Activities calendar

10 July 2018

21:52 - July 10, 2018

హైదరాబాద్ : కత్తి మహేష్‌ను నగర బహిష్కరణ చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర నాయకులు నంద్యాల నర్సింహారెడ్డితో పాటు.. దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. కత్తి మహేష్‌పై నగర బహిష్కరణ వేటు ఎత్తివేయాలని వక్తలంతా డిమాండ్‌ చేశారు. కత్తి మహేష్‌ను నగర బహిష్కరణ చేయడమంటే... యావత్తు దళితులందర్నీ బహిష్కరణ చేసినట్లేనని అభిప్రాయపడ్డారు. కొందరు రాజకీయ స్వార్ధం కోసం.. ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడడం సరైనది కాదని వెంటనే కత్తి మహేష్‌ నగర బహిష్కరణ వేటును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

21:48 - July 10, 2018

కరీంనగర్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ పనులపై ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంపై ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్షించారు. సమీక్షకు హాజరైన ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, కొప్పులు ఈశ్వర్‌, రసమయి బాల్‌కిషన్‌, శోభ.. మిషన్‌ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో అధికారుల తీరుపై మంత్రి ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు

21:42 - July 10, 2018

జగిత్యాల : తెలంగాణలో రాజకీయ చీకటి ఒప్పందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అధికారం కోసం.. అడ్డదారులు తొక్కిన నేతల గుట్టు రట్టవుతోంది. అవిశ్వాస తీర్మానాల నేపథ్యంలో.. కొత్త కొత్త వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. పదవి కోసం డబ్బులు చేతులు మారిన వైనం ఒకటి.. జగిత్యాల జిల్లాలో బయటపడింది. ఆ కథాకమామిషు ఏంటో ఓసారి చూద్దాం...
వెలుగుచూసిన నాలుగేళ్లనాటి చీకటి ఒప్పందం
జగిత్యాల జిల్లాలో నాలుగేళ్ల నాటి చీకటి ఒప్పందం ఒకటి బయటపడింది. అధికారం పొందడమే పరమావధిగా సాగిన డబ్బుల పందేరం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం.. కథలాపూర్‌ ఎంపీపీ పదవి కోసం.. తోటనర్సు.. ఎంపీటీసీకి నాలుగు లక్షల రూపాయలు చెల్లించారు. దీనికి సంబంధించి ఓ అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారు. ఎంపీపీ తోటనర్సుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో.. నాలుగేళ్లనాటి చీకటి ఒప్పందం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన బాండ్‌ పేపర్‌ ఇప్పుడు జిల్లాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఎంపీటీసీలకు భారీగా నగదు పంపిణీ..
జగిత్యాల జిల్లా కథలాపూర్‌లోని 13 ఎంపీటీసీ స్థానాలకు గాను.. బీజేపీ, టీఆర్ఎస్‌లు చెరి ఐదు స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్‌ మూడింట గెలిచింది. దీంతో కాంగ్రెస్‌కు చెందిన పోతారం ఎంపీటీసీ తోట నర్సు.. బీజేపీ మద్దతును కోరారు. ప్రతిగా.. వారికి భారీ మొత్తాన్ని ముట్టజెప్పారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన దులూరు ఎంపీటీసీ సౌజన్య భర్త గంగాధర్‌.. తోటనర్సుకు మద్దతిచ్చేందుకు నాలుగు లక్షలు తీసుకున్నారు. ఒకవేళ మధ్యలో మద్దతు విరమిస్తే.. 20 లక్షల రూపాయలు చెల్లిస్తానంటూ బాండ్ పేపర్‌ మీద రాసి మరీ సంతకం పెట్టారు. 2014 మే 14వ తేదీన ఈ ఒప్పందంపై సంతకాలు పెట్టారు

చర్చనీయాంశంగా మారిన అవిశ్వాస తీర్మానం
వివిధ కారణాల వల్ల.. బీజేపీ, టీఆర్ఎస్‌ ఎంపీటీసీలు.. ఎంపీపీ తోట నర్సుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో తోట నర్సు వర్గం.. ఎంపీటీసీ కుందారపు సౌజన్య భర్తను బహిరంగంగా.. గ్రామం మధ్యలోనే నిలదీయడం చర్చనీయాంశమైంది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు.. తమకు 20 లక్షలు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. దీనికి గంగాధర్‌ రెండు రోజులు గడువు కోరారు. ఎంపీపీ పదవి కోసం.. లక్షల రూపాయలు చేతులు మారడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం జగిత్యాల జిల్లా చర్చనీయాంశంగా మారింది.

21:35 - July 10, 2018

అమరావతి : ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. ప్రజాక్షేత్రంలోకి ద్విముఖ వ్యూహంతో వెళ్లాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అన్ని జిల్లాల్లో ధర్మపోరాట దీక్షలు.. అన్ని నియోజకవర్గాల్లో లోకేశ్‌ పర్యటనలు చేపట్టాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే 80 నియోజకవర్గాల్లో పర్యటించిన లోకేశ్‌ను.. మిగిలిన 90 నియోజకవర్గాల్లోనూ పర్యటించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఎన్నికల ముంగిట్లో టీడీపీ ద్విముఖ వ్యూహం
సాధారణ ఎన్నికలకు ఇక పది నెలల గడువే ఉంది. తరుణం తరుముకొస్తుండడంతో.. ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట ప్రజల మధ్య ఉన్నారు. జనసేనాని పవన్‌ కూడా ప్రజాక్షేత్రంలో గడుపుతున్నారు. పాలక టీడీపీ కూడా ప్రజలను పార్టీ వైపు ఆకర్షించడంతో పాటు.. క్యాడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేసే ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కీలక భూమిక పోషించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

నారా లోకేశ్‌కు నియోజకవర్గాల పర్యటనల బాధ్యత
పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 80 నియోజకవర్గాల్లో పర్యటించారు. మిగిలిన 90 నియోజకవర్గాల్లోనూ.. వారానికి మూడు, నాలుగు నియోజకవర్గాలు పర్యటించేలా షెడ్యూల్‌ చేశారు. లోకేశ్‌, ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో పాటు.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నారు.

లోకేశ్‌కు.. కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యత
పర్యటించిన ప్రతి చోటా.. విపక్షాలపై విసుర్లతో పాటు.. చంద్రబాబును మరోసారి ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రతిరోజూ పగలంతా సచివాలయంలో సమీక్షలు.. సాయంత్రానికి నివాసంలో పార్టీపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ప్రతి రోజూ భేటీ అవుతూ.. చంద్రబాబు.... నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రజలతో మమేకమయ్యే బాధ్యతను లోకేశ్‌ తీసుకున్నారు. జగన్‌, పవన్‌లు ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా సాగిస్తున్న ప్రచారానికి ప్రజాక్షేత్రంలోనే దీటుగా బదులివ్వాలని లోకేశ్‌ భావిస్తున్నారు.

ఇకపై నెలకు రెండు చొప్పున ధర్మపోరాట దీక్షలు
మరోవైపు.. ఎన్నికల వరకూ ధర్మపోరాట దీక్ష సభలు నిర్వహించాలని కూడా టీడీపీ భావిస్తోంది. ఇప్పటివరకూ తిరుపతి, విశాఖ, కాకినాడల్లోనే ధర్మపోరాట సభలు నిర్వహించారు. మిగిలిన పది జిల్లాల్లోనూ నెలకి రెండు చొప్పున సభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ధర్మపోరాట దీక్షలు, నియోజకవర్గాల పర్యటనల ద్వారా క్యాడర్‌లో జోష్ నింపాలన్న ఆలోచనతో హైకమాండ్‌ కార్యక్రమాలు రూపొందిస్తోంది. మొత్తానికి పది నెలల ముందే.. రాష్ట్రంలో.. ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. 

21:29 - July 10, 2018

నల్లగొండ : కాంగ్రెస్‌ పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లా సర్వనాశమైందని మున్సిపల్‌ పరిపాలన శాఖ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కనీసం రోడ్లను కూడా అభివృద్ధి చేయలేకపోయారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా నుంచి వచ్చిన వివిధ పార్టీల కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన అందరికీ మంత్రి కేటీఆర్‌ గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన నల్గొండ జిల్లా అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల ఏడాదితో కాంగ్రెస్‌ నేతలు మాటల గారడీతో మరోసారి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇస్తున్న రైతు రుణమాఫీ అంశాన్ని కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. 

21:24 - July 10, 2018

అమరావతి : ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి ఎండగట్టేందుకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సిద్ధమవుతోంది. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ ఎంపీలు సమాయత్తమవుతున్నారు. ఈనెల 12న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ఈసారైనా పార్లమెంటు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఎంపీలకు లేఖ రాశారు. look.

పార్లమెంట్ వ్యూహాలపై చంద్రబాబు అధ్యక్షతన భేటీ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 10 వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చర్చించేందుకు ఈనెల 12న చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు.

జమిలి ఎన్నికలకు టీడీపీ వ్యతిరేకం
అవసరమైతే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశంపై టీడీపీపీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. లోక్‌సభతోపాటే శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను టీడీపీ వ్యతిరేకించింది. ఈ అంశంపై రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయం సేకరిస్తున్న లా కమిషన్‌కు ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. టీడీపీపీ భేటీలో దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో కమలనాథులకు వ్యతిరేక పవనవాలు వీస్తున్నాయన్న అభిప్రాయంతో టీడీపీ ఉంది. దీనిని అధిగమించేందుకే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెస్తోందన్న వాదాన్ని తెలుగుదేశం నాయకులు లేవనెత్తుతున్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ ప్రయోగాలు విఫలమయ్యాయన్న అభిప్రాయంతో టీడీపీ ఉంది. ఈ రెండు అంశాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు... బీజేపీపై వ్యతిరేకతతో ఉన్నారన్నది టీడీపీ వాదన. వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రధాని మోదీ జమిలి ఎన్నికలను ముందుకు తెచ్చారని టీడీపీ నాయకులు మండిపడ్డుతున్నారు.

కడప స్టీల్‌ ప్లాంట్‌పై ఈనెల 23 రాష్ట్రపతితో భేటీ
కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం పార్లమెంటు వేదికగా పోరాటాన్ని ఉధృతం చేయాలని ప్రతిపాదించిన టీడీపీ... ఇదే అంశంపై అఖిపలక్షంతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ని కలవాలని నిర్ణయించింది. కడప జిల్లాకు చెందిన అఖిలపక్ష బృందంతో ఈనెల 23న రాష్ట్రపతితో భేటీ అవుతారు. మరోవైపు పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగనివ్వాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఎంపీలకు లేఖ రాశారు. టీడీపీ, వైపీసీ ఎంపీల ఆందోళనతో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఏ అంశంపైనా చర్చించకుండానే తుడిపెట్టుకుపోయిన నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ ఈ లేఖ రాశారు. సభ సజావుగా జరిగే విధంగా చూడటం ఎంపీల నైతిక బాధ్యత అన్న విషయాన్ని సుమిత్రా మహాజన్‌ గుర్తు చేశారు. పవిత్రమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంపీలందరిపైనా ఉందన్నారు. ఎంపీల పనితీరును ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారన్న అంశాన్ని ప్రస్తావించారు. ఎంపీలు రాజకీయ వివాదాలను నియోజకవర్గాలకు పరిమితంచేసి... పార్లమెంటులో ప్రజాస్వామ్యబద్ధంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సుమిత్రా మహాజన్‌ తన లేఖలో కోరారు. 

