Activities calendar

07 August 2018

20:39 - August 7, 2018

డీఎంకే అధినేత, మాజీ సీఎం, సినీరంగం ఇలా ఏది చూసినా కరుణానిధి ముద్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది. సినిమా రచయితగా ప్రారంభించారు కరుణానిధి, 14 ఏళ్ల వయసులోనే కరుణ రాజకీయపరంగా యాక్టివ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అలగిరిస్వామి స్ఫూర్తితో ఆయన స్థానికంగా ఓ యూత్ సొసైటీని స్థాపించారు. ఆ తర్వాత 'తమిళనాడు తమిళ్ మనవర్ మండ్రమ్' అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ను స్థాపించారు. దీంతోపాటు, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. కళ్లకూడి టౌన్ పేరును దాల్మియాపురంగా మార్చడంపై జరిగిన పోరాటంలో డీఎంకే తరపున ఆయన పోరాడారు. అనంతరం... 33 ఏళ్ల వయసులో 1957లో డీఎంకే తరపున ఆయన తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1961లో డీఎంకే కోశాధికారిగా, 1962లో ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ గా బాధ్యతలను నెరవేర్చారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 1969లో అన్నాదురై చనిపోయిన తర్వాత కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. డీఎంకే తొలి అధినేత కరుణానిధే కావడం గమనార్హం. పెరియార్ మీద ఉన్న గౌరవంతో అన్నాదురై ఉన్నంత కాలం అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది. అన్నాదురై పార్టీ జనరల్ సెక్రటరీగానే ఉండేవారు. చలనచిత్ర పరిశ్రమ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన తొలి వ్యక్తి కరుణానిధి..మరి కరుణానిధి గురించి మరింతగా ప్రముఖ విశ్లేషకులు నడింపల్లి సీతారామ రాజు విశ్లేషణలో తెలుసుకుందాం..

కరుణతో ఫోటో దిగా..అదే చివరిసారనుకోలేదు : ఖుష్బూ

తమిళనాడు : మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ నటి ఖుష్భూ స్పందిస్తూ, నెల క్రితమే కరుణానిధితో కలిసి ఓ ఫొటో దిగానని, కరుణానిధి గొప్ప నాయకుడనీ..గొప్ప నాయకుడైన ఆయన్ని కలవడం అదే చివరిసారి అవుతుందని అనుకోలేదని తన ట్వీట్ లో చెప్పింది. ‘అప్పా, మేమ మిమ్మల్ని మిస్సవుతున్నాం’ అని ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేసారు.

కరుణ మృతికి హన్సిక సంతాపం..

తమిళనాడు : మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి హన్సిక స్పందిస్తూ, కరుణానిధి మరణ వార్తను జీర్ణించుకునే ధైర్యం ఆయన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, యావత్తు తమిళప్రజలకు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని నటి హన్సిక తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది.

 

కరుణ మృతి 'బ్లాక్ డే'దీన్ని మరచిపోను : రజనీకాంత్

తమిళనాడు : మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. కరుణానిధి మృతి చెందిన ఈరోజును ‘బ్లాక్ డే’ గా ఆయన అభివర్ణించారు. ఈ బ్లాక్ డేను తాను ఎప్పుడూ మర్చిపోలేనని, కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఇంకా, కరుణానిధితో తమకు ఉన్న అనుబంధాన్ని పలువురు నటులు గుర్తుచేసుకున్నారు. తమిళుల కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి అని, ఆయన్ని మిస్సయ్యాం కానీ, ఆయన సంక్పలం మాత్రం ఎప్పుడూ సజీవంగానే ఉంటుందని ప్రముఖ నటి రాధికి అన్నారు.

కరుణ మృతి..ఔట్ గోయింగ్ కట్..

తమిళనాడు : కరుణానిధి మరణవార్త అనంతరం తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. కర్ణాటక నుంచి తమిళనాడు వెళ్లే కేఎస్ఆర్టీసీ బస్సులను ప్రభుత్వం రద్దు చేసింది. అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కర్ణాటక జిల్లాల ఎస్పీలను సీఎం కుమారస్వామి ప్రభుత్వం ఆదేశించింది. కాగా, తమిళనాడులో రేపు, ఎల్లుండి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ రద్దు చేశారు. ఈరోజు, రేపు తమిళనాడులో సినిమాల ప్రదర్శనలు నిలిపివేశారు. తమిళనాడు వ్యాప్తంగా ఫోన్ ఔట్ గోయింగ్ కాల్స్ నిలిపివేసినట్టు సమాచారం.

రాజకీయ చైతన్యం కలిగించిన వ్యక్తి కరుణ : కేసీఆర్

హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై తెళ:ఘౄన సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించిన వ్యక్తి కరుణానిధి అని, దేశ రాజకీయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ అన్నారు. కాగా, రేపు కరుణానిధి అంత్యక్రియల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. కాగా, కరుణానిధి మృతికి ఏపీ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా తమ సంతాపం తెలిపారు.

దేశం రాజకీయ యోధుడిని కోల్పోయింది : చంద్రబాబు

అమరావతి : మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దేశం రాజకీయ యోధుడిని కోల్పోయిందని చంద్రబాబు అన్నారు. సాహిత్యం, సినీ, పత్రికా, రాజకీయ రంగాల్లో కరుణానిధి విశేష కృషి చేశారని కొనియాడారు. సేవాభావం, పాలనా అనుభవంతో ప్రజల గుండెల్లో కరుణానిధి నిలిచిపోయారని, నిరుపేదలు బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన పరితపించారని సీఎం చంద్రబాబు తన ప్రగాభ సానుభూతిని తెలిపారు. 

కరుణానిధి మృతికి ప్రధాని మోదీ సంతాపం..

తమిళనాడు : మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలు కరుణానిధి కుటుంబం చుట్టూ, ఆయనకు అభిమానుల చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. భారత దేశం .. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం ఆయన్ని కోల్పోయిందని, కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, కరుణానిధి మరణవార్త తెలియగానే డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానలు విషాదంలో మునిగిపోయారు. తమిళనాడులో పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

19:27 - August 7, 2018

గత 11 రోజులుగా మృత్యువుతో పోరాడి అలసిపోయిన డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం కరుణానిధి కావేరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటు మృతి చెందారు. దేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక పార్టీకి 50 ఏళ్లు అధ్యక్షుడిగా వున్న కరుణానిధి నాయకత్వంతో డీఎంకే ఎన్నో విజయాలను చవి చూసింది. తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి రాజకీయ మార్క్ అసాధారణమైనది. ఈ అంశంపై చర్చ, ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నగేశ్, టీఆర్ఎస్ నేత, ప్రభుత్వ చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి, వైసీపీ నేత రాజశేఖర్ పాల్గొన్నారు. 

19:04 - August 7, 2018

తమిళనాడు : డీఎంకే అధినేత కరుణానిధి తన 94 ఏళ కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. అనారోగ్యంతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, వయో భారం కారణంగా కరుణానిధి అవయవాలు చికిత్సకు స్పందించలేదు. ఆయన ఆరోగ్యం మెరుగు పరిచేందుకు వైద్యులు ఎంతగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కరుణ మృతి వార్తతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు చేరుకుంటున్నారు. ఇప్పటికే కరుణ ఆరోగ్యంపై ఆందోళనతో 21మంది అభిమానులు మృతి చెందారు. సోమవారం రాత్రి హఠాత్తుగా కరుణ ఆరోగ్యం క్షీణించటంతో కావేరీ ఆసుపత్రికి తరలించి అప్పటి నుండి చికిత్సనందిస్తునే వున్నా ఈరోజు ఉదయం నుండి మాత్రం చికిత్సకు కరుణ అవయవాలు ఏమాత్రం స్పందించటంలేదని వైద్యులు హెల్త్ బులిటెన్ లో ప్రకటించారు. ఈక్రమంలో సాయంత్రం 6:10 గంటలకు తుది శ్వాస విడిచినట్టు ప్రకటించాయి. కరుణ మరణవార్తతో తమిళులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన వయస్సు 94 ఏళ్లు. కరుణానిధి 1924 జూన్ 3న తంజావూరులోని తిరుక్కువలైలో జన్మించారు. అసలు పేరు దక్షిణామూర్తి. ఆయన పూర్వీకులు తెలుగువాళ్లు. ఆయనకు ఇద్దరు భార్యలు, నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఆయన చిన్నకుమారుడు స్టాలిన్ ప్రస్తుతం పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నారు.

కరుణ ప్రస్థానం..
ఎం.కెగా మరియు డా.కళైనార్గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. 1969లో సి.ఎన్.అన్నాదురై మరణించినప్పటినుండి నేటి వరకు, తమిళనాడులోని రాజకీయ పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు మరియు వ్యవస్థాపక సభ్యులలో ఒకడుగా కరుణ సేవలందించారు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కరుణ తన రాజకీయ జీవితంలో పోటీచేసిన ప్రతి ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు. 2004 లోక్ సభ ఎన్నికలలో తమిళనాడులోని అన్నీ స్థానాలు అంటే 40 లోక్ సభ స్థానాలలో యూపీఏను గెలిపించడంలో ప్రధానపాత్ర పోషించాడు. 

సినీ రాజకీయ జీవితంలో తిరుగులేని నాయకుడు కరుణ..
దక్షిణా మూర్తి పేరుతో వున్న కరుణ కరుణానిధిగా పేరుగాంచారు. ముత్తువేలర్, అంజుగం దంపతులకు జూన్ 3, 1924 న జన్మించాడు. తంజావూరులోని తిరుక్కువలైలో కరుణానిధి తమిళ నాయీబ్రాహ్మణ కులానికి చెందినవారు. మే 13, 2006 న జరిగిన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి నేతృత్వంలోని సంకీర్ణ పక్షాలు గెలిచి అధికారం చేజిక్కించుకున్నారు. తమిళ సాహిత్యంలో కరుణానిథి తనదైన ముద్రను వేసుకున్నాడు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు, సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. ధక్షిణ భారత చలన చిత్ర సీమ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి కరుణానిధి గారు. 1942లో మురసోలి అనే పత్రికను కూడా కరుణ ప్రారంభించారు. అటు సినిమా పరిశ్రమలోను, ఇటు రాజకీయ జీవితంలో కూడా కరుణానిధి తనదైన ముద్ర వేసుకుని కరుణ మార్క్ ను చూపించారు. 

మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి మృతి..

తమిళనాడు : డీఎంకే అధినేత కరుణానిధి తన 94 ఏట  మృతి చెందారు. అనారోగ్యంతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, వయో భారం కారణంగా కరుణానిధి అవయవాలు చికిత్సకు స్పందించలేదు. ఆయన ఆరోగ్యం మెరుగు పరిచేందుకు వైద్యులు ఎంతగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కరుణ మృతి వార్తతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు చేరుకుంటున్నారు.

18:44 - August 7, 2018
18:36 - August 7, 2018

నల్లగొండ : సాగు, తాగునీటి కోసం ప్రాజెక్టులు కడుతున్న ప్రభుత్వం ఆయా ప్రాంతాల రైతుల నుండి భూముల్ని సేకరించటం సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. ఇష్టమున్నా, లేకున్నా రైతులు భూములు ఇస్తున్నారు. ఇవ్వకుంటే ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి మరీ భూముల్ని స్వాధీనం చేసుకోవటం సాధారణంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లాలోని నిర్మించనున్న పెండ్లిపాకల ప్రాజెక్టు నిర్మాణానికి ఆ ప్రాంత రైతులు భూముల్ని ఇచ్చారు. కానీ ఇంతవరకూ వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో పెండ్లిపాకల ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన ఐదుగురు వ్యక్తులు నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద వున్న సెల్ టవర్ ఎక్కి తమకు కావాల్సింది హామీలు కాదనీ..నష్టపరిహారమనీ..తమకు ఎవరైతే హామీలిచ్చారో వారే స్వయంగా వచ్చి తమ సమస్యకు పరిష్కారం చూపాలని నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న భూ నిర్వాశితులకు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అయిన జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు.

నష్ట పరిహారం అందలేదని భూ నిర్వాశితుల నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్నవారంతా కొండమల్లేపల్లి మండలం చింతచెట్టు తండాకు చెందినవారుగా తెలుస్తోంది. గత రెండు సంవత్సరాల నుండి నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నా ఇప్పటి వరకూ తమకు ఒక్క సైసా కూడా ప్రభుత్వం నుండి అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నిర్వాశితుల్లో దాదాపు 550ఎకరాలకు చెందిన 250 మందికి పరిహారం అందాల్సివుంది. దీంతో గత రెండు సంవత్సరాల నుండి అధికారులు, ఎమ్మెల్యేల వద్దకు వారు తిరుగుతునే వున్నారు. ఇటీవల ఆ ప్రాంతానికి వచ్చిన మంత్రి హరీశ్ రావుకు తమ గోడును విన్నవించుకున్న నేపథ్యంలో హరీశ్ రావు ఒక్క నెలలో అందజేస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో భారీగా కలెక్టరేట్ కు చేరుకున్న భూ నిర్వాశితులు కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అధికారులను విజ్నప్తి చేసారు. అయినా వారు పట్టించుకోకపోవటంతో ఐదుగురు సెల్ టవర్ ఎక్కి సెల్ టవర్ ఎక్కి తమ డిమాండ్ వినిపిస్తున్నారు. 

17:30 - August 7, 2018
17:16 - August 7, 2018
17:08 - August 7, 2018

తమిళనాడు : డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి ఆరోగ్యం అంత్యం విషమంగా వున్నట్లుగా కావేరీ ఆసుపత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపారు. కరుణానిధి చికిత్సకు ఏమాత్రం స్పందించటంలేదని తెలిపారు. దీంతో ఆసుపత్రి వద్దకు అభిమానులు భారీగా చేరుకోవటంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కరుణానిధి ఆరోగ్యం విషయమంగా వుండటంతో ఈ విషయాన్ని సీఎం పళనిస్వామిని డీఎంకే నేత స్టాలిన్ కొద్ది సేపటి క్రితం కలిశారు. డీఎంకే అధినేత, తన తండ్రి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి పళనిస్వామికి స్టాలిన్ వివరించినట్టు సమాచారం. కాగా, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆరోగ్యం విషమంగానే ఉంది. దీంతో ఆసుపత్రి వద్దకు అభిమానులు భారీగా చేరుకోవటంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులంతా అప్రమత్తంగా వుండాలని డీజీపీ సూచించారు. 

అత్యంత విషమంగా కరుణానిధి ఆరోగ్యం..

తమిళనాడు : డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి ఆరోగ్యం అంత్యం విషమంగా వున్నట్లుగా కావేరీ ఆసుపత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపారు. కరుణానిధి చికిత్సకు ఏమాత్రం స్పందించటంలేదని తెలిపారు. దీంతో ఆసుపత్రి వద్దకు అభిమానులు భారీగా చేరుకోవటంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 

16:38 - August 7, 2018

బెంగళూరు : దేశంలో పలు ప్రాంతాలలో విధ్వంసానికి పాల్పడుతున్నారనే సమాచారంతో ఎన్ ఐఏ అధికారులు పలు కీలక ప్రాంతాలపై కన్ను వేశారు. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్ ఐఏ అధికారులు నేడు బెంగళూరులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో పలు కీలక పత్రాలతో పాటు కౌసర్ మున్నాను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సెల్ ఫోన్, పెన్ డ్రైవ్, ల్యాప్ టాప్ లను సీజ్ చేశారు. సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్ చేసే లింక్, ఫేస్ బుక్ ఫేక్ ఐడీ, లాగిన, పాస్ వర్డ్ లను అధికారులు గుర్తించారు. భారత్ లోని పలు ప్రాంతాలలోని పలు ప్రాంతాలలో విధ్వంసాలను కౌసర్ మున్నా కుట్ర పన్నినట్లుగా ఎన్ ఐఏ అధికారులు గుర్తించారు. కౌసర్ కు సహకరించిన మరో తీవ్రవాది ముస్లాఫిజర్ రెహ్మాన్ అనే వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దని అధికారులు కోర్టులో హాజరుపరిచారు. 

సీఎం పళనిస్వామిని కలిసిన స్టాలిన్..

తమిళనాడు : సీఎం పళనిస్వామిని డీఎంకే నేత స్టాలిన్ కొద్ది సేపటి క్రితం కలిశారు. డీఎంకే అధినేత, తన తండ్రి కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి పళనిస్వామికి స్టాలిన్ వివరించినట్టు సమాచారం. కాగా, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆరోగ్యం విషమంగానే ఉంది. కరుణ ఆరోగ్యం పై హెల్త్ బులెటిన్ కొంచెం సేపట్లో విడుదల కానుంది. ఇదిలా ఉండగా, కావేరి ఆసుపత్రి వద్దకు కరుణానిధి అభిమానులు, పార్టీ కార్యకర్తలు అధికి సంఖ్యలో చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.

16:17 - August 7, 2018

జమ్ముకశ్మీర్ : గురేజ్‌ సెక్టార్‌లో చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. చొరబాటుదారులను అడ్డుకునే సమయంలో ముష్కరులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ ఆర్మీ మేజర్‌తో పాటు ముగ్గురు సైనికులు అమరులయ్యారు. శ్రీనగర్‌కు 125 కి.మీ దూరంలో బందిపొరా జిల్లా గురెజ్‌ సెక్టార్‌లో ఎల్వోసి నుంచి ఎనిమిది మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. ఉగ్రవాదుల చొరబాటును గమనించిన భారత సైన్యం వారికి దీటుగా బదులిచ్చింది. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి అదనపు భద్రతా బలగాలు చేరుకున్నాయి. అమరులైన సైనికులను మేజర్‌ కేపీ రాణె, జామీ సింగ్‌, విక్రమ్‌జీత్‌, మణిదీప్‌లుగా గుర్తించారు.

16:15 - August 7, 2018

నల్లగొండ : మోటార్‌ వాహన యాక్ట్‌కు కేంద్రం తీసుకువస్తున్న సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ కార్మికులు ముక్త కంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు. సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛంధంగా బంద్‌ పాటిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. సరైన సమాచారం లేకపోవడంతో... బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

16:12 - August 7, 2018

ఢిల్లీ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో దేశ రాజధానిలో ఏపీ ఎన్ ఎస్ యూఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్‌లో జరిగిన ఆందోళనకు కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, ఏఐసీసీ కార్యదర్శి జేడీ శీలం మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేసిందని ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు భగత్‌ ఆరోపించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీ అందిస్తారు. 

16:07 - August 7, 2018

నిజామాబాద్ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి నిలువలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో ఆరున్నర టీఎంసీలను మిషన్‌ భగీరథకు కేటాయించగా 5 టీంఎసీల నీటిని డెడ్‌ స్టోరేజీగా పరిగణిస్తారు. మిగతా నీరు ఆవిరి రూపంలో వెళ్లిపోతుందని అధికారులు లెక్కలు వేశారు. మరో వైపు కాకతీయ కాలువ ద్వారా ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. 

16:04 - August 7, 2018

ఢిల్లీ : మినిమమ్‌ బ్యాలెన్స్‌ పేరుతో బ్యాంకులు కస్టమర్లను దోచేస్తున్నాయి. ఓపక్క జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు ఓపెన్‌ చేయమని ప్రధాని పిలుపునిస్తుంటే.. మరో వైపు కనీస నిలువల్లేవంటూ.. బ్యాంకులు జనాన్ని లూటీ చేస్తున్నాయి. ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వరంగ, ప్రైవేటు బ్యాంకులు... ప్రజల నుంచి ఐదువేల కోట్ల రూపాయలను ముక్కు పిండి వసూలు చేశాయి.

