Activities calendar

11 August 2018

నెల్లూరు జిల్లాను కరవు జిల్లాగా గుర్తించేందుకు కృషి...

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌ కరవు నివారణ ప్రాజెక్టులో నెల్లూరు జిల్లాను కూడా చేర్చేందుకు కృషి చేస్తానని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేసి పంపాలని ఆయన అధికారులకు ఆదేశించారు. 

21:18 - August 11, 2018

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటనపై రగడ కొనసాగుతోంది. ఓయూ సభకు రాహుల్‌కు అనుమతించకపోవడంపై కాంగ్రెస్‌ నేతలు భగ్గుమంటున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని హస్తం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష హోదాలో ఈ నెల 13, 14 తేదీల్లో రంగారెడ్డి, హైదరాబాద్‌లో పర్యటించనున్న రాహుల్‌....ఉస్మానియా యూనివర్సిటీలో సదస్సుకు హాజరు కావాల్సి ఉంది. దీనికి రాహుల్‌కు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరు మార్చుకోవాలంటూ నిప్పులు చెరుగుతున్నారు.

తెలంగాణ రావడానికి కారణమైన ఓయూ క్యాంపస్‌ను ప్రభుత్వం నిషేధిత ప్రాంతంగా మార్చిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల కోరిక మేరకు రాహుల్‌ క్యాంపస్‌కు వెళ్లాలనుకున్నాడని.. విద్యార్థులను కలిస్తే తప్పేంటని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాహుల్‌ను ఓయూకు వెళ్లకుండా ఎల్లకాలం ప్రభుత్వం అడ్డుకోలేదని... ఇనుప కంచెలు తొలగించుకొని ఓయూకి వెళ్తామని హెచ్చరించారు.

అతిథులను గౌరవించే సంప్రదాయం తెలంగాణకు ఉందన్న సంగతి సీఎం కేసీఆర్‌ గుర్తుంచుకోవాలన్న వీహెచ్‌.. తెలంగాణను ఇచ్చిన రాహుల్‌ను అడ్డుకనోవడం ఏంటని ప్రశ్నించారు. క్యాంపస్‌లో కేసీఆర్‌ కాలు పెట్టనందుకే రాహుల్‌ను కూడా వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. రాహుల్‌ గాంధీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని అందుకే ఆయన టూర్‌ను అడ్డుకుంటున్నారన్నారు కాంగ్రెస్‌ నేత గీతారెడ్డి. కేసీఆర్‌ తీరు మార్చుకోవాలని సూచించారు. మొత్తానికి రాహుల్‌ ఓయూ పర్యటన తెలంగాణలో కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ల మధ్య సెగలు రాజేసింది. సర్కార్‌పై నిప్పులు చెరుగుతున్న హస్తం నేతలకు గులాబీ పార్టీ ఏవిధంగా కౌంటర్‌ ఇస్తుందో చూడాలి.  

21:16 - August 11, 2018

హైదరాబాద్ : పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూము ఇళ్ల కార్యక్రమము చరిత్ర సృష్టించబోతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని కొల్లూరులో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను కేటీఆర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అతిపెద్ద గృహ సముదాయంగా మారబోతుందనీ కేటీఆర్‌ అన్నారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఉన్నతాధికారులు డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. అలాగే నిర్మాణ సమయంలో కార్మికుల భద్రతకు సంబంధించిన అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూము ఇళ్ల కార్యక్రమం దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించబోతుందని కేటీఆర్‌ తెలిపారు. కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు అతిపెద్ద గృహ సముదాయంగా మారబోతుందన్నారు. దేశంలో ఇప్పటివరకు ప్రైవేట్ రంగం గానీ, ప్రభుత్వం గానీ ఇంత పెద్ద గృహ సముదాయాన్ని ఒకేచోట నిర్మించలేదని తెలిపారు. సకల సౌకర్యాలతో కొల్లూరులోని డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. కొల్లూరులో నిర్మిస్తున్న15,660 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఈ ప్రాంతమంతా పట్టణంగా మారుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రతీరోజు మూడుషిఫ్టుల్లో దాదాపు 3,500 మంది కార్మికులు 400 మంది సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. మంత్రి ఆకస్మిక తనిఖీపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పరిశీలనతో పనుల్లో మరింత వేగం పెరుగుతుందని.. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి అవుతాయని లబ్దిదారులు భావిస్తున్నారు. 

21:04 - August 11, 2018

విజయవాడ : ఈడీ కేసులో భారతి పేరు ఉందంటూ వచ్చిన వార్తలపై జగన్‌ లేఖ రాయడం మీద.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈడీ కేసులో భారతి పేరుంటే టీడీపీకి సంబంధం ఏంటిని ప్రశ్నిస్తున్నారు. అవినీతిలో కుటుంబ సభ్యులను భాగస్వాములను చేసిన జగన్‌... ఇప్పుడు పేరు వచ్చిందని గగ్గోలు పెడుతున్నారన్నారు. ఈడీ కేసులో భారతి పేరు ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాల్సిన జగన్‌.. దీన్ని కూడా సానుభూతి పొందేందుకే యత్నిస్తున్నారన్నారు. ఈడీ కేసులో వైఎస్‌ భారతి వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్‌ బహిరంగ లేఖ రాయడంపై ఏపీ టీడీపీ నేతలు స్పందించారు. అవినీతిలో భార్యను భాగస్వామిని చేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. సీబీఐ, ఈడీ కేసుల్లో మీ భార్య నిందితురాలిగా నమోదైతే దాని ద్వారా కూడా సానుభూతి పొందాలనుకుంటే.. ప్రజల్లో అభాసుపాలు కాక తప్పదన్నారు. నీ అవినీతికి ఆమెను బాధ్యురాలిని చేసినందుకు నిన్ను నీవే ప్రశ్నించుకోవాలన్నారు. నువ్వు చేసిన పాపాలే నిన్ను, నీ కుటుంబాన్ని వెంటపడి తరుముతున్నాయన్నారు కళా వెంకట్రావు.

ఈడీ కేసులో భారతి పేరు రావడానికి టీడీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు కళా వెంకట్రావు. నీ భార్యకు ఈ పరిస్థితి వచ్చినందుకు నిన్ను నువ్వే ప్రశ్నించుకోకుండా.. సీబీఐ, ఈడీనీ, కోర్టులను ప్రశ్నిస్తే లాభమేంటని అన్నారు. వేల కోట్లు అవినీతికి పాల్పడిన నీవు... దర్యాప్తు సంస్థలను, వ్యవస్థలను ఎలా ప్రశ్నిస్తున్నావన్నారు. కాంగ్రెస్‌తో లాలూచీ పడి బెయిల్‌ తెచ్చుకున్నది వాస్తవం కాదా అని కళావెంకట్రావు ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ప్రకారం ఏడాదిలో విచారణ పూర్తి కావాల్సిన కేసులు... బీజేపీతో లాలూచీ వల్ల నాలుగేళ్లయినా పూర్తి కాకపోవడం నిజం కాదా ? అని ప్రశ్నించారు. కేంద్రం ద్వారా నీ కేసులను మాఫీ చేయించుకునేందుకే... నీ కేసులో ఎ-2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా చేయించుకోలేదా ? అని ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఊడిగం చేస్తూ లాలూచీ పడడం నీ నైజం కాదా అని జగన్‌ను ప్రశ్నించారు కళా. అక్రమంగా సంపాదించిన 43 వేల కోట్ల రూపాయలు పేదప్రజలకు పంచి.. భారతి కేసుల నుండి విముక్తి చేసేందుకు ప్రయత్నించకుండా అధికారులు, కోర్టులు, పత్రికలు, టీడీపీపై నిందలు వేస్తే సానుభూతి రాదని కళా వెంకట్రావు అన్నారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టీడీపీ పోరాటం చేస్తుంటే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారన్నారు మంత్రి దేవినేని. గతంలో కాంగ్రెస్‌తో చేసుకున్న ఒప్పందం వల్లే.. అప్పుడు బయటపడని పాపాలన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే.. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు దేవినేని.

