Activities calendar

06 August 2018

17:50 - August 6, 2018
17:49 - August 6, 2018
17:48 - August 6, 2018
17:43 - August 6, 2018

హైదరాబాద్ : పాతబస్తీ షాహిన్ నగర్ లో ని ఓ ఇంట్లో ఎన్ ఐ ఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరు అనుమానుతులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ తనిఖీల విషయాన్ని అధికారులు గోప్యంగా వుంచారు. కర్ణాటక, గుజరాత్ కు చెందిన రెండు ఎన్ ఐఏ అధికారులు అర్థరాత్రి నుండి తనిఖీలు స్థానిక పోలీసుల సహాయంతో ఎన్ ఐఏ అధికారులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 

17:28 - August 6, 2018

వరంగల్ : హన్మకొండలోని ప్రెస్ క్లబ్ వద్ద ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన విజయలక్ష్మీ అనే మహిళను తక్షణమే అరెస్ట్ చేయాలని వెంకటాచారి అనే యువకుడు డిమాండ్ చేశాడు. కాగా గండ్ర వెంకటరమణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని, తనతో ఆయన శారీరక సంబంధం పెట్టుకున్నాడన్న దానికి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని బాధిత మహిళ విజయలక్ష్మీ రెడ్డి ఆరోపించింది. తాను మదర్ అనే ఎన్జీవోగా పనిచేస్తున్న సమయంలో సండ్రతో తనకు ఏర్పడి పరిచయంతో ఐదేళ్ల నుండి సండ్రతో తనకు సంబంధం వుందని కానీ ఇటీవల తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడనీ..దీంతో తనకు గండ్ర వెంకటరమణారెడ్డి వల్ల తనకు ప్రాణానికి ముప్పు వుందని విజయలక్ష్మీ ఆరోపిస్తోంది. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇదంతా రాజకీయ కుట్ర అని గండ్ర ఆరోపిస్తున్నారు. కాగా సెల్ టవర్ ఎక్కిన యువకుడిని క్షేమంగా కిందకు దింపేందుకు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారు. 

17:17 - August 6, 2018

ఢిల్లీ : రైతులు, వ్యవసాయ కార్మికులు జరుపుతున్న పోరాటానికి సీపీఐ మద్దతిస్తోందనా ఆ పార్టీ నేత సురవరం ప్రకటించారు. యూనివర్సిటీ గ్రాంట్ రద్దు చేయడం రాబోయే కాలంలో స్వయంప్రత్తికి నష్టం కలుగుతుందని అభిప్రాయ పడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 9న దళిత సంఘాలు చేపట్టే పోరాటానికి భారత్ బంద్ కు సీపీఐ మద్దతు తెలియచేస్తుందన్నారు. పాక్ టెర్రరిజాన్ని ఆపాలని సీపీఐ కోరుతోందని, చర్చల కోసం ఇమ్రాన్ ఖాన్ పెట్టిన ప్రతిపాదనలను ఎన్డీయే సమ్మతించాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. 

16:57 - August 6, 2018

నిజామాబాద్ : టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా అరెస్ట్ అయిన రైతు సంఘాల నాయకులను పరామర్శించేందుకు వెళుతున్న కోదండరాంను బిక్ నూర్ టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ అయినవారిని పరామర్శించేదుకు వెళుతున్న మమ్మల్ని అరెస్ట్ చేయటం సరికాదనీ...అరెస్ట్ లతో తమకు ఆపలేరని కోదండరాం పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన రైతు సంఘం నేతల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి కాకతీయ కాల్వ ద్వారా వుండే రైతులకు నీటిని విడుదల చేయాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులతో కలిసి అందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో రైతు కూలి సంఘం నాయకుడు ప్రభాకర్ ను నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా ప్రభాకర్ ను కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ ను పరామర్శించేదుకు వెళుతున్న టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ను పోలీసులు అరెస్ట్ చేసి తిరిగి హైదరాబాద్ కు తరలించారు.

16:40 - August 6, 2018

నిజామాబాద్ : ఎస్సారెస్పీ పరిధిలోని పలు గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. రైతుల ఆందోళనలు, పోలీసుల మోహరింపుతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కుమ్మర్ పల్లి మండలం ఉఫ్లూర్ లో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్తికేయ 10టీవీతో మాట్లాడుతు..ఎస్సారెస్పీ గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకూ 144 సెక్షన్ కొనసాగిస్తామని తెలిపారు. రైతుల ఉసంయమనం పాటించాలని..ప్రజాస్వామ్యబద్దంగా వారు నిరసన తెలిపితే తాము సహకరిస్తామని..కానీ హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు నీరు విడుదల చేయాలని ఆ ప్రాంత రైతులు ఆందోళన చేపట్టటంతో పోలీసులు భారీగా మోహరించారు. నీరు విడుదల లేదని ప్రభుత్వ కమిటీ స్పష్టం చేయటంతో ప్రస్తుత పరిస్థితుల్లో నీరు విడుదల చేయకపోతే పంటలు ఎండిపోతాయని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తు రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపత్యంలో ఆప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. 

16:25 - August 6, 2018

కర్నూలు : సినీ నటుడు, జనసేనానీ కర్నూలు జిల్లాలో అడుగు పెట్టారు. నేరుగా హత్తిబెళగల్ క్వారీ వద్దకు చేరుకున్నారు. పవన్ రాకతో ఆ ప్రాంతానికి భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. ఇటీవలే హత్తిబెళగల్ క్వారీ పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిని పరామర్శించేందుకు..ఘటనాస్థలిని పరిశీలించేందుకు శుక్రవారం పవన్ ఇక్కడకు చేరుకున్నారు. ఘటనపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు భారీగా క్వారీలున్నా..అక్రమ క్వారీలను అరికట్టడంలతో ప్రభుత్వం విఫలం చెందిందని పవన్ విమర్శించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:22 - August 6, 2018

పశ్చిమగోదావరి : ఉండ్రాజవరం మండలం సత్యవాడలో కల్తీ మద్యం తాగి ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. సత్యవాడలోని ఓ మద్యం దుకాణంలో మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరించారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా వుంది. వీరి తాగిన మద్యం కల్తీ అయిందనీ..అందుకే వారు అస్వస్థతకు గురయినట్లుగా అనుమానిస్తున్నారు. కాగా ఈ మద్యం దుకాణం విషయంలో ఫిర్యాదు చేసినా అధికారులు, పోలీసులు పట్టించుకోలేదనీ..పట్టించుకుంటే ఈరోజు ఈరోజున ఈ పరిస్థితి వచ్చి వేండేది కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుని మద్యం దుకాణదారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

