Activities calendar

07 July 2018

21:58 - July 7, 2018

ప్రపంచ ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఆసక్తికరంగా మారింది. గతంతో పోలిస్తే ఫుట్ బాల్ మ్యాచ్ లకు క్రేజ్ పెరిగింది. వరల్డ్ కప్ లో ఇప్పటికే ఫ్రాన్స్, బెల్జియం, ఇంగ్లాండ్ లు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. జర్మనీ, అర్జెంటీనా, ఉరుగ్వే సెమీఫైనల్ కు చేరుకోలేకపోయాయి. ఇదే అంశంపై ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ ప్లేయిర్, తెలంగాణ రాష్ట్ర ఫుట్ బాల్ సెక్రటరీ పాల్గుణ విశ్లేషణ అందించారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

21:50 - July 7, 2018

ఎవరైనా మనకు నచ్చని పనులు చేసినా...ఆధునిక భావాలకు వ్యతిరేకంగా మాట్లాడినా..వారిని రాతియుగం మనుషులని తీసివేయడం మనకలవాటు.. కానీ రాతియుగం మనుషులు నిజంగా ఎలా బతికేవారో మీకు తెలుసా ? ఆకాశం కథ 2...ది బిగ్ క్వెశ్చన్.. ఈ అంశాలపై పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం... 

 

21:42 - July 7, 2018

రాజస్థాన్‌ : జైపూర్‌లో జరిగిన బహిరంగసభలో ప్రధానమంత్రి నరేంద్రమోది కాంగ్రెస్‌ను మళ్లీ టార్గెట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలంతా 'బెయిల్‌ గాడీ' అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చాలామంది నేతలు బెయిలుపై బయట ఉన్నారని విమర్శించారు. విపక్షాలు సైనికులనే అనుమానించే విధంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు చేసేవారికి రాజస్థాన్‌ ప్రజలు బుద్ధి చెబుతారని మోది అన్నారు. రాజస్థాన్‌లో గత నాలుగేళ్లలో రెండింతల అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రప్రభుత్వం 2100 కోట్ల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మోది శంఖుస్థాపన చేశారు.

 

21:39 - July 7, 2018

మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరుకు చాలా అన్యాయం జరిగిందన్నారు. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. దివిటిపల్లిలో ఐటీ పార్క్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లాపై కేటీఆర్‌ వరాల జల్లు కురిపించారు. 

పాలమూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్‌. పాలమూరు చరిత్రలో ఇవాళ లిఖించదగ్గ రోజన్నారు. ఐటీ టవర్‌ నిర్మాణానికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి 9 నెలల్లోనే పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ పార్క్‌ ఏర్పాటు ద్వారా 15వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని మంత్రి చెప్పారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా నష్టపోయి జిల్లాలో పాలమూరు ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. పాలమూరు అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. 

పాలమూరు జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువును మినీట్యాంక్‌బండ్‌గా తయారు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హుస్సేన్‌సాగర్ వద్ద ఉన్న నెక్లెస్ రోడ్ తరహాలో.. పెద్ద చెరువు వద్ద నిర్మించేందుకు 24 కోట్ల రూపాయలు మంజూరు చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామన్నారు. 

4 ఏళ్ల నుండి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తుంటే... కాంగ్రెస్‌ పార్టీ మాత్రం లేని పోని ఆరోపణలు చేస్తుందన్నారు కేటీఆర్‌. కర్నాటకలో కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం నాలుగు విడతల్లో కాకుండా ఒకే సారి రుణమాఫీ చేయాలని రాహుల్‌ గాంధీని డిమాండ్‌ చేశారు. అభివృద్ధే ధ్యేయంగా పాలమూరులో అన్ని రంగాలపై దృష్టి సారించామన్నారు మంత్రి కేటీఆర్‌. ఆ దిశగానే ప్రభుత్వం పని చేస్తుందన్నారు. 
 

21:35 - July 7, 2018

సింగపూర్ : ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌ చేరుకున్నారు. చంద్రబాబుకు అక్కడి తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మూడు రోజులపాటు చంద్రబాబు సింగపూ‌ర్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ నగరాల సదస్సులో భాగంగా కొన్ని ముఖ్యమైన సమావేశాలు, బృంద చర్చల్లో పాల్గొనడంతో పాటు, పట్టణ, నగరీకరణకు సంబంధించిన అంశాలపై కీలక ప్రసంగాలు చేయనున్నారు. వివిధ దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధినేతలతోనూ భేటీ కానున్నారు. 

 

21:33 - July 7, 2018

తూ.గో : ఏపీ సీఎం చంద్రబాబు నాలుగేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. ఎన్నికలు దగ్గర్లో ఉన్నప్పుడే చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ప్రజాసంకల్ప యాత్రలో ప్రభుత్వ తీరుపై జగన్‌ నిప్పులు చెరిగారు. 

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంకు చేరుకుంది. ఈ సందర్భంగా రామచంద్రాపురంలో భారీ బహిరంగా సభ ఏర్పాటు చేశారు. చంద్రబాబు పాలనలో మొత్తం అవినీతే రాజ్యమేలిందన్నారు జగన్‌. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. 

రామచంద్రాపురంలోని ఏరియా ఆస్పత్రిలో సరిపడా డాక్టర్లు లేకపోవడంపై జగన్‌ మండిపడ్డారు. జనరల్‌ ఫిజిషిన్‌ కూడా ఆస్పత్రిలో లేకపోవడం దారుణమన్నారు జగన్‌. పేదవాళ్లకు ఇళ్లు కట్టించేందుకు వైఎస్సార్‌ హయాంలో 32 ఏకరాలను రామచంద్రపురంలో సేకరిస్తే.... టీడీపీ ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుందని జగన్‌ ఆరోపించారు. పేదవాడికి ఇచ్చే ఇంటిపై కూడా టీడీపీ పాలకులు లంచం తీసుకుంటున్నారని జగన్‌ విమర్శించారు. 

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్న జగన్‌... ఇప్పటికైనా ప్రజలు తమకు కావాల్సిన నాయకుడిని నిర్ణయించుకోవాలని సూచించారు. ఓటును టీడీపీ ప్రభుత్వం కొనాలని చూసిననా మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

21:27 - July 7, 2018

విశాఖ : వచ్చే ఎన్నికల్లో తాను అధికారంలోకి రాకపోయినా... టీడీపీ దోపిడీపై పోరాడుతానని స్పష్టం చేశారు జనసేనాని. ఉత్తరాంధ్ర పోరాటయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ పాలనపై విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని గాలికొదిలేసిన సర్కార్‌... గిరిజన, దళితుల భూములను విచ్చలవిడిగా లాక్కుంటుందన్నారు. టీడీపీ దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి కార్యకర్తలంతా పోరాడాలని జనసేనాని పిలుపునిచ్చారు. 

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోరాటయాత్ర ముగింపు సందర్బంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నిరసన కవాతు నిర్వహించారు. ఈ కవాతులో అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈ కవాతు కొనసాగింది. ప్రజా సమస్యలపై గళమెత్తడంతోపాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు పవన్‌కల్యాణ్‌. రాష్ట్రంలో టీడీపీ దోపిడీ పెరిగిపోయిందన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రం అభివృద్ది చెందాలంటే అనుభవం ఉన్న నేత కావాలని చంద్రబాబుకు మద్దతిస్తే.. అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఎలాంటి ప్రయోజనం లేకపోతే చంద్రబాబు ఏ పని చేయరని పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. తమ ప్రయోజనాల కోసం ఉత్తరాంధ్ర అడ్డంగా దోచేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి తన మద్దతు ఎంత ఉపయోగపడిందో... వచ్చే ఎన్నికల్లో అంతే బలమైన ప్రత్యర్ధిని అని పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. 

విశాఖ రైల్వే జోన్‌ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. నలుగురు తలుచుకుంటే... విశాఖ రైల్వేజోన్‌ సాధ్యమన్నారు. చంద్రబాబు, లోకేశ్‌, జగన్‌తో కలిసి రైళ్లను స్తంభింపజేసేందుకు తాను సిద్ధమని.. వాళ్లు సిద్దమా ? అని సవాల్‌ విసిరారు. చంద్రబాబుకు ప్రధాని మోదీ అంటే భయమని.. అందుకే ప్రత్యేకహోదాపై గట్టిగా పోరాటం చేయడం లేదన్నారు. 

తనకు డబ్బుపై ఆశలేదని... స్వచ్చమైన రాజకీయాలు చేసేందుకు సిద్దంగా ఉన్నానన్నారు పవన్‌కల్యాణ్‌. ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూశానని.. ఎన్నికల్లో గెలవకపోయినా... ప్రభుత్వ దోపిడీలపై పోరాడుతానన్నారు. చంద్రబాబు దళిత తేజం అని చెప్పి.. దళితుల భూములనే లాక్కుంటున్నారన్నారు. టీడీపీ నేతల అవినీతి, అక్రమాలపై జనసేన సైనికుల్లా పోరాడుతుందన్నారు జనసేనాని.  ఉత్తరాంధ్ర పర్యటనలో టీడీపీపై విమర్శలు చేస్తున్న పవన్‌కల్యాణ్‌... పోరాటయాత్ర ముగింపు యాత్రలో స్వరం పెంచారు. టీడీపీ దోపిడీకి ప్రజలంతా అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. 

21:23 - July 7, 2018

హైదరాబాద్ : బీసీల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. చిన్న వ్యాపారాలు, కులవృత్తులు చేసుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండా 100శాతం రాయితీతో ఆర్ధికసాయం చేయాలని నిర్ణయించారు. జిల్లాల్లో  లబ్దిదారుల ఎంపిక కోసం కలెక్టర్‌ చైర్మన్‌గా నలుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ స్థాపించామని.. వచ్చే ఏడాది మరో 119 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

బీసీలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వీలుగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ప్రగతిభవన్‌లో బీసీ వర్గాల సంక్షేమ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. 

వెనకబడిన తరగతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. బీసీ కులాల్లో కులవృత్తులు చేసుకుని జీవించే వారికి అవసరమైన పనిముట్లు కొనుగోలు చేసుకునేందుకు... చిన్న వ్యాపారాలు చేసేవారికి... కులవృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే 100శాతం రాయితీతో ఆర్ధికసాయం అందించాలని సూచించారు. గ్రామాలవారీగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కలెక్టర్‌ చైర్మన్‌గా, బీసీ సంక్షేమ అధికారి కన్వీనర్‌గా, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్డీఏ పీడీ సభ్యులుగా కమిటీని నియమించాలన్నారు. లబ్ధిదారుల జాబితా సిద్దంకాగానే ఆర్ధిక సాయం చేయాలని సూచించారు. బీసీ సంక్షేమశాఖకు, ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులను ఇందుకోసం వినియోగించాలన్నారు కేసీఆర్‌. 

