Activities calendar

05 August 2018

21:53 - August 5, 2018

విజయవాడ : బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం వివాదాలకు నిలయంగా నిలుస్తోంది. తాజాగా దుర్గమ్మగుడిలో అమ్మవారి చీర మాయమైంది. ఆషాడ మాసం సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన పద్మజ అనే భక్తురాలు అమ్మవారికి 18వేల రూపాయల చీరెను సారెగా సమర్పించింది. పూజలు నిర్వహించాక.. అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద చీరెను  కాసేపు ఉంచి..  తీసేశారు. కొద్దిసేపట్లోనే  ఆ చీర కనిపించకపోవడంతో పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత తీసుకెళ్లిందని అర్చకులు  తెలిపారు. మరోవైపు తాను పట్టు చీర తీసుకెళ్లలేదని, యాదవ సంఘం ప్రతినిధులు కానుకగా ఇచ్చిన చీరను మాత్రమే తీసుకెళ్లానని సూర్యలత చెప్పారు. విషయం తెలుసుకున్న వన్‌ టౌన్‌ పోలీసులు దుర్గగుడికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.  

 

21:51 - August 5, 2018

హైదరాబాద్ : భాగ‌్యనగరం బోనమెత్తింది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల నృత్యాలతో లాల్‌ దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరిగాయి. వీఐపీలతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాల సందర్భంగా ఉదయం నుండే భక్తులు ఆలయంలో బారులు తీరారు. 

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగిన లాల్‌ దర్వాజ బోనాలకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమ్మవారికి బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 

లాల్‌ దర్వాజ మహంకాళీ అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రజలందరికీ తలసాని బోనాల జాతర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తలసానితో పాటు, హోంమంత్రి నాయిని,  దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్‌, ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. 

బోనాల పండుగ తెలంగాణ ప్రజలకు లభించిన గొప్ప సంస్కృతి అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. ఎమ్మెల్సీ రాంచంద్రా రెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డిలు అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు.  

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని ద‌ర్శించుకున్నారు. అమ్మవారి దీవెనలతో బోనాల జాతర విజయవంతం కావాలని కోరుకున్నట్లు జానా రెడ్డి తెలిపారు. సింహవాహిని మహాంకాళి అమ్మవారికి కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి బోనం సమర్పించారు. తెలంగాణ వస్తే తాను బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నానని.. అందుకే బోనం సమర్పించానని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు విజయశాంతి తెలిపారు. 

టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరాం సింహవాహిని మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దివెనలతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కోదండరామ్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు దక్కాలని.. ప్రతిఒక్కరికీ ఉద్యోగం లభించాలని అమ్మవారిని కోరుకున్నట్లు కోదండరామ్‌ చెప్పారు. లాల్‌ దర్వాజ బోనాల జాతరకు ప్రజలతో పాటు వీఐపీల తాకిడి పెరిగింది. ఈ మేరకు ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే సోమవారం జరగబోయే ఊరేగింపునకు కూడా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తలసాని తెలిపారు. 

21:48 - August 5, 2018

మేడ్చల్‌ : జిల్లాలోని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌పై వేధింపుల ఆరోపణలు వచ్చాయి. చింతల దశరథం తనను వేధిస్తున్నాడంటూ వార్డర్‌ శ్రీనివాస్‌ సూసైడ్‌ నోట్‌ రాశాడు. నిజాయితీగా ఉన్నందుకు తనను వేధిస్తున్నాడని శ్రీనివాస్‌ సెల్ఫీ వీడియో తీసి కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన నెలకొంది. దశరథం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని శ్రీనివాస్‌ తన సూసైడ్‌ లేఖలో పేర్కొన్నాడు. 

21:39 - August 5, 2018

విజయవాడ : ఏపీ ప్రభుత్వంలో భారీగా అవినీతి జరుగుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. 58,418 వ్యక్తిగత ఖాతాలు తెరిచి 53 వేల కోట్లను డిపాజిట్‌ చేశారని మండిపడ్డారు.ఈ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందన్నారు. 2జీ స్పెక్ట్రమ్‌, బొగ్గు, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ కుంభకోణాల కంటే ఇది పెద్ద స్కామ్‌ అని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారపై శ్వేతపత్రం ప్రకటించాలని జీవీఎల్‌ నరసింహరావు డిమాండ్‌ చేశారు. 
 

 

21:36 - August 5, 2018

తూర్పుగోదావరి : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని వైసీపీ అధినేత జగన్‌ ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు, కత్తిపూడి సభల్లో మండిపడ్డారు. అటవీ భూములను సైతం వదలకుండా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాక్సైట్‌ ఖనిజాన్ని అక్రమంగా తవ్వుకుంటూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. దేవుణ్ని కూడా టీడీపీ నాయకులు విడిచిపెట్టడంలేదని జగన్‌ విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకులు బంధువులకే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులు దక్కాయన్నారు. పత్తిపాడు నియోజకవ్గరంలోని సాగునీటి ప్రాజెక్టులను టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని జగన్‌ విమర్శించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం  చేశారు. జగన్‌ సభలకు భారీగా జనం తరలివచ్చారు. 
 

21:34 - August 5, 2018

హైదరాబాద్ : ఐఐటీ వంటి ఉన్నత సాంకేతిక విద్యాసంస్థలు కేవలం డిగ్రీలు ఇవ్వడానికే పరిమితం కాకుండా... పరిశోధనాభివృద్ధికి పెద్దపీట వేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పిలుపునిచ్చారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని అగ్రపథాన నిలిపేందుకు ఐఐటీయన్లు కృషి చేయాలని సూచించారు. నూతన ఆవిష్కరణలకు ప్రధాన్యత ఇవ్వాలని హైదరాబాద్‌ ఐఐటీ స్నాతకోత్సవంలో రామ్‌నాథ్‌ కోవింద్‌ కోరారు. 

రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. ఆదివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మొక్కలు నాటారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్‌ ఐఐటీ 7వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఐటీలో వివిధ కోర్సులు పూర్తి చేసిన 560 మంది విద్యార్థులను పట్టాలు ప్రధానం చేశారు.  

విద్యార్థుల పరిశోధనాభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు ప్రధాన్యత ఇవ్వాలని రామ్‌నాథ్‌ కోవింద్‌ కోరారు. సాంకేతిక పరిశోధనలు, నూతన ఆవిష్కరణలతో అమెరికాలోని సిలికాన్‌వ్యాలీ ప్రపంచ దృష్టిని ఆష్కరించిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు. ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో డిగ్రీలు పొందిన విద్యార్థులు సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలని రామ్‌నాథ్‌ కోవింద్ కోరారు. 

ఐఐటీ స్నాతకోత్సవం పూర్తైన తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బేగంపేట విమానాశ్రయం చేరుకుని నేరుగా చెన్నై బయలుదేరి వెళ్లారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్‌, కుమార్తె కణిమొలిని అడిగి తండ్రికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమ, మంగళవారాల్లో కేరళలో పర్యటిస్తారు. ఈనెల 6న తిరువనంతపురంలో ప్రజాస్వామ్య వేదిక..  ఫెస్టివల్‌ ఆఫ్‌ డెమోక్రసీని ప్రారంభిస్తారు. కేరళ శాసనసభ వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. ఆగస్టు 7న త్రిసూర్‌లోని సెయింట్‌ థామస్‌ కాలేజీ శతాబ్ది ఉత్సాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. 

చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ పై వేధింపుల ఆరోపణలు

మేడ్చల్ : చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ పై వేధింపుల ఆరోపణలు వచ్చాయి. జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం వేధిస్తున్నాడంటూ వార్డర్ శ్రీనివాస్ సూసైడ్ నోట్ రాశాడు. దశరథం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని లేఖలో శ్రీనివాస్ పేర్కొన్నారు. నిజాయితీగా ఉన్నందుకు తనను వేధిస్తున్నాడంటూ శ్రీనివాస్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. సెల్ఫీ అనంతరం వార్డర్ శ్రీనివాస్ కనిపించకుండా పోయారు.  

 

ఈనెల 14న జనసేన ఎన్నికల ప్రి మేనిఫోస్టో విడుదల

హైదరాబాద్ : ఈనెల 14న జనసేన ఎన్నికల ప్రి మేనిఫోస్టో విడుదల కాన్నుట్లు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రకటించింది. ఫిన్లాండ్ లో సక్సెస్ అయినా విద్యా విధానాలకు మేనిఫెస్టోలో టాప్ ప్రయారిటీ ఇచ్చారు. 7 జిల్లాలకు సంస్థాగత నిర్మాణ కమిటీలు వేశారు.

