Activities calendar

10 August 2018

21:26 - August 10, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సభపై రగడ జరుగుతోంది. ఈనెల 14న తలపెట్టిన రాహుల్‌ సభకు ఓయూ అధికారులు అనుమతి నిరాకరించడంపై విద్యార్ధి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించినట్టు అధికారులు చెబుతున్నా... ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒత్తిడికి లొంగిన ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు.. రాహుల్‌ సభను అనుమతి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సభసై రాజకీయ దుమారం చెలరేగుతోంది. యూనివర్సిటీలోని ఠాకూర్‌ ఆడిటోరియంలో రాహుల్‌ విధ్యార్థులతో భేటీ కోసం కాంగ్రెస్‌ నాయకులు అనుమతి కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు లేఖ రాశారు. భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించినట్టు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించడంతో కాంగ్రెస్‌ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

రాహుల్‌ సభకు అనుకూలంగా, వ్యతిరేకగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు విడిపోయాయి. అడ్డుకుంటామని ఒక వర్గం, సభ నిర్వహించి తీరతామని మరోవర్గం ప్రకటించడంతో వివాదం ముదిరింది. రాహుల్‌ రాకను టీఆర్‌ఎస్వీ వ్యతిరేకిస్తోంది. రాహుల్‌ ఫ్రొపెసర్‌ లేదా శాస్త్రవేత్త కాదన్నది టీఆర్‌ఎస్వీ వాదన. రాజకీయ నాయకులు యూనివర్సిటీకి వస్తే విద్యా వాతావరణం పాడైపోతుందని టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు అంటున్నారు. తెలంగాణ ఇవ్వడంతో కాంగ్రెస్‌ జాప్యం చేయడంతోనే వందలాది మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సీడబ్ల్యూసీ తీర్మానం చేయడాన్ని టీఆర్ఎస్వీ నాయకులు తప్పుపడుతున్నారు. దీనివలన తెలంగాణ నుంచి ఏపీకి పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు రాహుల్‌ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు.

మరోవైపు ఓయూ నిధుల కొరత ఎదుర్కొంటోందని... ఎస్సీ, ఎస్టీ విద్యార్థులుకు ఉపకారవేతనాలు రావడంలేదన్న వాదాన్ని రాహుల్‌ అనుకూలవర్గం విద్యార్థి సంఘాలు వినిపిస్తున్నాయి. దళితులపై దాడులు, రైతుల ఆత్మహత్యలు, తెలంగాణలో తాండవిస్తున్న నిరుద్యోగ సమస్య వంటి అంశాలను రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. రాహుల్‌ ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందని..ఆయన పర్యటనను రాజకీయం చేయడం తగదని అంటున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడి సభకు అనుమతి ఇవ్వాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రత్యేకాధికారి ప్రొఫెసర్‌ కృష్ణారావు కార్యాయంలో విద్యార్థి నాయకులు బైఠాయించారు. సదస్సుకు అనుమతి కోరుతూ రూ.25 వేల డీడీ చెల్లించి... ఈనెల 4న దరఖాస్తు చేసుకున్నా...పర్మిషన్‌ ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నారు. రాహుల్‌ పర్యటనపై విద్యార్థి సంఘాలు రెండుగా చీలిపోయిన నేపథ్యంలో ఆయన వస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తవచ్చన్న అనుమానంతో ఏఐసీసీ అధ్యక్షుడి సభకు అనుమతి నిరాకరించడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తోంది.

రాహుల్‌ ఓయూ సభకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఈనెల 14న హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే రాహుల్‌ సభ ఏర్పాట్లను తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు పరిశీలించారు.నిరుద్యోగ గర్జన పేరుతో నిర్వహించే ఈ సభకు భారీగా విద్యార్థులను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు రోజుల రాహుల్‌ పర్యటనను విజయవంతం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

13న అల్పపీడనం ?

హైదరాబాద్ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొనట్లు తెలుస్తోంది. ఈ కారణంగా కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు...కోస్తాంధ్రలో శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని సమాచారం. 

21:21 - August 10, 2018

హైదరాబాద్ : నగరంలో ప్రజారవాణ వ్యవస్థను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించింది. జంటనగరాల్లో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించే విధంగా ఫ్లై ఓవర్లు, అండర్‌ పాస్‌ల నిర్మాణాన్ని విస్తృతం చేయాలని నిర్ణయించినట్టు ఎల్బీ నగర్‌ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవంలో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ ఎల్వీ నగర్‌ కామినేని ఆస్పత్రి వద్ద 50 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మించారు. వ్యూహాత్మక రహదారులు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పథకాల్లో ఇది నాల్గవది.

ఇంతకు ముందుకు చింతల్‌కుంట, మైండ్‌స్పేస్‌ జంక్షన్‌, అయ్యప్ప సొసైటీ అండర్‌ పాస్‌లను ప్రారంభించారు. ఎల్బీనగర్‌ వద్ద మూడు వరుసల్లో నిర్మిస్తున్న మరో ఫ్లై ఓవర్‌ను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ను ఈనెలాఖరు నాటికి, గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌ వచ్చే ఏడాది మార్చికి పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టింది. కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఫ్లై ఓవర్‌ను డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బైరామల్‌గూడ ఫ్లై ఓవర్‌ను 2019 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎల్బీనగర్‌ ప్రాంతంలోనే 450 కోట్లతో నిర్మిస్తున్న రోడ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మెగా సిటీగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు.

జంట నగరాల జనాభా కోటికి చేరింది. వ్యక్తిగత వాహనాలు 50 లక్షల వరకు ఉన్నాయి. రోడ్లు ఎంత విస్తరించినా సరిపోని పరిస్థితి ఉంది. తరచు ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని తగ్గించేందుకు బీఆర్‌టీఎస్‌, ఎంఎంటీఎస్‌, మెట్రో రైలు వ్యవస్థలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేఫ్టీ నుంచి ధ్రువీకరణ వచ్చిన తర్వాత అమీర్‌పేట-ఎల్బీనగర్‌ మెట్రో రైలును వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

21:20 - August 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భీమా పథకం ఆగష్టు 15 నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు భీమా అందే క్రమంలో దశల వారీగా తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేసుకోవాల్సిన యంత్రాంగం గురించి వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద భీమా పథకంగా ప్రారంభం కానున్న రైతు భీమా పథకం తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసాగా పేర్కొన్నారు. రికార్డుల్లో ఉన్న అర్హుడైన రైతు ఏ కారణం చేత అయినా చనిపోతే ఎల్‌ఐసీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం 10 రోజుల్లో రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందించాలన్నారు. 

కేసీఆర్ ను కలిసిన అడ్వకేట్ జనరల్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడ్వకేట్ జనరల్ బండ శివానంద ప్రసాద్ కలిశారు. ఆయన కొత్తగా నియమితులైన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌ను ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. 

చర్చలు సఫలం..సమ్మె విరమణ..?

చిత్తూరు : ఈ నెల 16 నుంచి తలపెట్టిన సమ్మెను టీటీడీ ఉద్యోగ సంఘాలు విరమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తో టీటీడీ ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలమయినట్లు సమాచారం. 

ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన బీజేపీ - పవన్...

పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో మాట తప్పిన భారతీయ జనతా పార్టీ ప్రజల నమ్మకాన్ని, వారి మనసులో స్థానాన్ని కోల్పోయిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 

ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్‌.. రోజుకో మలుపు...

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్‌.. రోజుకో మలుపు తిరుగుతోంది. సోమవారం నాటికి చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే చెప్పాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేరోజు.. లా సెక్రెటరీతో పాటు.. అసెంబ్లీ సెక్రెటరీకి ఫారం-1 నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు సిద్ధమవుతోంది. 

21:08 - August 10, 2018

పశ్చిమగోదావరి : వచ్చే ఎన్నికల్లో టీడీపీని మరోసారి ఎన్నుకుంటే రాష్ట్రానికి జరిగేది ద్రోహమేని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హెచ్చరించారు. టీడీపీని మరోసారి గెలిపిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడాన్ని జనసేనాని తప్పుపట్టారు. అధికారంలో ఉండగా ఏం చేశారని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పోరాట యాత్రలో పవన్‌ ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పోరాట యాత్ర నిర్వహించారు. జనసేనాని సభకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పవన్‌ విమర్శల వర్షం కురించారు.

టీడీపీని మరోసారి ఎన్నుకుంటే రాష్ట్రానికి అధోగతి తప్పదని జనసేనాని హెచ్చరించారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని కుయుక్తులైనా పన్నుతారని పవన్‌ మండిపడ్డారు. రాష్ట్రానికి మేలు చేస్తారని గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీని బలపరిస్తే.. చివరికి అన్యాయమే జరిగిందని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ నేతల వైఖరి ఏరుదాటిన తర్వాత తెప్పతగలేసిన చందంగా ఉందని పవన్‌ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌ కాపులు, బీసీలకు ద్రోహం చేశారని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. సామాజిక న్యాయం, రాజకీయ మార్పు, అవినీతి ప్రక్షాళన కోసమే జనసేన ఆవిర్భవించిందని పవన్‌ చెప్పారు. 

21:02 - August 10, 2018

విజయవాడ : ఈడీ కేసులో.. వైఎస్‌ భారతిని నిందితురాలిగా చేర్చినట్లు వచ్చిన వార్తలపై.. వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చార్జిషీట్‌ను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకోకముందే.. ఈ విషయాలు ఎలా బయటకు వచ్చాయంటూ ప్రశ్నించారు. ఇదంతా తెలుగుదేశం పార్టీ చేస్తోన్న కుట్ర అని జగన్‌ ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి.. వైఎస్‌ భారతిని.. ఈడీ కేసులో నిందితురాలిగా చేర్చినట్లు.. వార్తలు వచ్చాయి. దీనిపై జగన్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. ప్రజలు, ప్రజాస్వామికవాదులను ఉద్దేశించి.. బహిరంగ లేఖను విడుదల చేశారు. తనపైనే కాకుండా.. తన కుటుంబ సభ్యుల్నీ టార్గెట్‌ చేయాల్సినంతటి శత్రుత్వం ఎవరికి ఉందో.. ఇన్నేళ్ల తర్వాత చార్జిషీట్లలో భారతి పేరును చేర్చడం వెనుక కుట్ర ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు.

తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలు తనపై కుట్ర పన్ని.. 2011 ఆగస్టు పదోతేదీన అక్రమ కేసులు బనాయించి.. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని జగన్‌ లేఖలో ఆరోపించారు. కేసు ప్రారంభమై శుక్రవారం నాటికి పదేళ్లు గడచిపోయిన తరుణంలో.. ఇప్పుడు అనూహ్యంగా తెరపైకి భారతి పేరును తేవడం వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గమనించాలని జగన్‌ కోరారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లో చంద్రబాబు మనుషులున్నారని జగన్‌ ఆరోపించారు. బాబు ఆదేశాలకు అనుగుణంగా.. ఉమాశంకర్‌గౌడ్‌, గాంధీ అనే ఇద్దరు పనిచేస్తున్నారని, వీరిపై నిరుడు ఫిబ్రవరిలో ప్రధానికి కూడా ఫిర్యాదు చేశామని జగన్‌ వెల్లడించారు. ఆ అధికారుల చేతే టీడీపీ వారు తమపై కక్షసాధింపు రిపోర్టులను రాయించారని జగన్‌ ఆరోపించారు.

చంద్రబాబు నాయుడు పగలు కాంగ్రెస్‌తో కాపురం చేస్తూ, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు ఏపార్టీలో ఉన్నా మా మిత్రుడే అని కేంద్ర హోంమత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పడం.. చంద్రబాబు లాలూచీ రాజకీయాలకు అద్దం పడుతోందని జగన్‌ విమర్శించారు. బీజేపీతో బంధాలు, సంబంధాలు బాగున్నాయి కాబట్టే.. ఓటుకు కోట్లిస్తూ సాక్ష్యాధారాలతో పట్టుబడ్డా.. చంద్రబాబు రొమ్ము విరుచుకు తిరుగుతున్నారని జగన్‌ ఆరోపించారు.

చంద్రబాబు.. రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని సీఎంఎస్‌, ఆమ్నెస్టీ లాంటి సంస్థలు.. నివేదించాయని జగన్‌ తన లేఖలో ప్రస్తావించారు. కేంద్రం చంద్రబాబుపై విచారణ జరపకపోవడమే ఆయన లాలూచీ వ్యవహారాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు. విపక్షాన్ని ప్రజల్లో ఎదుర్కోలేక.. చంద్రబాబు ముందుగా తన తండ్రిని.. తర్వాత తనను.. ఇప్పుడు తన భార్యను టార్గెట్‌ చేసుకున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యవహారాలను ఆమోదిస్తే.. ఈ దేశంలో ఎవరికి రక్షణ ఉంటుందని ప్రశ్నిస్తూ.. ఈ అంశాన్ని ప్రజలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

20:40 - August 10, 2018

రెండు ఏటీఎంలలో చోరీ...

హైదరాబాద్ : చందానగర్ పీఎస్ పరిధిలో ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్ ల సహాయంతో రెండు ఏటీఎంలను కట్ చేశారు. ఘటనాస్థలిని మాదాపూర్ డీసీపీ, క్లూస్ టీంలు పరిశీలిస్తున్నారు. 

ఇమ్రాన్ ఖాన్ ప్రమాణంలో మార్పులు...

ఇస్లామాబాద్ : ఇమ్రాన్ ఖాన్ ప్రధాని ప్రమాణ స్వీకారం చేతిలో మార్పులు జరిగాయి. ప్రధానిగా ఆగస్టు 18వ తేదీన ప్రమాణం చేయనున్నారు. 

20:30 - August 10, 2018

భారతదేశంలనే గాదు ఈ ప్రపంచంలనే రైతులకు భీమా జేశిన ప్రభుత్వంగానీ.. రైతులకు పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వంగాని ఏడలేదు అంటున్నడు ఎవుసం శాఖామంత్రి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి సారు.. సూడుండ్రి నెల రోజుల సంది గ్రామ పంచాది కార్మికులు సమ్మె జేస్కుంట జీతాలు వెంచుమంటే ఎవ్వడు వాళ్ల ముచ్చట వట్టిచ్చుకోలే..రాసమయి బాలకిషన్ సారు.. ఎందుకు సారు ఈ ఉద్దెర మాటలు మాట్లాడ్తవ్..? నిజామాబాద్ జిల్లా బాల్కొండ జడ్పీటీసీ రాజీనామా జేశింది..ప్రజలారా మీరు ముందుగాళ్ల మారకుంట ఈ భూమ్మీద ఏ వ్యవస్థ మారది.. మార్పురావాల్సింది ముందుగాళ్ల ప్రజలళ్లనే.. నిన్న పొద్దుగాళ్ల యాదాద్రి బోనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడ్గుకాడ.. ఒక కారు స్కూటీ మీద వోతున్న పోరగాళ్ల బండికి టక్కరైంది..రాజుగాని పెండ్లి శ్రీకాంతు సావుకొచ్చింది.. ప్రేమించుకున్నోళ్లు బాగనే ఉన్నరు.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:27 - August 10, 2018

పద్మశాలి భవనానికి రూ. 5 కోట్లు - కేసీఆర్...

