Activities calendar

08 July 2018

21:58 - July 8, 2018

థాయ్‌లాండ్‌ : ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. 9 రోజుల పాటు బిక్కుబిక్కు మంటూ గడపిన చిన్నారుల్లో ఆరుగురిని గుహ నుండి బయటకు తీసుకురాగలిగారు. థాయ్‌లాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహలో చిక్కుకున్న చిన్నారుల రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మిగిలిన ఏడుగురు చిన్నారులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

9 రోజులు....12 మంది చిన్నారులు....ఒక ఫుట్‌బాల్‌ కోచ్‌... మొత్తం 13 మంది... థాయ్‌లాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహలో చిక్కుకుపోయారు. పద్మవ్యూహం లాంటి గుహలోకి వెళ్లిన చిన్నారులు.. వర్షం ధాటికి దారులన్నీ మూసుకుపోవడంతో బయటకు రాలేక .. దారి తెలీక గుహలోనే ఇరుక్కుపోయారు. బ్రిటీషు గజ ఈతగాళ్లు వీరిని గుర్తించడంతో వీరిని కాపాడేందుకు థాయ్‌ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే 6గురు చిన్నారులను క్షేమంగా గుహ నుండి బయటకు తీసుకువచ్చారు.  

జూన్‌ 23న ఫుడ్‌ బాల్‌ కోచ్‌తో సహా 12 మంది చిన్నారులు థాయ్‌లాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహను సందర్శించేందుకు వెళ్లారు. గుహను చూస్తూ దాదాపు 2 కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్లిపోయారు. సరిగ్గా ఆ సమయంలోనే భారీ వర్షం కురవడంతో గుహంతా నీటితో నిండిపోయింది. నీరు, రాళ్లు, బురద, మట్టితో లోపలికి వెళ్లిన దారులన్నీ మూసుకుపోవడంతో లోపలికి వెళ్లిన వారికి బయటకు రావడానికి ఆస్కారం లేకుండా పోయింది. 

వీరిని రక్షించేందుకు గుహలోకి చేరిన నీటిని ప్రతి రోజు తోడుతునే ఉన్నారు. ఇప్పటికి 35 మిలియన్‌ గ్యాలన్లను తోడేశారు. గుహ పైభాగం నుండి వంద రంధ్రాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గుహలో ఆక్సీజన్‌ సిలిండర్లు అమర్చేక్రమంలో ఓ మాజీ మిలిటరీ డైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. గుహలో చిక్కుకున్న పిల్లలకు స్వచ్ఛందంగా సహాయం చేసేందుకు వెళ్లిన డైవర్‌ సుమన్ కునోన్ట్‌.... పిల్లలు ఉన్న ప్రాంతం నుండి తిరిగి వస్తుండగా ఆక్సీజన్‌ అయిపోవడంతో మృతి చెందారు. స్పృహ కోల్పోయిన ఆయనను కాపాడేందుకు మరో డైవర్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 

ఇంతటి అత్యంత ప్రతికూల పరిస్థితులలో దాదాపు 4 కిలోమీటర్లు ప్రయాణించిన రెస్క్యూ టీం 6 గురు చిన్నారులను రక్షించాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను వేగవంతం చేశారు. బయటపడ్డ చిన్నారులకు వైద్యసేవలు అందిస్తున్నారు. చిన్నారులను కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన రెస్క్యూ టీం ఎట్టకేలకు చిన్నారులను బయటకు తీసుకురాగలిగింది. మిగిలిన వారిని కూడా బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలను మరింత వేగవంతం చేసింది థాయ్‌ ప్రభుత్వం. 

21:53 - July 8, 2018

మెదక్ : కాళేశ్వరం ప్రాజెక్టు కొండపోచమ్మ కాల్వ సర్వే పనులు ఓ మహిళా రైతు ఉసురు తీశాయి. సర్వేలో భూమి పోతోందన్న తేలడంతో మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్‌కు చెందిన మహిళా రైతు బూదమ్మ పోలంలోనే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి అక్కడే కుప్పకూలి పడిపోయారు. ఆ తర్వాత పొలంలోనే ప్రాణం విడచారు. ఉన్న పొలం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కొండపోచమ్మ కాల్వలో పోతే... భుక్తి కరవు అవుతుందని బెంగపెట్టకుని చనిపోయింది. బూదమ్మ కుమారుడు గతంలోనే మరణించడంతో మనవడు వంశీ, మనువరాలు దీపికను పోషిస్తోంది. ఇప్పుడు నాయనమ్మ మృతిలో వంశీ, దీపిక అనాధలయ్యారు. 
 

21:51 - July 8, 2018

హైదరాబాద్ : బీసీలకు చట్టంలో ఇచ్చిన హామీలను కాకుండా చిన్న చిన్నపథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు బీసీల మీద ప్రేమ ఉంటే ఎన్నికల్లో 60 శాతం సీట్లను కేటాయించి, ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. బీఎల్‌ఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తమ్మినేని, బీఎల్‌ఎఫ్ చైర్మన్‌ నల్లా సూర్యప్రకాష్‌ పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌పై బీసీలకు గౌరవం తగ్గుతున్నందునే కేసీఆర్‌కు బీసీలపై ప్రేమ చూపిస్తున్నారని నల్లా సూర్యప్రకాష్‌ అన్నారు.

 

21:47 - July 8, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
రెండు రోజులుగా వర్షాలు 
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మొన్నటి వరకు నీరు లేక వెలవెల బోయిన చెరువులు వర్షపు నీటితో నిండుతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అతలాకుతలమవుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పెన్‌గంగా, ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక సిర్పూర్‌ వెంకట్రావుపేట వద్ద మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ ఉన్న వంతెనపైకి భారీగా నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది నెలకొంది. వెంకట్రావుపేట సమీపంలోని పలు గ్రామాలకు బ్యాక్‌ వాటర్‌ చేరడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. 
కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 700 అడుగులు కాగా... ప్రస్తుతం నీటిమట్టం 697.450 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్‌లోకి 10,700 క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో... ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్‌ అధికారులు సూచించారు. భారీ వర్షాలతో మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌లను కలిపే ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేస్తున్న అప్రోచ్‌ వంతెన తెగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 
సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి  
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 45వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సంస్థకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని సింగరేణి అధికారులు చెబుతున్నారు. సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో ఉత్పత్తి అక్కడే నిలిచిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లందు, టేకులపల్లి మండలం కోయగూడెంలలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. ఇల్లందులో 8, కోయగూడెంలో 18వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. 
ఉధృతంగా ప్రవహిస్తోన్న జల్లేరువాగు 
పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం దగ్గర జల్లేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ధాటికి రోడ్డుకు గండిపడింది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
అల్లకల్లోలంగా మారిన సముద్ర తీరం 
శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అల్పపీడన నేపథ్యంలో జిల్లాలోని బారువా, రామయ్యపట్నం, ఇసుకలపాలెం తదితర ప్రాంతాల్లో సుమారు 30అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. కెరటాల తీవ్రత అధికంగా ఉండటంతో సముద్రం వైపుకు పోవద్దని అధికారులు హెచ్చరించారు. సముద్ర తీరంలో సుమారు పది అడుగుల మేర ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. కేంద్ర వాతావరణ నివేదిక ప్రకారం మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు అధికారులు. 

