Activities calendar

03 August 2018

21:03 - August 3, 2018

పేపర్ మిల్లు మూశింది వీళ్లె తెర్శింది వీళ్లు...పెండ్లినాడు విడాకుల నాడు పెద్దలు వీళ్లే, ప్రొటోకల్ అంటే టీఆర్ఎస్ పార్టీ సభ్యతమట...కనీసం సోయిలేకుంటున్న కరెంటి మంత్రి, తిరుమల కొండ మీదికి జేర్న రాజకీయం...దేవుని సన్నిధి గూడ పాలిటిక్స్ వేదికైంది, ఇగ తెల్లారి ఒంటిగంటదాక బార్ షాపులు...తాగువోతుల కష్టాలు తీర్చిన కేసీఆర్ సార్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ చేతివాటం...పిల్లల సర్కులు చోరి జేశి అడ్డంగ దొర్కింది, పూజలందుకున్న పాము పుటుక్కుమంది...పాము సావుతోని రోడ్డెక్కిన మూడ భక్తులు... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

20:57 - August 3, 2018

హీరో అయిన రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా మారుతున్నాడు, సుశాంత్ తో సినిమా తీస్తున్నాడు అని అనగానే .. అంతా ఇదో వేస్ట్ ప్రయత్నం అనుకున్నారు. కానీ సడెన్ గా సమంతా, నాగచైతన్య , నాగార్జున్ లైవ్ లోకి వచ్చి సినిమాకి కావల్సినంత బూస్ట్ ఇవ్వడంతో ఇధో విషయం ఉన్న సినిమా అని  క్లారిటీ వచ్చింది. ఇక అన్నపూర్జ  స్టూడియెస్, మనం ఎంటర్ టైన్ మెంట్స్ ప్రజెంటేషన్ అనగానే ఫుల్ అటెన్షన్ తెచ్చుకుంది చిలసౌ. అలా భారీ ప్రీ  రిలీజ్ హైప్ తో ధియేటర్ లోకి వచ్చిన  ఈ డిఫరెంట్ అటెంప్ట్ ఎలా ఉ:దో ఇప్పుడు చూద్దాం.
కథ విషయానికొస్తే..    
కథ విషయానికొస్తే..అర్జున్   తనకంటూ కొన్ని గోల్స్ పెట్టుకుని  పెళ్లి అనగానే 5 ఇయర్స్ పోస్ట్ పోన్ అనే స్టాండ్ మీద ఉంటాడు.  అనుకోని విధంగా  అంజలితో పెళ్లి చూపులకు రెడీ అవుతాడు. ఆ సమయంలో జరిగిన అనూహ్య పరిణామాలు, వాటి పర్యావసానాల పరంగా అంజలి  తనకు పర్ పెక్ట్ లైఫ్ పార్టనర్ అని ఫిక్స్ అయ్యి ఆమెని పెళ్లాడతాడు. పెళ్లే వద్దనుకున్న అర్జున్ ని అంతగా ఇంప్రెస్ చేసిన అంజలి క్వాలిటీస్ ఏంటి..? వాళ్లిద్దరి మధ్య  ఎలాంటి ట్రావెల్ జరిగింది.. అనేది సినిమా కథ.
నటీనటుల విషయానికొస్తే
నటీనటుల విషయానికొస్తే.. ఇప్పటి వరకూ ఒక్క సినిమాలో కూడా పరిణతి కనిపించని సుశాంత్.. ఈ సినిమాలో మాత్రం నటించలేదు.. అర్జున్ అనే  ఒక యువకుడి క్యారెక్టర్ ని అర్దం చేసకుని  అందులో ఒదిగిపోయి అతను సుశాంత్ కాదు.. అర్జున్ అనేంతలా ఇంప్రెస్ చేశాడు.  మొట్టమొదటి సారిగా సెటిల్ ఎక్స్ ప్రెషన్స్ పలికిస్తూ..ఎమోషనల్ సీన్స్ లో సైతం  ఆకట్టుకున్నాడు. స్క్రీన్ ప్రజెన్స్ లో కూడా చాలా వేరియేషన్ ఉంది. సినిమా చూశాక అర్జున్ క్యారెక్టర్ కి సుశాంత్  100 పర్సెంట్ న్యాయం చేశాడు అనిపిస్తుంది. ఇక హీరోయిన్ రుహానీ శర్మ..ట్రైలర్స్ లో జస్ట్ యావరేట్ అనిపించే లుక్స్ లో సినిమాకి మైనస్ ఏమో అనే  ఫీలింగ్ కలిగించింది. కానీ సినిమాకి  మెయిన్ ఎసెట్ ఆమె నటనే. అంజలి క్యారెక్టర్ ఆమె క్యారీ చేసిన తీరుకి హాట్సాఫ్ చెప్పాలి. ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ కి అంత ఎక్స్ ప్రెసివ్ ఫేస్ ఉన్న హీరోయిన్ ఎవరూ రాలేదనే చెప్పాలి. చిన్న చిన్న ఎమెషన్స్ ని ఆమె  కన్వే చేసిన విధానం సింప్లీ సూపర్బ్.  అందం పరంగా యావరేజ్ మార్క్స్ స్కోర్ చేసినా.. నటన పరంగా మాత్రం డిస్టింక్షన్ లో పాస్ అయ్యింది. సినిమా పూర్తయ్యే సరికి అంజలి లాంటి అమ్మాయి లైఫ్ పార్టనర్ గా ఉంటే బావుండు అని చాలా మంది బ్యాచిలర్స్ అనుకుంటారు అంటే...అతిశయోక్తి కాదు. ఒక చిన్న డైలాగ్ ఇచ్చానా.. సింపుల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చినా..విపరీతంగా ఎలివేట్ చేసి నవ్వించే వెన్నెల కిషోర్ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచాడు. ఈ మధ్య కాలంలో సరైన  క్యారెక్టర్ దొరకక వెయిట్ చేస్తున్న వెన్నెల కిషోర్ ఈసినిమాలో మాత్రం ఛాన్స్ ఉన్న ప్రతిచోటా..  చెలరేగిపోయాడు. 2 సీన్స్ అయితే.. ధియేటర్ మొత్తం నవ్వులే నవ్వులు. ఒక రాహుల్ రామకృష్ణ గెస్ట్ క్యారెక్టర్ లా జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడు, విధ్యుల్లేఖ, రోహిణి, సంజయ్  ఇలా నోన్ ఫేసెస్ అన్నీ.,. సినిమా రీచ్ కి బాగానే ఉపయోగపడ్డాయి.
టెక్నీషియన్స్ విషయానికొస్తే..  
టెక్నీషియన్స్ విషయానికొస్తే.. యాక్టర్ లా ఉన్న రాహుల్.. డైరెక్టర్ లా మారి..ఏం చెయ్యగలుగుతాడా..? అని అనుకున్నారు అంతా. కానీ అతను డైరెక్టర్ గా ఏం చేశాడ్రా అనిపించుకున్నాడు. మొదటి సినిమాకి  అలాంటి  సెన్సిబుల్ స్క్రిప్ట్ ని రాసుకోవడమే ఒక సాహసం. దాన్ని అతను పక్కా స్క్రీన్ ప్లే తో  ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ తో  ఎలివేట్ చేసినవిధానానికి మెచ్చుకుని తీరాలి.  మొదటి సినిమాకే డైరెక్టర్ గా  స్క్రిప్ట్ పై అతనికున్న కమాండ్, క్లారిటీ చూశాక  అతని నుంచి ముందుముందు మరిన్ని మంచ సినిమాలు ఖచ్చితంగా ఆశించవచ్చు. డైలాగ్స్ కూడా.. కథను నడిపిస్తూ..ఆహ్లాదంగా సాగిపోయాయి. d.o.p సుకుమార్ డైరెక్టర్ మైండ్ లో ఉన్న విజువల్స్ ని మైండ్ బ్లోయింగ్ గా స్క్రీన్ పైకి ట్రాన్స్ లేట్ చేశాడు. అక్కడక్కడా.. టైట్ ఫ్రేమ్స్ మాత్రం కాస్త్ ఇబ్బంది పెట్టాడు.  కానీ అంత తక్కువ ఖర్చులో  అలాంటి రిచ్ నెస్ తీసుకొచ్చినందుకు అతనికి తప్పకుండా క్రెడిట్ ఇచ్చి తీరాలి. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి కూడా డైరెక్టర్ విజన్ ని అర్ధం చేసుకుని అవసరం అయినంతమేరకు  క్వాలిటీ ఉన్న మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా సినిమా సోల్ రివీల్ అయ్యే సీన్స్ లో  విహారి అందించిన మ్యూజిక్ హార్ట్ ను టచ్ చేస్తుంది.  ప్రొడక్షన్ వాల్యూస్..సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా క్రిస్ప్ గా ఉంది. ఆర్ట్ డైరెక్టర్ కష్టం  సినిమాలో కనిపిస్తుంది.     
ఓవరాల్ గా చెప్పాలంటే..     
ఓవరాల్ గా చెప్పాలంటే.. సెన్సిబుల్ స్టోరీ లైన్ తో సెన్సిటివ్ నెరేషన్ తో తెరకెక్కిన చిలసౌ మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని అలరించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. తమ టేస్ట్ కి మ్యాచ్ అయ్యే  సినిమా లేక ఆవురావురు అంటూ ఎదురుచూస్తున్న A  సెంటర్ ఆడియన్స్ ని చాలా వరకూ శాటిస్ఫై చేస్తుంది చిలసౌ.

ప్లస్..
సెన్సిటివ్ కథ
ఫ్రెష్ స్క్రీన్ ప్లే
డైలాగ్స్, కామెడీ, డైరెక్షన్ 
హీరోయిన్ నటన

మైనస్..
స్లో నెరేషన్
ల్యాగింగ్ హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్