20:25 - August 5, 2018

చి''ల''సౌ'' మూవీ టీంతో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో సుశాంక్, హీరోయిన్ రుహానీ మాట్లాడుతూ సినిమా విషయాలను తెలిపారు. అంజలి లాంటి అమ్మాయి అయితే పెళ్లికి చేసుకోవడానికి ఆలోచిస్తానని సుశాంత్ అన్నారు. యాక్టర్ రాహుల్ రామకృష్ణన్ ప్రాంక్ కాల్ చేసి, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

దుర్గగుడిలో చీర మాయంలో కొత్త ట్విస్టు

విజయవాడ : దుర్గగుడిలో చీర మాయంలో కొత్త ట్విస్టు చేసుకుంది. అమ్మవారి ఉత్సవ విగ్రహ నుంచి చీర మాయమైందని దుర్గగుడి అధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు. చీర ఇచ్చిన భక్తురాలు వెళ్లిపోవడంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు చేతులెత్తాశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలా.. వద్దా అన్న డైలమాలో పాలకమండలి సభ్యులు ఉన్నారు. చీర మాయంపై గంటలు గడుస్తున్నా మిస్టరీ వీడడం లేదు. పోలీసులు, దుర్గ గుడి అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

19:45 - August 5, 2018

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో సరైన వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకాశంలో మబ్బులు కమ్ముకోగానే చినుకు జాడ కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. అయితే ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొన్నప్పటికీ సరైన వానల్లేక పంటలసాగు ప్రశ్నార్థకంగా మారింది. వాచ్‌ది స్టోరీ

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికన్నా ముందుగానే ప్రవేశించినా.. పంటసాగుకు అవసరమైన వర్షాలు మాత్రం కురవడం లేదు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. అయితే వాతావరణ శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. కానీ దీనికి భిన్నంగా ఖరీఫ్‌ సేద్యం ఆశించినస్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్న స్థాయిలో వర్షాలు కురిస్తే తప్ప పంటలసాగు ముందుకు సాగదని రైతులు వాపోతున్నారు.
 
ఇప్పటికే నైరుతి రుతుపవనాల సీజన్‌ సగం ముగిసింది. తొలుత జూన్‌లో వర్షాలు కురిసిన అవి అంతంత మాత్రంగానే పడ్డాయి. గడిచిన రెండు నెలల్లో వర్షాల కంటే ఎండలే ఎక్కువ కావడంతో.. ఖరీఫ్‌ పంటకు ఆగస్టు నెలలో పడే వర్షాలు చాలా కీలకంగా మారాయి. అయితే రుతుపవన ద్రోణి ఉత్తరాదిలో ఉండడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోవడంతో కోస్తా , సీమల్లో వర్షాభావం కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మరోపక్షం రోజుల వరకు రాయలసీమ, దక్షిణకోస్తాల్లో ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

అయితే బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి తీవ్ర వాయుగుండం ఏర్పడితే.. కోస్తా వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదివరకు రుతుపవనాలు ప్రవేశించి..  48 రోజుల్లో దేశమంతా విస్తరించాల్సిన రుతుపవనాలు కేవలం 28 రోజుల్లోనే విస్తరించాయి. అయితే గ్లోబల్‌ వార్మింగ్‌తోనే నైరుతి పవనాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. మొత్తంమీద బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడితే పంటలసాగు ఆశాజనకంగా మారుతుందని రైతులు ఆశిస్తున్నారు.

19:34 - August 5, 2018

వరంగల్ రూరల్‌ : జిల్లాలోని పర్వతగిరి మండలం తూర్పుతండాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుచెపుతుందని.. ఓ ప్రబుద్ధుడు భార్యను చెట్టుకు కట్టేసి నిప్పటించాడు. గ్రామానికి చెందిన బాలు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనికి తన భార్య రజిత అడ్డుచెపుతుండటంతో మద్యం మత్తులో భార్యను చెట్టుకు కట్టేసి నిప్పటించాడు. స్థానికులు రజితను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రజిత మృతిచెందింది.
 

 

19:31 - August 5, 2018

నెల్లూరు : పట్టణంలో మంత్రి నారాయణ క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. పట్టణంలోని వీఆర్సీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సిఎం క్రికెట్ కప్ పోటీని నారాయణ ప్రారంభించారు. క్రికెట్‌ జట్లకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ క్రికెట్ ఆడుతూ అందరినీ అలరించారు. క్రీడల్లో రాష్ట్రాన్ని ముందు ఉచ్చాలనే ఉద్దేశంతో పోటీలు ప్రారంభించామని నారాయణ అన్నారు. 

18:23 - August 5, 2018

విజయవాడ : విజయవాడ దుర్గగుడి వివాదాలకు నిలయంగా మారింది. తాజాగా దుర్గగుడిలో అమ్మవారి చీర వివాదం నెలకొంది. కనకదుర్గ అమ్మవారి చీర మాయం అయింది. ఉండవల్లికి చెందిన భక్తుడు సూర్యనారాయణ రూ.18వేల విలువైన చీరను అమ్మవారికి సమర్పించారు. మహామండపంలో అమ్మవారికి చీర సమర్పించారు. ఉత్సవ విగ్రహానికి అలంకరించిన కొద్దిసేపటికే చీర మాయం అయింది. పూజారి రమేష్ చీరను ట్రస్టు బోర్డు సభ్యురాలికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్రస్టు బోర్డు సభ్యురాలే చీర తీసుకెళ్లినట్లు ఆరోపిస్తున్నారు. భక్తులు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆలయ అధికారులు సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...  

18:12 - August 5, 2018

హైదరాబాద్ : బాలీవుడ్ స్టార్ కాజోల్ నటించిన 'హెలికాప్టర్ ఈలా' సినిమా ట్రైలర్ విడుదల అయింది. కాజోల్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేసింది. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన హెలికాప్టర్ ఈలా సినిమా.. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కానుంది.

రిమ్స్ ఘటన విచారకరం : మంత్రి కళా వెంకట్రావు

శ్రీకాకుళం : రిమ్స్ లో అస్వస్థతకు గురైన బాధితులను మంత్రి కళా వెంకట్రావు పరామర్శించారు. శుక్రవారం రిమ్స్ లో సూదిమందు వికటించి పలువురు అస్వస్థత గురయ్యారు. రిమ్స్ ఘటన విచారకరమన్నారు. ఇప్పటికే నమూనాలను ప్రయోగశాలకు పంపించామని తెలిపారు. నిజ నిర్ధారణ కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామని పేర్కొన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఔషధాలను నిలుపుదల చేశామన్నారు. నివేదిక ఆధారంగా బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు.

శ్రీకాకుళం రిమ్స్ లో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన మంత్రి కళా

శ్రీకాకుళం : రిమ్స్ లో అస్వస్థతకు గురైన బాధితులను మంత్రి కళా వెంకట్రావు పరామర్శించారు. శుక్రవారం రిమ్స్ లో సూదిమందు వికటించి పలువురు అస్వస్థత గురయ్యారు. 

విజయవాడ దుర్గగుడిలో అమ్మవారికి సమర్పించిన చీర మాయం

విజయవాడ : దుర్గగుడిలో అమ్మవారికి సమర్పించిన రూ.18వేల విలువైన చీర మాయం అయింది. ఉండవల్లికి చెందిన పద్మజ మహామండపంలో అమ్మవారికి చీర సమర్పించింది. ఉత్సవ విగ్రహానికి అలంకరించిన కొద్దిసేపటికే మాయం అయింది. ట్రస్టు బోర్డు సభ్యురాలే చీర తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలయ అధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు. ఆలయ అధికారులు సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.  

17:47 - August 5, 2018

శ్రీనగర్ : అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రాష్ట్ర లెజిస్లేచర్ కు ప్రత్యేక అధికారాలు ఇవ్వాలనే ఆర్టికల్ 35ఏకు మద్దతుగా యాత్రను నిలిపివేశారు. భద్రతా చర్యల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ అధికారులు రెండు రోజులపాటు యాత్రను నిలిపివేశారు. 

