Activities calendar

01 August 2018

21:44 - August 1, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం చెప్పారు. ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ పాతబస్తీలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందాన ఉందన్న ఆయన.. అర్హులందరికీ డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

బహుజన్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేతలు.. కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో.. హైదరాబాద్‌ పాతబస్తీలో విస్తృతంగా పర్యటించారు. జియాగూడలోని మేకలమండిని సందర్శించిన బిఎల్‌ఎఫ్‌ నేతలు.. అక్కడి కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మేకల మండీని ప్రైవేటుపరం చేయాలన్న  ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, మండీని ప్రభుత్వమే నిర్మించాలని బిఎల్‌ఎఫ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. 

పాతబస్తీలో అనుకూలమైన వారికి తాయిలాలు ఇచ్చారే తప్ప.. ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని బిఎల్‌ఎఫ్‌ నేతలు ఆరోపించారు. ఉర్దూఘర్‌లో విలేకరులతో మాట్లాడిన తమ్మినేని వీరభద్రం.. పాతబస్తీ అభివృద్ధికి ప్రభుత్వం పదివేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని, ప్రధాన పార్టీలకు దీటుగా గట్టి పోటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

జియాగూడలో నిర్మాణంలోని డబుల్‌బెడ్‌ ఇళ్లనూ బిఎల్‌ఎఫ్‌ నేతలు పరిశీలించారు. అనంతరం, బండ్లగూడ తహశీల్దార్‌ కార్యాలయం ముందు బిఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సాగుతోన్న ధర్నాలో పాల్గొన్నారు. ఆ ప్రాంత నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణం కోసం ఖాళీ చేయించిన పేదలందరికీ ప్రభుత్వమే అద్దె చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

 

కొత్తగా 13 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం

ఢిల్లీ : కొత్తగా 13 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిద్ధిపేటకు కేంద్రీయ విద్యాలయం మంజూరు అయింది.

21:31 - August 1, 2018

విజయవాడ : విభజన హామీలు, ప్రత్యేక హోదాపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఏపీ బీజేపీ నాయకులు నిర్ణయించారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇకపై విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు కమలనాథులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్రతిపాదించారు. బీజేపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు వీలుగా పోలింగ్‌ బూత్‌ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయాలని విజయవాడలో జరిగిన  కీలక నేతల సమావేశంలో నిర్ణయించారు. 

విజయవాడలో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షతన బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ మురళీధరన్‌, సహాయ ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవధర్‌తోపాటు పార్టీ ముఖ్యనేతలు హాజరైన ఈ సమావేశంలో ఏపీలో పార్టీ పటిష్టత, ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వచ్చే నెలలో చేపట్టే  రాష్ట్ర పర్యటన, బీజేపీ రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. 

విభజన హామీలు, ప్రత్యేక హోదాపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీ నిర్ణయించింది. దీనిలో భాగంగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారులను నియమించిన చంద్రబాబు ప్రభుత్వం వైఖరిని కమలనాథులు తప్పుపట్టారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన వేల కోట్ల రూపాయల నిధులను టీడీపీ ప్రభుత్వం  మట్టి తవ్వకాలకు ఖర్చు చేయడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని బీజేపీ ఆరోపించింది. దీనిపై విచారణ జరపించాలని కేంద్రాన్ని కోరింది. 

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సంస్థలను తీసుకొచ్చే బాధ్యతలను భుజానికి ఎత్తుకోవాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. టీడీపీ నాయకులు చేసేదాని కంటే చెప్పేది ఎక్కువని వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు  రాజకీయం చేస్తున్నారని విమర్శించిన బీజేపీ.. బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. 
 

21:20 - August 1, 2018

నిజామాబాద్ : తెలంగాణలో.. ఐటీ రంగం మారుమూల గ్రామాలకూ విస్తరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని.. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ప్రభుత్వ చొరవ, ప్రోత్సాహాలతో.. గడచిన నాలుగేళ్లలోనే ఐటీ ఎగుమతులు లక్ష కోట్ల రూపాయలకు చేరుకున్నాయన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్‌ వెల్లడించారు.  

నిజామాబాద్‌ జిల్లాలో ఐటీ టవర్స్‌ నిర్మాణానికి.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో.. స్థానిక ఎంపీ కవితతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం స్థానిక పాలిటెక్నిక్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేటీఆర్‌ ప్రసంగించారు. ఐటీ రంగాన్ని.. ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటు మారుమూల గ్రామాలకూ విస్తరించాలన్నదే తమ అధినేత కేసీఆర్‌ సంకల్పమని అన్నారు. అన్ని పట్టణాల్లోని యువతకు ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, గడచిన నాలుగేళ్లలోనే ఐటీ ఉత్పత్తులు లక్ష కోట్లు దాటాయని కేటీఆర్‌ చెప్పారు. వచ్చే సంవత్సరాంతానికి లక్షా 20 వేల కోట్ల ఉత్పత్తుల లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టీఎస్‌ఐపాస్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల ఉద్యోగాలు సృష్టించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే.. ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. 

ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారంలోకి వస్తే.. ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంటున్నారని, మరి కర్నాటకలో కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారు.. రుణమాఫీని నాలుగు దశల్లో ఎందుకు చేస్తున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. గడ్డం తీసుకోకపోతే.. ఆయనే సన్నాసుల్లో కలసిపోతారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌ పల్లి వద్ద విమానాశ్రయం, క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లో ఆధునిక బస్‌ టెర్మినల్‌ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

 

21:17 - August 1, 2018

సిద్ధిపేట : తెలంగాణలో అడవుల పచ్చదనాన్ని రక్షించేందుకు.. గ్రీన్‌ బెటాలియన్స్‌ను ఏర్పాటు చేయాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అటవీ అధికారులను ఆదేశించారు. పోలీసు శాఖ సహకారం తీసుకుని.. బెటాలియన్‌కు తుదిరూపం ఇవ్వాలని సూచించారు. 

తెలంగాణలో హరితహారం నాలుగోవిడత కార్యక్రమం.. ఉత్సాహంగా ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గజ్వేల్‌లో హరితహారానికి శ్రీకారం చుట్టారు.  స్థానిక ఇందిరాపార్కు కూడలి వద్ద.. కేసీఆర్‌ కదంబ మొక్క నాటిన అనంతరం.. సైరన్‌ వేయగానే.. పట్టణవ్యాప్తంగా లక్ష 16వేల మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమైంది. 

గజ్వేల్‌కు వెళ్లేముందు.. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లిలో.. రాజీవ్‌ రహదారిపై ఆకాశమల్లె మొక్కను సీఎం కేసీఆర్‌ నాటారు. అనంతరం, రాజీవ్‌ రహదారికి ఇరుపక్కలా హకీంపేట నుంచి తుర్కపల్లి వరకూ ఐదువేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. 

హరితహారం పర్యటనలో భాగంగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సింగాయపల్లి ఫారెస్ట్‌నూ సందర్శించారు. అటవీరక్షణ చర్యలపై అధికారులతో సమీక్షించారు. సిబ్బంది కృషిని ప్రశంసిస్తూ.. ఐదు లక్షల రివార్డ్‌ను సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో అడవులు, పచ్చదనాన్ని రక్షించేందుకు.. గ్రీన్‌ బెటాలియన్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అడవిలో కలియతిరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అక్కడ ఓసారి ఎమ్మెల్యేలకు వనభోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. 

రాష్ట్రం నలుమూలలా.. నాయకులు, అధికారులు, ప్రజలు నాలుగోవిడత హరితహారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం.. అధికారులు కొబ్బరి, దానిమ్మ, అల్లనేరేడు, చింత, మామిడి, కరివేప, మునగ వంటి మొక్కలతో పాటు.. వేలాదిగా పూల మొక్కలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. 

21:13 - August 1, 2018

అనంతపురం : అభివృద్ధి నిరోధక వైసీపీ, జనసేన, బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ మూడు పార్టీల నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. సహాయ నిరాకరణతో ప్రధాని మోదీ ఏపీకి అన్యాయం చేస్తుంటే... కేసులతో వైసీపీ ప్రగతికి అవరోధంగా మారిందని విమర్శించారు. అసత్య ఆరోపణలతో జనసేన ప్రజలను రెచ్చగొడుతోందని అనంతపురం జిల్లా పేరూరు గ్రామదర్శిని సభలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. రామగిరి మండలం పేరూరులో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరూరు ప్రాజెక్టుకు నీరు తరలించే కాల్వ నిర్మాణానికి భూమి పూజ చేసిన చంద్రబాబు.. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. చంద్రన్న బీమా పథకం కింద చెక్‌లు అందచేశారు. వివిధ పథకాల కింది  లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేశారు. 

పేరూరు గ్రామదర్శిని సభలో ప్రసంగించిన చంద్రబాబు... ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు. అవినీతిపరుల ఆస్తులు జప్తు చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రధాని... ఇప్పుడు వైసీపీ వంటి అవినీతి పార్టీలకు అండగా నిలుస్తున్నారని విరుచుకుపడ్డారు. 

విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చిన మోదీ... ఇప్పుడు అడ్డం తిరిగడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో మహిళలు, మైనారిటీలు సహా ఏ వర్గానికి రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ లబ్ధి కోసమే అసోంలో జాతీయ పౌర రిజిస్టర్‌ నుంచి 40 లక్షల మంది పేర్లు తొలగించారని విమర్శించారు. 

రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమని అడిగితే ప్రధాని మోదీ బెదిరింపులకు దిగుతున్నారని చంద్రబాబు విమర్శించారు. హుందాగా ప్రవర్తించాల్సిన మోదీ... స్థాయి మరిచి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో పలు గ్రామాలకు రోడ్లు, ఎన్టీఆర్‌ ఇళ్లు చంద్రబాబు మంజూరు చేశారు. 

 

20:41 - August 1, 2018

ఇక లంచం ఇస్తే కటకటాలపాలే..లంచం ఇచ్చిన వారికి కూడా ఏడేళ్ల జైలు శిక్ష పడనుంది. ఇక లంచం తీసుకోవడంతోపాటు ఇవ్వడం నేరమే.. లంచం ఇస్తే జైలుకు పోకతప్పదు.. ఈ విషయాన్ని రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టం చేశాయి. వీటిపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తున్నాయి. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు రాజేంద్రప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. చట్టాల ద్వారా అవినీతిని కంట్రోల్ చేయలేమన్నారు. రాజకీయ అవినీతిని కంట్రోల్ చేయాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:19 - August 1, 2018

నీళ్ల మంత్రి జెప్పిన దాంట్లె నిజమేమన్నుందా?... ఓట్ల కోసం హరీష్ రావు ఆడుతున్న డ్రామేంది?, కాంగ్రెస్ కండువాల మెరిశిపోతున్న కిరణాలు...ఢిల్లీ స్క్రిప్టును నాల్గేండ్ల సంది అమలు జేస్తుండు, పంద్రాగష్టి రోజు ఏం మాట్లాడాలంటున్నమోడీ...అవద్దాలు బట్టెవాయి మాటలు మాత్రం వద్దు, పేదల ఇండ్లను కూలగొట్టిన అధికారులు...మర్రవడ్డ జనం.. లాఠీ ఛార్జీ రాళ్ల దాడులు, మాల్యాగారి విలాస జైలు వీడ్యో వంపుండ్రి...భారత్కు అప్పగించెకాడ లండన్ కోర్టు మాట, పచ్చికోడిని వీక్కతిన్న మానవ జంతువు.. ఆదిమానవుల కంటె అద్వాహ్నమైన తీరు.... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

హైదరాబాద్ జలమండలికి కొత్త పోస్టులు మంజూరు

హైదరాబాద్ : హైదరాబాద్ జలమండలికి కొత్త పోస్టులు మంజూరు అయ్యాయి. కొత్తగా 692 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. కొత్త పోస్టులకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ పర్సన్ ఉద్యోగులు(నీటి సరఫరా) 200 పోస్టులు, జనరల్ పర్పస్ ఎంప్లాయ్ (సీవరేజ్) 200 పోస్టులు, జలమండలి టెక్నీషియన్ గ్రేడ్ 2 (నీటి సరఫరా) 100 పోస్టులు, జలమండలిలో 80 మేనేజర్ సహా ఇతర పోస్టులు మంజూరు చేశారు. 

 

19:57 - August 1, 2018

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అధికార, విపక్షాలు విమర్శలకు దిగాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ కుట్రలు చేస్తుందని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. హరీష్‌రావు వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి తిప్పికొట్టారు. ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్‌ పేరుతో 50 వేల కోట్ల రూపాయలను కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విషయంపై విమర్శలు గుప్పించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆలిండియా కిసాన్ సంఘం ఉపాధ్యక్షులు, సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి, టీజేఏసీ నేత వెంకట్ రెడ్డి, టీఆర్ ఎస్ నేత రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పాల్గొని, మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించారు. ప్రాజెక్టుల నిర్మాణం, రిడిజైనింగ్ పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

19:41 - August 1, 2018

హైదరాబాద్ : కేఎల్‌ యూనివర్సటీకి చెందిన ఎంబీఎ విద్యార్థిని జ్యోతి సురేఖ ఆర్చరీ రంగంలో రాణించడం గర్వంగా ఉందని కేఎల్‌ యూనివర్సిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజా హరి అన్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నదింపల్లి గ్రామానికి చెందిన జ్యోతి సురేఖ గతంలో స్విమ్మిర్‌గా లిమ్మా బుక్‌ ఆఫ్‌ రికార్డు గ్రహీతగా నిలిచిందన్నారు. 13 ఏళ్లకే జూనియర్‌ ఆర్చరీ ప్రపంచ ఛాపియన్‌ షిప్‌, ఏషియన్‌ ఛాపియన్‌ షిప్‌లో పతకాలు సాధించిందని వెల్లడించారు. ఆర్చరీలో బెస్ట్‌ ర్యాంక్‌ పొందిన క్రీడాకారిణి జ్యోతి సురేఖను కాలేజ్‌ యాజమాన్యం విద్యార్థులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.

