Activities calendar

09 July 2018

21:44 - July 9, 2018

హైదరాబాద్ : కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ నగరం నుంచి బహిష్కరించారు పోలీసులు. హిందూ ధర్మంపై కత్తి మహేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనలకు దిగాయి. అంతేకాకుండా భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. నగరంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా కత్తి మహేష్‌ను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు.

వివాదాస్పద వ్యాఖ్యల కత్తి మహేశ్ పై చర్యలు
గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యల చేస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌ నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. తమ అనుమతి లేకుండా హైదరాబాద్‌లోకి అడుగు పెట్టవద్దని ఆదేశించారు. అంతేకాకుండా కత్తి మహేష్‌ను అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు అప్పగించారు.

కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ వేటు
కత్తి మహేష్‌, హిందూ ధార్మిక సంఘాల ఆందోళనల నేపథ్యంలో... డీజీపీ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. సమాజంలో అలజడి సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్న కత్తి మహేష్‌ను ఆరు నెలలపాటు హైదరాబాద్‌ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. నగరానికి రావాలంటే తమ అనుమతి తీసుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

పరిపూర్ణానంద యాదాద్రి పాదయాత్రకు పోలీసుల అనుమతి నిరాకరణ
గత కొన్ని రోజుల క్రితం కత్తి మహేష్‌ హిందూ ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని.. గడ్డం శ్రీధర్‌ అనే వ్యక్తి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కత్తి మహేష్‌ను పీఎస్‌కు పిలిపించి స్టేట్‌మెంట్‌ తీసుకుని పంపించి వేశారు. అయితే.. కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడ్డాయి. హిందూ ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ... శ్రీపీఠం అధిపతి పరిపూర్ణనంద స్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి యాదాద్రికి పాదయాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యారు. దీంతో సోమవారం ఉదయం నుంచే హైదరాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పరిపూర్ణనంద ఇంటికి చేరుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. బయటకు వెళ్లకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిపూర్ణానందకు మద్దతుగా హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

పోలీసుల తీరుపై పరిపూర్ణానంద అసంతృప్తి
ఇక తనను హౌస్‌ అరెస్ట్‌ చేయడంపై పరిపూర్ణానంద అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులతో కలిసి వెళ్లడానికి పోలీసులు అనుమతివ్వకపోతే... ధర్మాగ్రహా యాత్రను నిర్వహించేందుకు తానొక్కడికి అనుమతివ్వాలని లేనిపక్షంలో అన్నపానీయాలు మానేస్తానని హెచ్చరించారు. తనకు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారని.. వారిని బేషరతుగా విడుదల చేయాలని పరిపూర్ణానంద డిమాండ్‌ చేశారు.

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం : డీజీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్‌కు ఎవరైనా రావొచ్చు.. జీవించవచ్చని.. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం సహించేది లేదని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. మొత్తానికి రాష్ట్రంలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు ప్రతిస్పందించారు. దీనిపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

 

21:39 - July 9, 2018

విజయవాడ : ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఉమన్‌ చాందీ తెలిపారు. అక్టోబర్‌ 2 నుంచి ప్రతి ఇంటికి వెళ్లి... కాంగ్రెస్‌ పార్టీ విధివిధానాలను తెలియజేస్తామన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి రోజైనా అక్టోబర్‌ 31 నుంచి.. నవంబర్‌ 19 వరకు ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్‌ నాటికి.. బూత్‌ స్థాయి నుంచి నియోజకర్గం స్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు ఉమెన్‌ చాందీ. 

21:37 - July 9, 2018

కరీంనగర్ : రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా రామగుండంలో జరుగుతున్న రాజకీయా పరిణామాలతో మనస్తాపం చెందిన సోమారపు... రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే... మున్సిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానంలో మంత్రి కేటీఆర్‌ మందలించడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది.

రాజకీయల నుంచి తప్పుకున్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ
రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మనస్తాపానికి గురై సోమారపు... రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేగానే కాకుండా... ఆర్టీసీ చైర్మన్‌ పదవి నుంచి కూడా తప్పుకోనున్నట్లు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ అధిష్టానం కార్పొరేటర్లు అవిశ్వాసం
కొన్ని రోజుల క్రితం రామగుండం మేయర్‌ లక్ష్మీనారాయణపై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు కలెక్టర్‌కు ఇచ్చారు. అయితే.. టీఆర్‌ఎస్‌ అధిష్టానం కార్పొరేటర్లు అవిశ్వాసం ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని సోమారపుకు బాధ్యతలు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సోమారపు కార్పొరేటర్లతో చర్చించి.. అవిశ్వాస తీర్మానం ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే కొంతమంది కార్పొరేటర్లు ఇందుకు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన సోమారపు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన మాటలు కార్పొరేటర్లు పట్టించుకోనప్పుడు.. వారి ప్రతినిధిగా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు.

సోమారపుపై మండిపడ్డ మంత్రి కేటీఆర్‌
అయితే... సోమారపు నిర్ణయం వెనక పార్టీ అంతర్గత కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం విసయంలో పార్టీ అధిష్టానం సోమారపుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు.. మంత్రి కేటీఆర్‌ సోమారపుపై మండిపడినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీ అధిష్టానం, కేటీఆర్‌ సీరియస్‌ నేపథ్యంలోనే సోమారపు కార్పొరేటర్ల చర్చలు జరిపినట్లు... అవి ఫలించకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే... సోమారపు నిర్ణయం పట్ల పార్టీలో చర్చ కొనసాగుతోంది. మరోవైపు కార్పొరేటర్లు కూడా సోమారపుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని... పట్టణాన్ని అభివృద్ధి చేయలేని వారికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సోమారపు... గోదావరిఖనిలో బొగ్గుగని కార్మికుల వద్ద వెల్లబోసుకున్నారు. ఓవైపు పార్టీ అధిష్టానం ఆదేశాలు.. మరోవైపు అవిశ్వాసం వెనక్కి తీసుకోవడానికి కార్పొరేటర్లు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన సోమారపు రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు.

2 రోజుల్లో ఎమ్మెల్యేగా రిలివ్‌ అవతానంటూ వెల్లడి
ఇక సోమారపు.. ఆర్టీసీ చైర్మన్‌ పదవి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. రామగుండలో ఎవరికీ టికెట్‌ ఇచ్చినా గెలుస్తారని.. ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానన్నారు. అయితే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను కానీ... విశ్రాంతి తీసుకుంటానన్నారు సోమారపు. మొత్తానికి మేయర్‌పై కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం.. సోమారపు రాజకీయ జీవితంపై ప్రభావితం చూపించింది. ఓవైపు పార్టీ అధిష్టానం ఆదేశం... మరోవైపు కార్పొరేటర్ల తీరుతో సోమారం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారు. అయితే... ఈ పరిణామాలపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

21:31 - July 9, 2018

హైదరాబాద్ : జంట నగరాల్లోని కాలుష్యకారక పరిశ్రమలను అవుటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపలకు తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మెదక్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, భునగిరి, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 17 ప్రాంతాలకు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిన తర్వాత కాలుష్యకారక పరిశ్రమలను తరలిస్తామని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పర్యటనలో మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

పాశమైలారంలో కేటీఆర్ పర్యటన
పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పర్యటించారు. ఇక్కడ 4 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధి కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కాలుష్యకారక పరిశ్రమల తరలింపు అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.

మొత్తం 1122 కాలుష్యకారక పరిశ్రమలు గుర్తింపు
జంట నగరాల్లో భారీగా కాలుష్యకారక పరిశ్రమలను గుర్తించారు. వీటి తరలింపునకు సంబంధించిన అధ్యయనం కూడా పూర్తైంది. కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు గుర్తించిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయలు కల్పించిన తర్వాత ఈ కార్యక్రమం చేపడతారు. మొత్తం 1122 కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నట్టు లెక్కతేలింది. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్యంతో భూగర్భజలాలతోపాటు పర్యావరాణానికి తీవ్ర ముప్పువాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయా ప్రాంతాల ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం కాలుష్య కారక పరిశ్రమల తరలింపు ఒక్కటే మార్గమని నిర్ణయించింది. వీటిలో ఎక్కువ భాగం ఫార్మా కంపెనీలు ఉన్నాయి. మొత్తం 283 కాలుష్యకారక ఫార్మా పరిశ్రమలను రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో అభివృద్ధి చేస్తున్న ఫార్మా సిటీకి తరలిస్తారు.

కాలుష్య పరిశమ్రలను తరలించేందుకు 17 ప్రాంతాలకు గుర్తించాం -కేటీఆర్‌
కాలుష్యకారక పరిశ్రమలను అవసరమైనే మూసివేయడానికి కూడా వెనుకాడబోమని కేటీఆర్‌ హెచ్చరించారు. కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు 17 ప్రాంతాలను గుర్తించారు. పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ... ఈపీటీఆర్‌ఐ.. అవుటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపల ఈ ప్రాంతాలను గుర్తించింది. కాలుష్యకోరల నుంచి ప్రజలను రక్షించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నకేటీఆర్‌.. పరిశ్రమల తరలింపునకు పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. 

21:27 - July 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సహకారం అందించడానికి కేంద్ర జలవనరుల శాఖ ముందుకు వచ్చింది. రాష్ట్రం చేపట్టిన సాగునీటి పథకాలకు నిధులు విడుదల చేసేందుకు మంత్రి నితిన్‌ గడ్కరీ అంగీకరించారు. రాష్ట్రంలోని ఏడు రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ అంశాలపై కేంద్ర జలవనరులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చర్చలు జరిపారు.

సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై చర్చించిన మంత్రులు
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితీశ్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై చర్చించారు. నితిన్‌ గడ్కరీతో హరీశ్‌రావు భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతుల ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బీమా, ఆదిలాబాద్‌ జిల్లాలోని నీల్వాయి, ర్యాలీవాగు, మత్తడి వాగు, కొమురం భీమ్‌, గొల్లవాగు ప్రాజెక్టులకు కేంద్రం విడుదల చేయాల్సిన నిధులను వెంటనే ఇవ్వాలని కోరారు. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలానికి నిధుల విడుదలకు మంత్రి గడ్కరీ అంగీకరించారు.

కాళేశ్వరంకు అన్ని అనుమతులు ఇచ్చినందుకు గడ్కరీకి కృతజ్ఞతలు: హరీశ్‌
రాష్ట్రంలోని ఏడు ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా మార్చే అంశంపై కూడా నితిన్‌ గడ్కరీతో హరిశ్‌రావు చర్చించారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. 