వచ్చే ఏడాది మరో 119 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఇక మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఎక్కడైనా సీట్లు మిగిలితే... బీసీలకే కేటాయిస్తామని... బీసీ కులాల్లోని పిల్లలకు మంచి విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కల్లు దుకాణాల పునరుద్ధరణతో పాటు చెట్ల రకం రద్దు చేయడం వల్ల గీత కార్మికులకు మేలు కలుగుతుందన్నారు. గీత కార్మికులకు కావాల్సిన విషయాలపై మరోసారి అధ్యయనం చేసి మరిన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యాదవులకు ఇప్పటికే 65 లక్షల గొర్రెలు పంపిణీ చేయడంతో... ఆర్థికంగా బలోపేతమవుతున్నారని కేసీఆర్‌ స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున చేపల పెంపకం వల్ల ముదిరాజ్, గంగపుత్రులతో పాటు మత్స్యకారులు లబ్ది పొందుతున్నారన్నారు. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి తీసుకున్న చర్యల వల్ల పద్మశాలీలకు మేలు జరిగిందన్నారు. విశ్వకర్మలు, రజకులు, నాయీ బ్రాహ్మణులతో పాటు ఎంబీసీ కులాల వారికి ఆర్థిక చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. కుల వృత్తులు చేసుకునే వారికే కాకుండా చిన్న వ్యాపారాలు చేసే వారికి పండ్లు, కూరగాయలు, పూలు అమ్ముకునే వారికి, మెకానిక్ పనులు చేసుకునే వారికి, ఇంకా ఇతరత్రా పనులు చేసుకునే బీసీలను గుర్తించి ఆర్థిక చేయూత అందివ్వాలని మంత్రులకు సీఎం కేసీఆర్ సూచించారు.

21:14 - July 7, 2018

తెల్గుదేశానికి త్వరలో ఆనం గుడ్ బై..జగన్తోని ఎయిర్ పోర్టుల ఏకాంత చర్చ, మీ చెల్లె కవితను గెలిపిచ్చుకో కేటీఆర్.. నేను రాజకీయం జేయంటున్న కోమటి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కోదండరాం..మరి మీ పార్టీల అసమ్మతి సంగతేంది?, ఎంసెట్ పేపర్ల లీకుల శ్రీచైతన్య నారాయణ....రోడ్డెక్కుతున్న విద్యార్థి సంఘాలు, సైనికుని భూమి కబ్జా వెట్టిన కారుకర్తలు.. తహశీల్దార్ ఆఫీసు సుట్టు బాధితులు, ఉద్యమ కారులకు పూలదండ శాలువు...ఉద్యమ ద్రోహులకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు....ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.... 

21:05 - July 7, 2018

లిరిక్ రైటర్ రాంబాబు గోసలతో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సినీ అనుభవాలను తెలిపారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లో... వియ్యాలవారి కయ్యాలు సినిమాకు 2007లో నేను మొదటిసారిగా పాటలు రాశాను. అర్జున్ రెడ్డి మూవీ నాకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి నుంచి మొదటగా నాకు కాంప్లిమెంట్స్ వచ్చాయి. నాకు పాటలంటే ఇష్టం. వేటూరి సుందర్ రామమూర్తి నా గురువు అన్నారు. బాలకృష్ణ నా ఫేవరేట్ హీరో, ఇష్టమైన డైరెక్టర్ రాజమౌళి. అని వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

20:51 - July 7, 2018
20:26 - July 7, 2018

విశాఖ : టీడీపీపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. విశాఖ రైల్వేజోన్ కోసం తాను దేనికైనా సిద్ధమని అని అన్నారు. రైళ్లను అడ్డుకుంటే రైల్వే జోన్ ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. 'రైళ్లను అడ్డుకునేందుకు నేను సిద్ధం... చంద్రబాబు, లోకేష్, జగన్ లు సిద్ధమా' అని పవన్ అన్నారు. విశాఖ రైల్వేజోన్ అంటే టీడీపీ నేతలకు నవ్వులాటగా ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ దోపిడీ పెరిగిందన్నారు. 

 

నేను దోపిడీకి వ్యతిరేకం : పవన్

విశాఖ : జనసేన నిరసన కవాతు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని, మాట్లాడారు. 'నేను మీ ఇంట్లో ఒకడినని.. మీరంతా నా వాళ్లు అని అన్నారు. దోపిడీకి తాను వ్యతిరేకమని చెప్పారు. తాను మీకు అండగా ఉంటానని..అన్ని సమస్యలను పార్టీ మ్యానిఫెస్టోలో పెడతానని పేర్కొన్నారు. 
 

సమస్యల పరిష్కారానికి ప్రాణ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు : పవన్ కళ్యాణ్

హైదరాబాద్ : సమస్యల పరిష్కారానికి, మంచి పరిపాలన కోసం ప్రాణ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని...ఓటు రిజిస్టర్ చేసుకోండి...ఓటు వేయండి అని పవన్ కళ్యాణ్ సూచించారు. నిరుద్యోగ యువత బాధలు చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీవితంలో తనకు ఏ కోరికలు, ఆశలు లేవన్నారు. మా అన్నయ్య చిరంజీవి అంటే నాకు గురువు, దైవం అని అభివర్ణించారు. మా అన్నయ్యను కాదని టీడీపీకి మద్దుతు ఇచ్చానని తెలిపారు. తాను ఎంత అండగా ఉన్నానో....అంతబలంగా ఢీకొట్టే వ్యక్తిని అని పేర్కొన్నారు. 

నాకు చాలా తెగింపు ఉందన్న పవన్ కళ్యాణ్

విశాఖ : జనసేన నిరసన కవాతులో పవన్ కళ్యాణ్ పాల్గొని, మాట్లాడారు. 'నన్ను చాలా మంది బెదిరించారు' అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. కారు యాక్సిడెంట్ చేస్తామని, కారులో బాంబు పెడతామని బెదిరించారని పేర్కొన్నారు. తనకు చాలా తెగింపు ఉందని..ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. 

19:32 - July 7, 2018

విశాఖ : 'నన్ను చాలా మంది బెదిరించారు' అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. కారు యాక్సిడెంట్ చేస్తామని, కారులో బాంబు పెడతామని బెదిరించారని పేర్కొన్నారు. తనకు చాలా తెగింపు ఉందని..ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి, మంచి పరిపాలన కోసం ప్రాణ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని...ఓటు రిజిస్టర్ చేసుకోండి...ఓటు వేయండి అని సూచించారు. నిరుద్యోగ యువత బాధలు చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీవితంలో తనకు ఏ కోరికలు, ఆశలు లేవన్నారు. మా అన్నయ్య చిరంజీవి అంటే నాకు గురువు, దైవం అని అభివర్ణించారు. మా అన్నయ్యను కాదని టీడీపీకి మద్దుతు ఇచ్చానని తెలిపారు. తాను ఎంత అండగా ఉన్నానో....అంతబలంగా ఢీకొట్టే వ్యక్తిని అని పేర్కొన్నారు. 'నేను మీ ఇంట్లో ఒకడినని.. మీరంతా నా వాళ్లు అని అన్నారు. దోపిడీకి తాను వ్యతిరేకమని చెప్పారు. తాను మీకు అండగా ఉంటానని..అన్ని సమస్యలను పార్టీ మ్యానిఫెస్టోలో పెడతానని పేర్కొన్నారు. 

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బాగ్ లింగంపల్లి, నారాయణగూడ, మల్కాజ్ గిరి, నేరేడ్ మెంట్, కుషాయిగూడ, ఈసీఐఎల్, నాగారం, కీసరలో వర్షం కురుస్తుంది. 

 

19:00 - July 7, 2018

హైదరాబాద్ : తెలంగాణలో పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. లక్షా 6వేల 240 మంది పరీక్షలకు హాజరుకాగా..వీరిలో  48 వేల 644 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 45.79 గా ఉందని కడియం తెలిపారు. బాలికలు 48.6 శాతం,  బాలురు 44.05 శాతం ఉత్తీర్ణత సాధించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. ఆదిలాబాద్‌ జిల్లా చివరిస్థానంలో నిలిచిందని కడియం తెలిపారు. 

 

చంద్రబాబుపై జగన్ విమర్శలు

తూ.గో : నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమీలేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రామచంద్రాపురం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం విమర్శించారు. చవరికి ఇసుకను కూడా వదలడం లేదని ఎద్దేవా చేశారు. అరకొర ఇళ్లు కట్టించారని చెప్పారు. ఆస్తులు అమ్ముకుంటే తప్ప చదివించుకోలేని పరిస్థితలు ఉన్నాయని అన్నారు. 

18:56 - July 7, 2018

తూ.గో : నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేమీలేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రామచంద్రాపురం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం విమర్శించారు. చవరికి ఇసుకను కూడా వదలడం లేదని ఎద్దేవా చేశారు. అరకొర ఇళ్లు కట్టించారని చెప్పారు. ఆస్తులు అమ్ముకుంటే తప్ప చదివించుకోలేని పరిస్థితలు ఉన్నాయని అన్నారు. రేషన్ కార్డు, పించన్, మరుగుదొడ్ల ఇవ్వాలంటే లంచాలు అడుగుతున్నారని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను పోషిస్తున్నారని విమర్శించారు. నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్న టీడీపీ ప్రభుత్వాన్ని ఏమనాలి అని అన్నారు. గతంలో చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్ ను అడ్డుకుని...ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ కోసం దీక్షలు చేస్తున్న మోసకారిని ఏమనాలన్నారు. చంద్రబాబు రోజుకో కొత్త నాటకం ఆడుతున్నారని పేర్కొన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి..ఇప్పటివరకు యువతకు ఉపాధి కల్పించలేదన్నారు. 

 

18:45 - July 7, 2018

విశాఖ : 'నా జీవితం సినిమాలకు కాదు...ప్రజలకు అంకితం చేస్తాను' అని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు గెలుపోటములు సెకండరీయని...మొదటగా సీఎం చంద్రబాబు దోపిడీ మీద పోరాటం చేస్తానని తెలిపారు. విశాఖ బీచ్ రోడ్ లో జనసేన నిరసన కవాతులో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఈ దుర్మార్గులపై తిరగబడతానని.. అన్యాయంపై పోరాడుతానని చెప్పారు. 'మీ వద్ద బాంబులు, వేటకొడవళ్లు, బరిసెలు ఉంటే భయపడను' అని పవన్ కళ్యాణ్ అన్నారు. 'మీ అన్నయ్యపై, మీ మీద కొన్ని కేసులు పెడతారు' అని అన్నారని తెలిపారు. గతంలో చిరంజీవి రాజకీయాల్లో వస్తున్నప్పుడు తనపై కేసులు పెడితే ఆయన రాజకీయాల్లోకి రారనే ప్రయత్నం చేశారని తెలిపారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. ఇంతమంది అభిమానులు ఉన్న తననే భయపడితే... ఇక సామాన్యుల పరిస్థితేంటని అన్నారు. కాంగ్రెస్ ను పవన్ విమర్శించడం లేదని..అంటున్నారు... కానీ అది కారెక్ట్ కాదు...కాంగ్రెస్ నేతలను పంచలూడిపోయేలా తరమికొట్టాలని పిలుపుఇచ్చానని... కాంగ్రెస్ హఠావో,..దేశ్ కో బచావో అని నినాదం ఇచ్చినట్లు గుర్తు చేశారు. వైజాగ్ పట్టణం కబ్జాకు గురౌతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో దౌర్జన్యంగా కబ్జాలు చేస్తే.. టీడీపీ హయాంలో లీగల్ గా కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. 'ఇది నాకు మీరిచ్చిన జీవితం... నా జీవితం సినిమాలకు కాదు....ప్రజలకు అంకింతం చేస్తాను' అని అన్నారు. తనకు ఏం తెలుసునని ప్రశ్నిస్తున్న వారికి.. ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర బాధ, ఆవేదన మీకు తెలుసా..నాకు తెలుసునని అన్నారు. తనకు ప్రాణాలపై తీపి లేదు, డబ్బు మీద అశ లేదన్నారు. 