16:12 - August 6, 2018

ఢిల్లీ : ఏపీలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చిన కేంద్రం వాటిని వెనక్కి తీసుకోవడంపై లోక్ సభలో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం చర్యకు నిరసనగా లోక్ సభ నుంచి టీడీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, జేసీ దివాకర్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మురళీమోహన్ లు మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏపీపై కేంద్రం వివక్ష చూపడం మానుకోవాలని, 95 శాతం యూసీలు ఇచ్చినా కేంద్రం నిధులు ఇవ్వకపోవడం కక్ష సాధింపు చర్యేనని అన్నారు. ఫిబ్రవరి 9న వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు విడుదల చేశారని, వారం రోజుల్లోగా పీఎంవో చెప్పిందంటూ వెనక్కి తీసుకున్నారని, ఏపీపై వివక్ష చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. యూసీలు అందించడంలో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో ఉందని, యూసీలు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏపీకి బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజ్ అమలు చేస్తామన్నారని, అది అమలు చేస్తే రూ.22 వేల కోట్లు విడుదల చేయాలని అన్నారు. 

15:55 - August 6, 2018

ఖమ్మం : మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందా ? మావోయిస్టుల ఏరివేతలో పోలీసులు పై చేయి సాధిస్తున్నారా ? అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజం అనిపిస్తోంది. ఇటీవలే కాంకేర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ ఘటన మరిచిపోకముందే మరో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సుకుమా జిల్లా గొల్లపల్లి - కుంట మధ్య పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు తారసపడడం..ఇరువురి మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దీనితో పోలీసుల కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించారు. మావోయిస్టుల మృతదేహాలను ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 

15:47 - August 6, 2018

విజయనగరం : ఓవైపు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం... కానీ దానికి తగ్గట్టు వసతుల కల్పన మాత్రం చేపట్టడం లేదు. దీంతో చాలా పాఠశాలలు చెట్ల కిందో, రేకుల షెడ్డూల్లోనో లేక పశువుల పాకల్లోనో తరగతులు నిర్వహించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. విజయనగరం జిల్లాలో చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలోని దుర్భర పరిస్థితిల నడుమ కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలపై 10 టీవీ ప్రత్యేక కథనం...

ఇది ఓ పాఠశాల భవనం. రేకుల షెడ్డులా ఉందని ఆశ్చర్యపోకండి. ఇది రేకుల షెడ్డే. కాకపోతే ఆ రేకులషెడ్డే ఇప్పుడు పాఠశాలగా మారింది. ఈ రేకులషెడ్డు కిందే విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రెల్ల పంచాయతి పరిధిలోని మల్లుగూడాలోని దుస్థితి ఇది. మల్లుగూడాలో 24 మందికి పైగా విద్యార్ధులున్నారు. వీరంతా ఈ రేకులషెడ్డు కిందే చదువుకుంటున్నారు. పాఠశాల భవనం లేక.., అత్యంత ప్రమాదకరమైన పరిస్ధితిలో చవుతున్నారు. నేలపై వాడే టార్బన్‌ను పైకప్పుగా ఏర్పరచుకొని చదువుని సాగిస్తున్నారు.

పాఠశాల నూతన భవనం కోసం పాత భవనాన్ని అధికారులు మూడేళ్ల కిందట కూల్చివేశారు. కానీ ఇప్పటికీ కొత్త స్కూల్ భవనాన్ని మాత్రం నిర్మించలేదు. దీంతో విద్యార్థులకు ఈ రేకులషెడ్డే దిక్కైంది. తేలిక పాటి వర్షానికి ఈ పాఠశాలకు సెలవు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో చదువులు ముందుకుసాగడం లేదు. తమ సమస్యను ప్రజా ప్రతినిధులకు, సంబంధిత అధికారులతో మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు అంటున్నారు.
బాడంగి మండలం పెద్దపల్లి గ్రామంలోని పాఠశాలది మరో దుస్థితి. నిన్న,మొన్నటి వరకు ఈ పశువుల పాకలోనే పాఠశాల కొనసాగేది. అయితే సుమారు 30 మంది విద్యార్థులుండే ఈ ఎలిమెంటరీ స్కూల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో గతంలో దీనిని కూల్చివేశారు. ఇక అప్పటి నుంచి పాఠశాలకు భవనం లేకపోవడంతో ఇదిగో...ఇక్కడ కనిపిస్తున్న ఈ పశువుల పాకలోనే తరగతులు నిర్వహించుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. ఈ మధ్యే ఈ పాఠశాలను అధికారులు అంగన్వాడీ భవనంలోకి మార్చారు. స్కూల్ బిల్డింగ్ నిర్మించాలని గత రెండు మూడు ఏళ్లుగా ఇటు ఉపాధ్యాయులు, అటు గ్రామస్తులు కోరుతున్నప్పటికీ, ఎవరూ పట్టించుకునే నాధుడే లేడు. జిల్లాలో కేవలం ఈ రెండు పాఠశాలలే కాదు. ఇలా చాలా పాఠశాలల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పక్కా భవనాలు, సరైన మౌళిక సదుపాయాలు లేక పిల్లలు చదువులు కొనసాగించలేని పరిస్థితి తలెత్తింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిదులు స్పందించి ప్రభుత్వ పాఠశాలల బాగోగులపై దృష్టి పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

 

బాబుకు వున్నది జగన్ కు లేనిది అదే : ఉండవల్లి

హైదరాబాద్ : ఓ ఇంటర్వ్యూలో భాగంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతు..చంద్రబాబు, జగన్ ల మధ్య తేడా గురించి ప్రస్తావిస్తూ, ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో చంద్రబాబు సిద్ధహస్తుడని, స్వయంగా వ్యూహాలను రచించగల దిట్టని చెప్పారు. జగన్ వద్ద ఎలక్షన్ మేనేజ్ మెంట్ శక్తి లేదని, ఆయన వద్ద ఆ పనిని సమర్థవంతంగా చేసిపెట్టగల వారు ఎవరైనా ఉన్నారా? అన్న విషయం తనకు తెలియదన్నారు. 2014 ఎన్నికలకు ముందు సైతం జగన్ కు అడ్వాంటేజ్ ఉందని అందరూ భావించారని, అయితే, చివరి నెలన్నర రోజులూ చంద్రబాబు పన్నిన వ్యూహాలు ఫలితాలను మార్చి ఆయనకు అనుకూల ఫలాన్నిచ్చాయని చెప్పారు.

