Activities calendar

11 July 2018

జకోవిచ్ జోరు...

ఢిల్లీ : వింబుల్డన్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో జపాన్ క్రీడాకారుడు నిషికోరిపై 6-3, 3-6, 6-2, 6-2 తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు.

బాలాపూర్ కు వీహెచ్...

రంగారెడ్డి : జిల్లా బాలాపూర్‌లోని దేవతల గుట్టలో వందల ఎకరాలు కబ్జా అవుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు. గురువారం దేవతలగుట్టకు వెళ్లి పరిశీలించనున్నట్లు వెల్లడించారు. 

21:11 - July 11, 2018

విజయవాడ : నిరుపేదలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించే 'అన్న క్యాంటీన్లు' ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమయ్యాయి. విజయవాడలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన చంద్రబాబు.. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీలేకుండా పేదలకు ఆహారాన్ని అందిస్తామన్నారు. అనంతరం ప్రజలతో కలిసి సీఎం భోజనం చేశారు. ఐదు రూపాయలకే పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. విజయవాడలోని విద్యాధరపురంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రజలతో కలిసి భోజనం చేశారు.

పేదలకు కడుపునిండా అన్నం పెట్టిన ఎన్టీఆర్‌ పేరుతో క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని సీఎం చెప్పారు. అన్న క్యాంటీన్లను చక్కగా ఉంచాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాలని సూచించారు. ప్రతి క్యాంటీన్‌ దగ్గర 300 ల మందికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. పేదలు, వృద్ధులకు అన్న క్యాంటీన్లు ఒక వరమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా క్యాంటీన్ల నిర్వహణ కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

నాణ్యమైన భోజనాన్ని తక్కువ రేటుకు అందించి పేదల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరులోని మిర్చి యార్డు, అమరావతి రోడ్డు, ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మూడు అన్న క్యాంటీన్లను మంత్రి ప్రారంభించారు.

రాష్ట్రంలో పేద ప్రజల కడుపు నింపడం కోసమే 5 రూపాయలకే ఆహారాన్నందించే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. కడప నగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ లోని ఆహార నాణ్యతను పరిశీలించి ప్రజలతో కలిసి భోజనం చేశారు.

పేదవారిని ఆదుకునేందుకే తక్కువ ధరకు ఆహారం అందించే అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. రాజమండ్రిలోని క్వారీ సెంటర్‌లో ఆయన అన్న క్యాంటీన్లను ప్రారంభించారు.

విజయనగరంలో అన్న క్యాంటీన్ ను కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. అనంతరం ప్రజలతో కలిసి భోజనం చేశారు. పేదల అభ్యన్నతి కోసం తమ ప్రభుత్వం నిరంతరం ఆలోచిస్తుందని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో ఎంపీ టీజీ వెంకటేశ్‌ అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. తక్కువ ధరకే పేదవారి కడుపు నింపే మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు.

కాకినాడలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను కాకినాడ సిటీ రూరల్‌ ఎమ్మెల్యేలు ప్రారంభించారు. తక్కవ ఖర్చుతో రుచికరమైన ఆహారాన్ని అందించేందుకే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని సిటి ఎమ్మెల్యే కొండబాబు వెల్లడించారు. దూరప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చేవారికి, మోటార్ ఫీల్డ్ కార్మికులకు ఇది ఎంతో ఉపకరిస్తుందన్నారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్తపట్నంలో ఏర్పాటు చేసిన రెండు అన్న క్యాంటీన్లను ఒంగోలు ఎమ్మెల్యే జనార్ధన్‌, జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌లు ప్రారంభించారు. మరో రెండు క్యాంటీన్లను వచ్చే నెలలో ప్రారంభం చేయనున్నారు. 

21:08 - July 11, 2018

హైదరాబాద్ : పంచాయితీల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రిజర్వేషన్లు 50 శాతం క‌న్నా మించ‌వ‌ద్దని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్లను 34 శాతం క‌న్నా త‌గ్గకుండా చూడాల‌ని మంత్రుల సబ్ కమిటీ తీర్మానించింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును యాథాతథంగా అమలు చేయాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అగస్టు ఒకటితో పంచాయితీల కాలపరిమితి ముగుస్తుండటంతో స్పెషల్ అఫీసర్లను వేసే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి వర్గఉప సంఘం అభిప్రాయపడింది.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బీసీ రిజ‌ర్వేష‌న్లను 34 శాతం క‌న్నా త‌గ్గకుండా చూడాల‌ని మంత్రుల సబ్‌ కమిటీ తీర్మానించింది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో రిజర్వేషన్లు 50 శాతం క‌న్నా మించ‌వ‌ద్దని ఇటీవ‌ల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన సెక్రటేరియట్‌లో భేటీ అయిన మంత్రివ‌ర్గ ఉప సంఘం కూలంకుశంగా చ‌ర్చించింది.

ఈ నెలాఖ‌రుతో పాల‌క‌వ‌ర్గాల ప‌ద‌వీకాలం ముగియ‌నున్న నేప‌థ్యంలో ఈలోపు ఎన్నిక‌లు నిర్వహించ‌లేని ప‌రిస్థితుల్లో తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై కూడా సబ్‌కమిటీ చ‌ర్చించింది. గ‌త‌ పంచాయ‌తీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా 61 శాతం రిజ‌ర్వేష‌న్లను క‌ల్పించుకునే వెసులుబాటు సుప్రీంకోర్టు ఇచ్చింద‌ని...ఈ సారి కూడా 50 శాతం రిజ‌ర్వేష‌న్లను మించ‌కూడదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాల‌ని నిర్ణయించిన‌ట్లు మంత్రి ఈటల రాజేంద‌ర్ తెలిపారు. బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను రానున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా చూడ‌టానికి సుప్రీం కోర్టును ఆశ్రయించాల‌ని నిర్ణయించిన‌ట్లు ఈటల తెలిపారు.

జూలై 31 తో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుంద‌ని...ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్లకు బాధ్యత‌లు అప్పగించాలా లేక పాల‌క‌వ‌ర్గం పదవీకాలం పొడిగించాలా అన్నదానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. దీనితో పాటు బీసీ గ‌ణ‌న విష‌యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాల‌న్నది కూడా కేబినెట్లో చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు. రిజర్వేషన్ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామ‌ని, దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేయాల‌ని స‌బ్ క‌మిటీ నిర్ణయించిన‌ట్లు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు.

ఇక బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం సుప్రీం కోర్టులో తమ వాదనలు గట్టిగా వినిపించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్టయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 50 శాతం రిజర్వేషన్లనేవి విద్యా, ఉద్యోగాలపై మాత్రమేనని.. రాజకీయాలకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోంది. ఇక తమిళనాడు 69 శాతం ఉన్నపుడు ఒక్కో రాష్ట్రంలో ఒక్కక్క విధంగా ఎందుకు ఉండాలనే వాదనను సుప్రీం కోర్టులో వినిపిస్తామని చేప్తోంది.

21:05 - July 11, 2018

అనంతపురం : ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోదీకి రోజులు దగ్గర పడ్డాయని రాష్ట్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీని గెలిపిస్తే చంద్రబాబు సూచించిన నేత ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరవు నేలపై కేంద్ర వివక్ష పేరుతో అనంతపురంలో టీడీపీ నిర్వహించిన నిరసన దీక్షలో ప్రసంగించిన ఎంపీలు, మంత్రులు... బీజేపీ, వైసీపీ, జనసేనను టార్గెట్‌ చేశారు. రాయలసీమ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ ప్రజాప్రతినిధులు అనంతపురంలో దీక్ష చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆందోళన నిర్వహించారు. దీక్షా వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ప్రారంభించారు.
నిరసన దీక్షలో ప్రసంగించిన సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు... ప్రధాని మోదీని టార్గెట్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు 25 మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే... అన్ని హక్కులు సాధించుకోవచ్చన్నారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో చక్రం తప్పేది చంద్రబాబేనని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, కేశినేని నాని చెప్పారు.

రాయలసీమ.. ముఖ్యంగా అనంతపురం ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిగా చూడాల్సిన అవసరం ఉందని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన 350 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోడాన్ని ఎంపీ తోట నరసింహం తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై ఆరోపణలు చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఎంపీ నిమ్మల కిష్టప్ప మండ్డిపడ్డారు. కరువు సీమపై కేంద్ర వివక్షకు నిరసనగా టీడీపీ నిర్వహించిన నిరసన దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.

21:03 - July 11, 2018

విజయవాడ : సులభతర వాణిజ్య విధానంలో ఏపీకి మొదటి స్థానం దక్కడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు, ప్రజలు, అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైనందన్నారు. రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేదుకాబట్టే పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు. సులభతర వాణిజ్య విధానంలో ఏపీకి మొదటి స్థానం రావడం మంచిపరిణామని,ఈ విజయం తనకు నూతన జవసత్వాలను ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. సుపరిపాలనతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ మొదటి స్థానంలో ఉన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. జగన్‌ అవినీతితో ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతిందన్న చంద్రబాబు.. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రతిష్టను పునరుద్ధరించిన అంశాన్ని గుర్తు చేశారు. సులభతర వాణిజ్య విధానంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడానికి కృషి చేసిన అందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పారు. 

21:00 - July 11, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు సివిల్‌ నిర్మాణాలన్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పోలవరం పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గడ్కరీ చెప్పారు. ఏపీ ప్రభుత్వం అధికారులు మూడు రోజులు ఢిల్లీలో మకాంవేసి.. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని పోలవరంను సందర్శించిన గడ్కరీ సూచించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కాంట్రాక్టు సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్షించారు. జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.

పోలవరం సివిల్‌ పనులను వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తామని కాంట్రాక్ట్‌ సంస్థలు గడ్కరీ దృష్టికి తెచ్చాయి. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2019 ఫిబ్రవరిలోగానే సివిల్‌ నిర్మాణాలను పూర్తి చేయాలని గడ్కరీ ఆదేశించారు. ఇందుకు కాంట్రాక్టు సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయి. ప్రాజెక్టు పనుల కోసం అడ్వాన్స్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరగా... ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినందున.. ఇది సాధ్యంకాదన్నారు. పెరిగిన నిర్మాణ వ్యయానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మూడు రోజులు ఢిల్లీలో మకాంవేసి... కేంద్ర అధికారులతో చర్చించి, అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని గడ్కరీ సూచించారు. ఇందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారు. అన్ని సమస్యలు పరిష్కరించుకున్న తర్వాత పెరిగిన నిర్మాణ వ్యయంపై ఎనిమిది రోజుల్లో ఆర్థిక శాఖను వివేదిస్తానని గడ్కరీ చెప్పారు.

పోలవరం నిర్మాణ వ్యయం పెరిగినందున సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించాలని గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణ కార్యక్రమాల అమల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా పోలవరం ప్రాజెక్టునుపూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గడ్కరీ చెప్పారు. గడ్కరీ ఆదేశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ.. కేంద్ర కోరిన అన్ని వివరాలను అందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు స్థలంలో కేంద్ర మంత్రి గడ్కరీని కలిసేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు.. బీజేపీ కార్యకర్తలకు మధ్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. 

20:28 - July 11, 2018

అమ్మయ్య మొత్తం మీద థాయ్ లాండ్ బొయ్యారం కథ సుఖాంతమైంది..జేసీ దివాకర్ రెడ్డి అంటె ఫీలైతవ్ గని.. నీది నాల్కెనా తాటి మట్టనా..? అరే నీయక ఆ పోరని పేరేంది ఆ లోకేశం.. ఆ పోరన్ని ఎవ్వలికన్న మంచి డాక్టరుకు సూపెట్టుండ్రివా ఓ తెల్గుదేశమోళ్లు..అనంతపురం కాడ తెల్గుదేశం ఎంపీలు దీక్ష జేస్తున్నరు ఎందుకు..? ఓయమ్మనే ఈ ముచ్చట మూడు రోజులు ముందు దెలిస్తె చంద్రాలు ఆంధ్రరాష్ట్రమంత పండుగ జేసునో ఏమో..?అయ్యో హైకోర్టు ఎంత పనిజేశే.. ఇంకో నాల్గొద్దులు ఆగినా.. ఎన్నికలు అయిపోవు అప్పుడు ఏం జెప్పినా ఏంగాకపోతుండే..మంత్రి జగదీశ్వర్ రెడ్డిగారు తమరేమో గడ్కోపారి రచ్చగెలుస్తాని..పెద్దల పెద్దరికం పర్వు మర్యాదలు.. అన్ని గల్పి నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తేవెధ ఊర్లె ఒక శవాన్ని తయ్యారు జేశ్నయ్..గీ గరం గరం ముచ్చట్లు జూడాలంటే వీడియో క్లిక్ జేయండి...

