Activities calendar

08 August 2018

అడుక్కోవడం నేరం కాదన్న ఢిల్లీ హైకోర్టు...

ఢిల్లీ : దేశ రాజధానిలో అడుక్కోవడం నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భిక్షాటన చేయడం నేరమని ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు పేర్కొంది. 

రెచ్చిపోయిన కన్వర్ యాత్రికులు...

ఢిల్లీ : కన్వర్‌ యాత్రికులు రెచ్చిపోయారు. మోతి నగర్‌ రోడ్డుపై ఓ కారు తమను రాసుకుంటూ వెళ్లిందనే ఆగ్రహంతో 12 మంది కన్వరియాలు అందరూ చూస్తుండగానే కర్రలతో కారుపై దాడి చేశారు. 

రైతులకు బీమా పత్రాల పంపిణీ...

హైదరాబాద్ : భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతు బీమా పథకంలో భాగంగా వివిధ జిల్లాల్లోని రైతులకు మంత్రులు బీమా పత్రాలను పంపిణీ చేశారు.

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నిక..ఉత్కంఠ...

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవికి రేపు ఎన్నిక జరగనుంది. ఎన్డీయే తరపున జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, విపక్షాల తరపున కాంగ్రెస్‌ అభ్యర్థి బికె హరిప్రసాద్‌ పోటీ పడుతున్నారు. తమ తమ అభ్యర్థుల గెలుపుపై ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు ఈ ఎన్నిక జరుగుతోంది. 

బిపిసిఎల్ ప్లాంట్ లో ఫైర్ ఆక్సిడెంట్...

ముంబై : చెంబూర్‌లోని బిపిసిఎల్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారత్‌ పెట్రోలియంకు చెందిన ఆయిల్‌ రిఫైనరీలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో భారీ పేలుడు తర్వాత మంటలంటుకున్నాయి.

21:15 - August 8, 2018

హైదరాబాద్ : భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతు బీమా పథకంలో భాగంగా వివిధ జిల్లాల్లోని రైతులకు మంత్రులు బీమా పత్రాలను పంపిణీ చేశారు. రైతు ప్రమాదవశాత్తు గానీ, సహజంగా గానీ మరణిస్తే రైతు కుటుంబం వీధిన పడకుండా ఉండటానికి.. ప్రభుత్వం రైతుబీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలను చెల్లిస్తుందని తెలిపారు. మంత్రులు రైతులకు బీమా బాండ్లను పంపిణీ చేశారు. వివిధ జిల్లాల్లో జరిగిన పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీష్‌రెడ్డిలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలంలోని తెర్లుమద్దిలో మంత్రి కేటీఆర్ రైతులకు బీమా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రైతు బంధు, రైతు బీమా పథకాలపై రైతుల అభిప్రాయాలను కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని కేటీఆర్‌ అన్నారు. రైతు ప్రమాదవశాత్తు గానీ, సహజంగా గానీ మరణిస్తే.. రైతు కుటుంబం వీధిన పడకుండా ఉండటానికి.. ప్రభుత్వం రైతుబీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలను చెల్లిస్తుందని తెలిపారు. రైతు బీమా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదని.. మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు.

నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలంలోని శ్రీనగర్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతులకు బీమా పత్రాలు పంపిణీ చేశారు. దేశంలో ఏ ప్రభుత్వాలు ప్రవేశపెట్టని ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారని పోచారం అన్నారు. రైతులు ఏ రకంగా చనిపోయినా వారి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండేందుకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు బీమా ద్వారా అందిస్తుందని తెలిపారు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ ఎస్‌ మండలంలోని కందకట్ల గ్రామంలో రైతులకు మంత్రి జగదీష్‌రెడ్డి జీవిత బీమా పత్రాలను పంపిణీ చేశారు. తెలంగాణలో గత 60 ఏండ్లుగా జరగని అభివృద్ధి టీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చాక జరుగుతుందని జగదీష్‌రెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ఎకరాకు 4 వేల రూపాయలను టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇస్తుందని చెప్పారు. అలాగే రైతు కుటుంబాలకు అండగా ఉండటం కోసం 5 లక్షల రూపాయల బీమా ఇస్తున్నామని తెలిపారు. బీమా పత్రాల పంపిణీపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని ఆదుకోవటం కోసం 5 లక్షల రూపాయలు చెల్లించటం సంతోషంగా ఉందని రైతులు చెబుతున్నారు. 

జంగారెడ్డిగూడెంలో శ్రీనివాస కళ్యాణం టీమ్ సందడి...

పశ్చిమ గోదావరి : జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో శ్రీనివాస కళ్యాణం సినిమా యూనిట్ సందడి చేసింది. మండలంలోని గురవాయి గూడెం గ్రామంలో మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సినీ నిర్మాత దిల్ రాజు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు

8 జిల్లాల్లో కరువు పరిస్థితులు - సోమిరెడ్డి...

విజయవాడ : ఏపీలోని ఎనిమిది జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డిలు అన్నారు. కరువు నేపథ్యంలో రైతులకు ఉచితంగా విత్తనాలు ఇస్తున్నామన్నారు. 

21:10 - August 8, 2018

విజయవాడ : జపాన్‌ రాయబారి కెంజి హిరమట్సు, ఆయన ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఉండవల్లిలో ముఖ్యమంత్రి తన నివాసంలో జపాన్‌ ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిలో జపాన్‌ భాగస్వామ్యం గురించి ఇరువురు చర్చించారు.

విజ్ఞానం పెంచే సంస్థలను ఏర్పాటు చేసినట్లయితే ఉపాధి, పెట్టుబడులు మెరుగుపడతాయని అందుకు కావాల్సిన వనరులన్నీ నవ్యాంధ్రలో ఉన్నాయని జపాన్‌ ప్రతినిధి బృందానికి సీఎం తెలిపారు. మూడేళ్ల క్రితం జపాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి జపాన్‌కు చెందిన అనేక సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. ఆ దిశగా ఏపీ, జపాన్‌ అధికారులు పలు దఫాలుగా సమావేశమై చర్చలు జరుపుతున్నామని తెలిపారు.

విజయవాడలో ట్రాఫిక్‌, రవాణాకు సంబంధించిన అధ్యయనం, నవంబర్ 2018 నాటికి ఇస్తామన్న నివేదిక గురించి ముఖ్యమంత్రి ప్రతినిధుల బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో డేటా సెంటర్‌, విపత్తుల నిరోధక వ్యవస్థ, విజయవాడలో ట్రాఫిక్‌ నియంత్రణ, తాగునీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించి ఐదుగురు సభ్యులతో కూడిన జపాన్ ప్రతినిధి బృందం స్పష్టమైన ప్రతిపాదనలను సమర్పించింది.

సీఆర్డీఏ సహకారంతో రాజధాని అమరావతిలో 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 'హైమన్ ఫ్యూచర్ పెవిలియన్' ను అభివృద్ధి చేయడానికి కుని ఉమి అసెట్ మేనేజ్ మెంట్ సంస్థ ముందుకొచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. రాజధాని ప్రాంతంలో గృహనిర్మాణం పట్ల జపాన్ ఆసక్తి చూపిస్తోందని తెలిపారు. త్వరలోనే విశ్వవిద్యాలయాల్లో జపాన్ భాషను కూడా ప్రవేశపెడతామని జపాన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి అన్నారు. అమరావతిని రెండో టోక్యోగా చూడాలని జపాన్, ఆంధ్రప్రదేశ్ అభిలషిస్తున్నాయి. ఆ దిశగా అభివృద్ధికి బాటలు వేయాలని.. ఇందులో జపాన్ సహాయ సహకారాలు ఎంతైనా అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా జపాన్‌, రాయబారిని, ప్రతినిధుల బృందాన్ని సీఎం సత్కరించారు. 

21:09 - August 8, 2018

విజయవాడ : తమిళనాడును అగ్రశ్రేణి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కరుణానిధి సేవలు అమోఘమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నోడల్‌ అధికారుల రాష్ట్ర స్థాయి సదస్సు సందర్భంగా చంద్రబాబు సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు. కరుణానిధి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కరుణానిధి మరణంతో దేశం మహానేతను కోల్పోయిందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నోడల్‌ అధికారుల రాష్ట్ర స్థాయి సదస్సులో కరుణానిధికి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. అనేక అనుభవాలతో తన జీవితకాలంలో కోట్ల మందిని ప్రభావితం చేసిన విలక్షణ నాయకుడు కరుణానిధి అని కీర్తించారు చంద్రబాబు. దక్షిణ భారతదేశంలోనే పెద్ద రాజకీయ వేత్తగా కొనసాగిన నేత అని కొనియాడారు.

రాజకీయాల్లోనే కాకుండా కళా రంగంలోనూ కరుణానిధికి ప్రత్యేకత ఉందని సీఎం చంద్రబాబు కొనియాడారు. 50 ఏళ్ల సుధీర్ఘకాలం పాటు పార్టీని నడిపించి చరిత్ర సృష్టించారన్నారు. తమిళనాడు అభివృద్ధి పథంలో నడిపించడంలో కరుణానిధి పాత్ర మరువలేనిదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ద్రవిడ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి అని గుర్తు చేశారు. కరుణానిధి ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం చంద్రబాబు కోరారు. కరుణానిధి, అభిమానులకు, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

21:06 - August 8, 2018

చెన్నై : కరుణానిధి మృతిపై తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు.. కరుణానిధి మృతదేహాన్ని సందర్శించి.. నివాళులు అర్పించారు. సినీ పరిశ్రమతో కరుణానిధికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి మృతిపట్ల తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సినీరంగానికి చెందిన ప్రముఖులందరూ.. కలైజ్ఞర్‌ మృతదేహాన్ని సందర్శించి కన్నీరుమున్నీరయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. నటుడు సూర్య ఎదిగే క్రమంలో కరుణానిధి అందించిన ఆశీస్సులను ఆయన తండ్రి, వెటరన్‌ స్టార్‌ జయకుమార్‌ గుర్తు చేసుకున్నారు. కరుణానిధి రచించిన సినిమాలో తాను నటించిన సందర్భాన్ని నటి కాంచన స్మరించుకున్నారు.

తల్లీ తండ్రి లేని అనాథలా ఉన్న తాను.. కరుణానిధిని పెదనాన్నలా భావించానని.. ఇవాళ ఆయన కూడా తనను వదిలి వెళ్లారని శివాజీగణేశన్‌ తనయుడు.. నటుడు ప్రభు వాపోయారు. కరుణానిధిని రాజకీయ నాయకుడిగానే చూడలేమని, తమిళ భాషకు, సాహిత్యానికి ఆయన చేసిన సేవ.. శాశ్వత యశస్సును సముపార్జించిందని నటుడు నాజర్‌ అన్నారు. కరుణానిధికి సమానమైన నాయకుడు, సాహితీవేత్త భవిష్యత్తులో మరెవరూ రారని నటులు వివేక్‌, మన్సూర్‌అలీఖాన్‌ తదితరులు వ్యాఖ్యానించారు. కరుణానిధి మరణం.. తమిళనాడు ప్రజలందరికీ తీరని వేదనను కలిగించిందని నటదర్శకుడు టి.రాజేంద్రన్‌ అన్నారు. తన తండ్రి ఎం.ఆర్‌.రాధాతో కరుణానిధి అనుబంధాన్ని రాధారవి గుర్తు చేసుకున్నారు. కరుణానిధి తమిళ సినీ రంగంపై తనదైన ముద్ర వేశారని.. అది శాశ్వతంగా నిలిచిపోతుందని పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. 