 

కబ్జాకు గురౌతున్న వైజాగ్ : పవన్ కళ్యాణ్

విశాఖ : బీచ్ రోడ్ లో జనసేన నిరసన కవాతులో పవన్ కళ్యాణ్ పాల్గొని, మాట్లాడారు. వైజాగ్ పట్టణం కబ్జాకు గురౌతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో దౌర్జన్యంగా కబ్జాలు చేస్తే.. టీడీపీ హయాంలో లీగల్ గా కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. 

 

 

నేను ఎవరికీ భయపడను : పవన్ కళ్యాణ్

విశాఖ : బీచ్ రోడ్ లో జనసేన నిరసన కవాతులో పవన్ కళ్యాణ్ పాల్గొని, మాట్లాడారు. 'మీ వద్ద బాంబులు, వేటకొడవళ్లు, బరిసెలు ఉంటే భయపడను' అని పవన్ కళ్యాణ్ అన్నారు. 'మీ అన్నయ్యపై, మీ మీద కొన్ని కేసులు పెడతారు' అని అన్నారని తెలిపారు. గతంలో చిరంజీవి రాజకీయాల్లో వస్తున్నప్పుడు తనపై కేసులు పెడితే ఆయన రాజకీయాల్లోకి రారనే ప్రయత్నం చేశారని తెలిపారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. ఇంతమంది అభిమానులు ఉన్న తననే భయపడితే... ఇక సామాన్యుల పరిస్థితేంటని అన్నారు. 

18:12 - July 7, 2018

పెద్దపల్లి : జిల్లాలోని సుల్తానాబాద్ మండలం నీరుకుల్లాలో రైల్వేట్రాక్ కింద వర్షపు నీరు చేరడంతో ఆయా గ్రామాలప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులే నీటిని మోటార్ల ద్వారా ఎత్తి పోస్తున్నారు. రైల్వే అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

18:01 - July 7, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో భారీ వర్షం ముంచెత్తుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. పట్టినపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి రోడ్డు కొట్టుకుపోయే పరిస్థితిలో ఉంది. భారీ వర్షాలతో ఏలూరు, భీమడోలు, జంగారెడ్డి గూడెంలలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

17:59 - July 7, 2018

ఢిల్లీ : ఇకనుంచి ఏడాదికి రెండుసార్లు నీట్‌, జేఈఈ పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ప్రకటించారు. జనవరి, ఏప్రిల్‌లో జేఈఈ పరీక్షలు, ఫిబ్రవరి, మేలో నీట్ పరీక్షలు నిర్వహించనున్నారు. 

17:52 - July 7, 2018

కడప : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక  ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ అన్నారు. కార్మిక వ్యతిరేక పార్టీగా బీజేపీ ముద్ర వేసుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను మారుస్తూ కార్మికులపై దాడులు చేస్తున్నారని గఫూర్‌ ఆరోపించారు. కార్మికులను బానిసలు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని మండిపడ్డారు. 

 

17:31 - July 7, 2018

విజయవాడ : జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ కేంద్రం నడవమన్నట్లుగా నడుస్తున్నారని ఏపీ ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నఆరోపించారు. పవన్‌ నటించిన సినిమాల్లో ఒక్క జాని సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ వేరే డైరెక్టర్లు చేసినవే అని.. ఇప్పుడు రాజకీయం కూడా కేంద్రం డైరెక్షన్‌లోనే నడుపుతున్నాడన్నారు. చంద్రబాబును ఏపీ ముఖ్యమంత్రి పదవి నుంచి.. పవన్‌ రాజీనామా చేయమనడం హస్యాస్పదమన్నారు. ముఖ్యమంత్రిని రాజీనామా చేయమనే హక్కు పవన్‌కు లేదన్నారు. దీని వెనుక ఎవరున్నారనేది మోదీయా లేక జగనా అనేది పవన్‌ చెప్పలన్నారు.

 

17:00 - July 7, 2018

నిజామాబాద్‌ : తెలంగాణలో భస్మాసుర పాలన కొనసాగుతుందని జనసమితి అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రజలు ఓటు ఆయుధంతో ప్రజాస్వామ్యాన్ని నిర్మించాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రాజెక్టుల పేరుతో జేబులు నింపుకుంటున్నారని అన్నారు. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ, ధర్పల్లి, ప్రాజెక్టు రామడుగులో తెలంగాణ జన సమితి పార్టీ జెండాను కోదండరామ్‌ ఆవిష్కరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసి అధికారం సాధిస్తుందని కోదండరామ్‌ అన్నారు.
 

16:57 - July 7, 2018

గుంటూరు : జిల్లాలోని తాడేపల్లిలోని డోలాస్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కోడలిని ఇంట్లో బంధించి అత్తింటి వేధింపులకు పాల్పడ్డారు... అంతేకాకుండా అనుమానంతో జుట్టు కత్తిరించారు. గతంలో భర్త రాంబాబు తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే... మంచిగా చూసుకుంటానని చెప్పి... మళ్లీ అదే తీరుగా ప్రవర్తిస్తున్నాడని మేరి చెబుతోంది. భర్తే కాకుండా అత్తామామలు కూడా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

16:52 - July 7, 2018

నాగర్కర్నూల్ : పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి పీటలపై నవ వధువు మృతి చెందింది. అచ్చంపేటలో జరిగిన పెళ్లి వేడుకలో వధూవరుడు తలంబ్రాలు పోసుకుంటుండగా వధువు లక్ష్మీ పీటలపై కుప్పకూలింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. వధువు మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పెళ్లి కూతురు మృతితో వధువు, వరుని కుటుంబాల్లో విషాధచాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

16:45 - July 7, 2018

పాట్నా : బీహార్ లో దారుణం జరిగింది. టెన్త్ క్లాస్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. మైనర్ బాలికపై 15 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు లైంగిక దాడికి పాల్పడ్డారు. గత 6 నెలలుగా బాలికను బ్లాక్ మెయిల్ చేసి కిరాతకులు పశువాంఛ తీర్చుకుంటున్నారు. 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్, టీచర్, ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేశారు. 

 

16:40 - July 7, 2018

చెన్నై : తమిళ రాజకీయాలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  తమిళ రాజకీయాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలా మారాయన్నారు ప్రకాష్‌ రాజ్‌.  అన్నాడిఎంకె భవిష్యత్తులో తిరిగి ప్రభుత్వంలో ఉండదనే వాస్తవమే రాబోయే రోజుల్లో ప్రమాదకరంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నైలో జరిగిన తూత్తుకుడి మృతుల సంతాప సభలో ప్రకాష్‌ రాజ్‌  మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోనే ఉన్నాను కానీ.. ఎన్నికల్లో నిలబడే రాజకీయ నాయకుడిలా కాదన్నారు. తమిళనాట అన్ని రాజకీయ పార్టీలు ఒకేలా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో వాటన్నింటికీ వ్యతిరేకంగా ప్రజాస్వామ్య ఉద్యమం రానుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ప్రకాష్ రాజ్ తమిళ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. 

 

16:24 - July 7, 2018

హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీఆర్‌ఎస్‌ నేతల చుట్టూ వివాదాలు చెలరేగుతున్నాయి. అధికారపార్టీ నేతలు అత్యుత్సాహం చూపుతూ... కొత్త చిక్కులు తెచ్చుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ సుమర్‌పై వచ్చిన ఆరోపణలు పార్టీ నేతల్లో హాట్‌టాఫిక్‌గా మారాయి.
వివాదాల్లో గులాబీ నేతలు
గులాబి పార్టీ నేతలను వివాదాలు వీడడం లేదు. ఒక్కో జిల్లాల్లో ఒక్కో రకమైన    ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. నేతల మధ్య ఆధిపత్య పోరు సహా..... గులాబి నేతలు చూపిస్తున్న అత్యుత్సాహం అధికార పార్టీకి  ఇబ్బందులు సృష్టిస్తోంది. గత  నాలుగేళ్లుగా అక్కడక్కడా  వివాదాలు వెలుగు చూస్తున్నా...ఇటీవల కాలంలో   నేతల వ్యవహార శైలి మరింత  చర్చనీయంశంగా మారుతోంది. ఆధిపత్యం కోసం  ఒక నేత..... అధికార పార్టీ అన్న ధీమాతో మరో నేత....వ్యక్తి గత వ్యవహార శైలితో  ఇంకొక నేత వ్యవహరిస్తుండడం.... గులాబి బాస్ కేసిఆర్  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సోషల్‌ మీడియాలో టీఆర్‌ఎస్‌ నేతల తీరు హల్‌చల్‌ 
అవిశ్వాస తీర్మానం విషయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య  చేసిన వ్యాఖ్యలు  సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.....  గులాబి నేతల్లో చర్చనీయంశంగా మారాయి. మరుసటి రోజే యువనేత ఎంపీ సుమన్ పై  మహిళా పాత్రికేయులు ప్రధానికి ఫిర్యాదు చేసారన్న  విషయం బయటపడడంతో.... అధికార పార్టీలో వ్యవహారం హాట్ హాట్ గా మారింది. కేసిఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా  ఉండే నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సుమన్..... మహిళలను  లైంగికంగా వేధించడాన్న ఫిర్యాదులపై పార్టీ కూడా అప్రమత్తమైంది.  పార్టీ పరంగా నేతలు ఈ వ్యవహారంపై స్పందించేందుకు ఆసక్తి చూపక పోయినా..... పోలీసు శాఖా పరంగా దిద్దుబాటు చర్యలను మొదలు పెట్టింది. ఫోటోలను  మార్ఫింగ్ చేసి..... బ్లాక్ మేయిలింగ్ కు పాల్పడ్డారని పోలీసు అధికారులు వెల్లడించడం వెనుక వ్యూహం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
టీఆర్‌ఎస్‌ మంత్రి చాంబర్‌లో వివాదం
పది రోజుల  క్రితం  దక్షిణ తెలంగాణాకు జిల్లాకు చెందిన ఓ మంత్రి ఛాంబర్ లో చోటు చేసుకున్న వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చింది. నగర శివారుల్లో ఓ భూ సెటిల్ విషయంలో  అదే జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందన్న ప్రచారం జరుగుతోంది.  మంత్రి ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించకపోవడంతో సదరు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ....తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమన్న ప్రకటన చేసినట్లు సమాచారం.  మొత్తం మీద ఎన్నికలకు ముందు గులాబి నేతలపై  ఆరోపణలు తెరపైకి వస్తుండడం అధికార పార్టీని కలవరపెడుతోంది.

