Activities calendar

02 August 2018

22:05 - August 2, 2018
22:02 - August 2, 2018

చెన్నై : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించారు. అనంతరం ఎంకే స్టాలిన్, కనిమొళి,  డిఎంకె నేతలతో విజయన్‌ సమావేశమై కరుణానిధి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.  కరుణానిధి కోలుకుంటున్నారని... ఆయనకు అపారమైన శక్తి ఉందని సీఎం పేర్కొన్నారు. కరుణానిధి పుట్టుకతోనే పోరాడే శక్తి ఉన్న గొప్ప వ్యక్తని అభివర్ణించారు.

21:53 - August 2, 2018

నిజామాబాద్‌ : జిల్లాలోని శాంకరీ నర్సింగ్‌ కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ కుమారుడు ధర్మపురి సంజయ్‌.. నర్సింగ్‌ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారని నాయినికి ఫిర్యాదు చేశారు. ఆయనపై, కళాశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీడబ్ల్యూడీ నాయకురాలు సంధ్య నేతృత్వంలో తల్లిదండ్రులు హోం మంత్రిని కలిశారు. ఈ మేరకు డీజీపీతో ఫోన్లో మాట్లాడిన నాయిని పోలీస్‌ కమిషనర్‌తో విచారణ జరిపించాలని ఆదేశించారు.

21:46 - August 2, 2018

నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కు చుక్కెదురైంది. దామరచర్ల మండల పరిధిలో నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయతీల ప్రారంభోత్సవానికి హాజరైన భాస్కర్‌రావును ఆయా తాండావాసులు అడ్డుకున్నారు. సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడేముఖం పెట్టుకొని వచ్చారంటూ నిలదీశారు. అందర్నీ అరెస్ట్ చేయాలంటూ ఎమ్మెల్యే పోలీసులకు హుకుం జారీ చేయడంతో.. ఆగ్రహించిన గ్రామస్తులు ఎమ్మెల్యే వాహనాలపై రాళ్లదాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

21:37 - August 2, 2018

అసిఫాబాద్ : సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దూసుకుపోతుందన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ మేరకు నాలుగేళ్లుగా మూతపడిన సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునరుద్ధరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మిల్లులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
అసిఫాబాద్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన 
కోమ్రం భీం అసిఫాబాద్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. సిర్పూర్‌ కాగజ్‌ నగర్ పేపర్‌ మిల్లు పునరుద్ధరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మిల్లులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్మికుల శ్రేయస్సు కోసమే సిర్పూర్‌ పేపర్‌ మిల్లును పునః ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్‌. గత ప్రభుత్వాల తప్పిదం వల్ల, మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పేపర్‌ మిల్లు మూతపడిందన్నారు. పేపర్‌ మిల్లు పునః ప్రారంభానికి ప్రభుత్వం కృషి చేస్తుందని.. జేకే పేపర్స్‌ అనే సంస్థ పేపర్‌ మిల్లు ప్రారంభానికి ముందుకు వచ్చిందని  తెలిపారు. 
మూతపడ్డ పరిశ్రమలన్నింటినీ తెరిపించేందుకు కృషి : కేటీఆర్ 
జిల్లాలో మూతపడ్డ పరిశ్రమలన్నింటినీ తెరిపించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్‌. కార్మికులకు అండగా ఉండటానికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్‌ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్ పాలనను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కోసం 25 కోట్లు వెంటనే మంజూరు చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కాగజ్‌ నగర్‌ అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. 

 

21:32 - August 2, 2018

గుంటూరు : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. నిరుద్యోగులు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న భృతి చెల్లించేందుకు రంగం సిద్ధమైంది. నెలకు వెయ్యి రూపాయల భృతి చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పథకానికి ముఖ్యమంత్రి యువనేస్తం పేరును ఖరారు చేశారు. ఈ మేరకు  ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి నిర్మానానికి 2 వేల కోట్ల రూపాయల బాండ్ల జారీనిక కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 
నిరుద్యోగ భృతికి అమోదం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీకి అనుగుణంగా నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ఈనెల 3 లేదా 4 వ వారంలో రిజిస్ట్రేషన్‌ ప్రారంభిస్తారు. నిరుద్యోగుల నమోదు ప్రక్రియ ముగిసిన 15 రోజుల్లో భృతి చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.  22-35 ఏళ్ల మధ్య వయసు ఉన్న నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల వంతున భృతి చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఒక కుటుంబంలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నా.. అందరికీ భృతి చెల్లిస్తారు. గతంలో నిర్వహించిన ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. డిగ్రీ లేదా పాలిటెక్నిక్‌ చదవిన వారికి భృతి చెల్లిస్తారు. ప్రతి నెలా రూ.600 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఏడాదికి 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్క తేల్చారు. నిరుద్యోగ భృతి చెల్లించడంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. నేరుగా నిరుద్యోగ యువత బ్యాంకు ఖాతాలో భృతి జమచేసే ఏర్పాటు చేశారు. 
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం 
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 20 వేల ఉద్యోగాలతోపాటు 9 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తారు. సవరించిన ఏపీ జౌళి విధానానికి మంత్రివర్గం ఆమోదించింది. ఈ రంగంలో భారీ పరిశ్రమలను ఆకర్షించేందుకు ఈ విధానం రూపొందించారు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ.. వుడా పేరు మార్పు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఉడాను.. విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా మార్పు చేశారు. దీంతో వుడా పరిధి ప్రస్తుతం ఉన్న 5,573 కి.మీ. నుంచి 6,746.59 కి.మీ.పెరుగింది. వీఎంఆర్‌డీ పరిధిలోకి 48 మండలాలు, 1,346 గ్రామలు రానున్నాయి. కుప్పంలో ఎయిర్‌ స్ట్రిప్‌ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసిన మంత్రివర్గం... ఫియోథెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్‌ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.
 

 

21:24 - August 2, 2018

MBBS చదవాలనుకొనే మనదేశం విద్యార్థుల కోరిక నెరవేర్చే అద్భుత అవకాశం. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ అందిస్తున్నది. మనదేశానికి అతి దగ్గరలో కేవలం 5-6 గంటల ప్రయాణం గల యురోపియన్‌ దేశమైన జార్జియా దేశంలోని ప్రభుత్వ గుర్తింపుపొంది, జార్జియా ప్రభుత్వంచే నడపబడుతున్న 125 సంవత్సరాల చరిత్ర కలిగిన భటుమి చోటా రెస్టవెల్లి స్టేట్‌ యూనివర్సిటీ మరియు 90 సంవత్సరాల చరిత్ర కలిగిన అకాకి ట్సెరిటెలి స్టేట్‌ యూనివర్సిటీ మన తెలుగు విద్యార్థులకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నది. అత్యాదునిక పద్దతులు 3D స్టీరియో స్కోపిక్‌ టెక్నాలజీతో వైద్య, విద్య బోధిస్తూ.. ఆ దేశంలో టాప్‌ యూనివర్సిటీలుగా నిలుస్తున్నాయి. కేవలం 5 సంవత్సరాలలో ఇంగ్లీష్‌ మీడియం కోర్సుతో, అతితక్కువ ఫీజుతో మెడిసిన్‌ పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నది. వరల్డ్‌ బెస్ట్‌ ఫ్యాకల్టీ, ఫ్రీ MCI & USMLE కోచింగ్‌ ఇస్తూ వందలాది విద్యార్థులకు వివిద దేశాల్లో మెడిసిన్‌ విద్యను మీకు అందిస్తున్నది మీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌. దీని గురించి మనతో మాట్లాడటానికి BSS ప్రసాద్‌ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..  

 

రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. కొత్త జోనల్ విధానం అంశంపై కేంద్రంతో సీఎం చర్చించనున్నారు.
  

21:14 - August 2, 2018

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచింది. కీలక వడ్డీరేట్లను పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. రెపో రేటు పెరగడంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ శాతాన్ని పెంచే అవకాశం ఉంది. 2019 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆర్థికరంగ విశ్లేషకులు శశికుమార్ పాల్గొని, మాట్లాడారు. రెపో రేటు అంటే బ్యాంకులకు ఆర్ బీఐ అప్పులు ఇవ్వడం.. రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకులు ఆర్ బీఐకి అప్పులు ఇవ్వడం అని పేర్కొన్నారు. సాధారణంగా వృద్ధి పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

20:59 - August 2, 2018

ఉద్యోగాల భర్తీ కాడ మంత్రి అవద్దాలు...అవద్దాలే ఆత్మహత్య జేస్కుంటయ్, ఎస్ఈ ఆఫీసు మీద మహిళ రైతుల దాడి...నీళ్లిడుస్తలేరని కుర్చీలు ఫర్నీచర్ ధ్వంసం, పోలీసోళ్లను పొర్కపొర్క గొట్టిన జనం.. ఓవరాక్షన్ జేస్తె కొట్టకపోతె ఏం జేస్తరు.??, ఆంధ్రా కాపులళ్ల రగులుతున్న సెగలు...ఉద్యమానికి సిద్దమైతున్న నాయకులు, కొత్తగూడెం ఎమ్మెల్యే గారి దత్తత దరిద్రం...ఎక్కిరిస్తున్న మోరీలు.. రోడ్లు, నల్లాలు, బైకులు పార్కింగు జేశే కాడ జాగ్రత్త సుమా...పాములు జొర్రి పంటున్నయ్ ఈ కాలంల... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

చెన్నైలో 11.15 కిలోల బంగారం పట్టివేత

తమిళనాడు : చెన్నైలో రూ.3.32 కోట్ల విలువైన 11.15 కిలోల బంగారం పట్టుబడింది. శ్రీలంక నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ముగ్గురిని డీఆర్ ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

 

20:43 - August 2, 2018

దళితాగ్రహానికి కేంద్రం దిగి వచ్చింది. మరో విడత ఆందోళనల అగ్గి రాజుకోకముందే జాగ్రత్త పడింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని తీర్మానించింది. ఈ చట్టం మునుపటిలాగా కఠినంగా, పటిష్టంగా ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై మోడీ సర్కార్ కు ఉన్న కమిట్ మెంట్ ఎంత ? ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ, కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కుమార్, సామాజిక విశ్లేషకులు ప్రొ. శ్రీపతిరాముడు పాల్గొని, మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:40 - August 2, 2018

సంగారెడ్డి : జిల్లాలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయితీల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. తండాలను కూడా గ్రామ పంచాయితీ హోదాను కల్పించడంతో పండుగ వాతావరణం వచ్చిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయితీలతో పాలన మరింత మెరుగవుతుందంటున్న జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. సంగారెడ్డి జిల్లాకు కొత్తగా 190 గ్రామ పంచాయితీలు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. సుమారు 90 తండాలకు గ్రామ పంచాయితీలు వచ్చాయన్నారు.

 

20:31 - August 2, 2018

హైదరాబాద్‌ : అంతరాష్ట్ర ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉద్యోగాల పేరుతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్లు హైదర్‌బాద్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. 8 మంది ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సీపీ  చెప్పారు. ముఠా నుంచి 25 లక్షల నగదు, నకిలీ అపాయిట్మెంట్‌ లెటర్స్, యూనిఫార్మ్స్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. 

 

క్వార్టర్ ఫైనల్ కు చేరిన పీవీ సింధు

హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ కు చేరింది. 21..10, 21..18 తేడాతో సింధు విజయం సాధించారు. 

 

20:17 - August 2, 2018

హైదరాబాద్ : డీ.శ్రీనివాస్ కుమారుడు సంజయ్ పై విద్యార్థినులు లైంగిక ఆరోపణలు చేశారు. తమను వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరి నర్సింగ్ కళాశాల విద్యార్ధినులు ఫిర్యాదు చేశారు. హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని కలిసి విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. 

డీఎస్ కుమారుడు సంజయ్ పై నాయినికి ఫిర్యాదు చేసిన విద్యార్థినులు

హైదరాబాద్ : డీ.శ్రీనివాస్ కుమారుడు సంజయ్ పై విద్యార్థినులు లైంగిక ఆరోపణలు చేశారు. తమను వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరి నర్సింగ్ కళాశాల విద్యార్ధినులు ఫిర్యాదు చేశారు. హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డిని కలిసి విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. 

 

20:01 - August 2, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లా గంభీరావుపేట మండలం ధమ్మన్నపేటలో విద్యుత్‌ షాక్‌తో నాలుగు గేదెలు మృతి చెందాయి. ప్రమాదంలో రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే వైర్లు తెగి పోయాయని గ్రామస్తులు ఆరోపించారు. ధమ్మన్న పేట రహదారి వెంట స్కూల్‌ పిల్లలు వస్తుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరారు.

