యాగింగ్‌ భూతమో తెలీదు కాని ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కాలేజీ హాస్టల్‌లోనే  ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఒకరు కర్నూలు మెడికల్‌ కాలేజీ విద్యార్థి హర్షప్రణీత్‌రెడ్డి అయితే మరొకరు తిరుపతిలో ఇంటర్మీడియట్‌ చదువుతోన్న విద్యార్థిని శృతి. 

అయితే కర్నూలు జిల్లా మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ విద్యార్థి హర్షప్రణీత్‌రెడ్డి ఆత్మహత్య కలకలం రేపింది. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న హర్షప్రణీత్‌రెడ్డి మెడికల్ కాలేజ్‌ హాస్టల్‌ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రి వర్గాలు విద్యార్థి ఆత్మహత్యను గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశాయి. అయితే తన కొడుకుది ఆత్మహత్య కాదు ముమ్మాటికీ హత్యే అంటున్నాడు హర్ష తండ్రి రామాంజనేయరెడ్డి. డాక్టర్‌ అవ్వాలన్న సంకల్పంతో ఎంబీబీఎస్‌ చదువుతున్న విద్యార్థి బలవన్మరణం చెందడం వెనుక అనేక అనుమానాలు బీజం పోసుకుంటున్నాయి. 

హర్షప్రణీత్‌ మరణానికి బాధ్యులైన వారిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. తిరుపతిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్‌ విద్యార్థిని శృతి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్‌మీడియట్‌ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది శృతి. అయితే కళాశాల వేధింపులే శృతి ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అకస్మాత్తుగా తమ కూతురు విగత జీవిగా పడి ఉండడం చూసి శృతి తల్లిదండ్రులు
కన్నీరుమున్నీరయ్యారు. కళాశాల వేధింపులే శృతి ఆత్మహత్యకు కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. శృతి మరణానికి కారణమైన కాలేజీని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేశాయి.

22:03 - July 6, 2018

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కేసులో రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత విధుల నుంచి తొలగించిన ఐదుగురు పోలీసులలో ఇద్దరి పై సస్పెన్షన్‌ ఎత్తివేశారు. మిగతా ముగ్గురి పై సస్పెన్షన్‌ అలాగే కొనసాగుతుంది. సస్పెన్షన్‌ నుంచి బయటపడ్డ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌ , ఏసీపీ శ్రీనివాస్‌లు డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేశారు.    

 

22:01 - July 6, 2018

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ లో కాల్పులు కలకలం రేపాయి. ప్రశాసన్‌నగర్‌లో కానిస్టేబుల్‌ కిషోర్‌ ఏకే 47తో కాల్పుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.  వెంటనే తేరుకున్న పోలీసులు కిషోర్‌ను  ఆస్పత్రికి తరలించారు. కిషోర్‌కు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రిటైర్డ్‌ డీజీ ఆర్‌.పి.మీనా వద్ద పనిచేస్తున్న కానిస్టేబుల్‌ కిషోర్‌.. ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యా యత్నం చేశారని పోలీసులు తెలిపారు.  

 

21:57 - July 6, 2018

సిద్ధిపేట : దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేటలో మొత్తం 4600 ఇళ్లకు గాను... 3500 ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యాయన్నారు. ఇళ్ల నిర్మాణంలో రాజకీయాలకు, ఫైరవీలకు తావులేకుండా చూస్తామన్నారు. అర్హులైన వారిని గుర్తించి రాజకీయాలకు తావులేకుండా పంపణీ చేస్తామన్నారు. అధికారులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను హరీష్‌రావు ఆదేశించారు. 

 

21:56 - July 6, 2018

హైదరాబాద్ : బీసీ, ఎంబీసీలకు స్వయం ఉపాధి పథకాలు వెంటనే అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థికసాయం అందించే కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలన్నారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ప్రకారం కార్యక్రమాలు అమలుచేయనున్నట్లు సీఎం తెలిపారు. వెనుబడిన తరగతుల వారికి  లక్ష, నుంచి  2 లక్షల విలువ చేసే యూనిట్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు.ఈనెల 9న జరగనున్న కేబినెట్‌ భేటీలో దీనిపై సమగ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈఏడాది చేపట్టనున్న  హరితహారం కార్యక్రమంపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతీ గ్రామంలో నర్సరీ పెంచాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి 10 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో  హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. 

 

21:48 - July 6, 2018

విజయవాడ : కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు భగ్గుమన్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ... కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు నిర్వహించి తమ నిరసనను తెలియజేశాయి. ఏపీలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేమని సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేయడంపై ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. 

ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రం వైఖరికి నిరసనగా విజయవాడ లెనిన్ సెంటర్‌లో సిపిఐ, సిపియం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయటాన్ని నిరసిస్తూ కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు నేతలు. మోడి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని అన్ని విధాలుగా మోసిగించిందని సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆరోపించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై వామపక్షపార్టీలు రాజీలేని పోరాటం కొనసాగిస్తాయన్నారు. 

విశాఖలో వామపక్షాలు కేంద్రంపై అసహనం వ్యక్తం చేశాయి. ఏపీకి బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తుందని.....కేంద్రం బూటకపు అఫిడవిట్‌తో కోర్టును తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు సీపీఎం నేత నరసింగారావు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ మోసాలను గ్రహిస్తున్నారని...ప్రజాగ్రహానికి కేంద్రం భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. 

విభజన చట్టంలో ఇచ్చిన విధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు అఖిలపక్షం నేతలు. ఆ తర్వాతే జిల్లాలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అడుగుపెట్టాలని లేని పక్షంలో ఆయనకు చెప్పులతో స్వాగతం పలుకుతామని నేతలు హెచ్చరించారు. ఈ మేరకు కేంద్రం తీరుపై జిల్లాలోని అంబేద్కర్‌ కూడలి వద్ద సీపీఐ, సీపీఎం, జనసేన నాయకులు నిరసన తెలియజేశారు. 

ప్రత్యేక హోదా విషయంలో ఏపీని మోసం చేసిన కేంద్రం.... సుప్రీం కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి మోసగిస్తుందని ఆరోపించారు లెఫ్ట్ పార్టీనేతలు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రామలక్ష్మణ కూడలి వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కేంద్రం దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. 

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరిపై రాజమండ్రిలో వామపక్షాలు రోడ్డెక్కాయి. బీజేపీ తీరుని నిరసిస్తూ సీపీఎం, సీపీఐ పార్టీలు ఆందోళన నిర్వహించాయి. కంబాల చెరువు వద్ద దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించిన సమయంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు వామపక్షనేతలు. కాకినాడలోనూ లెఫ్ట్‌ పార్టీ నేతలు కదం తొక్కారు. రాష్ట్రాన్నే కాదు సుప్రీం కోర్టును కూడా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

21:46 - July 6, 2018

గుంటూరు : విభజన చట్టంలోని హామీలను సాధించేందుకు ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యంకాదంటూ  కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై  సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. దీనికోసం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేయాలని మంత్రివర్గభేటీలో డెసిషన్‌ తీసుకున్నారు. 

రాష్ట్ర విభజన హామీల అమలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో భేటీ అయిన ఏపీ మంత్రిమండలి విభజన హామీల అమలుకోసం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై న్యాయపోరాటం చేసేందుకు కేబినెట్‌ నిర్ణయించింది. విభజన హామీల సాధనకోసం  సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, ఇందుకోసం సొంతంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

విభజన హామీల సాధనతోపాటు రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును కూడా మంత్రివర్గ సమావేశంలో  సమీక్షించారు. ఈ భేటీలో ఏపీ జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ గృహనిర్మాణం, కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద జర్నలిస్ట్ హౌసింగ్ స్కీమ్‌ను చేర్చింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు అదనపు సబ్సిడీ లక్ష , పట్టణ, నగర ప్రాంతాల్లో ఇళ్లకు లక్షన్నర రూపాయలు  ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం గృహనిర్మాణ శాఖకు అదనంగా రూ.1500 కోట్లు ఇచ్చేందుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలను క్రమబద్దీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖలోని గాజువాక, కొమ్మాది, పరదేశీపాలెంలో పట్టణ గృహనిర్మాణ పథకం, వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీకి భూ సమీకరణ చేసేందుకు వుడాకు అనుమతిచ్చింది. రానున్న పార్లమెంట్‌ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచే వ్యూహాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమల్లో పెడుతోంది. దీన్లో  భాగంగానే విభజన హామీల అంశంపై సుప్రీంకోర్టు తలుపు తడుతున్నట్టు తెలుస్తోంది.

బీసీ, ఎంబీసీల స్వయం ఉపాధి పథకాలను వెంటనే ప్రారంభించాలి : సీఎం కేసీఆర్

హైదరాబాద్ : బీసీలు, ఎంబీసీల స్వయం ఉపాధి పథకాలను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఉన్న వాటికి అదనంగా కొత్త రెసిడిన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు లక్ష్యంగా ఉందన్నారు.

తగరపువలసలో పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర

విశాఖ : తగరపువలసలో పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, జగన్ తనతో కలిసి ఉమ్మడి పోరాటం చేయగలరా అని సవాల్ విసిరారు. 19 మంది ఎంపీలు రాజీనామా చేయండి...మీతోపాటు నేనూ వస్తా రైల్ రోకో చేద్దాం.. అన్నారు. అవంతి, మురళీమోహన్ కు ప్రత్యేకహోదా, రైల్వే జోన్ అంటే హేళన అయిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ దోపిడీలే జరుగుతున్నాయని వాపోయారు. 

 

20:51 - July 6, 2018

అమెరికా, చైనా మధ్య ట్రెడ్ వార్ తీవ్రంగా కొనసాగుతోంది. 34 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై 25 శాతం తారీఫ్ లను విధిస్తూ అమెరికా ట్రెడ్ వార్ కు కాలుదువ్వగా.. చైనా కూడా తానేమాత్రం తక్కువకాదంటూ అమెరికా ఉత్పత్తులపై ట్రెడ్ వార్ కొనసాగిస్తోంది. ఈ దేశాల ట్రెడ్ వార్ గురించి ప్రపంచదేశాలు బెంబేలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ట్రెడ్ వార్ రెండు దేశాల మధ్య ఇలాగే కొనసాగితే ప్రపంచవాణిజ్యం మీద ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. వాణిజ్య యద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ? అసలు అమెరికా, చైనా ట్రెడ్ వార్ కు కారణం ఏమిటీ ? ఇదే అంశంపై ప్రత్యేకచర్చ కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు పాల్గొని, మాట్లాడారు. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

20:34 - July 6, 2018

చంద్రాలును చెండాడుతున్న పవనాలు..టీడీపీ అవినీతిని గల్లావట్టి అడ్గుతడంట, దేశంల మద్దతు ధరలిచ్చింది మనమే..ఏసీ రూంల సుఖేందర్ రెడ్డి అవద్దాలు, ఓట్లు నాయకులు ఏస్తున్న జనాలు..వానలకోసం దేవుని దిక్కు సూపులు, తెల్గురాష్ట్రాలను ఎక్కిరిస్తున్న వానలు..కరీఫ్ పంటలేశి కలవరపడ్తున్నరైతులు, హోంమంత్రి పర్సనల్ సెక్రేటరీ గారి కబ్జా..మందిని ముంచుతున్న ముకుందరెడ్డి, స్థానిక సంస్థల మీద కేసీఆర్ పగవట్టిండు.. పటేల్ పట్వారీ వ్యవస్థకు జీవంబోస్తుండు... ఈ అంశాలను మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

జూబ్లీహిల్స్ లో కాల్పులు కలకలం

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లో కాల్పులు కలకలం రేగింది. ఏకే 47 తో కానిస్టేబుల్ కిశోర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రిటైర్డ్ డీజీ ఆర్పీ మీనా వద్ద కానిస్టేబుల్ పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కానిస్టేబుల్ చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

 

అటవీ, విద్యాశాఖ అధికారులతో కడియం వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : విద్యాసంస్థల్లో హరితహారం కార్యక్రమం అమలుపై అటవీ, విద్యాశాఖ అధికారులతో కడియం శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

20:02 - July 6, 2018

2016 ఎంసెట్‌ 2 మెడిసిన్‌ స్కామ్‌లో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఈ కుంభకోణంలో శ్రీచైతన్య, నారాయణ కాలేజీలకు చెందినవారి హస్తం ఉన్నట్టు సీఐడీ తేల్చింది. ఈ మేరకు శ్రీచైతన్య కాలేజీల డీన్‌ వేలేటి వాసుబాబు, శ్రీచైతన్య, నారాయణ కాలేజీల ప్రధాన ఏజెంట్‌ కమ్మ వెంకట శివనారాయణలను సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. దీంతో  ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 90కి చేరింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్, టీఆర్ ఎస్ నేత, విద్యావేత్త శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నేత సతీష్ పాల్గొని, మాట్లాడారు. ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:56 - July 6, 2018