17:41 - August 5, 2018

పెద్దపల్లి : అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్స్ ఆనకట్ట భూసేకరణకు ప్రభుత్వం యత్నం చేసింది. భూసేకరణకు వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. వాగు నుంచి నీరు అందించే పైపు లైన్ ను అధికారులు కట్ చేశారు. మల్లారం రైతుల భూములకు పైపు లైన్ కట్ చేశారు. అధికారుల నిర్వాకంతో పంట భూములు బీడుగా మారాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

17:32 - August 5, 2018

మెడ, వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నారా? మెడ, వెన్నెముక సమస్యలకు హోమియోపతి చికిత్సలో విధానాలు... మాస్టర్స్ హోమియోపతి రా.రవికిరణ్ సలహాలు, సూచనలు..మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

17:29 - August 5, 2018

హైదరాబాద్ : లాల్ దర్వాజ బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. బోనాల జాతర సందర్భంగా సందడి నెలకొంది. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు బలిగంప సమర్పించారు. లాల్ దర్వాజలో సింహవాహిని మహంకాళి అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించారు. లాల్‌ దర్వాజ బోనాల జాతరకు ప్రజలతో పాటు వీఐపీల తాకిడి పెరిగింది. సింహవాహిని మహాంకాళి అమ్మవారికి విజయశాంతి బోనం సమర్పించారు. అమ్మవారిని కాంగ్రెస్ జానారెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించే వారి కోసం రెండు క్యూలైన్ లు, వీఐపీల కోసం ఒక ప్రత్యేక క్యూలైన్, సాధారాణ భక్తుల కోసం ఒక క్యూలైన్ ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావారణంలో బోనాల జాతర జరుగుతోంది. 80 వేలకు పైగా మహిళలతోపాటు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. 50 పైగా షీ టీమ్స్ బృందాలు పని చేస్తున్నాయి. లాల్ దర్వాజ మహంకాళీ ఆలయం, అక్కన్నమాదన్న దేవాలయాలతోపాటు పాతబస్తీలోని పలు అలయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం తొట్టెల ఊరేగింపు, శివసత్తుల నృత్యాలు నిర్వహించనున్నారు. రేపు ఘటాల ఊరేగిపుం, తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:18 - August 5, 2018

హైదరాబాద్ : లాల్ దర్వాజ బోనాల సందర్భంగా సందడి నెలకొంది. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు బలిగంప సమర్పించారు. లాల్ దర్వాజలో సింహవాహిని మహంకాళి అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించారు. అమ్మవారికి బోనాలు సమర్పించే వారి కోసం రెండు క్యూలైన్ లు, వీఐపీల కోసం ఒక ప్రత్యేక క్యూలైన్, సాధారాణ భక్తుల కోసం ఒక క్యూలైన్ ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావారణంలో బోనాల జాతర జరుగుతోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:03 - August 5, 2018

చెన్నై : తమిళనాడులోని మధురైలో విషాదం చోటుచేసుకుంది. మదురై సమీపంలో గల మరుతకలం వద్ద 43 నెమళ్లు మృతిచెందాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విషాహారం తినడం వల్లే నెమళ్లు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరణించిన వాటిలో 34 ఆడ నెమళ్లు, 9 మగ నెమళ్లు ఉన్నట్లు గుర్తించారు. విషం కలిసిన గింజలు తినడం వల్లే నెమళ్లు మృతి చెంది ఉంటాయని మదురై అటవీ ప్రాంత రేంజ్‌ అధికారులు తెలిపారు. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం నెమళ్లను చంపడం నేరమని.. దీనికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు నగదు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

16:59 - August 5, 2018

ఢిల్లీ : వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మాదురోపై హత్యయత్నం జరిగింది. శనివారం సాయంత్రం సైనిక కవాతులో పాల్గొన్న ఆయనపై డ్రోన్ల ద్వారా ఈ దాడి జరిగింది. పేలుడు పదార్థాలు నింపిన డ్రోన్లు ఆయనకు సమీపంలో పేలాయి. ఈ దాడిలో 9 మంది గాయపడ్డారు. పొరుగు దేశమైన కొలంబియానే ఈ దాడికి పాల్పడిందని.. దేశ అధ్యక్షుడు నికోలస్‌ మాదురో ఆరోపించారు. దేశ ఎకానమీ మీద మాదురో ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి పేలుడు సంభవించింది. ఈ ఘటనంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ దాడిలో ప్రమేయమున్న అనుమానితులను ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా మరికొందరిని సీసీటీవీ ఫుటేజీల ద్వారా గుర్తించే పనిలో ఉన్నారు. ఘటనానంతరం అక్కడికి వచ్చిన సైనికులు, ప్రజలు పరుగులు తీశారు. అయితే పేలుడు పదార్థాలు అంత శక్తివంతమైనవి కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కట్టుదిట్టమైన భద్రతల నడుమ మాదురోను భద్రతా బలగాలు సురక్షితంగా వేదిక బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

 

16:41 - August 5, 2018

రాతియుగం మనుషులు సాధించిందేమిటి? అండమాన్ దీవుల్లో మనుషులకు తోడేళ్ల తలలున్నాయా? మహబూబ్ నగర్ నిలువు రాళ్లకు ఇంగ్లండ్ కు సంబంధం ఏమిటి? రాకాసి గుళ్లు అంటే ఏమిటి? 'రాళ్లు చెప్పిన కథలు 5', 'బిగ్ క్వెశ్చన్'.. ఈ అంశాలపై పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...    

 

16:37 - August 5, 2018

కడప : సోమశిల బ్యాక్‌ వాటర్స్‌ను కడప జల్లా బద్వేల్‌కు తరలించాలన్న డిమాండ్‌తో అఖిలపక్ష నాయకులు పాదయాత్ర చేపట్టారు. గోపవరం మండలం బ్రాహ్మణపల్లి  నుంచి ప్రారంభమైన పాదయాత్ర సోమవారం బద్వేల్‌ చేరుకుంటుంది.  బద్వేల్‌, గోపవరం, అట్లూరు, బి.కోడూరు మండలాకు లిఫ్ట్‌ ద్వారా సోమశిల బ్యాక్‌ వాటర్స్‌  తరలించాలని నాయకులు కోరారు. ఈ పాదయాత్రకు రైతులు, మహిళలు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సోమశిల బ్యాక్‌ వాటర్స్‌ను బద్వేల్‌ తరలించేందుకు చర్యలు తీసుకోపోతే ఉధ్యమాన్ని ఉధృతం చేస్తామని అఖిలపక్ష నేతల హెచ్చరించారు.

16:35 - August 5, 2018

విశాఖపట్నం : పోర్టు పరిధిలోని సీ పోర్టులో 15 మంది కార్మికులను తొలగిండాన్ని నిరసిస్తూ సీఐటీయూ ధర్నా నిర్వహించింది. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్‌ చేశారు. యూనియన్‌ ఏర్పాటు చేసుకున్న కారణంలో కార్మికులను తొలగించడాన్ని తప్పుపట్టారు.  లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీ పోర్టు యాజమాన్యం  కార్మిక చట్టాలను కాలరాస్తోందని ఆరోపించారు. 
 

16:30 - August 5, 2018

ఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ లో పీవీ సింధు పోరాడి ఓడింది. 21..19, 21..10 తేడాతో పీవీ సింధుపై కరోలినా మారిన్‌ విజయం సాధించింది. సింధు వరుసగా రెండోసారీ రజత పతకానికే పరిమితమైంది. కరోలినాతో ఆడిన 12 మ్యాచ్‌ల్లో  ఐదు మ్యాచ్‌ల్లో సింధు విజయం సాధించింది. 

 

16:26 - August 5, 2018

హైదరాబాద్ : లాల్‌ దర్వాజ బోనాల జాతరకు ప్రజలతో పాటు వీఐపీల తాకిడి పెరిగింది. సింహవాహిని మహాంకాళి అమ్మవారిని కాంగ్రెస్‌ నేత జానారెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారి దీవెనలతో బోనాల జాతర విజయవంతం కావాలని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు జానారెడ్డి తెలిపారు.  

 

లాల్ దర్వాజ మహంకాళీ ఆలయానికి పోటెత్తిన భక్తులు

హైదరాబాద్ : లాల్ దర్వాజ మహంకాళీ అమ్మవారి బోనాలు తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున అమ్మవారికి ఆలయ అర్చకులు బలిగంప సమర్పించారు. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. 

16:14 - August 5, 2018

నిజామాబాద్ : ఆర్మూర్ డివిజన్ లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎస్సారెస్పీ నీటి విడుదల కోసం రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. నీటిని విడుదల చేయకపోవటంపై అన్నదాతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద పోలీసులు మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆయకట్టు గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పరిసర జిల్లాల నుంచి 1200 మంది పోలీసులు తరలించారు. నిజామాబాద్ కమిషనర్, కామారెడ్డి, నిర్మల్, సిద్ధిసేట జిల్లాల ఎస్పీలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

 

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో ఓడిపోయిన పీవీ సింధు

ఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ లో పీవీ సింధు ఓడిపోయారు. కరోలినా చేతిలో ఓడిపోయారు. 