21:04 - August 8, 2018

చెన్నై : కరుణానిధికి దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు ఘన నివాళులర్పించారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌తో సహా పలువురు నేతలు చెన్నైకు తరలివచ్చి.. కరుణానిధి భౌతికకాయానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కరుణానిధితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తమిళుల ఆరాధ్య నేత, డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధిని చివరిసారి చూసి నివాళులర్పించేందుకు దేశ నలుమూలల నుంచి రాజకీయనేతలు, సినీ ప్రముఖులు, ఇతర రంగాల వ్యక్తులు తరలివచ్చారు. కరుణానిధి మృతి వార్త తెలుసుకుని అందరూ చెన్నైకు చేరుకున్నారు. ఉదయం నుంచి రాజాజీ హాల్‌లో ప్రజల సందర్శనార్ధం ఉంచిన.. కరుణానిధి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు.. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

బుధవారం ఉదయం ప్రధాని మోదీ.. కళైంగర్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. భావోద్వేగంతో ఉన్న స్టాలిన్‌, కనిమొళిలను మోదీ ఓదార్చారు. ప్రధానితో పాటు.. రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ కూడా కరుణానిధికి నివాళులర్పించారు. ఇక కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా కరుణానిధికి నివాళులర్పించారు. మధ్యాహ్నం చెన్నై చేరుకున్న రాహుల్‌.. రాజాజీ హాల్‌కు వెళ్లి.. కరుణానిధి భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక కాంగ్రెస్‌ నాయకులు గులాంనబీ అజాద్‌, వీరప్ప మెయిలీ కూడా కరుణ పార్థీవదేహానికి నివాళులర్పించారు.

కరుణానిధి భౌతికకాయానికి తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. కరుణానిధి పార్ధీవదేహానికి తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థీవదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. హైదరాబాద్‌ నుంచి చెన్నై వెళ్లిన కేసీఆర్‌... కరుణానిధి కుమారుడు స్టాలిన్‌, కూతురు కనిమొళితోపాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్‌తో పాటు ఆయన కూతురు, నిజామాబాద్‌ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కూడా ఉన్నారు. కరుణానిధికి నివాళులర్పించిన అనంతరం కేసీఆర్‌ పిడికిలి పైకెత్తి కరుణానిధి అమర్‌రహే అని నినదించారు.

కరుణానిధి భౌతికకాయానికి కేరళ సీఎం పినరాయి విజయన్‌ నివాళులర్పించారు. కరుణానిధితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా విజయన్‌ గుర్తు చేసుకున్నారు. ఇక కరుణానిధి భౌతికకాయానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్‌, సీపీఐ నేత డి.రాజా నివాళులర్పించారు. 7 దశాబ్ధాల పాటు రాజకీయాలను ఏలిన మేటి నేత కరుణానిధి అని ప్రకాశ్‌కరత్‌ అన్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కూడా కరుణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. కరుణానిధి గొప్ప నేత అని అఖిలేశ్‌ కొనియాడారు.

కరుణానిధి మరణం చీకటిరోజుగా అభివర్ణించి రజనీకాంత్‌.. రాజాజీ హాల్‌లో కరుణానిధి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అదేవిధంగా కమల్‌హాసన్‌ కూడా రాజకీయ కురువృద్ధుడికి నివాళుర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బుధవారం ఉదయం నుంచి రాజాజీహాల్‌లో రాజకీయాలకతీతంగా నేతలంతా నివాళులర్పించారు. మెరీనాబీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబుతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. ఇక పార్లమెంట్‌ కూడా కరుణానిధికి ఘనంగా నివాళులర్పించింది. పార్లమెంట్‌ ప్రారంభమైన వెంటనే ఉభయసభల్లో సభ్యులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. 

21:01 - August 8, 2018

చెన్నై : తమిళ ప్రజల ఆరాధ్య నేత, మాజీ సీఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు ఘనంగా ముగిశాయి. మెరీనా బీచ్‌లోని మాజీ సీఎం అన్నాదురై స్మారక కేంద్రంలో.. అన్నా స్క్వేర్‌ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో రాజకీయ కురువృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించారు. బంగారు పూత పూసిన శవపేటికలో కరుణానిధి పార్థివదేహాన్ని ఖననం చేశారు. దాదాపు 2 గంటలకు పైగా సాగిన అంతిమయాత్రలో రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు.. డీఎంకే కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు అంతిమ నివాళులు సమర్పించిన అనంతరం.. కరుణానిధి పార్థీవదేహాన్ని కననం చేశారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో మెరీనా బీచ్‌ శోకసంద్రమైంది.

కరుణానిధి అంత్యక్రియల్లో తమిళనాడు గవర్నర్, ముఖ్యమంత్రి పళనిస్వామి, రాహుల్‌గాంధీ, ఆజాద్‌, శరద్‌పవార్‌, దేవెగౌడ, చంద్రబాబు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నేత గులాంనబీ అజాద్‌, వీరప్పమొయిలీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి తదితరులు కరుణానిధి పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు డీఎంకే శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు మెరీనా బీచ్‌కు భారీగా తరలివచ్చారు.

ఉదయం నుంచి రాజాజి హాలులో ప్రజల సందర్శనార్ధం ఉంచిన కరుణానిధి భౌతికకాయాన్ని.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అంతిమయాత్రగా మెరీనా బీచ్‌కు తీసుకువచ్చారు. అంతిమయాత్ర వాలాజా రోడ్‌, చెపాక్‌ స్టేడియం, శివానందరోడ్‌, తంతైపెరియార్‌ రోడ్‌ మీదుగా మెరీనాబీచ్‌కు వరకు సాగింది. అంతిమయాత్ర దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగింది. దారి పొడువునా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కరుణానిధికి కన్నీటి నివాళులర్పించారు.

ఇక కరుణానిధి భౌతికకాయాన్ని మెరీనాబీచ్‌లోని అన్నాస్క్వేర్‌ ప్రాంతంలో మాజీ సీఎం అన్నాదురై స్మారక కేంద్రం సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో ఖననం చేశారు. బంగారుపూత పూసిన శవపేటికలో కరుణానిధి పార్థివ దేహాన్ని ఉంచి ఖననం చేశారు. 'విరామం ఎరుగకుండా శ్రమించిన నాయకుడు.. ఇదిగో విశ్రమిస్తున్నాడు' అని శవపేటిక మీద తమిళంలో రాయించారు. కరుణానిధిని ఖననం చేసే సమయంలో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అప్పటివరకు ఎంతో నిబ్బరంగా ఉన్న స్టాలిన్‌... ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. గుక్కుతిప్పుకోకుండా ఆయన కంటతడి పెట్టడంతో.. అంత్యక్రియలకు హాజరైన పలువురు ప్రముఖులు ఆయనకు స్వాంతన పలికారు.

తమ అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలతో మెరీనా బీచ్‌ జనసంద్రంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, గులాంనబీ ఆజాద్‌, వీరప్పమొయిలీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, జేడీయూ నేత దేవెగౌడ, వివిధ పార్టీల నేతలు మెరీనా బీచ్‌కు చేరుకుని... కరుణానిధి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. ఇదిలావుంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్దివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన రాజాజీ హాలు వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 30 మంది గాయపడ్డారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. అభిమానులు భారీగా తరలిరావడంతో.. స్టాలిన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆందోళన చేయకుండా కడచూపు చూసి ఇతరులకు అవకాశం కల్పించాలని కోరారు. అనంతరం డీఎంకే కార్యకర్తలు, అభిమానుల శోకసంద్రం మధ్య కరుణానిధి అంత్యక్రియలు ముగించారు. 

20:38 - August 8, 2018

క్వారీ పేలుడులో అరెస్టులు...

కర్నూలు : క్వారీ పేలుడు ఘటనలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. క్వారీ యజమానితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు శారు. గురువారం వీరిని ఆలూరు కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. 

ప్రతిపక్ష అభ్యర్థికి వైసీపీ మద్దతు...

హైదరాబాద్ : రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థికి వైసీపీ మద్దతినివ్వనుంది. ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. 

అనూష కేసులో ట్విస్టు...

హైదరాబాద్ : అనూష హత్య కేసులో మరో ట్విస్టు చోటు చేసుకుంది. ప్రేమోన్మాది వెంకటేష్ కు మరో అమ్మాయితో లవ్ ఎఫైర్ ఉన్నట్లు, ఇన్ స్ట్రాగామ్ లో వెంకటేష్ ప్రేమ కార్యకలాపాలు చూసి వెంకటేష్ ను అనూష దూరం పెట్టింది. ఎలాగో అనూషను ఓయూకి వెంకటేష్ రప్పించాడు. బ్లేడ్ తో చంపేస్తానని అనూషను బెదిరించాడు. దీనితో ప్రేమిస్తానని అనూష చెప్పినా వెంకటేష్ ఆమెను దారుణంగా చంపేశాడు. వెంకటేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

నల్గొండ పోలీసు వాహనానికి ప్రమాదం...

నల్గొండ : నాంపల్లి పోలీసు వాహనానికి ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి చెట్ల పొదల్లోకి వాహనం దూసుకెళ్లింది. ఈఘటనలో పోలీసులకు, నిందితులకు స్వల్పగాయాలయ్యాయి. నిందితులను దేవరకొండకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఓయూకు రాహుల్ వద్దన్న విద్యార్థి సంఘాలు...

హైదరాబాద్ : రాష్ట్ర హోం మంత్రి నాయినీ నర్సింహరెడ్డిని ఓయూ విద్యార్థి సంఘాలు కలిశాయి. ఈనెల 14వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓయూలోకి అనుమతినించవద్దని వినతిపత్రం ఇచ్చారు. 

గురుకుల టీజీటీ, పీజీటీ దరఖాస్తు గడువు పెంపు...

హైదరాబాద్ : గురుకుల టీజీటీ, పీజీటీ దరఖాస్తు గడువును గురుకుల నియామక బోర్డు పొడిగించింది. ఈనెల 10వరకు గడువు పొడిగించింది. 

20:09 - August 8, 2018

కొన్ని వందల సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉండి ఈ రాజ్యంలో ఈ ప్రాంతంలో ఈ దేశంలో అంటరాని బతుకు బతుకుతున్న బహుజనులు రాజ్యాధికారం మాది...ఈ దేశం..ఈ రాష్ట్రం మాది...రాష్ట్రంలో ఉన్న సంపద మాది...అని చెప్పి బైలెలుతున్నరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవ యాత్ర పేరిట 80 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ప్రారంభం కొనసాగుతోంది. ఈ యాత్రను తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆయనతో 'మల్లన్న' ముచ్చటించారు. వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

ప్రొ.అగర్వాల్ విజ్ఞాపనకు కేంద్రం విలువ ఇవ్వాలి -పవన్...

విజయవాడ : గంగా నదిని కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకరావాలని డిమాండ్ చేస్తున్న ప్రొ. జి.డి.అగర్వాల్ విజ్ఞాపనకు ప్రభుత్వం విలువ ఇవ్వాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గంగా చట్టం తీసుకరావాలనే వారి దీక్షకు నైతిక మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. 

పూర్తయిన 'కరుణ' అంత్యక్రియలు...

చెన్నై : తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు కాసేపటి క్రితం ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాల మధ్య..అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. 

19:02 - August 8, 2018

చెన్నై : తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. వేలాది మంది అభిమానులు, నేతలు, కార్యకర్తలు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. మెరీనా బీచ్ లోని స్క్వేర్ లో ప్రభుత్వ లాంఛనాలతో 'కరుణా నిధి' అంతిమ సంస్కారాలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వేలాదిగా డీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అంతకుముందు రాజాజీ హాల్ నుండి అంతిమయాత్ర కొనసాగింది. రాజాజీ హాల్ నుంచి వాలాజా రోడ్, చేపాక్ స్టేడియంల మీదుగా మెరీనా బీచ్ కు చేరుకుంది. అంత్యక్రియల్లో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

ఎన్ఐఏ ఆపరేషన్ కొనసాగుతోంది...

హైదరాబాద్ : ఎన్ఐఏ ఆపరేషన్ కొనసాగుతోంది. పాతబస్తీకి చెందిన పది మందిని ఎన్ఐఏ విచారించింది. బేగంపేటలోని ఎన్ఐఏ కార్యాలయానికి అధికారులు తీసుకొచ్చారు. 

కుటుంబసభ్యులు చివరి నివాళి...

చెన్నై : తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధికి కుటుంబసభ్యులు చివరిసారిగా నివాళులర్పిస్తున్నారు. మెరీనా బీచ్ లో ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. 