19:38 - August 1, 2018

హైదరాబాద్ : బీగ్‌ సీ మొబైల్‌ మరో స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సఫైర్‌ బ్లూ, మిడ్‌ నైట్‌ బ్లాక్‌ రంగుల్లో లభించే ఈ హానర్‌ 9మొబైల్‌ ధర 17 వేల 999 రూపాయలు ఉంటుందని సంస్థ సీఎండీ, ఫౌండర్‌ బాలు చౌదరి తెలిపారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌ లైన్‌లో దీని ధర ఒకే విధంగా ఉంటుందన్నారు. ముందుగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఆకర్షణీయమైన బహుమతి లభింస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ తార రాశి ఖన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

 

19:35 - August 1, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకు రావాలని.. ఏపీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ తీర్మానించింది. ఈ క్రమంలో.. అక్టోబర్‌ నెల నుంచి ఇంటింటికీ కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఇతర పార్టీల్లోకి వలస వెళ్లిన నేతలను.. కాంగ్రెస్‌లోకి తిరిగి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలనీ తీర్మానించింది. 

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం.. విజయవాడలో జరిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఊమెన్‌ చాందీ అధ్యక్షతన సాగిన ఈ భేటీలో.. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రప్పించడంపైనే ప్రధానంగా చర్చ సాగింది. ఇప్పటికే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటనలు ముగించిన ఊమెన్‌ చాందీ.. ఎన్నికలకు సమాయత్తం కావడంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో.. పార్టీని బూతు, మండల, నియోజకవర్గ స్థాయుల్లో బలోపేతం చేయాలని సూచించారు. ప్రజల్లో మమేకం కావడానికి కార్యక్రమాలు రూపొందించాలన్నారు. 

రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు ప్రస్తుతం లేవని, కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో ఏహ్యభావం బాగా తగ్గిందని నేతలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ పాలనను, సిద్ధాంతాలను ప్రజలు ఇప్పుడు బాగా గుర్తు చేసుకుంటున్నారని సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్పుకొచ్చారు. ఇదే ఊపులో.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూనే.. వలసవెళ్లిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నం చేయాలని తీర్మానించారు. 

కాపు రిజర్వేషన్‌ల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. బీసీలకు నష్టం కలగకుండా కాపులకు రిజర్వేషన్‌ ఇవ్వాల్సిందేనని.. సమావేశం తీర్మానించింది. 

సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా హాజరయ్యారు. కాంగ్రెస్‌లోకి తిరిగి చేరాక, ఆయన పాల్గొంటున్న తొలి సమావేశం కావడంతో.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గన్నవరం విమానాశ్రయం నుంచే పార్టీ శ్రేణులు.. ఆయనకు ఘన స్వాగతం పలికాయి. స్టేట్‌ అతిథిగృహం నుంచి భారీ ర్యాలీగా సమావేశానికి తీసుకు వెళ్లారు. 

19:33 - August 1, 2018

ఢిల్లీ : విభజన హామీలు.. ముఖ్యంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం.. తెలుగుదేశం నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. పార్లమెంటు లోపలా, బయటా ఆందోళనలు సాగిస్తూనే.. రాష్ట్రపతి దృష్టికీ ఈ అంశాన్ని తీసుకు వెళ్లారు. ఇంకోవైపు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీతోనూ టీడీపీ నేతలు భేటీ అయి.. తమ డిమాండ్‌కు మద్దతును సమీకరించారు. 

విభజన హామీల సాధన దిశగా.. తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటివరకు పార్లమెంటు ప్రాంగణంతో పాటు ఉభయసభల్లో ఆందోళన కొనసాగిస్తున్న ఆ పార్టీ ఎంపీలు తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. సుజనాచౌదరి నేతృత్వంలోని బృందం.. రాష్ట్రపతిని కలిసి.. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు కర్మాగారం ఆంధ్రుల మనోభావాలకు చెందిన అంశం కాబట్టి ఆ హామీ నెరవేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో.. టీడీపీ ఎంపీలు.. కేంద్ర ఉక్కు శాఖమంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌నూ కలిశారు. కడప జిల్లా నాయకులతో కలిసి.. టీడీపీ ఎంపీలు.. కేంద్ర మంత్రిని కలిశౄరు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

అటు పార్లమెంటు ప్రాంగణంలో.. బుధవారం కూడా టీడీపీ ఎంపీలు ఆందోళనను కొనసాగించారు. పార్లమెంటు గాంధీ విగ్రహం దగ్గర ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మరోవైపు.. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ప్రజాకవి వేషధారణలో మోదీ వైఖరిపై మండిపడ్డారు. మాటలగారడీ.. వినయం పేరడీతో మోదీ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ఇంకోవైపు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీతోనూ.. టీడపీ ఎంపీలు సుజనాచౌదరి, కేశినేని నాని భేటీ అయ్యారు. పార్లమెంటులో ఆమెను కలిసి.. తమ ఆందోళనకు మద్దతును కోరారు. 

19:29 - August 1, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో.. ఐదు జిల్లాలను సైబరాబాద్‌లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. విశాఖ, ఉభయగోదావరి, చిత్తూరు, అమరావతిలతో పాటు.. అనంతపురం జిల్లాలనూ ఐటీ పరిశ్రమలను స్థాపింప చేస్తామన్నారు. 2019 నాటికి ఐటీ రంగంలో లక్ష, ఎలెక్ట్రానిక్స్‌ మానుఫ్యాక్చరింగ్‌లో రెండు లక్షలు చొప్పున ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
మరో పది ఐటీ కంపెనీలు ప్రారంభం 
నవ్యాంధ్రప్రదేశ్‌లో సరికొత్తగా మరో పది ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయి. అమరావతిలోని ఏపీ ఎన్నార్టీ పార్క్‌లో.. ఒకేసారి పది ఐటీ సంస్థలను.. రాష్ట్ర ఐటీ మంత్రి నారాలోకేశ్‌ ప్రారంభించారు. వీటి ద్వారా వెయ్యిమందికి ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. ఎన్నికల నాటికి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మూడు లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో అహర్నిశలూ కృషిచేస్తున్నామని లోకేశ్‌ చెప్పారు. ఈ దిశగా.. ఐదు జిల్లాలను సైబరాబాద్‌లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు.
ఎంఓయూలు వాస్తవరూపం 
ఎంఓయూలను వాస్తవరూపంలోకి తేవడంలో.. ఏపీ దేశంలోనే అగ్రభాగాన ఉందని లోకేశ్‌ వెల్లడించారు. సీఐఐ సదస్సులో ఐటీ శాఖ కుదుర్చుకున్న ఎంఓయూలు దాదాపుగా వాస్తవరూపం దాల్చాయన్నారు. జియో కంపెనీకి చెందిన ఎలెక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల్లో 80శాతం ఏపీలోనే చేస్తామని రిలయన్స్‌ సంస్థతో ఒప్పందం కుదిరిందని.. తిరుపతిలో 125 ఎకరాలు దీనికోసం సిద్ధం చేస్తున్నామని లోకేశ్‌ తెలిపారు. ప్రభుత్వం రూపొందించుకున్న విధానం వల్లే.. ఇది సాధ్యపడుతోందని లోకేశ్‌ చెప్పారు. 
పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన లోకేశ్‌  
తనను అవినీతిపరుడని ఆరోపించిన పవన్‌ వ్యాఖ్యలపై లోకేశ్‌ స్పందించారు. తాను అవినీతిపరుడైతే ఇన్ని సంస్థలు రాష్ట్రానికి వచ్చేవా అని ప్రశ్నించారు. తనపై ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుందని అన్నారు. రాజధాని నిర్మాణంపై ఆరోపణలు చేస్తూ.. పనులను అడ్డుకుంటామనడాన్ని తప్పుబట్టిన లోకేశ్‌.. పది మంది కోసం 35వేల ఎకరాలిచ్చిన రైతులను ఇబ్బందిపెట్టలేమని అన్నారు. విపక్షాలు అడ్డుకుంటే.. పెట్టుబడులు రావని, ఇది సరైంది కాదని లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

 

19:14 - August 1, 2018

ఢిల్లీ : టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం స్పీకర్‌ను పావులా వాడుకోవలనుకోవడం బాధకరమన్నారు కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ. ప్రభుత్వం ప్రజలను, ప్రతిపక్షాలను, మిత్రపక్షాలను తప్పుదోవ పట్టించినట్లే స్పీకర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం వివరాలు తెలిసిన వారి ముందు స్పీకర్‌ను దోషిగా నిలబేట్టిందని మండిపడ్డారు. తప్పుడు ప్రసంగం చేయించిన వారిపై స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వంచే శ్వేతపత్రం విడుదల చేయించాలని కేవీపీ డిమాండ్ చేశారు.

18:20 - August 1, 2018

ఆస్ట్రేలియాలో ఉన్నత విధ్య అభ్యసించడానికి సులభమైన మార్గాలేమిటి??? ఆస్ట్రేలియాలో ఏ కోర్స్‌ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్ట్రేలియా యూనివర్శిటీల్లో సులువైన వీసా ప్రోసెస్‌, స్కాలర్‌ షిప్‌ ఎలా పొందాలో, ఆస్ట్రేలియా అడ్మిషన్‌ డే వివరాలను ఏఈసీసీ గ్లోబల్‌ హెడ్‌ ఇంతియాజ్‌ మనతో ఉన్నారు.... అడిగి తెలుసుకుందాం..ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

18:14 - August 1, 2018

ఉత్తరాఖండ్‌ : ఒంటి నిండా బంగారు ఆభరణాలతో గోల్డెన్‌ బాబా ఉత్తరాఖండ్‌లో మళ్లీ తళుక్కుమని మెరిశారు. గోల్డెన్‌ బాబాగా పేరొందిన సుధీర్‌ మక్కర్‌ ప్రతిఏటా ఢిల్లీ నుంచి హరిద్వార్‌ వరకు కన్వర్‌ యాత్రలో పాల్గొంటారు. ఈసారి 20 కిలోల బంగారు ఆభరణాలను ఆయన ధరించారు. బాబా బంగారు ఆభరణాల్లో 21 గొలుసులు, దేవుడి విగ్రహాలతో కూడిన 21 లాకెట్లు, చేతి కడియాలు, బంగారపు జాకెట్‌, తదితర నగలు ఉన్నాయి. ఈ ఆభరణాలు ధరించి ఎస్‌యువీ పైన కూర్చుని యాత్రలో పాల్గొంటారు. 200 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. బంగారు ఆభరణాలను ప్రదర్శించాలనే మోజు తనకు లేదని, సిరిసంపదలకు నిలయమైన లక్ష్మీ దేవతకు ప్రతీకగానే తాను వీటిని ధరిస్తుంటానని ఆయన చెబుతుంటారు. ఈ గోల్డెన్‌ బాబాకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. వ్యాపారవేత్త నుంచి స్వామీజీగా మారిన ఈ బాబాకు 150 కోట్ల ఆస్తులున్నాయి. గతంలో ఈయనకు క్రిమినల్‌ రికార్డ్‌ కూడా ఉంది. ఈ యాత్రకు ఆయన 1.25 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

 

18:10 - August 1, 2018

విజయవాడ : ఏపీలో నరేగా నిధులు దుర్వినియోగమవుతున్నాయని బీజేపీ ఆరోపించింది. గ్రామీణ ఉపాధికి ఉపయోగించాల్సిన 13 వేల కోట్ల రూపాయల నరేగా నిధులను మట్టి తవ్వకాలను ఉపయోగించారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిని కలిసి  ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిస్తే పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌కు జైలు తప్పదని సోము వీర్రాజు హెచ్చరించారు. 

 

18:08 - August 1, 2018

హైదరాబాద్‌ : పాత బస్తీని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాత బస్తీలో ప్రజలు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత బస్తీకి ప్రభుత్వం పదివేల కోట్లు కేటాయించి, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని తమ్మినేని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పాత బస్తీలోని అన్ని స్థానాల్లో బీఎల్‌ఎఫ్‌ పోటీ చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌ పాత బస్తీలో బీఎల్‌ఎఫ్‌ ఒకరోజు పర్యటన చేపట్టింది. 

 

18:04 - August 1, 2018

హైదరాబాద్ : మానవ అక్రమ రవాణాపై తెలంగాణ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుటుందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. మానవ అక్రమ రవాణకు పాల్పడే నిందితులపై పీడి చట్టాన్ని ప్రయోగిస్తామని తెలిపారు. మైనర్లపై అత్యాచారం చేసిన వారికి మరణశిక్ష విధించాలన్నారు నాయిని . మానవ అక్రమ రవాణాను సహించేది లేదని నగర పోలీస్‌ కమిషనర్ అంజనీకుమార్‌ అన్నారు. ప్రపంచ మానవ రవాణా నిరసన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో పోలీస్‌ షీ టీమ్స్‌, ప్రజ్వల సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీలో హోం మంత్రి నాయిని పాల్గొన్నారు. అఫ్జల్‌గంజ్‌ నుంచి చార్మినార్‌ వరకు సాగిన అవగాహన ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు.