హైదరాబాద్ : 2016 ఎంసెట్‌ -2 మెడిసిన్‌ స్కామ్‌లో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఈ కుంభకోణంలో శ్రీచైతన్య, నారాయణ కాలేజీలకు చెందినవారి హస్తం ఉన్నట్టు సీఐడీ తేల్చింది. ఈ మేరకు శ్రీచైతన్య కాలేజీల డీన్‌ వేలేటి వాసుబాబు, శ్రీచైతన్య, నారాయణ కాలేజీల ప్రధాన ఏజెంట్‌ కమ్మ వెంకట శివనారాయణలను సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. దీంతో  ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 90కి చేరింది. 
ఎంసెట్‌ 2 కుంభకోణం వెనుక కార్పొరేట్‌ నీడలు 
2016 ఎంసెట్‌ 2 కుంభకోణం వెనుక కార్పొరేట్‌ నీడలు ఎట్టకేలకు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా సంచలం రేపిన ఈ స్కాంలో పేరు పొందిన రెండు కార్పొరేట్‌ కళాశాలలు నిజస్వరూపాన్ని సీఐడీ వెల్లడిచేసింది. శ్రీచైతన్య, నారాయణ కాలేజీలకు చెందినవారితోపాటు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు, లాయర్లు, డాక్టర్లు, దళారులున్నట్టు సీఐడీ తెలిపింది. 
విద్యార్థిని ఫిర్యాదుతో వెలుగు చూసిన స్కాం
జెఎన్‌టీయూకు చెందిన ప్రొఫెసర్‌ రమణారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరించిన ఎంసెట్‌ 2 మెడిసిన్‌ ఫలితాలు వెల్లడయ్యాక పేపర్‌ లీక్‌ అయ్యిందని, దీని కారణంగా మెరిట్‌ సాధించాల్సిన తన కూతురికి ర్యాంక్‌ తక్కువగా వచ్చిందంటూ వరంగల్‌కు చెందిన ఓ  విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. మొదట అసలు ఎలాంటి లీకులూ జరగలేదని తెలిపిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి.. తర్వాత సీఐడీ విచారణకు ఆదేశించడంతో దేశవ్యాప్తంగా విస్తరించిన ఎంసెట్‌ స్కాం గుట్టు రట్టయ్యింది. మొదట్లో ఈ స్కాంపై దూకుడుగా వ్యవహరించిన రాష్ట్ర సీఐడీ అధికారులు మొత్తం 88 మంది నిందితులను అరెస్టు చేశారు. తాజాగా మరో ఇద్దరు నిందితులు వాసుబాబు, వెంకట శివనారాయణలను అరెస్టు చేయడంతో నిందితుల సంఖ్య 90కి చేరింది. 
శ్రీచైతన్య 6 క్యాంపస్‌లకు డీన్‌గా వున్న వాసుబాబు 
హైదరాబాద్‌ కొత్తపేట్‌ మార్గదర్శి కాలనీ వాసి అయిన వాసుబాబు.. శ్రీచైతన్య కాలేజీకి చెందిన దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌ మొదలైన ఆరు క్యాంపస్‌లకు డీఎన్‌గా వ్యవహరిస్తున్నారు.  గుంటూరుకు చెందిన వెంకట శివనారాయణ శ్రీచైతన్యతో పాటు నారాయణ కాలేజీలకు రెండు రాష్ట్రాలలో విద్యార్థులను చేర్పించే ప్రధాన ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ స్కాంలో ఇదివరకే అరెస్టయిన డాక్టర్‌ ధనుంజయ తవకూర్‌, డాక్టర్‌ సందీప్‌కుమార్‌ల కాల్‌ డేటాను పరిశీలించిన సీఐడీ అధికారులు ఈ ఇద్దరు నిందితులు కూడా ఈ స్కాంలో పాత్రధారులేనని తేల్చింది. అయితే స్కాంలో ఎవరున్నా వదిలేది లేదని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి అన్నారు. 
ధనుంజయ, సందీప్‌లతో వాసుబాబు కాంటాక్ట్స్‌ 
ఎంసెట్‌ 2 పేపర్‌ను సాధించిన ధనుంజయ, సందీప్‌కుమార్‌లతో కాంటాక్ట్‌ అయిన వాసుబాబు, వెంకటశివనారాయణలు తమవైపు నుంచి ఆరుగురు విద్యార్థులను సమీకరించారు. భువనేశ్వర్‌లో ధనుంజయ ఏర్పాటు చేసిన ఎంసెట్‌ 2 పేపర్‌ ప్రిపరేషన్‌ క్యాంపునకు తమ ఆరుగురు విద్యార్థులను తరలించి శిక్షణ ఇప్పించారు. దీనికోసం ఒక్కో విద్యార్థి తల్లిదండ్రుల నుంచి 30 లక్షల చొప్పున రూపాయలను వసూలు చేశారని సీఐడీ విచారణలో తేలింది. ఆ డబ్బును ఎంసెట్‌ పరీక్ష ముగిసాక 2016 జూలై 13, 14 తేదీలలో హైదరాబాద్‌కు వచ్చిన ధనుంజయ, సందీప్‌కుమార్‌లకు వారి వాటాను అందచేసినట్టు బయటపడింది. 
ప్రతి పరీక్షలోనూ ఇదే భాగోతం !
ఎంసెట్‌ స్కాంలో శ్రీచైతన్య, నారాయణ కాలేజీల భాగోతాలు బయటపడ్డంతో.. అన్ని ప్రవేశపరీక్షల్లో ఈ రెండు కళాశాలలు సాధించిన ర్యాంకులపైన కూడా సీఐడీ  అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   ప్రస్తుతం వాసుబాబు, శివనారాయణలను అరెస్టు చేసిన దర్యాప్తు అధికారులు .. ఇంకా స్కాం మూలాలు ఎక్కడి వరకు ఉన్నాయనే దిశలో విచారణను కొనసాగిస్తున్నారు. వాస్తవానికి గతేడాది ఆర్‌బీ సింగ్‌ అనే బిహార్‌కు చెందిన వ్యక్తి అరెస్టుతో ఎంసెట్‌ 2 స్కాంలో ప్రధాన సూత్రధారి దొరకడంతో ఈ విచారణకు తెర పడినట్టేనని సీఐడీ వర్గాలు భావించాయి.   కాని సీఐడీ చీఫ్‌గా గోవింద్‌సింగ్‌ బాధ్యతలు చేపట్టాక అప్పటి వరకు జరిపిన విచారణలో ఉన్న లోపాల గురించి అంతర్గతంగా తిరిగి విచారణను సాగించారు. అలాగే మరోసారి ఎంసెట్‌ 2 పేపర్‌ ను ఎలా నిర్వహించింది, ఎక్కడ ప్రింటింగ్‌కు ఆర్డర్‌ ఇచ్చింది, అందుకు తీసుకున్న జాగ్రత్తలపై జెఎన్‌టీయూ ఎంసెట్‌ 2 కన్వీనర్‌ నుంచి వివరాలను సీఐడీ తిరిగి సేకరించింది. 
నిందితులకు రాజకీయ అండదండలు !
అయితే దాదాపు ఏడాది క్రితం ధనుంజయ, సందీప్‌కుమార్‌ల అరెస్టుల సందర్భంలోనే వారి కాల్‌ డేటా పరిశీలనతో వాసుబాబు, శివనారాయణల పాత్ర బయటపడినట్టు తెలుస్తోంది. అయితే వారిని అపుడే ఎందుకు అరెస్టు చేయలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక రాజకీయ ఒత్తిడులు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు ఎంసెట్‌ 2 పేపర్‌ ముద్రణ జరిగిన ఢిల్లీ సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ యాజమాన్య పాత్ర గురించి కూడా ఇంకా సీఐడీ లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అంటున్నారు. ఇప్పటికే విద్యారంగ౦ కార్పోరేట్ చేతుల్లో కీలుబొమ్మ లా మారిందని.. ర్యా౦కుల కోసం ఇలాంటి స్కా౦లు చేసి విద్యార౦గాన్ని మరింత దిగజారుస్తున్నారని మండిపడుతున్నారు. 
శ్రీచైతన్య, నారాయణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి : ప్రజలు
కాగా ఈ కుంభకోణంతో తమ వివ్యాసంస్థకు ఎలాంటి సంబంధం లేదని శ్రీచైతన్య విద్యాసంస్థల స్టేట్‌ కో ఆర్డినేటర్‌ నరేంద్రబాబు తెలిపారు. సీఐడీ అరెస్టు చేసిన వెంటనే డీన్‌ వాసుబాబును సస్పెండ్‌ చేశామని నరేంద్రబాబు తెలిపారు.  విద్యావ్యవస్థను బ్రష్టుపట్టిస్తున్న శ్రీచైతన్య, నారాయణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్‌లు వస్తున్నాయి. 

 

19:47 - July 6, 2018

హ్యట్రిక్స్ హిట్స్ తో కెరీర్ మొదలు పెట్టి, ఆ తరువాత దారితప్పి డబుల్ హ్యాట్రిక్ ప్లాప్ అంచున నిలిచిన మెగా మేనల్లుడు తేజ్ ఎలాగైనా హిట్ అందుకోవాలని, రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా చేసిన సినిమా తేజ్ ఐ లవ్ యు. మాస్ మూస నుండి బయట పడటానికి లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ అయిన కరుణాకరణ్ డైరక్షన్ లో ఈ సినిమా చేశాడు.. సీనియర్ అండ్ గుడ్ జడ్జిమెంట్ ఉన్న కె.ఎస్ రామారావు ఈ సినిమా నిర్మించడం.. ప్రొమోస్ అండ్ సాంగ్ టీజర్స్ గ్రాండీయర్ గా కనిపించడంతో తేజ్ ఐలవ్ యు పై ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి.. ప్రస్తుతానికి హిట్ అత్యవసరంగా మారిన టీంకు వాళ్ళు  అందరూ కలిసి చేసిన తేజ్ ఐ లవ్ యు ప్రేక్షకుల చేత ఐ లవ్ యు అనిపించుకుందా.లేక ఐ హేట్ యు అని రిజక్ట్ చేయబడిందా అనేది ఇప్పుడు చూద్దాం.. 
కథ.. 
 కథ విషయానికి వస్తే.. లండన్ నుండి ఇండియాకు వచ్చిన నందినిని చూసిన వెంటనే ఇష్టపడతాడు తేజ్.. అయితే ముందు తేజ్ ను ఆటపట్టించిన నందిని, అతని కేరింగ్ ను, సిన్ సియారిటీని చూసి లవ్ చేస్తుంది...  ఆ విషయం తేజ్ కి చెప్పడానికి వెళ్ళిన టైంలో.. యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోతుంది.. అసలు నందిని ఎవరు, ఆమె ఇండియాకు ఎందుకు వచ్చింది, మళ్ళీ ఆమెకు గతం గుర్తుకు వచ్చిందా లేదా.. తేజ్ లవ్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది మిగతా కథ.
నటీనటులు.. 
నటీనటుల విషయానికి వస్తే.. మొదటి నుండి మాస్ అని పరిగెత్తిన తేజుకు.. దానివల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదురౌతాయి అని తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది.. అందుకే మార్పు అనివార్యం అని గ్రహించి, ఇమేజ్ చేంజ్ ఓవర్ కోసం ఫ్యూర్ లవ్ స్టోరీని ఎంచుకున్నాడు.. అతని క్యారక్టర్ వరకు బాడీలాంగ్వేజ్ నుండి యాక్టింగ్ వరకు బాగానే డిజైన్ చేశాడు డైరక్టర్. తేజూ కూడా ఆ పాత్రను పండించడానికి సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు.. అయితే సినిమా మొత్తాన్ని టేకోవర్ చేసి నటిపించింది అనుపమా పరమేశ్వరన్.. క్యాట్ లుక్స్ కి తోడు, కాస్త బబ్లీ యాక్టింగ్ తో స్క్రీన్ పై మెరిసింది.. తేజ్ ఐ లవ్ యు కి మేజర్ ప్లస్ పాయింట్ అనుపమా పరమేశ్వరన్. లవ్ ఫీల్ ను కూడా 100% ఎక్స్ ప్రెసీవ్ గా పండించింది ఇన్నాళ్ళు ఉన్న ట్రెడిషన్ లుక్స్ కి.. కాస్త గ్లామర్ టచ్ కూడా ఇచ్చింది. ఇక హీరో ఫ్రెండ్ గ్యాంగ్ తమ ఇంట్లో లేడీస్ గ్యాంగ్ కాస్త కామెడీ పండించగలిగారు.. హీరోయిన్ తండ్రిగా అనీష్ కురువెళ్ళ, హీరో పెదనాన్నగా జయప్రకాశ్, సాదా సీదా పాత్రల్లో కనిపించారు.. హీరో బాబాయి పాత్రలో  పృథ్వీ, అతని భార్య పాత్రలో సురేఖావాణి.. ఎంటర్ టైన్మెంట్ తో  కాస్త నవ్వులు పూయించారు.. మిగతా వాళ్లు అంతా పాత్రల పరిది మేర అలా అలా నటించారు.. 
టెక్నీషియన్స్..  
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. తొలిప్రేమ, డార్లింగ్ అనే రెండు హిట్స్ తో వరుసగా సినిమాలు చేస్తున్న కరుణాకరణ్ ఆ రెండు సినిమాల్లో ఉన్న ఫీల్ లో పదోవంతుకూడా ఈ సినిమాలో పండించలేకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.. కథ లేని లవ్ ట్రాక్స్ ని కూడా అరెస్టింగ్ గా చెప్పగల కరుణాకరణ్ ఈ సినిమాలో మాత్రం మొదటి నుండి అవుట్ అవ్ ట్రాక్ లో నడిచాడు.. హీరో హీరోయిన్ కలిస్తే బావుండు అని ఆడియన్స్ ఫీలయ్యేలా ఒక్క సీన్ కూడా రాసుకోలేకపోయాడు.. అతి పలుచని కథ, కరుణాకరణ్ స్క్రీన్ ప్లేతో ఇంకా వీక్ గా తయారయ్యింది.. డార్లింగ్ స్వామి మాటలు కూడా, కథకు తగ్గట్టే సొ.. సోగా ఉన్నాయి.. ఈ సినిమాకు సంగీతం అందించిన గోపీ సుందర్ కాస్త మనసు పెట్టి ఆర్ ఆర్ ఇచ్చాడు అనిపిస్తుంది. పాటలు కూడా మెస్మరైజింగ్ గా లేకపోయిన. పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. ఆండ్రూ సినిమాటోగ్రాఫీ  సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది.. లిమిటెడ్ బడ్జెట్ లో కూడా క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. 
ఓవర్ ఆల్ గా.. 
ఓవర్ ఆల్ గా చెప్పాలిఅంటే కరుణాకరణ్ కసిగా, కెఎస్ రామారావు పకట్బందీగా, తేజ్ సిన్సియర్ గా చేసినా.. ఈ సినిమాలో ఉండాల్సిన ఫీల్ మిస్ అయ్యింది.. మిగిలిన అంశాలు.. హైలెట్ అయ్యాయి.. అసలే అయిదు ప్లాప్ లతో చాలా డల్ గా ఉన్న తేజు మార్కెట్ ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర సేవ్ చేయడం కాస్త కష్టమే. .. అటు యూత్ కి, ఇటు మల్టీప్లక్స్ ఆడియన్స్ కి మరో వైపు మాస్ ఆడియన్స్ కి ఎవరికీ కనెక్ట్ అయ్యే అంశాలు లేకుండా వచ్చిన తేజ్ ఐ లవ్ యు ఫైనల్ గా బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు నిలబడుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.. 
 