మెరీనా బీచ్ కు కరుణ కుటుంబసభ్యులు...

చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి అంతిమ సంస్కారాలు మెరీనా బీచ్ లో కాసేపట్లో జరుగనున్నాయి. కుమారుడు స్టాలిన్, కూతురు కనిమొళి, ఆయన కుటుంబసభ్యులు కొద్ది సేపటి క్రితం అక్కడికి చేరుకున్నారు.

మెరీనా బీచ్ కు 'కరుణా నిధి' అంతిమయాత్ర...

చెన్నై : మెరీనా బీచ్ కు 'కరుణా నిధి' అంతిమయాత్ర చేరుకుంది. కాసేపట్లో వేలాది అభిమానుల అశ్రునయనాల మధ్య కరుణా అంత్యక్రియలు జరుగనున్నాయి. 

మెరీనా బీచ్ లో రాహుల్, బాబు..ఆజాద్,

చెన్నై : తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి అంతిమ యాత్ర కొనసాగుతోంది. అంతిమసంస్కారాలు జరిగే మెరీనా బీచ్ కు ప్రజలు భారీగా పోటెత్తారు. సినీ, రాజకీయ రంగ ప్రముఖులు మెరీనా బీచ్ కు చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులున్నారు. 

కొనసాగుతున్న 'కరుణ' అంతిమయాత్ర...

చెన్నై : తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి అంతిమ యాత్ర కొనసాగుతోంది. డీఎంకే శ్రేణులు, అభిమానుల అశ్రునయనాల మధ్య కరుణా నిధి అంతిమయాత్ర జరుగుతోంది.

రాజీనామా చేసిన మంత్రి...

పాట్నా : అనాథ బాలికలపై అత్యాచారం కేసులో మంత్రిపై వేటు పడింది. బీహార్ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మంజువర్మ రాజీనామా చేశారు. సీఎం నితీశ్ ఆదేశాలతో మంజువర్మ తప్పుకున్నారు. ముజఫర్ నగర్ అత్యాచారం కేసులో మంజువర్మ భర్తపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 

17:11 - August 8, 2018

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన పార్థివదేహాన్ని త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది మోస్తూ అంతిమయాత్ర వాహనంలోకి చేర్చారు. అశేష జనవాహిని మధ్య కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. సినీ, రాజకీయ రంగ ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. మెరీనీ బీచ్ లో ఈ కార్యక్రమం జరుగనుంది. రాజాజీ హాల్ నుంచి వాలాజా రోడ్, చేపాక్ స్టేడియంల మీదుగా మెరీనా బీచ్ కు చేరుకుంటుంది. అక్కడ గంటలకు మెరీనా బీచ్ లోని స్క్వేర్ లో ప్రభుత్వ లాంఛనాలతో 'కరుణా నిధి' అంతిమ సంస్కారాలు జరుగుతాయి.

కరుణ శవపేటికపై చెక్కిన 'కరుణ' మాటలు..

తమిళనాడు : ముప్పై మూడేళ్ల క్రితం కరుణానిధి తన కుమారుడు స్టాలిన్ కు ఓ మాట చెప్పారట. ‘మనం చనిపోయినప్పుడు ప్రజలు మన సమాధిని చూసి..‘విరామం లేకుండా పనిచేసిన వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నారు’ అనేంతగా పేరు తెచ్చుకోవాలి’ అని స్టాలిన్ కు కరుణ చెప్పారట. ఇప్పుడు, ఈ విషయం గురించి ప్రస్తావించడం ఎందుకంటే, కరుణానిధి భౌతికకాయాన్ని ఉంచే శవపేటికపై ఆ మాటలనే తమిళంలో చెక్కించారు. కాగా, రాజాజీహాల్ నుంచి కరుణానిధి అంతిమయాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. వాలాజారోడ్, చెపాక్ స్టేడియం మీదుగా అంతిమయాత్ర కొనసాగనుంది.

ప్రారంభమైన కరుణానిధి అంతిమయాత్ర..

తమిళనాడు : మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన పార్థివదేహాన్ని త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది తమ భూజాలపై మోస్తూ... అంతిమయాత్ర వాహనంలోకి చేర్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వేలాది మంది హృదయాలు బరువెక్కాయి. అక్కడున్న వారంతా తీవ్ర భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టారు. అశేష జనవాహిని కరుణ పార్థివ దేహం వెంట నడుస్తూ మెరీనా బీచ్ వైపు కదిలారు. ఈ అంతిమయాత్ర రాజాజీ హాల్ నుంచి వాలాజా రోడ్, చేపాక్ స్టేడియంల మీదుగా మెరీనాకు చేరుకుంటుంది. 5 గంటలకు మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగుతాయి.

గొప్ప మానవతావాదిని కోల్పోయాం,కరుణ మృతి పూడ్చలేని : చంద్రబాబు

చెన్నై : ఒక గొప్ప మానవతావాది, నాయకుడు కరుణానిధిని మనం కోల్పోయామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్న గొప్పనేత కరుణానిధి అని, తమిళనాడు ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని అన్నారు. కరుణానిధి చేసిన సేవలను తమిళనాడు మాత్రమే కాక యావత్ దేశమంతా గుర్తుంచుకుంటుందని చెప్పారు. కరుణ మరణంతో దక్షిణ భారతదేశం ఒక మహా నేతను కోల్పోయిందని... ఆ లోటును మరెవరూ భర్తీ చేయలేరని అన్నారు కరుణానిధితో, డీఎంకే పార్టీతో టీడీపీకి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. చెన్నైలో కరుణ పార్థివదేహానికి చంద్రబాబు నివాళి అర్పించారు.

కరుణ అంతిమయాత్రలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు..

తమిళనాడు : డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి అంతియ యాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. పలు రాజకీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా వున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెన్నై బయలుదేరారు. కరుణానిధికి నివాళులర్పించి అంతిమయాత్రలో చంద్రబాబు పొల్గొననున్నారు. రాజాజీ హాల్ నుండి వాలాజారోడ్, చెపాక్ స్టేడియం మీదుగా అంతిమయాత్ర కొనసాగనుంది. సాయం 5 గంటలకు అ యాత్ర ప్రారంభం కానుంది. మెరీనా బీచ్ లోని అన్నా స్వేక్వర్ లో ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధి అంతమ సంస్కారాలు జరగనున్నాయి.

15:56 - August 8, 2018

చెన్నై : తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి అంతిమ కార్యక్రమాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాజాజీ హాల్ లో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని పలువురు సందర్శించి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. సినీ, రాజకీయ రంగ ప్రముఖులు చెన్నైకి విచ్చేసి కరుణకు ఘనంగా నివాళులర్పించారు. మెరీనా బీచ్ వద్ద ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమం జరుగనుంది. మెరీనా తీరంలో అంత్యక్రియలకు మద్రాస్ హైకోర్టు అనుమతిచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మిలటరీని రంగంలోకి దించారు. మెరీనా..అన్నా స్క్వేర్ వద్దే కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంతిమ యాత్రలో భారీగా నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. 

కరుణకు రాహుల్ నివాళి..

తమిళనాడు : అనారోగ్యంతో కన్నుమూసిన రాజకీయ కురువృద్ధుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నివాళులర్పించారు. దిల్లీ నుంచి చెన్నై చేరుకున్న రాహుల్‌.. రాజాజీ హాల్‌ వద్దకు చేరుకుని కరుణానిధి పార్థివదేహానికి అంజలి ఘటించారు. ఆయన కుమారుడు స్టాలిన్‌ను పరామర్శించారు. రాహుల్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ తదితరులు కరుణానిధికి నివాళులర్పించారు.

దేశ ప్రజలు గొప్ప నాయకుడిని కోల్పోయారు : వీరప్ప మొయిలీ

తమిళనాడు : ఆయన మృతికి తీరని లోటని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. కరుణ పార్థీవ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం, పేద ప్రజలకు ఆయన మృతి తీరని లోటన్నారు. ఎంతో చురుకుగా ఉంటూ రాజకీయాలను కొనసాగించారని, తమిళడు రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజలు గొప్ప నాయకుడిని కోల్పోయారన్నారు. తాను ఆప్తమిత్రుడిని కోల్పోయాయన్నారు. 

కరుణ సామాజిక న్యాయం కోసం కృషి చేశారు : ఆజాద్

తమిళనాడు : కరుణా నిధి గొప్ప జాతీయ నేత అని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. కరుణ పార్థీవ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం జీవించారని, సామాజిక న్యాయం కోసం కృషి చేశారని తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిందన్నారు. అలాంటి ఎన్నో ప్రతిభాపాటవాలున్న నేత ఇక లేకపోవడం బాధించదన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నట్లు, కరుణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

పట్టించుకునే దిక్కులేక వృద్ధ దంపతులు ఆత్మహత్య..

కృష్ణా : ముసునూరులో విషాదం చోటుచేసుకుంది. ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమను పట్టించుకునే దిక్కు లేకపోవటంతో రామదాసు అనే 90 సంవత్సరాల వృద్ధుడు అచ్చమాంబ అనే 80 సంవత్సరాల భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారిద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఇద్దరు మృతి చెందారు. కొందరి పాలిట వృద్ధాప్యం వరమైతే ఇటువంటి వారి పట్ల శాపంగా మారింది. 

రాజాజీ హాల్ వద్ద తోపులాట, ఇద్దరు మృతి..

తమిళనాడు : చెన్నై రాజాజీ హాలు వద్ద తోపులాట చోటుచేసుకుంది. మాజీ సీఎం కరుణానిధి భౌతిక కాయం దగ్గర నుండి చూసేందుకు బారికేడ్లను తోసుకుని అభిమానులు జొరబడేందుకు యత్నించారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో స్వల్పంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 33మందికి గాయాలయ్యాయి. 

కరుణకు పలువురి నివాళి..

తమిళనాడు : దివంగత కరుణానిధిని చివరిసారి చూసుకునేందుకు, ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించేందుకు దేశ నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు చైన్నైకి తరలివస్తున్నారు. కాసేపటి క్రితమే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లు చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి రాజాజీ హాల్ కు వెళ్లి వారు నివాళి అర్పించారు. అనంతరం కరుణ కుటుంబసభ్యులను పరామర్శించారు.

15:19 - August 8, 2018

చెన్నై : కరుణా నిధి గొప్ప జాతీయ నేత అని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. కరుణ పార్థీవ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం జీవించారని, సామాజిక న్యాయం కోసం కృషి చేశారని తెలిపారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిందన్నారు. అలాంటి ఎన్నో ప్రతిభాపాటవాలున్న నేత ఇక లేకపోవడం బాధించదన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నట్లు, కరుణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు వెల్లడించారు.

వీరప్ప మొయిలీ...
ఆయన మృతికి తీరని లోటని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. కరుణ పార్థీవ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం, పేద ప్రజలకు ఆయన మృతి తీరని లోటన్నారు. ఎంతో చురుకుగా ఉంటూ రాజకీయాలను కొనసాగించారని, తమిళడు రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రజలు గొప్ప నాయకుడిని కోల్పోయారన్నారు. తాను ఆప్తమిత్రుడిని కోల్పోయాయన్నారు. 

15:17 - August 8, 2018

చెన్నై : తమ అభిమాన నాయకుడిని చూసేందుకు రాజాజీహాల్ కు భారీగా అభిమానులు చేరుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి పార్థివ దేహం రాజాజీ హాల్ లో ఉంచిన సంగతి తెలిసిందే. ఆయనకు నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు చెన్నైకి చేరుకుంటున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలు విచ్చేసి ఘనంగా నివాళలర్పించారు. కరుణ కుటుంబాన్ని ఓదార్చారు. వివిధ జాతీయ పార్టీల నేతలు కూడా విచ్చేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు చెనైకి చేరుకున్నారు. కాసేపటి క్రితం సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఆయనతో పాటు ఎంపీ కవిత, తదితరులున్నారు. నివాళి అర్పించిన అనంతరం... జోహార్ కరుణానిధి అంటూ కేసీఆర్ పిడికిలి బిగించారు. అనంతరం కరుణానిధి కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు.