21:42 - July 8, 2018

విశాఖ : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... రాష్ట్ర మంత్రి లోకేశ్‌పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ లక్ష్యంగా సవాళ్లు విసురుతూ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. లోకేశ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే  ఎమ్మెల్సీగా రాజీనామా చేసి, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని విశాఖ పర్యటనలో జనసేనాని సవాల్‌ విసిరారు. లోకేశ్‌ను దొడ్డిదారిన ముఖ్యమంత్రిని చేయాలని చూస్తే జనసేన సహించబోదని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. 
ముగిసిన పవన్‌ కల్యాణ్‌ విశాఖ జిల్లా పర్యటన   
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ జిల్లా పర్యటన ముగిసింది. రంజాన్‌ సందర్భంగా గత నెలలో పర్యటనకు బ్రేక్‌ ఇచ్చిన పవన్‌.. జూన్‌ చివరి నుంచి పునఃప్రారంభించారు. విశాఖ జిల్లాలోని పలు నియోజవర్గాలతోపాటు విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట పోరాట యాత్ర నిర్వహించారు. విశాఖ పర్యటనలో చివరి రోజు పలువురు ప్రముఖులు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. అందరికీ పార్టీ కండువాలు కప్పి.. జనసేనలోకి ఆహ్వానించారు.
లోకేశ్‌, చంద్రబాబు లక్ష్యంగా పవన్ విమర్శల దాడి 
ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మంత్రి లోకేశ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి పెంచారు. లోకేశ్‌ను దొడ్డి దారిన ముఖ్యమంత్రిని చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. మంత్రి లోకేశ్‌కు ఏ అంశంపైనా విషయ పరిజ్ఞానం, సమస్యలపై అవగాహనలేదని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. అవగాహన ఉంటే ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు ఏ సమస్యపైనా చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. లోకేశ్‌, చంద్రబాబు, జగన్‌.. వస్తే కూర్చుని సమస్యలపై చర్చించడానికి సిద్ధమని జనసేనాని ప్రకటించారు. 
సామాజిక విప్లవం పోరాటం : పవన్ 
అణగారిని వర్గాలకు అందలం ఎక్కించేందుకే జనసేన అవిర్భవించిందన్న పవన్‌ కల్యాణ్‌... ఆర్థిక, రాజకీయ, సామాజిక విప్లవం కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు డబ్బు, పదవిపై వ్యామోహం పోలేదని  వపన్‌ విమర్శించారు. చంద్రబాబు ఒక్కరే ఎదుగుతూ మిగిలిని వారిని అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. 
 

21:36 - July 8, 2018

ఢిల్లీ : లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై లా కమిషన్‌ రాజకీయ పార్టీల నుంచి సేకరిస్తున్న అభిప్రాయ సేకరణలో విభిన్నవాదనలు వచ్చాయి.  జమిలి ఎన్నికలను కొన్ని పార్టీలు సమర్థిస్తే.. మరికొన్ని వ్యతిరేకించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఈ విషయంలో భిన్నధ్రువాలుగా నిలిచాయి. టీఆర్‌ఎస్‌ జమిలి ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తే... టీడీపీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. 
కాంగ్రెస్‌, టీడీపీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ జమిలికి వ్యతిరేకం 
జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీలతో లా కమిషన్‌ నిర్వహిస్తున్న సంప్రదింపుల ప్రక్రియలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏడు జాతీయ, 49 ప్రాంతీయ పార్టీల నుంచి లా కమిషన్ అభిప్రాయం సేకరిస్తోంది. ఈనెల 10 వరకు ఈ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది. లోక్‌సభతోపాటే రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను కొన్ని పార్టీలు  వ్యతిరేకిస్తే... మరికొన్ని పక్షాలు సమర్థించాయి. కాంగ్రెస్‌, టీడీపీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ తీవ్రంగా వ్యతిరేకించాయి. టీఆర్‌ఎస్‌, సమాజ్‌వాదీ పార్టీ లా కమిషన్‌ ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించాయి. 
జమిలి ఎన్నికలకు జై కొట్టిన టీఆర్‌ఎస్‌ 
జమిలి ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ జై కొట్టింది. లా కమిషన్‌ ముందు హాజరైన టీఆర్‌ఎస్‌ ఎంపీలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాసిన లేఖను అందజేశారు.లోక్‌సభలోపాటే అసెంబ్లీలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిచాలన్న ప్రతిపాదనకు తమ పార్టీ అనుకూలమని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌... లా కమిషన్‌కు విస్పష్టం చెప్పారు. అయితే 2019 ఎన్నికల నుంచి జమిలి ఎన్నికలు నిర్వహిచాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్రాల్లో ఐదేళ్ల పాలన సజావుగా సాగేందుకు ఈ విధానం దోహదం చేస్తుందని అభిప్రాయాన్ని టీఆర్‌ఎస్‌ వ్యక్తం చేసింది. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు స్వేచ్ఛగా పూర్తికాలం పనిచేసేందుకు అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌... లా కమిషన్‌ దృష్టికి తెచ్చారు. 1999, 2004, 2009లో ఉమ్మడి ఏపీ, 2019లో ఏపీ, తెలంగాణలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీకి ఒకేసారి  ఎన్నికలు జరిగిన విషయాన్ని టీఆర్‌ఎస్‌ గుర్తు చేసింది. 
పరిమిత కాలానికే మధ్యతంర ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం 
మరోవైపు టీడీపీ జమిలి ఎన్నికలను వ్యతిరేకించింది. లా కమిషన్‌ ముందు తమ వాదనలు వినిపించిన టీడీపీ ఎంపీలు.. లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వంచడం వలన రాజ్యాంగపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కమిషన్‌ దృష్టికి తెచ్చింది. జమిలి ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే మిగిలివున్న పరిమిత కాలానికే మధ్యంతర ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్న వాదాన్ని టీడీపీ  వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరత్వంపాలు చేసే కుట్రల్లో భాగమే జమిలి ఎన్నికలని టీడీపీ ఎంపీలు విమర్శించారు. జమిలి ద్వారా ప్రాంతీయ పార్టీలను ఇబ్బందులకు గురిచేయడమే కేంద్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందన్న వాదాన్ని టీడీపీ లేవనెత్తుతోంది. 
జమిలి ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేసిన ఎస్పీ
మరోవైపు జమిలి ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేసిన సమాజ్‌వాదీ పార్టీ... 2019 ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకురాలని కోరింది. 2019 తర్వాత నుంచి ఈ విధానం అమల్లోకి తెస్తామంటే ఒప్పుకోబోమని ఆ పార్టీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌ లా కమిషన్‌కు స్పష్టం చేశారు.

21:04 - July 8, 2018

'RX 100' మూవీ టీంతో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ, డైరెక్టర్ అజయ్ భూపతి, పాటల రచయిత చైతన్య ప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. సినిమా విశేషాలు తెలిపారు. షూటింగ్ అనుభవాలు వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

20:31 - July 8, 2018

హైదరాబాద్ : రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. మంత్రులను తమ సొంత జిల్లాలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషికి ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. 

 

20:29 - July 8, 2018

విశాఖ : ఉత్తరాంధ్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది. ఉత్తరాంధ్రలో ఉన్న రాజకీయ నాయకులు ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేసారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈమేరకు ఆయనతో 10టివి ఫేట్ టు ఫేస్‌ నిర్వహించింది. ఉత్తరాంధ్ర వెనుబడిన ప్రాంతం కాదని కేవలం రాజాకీయ నాయకులు స్వార్ధంతో వెనుకబడిపోయిందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, వలసలు, కాలుష్యంపై జనసేన పోరాటం చేస్తుందని చెప్పారు. 