విద్యావాలంటీర్ల నియామకం...

హైదరాబాద్ : 16,781 మంది విద్యావాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 20లోగా విద్యావాలంటీర్లను నియమించాలని అధికారులకు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 13-16 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టనున్నట్లు, 17న ఎంఈవో వెరిఫికేషన్ చేసి లిస్టును డీఈవోకు పంపాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఈనెల 20 నుండి విధుల్లో విద్యావాలంటీర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, వీరి వేతనం రూ. 12వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 

పంచాయతీ రిజర్వేషన్లపై ముగిసిన సమావేశం...

హైదరాబాద్ : పంచాయతీ రిజర్వేషన్లపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్, న్యాయనిపుణులు పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని భావించడం జరిగిందని ఆర్థిక మంత్రి రాజేందర్ పేర్కొన్నారు. కొన్ని శక్తులు కోర్టుకెళ్లి అడ్డుకున్నారని, 2 నుండి కొత్తపాలక మండళ్లా ? స్పెషల్ ఆఫీసర్ల పాలనా అనేది సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను సాధిస్తామని తెలిపారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం జరిగిందని, హై కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.

20 నుండి ఏపీలో లారీల నిరవధిక సమ్మె...

విజయవాడ : ఈ నెల 20 నుంచి ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు దిగనుంది. విజయవాడలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశమైంది. ఈ సమ్మెకు 13 జిల్లాలకు చెందిన లారీ యజమానులు తమ మద్దతు తెలిపారు.

19:31 - July 11, 2018
19:24 - July 11, 2018

'2019 డిసెంబర్ నాటికి పోలవరం డెడ్ లైన్'...

పశ్చిమగోదావరి : ఫిబ్రవరి నాటికి పోలవరం కాంక్రీట్ పనులను పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 2019 డిసెంబర్ నాటికి డెడ్ లైన్ పెట్టుకున్నట్లు, సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ. 57,940 కోట్లు అవసరమన్నారు. భూ సేకరణకు రూ. 33వేల కోట్ల అవసరమని, 2013 చట్టం ప్రకారం ఖర్చు అంచనాలు పెరిగినట్లు తెలిపారు. మెజార్టీ పనులన్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

 

మోత్కుపల్లికి అస్వస్థత...

చిత్తూరు : టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. కానీ అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. 

పోలవరం ఏపీకి కొత్త జీవం - గడ్కరి...

పశ్చిమగోదావరి : తాను పోలవరానికి రావడం ఇది రెండోసారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. పోలవరం పూర్తి చేయడానికి మోడీ కట్టుబడి ఉన్నారని, ప్రాజెక్టు ఏపీకి కొత్త జీవాన్ని ఇస్తుందని, త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను కోరడం జరగిందన్నారు. పోలవరం ఏపీకే కాదు..దేశానికి కీలకమైన ప్రాజెక్టు అని అభివర్ణించారు. పోలవరం రైతులకు జీవితాన్ని ఇస్తుందని, కేంద్ర, రాష్ట్ర అధికారులు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి సమస్యలను పరిష్కరించాలని సూచించామన్నారు. పెరిగిన ప్రాజెక్టు అంచనాను ఆర్థిక శాఖకు పంపిస్తామని ప్రకటించారు. 

18:51 - July 11, 2018

పశ్చిమగోదావరి : పోలవరం పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకున్నారు. పోలవరం నిర్మాణం జరుగుతున్న అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నాయి. కానీ ఇటీవలే టిడిపి..జిజెపి మధ్య సంబంధాలు తెగిపోవడం...ఇరు పార్టీల మధ్య విమర్శలు..ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పోలవరం నిధుల విషయంలో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో గడ్కరి పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాబు..గడ్కరి మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయనేది దానిపై ఉత్కంఠ నెలకొంది.

రెండు గంటల ముందే చేరుకున్న బాబు అక్కడున్న అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం గడ్కరి చేరుకున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ నేతలు కార్యకర్తలు...ఆందోళన చేపట్టారు. తమను అనుమతించాలని..గడ్కరితో మాట్లాడుతామని నేతలు పేర్కొన్నారు. కానీ పాస్ లున్న వ్యక్తులకు మాత్రమే అనుమతినిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. దీనితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

18:32 - July 11, 2018

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు విషయంలో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని..ఈ విషయంలో రాజకీయం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి వెల్లడించారు. బుధవారం ఆయన ప్రాజెక్టులో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం బాబు..మోడీ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయానికి నీరు ఎంతో ప్రధానమైందని, ఈ విషయంలో ప్రధాన మంత్రి మోడీ సానుకూలంగా ఉన్నారని, ప్రస్తుతం తాను ఇక్కడకు వచ్చి పనులను పరిశీలించడం జరిగిందన్నారు.

 తాను పోలవరానికి రావడం ఇది రెండోసారి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. పోలవరం పూర్తి చేయడానికి మోడీ కట్టుబడి ఉన్నారని, ప్రాజెక్టు ఏపీకి కొత్త జీవాన్ని ఇస్తుందని, త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను కోరడం జరగిందన్నారు. పోలవరం ఏపీకే కాదు..దేశానికి కీలకమైన ప్రాజెక్టు అని అభివర్ణించారు. పోలవరం రైతులకు జీవితాన్ని ఇస్తుందని, కేంద్ర, రాష్ట్ర అధికారులు మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి సమస్యలను పరిష్కరించాలని సూచించామన్నారు. పెరిగిన ప్రాజెక్టు అంచనాను ఆర్థిక శాఖకు పంపిస్తామని ప్రకటించారు. 

ప్రతి నెలా ఇక్కడకు వస్తానని హామీనివ్వడం జరిగిందని, కానీ కొన్ని సమస్యల వల్ల ఇక్కడకు రావడం జరగలేదన్నారు. ఈ విషయంలో తాను ఢిల్లీలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో కొన్ని సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆర్థిక మంత్రితో చర్చించి బాబు కోరినట్లుగా నిధుల అడ్వాన్స్ వచ్చే విధంగా చూస్తానని, డబ్బుల సమస్య లేదన్నారు. గిరిజన ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి న్యాయం జరిగే విధంగా చూస్తామని, ఈ విషయంలో రాజకీయం అవసరం లేదని..కేవలం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. 

18:29 - July 11, 2018

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టు 2019 సంవత్సరానికల్లా పూర్తి చేయడానికి కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈసందర్భంగా బాబు మాట్లాడుతూ...గతంలో డయా ఫ్రం వాల్ 553.8 మీటర్ల పని చేయడం జరిగిందని, ప్రస్తుతం 1396.06 మీటర్లు చేయడం జరిగిందన్నారు.

ఫిబ్రవరి నాటికి పోలవరం కాంక్రీట్ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. 2019 డిసెంబర్ నాటికి డెడ్ లైన్ పెట్టుకున్నట్లు, సవరించిన అంచనాల ప్రకారం పోలవరానికి రూ. 57,940 కోట్లు అవసరమన్నారు. భూ సేకరణకు రూ. 33వేల కోట్ల అవసరమని, 2013 చట్టం ప్రకారం ఖర్చు అంచనాలు పెరిగినట్లు తెలిపారు. మెజార్టీ పనులన్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 

పోలవరం ప్రాజెక్టుకు చరిత్ర ఉందని..1941లో ఈ ప్రాజెక్టు డీపీఆర్ సర్వే చేయడం జరిగిందని, 1983 లో అడ్మిట్ చేయడం జరిగిందన్నారు. 2010- 11లో రూ. 1.610 కోట్లు ఎస్టిమేట్ చేయడం జరిగిందని..ఇందుకు ప్లానింగ్ కమిషన్ అనుమతినిచ్చిందన్నారు. 2017లో మొత్తం క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. 2013- 2014 ప్రకారం రూ. 57,940 కోట్లు ఎస్టిమేట్ ఇచ్చిందన్నారు. భూసేకరణ ప్రధాన సమస్యగా మారిందని..ఇక్కడ ఖర్చు బాగా పెరిగిందన్నారు. 90 శాతం రైట్ కెనాల్ పనులు పూర్తయ్యాయని, లెఫ్ట్ కెనాల్ పనులు కూడా తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ 2019 డిసెంబర్ వరకు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రెండు లక్షల క్యూబిక్ మీటర్ల పనులు ప్రతి నెలా జరుగుతున్నాయన్నారు. డీపీఆర్ 2 అనుమతి, కొంత నిధుల అడ్వాన్స్.. విడుదల చేస్తే పనులన్నీ తొందరగా జరుగుతాయని..ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రిని కోరినట్లు వెల్లడించారు. 

పోలవరంలో గడ్కరి...

పశ్చిమగోదావరి : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పోలవరానికి చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఆయన జరుగుతున్న పనులను పరిశీలిస్తున్నారు.

17:47 - July 11, 2018

సంగారెడ్డి : జిల్లా ముత్తంగి జాతీయ రహదారిపై T.N.S.F ఆధ్వర్యంలో ఆర్.ఆర్.ఎస్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు రాస్తారోకో చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించి... తరగతులు నిర్వహించాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్ధులను అదుపులో తీసుకున్నారు.

 

17:45 - July 11, 2018

సంగారెడ్డి : జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో దళితులు పాదయాత్ర చేపట్టారు. నాలుగు దశాబ్ధాల క్రితం దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం.. వేరే నిర్మాణాలకు కేటాయించడంతో దళితులు ఆందోళన చేపట్టారు. మొగుడంపల్లి మండల కేంద్రం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటామని దళితులంటున్నారు. వారి ఆందోళనపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:43 - July 11, 2018

హైదరాబాద్ : పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని టీపీసీసీ విమర్శించింది. ఎన్నికల నిలుపుదలకు హైకోర్టులో కేసు వేసిన వారిలో టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా ఉన్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రవణ్‌ మండిపడ్డారు. నాగర్‌కర్నూల నియోజకవర్గం ఎంపీటీసీ గోపాల్‌రెడ్డి కేసు వేసిన విషయం టీఆర్‌ఎస్‌ నాయకులకు తెలియదా.. అని శ్రవణ్‌ ప్రశ్నించారు. 

17:41 - July 11, 2018

పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న గడ్కరి..

పశ్చిమగోదావరి : పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర జల వనరుల శాఖమంత్రి నితిన్ గడ్కరి పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఆయన వెంటన సీఎం చంద్రబాబు, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వున్నారు. గడ్కరికి దేవినేని, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. 

16:48 - July 11, 2018

ఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరమా కాదా అన్న అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. స్వలింగ సంపర్కంపై తాము ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నామని, సుప్రీంకోర్టు విచక్షణకే ఈ అంశాన్ని వదిలివేస్తున్నామని ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. ఆర్టికల్ 377ను రద్దు చేయాలంటూ పెట్టుకున్న అభ్యర్థనలపై సుప్రీం సీనియర్ జడ్జిలు విచారణ చేపడుతున్నారు. బ్రిటీష్ కాలం నాటి చట్టం ప్రకారం ఒకవేళ ఎవరైనా స్వలింగ సంపర్కానికి పాల్పడితే వాళ్లకు జీవిత కాల జైలు శిక్షను విధిస్తారు. 

16:47 - July 11, 2018

ఢిల్లీ : తాజ్‌మహల్‌ సంరక్షణ విషయంలో సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్‌మహల్‌ను రక్షించండి... లేదా మూసేయండి... లేదా ధ్వంసం చేయండని కోర్టు వ్యాఖ్యానించింది. తాజ్‌మహల్‌ను కాపాడుకోవాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్రం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తాజ్‌ మహల్‌ బాగోగులను పట్టించుకుంటాయన్న ఆశ కనిపించడం లేదని కోర్టు పేర్కొంది. పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కన్నా తాజ్‌మహల్‌ ఎంతో అందమైనదని.. దీన్ని సంరక్షిస్తే భారత్‌కున్న విదేశీ కరెన్సీ లోటు భర్తీ చేయొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశ సమస్యను పరిష్కరించే సత్తా ఉన్న ఏకైక కట్టడం తాజ్‌మహల్‌... అలాంటి తాజ్‌ను మీరు పట్టించుకోవడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. తాజ్‌ ట్రాపెజియమ్‌ జోన్‌ పరిధిలోని పరిశ్రమలను ఎందుకు మూయించడం లేదని టిటిజెడ్‌ ఛైర్మన్‌ను ప్రశ్నించింది. టిటిజెడ్‌ పరిధిలో కొత్త ఫ్యాక్టరీలకు అనుమతించమని ఛైర్మన్‌ కోర్టుకు హామీ ఇచ్చారు.