15:59 - August 5, 2018

ఏలూరు : మానస సరోవరం యాత్రలో ఏలూరు నగర మేయర్ భర్త పెదబాబు చిక్కుకున్నారు. ఇండియా..చైనా బోర్డర్లో పెదబాబు, యాత్రికులు చిక్కుకున్నారు. వాతావారణం అనుకూలించకపోవడంతో తిరుగు ప్రయాణం ఆలస్యం అవుతోంది. పెదబాబు కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. యాత్రికులను రప్పించేందుకు రక్షణమంత్రి సహాయం కోరుతున్నామని మేయర్ నూర్జహాన్ అన్నారు. 

 

లాల్ దర్వాజ మహంకాళీ అమ్మవారి బోనాలు

హైదరాబాద్ : లాల్ దర్వాజ మహంకాళీ అమ్మవారి బోనాలు తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున అమ్మవారికి ఆలయ అర్చకులు బలిగంప సమర్పించారు.  

 

బంగారు బోనం సమర్పించిన విజయశాంతి...

హైదరాబాద్ : లాల్ దర్వాజ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. కొద్దసేపటి క్రితం మహంకాళి అమ్మవారికి మాజీ ఎంపీ, సినీనటి విజయసాంతి బంగారు బోనం సమర్పించారు. 

పాతబస్తీలో బోనాలు...తప్పిన ప్రమాదం...

హైదరాబాద్ : పాతబస్తీ అమ్మవారి బోనాల్లో ప్రమాదం తప్పింది. అక్కన్న మాదన్న దేవాలయం వద్ద భారీ కమాన్ ఒరిగింది. భక్తులపై కూలిపోతుండగా గమనించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కమాన్ పడకుండా చూశారు. దీనితో పెను ప్రమాదం తప్పింది. 

13:29 - August 5, 2018

హైదరాబాద్ : లాల్ దర్వాజ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. కొద్దసేపటి క్రితం మహంకాళి అమ్మవారికి మాజీ ఎంపీ, సినీనటి విజయసాంతి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రం వస్తే అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటి చేసి ఓడిపోయిన ఆమె ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ ఈ మధ్యే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలవడంతో ఆమె కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. తాజాగా ఈనెల 13, 14 తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. రాహుల్ పర్యటనలో ఆమె పాల్గొనే అవకాశం ఉందని మళ్లీ ప్రచారం జరుగుతోంది. 

13:18 - August 5, 2018

విజయవాడ : బీజేపీ రాజకీయ నేత రాష్ డ్రైవింగ్ తో హల్ చల్ చేశాడు. ఏకంగా కానిస్టేబుల్ పైకి వాహనం పోనిచ్చే ప్రయత్నం చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన బెజవాడలో చోటు చేసుకుంది. బందర్ రోడ్డులో సీఎం చంద్రబాబు కాన్వాయ్ నేపథ్యంలో రోడ్లపై వాహనాలు పెట్టవద్దని పోలీసులు మైక్ ద్వారా సూచించారు. కానీ ఓ కారు రోడ్డుపై పార్కు చేసి ఉంది. దీనిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని వాహనం ఎవరదని ఆరా తీయగా బీజేపీ నేత లాకా వెంగళరావు యాదవ్ దని తెలిసింది.

తాను ఎలాంటి పరిస్థితుల్లో వాహనాన్ని తీయనని వాగ్వాదానికి దిగాడు. ఎస్ఐ రావడం..కారును వ్యాన్ లో ఎక్కించేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ లు ప్రయత్నించారు. వెంటనే లాకా కారులోకి వెళ్లి డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఓ కానిస్టేబుల్ అడ్డుకొనే ప్రయత్నం చేశాడు. కానీ లాకా నిర్లక్ష్యంగానే ముందుకు పోనిచ్చాడు. కానిస్టేబుల్ పై నుండే పోనిచ్చే ప్రయత్నం చేశాడు. వెంటనే కానిస్టేబుల్ పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. తప్పించుకున్న లాకా కారును పోలీసులు కొంతదూరంలో పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. లాకాను పోలీసులు విచారిస్తున్నారు. 

తూర్పుతండాలో దారుణం...

వరంగల్ : జిల్లా పర్వతగిరి మండలం తూర్పుతండాలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త చెట్టుకు కట్టేసి నిప్పంటించాడు. వివాహేతర సంబంధం వద్దని చెబుతున్నా వినిపించుకోకపోవడంతో భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. 

12:36 - August 5, 2018
12:28 - August 5, 2018

కందిలో ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవం...

సంగారెడ్డి : కందిలో ఐఐటీ హైదరాబాద్ స్నాతకోత్సవం జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహన్, డిప్యూటి సీఎం మహమూద్ ఆలీ, మంత్రి హరీష్ రావులు హాజరయ్యారు. స్నాతకోత్సవంలో భాగంగా 500 మందికిపైగా విద్యార్థులకు పట్టాలను ప్రధానం చేశారు. 

పెదబాబు ఎక్కడ ?

పశ్చిమగోదావరి : మానస సరోవరం యాత్రలో చిక్కుకున్న ఏలూరు మేయర్ నూర్ జహాన్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబు ఇంకా తిరిగి రాలేదు. మూడు రోజులుగా ఆయన క్షేమ సమాచారం తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన పడుతున్నారు. 

12:22 - August 5, 2018

మంచిర్యాల : జిల్లా చెన్నూరులో డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నాయి. పట్టణంలో జ్వరాలు ప్రబలుతున్నా..పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదు. మురుగు కాల్వల్లో పూడికతీత, క్లోరినేషన్, దోమల నివారణ మందు పిచికారి చేపట్టకపోవడంతో పలు కాలనీల్లో దోమల బెడద అధికమైంది. దీంతో సాయంత్రం అయితే చాలు కిటికీలు, తలుపులు మూసి ఉంచాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చెన్నూరు పట్టణంలోని ఇందిరానగర్ లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. మురుగు కాల్వలు లేక పోవడంతో ఇళ్ల మధ్యలో మురుగునీళ్లు నిలిచి ఉంటున్నాయి. దీంతో చిన్నపాటి వర్షం పడితే చాలు కాలనీ ప్రజలు నరకయాతన పడుతున్నారు. మురుగు నీటి మధ్యలోనే బోరుపంపు ఉండడంతో నీళ్లు కలుషితమై వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణంలోని బట్టిగూడెం, లైన్ గడ్డ, మార్కెట్ రోడ్, తదితర ప్రాంతాల్లో డెంగీ జ్వరాలతో బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. అయితే తెల్ల రక్త కణాలు తగ్గిపోవడంతో బాధితులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానికంగా చికిత్స పొందినా..జర్వం తగ్గుముఖం పట్టకపోవడంతో పలువురు మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు.

బట్టిగూడెంలో మురుగుకాల్వలు కంపుకొడుతున్నాయి. అందులో పందులు సైతం సంచరిస్తున్నాయి. దీంతో దోమల బెడద అధికమై పలువురు జ్వరాల బారినపడ్డారు. దీంతో మంచిర్యాలలో నలుగురు డెంగీ బాధితులు కరీంనగర్ లో చికిత్స పొందుతున్నారు. అలాగే లైన్ గడ్డ ప్రాంతంలో కాల్వలు నిండిపోయి మురుగునీళ్లు రోడ్డుపై పారుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో కూడా ఐదుగురు విషజ్వరాలతో ఆస్పత్రి పాలయ్యారు. పట్టణంలో జ్వరాలు ప్రబలడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

12:09 - August 5, 2018

నెల్లూరు : హ్యాపీ సండేలో పాల్గొన్న మంత్రి నారాయణ పాల్గొని చిందులు వేశారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం సందర్భంగా ఎన్టీఆర్ పార్కులో కార్పొరేషన్ అధికారులు 'హ్యాపీ సండే' పేరిట ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాంత్రిక జీవనంలో అలిసిపోయిన వారు ఒత్తిడిని అధిగమించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయంగా ప్రకటించిన ఆనందదాయకమైన దేశాల్లో భారత్ 122వ స్థానంలో నిలిచిందన్నారు. క్రీడలు, పర్యాటకం, కళలకు ప్రజలు ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. దీనివల్ల ఆనంద ఆంధ్రప్రదేశ్ ను సాధించవచ్చన్నారు. 