రేటింగ్..
2.5

20:53 - August 3, 2018

క్షణం సినిమాతో తెలుగు సినిమాల్లోనే కొత్త ఒరవడిని క్రియేట్ చేసిన అడవిశేష్...మళ్లీ తన టీమ్ తో కలిసి గూడఛారి అనే  న్యూ ఏజ్ స్పై థ్రిల్లర్ ను రూపొందించారు. సమంతా టీజర్ లాంచ్ చెయ్యడం, నాని ట్రైలర్ రిలీజ్ చెయ్యడంతో గూడఛారి రేంజ్ విపరీతంగా పెరిగింది. ప్రమోషన్ మెటీరియల్ అంతా..హాలీవుడ్ తరహాలో ఉండడంతో విడుదలకు ముందే.. భారీ అంచనాలు క్రియేట్ చేసింది. గూడఛారి అలా భారీ అంచనాల నడుమ థియేటర్ లోకి అడుగు పెట్టి,,అనుకున్నట్టుగానే ఆఢియన్స్ మనసులు కొల్లగొట్టాడా..? థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్నాడా అనేది ఇప్పుడు మనం చూద్దాం.
కథ విషయానికొస్తే..    
కథ విషయానికొస్తే..చిన్న తనంలోనే రా ఏజెంట్ గా ఉన్న తన తండ్రిని కోల్పోయిన  అర్జున్ తండ్రి ఇన్స్పిరేషన్ తోనే రా ఏజెంట్ గా మారతాడు .దేశాన్ని కాపాడాలి అనే స్ట్రాంగ్ విల్లింగ్ తో డ్యూటీ ఛార్జ్ తీసుకున్న కొన్ని రోజుల్లోనే ఊహాతీత పరిణామాల మధ్య టెర్రర్రిస్ట్ అనే ముద్ర పడుతుంది. అలా టెర్రరిస్ట్ ముద్రవేయించుకున్న అర్జున్..తాను టెర్రరిస్ట్ కాదని ఎలా నిరూపించుకున్నాడు..? అసలు అతన్ని టెర్రరిస్ట్ గా ఫోకస్ చెయ్యాలనుకున్నది ఎవరు..? అసలు అర్జున్ గతం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 
నటీనటుల విషయానికొస్తే..    
నటీనటుల విషయానికొస్తే..ఎలాంటి క్యారెక్టర్ ని అయినా పోషించి మెప్పించే సత్తా ఉన్న అడవిశేష్ ఈ సినిమాలో రాఏజెంట్ గా ఇంప్రసివ్ మేకోవర్ తోకనిపించాడు. క్లాసీ యాక్టింగ్ తో ఆ క్యరెక్టర్ కి ఫుల్ ఫిల్ మెంట్ ఇస్తూ..స్టైలిష్ టచ్ ఇచ్చాడు. అతని హావభావాలు, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా ఆ క్యరెక్టర్ కి పర్ ఫెక్ట్ గా సూట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శోబితా ధూలిపాళ్ల..హై ఫై లుక్ తో అలరించింది. ఆమె ఎలిగెంట్ యాక్టింగ్ సినిమాకి ప్లస్ అయ్యింది. చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇఛ్చిన సుప్రియ..ఇంపార్టెన్స్ ఉన్న రా ఆఫీసర్ పాత్రలో పర్ ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఆమె నట అనుభవం స్క్రీన్  పై కనిపించింది. ఇక ఎలాంటి పాత్రనైనా తమ నటనతో వంద రెట్లుపెంచి చూపించే..ప్రకాష్ రాజ్, జగపతిబాబు సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచారు. వాళ్లిద్దరి మధ్య వచ్చే ట్విస్ట్  సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సినిమాని ఎమోషనల్ గా డ్రైవ చేసింది. అనీష్ కురువిళ్ల ప్రజెన్స్.. చాలా డిగ్నిఫైడ్ గా ఉంది. వెన్నెల కిషోర్ ఉన్నంతలో నవ్విస్తూ..చిన్న ఝ లక్ ఇచ్చాడు.మధుశాలిని తదితరులంతా ఆక్యరెక్టర్స్ కి పర్ ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు.
టెక్నీషియన్స్ విషయానికొస్తే..
టెక్నీషియన్స్ విషయానికొస్తే..ఈ సినిమా కథను రాసుకున్న అడవిశేష్..కథలో తనను తాను ఊహించుకుంటూ డెవలప్ చెయ్యడంతో అది నటనపరంగా కూడా ప్లస్ అయ్యింది. అయితే క్షణం తరహాలో కన్సిస్టెన్సీని మెయింటెన్ చెయ్యడంలో తడబాటు కనిపించింది. ఫస్ట్ హాఫ్ ని ఎలాబిరేటెడ్ గా, ఎఫెక్టివ్ గా , ఎంగేజింగ్ గా, ఎంటర్ టైనింగ్ గా తీర్చిదిద్దిన టీమ్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ..పర్సనల్ మిషన్ కి హీరో ని పరిమితం చెయ్యడంతో గ్రాఫ్ లో డౌన్ కనిపించింది. మధ్య మధ్యలో ఆసక్తి కరమైన ట్విస్ట్ లు ఉన్నప్పటికీ హీరో ప్రిపరేషన్ కి పూర్తి విరుద్దంగా స్క్రీన్ ప్లే మలచడం కాస్త డిజప్పాయింటింగ్ గా అనిపిస్తుంది.  ఫస్ట్ హాఫ్ తరహాలో సెకండ్ హాఫ్ ని మలచడంలో గూడఛారి టీమ్ తడపడింది. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా  మారిన శశికిరణ్ తిక్క.. షాట్ డివిజన్ లో, మేకింగ్ లో  కమాండ్ చూపించాడు. అతి తక్కువ బడ్జెట్ లో అల్ట్రా స్టైలిష్ విజువల్స్  ఇచ్చాడు.  క్షణం సినిమాని తన రైటింగ్ తో వెయిట్ పెంచిన అబ్బూరి రవి ఈ సినిమాకి కూడా స్క్రిప్ట్ పరంగా వర్కవుట్ అయ్యే మెరుగుని దిద్దాడు. అతని డైలాగ్స్ చాలా నేచురల్ గా రియలిస్టిక్ గా ఎఫెక్టివ్ గా ఉన్నాయి. కెమెరామెన్ షానియల్ డియో..సూపర్ అవుట్ పుట్ ఇచ్చాడు. స్క్రిప్ట్ తో అతను కూడా ట్రావెల్ అవ్వడంతో ప్రతి సీన్ కి కావల్సిన ఎటైర్ కూడా పర్ఫెక్ట్ గా ఎంచుకోగలిగాడు.  అతని డెడికేషన్...ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఇక ఎడిటర్, గ్యారీ స్టైలిష్ కట్స్ ఇచ్చాడు. సినిమా డీవియేట్ అయ్యే సీన్స్ ఏమీ లేకుండాజాగ్రత్త పడ్డాడు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల ..శేష్ తో ఉన్న రాపో వల్ల వాళ్ల టేస్ట్ కి తగ్గట్టు..సినిమాకి అవసరమైనట్టు ..క్లాసీ సౌండింగ్ అందించాడు. నిర్మాణ విలువలు బావున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే..     
ఓవరాల్ గా చెప్పాలంటే.. ట్రైలర్ తరహాలోనే  స్టైలిష్ అవుట్ పుట్ తో రూపొందిన స్పై థ్రిల్లర్ గూడఛారి సెకండాఫ్ లో కాస్త డీవియేట్ అయినా కానీ..డిఫరెంట్ జానర్ లవర్స్ కి బాగా నచ్చుతుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఈసినిమా బాక్సాఫీస్ గా బాగానే సందడి చేసే అవకాశం కనిపిస్తోంది. 
ప్లస్ ..
కాస్టింగ్, స్క్రీన్ ప్లే
మేకింగ్, మ్యూజిక్
కెమెరా వర్క్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్...
సెకండాఫ్ డీవియేషన్
ప్రీ క్లైమాక్స్
కాస్త ఎక్కువైన సినిమాటిక్ లిబర్టీ
టచ్ కాని ఎమోషన్

రేటింగ్..2.5

20:42 - August 3, 2018

రాజమండ్రి : భోగాపురం ఎయిర్ పోర్టు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం అంతా బోగస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ పోర్టు నిర్మాణం వెనుక పెద్ద అవినీతి జరుగుతోందని ఆరోపించారు. షార్ట్ టైం టెండర్లు పిలవటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 

సంజయ్ పై నిర్భయ సహా నాల్గు కేసు నమోదు

నిజామాబాద్ : నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ అరెస్టుకు రంగం సిద్ధం అయింది. నిర్భయ సహా నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. 354, 354/ఎ, 342, నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంజయ్ ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. 

 

20:35 - August 3, 2018

నిజామాబాద్ : నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ అరెస్టుకు రంగం సిద్ధం అయింది. నిర్భయ సహా నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. 354, 354/ఎ, 342, నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంజయ్ ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. 

20:24 - August 3, 2018

కృష్ణా : జిల్లాలో కిడ్నీ వ్యాధి మరణమృదంగం మోగిస్తోంది. నానాటికీ పెరుగుతున్న కిడ్నీ వ్యాధితో కృష్ణాజిల్లా ఎ.కొండూరు మండలం మంచం పట్టింది.  బాధితుల వేదనపై 10టీవీ వరుస కథనాలతో జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. వ్యాధి నియంత్రణ చర్యలపై నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాగాన్ని ఆదేశించింది.

కృష్ణా జిల్లాలో ఉద్దానం కంటే ఘోరమైన పరిస్థితి నెలకొంది. కిడ్నీ వ్యాధితో తీవ్రతతో వంద మందికిపైగా మృత్యువాత పడ్డారు. సీపీఎం నిరంతరం తమ పక్షాన నిలవడం కొండంత ధైర్యాన్ని ఇస్తోందని  బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నీ పేషెంట్ల వేదనపై 10టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. జాతీయ ఎస్టీ కమిషన్ సైతం సీరియస్‌గా తీసుకుంది. పేషెంట్లకు అందిస్తున్న వైద్యం, వ్యాధి నియంత్రణ చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాగాన్ని ఆదేశించినట్టు తెలుస్తోంది.

ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలంటూ.. సీపీఎం నేతలు పోరాడుతున్నారు. ముఖ్యంగా 19 మండల కేంద్రాల్లో ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలు, ఉచిత అంబులెన్స్‌ సౌకర్యం కలిపించాలని వారు కోరుతున్నారు. ప్రతినెలా 2,500 రూపాయలు పింఛన్‌తో, క్రియాటిన్ 1.4 దాటిన వారికీ మందులు, పరీక్షలు, ప్రయాణ ఖర్చులకు 5 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నారు. కిడ్నీ వ్యాధితో  చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా 5 లక్షల రూపాయలతో పాటు.. ఎకరా సాగుభూమి, ఇల్లు లేనివారికి పక్కాగృహం కేటాయించాలని సీపీఎం  డిమాండ్‌ చేస్తోంది.

143 గ్రామాల్లో 1,251 మంది పేషెంట్లపై సీపీఎం పార్టీ సర్వే చేసింది. పలు ఆసుపత్రుల్లో 91 మంది డయాలసిస్ చేయించుకుంటున్నట్లు తేలింది. వైద్య ఖర్చులు భరించలేక కొందరు కిడ్నీలే తొలగించుకున్నట్లు తెలిసింది. ఒక్కో పేషెంట్‌ నెలకు 12 వేలు ఖర్చు చేస్తున్నా వ్యాధి తగ్గడంలేదు. దీంతో గిరిజన తండాలో పెళ్లిళ్లు కూడా జరగని పరిస్థితి నెలకొంది. తిరువూరు, నందిగామ, మైలవరం ప్రాంతాల్లో తక్షణమే  పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేకపోవడం బాధాకరం. 600 కోట్లతో  ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్న మంత్రి నారా లోకేష్ హామీ నేటికీ అమలు కాలేదు. ప్రభుత్వం బాధితులపక్షాన నిలిస్తే వ్యాధి నియంత్రణకు మార్గం సుగమం అవుతుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

20:21 - August 3, 2018

విజయవాడ : నగరం నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలంపై అధికారపార్టీ నేత కన్ను పడింది. వంద కోట్ల విలువైన భూమిని ఓ వ్యాపారసంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశాడు. నెలకు ఐదు లక్షలకు స్థలాన్ని లీజుకు ఇవ్వడానికి పావులు కదిపారు. గుట్టుచప్పుడు కాకుండా సదరు నేత చేస్తున్న ప్రయత్నాలపై మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై  ప్రతిపక్ష నేతలు ఆందోళనలకు దిగడంతో టెండర్‌ ఉపసంహరించుకొని అబాసుపాలయ్యాడా నేత. 
కాళేశ్వరరావు మార్కెట్‌ సమీపంలో వక్ఫ్‌ బోర్డు  స్థలం
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ భూమి విజయవాడ వన్‌ టౌన్‌లోని కాళేశ్వరరావు మార్కెట్‌ సమీపంలోని వక్ఫ్‌ బోర్డుకు చెందిన స్థలం. ఇందార్‌ ఘర్‌కు పక్కనే ఉన్న 3400 గజాల ఈ స్థలం విలువ వంద కోట్లకుపైగానే ఉంటుంది. వ్యాపార కూడలిగా ఉన్న ఈ ప్రాంతంలోని స్థలంను కమర్షియల్‌ అవసరాలకు వినియోగించుకునేందుకు గతంలో ఎందరో వ్యాపారులు ప్రయత్నించారు. అయితే వక్ఫ్‌ బోర్డు పరిధిలో ఈ స్థలం ఉండటంతో దీనిని దక్కించుకునేందుకు గతంలో జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ కన్ను దీనిపై పడింది. దీంతో ఈ స్థలాన్ని గుట్టు చప్పుడు కాకుండా తనకు సన్నిహితంగా ఉండే ఓ వ్యాపారసంస్థకు అప్పగించే ప్రయత్నం చేశారు. దీనిపైప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ వస్త్ర వ్యాపార సంస్థకు అప్పగించేందుకు జలీల్‌ ఖాన్‌ ప్రయత్నాలు..!
వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన ప్రాంతం కావడంతో ఈ స్థలాన్ని ఓ వస్త్ర వ్యాపార సంస్థకు అప్పగించేందుకు జలీల్‌ ఖాన్‌ ప్రయత్నించారు. ఇందుకోసం జూలై 6న టెండర్లకు పిలువగా,  జూలై 18 వరకు మూడు సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో  జలీల్‌ ఖాన్‌ ఆశీస్సులు ఉన్న సంస్థకే టెండర్లు దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు వంద కోట్ల విలువైన స్థలాన్ని లీజుకు ఇచ్చే విషయంలో గ్లోబల్‌ టెండర్లు నిర్వహించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జలీల్‌ ఖాన్‌ ఈ అక్రమ లీజును వెంటనే రద్దు చేసుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. 
అభివృద్ధి కోసమే లీజుకిచ్చామన్న జలీల్‌ఖాన్‌
మరోవైపు భనానీపురం, నిడమానూరులో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఆక్రమించుకుంటే ఎవరూ మాట్లాడలేదని, అభివృద్ధి కోసం నిబంధనల మేర లీజుకిస్తే రాద్ధాంతం చేయడం సరికాదని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ అంటున్నారు. టెండర్లలో ఈ స్థలానికి లాభం రాకపోతే ఆరోపించిన వారిపై దావా వేస్తానని హెచ్చరించారు. వక్ఫ్‌ ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు, ముస్లిం నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

టీడీపీ ఎంపీలపై ఎంపీ జీవీఎల్‌ ఫిర్యాదు

ఢిల్లీ : బీజేపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు చేసుకుంటుండగా... తాజాగా టీడీపీ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు  ఫిర్యాదు చేశారు. టీడీపీ డ్రామాలతో పార్లమెంట్‌ స్థాయి దిగజారుతుందని ఆరోపించారు. టీడీపీ ఎంపీలు డ్రామాలు ఆపే విధంగా చూడాలని స్పీకర్‌కు జీవీఎల్‌ ఫిర్యాదు చేశారు. 

 

20:15 - August 3, 2018

ఢిల్లీ : బీజేపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు చేసుకుంటుండగా... తాజాగా టీడీపీ ఎంపీలపై లోక్‌సభ స్పీకర్‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు  ఫిర్యాదు చేశారు. టీడీపీ డ్రామాలతో పార్లమెంట్‌ స్థాయి దిగజారుతుందని ఆరోపించారు. టీడీపీ ఎంపీలు డ్రామాలు ఆపే విధంగా చూడాలని స్పీకర్‌కు జీవీఎల్‌ ఫిర్యాదు చేశారు. 