 

19:59 - August 2, 2018

కర్నూల్‌ : జిల్లాలోని ధర్మ పేటలో విషాదం చోటు చేసుకుంది.  రేపల్లే మధు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. రెండు రోజుల క్రితం కారు సర్వీసింగ్‌ చేసుకొని వస్తానని వెళ్లి శవమైయి కనిపించాడు. కారులో శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

 

19:58 - August 2, 2018

హైదరాబాద్‌ : నగరంలోని పలు మల్టీఫ్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో తూనికలు కొలతలశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆగస్టు 1 నుంచి మల్టీఫ్లెక్స్‌లలో, సినిమా థియేటర్స్‌లో ఎమ్మార్పీ ధరలకే తినుబండరాలు అమ్మాలని ఆదేశాలు జారీ చేసినా.. నిర్వాహకులు నిబంధనలు పాటించడంలేదని అధికారులు అంటున్నారు. మొదటి రోజే 20కిపైగా కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

19:54 - August 2, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో.. పంచాయతీలు ప్రగతి బాటలో సాగుతున్నాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం.. మేలిమి ఫలితాలను ఇస్తోంది. ఈ సమన్వయం కారణంగా.. గ్రామాల్లో దశాబ్దాలనాటి సమస్యలన్నీ దశలవారీగా దూరమవుతున్నాయి. ఫలితంగా.. మెజారిటీ గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. తాగునీరు, రోడ్లు, విద్యుత్‌, గృహనిర్మాణం వంటి కనీస సదుపాయాలు మెరుగయ్యాయి. పల్లెలన్నీ ఇప్పుడు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. 
ఏపీలో 12వేలకు పైగా పంచాయతీలు
ఆంధ్రప్రదేశ్‌లో 12వేలకు పైగా పంచాయతీలున్నాయి. వీటి పరిధిలో మరో వెయ్యికి పైగా శివారు గ్రామాలున్నాయి. 2014 వరకూ రాష్ట్రంలోని గ్రామాల్లో విద్య, వైద్యం, రవాణ సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉండేవి. ప్రధానంగా తాగునీటి కోసం జనం నానాయాతనలు పడేవారు. రోడ్ల సంగతి సరేసరి. వానాకాలంలో రోడ్లమీద నడవలేక పోయేవారు. ఇక స్కూళ్లలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు పడరాని పాట్లు పడేవారు. సాయంత్రం ఆరు దాటితే చాటు జనాన్ని కరెంటు భయం వెంటాడేది. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.
మెరుగుపడ్డ రోడ్లు, స్కూళ్లు, విద్యుత్‌ సదుపాయం
ఏపీలోని గ్రామాల్లో ఇప్పుడు రోడ్లు, స్కూళ్లు, విద్యుత్‌ సదుపాయాలు  బాగా మెరుగయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న చొరవ, నరేగాను సమర్థంగా వినియోగించుకోవడం వల్ల సత్ఫలితాలు సిద్ధిస్తున్నాయి. గతంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగాలంటే.. 50 శాతం ఉపాధిహామీ పథకం నిధులు, మరో 50 శాతం ఆర్థిక సంఘం నిధులో.. ఎమ్మెల్యే, ఎంపీల నిధులో వాడాల్సి వచ్చేది. ఆ నిధులు సరిపోక చాలా గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం మేలిమి నిర్ణయం తీసుకుంది.
రెండు వేలలోపు జనావాసాలకు 90% ఉపాధి నిధులు
రెండువేల కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాలకు 90 శాతం ఉపాధిహామీ నిధులు, 9వేల లోపు జనాభా ఉంటే 70శాతం ఉపాధి హామీ నిధులు వాడుకునేలా, మిగిలిన మొత్తాన్ని ఇతరత్రా మార్గాల ద్వారా సమీకరించుకునేలా ప్రభుత్వం జీవోనెంబర్‌ 30ని జారీ చేసింది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి సులభతరమైంది. ఫలితంగా.. గ్రామీణాభివృద్ధికి అవరోధంగా మారిన రవాణా సదుపాయాలు మెరుగయ్యాయి. చంద్రన్నబాట పేరిట సిమెంట్‌ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. గత ప్రభుత్వాలు పదేళ్ల కాలంలో 23 జిల్లాల్లో 1120 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లను నిర్మిస్తే.. గడచిన నాలుగేళ్లలో 13 జిల్లాల్లో ప్రస్తుత ప్రభుత్వం 16వేల కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించింది.
భూగర్భ మురుగు కాలువల నిర్మాణానికీ ప్రణాళికలు
రహదారుల నిర్మాణమే కాదు.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్న భావనకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం భూగర్భ మురుగు కాలువల నిర్మాణానికీ ప్రణాళికలు రూపొందించి విజయవంతంగా అమలు చేస్తోంది. ఐదువేల కంటే ఎక్కువ జనాభా ఉన్న 1340 గ్రామాల్లో 2346 కిలోమీటర్ల పొడవునా.. అదే విధంగా 13 జిల్లాలో 5వేల కిలోమీటర్ల పొడవునా భూగర్భ మురుగు కాల్వల వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. దీంతో పాటే.. రాష్ట్రంలో 80శాతం మేర ఉన్న బహిరంగ మల విసర్జనను.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా నిర్మూలించగలిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టిన ఈ పథకం అమలుకు.. ప్రభుత్వం టార్గెట్లు ఫిక్స్‌ చేసి.. కలెక్టర్లను పరుగులు పెట్టించి.. 8లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మింప చేసింది.
ఎల్‌ఈడీ లైట్ల ద్వారా 50% విద్యుత్‌ ఆదా
ఇక గ్రామాల్లో వెలుగులు నింపేందుకు.. ఎల్‌ఈడీ లైట్లను అమర్చే కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా 50శాతం విద్యుత్‌ను ఆదా చేస్తున్నారు. ఈ స్కీమ్‌ని కమాండ్‌ కంట్రోల్‌ మానిటరింగ్‌ వ్యవస్థకు అనుసంధానం చేసి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. డిసెంబర్‌ నాటికి అన్ని పంచాయతీల్లోనూ ఎల్‌ఈడీ లైట్లను అమర్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇక జలవనరుల పెంపునకూ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తాగు, సాగు నీటి వనరుల పెంపును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 6177 కోట్లతో 42 వేల ఊట చెరువులు, 28వేల చెక్‌డ్యామ్‌లు, 6 లక్షల పంట సంజీవని నిర్మాణాలను పూర్తి చేయించింది. ఫలితంగా రాష్ట్రమంతటా భూగర్భజలాలు రెట్టింపయ్యాయి.
రూ. 125 కోట్లతో 4590 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం
ఇంతే కాదు.. గ్రామాల్లో 4590 అంగన్‌వాడీ కేంద్రాలను 125 కోట్లతో ప్రభుత్వం నిర్మించింది. సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచి రసాయన రహిత పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. దీనికోసం లక్షా 20వేల వర్మి కంపోస్టు గుంతలను అభివృద్ధి చేసింది. గడచిన నాలుగేళ్లలో 162 కోట్లతో 1750 పంచాయతీ కార్యాలయ భవనాలను నిర్మించింది. రాష్ట్రవ్యాప్తంగా 722 మేజర్‌ శ్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలూ అభివృద్ధి చేశారు. 1400 గ్రామాల్లో చెత్త నుంచిసంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు 13 లక్షల ఇళ్ల నిర్మాణానికి కంకణం కట్టుకుంది. ఎస్సీ ఎస్టీ రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాల వల్ల.. ప్రస్తుతం గ్రామాల రూపురేఖలు వినూత్నంగా మారిపోయాయనడంలో అతిశయోక్తి లేదు.  

 

19:49 - August 2, 2018

గుంటూరు : ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిరుద్యోగ భృతి విధివిధానాలకు ఆమోదం తెలిపారు. ఈ పథకానికి ముఖ్యమంత్రి యువనేస్తం పేరును నిర్ణయించారు. రాష్ట్రంలో 20వేల ఉద్యోగాల ఖాళీలు, 9,000 టీచర్ల పోస్టులతో పాటు ఇతరత్రా శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీచేయాలని కేబినెట్‌ తీర్మానించింది. వుడాకు విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌ చెల్లించే 11 కోట్ల రూపాయల పన్ను మినహాయింపునకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వుడాను విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా పేరు మార్చారు. ప్రస్తుతం ఉన్న వుడా పరిధి 5,573 చదరపు కిలోమీటర్లను 6,764 చదరపు కిలోమీటర్ల మేరకు పెంచారు. వీఎంఆర్‌డీ పరిధిలోకి 48 మండలాలు, 1,346 గ్రామాలు రానున్నాయి. ఫిజియో థెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కుప్పంలో ఎయిర్‌స్ట్రిప్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నూతన చేనేత విధానాన్ని మంత్రివర్గం ఆమోదించింది.

 

19:48 - August 2, 2018

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టకు జాతీయ హోదా సాధించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. జాతీయ హోదా దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. జాతీయ హోదాకు బదులు కాళేశ్వరంకు కేంద్రం నుంచి నిధులు అడగటం ఏంటని మర్రి శశిధర్‌రెడ్డి ప్రశ్నించారు. 

19:45 - August 2, 2018

మెదక్‌ : జిల్లాలోని అల్లదుర్గం మండలం చిల్వర గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుత్‌ వైర్లు తెగిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గీత కార్మికుడు సంగమేశ్వర్‌ గౌడ్‌, మహమ్మద్‌ పాషా పొలంలో పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. హై టెన్షన్‌ వైర్ల ప్రమాదం ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. 

 

19:42 - August 2, 2018

ఢిల్లీ : బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఉదంతానికి సంబంధించి బిహార్‌ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బాధిత బాలికల ఫోటోలను మార్ఫింగ్ చేసి మీడియాలో ప్రదర్శించ రాదని కోర్టు ఆదేశించింది. ముజఫర్‌పూర్‌లోని ఎన్జీవో సేవా సంకల్ప్‌ ఇవాం వికాస్‌ సమితి నిర్వహిస్తున్న వసతి గృహంలో మైనర్‌ బాలికలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. రేప్ కేసులో ప్రధాన నిందితుడు, బీహార్ షెల్టర్ హోమ్ నడుపుతున్న  55 ఏళ్ల బ్రిజేశ్ థాకూర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలపై బిహార్‌ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది.

 

19:39 - August 2, 2018

బీహార్ : ముజఫర్‌పూర్‌ బాలికల వసతి గృహంలో జరిగిన అత్యాచారాలకు నిరసనగా వామపక్షాలు బిహార్‌ బంద్‌కు  పిలుపు ఇచ్చాయి. ఈ బంద్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలిపాయి. వామపక్షాలు చేపట్టిన బంద్‌ రాష్ట్రవ్యాప్తంగా  తీవ్ర ప్రభావం చూపింది. బిహార్‌లో స్కూళ్లు, కాలేజీలు, షాపులు మూతపడ్డాయి. జహానాబాద్‌, గయ, నలందా తదితర ప్రాంతాల్లో సిపిఐఎం కార్యకర్తలు రైలురోకో నిర్వహించారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిన్నారులపై లైంగిక దాడి ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. వామపక్షాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ముజఫర్‌పూర్‌కు చెందిన ఎన్జీవో సేవా సంకల్ప్‌ ఇవాం వికాస్‌ సమితి నిర్వహిస్తున్న వసతి గృహంలో 34 మంది బాలికలపై అత్యాచారాలు జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  నిర్వాహకులు, అధికారులు, పలువురు నేతలు బాలికలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం జరిపారు. జూన్‌లో ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ సంస్థ చేపట్టిన సామాజిక ఆడిట్‌లో ఈ దారుణం వెలుగుచూసింది. 

 

18:42 - August 2, 2018

ఆదిలాబాద్ : గత ప్రభుత్వాల తప్పిదం వల్ల, మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పేపర్‌ మిల్లు మూతపడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాగజ్‌నగర్‌-చింతగూడ మధ్యలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం పేపర్‌ మిల్లులో ప్రత్యేక పూజలు చేసి బహిరంగసభలో పాల్గొన్నారు. పేపర్‌ మిల్లు పునః ప్రారంభానికి ప్రభుత్వం కృషి చేస్తుందని.. జేకే పేపర్స్‌ అనే సంస్థ పేపర్‌ మిల్లు ప్రారంభానికి ముందుకు వచ్చిందని కేటీఆర్‌ తెలిపారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో మిల్లులో పనులు ప్రారంభమవుతాయని కేటీఆర్‌ అన్నారు. 

18:38 - August 2, 2018

హైదరాబాద్ : సింగపూర్‌ తరహా రాజధానిని నిర్మిస్తానంటున్న ముఖ్యమంత్రి చందబాబు... సింగపూర్‌ తరహా పాలన గురించి ఎందుకు మాట్లాడటంలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. జనసేన మహిళా విభాగసం సమావేశంలో పార్టీ పక్ష పత్రిక శఘ్నిని ఆవిష్కరించారు. ఈసందర్భంగా మహిళ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పవన్‌... మహిళ విభాగం కార్యకర్తలు జనసేన పార్టీకి కొంత సమయం కేటాయించి, సిద్ధాంతాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే  ప్రస్తావిస్తున్న సింగపూర్‌ రాజధాని కంటే సింగపూర్‌ పాలన ముఖ్యమని పవన్‌ సూచించారు. సింగపూర్‌లో మహిళలు, మహిళా అధికారులపై చేయి చేసుకునే ఎమ్మెల్యేలకు కఠిన శిక్షలు ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేశారు. తన వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే ప్రయత్నం కంటే పార్టీ విధానాలను చూడాలని జనసేనాని కోరారు. 

 

18:32 - August 2, 2018

నెల్లూరు : జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ పై దళితులు చేసిన దాడిని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే దాడికి పాల్పడ్డ వారిలో పలువురిని అరెస్టు చేయగా.. మరికొందరి కోసం గాలింపు చేపట్టారు . దీంతో తమను కూడా అరెస్ట్‌ చేస్తారనే భయంతో హరిజనవాడలోని స్థానికులంతా ఇళ్లను వదిలి పారిపోయారు. దీంతో ఇళ్లన్నీ బోసిపోయాయి. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

18:29 - August 2, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న రైతులు ఎస్ ఆర్ ఎస్ పీ ఎస్‌సీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. దీంతో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రోజు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

18:25 - August 2, 2018

హైదరాబాద్‌ : నగరంలోని పలు మల్టీఫ్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో తూనికలు కొలతలశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. ఆగస్టు 1 నుంచి మల్టీఫ్లెక్స్‌లలో, సినిమా థియేటర్స్‌లో ఎమ్మార్ఫీ ధరలకే తినుబండరాలు విక్రయించాలని లీగల్ మెట్రాలజీ డిపార్ట్ మెంట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆదేశాలు జారీ చేసిన ఎమ్మార్పీ ధరల ప్రకారం ఇంకా తినుబండరాలు విక్రయించకపోవటంతో తూనికలు కొలతలు శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

18:20 - August 2, 2018

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి న్యూ సెంచరీ స్కూల్‌లో విషాదం నెలకొంది. స్కూల్‌ గోడ కూలి ఇద్దరు విద్యార్థినులు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

18:17 - August 2, 2018

యాదాద్రి : జిల్లాలోని యాదగిరి గుట్టలోని అనురాధ నర్సింగ్‌ హోంపై ఎస్వోటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. 48 ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌లతో పాటు శాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాలికలకు ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ను ఇచ్చి వ్యభిచారంలోకి దింపేందుకు నిర్వహకులు ప్రయత్నిస్తుంటారు. వ్యభిచార నిర్వహకులకు సహకరిస్తున్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

 

18:13 - August 2, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఖరారరైంది. ఈనెల 13, 14 లేదీల్లో రాష్ట్రంలో రాహుల్‌ పర్యటించనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో జరిగే తెలంగాణ కాంగ్రెస్‌ బస్సు యాత్రలో రాహుల్‌ పాల్గొంటారు. ఆ రెండు రోజుల్లో రాహుల్‌ సమక్షంలో  పెద్ద ఎత్తున్నఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరతారు. 