21:24 - July 9, 2018

అమరావతి : ఆర్ధికాభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధప్రదేశ్‌కు విదేశీ సంస్థలు ఇతోదికంగా సాయం అందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ప్రస్తుతం పదిన్నర శాతంగా ఉన్న ఆర్థికాభివృద్ధిని 12 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని సింగపూర్‌లో జరుగుతున్న నగరాల సదస్సులో చంద్రబాబు చెప్పారు. ఈ లక్ష్య సాధనకు విదేశీరుణ సంస్థలు సహకరించాలని చంద్రబాబు కోరారు.

ప్రపంచ నగరాల సదస్సులో పట్టణీకరణపై సీఎం ప్రసంగం
సింగపూర్‌లో జరుగుతున్నప్రపంచ నగరాల సదస్సులో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు... వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమాశంలో పాల్గొన్న చంద్రబాబు..ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రపంచ నగరాల సదస్సులో పట్టణీకరణ-నీరు, పర్యావరణం, ప్రజా రవాణ నిర్వహణ.. అన్న అంశంపై ప్రసంగించారు.

నివాసయోగ్యమైన నగరాల నిర్మాణంలో నీరే కీలకం -బాబు
ఆర్థికాభివృద్ధిలో ఏపీ శరవేగంగా దూసుకుపోతున్న విషయాన్ని చంద్రబాబు వివిధ సంస్థల సీఈవోల దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం ఉన్న పదిన్నర శాతం ఆర్థికాభివృద్ధి రేటును 12 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. దీనిని 14 నుంచి 15 శాతానికి పెంచేందుకు అంతర్గతంగా చర్యలు చేపట్టామని పలు సంస్థల ప్రతినిధులకు వివరించిన చంద్రబాబు.. ఇందుకు వారి సహకారంకావాలని అర్థించారు. సరళతర వాణిజ్య విధానంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. జాప్యం లేకుండా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రపంచ నగరాల సదస్సులో ప్రసంగించిన చంద్రబాబు.. నివాసయోగ్యమైన నగరాల రూపకల్పనలో నీరు, పర్యావరణ అంశాలతోపాటు మౌలిక వసతులు కీలకపాత్ర పోషిస్తాయన్న విషయాన్ని గుర్తు చేశారు. అమరావతిని ఈ దిశగా అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.

20:44 - July 9, 2018

2012 దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ హత్య కేసులో సుప్రీంకోర్టు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. దోషులకు మరణ శిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలన్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. దోషులకు మరణశిక్షే సరైనదంటూ... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా , న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ భానుమతిలతో కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్భయ కేసులో గత ఏడాది మే 5న నలుగురు దోషులు ముఖేస్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తలకు సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. తమకు విధించిన మరణ శిక్షను తగ్గించి యావజ్జీవ శిక్షగా మార్చాలని నిందితులు రివ్యూ పిటిషన్‌ వేశారు. 31 ఏళ్ల అక్షయ్‌ కుమార్‌ మాత్రం రివ్యూ పిటిషన్‌ వేయలేదు. విచారణ సమయంలో నిందితుల్లో ఒకడైన రాంసింగ్‌ 2013 మార్చి 11న పోలీస్‌ కస్టడీలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్యురెటివ్‌ పిటిషన్‌ వేసేందుకు మాత్రం అంగీకరించింది. సుప్రీం తీర్పును నిర్భయ తల్లిదండ్రులు స్వాగతించారు.

 

20:24 - July 9, 2018

రామగుండం రాజకీయం రంజుకొచ్చింది గదా..? ఇప్పటికే ఉత్తర తెలంగాణల పట్టుగోల్పోతున్న టీఆర్ఎస్ పార్టీకి రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ షాకిచ్చిండు.. రాజకీయాలళ్ల కెళ్లి తప్పుకుంటున్న అని ప్రకటించిండు.. రామగుండం మేయర్ అవిశ్వాస తీర్మానం పంచాది చిల్కి చిల్కి టీఆర్ఎస్ దుమారం లేశింది.. అసలు ఏం జర్గింది ఒక్కపారి జూద్దాం పాండ్రి.. సతీష్.. అడ్గు..

తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు పెద్ద ఎత్తునొస్తున్నయట.. ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అంటున్నడు.. పెద్ద ఎత్తునొస్తున్నాయి..? యాడనో సూపెడ్తవా కేటీఆర్ గారు ఆ పరిశ్రమలు ఏడికొచ్చినయ్ ఇప్పుడు ఏడున్నయ్.. అండ్ల నౌకర్లు ఎన్నొచ్చినయ్ మా పోరగాళ్లకు అనేది ఎందుకు సారు ఈ ఉద్దెర ముచ్చట్లు జెప్తవ్..?

అయ్యో గద్వాల జేజమ్మ అలియాస్ అరుణారెడ్డి అడ్డగోల్గ తిట్టిందిగదా కల్వకుంట్ల తారక రామారావును భీమా నెట్టెపాండు ప్రాజెక్టులు గట్టి నీళ్లిచ్చింది కాంగ్రెస్ పార్టీరా సన్నాశి అని నోటికొచ్చిన మాటలన్నది.. నీళ్లు ఇచ్చింది మేమే అని చెప్పింది అరుణమ్మగని..? అర్వై ఏండ్ల సంది తెలంగాణ ఉద్యమం అయితే ఆల్చంగ రాష్ట్రమిచ్చింది గూడ మేమే అని చెప్తలేదు పాపం..

పార్టీల డ్రామాలు జూడుండ్రి ఎట్లుంటయో.. ఏడనన్న గింత మంచి జర్గంతనే అది మాదంటే మాదని ఎగవడి వాళ్ల ఖాతల ఏస్కుంటరు.. చెడు జర్గితె మాత్రం మాదిగాదు గతపాలకుల నిర్ణయాలు అని మంది మీద నూకేస్తుంటరు.. నిన్నమొన్న రెండు గట్టి శిన్కులు వడంగనే తెల్గుదేశం పార్టోళ్లు జూడుండ్రి ఆంధ్ర రాష్ట్రంల హంగామా ఎట్ల జేస్తున్నరో..

ఉన్నదే ఎక్రం పొలం.. ఆ పొలాన్ని ఉన్నకాడికి కాళేశ్వరం కాల్వకోసం గుంజుకున్నరు.. ఇగ ఏం జేయాల్నో తెల్వక అదే పొలంకాడ గూసోని పొద్దంత ఏడ్సింది ఒక మహిళా రైతు.. ఏడ్సి ఏడ్సి ఆడనే జీవిడ్సింది.. కళేశ్వరం అద్భుతాలళ్ల ఇది గూడ ఒక్కటన్నట్టు.. ఉన్నోని పొలాలు వోవు... పాపం ఎక్రం అద్దెక్రం ఉన్నోని భూములు వోతె వాళ్లు ఎట్లబత్కుతరు చెప్పుండ్రి.. ముఖ్యమంత్రిగారు మీ ఖాతల జామజేయవల్సిన సావు ఇదే..

తెలంగాణ రాష్ట్రం నిరాహార దీక్షలు రాస్తరొకోలు.. నిరసనలు ఆందోళనలతోనే తెల్లార్తున్నది.. అవ్విటితోనే పొద్దుగూట్లె వడ్తున్నది.. ఆశాలు అంగన్ వాడీలు, ఏఎన్ఎంలు వాళ్లు ఉద్యోగాలు తక్వ జేశిండ్రు ఆందోళనలు ఎక్వ జేశిండ్రు చేశిండ్రంటే సర్కారు జేపిచ్చింది వాళ్లతోని.. వీళ్లకు తోడుగ ఇగ మెప్మా రిసోర్స్ పర్సన్లు రంగంలకు దిగిండ్రు మా బత్కు సంగతేంది ఈ బంగారు తెలంగాణల అంటున్నరు..

నిజామాబాద్ జిల్లా బోధన్ కాడ ఒక వైన్సుల దొంగలు వడ్డరట నిన్నరాత్రి.. వైన్సు దుకాండ్ల దొంగలు వడ్తె పొయ్యేదేమున్నది.. అదేమన్న మెడికల్ షాపు అని మీరు అనుకుంటుండొచ్చుగని.. ఏదైనా దొంగతనం దొంగతనమేగదా..? మరి దొంగలు వడి రెండు లక్షల రూపాలు ఎత్కపోయిండ్రట.. వైన్సులున్న మాలు గూడ జర్రంత లేపిండ్రట..

జూన్ ఇర్వై మూడు తారీఖు నాడు అంటే అటీటు పదిహేను రోజులైంది ఇయ్యాళటికి పన్నెండు మంది పోరగాళ్లు థాయ్ లాండ్ దేశంలున్న ఒక గుహలకు వొయ్యిండ్రట సూస్తందుకు బాగ వానలొచ్చి గుహంత నీళ్లతోని నిండిపోయిందట.. అండ్లనే ఒక గడ్డ మీద గూసున్నరట వాళ్లను బైటికి తీస్తందుకు చిన్న కష్టమైతలేదు కొంతమందిని దీశిండ్రు ఇంక కొంతమంది అండ్లనే ఉన్నరు పదిహేను రోజుల సంది నీళ్లు తాగి బత్కిండ్రంటే మామూలు ముచ్చట గాదు..

 

పసిబిడ్డను నేలకేసి బాదిన కసాయి తండ్రి..

హైదరాబాద్ : నగరంలో ఓ తండ్రి కిరాతకుడిగా మారాడు. ఆవేశంలో కన్న బిడ్డను నేలకేసి బాదాడు. కోపోద్రేక్తుడిగా మారి రాక్షసుడిగా మారిపోయి విచక్షణ కోల్పోయాడు. భార్యమీద వున్న కోపంతో కన్న బిడ్డను నేలకేసి బాదాడు..తరువాత ఆటోకేసి బాదాడు. ఆవేశంతో ఊగిపోతు చిన్నారి పాలిట కిరాతకుడిగా మారాడు. భార్యాభర్తల మద్య వచ్చిన గొడవతో పసిబిడ్డను స్థానికులు అడ్డుకుంటున్నా వినకుండా ఇష్టమొచ్చిన రీతిలో కనిపించనదానికల్లా బాదాడు. దీంతో ఆ చిన్నారి స్పృహ తప్పిపోవటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.