21:20 - July 10, 2018

ఢిల్లీ : ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. వాణిజ్య సంస్కరణలు, కార్యాచరణ ప్రణాళికల ఆధారంగా ప్రకటించిన జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌ వన్‌గా నిలువగా.. తెలంగాణ రెండో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో హర్యానా, జార్ఖండ్‌, గుజరాత్‌లు నిలిచాయి.
తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్‌,రెండో స్థానంలో తెలంగాణ
ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులను కేంద్రం ప్రకటించింది. వాణిజ్య సంస్కరణలు, కార్యాచరణ ప్రణాళిలక ఆధారంగా రూపొందించిన ఈ ర్యాంకుల జాబితాను డీఐపీపీ కార్యదర్శి రమేష్‌ అభిషేక్‌ ప్రకటించారు. ఈ జాబితాలో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. రెండోస్థానంలో తెలంగాణ, మూడో స్థానంలో హర్యానా, నాలుగో స్థానంలో జార్ఖండ్‌, ఐదో స్థానంలో గుజరాత్‌ రాష్ట్రాలు నిలిచాయి. మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ 98.42 శాతం స్కోర్‌ సాధించగా.. రెండో స్థానంలో ఉన్న తెలంగాణ 98.33 శాతం స్కోర్‌ సాధించింది.

టాప్‌ అచీవర్స్‌గా 95 శాతం పైబడి సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలు
డూయింగ్‌ ఆఫ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో ఆయా రాష్ట్రాలను నాలుగు విభాగాలుగా కేంద్రం గుర్తించింది. 95 శాతం పైబడి సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను టాప్‌ అచీవర్స్‌గా, 90 నుంచి 95 శాతం మేర సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను అచీవర్స్‌గా... 80 నుంచి 90 శాతం మేర సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలను ఫాస్ట్‌ మూవర్స్‌గా... 80 శాతం లోపు సంస్కరణలను అమలు చేసిన రాష్ట్రాలను ఆస్పైరర్స్‌గా గుర్తించారు. ఈ సంస్కరణలను వంద శాతం సాధించిన రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, జార్ఖండ్‌, గుజరాత్‌లు నిలిచాయి.

టాప్‌ అచీవర్స్‌ జాబితాలో 9 రాష్ట్రాలు
అయితే... టాప్‌ అచీవర్స్‌ జాబితాలో 9 రాష్ట్రాలు, అచీవర్స్‌ జాబితాల్లో ఆరు, ఫాస్ట్‌ మూవర్స్‌ జాబితాలో మూడు, ఆస్పైరర్స్‌ జాబితాలో 18 రాష్ట్రాలు నిలిచాయి. మరోవైపు సంస్కరణల అమలు స్కోర్‌లో ఎక్కువ పురోగతి సాధించిన రాష్ట్రాల జాబితాలో అసోం, తమిళనాడులకు చోటు లభించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌,.. నిర్మాణరంగ అనుమతుల్లో రాజస్థాన్‌,.. కార్మిక చట్టాల్లో పశ్చిమబెంగాల్‌,.. పర్యావరణ రిజిస్ట్రేషన్లలో కర్ణాటక,.. భూమి లభ్యతలో ఉత్తరాఖండ్‌,.. పన్నుల చెల్లింపులో ఒడిశా... పర్యవేక్షణ అమలులో మధ్యప్రదేశ్‌... ఐటీ పారదర్శకతలో మహారాష్ట్ర వంద శాతం స్కోర్లు సాధించాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో దేశంలోనే తెలుగు రాష్ట్రాలు టాప్‌గా నిలవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

టీడీపీ బైటకొచ్చాక ఎన్డీయే హవా తగ్గింది : మంత్రి ఆనందబాబు

అమరావతి : ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడం వల్లే నరేంద్రమోదీ హవాకు బ్రేక్ పడిందని మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు పోటీకి ముఖం చాటేస్తే, కన్నా లక్ష్మీనారాయణ మాత్రం బరిలో దిగారన్నారు. కన్నా లక్ష్మీనారాయణ యాత్ర సందర్భంగా ప్రతి చోటా గొడవలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హమీలను మరిచిందనే కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనీ అవి వ్యక్తిగత నిరసనలు కావని, బీజేపీ తీరుపై ఆగ్రహానికి నిదర్శనమని అన్నారు.

అవినీతిని కాపాడుకునేందుకే కన్నా బీజేపీలోకి : నక్కా

అమరావతి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన అవినీతిని కాపాడుకోడానికే కాషాయ పార్టీలో చేరారని మంత్రి నక్కా అనందబాబు విమర్శించారు. కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుతారంటూ కొందరు రాత్రికి రాత్రి ప్లేక్సీలు ఏర్పాటు చేశారన్నారు. మరుసటి రోజు ఉదయం అదే వ్యక్తుల పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాకు అభినందనలు అంటూ కొత్త ప్లెక్సీలు వెలిశాయన్నారు. గత ఎన్నికలకు ముందు కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం పదవి నుంచి తొలగిస్తే, తనకు ఆ అవకాశమివ్వాలంటూ ఆనాడు ఢిల్లీలో కన్నా లక్ష్మీనారాయణ ప్రదక్షిణలు చేశారని నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు

20:35 - July 10, 2018

తమ సమస్యలు పరిష్కరించాలంటు ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా జూలై 11న మహాధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఉపాధ్యాయులను స్కూల్స్ , నివాసాల వద్ద ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని వారి ఆందోళనను అడ్డుకునేందుకు సిద్ధమయ్యింది. అసలు ఉపాధ్యాయుల సమస్యలేమిటి? ఎందుకు వారు ఆందోళన బాట పట్టాల్సివచ్చింది అనే అంశంపై చర్చ. ఈ చర్చలో ఉపాధ్యా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి పాల్గొన్నారు

20:26 - July 10, 2018

టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కార్యకర్తలు చింపిన ఇస్తరాకే అయితున్నదిగదా..? మొన్న బెల్లంపల్లి కాడ అవిశ్వాస తీర్మానం.. నిన్న రామగుండం కాడ... ఇయ్యాళ వేములవాడ కాడ.. వాళ్లదాంట్లె వాళ్లే విశ్వాసాలు లేకుంట బత్కుతున్నరు.. ఇంకో నాల్గురోజులు ఇదే స్పీడుతోని అంబాసిడర్ ముంగటికి వొయ్యెనాంటే.. కాంగ్రెసోళ్లు పెద్దగ కష్టపడవల్సిన పనేం ఉండదేమో..

నక్కవుట్టి నాల్గు రోజులు గాలే నా ఎక్సుపీరియన్సు ఎవ్వలికున్నదని ఎక్కిరిచ్చిందట అగో అట్లనే ఉన్నది.. చంద్రాలు కొడ్కు లోకేశం ముచ్చట గూడ.. నేను వుట్టెటప్పటికే మా తాత ముఖ్యమంత్రిగుండే.. నేను శెడ్డి ఏస్కోని బడికి వొయ్యెతప్పుడే మా నాయిన ముఖ్యమంత్రిగుండే.. అయినా నా మీద గింత అవినీతి మచ్చవడ్డదా అంటున్నడు..

నాల్గురు బీసీ పోరగాళ్లు ఒక్కతాన గూడి.. టూ బై ఫోర్ చాయజెప్పి.. పైసలు నువ్వుగట్టుమంటే నువ్వుగట్టుమని.. అద్దగంట ముచ్చట వెట్టుకోని రేపు పొద్దుగాళ్ల వర్కళ్ల రాజ్యాధికారం ఎట్లొస్తదని ఆలోచన జేశి ప్రెస్ మీటింగు వెట్టి ఎవ్వలికి వాళ్లు ఎల్లిపోవుడు.. తర్వాత ఇదే నాల్గురు మళ్లొక నెల రోజులకు గూడి మళ్ల చాయి మళ్ల ప్రెస్ మీటు.. మళ్ల ఎవ్వలింటికి వాళ్లు.. గిదా రాజ్యాధికారం సాధించే కథ..?

మాటలు జెప్పుమంటే ఏమన్న మాటలా అవ్వి.. గా మూడేండ్ల కింద నారాయణ ఖేడ్ ఉప ఎన్నికైందిగదా.?. ఆ ఉపఎన్నికలకోసం ప్రచారానికి వొయ్యిండు కేసీఆర్ అల్లుడు హరీష్ రావు.. పొయ్యి ఆ నియోజకవర్గాన్ని సూశి వైసు కన్నీళ్లు గార్చిండు.. ఇగ ఒక ఊరికి వొయ్యి ఈ ఊరిని నేను దత్తత దీస్కుంటున్నాని చెప్పిండు.. ఓట్లువడంగనే ఊరులేదు గీరు లేదు.. దత్తత గాదు సారే పత్తకు లేడు.. పాపం ఆఊరిగోస జూడుండ్రి..

చట్టాలను ఉల్లంఘించెటోళ్లు మీద కేసులు వెట్టి జైలుకు తోలిస్తున్నప్పుడు.. మరి విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించి విద్యార్థులను సద్వుకు దూరం జేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీద.. విద్యామంత్రి కడియం శ్రీహరి మీద గూడ కేసులు వెట్టి జైలుకు వంపాలేగదా... నెల రోజులాయే బడులు సుర్వై.. ఇప్పటికి ఒక్కసారి వచ్చింది లేదు పాఠం జెప్పింది లేదు.. ఇగ మరి ఇది చట్టం ఉల్లంఘన కిందికి రాదా..?

అంగట్ల పశులను కొన్నట్టే ఉన్నది ఎంపీటీసీల కొనుగోలు తెలంగాణల.. ఎవ్వని బర్రైతేంది మన దొడ్లె పెండవెట్టిందా లేదా అన్నట్టే సూస్కుంటున్నరు.. ఒక్కొక్క ఎంపీటీసీకి నాల్గు లక్షల రూపాలు ఖరీదు వెట్టి కొనుక్కున్నడంటే ఆ ఎంపీపీ ఎంత సంపాయించాలే.. మళ్ల మందిని ముంచాల్సిందేగదా.?. అమ్ముడువొయ్యే ఎంపీటీసీలకు శిగ్గులేదు.. కొనుక్కునెటోనికి గూడ లేదు.. జగిత్యాల జిల్లాల ఒక కథ బైటవడ్డది సూడుండ్రి..

తెలంగాణ రైతులకు ఆన్ లైన్ అంటె హార్ట్ ఫెయిల్ అయినంత భయమైతున్నది.. భూ ప్రక్షాళణ పేరు మీద వేల మంది రైతుల బత్కు ఆగానికొచ్చింది.. ఒకలి భూమి ఒకలికి వడి.. కొంతమందికి సంగం భూమే ఎక్కింది.. కొంతమందికి మొత్తం భూములే లేకుంట వొయ్యినయ్... ఆగమాగం చెందన చెందన అయ్యింది. నాకు తెల్చి ఒక్క కేసీఆర్ ఇంటోళ్ల భూములు తప్ప అందరియి ఆగమే ఉన్నట్టున్నయ్ కాదా మరి.. ఇగజూడుండ్రి..