16:46 - July 11, 2018

చిత్తూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. బి.కొత్తకోట మండలం హార్సిలీ హిల్స్‌ ఘాట్‌రోడ్డులో ప్రమాదవశాత్తు కారు లోయలోకి దూసుకెళ్లింది. చెట్లు తగిలి కారు నిలిచిపోయింది.. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కడప నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. 

16:45 - July 11, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మొదటి, రెండు స్థానాలు తెచ్చుకున్నామని సంతోషపడడం కాదని.. ప్రజలు సులభతరంగా జీవించే విధంగా ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలన్నారు మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ వల్ల ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చింది... ఉపాధి అవకాశాలు ఎంత వరకు పెరిగాయన్నది చూడాలన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ర్యాంకుల వల్ల వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు మాత్రమే మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఇంకా విద్య, వైద్య రంగంలో వెనకబడే ఉన్నాయని... ప్రజలు చాలా సులభంగా జీవించే విధంగా ప్రభుత్వాలు చూసినప్పుడే అనుకున్న లక్ష్యం సాధించినట్లు అవుతుందన్నారు నాగేశ్వర్‌. 

16:44 - July 11, 2018

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని దేవతల గుట్టలో వందల ఎకరాలు కబ్జా అవుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు. యదేచ్ఛగా భూములు కబ్జా అవుతుంటే సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. కొంతమందికి టీఆర్‌ఎస్‌ నేతలు అండగా ఉండే భూకబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. భూములను పరిశీలించేందుకు కూడా ఎవరినీ అనుమతించకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఇదంతా జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కబ్జాకు గురైన భూములను రేపు ఉదయం పరిశీలిస్తామని.. అక్రమంగా భూములు కబ్జా చేస్తుంటే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోదన్నారు వీహెచ్‌. 

16:43 - July 11, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో అవినీతి వ్యవస్థీకృతమైందని వైసీపీ విమర్శించింది. సులభతర వాణిజ్య విధానంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటే సరిపోదని వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌ విమర్శించారు. ఈ నాలుగేళ్లలో ప్రజలకు ఏమి చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. 

16:40 - July 11, 2018

పిల్లల ఆరోగ్యానికీ, ఎదుగుదలకూ పాలు చాలా అవసరం. అలాగే వయసుతో తారతమ్యం లేకుండా పాలు అన్ని వయసులవారికి చాలా అవసరం. సాధారణంగా మనం ఎక్కువ ఆవు, గేదె పాలను వాడుతుంటాం. అంతగా కాకుంటే మేకపాలు, గొర్రెపాలు వాడుతుంటాం. ఆవుపాలు పిల్లలకు, పెద్దవారికి కూడా ఎంతో శ్రేష్టమయినవి. పాలు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. ఇది అందరికీ తెలుసు. పాలవలన బరువు తగ్గడము కూడా సాధ్యమేని నిరూపించబడింది. ఇజ్రాయిల్ పరిశోధకులు భారీ కాయము కలిగిన 45-60 మధ్య వయసు వున్న 300 మంది మీద జరిపిన పరిశోధనా ఫలితం ఇది. ప్రతిరోజూ 2 గ్లాసుల పాలు త్రాగడంతో పాటు పిండి పదార్ధము ఉన్న ఆహారము తక్కువగా తీసుకున్న వీరు 2 ఏళ్ళ కాలములో 5.5 కిలోల బరువు తగ్గడము గమనించారు. అందుకే పాలలోని కాల్సియం, విటమిన్‌ డి-బరువుతగ్గడములో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధనల ద్వారా స్పష్టమైనది. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైననేమి ఖరము పాలు అనే సామెతను మనం వింటుంటాం. కానీ ఆవుపాలకు మించిన డిమాండ్ ఒంటెపాలకు వచ్చింది.

ఆవు పాలకు మించిన డిమాండ్‌ ఇప్పుడు ఒంటె పాలకు..
ఆవు పాలకు మించిన డిమాండ్‌ ఇప్పుడు ఒంటె పాలకు ఉంది. ఆ ‘డిమాండ్‌’ను రూపాయల్లో లెక్కించాలంటే.. లొట్టిపిట్ట అంటే ఒంటె. దీనినే ఎడారి ఓడ అని కూడా అంటారు. ఒంటె పాలు లీటరు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 3వేల వరకూ పలుకుతోందట. అమెరికాలో అయితే రూ. 3500 వరకూ వెళ్తోంది. ఒంటెపాలతో పాటు పాల పౌడర్‌కూడా మనదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతోంది. రాజస్థాన్‌లోని ఒంటెల యజమానులకు ఈ డిమాండ్‌ వరంగా మారింది. దీంతో వారు ఒంటె పాలతో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.

పాల తయారీకోసం కొత్తగా యూనిట్లు..
బికనీర్‌, కచ్‌, సూరత్‌ ప్రాంతాల్లో పాల తయారీకోసం కొత్తగా యూనిట్లు కూడా వెలిశాయి. అసలేంటి ఈ ఒంటె పాల విశిష్టత అంటే.. వీటిలో సహజసిద్ధమైన ఇన్సులిన్‌ ఉందట. డయాబెటిస్‌ ఉన్న వారికి ఈ పాలు చాలా ఆరోగ్యకరమని కొన్ని జంతువులపై చేసిన పరీక్షల్లో తేలిందని పరిశోధకులు తెలపటంతో ఒంటెపాటకు డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది.

పలు దీర్ఘకాలిక వ్యాధులకు ఔషదంగా ఒంటెపాలు..
ఇదే కాక ఆటిజం, కీళ్లనొప్పుల పరిష్కారానికి, రోగనిరోధక శక్తి పెంపుదలకు ఉపకరిస్తాయని పరిశోధకులు అంటున్నారు. మిగిలిన పాలతో పోలిస్తే లాక్టోజ్‌ శాతం కూడా చాలా తక్కువగా ఉన్న కారణంగా.. లాక్టోజ్‌ సహించని వారికి ఒంటెపాలు మంచి ప్రత్యామ్నాయమని వారు చెబుతున్నారు. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఒంటెపాలను నేరుగా అస్సలు తాగకూడదు. మానవ శరీరంలోకి వెళ్లకూడని అనేక మలినాలు వీటిలో ఉంటాయట. ఈ పాలను శుద్ధి చేసిన తర్వాతే తాగడానికి వీలుగా తయారవుతాయి. 

16:29 - July 11, 2018

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధికి కృషి చేస్తుంటే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకరించడం లేదని టిడిపి ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి మంత్రులు, ఎంపీలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేంద్రం కల్లబొల్లి మాటలు చెబుతోందని, ఈ గడ్డపై ఎంతో మంది వీరులు పుట్టారని..వారి ఉద్యమ స్పూర్తిని తీసుకొని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అభివృద్ధికి మోడీ సహకరించాలని..కానీ అలా చేయడం లేదన్నారు. కరవు జిల్లా..ఎడారిగా మారుతున్న జిల్లాలో సంకల్పం పూనుకుని కాల్వలు..చెరువులు..నీళ్లతో నింపిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. అనంతపురం జిల్లాలో స్వచ్చమైన నీరు తాండవం చేస్తోందని, ఉద్యోగాలు..ఉపాధి కోసం..కడుపు మంటతో వలసలు వెళ్లిన కుటుంబాలను చూసి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతోందని తెలిపారు. కియో పరిశ్రమ ఏర్పాటు చేసి వలసల నివారణకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఏపీ రాష్ట్రం..జాతిపై చిన్న చూపు చూస్తున్నారని తెలిపారు. 

16:25 - July 11, 2018

అనంతపురం : టిడిపి మంత్రులు..ఎంపీలు జనసేన అధ్యక్షుడు పవన్ ను టార్గెట్ చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి మంత్రులు, ఎంపీలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ పై తీవ్ర ఆరోపణలు..విమర్శలు గుప్పించారు. బాబు..లోకేష్ లపై పవన్ చేస్తున్న ఆరోపణలను ఎంపీలు తిప్పికొట్టారు.

పవన్ ను చూస్తే బాధేస్తోందని..ప్రజారాజ్యాన్ని ప్రజలు నమ్మారని..కానీ వారు మాత్రం కోట్ల రూపాయల కొల్లగొట్టారని ఆరోపించారు. పవన్ అవినీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కోట్ల రూపాయలు తీసుకెళ్లి బీఫారాలు తీసుకున్నారని..ఇది వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. ఇవన్నీ పవన్ కు తెలియదా ? అని నిలదీశారు. ప్రజల్లో మమేకమవుతే రాజకీయాలు తెలుస్తాయని, కేంద్రంతో డబ్బులు తీసుకుని బీజేపీ ఏది చెబితే అదే చేస్తున్నాడని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 

2019 నాటికల్లా పోలవరం గ్రావిటి ద్వారా నీరు: దేవినేని

పశ్చిమగోదావరి : 2019 నాటికల్లా పోలవరం గ్రావిటి ద్వారా నీళ్లందిస్తామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు కొనసాగుతున్నాయన్నారు. దేశల్లోని 16 జాతీయ ప్రాజెక్టుల్లో పోలవరమే వేగంగా పూర్తవుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన కోసం కేంద్రం మంత్రి నితిన్ గడ్కరి వస్తున్నారని నిర్వాశితుల కోసం రూ.10 వేల కోట్లు ఇవ్వాలని గడ్కరినీ కోరతామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. 

16:07 - July 11, 2018

నిర్భయ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు మరణ శిక్ష విధించింది. కింద కోర్టు విధించిన తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసింది. రివ్యూ పిటిషన్ ను కొట్టివేస్తూ తుది తీర్పును వెలువరించడం పట్ల హర్షాతిరేకలు వ్యక్తమౌతున్నాయి. నిర్భయ ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు...ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. 2012 సంవత్సరంలో జరిగిన ఈ ఘటనపై 2018 జూలైలో సుప్రీం తీర్పును వెలువరించింది. ఈ అంశంపై న్యాయ సమస్యలు..సందేహాలను మానవి ' మై రైట్ ' కార్యక్రమంలో లాయర్ పార్వతి నివృత్తి చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

15:59 - July 11, 2018

అనంతపురం : వైసిపి..జనసేన..బిజెపి పార్టీలపై టిడిపి మంత్రులు, ఎంపీలు విమర్శల పర్వం కొనసాగుతోంది. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి మంత్రులు, ఎంపీలు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎంపీలు మాట్లాడారు. మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని... గద్దె నింపే వరకు పోరాటం చేస్తామని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలో ఏపీకి అన్యాయం చేసిన మోడీని గద్దె దింపే వరకు పోరాటం చేస్తామన్నారు. బీజేపీ..జనసేన..వైసీపీ పార్టీలు కుట్రల కూటమిగా ఏర్పడ్డాయని విమర్శించారు. ఏపీకి జరిగిన అన్యాయంలో వీరు కూడా పావుగా మారుతున్నారని..మోడీకి భజనపరులరని మండిపడ్డారు. ప్రశ్నించాల్సిన పవన్ జగన్ ఫ్యాన్ గాలిగా ఎందుకు మారాడో అర్థం కావడం లేదన్నారు. పోరాటం ఇక్కడితే ఆగదని..ఇంకా ఉధృతంగా సాగుతుందన్నారు. 

సైబర్ దొంగల ముఠా గుట్టు రట్టు ..

హైదరాబాద్ : సైబర్ దొంగల ముఠా గుట్టును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పోలీసులు రట్టు చేశారు. ఎస్బీఐ కాల్ సెంటర్ పేరుతో నగదు కాజేస్తున్న 30 మందిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్బీఐ ఖాతాల నుండి ఇప్పటి వరకూ రూ.5 కోట్లను ఈ ముఠా కాజేసినట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వారి వద్దనుండి రూ.80లక్షల నగదు, ల్యాప్ టాప్స్, క్రెడిట్ కార్డులు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. 

ఫీజుల కోసం 50మంది విద్యార్ధులను నిర్భంధించిన స్కూలు..