11:30 - August 5, 2018

హైదరాబాద్ : లాల్ దర్వాజ బోనాల సందర్భంగా సందడి నెలకొంది. లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు బలిగంప సమర్పించారు. లాల్ దర్వాజలో సింహవాహిని మహంకాళి అమ్మవారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించారు.

మహిళలు బోనాలు ఎత్తుకుని తరలివస్తుండడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. వీఐపీలు కూడా తరలివచ్చారు. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డిలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ టెన్ టివితో మాట్లాడారు. పాత పట్టణంలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. మహిళలపై ఘోరాలు జరుగకుండా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. బోనాలు..బతుకమ్మ కార్యక్రమాలను అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు. 

11:22 - August 5, 2018

హైదరాబాద్ : లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. వీఐపీలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ జనసమితి వ్యవస్థాపకుడు కోదండరాం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...లాల్ బజార్ లో సంప్రదాయ బద్ధంగా బోనాలు జరుగుతుంటాయని, సంప్రదాయబద్ధంగా బోనాలు నిర్వహిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో బోనాలు జరగాలని అనుకున్నామని, అనుకున్నట్లుగానే ఏపీ భవన్, తెలంగాణ భవన్ లో నిర్వహించుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రొ.జయశంకర్ గతంలో పేర్కొన్నారని తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలని పేర్కొన్నారని కోదండరాం గుర్తు చేశారు. 

11:12 - August 5, 2018

హైదరాబాద్ : నగరంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన కొనసాగుతోంది. శనివారం ఆయన నగరానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి దంపతులు చేరుకున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా వారు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చూసిన ఫొటో ఎగ్జిబీషన్ ను సందర్శించారు. 

అమ్మవారిని దర్శించుకున్న లక్ష్మణ్...

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాలకు గొప్ప సంస్కృతి ఉందని..లాల్ దర్వాజ ఆలయానికి చరిత్ర ఉందన్నారు.

11:09 - August 5, 2018

హైదరాబాద్ : లాల్ దర్వాజ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. సింహవాహిని అమ్మవారిని దర్శించుకొనేందుకు మహిళలు భారీగా తరలివస్తున్నారు. బోనాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకొనేందుకు వీఐపీలు కూడా తరలివస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాలకు గొప్ప సంస్కృతి ఉందని..లాల్ దర్వాజ ఆలయానికి చరిత్ర ఉందన్నారు. ఈ బోనాల్లో మహిళలు సంప్రదాయాన్ని పాటిస్తూ బోనాలు సమర్పిస్తుంటారని...వర్షాలు కురిపించి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర పండుగగా గుర్తించినా మరిన్ని సదుపాయాలు కల్పించాల్సినవసరం ఉందన్నారు. 

మొక్కలు నాటిన రాష్ట్రపతి...

హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. అక్కడ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. 

తిరుపతిలో 'సమంత'...

చిత్తూరు : నటి అక్కినేని 'సమంత' తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించకున్నారు. మండపానికి చేరుకున్న ఆమెకు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందచేశారు. 

10:29 - August 5, 2018

హైదరాబాద్ : నగరంలో పలు ప్రాంతాల్లో బోనాల సందడి నెలకొంది. పాతబస్తీ లాల్ దర్వాజ మహంకాళీ అమ్మవారి ఆలయంతో పాటు పలు ఆలయాలకు బోనాల సందడి నెలకొంది. తెల్లవారుజామునుండే మహిళలలు బోనాలతో తరలివస్తుండడంతో లాల్ దర్వాజ ఆలయం కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మేర క్యూ లైన్ లు దర్శనిమిస్తున్నాయి.

ఏర్పాట్లు బాగున్నాయన్న కోదండరాం...
లాల్ దర్వాజ మహంకాళీ ఆలయంలో బోనాల సందర్భంగా ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసిందని ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించకుని టెన్ టివితో మాట్లాడారు. వేలాది మంది తరలివస్తున్నారని, అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు కోవడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని..ఈ ఫలాలు అందరికీ కలుగాలని కోరుకున్నట్లు ఆకాంక్షించారు. వీఐపీలు రావడంతో భక్తులు పలు ఇక్కట్లకు గురవుతున్నారని, ఇందుకు క్షమించాలని కోరారు. 

10:22 - August 5, 2018

హైదరాబాద్ : పాతబస్తీలోని లాల్ దర్వాజ మహంకాళీ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునుండే మహిళలు బోనాలతో తరలివస్తున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి బలిగంపను ఆలయ అర్చకులు సమర్పించారు. కాసేపటి క్రితం ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నగరంలోని ఆలయాలకు భక్తులు తరలివస్తున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర పండుగగా ప్రకటించి ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 

అమ్మవారికి పట్టువస్త్రాలు...

హైదరాబాద్ : లాల్ దర్వాజ మహంకాళీ అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేస్తున్నామని తలసాని పేర్కొన్నారు. 

10:16 - August 5, 2018
10:15 - August 5, 2018

చిత్తూరు : తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో క్రూర జంతువులు ప్రవేశిస్తుండడం పరిపాటిగా మారిపోతోంది. జంతువులు ప్రవేశిస్తుండడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవలే హెచ్ బ్లాక్ హాస్టల్ సమీపంలో ఎలుగు బంటి సంచరించిన సంగతి తెలిసిందే. తాజాగా చిరుత ప్రవేశం కలకలం రేపుతోంది. వర్సిటీలోకి ప్రవేశించిన చిరుత రెండు ఆవు దూడలను చంపేసింది. డీడీఈ బిల్డింగ్ ముందున్న రోడ్డుపైనే చిరుత సంచరిస్తోంది. దీనితో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

తిరుపతిలో చిరుత...

చిత్తూరు : తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం సృష్టిస్తోంది. రెండు ఆవు దూడలను చంపేసింది. డీడీఈ బిల్డింగ్ ముందున్న రోడ్డుపైనే చిరుత సంచరిస్తోంది. దీనితో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

09:32 - August 5, 2018

మేడ్చల్ : జవహార్ నగర్ పీఎస్ పరిధిలోని అరుంధినగర్ లో ఓ మహిళ గొంతు కోశారు. ఉష అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన మైనర్ అబ్బాయిలు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. వెంటనే ఉష గొంతు కోసి పరారయ్యారు. స్థానికులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె గొంతు ఎందుకు కోశారో ? తెలియరాలేదు. పరారయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డారో తెలియరానుంది. ప్రస్తుతం ఉష ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తోంది. 

జవహార్ నగర్ లో దారుణం...

మేడ్చల్ : జిల్లా జవహార్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఉష అనే మహిళను మైనర్ అబ్బాయిలు గొంతు కోశారు. డాగ్ స్వ్కాడ్ తో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. 

09:25 - August 5, 2018
09:24 - August 5, 2018

హైదరాబాద్ : నిజామాబాద్ శ్రీరాం సాగర్ జల జగడం ప్రారంభమైంది. తమ పంటలకు నీళ్లు విడుదల చేయాలంటూ రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్డీవో, ఇతర ఉన్నతాధికారులు రైతులతో చర్చించారు. నాలుగో తేదీన నీళ్లు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. వర్షాలు కురిస్తే ఎగువ ప్రాంతాల నుండి నీళ్లు వస్తాయని, ఆ సమయంలో నీటిని విడదల చేస్తామన్నారు. రైతుల ఆందోళనతో 20 గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. 2వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎస్సార్ఎస్పీ పరిసర ప్రాంతాలను పోలీసులు ఆధీనలోకి తీసుకున్నారు. ఆయుకట్టు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఆర్మూర్ లో 144 వ సెక్షన్ అమలు చేశారు. 

అనంతలో రోడ్డు ప్రమాదం...

అనంతపురం : పెనుగొండ గోనిపెంట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొంది. ఈఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. 

మంగళవారం సుప్రీం కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం...

ఢిల్లీ : మంగళవారం సుప్రీం కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం జరుగనుంది. నాలుగేళ్లకు పైగా సుప్రీంకోర్టు జడ్జీగా జస్టిస్ కేఎం జోసెఫ్ ఉండనున్నారు. 8వ మహిళా జడ్జీగా ఇందిరా బెనర్జీ ప్రమాణం చేయనున్నారు. సుప్రీంలో జస్టిస్ ఇందిరా, జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రలు ఉండనున్నారు. 

రైతులు సంయమనం పాటించాలన్న హరీష్...

