Activities calendar

12 July 2018

తాలిపేరుకు ప్రాజెక్టుకు వరద ఉధృతి...

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది.

రెండు రోజుల పాటు భారీ వర్షాలు ?

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు చాలా చోట్ల భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

రైల్వేలో కొత్త యాప్...

ఢిల్లీ : రిజర్వేషన్‌ లేని సాధారణ ప్రయాణికులకు కొత్త మొబైల్‌ ఆప్‌ను తెచ్చింది దక్షిణ మధ్య రైల్వే. యూటీఎస్‌ పేరుతో వచ్చిన ఈ ఆప్‌తో ..రైల్‌ టికెట్‌, ఫ్లాట్‌ ఫాం టికెట్‌ కూడా పొందవచని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌ కుమార్‌ తెలిపారు. 

తెలంగాణకు అమిత్ షా...

హైదరాబాద్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు రానున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ తెలిపారు. టార్గెట్ తెలంగాణనేనని, ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తలు..నేతలతో సమావేశాలు జరుగుతాయన్నారు. 

21:15 - July 12, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తెలంగాణ, ఏపీలో గాలి వానకు పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నారుమళ్లలో నీరు చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు ఇళ్ళలోకి చేరింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరగటంతో జనజీవనం స్తంభించింది. చందానగర్, లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో బయటకు రావడానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రహదారులు, లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, కూసుమంచి, తిరుమలాయపాలెం, పెనుబల్లి, సత్తుపల్లి, అశ్వారావుపేట మండలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, భువనగిరి, శాలిగౌరారం, ఎల్కారంలో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. ఈదురు గాలులకు చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిశాయి. తాండూరు, తెల్కపల్లి, తిమ్మాజిపేట, బిజినేపల్లిలో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తేలికపాటి జల్లులు కురిశాయి. నార్నూర్ మండలంలో 9.64 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా కడెం నారాయణ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి 13,109 క్యూసెక్కుల వరద నీరు చేరింది. 3 గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రావులపాలెంలో 5.57 సెం.మీ, గడలలో 5.42 సెం.మీ, కపిలేశ్వరంలో 5.35 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో గోదావరి నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో లంక గ్రామాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించింది. తణుకు, అత్తిలి, ఇరగవరం, నిడదవోలు, ఉండ్రాజవరం మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. అత్తిలిలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన బీటీరోడ్‌ కాలువలోకి కుంగిపోయింది. కృష్ణా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో భారీ వర్షానికి రోడ్లన్ని నీటమునిగాయి. పలుచోట్ల లొతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఇటు తెలంగాణ, అటు ఏపీలో ఖరీఫ్‌ నారుమళ్లకు తీవ్రమైన నష్టం ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముంపునీరుతో నారుమళ్లు కుళ్లిపోతున్నాయి. నారుమడుల్లోంచి ముంపునీటిని బయటకు పంపేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నాటు వేసే పనులు ముందుకు సాగటం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు చాలా చోట్ల భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

21:11 - July 12, 2018

అనంతపురం : జిల్లాలోని తాడిపత్రిలో విషాదం నెలకొంది. స్థానిక గెరుడౌ స్టీల్‌ ఫ్యాక్టరీలో విష వాయువు విడుదల కావడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు. ఓ పెద్దగదిలో పదకొండు మంది కార్మికులు పని చేస్తుండగా విష వాయువు విడుదలైనట్లు తెలుస్తోంది. ఆ వాయువును పీల్చిన రంగనాథ్‌, మనోజ్‌, లింగయ్య, గంగాధర్‌, వసీమ్‌, గురవయ్యలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఘటనలో గాయపడ్డ మరో ఐదుగురిని మిగిలిని కార్మికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సకాలంలో లోపాలను సవరించకుండా నిర్లక్ష్యం చేయటంతోనే విషవాయువు లీకైందని కార్మికులు చెబుతున్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

21:10 - July 12, 2018

నెల్లూరు : ప్రత్యేక హోదా విషయంలో తెలుగు ప్రజలను బీజేపీ, టీడీపీ మోసం చేశాయని కాంగ్రెస్‌ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్‌ ఊమెన్‌ చాందీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఉమెన్‌ చాందీ.. కాంగ్రెస్‌ బలోపేతానికి కృషిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్‌ ఊమెన్‌ చాందీ బీజేపీ, టీడీపీ తీరుపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో రెండు పార్టీలు మోసం చేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో పర్యటించిన ఊమెన్‌ చాందీ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తేవడానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.

మోదీ నాలుగేళ్ల పాలనలో లక్షల కోట్లు లూటీ చేయడం తప్ప, ప్రజలకు చేసిందేమీ లేదని ఊమెన్‌ చాందీ అన్నారు. మోదీ కాంగ్రెస్‌ను విమర్శించడం మానుకొని.... ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలని హితవు పలికారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసం చేసిన బీజేపీ, టీడీపీలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు ఊమెన్‌ చాందీ.

మరో వైపు కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్‌ నింపే ప్రయత్నం చేశారు పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరా రెడ్డి. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్‌ వల్లే సాధ్యమవుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్‌ గెలుపొందాలన్నారు. మొత్తానికి కేంద్ర వైఫల్యాలను ఎత్తి చూపుతూ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్‌ కృషి చేస్తోంది. 

21:07 - July 12, 2018

విజయవాడ : ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని హామీలన్నీ అమలు చేసేవరకు కేంద్ర ప్రభుత్వంతో రాజీలేని పోరాటం కొనసాగించాలని టీడీపీ నిర్ణయించింది. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానం అవసరంలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హక్కులు సాధించుకునే వరకు విశ్రమించబోమని తేల్చి చెప్పారు. జమిలి ఎన్నికలకు టీడీపీ వ్యతిరేకంకాదని చెప్పిన చంద్రబాబు.. రాజకీయ దురుద్దేశంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకున్నా... వాయిదా వేసినా సహించబోమని అమరావతిలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో హెచ్చరించారు. జమిలి ఎన్నికలకు టీడీపీ వ్యతిరేకంకాదని చెప్పిన చంద్రబాబు.. రాజకీయ దురుద్దేశంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లినా... లేక వాయిదా వేసినా.. సహించేందిలేదని హెచ్చరించారు. రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు చాత్రిక అవసరమన్న చంద్రబాబు... ఈవిషయంలో ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు అహర్నిశలు కష్టపడి పనిచేయాలని చెప్పారు.

విశాఖ రైల్వే జోన్‌ సహా విభజన చట్టంలోని అన్ని హామీలు అమలు చేసేవరకు కేంద్ర ప్రభుత్వంతో రాజీలేని పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు నెలల్లోగా తేల్చకపోతే.. రాష్ట్ర ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా పూర్తి చేయమంటే ఎలా.. అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఈనెల 16 తేదీకి టీడీపీ 1500 రోజుల పాలన పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో గ్రామ దర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించాలని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఎన్నికల్లోగా రాష్ట్ర వ్యాప్తంగా వంద సభల్లో చంద్రబాబు పాల్గొనే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నెలలోనే వంచన, కుట్ర రాజకీయాలపై ధర్మపోరాట దీక్ష నిర్వహించే ప్రాంతాన్ని నిర్ణయించే బాధ్యతను చంద్రబాబు పార్టీ నాయకులుకు అప్పగించారు. మైనారిటీలతో సమావేశాలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులతో భేటీలు నిర్వహణ తేదీలను ఖరారు చేయాలని టీడీపీ విస్తృత సమావేశంలో పార్టీ నాయకులను చంద్రబాబు ఆదేశించారు. 

అన్నా క్యాంటీన్ లో దురుసు ప్రవర్తన...

కర్నూలు : జిల్లాలోని ఎమ్మిగనూరులో నూతనంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్ లో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి జనాలపై చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. ఆకలితో వస్తే పురుగుల్లా చూస్తున్నారంటూ పేద ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

20:27 - July 12, 2018

అన్నా క్యాంటీన్లు అని కొత్తయి కొలాయించిండ్రుగదా..? క్యాంటీన్లు గట్టెకాడ కోట్ల రూపాల అవినీతి అయ్యిందట..ఏ ప్రభుత్వమైనా పేదోనికి కనీసం అందించవల్సిన సేవ ఏంది..?తెలంగాణ ప్రజలారా ఇది మీరు బాగ జూడాలే ముచ్చట.. ఏం ప్రభుత్వమండి చంద్రశేఖర్ రావుగారు మీది..? ఇదో ప్రభుత్వమేనా.?.బోధకాలు రోగం లేని మన్షిలేడు ఆ ఊర్లె.. ఈ తెలంగాణ ఆప్కారోళ్లకు బుర్ర పనిజేస్తలేదా ఏంది..? ఏటీఎంల పైసల తీస్కుందానమి వొయ్యని ఒకాయనను ఏటీఎం సతాయించింది.. గుడి కొచ్చిన భక్తులకు శఠగోపం బెట్టో తీర్థం బోశే.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానాలు...

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ తీర్మానాలు చేసింది. మరో 20 వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. నగరంలోని పలు రోడ్ల విస్తరణకు..ఎన్ ఫోర్స్ మెంట్ మరియు విజిలెన్స్ డైరెక్టర్ కు రూ. 20 లక్షల నగదు వరకు విత్ డ్రా అధికారం...ఫలక్ నుమా రైల్వే స్టేషన్ దగ్గర మరో ఆర్ ఓబీ నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. 

ఏపీలో హైకోర్టు ఏర్పాటుపై కేంద్ర న్యాయశాఖ అఫిడవిట్...

ఢిల్లీ : ఏపీలో హైకోర్టు ఏర్పాటుపై సుప్రీంలో కేంద్ర న్యాయశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన హామీల అమలుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో తుదిగడువు లేదని కేంద్ర న్యాయ శాఖ పేర్కొంది. విభజన చట్టంలో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని వెల్లడించింది. 

ప్రమాద ఘటనపై జగన్ దిగ్ర్భాంతి...

తూర్పుగోదావరి : తాడిపత్రి స్టీల్ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై వైసీపీ అధ్యక్షుడు జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. 

19:56 - July 12, 2018

ఉక్కు పరిశ్రమ వద్ద ఉద్రిక్తత...

అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి గెరుడౌ ఉక్కు పరిశ్రమలో మృతి చెందిన ఆరుగురు కుటుంబసభ్యులకు పరిహారం అందించాలని పలు పార్టీలు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో కంపెనీ యాజమాన్యం పట్టించకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

19:04 - July 12, 2018

'విజేత' సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో, ఎంత వరకు రీచింగ్ ఉందొ సినిమా చూసొచ్చిన వాళ్ల మాటల్లోనే...'విజేత’ సినిమా చూసిన ప్రేక్షకుల ఫీలింగ్స్. చూశాం 'విజేత' సినిమాపై టెన్ టివి సినీ డెస్క్ రివ్యూ...ప్రేక్షకుల స్పందనతో పాటు టెన్ టివి సినీ డెస్క్ రివ్యూ కూడా తీసుకున్న తర్వాత 'విజేత సినిమాకి 10టీవీ ఇచ్చే రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి.

 

19:00 - July 12, 2018

'RX100' సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో, ఎంత వరకు రీచింగ్ ఉందో సినిమా చూసొచ్చిన వాళ్ల మాటల్లోనే విందాం. 'RX100' సినిమా చూసిన ప్రేక్షకుల ఫీలింగ్స్ 'RX100' సినిమాపై టెన్ టివి సినీ డెస్క్ తమ రివ్యూ ఇవ్వడానికి ఉన్నారు ఆ రివ్యూ...ప్రేక్షకుల స్పందనతో పాటు టెన్ టివి సినీ డెస్క్ రివ్యూ కూడా తీసుకున్న తర్వాత 'RX100' సినిమాకి 10టీవీ ఇచ్చే రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి. 

18:34 - July 12, 2018

విజయవాడ : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కిరణ్ తో పాటు పలువురు నేతలు శుక్రవారం పార్టీ కండువా కప్పుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టినా అందులో సక్సెస్ కాకపోవడంతో కిరణ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలకు రోజులు దగ్గర పడుతుండడంతో పార్టీ క్యాడర్ ను సన్నద్ధం చేసేందుకు రాహుల్ వ్యూహాలు పన్నుతున్నారు.

గతంలో విభజనను వ్యతిరేకించి పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్న కీలక నేతలను తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు పలువురు దూతలను ఏపీకి రాహుల్ పంపించిన సంగతి తెలిసిందే. పార్టీకి దూరంగా ఉన్న నేతలతో దూతలు చర్చలు మొదలు పెట్టారు. అందులో భాగంగా కిరణ్ తో చర్చలు జరిపారు. ఎట్టకేలకు ఆయన పార్టీలో చేరేందుకు సమ్మతించినట్లు, ఏఐసీసీ కార్యదర్శి..., సీడబ్ల్యూసీ వంటి కీలక పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆయతో పాటు ఇతర కీలక నేతలను పార్టీలోకి రావాలని పిలుపునిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి పాత నేతలను తిరిగి పార్టీలోకి అధిష్టానం ఆహ్వానిస్తోంది.