 

16:03 - July 7, 2018

ప్రకాశం : ఏపీ విభజన హామీలపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయటం దారుణమని సీపీఐ సీనియర్‌ నేత నాయుడు ప్రకాశరావు అన్నారు. విభజన హామీలు అమలుతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో ధర్నా నిర్వహించి, సీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీ, తెలుగు దేశం పార్టీలు ఇచ్చిన హామీల అమలుకు నోచుకోలేదని సీపీఐ నేతలు మండిపడ్డారు.

 

15:59 - July 7, 2018

మహబూబ్ నరగ్ : తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుండి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రి  పర్యటించారు. పాలమూరులో ఐటీ టవర్‌ నిర్మాణాని 50 కోట్లు విడుదల చేస్తామన్నారు. జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతామన్నారు. 

ఇకపై నీట్, జేఈ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు : జవదేకర్

ఢిల్లీ : ఇకపై నీట్, జేఈ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. విద్యార్థులు ఎప్పుడైనా ఒక్కసారి పరీక్షకు హాజరుకావచ్చన్నారు. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు కొత్త విధానం తీసుకొస్తున్నామని తెలిపారు. 

అచ్చంపేటలోని పెళ్లి ఇంట్లో విషాదం

నాగర్ కర్నూల్ : అచ్చంపేటలోని పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. అరుంధతి నక్షత్రం చూస్తూ వధువు బుజ్జి (24) కుప్పకూలింది. చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. వధువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

 

15:35 - July 7, 2018

శ్రీకాకుళం : అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన పలాస జీడి పరిశ్రమపై జీఎస్టీ దెబ్బ పడింది. వివిధ రకాల పన్నుల భారంతో జీడి పరిశ్రమల బంద్‌కు యజమాన్యాలు సిద్ధమయ్యాయి. జీడిపిక్కల సీజన్‌ ప్రారంభమైన నెలరోజులకే యజమాన్యాలు బంద్‌ ప్రకటించడంతో వేలాదిమంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడింది. 
15 రోజులపాటు మూతపడనున్న జీడి పరిశ్రమ  
శ్రీకాకుళం జిల్లాలో జీడిపిక్కల సీజన్‌ ప్రారంభమైన నెలరోజులకే జీడి పరిశ్రమ 15 రోజుల పాటు మూతపడనుంది. ఈ నెల 10 నుంచి 25 వరకు పరిశ్రమలను బంద్‌ చేయనున్నారు. దీంతో జిల్లాలోని పలాస కాశీబుగ్గ జంట పట్టణాలు, పారిశ్రామికవాడతో పాటు పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో సుమారు 300 కర్మాగారాలు మూతపడనున్నాయి.
దేశంలో జీడి పప్పునకు కీలకంగా కేరళ, ఆందేశ్‌ 
దేశంలో జీడి పప్పునకు కేరళ, ఆందేశ్‌ కీలకంగా ఉన్నాయి. అయితే జీఎస్టీ వచ్చాక నెలకొన్న పరిస్థితుల వల్ల కేరళలోని సుమారు 700లకు పైగా కర్మాగారాలు మూతపడ్డాయి. జీడిపప్పు ఎగుమతులకు సంబంధించిన రాయితీలపై జీఎస్టీ ప్రభావం చూపడంతో యూరప్‌ వంటి దేశాలకు సరఫరా నిలిచిపోయింది. వీటికి తోడు తాజాగా గోవా, మధ్యప్రదేశ్‌, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కొత్తగా కర్మాగారాలు ప్రారంభించారు. దీంతో ఈ నెల నుంచి అమలుచేస్తున్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పన్నుల విధానం కొనుగోలుదారులకు  ఇబ్బందికరంగా మారింది. మరో వైపు పిక్కలు కొనుగోలు చేసినచోటే ఆన్‌లైన్‌ విధానం ద్వారా పన్ను చెల్లించాలన్న నిబంధనను అమలవుతున్నాయి. దీంతో మారుమూల ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన వాటికి ఆన్‌లైన్‌లో పన్నులు ఎలా చెల్లించాలని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.  
జీఎస్టీ విధానంతో జీడి పరిశ్రమలకు ఇబ్బందులు 
ఎగుమతులు బాగా తగ్గి డిమాండ్ లేకపోవడంతో దిగుమతి చేసుకున్న విదేశీ పిక్కల నిల్వలు విశాఖపట్నం, ట్యూటీకోరిస్‌ పోర్టుల్లో పేరుకుపోయాయి. మరోవైపు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు... జీఎస్టీ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా జీడి పశ్రమపై తాజాగా ఏ.ఎం.సి పన్ను విధానం కలవరపెడుతోంది. 

15:25 - July 7, 2018

ఆసిఫాబాద్‌ : వెనకబడిన ప్రాంతాలలో అత్యంత ముందు వరసలో ఉండే ప్రాంతం అది. గిరిజనుల సౌకర్యం మెరుగు పడాలని ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది. కాని ఆ ప్రాంతంలో పనిచేయడానికి ఉద్యోగులు ఇష్టపడడం లేదు. ఇతర ప్రాంతాల నుండి బదిలీలు జరిగినా ఈ ప్రాంతంలో పని చేసేందుకు ఇష్టంలేక విధుల్లో చేరడం లేదు. 
గాడి తప్పుతున్న పాలన 
కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా.... రెండేళ్ల క్రితం జిల్లాల విభజనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి వేరు చేసి ఏర్పాటు చేసిన కొత్త జిల్లా ఇది. ఈ కొత్త జిల్లాను ఉద్యోగుల కొరత పట్టిపీడిస్తుంది. జిల్లాలో ఏ శాఖలోను సగానికిపైగా ఉద్యోగులు లేక పాలన గాడి తప్పుతుంది. 
జిల్లాకు రావడానికి ఇష్టపడని ఉద్యోగులు
వెనుకబడిన జిల్లాగా  పేరొందిన ఆసిఫాబాద్‌ జిల్లాకు ఉద్యోగులు రావడానికి ఇష్టపడటం లేదు. జిల్లాలో మొత్తం నలభై మూడు శాఖలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కీలక పోస్టుల నుంచి అటెండర్‌ పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఉద్యోగులు బదిలీలపై వెళ్లడమే కాని కొత్తగా వస్తున్నవారు ఎవరూ లేరు. ఆర్‌ అండ్‌ బీ శాఖలో ఏడుగురు జూనియర్‌ ఇంజనీర్లు పనిచేయాల్సి ఉండగా కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. తునికల కొలతలు శాఖకు ఇప్పటి వరకు అధికారులు లేకపోగా.. విద్యుత్ శాఖలో కేవలం జిల్లా కేంద్రంలో నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.
46 మంది జనరల్‌ డాక్టర్లకు గాను విధుల్లో 29 మంది డాక్టర్లు 
మరో వైపు విద్య, వైద్య శాఖలలో ఇంకా దారుణమైన పరిస్థితి నెలకొంది. జిల్లా పరిధిలో మొత్తం 18 పీహెచ్‌సీలలో 46 మంది జనరల్‌ డాక్టర్లు అవసరం ఉండగా 29 మాత్రమే సేవలందిస్తున్నారు. వీరిలో కేవలం ముగ్గురు మాత్రమే రెగ్యులర్‌ డాక్టర్లు...మిగితా 26 మంది కాంట్రాక్టు బేస్‌లో పనిచేస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఒక్క డాక్టరు కూడ లేక నర్సులు సేవలందిస్తున్నారు. ఇక విద్యారంగంలో చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా 12 ఎంఈఓలకు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. మిగతా వారంతా హైస్కూల్‌ హెచ్‌ఎంలకే ఇంచార్జ్‌ బాధ్యతలను ఇచ్చారు. 
ఆర్డీఓకు అదనపు బాధ్యతలు
జిల్లాలో రెవిన్యూ అధికారి లేక ఆర్డీఓకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా నాలుగైదు గ్రామాలకు ఒక వీఆర్వో ఉన్నారు. పంచాయితీ కార్యదర్శులు 173 మందికి 98 మందే ఉన్నారు. ఇలా జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సిబ్బంది కొరత ఏర్పడింది. 
సిబ్బంది లేక పరిపాలనలో జాప్యం 
కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పనిచేయడానికి ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. బదిలీపై వచ్చిన వారు పైరవీలతో వారంలోగా బదిలీపై వెళ్తున్నారు. దీంతో జిల్లా కేంద్రలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయి. అధికారులు, సిబ్బంది లేక పరిపాలనలో జాప్యం జరుగుతోందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ జిల్లాకు పూర్తిస్థాయి అధికారులను వచ్చేల చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

వర్షాలు... కడెం ప్రాజెక్టులోకి చేరుకుంటున్న నీరు

అదిలాబాద్‌ : జిల్లాలో బోథ్‌, నేరడిగొండ, గుడి హత్నూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నిర్మాల్‌ జిల్లా కడెం ప్రాజెక్టులోకి నీరు చేరుకుంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగ ప్రస్తుత నీటి మట్టం 693 అడుగులకు ఉంది. ఈ వరద ఇలాగే కొనసాగితే రేపటివరకు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుతుందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

15:00 - July 7, 2018

అదిలాబాద్‌ : జిల్లాలో బోథ్‌, నేరడిగొండ,గుడి హత్నూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నిర్మాల్‌ జిల్లా కడెం ప్రాజెక్టులోకి నీరు చేరుకుంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగ ప్రస్తుత నీటి మట్టం 693 అడుగులకు ఉంది. ఈ వరద ఇలాగే కొనసాగితే రేపటివరకు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుతుందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

14:58 - July 7, 2018

కామారెడ్డి : జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గంలో విషాదం జరిగింది. పిట్లం మండల కేంద్రంలోని జ్యోతిబాపులే గురుకుల విద్యాలయంలోని హాస్టల్‌లో చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ వేడి  సాంబార్‌లో పడింది. చిన్నారి వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు గురుకుల విద్యాలయంలోని హాస్టల్‌లో వంట పని చేస్తుంటారు. 

 

కామారెడ్డి జిల్లాలో విషాదం

కామారెడ్డి : జిల్లాలోని జుక్కల్‌ నియోజకవర్గంలో విషాదం జరిగింది. పిట్లం మండల కేంద్రంలోని జ్యోతిబాపులే గురుకుల విద్యాలయంలోని హాస్టల్‌లో చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ వేడి  సాంబార్‌లో పడింది. చిన్నారి వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. 

ఎంబీబీఎస్ సీట్ల భర్తీ వివాదం...