 

18:11 - August 2, 2018

చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైసీపీ  విమర్శించింది. రాక్షస పాలనను రామరాజ్యంతో పోల్చుకోడాన్ని వైసీపీ ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి తప్పుపట్టారు. 2019లో చంద్రబాబుకు అధికారం కల్ల అని వ్యాఖ్యానించారు. 

 

17:25 - August 2, 2018

గుంటూరు : నిరుద్యోగ భృతి ఇచ్చి రాష్ట్రంలోని నిరుద్యోగులను ఆదుకుంటామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. 22 నుంచి 35 సం.రాలు వరకు వయసు గల వారికి నిరుద్యోగ భృతి వర్తిస్తుందన్నారు. నిరుద్యోగ యువతీయువకులకు నెల నెలా వెయ్యి రూపాయలు ఇస్తామని, డబ్బులు డైరెక్ట్ గా వారి బ్యాంకు అకౌంట్ లో వేస్తారని తెలిపారు. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యగ భృతి ఇస్తామని చెప్పారు. పీఎఫ్ ఉన్న వారికి ఈ స్కీమ్ వర్తించదన్నారు. ఆగస్టు 15 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుందన్నారు. ప్రజా సాధికారిత సర్వే ప్రకారం 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. కుటుంబంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 54లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నామని తెలిపారు. విద్యుత్ రంగంలో బాగా కొరత ఉండేది...ఇప్పుడు 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని పేర్కొన్నారు.

 

మల్టీ టాస్కింగ్ మగవారు చేయలేరు : పవన్

హైదరాబాద్ : భారతదేశపు మహిళల్లో నిగూఢమైన శక్తి దాగుందనీ..మన ఇంట్లోనే అమ్మను చూడండి... వంటిల్లు చక్కబెడుతుంది. పిల్లల బాధ్యత చూస్తోంది, భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఆర్థిక విషయాలను చూసుకొంటుంది. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తుంది. ఇది ప్రతి మహిళకి తెల్సిన మల్టీ టాస్కింగ్ గలిగిన మహిళలకు ఇదంతా చిటికెలో పనిగా చ చేసేస్తుంటారనీ..ఇటువంటి మల్టీ టాస్కింగ్ ఫీట్స్ పురుషులు చేయలేరని పవన్ కళ్యాణ్ వీర మహిళా విభాగం సమావేశంలో మహిళలను పవన్ ఉత్సాహపరిచారు. 

మహిళా సాధికారతకు సామాజిక మద్దతుఅవసరం : పవన్

హైదరాబాద్ : మహిళా సాధికారత రావాలి అంటే సామాజిక మద్దతు చాలా అవసరం అని 'వీర మహిళ' విభాగం సమావేశంలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్త్రీ అర్థరాత్రి ఒంటరిగా వెళ్లగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ గారు అన్నారు. ఇప్పుడు పట్టపగలు కూడా స్త్రీలు ధైర్యంగా వెళ్లలేని పరిస్థితి ఉంది. మహిళలకు కనీస భద్రత కల్పించడం అవసరం. వారి పనిని వారిని స్వేఛ్చగా చేసుకోనిస్తే చాలు. మహిళలు రాజకీయాలు, ప్రజా జీవితం, సేవా రంగంలోకి వచ్చేటప్పుడు సామాజికంగా వారికి వెన్నుదన్ను ఇవ్వాలి. ఇలా వచ్చేటప్పుడు నవ్వుతారు... నిరుత్సాహపరుస్తారు.

రాజకీయం కాదు వివేకం,విజ్ఞత గల మహిళా సేన కావాలి : పవన్

హైదరాబాద్ : జనసేన మహిళా విభాగంలో భాగం అయ్యేందుకు ఎందరో అక్కాచెల్లెళ్లు ఆసక్తి చూపిస్తుండటం సంతోషకరమైన విషయమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో ఆ పార్టీకి సంబంధించిన 'వీర మహిళ' విభాగం సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, అరుపులు కేకలు, నినాదాలతో మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, మిగిలిన పార్టీల్లా రాజకీయాలు చెయ్యక్కరలేదని, వివేకం, విజ్ఞత, సహనం ఉన్న మహిళా సేనను సిద్ధం చేసుకుందామని అన్నారు. వారికి పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, విధులపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.

సింగపూర్ నిర్మాణం సరే సింగపూర్ పాలన అనరే? : పవన్

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో ఆ పార్టీ సంబంధించిన వీర మహిళ విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు ఎప్పుడూ ‘సింగపూర్ సిటీలాంటిది నిర్మిస్తా.. సింగపూర్ తరహా నిర్మాణాలు’ అని అంటారు. అంతే తప్ప, సింగపూర్ తరహా పాలన అని మాత్రం ఆయన చెప్పరు. అక్కడ చట్టం ఎవరికైనా ఒకే రీతిలో కఠినంగా అమలవుతుంది. మహిళలకి భద్రత ఇస్తుంది. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదు. వదిలేశారు.

నిరుద్యోగ భృతికి ఏపీ కేబినెట్ ఆమోదం..

అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం పలికింది. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏపీ కేబినెట్ ఆమోదం పలికింది. దీనికి సంబంధించి ఆగస్టు 15న దరఖాస్తులకు శ్రీకారం చుట్టింది. 9 వేల టీచర్ పోస్టులతో పాటు ఇతర ఖాళీల భర్తీకి, 25వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కుప్పంలో ఏయిర్ స్ట్రిప్ నిర్మాణం, ఫిజియో థెరపిస్ట్ రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు వంటి పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

16:55 - August 2, 2018

గుంటూరు : ఏపీ కేబినేట్‌ భేటీ ముగిసింది. నిరుద్యోగ భృతికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించారు. ఆగస్టు 15 నుంచి దరఖాస్తులకు ఆహ్వానించనున్నారు. అలాగే 9వేల టీచర్‌ పోస్టులతో పాటు ఇతర ఖాళీల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 20వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కుప్పంలో ఏయిర్ స్ట్రిప్‌ నిర్మాణంతో పాటు ఫిజియో థెరపిస్ట్‌ రాష్ట్ర కౌన్సిల్‌ ఏర్పాటుకు ఆమోదతెలిపారు. మావోయిస్టులపై మరో ఏడాది పాటు నిషేధం విధిస్తూ కేబినెట్‌ నిర్ణయంతీసుకుంది. 

 

16:53 - August 2, 2018

ఆదిలాబాద్ : మంత్రి కేటీఆర్ సిర్పూర్ కాగజ్ నగర్ లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం తప్పు లేకుండానే పేపర్‌ మిల్లు ముతపడిందని అన్నారు మంత్రి కేటీఆర్‌. మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పేపర్‌ మిల్లు మూతపడిందని తెలిపారు. 

 

16:49 - August 2, 2018

ఆదిలాబాద్ : ఇంటింటికి తాగునీరు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 25  కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మరో 17.50 కోట్ల రూపాయలు బ్రిడ్జీల కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

మల్టీ టాస్కింగ్ మగవారు చేయలేరు : పవన్

హైదరాబాద్ : భారతదేశపు మహిళల్లో నిగూఢమైన శక్తి దాగుందనీ..మన ఇంట్లోనే అమ్మను చూడండి... వంటిల్లు చక్కబెడుతుంది. పిల్లల బాధ్యత చూస్తోంది, భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. ఆర్థిక విషయాలను చూసుకొంటుంది. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తుంది. ఇది ప్రతి మహిళకి తెల్సిన మల్టీ టాస్కింగ్ గలిగిన మహిళలకు ఇదంతా చిటికెలో పనిగా చ చేసేస్తుంటారనీ..ఇటువంటి మల్టీ టాస్కింగ్ ఫీట్స్ పురుషులు చేయలేరని పవన్ కళ్యాణ్ వీర మహిళా విభాగం సమావేశంలో మహిళలను పవన్ ఉత్సాహపరిచారు. 

మహిళా సాధికారతకు సామాజిక మద్దతుఅవసరం : పవన్

హైదరాబాద్ : మహిళా సాధికారత రావాలి అంటే సామాజిక మద్దతు చాలా అవసరం అని 'వీర మహిళ' విభాగం సమావేశంలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్త్రీ అర్థరాత్రి ఒంటరిగా వెళ్లగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మహాత్మా గాంధీ గారు అన్నారు. ఇప్పుడు పట్టపగలు కూడా స్త్రీలు ధైర్యంగా వెళ్లలేని పరిస్థితి ఉంది. మహిళలకు కనీస భద్రత కల్పించడం అవసరం. వారి పనిని వారిని స్వేఛ్చగా చేసుకోనిస్తే చాలు. మహిళలు రాజకీయాలు, ప్రజా జీవితం, సేవా రంగంలోకి వచ్చేటప్పుడు సామాజికంగా వారికి వెన్నుదన్ను ఇవ్వాలి. ఇలా వచ్చేటప్పుడు నవ్వుతారు... నిరుత్సాహపరుస్తారు.

రాజకీయాలు కాదు వివేకం,విజ్ఞత గల మహిళా సేన కావాలి : పవన్

హైదరాబాద్ : జనసేన మహిళా విభాగంలో భాగం అయ్యేందుకు ఎందరో అక్కాచెల్లెళ్లు ఆసక్తి చూపిస్తుండటం సంతోషకరమైన విషయమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో ఆ పార్టీకి సంబంధించిన 'వీర మహిళ' విభాగం సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, అరుపులు కేకలు, నినాదాలతో మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, మిగిలిన పార్టీల్లా రాజకీయాలు చెయ్యక్కరలేదని, వివేకం, విజ్ఞత, సహనం ఉన్న మహిళా సేనను సిద్ధం చేసుకుందామని అన్నారు. వారికి పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, విధులపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.

16:33 - August 2, 2018

'శివకాశీపురం' మూవీ టీమ్ తో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమా విశేషాలను తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

సింగపూర్ నిర్మాణం సరే సింగపూర్ పాలన అనరే? : పవన్

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో ఆ పార్టీ సంబంధించిన వీర మహిళ విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు ఎప్పుడూ ‘సింగపూర్ సిటీలాంటిది నిర్మిస్తా.. సింగపూర్ తరహా నిర్మాణాలు’ అని అంటారు. అంతే తప్ప, సింగపూర్ తరహా పాలన అని మాత్రం ఆయన చెప్పరు. అక్కడ చట్టం ఎవరికైనా ఒకే రీతిలో కఠినంగా అమలవుతుంది. మహిళలకి భద్రత ఇస్తుంది. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదు. వదిలేశారు.

16:14 - August 2, 2018

కర్నూలు : కట్టుకున్న భర్తే ...భార్య పిల్లలను ఇంటి నుండి గెంటేశాడు. దీంతో ఎక్కడికి వెళ్లాలో తెలీక ఇద్దరు చిన్నారులతో రోడ్డున పడింది ఆ మహిళ. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరి గ్రామంలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఎపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజేశ్‌ కుమార్‌... భార్య కళావతిని మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. ఎలాగైనా వదిలించుకోవాలని కళావతిని ఇంటి నుండి గెంటేశాడు. దీంతో తనకు న్యాయం చేయాలని, తన భర్త నుండి తనకు రక్షణ కల్పించాలని కళావతి కోరుతోంది.

16:01 - August 2, 2018

నిజామాబాద్‌ : జిల్లాలోని ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. అధికారుల తీరుకి నిరసనగా వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. తమ పంటలను కాపాడలంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. శ్రీరాంనగర్‌ ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేసి పంటలకు నీళ్లు అందిచాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళనపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

15:56 - August 2, 2018

అధిక బరువు తగ్గేంచుకునేందుకు మన చాలా చిట్కాలు పాటిస్తుంటాం. బరువు తగ్గించుకునేందుకు ఎవరు ఏ చిట్కా చెబితే అది పాటిస్తుంటాం. ఏ ఫుడ్ తినమని ప్రిఫర్ చేస్తే అవే తింటుంటాం. ఉదయాన్నే గోరు వెచ్చటి నీటితో తేనెను కలిపి తీసుకుంటే..ఇంకొందరు అన్నం తినడం మానేసి కేవలం పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటుంటారు. అయితే కేవలం పండ్లను జ్యూస్ లుగా మార్చి ఎక్కువ ద్రవంగా తయారు చేసిన వాటిని తాగినంత మాత్రాన బరువు తగ్గొచ్చా? అన్న ప్రశ్నకు డైటీషియన్లు అడిగితే కాదనే సమాధానమిస్తున్నారు. దీనివల్ల బరువు తగ్గకపోగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ద్రవ పదార్ధాలతో ఆరోగ్యంపై ప్రభావం..
ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏక్టివ్ గా పనిచేసేందుకు అవసరమైన శక్తి 'ఘన ఆహారం' వల్లే లభిస్తుందన్నది నిపుణులు చెబుతుఆన్నారు. అంతేతప్ప కేవలం జ్యూస్ లు, ఇతర ద్రవ పదార్ధాల వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందకుంటాపోతాయంటున్నారు. అలా చేస్తే సాయంత్రం అయ్యేసరికి అలసిపోయి నీరసించిపోతారట. అంతేకాదు ఇలా చేస్తే దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం వుంటుందంటున్నారు.