ఎంకి పెండ్లి సుబ్బిసావుకొచ్చిట్టుగాదు.. సుబ్బి సావే ఎంకిపెండ్లికొచ్చినట్టుంది ఈ వానలు జూస్తుంటే.. పాపం ఆ మహారాష్ట్రల అడ్డగోల్గవానలు వడి.. అక్కడి జనం తక్లైవైతుంటే.. వానలు ఎప్పుడువడ్తయా అని ఎదురు సూస్తున్న తెలంగాణలకు మహారాష్ట్ర వర్దొస్తున్నది.. గోదావరి నది.. గట్టిగనే వారుతున్నది.. ఇగ మన కళల ప్రాజెక్టుల కట్కాలు ఏడికాడ ఆగిపోయినయట.. 

ఆరేళ్ల బాలికపై 60ఏళ్ల వ్యక్తి అత్యాచారం..

పశ్చిమగోదావరి : దెందులూరు మండలం సోమారప్పాడులో దారుణం జరిగింది. మనవరాలి వయస్సున్న ఓ చిన్నారిపై కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మానవ మృగం లైంగిక దాడికి పాల్పడిన సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునే చేసింది. మానవత్వం అనే మాటకు విలువ లేకుండా చేసింది. ఆరేళ్ల బాలికపై 60ఏళ్ల పశువు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో వున్న బాలికను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాలికను పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. 

20:11 - July 10, 2018

పేద విద్యార్థులకు కొంత శాతం మేర ఉచిత వైద్యం అందించాల్సిందేనని డిల్లీలో ప్రైవేటు ఆసుపత్రులకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఆసుపత్రుల నిర్మాణం కొరకు చౌక ధరకు ప్రభుత్వం నుంచి భూమిని పొంది సబ్సిడీలు కూడా పొందుతున్నారని.. కాబట్టి పేదలకు ఉచితంగా ట్రీట్ మెంట్ అందించాలి.. లీజు అగ్రిమెంట్ లో కూడా అది ఉంటుంది. ఇన్ పేషేంట్ విభాగంలో 10 శాతం, ఔట్ పేషేంట్ విభాగంలో 25 శాతం మేర ఉచిత వైద్యం అందించాల్సిందేనని చీప్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అలా ఉచితంగా ఇవ్వని ఆసుపత్రుల లీజు రద్దు చేస్తామని.. ప్రభుత్వం కూడా నిఘా పెట్టాలని ధర్మాసనం సూచించింది. దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది... లక్షలాది రూపాయిలు ఫీజులుగా లాగుతున్న కార్పోరెట్ ఆసుపత్రులు.. పేదల పట్ల మాత్రం నిర్దయ గా వ్యవహరిస్తున్న సందర్భాలు కొకొల్లలు.. ఈ నేపథ్యంలో ఇదెక్కడి కార్పొరేట్ అంశంపై టెన్ టీవీ ప్రత్యేక చర్చ. ఈ చర్చలో ప్రముఖ విశ్లేషకులు నగేశ్ కుమార్, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి,ప్రముఖ వైద్యులు గంగాధర్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. 

అలక వీడిన సోమారపు..

హైదరాబాద్ : రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎట్టకేలకు అలక వీడారు. మంత్రి కేటీఆర్ తో కలిసి తెంగాణ భవన్ లో జరిగిన అవిశ్వౄస తీర్మానం, ఎమ్మెల్యేల అలకపై చర్చా కార్యక్రమంలో సోమారపు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సోమారపుతో మాట్లాడారు. తిరిగి రాజకీయాల్లో కొనసాగాలని సోమారపుతో కేటీఆర్ కోరారు. దీంతో అలక వీడిన సోమారపు తిరిగి రాజకీయాల్లో కొనసాగేందుకు సమ్మతించారు. కాగా కొన్ని రోజుల క్రితం రామగుండం మేయర్‌ లక్ష్మీనారాయణపై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు కలెక్టర్‌కు ఇచ్చారు. అయితే..

19:47 - July 10, 2018

హైదరాబాద్ : జంటనగరాల్లో మరోరెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారి నాగరత్నం తెలిపారు. కొన్ని రోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. మూడు, నాలుగు రోజులుగా నగరంలో చిరుజల్లులతోపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఛత్తీస్‌ఘడ్‌, దానిని ఆనుకుని ఉన్న ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో 7కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికితోడు తూర్పు, పశ్చిమ జోన్‌లో సుమారుగా 19.0 డిగ్రీల వెంబడి 4.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య కొనసాగుతోందని, దీని ప్రభావంతో మరో రెండురోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా నగరంలో సోమవారం ఉదయం, రాత్రి సమయాల్లో ముసురుతో కూడిన చిరు జల్లులు కురిశాయి. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 26.3 డిగ్రీలు, కనిష్ఠంగా 22.3 డిగ్రీలుగా నమోదయినట్టు అధికారులు తెలిపారు.

19:43 - July 10, 2018

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉదయం నుంచి గ్రేటర్‌ ముంబై, థానె, రాయ్‌గడ్‌, పాల్‌ఘర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముంబైలో ఈరోజు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పాల్‌ఘర్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో 300 వందల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. రైల్వే ట్రాక్‌లపైనా నీళ్లు నిలిచిపోవడంతో 90 లోకల్‌ ట్రైన్‌లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ట్రాక్‌లపై నీళ్లు తగ్గేవరకు రైళ్లను నిలిపేస్తామని అధికారులు తెలిపారు. సెంట్రల్‌ రైల్వే సర్వీసులు యథావిధిగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. డబ్బావాలాలు కూడా తమ సేవలను నిలిపివేశారు. గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నేవీ సిబ్బందిని ప్రభుత్వం రంగంలోకి దింపింది.

19:40 - July 10, 2018

అమరావతి : వైసీపీ, బీజేపీ, జనసేన రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయని టీడీపీ ఆరోపించింది. ఈ పార్టీల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ తప్పుపట్టారు. ప్రజల సొమ్ము దోచుకోవడం జగన్‌కే అలవాటని విమర్శించారు. చంద్రబాబు అనుమతిస్తే గుంటూరులో కన్నాపై పోటీ చేస్తానన్నారు. జగన్‌పై తన కూతుర్ని పోటీకి పెడతానని చెప్పారు. పవన్‌కు ఒక్క సీటు కూడా రాదన్న జలీన్‌ ఖాన్‌.. జగన్‌కు డబుల్‌ డిజిట్‌ దాటుతుందో లేదో అన్న అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు చంద్రబాబును కోరుకుంటున్నారని జలీల్‌ ఖాన్‌ చెప్పారు. 

19:37 - July 10, 2018

హైదరాబాద్ : కత్తి మహేష్‌పై విధించిన నగర బహిష్కరణను డీజీపీ వెంటనే ఎత్తివేయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ డిమాండ్‌ చేశారు. ఇది నగర బహిష్కరణ కాదని.. కుల బహిష్కరణగానే తాము భావిస్తున్నామన్నారు. కత్తి మహేష్‌ వ్యాఖ్యలు భావ ప్రకటన స్వేచ్చను అధిగమించినట్లయితే... దళిత, గిరిజనులను అవమానిస్తూ వ్యాఖ్యానించిన వారిపై డీజీపీ చర్యలు తీసుకోగలరా ? అని మందకృష్ణ ప్రశ్నించారు. ఇక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కోసం ఆగస్టు 8న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో సింహగర్జన నిర్వహించనున్నట్లు మందకృష్ణ తెలిపారు. 

19:31 - July 10, 2018

కర్నూలు : కోవెలకుంట్లలో ఓ భార్య న్యాయం కోసం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తన భర్త నందకుమార్‌ వేరే పెళ్లి చేసుకుని.. తనను వదిలించుకునేందుకు యత్నిస్తున్నాడని అరుణ ఆవేదన వ్యక్తం చేసింది. తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె భర్త ఇంటి ముందు 8 నెలల బాలుడితో న్యాయపోరాటం చేస్తోంది. అరుణ ఆందోళన చేస్తుండడంతో అత్తింటివారు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. 

19:29 - July 10, 2018

సంగారెడ్డి : ఇటీవల కబడ్డీకి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభిస్తోంది. యువత కబడ్డీ క్రీడ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి కబడ్డీ జాతీయ జట్టుకు తెలుగు యువకుడు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. గత నెల దుబాయ్‌లో జరిగిన ఇండియన్‌ మాస్టర్స్‌ టోర్నీలో ఇరాన్‌పై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించి, కోచ్‌గా వ్యవహరించి.. సొంతగడ్డ సంగారెడ్డికి వచ్చిన శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం లభించింది. గత నెల దుబాయ్‌లో ఇండియన్‌ మాస్టర్‌ టోర్నీలో ఇరాన్‌పై జాతీయ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతు.. ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే యువత క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తారనీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాఠశాలలు, కాలేజీల్లో చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించాలన్నారు. క్రీడల పట్ల తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసమని జాతీయ కబడ్డీ జట్టు కోచ్ శ్రీనివాసరెడ్డి సూచించారు. 

19:23 - July 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యలు హైకోర్టు షాక్ ఇచ్చింది. సాంస్కృతిక సమాఖ్య నియమించిన 550 మంది కళాకారుల నియామకాలు పారదర్శకంగా లేవని తెలంగాణ సర్కార్ కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. మరోసారి నోటిషికేషన్ ఇచ్చి మళ్లీ నియామకాలను చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో ప్రకటన ఇచ్చి 3 నెలల్లో ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ రసమయి బాలకిషన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో పాల్గొన్న పలువురు కళాకారులకు న్యాయం జరగలేదంటు కొంతమంది కళాకారులు వేసిన పిటీషన్ పై విచారణ చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యలు ఆదేశాలు జారీ చేసింది. 

ఆత్మాహుతితో దద్దరిల్లిన ఆఫ్ఘన్..10మంది మృతి..

ఆప్ఘనిస్థాన్‌ : జలాలాబాద్ నగరం మరోసారి ఆత్మాహుతి దాడితో దద్దరిల్లింది. నాంగర్‌హర్‌ ప్రాంతంలో ఉదయం 10 గంటల సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 10 మంది పౌరులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఆత్మాహుతి దాడి ఘటనను రాష్ట్ర గవర్నర్ ప్రతినిధి అతాహుల్లా ధ్రువీకరించారు.

తామ్ లుయాంగ్‌ గుహ ఆపరేషన్ సక్సెస్..అంతా సురక్షితం..

థాయ్‌లాండ్‌ : థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత తామ్ లుయాంగ్‌ గుహ చూడడానికి వెళ్లి గుహలో చిక్కుకుపోయిన 12 మంది చిన్నారులు సహా వారి కోచ్‌ గుహ నుంచి క్షేమంగా బయటపడ్డారు. వారిని వెలికి తీసేందుకు చేపట్టిన ఆపరేషన్ పూర్తయింది. మొత్తం 13 మందిని సురక్షితంగా రక్షించినట్లు థాయ్ నేవీ సీల్స్ ధ్రువీకరించింది. ఆదివారం నలుగురు చిన్నారులను రక్షించి అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చిన రెస్క్యూ సిబ్బంది, సోమవారం మరో నలుగురిని బయటకు తీసుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నానికి గుహలో మిగిలిన నలుగురు చిన్నారులు, వారి కోచ్‌ను బయటకు తీసుకొచ్చారు. దీంతో ఆపరేషన్ పూర్తయింది.

సులభతర వాణిజ్య విధానంలో ఏపీకి ప్రథమస్థానం..

