Activities calendar

04 August 2018

21:06 - August 4, 2018

ఢిల్లీ : హస్తినలో ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ప్రధానితో కేసీఆర్‌ చర్చించారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాల్సిందిగా కేసీఆర్‌ మోదీని కోరారు. హైకోర్టును సత్వరమే విభజించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 

18:52 - August 4, 2018

చిత్తూరు : ప్రధాని మోడీ నమ్మక ద్రోహం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక నేషనల్ పార్టీ విభజన చేసి దెబ్బతీస్తే.. మరో నేషనల్ పార్టీ అండగా ఉంటానని మోసం చేసిందన్నారు. నాలుగు సంవత్సరాలు వెయిట్ చేశానని.. 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని తెలిపారు. అయినా కేంద్రం రాష్ట్రం సమస్యలను పట్టించుకోలేదని..అప్పుడు కేంద్రం ప్రభుత్వం నుంచి బయటికి రావాల్సివచ్చిందన్నారు. తిరుపతి జ్ఞానభేరి కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తాను మంత్రి పదవులకు కోసం ఎన్నడూ పాకులాడలేదన్నారు. తనకు మంత్రి పదువులు ముఖ్యం కాదని.. రాష్ట్ర, దేశ ప్రయోజనాలు ముఖ్యం అన్నారు. రాష్ట్ర హక్కులు సాధించే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. చివరివరకు పోరాడి హక్కులు సాధిస్తామన్నారు. దేశ ప్రజలకు అర్థం అయ్యే విధంగా శివప్రసాద్ కు తోచిన విధంగా ఆందోళన చేపట్టారని.. తెలిపారు. మెజారిటీ తాల్కాలికం..తమకు మొరాలిటీ ఉందన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని పేర్కొన్నారు. 
పిల్లలకు సంస్కారం, చదువు ఇవ్వాలి..
తల్లిదండ్రులు పిల్లలకు సంస్కారం, చదువు ఇవ్వాలన్నారు. ఎంత డబ్బులు ఇచ్చామన్నది ముఖ్యం కాదు...ఎంత సంస్కారం, చదువు ఇవ్చామన్నది ముఖ్యమన్నారు. చదువుతో ప్రపంచాన్ని జయించే శక్తి, సంపద సృష్టించే శక్తి వస్తుందన్నారు. తెలుగు జాతికి కోసం హైదరాబాద్ ను అభివృద్ధి చేశానని అన్నారు. తన హయాంలో ప్రపంచంలోని 1350 ఫేమస్ కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయన్నారు. పొట్టిశ్రీరాములు పోరాటం, ప్రాణత్యాగం ద్వారా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. భారతేశంలో ఏర్పాటు అయిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. విభజన రోజున ఏపీ తలసరి ఆదాయం 82500 ఉన్నదన్నారు. ఒక పక్క పోరాటం..మరో పక్క అభివృద్ధి సమాంతరంగా జరగాలన్నారు. 2022 నాటికి దేశంలోని మూడు అగ్రరాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంటుందన్నారు. 2029నాటికి భారతదేశంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుందన్నారు. పిల్లలు స్ట్రెస్ తో ఉండకూడదని..ఆడుతూ పాడుతూ చదువుకోవాలని చెప్పారు. 20 గంటలూ చదివిచండం సరికాదని యాజమాన్యాలకు సూచించారు. చదువు అనేది స్కిల్ కు సంబంధించినదని అన్నారు. ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.  

 

18:35 - August 4, 2018

కర్నూలు : క్వారీ పేలుళ్ల ఘటనపై విచారణ ప్రారంభం అయింది. క్వారీ యజమానులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రమాద ఘటనపై విచారణ చేపడుతున్నామని తెలిపారు.

 

18:32 - August 4, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో కోటి 40 లక్షల మంది ఎంబీసీలుంటే ఉండగా.. మూడు లక్షల మంది మాత్రమే ఎంబీసీలు ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిందని కాంగ్రెస్ నేత దాసోజో శ్రవణ్ కుమార్ అన్నారు. 36 కులాలను ఎంబీసీలు గుర్తించారని తెలిపారు. ఏ ప్రాతిపదిక మీద 36 కులాలను ఎంబీసీలుగా గుర్తించారని..ఏ ప్రాతిపదిక మీద మిగిలిన కులాలను ఎంబీసీలుగా గుర్తించలేదని ఆయన ప్రశ్నించారు. బీసీ కమిషన్ రాజ్యాంగ బద్ధమైనటువంటి సంస్థ అన్నారు.  బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా...ఎర్రజెండా పట్టుకుని బీసీ కమిషన్ వారు రాజ్యాంగపరైమన హక్కులను సంతరింపచేసేవిధంగా కొట్లాడాలి.. కానీ వారి బాధ్యతలు పక్కనపెట్టేశారని విమర్శించారు. 

 

18:26 - August 4, 2018

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిపాలనలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రేటర్‌లో సర్కిల్‌, జోన్‌లను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోన్‌లు 6 నుండి 12కు సర్కిల్‌లు 30 నుండి 48కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రతి జోన్‌కు 4 సర్కిల్‌లు ఉండేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బల్దియా. సర్కిల్‌లు, జోన్‌లు పెరగడంతో ఒకవేయి 610 అదనపు పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

18:21 - August 4, 2018

పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌లో రాజకీయాలు రసవత్తరంలో పడ్డాయి. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎవరిని మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాలపై కూర్చోబెడతారనే చర్చ జోరుగా సాగుతోంది. అధికారపార్టీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతిచ్చిన కాంగ్రెస్‌ ..... డిప్యూటీ మేయర్‌ కోసం ఒత్తిడి చేస్తుండడంతో పదవుల పందేరం మొదలైంది. ఇంతకీ మేయర్‌ పీఠం ఎవరిని వరించనుంది? కాంగ్రెస్‌ వ్యూహం ఏంటి? లెట్స్‌ వాచ్‌దిస్‌ 10టీవీ స్పెషల్‌ స్టోరీ..

ఈనెల 2న రామగుండం మేయర్‌ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్‌ శంకర్‌ఫై నిర్వహించిన  అవిశ్వాస పరీక్ష నెగ్గింది. ఇద్దరి పదవులూ ఊడాయి. మేయర్‌ పదవిని ఇప్పుడు ఎస్సీలకు కేటాయించడంతో..ఆ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు.. మేయర్‌ అవడానికి లాబీయింగ్‌ మొదలుపెట్టారు. ఎమ్మెల్యే కటాక్షం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆదేశాలతో అవిశ్వాస తీర్మానం పెట్టిన  ఎమ్మెల్యే వర్గీయుల్లో ఆశలు  మొదలయ్యాయి. 

అధికార పార్టీకి చెందిన కోదాటి ప్రవీణ్‌, జాలి రాజమణి, బక్కి రాజకుమారితోపాటు కాంగ్రెస్‌కు చెందిన దాసరి సావిత్రి, మహంకాళి స్వామిసైతం మేయర్‌ రేసులో ఉన్నారు. ఇక డిప్యూటీ మేయర్‌ పదవి ఆశిస్తున్న వారిలో వనం శివానందం, రవి , ముప్పిడి సత్యప్రసాద్‌తోపాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోలిపాక సుజాత, మారెల్లి సుశీల ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మెజారిటీ కార్పొరేటర్ల మద్దతుతో అవిశ్వాసం నెగ్గడంతో... అవసరం అయితే కాంగ్రెస్‌ కార్పొరేటర్లంతా కండువాలు మార్చుకునేందుకు సిద్దంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ మద్దతుతో మేయర్ లక్ష్మినారాయణను అవిశ్వాసం పెట్టి పదవి నుంచి తొలగించడంతో... కాంగ్రెస్‌ కార్పొరేటర్లకు మేయర్‌ పదవి దక్కుతుందని ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ విప్‌ను ధిక్కరించి టీఆర్‌ఎస్‌తో జతకట్టిన కార్పొరేటర్లలో మహంకాళి స్వామి మొదటి నుంచి మేయర్‌ పదవి ఆశించి భంగపడుతున్నారు. ఈసారి ఎలాగైనా మేయర్‌ సీటుపై కూర్చోవడానికి సిద్దపడుతున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరో 15 రోజులు గడువు ఉండడంతో మేయర్‌ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. అయితే మేయర్‌ పదవి టీఆర్‌ఎస్‌కు దక్కితే... డిప్యూటీ మేయర్‌ మాత్రం కాంగ్రెస్‌కే ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. 