 

20:14 - August 3, 2018

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులు ఆందోళన బాట పట్టారు. పరీక్ష ఫీజులు తగ్గించాలని.. డిటెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో పాటు పలు అంశాలపై ఓయూ ఆర్ట్స్‌ కాలేజీ నుండి అడ్మిన్‌ బిల్డింగ్‌ వరకు దాదాపు 300 మంది బీటెక్‌ విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించి... అనంతరం ధర్నా చేశారు. వీసీ వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. 

 

20:13 - August 3, 2018

 గుంటూరు : రొయ్యలు, చేపల ఉత్పత్తిదారుల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తున్న రుసుమును ఏపీ ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. గతంలో ఒక యూనిట్‌కు ఆరు రూపాయల 80పైసలు వసూలు చేసేవారు. ఇకపై యూనిట్‌కు కేవలం రెండు రూపాయలే వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎగుమతులు, ఉత్పాదక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రొయ్యలు, చేపల రైతాంగానికి.. ప్రభుత్వ నిర్ణయం ఊరటనిస్తుందని.. రాష్ట్ర వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి చెప్పారు. 

20:09 - August 3, 2018

హైదరాబాద్ : సీతారామ ప్రాజెక్ట్‌ టెండర్ల ప్రక్రియలో అవినీతి జరిగిందని ఆరోపించారు కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌ కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రం దివాల తీసిందన్నారు. రాష్ట్రం రాకముందు పది పైసలకు విలువలేని కేసీఆర్‌ కుటుంబం.. రాష్ట్రం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడ బెట్టుకుందని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నందుకు తనపై ఎదురుదాడికి దిగిందని తెలిపారు. నీళ్ల సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని ధన దోపిడికి పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 

 

20:07 - August 3, 2018

ఢిల్లీ : కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. హైకోర్టు విభజన, జోనల్ వ్యవస్థపై న్యాయశాఖ మంత్రితో చర్చించారు. విభజనపై స్పష్టత ఉన్నప్పటికీ జాప్యం జరుగుతుందని కేసీఆర్ వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

20:02 - August 3, 2018

హైదరాబాద్ : టీఆర్ ఎస్ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని కాంగ్రెస్ నేత మల్లుభట్టి విక్రమార్క అన్నారు. తన నియోజకవర్గంలో ప్రొటోకాల్ తో సంబంధం లేకుండా నూతన గ్రామ పంచాయితీలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రొటో కాల్ పై కలెక్టర్ కు, సీఎస్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. నేతలపై చర్యలు తీసుకోకుండా కలెక్టర్ అధికారులను బదిలీ చేశారని  పేర్కొన్నారు. 

 

19:51 - August 3, 2018

హైదరాబాద్ : ప్రభుత్వం మానవీయ ధృక్పథంతో గీతకార్మికులకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన గౌడ ఆత్మీయ సదస్సులో కేటీఆర్‌ పాల్గొన్నారు. గీత కార్మికులు మరణిస్తేనే ప్రభుత్వం పరిహారం ఇవ్వటం లేదని.. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా.. పరిహారం ఇస్తుందన్నారు కేటీఆర్‌. వైన్‌షాపుల విషయంలో గౌడ్స్‌ రిజర్వేషన్‌ కోసం ప్రయత్నిస్తానని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో గౌడ భవన్‌ కోసం 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని.. భవనం పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. 

19:23 - August 3, 2018

కృష్ణా : బీజేపీ, ఎన్ డీఏలను ఓడిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. మనకు రావాల్సిన హక్కుల కోసం బీజేపీ, ఎన్ డీఏలను ఓడించే కేంద్రంలో మనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. ఆ రెండింటిని ప్రజల్లో దోషిగా నిలబెడతామని చెప్పారు. 25 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే ఎవరిని ప్రధాని చేయాలో నిర్ధేశించే స్థాయికి ఎదుగుతామన్నారు. అన్యాయం చేసిన వ్యక్తికి గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. పార్లమెంట్ లో, ఢిల్లీలో, గల్లీలో పోరాటం చేయాలన్నారు. అభివృద్ధి అగిపోతే దెబ్బతింటామని చెప్పారు. ప్రతి గ్రామం స్మార్ట్ గ్రామంగా తయారు కావాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని.. నూతన ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుడతామని తెలిపారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పశువులకు ఆస్పత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే 1100 నెంబర్ కు కాల్ చేసి చెప్పండి అన్నారు. అందరికీ సహకరించి, సుపరిపాలనకు నాంది పలకాలని కోరారు. సమర్థవంతంగా పని చేసి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వాలని చెప్పారు. నీతి నిజాయితీగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేయాలన్నారు. 

 

19:11 - August 3, 2018

 ఢిల్లీ : టీడీపీ ఎంపీల తీరుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎంపీలు డ్రామాలాడుతూ పార్లమెంట్‌ స్థాయిని దిగజారుస్తున్నారని ఆరోపించారు. రోజుకో నాటకం, వేషం వేస్తూ పార్లమెంట్‌ను అభాసుపాలు చేస్తున్నారని, టీడీపీ డ్రామాలకు తెరదించాలని స్పీకర్‌కు లేఖ ఇచ్చానని జీవీఎల్‌ చెప్పారు. ప్రచారం కోసం పార్లమెంట్‌ను ఉపయోగించుకోవడం సరికాదని, పాలన వదిలేసి దగా రాజకీయాలు చేస్తున్నారని నరసింహారావు ఆరోపించారు. వారి డ్రామాలకు త్వరలో తెరపడబోతుందన్నారు. తప్పుడు ప్రచారాన్ని, ప్రణాళికలను మానుకోవాలన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఇలాంటి ప్రచారం చేసుకోవడానికి కాదని చెప్పారు. 

 

19:01 - August 3, 2018

హైదరాబాద్ : ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తుంటే.. టీఆర్ ఎస్ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. సమస్యలపై నిలదీస్తుంటే అడ్డగోలుగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. చర్చల ద్వారా ప్రజలకు సమాధానం చెప్పాలమని అడిగితే ఎదురుదాడి చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టుకు 2500 కోట్ల రుపాయలు అంచనాలు పెంచారని.. ధన దాహం తీర్చుకునేందుకు, దోచుకోవడం కోసమే ప్రాజెక్టు నిర్మాణం అంచనాలు పెంచుతున్నారా..? అని ప్రశ్నించారు.  

 

19:00 - August 3, 2018

కృష్ణా : బీజేపీ, మోడీకి భయపడబోమని సీఎం చంద్రబాబు అన్నారు. బీజేపీ, మోడీలకు భయపడి రాజీనామాలు చేయలేదని స్పష్టం చేశారు. హక్కులు సాధించే వరకు కేంద్రంపై రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. జిల్లాలోని విసస్నపేటలో నిర్వహించిన ఐదో గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కేంద్రం నమ్మక ద్రోహం చేసిందని..కుట్ర రాజకీయాలు చేశారని మండిపడ్డారు. వైసీపీ వెంట వెళితే..'కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే' అని' ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చారని..రూటే మార్చేశారని అన్నారు. సింగపూర్ గవర్నమెంట్ దేశంలో ఒక్క ఏపీని మాత్రమే నమ్మి సహకరిస్తున్నారని అన్నారు. ఒక్క పైసా తీసుకోకుండా రాజధాని అమరావతికి డిజైన్ ఇచ్చారని తెలిపారు.
ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం అండ
ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. 100 రోజలు ఉపాధి హామీ పనిని 120 రోజులకు కన్సిడర్ చేశామని తెలిపారు. టీడీపీ పేదల ప్రభుత్వమని..ఉపాధి కల్పిస్తామన్నారు. సులభతర పద్ధతులలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ప్రజలకు అండగా ఉందామని... మనవతా దృక్పథంతో ముందుకు పోదామని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం టీమ్ గా పని చేసి అభివృద్ధి సాధించడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఏపీకి న్యాయం జరగాలన్నారు. మాయ మాటలు చెప్పి మభ్య పెట్టారని మండిపడ్డారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లాలన్నారు. చెప్పిన మాటలను కేంద్రం పెడచెవిన పెట్టారు...అప్పుడు కేంద్రం, ఎన్ డీఏ నుంచి బయటికి వచ్చామని చెప్పారు. అనంతరం కేంద్రంపై టీడీపీ ఎంపీలు ఢిల్లీని గడగడలాడించారని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా, విభజన హామీలపై పార్లమెంట్ లో మోడీని ఎంపీ కేశినేని నాని నిలదీశారని తెలిపారు. రాజకీయంతో రాష్ట్రాన్ని విభజించారని... తాను సీఎం అయిన మూడు నెలలకే హుదూద్ తుపాన్ వచ్చిందన్నారు.
నదులు అనుసంధానం
నదులు అనుసంధానం, వర్షపు నీటిని భూగర్భ జలాలు మార్చడం ద్వారా పైరర్లు కాపాడుకోగలిగామన్నారు. నదుల అనుసంధానం చేసి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు నీటిని అందించామని తెలిపారు. ఎక్కడ ఇబ్బంది, ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ టీడీపీ ఉంటుందని హామీ ఇచ్చారు. సంపద రావాలంటే కష్టపడాలని సూచించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని తెలిపారు. దీనికి యంత్రాంగం సహకారం ఎంతో ఉందన్నారు. 

టీడీపీ ఎంపీల తీరుపై స్పీకర్ కు జీవీఎల్ ఫిర్యాదు..

ఢిల్లీ: టీడీపీ ఎంపీల తీరుపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎంపీలు డ్రామాలాడుతూ పార్లమెంట్‌ స్థాయిని దిగజారుస్తున్నారని ఆరోపించారు. రోజుకో నాటకం, వేషం వేస్తూ పార్లమెంట్‌ను అభాసుపాలు చేస్తున్నారని, టీడీపీ డ్రామాలకు తెరదించాలని స్పీకర్‌కు లేఖ ఇచ్చానని జీవీఎల్‌ చెప్పారు. ప్రచారం కోసం పార్లమెంట్‌ను ఉపయోగించుకోవడం సరికాదని, పాలన వదిలేసి దగా రాజకీయాలు చేస్తున్నారని నరసింహారావు ఆరోపించారు.

పోట్రోకాల్స్ పాటించటంలేదు : భట్టి

హైదరాబాద్ : ప్రభుత్వ కార్యక్రమాలను టీఆర్ఎస్.. పార్టీ ప్రోగ్రామ్స్‌గా నిర్వహిస్తోందని భట్టి ఆరోపించారు. మథిర నియోజకవర్గంలో కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే.. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులనే కలెక్టర్లుగా చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు.. దొంగతనంగా అధికారులు చార్జ్ తీసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై సీఎస్, స్పీకర్‌లకు ఫిర్యాదు చేస్తానని భట్టి తెలిపారు.

16:59 - August 3, 2018

మెడ, నడుమునొప్పి.. వయసుతో సంబంధంలేకుండా ఎంతోమందిని ఇబ్బంది పెడుతుంది.. మెడ, నడుము నొప్పి రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి? వెన్నెముకలో ఏం జరుగుతుంది? గత కొన్నేళ్లుగా ఎటువంటి మందులు, సర్జరీలు లేకుండా, సహజమైన పద్దతులతో ఎందరికో చికిత్స అందిస్తున్న సంస్థ సంజీవని నేచర్‌ క్యూర్‌, నేచురోపతిలో గోల్డ్‌మెడలిస్ట్ డాక్టర్‌ మధుగారు మనతోపాటు స్టుడియోలో ఉన్నారు..మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

16:55 - August 3, 2018

రాజమహేంద్రవరం : గోదావరి తీరంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ వ్యవహారం మూడు గ్రూపులు, ఆరు శిబిరాలుగా తయారవుతోంది. పార్టీ అధినేత అధికారం కోసం కంటున్న కలలకు సొంత పార్టీ నేతలే తూట్లు పొడిచేలా ఉన్నారు. రాజమహేంద్రవరంలో వైసీపీ తీరుపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం..

గోదావరి జిల్లాల్లో పట్టు సాధించేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.  ఇటీవల జగన్ పాదయాత్రకు గోదావరి వంతెనపై  ప్రజలు పోటెత్తడంతో..   అధికారంపై ఆశలు రెట్టింపయ్యాయి. కానీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో అసలుకే ఎసరొచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజమహేంద్రవరం రూరల్, అర్బన్ స్థానాల్లో వర్గపోరుతో  వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. రాజమహేంద్రవరం అర్బన్ సీటు ఈసారి తనకేనన్న భావనలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు.  ఆయన వైఎస్ హయాంలో  రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనను మరోసారి గెలిపిస్తాయన్న ఆశాభావంతో ఉన్నారు.  

రాజమహేంద్రవరం అర్బన్ సీటు తనకిస్తే.. వైసీపీలో చేరేందుకు సిద్ధమంటూ సంకేతాలు పంపుతున్నారు ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం. మాజీ సీఎం రోశయ్య శిష్యుడిగా పేరుపొందిన ఈయనకు  వైసీపీ నుంచి స్పష్టత రావడం లేదు. కార్పొరేషన్‌లో వైసీపీ పక్ష నేతగా ఉన్న మేడపాటి షర్మిళా రెడ్డి కూడా ఇదే సీటువైపు ఆశగా చూస్తున్నారు. జక్కంపూడి వర్గం ఆశీస్సులతో ఎలాగైనా తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు షర్మిళారెడ్డి. 