శక్తివంతమైన నేత కరుణానిధికి నా సంతాపం: అమితాబ్

తమిళనాడు : కలైంజర్ కరుణానిధి మరణంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. తన తొలి జాతీయ అవార్డును కరుణ చేతుల మీదుగానే అందుకున్నానని భావోద్వేగంతో ట్వీట్ చేశారు. కరుణానిధి మృతి పట్ల అమితాబ్ విచారం వ్యక్తం చేశారు. కరుణ చనిపోవడంపై బిగ్ బీ స్పందిస్తూ..గౌరవీనయులైన, శక్తిమంతమైన నేత కరుణానిధికి మృతికి సంతాపం తెలుపుతున్నాను. నేను నటించిన ‘సాత్ హిందుస్తానీ’ సినిమాకు తొలి జాతీయ అవార్డును చెన్నైలో జరిగిన కార్యక్రమంలో కరుణ చేతుల మీదుగానే అందుకున్నాను. అప్పుడు ఆయన తమిళనాడు సీఎంగా ఉన్నారు’’ అని అమితాబచ్చన్ ట్వీట్ చేశారు.

14:51 - August 8, 2018

చెన్నై : తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పార్థివ దేహాన్ని సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సందర్శించి నివాళుర్పిస్తున్నారు. సాయంత్రం మెరీనా బీచ్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానుల సందర్శనార్థం రాజాజీ హాల్ లో 'కరుణ' భౌతికకాయన్ని ఉంచారు. ఆయన కడసారి చూసేందుకు భారీగా అభిమానులు, డీఎంకే కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ఆ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం 4గంటల నుండి రాజాజీహాల్ నుండి కరుణానిధి అంతమయాత్ర జరుగనుంది. చెపాక్ స్టేడియం మీదుగా యాత్ర కొనసాగనుంది. సాయంత్రం ఆరు గంటలకు మెరీనా బీచ్ లోని అన్నా స్వ్కేర్ వద్ద అంత్యక్రియలు జరుగనున్నాయి.

అఖిలేష్ యాదవ్...
ఆయన జీవితంలో ఎన్నో విశేషాలు నెలకొన్నాయని అఖిలేష్ యాదవ్ తెలిపారు. కరుణా నిధి పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పేద వారి కోసమే ఆయన జీవించారని, కేవలం 14 ఏళ్ల వయస్సు నుండే ప్రజల కోసం ఆలోచించారన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు తెలిపారు. 

పళనీ నిర్ణయం నిరాశపరిచింది - స్టాలిన్..

చెన్నై : సీఎం పళనీ స్వామి నిర్ణయం అందర్నీ నిరాశపరిచిందని, మెరీనా బీచ్ లో అంత్యక్రియలపై కోర్టు తీర్పు ప్రజావిజయమని కరుణ తనయుడు స్టాలిన్ పేర్కొన్నారు. అంతిమయాత్ర సజావుగా సాగేలా సహకరించాలన్నారు. అంత్యక్రియల విషయంలో వివాదం సృష్టించాలని చూశారని, భద్రత ఎందుకు తొలగించాల్సి వచ్చిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. 

14:14 - August 8, 2018

చెన్నై : తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధిని కడసారి చూసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు విచ్చేస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న 'కరుణ' మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికదేహాన్ని అభిమానుల సందర్శనార్థం రాజాజీ హాల్ కు తరలించారు. బుధవారం ఉదయం నుండి సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. హాల్ కు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.

లాఠీఛార్జీ...
రద్దీని పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. బారికేడ్లను ధ్వంసం చేసి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనితో పోలీసులు లాఠీలను ఝులిపించారు. సుమారు 25 మంది కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. హాల్ వద్ద మరింత భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాజాజీ హాల్ వద్ద ఓ మహిళ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

స్టాలిన్ జోక్యం...
ఈ నేపథ్యంలో కరుణ కుమారుడు స్టాలిన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎవరూ ఉద్వేగాలకు లోను కావద్దని..భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి తిరిగి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. ఇక్కడ దాక రావద్దని..చాలా సమస్యలున్నాయని..అక్కడి నుండే నివాళులర్పించేందుకు ప్రయత్నించాలని స్టాలిన్ కోరారు. అభిమానులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.

అంత్యక్రియలు...
మరోవైపు కరుణా నిధి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మెరీనా బీచ్ వద్ద ఈ కార్యక్రమం జరుగనుంది. అంతకంటే ముందు అంత్యక్రియలపై వివాదం నెలకొంది. మెరీనా బీచ్‌లో ఖననం, స్మారక కేంద్రం నిర్మాణానికి అనుమతించాలని డీఎంకే కోరుతుంటే.... ప్రభుత్వం అందుకు నిరాకరిస్తోంది. దీంతో డీఎంకే హైకోర్టును ఆశ్రయించింది. రాత్రి అర్థరాత్రి విచారణ జరిపిన న్యాయస్థానం ఏమీ తేల్చలేక ఈ ఉదయం 8గంటలకు తదుపరి విచారణ వాయిదా వేసింది.

కోర్టు అనుమతి...
మెరీనా తీరంలో అంత్యక్రియలకు మద్రాస్ హైకోర్టు అనుమతిచ్చింది. గతంలో జానకీరాంచంద్రన్ అంత్యక్రియలకు డీఎంకే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తమిళ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వాదనను డీఎంకే లాయర్ తప్పుబట్టారు. ప్రజల సెంటిమెంట్ దెబ్బతింటుందని డీఎంకే లాయర్ అన్నారు. సాయంత్రం మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు జరుగనున్నాయి. మెరీనా..అన్నా స్క్వేర్ వద్దే కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

చెన్నైకి కేసీఆర్...

హైదరాబాద్ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కరుణానిధి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి చెన్నై కి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బయల్దేరారు. ఆయన వెంటన ఎంపీ కవిత, తదితరులున్నారు. 

రైల్వే జోన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలం : మాణిక్యాలరావు

ఢిల్లీ : విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వుందని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాల రావు అభిప్రాయపడ్డారు. రైల్వే జోన్ విషయంలో రాజకీయ లబ్ది కోసం టీడీపీ రాద్ధాంతం చేస్తోందనీ..ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని మాణిక్యాలరావు పేర్కొన్నారు. రైల్వే జోన్ విషయంలో టీడీపీ వైఖరిని ఖండిస్తున్నామన్నామన్నారు. బుందేల్ ఖండ్ కు ఇచ్చిన ప్యాకేజీనే ..ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ఇచ్చారని మాణిక్యాలరావు తెలిపారు. రై.350 కోట్లు ఎన్డీయేలో వున్నప్పుడే వెనక్కి తీసుకున్నామని ఆయన స్పష్టంచేశారు. దానికి సంబంధించిన టెక్నికల్ కారణాలను అన్వేషిస్తున్నామన్నారు.

13:42 - August 8, 2018

చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. చెన్నైలోని రాజాజీ మహల్ లో కరుణానిధి భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. కరుణానిధి కుటుంబ సభ్యులను ప్రధాని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కనిమొళి, స్టాలిన్ లను ఓదార్చారు. కరుణానిధి నిన్న కన్నుమూశారు. కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కరుణానిధి మృతికి రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. రెండు రోజుల పాటు తమిళనాడు ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుంది. ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించారు. సినిమా థియేటర్లను సైతం రెండు రోజుల పాటు స్వచ్ఛందంగా మూసివేయనున్నారు.    

కరుణకు నివాళులర్పించనున్న సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి భౌతికకాయానికి నివాళులర్పించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ చెన్నై చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై కు చేరుకుని అక్కడి నుండి రాజాజీ హాల్‌లో కరుణానిధి పార్థివదేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. కావేరి ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం కరుణ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కరుణానిధి మృతిపట్ల కేసీఆర్ సంతాపం కూడా తెలిపారు. సామాన్య జనాలకు రాజకీయ చైతన్యం కలిగించిన కొద్ది మందిలో ఒకరిగా కరుణానిధి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతారని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కే మా మద్దతు : టీడీపీ ఎంపీలు

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇవ్వమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చౌదరి తెలిపారు. ఈ మేరకు హరిప్రసాద్‌కు మద్దతుగా తమ పార్టీ ఎంపీలు ఓటేస్తారని చెప్పారు. బీకే హరిప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఎన్డీఏ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ పోటీ చేస్తున్నారు.

కరుణ మృతి..గుండు గీయించుకుంటున్న అభిమానులు..

తమిళనాడు : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతితో డీఎంకే కార్యకర్తలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కరుణానిధి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. కోయంబత్తూరులో కొంతమంది అభిమానులు, మద్దతుదారులు.. కరుణానిధి మృతికి నివాళిగా గుండు గీయించుకుంటున్నారు. తమిళనాడు ప్రజలు ఒక మంచి నాయకుడిని కోల్పోయారని పలువురు కొనియాడుతున్నారు. కరుణానిధిని కడసారి చూసేందుకు చెన్నైలోని రాజాజీ హాల్‌కు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు తరలివస్తున్నారు.

ఏసీబీ వలలో విద్యుత్ శాఖ డీఈ..

హైదరాబాద్: అవినీతికి పాల్పడుతూ విద్యుత్‌శాఖ డీఈ దుర్గారావు ఏసీబీకి చిక్కాడు. బిల్లులు మంజూరు చేయడానికి గుత్తేదారు నుంచి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు ప్రత్యక్షంగా పట్టుకున్నారు. నగరంలోని సైదాబాద్ గ్రీన్ పార్కు కాలనీలోని ఇంట్లో దుర్గారావు లంచం తీసుకుంటూ చిక్కాడు. దుర్గారావు భువనగిరి టీఎస్‌ఎస్పీడీసీఎల్ డీఈగా  విధులు నిర్రవహిస్తున్నాడు. 

13:17 - August 8, 2018

చెన్నై : ప్రజల సందర్శనార్థం డీఎంకే అధినేత కరుణానిధి పార్థివదేహం ఉంచిన రాజాజీ మహల్ జనసంద్రంగా మారింది. కరుణానిధి భౌతికకాయాన్ని సందర్శించేందుకు జనం బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. కరుణానిధి అభిమానులు చెన్నైకి బారులు తీరారు. కరుణ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనను కడసారి చూసేందుకు విదేశాల నుంచి ప్రజలు తండోపతండాలుగా చేరుకుంటున్నారు. ఢిల్లీతోపాటు అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ జాతీయ జెండా అవనతం చేశారు. కరుణ అంత్యక్రియలకు ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. చెన్నై నగరం విషాదచాయలు అలుముకున్నాయి. 
మెరీనా తీరంలో కరుణానిధి అంత్యక్రియలు
మెరీనా తీరంలో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డంకులు తొలగిపోయాయి. కరుణానిధి అంత్యక్రియలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మెరీనా తీరంలో అంత్యక్రియలకు మద్రాస్ హైకోర్టు అనుమతిచ్చింది. గతంలో జానకీరాంచంద్రన్ అంత్యక్రియలకు డీఎంకే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తమిళ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వాదనను డీఎంకే లాయర్ తప్పుబట్టారు. ప్రజల సెంటిమెంట్ దెబ్బతింటుందని డీఎంకే లాయర్ అన్నారు.  సాయంత్రం మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు జరుగనున్నాయి. మెరీనా..అన్నా స్క్వేర్ వద్దే కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
కావేరీ ఆస్పత్రిలో కరుణానిధి మృతి 
కరుణానిధి నిన్న కన్నుమూశారు. కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కరుణానిధి మృతికి రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. రెండు రోజుల పాటు తమిళనాడు ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుంది. ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించారు. సినిమా థియేటర్లను సైతం రెండు రోజుల పాటు స్వచ్ఛందంగా మూసివేయనున్నారు.    

 

12:42 - August 8, 2018

గుంటూరు : దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు కరుణానిధి అని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. కరుణానిధి మృతికి సీఎం సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో రాటుదేలిన నేత కరుణానిధి అన్నారు. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న నేత అని పేర్కొన్నారు.