కాంగ్రెస్ లోకి కిరణ్ ?

విజయవాడ : ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శుక్రవారం రాహుల్ సమక్షంలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కిరణ్ కుమార్ రెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి..., సీడబ్ల్యూసీ వంటి కీలక పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 

18:23 - July 12, 2018

అనంతపురం : ఏపీ రాష్ట్రంలో మరో మరణ మృదంగం మోగింది. రోడ్డు ప్రమాదాలు..ఇతర ప్రమాదాల కారణంగా ఎంతో మంది మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. నిండు జీవితాలు గాలిలో కలిసిపోతుండడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా అనంత జిల్లాలోని తాడిపత్రిలో గెరుడౌ ఉక్కు కర్మాగారంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కర్మాగారంలో గ్యాస్ లీకు కావడంతో ఆరుగురు అక్కడికక్కడనే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గ్యాస్ లీక్ కావడం..వెంటనే మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. తమ వారు మృతి చెందారని తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

18:10 - July 12, 2018

పశ్చిమగోదావరి : కొవ్వూరు మున్సిపాల్టీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటి వరకు తామంతా ఒక్కటేనని భావించిన టిడిపి తమ్ముళ్లు ఒక్కసారిగా విడిపోయారు. దీనికంతటికి కారణం 'అవిశ్వాస తీర్మానం'. మంత్రి జవహార్ నియోజకవర్గం కావడంతో టిడిపి నాయకులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

టిడిపి కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. 10 మంది కౌన్సిలర్లు వైస్ ఛైర్మన్ రమేశ్ కుమార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. కానీ ఈ తీర్మానం విషయం తమకు తెలియదని...అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీలు లేదంటూ 10 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన నిజాయితీపరుడని, ఆయన్ను తొలగించద్దని తాము కోరడం జరిగిందన్నారు. 

గెరుడౌ ఉక్కు కర్మాగారంలో గ్యాస్ లీక్..6గురు మృతి..

అనంతపురం : తాడిపత్రిలోని గెరుడౌ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాగారంలో ఒక్కసారిగా గ్యాస్‌ లీకై ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గరికావటంతో వారిని ఆసుపత్రికి తరలించిన కర్మాగార సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీక్ గల కారణాలపై దర్యాప్తుచేపట్టారు. 

17:39 - July 12, 2018

మేఘాలయ : థాయ్‌లాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహ ప్రపంచ వ్యాప్తంగా సెస్సేషన్ గా మారిపోయింది. ఆ గుహలో చిక్కుకున్న 12మంది చిన్నారులతో పాటు మొత్తం కోచ్ తో కలిపి మొత్తం 13మందిని రక్షించేందకు అధికారు పడిన శ్రమ..చూపిన తెగువ, అంకిత భావం ప్రపంచ వ్యాప్తంగా అందరి మనస్సులను గెలుచుకుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అందరిని సురక్షితంగా తీసుకురావటంతో అందరు ఆనందంగా ఊపిరి పీల్చుకున్నారు. శ్రమపడిన అధికారుల, డైవర్లు తమ శ్రమను మరిపోయి ఆనందం పడ్డారు. మరి థాయ్‌లాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహలాంటి గుహ మన భారత దేశంలో కూడా వుందట. మేఘాలయలో ఇటీవలే అలాంటి ఒక గుహను కనుగొన్నారు. ప్రపంచలోనే అతి పొడవైన ఇసుకరాయి గుహగా అది గుర్తింపు పొందింది. మరి ఆ గుహ విశేషాలేమిటో చూద్దాం..

మేఘాలయలో క్రెంపురి గుహ అడ్వెంచర్‌ అసోసియేషన్‌ సాహసయాత్ర...
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో క్రెంపురి అనే గుహ ఉంది. దీని పొడవు 24.5 కి.మీ. ఈ గుహను 2016లో కనుగొన్నారు. మాసిన్రామ్‌ ప్రాంతంలో ఉన్న గుహ అతి పొడవైన శాండ్‌స్టోన్‌ కేవ్‌గా గుర్తింపు పొందింది. గుహ పొడవెంతో తెలుసుకోవడానికి మేఘాలయ అడ్వెంచర్‌ అసోసియేషన్‌ సాహసయాత్రను చేపట్టింది. వివిధ దేశాలకు చెందిన 30 మందితో కూడిన కేవర్స్‌ అంటే గుహల అన్వేషకులు. ఈ అన్వేషన్ బృందం సుమారు నెల రోజుల పాటి శ్రమించి గుహ పొడవెంతో కనుగొంది.

గుహ లోపల డైనోసార్‌ అవశేషాలను గుర్తించిన అన్వేషకులు..
గుహలో రహస్యాలు తెలుసుకోవడానికి వెళ్లిన బృందానికి అనేక ఆసక్తికర అంశాలు కనిపించాయి. గుహ లోపల డైనోసార్‌ అవశేషాలను గుర్తించారు. అవి కొన్ని వేల ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు తేల్చారు. డైనోసార్లు ఆ గుహ లోపల తలదాచుకునేవని, వాటి శిలాజాలే ఇప్పుడు లభించాయని అన్వేషకుల బృందం భావిస్తుస్తోంది.

అవగాహన లేకుండా లోపలకు వెళ్లవద్దని సూచించిన అన్వేషకుల బృందం
ఈ గుహ లోపలకు పొరపాటున ఎవరైనా వెళితే మళ్లీ వెనక్కి రావడం కష్టం. ఎందుకంటే దారంతా గజిబిజిగా, ఒక్కో చోట ఇరుకుగా ఉంటుంది. అక్కడక్కడా నీటి ప్రవాహాలు ఉన్నాయి. దారి మరిచిపోతే బయటపడటం కష్టమేనని కేవర్స్‌ బృందం వెల్లడించింది. పిల్లలూ... గుహల గురించి అవగాహన లేకుండా లోపలకు వెళ్లడం ప్రమాదకరమని అన్వేషకులు హెచ్చరించారు. 

16:54 - July 12, 2018

విజయవాడ : అధికారంలోకి రాకముందు పార్టీ మేనిఫెస్టో ప్రకటించడం జరిగిందని..అందులో పేర్కొన్నవే కాకుండా మిగతావి కూడా పూర్తి చేయడం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. లోటు బడ్జెట్...రాజధాని లేకుండా పాలన ప్రారంభించామని...విభజన చట్టం వల్ల జరిగిన నష్టం దేశంలో నెంబర్ వన్ గా అయినా దక్షిణాది రాష్ట్రాలతో పోటీ పడడానికి 10-12 సంవత్సరాలు అవుతుందని..జాగ్రత్తగా పాలన చేయకపోతే మరో బీహార్ తయారయ్యేదని పేర్కొన్నారు.

కరెంటు వాడితే పెనాల్టీ వేసేవారని...వ్యవసాయంలో చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు. ఎరువుల మందులు..విత్తనాల సమస్యలు..ఇలా ఎన్నో ఉన్నాయన్నారు. ఆనాడు జరిగిన కొన్ని ఘటనలను ఇంకా గుర్తుకొస్తాయని..లాఠీలతో కొట్టి ఒక్కొక్కరికి ఎరువుల బస్తాలు ఇచ్చారన్నారు. వ్యవసయాన్ని అస్తవ్యస్థం చేశారని..క్రాప్ గిట్టుబాటు ధర లేక..అవినీతి..ఆరాచకాలు..వ్యాన్ పిక్ సిటీ..లేపాక్షి సిటీ...విశాఖపట్టణంలో బాక్సైట్..లలో అవినీతి జరిగిందన్నారు. జలయజ్ఞం...కాదు ధనయజ్ఞం అంటూ పలు ఆరోపణలు గుప్పించి పోరాటం చేయడం జరిగిందని...సుమారు 300 మంది కార్యకర్తలను చంపేశారన్నారు.

కరెంటు విషయంలో రైతులు కాపలా ఉండే పరిస్థితి నెలకొని ఉండేదని..దీనివల్ల పలువురు రైతులు మృత్యువాత పడ్డారన్నారు. దానికంటే ముందు అనంతలో తాను పర్యటించే సమయంలో రైతు రుణమాఫీ చేస్తామని మొదటగా చెప్పడం జరిగిందన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసినట్లు, రుణమాఫీ విషయంలో బ్యాంకులు సహకరించలేదన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని..కానీ కొన్ని రాష్ట్రాలు అధిక ఆదాయం కలిగినవని..అయినా ఏపీలో లక్షా 50వేల రూపాయల రుణమాఫీ ప్రకటించడం జరిగిందన్నారు. అందులో రూ. 50వేలు ఒకేసారి మాఫీ చేయడం జరిగిందన్నారు.

ఎమ్మెస్పీ ఇవ్వకున్నా ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని డబ్బులు సమకూర్చిందన్నారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా ప్రభుత్వం చొరవ తీసుకుని రైతుల సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. 60 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 200 అన్నా క్యాంటీన్లు పెడుతామన్నారు. గౌరవ ప్రదంగా భోజనం పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 200 భవనాలు ఏసీలు మార్చాలని చెప్పడం జరిగిందని తెలిపారు. అన్నా క్యాంటీన్లకు ఒక సొసైటీ ఏర్పాటు చేసి..ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని..ఇందులో ప్రజల సహకరించాలని సూచించారు. ఇంట్లో జరిగే శుభకార్యక్రమాలకు అన్యా క్యాంటీన్లకు డోనేట్ చేయాలని పిలుపునిచ్చారు.

నిరుద్యోగ భృతి త్వరలోనే అమలు చేయడం జరుగుతుందని..మహిళా వితంతు ఫించన్..వికలాంగుల ఫించన్ నేరుగా లబ్ధి దారుల ఇంటికే చేరే విధంగా ప్రభుత్వం చేస్తోందన్నారు. బయో మెట్రిక్ లో ఐరీస్ తీసుకోవాలని..ఐరీస్ ఫెయిల్ అయితే ప్రత్యామ్నాయం చూసుకోవాలని...ఏదైనా సమస్యలు వస్తే అర్హులైన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగిందన్నారు. ప్రజల జీవిత భద్రతకు డబ్బులు ఇస్తున్నామని..పెళ్లి కానుకలో కొన్ని టెక్నికల్ సమస్యలు వచ్చాయని తొందరలో ఈ సమస్య పరిష్కరించి పెళ్లి కానుకలు అందచేస్తామన్నారు. 19 లక్షల ఇళ్లు నిర్మాణం చేసి అర్హులైన పేదలకు అందచేయడం జరుగుతుందని, ఇటీవలే మూడు లక్షల గృహ ప్రవేశాలు చేయడం జరిగిందన్నారు. లబ్దిదారులకు ఏవైనా సమస్యలు వస్తే ఆ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:50 - July 12, 2018

విజయవాడ : ఏపీ ప్రభుత్వం చేపడుతున్న..చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలు..పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకోవాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గడిచిన మూడు సంవత్సరాల్లో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని..నూతన టెక్నాలజీతో అరకొటి మందిని సభ్యత్వం తీసుకోవడం జరిగిందన్నారు. 2016లో సభ్యత్వం 70 లక్షల మందికి చేరుకోవడం జరిగిందని..గ్రామ కమిటీలు..మండల కమిటీలు..జిల్లా కమిటీలు ఒక పద్ధతి ప్రకారం చేయడం జరిగిందన్నారు. నాలుగు రీజియన్ సెంటర్స్ ఏర్పాటు చేసి, శిక్షణా శిబిరాలు ఏర్పాటయ్యాయన్నారు. బూత్ కమిటీలను బలోపేతం చేయాలనే దృష్టి బాబులో ఉందని..పటిష్టంగా ఉంటే 175 నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందన్నారు. 5162 బూత్ కన్వీనర్ల నియామకం పెండింగ్ లో ఉందని..ఇవి వెంటనే పూర్తి చేసే విధంగా ప్రజాప్రతినిధులు చూడాలన్నారు.

అనంతపురం, కడప, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల్లో బూత్ కన్వీనర్ల సమస్యలున్నాయని..వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. సేవా మిత్రలను సాధికారిక మిత్రలతో ట్యాగింగ్ చేయాలని..ఇందులో ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగిందని, కుప్పంలో పైలట్ చేసినట్లు పేర్కొన్నారు. వచ్చేవారంలో 'గ్రామ దర్శిని' కార్యక్రమం ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని..ప్రతి ఇంటికి వెళ్లాలని..బూత్ కన్వీనర్లు ప్రతొక్కరినీ కలిసి సమస్యలను గుర్తించాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక వ్యక్తిని అనుసంధానం చేయడం జరుగుతుందని..పార్టీ ఆఫీసులో ఉంటూ సమాచారం ఇతరులకు తెలియచేస్తారని లోకేష్ పేర్కొన్నారు. 