వైసీపీలో ఆశావాహుల సంఖ్య పెరగడంతో అంతర్గత పోరు పెరుగుతోంది. దీనికి తోడు అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో మరింత గందరగోళంగా మారింది.   దీంతో రాజమహేంద్రవరం సిటీలో వైసీపీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. మరోవైపు  రూరల్ వ్యవహారం అలాగే ఉంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆకుల వీర్రాజుకే మరోసారి అవకాశం దక్కుతుందన్న ప్రచారం సాగుతోంది. దీంతో  ఈ సీటు కోసమే  వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పునరాలోచనలో పడ్డారు. టికెట్‌ రాకుంటే.. పార్టీని వీడేందుకు సైతం ఆయన వెనకాడరన్న ప్రచారం సాగుతోంది.

అర్బన్, రూరల్ రాజకీయాల్లో జక్కంపూడి కుటుంబం జోక్యం వైసీపీకి తలనొప్పిగా మారుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వైసీపీ అధిష్టానం ఇప్పటికైనా జోక్యం చేసుకుని స్పష్టత ఇవ్వకుంటే... పరిస్థితి మరింత సమస్యాత్మకంగా మారుతుందంటున్నాయి పార్టీశ్రేణులు. 

16:52 - August 3, 2018

ఢిల్లీ : వైసీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డితోనే ఏపీకి ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. తాము ఎంపీలుగా రాజీనామా చేసినప్పటికీ ప్రజలతో కలిసి రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులను, అధికారులను కలిశామన్నారు.

 

16:44 - August 3, 2018

నెల్లూరు : జిల్లాలోని రాపూరు సోలీస్‌ స్టేషన్‌పై దళితులు చేసిన దాడిపై ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ స్పందించింది. కమిషన్‌ సభ్యులు బద్దెపూడి రవీంద్ర ఆధ్వర్యంలో ఘటనపై విచారణ చేపట్టారు. పలువురు దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి స్టేషన్‌కు వెళ్లి, డీఎస్పీ రాంబాబుతో పాటు ఫిర్యాదు దారుడు జోసఫ్‌తో రవీంద్ర మాట్లాడారు. అనంతరం దాడికి జరిగిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. 

టీ.కేబినెట్ సబ్‌కమిటీ భేటీ..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌, డిగ్రీ కాలేజీల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలుపై మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తోంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుపై మంత్రులు చర్చిస్తున్నారు. ఈ బాధ్యతలు అక్షయ పాత్రకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అక్షయపాత్ర భోజనాలను మంత్రులు రుచిచూశారు.

మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు తప్పిన ప్రమాదం..

అనంతపురం: మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. జిల్లాలోని బెలుగుప్ప మండలం కాలువపల్లి దగ్గరలో శ్రీనివాస్‌ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. అయితే ఆయన ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు కల్వర్టును ఢీ కొట్టింది. వాహనంలో జెడ్పీ చైర్మన్ నాగరాజు కూడా ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. వీరికి ఎలాంటి హాని కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాద విషయం సీఎం చంద్రబాబుకు తెలియడంతో ఫోన్ ద్వారా కాల్వను పరామర్శించారు.

కరుణను పరామర్శించనున్న రాష్ట్రపతి..

తమిళనాడు : అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పరామర్శించనున్నారు. ఈ నెల 5న రామ్ నాథ్ చెన్నై వెళ్లనున్నారు. కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణను పరామర్శిస్తారని చెన్నైలోని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే కరుణానిధిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఇతర రాష్ట్రాల నేతలు ఇప్పటికే పరామర్శించారు.

ప్రేమజంట ఆత్మహత్యా యత్నం..

ఆదిలాబాద్ : తలమడుగు మండలం కె.పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ప్రియుడు రమేశ్ మృతి చెందగా..యువతి మాధవి పరిస్థితి విషమంగా వుంది. 

16:01 - August 3, 2018

గుంటూరు : గ్రామాలలో అమలవుతున్న సంక్షేమ పథకాల పనితీరును ప్రభుత్వం గ్రామదర్శిని ద్వారా తెలుసుకుంటుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వటంతో టీడీపీ మేనిఫెస్టో 99 శాతం పూర్తయిందని డొక్కా తెలిపారు. బీజేపీ నేత సోము వీర్రాజు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. ఈ ఆరోపణలు ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధి నిరోధకునిగా సోమువీర్రాజు వ్యవహరిస్తున్నారని.. వ్యవహారశైలి మార్చుకోవాలని డొక్కా సూచించారు. 

 

కరుణను పరామర్శించనున్న చంద్రబాబు..

అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు రేపు చెన్నై వెళ్లనున్నారు. డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధిని పరామర్శించేందుకు చంద్రబాబు చెన్నైలోని కారవేరీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. చెన్నై పర్యటన ముంగించుకున్న చంద్రబాబు తిరిగి తిరుపతి చేరుకోనున్నారు. తిరుపతిలో జ్నానభేరి పేరిట ఎస్వీయూ విద్యార్ధులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు.

15:58 - August 3, 2018

కరీంనగర్‌ : జిల్లాలోని జమ్మికుంటలో ఓ గ్రామ పంచాయితీ ఉద్యోగి టవర్‌ ఎక్కి ఆందోళనకు దిగాడు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని గ్రామ పంచాయితీ సిబ్బంది నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవటంతో జమ్మికుంటలోని గంగారపు కిరణ్‌ అనే ఉద్యోగి టవర్‌ ఎక్కి నిరసన దిగాడు. ఘటనాస్థలి వద్ద బాధితుని తల్లి బోరున విలపించటంతో కిరణ్‌ టవర్‌పై నుంచి కిందకు దిగివచ్చాడు. 

ఆడ శిశువును విక్రయానికి యత్నం..7గురు అరెస్ట్..

యాదాద్రి : బీబీనగర్ మండలం పలుగుతండాలో ఓ ఆడ శిశువును తల్లిదండ్రులు విక్రయానికి పెట్టారు. మూడో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టటంతో తల్లిదండ్రులు ఆ ఆడపిల్లను విక్రయించేందుకు యత్నించారు. దీనికి ఆర్ఎంపీ డాక్టర్ మధ్యవర్తిత్వం వ్యవహరించాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆర్ఎంపీ, శిశువు తల్లిదండ్రులతో సహా మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. 

గోదావరి నీటితో విస్సన్నపేట ప్రాంతం సస్యశ్యామలం : చంద్రబాబు

కృష్ణా : గోదావరి నీటితో విస్సన్నపేట ప్రాంతం సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. విస్సన్నపేట ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతు..చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమనీ..అధికార పక్షం అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షం రాజకీయాలు చేస్తు అభివృద్ధికి అడ్డుపడుతోందని చంద్రబాబు విమర్శించారు. 

టెక్నాలజీ సమాజ నిర్మాణం మా లక్ష్యం : కేటీఆర్

హైదరాబాద్ : టెక్నాలజీ ఆధారిత సమాజాన్ని నిర్మించటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిశ్రామిక విప్లవంలో డిజిటల్ విప్లవం కీలకమైనదన్నారు. అభివృద్ధికి బ్లాక్ చైన్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతోందనీ..మానవాభివృద్ధిలో ఇదొక సరికొత్త అధ్యాయమని తెలిపారు. వివిధ శాఖలను ఈ కొత్త టెక్నాలజీ సమన్వయం చేస్తోందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో విశ్వసనీయత పెరుగుతుందనీ..బ్లాక్ చైన్ టెక్నాలజీతో మోసాలను కూడా అరికట్టవచ్చన్నారు. భూ రికార్డులు, ఓటింగ్ రికార్డులు, హెల్త్ రికార్డులు బ్లాక్ టెక్నాలజీ ద్వారా సురక్షితంగా ఉంటాయని కేటీఆర్ తెలిపారు.

15:42 - August 3, 2018

ఢిల్లీ : తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో భేటీ అయ్యారు. హైకోర్టు విభజన అంశంపై న్యాయశాఖ మంత్రితోమ చర్చించనున్నారు. విభజనపై స్పష్టత ఉన్నప్పటికీ అనవసరంగా జాప్యం జరుగుతోందని మంత్రికి కేసీఆర్ వివరించనున్నారు. హైకోర్టు విషయంపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడంతో కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఎంపీలం కాకపోయినా మంత్రులను కలిస్తున్నాం : వరప్రసాద్

ఢిల్లీ : ఆరోగ్య సంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రిని కోరామని వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం తాము ఎంపీలం కాకపోయినా నిధుల కోసం మంత్రులు, అధికారులను కలుస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా జగన్ తోనే సాధ్యమన్నారు. కడప స్టీల్ ప్లాంట్, దుర్గరాజపట్నం పోర్ట్, ఎయిర్ పోర్టులు రావాలంటే జగన్ అధికారంలోకి రావాలన్నారు. హోదా కోసం రాజీనామాలు చేసినందుకు సంతోషంగా వుందన్నారు. 

15:36 - August 3, 2018

ఢిల్లీ : హస్తినలో టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం దగ్గర ఎంపీలు ధర్నా చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి పార్లమెంట్ లోపల, వెలుపల టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. 

భూకుంభకోణంలో నేతల పేర్లను వెల్లడించాలి : సీపీఐ రామకృష్ణ

విజయనగరం : కొత్త వలస బలిగట్టంలో వివాదాస్ప భూమిని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. 2008లో బలిగట్టంలో 91 ఎకరాల్లో రూ.500కోట్ల భూకుంభకోణం కేసులో భూ ట్యాంపరింగ్ చేశారని తెలిపారు. విశాఖలో రూ.2500 కోట్ల భూకుంభకోణం జరిగిందని..దీనిపై సిట్ నివేదిక ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. సిట్ నివేదికలో అధికార పార్టీలకు చెందిన నేతలున్నారని..అందుకే నివేదికను బహిర్గతం చేయలేదని రామకృష్ణ ఆరోపించారు.

ప్రైవేటు స్కూల్ అరాచకం..ఫీజ్ కట్టలేదనీ..

హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో ప్రైవేటు స్కూల్ దారుణాలు పెరిగిపోతున్నాయి. ఫీజు చెల్లించడం లేదని..ఇతరత్రా కారణాలతో విద్యార్థులను హింసిస్తున్నారు. తాజాగా దిల్ సుఖ్ నగర్ లో ఉన్న ఎస్ఆర్ డిజి స్కూల్ లో ఐదు, ఆరు తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థులను గదిలో బంధించిన దారుణ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీనిని ప్రశ్నించడానికి వచ్చిన తల్లిదండ్రులను స్కూల్ లోపలికి రానీయకుండా గేట్లకు తాళాలు వేశారు. దీనితో మలక్ పేట పీఎస్ లో స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు.

సుప్రీంకోర్టు కొలీజియం వివాదానికి తెర..

ఢిల్లీ : సుప్రీంకోర్టు కొలీజియంతోవున్న వివాదానికి తెర పడింది. ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కేఎం.జోసెఫ్ ను సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ జోసెఫ్ తో పాటు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒడిశా హైకోర్టు చీఫ్ జస్టిస్ వినీత్ శరణ్ కూ సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమోషన్ లభించింది. జనవరి 10న జోసెఫ్ పేరుతో సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది.   

15:17 - August 3, 2018

సంగారెడ్డి : సదాశివపేట ఎమ్ ఆర్ ఎఫ్ పరిశ్రమ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం తీరుకు నిరసనగా 600 మంది కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం, కార్మిక సంఘం నాయకుల చీకటి ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం కార్మిక వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకొని హామీలను విస్మరించిందని ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికుల ఆందోళనకు సీఐటీయూ మద్దతు తెలిపింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

క్రికెట్ బెట్టింగ్, 15మంది అరెస్ట్..

గుంటూరు : నర్సరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న 15మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్దనుండి రూ.3.80 లక్షల నగదు, 3 ల్యాబ్ టాప్ లు, టీవీ, కమ్యూనికేటర్ బాక్సులు,10 సెల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ అప్పల నాయుడు మాట్లాడుతు..ఇప్పటి వరకూ 200ల బెట్టింగ్ లను ఛేదించామని తెలిపారు. 

పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం..

కృష్ణా : విసన్నపేట మండలం తాతగుంట్లలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సేద్యపుకుంట, ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం, వర్మి కంపోస్ట్ ను ప్రారంభించి చంద్రబాబు మొక్కలు నాటారు. అనంతరం చంద్రబాబు ఎంపీపీ స్కూల్ ను సందర్శించి గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. 

పీసీసీ సంప్రదింపుల కమిటీ భేటీ..

హైదరాబాద్ : గాంధీ భవన్ లో పీసీసీ సంప్రదింపుల కమిటీ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, రాజనర్శింహ హాజరయ్యారు. పార్టీలో నేతల చేరిక వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. 