టెక్కీ నిర్వాకం..ఫేస్ బుక్ ద్వారా డ్రగ్స్ విక్రయాలు..

హైదరాబాద్‌ : ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఫేస్‌బుక్ ద్వారా బహిరంగంగా డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసుల చేతికి చిక్కాడు. గత నెల 31న కౌస్తవ్ బిస్వాస్ అనే టెక్కీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేస్తూ సరఫరాకు డ్రగ్స్ సిద్ధంగా ఉన్నాయని, చార్లీ 4వేలు, ఎక్స్‌టాసీ 1000 అంటూ మెసేజ్ పెట్టిన అతడు ఎక్కడ కావాలంటే అక్కడికి డెలివరీ చేస్తానని పేర్కొన్నాడు. దీనిని గుర్తించిన తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 15 గ్రాముల కొకైన్, 80 గ్రాముల ఎండు గంజాయి, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

భారీ ఎన్ కౌంటర్..14మంది మావోలు హతం..

ఛత్తీస్‌ ఘడ్‌ : రాష్ట్రంలో మరోసారి తుపాకీల మోత మోగింది. ఈ ఉదయం పోలీసులు కూబింగ్ నేపథ్యంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. కొంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి, కన్నాయి గూడ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కు వెళ్లిన జవాన్లు, పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డ వేళ ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. తమకు లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించగా, వినకుండా మావోలు కాల్పులు ప్రారంభించడంతో ప్రాణ రక్షణకు జవాన్లు కూడా ఫైరింగ్ ప్రారంభించారు.

ఆర్టికల్ 35(ఏ) పై సుప్రీంకోర్టు విచారణ..

ఢిల్లీ : ఆర్టికల్ 35(ఏ) పై సుప్రీంకోర్టు విచారణను చేపట్టింది. ఆర్టికల్ 35 ఏ పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం… తదుపరి విచారణను రెండు వారాల పాటూ వాయిదా వేసింది. ఆర్టికల్ 35ఏ పై విచారణ సందర్భంగా జమ్మూకాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టికల్ 35-ఏ ను తొలగించే ప్రయత్నం జరుగుతోందని వేర్పాటు వాదులు రెండు రోజుల పాటూ బంద్ కు పిలపునిచ్చారు. దీంతో ముందస్తుగా భారీ భద్రత ఏర్పాటు చేశారు.

12:32 - August 6, 2018

ఖమ్మం : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టులపై కేంద్రం, రాష్ట్రాలు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కాంకేర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం మరో భారీ ఎన్ కౌంటర్ సోమవారం చోటు చేసుకున్నట్లు సమాచారం.

ఇటీవలే మావోయిస్టు వారోత్సవాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. గట్టి నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు విశ్వసనీయ సమచారం మేరకు సోమవారం ఉదయం ఓ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు ఎదురు పడడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కానీ దీనిని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. 

ప్రొ.జయశంకర్ కు మంత్రి కడియం నివాళి..

వరంగల్: ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్భంగా.. ఆయన విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయశంకర్ సార్ యాదిలో ఆయన ఆశయాలకు అనుగుణంగానే సీఎం కేసీఆర్ సమర్ధవంతమైన పాలన అందిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేడు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయన్నారు. 

గదిలో పశువుల నిర్భంధం..ఊపిరాడక మృతి..

ఛత్తీస్‌గఢ్‌ : తరుచూ పంట పొలాల్లోకి వెళ్తు..పంటను నాశనం చేస్తున్నాయని ఆవులు, బర్రెలను ఓ గదిలో నిర్బంధించారు. ఆ గదిలో నిర్బంధించిన 18 పశువులు ఊపిరాడక మృతి చెందాయి. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్‌బజార్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. రోహషి గ్రామానికి సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి గుర్తు తెలియని పశువులు మేత కోసం వస్తున్నాయి. దీంతో పంట పొలాలను పాడు చేస్తున్నాయని ఆ పశువులను రైతులు గ్రామంలోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత గ్రామంలో ఉన్న పశువుల షెడ్డులోని ఓ గదిలో నిర్బంధించారు. వాటికి మేత, నీటి సదుపాయం కల్పించలేదు. 

12:26 - August 6, 2018
12:24 - August 6, 2018

విజయవాడ : మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు ఏజెన్సీకి ఇస్తారా ? అంటూ మధ్యాహ్న భోజన కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీగా తరలివస్తున్న మహిళా కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు...కార్మికుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ సీఐటీయూ నేతలు అలంకార్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. రోడ్డుపై సీఐటీయూ నేతలు బైఠాయించడంతో కొంత పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. మరి మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటు వారికి అప్పచెబుతారా ? లేక వెనక్కి తగ్గుతారా ? అనేది చూడాలి. 

వైసీపీ రాజీనామా..జనసేనలోకి ప్రముఖ నేత..

తూర్పు గోదావరి : జిల్లా వైసీపీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శిట్టిబత్తుల రాజబాబు, పార్టీ పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. తన రాజీనామాను వైఎస్ జగన్ కు మెయిల్ ద్వారా పంపించినట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీకి పునాదిగా ఉన్న ఎస్సీలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఈ విషయంలో తాను పలుమార్లు రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేసినా, ఫలితం శూన్యమని వ్యాఖ్యానించిన ఆయన, అగ్రవర్ణ నేతలు తనపై వివక్ష చూపుతుండటంతోనే రాజీనామా చేసినట్టు తెలిపారు.

5వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం..

నెల్లూరు : పొదలకూరు రోడ్డులోని గిరిజన పాఠశాలలో దారుణం జరిగింది. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం ఏడుగురు గురుకుల పాఠశాల సిబ్బంది ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. దీంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పగా వారు సోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏడుగురు సిబ్బందిపై వేదాయపాలెం పీఎస్ లో కేసు నమోదయ్యింది. 

12:20 - August 6, 2018

విజయవాడ : ఈ వారం రోజులు పోరాటంలో కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయన సోమవారం పార్టీ ఎంపీలతో టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. పార్లమెంట్ లో పోరాటం..ఆందోళనలు గురించి ఆయన చర్చించారు. పోరాటాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇదే స్పూర్తిని మున్ముందుకు తీసుకెళ్లాలని, విశాఖ రైల్వే జోన్ పై ఉత్తరాంధ్రపై ఎంపీలు పోరాటం ఉధృతం చేయాలని సూచించారు. 

6.6 కిలోల బంగారం పట్టివేత..