16:45 - July 12, 2018

విజయవాడ : టిడిపిపై, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని..బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల పిలుపునిచ్చారు. టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను రిక్రూట్ మెంట్ చేయడం జరుగుతోందని, 40వేల పోస్టులు భర్తీకి శ్రీకారం చుడుతోందన్నారు. యూత్ కు అలవెన్స్ ఇవ్వాలని బాబు లక్ష్యంగా పెట్టుకున్నట్లు, మేనిఫెస్టోలో పేర్కొన్న వాటినే కాక ఇతరుల హామీలు కూడా చేయడం జరిగిందన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం కొన్ని అంశాలు మొదలు అనుకోలేదని..తరువాత వచ్చాయన్నారు. తప్పుడు ప్రచారం చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని..దీని ద్వారా మనుగడ ఉంటుందని బీజేపీ ఆలోచన అన్నారు. బీజేపీ..జనసేన..జగన్ ను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వీరికి సరియైన విధంగా బుద్ధి చెప్పాలంటే ప్రజల మధ్య వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు.

1951లో రాజ్యంగం వచ్చిన అనంతరం ఒకే ఎన్నిక జరిగిందని, అనంతరం ఎన్నికలు విడిపోయాయన్నారు. ఒకే సారి ఎన్నికలు సాధ్యమైనా ? అని ఆలోచించకుండా ప్రాంతీయ పార్టీలు..ప్రాంతీయ నేతలు పైకి వస్తున్నారనే ఆలోచనతో..ప్రాంతీయ పార్టీలను అణిచివేయాలనే ఉద్దేశ్యంతో ఒక ఏజెండాను దేశపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు బతకాలనే ఉద్దేశ్యం బీజేపీకి లేదని..రాజకీయ దురుద్ధేశ్యంతో చేస్తున్న ప్రయత్నాన్ని టిడిపి వ్యతిరేకిస్తోందన్నారు. 

16:23 - July 12, 2018

ఢిల్లీ : కాంగ్రెస్ నేత శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే భారత్ కాస్తా 'హిందూ - పాక్' గా మారిపోతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాకిస్తాన్ లా భారత్ ను మార్చేందుకు బీజేపీ కొత్త రాజ్యాంగం తయారు చేస్తోందని..దీనితో మైనార్టీల హక్కులు అణిచివేయబడుతాయన్నారు. గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆజాద్ వంటి స్వాతంత్ర సమరయోధుల ఆంక్షలకు అది విరుద్ధమన్నారు. థరూర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్ క్షమాపణలు చెప్పాలని, హిందూవులకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. 

16:14 - July 12, 2018

ఒడిశా : గిరిజనులు, ఆదివాసీలు అమాయకత్వంలోనే కాదు నిజాయితీలో కూడా వారికి వారే సాటిగా నిలుస్తారు. అలాగే వారు ఏ విషయంలోనైనా పట్టు పట్టారంటే దాన్ని సాధించేంత వరకూ విశ్రమించరు. వేషధారణలోను, సంప్రదాయాలను అనుసరించటంలోను, వాటిని నిలుపుకోవటంలోను అడవి బిడ్డలు ఏమాత్రం రాజీ పడరు. కానీ నేటి తరం వాటిని కొనసాగిస్తునే ఆధునికంగా కూడా విజయాలు సాధిస్తున్నారు. వారి సంస్కృతి సంప్రదాయాల విషయంలో వారికి వారే సాటిగా వుంటారు గిరిజనులు.

భారతదేశ తొలి ట్రైబల్‌ క్వీన్‌గా పల్లవి దరువా చరిత్ర ..
భారతదేశ తొలి ట్రైబల్‌ క్వీన్‌గా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్‌ జిల్లాకు చెందిన పల్లవి దరువా చరిత్ర సృష్టించారు. ఆది రాణి కళింగ ట్రైబల్‌ క్వీన్‌ పోటీలో పాల్గొన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 22 మందిని ఓడించి ఆమె కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గిరిజన వేషధారణ, ఆభరణాల ప్రదర్శన, అద్భుత ప్రతిభ, సంస్కృతిని ప్రదర్శించడంలో నైపుణ్యం, ఫొటోజెనిక్‌ ఫేస్‌, బెస్ట్‌ స్కిన్‌, బెస్ట్‌ పర్సనాలిటీ వంటి ఏడు విభిన్న విభాగాల్లో పల్లవి విజేతగా నిలిచారు.

మొదటి రన్నరప్‌ గా పంచమీ మజీ ..
ఈ పోటీలో టిట్లాఘడ్‌కు చెందిన పంచమీ మజీ మొదటి రన్నరప్‌గా నిలవగా.. మయూర్‌భంజ్‌కు చెందిన రష్మీరేఖా హన్స్‌దా రెండో రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఒడిశా ఎస్సీ, ఎస్టీ డిపార్ట్‌మెంట్‌, టూరిజం శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. స్థానిక ఉత్కళ్‌ మండపంలో జరిగిన ఈ పోటీలో ‘పద్మశ్రీ’ తులసి ముండా నేతృత్వంలోని జ్యూరీ సభ్యులు విజేతలను నిర్ణయించారు.

గిరిజనులు మూఢనమ్మకాలు వీడాలి : పల్లవి దరువా
భారతదేశ తొలి ట్రైబల్‌ క్వీన్‌గా గెలుపొందటంపై పల్లవి దరువా ఆనందం వ్యక్తంచేసింది. ఈ అసందర్భంగా ఆమె మాట్లాడుతు..ఎంతోమంది గిరిజన బాలికలు, మహిళలకు బయటి ప్రపంచంలోకి రావడానికి, చదువుకోవడానికి అవకాశాలు దక్కడం లేదని వాపోయింది. 'ట్రైబల్‌ క్వీన్‌'గా కిరీటాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గిరిజనులు మూఢనమ్మకాలు వదిలి.. బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిన అవసరం ఎంతో వుందని పల్లవి పిలుపునిచ్చింది.

గిరిజన మహిళలకంటూ సొంత గుర్తింపు కోసం ఈ కార్యక్రమం : ఖట్వా
విజేతలను ప్రకటించిన అనంతరం అవార్డు కమిటీ ప్రధాన కార్యదర్శి చిదాత్మిక ఖట్వా మాట్లాడుతూ...ఈ కార్యక్రమం ద్వారా గిరిజన సంస్కృతిని దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చామన్నారు. ఇది కేవలం బాహ్య సౌందర్యానికి సంబంధించిన పోటీ కానే కాదు. కళలు, నృత్యరీతుల ద్వారానే కాకుండా గిరిజన మహిళలకంటూ ఒక సొంత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ పోటీ నిర్వహించామని చిదాత్మిక ఖట్వా తెలిపారు. సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాంప్‌పై నడవడం, అందరి ముందు అభిప్రాయాలను వెల్లడించడం వంటివి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయంటూ’ వ్యాఖ్యానించారు.

16:05 - July 12, 2018

బీహార్ : రాష్ట్రంలో మద్య పాన నిషేధంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. మద్యపాన నిషేధానికి సంబంధించిన చట్టంలో పలు కీలక మార్పులకు నితీష్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం కఠినంగా అమలు చేయడం సాహసోపేతమైనదిగా నితీష్ అభివర్ణించారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్ట సవరణ బిల్లును నితీష్ సర్కార్ ప్రవేశ పెట్టనుంది. ఈ చట్టంలో మార్పులు చేయడం ద్వారా విపక్షాలకు అస్త్రం లభించినట్లైంది. మద్యపాన నిషేధం మాటున దళితులు...వెనుకబడిన తరగతుల వారిని ప్రభుత్వం అరెస్టు చేస్తోందని..లక్షా 50 వేల మందిని అరెస్టు చేశారు. 

16:04 - July 12, 2018

బీహార్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా బీహార్ రాష్ట్రంలో అడుగు పెట్టారు. జేడీయూ..ఎన్డీయే కూటమిలో చేరిన అనంతరం తొలిసారిగా బీహార్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ తో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 ఎన్నికల్లో లోక్ సభ సీట్ల పంపకాలపై చర్చించినట్లు సమాచారం. సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం కూడా పాల్గొన్నారు. 

టీడీపీ విస్తృతస్థాయి సమావేశం..పలు అంశాలపై చర్చ..

అమరావతి : ఏపీ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. ఎన్నికలకు సమాయత్తం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, గ్రామదర్శిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణలపై సమాలోచనలు చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలోనే అసెంబ్లీ సమావేశాలు జరిపే అంశంపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నారు. ఈ అంశాలపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై నేతలకు చంద్రబాబు దిశా నిర్ధేశం చేస్తున్నారు. మైనార్టీ సదస్సు దేదీని ఈ సమావేశంలో ఖరారుపై నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. 

15:46 - July 12, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని తణుకు మండలం దువ్వ గ్రామంలో భారీ వర్షం కురవడంతో ఎస్సీ కాలనీలోకి నీరు భారీగా వచ్చి చేరింది. సంవత్సన్నర క్రితం డ్రైనేజీ కోసం భారీగా గోతి తవ్వారు. దీనిని అలాగే వదిలేయడంతో దీనితో వర్షపు నీరు వెళ్లడానికి దారి లేకపోవడంతో ఇళ్లలోకి వచ్చి చేరుతోంది. విష సర్పాలు వస్తున్నాయని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

పశ్చిమగోదావరి : అత్తిలి సమీపంలో రెండు నెలల క్రితమే వేసిన రోడ్డు కుంగిపోయింది. చిన్నపాటి వర్షానికే ఈ రోడ్డు కుంగిపోవడం నిర్మాణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రూ. 1.40 కోట్లతో ఈ రోడ్డును నిర్మించారు. నిర్మాణంలో అధికారులు నాణ్యతకు ఎంత పెద్ద పీఠ వేశారో ఈ రోడ్డును చూస్తే తెలుసుకోవచ్చని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 

15:39 - July 12, 2018

హైదరాబాద్ : పోలవరం ప్రాజె క్టుపై రాష్ట్ర ప్రభుత్వం డొల్లతనం మరోసారి బయటపడిందని వైసిపి నేత బోత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరి అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని పేర్కొన్నారు. డీపీఆర్ లో మార్పులు..గడ్కరి నిలదీస్తే ముఖ్యమంత్రి, అధికారులు నీళ్లు నమిలారని, ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని నిలదీశారు. 

కేసీఆర్, కేటీఆర్ బాటలోనే నేను కూడా : సోమారపు

పెద్దపల్లి : సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ బాటలోనే నేను కూడా పయనిస్తానని ఆర్టీసీ ఎండీ సోమారపు సత్యనారాయణ తెలిపారు. నాలుగేళ్లలో ఆశించినంతగా అభివృద్ధి చేయలేకపోయాననీ..రానున్న రోజుల్లో రామగుండం ప్రాంతంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తెలిపారు. పనిచేయని ప్రజాప్రతినిధులపై అవిశ్వాసం పెట్టే హక్కు వుందనీ..కానీ ఇష్టానుసారంగా తనపై ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. కాగా కొన్ని రోజుల క్రితం అవిశ్వాస తీర్మానం విషయంలో మనస్తాపం చెందిన సోమారపు సత్యనారాయణ రాజకీయ సన్యాసం చేస్తానని తెలిపిన విషయం గమన్హాం.

15:24 - July 12, 2018

తెలుగులో బిగ్ బాస్ 2ఇప్పుడిప్పుడే ముదిరి పాకాన పడుతోంది. కొంతమంది సభ్యుల మధ్య వుండే గ్రూప్స్ ను సున్నితంగానే కాకుండా సూటిగా బిగ్ నిర్వాహకులు విడదీసి వారిలో వారికే పోటీలు,టార్గెట్ లు పెట్టి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ హిట్ కావ‌డంతో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ భారీ అంచనాల మ‌ధ్య మొద‌లైంది. సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ అయితే.. సీజన్ 2కి నేచురల్ స్టార్ నాని అట్రాక్షన్. కానీ ఎన్టీఆర్ ఆకట్టుకున్నంతగా నాని ఆకట్టుకోలేకపోతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ బిగ్ బాస్ సభ్యులను అలరించేలా వ్యాఖ్యానిస్తే..నాని మాత్రం షో జరిగే పరిణామాలను..ఆ సందర్భాలను విశ్లేషిస్తు సభ్యుల వివరణలు కోరుతున్నాడు. ఆ సమయంలో సభ్యులు కొంచెం ఎమోషన్ గా మాట్లాడుతున్న సందర్భంగా నాని వాటిని సున్నితంగా కట్ చేస్తునే..పదునుగా మాట్లాడుతు..సమాధానాలు వారి ద్వారానే చెప్పిస్తుంటం విశేషం. దీన్ని పెద్ద గమనించిన పలువురు నాని ఎన్టీఆర్ లా యాంకరింగ్ చేయలేకపోతున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ షోలో సెలబ్రిటీస్ ఎవ‌రూ పెద్దగా ఫేమ‌స్ కాక‌పోవ‌డంతో పెద్దగా ఆక‌ట్టుకోవ‌డం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. దీనికితోడు హోస్‌మెట్స్ మ‌ధ్య జరుగుతున్న అర్థం పర్థం లేని తగాదాలు..సాగదీత ధోరణులు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయని టాక్. దీంతో షోకి సీజన్ 1కి వచ్చినంత రేటింగ్ రావట్లేదని తెలుస్తోంది.