19:31 - July 9, 2018

తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికలపై భిన్నా భిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జమిలి ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ జై కొట్టింది. లా కమిషన్‌ ముందు హాజరైన టీఆర్‌ఎస్‌ ఎంపీలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాసిన లేఖను అందజేశారు. మరోవైపు టీడీపీ జమిలి ఎన్నికలను వ్యతిరేకించింది. లా కమిషన్‌ ముందు తమ వాదనలు వినిపించిన టీడీపీ ఎంపీలు.. లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వంచడం వలన రాజ్యాంగపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కమిషన్‌ దృష్టికి తెచ్చింది. జమిలి ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే మిగిలివున్న పరిమిత కాలానికే మధ్యంతర ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్న వాదాన్ని టీడీపీ వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరత్వంపాలు చేసే కుట్రల్లో భాగమే జమిలి ఎన్నికలని టీడీపీ ఎంపీలు విమర్శించారు. జమిలి ద్వారా ప్రాంతీయ పార్టీలను ఇబ్బందులకు గురిచేయడమే కేంద్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందన్న వాదాన్ని టీడీపీ లేవనెత్తుతోంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల టెన్షన్ అనేది నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. తమ తమ స్థానాలు, గెలుపులపై నేతలు కసరత్తులు ప్రారంభించినట్లుగా వాతావరణం వేడివేడిగా మారింది. ఈ అంశంపై చర్చను చేపట్టింది 10టీవీ.ఈ చర్చలో ఈ చర్చలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నంద్యాల నరసింహారావు, టీఆర్ ఎస్ నేత దేవీ ప్రసాద్, టీడీపీ నేత బాబు రాజేంద్ర ప్రసాద్ , బీజేపీ నేత రంగరాజు పాల్గొన్నారు. 

19:12 - July 9, 2018

చిత్తూరు : పలమనేరు నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓ వైపు మంత్రి అమర్‌నాధ్‌ రెడ్డిని ఓడించాలని వైసీపీ వ్యూహాలు అల్లుతుంటే.. మరో వైపు వైసీపీని ఓడించి మళ్లీ గెలుస్తానని ధీమాతో ఉన్నారు అమర్‌నాథ్‌ రెడ్డి. అయితే పలమనేరులో మొన్నటి వరకు వైసీపీలో కొనసాగుతున్న ముగ్గురు కన్వీనర్లను తొలగించి ఓ కొత్త వ్యక్తికి కన్వీనర్‌ బాధ్యత అప్పగించింది వైసీపీ. దీంతో పలమనేరులో రాజకీయం రసవత్తరంగా మారింది.

2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన అమర్‌నాథ్‌ రెడ్డి
పలమనేరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అనే పేరుంది. పలమనేరు రూరల్‌, అర్బన్‌ మండలాలతో పాటు బైరెడ్డి పల్లె, గంగవరం, వి కోట, పెద్ద పంజాని మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల ముందు వరకు ఒక్క 1994 ఎన్నికలు మినహా ఇక్కడ టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అమర్‌నాథ్‌ రెడ్డి, అతని తండ్రి రామకృష్ణా రెడ్డికి ఈ నియోజకవర్గంతో మంచి సంబంధాలు ఉన్నాయి. 2009లో మొదటిసారి అమర్‌నాథ్‌ రెడ్డి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2014 ఎన్నికలకు మందు సీన్‌ మారింది. అనూహ్యంగా అమర్‌నాథ్‌ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లి ఎన్నికల్లో విజయం సాధించారు. మూడేళ్ల పాటు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన ఏడాది క్రితం మళ్లీ టీడీపీలోకి జంప్‌ చేసి మంత్రి పదవి కొట్టేశారు. అప్పట్నుంచి ఆయనపై వైసీపీ శ్రేణులు గుర్రుగా ఉన్నాయి.

అమర్‌నాథ్‌ రెడ్డికి చెక్‌ పెట్టే యోచనలో వైసీపీ
ఇదిలా ఉంటే అమర్‌నాథ్‌ రెడ్డి పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లిన తర్వాత వైసీపీలో కొంత గందరగోళం నెలకొంది. సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనతో ఈ నియోజకవర్గంలో ముగ్గురు కన్వీనర్లుగా.. సివి కుమార్‌, రాకేష్ రెడ్డి, రెడ్డెమ్మలను నియమించారు వైఎస్‌ జగన్‌. అయితే ఆర్థిక బలం, అంగ బలంలో వీరు మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డితో సరితూగరని భావించిన అధిష్టానం మళ్లీ కన్వీనర్లలను మార్చాలని యోచిందింది. ఇదే నియోజకవర్గంలోని వి కోట మండలానికి చెందిన వెంకట్‌ గౌడ్‌ను అనూహ్యంగా తెరపైకి తెచ్చింది. వెంకట్‌ గౌడ్‌ బెంగళూరులో స్థిరపడ్డ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ఇటీవలే పెద్దిరెడ్డి ఆశీస్సులతో వైసీపీ పలమనేరు ఇంచార్జ్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇది వరకు ఇంచార్జ్‌లుగా ఉన్న ముగ్గురినీ కలుపుకుపోయేందుకు వెంకట్‌గౌడ్‌ యత్నిస్తున్నారు.

టీడీపీకి గణనీయమైన ఓటు బ్యాంకుగా పలమనేరు..
పలమనేరు నియోజకవర్గం వి కోట మండలంలో టీడీపీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. టీడీపీ అభ్యర్థిని ఆదుకునేది ఈ మండలమే. అయితే అదే మండలంకు చెందిన వెంకట్‌గౌడ్‌ తమ అభ్యర్థిగా బరిలోకి దింపి టీడీపీ ఓటు బ్యాంకును చీల్చాలన్నది వైసీపీ వ్యూహం. మండలంలో అమర్‌నాథ్‌ రెడ్డికి చెక్‌ పెట్టగల సామర్థ్యం ఒక వెంకట్‌ గౌడ్‌ కే ఉందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. అమర్‌నాథ్ రెడ్డి పార్టీ మారి ప్రజలను మోసం చేశాడని పైగా మంత్రిగా నియోజకవర్గానికి ఆయన చేసింది ఏమీ లేదని వెంకట్‌గౌడ్‌ అంటున్నారు.అయితే వైసీపీలో పరిణాలను ఒకవైపు గమనిస్తున్న అమర్‌నాథ్‌ రెడ్డి ఈ పరిణామాలు తనకు లాభిస్తుందని భావిస్తున్నారు. పార్టీ మారిన ఉదంతంపై పలమనేరు ఓటరు నాడి ఏమిటన్న టెన్షన్‌ ఆయనను వెంటాడుతునే ఉంది.

19:06 - July 9, 2018

అమరావతి : ఏపీకి అన్యాయం చేస్తోన్న కేంద్ర వైఖరిని ఎండగట్టేందుకు మరోసారి అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. చంద్రబాబు సింగపూర్‌ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత.. అసెంబ్లీ సమావేశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 12న రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంతోపాటు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినందున... ఆ సమావేశంలో ఓ స్పష్టతరానుంది.

అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని టీడీపీ యోచన
కేంద్ర ప్రభుత్వ ధోకాను ప్రజలకు చెప్పడానికి మరోసారి అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా ఎలాంటి తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. కానీ సింగపూర్‌ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత నిర్వహించే విస్తృత స్థాయి సమావేశంలో దీనిపై ఓ స్పష్టత రానుంది. ఈనెల 16 నుంచి జనవరి 10 వరకు గ్రామదర్శిని పేరుతో నేతలంతా ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే.. గ్రామదర్శిని ఆగకుండా తగు ప్రత్యామ్నాయాలు ఏమిటనేదానిపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. గతసారి 19 పనిదినాలపాటు జరిగిన బడ్జెట్‌ సమావేశాలు రాజకీయ వేడిని రగిల్చాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ కంటే పార్లమెంట్‌ సమావేశాలు జరిగినన్ని రోజులూ అసెంబ్లీ సమావేశాలను పొడిగించారు. విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాలపై చంద్రబాబు చేసిన సుదీర్ఘ ప్రసంగాలు ప్రజల్లోకి వెళ్లాయి. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకళ్లడంలో గతసారి సమావేశాలను టీడీపీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది.

12న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నందున అందులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఈ నెల 12వ తేదీ సాయంత్రం నిర్వహించనున్నారు. మరో మారు కేంద్రంపై అవిశ్వాసం ప్రకటిస్తూనే పార్లమెంట్ వేదికగా పోరాడే అంశంపై అధినేత చంద్రబాబు ఎంపీలకు ఈ భేటీలో దిశానిర్థేశం చేయనున్నారు. ఎంపీలు దిల్లీలో పోరాడుతున్న సమయంలో రాష్ట్రంలో చట్టసభలు నిర్వహించటం ద్వారా దిల్లీ పరిణామాలకు అనుగుణంగా అపరిష్కృత సమస్యలపై తీర్మానాలు చేసి కేంద్రానికి పంపేందుకు అసెంబ్లీ సమావేశాలు లాభిస్తాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మోసాన్ని ఎండగట్టేందుకు అసెంబ్లీ సరైన వేదిక అవుతుందని తెలుగుదేశం అంచనా వేస్తోంది.

పార్లమెంట్‌ సమావేశాలతోపాటు అసెంబ్లీ సమావేశాలు
పార్లమెంట్ సమావేశాలతోపాటు ఒకట్రెండురోజులు అటు ఇటుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 18రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. జూలై నెలలో వర్షాకాల సమావేశాలు నిర్వహించటం సంప్రదాయమే అన్న అభిప్రాయం అసెంబ్లీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ప్రతిపక్షం లేకపోయినా...., ప్రజా సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే మంత్రులను ప్రశ్నించి.. పలు సందర్భాల్లో ఇరుకున పెట్టడం..., బిజెపి ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పాత్ర పోషించే ప్రయత్నం చేయటం వంటి పరిణామాలు గత సమావేశాల్లో చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఈ సారి కూడా వాడీవేడి రాజకీయ వాతావరణం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

19:01 - July 9, 2018

హైదరాబాద్‌ : కుత్బుల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీ డీ శ్రీనివాస్‌ తన అనుచరులతో భేటీ అయ్యారు. ఐదు మండలాల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తరలి వచ్చారు. డీఎస్‌ను సస్పెండ్‌ చేయాలని నిజామాబాద్‌లో పదిరోజుల క్రితం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీర్మానం చేయడాన్ని వారు ఖండించారు. టీఆర్‌ఎస్‌ నుంచి డీఎస్‌ను సస్పెండ్‌ చేయవద్దని ఆయన అభిమానులు కోరారు. డీఎస్‌ను కలిసేందుకు నిజామాబాద్‌ జిల్లా నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

18:59 - July 9, 2018

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అవసరానికి మించి నీటి నిల్వ సామర్థ్యంతో కాళేశ్వరం కడుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు విపక్షాలు చెంపెట్టని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. 