ఢిల్లీ : ఢిల్లీ నుండి వచ్చిన విమానంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారనే అనుమానంతో డీఆర్ఐ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాలలో టాయిలెట్‌లో దాచిన సుమారు ఆరున్నర కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని మార్కెట్ విలువ రెండు కోట్ల కు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు.

చరిత్రలో ప్రొ.జయశంకర్ నిలిచిపోతారు : కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ సిద్దాంత కర్త, ఉద్యమ స్ఫూర్తిప్రదాత..ఆచార్య శ్రీకొత్తపల్లి జయశంకర్ర జయంతి సందర్భంగా..ప్రొ.జయ శంకర్ కు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ జ్నాపకాలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కలుగజేయటంలో జయశంకర్ కఠోర శ్రమను కొనసాగించారని ప్రొఫెసర్ జయశంకర్ పేరు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని కేసీఆర్ తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తరువాత వచ్చిన మార్పు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమాలు జయశంకర్ ఆత్మకు శాంతి చేకూర్చుతాయని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 

12:12 - August 6, 2018

నిజామాబాద్‌ : జిల్లా ఎస్సారెస్పీ గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసేది లేదని ప్రభుత్వ కమిటీ తేల్చి చెప్పడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు నీరు విడుదల చేయాలని... లేకపోతే పంటలు ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే... రైతుల ఆందోళనల నేపథ్యంలో పలు గ్రామాల్లో పోలీసులు భారీ ఎత్తున మోహరించడంతో పాటు.. 144 సెక్షన్‌ విధించారు. రైతులు ఆందోళనలు చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

12:10 - August 6, 2018

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నాయి. అప్పటి నుండి టిడిపి ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. విభజన హామీలు..ప్రత్యేక హోదా తదితర వాటిపై ఆందోళన..నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద వర్షంలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. రోజుకో వినూత్న వేషధారణలో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరవుతున్న ఎంపీ శివప్రసాద్‌ ఈరోజు... శ్రీరాముడి వేషధారణలో వచ్చారు. శ్రీరాముడు ఒకే మాట, ఒకే బాణం అన్న ధర్మాన్ని పాటించగా... శ్రీరాముడే దేవుడిగా భావించే బీజేపీ మాత్రం ఆడిన మాట తప్పుతుందని శివప్రసాద్‌ ఆరోపించారు. 

ఎయిర్ పోర్ట్ నిర్మాణం జీఎమ్మార్ ఇవ్వొద్దంటు సీపీఎం ఆందోళన..

విశాఖ : తాజ్ గేట్ వే హోటల్ వద్ద సీపీఎం ఆందోళన చేట్టింది. కొనసాగుతోంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం జీఎమ్మార్ కి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ..సీపీఎం ఆందోళన చేట్టింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణం ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఇవ్వాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. దీంతో సీపీఎం నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. 

12:06 - August 6, 2018

విజయవాడ : దేశంలో వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యం గల చేనేత రంగంపై ప్రభుత్వం దృష్టిసారించాలని చేనేత కార్మికులు కోరుకుంటున్నారు. అయితే చేనేత రంగాన్ని ఆదుకునేవారే లేక ఈ రంగాన్నే నమ్ముకుని జీవిస్తున్న కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. చేనేత కార్మికుల సంక్షేమం దిశగా పాలకులు మొగ్గు చూపాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు నామమాత్రంగానే మిగిలిపోతున్నాయి. ఏపీలో చేనేత కళకు, చేనేత తయారీకి కళాకారులు జీవం పోస్తున్నా..నేతన్నల బతుకు భారంగా మారుతున్న వైనంపై..10టీవీ ప్రత్యేక కథనం.

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికుల సంక్షేమం దిశగా పాలకులు మొగ్గు చూపాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు నామమాత్రంగానే మిగిలిపోతున్నాయి. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు చేనేతలకు రుణమాఫీ చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 110 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి కొంత ఉపశమనం కల్పించినా ... పూర్తిస్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో నేతన్నల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.

ఆప్కోకు 150 కోట్ల రూపాయల నుంచి 250 కోట్లు కేటాయిస్తే..చేనేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు 20 శాతం రిబేటు ఇస్తుండగా, దీన్ని ఆప్కోకు కూడా వర్తింపజేసి 30 శాతానికి పెంచేలా సర్కార్ చొరవ చూపాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. మరోవైపు కృష్ణాజిల్లాలో చేనేత రంగం నానాటికీ సంక్షోభంలో కూరుకుపోతోంది. జీఎస్టీతో నూలు ధరలు బాగా పెరిగాయి. దీనికి తోడు ఆప్కోకు విక్రయించిన ఉత్పత్తులు కొనుగోలు కావడం లేదు. దీంతో వాటికి సంబంధించిన బకాయిలు విడుదల చేయకపోవడంతో చేనేతలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆశించినమేర విక్రయాలు లేకపోవడంతో చేనేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ప్రస్తుతం చీరల తయారీ ఖర్చు రెట్టింపయ్యింది. ఈ ప్రభావం వినియోగదారులపై కూడా పడి విక్రయాలు తగ్గిపోయాయి. సాధారణంగా ఒక్కో చీర 500 నుంచి 1200ల వరకు ఉంటుంది. తయారీకి ఉపయోగించే నూలుపై 5 శాతం, జరీపై 15 శాతం ఇలా రంగులు, ఇతరత్రా కూడా జీఎస్టీ ఉండటంతో ధర పెంచి విక్రయించాల్సి వస్తోంది. . అయితే ప్రతినెలా జిల్లాలో సుమారు 1.60 కోట్ల రూపాయలు నూలుకే వెచ్చిస్తున్నారు. నూలుపై 5 శాతం పన్ను విధించడంతో ఇబ్బందులు పడుతున్నారు చేనేత కార్మికులు. దేశంలో వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యం గల చేనేత రంగంపై ప్రభుత్వం దృష్టి సారించాలని,..కళాకారులను ఆదుకోవాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు కోరుతున్నారు. ఆగస్టు7న తేదీన చేనేత దినోత్సవం రోజు కావడంతో ప్రభుత్వం తమపై కనికరం చూపించి... సీఎం చంద్రబాబు ఓ ప్రకటన చేయాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. 