తన పంతాన్ని నెగ్గించుకున్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎవరిని మేయర్‌, డిప్యూటీ మేయర్‌ కుర్చీలపై కూర్చోబెడతారనే అంశం అంతుచిక్కడం లేదు. తన వర్గానికి చెందిన వారితోపాటు అవిశ్వాసానికి సహకరించిన వారికి ఎలాంటి న్యాయం చేస్తారని స్థానిక ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఉత్కంఠ తొలగాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

17:52 - August 4, 2018

కృష్ణా : జిల్లాలోని నిమ్మకూరులో నటుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ పర్యటించారు. ఈ సందర్భంగా బసవతారకం, ఎన్ టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమా చిత్రీకరణ ప్రదేశాలను.. దర్శకుడు క్రిష్‌తో కలిసి బాలకృష్ణ పరిశీలించారు.

17:49 - August 4, 2018

కర్నూలు : జిల్లా ఆలూరు ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదే బాధ్యతని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసారని, గ్రామదర్శినిని కూడా బహిష్కరించారని అయినా అధికారులు స్పందించలేదని న్నారు. విదేశీ కంపెనీలకు అనుకూలంగా చట్టాలను సడలించి భద్రతను ప్రభుత్వమే గాలికొదిలేసిందని విమర్శించారు.

క్వారీల యజమానులపై కఠిన చర్యలు: మంత్రి సుజయ

కర్నూలు : క్వారీ పేలుడు ప్రాంతాన్ని మంత్రి సుజయ కృష్ణ రంగారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..నిబంధనలు వ్యతిరేకంగా వున్న క్వారీల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని..పేలుడుకు అధికారుల నిర్లక్ష్యం కూడా ఒక కారణమని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కాగా కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలం అగ్రహారం దగ్గర హత్తెబెళగల్ మైనింగ్ క్వారీలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.  

నాపై బీసీసీఐ బ్యాన్ లేదు : అజారుద్దీన్

హైదరాబాద్ : తనపై బీసీసీఐ బ్యాన్ విధించలేదని క్రికెటర్ అజారుద్దీన్ స్పష్టంచేశారు. ఈ విషయం తెలీకుండా ఎంపీ వివేక్ ఆరోపణలు చేస్తున్నారని..హెచ్ సీఏ ఎన్నికల్లో పోటీ చేసే దిశగా ఆలోచిస్తున్నానని అజారుద్ధీన్ తెలిపారు. నాపై అంజన్ కుమార్ యాదవ్ వ్యాక్యలు పట్టించుకోననీ..హైదరాబాద్ ప్రజల మద్దతు తనకు వుందని తెలిపారు. 

15నుండి జిల్లాలలో కంటి వెలుగు : హరీశ్ రావు

హైదరాబాద్ : ఈనెల 15వ తేదీ నుంచి జిల్లాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమాలను ఈనెల 15వ తేదీ నుంచి జనవరి 26వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమం విజయవంతానికి మండలానికి ఒక టీంను నియమించామని, ప్రతి గ్రామంలో రోజుకు 250 మందికి ఒక టీం పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. జిల్లాలకు ఇప్పటికే పరీక్షలకు కావలసిన పరికరాలు, కంటి అద్దాలు వచ్చాయన్నారు. ప్రభుత్వమే ఉచితంగా సర్జరీలు చేయిస్తుందన్నారు. జిల్లాలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు నూతనంగా డాక్టర్లను నియమించినట్లు చెప్పారు.

16:24 - August 4, 2018

తూ.గో : రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా సాగింది. అధికార విపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ వైసీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. పోడియం ముందుకు వెళ్లి నిరసన తెలిపారు. వారిని వారించేందుకు మేయర్‌ ప్రయత్నించినా ఆందోళన విరమించకపోవడంతో 7గురు కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు. సస్పెండ్‌ చేసినప్పటికీ బయటకు వెళ్లకపోవడంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని బయటకు పంపించారు. దీంతో అధికార పార్టీ తీరుపై వైసీపీ నేతలు మండిపడ్డారు. 

 

కొడంగల్ లో టీ.మంత్రులు..

మహబూబ్ నగర్ : మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డిలు కొడంగల్ పర్యటనకు బయలుదేరారు. చేవెళ్లలో మంత్రులకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. షాబాద్ నుంచి వందలాది వాహనాల్లో మంత్రుల వెంట బయలుదేరారు. మొయినాబాద్, చేవెళ్లలో మంత్రులు పార్టీ జెండాలు ఎగరవేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన బహుమతి ప్రాజెక్టులను నిలిపివేసేలా కేసులు వేయడం. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

16:21 - August 4, 2018

తూర్పుగోదావరి : జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్‌ చేపట్టిన పాదయాత్రకు కాపు సెగ తగిలింది. జగన్‌ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 228 రోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో సాగింది. అయితే క్షేమాలు గ్రామం రామాలయం సెంటర్‌ వద్ద నల్లజెండాలు, ప్లాకార్డలుతో నిరసన తెలుపుతూ ముద్రగడ వర్గీయులు అడ్డుపడటంతో వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.... ఇరు వర్గీయులను అదుపు చేయడానికి  పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

 

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ పలు విన్నపాలు..

ఢిల్లీ : ఢిల్లీ టూర్ లో వున్న సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు అంశాలపై కేసీఆర్ చర్చించారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం పలకాలని కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు. అలాగే హైకోర్టును విభజించాల్సిందిగా విజ్నప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నిధులు, సెక్రటేరియట్ నిర్మాణానికి రక్షణ స్థలం కేటాయింపుపై చర్చించారు. రిజర్వేషన్ల పెంపు, రాజ్యాంగ సవరణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు, కరీంనగర్ ట్రివపుల్ ఐటీ ఏర్పాటు వంటి తదితర అంశాలపై ప్రధాని నరేంద్రమోదీతో సీఎం కేసీఆర్ చర్చించారు. 

16:19 - August 4, 2018

హైదరాబాద్ : మస్కులర్‌ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న షేక్‌ నాఫిన్‌ అనే చిత్రకారిణి ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు  నాఫిన్‌కు అందిస్తామని మంత్రి తెలిపారు. అరుదైన వ్యాధి ఉన్నప్పటికీ ధైర్యంతో తన చిత్రకళను కొనసాగిస్తున్న నాఫిన్‌ను ఆయన అభినందించారు. రవీంద్రభారతిలోని ఫోటో ఎగ్జిబిషన్‌ హాల్లో 50 చిత్రాలతో తన ప్రదర్శనను నాఫిస్‌ కొనసాగిస్తున్నారు. 

 

16:15 - August 4, 2018

ఢిల్లీ : తెలంగాణ గిరిజన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా లంబాడాలు ఆందోళనకు దిగారు. లంబాడాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచాలని, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఎస్టీల ఆందోళనపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

యువతలో నైపుణ్యాలు వెలికి తీసేందుకు కృషి : చంద్రబాబు

తిరుపతి : జ్నానభేరీ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు..రాష్ట్ర భవిత యువత, విద్యార్ధుల చేతిలోనే వుందన్నారు. 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని చంద్రబాబు ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టేందుకు యువతలో నైపుణ్యాలను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఏదేశానికి లేని అనుకూలతలు భారతదేశానికి వున్నాయనీ..అలాగే ఏ రాష్ట్రానికి లేనివి ఏపీకి వున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరుగా మనం వున్నామన్నారు.

16:13 - August 4, 2018

హైదరాబాద్ : బాలానగర్‌ ఎంఈవో శ్రీధర్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కూకట్‌పల్లిలోని ఓ ప్లే స్కూల్‌ యాజమాన్యం నుంచి లంచం తీసుకుంటున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

16:04 - August 4, 2018

చెన్నై : రాజకీయ కురువృద్ధుడు కరుణానిధిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెన్నైలో పరామర్శించారు. కరుణానిధి చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కరుణానిధి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాఢపడుతున్నారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

ఇంకా వీడని చిన్నారి మణీశ్వరి కిడ్నాప్ కేసు..

నిజామాబాద్ : నందిపేట మండలంలో చిన్నారి అదృశ్యం కేసు ఇంకా కొనసాగుతునే వుంది. ఈనెల 2వ తేదీన చిన్నారి మణీశ్వరిని ఓ గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. 48 గంటలు దాటినా చిన్నారి మణీశ్వరి ఆచూకీ లభించలేదు. పోలీసులు పట్టించుకోవటంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

ఢిల్లీలో తెలంగాణ బంజారాల ధర్నా..