 

18:01 - August 1, 2018

హైదరాబాద్ : బీజేపీ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుందని కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు అన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుంటే బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మైనార్టీలపై దాడులు చేస్తే ఊరుకోబోమని వీహెచ్‌ హెచ్చరించారు. భారత్‌ను సెక్యూలర్ దేశంగా కాపాడటానికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. రైతులకు సంకెళ్లు వేసిన రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్తారని వీహెచ్‌ అన్నారు.

 

17:39 - August 1, 2018

అనంతపురం : కేంద్ర ప్రభుత్వాన్ని మార్చి హక్కులు కాపాడుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపిచ్చారు. బీజేపీ పాలనలో దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఆడపిల్లలు, మైనారిటీలకు భద్రత లేదన్నారు. స్వాతంత్ర్యం పోరాటం సమయంలో బ్రిటీష్ వారికి సహకరించి...పోరాటానికి ద్రోహం చేసిన వారు.. ఇప్పుడు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలను ప్రధాని మోడీ బెదిరించారని అన్నారు. ఎన్నికల మందు మోడీ బాగా మాటలు చెప్పారని తెలిపారు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో డబ్బులు వేస్తానని... విదేశాల్లోని నల్లధనం వెనక్కి తెస్తానన్నారు. కానీ అవేమీ జరగలేదని విమర్శించారు. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు లేకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం మన లక్ష్యం అన్నారు. కేంద్రంపై పోరాడి హక్కులు సాధించుకుంటామని చెప్పారు.  

 

తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సివుంది : బీరేంద్ర సింగ్

ఢిల్లీ : విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సివుందని కేంద్ర ఉక్కు శాఖా మంత్రి బీరేంద్ర సింగ్ తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని పార్లమెంట్ లో ప్రకటన చేయాలని కోరుతు టీడీపీ ఎంపీలు, కడప జిల్లా నాయకులు మంత్రి బీరేంద్ర సింగ్ ను కలిసి విజ్నప్తి చేశారు. ఈ సందర్భంగా బీరేంద్ర సింగ్ మాట్లాడుతు..పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ప్రస్తుతం తాను ఈ ప్రకటన తాను చేయలేనని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే టాస్క్ ఫోర్స్ నియమించామనీ రాష్ట్ర ప్రభుత్వాల నుండి సమాధానాలు రావాల్సివుందన్నారు.

కాపు రిజర్వేషన్లపై జగన్ తోక ముడిచారు : సీఎం చంద్రబాబు

అనంతపురం : యాభై శాతం దాటితే కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదన్న జగన్, అందరూ వ్యతిరేకించడంతో తోకముడిచారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. అనంతపురం జిల్లాలోని పేరూరు ప్రాజెక్ట్ కు నీటిని విడుదల చేసే కాల్వకు ఆయన భూమిపూజ చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతు..ప్రజల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర రాజకీయాలు చేస్తే సహించేది లేదని, కేంద్రంతో విరోధం పెట్టుకుంటే జైలులో ఉండాల్సి వస్తుందని కొందరు భయపడుతున్నారని, జైలు భయంతోనే కేంద్రానికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.

17:24 - August 1, 2018

అనంతపురం : 'నాది రైట్ టర్న్... మీది యూటర్న్' అని సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ ట్రాప్ లో తాను పడలేదని...వైసీపీ అవినీతి కుడితిలో బీజేపీ, ఎన్ డీఏ ప్రభుత్వం పడిందన్నారు. తనకు మెచూరిటీ లేదని మోడీ అంటున్నారు..ఆయనకు మెచ్యూరిటీ ఉన్నట్లు అని అన్నారు. ఉందాతనం కోల్పోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అందరికంటే ముందుగా తాను ముఖ్యమంత్రి అయ్యానని.. తనకు రాజకీయాలు నేర్పిస్తున్నారని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం పాల్గొని, మాట్లాడారు. నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. బిందు, తుంపర సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కమ్యూనిటీ డ్రిప్ ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒక నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తానని తెలిపారు. అనంతపురం వెనుకబడిన జిల్లా అని.. జిల్లాలో అందరూ పేదవారు ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీకి అనంతపురం ప్రజలు మొదటి నుంచి బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నానని అన్నారు. 87 శాతం మైక్రో ఇరిగేషన్ చేశామని.. ఈ సం. 100 శాతానికి చేరాలన్నారు. జిల్లాకు సెంట్రల్, ఎనర్జీ యూనివర్సిటీలను ఇచ్చామని తెలిపారు. ఆరు నెలల్లో గొల్లపల్లికి నీరు తీసుకొచ్చామని తెలిపారు. రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. పరిటాల రవీంద్ర కాలువగా నామకరణం చేశామని తెలిపారు. అనంతపురం జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం వస్తుందన్నారు. జిల్లాలో మరో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
వైసీపీ కేసులు మీకు కనపడడం లేదా..? 
'వైసీపీ కేసులు మీకు కనపడడం లేదా..'? అని ప్రధాని మోడీని చంద్రబాబు నిలదీశారు. 'ఏ1, ఏ2 లను మీ ఆఫీస్ లో కూర్చోపెట్టుకుని.. అవినీతిని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు' అని ప్రశ్నించారు. 'వారికి రాజకీయం కావాలి...మనకు ప్రజా హితం కావాలి' అని పేర్కొన్నారు. కొంతమంది ఢిల్లీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. కేసులు, జైలు భయంతోని వైసీపీ కేంద్రానికి ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హోదా, విభజన హామీలపై పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు నిలదీస్తుంటే వైసీపీ, జనసేన అడ్రస్ లేదని విమర్శించారు. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో తనకు తెలుసు...సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని అన్నారు. రాజ్యసభలో ఒక్క బీజేపీ తప్ప అందరూ కేంద్రాన్ని నిలదీశారని చెప్పారు. బీజేపీ అధికారం, మంద బలం ఉందని ముందుకెళ్తోందన్నారు. మెజారిటీ కంటే మొరాలిటీయే గెలుస్తుందన్నారు. అంతిమ విజయం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా సాధిస్తామని చెప్పారు.  

 

 

పేరూరు ప్రాజెక్ట్ కాల్వకు ‘పరిటాల రవీంద్ర కాల్వ’ : చంద్రబాబు

అనంతపురం : జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నానని సీఎం చంద్రబాబునాయడు అన్నారు. అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని పేరూరులో ఆయన పర్యటించారు. పేరూరు ప్రాజెక్ట్ కు నీటిని తరలించే కాల్వకు చంద్రబాబు భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పేరూరు ప్రాజెక్ట్ కు నీరు తరలించే కాల్వకు ‘పరిటాల రవీంద్ర కాల్వ’ గా పేరు పెడతామని చెప్పారు.నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, బిందు, తుంపర సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతపురం జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో బిందు, తుంపర సేద్యం జరుగుతోందని అన్నారు.

16:46 - August 1, 2018

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు..వ్యాధులు వస్తే.. బాధలు ముసురుకుంటాయి. అంతే కాదు.. నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా బ్రతకవలసిన జీవీతం అనారోగ్యంతో క్షణక్షణమూ బాధపడవలసి వస్తుంది. ఇలా మనిషి ఆరోగ్యాన్ని కబళించే వ్యాధులలో థైరాయిడ్‌ ఒకటి. ఇవి రెండు రకాలు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

16:41 - August 1, 2018

ఢిల్లీ : ఆర్ బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీరేటు రెపోను వరుసగా రెండోసారి 25 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతం పెరిగింది. ముడి చమురు ధరలు ప్రస్తుతం కాస్త తగ్గినప్పటికీ, మళ్లీ పెరుగుతాయనే భయాందోళనలుండటం, ఖరీఫ్‌ పంటలకు ప్రభుత్వం మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాల కారణంతో రెపోను పెంచేందుకే మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల సమావేశం అనంతరం ఆర్‌బీఐ నేతృత్వంలోని మానిటరీ కమిటీ ఇవాళ పాలసీ నిర్ణయాన్ని ప్రకటించింది. ఆరుగురు సభ్యులున్న ఈ కమిటీలో ఐదుగురు రెపో రేటు పెంపుకు ఆమోదం తెలుపగా.. ఒకరు మాత్రం వ్యతిరేకించినట్టు సమాచారం. గత జూన్‌ పాలసీలో కూడా రెపోను 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.25 శాతంగా నిర్ణయించింది. ఇంధన ధరలు ఖరీదైనవిగా మారడంతో, జూన్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టం 5 శాతానికి పెరిగింది. రివర్స్‌ రెపో రేటు 6.25 శాతంగా, ఎంఎస్‌ఎఫ్‌ రేటు, బ్యాంక్‌ రేటు 6.75 శాతంగా మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. 2019 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.4 శాతంగా ఉంచింది. 

 

16:38 - August 1, 2018
16:36 - August 1, 2018

విశాఖ : అదొక చారిత్రక కట్టడం. సాగరతీరం వెంబడి సోయగాల చిత్రాలు, సొగసైన నిర్మాణాలు కనిపిస్తాయి. అందులో పేరుగాంచినది హవామహల్‌.  సాగరతీర నగరంలో ఈ హవామహల్‌ తెలియని వారుండరు. సినీ చిత్రాల నిర్మాణంకు ఇది కేరాఫ్‌ అడ్రస్‌. ఏ సినిమా అయినా ఇక్కడ షూటింగ్‌ జరగాల్సిందే. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ హవామహల్‌ కోసం ఇప్పుడు రెండు రాచకుటుంబాల మధ్య సమరం సాగుతోంది.
విశాఖ బీచ్‌రోడ్డులో హవామహల్‌ 
హవామహల్‌ .. ఈ పేరు వింటేనే మనకు రాజస్థాన్‌లోని ప్రతిష్టాత్మక నిర్మాణం మన కళ్లెదుట కనబడుతుంది. అయితే ఇంత గొప్ప పేరును, ఘనతను విశాఖ సాగరతీరంలోని ఓ మహల్‌ కూడా సొంతం చేసుకుంది. విశాఖ బీచ్‌రోడ్డులో చారిత్రక కట్టడమైన హవామహల్‌ నాటి నిర్మాణ విశిష్టతకు, అప్పటి రాజుల దర్పానికి ప్రతీకగా నిలుస్తుంది. అత్యంత సుందరమైన ఈ భవనం దేశ తొలి ప్రధాని నెహ్రూ విశాఖ సందర్శించినప్పుడు ఆతిథ్యం ఇచ్చిన నిర్మాణంగా పేరు పొందింది. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ మహల్‌ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది. ఈ మహల్‌ కోసం రెండు రాచకుటుంబాల మధ్య సమరం సాగుతోంది.
1910లో హవామహల్‌ నిర్మాణం
1910లో నిర్మించిన హవమహల్‌ ఓరిస్సాలోని జైపూర్‌ మహారాజులకు చెందినది. విశాఖలో వేసవి విడిదిగా జైపూర్‌ మహారాజ్‌ రామ చంద్రదేవ్‌ ఈ భవంతిని నిర్మించారు. 1960లో దీనిని ప్రభుత్వ మహిళా కళాశాలగా ఉపయోగించారు. 1961లో హిందస్థాన్‌ షిప్‌యార్డు తయారు చేసిన తొలి నౌక జల ఉషను ప్రారంభించేందుకు అప్పటి ప్రధాని నెహ్రూ ఈ మహల్‌లో విడిది చేశారు. అంతటి ప్రాధాన్యత ఉందీ మహల్‌. హవమహల్‌ ప్రస్తుతం మార్కెట్‌ విలువ 30 కోట్లకుపైబడే ఉంటుంది. అందుకే ఈ మహల్‌ను స్వాధీనం చేసుకునేందుకు రెండు రాచకుటుంబాలు పోరాటానికి సై అంటున్నాయి. మహల్‌ను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి.
ఆస్తులపై తమకే సర్వహక్కులు : రాజమాత మయాంక్‌ కుమారి దేవ్‌ 
జైపూర్‌ సంస్థానం ఆస్తులపై తమకే సర్వహక్కులు ఉన్నాయని రాజమాత మయాంక్‌ కుమారి దేవ్‌ చెబుతున్నారు. హవామహల్‌పై ఎవరికి సర్వహక్కులు ఉన్నాయో కోర్టులోనే తేల్చుకుందామన్నారు.  జైపూర్‌ మహారాజ్‌ రామకృష్ణ దేవ్‌ కుమారుడైన శక్తి విక్రమ్‌దేవ్‌తో 1987లో తనకు వివాహం జరిగిందని ఆమె తెలిపారు. 1993లో తన భర్త విక్రమ్‌దేవ్‌ , అతని సోదరుడు విభూది భూషణ్‌దేవ్‌ విశాఖ వచ్చి స్థిరపడ్డారని చెప్పారు. ఇక్కడే వేర్వేరుగా నివాసాలు ఏర్పర్చుకున్నామని.. విభూది భూషన్‌కు షారికాదేవితో వివాహం జరిగిన తర్వాత విశాఖలో ఉన్న నివాసాన్ని అమ్మేసి జైపూర్‌ వెళ్లిపోయినట్టు వెల్లడించారు. 1997లో ఆయన మరణించారని.. 20ఏళ్లకు పైగా విశాఖలో ఉన్న తన ఆధీనంలోనే హవామహల్‌ ఉందని... దాన్ని ధార్మిక సేవా కార్యక్రమాలకు, కళా ప్రదర్శనలకు ఉచితంగా ఇచ్చేవాళ్లమన్నారు. ఇప్పటి వరకు హవామహల్‌ మొహం కూడా చూడని సారికాదేవి... హఠాత్తుగా ఇప్పుడు వచ్చి.. తామే వారసులమని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మేమే మహల్‌కు అసలైన వారసులం : విశ్వేశ్వర చంద్రచూడ్‌దేవ్‌
హవామహల్‌కు తామే అసలైన వారసులమని విశ్వేశ్వర చంద్రచూడ్‌దేవ్‌ బల్లగుద్దమరీ వాదిస్తున్నారు.  చంద్రదేవ్‌ మరణానంతరం మహారాజు విక్రమ్‌దేవ్‌వర్మ, మహారాజ రాయ్‌క్రిష్ణదేవ్‌లకు ఆస్తులు చెందాయని ఆయన చెప్పారు. వారి తదనంతరం హక్కులు రాణిమయాంక్‌ కుమారిదేవ్‌కు... వారి కుమార్తె లతికాదేవ్‌కు, తన తల్లి అయిన రాణి సారికాదేవ్‌కు దక్కాయన్నారు. కేవలం రాణి మయాంక్‌దేవ్‌ ఒక్కరే ఈ ఆస్తులను అనుభవిస్తూ సంస్థానానికి వారసులమంటూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఈ హవామహల్‌ ఇప్పుడు వివాదాల మధ్యలో రచ్చకెక్కుతుంది. తమకే చెందుతుందని ఇరువర్గాలు పోటాపోటీగా వాగ్వాదాలు చేసుకుంటుండడంతో ఇప్పుడు నగరంలో హవామహల్‌పైనే చర్చ జరుగుతోంది. చివరికి ఈ మహల్‌ ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 