ప్లస్ పాయింట్స్
అనుపమ లుక్స్, నటన
మ్యూజిక్
సినిమాటోగ్రఫి
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్
వీక్ కథ
రొటీన్ స్ర్కీన్ ప్లే
ఫీల్ లేని లవ్ ట్రాక్
డ్రమటిక్ క్లైమాక్స్

రేటింగ్
1. 2.5 /  5

19:41 - July 6, 2018

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌ ఎండీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం రసాభాసాగా మారింది. శంషాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు లేక రోగులు అవస్థలు పడుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచులు, ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

19:39 - July 6, 2018

జగిత్యాల : ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది. అయితే అధికారులు, కాంట్రాక్టర్లు  నిధులు సద్వినియోగం చేయకుండా కాలయాపన చేయడంతో పాఠశాలలు శిథిలావస్థకు చేరుతున్నాయి.  ఇలాంటి పరిస్థితే జగిత్యాల జిల్లా ప్రభుత్వ పాఠశాల ఎదుర్కొంటోంది. 
భయం నీడలో విద్యార్థుల చదువు 
ఇదిగో ఇదే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వున్న ప్రభుత్వ పాఠశాల.. సుమారు 320 మంది విద్యార్థులు  ఇందులో చదువుతున్నారు. అయితే పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల చదువు భయం నీడన కొనసాగుతోంది.. పై కప్పు పెచ్చులుగా ఊడి పడుతుండటంతో ఎప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటు విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తున్నారు.
స్కూల్‌లో క్లాస్‌రూమ్‌లు లేవని విద్యార్థులు ఆందోళన
స్కూల్‌లో చదువుకునేందుకు క్లాస్‌రూమ్‌లు లేవని విద్యార్థులు వాపోతున్నారు. కూర్చొవడానికి బెంచీలు లేక సగానికి పై విద్యార్థులు నేలపై కూర్చుని పాఠాలు వింటున్నారు. ఓ వైపు ఎక్కడ పై కప్పు కూలుతుందోనని భయపడుతుంటే.. మరోవైపు చిన్న వర్షానికే నోట్‌ బుక్స్‌ తడిసి ముద్దవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో ఉండాల్సిన కనీస వసతులు త్రాగునీరు, మూత్రశాలలు, ఆడుకోవడానికి గ్రౌండ్‌  కూడా లేవని ఆందోళన చెందుతున్నారు.  తమ చదువులు ఎలా సాగుతాయని ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన భవన నిర్మాణం చేసి కనీస సౌకర్యాలు త్రాగునీరు, మూత్రశాలలను బాగు చేయించాలని అంటున్నారు. 
ఇప్పటి వరకు ప్రారంభం కాని నూతన భవన నిర్మాణం
1994 లో విద్యార్థుల సంఖ్య దృష్ట్యా అదనపు గదులను నిర్మించారు కానీ ఆ తరగతి గదులు చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్నాయి. ఆ తరువాత పాఠశాల నూతన నిర్మాణ భవనం కోసం రెండు సంవత్సరాల క్రితం రాష్ట్రీయ విద్యామిషన్‌ ద్వారా 40 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. కానీ ఇప్పటి వరకు భవన నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. స్థానిక అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నూతన భవన నిర్మాణం అటకెక్కిందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విమర్షిస్తున్నారు .
నిధులు వినియోగంలో అధికారులు కాలయాపన
ప్రభుత్వం ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తుంటే అధికారులు మాత్రం ఉన్న నిధులు వినియోగించకుండా కాలయాపన చేయడం విస్మయం కల్గిస్తుందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

 

19:35 - July 6, 2018

హైదరాబాద్ : ఏపీ విభజన హామీలపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయటం అన్యాయమన్నారు వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారధి. టీడీపీ నాలుగేళ్లు బీజేపీతో కలిసి ఉండి ఇప్పుడు పోరాటం చేస్తున్నట్లు డ్రామాలాడుతుందని మండిపడ్డారు. టీడీపీ నాలుగు సంవత్సరాల్లో ఏదో సాధించినట్లు మాట్లాడుతుందని విమర్శించారు. వైసీపీ గురించి మాట్లాడే అర్హత టీడీపీ మంత్రులకు లేదని... బీజేపీపై తొలినుంచి పోరాడుతుంది వైసీసీ అన్నారు. 

 

19:30 - July 6, 2018

నిజామాబాద్ : కేటీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిజామాబాద్ ఎంపీగా కవిత గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లు కాదు..10 సీట్లు కూడా గెలవదన్నారు. సోనియాపై అనుచిత వాఖ్యాలు చేసిన కేటీఆర్ పై కోమటి రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే నారాయణ-శ్రీ చైతన్య యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ నేతలకు మహిళలు, దళితులు అంటే గౌరవం లేదన్నారు. కేబినెట్ లో మహిళకు స్థానం ఇవ్వనప్పుడే.. మహిళలకు ఎంత గౌరవం ఇస్తుందో అర్థమైందన్నారు. కేబినెట్ లో మాదిగ జాతికి స్థానం లేదని పేర్కొన్నారు. 

 

 

19:05 - July 6, 2018

గుంటూరు : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. జర్నలిస్టుల గృహ నిర్మాణ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడు కేటగిరీలలో ఇళ్ల నిర్మాణం జరుగనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన జర్నలిస్టులకు సొంతిళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. అందుకుగాను ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించారు. పలు సంస్థలకు భూములు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

 

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రాంతీయపార్టీల మద్దతు తప్పనిసరి : యనమల

హైదరాబాద్ : ఏ జాతీయ పార్టీ కూడా సొంత బలంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో లేవని ఏపీ ఆర్థికమంత్రి యనలమ రామకృష్ణుడు తెలిపారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రాంతీయపార్టీల మద్దతు తప్పనిసరిగా మారిందన్నారు.  

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

గుంటూరు : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు సంస్థలకు భూములు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం సింగపూర్ పర్యటన నేపథ్యంలో సమావేశాన్ని త్వరగా ముగించారు. 

 

అవినీతి కేసులో నవాజ్ షరీఫ్ దోషి

పాకిస్తాన్ : అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కోర్టు దోషిగా తేల్చింది. నవాజ్ షరీఫ్ కు పదేళ్ల జైలు శిక్షపడింది. ఆయన కూతురు మరియంకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. 

శిశువు కిడ్నాప్ కేసులో నిందితురాలుకు బెయిల్ మంజూరు

హైదరాబాద్ : కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ కేసులో నిందితురాలు నయనరాణికి బెయిల్ మంజూరు అయింది. ఈమేరకు మహిళకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు సరైన ఆధారాలు చూపించలేకపోయినందుకు బెయిల్ ఇచ్చారు.

 

17:48 - July 6, 2018

హైదరాబాద్ : సరసమైన ధరలకే స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తోన్న సంగీతా మొబైల్‌ స్టోర్స్‌ 44 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది సంగీత స్టోర్స్‌. 5 నుండి 15వేల స్మార్ట్‌ ఫోన్‌ కొన్న కస్టమర్లకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు అందిస్తోంది. 30 రోజుల వరకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని సంగీత రీజియన్‌ సిబ్బంది తెలిపారు. 

17:46 - July 6, 2018

కడప : విభజన హామీ చట్టంలో ఇచ్చిన విధంగా కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని..ఆ తర్వాతే కడపలో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  అడుగుపెట్టాలన్నారు వామపక్ష నేతలు.  కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా కేంద్రం తుంగలో తొక్కిందని ఆరోపించారు. వెంటనే జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకై స్పష్టమైన ప్రకటన చేయాలని లేని పక్షంలో బీజేపీ అధ్యక్షుడు కన్నా పర్యాటనను అడ్డుకుంటామని వామపక్ష నేతలు హెచ్చరించారు.

 

17:43 - July 6, 2018

విజయవాడ : ప్రజల మద్దతు కోసం టీడీపీ రాజకీయ డ్రామాలాడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావు విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఏపీని అన్ని విధాలుగా మోసం చేసిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విభజన హామీలపై, ప్రత్యేక హోదాపై వామపక్షపార్టీలు రాజీలేని పోరాటం చేస్తామని బాబురావు అన్నారు.

 

17:40 - July 6, 2018

గుంటూరు : అమరావతిలో ఏపీ కేబినెట్‌ సమావేశం జరుగుతోంది. విభజన హామీలపై సుప్రీంకోర్టులో కేంద్రం వేసిన అఫిడవిట్‌పై ప్రధానంగా కేబినెట్‌లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీరుపై ప్రత్యేక నివేదిక రూపొందించి కేబినెట్‌ తీర్మానం చేయనుంది. ఇక నిరుద్యోగ భృతి విధి విధానాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. అలాగే విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌కు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 

17:35 - July 6, 2018

హైదరాబాద్ : క్రికెట్‌ బెట్టింగ్‌ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జింబాబ్వే, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ ట్రైసిరీస్‌ టీట్వంటీ టోర్నీపైఔ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ బెట్టింగ్‌లో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మెయిన్‌ ఆర్గనైజర్‌ వెంకటరత్నంతోపాటు మొత్తం ఐదుగురుని పట్టుకున్నారు. నిందితుల్లో నలుగురు కృష్ణజిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లుకు చెందినవారు కాగా.. ఒకరు పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 2లక్షల 9వేల రూపాయలతోపాటు పలు ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్‌ ముఠాను పట్టుకున్న ఎల్‌బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులను రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ అభినందించారు.

 

సికింద్రాబాద్ లో రౌడీ షీటర్ హల్ చల్

హైదరాబాద్ : సికింద్రాబాద్ లో చిలకలగూడ పీఎస్ ముందు రౌడీ షీటర్ అమీర్ హల్ చల్ చేశాడు. ఓ కేసు విషయంలో తనపై రౌడీ షీట్ నమోదు చేసి పోలీసులు వేధిస్తున్నారని బ్లేడ్ తో చేయకోసుకున్నారు. 

బ్యాంకు లోన్లు, మెడికల్ సీట్లు ఇప్పిస్తామని మోసాలు

హైదరాబాద్ : నగరంలో వివిధ బ్యాంకుల్లో లోన్స్, మెడికల్ సీట్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గరు ముఠా సభ్యులను వెస్టు జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.45 లక్షలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

రామంగుండం మేయర్ పై అవిశ్వాసానికి 41 మంది కార్పొరేటర్లు మద్దతు

పెద్దపల్లి : రామగుండం కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసానికి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. మేయర్ లక్ష్మీనారాయణపై అవిశ్వాసానికి 41 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. తీర్మాన పత్రాలతో కార్పొరేటర్లు పెద్దపల్లి కలెక్టరేట్ కు చేరుకున్నారు. రాజీనామా యోచనలో లక్ష్మీనారాయణ ఉన్నట్లు కనిపిస్తోంది. అవిశ్వాసానికి టీఆర్ ఎస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవిశ్వాసం వెనుక ఎమ్మేల్యే సోమారపు సత్యనాయణ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 

17:05 - July 6, 2018

హైదరాబాద్ : నగరంలో వివిధ బ్యాంకుల్లో లోన్స్, మెడికల్ సీట్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గరు ముఠా సభ్యులను వెస్టు జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.45 లక్షలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసపోవద్దని పోలీసుల అధికారులు సూచించారు.

 

17:01 - July 6, 2018

పెద్దపల్లి : రామగుండం కార్పొరేషన్ మేయర్ లక్ష్మీనారాయణపై అవిశ్వాసానికి కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. లక్ష్మీనారాయణపై అవిశ్వాసానికి 41 మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు. తీర్మాన పత్రాలతో కార్పొరేటర్లు పెద్దపల్లి కలెక్టరేట్ కు చేరుకున్నారు. రాజీనామా యోచనలో లక్ష్మీనారాయణ ఉన్నట్లు కనిపిస్తోంది. అవిశ్వాసానికి టీఆర్ ఎస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవిశ్వాసం వెనుక ఎమ్మేల్యే సోమారపు సత్యనాయణ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

16:50 - July 6, 2018

ముంబై : రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగ్‌పూర్‌లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో నాగ్‌పూర్‌లో జనజీవనం స్తంభించింది. నాగ్‌పూర్‌లో విధానసభలో నీళ్లు ప్రవేశించాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో శాసనసభ సమావేశాలను సోమవారానికి వాయిదా వేశారు. ముందస్తు చర్యలు చేపట్టకుండా నాగ్‌పూర్‌లో తొలిసారిగా వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడంపై విపక్షాలు విమర్శించాయి. నాగ్‌పూర్‌లో శాసనసభ  శీతాకాల సమావేశాలను నిర్వహిస్తుంటారు.  మరోవైపు దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్‌, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మధ్యప్రదేశ్‌, అస్సాంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

 

16:48 - July 6, 2018

విశాఖ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేయడాన్ని నిరసిస్తూ విశాఖలో వామపక్షాలు ఆందోళన చేశాయి. ఏపికి బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తుందని..... కేంద్రం బూటకపు అఫిడవిట్‌తో కోర్టును తప్పు దోవ పట్టించడంతో పాటు ప్రజలను మోసం చేస్తుందని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ మోసాలను గ్రహిస్తున్నారని...  ప్రజా ఆగ్రహానికి బీజేపీ మూల్యం చెల్లించక తప్పదని నేతలు హెచ్చరించారు. 