ఢిల్లీ : తెలంగాణ గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో లంబాడాలు ధర్నా చేపట్టారు. లంబాడాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తు లంబాడాలు ఢిల్లీలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని..ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని లంబాడాలు డిమాండ్ చేస్తున్నారు. 

జీహెచ్ ఎంసీలో భారీ మార్పులు..

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీలు పలు మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సర్కిల్స్, జోన్ లను పెంచుతు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో జోన్లను ఆరు నుండి 12 జోన్లకు పెంపు..సర్కిల్స్ 30 నుండి 48కి పెంచుతు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతీ జోన్ కు నాలు సర్కిల్స్ వుండే విధంగా బల్దియా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. జోన్స్, సర్కిల్స్ పెరగటంతో 1610 అదనపు పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఏపీబీ వలలో బాలానగర్ ఎంఈవో శ్రీధర్..

హైదరాబాద్ : బాలానగర్ మండల ఎడ్యుకేషణ్ ఆఫీసర్ శ్రీధర్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. కూకట్ పల్లి లోని ఓ ప్లే స్కూల్ యాజమాన్యం నుండి లంచం తీసుకుంటు ఎంఈవో రూజ20వేలు లంచం తీసుకుంటు శ్రీధర్ ఏసీబీకి పట్టుపడ్డాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎటువంటి వసతులు లేని ఓ ప్లే స్కూల్ కు అనుమతు విషయంలో గత కొంత కాలంగా వేధిస్తు..అనుమతులు ఇవ్వాలంటే లంచం ఇవ్వాల్సిందేనని వేధిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కరుణను పరామర్శించిన సీఎం చంద్రబాబు..

తమిళనాడు : డీఎంకే అధినేత కరుణానిధి తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరుణానిధిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన కుమారుడైన స్టాలిన్, కుమార్తె కనిమొళిని కలిసి కరుణ ఆరోగ్యం గురించి వివరాలను తెలుసుకున్నారు. కరుణా త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. చెన్సై రాకముందుకు కరుణ ఆసుపత్రిలో చేరిన క్రమంలో ఫోన్ ద్వారా కూడా కరుణ ఆరోగ్యం గురించి చంద్రబాబు ఎప్పటికప్పుడు తెలుసుకుంటునే వున్నారు. 

జగన్ పాదయాత్రలను నిరసనలతో అడ్డుకుంటున్న కాపులు..

తూర్పుగోదావరి : వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్రకు తూర్పు గోదావరి జిల్లాలో నిరసనల సెగ తగిలింది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల విషయంలో జగన్ వైఖరిని నిరసిస్తూ పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో కాపు యువకులు ఈ రోజు జగన్ పాదయాత్రను అడ్డుకున్నారు. ప్లకార్డులు, నల్లజెండాలు ప్రదర్శిస్తూ ‘జై కాపు.. జైజై కాపు’ అంటూ నినాదాలు చేశారు. కాపు రిజర్వేషన్ పై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని యువకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

పంట పొలాల్లో మందుబాబుల పైశాచికత్వం..

అమరావతి : నున్న నగరం శివారు ప్రాంతంలో మందుబాబు పైశాచికత్వానికి హద్దు లేకుండా పోతోంది. ఆ ప్రాంతంలో వుండే పొలాల్లో మద్యం సేవించి ఖాళీ బాటిళ్లను పగులగొడుతున్నారు. దీంతో రైతులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవటంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పొలాల్లో మద్యం సేవించే కార్యక్రమాలు వద్దు అంటు రైతులు ఫెక్లీలను ఏర్పాటు చేశారు. దీంతో రైతులపై మందుబాబులు ఎదురు దాడికి దిగుతు నానా బీభత్సం సృష్టిస్తున్నారు.

13:22 - August 4, 2018

విజయవాడ : కర్నూలు జిల్లాలోని హత్తెబెళగల్ వద్ద జరిగిన క్వారీ ప్రమాద బాధ్యత ప్రభుత్వానిదేనని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. క్వారీ పేలుడు ఘటనలో 12 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు మధు సానుభూతి తెలియచేశారు. అనంతరం ఆయన మీడయాతో మాట్లాడారు. అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారని, శుక్రవారం గ్రామదర్శినిలో గ్రామ ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. విదేశీ పరిశ్రమలకు అనుకూలంగా చట్టాలు మారుస్తున్నారని, ప్రజల భద్రతను గాలికొదిలేశారని తెలిపారు. 

13:19 - August 4, 2018

హైదరాబాద్ : దేశం మొత్తం మీద తెలంగాణ పోలీసు శాఖ అద్భుతంగా పనిచేస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...హైదరాబాద్ లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపారు. నగరంలో విపత్తులు, ప్రమాదాలు సంభవిస్తే డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ పనిచేస్తుందని, ఇలాంటి ఫోర్స్ ఉన్న పాలక సంస్థ జీహెచ్‌ఎంసీ మాత్రమేనన్నారు. ప్రజల్లో ఒక విశ్వాసం పెంచుతుందన్నారు. 

మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో దుండగుడి కాల్చివేత..

జమ్ము కశ్మీర్ : మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా నివాసంలోకి చొరబడేందుకు ఓ అజ్నాత వ్యక్తి యత్నించాడు. కారులో వచ్చిన సదరు దుండగుడు అబ్దుల్లా ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించాడు. దీంతో వెంటనే స్పందించిన భద్రతా దళాలు దుండగుడిని కాల్చి చంపారు. కాగా సదరు దుండగుడు ఎవరు? ఎందుకు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించాడు? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. 

13:14 - August 4, 2018

పశ్చిమగోదావరి : మానస సరోవర్ యాత్రకు వెళ్లి తిరుగు వస్తుండగా వాతావరణం అనుకూలించకపోవడంతో పలువురు తెలుగు యాత్రికులు చిక్కుకపోయారు. చిక్కుకున్న వారిలో ఏలూరు నగర మేయర్ భర్త పెదబాబు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనతో టెన్ టివి మాట్లాడింది. మూడు రోజుల నుండి భారీగా మంచు కురుస్తోందని..హెలికాప్టర్ లు రావడం లేదన్నారు. దీనితో తాము పలు సమస్యలను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. తాము ప్రస్తుతం చైనా బోర్డర్ లో ఉన్నామని..ఒక హిల్ స్టేషన్ లో తలదాచుకున్నామన్నారు. అధికారులకు సమాచారం అందించామని, తనతో పాటు 94 మంది ఇక్కడున్నామన్నారు. 65-70 మంది దాక తెలుగు వారున్నారని వెల్లడించారు. 

13:11 - August 4, 2018

హైదరాబాద్ : వందలాది మందిని మోసం చేసి..సిండికేట్ గా ఏర్పడి లక్షలాది రూపాయలను దోచుకున్న 'కరక్కాయల' స్కాం ప్రధాన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. దీనితో 'కరక్కాయల స్కాం'ను పోలీసులు చేధించినట్లైంది. ఇటీవలే కరక్కాయల కొనుగోలు చేసి పొడి చేసి ఇస్తే కమిషన్ ఇస్తామని మల్లిఖార్జున్ అనే వ్యక్తి జనాలని నమ్మబలికి కోట్లాది రూపాయల కుచ్చుటోపి పెట్టి పరారయ్యాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కీలక నిందితుడు మల్లిఖార్జున్ తో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి నుండి 44 లక్షల రూపాయలను సీజ్ చేశారు.

ఏమి జరిగింది ?
కిలో కరక్కాయలు రూ.1000లకు కొనుగోలు చేసి.. పొడిచేసి ఇస్తే.. రూ.300లు కమీషన్ ఇస్తామని మల్లిఖార్జున్ నమ్మబలికాడు. 30శాతం కమీషన్ వస్తుండటం..చాలా మంది ఎగబడ్డారు. దీనితో మల్లిఖార్జున్ పెట్టిన సంస్థ ఒక్కొక్కరి నుంచి కిలో రూ.1000 వంతున లక్షల్లో వసూలు చేపట్టింది. కొద్ది రోజుల అనంతరం వారికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. రూ.కోట్లలో వసూలు చేసి సంస్థ బోర్డు తిప్పేసింది. తాము మోస పోయామని తెలుసుకున్న బాధితులు కేపీహెచ్ బి పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. 