 

20:18 - July 8, 2018

సింగపూర్ : ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ముందుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేవారికి భారీగా రాయితీలు ఇవ్వడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామని సింగపూర్‌లోజరుగుతున్న ప్రంపచ నగరాల సదస్సులో చంద్రబాబు చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని  అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. 
ప్రపంచ నగరాల సదస్సులో ప్రసంగించిన బాబు 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. సింగపూర్‌లో జరుగుతున్న ప్రపంచ నగరాల సదస్సులో ప్రసంగించారు. 165 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ప్రపంచ నగరాల సదస్పులో ప్రసంగించిన చంద్రబాబు... ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులు పెట్టే సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు విద్యుత్‌ను రాయితీపై సరఫరా చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. పన్నులు రాయితీలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 
అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలి : బాబు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రపంచ నగరాల సదస్సుకు హాజరైన ప్రతినిధులను చంద్రబాబు కోరారు. అమరావతిని ప్రపచంలోని ఐదు అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని ప్రపంచ నగరాల సదస్సుకు హాజరైన ప్రతినిధుల దృష్టికి తెచ్చారు. హరిత, నీలి నగరంగా అమరావతిని తీర్చి దిద్దుతున్న విషయాన్ని ప్రస్తావించారు. 
పలువురు ప్రముఖలతో చంద్రబాబు భేటీ
సింగపూర్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు.. పలువురు ప్రముఖలతో భేటీ అయ్యారు. సింగపూర్‌ జాతీయాభివృద్ధి శాఖ మంత్రి లారెన్స్‌ వొంగ్‌తో అమరావతి ప్రణాళికల అమలుపై చర్చించారు. భూసమీకరణతోపాటు అమరావతి అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన ఫోర్టెస్కు గ్రూపు ప్రతినిధి గౌతమ్‌ వర్మతో  ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో లిథియం ఐయాన్‌ బ్యాటరీల తయారీ పరిశ్రమ ఏర్పాటుపై  మంతనాలు జరిపారు. మలేషియాకు చెందిన ఎస్‌ఎంహెచ్‌ రైల్ కార్పొరేషన్‌ ప్రతినిధి బృందంతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. భారత్‌లో మెట్రో రైల్‌ కోచ్‌ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న ఈ సంస్థను ఏపీకి రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. 

జమిలి ఎన్నికల నిర్వహణపై పార్టీల నుంచి మిశ్రమ స్పందన

ఢిల్లీ : జమిలి ఎన్నికల నిర్వహణపై పార్టీల నుంచి మిశ్రమ స్పందన లభించింది. రెండోరోజు న్యాయ కమిషన్ కు టీడీపీ, టీఆర్ ఎస్, డీఎంకే, ఎస్పీ అభిప్రాయాలు తెలిపారు. జమిలి ఎన్నికలకు అనుకూలమని టీఆర్ ఎస్, సమాజ్ వాదీ పార్టీలు చెప్పారు. 2019 సాధారణ ఎన్నికలతో ఐతే మాకు సమ్మతమేనని తెలుగుదేశం తెలిపింది. డీఎంకే దేశమంతా ఒకేసారి ఎన్నికలకు విముఖత తెలిపింది. ప్రధాన పార్టీ బీజేపీ ఈ నెలఖారు వరకు సమయం కోరింది. విపక్షాలతో చర్చించాక నిర్ణయం చెబుతామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈనెల 10న అభిప్రాయం చెబుతామని వైసీపీ తెలిపింది.  
 

119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి : తమ్మినేని

హైదరాబాద్ : 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ప్రపంచీకరణ విధానం వల్ల చేతివృత్తులు దెబ్బతిన్నాయన్నారు. సంక్షేమ పథకాలు ప్రకటించి ప్రచార ఆర్బటాలకే ఉపయోగించుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిల్ నిర్వహణ సక్రమంగా లేదు...సంక్షేమానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలన్నారు.

 

18:54 - July 8, 2018

జగిత్యాల : జిల్లాలోని తక్కళ్లపల్లి వద్ద నువ్వుల తూకంలో మోసం చేసిన వ్యాపారులను రైతులు చితకబాదారు. సారంగపూర్‌ మండలం అర్పపల్లి రైతుల వద్ద మెట్‌పల్లికి చెందిన ఆరుగురు వ్యాపారులు నువ్వులు కొనుగోలు చేశారు. వ్యాపారులు తమ వద్ద కొనుగోలు చేసిన నువ్వులు తూకంలో క్వింటాలుకు 30 కిలోలు మోసం చేయడాన్ని గమనించిన రైతులు.. తక్కళ్లపల్లి వద్ద వ్యాపారులను వెంటాడి పట్టుకున్నారు. వ్యాపారులను చితకబాదిన రైతులు స్థానిక పోలీసుల స్టేషన్‌లో అప్పగించారు. 

 

18:50 - July 8, 2018

హైదరాబాద్ : పర్యావరణ సంక్షోభం- పరిష్కారం అనే అంశంపై హైదరాబాద్‌ పొట్టిశ్రీరాములు యూనివర్సిటీలో ఓ సదస్సు నిర్వహించారు.  హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు జీహెచ్ ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి, ఢిల్లీ సైన్‌ ఫోరమ్‌ డైరెక్టర్‌ రఘునందన్‌, ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తం రెడ్డి, సాగరాధార పాల్గొన్నారు. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి హాని తలపెడుతున్నారని రఘునందన్‌ అన్నారు. దేశంలో పర్యావరణ చట్టాలు అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర పర్యావరణ పరిరక్షణ మండలి ఏర్పాటు అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. సమాజంలో పరివర్తన రాకపోతే పర్యావరణం విధ్వంసం అవుతుందని జనార్దన్‌ రెడ్డి అన్నారు.

 

18:47 - July 8, 2018

విజయవాడ : దివంగత సీఎం వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన పథకాలను దేశంలో ఏ సీఎం అమలు చేయలేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన వైయస్‌ జయంతి కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. వైయస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబుకు దోచుకోవటం, దాచుకోవటం తప్ప ప్రజా సంక్షేమం తెలియదని రోజా ఆరోపించారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన ఉనికి కోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నారని.. రాష్ట్రాన్ని ఉద్దరించేందుకు ఏ మాత్రం కాదన్నారు. వైయస్‌ లా సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు జగన్‌ మాత్రమే అందించగలడన్నారు.
 

 

18:43 - July 8, 2018

విశాఖ : రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌కు దమ్ముంటే ఎమ్మెల్సీగా రాజీనామాచేసి ఎమ్మెల్యేగా బరిలో దిగాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ సవాల్‌ విసిరారు. లోకేశ్‌ను దొడ్డిదారిన ముఖ్యమంత్రిని చేయాలని చూస్తే జనసేన సహించబోదని పవన్‌  హెచ్చరించారు. సమస్యలపై అవగాహన, విషయపరిజ్ఞానం లేని లోకేశ్‌.. ఉత్తరాంధ్ర సమస్యలపై తనతో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

 

18:40 - July 8, 2018

గుంటూరు : అమరావతి ప్రజా రాజధాని అని, ఈ నిర్మాణంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సింగపూర్‌ పర్యటనలో భాగంగా ప్రపంచ నగరాల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్‌ ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించామని, ఉన్నతమైన నివాసయోగ్య ప్రమాణాలు పాటిస్తున్నామని వివరించారు. అభివృద్ధిలో పీపీపీ విధానంలో తాము ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. 
 

 

18:38 - July 8, 2018

ఢిల్లీ : జమిలి ఎన్నికలకు టీడీపీ వ్యతిరేకమని లోక్‌సభపక్షనేత ఎంపీ తోట నరసింహం, రాజ్యసభ ఎంపీ రవీంద్రకుమార్‌ లా కమిషన్‌కు స్పష్టం చేశారు. రాష్ట్రం ప్రస్తుతమున్న ఇబ్బందికర పరిస్థితుల్లో ఎన్నికలకు సిద్ధంగా లేమని ఎంపీలు తెలిపారు. అలాగే జమిలి ఎన్నికల ద్వారా రాజ్యాంగ ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. ఎన్నికలు రావాలని కేంద్రం భావిస్తే.. లోక్‌సభ ఎన్నికలకు తాము సిద్ధమని.. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా లేమన్నారు. జమిలి ఎన్నికల ద్వారా కేంద్రం రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తోందని ఎంపీలు మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను ఇబ్బందులకు గురి చేయడమే కేంద్రం ప్రధాన లక్ష్యం పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే టాంపరింగ్‌కు అవకాశం ఉంటుందని ఎంపీలు లా కమిషన్‌కు వివరించారు. ఈవీఎంలకు వీవీపీఏటీ ఏర్పాటు చేయాలని.. లేని పక్షంలో బ్యాలెట్‌ ద్వారా ఎన్నికల నిర్వహించాలని ఎంపీలు లా కమిషన్‌ను కోరారు. 