అమరావతి : సులభతర వాణిజ్య విధానంలో తెలుగు రాష్ట్రాలు మరోసారి సత్తా చాటాయి. దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానం దక్కించుకుంది. ఈరోజు ఢిల్లీలో డీఐపీపీ కార్యదర్శి రమేశ్‌ అభిషేక్‌ ఈ ర్యాంకులను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల తరువాతి స్థానాల్లో వరుసగా హర్యానా, జార్ఖండ్‌, గుజరాత్‌, చత్తీస్‌గఢ్‌, మధ్య ప్రదేశ్‌, కర్ణాటక ఉన్నాయి. గత ఏడాది ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఒకే రకంగా స్కోరు సాధించి ఇరు రాష్ట్రాలు అగ్రస్థానాన్ని పంచుకున్న విషయం తెలిసిందే.  

18:12 - July 10, 2018

అమరావతి : కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రంలో కష్టాలున్నా ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి, దూరదృష్టితో రాష్ట్రంలో ముందుకెళుతున్నామని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. కానీ కష్టాల్లో వున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబుపై విమర్శలు చేయటం తప్ప జగన్ ఏం చేస్తున్నాడని ఆనందబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్డాకు నీరిచ్చి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి..పోలవరం ప్రాజెక్టు కోసం అహర్నిశలు కష్టపడి నిరంతరం పరిశీలిస్తు పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి పనులు విపక్ష వైసీపీ నాయకుడికి కనిపించటంలేదనా ప్రశ్నించారు. అనంతపురంలో పెరిగిన భూగర్భ జలాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలతో అభివృద్ధితో కొనసాగుతున్న ప్రభుత్వానికి సహకరించకుండా అర్థం పర్థం లేని విమర్శలు చేయటం తప్ప జగన్ కు ఇంకేమీ అవగాహ లేదని విమర్శించారు. 

17:56 - July 10, 2018

తూర్పుగోదావరి : గోదావరి జిల్లాలో గ్యాస్ వాయువులు లీక్ అవ్వటం పరిపాటిగా మారిపోయింది. సకినేటిపల్లి మండలంలో గతంతో రెండుసార్లు గ్యాస్ లీక్ అయిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మకిలిపురం మండలం గొల్లపాలెంలో ఓఎన్ జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయ్యింది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి స్థానికులను అప్రమత్తం చేసేందుకు చర్యలు చేపట్టారు. 

17:55 - July 10, 2018

యాదాద్రి భువనగిరి : చందుపట్లకు చెందిన ఓ యువతి.. వలిగొండలో ప్రియుడు భాస్కర్‌ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భాస్కర్‌ తనను ప్రేమించానని చెప్పి.. మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్దం కావడంతో జ్యోతి ఆందోళనకు దిగింది. రెండు నెలలుగా తప్పించుకున్న తిరుగుతున్న భాస్కర్‌పై.. జ్యోతి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవడం... భాస్కర్‌ వేరే యువతితో పెళ్లికి సిద్దం కావడంతో... ఆమె ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది. 

17:52 - July 10, 2018

హైదరాబాద్ : పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న హైకోర్టు తీర్పుపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలని డిమాండ్‌ చేశారు. 

17:36 - July 10, 2018

హైదరాబాద్ : రాజధాని అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. అమరావతి భూములను సింగపూర్‌ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిది వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు చంద్రబాబు ప్రత్యామ్నాయం చూపించలేదని పద్మ ఆరోపించారు.

17:27 - July 10, 2018

హైదరాబాద్‌ : ఏసీబీ కోర్టులో రిటైర్డ్‌ జడ్జి గాంధీ లొంగిపోయారు. అక్రమాస్తుల కేసులో అరెస్ట్‌ అయిన లేబర్‌ కోర్టు రిటైర్డ్‌ జడ్జి గాంధీకి... సుప్రీంకోర్టు ఇంటీరియం బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయడంతో ఆయన ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. కాగా గతంతో ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి వున్నాడనే ఆరోపణతో ఏసీబీ గాంధీని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో గాంధీ హైకోర్టుకు బెయిల్ పిటీషన్ వేసుకున్నారు. ఈ పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు గాంధీకి బెయిల్ నిరాకరిచింది. దీంతో గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ ఇప్పించాల్సిందిగా కోరారు. దీంతో సుప్రీంకోర్టు కూడా వెంటనే ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని గాంధీని ఆదేశించింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో గాంధీ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో 11 రోజుల రిమాండ్ కోసం చంచల్ గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించనున్నారు. సమగ్ర విచారణ జరిపించాలని న్యాయవాదులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం కోసం పనిచేయాల్సిన న్యాయమూర్తులే అవినీతికి పాల్పడతుంటే న్యాయంపై సమాజంలో నమ్మకం పోతుందని అభిప్రాయపడుతున్నారు. నాంపల్లి లేబర్ కోర్టు జడ్జిగా పనిచేసే విషయంలో నగదు డిమాండ్ చేసి అవినీతి ఆరోపణలు రావటంతో న్యాయవాదులు జడ్జిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల నేపథ్యంలో దాదాపు రూ. 300ల కోట్లు అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.

హైకోర్టు అనుమతితో వారాసిగూడలోని జడ్జి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. దాంతో పాటు నాంపలి, డీడీ కాలనీ, ఏపీలోని రాజమండ్రి, కొవ్వూరు, ఏలూరు సహా ఏడు ప్రదేశాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. గాంధీని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. దాదాపు రూ.300 కోట్లకు పైగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఒక బిల్డింగ్, రెండు ప్లాట్లు, కొవ్వూరులో 18 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జడ్జి గాంధీకి చెందిన బ్యాంకు లాకర్‌ను ఏసీబీ అధికారులు తెరిచి లాకర్ లో వున్న నగదును, నగలను స్వాధీనం చేసుకున్నారు. 

17:12 - July 10, 2018

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలూ పనిచేస్తుంటే.. విపక్ష నేతలు అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని.. ఏపీ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. జగన్‌, పవన్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ కోసం పనిచేస్తోన్న చంద్రబాబును మళ్లీ ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్‌ అవినీతి పుత్రుడు, పవన్‌ మోదీ దత్తపుత్రుడని మంత్రి లోకేశ్ విమర్శలు సంధించారు. 

17:11 - July 10, 2018

విజయవాడ : రైతాంగ సమస్యలపై ప్రభుత్వాలు స్పందించకుంటే ప్రత్యక్ష పోరాటాలు తప్పవన్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. విజయవాడలో వ్యవసాయదారుల సమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో చర్చాగోష్టి జరిగింది. ఈ సమావేశంలో పలు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. మోదీ, చంద్రబాబులు రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని పలువురు ఆరోపించారు. అధికారంలోకి వస్తే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తామని హామీలిచ్చి విస్మరించారన్నారు. రైతుల సమస్యలతో పాటు.. ప్రజాసమస్యలపై ప్రత్యక్ష పోరాటాలు చేస్తామన్నారు రామకృష్ణ.

17:08 - July 10, 2018

జపాన్ : భారీ వర్షాలు, వరదల కారణంగా జపాన్‌లో మృతుల సంఖ్య 141కి చేరింది. గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలతో చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు చోట్ల కొండచరియలు విరిగపడడంతో ఇళ్లు, భవనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. కురషికి నగరంలో వర్షా ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఇళ్లు నీటమునిగి పోయాయి. ప్రజలు భవనాల పైకప్పుల ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. సహాయక సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. గత దశాబ్ద కాలంలో వచ్చిన భయంకరమైన విపత్తు ఇదేనని వారు వెల్లడించారు. వర్షాలు కాస్త తగ్గడంతో ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జపాన్‌లో వరద బీభత్సంతో ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం కూడా సంభవించింది.

17:07 - July 10, 2018

థాయ్‌లాండ్‌ : తామ్‌ లుయాంగ్‌ గుహలో చిక్కుకున్న పిల్లలను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ థాయ్‌లాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహ నుంచి బాలలను రక్షించడానికి సహాయక చర్యలు థాయ్‌లాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహ నుంచి బాలలను రక్షించడానికి అధికారులు చేసిన సహాయక చర్యలు ఎట్టకేలకు సక్సెస్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా థాయ్‌లాండ్ చిన్నారుల ఘటనకు సంబంధించిన ఉత్కంఠకు తెరపడింది. 18 రోజులుగా గుహలో బిక్కుబిక్కుమంటూ గడిపిన చిన్నారులను ఒక్కొక్కరిగా సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. గుహలో చిక్కుకున్న ఫుట్‌బాల్ టీం కోచ్ సహా 12 మంది పిల్లలను 19 మంది డైవర్లతో కూడిన రెస్క్యూ టీం అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. జులై 8న సహాయక చర్యలు ప్రారంభించిన సిబ్బంది నలుగురిని కాపాడగా..అనంతరం  మరో నలుగురు చిన్నారులను సురక్షితంగా కాపాడారు. మూడో రోజు మిగిలిన ఐదుగురిని సురక్షితంగా బైటకు తీసుకురాగలిగారు. రెండు వారాలపాటు గుహలో వుండిపోయిన  12మంది బాలలతో పాటు కోచ్ ను కూడా రెస్క్యూ టీమ్  సురక్షితంగా రక్షించగలిగారు. కాగా రెండదశ రక్షణాచర్యల్లో భాగంగా  రెస్క్యూ టీమ్ డైవర్లు 8 మంది పిల్లలను బయటకు సురక్షితంగా తీసుకురాగా... కోచ్‌తో సహా మరో ఐదుగురు లోపలే ఉండిపోయారు. వారిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు మూడో దశ సహాయక చర్యల్లో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించినట్లు థాయ్‌ అధికారులు తెలిపారు. తామ్‌ లుయాంగ్‌ గుహలో చిక్కుకున్న చిన్నారులను బయటకు తీసుకురావడం కోసం అమెరికాకు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సిఈఓ ఎలోన్‌ మస్క్ కిడ్‌సైజ్‌ సబ్‌మెరైన్‌ తయారుచేశారు. ఈ సబ్‌మెరైన్‌తో పాటు తాను థాయ్‌లాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహ వద్దకు చేరుకున్నట్లు ఎలోన్‌ మస్క్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఇప్పటికే ఈ సబ్‌మెరైన్‌తో అమెరికాలో డెమో నిర్వహించారు. సబ్‌మెరైన్‌ వాడతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. గుహ నుంచి బయటకు వచ్చిన పిల్లల్లో ఇద్దరికి న్యూమోనియా సోకినట్లుగా అధికారులు తెలిపారు. మిగతావారు ఆరోగ్యంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. అధికారులు, రెస్క్యూ టీమ్ పడిన కష్టానికి అందరూ ప్రాణాలతో రక్షించబడ్డారు. 

16:48 - July 10, 2018

నిజామాబాద్ : ఇద్దరు ప్రేమికుల వివాహానికి ఒప్పుకోని పెద్దల వైఖరితో ఓ యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మూడు సంవత్సరాలు ప్రేమించుకున్న ప్రేమికుల ప్రియురాలు గంగాలత ఆత్మహత్యకు యత్నించింది.