క్వారి పేలుడు ఘటనపై అన్ని పార్టీలు ఉద్యమించాలి : మధు

కర్నూలు : జిల్లాలో జరిగిన క్వారీ ప్రమాదం బాధాకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విచారం వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే క్వారీలో పేలుడు సంభవించిందని మధు ఆరోపించారు. క్వారీలకు సంబంధించిన సమస్యలను ప్రజలు ఫిర్యాదు చేసినా..అధికారులు పెడ చెవిన పెట్టారనీ..అందుకే ఈ పేలుడు సంభవించిందన్నారు. అలూరు క్వారీ పేలుడు టీడీపీ హత్యలుగా భావించాలని మధు ఆరోపించారు. వలస కూలీల వివరాలను..వారు పని చేస్తున్న కంపెనీ వివరాలను కార్మిక శాఖ రిజిస్టర్ లో నమోదు చేయాలనీ..కానీ అలా జరగటంలేదన్నాఉ.

రాజమండ్రి మున్సిపల్ సమావేశం రసాభాస..

తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సభకు ఆటంకం కలిగిస్తున్నారని ఏడుగురు వైసీపీ పార్టీకి చెందిన కార్పొరేటర్లను మేయర్ ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు.దీంతో సభలో వున్న మిగిలిన వైసీపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. దీంతో వీరిని పోలీసులు బైటకు పంపించారు. 

కరక్కాయల స్కాంలో కీలక నిందితులు అరెస్ట్..

హైదరాబాద్ : కరక్కాయల స్కాం కేసులో..కీలక నిందుతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ టూల్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని స్థాపించిన మల్లికార్జున్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.44లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కాగా సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టీ టూల్స్ ప్రయివేట్ లిమిటెడ్ సిబ్బంది అయిన ఐదుగురు యువతులను స్కామ్ లో భాగస్వాములనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

ఛలో గుంటూరు పోస్టర్ ఆవిష్కరణ..

విజయవాడ : ఈ నెల 28న సీఎం చంద్రబాబు అధ్యక్షతన గుంటూరులో ముస్లిం మైనార్టీ సభ నిర్వహించనున్నారు. ముస్లిం మైనార్టీలు రూపొందించిన ఛలో గుంటూరు పోస్టర్ ను ఎంపీ కేశినేని నాని ఆవిష్కరించారు. 'నారా హమారా' 'టీడీపీ హమారా' పోస్టర్ ను కేశినేని ఆవిష్కరించారు. 

బేగంపేటలో లైఫ్ స్టైల్ భవనం వద్ద డ్రగ్స్ విక్రయం..

హైదరాబాద్ : నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. బేగంపేటలో లైఫ్ స్టైల్ భవనం వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుండి 7 ఎల్ఎస్ డీ డ్రగ్స్ బాటిళ్లు, 10గ్రాముల చారస్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మల్కాజ్ గిరికి చెందిన ఆకాష్ కుమార్, దాసరి రాకేశ్ లుగా పోలీసులు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేసి డ్రగ్స్ ఎవరికి సరఫరా చేస్తున్నారు? అనే విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. 

12:31 - August 4, 2018

హైదరాబాద్ : నగరంలోని ఎన్ఎంజీ కేన్సర్ ఆసుపత్రి నినాదాలతో మారుమోగింది. ఈ ఆసుపత్రిని 'అటానమస్' చేయవద్దని ఆసుపత్రి సిబ్బంది గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతోంది. శుక్రవారం వీరి ఆందోళనకు సీపీఎం మద్దతు తెలియచేసింది. 'వద్దురా..వద్దురా..అటామనస్ వద్దురా' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టెన్ టివి వారితో మాట్లాడింది. స్యయంప్రతిపత్తి కల్పిస్తే రోగులు డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సి వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. రోగులు ఇబ్బందులు పడుతారని కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతామని వైద్యులు పేర్కొన్నారు. అటామనస్ అంటే స్వయం ప్రతిపత్తి అని సీపీఎం నేత నంద్యాల నర్సింహరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకోవాలనే ఉద్ధేశ్యంతో ఇలా చేస్తున్నారని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఎన్ఎంజీ కేన్సర్ ఆసుపత్రి వద్ద సీపీఎం ఆందోళన..

హైదరాబాద్ : ఎన్ఎంజీ కేన్సర్ ఆసుపత్రి వద్ద సీపీఎం ఆందోళన చేపట్టింది.గత కొంతకాలంలో ఎన్ఎంజీ కేన్సర్ ఆసుపత్రిని అటానమస్ చేసేందుకు యాజమాన్యం యత్నాలు చేస్తుటం..దానిపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఎన్ఎంజీ ఆసుపత్రిని అటానమస్ చేస్తే రోగులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనీ..ఆసుపత్రి సిబ్బంది ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా సీపీఎం నిలిచింది. ఈ ఆసుపత్రిని అటానమస్ చేయవద్దని డిమాండ్ చేస్తు సీపీఎం ఆందోళన చేపట్టింది. 

12:30 - August 4, 2018

కర్నూలు : ఆలూరు నియోజకవర్గంలోని హత్తెబెళగల్ వద్ద జరిగిన క్వారీ పేలుడిపై ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది. పేలుడులో 12 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరుగుతుందని ముందే హెచ్చరించినా అధికారులు స్పందించలేదని...దీనికారణంగా ఇంతటి విషాదం చోటు చేసుకుందని గ్రామస్తులు, విపక్షాలు పేర్కొంటున్నాయి. అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలని, ప్రమాదానికి గల కారణమైన క్వారీ యజమానిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతున్నారు. కానీ ఘటనాస్థలంలో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. చెల్లాచెదురుగా పడిన శరీర మాంసపు ముద్దలను కుక్కలు పీక్కుతింటున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలువురు మండిపడుతున్నారు.

ఆరా తీసిన బాబు...చిన రాజప్ప స్పందన...
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపై చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వెంటనే ఘటనా స్థలికి వెళ్లాలని డిప్యూటి సీఎంలకు, మైనింగ్ శాఖ మంత్రికి, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తున్న సీఎం బాబు ప్రకటించారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డిప్యూటి సీఎం చిన రాజప్ప వెల్లడించారు. క్వారీ యజమానులు ఎంతటివారైనా సరే కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. 

పలువురి పరామర్శ...
క్వారీ పేలుడు ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అక్రమ క్వారీలను మూసివేయాలని డిమాండ్ చేశారు. పేలుడు ఘటనకు సంతాపంగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పాణ్యం ఎమ్మెల్యే చరితరెడ్డి వెల్లడించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్, తదితర ప్రజాప్రతినిధులు క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సీపీఐ రామకృష్ణ సానుభూతి తెలియచేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు మెరుగైన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. 

12:12 - August 4, 2018

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం 'రాహుల్' పలు సమావేశాలు నిర్వహిస్తూ అధికారంలోకి రావడానికి వ్యూహ రచనల్లో బిజీగా మారుతున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. అనారోగ్య కారణాల వల్ల ఆమె హాజరు కాలేదని తెలుస్తోంది. కానీ రాహుల్ కు స్వేచ్ఛ ఇవ్వాలని...సీనియర్ నేతలతో రాహుల్ స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో సోనియా హాజరు కాలేదనే చర్చ జరుగుతోంది. సీడబ్ల్యూసీలో తీసుకొనే నిర్ణయాలు కాంగ్రెస్ అమలు చేస్తుందనే సంగతి తెలిసిందే.

2019 ఎన్నికలకంటే ముందు మూడు రాష్ట్రాల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి ? ఏ పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవాలి అనే దానిపై సీడబ్ల్యూసీలో నేతలు చర్చిస్తున్నారు. పొత్తులకు సంబంధించి నిర్ణయం రాహుల్ కే అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో వచ్చే బిల్లులపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రధాని అభ్యర్థి

ప్రధాని అభ్యర్థిని కాంగ్రెస్ వదులుకుని బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పనిచేయాలని రాహుల్ పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. వివిధ జాతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆయా పార్టీలతో మాట్లాడి...వివిధ స్థాయిల్లో ఆందోళనలు జరపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దళితులపై దాడులు..పెరుగుతున్న నిరుద్యోగం..తదితర అంశాలపై సీడబ్ల్యూసీ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకొంటుంది ? అనే విషయాలు సమావేశం అనంతరం తెలుస్తుంది. 