విజయవాడ : ఎన్టీఆర్ వర్సిటీలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ వివాదం నెలకొంది. జీవో 550 స్టే కౌంటర్ ను ఏపీ సర్కార్, ఎన్టీఆర్ వర్టిసీ దాఖలు చేసింది. ప్రస్తుతం యూనివర్సిటీలో కౌన్సిలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. ఎన్టీఆర్ వర్సిటీ వీసీతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. కౌన్సెలింగ్ రద్దుపై కోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 

13:27 - July 7, 2018

జగిత్యాల : ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది. అయితే అధికారులు, కాంట్రాక్టర్లు నిధులు సద్వినియోగం చేయకుండా కాలయాపన చేయడంతో పాఠశాలలు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇలాంటి పరిస్థితే జగిత్యాల జిల్లా ప్రభుత్వ పాఠశాల ఎదుర్కొంటోంది. ఇదిగో ఇదే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వున్న ప్రభుత్వ పాఠశాల.. సుమారు 320 మంది విద్యార్థులు ఇందులో చదువుతున్నారు. అయితే పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థుల చదువు భయం నీడన కొనసాగుతోంది.. పై కప్పు పెచ్చులుగా ఊడి పడుతుండటంతో ఎప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటు విద్యార్థులు తమ విద్యను కొనసాగిస్తున్నారు.

స్కూల్‌లో చదువుకునేందుకు క్లాస్‌రూమ్‌లు లేవని విద్యార్థులు వాపోతున్నారు. కూర్చొవడానికి బెంచీలు లేక సగానికి పై విద్యార్థులు నేలపై కూర్చుని పాఠాలు వింటున్నారు. ఓ వైపు ఎక్కడ పై కప్పు కూలుతుందోనని భయపడుతుంటే.. మరోవైపు చిన్న వర్షానికే నోట్‌ బుక్స్‌ తడిసి ముద్దవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో ఉండాల్సిన కనీస వసతులు త్రాగునీరు, మూత్రశాలలు, ఆడుకోవడానికి గ్రౌండ్‌ కూడా లేవని ఆందోళన చెందుతున్నారు. తమ చదువులు ఎలా సాగుతాయని ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన భవన నిర్మాణం చేసి కనీస సౌకర్యాలు త్రాగునీరు, మూత్రశాలలను బాగు చేయించాలని అంటున్నారు.

1994 లో విద్యార్థుల సంఖ్య దృష్ట్యా అదనపు గదులను నిర్మించారు కానీ ఆ తరగతి గదులు చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్నాయి. ఆ తరువాత పాఠశాల నూతన నిర్మాణ భవనం కోసం రెండు సంవత్సరాల క్రితం రాష్ట్రీయ విద్యామిషన్‌ ద్వారా 40 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. కానీ ఇప్పటి వరకు భవన నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. స్థానిక అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నూతన భవన నిర్మాణం అటకెక్కిందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విమర్షిస్తున్నారు. ప్రభుత్వం ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తుంటే అధికారులు మాత్రం ఉన్న నిధులు వినియోగించకుండా కాలయాపన చేయడం విస్మయం కల్గిస్తుందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

13:24 - July 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దీనివల్ల సర్కారు ప్రతిష్ట ఎంత పెరిగిందో తెలిదు. కానీ పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులు.. సర్కార్‌కు ఉన్న ప్రతిష్టను కాస్త దిగజార్చేసింది . దీంతో ఇప్పుడు రెవిన్యూ శాఖ పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులకు దిద్దుబాటు కార్యక్రమం చేపట్టింది. ధరిణి వెబ్‌ సైట్‌ ద్వారా దొర్లిన తప్పులను సవరించే పనిలో పడింది. పట్టదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే పట్టదారు పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులపై అటు రైతులు ఇటు రాజకీయపార్టీల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేఖత వచ్చింది. దీంతో సీఎం కేసీఆర్‌ రెవిన్యూ అధికారులపై ఫైర్‌ అయ్యారు. దొర్లిన తప్పులను వీలైనంత త్వరగా సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన రెవిన్యూ అధికారులు పాసుపుస్తకాల్లో తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశారు. పాసుపుస్తకాల్లో ఉన్న తప్పులకు ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు కూడా కారణమని తెలుసుకున్నారు. రైతు పేరు, ఆధార్‌ నెంబర్‌, ఫోటో, రైతు జెండర్‌, రైతు కు అనువషికం నుంచి ఆస్తి సంక్రమించినట్లుగా ఇలా సుమారు 7 లక్షల పట్టదారు పాసు పుస్తకాల్లో తప్పులు దొర్లాయి. వీటిలో తప్పులను రెవిన్యూ అధికారులు సరిచేస్తున్నారు. కానీ ఎక్కువ సెక్యూరిటీ ఫిచర్స్‌ ఉన్న ధరణి వెబ్‌ సైట్‌ ఎడిట్‌ చేయడం రెవిన్యూ ఉద్యోగులకు కష్టంగా మారింది.

దీని వల్ల ఏడు లక్షల పట్టాదారు పాసుపుస్తకాల్లో మూడున్నర లక్షల పట్టాదారు పాసు పుస్తకాల తప్పులు సరి చేసి ప్రింట్‌ చేసినట్టుగా రెవిన్యూ అధికారులు తెలిపారు. త్వరలోనే మణిపాల్‌ నుంచి ప్రింట్‌ అయిన మూడున్నర లక్షల పట్టా పుస్తకాలు రాష్ట్రానికి వస్తాయని తెలిపారు. మిగిలిన పట్టాదారు పాసుపుస్తకాల్లో మరికొన్ని మద్రాస్‌లో ప్రింట్‌ అవుతాయని... ఈ పుస్తకాలను వీలైనంత తొందరగానే ప్రింట్ చేస్తామంటున్నారు.

ఇక ధరణీ వెబ్‌సైట్‌ విషయానికి వస్తే ఇంతవరకు ఈ వైబ్‌సైట్‌ను అధికారికంగా ప్రారంభించలేదు. కానీ రాష్ట్రంలో 35 మండలాల్లో తహశీల్దార్‌ కార్యాలయాల్లో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ధరణి వెబ్‌సైట్‌ ను ఉపయోగించి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. ధరణి వెబ్‌సైట్‌ ను ఆగస్టులో లేదా సెప్టెంబర్‌లో సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఎక్కువ ఫీచర్లున్న వెబ్‌సైట్‌ కావడం వల్లనే ధరణీ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని మొత్తం ఒక కోటి 42 లక్షల ఎకరాల భూమి ఎలాంటి వివాదం లేని వ్యవసాయభూమికి 58 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నాయని వీటిలో కేవలం 7 లక్షల పాసుపుస్తకాల్లో తప్పులు దొర్లాయని అంతే కానీ హైదరాబాద్‌లో తిరిగే రెవిన్యూ ఉద్యోగ సంఘాలు దీనిపై విమర్షించడం సరి కాదన్నారు అధికారులు. మొత్తానికి పట్టాదారుపాసు పుస్తకాల విషయంలో సర్కార్‌ తీవ్రంగానే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

వెనకబడిన ప్రాంతాలలో అత్యంత ముందు వరసలో ఉండే ప్రాంతం అది. గిరిజనుల సౌకర్యం మెరుగు పడాలని ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది. కాని ఆ ప్రాంతంలో పనిచేయడానికి ఉద్యోగులు ఇష్టపడడం లేదు. ఇతర ప్రాంతాల నుండి బదిలీలు జరిగినా ఈ ప్రాంతంలో పని చేసేందుకు ఇష్టంలేక విధుల్లో చేరడం లేదు. 

13:23 - July 7, 2018

హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జస్టిస్‌ రాధాకృష్ణన్‌తో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు సీజేగా విధులు నిర్వహించిన జస్టిస్‌ రాధాకృష్ణన్‌.. రాజ్యాంగం, సివిల్‌, అడ్మినిస్ట్రేటివ్‌లాలో ప్రావీణ్యులు. 2004 అక్టోబరు 14న కేరళ హైకోర్టు జడ్జిగానూ, కొంత కాలం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.  

13:22 - July 7, 2018

జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా బొగ్గు తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది. వర్షం కారణంగా KTK ఒకటవ గని ఓపెన్‌ కాస్ట్‌లో వరద నీరు చేరడంతో బొగ్గు తవ్వకాలు నిలిపివేశారు. సుమారు మూడు వేల టన్నుల బొగ్గు తవ్వకానికి ఆటంకం ఏర్పడింది. రెండు కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు.

ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు...

భద్రాద్రి : కొత్తగూడెం జిల్లాలోని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కిన్నెరసాని, ఏడుమెలికల, మల్లన్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు దాటలేక ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. 

కుల్గాంలో ఉగ్రవాదుల కాల్పులు...

జమ్మూ కాశ్మీర్ : కుల్గాంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

12:31 - July 7, 2018
12:29 - July 7, 2018

భర్తకు దేహశుద్ధి చేసిన భార్య..

భువనగిరి : మరో మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న భర్తకు ఓ భార్య దేహశుద్ధి చేసింది. ప్రియురాలితో ఉన్న భర్తను చితకబాదింది. ఈ ఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలో చోటు చేసుకుంది. తన బంధువులతో కలసి భర్త ఉన్న చోటుకు వెళ్లిన భార్య... ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

జాతీయ లా కమిషన్ సమావేశానికి టిడిపి హాజరు..

విజయవాడ : జాతీయ లా కమిషన్ సమావేశానికి హాజరు కావాలని టిడిపి నిర్ణయించింది. ఎన్నికలను ముందుకు జరపడం ప్రజలు ఇచ్చిన తీర్పుకు విరుద్దమని, ఈవీఎంలపై ప్రజలకు సందేహాలున్నాయని...ఓటు వేసిన వెంటనే ఎవరికి వేశారో తెలియసే విధానం..బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని బాబు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సమావేశంలో చెప్పాలని బాబు ఆదేశించారు. 

12:06 - July 7, 2018

జగన్ 207వ రోజు...

తూర్పుగోదావరి : వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర 207 రోజు కొనసాగుతోంది. రామచంద్రాపురం (మం) తాళ్లపోలం నుండి జరుగుతోంది. చిన్నతాళ్లపోళం, పెద్దతాళ్లపోళం, వెల్లవంతెన మీదుగా యాత్ర కొనసాగనుంది.

జాతీయ లా కమిషన్ సమావేశానికి టిడిపి దూరం...

విజయవాడ : జాతీయ లా కమిషన్ సమావేశానికి టిడిపి దూరంగా ఉంది. జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర విభజన సమస్యలను వదిలేసి కేంద్రం ఎన్నికలపై దృష్టి పెడుతుండడంపై టిడిపి తప్పుబడుతోంది. అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుగానే నిర్వహించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. 

11:25 - July 7, 2018

విజయవాడ : జాతీయ లా కమిషన్ సమావేశానికి టిడిపి దూరంగా ఉంది. జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర విభజన సమస్యలను వదిలేసి కేంద్రం ఎన్నికలపై దృష్టి పెడుతుండడంపై టిడిపి తప్పుబడుతోంది. అసెంబ్లీ ఎన్నికలను ముందస్తుగానే నిర్వహించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది.

ఏపీ ప్రభుత్వం..టిడిపి పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏపీ రాష్ట్ర సమస్యలే ప్రధాన ఏజెండా అని నొక్కి చెబుతోంది. త్వరలో పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని బాబు యోచిస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అసెంబ్లీ వేదికగా చేసుకుని అక్కడ జరిగే పరిణామాలను తిప్పికొట్టాలని...దీనివల్ల వైసిపి..జనసేన పార్టీలను టార్గెట్ చేయవచ్చని బాబు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

11:19 - July 7, 2018

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ప్రశ్నించే కార్మికులకు వేధింపులు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీలో అధికారుల దాష్టీకం బయటపడింది. ఇక్కడ ఆర్డర్లీ వ్యవస్థ నడుస్తుండడం కలకలం రేపుతోంది. ఆర్థికంగా..శ్రమ దోపిడి చేస్తున్నారు. ఇటీవలే మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాకపోవడం శోచనీయం.