హైదరాబాద్ : వర్షాభావం కారణంగా ఎస్సారెఎస్పీలో కేవలం 15 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, నీటిని విడుదల చేస్తే తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. రైతులు సంయమనం పాటించి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. 

బాల్కొండ, కోరుట్లలో హై అలర్ట్...

హైదరాబాద్ : బాల్కొండ, కోరుట్ల నియోజకవర్గాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రైతుల ఆందోళనతో 20 గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. 2వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎస్సార్ఎస్పీ పరిసర ప్రాంతాలను పోలీసులు ఆధీనలోకి తీసుకున్నారు. 

08:16 - August 5, 2018

హైదరాబాద్ : లాల్ దర్వాజ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లాల్‌దర్వాజతో పాటు.. రాష్ట్రంలో అనేక చోట్ల ఆదివారం భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజ ఆలయం వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు బోనాలు సమర్పించేందుకు తరలివచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి బలిగంపను ఆలయ అర్చకులు సమర్పించారు. ఉదయం 8.30గంటలకు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాసేపటి క్రితం సీఎల్పీ నేత జానారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ లు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. పట్టణంలో వందల సంవత్సరాల నుండి చారిత్రాత్మకంగా బోనాల పండుగ జరుగుతోందని తెలిపారు. గత కొన్ని రోజుల నుండి ఆలయ అధికారులు, స్వచ్చంద సమితిలు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చేస్తున్నారని వీరిని అభినందిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సినీ నటి విజయశాంతి ఇక్కడకు బోనం ఎత్తుకుని రానున్నారని, దీనికి సంబంధించిన సమాచారం అందిందన్నారు. 

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా - జానా...

హైదరాబాద్ : లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని టి.కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ లు దర్శించకున్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ...అమ్మవారి దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. 

లాల్ దర్వాజ బోనాల్లో జానారెడ్డి...

హైదరాబాద్ : లాల్ దర్వాజ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునుండే బోనాలతో మహిళలు తరలివస్తున్నారు. బోనాలు ఎత్తుకెళ్లే మహిళలకు ప్రత్యేక క్యూ లైన్, పురుషులకు మరొక క్యూ లైన్, వీఐపీలకు మరో క్యూ లైన్ ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితం కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ లు హాజరయ్యారు. 

08:02 - August 5, 2018
07:33 - August 5, 2018

వరంగల్ : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని స్టేషన్‌ ఘణపూర్‌ నియోజకవర్గం వర్గపోరుకు అడ్డాగా మారుతోంది. అటు అధికార టీఆర్‌ఎస్‌లోనూ.... ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలోనూ నాయకత్వం వర్గాలుగా విడిపోయింది. దీంతో ఆధిపత్యపోరు కోసం ఎప్పుడూ కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. వర్గపోరుతో తరచూ వార్తల్లోకెక్కుతున్న స్టేషన్‌ ఘణపూర్‌ నియోజకవర్గంపై కథనం...

స్టేషన్‌ ఘణపూర్‌ నియోజకవర్గం పార్టీల ఆధిపత్య పోరుకు అడ్డాగా మారుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. ధర్మసాగర్‌ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఈ వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. దీన్ని ప్రారంభించడానికి సింగపురం ఇందిర వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న విజయరామారావు వర్గానికి చెందిన నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. స్థానికంగా ఉండే తమను కాదని.... మీరెలా ప్రారంభోత్సవం చేస్తారంటూ ఇందిరను నిలదీశారు. ఇరువర్గాల మధ్య మాటలు పెరగడంతో పరిస్థితి తోపులాట వరకు వెళ్లింది. అంతటితో ఆగకుండా.... ఒకరి ఫ్లెక్సీలు ఒకరు చించివేసుకున్నారు. ఒకరిపై మరొకరు దాడి కూడా చేసుకున్నారు.

సింగపురం ఇందిర వర్గానికి చెందిన నాయకులు డీజే సౌండ్‌తో ఊరేగింపుగా పంక్షన్‌హాల్‌కు వెళ్తుండగా పోలీసులు అడ్డుపడ్డారు. అనుమతి లేదంటూ ఆ ఫంక్షన్‌ హాల్‌కు తాళం వేశారు. అయితే ఇదంతా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే రాజయ్య చేయిస్తున్నట్టుగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఫంక్షన్‌హాల్‌లో సమావేశం జరుగకుండా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే నిర్వహించారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఇందిర హెచ్చరించారు.

కాంగ్రెస్‌లోని మరోవర్గం నేత విజయరామారావు అనుచరులు కూడా సమావేశంలో ప్రసంగించారు. పార్టీలో ఎలాంటి సభ్యత్వం లేని వ్యక్తులు. స్థానికంగా ఉన్న తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు చేపట్టడమేంటని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు సృష్టించవద్దని హెచ్చరించారు. మొత్తానికి స్టేషన్‌ఘణపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో రెండు వర్గాలు ఆధిపత్యంకోసం పోటీ పడుతున్నాయి. ఇరువర్గాల మధ్య పోరు రోజురోజుకు ముదురుతోంది. ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్‌ కార్యక్రమాలను అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు లొస్తున్నాయి. దీంతో నియోజకవర్గ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

07:26 - August 5, 2018

హైదరాబాద్ : నగరంలో బోనాల సందడి ఉత్సాహంగా కొనసాగుతోంది. లాల్‌దర్వాజతో పాటు.. రాష్ట్రంలో అనేక చోట్ల ఆదివారం భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజ ఆలయం వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు బోనాలు సమర్పించేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున అమ్మవారికి బలిగంపను ఆలయ అర్చకులు సమర్పించారు. ఉదయం 8.30గంటలకు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ ఎల్ ఈడీ స్ర్కీన్ లను సమర్పించారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.

ఆషాడమాసం చివరి ఆదివారం కావటంతో.. తెల్లవారుజాము నుంచే భక్తులు… అమ్మవారికి బోనం సమర్పించేందుకు క్యూ కట్టారు. ఆలయం వద్ద మంచినీరు, ప్రసాదాలు, మహిళలు, పురుషులు, వీఐపీలకు వేర్వేరు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు బోనాల జాతరకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు తనిఖీలు చేపట్టారు. 

జగన్ 229వ రోజు పాదయాత్ర...

తూర్పుగోదావరి : నేడు 229వ రోజు జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. గొల్లప్రోలు, వినాయక్ నగర్, కత్తిపూడి వరకు జగన్ పాదయాత్ర కొనసాగనుంది. 

బొల్లారం రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి...

హైదరాబాద్ : నేడు బొల్లారం రాష్ట్రపతి నిలయానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రానున్నారు. హరితహారంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం కంది ఐఐటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. సాయంత్రం చెన్నైలో కరునానిధిని సమర్పించనున్నారు. 

లాల్ దర్వాజ బోనాలు ప్రారంభం...

హైదరాబాద్ : లాల్ దర్వాజ మహంకాళీ అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునుండే భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి బలిగంపను ఆలయ అర్చకులు సమర్పించారు. ఉదయం 8.30గంటలకు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

06:54 - August 5, 2018
06:51 - August 5, 2018

విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్‌ సకల హంగులతో అధికారులు తీర్చిదిద్దుతున్నారు. స్వదేశంలో వివిధ ప్రాంతాలకు విమానాల రాకపోకలు కొనసాగిస్తుండగా... విదేశాలకు సైతం త్వరితగతిన రాకపోకలు సాగించేందుకు అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో నిర్మాణ పనులు చేపట్టారు. త్వరలోనే గన్నవరం నుండి అంతర్జాతీయ సర్వీసులు నడవనున్నాయి.