 

18:31 - July 8, 2018

హైదరాబాద్ : అమెరికాలో దుండగుల కాల్పుల్లో తెలుగు విద్యార్థి శరత్‌ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు శరత్‌కి  హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో గల జాగృతి కాంప్లెక్స్‌లో స్వగృహం ఉంది. ఇప్పటికే శరత్‌ కుటుంబ సభ్యులను పలువురు నేతలు పరామర్శించి.. భౌతికకాయాన్ని త్వరగా తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. 

18:28 - July 8, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని తాడేపల్లిగూడెం నిట్‌ ప్రాంతం నుంచి టీడీపీ నేతలు జన జాగృతి యాత్రను ప్రారంభించిచారు.  పోలవరం ప్రాజెక్టు సందర్శనార్థం 86 బస్సులు, 50 కార్లల్లో పోలవరం తరలివెళ్లారు. ఈ యాత్రలో రైతులతో పాటు తెలుగు దేశం పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బీఎల్ ఎఫ్ తరపున అద్భుతమైన పథకాన్ని ప్రకటిస్తాం : తమ్మినేని

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికానికి ఒక అద్భుతమైన పథకాన్ని బీఎల్ ఎఫ్ ప్రకటించబోతుందని ఫ్రంట్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపలేదు...అమలు జరిపేందుకు సాహసించనటువంటి అద్భుతమైన పథకాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఈమేరకు బీఎల్ ఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ ప్రకటనలో పథకానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. 

18:24 - July 8, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికానికి ఒక అద్భుతమైన పథకాన్ని బీఎల్ ఎఫ్ ప్రకటించబోతుందని ఫ్రంట్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం తెలిపారు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపలేదు...అమలు జరిపేందుకు సాహసించనటువంటి అద్భుతమైన పథకాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఈమేరకు బీఎల్ ఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ ప్రకటనలో పథకానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. ఆ పథకాన్ని ప్రభుత్వం ఆచరించాలని డిమాండ్ చేస్తూనే ఎన్నికలు వచ్చే దాకా ప్రజలను సమీకరించి, వారి సహాయాన్ని తీసుకుని పథకాన్ని కొన్ని గ్రామాల్లో అమలు జరిపి చూపిస్తామని, రుజువు చేస్తామన్నారు. స్పష్టంగా అమలు చేయగలమని చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు అమలు చేయాలని సవాల్ చేసేలా ఆ పథకాన్ని రూపొందించామని చెప్పారు. దాన్ని త్వరలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగబోయే సదస్సులో ప్రకటిస్తామని చెప్పారు. వచ్చే 15 వ తేదీ సదస్సులో అఖిల భారత నాయకుల సమక్షంలో చాలా స్పష్టమైన పథకాలను ప్రకటిస్తామని చెప్పారు. ఆర్థిక పథకాలను కూడా ప్రకటిస్తామని తెలిపారు. మీడియా ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

 

18:16 - July 8, 2018

విశాఖపట్నం : విశాఖ ఉత్తర నియోజకవర్గానికి  చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ బోడె రఘు జనసేన పార్టీలో చేశారు. జనసేన అధ్యక్షుడు  పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రఘుతోపాటు ఆయన అనుచరలు జనసేనలో చేరారు. వీరికి పవన్‌ కల్యాణ్‌ పార్టీ కండువాలు కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

18:13 - July 8, 2018

విశాఖ : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన బలపడుతోంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు నాయకులు ఆ పార్టీలో చేరారు. దక్షిణ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గంపల గిరిధర్ తెలిపారు. 

17:01 - July 8, 2018

అనంతపురం : పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకుండా మోదీ సర్కార్‌ రైతులను మోసం చేస్తుందన్నారు. రైతుల సమస్యలపై ఈనెల 10న విజయవాడలో సమావేశమమై... భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రజాసమస్యలపై సదస్సులు, బస్సుయాత్రలు చేపడతామని.. ఉభయ కమ్యూనిస్టులు కలిసి పోరాటాలు చేస్తాయన్నారు. 

 

16:57 - July 8, 2018

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి జెఎన్టీయూ పార్కింగ్‌ విషయంలో ప్రొఫెసర్‌ విరుచుకుపడ్డాడు. నో పార్కింగ్‌ప్లేస్‌లో కారు నిలపవద్దన్న సెక్యూరిటీ గార్డుపై ఫ్రొపెసర్‌ వెంకటేశ్వరరావు దాడి చేసి చితకబాదాడు. వెంకటేశ్వరరావు ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. నిజాయితీగా పని చేసినందుకు బహుమానంగా దెబ్బలు తినాల్సి వచ్చిందని సెక్యూరిటీ గార్డ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

 

16:54 - July 8, 2018

కడప : వైఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షస్త్రమ పథకాలు ఇప్పటికీ ప్రజల్లో ఉన్నాయని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ 69వ జయంతి సందర్బంగా కడప జిల్లా పులివెందులలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం.. ఎంపీ అవినాష్‌రెడ్డి, నేతలు వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కేక్‌ కట్‌ చేశారు. ఆటోడ్రైవర్లకు రెండు జతల చొక్కాలు పంపిణీ చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్లకు ఏడాదికి 10 వేలు ఆర్దికసాయం అందిస్తామన్నారు. వైఎస్సార్‌ ఆశించిన స్వర్ణయుగం జగన్‌తో సాధ్యమన్నారు అవినాష్‌రెడ్డి. 

 

16:48 - July 8, 2018

హైదరాబాద్ : వైఎస్సార్‌ జయంతి సందర్భంగా వైఎస్‌ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. దివంగత నేత వైఎస్ఆర్‌కు పలువురు వైసీపీ నేతలు, వైసీపీ రాజకీయాల కార్యదర్శి నేత సజ్జల రామకృష్ణ రెడ్డి, సీనియర్ వైసీపీ నేత బొత్స నివాళుల్పరించారు. దివంగత నేత మాజీ ముఖ్యంత్రి వైఎస్ఆర్ 69వ జయంతి సందర్భంగా పలువురు నేతలు నివాళుల్పారించారు. అయన హాయంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అంతే కాదు అయన ఏదైనా కార్యక్రమం చేపట్టితే అది చిరస్థాయిగా ఉంటుందని బొత్స అన్నారు. దేశంలోనే వ్యవసాయానికి పెద్ద పీటవేస్తూ.. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ దే అని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రంలో ఉన్న ఆశయాలు అన్ని నెరవేరుతాయని అన్నారు. 

 

16:40 - July 8, 2018

హైదరాబాద్ : చెరువులను ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లో 50 కాలనీవాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాలుష్యం నుంచి చెరువులను,... రోగాల నుంచి తమను రక్షించాలని కోరుతూ ఐదువేల మంది కాలనీవాసులు ఆందోళన బాట పట్టారు. ర్యాలీలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం మీర్‌పేట్‌, ఆల్మాస్‌గూడా కమాన్‌ నుంచి మంద మల్లమ్మ ఫంక్షన్‌ హాల్‌ వరకు ర్యాలీ కొనసాగింది. డ్రైనేజీలకు ప్రత్యేక ట్రంక్‌లైన్‌ ఏర్పాటు చేయాలని నాగేశ్వర్‌ కోరారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌సిటీగా మార్చాలనుకుంటున్న సర్కార్‌.. చెరువులను ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు.