హైదరాబాద్ : పద్మశాలి భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో పద్మశాలీల అభ్యున్నతికి బహుముఖ వ్యూహం రచిస్తున్నట్లు, చేనేత వృత్తిలో కొనసాగుతున్న వారికి చేయూత, ప్రోత్సాహం అందిస్తామన్నారు. వృత్తిని వదిలిపెట్టిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తామని, పద్మశాలి సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మొదటి విరాళంగా రూ. 50 లక్షలు అందిస్తామన్నారు. 

19:10 - August 10, 2018

విజయవాడ : ఈడీ ఛార్జీషీట్ లో భారతి పేరుందని వచ్చిన కథనాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. రఘురాం సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదులో జగన్ సతీమణి వైఎస్ భారతిని 5వ నిందితురాలిగా పేర్కొంది. దీనిపై శుక్రవారం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఛార్జీషీట్ ను సీబీఐ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే పత్రికల్లో వార్తలు ఎలా ప్రచురిస్తారని ప్రశ్నించారు. సీబీఐ విచారణలో లేని అంశాలు ఇన్నేళ్ల తరువాత ఈడీ ఛార్జీషీట్ లోకి ఎందుకొచ్చాయని, వైఎస్ భారతికి ఈ కేసులతో సంబంధం ఏంటీ ? భారతిని కూడా కోర్టుల చుట్టూ తిప్పాలని కంకణం కట్టుకున్నారా ? అని ప్రశ్నించారు. తమపై కావాలనే బురద జల్లుతున్నారని ఈడీలో ఉన్న ఇద్దరు అధికారులు చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని ఆరోపించారు.

జగన్ అక్రమాస్తుల కేసులో 11 ఛార్జీషీటులు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్ భారతిపై కూడా ఛార్జీషీట్ నమోదు కావడం కలకలం రేపింది. ఇటీవల మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద రఘురాం సిమెంట్స్‌కు సంబంధించిన వ్యవహారాలపై ప్రత్యేక కోర్టు హోదా కలిగిన సీబీఐ ప్రధాన న్యాయస్థానంలో అభియోగ పత్రాన్ని ఈడీ దాఖలు చేసింది. ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. 

18:57 - August 10, 2018

2013లో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం 2' రూపొందించారు. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. పూజా కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్ ముఖ్య పాత్రలు పోషించారు. కానీ పలు కారణాల వల్ల ఐదేళ్ల తరవాత ఈ సినిమా శుక్రవారం రిలీజైంది. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్ర రివ్యూ...రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి.

 

భారతికి ఈ కేసులతో సంబంధం ఏంటీ ? - జగన్...

విజయవాడ : ఈడీ ఛార్జీషీట్ లో భారతి పేరుందని వచ్చిన కథనాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ స్పందించారు. ఛార్జీషీట్ ను సీబీఐ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే పత్రికల్లో వార్తలు ఎలా ప్రచురిస్తారని ప్రచురించారు. సీబీఐ విచారణలో లేని అంశాలు ఇన్నేళ్ల తరువాత ఈడీ ఛార్జీషీట్ లోకి ఎందుకొచ్చాయని, వైఎస్ భారతికి ఈ కేసులతో సంబంధం ఏంటీ ? భారతిని కూడా కోర్టుల చుట్టూ తిప్పాలని కంకణం కట్టుకున్నారా ? అని ప్రశ్నించారు. తమపై కావాలనే బురద జల్లుతున్నారని ఈడీలో ఉన్న ఇద్దరు అధికారులు చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని ఆరోపించారు. 

రైతు బీమాపై కేసీఆర్ సమీక్ష...

హైదరాబాద్ : రైతు బీమాపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రైతు బీమా పథకం ప్రపంచంలోనే అతి పెద్దదని, రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే భరోసా అని తెలిపారు. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే 10 రోజుల్లోగా రైతు కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సొమ్ము చెల్లించాలని తెలిపారు. బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకోని వాళ్లు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. 

విశాఖ భూ కబ్జా దారుల వివరాలు...

విశాఖపట్టణం : భూ కబ్జాదారుల పేర్లను సీపీఐ ప్రకటించింది. సర్వే నెంబర్ 154/3లో 5 ఎకరాలను మంత్రి గంటా బంధువు పరుచూరి భాస్కరరావు...గాజువాకలో మాజీ ఎమ్మెల్యే పలాల సింహాచలం కుటుంబీకులు..వెయ్య చదరపు గజాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని..., కొమ్మాది, పరదేశీపాలెం, పెదగంట్యాడలో అధికార పార్టీ నేతలుత భూములు ఆక్రమించుకున్నారని సీపీఐ నేత రామకృష్ణ పేర్కొన్నారు. 

18:20 - August 10, 2018

టిడిపి..బాబును ఎన్నుకొంటే ద్రోహం - పవన్...

పశ్చిమగోదావరి : 2019 ఎన్నికల్లో టిడిపిని..బాబును ఎన్నుకొంటే ద్రోహం జరుగుతుందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నరసాపురంకు చేరుకున్నారు. సాయంత్రం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తాను అందరి కన్నీళ్లు తుడవడానికే వచ్చానన్నారు. ప్రతొక్కరినీ అర్థం చేసుకోవాలని..తదితర కారణాలతో 2014లో పోటీ చేయలేనని..ప్రస్తుతం అందర్నీ అర్థం చేసుకున్నానన్నారు. మత్స్యకారుల సమస్య తనకు బాధిస్తోందని...కోల్డ్ స్టోరేజ్ ..తదితర సమస్యలను టిడిపి పట్టించుకోలేదన్నారు. 

నరసాపురంలో పవన్ కళ్యాణ్...

పశ్చిమగోదావరి : శుక్రవారం సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నరసాపురంకు చేరుకున్నారు. సాయంత్రం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కులాలు విడగొట్టే పద్ధతి ఆగిపోవాలని పిలుపునిచ్చారు. 15 సీట్లు ఇచ్చిన జిల్లాలో ఏ ఒక్క హామీ పూర్తి చేయలేదని బీసీలకు..కాపులకు..ద్రోహం చేశారని విమర్శించారు. 

18:13 - August 10, 2018

పశ్చిమగోదావరి : 2019 ఎన్నికల్లో టిడిపిని..బాబును ఎన్నుకొంటే ద్రోహం జరుగుతుందని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నరసాపురంకు చేరుకున్నారు. సాయంత్రం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కులాలు విడగొట్టే పద్ధతి ఆగిపోవాలని పిలుపునిచ్చారు.

15 సీట్లు ఇచ్చిన జిల్లాలో ఏ ఒక్క హామీ పూర్తి చేయలేదని బీసీలకు..కాపులకు..ద్రోహం చేశారని విమర్శించారు. జగన్ కూడా మాట మార్చేశారని..తాను మాట తప్పనన్నారు. అందర్నీ కులాలకు న్యాయం చేస్తానన్నారు. అందరీకి అండగా నిలబడేది జనసేన పార్టీ అని...తాను అందరి కన్నీళ్లు తుడవడానికే వచ్చానన్నారు. ప్రతొక్కరినీ అర్థం చేసుకోవాలని..తదితర కారణాలతో 2014లో పోటీ చేయలేనని..ప్రస్తుతం అందర్నీ అర్థం చేసుకున్నానన్నారు. మత్స్యకారుల సమస్య తనకు బాధిస్తోందని...కోల్డ్ స్టోరేజ్ ..తదితర సమస్యలను టిడిపి పట్టించుకోలేదన్నారు. 

కబ్జా వివరాలను బయటపెట్టిన సీపీఐ...

విజయవాడ : విశాఖలో 187 ఎకరాలు కబ్జాకు గురైన లిస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విడుదల చేశారు. సిట్ నివేదికపై సీపీఐ ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో ఈ జాబితాను ఆయన విడుదల చేశారు. మొదట విడతగా సిట్ లో ఉన్న 187 ఎకరాల భూ కబ్జాపై వివరాలు వెల్లడించారు. 

పార్లమెంట్ హోం శాఖ స్థాయి సంఘం సమావేశం

ఢిల్లీ : పార్లమెంట్ హోం శాఖ స్థాయి సంఘం సమావేశం జరిగింది. కాంగ్రెస్ ఎంపీ చిదంబరం నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. విభజన చట్టం అమలు తీరు తెన్నులపై చర్చించారు. రాష్ట్రంలో విభజన చట్టం అమలుపై నివేదికను స్థాయి సంఘానికి అధికారులు అందించారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎస్ జోషి హాజరయ్యారు. గత నెల 27వ తేదీన ఏపీ వాదనలను స్థాయి సంఘం విన్నది. 

పంచాయతీ రాజ్ శాఖలో కొత్త పోస్టులు...

హైదరాబాద్ : పంచాయతీ రాజ్ శాఖలో 6603 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. కొత్త పంచాయతీల ఏర్పాటుతో జూనియర్ పంచాయతీ, సెక్రటరీ పోస్టులను మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని ప్రభుత్వం నియమించనుంది. 

బాబుతో కలెక్టర్ ప్రద్యుమ్న...

విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడిని కలెక్టర్ ప్రద్యుమ్న కలిశారు. డాక్టర్ శిల్పి ఆత్మహత్య ఘటన పూర్తి వివరాలను బాబుకు వివరించారు. శిల్ప ఆత్మహత్య ఘటనపై త్వరతిగతిన సీఐడీ విచారణ వేగవంతం చేసి నివేదికను ఇవ్వాలని పోలీసులను బాబు ఆదేశించారు. 

17:52 - August 10, 2018

డాక్టర్‌ కావాలనేది ఎందరో విద్యార్థుల కల.. ఆ కలని నెరవేర్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్న మెడికల్‌ కాలేజీలలో సీట్ల లభ్యత జనరల్‌ కేటగిరి మరియు బి కేటగిరి కలిసినా 6శాతం మించలేదు. మరి దీనికి పరిష్కారమేంటీ ? డాక్టర్‌ కల నెరవేరేదెలా ? దీనికి సమాధానమే విదేశీ మెడికల్‌ విద్య. మన దేశంలో ఉన్న డాక్టర్‌ డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు ప్రస్తుతం చైనా, రష్యా, సెంట్రల్‌ అమెరికా, జార్జియా, ఫిలిప్పైన్స్‌, ఆర్మేనియా, మారిషస్‌ లాంటి ఎన్నో దేశాలు పోటీపడుతున్నాయి. ఆర్మేనియా మరియు ఉక్రేయిన్‌లో అందజేస్తున్న చేస్తున్న ఎంబీబీఎస్‌ విద్యపై క్రెడో వీసాస్‌ డైరెక్టర్‌ కోటేశ్వరరావు, గాయత్రి కనుపర్తి టెన్ టివితో ముచ్చటించారు. ఆర్మేనియా, ఉక్రేయిన్‌లలో మెడికల్‌ విద్య ఎలా ఉంటుంది... ఫీజు మరియు ఇతర వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:50 - August 10, 2018

ఢిల్లీ : గురువారం రాజ్యసభ డిప్యూటి ఛైరన్‌ పదవికి జరిగిన ఓటింగ్‌ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ అభ్యర్థి హరిప్రసాద్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో విపక్ష అభ్యర్థిగా హరి ప్రసాద్ పోటీపడ్డారు. రాజ్యసభలో హరివంశ్‌కు శుభాకాంక్షలు చెప్పిన మోదీ.. డిప్యూటీ చైర్మన్ పదవి కోసం ఇద్దరు హరిలు పోటీపడ్డారన్నారు. మోది వ్యంగంగా చేసిన వ్యాఖ్యలపై హరిప్రసాద్ మనస్తాపానికి గురయ్యారు. చైర్ హుందాతనాన్ని ప్రధాని దిగజార్చారని, సభ హుందాతనానికి భంగం కలిగించారని హరిప్రసాద్ ఆరోపించారు. దీంతో మోదీ ప్రసంగం నుంచి వివాదాస్పద వ్యాఖ్యలను తొలిగిస్తున్నట్లు రాజ్యసభ సెక్రటేరియేట్ ప్రకటించింది. 

17:48 - August 10, 2018

విజయవాడ : దుర్గగుడి చీర వివాదం నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో పాలకమండలి సభ్యులతో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇక నుండి ఇంద్రకీలాద్రిపై వివాదాలు తలెత్తితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పాలనాపరమైన అంశాల్లో సభ్యులెవరూ జోక్యం చేసుకోకూడదని... సభ్యులు కేవలం దుర్గగుడి అభివృద్ధి కోసం.. భక్తుల సౌకర్యాలపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఈ విషయంపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:45 - August 10, 2018

ఢిల్లీ : విభజన హామీల అమల్లో విఫలమైన బీజేపీకి 2019 ఎన్నికల్లో శృంగభంగం తప్పదని టీడీపీ ఎంపీలు హెచ్చరించారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కు ఏ గతిపట్టిందో.. బీజేపీకి కూడా అదేగతి పడుతుందని వారించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైందని టీడీపీ ఎంపీలు తోట నరసింహం, సుజనా చౌదరి విమర్శించారు. 

17:43 - August 10, 2018

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని పోలీస్‌స్టేషన్‌లో కొండచిలువ కలకలం సృష్టించింది. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోకి వచ్చిన కొండచిలువ పిల్లను హోంగార్డు గుర్తించారు. దీంతో వెంటనే హుస్సాని ఆలం పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ వెంకటేశ్‌ నాయక్‌కు సమాచారం అందించారు. కొండచిలువను స్వాధీనం చేసుకున్న పోలీసులు జూపార్క్‌కు తరలించారు. 

17:39 - August 10, 2018

పెద్దపల్లి : జిల్లా మంథనిలో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పగిలింది. దీంతో ప్రధాన రహదారిపై భారీగా నీరు చేరింది. రహదారిపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పైప్‌లైన్‌కు వెంటనే రిపేర్‌ చేయాలని స్థానికులు కోరుతున్నారు. పైపులైన్ పగిలిన తరువాత ఎలాంటి పరిస్థితి ఉందో వీడియో క్లిక్ చేయండి. 

17:37 - August 10, 2018

ఢిల్లీ : కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య 26కి పెరిగింది. మరికొందరు గల్లంతయ్యారు. కన్నూర్, ఇడుక్కి, వాయినాద్‌, కోజికోడ్, మల్లాపురం జిల్లాలపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. ఎర్నాకులం, అలపుజా, పలక్కడ్‌ జిల్లాలను కూడా వరదలు ప్రభావితం చేశాయి. రాష్ట్రంలోని 22 రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగడంతో గేట్లను తెరచారు. పలు ప్రాంతాల్లో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 6 బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆర్మీ, నేవీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి. వరదల కారణంగా రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఫోన్‌ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 50 ఏళ్ల చరిత్రలో కేరళలో ఇంత భారీ వర్షం ఎప్పుడూ కురియలేదని అధికారులు చెప్పారు.

17:27 - August 10, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ హంతకులను విడుదల చేయమని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాజీవ్ హంతకులను విడుదల చేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనితో శుక్రవారం కేంద్ర వైఖరిని కోర్టుకు తెలియచేసింది. కేంద్రం అనుమతి లేకుండా నిందితులను విడుదల చేయవద్దని ఇదివరకే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఇటీవలే సుప్రీంకోర్టుకు కేంద్రాన్ని ఆదేశించింది. దీనితో రాజీవ్ హంతకులను వదిలేది లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. 1991 మే 21న శ్రీ పెరంబుదూర్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో గత 27 ఏళ్లుగా ఏడుగురు నిందితులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇందులో త్వరగా విడుదల చేయాలని నిందితురాలిగా ఉన్న నళిని కోరగా మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. 

విశాఖ జిల్లాకు పిడుగు హెచ్చరిక!!..