16:29 - August 1, 2018

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కంటే కాంట్రాక్టర్లకు ఎక్కువ మేలు చేస్తుందని టీజేఎస్‌ అధినేత కోదండరాం అన్నారు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో అధికారులు దోపిడి చేసి, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై చర్చకు సిద్ధంగా ఉన్నామని కోదండరాం తెలిపారు.  మేము గతంలో లేవనేత్తిన ప్రశ్నలకు  మంత్రి హరీష్‌రావు  సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. కేసీఆర్‌ పాపాల పుట్ట పగిలే రోజులు దగ్గరపడ్డాయని కోదండరాం అన్నారు.

 

బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత..

విజయవాడ : బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్ ను మాల మహానాడు కార్యకర్తలు ముట్టడించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం ఆర్డినెన్స్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు మాల మహానాడు కార్యకర్తలు యత్నించటంతో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

16:03 - August 1, 2018

గుంటూరు : తాను అవినీతికి పాల్పడుతున్నట్టు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న ఆరోపణలపై ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ మండిపడ్డారు. అవినీతిని ఆధారాలతో నిరూపించమంటే పవన్‌ స్పందించలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్‌ సంస్థలకు ప్రభుత్వం విధానం ప్రకారం తక్కువ రేటుకు భూములు ఇస్తుంటే.. భూ దోపీడికి పాల్పడుతున్నారని పవన్‌  ఆరోపించడాన్ని లోకేశ్‌ తప్పుపట్టారు. విపక్షాల అసత్య ఆరోపణలతో పరిశ్రమలు వెనక్కిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

 

కాళ్వేశ్వరంతో ప్రజలకు నీళ్లు..కాంగ్రెస్ కు కన్నీళ్లు : కేటీఆర్

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ బెయిల్ గాడీ అని ప్రధాని మోదీ అన్న మాటలు అక్షర సత్యాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెయిల్ మీదనే వున్నారనీ..కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలకు నీళ్లు, కాంగ్రెస్ కు కన్నీళ్లే మిగులుతాయన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ కు 75 సీట్లు వస్తాయని ఉత్తమ్ ధీమాగా మాట్లాడుతున్నారనీ..కానీ ఉత్తమ్ ఉద్ధేశ్యంలో కాంగ్రెస్ సాధించేవి ఎంపీ సీట్లు కాదనీ..ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ స్వంతంగా సాధించేది కనీసం 20 సీట్లన్నా గెలిచే పరిస్థితి లేదన్నారు.  

జైలుకు పంపేవి కోర్టులు ..ఉత్తమ్, కోదండాలు కాదు : కేటీఆర్

హైదరాబాద్ : మేము తప్పు చేస్తే మమ్మల్ని జైలుకు పంపేవి కోర్టులు కానీ..ఉత్తమ్ కుమార్, కోదండరాంలు కాదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉత్తమ్ కుమార్ అసత్యాలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంట్రాక్టర్లను కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయితీలకు స్పెషల్ ఆఫీసర్లను తమకు ఇష్టంతో తెచ్చింది కాదనీ.. ఈ విషయాన్ని సర్పంచ్ లు అర్థం చేసుకోవాల్సిన అవసరముందని కేటీఆర్ పేర్కొన్నారు. విభజన హామీల విషయంలో కేంద్రంతో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతున్నామన్నామని కేటీఆర్ స్పష్టంచేశారు.  

15:30 - August 1, 2018

నిజామాబాద్ : ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతుందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. జిల్లాలో ఐటీ టవర్స్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు భృతి ఎంత ఇస్తారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు.

ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ..

ఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో రెపో రేటును 25 బేసిన్ పాయింట్లు పెంచింది. రివర్స్ రెపో రేటు6.25 శాతంగా..ఎంఎస్ఎఫ్ రేటు, బ్యాంకు రేటు 6.75 శాతం అని ప్రకటించింది. 2018/19లో వృద్ధి రేటు 7.4 శాతంగా వుంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. దీంతో బ్యాంకు రుణాల ఈఎంఐలు పెరగనున్నాయి.  

కడప ఉక్కు..విభజన చట్టంలో వుందిగా : రాష్ట్రపతి

ఢిల్లీ : విభజన హామీల సాధన ప్రయత్నంలో భాగంగా టీడీపీ ఎంపీలు ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఈ సందర్భంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ భేటీ వివరాలను వెల్లడించారు. కడప ఉక్కు కర్మాగారం కల నెరవేరేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రపతిని కోరామని సీఎం రమేష్ తెలిపారు. ఉక్కు పరిశ్రమపై దీక్ష చేసిన విషయం తన దృష్టికి కూడా వచ్చిందని... స్టీల్ ప్లాంటు అంశం చట్టంలో ఉన్నప్పుడు, ఇబ్బంది ఏమిటని రాష్ట్రపతి అడిగారని చెప్పారు.

కరుడుగట్టిన హిందూ పార్టీ ముస్లిం రిజర్వేషన్లకు మద్దతు..

మహారాష్ట్ర : కరుడుగట్టిన హిందూ పార్టీగా ముద్ర పడిన శివసేన సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం మైనార్టీలకు విద్యలో 5 శాతం రిజర్వేషన్ కల్పించే అంశానికి మద్దతు పలికింది. ముంబై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. మరాఠా రిజర్వేషన్లతో పాటు ధన్ గర్స్, ముస్లిం, ఇతర రిజర్వేషన్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సూచించారు. తమ వర్గానికి కూడా రిజర్వేషన్లు కావాలని ముస్లింలు డిమాండ్ చేయడం సమంజసమైనదేనని చెప్పారు. మరోవైపు, శివసేన నిర్ణయాన్ని ఎంఐఎం స్వాగతించింది. 

అంబానీ, అదానీలతో కేసీఆర్ పోటీ : ఉత్తమ్

హైదరాబాద్ : కేసీఆర్ కుటుంబం ఆస్తుల విషయంలో అంబానీ, అదానీలతో పోటీ పడుతోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. దేశంలో ఏ సీఎం కూడా ఇంత అవినీతికి పాల్పడలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు సంపాదించింది కాబట్టి ప్రజలను బానిసలుగా చేసేందుకు యత్నిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తు ఊరుకోదని హెచ్చరించారు. కేసీఆర్ వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా ఆరోపించటమే పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ నేతల్లా కాంగ్రెస్ నేతలు చిల్లర మాటలు మాట్లాడలేమన్నారు.

దళితులు, ఎస్టీలంటే కేసీఆర్ కు చులకన : ఉత్తమ్

హైదరాబాద్ : దళితులు, ఎస్టీల పట్ల కేసీఆర్ కు చులకన వుందనీ..తమ భూమలు లాక్కుంటున్నారని నిరుపేదలు, దళితులు,ఎస్టీలు కోర్టుకు వెళితే నేరమా? అని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ప్రశ్నించారు. కోర్టులు ఏమన్నా నిషేధిత సంస్థలా అని ప్రశ్నించారు. తుమ్మిడి హట్టి నీటి లభ్యతపై ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని ఉత్తమ్ ఆరోపించారు. ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ తుమ్మిడి హట్టికి ఓకే చెప్పిన విషయం వాస్తవం కాదాన్ని ఉత్తమ్ ప్రశ్నించారు. 

15:04 - August 1, 2018

ఇటీవల ఆడపిల్లల అక్రమ రవాణా పెరిగిపోయింది. ఆడపిల్లలను అక్రమ రవాణా చేస్తూ లక్షలు, కోట్లు గడిస్తున్నారు. వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. పిల్లలను చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇదే అంశంపై నిర్వహించిన మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఆడపిల్లల అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. ఆ వివరాలను వీడియోలో చూద్డాం...

 

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి యనమల ఆగ్రహం..

అమరావతి : ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టటం అజ్నాం అని ప్రధాని వ్యాఖ్యానించటంపై యనమల మండిపడ్డారు. ప్రధాని వ్యాఖ్యలు బీజేపీ అహంభావానికి నిదర్శనమన్నారు. అపరిపక్వత, అపరిణి, అవగాహనలేమి బీజేపీ అధినాయకత్వానిదేనని యనమల ఎదురు దాడికి దిగారు. ప్రజల్లో బీజేపీకి వున్న వ్యతిరేకతను అవిశ్వాస తీర్మానం ప్రతిబింభించిందన్నారు. ప్రజా వ్యతిరేకతను జీర్ణించుకోలేకనే ప్రధాని టీడీపీ అవిశ్వాసం అజ్నానం అనే వ్యాఖ్యలు చేశారని యనమల ఎద్దేవా చేశారు.

14:53 - August 1, 2018

గుంటూరు : ఐటీ రంగం ప్రోత్సాహానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇవాళా తాడేపల్లిలో పది ఐటీ కంపెనీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఐటీని ఎకనామిక్ ఇంజన్ గా గుర్తించింది చంద్రబాబేనని తెలిపారు. త్వరలో తిరుపతి, అనంతపురంలోనూ ఐటీ పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పారు. 

 

ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు..

యాదాద్రి : చౌటుప్పల్ ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ.70 వేలు లంచం తీసుకుంటు ఈవోపీఆర్డీ ఏసీబీకి చిక్కాడు. ఇన్ చార్జ్ పంచాయితీ కార్యదర్శిగా నర్శిరెడ్డి రూ.70 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కాడు. 

కాపులను తండ్రీకొడుకులిద్దరు మోసం చేశారు : మంత్రి నారాయణ

అమరావతి : కాపు రిజర్వేషన్లపై వైసీపీ అధినేత జగన్ మాట మార్చారని ఏపీ మంత్రి నారాయణ విమర్శించారు. కాపు రిజర్వేషన్లు సాధ్యమేనని 2016లో జగన్ అన్నారని... ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. రోజుకో మాట, పూటకో అబద్ధం చెప్పేవారు నాయకులు కాలేరని అన్నారు. కాపులు పేదరికాన్ని అనుభవిస్తున్నారని... వారు ఎదగాలంటే రిజర్వేషన్లు అవసరమని చెప్పారు. కాపులను తండ్రీకొడుకులు రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇద్దరూ మోసం చేశారని దుయ్యబట్టారు. కాపు రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు.

13:57 - August 1, 2018

నిజామాబాద్ : కాకతీయ కాల్వకు నీటిని విడుదల చేస్తారా ? లేదా ? అంటూ మహిళా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎస్ఆర్ఎస్పీ ఎస్ఈ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. అధికారుల కాకతీయ కాల్వకు లీకేజీ, నీటిని విడుదల చేయాలని కోరారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

అన్ని జిల్లాలకు ఐటీని విస్తరిస్తాం : మంత్రి కేటీఆర్

నిజామాబాద్ : ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతు..ఐటీని రాష్ట్ర రాజధానికి మాత్రమే పరిమితం చేయకుండా.. అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నామని తెలిపారు. ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటు మారుమూల గ్రామాలకు ఐటీని విస్తరించాలనే సీఎం కేసీఆర్ సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లోని యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి అనే లక్ష్యంతోనే ఐటీ కంపెనీలను జిల్లాలకు విస్తరిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.

13:53 - August 1, 2018

నిజామాబాద్ : ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ మరోసారి విరుచకపడ్డారు. గత కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్ అన్యాయం చేస్తూ వస్తోందని..ప్రస్తుతం తమకు అధికారం ఇవ్వాలని అడుగుతోందని..తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్సే అని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ పరిశ్రమకు ఎంపీ కవితో కలిసి ఆయున శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....సీఎం కేసీఆర్ ను గద్దె దించుతామని...ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయని..ఏ కారణం చేత కేసీఆర్ ను గద్దె దించుతారని ప్రశ్నించారు. ఎన్నో సంక్షేమ పథకాలు..పేదలకు..రైతులకు ఎన్నో పథకాలు చేపట్టినందుకు దించేస్తారా ? అని నిలదీశారు. కేసీఆర్ ను గద్దె దించే దాక గడ్డం తీసుకోనని ఒక నేత పేర్కొన్నారని..ఇతను భవిష్యత్ లో సన్నాసుల్లో కలిసి పోవడం తప్ప ఏమి లేదని...గడ్డం పెంచేటోళ్లందరూ 'గబర్బ్ సింగ్' అయిపోతాడా ? డైలాగ్ లు చెబితే ఏం పోదన్నారు.

తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నీటి బొట్టును బీడు భూములకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బిందెలు పట్టుకుని మహిళలు బయటకు రావద్దనే ఉద్ధేశ్యంతో మిషణ్ భగీరథ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇంటింటికి నీళ్లు ఇచ్చే విధంగా కృషి చేయడం జరుగుతోందని..నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పిన ధైర్యం ఉన్న నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు కార్పొరేషన్ కు ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని కలుపుకుంటే రూ. 900 కోట్ల రూపాయలు నిజామాబాద్ జిల్లకు వచ్చాయని, నిధులు కూడా సద్వినియోగం అవుతున్నాయన్నారు. మా కొలువులు మాకొస్తాయనే ఉత్సాహంతో యువత ముందుకెళ్లిందని..లక్షా 12వేల ఉద్యోగాలు ఈ సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పడం జరిగిందని, అందుకనుగుణంగా ఎక్కువగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రభుత్వం చేయని పని తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని...ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ప్రోత్సాహించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు.

2013-14లో అధికార పార్టీ పగ్గాలు చేపట్టిన అనంతరం...ఐటీ ఎగుమతులు రాష్ట్ర వ్యాపితంగా 54వేల కోట్లు మాత్రమేనని, కేసీఆర్ ఆదేశాలతో 1.20 కోట్లకు ఎగుమతులు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు..అందుకనుగుణంగా కృషి చేయడం జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా పలు జిల్లాలో ఐటీ హబ్ లు ఏర్పాటు చేయడం జరుగుతోందని..ఒకే ఒక్క రోజు పలు ఎంవోయూలు చేసుకోవడం జరిగిందని 18 నెలల్లో వేయి ఉద్యోగాలు తగ్గకుండా చూస్తామని పేర్కొన్నారని తెలిపారు. నిజామాబాద్ కు చెందిన ఫణీ అనే వ్యక్తి రెడ్ బస్.ఇన్ సంస్థను ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి కల్పించారన్నారు. త్వరలోనే నిజామాబాద్ లో విమానాశ్రయం, స్పోర్ట్స్ గ్రౌండ్, బస్ టెర్మినల్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 

ప్రభుత్వ ఉద్యోగాలు,మరోవైపు ఉపాధి అవకాశాలు : కేటీఆర్

నిజామాబాద్ : ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతు..కార్పొరేషన్‌కు ఈ నాలుగేళ్లలోనే రూ. 400 కోట్లు ఇచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, ఇతరత్రా గ్రాంట్లు కలుపుకుంటే మొత్తం రూ. 900 కోట్లు వచ్చాయని గుర్తు చేశారు. లక్షా 12 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ద్వారా 46 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తూనే.. మరోవైపు ప్రయివేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

రూ.లక్షా 20 వేల కోట్ల ఐటీ ఎగుమతులు లక్ష్యం : కేటీఆర్

నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నాలుగేళ్లలోనే ఐటీ ఎగుమతులు రూ. లక్ష కోట్లకు చేరుకున్నాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతు..2013-14లో తెలంగాణలో ఐటీ ఎగుమతులు రూ. 56వేల కోట్లు మాత్రమే అని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ ఎగుమతులను రూ. లక్షా 20 వేల కోట్లకు తీసుకుపోవాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఈ సంవత్సరం వరకు రూ. లక్ష కోట్లకు చేరుకున్నాం. రాబోయే సంవత్సరం తమ లక్ష్యం నెరవేరుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

జగన్ సీఎం అయ్యేదెప్పుడు?కాపులకు కోట్లిచ్చేదెప్పుడు : చినరాజప్ప

అమరావతి : జగన్ ఎప్పటికీ సీఎం కాలేరని, పులివెందుల ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలవలేరని జోస్యం చెప్పారు. జగన్ సీఎం అయ్యేదెప్పుడు? కాపు కార్పొరేషన్ కు పదివేల కోట్లు ఇచ్చేదెప్పుడు? అని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాపు రిజర్వేషన్ల చట్టాన్ని షెడ్యూల్ 9లో పెట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని, కాపు రిజర్వేషన్లు చంద్రబాబుతోనే సాధ్యమని ముద్రగడ కూడా చెప్పారని అన్నారు. బీసీలు, కాపులకు మధ్య తగువు పెట్టడానికి జగన్ యత్నిస్తున్నారని చినరాజప్ప ఆరోపించారు.

మరోసారి పెరిగిన వంట గ్యాస్ ధర..

ఢిల్లీ : వంట గ్యాస్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. రాయితీ వంట గ్యాస్ సిలిండర్‌ ధర ఢిల్లీలో ప్రస్తుతం రూ.496.26గా ఉండగా దీనిపై రూ. 1.76 పెంచింది. పెరిగిన ధరతో కలుపుకుంటే సిలిండర్ ధర రూ.498.02కు చేరుకుంది. గత నెల 30న సిలిండర్‌పై రూ.2.71 పెంచిన ప్రభుత్వం నెల రోజుల వ్యవధిలోనే మరోసారి పెంచింది. జీఎస్టీ సవరణ, అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడం, రూపాయి మారక విలువ పడిపోవడం వంటి కారణాల వల్ల గ్యాస్ ధర పెంచినట్టు ఐవోసీఎల్ తెలిపింది.

మోదీ ఏంమాయ చేశారో? చెప్పాలి : యనమల

అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ ఏమాయ చేశారో జగన్, పవన్ వెల్లడించాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ‘సుప్రీంలో కేంద్రం వేసిన అఫిడవిట్లపై ఆ ఇద్దరు ఎందుకు స్పందిచరని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపై జగన్, పవన్ ఎందుకు మాట్లాడటంలేదని దీనికి వారు సమాధానం చెప్పాలని మంత్రి నిలదీశారు. జగన్ దృష్టి సీఎం కుర్చీపైనే తప్ప ప్రజాసంక్షేమంపై లేదని యనమల దుయ్యబట్టారు. నియోజకవర్గానికో మాట, జిల్లాకో వైఖరి వైసీపీ విధానమన్నారు. మాట తప్పడం, మడమ తిప్పడంలో జగన్‌కు ఎవరూ సాటిలేరని మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.

జగన్,పనవ్ వ్యాఖ్యలపై లోకేశ్ ..

అమరావతి: కాపు రిజ‌ర్వేష‌న్లపై జ‌గ‌న్ ఏం మాట్లాడారో ప్రజలందరికీ తెలుసని మంత్రి లోకేష్ అన్నారు. కెమెరాల్లో రికార్డు అయిన జగన్ వ్యాఖ్యల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. రాష్ట్రానికి అనుభ‌వం ఉన్న నేత కావాలన్న విషయం జగన్‌ వ్యాఖ్యలతో స్పష్టమైందని మంత్రి అన్నారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని కానీ తనపై ఆరోపణలు విమర్శలు చేస్తే బాధ కలుగుతుందన్నారు. తనపై అవినీతి, దోపిడీ ఆరోపణలు చేయడం తగదన్నారు. సాక్షాధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరినా ఇంత వరకు పవన్ నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణాన్ని ఆపుతామని పవన్‌ అనడం సరికాదన్నారు.

13:28 - August 1, 2018

ఢిల్లీ : బ్రిటిష్ పాలనకు మునుపు భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని, బ్రిటిష్ పాలన తరువాత భారతదేశం చిన్న చిన్న రాజ్యాలన్నింటిని కలుపుకుని ఒక పరిపూర్ణ అఖండ భారతదేశంగా రూపాంతరం చెందిదని అభిప్రాయపడతారు. వారి ఈ అభిప్రాయానికి కారణం మనం చిన్నప్పుడు చదువుకున్న పాఠ్య పుస్తకాలు ఒక కారణం కావచ్చు. అంతే కాక భారత దేశం అంతటా వివిధ రకాల సంస్కృతులు ఉండేవని, రాజకీయపరంగా భారతదేశాన్ని ఒక్క గాటిన పెట్టటానికి వీటన్నటినీ సమ్మేళనం చేసి హిందుత్వం అన్న వాదనని తెరపైకి తెచ్చారని కూడా మార్కిస్టులూ మరియూ హిందువేతరులూ భావిస్తారు. ఏది ఏమైనా భారత ఉపఖండానికి ప్రపంచలోనే అత్యంత ప్రమాదకరమైన భూకంపాల ముప్పు పొంచి వుందని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.

దక్షిణాసియా దేశాలు..
భారత దేశం,పాకిస్థాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్థాన్,నేపాల్,భూటాన్,మాల్దీవులు,శ్రీ లంకలకు కలుపుకున్న భూభాగాన్ని అఖండ భారతావనిగా పిలుస్తారు. ఇప్పుడు వీటిని భారత ఉప ఖండంగా..దక్షిణాసియాగా పిలుస్తుంటాయరు. ఈ నేపథ్యంలో భారత ఉపఖండం అయిన దక్షిణాసియాకు భూ కంపాల ముప్పు పొంచి వుందని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.

5 లక్షల సంవత్సరాల క్రితం భూ అంతర్భాగాల్లో భీకొన్న టెక్టానిక్ ప్లేట్స్..
భారత ఉప ఖండానికి పెను భూకంపాల నుంచి ముప్పుందని రీసెర్చర్లు హెచ్చరించారు. టిబెట్ పీఠం కింద ఉన్న ఆసియన్ టెక్టానిక్ ప్లేట్లు ఢీకొట్టుకోనుండటమే ఇందుకు కారణమని..దాదాపు 5 లక్షల సంవత్సరాల క్రితం భూ అంతర్భాగాల్లో ఇవి ఢీకొట్టుకున్న సమయంలో పెను భూకంపాలు సంభవించాయని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ జియోలజీ ప్రొఫెసర్ జియోడాంగ్ తెలిపారు.

తూర్పు ఆసియా స్వరూపాన్ని మార్చనున్న ఆసియన్ టెక్టానిక్ ప్లేట్స్..
ఇప్పుడు ఇండియన్, ఆసియన్ టెక్టానిక్ ప్లేట్లు తూర్పు ఆసియా స్వరూపాన్ని మార్చనున్నాయని, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన భూకంపాలు సంభవించే ప్రమాదముందని తన తాజా అధ్యయనంలో తెలిపారు. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నాలుగు ముక్కలుగా విడిపోనుందని తమ అధ్యయనంలో తేలినట్టు చెప్పారు. పలు మార్గాల నుంచి తాము భూ భౌతిక సమాచారాన్ని సేకరించామని, టిబెట్ పీఠభూమికి 160 కిలోమీటర్ల లోతున జరుగుతున్న పరిణామాలను టోమోగ్రాఫిక్ విధానంలో చిత్రాలు తీశామని ఆయన తెలిపారు.

13:19 - August 1, 2018
13:16 - August 1, 2018

చెన్నై : గత కొద్ది రోజులుగా కావేరీ ఆసుపత్రి వద్దనున్న టెన్షన్ వాతావరణం ప్రస్తుతం కూల్ గా మారుతోంది. తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి ఆరోగ్యంపై టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన చికిత్స పొందుతున్న కావేరీ ఆసుపత్రి వద్దకు భారీగా అభిమానులు చేరుకుని కరుణ కోలుకోవాలని నినదించారు. ఈ నేపథ్యంలో కరుణ ఆరోగ్యం కుదుటపడుతోందని..శరీర అవయవాలు మెరుగ్గా ఉన్నాయని తాజాగా కావేరీ వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొనడంతో కుటుంబసభ్యులు..డీఎంకే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దీనితో కావేరీ ఆసుపత్రి వద్ద మోహరించిన డీఎంకే కార్యకర్తలు, కరుణ అభిమానులు తమ తమ స్వస్థలాకు వెళ్లిపోతున్నారు. ఇదిలా ఉంటే తమిళ నటుడు విజయ్ ఆసుపత్రికి చేరుకుని కరుణను పరామర్శించారు. అనంతరం స్టాలిన్ తో భేటీ అయి కరుణ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కరుణ ఆరోగ్యంపై యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆరా తీశారు. కర్నాటక, కేరళ సీఎంలు చెన్నైకి వచ్చి కరుణను పరామర్శిస్తారని ప్రచారం జరిగింది. కానీ కొన్ని పరిణామాల నేపథ్యంలో వారి పర్యటన రద్దు అయ్యింది. తమ నాయకుడు త్వరలోనే కొలుకుంటారని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

13:00 - August 1, 2018

రోహింగ్యా ముస్లింలంతా టెర్రరిస్టులకు అనుకూలం: ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాదు : నగరంలో భారీ సంఖ్యలో రోహింగ్యా ముస్లింలు అక్రమంగా నివసిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. ముఖ్యంగా పాతబస్తీలోని ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వీరు ఎక్కువగా నివసిస్తున్నారని చెప్పారు. రోహింగ్యాలకు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్థికంగా సాయం చేస్తున్నారని ఆరోపించారు. రోహింగ్యా ముస్లింలంతా టెర్రరిస్టులకు అనుకూలంగా ఉంటారని చెప్పారు. భారతదేశం, తెలంగాణ సురక్షితంగా ఉండాలంటే... కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి కేసీఆర్ లు ... వీరిని దేశం నుంచి తరిమికొట్టాలని కోరారు. ఒక వేళ ఆ పనిని చేయకపోతే... దేశానికి వీరు ప్రమాదకరంగా మారుతారని చెప్పారు. 