15:05 - August 3, 2018

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్ లో మరో విషాదం చోటు చేసుకుంది. మరొక విద్యార్థి మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం గోడ కూలిపోవడంతో గురువారం ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న ఒక విద్యార్థి శుక్రవారం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. విద్యార్థుల మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జేసీ అక్కడకు చేరుకుని అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మేడ్చల్ జిల్లా విద్యాశాఖాధికారులు సీరియస్ అయ్యారు. స్కూల్ ను సీజ్ చేశారు.
తల్లిదండ్రులు..విద్యార్థి సంఘాల ఆందోళన...
ప్రభుత్వం తరపున పరిహారం ఇప్పించే విధంగా కృషి చేస్తామని జేసీ పేర్కొన్నారు. కానీ తమకు లిఖిత పూర్వకంగా ఇచ్చేంత వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. మరోవైపు స్కూల్ యాజమాన్యంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ స్కూల్ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. దీనితో పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై మేడ్చల్ జిల్లా విద్యాశాఖాధికారులు సీరియస్ అయ్యారు. స్కూల్ ను సీజ్ చేశారు. స్కూల్ ను కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయనుంది. స్కూల్ ను సీజ్ చేయడం..కూల్చివేస్తామని అధికారులు పేర్కొనడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. విద్యా సంవత్సరం మధ్యలో స్కూల్ ను సీజ్ చేసినా ఎలాంటి ఆందోళన చెందవద్దని..సమీప పాఠశాలల వారితో మాట్లాడి అందులో విద్యార్థులను చేరిపిస్తామని డీఈవో హామీనిచ్చారు. తల్లిదండ్రులపై భారం పడకుండా కూడా చూస్తామన్నారు.

 

14:57 - August 3, 2018

హైదరాబాద్ : గాంధీభవన్ లో టీపీసీసీ సంప్రదింపుల కమిటీ భేటీ అయింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ్మ, డీ.అరుణ, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. పార్టీలో చేరికలపై చర్చించనున్నారు.వీరిని తీసుకుంటే పార్టీకి వచ్చే లాభాలేంటీ? తీసుకోకపోతే పార్టీకి వచ్చే నష్టాలేంటి? అనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే చేర్చుకోవడానికి పార్టీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

3కు చేరిన న్యూ సెంచరీ విద్యార్ధుల మృతుల సంఖ్య..

మేడ్చల్ : కూకట్ పల్లి న్యూసెంచరీ పబ్లిక్ స్కూల్లో నిన్న కల్చరల్ స్టేజీ కూలిన ఘటనలో ఇద్దరు విద్యార్ధులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పీలువురికి గాయాలవ్వగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక విద్యార్థి మృతి చెందారు. దీంతో న్యూసెంచరీ స్కూల్ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. 

ఏపీ విభజన అంశాలపై సుప్రీంకోర్టులో వరుస పిటీషన్లు..

ఢిల్లీ : ఏపీ విభజన అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలవుతున్నాయి. కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు, చలసాని ప్రసాద్ లు వేసిన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా నాలుగు వారాల్లోగా లిఖితపూర్వక వాదనలను ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపింది. విభజన చట్టానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అన్ని పిటిషన్లను కలిపి విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.

యాదిద్రిలో బాలికలు మా పిల్లలేనంటున్న దంపతులు..

యాదాద్రి : యాదగిరి గుట్ట పోలీసులు సంరక్షణలో 15 మవంది చిన్నారులు సురక్షితంగా వున్నారు. పోలీసులు సంరక్షణలో తమ పిల్లలు వున్నారని తెలిసిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మౌనిక అనే చిన్నారి తమ కుమార్తెనంటు ప్రకాశం జిల్లాకు చెందిన దుబ్బయ్య, విశ్రాంతమ్మ అనే దంపతులు పోలీసులను ఆశ్రయించగా..బిందు అనే చిన్నారి కోసం ఈసీఎల్ కు చెందిన అనురాధ, కృష్ణ అనే దంపతులు పోలీసులను ఆశ్రయించారు. కాగా గత కొంతకాలంలో బాలికలను అపహరిస్తు వారిని వేశ్యా వృత్తిలో దింపేందుకు ప్రయత్నిస్తున్న ఓ ముఠాను ఇటీవల యాదగిరిగుట్ట వద్ద చేపట్టిన పోలీసుల ఆపరేషన్ లో పట్టుకున్న సంగతి తలిసిందే.

భారత్ లో చొరబాటుకు 600ల మంది ఉగ్రవాదులు..

జమ్ము కశ్మీర్ : పాక్ భూభాగం నుంచి భారత్ లోకి చొరబడేందుకు ఏకంగా 600 మంది ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారు. నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్న పలు స్థావరాల్లో వీరు ఉన్నారని... భారత్ లోకి అడుగు పెట్టేందుకు అదను కోసం వేచి చూస్తున్నారని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర హోం శాఖకు ఓ నివేదికను అందించాయి. కశ్మీర్ లో కల్లోలం సృష్టించడమే వీరి లక్ష్యమని తెలిపాయి. వీరికి పాక్ సైన్యం అండదండలు ఉన్నాయని చెప్పింది. ఉగ్రవాదులను ఏరి వేసేందుకు భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేపట్టిన తర్వాత... ఇంత భారీ సంఖ్యలో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధం కావడం ఇదే ప్రథమం.

13:35 - August 3, 2018

పశ్చిమగోదావరి : విద్యార్థులకు అందాల్సిన నిత్యావసర సరుకులను కొంతమంది కాంట్రాక్టు టీచర్లు అక్రమంగా తరలిస్తున్నారు. తరలిస్తున్న దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డు కావడం..ఆ రికార్డు శుక్రవారం బయటకు రావడంతో..వారు చేస్తున్న దోపిడి బయటపడింది. ఈ ఘటన ద్వారకా తిరుమల బాలయోగి గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. గతంలో ఇలాగే చేయడంతో అధికారులు ప్రిన్స్ పాల్ సుధారాణిని సస్పెండ్ చేశారు. కానీ అక్కడి టీచర్లలో మాత్రం మార్పు రాలేదు. విద్యార్థులకు అందాల్సిన డ్రెస్ లు, బిస్కెట్ లు..ఇతరత్రా నిత్యావసర వస్తువులను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతి రోజు రాత్రి రెండు గంటలకు వచ్చే పాల వ్యాన్ లో వీటిని తరలిస్తున్నారు. అంతేంగాకుండా కొంతమంది విద్యార్థులను మచ్చిక చేసుకుని వారి వారి నివాసాల్లో పనులు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. ఇన్ ఛార్జీ ప్రిన్స్ పాల్ అక్కడనే ఉండకుండా వేరే ప్రాంతంలో ఉంటున్నారని సమాచారం. మరి దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

13:25 - August 3, 2018

హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో ప్రైవేటు స్కూల్ దారుణాలు పెరిగిపోతున్నాయి. ఫీజు చెల్లించడం లేదని..ఇతరత్రా కారణాలతో విద్యార్థులను హింసిస్తున్నారు. తాజాగా దిల్ సుఖ్ నగర్ లో ఉన్న ఎస్ఆర్ డిజి స్కూల్ లో ఐదు, ఆరు తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థులను గదిలో బంధించిన దారుణ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీనిని ప్రశ్నించడానికి వచ్చిన తల్లిదండ్రులను స్కూల్ లోపలికి రానీయకుండా గేట్లకు తాళాలు వేశారు. దీనితో మలక్ పేట పీఎస్ లో స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా ? వేచి చూడాలి. 

13:24 - August 3, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మహిళలు..విద్యార్థులపై లైంగిక వేధింపులు అధికమౌతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రధానంగా సన్మాన మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులు సభ్య సమాజం తలదించుకొనేలా చేస్తున్నారు. విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని డీడీ కాలనీలో చైతన్య స్కూల్ విద్యార్థులపై రమేశ్ అనే ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చైతన్య స్కూల్ కు చేరుకుని రమేశ్ ను చితకబాదారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్కూల్ కు చేరుకుని రమేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన రమేశ్ ను ఆసుపత్రికి తరలించి కేసులు నమోదు చేశారు.

13:13 - August 3, 2018

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్ లో మరో విషాదం చోటు చేసుకుంది. మరొక విద్యార్థి మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం గోడ కూలిపోవడంతో గురువారం ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతున్న ఒక విద్యార్థి శుక్రవారం మృతి చెందాడు. దీనితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జేసీ అక్కడకు చేరుకుని అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

తల్లిదండ్రులు..విద్యార్థి సంఘాల ఆందోళన...
ప్రభుత్వం తరపున పరిహారం ఇప్పించే విధంగా కృషి చేస్తామని జేసీ పేర్కొన్నారు. కానీ తమకు లిఖిత పూర్వకంగా ఇచ్చేంత వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి. మరోవైపు స్కూల్ యాజమాన్యంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ స్కూల్ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. దీనితో పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై మేడ్చల్ జిల్లా విద్యాశాఖాధికారులు సీరియస్ అయ్యారు. స్కూల్ ను కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయనుంది.

స్కూల్ సీజ్...
స్కూల్ ను సీజ్ చేయడం..కూల్చివేస్తామని అధికారులు పేర్కొనడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. విద్యా సంవత్సరం మధ్యలో స్కూల్ ను సీజ్ చేసినా ఎలాంటి ఆందోళన చెందవద్దని..సమీప పాఠశాలల వారితో మాట్లాడి అందులో విద్యార్థులను చేరిపిస్తామని డీఈవో హామీనిచ్చారు. తల్లిదండ్రులపై భారం పడకుండా కూడా చూస్తామన్నారు.

మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందన..
ఈ ఘటన జరగడం బాధాకరమని, మృతి చెందిన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు తెలిపారు. స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని, ఎఫ్ఐఆర్ జారీ అయ్యిందన్నారు. కేర్ టేకర్ ను అరెస్టు చేయడం జరిగిందని, యజమానులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోందని వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గాయపడిన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఒకరు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారన్నారు. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని..ఇందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు తెలిపారు. స్కూల్ ను సీజ్ చేయడంతో అక్కడున్న విద్యార్థులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాల శిథిలావస్థకు చేరుకుందనే విషయం వాస్తవమని అందుకే ఈ ఘటన జరగినట్లు తెలుస్తోందన్నారు. పాఠశాలలను తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. 

13:07 - August 3, 2018

సమంతా..తెలుగులో సూపర్, డూపర్ హిట్ హీరోయిన్..సాధారణంగా హీరోయిన్స్ అంటే ముఖ్యంగా తెలుగులో కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితంగా నిలిచిపోతుంటారు. కానీ సమంతా అలా కాదు..కేవలం గ్లామర్ చట్రంలోనే ఇరుక్కుపోలేదు. విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ సమంత వరుస విజయాలతో తన మార్క్ ను నిలబెట్టుకుంటోంది. అంతేకాదు టాలీవుడ్ లో అగ్ర సంస్థ, అగ్రహీరోలు వున్న కుటుంబానికి ముద్దుల కోడలు కూడాను. అలాంటి సమంత మరో వైవిధ్యభరితమైన కథాంశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఫిల్మ్ నగర్లో టాక్ పక్కాగా వినిపిస్తోంది.

'మిస్ గ్రానీ'కి రీమేక్ లో సమంతా..
దర్శకురాలు నందినీ రెడ్డి .. సమంతకు మధ్య కొన్ని రోజులుగా కథా చర్చలు జరుగుతున్నాయట. 2014లో వచ్చిన కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్ అని అంటున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపిస్తూ ఉంటుంది. అతీత శక్తులను కలిగిన ఆమె అవసరమైనప్పుడు యవ్వనవతిగా మారిపోతూ ఉంటుందట. అటువంటి పాత్రలో సమంతను చూపించాలనే ఉద్దేశంతోనే నందినీ రెడ్డి ఉన్నారట. కొత్తదనంతో కూడిన పాత్రలనే ఎక్కువగా చేస్తానని ఇటీవలే చెప్పిన సమంత, ఈ సినిమా చేసే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు సినీ పరిశ్రమ వర్గాల భోగట్టా..

ఇండియాలో 'విషాద దశ'..హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

మహారాష్ట్ర : ఇండియాలోని ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం కరవైందని, కనీసం స్వేచ్ఛగా కూడా తిరగలేని దుస్థితిలోకి దేశం నెట్టివేయబడిందని బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో కలకలం రేపిన నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే హత్య కేసుల విచారణను న్యాయస్థానం పర్యవేక్షణలో జరిపించాలన్న పిటిషన్ ను విచారిస్తున్న సందర్భంగా న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

12:31 - August 3, 2018
12:30 - August 3, 2018

ఢిల్లీ : మధ్యాహ్న భోజన పథకం కార్మికుల వేతనాలు పెంచాలని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు. శుక్రవారం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ను ఎంపీ కవిత ఆధ్వర్యంలో పార్టీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా వారు ఒక వినతిపత్రం ఇచ్చారు. కార్మికుల వేతనాలు పెంచాలని, 10, 500 పెంచాలని కోరడం జరిగిందని ఎంపీ కవిత తెలిపారు. అంతేగాకుండా ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40వేల మంది కార్మికులకు మేలు కలిగే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. 