అంతర్జాతీయ విమానాశ్రయం హోదా దక్కించుకున్న గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే విస్తరణ పనులు స్పీడందుకున్నాయి. ఈ ఏడాది చివరినాటికి రన్‌వే విస్తరణ ను పూర్తి చేసి... వీలైనంత త్వరంగా విదేశాలకు ఫ్లైట్‌ కనెక్ట్‌విటీని తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. కొత్తగా విస్తరించనున్న రన్‌వే, ట్యాక్సీవే నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఇప్పటివరకు వీటికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో విజయవాడ నగరం కీలకంగా మారింది. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ అవసరాలు మరింతగా పెరిగాయి. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయాలని కృతనిశ్చయంతో ముందుకొచ్చింది. 2017 జనవరిలో ట్రాన్సెంట్‌ టెర్మినల్‌, రన్‌వే విస్తరణ ప్రాజెక్ట్‌కు సీఎం చంద్రబాబు రూ.100 కోట్లు కేటాయించి... విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

ముంబైకి చెందిన కాంట్రాక్టర్‌ పనులు దక్కించుకుని.. రైతుల నుంచి సమీకరించిన భూముల్లో రన్‌వే నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ప్రస్తుత రన్‌వే 2,286 మీటర్లు ఉండగా.. కొత్తగా 1,074 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు విస్తరణ పనులు చేపట్టారు. ట్యాక్సీ ట్రాక్‌, పెరీమీటర్‌ రోడ్డు, రన్‌వే ఎండ్‌ సేఫ్టీ ఏరియా రెండు వైపులా పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తాయని అధికారులంటున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే రన్‌వే పొడవు 3,360 మీటర్లకు పెరగనుంది. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. త్వరగా రన్‌వే అందుబాటులోకి తీసుకొస్తే అంతర్జాతీయ సర్వీసులకు ఉపయోగించే బోయింగ్‌ 747-400, బీ787-800, ఎయిర్‌బస్‌ 330 వంటి భారీ విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి సులువుగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం శరవేగంగా విస్తరణ పనులు చేపడుతుందని స్థానిక నేతలంటున్నారు. మొత్తానికి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రన్‌వే విస్తరణ పనులు పూర్తయితే... అంతర్జాతీయ సర్వీసులు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. 

06:48 - August 5, 2018

విశాఖపట్టణం : దాడి వీరభద్రరావు. ఉపాధ్యాయుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. టీడీపీలో కీలకనేతగా ఎదిగిన వ్యక్తి. రెండుసార్లు మంత్రి పదవులు అనుభవించి.. ఆ తర్వాత విభేదాలతో టీడీపీ నుంచి బయటకు వచ్చి.. వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తన తనయుడికి టికెట్‌ ఇప్పించుకున్నా... ఆ తరువాత జరిగిన పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా జనసేన అధినతే పవన్‌కల్యాణ్‌ కలవడంతో దాడి మరోసారి తెరపైకి వచ్చారు. అయితే... దాడి జనసేనలో చేరుతారా ? ఆయన భవిష్యత్‌ కార్యచారణ ఏంటి ? వాచ్‌ దిస్‌ స్టోరీ.

దాడి వీరభద్రరావు. లెక్చరర్‌గా జీవితాన్ని ప్రారంభించి.. ఎన్టీఆర్‌ పిలుపుతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వ్యక్తి. టీడీపీలో కీలకనేతగా ఎదిగిన దాడి... రెండుసార్లు మంత్రిగా పని చేశారు. విశాఖ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న దాడి... 2009 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా... టీడీపీ ఎమ్మెల్సీగా అవకాశమిచ్చింది. శాసనమండలిలో విపక్షనేతగా సమర్దవంతగా.. వైఎస్‌ను, కాంగ్రెస్‌పార్టీని ఎదుర్కొన్నారు. అనంతరం 2014 ఎన్నికల్లో పార్టీలో తలెత్తిన విభేదాలతో వైసీపీలో చేరారు. అయితే.. ఆ ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా తన కుమారుడు రత్నాకర్‌ను విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. కానీ... రత్నాకర్‌ పరాజయం కావడంతో వైసీపీ నుంచి బయటకు వచ్చి... ఖాళీగానే ఉన్నారు. అప్పడప్పుడు ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమాలు చేస్తుండేవారు.

ఇక తాజాగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అనకాపల్లి పర్యటనలో సడన్‌గా దాడి వీరభద్రరావును కలవడం సంచలనం రేకెత్తించింది. దాడి జన్మదినం రోజు ఈ సంఘటన జరగడంతో..ఆయన జనసేన పార్టీలో చేరుతారని అనుచరులు సైతం భావించారు. ఇక పవన్‌కల్యాణ్‌ సైతం... దాడిని జనసేనలోకి ఆహ్వానించడంతో పార్టీలో చేరడం ఖాయమని అనిపించింది. అయితే... తన అనుచరులతో చర్చించి నిర్ణయిం చెబుతానని దాడి చెప్పారు. దీంతో దాడి జనసేనలో చేరుతారా ? లేదా అనేది సస్పెన్షన్‌గా మారింది. దాడికి అనకాపల్లిలోనే కాకుండా.. విశాఖజిల్లా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. జిల్లా రాజకీయాలపై పూర్తి అవగాహన, పట్టు ఉంది. పైగా ఎలాంటి ఆరోపణలు ఆయనపై లేవు. దాడి చేరికతో పార్టీకి మరింత ప్లస్‌ అవుతుందని జనసేన భావిస్తోంది. అయితే దాడి మాత్రం జనసేనలో చేరుతారా ? లేదా అనేది మాత్రం స్పష్టం చేయలేదు.

అయితే... 2014 ఎన్నికల్లో పోటీ చేయని దాడి... ఇప్పుడు పార్టీ మారి... రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ దాడి జనసేనలో చేరితే మాత్రం జిల్లా రాజకీయాల్లో అనేక మార్పులు రావచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి దాడి ఏం ఆలోచన ఏమిటి ? ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారా ? లేదా తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. 

06:46 - August 5, 2018

కర్నూలు : జిల్లా హత్తిబెళగల్‌ క్వారీలో పేలుడు విధ్వంసానికి, క్వారీ నిర్వాహకుడి అజాగ్రత్తే కారణమని ప్రాథమిక విచారణలో తేల్చారు. పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వ ఉంచడం.. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమని.. స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము ఫిర్యాదు చేసినప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే.. ఇంతటి తీవ్ర ప్రమాదం జరిగేది కాదని మండిపడుతున్నారు. ఆలూరు మండలం హత్తిబెళగల్‌ సమీప కొండల్లో.. శుక్రవారం రాత్రి జరిగిన పేలుళ్లకు.. నిర్లక్ష్యం, అజాగ్రత్తే కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. చిప్పగిరి మండలం ఏరూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాసచౌదరి.. ఈ క్వారీ తవ్వకానికి అనుమతులు పొందారు. అక్కడే క్వారీ క్రషింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. నైపుణ్యం లేని కూలీలతో బ్లాస్టింగ్‌ పనులు చేయించడం.. పేలుళ్లు జరిగినప్పుడు అవసరమైన రక్షణ చర్యలు ఏవీ ఏర్పాటు చేయకపోవడంతో.. ప్రాణనష్టం భారీగా ఉందని అంటున్నారు.

క్వారీలో పేలుళ్ల కోసం బోరు ఘాతాలు వేసి.. అందులో మందుగుండు సామగ్రి అమర్చారు. బ్యాటరీ సాయంతో పేలుడుకు యత్నించినా.. ఎంతకీ బ్లాస్టింగ్‌ కాకపోవడంతో.. అక్కడున్న ఒడిశా కూలీలు చూసేందుకు వెళ్లారని, అదే సమయంలో భారీ పేలుడు జరిగిందని క్షతగాత్రుల సమాచారం ఆధారంగా అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున అమర్చిన మందుగుండు నుంచి వెలువడ్డ నిప్పు రవ్వలు.. క్రషింగ్‌ యూనిట్‌ సమీపంలో నిల్వ చేసిన మందుగుండు సామగ్రిపై పడడంతో.. పేలుళ్ల తీవ్రత బాగా పెరిగిందని చెబుతున్నారు.

ఈ ప్రమాదానికి అధికారుల ఉదాసీన వైఖరీ కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్వారీలో బ్లాస్టింగ్‌ల వల్ల ఇళ్లు దెబ్బతింటున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటున్నారు. రాజకీయ నాయకుల జోక్యంతో.. అధికారులెవరూ కనీసం క్వారీ సందర్శనకైనా రాలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. తాము ఫిర్యాదు చేసినప్పుడే అధికారులు పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మండిపడుతున్నారు.

06:44 - August 5, 2018

కర్నూలు : జిల్లా ఆలూరు పరిధిలోని హత్తిబెళగల్‌ వద్ద జరిగిన క్వారీ పేలుడు ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఐదేసీ లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కర్నూలు జిల్లా ఆలూరు వద్ద.. శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో పన్నెండు మంది మరణించిన ఘటనను.. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అటు హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ కూడా.. ఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు సేకరించారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, మైనింగ్‌, పోలీసు శాఖలు సంయుక్త కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన క్వారీ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. హోంమంత్రి తెలిపారు. బాధితులను ఆదుకుంటామన్నారు. మరోవైపు.. ఘటన జరిగిన ప్రాంతాన్ని ఉదయం నుంచీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మీడియా సహా ఎవరినీ అటువైపు వెళ్లనివ్వలేదు. ఓ దశలో, వామపక్షాలు, బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని తోసుకుంటూ క్వారీ వద్దకు వెళ్లారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. విపక్షాలు డిమాండ్‌ చేశాయి. క్వారీ నిర్వాహకుడు.. తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీనివాసచౌదరి.. పరారీలో ఉన్నారని.. ఆయన ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. 