 

16:44 - July 6, 2018

శ్రీకాకుళం : సాక్షాత్తు సీఎం వార్నింగ్‌ ఇచ్చారు. రెండు నెలలో ఓడిఎఫ్‌ జిల్లాగా ప్రకటించకపోతే ముఖ్యమంత్రే కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తానని బహిరంగసభలో హెచ్చరించారు. అయితే చంద్రబాబు చెప్పి ఆరు నెలలవుతున్నా శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు.
టెక్కలిలో నత్తనడకన నిర్మాణ పనులు 
వందల కోట్లు రూపాయలు వెచ్చించి అన్ని జిల్లాల మాదిరిగానే శ్రీకాకుళం జిల్లాలో ఏడాది కాలం నుంచి ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతోంది. అయితే లక్ష్యం నీరుగారిపోతోంది. లక్ష్యాన్ని పూర్తి చేయాలని  కలెక్టర్ ధనుంజయరెడ్డి నెలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నా క్షేత్రస్థాయిలో కదలిక కరువవుతోంది. ముఖ్యంగా ఉపముఖ్యమంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో నిర్మాణాలు నత్తతో పోటీపడుతున్నాయి.
మరుగుదొడ్ల నిర్మాణాల వెనుకంజపై మండిపడ్డ కలెక్టర్‌
టెక్కలి, సంతబొమ్మాళి మండలాలతో పాటు రాజాం నియోజకవర్గం సంతకవిటిలో మరుగుదొడ్ల నిర్మాణాలు వెనుకంజలో ఉన్నాయని కలెక్టర్‌ మండిపడుతున్నారు. బహిరంగ మల, మూత్ర విజర్జన నిరోదించి, సామాజిక చైతన్యం కలిగించేందుకు పెద్ద ఎత్తున నిధులు, అంతకన్నా ప్రచారం చేస్తున్న లక్ష్యాలను చేరుకోవడం లేదు. 
కలెక్టర్‌ ఎదుట ధర్నా చేస్తానని సీఎం హెచ్చరిక
ఈ ఏడాది జనవరి 4న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పర్యటించి, ఓడిఎఫ్‌ జిల్లాగా ప్రకటించేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మార్చి 31వలోగా శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం జరగకపోతే సీఎంగా తాను కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తానని హెచ్చారించారు. నేటికి ఆరు మాసాలు పూర్తయిన జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదని స్థానికులు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 38 మండలాలుండగా ఇంకా 85 శాతం కూడా నిర్మాణాలు పూర్తికాలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పనులపై మండల తహశీల్దారులు దృష్టి సారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

 

16:40 - July 6, 2018

హైదరాబాద్ : రాష్ట్ర ప్రగతి కోసం శ్రమిస్తున్న ఉద్యోగులకు దేశం గర్వించేలా పిఆర్సిని ప్రక‌టించాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పిఆర్సిలో పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా 63 శాతం పిట్ మెంట్‌తో పాటు 30 శాతం ఐ ఆర్ ని ప్రక‌టించాల‌ని టిఎన్జివో, టిజివో సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. స‌చివాల‌యంలో పే రివిజ‌న్ క‌మీష‌న్ చైర్మన్‌ను  క‌ల‌సి విడివిడిగా నివేదిక‌లు అందించారు.
సీఎం కేసీఆర్‌ ఆద‌ర్శవంత‌మైనా నిర్ణయం తీసుకోవాలి 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ త‌మ పిఆర్సి విష‌యంలోనూ ఆద‌ర్శవంత‌మైనా నిర్ణయం తీసుకోవాల‌ని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే  వివిధ కారాణాల‌తో రెండు సార్లు పిఆర్సిని కోల్పోయిన తాము..మ‌రో సారి అలా న‌ష్టపోకుండా చూడాల‌ని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 
మా ప‌ట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండాలి  
రాష్ట్ర అభివృద్ధిలో, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో కీల‌క‌పాత్ర పోషిస్తున్న తమ ప‌ట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉండాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈమేరకు తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేత‌లు  పిఆర్సి క‌మీటికి  ఓ నివేదిక అందించారు. 41 అంశాల‌తో టిఎన్జివో సంఘం అంద‌చేసిన వివ‌రాల ప‌ట్ల క‌మీష‌న్ సానుకూలంగా ఉన్నట్లు నేత‌లు చెప్పారు. 
ఖాళీ పోస్టులను బర్తీచేయాలి 
రాష్ట్రంలోని వివిధ స్ధాయిల్లో ఉద్యోగుల ప‌డుతున్న  ఇబ్బందుల‌ను కూడా ఆ నివేదిక‌లో పొందు ప‌ర్చారు. ఉద్యోగుల సంఖ్య తగ్గడంలో ప్రస్తుతం ఉన్న వారిపై భారం పడుతున్నందున ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.. వీటితో పాటు ప‌క్కన ఆంధ్ర ప్రదేశ్ తో పాటు చాల రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే ఉద్యోగుల వయో పరిమితి ని పెంచాలని డిమాండ్ చేశారు. ఇక  కాలుష్యం వల్ల ప్రయాణంలో ఇబ్బందులకి గురి అవుతున్నందున పని దినాలు సంఖ్య ని 5 రోజులకి కుదించాలని డిమాండ్‌ చేస్తున్నారు
నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలి 
వీటితో పాటు నూత‌న పెన్షన్ విధానాన్ని కూడా ర‌ద్దు తో పాటు మ‌హిల ఉద్యోగుల స‌మ‌స్యలు, గ్రామీణప్రాంతా ఉద్యోగుల హెచ్ ఆర్ ఏ వంటి అంశాల‌నుకు కూడా నివేదిక‌లో పోందు ప‌ర్చారు. అయితే పిఆర్సి కి సంఘాల ప్రతిపాద‌న‌లు అందించే స‌మ‌యం ద‌గ్గర ప‌డుతున్నందన ఉద్యోగుల డిమాండ్లపై సీఎం కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తసుకుంటారనేది ఇపుడు ఆసక్తిగా మారింది. 

 

16:23 - July 6, 2018

గుంటూరు : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు నిర్ణయించిన కనీస మద్దతు ధరలపై ఏపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోపోవడాన్ని తప్పు పట్టింది. ఉత్పత్తి వ్యయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎంఎస్‌పీ నిర్ణయించారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. 

 

16:06 - July 6, 2018

తూర్పుగోదావరి : ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరిపై వామపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. బీజేపీ తీరును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో ఆందోళన చేపట్టాయి. కంబాల చెరువు వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేసి నిరసన తెలిపారు వామపక్షనేతలు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

కర్నూలు జిల్లాలో విషాదం

కర్నూలు : జిల్లాలోని గడివేముల మండలం బిలకగూడూరులో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు సెయింట్‌పాల్ స్కూల్ బస్సు కిందపడి చిన్నారి హన్సిక మృతి చెందింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, క్లీనర్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి మృతికి కారణమైన సెయింట్ పాల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు డిమాడ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎనిమిది మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కేసులో రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత విధుల నుంచి తొలగించిన ఆరుగురు పోలీసులతో పాటు అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌ , ఏసీపీ శ్రీనివాస్‌ లపై ప్రభుత్వం సస్పెన్షన్‌ ఎత్తివేసింది. దీంతో అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌, ఏసీపీ శ్రీనివాస్‌తో పాటు మరో ఆరుగురు డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేశారు. నయీం ఎన్‌కౌంటర్‌లో ఆరోపణలు రుజువు కాకపోవడంతో వీరిని తిరిగి విధుల్లోకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

15:58 - July 6, 2018

కర్నూలు : జిల్లాలోని గడివేముల మండలం బిలకగూడూరులో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు సెయింట్‌పాల్ స్కూల్ బస్సు కిందపడి చిన్నారి హన్సిక మృతి చెందింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, క్లీనర్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. చిన్నారి మృతికి కారణమైన సెయింట్ పాల్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు డిమాడ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

15:57 - July 6, 2018

హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ కేసులో రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత విధుల నుంచి తొలగించిన ఆరుగురు పోలీసులతో పాటు అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌ , ఏసీపీ శ్రీనివాస్‌ లపై ప్రభుత్వం సస్పెన్షన్‌ ఎత్తివేసింది. దీంతో అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌, ఏసీపీ శ్రీనివాస్‌తో పాటు మరో ఆరుగురు డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేశారు. నయీం ఎన్‌కౌంటర్‌లో ఆరోపణలు రుజువు కాకపోవడంతో వీరిని తిరిగి విధుల్లోకి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ సమావేశం

గుంటూరు : ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించిన అఫిడవిట్ పై చర్చిస్తున్నారు.

 

షామీర్ పేటలో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

మేడ్చల్ : జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసు స్టేషన్ లో సూర్యప్రకాశ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితమే షామీర్ పేట పోలీస్ స్టేషన్ నుంచి మేడ్చల్ పీఎస్ కు ప్రకాశ్ బదిలీ అయ్యారు. ఈనేపథ్యంలో షామీర్ పేటలోని తన ఇంట్లో ప్రశాక్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. సుచిత్రలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 

 

15:29 - July 6, 2018

మేడ్చల్ : జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసు స్టేషన్ లో సూర్యప్రకాశ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితమే షామీర్ పేట పోలీస్ స్టేషన్ నుంచి మేడ్చల్ పీఎస్ కు ప్రకాశ్ బదిలీ అయ్యారు. ఈనేపథ్యంలో షామీర్ పేటలోని తన ఇంట్లో ప్రశాక్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. సుచిత్రలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

15:23 - July 6, 2018

గుంటూరు : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. విభజన హామీలపై సుప్రీంకోర్టులో కేంద్రం వేసిన అఫిడవిట్ పై కేబినెట్ చర్చించనుంది. కేంద్రం తీరుపై ప్రత్యేక నివేదిక రూపొందించి తీర్మానం చేయనుంది. నిరుద్యోగ భృతి విధి విధానాలకు సర్కార్ ఆమోదముద్ర వేయనుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం

గుంటూరు : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. విభజన హామీలపై సుప్రీంకోర్టులో కేంద్రం వేసిన అఫిడవిట్ పై కేబినెట్ చర్చించనుంది. కేంద్రం తీరుపై ప్రత్యేక నివేదిక రూపొందించి తీర్మానం చేయనుంది. నిరుద్యోగ భృతి విధి విధానాలకు సర్కార్ ఆమోదముద్ర వేయనుంది. 

యువతిపై మూడు రోజులుగా రౌడీ షీటర్ అత్యాచారం

సికింద్రాబాద్ : వారాసిగూడ అంబర్ నగర్ లో దారుణం జరిగింది. యువతిపై మూడు రోజులుగా రౌడీ షీటర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి తల్లిపై దాడి చేసి తల్లి ముందే అత్యాచారానికి చేశాడు. పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. రౌడీ షీటర్ పరారీలో ఉన్నాడు. 

 

రైస్ మిల్లర్ల యజమానులతో ముగిసిన సబ్ కమిటీ ససమావేశం

హైదరాబాద్ : రైస్ మిల్లర్ల యజమానులతో సబ్ కమిటీ ససమావేశం ముగిసింది. రైస్ మిల్లర్ల అభివృద్ధి పాలసీ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పౌరసరఫరాల 
రాష్ట్ర చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. రూ.1600 కోట్ల బకాయిలు దశలవారీగా చెల్లింపునకు ఆగస్టు మొదటివారంలో మిల్లర్లతో మరోసారి సమావేశం కానున్నారు. మిల్లర్లకు సబ్సిడీ విద్యుత్ విషయంపై పరిశీలన చేయనున్నారు. వరికి మద్దతు ధర ఉడతా భక్తిగా ఉందని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. 

 

13:28 - July 6, 2018

నడిరోడ్డుపై భార్యను పాశవికంగా నరికిన భర్త..

తమిళనాడు : నడిరోడ్డుపై భార్యను అత్యంత పాశవికంగా ఓ భర్త నరికి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలతోను ఈహత్య జరిగిందని భావిస్తున్నారు. రాష్ట్రంలోని రాజపాలెంలో జరిగిన ఈఘటన సీసీ టీవీ పుటేజ్ లో రిక్డార్డు అయిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

13:21 - July 6, 2018

హైదరాబాద్ : తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని..తనపై వస్తున్నవన్నీ ఆరోపణలేనని తెలంగాణ నీటి పారుదల శాఖ సీఈ సురేష్ కుమార్ పేర్కొన్నారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నరనే సమాచారం మేరకు ఏసీబీ అధికారులు ఆయన నివాసం..కార్యాలయం..ఇతర ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా టెన్ టివితో సురేష్ కుమార్, ఏసీబీ అధికారులు మాట్లాడారు.