శ్రీరాముడ్ని దేవుడనే బీజేపీ ఆడిన మాట తప్పింది : ఎంపీ శివ ప్రసాద్

ఢిల్లీ : భిన్న, విభిన్న వేషధారణలతో ఏపీ సమస్యలను వివరిస్తు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్ నిరజనను కొనసాగిస్తున్నారు. ఒకే మాట, ఒకే బాణం అన్ని రాముడి ధర్మాన్ని పాటించాడనీ..శ్రీరాముడ్ని దేవుడిగా భావించే బీజేపీ మాత్రం మాట తప్పి విభజన హామీలను నెరవేర్చకుండా ఏపీకి అన్యాయం చేస్తోందని ఎంపీ శివప్రసాద్ తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ ఎంపీలు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు.

12:03 - August 6, 2018

శ్రీకాకుళం : రిమ్స్‌ ఆసుపత్రిలో ఇంజక్షన్‌ వికటించడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అస్వస్థతకు గురైన మరో 16మంది చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషాదానికి కారణమైన సెప్ర్టియాక్షన్‌ సూది మందు వినియోగం, బాద్యులైన వైద్యులపైన 8 మంది ఉన్నతాధికారులతో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనలో శైలు, అనిత, దుర్గమ్మ శనివారం మృతి చెందగా.. మరో నలుగురు విశాఖ కేజీహెచ్‌లోనూ, 12మంది రిమ్స్‌ అత్యవసర విభాగంలోనూ చికిత్స పొందుతున్నట్లు రిమ్స్‌ వర్గాలు తెలిపాయి.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి కళా వెంకటరావు, కలెక్టర్‌ ధనుంజయరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి వైద్యాధికారులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు. 20మంది రోగులకు ఒకే రకమైన ఇంజక్షన్‌ ఎందుకువాడారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కాగా దర్యాప్తు పూర్తయ్యాక కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని రిమ్స్‌ డైరెక్టర్‌ కృష్ణవేణి తెలిపారు.

12:01 - August 6, 2018

నెల్లూరు : జిల్లా గంగాధర నెల్లూరులో కన్న బిడ్డలనే.. తండ్రి కడతేర్చిన ఘటన చోటు చేసుకుంది. కసాయి తండ్రి వెంకటేశ్‌ తన ముగ్గురు పిల్లలైన పునీత్‌, సంజయ్‌, రాహుల్‌లను నీవా నదిలో పడేశాడు. దంపతుల మధ్య వివాదమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. 

12:00 - August 6, 2018

పశ్చిమగోదావరి : ఉండ్రాజపురం సత్యవాడలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితుల దినోత్సవం రోజున మద్యం సేవించి ఇద్దరు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇందులో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. కల్తీ మద్యమే కారణమని తెలుస్తోంది. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో మద్యం షాపు నుండి మద్యం కొనుగోలు చేసి సేవించారు. కొంతసేపటికే వీరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆ సమయంలో వారిలో ఉన్న ఓ వ్యక్తి తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని తెలియచేశాడు. అక్కడకు చేరుకున్న ఆ తండ్రి ముగ్గురిని ఇంటికి తీసుకెళ్లారు. అధికంగా మద్యం సేవించి ఉంటారనే అనుమానంతో ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. తెల్లారేసరికి వారు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ మద్యం తాగడం వల్లే మృతి చెంది ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని ఎస్ఐ పరిశీలించారు.

క్వారీ పేలుడు బాధితులను పరామర్శించనున్న జనసేనాని..

కర్నూలు : జనసేనాని పవన్ కళ్యాణ్ కర్నూలు చేరుకున్నారు. పుల్లూరు టోల్ గేట్ వాద్ద పవన్ కళ్యాణ్ కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పవన్ ఆలూరు క్వారీ ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. ఆలూరు మండలం అగ్రహారం దగ్గర హత్తెబెళగల్ మైనింగ్ క్వారీలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్సపొంతున్నవారిని పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. 

వర్షపాతాన్ని పర్యవేక్షించి రైతులను అప్రమత్తం చేయాలి : చంద్రబాబు

అమరావతి : నీరు, ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి దిశా నిర్ధేశం చేశారు. రాష్ట్రంలో 2 జిల్లాలో తప్ప అన్ని జిల్లాల్లోను లోటు వర్షపాతం నమోదు అయ్యిందనీ..జిల్లాల్లో వర్షాభావంపై ఎప్పటికప్పుడు కలెక్టఉ్ల పర్యవేక్షించి ఆయా ప్రాంతాలలోని రైతులను అప్రమత్తం చేయాలని చంద్రబాబు సూచించారు. జులై 31 వరకు వర్షాభావం వివరాలు ఢిల్లీకి పంపించాలని..రాబోయే మూడు రోజుల్లో ముందస్తు నివేదిక కేంద్రానికి చేరాలన్నారు.

సీఎం కేసీఆర్ కు సోదరీ మృతి..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సోదరి మృతి చెందారు. గత కొంతకాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న లీలమ్మ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్, లీలమ్మ మరణవార్తను తెలుసుకుని, మిగతా పర్యటనను వాయిదా వేసుకుని హుటాహుటిన హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 21న కేసీఆర్ మరో సోదరి విమలాబాయి కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఎస్సారెస్పీ గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత..

నిజామాబాద్ : ఎస్సారెస్పీ గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎస్సారెస్పీ పరిధిలోని పలు గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. రైతుల ఆందోళనలు, పోలీసుల మోహరింపుతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కుమ్మర్ పల్లి మండలం ఉఫ్లూర్ లో పోలీసులు భారీగా మోహరించారు. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కాలువకు నీరు విడుదల చేయాలని ఆ ప్రాంత రైతులు ఆందోళన చేపట్టటంతో పోలీసులు భారీగా మోహరించారు.

తిరుమలలో అరుదైన దృశ్యం!!..

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో ఈ నెలలో ఓ అరుదైన దృశ్యం సాక్షాత్కారం కానుంది. ఒకే నెలలో స్వామివారు తనకు ఎంతో ఇష్టమైన గరుడ వాహనంపై రెండుసార్లు విహరించనున్నారు. ఈ నెల 16న గరుడ పంచమికాగా, ఆపై 26న శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీనివాసుడు తిరు మాడవీధుల్లో గరుడ వాహనంపై ఊరేగనున్నారు. గరుడ పంచమి నాడు సాయంత్రం 5 నుంచి 6.30 గంటల మధ్య, ఆపై శ్రావణ పౌర్ణమి నాడు రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య గరుడవాహన సేవను నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

09:19 - August 6, 2018

పాక్ జైళ్ల నుండి గుజరాత్ మత్స్యకారులు విడుదల..