18:55 - July 9, 2018

హైదరాబాద్ : కోపం, ఆగ్రహం వీటికి అర్థం ఒకటే అయినా..వాటి వాటి స్థాయిలను బట్టి పదాలు ఉపయోగిస్తుంటాం. కోపం వస్తే కొద్ది సేపటికి తగ్గిపోతుంది. ఆగ్రహం వస్తే మరికాసేపు పడుతుంది తగ్గటానికి. కానీ పసిబిడ్డను నేలకేసి బాదేసినా ఆగ్రహం తగ్గలేదు అంటే దాన్ని ఏమంటాం. ఇటువంటి ఓ అర్థం లేని ఆగ్రహానికి ఓ చిరుప్రాణం విలవిల్లాడిపోయింది. బిడ్డలపై కోపం వస్తే ఒక్క దెబ్బ వేయగానే తగ్గిపోతుంది. కానీ నేలకేసి బాదినా కోపం తీరక అక్కడే వున్న ఓ వాహనం కేసి మరోసారి మరోసారి చంటిబిడ్డను బాదేసాడు ఓ కసాయి తండ్రి..వీడిని తండ్రి అనటానికి ఖచ్చితంగా వీల్లేదు. అంతటి దారుణానికి పాల్పడ్డ వీడు ఖచ్చితంగా కిరాతకుడే అనాలా కన్నబిడ్డ పాలిట కసాయివాడిలా వ్యవహరించాడు.

నగరంలో ఓ తండ్రి కిరాతకుడిగా మారాడు. ఆవేశంలో కన్న బిడ్డను నేలకేసి బాదాడు. కోపోద్రేక్తుడిగా మారి రాక్షసుడిగా మారిపోయి విచక్షణ కోల్పోయాడు. భార్యమీద వున్న కోపంతో కన్న బిడ్డను నేలకేసి బాదాడు..తరువాత ఆటోకేసి బాదాడు. ఆవేశంతో ఊగిపోతు చిన్నారి పాలిట కిరాతకుడిగా మారాడు. భార్యాభర్తల మద్య వచ్చిన గొడవతో పసిబిడ్డను స్థానికులు అడ్డుకుంటున్నా వినకుండా ఇష్టమొచ్చిన రీతిలో కనిపించనదానికల్లా బాదాడు. దీంతో ఆ చిన్నారి స్పృహ తప్పిపోవటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ తండ్రిని ఆపేందుకు యత్నించారు. అయినా కోపం తగ్గకపోవటంతో పోలీసులను కూడా నెట్లేస్తు బిడ్డను దారుణంగా చితకబాదాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జగద్గిరి గుట్టలో చోటు చేసుకుంది. 

17:41 - July 9, 2018

కర్నూలు : స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంత్రి లోకేశ్ కాన్వాయ్ ను విద్యార్ధి సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకో..విద్యార్ధులకు, పోలీసులు కు మధ్య వాగ్వాదం నెలకొంది. మెడికల్ సీట్ల కౌన్సిలింగ్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాం జరిగిందని..వారికి న్యాయం చేయాలని విద్యార్ధి సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద మంత్రి లోకేశ్ కాన్వాయ్ ని అడ్డుకున్నారు.

17:37 - July 9, 2018

హైదరాబాద్ : చట్టసభల్లో యువత వాటా ఎంత? అనే అంశంపై నగరంలోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగుతోంది. యంగ్ లీడర్ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈసమావేశంలో నిర్వహించబడుతోంది. ఈ సమావేశానికి పలువురు యువ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, యువసంఘాల నాయకులు పాల్గొన్నారు. పంచాయితీ నుండి పార్లమెంట్ వరకూ చట్టసభల్లో యువత శాతం పెరగాలనే సమావేశం మాట్లాడిన వక్తలు డిమాండ్ చేశారు. చట్టసభలు, ఇతర రాజ్యంగ పదవుల్లో 65 ఏళ్లకు పైబడినవారికి చట్టసభలకు పోటీ చేయకుండా రూల్ పాస్ చేయాలని..చట్టసభల్లో యువతకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని యంగ్ లీడర్ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఒక వ్యక్తికి ఒకే పదవిని రెండు సార్లకు మించి ఇవ్వకూడదని యువ నేతలు సూచించారు. యువత శాతం పెరగాలని రౌండ్ టేబుల్ లో వక్తలు పిలుపునిచ్చారు. వయసు మీరిన వారు ప్రత్యక్ష రాజకీయాలలోనుండి తప్పుకుని యువతకు అవకాశం ఇవ్వాల్సిన అవసరముందన్నారు. యువతకు వారి రాజకీయ అనుభవాలను గైడ్ చేస్తు రాజకీయ సలహా దారులుగా వ్యవహరిస్తు యువతకు దిశా నిర్ధేశంగా నిలబడాలని వక్తలు కోరారు. చట్టసభల్లో యువత వాటా ఎంత అనే అంశం తెలంగాణ నుండి ప్రారంభమై ఢిల్లీ వరకూ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. 

జపాన్‌లో భారీ వర్షాలకు 112మంది మృతి..

హైదరాబాద్ : జపాన్‌లో భారీ వర్షాల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 112కు పెరిగింది. వేలాది ఇండ్లు జలమయం అయ్యాయి. ఆ నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ వర్కర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని షింజో అబే తన విదేశీ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. 1983 తర్వాత ఇంత భారీ ఎత్తున వరదలు రావడం ఇదే తొలిసారి. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నీటి మునిగిన ప్రాంతాల్లో ప్రస్తుతం ఆహార కొరత ఏర్పడింది.

వరద నీటిలో కొట్టుకుపోయిన లారీ..

జయశంకర్ భూపాలపల్లి : పలిమెల మండలం పంకెన వాగు వద్ద వరద ఉధృతి ఎక్కువైంది. ఈ వాగును లారీ దాటుతున్న సమయంలో వరద ఎక్కువగా ఉండటంతో ఆ వాహనం కొట్టుకుపోయింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికులు అప్రమత్తమై డ్రైవర్‌ను ప్రాణాలతో రక్షించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. రాష్ట్రంలోని పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.

కత్తి మహేశ్ పై ఎమ్మెల్యే రాజాసింగ ఫైర్..

హైదరాబాద్ : శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై ఆరు నెలల నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, కత్తి మహేష్ కు ఆరు నెలల నిషేధం సరిపోదని... హైదరాబాదు నుంచి ఆయనను శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు తమను పోలీసులు అనుమతించలేదని... దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 

బీజేపీని గెలిపించేది హిందూత్వమే : బీజేపీ ఎంపీ

ఢిల్లీ : బీజేపీని అధికారంలోకి తెచ్చేది హిందుత్వ అజెండానే అని ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. వాజ్ పేయి హయాంలో 'ఇండియా షైనింగ్' నినాదంతో ఎన్నికల బరిలోకి బీజేపీ దిగిందని... కానీ, ఓటమిపాలైందని చెప్పారు. బీజేపీకి అభివృద్ధి నినాదం పని చేయదని అన్నారు. గత ఎన్నికల్లో హిందుత్వ స్థాపన, అవినీతి రహిత ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంతో బీజేపీ ఎక్కువ సీట్లను సాధించిందని చెప్పారు. బీజేపీకి మరో ఐదేళ్ల పాటు అధికారాన్ని ఇస్తే... తన ఎన్నికల వాగ్దానాన్ని నెరవేరుస్తుందని తెలిపారు. జమ్ముకశ్మీర్ లో హిందూ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పారు.

ఈ జిల్లా వారికి పాఠాలు అవసరం లేదు : ఉమెన్ చాంది

విజయవాడ : కృష్ణా జిల్లా పెనమలూరులో కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాందీ మాట్లాడుతు.. తాను రెండవసారి విజయవాడ రావటం ఆనందంగా ఉందన్నారు. కృష్ణా జిల్లా కార్యకర్తలకి రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మంచి నాయకత్వాన్ని ఇవ్వగలిగిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీనే అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొత్తులు అవసరం లేదని, రాష్ట్రంలో ఒంటరిగానే కాంగ్రెస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.కార్యకర్తలే కాంగ్రెసుకు బలమని, పార్టీ బలోపేతం కోసం వారంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నిర్భయ నేరస్తులకు ఉరే సరైనది : సుప్రీం కోర్టు

ఢిల్లి : నిర్భయ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో దోషులు వేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. ఈ కేసులో గతంలో ఢిల్లీ హైకోర్టుతో పాటు కింది కోర్టు ఇచ్చిన తీర్పులను సమర్థించింది. రివ్యూ పిటిషన్‌ వేసిన ముగ్గురు దోషులకు ఉరి శిక్షే సరి అని స్పష్టం చేసింది. కాగా, 2012 డిసెంబరు 16న జరిగిన నిర్భయ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, అత్యాచారాలపై కఠిన చట్టాలను తేవడానికి కారణమైన విషయం తెలిసిందే.

16:51 - July 9, 2018

ఉత్తరప్రదేశ్‌ : గ్యాంగ్‌స్టర్‌ మున్నా బజరంగీని బాగ్‌పత్ జైలులో కాల్చి చంపారు. 2005లో బిజెపి ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ను హత్య చేసిన కేసులో నిందితుడైన మున్నా బజరంగి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మున్నా బజరంగీపై హత్య, దోపిడి, తదితర 40 కేసులున్నాయి. మున్నాను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసే ఆలోచనలో ఉన్నారని, ఆయనకు భద్రత కల్పించాలని మున్నా భార్య వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేసినన నేపథ్యంలో ఈ హత్య జరగడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన సిఎం యోగి ఆదిత్యనాథ్- జైలర్‌, డిప్యూటి జైలర్‌ను సస్పెండ్‌ చేసి న్యాయ విచారణకు ఆదేశించారు. ప్రేమ్‌ ప్రకాశ్‌ అలియాస్‌ మున్నా బజరంగిని 2009లో ముంబైలో అరెస్ట్‌ చేశారు. బజరంగి 2012 యూపీ ఎన్నికల్లో అప్నాదల్ పార్టీ టికెట్‌పై పోటీ చేశారు. 