ఎన్టీఆర్ జీవితంలో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. : దర్శకుడు క్రిష్

కృష్ణా : దివంగత సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ పుట్టిన ఊరు నిమ్మకూరులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతు..ఎన్టీఆర్ బయోపిక్ లో ఇప్పటికే పలు కీలక పాత్రలకు నటీనటులను ఖరారు చేసామని తెలిపారు. ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందేననీ..ఆయన భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్..ఎన్టీఆర్ అల్లుడు..ప్రస్తుత ఏపీ సీఎంగా వున్న చంద్రబాబు నాయుడు పాత్రలో నటుడు రానా దగ్గుపాటి నటిస్తారని తెలిపారు.

11:35 - August 4, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు 'రాహుల్ గాంధీ' వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తే పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని..పార్టీ నేతలు..కార్యకర్తలకు మరింత ఊపు వస్తుందని కాంగ్రెస్ నేతలు భావించి పలుమార్లు కోరిన సంగతి తెలిసిందే. తాజాగా 'రాహుల్' పర్యటన ఖరారైంది. 13, 14వ తేదీల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. నాలుగో బస్సు యాత్రను రాహుల్ ఈ సందర్భంగా ప్రారంభించనున్నారు. రాజేంద్రనగర్ నుండి ఈ యాత్ర ప్రారంభం కానుంది.

13వ తేదీన మధ్యాహ్నం 2గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగి రాజేంద్రనగర్ కు వెళుతారు. అక్కడ 2.30గంటలకు 10వేల మంది డ్వాక్రా మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాంగ్రెస్ హాయాంలో ఉన్న పథకాలు..ప్రస్తుతమున్న పథకాలపై వారితో రాహుల్ చర్చించనున్నారు. సాయంత్రం 5గంటలకు శేరిలింగంపల్లిలో జరిగే బహిరంగసభ...రాత్రి 8కి నాంపల్లిలో జరిగే బహిరంగసభల్లో ఆయన పాల్గొంటారు. రాత్రి 10గంటలకు ముస్లిం ప్రముఖలతో రాహుల్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

14వ తేదీ ఉదయం 9.30గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం 10గంటలకు జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం 11గంటలకు వాణిజ్య ప్రముఖలతో భేటీ కానున్నారు. ఇదిలా ఉంటే ఆయన ఉస్మానియా యూనివర్సిటీని రాహుల్ సందర్శించనున్నట్లు సమాచారం. 

11:21 - August 4, 2018

పశ్చిమగోదావరి : మానస సరోవర్ యాత్ర వెళ్లడం...తిరుగు ప్రయాణంలో కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ యాత్రకు వెళుతున్న వారు మార్గమధ్యంలో చిక్కుకోవడం..పలువురు మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మానస సరోవర్ యాత్రకు వెళ్లి..తిరుగు వస్తుండగా మార్గమధ్యంలో తెలుగు యాత్రికులు చిక్కుకపోయారు. నేపాల్ - జార్ఖండ్ మధ్యలో తీవ్రమైన మంచు కురుస్తోంది. దీనితో పలువురు అష్టకష్టాలు పడుతున్నారు. చిక్కుకున్న వారిలో ఏలూరు నగర మేయర్ భర్త పెదబాబు, ఆయన సమీప కుటుంబసభ్యులు, ప్రకాశం జిల్లాకు చెందిన కొంతమంది చిక్కుకున్నారు. దీనితో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారంతా ప్రైవేటు హెలికాప్టర్ల ద్వారా వెళ్లాలని అనుకున్నా వాతావరణం అనుకూలించడం లేదు. రక్షణ సైన్యానికి సంబంధించిన హెలికాప్టర్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. చిక్కుకున్న 40 మంది తెలుగు యాత్రికులను సురక్షితంగా వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. 

11:08 - August 4, 2018

కర్నూలు : ప్రమాదం జరిగిన అనంతరం చర్యలు తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. కర్నూలు జిల్లాలోని హత్తిబెళగల్ క్వారీ పేలుళ్ల అనంతరం పాలనా యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. పేలుళ్ల ఘటనలో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరంతా ఒడిశా వాసులు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపై చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. వెంటనే ఘటనా స్థలికి వెళ్లాలని డిప్యూటి సీఎంలకు, మైనింగ్ శాఖ మంత్రికి, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తున్న సీఎం బాబు ప్రకటించారు.

అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలి...
ఇదిలా ఉంటే అక్రమ క్వారీలను సీజ్ చేయాలని, పేలుళ్లకు కారణమైన క్వారీ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. శుక్రవారం నాడు ఉదయం జరిగిన గ్రామదర్శినిలో క్వారీపై ఫిర్యాదు చేసినా రెవెన్యూ, ఇతర అధికారులు పట్టించుకోలేదని, కొద్ది గంటల అనంతరం ఈ పేలుడు చోటు చేసుకుందని..చర్యలు తీసుకుంటే ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. క్వారీ పేలుడు ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అక్రమ క్వారీలను మూసివేయాలని డిమాండ్ చేశారు.

పలువురు పరామర్శ...
పేలుడు ఘటనకు సంతాపంగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పాణ్యం ఎమ్మెల్యే చరితరెడ్డి వెల్లడించారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్, తదితర ప్రజాప్రతినిధులు క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు మెరుగైన పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. 

అమర్ నాథ్ యాత్రలో చిక్కుకున్న 40మంది తెలుగువారు..

పశ్చిమగోదావరి : మానస సరోవర యాత్రకు వెళ్లి చిక్కుకున్నవారిలో 40మంది తెలుగు యాత్రీకులున్నట్లు సమాచారం. గత మూడు రోజులుగా వాతావరణం అనుకూలించకపోవటంతో వారు ఆహారం లేక పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ యాత్రలో చిక్కుకున్నవారిలో ఊలూరు నగర మేయర్ర భర్త, కో ఆప్షన్ సభ్యులు పెదబాబు వున్నారు. కాగా అమర్ నాథ్ యాత్రలో ఈ ఏడాది వాతావరణం అనుకూలించక పలు అనారోగ్యాలకు గురై పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. 

గర్భిణి భార్యపై భర్త తుపాకీ కాల్పులు..

కరీంనగర్ : భార్యాభర్తల మధ్య ప్రారంభమైన చిన్నపాటి గొడవ ఏకంగా కాల్పులకు దారి తీసింది. తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణాపూర్‌ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ విషయంలో కనకయ్య, భార్య స్వప్నల మధ్య గొడవ మొదలై చికిలి చిలికి గాలివానగాప్రారంభమైన గొడవ..దీంతో ఆగ్రహం పట్టలేని కనకయ్య వెంటనే తన దగ్గరున్న తుపాకి తీసి భార్యపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె 5 నెలల గర్భిణిగా వున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

10:31 - August 4, 2018

కరీంనగర్ : ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు..సవ్యంగా కాపురం చేసుకోవాల్సిన భర్త...భార్యపై అనుమానాలు పెంచుకున్నాడు..గర్భవతి అని చూడకుండా ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

తిమ్మాపూర్ రామకృష్ణ కాలనీలో కనకయ్య..స్వప్నలు నివాసం ఉంటున్నారు. గతంలో వీరు నేపాల్ ఉండే వారు. వీరిది ప్రేమ వివాహం. నెలన్నర క్రితమే వీరు నేపాల్ నుండి కరీంనగర్ జిల్లాకు వచ్చారు. కానీ కనకయ్యకు ఆర్థికపరమైన బాధలు..భార్యపై అనుమానాలు పెంచుకున్నాడు. ప్రస్తుతం స్వప్న 5 నెలల గర్భవతి. శుక్రవారం రాత్రి స్వప్న..కనకయ్య మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆవేశంలో తన దగ్గరున్న నాటు తుపాకీతో ఆమె తొడ భాగంలో కాల్చాడు. గాయాల పాలైన ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే సీపీ కమలాసన్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. పరారైన కనకయ్య కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. 

క్వారీ యజమానులపై కఠిన చర్యలు : చంద్రబాబు

కర్నూలు : జిల్లాలోని హత్తెబెళగల్ లో క్వారీలో పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందిన తరువాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనపై ఆయన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం చెల్లిస్తామని బాబు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించిన క్వారీ ఓనర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు. పేలుడులో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం చేయాలని ఆదేశించారు.

నిమ్మకూరులో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ పర్యటన..