ఘనాహారంతోనే ప్రొటీన్లు, మిటమిన్లు..
ఆరోగ్యంగా ఉండేందుకు శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు, కార్పొహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా అవసరం. ఇవి ద్రవ పదార్ధాలలో అంటే పండ్ల రసాలలో లభించవు. దీంతో బీపీ తో పాటు షుగర్ స్థాయిలో పలు మార్పులు చోటుచేసుకుని జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం వంటి అనర్ధాలు జరుగుతాయట.

ఇరిటేషన్స్ తో వచ్చే ప్రమాదం..
కేవలం ఆరోగ్యమే కాకుండా..వ్యక్తిగత, వృత్తి జీవితం కూడా దీనివల్ల తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఎందుకంటే ద్రవాహారం తీసుకున్నవారిలో శరీరానికి తగిన శక్తి లభించక అలసట వచ్చేస్తుంది. దీంతో ఏ పని మీదా దృష్టి పెట్టలేకపోవడం, ప్రతి చిన్నవిషయానికి కోపంతో గట్టిగా అరవడం వంటి ఇరిటేషన్స్ కు గురై బీపీ వచ్చే ప్రమాదం వుంటుంది. దీంతో ఉద్యోగుల్లో తీటో ఉద్యోగస్తులతోను, యాజమాన్యంతోను మనస్పర్థలు వచ్చి వృత్తిపరమైన జీవితం దెబ్బతింటుంది. రోజుకు 2,500 కేలరీల ఘనాహారం తీసుకోవాలని నిపుణులు సలహా.

శరీరానికి సమతుల ఆహారం...వ్యాయామం
మన శరీరానికి రోజుకు సగటున 2,500 కేలరీల శక్తి అవసరం పడుతుంది. అయితే ఈ జ్యూస్ లతో కేవలం 800 నుంచి 1200 కేలరీలు మాత్రమే లభిస్తాయి. తగినన్ని కేలరీలు లభించకుంటే శరీరంలో జీవక్రియ నెమ్మదించడం ద్వారా నిస్తేజం అలవడిపోతుంది. జ్యూస్ ల ద్వారా బరువు తగ్గుతారనటానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డైటీషియన్లు చెబుతున్నారు. ఆకుకూరలు, పండ్లు, పీచు పదార్థాలు సమపాళ్లలో తింటూ తగిన వ్యాయామం చేయడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. పైగా ఈ విధానంలో ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని నిపుణులు హామీ ఇస్తున్నారు.

15:40 - August 2, 2018

హైదరాబాద్ : మల్టీఫ్లెక్స్, సినిమా థియేటర్లలో తూనికలు, కొలతల శాఖ దాడులు కొనసాగుతున్నాయి. థియేటర్లు, మల్టీఫ్లెక్స్ యాజమాన్యాలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. తినుబండారాలను మల్టీఫ్లెక్స్ లు, సినిమా థియేటర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. ఎమ్మార్పీ ధరల డిస్ ప్లే బోర్డులు కనిపించడం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

15:26 - August 2, 2018

మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 400 బీసీ లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడింది. మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా వినాయకుడు రచించాడని హిందువుల ప్రగాఢ నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో ప్రపంచంలోనే అతి పెద్ద పద్య కావ్యంగా చెప్పబడుతోంది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన అనే కవులు తెలుగు లోకి అనువదించారు. అంతటి పేరుగాంచిన మహాభారతంలోకి ఒక్కొక్క సందర్భం ఒక్కో కావ్యంగా రచించబడింది. ఇప్పటికే మహాభారత ఘట్టాలను కథా వస్తువులుగా మలచుకుని అనేక సినిమాలు చిత్రీకరించబడ్డాయి. ఈ నేపథ్యంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధానమైన పాత్రగా .. మహాభారతం కథావస్తువుగా ఒక సినిమాను నిర్మించనున్నారనే వార్త కొంతకాలంగా వినిపిస్తోంది.

1000 కోట్ల బడ్జెట్ తో బహు భాషా చిత్రంగా..
బీఆర్ శెట్టి దీనిని 1000 కోట్ల బడ్జెట్ తో బహు భాషా చిత్రంగా నిర్మించనున్నారనే టాక్ రావడంతో సహజంగానే అందరి దృష్టి ఈ ప్రాజెక్టు వైపుకు మళ్లింది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రముఖ రచయిత వాసుదేవ నాయర్ రాసిన 'రండా మూళమ్'అనే నవల ఆధారంగా రూపొందించనున్నారు.

'ది మహాభారత'గా పేరు మార్పు..
కాగా మలయాళంలో ఇదే టైటిల్ ను ఖరారు చేసి తెలుగు .. తమిళ .. హిందీ .. కన్నడ .. వెర్షన్స్ కి మాత్రం 'ది మహాభారత' అనే టైటిల్ పెడదామనే ఆలోచనలో వున్నట్టుగా..నటీనటులను కూడా ఆయా భాషల నుంచి ఎంపిక చేయనున్నట్టు సమాచారం. రెండు భాగాలు ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. వచ్చే జూలై నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. 2020లో మొదటి భాగాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. 

15:24 - August 2, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పర్యటన ఖరారు అయింది. ఈనెల 13, 14 తేదీల్లో రాష్ట్రంలో రాహుల్ పర్యటించనున్నారు. రెండు రోజులపాటు పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో బస్సుయాత్రలో రాహుల్ పాల్గొననున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

నిరుద్యోగ భృతికి ఏపీ కేబినెట్ ఆమోదం..

అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం పలికింది. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏపీ కేబినెట్ ఆమోదం పలికింది. దీనికి సంబంధించి ఆగస్టు 15న దరఖాస్తులకు శ్రీకారం చుట్టింది. 9 వేల టీచర్ పోస్టులతో పాటు ఇతర ఖాళీల భర్తీకి, 25వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, కుప్పంలో ఏయిర్ స్ట్రిప్ నిర్మాణం, ఫిజియో థెరపిస్ట్ రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు వంటి పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

14:48 - August 2, 2018

హిట్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ ఇప్పటికీ బిజీ బిజీగా వుంది. తేజా దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులో అరంగ్రేటం చేసిన కాజల్ అప్పటి నుండి తిరిగి చూసుకోలేదు. అగ్రకథానాయకులతోనే వరుస సినిమాలు చేస్తూ 10 సంవత్సరాల నుండి అగ్రహీరోయిన్ గా వెలుగొందుతోంది. హిట్ హీరోయిన్ గా పేరొందిన కాజల్ డేట్స్ కోసం నిర్మాతలు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో హిట్స్ లేక సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న హరో రాజశేఖర్ 'గరుడ వేగ'తో హిట్ అందుకున్నాడు. తరువాత సినిమా కూడా హిట్ కొట్టాలనే కసితో వున్నాడు. ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చినా కాజల్ స్థాయికి తగిన అవకాశాలు మళ్లీ పెరగడం .. సక్సెస్ లు పలకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా రాజశేఖర్ సినిమా కోసం ఆమెను అడిగారట. అయితే కాజల్ నుంచి నో అనే ఆన్సర్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

'గరుడవేగ' హిట్ తరువాత..మంచి కథ కోసం రాజశేఖర్ గ్యాప్ తీసుకున్నారు. 'అ!' వంటి ప్రయోగాత్మక చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న ప్రశాంత్ వర్మ, ఇటీవలే ఒక విభిన్నమైన కథకు రాజశేఖర్ కనెక్ట్ అయ్యాడట. దీంతో ఈ సినిమా చేయడానికి రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ని అడిగితే డేట్స్ లేవని చెప్పడంతో, శ్రియను ఓకే చేసినట్టుగా సమాచారం.

14:31 - August 2, 2018

మోగా స్టార్ రీఎంట్రోలో రెండవ సినిమా అయిన 'సైరా' లో హేమా హేమీ నటులు నటిస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నిర్మాణంలో వస్తున్న సైరాలో బిగ్గెస్ట్ స్టార్స్ నటిస్తున్నారు.

బిగ్గెస్ట్ స్టార్లతో సైరా..
అగ్రహీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార కథానాయికగా నటిస్తుండగా, ముఖ్య పాత్రల్లో అమితాబ్..జగపతిబాబు..సుదీప్..విజయ్ సేతుపతి నటిస్తున్నారు. వీరి వీరి పాత్రలు ఇప్పటకే ఖరారైనట్లుగా తెలుస్తున్నా..తమిళ నటుడు విజయ్ సేతుపతి పాత్రపై ఉత్కంఠ నెలకొంది. మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన విజయ్ సేతుపతికి తమిళనాట మంచి క్రేజ్ వుంది. నటుడిగా, నిర్మాతగా, పాటల రచయితగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
'ఓబయ్య' గా విజయ్ సేతుపతి..
ఈ సినిమాలో ఆయన 'ఓబయ్య' అనే తమిళుడి పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఆంగ్లేయులతో పోరాట సమయంలో తెలుగువారిని .. తమిళులని ఏకం చేయడానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ప్రయత్నంలో భాగంగా సైరా కుడిభుజంగా ఓబయ్య వ్యవహరిస్తాడని సినీ పరిశ్రమ సమాచారం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ పాత్రను తీర్చిదిద్దారని..విజయ్ సేతుపతి కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్రగా నిలిచిపోతుందని సమాచారం. 

14:18 - August 2, 2018

రీ ఎంట్రీతో వచ్చి మెగా హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి తన రెండో సినిమాను బయోపిక్ తో వస్తున్న విషయం తెలిసందే. బ్రిటీష్ వారికి ముచ్చెమటలు పట్టించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో 'సైరా' చిత్రం తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నరసింహారెడ్డిగా చిరంజీవి నటిస్తుండగా, రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అడపాదడపా చిన్నచిన్న ఆటంకాలు ఎదురవుతున్న విషయం కూడా తెలిసిందే. తాజాగా ఉయ్యాలవాడ వంశీకుల నుంచి నిరసనల పర్వం ఎదురవుతోంది.

కంటతడి పెట్టిన ఉయ్యాలవాడ వంశీకులు..
తమ వంశానికి చెందిన ఓ గొప్ప వీరుడి చరిత్రను తెరకెక్కిస్తుడటంతో ఉయ్యాలవాడ వంశీలుకు సంతోషపడుతున్నారు. కానీ తమను ఏమాత్రం గుర్తించడంలేదని ఉయ్యాలవాడ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తు..ఆవేదన వ్యక్తం చేస్తు కంటతడి పెట్టారు. తమను కర్నూలు నుంచి హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నామని... చిరంజీవి కానీ..రామ్ చరణ్ కానీ తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిరంజీవిగారు వచ్చి మాట్లాడతారని చెబుతూనే ఉన్నారని... ఇంతవరకు అది జరగలేదని వాపోయారు. 

13:33 - August 2, 2018

నిజామాబాద్ : మానవత్వం రాను రాను మంటగలుస్తోంది. మగవారు ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కన్న తల్లిదండ్రులు అని కూడా చూడడం లేదు. నిర్ధాక్షిణంగా వేధిస్తుండడం..ఇంటి నుండి బయట గెంటి వేయడం ఘటనలు చూస్తునే ఉంటాం. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. తల్లిని కొట్టి ఓ కసాయి కొడుకు ఇంటిని రిజిస్త్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం ఆ తల్లిని నిర్దాక్షిణంగా ఇంటి నుండి బయటకు గెంటేశాడు. దిక్కుతోచని ఆ తల్లి నెల రోజులుగా భిక్షాటన చేస్తూ రోడ్డు పక్కన పడుకొంటోంది. ఈమె పడుతున్న బాధను చూసిన కొంతమంది చలించిపోయారు. వృద్ధురాలికి న్యాయం చేయాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు. వెంటనే ఆ కసాయి కొడుకును అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 

సొరంగంలో వ్యభిచార విక్రయ చిన్నారులు..

యాదాద్రి : వ్యభిచార దందాలతో నిండిపోయిన యాదగిరిగుట్ట ప్రక్షాళనలో భాగంగా పోలీసులు వరుసగా మూడో రోజూ తనిఖీలు చేపట్టారు. నేటి తనిఖీల్లో భాగంగా ఓ ఇంట్లో నలుగురు బాలికలు పట్టుబడ్డారు. ఇదే ఇంటిలో రెండు రోజుల క్రితం కూడా తనిఖీలు చేసినప్పుడు పట్టుబడని బాలికలు మూడోరోజు తనిఖీల్లో బైటపడటంతో పోలీసులు సైతం విస్తుపోయారు. కానీ పక్కా సమాచారంతో మరోసారి దాడికి వెళ్లిన పోలీసులకు గదిలోని మంచం కింద గోడను తొలుస్తూ మూడు అడుగుల వెడల్పుతో ఉన్న సొరంగంలో బాలికలను దాచారని గుర్తించి ఆశ్చర్యపోయారు.

13:26 - August 2, 2018

శ్రీకాకుళం : రాజకీయ అగ్రనేతలంతా శ్రీకాకుళం ప్రజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్.. వెనువెంటనే జేడీ లక్ష్మీనారాయణ, ఆ తర్వాత బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ.. ఆపై వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి.. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు.. సిక్కోలులో చక్కర్లు కొడుతున్న నేతల తీరుపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం.. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు కాక మీదున్నాయి. రాజకీయ పార్టీల అగ్రనేతలంతా ప్రజల ముందు బారులు తీరుతున్నారు. నేతల వరుస పర్యటనలు, ముందస్తు ప్రణాళికలతో రాజకీయ వేడి రాజుకుంటోంది. రాజకీయ నేతల విన్యాసాలకు సిక్కోలు వాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. నాయకులు సుడిగాలి పర్యటనల్లో స్థానిక సమస్యల్నే ప్రధాన ఎజెండాగా చేసుకోవడం గమనార్హం.

జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చాపురం నుంచి ఎచ్చర్ల వరకూ నిరసన పోరాట యాత్ర చేశారు. ఏ పార్టీ జెండా లేకుండానే మాజీ ఐ.పి.ఎస్. అధికారి జేడీ లక్ష్మీనారాయణ 3 రోజులు పర్యటించారు. ఏపీలో బీజేపీ పగ్గాలు చేపట్టిన కన్నా లక్ష్మినారాయణ సైతం ఇక్కడ నుంచే పర్యటనలు ప్రారంభించారు. ఇక వైసీపీ కూడా సమస్యలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వంపై విమర్శల దూకుడు పెంచింది. సమన్వయకర్తల మార్పు, కన్వీనర్ల పనితీరు మెరుగుపరచడంలో భాగంగా విజయసాయిరెడ్డి పర్యటించారు. ఆగస్టులో జగన్ జరిపే ప్రజా సంకల్ప యాత్రను విజయవంతం చేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి వీరంతా ఈ పర్యటనల్లో చేరికలు, గెలుపోటములపై సమీక్షలు జరిపారు.

నేతలంతా అధికార పార్టీనే టార్గెట్‌ చేస్తుండడంతో.. సీఎం చంద్రబాబు సైతం శ్రీకాకుళం జిల్లా నుంచే విపక్షాల తీరును ఎండగట్టారు. 3 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 10 అసెంబ్లీ స్థానాలు, మరో పార్లమెంట్ స్థానంలో బలంగా ఉన్నామంటున్న టీడీపీ నేతలపై ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. ఐక్యంగా పనిచెయ్యాలంటూ చంద్రబాబు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. అన్ని పార్టీల అగ్రనేతలు సిక్కోలులో సుడిగాలి పర్యటనలు చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ప్రెస్ మీట్‌లకే పరిమితమవుతోంది. జిల్లాలో ప్రధాన సమస్యలపై వామపక్షాలు సైతం ఉద్యమిస్తుంటే.. కాంగ్రెస్ కేడర్ కోసం వెదుకులాడుతోంది. మొత్తానికి రాజకీయ నాయకులంతా పర్యటనలతో హడావిడి చేస్తుంటే.. ప్రజలు మాత్రం మౌనంగా గమనిస్తున్నారు. 

ఫిలిం థియేటర్ల దోపిడీపై అధికారుల తనిఖీలు..కేసులు

హైదరాబాద్ : సినిమాహాల్స్, మల్టీ ప్లెక్సుల్లో తినుబండారాల దోపిడీ యదేచ్ఛగా కొనసాగిపోతోంది. వీటిపై స్పందించిన తెలంగాణ సర్కారు ఆదేశించినా వినని థియేటర్లపై చర్యలు ప్రారంభం అయ్యాయి. ఆగస్టు 1 నుండి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయనీ వీటిని అధిగమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అకున్ సబర్వాల్ వార్నింగ్ లను కూడా మల్టీప్లెక్స్ యాజమాన్యం పట్టించుకోవటం లేదు. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు లీగల్ మెట్రాలజీ అధికారులు, సాధారణ సినీ ప్రేక్షకుల మాదిరిగా థియేటర్లలోకి వెళ్లి తనిఖీలు చేపట్టారు.

13:20 - August 2, 2018

హైదరాబాద్ : నగరంలో పలు మల్టీప్లెక్స్ లు..సినిమా థియేటర్ లలో తినుబండారాలు, ఇతర ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయించవద్దు...అని తెలంగాణ తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే అశోక్‌నగర్‌లోని లీగల్ మెట్రాలజీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ తూనికలు..కొలతలు శాఖ హెచ్చరించినా యాజమాన్యాలు స్పందించలేదు. యదావిధిగా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. గురువారం శాఖాధికారులు జీవీకే 1లో దాడులు చేశారు. ఈ దాడుల్లో విస్తుపోయిన వాస్తవాలు వెలుగు చూశాయి. ఐదు తినుబండారాల పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. 200 ఎంఎల్ సాప్ట్ డ్రింక్ బాటిల్ లో కేవలం 150 ఎంఎల్ మాత్రమే కూల్ డ్రింక్ ఉన్నట్లు గుర్తించారు. అంతేగాకుండా కూల్ డ్రింక్ ధర రూ. 20 ఉంటే ఇక్కడ మాత్రం రూ. 100 విక్రయిస్తున్నారని వెల్లడైంది. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కరుణకు కేరళ సీఎం పినరాయి పరామర్శ..

తమిళనాడు : కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని కేరళ సీఎం పినరాయి విజయన్ పరామర్శించారు. కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడిందని  పినరాయి తెలిపారు. 

నెగ్గిన అవిశ్వాసం..పదవి కోల్పోయిన లక్ష్మీనారాయణ..

పెద్దపల్లి : రామగుండం మేయర్ లక్ష్మీనారాయణ అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. మేయర్ లక్ష్మీనారాయణ కు వ్యతిరేకంగా కార్పొరేటర్లు ఓట్లు వేశారు. దీంతో లక్ష్మీనారాయణ మేయర్ పదవిని కోల్పోయారు. మరి కాసేపట్లో డిప్యూటీ మేయర్ పై అవిశ్వాసం తీర్మానాన్ని కార్పొరేటర్లు ప్రవేశపెట్టానున్నారు. 

తెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్వే లైన్లు..లోక్ సభ ఆమోదం..

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 200 కొత్త రైల్వే లైన్లను ప్రకటించనున్నట్టు ప్రభుత్వం నేడు లోక్ సభకు తెలిపింది. కొత్త రైల్వే లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని రైల్వే శాఖ సహాయమంత్రి రాజన్ గోహెన్ లోక్ సభలో తెలిపారు. ఇవి పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రివర్గ శాఖల నుంచి కొన్ని అనుమతులు రావాల్సి వుందని తెలిపారు. భూ సేకరణ, అటవీ, వన్యప్రాణి, పర్యావరణ వంటి చట్టపరమైన అడ్డంకులు కొన్ని ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజన్ గోహెన్ వెల్లడించారు.

12:52 - August 2, 2018

విశాఖపట్టణం : ప్రముఖ దర్శకుడు 'రాజమౌళి' దంపతులు గురువారం జిల్లాకు చేరుకున్నారు. కసింపేటకు చేరుకున్న వారు డీపీఎన్ జడ్పీహెచ్ హై స్కూల్ ను రాజమౌళి దంపతులు ప్రారంభించారు. హుదూద్ తుఫాన్ లో శిథిలమైన ఈ పాఠశాల భవనాన్ని స్వయంగా 'రాజమౌళి' వారి అమ్మగారి పేరిట రూ. 40 లక్షలు వెచ్చించి పునర్ నిర్మించారు. 

కసింకోటలో రమా,రాజమౌళి సందడి..

విశాఖపట్నం : కసింకోటకు వచ్చిన రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి అక్కడి ప్రజలు, అభిమానులు, చిన్నారులతో కాసేపు సందడి చేశారు. తన తల్లి పేరిట నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించేందుకు రాజమౌళి దంపతులు రాగా, స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వారికి స్వాగతం పలికారు. 

12:47 - August 2, 2018

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు 'కమల్ హాసన్' హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన నటించిన 'విశ్వరూపం 2' త్వరలో విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఆయన హైదరాబాద్ కు వచ్చారు. గురువారం ముంబై నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు రానా, హీరోయిన్ పూజలున్నారు. వీరికి దర్శకుడు జిబ్రాన్, మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ స్వాగతం పలికారు. అనంతరం పార్క్ హయత్ హోటల్ కు వెళ్లారు. 

సిద్ధిపేటలో కేంద్రీయ విశ్వవిద్యాలయం..

ఢిల్లీ : దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలుపగా, ఆ జాబితాలో తెలంగాణలోని సిద్ధిపేట కూడా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంతో మెదక్, సిద్ధిపేట జిల్లా వాసుల నాణ్యమైన విద్యా కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది.

12:43 - August 2, 2018

హైదరాబాద్ : నీళ్ళు, నిధులు, నియామకాల డిమాండ్‌తో ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న... ముఖ్యమంత్రి హామీ మాటలకే పరిమితమైంది. ఇప్పటికీ 40వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకపోవడం దారుణం. TSPSC నుంచి భవిష్యత్తులో కూడా పెద్దగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

ప్రత్యేక రాష్ర్టంలో ఖాళీ పోస్టులన్నీ భర్తీ అవుతాయని ఆశించారు నిరుద్యోగులు. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా మారింది. టీఎస్‌పిఎస్‌సి ఏర్పాటుతో నియామకాలు చకచకా జరుగుతాయని ఎదురు చూశారు. కాగా.. సుమారు 36 వేల 76 పోస్టుల భర్తీకి 93 నోటిఫికేషన్లు మాత్రమే విడుదల అయ్యాయి. అందులోనూ కొన్ని పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వాటిలో ఎక్కువ ఉద్యోగాలు టీచర్లకు సంబంధించినవే.

ఎక్కువ సంఖ్యలో భర్తీ చేసిన పోస్టులు ఇంజినీరింగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవే. కేవలం సాధారణ డిగ్రీతో వేసిన పోస్టులు గ్రూప్ -2 తప్ప పెద్దగా లేవు. దీనికితోడు గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంకా కోర్టులోనే ఉండిపోయింది. అది ఎప్పటికి తేలుతుందో కూడా తెలియదు. కాగా పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టింది మాత్రం కేవలం 12వేల 749 మాత్రమే. ఫలితాలు విడుదలై ప్రాసెస్‌లో వున్నవి 20వేల 360 పోస్టులున్నాయి. అసలు టిఎస్‌పిఎస్‌సి దగ్గర నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఉద్యోగాలే లేకపోవడం విశేషం. ఒకవేళ నోటిఫికేషన్లు వచ్చినా మహా అయితే ఒకటి అరా రావొచ్చేమో గాని అంతకు మించి అవకాశం కనిపించడం లేదు. ప్రత్యేక రాష్ర్టంలో ఉద్యోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగుల ఆశ అడియాశ గానే మిగిలిపోనుంది. 

వ్యభిచార చట్టాన్ని సవరించలేం : సుప్రీంకోర్టు

ఢిల్లీ : వ్యభిచారం చేస్తూ పట్టుబడే మహిళలను కేవలం బాధితులుగానే పరిగణిస్తామని, వారిపై కేసులు పెట్టి నిందితులుగా చూపించాలన్న ఆలోచన తమకు లేదని సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. వ్యభిచార చట్టాన్ని తాకాలన్న ఉద్దేశంగానీ, సవరణలు చేయాలన్న ఆలోచనగానీ తమకు లేదని పేర్కొంది. వ్యభిచార చట్టాన్ని, లింగ సమానత్వ చట్టాన్ని ఒకటిగా చూడలేమని తెలిపింది.

12:41 - August 2, 2018

హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖలో మరో కొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టారు. ఫేషియల్ రికిగ్నిషన్ టెక్నాలజీని డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం దీనికి సంబంధించిన వివరాలు డీజీపి తెలియచేశారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీకి సంబంధించిన ప్రజెంటేషన్ ఇచ్చారు. నేరస్తులందరనీ ఈ విధానం ద్వారా అనుసంధానం చేయనున్నట్లు డీజీపీ తెలిపారు. టెక్నాలజీ విస్తారంగా ఉపయోగించుకుని, కేసుల దర్యాప్తులో నైపుణ్యం పెంచుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నేరం చేస్తే పట్టుబడుతామని..దొరికిపోతామని..శిక్షలు పడుతాయని భావించడానికి కొత్త కొత్త విధానాలను అవలింబిస్తున్నట్లు వెల్లడించారు. నేర రహిత సమాజం నెలకొల్పడానికి టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తామన్నారు. పోలీసులకు ఇందులో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.

ఈ సిస్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పీఎస్ లో అరెస్టు అయిన నేరస్తుల వివరాలను అన్నీ నిక్షిప్తమౌతాయి. నేరాలు ఎక్కువ చేసిన వారి ఫొటోలు పొందుపరిచారు. అదృశ్యమైన కేసులను పరిష్కరించడానికి ఆయా పోలీసులకు అవుట్ లుక్ పోస్టులు పంపించనున్నారు. నేరస్తుల ఫొటో తీసుకుని అప్ డేట్ చేస్తే సమాచారం వెంటనే ఇచ్చేస్తుంది. 