16:45 - July 9, 2018

ఢిల్లీ : 2012 దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ హత్య కేసులో సుప్రీంకోర్టు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. దోషులకు మరణ శిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలన్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. దోషులకు మరణశిక్షే సరైనదంటూ... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా , న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ భానుమతిలతో కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్భయ కేసులో గత ఏడాది మే 5న నలుగురు దోషులు ముఖేస్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తలకు సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. తమకు విధించిన మరణ శిక్షను తగ్గించి యావజ్జీవ శిక్షగా మార్చాలని నిందితులు రివ్యూ పిటిషన్‌ వేశారు. 31 ఏళ్ల అక్షయ్‌ కుమార్‌ మాత్రం రివ్యూ పిటిషన్‌ వేయలేదు. విచారణ సమయంలో నిందితుల్లో ఒకడైన రాంసింగ్‌ 2013 మార్చి 11న పోలీస్‌ కస్టడీలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్యురెటివ్‌ పిటిషన్‌ వేసేందుకు మాత్రం అంగీకరించింది. సుప్రీం తీర్పును నిర్భయ తల్లిదండ్రులు స్వాగతించారు.

16:42 - July 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని టీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ కుంతియా విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు లేకపోవటంతో యువకులు, విద్యార్థులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారన్నారు. ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలను బలిదానం చేస్తే.. వారికి ఎలాంటి లాభం చేకూరలేదని ఆరోపించారు. సోనియా గాంధీని అమ్మ బొమ్మ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని.. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్‌, కేటీఆర్‌ ఎక్కడ ఉండేవారని కుంతియా ప్రశ్నించారు.

కేటీఆర్ కుటుంబానిది అధికార గర్వం : కోమటిరెడ్డి

హైదరాబాద్ : గాంధీభవన్‌ వద్ద జరిగిన సభలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. దేశంలో మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజా వ్యతిరేకపాలనకు నిరసనగా.. భారత్‌ బచావో కార్యక్రమం చేపట్టామని కోమటిరెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో సామాన్యుడి నడ్డి విరిచిందని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. విద్యార్థుల బలిదానాలు చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్‌ కుటుంబం అధికార గర్వంతో రెచ్చిపోతుందని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

16:37 - July 9, 2018

హైదరాబాద్‌ : గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోనియాపై కేటీఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రగతిభవన్‌ ముట్టడికి యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు బయల్దేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు, యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గాంధీభవన్‌ వద్ద ఉద్రిక్తత
అంతకుముందు గాంధీభవన్‌ వద్ద జరిగిన సభలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. దేశంలో మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజా వ్యతిరేకపాలనకు నిరసనగా.. భారత్‌ బచావో కార్యక్రమం చేపట్టామని కోమటిరెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో సామాన్యుడి నడ్డి విరిచిందని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. విద్యార్థుల బలిదానాలు చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. కేసీఆర్‌ కుటుంబం అధికార గర్వంతో రెచ్చిపోతుందని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

16:18 - July 9, 2018

కరీంనగర్‌ : టీఆర్‌ఎస్‌లో ముసలం ముదురుతోంది. రామగుండం మేయర్‌పై అవిశ్వాసం విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు మెజార్టీ కార్పొరేటర్లు ఒక్కసారి నోటీసు ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కార్పొరేటర్లు స్ఫష్టం చేశారు. రాజకీయాలకు దూరమన్న సోమారపు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు.విశ్వాస తీర్మానంలో మేము నెగ్గుతాం, నెగ్గని పక్షంలో రాజీనామా చేస్తాం కార్పొరేటర్లు ధీమా వ్యక్తంచేశారు. 

16:08 - July 9, 2018

కరీంనగర్ : రామగుండం నగరపాలక సంస్థ అవిశ్వాస రాజకీయాలు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మెడకు చుట్టుకున్నాయి. రామగుండం మేయర్‌, డిప్యూటీ మేయర్‌పై టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకునే విధంగా చేయాలని మంత్రి కేటీఆర్‌ సోమారపు సత్యనారాయణను ఆదేశించారు. అవిశ్వాసం ప్రతిపాదించిన కార్పొరేటర్లతో సోమారపు సత్యనారాయణ చర్చలు జరిపినా వెనక్కి తగ్గలేదు. దీంతో మనస్తాపానికి గురైన సోమారపు సత్యనారాయణ రాజకీయాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఆర్టీసీ చైర్మన్‌ పదవిలో కూడా కొనసాగనని తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో పోటీచేయబోనంటున్న సత్యనారాయణ పేర్కొన్నారు. 

16:00 - July 9, 2018

ఢిల్లీ : 2012 దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ హత్య కేసులో సుప్రీంకోర్టు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. దోషులకు మరణ శిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించాలన్న రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. దోషులకు మరణశిక్షే సరైనదంటూ... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా , న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ భానుమతిలతో కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. నిర్భయ కేసులో గత ఏడాది మే 5న నలుగురు దోషులు ముఖేస్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తలకు సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. తమకు విధించిన మరణ శిక్షను తగ్గించి యావజ్జీవ శిక్షగా మార్చాలని నిందితులు రివ్యూ పిటిషన్‌ వేశారు. 31 ఏళ్ల అక్షయ్‌ కుమార్‌ మాత్రం రివ్యూ పిటిషన్‌ వేయలేదు. విచారణ సమయంలో నిందితుల్లో ఒకడైన రాంసింగ్‌ 2013 మార్చి 11న పోలీస్‌ కస్టడీలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్యురెటివ్‌ పిటిషన్‌ వేసేందుకు మాత్రం అంగీకరించింది. సుప్రీం తీర్పును నిర్భయ తల్లిదండ్రులు స్వాగతించారు.

15:54 - July 9, 2018

విశాఖపట్నం : నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న సొంతింటి కల నెరవేరుతుంది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్‌ గృహా పథకంతో పాటు వివిధ హౌసింగ్‌ స్కీంల క్రింద ప్రభుత్వం అందిస్తున్న రెండున్నర లక్షల రూపాయలతో చాలా మంది సొంతింటి కల సాకారమవుతుంది. సొంతింటి కల సాకారమవ్వటం పట్ల లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లాలో అమలవుతున్న ఎన్టీఆర్ హౌసింగ్‌ స్కీంపై స్పెషల్‌ స్టోరీ.

ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ద్వారా రూ.2,50,000 ఇస్తున్న ప్రభుత్వం
విశాఖపట్నం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న నిరుపేదల సొంతింటి కల నెరవేరుతుంది. పూరి గుడిసెలు, రేకుల షెడ్లలో ఉండే పేదవాళ్లకు ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం కింద ఇళ్లు నిర్మిస్తుంది. అలాగే నగరంలోనూ, పురపాలికల్లోనూ అద్దెలు భరించలేకపోతున్న మధ్యతరగతి వారికి కూడా ఈ పథకంలో ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇస్తుంది. స్వంత స్థలం ఉన్న వారికి ఈ స్కీమ్‌ క్రింద 2,50,000 రూపాయలు ఇవ్వటంతో లబ్దిదారులు ఇంటిని నిర్మించుకుంటున్నారు. 2016 డిసెంబర్‌లో ప్రభుత్వం విశాఖ జిల్లాకు 27,271 ఇళ్లను కేటాయించింది. ఇందులో హూదూద్‌ తుఫాన్ వల్ల ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కేటాయించింది. నిర్మాణం పూర్తి అయిన 19,429 ఇళ్లలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గృహా ప్రవేశం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహప్రవేశం చేయించిన చంద్రబాబు
గాజువాకలో ఇల్లు నిర్మించుకున్న వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు గృహ ప్రవేశం చెయించారు. ఇంటి నిర్మాణం నుంచి గృహ ప్రవేశం వరకు అధికారులు దగ్గరుండి అన్నీ కార్యక్రమాలు చూసుకున్నారు. ప్రతి లబ్దిదారుడికి ఇంటి స్వాధీన పత్రాలతో పాటు పెండింగ్‌ బిల్లుల చెల్లింపు పత్రాలను అధికారులు అందజేశారు. దీంతో తమ సొంతింటి కళ నెరవేరటం పట్ల లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు తీరాయని.. ఇకపై ఇళ్లు లేదని ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ స్కీం క్రింద 71 వేల గృహాలు మంజూరు
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాలలో 71 వేల గృహాలు మంజూరు అయ్యాయి అన్నారు టీడీపీ నేతలు. ఇందులో చాలా వరకు పూర్తికాగా.. మిగిలిన వాటిని త్వరలో పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని నేతలు చెపుతున్నారు. మొత్తానికి జిల్లాలో ఎన్టీఆర్ స్కీం సక్సెస్‌ అవ్వటం పట్ల అటు అధికారులు, ఇటు టీడీపీ నేతలుహర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇళ్లు పొందిన లబ్దిదారులు సంబరపడుతున్నారు. 

15:50 - July 9, 2018

తూర్పుగోదావరి : తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డైట్ విద్యార్ధులు ధర్నా చేపట్టారు. నాలుగు సంవత్సరాల డైట్ కోర్సును రెండు సంవత్సరాలు కుదించడంతో నిర్ణీత కాలంలో కోర్సు పూర్తి కాకపోవడంతో తమ విలువైన కాలాన్ని కోల్పోతున్నామని విద్యార్ధులు అవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం లెక్చరర్ల కొరతే అని..వెంటనే ప్రభుత్వం కలుగజేసుకొని డైట్ విద్యార్ధుల డిమాండ్లను నెరవేర్చాలని విద్యార్ధిసంఘం నాయకులు కోరుతున్నారు.

15:48 - July 9, 2018

కుమురంభీం ఆసిఫాబాద్ : గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెనుగంగా, ప్రాణహిత నదులు, వాగులు పోంగిపోర్లుతున్నాయి. కౌటాల, బెజ్జూర్‌, దహేగాం, పెంచికల్ పేట్, చింతలమానేపల్లి, కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి మండలాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు సిర్పూర్-టి మండలం వెంకట్రావు పేట వద్ద పెనుగంగా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. దహేగాం మండలంలో ఎర్రవాగు పోంగిపోర్లడంతో సమీపంలోని పదకొండు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షాల కారణంగా గ్రామాలలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 

15:45 - July 9, 2018

కరీంనగర్ : టీఆర్‌ఎస్‌పార్టీలో అవినీతి పరులను ప్రోత్సహిస్తున్నారని ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారయణ అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీతో కుమ్మక్కై రామగుండం కార్పొరేషన్‌ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి తన ప్రతిష్టను దెబ్బతీశారని సోమారపు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిఖనిలోని సింగరేణి కార్మికులతో భేటీ అయిన సోమారపు సత్యనారాయణ... తాను రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. 