12:27 - August 3, 2018

ఢిల్లీ : విభజన హామీలు..ప్రత్యేక హోదా..ఇతరత్రా సాధించుకోవడానికి కేంద్రంపై టిడిపి ఎలాంటి వత్తిడి పెట్టడం లేదని వైసీపీ మాజీ ఎంపీ వర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కేవలం వైసీపీ మాత్రమే వత్తిడి తెచ్చే విధంగా ప్రయత్నిస్తోందని, మొత్తం 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగిందన్నారు. ఇందుకు టిడిపి సపోర్టు ఇవ్వలేదన్నారు. గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో టిడిపి సపోర్టు ఇస్తుందని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొని చివరకు మొండి చేయి చూపించారని తెలిపారు. అనంతరం పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేసి నిరహార దీక్షకు పూనుకోవడం జరిగిందన్నారు.

తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కోసం పలువురిని కలవడం జరగుతోందన్నారు. ఓఎన్జీసీ అధికారులను కలవడం జరిగిందని, వాటర్ ప్లాంట్లు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. నాలుగు గ్రామాలకు ప్లాంట్లు ఇవ్వడానికి సిద్ధ పడిందని, రోడ్ల కోసం కోటి రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాను కలిసి స్విమ్స్, రుయా ఆసుపత్రులకు నిధులు కేటాయించాలని కోరినట్లు, నిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి చెందడం లేదని తెలియచేసినట్లు తెలిపారు. ఒక్కో ఆసుపత్రికి రూ. 50 కోట్లు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. తాను తిరుపతికి వెళ్లిన అనంతరం ప్రభుత్వం తరపున ఒక నివేదిక..తన నివేదికలను అందించడం జరుగుతుందన్నారు. 

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలన్నీ అవాస్తం: డీఎస్ కుమారుడు

నిజామాబాద్ : తనపై వచ్చిన లైంగిక ఆరోపణలన్నీ అవాస్తవమని డీఎస్ కుమారుడు సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తమ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయాలన్న కుట్ర ఈ ఆరోపణల వెనకుందని అన్నారు. తాను ఏ విద్యార్థినినీ లైంగికంగా వేధించలేదని, వారంతా తన ఇంటి బిడ్డల వంటి వారని వ్యాఖ్యానించిన సంజయ్, తాను ఎవరితోనూ సహజీవనం చేయట్లేదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని, నిర్దోషిగా బయటకు వస్తానన్న ధీమా తనకుందని చెప్పారు.

12:20 - August 3, 2018

ఢిల్లీ : పార్లమెంట్ వేదికగా తాము చేస్తున్న పోరాటం..ఆందోళనకు ఏపీ ప్రజలు అభినందిస్తున్నారని టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం కూడా టిడిపి ఎంపీల ఆందోళన కొనసాగింది. గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. విభజన హామీలు అమలు చేయాలి...ప్రత్యేక హోదా కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ పోరాటం..ఆందోళనలను ప్రజలు అభినందిస్తున్నారని, ప్రజలకు మూడు పార్టీల మీద సానుభూతి లేదని, కేవలం సీఎం చంద్రబాబు నాయుడిపైనే ఉందన్నారు. కేంద్రం ఇంకా మౌనంగానే ఉంటోందని..తమ పోరాటం మాత్రం కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు. 

12:18 - August 3, 2018

కేరళ : కష్టాలు వెల్లువలా వస్తే ఎదురీది బైటపడేందుకు కొంతమంది తమ శాయశక్తులా పోరాడటాతరు. మరికొందరు తమను ఎవరైనా ఆదుకుని కష్టాల నుండి గట్టెక్కించకపోతారా? అని ఎదురు చూస్తుంటారు. ఇంకొందరు వాటిలోనే కృంగిపోయి పాతాళానికి జారిపోతారు. కానీ కొందరు మాత్రమే ఎవరూ తమకు అండలేకపోయినా..ఒంటిరిగానే కష్టాలను అధిగమించేందుకు శ్రమిస్తూనే తన కలల సాకారానికి పోరాడుతుంటారు. ఈ క్రమంలో అనుకోకుండా తాము చేస్తున్న కష్టానికి అనూహ్యంగా ప్రోత్సహం వచ్చినప్పుడు వారికి నిజమైన న్యాయం జరుగుతుంది. ఇటువంటి గుర్తింపును, ప్రోత్సాహాన్ని అందుకున్న ఓ సాధారణ యువతి విజయగాధను తెలుసుకుందాం...

ఆత్మవిశ్వాసంతో సాగిపోతున్న హనన్..
జీవనయానంలో కష్టాలనే ముళ్ళను ఒడుపుగా ఏరిపారేస్తు.. నైపుణ్నా పెంపొందించుకుంటు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నవారే విజ్నులు. ఆ విజ్నత అనేది వారి జీవితానికి ఒక మైలురాయిగా మారిపోవచ్చు. అటువంటి అవకాశాలను అందుకున్నవారే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. దీనికి ఉదాహరణగా కేరళలోని హనన్ హమీద్ అనే పందొమ్మిదేళ్ళ విద్యార్థిని యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. తన కుటుంబంలోని ఆర్థిక ఒడుదొడుకులను అధిగమించేందుకు ఆమె అనేక రకాలుగా శ్రమిస్తోంది. తన కలల సాకారం కోసం నిరంతరం పోరాడుతోంది. ఇటువంటివారిని ప్రోత్సహించకున్నా వారి ఆత్మవిశ్వాసంతో ముందుకు కొనసాగిపోతుంటారు. కానీ ఛాందసపు పొరలు కట్టిన కొందరు ఆమెను ఎగతాళి చేయటమే కాక స్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాటిని ఖాతరు చేయని ఆ ధీశాలి మాత్రం తన కష్టాన్నే నమ్ముకుని ముందుకే అడుగులు వేస్తోంది. ఆ ఆత్మవిశ్వాసపు అడుగులకు గుర్తింపు, ప్రోత్సాహం లభించింది.

హనన్ హమీద్ కు ప్రముఖుల అండ..
కేరళలోని హనన్ హమీద్ అనే విద్యార్థిని జీవనం సోషల్ మీడియాలో వైరల్‌ మారింది. ఈమెను కొందరు అభినందిస్తుంటే..మరికొందరు ప్రచారం కోసమేనంటూ విమర్శిస్తున్నారు. ఇంకొందరు ఛాందసవాదులు ఆమెను ఎగతాళి చేస్తూ బెదిరిస్తున్నారు. హనన్‌ చదువుతున్న కలేజీ యాజమాన్యంతోపాటు కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ కూడా ఆమెకు మద్దతిచ్చారు. ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా ఆమెకు అండగా నిలుస్తానని మాటిచ్చారు.
ఉన్నత విద్యే లక్ష్యంగా కష్టపడుతున్న హనన్..
హనన్ ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు చేపలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసింది.కేరళలోని ఎర్నాకుళంకు చెందిన ఈమె చేపలు అమ్ముకుంటునే బీఎస్సీ చేస్తోంది. హనన్‌ తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే విడిపోయారు.తండ్రి మద్యానికి బానిసగా మారాడు. తల్లి మానసిక పరిస్థితి అంతగా లేదు. దీంతో చిన్నతనం నుంచే హనన్ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నా చదువును మాత్రం ఆపలేదు. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఉన్నత విద్యే లక్ష్యంగా కష్టపడుతోంది. చేపలు అమ్ముతు ఆ డబ్బుతో చదువుకు ఉపయోగించుకునేది. ఒకరిపై ఆధారపడకుండా స్వతహాగా బతికుతున్న ఆమె ఎంతోమంది యువతకు ఆదర్శం అనటంలో ఎటువంటి సందేహం లేదు.
హనన్ కు అండగా వుంటామన్న సీఎం పినరాయి విజయన్..
'ఓ విద్యార్థి తన కాళ్ళపై తాను నిలబడి విద్యను కొనసాగించటం.. సొంతంగా సంపాదించిన సొమ్మును చదువు కోసం ఖర్చు చేయడంలో కలిగే సంతృప్తిని అనిర్వచనీయమనీ..జీవితంలో అలాంటి అనుభవాలను పొందినవారు మాత్రమే దీనిని అర్థం చేసుకోగలుగుతారు అని కేరళ సీఎం పినరాయి విజయన్ ప్రశంసించారు. హనన్ కు రక్షణ కల్పించాలని ఎర్నాకుళం జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. ఆమెను వేధిస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హనన్ తన కార్యక్రమాలను కొనసాగించాలని, కేరళ మొత్తం ఆమెకు మద్దతుగా నిలుస్తుందని సీఎం పినరాయి విజయన్ తెలిపారు.
హనన్ పై ముస్లిం మత పెద్దల ఆగ్రహం..
జీన్స్ ప్యాంట్, షర్ట్ ధరించి ..చేతికి ఉంగరాలు పెట్టుకుని హనన్ చేపలు విక్రయించడం వివాదంగా మారింది. ముస్లిం సంప్రదాయాల ప్రకారం ప్యాంటు, షర్టు ధరించడం నేరమంటూ ముస్లిం మతపెద్దలు హుంకరించారు. మరోవైపు అదంతా సినిమా షూటింగ్‌లో భాగమని మరికొందరు తేల్చి చెప్పారు. కాగా, చదువు కోసం హనన్ పడుతున్న కష్టాలు గురించి తెలిసిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆమెకు అండగా నిలిచారు.

ఓనమ్-బక్రీద్ ఎక్స్‌పో’ లో హనన్..ప్రోత్సహిస్తామన్న ఖాదీ బోర్డు
హనన్ ఆత్మవిశ్వాసాన్ని గుర్తించిన కేరళ ఖాదీ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓనమ్-బక్రీద్ ఎక్స్‌పో’లో హనన్ ర్యాంప్‌పై మెరిసింది. లంగా వోణీ ధరించి ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. కేరళ ఖాదీ బోర్డు వైస్ చైర్మన్ శోభన జార్జ్ మాట్లాడుతూ ఆమెకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కాగా, తనకీ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి పనరయి విజయన్, ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితలను కలిసిన హనన్ కృతజ్ఞతలు తెలిపింది.

12:18 - August 3, 2018

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్ ను కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయనుంది. గురువారం స్కూల్ గోడ కూలిపోవడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం..ఐదుగురు విద్యార్థులకు గాయాలైన సంగతి తెలిసిందే. దీనిపై మేడ్చల్ జిల్లా విద్యాశాఖాధికారులు సీరియస్ అయ్యారు. జేసీ పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు.

స్కూల్ ను సీజ్ చేయడం..కూల్చివేస్తామని అధికారులు పేర్కొనడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. విద్యా సంవత్సరం మధ్యలో స్కూల్ ను సీజ్ చేసినా ఎలాంటి ఆందోళన చెందవద్దని..సమీప పాఠశాలల వారితో మాట్లాడి అందులో విద్యార్థులను చేరిపిస్తామని డీఈవో హామీనిచ్చారు. తల్లిదండ్రులపై భారం పడకుండా కూడా చూస్తామన్నారు.

ఇద్దరు విద్యార్థులను బలిగొన్న స్కూల్ యాజమాన్యంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టిన ఆందోళనకారులు స్కూల్ లో ఉన్న ఫర్నీచర్ ను ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

డీఈవో స్పందన...
ఈ ఘటనపై డీఈవో విజయకుమారి టెన్ టివితో మాట్లాడారు. ఘటన జరగడం దురదృష్టకరమని, మృతి చెందిన విద్యార్థుల కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నట్లు తెలిపారు. స్కూల్ ను కూల్చివేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, సమీపంలోని పది పాఠశాలలకు చెందిన యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులను ఆయా పాఠశాలలో చేరిపించడం జరుగుతుందన్నారు. ఇందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుందన్నారు. 

టీడీపీలో ఆధిపత్య పోరు..దాడులు..

కృష్ణా : గోకరాజుపల్లి టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బైటపడింది. రెండు వర్గాలుగా చీలిపోయిన తెలుగు తమ్ముళ్లు కర్రలు, రాడ్లతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ దాడిలో అనిల్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అనిల్ ను చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

11:28 - August 3, 2018

నిజామాబాద్ : జిల్లాలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. నందిపేట్ మండల కేంద్రాంలో చిన్నారి మునీశ్వరి కిడ్నాప్ కు గురైంది. చిన్నారి ఆచూకి తెలియకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నందిపేటలోని వన్నెల్ గ్రామంలో రమేశ్..హరిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మునీశ్వరీ కూతురు ఉంది. గురువారం స్కూల్ కు వెళ్లిన చిన్నారి..చాకెట్ ఇప్పిస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు చెప్పడంతో వెళ్లింది. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియచేసింది. రాత్రి వరకు కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. సమీపంలో ఉన్న సీసీ టివి ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే రమేశ్ కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని..ఈ కారణంగా చిన్నారి కిడ్నాప్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. 

