Activities calendar

09 August 2018

21:23 - August 9, 2018

గుంటూరు : స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని వైసీపీ నేతలు ఆరోపించారు. గుంటూరులో వైసీపీ చేపట్టిన వంచనపై గర్జన సభలో చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు వైఎస్‌ జగన్ వల్లే సాధ్యమవుతాయని అన్నారు. గుంటూరులోని విఎఆర్‌ గార్డెన్స్‌లో వైసీపీ వంచనపై గర్జన పేరుతో సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు.. నలుపు రంగు దుస్తులతో హాజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాను సీఎం చంద్రబాబు నీరుగార్చారని వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను చంద్రబాబు మరిచిపోయారన్నారు.

40 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి ప్రదేశ్‌గా సీఎం చంద్రబాబు మార్చారని వైసీపీ మాజీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ మొత్తం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ కలిసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేశాయన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే వంచనపై గర్జన కార్యక్రమం చేపట్టామన్నారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ప్రధాని మోదీపై తిరుగుబాటు చేస్తున్నామంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా స్టాండ్‌ తీసుకోవడానికి వైసీపీయే కారణమని గుర్తు చేశారు. వంచనపై గర్జన సభ సందర్భంగా సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు వైఎస్‌ జగన్‌తో సాధ్యమవుతాయన్నారు. 

21:20 - August 9, 2018

ప్రజలను అప్రమత్తం చేసిన కేరళ సర్కార్...

కేరళ : రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో 22 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. పలు రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగడంతో గేట్లను ఎత్తివేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది.

కుమార స్వామి ప్రమాణ స్వీకారం ఖర్చు...

కర్ణాటక : ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి కుమారస్వామి చేసిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా 42 లక్షలు. ఈ విషయాన్ని ఆర్టీఐ బయట పెట్టడంతో కుమారస్వామిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మే 23న జరిగిన ప్రమాణ స్వీకారానికి బిజెపియేతర పార్టీలను కుమారస్వామి ఆహ్వానించారు. 

గ్రామాలను పరిశుభ్రం చేయాలన్న కేసీఆర్...

హైదరాబాద్ : గ్రామాలను పరిశుభ్రం చేసే పనిని ఆగస్టు 15న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచేలా తీర్చిదిద్దాలనిచ, గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి చేపట్టాల్సిన చర్యలపై సీఎం సూచనలు చేశారు. 

20:43 - August 9, 2018

విజయవాడ : 5 మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌లపై వినియోగదారుల ఫోరం భగ్గుమంది. అధిక ధరలతో వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నారంటూ థియేటర్ల యాజమాన్యాలకు భారీ జరిమానా విధించింది. వినియోగదారులను మోసగించడం తీవ్రమైన తప్పిదమని.. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

విజయవాడలోని కొన్ని మల్టీఫ్లెక్స్‌ థియేటర్లలో టికెట్లు, ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయంపై కొందరు వినియోగదారులు మార్గదర్శక సమితి సహకారంతో గతేడాది ఏప్రిల్‌లో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. LEPL, ట్రెండ్‌సెట్‌, PVR, PVP, ఐమ్యాక్స్ మల్టీఫ్లెక్స్‌ థియేటర్లపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై మల్టీఫ్లెక్స్‌ యాజమాన్యాలు, తూనికలు, కొలతల శాఖను న్యాయస్థానం ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై సమగ్ర విచారణ చేసిన న్యాయమూర్తి మాధవరావు ఈ అంశంపై సంచలన తీర్పు వెలువరించారు.

నగరంలోని 5 థియేటర్ల యాజమాన్యాలు తినుబండారాలపై ఎమ్మార్పీ కంటే మూడు రెట్లు అధికంగా ధర ముద్రించి వినియోగదారులను మోసం చేసినట్లు న్యాయమూర్తి తీర్పులో వెల్లడించారు. వినియోగదారులు నష్టపోయిన మొత్తాన్ని 9 శాతం వడ్డీతో పరిహారం చెల్లించాలని మల్టీఫ్లెక్స్‌ యాజమాన్యాలను ఆదేశించారు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మొత్తం 25 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని 2 నెలల లోపు జిల్లా వినియోగదారుల ఫోరం వద్ద జమ చేయాలని ఆదేశించారు.

ఇక నుండి వినియోగదారులు బయట నుండి తెచ్చుకునే తినుబండారాలను థియేటర్లలోకి అనుమతించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తమ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని తూనికలు, కొలతల శాఖను ఆదేశించింది. ఇలాంటి మోసాలకు పాల్పడడం తప్పని, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. థియేటర్లకు వచ్చే వినియోగదారులకు ఉచిత తాగునీరు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. 

20:23 - August 9, 2018

సూస్తిరా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు ఎట్లైనయో.. మనం ఈడ అంగీలు శింపుకుంటం.. అభిమానం ఉండాలేగని.. అది బానిసత్వానికి ప్రతిరూపంగ మారొద్దు.. కరుణానిధి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమన్న ఉన్నదా..? జగన్ మోహన్ రెడ్డిగారు పాదయాత్ర జేస్తున్నడు.. ఎందుకు..?అభిమానం ఉండాలేగని.. అది బానిసత్వానికి ప్రతిరూపంగ మారొద్దు.. జగన్ మోహన్ రెడ్డిగారు పాదయాత్ర జేస్తున్నడు.. ఎందుకు..? రేపు పొద్దుగాళ్ల పేపర్ల పొంట వస్తయ్ తాటికాయంత అచ్చరాలతోని.. ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు.. రాజకీయాలు ఎంత దిగజారిపోయినయో సూడుండ్రి మొన్న ఒకనాడు ఒక బాండు బైటవడెనా..? డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కేసీఆర్ రాజకీయ కొంప కొల్లేరు జేస్తట్టే గొడ్తున్నది..వర్దన్నపేట ఎమ్మెల్యేగారు.. మీరు రాజీనామా జేయవల్చిన ఎమ్మెల్యేల లిస్టుల ఫస్టు ప్లేస్ల ఉంటరేమో... పదో తర్గతి పోరడు ఉరివెట్టుకోని సచ్చిపోయిండు.. ఎందుకు..? గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

హైకోర్టు చీఫ్ జస్టిస్ తో కేసీఆర్...

హైదరాబాద్ : హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. హైకోర్టు విభజనపై కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. 

బీజేపీకి మేలు చేసిన వైసీపీ - యనమల...

విజయవాడ : రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకే వైసీపీ ఎంపీలు గైర్హాజర్ అయ్యారని ఏపీ మంత్రి యనమల విమర్శించారు. వైసీపీ గైర్హాజర్ ద్వారా మేజిక్ మార్కు తగ్గిందని, దీనితో వైసీపీ బీజేపీకి మేలు చేసిందన్నారు. 

19:33 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవికి జరిగిన ఎన్నికల్లో విపక్షాలకు చుక్కెదురైంది. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ విపక్షాల తరపున పోటీచేసిన హరిప్రసాద్‌పై 20 ఓట్ల తేడాతో గెలుపొందారు. కొత్త డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ పేరును రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ విజయం సాధించారు. విపక్షాల తరపున పోటీ చేసిన కాంగ్రెస్‌ ఎంపీ హరిప్రసాద్‌పై 20 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

రాజ్యసభలో మొత్తం 244 మంది సభ్యులుండగా 230 మంది హాజరయ్యారు. ఎన్డీయేకు 125 ఓట్లు, విపక్షాల అభ్యర్థికి 105 ఓట్లు వచ్చాయి. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ డిప్యూటి చైర్మన్‌గా ఎన్నికైనట్లు సభాపతి వెంకయ్యనాయుడు ప్రకటించారు.

ఈ ఎన్నికలో 14 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండడంతో సంఖ్యాబలం 230కి తగ్గింది. దీంతో విజయలక్ష్యం 119 నెంబర్‌కే పరిమితమైంది. కాంగ్రెస్‌, వైసిపి, డిఎంకె, టిఎంసి, పిడిపిలకు చెందిన ఇద్దరేసి సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆప్‌కు చెందిన ముగ్గురు సభ్యులు, ఎస్పీ ఎంపి జయబచ్చన్‌ కూడా గైర్హాజరయ్యారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హరివంశ్‌ మంచి విద్యావంతుడని... సభను హుందాగా నడిపే సమర్ధత హరివంశ్‌కు ఉందన్నారు.

రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపికైన జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ను విపక్షాలు అభినందించాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం సర్వసాధారణమని..రాజ్యాంగ బద్దమైన పదవికి ఎంపికైన వ్యక్తులు పార్టీలకు అతీతంగా పనిచేయాల్సి ఉంటుందని కాంగ్రెస్‌ పక్షనేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. హిందీ భాష అభివృద్ధికి ఆయన చాలా కృషి చేశారని కొనియాడారు. ఓ జర్నలిస్ట్‌ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపిక కావడం వల్ల మీడియాలో సభ కార్యకలాపాలకు చెందిన వార్తలు ఎక్కువగా వస్తాయని నవ్వుతూ చెప్పారు.

పార్లమెంట్‌ సభ్యుడిగా హరివంశ్‌ పనితీరుపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సంతృప్తి వ్యక్తం చేశారు. రచయిత, సంపాదకుడు, బ్యాంకర్, రాజకీయ కార్యకర్తగా ఎంతో అనుభవం గడించిన ఆయన ఏ విషయమైనా రిసెర్చ్‌ చేసి చర్చించే వారని ఆయన తెలిపారు. హరివంశ్‌ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపిక కావడం ద్వారా సభా హుందాతనం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. కిడ్నీ ప్లాంటేషన్‌ చేయించుకున్న తర్వాత జైట్లీ తొలిసారిగా పార్లమెంట్‌కు హాజరయ్యారు.

తనని రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌గా ఎన్నుకున్నందుకు హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తాను నిష్పక్షపాతంగా సభను నడిపిస్తానని హామి ఇచ్చారు. ఈ పదవిని చేపట్టడం తనకు కొంత భయంగానే ఉందని... రాజ్యసభలో ఎందరో అనుభవజ్ఞులున్నారని వారి సూచనలతో సభను హుందాగా నడిపిస్తానని హరివంశ్‌ పేర్కొన్నారు.

హరివంశ్‌కు ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు బిజెడి, టిఆర్‌ఎస్‌, శివసేన మద్దతు తెలిపాయి. డిప్యూటి ఛైర్మన్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ సభ్యులు మద్దతు ఇచ్చినందుకు బిహార్‌ సిఎం నితీష్‌కుమార్‌ తెలంగాణ సిఎం కేసీఆర్‌కు ఫోన్‌ చేసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ సహకారం ఉంటుందని నితీష్‌ అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఎస్పీ, బిఎస్పీ, ఎన్‌సిపి, టిఎంసి, టిడిపి, వామపక్షాలు మద్దతుగా నిలిచాయి. ఎన్డీయే అభ్యర్థిని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమైనప్పటికీ ఫలితం దక్కలేదు.

రామగుండం సీపీ బదిలీ...

పెద్దపల్లి : రామగుండం సీపీ విక్రమ్ జిత్ దుగ్గల్ బదిలీ అయ్యారు. పంజాబ్ రాష్ట్రానికి మూడేళ్ల పాటు డిప్యూటేషన్ బదిలీపై కేంద్రం ఆమోదం తెలిపింది. 

18:52 - August 9, 2018
18:50 - August 9, 2018

'శతమానం భవతి' సినిమాతో హిట్ సాధించిన దర్శకుడు 'సతీష్ వేగేశ్న' మరో సినిమాను రూపొందించారు. 'దిల్' రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కళ్యాణం' సినిమా రూపొందింది. పెళ్లి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలో జయసుధ, ప్రకాశ్ రాజ్, నరేష్, సితారలు కాకుండా ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి మూవీ రివ్యూ కోసం..రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఏపీ వ్యాప్తంగా ఆగిపోయిన మద్యం సరఫరా...

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుండి మద్యం దుకాణాలకు సరఫరా నిలిచిపోయింది. యూఎస్ సీ సంస్థ సేవలు నిలిపివేయడంతో సరఫరా ఆగిపోయింది. మద్యం అమ్మకాలను ఆన్ లైన్ లో నియంత్రించే యూఎస్ సీ సంస్థ సేవలు నిలిపివేసింది. యూఎస్ సీ సంస్థకు ప్రభుత్వం రూ. 56 కోట్లు చెల్లించడం లేదని యూఎస్ సీ సంస్థ సరఫరాను నిలిపివేసింది. 

18:38 - August 9, 2018

నెల్లూరు : జిల్లా సీతారాంపురంలో విషాదం నెలకొంది. స్కూల్‌లో ఆడుకుంటూ పెన్ను క్యాప్‌ మింగిన మూడో తరగతి విద్యార్థి వినయ్‌..ఊపిరి ఆడక అపస్మారకస్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వినయ్‌ మృతి చెందాడు. 

18:34 - August 9, 2018

విశాఖపట్టణం : గిరిజనులకు పెన్షన్లు ఇచ్చే వయసును ఏపీ ప్రభుత్వం తగ్గించింది. యాభై ఏళ్లు నిండిన ప్రతి గిరిజనుడికి పెన్షన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖపట్నం జిల్లా పాడేరులో జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు... గిరిజనుకు ప్రస్తుతం ఇస్తున్న 75 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను వంద యూనిట్లకు పెంచుతున్నట్టు చెప్పారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రాన్ని ఆదుకోవడంలో విఫలమైన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ధర్మపోరాటం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా పాడేరులో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు.. కేంద ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్రంపై చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. 