 

బీజేపీకి కాంగ్రెస్ షాక్..పెద్దలసభ డిప్యూటీ చైర్మన్ గా బీకే హరిప్రసాద్..

ఢిల్లీ : రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలన్న బీజేపీకి షాకిస్తూ, కర్ణాటకకు చెందిన ఎంపీ బీకే హరిప్రసాద్ ను బరిలోకి నిలపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. డిప్యూటీ చైర్మన్ పదవికి 9వ తేదీన ఎన్నికలు జరిపించేందుకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, సీపీఐ తదితర పార్టీల మద్దతుతో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా హరిప్రసాద్ పేరును తెరపైకి తెచ్చారు. సీపీఐ నేత డీ రాజా స్వయంగా హరిప్రసాద్ పేరును ప్రకటించారు. ఇక, కాంగ్రెస్ కు ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం తదితర పార్టీల మద్దతు ఖాయంగా కనిపిస్తోంది.

అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయాం : బాలకృష్ణ

అమరావతి : భారతావని ఓ అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయిందని హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతిపట్ల ఆయన తన సంతాపాన్ని తెలుపుతూ ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. కరుణానిధి మరణం రాజకీయాలకు మాత్రమే కాదు, చిత్రసీమకు కూడా తీరని లోటు. నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేది. 80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది మాములు విషయం కాదు. అటువంటి రాజకీయ చరిత్ర కలిగిన మహానుభావుడు, నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం.

దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడు కరుణ : చంద్రబాబు

అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి సంతాపం ప్రకటించారు. దేశ రాజకీయాల్లో రాటుతేలిని నేత కరుణానిధి అని చంద్రబాబు ప్రశంసించారు. దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడనీ..కోట్లాదిమంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న గొప్ప నేత కరుణానిధి అని చంద్రబాబు పేర్కొన్నారు. 

పార్లమెంట్ ఉభయ సభల్లో కరుణకు సంతాపం..

ఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి పార్లమెంటు ఘన నివాళి అర్పించింది. ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ సహా లోక్ సభ సభ్యులంతా లేచి నిలబడి ఓ నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు, రాజ్యసభలో కరుణానిధి సంతాప సందేశాన్ని ఛైర్మన్ వెంకయ్య నాయుడు చదివి వినిపించారు. సభ్యులంతా కరుణకు సంతాపం ప్రకటించి, నివాళులర్పించారు. ఓ నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం కరుణకు గౌరవ సూచకంగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు వెంకయ్య ప్రకటించారు. రేపు ఉదయం ఉభయసభలు యథావిధిగా సమావేశమవుతాయి.

కరుణకు సీపీఎం నేత ప్రకాశ్ కరత్ నివాళులు..

తమిళనాడు : కరుణానిధి భౌతికకాయానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు సీపీఎం సభ్యులు కూడా కరుణానిధికి నివాళులర్పించారు. మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి భౌతికకాయానికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. తీవ్ర అస్వస్థతతో 11 రోజుల పాటు కావేరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న కరుణానిధి బుధవారం సాయంత్రం 6గంటల సమయంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరుణానిధికి పలువరు రాజకీయ, సిని పరిశ్రమకు చెందిన పలువురు రాజాజీ హాల్ కు వచ్చి కరుణానిధి భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. 

కరుణకు ప్రధాని మోదీ నివాళులు..

తమిళనాడు : మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి భౌతికకాయానికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. తీవ్ర అస్వస్థతతో 11 రోజుల పాటు కావేరీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న కరుణానిధి బుధవారం సాయంత్రం 6గంటల సమయంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఇప్పటికే కరుణానిధి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ క్రమంలో ఢిల్లీ నుండి చెన్నై ఎయిర్ పోర్టుకు చేరి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రాజాజీ హాల్ లోని కరుణానిధి భౌతికకాయానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. అనంతరం కరుణ కుమారుడు స్టాలిన్, కుటుంబ సభ్యులను మోదీ పరామర్శించారు.

11:44 - August 8, 2018

చెన్నై : మెరీనా తీరంలో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డంకులు తొలగిపోయాయి. కరుణానిధి అంత్యక్రియలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మెరీనా తీరంలో అంత్యక్రియలకు మద్రాస్ హైకోర్టు అనుమతిచ్చింది. గతంలో జానకీరాంచంద్రన్ అంత్యక్రియలకు డీఎంకే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తమిళ ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ వాదనను డీఎంకే లాయర్ తప్పుబట్టారు. ప్రజల సెంటిమెంట్ దెబ్బతింటుందని డీఎంకే లాయర్ అన్నారు.  సాయంత్రం మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు జరుగనున్నాయి. మెరీనా..అన్నా స్క్వేర్ వద్దే కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
కావేరీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కరుణానిధి మృతి 
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కన్నుమూశారు. కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కరుణానిధి మృతికి రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. రెండు రోజుల పాటు ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుంది. ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించారు. సినిమా థియేటర్లను సైతం రెండు రోజుల పాటు స్వచ్ఛందంగా మూసివేయనున్నారు.    
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

అంత్యక్రియలకు కోర్టు అనుమతి..కన్నీరు పెట్టిన స్టాలిన్..

తమిళనాడు : చెన్నైలోని మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసిన తరువాత రాజాజీ హాల్ వద్ద భావోద్వేగాలు పెల్లుబికాయి. ఈ విషయం తెలిసిన వెంటనే, మైకుల ద్వారా అనౌన్స్ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్టాలిన్, అళగిరి, కనిమొళి తదితరులు పెద్దపెట్టున విలపించారు. తండ్రి భౌతికకాయాన్ని ఉంచిన శవపేటికను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. అక్కడే వేలాదిగా ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకు వచ్చి, 'కలైంజర్ వాంగే' అని నినాదాలు చేశారు.

పార్లమెంట్ ఉభయ సభల్లో కరుణకు సంతాపం..

ఢిల్లీ : పార్లమెంట ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సభలు ప్రారంభమైన అనంతరం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి ఉభయ సభలు సంతాపం తెలిపాయి. అనంతరం ఉభయ సభలను వాయిదా వేశారు. 

11:07 - August 8, 2018

గుంటూరు : కరుణానిధి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొని, మాట్లాడారు. కరుణానిధికి దేశమంతా నివాళులర్పిస్తోందన్నారు. మహానాయకుడిని కోల్పోవడం దేశ రాజకీయాలకు నష్టమన్నారు. కరుణానిధి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన వ్యక్తి కరుణానిధి అని కొనియాడారు. తమిళనాడు ప్రజలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు.

 

మెరినా తీరంలోనే కరుణ అంత్యక్రియలకు కోర్టు అనుమతి..

తమిళనాడు : డీఎంకే అధినేత, మాజీ సీఎం అయిన కరుణానిధి మృతి అనంతరం అంత్యక్రియలు మెరీనా బీచ్ లోనే అంత్యక్రియలకు అనుమతి లేదంటు ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనిపై డీఎంకే హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అటు ప్రభుత్వం..ఇటు డీఎంకే తరపు వాదనలు విన్న హైకోర్టు ఎట్టకేలకూ మెరీనా తీరంలోనే కరుణానిధి అంత్యక్రియలను జరిపేందుకు అనుమతినిచ్చింది. కాగా మరణించే సమయానికి సీఎంగా లేని మాజీ సీఎంలకు మెరీనా బీచ్ లో అంత్యక్రియలకు అనుమతి లేదని ప్రభుత్వం పేర్కొంది.

10:58 - August 8, 2018

చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి పార్థివదేహం సందర్శనకు జనం బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. కరుణానిధి అభిమానులు చెన్నైకి బారులు తీరారు. విదేశాల నుంచి ప్రజలు తండోపతండాలుగా చేరుకుంటున్నారు. ఢిల్లీతోపాటు అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ జాతీయ జెండా అవనతం చేశారు. కరుణ అంత్యక్రియలకు ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. 

 

 

చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ప్రధాని మోదీ..

తమిళనాడు : మాజీ సీఎం కరుణానిధికి నివాళి అర్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు చెన్నైకి చేరుకున్నారు. ఉదయం 10.38 కి చెన్నై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయనకు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మరికొందరు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రాజాజీ హాల్ కు చేరుకోనున్నారు. శరీరంలోని అవయవాలు పనిచేయకపోవడంతో కరుణానిధి మంగళవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

10:48 - August 8, 2018

ఆసుపత్రిగా మారనున్న కరుణానిధి నివాసం..

తమిళనాడు : డీఎంకే అధినేత, మాజీ సీఎం అయిన కరుణానిధి మరణవార్తతో తమిళనాడు అంతా శోకసముద్రంలో మునిగిపోయాడు. చిన్ననాటే రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం సీఎం స్థాయికి ఎదిగిన నేతగా కరుణానిధి మంత్రి కావడానికి ముందే కరుణానిధి ఈ ఇంటిని కొనుగోలు చేశారు. 1955లో శరబేశ్వర అయ్యర్ అనే వ్యక్తి నుంచి రూ.45 వేలకు ఈ ఇంటిని కొనుగోలు చేసినట్టు కరుణ ఓ సందర్భంలో తెలిపారు. కరుణ ముఖ్యమంత్రి అయ్యాక కూాడా ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఇంటిని కుమారుల పేరిట రాసిచ్చినప్పటికీ, దానిని తన తదనంతరం ఆసుపత్రిగా మార్చాలని కరుణ కోరారు.

10:39 - August 8, 2018

చెన్నై : కరుణానిధి అంత్యక్రియల స్థలంపై వివాదం నడుస్తోంది. కాసేపట్లో మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ కేసు విచారిస్తున్నారు. ట్రాఫిక్ రామస్వామితో చీఫ్ జస్టిస్ మాట్లాడారు. గతంలో మెరీనా తీరంలో స్మారకాలపై ట్రాఫిక్ రామస్వామి కేసు వేశారు. మెరీనా తీరంలో కరుణ అంత్యక్రియలకు అభ్యంతరం లేదని రామస్వామి తెలిపారు. అభ్యంతరం లేదంటూ రామస్వామి లాయర్ కోర్టుకు మెమొరాండం ఇచ్చారు. మెరీనా తీరంలో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డంకులు తొలుగుతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన కారు మబ్బులు..

తమిళనాడు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలను మబ్బులు కమ్మేశాయి. నిన్న మధ్యాహ్నం వాయుగుండం ఏర్పడి, రాత్రికి ఒడిశా, పశ్చిమ బెంగాల్ నడుమ కేంద్రీకృతమై, బాలాసోర్ దగ్గరకు వెళుతోంది. దీని ప్రభావం ఒడిశా, చత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల రెండు రోజుల వ్యవధిలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.

స్టాలిన్ చేతికే డీఎంకే పగ్గాలు?..

తమిళనాడు : రాజకీయ మేరు నగధీరుడు కరుణానిధి మృతితో డీఎంకేలో ఓ శకం ముగిసింది. సుదీర్ఘ రాజకీయ జీవితంలో 50 ఏళ్లకుపైగా డీఎంకే అధ్యక్షుడిగా కొనసాగిన కరుణానిధి అస్తమయంతో ఇప్పుడాయన వారసుడు ఎవరన్నచర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్‌కే ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. డీఎంకే పగ్గాలను ఆయన చేపట్టడం లాంఛనమే అని చెబుతున్నారు. పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు ఉండడం, పార్టీలో ఆయనను ఢీకొనే నేతలు మరెవరూ లేకపోవడంతో ఆయన ఎన్నిక ఈజీయేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

డీఎంకే కోర్టు కెక్కడంలో రాజకీయ ఎజెండా..

తమిళనాడు : కరుణానిధి మృతికి అధికారికంగా సంతాప దినాలు ప్రకటించినప్పుడు స్థలం ఇవ్వడానికి ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని డీఎంకే న్యాయవాది ప్రశ్నించారు. కరుణానిధి అంత్యక్రియలకు స్థలం విషయంలో ప్రభుత్వానికి-డీఎంకేకు మధ్య మొదలైన వివాదం ఎడతెగడం లేదు. న్యాయపరమైన చిక్కులు చూపి మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం మెరీనా బీచ్‌లో మాజీ ముఖ్యమంత్రులకు మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ.. స్థలం విషయంలో డీఎంకే కోర్టు కెక్కడంలో రాజకీయ ఎజెండా ఉందని వాదించారు.