ఢిల్లీ : విద్యార్ధులు ఫీజులు చెల్లించలేదని ఓ స్కూలు యాజమాన్యం విద్యార్ధులపై జులుం ప్రదర్శించింది. ఫీజులు చెల్లించలేదని 50మంది విద్యార్ధులను రబియా గర్ల్స్ స్కూలు యాజమాన్యం గదిలో నిర్భంధించింది. 16మంది విద్యార్ధుల పేరెంట్స్ ఫిర్యాదు మేరకు స్కూలుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్ నివేదిక ఇవ్వాలని స్కూలు యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు. 

15:31 - July 11, 2018

డంపింగ్ యార్డులను సైక్లింగ్ పార్క్‌గా ఏర్పాటు : కేటీఆర్

హైదరాబాద్ : కాలుష్యం బారినపడ్డ ఢిల్లీపై వస్తున్న వార్తలు మనల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పారు. కొత్తగూడ బొటానికల్ పార్కును ప్రారంభిచిన తరువాత కేటీఆర్ మాట్లాడుతు..కాలుష్యం భయంకరమైన సమస్యగా మారిందన్నారు. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నా.. ప్రపంచంలో చివరి స్థాయిలో ఉన్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టు పక్కల లక్షా యాభై వేల ఎకరాల అటవీ భూమి ఉందన్నారు. కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలకు తరలిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యం : కేటీఆర్

హైదరాబాద్ : బొటానికల్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతు..కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌లోని 12 ఎకరాల పార్క్‌ను ప్రజలకు అంకితం చేసినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి ఉద్ఘాటించారు. ప్రతి నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారుతుంది. ప్రజలు సహకరిస్తేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు సరికొత్త పార్క్‌ను అందించామని తెలిపారు. పట్టణీకరణ జరిగితే పర్యావరణ దెబ్బతింటుందని పేర్కొన్నారు. 

వాయు కాలుష్యంపై సీప్రీం సీరియస్..

ఢిల్లీ : ప్రపంచ ప్రసిద్ధి పొందిన తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని కేంద్రానికి మొట్టికాయలు వేసింది. అధికార యంత్రాంగం ఉదాసీత వైఖిరిని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తాజ్‌మహల్ సంరక్షణ విషయంలో ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని కోర్టు ఆగ్రహించింది. రోజు రోజుకూ వాయు కాలుష్యం వ‌ల్ల‌ రంగుమారుతున్న పాలరాతి కట్టడాన్ని కాపాడాకోవాలంటూ దాఖలైన పిటీషన్‌పై స్పందిస్తూ కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

హైకోర్టులో పరిపూర్ణానంద పిటీషన్..

హైదరాబాద్ : శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తెలంగాణ పోలీస్ శాఖ తనను నగరం నుండి బహిష్కరించటాన్ని సవాల్ చేస్తు పరిపూర్ణానంద స్వామి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను తెలంగాణ పోలీస్ శాఖ విస్మరింస్తోందని ఆయన విమర్శించారు. తనపై విధించిన బహిష్కరణను వెంటనే తొలగించేలా న్యాయస్థానం తెలంగాణ పోలీస్ శాఖకు ఆదేశించాలని పిటీషన్ లో పరిపూర్ణానంద కోరారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ రేటింగే మా పనితీరుకు నిదర్శనం: చంద్రబాబు

అమరావతి : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ 1 స్థానం రావటం మా పనితీరుకు నిదర్శనమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మాటలు కాకుండా అభివృద్ధిని చేతల్లో చూపించామన్నారు. ఏపీలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు సంతృప్తిగా వున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రూ. 5.80 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయని..అవినీతి లేదు కాబట్టే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. అయినా మాపై కొందరు అవినీతి పరులని విమర్శలు చేయటంలో అర్థం లేదన్నారు. ఏపీ బ్రాండ్లను కొందరు భ్రష్టుపట్టించారని విమర్శించారు.

బీసీల రిజర్వేషన్లపై అన్ని పార్టీలు తమ వైఖరిని తెలపాలి : ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్ : బీసీల రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు తమ వైఖరిని స్పష్టంచేయాలని బీసీ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల సవరణ చేసేలా సీఎం ప్రయత్నించాలన్నారు. పోరాడి తెచ్చుకున్న రిజర్వేషన్లను ప్రభుత్వం కుదించే యత్నం చేస్తోందని కృష్ణయ్య ఆరోపించారు. అధికారంలో బీసీలకు వాటా దక్కకుండా పాలకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజకీయాల్లో రిజర్వేషన్లపై సీలింగ్ పెట్టడంలో అర్థంలేదన్నారు. ఈ విషయంలో బీసీ సంఘంగా తాము సుప్రీం కోర్టుకు వెళాతమని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. 

పేదలకు, వృద్ధులకు అన్నా క్యాంటీన్లు వరం : చంద్రబాబు

అమరావతి : అందరు కడుపునిండా తినాలనే ఉద్ధేశ్యంతోనే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. పేదలకు, వృద్ధులకు అన్నా క్యాంటీన్లు వరంలాంటివన్నారు. క్వాలిటీలోను, కాంటిటో విషయంలోను రాజీ పడకుండా రాజీ పడకుండా పేదలకు ఆహారం అందిస్తామని చంద్రబాబు తెలిపారు. పూర్తి పాదర్శకంగా క్యాంటీన్లను నిర్వహించేందుకు ప్రజల నుండి అభిప్రాయ సేకరిస్తామన్నారు. రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్ల ద్వారా 2.50లక్షల మందికి అల్పాహారం, భోజనం ఏర్పాటు చేశామన్నారు.

14:48 - July 11, 2018

ఢిల్లీ : మణిపూర్ లోని తమెన్ లాంగ్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో 9మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు పిల్లలున్నారు. కానీ ఐదుగురు పిల్లలు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కొండచరియలు విరిగిపడడంతో పలు నివాసాలు ధ్వంసమయ్యాయి. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడం...వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. ప్రస్తుతానికి ఏడుగురు మృతదేహాలను వెలికి తీశారు. ప్రతికూల వాతావరణం ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు. సహాయక చర్యలు మాత్రం కొనసాగిస్తున్నట్లు డిప్యూటి కమిషనర్ రవీందర్ సింగ్ పేర్కొన్నారు. 

లోకేష్ ను ఎస్వీ మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేశారేమో : టీజీ

అమరావతి : లోకేష్ ను ఎస్వీ మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేశారని అనుకుంటున్నారని టీజీ వెంకటేశ్ అభిప్రాయపడ్డారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను మంత్రి నారా లోకేష్ ప్రకటించడంపై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఈ విధంగా స్పందించారు. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్న తర్వాత తాను స్పందిస్తానని తెలిపారు. బీఫామ్ ఇచ్చే ముందు అభ్యర్థిని చంద్రబాబు ప్రకటిస్తారని...

14:18 - July 11, 2018

ఢిల్లీ : దేశ ఆర్థిక నగరం ముంబై అతలాకుతలమవుతోంది. గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. బుధవారం తక్కువగా వర్షం కురుస్తుండడంతో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. సహాయక చర్యల కోసం 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

రైలు సర్వీసులను నిలిపివేయగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముంబై, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, గుజరాత్ లో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా రవాణా సౌకర్యం అంతగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:17 - July 11, 2018

హైదరాబాద్ : మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మొక్కలు పెట్టడం, పెంచడం గవర్నమెంట్ పని అనుకోవడం పొరపాటని ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈమేరకు ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలు పూర్తిస్థాయిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొక్కలు పెంచడం లక్ష్యంగా పెట్టుకోవాలని.. మొక్కలు పెంచడం ఒక ఉద్యమస్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్ కావాలన్నారు. అయితే మొక్కలు పెంచడంతోనే పర్యావరణాన్ని కాపాడలేమన్నారు. హెచ్ ఎండీఏ ఆధ్వర్యంలో 40 చెరువులు, జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో 40 చెరువులను శుద్ధీకరించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. 

 

14:16 - July 11, 2018

మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశ పెట్టిన పలు పథకాలు అక్రమార్కులకు వరంగా మారిపోయాయి. భూ రిజిష్ట్రార్ ల పేరిట ఓ ఎమ్మార్వో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తపేటలో చోటు చేసుకుంది. కొత్తపేట వద్ద సర్వే నెంబర్ లో భూ వివాదం నెలకొంది. ఈ వివాదం పరిష్కారించాలంటే రూ. 1.50 వేలు ఇవ్వాలని రియల్టర్ ను ఎమ్మార్వో డిమాండ్ చేశాడు. దీనితో సంబంధిత రియల్టర్ ఏసీబీకి సమాచారం అందించారు. పక్కా ప్లాన్ తో రూ. 1.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. గతంలో కూడా ఇతనిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

14:11 - July 11, 2018

హైదరాబాద్ : ఎవరైనా..  వ్యాపారంలో ఒక ఏడాది నష్టం వస్తే భరిస్తారు.. రెండేళ్లు అయినా ఇదొక్కసారి చూద్దాంలే అనుకుంటారు. కానీ, వరుసగా మూడో ఏడూ నష్టాలే వస్తే.. తక్షణం ఆ వ్యాపారాన్ని మూసేస్తారు. కానీ, రైతుకు వ్యవసాయంలో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఇరవై ఏళ్లుగా నష్టాలే.. నష్టాలు. కనీసం పెట్టుబడి కూడా దక్కని దయనీయ స్థితి.. దీనికి కారణం ఎవరు..? కచ్చితంగా పాలకులే. ద్రవ్యలోటును తగ్గించుకునే క్రమంలో చేస్తున్న విన్యాసాలే రైతులను అప్పుల ఊబిలోకి.. అక్కడి నుంచి వద్యశిలకు తోసేస్తున్నాయి. 
ఇరవై ఏళ్లుగా వరుస నష్టాలు...
ఇరవై ఏళ్లుగా వరుస నష్టాలు...సేద్యపు నష్టాల్లో భారత్‌కు ప్రపంచంలోనే అగ్రస్థానం... అవును.. భారత దేశంలో వ్యవసాయం ఓ జూదంగా మారిపోయింది. ప్రతిఏడాదీ కోటి ఆశలతో సేద్యం చేసే రైతులు.. గడచిన ఇరవై ఏళ్లలో ఒక్కసారీ లాభం గడించలేదు సరికదా.. పెట్టుబడి మొత్తాన్ని కూడా సంపాదించలేక పోయారు. ఇది ఎవరో వేసిన కాకి లెక్కలు కాదు. అంతర్జాతీయ సంస్థ.. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఓఈసీడీ... 36 దేశాల్లో విస్తృతంగా సర్వే చేసి వెల్లడించిన సత్యం. 
ఓఈసీడీ సంస్థ అత్యంత పకడ్బందీగా సర్వే 
ఓఈసీడీ సంస్థ అత్యంత పకడ్బందీగా ఈ సర్వేని నిర్వహించింది. వరుస నష్టాలకు కారణాలనూ అధ్యయనం చేసింది. ఈ క్రమంలో స్థూల రాబడులు, పాత సూచీలను ఎన్నింటినో పరిశీలించింది. 2000-2016 మధ్య కాలంలో సేద్యపు రాబడులు.. ఏటేటా ఆరు శాతం చొప్పున.. సగటున  14శాతానికి పడిపోయాయి. దీన్నిబట్టే.. భారత్‌లో సేద్యం ఏ దుస్థితిలో ఉందో.. రైతు బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయో తేటతెల్లం అవుతోంది. మరి ఈ దుస్థితికి కారణం ఎవరు..? ఇంకెవరు.. ఘనత వహించిన పాలకులే..!
పాలకుల అస్తవ్యస్థ వాణిజ్య విధానాలు
భారత్‌లో పాలకుల అస్తవ్యస్థ వాణిజ్య విధానాలు రైతాంగాన్ని నష్టాల్లో తోసిందన్నది ఓఈసీడీ సర్వే తేల్చింది. ద్రవ్యలోటును పూడ్చుకునే వంకతో.. ఆహారం ధరలను అతి తక్కువగా కొనసాగించారన్నది సర్వేలో తేలింది. ఎగుమతులపై ఆంక్షలు విధించిన ప్రభుత్వాలు.. ప్రపంచ మార్కెట్‌లో వచ్చే పరిణామాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా భారత్‌ పంచదార, బియ్యం, జొన్న, గోధుమ, బాస్మతి బియ్యం వంటి ఉత్పత్తులను గణనీయంగా ఎగుమతి చేసి.. లాభాలు గడించే అవకాశాలను కోల్పోయింది. మరోవైపు.. పదే పదే ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఇచ్చారే తప్ప.. సేద్యంలో పెట్టుబడులు,  ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వంటి ప్రధాన అంశాలను పాలకులు విస్మరించారన్నది సర్వే తేల్చిన సత్యం. 
భూమి కలిగిన రైతులు 62 శాతం 
భారత్‌లో, 0.80 హెక్టార్లలోపు భూమి కలిగిన రైతులు 62 శాతం మంది ఉన్నారు. వీరు వ్యవసాయేతర వృత్తుల్లోకి మారకపోతే.. శాశ్వతంగా దిగువ పేదరికపు జీవులుగా బతకాల్సిన దుస్థితి నెలకొంటుందని నీతి ఆయోగ్‌ సైతం గుర్తించినట్లు.. సర్వే నిర్వహించిన ఓఈసీడీ సంస్థ వెల్లడించింది. భారత్‌లో 2011 నుంచి వ్యవసాయ ఉత్పాదనలు ఏటా 3.6 శాతం మేర పెరుగుతూ వస్తున్నాయి. జీడీపీ 1990 నుంచి 5 శాతం వరకూ పెరిగింది. ఫలితంగా దేశంలో పేదరికం సగానికి తగ్గినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. 
వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుబట్టిన సర్వే  
వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడాన్ని సర్వే తప్పుబట్టింది. దేశీయ ద్రవ్యలోటును తక్కువగా చూపేందుకు ప్రత్యేకమైన వాణిజ్య ఆంక్షలు డిజైన్‌ చేశారు. ఇందులో భాగంగా.. ఎగుమతులపై తరచూ బ్యాన్‌ విధించడం.. కనీస మద్దతు ధరను అంతర్జాతీయ స్థాయితో పోలిస్తే అత్యంత తక్కువగానే నిర్ణయించడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా.. ఇరవై ఏళ్లుగా.. ఏలికలు తీసుకుంటున్న అస్తవ్యస్థ విధానాల కారణంగా.. భారత రైతు పెను సంక్షోభంలో కూరుకు పోయాడు. ఈ పరిస్థితిలో స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికను యథాతథంగా అమలు చేసి... రైతును లాభాల బాట పట్టించాలి. తద్వారా.. ఇంతకాలం రైతుకు చేసిన అన్యాయాన్ని పాలకులు సరిదిద్దుకున్నట్లు అవుతుంది. మరి ఏలికలు ఆదిశగా అడుగులు వేస్తారా..?  చూడాలి. 