జీవీఎల్ అవినీతి చిట్టా ఉంది - బుద్ధా...

విజయవాడ : యూ టర్న్ లు తీసుకోవడంలో జగన్ సిద్ధహస్తుడని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వస్తుందని, రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలో ఓటు వేయకుండా తప్పుకుందన్నారు. జీవీఎల్ నరసింహరావు పవర్ బ్రోకర్ అని, జీవీఎల్ అవినీతి సంపాదన చిట్టా తన దగ్గర ఉందన్నారు. జీవీఎల్ అవినీతిని బట్టబయలకు చేయకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు. జీవీఎల్ వ్యాఖ్యలకు బాబు, లోకేష్ లు స్పందించాల్సినవసరం లేదన్నారు. 

పెన్ క్యాప్ మింగి విద్యార్థి మృతి...

నెల్లూరు : సీతారాంపూర్ లో విషాదం చోటు చేసుకుంది. పెన్ క్యాప్ మింగిన మూడో తరగతి విద్యార్థి వినయ్ మృతి చెందాడు. 

పంచాయతీ రాజ్ శాఖపై కేసీఆర్ సమీక్ష...

హైదరాబాద్ : పంచాయతీ రాజ్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష ఈనెల 2నుండి గ్రామాల్లో అమల్లోకి వచ్చిన స్పెషల్ అధికారుల పరిపాలనపై చర్చించారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు, పనితీరుపై కూడా చర్చించారు. 

17:18 - August 9, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు..మైనార్టీల అభివృద్ధికి సహకరించని మోడీకి సీఎం కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ బీజేపీకి అనుసంధానకర్త 'అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్' అని ఆరోపించారు. ఇందుకు తమిళనాడు పర్యటన నిదర్శనమని, ఆ పర్యటనలో అదానీకి చెందిన విమానంలో కేసీఆర్ వెళ్లారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధికి మోడీ సహకరించడం లేదని, ముస్లిం రిజర్వేషన్ కు క్లారిటీ ఇవ్వని కేసీఆర్ పై ఎంఐంఎం ఆలోచించాలని సూచించారు. కేసీఆర్ భవిష్యత్ లో బీజేపీతో వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. 

17:08 - August 9, 2018

విజయవాడ : జిల్లా వినియోగదారుల న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. థియేటర్లలో తినుబండారాలను అనుమతించాలని ఆదేశించింది. అధిక రేట్లతో వినియోగదారులను దోచుకుంటున్న మల్టీప్లెక్స్ థియేటర్లపై కోర్టు కొరడా ఝులిపించింది. ఐదు మల్టీప్లెక్స్ థియేటర్లకు రూ. 25 లక్షల జరిమాన విధించింది. వినియోగదారులు బయటి నుండి తీసుకొచ్చుకున్న తినుబండారాలను..మంచినీరును అనుమతించాలని కోర్టుకు పేర్కొంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఉన్నతవిద్య కోసం గిరిజన విద్యార్థులను విదేశాలకు : చంద్రబాబు

విశాఖపట్నం : గిరిజన పిల్లలను విద్య కోసం విదేశాలకు పంపుతున్నామని, ఏపీలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి, సంక్షేమం ఈ నాలుగేళ్లలో జరిగిందని చంద్రబాబు తెలిపారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత ప్రభుత్వానిదేనని, అడగకుండానే వరాలిచ్చే పార్టీ తెలుగుదేశం అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణం జిల్లాలోని పాడేరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘గిరి ప్రగతి’ వెబ్ సైట్, జీసీసీ ఉత్పత్తులను చంద్రబాబు ఆవిష్కరించారు.

గిరిజనుల భూములకు పట్టాలు ఇస్తున్న ఘనత మాదే : చంద్రబాబు

విశాఖపట్నం : గిరిజనులకు భూమి పట్టాలు ఇస్తున్న ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణం జిల్లాలోని పాడేరులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తెలిపారు. కేవలం భూములు ఇవ్వడమే కాకుండా సాగును లాభసాటిగా మారుస్తామని, గిరిజన ప్రాంతంలో పండించే జీడిపప్పుకు ప్రాధాన్యత తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 

కేసీఆర్, మోదీల మధ్య ఆదాని మధ్యవర్తిత్వం : రేవంత్

హైదరాబాద్ : కేసీఆర్, మోదీల మధ్య ఆదాని అనుసంధాన కర్తగా వున్నారని..ఆదానీ కంపెనీతో కేసీఆర్ కు వున్న ఆర్థిక ప్రయోజనాల కోసమే మోదీకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో మద్దతునిచ్చారని రేవంత్ ఆరోపించారు. ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ ను కొనుగోలు చేస్తు ఆదానీ, కేసీఆర్ లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తుల గురించి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందనీ..ఆ విషయంపై తాను అధిష్టానం నిర్ణయం తరువాతనే మాట్లాడతానని ఇప్పుడు మాట్లాడదలచుకోలేదని రేవంత్ స్పష్టం చేశారు. 

బీజేపీ, టీఆర్ఎస్ దోస్తీపై క్లారిటీ వచ్చింది : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : బీజేపీ, టీఆర్ఎస్ దోస్తీపై చీకట్లు తొలగిపోయి పూర్తి క్లారిటీ వచ్చిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. రాజ్యసభలో జరిగిన డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థికే ఓటు వేయటంతో వీరి దోస్తీపై పూర్తి క్లారిటీ వచ్చిందని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ ఓ వైపు ఎంఐఎంతో మరోవైపు మోదీతో దోస్తీ చేస్తు ప్రజలను..వారిని కూడా మోసం చేస్తున్నారని రేవంత్ విమర్వించారు. రాజ్యసభ ఎన్నికల్లో మోదీకి కేసీఆర్ ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.

ఫిల్మ్ నగర్ హత్యను ఛేదించిన పోలీసులు..

హైదరాబాద్ : ఫిల్మ్ నగర్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు చాకచక్యం ఛేదించారు. ఈనెల 7వ తేదీన ఫిల్మ్ నగర్ లో జగన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి వివాహేతర సంబంధం వల్లనే జగన్ హత్యకు గురయ్యాడని నిర్ధారించారు. ఈ కేసులో నిందితులుగా భావించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

16:41 - August 9, 2018

కేరళ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడడంతో 20 మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఇడుక్కి జిల్లాలో అత్యధికంగా 11 మంది మృత్యువాత పడ్డారు. మళప్పరంలో 6గురు, కోచికూడిలో ఇద్దరు, వాయునాడులో ఒకరు మృతి చెందారు. పాలక్కాడ్, వాయునాడ్, కోచికూడిలో కొందరు గల్లంతయ్యారు. తెల్లవారుజామునుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు..వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెరియార్ నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. ఇడుక్కి రిజర్వాయర్ లో నీటి మట్టం పెరిగిపోవడంతో 22 గేట్లను ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమలమయ్యాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు..కళాశాలలకు సెలవు ప్రకటించారు. 

సీఎం కేసీఆర్ కు బీహార్ సీఎం నితీశ్ కృతజ్నతలు..

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఫోన్ చేసి మాట్లాడారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసినందుకు కేసీఆర్ కు నితీశ్ కుమార్ కృతజ్నతలు తెలిపారు. భవిష్యుత్తులో తెలంగాణ అభివృద్ధికి తాము సహకారం అందిస్తామని నితీశ్ కేసీఆర్ కు తెలిపారు. 

16:36 - August 9, 2018
16:34 - August 9, 2018

వరంగల్ : జిల్లాలో మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ప్రభుత్వం మినలర్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ - ఖమ్మం రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. ప్రతి ఇంటికి గోదావరి జలాలను అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఉన్న వాటర్ ప్లాంటును మూసివేస్తోందని తెలిపారు. వాటర్ ప్లాంట్ ఉన్నప్పుడు కేవలం రూ. 2లతో స్వచ్ఛమైన నీటిని తాగే వారమన్నారు. 

16:31 - August 9, 2018

విజయవాడ : క్విట్ ఇండియా ఉద్యమానికి 76 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో కాంగ్రెస్ సేవా దళ్ విభాగం వినూత్న కార్యక్రమం నిర్వహించింది. లెనిన్ సెంటర్ వద్ద 76 అడుగుల జాతీయ జెండాను సేవా దళ్ కార్యకర్తలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ ఊమెన్ చాందీ, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఊమెన్ చాందీ మాట్లాడుతూ ఆనాటి సమరయోధుల త్యాగాలను నేటి తరం మననం చేసుకోవాలని సూచించారు. 

16:28 - August 9, 2018

ఢిల్లీ : కొంతమంది ఎంతటి ప్రతిభ వున్నా వారు వెలుగులోకి రావటానికి ఈ ప్రపంచానికి పూర్తిస్థాయిలో పరిచయం కావటానికి ఓ కీలక సందర్భం తోడ్పడుతుంది. వారు ఆ స్థాయికి రావటానికి మహానుభావుల ప్రభావం కూడా వుండవచ్చు. పెద్ద మనస్సున్నవారి వద్ద పనిచేసినంత మాత్రాన పెద్ద మనసు వస్తుందన్న నమ్మకం లేదు. మేధావుల వద్ద పనిచేసినంత మాత్రాన వారికి మేధావుల సరసన చోటు దక్కుతుందన్న గ్యారంటీ లేదు. కానీ ప్రతిభ వున్నవారి ఎదుగుదలను మాత్రం ఎవరు నియంత్రించలేరు. అటువంటివారికి ఓ సమయం..ఓ సందర్భం..అ అవకాశం..ఓ కీలక పరిణామం వారిని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఓ కీలక సందర్భం వారికి కీలక పదవి వరిస్తుంది. అటువంటి సమయం, సందర్భం, అవకాశం తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ నారాయణ సింగ్ ఇప్పుడు పూర్తిస్థాయిలో భారతదేశానికి పరిచయం అయ్యారు.

జర్నలిజం నుండి డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్
రాజకీయ సలహాదారుడిగా..బ్యాంకు ఉద్యోగిగా..జర్నలిస్టుగా వివిధ బాధ్యతలను నిర్వహించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ నారాయణ సింగ్ యుపిలో బలియా జిల్లా డయారా అనే గ్రామంలో జన్మించిన ఈయన బెనారస్‌ హిందీ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. ఆ తర్వాత హరివంశ్‌ హిందీ దినపత్రిక ప్రభాత్‌ ఖబర్‌లో ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా పనిచేశారు. ఆ తర్వాత రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైద్రాబాద్‌ బ్రాంచ్‌లో కొన్నాళ్లు బాధ్యతలు నిర్వర్తించిన హరివంశ్‌..భారతదేశపు 11వ ప్రధాని చంద్రశేఖర్‌కు మీడియా సలహాదారుగా కూడా వ్యవహరించారు. బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు సన్నిహితుడుగా ఉన్న ఈయన 2014 లో మొదటిసారి రాజ్యసభ కు ఎన్నికయ్యారు.

మాజీ ప్రధానికి మీఇయా సలహాదారుడిగా హరివంశ్
చంద్రశేఖర్‌కు మీడియా సలహాదారుగా కూడా వ్యవహరించిన క్రమంలో ప్రభౄత్ ఖబర్ ఎడిటర్ పోస్టుని కాదనుకున్నారు. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవటంతో హరివంశ్ కూడా పదవిని కోల్పోయారు. దీంతో ఆయన తిరిగి జర్నలిజంలో చేరిపోయారు. 1980లో 'ధర్మయుగ్' అనే హిందీ వారపత్రికలో జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించిన హరివంశ్ తరువాత బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ గా మరో బాధ్యతల్లోకి ఒదిగిపోయారు. కానీ కుటుంబ సభ్యులు జర్నలిజంలోనే కొనసాగితే బాగుంటదనటంతో తిరిగి 'రణవీర్' అనే పత్రికలో చేరారు.
జర్నలిస్ట్ నుండి ఎడిటర్ గా ఎదిగిన హరివంశ్
ఒక సాధారణ జర్నలిస్టుగా 1989లో రాంచీలోని ప్రభాత్ ఖబర్ లో చేరిన హరివంవ్ అన పత్రికకు చీఫ్ఎడిటర్ స్థాయికి ఎదిగారు. 2014లో జేడీయూ తరపున రాజ్యసభ ఎంపీ కాగానే ఎడిటర్ పదవికి రిజైన్ చేసి ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా బీహార్ ముఖ్యమంత్రిగా వున్న నితీశ్ కుమార్ కు తన పత్రిక ద్వారా మద్దతు పలికారన్న విమర్శలు హరివంశ్ పై వున్నాయి. కాగా దీంతోనే హరివంశ్ ను రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ నామినేట్ చేసి వుండవచ్చు అనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కూడా తనకు అనుకూలంగా మలచుకున్న మేధావిగా హరివంశ్ ను చూడవచ్చు. మంచి మనులు చేసినప్పుడు ఎక్కడ పనిచేసినా మెచ్చుకోవాల్సిందేనంటారు హరివంశ్. వ్యవస్థను టార్గెట్ చేస్తునే నిర్మాణాత్మక విమర్శలతో జర్నలిజం వుండాలని ఆయన అభిప్రాయపడుతుంటారు. ఏది ఏమైనా ఒక సాధారణ వ్యక్తి జీవితంలో అసాధారణ పెను మార్పులు సంభవించాయి అంటే ఆ వ్యక్తి వెనుక ఒక పెద్ద నేతగానీ..వ్యక్తి గానీ..వ్యవస్థ గానీ వుంటుందనే మాటకు నిదర్శనం ఈరోజు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ సింగ్ ఎన్నికను మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఒక రాజ్యాంగ సభకు ప్రతినిథిగా వుండటమంటే పార్టీలకు.. వ్యక్తులకు, పదవులకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయటమేనని హరివంశ్ నారాయణ సింగ్ తన బాధ్యతను నిర్వహిస్తారని ఆశిద్దాం..