తాను కొనుక్కున్న ఆస్తులు సక్రమమేనని సురేష్ కుమార్ తెలిపారు. తన కొడుకు ఎన్ఆర్ఐ నని ఆయన ఆస్తులు తన ఆస్తిగా చూపించే ప్రయత్నం చేసి ఉండవచ్చునన్నారు. తాను ఎలాంటి అక్రమాస్తులు కొనుగోలు చేయలేదని..ఉంటే సీజ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. తాను ఏసీబీ అధికారులకు సహకారం అందిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు కోట్లు ఆస్తులున్నట్లు గుర్తించడం జరిగిందని ఏసీబీ అధికారి తెలిపారు. బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉందని..ఇంకా సోదాలు జరుగుతున్నాయన్నారు. 

13:13 - July 6, 2018

చిత్తూరు : కార్పొరేట్ కళాశాలల్లో మరణ మృదంగం మోగుతూనే ఉంది. తాజాగా ఇంటర్ చదువుతున్న చింతపర్తికి చెందిన శృతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. శుక్రవారం కళాశాలకు వెళ్లిన శృతి సృహ లేకుండా పడి ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఉదయం కడుపునొప్పితో బాధ పడుతోందని..కొన్ని టాబ్లెట్స్ ఇచ్చామని..కడుపునొప్పి మరింత తీవ్రం కావడంతో ఆసుపత్రికి తరలించామని..అప్పటికే శృతి మృతి చెందిందని కళాశాల యాజమాన్యం పేర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న శృతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లే మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. న్యాయం చేయాలని...కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 

సీబీఐ కోర్డుకు జగన్..మాజీ ఐపీఎస్ శ్రీలక్ష్మీ..

హైదరాబాద్ : వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ, నాంపల్లి సీబీఐ, ఈడీ కోర్టులో నేడు సాగుతుండగా, విచారణకు పలువురు వీఐపీలు హాజరయ్యారు. తన పాదయాత్రకు విరామం ఇచ్చి, నిన్ననే హైదరాబాద్ కు చేరుకున్న వైఎస్ జగన్ తో పాటు, వైకాపా ఎంపీ, విజయసాయిరెడ్డి, మాజీ హోమ్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, ఎన్ శ్రీనివాసన్ తదితరులు హాజరయ్యారు.

12:50 - July 6, 2018

పశ్చిమబెంగాల్ :   వావి, వరస అనేది పశువుల నుండి మనుష్యుల్ని వేరుచేస్తుంది. ఇది మనిషికి, పశువులకు వుండే తేడా. కానీ కొంతమంది మనుష్యులు మూఢత్వంతోను, కామంతోను కన్న కూతురునే వివాహం చేసుకున్న ఓ పశువు ఘటనతో సభ్య సమాజం నివ్వెరపోయింది. అది కూడా భార్య సమక్షంలోనే కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఓ తండ్రి..దానికి కారణాన్ని దేవుడు చెప్పాడు కాబట్టి చేసుకుంటున్నానని మసిపూసాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

జల్పాయ్‌గురి జిల్లా కసియాజోరా అనే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అల్లా చెప్పాడనీ కట్టుకున్న భార్య సమక్షంలోనే కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. కుమార్తెను గర్భవతిని చేసిన అమానవీయ ఘటనతో మనం సమాజంలోనే నివసిస్తున్నామా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

 

12:34 - July 6, 2018
12:22 - July 6, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అవినీతి అధికారులు పెరిగిపోతున్నారు. అక్రమంగా ఆదాయాలు సమకూర్చుతున్న అధికారులను ఏసీబీ పట్టుకొంటోంది. తాజాగా మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ ఇంజినీరింగ్ శాఖకు చెందిన సురేశ్ కుమార్ అధికారి అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్నారన్న సమాచారం మేరకు ఏసీబీ శుక్రవారం దాడులు నిర్వహించింది. కరీంనగర్, నిజామాబాద్, సోమాజీగూడతో పాటు మరో రెండు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సురేష్ కుమార్ నివాసం...ఎర్రమంజిల్ లోని మైనర్ ఇరిగేషన్ సీఈ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో 2.5 లక్షల నగదు, 60 తులాల బంగారం, రెండు ప్లాట్లు, రెండు ఇళ్లు, పది ఇంటి స్థలాలున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

12:13 - July 6, 2018

కాజల్ అంటే కాటుక అని అర్థం..కళ్లకు కాటుక ఎంత అందాన్నిస్తుందో వెండి తెరపై కాజల్ అందం అలా వుంటుంది. సినీ పరిశ్రమలో పెద్ద హీరోలందరితోను నటించిన కాజల్ మోగా స్టార్ చిరంజీవితో కలిసి స్టెప్ లేసింది. కమర్షియల్‌ కాజల్ అనే కాకుండా హిస్టరీ కాజల్ గా ఫాంటసీ కాజల్ గా ‘మగధీర’తో నిరూపించుకుంది. యువరాణి మిత్రవిందగా కాజల్‌ ఆ పాత్రలో ఒదిగిపోయింది. అయితే ఇప్పుడు ఆమె మరో చారిత్రక. చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

రావణాసురుడి సోదరి శూర్ఫణఖగా కాజల్?..
దర్శకుడు భార్గవ్‌ ఓ చారిత్రక సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాలో కాజల్‌ రావణాసురుడి సోదరి శూర్పణక పాత్రలో నటించనున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. రామాయణంలోని చాలా పాత్రల గురించి మనం విని ఉంటాం కానీ శూర్పణక గురించి చాలా మందికి అంతగా తెలీదని.. అందుకే ఈ సినిమాలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు తెలియజేయాలని చిత్రబృందం భావిస్తోందట. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

తిరిగి కాంగ్రెస్ లో చేరనున్న మాజీ సీఎం..

ఢిల్లీ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి మరో పార్టీని స్థాపించి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 13వ తేదీన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. కాగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అకాల మరణం నేపథ్యంలో కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది.

ఇప్పట్లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేం : మంత్రి గంటా

అమరావతి : ఏపీలోలో లక్షలాది మంది నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఇప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదని మంత్రి గంటా శ్రీనివాస్ స్పష్టంచేశారు. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన మంత్రి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానందున డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేక పోతున్నామని చెప్పారు. ఎన్సీటీఈ ఆదేశాలపై మరింత స్పష్టత రావాల్సివుందని..సాధ్యమైనంత త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.

రాహుల్ డ్రగ్స్ తీసుకుంటాడు..డో'ప్' టెస్ట్ చేయండి : కుమారస్వామి

ఢిల్లీ : నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తు వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ కొకైన్ తీసుకుంటారని ఆయన ఆరోపించారు. పంజాబ్ లో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖతో పాటు ప్రభుత్వోద్యోగులందరికీ డోప్ టెస్ట్ నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై స్వామి స్పందిస్తూ, పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందు రాహుల్ గాంధీకి డోపింగ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాహుల్ కొకైన్ తీసుకుంటారు కాబట్టి...

అయోధ్య కేసు సుప్రీంకోర్టులో పున:విచారణ..

ఢిల్లీ : వివాదాస్ప అయోధ్య కేసు నేటి నుండి సుప్రీంకోర్టులో పున: విచారణ ప్రారంభం కానుంది. అయోధ్య కేసుపై దాఖలైన 14 పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం మళ్లీ విచారణ చేపట్టింది. వివాదాస్పదంగా మారిన అయోధ్య స్థలంలో మసీదు నిర్మాణానికి అనుమతించాలంటు పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పును వెలువరించింది. అయోధ్య స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోరా హకీరా రాంలీలా సంఘాలు పంచుకోవాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ నేటి నుండి ప్రారంభించినుంది.

11:28 - July 6, 2018

ఢిల్లీ : అయోధ్య మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ పున:ప్రాంరభం కానుంది. సుప్రీం మే 17న ఈ కేసు వాయిదా వేసింది. వివాదాస్పదస్థలంలో మసీదు నిర్మాణానికి అనుమతించాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. అయోధ్యపై 2010లో అలాహాబాద్ హైకోర్టు తీర్పును వెలువరించింది. ముగ్గురికి భూ పంపిణీ చేస్తూ తీర్పును చెప్పింది. సున్నీ, నిర్మోహీ అకీరా, రాంలీలాల సంఘాలు భూములు పంచుకోవాలంటూ తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్ లు దాఖలయ్యాయి. దీనిపై శుక్రవారం నుండి సుప్రీం విచారించనుంది. 

11:27 - July 6, 2018

ఢిల్లీ : అమర్ నాథ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడుతుండడం...భారీ వర్షాలు పడుతుండడంతో పలువురు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. ప్రతికూల వాతావరణం ఏర్పడుతుండడంతో యాత్రకు ఆటంకాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. పలు బేస్ క్యాంపుల వద్ద తలదాచుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా యాత్రలో చిక్కుకపోయారు. అనారోగ్య సమస్యలతో..ఇతరత్రా కారణాలతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు మృతి చెందారు. తాజాగా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన మహిళ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కొండపై నుండి బండరాళ్లు కిందకు పడడంతో శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన లక్ష్మీ అక్కడికక్కడనే మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

అమర్ నాథ్ యాత్రలో హైదరాబాద్ మహిళ మృతి..

జమ్ము కశ్మీర్ : పవిత్ర అమర్ నాథ్ యాత్రలో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్ లో కురుస్తున్న వర్షాలకు కొండపై నుంచి బండరాళ్లు జారి పడటంతో అవి తగిలి ఓ మహిళ మరణించింది. హైదరాబాద్, శేరిలింగంపల్లికి చెందిన పులిచెర్ల లక్ష్మి అనే గృహిణి, ఇటీవల యాత్రకు బయలుదేరి వెళ్లింది. ఆమె నడుస్తుండగా, పై నుంచి ఓ పెద్ద బండరాయి దొర్లుతూ వచ్చి ఆమెను తాకింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించగా, విషయాన్ని అధికారులు బంధువులకు చేరవేశారు. మృతదేహాన్ని స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో ఆమె కుటుంబం విషాధంలో మునిగిపోయింది.

వారు పార్లమెంట్ కు పోరు..వీరు అసెంబ్లీకి రారు:దేవినేని

అమరావతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని, ఎంపీలు పార్లమెంట్ కు పోరని..రాష్ట్ర ప్రయోజనాలు పట్టని వీరి అవసరం ప్రజలకు లేదని ఏపీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రాన్ని విభజించిన వారే ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలే బీజేపీ, వైసీపీ నేతలుగా, ఆపై జనసేన నేతలుగా రూపాంతరం చెందుతున్నారని, ఈ మూడు పార్టీలూ తోడు దొంగలేనని ఎద్దేవా చేశారు.

11:13 - July 6, 2018

నల్గొండ : విద్యుత్ శాఖలో లంచగొండిని ఏసీబీ పట్టుకుంది. ఓ కాంట్రాక్టర్ నుండి రూ. 20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం దాడి చేసి రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. వేములపల్లి ఎలక్ట్రికల్ ఏఈగా అలుగుబెల్లి శ్రీధర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఓ కాంట్రాక్టర్ పనుల విషయంలో ఏఈ డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనితో ఆయన నివాసంలో డబ్బులు ఇస్తుండగా ఏసీబీ దాడి చేసి పట్టుకుంది. ప్రస్తుతం సోదాలు..తనిఖీలు కొనసాగుతున్నాయ. 

10:48 - July 6, 2018

"దేవదాసు''సినిమా అక్కినేని నాగేశ్వరావు సినీ చరిత్రలో కలికితురాయిగా మిగిలిపోయింది. నూనూగు మీసాల యువకుడి వయస్సులోనే బరువైన పాత్రలో నటించిన పెద్ద అక్కినేనికి "దేవదాసు''ఓ చరిత్ర అని చెప్పవచ్చు. నాగేశ్వరరావు నటించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో "దేవదాసు'' కి ఒక ప్రత్యేక స్థానం వుంది. ఈ సినిమా తెలుగులోనే కాక దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇప్పడు తాజాగా ఇదే టైటిల్‌తో సీనియర్ అక్కినేని వారసుడుగా పరిశ్రమలో అడుగు పెట్టిన నాగార్జున మరో దేవదాసుతో రానున్నారు. ఈ సినిమాలో మల్టీస్టారర్ గా రూపొందుతోంది. ఈ సినమాలో మరో స్టార్ నాచ్యురల్ స్టార్ నాని.

'దేవదాస్' అనే టైటిల్ గుర్తుకు వస్తేనే చాలు మందు సీసాలు గుర్తుకొస్తాయి. అలాంటిది 2018 'దేవదాస్' టైటిల్ పోస్టర్‌లో మాత్రం తుపాకులు, బుల్లెట్లు ఉండటం చూస్తుంటే.. మూవీ వైవిధ్యంగా ఉంటుందనే విషయం ఇట్టే అర్థమైపోతోంది.

ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ తన సొంత బ్యానర్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి దేవదాస్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని జూలై 5వ తేదీన అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో హీరో నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. "మీ అండ్ దాస్" అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చనున్నారు. నాగార్జున సరసన ఆకాంక్షా సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. "ఛలో" ఫేం రష్మిక మందన నానికి జోడీగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇప్పటికే 65 శాతానికిపైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న దేవదాస్ సెప్టెంబర్‌‌లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

మెడికల్ విద్యార్ధి హర్ష ఆతహత్య..ర్యాగింగ్ కారణమా?..