పాకిస్థాన్ : పాకిస్థాన జైళ్ల నుండి గుజరాత్ కు చెందిన మత్స్యకారులను విడుదల చేస్తు భారత్ తో తాను సత్సంబంధాలనే కోరుకుంటున్నానన్న సంకేతాలను ప్రపంచానికి తెలిపేలా పాకిస్థాన్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారీతీయులను విడుదల చేస్తు నిర్ణయం తీసుకున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వీరు..తెలీకుండానే పాక్ జలాల్లోకి ప్రవేశించడంతో, పాక్ సైన్యం వీరిని అదుపులోకి తీసుకుని కరాచీ జైలుకు తరలించింది. ఆపై వీరిని లాహోర్ జైలుకు మార్చింది. వీరంతా దాదాపు రెండేళ్లుగా జైళ్లలో ఉన్నారు.

27మంది భారతీయ ఖైదీలను విడుదల చేసిన పాక్ ఇమ్రాన్ ఖాన్..

పాకిస్థాన్ : భారత్ తో సత్సంబంధాలనే కోరుకుంటున్నానన్న సంకేతాలను ప్రపంచానికి తెలిపేలా పాకిస్థాన్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న 27 మంది భారతీయులను విడుదల చేయాలని ఆయన నిర్ణయించారు. తన ప్రమాణ స్వీకారం జరిగిన మరుసటి రోజునే వారిని ఇండియాకు అప్పగించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఇమ్రాన్ ఆదేశించారు. ఈ విషయమై భారత అధికారులకు సమాచారం కూడా అందింది.

ముగ్గురు పిల్లలను నదిలో పడేవేసిన కసాయి తండ్రి..

చిత్తూరు : గంగాధర నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులను నీవీ నదిలో పడవేసిన కసాయి తండ్రి వైనం స్థానికంగా ఆగ్రహానికి గురిచేసింది. భార్యా భర్తల మధ్య తలెత్తిన వివాదం ముగ్గురు పిల్లల పాలిట శాపంగా మారింది. భార్యతో గొడవ పడిన వెంకటేశ్ అనే వ్యక్తి తమ ముగ్గురు పిల్లలను నీవానదిలో పడవేశారు. దీంతో వారు ముగ్గురు మృతి చెందారు. మృతులు పునీత్, సంజయ్, రాహుల్ గా గుర్తించారు. 

వెంటిలేటర్ పై కాంచన..

నెల్లూరు : కావలి విట్స్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని కాంచన పరిస్థితి విషమించింది. చెన్నైలోని కార్పొరేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై కాంచనకు చికిత్సనిందిస్తున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం కాలేజీలో కలుషిత నీరు త్రాగి అస్థతకు గురైన కాంచనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. కాంచన అనారోగ్యానికి గురైనా కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవటంతో కాంచన ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో చెన్నైలోని కార్పొరేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై కాంచనకు చికిత్సనిందిస్తున్నారు. 

ఇంటికి నిప్పంటించిన కుమారుడు..

వరంగల్ రూరల్ : దామోదర మండలం కంఠాత్మకూర్ లో దారుణం జరిగింది. తన ఇంటికి తానే నిప్పంటించి కుమారుడు వైనం స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. ఈ మంటల ధాటికి ఇంటిలో వున్న గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో తండ్రి కుమారస్వామి, తల్లి రాజమ్మ, కుమార్తె సుజాత వున్నారు. కుటుంబ సభ్యుల్లో వృద్ధుడు మామిడి లింగయ్య పరిస్థితి విషమంగా వుంది. సమాచారం అందుకున్న పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

మద్యం తాగి ఇద్దరు మృతి..

పశ్చిమగోదావరి : ఉండ్రాజవరం మండలం సత్యవాడలో విషాదం చోటు చేసుకుంది. మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరించారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా వుంది. వీరి తాగిన మద్యం కల్తీ అయిందనీ..అందుకే వారు అస్వస్థతకు గురయినట్లుగా అనుమానిస్తున్నారు.  

08:15 - August 6, 2018

వరంగల్ : అందరూ గాఢ నిద్రలో ఉన్నారు...ఒక్కసారిగా భారీ పేలుడు...ఏమి జరిగిందో తెలియరాలేదు...ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనం కాగా ఒకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ విషాదం చోటు చేసుకుందని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది కన్నకొడుకని తెలుస్తోంది. వలస వచ్చి వరంగలో ఓ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి వివాహం అప్పటికే అయినా మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇతనికి తండ్రి కుమార స్వామి, తల్లి రాజమ్మ, తాత మామిడి లింగయ్యలున్నారు. దామెర మండలంలో కంఠత్మాకూరుకు వచ్చిన అతను ఆదివారం అర్ధరాత్రి ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. గాఢ నిద్రలో ఉన్న వారు సజీవదహనమయ్యారు. మామిడి లింగయ్యకు మాత్రం 75శాతం కాలిన గాయాలయ్యాయి. చేసిన ఘోరాన్ని కుమార స్వామి తన బంధువులకు తెలియచేశాడు. అక్కడకు వచ్చే సరికి కుమార స్వామి, రాజమ్మ, సుజాతలు మృతి చెందగా వృద్ధుడు మామిడి లింగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

గ్యాస్ పేలి ముగ్గురు మృతి...

వరంగల్ : దామెర (మం) కంటాత్మకూరులో విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. 

07:33 - August 6, 2018

నగరంలో మహిళలపై యువకుడు పెప్పర్ స్ప్రే దాడి ?

హైదరాబాద్ : మహిళలపై ఓ యువకుడు పెప్పర్ స్ప్రేతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పాతాబస్తీ కాలాపత్తర్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు, ఆరుగురు మహిళలకు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. యువకుడిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఢిల్లీకి ఉత్తరాంధ్ర మంత్రులు...

ఢిల్లీ : నేడు ఉత్తరాంధ్ర మంత్రులు, 12 మంది ఎమ్మెల్యేలు హస్తినకు వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలువనున్నారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని వారు కోరనున్నారు. 

నేటి నుండి రైతు బీమా పత్రాల పంపిణీ...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి రైతు బీమా పత్రాల పంపిణీ కార్యక్రమం జరుగనుంది. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. 

ఇండోనేషియాలో భూకంపం...82 మంది మృతి...

ఢిల్లీ : ఇండోనేషియాలో సంభవించిన భూకంపం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల సంఖ్య 82కి చేరింది. 100 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

 

గ్రనైడ్ విసిరిన ఘటనలో ఒకరి అరెస్టు...