నందిపేట మండలం తల్వేదకు చెందిన గంగాధర్ అనే యువకుడు.. లత అనే యువతిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని లతను గంగాధర్ నమ్మించాడు. కానీ వీరిద్దరి వివాహానికి గంగాధర్ ఇంటివారు ఒప్పుకోకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైన గంగాలత లక్కంపల్లిలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఒంటినిండా గాయాలపాలయిన లతను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. దీంతో లత మృతికి కారణమైన గంగాధర్ ఇంటి ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. యువకుడి ఇంటి ఆవరణలో శవాన్ని పూడ్చి పెట్టడానికి లత బంధువులు గంగాధర్ ఇంటి ముందు ఆరడుగుల మేర యువకుడి ఇంటి ముందు గుంత తవ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులకు పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ముగిసింది.

 

టెర్రరిస్టులు హిట్ లిస్టులోఇమ్రాన్ ఖాన్..

పాకిస్థాన్ : జూలై 25న పాకిస్థాన్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో, ఎన్నికల ప్రచార సమయంలో పలువురు నేతలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని పాకిస్థాన్ కు చెందిన జాతీయ కౌంటర్ టెర్రరిజం అథారిటీ హెచ్చరించింది. భద్రతను పెంచాలని సూచించింది. టెర్రరిస్టులు హిట్ లిస్టులో తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్, అవామీ నేషనల్ పార్టీ అధ్యక్షుడు అఫ్సంద్యార్ వలీ, క్వామీ వతన్ పార్టీ కి చెందిన అహ్మద్ ఖాన్ షెర్పావో, జమియత్ ఉలేమా ఇ ఇస్లాం ఫజల్ నేత అక్రమ్ దుర్రానీ, ఏఎన్పీ నేత అమీర్ హైదర్ మోటీలు ఉన్నారు.

జమిలికి ఓటేసిన వైసీపీ..

ఢిల్లీ : జమిలి ఎన్నికలపై దేశంలోని పార్టీల నుంచి లా కమిషన్‌ అభిప్రాయాలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌ మినహా ప్రధాన పార్టీలన్నీ తమ నిర్ణయాన్ని తెలిపాయి. ఈరోజు ఏపీ ప్రతిపక్ష వైసీపీ కూడా తమ అభిప్రాయాన్ని తెలిపింది. జమిలి ఎన్నికలకు తమ పార్టీ మద్దతు ఇస్తునట్లు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లా కమిషన్‌కు లేఖ అందించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... జమిలి ఎన్నికలతో ఖర్చు, అవినీతి తగ్గుతుందన్నారు. 

16:34 - July 10, 2018

తూర్పుగోదావరి : జియో టవర్ పై గ్రామస్తులు యుద్ధం ప్రకటించారు. మామిడికుదురు మండలం మగటపల్లిలో జియో టవర్ కు విద్యుత్ లైన్ల కనెక్షన్ ఇవ్వవద్దంటు నిరసన వ్యక్తంచేస్తున్నారు. జియో టవర్ కు ఇచ్చే విద్యుత్ లైన్లను తమ నివాసాల మధ్య నుండి వేయటంతో తమకు ప్రమాదకరంగా మారుతున్నాయని దీన్ని ఆపకుంటే ఆత్మహత్య చేసుకంటామని ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. మరోవైపు ఇద్దరు యువకులు సెల్ టవర్ ఎక్కి తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. కాగా గ్రామస్థులు జియో టవర్ విషయంలో రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు జియోకు మద్దతుగా నిలిస్తే..మరికొందుకు వ్యతిరేకించటం విశేషం. ఈ విషయంలో పోలీసులు కలగజేసుకోవటంతో మగటపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో జియోను వ్యతిరేకిస్తు ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతని పరిస్థితి విషమంగా వుండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

16:32 - July 10, 2018

ఢిల్లీ : జమిలి ఎన్నికలకు వైసీపీ జై కొట్టింది. లా కమిషన్ కు తమ అభిప్రాయాన్ని తెలిపిన ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతు.. జమిలి ఎన్నికలో ఖర్చుతో అవినీతి, ఖర్చు తగ్గుతుందన్నారు. జమిలి ఎన్నికలపై తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఢిల్లీ లా కమిషన్ వద్దకు వెళ్లిన వైసీపీ పార్టీ జమిలి ఎన్నికలు జరిపేందుకు తమకేమీ అభ్యంతరం లేదని తెలిపింది. లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరపాలని లా కమిషన్ కు తెలిపామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీలో నెగ్గి టీడీపీలోకి చేరారని ఒక్కొక్క ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఇచ్చి వారిని టీడీపీ పార్టీ కొనుగోలు చేసిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కాగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అభిప్రాయాన్ని లా కమిషన్ అభిప్రాయాలను సేకరిస్తున్న నేపథ్యంలో జమిలి ఎన్నికల జరిపేందుకు తమ పార్టీ సిద్ధమేనని తెలిపారు. 

15:20 - July 10, 2018

ఢిల్లీ : జమిలి ఎన్నికలకు వైసీపీ జై కొట్టింది. లా కమిషన్ కు తమ అభిప్రాయాన్ని తెలిపిన ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతు.. జమిలి ఎన్నికలపై తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఢిల్లీ లా కమిషన్ వద్దకు వెళ్లిన వైసీపీ పార్టీ జమిలి ఎన్నికలు జరిపేందుకు తమకేమీ అభ్యంతరం లేదని తెలిపింది. లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరపాలని లా కమిషన్ కు తెలిపామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. జమిలి ఎన్నికలో ఖర్చుతో అవినీతి, ఖర్చు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీలో నెగ్గి టీడీపీలోకి చేరారని ఒక్కొక్క ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఇచ్చి వారిని టీడీపీ పార్టీ కొనుగోలు చేసిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కాగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అభిప్రాయాన్ని లా కమిషన్ అభిప్రాయాలను సేకరిస్తున్న నేపథ్యంలో జమిలి ఎన్నికల జరిపేందుకు తమ పార్టీ 

14:56 - July 10, 2018

జగిత్యాల : జిల్లాలో అవిశ్వాస రాజకీయంలో పలు చీకటి కోణాలు బైపడుతున్నాయి. కథలాపూర్ ఎంపీపీ తోట రర్సుపై ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. దీంతో నాలుగేళ్లనాటి చీకటి ఒప్పందాలు వెలుగులోకి వస్తున్నాయి. జెట్పీటీసీ మద్దతు కోసం ఒక్కొ ఎంపీటీసీలకు రూ.4లక్షలు చెల్లించినట్లుగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి ఒప్పంద పత్రాలపై దూలూరు బీజేపీ ఎంపీటీసీ సౌజన్య భర్త గంగాధర్ సంతకం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ తాజా క్యాంపు రాజకీయాలు గ్రామస్థుల ముందే ఒప్పందాలు జరుపుకోవటంతో వారు విస్మయానికి గురయ్యారు. కాగా తాజాగా ఎంపీపీ తోట నర్సుపై అవిశ్వాసం నేపథ్యంలో బీజేపీ ఎంపీటీసీ మద్దతు ఉపసంహరించుకోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మద్దతు విరమిస్తే 20లక్షలు చెల్లించాలని కాంగ్రెస్‌ నేతలు పట్టుబడుతున్నారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ నేతలు ఖండిస్తున్నారు. బీజేపీ ఎంపీటీసీ తమకు స్వచ్ఛందంగానే మద్దతు తెలిపారి చెబుతున్నారు. ఈ తాజా క్యాంపు రాజకీయాల నుండి రెండు రోజులకే సౌజన్య ఇంటికి చేరింది. గ్రామస్థుల ముందే ఒప్పందం గురించి ఎంపీపీ వర్గీయులు నిలదీశారు. అధికారం కోసం జరిగిన చీకటి ఒప్పందంపై స్థానికులు విస్మయం చెందుతున్నారు.

14:52 - July 10, 2018

హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల ఎన్నికలకు కేటాయించే రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తెలంగాణ ప్రభుత్వం తరుఫున సుప్రీంకోర్టుకు వెళతామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునరుద్ధరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీని కోసం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడానికి రేపు కేబినెట్‌ సబ్‌ కమిటి సమావేశం కావాలని ఆయన ఆదేశించారు. అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌తో పాటు ఇతర సంబంధిత అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిచి, అన్ని విషయాలను సమగ్రంగా చర్చించి, పరిశీలించి రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 61 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాల్సిన అవసరాన్ని న్యాయస్థానంలో తమ వాదనలు తెలిపేందుకు గులాబీ బాస్ రెడి అవుతున్నారు. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడానికి రాష్ట్ర సర్కారు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, ఇందుకు అవసరమైన న్యాయ పోరాటం చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో బీసీలకు 61 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు టీఆర్ఎస్ వెళ్లనుంది.

 

13:59 - July 10, 2018

హైదరాబాద్ : చెత్త బాధల నుంచి తమకు విముక్తి కలిపించాలంటూ.. జవహర్‌ నగర్‌  ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేశారు. కొన్నేళ్ళుగా పేరుకుపోయిన చెత్తతో ఇక్కడ జీవనమే ప్రాణాంతకంగా మారింది. కాగా.. ప్రజలకు చెత్త సమస్యలు తొలగించి.. ఆరోగ్యకరమైన వాతావరణం కలిపిస్తామని హామీ ఇస్తోంది బల్దియా.. ఇంతకీ ఇక్కడి ప్రజల బాధలేంటీ.. ప్రభుత్వం ఇస్తున్న భరోసా ఏంటో చూద్దాం..
విషతుల్యంగా  మారిన గాలి, నీరు, భూమి 
దాదాపు 12 ఏళ్లుగా హైదరాబాద్‌ నగర పరిధిలోని చెత్తనంతటినీ జవహర్‌నగర్ డంపింగ్‌ యార్డులో పోగేశారు. దీంతో పరిసరాలన్ని విపరీతమైన కాలుష్యంతో నిండిపోయాయి.  గాలి, నీరు, భూమి విషపూరితంగా తయారయ్యాయి. ఈ సమస్యలనుంచి తమకు విముక్తి కలిపించాలని ఇక్కడి ప్రజలు ఎప్పట్నుంచో పోరాటాలు చేశారు. జవహర్‌నగర్ ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీతోపాటు.. పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, పాదయాత్రలు సైతం చేపట్టారు.
2001 నుంచి జవహర్‌నగర్‌కు చేరుతున్న చెత్త
2001 నుంచి చుట్టు ప‌క్కల మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల‌ చెత్తను జ‌వ‌హర్ న‌గ‌ర్ డంపింగ్ యార్డుకు  త‌ర‌లిస్తున్నారు.  2005 త‌రువాత నుంచి హైద‌రాబాద్‌లోని చెత్తను కూడా ఇక్కడికే తెచ్చిపోస్తున్నారు. దీంతో ఇక్కడ ఒక కోటి 20 ల‌క్షల ట‌న్నుల చెత్త పోగైంది. ఇది 135 ఎక‌రాల్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. దీన్నుంచి వ‌చ్చిన మురుగుతో చెరువుల‌ు, భూగ‌ర్బ జ‌లాల‌ క‌లుషితం అయ్యాయి. ఇక్కడి నీటిలో జీవులు ఏమాత్రం బత‌క‌లేవంటే ఏ స్థాయిలో కలుషితమైందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పటికే ఆరున్నర ల‌క్షల కిలో లీట‌ర్ల లీచ‌ట్ ఉత్పతి అయింది.
చెత్తను శాస్త్రీయ ప‌ద్ధతుల్లో నాశ‌నం చేసే ప్రాజెక్టుకు శ్రీకారం 
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక.. జవహర్‌ నగర్ యార్డుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనకి తెలుసని సీఎం కేసీఆర్‌   చెప్పారు. వారి సమస్యలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్నట్లుగానే.. అందుకోసం చెత్తను శాస్త్రీయ ప‌ద్ధతుల్లో నాశ‌నం చేసే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దీన్ని రాంకీ ఎన్వీరో సంస్థకు జీహెచ్ఎంసీ క‌ట్టబెట్టింది.