కర్నూలు : మరో మెడికల్ విద్యార్ధి ఆతహత్యకు పాల్పడ్డాడు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న మెడికల్ విద్యార్థి ప్రణీత్ రెడ్డి తాను వుంటున్న హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ సమాచారం అందుకున్న హర్షా ప్రణీత్ రెడ్డి తండ్రి తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని..తనకుమారుడిది హత్యనేనని వాదిస్తున్నారు. కాగా హర్షా ప్రణీత్ రెడ్డిది ఆత్మహత్యను కాలేజీ యాజమాన్యం గోప్యంగా వుంటచంతో పలు అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంతో హర్షా ప్రవీణ్ రెడ్డి తండ్రి రామాంజనేయ రెడ్డి అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

10:34 - July 6, 2018

కర్నూలు : మరో విద్యా కుసుమం అనంతలోకాలకు వెళ్లిపోయాడు. చదువు ఒత్తిడి భరించలేక...యాజమాన్య వత్తిడి తట్టుకోలేక...వేధింపులు భరించలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కానీ ఇది ఆత్మహత్య కాదని...హత్య అని మృతుడి తండ్రి పేర్కొంటున్నాడు.

జిల్లాలోని మెడికల్ కాలేజీలో హర్ష ప్రణీత్ రెడ్డి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతను శుక్రవారం విగతజీవిగా కనిపించాడు. ఉరి వేసుకుని చనిపోయాడని...ప్రమాదవశాత్తు కిందపడిపోయి మరణించాడని ప్రచారం జరుగుతోంది. మృతి చెందిన వార్త గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై తండ్రి రామాంజనేయరెడ్డి స్పందించాడు. తన కొడుకు ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని..మృతికి ర్యాంగింగే కారణమని పేర్కొన్నారు. 

10:18 - July 6, 2018

జమ్మూ కాశ్మీర్ : మంచు లింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. అమర్ నాథ్ యాత్ర నిలిచిపోయింది. వర్షాలు..కొండచరియలు విరిగిపడడంతో యాత్రకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఉధంపూర్ లో 1798 మంది యాత్రికులు నిలిచిపోయారు. పహాల్ గావ్, బల్తాల్ మార్గాలత్లో యాత్రను నిలిపివేశారు. ఆయా శిబిరాల్లో తలదాచుకున్న భక్తులకు ఆర్మీ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జమ్మూ బేస్ క్యాంపు నుండి మరో 28వేల మంది భక్తులు బయలుదేరారు. ఈ యాత్ర ఆగస్టు 26వరకు కొనసాగనుంది. ఇంతవరకు మంచు లింగాన్ని 61వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

అమర్ నాథ్ యాత్ర పున:ప్రారంభం..

జమ్ము కశ్మీర్ : హిందువుల అత్యంత పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర తిరిగి యథావిధిగా ప్రారంభమయ్యింది. భారీ వర్షాలు, ప్రతికూల పరిస్థితుల్లో చిక్కుకుని దాదాపు 15మంది వరకూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాతావరణం అనుకూలించటంతో అమర్ నాథ్ యాత్రను అధికారులు పున:ప్రారంభించారు. దీంతో కౌలాస మానస సరోవర యాత్రకు మార్గం సుగమం అయింది. యాత్రీకుల కోసం సిమికోట్, సర్కేట్ లో శిబిరాలను ఏర్పాటు చేసారు. యాత్ర ప్రారంభం కావటంతో టూర్ ఆపరేటర్లు తమదైన శైలిలో సేవలందిస్తున్నారు.

10:05 - July 6, 2018

ఢిల్లీ : మానస సరోవర్ లో వాతావరణం సాధారణ స్థితికి చేరుకోవడంతో మళ్లీ కైలాస్ మానస సరోవర్ యాత్ర ప్రారంభమైంది. యాత్రలో చిక్కుకున్న వారందరినీ హెలికాప్టర్ లో తరలించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సిమికోట్ల, సర్కేట్ లో శిబిరాలు ఏర్పాటు చేశారు. యాత్రికులకు టూర్ ఆపరేటర్లు సహకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వంద మంది సురక్షితంగా బయటపడ్డారు. అక్కడ వాతావరణం ఇలా ఉంటుందని తమకు తెలియదని..భారత ఎంబసీ ద్వారా వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని..ప్రైవేటు టూర్ ఆపరేటర్ల ద్వారా వెళితే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అక్కడకు వెళ్లిన యాత్రికులు పేర్కొంటున్నారు. నేపాల్ గంజ్ నుండి వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు చిక్కుక్కున్న వారందరినీ తరలిస్తారని తెలుస్తోంది. 

09:53 - July 6, 2018

హైదరాబాద్ : హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనపై మరోసారి దృష్టి సారించారు అధికారులు. ఇప్పటికే మురుగు కాలువలను దారిమళ్లించిన హెచ్‌ఎండీఎ, సాగర్‌లోని పూడికతీతకూ... ఆధునిక యంత్రాలను రంగంలోకి దింపింది. భారీ యంత్రాలతో నాలాల ముఖద్వారంలో వచ్చే వ్యర్థాలను తొలగిస్తున్నారు. ఇప్పటికే మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం మరోసారి సాగర్‌లో నీటిశుద్ధికి చర్యలు చేపట్టింది.

హుస్సేన్‌సాగర్‌ శుద్ధికి మరో సారి రంగం సిద్ధం చేశారు అధికారులు. వ్యర్థాల క్లీనింగ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జైకా నిధులతో మలేషియా నుంచి భారీ యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. వీటిని లాంగ్‌ భూమ్‌ ఎక్స్‌ వేటర్‌ అంటారు. ఈ మిషన్‌తో సాగర్‌ అడుగు భాగంలో ఉన్న బురదను తొలగిస్తారు. ఇప్పటి వరకూ సాగర్‌ క్లీనింగ్‌ కోసం ఉపయోగిస్తున్న డ్రడ్జింగ్‌ మిషన్స్‌ కంటే ఇది పదిరెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పూర్తిగా విదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ లాంగ్‌ భూమ్‌ ఎక్స్‌ వేటర్‌ యంత్రానికి రెండు కోట్ల యాభైలక్షల రూపాయలు వెచ్చించారు. ఇలాంటివి మరో రెండు యంత్రాలు త్వరలో రానున్నాయన్నారు అధికారులు.

సాగర్‌ క్లీనింగ్‌ విషయంలో ప్రభుత్వం ప్రణాళికా ప్రకారం ముందుకెళ్తుదని హెచ్‌ఎండీఎ కమిషనర్‌ చిరంజీవులు అన్నారు. సాగర్‌ను మూడుదశల్లో ప్రక్షాలన చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. నాలాల మళ్లింపుతో మొదటి దశపూర్తయిందని, రెండవ దశలో సాగర్‌లోని మురుగను తొలగించడంతో పాటు నీటిలో ఆక్సిజన్‌ లెవల్స్‌ పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఇప్పటికే సాగర్ ప్రక్షాళణకు, పూడికతీతకు, ఎస్టీపీల నిర్మాణానికి హెచ్‌ఎండీఎ 300కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జైకా నుండి 370 కోట్ల రుణం పోందితే, అందులో 270 సాగర్‌ పాలయ్యాయి. కాని సాగర్‌లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా ఎన్నికలకు ముందు నగరానికి చెందిన ఓ మంత్రి సాగర్‌ వాటర్‌ను త్రాగునీటిలా మార్చడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అందులో భాగంగానే ఆస్ట్రియా బృందం వచ్చి సాగర్‌ కాలుష్యం... దాని క్షీనింగ్‌కు అవసరమైన స్టడీ చేసింది. కానీ తరువాత ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి దగ్గింది. ఇప్పుడు మరోసారి సాగర్‌లోని వ్యర్థాలను తొలగించి, సాగర్‌ వాటర్‌ను శుద్ధి చేస్తామంటున్నారు హెఎండీఎ అధికారులు. అధికారులు, ప్రభుత్వ పెద్దలు సాగర్‌ ప్రక్షాళనపై ఎప్పటికప్పుడు కొత్త కొత్త మాటలు చెబుతున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చువుతున్నా.. హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన మాత్రం కావడంలేదని వాపోతున్నారు.

09:52 - July 6, 2018

విజయవాడ : పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభంలోపే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహ రచన చేస్తోంది తెలుగుదేశం పార్టీ. విభజన హామీలపై బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఉన్నఅన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలో.. జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మరోసారి టీడీపీ అధినేత సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. మరో పదిరోజుల్లో పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానుండడంతో.. ఈ లోగా రాష్ర్టంతోపాటు.. ఢిల్లీలోనూ ఉద్యమ వేడిని రగిలించేందుకు టీడీపీ వ్యూహం రచిస్తోంది. హక్కుల సాధనకోసం దీక్షలు చేస్తూనే.. రాష్ర్టానికి చేసిన అన్యాయంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని యోచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌, బీటెక్‌ రవి చేసిన దీక్షతోపాటు.. విశాఖలో రైల్వే జోన్‌కోసం ఎంపీలు చేసిన ఒక రోజు దీక్షతో కేంద్రానికి సెగ తగిలేలా చేసింది టీడీపీ. దీనితర్వాత వెనుకబడిన జిల్లాలకు నిధులు డిమాండ్‌ చేస్తూ.. అనంతపురంలో మరో ఉద్యమానికి ప్రణాళిక రచిస్తోంది. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ ఉపయోగించుకోవాలని చూస్తోంది. కేంద్రంపై మరోసారి అవిశ్వాసం పెట్టేందుకు సైతం టీడీపీ సమాయత్తం అవుతోంది.

రాబోయే పార్లమెంటు సమావేశాల్లో రాజ్య సభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగాల్సి ఉంది. దీనికోసం బలాబలాలను లెక్కగడుతోన్న టీడీపీ.. ఎన్టీఏ కూటమికి కావాల్సినన్ని ఓట్లు లేవని భావిస్తోంది. ఇదే అదనుగా జాతీయ స్థాయిలో బీజేపీని మళ్ళీ ఇరుకున పెట్టాలని యోచిస్తున్నారు చంద్రబాబు. దీనిపై జాతీయ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీల తరపును ఓ అభ్యర్థిని నిలబెడితే బాగుంటుందన్న సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని సంప్రదింపులు జరిపాక పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని భావిస్తోంది టీడీపీ.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరిగితే.. వైసీపీ తెరచాటు ఒప్పందం బట్టబయలవుతుందని భావిస్తోంది టీడీపీ. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా వెళ్ళే పరిస్థితి వైసీపీకి లేదని టీడీపీ అంచనా వేస్తోంది. ఎన్డీఏకు సహకరించడమో.. లేక ఎన్నికకు దూరంగా ఉండడానికో వైసీపీ మొగ్గు చూపుతుందని టీడీపీ భావిస్తోంది. వైసీపీ ఏ నిర్ణయం తీసుకున్నా.. బీజేపీకి సహకరించిందన్న వాదనను తెరమీదకు తెచ్చేయోచనలో టీడీపీ ఉంది. కర్నాటక పరిణామాలను తలపించేలా మరోసారి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న వ్యూహంలో టీడీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందుకోసం ఇప్పుడు జాతీయ పార్టీలతో ప్రాథమికంగా సంప్రదింపులు జరిపినా... పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాక.. పూర్తి స్థాయిలో మంతనాలు జరిపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఏసీబీ వలలలో విద్యుత్ ఏఈ శ్రీధర్ రెడ్డి..

నల్లగొండ : ఏసీబీ వలలో వేములపల్లి విద్యుత్ శాఖ ఉద్యోగి అడ్డంగా చిక్కాడు. విద్యుత్ సంస్థలో ఏఈ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. మిర్యాలగూడలోని తన నివాసంలో కాంట్రాక్టర్ నుండి రూ.20వేలు తీసుకుంటు వేములపల్లి ఏఈ శ్రీధర్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డాడు. 

లైం‌గిక దోపిడీ వివాదంలో ఎంపీ బాల్క సుమన్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ వివాదంలో చిక్కుకున్నారు. పలువురు మహిళలపై ఆయన లైం‌గిక దోపిడీకి పాల్పడ్డారని పాత్రికేయులు మల్హోత్రా, సురభి నిర్మల్, న్యాయవాదులు వీఎస్ రావు, ఎంఎస్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. మే 31న బంజారాహిల్స్‌లోని ఎం‌పీ అపార్ట్‌మెంట్‌కు ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు వచ్చి తనను బెదిరించారని ఎంపీ సహాయకుడు మర్రి సునీల్ గత నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మసాజ్ సెంటర్ అడ్డాగా సెక్స్ రాకెట్..గుట్టు రట్టు..

హర్యానా : గురుగ్రామ్‌లో పోలీసులు సెక్స్ రాకెట్‌ గుట్టును రట్టు చేశారు. ఓ మసాజ్ సెంటర్‌ను అడ్డాగా చేసుకుని వ్యభిచారం సాగిస్తున్న ఐదుగురు విదేశీ మహిళలతో పాటు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంపన్నులు నివసించే సైబర్ సిటీ ప్రాంతంలో మసాజ్ సెంటర్ పేరిట కొందరు వ్యభిచారం నిర్వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సెక్టర్ 29 మార్కెట్‌లో ఉన్న సదరు స్పా సెంటర్‌పై పోలీసులు మెరుపుదాడి చేశారు. స్పా యజమాని, ఇద్దరు మేనేజర్లను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

యూకే కోర్టులో మాల్యాకు చుక్కెదురు..