ఇక ఈడీ కేసులో జగన్‌ వాదన విచిత్రంగా ఉందన్నారు మంత్రి యనమల. జగన్‌ లేఖ ద్వారా అవినీతిలో కుటుంబసభ్యులకు ప్రమేయమున్నట్లు స్పష్టమైందన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలకు టీడీపీకి సంబంధం ఏంటని యనమల ప్రశ్నించారు. మొత్తానికి జగన్‌ అవినీతిపై మరోసారి టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ఈడీ కేసులో భారతి పేరు ఎందుకు వచ్చిందో చూసుకోకుండా టీడీపీ, సీబీఐ, ఈడీ, కోర్టులపై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే... జగన్‌పై టీడీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

20:40 - August 11, 2018
20:11 - August 11, 2018

ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెల్గుదేశం ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం బెట్టుకోని ఉన్నరట.. నిన్న ఫ్యాను పార్టీ జగనాలు సారు జనాలకు బహిరంగ ఉత్తరం రాశిండు..మంత్రి కేటీఆర్కు సుక్కలు జూపెడ్తున్నరుగదా జనం.. క్క సీసీ కెమేరా ఉంటే.. ఐదుగురు కానిస్టేబుళ్లతోని సమానం అంట మన నీళ్ల మంత్రి హరీషు రావుగారు అంటున్నడు..పాపం గుడులు గోపురాల పొంటి అయ్యగార్లు భక్తులకు శఠగోపం బెడ్తుంటే.. అయ్యగార్లకే శఠగోపం బెట్టిండు ముఖ్యమంత్రి కేసీఆర్..ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదే మా తాగువోతులు.. ఆస్తి అనేది జీవితంల భాగంగని.. జీవితమే ఆస్తిగాదు గదా..? మన్సులకే అన్ని పట్టింపులు లోకంల బత్కే జంతులకు ఏ పట్టింపు ఉండది.. గీ గరం గరం ముచ్చట్ల కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:01 - August 11, 2018

నల్గొండ : జిల్లాలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంజలూరు జాతీయ రహదారిపై డివైడర్ ను కారు ఢీకొంది. ఇద్దరు మృతి చెందగా కారులో డ్రైవర్ ఇరుక్కపోయాడు. మృతుల్లో కరీంనగర్ కు చెందిన ఎస్ఐ శ్రీరాములున్నారు. ఇరుక్కున్న డ్రైవర్ ను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

19:55 - August 11, 2018
19:52 - August 11, 2018

'మారుతి' స‌మ‌ర్పణ‌లో శ్రీ శైలేంద్ర ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై 'ప్రభాక‌ర్.పి' ద‌ర్శక‌త్వంలో 'బ్రాండ్ బాబు' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ఎస్‌.శైలేంద్రబాబు నిర్మించారు. డైరెక్టర్ 'మారుతి' కథ అందించారు. ఈ మూవీలో సుమంత్ శైలేంద్ర‌, ఈషా రెబ్బా, పూజిత వ‌న్నోడ హీరో హీరోయిన్లుగా నటించారు. సినిమా విడుదలైన సందర్భంగ టెన్ టివి 'ప్రభాకర్ పి'తో ముచ్చటించింది. ఆయన చిత్ర విశేషాలతో మరిన్ని ముచ్చట్లు తెలియచేశారు. ఆయన ఎలాంటి విశేషాలు తెలియచేశారో వీడియో క్లిక్ చేయండి. 

తిరుమలలో అంకురార్పణ...

చిత్తూరు : తిరుమలలో వైభవంగా అంకురార్పణ ప్రారంభమైంది. ఆలయ మాఢ వీధుల్లో స్వామి వారు విహరిస్తున్నారు. మహా సంప్రోక్షణ కార్యక్రమం ఆదివారం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు రోజు అంకురార్పణ జరుపుతున్నారు. 

సికింద్రాబాద్ లో పోలీసుల తనిఖీలు...

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ తనిఖీలు జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ నేపథ్యంలో ముందస్తు తనిఖీలు చేస్తున్నారు. 

నగరంలో ఎరుకుల భవన్ - కేసీఆర్...

హైదరాబాద్ : ఎరుకల కులస్థుల సామాజిక, విద్యా ప్రగతికి దోహదపడే విధంగా నగరంలో భవనం నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. దీనికి అవసరమైన స్థలం కేటాయించడంతో పాటు నిర్మాణానికి అవసరమయ్యే ఖర్చు కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు.

పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రయోగం...

ఢిల్లీ : అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) సిద్ధం చేసిన 'పార్కర్ సోలార్ ప్రోబ్' రోబోటిక్ వ్యోమనౌక ప్రయోగం వాయిదా పడింది. శనివారం తెల్లవారుజామున 3.53 గంటలకు ప్రారంభించాలని నాసా నిర్ణయించింది. అయితే, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ ప్రయోగాన్ని ఆదివారం ఉదయం 4.28 గంటలకు ప్రయోగిస్తామని నాసా వెల్లడించింది. 

19:28 - August 11, 2018

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా లెక్కకు మించి వెంచర్లను పూర్తి చేసుకుని ఎందరో కష్టమర్ల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న సంస్థ సుఖీభవ ప్రాపర్టీస్‌. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా హైదరాబాద్-వరంగల్‌లో కొత్త వెంచర్లతో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వనమాలి వెంచర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సుఖీభవ ప్రాపర్టీస్‌ సంస్థ CMD... రియల్ ఎస్టేట్‌ రంగంలో 29 సంవత్సరాల అనుభవం ఉన్న గురు రాజు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:22 - August 11, 2018

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే మహాసంప్రోక్షణ కార్యక్రమం రాత్రి అంకురార్పణతో ప్రారంభంకానుంది. ఈ వైదిక కార్యక్రమానికి అంతరాయం కలగకుండా టీటీడీ భక్తుల దర్శనాలను పరిమితం చేసింది. దీంతో తిరుమల, తిరుపతి పరిసరాలు బోసిపోయాయి. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే అలిపిరి తనిఖీ కేంద్రం పూర్తిగా ఖాళీ అయింది. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:20 - August 11, 2018

విజయనగరం : జిల్లాకు ప్రభుత్వ వైద్య కాలేజీని మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షకు వామపక్షాలు, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ దీక్షకు హాజరై తన సంఘీభావం ప్రకటించారు. ఈ విషయంపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:18 - August 11, 2018