16:16 - August 9, 2018

విశాఖపట్టణం : గిరిజన, ఆదివాసీలకు ఏపీ ప్రభుత్వం తోడుగా ఉంటుందని..వారి మేలు కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖ జిల్లాలోని అడారిమెట్టలో నిర్వహించిన గ్రామ దర్శినిలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గ్రామాల్లో ప్రజలను కూర్చొబెట్టి ప్రతి దానిపై సమీక్ష చేయడం జరిగిందని, 175 నియోజకవర్గాలోని 800-900 మండలాలకు నోడల్ ఆఫీసర్లను పెట్టడం జరిగిందని, గురు, శుక్రవారాల్లో గ్రామాలకు వెళ్లాలని వారిని ఆదేశించడం జరిగిందన్నారు. అధికారుల పనితనం..వారి యొక్క సేవల వల్ల ప్రజల తృప్తిని కనుక్కోవడం జరుగుతోందన్నారు. అమరావతికి దూరంగా ఉన్న పాడేరు..ఇతర కొన్ని నియోజకవర్గాలపై కూడా సమీక్ష జరుపుతున్నామన్నారు.

పాడేరులో బల్బు వెలుగుతుందా ? లేదా ? అనేది అమరావతిలో కూర్చొని సమీక్షిస్తానని...ఫించన్ సరిగ్గా వస్తుందా ? లేదా ? ఫించన్ అధికారి సక్రమంగా వ్యవహరించారా ? లేదా అని తాను పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. పలువురికి పేద వారికి అండగా ఉంటూ..సేవలందిస్తున్నట్లు, అంగన్ వాడీ..మెప్నా..వీఆర్ఏ లకు వేతనాలు పెంచడం జరిగిందన్నారు. గిరిజనులకు తాను తోడుగా ఉంటానని హామీనిచ్చారు. రాబోయే తరాలు బాగుండాలనే ఉద్దేశ్యంతో పనులు చేయడం జరుగుతోందన్నారు.

15:42 - August 9, 2018

ఢిల్లీ : భారత దేశ ప్రధాని మోడీ పాలనలో దళితులు అణిచివేతకు గురవుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గురువారం పార్లమెంట్ స్ట్రీట్ లో 'దళిత సంఘాల' సింహగర్జనలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్..మోడీలు దళితులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని మోడీ నీరుగారుస్తున్నారని, 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత దళితుల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని హామీనిచ్చారు. 

రాహుల్ కి ప్రోటోకాల్ పాటించకపోవటం ఏమిటి : ఉత్తమ్

హైదరాబాద్ : సీఎస్ జోషికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఫోన్ చేశారు. రాహుల్ గాంధీకి హరితప్లాజాలో అకామినేషన్ కల్పించకపోవటం ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా ప్రజలతో ఎన్నుకోబడిన రాహుల్ గాంధీకి ప్రోటోకాల్ పాటించకపోవటం ఏమిటని ఉత్తమ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ శాశ్వతంగా అధికారంలో వుండదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరమందని సూచించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుని తెలిజేస్తామని సీఎస్ జోషి తెలిపారు.    

15:31 - August 9, 2018

హైదరాబాద్ : గత కొంతకాలంగా మౌనంగా ఉన్న టి.కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మళ్లీ విమర్శల దాడిని పెంచారు. టీఆర్ఎస్ ప్రభుత్వం..కేసీఆర్ పై పలు ఆరోపణలు గుప్పించారు. ఛత్తీస్ గఢ్ కరెంటు ఒప్పందంలో పలు అవతవకలు జరిగాయని, పది సంవత్సరాల కాంట్రాక్టు అదానీకి అప్పచెప్పారని..అదానీ..కేసీఆర్ లు వాటాలు పంచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించడం లేదని, స్వార్థం కోసం తెలంగాణను బలి ఇస్తున్నారని విమర్శించారు. ఇక్కడ ఎంఐఎం..కేసీఆర్ కు మద్దతిస్తున్నారని..కానీ కేసీఆర్ మాత్రం బీజేపీకి మద్దతిస్తున్నారని తెలిపారు. 12 శాతం మైనార్టీ రిజర్వేషన్లను తుంగలో తొక్కి బీజేపీతో కేసీఆర్ అంటకాగుతున్నారని, ఏమైనా అర్థం అవుతుందా ? లేదా ? అని ఎంఐఎం ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎంఐఎం..కేసీఆర్ లు కలిసి తెలంగాణ మైనార్టీ వారిని మోసం చేస్తున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ తోని అంటకాగొద్దని హితవు పలికారు. అవినీతి కోసం కేసీఆర్ కలిసిపోతారని...ఆదేశాలు ఇవ్వకుండా ఉండొద్దనే ఉద్దేశ్యంతో మోడీతో కలుస్తున్నారని ఆరోపించారు. 

మోదీకి కేసీఆర్ చెమ్చాగిరి ఈ ఎన్నికతో రుజువైంది : ఉత్తమ్

హైదరాబాద్ : నాలుగేళ్ల నుండి సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి చెమ్చాగిరి చేస్తున్న విషయం పలు సందర్భాలలలో వెల్లడయ్యిందనీ..ఈరోజు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్ ఎంపీల ఓట్లు బీజేపీ అభ్యర్థి హరివంశ్ కు వేయటంతో ఆ విషయం తేటతెల్లమయ్యిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 

పీపుల్స్ పోలింగ్ కోసమే ఇంటర్ సెప్టార్ వెహికల్స్ : డీజీపీ ఠాకూర్

విజయవాడ : నగరంలో 12 పోలీస్ ఇంటర్ సెప్టార్ వాహనాలను డీజీపీ ఠాకూర్, కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నారు. 24 గంటలు ప్రజలకు ఇవి అందుబాటులో వుంటాయని డీజీపీ ఠాకూర్ తెలిపారు. ప్రజలకు పోలీసింగ్ ను దగ్గరకు చేర్చేందుకు వాహనాలు ఉపయోగపడతాయన్నారు.

15:21 - August 9, 2018

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆనాటి నుండి వైసీపీ పోరాటం చేస్తోందని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో 'వంచనపై గర్జన' పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తమను ఎన్నుకుంటే పది హేను సంవత్సరాల పాటు 'హోదా' ఇస్తామని గతంలో పేర్కొన్నారని తెలిపారు. రెండు చోట్ల ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత 'హోదా' పరిస్థితులపై ఆనాటి నుండి ఇప్పటి వరకు వైసీపీ నిలదీస్తూ వస్తోందన్నారు. హోదా వద్దు..ప్యాకేజీ ముద్దు అని కేంద్రం పేర్కొందని..కానీ హోదానే ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసిందన్నారు. 'హోదా'కు బదులు 'ప్యాకేజీ' ఇస్తామని కేంద్రం చెబుతుంటే వైసీపీ అడ్డు పడుతోందని ఆనాడు బాబు పేర్కొన్నారని గుర్తు చేశారు. 'హోదా' కోసం వైసీపీ ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం అరెస్టులు చేసిందని, ప్రస్తుతం బాబు మళ్లీ 'హోదా' మాటెత్తుతున్నారని తెలిపారు. 

15:18 - August 9, 2018

గుంటూరు : తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బిజెపికి టిడిపి తాకట్టుపెట్టిందని వైసీపీ పేర్కొంది. గుంటూరు జిల్లాలో గురువారం వంచనపై గర్జన కార్యక్రమం నిర్శహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు టిడిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎంగా చంద్రబాబు ఉన్నంతకాలం ఏపీకి హోదా రాదని, జగన్ తో విభజన హామీలు అమలవుతాయన్నారు.

బాబు అనుభవం అప్పుల పాలు..
చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల అనుభవం అప్పుల పాలు చేసిందని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ప్రజల కోసం జగన్ అలుపెరుగని పోరాటం చేస్తుంటే జగన్ ను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తిపై కుట్రలు పన్నడం ధర్మం కాదన్నారు. 

సైబర్ నేరాలపై పోలీసులకు శిక్షణ : డీజీపీ ఠాకూర్

విజయవాడ : సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను డీజీపీ ఠాకూర్ ప్రారంభించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పై దృష్టి పెట్టామని..సైబర్ నేరాలపై పోలీసులకు శిక్షణనిస్తామని డీజీపీ ఠాకూర్ తెలిపారు. వారం రోజుల్లో విశాఖలో సైబర్ పీఎస్ ను ప్రారంభిస్తామన్నారు. మరో మూడు నెలల్లో ఏడు సైబర్ ల్యాబ్స్ ప్రారంభిస్తామని డీజీపీ ఠాకూర్ తెలిపారు. 

బీసీసీఐ రాజ్యాంగ సంస్కరణలకు సుప్రీంకోర్టు ఆమోదం..

ఢిల్లీ : బీసీసీఐ రాజ్యాంగ సంస్కరణలకు సుప్రీంకోర్టు ఆమోదం పలికింది. లోథా కమిటీ సిఫార్సుల ఆధారంగా బీసీసీఐ రాజ్యాంగంలో సంస్కరణలకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆమోదం పలికింది. పలు కీలక సిఫార్సులను పక్కన పెట్టిం సుప్రీంకోర్టు సీసీఐ రాజ్యాంగ సంస్కరణలకు సుప్రీంకోర్టు ఆమోదం పలికింది.

బాక్సైట్ తవ్వాలని కేంద్రం ఒత్తిడి..తలొగ్గేది లేదు : చంద్రబాబు

విశాఖపట్నం : ఏజెన్సీలో వుండే బాక్సైట్ మైన్స్ విషయంలో తవ్వకాలు జరిపించాలని కేంద్రం ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందనీ..అయినా కేంద్రం ఒత్తిడికి ఏమాత్రం తలొగ్గేది లేదని సీఎం చంద్రబాబు పాడేరు గ్రామదర్శిని సభలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. బాక్సైట్ తవ్వకాల అనుమతులను గతంలోనే రద్దు చేశామని చంద్రబాబు స్పష్టంచేశారు. అయినా కేంద్రం తమపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రూ.2300 కోట్లతో గిరిజన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు ప్రపంచ ఆదివాసీల దినోత్సం సందర్భంగా పాడేరు నియోజకవర్గంలోని గ్రామదర్శిని కార్యక్రమంలో హామీ ఇచ్చారు. 

గిరిజన మహిళలతో చంద్రబాబు ముఖాముఖీ..

విశాఖపట్నం : ఈరోజు ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆడారిమెట్టలో గ్రామదర్శిని కార్యక్రమంలో చంద్రబాబు పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..పలు సమస్యలతో బాధపడుతున్న గిరిజనులకు నగదు ప్రోత్సాహకాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు గిరిజన గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలను నిర్వహించారు. చింతలవీధిలో గ్రామదర్శిని కార్యక్రమంలో గిరిజన మహిళలతో చంద్రబాబు ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. 

20 ఆవుల ప్రాణం తీసిన రైలు..

ఢిల్లీ : గోమాతల పాలిట రైలు యమపాశంలా మారింది. వేగంగా వెళుతున్న కల్కా - శతాబ్ది ఎక్స్ ప్రెస్ న్యూఢిల్లీ శివార్లలోని నరేలా ప్రాంతంలో వెళుతున్న వేళ, ఓ ఆవుల మంద పట్టాలపైకి రావడంతో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని కనీసం 20 ఆవులు మృత్యువాత పడ్డాయి. హోలంబీ కలాన్, నరేలా మధ్య ఆవులు రైలు పట్టాలు దాటుతున్న వేళ ఈ ఘటన జరిగింది. ఇది చాలా భయానక ఘటన అని, రైలు పట్టాలు సైతం స్వల్పంగా దెబ్బతిన్నాయని నార్త్ రన్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఓ అధికారి తెలిపారు.