 

రేపు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా

హైదరాబాద్ : రేపు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 2, 3 రోజుల్లో అతి భారీ వర్షాల హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులంతా జిల్లాల్లోనే ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

 

 

 

15:34 - July 8, 2018

ఢిల్లీ : హస్తినలో లా కమిషన్‌ ఎదుట టీఆర్‌ఎస్‌ ప్రతినిధులు హాజరయ్యారు. జమిలి ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపింది. జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సమావేశానికి హాజరైన టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ తెలిపారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే తలంపుతో తాము ఉన్నామన్నారు. జమిలి ఎన్నికలతో ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించనున్నాయి. నిన్నటి సమావేశానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు హాజరుకాలేదు. జమిలి ఎన్నికలను పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. సమాఖ్య స్ఫూర్తికి, ప్రాంతీయ భావోద్వేగాలకు ఈ ప్రతిపాదన వ్యతిరేకమని అభిప్రాయం పడుతున్నాయి. ఇవాళ లా కమిషన్‌ ఎదుట టీడీపీ, టీఆర్‌ఎస్‌ అభిప్రాయాలు వెల్లడించనున్నాయి.

 

13:26 - July 8, 2018

నిర్మల్ : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 700 అడుగులు కాగా... ప్రస్తుతం నీటిమట్టం 697.450 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్‌లోని 10,700 క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో... ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్‌ అధికారులు సూచిస్తున్నారు.

 

13:22 - July 8, 2018

హైదరాబాద్ : జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లా కమిషన్ రెండో రోజు సమావేశం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాల పార్టీల నేతలు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ ఎంపీ వినోద్ లా కమిషన్ ఎదుట హాజరై పార్టీ అభిప్రాయాని తెలియచేశారు. జమిలి ఎన్నికలకు మద్దతు తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే తలపుంతో ఉన్నామని...దీనివల్ల ప్రజాధానం ఆదా అవుతుందని తెలిపారు. ఇది ముందస్తు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:20 - July 8, 2018

విశాఖపట్టణం : భర్త చనిపోయాడు..ఒకవైపు మనోవేదన..మరోవైపు పిల్లల పోషణ..ఆ తల్లికి భారమై పోయింది. దీనితో పిల్లను చంపేసి తాను తనువు చాలించింది. ఈ విషాద ఘటన చీడికాడ మండలం చుక్కపల్లిలో చోటు చేసుకుంది. భవానీ భర్త రెండు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఈమెకు జయంతి (12), వరలక్ష్మి (8) సంతానం. భర్త మృతి చెందడంతో భవానీ తీవ్ర మనోవేదనకు గురైంది. పిల్లల పోషణ భారం కావడంతో ఇక తనువు చాలించాలని నిర్ణయం తీసుకుంది. ఆదివారం నేలబావిలోకి పిల్లలతో సహా దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

చుక్కపల్లిలో విషాదం...

విశాఖపట్టణం : చీడికాడ మండలం చుక్కపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి నేలబావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. భవానీ, జయంతి (12), వరలక్ష్మి (8) మృతులుగా గుర్తించారు. 

13:03 - July 8, 2018

శరత్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు...

ఢిల్లీ : అమెరికాలోని కన్సాస్ రెస్టారెంట్‌లో ఓ దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన వరంగల్ విద్యార్థి కొప్పు శరత్ కుటుంబాన్ని మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. శరత్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. 

12:51 - July 8, 2018

అనంతపురం : వైఎస్‌ జయంతి రోజున అనంతపురం జిల్లా కదిరిలో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తామంటే తాము పూలమాల ముందు వేస్తామని సిద్దారెడ్డి, వజ్రభాస్కర్‌రెడ్డి అనుచరుల ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ సుముఖం...

హైదరాబాద్ : జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై లా కమిషన్ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎంపీ వినోద్ కుమార్ టీఆర్‌ఎస్ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. 2019 నుంచి జమిలి ఎన్నికలకు టీఆర్‌ఎస్ అనుకూలంగా ఉందని తెలిపారు. 

12:45 - July 8, 2018

నెల్లూరు : మాజీ మంత్రి ఆనం పార్టీ మార్పుపై నెలకొన్న సస్పెన్స్‌ త్వరలోనే వీడనుంది. వైసీపీ ఆయన చేరికకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్‌, ఆనం రాంనారాయణరెడ్డి భేటీ అవ్వడంతో ఆనం అతి త్వరలోనే వైసీపీ గూటికి చేరనున్నట్లు స్పష్టమవుతోంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మార్పుపై నెలకొన్న సంధిగ్ధంతోపాటు.. ఊహాగానాలకు త్వరలోనే తెరపడనుంది. ఆయన వైసీపీలో చేరేందుకు లైన్ క్లియర్‌ అయినట్లు సమాచారం. ఆనం టీడీపీని వీడి వైసీపీలోకి చేరుతారంటూ జోరుగా సాగిన ప్రచారానికి.... ఈ మధ్యలో కొంత బ్రేక్ పడింది. దీంతో మాజీ మంత్రి ఆనం వైసీపీలో చేరతాడా, లేదా అన్న సంధిగ్దం నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ శంషాబాద్ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్, ఆనం రామనారాయణ రెడ్డి కలయికతో సస్పెన్స్‌కు తెరపడింది. వారిద్దరి భేటీలో దాదాపు పది నిమిషాలు చర్చించుకున్నారు. ఆనం వైసీపీలో చేరికపై మాట్లాడుకున్నట్లు సమాచారం. దీన్నిబట్టి వైసీపీలో ఆనం చేరిక లాంఛన ప్రాయంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

తమ కుటుంబ సభ్యులందరితో కలిసి వైసీపీలో చేరాలని భావించారు ఆనం. కానీ వారంతా ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా ఉండడంతో.. అది సాధ్యం కాలేదు. ఆనం సోదరుల్లో విజయకుమార్ రెడ్డి వైసీపీలోనే ఉండగా, మరో సోదరుడు జయకుమార్‌ రెడ్డి టీడీపీలోనే కొనసాగుతానని తేల్చేశాడు. ఇక దివంగత ఆనం వివేకానందరెడ్డి ఇద్దరు కుమారుల్లో రంగమయూర్ రెడ్డి ఆనం రామనారాయణరెడ్డి వెంట నడుస్తుండగా.. మరో కుమారుడు సుబ్బారెడ్డి జనసేన వైపు అడుగులేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆనం రామనారాయణరెడ్డి మాత్రమే వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆనం పెట్టిన షరతులతోపాటు.. వైసీపీనేతల అభ్యంతరాల వల్లే ఆయన చేరిక ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కాగా.. ఆనంకు వైసీపీ అధినేత జగన్‌ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో ఆనం, జగన్‌ కలయికతో సస్పెన్స్‌కు తెరపడినట్లైంది. అన్నీ కలిసొస్తే మరో వారం రోజుల్లోనే ఆనం తన అనుచరులతో కలిసి వైసీపీలోకి రావడం ఖాయం అన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో బలంగా ఉన్న వైసీపీ.. ఆనం చేరికతో మరింత బలం పుంజుకుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 

12:42 - July 8, 2018

తూర్పుగోదావరి : ముందస్తు ఎన్నికలు రాజకీయ నాయకుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఆరునెలల ముందే ఎన్నికలు వస్తాయన్న వార్తలు.. రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితేంటి ..? ఆశావహుల ఆశల సంగతేంటి..? దీంతో ముందస్తు ఎన్నికల ప్రచారంతో నాయకుల్లో ఆందోళన పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో ముక్కోణ పోరు ఖాయమనే వాదన వినిపిస్తోంది. తూర్పుగోదావరి రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి...పార్టీలు, నాయకులు ఏడాది తరువాత జరగబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ముందస్తు ఎన్నికల కథనాలతో క్షేత్రస్థాయిలో సందడి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలోనే అధిక నియోజకవర్గాలున్న తూర్పుగోదావరి జిల్లాలో నాయకులకు ముందస్తు ఎన్నికల వార్త పిడుగులామారింది.