11:23 - August 3, 2018

కృష్ణా : క్రమ శిక్షణకు మారు పేరంటూ చెప్పుకునే టిడిపి పార్టీలో అంతర్గత విబేధాలు పొడచూపుతున్నాయి. ఇటీవలే ఘర్షణలు..చోటు చేసుకుంటుండడం..దీక్షలు కూడా చేస్తుండడం తెలిసిందే. తాజాగా గోకరాజుపల్లిలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. ఆధిపత్య పోరు కారణంగా ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. ఒక వర్గం మరో వర్గం కర్రలు..రాడ్లతో దాడికి దిగారు. దీనితో అనీల్ వ్యక్తి తలపగిలింది. ఇతడిని నందిగామ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

11:14 - August 3, 2018

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో అడుగు పెట్టనున్నారు. ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర మంత్రులను కలిసేందుకు ఆయన శుక్రవారం ఉదయం హస్తినకు పయనమయ్యారు. తెలంగాణ జోనల్ వ్యవస్థకు ఆమోద ముద్ర వేయాలని ఆయన పెద్దలను కలిసి కోరనున్నారు. దీనికి సంబంధించిన ఫైల్ పీఎంవో కార్యాలయం వద్ద పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి గల కారణాలను ప్రధాన మంత్రి మోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు వివరించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే విభజన హామీలకు సంబంధించి నిధులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని...పరిష్కరించాలని కేసీఆర్ కోరనున్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు..ప్రాజెక్టుల వివరాలు ఇతరత్రా విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. మరి కేసీఆర్ విన్నపాలను కేంద్రం ఆలకిస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

జోనల్ వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా కేసీఆర్ ఢిల్లీ టూర్..

హైదరాబాద్ : ఉద్యోగావకాశాల్లో స్థానికులకే ఎక్కువ ప్రయోజనం కలిగించే విధంగా 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో కొత్త జోనల్ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జోనల్ వ్యవస్థ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందే నిమిత్తం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు.ఈ క్రమంలో కేసీఆర్ ఈరోజు ఉదయం ఢిల్లీ బయలుదేరారు. మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నట్టు సమాచారం. కొత్త జోనల్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆయన చర్చిస్తారని, అవసరమైతే, ప్రధాని మోదీని కలిసి దీని గురించి వివరించి చెబుతారని సమాచారం.

11:12 - August 3, 2018

హైదరాబాద్ : కూకట్ పల్లిలో ఇద్దరు విద్యార్థులను బలిగొన్న స్కూల్ ను అధికారులు సీజ్ చేశారు. గురువారం న్యూ సెంచరీ స్కూల్ గోడ కూలడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా ఐదుగురు విద్యార్థులకు గాయాలైన సంగతి తెలిసిందే. దీనితో విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

మరోవైపు స్కూల్ ను సీజ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. శుక్రవారం జాయింట్ కలెక్టర్, అధికారులు ఘటనకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్కూల్ ను సీజ్ చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో స్కూల్ ను సీజ్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదని, విద్యార్థులను వేరే పాఠశాలలో చేర్పిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి వైద్యు ఖర్చులు ప్రభుత్వం భరించే విధంగా చూస్తామని జేసీ వెల్లడించారు. 

స్కూల్ ను కూల్చేస్తామంటున్న జీహెచ్ ఎంసీ..

హైదరాబాద్ : న్యూ సెంచరీ స్కూల్ ను సీజ్ చేసిన భవనాన్ని కూల్చేస్తామని జీహెచ్ ఎంసీ అధికారులు పేర్కొంటున్నారు. నిన్న న్యూసెంచరీ స్కూల్ గోడ కూలి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థులు మృతి చెందారని..వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అనంతరం స్కూల్ ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. దీంతో స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 

జైళ్ల శాఖ ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ ..

హైదరాబాద్ : హెల్మెట్ లేకుండా వాహనం నడపకూడదనే హెచ్చరికలను పట్టించుకోని ప్రజలు అనివార్యంగా జరుగుతున్న ప్రమాదాలలో ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఈ నేపత్యంలో తప్పనిసరి హెల్మెట్ నిబంధన కోసం జైళ్లశాఖ ఓ నిర్ణయాన్ని తీసుకుంది. హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోలు పోయవద్దన్న ఆదేశాలు జారీ చేయాలని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ పెట్రోలియం శాఖను కోరారు. గురువారం ఆయన పెట్రోలియం శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో అత్యధిక మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

బోనాల ముందుకు జాగ్రత్తలు..మద్యం షాప్స్ బంద్..

హైదరాబాద్ : ఆషాడమాసంలో అమ్మవారి దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా ముందు జాగ్రత్తగా 5, 6 తేదీలు... ఆదివారం, సోమవారాల్లో మద్యం దుకాణాలను మూసి వేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బార్లు, పబ్బులను కూడా మూసివేయాలని, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మాత్రం మినహాయింపు ఉంటుందని అన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకూ ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు.

10:09 - August 3, 2018

కరెంటు షాక్ తో తల్లి, కుమారుడు మృతి...

మహబూబాబాద్ : గార్ల మండలం అంజనాపురంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావి వద్ద కరెంటు షాక్ తో తల్లి శాంతి (35), కుమారుడు సతీష్ (20) మృతి చెందారు. 

09:14 - August 3, 2018

వరంగల్ : జిల్లాలోని మహాలక్ష్మీ కాటన్ ఇండస్ట్రీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన వాచ్ మెన్ స్థానికులకు విషయం తెలియచేశాడు. కానీ ఉవ్వెత్తున్న ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు సాహసించలేదు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక అగ్నిమాపక శాఖకు తెలియచేశారు. రెండు ఫైరింజన్లతో చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పేందుకు నిర్విరామంగా కృషి చేశారు. భారీ ఎత్తున పత్తి బేళ్లు ఉండడంతో మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. ఎంత నష్టం సంభవించింది ? అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

09:12 - August 3, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. మూడు రోజుల పాటు హస్తినలో ఉండనున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ రాష్ట్రపతి పర్యటన ఉన్నా ఆయన ఢిల్లీకి వెళుతుండడం గమనార్హం. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న వాటిని పరిష్కరించుకొనేందుకు ఆయన పర్యటన కొనసాగనుంది. ప్రధాన మంత్రి మోడీ..కేంద్ర మంత్రులు..ఇతర అధికారులను ఆయన కలుసుకోనున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ, న్యాయ శాఖ ఆమోదించినట్లు సమాచారం. కానీ దీనికి సంబంధించిన ఫైల్ పీఎంవో కార్యాలయంలో పెండింగ్ లో ఉంది. ఇది ఆమోదం తెలిపితే రాష్ట్రపతికి వెళ్లనుంది. ఆయన అనుమతి ఇచ్చిన అనంతరం జోనల్ వ్యవస్థ ఏర్పడనుంది. తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పడింది ? ఉమ్మడి రాష్ట్రంలో జోనల్ వ్యవస్థ ఎందుకు తొలగించాల్సి వచ్చింది ? అనే దానిపై ప్రధానికి..కేంద్ర మంత్రులకు కేసీఆర్ వివరించనున్నారు. అలాగే విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇంకా అమలు కాలేదని...నిధులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని..కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని ఆయన కోరనున్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇతరత్రా విషయాలపై ఆయన చర్చించనున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

మహాలక్ష్మీ కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం...

వరంగల్ : జిల్లాలోని నక్కలపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మహాలక్ష్మీ కాటన్ మిల్లులో మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్...

ఢిల్లీ : సీఎం కేసీఆర్ హస్తినకు బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్‌ వ్యవస్థకు కేంద్రం ప్రభుత్వం నుంచి ఆమోదం సాధించడానికి ఆయన ఢిల్లీ టూర్‌కు రెడీ అయ్యారు.

08:13 - August 3, 2018

జీడిమెట్ల : నగరంలో యాసిడ్ దాడి జరిగింది. ఓ టీచర్ పై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడడం కలకలం రేపింది. సూర్యకుమారి ప్రైవేటు టీచర్ గా పనిచేస్తుంది. పద్మానగర్ ట్యూషన్ చెబుతున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖానికి బట్టలు కప్పుకుని సూర్యకుమారి వద్దకు వచ్చారు. వెంటనే ఆమె ముఖంపై యాసిడ్ పోశారు. వెంటనే దీని నుండి తప్పించుకొనేందుకు ఆమె ప్రయత్నించింది. యాసిడ్ వీపుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు రెమిడీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. టీచర్ పై యాసిడ్ దాడి ఎందుకు జరిగింది ? విద్యార్థులు కక్ష పెంచుకున్నారా ? తదితర వాటిపై దర్యాప్తు చేపడుతున్నారు. 

08:12 - August 3, 2018

విశాఖపట్టణం : నిత్యం రద్దీగా ఉండే ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద రౌడీషీటర్ దారుణ హత్య కావడం కలకలం రేపింది. వన్ టౌన్ ఏరియాలో నివాసం ఉండే ఖాసీం అనే రౌడీషీటర్ నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి బైక్ పై వెళుతున్న ఖాసీంను గుర్తు తెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టారు. అనంతరం కత్తులతో విచక్షణారహితంగా నరికేశారు. దీనితో ఖాసీం అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆ ప్రాంతంలో ఉన్న ఇతర రౌడీషీటర్లతో విబేధాలున్నట్లు, ఈ నేపథ్యంలో హత్య జరిగిందని తెలుస్తోంది. పాత రౌడీషీటర్లపై నిఘా పెట్టడం జరిగిందని, హత్యకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. 

విశాఖలో రౌడీషీటర్ దారుణ హత్య...

విశాఖపట్టణం : విశాఖలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. రౌడీషీటర్ ఖాసీంను గుర్తు తెలియని దుండగులు కత్తులతో నరికి చంపేశారు. ఎల్ఐసీ బిల్డింగ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

07:45 - August 3, 2018

నగరానికి రాష్ట్రపతి...

హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా శని, ఆదివారాల్లో బేగంపేట్, రాజ్‌భవన్, రాష్ట్రపతి నిలయం మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించనున్నారు. 

07:07 - August 3, 2018

ఢిల్లీ : పాకిస్తాన్‌ ప్రధానమంత్రిగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి విదేశీ నేతలను ఆహ్వానించడం లేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహత స్నేహితులైన విదేశీ వ్యక్తులను కొందరిని మాత్రమే ఆహ్వానించినట్లు తెలిపింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా మాజీ క్రికెటర్, 65 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సార్క్ దేశాల అధినేతలతో పాటు ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం పంపుతారని వార్తలు వెలువడ్డ నేపథ్యంలో పాక్‌ విదేశాంగ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. పాక్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు.

07:05 - August 3, 2018

ఢిల్లీ : దేశంలోని ముస్లింలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని లోక్‌సభలో ఎంఐఎం సభ్యులు అసదుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు. ముస్లింలు అన్ని రంగాల్లోనూ వెనకబడి ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని ఓవైసీ డిమాండ్‌ చేశారు. ఒకవేళ మరాఠాలు, పటేల్‌, గుజ్జర్లు, జాట్‌ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తే ముస్లిం సామాజిక వర్గానికి కూడా రిజర్వేషన్లు కల్పించాలి ఆయన స్పష్టం చేశారు.

07:03 - August 3, 2018

ఢిల్లీ : ఎస్‌సి ఎస్‌టి యాక్ట్‌ సవరణ బిల్లుపై లోక్‌సభలో రగడ జరిగింది. గత నాలుగు నెలలుగా ఈ బిల్లుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ ఎందుకు తీసుకురాలేదని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ బిల్లును రేపే ప్రవేశపెట్టండి...అందరం కలిసి బిల్లును పాస్‌ చేయిద్దామని ఖర్గే అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి బిల్లుకు మోది క్యాబినెట్‌ బుధవారమే ఆమోదం తెలిపిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కొద్దిసేపు సభలో గందరగోళం నెలకొంది. వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెడతామని హోంమంత్రి పేర్కొన్నారు. 

07:01 - August 3, 2018

నెల్లూరు : జిల్లా రాపూరు పోలీస్‌ స్టేషన్‌పై బుధవారం రాత్రి జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దళితవాడకు చెందిన కొందరు పోలీసులపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. రాపూరు దళితవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ తదితరులు అదే ప్రాంతానికి చెందిన జోసెఫ్‌ అనే వ్యక్తికి డబ్బులు బాకీ ఉన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో జోసెఫ్‌ రాపూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పిచ్చయ్యతోపాటు ఇద్దరు మహిళలను విచారించేందుకు పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అప్పటికే మద్యం సేవించిన పిచ్చయ్యను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా, వారి బంధువులు దాదాపు 150 మంది పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. దాదాపు 40 మంది స్టేషన్‌లోకి ప్రవేశించారు. అక్కడ కనిపించిన పోలీసులపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ లక్ష్మణ్‌ను బయటకు లాగి కొట్టారు. అడ్డువచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లపై సైతం దాడులకు తెగబడ్డారు.