12:58 - August 1, 2018

చిత్తూరు : అధికారులకు అవగాహన లేక దేవుడి ప్రతిష్టను దిగజారుస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ...రమణ దీక్షితులను సీఎం చంద్రబాబు అవమానించడం పాపమని, శ్రీవారి ఆభరణాల వివరాలను ఆన్ లైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో ఆసుపత్రికి వెళ్లడానికి సౌకర్యం వెళ్లకపోవడంతో గర్భిణీ తన బిడ్డను కోల్పోయిందని..ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇది జరిగిందన్నారు. గిరిజనులకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

రోహింగ్యా ముస్లింలను కాల్చి చంపండి : బీజేపీ ఎమ్మెల్యే

హైదరాబాద్ : భారత్ లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలను కాల్చి చంపాలంటూ హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. దేశం విడిచి వెళ్లకపోతే, వారిని కాల్చి చంపాలంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా ముస్లింలను వాళ్ల దేశాలకు వెంటనే పంపించి వేయాలనీ..అత్యంత ప్రమాదకరమైన వారిని మన దేశంలో ఉంచుకోవడం హానికరమని అన్నారు. వారు రోహింగ్యాలైనా లేదా బాంగ్లాదేశీలైనా ఎవరైన సరే... వారిని దేశం నుంచి తరిమి వేయాలని కేంద్రాన్ని కోరుతున్నానన్నారు.

12:45 - August 1, 2018

కాంట్రాక్టర్ లాభం కోసమే కాళేశ్వరం వ్యవం పెంపు : కోదండరాం

హైదరాబాద్ : కాళేశ్వరం ఇరిగేషణ్ ప్రాజెక్టు నివేదికను టీజేఎస్ సిద్ధం చేసిందనీ..ఈ నివేదికను ప్రభుత్వ అధికారులకు పంపించామనీ టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం తెలిపారు. ఈ నివేదికపై మంత్రి హరీవ్ రావు ఒక్కవిషయానికి సమాధానం ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కంటే కాంట్రాక్టర్లకే ఎక్కువ మేలు చేస్తోందని కోదండరాం విమర్శించారు. తక్కువ ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని కోదండరాం ప్రభుత్వాన్ని కోరారు. మెగా ఇంజనీర్ కృష్ణారెడ్డికి లాభం చేకూర్చేందుకే కాళేశ్వరం వ్యయాన్ని పెంచారని కోదండరాం ఆరోపించారు. 

12:31 - August 1, 2018

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం కాసేపటి క్రితం ఘనంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో ఆయన మొక్కలు నాటారు. ములుగు, గజ్వేల్, సిద్ధిపేటల్లో ఆయన మొక్కలు నాటేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. మసీదు లో సైరన్ మోగడంతో ఒకేసారి లక్ష మొక్కలను నాటేందుకు శ్రీకారం చుట్టారు.

గజ్వేల్‌ మున్సిపాలిటి పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లోనూ, అన్నిరకాల రోడ్లపైనా, ఔటర్‌ రింగ్‌రోడ్డుపైనా మొక్కలు నాటుతారు. అంతేకాదు... ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలంతా ఒకేసారి మొక్కలు నాటేలా ఏర్పాటు పూర్తి చేశారు.  

భువనగిరి లాడ్జీలపై ఖాప్స్ కన్ను..

యాదాద్రి : భువనగిరి లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే పక్కా సమాచారంతో లాడ్జీలపై పోలీసులు దృష్టి సారించారు. శ్రీలక్ష్మీనరసింహ లాడ్జి, శ్రీధ లాడ్జిలో ఒక్కో జంట చొప్పున, ఎస్‌ఎన్‌ లాడ్జిలో, శ్రీ లక్ష్మీలాడ్జిలో మూడు జంటల చొప్పున అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన జంటలు ఇక్కడి లాడ్జీల్లో రూములు తీసుకుని వ్యభిచారానికి పాల్పడుతుండగా, ఎన్ని కేసులు పెట్టినా అసభ్య కార్యక్రమాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు.

12:26 - August 1, 2018
12:25 - August 1, 2018

శ్రీకాకుళం : టిడిపి నేతలు దీక్షలు చేపడుతున్నారు. ఇటీవలే టిడిపి నేత కన్నబాబు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. పార్టీ ఇన్ ఛార్జీ ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ ఆయన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మౌన దీక్ష చేపట్టడం చర్చానీయాంశమైంది. అధికారుల తీరును నిరసిస్తూ ఆయన దీక్ష చేపడుతున్నారు.

ఆఫ్ షోర్ జలాశయం పనుల పూర్తిలో జాప్యంపై పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర శివాజీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జులై 31వ తేదీ నాటికి పూర్తి కావాల్సిన జలాశయం పూర్తి కాకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ 50 శాతం కూడా పనులు పూర్తి కాకపోవడంపై అధికారుల తీరును నిరసిస్తూ ఆయన మౌన దీక్ష చేపట్టారు. టిడిపి పార్టీ కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టారు. ఆయనకు టిడిపి నేతలు సంఘీభావం ప్రకటించారు. 

యాదాద్రి గుట్ట లాడ్జీల్లో వ్యభిచారం..దాడులు..కేసులు..

యాదాద్రి : పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో వ్యభిచారం పెరిగిపోయిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో పడాయిగూడెం శివార్లలోని లాడ్జీలపై ఏకకాలంలో దాడులు చేసిన పోలీసులకు ఎనిమిది జంటలు పట్టుబడ్డాయి. వీరంతా తమ వివరాలు సరిగ్గా చెప్పకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వచ్చిన వారి వివరాలు తెలుసుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా రూములు అద్దెకు ఇచ్చిన లాడ్జీల యజమానులపైనా కేసులు పెట్టారు.

12:24 - August 1, 2018

ఢిల్లీ : రాష్ట్రపతికి తమ ఆవేదనను తెలియచేసినట్లు టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రపతితో టిడిపి బృందం భేటీ అయ్యింది. భేటీకి సంబంధించిన వివరాలు తెలుసుకొనేందుకు టెన్ టివితో ఆయనతో మాట్లాడింది.

తమ ఆవేదనను తెలియచేయడం జరిగిందని, ఇందుకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంపై కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, కేంద్రం కావాలనే నిర్లక్ష్యం వహిస్తోందని తెలియచేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంతో ముడిపెట్టవద్దని కోరుతున్నట్లు, నివేదికలు వచ్చే వరకు వేచి చూడాలని చెప్పడం సమంజసం కాదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇందుకు భూమి, రైల్వే లైన్ తదితర సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. 

12:22 - August 1, 2018

ఢిల్లీ : రాష్ట్రపతితో టిడిపి ఎంపీలు, కడప జిల్లా టిడిపి ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. విభజన చట్టం అమలు.. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు..తదితర అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. టిడిపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నేతృత్వంలో రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. హైదరాబాద్ వస్తున్నానని, అక్కడ కలుస్తానని చెప్పడం జరిగిందన్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ విషయం కూడా తెలియచేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళుతానని తెలిపారు. 

బెస్తం చెరువు వద్ద మొక్కలు నాటిన మంత్రి కడియం..

వరంగల్ అర్భన్: నాల్గొవ విడత హరితహారంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలోని బెస్తం చెరువు వద్ద చేపట్టిన హరితహారంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, కొండా సురేఖ, మహిళ ఫైనాన్స్ చైర్మన్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవా రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ లలితా యాదవ్, కలెక్టర్ ఆమ్రపాలి, పోలీస్ కమీషనర్ రవీందర్, మున్సిపల్ కమీషనర్ గౌతమ్, ఐఎఫ్ఎస్ అక్బర్, తదితరుల పాల్గొన్నారు. 

పేరూరు జలాశయాన్ని పరిశీలించిన చంద్రబాబు..

అనంతపురం : రామగిరి మండలం పేరూరులో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పేరూరు జలాశయాన్ని చంద్రబాబు పరిశీలించారు.

ప్రారంభమైన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం..

విజయవాడ : రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ప్రారంభమయ్యింది. ఈ సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ ఉమెన్ చాందీ, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 

కాంగ్రెస్ తిరిగి ఆదరిస్తారనే నమ్మకముంది : పల్లంరాజు

విజయవాడ : కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు తిరిగి ఆదరిస్తారనే నమ్మకం తమకు వుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పల్లంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలను కలిసేందుకు అక్టోబర్ 2 నుండి ఇంటింటికీ వెళ్లనున్నామని..అక్టోబర్ 31 నుండి నవంబర్ 19 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నామని పల్లం రాజు తెలిపారు. కాపు రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి వుందనీ..ఈ విషయాన్ని గతంలో సోనియాగాంధీ స్పష్టం చేశారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో ఏపార్టీతో ను పొత్తులు పెట్టుకోబోమనీ..ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటామని పల్లంరాజు తెలిపారు.

బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం..

విజయవాడ : నగరంలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మురళీధరన్, సహ ఇన్ చార్జ్ సునీల్ దేవ్ ధర్, రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణతో సహా 16మంది కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లంపై నేతలు సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి ఎవరు ఏఏ బాధ్యతలు తీసుకోవాలో నేతలు దిశానిర్ధేశం చేయనున్నారు. 

కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం..

తమిళనాడు : కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుందరాపురం సమీపంలో జనం పైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళల, ఇద్దరు కాలేజీ విద్యార్థులు వున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.  

ములుగులో మొక్కలు నాటిన సీఎం కేసీఆర్..

సిద్ధిపేట : ములుగులో సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. నాలుగవ విడత హరితహారాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ లక్షా 116 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హరితహారంలో ప్రజలందరు భాగస్వాములు కావాలని కేసీఆర్ పిలుపు మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ తనసొంత నియోజకవర్గకేంద్రమైన గజ్వేల్‌లో మొక్కలు నాటారు. మున్సిపాలిటీ పరిధిలో ఒకేరోజు లక్షా నూటా పదహారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ములుగు సమీపంలోని రాజీవ్హ్రదారిపై, ప్రజ్ఞాపూర్ చౌరస్తా, గజ్వేల్‌లోని ఇందిరాచౌక్ వద్ద సీఎం కేసీఆర్ మూడు మొక్కలకు సీఎం కేసీఆర నాటారు. 

రాష్ట్రపతి రామ్ నాథ్ తో టీడీపీ ఎంపీలు భేటీ..

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ఏపీ టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. కడప ఉక్కు కర్మాగారం విషయంపై కేంద్రం అవలభిస్తున్న తీరుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను టీడీపీ ఎంపీలు కలిసారు. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని వినతిపత్రాన్ని సమర్పించారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని రాష్ట్రపతిని ఎంపీలు కోరారు. 

మాజీ మంత్రి చిదంబరానికి తాత్కాలిక ఊరట..

ఢిల్లీ : కాంగ్రెస్ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన చిదంబరానికి కోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ కేసులో సెప్టెంబర్ 28 వరకూ చిదంబరానికి అరెస్ట్ చేయవద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నేటితో ముగియనుండగా.. మరో నెల రోజుల పాటు గడువును పొడిగించాల్సిందిగా చిదంబరం కోర్టును కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన జస్టిస్‌ ఏకే.పథక్‌ అందుకు అంగీకరించారు. ఆగస్టు 1 వరకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే..

11:40 - August 1, 2018

ఉత్తర్ ప్రదేశ్ : యూపీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతుండడంతో జనజీవనం స్తంభించింది. బుధవారం కూడా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీనితో ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. గత వారం రోజుల నుండి కురిసిన వర్షాల కారణంగా ఇప్పటి వరకు 92 మంది మృతి చెందగా 91 మందికి గాయాలయ్యాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. 

గజ్వేల్ బయల్దేరిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ పర్యటనకు బయల్దేరారు. మరికాసేపట్లో నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. హరితహారం నాలుగోవిడుత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనసొంత నియోజకవర్గకేంద్రమైన గజ్వేల్‌లో మొక్కలు నాటనున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఒకేరోజు లక్షా నూటా పదహారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ములుగు సమీపంలోని రాజీవ్హ్రదారిపై, ప్రజ్ఞాపూర్ చౌరస్తా, గజ్వేల్‌లోని ఇందిరాచౌక్ వద్ద సీఎం కేసీఆర్ మూడు మొక్కలు నాటుతారు.

11:36 - August 1, 2018

నెల్లూరు : కావలి విట్స్ కాలేజీ లేడీస్ హాస్టల్ విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. హాస్టల్ భోజనం కలుషితంగా ఉందంటూ కాలేజీ ఎదుట బైఠాయించారు. కలుషిత ఆహారం తినడంతో పలువురు విద్యార్థులకు ఫుడ్ ఫాయిజన్ అయినట్లు సమాచారం. విద్యార్థినిలు ధర్నా చేస్తున్నా కాలేజీ యాజమాన్యం స్పందించ లేదని తెలుస్తోంది. 