విశాఖపట్నం : విశాఖ జిల్లాకు రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పిడుగు హెచ్చరికను జారీ చేసింది. విశాఖ అర్బన్, విశాఖ రూరల్, పెందుర్తి, గాజువాక మండలాల్లో పిడుగు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

అడ్వకేట్ ప్రకాశ్ రెడ్డి రాజీనామాను ఆమోదం..

హైదరాబాద్ : అడ్వకేట్ జన్ రల్ దేశాయి ప్రకాశ్ రెడ్డి రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. వ్యక్తిగత కారణాలతో మార్చి 26న అడ్వకేట్ ప్రకాశ్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో కొత్త అడ్వకేట్ జన్ రల్ గా ప్రభుత్వం బీఎస్ ప్రసాద్ ను నియమించింది. 

కేసీఆర్ మార్క్ ప్రజాస్వామ్యం ఇదేనా : పొంగులేటి

హైదరాబాద్ : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన వివాదాస్పదంగా మారింది. ఓయూలో రాహుల్ విద్యార్థి సంఘాలతో కలిసి సదస్సు నిర్వహించేందుకు టీ.కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది. కానీ ఓయూ వీసీ భద్రతా కారణాల రీత్యా అనుమతిని నిరాకరించింది. దీనిపై ఉస్మానియా యూనివర్శిటీలో సదస్సుకు అనుమతి నిరాకరించటం కేసీఆర్ మార్క్ ప్రజాస్వామ్యమా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చొరవతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు ఇచ్చే గౌరవం ఇదేనా?

కేసీఆర్ సర్కార్ కు కోర్టు చీవాట్లు..

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోర్టు ధిక్కరణ పిటీషన్ పై ఈరోజు కూడా హైకోర్టులో విచారణ కొనసాగింది. డివిజన్ బెంచ్ లో అప్పీల్ వున్నందున కోర్టును ప్రభుత్వం గడువు కోరింది. దీంతో న్యాయస్థానం అనుమతించలేదు. అభ్యంతారాలు వుంటే 13వ తేదీని తెలపాలని కోర్డు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు 12వ తేదీకి వాయిదా వేసింది.

 

16:34 - August 10, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని న్యాయవాది జంధ్యాల పేర్కొన్నారు. ఆయన టెన్ టివితో ముచ్చటించారు. అసెంబ్లీ లా సెక్రటరీ కోర్టుకు డైరెక్ట్ గా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. అభ్యంతరాలు తెలపాలని కోర్టు ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేసిందని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:31 - August 10, 2018

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ ((ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు ఆగిపోయింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టడం లేదు. శుక్రవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టాలని కేంద్రం పలు ప్రయత్నాలు చేసింది. కానీ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీనితో ఈ బిల్లును ప్రవేశ పెట్టడం లేదని రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు ప్రకటించారు. బిల్లులో సవరణలకు ప్రతిపక్షాలు పట్టుబట్టినప్పటికీ కేంద్రం అందుకు అంగీకరించకుండానే లోక్‌సభలో బిల్లును పాస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం కీలక సవరణలు చేసింది.

ట్రిపుల్ తలాక్ ముసాయిదా బిల్లు 2017గా ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లు ప్రకారం భార్యకు మాటల ద్వారా కానీ, రాత పూర్వకంగా కానీ, ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా కానీ ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం అవుతుందని పేర్కొంది. అందులో భాగంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. దీనిపై ముస్లిం సంఘాల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను సోమవారం వరకు పొడిగించేందుకు కాంగ్రెస్, టీఎంసీ అంగీకరించలేదని సమాచారం.  

ట్రిపుల్ తలాక్ బిల్లుకు బ్రేక్..

ఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుకు బ్రేకులు పడ్డాయి. ఈ బిల్లుపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ట్రిపుల్ తలాక్ బిల్లుకు బ్రేకులు పడ్డాయి. దీంతో ఈ సమావేశాలలో ఈ బిల్లును టేకప్ చేయటంలేదని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఈ బిల్లును కేంద్రం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టం చేయాలని కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఈరోజు రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని  ప్రభుత్వం తలంచింది. కానీ ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ పేర్కొంది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ట్రిపుల్ తలాక్ బిల్లుకు బ్రేకులు పడ్డాయి.

పీఎస్ లో కొండచిలువ పిల్ల హల్ చల్..

హైదరాబాద్ : జనావాసాలలోకి జంతువులు, విషసర్పాలు రావటం ఇటీవల పరిపాటిగా మారిపోయింది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ కొండచిలువ పిల్ల పోలీసులను సైతం హడలెత్తించింది.  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఓ కొండచిలువ పిల్ల హల్ చల్ చేసింది. దీంతో హుస్సేనిఆలం పీఎస్ కు చెందిన కానిస్టేబుల్ వెంటేశ్ నాయుడు ఫారెస్ట్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. వారు పీఎస్ కు వచ్చి కొండచిలువ పిల్లను జూపార్క్ కు తరలించారు.

ఓయూలో రాహుల్ సభకు దొరకని అనుమతి..

హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 13,14 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్శిటీలో పర్యటిస్తారని, ఓ సదస్సు కూడా నిర్వహించనున్నామని టీ-కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఓయూలో రాహుల్ సదస్సుకు ఠాగూర్ ఆడిటోరియంలో సదస్సుకు విద్యార్థి సంఘాలు వీసీని అనుమతి కోరాయి. దీంతో వర్శిటీ వీసీ నిరాకరించారు. భద్రతా కారణాల రీత్యా ఈ సదస్సు నిర్వహణకు అనుమతి నిరాకరించినట్లుగా వీసీ తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. రాహుల్ ని యూనివర్శిటీలోకి అడుగుపెట్టనివ్వమని కొన్ని విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళన బాటపట్టాయి.

16:08 - August 10, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో..హైదరాబాద్ లో 'రాహుల్' అడుగు పెట్టకముందే వేడి రాజుకుంది. ఓయూలో రాహుల్ పర్యటనకు నిరాకరించడంతో మళ్లీ కాంగ్రెస్..టీఆర్ఎస్ మధ్య మాటలతూటాలు పేలే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు 'రాహుల్ గాంధీ' హైదరాబాద్ పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. ఈనెల 14వ తేదీన ఓయూలో ఓ సదస్సులో ఆయన పాల్గొనేందుకు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏర్పాట్లు చేస్తోంది. కానీ రాహుల్ ను ఓయూలోకి అనుమతినివ్వొద్దంటూ కొన్ని విద్యార్థి సంఘాలు హోం మంత్రి నాయినీని కలిసి వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించే సదస్సుకు అనుమతినివ్వాలంటూ పలువురు విద్యార్థులు శుక్రవారం ఓయూ అధికారులను కోరారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా యూనివర్సిటీ అధికారులు అనుమతిని నిరాకరించారు. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సభకు అనుమతిని నిరాకరించడంపై హైకోర్టుకు వెళ్తామని పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ ఒత్తిడి వల్లే అనుమతిని నిరాకరించారని పేర్కొంటున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

16:05 - August 10, 2018

రాజస్థాన్ : ఒక యువకుడికి వివాహం కావటంలేదు అంటే వారు కట్నం ఎక్కువ డిమాండ్ చేసుండాలి..లేదా అతడికి ప్రవర్తన మంచికాదై వుండాలి. కానీ ఒకే ఊరిలో నివసించే యువకులకు వివాహాలు కావటంలేదు అంటే అది మాత్రం వింత..విశేషంగా చెప్పుకోవాలి. లేదా..ఆ ఊరికి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేనిదై వుండాలి..కానీ రాజస్తాన్ లో మాత్రం వుండే ఒక గ్రామంలో నివసించే యువకులకు పిల్లనివ్వటానికి మాత్రం ఏ ఆడపిల్లల తండ్రులు ముందుకు రావటంలేదు కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..వారి కుమారులకు వివాహాలు కావటం కోసం ఆ ఊరివాంతా కలిసి ఆలోచించి ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అదే ఆ ఊరి పేరు మార్చేయాలనుకోవటం!!..వినటానికి ఆశ్చర్యంగా వున్నా ఇది సత్యం..ఆ ఊరి పేరు మార్చేసారు!!..

వివాహాలను నిలిపివేసిన ఊరి పేరు..
ఊర్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి..ఆ ఊరి యువకులు మంచి మంచి ఉద్యోగాలు కూడా వున్నాయి. కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి అమ్మాయిల్ని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకురావడం లేదు. ఎందుకంటే ఈ ఊరి పేరు 'మియాంకా బరా' అని ఉండటమే. ముస్లిం ఊరిపేరు కావడంతో తమ కుమారులకు పెళ్లిళ్లు కావడం లేదని గ్రామస్తులు వాపోయారు. గ్రామం పేరును మార్చాల్సిందిగా పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఎట్టకేలకు అధికారులు ఆ ఊరి పేరును మార్చారు. ప్రస్తుతం ఈ ఊరికి మహేశ్ నగర్ గా పేరు పెట్టారు. 'మియాంకా బరా హల్ట్' కాస్తా మహేశ్ నగర్ గా మారిపోయింది. ఈ విషయమై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే హర్మీర్ సింగ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ గ్రామాన్ని మహేశ్ నగర్ అనే పిలిచేవారనీ, కాలక్రమంలో కొన్ని కారణాలతో దీన్ని మార్చాల్సి వచ్చిందని తెలిపారు.

దుర్గమ్మ చీర మాయం..ఈవో బదిలీ..

విజయవాడ : కనక దుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీర మాయమైన ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆలయ ఈవో పద్మపై బదిలీ వేటు వేసింది. ఆమె స్థానంలో ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను నియమించింది. అమ్మవారి చీర మాయం కేసులో పాలకమండలి సభ్యురాలు సూర్యలత ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆమెను ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించింది. కాగా, విధుల్లో చురుగ్గా ఉండకపోవడంతోనే పద్మను బదిలీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆలయ ఈవోతో పాటు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా పద్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారనీ, దీంతో ఆమె గందరగోళానికి గురి అవుతున్నారని తెలిపాయి.

15:29 - August 10, 2018

చిత్తూరు : తిరుపతిలోని వేంకటేశ్వరుడిని సేవించేవారు బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమం గురించి మాట్లాడుకొంటూ ఉన్నారు. ఎక్కడ విన్నా ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? ఆ సమయంలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారా? లేదా? ఒక వేళ అనుమతిస్తే ఏ ఏ సమయాలలో స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారన్న విషయం పై చర్చించుకొంటున్నారు. అయితే ఆ మహా సంప్రోక్షణ కూడా అదే సమయంలో జరుగుతుండటం వల్ల తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలా వద్దా అన్న విషయం పై భక్తుల్లో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. వీటన్నింటికీ సమాధానమే 10టీవి ప్రత్యేక కథనం.

పన్నెండేళ్లకు ఒకసారి నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్లే తిరుమల శ్రీవారికి కూడా అష్టబంధన బాలాలయం మహా సంప్రోక్షణ అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి దీనిని నిర్వహిస్తారు. ఆలయ నిర్మాణాల్లో ప్రధానమైనది విగ్రహ ప్రతిష్టాపన. తర్వాత శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ పనులు చేస్తారు. సజీవంగా ఉండే ఓ దేవతా మూర్తిని సేవిస్తున్నామనే భావన భక్తులకు కలిగేలా విగ్రహంలో ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు.

తిరుమలలో శ్రీవారికి ప్రతి రోజూ అనేక ఉపచారాలు, నివేదనలు జరుగుతాయి. ఆ సమయంలో పాత్రలు లేదా కొన్ని పదార్థాలు కింద పడినప్పుడు ఎంతో కొంత మాలిన్యాలు గర్భాలయంలోకి చేరుతాయి. దీని వల్ల కొన్ని సార్లు గర్భాలయంలో పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని అపచారంగా భావించి పన్నెండేళ్లకోసారి గర్భాలయంలో అర్చకులే వాటికి మరమ్మతులు చేస్తారు. ఈ క్రమంలో మొదట శ్రీవారి మూలవిరాట్ పాదాలకు పద్మపీఠం మధ్యలో ఉన్న భాగాన్ని లేపంతో నిపటమే అష్టబంధన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా 8 రకాల వస్తువులతో తయారుచేసిన చూర్ణాన్ని శ్రీవారి పాదాల కింద, మూలవిరాట్ సమీపంలో ఉంచుతారు.

చూర్ణంలో ముఖ్యంగా నల్లసరిగళం, కరక్కాయ, ఎర్రపత్తి, వెన్న, కండచెక్కర, లక్క, చెకుముకిరాయి, బెళ్లం వంటి పదార్థాలు ఉంటాయి. ఈ మిశ్రమాన్ని మూలవిరాట్ తో పాటు ఆధార్ పీఠం, పాదపీఠం మధ్యలో సన్నపాటి ప్రదేశంలో, మూలవిరాట్ పై భాగంలో గోడకు ఉన్న రంధ్రాల్లో ఈ చూర్ణాన్ని అద్దుతారు. కాల క్రమంలో ఈ మిశ్రమం కరిగిపోవడం, రంగు మారడం వల్ల మూలవిరాట్ లో శక్తి తగ్గుతుంది. తిరిగి ఆ శక్తిని పెంపొందించేందుకే అష్టబంధన బాలాయన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఆలయ ఆర్చకులు.

ఈ మహాసంప్రోక్షణ శ్రీవారి ఆలయంలో 1958లో ప్రారంభమైంది.... చివరిగా 2006లో ఈ కార్యక్రమం నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు ఈనెలలో ప్రారంభమవుతోంది. ఆలయంలో మరమ్మత్తు పనులను నిర్వహించడానికి నిర్దేశించిన కార్యక్రమమే మహా సంప్రోక్షణ. అయితే శ్రీవారి గర్బాలయంలోకి అర్చకులు, జీయ్యంగార్లు మినహా మరెవ్వరినీ అనుమతించరు. ఇతర ఆలయాల్లో మాదిరిగా గర్బాలయంలోకి ఇంజనీరింగ్ అధికారులను అనుమతించరు. మహా సంప్రోక్షణంలో మూలవిరాట్ పాదాలు, పద్మపీఠం మధ్యన అష్టబంధన కార్యక్రమాన్ని చేపడుతారు. మొదటగా శ్రీవారి మూలవిరాట్ లో ఉన్న శక్తిని కుంభంలోకి ఆవాహనం చేస్తారు. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న పాత కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా 24 యాగశాలలను ఏర్పాటు చేసి అక్కడ స్వామివారి శక్తిని ఆవాహన చేసిన కుంభాన్ని ఉంచుతారు. దీంతో పాటు మూలవిరాట్ కు నిత్యం నిర్వహించే పూజా కైంకర్యాలను ఈ కుంభానికి నిర్వహిస్తారు. ఆఖరి రోజున మహా సంప్రోక్షణతో స్వామివారి శక్తిని తిరిగి మూలవిరాట్ లోకి పంపిస్తారు. మూలవిరాట్ లోకి తిరిగి శక్తిని ఆవాహనం చేయడం మూలవిరాట్ ని నూతనంగా నిర్మించినట్లేనని చెబుతారు ఆలయ ఆర్చకులు.