 

13:51 - July 10, 2018

గుంటూరు : ప్రధాని మోదీ మూడు పార్టీలను పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, వైఎస్‌ జగన్‌, జనసేన పవన్‌లకు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఈ ముగ్గురినీ ప్రజలు తరిమి కొట్టాలని జలీల్‌ఖాన్‌ విజ్ఞప్తి చేశారు. 

 

జగిత్యాల జిల్లాలో రసవత్తరంగా అవిశ్వాస రాజకీయం

జగిత్యాల : జిల్లాలో అవిశ్వాస రాజకీయం రసవత్తరంగా మారింది. కథలాపూర్‌ ఎంపీపీ తోట నర్సుపై అవిశ్వాసం ప్రక్రియలో లక్షలాది రూపాలయలు చేతులు మారినట్టు ఆరోపణలొస్తున్నాయి. ఎంపీపీకి మద్దతు ఇచ్చే విషయంలో నాలుగేళ్ల చీకటి ఒప్పందం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్‌ ఎంపీపీకి మద్దతు ఇస్తే ఒక్కో ఎంపీటీసీకి 4 లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఎంపీపీ తోట నర్సుపై అవిశ్వాసం నేపథ్యంలో బీజేపీ ఎంపీటీసీ మద్దతు ఉపసంహరించుకోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. 

13:48 - July 10, 2018

హైదరాబాద్ : పంచాయితీ ఎన్నికల్లో బీసీలకు 61 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్‌. బీసీలకు 61 శాతం రిజర్వేషన్‌ ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తామన్నారు. గతంలో రిజర్వేషన్లపై సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరతమన్నారు.  

 

13:45 - July 10, 2018

జగిత్యాల : జిల్లాలో అవిశ్వాస రాజకీయం రసవత్తరంగా మారింది. కథలాపూర్‌ ఎంపీపీ తోట నర్సుపై అవిశ్వాసం ప్రక్రియలో లక్షలాది రూపాలయలు చేతులు మారినట్టు ఆరోపణలొస్తున్నాయి. ఎంపీపీకి మద్దతు ఇచ్చే విషయంలో నాలుగేళ్ల చీకటి ఒప్పందం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్‌ ఎంపీపీకి మద్దతు ఇస్తే ఒక్కో ఎంపీటీసీకి 4 లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఎంపీపీ తోట నర్సుపై అవిశ్వాసం నేపథ్యంలో బీజేపీ ఎంపీటీసీ మద్దతు ఉపసంహరించుకోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మద్దతు విరమిస్తే 20లక్షలు చెల్లించాలని కాంగ్రెస్‌ నేతలు పట్టుబడుతున్నారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ నేతలు ఖండిస్తున్నారు. బీజేపీ ఎంపీటీసీ తమకు స్వచ్ఛందంగానే మద్దతు తెలిపారి చెబుతున్నారు. ఒప్పంద పత్రంపై దూలూరు బీజేపీ ఎంపీటీసీ సౌజన్య భర్త గంగాధర్‌ సంతకం చేశారు. తాజా క్యాంపు నుంచి రెండు రోజులకే సౌజన్య ఇంటికి చేరింది. గ్రామస్థుల ముందే ఒప్పందం గురించి ఎంపీపీ వర్గీయులు నిలదీశారు. అధికారం కోసం జరిగిన చీకటి ఒప్పందంపై స్థానికులు విస్మయం చెందుతున్నారు.

పంచాయతీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో అప్పీల్ వేయాలని టీ.ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్ : పంచాయతీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో అప్పీల్ వేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. రిజర్వేషన్లు 61 శాతం పునరుద్ధరించాలని ప్రభుత్వం కోరనుంది. రేపు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కావాలని సీఎం ఆదేశించారు. కాంగ్రెస్ తమ సర్పంచ్ ద్వారా హైకోర్టులో పిటిషన్ వేయించింది. కాంగ్రెస్ బీసీల రిజర్వేషన్లకు గండి కొట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. 

 

13:21 - July 10, 2018

హైదరాబాద్ : రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి యువత ఆకాంక్షలను నెరవేర్చాలని యంగ్‌ లీడర్స్‌ సంస్థ డిమాండ్‌ చేసింది. చట్ట సభల్లో యువత వాటా అనే అంశంపై హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో  నిన్న రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. పార్టీలకు అతీతంగా యువ, విద్యార్థి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారతదేశ జనాభాలో 65 శాతం కంటే ఎక్కువ ఉన్న యువతకు చట్ట సభల్లో, విధాన నిర్ణయాల్లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని యంగ్‌ లీడర్స్‌ అధ్యక్షుడు పైలెట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. చట్ట సభల్లో యువతకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని.. 65 సంవత్సరాలు పైబడిన రాజకీయ నాయకులకు చట్టసభలతో పాటు ఇతర రాజ్యాంగ పదవుల్లో అవకాశం ఇవ్వకూడదన్నారు. 

 

13:18 - July 10, 2018

భద్రాది కొత్తగూడెం : నగరాలకు పరిమితమైన డ్రగ్స్‌ కల్చర్‌ యెల్లలు దాటి పల్లెకు చేరిపోయింది. రోజుల తరబడి మత్తులో ముంచెత్తే ఈ మహమ్మారి యువతను లక్ష్యంగా చేసుకుంటోంది. ఏజెన్సీ ప్రాంతంలోని యువత గంజాయికి బానిసలవుతున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పల్లె వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గంజాయి సేవిస్తున్న వారిలో మైనర్లు కూడా ఉండడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.. చాపకింద నీరులా ఏజెన్సీ ప్రాంతాల యువతను మత్తులో ముంచెత్తుతున్న గంజాయిపై  టెన్‌టీవీ ప్రత్యేక కథనం.
గంజాయి మత్తులో యూత్‌
భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో గ్రామీణ యువత గంజాయి మత్తులో జోగుతున్నారు. యువకులు గంజాయికి బానిసలవుతుండంతో పల్లెల్లో ఆందోళనకరపరిస్థితులు తలెత్తులున్నాయి. 
గంజాయి పొట్లాలను యువతకు చేరవేస్తున్న మహిళ
గంజాయి అమ్మకాలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి గంజాయిని సరఫరా చేస్తుండగా.. ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశ్వారావుపేట పుల్లల కాలనీకి చెందిన మహిళ పల్లెల్లో ప్లాస్టిక్‌ సామాన్లు అమ్ముతూ జీవిస్తోంది. దాంతోపాటే  గంజాయిని పొట్లాలు స్థానిక యువతకు చేరవేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.  ఈ గంజాయి సేవిస్తున్న వారిలో దుకాణాల్లో గుమస్తాలు, సంపన్నుల పిల్లలు అధికంగా ఉన్నట్టు  తెలుస్తోంది.
ఉన్నత చదువుల కోసం వెళ్లి గంజాయికి బానిసలైన యువత
అశ్వారావుపేట ప్రాంతం నుంచి  ఉన్నత చదువుల కోసం పట్టణాలకు వెళ్లిన యువకులు కొందరు..  ఈ పల్లెల్ల్లో గంజాయిని సరఫరా  చేస్తున్నారు. ప్లాస్టిక్‌ అమ్ముకొనే మహిళ ద్వారా స్థానిక యువకులకు గంజాయి చేరవేస్తున్నారని పోలీసు దర్యాప్తులో వెల్లడియింది. అశ్వారావుపేటలోని  పేపర్‌మిల్‌ సమీపంలోని ఓ గదిని అద్దెకు తీసుకొని గంజాయి సేవిస్తున్నట్టు గుర్తించారు. 
పిల్లల భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
అశ్వారావుపేట ఎజెన్సీ ఏరియాలో గిరిజనులు గుడుంబా బారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న నేపథ్యలో.. గంజాయి అమ్మాకాలు ఊపందుకోవడంతో ఆధికారులు విస్తుపోతున్నారు. తమ ప్రాంతంలో యువత గంజాయికి బానిసలవడంతో పిల్లల భవిష్యత్‌ ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ మత్తుకు బానిసలుగా మారిన వారికి మానసిక వైద్యులచే  చిక్సిత చేయించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో గంజాయి సరఫారాను పోలీసులు అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 
 

 

12:55 - July 10, 2018

కరీంనగర్ : ఆలోచన.. ఆయుధం కంటే పదునైనదని నిరూపించాడు ఓ యువకుడు. సాధించాలనే సంకల్ప ఉంటే ఏదైనా చేయొచ్చు అంటున్నాడు. కుల వృత్తులు అంతరించిపోతున్న తరుణంలో... తమకు ప్రోత్సాహం కల్పిస్తే ఏదైనా సాధిస్తామని.. అగ్గిపెట్టెలో పట్టే పని ముట్లను తయారు చేసి నిరూపించాడు. ఇంతకు ఎవరా యువకుడు ? ఏంటా కథా  ? అనే దానిపై ప్రత్యేక కథనం. 

రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కులవృత్తులు అంతరించిపోతున్నాయి. దీంతో చేతివృత్తుల వారు కులవృత్తులు వీడి.. వలసపోతున్నారు. గ్రామాల్లో కొన్ని కొన్ని వృత్తులు చేసేవారు అంతరించిపోతున్నారు. మరోవైపు ఉన్నవారికి ఉపాధి లేక.. కుటుంబాలు పోషించలేక అవస్థలు పడుతున్నారు. దీంతో ఓ యువకుడు ఓ కొత్త ఆలోచన చేశాడు. అంతరించిపోతున్న తమ కులవృత్తులకు గుర్తింపు తీసుకురావాలనుకున్నాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే తమ కళతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తామని కరీంనగర్‌ జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి చెందిన సంపత్‌ రుజువు చేస్తున్నాడు. 

ఇంటర్‌ వరకు చదివిన సంపత్‌ విశ్వబ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవాడు. ఊర్లలో వ్యవసాయ పనిముట్లు తయారుచేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. అయితే... రానురాను ఈ వృత్తికి ప్రాధాన్యత తగ్గింది. దీంతో కుటుంబాలు పోషించడం భారంగా మారుతోంది. దీంతో సంపత్‌ అగ్గిపెట్టెలో పట్టే నాలుగు వ్యవసాయ పనిముట్లను తయారుచేశాడు. 7 గంటల్లోనే ఈ వస్తువులను తయారు చేయడం విశేషం. తమలో ఉన్న కళను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాను ఈ వస్తువులు తయారు చేశానంటున్నాడు సంపత్‌. 

అగ్గిపెట్టెలో వస్తువులను తయారు చేసిన సంపత్‌ను స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు. ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందిస్తే సంపత్‌ లాంటి వారు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని కొనియాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంతరించిపోతున్న చేతివృత్తుల వారిని బతికించాలని ప్రజలు కోరుతున్నారు. సరైన ప్రోత్సాహం అందిస్తే ప్రతి వృత్తిలో అద్భుతాలు సృష్టిస్తారంటున్నారు. 