దీంతో ఎలాగైనా మంచి రేటింగ్స్‌తో ఈ షోను ముందుకు తీసుకెళ్లాలని బిగ్‌బాస్ టీం భావిస్తోందట. దీనిలో భాగంగానే షోలోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఓ యువ హీరోయిన్‌ని తీసుకురాల‌ని బిగ్‌బాస్ టీం ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే వైల్డ్‌కార్డు ద్వారా నందిని ఎంట్రీ ఇచ్చింది. అయితే నందిని వ‌ల్ల షోకి పెద్దగా ఉప‌యోగం లేదు. ఎందుకంటే నందిని అనుకున్నంతగా మసాలా దట్టించలేకపోతోంది. దీనికి కారణం ఆమె సాఫ్ట్ నేచర్ ధోరణి కావచ్చు. దీంతో కుమారి 21 ఎఫ్ సినిమాలో రాజ్ తరుణ్ సరసన నటించి యూత్‌కి నిద్ర పట్టకుండా చేసిన హెబ్బా ప‌టేల్‌ని ఈ షోలోకి వైల్డ్‌కార్డ్ ద్వారా తీసుకురావడానికి ప్రయ‌త్నాలు జరుగుతున్నాయని సమాచారం. కానీ ఆమె అంగీకరించిందా.. లేదా? అన్నది తెలియడం లేదు. ఈ వీకెండ్‌లో ఈ విషయమై ఒక క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

పరిపూర్ణానందకు బహిష్కరణల పరంపర..

గుంటూరు : ఘర్షణలు రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న కారణాలతో స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు కూడా ఆయనను బహిష్కరించాయి. ఈ మేరకు పరిపూర్ణానందకు నోటీసులు జారీ చేశాయి. ఆరు నెలల పాటు ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోకి రాకూడదని నోటీసుల పేర్కొన్నారు. పరిపూర్ణానందకు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు కాకినాడకు బయల్దేరారు. మరోవైపు, సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై కూడా ఆరు నెలల నగర బహిష్కరణ వేటు పడిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ లోచేరేందుకు ఢిల్లీ చేరిన కిరణ్ కుమార్..

ఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఆయన ఏపీసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. కాగా, ఈ నెల 13న రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరతారని ఇటీవల ఆ పార్టీ శ్రేణులు స్పష్టతనిచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఏపీ నేతలు కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వస్తున్నాయి. రేపు కాంగ్రెస్ అధ్యక్షుడితో చర్చించిన తరువాత ఆ పార్టీలో చేరనున్న విషయాన్ని స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించనున్నారు.

బయ్యారం ఉక్కు ఏర్పాటు తీర్మానం చేయాలని డిమాండ్..

ఖమ్మం : జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్ కవిత, ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే అజయ్ కుమార్, కలెక్టర్ లోకేష్ కుమార్ హాజరయ్యారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కుగా పరిశ్రమ ఏర్పాటు తీర్మానం చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని జడ్పీ చైర్మన్ కవిత తెలిపారు. సమావేవానికి రెండు జిల్లాల డీఎమ్ హెచ్ వోలు కాకపోవటంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

రిజర్వేషన్ లేని ప్రయాణీకులకు మొబైల్ యాప్..

ఢిల్లీ: రిజర్వేషన్ లేని ప్రయాణీకులకు కొత్త మొబైల్ యాప్ ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. యూటీఎస్ అనే మొబైల్ యాప్ ను దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్ ప్రారంభించారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలోకి రైల్వే స్టేషన్ల లకు యాప్ ని అనుసంధానం చేయనున్నారు. కాగా త్వరంలో దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ సౌకర్యం అందేలా చూస్తామని..ఈ నెల 15 అర్థరాత్రి నుండి యూటీఎస్ యాప్ సేవలు అందుబాటులోకి రానున్నాయని జీఎం వినోద్ తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ వాడకంతో దక్షిణ మధ్య రైల్వే ముందుందని తెలిపారు.

15:00 - July 12, 2018

నిజామాబాద్ : అదో సర్కారు బడి. దశాబ్దాల చరిత్ర ఆ బాలికల పాఠశాల సొంతం. అక్కడ సీటు దొరకడమే కష్టం. కానీ పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారింది ఆ పాఠశాల పరిస్థితి. పైకప్పు రేకులు, గోడలు ఎప్పుడు కూలుతాయో తెలియదు. పాఠశాల ప్రాంగణం బురద గుంతను తలపిస్తుంది.నిజామాబాద్ నగర నడిబొడ్డున ఉన్న కోటగల్లి బడికి వెళ్ళాలంటేనే విద్యార్థినిలు హడలిపోతున్నారు. -

నిజామాబాద్ నగర నడిబొడ్డున ఉన్న కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల. 1969లో రేకుల షెడ్డులో ప్రారంభమైన ఈ బడిలో ఆరు నుంచి పదో తరగతి వరకూ విద్యా బోధన ఉంది. ఇక్కడ చేరేందుకు అమ్మాయిలు క్యూ కడతారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఇక్కడ ప్రవేశాలు జరుగుతాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ స్కూల్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. పగిలిన రేకులు, ఎప్పుడు కూలుతాయో తెలియని గోడల మధ్యన బిక్కు బిక్కుమంటూ చదువు సాగిస్తున్నారు. వర్షం కురిసినా, ఎండలు మండినా ఈ బడికి సెలవే

420 మందికి పైగా చదువుతున్న ఈ బడి ఎప్పుడు కూలుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొంది. ఇటీవల రేకులు విరిగిపడటంతో కొందరు గాయపడ్డారని ఉపాధ్యాయులు తెలిపారు. సరైన మరుగు దొడ్లు, తాగునీటి సౌకర్యం లేదంటున్నారు విద్యార్థినీలు. భయంతో చదువుపై శ్రద్ధ పెట్టలేకున్నామంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై పాలకుల మాటలు నీటిమూటలను తలపిస్తున్నాయి. జిల్లాలో 130 పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నట్లు రికార్డులే చాటుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్కార్‌ బడుల్లో సౌకర్యాలు మెరుగు పరచాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. 

14:56 - July 12, 2018

సంగారెడ్డి : అదో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి. గతేడాది 50 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా మార్చారు. కోట్ల రూపాయలు వెచ్చింది అధునాతన వైద్య పరికరాలు సమకూర్చారు. కానీ సరిపడ వైద్యులను ఏర్పాటు చేయడం మరిచారు. దీంతో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని ఉందన్నట్టూ.. అధునాతన పరికరాలు ఉన్నా... సరిపడ వైద్యులు లేక అవి నిరుపయోగంగా మారాయి. సూదిమందు పుష్కలంగా ఉన్నా.. అవి వేసే డాక్టర్లు లేకపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిపై 10టీవీ ప్రత్యేక కథనం.. సంగారెడ్డి జిల్లా ఆందోలు మండలం జోగిపేటలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారింది. రోగుల జబ్బులను నయం చేయాల్సిన ఆస్పత్రికే రోగం చేసింది. ఐదు కోట్ల రూపాయాలతో 50 పడకల నుంచి 100 పడకల ఆస్పత్రిగా ఈ హాస్పిటల్‌ను మార్చారు. ఆందోల్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌.... దీన్ని ప్రారంభించి నేటికి కరెక్ట్‌గా ఏడాది అయ్యింది. వంద పడకల ఆస్పత్రి అయిన ఇక్కడ అన్ని పరికరాలు ఉన్నాయి. అయితే అక్కడ వైద్యులు, స్టాఫ్‌ నర్సుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో తమకు వైద్యం అందడం లేదంటూ రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితి పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా మారింది. అద్దాల మేడలతో కార్పొరేట్‌ ఆస్పత్రిని తరలించే ఈ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల కొరత రోగులకు శాపంగా మారింది. ఆందోలు, పుల్కల్‌, అల్లదుర్గం, వట్పల్లి మండలాల నుంచి ఇక్కడికి రోగులు వస్తుంటారు. రోజుకు దాదాపు 900 నుంచి వెయ్యి మంది వరకు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఇంత పెద్ద ఎత్తున రోగులు వస్తుంటే ఇక్కడ పనిచేస్తోంది కేవలం ముగ్గురు వైద్యులే. వాస్తవానికి ఇక్కడ 32 మంది వైద్యులు ఉండాలి. దీంతో ఇక్కడ పనిచేస్తున్న ముగ్గురిపై భారమంతా పడుతోంది.

ఈ ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అధునాతన పరికరాలు సమకూర్చారు. ఫిజియోథెరపి, స్కానింగ్‌తోపాటు ఇతర సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇవేవీ ప్రస్తుతం పనిచేయడం లేదు. ప్రధానంగా గర్భిణీ వైద్య నిపుణులు, పిల్లల డాక్టర్లు లేకపోవడంతో మహిళలు, చిన్నారుల ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే సంగారెడ్డికి తరలిస్తున్నారు. వైద్యుల కొరతతో ఆస్పత్రిలో అధునాతన పరికరాలు ఉన్నా.. అవి నిరుపయోగంగా మారుతున్నాయి. సరిపడ సిబ్బంది లేకపోవడం విలువైన పరికరాలు తుప్పుపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి జోగిపేట ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరతను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. సరిపడ వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.

14:51 - July 12, 2018

హైదరాబాద్‌ : మంచినీటి అవసరాల కోసం నిర్మిస్తున్న కేశవపూర్‌ రిజర్వాయర్‌ కోసం సేకరించిన భూమి వివాదంలో చిక్కుకుంది. ఈ భూములన్నీ సారవంతమైనవి కావడంతో రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా జీవనాధారంగా మారిన ఈ భూములు పోతే తమకు ఉపాధి కూడా దొరకదని వారు వాపోతున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన సభలో అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి పాల్గొన్నారు. 2013 చట్టం ప్రకారమే భూ సేకరణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

14:50 - July 12, 2018

విజయవాడ : ఏపీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగులు విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో దీక్షకు దిగారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు కుమారుడికి మంత్రిగా ఉద్యోగం ఇచ్చుకున్నాడని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు విమర్శించారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయకుంటే ఈ నెల 18న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:48 - July 12, 2018

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన విమర్శలను టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఖండించారు. పోలవరం పనులను పరిశీలించి చంద్రబాబు సంకల్పం గొప్పదని కేంద్రమంత్రి గడ్కరీ మాటలు వైసీపీ, బీజేపీలకు వినబడలేదా అని ఎద్దేవా చేశారు. పదే పదే చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తున్న కన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదో చెప్పాలన్నారు బుద్ధా వెంకన్న.

 

14:18 - July 12, 2018

చిత్తూరు : తిరుపతి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వర్థమాన నటుడు 'హరి' ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పలు టీవీ కామెడీ షోల్లో నటించాడు. ఇతనిపై 20 ఎర్రచందనం కేసులున్నాయని..పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం పరారీలో ఉన్నా ఇతను టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఓ సినిమా కోసం రహస్యంగా ఫైనాన్స్ చేసింది హరి అని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం కొంతమంది కూలీలను పట్టుకునే సమయంలో మేస్త్రీలను విచారించిన సమయలో హరి ఉదంతం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పోలీసులు పూర్తిస్థాయిలో విచారించిన అనంతరం అతను హరి అని పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న స్మగ్లర్లు..విదేశాల్లో ఉన్న స్మగ్లర్లతో హరికి పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో వివరాలు చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. 

14:14 - July 12, 2018

విజయవాడ : త్వరలో ఎన్నికలు రానున్నాయి. ఒకవైపు ముందస్తు ఎన్నికలు వస్తాయనే సంకేతాలు..అసెంబ్లీ..పార్లమెంట్ లకు ఒకేసారి ఎన్నికలు జరుపాలని కేంద్రం యోచిస్తుండడ..తదితర పరిణామాలతో ఏపీ సీఎం చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని...కేంద్రంలో చక్రం తిప్పాలని వ్యూహ రచన చేస్తున్నారు. అందులో భాగంగా కార్యకర్తలు..నేతలు..ఆయా నియోజకవర్గాల నేతలతో భేటీలు జరుపుతున్నారు.

గురువారం సీఎం నివాసం పక్కనున్న గ్రీవెన్స్ సెల్ లో టిడిపి రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్ ఛార్జీలు హాజరు కానున్నారు. ఈనెల 16 నుండి ప్రారంభించతలపెట్టిన 'గ్రామ దర్శిని' కార్యక్రమం జనవరి 10వరకు కొనసాగించాలని..ఇందుకు సంబంధించిన విధి విధానాలు సమావేశంలో ఖరారు చేయనున్నారు.