పోలీసు స్టేషన్‌పై జరిగిన దాడిని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే దాడికి పాల్పడ్డ పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరికొందరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దాడిపై పోలీసు యూనియన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటన ఉందని పోలీసు సంఘం నేతలు అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దాడులను అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు పోలీసుస్టేషన్‌పై దాడి ఘటనలో తమ తప్పులేదని దళితులు అంటున్నారు. పోలీసులు తమను విచారణ కోసం పిలిపించి మహిళలు అని కూడా చూడకుండా అమానుషంగా కొట్టారని.. కులం పేరుతో దూషించారని దళితవాడకు చెందిన పిచ్చయ్య, కనకమ్మ, లక్ష్మమ్మ ఆరోపించారు. తమతోపాటు పెంచలయ్య అనే యువకుడిని కూడా పోలీసులు కొట్టారని చెబుతున్నారు. అధికారులు ఘటనను సీరియస్‌గా తీసుకోవటంతో దళితవాడంతా బోసిపోయింది. ఘటనలో తమను ఎక్కడ అరెస్ట్‌ చేసి కేసులు పెడతారనే భయంతో హరిజనవాడలోని స్థానికులంతా ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. 

06:58 - August 3, 2018

హైదరాబాద్ : గ్రామీణ తెలంగాణలో నూతన శకం ఆరంభమైంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏకకాలంలో 4 వేల 3 వందల 83 కొత్త పంచాయతీలు నేటి నుంచి ఉనికిలోకి వచ్చాయి. పాత పంచాయతీలతో పాటు నూతన పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. ఇంతకాలం ఒక ఊరికి అనుబంధంగా ఉన్న శివారు పల్లెలు, తండాలు, గూడేలకు ఇప్పుడు స్వతంత్ర హోదా దక్కింది. కొత్త పంచాయితీల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునివ్వటంతో పలు ప్రాంతాల్లోని గ్రామ పంచాయితీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక కొత్త మున్సిపాలటీలు కూడా నేటి నుంచి ఉనికిలో వచ్చాయి. తమ గ్రామాలను మున్సిపాలిటీలో కలవద్దంటూ పలు ప్రాంతాల్లో గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

గ్రామీణ తెలంగాణలో నూతన శకం ఆరంభమైంది. కొత్తగా 4,383 గ్రామ పంచాయితీలు గురువారం నుంచి ఉనికిలోకి వచ్చాయి. పాత పంచాయతీలతో పాటు నూతన పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. ఇంతకాలం ఒక ఊరికి అనుబంధంగా ఉన్న శివారు పల్లెలు, తండాలు, గూడేలకు ఇప్పుడు స్వతంత్ర హోదా దక్కింది. కొత్త పంచాయితీల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునివ్వటంతో పలు ప్రాంతాల్లోని గ్రామ పంచాయితీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లా అంథోల్‌, పుల్కల్ టేక్మాల్‌ మండలాల్లోని నూతన పంచాయితీలను స్థానిక ఎమ్మెల్యే బాబుమోహన్‌ ప్రారంభించారు. పుల్కాల్‌ మండలంలోని తడ్‌దాన్‌పల్లి, గొంగళూర్ తండాల్లో పంచాయితీ భవనాలను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు, అమీన్‌పూర్ మండలాల్లోని నూతన పంచాయితీలను మెదక్ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి ప్రారంభించారు. దీంతో దాయర, అయిలాపూర్‌ తండా, పటేల్‌గూడ గ్రామాలు నూతన పంచాయితీలుగా ఏర్పాటు అయ్యాయి. గ్రామాలు పంచాయితీలుగా ఏర్పడటం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలంలోని జక్కాపూర్‌, మల్లూర్‌ తండాల నూతన గ్రామ పంచాయితీలను ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే ప్రారంభించారు. అలాగే గోర్గల్‌, మంగ్లూర్‌, బ్రహ్మణపల్లిల పంచాయితీ భవనాలను సీడీసీ చైర్మన్‌ పట్లోళ్ల దుర్గారెడ్డి ప్రారంభించారు.

ఖమ్మం మండలంలోని నూతన పంచాయితీలను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. కొత్త పంచాయితీలుగా గ్రామాలు ఏర్పాడటం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. వరంగల్‌ జిల్లా వర్దన్నపేట మండలంలోని ఏబి తండా గ్రామస్థులు ఆందోళనక దిగారు. నూతన పంచాయితీగా గ్రామాన్ని ఏర్పాటు చేసినప్పటికీ భవనాన్ని వేరే తండాలో ఏర్పాటు చేయటం పట్ల ఆగ్రహించిన గ్రామస్థులు ధర్నాకు దిగారు.

ఇక కొత్త పంచాయితీలతో పాటు కొత్త మున్సిపాలటీలు కూడా గురువారం నుంచి ఉనికిలో వచ్చాయి. అయితే తమ గ్రామాలను మున్సిపాలిటీలో కలవద్దంటూ పలు ప్రాంతాల్లో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని కలపవద్దంటూ బ్రహ్మణపల్లి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.

అటు నిజామాబాద్‌ జిల్లా మామిడిపల్లి గ్రామస్థులు.. తమ గ్రామాన్ని ఆర్మూర్‌ మున్సిపాలిటీలో కలపవద్దంటూ ఆందోళనకు దిగారు. భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం మామిడిపల్లి చౌరస్తా వద్ద రాస్తారోకోకు చేశారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపటం వల్ల తాము నష్టపోతామని గ్రామస్థులు తెలిపారు.

06:54 - August 3, 2018

చిత్తూరు : ప్రముఖ ఫుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం రాజకీయ నేతల విమర్శలు, ప్రతివిమర్శలకు వేదికగా మారుతోంది. శ్రీవారి దర్శనానికి వస్తున్న నాయకులు స్వామివారి సన్నిదిలో ఉన్నామన్న విషయం మరచి ప్రవర్తిస్తున్నారు. తిరమలేశుని సాక్షిగా.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ.. పవిత్రతను మంటగలుపుతున్నారు. టిటిడి నియమ నిభందనలు తుంగలో తొక్కుతుంటే.. వారిని కట్టడి చేయాల్సిన టిటిడి విజిలెన్సు అధికారులు ప్రేక్షపాత్ర వహిస్తున్నారు.

నిత్యం గోవింద నామస్మరణలతో మార్మోగే తిరుమలలో.. రాజకీయ విమర్శలు ప్రతివిమర్శలతో వేడెక్కుతోంది. పరమ పవిత్రమైన శ్రీవారి సన్నిధిలో నేతల తీరు భక్తుల మనోబావాలను దెబ్బతీస్తోంది. తిరుమలలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడొద్దన్న నిభందనలు ఉన్నాయి. తిరుమలలో మాట్లాడితే సంచలనం అవుతందన్న ఉద్దేశంతో కొందరు నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ.. పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారు.

దైవసన్నిధిలో నేతల దూషణల పర్వానికి భక్తులు నోరెళ్ళబెడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా తిరుమలకు వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం పరపాటిగా మారింది. తెలంగాణ నేతలు సైతం తిరుమలకు వచ్చిన సందర్బంగా రాజకీయాలు మాట్లాడుతూ మీడియా దృష్టిలో పడే యత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాసుని సాక్షిగా టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రులు సైతం నోరు ఎక్కడున్నామన్న స్పృహ లేకుండా మాట్లాడుతున్నారు. మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప తామేమీ తీసిపోలేదన్నట్లుగా రాజకీయాలు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శ్రీవారి దర్శనానికి వచ్చే రాజకీయ నేతలు తిరుమల పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుకుంటున్నారు. శ్రీవారి సన్నిధిలో రాజకీయ విమర్శలు, ఆరోపణలను అడ్డుకోవాల్సిన టిటిడి విజిలెన్స్‌ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నేతల బాధ్యతారాహిత్యం, అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు.

06:50 - August 3, 2018

చిత్తూరు : నాలుగేళ్లుగా చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ప్రతిపక్ష పార్టీలు అన్యాయాలను ప్రశ్నిస్తే పోలీసులను ఉపయోగించి ఆణగదొక్కుతున్నారని మండిపడ్డారు. జగన్‌ చేస్తున్న ప్రజా పాదయాత్రను బాబు అవహేళన చేయడం సరికాదని హెచ్చరించారు అంబటి రాంబాబు. 

06:48 - August 3, 2018

హైదరాబాద్ : సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో కలిశారు. విభజన హామీలపై మరోసారి పోరు చేయటానికి సిద్ధమయ్యామని మధు తెలిపారు. రాష్ట్ర ప్రజల్లో టీడీపీ బలం తగ్గుతుందని.. ప్రజల్లో టీడీపీపై అసంతృప్తి పెరుగుతుందని మధు అన్నారు. సీపీఎం, సీపీఐ, జనసేనలు కలిసి పోరాడుతుంటే టీడీపీ తట్టుకోలేకపోతుందని.. అందుకే పవన్‌ కల్యాణ్‌పై చంద్రబాబు విమర్శలకు దిగుతున్నారని రామకృష్ణ అన్నారు. 

06:47 - August 3, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్‌ వ్యవస్థకు కేంద్రం ప్రభుత్వం నుంచి ఆమోదం సాధించడానికి ఆయన ఢిల్లీ టూర్‌కు రెడీ అయ్యారు. ఇందుకోసం ఆయన ఈ ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. జోనల్‌ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కేసీఆర్‌ మాట్లాడతారు. జోనల్‌ వ్యవస్థకు కేంద్రం ఆమోదం సాధించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తారు. రెండు మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి కొత్త జోనల్‌ వ్యవస్థ అవసరాన్ని విడమరచి చెప్పాలన్న యోచనలో కూడా కేసీఆర్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సంపూర్ణ ఫలితం స్థానికులకే దక్కాలంటే రాష్ట్రంలో కొత్త జోనల్‌ వ్యవస్థ ఉండి తీరాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి సత్వర ఆమోదం సాధించి... కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారం కొత్త నియామకాలు చేయాలని ముఖ్యమంత్రి గట్టి నిర్ణయంతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం, స్థానికులకే 95శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం వల్ల ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే యువకులు ఎక్కువ అవకాశాలు పొందుతారన్నది కేసీఆర్‌ అభిప్రాయం. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు విడమర్చి చెప్పాలని ఆయన ఢిల్లీ పర్యటనకు సిద్దమయ్యారు.

ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే ఎక్కువ ప్రయోజనం కలిగించడం కోసం 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ జోనల్ విధానానికి ఆమోదం తెలపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వ న్యాయ శాఖ, హోం శాఖ కూడా సానుకూలంగా స్పందించాయి. ఫైల్ ను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపారు. జోనల్ వ్యవస్థ ఆమోదం అంశం కీలక దశలో ఉన్నందున తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే ప్రధాన్యం కల్పించడానికి ప్రస్తుతం ఉన్న జోనల్ వ్యవస్థ అవరోధంగా ఉందని ముఖ్యమంత్రి మొదటినుంచీ భావిస్తున్నారు. జోనల్ వ్యవస్థలో మార్పుచేర్పులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. స్థానికులకే ఎక్కువ అవకాశాలు వచ్చేలా కోత్త జోనల్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. అందుకే జోనల్‌ వ్యవస్థను ఓ కొలిక్కి తీసుకురావడంలో భాగంగా ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ప్రభుత్వ పెద్దలు, అవసరమైతే ప్రధానమంత్రితో మాట్లాడి సమస్యను తేల్చుకొని రావాలన్న యోచనలో కేసీఆర్‌ ఉన్నారు.

అసోం టీఎంసీ నేతల రాజీనామా...

పశ్చిమ బెంగాల్ : అసోం నేతలు రాజీనామా చేశారు. ఎన్ఆర్ సీ అంశంపై పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామాలు చేశారు. 

ఇక్రిసాట్ తో టీఎస్ ప్రభుత్వం ఒప్పందం...

హైదరాబాద్ : ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ తో మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. మిషన్ కాకతీయ ఫలితాలు - ప్రభావాలపై ఇక్రిసాట్ తో టీఎస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. రెండేళ్లు మూడు దశల మిషన్ కాకతీయపై ఇక్రిసాట్ అధ్యయనం చేయనుంది. 

రావూరు ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ విచారణ...

నెల్లూరు : నేడు రావూరు ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ జరుపనుంది. ఎస్ఐ, కానిస్టేబుళ్లపై గ్రామస్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. 

లోక్ సభలో ప్రైవేటు మెంబర్ బిల్లు...

ఢిల్లీ : నేడు లోక్ సభలో ప్రైవెటు మెంబర్ బిల్లును ఎంపీ అవంతి శ్రీనివాస్ ప్రవేశ పెట్టనున్నారు. ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లులో పేర్కొననున్నారు. 

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల...

చిత్తూరు : తిరుమలలో నేడు శ్రీ వారి ఆర్జిత సేవా టికెట్లను అధికారులు విడుదల చేయనున్నారు. నవంబర్ నెల ఆర్జిత సేవా టికెట్లను టిటిడి విడుదల చేయనుంది. 

హస్తినకు కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి మోడీ..కేంద్ర మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. కొత్త జోనల్ విధానం అంశంపై కేంద్రంతో చర్చించనున్నారు. 

బర్మింగ్ హోం టెస్ట్ డే...

ఢిల్లీ : బర్మింగ్ హోం టెస్ట్ డే లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ 22 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 287 పరుగులు. భారత్ 274 పరుగులు చేసింది. 

ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎక్స్ పో...

హైదరాబాద్ : నేటి నుండి నాలుగు రోజుల పాటు ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎక్స్ పో జరుగనుంది. ఈ ఎక్స్ పోను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 

Don't Miss