జమ్మూ : గాంధీనగర్ ప్రాంతంలో గ్రనైడ్ విసిరిన ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. గత రాత్రి జరిగిన ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

06:37 - August 6, 2018

ఈనెల 12నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు దశల వారీగా ఆందోళన బాట పట్టనున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ర్టం తీసుకుంటున్న విద్యా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ.. కేంద్రం అనుసరిస్తున్న సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఈ కార్యక్రమం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. వారి ఆందోళనకు గల కారణాలు, పాలకులు అనుసరిస్తున్న విధి విధానాలపై టెన్ టివి జనపథంలో UTF తెలంగాణ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి చావా రవి విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:34 - August 6, 2018

తూర్పుగోదావరి : అది గోదావరి గలగలలతో అలారారే ప్రాంతం.. చుట్టూ ఎటు చూసినా నీళ్లే.. కానీ తాగడానికి గుక్కెడు నీరు కూడా పనికిరాని పరిస్థితి. పుష్కలంగా గోదావరి పారుతున్నా.. నీటి యుద్ధాలు తప్పడంలేదంటే.. ఒకింత ఆశ్చర్యమేసినా అది పచ్చి నిజం. రాజమహేంద్రవరంలో నెలకొన్న నీటి కష్టాలపై 10టీవీ కథనం.. అఖండ గోదావరికి కేరాఫ్‌ అడ్రస్‌ వంటిది రాజమహేంద్రవరం. అక్కడ కూడా నీటి కష్టాలు తప్పడం లేదు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది వాస్తవం. ఎన్ని ప్రణాళికలు వేసినా, కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా.. మారు మూల ప్రాంతాల్లో నీటి కష్టాలు తీరడంలేదు. నీటి యుద్ధాలు ఆగడంలేదు.

రాజీవ్ స్వగృహ వంటి నగర శివారు ప్రాంతాల్లో వాటర్‌ ట్యాంక్ వస్తే చాలు.. పోరాటానికి నడుం బిగించాల్సిందే. గుక్కెడు నీళ్ల కోసం గుండెలవిసేలా, గొంతు ఎండేలా అరవాల్సిందే. రెండు రోజులకోసారి వచ్చే వాటర్‌ ట్యాంకర్‌ కోసం పడిగాపులు కాసి.. పట్టుకున్నా.. అవి తాగేందుకు పనికిరావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో ఎటు చూసినా కలుషిత నీరే. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నా.. పాలకుల్లో చలనం లేదు. మున్సిపల్ అధికారుల అలసత్వంతో నీరంతా బురదమయమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు. కలుషిత నీటితో అనారోగ్యాల పాలవుతున్నామని రాజీవ్ స్వగృహలోని ప్రజానీకం ఆవేదన చెందుతున్నారు. నీరొస్తే చాలని ఎదురు చూస్తున్న జనానికి.. వాటర్‌ ట్యాంకులో వస్తున్న బురదనీరు చూసి ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతున్నారు.

వైకేసీ కాలేజీ రోడ్, తిలక్ రోడ్‌, ఏవీ అప్పారావు రోడ్, క్రిష్ణానగర్, లలితానగర్, క్వారీ రోడ్, సుభాష్ నగర్, కోటి లింగాలపేట, సీతంపేట, కోర్లంపేట, జాంపేటతోపాటు నగరంలో ఏ మూల చూసినా బురద నీరే వస్తోంది. పాలకుల నిర్లక్ష్యం వల్లే తాము రోగాల బారిన పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. చిన్నా పెద్దా తేడాలేకుండా.. డయేరియా, కడుపునొప్పితో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముక్కు పిండి పన్నులు వసూలు చేసే కార్పొరేషన్ అధికారులు.. మంచి నీటిని ఎందుకు అందించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.

ఆరు లక్షలకుపైగా జనాభా ఉన్న రాజమహేంద్రవరంలో.. అందుకు తగ్గట్టు మౌళిక వసతులు మాత్రం లేవు. దీనికి తోడు.. మురుగునీటి వ్యవస్థ అస్తవ్యవస్తంగా ఉంది. గడిచిన మూడేళ్లలో పలు అభివృద్ధి పనులకు 400 కోట్లకు పైగా ఖర్చుచేస్తే... అందులో సింహభాగం తాగు నీటి పైప్‌ లైన్ల కోసమే వ్యయం చేశారు. పాత పైపులైన్లు లీకవుతుండడంతో కొత్తవి వేశారు. నాసిరకపు పనుల వల్ల కొత్త పైపులైన్లు అప్పుడే పగిలిపోయాయి. వాటికి మరమ్మత్తులు చేస్తున్న క్రమంలోనే తాగునీరు కలుషితం అవుతోంది.

నగరవాసులకు నీటికష్టాలు తగ్గించేందుకు కార్పొరేషన్ చేసిన ప్రయత్నాలు కేవలం కంటి తుడుపు చర్యగా ఉందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. మూడు రిజర్వాయర్లు కట్టి 50 వార్డులకు 45ఎంఎల్డీ నీటిని అందిస్తున్నా చాలడంలేదు. దీనికి తోడు నీటిని సరిగా ప్యూరిఫికేషన్ చేయకపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. నిండు గోదావరి చెంతనే ఉన్నా గుక్కెడు నీటికి జనం అర్రులు చాస్తున్న దుస్థితి నెలకొంది. నగరంలో అసలు నీరే దొరక్క కొందరు ఇబ్బంది పడుతుంటే.. నీరు దొరికినా తాగలేని అవస్థ మరికొందరిది. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు నిర్లక్ష్యం వీడాలని ప్రజానీకం కోరుతున్నారు. 

06:29 - August 6, 2018

విజయవాడ : ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. నిరుద్యోగ భృతి ప్రకటనతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోతే... వైసీపీ విద్యార్థి నేతలు మాత్రం విశాఖలో ఆందోళనకు దిగారు. ఎన్నికల వేళ చంద్రబాబు మరోమోసానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. కొద్దిమందికి నిరుద్యోగ భృతి ఇవ్వడంకాదు... రాష్ట్రంలోని కోటిమంది నిరుద్యోగులకూ భృతి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతిపై నిరుద్యోగుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంతమంది ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. విశాఖలో టీడీపీ శ్రేణులయితే సంబరాలు జరుపుకున్నాయి. కేక్‌ కట్‌చేసి హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోని 12 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్టు సంతోషం వ్యక్తం చేశాయి. అంతేకాదు.. కొత్త కంపెనీలను ఏర్పాటుచేసి యువతకు చంద్రబాబు ఉద్యోగాలు కల్పిస్తున్నారని అన్నారు.