తూర్పుగోదావరి జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే హడావుడి చేస్తున్నారు. ఒక పక్క ప్రతిపక్ష నాయకుడి పర్యటన ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తుంటే.. మరోవైపు అధికార పార్టీ అడపా తడపా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఎన్నికల ప్రచారాన్ని బలపరుస్తోంది. జిల్లాలో కొన్నిరోజుల క్రితం సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేయడం ఎన్నికల వాతావరణాన్ని సృష్టించింది. అటు జనసేన సైతం జిల్లాలో పర్యటించాలనుకోవడం.. పొలిటికల్‌ హీట్‌ను పెంచుతోంది.

సీఎం చంద్రబాబు ఏకంగా రైతు, మహిళా, సంక్షేమ అంశాల వారీగా ఆరునెలల కాలంలో 75 బహిరంగ సభలకు సిద్దమవుతున్నారు. అందులో తూర్పుగోదావరి జిల్లాలో అధికంగా బహిరంగ సభలు పెట్టే అవకాశముందని ఇక్కడి నాయకులు చెబుతున్నారు. అయితే నిత్యం ఏదో ఒక రూపంలో ప్రజల్లోకి వెళ్లడమే టీడీపీ లక్ష్యమైతే... ప్రతిపక్ష పార్టీ నేతలు పాదయాత్ర చేస్తూనే.. పలు ప్రాంతాల్లో ప్రెస్ మీట్ లు పెట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.

జిల్లాలో ప్రస్తుతం ఫిరాయించిన ఎమ్మెల్యేలతో కలుపుకుని టీడీపీలో 16మంది ఉండగా... ఇద్దరు వైసీపీలో...ఒకరు బీజేపీలో ఉన్నారు. అధికార పార్టీ సర్వే చేస్తే... సిట్టింగ్‌లలో కొందరికి సీట్లు దక్కవనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి వచ్చిచేరిన రంపచోడవరం ఎమ్మెల్యేతో పాటు.. పి.గన్నవరం, అమలాపురం ఎమ్మెల్యేలకు టిక్కెట్లు అనుమానమేనని టీడీపీ నేతల్లో చర్చ సాగుతోంది. ఇక వైసీపీ నుంచి కూడా పలువురు కోఆర్డినేటర్లను చివరి నిమిషంలో పక్కన పెట్టే అవకాశం ఉందని..అలాగే పెద్దాపురం, పిఠాపురం, మండపేట నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు కూడా టిక్కెట్లు దక్కే అవకాశం లేదని భావిస్తున్నారు.

తూర్పున మరోసారి ముక్కోణపు పోరు ఖాయమనే వాదన వినిపిస్తోంది. గతంలో ప్రజారాజ్యం అనుభవంతో ఈసారి జనసేన ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆపార్టీలోకి పలువురు నేతలు జంప్ కావడానికి సిద్ధపడుతున్నారు. ఈ జాబితాలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆకుల సత్యన్నారాయణ పేరు కూడా వినిపిస్తోంది. టీడీపీ, వైసీపీ నుంచి మరికొందరి చేరిక ఖాయం అని చెప్పవచ్చు. అయితే ముందస్తు ఎన్నికలు వస్తే ఎవరికి టిక్కట్ దక్కుతుందోననే చర్చ వాడవాడలా వినిపిస్తోంది. మొత్తంగా ముందస్తు ఎన్నికల వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో రాజకీయ వేడి మొదలవుతోంది. ఎవరి నియోజకవర్గాలను వారు సర్ధుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓటరు మహాశయులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు నాయకులు. మరి ఈసారి తూర్పు గోదావరి జిల్లా ఓటరు ఎవరిని కరుణిస్తారో వేచి చూడాలి.

కడెంలోకి భారీగా వరద నీరు...

ఆదిలాబాద్ : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 700 అడుగులు కాగా... ప్రస్తుతం నీటిమట్టం 697.450 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్‌లోని 10,700 క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో... ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్‌ అధికారులు సూచిస్తున్నారు. 

భగ్గుమన్న వైసీపీలో విబేధాలు...

అనంతపురం : కదిరిలో వైసీపీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. వైఎస్ విగ్రహానికి పూలదండ వేయడంలో వైసీపీ సమన్వయకర్త సిద్ధారెడ్డి, వైసీపీ నేత వజ్రభాస్కరరెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనితో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. 

12:16 - July 8, 2018

కన్సాస్ : అమెరికా దుండగుల దుశ్చర్యతో మరో తెలుగు విద్యార్థి శరత్ బలయ్యాడు. కన్సాస్ లోని ఒక రెస్టారెంట్ లో ఉండగా శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన శరత్ మృతి చెందాడు. ఈ విషయం స్నేహితుల ద్వారా తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి రామ్మోహన్ హైదరాబాద్ లో బిఎస్ఎన్ఎల్ పనిచేస్తున్నారు. వీరు అమీర్ పేటలోని ధరంకరం రోడ్డులో నివాసం ఉంటున్నారు.

విషయం తెలుసుకున్న డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయలు శరత్ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. నాలుగైదు రోజుల్లో శరత్ భౌతికకాయం వచ్చేందుకు కృషి చేస్తామని..ఎవరైనా కుటుంబసభ్యులు అమెరికాకు వెళ్లాలనుకుంటే ప్రభుత్వమే వీసా ఏర్పాటు చేయడం..అన్నీ ఖర్చులు భరిస్తామని మంత్రులు తెలిపారు.

12:09 - July 8, 2018

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో పెనుగంగా, ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీనితో ఆ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు..వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో సిర్పూర్ (టి) వెంకట్రావు పేట వద్దనున్న వంతెనపైకి నీరు చేరింది. పెన్ గంగా 30 అడుగుల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. మొత్తం సామర్థ్యం 700 అడుగులుగా ప్రస్తుతం 697.450 అడుగులకు చేరుకుంది. దీనితో ప్రాజెక్టు 17వ నెంబర్ గేటు ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు. నిర్మల్ జిల్లాలోని వెంకట్రావు పేట సమీపంలోని పలు గ్రామాల్లోకి బ్యాక్ వాటర్ చేరుతోంది. దీనితో పలు రాకపోకలకు నిలిచిపోయాయి. భారీగా వరద నీరు వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

సిలిగిరిలో బంగారం స్వాధీనం...

వెస్ట్ బెంగాల్ : సిలిగిరి ప్రాంతంలో డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటిలెజెన్స్ అధికారులు ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వీరివద్ద 10 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ రూ. 3.2 కోట్లుగా ఉంటుందని అంచనా. 

10:48 - July 8, 2018
10:47 - July 8, 2018

సోమవారం బోనాలపై సమీక్ష...

హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 29వ తేదీన బోనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లను సమీక్షించేందుకు సోమవారం ఉదయం 10:30 గంటలకు ఆలయంలో మంత్రి తలసాని సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో ఇతర మంత్రులు, పలు శాఖల అధికారులు పాల్గొననున్నారు. 

సోమవారం టి. కేబినెట్ మీటింగ్...

హైదరాబాద్ : సీఎం చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో సోమవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనుంది. క్యాబినెట్ సమావేశంలో మొత్తం 45 అంశాలపై చర్చించనున్నారు. 

కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత...

నిర్మల్ : కడెం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 10698 ఉండగా ఔట్ ఫ్లో 8500 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 700గా ఉంది. 

సింగపూర్ మినిస్టర్ తో బాబు మీటింగ్...

సింగపూర్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. మినిష్టర్ లారెన్స్ వొంగ్ తో బాబు సమావేశమయ్యారు. 

3వేల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం...

భద్రాద్రి : కొత్తగూడెంలోని టేకులపల్లి (మం) కోయగూడెం ఓసీలో వర్షం కారణంగా మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణి గౌతమ్ ఖని ఓపెన్ కాస్ట్ లో భారీ వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

వైఎస్ కు జగన్ నివాళి...

విజయవాడ : దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖర రెడ్డి గారి 69వ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాదయాత్ర చేస్తున్న శిబిరం వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ నివాళులర్పించారు. 

చిదంబరం ఇంట్లో దొంగతనం...?

ఢిల్లీ : మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఇంట్లో చోరీ జరిగిందని వార్తలు వెలువడుతున్నాయి. ఆయన నివాసంలో రూ. 1.5 లక్షల నగదు చోరీకి గురైందని సమాచారం. 

లా కమిషన్ ఎదుట టీఆర్ఎస్..టిడిపి...

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై.. దేశంలోని రాజకీయ పార్టీల అభిప్రాయాలను లా కమిషన్‌ సేకరిస్తోంది. నిన్నటినుంచి ఈ చర్చలు ప్రారంభం కాగా... బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు హాజరుకాలేదు. ఇవాళ టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల ప్రతినిధులు లా కమిషన్‌ ఎదుట తమ అభిప్రాయాలు చెప్పనున్నారు. 

మలేషియా టౌన్‌షిప్‌లో కార్డన్‌సర్చ్...

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మలేషియా టౌన్‌షిప్‌లో పోలీసులు కార్డన్‌సర్చ్ నిర్వహించారు. 416 ఇళ్లల్లోతనిఖీలు చేపట్టారు. 26 మంది అనుమానితులను అదుపులో తీసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని 18 బైకులను స్వాధీనం చేసుకున్నారు. 

పశ్చిమలో భారీ వర్షాలు...

పశ్చిమగోదావరి : జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం దగ్గర జల్లేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ధాటికి రోడ్డుకు గండిపడింది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

09:37 - July 8, 2018

ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై.. దేశంలోని రాజకీయ పార్టీల అభిప్రాయాలను లా కమిషన్‌ సేకరిస్తోంది. నిన్నటినుంచి ఈ చర్చలు ప్రారంభం కాగా... బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు హాజరుకాలేదు. ఇవాళ టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల ప్రతినిధులు లా కమిషన్‌ ఎదుట తమ అభిప్రాయాలు చెప్పనున్నారు. ఇదిలావుంటే.. జమిలి ఎన్నికలను పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. నిన్న లా కమిషన్‌ ఎదుట కొన్ని పార్టీలు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికలు సమాఖ్య స్ఫూర్తికి, ప్రాంతీయ భావోద్వేగాలకు వ్యతిరేకమని అభిప్రాయపడ్డాయి. 

09:36 - July 8, 2018

హైదరాబాద్‌ : ఓ స్టార్‌ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ బోజ్‌పురి నటి దీక్షా కుశ్వా పట్టుబడింది. ఢిల్లీకి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగితోపాటు ఆమె నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు దొరికారు. దీక్షాతో వ్యభిచారం చేయిస్తున్న నగరానికి చెందిన జనార్ధన్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

09:35 - July 8, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం దగ్గర జల్లేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ధాటికి రోడ్డుకు గండిపడింది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

09:33 - July 8, 2018

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మలేషియా టౌన్‌షిప్‌లో పోలీసులు కార్డన్‌సర్చ్ నిర్వహించారు. 416 ఇళ్లల్లోతనిఖీలు చేపట్టారు. 26 మంది అనుమానితులను అదుపులో తీసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని 18 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు మెరుగైన భద్రత ఇవ్వడంతోపాటు.. రక్షణపట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఏసీపీ భుజంగరావు. ఈ కార్డన్‌సెర్చ్‌లో 10 మంది సీఐలు, ఎస్ఐలతో పాటు... సుమారు 150 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

09:05 - July 8, 2018
06:48 - July 8, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఆ నియోజకవర్గంలో జెండా ఎగురవేస్తారా? ఇరు నేతల మధ్య వర్గ పోరుతో పార్టీ క్యాడర్ కారెక్కడానికి సిద్ధమవుతుందా? మాజీ ఎమ్మెల్యే గులాబీ గూటికి చేరితే, సిట్టింగ్‌ ఎమ్మెల్యే సీటుకు ఎసరు రానుందా? ప్రస్తుతం హుస్నాబాద్‌ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ చర్చ రసవత్తరంగా మారింది. ఇంతకీ హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే అంశంపై 10టీవీ పొలిటికల్‌ స్టోరీ. ఎన్నికలు సమీపిస్తుండటంతో హుస్నాబాద్‌ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ఖాతాలో ఉన్న ఎమ్మెల్యే స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్‌తో పాటు సీపీఐ తహతహలాడుతోంది. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని మాజీ ఎమ్మెల్యేలు అల్గిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి, చాడ వెంకట్‌ రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి తోడు మాజీ ఎమ్మెల్యే బొమ్మవెంకన్న కొడుకు, టీపీసీసీ సెక్రటరీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

మాజీ ఎమ్మెల్యే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి ఇందుర్తి నియోజకవర్గం ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇందుర్తి నియోజకవర్గంతో పాటు విభజనతో ఏర్పాటైన హుస్నాబాద్‌ ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. దీంతో 2014 ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతివ్వడంతో కాంగ్రెస్‌ అల్గిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డికి టికెట్‌ కేటాయించింది. అయితే తెలంగాణ సెంటిమెంట్‌ కారణంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వోడిదెల సతీష్‌ విజయం సాధించారు. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకట్‌ రెడ్డి, ప్రవీణ్‌ రెడ్డి తహతహలాడుతున్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలికిన సీపీఐకి వచ్చే ఎన్నికల్లో మద్దతు పలకాలంటూ సీపీఐ కాంగ్రెస్‌ను కోరుతోంది. కాంగ్రెస్‌ పార్టీ మద్దత్తుతో సీపీఐ నుంచి చాడ వెంకట్‌ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దపడుతుండగా..... కాంగ్రెస్‌ మాత్రం మద్దతుపై తన అభిప్రాయాన్ని ఇంత వరకు బహిర్గతం చేయలేదు. మరోవైపు కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లో హుస్నాబాద్‌ నియోజక వర్గంలో విజయం సాధిస్తుందని పలు సర్వేల్లో వెల్లడైంది. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు బొమ్మ శ్రీరామ్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. దీంతో పొత్తుల గందరగోళంతో పాటు టికెట్ల గందరగోళం కాంగ్రెస్‌ను కలవర పెడుతోంది.