14:32 - August 9, 2018

విజయనగరం : జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ లక్షణాలతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 27 మందికి డెంగ్యూ సోకినట్లు వైద్యులు నిర్థారించారు. జిల్లాలో సాలూరు, ఎస్ కోట ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాధి లక్షణాలతో నలుగురు మృతి చెందడంతో ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం జిల్లాలో విషజ్వరాలపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:31 - August 9, 2018

పెద్దపల్లి : మా ఊరికి మున్సిపల్‌ అధికారులు వస్తే చెప్పులు, చీపుర్లతో తరిమికొడతామంటూ హెచ్చరిస్తున్నారు పెద్దపల్లి జిల్లా లింగాపూర్‌ గ్రామస్థులు. ఊరి పొలిమేరలో చెప్పులు, చీపుర్లను వేలాడదీసి మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అభివృద్ది పేరుతో మా జీవితాలతో ఆడుకోవేద్దంటూ అధికారులను హెచ్చరిస్తున్నారు. గ్రామస్తులు ఆందోళనకు గల కారణాలను తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:29 - August 9, 2018

మహబూబ్‌ నగర్‌ : జిల్లా మాచన్‌పల్లిలో ఓ యువకుడు సెల్ఫీ సూసైడ్‌కు చేసుకున్నాడు. తన చావుకు గ్రామస్థులు, సర్పంచ్‌ కారణమని వీడియోలో తెలిపాడు. శ్రీకాంత్‌ స్నేహితుడు రాజు మాచన్‌ పల్లి గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో కలిసి పారిపోయాడు. దీంతో అమ్మాయి కుటుంబసభ్యులు, గ్రామస్థులు రాజు ఎక్కడున్నాడంటూ తనను వేధిస్తున్నాడని శ్రీకాంత్‌ వీడియోలో పేర్కొన్నాడు. గ్రామస్థులు ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపి రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  

14:26 - August 9, 2018

హైదరాబాద్‌ : ప్రయాణికుల నుంచి దోపిడీ చేసే కజర్‌గ్యాంగ్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్‌ అయిన వారు తొమ్మిది కేసుల్లో ప్రదాన నిందితులుగా పోలీసులు గుర్తించారు. నిందుతుల్లో ఒకరైన అప్సర్‌ఖాన్‌ మెకానిక్‌ వృత్తి చేసేవాడని అనేక చోట్ల దొంగతనాలు చేసాడని సీపీ తెలిపారు. నిందితుల నుంచి భారీ ఎత్తున బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

14:24 - August 9, 2018

ఢిల్లీ : గత కొన్నేళ్లుగా పార్లమెంట్‌ సభ్యుడిగా హరివంశ్‌ పనితీరును తాము చూశామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. రచయిత, సంపాదకుడు, బ్యాంకర్, రాజకీయ కార్యకర్తగా ఎంతో అనుభవం గడించిన ఆయన ఏ విషయమైనా రిసెర్చ్‌ చేసి చర్చించే వారని జైట్లీ తెలిపారు. వ్యక్తిగత విమర్శలు చేయకుండా సభ నిబంధనలకు అనుగుణంగా హరివంశ్‌ పనిచేశారన్నారు. హరివంశ్‌ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపిక కావడం ద్వారా సభా హుందాతనం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నట్లు జైట్లీ పేర్కొన్నారు.

రాజ్యసభలో డిప్యూటి ఛైర్మన్‌ ఎన్నిక సుహృద్భావ వాతావరణంలో జరగడం అభినందనీయమని సమాజ్‌వాద్‌ పార్టీ ఎంపి రామ్‌గోపాల్‌ యాదవ్‌ అన్నారు. ఎన్డీయే తరపున పోటీ చేసిన హరివంశ్‌, విపక్షాల తరపున పోటీ చేసిన కాంగ్రెస్‌ ఎంపి హరిప్రసాద్‌ పరిపక్వత చెందిన వ్యక్తులని ఆయన కొనియాడారు. ఆయా రాష్ట్రాలకు చెందిన సభ్యులకు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అంశాలు ప్రస్తావించాల్సి ఉంటుందని...ఈ విషయంలో సభాపతి హుందాగా ప్రవర్తించారని రామ్‌గోపాల్‌ యాదవ్‌ కోరారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ఎన్నికయ్యారు. ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌కు 125 ఓట్లు వచ్చాయి. విపక్షాల అభ్యర్థి హరిప్రసాద్‌కు 105 ఓట్లు వచ్చాయి. టీడీపీ కాంగ్రెస్‌ అభ్యర్థికి, టీఆర్‌ఎస్‌ ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేశాయి. వైసీపీ ఓటింగ్‌కు దూరంగా ఉంది. 

14:09 - August 9, 2018

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం, టీడీపీ ఎంపీలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలు నాటాకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 'పచ్చి అబాద్ధాలు ఆడుతున్న మిమ్మల్ని దోషులుగా నిలబెడతాము' అని టీడీపీ ఎంపీలను ఉద్ధేశించి మాట్లాడారు. ఆర్థికమంత్రితో సహా అందరూ అబద్ధాలు చెప్పారని పేర్కొన్నారు. వేల కోట్లను పీడీ ఖాతాల్లోకి మార్చారని తెలిపారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఒక పెద్ద ఫ్రాడ్ చేసిందన్నారు. 'మీ ఫ్రాడ్ ను ప్రజల సమక్షంలో, ప్రభుత్వ సమక్షంలో పెడతాం' అని చెప్పారు. రాజ్యసభలో ఎన్ డీఏకు ఉన్న బలం కంటే ఎక్కువ ఓట్లు హరివంశ్ కు వచ్చాయని అన్నారు. 2019లో ఇంతక కన్నా మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

13:53 - August 9, 2018

హైదరాబాద్ : ప్రంపచంలోనే ఇంటీరియల్‌ ఫర్నీచర్‌ దిగ్గజం ఐకియా మొదటి స్టోర్‌ను హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఐకియా ఫర్నీచర్‌ కంపెనీని హైదరాబాద్‌లో లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నాయన్నారు.

13:50 - August 9, 2018

సంగారెడ్డి : అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ ఇక్రిశాట్‌ పరిశోధనా ఫలితాలను సంగారెడ్డి జిల్లా అందిపుచ్చుకోనుంది. ఈ మేరకు రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయంలో ఆధునిక మెళకువల కోసం ఇక్రిశాట్‌ను ఉపయోగిస్తామంటనున్న జిల్లా కలెక్టర్‌తో ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించారు. తెలంగాణ ప్రాంతంలో అధికంగా మెట్ట పంటలే సాగవుతున్నాయని తెలిపారు.

 

13:46 - August 9, 2018

విజయవాడ : రైతాంగ కార్మిక సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ,  రైతుకూలీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జైల్‌ భరో నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్‌ సెంటర్‌లో నిర్వహించిన జైల్‌ భరో కార్యక్రమంలో రైతాంగ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనిన నిరసన వ్యక్తం చేశాయి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదాయం పెంచుతామన్న మోదీ ..పూర్తిగా విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు శ్రీనివాస్‌ విమర్శించారు.

13:45 - August 9, 2018

కృష్ణా : జిల్లాలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముసునూరుకు చెందిన కొమ్మన రామదాసు, అచ్చాయమ్మ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుమారులు పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముసునూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

13:41 - August 9, 2018

హైదరాబాద్‌ : ఎస్సార్‌నగర్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో కొత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. మన అసోసియేషన్‌ పేరుతో రాజ్‌కిరణ్‌ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాజ్‌కిరణ్‌పై అక్రమ వసూళ్ళు, బ్లాక్‌మెయిల్‌ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టిస్టులకు సభ్యత్వం పేరుతో రాజ్‌ కిరణ్‌ డబ్బు వసూళ్ళకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో రాజ్‌కిరణ్‌పై నటి హేమ సీసీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఫేస్‌బుక్‌లో తన ఫొటోను మార్ఫింగ్‌ చేశాడని హేమ ఫిర్యాదు చేసింది. సభ్యత్వం పేరుతో మహిళల నుంచి రాజ్‌కిరణ్‌ భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అశ్లీల వీడియోలు, ఫొటోలతో రాజ్‌కిరణ్‌ బ్లాక్‌ మెయిల్ చేసినట్లు ఆరోణలు వస్తున్నాయి. రాజ్‌కిరణ్‌ పేరుతో తెలుగు రాష్ర్టాల్లో యాభైకి పైగా లాడ్జీలు బుక్‌ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజ్‌కిరణ్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా.. రాజ్‌కిరణ్‌ కేసునుంచి తప్పించేందుకు అతని అనుచరులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

 

బయటి ఆహారాన్ని తెచ్చుకోవద్దని చట్టం లేదు : హైకోర్టు

ముంబై : మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలోకి బయటి ఆహారాన్ని అనుమతిస్తే భద్రతాపరమైన సమస్యలు వస్తాయని ఆయ రాష్ట్ర ప్రభుత్వంపై స్పందించిన హైకోర్టు బయటి ఆహారాన్ని అనుమతిస్తే భద్రతాపరమైన సమస్యలు ఎలా వస్తాయో? ఎటువంటి సమస్యలు వస్తాయో చెప్పాలని నిలదీసింది. దీంతో తోక ముడిచిన ప్రభుత్వం ఈ వివాదంలో తాము తలదూర్చలేమని..తాము జోక్యం చేసుకుంటే గందరగోళం ఏర్పడుతుందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సినిమా హాళ్లలోకి బయటి ఆహారాన్ని తెచ్చుకోవద్దని చెప్పే ప్రత్యేకమైన చట్టం ఏమీ లేదని పేర్కొన్న కోర్టు, ప్రేక్షకులను ఆహారం తెచ్చుకోకుండా అడ్డుకోలేరని తేల్చి చెప్పింది.   

13:39 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపికైన జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ కాంగ్రెస్‌ పక్ష నేత గులాంనబీ ఆజాద్‌ విపక్షాల తరపున అభినందనలు తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగడం సర్వసాధారణమని..రాజ్యాంగ బద్దమైన పదవికి ఎంపికైన వ్యక్తులు పార్టీల కతీతంగా పనిచేయాల్సి ఉంటుందని ఆజాద్‌ పేర్కొన్నారు. హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ హిందీ భాష అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఓ జర్నలిస్ట్‌ డిప్యూటి ఛైర్మన్‌గా ఎంపిక కావడం వల్ల ఆ అనుభవం పార్లమెంట్‌ కార్యకలాపాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆజాద్‌ తెలిపారు.

 

మరాఠా ప్రభుత్వాన్ని వెటకారం చేసిన హైకోర్టు!!..

ముంబై : మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలోకి బయటి ఆహారాన్ని అనుమతిస్తే భద్రతాపరమైన సమస్యలు వస్తాయని ఆయ రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ వేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రభుత్వంపై కాస్త వెటకార ధోరణిని కనపబరిచింది. మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలోకి బయటి ఆహారాన్ని అనుమతిస్తే భద్రతాపరమైన సమస్యలు ఎలా వస్తాయో? ఎటువంటి సమస్యలు వస్తాయో చెప్పాలని నిలదీసింది. బయటి ఆహారాన్ని తెచ్చుకోవద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదని తేల్చి చెప్పింది.

13:36 - August 9, 2018

విజయవాడ : మల్టీప్లెక్స్‌ థియేటర్లకు వినియోగదారుల ఫోరం మొట్టికాయలు వేసింది. మల్టీప్లెక్స్‌లో అధిక ధరలకు తినుబండారాలు విక్రయించడంపై వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు వెలువరించింది. తినుబండారాలను, శీతల పానీయాలను అధిక ధరలకు విక్రయించినందుకు జరిమానా విధించారు. వినియోగదారులకు నష్టం కలిగించినందుకు రూ.5 లక్షల జరిమానా విధించారు. బయట నుండి తెచ్చిన తినుబండారాలు, తాగునీటిని మల్టీప్లెక్స్‌లోకి అనుమతించాలని తీర్పు ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లో అధిక ధరలపై ఫోరాన్ని వినియోగదారులు ఆశ్రయించారు. మార్గదర్శక సమితి సహకారంతో గత ఏడాది ఏప్రిల్‌లో వినియోగదారులు పిటిషన్‌ దాఖలు చేశారు. వినియోగదారుల వాదనలు విన్న న్యాయమూర్తి మాధవరావు ఎల్ ఈపీఎల్, పీవీఆర్, పీవీపీ, ట్రెండ్‌ సెట్‌, ఐనాక్స్‌, మల్టీప్లెక్స్‌ థియేటర్లపై చర్యలు తీసుకోవాలని తీర్పు వెలువరించారు. ఫోరం ఆదేశాలు తప్పకుండా అమలు చేయాలని అధికారులకు న్యాయమూర్తి ఆదేశించారు. ఆదేశాల అమలు, పర్యవేక్షణ బాధ్యతను తూనీకల కొలతల శాఖకు అప్పగించారు.

 

ఎస్సార్ నగర్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త కోణాలు..

హైదరాబాద్ : ఎస్సార్ నగర్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త కోణాలు వెలుగు వస్తున్నాయి. ఈ కోణాలు 'మన అసోసియేషన్' పేరుతో అక్రమాలు జరిగినట్లుగా తెలుస్తోంది. రాజ్ కిరణ్ అనే వ్యక్తిపై అక్రమ వసూళ్లు..బ్లాక్ మెయిల్,ఆర్టిస్టుల నుండి సభ్యత్వం పేరుతో డబ్బు వసూళ్లు.. వంటి పలు ఆరోపణలు వచ్చాయి. కాగా గతంలో రాజ్ కిరణ్ పై ఫేస్ బుక్ లో ఫోటో మార్పింగ్ చేశాడని నటి హేమ సీసీఎస్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అశ్లీల వీడియోలు, ఫోటోలతో రాజ్ కిరణ్ బ్లాక్ మెయిల్ చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మాల్స్,మల్టీ ప్లెక్స్ థియేటర్స్ కు జరిమానా..

విజయవాడ : షాపింగ్ మాల్స్,మల్టీ ప్లెక్స్ థియేటర్స్ కు వినియోగదారుల ఫోరం మొట్టికాయలు వేసింది. మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లలో అధిక ధరలకు తినుబండారాల విక్రయంపై జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పునిచ్చింది. మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లలో అధిక ధరలకు విక్రయంపై వినియోగదారులు ఫోరంను ఆశ్రయించారు. దీంతో మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లపై ఫోరం కొరడా ఝుళింపించింది. ఎల్ ఈసీఎల్, ట్రెండ్ సెట్, పీవీఆర్, పీవీపీ, ఐనాక్స్ వంటి మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది.