12:35 - August 2, 2018

ఢిల్లీ : టిడిపి ఎంపీ శివప్రసాద్..వినూత్నంగా నిరసన తెలపడంతో ఆరితేరిన వ్యక్తి. విభజన హామీలు..ప్రత్యేక హోదా..రైల్వే జోన్..కడప ఉక్కు ఫ్యాక్టరీ తదితర అంశాలపై కేంద్ర నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పార్లమెంట్ వేదికగా ఆయన వినూత్న వేషధారణలో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశంలో ఏపీ టిడిపి ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. గురువారం శివ ప్రసాద్ మాయల ఫకీరు వేషం వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. గొప్ప మాయల ఫకీరు ఈ పార్లమెంట్ లో ఉన్నాడని..మాయల ఫకీరుకు ఉండాల్సిన లక్షణాలన్నీ మోడీకి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 

12:32 - August 2, 2018

పెద్దపల్లి : రామగుండం మేయర్ అవిశ్వాసం నెగ్గుతారా ? ఓడిపోతారా ? అనే ఉత్కంఠకు తెరపడింది. మేయర్ లక్ష్మీనారాయణపై అవిశ్వాసం నెగ్గింది. దీనితో ఆయన మేయర్ పదవి కోల్పోయారు. మేయర్ కు వ్యతిరేకంగా కార్పొరేటర్లు ఓటు వేశారు. అనంతరం డిప్యూటి మేయర్ పై అవిశ్వాసం కొనసాగనుంది. ఇక మేయర్ పదవి ఎవరు చేజిక్కించుకోవాలనే దానిపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. ఇందుకు కాంగ్రెస్..టీఆర్ఎస్ మధ్య ఒక లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మేయర్ పదవి టీఆర్ఎస్..డిప్యూటి మేయర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు తీసుకోవాలనే ఒప్పందం కుదిరినట్లు సమాచారం. విప్ ను ధిక్కరించి ఓటు వేసిన పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ లక్ష్మినారాయణ మధ్య కొనసాగిన ఆధిపత్య పోరు అవిశ్వాస తీర్మానానికి తెరలేపింది. కాంగ్రెస్ కార్పొరేటర్లతో అవిశ్వాసం నెగ్గొచ్చని భావించిన ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వర్గానికి కాంగ్రెస్ అధిష్టానం విప్‌ జారీతో ఝలక్‌ ఇచ్చింది. పరాకాష్టకు చేరింది. తనకు కొరకరాని కొయ్యగా మారిన మేయర్‌ను కొనసాగించడం మంచిది కాదని భావించిన ఎమ్మెల్యే అవిశ్వాస అస్ర్తాన్ని ఎక్కుపెట్టారు. ఇందుకు కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్ల మద్దతు కూడగట్టుకొని కలెక్టర్‌కు తీర్మాన పత్రాన్ని అందచేశారు. టీఆర్ఎస్‌ పార్టీ తమ 13 మంది కార్పొరేటర్లకు తోడు.. మేయర్ లక్ష్మినారాయణతో పాటు మరో 14 మంది స్వతంత్ర కార్పొరేటర్ల మద్థతుతో.. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

రామగుండం కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. టీఆర్ఎస్‌కు 13, కాంగ్రెస్‌కు 20, ఇండిపెండెట్లు 15, బీజేపీకి 2 చొప్పున గెలుపొందారు. వీరిలో 9 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు.. 15 మంది ఇండిపెండెంట్లు టీఆర్ఎస్‌ గూటికి చేరారు. కాగా 50 మంది కార్పొరేటర్లలో 39 మంది అవిశ్వాసానికి సిద్దమయ్యారు. కాంగ్రెస్‌లో మిగిలిన 11 మంది కార్పొరేటర్లలో 8 మంది అవిశ్వాసానికి మద్థతునిస్తూ క్యాంపులకు తరలి వెళ్లారు. 

12:26 - August 2, 2018

విజయవాడ : తాను చినప్పటి నుండి తన కుటుంబసభ్యులతో మెలగడం జరిగిందని, అందువల్ల మహిళల బాధల తెలుసని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భూ సేకరణ చట్ట పరిరక్షణ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహిళలకు కనీస భద్రత ఇవ్వాలని...బయటకు వెళితే భద్రత ఉందా అని ప్రశ్నించారు. చిన్న తనంలో తల్లులు ఇంటిని ఎలా నడిపారో తెలిసేదని..మహిళల్లో నిగూఢమైన శక్తి ఉందని..మహిళలను ఇబ్బంది పెట్టకుండా ఉంటే అన్నీ సవ్యంగా జరుగుతాయన్నారు. 

పెద్ద మాయల ఫకీరు మోదీ : ఎంపీ శివప్రసాద్

ఢిల్లీ : విచిత్ర వేషధారణలతో ఎంపీ శివప్రసాద్ ఏపీ సమస్యలను, కష్టాలను ప్రతిబింభిస్తు తన నిరసనలను తెలియజేస్తుంటారు. ఈ క్రమంలో ఈరోజు మాయల ఫకీరు వేషయంలో పార్లమెంట్ కు వచ్చిన ఎంపీ శివప్రసాద్ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్నారు. నాకంటే పెద్ద మాయల ఫకీరు నరేంద్రమోదీ పార్లమెంట్ లో వున్నారంటు ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు. 

24 అంశాలతో కేంద్రానికి యనమల లేఖ..

అమరావతి : మొత్తం 24 అంశాలతో కూడిన వినతులతో మంత్రి యనమల కేంద్రానికి లేఖ రాసారు. టీటీడీ సేవలు, ప్రసాద విక్రయాలను జీఎస్టీ నుండి మినహాయించాలని, చేనేత వస్త్రాలు, చింతపండు, ఫైర్డ్ గ్రామ్స్, వేస్ట్ ప్లాస్టిక్, నార, నార ఉత్పత్తులు, రైస్ బ్రాన్ వంటి పలు ఉత్పత్తులను జీఎస్టీ నుండి మినహాయించాలని యనమల రాసిన లేఖలో కేంద్రాన్ని కోరారు. వంట పాత్రలు, ట్రాక్టర్లు, ట్కార్టర్ల స్పేర్ పార్ట్ లు, జరీ వస్త్రాలు, ఉన్ని దుస్తులు, నాపరాళ్లు వంటి వాటిని 5 శాతం జీఎస్టీ శ్లాబ్ లోకి తేవాలని లేఖలో కేంద్రాన్ని మంత్రి యనమల కోరారు.

నిందితులపై చట్టపరమైన చర్యలు : ఐజీ గోపాల్ రావు

నెల్లూరు : రావూరు ఎస్సైని ఐజీ గోపాల్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతు..రావూరు పోలీస్ స్టేషన్ పై దాడి సరైందికాదన్నారు. రక్షణ కల్పించే పోలీసులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఐజీ గోపాల్ రావు తెలిపారు. ఈ దాడిలో 50మందికి పైగా పాల్గొన్నట్లుగా గుర్తించామని..ఎస్సై పనితీరు బాగోలేదనటం సరికాదని ఐజీ పేర్కొన్నారు. కాగా రాజేష్ అనే వ్యక్తి మద్యం సేవించడంతో విచారణ సమయంలో ఎస్ఐ కొట్టారని మరో వాదన వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది.

పోలవరంతో భద్రాచలానికి ముప్పు..

భద్రాద్రి : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలంతో పాటు బొగ్గు గనులున్న ప్రాంతాలకూ ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ సర్కారు, ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసింది. ఈ సమస్య తొలగాలంటే, సమగ్ర సర్వే చేపట్టాలని, ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలియజేయాలని సుప్రీం ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ వైద్యనాథన్ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు.

11:28 - August 2, 2018

ఢిల్లీ : భారత రాజ్యాంగంలో స్త్రీ, పురుషులు ఇరువురికి సమాన హక్కులను కల్పించింది. చదువు, సమాన జీవనం, హక్కులు వంటి పలు అంశాలలో సమాన హక్కులను కల్పించింది. కానీ రాజ్యాంగంలో న్యాయం వుంటుంది. కానీ సంప్రదాయంలో న్యాయం వుండదు. ఈ క్రమంలోనే న్యాయం వేరు, సంప్రదాయం వేరు అంటు మహిళలకు కొన్ని ఆలయాలలోకి నిషేధం విధించారు. న్యాయం అయినా..సంప్రదాయం అయినా మనుషులు సృష్టించుకున్నవే.. కల్పించుకున్నవే. కానీ భారతదేశంలో మాత్రం కొన్ని ఆలయాలలోకి మహిళలను నిషేధించటంపై కొందరు హేతువాదులు, మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగంలోని హక్కుల ప్రకారం పురుషులతో సమానంగా స్త్రీలకు అన్ని హక్కులు వున్నాయనీ..నిషేధం వంటివాటిని సహించేది లేదని నినదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయం, శని సింగనాపూర్ లోని శనీశ్వరుని ఆలయం వంటి కొన్ని ఆలయాలలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలంటు కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

శతాబ్ధాలుగా శనీశ్వరిని ఆలయంలో మహిళల నిషేధం..
ని శింగనాపూర్‌లో స్వయంభూగా వెలసిన శనీశ్వరుని నల్లటి రాతి విగ్రహం ఉన్న చోట పూజలకు కేవలం మగవారిని మాత్రమే అనుమతిస్తారు. శతాబ్ధాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. గత ఏడాది నవంబర్‌లో ఓ మహిళ గట్టుపైకి ఎక్కి విగ్రహానికి అభిషేకం చేయడం కలకలం రేపింది. అనంతరం ఆలయ నిర్వాహకులు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించడం వివాదస్పదమైంది. దీనికి నిరసనగా మహిళా వివక్షపై పోరాడుతున్న భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ వందలాది మహిళలతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసున్నారు. ముఖ్యమంత్రి తన భార్యతో కలిసి శని ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించి మహిళల పక్షాన నిలవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ముస్లిం సంప్రదాయంలో దర్గాలలోకి కూడా మహిళలను రానివ్వని విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ముస్లిం మహిళల్లో కూడా చైతన్యం కలిగి దర్గాలలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని అక్కడక్కడా పోరాటాలు చేస్తున్నారు. ఇక పోతే అయ్యప్ప స్వామి ఆలయం..

మహిళల నిషేధం అంటరానితనం కాదా?..
కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రత్యేకంగా ఓ వయోవర్గానికి చెందిన మహిళలకు మాత్రమే ఆలయ ప్రవేశం వుంటుంది. దీనిపై మహిళలకు ప్రవేశం కల్పించాలంటు గత కొంతకాలంగా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతందో. ఈ నిషేధం మహిళల హక్కులను నిరాకరించడం పలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడంతో పాటు అంటరానితనం కిందకూ వస్తుందన్నారు.

ఆలయంలో పూజలు మహిళల రాజ్యాంగ హక్కు : సుప్రీంకోర్టు
కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించి, పూజలు చేసుకోవడం మహిళల రాజ్యాంగ హక్కు అనీ, ఈ విషయంలో లింగ వివక్షకు తావులేదని సుప్రీంకోర్టు విస్పష్టం చేసింది. రుతుస్రావం కారణంగానూ వివక్ష కారణంగా 10,50 మధ్య వయసు బాలికలు, మహిళలకు ఆలయ ప్రవేశాన్ని నిషేధిస్తూ సదరు దేవస్థానం తీసుకున్న నిర్ణయంపై భారత యువ న్యాయవాదుల సంఘం తదితర పార్టీలు దాఖలుచేసిన వ్యాజ్యం విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన రాజ్యంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘‘పురుషుడు ఆలయంలోకి వెళ్లగలిగినప్పుడు… మహిళ కూడా వెళ్లగలుగుతుంది. రాజ్యంగంలోని ఆర్టికల్‌ 25, 26 ప్రకారం పురుషులకు వర్తించేవన్నీ మహిళలకు కూడా వర్తిస్తాయి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మహిళలకు ఆలయ ప్రవేశంపై ప్రభుత్వం మద్దతు..కోర్టు వ్యాఖ్యలు..
మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించేందుకు మద్దతు పలుకుతూ కేరళ ప్రభుత్వం 2015లో సుప్రీంకు తొలి అఫిడవిట్‌ను దాఖలుచేసింది. దానికి విరుద్ధమైన అభిప్రాయం వ్యక్తంచేస్తూ 2017లో ఇంకో అఫిడవిట్‌ను సమర్పించింది. దీంతో ఇదేమిటని ధర్మాసనం ప్రశ్నించగా, తొలి అఫిడవిట్‌కే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ రాష్ట్రం తరఫు న్యాయవాది సమాధానమిచ్చారు. దీంతో ‘సమయానుకూలంగా మారిపోతున్నారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సుప్రీంకోర్టుతో భేష్' అనిపించుకు న్యాయవాది దీపక్ ..
కేరళలోని పరమ పవిత్ర శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు ప్రవేశం కల్పించాలా? వద్దా? అన్న విషయమై, సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన హైదరాబాద్ న్యాయవాది సాయి దీపక్, ధర్మాసనంతో 'భేష్' అనిపించుకున్నారు. తనను తాను దేవుడి తరఫు న్యాయవాదిగా ప్రకటించుకున్న న్యాయవాది దీపక్ 10 నిమిషాల సమయం ఇచ్చిన ధర్మాసనం సమయం ప్రకారం తన వాదనలను వినిపించాడు. తన వాక్పటిమ, లాజిక్ తో సాయి దీపక్ వాదన రెండు గంటల పాటు సాగింది. ఆయన వాదన జ్ఞాన బోధకంగా ఉందని న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారిమన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

దేవుడికి వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ వున్నాయి: దీపక్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ఆలయ యజమాని అయిన దేవుడికి, తన ఇంట్లో వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ వున్నాయని, నైష్ఠిక బ్రహ్మచర్యాన్ని కాపాడుకోవడం అందులో భాగమేనని దీపక్ వాదించారు. దేవుడు కూడా న్యాయబద్ధమైన వ్యక్తిగా గతంలో కోర్టు గుర్తించిందని గుర్తు చేశారు. మహిళల హక్కుల సంగతి సరే..మరి దేవుడి విశ్వాసాలకు విలువ లేదా? ఆయనకూ హక్కులన్నీ ఉంటాయి. బ్రహ్మచారిగా ఉండే హక్కు ఆయనకుంది. దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆలయానిదే" ననీ..రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) కింద ప్రజలకు తమ ధర్మాన్ని పాటించే హక్కు ఉన్న విధంగానే, దేవుడికి కూడా తన ధర్మాన్ని పాటించే స్వేచ్ఛ ఉందన్న దీపక్ వాదన సాక్షాత్తు ధర్మాసనంతో సహా అందరినీ ఆకట్టుకుంది.
ఏడు రోజుల్లోగా వాదనను తెలిపాలి : సుప్రీం
ఆపై కేసుకు సంబంధించిన వాదనలు పూర్తయ్యాయని చెప్పిన ధర్మాసనం, ఉభయపక్షాల న్యాయవాదులు మరేదైనా చెప్పాలనుకుంటే, ఏడు రోజుల్లోగా తమ వాదనను సంక్షిప్తంగా తెలియజేయాలని ఆదేశిస్తూ, తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఇలా వుంటే మహిళలకు ఆలయం ప్రవేశం రాజ్యాం హక్కుగా స్పష్టం చేసిన దేశ అత్యున్నత న్యాయం అయిన సుప్రీంకోర్టు దీపక్ వాదనలను ప్రశంసిచంతో మరోసారి మహిళా హక్కులు డైలమాలో పడ్డాయి. దీనిపై అటు మహిళా హక్కుల్ని, మరోపక్క న్యాయాన్ని పరిరక్షించాల్సిన బాద్యతపై సుప్రీంకోర్టు స్పష్టతనివ్వాల్సిన అవసరముంది.  