14:04 - July 11, 2018

నల్గొండ : దక్షిణ తెలంగాణ జిల్లాల పట్ల టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వివక్ష చూపుతోందని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండజిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులను బీఎల్‌ఎఫ్‌ నేతలతో కలిసి పరిశీలించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ పనులను పూర్తిచేయకుంటే.. బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జూలకంటి హెచ్చరించారు. 

14:01 - July 11, 2018

కృష్ణా : జిల్లా నందిగామలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. తమ సమస్యలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ 12 రోజుల నుండి కార్మికులు సమ్మె చేస్తున్నారు. అధికారులకు, కార్మికులకు మధ్య జరిగిన చర్చలు ఫలించకపోవడంతో సమ్మె రోజు రోజుకీ ఉధృతం అవుతోంది. అయితే చెత్త ఏరివేసేందుకు మున్సిపల్‌ అధికారులు కాంట్రాక్టు కూలీలను నియమించడంతో ఆ కూలీలను పంచాయితీ కార్మికులు అడ్డుకున్నారు. కొంత ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్మికులను అరెస్ట్‌ చేశారు. 

13:49 - July 11, 2018

మహబూబ్ నగర్ : అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. కొత్తకోట తహసీల్దార్ ఏసీబీకి చిక్కాడు. రూ.150000 లంచం తీసుకుంటూ ఎమ్మార్వో మల్లికార్జున్ రావు ఏసీబీకి పట్టుబడ్డాడు. 

13:45 - July 11, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. నాలుగురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకున్నాయి. నాలుగు రోజుల నుండి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. జంటనగరాల్లో మరోరెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నగరంలో మూడు, నాలుగు రోజులుగా చిరుజల్లులతోపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఛత్తీస్‌ఘడ్‌, దానిని ఆనుకుని ఉన్న ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో 7కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో రెండురోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 
    
ఐదు రోజులుగా మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పెనుగంగాలో వరద ప్రవాహం పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కొమురంభీం, చెన్నూరు నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలకు రాకపోకలు స్థంభించాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పెనుగంగా, గోదావరి నదులు కలిసే కాళేశ్వరం వద్ద వరద ఉధృతి 7.5 మీటర్లకు చేరుకుంది. వర్షం ప్రభావంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై మేడిగడ్డ ప్రాజెక్టు, అన్నారం బ్యారేజీ పనులు నిలిచిపోగా... కన్నెంపల్లి పంప్‌ హౌజ్‌ పనుల్లో వేగం తగ్గింది. అన్నారం బ్యారేజి వద్ద వరద నీటిని ఆపేందుకు నిర్మించిన తాత్కాలిక కట్ట తెగిపోవడంతో ఈరోజు 12,500 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుంది.

భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు, వంకలు పొంగి గోదావరి వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. 16 అడుగులు ఉన్న గోదావరి నీరు 26 అడుగులకు చేరింది. గోదావరికి ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో నిర్మాణంలో ఉన్న రెండవ బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. వరద నీరు క్రమంగా స్నానాల ఘట్టాల వరకు చేరుకోవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఇబ్బందిపడుతున్నారు. 

భద్రాద్రి జిల్లా జూలూరుపాడ్‌ మండలం పాపకొల్లు పంచాయితీ వెనకతండా గ్రామంలో రహదారులు చిత్తడిగా మారాయి. జూలూరుపాడు మండల కేంద్రానికి సుమారు 8 కిలోమీటర్లు దాటి వెళ్లాల్సి ఉంటుంది. అత్యవసర పనులకోసం మండలానికి వెళ్లాలంటే నరకయాతన పడుతున్నారు అక్కడి ప్రజలు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోలేదని వారు వాపోతున్నారు. అధ్వాన్నంగా ఉన్న రహదారికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని రహదారికి అడ్డంగా కంచెవేసి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చేవరకు కంచె తీసేదిలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాజమహేంద్రవరం, కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం, అమలాపురం, రంపచోడవరం డివిజన్లలో వర్షం జోరుగా కురుస్తోంది. వర్షాలతో కోనసీమలో పొలాలు ముంపు బారిన పడ్డాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో రాజమహేంద్రవరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు  ఓడిశామీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో మరో రెండు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

13:42 - July 11, 2018

సూర్యపేట : జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. వైద్యం వికటించి బాలింత, శిశువు మృతి చెందారు. సూర్యపేటలోని శ్రీ శివసాయి ఆస్పత్రిలో రామారంకు చెందిన బాలింత మణెమ్మ, శిశువు మృతి చెందారు. ఆపరేషన్ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందారని డాక్టర్లు తెలిపారు. అయితే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తల్లి, శిశువు చెందారని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 

 

13:32 - July 11, 2018

యదాద్రి : జిల్లాలో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోచంపల్లి మండలం పెద్దరావులపల్లికి చెందిన ప్రసన్నతో బీబీనగర్ కు చెందిన ఓ యువకుడితో ఇటీవలే ప్రేమ వివాహం జరిగింది. బీబీనగర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రసన్న ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనేపథ్యంలో బీబీనగర్ తహశీల్దార్ ఆఫీస్ పక్క గల్లీలోని నివాసంలో ప్రసన్న కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. 

12:57 - July 11, 2018

కర్నూలు : జిల్లాలో వీఆర్ఓ ఆత్మహత్య కలకలం రేపింది. రాజకీయ ఒత్తిళ్లతో వీఆర్ ఓ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొమిలిగుండ్ల మండలం ఎర్రగూడి గ్రామ నివాసి హాజివలీ కోవెలకుంట్ల మండలం బిజిమేముల గ్రామంలో వీఆర్ ఓ గా విధులు నిర్వహిస్తున్నారు. ఓ పొలం పాసు పుస్తకం విషయంలో హాజివలీపై తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. పొలిటికల్ లీడర్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో కోవెలకుంట్ల తహసీల్దార్ కార్యాలయంలో అధికారుల ముందే హాజివలీ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. వీఆర్ ఓ మృతితో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

12:44 - July 11, 2018

కృష్ణా : విజయవాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబునాయడు ప్రారంభించారు. 20 మున్సిపాలిటీల్లో 60 క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. ఐదు రూపాయలకే అల్పాహారం ఇవ్వనున్నారు. ప్రతీ క్యాంటీన్ నుంచి 300 మందికి అల్పాహారం పంపిణీ చేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

ప్రేమ వివాహం..అపై నవ వధువు ఆత్మహత్య..

యాదాద్రి భువనగిరి : బీబీ నగర్ తహశీల్దార్ కార్యాలం వద్ద వున్న తన నివాసంలో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వివాహం చేసుకున్న కొద్ది రోజులకే ప్రసన్న అనే నవ వధువు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివాహం అనంతరం బీబీ నగర్ లోని ఓ ప్రయివేట్ కళాశాలలో ప్రసన్న ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రసన్న బీబీ నగర్ కు చెందిన ఓ యువడికిని ప్రేమ వివాహం చేసుకుంది. పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామానికి చెందిన ప్రసన్న వివాహం జరిగిన కొద్ది కాలానికే ప్రసన్న ఆత్మహత్య చేసుకోవటం పలు అనుమానాలను దారి తీస్తోంది. 

అధికారుల ముందే వీఆర్వో ఆత్మహత్య..

కర్నూలు : వీఆర్వో అధికారుల ఎదురుగానే ఆత్మహత్యకు పాల్పడటం జిల్లాలో కలకలం రేగింది. కోవెలకుంట్ల తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వో హజివలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ఓ పొలానికి సంబంధించిన పాస్ బుక్ విషయంలో రాజకీయ వేధింపులతోనే వీఆర్వో హాజివలీ ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. కాగా గత కొంతకాలంగా మనస్తాపంతో వున్న హజీవలీ రాజకీయ, అధికారుల వేధింపులతోనే హజీవలి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం. హజీవలి మృతితో ఆయన స్వస్థలం కొమిలిగుండ్ల మండలం ఎర్రగుడిలో విషాయ ఛాయలు అలముకున్నాయి. 

వెంకయ్య ఉప రాష్ట్రపతి కావటం ఏపీకి శాపం: జేసీ

అనంతపురం: వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కావడం కూడా రాష్ట్రానికి శాపమైందని ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీపై కేంద్రం వైఖరికి నిరసనగా జిల్లాలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఎంపీలు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నంత వరకు ఏపీకి బెల్లం ముక్క కూడా ఇవ్వరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పానని అన్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రయత్నం చేయాలని సీఎం అన్నారని తెలిపారు. పదవులు వస్తున్నకొద్దీ హుందాగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

12:13 - July 11, 2018

అనంతపురం : వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కావడం రాష్ట్రానికి శాపంగా మారిందని టీడీపీ ఎమ్మెల్మే జెసి దివాకర్ రెడ్డి అన్నారు. టీడీపీ ధర్మపోరాట దీక్షలో ఆయన మాట్లాడారు. వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ విభజన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు జరుపుతామని చెప్పారని గుర్తు చేశారు. అలాగే ఏపీకి ప్రత్యేకహోదా 5 సం.రాలు సరిపోదని.. 10 ఏళ్లు ఇవ్వాలని నాడు చెప్పారని పేర్కొన్నారు. కానీ ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. పదవి వచ్చేకొద్ది ఉందాగా బతకాలని చెప్పారు. మోడీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ఏపీకి ఆరు నామాలు పెట్టిన ప్రబుద్ధుడు నరేంద్రమోడీ అని ఎద్దేవా చేశారు. తాను మొదట్లోనే బీజేపీ ప్రభుత్వంతో విడాకులు తీసుకుంటే మంచిదని అని చెప్పా...కానీ చంద్రబాబు వెయిటింగ్ చేద్దామన్నారని..పేర్కొన్నారు. కానీ మోడీ వల్ల రాష్ట్రం సాధించేది ఏమీ లేదన్నారు. దేశంలో ఇద్దరే ప్రధానమైన మంత్రులని..ఒకటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అని తెలిపారు. మిగిలిన మంత్రులు ఆల్ మోస్ట్ ఆల్ గా తీసేసిన కరివేపాకు లాంటివారని అన్నారు. సెక్రటరీలు చాలా దుర్మార్గులని...ప్రధాని, ముఖ్యమంత్రులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సీఎం రమేష్ సంవత్సరం పాటు దీక్ష చేయాలన్నారు. సీఎం రమేష్ పోతే తప్ప కడప ఉక్కు ఫ్యాక్టరీ రాదన్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకే ఈ దీక్షలు చేపట్టినట్లు తెలిపారు.