ఢిల్లీ : బ్యాకులకు కోట్లాది రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్ మాల్యాకు యూకే హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌ లోని మాల్యా ఇంట్లోకి వెళ్లి అక్కడున్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టు వీలు కల్పించింది. 13 భారతీయ బ్యాంకులు వేసిన కేసును హైకోర్టు విచారణ జరిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి, ఆయన ఏజెంట్లు హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని మాల్యా ఉంటున్న భవనాల్లోకి సోదాలు నిర్వహించడానికి అనుమతించింది. టెవిన్‌లోని లేడీవాక్, బ్రాంబిల్ లాడ్జ్‌లలో మాల్యా ఆస్తులు ఉన్నాయి.

09:30 - July 6, 2018

ఢిల్లీ : బ్యాకులకు కోట్లాది రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్ మాల్యాకు యూకే హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌ లోని మాల్యా ఇంట్లోకి వెళ్లి అక్కడున్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టు వీలు కల్పించింది. 13 భారతీయ బ్యాంకులు వేసిన కేసును హైకోర్టు విచారణ జరిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి, ఆయన ఏజెంట్లు హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని మాల్యా ఉంటున్న భవనాల్లోకి సోదాలు నిర్వహించడానికి అనుమతించింది. టెవిన్‌లోని లేడీవాక్, బ్రాంబిల్ లాడ్జ్‌లలో మాల్యా ఆస్తులు ఉన్నాయి. 9 వేల కోట్ల రుణాలను రికవరి చేసేందుకు హైకోర్టు జడ్జి జస్టిస్ బ్రయాన్ జూన్ 26న ఈ ఆదేశాలను జారీ చేశారు. ఈ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లే అవకాశం కల్పించాలని కోర్ట్ ఆఫ్ అప్పీల్‌లో మాల్యా పిటిషన్ దాఖలు చేశాడు.

హార్డ్ వేర్ అండ్ పెయింట్స్ దుకాణంలో అగ్రిప్రమాదం..

హైదరాబాద్ : కృష్ణ నగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆడిటోరియం పక్కనే ఉన్న నాలుగంతస్థుల భవంతిలో మంటలు చెలరేగాయి. వసంత హార్డ్ వేర్ అండ్ పెయింట్స్ దుకాణంలో మంటలు వ్యాపించగా, సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను ఆపేందుకు యత్నిస్తున్నారు. స్టోర్ లో పెయింట్స్, రసాయనాలు అధికంగా ఉండటంతో మంటలు అంత తొందరగా అదుపులోకి రాలేదు. భవంతిలోని వారందరినీ ఖాళీ చేయించిన అధికారులు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.

చారినార్ వద్ద డ్రోన్ కలకలనం..యువతి అరెస్ట్

హైదరాబాద్ : నగరంలోని చారిత్రాత్మక చార్మినార్ కట్టడం వద్ద ఓ డ్రోన్ కలకలం రేపింది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటైన పాతబస్తీలోని చార్మినార్ పైన ఓ డ్రోన్ తిరుగుతూ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆ ప్రాంతానికి వచ్చిన పోలీసులు ఓ బెంగాలీ యువతిని అదుపులోకి తీసుకున్నారు. చార్మినార్ వద్ద డ్రోన్ లపై నిషేధం ఉందని పోలీసులు తెలపటంతో ఆ విషయం తనకు తెలియదని..తాను సరదాగా ఈ పని చేశానని సదరు యువతి వాపోయింది. ఆమె హైదరాబాద్ ఎందుకు వచ్చింది? డ్రోన్ లను ఇంకా ఎక్కడెక్కడ ఎగురవేసింది? ఏఏ ప్రాంతాలను వీడియో తీసింది?

09:17 - July 6, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో అభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...చెరువులకు కృష్ణా జలాలు తీసుకొచ్చారని, ఆనాడు మంత్రులుగా ఉన్న వారు ఎందుకు తీసుకరాలేదని ప్రశ్నించారు. వైసీపీలో జగన్ ఇతర నాయకులకు ఏం మాత్రం విలువనిస్తున్నారు ? కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ ఊసెత్తలేదని...తెలిపారు. ఆర్థిక సాయం...డిజైన్స్ విషయంలో సీఎం చంద్రబాబు సమీక్షించి ఫ్లై ఓవర్ ను పూర్తి చేస్తున్నారని తెలిపారు. కేంద్రంలో ఉన్న సంస్థలను అభివృద్ధి చేస్తూ..ముందుకు వెళుతున్నామని..గోదావరి - పెన్నా అనుసంధానం ఎందుకు చేస్తున్నారంటూ ఓ నాయకుడు రాళ్లు వేస్తున్నారని విమర్శించారు. 1979 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నా దానిపై దృష్టి కేంద్రీకరించలేదన్నారు. 

బాబు కృషి చేస్తుంటే మీకే కష్టం - దేవినేని...

విజయవాడ : చెరువులకు కృష్ణా జలాలు తీసుకొచ్చారని, ఆనాడు మంత్రులుగా ఉన్న వారు ఎందుకు తీసుకరాలేదని మంత్రి దేవినేని ప్రశ్నించారు. వైసీపీలో ఏం మాత్రం విలువనిస్తున్నారు ? కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ ఊసెత్తలేదని...తెలిపారు. ఆర్థిక సాయం...డిజైన్స్ విషయంలో సీఎం చంద్రబాబు సమీక్షించి ఫ్లై ఓవర్ ను పూర్తి చేస్తున్నారని తెలిపారు. 

కొనసాగుతున్న కొబ్బరి వ్యాపారుల బంద్...

తూర్పుగోదావరి : కోనసీమలో కొబ్బరి వ్యాపారులు ఇంకా బంద్ కొనసాగిస్తున్నారు. నేడు ఐదో రోజు కూడా బంద్ కొనసాగుతోంది. ఈ పర్మిట్ విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాపారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారని తెలుస్తోంది. 

సింగరేణి ఒసీపీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి...

పెద్దపల్లి : రామగుండం సింగరేణి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గురువారం భారీ వర్షం కురవడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 

కానిస్టేబుల్ ను హతమార్చిన ఉగ్రవాదులు...

జమ్మూ కాశ్మీర్ : కుల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కానిస్టేబుల్ జావెద్ అహ్మద్ ను కిడ్నాప్ చేసిన తీవ్ర వాదులు హతమార్చారు. షోపియాన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థిని సూసైడ్...

కర్నూలు : మెడికల్ కాలేజీ హాస్టల్ లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న హర్ష ప్రణీతారెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది. చదువు ఒత్తిడి భరించలేకే ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. 

08:17 - July 6, 2018
08:16 - July 6, 2018
08:15 - July 6, 2018
08:13 - July 6, 2018
08:11 - July 6, 2018

గుంటూరులో భజరంగ్ జూట్ మిల్ తెరిపించాలని కార్మికుల ఆందోళన బాటపట్టారు. ఈ సంస్థను మూసివేసి 3 సంవత్సరాలు అవుతున్న,.. 2500 మంది రోడ్డున పడిన కార్మికుల ఆవేదనని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలుగుజేసుకొని దీన్ని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో భజరంగ్ జూట్ మిల్ కార్మికసంఘం నాయకుడు భువన నారాయణ విశ్లేషించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

నేడు ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉతర్వులు...

హైదరాబాద్ : నేడు ప్రధానోపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు విడుదల కానున్నాయి. బదిలీ కోసం 2182 మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. 

06:40 - July 6, 2018

ఢిల్లీ : కైలాస్‌ మానసరోవర్‌ యాత్రీకుల కష్టాలు ఇంకా తొలగలేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వెయ్యిమంది భారతీయులు మార్గమధ్యంలోనే చిక్కుకుపోయారు. సాయం కోసం వారు ఎదురు చూస్తున్నారు. నేపాల్‌ మీదుగా మానసరోవర్‌ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. మానసరోవర్‌ నుంచి యాత్రీకులు తిరిగి వస్తుండగా భారీ వర్షాలు కురుస్తుండడంతో మార్గమధ్యంలోనే వారు నిలిచిపోవాల్సి వచ్చింది. వారిని అక్కడి నుంచి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. బుధవారం హిల్సా నుంచి 250 మంది భారతీయ టూరిస్టులను తరలించారు. గురువారం ఉదయం 143 మంది ప్రయాణికులను పది విమానాల్లో సిమికోట్‌ నుంచి నేపాల్‌గంజ్‌కు తరలించారు.

సిమికోట్‌లో 643 మంది, హిల్సాలో 350 మంది చిక్కుకుపోయారు. సాయం కోసం వారు ఎదురుచూస్తున్నారు. ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడానికి భారత ఎంబసి హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. వాతావరణం సరిగా లేకపోవడంతో సోమవారం నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయని 'ద కఠ్మాండు పోస్ట్‌' పేర్కొంది.

నేపాల్‌ మీదుగా మానసరోవర్‌ యాత్రకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల మార్గమధ్యలో చిక్కకుపోయే ప్రమాదం అధికంగా ఉందని వెల్లడించింది. వాతావరణం అనుకూలంగా ఉంటే నేపాల్‌లోని సిమికోట్‌, హిల్సా ప్రాంతాలకు కేవలం హెలికాప్టర్లు, చిన్న విమానాల ద్వారా మాత్రమే వెళ్లడానికి వీలవుతుంది. హిల్సా, సిమికోట్‌ మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు సరిగ్గా లేవని ప్రయాణికులు తెలిపింది. మానసరోవర్‌ ఎత్తైన ప్రదేశం కావడం వల్ల ఆక్సిజస్‌ తక్కువ ఉండడంతో యాత్రికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఏడాది ఆక్సిజన్‌ అందక ఇప్పటివరకు 8 మంది మృతి చెందారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యాత్రికులు కూడా ఉన్నారు.

06:39 - July 6, 2018

హైదరాబాద్‌ : నిజామ్‌ కాలం నాటి కట్టడం.. సిటీ బస్‌స్టేషన్‌... సీబీఎస్‌.. కుప్పకూలిపోయింది. దీన్ని ముందుగానే పసిగట్టి.. ఐదు రోజుల నుంచి ఇక్కడ బస్సుల రాకపోకలను నిషేధించడంతో.. ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. సీబీఎస్‌ కూలిపోవడంతో.. భవిష్యత్తులో ఇక్కడ అధునాతన కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌తో అనుబంధం ఉన్న వారందరికీ చిరపరిచితమైన సిటీ బస్‌స్టేషన్‌ కుప్పకూలింది. నిర్మాణం బాగా బలహీనంగా ఉండడంతో.. ఎప్పుడైనా కూలొచ్చన్న నిపుణుల సూచనలతో.. జూన్‌ 30వ తేదీనుంచి ఇక్కడ బస్సు సర్వీసులను నిలిపివేశారు. దీంతో.. పైకప్పు కూలిన కారణంగా.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

సీబీఎస్‌ కూలిన విషయం తెలియగానే.. ఆర్టీసీ ఎండీ సుశీల్‌కుమార్‌ శర్మ, ఈడీ పురుషోత్తం, ఈస్ట్‌జోన్‌ డీసీపీ రమేశ్‌రెడ్డి.. ఘటనాస్థలిని సందర్శించారు. మరమ్మతులు సాధ్యం కానందునే.. నిజాం నాటి కట్టడాన్ని ఇలా వదిలేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఈస్థలంలో అధునాతన కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించబోతోందని వెల్లడించారు. గౌలిగూడలోని ఈ నిర్మాణాన్ని నిజాం నవాబులు 1930లో పూర్తి చేశారు. 1951లో ఆర్టీసీ ఈ నిర్మాణాన్ని స్వాధీనం చేసుకుంది. చాలాకాలం పాటు.. ఇదే ప్రధాన బస్‌స్టేషన్‌గా ఉండేది. అనంతర కాలంలో ప్రస్తుత మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌ ప్రారంభించాక.. దీన్ని సిటీ బస్‌ స్టేషన్‌గా మార్చేశారు. అప్పటి నుంచే దీన్ని సీబీఎస్‌గా నామకరణం చేశారు. సీబీఎస్‌ నుంచి రోజుకు ఐదు వందలకు పైగా బస్సులు.. 2385 ట్రిప్పులు నడిచేవి. సీబీఎస్‌ బస్‌స్టాండ్‌ కూలిపోయిన కారణంగా.. ప్రస్తుతం సిటీ సర్వీసులను ఎక్కడి నుంచి నడపాలన్న ప్రశ్న ఉత్పన్నతమవుతోంది. రోడ్డుమీదే నిలిపేందుకు.. రద్దీ ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అయితే.. పాత బస్టాండ్ స్థానంలో త్వరలోనే కొత్తది నిర్మించి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. 

06:36 - July 6, 2018

హైదరాబాద్ : బేబీ చేతనను కిడ్నాప్‌ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమెకు సహకరించిన మరో ముగ్గురినీ కటకటాల వెనక్కి పంపారు. ఎప్పట్లాగే ఈ కేసులోనూ సీసీ కెమెరా ఫుటేజీ ప్రధాన సాక్ష్యంగా నిలిచింది. దాంతోపాటే.. బీదర్‌ బస్‌ కండక్టర్‌ సమాచారం కేసును వేగంగా పరిష్కరించేందుకు దోహదపడింది. చిన్నారి చేతన కిడ్నాప్‌ కేసు ఛేదనలో.. పోలీసులకు టెక్నికల్‌ ఎవిడెన్స్‌, సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. బీదర్‌ పోలీసుల సహకారంతో.. ఏసీపీ డాక్టర్‌ చేతన నేతృత్వంలోని సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. ఈ కేసును విజయవంతంగా ఛేదించగలిగారు. పాపను గుర్తించడంలో జహీరాబాద్‌ డిపో బస్‌ డ్రైవర్‌, కండక్టర్‌ ఇచ్చిన సమాచారం.. పోలీసులకు ఎంతగానో ఉపయోగ పడింది. ఆమె బీదర్‌ బస్టాండ్‌లో కాకుండా.. ముందరి స్టేజ్‌ నయాకమాన్‌ వద్ద దిగడంతో.. ఆమె బీదర్‌ వాసిగా గుర్తించి ఇల్లిల్లూ గాలించారు.