ఒక్క ఏడాదిలోనే రూ.5000 కోట్లు వసూలు
మినిమమ్‌ బ్యాలెన్స్‌ సాకుతో దోపిడి పర్వానికి తెగబడ్డాయి బ్యాంకులు. కేవలం ఒక్క ఏడాదిలోనే ఐదు వేల కోట్లు ప్రజల ముక్కు పిండి మరీ వసూలు చేశాయి. ఆ వివరాల్ని స్వయానా ఆర్థికశాఖ సహాయమంత్రి శివప్రతాప్‌శుక్లా లోక్‌సభలో వివరించారు. ఎస్‌బీఐ ఈ ఏడాది ఏడు నెలల్లోనే 1700 కోట్లు వసూలు చేసింది.

2017-18 ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ రూ. 2,433.87 కోట్ల వసూళ్ళు
ఎస్బీఐ జరిమానాలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లోఎస్బీఐ కాస్త దూకుడు తగ్గించినా.. జరిమానాలు మాత్రం ఆపలేదు.2017-18 ఆర్థిక సంవత్సరానికి 2,433.87 కోట్ల వసూళ్ళతో ఎస్‌బీఐ ముందుంది. హెచ్‌డీఎఫ్‌సీ 590.84 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ 530.12 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ 317.60 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 211 కోట్లు తమ ఖాతా దారుల నుంచి రాబట్టుకున్నాయి. ప్రధాని మోదీ పాతనోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకుల్లో ఇతర లావాదేవీలు స్తంభించాయి. దీంతో బ్యాంకులు తమ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఏకంగా ప్రజలనే బాదేశాయి. జన్‌ధన్‌ యోజన పథకం కింద జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్లకు ప్రధాని పిలుపునిస్తే.. బ్యాంకుల జరిమానాలేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మోడీ ప్రభుత్వం తనకేమీ తెలియదన్నట్టు మౌనంగా ఉండడంపై ప్రజలు మండిపడుతున్నారు. 

15:59 - August 7, 2018

మహబుబ్ నగర్ : జిల్లాలో దేవరకద్ర రాజకీయం రసకందాయంగా రుతోంది...పాలమూరు జిల్లాలో వయస్సులో చిన్నదైన.. విస్తీర్ణంలో పెద్దదైన దేవరకద్ర నుంచి గెలిచి... అసెంబ్లీలో అడుగుపెట్టాలని పలువురు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.. అధికార పార్టీ నుంచి మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేనే బరిలోకి దిగబోతుండగా.. కాంగ్రెస్ టిక్కెట్ ఎవరికనేది చర్చనీయాంశంగా మారింది...

ఒక్కప్పుడు టీడీపీ కంచుకోటగా దేవరకద్ర
2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడింది దేవరకద్ర నియోజకవర్గం. ఒకప్పుడు టీడీపీకి ఈ నియోజకవర్గం కంచుకోట. అయితే నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యేగా టీడీపీ నేత సీతా దయాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011 కు ముందు భూత్పూర్ జడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ నుంచి ఎన్నికైన ఆల వెంకటేశ్వర్ రెడ్డి... ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం సమయంలో జడ్పీటీసీ పదవీకి, టీడీపీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు. పార్టీ బలోపేతంలో కీలకంగా వ్యవహారించిన వెంకటేశ్వర్ రెడ్డికి 2014 ఎన్నికలలో దేవరకద్ర నుంచి అవకాశమిచ్చారు గులాబీబాస్. యువకుడు ,విద్యావంతుడు కావడంతో ఎమ్మెల్యేగా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు వెంకటేశ్వర్ రెడ్డి. దీనికి తోడు ప్రతిష్టాత్మక పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రీ -డిజైన్ లో భాగంగా దేవరకద్ర పనులు ప్రారంభం కావడం, ఇది పూర్తయితే నియోజకవర్గమంతా సస్యశ్యమలమయ్యే అవకాశం ఉండటం తనకు ప్లస్ పాయింట్ అనే భావనతో ఉన్నారు.

మళ్లీ తనదే విజయమనే ధీమాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే
దేవరకద్రలో తనకు తిరుగులేదని టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ధీమాతో వుంటే కాంగ్రెస్ టికెట్ ఎవరికనే ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతుంది.ఇప్పటికే పలువురు నేతలు టికెట్ తమకేనని ప్రచారం చేసుకుంటుంటే ...టీడిపి నుంచి ముఖ్యనేతల్ని పార్టీలో చేర్చుకుని దేవరకద్ర బరిలో దించాలనే వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలున్నారని సమాచారం. దేవరకద్ర నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా డోకూర్ పవన్ కుమార్ రెడ్డి పోటీచేశారు.ఎన్నికల తరువాత కూడా ప్రజలతో టచ్ లో వుంటున్నారు.దీంతో వచ్చే ఎన్నికలలో కూడా టికెట్ తనకే వస్తుందని నమ్మకం పెట్టుకున్నారు డోకూర్ పవన్ కుమార్ రెడ్డి. అయితే గతంలో జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ తాను కూడా రేసులో ఉన్నాననే సంకేతాలిస్తున్నారు.ఈ మధ్యకాలంలో ప్రతి మండలంలో వున్న కార్యకర్తలతో సమావేశం కావడంతో పాటు బీసీవాదంతో బలంగా ముందుకుపోతున్నారు. అదే విధంగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలలో రెడ్డి సామాజికవర్గంకు చెందిన వారు ఎమ్మెల్యేలుగా,నియోజకవర్గం ఇంచార్జీగా ఉన్నారు కనుక బీసీలకే దేవరకద్ర టిక్కెట్ వస్తుందని కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ తన అనుచరులతో కలిసి నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తుకుంటున్నారు.

కాంగ్రెస్‌ నుంచి పోటీలో మధుసూదన్‌ రెడ్డి
మరోవైపు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న హైకోర్టు న్యాయవాది మధుసూధన్ రెడ్డి నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. టికెట్ పై హామీ ఇస్తే కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్నారు. అయితే దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరతారనీ,సీతా దయాకర్ రెడ్డి బరిలో నిలిచే అవకాశం వుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే దయాకర్ రెడ్డి దంపతులతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే టికెట్ విషయంలో మాత్రం ఎటువంటి హామీ రాకపోవడంతో పార్టీలో చేరికలో జాప్యం జరుగుతోందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

దయాకర్‌రెడ్డి దంపతుల చేరికపై కొరవడిన స్పష్టత
దయాకర్ రెడ్డి దంపతులు చేరిక పైనే క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ లో మరో సీనియర్ నేత టీడీపీని వీడి పార్టీలోకి రానున్నారని ప్రచారం మొదలైంది.రావుల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి దేవరకద్ర నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు బలంగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి ... పార్టీలోకి రావాలని రావులని ఆహ్వానించటం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. అయితే దయాకర్ రెడ్డి దంపతులు ,రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీ మారతారో లేదో ఇంత వరకు ఏలాంటి సమాచారం లేదు. మరో వైపు ఆ నేతలు టీడీపీ కార్యక్రమాలతో నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు.టీడీపీ నుంచి నేతల చేరికల పై లైన్ క్లియర్ కాలేదు. వస్తేగానీ దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్ది పై కేడర్ కి క్లారీటీ వచ్చేలా లేదు.

15:56 - August 7, 2018

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ నేతలందరూ ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాలని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు డిమాండ్‌ చేస్తున్నారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన డబ్బులను అకౌంట్‌లో వేసి తిరిగి తీసుకోవడంపై ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.ఈ నేపథ్యంలో ఈరోజు కేంద్ర రైల్వే మంత్రిని టీడీపీ ఎంపీలు కలవనున్నారు. విశాఖ రైల్వే జోన్‌ కోరుతూ కేంద్ర మంత్రి పియూశ్‌ గోయల్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులపై ఆర్థిక శాఖ కార్యదర్శిని కలవనున్నామని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. 

15:52 - August 7, 2018

ప్రకాశం : చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు సీఎం చంద్రబాబు. చదువు అనేది నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని... తాను అనుదినం విద్యార్థిగానే ఉంటానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. జిల్లాలోని పామూరు మండలం దూబగుంటలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

అబూ సలేం కు పెరోల్ తిరస్కరణ..

ఢిల్లీ : అబూ సలేం కు పెరోల్ అభ్యర్ధనను బాంబే బాంబే హైకోర్టు తిరస్కరించింది. వివాహం కోసం 45 రోజుల పాటు పెరోల్ కోరుతూ పిటీషన్ వేయగా..1993లో వరస పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న అబూసలేంకు బాంబే హైకోర్టుకు పెరోల్ ను తిరస్కరించింది. కాగా ఇరవై నాలుగేళ్ల కిందటి 1993లో ముంబయి బాంబు పేలుళ్ల కేసులో టాడా కోర్టు మరో ఆరుగురిని దోషులుగా నిర్ధారించింది. ఈ పేలుళ్లలో 257 మంది దుర్మరణం పాలవ్వగా..713 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. 

భార్యను రుచిగా వండమనటం హింసలోకి రాదు : హైకోర్టు

మహారాష్ట్ర : కట్టుకున్న భార్యను రుచిగా వంట చేయాలని, ఇంటి పనులు చేసుకోవాలని కోరడం తప్పేమీ కాదని అలా అడిగినంత మాత్రాన భార్యను హింసించినట్టు కాదని హైకోర్టు కీలక బాంబే హైకోర్టు కీలక రూలింగ్ పాస్ చేసింది. 17 సంవత్సరాల నాటి ఓ మహిళ ఆత్మహత్య కేసులో భర్త విజయ్ షిండే, ఆయన తల్లిదండ్రులకు కింది కోర్టు విధించిన శిక్షను నిలిపివేస్తూ, ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో తనను హింసిస్తున్నారని, భర్తకు వివాహేతర బంధం ఉందని ఆరోపిస్తూ, ఓ మహిళ విషం తాగి ఆత్మహత్య చేసుకోగా, కేసు విచారణ హైకోర్టుకు చేరింది.