విజయవాడ : విభజన హామీలు..ప్రత్యేక హోదా..తదితర సమస్యలపై ఏపీ ప్రభుత్వం పోరాటం చేస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ రాళ్లేస్తున్నారని ఏపీ మంత్రి దేవినేని విమర్శించారు. వైఎస్ భారతి పేరును ఛార్జీషీట్ లో నమోదు చేయడంపై జగన్ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అందులో ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా శనివారం మంత్రి దేవినేని ఓ కార్యక్రమంలో ఈ అంశంపై మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతోందని..ఈ ప్రయత్నంలో టిడిపి, ప్రభుత్వంపై రాళ్లు వేయడం సబబు కాదన్నారు. ఎల్లో పత్రికలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంగ్లపత్రికల్లో జగన్ అవినీతి బయటపడుతోందని, ఇంకా రెండు సీబీఐ నివేదికలు బయటకు రాకుండా ప్రయత్నించారని ఆరోపించారు. ఈ రోజు జగన్ చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయని, మహిళా ఆఫీసర్లు..గోల్డ్ మెడలిస్టులు కోర్టు బోనులెక్కి..జైలుకెళ్లి నానా అవమానాలు పడ్డారని తెలిపారు. అధికార దాహంతో లక్ష కోట్ల దోపిడితో కేసుల్లో ఇరుక్కున్నారని ఆరోపించారు. 

19:17 - August 11, 2018

హైదరాబాద్ : ఓయూ ఏమైన్నా నిషేధిత ప్రాంతమా ? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ఓయూలో రాహుల్ పర్యటనకు ఓయూ ఉన్నతాధికారులు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీనిపై శనివారం టి.కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. రాహుల్ సభకు అనుమతి నిరాకరించడం సబబు కాదని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కంచెలు తొలగించుకుని వెళుతామన్నారు. కార్మిక, ఉద్యోగస్తులు, విద్యుత్ శాఖ కార్మికులు..ఇలా ప్రతొక్కరూ కలిసి రావాలని మధు యాష్కి పిలుపునిచ్చారు. రాహుల్ తీసుకుంటన్న చర్యలను విజయవంతం చేయాలని కోరారు. భయం మూలంగా రానీవ్వడం లేదా ? అని గీతారెడ్డి పేర్కొన్నారు. గతంలో రాహుల్ ఓయూకు వెళ్లలేదా అని గుర్తు చేశారు. ఓయూ ఏమన్నా నిషేధిత ప్రాంతమా అని నిలదీశారు. 

19:16 - August 11, 2018

 

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కు లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీడీ అకౌంట్స్ కుంభకోణం జరిగిందని జీవీఎల్ లేఖలో పేర్కొన్నారు. బీహార్ లో దాణా కుంభకోణం కంటే పెద్ద కుంభకోణంగా తలపిస్తోందని, ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవడంతో నిందితులకు భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం 58,539 పీడీ అకౌంట్లు తెరిచిందని, రూ. 53,038 కోట్ల ప్రజాధనం పీడీ అకౌంట్స్ లో జమ చేశారని లేఖలో తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ ప్రభుత్వం పీడీ అకౌంట్లు తెరిచిందని కాగ్ నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు. పీడీ అకౌంట్స్ లో భారీగా నగదు జమ చేయడంపై సీబీఐ విచారణ జరిపించాలని జీవీఎల్ లేఖలో డిమాండ్ చేశారు. జీవీఎల్ చేస్తున్న ఆరోపణలను ఏపీ మంత్రులు కొట్టిపారేస్తున్నారు. జీవీఎల్ చేస్తున్న ఆరోపణలు నిజం కాదని..బహిరంగ చర్చకు సిద్ధమని వారు పేర్కొంటున్నట్లు సమాచారం. మరి గవర్నర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

19:14 - August 11, 2018

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్ చీఫ్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానమంత్రిగా ఆగస్టు 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 14న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా 18కి వాయిదా పడింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆహ్వానితుల జాబితాలో కొంత మార్పు చేశారు. భారత్‌కు చెందిన మాజీ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌, సునీల్‌ గవాస్కర్, నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూలకు మాత్రమే ఇమ్రాన్‌ తరపున ఆహ్వానం అందింది. పాకిస్తాన్‌కు కాబోయే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను భారత్‌ హైకమిషనర్‌ అజయ్‌ బిసారియా ఆయన ఇంట్లో కలిశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వీరివురు చర్చించారు.

19:09 - August 11, 2018

ఉత్తరప్రదేశ్‌ : నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లై ఓవర్‌ కుప్పకూలిపోయింది. బస్తీ జిల్లాలో శనివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడే పని చేస్తున్న ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పై వంతెనకు ఆసరాగా ఉండే ఐరన్‌ బీమ్‌లు కుంగిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గత రెండు వారాల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ వంతెన నిర్మాణం దాదాపు 60 శాతం పూర్తయ్యింది. 

19:08 - August 11, 2018

విశాఖపట్టణం : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికారణంగా 24గంటల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈనెల 13న వాయువ్య బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. సముద్రానికి కోస్తాంధ్ర సమీపంలో ఉండడంతో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశ మంతా మేఘామృతమై పోయింది. 

19:07 - August 11, 2018

నల్గొండ : ప్రేమ వివాహం చేసుకున్న అక్క ఎలా ఉంది ? క్షేమంగా ఉందా ? ఉంటే ఎలా ఉంది ? అని 9 ఏళ్లుగా ఓ తమ్ముడు చేసిన శోధన చివరకు విషాదంగా ముగిసింది. ఆ అక్కను ప్రేమించిన వ్యక్తి హన్మంతు హతమొందించాడని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తీవ్ర కలకలం రేగింది. సుమారు 12 ఏళ్ల క్రితం ప్రియాంక ప్రేమ వివాహం చేసుకుంది. కానీ సోదరుడు ఉపేందర్ ఆమె ఆచూకీ కోసం కొనుక్కొనే ప్రయత్నం చేశాడు. 9 ఏళ్ల తరువాత ఆమె నివాసం ఉంటున్న ఆచూకీ లభించింది. కానీ ఉపేందర్ జరిపిన విచారణలో ప్రియాంకను ప్రేమించిన వ్యక్తి హన్మంతు అంతమొందించాడని గుర్తించారు.

ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీనితో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఉపేందర్ చెప్పిన మర్రిగూడ మండలం వెంకయ్యపల్లిలో పాడు పడిన బావిలో ప్రియాంక శవ ఆనవాళ్ల కోసం తవ్వకాలు జరిపారు. శనివారం సాయంత్రం కొన్ని ఆనవాళ్లు బయటపడ్డాయి. పుర్రెతో పాటు ఎముకలను పోలీసులు గుర్తించారు. అవి ప్రియాంకవేనని పోలీసులు భావిస్తున్నారు. వీటిని డీఎన్ఏ కు టెస్టును పంపించిన తరువాత చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొంటున్నారు. 