అష్టబంధన బాలాయన మహాసంప్రోక్షణం ఆగస్టు 11 నుంచి 16వ తేది వరకూ జరగనుంది. 11న అంకురార్పణ జరగనున్నాయి. ఇక 12న ఆదివారం 4 గంటలు,13న 5 గంటలు ,14న 5 గంటలు , 15న 6 గంటలతోపాటు... 16న అతి తక్కువ సమయం మాత్రమే భక్తులకు శ్రీవారిని దర్శించేకునే అవకాశం ఉంటుంది. దీంతో టీటీడీ నడకదారి భక్తులకు జారీ చేసే దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లతో పాటు విఐపీ బ్రేక్ దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేసింది. మహాసంప్రోక్షణకు పాలకమండలి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

వెంకటరెడ్డి విద్యార్హత పిటీషన్ కొట్టివేసిన సుప్రీం..

ఢిల్లీ : కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్హతను సవాల్ చేస్తు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్ లో కోమటిరెడ్డి తన విద్యార్హతన తప్పుగా చూపించారని కాబట్టి ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఎన్నిక చెల్లదంటు కించెర్ల భూపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీనిపై స్పందించిన దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఈ పిటీషన్ పై విచారణ అర్హత ఏమాత్రం లేదని పిటీషన్ ను కొట్టివేసింది. 

15:26 - August 10, 2018

కశ్మీర్ వేర్పాటువాదులకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు..

ఢిల్లీ : కశ్మీర్ ఏర్పాటు వాదులకు జ్యుడిషియల్ కస్టడీని ఎన్ ఐఏ కోర్టు పొడిగించింది. సెప్టెంబర్ 7 వరకు పొడిగిస్తు న్ ఐఏ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కశ్మీర్ వేర్పాటువాది అసియాతో సహా మరో ఇద్దరు మహిళలకు ఈ కస్టడీని పొడిగిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. 

15:24 - August 10, 2018

హైదరాబాద్ : ఫుట్ పాత్ లపై వెలసిసిన ఆక్రమణలు జీహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుషాయిగూడలో మున్సిపల్, విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కాప్రా సర్కిల్ ప్రాంతంలో పుట్ పాత్ లపై వెలిసిన ఆక్రమణలు కూల్చివేశారు. 300 మంది సిబ్బంది రెండు టీంలుగా ఏర్పడి ట్రాఫిక్ లా అండ్ ఏర్పాటు చేసిన బందోబస్తు మధ్య నాలుగు జేసీబీలతో ఆక్రమణలను కూల్చివేశారు. సైనిక్ పురి నుండి ఈసీఎల్ చౌరాస్తా వరకు రోడ్డుకిరువైపులా ఆక్రమించిన నిర్మాణాలను కూల్చివేశారు. 

15:18 - August 10, 2018

తిరుపతి : ఎస్వీ మెడికల్ కాలేజీ పీజీ మెడికో శిల్ప ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై న్యాయవిచారణ జరిపించాలని వైద్యులు డిమాండ్ చేశారు. టెన్ టివితో వైద్యులు మాట్లాడారు. శిల్ప ఆత్మహత్యకు ఎస్వీ మెడికల్ కాలేజీ వైద్యులు కారణం కాదని తేల్చిచెప్పారు. ఆమె సెల్ ఫోన్ కాల్ డేటాను విచారించి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. శిల్మ ఆత్మహత్యతో వైద్యులందరినీ నిందించడం తగదన్నారు. సోమవారం ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామన్నారు. 

15:12 - August 10, 2018

హైదరాబాద్ : టిడిపిపై వైసీపీ నేత తమ్మినేని సీతారం పలు విమర్శలు గుప్పించారు. నగరంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టిడిపి పార్టీని కాంగ్రెస్ కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. టిడిపి ఎలా పుట్టిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వ్యతిరేక భావజాలతో పుట్టిందని..కానీ నేడు దానిని పూర్తిగా తాకట్టు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ తో కుమ్మక్కై కుహానా రాజాకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. టిడిపిని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఆశ్చర్యపోవాల్సినవసరం లేదన్నారు. రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలో టిడిపి ఎంపీలు కాంగ్రెస్ కు ఓటేయాడాన్ని తప్పుబట్టారు. 

14:55 - August 10, 2018

విజయవాడ : నాలుగేళ్లు కాలయాపన చేసి ఎన్నికల సమీపిస్తున్న సమయంలో నిరుద్యోభృతి అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. 2014 ఎన్నికల హామీ నేపథ్యంలో నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని సర్కార్ ప్రకటనలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? కేవలం వెయ్యితో సరిపెట్టడం సబబుకాదని.. ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ 2014 అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు గంపెడు ఆశలు కల్పించారు. 'బాబు వస్తే జాబొస్తుందంటూ.. నిరుద్యోగ భృతి కల్పిస్తామని సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులంతా తమకు భృతి అందుతుందని ఆశపడ్డారు. ప్రభుత్వం ఆ స్కీమ్‌ను అమలు చేయకపోవడంతో భృతి కోసం నాలుగున్నరేళ్లుగా వేచిచూస్తున్నారు. రానున్నది ఎన్నికల ఏడాది కావడంతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతిపై నిర్ణయం తీసుకుంది. అదికూడా వెయ్యిరూపాయలే ఇస్తామని ప్రకటించడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. తమ ఆశలు ఆవిరిచేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇచ్చే వెయ్యికి సవాలక్ష షరతులు విధించి కొందరికే ఆ అవకాశాన్ని కల్పించడంపట్ల యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నాలుగేళ్లపాటు మొక్కుబడిగా అదిగో ఇదిగో అంటూ మాయమాటలతో కాలం గడిపి.. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భృతి అందించాలనుకోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
కృష్ణా జిల్లాలో 2.71 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 71 వేల మంది జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో తమ పేర్ల నమోదు చేసుకోగా, పేర్లు నమోదు కానివారు సుమారు 2 లక్షల పైచిలుకు ఉంటారని విద్యావంతులు అంచనా వేశారు. అయితే ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ తదితర విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎక్కువమందే ఉన్నారు. వీరిలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు విద్యకు దూరమౌతుండగా, మరికొందరు నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. అర్హత ఉన్నవారు సిఫార్సులు లేనికారణంగా నిరాశ చెందుతున్నారు. దీంతో చాలా మంది విద్యార్ధులకు అన్యాయం జరుగుతోందని వైసీపీ విద్యార్ధి నేతలు మండిపడుతున్నారు.

ఆగస్టు, సెప్టెంబర్ నాటికి..సీఎం యువ నేస్తం' పేరుతో నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.దీనికి సంబంధించిన వెబ్ సైట్ ను ప్రారంభించి 15 రోజులపాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 12న ఈ వెబ్ సైట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగించి 'సీఎం యువ నేస్తం' పథకాన్ని అమలు జరిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాసాధికారిక సర్వేలో సమాచారం సేకరించి, ఆధార్ అనుసంధానం ఆధారంగా రిజిస్ట్రేషన్లను పకడ్బందీగా నిర్వహిస్తారు. ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం నమోదైన రిజిస్ట్రేషన్లనే ఆన్ లైన్ స్వీకరిస్తోంది.

22 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, డిగ్రీ లేదా పాలిటెక్నిక్ చదివిన అభ్యర్థులు నిరుద్యోగ భృతికి అర్హులుగా గుర్తిస్తామన్నారు అధికారులు. ఎంపికైన వారికి నెలకు వెయ్యి చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాసాధికార సర్వే ప్రకారం సుమారు 12 లక్షల మంది ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. వీరందరికీ 600 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని లెక్కకట్టారు. ఏదైనా సంస్థలో పనిచేస్తూ.. పీఎఫ్ కట్ అవుతున్నవారు లేదా...ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి కింద రుణాలు తీసుకున్న వారు ఈ పథకానికి అనర్హులుగా గుర్తించనున్నారు. అయితే ప్రతినెలా అర్హులైన విద్యార్ధుల వేలిముద్రలు తీసుకుని బ్యాంక్ ఎకౌంట్లలో ఈ మొత్తాన్ని జమచేయనున్నారు. 

14:47 - August 10, 2018

కరీంనగర్‌ : జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో 4k ఫ్రీడమ్‌ రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ ప్రమోద్‌, సిపి కమలాసన్‌ రెడ్డి, ఎమ్మెల్యే గంగల కమలాకర్‌లు పాల్గొన్నారు. నగరంలోని అంబేద్కర్‌ స్టేడియం నుంచి SRR కాలేజీ వరకు జరిగిన ఈ రన్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలందరిలో దేశభక్తిని.. జాతీయ భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ రన్‌ను నిర్వహించినట్టు సీపీ తెలిపారు. విభిన్న మతాలకు చెందిన పెద్దలతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి దేశభక్తిని చాటుకున్నారన్నారు. రన్‌లో భాగంగా విద్యార్థులు నృత్యపదర్శన చేశారు. రన్‌లో ఎన్‌సీసీ విద్యార్థులు ప్రదర్శించిన 100 అడుగుల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

14:19 - August 10, 2018

ఆదిలాబాద్ : జిల్లాలో 'రిమ్స్' ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ఎన్నో లోటుపాట్లు ఉన్నాయనే విమర్శలున్నాయి. కీలకమైన వైద్య శాలకు భారతీయ వైద్య మండలి షాక్ ఇచ్చింది. గుర్తింపు కొనసాగించడానికి నిరాకరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 22 అంశాల్లో లోపాలను ఎత్తి చూపింది. రెగ్యులర్ డీన్ లేరని..డీన్ ఉన్నా..ఆయన సరిగ్గా రాలేరని...ఉన్న ఫ్యాకల్టీ 35 శాతమేనని...దీనితో లోపాలతో గుర్తింపు కొనసాగించలేమని స్పష్టం చేసింది.

ఎంసీఐ గుర్తింపు కొనసాగించడానికి నిరాకరించడం విద్యార్ధులను కలవరపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిమ్స్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరుతున్నారు. 

14:14 - August 10, 2018

విజయవాడ : ప్రముఖ పుణ్యక్షేత్రం 'విజయవాడ దుర్గగుడి'..లో ఎన్నో వివాదాలు..వరుస వివాదాలతో చెడ్డ పేరు వస్తుండడంతో ప్రభుత్వం ప్రక్షాళనకు నడుం బిగించింది. దుర్గగుడి ఈవో పద్మ కుమారిని ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రాహ్మణకార్పొరేషన్ ఎండీగా పద్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మరోవైపు పద్మ స్థానంలో దుర్గగుడి ఈవోగా ఐఆర్‌ఎస్‌ అధికారి కోటేశ్వరమ్మను నియమించారు. దేవాదాయశాఖ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా పద్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

దుర్గగుడిలో గతంలో అనేక వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే ఆషాడ మాసం సందర్భంగా కొంతమంది భక్తులు అమ్మవారికి చీర సమర్పించారు. కొద్దిసేపటికే ఈ చీర మాయం కావడం కలకలం రేపింది. పోలీసులు, పాలక మండలి ఛైర్మన్ ఘటనపై నివేదికలను ప్రభుత్వానికి సమర్పించారు. దీనితో గురువారం రాత్రి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రాథమిక దర్యాప్తులో చీరను పాలకమండలి సభ్యురాలు సూర్య లతకుమారి తీసుకువెళ్లినట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో గత రాత్రి దుర్గగుడి పాలకమండలి సభ్యురాలుగా సూర్య లతకుమారిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

శుక్రవారం పాలక మండిలితో టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న భేటీ అయ్యారు. పాలక మండలి వ్యవహరిస్తున్న తీరుతో చెడ్డ పేరు వస్తోందని బుద్ధా వెంకన్న అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. 

14:13 - August 10, 2018

నిజామాబాద్ : ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యార్థి సంఘం నాయకులు చలో శ్రీరాంసాగర్ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకుని అరెస్టు చేశారు. 

 

రిమ్స్ కు ఎంసీఐ షాక్...

ఆదిలాబాద్ : జిల్లాలోని రిమ్స్ కు ఏంసీఐ షాక్ ఇచ్చింది. మెడికల్ కాలేజీ గుర్తింపును కొనసాగించలేమని స్పష్టం చేసింది. 22 అంశాల్లో లోపాలను ఎత్తి చూపింది. రెగ్యులర్ డీన్ లేరని..డీన్ ఉన్నా..ఆయన సరిగ్గా రాలేరని...ఉన్న ఫ్యాకల్టీ 35 శాతమేనని...దీనితో లోపాలతో గుర్తింపు కొనసాగించలేమని స్పష్టం చేసింది. 

14:06 - August 10, 2018

హైదరాబాద్ : నగరంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.23 వేల కోట్లతో ప్రణాళిక చేసినట్లు తెలిపారు. ఎల్ బినగర్ లో ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. నాగోల్ నుండి ఎల్ బి నగర్ వరకు ఫ్లై ఓవర్ నిర్మించారు. దేశంలోనే ఐదో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఉందన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో అమీర్ పేట...ఎల్ బినగర్ మెట్రో రైలు ప్రారంభం అవుతుందన్నారు. 

13:59 - August 10, 2018

ఢిల్లీ : టీఆర్ఎస్‌ ఎంపీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. టీఆర్ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ప్రధానిని కలిసి రాష్ర్టంలో కొత్త సెక్రటేరియట్‌కు రక్షణ భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. బైసన్‌ పోల్‌, జింఖానా మైదానం, రక్షణ శాఖ భూములు రాష్ర్టప్రభుత్వానికి ఇవ్వాలని కోరామని తెలిపారు. పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చామని తెలిపారు.

13:42 - August 10, 2018

విశాఖ : ఐటీ రంగానికి కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారబోతున్న కాపులపాడ ఐటీ పార్క్‌ని మంత్రి నారా లోకేష్‌ పరిశీలించారు. నాలుగు దశల్లో కాపులపాడ ఐటీ పార్క్‌ అభివృద్ధి చేస్తామని మొదటి దశగా వంద ఎకరాల్లో అందుబాటలోకి రానుందని తెలిపారు. మొత్తం 700 ఎకరాల్లో ఐటీపార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఒక్క కాపులపాడ ఐటీ పార్క్‌లో సుమారుగా 5 లక్షల మంది ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు.  రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్‌ ఇతర మౌలిక వసతుల కల్పన సెప్టెంబర్‌లోపు పూర్తి చేయాలని అధికారులని ఆదేశించారు.

13:32 - August 10, 2018

కడప : జిల్లాలోని ముద్దనూరు మండలం తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్‌ ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఇక్కున్న వ్యక్తిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గాయపడ్డవారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రొద్దుటూరు నుంచి బల్ళారికి వెళ్తుండగా ఘటన చేసుకుంది. మృతులు మహబూబ్ నగర్ కు చెందినవారుగా గుర్తించారు.

 

13:29 - August 10, 2018

హైదరాబాద్ : నగరంలోని ఎల్ బి నగర్ వద్ద ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుడివైపున ఉన్న ఫ్లైవోర్ ను జూన్ కల్ల పూర్తి చేస్తామని చెప్పారు. బైరామల్ గూడ దగ్గర ఉన్న ఫ్లైవోవర్ ను మార్చి 2019వరకు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. కామినేని దగ్గర మరో ఫ్లైవోర్ రావాల్సివుందన్నారు. ఎన్ని ఫ్లైవోవర్లు నిర్మించినా ట్రాఫిక్ పెరుగుతూనే ఉందన్నారు. బహుముఖ ఆలోచనలు, బహుముఖ వ్యూహాలతో పని చేస్తున్నామని తెలిపారు. నగర ప్రజల సర్వతోముఖావృద్ధికి చేస్తామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, వ్యూహాత్మకంగా ముందుకు పోతామని చెప్పారు. 