చిన్నారి ఆచూకీ కోసం.. పోలీసులు మొత్తం పదకొండు బృందాలుగా ఏర్పడి గాలింపు జరిపారు. ఈ క్రమంలో.. మీడియాలో వచ్చిన వార్తలతో బెదిరిపోయిన కిడ్నాపర్‌ నయనారాణి కుటుంబ సభ్యులు.. పాపను స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో నయనారాణి.. చిన్నారి చేతనను బీదర్‌ ప్రభుత్వాసుపత్రి వద్ద వదిలేసి వెళ్లింది. పాపను గుర్తించి తల్లి ఒడికి చేర్చిన పోలీసులు.. నిందితురాలి కోసం నాలుగు బృందాలుగా బీదర్‌లోనే గాలింపు జరిపారు. ఇల్లిల్లూ తిరిగి ఆమెను అరెస్ట్‌ చేశారు. కిడ్నాపర్‌ నయనారాణి చిన్నారి చేతన కన్నా ముందు.. అక్కడున్న ఇద్దరు చిన్నారులను ఎత్తుకెళ్లేందుకు విఫల ప్రయత్నం చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. రెండుసార్లు అబార్షన్‌ కావడం.. నాలుగేళ్లుగా సంతానం లేకపోవడంతో.. ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు తేల్చారు.

ప్రభుత్వాసుపత్రుల్లో శిశువుల కిడ్నాప్‌లు పునరావృతం కాకుండా.. భద్రత చర్యలపై అధ్యయనం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ ఎం,రమేశ్‌, సుల్తాన్‌బజార్‌ ఏసీపీ డాక్టర్‌ చేతన ఈ నివేదికను ఇస్తారని తెలిపారు. కిడ్నాప్‌కు గురై.. తిరిగి తల్లిఒడికి చేరిన పాపకు తనపేరు పెట్టడం తనకు గర్వంగా ఉందని ఏసీపీ డాక్టర్‌ చేతన తెలిపారు. మొత్తానికి ఆరు రోజుల పసికందు.. కిడ్నాపర్‌ ఒడి నుంచి తల్లి ఒడికి చేరడం.. కిడ్నాపర్‌ నయనరాణి అరెస్ట్‌ కావడంతో.. ఈ ఎపిసోడ్‌ సుఖాంతమైంది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో వేచి చూడాలి. 

06:33 - July 6, 2018

హైదరాబాద్ : ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ఆరోపించాయి. స్వామినాథన్‌ కమిషన్ సిఫార్సులను అమలు చేయలేదని మండిపడ్డాయి. వరిధ్యానానికి మద్దతు ధర ప్రకటించి రాష్ట్రాల్లోని రైతాంగాని ఆదుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. తెలంగాణలో వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించడంలో కేంద్రం ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తోందని రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి భారమైనా మార్క్‌ఫెడ్ ద్వారా ఇతర పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటుందన్నారు. వరి ధాన్యానికి మద్దుతు ధర ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్రం ప్రకటించిన కనీస మద్ధతు ధరలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ధరల కంటే చాలా తక్కువని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. స్వామినాథన్‌ కమిషన్ సిఫార్సులను కూడా కేంద్రం తుంగలో తొక్కిందని...ధాన్యం గ్రేడ్‌-ఏ కి 3 వేల 472 రూపాయలు ఇవ్వాలని కోరితే 1770 రూపాయలు, కామన్ వెరైటీకి 2 వేల 823 ప్రతిపాదిస్తే 1750 రూపాయలు మాత్రమే ప్రకటించారన్నారు. అన్ని పంటల మద్ధతు విషయంలో కేంద్రం దారుణంగా వ్యవహరించిందని సోమిరెడ్డి అన్నారు. మద్దతు ధర పేరుతో కేంద్రం మోసపూరిత ప్రకటన చేసిందని సీపీఎం ఆరోపించింది. స్వామినాథన్ ‌కమిషన్ సిఫారసులకు అనుగుణంగా ‌ఉత్పత్తి ఖర్చుపై 50 శాతం లాభంతో మద్దతు ధర పెంచలేదన్నారు. మోదీ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాన్ని సీపీఎం ఎండగడుతూ...రైతులకు వాస్తవాలు వివరిస్తామన్నారు.  

06:31 - July 6, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో నేత‌ల కుమ్ములాట‌ల‌పై హైక‌మాండ్ అల‌ర్ట్ అయ్యింది. నాయకులను గాడిలో పెట్టక పోతే .. వచ్చే ఎన్నికల్లో పార్టీ పుట్టి మునుగుతుంద‌ని భావిస్తున్న ఢిల్లీ పెద్దలు నేరుగా రంగంలోకి దిగారు. అసంతృప్తి నేత‌ల‌తో విడివిడిగా మంత‌నాలు జ‌రుపుతున్నారు. కస్సుబుస్సు నేతలకు స‌మ‌న్వయ మంత్రాన్ని ఉప‌దేశిస్తూ రాహుల్‌ దూతలు బిజీగా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య కస్సుబుస్సుల పంచాయతీలు హైకమాండ్‌ను కలవరపెడుతున్నాయి. ఓ వైపు ముంద‌స్తు ఎన్నికల ఘంటిక‌లు మ్రోగుతుండ‌టంతో అసంతృప్త సెగలను చల్లబరిచేందుకు ఢిల్లీనాయకత్వం రంగంలోకి దిగింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో అధికారం సాధించాలని పట్టుదలగా ఉన్న హస్తం పెద్దలు దూకుడు నేతలకు కళ్లెంవేసే వ్యూహాన్ని అమల్లో పెట్టారు.

ఇటివ‌ల టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు వ్వతిరేకంగా కొంద‌రు నేత‌ల సీక్రెట్ గా మీటింగ్‌ పెట్టడంపై డిల్లీ పెద్దలు సిరియ‌స్ అవుతున్నారు. వ‌రుస‌గా జ‌రుగుతున్న ఈ భేటిల‌పై ఆరా తీసిన రాహుల్ కార్యాల‌యం.. నేత‌ల అభిప్రాయాల‌ను వినాల‌ని నిర్ణయించింది. ఇప్పటికే ర‌హ‌స్య భేటిలు పెట్టుకున్న నేత‌లు రాహుల్ అపాయింట్ మెంట్ కోరిన నేప‌థ్యంలో .. ఆ భేటికంటే ముందే అసంతృప్త నేత‌ల మూడ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయ‌త్నం చేస్తున్నారు ఢిల్లీ దూతలు.

అసంతృప్తి నేత‌ల‌తో వ‌రుస‌గా మూడు రోజులుగా సంప్రదింపులు సాగిస్తున్న అధిష్టానం దూతలు స‌లిం అహ్మద్, బోస్ రాజు,శ్రినివాస‌న్ లు. అసంతృప్త నేతల అభిప్రాయాల‌ను క్రోడీక‌రించి ఓ నివేదిక‌ను రాహుల్ గాంధీ కి అందించనున్నారు. అయితే ఎన్నిక‌ల సీజ‌న్ మొద‌లైయ్యిన వేళ... పీసీసీ మార్పు అంశం స‌రికాద‌ని చెబుతున్న హైక‌మాండ్ దూత‌లు .. నేత‌ల ప‌ద‌వుల పంప‌కాల్లో అంద‌రినీ సంతృప్తిప‌రిచేలా నిర్ణయాలు ఉంటాయంటున్నారు. టికెట్ల కేటాయింపులో ఎవ‌రి డిమాండ్స్ ఏంటీ ..? ఎవ‌రికి ఏ ప్రాంతంలో బ‌ల‌ముంది .. ?ఎవ‌రికి ఎక్కడ ప్రాధాన్యత క‌ల్పించాల‌నే అంశంలో డిల్లీ దూత‌లు క్లీన్ గా అబ్జ‌ర్వు చేస్తున్నట్లు స‌మాచారం.

నాయ‌కుల మ‌ద్య స‌మ‌న్వయం కుద‌ర్చడ‌మే ప్రధాన ఎజెండాగా సాగుతున్న ఏఐసీసీ కార్యద‌ర్శుల మంత్రాంగం .. రాహుల్ సందేశాన్ని నేత‌ల‌కు ఇంజెస్ట్ చేసే ప్రయ‌త్నం చేస్తున్నారు. ఏఐసీసీ దూత‌ల‌తో భేటి అయ్యిన వారిలో రేవంత్ రెడ్డి .. డీకే అరుణ .. కోమ‌టి రెడ్డి .. శ్రీ‌ధ‌ర్ బాబు .. భ‌ట్టి విక్రమార్కల‌తో పాటు మ‌రికొంద‌రు ఇత‌ర నేత‌లు ఉన్నారు. అయితే .. రాష్ట్ర స్థాయిలో అసంతృప్తి నేత‌ల అభిప్రాయాల‌ను తెల‌సుకుంటూనే క్షేత్రస్థాయిలో ద్వితీయ‌శ్రేణి నేత‌ల అభిప్రాయాల‌ను కూడా తెలుసుకునేందుకు రెడీ అవుతోంది రాహుల్ టీమ్‌. మొత్తానికి నేత‌ల అసంతృప్తి జ్వాల‌లు భ‌విష్యత్తు కు ప్రమాధ ఘ‌టిక‌లు మోగిస్తుండ‌టంతో అల‌ర్టయిన హైక‌మాండ్ ఆప‌రేష‌న్ షురూ చేసింది. అయితే ఈ ఢిల్లీ ఆప‌రేష‌న్ మంత్రాంగానికి అసంతృప్త నేత‌లు ఏమేర‌కు మొత్తబ‌డ‌తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

ఆర్జిత సేవా టికెట్లు ఆన్ లైన్...

చిత్తూరు : తిరుమలలో నేడు ఉదయం 10గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో టిటిడి విడుదల చేయనుంది. 

కృష్ణా నగర్ లో భారీ అగ్నిప్రమాదం...

హైదరాబాద్ : కృష్ణానగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హార్డ్ వేర్ షాపులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆరు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. 

జొన్నలో సరికొత్త వంగడం...

హైదరాబాద్ : ఇక్రిశాట్‌ సైంటిస్టులు.. జొన్నలో మరో సరికొత్త వంగడాన్ని విడుదల చేశారు. ప్రస్తుతమున్న జొన్న రకాలకన్నా యాభై శాతానికి పైగానే అధిక పోషక విలువలతో ఈ జొన్న వంగడాన్ని రూపొందించారు. త్వరలోనే ఈ వంగడాన్ని జొన్న రైతులందరికీ అందుబాటులోకి తెస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. 

తొలగని యాత్రికుల కష్టాలు...

ఢిల్లీ : టిబెట్‌ లోని కైలాస్‌ మానసరోవర్‌ యాత్రీకుల కష్టాలు ఇంకా తొలగలేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో సుమారు 1000 మంది భారతీయులు టిబెట్‌లో పర్వత ప్రాంతాల్లో చిక్కుకుపోయారు.

యూకే హైకోర్టులో 'మాల్యా'కు షాక్...

ఢిల్లీ : బ్యాకులకు కోట్లాది రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్ మాల్యాకు యూకే హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. యూకేలోని మాల్యా ఇంట్లోకి వెళ్లి అక్కడున్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టు వీలు కల్పించింది. 13 భారతీయ బ్యాంకులు వేసిన కేసును హైకోర్టు విచారణ జరిపింది.

కర్ణాటకలో 'రైతు రుణమాఫి'...

కర్ణాటక : కాంగ్రెస్‌-జెడిఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం రైతుల రుణమాఫీపై ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అసెంబ్లీలో తొలిబడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కుమారస్వామి- రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. రుణమాఫీతో రైతులకు 34 వేల కోట్ల లబ్ది చేకూరుతుందని కుమారస్వామి తెలిపారు.

గురుగ్రామ్ లో సెక్స్ రాకెట్...

హర్యానా : గురుగ్రామ్‌లో పోలీసులు సెక్స్ రాకెట్‌ గుట్టును రట్టు చేశారు. ఓ మసాజ్ సెంటర్‌ను అడ్డాగా చేసుకుని వ్యభిచారం సాగిస్తున్న ఐదుగురు విదేశీ మహిళలతో పాటు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంపన్నులు నివసించే సైబర్ సిటీ ప్రాంతంలో మసాజ్ సెంటర్ పేరిట కొందరు వ్యభిచారం నిర్వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

11 మంది మృతిలో సీసీ టీవి ఫుటేజ్ లభ్యం...

ఢిల్లీ : బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యలకు సంబంధించి ఓ సిసిటివి వీడియో ఫుటేజీ బయటకొచ్చింది. అందులో ఆత్మహత్యలు చేసుకోవడానికి కొద్ది గంటల ముందు భాటియా కుటుంబంలోని ఇద్దరు మహిళలు బయట నుంచి స్టూళ్లు, వైర్లు తీసుకెళ్లడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

హస్తినలో 'పాలన'..రాని మార్పు..

ఢిల్లీ : లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా ఢిల్లీలో పరిస్థితి మారలేదు. ప్రభుత్వ అధికారులు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తున్నారని డిప్యూటి సిఎం మనీష్‌ సిసోడియా ఆరోపించారు. సుప్రీం ఆదేశాలను పాటించేది లేదని చీఫ్‌ సెక్రెటరీ లిఖితపూర్వకంగా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

Don't Miss