గ్రామాలు..పట్టణాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని బాబు నేతలకు దిశా..నిర్ధేశం చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 18న పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై మరోసారి అవిశ్వాసం పెట్టడానికి బాబు యోచిస్తున్నట్లు సమాచారం. 

సిలిగిరిలో బంగారం పట్టివేత...

వెస్ట్ బెంగాల్ : సిలిగిరిలో డీఆర్ఐ అధికారులు జరిపిన దాడుల్లో 20.490 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 3.3 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

13:48 - July 12, 2018

సంగారెడ్డి : జహీరాబాద్‌ నియోజకవర్గంలో సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో దళితులు పాదయాత్ర చేపట్టారు. నాలుగు దశాబ్ధాల క్రితం దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వం.. వేరే నిర్మాణాలకు కేటాయించడంతో దళితులు ఆందోళన చేపట్టారు. మొగుడంపల్లి మండల కేంద్రం నుండి జహీరాబాద్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటామని దళితులంటున్నారు. వారి ఆందోళనపై మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి..

13:44 - July 12, 2018

హైదరాబాద్ : రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో నగరం లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రధాన రాదారులపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. చందానగర్, లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో బయటకు రావడానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లింగంపల్లి అండర్ బ్రిడ్జ్ నుంచి గుల్మొహర్ పార్క్ వరకు, నల్లగండ్ల ఫ్లైఓవర్ ఫై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రెండు కిలోమీటర్లమేర నిలిచినా వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హాఫిజ్‌పేట్ ప్రాంతాల రహదారులపై వాహనాలు కిక్కిరిసాయి.

13:42 - July 12, 2018

హైదరాబాద్ : నగరంలోని ఓల్డ్ సిటీలో ఉన్న ఆర్ఆర్ పాన్ మసాలా, శ్రీఆదిత్య కార్యాలయంపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఉదయం నుండి ఐటీ శాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఆర్ఆర్ పాన్ మసాలాకు చెందిన లంగర్ హౌజ్ కార్యాలయంతో పాటు మరో మూడు చోట్ల ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓల్డ్ సిటీ, లంగర్ హౌస్, రాజేంద్రనగర్, సంతోష్ నగర్ లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులు సాయంత్రం వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. 

13:40 - July 12, 2018

చిత్తూరు : తిరుపతి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వర్తమాన నటుడు హరి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పలు టీవీ కామెడీ షోల్లో నటించాడు హరి. తాజాగా రిలీజైన ఓ మూవీకి ఫైనాన్స్‌ చేయడంతో పాటు ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోశించాడు. స్మగ్లింగ్‌లో మరో ఇద్దరు నటుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. సుమారు 20కేసుల్లో నిందితుడుగా వున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాల ద్వారా రెడ్ శ్యాండిల్స్‌ టాస్క్‌ ఫోర్స్‌ నటుల కోసం గాలిస్తున్నాయి. 

13:28 - July 12, 2018

ఢిల్లీ : అభివృద్ధి చెందిన దేశాలే లక్ష్యంగా ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు దాడులకు వ్యూహం పన్నుతున్నారు. ఈ మేరకు 12 మంది యువతకు పాకిస్థాన్‌లో కఠోర శిక్షణ ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కో దేశంలో లక్ష్యాలను అప్పగించారు. ఈ తరహాలోనే దేశ రాజధాని ఢిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు అఫ్ఘాన్ జాతీయుడైన యువకుడికి బాధ్యత అప్పగించారు. ఈ విషయాన్ని అఫ్ఘనిస్తాన్‌లోని అమెరికా దర్యాప్తు సంస్థలు భారత్‌కు సమాచారం అందించాయి. దీంతో ఐఎస్‌ఐఎస్‌ కుట్రను నిఘా సంస్థలు భగ్నం చేశాయి. మార్కెట్లు, మాల్స్, సున్నిత ప్రాంతాలే లక్ష్యంగా చేసుకున్న ఐఎస్‌ఐఎస్‌ ఈ భారీ విధ్వంసానికి పూనుకున్నట్లుగా అమెరికా దర్యాప్తు సంస్థలు భారత్‌కు సమాచారం అందించాయి. ఈ సమాచారంతో అప్రమత్తమైన నిఘా సంస్థలు ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. 

అభివృద్ధి చెందిన దేశాలే లక్ష్యంగా ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు దాడులకు వ్యూహం

అభివృద్ధి చెందిన దేశాలే లక్ష్యంగా ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు దాడులకు వ్యూహం పన్నుతున్నారు. ఈ మేరకు 12 మంది యువతకు పాకిస్థాన్‌లో కఠోర శిక్షణ ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కో దేశంలో లక్ష్యాలను అప్పగించారు. ఈ తరహాలోనే దేశ రాజధాని ఢిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు అఫ్ఘాన్ జాతీయుడైన యువకుడికి బాధ్యత అప్పగించారు. ఈ విషయాన్ని అఫ్ఘనిస్తాన్‌లోని అమెరికా దర్యాప్తు సంస్థలు భారత్‌కు సమాచారం అందించాయి. మానవ బాంబు దాడి కోసం ఆ వ్యక్తి ఢిల్లీ విమానాశ్రయం

 

12 మందికి పాకిస్థాన్‌లో శిక్షణ..
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో విధ్వంసాలే లక్ష్యంగా ఐఎస్‌ నేతలు 12 మంది యువతకుపాకిస్థాన్‌లో కఠోర శిక్షణనిచ్చారు. వీరిలో ఒక్కొక్కరికీ ఒక్కో దేశంలో లక్ష్యాలను అప్పగించారు. గత ఏడాది మే 22న బ్రిటన్‌లోని మాంచెస్టర్‌ ఎరీనాలో జరిగిన మానవ బాంబు దాడి కూడా ఈ 12 మందిలో ఒకడి పనే. ఆ ఘటనలో 23 మంది చనిపోయారు. ఆ తరహాలోనే న్యూఢిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు.. అఫ్ఘాన్‌ జాతీయుడైన యువకుడికి టాస్క్‌ అప్పగించారు. సదరు ఫిదాయీ భారత్‌కు రానున్న విషయంపై అఫ్ఘానిస్థాన్‌లోని అమెరికా దర్యాప్తు సంస్థలు భారత్‌కు ఉప్పందించాయి. భారత్‌లోని బహుళ నిఘా, దర్యాప్తు సంస్థలు నిత్యం 80 మందితో 18 నెలల పాటు అతని కదలికలపై నిఘా పెట్టాయి. పాతికేళ్ల వయసున్న ఐఎస్‌ ఫిదాయీ ఢిల్లీ శివార్లలోని లజ్‌పత్‌నగర్‌లో ఉంటూ.. ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో చేరాడు.మానవ బాంబు దాడి కోసం ఢిల్లీ విమానాశ్రయం, అన్సాల్‌ ప్లాజా మాల్‌, వసంత్‌ కుంజ్‌ మాల్‌, సౌత్‌ ఎక్స్‌టెన్షన్‌ మార్కెట్‌లలో రెక్కీ నిర్వహించాడు. అతనికి ఐఎస్‌ ద్వారా కొరియర్‌లో మానవ బాంబును తయారు చేసుకునే సరంజామా అంతా లభించినా.. ట్రిగ్గర్‌ (ఐఈడీ సర్క్యూట్‌) దొరక్కపోవడంతో.. తన లక్ష్యాన్ని పూర్తిచేయలేకపోయాడు. దర్యాప్తు సంస్థలు సదరు ఫిదాయీని పకడ్బందీగా అరెస్టు చేశాయి. ఆ తర్వాత అతణ్ని విడుదల చేయడంతో.. అఫ్ఘానిస్థాన్‌కు పారిపోయాడు. ఇది కూడా దర్యాప్తు సంస్థల వ్యూహంలో భాగం కావడంతో.. అక్కడ అతనికోసం కాపుకాచుకుని ఉన్న అమెరికా దర్యాప్తు సంస్థలు అసలు పనిని ప్రారంభించాయి. మిగతా దేశాల్లో దాడులకు నియమితులైన ఫిదాయీలు.. తాలిబన్‌ అగ్రనేతల వివరాలను తెలుసుకుని.. క్రమపద్ధతిలో వారిని ఏరివేస్తూ వచ్చాయి.

పురుషోత్తపట్నం ఎత్తిపోత ప్రాజెక్టు విచారణ..

ఢిల్లీ : పురుషోత్తపట్నం ఎత్తిపోత ప్రాజెక్టు నిర్మాణంపై దాఖలైన పిటీషన్ పై గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ కొనసాగుతోంది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టును నిర్మిస్తున్నారని చౌదరయ్య అనే వ్యక్తి పిటీషన్ వేయటంతో పిటీషనర్ తరపున వాదనలను అడ్వకేట్ రచనాచారి తమ వాదనలను వినిపించారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టును ఎలా నిర్మిస్తున్నారని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఎన్జీటీ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఎత్తిపోతల పథకంలో అటవీశాఖ భూమి లేదని ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

12:59 - July 12, 2018

కర్నూలు : జిల్లాలో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కింది. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా ఎస్వీ మోహన్‌రెడ్డిని.. లోకేశ్‌ ప్రకటించడంతో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్‌ అసంతృప్తిగా ఉన్నారు. టీజీ తనయుడు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం ఓవైపు జరుగుతుండగా... మరోవైపు లోకేశ్‌ ఎస్వీ మోహన్‌రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించడంతో టీడీపీలోనే రసవత్తర పోరు మొదలైంది. అయితే... వచ్చే ఎన్నికల్లో టీజీ వెంకటేశ్‌తో సహా అందరిని కలుపుకుంటూ ముందుకెళ్తామంటున్న ఎస్వీ మోహన్‌రెడ్డితో టెన్ టివి  ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. తనను అభ్యర్ధిగా ప్రకటించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇకనుంచి గెలుపుపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోల చూద్దాం... 

 

ఆర్ ఆర్ పాన్ మసాల ఓనర్స్ ఐటీ శాఖ దాడులు..

హైదరాబాద్ : ఆర్ ఆర్ పాన్ మసాల ఓనర్స్ పై ఐటీ శాఖ దాడులు చేపట్టింది. ఆర్ ఆర్ పాన్ మసాల ఓనర్స్ అయిన ఆదిత్య హమీద్ ఇళ్లపై ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. హైదరాబాద్ లోని మూడు ప్రాంతాలలో ఐటీ శాఖ దాడులను కొనసాగిస్తోంది. 

12:55 - July 12, 2018

హైదరాబాద్ : వారంతా పేద, మ‌ద్యతర‌గ‌తి కుటుంబాల‌కు చెందిన వాళ్లు..  హైద‌రాబాద్ లాంటి మ‌హానగ‌రంలో ఓ గూడుంటే చాలన్న భావనతో..
ఏళ్ల త‌ర‌బ‌డి క‌ష్టపడి కూడ బెట్టుకున్న సొమ్ముతో స్థలాలు కొన్నారు. కానీ వాటిని గ‌ద్దల్లా త‌న్నుకుపోవ‌డానికి రెడి అయ్యారు భూ భ‌కాసురులు. దీంతో స‌తీష్ హౌసింగ్‌ కో-అప‌రేటివ్ స‌భ్యులు తమకు న్యాయం చేయాలని  ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

హైద‌రాబాద్ అభివృద్దితోపాటే భూముల ధ‌ర‌ల‌ు పెరిగిపోయాయి. దీంతో ఎటుచూసినా.. భూ కబ్జాలు య‌థేచ్చగా సాగిస్తున్నారు. ఒక‌రు కొన్న భూమిని మ‌రొక‌రు ఆక్రమించడం, ఒకే భూమిని ఇద్దరు ముగ్గిరికి అమ్మడం వంటి ఘట‌న‌లు  గ్రేట‌ర్ చుట్టూ సర్వసాధారణం అయిపోయింది. అవినీతి  అధికారులు, రాజ‌కీయ నేతల అండదండలు చూసుకుని అక్రమార్కులు  బరితెగిస్తున్నారు.  కుత్బుల్లాపూర్ మండ‌లం బౌరం పేట్  గ్రామ ప‌రిధిలో 1980వ ద‌శ‌కంలో ఇళ్ల స్థలాల‌కోసం భూములు కోనుగోలు చేశారు. కానీ ఏళ్లు గ‌డుస్తున్నా ఇళ్ళు కట్టుకో లేకున్నామంటూ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు బాధితులు

కుత్బుల్లాపూర్ మండ‌లం బౌరం పేట్  గ్రామ ప‌రిధిలోని 240 నుంచి 269 వ‌ర‌కు ఉన్న స‌ర్వే న‌ంబర్‌లోని 310 ఎక‌రాల్లో దాదాపు 15 లే ఔట్లు వెలిశాయి.  ఇందులో స‌తీష్ హౌసింగ్ సొసైటి  ద్వారా 800 మంది,  జీపీఆర్‌  హౌసింగ్ ద్వారా మ‌రో 500 మంది ప్లాట్లు కొన్నారు. కానీ అక్కడి  రెండు లే ఔట్లలో 19 ఎక‌రాల‌ు తమ భూమి ఉంద‌ంటూ యాదగిరి అనే వ్యక్తి దౌర్జన్యం చేస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఆర్డీవో, డిప్యూటీ క‌లెక్ట‌ర్లు    యాద‌గిరికి ఎలాంటి భూమి లేదని స్పష్టం చేశారని అంటున్నారు. అన్ని స‌క్రమంగా ఉన్నా త‌మ‌ను బెదిరిస్తున్నాడని  ఆరోపిస్తున్నారు బాధితులు. ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నవారెవరికీ తాము భూములు  అమ్మలేదంటున్నారు గత భూ యజమానులు. ఆ భూమి తనదేనని చింత‌ల యాద‌గిరి ఎలా అంటున్నారో త‌మ‌కు అర్థం కావ‌డం లేదంటున్నారు రైతులు.