 

13:14 - August 10, 2018

కారులో షికారుకు వెళ్లటం హయిగానే వుంటుంది. కానీ కొన్ని కార్లు నడిపేవాళ్లను టెంప్ట్ చేస్తాయి. జోరుగా వెళ్లమని ప్రోత్సహిస్తాయి. ఎందుకంటే ఆ కార్ల డిజైన్ అలా వుంటుంది. లగ్జరీ కార్ల తయారీ అలా వుంటుంది. ఇక ఆ కార్లకు విశాలమైన రోడ్డు వుంటే మరింతగా దూసుకుపోవాలనిపిస్తుంది. కానీ మనం నడిపే కారు ఎక్కడ తయారైనా..ఆ కార్లు నడిపే రోడ్లు..ఆరోడ్లపై మనం నడిపే కారు ఏ దేశంలో వుంది? అక్కడ వుండే ట్రాఫిక్ నిబంధనలేమిటి? అనే విషయాన్ని తెలుసుకోవటం చాలా చాలా ముఖ్యం. అటువంటి నిబంధనలు తెలుసుకోకుంటే మాత్రం ఇదిగో ఈ కారు ఓనర్ లాగా బుక్ అయిపోతాం. కేవలం కారును అద్దెకిచ్చిన పాపానికి ఆ కారు ఓనర్ కి రూ.32 లక్షలు జరిమానా కట్టమని ప్రభుత్వం నోటీస్ పంపించింది. ఆ నోటీస్ చూసి ఇంకేముంది కారు ఓనర్ లబో దిబోమన్నాడు. మరి అది ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..

కారులో బాణంలా దూసుకుపోయిన యువకుడు..లబోదిబోమన్న ఓనర్
యువకుల చేతిలో బైకే విమానలా దూసుకుపోతుంది. మరి లగ్జరీ కారు స్టీరింగ్ వారి చేతిలో వుంటే..ఇంకేముంది దాన్ని విష్ణుచక్రంలా తిప్పేస్తారు. రయ్ మని దూసుకుపోతుంటారు. మరి వారు కారు నడిపే రోడ్లు నున్నగా..విశాలంగా వుంటే ఇక వారి ఉత్సాహానికి..దూకుడుకి అంతు వుండదు. ఇలా లగ్జరీ కారుతో విశాలమైన రోడ్ మీదికొచ్చిన ఓ బ్రిటన్ యువకుడు..దుబాయ్ పర్యటనకు వచ్చాడు. ఎత్తైన బిల్డింగులు, విశాలమైన రోడ్లు, లగ్జరీ కార్లకు కేరాఫ్ గా వుండే దుబాయ్ ని చూడగానే మైమరచిపోయాడు. లంబోర్గిని హారికేన్ అనే లగ్జరీ కారును రూ.లక్ష ఇచ్చి రెండు రోజులకు అద్దెకు తీసుకున్నాడు. దుబాయ్ లో ఉండే కఠినమైన ట్రాఫిక్ రూల్స్ ను తెలుసుకోకుండా..పట్టించుకోకుండా ఆ విశాలమైన..నున్నటి రోడ్లపై రివ్వున బాణంలా దూసుకుపోయాడు. ఫలితంగా కారు ఓనర్ లబోదిబోమనే పరిస్థితికి చేరుకున్నాడు. ఇంకేముంది!!..

బ్రిటన్ ఎంబసీకి మొరపెట్టుకున్న కారు ఓనర్..
దుబాయ్ లోని రోడ్ సర్కిల్స్ లో ఏర్పాటుచేసిన స్పీడ్ గన్లు అధిక వేగంతో వెళుతున్న ఈ లంబోర్గిని వాహనాన్ని గుర్తించాయి. నాలుగు గంటల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ కారుకి రూ.32 లక్షల భారీ జరిమానా విధించి ట్రావెల్స్ కి నోటీస్ పంపించారు. అది చూసిన కారు యజమాని లబోదిబోమంటూ..తాను అంత జరిమానాను కట్టలేనంటు దుబాయ్ ఎంబసీకి మొరపెట్టుకున్నాడు. కానీ అతి కఠినంగా వుండే బ్రిటన్ ఎంబసీకి మొరపెట్టుకున్నాడు..కానీ విచారణ తరువాత చూడొచ్చు ముందు జరిమానా కట్టమని దుబాయ్ సర్కార్ ఆదేశించేసరికి ఆ యజమానికి కళ్లు బైర్లు కమ్మాయి. 

12:57 - August 10, 2018

ఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా పార్లమెంటులో గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన చట్టం అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. చిత్తూరు ఎంపీ డాక్టర్‌ శివప్రసాద్‌.. హిజ్రా వేషధారణలో శివప్రసాద్‌ నిరసన వ్యక్తం చేశారు. మోదీబాబా ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం అంటూ.. హాస్య గీతం ఆలపించారు. మాటలెన్నో చెప్పావో.. చేతల్లో ఏమీ చూపలేదంటూ ఛలోక్తులు విసిరారు. 
 

12:43 - August 10, 2018

తినే తిండి విషయంలో శ్రద్ధ పెరిగింది. తాగే నీటి విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాం. కానీ..మనం బతికేందుకు ప్రధాన వనరు అయిన 'గాలి' విషయంలో మాత్రం మన దారుణంగా నష్టపోతున్నాం. అదే ఆరోగ్యం విషయంలో . మనం నిజానికి, తిండికన్నా, నీటికన్నా గాలినే మనం ఎక్కువగా అవసరం. అనుక్షణం ఆక్సిజన్ మన శరీరంలోని అణువణువుకూ అందాలి. అప్పుడే మనం సజీవంగా ఉండగలుగుతాం. సృష్టిలో జీవులకు, నిర్జీవులకు మధ్య అదే అతిపెద్ద తేడా. మనం మనగలుగుతున్నా మంటే అందుకు కారణం ప్రాణవాయువే. ఆ గాలి ఎంతగా కాలుష్యమౌతోందంటే, అది మన మనుగడకే శాపంగా మారింది. విషవాయువుల్ని పీలుస్తూ మనకు తెలియకుండానే మనం మన ఆయుషును కోల్పోతున్నాం.

దేశవ్యాప్తంగా కాలుష్య నగరాల సంఖ్య 100..
దేశంలోని వంద నగరాల్లో అత్యవసర కాలుష్య నిరోధక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది అంటే వాయు కాలుష్యం ఎంతటి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో ఊహించలేం. ముంబై, పూణే, నాగపూర్, లక్నో, కాన్పూర్, వారణాసి, చంఢీఘడ్, కోల్ కతాలతోపాటు వంద నగరాల్లో కాలుష్య నివారణకు చర్యలు చేపట్టనుంది. కానీ ఇది ఎప్పటికి ఆచరణలో వచ్చేనో..మన ప్రాణాలకు ఎప్పుడు రక్షణ దొరికేనో? అదంతా పాలకు చేతిలోనే వుంది.

వాయు కాలుష్యంతో డయాబెటిస్ ముప్పు..
భారత్‌లోని ప్రధాన నగరాల్లో వాతావరణ కాలుష్యం ఎంతగా పెరిగిపోతోందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఈ కాలుష్యం మనుషుల్లో పలు వ్యాధులకు కారణం అవుతోంది. దీని కారణంగా డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం కూడా అధికమని తాజాగా పరిశోధనలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతోన్న వారి సంఖ్య పెరగడానికి గాలి కలుషితం కావడం కూడా ఓ కారణమని పరిశోధకులు గుర్తించారు.

ఇన్సులిన్‌ ఉత్పత్తిపై వాయు కాలుష్య ప్రభావం..
కలుషితమైన గాలి మనిషిలో ఇన్సులిన్‌ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందని.. రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా మారకుండా అడ్డుకుంటుందని పరిశోధనలో తేలింది. గాలి కాలుష్యం విషయంలో తక్కువ ఆదాయ దేశాల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ పాలసీలు లేవని, దీంతో ఆయా దేశాల్లో ప్రజలు అత్యధికంగా గాలి కాలుష్యం వల్ల డయాబెటిస్‌ బారిన పడుతున్నారని గుర్తించారు.

గాలి కాలుష్యం 30లక్షల మంది మృతి..
పర్యావరణ రక్షణ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలు కలిసి అతి తక్కువ కాలుష్యంగా గుర్తించిన ప్రదేశాల్లోనూ డయాబెటిస్‌ పెరిగిపోయిందని పరిశోధకులు తెలిపారు. 2016లో గాలి కాలుష్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మధుమేహ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. మరి ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి వాయు కాలుష్యం తగ్గించటంలో చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం..లేకుండే మానవ మనుగడకు ముప్పును మనకు మనమే మన విధి విధానాలతో కొన్ని తెచ్చుకునే ప్రమాదంలో పడిపోతాం..ఎన్నికల సమయంలో పాలకులకు ప్రజల ఓట్లు కోరేవారు ప్రజల ఆరోగ్య విషయంలో కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవరముంది. లేకుంటే స్వచ్ఛమైన గాలి కావాలంటు ప్రజలే ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. 

12:32 - August 10, 2018

శ్రీకాకుళం : సిక్కోలు రిమ్స్ ఆసుపత్రికి మాయరోగం ఆవహించింది. కోట్లాది రూపాయలు నిధులు ఖర్చుపెడుతున్నా.. బాధ్యతాయుతమైన సేవలు కరువవుతున్నాయి. వైద్యుల ఇష్టారాజ్యం.. సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల అలసత్వంతో ... సిక్కోలు పెద్దాసుపత్రికి నిర్లక్ష్యపు జబ్బు పడుతోంది. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతిచెందగా.. మరో పదిహేడు మంది పరిస్థితి విషమంగా మారడం ఈ పరిస్థితులకు అద్దం పడుతోంది.
నిధులు ఫుల్...సేవలు నిల్
శ్రీకాకుళంలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఆసుపత్రి ఇది.. దాదాపు జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాల్లోని రోగులకు పెద్ద దిక్కుగా మారిన ఈ ఆసుపత్రికి నిలువునా నిర్లక్ష్యపు జబ్బు చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతి చెందడంతో పాటు, మరో పదిహేడు మంది ప్రాణాల మీదకు రావడానికి కారణం వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమేనన్న ఆరోపణలున్నాయి. 
రిమ్స్ కు వందల కోట్ల బడ్జెట్ కేటాయింపులు 
వందలాది మంది వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించే రిమ్స్ ఆసుపత్రికి వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు. ఆసుపత్రి భవనాలు సైతం కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. అయినప్పటికీ.. జిల్లాలో ఉన్న ఏకైక ఈ ధర్మాసుపత్రిలో బాధ్యతాయుత సేవలు కరువుతున్నాయి. ఆసుపత్రిలో చేరుతున్న రోగులకు సరైన సేవలు అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వైద్య పరీక్షలు, స్కానింగ్ లు, ఇతర రిపోర్టులు అవసరమైనప్పుడు బయట ప్రయివేటు లేబొరేటరీలపై ఆధారపడాల్సివస్తోందని బాధితులు వాపోతున్నారు. వీటికి తోడు.. వైద్యులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదని రోగులు చెబుతున్నారు. నర్సుల పరిస్థితీ అంతే.  రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారవుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
నీరుగారిపోతోన్న రిమ్స్ లక్ష్యం  
అయితే లక్షలాదిమంది జిల్లా వాసులకు పెద్ద దిక్కుగా ఉన్న ఈ ఆసుపత్రి మరింత భరోసా కల్పించేలా రోగులకు సేవలందించాలని స్థానికులు కోరుతున్నారు. రిమ్స్ లక్ష్యం ఇలాంటి పరిణామాలతో నీరుగారిపోతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపట్ల  ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 

12:23 - August 10, 2018

రుచికరమైనది..సురక్షితమైనది..పోషకాల ఘనిగా వుండేది..అరచేతిలో ఇమిడిపోయేంత బుజ్జి ఆకారంలో వుండేది..చటుక్కున వండుకునేవీలుండేది..ముఖ్యంగా అన్ని కాలాల్లోనూ అతి తక్కువ ధరకే దొరికేది..అన్ని వయసుల వారు మెచ్చేది.. ఒకే ఒక్కటి..అదే అనండీ..గుడ్డు..మరి ముఖ్యంగా నాన్ వెజ్ తినని వారు కూడా తినగలిగేది గుడ్డు?? రుచిని..ఆరోగ్యాన్ని కూడా సమపాళ్లలో అందించే గుడ్డు రోజుకొకటి తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశం బహు తక్కువ అంటున్నారు పరిశోధకులు..అందుకే ప్రపంచ వ్యాప్తంగా 'గుడ్డు'కు అంతటి వినియోగం..ప్రాచుర్యం పొందింది.

పెకింగ్‌ యూనివర్సిటీ హెల్త్‌ సైన్స్‌ సెంటర్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధనలు..
ప్రతిరోజు కోడి గుడ్డు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మరోసారి తేలింది. పెకింగ్‌ యూనివర్సిటీ హెల్త్‌ సైన్స్‌ సెంటర్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో గుడ్డు గురించి పలు విషయాలు వెల్లడయ్యాయి. 30 నుంచి 79 సంవత్సరాల మధ్య ఆరోగ్యవంతులైన నాలుగు లక్షల మంది ఆహారపు అలవాట్లను పరిశోధకులు పరిశీలించగా.. వారానికి అయిదు సార్లు గుడ్డు తింటే గుండె జబ్బుల ముప్పు 12 శాతం తగ్గుతుందని ఈ పరిశోధనలో తేలింది.

గుడ్డు తినేవారిలో గుండె జబ్బులు తక్కువ..
రోజూ కోడి గుడ్డు తినేవారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అలాగే గుడ్డు తినని వారి కంటే తినేవారిలో గుండెపోటు ముప్పు కూడా 26 శాతం తక్కువగా ఉన్నట్లు, గుండె జబ్బుల ద్వారా మరణించే అవకాశం 18 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. అందుకే ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతిరోజు ఓ కోడి గుడ్డు తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.

12:16 - August 10, 2018

హైదరాబాద్‌ : కూకట్‌పల్లి మూసాపేట జనతానగర్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. మాదాపూర్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అదనపు డీసీపీ గంగిరెడ్డి, కూకట్‌పల్లి ఏసీపీ బుహాంగరావు, 8మంది ఇన్‌స్పెక్టర్లు, 16మంది ఎస్సైలతో 607 ఇళ్ళలో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు, 29 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేందుకే  తనిఖీలు నిర్వహిస్తున్నామని డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు.  

 

డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసు సిట్ కు అప్పగింత..

చిత్తూరు : తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజీ పీజీ స్టూడెంట్, డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య కేసు విచారణ బాధ్యతలను ఏపీ ప్రభుత్వం స్పేషల్‌ ఇన్వేష్టిగేషన్‌ టీం కు అప్పగించింది. ఆమె ఆత్మహత్య వెనుక ప్రొఫెసర్ల లైంగిక వేధింపులు ఉన్నాయన్న ఆరోపణలు రావడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సిట్‌ అధికారిగా చిత్తూరు డీఎస్పీ రమణ కుమార్‌ ను నియమిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, శిల్ప మృతికి కారణమైన ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ను శిల్ప బంధుమిత్రులు కోరారు.

జగన్ భార్య భారతిపై ఈడీ ఛార్జ్ షీట్..

హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మరో కీలక మలుపు తిరిగింది. జగన్ భార్య భారతిపై ఈడీ తొలిసారి చార్జ్ షీట్ దాఖలు చేసింది. భారతి సిమెంట్ వ్యవహారంలో ఏ5 నిందితురాలిగా భారతి పేరుతో ఈడీ పేర్కొంది. ఇప్పటి వరకు సీబీఐ దాఖలు చేసిన 11 చార్జ్ షీట్స్ లో తొలిసారిగా భారతి పేరుతో ఈడీ ప్రస్తావించింది. మనీ లాండరింగ్ నిరోధర చట్టం కింద భారతి సిమెంట్ వ్యవహారాలపై సీబీఐ కోర్టులో ఈడీ చార్జ్ షీట్ ను దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3 కింద భారతి నేరానికి పాల్పడ్డారనీ నోటీసులు జారీ చేయాలని ఈడీ కోరింది. 

11:39 - August 10, 2018

వరంగల్‌ : జిల్లాలో ఐటీ శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు. అధికార పార్టీ నేతల రియల్‌ వెంచర్స్‌పై ఐటీ  అధికారులు దాడులు చేశారు. ఆదాయపన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలతో ఐటీ శాఖ దాడులకు దిగింది. హన్మకొండ హంటర్‌రోడ్డులోని విల్లాస్‌ నిర్మాణ లావాదేవీలపై ఐటీ అధికారులు అర్ధరాత్రి నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఎస్‌బీఐ, ఖాతాలను సీజ్‌ చేసిన ఐటీ అధికారులు.. విల్లా కొనుగోలుదారులకు నోటీసులు జారీ చేశారు.

 

11:35 - August 10, 2018

హైదరాబాద్ : రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడలో మల్కాజ్‌గిరి డీసీపీ ఉమా మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో సోదాలు జరిపారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 22 ద్విచక్రవాహనాలు, ఒక కారు, ఒక సిలిండర్, 10 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

సాగునీరు అడిగిన రైతులను నక్సలైట్లలా చూస్తున్నారు : జెట్పీసీలు

నిజామాబాద్ : పంటలు వేసిన రైతులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని వేడుకుంటున్న ఎస్సారెస్పీ పరిధిలోని రైతులను ప్రభుత్వం నక్సలైట్లలా చూస్తోందని ఆరోపించారు. సాగునీరు కోసం ఆందోళన చేస్తున్న రైతులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోందని ఆరోపించారు. వెంటనే రైతులకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా సాగునీటి కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే.. నీరు విడుదల చేయకపోగా ఆ ప్రాంత పరిధిలో పోలీసులు భారీగా మోహరించి 144 సెక్షన్ కూడా విధించిన విషయం తెలిసిందే.

11:29 - August 10, 2018

ఛత్తీస్ ఘడ్ : దంతేవాడలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. లారీ అసోసియేషన్ కార్యాలయంలో నిలిపిన లారీలకు నిప్పుపెట్టారు. 5 లారీలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు.

11:28 - August 10, 2018

హైదరాబాద్ : గత నాలుగేళ్లలో తెలంగాణలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. దేశంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయన్నది ముఖ్యం కాదని.. ఎంత ఉపాధి కల్పించామన్నదే ముఖ్యమని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ర్టాభివృద్ధి కోసం ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి పని చేస్తామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామని.. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్‌తో రాష్ర్టానికి పెట్టుబడులు తరలి వచ్చాయని తెలిపారు.  

 

కేసీఆర్ వైఖరికి నిరసనగా జెడ్పీటీసులు రాజీనామా..

నిజామాబాద్ : శ్రీ రామ సాగర్ ప్రాజక్ట్ రైతులపై కేసీఆర్ సర్కారు అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారు. ఎస్సారెస్పీ రైతులకు మద్దతుగా గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న బాల్కొండ జడ్పీటీసీ జోగు సంగీత, మెండోరా ఎంపీటీసీ మిట్టపల్లి రాజేశ్వర్ తాజాగా తమ పదవులకు రాజీనామా చేశారు. గురువారం స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వీరు కలెక్టర్ రామ్మోహన్ రావుకు రాజీనామా పత్రాలను అందజేశారు.

దేశంలో పచ్చదనం కోసం గ్రీన్ చాలెంజ్ : పుల్లెల గోపీచంద్

హైదరాబాద్ : బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రధాని మోదీకి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా పుల్లెల గోపిచంద్ మాట్లాడుతు.. దేశాన్ని పచ్చగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా తానో మొక్కను నాటినట్టు తెలిపారు. కాగా, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ ‌కు విశేష స్పందన లభిస్తోంది. ఛాలెంజ్‌కు నామినేట్ అయిన వారు మొక్కలు నాటుతూ మరో ముగ్గురికి సవాలు విసురుతున్నారు. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన గోపీచంద్ మొక్క నాటాడు. మరికొందరికి సవాలు విసిరాడు. 

11:26 - August 10, 2018

హైదరాబాద్ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆదివాసీలు ఆవేదన చెందారు.  
దేశవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవం 
దేశవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు సంప్రదాయ వేశధారణలో అలరించారు. ఆదివాసీల దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎంపీ సీతారాం నాయక్‌ ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పార్లమెంట్‌ను కోరినట్లు ఆయన వెల్లడించారు. 
మంచిర్యాలలో 
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీల దినోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఆదివాసీలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. 
నిర్మల్‌ లో
నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి సంప్రదాయ నృత్యాలు చేశారు. ఆదివాసీల సమస్యలు పట్టించకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. 
ఖమ్మంలో 
ఖమ్మంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ వేషధారణలో ఆదివాసీలు అలరించారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో ఆదివాసీలకు పురిటి కష్టాలు తప్పడంలేదు. వర్షం కురిస్తే మల్లన్నవాగు. కిన్నెరసాని వాగులు ఉధృతంగా ప్రవహించడంతో వాగులు దాటలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ స్త్రీల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంలో గుండాల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
పశ్చిమగోదావరి జిల్లాలో 
సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కోటరామచంద్రాపురంలో ఆదివాసీ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. అంతరించిపోతున్న ఆదివాసీ సంస్కృతీ, సాంప్రదాయాలను కాపాడుకోని భావితరాలకు అందివ్వాలని కోరుతూ ఆదివాసీ సాంప్రదాయ కొమ్ముబూర, డప్పు వాయిద్యాలతో ఆదివాసీసేన ఆధ్వర్యంలో వేలాదిమంది ఆదివాసీలు ప్రదర్శనగా తరలివచ్చారు.  
శ్రీకాకుళం జిల్లాలో
గిరిజనుల జీవన ప్రమాణాలు, ఆదాయ వనరులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీతం పేట ఏజెన్సీలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని ఆదివాసీ తల్లి విగ్రహానికి పూజలు చేసి ప్రారంభించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కాపాడుకునేందుకు ఆదివాసీ దినోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. 
 

 

ప్రధాని మోదీకి పుల్లె గ్రీన్ ఛాలెంజ్..

హైదరాబాద్ : బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రధాని మోదీకి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. హరితహారంలో భాగంగా మొక్కను నాటిన గోపీచంద్ ప్రధాని నరేంద్రమోదీ, క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, షూటర్ అభినవ్ బింద్రా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌లను నామినేట్ చేశాడు.

ఎక్సైజ్ ఎస్ఐ విజయ్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

చిత్తూరు : ఎక్సైజ్ ఎస్ఐ విజయ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వంచారు. విజయ్ కుమార్ కు చెందిన ఐదు నివాసాలలో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భారీగా బ్యాంక్ పాస్ బుక్కులు, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలులోని నాగాపురం చెక్ పోస్ట్ లో విజయ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. 

11:24 - August 10, 2018

హైదరాబాద్ : రాహుల్‌ పర్యటనకు.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాహుల్‌ను ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకొచ్చి.. తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి రగిలించే సన్నాహాలు చేస్తోంది. రాహుల్‌ రెండు రోజుల టూర్‌.. నిరుద్యోగ, మహిళ, ముస్లిం, సెటిలర్స్‌ ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా రాహుల్‌ టూర్‌ సాగనుంది.
ఈనెల 13, 14 తేదీల్లో రాహుల్‌ టూర్‌
ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. రాహుల్‌గాంధీ తొలిసారిగా తెలంగాణకు రానున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో రెండు రోజులూ.. రాహుల్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే పర్యటించనున్నారు. శంషాబాద్‌లో దిగింది మొదలు.. హస్తిన తిరుగుపయనమయ్యే వరకూ.. ఊపిరి సలపని రీతిలో రాహుల్‌ కార్యక్రమాల షెడ్యూల్‌ను టీపీసీసీ రూపొందించింది.     
హైదరాబాద్‌లో రెండురోజులూ రాహుల్‌ పర్యటన       
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఓ స్ట్రాటజీ మేరకే ... రాహుల్‌ను రెండురోజులూ గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే పర్యటింప చేస్తోందని పార్టీ వర్గాల విశ్లేషణ. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్‌లో.. కాంగ్రెస్‌ పార్టీకి అంత బలం లేదు. పైగా గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓటమి లగాయితు.. కాంగ్రెస్‌ కేడర్‌ నైరాశ్యంలో కూరుకుపోయింది. ఈ మధ్యనే అంజన్‌కుమార్‌ను సిటీ అధ్యక్షుడిగా నియమించాక.. పార్టీ కార్యక్రమాల్లో కాస్తంత దూకుడు కనిపిస్తోంది. ఇప్పుడు రాహుల్‌ను గ్రేటర్‌లో తిప్పితే.. పార్టీ శ్రేణుల్లో మరింత జోష్‌ వస్తుందని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. 
ఓట్ల వేటగానే రాహుల్‌ పర్యటన
రాహుల్‌ పర్యటనను.. టీపీసీసీ అచ్చంగా ఓట్లవేటగానే మలుస్తోంది. గ్రేటర్‌ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో అధికారం పక్కా అని హస్తంపార్టీ భావిస్తోంది. అందుకే.. ఇక్కడి మహిళలు, ముస్లింలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, పారిశ్రామిక వేత్తలతో రాహుల్‌ భేటీకి సన్నాహాలు చేస్తోంది. వివిధ వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ గతంలో చేసిన మేళ్లు.. ప్రస్తుత కేసీఆర్‌ సర్కారు నిర్లక్ష్యాలను రాహుల్‌ ద్వారా ఎత్తి చూపాలని టీపీసీసీ నిర్ణయించింది.
హైదరాబాద్‌ సెటిలర్స్‌పై కాంగ్రెస్‌ కన్ను
హైదరాబాద్‌లో సెటిలర్స్‌ సంఖ్య కూడా బాగా ఎక్కువే. వీరి మద్దతును కూడగడితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీగా లాభం చేకూరుతుందని హస్తం నేతలు నమ్ముతున్నారు. అందుకే శేరిలింగంపల్లి వేదికగా.. సెటిలర్స్‌కు రాహుల్‌ద్వారా భరోసా ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణలో వారి రక్షణకు తీసుకోనున్న చర్యలపై రాహుల్‌తో ప్రకటన చేయించాలని టీపీసీసీ నాయకత్వం భావిస్తోంది. అదేవిధంగా.. ముస్లింల రిజర్వేషన్‌ల అంశంపైనా.. కేసీఆర్‌, మోదీల వైఖరిని ఎండగడుతూ.. తమ మద్దతును స్పష్టం చేయాలని చూస్తున్నారు.
వ్యూహాత్మకంగానే రాహుల్‌ ఓయూ పర్యటన
రాహుల్‌ పర్యటనలో తెలంగాణ సెంటిమెంట్‌నూ రగిలించే ప్రయత్నాన్ని కాంగ్రెస్‌ నాయకత్వం చేస్తోంది. ఉద్యమానికి ఊపిరులు పోసిన ఉస్మానియా వర్సిటీలో రాహుల్‌ ప్లాన్‌ వెనుక ఉద్దేశం ఇదేనని చెబుతున్నారు. అంతేకాకుండా తెలంగాణలో ప్రస్తుత పరిణామాలపై.. కేసీఆర్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తూ.. విద్యార్థులు, యువతకు దగ్గర కావాలన్నది కాంగ్రెస్‌ వ్యూహంగా తెలుస్తోంది.  ఎవరైనా రాహుల్‌ టూర్‌ను అడ్డుకున్నా.. దాన్నీ రాజకీయంగా వినియోగించుకునేలా టీపీసీసీ నాయకత్వం ప్రణాళికతో ఉన్నట్లు చెబుతున్నారు. 
150 మంది పారిశ్రామిక వేత్తలతో రాహుల్‌ భేటీ 
రాహుల్‌ తొలిసారిగా 150 మంది స్థానిక పారిశ్రామిక వేత్తలతో ప్రత్యేకంగా భేటీ కానుండడం కూడా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. తమ ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకోవడం.. ఇతరుల ఓటు బ్యాంకును కొల్లగొట్టడం.. తద్వారా అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా రాహుల్‌ టూర్‌ను ప్లాన్‌ చేసిన కాంగ్రెస్‌ నాయకుల ఆశయం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. 

విజయవాడ టు సింగపూర్ కు విమాన సర్వీసులు..

విజయవాడ : విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులు నడపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఫలితాలు ఫలించాయి. ఏపీ వాసులు ఇప్పటి వరకు సింగపూర్ వెళ్లాలంటే హైదరాబాద్ వచ్చి వెళ్లాల్సి ఉండగా, ఇకపై విజయవాడ నుంచే నేరుగా సింగపూర్ వెళ్లే అవకాశం రానుంది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సింగపూర్‌కు విమానాలు నడిపేందుకు ముందుకొచ్చింది. ఇందుకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 27, లేదంటే వచ్చే నెల 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కచ్చితమైన తేదీని త్వరలో ప్రకటిస్తారు.

కుటుంబంపై 'కుల బహిష్కరణ'వేటు..

జగిత్యాల : మెట్పల్లి మండలం బండలింగాపూర్ లో ఒకే కటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులను కులపెద్దలు కుల బహిష్కరణ చేశారు. పొలం వద్ద జరిగిన తగాదాలతో వెంకటరెడ్డి అనే వ్యక్తి కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులను కులం నుండి బహిష్కరించారు. నెలరోజుల క్రితం కులం నుండి బహిష్కరించి రూ.1.5 లక్షలు జరిమానాను కులపెద్దలు విధించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని జిల్లా ఎస్పీ సునీల్ దంత్ ను కలిసేందుకు ఎస్పీ కార్యాలయానికి బాధిత కుటుంబీకులు చేరుకున్నారు. 

కాపులపాడ ఐటీ పార్క్ ను పరిశీలించిన మంత్రి లోకేశ్..

విశాఖపట్నం : కాపులపాడ ఐటీ పార్క్ ను మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. తొలిదశ ఐటీ కార్యకలాపాలకు అందుబాటులోకి రానున్న కాపులపాడలోని 100 ఎకరాల ఐటీ పార్క్ ను లోకేశ్ పరిశీలించారు. కాగా ఈ పార్క్ ను నాలుగు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఈ నాలుగు దశలు పూర్తయితే ఐటీ కార్యకలాపాలకు మరో 700ల ఎకరాలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్క కాపులపాడ ఐటీ పార్క్ లోనే సుమారు 5లక్షల మంది ఐటీ రంగంలో పనిచేసే అవకాశం వుంటుంది. 

గుట్కా ప్యాకెట్స్, 22 బైకులు స్వాధీనం..