 

అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన చంద్రబాబు..

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. కేవలం రూ.5లకే అన్నా క్యాంటీన్లలో అల్పాహారం అందించేందుకు 20 మున్సిపాలిటీల్లో 60 అన్నా క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతీ క్యాంటీన్ నుండి ప్రతీ రోజు 300ల మందికి ఈ అల్పాహారాన్ని అందించనున్నారు. అన్నా క్యాంటీన్ల క్యాటరింగ్ బాధ్యతలను ప్రభుత్వం అక్షయ పాత్ర ఫౌండేషన్ కు అప్పగించింది. కాగా త్వరంలో రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. 

12:02 - July 11, 2018

అమరావతి : బిర్యానీ పేరు చెబితే మాంసాహారుల నోటి వెంట లాలాజలం ఊరిపోతుంది. అందునా బిర్యానీ పేరు చెబితే హైదరాబాద్ గుర్తుకు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే హైదరాబాద్ బిర్యాని అంత ఫేమస్. ఇక బిర్యానీల్లో ఎన్నో రకాలున్నాయి. బిర్యానిని చేయటంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ వుంటుంది. బిర్యానీల్లో ఎన్నో రకాలున్నాయి. కుండ బిర్యానీ, దమ్ బిర్యాని.. ఇలా ఎన్నో రకాలు. రకాలు ఎనైనా..బిర్యానికుండే క్రేజ్ మాత్రం తగ్గదు. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంతటి ఫేమస్సో..ఎంతటి రుచో అందరికీ తెలిసిన విషయమే. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న తెలుగు రాష్ట్రాలు ఆహారం విషయంలో కూడా వారి వారి ప్రత్యేకతలను చాటు కుంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ బిర్యాని తెలంగాణకు ఎలా బ్రాండో..ఇకపై 'బొంగు బిర్యానీ' ఏపీకి బ్రాండ్ కానుంది.

ఏపీ బిర్యానీగా బొంగు బిర్యానీ ప్రమోట్ చేయానే నిర్ణయం..
ఏపీ బిర్యానీగా బొంగు బిర్యానీ ప్రమోట్ చేయాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం రాష్ట్ర బ్రాండ్ గా 'బొంగు బిర్యానీ'ని ప్రకటించింది. ఏపీ ఆహారంగా ఈ రకం బిర్యానీని ప్రచారంలోకి తేవాలని నిర్ణయించిన ఏపీ పర్యాటక శాఖ, అందుకోసం ఓ వార్షిక ప్రణాళికను కూడా సిద్ధం చేసింది.

చెఫ్ లకు బొంగు బిర్యానీ, బొంగు చికెన్ తయారీపై శిక్షణ
ఇందులో భాగంగా ప్రముఖ హోటళ్లలోని చెఫ్ లకు బొంగు బిర్యానీ, బొంగు చికెన్ తయారీపై శిక్షణ ఇవ్వడం, ఇప్పటివరకూ విశాఖ, అరకు పర్యాటకులకే తెలిసిన రుచిని రాష్ట్రానికి వచ్చే అతిథులకు రుచి చూపించాలని, విద్యార్థులకు, మహిళలకు బొంగులో వంటకాలపై పోటీలు పెట్టాలని నిర్ణయించింది. ఇదే సమయంలో అన్ని ముఖ్య హోటళ్లలో కనీసం రెండు హోటళ్లు వారం రోజుల పాటు ఆంధ్రా సంప్రదాయ వంటకాలనే వడ్డించేలా ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించాలని కూడా పర్యాటక శాఖ నిర్ణయించింది. 

11:57 - July 11, 2018

అనంతపురం : పవన్ కళ్యాణ్, జగన్ లకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని టీడీపీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. అనంతపురంలో నిర్వహించిన టీడీపీ ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పవన్, జగన్ లు బీజేపీతో లాలూచీగా ఉంటూ కేంద్రానికి వంత పాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, జగన్ కు నక్కకు నాగలోకానికి, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది' అని అన్నారు. 'జగన్ అవినీతి పరుడు.. చంద్రబాబు నీతి పరుడు' అని పేర్కొన్నారు. 'విజయసాయిరెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్దకు వెళ్తే రాజశేఖర్ రెడ్డి పైకి పోయాడు...జగర్ దగ్గరకు వెళ్లిన తర్వాత జగన్ జైలుకు వెళ్లాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి మోడీ దగ్గరకు వెళ్తున్నాడు.. ఇక మోడీ ఎక్కడి పోతాడో తెలియదు' అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిందని మండిపడ్డారు. 

11:44 - July 11, 2018

కర్ణాటక : పోలీసు ఉద్యోగమంటే సమాజంలో ఒక భయం వుంటుంది. వారికుండే అధికారాలు అటువంటివి. సమాజం కోసం ఎటువంటి సమయంలోనైనా ముందుగా నిలిచేది పోలీసులే. సామాన్యులకు సమస్యలు వచ్చినా..విఐపీలకు అవసరమొచ్చినా ప్రతీ విషయంలోను పోలీసుల ప్రాముఖ్యత కీలకమైనది. అటువంటి పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వుంటేనే సరిపోదు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వారికి 'ఫిట్ నెస్' చాలా ముఖ్యం. పోలీస్ ఉద్యోగంలో చేరినప్పుడు అందరు 'ఫిట్'గానే వుంటారు. తరువాత ప్రాకీస్ మానివేసి ఓవర్ వెయిట్ పెరిగిపోతుంటారు. దీంతో వారి ఫిట్ నెస్ కాస్తా అటకెక్కిపోతుంది. ఇప్పుడు కన్నడ నాట ఆ బానపొట్ట కలిగిన పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఫిట్ నెస్ లేని పోలీసులను సస్పెండ్ చేసి ఇంటికే పంపిచేస్తామంటు అల్టిమేటం జారీచేశారు అధికారులు. దీంతో ఓవర్ వెయిట్ కలిగిన పోలీసులు వ్యాయామాలు ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది.
శరరీ బరువును తగ్గించకుంటే సస్పెన్షన్ తప్పదంటున్న ఏడీజీ భాస్కరరావు
పెరుగుతున్న శరరీ బరువును తగ్గించకుంటే సస్పెన్షన్ వేటు తప్పదంటూ ఆ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ భాస్కరరావు హెచ్చరించారు. బరువు ఎక్కువున్న పోలీసులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఏబీజీ భాస్కరరావు తెలిపారు. నిర్దేశిత బరువు కంటే ఎక్కువ ఉన్న పోలీసులు తప్పకుండా దానిని తగ్గించుకోవాల్సిందేనని, లేదంటే సస్పెన్షన్ వేటుకు గురి కావడమో, కఠిన విధులు అప్పజెప్పడమో, అదనపు డ్యూటీలు వేయడమో చేస్తామని ప్రకటించి పోలీసుల గుండెల్లో వణుకు పుట్టించారు.

పోలీస్ క్యాంపుల్లో శారీరక దారుఢ్య కార్యక్రమాలు : భాస్కరరావు
దేశం ఆరోగ్యవంతమైన వ్యక్తులను కోరుకుంటోందన్న ఏడీజీ, అందుకు అనుగుణంగా పోలీస్ క్యాంటీన్లలో అందించే ఆహారంలోనూ మార్పులు చేయనున్నట్టు తెలిపారు. పోలీస్ క్యాంపుల్లో శారీరక దారుఢ్య కార్యక్రమాలను పెంచుతామన్నారు. బరువు ఎక్కువ ఉన్న పోలీసులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తామన్నారు. గడువులోగా బాన పొట్టలు తగ్గించుకోకుంటే చర్యలకు సిద్దంగా ఉండాలని భాస్కరరావు హెచ్చరించారు.

11:39 - July 11, 2018

కృష్ణా : విజయవాడలో ఉపాధ్యాయలు మహాధర్నా చేపట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ధర్నా చేపట్టారు. ఉపాధ్యాయలు ధర్నా స్థలికి చేరుకుంటున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. మహాధర్నా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే  ఉపాధ్యాయసంఘాల నేతలను గృహనిర్బంధాలు చేస్తున్నారు. టోల్ గేట్, బస్టాండ్, రైల్వే ష్టేషన్ లవద్ద  పలువురిని పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు. 

 

మరో పోరాటానికి సిద్ధమైన టీడీపీ ఎంపీలు..

అనంతపురం: ఏపీకి కరువు నిధులు మంజూరులో కేంద్రం చేసిన అన్యాయాన్ని నిలదీసేందుకు టీడీపీ ఎంపీలు మరోపోరాటానికి సిద్ధమయ్యారు. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో కరువు నేలపై కేంద్రం వివక్ష పేరిట దీక్ష చేపట్టనున్నారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు.

మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్రిక్తం..

కృష్ణా : నందిగామలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. డిమాండ్ల సాధన కోసం 12 రోజులుగా కార్మికులు సమ్మెకు దిగడంతో నగరంలో భారీగా చెత్తా చెదారం పేరుకుపోయింది. దీంతో ప్రైవేట్‌ వ్యక్తులను మున్సిపల్‌ అధికారులు రంగంలోకి దింపింది. విషయం తెలిసిన కార్మికులు పారిశుద్ధ్య పనులను అడ్డుకుని ఆందోళనకు దిగారు. ప్రైవేట్‌ వ్యక్తులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడకు చేరుకుని కార్మికులను అడ్డుకున్నారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు.

11:08 - July 11, 2018

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. భారీవర్షాలతో ముంబై అతలాకుతలం అయింది. వర్షపు నీటిలో ముంబై వీధులు మునిగి తేలుతున్నాయి. గత 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. రోడ్లు, వీధులన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. నగరంలో పలు రైళ్లు రద్దయ్యాయి. పాఠశాలలు బంద్‌ అయ్యాయి. మరో 48 గంటల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబాయి, కొంకణ్‌, గోవా, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. దీంతో అవసరమైతేనే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని అధికారులు సూచించారు. సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగింది. 

 

భార్య ఎన్నికల ఖర్చుల కోసం భర్త దోపిడీలు..

ఉత్తరప్రదేశ్ : భార్య ఎన్నికల ఖర్చుల కోసం దోపిడీలు చేసిన భర్త బాగోతం బైటపడింది. యూపీలోని ప్రతాప్‌ఘడ్ జిల్లా లాల్‌గంజ్ బ్లాక్‌లోని మద్వా గ్రామానికి చెందిన పంచ్‌లాల్‌వర్మ, సంగీతావర్మలు భార్యాభర్తలు. భార్య సంగీతావర్మ మద్వా గ్రామ ప్రధాన్ గా పోటీ చేసి విజయం సాధించింది. భార్య ఎన్నికల ఖర్చుతోపాటు ఆమె విజయం సాధించాక విజయోత్సవం కోసం భర్త పంచ్‌లాల్‌వర్మ ఇరుగుపొరుగువారు, బంధువుల నుంచి రూ.25 లక్షలు అప్పు చేశాడు.

11:03 - July 11, 2018

కృష్ణా : విజయవాడలో ఇవాళ ఉపాధ్యాయలు  మహాధర్నా చేపట్టనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉదయం 10గంటలకు ధర్నా మొదలవనుంది.  సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. మహాధర్నా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే  ఉపాధ్యాయసంఘాల నేతలను గృహనిర్బంధాలు చేస్తున్నారు.  టోల్ గేట్, బస్టాండ్, రైల్వే ష్టేషన్ లవద్ద  పలువురిని పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు. 

 

పోలవరాన్ని పరిశీలించనున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరి..

పశ్చిమగోదావరి : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానున్నారు. కేంద్రమంత్రితో పాటు సీఎం చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతాన్ని వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పోలవరం చేరుకుని రెండు గంటల పర్యటన అనంతరం సాయంత్రం తిరిగి విజయవాడ బయలుదేరి వెళతారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..చంద్రబాబుతో కలిసి ప్రాజెక్టును స్వయంగా పరిశీలించనున్నారు. తర్వాత కాంట్రాక్ట్ ఏజెన్సీలతోనూ, అధికారులతోనూ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. దాదాపు పది నెలల తర్వాత గడ్కరీ రెండో సారి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు.