వ్యభిచారంలో కొత్త ట్రెండ్!!..

సిద్ధిపేట : జరుగుతున్న వ్యభిచార దందాలో ఇదో నయా ట్రెండ్. ఇళ్లను అద్దెకు తీసుని వ్యభిచారదందా సాగిస్తున్న నిర్వాహకులు అమ్మాయిని, విటుడిని బయటే కలిసేలా చూసి, భార్యాభర్తలుగా, చుట్టాలుగా కలరిచ్చి, ఇంట్లోకి పంపుతున్నారు. కొందరు పెద్దమనుషులు బ్రోకర్లుగా మారి ఈ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అధికంగా అద్దెలు చెల్లించి, కొన్ని ఇళ్లను తీసుకున్న బ్రోకర్లు, అక్కడ ఓ కుటుంబాన్ని ఉంచి, ఆపై తమ దందాలను సాగిస్తున్నారు. ఆ ఇంట్లోని వారు భార్యా భర్తలుగా జీవిస్తూ, ఇంటికి వచ్చి వెళ్లే వారికి కాపలాగా ఉంటారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తాం : విజయసాయి

ఢిల్లీ : ఈ నెల 9న జరగనున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వకపోవడం, విభజన హామీలను నెరవేర్చకపోవడం వల్ల తాము బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వలేమంటూ పార్లమెంటులో కూడా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని తెలిపారు. గత నాలుగున్నరేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ పోరాడుతోందని... హోదాను ఇవ్వలేమంటూ కేంద్ర స్పష్టం చేసిన నేపథ్యంలో, ఆ పార్టీకి వ్యతిరేకంగా తాము ఓటు వేస్తామని చెప్పారు.

13:48 - August 7, 2018

పశ్చిమ గోదావరి : కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టం చేయాలని కోరుతూ రేపు రాజమండ్రి నుండి కొవ్వూరు వరకు వారధిపై కవాతు చేపట్టనున్నట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ చెప్పారు.  ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదం తెలపాలని కోరారు. రాపూరు ఘటనకు ఎస్ఐ ప్రవర్తనే కారణమంటున్న కారెం శివాజీతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:45 - August 7, 2018

నెల్లూరు : జిల్లా రావూరు పోలీస్‌ స్టేషన్‌ దాడి ఘటన ఎస్‌ఐ దురుసు ప్రవర్తన వల్లే జరిగిందని, ఎస్‌ఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు ఏపీ సీపీఎం రాష్ర్ట కార్యదర్శి మధు. రావూరు హరిజనవాడలో పర్యటించిన మధు అక్కడి స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన దళితులను 15 రోజుల్లోగా విడుదలచేయకుంటే అన్ని దళిత, ప్రజాసంఘాలను కలుపుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామంటున్న మధుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

బాగా చదువుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు : సీఎం చంద్రబాబు

ప్రకాశం :  దూబగుంటలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. బాగా చదువుకుంటే ప్రపంచాన్ని జయింవచ్చన్నారు. చదువు మన జీవితాలనే మార్చుతుందని తెలిపారు. ఎక్కువ మంది యువకులున్న దేశం భారతదేశం అన్నారు. ప్రపంచ ఐటీ కంపెనీలను హైదరాబాద్ కు తీసుకొచ్చామని తెలిపారు. 30 ఇంజనీరింగ్ కాలేజీలను 9 ఏళ్లలో 300 కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. విభజన జరిగిన తర్వాత అన్ని హైదరాబాద్ కు వెళ్లాయన్నారు. హైదరాబాద్, చెన్నె, బెంగళూరు కంటే మిన్నగా అమరావతి రాజధాని వస్తుందన్నారు.

దూబగుంటలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

ప్రకాశం : కాంగ్రెస్ హయాంలో దయ్యాలు పెన్షన్స్ తీసుకున్నాయని సీఎం చంద్రబాబు విమర్శించారు. తమ పాలనలో అర్హులకు పెన్షన్స్ అందుతున్నాయని తెలిపారు. రేషన్, పెన్షన్, బీమా పథకాలకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు పరుస్తున్నామని తెలిపారు. దూబగుంటలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ కేంద్రం అరకొర డబ్బులు ఇచ్చిందన్నారు. కేంద్రం నుంచి 11 జాతీయ విద్యా సంస్థలు రావాల్సివుందన్నారు. మన యూనివర్సిటీలు పాత పద్ధతిలో నడుస్తున్నాయని..వాటికి కొత్త రూపం తీసుకోవాలని చెప్పారు. టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

13:41 - August 7, 2018

హైదరాబాద్ : తెలంగాణలో చేనేత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుందని..వారికి అండగా ఉంటామని చెప్పారు. ప్రతి పైసా నేతన్నల కోసం ఖర్చు పెడుతున్నామని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేనేతకు ప్రాధాన్యత ఇవ్వలేదని..కానీ ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రంలో 17500 మగ్గాలు..వాటికి అనుబంధంగా 22500 మగ్గాలు ఉన్నాయన్నారు. 50 శాతం సబ్సిడీ మీద నూలు, రసాయనాలు, అద్దకాలు చేనేత కారులకు ఇస్తామని చెప్పారు. చేనేత కారులకు కోసం చేనేత మిత్ర పథకం ప్రవేశపెట్టామని చెప్పారు. 18683 మంది నమోదు చేసుకున్నారని.. 20 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించామని తెలిపారు. వారి అకౌంట్లకు డైరెక్ట్ గా డబ్బులు చేరుతాయన్నారు. నమోదు ప్రక్రియకు కాలపరిమితి లేదని..అందరూ చేరాలన్నారు. నేతన్నకు చేయూత పేరుతో మరో పథకం తీసుకొచ్చామని తలెఇపారు. ఈ పథకం కింద 19,125 మంది చేనేత కార్మికులు నమోదు చేసుకున్నారు. ఈ పథకం కింద 60 కోట్ల రూపాయలను ఇస్తున్నామని చెప్పారు. 12 వేల చేనేత కళాకారుల కుటుంబాలకు 2010 నుంచి ఇప్పటివరకు ఉన్న40 కోట్ల బకాయిలను చేనేత రుణాలను మాఫీ చేశామన్నారు.

13:32 - August 7, 2018

ప్రకాశం : కాంగ్రెస్ హయాంలో దయ్యాలు పెన్షన్స్ తీసుకున్నాయని సీఎం చంద్రబాబు విమర్శించారు. తమ పాలనలో అర్హులకు పెన్షన్స్ అందుతున్నాయని తెలిపారు. రేషన్, పెన్షన్, బీమా పథకాలకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు పరుస్తున్నామని తెలిపారు. దూబగుంటలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ కేంద్రం అరకొర డబ్బులు ఇచ్చిందన్నారు. కేంద్రం నుంచి 11 జాతీయ విద్యా సంస్థలు రావాల్సివుందన్నారు. మన యూనివర్సిటీలు పాత పద్ధతిలో నడుస్తున్నాయని..వాటికి కొత్త రూపం తీసుకోవాలని చెప్పారు. టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేషన్, ప్రజల జీవితాల్లో మార్పులు వస్తున్నాయని తెలిపారు.
చదువు జీవితాలనే మార్చుతుంది..
బాగా చదువుకుంటే ప్రపంచాన్ని జయింవచ్చన్నారు. చదువు మన జీవితాలనే మార్చుతుందని తెలిపారు. ఎక్కువ మంది యువకులున్న దేశం భారతదేశం అన్నారు. ప్రపంచ ఐటీ కంపెనీలను హైదరాబాద్ కు తీసుకొచ్చామని తెలిపారు. 30 ఇంజనీరింగ్ కాలేజీలను 9 ఏళ్లలో 300 కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. విభజన జరిగిన తర్వాత అన్ని హైదరాబాద్ కు వెళ్లాయన్నారు. హైదరాబాద్, చెన్నె, బెంగళూరు కంటే మిన్నగా అమరావతి రాజధాని వస్తుందన్నారు.

 

13:19 - August 7, 2018

ఢిల్లీ : టీడీపీ ఎంపీలు, శాసన సభ, మండలిసభ్యులు, మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలని కేంద్రమంత్రులను కలిసి విన్నవిస్తామన్నారు మంత్రి సుజయ కృష్ణ రంగారావు. విశాఖ రైల్వే ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయంపై కేంద్ర మంత్రికి వివరిస్తామంటున్న మంత్రి సుజయ కృష్ణ రంగారావుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ.350 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరుతామని చెప్పారు. కర్నూలు క్వారీ ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో జరగకుండా చూసుకుంటామని తెలిపారు.

ఆగస్టు 15 సందర్భంగా భద్రత కట్టుదిట్టం

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15 సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 31వరకు ఎయిర్‌పోర్టులోకి సందర్శకులకు అనుమతిని ఇవ్వరు. అన్ని రకాల పాసులను రద్దు చేశారు. ఎయిర్‌పోర్టులో అణువణువునా తనిఖీలు చేస్తున్నారు. 

13:15 - August 7, 2018

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15 సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 31వరకు ఎయిర్‌పోర్టులోకి సందర్శకులకు అనుమతిని ఇవ్వరు. అన్ని రకాల పాసులను రద్దు చేశారు. ఎయిర్‌పోర్టులో అణువణువునా తనిఖీలు చేస్తున్నారు. 