19:05 - August 11, 2018

హైదరాబాద్ : మాసబ్ ట్యాంక్ లోని ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వెబ్ కౌన్సెలింగ్ ను నిలిపివేయాలని నినాదాలు చేశారు. దీనితో కౌన్సెలింగ్ రసాభాసగా మారింది. ఫైన్ ఆర్ట్స్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంలో అవకతవకలు జరిగాయని, మరోసారి అర్హత పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు నినదించారు. ఫైన్ ఆర్ట్స్ వెబ్ కౌన్సెలింగ్ వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులతో టెన్ టివి ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

19:03 - August 11, 2018

కేరళ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో 29 మంది మృతి చెందారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పినరయి విజయన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం విజయన్ కు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లు నిండు కుండలా తొణకిసిలాడుతున్నాయి. ఇడుక్కి డ్యామ్ లో మొత్తం ఐదు గేట్లను తెరిచి కిందకు వదలుతున్నారు. వరదల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, వాయుసేన బృందాలు రంగంలోకి దిగాయి. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ నుండి ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను కాలికట్ కు పంపారు. మున్నార్ లోని ఓ రిసార్ట్స్ లో చిక్కుకున్న 54 మంది పర్యాటకులను ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందం రక్షించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ పర్యటించనున్నారు. 

గవర్నర్ కు బీజీపీ ఎంపీ జీవీఎల్ లేఖ..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు బీజేపీ ఎంసీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు. ఏపీలో పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ జరిపించాలని జీవీఎల్ లేఖలో పేర్కొన్నారు. పీడీ అకౌంట్ల నుండి నగదు ఉపసంహరణలో అక్రమాలు జరిగాయని గవర్నర్ కు జీవిఎల్ ఫిర్యాదు చేశారు. 

విదేశీ మెడికల్ సీట్ల పేరుతో మోసాలు..వ్యక్తి అరెస్ట్..

హైదరాబాద్ : విదేశాల్లో మెడికల్ సీట్లు ఇప్పిస్తామని విద్యార్థులను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్ధుల వద్దనుండి రూ.కోట్లు వసూలు చేసిన మురళీకిషన్ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మురళీకిషన్ రెడ్డి చిత్తూరు జిల్లా వి.కోట మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మురళీకిషన్ దిల్ సుఖ్ నగర్ లో ఎల్ జీజీఎల్ మల్టీ సర్వీస్ పేరుతో ఓ సంస్థను నిర్వహించి ఫిలిప్పీన్స్ లోని సీడీయూ యూనివర్శిటీలో మెడికల్ విద్యార్ధుల వద్ద కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్నాడు.

కేసులను తప్పించుకునేందుకు జగన్ ఊసరవెల్లి రాజకీయాలు : దేవినేని

విజయవాడ : చట్టం తన పని తాను చేసుకుంటుంటే..జగన్ సీఎం చంద్రబాబుపై అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు మండిపడ్డారు. జగన్, కుటుంబ సభ్యులపై..కేసు నమోదు చేసి జగన్ జైలుకెళ్లింది నిజంగా కాదా? అని ప్రశ్నించారు. కేసుల నుండి బైటపడేందుకే జగన్ బీజేపీతో లాలూచి పడి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ అవినీతికి పాల్పడటమే కాక..వ్యవస్థలను తప్పుపడుతు..అధికారులను కూడా భయపెడుతున్నారన్నారు. రూ.43వేల కోట్ల అవినీతి కేసుల్లో జగన్ ఏ1 నిందితుడిగా వుండటం నిజంగాకాదా? అని మంత్రి దేవినేని ప్రశ్నించారు. 

అక్క కోసం తమ్ముడు గాలింపు..బైటపడ్డ హత్య కేసు..

నల్లగొండ : మర్రిగూడ మండలం వెంకయ్యపల్లిలో అక్క ఆచూకీ కోసం ఓ తమ్ముడి చేసిన ప్రయత్నంలో ఓ వివాహిత హత్య కేసు వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంతో తన సోదరి ప్రియాంక కనిపించకుండా పోవటంతో అక్క ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించిన తమ్ముడు యత్నించటంతో వివాహిత హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ప్రియాంక తమ్ముడు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బావ హనుమంతును విచారించారు. దీంతో అసలు విషయం ఒప్పుకున్న హనుమంతు భార్యను హత్య చేసి మృతదేహాన్ని భర్త హనుమంతు పాడుపడ్డ బావిలో పడేసినట్లుగా తెలిపాడు.

ఇంటి ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని జగన్ అవినీతి : మంత్రి అయ్యన్న

అమరావతి : ఇంటి ఆడవారిని అడ్డం పెట్టుకుని జగన్ భారీ అవినీతికి పాల్పడ్డారని..తన అవినీతి దాహంతో జగన్ ఇంటి ఆడవారినికూడా వీధిలోకి లాగారని జగన్ పై మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. సొంత కుటుంబంలోని ఆడవాళ్లను రోడ్డు పైకి లాగిన జగన్... దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఆరోపించడం తగదని అన్నారు. తల్లి, చెల్లి, భార్యను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో విజయమ్మ ఓడిపోవడానికి జగనే కారణమని అన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన చెల్లెలు షర్మిల పాదయాత్ర చేశారని... ఇప్పడు ఆమె కనిపించకుండా పోవడానికి కూడా జగనే కారణమని తెలిపారు.

దీదీని కూకటివేళ్లతో పెకలించేస్తాం : అమిత్ షా

పశ్చిమబెంగాల్ : సీఎం మమతాబెనర్జీని కూకటివేళ్లతో పెకిలిసంచేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కోల్ కత్తా పర్యటనను అమిత్ షా చేపట్టారు. ఈ నేపథ్యంలో కోల్ కతాలో జరిగిన భారీ బహిరంగసభలో ప్రసంగిస్తూ ..అసోంలో చేపట్టిన జాతీయ పౌర రిజిస్టర్ ను మమత వ్యతిరేకిస్తున్న అంశంపై మాట్లాడుతూ, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటున్నవారే మమత ఓట్ బ్యాంక్ అని విమర్శించారు. ఎన్నార్సీని అడ్డుకోవడానికి మమత యత్నిస్తున్నారని... కానీ, దేశంలో అక్రమంగా ఉంటున్నవారిని తరిమివేసే ఒక ప్రక్రియే ఎన్నార్సీ అని చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో ఎస్సై, వైద్యాధికారి..

సూర్యాపేట : చివ్వెంల మండలం గుంజలూరు వద్ద..అదుపు తప్పిన ఓ కారు డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతులు కరీంగనగర్ కు చ ఎందిన ఎస్సై శ్రీరాములు, పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి భిక్షపతిలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ స్టీరింగ్ వద్దనే ఇరుక్కుపోయాడు..డ్రైవర్ ను బైటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా యత్నించి ఎట్టకేలకు ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

9క్రితం హత్య, నిందుతుడు అరెస్ట్..

నల్లగొండ : మర్రిగూడ వివాహిత హత్య కేసులో..నిందితుడు హనుమంతును అరెస్ట్ చేశామని 10టీవీతో ఎస్పీ రంగనాథ్ తెలిపారు. హన్మంతు తన భార్యను చంపినట్లుగా అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. ఈ హత్య విషయంలో గ్రామస్తుల వాంగ్ములాన్ని కూడా రికార్డు చేశామన్నారు. హత్య జరిగి తొమ్మిదేళ్లు కావటంతో హత్యకు సంబంధించిన ఆచూకీ కోసం యత్నిస్తున్నామని ఎస్పీ రంగ్ నాథ్ 10టీవీకి తెలిపారు.  