కృష్ణా : నిమ్మకూరులో నటుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ పర్యటిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి, బాలకృష్ణ తల్లి అయిన బసవతారకం, ఎన్టీఆర్ విగ్రహాలకు బాలకృష్ణ నివాళులర్పించారు. కాగా ఎన్టీఆర్ బయోపిక్ బయోపిక్ సినిమాగా చిత్రీకరిస్తున్న విషయం తెలిసందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చిత్రీకరణ ప్రవేశాలపై దర్శకుడు క్రిష్ బాలకృష్ణతో కలిసి పరిశీలిస్తున్నారు. 

10:19 - August 4, 2018

కర్నూలు : జిల్లాలోని హత్తెబెళగల్ లో క్వారీలో పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందిన తరువాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనపై ఆయన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల పరిహారం చెల్లిస్తామని బాబు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించిన క్వారీ ఓనర్లపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు. పేలుడులో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం చేయాలని ఆదేశించారు. ఘటనాస్థలికి డీజీపీ, ఇద్దరు డిప్యూటి సీఎంలు, మైనింగ్ శాఖ మంత్రులు వెళ్లాలని, మైనింగ్, పోలీసు శాఖల యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. 

10:13 - August 4, 2018

కర్నూలు : ఆలూరు మండలం అగ్రహారం వద్దనున్న హత్తెబెళగల్ వద్ద క్వారీలో పేలుడు ఘటన అనంతరం హృదయ విదారక దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. 12 మంది మృతి చెందినా అధికారులు ఇంకా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేలుడులో ప్రాణాలు కోల్పోయిన మృతదేహాలను కుక్కలు పీక్కుతింటున్నాయి. కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. పేలుళ్లు జరిగిన స్థలాన్ని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మునురు జయరాం పరిశీలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

పేలుడు మృతదేహాలను పీక్కు తింటున్న కుక్కలు..

కర్నూలు : హత్తిబెళగల్ క్వారీలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ప్రాంతంలో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి.పేలుడులో ప్రాణాలు కోల్పోయిన క్వారీ కార్మికుల మృతదేహాలను కుక్కలు పీక్కు తింటున్న దృశ్యాలు హృదయవికారంగా కనిపిస్తున్నాయి. మృతదేహాలను కుక్కలు పీక్కు తింటున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవటంలేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. కాగా పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మునురు జయంరాం పరిశీలించేందుకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. 

మతతత్వంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..

ఢిల్లీ : మతతత్వంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మతతత్వం అనేది సంస్కృతి ముసుగులో దూరి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తుందని అన్నారు. అది సింహం తోలు కప్పుకున్న గాడిదలాంటిదని జులై 31న ప్రముఖ రచయిత ప్రేమ్‌చంద్ 134వ జయంతి పురస్కరించుకుని హిందీలో ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. సింహం తోలు కప్పుకున్న గాడిద అడవికి తానే రాజని భావిస్తుందని పేర్కొన్నారు. అసలు రూపాన్ని బయటకు చూపించే సాహసాన్ని అది ఎన్నడూ చేయబోదన్నారు. ప్రస్తుతం మతతత్వం కూడా ఇలానే ప్రవర్తిస్తోందన్నారు.

కర్నూలు క్వారీ పేలుడు కారణాలివే..

కర్నూలు : క్వారీలో జరిగిన భారీ పేలుడులో మరణించిన వారి సంఖ్య 12కు పెరిగింది. మరో నలుగురు మృత్యువుతో పోరాడుతున్నారు. క్వారీలో ఇంత భారీ పేలుడుకు కారణాన్ని పోలీసులు దర్యాప్తు చేపట్టిన క్రమంలో బండరాళ్లను పేల్చేందుకు వినియోగించే డిటొనేటర్లు ఒకదాని తరువాత ఒకటి పేలుతుంటాయి. పేలుడు జరిగే ప్రాంతానికి దూరంగా వెళితే ఎటువంటి ప్రమాదమూ ఉండదు. కానీ ఈ క్వారీలో జరిగింది వేరు. రాళ్లను ముక్కలు చేసేందుకు వినియోగించే పేలుడు పదార్థాలను ఆ ప్రాంతంలో భారీగా నిల్వచేశారు.

రాహుల్ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదే..

హైదరాబాద్ :రాత్రి 8 గంటలకు నాంపల్లిలో బహిరంగసభలో పాల్గొననున్నారు. రాత్రి 10గంటలకు ముస్లిం ప్రముఖులతో రాహుల్ సమావేశంకానున్నారు. మరునాడు అంటే 14వ తేదీన 9.30గంటలకు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లిని దర్శించుకోనున్నారు. ఉదయం 10గంటలకు జూబ్లీహిల్స్ లో ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతో సమావేశం అనంతంర 11గంటలకు వాణిజ్య ప్రముఖులతో సమావేశమవుతారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన రాహుల్ తెలంగాణలో నెలకు ఒకసారి పర్యటించనున్నారని టీ.కాంగ్రెస్ నేతలు తెలిపారు. 

09:31 - August 4, 2018

ఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లో గవర్నర్ పాలన వచ్చిన అనంతరం రంజాన్ మాసం తరువాత ఉగ్రవాదుల చొచ్చుక వచ్చారనే సమాచారం మేరకు భారత బలగాలు ఆయా ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆయా సమయాల్లో ఉగ్రవాదులకు..జవాన్ల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా షోపియాన్, బారాముల్లా జిల్లాల్లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. షోపియాన్ జిల్లా కిల్లోరా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు, బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుపెట్టాయి. శుక్రవారం రాత్రి నుండి ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదుల నుండి ఏకె 47 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతి చెందిన ఉగ్రవాదులు రియాజ్ అహ్మద్ దర్, కుర్షీద్ అహ్మద్ మాలిక్ లుగా గుర్తించారు. కానీ బారాముల్లా జిల్లాలో జరిగిన కాల్పుల్లో జవాన్ సావర్ విజయ్ కుమార్ వీరమరణం పొందారు. 

7గురు ఉగ్రవాదుల హతం...

జమ్మూ కాశ్మీర్ : షోపియాన్, బారాముల్లా జిల్లాల్లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. షోపియాన్ జిల్లా కిల్లోరా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు, బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుపెట్టాయి. 

క్వారీ ప్రమాదం తరువాత..బాబు ఆదేశాలు...

విజయవాడ : ఆలూరు మండలం అగ్రహారం దగ్గర హత్తెబెళగల్ మైనింగ్ క్వారీలో పేలుడులో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఘటనాస్థలికి డీజీపీ, హోం మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన క్వారీ ఓనర్లపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటతి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మైనింగ్, పోలీసు శాఖల యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. 

క్వారీ ప్రమాదం..బాబు పరిహారం...

విజయవాడ : ఆలూరు మండలం అగ్రహారం దగ్గర హత్తెబెళగల్ మైనింగ్ క్వారీలో మృతి చెందిన 12 మంది కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

 

09:16 - August 4, 2018

కర్నూలు : ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పినా...అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తీరా ప్రమాదం జరిగిన అనంతరం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటిస్తుంటారు. తాజాగా ఆలూరు మండలం అగ్రహారం దగ్గర హత్తెబెళగల్ మైనింగ్ క్వారీలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ క్వారీలో భారీగా పేలుడు పదార్థాలున్నాయని..చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరినా అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. శుక్రవారం నిర్వహించిన గ్రామదర్శినిలో పాల్గొన్న రెవెన్యూ అధికారులు..గ్రామ పంచాయతీ అధికారులకు క్వారీపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు. కొన్ని గంటల అనంతరం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 11 మంది మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 12కి చేరింది. ఘటన జరిగిన అనంతరం క్వారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ క్వారీలు ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలూరు ప్రాంతంలతో ఉన్న క్వారీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పలువురు పేర్కొంటున్నారు. ఆయా క్వారీల్లో పనులు చేయించుకొనేందుకు ఇతర రాష్ట్రాల నుండి తీసుకొస్తున్నారు. డబ్బులు సంపాదించుకోవాలనే ధ్యేయంతో యువకులు పని చేసేందుకు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జరిగిన క్వారీలో ప్రమాదంలో మృతులంతా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు. ప్రమాదం జరిగిన విషయం కుటుబసభ్యులకు తెలియచేశారా ? లేదా ? అనేది తెలియరావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం...అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొంటారో వేచి చూడాలి. 