15:42 - July 9, 2018

హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌లోని స్వామి పరిపూర్ణానంద స్వామి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిపూర్ణనంద స్వామిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అయితే ధర్మాగ్రహ యాత్రకు వచ్చిన బజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఆప్రాంతంలోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

15:37 - July 9, 2018

ఢిల్లీ : నిర్భయకేసులో ఇవాళ తుది తీర్పు రానుంది. 2012 డిసెంబర్‌ 16న ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌రేప్‌లో మొత్తం నలుగురికి మరణశిక్ష పడింది. అయితే దీనిపై ముగ్గురు మద్దాయిలు పవన్‌, వినయ్‌, ముఖేశ్‌లు న్యాస్థానాన్ని ఆశ్రయించారు. తమకు విధించిన మరణ శిక్షను పునఃసమీక్షించాలని పిటిషన్‌ వేశారు. ముద్దాయిల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం ఇవాళ తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా , న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ భానుమతిలతో కూడా ధర్మాసనం ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 

కాళేశ్వరం పిటిషన్ తిరస్కరణ...

ఢిల్లీ : కాళేశ్వరంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో తేల్చుకోవాలని పిటిషనర్ కు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దొంతు లక్ష్మీనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. 

గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్న - రఘువీరా...

కృష్ణా : 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పనిచేయాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరా పేర్కొన్నారు. హోదా, విభజన హామీల అమలు కాంగ్రెస్ కే సాధ్యమన్నారు. ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని, ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి ప్రతొక్కరూ పునరంకితం కావాలన్నారు. 

వెనక్కి తగ్గమన్న కార్పొరేటర్లు...

రామగుండం : ఒక్కసారి నోటీసు ఇచ్చిన తరువాత వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదని, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వెనక్కి తగ్గినా తాము తగ్గమన్నారు. రాజకీయాలకు దూరమన్న సోమారపు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. అవిశ్వాస తీర్మానంలో తాము నెగ్గుతామని..నెగ్గనిపక్షంలో రాజీనామాలు చేస్తామని కార్పొరేటర్లు వెల్లడించారు. 

13:11 - July 9, 2018

హైదరాబాద్ : శ్రీరాముడిపై సినీ క్రిటిక్ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మ యాత్ర చేస్తానన్న స్వామి పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్భందం చేయడం..కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేయడం వంటి పరిణామాలు జరిగాయి. కత్తి మహేష్ ను ఏపీ పోలీసులు చిత్తూరు జిల్లాకు తరలించారు.

మరోవైపు పరిపూర్ణానంద స్వామి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను గృహ నిర్భందం చేయడంతో వీహెచ్ పీ..భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని వారించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. 

గడ్కరితో హరీష్ భేటీ...

ఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో మంత్రి హరీష్ రావు, ఎంపీలు వినోద్, కొత్త ప్రభాకర్ రెడ్డిలు భేటీ అయ్యారు. తెలంగాణలో పలు హైవేల విస్తరణపై చర్చించారు. 

పెనమలూరులో కాంగ్రెస్ సమావేశం...

కృష్ణా : పెనమలూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ ఊమెన్ చాందీ పాల్గొన్నారు. రఘువీరారెడ్డి, కేవీపీ, కాసు కృష్ణారెడ్డి, పల్లం రాజు, చింతా మోహన్, షేక్ మస్తాన్ వలి, సుంకర పద్మజ తదితరులు పాల్గొన్నారు. 

12:29 - July 9, 2018

నిర్మల్ : జిల్లాలోని కడెం మండలం లింగాపూర్ లో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రుల నిరక్షరాస్యత వారి కుమార్తెను బలిగొంది. నర్సవ్వ, ఎర్రన్న దంపతులకు శిరీష (5) ఉంది. చిన్నారికి ఆదివారం రాత్రి పాము కుట్టింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచేసింది. కానీ వారి నిరక్షరాస్యతతో చెట్ల మందులు కాలయాపన చేశారు. కానీ శిరీష ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఖానాపూర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందింది. 

12:25 - July 9, 2018

సంగారెడ్డి : కాలుష్య కారక పరిశ్రమలను హైదరాబాద్ నుండి తరలిస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పటన్ చెరువు మండలం పాశమైలారం వ్యర్థ జలాల శుద్ధి కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ...రామచంద్రాపురం, బాలానగర్, జీడిమెట్ల, పాశమైలారం, పటన్ చెరువు ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను తరలించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 300 కంపెనీల సీఈఓలతో మాట్లాడడం జరిగిందన్నారు. ఇప్పటికే కాలుష్యనాఇ్న వెదజల్లే 16 పరిశ్రమలను మూసివేయించడం జరిగిందని, మిగతా వాటిని ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలిస్తామన్నారు. 

12:07 - July 9, 2018

హైదరాబాద్ : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడంటూ సినీ క్రిటిక్ కత్తి మహేష్ ను నగర బహిష్కరణ వేటు వేశారు. సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు కత్తి మహేష్ కు నోటీసు ఇచ్చి ఏపీ పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆయన సొంత గ్రామమైన చిత్తూరు జిల్లాకు తరలించారు. కాసేపట్లో కత్తి మహేష్ చిత్తూరుకు చేరుకోనున్నారు.

గత కొన్ని రోజులుగా కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని..వెంటనే కత్తి మహేష్ ను అరెస్టు చేయాలంటూ డిమాండ్ వినిపించాయి. శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే పేరిట కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు వేశారు. పోలీసుల అనుమతి తీసుకుని హైదరాబాద్ కు రావాలని సూచించారు. 

నిర్భయ కేసు మధ్యాహ్నం తీర్పు...

ఢిల్లీ : నిర్భయ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించనుంది. మధ్యాహ్నం 2గంటలకు నిందితులకు దోషులకు ఉరిశిక్షా ? జీవిత ఖైదా ? అనేది సుప్రీం తేల్చనుంది. 

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య...

హైదరాబాద్ : చైతన్యపురి పరిధిలోని టెలిఫోన్ కాలనీలో ఇంటర్ విద్యార్థి సూర్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూర్య ఆత్మహత్యకు కాలేజీ సిబ్బంది వేధింపులే కారణమని పేర్కొంటూ నారాయణ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు బైఠాయించాయి. కాలేజీ యాజమాన్యం, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతుడు సూర్యాపేట జిల్లా వాసిగా గుర్తించారు. 

పవన్ పై కళా విమర్శలు..

విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో చేస్తూ ప్రజల్లో విష బీజాలు నాటుతున్నారని, రాజకీయాల గురించి తెలియనివాళ్లు ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి రాజకీయ స్వరూపం లేదని, జగన్..పవన్ లు బీజేపీ నేతలు ఆడిస్తున్న తోలుబొమ్మలని వ్యాఖ్యానించారు.

 

గ్యాంగ్ స్టర్ హత్యపై విచారణ...

ఉత్తర్ ప్రదేశ్ : గ్యాంగ్ స్టర్ మున్నా భజరంగీ హత్యపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు ఆదేశించారు. బాఘ్ పట్ జిల్లా జైల్ లో మున్నాను హత్య చేసిన సంగతి తెలిసిందే. 

11:14 - July 9, 2018

హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామిని పోలీసులు ఇంటి నుండి బయటకు రానివ్వడం లేదు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి సోమవారం వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు గృహ నిర్భందం చేశారు. హిందూ ధర్మ యాత్రకు అనుమతి లేదని రాచకొండ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుండి యాదాద్రి వరకు ఆయన యాత్ర చేపడితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సినీ క్రిటిక్ మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తాను హిందూ ధర్మ యాత్ర చేపడుతానని ఆదివారం పరిపూర్ణానంద స్వామి వెల్లడించిన సంగతి తెలిసిందే. బోడుప్పల్ నుండి యాదాద్రి వరకు ఈ యాత్ర ఉంటుందని..హిందువులందరూ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

11:12 - July 9, 2018

హైదరాబాద్ : సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు పడింది. ఆయన్ను నగరం నుండి బహిష్కరిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను ఏపీ పోలీసులకు అప్పచెప్పారు. ఇటీవలే శ్రీరాముడి విషయంలో కత్తి మహేష్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింది. కత్తి మహేష్ పై వెంటనే అరెస్టు చేయాలని..చర్యలు తీసుకోవాలంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో ఆయన్ను అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు విచారించారు. అనంతరం ఆయన్ను వదిలిపెట్టారు. కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మాగ్రహ యాత్ర చేపడుతానని పరిపూర్ణనాంద స్వామి హెచ్చరించారు. 

పరిపూర్ణానంద స్వామి హౌస్ అరెస్టు...

హైదరాబాద్ : స్వామి పరిపూర్ణానంద స్వామిని పోలీసులు గృహ నిర్భందం చేశారు. ధర్మాగ్రహ యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. యాత్రకు వేలాదిగా తరలివస్తున్నారు. 

కత్తి మహేష్ ను ఏపీ పోలీసులకు అప్పగింత...

హైదరాబాద్ : సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు పడింది. హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కత్తి మహేష్ ను ఏపీ పోలీసులకు అప్పగించారు. 

10:47 - July 9, 2018

హైదరాబాద్ : తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రులంతా వారి వారి జిల్లాలకు వెళ్లాలని..పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. శాఖల మధ్య సమన్వయం చేసుకుని జిల్లాలో వర్షపాత వివరాలు..పరిస్థితులను తెలుసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వర్షాల వల్ల ఆస్థి..ప్రాణనష్టం సంభవించకుండా చూడాలని, పరిస్థితిని సమీక్షించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందచేయాలని పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:28 - July 9, 2018

వరంగల్ : ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..రెండు నెలలకే విడిపోయారు..అయినా ఆ వ్యక్తి మాత్రం ఆమెనే వేధిస్తున్నాడు..ఇది చూసి భరించలేని తండ్రి అతడిని నరికిచంపాడు. ఈ ఘటన చీటకోడూరులో చోటు చేసుకుంది. సీతకోడూరుకు చెందిన లావణ్య...యాదాద్రి జిల్లా ఆలేరు ప్రాంతానికి చెందిన ఉదయ్ లు ప్రేమించుకున్నారు. వీరు వివాహం కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న రెండు నెలలకే ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. అనంతరం ఇరువురు విడిపోయారు. కానీ ఉదయ్..లావణ్యను తరచూ వేధించడం ప్రారంభించాడు.