మరోవైపు జీపీఆర్‌ హౌజింగ్  వారు కూడా ఇబ్బందుల‌కు గురిచేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు బాధితులు. వారిపై పోలిసుల‌కు కూడా ఫిర్యాదు చేశామంటున్నారు. చెమటోడ్చి కూడపెట్టిన డబ్బుతో కొన్న  భూముల్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. ప్రభుత్వం స్పందించి త‌మ‌కు న్యాయం చెయ్యాల‌ని కోరుతున్నారు. భూ సమస్యలు  అధికారుల దృష్టికి వచ్చినప్పుడు అన్ని విభాగాలు ఒకేసారి స్పందించాలని కోరుతున్నారు బాధితులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఢిల్లీని టార్గెట్ గా భారీ విధ్వంసానికి ఐఎస్ఐఎస్ కుట్ర!!..

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని అంతర్జాతీయ తీవ్రవాదం సంస్థ అయిన ఐఎస్ఐఎస్ కుట్ర పన్నినట్లుగా సమాచారం. మానవ బాంబులతో భారీ విధ్వంసానికి ఐఎస్ఐఎస్ వ్యూహం పన్నినట్లుగా సమాచారం. మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సున్నిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద సంస్థ పలు విధ్వంసాలకు పాల్పడేందుకు సిద్ధపడుతున్నట్లుగా అమెరికా నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీంతో భారత నిఘా సంస్థలు అప్రమత్తమయ్యింది. మానవ బాంబుగా ఆఫ్ఘాన్ పౌరుడు నియమించబడినట్లుగా ఆమెరికా నిఘా సంస్థ వెల్లడించింది. ఈ కుట్రను భగ్నం చేసేందుకు నిహా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

12:51 - July 12, 2018

ఆసిఫాబాద్ : చినుకు పడిందంటే చాలు ఆ ప్రాంతంలో ఉన్న గిరిజన గూడాలు, మారుమూల పల్లెలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అలాంటిది 5 రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా జనజీవనం స్థంబించిపోయింది. గ్రామాలన్నీ వరద నీటితో జలమయం అయ్యాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 

ఐదు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జనజీవనం స్థంభించిపోయింది. భారీ వర్షాలతో జిల్లాలో ఉన్న వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు ఎక్కువగా వచ్చి చేరడంతో కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మహరాష్ట్ర సరిహద్దును ఆనుకొని ఉన్న సిర్పూర్, కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్‌ మండలాలలో పెనుగంగా, ప్రాణహిత లాంటి పెద్ద నదులు ప్రవహిస్తుంటాయి. వారం రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ నదులు జలకళను సంతరించుకున్నాయి. పెనుగంగా ప్రవాహం తీవ్రంగా ఉండటంతో సిర్పూర్‌, కౌటాల మండలాల్లో ఉన్న పది గ్రామాల ప్రజల భయాందోళన చెందుతున్నారు. 

చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల్లో ఉన్న ప్రాణహిత నది కూడా నాలుగు రోజులుగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహారాష్ట్ర నుండి వచ్చే వరద నీరు సుమారు 30 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుంది. దీంతో పరిసర ప్రాంతాల్లోని 30 గ్రామాల ప్రజలు వరద ముంపు ఎప్పుడు సంభవిస్తుందో తెలీక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. మరో అతి పెద్ద వాగైన పెద్దవాగును ఆనుకొని దాదాపు వంద వరకు ముంపు గ్రామాలున్నాయి. భారీ వర్షాలతో పెద్దవాగును ఆనుకొని ఉన్న పిల్ల వాగులు గ్రామాలనే ముంచేస్తాయి.

బెజ్జూరు మండలంలో కుష్నేపల్లి, సుశ్మీర్‌ వాగులు చిన్నపాటి వర్షాలకే పొంగి పది గ్రామాలకు రాకపోకలను దూరం చేస్తాయి. దహేగాం మండలంలో ఎర్రవాగు ప్రతి సంవత్సరం ఉగ్రరూపం దాల్చుతుంది. ఈ వాగు పొంగితే 11 గ్రామాల ప్రజలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోతాయి. సిర్పూర్‌ మండలం కొలాంగూడ, పాతట్ల గూడ, శివపూర్‌ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. కాగజ్‌నగర్‌, పెంచికల్‌ పేట్‌, కౌటాల, చింతమానేపల్లి మండలాలు వర్షాకాలంలో బాహ్యప్రపంచానికి దూరం కావాల్సిందే. వాగులపై వంతెనలు నిర్మించినప్పటికీ వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు వర్షాకాలం వస్తుందంటేనే జంకుతున్నారు. 

12:49 - July 12, 2018

కాకినాడ : అధికారుల నిర్లక్ష్యం అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. ఆర్మీ సెలక్షన్స్‌ కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులకు ఇక్కట్లు తప్పలేదు. కాకినాడలో కనీస జాగ్రత్తలు పాటించకుండా అధికారులు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కాకినాడలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ క్యాంప్‌ సమస్యలకు కేంద్రంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ నాలుగు రోజులుగా క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. ట్రాక్‌ సరిగా లేకపోవడంతో బురదలో అభ్యర్థులు పడుతోన్న కష్టాలు వర్ణనాతీతం. కొందరు అభ్యర్థులకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

ఇక దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి వసతుల్లేవు. కనీసం మరుగుదొడ్ల ఏర్పాట్లు కూడా చేయలేదు అధికారులు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు అభ్యర్ధులు చెబుతున్నారు. రాత్రి పూట బస చేయడానికి అవకాశం లేకపోవడంతో రోడ్లపైనే విశ్రమించాల్సి వస్తుందంటున్నారు. 

పెద్ద సంఖ్యలో యువత తరలిరావడంతో హోటళ్లు, లాడ్జీలలో రేట్లు అమాంతం పెంచేశారు. దీంతో అభ్యర్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టిన అధికారులు అభ్యర్థులకు కనీస జాగ్రత్తలు చేపట్టడంలో విఫలమయ్యారు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

12:47 - July 12, 2018

హైదరాబాద్ : మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఎక్కడ..? కాంగ్రెస్‌తో అంటీముట్టనట్లుగా ఎందుకున్నారు..? ప్రాజెక్టులకు భూసేకరణపై.. కోర్టుల్లో కేసులు వేసి.. కేసీఆర్‌ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిర చేసిన దామోదర.. ఉన్నట్లుండి ఎందుకు సైలెంట్‌ అయ్యారు. ముఠా నాయకుడంటూ కేసీఆర్‌ తిట్టిపోసిన దామోదర మౌనం వెనుక మతలబేంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ.
తెలంగాణ రోడ్‌మ్యాప్‌లో కీలక భూమిక
దామోదర రాజ నరసింహ..! మాజీ డిప్యూటీ సీఎం..! అంతేనా..? తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో.. కీలక రోడ్‌మ్యాప్‌లో అంతే కీలకంగా వ్యవహరించిన నేత. ఈక్రమంలోనే.. అధిష్ఠానం ముందు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించి.. సోనియానే మెప్పించిన నేత. పైగా ఫైర్‌బ్రాండ్‌ ఇమేజ్‌తో.. కేసీఆర్‌ పేరెత్తినా.. ప్రత్యర్థులను ఏకిపారేయాలన్నా.. ఒంటికాలిపై లేచే నాయకుడు. ఇంతటి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న దామోదర రాజనరసింహ.. ఉన్నట్టుండి మౌనముద్ర దాల్చారు.
గతంలో ఎన్నడూ లేని మౌనముద్రలో దామోదర 
దామోదర రాజనరసింహ.. 2014 ఎన్నికల ఓటమి తర్వాత.. ఎన్నడూ లేనంతటి మౌనాన్ని ప్రస్తుతం పాటిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.. కనీసం గాంధీభవన్‌ వైపు కన్నెత్తయినా చూడడం లేదు. సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణలో.. ముఖ్యంగా మల్లన్నసాగర్‌ వ్యవహారంలో.. కేసీఆర్‌ సర్కారును కేసులతో ఉక్కిరి బిక్కిర చేసిన దామోదర.. కొంతకాలంగా సర్కారుపైనా విమర్శలు గుప్పించడం లేదు.
కేసీఆర్‌తో ముఠానాయకుడన్న ముద్ర వేయించుకున్న దామోదర
కేసీఆర్‌ సర్కారును కోర్టులతో మొట్టికాయలు వేయించి.. ప్రభుత్వాధినేతతో ముఠానాయకుడన్న ముద్రను వేయించుకున్న దామోదర రాజనరసింహ ఎందుకిలా మౌనంగా ఉన్నారు. ఈ ప్రశ్నకు.. పార్టీ అంతర్గత పరిణామాలే కారణమన్న సమాధానం వస్తోంది. కేసీఆర్‌ లాంటి నేత అవినీతిపై తాను పోరాడుతుంటే.. పార్టీ అధిష్ఠానం తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న భావనలో దామోదర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో తాజాగా జరిగిన పదవుల పందేరమే దీనికి కారణమని చెబుతున్నారు. 
ఎమ్మెల్యే సంపత్‌కు ఏఐసీసీ కార్యదర్శి పదవి
ఈ మధ్యనే.. పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంపత్‌కు ఏఐసీసీ కార్యదర్శి పదవి దక్కింది. తనలాంటి సీనియర్‌ను కాదని, తన సామాజిక వర్గానికే చెందిన సంపత్‌కు ఢిల్లీ స్థాయి పదవి కట్టబెట్టడం, పైగా మహారాష్ట్రకు ఇంచార్జిగా కూడా నియమించడం దామోదర ఆగ్రహానికి కారణమని చెబుతున్నారు. ఈకారణంతోనే ఆయన మౌనముద్ర దాల్చారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు.. దానం నాగేందర్‌ బాటలో ముఖేశ్‌ కూడా కారెక్కుతారని, అధిష్ఠానంపై అలిగిన దామోదర కూడా గులాబీ గూటికి చేరవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
పార్టీ మార్పిడి వార్తలు తోసిపుచ్చుతున్న సన్నిహితులు
దామోదర రాజనరసింహ పార్టీ మార్పిడి వార్తలను ఆయన సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు. అధిష్ఠానంపై ఆగ్రహమే తప్ప పార్టీ మారేంత సీరియస్‌ నిర్ణయాన్ని దామోదర తీసుకోరని పార్టీ వర్గాలూ భావిస్తున్నాయి. మొత్తానికి దామోదర, తన సైలెన్స్‌తో.. పార్టీలో హస్తిన వరకూ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన తనను విస్మరిస్తే.. పార్టీకి నష్టం తప్పదన్న సంకేతాన్ని తన మౌనం ద్వారా పంపుతున్నారు. మరి కాంగ్రెస్‌ హైకమాండ్‌.. దామోదర సైలెన్స్‌ను బ్రేక్‌ చేస్తుందా..? ఆయన అలకను ఎలా తీర్చనుంది..? వేచి చూడాలి. 

 

యాదాద్రి పుణ్యక్షేత్రంలో వ్యభిచార దందా..గుట్టు రట్టు..

యాదాద్రి : రాష్ట్రంలో అత్యద్భుత పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దాలన్న కేసీఆర్ సర్కారు ప్రణాళికలకు, ఇక్కడ దశాబ్దాలుగా వేళ్లూనుకున్న వ్యభిచార దందా అడ్డుగా నిలుస్తోంది.ద దీంతో పోలీసులు వ్యభిచారం దందాపై ఉక్కుపాదం మోపారు. మహిళలకు బలహీనతలను, వారి ఆర్థిక అవసరాలను తీర్చుకునే మార్గలను వెతుక్కునే యువతులను గాలం వేసి వారిని వ్యభిచార కూపంలోకి దింపి, యాదగిరిగుట్టలోని లాడ్జీలు, గృహాలు వేదికగా, దందా నడుపుతుండగా, పోలీసులు వారిపై ఇప్పుడు కఠిన చట్టాలను ప్రయోగించారు. గుట్టలో వ్యభిచారం చేస్తూ గడచిన ఐదేళ్లలో 21 పీటా కేసులు, 250కి పైగా ఇతర కేసులు నమోదైన నలుగురు మహిళలపై పీడీ చట్టాన్ని ప్రయోగించారు.