జవాన్లకు..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు...

జమ్మూ కాశ్మీర్ : షోపాన్ కిలోరా జిల్లాలో భారత బలగాలకు...ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

08:28 - August 4, 2018

హైదరాబాద్‌ : అబిడ్స్‌లో ఓ మహిళ ట్రాఫిక్‌ పోలీసులకు చుక్కలు చూపింది. వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు.. హెల్మెట్‌ లేకుండా టూ వీలర్‌పై వెళ్తున్న మహిళన ఆపారు. వాహనానికి సంబంధించిన పత్రాలు చూపమనడంతో.. ఆమె పోలీసులపై బూతు పురాణం మొదలుపెట్టింది. ఖంగుతిన్న ట్రాఫిక్‌ పోలీసులు.. ఆమె నోటికి తాళం వేసేందుకు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడ నుంచి ఆమె మెల్లగా జారుకుంది. పోలీసులు టూవీలర్‌ను సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు.

08:27 - August 4, 2018

హైదరాబాద్ : పాతబస్తీలో మరోసారి కత్తిపోట్ల కలకలం రేగింది. చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హుస్సేన్..అహ్మద్ ఖాన్ లు స్నేహితులు. వీరి మధ్య ఏదో విషయంలో శుక్రవారం రాత్రి గొడవ పడ్డారు. విచక్షణ కోల్పోయిన హుస్సేన్ కత్తి తీసుకుని అహ్మద్ పై విచక్షణారహితంగా దాడికి దిగాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న పోలీసులు అహ్మద్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

కడప జిల్లా బంద్...

కడప : శనివారం జిల్లా బంద్ జరుగనుంది. విద్యార్థులపై లాఠీఛార్జీ, అరెస్టులను నిరసిస్తూ కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

కరీంనగర్ లో మంత్రి ఈటెల పర్యటన...

కరీంనగర్ : నేడు జిల్లాలో మంత్రి ఈటెల రాజేందర్ పర్యటించనున్నారు. రైతు బీమా, ధరణి కంటి వెలుగు పథకాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి ఈటెల సమీక్ష నిర్వహించనున్నారు. 

జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్షా ర్యాలీ...

ఢిల్లీ : నేడు జంతర్ మంతర్ వద్ద తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ప్రతిపక్షాల ర్యాలీ నిర్వహించింది. ముజఫర్ ఘటనకు వ్యతిరేకంగా ర్యాలీ జరుగనుంది. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. 

లారీ - కారు ఢీ...డ్రైవర్ మృతి...

నెల్లూరు : పెళ్లకూరు మండలం శిరసనంబేడు చెక్ పోస్టు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు - లారీలు ఢీకొన్నాయి. లారీ డ్రైవర్ మృతి చెందాడు. ప్రయాణీకులకు స్వల్పగాయాలయ్యాయి. 

క్వారీలో పేలుడుపై జనసేనానీ స్పందన...

హైదరాబాద్ : కర్నూలు నగరంలో క్వారీలో జరిగిన పేలుడులో 11 మంది మృతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన కూలీల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుని మెరుగైన పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెల్లడించారు. క్వారీల్లో అక్రమ తవ్వకాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నిబంధనల ఉల్లంఘన కూలీల పాలిట శాపంగా మారుతోందన్నారు. 

06:45 - August 4, 2018

ఢిల్లీ : శారదా చిట్‌ఫండ్‌ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నళినికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డెరెక్టరేట్‌ జారీ చేసిన సమన్లపై కోర్టు స్టే విధించింది. దీనిపై సమాధానం చెప్పాలని ఈడీకి నోటీసు జారీ చేసింది. ఈ కేసులో నళిని, కార్తి చిదంబరాన్ని అరెస్ట్‌ చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఈడీ సమన్లను రద్దు చేయడానికి మద్రాస్‌ హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

06:42 - August 4, 2018

నిజామాబాద్ : గులాబి పార్టీలో నిజామాబాద్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సీనియర్ నేత డిశ్రీనివాస్‌పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ.. సాక్షాత్తు నిజామాబాద్‌ ఎంపీ కవిత ఇటీవలే డిమాండ్‌ చేశారు. ఇప్పుడు, ఆయన తనయుడు సంజయ్‌పై పోలీసు కేసు నమోదైంది. ఈ పరిమాణాలన్నీ చూస్తే.. కారు పార్టీ డిఎస్‌కు పొగబెడుతున్నట్లే అన్న భావన వ్యక్తమవుతోంది. తెలంగాణా రాష్ట్ర సమితిలో.. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ నేతల ఆధిపత్య పోరు సాగుతోంది. అయితే.. నిజామాబాద్ జిల్లా నేతల పోరు మాత్రం ప్రత్యేకతరె సంతరించుకుటోంది. ఆ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ కవిత ప్రాతినిథ్యం వహిస్తుండడం... జిల్లా అంతటా ఈ పార్టీకి చెందిన శాసనసభ్యులు, ఎంపీలే ఉండడంతో... ఇక్కడ అంతర్గత పోరు కాస్త అధికంగానే ఉంది. ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకుండా పోయిందని, నేతలంతా ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తో.....ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి విబేధాలు సమిసి పోకపోవడంతో భూపతి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆరు నెలల క్రితం జిల్లా ప్రజాప్రతినిధులు తీర్మానం చేసి సిఎంకు పంపారు. డి.శ్రీనివాస్ కూడా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని రెండు నెలలక్రితం జిల్లా నేతలు తీర్మానించి చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయంగా కలకలం రేపిన ఈ రెండు ఫిర్యాదులనూ సీఎం పెండింగ్‌లో ఉంచారు.

అనూహ్యంగా డిఎస్‌ తనయుడు సంజయ్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు అందడం.. పోలీసు శాఖ శరవేగంగా స్పందించడం.. నిర్భయ సహా నాలుగు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేయడంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నిజానికి సంజయ్‌పై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. అయితే.. ఉన్నట్టుండి ఇప్పుడే వాటిని తెరపైకి తెచ్చి.. కేసులు నమోదు చేయడం వెనుక రాజకీయ కోణం ఉందన్న భావన విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.

డి.శ్రీనివాస్‌, ప్రస్తుతం అధికార పార్టీలోనే కొనసాగుతున్నా, తనయుడిపై కేసు విషయంలో నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉండి ఉంటే.. తన పరిస్థితి, కేసు తీవ్రత మరోవిధంగా ఉండేదని, పార్టీ నుంచి తనను పొమ్మనలేకే పొగబెడుతున్నారన్న వాదనను ప్రజలకు వినిపించేందుకు డిఎస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో, డిఎస్‌, రాహుల్ పర్యటనలోపే కాంగ్రెస్ గూటికి చేరతారన్న ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. జిల్లా రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి. 

06:40 - August 4, 2018

నిజామాబాద్ : డి.శ్రీనివాస్‌ తనయుడు.. ధర్మపురి సంజయ్‌పై... లైంగిక వేధింపుల ఉచ్చు బిగుసుకుంటోంది. శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు చర్యలకు శ్రీకారం చుట్టారు. నిర్బయ సహా.. నాలుగు సెక్షన్ల కింద.. కేసులు నమోదు చేశారు. ఇక సంజయ్‌ని అరెస్ట్‌ చేయడమే తరువాయి అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ కుట్ర సాగుతోందని సంజయ్‌ ఆరోపిస్తున్నారు.

నిజమాబాద్‌ నగర మాజీ మేయర్‌, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తనయుడు.. డి.సంజయ్‌ని లైంగిక వేధింపుల ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సంజయ్‌, కాలేజీ హాస్టల్‌కు వచ్చి లైంగిక వికృత చేష్టలకు పాల్పడడం, అసభ్య పదజాలంతో దూషించడం, వేధింపులకు పాల్పడుతున్నారన్నది.. శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినుల ఆరోపణ. వీరి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. సంజయ్‌పై.. నిర్భయ సహా ఐపీసీలోని నాలుగు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

గురువారం, రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డికి ఫిర్యాదు చేసిన శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినులు, శుక్రవారం, నిజమాబాద్‌ పోలీసు కమిషనర్‌ను కలిసి విషయం వివరించారు. అనంతరం నాలుగో ఠాణాలో ఫిర్యాదు చేశారు. డిసెంబర్‌లో అడ్మిషన్‌లు తీసుకున్న తాము.. మూడు నెలల పాటు ప్రైవేటు హాస్టల్స్‌ ఉంటే.. సంజయ్‌ కాలేజీ హాస్టల్‌లో ఉండాలంటూ ఒత్తిడి తెచ్చారని.. అక్కడ సంజయ్‌ తమను వేధించారన్నది విద్యార్థినుల అభియోగం.