భక్తులు లేక వెలవెలబోతున్న తిరుమల..

తిరుమల : శ్రీవారి దేవాలయం బాలలయ మహాసంప్రోక్షణ సందర్భంగా వున్న ఆంక్షలతో తిరుమల వీధులు భక్తులు లేక వెలవెలబోతోంది. టీడీపీ ప్రకటనతో రానున్న 5 రోజుల పాటు కూడా భక్తులు పరిమిత సంఖ్యలోనే శ్రీవారి దర్శనానికి అనుమతి వుంటుందని పాలకులు ఇప్పటికే ప్రటించారు. దీంతో భక్తుల తాకిడి లేక తిరుమల వీధులు బోసిపోయాయి. అలిపిరి వద్ద తనిఖీల కేంద్రం నిర్మానుష్యంగా వుంది. 

పురిటి నొప్పులతో గర్భిణీ అవస్థలు..

ఖమ్మం : భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంత వాసులు నానా అగచాట్లకు గురవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లాలోని గుండాల మండలం నాగరంలో రోడ్డుపై ఏడు మెలికల వాగు పొంగి పొరలుతోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో పురిటి నొప్పులతో అవస్థ పడుతున్న ఓ గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు నానా అగచాట్లు పడ్డారు. 108 వాహనానికి ఫోన్ చేయగా వాగు వరకూ వచ్చి అంతకుమించి వెళ్లేందుకు వీలు లేక వాగువద్దనే 108 వాహనం నిలిచిపోయింది. దీంతో 108 వాహన సిబ్బంది..స్థానికుల సహాయంతో చేతులపై గర్భిణిని మోసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. 

అవినీతికి పాల్పడితే ఎవరైనా సరై జైలుకు వెళ్లాల్సిందే : మంత్రి నక్కా

గుంటూరు : అవినీతికి పాల్పడితే ఎవరైనా సరై జైలుకు వెళ్లాల్సిందేనని.. జగన్ అవినీతి మహిళా ఐఏఎస్ అధికారులు బలైపోయారనీ మంత్రి నక్కా అనందబాబు పేర్కొన్నారు...మహిళలు అవినీతి కేసులను ఎదుర్కోవాల్సిరావటం బాధాకరమని..దీనికి కారణం తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ చేసిన అరాచకం వల్లనేనన్నారు. జగన్ అవినీతి కంపెనీల్లో డైరెక్టర్ గా వున్నందునే ఆయన భార్య భారతి పేరును ఈడీ అఫిడవిట్ లో దాఖలు చేసిందన్నారు. త్వరలో భారతిని ఈడీ విచారిస్తుందని మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. జగన్ బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

బీజేపీ .బీ టీమ్ గా టీఆర్ఎస్ : మధుయాష్కీ

హైదరాబాద్ : 10శాతం కమీషన్ తో 30 వాటాలతో కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతోందని ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో నిర్భంధాలు కొనసాగుతున్నాయనీ..నీళ్లు అడిగితే ఎస్సార్ ఎస్పీ రైతులపై కేసులు పెడుతున్నారని మధుయాష్కీ విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు తరిమికొట్టేరోజు దగ్గరలోనే రానుందన్నారు. బీజేపీ .బీ టీమ్ గా టీఆర్ఎస్ మారిందని మధుయాష్కీ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా దళితులు, ముస్లింలపై దాడులు జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు స్పందించటంలేదనీ..కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటంలేదని మధుయాష్కీ కేసీఆర్ ను ప్రశ్నించారు. 

రాష్ట్రం ఇచ్చిన రాహుల్ ఇచ్చే గౌరవం ఇదేనా : భట్టి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తరువాత ప్రజల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయని తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించేందుకు వస్తున్నారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఓయూలో రాహుల్ గాంధీ సదస్సుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించటం దారుణమని భట్టి విక్రకమార్క పేర్కొన్నారు. విద్యార్ధుల కోరిక మేరకు రాహుల్ సదస్సుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని భట్టి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. తెలంగాణను ఇచ్చింది 4కోట్ల జనం కోసం..

సీఎ చంద్రబాబు దుర్గగుడి సూర్యలత లేఖ ..

విజయవాడ : సీఎం చంద్రబాబుకు దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు సూర్యలత లేఖ రాశారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమనీ..సీసీ పుటేజ్ పరిశీలించకుండాతనే తనపై చర్యలు ఎలా తీసుకుంటారని..వ్యక్తిగత విచారణతో తనను దోషిగా ఎలా నిర్ధారిస్తారని సూర్యలత వాపోతు సూర్యలత చంద్రబాబు లేఖలో ప్రశ్నించారు. దుర్గగుడి చైర్మన్ గౌరంగబాబు, సభ్యుడు శంకర్ బాబు, శంకర్ శాండిల్య దుర్గమ్మ చీర మాయం అయిన విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. శంకర్ శాండిల్యపై ఆరోపణలు వున్నాయనీ..వాటిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు రాసిన లేఖలో సూర్యలత కోరారు. 

15:52 - August 11, 2018

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోల్ కతాలో పర్యటిస్తున్నారు. మయూర్ రోడ్డులోని బహిరంగసభలో ఆయన పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే షా పర్యటనను నిరసిస్తూ పలు ఫ్లెక్సీలు వెలిశాయి. దీనితో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 'బెంగాల్ వ్యతిరేకి బిజెపి గో బ్యాక్' అంటూ రాసి ఉన్న పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. బెంగాల్ లో మమత ప్రాబల్యం తగ్గించే వ్యూహంలో భాగంగా అమిత్ షా ర్యాలీని నిర్వహిస్తున్నారు. కానీ షా పర్యటనకు బెంగాల్ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. బెంగాల్ బీజేపీ అనుమతి కోరడంతో పోలీసులు అనుమతినిచ్చారు. షా పర్యటనలో భద్రత కల్పించాలని బెంగాల్ ప్రధాన కార్యదర్శికి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లేఖ రాశారు. అసొం ఎన్ ఆర్ సీ జాబితాలో 40 లక్షల మంది పేర్లు లేకపోవడంపై బీజేపీపై మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

సీఎం చంద్రబాబుకు సూర్యలత లేఖ ..

విజయవాడ : సీఎం చంద్రబాబుకు దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు సూర్యలత లేఖ రాశారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమనీ..సీసీ పుటేజ్ పరిశీలించకుండాతనే తనపై చర్యలు ఎలా తీసుకుంటారని..వ్యక్తిగత విచారణతో తనను దోషిగా ఎలా నిర్ధారిస్తారని సూర్యలత వాపోతు సూర్యలత చంద్రబాబు లేఖలో ప్రశ్నించారు. దుర్గగుడి చైర్మన్ గౌరంగబాబు, సభ్యుడు శంకర్ బాబు, శంకర్ శాండిల్య దుర్గమ్మ చీర మాయం అయిన విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. శంకర్ శాండిల్యపై ఆరోపణలు వున్నాయనీ..వాటిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు రాసిన లేఖలో సూర్యలత కోరారు.