11:01 - July 11, 2018

హైదరాబాద్ : సెల్ ఫోన్ డ్రైవింగ్ ఓ నిండు ప్రాణం తీసింది. పాతబస్తీలో సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌తో వ్యక్తి దుర్మణం పాలయ్యాడు. బహదూర్‌పురా నాలా వద్ద ఖాజా మోయినుద్దీన్‌ అనే వ్యక్తి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ రాంగ్‌టూట్‌లోకి వెళ్లాడు. అదే సమయంలో మరో బైక్‌ ఎదురుగా రావడంతో.. రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళుతున్న ఖాజా మోయినుద్దీన్‌ తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఖాజామోయినుద్దీన్‌  బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు డాక్టర్లు తెలిపారు. 

ఎన్నికల ర్యాలీ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి..14మంది మృతి..

పాకిస్థాన్‌ : పెషావర్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఎన్నికల ర్యాలీ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 51 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అవామీ జాతీయ పార్టీకి చెందిన హరూన్ బిలోర్ కూడా ఉన్నాడు. హరూన్ 16 కుమారుడు డానియల్ తీవ్రంగా గాయపడ్డాడు. 2012లో తాలిబన్‌లు జరిపిన దాడిలో హరూన్ బిలోర్ తండ్రి అవామీ జాతీయ పార్టీ సీనియర్ నేత బషీర్ అహ్మద్ బిలోర్ మృతి చెందాడు. జులై 25న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ..

హైదరాబాద్ : శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఈమేరకు జూబ్లీహిల్స్‌లో గృహనిర్బంధంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకుని ఇంటి నుంచి తరలించారు. అయితే ఆయనను ఎక్కడికి తరలించారనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టం చేయలేదు. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయనకు నగర బహిష్కరణ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా..

కొండచరియలు విరిగిపడి 9మంది మృతి..

మణిపూర్ : భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో కొండ చరియలు విరిగిపడి తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో కొండ చరియల కింద నుండి ఏగుడుగురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీసారు. కాగా పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జన జీవనం స్థంభించిపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. 

అమీలియా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..

కర్నూలు : అమీలియా కార్పొరేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలో విద్యుత్ షార్ట్ సర్యూట్ కావటంతో మంటలు భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకు ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. గత రెండు రోజుల క్రితమే ప్రారంభమైన అమీలియా ఆసుపత్రిలో ఈ ప్రమాదం సంభవించింది. కాగా ఫైర్ నిబంధనలు పాటించకపోవటంతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది పలు ఇబ్బందుల మధ్యనే మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. కాగా ప్రారంభమై రెండురోజులు మాత్రమే కావటంతో రోగులు ఎవ్వరు లేకపోవటంతో ప్రాణాపాయం మాత్రం జరగలేదు. 

10:38 - July 11, 2018

కర్నూలు : నగరంలోని అమీలియా కార్పొరేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో రోగులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

10:34 - July 11, 2018

మహారాష్ట్ర : భారీ వర్షాలు ముంబైని ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం అవుతోంది. ముంబై వీధులు వర్షపు నీటిలో మునిగి తేలుతున్నాయి. భారీ వర్షాలతో జనజీవన స్తంభించింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. రైలు సర్వీసులు రద్దు అయ్యాయి. విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. సహాయక చర్యల కోసం ఎన్ డీఆర్ ఎఫ్ రంగంలోకి దిగింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముంబాయి, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, గుజరాత్ లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ చెబుతుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు హౌస్ అరెస్ట్..

అమరావతి : తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు మహాధర్నా చేపట్టాయి. దీంతో వీరి అడ్డుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తుమ్మల పల్లి కళాక్షేత్రం వద్ద 10 గంటల నుండి మహాధర్నాను యూటీఎఫ్ నిర్వహించనుంది. దీంతో విజయవాడ యూటీఎఫ్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉపాధ్యాయులను అడ్డుకునేందయు పోలీసులు యత్నిస్తున్నారు. 

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం..

ముంబై : నగరంలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో నగరం అతలాకుతంలగా మారిపోయింది. వర్షపు నీటితో ముంబై వీధులు మునిగిపోయాయి. జన జీవనం స్థంభించిపోయింది. రైలు సర్వీసులకు అధికారులు నిలిపివేశారు. విద్యాసంస్థలను బంద్ చేశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపటంతో ఎంతో అవరసరమైతే తప్ప ప్రజలు ఇళ్లనుండి బైటకు రావద్దని అధికారులు సూచించారు. ముంబై,కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎంబీ తెలిపింది. 

ముంబైలో భారీ వర్షాలు

మహారాష్ట్ర : భారీ వర్షాలకు ముంబై అతలాకుతలం అయింది. భారీ వర్షాలు ముంబైని ముంచెత్తుతున్నాయి. ముంబై వీధులు వర్షపు నీటిలో మునిగి తేలుతున్నాయి. భారీ వర్షాలతో జనజీవన స్తంభించింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. 

ప్రధాని మోదీ మరో సంచలన ప్రకటన!!..

ఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే, కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, సంచలన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత, కేంద్రానికి పన్ను ఆదాయం గణనీయంగా పెరగడం, బ్యాంకు లావాదేవీల సంఖ్య పెరగడంతో వ్యక్తుల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ఈ ప్రకటనను ప్రధాని మోదీ చేయనున్నట్లుగా అధికారిక వర్గాల సమాచారం.

కర్నూలులో అగ్నిప్రమాదం

కర్నూలు : నగరంలోని అమీలియా కార్పొరేట్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో రోగులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

ప్రాణాన్ని బలిగొన్న సెల్ ఫోన్ డ్రైవింగ్..

ఢిల్లీ : ఫోన్ మాట్లాడుతు డ్రైవింగ్ చేయవద్దని ఎంతగా అవగాహన కల్పించినా నిబంధనలను ఖాతు చేయటం పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ మాట్లాడుతు బైక్ డ్రైవింగే కాకుండా రాంగ్ రూట్ లో వచ్చి ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొన్న సంఘటన నగరంలో చోటుచేసుకుంది. పాతబస్తీలో బహదూర్ పురా నాలా వద్ద ఓ వ్యక్తి సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల ప్రాణాల్ని కోల్పోయాడు. ఖాజా మోయినుద్దీన్ అనే వ్యక్తి సెల్ ఫోన్ మాట్లాడుతు రాంగ్ రూట్ లో వెళుతు ఎదురుగా వస్తున్న మరో బైకర్ ను ఢీకొన్నాడు. దీంతో తలకు బలమైన గాయం తగలటంతో ఖాజా మోయినుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. 

09:41 - July 11, 2018

విజయవాడ : ఇవాళ్టి నుంచి ఏపీలో అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. విజయవాడలో అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. అతి తక్కువ ధరకే పేదలకు రుచికరమైన భోజనం అందనుంది. ఒక్క రూపాయికే ఇడ్లీ..ఐదు రూపాయలకే అన్నం పంపిణీ చేయనున్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆహార పదార్థాలను అందజేయనుంది. అన్ని జిల్లాల్లో అక్షయపాత్ర ఫౌండేషన్ కే బాధ్యతలు అప్పగించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

09:34 - July 11, 2018

హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామిపై బహిష్కరణ వేటు పడింది. పరిపూర్ణానందకు పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ విధించారు. పోలీసులు ఆరు నెలలపాటు నగర బహిష్కరణ విధించారు. మూడు రోజుల గృహనిర్బంధం అనంతరం పోలీసులు పరిపూర్ణానందను నగరం నుంచి తరలించారు. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున పరిపూర్ణానందను తరలించారు. ప్రత్యేక వాహనంలో ఓఆర్ ఆర్ మీదుగా ఆయన్ను తరలించారు. పరిపూర్ణానంద స్వస్థలం కాకినాడకు తరలించినట్టు సమాచారం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

విజయవాడలో నేడు ఉపాధ్యాయులు ర్యాలీ

కృష్ణా : విజయవాడలో నేడు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించనున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించనున్నారు.

 

 

08:32 - July 11, 2018

పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై వక్తలు పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 'పంచాయతీ ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు' అనే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత కిరణ్ యాదవ్, టీఆర్ ఎస్ నేత రాజమోహన్, సీపీఎం నేత బండారి రవి కుమార్ పాల్గొని, మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు సుప్రీంకోర్టు 50శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే అన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు లేవన్నారు. తమిళనాడు రాష్ట్రం బీసీలకు 50 శాతానికి పైగా రిజర్వేషన్లు పెంచుకుందని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

నేడు ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం

తిరుమల : నేడు ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పించింది. 

08:21 - July 11, 2018

తెలంగాణలో కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఆందోళన బాట పట్టారు. ఈ నెల 15వ తేదీన శంఖారావం పేరుతో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జులై 1 నుంచి రెగ్యులర్‌ ఎంప్లాయిస్‌కు అమలైనట్లే తమకు కూడా కొత్త పీఆర్‌సీని అమలు చేయాలని.. వారికి పెంచినట్లుగానే తమకూ జీతాలు పెంచాలని.. తమను పర్మినెంట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. వారి డిమాండ్లు వారిపట్ల ప్రభుత్వ విధానాలపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జె.వెంకటేశ్‌ మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:08 - July 11, 2018

ఢిల్లీ : ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు ఫ్రాన్స్‌ దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆ జట్టు 1..0 తేడాతో బెల్జియాన్ని మట్టికరిపించింది. దీంతో సంచలన విజయాలతో ఫుట్‌బాల్‌ సెమీస్‌కు దూసుకొచ్చిన బెల్జియం ఫైనల్‌ ఆశలకు గండి పడింది. కీలకమైన పోరులో బలమైన ఫ్రాన్స్‌ ఆ జట్టును  సెమీస్‌లో చిత్తు చేసింది. మెగా టైటిల్‌ ముద్దాడాలన్న బెల్జియం దూకుడుకు అడ్డుకట్ట వేసింది. గడిచిన 12 ఏళ్లలో ఫ్రాన్స్ ఫైనల్స్ చేరడం ఇదే మొదటిసారి. రెండు జట్లు హోరాహోరీగా పోరాడటంతో సెమీస్‌లో తొలి అర్థభాగం వరకు ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. ప్రత్యర్థులిద్దరూ చక్కని డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే 51వ నిమిషంలో శామ్యూల్‌ ఉమ్‌టీటీ అద్భుతమైన హెడల్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి  పంపించి ఫ్రాన్స్‌ను 1..0తో ఆధిక్యంలో నిలిపాడు.  చివర్లో బెల్జియం గోల్‌కోసం విపరీతంగా ప్రయత్నించినా... ఫ్రాన్స్‌ చాకచక్యంగా అడ్డుకుంది. ఇక ఇవాళ మరో సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో క్రొయేషియా తలపడుతుంది. 

 

08:05 - July 11, 2018

థాయ్‌లాండ్‌ : గుహలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసింది. గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు, వారి ఫుట్‌బాల్‌ కోచ్‌ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో  గత 18 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 
ఉత్కంఠకు తెరపడింది..
థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకున్న చిన్నారుల ఘటనకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఉదయం పది గంటలకు మూడో దశ సహాయక చర్యలు ప్రారంభించిన రెస్క్యూ టీం నలుగురు పిల్లలు, ఫుట్‌బాల్‌ కోచ్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
నిన్న మరో నలుగురు పిల్లలు క్షేమంగా బయటపటికి 
వాతావరణం అనుకూలించడంతో 19 మంది డైవర్లతో కూడిన రెస్క్యూ టీం ఆదివారం ప్రారంభించిన ఆపరేషన్‌ మూడురోజులకు ముగిసింది. 18 రోజులుగా గుహలో బిక్కుబిక్కుమంటూ గడిపిన చిన్నారులను ఒక్కొక్కరిగా సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఆదివారం నలుగురు పిల్లలను కాపాడగా.. సోమవారం మరో నలుగురు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. 
వరదలు రావడంతో గుహలో చిక్కుకున్న పిల్లలు 
జూన్‌ 23న 16 ఏళ్ల లోపు 12 మంది పిల్లలు ఫుట్‌బాల్‌ కోచ్‌తో కలిసి థాయ్‌లాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహ చూడడానికి వెళ్లారు. భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో పిల్లలు గుహలో చిక్కుకుపోయారు. నాలుగు కిలోమీటర్లు లోనికి వెళ్లడంతో బయటపడే మార్గం లేక పిల్లలు గుహలోనే ఓ సురక్షిత ప్రాంతంలో బిక్కు బిక్కు మంటూ గడిపారు. 9 రోజుల తర్వాత బ్రిటిష్‌ గజ ఈతగాళ్లు వారి జాడను కనిపెట్టారు. గుహలో నీటి మట్టం పెరగడం, బురద కూరుకు పోవడంతో వారిని బయటకు తీసుకురావడం కత్తిమీద సాములా మారింది. పైగా పిల్లలు నీరసంగా ఉండడం, ఈత రాకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.
తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ టీం
పిల్లలను గుహలో నుంచి బయటకు తెచ్చేందుకు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమించింది. ఈ ఆపరేషన్‌లో విదేశి నిపుణులు 50 మంది థాయ్‌లాండ్‌కు చెందిన 40 మంది పాల్గొన్నారు. విదేశీ డైవర్లు, థాయ్‌ డైవర్లు కలిసి ఓ ప్రణాళిక ప్రకారం చిన్నారులకు మాస్కులు తొడిగి, ఆక్సిజన్‌ అందించి, నీటి మధ్య తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పిల్లలకు ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో పిల్లలను బయటకు తెచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఓ మాజీ ఆర్మీ డైవర్ గుహలోకి వెళ్లి తిరిగొచ్చే సమయంలో ఆక్సిజన్‌ కొరతతో మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. 
 