11:09 - August 2, 2018
11:08 - August 2, 2018

ఢిల్లీ : విభజన హామీలు..ప్రత్యేక హోదా..రైల్వే జోన్..ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం నిర్లక్ష్యం వహింస్తుండడంపై పార్లమెంట్ లో టిడిపి ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుండి వారు పలు విధాలుగా ఆందోళన చేపడుతున్నారు. టిడిపి ఎంపీ శివప్రసాద్ రోజుకో వేషధారణ ధరిస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం 'మాయల ఫకీరు' వేషంలో వచ్చిన శివప్రసాద్ కేంద్రంపై పలు విమర్శలు గుప్పించారు. 'తన కన్నా పెద్ద మాయల ఫకీరు పార్లమెంట్ లో ఉన్నారు' అంటూ ప్రధాన మంత్రి మోడీపై సెటైర్లు వేశారు.

ఇదిలా ఉంటే టిడిపి ఎంపీలు..కడప జిల్లా ప్రతినిధులు బుధవారం రాష్ట్రపతితో భేటీ అయిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో భేటీ అయ్యారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకొనేలా చొరవ తీసుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కోరారు. కడప స్టీల్ ప్లాంట్ పై ఉప రాష్ట్రపతికి వినతిపత్రం అందచేశారు. 

10:32 - August 2, 2018

విజయవాడ : ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

నిరుద్యోగ భృతి : - అందులో ప్రధానంగా యువత నిరుద్యోగ భృతి అంశం ఉంది. దీనిపై విధి విధానాలను నిర్ణయించనున్నారు. యువ సాధికారిక నిరుద్యోగ భృతి పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. యువతకు ఆన్‌లైన్‌లో నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఈ భృతి అందించనున్నారు. దీని కోసం ఏడాదికి 1470 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించనుంది.

సాగునీటి ప్రాజెక్టులు : - సాగునీటి ప్రాజెక్టులపై కూడా చర్చించనుంది. అనుమతులతో పాటు... పర్యాటక ప్రాజెక్టులకు పాలనాపరమైన అనుమతులివ్వనున్నారు. రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే సాగునీటి ప్రాజెక్టులకు ఈ కేబినెట్‌ సమావేశంలో పాలనాపరమైన అనుమతులు ఇచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

వర్షాభావం..కరువు మండలాలు : - రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం.. కరవు మండలాలను గుర్తించడం..ఎలాంటి సహాయక సహాకారాలు అందచేయాలనే దానిపై చర్చించనున్నారు.

కాలుష్యం : - రాష్ట్రంలో వాహనాల పొల్యూషన్‌ను తగ్గించే అంశంపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని, దీనికి అనుగుణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల విధానం ముసాయిదాలో మార్పులు, చేర్పులపై కేబినెట్‌లో చర్చించనున్నారు.

రైతాంగం : - ఖరీఫ్ సీజన్ లో రైతాంగాన్ని ఎలా ఆదుకోవాలి ? రైతులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ? తదితర అంశాలపై చర్చించనున్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి : - రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా గాడిలో పెట్టాలని...ఆదాయం ఏ విధంగా పెంచుకోవాలి ? అన్ని వర్గాలను ఎలా సంతృప్తి పరచాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. 

ఓ ఇంట్లో 4 మృత దేహాల కలకలం..

కేరళ : ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11మంది సామూహిక ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి. అనంతరం జార్ఖండ్ లో ఒకే కుటుంబానికి చెందిన 7గురు ఆత్మహత్యలకు మరోసారి దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఇప్పుడు తాజాగా కేరళలోని ఇడుక్కిలోని ఓ ఇంటి ఆవరణలోని గుంతలో 4 మృతదేహాలు మరోసారి కలవర పెడుతున్నాయి. ఇడుక్కిడిలోని ఓ ఇంటి ఆవరణలో వున్న గుంతలో నాలుగు మృతదేహాలను గుర్తించారు. ఘటనాస్థలంలో వున్న సుత్తి, కత్తులను పోలీసలు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ మృతదేహాలు ఎవరివి? వీరిది హత్యా? ఆత్మహత్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 

కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం..

అమరావతి : సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశంకానుంది. ఈ సమావేవంలో నిరుద్యోగ భృతికి ఆమోదం తెలపనున్నారు. వర్షాభావ పరిస్థితులు, కరవు మండలాలను ముందుగానే గుర్తింపు, సాగునీటి ప్రాజెక్టులకు పాలనా అనుమతులు, పలు సంస్థలు, ఏపీఐఐసీకి భూ కేటాయింపులు వంటి పలు అంశాలపై కేబినెట్ సమావేశం చర్చించనుంది. మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా ఈ సమావేశం తీసుకోనున్నట్లుగా సమావేశం. 

10:24 - August 2, 2018
10:23 - August 2, 2018

ఢిల్లీ : కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకొనేలా చొరవ తీసుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కోరినట్లు ఏపీ టిడిపి ఎంపీ రమేశ్ పేర్కొన్నారు. గురువారం ఉదయం వెంకయ్య నాయుడిని ఏపీ టిడిపి ఎంపీలు, కడప జిల్లా ప్రజాప్రతినిధులు కలిశారు. కడప స్టీల్ ప్లాంట్ పై ఉప రాష్ట్రపతికి వినతిపత్రం అందచేశారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతిని వీరు కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ...ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ తాను దీక్ష చేయడం జరిగిందని, కానీ కేంద్రం స్పందించలేదని ఉప రాష్ట్రపతికి తెలియచేసినట్లు తెలిపారు. దీనితో ముఖ్యమంత్రి వచ్చి కొన్ని ఆప్షన్ వెల్లడించారని, కానీ ఉభయసభల్లో కేంద్రం ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పేర్కొన్నట్లు తెలిపారు. 

సరోజీనీదేవి ఆసుపత్రి వద్ద కొకైన్ విక్రయం..ఇద్దరు అరెస్ట్..

హైదరాబాద్ : సరోజీనీదేవి కంటి ఆసుపత్రి వద్ద కొకైన్ విక్రయం కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని గమనించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సయీద్, కౌస్తబ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని గోల్కొండ్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. వారి వీరిద్దరిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. వారి వద్దనుండి 15 గ్రాములు కొకైన్, 80 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న కౌస్తబ్ ఈ గంజాయి, కొకైన్ లను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయినట్లుగా తెలుస్తోంది. 

10:14 - August 2, 2018

హైదరాబాద్ : నగరంలో కొకైన్ విక్రయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అక్రమంగా మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా హుమాయిన్ నగర్ పీఎస్ పరిధిలో కొకైన్, గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరోజిని దేవి ఆసుపత్రి సమీపంలో కొకైన్ విక్రయిస్తున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొకైన్ కొనడానికి వచ్చిన వ్యక్తిని..అమ్ముతున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెండ్ గా అదుపులోకి తీసుకున్నారు. ఇర్ఫాన్ అనే వ్యక్తిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా అతను పరారయ్యాడు. వీరి వద్ద 15 గ్రాముల కొకైన్, 80 గ్రాముల డ్రై గంజాయి, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

ఉప రాష్ట్రపతితో ఏపీ టిడిపి ఎంపీలు..

ఢిల్లీ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ఏపీ టిడిపి ఎంపీలు, కడప జిల్లా ప్రజాప్రతినిధులు కలిశారు. కడప స్టీల్ ప్లాంట్ పై ఉప రాష్ట్రపతికి వినతిపత్రం అందచేశారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకొనేలా చొరవ తీసుకోవాలని వారు కోరారు. 

ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన ఈటెల...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ తో ఆయన భేటీ కానున్నారు. సివిల్ సప్లై శాఖలో బకాయిపడిన రూ. 1630 కోట్లను విడుదల చేయాలని ఈటెల కోరనున్నారు. 

బెంగాల్ లో పట్టాలు తప్పిన రైలు...

పశ్చిమ బెంగాల్ : హావ్ డా స్టేషన్ వద్ద ఇస్పాత్ ఎక్స్ ప్రెస్ ఇంజిన్ పట్టాలు తప్పింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

09:25 - August 2, 2018

నెల్లూరు :జిల్లా రాపూరు పోలీస్‌స్టేషన్‌పై స్థానికులు దాడి ఘటన కలకలం రేపుతోంది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ వ్యక్తిని ఎస్‌ఐ తీవ్రంగా కొట్టాడని ఆగ్రహించిన గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎస్సై లక్ష్మణ్‌ రావు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దీనిపై ఐజీ గోపాల రావు, జిల్లా ఎస్పీ ఘటనపై ఆరా తీశారు. పీఎస్ కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని వారు పరామర్శించారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి సిబ్బందిని గాయపరచడం హేయమైన చర్య అని, నిందితులపై కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. మరో వైపు స్టేషన్‌పై దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులంటున్నారు. ఇదిలా ఉంటే ఎస్ఐ లక్ష్మణ్ రావు ఫిర్యాదు దారులతో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

09:12 - August 2, 2018

వరంగల్ : జిల్లాలోని ఆర్టీసీ 1 డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2.30గంటలకు ఈ ప్రమాదం జరిగిందని అంచనా. బస్సు డిపోలో సాంకేతిక లోపంతో ఉన్న ఓ బస్సులో మంటలు చెలరేగాయి. కొద్దిగా మొదలైన మంటలు రాను రాను మరింత వ్యాపించాయి. పక్కనే ఉన్న నాలుగు బస్సులకు మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడున్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన విషయం తెలుసుకున్న మంత్రి మహేందర్ రెడ్డి స్పందించారు. విచారణకు ఆదేశించారు. 

09:10 - August 2, 2018

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెను ప్రమాదం తప్పింది. కువైట్ నుండి వచ్చిన విమానంలో మంటలు అంటుకున్నాయి. విమానం కిందకు దిగుతున్న సమయంలో కుడివైపు ఉన్న ఇంజన్ లో మంటలు అంటుకున్నాయి. విమానం లోపల ఉన్న ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్ రన్ వైపైనే విమానాన్ని నిలిపివేశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను రన్ వై పైకి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో మంటలు ఎలా అంటుకున్నాయనే దానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఆర్టీసీ డిపో 1లో ఫైర్ ఆక్సిడెంట్...

వరంగల్ : ఆర్టీసీ డిపో 1లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు బస్సులు కాలిపోయాయి. సాంకేతిక లోపంతో ఉన్న బస్సులో మంటలు చెలరేగి ఇతర బస్సులకు వ్యాపించాయి. మంత్రి మహేందర్ రెడ్డి విచారణకు ఆదేశించారు.

తప్పిన ప్రమాదం...

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో పెను ప్రమాదం తప్పింది. కువైట్ నుండి వచ్చిన విమానంలో మంటలు చెలరేగాయి. విమానాన్ని రన్ వైపైనే నిలిపవేశాడు. మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పివేశారు. 

08:52 - August 2, 2018

కరీంనగర్ : రామగుండం కార్పొరేషన్‌లో అవిశ్వాస తీర్మానంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అన్ని పార్టీల కార్పొరేటర్ల వ్యక్తిత్వం ఏంటో ఇవాళ జరగనున్న అవిశ్వాస పరీక్షతో తేలనుంది. కాంగ్రెస్ కార్పొరేటర్లతో అవిశ్వాసం నెగ్గొచ్చని భావించిన ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వర్గానికి కాంగ్రెస్ అధిష్టానం విప్‌ జారీతో ఝలక్‌ ఇచ్చింది. ఇంతకూ ఎమ్మెల్యే పంతం నెగ్గించుకుంటారా.. లేక మేయర్ బలపరీక్షలో నెగ్గుతారా.. అన్నదానిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా చర్చ సాగుతోంది.

రామగుండం నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల అంతర్గత పోరుతో పార్టీ పరువు బజారుకెక్కుతోంది. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ లక్ష్మినారాయణ మధ్య కొనసాగిన ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరింది. తనకు కొరకరాని కొయ్యగా మారిన మేయర్‌ను కొనసాగించడం మంచిది కాదని భావించిన ఎమ్మెల్యే అవిశ్వాస అస్ర్తాన్ని ఎక్కుపెట్టారు. కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్ల మద్దతు కూడగట్టుకొని కలెక్టర్‌కు తీర్మాన పత్రాన్ని అందచేశారు. దీంతో స్థానిక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

టీఆర్ఎస్‌ పార్టీ తమ 13 మంది కార్పొరేటర్లకు తోడు.. మేయర్ లక్ష్మినారాయణతో పాటు మరో 14 మంది స్వతంత్ర కార్పొరేటర్ల మద్థతుతో.. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్‌గా గెలిచిన లక్ష్మినారాయణ మేయర్ కావడం వెనుక స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఎంపీ బాల్క సుమన్ ఉన్నారన్నది బహిరంగ రహస్యం. కాగా ఏకు మేకైన చందంగా.. మేయర్‌ ఎమ్మెల్యేకు కొరకరాని కొయ్యగా మారాడు. ఎమ్మెల్యే వర్గమంతా.. మేయర్ వర్గంగా మారుతుండడంతో.. ఎమ్మెల్యేకు తన భవిష్యత్‌పై గుబులు పట్టుకుంది. దీంతో మేయర్‌ అడ్డు తొలగించుకునేందుకు అవిశ్వాస తీర్మాణానికి సిద్దపడ్డాడు. అవిశ్వాసం వద్దన్న పార్టీ అధిష్టానమే చివరికి ఎమ్మెల్యే డిమాండ్‌కు తలొగ్గింది. దీంతో క్యాంపు రాజకీయాలను షురూ చేశారు ఎమ్మెల్యే.