సమస్యలకు నియలంకేంద్రంగా ఆర్మీ రిక్రూట్ మెంట్ క్యాంప్..

తూర్పుగోదావరి : ఆర్మీ రిక్రూట్ మెంట్ క్యాంప్ సమస్యల మయంగా తయారయ్యింది. అభ్యర్ధులకు కనీస సౌకర్యాలను కూడా అధికారులు కల్పించకపోవటంతో పలు విమర్శలకు తావిస్తోంది. పరుగు పందెం పోటీలో వర్షంతో తడిసి ముద్దయిన క్యాంపులో పేరుకున్న బురదతోనే అభ్యర్ధుల పరుగు పోటీలను అధికారులు నిర్వహించారు. రాత్రిపూట అభ్యుర్ధులు రోడ్లపైనే బస చేస్తున్నారు. ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా అభ్యర్థులకు నరకం చూపిస్తున్నారని వారు వాపోతున్నారు.  

11:54 - July 12, 2018

హైదరాబాద్ : నీట్ పరీక్షలో శ్రీవాణి 427వ ర్యాంక్ సాధించింది. డా.విజయలక్ష్మీ శ్రీవాణిని సన్మానించింది. తనను ప్రోత్సహిస్తున్న వారికి శ్రీవాణి ధన్యవాదాలు తెలిపారు. 

11:48 - July 12, 2018

సంగారెడ్డి : ఈనెల 14న మహీంద్ర ఆండ్ మహీంద్ర కంపెనీలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో సిఐటియుకు ఓటు వేసి గెలిపించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు కోరారు. ఈమేరకు కంపెనీ ముందు ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. యాజమాన్యంతో గొడవపడి కార్మికలకు అనేక సదుపాయాలు కల్పించిన సిఐటియును గెలిపించాలన్నారు. కార్మికుల పక్షాన నిలబడి తలబడేది సిఐటియు మాత్రమేనని చెప్పారు. టీఎంఎస్ తో కార్మికులకు ఒరిగేదేమి లేదని స్పష్టం చేశారు. 

మేజర్ పోర్టుల ఛైర్మన్లతో మంత్రి గడ్కరి సమావేశం..

విశాఖపట్నం : దేశవ్యాప్తంగా వున్న మేజర్ పోర్టుల ఛైర్మన్లతో కేంద్రమంతి నితిన్ గడ్కరి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సహాయం మంత్రులు మనుషుక్, రాథాకృష్ణన్ పాల్గొన్నారు. 

11:27 - July 12, 2018

ఆసిఫాబాద్ : జిల్లాలో జైనూర్ లో ఎమ్మెల్యే కోనా లక్ష్మీ పర్యటించారు. వర్షంలోనూ ఎమ్మెల్యే కోనా లక్ష్మీ పలు కాలనీలను సందర్శించారు. కాలనీవాసులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె అన్నారు. 

 

రోగులు, వైద్యులపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టేందుకు యత్నం..

సూర్యాపేట : శ్రీలక్ష్మీ డెంటల్ హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. ఆ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్స్ పైనా, వైద్యం చేయించుకుంటున్న రోగులపై ఓ వ్యక్తి పెట్రోల్ చల్లి నిప్పు పెట్టేందుకు యత్నించాడు. ఇది గమనించి వైద్యలు, రోగులు అతన్ని అడ్డుకున్నారు. ఈ వ్యక్తిని పోలీసులు గోపగాని గిరిగా గుర్తించారు. కాగా గత కొంతకాలంలో శ్రీలక్ష్మీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రంజిత్ రెడ్డికి గిరి మధ్య ఆర్థిక లావాదేవీల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో గిరి ఈ దారుణానికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు.

11:20 - July 12, 2018

విశాఖ : ఉత్తర ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉపరిత ఆవర్తనంతో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. రేపు ఒకటి, ఈనెల 16న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనాల  ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్ గఢ్, కోస్తాంధ్ర, తెలంగాణాలలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈనెల 13, 14 తేదీల్లో సముద్రంలో అలల తీవ్రత పెరుగనుంది. తీరప్రాంతంలో అలలు 2 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

11:09 - July 12, 2018

హైదరాబాద్‌ : నగరంలో కుండపోత వర్షం పడుతోంది. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు ఇళ్ళలోకి చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు, చెట్లు నేలకొరిగాయి. జనజీవనం స్తంభించి పోయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...  

 

చెన్నై, కాచిగూడ రైల్లో చోరీ..

హైదరాబాద్ : చెన్నై, కాచిగూడ రైల్లో చోరీ జరిగింది. వంగనూర్ రైల్వే స్టేషన్ సమీపంలోకి ట్రైన్ రాగా ఎస్ 1 బోగిలో ప్రయాణిస్తున్న ఓ మహిళ మెడలో నుండి ఐదు తులాల బంగారు గొలుసును దొంగలు అపహరించారు. దీంతో మహిళ కేకలు వేయటంతో రైల్వే పోలీసులు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపగా దొంగలు పారిపోయినట్లుగా తెలుస్తోంది. 

11:06 - July 12, 2018

విశాఖ : ఉత్తర ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉపరిత ఆవర్తనంతో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. రేపు ఒకటి, ఈనెల 16న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనాల  ప్రభావంతో ఒడిశా, ఛత్తీస్ గఢ్, కోస్తాంధ్ర, తెలంగాణాలలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈనెల 13, 14 తేదీల్లో సముద్రంలో అలల తీవ్రత పెరుగనుంది. తీరప్రాంతంలో అలలు 2 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

10:56 - July 12, 2018

గుంటూరు : జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టును అడ్డుకుంటున్న సీపీఎం కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో మధుతోపాటు కార్యకర్తలకు బలమైన గాయాలయ్యాయి. పాత గుంటూరులో పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో ముస్లిం యువకులపై అక్రమ కేసులు పెట్టారు. ఈనేపథ్యంలో అక్రమంగా అరెస్ట్ అయిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న మధును పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టును అడ్డుకుంటున్న సీపీఎం కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో మధుతోపాటు కార్యకర్తలకు బలమైన గాయాలయ్యాయి. మధును అరెస్ట్ చేసే క్రమంలో కార్యకర్తలు అడ్డుకోవటంతో పోలీసులు, ఘర్షణ వాతావరణం నెలకొనటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అర్ధరాత్రి నుండి మధు నివాసం వద్ద పోలీసులు నిఘా వేశారు. 144 సెక్షన్ విధించారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని మధు అన్నారు. 

 

భాగ్యనగరంలో భారీ వర్షం..

హైదరాబాద్ : నగరంలో కుండపోత వర్షం పడుతోంది. బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ ప్రాంతాలలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు ఇళ్ళలోకి చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు, చెట్లు నేలకొరిగాయి. జనజీవనం స్తంభించి పోయింది. 

బంగాళా ఖాతంలో రెండు అల్పపీడనాలు..

విశాఖ : ఉపరితల ఆవర్తనంతో బంగాళా ఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్ననట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఉపరిత ఆవర్తనంతో రేపు ఒకటి, 16న మరొక అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపారు. దీంతో ఒడిశా, ఛత్తీస్ గఢ్, కోసాంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో వర్షాలు మరింతగా కురిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉత్రఆంధ్ర తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ ప్రభావంతో 13,14 తేదీల్లో సముద్రం అలల తీవ్రత..తీర ప్రాంతాలలో ఈ తీవ్రత 2 నుండి 4 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడతాయని తెలిపారు.

10:36 - July 12, 2018

కొమ్రం భీం అసిఫాబాద్‌ : జిల్లాలో 5 రోజుల నుండి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొమ్రం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూడు గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ ఫ్లో 35000 క్యూసెక్కులు కాగా ఔట్‌ ఫ్లో 13వేల 376 క్యూసెక్కులుగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

భవనం పైనుండి దూకి బాలివుడ్ రచయిత ఆత్మహత్య..

ముంబై : నానా పటేకర్ నటించిన 'అబ్ తక్ చప్పన్' వంటి చిత్రాలకు కథా రచయితగా పనిచేసిన రవి శంకర్ అలోక్ ముంబైలోని ఓ బహుళ అంతస్తుల భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రవిశంకర్ పశ్చిమ అంధేరీలోని సెవన్ బంగ్లాస్ ప్రాంతంలో నివసిస్తున్న రవి శంకర్ బుధవారం రాత్రి 2 గంటల సమయంలో తన భవంతి పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా రవిశంకర్ ఆత్మహత్యకు సంబంధించి ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా రవిశంకర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, సైకియాట్రిక్ చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు.

10:33 - July 12, 2018

హైదరాబాద్‌ : నగరంలో కుండపోత వర్షం పడుతోంది. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు ఇళ్ళలోకి చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు, చెట్లు నేలకొరిగాయి. జనజీవనం స్తంభించి పోయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

బీహార్ మద్య నిషేధ చట్టంలో మార్పులు..

హైదరాబాద్ : మద్య నిషేధం అమలులో వున్న బీహార్‌ రాష్ట్రంలో మందుబాబుల కోసం ప్రభుత్వం మద్య నిషేధ చట్టంలో కొన్ని మార్పులు చేసింది. ప్రతిపాదిత బిల్లు వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీ ముందుకు రానుంది. ఇందులో భాగంగా మద్యం తాగి తొలిసారి పట్టుబడిన వారు ఇకపై రూ.50 వేల జరిమానా కట్టి బయటపడొచ్చు. లేదంటే మూడు నెలల శిక్ష తర్వాత బయటకు రావచ్చు. బుధవారం ప్రతిపాదిత బిల్లుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన గుంటూరు యాత్రీకులు క్షేమం : పత్తిపాటి

గుంటూరు : మానస సరోవర యాత్రకు వెళ్లి చిక్కుకున్న గుంటూరు వాసులు క్షేమంగా ఉన్నారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. యాత్రికు వెళ్లిన వారిలో కొంతమందితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి వారంతా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల వారంతా నేపాల్ సరిహద్దులో ఉండిపోయారని అన్నారు. రెండుమూడు రోజులు యాత్రకు అంతరాయం కలిగిందన్నారు. యాత్రకు వెళ్లిన 132 మంది నేడు నేపాల్ చేరుకోనున్నారనీ..అనంతరం అక్కడి నుంచి నేరుగా గుంటూరు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తెలిపారు. రెండురోజుల్లో మొత్తం 132 మంది గుంటూరు చేరుకుంటారని వివరించారు.

సీపీఎం కార్యకర్తలపై లాఠీచార్జ్..కార్యదర్శి మధు అరెస్ట్..

గుంటూరు : జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్డుకున్న సీపీఎం కార్యకర్తలపో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పాత గుంటూరులో పోలీస్ స్టేషన్ పై దాడి ఘటనలో ముస్లిం యువకులపై అక్రమ కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో అక్రమంగా అరెస్ట్ అయిన బాధిత కుటుంబాలను కలవటానికి వెళ్తున్న మధును పోలీసులు అరెస్ట్ చేశారు.మధును అరెస్ట్ చేసేందుకు పోలీసులు అర్ధరాత్రి నుండి ఆయన నివాసం వద్ద నిఘా వేశారు. ఈ క్రమంలో మధును పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు,నదులకు జలకళ..

అమరావతి : తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. దీంతో జన జీవితం అస్తవ్యస్తమైంది. గత రాత్రి 12 గంటల సమయం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వర్షం పడుతూనే ఉంది. దీంతో ఈ ఉదయం స్కూళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లాల్సిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రహదారులపై నీరు చేరగా, లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు ప్రవేశించడం ప్రారంభమైంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

న్యూస్ ఛానెల్స్ కు సీఎం కేసీఆర్ వార్నింగ్..

హైదరాబాద్ : ప్రజలను రెచ్చగొట్టేలా న్యూస్ ను ప్రసారం చేసే న్యూస్ ఛానెల్స్ కు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అభ్యంతరకర ప్రసారాలు చేసినా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన వారి వ్యాఖ్యలు చూపించినా కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ సర్కారు తెలుగు వార్తా చానళ్లను హెచ్చరించింది. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడిన వారిపై ఐపీసీలోని ఏ సెక్షన్ల కింద కేసులు పెడతామని హెచ్చరించింది. అటువంటివాటిని ప్రసారం చేసే చానళ్లపైనా అవే సెక్షన్లు పెట్టి విచారించాలని నిర్ణయించిన ప్రభుత్వం, అదే విషయాన్ని చానళ్ల యాజమాన్యాలకు తెలిపింది.