11:31 - August 1, 2018

విజయవాడ : ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన బ్రాండ్ సీఎం చంద్రబాబు నాయుడున్నారని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ గా ఉందని ఏపీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. బుధవారం తాడేపల్లిలో పది ఐటీ కంపెనీలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సుమారు వేయి మంది యువతి, యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు ఎదురుగా మేథా టవర్స్ ఫుల్ అయిపోయిందని..రెండో టవర్ కూడా నాలుగైదు నెలల్లో రూపొందుతుందన్నారు. డెవలపర్స్ మెంట్స్ ను ప్రోత్సాహించడానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోందని, పది మంది ఐటీ రంగంలో ఉంటే..అందులో నలుగురు భారతీయులుంటారని తెలిపారు.

విశాఖపట్టణం..ఉభయగోదావరి, అమరావతి, తిరుపతి, అనంతపురం తదితర జిల్లాల్లో ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు. ఐదు సైబరాబాద్ లు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికలు వచ్చే వరకు లక్ష ఉద్యోగాలు ఐటీ రంగంలో...రెండు లక్షల ఉద్యోగాలు ఎలక్ట్రానిక్స్ రంగంలో అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రం 216 ఎంవోయూలు కుదుర్చుకుంటే ఏపీ రాష్ట్రం 214 ఎంవోయూలు కుదుర్చుకుందన్నారు. ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా అవన్నీ వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. 

జన్మనించ్చేందుకు స్త్రీ కావాలి,గుడిలో పూజలకు పనికిరారా?: సాధ్వీ

ఉత్తరప్రదేశ్ : యూపీలోని ఓ దేవాలయంలోకి ఓ మహిళా ఎమ్మెల్యే వెళ్లినందుకు మందిరంలో గంగా జలంతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డకు జన్మనిచ్చేందుకు స్త్రీ కావాలి కానీ, దేవాలయంలో పూజలకు మాత్రం ఆమెకు అవకాశం ఉండదా? అని సాధ్వీ ప్రశ్నించారు. మహిళలపై ఇలాంటి వివక్ష ఉండకూడదని అభిప్రాయపడ్డాడు. అయోధ్యలో రామాలయం రాజకీయ అంశం కానేకాదని సాధ్వీ తెలిపారు. ఇది కోట్లాది హిందువుల నమ్మకానికి సంబంధించిన అంశమని ఆమె స్పష్టం చేశారు. రామాలయ నిర్మాణాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు.

హిందూ యువకులను పెళ్లి చేసుకుంటే సమస్యలుండవు : సాధ్వీ

ఉత్తరప్రదేశ్ : ముస్లిం అమ్మాయిలు హిందూ మతం స్వీకరించి హిందూ యువకులను పెళ్లాడాలని విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వీ ప్రాచీ వ్యాఖ్యానించారు. హిందూ యువకులను పెళ్లాడటం ద్వారా ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి దురాచారాల నుంచి బయటపడొచ్చన్నారు. మధుర లోని బంకే బిహారి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిందూ మతాన్ని స్వీకరించడం ద్వారా ముస్లిం యువతులు అనేక వేధింపుల నుంచి బయటపడొచ్చని వీహెచ్ పీ నేత సాధ్వీ సూచించారు.

11:15 - August 1, 2018

సిద్ధిపేట : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ములుగు, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ లో ఆయన మొక్కలను నాటనున్నారు. మసీదుల్లో సైరన్ మోగిన అనంతరం ఒకేసారి లక్ష మొక్కలను ప్రజలు నాటనున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి పలువురితో ముచ్చటించింది. ములుగు, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ లో కొంతమంది నివాసాల్లో కేసీఆర్ మొక్కలు నాటనున్నారు. తమ నివాసాలు..గ్రామాల్లో కేసీఆర్ మొక్కలు నాటుతుండడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. మొక్కలు నాటేందుకు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

భారత ఉప ఖండానికి భూకంపాల ముప్పు..

ఢిల్లీ : భారత ఉప ఖండానికి పెను భూకంపాల నుంచి ముప్పుందని రీసెర్చర్లు హెచ్చరించారు. టిబెట్ పీఠం కింద ఉన్న ఆసియన్ టెక్టానిక్ ప్లేట్లు ఢీకొట్టుకోనుండటమే ఇందుకు కారణమని..దాదాపు 5 లక్షల సంవత్సరాల క్రితం భూ అంతర్భాగాల్లో ఇవి ఢీకొట్టుకున్న సమయంలో పెను భూకంపాలు సంభవించాయని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ జియోలజీ ప్రొఫెసర్ జియోడాంగ్ తెలిపారు.

11:06 - August 1, 2018

ఢిల్లీ : టిడిపి ఎంపీల ఆందోళనలు..నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. విభజన హామీలు..ప్రత్యేక హోదా..తదితర అంశాలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ లోక్ సభలో ఎంపీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బుధవారం రాష్ట్రపతితో టిడిపి ఎంపీలు, కడప జిల్లా టిడిపి ప్రజాప్రతినిధులు భేటీ కానున్నారు. విభజన చట్టం అమలు.. కడప జిలాలలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు..తదితర అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. టిడిపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నేతృత్వంలో రాష్ట్రపతిని బృందం కలువనుంది. ఈ భేటీ అనంతరం మధ్యాహ్నం ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తో టిడిపి ప్రతినిధి బృందం భేటీ కానుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

225 అడుగుల లోతు బోరుబావిలో పడిన 3ఏళ్ల చిన్నారి..

బీహార్ : బీహార్ లోని ముంగేర్ జిల్లాలో 225 అడుగుల లోతున్న బోరు బావిలో మూడు సంవత్సరాల బాలిక ఆడుకుంటూ వెళ్లి పడిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో పాప బావిలో పడిపోగా, వెంటనే భగల్ పూర్ నుంచి అధికారులు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బాలిక సుమారు 48 అడుగుల లోతులో ప్రాణాలతోనే ఉందని గుర్తించిన సిబ్బంది, ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నారు. పాప ఏడుపులు బయటకు వినిపిస్తుండటంతో సీసీ కెమెరాలను పంపి పాపను గమనిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

10 ఐటీ కంపెనీలను ప్రారంభించిన మంత్రి లోకేశ్..

అమరావతి : ఏపీ రాజధాని అమరావతికి మరో 10 ఐటీ కంపెనీలు రానున్నాయి. 10 ఐటీ కంపెనీలను మంత్రి నారా లోకేశ్ ప్రాంభించారు. ఏపీఎన్ ఆర్టీ ఆధ్వర్యంలో 10 ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఈ 10 కంపెనీల ద్వారా 1000మందికి ఉద్యోగ అవకాశాలు లభ్యమవుతాయి. 

భారీగా జిలెటిన్ స్టిక్స్ పట్టివేత..

తమిళనాడు : రామేశ్వరం తీర ప్రాంతంలో జిలెటిన్ స్టిక్స్ ను కోస్ట్ గార్డ్ పోలీసులు పట్టుకున్నారు. శ్రీలంకు తరలించేందుకు సిద్ధంగా వున్న 5,680 జిలెటిన్ స్టిక్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఐటీడీఏ కార్యాలయాన్ని తాళాలు వేసిన గిరిజనులు..

పశ్చిమగోదావరి : బుట్టాయిగూడెం గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయాన్ని గిరిజనులు ముట్టడించారు. పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తు ఐటీడీఏ ఉద్యోగులను బలవంతంగా బైటకు పంపి కార్యాలయానికి గిరిజనులు తాళాలు వేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని లేకుండా ఉద్యమాన్ని ఉదృతం చేయాలని వారు డిమాండ్ చేశారు. 

తన సెల్ ఫోన్ చోరీ అయ్యిందని సీఐ ఫిర్యాదు ..

హైదరాబాద్ : ప్రజలకు భద్రతనిచ్చే పోలీసుల వస్తువులే చోరీకి గురవుతున్నాయి. జూబ్లీ హిల్స్ లోని ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సీఐ సెల్ ఫోన్ చోరీ అయ్యింది. హోంగార్డ్ కాజేసినట్లుగా సీఐ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో సీఐ బలవంతయ్య ఫిర్యాదు చేశారు. 

10:33 - August 1, 2018
10:32 - August 1, 2018

హైదరాబాద్ : మేకలమండిని ప్రైవేటు పరం చేయవద్దని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదిర్శ, బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పాతబస్తీలోని మేకలమండిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ...ప్రస్తుతం టీఆర్ఎస్, గతంలో కాంగ్రెస్ అన్నం పెట్టేవి కావని..పెద్ద పెద్ద వారికి ప్లేట్లు వేసేవన్నారు. పేద వారి..అట్టడుగు కులాల గవర్నమెంట్ రావాలంటే

బీఎల్ఎఫ్ కు ఓటేయాలన్నారు. మాయమాటలు చెప్పేందుకు మళ్లీ వస్తారని, కబేలాలో ఉన్న వృత్తిదారులు, కార్మికులు చైతనవంతం కావాలని పిలుపునిచ్చారు.వీరు చేస్తున్న న్యాయ పోరాటానికి సీపీఎం, సీఐటీయూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. 

మేకలమండిని ప్రైవేటు పరం చేయవద్దని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదిర్శ, బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పాతబస్తీలోని మేకలమండిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ...ప్రస్తుతం టీఆర్ఎస్, గతంలో కాంగ్రెస్ అన్నం పెట్టేవి కావని..పెద్ద పెద్ద వారికి ప్లేట్లు వేసేవన్నారు. పేద వారి..అట్టడుగు కులాల గవర్నమెంట్ రావాలంటే

బీఎల్ఎఫ్ కు ఓటేయాలన్నారు. మాయమాటలు చెప్పేందుకు మళ్లీ వస్తారని, కబేలాలో ఉన్న వృత్తిదారులు..కార్మికులు చైతనవంతం కావాలని పిలుపునిచ్చారు.వీరు చేస్తున్న న్యాయ పోరాటానికి సీపీఎం, సీఐటీయూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. 

విట్స్ ఇంనీరింగ్ కళాశాల విద్యార్థుల ఆందోళన..

నెల్లూరు : విట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. భోజనం సరిగా లేదనీ..మంచినీరు సమస్య తీర్చాలనే డిమాండ్ తో విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. హాస్టల్ లోని భోజనం చేసిన ఓ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. దీంతో హాస్టల్ లోని సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తు విద్యార్థులు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. 

ఒకేరోజు లక్షా 116 మొక్కలతో హరితహారం.. ..

హైదరాబాద్ : నాలుగో విడత హరిత హారాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఒకేరోజున అక్షా 116 మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ పిలుపునిస్తు మొక్కలు నాటి హరితహారాన్ని ప్రారంభించనున్నారు. ములుగు, ప్రజ్నాపూర్, గజ్వేల్ లలో సీఎం కేసీఆర్ మొక్కలు నాటనున్నారు. ములుగు సమీపంలోని రాజీవ్ నగర్ రహదారిపై, ప్రజ్నాపూర్ చైరస్తా, గజ్వేల్ లోని ఇందిరా చౌక్ వద్ద మొక్కలను సీఎం కేసీఆర్ నాటనున్నారు. 

10:18 - August 1, 2018

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగో విడత హరిత హారం కాసేపట్లో ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్, సిద్ధిపేటలో ప్రారంభం కానుంది. ఇందుకు అధికారులు మొక్కలను సిద్ధం చేశారు. ఒకేసారి లక్ష మొక్కల కార్యక్రమం జరుగనుంది. ములుగు మండలంలో మొదటి మొక్కను నాటిన అనంతరం రెండో మొక్కను ప్రజ్ఞాపూర్ లోని కూర నాగరాజు ఇంట్లో సీఎం కేసీఆర్ మొక్కను నాటనున్నారు. అనంతరం గజ్వేల్ లో మూడో మొక్కను నాటనున్నారు. ఈ సందర్భంగా కూర నాగరాజు, స్థానికులతో టెన్ టివి ముచ్చటించింది. తమ నివాసంలో మొక్క నాటేందుకు కేసీఆర్ వస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

10:07 - August 1, 2018

ఢిల్లీ : 'యుమన' నది ఒప్పొంగి ప్రవహిస్తోంది. హర్యానా, యూపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గత ఐదు రోజులుగా నది ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో 206.05 అడుగుకు వరద నీరు చేరింది. హర్యానా హతినికుండ్ బ్యారేజ్ నుండి వరద నీరు ప్రవహిస్తోంది. ఢిల్లీలో ఇనుప వంతెనపై రైళ్లు..వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 14వేల మందిని సురక్షిత ప్రాంతాలు తరలించి ఆహారం..వైద్యాన్ని అందిస్తున్నారు. వరద బాధితుల కోసం 1461 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:25 - August 1, 2018

కర్నూలు : ఏపీ రాష్ట్రంలో ఇసుక మాఫియా లేదని..కేవలం తప్పుడు ఆరోపణలు చేయవద్దని ప్రభుత్వం పేర్కొంటోంది. కానీ ఉచిత ఇసుక పాలసీ పక్కదారి పడుతోంది. మాఫియా తమకు అనుకూలంగా మార్చుకొంటోంది. నిత్యం ట్రక్కులు..లారీల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన పోలీసులు, ఇతర అధికారులు మాఫియాతో కుమ్మక్కయ్యారు.

పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఉచిత ఇసుక పాలసీని మాఫియా అనుకూలంగా మార్చుకుంది. అక్రమంగా ఇసుకను మాఫియా తోడేస్తోంది. కర్నూలు నుండి హైదరాబాద్, బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక మాఫియాతో పోలీసు, రెవెన్యూ గనులు, భూగర్బ శాఖ ములాఖత్ కావడంతో వీరి వ్యాపారం మూడు ట్రాక్టర్లు...ఆరు లారీల చందంగా నడుస్తోంది. 