రామగుండం కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లలో టీఆర్ఎస్‌కు 13, కాంగ్రెస్‌కు 20, ఇండిపెండెట్లు 15, బీజేపీకి 2 చొప్పున గెలుపొందారు. వీరిలో 9 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు.. 15 మంది ఇండిపెండెంట్లు టీఆర్ఎస్‌ గూటికి చేరారు. కాగా 50 మంది కార్పొరేటర్లలో 39 మంది అవిశ్వాసానికి సిద్దమయ్యారు. కాంగ్రెస్‌లో మిగిలిన 11 మంది కార్పొరేటర్లలో 8 మంది అవిశ్వాసానికి మద్థతునిస్తూ క్యాంపులకు తరలి వెళ్లారు. కాగా గురువారం బలపరీక్ష నిర్వహిస్తామంటూ జిల్లా కలెక్టర్ దేవసేన ఆదేశాలు జారీ చేశారు.

చివరి నిమిషంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఎమ్మెల్యేకు ఝలక్‌ ఇచ్చింది. అవిశ్వాసానికి దూరంగా ఉండాలని పీసీపీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను అప్రమత్తం చేశారు. 50 మంది కార్పొరేటర్లలో 34 మంది మద్ధతు ఉంటేనే అవిశ్వాసం నెగ్గుతుంది.. కానీ కాంగ్రెస్‌ కార్పొరేటర్లు పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటారా..? లేదా..? అన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. మరోవైపు కాంగ్రెస్‌నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 9 మందిపై చర్యలు తీసుకోకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. విప్ పత్రాలను కార్పొరేటర్ల ఇంటి గోడలకు అంటించడంతో పాటు జాయింట్ కలెక్టర్‌కు అందచేసింది కాంగ్రెస్. మొత్తానికి రామగుండం కార్పొరేషన్‌లో అవిశ్వాస తీర్మానం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.. ఎవరి ఓటు ఎటు వైపు ఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఎమ్మెల్యే పంతం నెగ్గించుకుంటాడా.. లేక మేయర్‌ బలపరీక్షలో నెగ్గుతాడా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

08:15 - August 2, 2018
08:09 - August 2, 2018
08:06 - August 2, 2018

నెల్లూరు : కావలి ఇందిరానగర్ లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. భార్గవ్ అనే యువకుడిని దుండగులు కొట్టి చంపారు. జి.నాయుడు కళాశాలలో ఐటీఐ చదువుతున్న భార్గవ్ బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి భార్గవ్ ను బయటకు తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీనితో భార్గవ్ అక్కడికక్కడనే మృతి చెందాడు. భార్గవ్..రాము..కొందరు మద్యం సేవించినట్లు సమాచారం. హతుడు వ్యసనాలకు..ఆకతాయి పనులకు పాల్పడే వాడని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

07:33 - August 2, 2018

పోలీసులపై దాడి హేయమైన చర్య - ఎస్పీ...

నెల్లూరు : రావూరు ఎస్ఐ, కానిస్బేబుల్ పై గ్రామస్తులు జరిపిన దాడిపై జిల్లా ఎస్పీ స్పందించారు. యువకుడిని కొట్టాడని గ్రామస్తులు ఈ దాడికి పాల్పడ్డారు. పీఎస్ ను జిల్లా ఎస్పీ రామకృష్ణ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి సిబ్బందిని గాయపరచడం హేయమైన చర్య అని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. 

పోలవరంపై గడ్కరి ఉన్నతస్థాయి సమీక్ష...

ఢిల్లీ : నేడు పోలవరంపై కేంద్ర మంత్రి గడ్కరి నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ జరుగనుంది. కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు హాజరు కానున్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించి అంచనాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

హస్తినకు ఈటెల...

ఢిల్లీ : నేడు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల హస్తినకు వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి పాశ్వాన్ తో ఈటెల భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చించనున్నారు. 

06:36 - August 2, 2018

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులు ఆందోళన బాట పట్టారు. చేనేత మీద జీఎస్టీని తొలగించాలని తమకు గతంలో కేటాయించిన పథకాలను అమలు చేయాలని కనీస వేతనం అమలు చేయాలని తదితర డిమాండ్లతో.. ఈ నెల 7న చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ధర్నాకు గల కారణాలు.. చేనేతపట్ల అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై టెన్ టివి జనపథంలో ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:33 - August 2, 2018

విజయవాడ : ఏపీ టీడీపీ ఎమ్మెల్సీల చూపు ఎమ్మెల్యే స్థానాలపై పడింది. పెద్దల సభలో ఉన్న నేతల్లో చాలామంది ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి వారిని అసెంబ్లీ నుంచి పోటీకి దింపేందుకు అధిష్టానం రెడీగా ఉందా ? ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతలు ఎవరు ? వాచ్‌ దిస్‌ స్టోరీ. రాజకీయ నేతలు చాలామంది శాసనమండలిలో కూర్చోవడం కంటే శాసనసభలోనే కూర్చునేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచివారికి పరోక్షంగా వచ్చిన వారికంటే సమాజంలో ఎక్కువ మర్యాదలు దక్కడమే కారణం. అందుకే ఏపీ టీడీపీ ఎమ్మెల్సీల్లో చాలామంది ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలాంటివారు ఏ ఒక్కరో.. ఇద్దరు కాదో.. జాబితా చాలా పెద్దగానే ఉంది.

నారా లోకేశ్‌. ప్రస్తుతం శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికై మంత్రిగా కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో లోకేశ్‌ అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఎక్కడినుండి పోటీ చేయాలనే దానిపై ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు చినబాబు. గతంలోనే అసెంబ్లీకి పోటీ చేయాలని భావించినా... అప్పటి పరిస్థితులను బట్టి ఎమ్మెల్సీ అయి.. మంత్రివర్గంలోకి వచ్చారు. కానీ.. ఈసారి మాత్రం కచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టాలన్నది లోకేశ్‌ ఆలోచన.

ఇక నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణలు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం వారిద్దరు ఎమ్మెల్సీలు అయి వారిద్దరు మంత్రులుగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో సర్వేపల్లి నుండి పోటీ చేసి ఓడిపోయిన సోమిరెడ్డి... వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు కూడా ఇందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక నారాయణ కూడా నెల్లూరు నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత కూడా ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారని పార్టీలో టాక్‌ నడుస్తోంది. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కరణం బలరామ్‌... రానున్న ఎన్నికల్లో తన తనయుడు వెంకటేశ్‌కు టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో వెంకటేశ్‌ పోటీ చేసి ఓడిపోయారు. మరో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న పయ్యావుల కేశవ్‌ వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. గత ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గం నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన పయ్యావుల.. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి పొందారు. అయితే పయ్యావుల కూడా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ ఖాయమని తెలుస్తోంది. ఇక ఇదే జిల్లాకు చెందిన రాయదుర్గం దీపక్‌రెడ్డి పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నారు. గతంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన దీపక్‌రెడ్డి... ఇటీవలే ఎమ్మెల్సీ పదవి పొందారు. అయితే.. కోర్టు కేసుల నేపథ్యంలో దీపక్‌రెడ్డిని టీడీపీ సస్పెండ్‌ చేసింది. అయినాసరే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని దీపక్‌రెడ్డి భావిస్తున్నారు. అనంత ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి దీపక్‌రెడ్డి దగ్గరి బంధువు కావడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్‌ వస్తుందని ఆశిస్తున్నారు. ఇక కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం కేఇ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్‌ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గతంలో ఈయన మంత్రిగానూ పని చేశారు. గత ఎన్నికల్లో వివిధ కారణాలతో కేఈ ప్రభాకర్‌కు టికెట్‌ లభించలేదు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీకి పోటీ చేస్తానని ప్రభాకర్‌ స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీకి అవకాశం లేకపోతే.. కర్నూలు ఎంపీగానైనా పోటీ చేసేందుకు సై అంటున్నారు.

ఇక గుంటూరు జిల్లా నుంచి అన్నం సతీష్‌ ప్రభాకర్‌, డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. ఇందులో అన్నం సతీష్‌ గత ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఎమ్మెల్సీ పదవి వరించింది. కానీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక డొక్కా మాణిక్యవరప్రసాద్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక కృష్ణాజిల్లాలో ఎమ్మెల్సీ యలమంచిలి బాబూరాజేంద్రప్రసాద్‌ వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. గత ఎన్నికల సమయంలో చివరిదాకా టికెట్‌ కోసం తెగ ప్రయత్నం చేశారు. అయితే వివిధ కారణాలతో టికెట్‌ లభించలేదు. అయితే రానున్న ఎన్నికల్లో పోటీ కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ఇదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అసెంబ్లీకి పోటీ చేస్తే ఎలా ఉంటుందా ? అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశిస్తే పోటీకి సై అంటున్నారు బుద్దా వెంకన్న.

ఇక ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు రాజమండ్రి టికెట్‌ కోసం ట్రై చేస్తున్నారు. తనకు టికెట్‌ రాకపోయినా తన కుమారుడు వాసుకి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా పాతపట్నం నుండి పోటీ చేసేందుకు మాజీ మంత్రి శత్రుచర్ల రెడీ అవుతున్నారు. మరోనేత బచ్చుల అర్జునుడు నూజివీడు నుండి పోటీ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇక వీళ్లే కాక చాలామంది ఎమ్మెల్సీలు... ఎమ్మెల్యేగా పోటీ చేసే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో పోతుల సునీత, గుమ్మడి సంద్యారాణి, రెడ్డి సుబ్రహ్మణ్యంలు ఉన్నారు. ఒకవేళ టికెట్లు రాకపోయినా ఎమ్మెల్సీలుగా కొనసాగనున్నారు. మొత్తానికి చాలామంది టీడీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. మరి వారి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాలి. 

06:30 - August 2, 2018

విజయవాడ : గురువారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న సమావేశంలో... యువత నిరుద్యోగ భృతికి ఆమోదముద్ర వేయనున్నారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులతో పాటు... పర్యాటక ప్రాజెక్టులకు పాలనాపరమైన అనుమతులివ్వనున్నారు. ఇక రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు.. కరవు మండలాలను గుర్తించే అంశాలపై కూడా కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు. యువసాధికార పేరుతో ఈ భృతిని నిరుద్యోగులకు అందించనున్నారు. దీని ద్వారా 12.26 లక్షల మంది యువతకు లబ్ధిపొందనున్నారని... యువతకు ఆన్‌లైన్‌లో నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఈ భృతి అందించనున్నారు. దీని కోసం ఏడాదికి 1470 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించనుంది.

ఇక రాష్ట్రంలో వాహనాల పొల్యూషన్‌ను తగ్గించే అంశంపై చంద్రబాబు దృష్టి సారించారు. ఇందుకోసం ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నారు. దీనికి అనుగుణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల విధానం ముసాయిదాలో మార్పులు, చేర్పులపై కేబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు వివరాలు సేకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది కరవు మండలాలను ముందుగానే గుర్తించే అంశంపై కూడా ఈ కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు.

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్న ఈ మధ్య ప్రకటించిన చంద్రబాబు.. ఆ దిశగానే అడుగులు వేయనున్నారు. రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే సాగునీటి ప్రాజెక్టులకు ఈ కేబినెట్‌ సమావేశంలో పాలనాపరమైన అనుమతులు ఇచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో రెండు పర్యాటక ప్రాజెక్టులతో పాటు పలు సంస్థలు, ఏపీఐఐసీకి భూ కేటాయింపులపై ప్రధానంగా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 

06:28 - August 2, 2018

నెల్లూరు : జిల్లా రాపూరు పోలీస్‌స్టేషన్‌పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై లక్ష్మణ్‌ రావు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ వ్యక్తిని ఎస్‌ఐ తీవ్రంగా కొట్టాడని ఆగ్రహించిన గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. మిగతా సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గాయపడిన ఎస్సై లక్ష్మణరావు, ఇద్దరు కానిస్టేబుళ్లను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రికి ఉన్నతాధికారులు వచ్చి వివరాలు సేకరించారు. మరోవైపు స్టేషన్‌పై దాడి చేసినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులంటున్నారు. 

ఇమ్రాన్ ప్రమాణానికి మోడీ..కపిల్, అమీర్..

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారతదేశం నుండి ప్రధాని నరేంద్ర మోడీ, సినీ నటుడు అమీర్ ఖాన్, క్రికెటర్లు కపిల్ దేవ్ లు హాజరు కానున్నారని అక్కడి పత్రిక వెల్లడించింది. 

3న లోక్ సభలో ప్రైవేటు బిల్లు - అవంతి...

ఢిల్లీ : కాపుల రిజర్వేషన్లపై ఈనెల 3న లోక్‌సభలో ప్రైవేటు మెంబర్‌ బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన పంపిన బిల్లును కేంద్రం ఆమోదించాలని, అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. 

పింగళి వెంకయ్య జయంతి వేడుకలు...

హైదరాబాద్ : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 141వ జయంతి వేడుకలను న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ (ఏపీ భవన్)లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. 

Don't Miss