06:41 - August 5, 2018

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మరోసారి మార్పులు చేసుకోబోతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాలనలో తరుచూ మార్పులు చేస్తున్న అధికార యంత్రాంగం... తాజాగా మరోసారి సర్కిళ్లు, జోన్లు సంఖ్య పెంపునకు ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించిన ప్రభుత్వం.. పెంపునకు అంగీకరించింది. వాటితోపాటు జీహెచ్‌ఎంసీలో ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది.

హైదరాబాద్‌ నగరం విస్తరించడం, జనాభా పెరుగుతుండడంతో ప్రభుత్వం పాలనలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌.. 2007లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మారింది. తొలుత 18 సర్కిళ్లు, 5 జోన్టతో ఏర్పడగా... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో 24 సర్కిళ్లుగా మారింది. మరో రెండేళ్లకే వీటిని 30 సర్కిళ్లుగా విభజించి.. ఐదు జోన్లను ఆరు జోన్లకు పెంచారు. పాలనా సౌలభ్యం కోసం జోన్లను మరోసారి విభజించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. సర్కిళ్లను 50కి... జోన్లను 10కి పెంచాలని జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ప్రభుత్వానికి గతంలో నివేదించింది. అనేక తర్జనభర్జనల అనంతరం ప్రభుత్వం.. కేబినెట్‌లో చర్చించి 48 సర్కిళ్లు... 12 జోన్లుగా విభజించేందుకు నిర్ణయించింది.

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సర్కిళ్లను 50కి, జోన్లను 10కి పెంచాలని ప్రతిపాదించగా... ప్రభుత్వం రెండు నియోజకవర్గాలను ఒక జోన్‌గా చేయాలని నిర్ణయించిందని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. పాలనా సౌలభ్యం కోసమే సర్కిళ్లు, జోన్లను విస్తరించామో తప్ప... కొందరు ఆరోపిస్తున్నట్లుగా అధికారులకు పోస్టింగ్‌ల సర్దుబాటు కోసం కాదన్నారు. అర్హులైన అధికారులు మాత్రమే సరైన పోస్టింగ్‌లో ఉన్నారన్నారు. పెరిగిన సర్కిళ్లు, జోన్ల కోసం కొత్తగా 1610 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందన్నారు.

పాలనా సౌలభ్యం జోన్లు, సర్కిళ్ల విభజన చేపడుతున్న ప్రభుత్వం... మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందనే విమర్శలు తలెత్తుతున్నాయి. సరిపడ సిబ్బంది లేక.. ఉన్నవారిపైనే పని భారం పెరుగుతుందని పలువురంటున్నారు. మరోవైపు పాలనా సౌలభ్యం కోసం సర్కిళ్లు, జోన్లను విభజిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ప్రజలకు మెరుగైన సేవలు అందించినప్పుడే... వాటికి సార్దకత ఉంటుందని నగరవాసులంటున్నారు.

06:38 - August 5, 2018

హైదరాబాద్‌ : మహానగర పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌. విపత్తులు, ప్రమాదాల సమయంలో తక్షణం సహాయ చర్యలు చేపట్టేందుకు డిజాస్టర్‌ రెస్పాన్స్ ఫోర్స్‌ను ప్రారంభించారు మంత్రి. హైదరాబాద్‌ మహానగరంలో ప్రమాదాలు, విపత్తుల సమయాల్లో సహాయక చర్యలు అందించేందుకు ప్రత్యేక దళాన్ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. అన్ని రకాల మౌలిక వసతులను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసే డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ప్రతి జోన్‌కు కేటాయిస్తామని కేటీఆర్‌ చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించామన్నారు మంత్రి కేటీఆర్. ఈ ప్రత్యేక దళంతో పోలీసు, అగ్నిమాపక శాఖలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. ఉన్న మానవ వనరులతోనే ఈ దళాన్ని రూపొందించినట్లు చెప్పారు. దేశంలో ఇలాంటి ప్రత్యేక దళం జీహెచ్‌ఎంసీకి మాత్రమే ఉందన్నారు కేటీఆర్. విపత్తులను ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు కేటీఆర్. హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా మార్చేందుకు మరో లక్ష కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. 

06:34 - August 5, 2018

చిత్తూరు : టెక్నాలజీని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ ముందుకు పోతున్నామన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా, సమర్థమైన పాలన అందిస్తున్నామన్నారు. తిరుపతిలో నిర్వహించిన జ్ఞానభేరి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. విద్యార్థుల అనుమానాలు తొలగించి, ఏపీని నాలెడ్జ్‌ ఎకానమీలో నంబర్‌ వన్‌గా తయారు చేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సీఎం చెప్పారు.

ప్రపంచంలోనే ఎక్కువ యువత భారతదేశంలోనే ఉందన్నారు సీఎం చంద్రబాబు. యువత ఉద్యోగాలు చేసే విధంగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే దశకు రావాలని సూచించారు. ఏపీలో ప్రతి ఒక్క యూనివర్సిటీ నాలెడ్జ్‌ హబ్‌గా తయారు కావాలన్నారు సీఎం చంద్రబాబు. ఇందు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు.

హైదరాబాద్‌ ద్వారా అధిక ఆదాయం వస్తుందంటే ఆనాడు తాను వేసిన పునాదేనని సీఎం చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌ కంటే బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేసి రాష్ట్ర ప్రజలకు అందిస్తామన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ నమ్మించి ద్రోహం చేశారన్నారు సీఎం చంద్రబాబు. అయినప్పటికీ రాష్ట్ర హక్కుల కోసం చివరి వరకు పోరాటం చేస్తామన్నారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నాలెడ్జికి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచేందుకు అన్ని విధాలా సహకరిస్తామని చంద్రబాబు చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామన్నారు.  

06:30 - August 5, 2018

ఢిల్లీ : మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సుమారు గంట పాటు ప్రధానితో చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానికి సీఎం 11 అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. హై కోర్టు విభజన త్వరగా పూర్తి చేయాలని, నూతన జోన్ల విధానానికి కేంద్రం ఆమోదం తెలపాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కొత్త సచివాలయం నిర్మాణానికి రక్షణశాఖకు చెందిన బైసన్‌ పోలో మైదానాన్ని ఇవ్వాలని, కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని, తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కావాలని విజ్ఞప్తి చేశారు.

వెనకబడిన జిల్లాలకు 450 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ ప్రధాని మోదీని కోరారు. తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలని, ఐటీఐఆర్ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ప్రధానికి వినతి పత్రం అందజేశారు. 

హైదరాబాద్ కు రాష్ట్రపతి...

హైదరాబాద్ : భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా, బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లారు. రాత్రికి ఆయన అక్కడే బస చేశారు. 

బోనం ఎత్తనున్న విజయశాంతి...

హైదరాబాద్ : ఆదివారం లాల్ దర్వాజలో జరిగే బోనాల్లో విజయశాంతి బోనమెత్తనున్నారు. అనంతరం భవిష్యత్ రాజకీయాలపై ఆమె ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

హత్తిబెళగల్ కు పవన్...

విజయవాడ : సోమవారం సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హత్తిబెళగల్ వెళ్లనున్నారు. అక్కడి ప్రజలను కలసి, పరిస్థితులను పరిశీలిస్తానని పవన్ వెల్లడించారు. ఈ సందర్భంగా తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న వారిని, మృతుల బంధువులను పవన్ పరామర్శించనున్నారు. 

కోహ్లీని కలవడానికి మాల్యా తహతహ...

ఢిల్లీ : బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని కలవడానికి తహతహ లాడుతున్నాడు. కోహ్లీని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని మాల్యా చేసిన విజ్ఞప్తిని భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. 

ఫైనల్ కి చేరిన సింధూ...

ఢిల్లీ : భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు 2018 ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో సింధు తలపడనుంది. సెమీస్‌లో జపాన్‌ షట్లర్‌ యమగూచితో జరిగిన హోరాహోరీ పోరులో సింధు విజయం సాధించింది. ప్లేస్‌మెంట్లతో సింధు చెలరేగటంతో యమగూచి ఓటమిపాలైంది. 

Don't Miss