13:02 - August 9, 2018

హైదరాబాద్ : నగరంలో మూడోరోజు ఎన్ ఐఏ విచారణ కొనసాగుతోంది. పాతబస్తీకి చెందిన మొత్తం 20 మంది యువకులను ఎన్ ఐఏ అధికారులు విచారించారు. లష్కరే తోయిబా ఉగ్రవాది హబీబ్ ఉల్ రహేమాన్ అరెస్టుతో ఎన్ ఐఏ ఆపరేషన్ హైదరాబాద్ చేపట్టింది. హబీబ్ తో సంబంధాలున్నాయన్న అనుమానంతో 20 మంది యువకులను విచారించింది. అనుమానితుల కాల్ డేటాతోపాటు కొన్ని కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద సానుభూతిపరుల మూలాలను కనుక్కొంటున్నారు. ఈరోజు మరికొంత మంది యువకులను ఎన్ ఐఎ అధికారులు విచారింనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

హరివంశ్ రాయ్ పై పూర్తి విశ్వాసం : ప్రధాని మోదీ

ఢిల్లీ : డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన ఎన్డీయే అభ్యర్థి హరివంశరాయ్ కు ప్రధాని మోదీ, మంత్రి అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ అజాద్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతు..డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ తన బాధ్యతను పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నెరవేరుస్తారని తనకు పూర్తి విశ్వాసం వుందన్నారు. హరివంశ్ రాయ్ నారాయణ మంచి విద్యావంతుడనీ.. లోక్ నాయక్ జయప్రకాశ్ నుండి హరివంశ్ నారాయణ్ సింగ్ స్ఫూర్తి పొందారని మోదీ తెలిపారు. హరివంశ్ చాలా కాలం నుండి సమాజ సేవలో వున్నారని గుర్తు చేశారు.  

12:48 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్ డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ఓటింగ్ లో మొత్తం 222 మంది సభ్యులు పాల్గొన్నారు. ఎన్ డీఏ అభ్యర్థి జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ కు అనుకూలంగా 125 ఓట్లు వచ్చాయి. విపక్షాల అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ కు అనుకూలంగా 105 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ సభ్యులు ఓటు వేయగా....ఎన్ డిఎ అభ్యర్థికి టీఆర్ ఎస్ సభ్యులు ఓటు వేశారు. వైసీపీ, ఆమ్ ఆద్మీపార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. రాజ్యసభ సభ చైర్మన్ హోదాలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. తీర్మానాల ద్వారా ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. 26 ఏళ్ల తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిగింది. 
 

12:40 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్ డీఏ అభ్యర్థి జెడియు ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ హరివంశ్ నారాయణ్ కు అభినందనలు తెలిపారు. హరివంశ్ మంచి విద్యావంతుడు అన్నారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నుంచి హరివంశ్ నారాయణ్ స్ఫూర్తి పొందారని తెలిపారు. డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ పై పూర్తి విశ్వాసం ఉందన్నారు. హరివంశ్ చాలా ఏళ్లుగా సమాజ సేవలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 

 

ఉగ్ర మూలల వేటలో ఎన్ ఐఏ..

హైదరాబాద్ : ఉగ్ర కుట్రలను భగ్నం చేసేందుకు ఎన్ ఐఏ శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉగ్రమూలాల వేటను తీవ్రతరం చేసింది. ఉగ్రవాద సానుభూతిపరుల మూలలను కనుక్కొంటు తన వేటను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని పాతబస్తీలో ఇప్పటికే రెండు సార్లు తనిఖీలు చేయగా ఈరోజు మూడవ సారి కూడా తన తనిఖీలను ముమ్మరం చేసింది. పాతబస్తీలో కొందరిని అరెస్ట్ చేసిన విచారిస్తున్న ఎన్ ఐఏ ఈరోజు మొత్తం 20మంది యువకులను విచారించింది. లష్కరే తొయిబా ఉగ్రవాది హబీబ్ ఉల్ రహేమాన్ అరెస్ట్ తో ఆపరేషన్ హైదరాబాద్ ను చేపట్టింది.

కాంగ్రెస్ కు షాకిచ్చిన ఆప్..ఎన్నిక దూరం..

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ కు షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వరాదని, ఎన్నికలను బాయ్ కాట్ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. తాము పెట్టిన షరతులను కాంగ్రెస్ పార్టీ పాటించని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. జేడీయూ తరఫున నిలిచిన హరివంశ్ నారాయణ సింగ్ కు మద్దతివ్వాలని నితీశ్ కుమార్ తమకు ఫోన్ చేసి కోరారినా ఆ పార్టీ బీజేపీతో కలిసున్నందున ఆ పని చేయలేమని తాము స్పష్టం చేసినట్టు ఆయన వెల్లడించారు.

ఎన్డీయే కు ఓట్లు వేసిన టీఆర్ఎస్..

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీయే కూటమిలోని జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఓటింగ్ చేపట్టారు. విపక్ష అభ్యర్థి కాంగ్రెస్ ఎంపీ బి.కె. హరిప్రసాద్ కు 105 ఓట్లు రాగా..ఎన్డీయే అభ్యర్తి జేడీయూ ఎంపీ హరివంశ్ కు 125 ఓట్లు సాధించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు ఎన్డీయే అభ్యర్థికి తమ ఓట్లు వేశారు. టీడీపీ కాంగ్రెస్ ఎంపీ, విపక్షాల అభ్యర్థి హరిప్రసాద్ కు ఓట్లు వేశారు. వైసీపీ మాత్రం ఎవరికి ఓటు వేయకుండా సభ నుండి పారిపోయింది.  

11:55 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ఓటింగ్ లో మొత్తం 222 మంది సభ్యులు పాల్గొన్నారు. ఎన్ డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు అనుకూలంగా 125 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. ఇద్దరు వైసీపీ సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. రాజ్యసభ సభ చైర్మన్ హోదాలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. తీర్మానాల ద్వారా ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. 26 ఏళ్ల తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీయే తరపున జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, విపక్షాల తరపున కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి బికె హరిప్రసాద్‌ పోటీ పడ్డారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు ఈ ఎన్నిక జరిగింది. ప్రస్తుతం 244 మంది రాజ్యసభ సభ్యులకు గానూ 222 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. 

 

పార్లమెంట్ లో 'హిట్లర్'..

ఢిల్లీ : ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వనందుకు నిరసనగా టీడీపీ నేత, చిత్తూరు లోక్ సభ సభ్యుడు ఎన్.శివప్రసాద్ గురువారం పార్లమెంట్ వద్ద హల్ చల్ చేశారు. జర్మనీ హిట్లర్ అడాల్ఫ్ హిట్లర్ వేషధారణలో పార్లమెంటు వద్దకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. శివ ప్రసాద్ గతంలోనూ స్కూలు పిల్లాడు, మాయల ఫకీరు, నారద ముని వేషాల్లో పార్లమెంటు వద్ద నిరసన తెలిపిన విషయం తెలసిందే. 

డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఘన విజయం..

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీయే కూటమిలోని జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తరువాత వెంకయ్యనాయుడు నామినేషన్లు వేసిన హరివంశ్, హరిప్రసాద్ పేర్లను ప్రకటించి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆ తరువాత లాబీలను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఆపై మూజువాణీ ఓటు ద్వారా హరివంశ్ గెలిచినట్టు ప్రకటించారు. విపక్ష సభ్యులు డివిజన్ కావాలని పట్టుబట్టడంతో ఓటింగ్ నిర్వహించారు. డివిజన్ బెల్ మోగించారు. హరివంశ్ నారాయణ్ కు 115 ఓట్లు, హరిప్రసాద్ కు 89 ఓట్లు వచ్చాయి.

11:42 - August 9, 2018

మహారాష్ట్ర : రైతే రాజ్యానికి వెన్నెముక అన్నారు. రైతన్న అలిగితే ఎవరికి అన్నమే వుండదు..కడుపు నిండదు. రైతు లేనిదే రాజ్యం లేదు. అందుకే రైతన్నను అన్నదాత అన్నారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం..దేశ ప్రగతికి రైతే వెన్నెముకలాంటివాడు. మరి ఈనాడు రైతు అంటే విలువలేకుండా పోయింది. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు హామీలతోనే సరిపెడుతున్నాయి. మరోపక్క వరుణుడు కూడా రైతన్నపైనే అలుగుతున్నాడు. కోపం లేని కోపం రాని రైతన్న అలిగితే..క్రాప్ హాలిడే ప్రకటిస్తే..దేశమే కాదు..ప్రపంచమే స్థంభించిపోతుంది. ఆకలి కరాళనృత్యం చేస్తుంది. కానీ అన్నదాత అన్నమే పెడతాడు..ఆకలిని దరి చేరనివ్వడు. అందుకే తనను తాను చంపుకుంటాడు తప్ప ఎవరిపైనా రైతన్న కోపగించుకోడు..కానీ ఆ రైతన్నకు కోపం వస్తే..ఎవరిమీదనైనా సరే పోరాడుతాడు. తన పంటను కాపాడుకునేందుకు రైతన్న దేనికైనా తెగిస్తాడు..ఈ నేపథ్యంలో కొందరు రైతన్నలు ఓ విచిత్రమైన పనిచేశారు. నారు వేసిన రైతన్న వర్షం కోసం ఆకాశం వంక ఆశగా చూసాడు. వర్షాలు పడతాయో లేదోనని ఆందోళన పడ్డాడు. వర్షాలు పడతాయో లేదో చెప్పేందు ఓ శాఖ కూడా వుంది. కానీ అదెప్పుడు సరైన సమాచారాన్ని అందివ్వదు. దీనికి నిరసనగా రైతన్నలు వాతావరణ శాఖ తప్పుడు సమాచారం చెప్పిందనీ ఆ సంస్థ డైరెక్టర్ పై కేసు పెట్టారు..అవును నిజమండీ..కావాలంటే ఆ వివరాలు చూడండి..
వాతావరణ శాఖ డైరెక్టర్ పై ఫిర్యాదు చేసిన మలాఠ్వాడ రైతులు..
వానలు పడక ఒకసారి..నకిలీ విత్తనాలతో మరోసారి..వెరసి రైతన్నలు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. తీవ్రంగా నష్టపోతున్నారు. రైతన్న నష్టపోతే మనకేమిలో అనుకోవటానికి వీలులేదు..రైతన్న నష్టపోతే దేశానికే నష్టం. ఈ క్రమంలో నష్టాలపాలైన రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే..మరికొందరు వున్న ఊరును..కన్నతల్లిలాంటి పొలాన్ని అమ్ముకుని వలస బాట పడతున్నారు. కానీ రైతన్నలలో మరాఠ్వాడా రైతులు మాత్రం ఫుల్ డిఫరెంట్. వాతావరణ శాఖ వర్షపాతంపై సరైన అంచనాలు ఇవ్వకపోవడంతో ఏకంగా సంస్థ డైరెక్టర్ పై మహారాష్ట్రలోని మలాఠ్వాడ రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వర్షాలు పడతాయన్న సంస్థ..పడని వర్షాలు..కేసు నమోదు..
ఈ సారి రుతుపననాల సందర్భంగా మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరఠ్వాడా ప్రాంతానికి చెందిన రైతులు తమవద్ద ఉన్న మొత్తం నగదుతో పంటల్ని సాగుచేశారు. అయితే తొలికరి వర్షం మినహా వాన జాడలేకపోవడంతో ఆగ్రహం చెందిన రైతన్నలు.. భారత వాతావరణ శాఖ పుణె డైరెక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి అధికారులు ఎరువులు, పురుగు మందుల కంపెనీలతో కుమ్మక్కై తప్పుడు అంచనాలను ఇచ్చారని ఆరోపించారు.

ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదుచేయాలని డిమాండ్..
ఈ మేరకు రైతు సంఘం స్వాభిమాని షేట్కారీ సంఘటన మరఠ్వాడా ప్రాంత చీఫ్ మాణిక్ కదమ్ రైతులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ విషయమై స్పందించేందుకు వాతావరణ శాఖ అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు.

11:39 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయింది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయింది. రాజ్యసభ సభ చైర్మన్ హోదాలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఎన్నిక ప్రక్రియను ప్రారంభించనున్నారు. తీర్మానాల ద్వారా ఎన్నిక ప్రక్రియను నిర్వహించనున్నారు. 26 ఏళ్ల తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంది. ఎన్డీయే తరపున జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, విపక్షాల తరపున కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి బికె హరిప్రసాద్‌ పోటీ పడుతున్నారు. తమ తమ అభ్యర్థుల గెలుపుపై ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు ఈ ఎన్నిక జరుగుతోంది. ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ఎన్నికను అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 

11:31 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు వైసీపీ ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ లకు మద్దతు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. 

 

భారత స్టాక్ మార్కెట్ రికార్డుల మీద రికార్డులు!!..

ముంబై : భారత స్టాక్ మార్కెట్ రికార్డుల మీద రికార్డులను బద్ధలుకొడుతూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డులపై ఉన్న బీఎస్ఈ సెన్సెక్స్ సూచి, ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తరువాత తొలిసారిగా 38 వేల మార్క్ ను తాకింది. ఈ సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఇన్వెస్టర్లు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఉదయం 10.02 గంటల సమయంలో సెన్సెక్స్ 38 వేల మార్క్ ను తాకింది. ఆపై 10.39 నిమిషాలకు 38,052 పాయింట్ల స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ప్రస్తుతం సెన్సెక్స్ 37,950 పాయింట్ల వద్ద సాగుతోంది.

11:19 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయింది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అయింది. రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. తీర్మానాల ద్వారా డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 26 ఏళ్ల తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎన్డీయే తరపున జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, విపక్షాల తరపున కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి బికె హరిప్రసాద్‌ పోటీ పడుతున్నారు. తమ తమ అభ్యర్థుల గెలుపుపై ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు ఈ ఎన్నిక జరుగుతోంది. ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. 