మల్కాజ్ గిరిలో సూపర్ వైజర్లు బరి తెగిస్తున్నారు. ఎంటమాలజీ కార్మికులతో సూపర్ వైజర్ పనులు చేసుకుంటుండడం గమనార్హం. బల్దియా సిబ్బందితో అధికారులు బట్టలు ఉతికించుకుంటున్నారు. పిల్లల్ని బడికి తీసుకెళ్లేందుకూ బల్దియా సిబ్బందిని ఉపయోగించుకుంటున్నారు. అంతేకుండా స్నేహితుల పనులను అధికారులు చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో దోపిడి కూడా ఉంది. పీఎఫ్ డబ్బులూ వదలలేదు. వేతనాలు పడగానే వసూళ్లు ప్రారంభిస్తారు. పై అధికారులకు ఇవ్వాలంటూ వసూళ్లు చేస్తున్నారు. 

10:57 - July 7, 2018

ఫుట్ పాత్ ల ఆక్రమణల కూల్చివేతలు...

హైదరాబాద్ : నగరంలో ఫుట్ పాత్ ల ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శనివారం మెహిదీపట్నంలో ఆక్రమణలను జీహెచ్ఎంసీ తొలగిస్తోంది. 

బాబు భయపడడు..వారికే భయం - యనమల...

విజయవాడ : ఏపీ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు పోరాటం చేస్తున్నారని ఏపీ మంత్రి యనమల పేర్కొన్నారు. టిడిపిని ఎలా ఓడించాలా ? అనేది జగన్..పవన్ ఆలోచనలని, మోడీ డైరెక్షన్ లో జగన్...పవన్ పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలపై మోడీని జగన్..పవన్ విమర్శించారా ? అలాంటి పార్టీలతో టిడిపి ఎలా కలిసి పోరాటం చేస్తుందని నిలదీశారు. మోడీని చూసి చంద్రబాబు భయపడుతున్నారనేది అబద్ధమని కొట్టిపారేశారు. ఐటీ దాడులు చేస్తారని అక్రమార్జన చేసే వారు భయపడాలని, జగన్..పవన్ కే భయం ఉంటుంది కానీ బాబుకు భయం ఉండదన్నారు.

మంచిర్యాల..భూపాలపల్లిలో వర్షాలు...

హైదరాబాద్ : మంచిర్యాల..భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో 18వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

టిటిడి మరో కీలక నిర్ణయం...

చిత్తూరు : టిటిడి మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీరాశి వంశీకులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని, రిటైర్ అయిన నలుగురు అర్చకులకు రూ. 40 లక్షల నగదు అందించాలని..ఇందుకు విధి విధానాలతో ఒక ఫైల్ తయారు చేయాలనీ ఈవో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

తెలంగాణలో భారీ వర్షాలు...?

హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ తో పాటు 31 జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

సింగపూర్ కు బయలుదేరిన బాబు టీం...

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌ పర్యటనకు బయల్దేరారు. సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు వెళ్లారు. సింగపూర్‌లో సీఎం బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. ఏపీలో వ్యాపారం, వ్యవసాయ అంశాలపై వివరించనున్న సీఎం. చంద్రబాబు వెంట మంత్రి యనమలతోపాటు.. పలువురు అధికారులు వెళ్లారు. 

బాలికపై ప్రిన్స్ పాల్...18 మంది అత్యాచారం...

బీహార్ : రాష్ట్రంలోని సరన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికపై ఆమె చదువుతున్న ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్‌తో సహా 18 మంది అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

కరెంట్ షాక్ తో యువకుల మృతి...

నల్గొండ : రహమత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు శ్రీనివాస్, ఆనంద్ గా గుర్తించారు. 

09:14 - July 7, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సింగపూర్‌ పర్యటనకు బయల్దేరి వెళ్ళనున్నారు. సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు వెళ్ళనున్నారు. సింగపూర్‌లో సీఎం బృందం మూడు రోజులపాటు పర్యటించనుంది. ఏపీలో వ్యాపారం, వ్యవసాయ అంశాలపై వివరించనున్న సీఎం. చంద్రబాబు వెంట మంత్రి యనమలతోపాటు.. పలువురు అధికారులు వెళ్ళనున్నారు.

09:12 - July 7, 2018

మహబూబ్ నగర్ : తొలకరి చినుకులతో విత్తనాలు వేసుకున్న ఆ అన్నదాతలకు ఇప్పుడు కష్టకాలం వచ్చిపడింది. వచ్చిన మొలకలు ఎండిపోతుండటం చూసి తల్లడిల్లిపోతున్నారు. ఆకాశంవైపు చూస్తూ దిగాలుపడుతున్నారు. కరుణించు వరుణుడా అంటూ పూజలు చేస్తున్నారు. వాన జాడ లేకపోవటంతో బాధపడుతున్న పాలమూరు రైతన్నలపై టెన్‌టీవీ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ఆరంభంలో.. తొలకరి చినుకల రాకతో రైతన్నలు పులకించిపోయారు. పొలం బాట పట్టి దుక్కిదున్ని సాలు పట్టి పంటలు సాగు చేశారు. దాదాపు నాలుగు లక్షల హెక్టార్లలో పత్తి, మొక్కజొన్న పంటలను వేశారు. తీరా ఇప్పుడు వానదేవుడు కరుణించకపోవటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. 15 రోజులుగా వరుణ దేవుడు అడ్రస్‌ లేకుండా పోవటంతో అన్నదాతలు ఆకాశంవైపు చూస్తోన్నారు.

తడిలేక మొలకెత్తిన పంటలు కళ్లముందే ఎండుపోతుంటే రైతులు కలత చెందుతున్నారు. మరోమూడు రోజుల్లో వర్షాలు కురవకపోతే పంటలు బతకటం కష్టమని వ్యవసాయ అధికారులు చెప్పటంతో మరింత ఆందోళన చెందాల్సిన పరిస్థితి అన్నదాతది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గండీడ్‌, భూత్పూర్, జడ్చర్ల మండలాల్లో వర్షభావ పరిస్థితి తీవ్రంగా ఉంది. తక్కువ వర్షపాతం నమోదు కావటంతో వచ్చిన మొలకలు వాడిపోతున్నాయి.

కొంతమంది రైతులు వరుణదేవుని కరుణ కోసం ప్రత్యేకపూజలు చేస్తున్నారు. ఎండుతున్న పంటలను చూసి దేవుడిపైనే భారం వేస్తున్నారు. చిన్నచింతకుంట మండలం తిర్మలాపూర్‌ రైతులు భజనలతో, ఎడ్లబండ్లతో వెళ్లి కృష్ణానదిలోని నీటిని తీసుకొచ్చి.. గ్రామంలోని ఆలయాల్లో నీటితో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పూజలు చేయటం ద్వారా వానలు పడుతాయని.. మొలకలు ఎండిపోతున్న వేళ వరుణుడు కరుణిస్తాడని రైతులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వరుణ దేవుని కోసం కళ్లు కాయాలు కాచేలా ఎదురుచూస్తోన్నా.. వర్షాలు మాత్రం పడటం లేదు. చినుకు రాల్చడం లేదు. పూజలు ఫలించైనా వర్షాలు కురవాలని పాలమూరు రైతులు కోరుకుంటున్నారు.   

09:11 - July 7, 2018

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం తెలుగుతమ్ముళ్ల తగాదా తార స్థాయికి చేరుతోంది. వర్గపోరుతో అధికారపార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. గోదావరి తీరంలో ఆపార్టీ వ్యవహారం గందరగోళంగా మారుతోంది. కరవమంటే కప్పకు కోపం.... విడవమంటే పాముకు కోపం అన్నచందంగా తయారయ్యింది కార్యకర్తల పరిస్థితి. నాయకుల మధ్య విభేదాలతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. ఇతర పార్టీల వైపు చూడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మొదటి నుంచి టీడీపీకి గట్టి పట్టుంది. ఇక్కడి రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీయే ఎక్కువసార్లు గెలిచింది. గత ఎన్నికల్లో కూడా టీడీపీ, దాని మిత్రపక్షమైన బీజేపీయే విజయం సాధించాయి. మరో ఏడాదిలోగా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార టీడీపీలో ఇక్కడ నుంచి పోటీ చేయడానికి నేతలు పోటీ పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు తమకంటే తమదేనని ప్రచారం చేసుకుంటున్నారు. కేవలం ప్రచారంతోనే సరిపెట్టుకుండా పార్టీలో పట్టు కోసం ఇతర నేతలను అడ్డుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. చివరకు ఈ తాగాదాలు బాహాటంగా సాగుతుండడంతో పార్టీ పరువు కూడా పోతోందన్న అభిప్రాయం బలపడుతోంది.

నేతల మధ్య తాగాదాలతో రాజమండ్రిలో టీడీపీ పరిస్థితి నాలుగు స్తంభాలాటగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి అర్బన్‌ నుంచి పోటీ చేయాలని ప్రస్తుత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిరెడ్డి అప్పారావు కూడా పట్టుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరు చాలదన్నట్టుగా గుడా చైర్మన్‌, సీనియర్‌ టీడీపీ నేత గన్ని కృష్ణ ఈసారి తనకే టికెట్‌ దక్కుతుందన్న ధీమాగా కనిపిస్తున్నారు. సిటీ మేయర్‌ పంతం రజనీశేషసాయి కూడా టిక్కెట్‌ కోసం చేయని ప్రయత్నాలు లేవు.

రాజమహేంద్రవరం టీడీపీలో విభేదాలు ఇప్పటికే రచ్చకెక్కాయి. కౌన్సిల్‌ సమావేశంలో బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి కేకలు వేసుకునే వరకూ వెళ్లింది. రోడ్డుమీద కూడా నువ్వెంత అంటే నువ్వెంత అనే దశకు చేరింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ధర్మపోరాట సభ కూడా రాజమహేంద్రవరంలో నిర్వహించాలని భావించిన టీడీపీ అధిష్టానం ఇక్కడి పరిస్థితి గమనించి, దాన్ని కాకినాడకు మార్చేసింది. టీడీపీ అధిష్టానం కూడా రాజమహేంద్రవరంలో నేతల మధ్య నెల్లకొన్న వివాదాలను చల్లార్చే ప్రయత్నాలను చేయలేకపోతోందనే అభిప్రాయం నెలకొంది.

నేతలు చీటికిమాటికి గొడవలు, తాగాదాలకు దిగుతుండడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో ఇలాంటి పరిస్థితిని సహించలేని పలువురు కార్యకర్తలు ఇప్పటికే జనసేన, వైసీపీ వైపు చూస్తున్నారు. నాయకుల మధ్య విభేదాలతో పార్టీ పరువు పోతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం ఈ వ్యవహారాన్ని సరిదిద్దకపోతే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు.