మెరీనా బీచ్‌లో కరుణ అంత్యక్రియలకు స్థలం వివాదం..

తమిళనాడు : కరుణానిధి అంత్యక్రియలకు స్థలం విషయంలో ప్రభుత్వానికి-డీఎంకేకు మధ్య మొదలైన వివాదం ఎడతెగడం లేదు. న్యాయపరమైన చిక్కులు చూపి మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. దీనికి నొచ్చుకున్న డీఎంకే నేతలు తమకు అక్కడే కావాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం దీనిపై వాదనలు జరుగుతున్నాయి. డీఎంకే న్యాయవాది మాట్లాడుతూ తమిళనాడు మొత్తం జనాభా ఏడుకోట్లని, అందులో కోటిమంది డీఎంకే అభిమానులని పేర్కొన్నారు. తమ అభిమాన నేత అంత్యక్రియలకు మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వకుంటే వారంతా తీవ్ర మనస్తాపానికి గురవుతారని పేర్కొన్నారు.

మెరీనా బీచ్ లో కరుణానిధి ఖననంపై తొలగిన అడ్డంకి

చెన్నై : మెరీనా బీచ్ లో కరుణానిధి ఖననంపై అడ్డంకి తొలగింది. కరుణానిధిని మెరీనా తీరంలో ఖననం చేసేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది.

09:40 - August 8, 2018

చెన్నై : డీఎంకే అధినేత కరుణానిధి పార్థివదేహం సందర్శనకు జనం బారులు తీరారు. సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. కరుణానిధి అభిమానులు చెన్నైకి బారులు తీరారు. విదేశాల నుంచి ప్రజలు తండోపతండాలుగా చేరుకుంటున్నారు. ఢిల్లీతోపాటు అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ జాతీయ జెండా అవనతం చేశారు. కరుణ అంత్యక్రియలకు ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. 

కరుణ అంత్యక్రియల స్థలంపై వివాదం

చెన్నై : కరుణానిధి అంత్యక్రియల స్థలంపై వివాదం నడుస్తోంది. కాసేపట్లో మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ కేసు విచారిస్తున్నారు. ట్రాఫిక్ రామస్వామితో చీఫ్ జస్టిస్ మాట్లాడారు. గతంలో మెరీనా తీరంలో స్మారకాలపై ట్రాఫిక్ రామస్వామి కేసు వేశారు. మెరీనా తీరంలో కరుణ అంత్యక్రియలకు అభ్యంతరం లేదని రామస్వామి తెలిపారు. అభ్యంతరం లేదంటూ కోర్టుకు రామస్వామి లాయర్ మెమొరాండం ఇచ్చారు. మెరీనా తీరంలో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డంకులు తొలగినట్లు తెలుస్తోంది.

 

09:22 - August 8, 2018

చెన్నై : కరుణానిధి అంత్యక్రియల స్థలంపై వివాదం నడుస్తోంది. కాసేపట్లో మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ కేసు విచారిస్తున్నారు. ట్రాఫిక్ రామస్వామితో చీఫ్ జస్టిస్ మాట్లాడారు. గతంలో మెరీనా తీరంలో స్మారకాలపై ట్రాఫిక్ రామస్వామి కేసు వేశారు. మెరీనా తీరంలో కరుణ అంత్యక్రియలకు అభ్యంతరం లేదని రామస్వామి తెలిపారు. అభ్యంతరం లేదంటూ కోర్టుకు రామస్వామి లాయర్ మెమొరాండం ఇచ్చారు. మెరీనా తీరంలో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డంకులు తొలగినట్లు తెలుస్తోంది.

 

09:11 - August 8, 2018

చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కన్నుమూశారు. కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కరుణానిధి మృతికి రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. రెండు రోజుల పాటు ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుంది. ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించారు. సినిమా థియేటర్లను సైతం రెండు రోజుల పాటు స్వచ్ఛందంగా మూసివేయనున్నారు. కరుణానిధి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని రాజాజీ హాలుకు తరలించారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధికి ముగ్గురు భార్యలు పద్మావతి, దయాళు అమ్మాళ్‌, రాజత్తి అమ్మాళ్‌. కరుణానిధి తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రజలు సందర్శిస్తున్నారు. మధ్యాహ్నం 3 తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

09:00 - August 8, 2018

డీఎంకే అధినేత కరుణానిధి మృతి తీరని లోటు అని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బీజేపీ నేత కుమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ పాల్గొని, మాట్లాడారు. తమిళ రాజకీయాల్లో కరుణానిధితో పోల్చదగిన నాయకుడు లేరన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని నమ్మినవాడని.. హేతువాది అని అన్నారు. సంక్షేమ పథకాలు ఆద్యుడు కరుణానిధి తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:55 - August 8, 2018

ఆంధ్రప్రదేశ్‌లో రైతు సంఘం ఆందోళన బాట పట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదని మద్దతు ధర, రుణమాఫీ, పంట బీమా, తదితర డిమాండ్లతో వారు ఆందోళన బాట పట్టారు. వారు ఆందోళనకు గల కారణాలు, వారి డిమాండ్లు, వారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అంశాలపై ఇవాళ్టి జనపథంలో ఏపీ రైతు సంఘం నాయకులు కేశవరావు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

కరుణానిధి అంతిమ సంస్కారాలపై స్థల వివాదం

చెన్నై : కరుణానిధి అంతిమ సంస్కారాలపై స్థల వివాదం నెలకొంది. డీఎంకే నేతలు హైకోర్టును ఆశ్రయించారు. మెరీనా బీచ్ లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని డీఎంకే న్యాయవాదుల పిటిషన్ వేశారు. కాసేపట్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారించనున్నారు. కౌంటర్ దాఖలుకు తమిళనాడు ప్రభుత్వం సమయం కోరింది. 

కరుణానిధి మృతికి నేడు దేశవ్యాప్తంగా సంతాప దినం ప్రకటించిన కేంద్రం

ఢిల్లీ : డీఎంకే అధినేత కరుణానిధి మృతికి కేంద్ర ప్రభుత్వం నేడు దేశవ్యాప్తంగా సంతాపం దినంగా ప్రకటించింది. 2 రోజులు పాటు ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు చేసింది.

08:30 - August 8, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రజా రవాణ సంస్థలు బంద్‌ పాటించాయి. తెలుగు రాష్ట్రాల్లో బంద్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. బస్‌లు, లారీలు ఆటోలు, క్యాబ్‌లు తిరగపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిని అదునుగా భావించిన కొందరు ఆటోవాలలు ప్రజలను దోచుకున్నారు. 
స్తంభించిన రవాణ వ్యవస్థ 
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రజా రవాణ సంస్థలు బంద్‌ పాటించాయి. ఆర్టీసీ బస్సులు, లారీలు, ఆటోలు, క్యాబ్‌లు  తిరగలేదు. దీంతో రవాణ వ్యవస్థ స్తంభించింది. బంద్‌లో పాల్గొన్న కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు-2018ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.టూరిస్టు పర్మిట్‌-2016ను రద్దు చేయాలని కోరారు. పెట్రోలు, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. 
విజయవాడలో బంద్‌ సంపూర్ణం 
ఏపీలోని అన్ని ప్రాంతాల్లో రవాణ బంద్‌ సంపూర్ణంగా జరిగింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రవాణ రంగ కార్మికులు నిరనసన ప్రదర్శనలు నిర్వహించారు. విజయవాడలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి బస్‌ స్టేషన్లు,  రైల్వే స్టేషన్లనుకు చేరుకున్న ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 
విశాఖలో  
విశాఖలో ఆటో, లారీ, ఇతర రవాణకు సంబంధించిన కార్మికులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుతో ప్రజా రవాణ వ్యవస్థలో ప్రైవేటు ఆధిపత్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రవాణ రంగాన్ని ధ్వంసం చేసే లక్ష్యంతోనే  కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తోందని నెల్లూరు రవాణ బంద్‌లో పాల్గొన్న కార్మికలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీరుతో  ప్రజా రవాణ సంస్థలు  నష్టపోతాయని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 
కర్నూలు, చిత్తూరు, గుంటూరులో 
మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కర్నూలులో ఆర్టీసీ కార్మికులు, ఆటో డ్రైవర్లు బంద్‌ పాటించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రవాణ బంద్‌ సంపూర్ణంగా జరిగింది. 
హైదరాబాద్‌ లో
తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా రవాణ బంద్‌ జరిగింది. హైదరాబాద్‌ నగరంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మెలో పాల్గొనకుండా తిరుగుతున్న కొన్ని ఆటోలను ఆందోళనకారులు నిలిపివేశారు. రవాణ బంద్‌తో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల నుంచి ఇళ్లకు చేరుకోడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. 
ఉమ్మడి వరంగల్‌ లో 
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సమ్మె సంపూర్ణంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం   మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుతో ఆర్టీసీ కుదేలైపోయే ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్వపు మహబూబ్‌నగర్‌ జిల్లాలో రవాణ బంద్‌ సంపూర్తంగా జరిగింది. బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. ఆటోలు, లారీలు తిరగలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో బంద్‌ జరిగింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. 

 

08:23 - August 8, 2018

 ప్రకాశం : రాష్ట్రాన్ని మోసం చేసిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం  చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకు రాజీలేని పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. కేసుల మాఫీ కోసం బీజేపీకి కొమ్ము కాస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న వైసీపీని ప్రజలు ఎక్కడికక్కడ ఎండగట్టాలని ప్రకాశం జిల్లా చీరాలలో చంద్రబాబు పిలుపు ఇచ్చారు. 
ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. చీరాలలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు. చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించారు. మగ్గంపై కూర్చుని వస్త్రాలు నేశారు. చేనేత కార్మికుల కోసం ఆధునిక వర్క్‌ షెడ్లను ప్రారంభించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చేనేత  వస్త్రాల తయారీలో నైపుణ్యం ప్రదర్శించిన కార్మికులను చంద్రబాబు అవార్డులు అందచేశారు. 
కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డ చంద్రబాబు 
చీరాలలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ సభలో ప్రసంగించిన చంద్రబాబు... కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటారన్న నమ్మకంతో గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తే... చివరికి మొండిచేయి చూపించారని విమర్శించారు. ప్రజల కోసం కేంద్రంతో చేస్తున్న ధర్మ పోరాటంలో అంతిమ విజయం తమదేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 
దూబగంటలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన 
అంతకు ముందుకు కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పామూరు మండలం దూబగంటలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కడప కేంద్రంగా పనిచేస్తున్న రాజీవ్‌గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుంబంధంగా ఈ ట్రిపుల్‌ ఐటీ పని చేస్తుంది. పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. 
రాష్ట్రాన్ని విజ్ఞాన ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దుతాం : చంద్రబాబు 
దూబగంట ట్రిపుల్‌ ఐటీకి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ... రాష్ట్రాన్ని విజ్ఞాన ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