12:52 - July 10, 2018

శ్రీకాకుళం : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామిని గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తన రెండవ రోజు పర్యటనను ప్రారంభించిన గవర్నర్ మొదట అరసవల్లి దర్శనం చేసుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయం లోపలికి స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటాన్ని గవర్నర్‌కు అందించారు. 

 

12:49 - July 10, 2018

హైదరాబాద్‌ : జంటనగరాల్లో మరోరెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. మూడు, నాలుగు రోజులుగా నగరంలో చిరుజల్లులతోపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఛత్తీస్‌ఘడ్‌, దానిని ఆనుకుని ఉన్న ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో 7కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికితోడు తూర్పు, పశ్చిమ జోన్‌లో సుమారుగా 19.0 డిగ్రీల వెంబడి 4.5 కి.మీ. నుంచి 7.6 కి.మీ. మధ్య కొనసాగుతోందని, దీని ప్రభావంతో మరో రెండురోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా నగరంలో సోమవారం ఉదయం, రాత్రి సమయాల్లో ముసురుతో కూడిన చిరు జల్లులు కురిశాయి. వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 26.3 డిగ్రీలు, కనిష్ఠంగా 22.3 డిగ్రీలుగా నమోదయినట్టు అధికారులు తెలిపారు.

 

12:46 - July 10, 2018

హైదరాబాద్ : తెలంగాణలో గోదావరి ఉపనదులు ఉరకలెత్తుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టు నుంచి 4 గేట్ల ద్వారా 5,044 క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో వరద ప్రవాహం 26 అడుగులకు చేరుకుంది.  వరద ఉధృతి కారణంగా భద్రాచలం వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. స్నానఘట్టాల వరకూ వరద నీరు చేరడంతో భక్తులకు ఇబ్బందులు ఎదరువుతున్నాయి. అటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోనూ గోదావరి ఉధృతంగా  ప్రవహిస్తోంది. కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కాళేశ్వరం వద్ద ప్రస్తుతం  7.5 మీటర్ల మేర వరద ప్రవహిస్తోంది. వరద మరింత పెరగొచ్చన్న అంచనాతో  పరీవాహక ప్రాంతాల ప్రజలను  అధికారులు అప్రమత్తం చేశారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే సాయంత్రానికి  మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే యోచనలో అధికారులు ఉన్నారు. 

 

కొనసాగుతున్న పరిపూర్ణానంద స్వామి హౌజ్ అరెస్టు

హైదరాబాద్‌ : నగరంలో పరిపూర్ణానంద స్వామి గృహనిర్భందం కొనసాగుతూనే ఉంది. నిన్నటి పరిణామాల తర్వాత పోలీసు బందోబస్తును ఇంకా పెంచారు. పరిపూర్ణానంద ఇంటి పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మీడియాపై కూడా ఆంక్షలు అమలు చేస్తున్నారు. బారికేడ్లు దాటి లోపలికి వస్తే.. అరెస్టు చేస్తామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

12:33 - July 10, 2018

ఢిల్లీ : ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌, బెల్జియం జట్ల మధ్య జరిగే ఫుట్‌బాల్‌ తొలి సెమీఫైనల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెండు జట్లలోనూ స్టార్‌ ఆటగాళ్లు నిండి ఉండడంతో ఈ మ్యాచ్‌ హోరా హోరీగా  జరగనుంది. 23 మ్యాచ్‌లలో పరాజయమన్నదే ఎరుగని బెల్జియం క్వార్టర్‌ఫైనల్లో బ్రెజిల్‌పై విజయం సాధించి సంచలనం సృష్టించింది. దీంతో ప్రపంచకప్ హాట్‌ ఫేవరెట్ ముద్ర వేసుకొని సెమీస్‌లో మాజీ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. డెస్చాంప్ కెప్టెన్సీలో అనేక విజయాలందుకున్న ఫ్రాన్స్‌ జట్టు ప్రపంచకప్‌ హాట్‌ ఫేవరెట్‌గా ఫుట్‌బాల్‌ పండితుల కితాబందుకుంటోంది. 

12:13 - July 10, 2018

కశ్మీర్ : దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. కుండలన్‌ గ్రామంలోని ఒక ఇంట్లో ఆరుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని చుట్టుముట్టాయి. భద్రతా దళాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ అధికారులు గాయపడ్డారు. వీరిలో ఒక జూనియర్‌ ఆఫిసర్‌ స్థాయి అధికారి కూడా ఉన్నారు. ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య భీకర పోరాటం కొనసాగుతోంది. ఓ వైపు భారీ కాల్పులు జరుగుతుంటే అల్లరి మూకలు ఆ ప్రాంతానికి చేరి ఉగ్రవాదులను తప్పించేందుకు ప్రయత్నించాయి. వీరి ప్రయత్నాన్ని భద్రతా బలగాలు సమర్ధంగా తిప్పికొడుతున్నాయి. వీరిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించాయి. 

 

12:02 - July 10, 2018

హైదరాబాద్‌ : నగరంలో పరిపూర్ణానంద స్వామి గృహనిర్భందం కొనసాగుతూనే ఉంది. నిన్నటి పరిణామాల తర్వాత పోలీసు బందోబస్తును ఇంకా పెంచారు. పరిపూర్ణానంద ఇంటి పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మీడియాపై కూడా ఆంక్షలు అమలు చేస్తున్నారు. బారికేడ్లు దాటి లోపలికి వస్తే.. అరెస్టు చేస్తామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నిన్నటి పరిణామాల నేపథ్యంలో పరిపూర్ణానంద సహా పాతిక మందిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. 

11:52 - July 10, 2018

హైదరాబాద్ : తెలంగాణలో గోదావరి ఉపనదులు ఉరకలెత్తుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టు నుంచి 4 గేట్ల ద్వారా 5,044 క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో వరద ప్రవాహం 26 అడుగులకు చేరుకుంది.  వరద ఉధృతి కారణంగా భద్రాచలం వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. స్నానఘట్టాల వరకూ వరద నీరు చేరడంతో భక్తులకు ఇబ్బందులు ఎదరువుతున్నాయి. అటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోనూ గోదావరి ఉధృతంగా  ప్రవహిస్తోంది. కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. కాళేశ్వరం వద్ద ప్రస్తుతం  7.5 మీటర్ల మేర వరద ప్రవహిస్తోంది. వరద మరింత పెరగొచ్చన్న అంచనాతో పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అన్నారం బ్యారేజీ వద్ద తాత్కాలిక ఆనకట్ట తెగింది. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే యోచనలో అధికారులు ఉన్నారు. 

 

11:32 - July 10, 2018

శ్రీనగర్ : కశ్మీర్‌లో మరో సారి కాల్పుల కలకలం రేగింది. దక్షిణ కశ్మీర్‌ సోఫియాన్‌ జిల్లా కుందాలన్‌ గ్రామంలో ఓ ఇంట్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఇంటిని చుట్టుము ట్టాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్‌ ఆఫీసర్‌ సహా మరో జవాన్‌ గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆర్మీబేస్‌ 92 ఆస్పత్రికి తరలించారు. 

11:27 - July 10, 2018

 రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధి తారామతిపేటలో స్కూల్‌ బస్సు కిందపడి మూడు సంవత్సరాల తన్విష్‌ మృతి చెందాడు. స్థానిక శాంతినికేతన్‌ స్కూల్‌కు వెళుతున్న తన్వీష్‌.. బస్సు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే బాబు మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

జోతిష్యం ముసుగులో రూ.22 లక్షలు దోచుకున్న బురిడీబాబా

హైదరాబాద్‌ : నగరంలో బురిడీబాబా మోసం బయటపడింది. జోతిష్యం ముసుగులో రూ.22 లక్షలు బురిడీబాబా దోచుకున్నారంటూ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. మధురానగర్‌ కాలనీలో తత్వపీఠం నిర్వహిస్తోన్న రాందేవ్‌ చైతన్య స్వామి.. తమ వద్ద నుంచి 300 గ్రాముల బంగారం, రూ.22 లక్షలు దోచుకున్నాడని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం వెదుకు తున్నారు. 

11:15 - July 10, 2018

హైదరాబాద్‌ : నగరంలో బురిడీబాబా మోసం బయటపడింది. జోతిష్యం ముసుగులో రూ.22 లక్షలు బురిడీబాబా దోచుకున్నారంటూ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. మధురానగర్‌ కాలనీలో తత్వపీఠం నిర్వహిస్తోన్న రాందేవ్‌ చైతన్య స్వామి.. తమ వద్ద నుంచి 300 గ్రాముల బంగారం, రూ.22 లక్షలు దోచుకున్నాడని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం వెదుకు తున్నారు. 

 

 

11:09 - July 10, 2018

ఆదిలాబాద్‌ : రిమ్స్‌ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్‌ మిస్టరీ వీడింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి శిశువు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రిలో ఉన్న సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితురాలని గుర్తించారు. ఇచ్చోడకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తనకు పిల్లలు లేనందునే శుశువును తీసుకెళ్లినట్టు మహిళ చెబుతోందని పోలీసులు తెలిపారు.   

 

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో కిడ్నాపైన పసికందు ఆచూకీ లభ్యం

ఆదిలాబాద్‌ : రిమ్స్‌ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్‌ మిస్టరీ వీడింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి శిశువు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రిలో ఉన్న సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితురాలుని గుర్తించారు. ఇచ్చోడకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. 

 

10:35 - July 10, 2018

ఆదిలాబాద్‌ : రిమ్స్‌ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్‌ మిస్టరీ వీడింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి శిశువు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రిలో ఉన్న సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితురాలని గుర్తించారు. ఇచ్చోడకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. తనకు పిల్లలు లేనందునే శిశువును తీసుకెళ్లినట్టు మహిళ చెబుతోందని పోలీసులు తెలిపారు.   

 

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఓడిశామీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయిన వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

కడెం ప్రాజెక్టులోకి 10,730 క్యూసెక్కుల నీటి ప్రవాహం

హైదరాబాద్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. అటు కడెం ప్రాజెక్టులోకి కూడా 10వేల 730 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో.. దిగువకు భారీగా వరద నీటిని వదలిలేస్తున్నారు.  

భద్రాచలం వద్ద 24 అడుగులకు చేరుకున్న గోదారి నీటిమట్టం

హైదరాబాద్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. భద్రాద్రి జిల్లాల్లో వాగులు పొంగుతున్నాయి. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదారి నీటిమట్టం 24 అడుగులకు చేరుకుంది.

 

 

తాలిపేరులోకి 7వేల 250 క్యూసెక్కుల ప్రవాహం

హైదరాబాద్ : తాలిపేరులోకి 7వేల 250 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 73  మీటర్లకు చేరుకోవడంతో రాత్రివరకూ 7గేట్లను రెండడుగుల మేర ఎత్తారు. గోదావరిలోకి 8వేల 900 క్యూసెక్కుల వరదను వదులుతున్నారు. దీంతో దిగువన గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. 

వరంగల్‌, భద్రాద్రి జిల్లాల్లో పొంగుతున్న వాగులు

హైదరాబాద్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. వరంగల్‌, భద్రాద్రిజిల్లాల్లో వాగులు పొంగుతున్నాయి. చిన్నతరహా జలాశయాల్లో భారీగా వరద చేరుతోంది. గోదావరి ఉపనదులు ప్రాణహిత, కిన్నెరసాని, తాలిపేరుల్లోకి వరద నీరు ఉధృతంగా చేరుతోంది.