09:09 - July 7, 2018

సంగారెడ్డి : ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధే.. చట్టాన్ని అతిక్రమించాడు. తనను ఎంపీగా గెలిపించినందుకు రైతుల భూములకే ఎసరు పెట్టాడు. పరిశ్రమ నెలకొల్పి.. ఉపాధి కలిపిస్తానంటూ...వేలాది ఎకరాల భూమిని సొంతం చేసుకున్నాడని రైతులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో రాష్ర్టం నుంచి కేంద్ర స్థాయివరకూ ప్రజాప్రతినిధులు హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ భూ దందాపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం..
 

ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజా ప్రతినిధులే వారికి అన్యాయం చేస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా మూడువేల ఎకరాల రైతుల భూమిని... వారికే తెలియకుండా కాజేశారు జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఆయన అనుచరులు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు రైతులు, ప్రజా సంఘాల నాయకులు.

2005లో ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడి భూమిని ఎకరా నలభైవేల రూపాయలతో తీసుకుంటానని చెప్పాడు. తొలిగా ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున కొందరికి ఇచ్చాడు. మిగతా డబ్బు రిజిస్ర్టేషన్‌ సమయంలో ఇస్తానని చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళిన వ్యక్తి తిరిగి రాలేదు. కాలక్రమంలో ఆయన చనిపోయాడని కూడా చెబుతున్నారు. తర్వాత రైతులు యధావిధిగా తమ పొలాలను సాగు చేసుకుంటున్నారు.

అసలు కథ ఇలా ఉంటే.. ఆ భూములన్నీ తమవే అంటున్నారు జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌. దీంతో తమకు న్యాయం చేయాలంటూ 15 గ్రామాల రైతులు అధికారులను ఆశ్రయించారు. కానీ.. న్యాయం జరగలేదు. దీంతో సీపీఎం పార్టీ రైతులకు అండగా పోరాటం చేసింది. దీనిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జీతో సగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తోంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నెలకొల్పి కోట్లాది రూపాయలు సబ్సిడీగా పొందాలని ఎంపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల్ని మోసం చేసిన ఎంపీకి వ్యతిరేకంగా పోరాడుతామని బీఎల్‌ఎఫ్‌ నాయకులు హెచ్చరిస్తున్నారు. బీంరా, బోర్గి, చాప్పా, మోర్గీ, కంగ్టీ లాంటి పదిహేను గ్రామాల రైతులు న్యాయం కోసం పోరాడుతున్నా.. అధికారుల్లో చలనం రాలేదు. ఇందులో బాధితులు ఎక్కువగా దళితులే ఉన్నారని.. న్యాయం జరగేదాకా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజ్‌.

అసలు రామ్‌శరణ్‌కు రైతులు భూమి రిజిస్ర్టేషన్‌ చేయించనే లేదని ఆరోపిస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. తమ సంతకాలు, వేలి ముద్రలు లేకుండా రిజిస్ర్టేషన్లు ఎలా జరుగుతాయని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రైతులు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. ఎంపీ అనుచరులు దారుణానికి పాల్పడుతున్నారని కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి మాణిక్యం ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్‌ కూడా ఉంది. 2006లో ఈ భూముల్ని కొనుగోలు చేసినట్లు చెబుతున్న రామ్‌శరణ్‌.. ఏకంగా ఈ భూముల్ని బ్యాంకులో తనఖా పెట్టి కోట్లాది రూపాయలు రుణంగా పొందినట్లు తెలుస్తోంది. దీనిపై సీబీసీఐడీ విచారణ కూడా జరిగినట్లు సమాచారం. ఈ భూములకు ఏ బ్యాంకు రుణం ఇచ్చిందన్న విషయం తెలియడం లేదు. జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌ తీరు కంచే చేను మేసిన చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.  

08:15 - July 7, 2018
08:11 - July 7, 2018

జనసేన భారీ కవాతు...

విశాఖపట్టణం : నేడు జనసేన భారీ కవాతు నిర్వహించనుంది. మధ్యాహ్నం 3గంటలకు సాగర తీరాన ఈ ప్రదర్శనలో జనసేన అధ్యక్షుడు పవన్, జనసైనికులు పాల్గొననున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ తో ఈ పదర్శన జరుగనుంది. 

జమిలి ఎన్నికల నిర్వాహణపై అఖిలపక్ష సమావేశాలు...

ఢిల్లీ : జమిలి ఎన్నికల నిర్వాహణపై నేడు, రేపు అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశాల్లో ఏడు జాతీయ పార్టీలు..59 ప్రాంతీయ పార్టీలు పాల్గొననున్నాయి. 

06:39 - July 7, 2018

ఢిల్లీ : వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌ను ఇండియాకు అప్పగించేది లేదని మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్ స్పష్టం చేశారు. జకీర్‌కు మలేషియా పౌరసత్వం ఇచ్చామని...ఆయన వల్ల దేశంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కానంతవరకు అప్పగించే ప్రసక్తే లేదన్నారు. జకీర్‌పై రెచ్చగొట్టే ప్రసంగాలు, మతోన్మాదం నూరిపోయడం, మనీ లాండరింగ్ సహా పలు కేసులున్నాయి. జకీర్ 2016లో మలేషియాకు పారిపోయాడు. మలేషియాలో శరణు పొందుతున్న ఆయనను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో మే 31న మోది మలేసియా ప్రధానితో చర్చలు కూడా జరిపారు. తన పట్ల భారత ప్రభుత్వం న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందన్న భరోసా కలిగినపుడు మాత్రమే స్వదేశానికి తిరిగి వస్తానని ఇటీవల జకీర్‌ నాయక్‌ తెలిపారు. 

06:37 - July 7, 2018

ఢిల్లీ : థాయ్‌లాండ్‌లోని థామ్‌ లుయాంగ్‌ గుహలో చిక్కుకుపోయిన పిల్లలకు సహాయం చేసేందుకు వెళ్లిన మాజీ మిలటరీ డైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల కోసం స్వచ్ఛందంగా సహాయక చర్యలు అందించేందుకు వెళ్లిన ఆయన- గుహలో పిల్లలు ఉన్న ప్రాంతం నుంచి తిరిగి వస్తుండగా ఆక్సిజన్‌ అయిపోవడంతో మృతి చెందారు. స్పృహ కోల్పోయిన ఆయనను కాపాడేందుకు మరో డైవర్‌ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని చియాంగ్‌ రాయ్‌ డిప్యూటి గవర్నర్‌ పసాకోర్న్ బూన్యాలక్ విచారం వ్యక్తం చేశారు. డైవర్‌ను సమన్‌ కునోన్ట్‌గా గుర్తించారు. ఈ ఘటనతో అనుభవం ఉన్న డైవరే ప్రాణాలు కోల్పోతే పిల్లలను ఎలా సురక్షితంగా బయటకు తీసుకొస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు వారాల క్రితం భారీ వర్షాల కారణంగా 12 మంది పిల్లలతో పాటు ఫుట్‌బాల్‌ కోచ్‌ గుహలో చిక్కుకుపోయారు. కొన్ని కిలోమీటర్ల లోపల ఇరుకైన ప్రాంతంలో ఉన్న గుహలో నీటిమట్టం, బురద పెరిగిపోవడంతో వారిని తీసుకురావడం కష్టంగా మారింది. చిన్నారులకు సహాయంగా పలువురు గజ ఈతగాళ్లు, వైద్యులు ఉన్నారు.

06:35 - July 7, 2018

ఇస్లామాబాద్ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఓ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. నవాజ్‌ కూతురు మరియం నవాజ్‌కు కూడా ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో షరీఫ్‌కు 80 లక్షల పౌండ్లు, ఆయన కూతురు మరియంకు 20 లక్షల పౌండ్లు జరిమానాను విధించింది. అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో వేసిన పిటిషన్ ఆధారంగా ఈ శిక్షను ఖరారు చేశారు. షరీఫ్ అల్లుడు కెప్టెన్ సఫ్‌దార్‌కు కూడా అకౌంట‌బులిటీ కోర్టు ఏడాది జైలు శిక్షను విధించింది. ప్రస్తుతం నవాజ్‌ షరీఫ్ ఆయన కూతురు లండన్‌లో ఉన్నారు. అక్కడ నవాజ్‌ షరీఫ్‌ భార్య కుల్సుంకు క్యాన్సర్‌ చికిత్స జరుగుతోంది. కోర్టు తీర్పుపై నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు, పంజాబ్‌ మాజీ సిఎం షాబాజ్‌ షరీఫ్‌ స్పందించారు. చట్టపరంగానే న్యాయం కోసం పోరాటం జరుపుతామని ఆయన తెలిపారు.

06:33 - July 7, 2018

ఉత్తరప్రదేశ్‌ : ఉన్నావ్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంగాఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ముగ్గురు యువకులు మహిళను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి బలవంతగా అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఇద్దరు యువకులు మహిళను బలవంతంగా లాక్కెళ్లుతుంటే మరో యువకుడు దానిని వీడియో తీశాడు. మాకు సహకరించకపోతే వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తామని బెదిరించారు. తనని వదిలేయండని ఎంత వేడుకున్నా ఆ దుర్మార్గులు కనికరించలేదు. చివరికి ఆ మహిళ ఎలాగోలా ఆ కామాంధుల నుంచి తప్పించుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. 

06:31 - July 7, 2018

ఢిల్లీ : అస్సాంలో ఆర్మీ జవాన్లు స్థానిక ప్రజల మూకుమ్మడి దాడి నుంచి ముగ్గురు సాధువులను కాపాడారు. మాహుర్‌ పట్టణంలో పిల్లలను ఎత్తుకెళ్లడానికి సన్యాసుల వేషంలో వచ్చారని స్థానికులు వారిని చుట్టుముట్టారు. మాహూర్‌లోకి అడుగుపెట్టగానే గ్రామస్తులు వారి కారును ఆపి వాదానికి దిగారు. ఆర్మీ జవాన్లు నిముషాల్లో అక్కడికి చేరుకోవడంలో పెను ముప్పు తప్పింది. ముగ్గురు సన్యాసులను సురక్షితంగా ప్రజల చెర నుంచి తప్పించ గలిగారు. 26 నుంచి 31 ఏళ్ల లోపు ఉన్న ముగ్గురు సన్యాసులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. అస్సాం జరగనున్న ఓ మేళాలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. వాట్సప్‌లో పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారన్న రూమర్లు షికార్లు చేయడంతో గ్రామస్థులు మూకుమ్మడి దాడులకు దిగుతున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల కర్బి ప్రాంతంలో చైల్డ్‌ లిఫ్టర్స్‌గా భావించి స్థానికులు ఇద్దర్ని కొట్టి చంపిన విషయం తెలిసిందే.