స్వస్థలానికి చేరుకున్న కొప్పు శరత్ మృతదేహం

వరంగల్ : అమెరికాలో కన్సాస్ రెస్టారెంట్‌లో ఓ ఉన్మాది కాల్పుల్లో మృతి చెందిన శరత్‌ మృతదేహం.... ఆయన స్వస్థలమైన వరంగల్‌లోని కరీమాబాద్‌కు చేరుకుంది. శరత్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరైయ్యారు. 

09:54 - July 12, 2018

వరంగల్ : అమెరికాలో కన్సాస్ రెస్టారెంట్‌లో ఓ ఉన్మాది కాల్పుల్లో మృతి చెందిన శరత్‌ మృతదేహం.... ఆయన స్వస్థలమైన వరంగల్‌లోని కరీమాబాద్‌కు చేరుకుంది. శరత్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరైయ్యారు. పలువురు నాయకులు శరత్ మృతదేహానికి నివాళులర్పించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు శరత్ తల్లిదండ్రులు మాలతి, రామ్మోహన్, కుటుంబసభ్యులను ఓదార్చారు. కరీమాబాద్ లోని స్మశాన వాటికలో అతని అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఘటనపై మంత్రి కేటీఆర్, డిజిపి మహేందర్ రెడ్డి, కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ లకు శరత్ తల్లిదండ్రులు నివేదిక ఇచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అమెరికాలోని భారతీయులకు రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. అమెరికా కన్సాస్‌లోని ఒక రెస్టారెంట్‌లో ఓ దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న తెలంగాణ విద్యార్థి కొప్పు శరత్‌ దొంగతనాన్ని అడ్డుకోబోయినందుకు ఆ దొంగ తుపాకీతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనలో శరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. 
ఘటన జరిగిన తీరు...
రెస్టారెంట్‌ యజమాని షాహిద్ తెలిపిన వివరాల ప్రకారం రెస్టారెంట్‌లో ఐదుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఓ గుర్తుతెలియని వ్యక్తి లోపలికి వచ్చాడు. అతడిని చూడగానే అక్కడున్నవారంత భయపడ్డారు. ఆ వ్యక్తి వెంటనే గన్‌ బయటికి తీసి అందరినీ బెదిరించాడు. అయితే అతడిని శరత్‌ అడ్డుకున్నాడు. శరత్‌ను యజమాని వారించే సరికి దుండగుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ వ్యక్తి శరత్‌పై కాల్పులు జరిపాడు. శరత్‌ వెనకవైపు బలంగా తూటాలు తగిలాయి. దీంతో అక్కడే అతడు కుప్ప కూలిపోయాడు. పోలీసులకు కాల్‌ చేసేలోపే దుండగుడు పారిపోయాడు రెస్టారెంట్‌ యజమాని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శరత్‌ మృతి చెందినట్లు స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
శరత్‌ స్వస్థలం కరీమాబాద్‌...
శరత్‌ స్వస్థలం వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌. తండ్రి రామ్మోహన్‌ హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగి. తల్లి మాలతి వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో పంచాయతీరాజ్‌ శాఖలో ఈవోఆర్డీగా పనిచేస్తున్నారు. రామ్మోహన్‌.. కుటుంబంతో హైదరాబాద్‌ అమీర్‌పేటలోని ధరంకరం రోడ్డులో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన శరత్‌ హైదరాబాద్‌లోనే మూడేళ్లపాటు ఉద్యోగం చేశాడు. ఎంఎస్‌ చేసేందుకు ఆరు నెలల కిందట అమెరికా వెళ్లాడు. మిస్సోరి యూనివర్సిటీలో చదువుకుంటూనే కన్సాస్‌ నగరం ప్రాస్పెక్ట్స్‌ అవెన్యూలోని జేఎస్‌ ఫిష్‌ అండ్‌ చికెన్‌ మార్కెట్‌ అనే ఓ హోటల్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

 

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

అనంతపురం : రాయదుర్గంలో రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందారు. బైక్ ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు శ్రీనివాసులుగా గుర్తించారు. మృతుడు ఆర్టీసీ డ్రైవర్ అని తెలుస్తోంది. 

08:14 - July 12, 2018

అనంతపురం : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందారు. మల్యంకు చెందిన శ్రీనివాసులు ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. రాయదుర్గంలో శ్రీనివాసులు బైక్ పై వెళ్తుండగా అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ బైక్ ను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన శ్రీనివాసులు మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీనివాసులుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

07:55 - July 12, 2018

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కాంట్రాక్టు సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమీక్షించారు. జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు సివిల్‌ నిర్మాణాలన్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి, టీడీపీ నేత లాల్ వజీర్, బీజేపీ నేత విష్ణు పాల్గొని, మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

07:47 - July 12, 2018

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం యువజన సంఘాలు ఆందోళన బాట పట్టాయి. బాబు వస్తే జాబు వస్తుందని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల నాడు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాట నిలబెట్టుకోలేదని వారు మండిపడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో ప్రతి యువకునికి 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు నేడు వెయ్యి రూపాయలు ఇస్తామంటున్నారని ఇది యువతను మోసం చేయడమేనని వారు విమర్శిస్తున్నారు. కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయని చెబుతున్న పాలకులు అవెక్కడో చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఏపీ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు పాల్గొని, మాట్లాడారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం... 

 

07:44 - July 12, 2018

ఢిల్లీ : ఫిఫా 2018 పుట్‌బాల్‌లో అద్భుతమైన ఆటతీరుతో  తన సత్తా చాటింది క్రొయేషియా. 1966 తర్వాత రెండో సారి ఫైనల్‌కు చేరుకోవాలన్న ఇంగ్లాండ్‌ తపనను  క్రొయేషియా నీరుగార్చింది.లుజ్నికీ స్టేడియంలో హోరాహోరీగా సాగిన పోరులో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో  విజయం సాధించి  ఫైనల్‌కు చేరింది.   అంచనాలు లేకుండా సాగిన పోరులో క్రొయేషియా విజయం సాధించింది. మ్యాచ్‌ ప్రారంభమైన 5 నిమిషాలకే ఇంగ్లాండ్‌ ప్లేయర్‌ కీరన్‌ ట్రిప్పర్‌ గోల్‌కొట్టాడు.  ఇక ద్వితీయార్థంలో క్రొయేషియా  ప్లేయర్‌ ఇవాన్‌ పెరిసిక్‌ 68వ నిమిషంలో గోల్‌ కొట్టి జట్టు స్కోర్‌ ఈక్వల్‌ చేశాడు. ఇక మారియో మండ్జుకిక్‌ 109వ నిమిషంలో గోల్‌ చేసి క్రొయేషియాకు విజయాన్ని సాధించాడు. ఆదివారం జరుగనున్న టైటిల్‌ పోరులో ఫ్రాన్స్‌తో క్రొయేషియా తలపడనుంది.

07:42 - July 12, 2018

తూర్పుగోదావరి : వానాకాలం వస్తే.. తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల ప్రజలకు ప్రాణగండమే.. ఎగువ ప్రాంతాల్లో కురుసే వర్షాలకు గోదావరి నీటి మట్టం పెరిగితే  చాలు ఈ ప్రాంత ప్రజానీకం గుండెల్లో దడ పుడుతుంది. ఏజెన్సీలోని కొన్ని గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. రోగులు, గర్భవతులకు మరణ యాతనే.. భారీ వర్షాలు కురిశాయంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.. తూర్పు పోలవరం ముంపు మండలాలకు పొంచి ఉన్న వరద ముప్పుపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం...
భయంతో వణుకుతున్న విలీన మండలాల ప్రజల 
చినుకు పడితే చాలు.. తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల ప్రజల గుండెల్లో పిడుగులు పడ్డంతగా భయపడతారు.  వాగులు, వంకలు పొంగాయంటే.. వారికి ప్రాణ గండమే. గోదావరి నీటి మట్టం పెరిగితే.. ఏజెన్సీలోని కొన్ని గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోతాయి. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే.. వారి బతుకులు గాల్లో దీపంతో సమానం. 
ఉధృతంగా ప్రవహిస్తున్న సోకులేరు వాగు
ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఎగువప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు చింతూరు మండలంలోని సోకులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అవతలి ఒడ్డున ఉన్న గవన్లకోట, చదలవాడ, చౌలూరు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఇక్కడి ప్రజలు ఏచిన్న పనికోసమైనా ఈ సోకులేరు వాగు దాటాల్సిందే. నడుంలోతు నీళ్ళలో దిగి  వస్తువులను నెత్తిన పెట్టుకుని వాగు దాటడమంటే.. ప్రాణాలతో చెలగాటమే.  ఇప్పటివరకూ ఈ మూడు గ్రామాలకు చెందిన వారు సుమారు 24 మంది ఈ వాగు దాటుతూ.. చనిపోయారని స్థానిక ఎంపీపీ చిచ్చడి మురళి అన్నారు. 
తెలంగాణ, ఏపీ రాకపోకలకు అంతరాయం
వరదలు ముంచెత్తితే.. ప్రజలు సురక్షితంగా ఉండేందుకు కోతులగుట్టలోని రెడ్‌క్రాస్‌ బిల్డింగ్‌లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగే కొద్దీ.. గోదావరి, శభరి నదుల పరివాహక ప్రాంతంలో ఉన్న కూనవరం, విఆర్‌పురం మండలాలకు వరద తాకిడి ఎక్కువగా ఉంటుంది.  గోదావరి, శభరి నదుల వద్ద పది అడుగుల నీటి మట్టం పెరిగితే తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు రాకపోకలు నిలిచిపోతాయి.  చాలా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటాయి. వర్షాకాలం వస్తే ఈప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే.  ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి బ్రిడ్జీ, రోడ్ల సౌకర్యం కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

 

07:35 - July 12, 2018

హైదరాబాద్‌ : నగరంలో కుండపోత వర్షం కురిసింది. కుండపోత వర్షంతో హైదరాబాద్‌ తడిసిముద్దయింది. బుధవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు ఇళ్ళలోకి చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు, చెట్లు నేలకొరిగాయి.

 

07:33 - July 12, 2018

గుంటూరు : నేడు చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీకానున్నారు. గ్రామదర్శిని కార్యక్రమం, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.  ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ.. పార్టీపై నేతలు మరింత ఫోకస్‌ పెట్టేలా వ్యూహాలు రూపొందించనున్నారు. నేతల మధ్య విభేదాలను తొలగించేందుకు ప్రణాళికలను ఆయన రచిస్తున్నారు.
నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
ఇవాళ చంద్రబాబు తన నివాసంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇంచార్జీలు హాజరుకానున్నారు.ఈ సమావేశంలో చంద్రబాబు పలు అంశాలపై నేతలతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈనెల 16వ తేదీ నాటికి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తవుతున్నందుకు భారీ కార్యక్రమానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఆ రోజు నుంచి సుమారు నాలుగు నెలలపాటు గ్రామదర్శిని పేరుతో నేతలు ప్రజల్లో ఉండేలా యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయనున్నారు.  ఈ గ్రామదర్శిని, పట్టణదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యేలతోపాటు సీఎం చంద్రబాబు నేరుగా ప్రజలతో మమేకంకానున్నారు.  4నెలల కాలంలో 75 బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ కార్యక్రమం ఎక్కడి నుంచి ఎలా ప్రారంభించాలి, ఎలాంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది ఈ సమావేశంలో చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు.
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్న చంద్రబాబు
అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించనున్నారు.  ఈనెల 18 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు  ప్రారంభం అవుతున్న నేపథ్యంలో... అదే సమయంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జరిగినట్టు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని మరోసారి అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు ఏరోజు నుంచి ప్రారంభిస్తే బావుంటుంది.... ఏయే అంశాలను అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నే అంశాలపై చంద్రబాబు నేతలతో కూలంకశంగా చర్చించనున్నారు. 
నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
విస్తృత స్థాయి సమావేశం అనంతరం రాత్రికి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. పార్టీ ఎంపీలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఏపీకి జరిగిన అన్యాయంపై... కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసిస్తూ ఏం చేయాలన్న దానిపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోసారి అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీ భావిస్తోంది.

 

వరంగల్ చేరుకున్న కొప్పు శరత్ మృతదేహం

వరంగల్ : కొప్పు శరత్ మృతదేహం వరంగల్ కు చేరుకుంది. నేడు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. అమెరికాలో ఉన్మాది కాల్పుల్లో శరత్ మృతి చెందారు.

 

నేటి నుంచి భారత్..ఇంగ్లండ్ మధ్య 3 వన్డేల సిరీస్

ఢిల్లీ : నేటి నుంచి భారత్..ఇంగ్లండ్ మధ్య 3 వన్డేల సిరీస్ జరుగనుంది. నాటింగ్ హమ్ లో సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 

నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

గుంటూరు : నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. రాత్రి 7 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చించనున్నారు.

 

నేడు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం

అమరావతి : నేడు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.  

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రామంతాపూర్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, హయత్ నగర్ లో వర్షం పడుతోంది. 

Don't Miss