మరోవైపు చంద్రబాబు ప్రకటించిన నిరుద్యోగ భృతిపై వైసీసీ విద్యార్ధి నేతలు మండిపడుతున్నారు..నిరుద్యోగ భృతి డిగ్రీ, పాలిటెక్నిక్ చదివిన నిరుద్యోగులకు మాత్రమే ఇస్తానని చెప్పడాన్ని వారు తప్పు పడుతున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ భృతి ఇవ్వాలని కోరుతున్నారు. గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు నాలుగేళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి యువతను మోసం చేయడానికే నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారని వారు మండిపడుతున్నారు. అయితే ఎన్నికల ముందు రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చేప్పి.. ఇప్పుడు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పడాన్ని వైసీపీ విద్యార్థినేతలు తప్పుపడుతున్నారు. రాష్ట్రంలోని కోటిమంది నిరుద్యోగులందరికీ రెండువేల చొప్పున భృతి ఇవ్వాలని లేదంటే... ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.

06:27 - August 6, 2018

పెద్దపల్లి : జిల్లా రామగుండం మున్సిపాలిటీలో అవిశ్వాసం ముగియడంతో నేతల మధ్య మాటలయద్ధం మొదలైంది. నాలుగేళ్లుగా ప్రజాభివృద్ధిని పట్టించుకోని నేతలు ఒకరిపై ఒకరు అవినీతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ మేయర్‌ లక్ష్మీనారాయణ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇరువురూ బహిరంగంగా పరస్పర ఆరోపణలకు దిగుతూ పార్టీ పరువునూ రచ్చకీడుస్తున్నారు. పార్టీ వ్యతిరేకులను బయటకు పంపిస్తున్నానని ఎమ్మెల్యే చెపుతోంటే... ఎమ్మెల్యే ఓటమి కోసమే పనిచేస్తానంటూ లక్ష్మీ నారాయణ సవాల్‌ చేయడం కారును కుదిపేస్తోంది.

అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం రాజకీయాల్లో సాధారణంగా జరుగుతుంది. కానీ ఒకేపార్టీకి చెందిన ఇద్దరు నేతలు బహిరంగంగా విమర్శిలకు దిగడం అరుదుగానే కనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఈ మధ్యే రామగుండం మేయర్‌ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్‌ను స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అవిశ్వాసఅస్త్రం ఉపయోగించి పదవీచ్యుతులను చేశారు. దీంతో లక్ష్మినారాయణ, సోమారపు సత్యనారాయణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలకు దిగారు. అవినీతిపై ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.

రామగుండం నగర పాలక సంస్థ అభివృద్ధికాకుండా లక్ష్మీనారాయణ అడ్డుకున్నారని ఎమ్మెల్యే సోమారపు ఆరోపిస్తున్నారు. నగరపాలక సంస్థ అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని... మేయర్‌గా కొనసాగిన లక్ష్మీనారాయణ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్నది ఆయన ప్రధాన ఆరోపణ. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లక్ష్మీనారాయణను పార్టీకి ఆహ్వానించి మేయర్‌ను చేస్తే... కనీసం పార్టీజెండాను కూడా గౌరవించకపోవడం బాధేస్తోందని అన్నారు. అభివృద్ధి కుంటుపడుతుండడంతోనే మేయర్‌ను పదవి నుంచి తొలగించామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పేరు ఎత్తితేనే లక్ష్మీనారాయణ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యేనే పెద్ద అవినీతిపరుడని ఆయన ఆరోపిస్తున్నారు. మేయర్‌ పదవి తనకు ఇవ్వడానికి పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టించారని విమర్శించారు. తాను టీఆర్‌ఎస్‌ను వీడేది లేదంటూనే... సోమారపు మళ్లీ ఎమ్మెల్యే టికెట్‌ రాకుండా చేస్తానని... ఒకవేళ వచ్చినా ఆయన ఓటమి కోసమే పనిచేస్తానని సవాల్‌ విసిరారు.

ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడంతో టీఆర్‌ఎస్‌ పరువు రచ్చెకెక్కింది. ఒకరిగుట్టు ఒకరు బయటపెట్టుకుంటుండడంతో పార్టీ కార్యకర్తలు ఈ సమస్య ఎటుదారితీస్తుందోన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం దృష్టిసారించి సమస్య పరిష్కరించకపోతే... పార్టీకి నష్టం కలుగుతుందని చెప్తున్నారు.

కేరళకు రాష్ట్రపతి...

ఢిల్లీ : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సోమ, మంగళవారాల్లో కేరళలో పర్యటించనున్నారు. ఈనెల 6న తిరువనంతపురంలో ప్రజాస్వామ్య వేదిక.. ఫెస్టివల్‌ ఆఫ్‌ డెమోక్రసీని ఆయన ప్రారంభిస్తారు. కేరళ శాసనసభ వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. ఆగస్టు 7న త్రిసూర్‌లోని సెయింట్‌ థామస్‌ కాలేజీ శతాబ్ది ఉత్సాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. 

ఆర్టికల్ 35-ఎ కొనసాగించాలా ? వద్దా ?

ఢిల్లీ : ఆర్టికల్ 35-ఎ కొనసాగింపుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. రెండు రోజులుగా న్యాయవాదులు నిరవధిక బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

లాల్ దర్వాజ అమ్మవారి అంబారీ ఊరేగింపు...

హైదరాబాద్ : లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు కొనసాగుతున్నారు. చివరి రోజు సోమవారం అమ్మవారి అంబారీ ఊరేగింపు జరుగనుంది.   సాయంత్రం 4గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 

రాజ్ నాథ్ తో భేటీ కానున్న కేసీఆర్...

ఢిల్లీ : కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. హైకోర్టు విభజన, అసెంబ్లీ సీట్ల పెంపు, తదితర అంశాలపై చర్చించనున్నారు. 

ఇండోనేషియాలో భూకంపం...

ఢిల్లీ : ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. లాంబాక్ దీవుల్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ పై 7గా నమోదు చేసింది. పలు చోట్ల భవనాలు కూలిపోవడంతో 19 మంది మృతి చెందారు. 

కల్వకుర్తిలో రోడ్డు ప్రమాదం...

నాగర్ కర్నూలు : కల్వకుర్తి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. బల్మూరు గట్టుతుమ్మెన గ్రామానికి చెందిన యాదమ్మ (35), కూతురు యామిని (2) గా గుర్తించారు. 

జగన్ 230వ రోజు...

తూర్పుగోదావరి : జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. 230వ రోజు ప్రత్తిపాడు నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతోంది. నేడు శంఖవరం మండలంలోని నెల్లిపూడి నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. 

Don't Miss