ఇక సర్వేల ఫలితాలు టీఆర్‌ఎస్‌ పార్టీకి కాస్త వ్యతిరేకంగా వస్తుండడంతో ఫలితాలను మార్చే పనిలో పడ్డారు ఎమ్మెల్యే సతీష్‌ బాబు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచుతూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి కాంగ్రెస్‌ను దెబ్బతీసే పనిలో పడ్డారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి కేసీఆర్‌ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు గులాబీ వర్గాల్లో చర్చసాగుతోంది. ఒక వేళ ప్రవీణ్‌ రెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తే మాత్రం ఎమ్మెల్యే సతీష్‌ బాబు సీటుకు ఎసరు వచ్చే ప్రమాదముందని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. కాంగ్రెస్‌ ఇంకా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తే మాత్రం పార్టీ క్యాడర్‌ పోయి గెలుపు గుర్రాలు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని పలువురు పార్టీ నేతలు అంటున్నారు. పొత్తుల విషయం పక్కన పెడితే గెలిచే స్థానాల పైన కాంగ్రెస్‌ దృష్టిసారించక పోవడం మాత్రం టీఆర్‌ఎస్‌కు కలిసివచ్చే అదృష్టంగా చెప్పుకోవాలని పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

06:43 - July 8, 2018

విజయవాడ : నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న సొంతింటి కల నెరవేరుతుంది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్‌ గృహా పథకంతో పాటు వివిధ హౌసింగ్‌ స్కీంల క్రింద ప్రభుత్వం అందిస్తున్న రెండున్నర లక్షల రూపాయలతో చాలా మంది సొంతింటి కల సాకారమవుతుంది. సొంతింటి కల సాకారమవ్వటం పట్ల లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లాలో అమలవుతున్న ఎన్టీఆర్ హౌసింగ్‌ స్కీంపై స్పెషల్‌ స్టోరీ.

విశాఖపట్నం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న నిరుపేదల సొంతింటి కల నెరవేరుతుంది. పూరి గుడిసెలు, రేకుల షెడ్లలో ఉండే పేదవాళ్లకు ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం కింద ఇళ్లు నిర్మిస్తుంది. అలాగే నగరంలోనూ, పురపాలికల్లోనూ అద్దెలు భరించలేకపోతున్న మధ్యతరగతి వారికి కూడా ఈ పథకంలో ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుంది.

స్వంత స్థలం ఉన్న వారికి ఈ స్కీమ్‌ క్రింద 2,50,000 రూపాయలు ఇవ్వటంతో లబ్దిదారులు ఇంటిని నిర్మించుకుంటున్నారు. 2016 డిసెంబర్‌లో ప్రభుత్వం విశాఖ జిల్లాకు 27,271 ఇళ్లను కేటాయించింది. ఇందులో హూదూద్‌ తుఫాన్ వల్ల ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కేటాయించింది. నిర్మాణం పూర్తి అయిన 19,429 ఇళ్లలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గృహా ప్రవేశం చేశారు.

గాజువాకలో ఇల్లు నిర్మించుకున్న వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు గృహ ప్రవేశం చెయించారు. ఇంటి నిర్మాణం నుంచి గృహ ప్రవేశం వరకు అధికారులు దగ్గరుండి అన్నీ కార్యక్రమాలు చూసుకున్నారు. ప్రతి లబ్దిదారుడికి ఇంటి స్వాధీన పత్రాలతో పాటు పెండింగ్‌ బిల్లుల చెల్లింపు పత్రాలను అధికారులు అందజేశారు. దీంతో తమ సొంతింటి కళ నెరవేరటం పట్ల లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు తీరాయని.. ఇకపై ఇళ్లు లేదని ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలలో 71 వేల గృహాలు మంజూరు అయ్యాయి అన్నారు టీడీపీ నేతలు. ఇందులో చాలా వరకు పూర్తికాగా.. మిగిలిన వాటిని త్వరలో పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని నేతలు చెపుతున్నారు. మొత్తానికి జిల్లాలో ఎన్టీఆర్ స్కీం సక్సెస్‌ అవ్వటం పట్ల అటు అధికారులు, ఇటు టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇళ్లు పొందిన లబ్దిదారులు సంబరపడుతున్నారు. 

06:38 - July 8, 2018

వరంగల్ : అమెరికాలో వరంగల్‌కు చెందిన విద్యార్థి కొప్పు శరత్‌పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. మిస్సోరిలోని కేన్సస్‌ సిటీ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల సమయంలో శరత్‌తో పాటు అతని స్నేహితులు కూడా ఉన్నారు. కాల్పుల్లో శరత్‌ భుజంలోకి బుల్లెట్‌ దిగినట్లు స్నేహితుల ద్వారా తల్లిదండ్రులు తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవటంతో శరత్ ‌తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై తల్లిదండ్రులు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిశారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కూడా సమాచారం ఇచ్చినట్లు తల్లిదండ్రులు తెలిపారు. వరంగల్‌ వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ పూర్తి చేసిన శరత్‌.. ఉన్నత చదువుల నిమిత్తం ఈ ఏడాది జనవరిలో అమెరికాకు వెళ్లారు.

06:35 - July 8, 2018

హైదరాబాద్ : వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటి..వాటిని పరిరక్షించే విధంగా తెలంగాణకు హరితహారం ప్రణాళికను రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌లో హరితహారం కార్యక్రమంపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పెద్ద మొత్తంలో మొక్కలు సిద్ధం చేయడానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల సంఖ్య పెంచాలని తెలిపారు. అడవుల పునరుద్ధరణతో పాటు పండ్ల చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులకు హరితహారంపై దిశనిర్దేశం చేశారు. రాష్ట్రంలోని మొత్తం భూభాగంలో 24 శాతం అటవీ భూములున్నాయని కానీ అడవులు మాత్రం 12 శాతం లోపు ఉన్నాయని తెలిపారు. కనీసం 33 శాతం గ్రీన్ కవర్ ఉండేలా చెట్ల పెంపకం జరగాలన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నందున.. పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. హరితహారం కార్యక్రమానికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వీటితో పాటు నరేగా నిధులు కూడా ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

అడవుల్లో పండ్ల చెట్లు ఉంటే కోతులతో పాటు ఇతర జంతువులు అవి తిని బతికేవని.. అడవి పోవటంతో కోతులతో పాటు ఇతర జంతువులు జనావాసాలపై పడ్డాయన్నారు సీఎం కేసీఆర్. ఈ పరిస్థితి పోవాలంటే పండ్ల చెట్లు భారీగా పెంచాలని.. నర్సరీల ద్వారా మొక్కలు సిద్ధం చేయాలన్నారు. ఈత, తాటి చెట్లు కూడా విరివిగా పెంచాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే మున్సిపాలిటీల్లో చెట్లు పెంచడానికి స్థలం లేకుండా పోతుందని.. మున్సిపల్ అధికారులు చాలా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో కూడా ఆక్రమణలు గుర్తించి.. ఆక్రమణలు తొలగించడానికి వ్యూహం రూపొందించాలని సీఎం కేసీఆర్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటడం, వాటిని పెంచడం కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాదిరిగా కాకుండా ప్రజా ఉద్యమంగా సాగాలని కేసీఆర్‌ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ.. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. హరితహారంపై విద్యా సంస్థల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి.. అవగాహన పెంచే ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాలు, పట్టణాల్లో చెరువుల పరిరక్షణపై శ్రద్ధ వహించాలన్నారు. మురికి కాల్వలు చెరువులో కలవకుండా మళ్లింపు కాల్వలు నిర్మించాలని.. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మిషన్ కాకతీయలో చెరువులను శుభ్రం చేయటంతో పాటు చెరువుల చుట్టూ పచ్చగా ఉండే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన నటి...

హైదరాబాద్ : బంజారాహిల్స్ లో ఓ స్టార్ హోటల్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం చేస్తున్న భోజ్ పురి నటి దీక్షా కుశ్వా పట్టుబడ్డారు. ఆమెతో పాటు మరో ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు.

 

 

నితీశ్ అధ్యక్షతన జేడీయూ భేటీ...

బీహార్ : నేడు నితీశ్ కుమార్ అధ్యక్షతన జేడీయూ భేటీ జరుగనుంది. ఎన్డీయేలో కొనసాగే అంశాలపై ప్రధాన చర్చించనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం కీలక ప్రకటన చేయనుంది.

 

Don't Miss