13:12 - August 7, 2018

చిత్తూరు : తిరుపతిలో డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య చేసుకుంది. పీలేరులోని అపార్ట్‌మెంట్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కాలేజీలో పిడియాట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌లో పీజీ చదువుతోన్న శిల్ప...తనను కొంత కాలంగా ప్రొఫెసర్లు వేధిస్తున్నారని వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శిల్ప ఆత్మహత్యపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

అమ్మవారి సన్నధిలో చీర పోవడంపై ప్రభుత్వానికి నివేదిక సిద్ధం

కృష్ణా : విజయవాడ దుర్గమ్మ గుడిలో చీర వివాదంపై ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారి సన్నధిలో చీర పోవడంపై ప్రభుత్వానికి నివేదిక సిద్ధం చేశారు ఈవో పద్మ. ట్రస్టు బోర్డు సభ్యురాలే చీర తీసినట్లు నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

13:09 - August 7, 2018

కృష్ణా : విజయవాడ దుర్గమ్మ గుడిలో చీర వివాదంపై ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారి సన్నధిలో చీర పోవడంపై ప్రభుత్వానికి నివేదిక సిద్ధం చేశారు ఈవో పద్మ. ట్రస్టు బోర్డు సభ్యురాలే చీర తీసినట్లు నివేదికలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి నివేదిక పంపడానికి ముందు ఈ వివాదంపై విచారణ జరిపిన పోలీసులతో ఈవో మాట్లాడారు. ట్రస్టు బోర్డు సభ్యురాలే చీర తీశారని వాగ్మూలం నమోదు చేసినట్లు పోలీసులు ఈవోకు తెలిపారు. వాంగ్మూలం నమోదు ప్రతిని తమకు ఇవ్వాలని పోలీసులను ఈవో కోరారు.

13:06 - August 7, 2018

ఢిల్లీ : విశాఖ రైల్వే జోన్‌ సాధించేవరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు టీడీపీ ఎంపీ తోట నరసింహం. ఈ మేరకు టీడీపీ ఎంపీలు, శాసన సభ, మండలిసభ్యులు, మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్‌ కోరుతూ ఇవాళ కేంద్ర రైల్వే మంత్రి పియూశ్‌ గోయల్‌ను కలవనున్నారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన 350 కోట్లు త్వరగా విడుదల చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని కోరనున్నారు. 

 

తిరుపతిలో డాక్టర్‌ ఆత్మహత్య

చిత్తూరు : తిరుపతిలో డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య చేసుకుంది. పీలేరులోని అపార్ట్‌మెంట్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కాలేజీలో పిడియాట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌లో పీజీ చదువుతోన్న శిల్ప...తనను కొంత కాలంగా ప్రొఫెసర్లు వేధిస్తున్నారని వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శిల్ప ఆత్మహత్యపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. 

13:02 - August 7, 2018

చిత్తూరు : తిరుపతిలో డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య చేసుకుంది. పీలేరులోని అపార్ట్‌మెంట్‌లోని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కాలేజీలో పిడియాట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌లో పీజీ చదువుతోన్న శిల్ప...తనను కొంత కాలంగా ప్రొఫెసర్లు వేధిస్తున్నారని వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శిల్ప ఆత్మహత్యపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. 

12:57 - August 7, 2018

ఆదిలాబాద్‌ : రవాణా రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పేందుకు తీసుకువచ్చిన ఎమ్‌వీ యాక్ట్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఇందులో భాగంగా ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆదిలాబాద్‌ బస్సు డిపో ముందు ఆందోళన చేశారు. వీరికి సీఐటీయూ నేతలు మద్దతు తెలిపారు. సమ్మెతో జిల్లా వ్యాప్తంగా 6 డిపోలలో 700 బస్సులు నిలిచిపోయాయి. 

 

12:42 - August 7, 2018

హైదరాబాద్ : మోటార్‌ వాహన చట్టం 2017ను ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ, రవాణా, కార్మికసంఘాలు దేశవ్యాప్తంగా బంద్‌ చేపట్టాయి. ఆల్‌ ఇండియా కో ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఈ బంద్‌ కొనసాగుతోంది. డీజిల్‌, పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్‌లు సైతం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మోటరు వాహనాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పలు కార్మిక యూనియన్‌లు బంద్‌కు మద్దతుగా పాల్గొన్నాయి. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. బస్సులతోపాటు ఆటోలు బంద్‌ అయ్యాయి. బస్సులు లేక ఎంజిబిఎస్ వెలవెలబోతుంది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

12:08 - August 7, 2018

మధ్యాహ్నం భోజన పథకం ప్రైవేటీకరణకు ప్రభుత్వం సిద్ధం అయింది. ప్రజా సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు గఫూర్ పాల్గొని, మాట్లాడారు. మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రైవేటీకరించవద్దని ఆయన అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

11:56 - August 7, 2018

హైదరాబాద్ : మోటార్‌ వాహన చట్టం 2017ను ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ, రవాణా, కార్మికసంఘాలు దేశవ్యాప్తంగా బంద్‌ చేపట్టాయి. ఆల్‌ ఇండియా కో ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఈ బంద్‌ కొనసాగుతోంది. డీజిల్‌, పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్‌లు సైతం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మోటరు వాహనాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పలు కార్మిక యూనియన్‌లు బంద్‌కు మద్దతుగా పాల్గొన్నాయి. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. బస్సులతోపాటు ఆటోలు బంద్‌ అయ్యాయి. బస్సులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం : టీడీపీ ఎంపీలు

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అస్తవ్యస్థ పాలన కొనసాగిస్తుందని టీడీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు విమర్శించారు. ఈమేరకు ఢిల్లీలో ఎంపీలు మీడియాతో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ సాధించేవరకు పోరాడుతూనే ఉంటామన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తామన్నారు. మధ్యాహ్నం కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ను కలిసి ఏపీకి న్యాయం చేయాలని కోరతామని చెప్పారు. వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్  పోరాటం 30 సంవత్సరాలుగా జరుగుతోందన్నారు. ఇది విశాఖ ప్రజల పోరాటంమన్నారు. 

 

11:53 - August 7, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అస్తవ్యస్థ పాలన కొనసాగిస్తుందని టీడీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు విమర్శించారు. ఈమేరకు ఢిల్లీలో ఎంపీలు మీడియాతో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ సాధించేవరకు పోరాడుతూనే ఉంటామన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేస్తామన్నారు. మధ్యాహ్నం కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ను కలిసి ఏపీకి న్యాయం చేయాలని కోరతామని చెప్పారు. వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్  పోరాటం 30 సంవత్సరాలుగా జరుగుతోందన్నారు. ఇది విశాఖ ప్రజల పోరాటంమన్నారు. 

 

11:45 - August 7, 2018

నిజామాబాద్ : ఎమ్ వీ యాక్టు సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తు దేశ వ్యాప్తంగా ఆర్టీసి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. బంద్‌లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసి కార్మిక సంఘాలు డిపో ముందు ఆందోళన చేపట్టారు. దీంతో బస్సుల డిపోలకే పరిమితమైయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ సమ్మెపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

11:39 - August 7, 2018

హైదరాబాద్ : మోటార్‌ వాహన చట్టం 2017ను ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ, రవాణా, కార్మికసంఘాలు దేశవ్యాప్తంగా బంద్‌ చేపట్టాయి. ఆల్‌ ఇండియా కో ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఈ బంద్‌ కొనసాగుతోంది. డీజిల్‌, పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్‌లు సైతం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మోటరు వాహనాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పలు కార్మిక యూనియన్‌లు బంద్‌కు మద్దతుగా పాల్గొన్నాయి. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. బస్సులతోపాటు ఆటోలు బంద్‌ అయ్యాయి. బస్సులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

10:27 - August 7, 2018

పార్లమెంట్‌లో పెద్దల సభ ఎన్నికలకు సిద్ధం అయ్యింది. ఈనెల 9న జరుగనున్న రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికపై అధికార, విపక్షాలు దృష్టి సారించాయి. 26ఏళ్ల తర్వాత ఉపసభాపతి పదవికి ఎన్నిక జరుగుతుండడంతో ఆ పదవి ఎవరిని వరిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించినట్టుగానే... డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎన్డీయే వ్యూహాలు రచిస్తోంటే.... రాజ్యసభలో తమ బలాన్ని చూపేందుకు విపక్షాలు ఐక్యంగా ముందుకు వెళ్లాలన్ని ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టీఆర్ ఎస్ నేత సమ్మారావు, కాంగ్రెస్ నేత రామ్మోహన్ రావు, బీజేపీ నేత రవీందర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:20 - August 7, 2018

ఈ రోజు దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మె బాట పట్టారు. కేంద్రం తీసుకువస్తున్న కొత్త మోటర్‌ వెహికిల్‌ యాక్ట్‌ను వెనక్కి తీసుకోవాలని రోడ్డు రవాణా కార్మికులకు రక్షణ కల్పించాలని,  పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. వారి ఆందోళనకు గల కారణాలు, వారి పట్ల ప్రభుత్వ విధానాలపై ఇవాళ్టి జనపథంలో ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ముజ్‌ఫర్‌ అహ్మద్‌ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

10:13 - August 7, 2018

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించింది. ఈ విషయాన్ని కావేరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై కావేరీ ఆస్పత్రి యాజమాన్యం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని... వయోభారం రీత్యా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంచడం కష్టంగా మారిందన్నారు. ప్రస్తుతం కరుణానిధి వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. మరో 24 గంటల పాటు ఆయన చికిత్సకు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉందని వైద్యులు తెలిపారు. అధిక రక్తపోటు కారణంగా కరుణానిధిని జులై 21న కావేరీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అప్పటి నుంచి ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు కావేరీ ఆస్పత్రికి వెళ్లారు. స్టాలిన్‌ను కలుసుకొని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. 