కేసీఆర్ కు మహిళలపై చిన్నచూపు : గీతారెడ్డి

హైదరాబాద్ : మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలను నీరుగారుస్తు..సీఎం కేసీఆర్ మహిళలను చిన్నచూపు చూస్తున్నారనీ కాంగ్రెస్ నేత గీతారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రిగా వుండటానికి సీఎం కేసీఆర్ కు ఒక్క మహిళ కూడా కనిపించలేదా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఓయూ సభ విషయంలో కేసీఆర్ భయపడుతున్నారని అందుకే సదస్సుకు అనుమతి ఇవ్వకుండా రాజకీయ ఒత్తిడులు తెచ్చి అనుమతి ఇవ్వలేదని గీతారెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా కేసీఆర్ మనసు మార్చుకుని ఓయూ సదస్సుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

15:47 - August 11, 2018

విజయవాడ : దుర్గగుడిలో చీర మాయం వివాదం సద్దుమణగడం లేదు. పాలక మండలి సభ్యురాలు సూర్యలత బాధ్యులుగా చేస్తూ ఆమెను భాధ్యతల నుండి ప్రభుత్వం తప్పించిన సంగతి తెలిసిందే. సూర్యలత చీర తీసిందని ఛైర్మన్ తో పాటు వేదిక కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్యలు పోలీసు, సీఎం చంద్రబాబు నాయుడులకు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక అనుసారం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ తానేమి తప్పు చేయలేదని, వ్యక్తిగత విచారణతో వేటు వేయడం కరెక్టు కాదని సూర్యలత పేర్కొంటున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ కూడా రాశారు. ఇంద్రకీలాద్రిలో జరుగుతున్న అవినీతిని అడ్డుకొంటున్నందుకు తనపై కక్ష కట్టారని ఆరోపించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

రాష్ట్రం ఇచ్చిన రాహుల్ కి ఇచ్చే గౌరవం ఇదేనా : భట్టి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తరువాత ప్రజల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయని తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించేందుకు వస్తున్నారని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఓయూలో రాహుల్ గాంధీ సదస్సుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించటం దారుణమని భట్టి విక్రకమార్క పేర్కొన్నారు. విద్యార్ధుల కోరిక మేరకు రాహుల్ సదస్సుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని భట్టి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. తెలంగాణను ఇచ్చింది 4కోట్ల జనం కోసం..

బీజేపీ .బీ టీమ్ గా టీఆర్ఎస్ : మధుయాష్కీ

హైదరాబాద్ : 10శాతం కమీషన్ తో 30 వాటాలతో కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతోందని ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో నిర్భంధాలు కొనసాగుతున్నాయనీ..నీళ్లు అడిగితే ఎస్సార్ ఎస్పీ రైతులపై కేసులు పెడుతున్నారని మధుయాష్కీ విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు తరిమికొట్టేరోజు దగ్గరలోనే రానుందన్నారు. బీజేపీ .బీ టీమ్ గా టీఆర్ఎస్ మారిందని మధుయాష్కీ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా దళితులు, ముస్లింలపై దాడులు జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు స్పందించటంలేదనీ..కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించటంలేదని మధుయాష్కీ కేసీఆర్ ను ప్రశ్నించారు. 

అవినీతికి పాల్పడితే ఎవరైనా సరై జైలుకు వెళ్లాల్సిందే : మంత్రి నక్కా

గుంటూరు : అవినీతికి పాల్పడితే ఎవరైనా సరై జైలుకు వెళ్లాల్సిందేనని.. జగన్ అవినీతి మహిళా ఐఏఎస్ అధికారులు బలైపోయారనీ మంత్రి నక్కా అనందబాబు పేర్కొన్నారు...మహిళలు అవినీతి కేసులను ఎదుర్కోవాల్సిరావటం బాధాకరమని..దీనికి కారణం తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ చేసిన అరాచకం వల్లనేనన్నారు. జగన్ అవినీతి కంపెనీల్లో డైరెక్టర్ గా వున్నందునే ఆయన భార్య భారతి పేరును ఈడీ అఫిడవిట్ లో దాఖలు చేసిందన్నారు. త్వరలో భారతిని ఈడీ విచారిస్తుందని మంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. జగన్ బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

పొంగుతున్న వాగులు..పురిటి నొప్పులతో గర్భిణీ అవస్థలు..

ఖమ్మం : భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంత వాసులు నానా అగచాట్లకు గురవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లాలోని గుండాల మండలం నాగరంలో రోడ్డుపై ఏడు మెలికల వాగు పొంగి పొరలుతోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో పురిటి నొప్పులతో అవస్థ పడుతున్న ఓ గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు స్థానికులు నానా అగచాట్లు పడ్డారు. 108 వాహనానికి ఫోన్ చేయగా వాగు వరకూ వచ్చి అంతకుమించి వెళ్లేందుకు వీలు లేక వాగువద్దనే 108 వాహనం నిలిచిపోయింది. దీంతో 108 వాహన సిబ్బంది..స్థానికుల సహాయంతో చేతులపై గర్భిణిని మోసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. 

భక్తులు లేక వెలవెలబోతున్న తిరుమల..

తిరుమల : శ్రీవారి దేవాలయం బాలలయ మహాసంప్రోక్షణ సందర్భంగా వున్న ఆంక్షలతో తిరుమల వీధులు భక్తులు లేక వెలవెలబోతోంది. టీడీపీ ప్రకటనతో రానున్న 5 రోజుల పాటు కూడా భక్తులు పరిమిత సంఖ్యలోనే శ్రీవారి దర్శనానికి అనుమతి వుంటుందని పాలకులు ఇప్పటికే ప్రటించారు. దీంతో భక్తుల తాకిడి లేక తిరుమల వీధులు బోసిపోయాయి. అలిపిరి వద్ద తనిఖీల కేంద్రం నిర్మానుష్యంగా వుంది. 

9క్రితం హత్య, నిందుతుడు అరెస్ట్..

నల్లగొండ : మర్రిగూడ వివాహిత హత్య కేసులో..నిందితుడు హనుమంతును అరెస్ట్ చేశామని 10టీవీతో ఎస్పీ రంగనాథ్ తెలిపారు. హన్మంతు తన భార్యను చంపినట్లుగా అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. ఈ హత్య విషయంలో గ్రామస్తుల వాంగ్ములాన్ని కూడా రికార్డు చేశామన్నారు. హత్య జరిగి తొమ్మిదేళ్లు కావటంతో హత్యకు సంబంధించిన ఆచూకీ కోసం యత్నిస్తున్నామని ఎస్పీ రంగ్ నాథ్ 10టీవీకి తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో ఎస్సై, వైద్యాధికారి మృతి ..

సూర్యాపేట : చివ్వెంల మండలం గుంజలూరు వద్ద..అదుపు తప్పిన ఓ కారు డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతులు కరీంగనగర్ కు చ ఎందిన ఎస్సై శ్రీరాములు, పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి భిక్షపతిలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ స్టీరింగ్ వద్దనే ఇరుక్కుపోయాడు..డ్రైవర్ ను బైటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా యత్నించి ఎట్టకేలకు ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

దీదీని కూకటివేళ్లతో పెకలించేస్తాం : అమిత్ షా

పశ్చిమబెంగాల్ : సీఎం మమతాబెనర్జీని కూకటివేళ్లతో పెకిలిసంచేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కోల్ కత్తా పర్యటనను అమిత్ షా చేపట్టారు. ఈ నేపథ్యంలో కోల్ కతాలో జరిగిన భారీ బహిరంగసభలో ప్రసంగిస్తూ ..అసోంలో చేపట్టిన జాతీయ పౌర రిజిస్టర్ ను మమత వ్యతిరేకిస్తున్న అంశంపై మాట్లాడుతూ, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటున్నవారే మమత ఓట్ బ్యాంక్ అని విమర్శించారు. ఎన్నార్సీని అడ్డుకోవడానికి మమత యత్నిస్తున్నారని... కానీ, దేశంలో అక్రమంగా ఉంటున్నవారిని తరిమివేసే ఒక ప్రక్రియే ఎన్నార్సీ అని చెప్పారు.