08:18 - August 8, 2018

ఢిల్లీ : రైల్వే జోన్ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో టీడీపీ ఉత్తరాంధ్ర ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. కేంద్ర మంత్రి స్పందించాల్సిన అంశాలపై జీవీఎల్‌ మాట్లాడటంతో, టీడీపీ నేతలు ఫైర్‌ అయ్యారు. టీడీపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని జీవీఎల్‌  చెప్పడంతో వివాదం ఏర్పడింది. దీంతో టీడీపీ నేతలు కేంద్రమంత్రిని సైతం కడిగిపారేశారు. 4 ఏళ్లైనా రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదని కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ను ప్రశ్నించారు. రైల్వే జోన్ ఎప్పుడుస్తారో నిర్దిష్ట గడువు చెప్పాలంటూ ఆయన ఛాంబర్‌ ముందు ఆందోళనకు దిగారు. 
రైల్వే మంత్రితో ఉత్తరాంధ్ర నేతల భేటీ
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో టీడీపీ నేతల సమావేశం రసాభాసగా మారింది. కేంద్ర మంత్రి స్పందించాల్సిన అంశాలపై జీవీఎల్‌ మాట్లాడటం, టీడీపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని చెప్పడంతో వివాదం ఏర్పడింది. మంగళవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతృత్వంలో ఎంపీలు, ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఉత్తరాంధ్ర జిల్లాల కు చెందిన 25 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు ఢిల్లీ రైల్‌ భవన్‌లో పీయూష్‌ గోయల్‌తో సమావేశమయ్యారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ప్రకటించాలని వినతి పత్రం అందించారు. 
జీవీఎల్‌ వర్సెస్ టీడీపీ ఎంపీలు
పీయూష్‌ ఆర్థిక శాఖను కూడా చూస్తున్న నేపథ్యంలో.. వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు ఇచ్చి వెనక్కి తీసుకున్న అంశాన్ని ప్రస్తావించారు టీడీపీ నేతలు. ఈ సందర్భంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ జోక్యం చేసుకొని టీడీపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించడంతో..టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆగ్రహించారు. సీట్లలో నుంచి లేచి జీవీఎల్‌పై మండిపడ్డారు. ''ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడడానికి మీరెవరు? అసలు ఏపీ గురించి ఏం తెలుసునని మాట్లాడుతున్నారు? మేం కేంద్రమంత్రిని అడుగుతుంటే మీరెందుకు స్పందిస్తున్నారు? అసలు మీరెందుకు వచ్చారు?'' అని జీవీఎల్‌ను నిలదీశారు. దీంతో సమావేశంలో ఎవరు పాల్గొనాలో మీరెలా నిర్ణయిస్తారని జీవీఎల్‌ ఎదురుదాడికి దిగారు.
జీవీఎల్‌ ఎదురుదాడి
అనంతరం సుజనా చౌదరి కల్పించుకుని.. ''మేం కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఆయనే మాకు దీనిపై వివరణ ఇవ్వాలి. మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు. ఏ హోదాతో మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే అర్హత లేదు'' అంటూ జీవీఎల్‌కు సూటిగా సమాధానం చెప్పారు అయితే ''ఆంధ్రకు ద్రోహం చేయాలని చూస్తే మిమ్మల్ని రాష్ట్రంలో తిరగనివ్వం '' అంటూ అని కళా వెంకట్రావు పేర్కొనగా... 'నువ్వేం చేస్తావ్‌' అని జీవీఎల్‌ ఎదురుదాడికి దిగారు. తాను మాట్లాడి తీరతానని తేల్చిచెప్పారు. దీంతో టీడీపీ నేతలు మరింత మండిపడ్డారు. 'యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీకు... ఏపీతో  ఏం సంబంధం?' అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. మాటామాటా పెరగడంతో సమావేశ మందిరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, సుజనా చౌదరి, బీజేపీ ఎంపీ హరిబాబు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అర్ధాంతరంగా ముగిసిన సమావేశం 
చివరికి జీవీఎల్‌, హరిబాబు, పీయూష్‌ తన కార్యాలయంలోకి వెళ్లిపోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. గోయల్‌, జీవీఎల్‌ వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైల్‌ భవన్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. టీడీపీ నేతలకు సమయం కేటాయించేందుకు పీయూష్‌ రోజంతా మొరాయించారు. చివరికి సమయం కేటాయించినా... రెండుగంటలు నిరీక్షించేలా చేశారు.

 

07:46 - August 8, 2018

చెన్నై : కరుణానిధి ఎంతటి వ్యూహకర్త అయినా.. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం కారణంగా.. వివాదాల్లో ఇరుక్కున్నారు. అవినీతి ఆరోపణలపై జైలుకూ వెళ్లారు. అదే బాటలో.. కుమార్తె కనిమొళి కూడా అవినీతి ఆరోపణలతోనే జైలుపాలయ్యారు. 
2001లో కరుణానిధి అరెస్ట్‌  
కరుణానిధి రాజకీయ ప్రస్థానం పూలబాటగానే కాదు. రాళ్లు.. ముళ్లబాటలుగానూ సాగింది. వీరాణం ప్రాజెక్టుకు టెండర్లు కట్టబెట్టడంలో అవినీతికి పాల్పడ్డారంటూ.. కరుణ ప్రభుత్వాన్ని సర్కారియా కమిషన్‌ తప్పుబట్టింది. ఇందిరాగాంధీ.. కరుణానిధి ప్రభుత్వాన్ని ఇదే కారణంతో బర్త్‌రఫ్‌ చేసింది. 2001లో ఫ్లైఓవర్ల కుంభకోణంలో కరుణానిధి అరెస్ట్‌ కూడా అయ్యారు. 
వివాదంలో కూరుకుపోయిన కరుణానిధి  
బంధుప్రీతి అంశంపైనా కరుణానిధి వివాదంలో కూరుకుపోయారు. తనయులు స్టాలిన్‌, అళగిరి, కనిమొళిలపైనా అవినీతి ఆరోపణలు వచ్చాయి. కనిమొళి కూడా అవినీతి ఆరోపణలపై జైలుజీవితం గడిపారు. కొంతకాలం క్రితమే ఆమె విడుదలయ్యారు. ఇక రాజీవ్‌గాంధీ హత్య కేసును విచారించిన జస్టిస్‌ జైన్‌ కమిషన్‌.. కరుణానిధి ఎల్టీటీయీకి మద్దతునివ్వడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమిళ ఈలం నేత ప్రభాకరణ్ తనకు మంచి స్నేహితుడని కరుణానిధి కూడా ఓ సందర్భంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. సేతుసముద్రం వివాదంలో రాముడి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ కరుణానిధి చేసిన వ్యాఖ్యలు కూడా పెను కలకలాన్నే సృష్టించాయి. 
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడని కరుణానిధి
ఇవన్నీ ఒక ఎత్తయితే.. కరుణానిధి... రాష్ట్ర ప్రయోజనాల విషయంలో.. ఎన్నడూ రాజీపడేవారు కాదని, అయితే శత్రువులతోనూ చేతులు కలుపుతారని తమిళులు గట్టిగా నమ్ముతారు. కావేరి నదీజలాల వివాదంలో కానీ, రాష్ట్రానికి పరిశ్రములను తరలించుకు వెళ్లే విషయంలో కానీ.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. తమిళులు అందరూ ఒక్కటే అన్న భావన తీసుకురావడంలో కరుణానిధే తొలి అడుగు వేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. 

 

07:40 - August 8, 2018

చెన్నై : ముత్తువేల్‌ కరుణానిధి...! వ్యూహదురంధర రాజకీయవేత్తగానే ప్రస్తుత తరానికి పరిచితుడు. కానీ.. ఆయన నవనీతంలాంటి మనసున్న కళావల్లభుడు... సాహిత్యరంగంలో చేయితిరిగిన రచయిత. అందుకే.. ఆయన్ను తమిళనాడు.. కళాకారుడు అన్న అర్థంలో... కలైజ్ఞర్‌గానే చివరిదాకా గౌరవించింది.  
తమిళ పరిశ్రమకు రచయితగా పరిచయమైన కరుణానిధి 
రాజకీయాల్లోకి రాకముందు కరుణానిది తమిళ సినీరంగంలో సిద్ధహస్తుడైన రచయితగా కొనసాగారు. అద్భుతమైన కథలు, నాటికలు, నవలలు రచించడం ద్వారా.. తమిళ సాహిత్య రంగానికీ తనవంతు సేవలు అందించారు. కరుణానిధి 1947లో రాజకుమారి అనే సినిమా ద్వారా తమిళ పరిశ్రమకు రచయితగా పరిచయం అయ్యారు. ఈ సినిమా సమయంలోనే కరుణానిధికి ఎంజీరామచంద్రన్‌ పరిచయమయ్యారు. అభిమన్యు, మరుదనాట్టు ఇళవరసి లాంటి ఎంజీఆర్‌ సినిమాలెన్నింటికో కరుణానిధి రచన అందించారు. కరుణానిధి సినీజీవితంలో చెరగని యశస్సును అందించిన సినిమాగా పరాశక్తిని చెప్పుకోవాలి. ద్రవిడ ఉద్యమ స్పూర్తిని రగిలించడమే కాదు.. బ్రాహ్మణవాదంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. 
వ్యంగ్య రచనలోనూ కరుణానిధి దిట్ట
పరాశక్తి ఇచ్చిన చైతన్యంతో.. అదే ఒరవడిలో పణం, తంగరత్నం సినిమాలకూ తనదైన శైలిలో రచన అందించి వివాదాలకు కారణమయ్యారు. వ్యంగ్య రచనలో కరుణానిధి దిట్ట. పైగా తన రచనల ద్వారా సమాజానికి ఆయన అందించే సందేశం ఆబాలగోపాలన్ని చేరింది. అదే కరుణానిధిని సుప్రసిద్ధ రాజకీయవేత్తగా రూపాంతరం చెందించింది. దీన్ని అవకాశంగా చేసుకుని.. కరుణానిధి... అన్నాదురైకి దన్నుగా.. సినిమా ద్వారా ద్రవిడ ఉద్యమవ్యాప్తి చేశారు. 
చివరిసారిగా పొన్నార్‌ శంకర్‌కు రచన అందించిన కరుణానిధి 
కరుణానిధి 2011 వరకూ తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. చారిత్రక చిత్రం పొన్నార్‌ శంకర్‌కు ఆయన చివరిసారిగా రచనను అందించారు. కరుణానిధి తమిళ సాహిత్యానికీ కరుణానిధి ఇతోధిక సేవను అందించారు. పద్యాలు, లేఖలు, స్క్రీన్‌ప్లేలు, నవలలు, ఆత్మకథలు, చారిత్రక నవలలు, డ్రామాలు, సినిమాలకు సంభాషణలు, పాటలు రాశారు. సమాజాన్ని చైతన్యపరిచిన తిరువళ్లువార్‌ అంటే.. కరుణానిధికి వల్లమాలిన అభిమానం. ఆయన రచించిన తిరుక్కురళ్‌కు కరుణానిధి వ్యాఖ్యానం రాశారు. ఆయన రచనల వ్యాప్తిని కాంక్షిస్తూ.. చెన్నైలో.. వళ్లువార్‌కొట్టం పేరిట.. తిరువళ్లువార్‌ 133 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. 