 

10:08 - August 7, 2018

హైదరాబాద్‌ : పాతబస్తీలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. స్థానిక పోలీసుల సాయంతో ఎన్‌ఐఏ అధికారులు షాహీన్‌ నగర్‌, పహాడీ షరీఫ్‌ ప్రాంతాల్లో దాడులు చేశారు. గుజరాత్‌, కర్ణాటకకు చెందిన రెండు ఎన్‌ఐఏ బృందాలు అర్థరాత్రి నుంచి సోదాలు చేస్తూ కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాయి. ఓ ఇంట్లోని ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడుల విషయాన్ని స్థానిక పోలీసులు గోప్యంగా ఉంచారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రకదలికల నేపథ్యంలో సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ ఆధీనంలో పనిచేసే ఓ వాట్సాప్‌ నంబర్‌ ద్వారా దేశంలో ఉగ్రదాడుల యత్నం జరుగుతుందని గుర్తించిన ఇంటలిజెన్స్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయి.  ఈ ఆరుగురు అనుమానితులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎండీ అజీమ్‌ షాన్‌, ఎండీ ఒసమా అలియాస్‌ అదిల్‌ అలియాస్‌ పీర్‌, అకాలకుర్‌ రెహ్మాన్‌ అలియాస్‌ అక్లక్‌, మహ్మద్‌ మెహ్‌రాజ్‌ అలియాస్‌ మోనూ, మోహ్‌సిన్‌ ఇబ్రహీం సయ్యద్‌, ముదాబ్బిర్‌ ముస్తాక్‌ షేక్‌లను అధికారులు జ్యూడీషియల్‌ కస్టడీకి తీసుకున్నారు.

 

10:00 - August 7, 2018

కర్నూలు : జిల్లా హత్తిబెళగల్‌లో క్వారీ పేలుడు ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా అక్రమ మైనింగ్‌ జరుగుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హత్తిబెళగల్‌ క్వారీలో జరిగిన పేలుడు బాధితులను పవన్‌ పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. 
క్వారీ పేలుడు స్థలాన్ని పరిశీలించిన పవన్  
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆలూరు మండలం హత్తిబెళగల్‌ గ్రామంలో క్వారీ పేలుడు జరిగిన స్థలాన్ని పవన్ పరిశీలించారు. అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. రియల్‌ టైం గవర్నెన్స్‌ నడుపుతున్న చంద్రబాబుకు ఇంత భారీ అక్రమ మైనింగ్‌ జరుగుతుంటే కనబడటం లేదా అని ప్రశ్నించారు. చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం కాకుండా ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు పవన్‌. 
అక్రమ మైనింగ్‌ ఆపాలన్న పవన్  
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్‌ జరుగుతుంటే గనుల శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అక్రమ మైనింగ్‌ ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. పవన్‌ రాక సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కర్నూలు నగరంలోని టోల్‌గేట్‌ నుండి హనుమాన్‌ సర్కిల్‌ వరకు పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 

 

కొనసాగుత్ను మోటార్ వాహనాల సమ్మె

హైదరాబాద్ : మోటార్‌ వాహన చట్టం 2017ను ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ, రవాణా, కార్మికసంఘాలు దేశవ్యాప్తంగా బంద్‌ చేపట్టాయి. ఆల్‌ ఇండియా కో ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఈ బంద్‌ కొనసాగుతోంది. డీజిల్‌, పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్‌లు సైతం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మోటరు వాహనాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పలు కార్మిక యూనియన్‌లు బంద్‌కు మద్దతుగా పాల్గొన్నాయి. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.

09:55 - August 7, 2018

హైదరాబాద్ : మోటార్‌ వాహన చట్టం 2017ను ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ, రవాణా, కార్మికసంఘాలు దేశవ్యాప్తంగా బంద్‌ చేపట్టాయి. ఆల్‌ ఇండియా కో ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఈ బంద్‌ కొనసాగుతోంది. డీజిల్‌, పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్‌లు సైతం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మోటరు వాహనాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పలు కార్మిక యూనియన్‌లు బంద్‌కు మద్దతుగా పాల్గొన్నాయి. హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. బస్సులతోపాటు ఆటోలు బంద్‌ అయ్యాయి. బస్సులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

భర్తను హతమార్చిన భార్య

హైదరాబాద్ : వేధింపులు తాళలేక భర్తను భార్య హతమార్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఉష, జగన్ దంపతులు ఫిల్మ్ నగర్ లో రెండు సంవత్సరాలుగా నివాసముంటున్నారు. గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. జగన్ తరచూ ఉషను వేధిస్తున్నాడు. వేధింపులు తాళ లేక మద్యంలో మత్తులో ఉన్న భర్త నోట్లో హిట్ స్ప్రే చల్లడంతో అతను అపస్మాకరక స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతన్ని చంపేసింది. 

09:47 - August 7, 2018

హైదరాబాద్ : వేధింపులు తాళలేక భర్తను భార్య హతమార్చింది. గుంటూరు జిల్లాకు చెందిన ఉష, జగన్ దంపతులు ఫిల్మ్ నగర్ లో రెండు సంవత్సరాలుగా నివాసముంటున్నారు. గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. జగన్ తరచూ ఉషను వేధిస్తున్నాడు. వేధింపులు తాళ లేక మద్యంలో మత్తులో ఉన్న భర్త నోట్లో హిట్ స్ప్రే చల్లడంతో అతను అపస్మాకరక స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతన్ని చంపేసింది. అనంతరం అక్కడి నుంచి ఉష పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జగన్ కుటుంబానికి సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

08:51 - August 7, 2018

కృష్ణా : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందారు. ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో విజయవాడ..హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళ్తోంది. మొదటి డ్రైవర్ నిద్రిస్తున్నాడు. రెండో డ్రైవర్ బస్సు నడుపుతున్నాడు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో మార్గంమధ్యంలో జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద బస్సు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 20 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో నల్గురి పరిస్థితి విమషంగా ఉంది. క్షతగాత్రులను జగ్గయ్యపేట, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. వెనుక నుంచి వస్తున్న మరో రెండు బస్సులు, కారు.. బస్సును ఢీకొన్నాయి. రహదారి స్తంభించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

నేడు ఆర్టీసీ, రవాణా, కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె

హైదరాబాద్ : ఆర్టీసీ, రవాణా, కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. మోటారు వాహనాల చట్టం 2017 సవరణ బిల్లును నిరసిస్తూ కార్మికులు సమ్మె చేపట్టారు. సమ్మెతో తెలుగు రాష్ట్రాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 

నేడు ఢిల్లీ వెళ్లనున్న ప్రొ.కోదండరామ్

హైదరాబాద్ : నేడు ప్రొ.కోదండరామ్ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కోదండరామ్ తో ఆయన భేటీ కానున్నారు.

నేడు రావూరు హరిజనవాడలో సీపీఎం నేత పి.మధు పర్యటన

నెల్లూరు : రావూరు హరిజనవాడలో నేడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పర్యటించనున్నారు. 

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి

కృష్ణా : జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందారు. బస్సును వెనుక నుంచి మరో రెండు బస్సులు, కారు ఢీకొన్నాయి. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగ్గయ్యపేట ఆస్పత్రికి తరలించారు. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె

మహబూబ్ నగర్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. 690 ఆర్టీసీ బస్సులు డీపోలకే పరిమితయ్యాయి.

నేడు సుప్రీంకోర్టు జడ్జీలుగా ముగ్గురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ఢిల్లీ : నేడు సుప్రీంకోర్టు జడ్జీలుగా ముగ్గురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

08:00 - August 7, 2018

గుంటూరు : కాలుష్యరహిత ఇంధనానికి ఆంధ్రప్రదేశ్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అతి తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నది తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. మరింత చవకగా విద్యుత్‌ను ఎలా అందించగలమనే అంశంపై విద్యార్థులు ఆలోచలను చేయాలని పిలుపునిచ్చారు. 
అసాధ్యాలను సుసాధ్యం చేయాలి : సీఎం చంద్రబాబు 
అమరావతి ప్రజావేదిక హాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత్‌ ఎనర్జీ స్టోరేజీ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చిన అతి భారీ బ్యాటరీని.. పారిశ్రామిక వేత్తలు, విద్యార్థుల సమక్షంలో చంద్రబాబు ఆవిష్కరించారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడంపై యువత దృష్టి సారించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధ్యం కాదన్న స్థాయి నుంచి.. చౌక ధరకే కాలుష్య రహిత ఇంధనం ఇచ్చే పరిస్థితులు వచ్చాయని అన్నారు. కాలుష్య రహిత ఇంధనానికి ఏపీ కేరాఫ్‌ అడ్రస్‌గా మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. నాణ్యమైన విద్యుత్‌ ఇప్పుడు ఐదు రూపాయలకే లభిస్తోందని, దీన్ని రూపాయిన్నరకు తగ్గించగలిగితే మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చన్న చంద్రబాబు.. ఈ దిశగా విద్యార్థులు సరికొత్త ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు. 
అవయవదాన కార్యక్రమంలో చంద్రబాబు 
బ్యాటరీ ఆవిష్కరణ కార్యక్రమానంతరం, అక్కడే జరిగిన అవయవదాన కార్యక్రమంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. తన అవయవాలను దానం చేసేందుకు ముఖ్యమంత్రి ముందుకొచ్చారు.అవయవదానాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెడతామని, డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో ఈ అంశాన్ని ఓ షరతుగా పెట్టే అవకాశాన్ని పరిశీలస్తామని చంద్రబాబు చెప్పారు. 
అవయవదానానికి ముందుకొచ్చిన లక్షా ఇరవై వేల మంది 
పది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు లక్షా ఇరవై వేల మంది అవయవ దాతలు ముందుకు వచ్చారు. వారికి ఇచ్చిన పత్రాలను ముఖ్యమంత్రి సమక్షంలో.. మెప్మా... జీవన్‌దాన్‌ సంస్థకు అందజేసింది. ఇంత భారీస్థాయిలో అవయవదాతలు ముందుకు రావడాన్ని ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. తన పిలుపునకు స్పందించి ఇంతమంది అవయవదానానికి ముందుకు రావడం పట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. 