నిర్భయ సహా.. నాలుగు సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొంటోన్న సంజయ్‌.. తనపై వచ్చిన అభియోగాన్ని తోసిపుచ్చారు. ఇదంతా రాజకీయ కుట్ర అని అభిప్రాయపడ్డారు. అటు.. సంజయ్‌ సోదరుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌.. దీన్ని టీఆర్ఎస్‌ అంతర్గత వ్యవహారంగా అభివర్ణించారు. సంజయ్‌తో విడిపోయి 20 ఏళ్లు దాటిందని, ఆయనపై వస్తోన్న ఆరోపణలు తనకు వ్యక్తిగతంగా ఎలాంటి డ్యామేజీ చేయవని అభిప్రాయపడ్డారు.

మరోవైపు.. మహిళా, ప్రజాసంఘాలు సంజయ్‌ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. పదకొండు మంది విద్యార్థినులు సంజయ్‌ వేధింపులపై రోడ్డెక్కితే.. దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించడాన్ని.. మహిళా, ప్రజా సంఘాలు తప్పుబడుతున్నాయి. ఆయన దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని, పోలీసులు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మొత్తానికి సంజయ్‌పై వచ్చిన ఆరోపణలు.. నిజామాబాద్‌ జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపనలనే సృష్టిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ గూటికి చేరుకుంటారని వస్తోన్న వార్తల నేపథ్యంలో.. ఆయన తనయుడు సంజయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఆసక్తిని కలిగిస్తున్నాయి. కేసులో సంజయ్‌కి శిక్ష పడితే.. ఆయన రాజకీయ భవితవ్యం అంధకారం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు పోలీసులు ఎంత పకడ్బందీగా కేసును కడుతున్నారన్న దానిపై.. సంజయ్‌ భవితవ్యం ఆధారపడుతుంది. 

06:37 - August 4, 2018

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన గౌడ ఆత్మీయ సదస్సులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా మంత్రులు కేటీఆర్, పద్మారావు, జోగు రామన్న, మహేందర్‌ రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌లు ఈత మొక్కలు నాటారు. ప్రభుత్వం మానవీయ ధృక్పథంతో గీత కార్మికులకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తుందన్నారు మంత్రి కేటీఆర్‌. ఈ సందర్భంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా.. పరిహారం ఇస్తున్నామన్నారు.

హైదరాబాద్‌లో గౌడ భవన్‌ కోసం 5 ఎకరాల స్థలాన్ని, 5 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భవనం పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. 60 ఏళ్లలో రాష్ట్రంలో 22 గురుకుల పాఠశాలలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 261 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. పేదవాడి సంక్షేమం కోసం 43 వేల కోట్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖర్చు పెడుతుందన్నారు మంత్రి కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

06:33 - August 4, 2018

కర్నూలు : జిల్లా ఆలూరు మండలంలోని క్వారీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11మంది మృతి చెందగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బ్లాస్టింగ్‌కు వాడిన కెమికల్‌ వల్లే భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా.. పరారీలో ఉన్న క్వారీ యజమానుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్రమ క్వారీలు ఉన్నాయని..చర్యలు తీసుకోవాలని ఆనాడే చెప్పినా అధికారులు స్పందించలేదని సీపీఎం నేతలు పేర్కొంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:30 - August 4, 2018

కర్నూలు : జిల్లా ఆలూరు మండలంలోని క్వారీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11మంది మృతి చెందగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బ్లాస్టింగ్‌కు వాడిన కెమికల్‌ వల్లే భారీ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కాగా.. పరారీలో ఉన్న క్వారీ యజమానుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ పేలుడుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

శుక్రవారం సాయంత్రం ఆలూరు మండలం అగ్రహారం దగ్గర మైనింగ్ క్వారీలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 11మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఒడిశా నుంచి వచ్చిన కార్మికులుగా గుర్తించారు. ఆలూరు, ఆదోని ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.

పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు కూలిపోయినట్లు తెలుస్తోంది. భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. ఊరి శివారుకు చేరుకుని ఏమైందా అని ఆరా తీశారు. చుట్టు పక్కల గ్రామాల్లో ఇళ్ళకు బీటలు వారాయి. ఈ ప్రమాదంలో ముందు 9మంది మృతి చెందారు. తర్వాత చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరో ఇద్దరు మరణించారు. బ్లాస్టింగ్‌లో కెమికల్‌ వాడటం వల్లే భారీ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నా..అసలు కారణాలు తెలియలేదు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

అనుతుల్లేకుండా ఈ క్వారీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం ఏరూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాస చౌదరి క్వారీని నిర్వహిస్తున్నాడు. హత్తి బెళగల్ వద్ద కొండల్లో సర్వే నెంబర్ 969లో ఒక క్వారీకి మాత్రమే అనుమతి ఉంది. కాగా.. అక్రమంగా మరో రెండింటిని నిర్వహిస్తున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున కంకర రాయి కోసం బ్లాస్టింగ్స్ చేస్తుండగా ఈ భారీ ప్రమాదం జరిగింది. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన కార్మికులు అక్కడే షెల్టర్ నిర్మించుకున్నారు.

డీజీఎంఎస్ శాఖ నుంచి సర్టిఫికెట్లు పొందిన వారే క్వారీల్లో బ్లాస్టింగ్‌ చేయాలి. కానీ ఎలాంటి అర్హతలూ లేని వారే ఈ క్వారీలో ఉన్నట్లు సమాచారం. క్వారీ యాజమాన్యమే నకిలీ సర్టిఫికెట్లతో పనిచేయిస్తున్నట్లు సమాచారం. ఈ బ్లాస్టింగ్‌తో కర్నూలు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని ఆయా క్రషర్ ఫ్యాక్టరీల యజమానులు ఇవాళ ఆయా పోలీస్‌ స్టేషన్లలో హాజరుకావాలని ఆదేశించారు. అనుమతులను పరిశీలించేందుకు అన్ని రికార్డులతో రావాలన్నారు. దీంతో జిల్లాలోని అక్రమ క్వారీల లెక్క తేలనుంది.

ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం పెరగకుండా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌‌ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. కలెక్టర్‌ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. 

నగరానికి రానున్న రాష్ట్రపతి...

హైదరాబాద్ : నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం ఢిల్లీ నుండి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఆదివారం ఐఐటీ హైదరాబాద్ ఏడో స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు...

హైదరాబాద్ : జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరిగాయి. తనిఖీల్లో 69 మందిపై కేసులు నమోదయ్యాయి. 42 కార్లు 27 బైక్ లు సీజ్ చేశారు. 

ఫిల్మ్ నగర్ లో రోడ్డు ప్రమాదం...

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో ప్రయాణించిన కారు అదుపు తప్పడంతో డివైడర్ ను ఢీకొంది. బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న ఇద్దరికి ప్రాణాపాయం తప్పింది. 

చెన్నైకి బాబు...

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెన్నైకి వెళ్లనున్నారు. తమిళనాడు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధిని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం అక్కడి నుండి నేరుగా తిరుపతికి రానున్నారు. తిరుపతిలో జ్ఞాన భేరీ పేరిట ఎస్సీ వర్సిటీ విద్యార్థులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. 

ఢిల్లీలో కేసీఆర్...

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం వెళ్లిన ఆయన శనివారం సాయంత్రం 4గంటలకు ప్రధాన మంత్రి మోడీతో సమావేశం కానున్నారు. 

క్వారీలో పేలుడు...11 మంది మృతి...

కర్నూలు : జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆలూరు మండలం హత్తిబెళగళ్ లోని మైనింగ్ క్వారీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 11 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు. పలువురికి గాయాలయ్యాయి. 

ఏఐసీసీ అధికార ప్రతినిధిగా జైపాల్ రెడ్డి...

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డిని ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కేఈ దిగ్ర్భాంతి...

కర్నూలు : హత్తెబెళగల్ వద్ద క్వారీలో పేలుడు ఘటనపై ఉప ముఖ్యమంత్రి కేఈ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని కేఈ స్పష్టం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. 

 

Don't Miss