మరోసారి పారిపోయిన వైసీపీ..

ఢిల్లీ : మాట తప్పం అని మడమ తిప్పం అని భీరాలు పలికే వైసీపీ పార్టీ మరోసారి పలాయనం చిత్తగించింది. జ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ షాకిచ్చింది. నిన్నటివరకూ విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తామని చెప్పిన ఆ పార్టీ, నేడు అనూహ్యంగా తన మనసు మార్చుకుంది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని, ఓటింగ్ ను బాయ్ కాట్ చేస్తున్నామని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.

ప్రారంభమైన డిప్యూటీ చైర్మన్ ఎన్నిక..

ఢిల్లీ : ఈరోజు రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ ఎన్నికను చైర్మన్ వెంకయ్యనాడు ప్రాంభించారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికను అధికార ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం తరపున జేడీయు ఎంపీ హరివంశనారాయణ్ సింగ్ ను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. కాగా డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిపోతుందనే ధీమాతో వున్న బీజేపీకి షాక్ ఇస్తు కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ కె.హరిప్రసాద్ ని ప్రకటించటంతో ఎంపీ హరివంశనారాయణ్ సింగ్, ఎంపీ కె.హరిప్రసాద్ మధ్య పోటీ నెలకొంది.

డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు వైసీపీ దూరం..

ఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వం నుండి టీడీపీ వైదొలగిన నాటి నుండి బీజేపీకి దగ్గరైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వైసీపీ బీజేపీతో కలిసి ఏపీకి నష్టం వాటిల్లేలా లాలూచీ రాజకీయాలు చేస్తోందనీ..జగన్ కేసులకు భయపడి బీజేపీకి కొమ్ముకాస్తున్నాడని టీడీపీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని వైసీపీ ఖండిస్తోంది. కానీ బీజేపీతో వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్న సంగతి తేటతెల్లమయ్యింది. నేడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకూ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తానని డాంబికాలు పలికిన వైసీపీ ఇప్పుడు ఓటింగ్ కు దూరంగా వుండిపోతోంది.

మందుబాబుల కట్టడి కోసమే ఆర్మ్ డ్ : కమిషనర్ సజ్జనార్‌

హైదరాబాద్ : మందుబాబులను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలన్నదే తమ ఉద్దేశమని..ఈ క్రమంలో పోలీసులపై మందుబాబులు దాడులకు ప్పాలడుతున్నారనీ..అందుకే అర్థరాత్రి నుండి గస్తీ తిరుగుతున్న ట్రాఫిక్‌ పోలీసులకు ఆర్మ్ డ్ సిబ్బందిని నియమిస్తున్నామని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఐటీ కారిడార్..నగర శివారు ప్రాంతాల్లో రిసార్ట్‌ లు, మద్యం దుకాణాలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయని అన్నారు. వీటిల్లో మద్యం తాగి రోడ్డెక్కుతున్న వాహనదారులు రోడ్డు ప్రమాదాలు చేస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం జనవరి - జూన్‌ మధ్య 7,791 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసి రూ.

మందుబాబుల దెబ్బ..ట్రాఫిక్‌ పోలీసులకు తోడుగా ఆర్మ్ డ్..

హైదరాబాద్ : నగర పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రోజు అర్థరాత్రి నుండి గస్తీ తిరుగుతున్న ట్రాఫిక్‌ పోలీసులకు వందల సంఖ్యలు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్నారు. పట్టుకున్న పోలీసులపైనా..మీడియాపై దాడులకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్‌ పోలీసులకు తోడుగా ఆర్మ్ డ్ సిబ్బందిని రహదారులపై నిలపాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ లో సాయుధ పోలీసు సిబ్బంది సేవలను శుక్ర, శనివారాల్లో వినియోగించుకుంటామని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

సీఎం చంద్రబాబుకు గిరిజనుల సమస్యల స్వాగతం..

విశాఖపట్నం : నేడు ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పాడేరు నియోజక వర్గంలో జరిగే ప్రపంచ ఆదివాసీల దినోత్సవంలో చంద్రబాబు పాల్గొననున్నారు. దీనికి అధికారులు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ పర్యటనను ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కార్యక్రమాలను పరిశీలించారు. దీంతో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు గిరిజన సంఘాలు పిలుపినిచ్చాయి. ఈ క్రమంలో గిరిజనులు చంద్రబాబుకు సమస్యలతో స్వాగతం పలకనున్నారు. 

జూనియర్ ఆర్టిస్ట్ పై గ్యాంగ్ రేప్..

హైదరాబాద్ : జూనియర్ ఆర్టిస్ట్ గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న ఓ యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరికి అండగా వుండిఇద్దరు స్నేహితురాళ్లు అత్యాచారం దృశ్యాలను రిక్డార్డ్ చేసారు. ఈ ఘటనపై సదరు బాధితురాలు ఎస్ ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి తెలిపిన ఆధారాల ప్రకారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

బంద్ ను విరమించుకున్న దళిత సంఘాలు..

ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు ఉత్తర్వులను నిరసిస్తూ ఆలిండియా అంబేద్కర్ మహాసభ ఆధ్వర్యంలో నేడు తలపెట్టిన బంద్‌ను దళిత సంఘాలు విరమించుకున్నాయి. ఎస్సీ, ఎస్టీ సవరణ బిల్లు లోక్‌సభలో అంగీకారం పొందడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. తామేం కోరుకుంటున్నామో అది నెరవేరిందని, అందుకనే బంద్‌ను ఉపసంహరించుకుంటున్నామని ఏఐఏఎం తెలిపింది. దీంతో కేంద్రానికి పెద్ద ఉపశమనం లభించినట్టు అయింది. కాగా ఎస్సీ,ఎస్టీ చట్టం వల్ల అమాయకులపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయని, దీనిలో సవరణలు అవసరమని మార్చి 20న సుప్రీంకోర్టు పేర్కొంది.

10:35 - August 9, 2018

గుంటూరు : వంచనపై వైసీపీ గర్జన దీక్ష చేపట్టనుంది. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని వీఏఆర్ గార్డెన్స్ లో దీక్ష చేపట్టనున్నారు. కాసేపట్లో దీక్ష ప్రారంభం కానుంది. ఈ దీక్షలో వైసీపీ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నేతలు పాల్గొనున్నారు. 

డిప్యూటీ చైర్మన్ ఎన్నిక..రథసారధిగా జైట్లీ..

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం నేడు ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభలో ఎన్డీయేను ముందుండి నడిపించనున్నారు. కిడ్నీ మార్పిడి కారణంగా జైట్లీ మూడు నెలలుగా అధికారిక విధులకు దూరంగా ఉన్నారు. వైద్యుల సలహా మేరకు ఆయన మూడు నెలలపాటు పూర్తిగా బయటకు రాకుండానే గడిపారు. బహిరంగ ప్రదేశాలకు ఇన్నాళ్లూ దూరంగా ఉన్న ఆయన తొలిసారి రాజ్యసభకు రానున్నారు. సభలో ఎన్డీయేకు తగిన బలం లేకపోవడంతోనే ఆయన ఓటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. కాగా బీజేపీ యేతర, కాంగ్రెస్సేతర పార్టీల నుంచి తమకు మద్దతు లభిస్తుందని బీజేపీ నమ్మకంతో ఉంది.

10:31 - August 9, 2018

ఢిల్లీ : 26 ఏళ్ల తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరుగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎన్డీయే తరపున జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, విపక్షాల తరపున కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి బికె హరిప్రసాద్‌ పోటీ పడుతున్నారు. తమ తమ అభ్యర్థుల గెలుపుపై ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు ఈ ఎన్నిక జరుగుతోంది. ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఐఆర్ఎస్ అధికారిణిపై భర్త వేధింపులు..ఆత్మహత్య..

రాజస్థాన్ : తల్లితో కలిసి భర్త పెట్టే బాధలు భరించలేక ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి ఆత్మహత్య చేసుకున్నారు. జైపూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బిన్నీ శర్మ అనే 34 అనే అధికారిణి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇండియన్ అకౌంట్స్ అండ్ ఆడిట్ ఆఫీసర్ అయిన గుర్‌ప్రీత్ వాలియా మధ్య ట్రైనింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో వారిద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడేళ్ల క్రితం గుర్‌ప్రీత్‌కు జైపూర్ బదిలీ అయింది. అయితే, వైవాహిక బంధంలో సమస్యల కారణంగా గతేడాది గుర్‌ప్రీత్ ట్రాన్స్‌ఫ్ చేయించుకుని చండీగఢ్ వెళ్లిపోయారు.

డిప్యూటీ ఛైర్మన్ పదవి ఎవరిని వరించేను?!...

ఢిల్లీ : ఈరోజు రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగనుంది. ఉదయం 11గంటలకు ఈ ఎన్నిక ప్రారంభం కానుంది. ఎన్డీఏ ప్రభుత్వం తరపున జేడీయు ఎంపీ హరివంశనారాయణ్ సింగ్ ను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. కాగా డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిపోతుందనే ధీమాతో వున్న బీజేపీకి షాక్ ఇస్తు కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ కె.హరిప్రసాద్ ని ప్రకటించటంతో ఎంపీ హరివంశనారాయణ్ సింగ్, ఎంపీ కె.హరిప్రసాద్ మధ్య పోటీ నెలకొంది. కాగా రాజ్యసభలో ఎంపీల మొత్తం సంఖ్య 244లుగా కాగా డిప్యూటీ చైర్మన్ గా గెలిచేందుకు కనీసం 123 మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది.

10:07 - August 9, 2018

మధ్యప్రదేశ్‌ : సాధారణంగా అత్యాచారం కేసుల్లో సంవత్సరాల తరబడి జాప్యం జరగటం..ఈలోగా నిందితులు చట్టంలో వున్న బలహీనతలను..లొసుగులను ఆసరాగా చేసుకుని తప్పించుకుంటుంటారు. దీంతో నిందితులు హాయిగా సభ్య సమాజంలో తిరగుతు..మరిన్ని నేరాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి జాప్యం తగదనీ..నిందుతులపై సమగ్ర విచారణ జరిపి కఠిన శిక్షలను అమలు చేయాలని మహిళా సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు డిమాండ్ చేస్తునే వున్నాయి, పోరాడుతునే వున్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడుతున్నవారు..ముఖ్యంగా బాలికలపై..యువతులు..మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న కేసులు వేలాది పెండింగ్ లో వున్న దాఖలాలు కోకొల్లలుగా వున్నాయి. మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నియమించి విచారణ వేగవంతం చేస్తే నిందితులు తప్పించుకునే అవకాశం వుండదు..పైగా శిక్షలను కూడా వెంటనే అమలు చేయటంతో సమాజంలో ఒక భయం అనేది ఏర్పడి నేరాల సంఖ్య నియంత్రించే అవకాశం కూడా లేకపోలేదు. విచారణలో సమగ్రత..శిక్షల అమలులో చిత్తశుద్ది కలిగి వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆరేళ్ల పసిమొగ్గపై అత్యాచారానికి పాల్పడిన ఓ పశువును కేవలం మూడు రోజుల్లో విచారణ చేసి జీవిత ఖైదును విధించి సంచలన తీర్పునిచ్చింది న్యాయస్థానం.
కేవలం మూడు రోజుల్లోనే అత్యాచార నిందితుడికి జీవిత ఖైదు..
దేశ చరిత్రలో బహుశా ఇదే అత్యంత వేగవంతమైన తీర్పు అయివుండవచ్చు. కేసును విచారించిన కోర్టు కేవలం మూడు రోజుల్లోనే శిక్ష విధించింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు జీవితకాల శిక్ష విధించింది. మరణించే వరకు అతడిని జైల్లోనే ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. మధ్యప్రదేశ్‌లోని దాతియా కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది.
వివాహానికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం..

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన మోతిల్ అతిర్వార్ అనే 24 సంవత్సరాల మృగాడు ఈ ఏడాది మే 29న ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్ లోని దాతియా పట్టణానికి ఓ వివాహ కార్యక్రమానికి బంధువులతో కలిసి వచ్చిన చిన్నారిపై పువ్వులు ఇస్తానని చెప్పి నమ్మించిన అతిర్వార్ సమీపంలోని ప్రభుత్వ స్కూలులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కుమార్తె కనిపించక తల్లడిల్లిన తల్లిదండ్రులు వెతగ్గా..వెతగ్గా..బాలిక జాడ తెలిసింది. కుమార్తెను ఆ స్థితిలో చూసిన ఆ తల్లిదండ్రుల గుండెలు అవిసేలా రోదించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చిన్నారిపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు తెలపటంతో పోలీసులు ఆ విషయాన్ని దృవీకరించారు. ఈ విషయాన్ని దాతియా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మయాంక్ అవస్థి అధికారికంగా వెల్లడించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు..అరెస్ట్..విచారణ..శిక్ష..
కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని, హింసను తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందారు. నిందితుడికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తు.. ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్కో చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు కేవలం మూడు రోజుల్లోనే విచారణ పూర్తిచేసి దోషికి శిక్ష విధించింది.
పోలీస్ శాఖ..న్యాయశాఖ సమన్వయంతో నేరాలను అరికట్టే చర్యలు..
పోలీసులు..న్యాయస్థానం చిత్తశుద్ధి వుంటే ఇటువంటి కేసులను తక్కువ వ్యవధిలోనే ఛేదించవచ్చు..అందునా ఇప్పుడు అందుబాటులో వుండే టెక్నాలజీతో మరింత సమర్థవంతంగా..ఈజీగా కేసులను ఛేదించవచ్చు. విచారణలో చిత్తశుద్ధి..వేగవంతం..శిక్షలు వేయటంలో నిబద్ధత వుంటే నేరాల సంఖ్యల తగ్గుతుందటంలే సందేహం లేదు..అదే విచారణలో చిత్తశుద్ధి..నేరస్థుల పట్ల కఠిన వైఖరి వుంటే భారత్ లో మహిళలపై జరుగుతున్న నేరాలు సంఖ ఇంత దారుణంగా పెరిగే అవకాశం వుండదని న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారంటే అది ఎంతటి వాస్తవమో అర్థం చేసుకోవచ్చు. కాగా ఇప్పటికైనా పోలీసు యంత్రాంగా..న్యాయస్థానాలు సమన్వయంతో..చిత్తశుద్ధితో వ్యవహరిస్తే..ఇటువంటి చిన్నారులు జీవితాలు మొగ్గలోనే వసివాడకుండా అరికట్టవచ్చు..మరోవైపు రాజకీయ నాయకులు తమ అధికారాలను వినియోగించి నిందితులను తప్పించే ఆలోచనలను మానుకోవాలి..ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు ఆ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను..వారిపై జరుగుతున్న అఘాయితాలకు బాధ్యత వహించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని అలవరచుకోవాల్సిన అవసరముంది.