 

07:49 - August 7, 2018

గంటూరు : ఆంధ్రప్రదేశ్‌కు మరో అతిపెద్ద ఎలెక్ట్రానిక్స్‌ కంపెనీ రాబోతోంది. చైనాకు చెందిన హోలిటెక్‌ టెక్నాలజీస్ సంస్థ.. తిరుపతిలో తన ఉత్పాదక యూనిట్‌ను  ప్రారంభించబోతోంది. దేశంలో నేరుగా ఓ ఎలెక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ సంస్థ ఏర్పాటు కావడం ఇదే ప్రథమం. ముఖ్యమంత్రి సమక్షంలో.. ఏపీ ప్రభుత్వంతో.. హోలిటెక్ సంస్థ ప్రతినిధులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. 
చైనాకు చెందిన హోలిటెక్‌ టెక్నాలజీస్‌ సంస్థ.. 
ఆంధ్రప్రదేశ్‌లో మరో పెద్ద కంపెనీ ప్రారంభం కాబోతోంది. చైనాకు చెందిన హోలిటెక్‌ టెక్నాలజీస్‌ సంస్థ.. తిరుపతిలోని.. ఎలెక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో ఎలెక్ట్రానిక్స్‌ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ఎంఓయూలపై.. సంస్థ ప్రతినిధులు.. రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేశాయి. ఇప్పటివరకూ దేశంలో ఎలెక్ట్రానిక్స్‌ అసెంబ్లీ కంపెనీలు మాత్రమే ఉన్నాయి. నేరుగా ఎలెక్ట్రానిక్స్‌ ఉత్పాదక సంస్థ.. తొలిసారిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కాబోతోంది. మొత్తం 75 ఎకరాల్లో 14 వందల కోట్ల రూపాయల పెట్టుబడితో సంస్థను ప్రారంభించనున్నారు. హోలిటెక్‌ సంస్థ కర్మాగారంలో నేరుగా ఆరువేల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ఇప్పటికే సెల్‌ఫోన్‌లను ఉత్పత్తి చేస్తోన్న షియామి సంస్థకు అవసరమైన విడిభాగాలను హోలిటెక్‌ సంస్థ అందిస్తుంది. అనంతరం.. ఇతర ప్రాంతాలకూ ఎగుమతులు ప్రారంభిస్తుంది. 
రాష్ట్రం ఎలెక్ట్రానిక్స్‌ హబ్‌గా మారుతుందన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎలెక్ట్రానిక్స్‌ హబ్‌గా మారుతోందని, ఈ రంగంలో ఇప్పటికే 20వేల ఉద్యోగాలు కల్పించామని లోకేశ్‌ వెల్లడించారు. మొబైల్‌ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌లోనే 15వేల మంది పనిచేస్తున్నారని, రాబోయే రోజుల్లో లిథియం ఐయాన్‌ బ్యాటరీ తయారీ కంపెనీ మునోత్‌ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టనుందని వెల్లడించారు. అధునాతన సాంకేతిక పరిశోధనకూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు సంస్థ అంగీకరించింది. ఈ సంస్థ తొలి దశ ఉత్పత్తిని వచ్చే సంవత్సరం జనవరి నాటికి, రెండో దశను జూన్‌ నాటికి ప్రారంభించనుంది.  

07:45 - August 7, 2018

కృష్ణా : విజయవాడ కనదుర్గమ్మ దేవాలయంలో చీర మాయం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.. భక్తులు మొక్కుబడులు తీర్చుకోవడానికి తెచ్చిన  విలువైన చీరలు మాయం కావడం పై తీవ్ర దుమారం చెలరేగుతోంది.  కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరా నిఘాలో ఉండే అమ్మవారి ఆలయంలో...  చీర మిస్సింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది.. అయితే సీఎం చంద్రబాబు సైతం దుర్గమ్మ గుడిలో చీర మిస్సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంచలనంగా మారిన ఆలయ ఉద్యోగులపై ఎస్మా చట్ట ప్రయోగం
పవిత్ర పుణ్యక్షేత్రమైన విజయవాడ కనదుర్గమ్మ దేవాలయం నిత్యం ఏదోక వివాదంతో వార్తలకెక్కుతూనే ఉంది.  గత నెలలో ఆలయంలోని డార్మిటరీ లో  ఆడవాళ్లు బట్టలు మార్చుకునే గదిలో సీసీ కెమెరాలు పెట్టారంటూ పెద్ద వివాదమే చెలరేగింది. అనంతరం దుర్గ గుడిలోని పని చేసే ఉద్యోగులు పై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఇప్పుడేమో దుర్గమ్మకు  భక్తులు మొక్కుబడులు తీర్చుకునేందుకు సమర్పించిన చీర మాయం కావడం  తీవ్ర దుమారం రేపుతోంది.  భక్తులు సమర్పించిన మొక్కులను పరిరక్షించాల్సిన ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యుల పైనే ఆరోపణలు రావడం, పాలకమండలిలోని సభ్యులు ఒకరి పై మరోకరు విమర్శలు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అమ్మవారి చీర మాయం 
ఉండవల్లికి చెందిన సూర్యనారాయణ, వసుంధర దంపతులు 200మంది భక్తులతో అమ్మవారికి ఆదివారం ఆషాడం సారె సమర్పించారు. అయితే ఈ ఏడాది అమ్మవారి కోసం మదనపల్లిలో 18వేల రూపాయలతో పింక్ కలర్ చేనేత చీరను నేయించి సారెగా సమర్పించారు..ఉండవల్లి దంపతులు. తెచ్చిన చీరను అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ పూజారులు  అలంకరించారు. ఆ తర్వాత కొద్దిసేపు పూజలు నిర్వహించారు..పూజలు నిర్వహించిన కొద్దిసేపటికే చీర మాయం కావడాన్ని  భక్తులు గమనించారు... వెంటనే అక్కడ ఉన్న పూజారికి చెప్పడంతో చీర మాయం అయిందనే విషయం బయటకు పొక్కింది.  
చీర మాయం కావడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం
అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్దలతో తెచ్చిన చీర మాయం కావడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..అక్కడే ఉన్న సిబ్బంది ఎవరు పట్టించుకోకుపోవడంతో, వెంటనే ఆలయ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన పాలకమండలి సభ్యుడు ఒకరు రెండు రోజుల గడువు కోరడంతో  చీరను సమర్పించిన భక్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతరం చీర మాయం ఘటన పై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు పట్టించుకోలేదు..అయితే పాలకమండలి సభ్యుల పైనే తమకు అనుమానం ఉందంటూ చీరను తీసుకొచ్చిన సూర్యనారాయణ, వసుంధర  ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు..దీంతో ఆలయ అధికారులు చీరమిస్సింగ్  అయిందని పాలకమండలి చైర్మన్ కు సమాచారం అందించారు. 
సూర్యలతపై అనుమానాలు 
అయితే చీర ఎలా మాయం అయిందని ఆలయ అధికారులు తర్జనభర్జనలు పడుతున్న సమయంలో...ఆలయ కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్య చీరను పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలతనే తీసుకెళ్లిందని చెప్పడంతో వివాదం రాజుకుంది..సూర్యలతా చీరను తీసుకెళ్లడం తాను చూశానంటూ మీడియాకు కూడా చెప్పడంతో సూర్యలత పై అనుమానాలు బలపడ్డాయి..అయితై సూర్యలత మాత్రం తాను చీరను తీయలేదని, కావాలనే వైదిక కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్య తన పై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. చీరను అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అలంకరించాలంటే ముందుగానే రిజస్ట్రేషన్ చేసుకోవాలని, అయితే చీరను తెచ్చిన సమయంలో ఎవరు దానిని రిజిస్ట్రర్ నమోదు చేయలేదని చెబుతోంది. అమ్మవారికి అలంకరించిన సమయంలో అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారని... వేణుగోపాల స్వామి భక్త బృందం తనకు బహుకరించిన చీరను మాత్రమే తాను తీసుకెళ్లాలని చెప్పుకొచ్చింది సూర్యలతా.. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, చీరను తాను తీసుకెళ్లాలని విచారణలో తెలితే ఏ శిక్ష కైనా సిద్దమేనని ఆమె స్పష్టం చేసింది. 
చీర మిస్సింగ్ లో ఎవరున్నా కఠినంగా శిక్షిస్తాం : పాలమకమండలి చైర్మన్
దర్గమ్మ దేవాలయంలో చీర మిస్సింగ్ లో ఎవరు ఉన్న కఠినంగా శిక్షిస్తామని పాలమకమండలి చైర్మన్ గౌరంగబాబు అన్నారు. ఆలయంలోని అన్ని సిసీ కెమెరాలు పరిశీలిస్తామని , చీరను మాయం చేసిన వాళ్లను రెండు రోజుల్లో పట్టుకుంటామని చెప్పారు. పాలకమండలి సభ్యురాలు సూర్యలత పైన ఆరోపణలు వచ్చాయని, చీర మిస్సింగ్ పై విచారణ జరుపుతున్నామని రెండు రోజుల్లో చీర ఏమైందో తేలుస్తామని చెబుతున్నారు.
చీర మాయం కావడం పట్ల సీఎం చంద్రబాబు సిరియస్ 
పటిష్టమైన భద్రత ఉండే అమ్మవారి దేవాలయంలో భక్తులు సమర్పించిన చీర మాయం కావడం పట్ల సీఎం చంద్రబాబు సిరియస్ అయ్యారు.. ఆలయంలో ఇలాంటి ఘటనలు జరిగితే  భక్తులకు ప్రభుత్వం మీద నమ్మకం పోతుందని ఆలయ చైర్మన్ గౌరంగబాబును హెచ్చరించారు.చీర మిస్సింగ్  వివాదాన్ని వెంటనే ముగించాలని ఆలయ ఈవో పద్మ, చైర్మన్ గౌరంగబాబుకు చంద్రబాబు సూచించారు. ఏది ఏమైన పవిత్రిమైన కనకదుర్గ దేవాలయంలో ఇలాంటి ఘటనలు జరగడం, ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యుల పైన ఆరోపణలు రావడం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

 