15:43 - August 11, 2018
15:24 - August 11, 2018

ఖమ్మం : జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కొత్తగూడెం, ఖమ్మం తదితర ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పురిటినొప్పులతో బాధ పడుతున్న ఓ గర్బిణీ ఆసుపత్రికి తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. గుండాల మండలం నాగారంలో ఏడు మెలికల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు పలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆసుపత్రికి చేర్చేందుకు వచ్చిన 108 వాహనం వాగు ఉధృతితో ఆగిపోయింది. దీనితో కుటుంబసభ్యులు గజ ఈతగాళ్ల సహాయం తీసుకుని ఆమెను వాగును దాటించారు. అనంతరం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. 

14:31 - August 11, 2018

నల్గొండ : సుమారు 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని అదృశ్యమైన తన అక్క ఆచూకీ కోసం తమ్ముడు చేసిన శోధనలో విషాదం ఎదురైంది. తన అక్క ప్రియాంకను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే 9 ఏళ్ల క్రితం దారుణంగా హత్య చేసిన చేదు నిజం తమ్ముడు ఉపేందర్ కు తెలిసింది. నల్గొండ జిల్లా మర్రిగూడలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దీనితో ఉపేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఓ పాడు పడిన బావిలో ప్రియాంక శవ ఆనవాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఇంత వరకు మాత్రం మృతదేహం కనిపించలేదు. కానీ జరిగిన నేరాన్ని మాత్రం నిరూపిస్తామని జిల్లా ఎస్పీ పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఎస్పీతో టెన్ టివి ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:23 - August 11, 2018

హైదరాబాద్ : రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. తెలంగాణ నూతన అడ్వకేట్ జనరల్ గా బండా శివానంద ప్రసాద్‌ (బీఎస్‌ ప్రసాద్‌)ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ఏజీగా నియమించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికై కృషి చేస్తానని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:55 - August 11, 2018

తూర్పుగోదావరి : ఏపీ డిప్యూటీ సీఎంకి చిక్కులు తప్పవా.. సొంత పార్టీలోనే అయనకు చికాకు కలిగిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ సీటుకు సెగ పెడుతున్నారా? పెద్దాపురంలో పార్టీ వ్యవహారాలు ఇప్పుడిలాంటి చర్చకు ఆస్కారమిస్తున్నాయా? 
మళ్లీ పెద్దాపురం నుంచి పోటీ చేస్తానన్న చినరాజప్ప 
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆయన అక్కడి నుంచే బరిలో దిగాలని ఆశిస్తున్నారు. తాను మళ్లీ పెద్దాపురం నుంచి పోటీ చేస్తానంటూ ఆయన ప్రకటించారు. కానీ తీరా చూస్తే అమలాపురానికి చెందిన రాజప్పకు పెద్దాపురంలో రెండో సారి అవకాశం ఇవ్వకూడదంటూ సొంత పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే పలువురు టీడీపీ నేతలు  అసమ్మతి స్వరం వినిపిస్తుండంతో రాజప్పకు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.
చినరాజప్ప తీరు సామాన్యులకు పెద్దగా రుచించడం లేదు 
పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో చినరాజప్ప తీరు సామాన్యులకు పెద్దగా రుచించడం లేదు. పెద్దాపురంలో శతాబ్ధి పార్క్ వంటి నిర్మాణాలు చేపట్టినా మౌలిక సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  దానికి తోడుగా రామేశ్వరం మెట్టపై అక్రమ మైనింగ్ లో అమాత్యుడి పేరు వినిపిస్తుండడంతో పలువురు స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీవో కార్యాలయం కూల్చివేసిన ఘటనతో డిప్యూటీ సీఎం ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది. ఈ వ్యవహారం టీడీపీ శ్రేణులకు మింగుడుపడడం లేదు.
చినరాజప్పపై పెరుగుతున్న వ్యతిరేకత 
చినరాజప్పపై పెరుగుతున్న వ్యతిరేకతను అతనకు అవకాశంగా మార్చుకోవాలని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు భావిస్తున్నారు. తనకు మరోసారి పెద్దాపురంలో అవకాశం ఇవ్వాలంటూ ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీలో స్థానిక నినాదం తీసుకుస్తున్నారు. దీంతో ఇప్పటికే పార్టీ రెండు శిబిరాలుగా చీలిపోయన తరుణంలో బొడ్డు భాస్కర రామారావు వర్గం వేగంగా పావులు కదుపుతోంది.చినరాజప్పకు చెక్ పెట్టేదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 
టికెట్ కోసం ఇద్దరు నేతల పోటీ
వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఇద్దరు నేతల నేరుగా తలపడుతుండడం ఆసక్తి రేకిస్తోంది. కీలక సామాజికవర్గాలకు చెందిన నేతలు బహిరంగంగా  విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పటికే బీబీఆర్ తన శత్రువు అంటూ చినరాజప్ప ఓ చానెల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో బొడ్డు కూడా దేనికైనా సైఅన్నట్టుగా సిద్ధమవుతున్నారు.

 

13:48 - August 11, 2018

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అనంతపురంలో సెల్‌ టవర్‌ ఎక్కి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భాస్కర్‌ను కిందికి దింపేందుకు అనంతపురం ఎమ్మెల్యేలు సెల్‌ టవర్‌ వద్దకు చేరుకున్నారు. భాస్కర్‌తో ఫోన్‌ మాట్లాడిన ఎమ్మెల్యేలు యువకుడిని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా విషయం కేంద్రం పరిధిలో ఉందని.... కావాలంటే భాస్కర్‌ను సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:43 - August 11, 2018

హైదరాబాద్‌ : మాసబ్‌ట్యాంక్‌లోని ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీలో ప్రవేశ పరీక్ష పేపర్‌ లీక్‌ అయిందని వీసీ చాంబర్‌ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి కౌన్సిలింగ్‌ ప్రారంభం కావడంతో ప్రవేశ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌ అవడంతో విద్యార్థులు నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీసీ డౌన్‌ డౌన్‌ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. వీసీ చాంబర్‌ వద్దకు ఒక్కసారిగా విద్యార్థులు దూసుకురావడంతో విద్యార్థుల మధ్య తోపులాట జరిగి కొందరికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