సోమవారం కూడా ఇలాగే వేధించడం ప్రారంభించాడు. మామ ఎల్లేష్ వారించడానికి వెళ్లగా ఇద్దరి మధ్య వాగ్వాదం..ఘర్షణ చోటు చేసుకుంది. ఆపడానికి వెళ్లిన అత్త, లావణ్యలపై ఉదయ్ దాడి చేశాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఎల్లేశ్ గొడ్డలితో దాడి చేశాడు. దీనితో ఉదయ్ అక్కడికక్కడనే మృతి చెందాడు. గతంలో ఉదయ్ ప్రవర్తన తీరును..వేధింపుల విషయాన్ని ఎల్లేష్ పెద్దలకు తెలియచేసినట్లు...పోలీసులకు ఫిర్యాదు చేసినా అతనిలో పరివర్తన రాలేదని తెలుస్తోంది. ఘటన జరిగిన అనంతరం ఎల్లేశ్..అతని కుమారులు జనగామ పీఎస్ లో లొంగిపోయారు. 

చీటకోడూరులో విషాదం...

జనగామ : జిల్లాలోని చీటకోడూరులో విషాదం చోటు చేసుకుంది. అల్లుడు ఉదయ్ ని మామ ఎల్లేశ్ గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం ఎల్లేష్ పోలీసులకు లొంగిపోయాడు. కూతురుని వేధిస్తున్నాడని మామ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 

10:14 - July 9, 2018

పెద్దపల్లి : రామగుండం మేయర్ పై అవిశ్వాస తీర్మానం చిచ్చు రేపుతోంది. ఏకంగా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేయడం పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. 'రాజకీయాల నుండి తప్పించుకుంటాను...అధిష్టానం తన మాటలు వినిపించుకోవడం లేదు..ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటాను' అంటూ ఎమ్మెల్యే సోమారపు వ్యాఖ్యలు చేశారు. రామగుండం మేయర్ పై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కార్పొరేషన్ లోని 50 కార్పొరేటర్లలో 41 మంది కార్పొరేటర్లు మేయర్ లక్ష్మీనారాయణపై అవిశ్వాసం ప్రకటించడంతో ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు పెల్లుబికాయి. అవిశ్వాస తీర్మానం వెనుక ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీనితో అధిష్టానం జోక్యం చేసుకుని అవిశ్వాస తీర్మానం ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు తెలియచేసినట్లు సమాచారం.

కానీ కార్పొరేటర్లు వెనక్కి తగ్గకపోవడంతో ఎమ్మెల్యే సోమారపు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం. దీనితో సోమవారం ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని..తన మాట అధిష్టానం వినిపించుకోవడం లేదని...అవినీతిపరులను ప్రోత్సాహిస్తున్నారని...అంటూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఆయన్ను అధిష్టానం బుజ్జగిస్తుందా ? కార్పొరేటర్లు వెనక్కి తగ్గుతారా ? అనేది వేచి చూడాలి. 

60వేల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం...

ఖమ్మం : సత్తుపల్లిలో మూడు రోజుల నుండి వర్షం కురుస్తోంది. దీనికారణంగా జేవీఆర్ ఓపెన్ కాస్ట్ లో 60 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 

రాజధాని నిర్మాణం కష్టసాధ్యం - బాబు...

సింగపూర్ : ప్రపంచ నగరాల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పట్టణీకరణ – నీరు, పర్యావరణం, ప్రజా రవాణా అంశంపై సదస్సు జరిగింది. సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. భారతీయ చరిత్రలో అమరావతికి గొప్ప చరిత్ర ఉందని, రాజధాని నిర్మాణం చాలా కష్టసాధ్యమైందన్నారు. సంస్కృతిని పరిరక్షిస్తూ రాజధాని నిర్మాణం జరుగుతోందని..నూతన సాంకేతిక ఉపయోగిస్తూ రాజధాని నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి నగరాల్లో అమరావతిని నిలపాలన్నదే ధ్యేయమన్నారు. 

అధిష్టానంపై ఎమ్మెల్యే సోమారపు సంచలన వ్యాఖ్యలు...

పెద్దపల్లి : టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ లోపించిందని..అవినీతి పరులను ప్రోత్సాహిస్తున్నారని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తన మాటలను పట్టించుకోవడం లేదని, అవిశ్వాసంపై కార్పొరేటర్లు వెనక్కి తగ్గడం లేదన్నారు. 

ఎమ్మెల్యే సోమారపు సంచలన నిర్ణయం...

పెద్దపల్లి : ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ సన్యాయం తీసుకుంటానని ప్రకటించారు. మేయర్ పై అవిశ్వాసానికి మెజార్టీ కార్పొరేటర్లు సిద్ధం కావడం...అధిష్టాన తీరుతో సోమారపు తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. 

సంగారెడ్డికి కేటీఆర్..హరీష్ రావు...

సంగారెడ్డి : జిల్లాకు నేడు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు రానున్నారు. పటన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో కాలుష్య శుద్ధి ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. 

09:09 - July 9, 2018

హైదరాబాద్ : కుషాయిగూడ పీఎస్ పరిధిలోని సోనియాగాంధీ నగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మల్కాజ్ గిరి డీసీపీ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. సోమవారం ఉదయం 4గంటలకు ప్రతి ఇంటిని పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిషేధం విధించిన గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. 

09:07 - July 9, 2018

నల్గొండ : మళ్లీ ఓ బస్సు బోల్తా పడింది. కానీ ఈ ఘటనలో ప్రాణ నష్టం సంభవించలేదు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ప్రయాణీకులు పేర్కొంటున్నారు. ఓ ప్రైవేటు బస్సు తెనాలికి వెళుతోంది. కట్టంగూర్ (మం) ఐటి పాముల శివారు వద్ద ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది. ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఇతరులకు స్వల్పగాయాలయ్యాయి. వీరందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు బోల్తా పడిన సుమారు మూడు గంటల అనంతరం సహాయక చర్యలు కొనసాగాయి. బస్సు డ్రైవర్ పరారీ కావడంతో ప్రయాణీకులకు ఏమి చేయాలో అర్థం కాలేని పరిస్థితి నెలకొంది. బస్సులో మొత్తం 25 మంది ప్రయాణీకులున్నట్లు సమాచారం. 

బోల్తా పడిన ప్రైవేటు బస్సు...

నల్గొండ : కట్టంగూర్ (మం) ఐటి పాముల శివారు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ – హైదరాబాద్ హైవేపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. తెనాలికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

07:07 - July 9, 2018

యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ స్థానంలో భారత ఉన్నత విద్యా కమిషన్‌ తీసుకురావాలని కేంద్రం ఆలోచనను విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు, విద్యారంగ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ యూనివర్సిటీలకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని... విద్యావ్యవస్థకు ఉన్న స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేదిగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ ఆలోచనను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే కర్నాటక తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని వారు తెలంగాణ సర్కార్‌ను కోరుతున్నారు. టెన్ టివి జనపథంలో ప్రసారమయిన ఈ కార్యక్రమం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:04 - July 9, 2018

ఢిల్లీ : మూడో టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా అద్భుత విజయం సాధించింది. మన క్రికెటర్లు అద్భుతమైన ఆటతీరుతో ఇంగ్లండ్‌ క్రికెటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ చిత్తైంది. దీంతో 2-1 తేడాతో టీ 20 సిరీస్‌ను ఇండియా గెల్చుకుంది. రోహిత్ శర్మ, హార్థిక్ అద్భుతమైన ఆటతీరుతో భారత్‌కు విజయం తెచ్చిపెట్టారు. ఇంగ్లండ్ క్రికెటర్లను మనవాళ్ళు ముచ్చెమటలు పట్టించారు. భారత జట్టు వరుసగా ఆరు అంతర్జాతీయ టీ-20 సిరీస్‌లు, మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీసులు ఎనిమిది కైవసం చేసుకుంది.

టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 199 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో జేసన్ రాయ్ 67, బట్లర్ 34, హేల్స్ 30 పరుగులు చేశారు.

200 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన టీమ్‌ ఇండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ విల్లీ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి శిఖర్ ధవన్ ఔట్ అయ్యాడు. తర్వాత కేఎల్ రాహుల్ 19 పరుగులకు ఔట్ అయ్యాడు. ఈ దశలో రోహిత్, విరాట్‌లు జట్టుకు అండగా నిలిచారు. 3వ వికెట్‌కి 89 పరుగులు జోడించిన వీరిద్దరు... స్కోర్ బోర్డును పరుగులు తీయించారు. 43 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ జోర్డన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌ చేసిన హార్థిక్‌తో కలిసి రోహిత్ చెలరేగిపోయాడు. 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులు కొట్టాడు. మొత్తానికి 100 పరుగులతో జట్టు విజయానికి కీలకంగా వ్యవహరించాడు. హార్థిక్ 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు తీశాడు. దీంతో టీమ్‌ ఇండియా 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. మ్యాచ్‌ను 7 వికెట్ల తేడాతో గెలిచి... సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో మొత్తం 137 పరుగులు చేసిన రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. 

07:02 - July 9, 2018

సంగారెడ్డి : పారిశ్రామికంగా తమ ప్రాంతం అభివృద్ధి కావాలనే కోరుకుంటారు ప్రతి ఒక్కరూ.. దానివల్ల ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆశిస్తారు. కానీ.. అవే పరిశ్రమలు తమకు ప్రాణాంతకంగా మారాయని ఆవేదన చెందుతున్నారంటే.. అంతకంటే విషాదం వేరే ఉండదు. సంగారెడ్డి జిల్లా మండల ప్రజలు ఇప్పుడు అలాంటి దుస్థితిలోనే జీవిస్తున్నారు.. ఇంతకీ వారు పరిశ్రమల వల్ల పడుతున్న బాధలేంటో ఓ సారి చూద్దాం.. మీరు చూస్తోంది కోహీర్‌ మండలం గద్వాల్‌లోని పిరామిల్‌ హెల్త్‌ కేర్‌ పరిశ్రమ. ఈ పరిశ్రమ వెదజల్లే కాలుష్యంతో చిలికేపల్లి, కవేలి, చింతల్‌ఘాట్, అనంతసార్, చిలమామిడి గ్రామాల ప్రజల జీవనం దుర్భరంగా మారింది. జల, వాయు కాలుష్యంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయ్యాయి. ఎక్కడ బోర్లేసినా.. తాగడానికి పనికి రాని నీరే వస్తోంది.. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

పరిశ్రమనుంచి వచ్చే వ్యర్థ జలాలను భూమిలోకి ఇంకిపోయేలా చేయడం వల్లే ప్రజలకు జీవనం అస్తవ్యస్తంగా మారింది. గత ఇరవై ఏళ్ళుగా కాలుష్య విధ్వంసంతో ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఇది చాలదన్నట్లు ఈ పరిశ్రమ విస్తరణకు పూనుకున్నట్లు తెలుస్తోంది. విస్తరణకు ప్రభుత్వం అనుమతిస్తే.. మా జీవితాలు మరింత దుర్భరంగా మారతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కలుషిత గాలితో ప్రజలు శ్వాస కోశ వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో ఊర్లు ఖాళీ చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక తాగడానికి మంచినీరే కరువైంది. ఇలా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎలా జీవించాలంటూ ప్రశ్నిస్తున్నారు స్థానికులు. విపరీతంగా కాలుష్యం వ్యాపిస్తున్నా.. స్పందించని అధికారులపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..