ఇసుకను తోడేస్తున్న మాఫియా...

కర్నూలు : పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఉచిత ఇసుక పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉచిత ఇసుక పాలసీని మాఫియా అనుకూలంగా మార్చుకుంది. అక్రమంగా ఇసుకను మాఫియా తోడేస్తోంది. కర్నూలు నుండి హైదరాబాద్, బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక మాఫియాతో పోలీసు, రెవెన్యూ గనులు, భూగర్బ శాఖ ములాఖత్ కావడంతో వీరి వ్యాపారం మూడు ట్రాక్టర్లు...ఆరు లారీల చందంగా నడుస్తోంది. 

09:16 - August 1, 2018

మెదక్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హరితహారం' నాలుగో విడుత కార్యక్రమం జరుగనుంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో ఈ కార్యక్రమం జరుగనుంది. ములుగు, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ లో మొక్కలు నాటనున్నారు. ఒకే రోజు లక్ష మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

గజ్వేల్‌ ప్రజలందరూ మొక్కలు నాటే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. గజ్వేల్‌ పట్టణంలో సీఎం ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి స్థానిక నేతలతో మాట్లాడింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

09:12 - August 1, 2018

నల్గొండ : ప్రజా గాయకుడు గద్దర్ పై రాళ్ల దాడి జరగడం కలకలం రేపుతోంది. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. తాను తూటాలకే భయపడలేదని..రాళ్ల దాడికి భయపడుతానా ? అంటూ గద్దర్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం అమరవీరుల స్మరణ దినోత్సవం జరిగింది. సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొన్నారు.

గద్దర్ తన కళారూపాలను ప్రదర్శిస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సీపీఎం కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించాల్సిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీపీఎం నేతలు పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతలు గ్రామంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, దాడికి పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

గద్దర్ పై దాడి...

నల్గొండ : ప్రజా గాయకుడు గద్దర్ పై రాళ్ల దాడి జరిగింది. దాడికి పాల్పడింది టీఆర్ఎస్ నేతలని సీపీఎం నేతలు పేర్కొంటున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మీటింగ్...

విజయవాడ : నేడు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరుగనుంది. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జీ మురళీదరన్, బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇన్ ఛార్జీ సునీల్ దేవ్ ధర్ లు హాజరు కానున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ కూర్పుపై సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

39 మంది యువతులను రక్షించిన కమిషన్...

ఢిల్లీ : డీసీడబ్ల్యూ (ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్) 39 మంది యువతులను రక్షించింది. పహర్ గంజ్ లోని ఓ హోటల్ లో యువతులున్నారనే సమాచారం అందుకున్న కమిషన్ సభ్యులు దాడి చేసి యువతులను రక్షించారు. వీరంతా నేపాల్ కు చెందిన వారుగా తెలుస్తోంది. జులై 25వ తేదీన 16మంది యువతులను రక్షించిన సంగతి తెలిసిందే. 

08:20 - August 1, 2018

నెల్లూరు : కలువాయిలోని బాలాజీరావు పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భాను అనే నాలుగేళ్ల బాలుడిని ఓ మహిళ హత్య చేసింది. బాలుడి తండ్రి శ్రీనయ్యకు భార్య..ఇద్దరు పిల్లలు. అదే గ్రామంలో నివాసం ఉండే రత్తమ్మతో శ్రీనయ్యకు వివాహేతర సంబంధం ఉండేది. కొన్ని విబేధాలు రావడం...ఇంట్లో వారు మందలించడంతో రత్తమ్మతో శ్రీనయ్య మాట్లాడడం.కలవడం మానేశాడు. అప్పటి నుండి శ్రీనయ్యపై రత్తమ్మ కక్ష పెట్టుకుంది. తనతో సంబంధం కొనసాగించాలని పలుమార్లు రత్తమ్మ బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం శ్రీనయ్య కుమారుడు భాను (4) ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. మాయమాటలతో భానును రత్తమ్మ తీసుకెళ్లింది. ఇంట్లోకి వెళ్లిన అనంతరం బ్లేడుతో భానుపై గాయపరిచి గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం అక్కడనే ఓ గోనె సంచిలో పడేసింది. కొడుకు కనిపించకపోవడంతో శ్రీనయ్య చుట్టుపక్కల వెదికారు. కానీ ఫలితం కానరాలేదు. రత్తమ్మపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారవ్వడానికి సిద్ధమౌతున్న రత్తమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాను మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

08:09 - August 1, 2018

పశ్చిమగోదావరి : నరసాపురం మండలం పేరుపాలెం బీచ్ లో సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. తీర ప్రాంతంలో 100 మీటర్లకు పైగా సముద్రం ముందుకొచ్చింది. సముద్రపు అలలు రోడ్డును తాకుతుండడంతో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. తూర్పు పెద్ద మైనం లంక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

అలలు ఒక్కసారిగా ఉధృతంగా దూసుకొస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తోటలు..సమీపంలో ఇళ్లలోకి అలలు దూసుకొచ్చాయి. సంపూర్ణ చంద్రగహణం నుండి సముద్ర అలలు ముందుకొస్తున్నాయని, కానీ మంగళవారం రాత్రి నుండి మరింత అలల ఉధృతి ఎక్కువగా ఉందని మత్స్యకారులు పేర్కొంటున్నారు. రక్షణ గోడ ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు, పాలకులు స్పందించడం లేదని స్థానిక మత్సకార కుటుంబాలు పేర్కొంటున్నాయి. 

పేరుపాలెం బీచ్ సముద్రం అల్లకల్లోలం...

పశ్చిమగోదావరి : నరసాపురం మండలం పేరుపాలెం బీచ్ లో సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. తీర ప్రాంతంలో 100 మీటర్లకు పైగా సముద్రం ముందుకొచ్చింది. సముద్రపు అలలు రోడ్డును తాకుతుండడంతో ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. తూర్పులు పెద్ద మైనం లంక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

 

07:37 - August 1, 2018
06:39 - August 1, 2018

మనిషి సాధరణ జీవితంలో పేపర్‌ పోషిస్తున్న పాత్ర చాలా ముఖ్యమైనది. సమాచారాన్ని ఇవ్వటంలోనైనా, విజ్ఞాన్ని పంచటంలోనైనా, విషయాలను లోతుగా తెలుపటంలోనైనా పేపర్‌ పోషిస్తున్న పాత్ర చాలా కీలకమైనది. ఆగస్టు 1న పేపర్ డే సందర్భంగా పేపర్‌ నిర్వహిస్తున్న పాత్ర, పేపర్‌ పట్ల ప్రజల్లో ఉన్న సందేహాలపై టెన్ టివి జనపథం ప్రత్యేక చర్చను చేపట్టింది. ఫెడరేషన్‌ ఆఫ్ పేపర్‌ టేడర్స్‌ అసోసియేషన్స్ నాయకులు రామకృష్ణ, తెలంగాణ పేపర్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీనాథ్‌ విశ్లేషించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:34 - August 1, 2018

నిజామాబాద్ : అర్బన్‌ నియోజవర్గంలో ఇవాళ తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటించనున్నారు. 50 కోట్లతో నిర్మించనున్న ఐటీ హబ్‌తోపాటు... మరో 300 కోట్ల అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఉదయం 10 గంటలకు కేటీఆర్‌ జిల్లాకు చేరుకోనున్నారు. మాధవనగర్‌ దగ్గర జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌కు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి బైక్‌ ర్యాలీగా కొత్తగా నిర్మించతలపెట్టిన ఐటీహబ్‌ ప్రాంతానికి చేరుకుని భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి పాలిటెక్నిక్‌ గ్రౌండ్‌ వేదికగా చేపట్టిన బహిరంగ సభలో కేటీఆర్‌ పాల్గొంటారు. ఈ సభకు ఎంపీ కవితతోపాటు... జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో... నగరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన కూడళ్లతోపాటు డివైడర్లలో తాత్కాలిక చెట్లను ఏర్పాటు చేశారు. మొన్నటి వరకు గుంతల రోడ్లతో అధ్వాన్నంగా ఉన్న రహదారులను అద్దంలా మార్చారు. మంత్రి పర్యటించే రహదారులను గతుకులు లేకుండా చేశారు. నగరంలో ఫ్లెక్సీలను నిషేధిస్తూ మున్సిపల్‌ పాలకవర్గం తీర్మానం చేసిన నేపథ్యంలో.. కాస్తా ఫ్లెక్సీల హడావుడి తగ్గింది. ప్లాస్టిక్‌ రహిత తోరణాలను ఏర్పాటు చేశారు. నగరాన్ని గులాబీ వనంలా మార్చిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు.. కేటీఆర్‌ స్వాగత ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన దృష్ట్యా నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు సంఘాల నేతలు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసన తెలిపే అవకాశం ఉండడంతో.. ముందస్టు అరెస్ట్‌లకు ప్రణాళికలు సిద్దం చేశారు. 

06:32 - August 1, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం నాలుగో విడత నేటి నుంచి ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్‌లో మొక్కనాటి హరితహారం ప్రారంభిస్తారు. సీఎం పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగో విడత హరితహారం కార్యక్రమం ఇవాళ మొదలు కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌లో ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. లక్షా నూటపదహారు మొక్కలు నాటి కార్యక్రమం మొదలు పెడతారు. గజ్వేల్‌ మున్సిపాలిటి పరిధిలో ఉన్న ప్రతి ఇంట్లోనూ, అన్నిరకాల రోడ్లపైనా, ఔటర్‌ రింగ్‌రోడ్డుపైనా మొక్కలు నాటుతారు. అంతేకాదు... ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవాళ అన్ని ప్రార్థనా మందిరాల్లో ఒకేసారి సైరన్‌ మోగించాలంటూ వారు ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే ప్రజలంతా ఒకేసారి మొక్కలు నాటేలా ఏర్పాటు పూర్తి చేశారు.

మొక్కల రక్షణ కోసం 60వేల ట్రీగార్డులను అధికారులు సిద్ధం చేశారు. వాటికి శుద్ధి చేసిన నీటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేయాలని సూచించారు. ఇక హరితహారం ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. చిన్నాపెద్దా అన్న తేడాలేకుండా అందరూ కలిసి పండుగ వాతావరణంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుపుకోవాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని విజయంతం చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. సీఎం పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. 

నిలకడగా కరుణ ఆరోగ్యం...?

ఢిల్లీ : చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. ఈ నెల 28న బీపీ, పల్స్ పడిపోవడంతో కరుణానిధిని ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. 

హరితహారం...

గజ్వేల్ : సీఎం కేసీఆర్‌ బుధవారం నాల్గవ విడత హరితహారం కార్యక్రమాన్ని తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌ నుంచి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్‌ ప్రజలందరూ మొక్కలు నాటే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. గజ్వేల్‌ పట్టణంలో సీఎం ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.

ఎమ్మార్పీకి అమ్మకంటే కఠిన చర్యలు...

హైదరాబాద్ : సినిమా ప్రేక్షకులకు శుభవార్త... సినిమాకెళ్తే జేబుకు చిల్లుపడుతుందన్న భయం ఇకమీదట అసరంలేదు. థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో తినుబండారాలు ఇకపై ఎమ్మార్పీకే దొరకనున్నాయి. ఇంతవరకూ ప్రేక్షకుల పర్సులు లూటీ చేసిన థియేటర్స్ యాజమాన్యాలకు ముకుతాడు వేయనుంది తూనికలు, కొలతల శాఖ. రేపటినుంచి ఎమ్మార్పీకే అమ్మకుంటే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు.

బాలాజీరావు పేటలో దారుణం...

నెల్లూరు : కలువాయిలోని బాలాజీ రావు పేటలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడిని గొంతు నులిమి చంపిన రత్తమ్మ అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

రాష్ట్రపతితో టిడిపి బృందం భేటీ...

ఢిల్లీ : నేడు రాష్ట్రపతిని ఏపీ టిడిపి ఎంపీలు, నేతలు కలువనున్నారు. విభజన చట్టం అమలు, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరనున్నారు. ఉదయం 11.30గంటలకు రాష్ట్రపతిని టిడిపి బృందం కలువనుంది. 

రుణాలు చెల్లించేందుకు సిద్ధమన్న మాల్యా...

ఢిల్లీ : భారతీయ బ్యాంకులకు రుణాలు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లిక్కర్‌కింగ్‌ విజయ్‌మాల్యా తెలిపారు. తనకున్న 14 వేల కోట్ల ఆస్తులను అమ్మకానికి పెట్టి రుణాలు చెల్లిస్తానని చెప్పారు. తనపై వస్తున్న మనీలాండరింగ్‌ ఆరోపణలు అవాస్తవమని ఆయన కొట్టి పారేశారు.

విపక్షాలు సిద్ధం...

ఢిల్లీ : 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కొనేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని నిర్ణయించాయి. కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ పార్టీలు ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చాయి. 

ఆగస్టు 11న ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం..

ఢిల్లీ : పాకిస్తాన్‌ ప్రధానమంత్రిగా ఆగస్టు 11న జరిగే ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోది సహా సార్క్‌ దేశాధినేతలను ఆహ్వానించాలని పాకిస్తాన్ తెహ్రిక్‌ ఎ ఇన్సాఫ్‌ పార్టీ భావిస్తోంది. పాకిస్తాన్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రధాని మోది ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. 

Don't Miss