07:33 - August 8, 2018

చెన్నై : రాజకీయాల్లో కురువృద్ధుడిగా.. విజయవంతమైన వ్యూహనిపుణుడిగా తరగని యశస్సును సొంతం చేసుకున్న కరుణానిధి.. తన 94వ ఏట కన్ను మూశారు. కొన్ని రోజులుగా.. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న కరుణానిధి.. మంగళవారం తుది శ్వాస విడిచారు. కరుణానిధి జీవిత విశేషాలపై 10టీవీ ప్రత్యేక కథనం. 
1924లో కరుణానిధి జననం
కరుణానిధి 1924లో.. నాగపట్నం జిల్లా తిరుక్కువలైలో.. ముత్తువేల్‌ అంజు దంపతులకు జన్మించారు. స్కూలు దశ నుంచే నాటకాలు, కవిత్వం, సాహిత్యాలపై ఆయన మక్కువ పెంచుకున్నారు. ఎంచుకున్న రంగాల్లో తనదైన శైలిలో ఎదుగుతూ వచ్చారు. స్కూలు దశ నుంచే సామాజిక స్పృహను పెంపొందించుకున్నారు. జస్టిస్‌ పార్టీకి మూలస్తంభంగా భావించే అళగిరి స్వామి కరుణానిధికి స్ఫూర్తినిచ్చారు. ఫలితంగా.. కరుణానిధి తన 14వ ఏటి నుంచే సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. సహవిద్యార్థులతో కలిసి యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి.. వారిలో రచనావ్యాసంగాన్ని ప్రోత్సహించేవారు. ద్రావిడ ఉద్యమకాలంలో తొలి యువజన సంఘం ఇదే. కరుణానిధి ప్రత్యక్ష ఉద్యమాల్లోకి దిగి.. యశస్సును పొందింది మాత్రం 1953లోనే. కల్లగుడి అన్న పేరును.. దాల్మియాపురంగా మార్చేందుకు ఉత్తరాది పారిశ్రామిక వేత్తలు చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగా కరుణానిధి భారీ ఉద్యమాన్నే లేవనెత్తారు. ఆ నిరసనలో.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఆ సందర్భంగా పోలీసులు కరుణానిధిని అరెస్టు చేశారు. 
దురంధరుడు కరుణానిధి
ద్రవిడ ఆత్మాభిమాన ఉద్యమం.. రాజకీయ యవనికపై ఆవిష్కరించిన దురంధరుడు కరుణానిధి. ద్రవిడ మున్నేట్ర కళ్జగం పేరిట స్థాపించిన పార్టీకి ఆయన అచ్చంగా పదిసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కరుణానిధి, తన 33వ ఏట.. 1957లో కుళితలై స్థానం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1961లో డిఎంకె కోశాధికారిగాను, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ లీడర్‌గాను ఎన్నికయ్యారు. 1967లో డిఎంకె అధికారంలోకి రాగానే కరుణానిధి పబ్లిక్‌ వర్క్స్‌ మంత్రిగా నియమితులయ్యారు. 
1969లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు 
రాజకీయ రంగంలో అంచెలంచెలుగా ఎదిగిన కరుణానిధి 1969లో అన్నాదురై మరణించడంతో.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  కరుణానిధి తన కెరీర్‌లో మొత్తం మీద 13సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1969 నుంచి 2011 మధ్య కాలంలో ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి ఇందిరాగాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఫలితంగా ఆయన పార్టీ నాయకులు చాలామంది అరెస్టయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కరుణానిధి జనతాపార్టీతో కలిసి వెళ్లి ఓటమిపాలయ్యారు. 
కరుణానిధి హయాంలోనే డీఎంకే పార్టీ చీలిక 
ద్రవిడ ఉద్యమ స్ఫూర్తితో ఏర్పాటైన ద్రవిడ మున్నేట్ర కళ్జగం పార్టీ చీలిక కరుణానిధి హయాంలోనే జరిగింది. పార్టీ కార్యదర్శిగా ఉన్న కరుణానిధి.. సినీ, రాజకీయ సన్నిహితుడు ఎంజీరామచంద్రన్‌ను.. వివిధ కారణాల వల్ల.. పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో.. ఎంజీఆర్‌ అన్నాడిఎంకె పార్టీని స్థాపించారు. ఆటుపోట్ల అనంతరం ఎంజీఆర్‌ అధికారపీఠాన్ని దక్కించుకోగలిగారు. అప్పటి నుంచి రాష్ట్రంలో డిఎంకె, అన్నాడిఎంకెలు చెరో టర్మ్‌ గెలవడం ఆనవాయితీగా కొనసాగింది. 2013లో ఆ ఆనవాయితీని తమిళ ఓటర్లు తిరగరాస్తూ.. జయలలితకు వరుసగా రెండోసారి పట్టం కట్టారు. అలా.. ఈసారి కరుణానిధి అధికారానికి దూరమయ్యారు. మాజీ ముఖ్యమంత్రిగానే కన్నుమూశారు. 

 

07:24 - August 8, 2018

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలపై ఓ స్పష్టత రాలేదు. అంతిమ సంస్కారాలపై వివాదం రాజుకుంది. మెరీనాబీచ్‌లో ఖననం, స్మారక కేంద్రం నిర్మాణానికి అనుమతించాలని డీఎంకే కోరుతుంటే.... ప్రభుత్వం అందుకు నిరాకరిస్తోంది. దీంతో డీఎంకే హైకోర్టును ఆశ్రయించింది. రాత్రి అర్థరాత్రి విచారణ జరిపిన న్యాయస్థానం ఏమీ తేల్చలేక ఈ ఉదయం 8గంటలకు తదుపరి విచారణ వాయిదా వేసింది. మరోవైపు కరుణానిధి కడసారి చూపుకోసం అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఈ సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 
కరుణానిధి అంత్యక్రియలపై వివాదం 
కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ జరపాలనే విషయంలో వివాదం ఏర్పడింది. స్థానిక మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు అవకాశం ఇవ్వాలని డీఎంకే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. అయితే అందుకు ప్రభుత్వం మాత్రం నిరాకరించింది. చట్టపరమైన చిక్కులు ఉన్నాయని తెలిపింది. జీవితాంతం అన్నాదురై బాటలో పయనించిన కరుణానిధిని కూడా అన్నాదురై సమాధి దగ్గర ఖననం చేయాలని డీఎంకే భావించింది. ఈ మేరకు డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు స్టాలిన్‌ తన అన్న అళగిరి, సోదరి కనిమొళి, ఇతర నేతలతో ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంతో మాట్లాడారు. ఆయన సానుకూలంగా స్పందించారు. సీఎంకు చెబుతానని హామీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత డీఎంకే నేతలు సీఎం పళనిస్వామి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు.  అంత్యక్రియల కోసం మెరీనా బీచ్‌లోని అన్నాదురై మ్యూజియం కాంప్లెక్స్‌లో స్థలం ఇవ్వాలని కోరారు.  వారిని ఓదార్చిన పళనిస్వామి...గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నందున అధికారులతో చర్చించి చెబుతాన్నారు.  ఆ తర్వాత కరుణానిధి భౌతికకాయాన్ని అన్నాదురై సమాధి దగ్గర ఖననం చేయడానికి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు.  అడయార్‌ అన్నా విశ్వవిద్యాలయం ఎదురుగా గాంధీ మంటపం పక్కనే రాజాజీ, కామరాజ్‌ సమాధులకు సమీపంలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. రాజాజీ హాల్‌లో భౌతికకాయాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచేందుకు అనుమతించారు. అయితే ప్రభుత్వ తీరును ఖండిస్తూ కావేరి ఆస్పత్రి దగ్గర డీఎంకే కార్యకర్తలు ధర్నాకు దిగారు. అన్నాదురై పక్కనే ఖననం చేసేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు.
న్యాయపోరాటానికి దిగిన డీఎంకే 
అన్నాదురై సమాధి పక్కన ఖననం చేసేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో డీఎంకే న్యాయపోరాటానికి దిగింది. మెరీనా బీచ్‌లోనే ఖననం, స్మారక నిర్మాణానికి అనుమతించాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై రాత్రి 10.30కు విచారణ జరిగింది. హైకోర్టు ఏసీజే హులువాడి రమేష్‌ అత్యవసర విచారణ ఏపట్టారు. అర్ధరాత్రి దాటేవరకు ఈ విచారణ జరిగింది. డీఎంకే పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలంటూ ఏసీజే తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేసు విచారణను నేటి ఉదయం 8 గంటలకు వాయిదా వేశారు. మాజీ సీఎం జయలలిత చనిపోయినప్పుడు ఆమె స్మారకాన్ని మెరీనాబీచ్‌లో నిర్మించాలని అన్నాడీఎంకే నిర్ణయించినప్పుడు కొందరు కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు కరుణానిధి స్మారకానికి అవే ఆటంకంగా మారాయి. అయితే వాటిని తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్టు పిటిషనర్లు ప్రకటించారు. ఇది కరుణానిధి కోసమే వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో మెరీనాబీచ్‌లో ఖననానికి ఉన్న ఆటంకాలు తొలగినట్టైంది. ప్రభుత్వం అనుమతిస్తే ఈ సాయంత్రం మెరీనాబీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు జరిగే అవకాశముంది. రజనీకాంత్‌, ఖుష్బూ, విశాల్‌తోపాటు పలువురు  సినీ ప్రముఖులూ మెరీనా బీచ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు.
కరుణానిధి పార్థీవదేహాన్ని ఆయన నివాసానికి తరలింపు 
మరోవైపు కరుణానిధి పార్థీవదేహాన్ని కావేరి ఆస్పత్రి నుంచి గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించారు. రాత్రి పొద్దుపోయినాక అంబులెన్స్‌లో తరలించారు. దీంతో దారిపొడవునా అభిమానులు బారులు తీరారు. అభిమాననేత కడసారి చూపుకోసం ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరుణానిధి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేటి సాయంత్రం కరుణానిధి అంత్యక్రియలు జరుగనున్నాయి. అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తోపాలు ఇతర రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. 

07:17 - August 8, 2018

చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కన్నుమూశారు. కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. కరుణానిధి మృతికి రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. రెండు రోజుల పాటు ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుంది. ఏడు రోజులు సంతాప దినాలను ప్రకటించారు. సినిమా థియేటర్లను సైతం రెండు రోజుల పాటు స్వచ్ఛందంగా మూసివేయనున్నారు.    
కరుణానిధి కన్నుమూత 
రాజకీయ కురువృద్దుడు.. డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరుణానిధి మరణ వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధికి ముగ్గురు భార్యలు పద్మావతి, దయాళు అమ్మాళ్‌, రాజత్తి అమ్మాళ్‌. కరుణానిధి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని రాజాజీ హాలుకు తరలించే అవకాశముంది.
కరుణానిధి మరణవార్తతో శోకసంద్రంలో తమిళనాడు  
కరుణానిధి మరణవార్తతో.. తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. కవిగా, రచయితగా, పాత్రికేయుడిగా, రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి 80 ఏళ్లపాటు అందించిన సేవలను తలచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు కావేరి ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. కరుణానిధి భౌతికకాయాన్ని సందర్శించేందుకు దేశంలోని పలువురు ప్రముఖులు చెన్నైకి రానుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరుణానిధి మృతితో తమిళనాడు వ్యాప్తంగా అలర్ట్‌ ప్రకటించారు. రెండు రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు. అలాగే రెండు రోజుల పాటు సినిమా థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి.
కరుణానిధి మృతి పట్ల ప్రముఖుల సంతాపం 
మరోవైపు కరుణానిధి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీతో సహా తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, చంద్రబాబు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాపం తెలిపారు. 
కరుణానిధి మృతిని జీర్ణించుకోలేకపోతోన్న సినీ ఇండస్ట్రీ 
అటు సినీ ఇండస్ట్రీ మొత్తం కరుణానిధి మృతిని జీర్ణించుకోలేకపోతోంది. ఆగస్టు 7 బ్లాక్‌డే అని.. దీన్ని ఎప్పటికీ మర్చిపోలేనని రజనీకాంత్‌ ట్వీట్‌ చేశారు. కరుణానిధి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. కరుణానిధి సేవలు మర్చిపోలేమని నటి రాధిక ట్వీట్‌ చేశారు. తమిళుల కోసం పోరాడిన వ్యక్తి కరుణానిధి అని... ఆయన సంకల్పం ఎప్పుడూ సజీవంగానే ఉంటుందన్నారు. కరుణానిధి లేని లోటు తీర్చలేనిదని హీరోయిన్‌ హన్సిక అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూరాలని దేవుడిని వేడుకుంటున్నాన్నారు. 

 

కరుణానిధి మృతిపట్ల రాష్ట్రపతి సంతాపం

చెన్నై : కరుణానిధి మృతిపట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమిళనాడు అభివృద్ధికి కరుణానిధి విశేష కృషి చేశారని కొనియాడారు. 

 

కరుణానిధి పార్థీవదేహానికి నివాళులర్పించిన మమతా బెనర్జీ

చెన్నై : కరుణానిధి పార్థీవదేహానికి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాళులర్పించారు. 

మెరీనా తీరంలో కరుణానిధిని ఖననం చేయడానికి వ్యతిరేకంగా ఉన్న పిటిషన్ల ఉససంహరణ

చెన్నై : మెరీనా తీరంలో కరుణానిధి మృతదేహాన్ని ఖననం చేయడానికి వ్యతిరేకంగా ఉన్న పిటిషన్లను న్యాయవాదులు  ఉససంహరించుకున్నారు. న్యాయవాదులు పిటిషన్లను వెనక్కి తీసుకున్నారు. గతంలో జయలలిత సమాధికి స్మారకం కట్టకూడదని మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు పిల్ దాఖలు చేశారు.

 

Don't Miss