10:14 - July 10, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. వరంగల్‌, భద్రాద్రిజిల్లాల్లో వాగులు పొంగుతున్నాయి. చిన్నతరహా జలాశయాల్లో భారీగా వరద చేరుతోంది. గోదావరి ఉపనదులు ప్రాణహిత, కిన్నెరసాని, తాలిపేరుల్లోకి వరద నీరు ఉధృతంగా చేరుతోంది.  తాలిపేరులోకి 7వేల 250 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 73  మీటర్లకు చేరుకోవడంతో రాత్రివరకూ 7గేట్లను రెండడుగుల మేర ఎత్తారు. గోదావరిలోకి 8వేల 900 క్యూసెక్కుల వరదను వదులుతున్నారు. దీంతో దిగువన గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదారి నీటిమట్టం 24 అడుగులకు చేరుకుంది. అటు కడెం ప్రాజెక్టులోకి కూడా 10వేల 730 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో.. దిగువకు భారీగా వరద నీటిని వదలిలేస్తున్నారు.  మరోవైపు  ఓడిశామీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో మరో రెండు రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయిన వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

 

10:00 - July 10, 2018

రంగారెడ్డి : ప్రైవేట్ స్కూల్ బస్సులు విద్యార్థుల పాలిట మృత్యు శకటాలుగా మారాయి. స్కూల్ పిల్లల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. విద్యాలయాలకు విద్యార్థులను క్షేమంగా చేరవేయాల్సి బస్సులు వారి పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. తాజాగా స్కూల్ బస్సు మరో విద్యార్థిని బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి చెందాడు. అబ్దుల్లాపూర్ మెట్ పరిధి తారామతిపేటలో తన్విష్ (3) అనే బాలుడు స్థానిక శాంతినికేతన్ స్కూల్ కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి మృతి చెందాడు. తల్లిదండ్రులు, గ్రామస్తులు బోరును విలపిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బాబు చనిపోయారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాపు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

రంగారెడ్డి జిల్లాలో విషాదం

రంగారెడ్డి : జిల్లాలో విషాదం నెలకొంది. స్కూల్ బస్సు కిందపడి తన్విష్ (3) మృతి చెందారు. అబ్దుల్లాపూర్ మెట్ పరిధి తారామతిపేటలో ఘటన చోటుచేసుకుంది.
 

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య కాల్పులు

జమ్మూకాశ్మీర్ : ఉగ్రవాదులు, భద్రతాబలగాలు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆర్మీ 92 బేస్ ఆస్పత్రికి తరలించారు. దక్షిణ కశ్మీర్ షోపియాన్ జిల్లా కుందలాన్ లోని నివాసగృహంలో ఇద్దరు ఉగ్రవాదులు దాగి ఉన్నారు. భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. 

 

08:45 - July 10, 2018

 చిత్తూరు : కురబలకోట మండలంలో తాటిచెరువుమిట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు చందర్, దేవేంద్ర, దినేష్ లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

 

08:41 - July 10, 2018

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వక్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు నిర్మించాలని సూచించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.సాగర్, టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి రామ్మోహన్, టీఆర్ ఎస్ అధికార ప్రతినిధి విద్యాసాగర్ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రం వ్యాప్తంగా సమాన అభివృద్ధి చేయాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

ఆదిలాబాద్ రిమ్స్ లో మగ శిశువు అపహరణ

ఆదిలాబాద్ : రిమ్స్ ఆస్పత్రిలో మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. శిశువు తల్లి, బంధువులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆరు రోజుల క్రితం మమత బిడ్డకు జన్మనిచ్చింది. బాధితురాలు నార్నూర్ మండలం చోర్ గావ్ వాసిగా గుర్తించారు.

నేడు కర్నూలు జిల్లాలో మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ పర్యటన

కర్నూలు : జిల్లాలో నేడు మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ పర్యటించనున్నారు. ఈనెల 13వరకు ఆయన పర్యటించనున్నారు. 

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చిత్తూరు : కురబలకోట మండలంలో తాటిచెరువుమిట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

 

07:59 - July 10, 2018

తెలంగాణలో అంగన్ వాడిలు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యల సాధన కోసం 36 గంటల ధర్నా చేపట్టారు. తమకు కనీస వేతనం ఇవ్వాలని.. తమకు పీఎఫ్‌, ఈఎస్‌ఐల సదుపాయం కల్పించాలని.. పెన్షన్‌ ఇవ్వాలని.. ఐసీడీఎస్‌ను రక్షించాలని డిమాండ్‌ చేస్తూ వారు ఆందోళన బాట పట్టారు. వారు ఆందోళనకు గల కారణాలు, వారి పట్ల ప్రభుత్వ విధానాలపై ఇవాళ్టి జనపథంలో అంగనీవాడీ వర్కర్స్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

07:54 - July 10, 2018

హైదరాబాద్ : మెగా అభిమానులు జనసేన పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇన్నాళ్లు మెగా అభిమానాన్ని చాటిచెప్పిన అభిమానులు.. ఇక నుంచి జనసేనానికి నీరాజనం పట్టబోతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి రాజకీయ ఆరంగేట్రం చేయడంతో.. ఆయనకు బాసటగా నిలవబోతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో వారంతా జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
జనసేనలోకి వలసలు
జనసేన పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలువురు జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు మెగా అభిమానులు సైతం జనసేన వైపు చూస్తున్నారు. ఇన్నాళ్లు చిరంజీవి అభిమానులుగా ఉన్న వారంతా.. ఇప్పుడు జనసేనాని వెంటనడువబోతున్నారు. అన్నను అందలం ఎక్కించిన ఫ్యాన్సే.. ఇప్పుడు తమ్ముడి కి బాసటగా నిలవబోతున్నారు.
మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం
హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మెగా అభిమానులు భారీగా తరలివచ్చారు. సమావేశంలో పాల్గొన్న పవన్‌.. అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. పదేళ్లు సక్సెస్‌ లేకున్నా... ప్యాన్స్‌ అభిమానమే తనను నిలబెట్టిందని అన్నారు. ఎప్పటికీ అన్న చిరంజీవి మీద ప్రేమ, అభిమానం పెరిగేవే తప్ప.... తగ్గబోవన్నారు. తాను ఈ స్థాయిలో నిలబడటానికి కారణం మెగా అభిమానులేనని పవన్‌ స్పష్టం చేశారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా అండగా ఉండే పార్టీ జనసేన ఒక్కటే అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో జాతీయ భావం కలిగిన పార్టీ జనసేన మాత్రమేనన్నారు. ఒక విత్తు మొక్కగా మారి... చెట్టుగా ఎదిగేందుకు ఎన్నో కష్టాలు పడాలి.. ఎంతో యుద్ధం చేయాలని.. అటాంటి యుద్ధాన్నే ఇప్పుడు జనసేన చేస్తోందన్నారు. మెగా అభిమానుల ఆత్మీయ సమావేశానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. పవన్‌ సమక్షంలో మెగా అభిమానులు జనసేన పార్టీలో చేరిపోయారు. పవన్‌ కల్యాణ్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

07:48 - July 10, 2018

కర్నూలు : పవన్‌, జగన్‌ బీజేపీతో కలిసి ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్‌ ఆరోపించారు. మోదీని ప్రశ్నించాలంటే పవన్‌, జగన్‌లు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ముగ్గురూ కలిసి ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. 2019 ఎన్నికల్లో తెలుగు ప్రజలు బీజేపీకి అసలైన సినిమా చూపిస్తారని తేల్చి చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు లోకేష్ శంకుస్థాపన
కర్నూలు జిల్లాలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ పర్యటన బిజీబిజీగా సాగింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన మంత్రి లోకేష్‌కు... పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి... వేలాది మంది కార్యకర్తలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. పాతబస్తీలోని జమ్మిచెట్టు దగ్గర హంద్రీనదిపై 17 కోట్లతో చేపట్టనున్న వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రెండున్నర కోట్లతో చేపట్టబోయే హిందూ, ముస్లిం శ్మశాన వాటికకు శంకుస్థాన చేశారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో 35 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మెటర్నరీ బ్లాక్‌ను ఆయన ప్రారంభించారు.  అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ చేరుకుని అక్కడ నూతన భవనాలను ప్రారంభించారు. 
కేంద్రం, పవన్‌, జగన్‌లపైనా లోకేష్ ఫైర్‌ 
వివిధ చోట్ల మాట్లాడిన నారా లోకేష్‌.. కేంద్ర ప్రభుత్వంతోపాటు పవన్‌, జగన్‌లపైనా ఫైర్‌ అయ్యారు. జనసేన అధ్యక్షుడు తనపై అసత్య అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏవైనా ఆధారాలుంటే ప్రజలముందు ఉంచాలని సవాల్‌ విసిరారు. పవన్‌, జగన్‌ ఇద్దరూ బీజేపీతో టచ్‌లో ఉన్నారని లోకేష్‌ విమర్శించారు. ముగ్గురూ కలిసి ఏపీకి అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  మోదీని చూస్తే జగన్‌, పవన్‌ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కోసం మోదీని వారు ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. 
2019 ఎన్నికల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన మంత్రి లోకేష్‌   
2019 ఎన్నికల కంటే ముందే మంత్రి లోకేష్‌ అభ్యర్థులను ప్రకటించారు. మైనార్టీ మీటింగ్‌ వేదిక పైనుంచి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను కూడా 2019లో మరోసారి ఎంపీగా పార్లమెంట్‌కు పంపించాలన్నారు.
లోకేష్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న విద్యార్థి, యువజన సంఘాలు 
మరోవైపు నారా లోకేష్‌ కాన్వాయ్‌ను విద్యార్థి, యువజన సంఘాలు  కర్నూలు గెస్ట్‌హౌజ్‌ దగ్గర అడ్డుకున్నాయి. మెడికల్‌ సీట్ల కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని వారు ఆందోళనకు దిగారు.  మెడికల్‌ కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.  దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు.
 

 

నేడు ఫ్రాన్స్ వర్సెస్ బెల్జియం మధ్య తొలి మ్యాచ్

ఫీఫా వరల్డ్ కప్ : నేడు ఫ్రాన్స్ వర్సెస్ బెల్జియం మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. రాత్రి 11.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

నేడు సీతంపేటలో గవర్నర్ నరసింహన్ పర్యటన

శ్రీకాకుళం : నేడు సీతంపేటలో గవర్నర్ నరసింహన్ పర్యటించనున్నారు. ఏజెన్సీ విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖిగా మాట్లాడనున్నారు. 

 

అరసవళ్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్న గవర్నర్

శ్రీకాకుళం : అరసవళ్లి సూర్యనారాయణస్వామిని గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

నేడు మండపేట, ఆనపర్తిలో జగన్ ప్రజా సంకల్పయాత్ర

తూ.గో : నేడు మండపేట, ఆనపర్తిలో వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర కొనసాగనుంది. రాయవరం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.

నేటి నుంచి డైట్ సెట్ రెండో విడత కౌన్సిలింగ్

హైదరాబాద్ : నేటి నుంచి డైట్ సెట్ రెండో విడత కౌన్సిలింగ్ జరుగనుంది. నేడు, రేపు సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నారు. ఈనెల 16న సీట్ల కేటాయింపు జరుగనుంది. 

Don't Miss