మేడ్చల్ : కీసర మండటం బండ్లగూడలో మల్కాజ్ గిరి డీసీపీ మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ను నిర్వహించారు. 22 బైకులు, ఓ కారుని సీజ్ చేశారు. 10 గుట్కా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురుని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 

22 వాహనాలు సీజ్..29మంది అరెస్ట్..

హైదరాబాద్ : కూకట్ పల్లి జనతానగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 20 బైకులు, 2 ఆటోలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 29మంది అనుమానుతులను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించి విచారణ చేపట్టారు. 

అనంతవాసుదేవ ఆలయంలో అగ్నిప్రమాదం..

ఒడిశా : భువనేశ్వర్ లోని అనంతవాసుదేవ ఆలయంలో మంటలు చెలరేగటంతో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 వంట గదులు దగ్థం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 

మహాసంప్రోక్షణకు శ్రీకారం..భక్తుల దర్శనాలకు ఆంక్షలు..

తిరుమల : శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువుకు రేపు వైభవంగా అంకురార్పణ జరగనుండగా, భక్తులపై దర్శన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. రేపు రాత్రి విష్వక్సేనుల ఊరేగింపు తరువాత, ఆదివారం ఉదయం నుంచి మహా సంప్రోక్షణ ప్రారంభం కానుంది. తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి 45 మంది ఉద్ధండ పండితులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే యాగశాలలో ఇటుకలు, ఎర్రమట్టితో 28 హోమగుండాలు నిర్మించి, వాటిని గోమయంతో అలికారు. 21 హోమ వేదికలూ ఏర్పాటు అయ్యాయి. ఇక్కడి కరెంటు తీగలు, బల్బులు, సీసీ కెమెరాలను తొలగించి, వెలుతురు కోసం 1000 నెయ్యి దీపాలను ఏర్పాటు చేశారు.

అధికార పార్టీ నేతల రియల్ వెంచర్లపై ఐటీ దాడులు..

వరంగల్ : అధికార పార్టీ నేతల రియల్ ఎస్టేట్ వెంచర్లపై ఐటీ శాఖ ఆకస్మిక దాడులు చేపట్టింది. ఆదాయపు పన్ను ఎగవేస్తున్నారనే ఆరోపణలతో వున్న వెంచర్లపై ఐటీ శాఖ దాడులుచేట్టింది. ఈ దాడులలో హన్మకొండ హంటర్ రోడ్లులోని నిర్మాణ లావాదేవీలపై అర్థరాత్రి నుండి దాడులు కొనసాగుతున్నాయి. హెచ్ డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఎస్ బీఐ ఖాతులను ఐటీ అధికారులు సీజ్ చేశారు. అనంతం విల్లాలు కొనుగోలుదారులకు ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. రియల్ వెంచర్స్ డైరెక్టర్ల లాకర్లును కూడా సీజ్ చేశారు.

5 లారీలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు..

త్తీస్ గఢ్ : మావోలకు ఆవసంగా కొనసాగుతున్న దంతేవాడలో మరోసారి మావోయిస్టులు మరోసారి దుశ్చర్యలకు పాల్పడ్డారు. లారీ అసోసియేషన్ కార్యాలయం పార్క చేసిన 5 లారీలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు.

రాహుల్‌ పర్యటన తెలంగాణ సెంటిమెంట్..ఓయూలో ప్లాన్ ఇదేనా?..

హైదరాబాద్ : రాహుల్‌ పర్యటనలో తెలంగాణ సెంటిమెంట్‌నూ రగిలించే ప్రయత్నాన్ని కాంగ్రెస్‌ నాయకత్వం చేస్తోంది. ఉద్యమానికి ఊపిరులు పోసిన ఉస్మానియా వర్సిటీలో రాహుల్‌ ప్లాన్‌ వెనుక ఉద్దేశం ఇదేనని చెబుతున్నారు. అంతేకాకుండా తెలంగాణలో ప్రస్తుత పరిణామాలపై.. కేసీఆర్‌ సర్కార్‌ను టార్గెట్‌ చేస్తూ.. విద్యార్థులు, యువతకు దగ్గర కావాలన్నది కాంగ్రెస్‌ వ్యూహంగా తెలుస్తోంది. ఎవరైనా రాహుల్‌ టూర్‌ను అడ్డుకున్నా.. దాన్నీ రాజకీయంగా వినియోగించుకునేలా టీపీసీసీ నాయకత్వం ప్రణాళికతో ఉన్నట్లు చెబుతున్నారు. 

రాహుల్ తెలంగాణ పర్యటనలో బిజి బిజీ షెడ్యూల్..

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. రాహుల్‌గాంధీ తొలిసారిగా తెలంగాణకు రానున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో రెండు రోజులూ.. రాహుల్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే పర్యటించనున్నారు. శంషాబాద్‌లో దిగింది మొదలు.. హస్తిన తిరుగుపయనమయ్యే వరకూ.. ఊపిరి సలపని రీతిలో రాహుల్‌ కార్యక్రమాల షెడ్యూల్‌ను టీపీసీసీ రూపొందించింది. రాహుల్‌ పర్యటనకు.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాహుల్‌ను ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకొచ్చి.. తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి రగిలించే సన్నాహాలు చేస్తోంది. రాహుల్‌ రెండు రోజుల టూర్‌..

కరుణానిధి విగ్రహ ప్రతిష్ట..ఉద్రిక్తత..

తమిళనాడు : వేలూరులో కరుణానిధి మరణం అనంతరం ఓ అభిమాన నేత కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయించగా..విగ్రహం ప్రతిష్టించేందుకు అనుమతి లేదంటూ పోలీసులు దాన్ని తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. వేలూరు వినాయకపురంలో కుడియాత్తం ఉత్తర డీఎంకే ప్రతినిధి కృష్ణమూర్తి, కరుణ మరణం తరువాత రెండున్నర అడుగుల విగ్రహాన్ని, పార్టీ జెండాను ప్రతిష్ఠించారు. దీంతో విగ్రహం ప్రతిష్టించేందుకు అనుమతి లేదంటూ పోలీసులు దాన్ని తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. 

కేరళలో వర్షాలకు 18మంది మృతి..

కేరళ : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ కారణంగా వివిధ ప్రాంతాల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. ఒక్క ఇడుక్కీ ప్రాంతంలోనే కొండ చరియలు విరిగిపడి 10 మంది మృతి చెందినట్టు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. మలప్పురంలో ఐదుగురు, కన్నూర్‌లో ముగ్గురు, వయనాడ్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పాలక్కడ్‌, కోజికోడ్, వయనాడ్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గల్లంతయ్యారు.

టీడీపీ, వర్గీయులకు కారుతో ఢీకొట్టిన వైసీపీ..3గరు మృతి..

గుంటూరు : వినుకొండలో దారుణం జరిగింది. సిమెంటు రోడ్డు విషయంలో వైసీపీ,-టీడీపీ వర్గీయుల మధ్య మొదలైన ఘర్షణలో చివరికి టీడీపీ వర్గీయులుగా చెబుతున్న ముగ్గురు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెంలో టీడీపీ వర్గీయులు సిమెంటు రోడ్డు వేయడాన్ని అడ్డుకుంటున్న వైసీపీ వర్గీయులపై టీడీపీ వర్గం పోలీసులు ఫిర్యాదు చేసేందుకు గురువారం సాయంత్రం వెంకటకృష్ణ, సోమయ్య, మల్లికార్జున్‌‌లు ముగ్గూరు కలిసి ఒకే బైక్‌పై వినుకొండ బయలుదేరారు. విషయం తెలుసుకున్న వైసీపీ వర్గీయులు కారుతో వారిని వెంబడించారు.

నేడు కృష్ణా బోర్డు భేటీ

హైదరాబాద్ : నేడు కృష్ణా బోర్డు భేటీ కానుంది. 10 అంశాలతో ఎజెండా, నీటి కేటాయింపులపై చర్చించనున్నారు. మరో 3 అంశాలుగా చర్చించాలని తెలంగాణ అంటుంది.  

నేడు కృష్ణా బోర్డు భేటీ

హైదరాబాద్ : నేడు కృష్ణా బోర్డు భేటీ కానుంది. 10 అంశాలతో ఎజెండా, నీటి కేటాయింపులపై చర్చించనున్నారు. మరో 3 అంశాలుగా చర్చించాలని తెలంగాణ అంటుంది.  

నేడు కృష్ణా బోర్డు భేటీ

హైదరాబాద్ : నేడు కృష్ణా బోర్డు భేటీ కానుంది. 10 అంశాలతో ఎజెండా, నీటి కేటాయింపులపై చర్చించనున్నారు. మరో 3 అంశాలుగా చర్చించాలని తెలంగాణ అంటుంది.  

అధికార పార్టీ నేతల రియల్ వెంచర్స్ పై ఐటీ మెరుపు దాడులు

 వరంగల్ : అధికార పార్టీ నేతల రియల్ వెంచర్స్ పై ఐటీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఆదాయపన్ను ఎగవేస్తున్నారన్న ఆరోపణలతో దాడులు నిర్వహించారు.

08:47 - August 10, 2018

ఏపీలో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇదే ఏపీ రాజకీయాలపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు లక్ష్మీనారాయణ, టీడీపీ నేత సూర్యప్రకాశ్, వైసీపీ కిలారి రోశయ్య పాల్గొని, మాట్లాడారు. ఏపీలోని  విపక్షాల మధ్య ఐక్యత లోపించదన్నారు. రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంపై పోరాడాల్సింది పోయి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని తెలిపారు. అందరూ ఐక్యంగా హక్కుల సాధన కోసం కేంద్రంపై పోరాడాలని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:43 - August 10, 2018

తెలంగాణలో ఫీజురియింబర్స్‌మెంట్‌ కోసం విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. గత సంవత్సరంకు సంబంధించి 12 వందల కోట్లకు పైగా ఫీజురియింబర్స్‌మెంట్‌ పెండింగ్‌లో ఉందని.. ఇది విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు ఇదే అంశంపై ప్రయివేటు కాలేజీ యాజమాన్యాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం సంవత్సరానికి రెండు విడుతలుగా ఫీజురియింబర్స్‌మెంట్ విడుదల చేస్తామని చెబుతుంది. విద్యార్థి సంఘాల ఆందోళన ప్రభుత్వ వైఖరిపై ఇవాళ్టి జనపథంలో ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట రమేష్‌, పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రాము చర్చించారు. ఫీజురియింబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:39 - August 10, 2018

కేరళ : కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో 22 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. పలు రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగడంతో గేట్లను ఎత్తివేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది.
భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం 
కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. రాష్ట్రవ్యాప్తంగా వరదలు ముంచెత్తడంతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇడుక్కి రిజర్వాయర్‌లో నీటిమట్టం బాగా పెరిగిపోవడంతో గేట్లను ఎత్తివేశారు. 26 ఏళ్ల తర్వాత ఇడుక్కి డ్యామ్‌ గేట్లను తెరచినట్లు అధికారులు తెలిపారు. పెరియర్‌ నది ప్రమాదకరస్థాయిలో ప్రవహించడంతో ఇదమలయార్‌ డ్యామ్‌కు చెందిన నాలుగు గేట్లను తెరిచారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అప్రమత్తం
రిజర్వాయర్ల గేట్లు తెరవడంతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అప్రమత్తమయ్యారు. రన్‌వే దెబ్బతినే అవకాశం ఉండడంతో మధ్యాహ్నం నుంచి విమానాశ్రయంలోకి విమానాల రాకను నిలిపివేశారు. వర్షాల కారణంగా రైల్వే సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది.
కొండ చరియలు విరిగిపడి 22 మంది మృతి 
వర్షాలకు పలుచోట్ల కొండ చరియలు విరిగి పడడడంతో 22 మంది మృతి చెందారు. ఇడుక్కి జిల్లాలో 11 మంది, మలప్పురంలో ఐదుగురు, వాయనాద్‌లో ముగ్గురు, కన్నూరులో ఇద్దరు,  కోజికోడ్‌లో ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇడుక్కీలోని అడిమాలి పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. వాయనాద్‌, పలక్కడ్, కోజికోడ్‌ జిల్లాల్లో ఒక్కరు చొప్పున గల్లంతయ్యారు. అలప్పు, ఇడుక్కి, వాయినాద్‌, కొల్లాం, మల్లాపురం జిల్లాలను వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్మీ, నేవి, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. కొండ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
భారీ వర్షాలతో తీవ్రం నష్టం : సీఎం పినరయ్ విజయన్ 
కేరళలోని అనేక జిల్లాలలో భారీ వర్షాలు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తెలిపారు. వరద పరిస్థతిని అంచనా వేసేందుకు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. మరో రెండు రోజులు పాటు భారీనుంచి, అతి భారీ వర్షాలు కురవన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

08:30 - August 10, 2018

గుంటూరు : వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేసిన వైసీపీ నాయకులు వంచనపై గర్జన దీక్ష పేరుతో సభలు నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ పాలకులు అవినీతికి పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపించడాన్ని పుల్లారావు తప్పుపట్టారు. అవినీతిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలను వంచించింది వైసీపీయేనని మండిపడ్డారు. బీజేపీతో వైసీపీ నాయకులు అంటకాగుతున్నారని ఆరోపించారు.

08:15 - August 10, 2018

విశాఖ : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీల అమల్లో విఫలమైన బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు శపథం చేశారు. విభజన హామీలు అమలు చేసే వరకు ప్రధాని మోదీ నేత్వత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ధర్మపోరాటం ఆగదన్నారు. గిరిజనులందరికీ యాభై ఏళ్లకే పెన్షన్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి విధాన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా పాడేరులో జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దితోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు... గిరిజనులకు ప్రస్తుతం ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను 75 యూనిట్ల నుంచి వంద యూనిట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. 
పాడేరులో పర్యటించిన చంద్రబాబు 
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గంలో పర్యటించారు. చింతలవీధి పంచాయతీ అడారిమెట్టలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో గర్భిణిలకు శ్రీమంతాలు నిర్వహించి, చంటిపిల్లలకు అన్నప్రాసన చేశారు. అక్కడే అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. పాఠశాలలో డిజిటల్‌ తరగతులకు శ్రీకారం చుట్టారు. అడారిమెట్ట గ్రామ సభలో పెన్షన్లు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక వంటి పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 
ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు
పాడేరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లోనూ చంద్రబాబు పాల్గొన్నారు. ఆరువేల మందికిపైగా గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.... గిరిజనుల కోసం అన్నీ చేస్తున్న మంచి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. బీజేపీ మెడలు వంచి హక్కులు సాధించుకుంటామన్నారు. యాభై ఏళ్ల వయసు నిండిన గిరిజనులందరికీ పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. పాడేరు సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించిన కొందరు యువకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
రాష్ట్ర ప్రభుత్వ పండుగగా మోదుకొండమ్మ జాతర 
విశాఖ మన్యంలో గిరిజనులు జరుపుకునే మోదుకొండమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా చంద్రబాబు ప్రకటించారు. సభా వేదికపై గిరిజనులు బహుకరించిన సంప్రదాయ టోపీని ధరించారు.  ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులతో మంజూరు చేసిన ఇన్నోకార్లు, జీపులను లబ్దిదారులకు చంద్రబాబు పంపిణీ చేశారు. విలువిద్యలో ప్రతిభ కనబరచిన గిరిజన విద్యార్థులకు ఆర్చరీ పరికరాలు ఆందచేశారు. గిరిజన బాలికలతో కలిసి థింసా నృత్యం చేశారు. ఆ తర్వాత పాడేరు నుంచి అమరావతి బయలుదేరి వెళ్లారు.
 