పరిశ్రమల యాజమాన్యాల దృష్టి వార్షిక ఉత్పత్తి పెంచుకోవడం, లాభాలను గడించడంపైనే తప్ప అక్కడి ప్రజల జీవన స్థితిగతుల గురించి పట్టించుకోవడంలేదు. పైగా పరిశ్రమల విస్తరణకు పూనుకుంటున్నారు. ఇలాగైతే మా బతుకులేం కావాలని నిలదీస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడాలి కానీ... వారి జీవితాలే ప్రమాదంలో పడటం చాలా విషాదం. స్వలాభం మాత్రమే ఆశించే యాజమాన్యాలు, ఆగమేఘాలమీద అనుమతులిచ్చే అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల బాగోగులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

07:00 - July 9, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ జనజాగృతి కార్యక్రమాన్ని చేపట్టింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలోని తెలుగుదేశం నేతలు ఈ కార్యక్రమం చేపట్టారు. ముందుగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజవర్గానికి చెందిన నేతలు ప్రజలతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులపై పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నేతల జనజాగృతి కార్యక్రమం చేపట్టారు. నరసాపురం లోక్‌సభ నియోకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు చెందిన పార్టీ నేతలు ప్రజలతో కలిసి పోలవరం బాట పట్టారు. ముందుగా తాడేపల్లిగూడెంకు చెందిన నాయకులు ప్రాజెక్టును సందర్శించారు. విద్యార్థులు కూడా దీనిలో భాగస్వాములయ్యారు. 86 బస్సులు, 50 కార్లలో రెండువేల మందికిపైగా రైతులతో కలిసి వచ్చి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. గోదావరికి జలహారతి ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనులపై టీడీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేయడం మానుకుని జరుగుతున్న పనులను పరిశీలించాలని కోరారు.

పోలవరంపై ప్రజల్లో అపోహలు పెంచే విధంగా ప్రతిపక్షాలు విమర్శలు చేసే బదులు వాస్తవిక ధృక్పదంతో వ్యవహరించాలని టీడీపీ నాయకులు కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను టీడీపీ నాయకులు తిప్పికొట్టారు. టీడీపీ ఎంపీ సీతారామలక్ష్మి, చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్ల టీడీపీ నేతలు ప్రజలతో కలిసి ప్రాజెక్టును సందర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

06:59 - July 9, 2018

ఢిల్లీ : అమెరికాలో దుండగుల దుశ్చర్యకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. దొంగతనాన్ని అడ్డుకోబోయినందుకు శరత్‌ అనే విద్యార్థిని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటనను దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు.. తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మరోవైపు కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని పట్టిస్తే 10 వేల డాలర్లు ఇస్తామని అమెరికా పోలీసులు ప్రకటించారు. అమెరికా కన్సాస్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఓ దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న తెలంగాణ విద్యార్థి శరత్‌ ప్రతిఘటించినందుకు ఆ దొంగ ఐదు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనలో శరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే రెస్టారెంట్‌లో నమోదైన హంతకుని సీసీ ఫుటేజ్‌ను కన్సాస్‌ పోలీసులు విడుదల చేశారు. హంతకున్ని వివరాలు తెలిపిన వారికి 10 వేల అమెరికా డాలర్లు ఇస్తామని ప్రకటించారు.

శరత్‌ స్వస్థలం వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌. తండ్రి రామ్మోహన్‌ హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగి. తల్లి మాలతి వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో పంచాయతీరాజ్‌ శాఖలో ఈవోఆర్డీగా పనిచేస్తున్నారు. రామ్మోహన్‌.. కుటుంబంతో హైదరాబాద్‌ అమీర్‌పేటలోని ధరంకరం రోడ్డులో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన శరత్‌ హైదరాబాద్‌లోనే మూడేళ్లపాటు ఉద్యోగం చేశాడు. ఎంఎస్‌ చేసేందుకు ఆరు నెలల కిందట అమెరికా వెళ్లాడు. మిస్సోరి యూనివర్సిటీలో చదువుకుంటూనే కన్సాస్‌ నగరం ప్రాస్పెక్ట్స్‌ అవెన్యూలోని జేఎస్‌ ఫిష్‌ అండ్‌ చికెన్‌ మార్కెట్‌ అనే ఓ హోటల్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

రెస్టారెంట్‌ యజమాని షాహిద్ తెలిపిన వివరాల ప్రకారం రెస్టారెంట్‌లో ఐదుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఓ గుర్తుతెలియని వ్యక్తి లోపలికి వచ్చాడు. అతడిని చూడగానే అక్కడున్నవారంత భయపడ్డారు. ఆవ్యక్తి వెంటనే గన్‌ బయటికి తీసి అందరినీ బెదిరించాడు. అయితే అతడిని శరత్‌ అడ్డుకున్నాడు. శరత్‌ను యజమాని వారించే సరికి దుండగుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు . కానీ ఆ వ్యక్తి శరత్‌పై కాల్పులు జరిపాడు. శరత్‌ వెనకవైపు బలంగా తూటాలు తగిలాయి. దీంతో అక్కడే అతడు కుప్ప కూలిపోయాడు. పోలీసులకు కాల్‌ చేసేలోపే దుండగుడు పారిపోయాడు రెస్టారెంట్‌ యజమాని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శరత్‌ మృతి చెందినట్లు స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.

అమెరికాలో శరత్‌ హత్యకు గురైయ్యాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. శరత్‌ కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పరామర్శించారు. త్వరలోనే శరత్‌ భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని మంత్రులు తెలిపారు. శరత్‌ మృతిపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ ద్వారా శరత్‌ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అన్నివిధాలా సాయం చేస్తామని సుష్మా స్వరాజ్‌ ప్రకటించారు. 

06:58 - July 9, 2018

విజయవాడ : ఓటమి భయంతోనే చంద్రబాబు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ రావడం బాబుకు ఇష్టం లేదని ఆయన మండిపడ్డారు. బాబుకు ధన, భూ దాహం పట్టుకుందని అందుకే డాట్‌ భూముల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చాడని ఆరోపించారు. బురదలో కూరుకు పోయిన బాబు మాకు బురద అంటించే ప్రయాత్నాలు మానుకోవాలని హితవు పలికారు.

జగన్ 209వ రోజు...

తూర్పుగోదావరి : వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. 209వ రోజు మండపేట నియోజకవర్గంలో పాదయాత్ర జరుగనుంది. సోమేశ్వరం, సీతమ్మతోట, లోళ్ల, రాయవరం గుండా కొనసాగనుంది. సాయంత్రం రాయవరంలో జగన్ బహిరంగసభ జరుగనుంది. 

హైదరాబాద్ కు పవన్...

హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు రానున్నారు. సోమవారం గచ్చిబౌలిలో మధ్యాహ్నం 3.30గంటలకు పవన్ సమక్షంలో అభిమాన సంఘాలు చేరనున్నాయి. 

సిక్కోలుకు గవర్నర్...

శ్రీకాకుళం : జిల్లాలో గవర్నర్ నరసింహన్ పర్యటించనున్నారు. సోమ, మంగళవారాల్లో ఆయన ఇక్కడే ఉండనున్నారు. అంబేద్కర్ వర్సిటీలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో గవర్నర్ పాల్గొననున్నారు. 

రాయ్ పూర్ లో గౌడోన్ లో ప్రమాదం...

ఛత్తీస్ గఢ్ : రాయ్ పూర్ లోని ఓ గౌడోన్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.

టి.మంత్రివర్గ సమావేశం వాయిదా..

హైదరాబాద్ : రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. మంత్రులను తమ సొంత జిల్లాలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషికి ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. 

శరత్ మృతిపై సుష్మా విచారం...

ఢిల్లీ : అమెరికాలో శరత్‌ మృతిపై కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ ద్వారా శరత్‌ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అన్నివిధాలా సాయం చేస్తామని సుష్మా స్వరాజ్‌ ప్రకటించారు.

మహిళా రైతు ఉసురు తీసిన సర్వే పనులు...

మెదక్ : కాళేశ్వరం ప్రాజెక్టు కొండపోచమ్మ కాల్వ సర్వే పనులు ఓ మహిళా రైతు ఉసురు తీశాయి. సర్వేలో భూమి పోతోందన్న తేలడంతో మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్‌కు చెందిన మహిళా రైతు బూదమ్మ పోలంలోనే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి అక్కడే కుప్పకూలి పడిపోయారు. ఆ తర్వాత పొలంలోనే ప్రాణం విడిచింది.

ఏడుగురు చిన్నారుల కోసం గాలింపు...

ఢిల్లీ : ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించింది. 9 రోజుల పాటు బిక్కుబిక్కు మంటూ గడపిన చిన్నారుల్లో ఆరుగురిని గుహ నుండి బయటకు తీసుకురాగలిగారు. థాయ్‌లాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహలో చిక్కుకున్న చిన్నారుల రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. మిగిలిన ఏడుగురు చిన్నారులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

భారత్ దే టి 20 సిరీస్...

ఢిల్లీ : భారత్-ఇంగ్లాడ్‌ మూడో టీ-20లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్స్‌ భారత్‌ ముందు 199 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు జాసన్‌రాయ్‌, జోస్‌ బట్లర్‌ శుభారంభాన్ని అందించారు. రాయ్‌ భారీ సిక్సర్లు, బౌండరీలతో చెలరేగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ టీంలో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. రోహిత్ 100 పరుగులు సాధించాడు. 8 బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 

Don't Miss