07:36 - August 7, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌లో పెద్దల సభ ఎన్నికలకు సిద్ధం అయ్యింది. ఈనెల 9న జరుగనున్న రాజ్యసభ ఉపసభాపతి ఎన్నికపై  అధికార, విపక్షాలు దృష్టి సారించాయి. 26ఏళ్ల తర్వాత ఉపసభాపతి పదవికి ఎన్నిక జరుగుతుండడంతో ఆ పదవి ఎవరిని వరిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించినట్టుగానే... డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎన్డీయే వ్యూహాలు రచిస్తోంటే.... రాజ్యసభలో తమ బలాన్ని చూపేందుకు విపక్షాలు ఐక్యంగా ముందుకు వెళ్లాలన్ని ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఈనెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక
ఈనెల 9న రాజ్యసభలో ఉపసభాపతి ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికను అధికార, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  ఎవరికి వారే గెలుపుకోసం వ్యూహరచన చేస్తున్నారు. ఈ విషయంలో విపక్షాలు అధికారపక్షంకంటే ఒకడుగు ముందుకువేశాయి.  డిప్యూటీ చైర్మన్‌గా అభ్యర్థి ఎవరన్న అంశంపై కసరత్తు ప్రారంభించాయి.  బీజేపీని ఓడించడంతోపాటు విపక్షాల కూటమి బలపడటానికి విపక్షాల తరపున ఏ అభ్యర్థికైనా మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్‌ సిద్ధమైంది. ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్‌ చాంబర్‌లో రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌ అభ్యర్థి ఎంపికపై విపక్షపార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఈ సమావేశంలో పాల్గొన్న పలు పార్టీలు.. ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని నిర్ణయించాయి.  అధికారపక్షం నుంచి జేడీయూ ఎంపీ హరివంశ్‌ అభ్యర్థిగా ఉంటారన్న ఊహాగానాల నేపథ్యంలో అతనికి ధీటుగా విపక్షాల నుంచి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించారు.  ప్రస్తుతం టీఎంసీ ఎంపీ సుకేందు శేఖర్‌ రాయ్‌నుకానీ.. బీజేడీకి చెందిన ప్రసన్న ఆచార్యనుగానీ డిప్యూటీ చైర్మన్‌ పదవి రేస్‌లో నిలబెట్టే యోచనలో ఉన్నాయి. 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా డిప్యూటీ చైర్మన్‌ పదవికి నామినేషన్‌ దాఖలుగా గడువు విధించిన నేపథ్యంలో ఇవాళ కూడా విపక్షాలు చర్చలు కొనసాగనున్నాయి.
డిప్యూటీ చైర్మన్‌గా గెలవాలంటే 122 మంది బలం అవసరం
రాజ్యసభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికలో ఆ సభలోని 244 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. అయితే డిప్యూటీ చైర్మన్‌ పదవి చేజిక్కించుకోవాలంటే 122 మంది సభ్యుల బలం అవసరం ఉంటుంది.  ఆ బలం ఎవరికి ఉంటే వారిదే గెలుపు. ప్రస్తుతం రాజ్యసభలో అన్నాడీఎంకేకు 13 మంది సభ్యులు ఉన్నారు. టీఆర్‌ఎస్‌కు ఆరుగురు ఉన్నారు. వీరితో కలిపి రాజ్యసభలో ఎన్డీఏ బలం 109 అవుతుంది. ఇందులో బీజేపీ రాజ్యసభ సభ్యుల బలం 73. ఇటీవల ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన ఆరుగురు టీడీపీ సభ్యులతో కలిసి ప్రతిపక్షాల సంఖ్యాబలం 110కి పెరిగింది.  అయితే ఉపసభాపతి ఎన్నిక విషయంలో మ్యాజిక్‌ ఫిగర్‌ 122కి అవసరమైన బలం తమకు లేకపోవడంతో బీజేడీ, శివసేన, ఆరుగురు ఇండిపెండెంట్‌లను తమవైపు తిప్పుకోవాలని అధికార బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుం రాజ్యసభలో బీజేడీకి 9 మంది సభ్యులు, శివసేనకు ముగ్గురు సభ్యులు ఉండడంతో... ఇప్పుడు ఈ పార్టీలు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది.  కాంగ్రెస్‌కు చెందిన డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌ పదవీకాలం ముగియడంతో ఎన్డీఏ అభ్యర్థిని రంగంలోకి దించి ఆ స్థానాన్ని దక్కించుకోవాలని కమలదళం పావులు కదుపుతోంది.అయితే పెద్దల సభలో తగినంత సంఖ్యబలం లేకపోవడంతో ఎన్డీయే తరపున మిత్రపక్షానికి చెందిన శిరోమణి అకాలీదళ్‌కు చెందిన నరేష్‌ గుజ్రాల్‌ను లేక జేడీయూకు చెందిన హరివంశ్‌ను నిలబెడితే ఇతర పార్టీల మద్దతు కూడా ఉంటుందనే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోంది. మరోవైపు విపక్షాలు కూడా అదేస్థాయిలో వ్యూహాలు రచిస్తున్నాయి. మరి ఈ ఎన్నికలో గెలుపెవరిది, ఓటమి ఎవరిది తెలియాలంటే ఈనెల 9 వరకు ఆగాల్సిందే.

 

07:28 - August 7, 2018

హైదరాబాద్ : నేడు మోటారు వాహనాలు దేశ వ్యాప్తంగా బంద్‌ పాటిస్తున్నాయి. ఆల్‌ ఇండియా కో ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఈ బంద్‌ కొనసాగుతోంది. మోటార్‌ వాహన చట్టం -2017ను ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ, రవాణా, కార్మికసంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్లు సైతం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా మోటారు వాహనాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోనున్నాయి.
మోటార్‌ వెహికల్‌ సవరణ బిల్లు 2017ను వ్యతిరేకిస్తూ సమ్మె
దేశ వ్యాప్తంగా నేడు మోటార్‌ వాహనాలన్నీ బంద్‌ను పాటిస్తున్నాయి. కేంద్రం తీసుకువస్తున్న మోటార్‌ వెహికల్‌ సవరణ బిల్లు -2017కు వ్యతిరేకంగా మోటార్‌ వాహనాలు, కార్మికసంఘాలు దేశ వ్యాప్తంగా సమ్మెకు  పిలుపునిచ్చాయి.  ఒక్క రోజు జరిగే ఈ సమ్మెలో ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఆర్టీసీ పాల్గొంటున్నాయి. వివిధ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొని నిరసన తెలుపుతున్నాయి.  కేంద్రం తీసుకవస్తున్న మోటార్‌ వెహికల్‌ సవరణ బిల్లు -2017ను వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అంతేకాదు.. డీజిల్‌, పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.  దేశంలోని ఆర్టీసీలను నిర్వీర్యం చేసేలా ఉన్న మోటార్‌ వెహికల్‌ బిల్లును వెంటనే రద్దు చేయాలని ఆర్టీసీ యూనియర్లు డిమాండ్‌ చేస్తున్నాయి.
ప్రకంపనలు సృష్టిస్తోన్న మోటార్‌ వెహికల్‌ బిల్లు
మోటార్‌ వెహికిల్‌ సవరణ బిల్లు 2017 దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే రవాణా రంగంలో తీవ్రమైన కుదుపులొస్తాయని, ఈ బిల్లుతో తమ  ఉద్యోగాలకు, ఉపాధికి ఎసరు వస్తుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్లు కఠిన శిక్షలకకు, పోలీసు వేధింపులకు గురికావాల్సి వస్తుందని భయాందోళనలకు గురవుతున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి చూపిస్తున్న ఆటోలు, క్యాబ్‌ల మీద కూడా ఈ బిల్లు ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆర్టీసీకి మరణశాసనం లిఖించనున్న మోటార్‌ వెహికల్‌ బిల్లు
మోటార్‌ వెహికల్‌ సవరణ బిల్లు 2017 ఆర్టీసీకి మరణశాసన లిఖిస్తుందంటూ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీలకున్న ప్రత్యేక సదుపాయాలను రద్దు చేసి, దేశంలోని అన్ని రూట్లను వేలం వేస్తారని... వేలంపాటలో నెగ్గినవారికే రూట్‌ పర్మిట్లిస్తారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. లాభాలొచ్చే మార్గాలను ప్రైవేట్‌ సంస్థలు తన్నుకుపోతే.... నష్టాలొచ్చే రూట్లలో ఆర్టీసీ బస్సులు నడుపుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రవాణా వ్యవస్థమీద ప్రవేట్‌ సంస్థల ఆధిపత్యం పెరగడంతోపాటు ఆర్టీసీల్లో కండక్టర్ల వ్యవస్థ రద్దవుతుందని, వాహనాల రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ, ఫిట్‌నెస్‌ పరీక్షలను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగిస్తారంటూ ఈ బిల్లును కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  అన్ని రకాల రవాణా వాహనాలు సమ్మెలో పాల్గొంటున్నందున ప్రజలు సహకరించాలని వివిధ సంఘాల నాయకులు కోరుతున్నారు.

 

పీయూష్ గోయల్ తో ఉత్తరాంధ్ర టీడీపీ నేతల సమావేశం

ఢిల్లీ : నేడు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తో ఉత్తరాంధ్ర టీడీపీ నేతల సమావేశం జరుగనుంది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరనున్నారు. 

నేడు 231వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర

తూ.గో : నేడు 231వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర కొనసాగనుంది. రౌతులపూడి మండలంలో నేడు జగన్ పాదయాత్ర చేయనున్నారు. బంగారయ్యపేట, రౌతులపూడిలో జగన్ పాదయాత్ర కొనసాగనుంది. 

 

నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ప్రకాశం : నేడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పామూరు మండలంలోని దూబగుంటలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 

 

నేడు వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలు

అమరావతి : నేడు వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించనున్నారు. నిరుద్యోగ వంచన పేరుతో జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో నిరసనలు తెలపనున్నారు. 

Don't Miss