09:50 - August 9, 2018

హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కల్గిస్తున్నాయి. తోటి విద్యార్థులను షాక్ కు గురిచేస్తున్నాయి. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూనివర్సిటీలో చదవడం ఇష్టం లేక..ఊరికి పోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో చేరిన వారం రోజులకే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంచలనం రేపుతోంది. ఉత్తరాఖండ్ కు చెందిన రజినీష్ అనే విద్యార్థి హెచ్ సీయూలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వారం రోజుల క్రితమే యూనివర్సిటీలో చేరాడు. తను ఉంటున్న మెన్స్ హాస్టల్ రూమ్ నెం. 25 లో ఎవరూ లేని సమయంలో నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో బెడ్ షీట్ తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోతున్నానంటూ...తనకు అనుమతించాలని వార్డెన్ కు లేఖ రాశారు. అడ్మిషన్ ను రద్దు చేసుకున్నారు. రజినీష్ కు ఇక్కడ చదవడం ఇష్టం లేదని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థుల సమాచారం మేరకు అక్కడి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుకు సమాచారం అందించారు. ఆందదోళనకు గురైన వారు హుటాహుటిన హైదరాబాద్ కు ప్రయాణం అయ్యారు. సెక్షన్ 174 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యూనివర్సిటీల్లో పరిస్థితులేంటీ?  ప్రేమ వ్యవహారమా, ఆర్థిక ఇబ్బందులున్నాయా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

హెచ్ సీయూలో చదువుకోవటం ఇష్టంలేదంటు..విద్యార్ధి ఆత్మహత్య..

హైదరాబాద్ : పిల్లల ఇష్టాఅయిష్టాలను తెలుసుకోకుండా తల్లిదండ్రులు తమ నిర్ణయాలను పిల్లలపై రుద్దటం..వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవటం వంటి పలు కారణాలతో విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణాలుగా మారుతున్నాయి. ఇటువంటి మరో సంఘటనకు రజనీష్ అనే విద్యార్థి ఆత్మహత్య సాక్ష్యంగా కనిపిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. ఉత్తరాఖాండ్ కు చెందిన రజనీష్ అనే విద్యార్థి బెడ్ షీట్ తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

09:24 - August 9, 2018

ఢిల్లీ : ఇవాళ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి ఎన్నిక జరుగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్డీయే తరపున జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, విపక్షాల తరపున కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి బికె హరిప్రసాద్‌ పోటీ పడుతున్నారు. తమ తమ అభ్యర్థుల గెలుపుపై ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు ఈ ఎన్నిక జరుగుతోంది. ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ఇదే అంశంపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

09:21 - August 9, 2018

ఢిల్లీ : ఇవాళ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి ఎన్నిక జరుగనుంది. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్డీయే తరపున జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, విపక్షాల తరపున కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి బికె హరిప్రసాద్‌ పోటీ పడుతున్నారు. తమ తమ అభ్యర్థుల గెలుపుపై ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు ఈ ఎన్నిక జరుగుతోంది. ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. 
ఎన్డీయే, విపక్షాలు పోటీ 
రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవి కోసం ఎన్డీయే, విపక్షాలు పోటీ పడుతున్నాయి. విపక్షాల తరపున రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బీకే హరిప్రసాద్‌ను ఖరారు చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి పేరును సిపిఐ నేత డి.రాజా ప్రతిపాదించారు. హరిప్రసాద్‌  కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్డీయే తరపున రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ అభ్యర్థిగా జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ పేరును ప్రకటించారు. విపక్షాల తరపున ఎన్‌సిపి ఎంపి వందనా చవాన్‌ పేరును ఖరారు చేసినప్పటికీ ఆఖరి క్షణంలో కాంగ్రెస్‌ ఎంపి హరిప్రసాద్‌ పేరును తెరపైకి తెచ్చారు. రాజ్యసభలో బిజెపికి బలం లేదని, తమ అభ్యర్థి హరి ప్రసాద్‌ గెలుపుకు తగిన బలం ఉందని కాంగ్రెస్‌ పక్ష నేత ఆనంద్‌శర్మ తెలిపారు. ఏకగ్రీవ ఎన్నిక కోసం బిజెపి తమను సంప్రదించకుండానే అభ్యర్థిని ప్రకటించిందని ఆయన విమర్శించారు. 

 

ఘోర రోడ్డు ప్రమాదం..వరల్డ్ గోల్డ్ ఛాంపియన్ మృతి..

ఢిల్లీ : ఘోర రోడ్డు ప్రమాదంలో వరల్డ్ గోల్డ్ ఛాంపియన్ మృతి చెందారు. కెన్యా స్టార్ అథ్లెట్ 400 మీటర్ల హర్డిల్స్ వరల్డ్ చాంపియన్ నికోలస్ బెట్ ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. నైజీరియాలో జరిగిన ఆఫ్రికా చాంపియన్ షిప్ లో పాల్గొని తిరిగి వస్తున్న నికోలస్..నార్త్ వెస్ట్ కెన్యా ప్రాంతం సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు వేగంగా వస్తూ, అదుపుతప్పినట్టు తెలుస్తోంది.

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

హైదరాబాద్ : నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

 

ఇవాళ రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవికి ఎన్నిక

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. ఎన్డీయే తరపున జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, విపక్షాల తరపున కాంగ్రెస్‌ అభ్యర్థి బికె హరిప్రసాద్‌ పోటీ పడుతున్నారు. తమ తమ అభ్యర్థుల గెలుపుపై ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు ఈ ఎన్నిక జరుగుతోంది.

నేడు విజయవాడలో క్విట్ ఇండియా ఉద్యమం 76 వ వార్షికోత్సవ సభ

విజయవాడ : నేడు లెనిన్ సెంటర్ లో క్విట్ ఇండియా ఉద్యమం 76 వ వార్షికోత్సవ సభ జరుగనుంది. ఊమెన్ చాందీ, రఘువీరారెడ్డి పాల్గొననున్నారు. 

08:08 - August 9, 2018

ఇవాళ రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవికి ఎన్నిక జరగనుంది. ఎన్డీయే తరపున జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, విపక్షాల తరపున కాంగ్రెస్‌ అభ్యర్థి బికె హరిప్రసాద్‌ పోటీ పడుతున్నారు. తమ తమ అభ్యర్థుల గెలుపుపై ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు ఈ ఎన్నిక జరుగుతోంది. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేత ఆచారి పాల్గొని, మాట్లాడారు. తమ తమ అభ్యర్థుల గెలుపుపై ఇరువురూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారు తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

07:48 - August 9, 2018

తెలంగాణలో పంచాయతీ కార్మికులు గత 17 రోజులుగా సమ్మె చేస్తున్నారు. తమకు మున్సిపల్‌ కార్మికుల మాదిరిగా.. వేతనాలు పెంచి ఇవ్వాలని తమ వేతనాన్ని ప్రభుత్వమే చెల్లించాలని తమను క్రమబద్దీకరణ చేయాలని తదితర డిమాండ్లతో వారు సమ్మె చేస్తున్నారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని గతంలో తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పంచాయతీ కార్మికుల సమ్మెకు గల కారణాలు ప్రభుత్వ విధానంపై ఇవాళ్టి జనపథంలో పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పాలడుగు భాస్కర్‌ మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.. 

07:45 - August 9, 2018

కడప : కడప జిల్లా కరవుపై మంత్రులు దృష్టి సారించారు. ఏపీలోని ఎనిమిది జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డిలు అన్నారు. కరువు నేపథ్యంలో రైతులకు ఉచితంగా విత్తనాలు ఇస్తున్నామని తెలిపారు. కడప జిల్లా కరవుపై మంత్రులు సమీక్షించారు. కరువు పరిస్థితులున్న జిల్లాలోని రిజర్వాయర్లలో 19 టీఎంసీల నీరు నిల్వ ఉందని, గండికోట భూసేకరణ సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. కరువు పై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రులు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

 

07:40 - August 9, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులు సాగు నీరు అడిగితే అరెస్ట్‌లు చేసే పరిస్థితి వచ్చిందని బీజేపీ నేత కిషన్‌ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా అరెస్ట్‌ చేసిన రైతులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యాదాద్రిలో వ్యభిచార కేంద్రాలు వెలుగు చూడడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. వ్యభిచార కూపాలు నడుపుతున్న వారిపై నిర్భయ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

07:37 - August 9, 2018

పెద్దపల్లి : జిల్లాలోని మంథని మండలం సిరిపురంలో నిర్వహిస్తున్న సుందిళ్ల బ్యారేజీ, అన్నారం పంపుహౌస్‌ నిర్మాణ పనులను మంత్రి హరీష్‌ రావు సందర్శించారు. అనంతరం ఇరిగేషన్‌, కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుందిళ్ళ బ్యారేజీ 74 గేట్లకు గాను 44 గేట్లు పూర్తి చేశామని తెలిపారు. బ్యారేజీ పనుల నాణ్యత, వేగాన్ని పెంచేందుకు ఒక్కొక్క ఇంజనీర్‌ను కేటాయించామని హరీష్‌ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వేగం పెంచడానికి కేరళ, తమిళనాడు నుంచి కూలీలను పిలిపించి పనులు పూర్తి చేయిస్తామని మంత్రి హరీష్‌ రావు వెల్లడించారు.

 

07:28 - August 9, 2018

హైదరాబాద్ : మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం దీపావళి పండుగను టార్గెట్‌గా పెట్టుకుంది. మిషన్‌ భగీరథ ద్వారా నీళ్లివ్వకుంటే ఓట్లు అడగబోమంటూ పదేపదే చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఇచ్చిన మాట ప్రకారం నీళ్లిచ్చేందుకు అధికారులకు డెడ్‌లైన్‌ విధించారు. ఈ నెల 15 వరకల్లా ప్రతి ఊరికీ నీళ్లు ఇవ్వాలని.. దీపావళి వరకల్లా ప్రతి ఇంటికి నీరదించాలని అధికారులను ఆదేశించారు. 
ఆగస్టు 15కు ఊరూరా నీరు అందించాలి : కేసీఆర్‌
మిషన్‌ భగీరథ ద్వారా ఎన్నికల నాటికి నీళ్లు ఇస్తామని పదేపదే చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. అందుకనుగుణంగా భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. ఈ పంద్రాగాష్టుకు ఊరురా నీరు అందించాలని.. దీపావళి నాటికి ఇంటింటికీ త్రాగు నీరు అందించాలని అధికారులకు డెడ్‌లైన్‌ విధించారు. అందుకోసం ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పనులను నిరంతరం పర్యవేక్షించాలని భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, సిఎంవో అడిషనల్ సెక్రటరీ స్మితా సభర్వాల్‌కు కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ పనులు పూర్తయితే అక్కడ నీళ్లందించాలని సూచించారు. ఇక విద్యుత్ సబ్ స్టేషన్లు, పంపు హౌజుల నిర్మాణానికి అవసరమైన సిబ్బందిని నియమించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ట్రయల్ రన్స్‌ను ప్రారంభం
ఇక సీఎం ఆదేశాలతో నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పనుల పూర్తి కోసం అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. చాలా చోట్ల ట్రయల్ రన్స్‌ను ప్రారంభించారు. ఈ నెల 14న బల్క్‌గా నీళ్లిచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీలకు బిల్లులు పెండింగ్‌ పెట్టకుండా.. వెంటనే నిధులు విడుదల చేస్తున్నారు. ఏ ఒక్క ఆడపడుచు బిందే పట్టుకొని బజారుకు వెళ్లొద్దని.. అందుకోసం ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వాలని టార్గెట్‌ పెట్టుకున్న టీఆర్ఎస్ సర్కార్‌.. మరి డెడ్‌లైన్‌ ప్రకారం ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తుందో లేదో వేచి చూడాలి. 

నేడు, రేపు విశాఖలో మంత్రి లోకేష్ పర్యటన

విశాఖ : నేడు, రేపు విశాఖలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎక్స్ ప్రెస్ టెక్నాలజీ సభలో ఆయన పాల్గొననున్నారు. 10న పలు ఐటీ కంపెనీలను లోకేష్ ప్రారంభించనున్నారు. 