 

07:59 - July 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సమాఖ్యకు హైకోర్టులు చుక్కెదురైంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ కళల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఉ్రరూతలూగించి... స్వరాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన కళాకారులకు ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు వివాదంలో పడ్డాయి. ఎలాంటి నియమాలను పాటించకుండా కళాకారులను నియమించారని హైకోర్టు సీరియస్‌ అయ్యింది. నిజమైన కళాకారులను గుర్తించకుండా... తమకు అనుకూలంగా ఉన్నవారికే ఉద్యోగాలు కల్పించారని.. ఆ నియామకాలను వెంటనే రద్దు చేయాలని కోరింది. మూడు నెలల్లో కొత్త నియామకాలు చేపట్టాలని సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్‌ను ఆదేశించింది.
కళాకారుల నియామకాలు పారదర్శకంగా లేవన్న హైకోర్టు
తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యలో కళాకారుల నియామకాలు ఇప్పుడు వివాదంలో పడ్డాయి. తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యలో 550 మంది కళాకారుల నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్‌గా... కళాకారులకు ఉద్యోగాలు కల్పించింది. అయితే కళాకారుల ఉద్యోగ నియామకాల్లో ఏమాత్రం పారదర్శకత లేదని ... అసలైన కళాకారులకు అన్యాయం జరిగిందంటూ శంకరన్‌తోపాటు మరికొంతమంది నిరుద్యోగ కళాకారులు మూడేళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. దఫ దఫాలుగా విచారణ చేపట్టిన ధర్మాసనం గతంలో తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి విచారణ జరిపిన హైకోర్టు... తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సమాఖ్య కళాకారుల నియామకాలు పారదర్శకంగా లేవని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి నియమ నిబంధనలతో కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చి.. నియామకాలు చేపట్టాలని చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ను ఆదేశించింది.
తమ అనుయాయులకే ఉద్యోగావకాశాలు కల్పించారన్న పిటిషనర్‌ 
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులను కాదని.. తమ అనుయాయులకే ఉద్యోగావకాశాలు కల్పించారని పిటిషనర్‌ హైకోర్టుకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన కళాకారులు ఉద్యోగాలన్నీ రద్దు చేసి అసలైన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని విన్నవించారు. దీనిపై విచారించిన ధర్మాసనం కళాకారుల నియామకాలు పారదర్శకంగా జరుగలేదని అభిప్రాయపడింది. మళ్లీ రెండు వారాల్లో నూతన నోటిఫికేషన్‌ ఇచ్చి మూడు నెలల్లో ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు తెలంగాణ సాంస్కృతిక సమాఖ్యకు ఒక విధంగా షాకే. ఉన్న వారందరినీ తొలగించి... మళ్లీ నూతనంగా నియామకాలు చేపట్టాల్సి ఉంది. మరి హైకోర్టు తీర్పుపై సాంస్కృతిక సారధి ఏం చేస్తారో వేచి చూడాలి.

07:51 - July 11, 2018

ఢిల్లీ : జమిలి ఎన్నికలకు వైసీపీ జై కొట్టింది. లోక్‌సభతోపాటే శాసనసభలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు, అవినీతి తగ్గుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపులకు చెక్‌ పడుతుందని జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయం సేకరిస్తున్న లా కమిషన్‌ దృష్టికి తెచ్చింది.
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు వైసీపీ మద్దతు 
లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనకు వైసీపీ మద్దతు తెలిపింది. ఈ అంశంపై రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయం సేకరిస్తున్న లా కమిషన్‌కు  వైపీసీ నాయకులు తమ అభిప్రాయాన్ని చెప్పారు. వైపీసీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లా కమిషన్‌ను కలిశారు. జమిలి ఎన్నికల ప్రతిపాదనను సమర్థిస్తూ వైసీపీ అధినేత జగన్‌ రాసిన లేఖను లా కమిషన్‌కు అందజేశారు. లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహణలో ఉన్న లాభనష్టాలను  లా కమిషన్‌ దృష్టికి తెచ్చారు. 1951 నుంచి 1967 వరకు, 1999 నుంచి 2014 వరకు లోక్‌సభతోపాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. దీని వలన ఖర్చు, అవినీతి తగ్గుతుందని సూచించింది. వేర్వేరు ఎన్నికలతో అభివృద్ధి కుంటుపుడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
జమిలి ఎన్నికల్లో లాభనష్టాలను లా కమిషన్‌ దృష్టికి తెచ్చిన వైసీపీ 
ఐదేళ్లకు ఎన్నికైన ప్రభుత్వాలు అర్ధాంతరంగా మధ్యలో కూలిపోతే అప్పుడు పరిస్థితి ఏంటన్న అంశంపై వైసీపీ నాయకులు లా కమిషన్‌ వివరణ కోరారు. రాజ్యసభ ఎన్నికల తరహాలోనే మిగిలివున్న కాలానికే ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాటు ఉంటుందని లా కమిషన్‌ స్పష్టం చేసింది. జమిలి ఎన్నికల్లో ఉన్న లాభనష్టాలను కూడా వైసీపీ నాయకులు లా కమిషన్‌ దృష్టికి తెచ్చారు. ఈ విధానంలో జాతీయ  పార్టీల ప్రాధాన్యత పెరిగి... ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత తగ్గుందన్న అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ టికెట్‌పై ఎన్నికల్లో నెగ్గి, టీడీపీలో చేరిన 23 మంది  ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల విషయాన్ని విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లా కమిషన్‌ దృష్టికి తెచ్చారు. భవిష్యత్‌లో ఇలాంటి ఫిరాయింపులకు ఆస్కారంలేకుండా రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని సూచించారు. మరోవైపు రెండు రోజుల  క్రితం లా కమిషన్‌ను కలిసిన టీడీపీ నాయకులు జమిలి ఎన్నికలను వ్యతిరేకించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న  టీఆర్‌ఎస్‌ జమిలిని సమర్ధించింది. జాతీయ పార్టీల్లో కాంగ్రెస్‌, సీపీఐ, ప్రాంతీయ పార్టీల్లో టీఎంసీ, డీఎంకే జమిలిని వ్యతిరేకించాయి.

 

07:40 - July 11, 2018

గుంటూరు : అన్నార్తుల ఆకలి తీర్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంకాబోతున్నాయి. రోజు లక్ష రూపాయల సబ్సిడీ భారమైనా వెనుకాడకుండా... అన్నా క్యాంటీన్లను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.
నేడు అన్నా క్యాంటీన్ల ప్రారంభం
గుప్పెడు మెతుకులు కరువై ఆకలితో అలమటించే వారి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు సిద్దం చేసింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రెండేళ్ల క్రితమే పైలెట్‌ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ క్యాంటీన్లను ప్రారంభించింది. వాటిలో లోపాటలను సవరించుకుని పక్కా ప్రణాళికతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది.  ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజే వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి.
రూ. 5కే టిఫిన్స్‌, భోజనం
పేద వారికి ప్రభుత్వం అతి తక్కువ ధరకే రుచికరమైన భోజనం అందించబోతోంది. టిఫిన్, భోజనం సబ్సిడీ కింద అందించబోతోంది.  కేవలం ఐదు రూపాయలకే ఇడ్లీ, ఉప్మా, ఊతప్ప, వడ లాంటి ఫలహారాలను ప్రజలకు అందించబోతోంది. పేదవారి కడుపు నింపే లక్ష్యంతో రాష్ట్రప్రబుత్వం సబ్సిడీ ధరలకే ఆహారాన్ని అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డబ్బు లేక కడుపు మాడ్చుకునే పరిస్థితి ఎవరికీ ఉండకూడదన్న ఉద్దేశ్యంతోపాటు... వారికి నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది.  తొలిదశలో ప్రారంభించిన క్యాంటీన్లకు మంచి స్పందన రావడంతో... రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు అన్నా క్యాంటీన్లను విస్తరిస్తున్నారు.
విజయవాడలో 16చోట్ల అన్నా క్యాంటీన్ల ఏర్పాటు
విజయవాడలో 16 అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 5.60 కోట్ల వ్యయంతో ఎల్‌ అండ్‌ టీ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఒక్కో క్యాంటీన్‌ సుమారుగా 35 లక్షల వ్యయ అంచనాతో నిర్మిస్తున్నారు.  ప్రహరీ , టైల్స్‌ పనులను కార్పొరేషన్‌ చేపట్టింది. పక్కా భవన నిర్మాణం, గ్లాస్‌ ఫిట్టింగ్‌, ఫ్లోరింగ్‌, కిచెన్‌, రూప్‌. ఇంటీరియర్‌ పనులను ఎల్‌ అండ్‌ టీ చేస్తోంది. ఇక అన్నా క్యాంటీన్లలో ఆహార పదార్దాలను అక్షయపాత్ర ఫౌండేషన్‌ అందిస్తోంది. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న క్యాంటీన్లలో శుచిగా.. శుభ్రంగా.. నాణ్యమైన ఆహారాన్ని అక్షయపాత్ర అందిస్తుండటంతో అదే సంస్థకు అన్ని జిల్లాల్లో నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.
అన్నా క్యాంటీన్ల విక్రయాలపై నిఘా
అన్నా క్యాంటీన్ల నిర్వహణ కమాండ్‌ కంట్రోల్‌ నుంచి మానిటర్‌ చేయనున్నారు. ప్రతిరోజు విక్రయించే టోకెన్ల ఆధారంగా ఆయా కేంద్రాలలో విక్రయాలపై నిఘా పెట్టనున్నారు. ప్రాంతాలను బట్టి ఆహార అలవాట్లు మారుతాయి కనుక... దానికి తగ్గట్టుగా మెనూ సిద్ధం చేస్తున్నారు. ప్రజల నుంచి నాణ్యతపై నేరుగా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకునేలా ఓ అధునాతన వ్యవస్థను ఏర్పాటు చేశారు.

 

నేటి నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభంం

గుంటూరు : అన్నార్తుల ఆకలి తీర్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంకాబోతున్నాయి.  రోజు లక్ష రూపాయల సబ్సిడీ భారమైనా వెనుకాడకుండా... అన్నా క్యాంటీన్లను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 క్యాంటీన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.

నేడు తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

 హైదరాబాద్ : నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో మంత్రి ఉప సంఘం భేటీ కానుంది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై చర్చించనుంది.

 

పెషావర్ ఎన్నికల ర్యాలీలో ఆత్మహుతి దాడి

 పాకిస్తాన్ : పెషావర్ ఎన్నికల ర్యాలీలో ఆత్మహుతి దాడి జరిగింది. అనామీ నేషనల్ పార్టీ అభ్యర్థి హరూన్ బైలౌరీ సహా 13 మంది మృతి చెందారు. మరో 47 మందికి గాయాలు అయ్యాయి.

పరిపూర్ణానందపై నగర బహిష్కరణ వేటు

హైదరాబాద్ : పరిపూర్ణానందపై పోలీసులు నగర బహిష్కరించారు. పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి పోలీసులు నుంచి తరలిస్తున్నారు. 

 

Don't Miss