 

08:13 - August 10, 2018

హైదరాబాద్ : ఇన్నాళ్లూ బీజేపీకి దూరంగా ఉన్నామని కలరింగ్‌ ఇచ్చిన గులాబీ పార్టీ.... ఇప్పుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగానే ఉన్నామన్న సంకేతాలు ఇస్తోంది. గతంలో జరిగిన విషయాలు ఎలా ఉన్నా.... తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కేంద్రంతో తమకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని గులాబీపార్టీ చెప్పకనే చెబుతోంది. రాజకీయంగా కూడా బీజేపీతో ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది.
బీజేపీకి అనుకూలంగా టీఆర్ ఎస్ 
కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్‌ దోస్తీ కడుతుందా అంటే... అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్రప్రయోజనాల కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఇప్పటికే కేసీఆర్‌ పలు సందర్భాల్లో సమర్ధించారు.  ఇప్పుడు రాజకీయంగా కూడా బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించినా... ఫ్రంట్‌ కార్యకలాపాలు పెద్దగా కనిపించలేదు. కానీ అదే స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి  కేసీఆర్‌ పరోక్షంగా మద్దతిస్తూ .. తమకు ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో మరింత ఇరకాటంలో పెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలో ఉన్న నేతకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతునిచ్చింది. ఎన్నికల్లో పాల్గొని ఆయనకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఓటేశారు.  అయితే ఇందుకు కొత్త కథ చెబుతోంది. బీజేపీ అభ్యర్థి బరిలో లేకపోవడంతోనే తాము మద్దతు ఇచ్చామన్న వాదనను అధికారపార్టీ నేతలు ముందుకు తీసుకొస్తున్నారు. ఎన్డీయే తరపున అభ్యర్థియే కదాని ప్రశ్నిస్తే మాత్రం వారి దగ్గర సమాధానం లేదు.
కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన టీఆర్‌ఎస్‌
ఒకవైపు బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలిపిన టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసింది.  అంతేకాదు... తెలంగాణలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ టూర్‌ను అడ్డుకునేందుకు గులాబీపార్టీ అనుబంధ విభాగాలు సిద్ధమవుతున్నాయి. రాహుల్‌ తెలంగాణ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించనున్నారు. అక్కడి విద్యార్థుల సమస్యలను తెలుసుకోనున్నారు. అయితే ఓయూలో రాహుల్‌ గాంధీని అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌వీ నేతలు హెచ్చరిస్తున్నారు. రాజకీయాలు చేసేందుకు యూనివర్సిటీలు వేదికలు కాబోవని టీఆర్‌ఎస్‌వి నేతలు అంటున్నారు.  శనివారం ఓయూలోని కొన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌వీ నిర్ణయించింది. మొత్తానికి  జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీతో  టీఆర్‌ఎస్‌ విభేదిస్తూనే... బీజేపీకి దగ్గరవుతుందన్న సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వరాదన్న యోచనలో ఉంది.

 

08:00 - August 10, 2018

హైదరాబాద్ : కంజర్ కెర్వా గ్యాంగ్ అనే ముఠా పేరు వినపడితే చాలు జనం గుండె జారిపోతోంది. ఈ ముఠా దోపిడికి తెగబడిందని తెలిస్తే చాలు పోలీసులు కేసు చేధించడాని చలా టైమ్‌ పడుతోంది. అందినంత దోచేయడం...అడ్డుపడితే ప్రాణాలు తీయడం ఈ గ్యాంగ్ కు వెన్నెతో పెట్టిన విద్య. ఎదురుతిరిగితే చాలు ముక్కలుగా నరికేస్తారు. అంతటి ఆరాచకం సృష్టిస్తారు ఈ ముఠా సభ్యులు. నరరూప రాక్షసులైన ఈ ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు.
నరరూపరక్షసుల కన్నా భయకరమైన ముఠా  
కంజర్ కెర్వా అనే ఈ గ్యాంగ్ పేరు పోలీసుల రికార్డులో పాపులర్. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉండే ఈ ముఠాకు సంకెళ్లు వేయాలంటే పోలీసులు ప్రాణాలకు తెగించి చేజ్ చేయాలి. పట్టుకోవాలని చూసినా లేదా ఎదురుతిరిగినా ఈ ముఠా ఆరాచకం నరరూపరక్షసుల కన్నా భయకరంగా ఉంటుంది. ఒక్కసారి నేరం చేయాలని ఫిక్స్ అయితే చాలు పగలు రాత్రి అన్న తేడా లేకుండా పనికానిస్తారు. ఒక్కసారి స్వగ్రామం నుండి దోపిడీలకు బయలు దేరితే పక్కా ఎనిమిది రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతారు.
8 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో ముఠా
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ముఠా మోస్ట్ వాంటెడ్ గా పోలీసు రికార్డుల్లో  ఉంది. ఈ ముఠాకి నాయుకుడు హైదర్ అలీ. మధ్యప్రదేశ్ లోని కేర్వా జాగీర్ అనే ప్రాంతంలో ఈ ముఠా ఉండేది. ఒకప్పుడు శివారు ప్రాంతాల్లోని గ్రామాలపై దాడిచేసి అందినంత దోచుపోయే ఈ ముఠా ఇప్పుడు కాస్తా రూటు మార్చింది. హైవేలపై దారికాచి బస్సులను ఆపి ప్రయాణికులను భయభ్రాంతులకు  గురి చేసి వారి వద్ద ఉన్న డబ్బులతో ఉడాయిస్తోంది. అలా 2008 నుండి దారిదోపిడిలు మొదలు పెట్టారు. 2015లో పూణె పోలీసులు ముఠాత నాయకుడు హైదర్ అలీపై రివార్డు ప్రకటించారు.
సైబరాబాద్‌లో పెరిగిన నేరాలు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో  ఈమధ్య నేరాల విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు దోపిడిలకు పాల్పడింది కంజర్ కెర్వా గ్యాంగ్ అని గుర్తించారు. వారిని పట్టుకునేందుకు మధ్యప్రదేశ్  బయలుదేరివెళ్లారు.  అక్కడి కి వెళ్లాక పోలీసులు సీన్ చూసి అవాక్కయ్యారు. దోచుకున్న సోమ్ముతో ఈ ముఠా దర్జాగా జీవితాలు గడుపుతోంది. ఖరీదైన కార్లు, బంగ్లాలు, రిసార్ట్స్, ఫౌంహౌస్ లతో పాటు ఏకంగా పాఠశాలలను నడుపుతోంది. పోలీసులు ఈ ముఠాలోని అయిదుగురు ప్రధాన నిందితులను అదుపులో తీసుకున్నారు. ఏ రాష్ట్ర పోలీసులు చేయని సాహసం తెలంగాణ పోలీసులు తో తొలిసారిగా కంజర్ కెర్వా నేరాగాళ్ల అటకట్టించడంతో ప్రశంసలు అందుకుంటున్నారు. తొలిసారి వీరిని అరెస్ట్ చేసి పదుల సంఖ్యల్లో ఉన్న కేసుల చిక్కుమూడి విప్పారు.

 

07:48 - August 10, 2018

హైదరాబాద్ : కేజీ టూ పీజీ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రైవేట్‌ యాజమాన్యాలు ప్రభుత్వం ముందుంచిన ప్రధానమైన నాలుగు డిమాండ్స్‌పైనా ఇరు పక్షాలు చర్చించాయి.  అయితే ఒక డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన వచ్చినా... మిగతావాటిపై ప్రభుత్వం దాటవేసే ధోరణి అవలంభించిందంటూ ప్రైవేట్‌ యాజమాన్యాలు మండిపడుతున్నాయి. అయితే భేటీలో పాల్గొన్న మంత్రులు మాత్రం సానుకూలంగా చర్చలు జరిగాయని చెబుతున్నారు.
ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
తెలంగాణలోని ప్రైవేట్‌ విద్యాసంస్థలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు నిర్వహించింది. ప్రైవేట్‌ విద్యాసంస్థల డిమాండ్స్‌పై వారితో చర్చలు జరిపింది. ప్రైవేట్‌ యాజమాన్యాలు ప్రభుత్వం ముందు పలు డిమాండ్స్‌ను ఉంచింది. ఈ డిమాండ్స్‌పై చర్చించిన ప్రభుత్వం అందులో కొన్ని పరిష్కరిస్తామని హామీనిచ్చింది. మరికొన్ని డిమాండ్స్‌పై దాటవేత ధోరణి అవలంభించింది. గతేడాదికి సంబంధించిన 12 వందల కోట్ల ఫీరు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలపై స్పష్టమైన హామీ రాలేదని ప్రైవేట్‌ యాజమాన్యాలు అంటున్నాయి. ఈ సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు ఫీజురీఎంబర్స్‌మెంట్‌ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు.
ప్రతి విద్యాంస్థకు ఫైర్‌సేఫ్టీ నిబంధనలు, ఎస్కేప్‌ రూట్‌ ఏర్పాటు 
ప్రతి విద్యాంస్థకు ఫైర్‌సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటించాలని, ఎస్కేప్‌ రూట్‌ ఏర్పాటు చేయాలని ప్రైవేట్‌ విద్యాసంస్థల ప్రతినిధులు సూచించారు. అయితే దీనిపై అధ్యయనం చేయిస్తున్నట్ట కడియం చెప్పారు. జూనియర్‌, డిగ్రీ కాలేజీలకు సెపరేట్‌గా నిధులను విడుదల చేయాలని ప్రైవేట్‌ యాజమాన్యాలు కోరగా... అందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని చర్చల్లో పాల్గొన్న ప్రైవేట్‌ విద్యాసంస్థల ప్రతినిధులు తెలిపారు. 
ప్రతి కళాశాల హాస్టల్‌కు అనుమతి తప్పనిసరి
ప్రతి కళాశాల హాస్టల్స్‌ కోసం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు డిగ్రీ ప్రవేశాలు దోస్త్‌ అడ్మిషన్స్‌కు మరో అవకాశం ఇవ్వనున్నట్టు తెలిపింది. ప్రాపర్టీ ట్యాక్ష్‌కు కొత్త స్లాబ్‌ను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం హామీనిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం మాటల వరకే మిగిలిపోతున్నాయని... అవి ఆచరణ రూపం దాల్చడం లేదని ప్రైవేట్‌ యాజమాన్యాలు అంటున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
 

 

07:30 - August 10, 2018

హైదరాబాద్ : స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నీచర్‌ దిగ్గజ సంస్థ ఐకియా... హైదరాబాద్‌లో తన స్టోర్‌ను ప్రారంభించింది. మన దేశంలో ఐకియాకు ఇదే మొదటి షోరూం. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ఈ స్టోర్‌ను ప్రారంభించారు. 
హైదరాబాద్‌ షోరూం కోసం ఐకియా భారీగా పెట్టుబడి 
హైదరాబాద్‌లో ఐకియా ఫర్నిచర్‌ స్టోర్‌ ప్రారంభమైంది. సైబర్‌ టవర్స్‌ సమీపంలోని మైండ్‌ స్పేస్‌ ఎదురుగా దీనిని ఏర్పాటు చేశారు. స్వీడన్‌కు చెందిన ఐకియా.. మన దేశంలో షోరూం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. మంత్రి కేటీఆర్‌ దీనిని ప్రారంభించారు. హైదరాబాద్‌ షోరూం కోసం ఐకియా భారీగా పెట్టుబడి పెట్టింది. వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఒకేసారి వెయ్యి మంది కూర్చుకునేందుకు వీలున్న రెస్టారెంట్‌ ఈ ఐకియా స్టోర్‌లో ప్రత్యేకత. దాదాపు 7,500 రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వెయ్యి రకాల ఉత్పత్తుల ధరలు 200 రూపాయలలోపే. దీనిలో 950 మంది పనిచేస్తున్నారు. ఐకియా విధానం ప్రకారం వీరిలో సగం మంది మహిళలు. పరోక్షంగా మరో 1500 మందికి ఉపాధి లభిస్తుంది. హైదరాబాద్‌ ఐకియా షోరూం తమకు ఎంతో ప్రతిష్ఠాత్మకమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 
2019 వేసవిలో ముంబైలో ఐకియా స్టోర్‌ 
హైదరాబాద్‌ తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ఐకియా ప్రణాళికలు రూపొందించింది. 2019 వేసవికి ముంబైలో షోరూం ప్రారంభించాలని నిర్ణయించింది. ఆ తర్వాత బెంగళూరు, గురుగావ్‌, అహ్మదాబాద్‌, పుణె, చెన్నై, కోల్‌కతా, సూరత్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 2025 నాటికి దేశంలోని 25 నగరాలకు విస్తరించాలని నిర్ణయించిన ఐకియా... ఆ తర్వాత మరో 15 నగరాల్లో విస్తరించేందుకు ఏర్పాటు చేస్తోంది. మూడేళ్లలో 20 కోట్ల మంది ఖాతాదారులను సొంతం చేసుకోవాలని ఐకియా లక్ష్యంగా పెట్టుకునింది. 

 

07:24 - August 10, 2018

హైదరాబాద్ : నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డును ప్రపంచ స్థాయి ఎక్స్ ప్రెస్స్ వేగా నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఔటర్‌ రింగ్‌ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఆయన ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు. వరల్డ్ క్లాస్ ఎక్స్ ప్రెస్స్ వేగా తీర్చిదిద్దే విధంగా డీపీఆర్ తయారు చేయాలంటూ అధికారులను కోరారు. అయితే దానికి సంబంధించి నిధుల మంజూరు విషయంలో తాను స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. 
 

 

07:18 - August 10, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలను పచ్చగా, పరిశుభ్రంగా ఉండడమే లక్ష్యంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇందు కోసం మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వ్యూహం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను సూచించారు.రాబోయే మూడు నెలల్లో గ్రామ పంచాయితీల సమగ్రాభివృద్ధికి కార్యచరణ రూపోందిచాలన్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయితీల్లో పని చేసే సిబ్బందికి, సానిటేషన్ సిబ్బందికి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో పాటు వివాహ, జనన, మరణ, ధృవీకరణ పత్రాలు జారీ చేయడంతో పాటు మరికొన్ని బాధ్యతలు  పంచాయితీలకు అప్పగించాలన్నారు. 

 

నేడు ఎల్బీనగర్ వద్ద ఫ్లైవోవర్ ప్రారంభం

హైదరాబాద్ : నేడు ఎల్బీనగర్ వద్ద ఫ్లైవోవర్ ప్రారంభం కానుంది. నాగోల్...ఎల్బీనగర్ రోడ్డులో ప్లైవోవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 

నేడు 108 ఉద్యోగులు ఆందోళన

హైదరాబాద్ : నేడు 108 ఉద్యోగులు ఆందోళన చేయనున్నారు. తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేయనున్నారు. 

నేడు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అల్పాహార విందు

ఢిల్లీ : నేడు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అల్పాహార విందు ఇవ్వనున్నారు. విందును బహిష్కరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

 

నేడు ప్రధాని మోడీతో టీఆర్ ఎస్ ఎంపీలు భేటీ

ఢిల్లీ : నేడు ప్రధాని మోడీతో టీఆర్ ఎస్ ఎంపీలు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధానితో టీఆర్ ఎస్ ఎంపీలు భేటీ కానున్నారు. రక్షణ శాఖ పరిధిలో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్స్ ను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని ఎంపీలు కోరనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పరిష్కారంపై చర్చించనున్నారు. 

 

Don't Miss