 

06:59 - August 9, 2018

హైదరాబాద్ : గులాబీ పార్టీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వబోతోంది? కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతు ఇస్తుందా? లేక ఎన్డీయే ప్రతిపాదించిన జేడీయు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌కు ఓటేస్తుందా? లేక తటస్థంగా ఉంటుందా? ఇంతకీ టీఆర్‌ఎస్‌ ఎంపీలకు గులాబీ బాస్‌ ఇచ్చిన డైరెక్షన్‌ ఏంటి?
టీఆర్‌ఎస్‌ నిర్ణయంపై ఉత్కంఠ
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక ఇవాళ జరుగనుంది.  అధికార, విపక్ష పార్టీలు చెరో అభ్యర్థిని నిలబెట్టాయి. అయితే ఎవరికీ పూర్తి మెజారిటీ లేదు. దీంతో ప్రాంతీయ పార్టీలపై ఇరు పక్షాలు ఆధారపడక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఏం నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. టీఆర్‌ఎస్‌ మాత్రి ఇప్పటి వరకు అధికారికంగా ఏ నిర్ణయమూ ప్రకటించలేదు. 
జేడీయూ అభ్యర్థికే టీఆర్‌ఎస్‌ మద్దతు!
గులాబి పార్టీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చేది అధికారికంగా ప్రకటించకపోయినా... జేడీయూ అభ్యర్థికే తమ ఓటు వేసే సంకేతాలను ఇస్తోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ మూడో కూటమిని తెరపైకి తెచ్చినా.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మద్దతును కేసీఆర్‌ కూడగట్టేందుకు ఆసక్తి చూపలేదు. రాజ్యసభలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ లేకపోవడంతో డిప్యూటీ చైర్మన్‌ స్థానాన్ని దక్కించుకోవాలంటే ప్రాంతీయ పార్టీల నేతలను రంగంలోకి దించాలని కమలనాథులు తీసుకున్న నిర్ణయం టీఆర్‌ఎస్‌కు ఊటర నిచ్చింది.
తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ను కోరిన నితీష్‌కుమార్‌
డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌ను బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఫోన్‌లో కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు.  అయితే రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే గులాబీపార్టీ కాంగ్రెస్‌ పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం లేనట్టే కనిపిస్తోంది.  రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ను భావిస్తున్న నేపథ్యంలో.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీకి ఎలా మద్దతు ఇవ్వాలని గులాబీనేతలు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి రంగంలో లేకపోవడం, ప్రాంతీయపార్టీ అభ్యర్థి బరిలో ఉండడంతో టీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపేందుకు ఆసక్తి చూపుతోంది.   
రాజకీయవర్గాల్లో ఉత్కంఠ 
మొత్తం మీద రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక వ్యవహారం రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ప్రాంతీయ పార్టీలు మద్దతు కీలకం కావడంతో వాటి మద్దతు కోసం జాతీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. మరికొద్ది గంటల్లో జరుగనున్న ఎన్నికల్లో ఎవరిది గెలుపో... ఎవరిది పరాజయమో తేలిపోనుంది.

 

06:53 - August 9, 2018

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. ఎన్డీయే తరపున జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, విపక్షాల తరపున కాంగ్రెస్‌ అభ్యర్థి బికె హరిప్రసాద్‌ పోటీ పడుతున్నారు. తమ తమ అభ్యర్థుల గెలుపుపై ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు ఈ ఎన్నిక జరుగుతోంది.
డిప్యూటి ఛైర్మన్‌ పదవికి ఎన్డీయే, విపక్షాలు పోటీ 
రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ పదవికి ఆగస్టు 9న ఎన్నిక జరగనుంది. ఈ పదవి కోసం ఎన్డీయే, విపక్షాలు పోటీ పడుతున్నాయి. విపక్షాల తరపున రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బీకే హరిప్రసాద్‌ను ఖరారు చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి పేరును సిపిఐ నేత డి.రాజా ప్రతిపాదించారు.  హరిప్రసాద్‌  కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్డీయే తరపున రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌ అభ్యర్థిగా జెడియు ఎంపి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ పేరును ప్రకటించారు. విపక్షాల తరపున ఎన్‌సిపి ఎంపి వందనా చవాన్‌ పేరును ఖరారు చేసినప్పటికీ ఆఖరి క్షణంలో కాంగ్రెస్‌ ఎంపి హరిప్రసాద్‌ పేరును తెరపైకి తెచ్చారు. రాజ్యసభలో బిజెపికి బలం లేదని, తమ అభ్యర్థి హరి ప్రసాద్‌ గెలుపుకు తగిన బలం ఉందని కాంగ్రెస్‌ పక్ష నేత ఆనంద్‌శర్మ తెలిపారు. ఏకగ్రీవ ఎన్నిక కోసం బిజెపి తమను సంప్రదించకుండానే అభ్యర్థిని ప్రకటించిందని ఆయన విమర్శించారు. 
డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి
ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. రాజ్యసభలో కాంగ్రెస్‌కు 50 మంది ఎంపీలున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఎస్పీ, బిఎస్పీ, ఎన్‌సిపి, టిఎంసి, వామపక్షాలు మద్దతుగా నిలిచాయి. టిడిపి, ఆప్‌, పిడిపితో కలిపి ప్రతిపక్షాలకు 117 స్థానాలున్నాయి. డిఎంకె, వైసిపి కూడా మద్దతిస్తాయని విపక్షాలు భావిస్తున్నాయి.
ఎన్డీయేకు మద్దతు ప్రకటించిన బిజెడి  
రాజ్యసభలో బిజెపికి 73 మంది ఎంపీలున్నారు. ఈ ఎన్నికల్లో కీలకంగా మారిన బిజెడి ఎన్డీయేకు మద్దతు ప్రకటించింది. యూపిఏకు మద్దతుపై తనతో ఎవరు చర్చించలేదని...నితీష్‌కు తాను హామి ఇచ్చినట్లు ఒడిషా సిఎం నవీన్‌ పట్నాయక్‌ శరద్‌పవార్‌తో అన్నారు. బిజెడితో పాటు శివసేన, అన్నాడిఎంకే, వైసిపి, టిఆర్‌ఎస్‌ కూడా ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది. తమకు మొత్తం 126 ఓట్లు వస్తాయని ఎన్డీయే ధీమాతో ఉంది.

 

06:48 - August 9, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గిరిజనుల అభ్యన్నతికి పాటుపడుతోంది. గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమానికి పెద్దపీఠ వేస్తోంది. వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు నాలుగేళ్లుగా అనేక కార్యక్రమాలను చేపడుతోంది. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా.... ఏపీలో గిరిజనుల అభ్యున్నతిపై కథనం...
గిరిజన అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీఠ 
తెలుగుదేశం ప్రభుత్వం గిరిజన అభ్యున్నతికి పెద్దపీఠ వేస్తోంది. గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వారి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తోంది. గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచేందుకు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోంది. విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేసింది.  ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆదివాసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి వారిని అన్ని రంగాల్లో ఆదుకుంటోంది. గిరిజన యువతలో స్కిల్స్‌ డెవలప్‌చేస్తూ వారిని ఉపాధిరంగంలో ప్రోత్సహిస్తోంది.
గిరిపుత్రులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక
ఏపీలోని 35 జాతుల్లో 5.53శాతంగా ఉన్న గిరిపుత్రులను అన్నివిధాలా ఆదుకునేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికనూ అమలు చేస్తోంది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా సీఎం చంద్రబాబు  2018-19కిగాను 2129.13 కోట్లను కేటాయించారు. సబ్‌ప్లాన్‌ కింద 2018-19కిగానూ 4,176.60 కోట్ల నిధులు కేటాయించింది. ఈ స్థాయిలో భారీగా నిధులు మంజూరు చేసి గిరిజన ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటోంది.  విద్య ద్వారానే సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని భావించిన ప్రభుత్వం.... గురుకుల విద్యా వ్యవస్థ కింద 174 విద్యాసంస్థలను ఆదివాసీ విద్యార్థుల కోసం నడుపుతోంది. మరో 80 గిరిజన హాస్టళ్లను కొత్తగా కన్వర్ట్ చేసి వాటిని కూడా ప్రభుత్వం గురుకులాల నియంత్రణ కిందకు తీసుకువచ్చి గిరిజన యువతకు విద్యను అందుబాటులోకి తెచ్చింది.
గిరిజనుల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత 
విద్య తర్వాత ప్రభుత్వం గిరిజనుల ఆరోగ్యానికి అధికా ప్రాధాన్యత ఇస్తోంది. పాత పద్దతులకు స్వస్తి చెప్పి సరికొత్త ఆవిష్కరణలను టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. గిరిజన ప్రాంతాల్లో అధునాతన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది.  160 పీహెచ్‌సీలు, 249 సీహెచ్‌సీలు, 270 ఏహెచ్‌ల్లో మందులను అందుబాటులో ఉంచేందుకు  ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పీహెచ్‌సీల్లో 7 నుంచి 11 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సంఖ్యను 23కు పెంచారు. 15 చంద్రన్న సంచార చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం గిరిజనుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుతుండడంతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి
 

 

ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

విశాఖ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖ జిల్లా పాడేరులో పర్యటిస్తారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆదివాసీ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతారు. మరోవైపు బాక్సైట్‌ అంశంతోపాటు గిరిజన యూనివర్సిటీ, గిరిజన స్పెషల్‌ డీఎస్సీ, బోయా వాల్మీకి కులాలను ఎస్టీలను చేర్చే అంశంపై సీఎంకు నిరసన తెలపాలని గిరిజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటన సాఫీగా సాగుతుందా లేక ఆదివాసీలు అడ్డుకుంటారా అన్న ఉత్కంఠ నెలకొంది.

06:42 - August 9, 2018

విశాఖ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖ జిల్లా పాడేరులో పర్యటిస్తారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆదివాసీ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడుతారు. మరోవైపు బాక్సైట్‌ అంశంతోపాటు గిరిజన యూనివర్సిటీ, గిరిజన స్పెషల్‌ డీఎస్సీ, బోయా వాల్మీకి కులాలను ఎస్టీలను చేర్చే అంశంపై సీఎంకు నిరసన తెలపాలని గిరిజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటన సాఫీగా సాగుతుందా లేక ఆదివాసీలు అడ్డుకుంటారా అన్న ఉత్కంఠ నెలకొంది.
పాడేరులో పర్యటించనున్న చంద్రబాబు 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన పాడేరులో పర్యటిస్తారు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేశారు. చంద్రబాబు ప్రత్యేక విమానం ద్వారా విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి పాడేరుకు హెలికాప్టర్‌ ద్వారా వెళ్తారు.  పాడేరు మండలం అడారిమెట్టలో నిర్వహించే గ్రామదర్శి  కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. అడారిమెట్ట, చింతలవీధి పరిధిలోని 8 గ్రామాల ప్రజలతో చంద్రబాబు ముచ్చటిస్తారు. గ్రామదర్శి కార్యక్రమంతోపాటు గ్రామ వికాసం కార్యక్రమంలోనూ పాల్గొంటారు. మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతం కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ప్రతీవాహనాన్ని తనిఖీలు చేస్తున్నారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌తోపాటుగా... పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఏర్పాట్లను పరిశీలించారు.
చంద్రబాబు పాడేరు టూర్‌కు సమస్యలు స్వాగతం 
చంద్రబాబు పాడేరు టూర్‌కు అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా బాక్సైట్‌ గనులకు సంబంధించి జీవో నంబర్‌ 97పై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చెయ్యకపోవడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నాల్కో సంస్థకు బాక్సైట్‌ను అప్పగించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అందుకే జీవో నంబర్‌ 97ను రద్దు చెయ్యకుండా ఉంచిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో గిరిజన యూనివర్సిటీతోపాటుగా స్పెషల్‌ డీఎస్సీ అంశంపైనా గిరిజన నిరుద్యోగ యువత ఎదురు చూస్తోంది. అటవీ హక్కుల చట్టం అమలు గురించి కూడా సీఎం ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.  ఇక బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాల్లో చేర్చొద్దని ఇక్కడి గిరిజనులు తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నారు. ఆదివాసీ సమస్యలపై చంద్రబాబును నిలదీయాలని గిరిజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. నల్లజెండాలతో నిరసన తెలపాలని కోరారు. మొత్తానికి చంద్రబాబు పాడేరు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. 

 

నేటి నుంచి ప.గోదావరి జిల్లాలో పవన్ ప్రజా పోరాటయాత్ర

ఏలూరు : నేటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటయాత్ర చేయనున్నారు. భీమవరంలో వివిధ వర్గాలతో పవన్ సమావేశం కానున్నారు. 

నేడు సైబర్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్న డీజీపీ ఠాకూర్

విజయవాడ : నేడు సైబర్ పోలీస్ స్టేషన్ ను డీజీపీ ఠాకూర్ ప్రారంభించనున్నారు. 

 

నేడు కేంద్ర కేబినెట్ భేటీ

ఢిల్లీ : నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

హెచ్ సీయూ హాస్టల్ లో విద్యార్థి రజినీష్ ఆత్మహత్య

హైదరాబాద్ : హెచ్ సీయూ హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఎంఏ ఫస్టియర్ విద్యార్థి రజినీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. రజినీష్ ఉత్తరాఖండ్ వాసిగా గుర్తించారు. 

Don't Miss