06:30 - July 7, 2018

ఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తియే మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌ అని, ఇందులో ఎలాంటి వివాదం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కేసుల కేటాయింపు, ధర్మాసనాల ఏర్పాటులో చీఫ్‌ జస్టిస్‌కే విశేష అధికారాలుంటాయని సుప్రీంకోర్టు మరోసారి నొక్కి చెప్పింది. సిజెఐ విశేషాధికారాలను ప్రశ్నిస్తూ కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సిజెఐ ప్రత్యేక అధికారాలను ఇతర న్యాయమూర్తులతో పంచుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్‌ ఏకె సిక్రి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. సిజెఐ సమానులలో అందరికన్నా ప్రథములని, ఆయనకు కేసులను కేటాయించే అధికారం ఉంటుందని వెల్లడించింది.

06:29 - July 7, 2018

మధ్యప్రదేశ్ : విధులకు హాజరు కావడం లేదన్న కారణంతో యజమాని ఓ వర్కర్‌ను పెట్రోల్ పంపుకు కట్టేసి చితకబాదిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. హోషంగాబాద్‌లోని ఓ పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్న విజయ్ వారం రోజుల క్రితం చిన్న యాక్సిడెంట్ జరగడంతో యజమానికి చెప్పకుండా విధులకు డుమ్మా కొట్టాడు. దీనిపై సీరియస్‌ అయిన పెట్రోల్‌ పంపు యజమాని గురువారం రాత్రి వర్కర్‌ను పిలిపించి చితకబాదాడు. యజమాని తాళ్లతో బంకుకు కట్టేసి కొట్టాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

06:18 - July 7, 2018

విజయవాడ : పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కేంద్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించపోయినా రాష్ట్ర ప్రభుత్వం పనులను స్పీడ్‌గా చేస్తుందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే డయాఫ్రాం వాల్‌ నిర్మాణం పూర్తవటంతో పాటు కాఫర్‌ డ్యామ్‌ పనులు పుంజుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోలవరానికి మూలమైన భూ నిర్వాసితులను ప్రభుత్వం మరిచిపోయింది. నిర్వాసితులకు న్యాయం జరగకపోవటంతో వారు ఆందోళన బాట పట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం పెరిగింది. ప్రతినెల మూడో సోమవారం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు.. పనులు స్పీడ్‌గా జరిగే విధంగా చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే గేట్ల తయారీ 80 శాతం పూర్తవ్వటంతో పాటు డయాఫ్రాం వాల్ నిర్మాణం పూర్తయింది. అలాగే కాఫర్‌ డ్యామ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్ పనులు వేగంగా సాగుతున్నాయి. స్పిల్‌ ఛానల్‌ పనులు రికార్డ్‌ స్థాయిలో జరుగుతుండటంతో ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తోంది. 2019 చివరి నాటికి గ్రావిటీతో కూడిన నీటిని అందిస్తామని చెప్తున్న ప్రభుత్వం అందుకనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ స్థానంలో నవయుగకు కంపెనీకి పనులు అప్పగించినట్లు తెలుస్తోంది.

కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. కేంద్రం నుంచి ఇంకా 2 వేల కోట్లు రావల్సి ఉండగా.. వాటి కోసం ఎదురుచూడకుండా రాష్ట్రం ప్రభుత్వం తన ఖర్చుతో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. అయితే ఈ ఖర్చును కేంద్రం నుంచి ఎలాగైనా వసూలు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. విభేదాలు పెరిగిపోవటంతో కేంద్రం నిధులు ఇస్తుందో లేదో అన్న సందేహం వ్యక్తం చేస్తుంది. దీంతో ప్రాజెక్ట్‌ నిర్మాణం రాజకీయ చట్రంలో ఇరుక్కుని విలవిల్లాడుతుంది.

ప్రాజెక్ట్‌ నిర్మాణానికి పెరిగిన అంచనాలతో దాదాపు 20 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనితో పాటు ప్రాజెక్ట్ ఎగువున ఉన్న వందల గ్రామాలను ఖాళీ చేయించడానికి, భూ నిర్వాసితులకు దాదాపు 35 కోట్ల రూపాయలు పరిహారం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇంతవరకు భూ నిర్వాసితులకు సంబంధించి ఒక్క రూపాయి కూడ ప్రభుత్వం చెల్లించలేదు. ఈ ఖర్చు కేంద్రం ప్రభుత్వం చెల్లించాల్సి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులను మర్చిపోయింది. అయితే కేంద్ర, రాష్ట్రం ప్రభుత్వాల మధ్య వైరం పెరుగుతుండటంతో ఇన్ని కోట్లు కేంద్రం చెల్లిస్తుందా? అని నిర్వాసితుల్లో ఆందోళన మొదలయింది. దీంతో తమకు నష్టపరిహారంతో పాటు భూమికి భూమి, ఇళ్లు నిర్మించాలని భూ నిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌లో నష్టపోతున్న తమకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని భూనిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వసితుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తాయో వేచి చూడాలి. 

06:16 - July 7, 2018

హైదరాబాద్ : తక్కువ సమయంలోనే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరగటం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్‌లో తెలంగాణ వృద్ధి రేటు, ఎంబీసీ పథకాల అంశంపై కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంబీసీ పథకాల పనితీరును కేసీఆర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎంబీసీల కోసం భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలను కేసీఆర్‌ అధికారులకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయాభివృద్ధి రేటుతో ఎంబీసీల పథకాలు, వివిధ అంశాలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలుశాఖల మంత్రులతో పాటు అధికారులు పాల్గొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో రాష్ట్రం 19.83 శాతం వృద్ధిరేటు సాధించినట్లు అధికారులు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 13,374.25 కోట్ల ఆదాయం రాగా.. 2018-19 సంవత్సరం మొదటి త్రైమాసికంలో 16,026.63 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు కేసీఆర్‌కు వివరించారు. గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోనే అత్యధిక ఆదాయం వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు పెరగటం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే దూకుడును కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు.

భవిష్యత్‌లో ఎంబీసీల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను కేసీఆర్‌ అధికారులకు వివరించారు. ఎంబీసీల స్వయం ఉపాధి కోసం రూపొందించే పథకాలకు సంబంధించి.. క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా లక్ష, రెండు లక్షల విలువ చేసే యూనిట్లను మంజూరు చేయాలని.. దీనికి వందశాతం ప్రభుత్వ గాంట్లు ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ రెసిడెన్షియల్స్‌ స్కూల్స్‌ను అదనంగా ప్రారంభించాలన్నారు. అలాగే ఎంబీసీ పథకాల అమలుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయాడానికి ఇవాళ స్పీకర్‌ మధుసూదనచారి సమక్షంలో సమావేశం కావాలని మంత్రులను, అధికారులను ఆదేశించారు.

త్వరలో చేపట్టబోయే నాలుగవ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి సంబంధించి కూడా కేసీఆర్ అధికారులతో చర్చించారు. వచ్చే ఏడాది నంచి సంవత్సరానికి వందకోట్ల మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా నర్సరీల సంఖ్యను పెంచాలని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి అవలంభించాల్సిన వ్యూహం ఖరారు చేయడానికి ఇవాళ మరోసారి ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. 

సింగపూర్ కు సీఎం బాబు బృందం...

విజయవాడ : నేటి నుండి మూడు రోజుల పాటు సీఎం చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. ప్రపంచ నగరాల సదస్సులో బాబు బృందం పాల్గొననుంది. 

ఫిఫా వరల్డ్ కప్ లో...

ఢిల్లీ : ఫిఫా వరల్డ్ కప్ లో నేడు క్వార్టర్స్ ఫైనల్స్ మ్యాచ్ లు జరుగనున్నాయి. రాత్రి 7గంటలకు ఇంగ్లండ్ - స్వీడన్ జట్లు..., రాత్రి 11.30గంటలకు క్రొయేషియా - రష్యా జట్లు తలపడనున్నాయి. 

సాధువులును కాపాడిన ఆర్మీ జవాన్లు...

అస్సొం : అస్సోంలో ఆర్మీ జవాన్లు స్థానిక ప్రజల మూకుమ్మడి దాడి నుంచి ముగ్గురు సాధువులను కాపాడారు. మాహుర్‌ పట్టణంలో పిల్లలను ఎత్తుకెళ్లడానికి సన్యాసుల వేషంలో వచ్చారని స్థానికులు వారిని చుట్టుముట్టారు. మాహూర్‌లోకి అడుగుపెట్టగానే గ్రామస్తులు వారి కారును ఆపి వాదానికి దిగారు. ఆర్మీ జవాన్లు నిముషాల్లో అక్కడికి చేరుకోవడంలో పెను ముప్పు తప్పింది. ముగ్గురు సన్యాసులను సురక్షితంగా ప్రజల చెర నుంచి తప్పించ గలిగారు.

ప్రధాన న్యాయమూర్తియే మాస్టర్ ఆఫ్ రోస్టర్...

ఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తియే మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌ అని, ఇందులో ఎలాంటి వివాదం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో కేసుల కేటాయింపు, ధర్మాసనాల ఏర్పాటులో చీఫ్‌ జస్టిస్‌కే విశేష అధికారాలుంటాయని సుప్రీంకోర్టు మరోసారి నొక్కి చెప్పింది. సిజెఐ విశేషాధికారాలను ప్రశ్నిస్తూ కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్‌ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 

మాజీ ప్రధాని షరీఫ్ కు పదేళ్ల జైలు శిక్ష...

ఇస్లామాబాద్ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఓ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. నవాజ్‌ కూతురు మరియం నవాజ్‌కు కూడా ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో షరీఫ్‌కు 80 లక్షల పౌండ్లు, ఆయన కూతురు మరియంకు 20 లక్షల పౌండ్లు జరిమానాను విధించింది. 

జకీర్ ను అప్పగించమన్న మలేషియా ప్రధాని...

ఢిల్లీ : వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్‌ను ఇండియాకు అప్పగించేది లేదని మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్ స్పష్టం చేశారు. జకీర్‌కు మలేషియా పౌరసత్వం ఇచ్చామని...ఆయన వల్ల దేశంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కానంతవరకు అప్పగించే ప్రసక్తే లేదన్నారు.

 

గుహలో చిక్కుకున్న 12 మంది పిల్లలు...

ఢిల్లీ : థాయ్‌లాండ్‌లోని థామ్‌ లుయాంగ్‌ గుహలో చిక్కుకుపోయిన పిల్లలకు సహాయం చేసేందుకు వెళ్లిన మాజీ మిలటరీ డైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల కోసం స్వచ్ఛందంగా సహాయక చర్యలు అందించేందుకు వెళ్లిన ఆయన గుహలో పిల్లలు ఉన్న ప్రాంతం నుంచి తిరిగి వస్తుండగా ఆక్సిజన్‌ అయిపోవడంతో మృతి చెందారు.

అమెరికా - చైనా ట్రేడ్ వార్...

ఢిల్లీ : అమెరికా-చైనాల మధ్య నడుస్తున్న ట్రేడ్‌ వార్‌ నడుస్తోంది. చైనాకు సంబంధించిన ఉత్పత్తులపై 20శాతం తారీఫును అమెరికా విధించింది. దీనికి చైనా ధీటుగా స్పందించింది. అమెరికా ఎగుమతులపై తాము తారీఫును పెంచుతామని చైనా ప్రకటించింది. ఈ దేశాల మధ్య ట్రేడ్‌ వార్‌తో ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

Don't Miss