13:29 - August 11, 2018

హైదరాబాద్ : రాష్ట్ర అవతరణకే పీఆర్సీ అని ఊరించిన తెలంగాణ ముఖ్యమంత్రి... . సాంకేతిక కారణాల వల్ల ఇప్పట్లో సాధ్యం కాదని తెల్చి చెప్పారు. రివిజన్ కమిషన్ నివేదిక ఇచ్చే వరకు రెండు నెలలు సమయం తీసుకునే అవకాశం ఉంది. కావున పీఆర్సీ సంగతి పక్కకు పెడితే కనీసం మధ్యంతర భృతి అన్నా త్వరగా పరీశిలించాలని వేడుకుంటున్నారు ఉద్యోగులు. ఈ సారైనా పంద్రాగాష్టు నాడు ఐఆర్ ప్రకటించి ఉద్యోగుల సేవలను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.
పీఆర్సీ కోసం ఉద్యోగులు ఎదురుచూపులు 
పీఆర్సీ కోసం తెలంగాణ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర అవతరణ రోజునే ఐఆర్‌ ప్రకటిస్తామని కేసీఆర్‌ తెలిపారు. తర్వాత మాటమార్చి ఆగస్టు 15న పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. పీఆర్సీ కోసం ఓ కమిటీ కూడా నియమించారు. మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పీఆర్సీ కమిటీ ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అయ్యింది. వారి నుంచి వినతులు స్వీకరించింది. 
నేటికీ పూర్తికాని పీఆర్సీ కమిటీ సంప్రదింపులు
ప్రభుత్వం చెప్పిన పంద్రాగస్టు దగ్గరికి వచ్చింది. కానీ ఇప్పటి వరకు పీఆర్సీ సంప్రదింపులు పూర్తి కాలేదు. నివేదిక సిద్ధం చేయలేదు. అయినా ఉద్యోగులకు ఇచ్చే మధ్యంతర భృతిపై సీఎం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంత ఇవ్వాలనే దానిపై చర్చిస్తున్నారు. పంద్రాగస్టున ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. 
18శాతం ఐఆర్‌ ఇవ్వాలని ప్రతిపాదించిన ఆర్థికశాఖ
ఆర్ధిక శాఖ మాత్రం ఉద్యోగులకు 18శాతం మాత్రమే ఐఆర్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ఉద్యోగులకు 1శాతం ఐఆర్ ఇస్తే సంవత్సరానికి 300 కోట్ల రూపాయాలు,10 శాతం ఇస్తే 3000 కోట్లు, 20 శాతం ఇస్తే 6000 కోట్లు వ్యయం అవుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. కాబట్టి 18శాతానికే 5400 కోట్లు అవుతున్నందున జాగ్రత్తగా ఆలోచించ నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాన్ని కోరింది. లేదంటే ప్రభుత్వఖజానాపై భారం పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఐఆర్ ఎంత ప్రకటించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం 43 శాతం ఐఆర్ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆగష్టు15న ఎంత ఐఆర్ ప్రకటిస్తుందనే ఆసక్తి  ఉద్యోగుల్లో నెలకొంది. .
21శాతం ఐఆర్‌ ఇచ్చే యోచనలో సర్కార్‌
2019లో  సాధారణ ఎన్నికల జరగనున్నాయి కాబట్టి దీంతో ఉద్యోగుల ఐఆర్ కు, పీఆర్సీకి ప్రాధాన్యత ఉంది. తెలంగాణలో సుమారు 3.5లక్షల మంది ఉద్యోగులు, 2 లక్షలమంది వరకు పెన్షనర్లు ఉన్నారు. వారందరికి సానుకూలంగా సంకేతాలు ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అటు ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ 43శాతం కాకుండా,ఇటు ఆర్ధిక శాఖ చెప్తున్న 18 శాతం కాకుండా 21 శాతం ఐఆర్ ఇచ్చే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఐఆర్ 21శాతం ప్రకటిస్తే...  ఏడాదికి ప్రభుత్వానికి 6300 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 21 శాతం ఐఆర్ ను ఆగష్టు 15న గొల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్  ప్రకటించాలని భావిస్తున్నారు. మరి 21శాతమే ఇస్తారా మరింత పెంచుతారా అన్నది పంద్రాగస్టున తేలిపోనుంది.

 

సీఎం వద్దకు తీస్కెళ్తామని ఎమ్మెల్యేల హామీతో టవర్ దిగిన భాస్కర్..

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠం డిమాండ్ చేస్తున్న విషయ తెలిసిందే. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను ఆత్మహత్య చేసుకుంటానంటు సెల్ టవర్ ఎక్కిన మున్సిపల్ ఉద్యోగి పెనుబోలు విజయభాస్కర్ ని సురక్షితంగా కిందికి దించేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం పరిధిలో వుందని..ఈ విషయంపై మాట్లాడేందుకు సీఎం వద్దకు తీసుకెళ్తాం ప్లీజ్ టవర్ మీద నుండి దూకవద్దు అంటు ఎమ్మెల్యేలు భాస్కర్ తో సంప్రదింపులు చేశారు.

13:20 - August 11, 2018

విజయనగరం : జిల్లాలోని బొబ్బిలి రైల్వేట్రాక్ పై అనుమానస్పందంగా పడివున్న రెండు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులు సాలూరు మండలం నేలపర్తి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు ఓ విందు కార్యక్రమంలో పాల్గొనడానికి బొబ్బిలి వచ్చినట్టు సమాచారం. మృతులు విశాఖ లోని మొబైల్‌ షాపుల్లో పనిచేస్తుం డేవారు. 

 

13:18 - August 11, 2018

నిజామాబాద్‌ : అజ్ఞాతంలో ఉన్న మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌పై మరో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు...  రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలని సంజయ్‌ ఇంటికి నోటీసులు అంటించారు. 42ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. హాజరు కాకుంటే సంజయ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. 

 

13:15 - August 11, 2018

భద్రాద్రి కొత్తగూడెం : గుండాల ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని, ఏడు మెలికల మల్లన్న వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆదివాసీ పల్లెలు జలదిగ్భందానికి గురయ్యాయి.  ఇల్లందు, సత్యనారాయణపురం ప్రాంతంలో మూడు వైపుల నుంచి కాలువలు రోడ్ల మీదకి రావడంతో రవాణా వ్యవస్థ స్థంబించిపోయింది. మరిన్ని వీడియోలో చూద్దాం.. 

13:13 - August 11, 2018

అనంతపురం : జిల్లాలో విషాదం నెలకొంది. ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతపురం రూరల్ పరిధిలోని ఎస్ ఎల్ ఎన్ జూనియర్‌ కాలేజీలో నాగేశ్వరి అనే విద్యార్థిని ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. హాస్టల్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని నాగేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. నాగేశ్వరి మృతిని కాలేజీ యాజమాన్యం
గోప్యంగా ఉంచింది. యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని బందువుల ఆందోళన చేపట్టారు. విద్యార్థిని మృతికి కాలేజి యాజమాన్యమే కారణమంటూ ఆరోపిస్తూ తల్లిదండ్రులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఫైన్ ఆర్ట్స్ ప్రవేశ పరీక్షా ప్రశ్నాపత్రం లీక్..

హైదరాబాద్ : ఫైన్ ఆర్ట్స్ ప్రవేశ పరీక్షా ప్రశ్నా పత్రం లీక్ కలకలం సృష్టించింది. దీంతో విద్యార్థులు ఫైన్ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. 

కారు యాత్ర సమన్వయ కమిటీ భేటీ..

హైదరాబాద్ : గాంధీ భవన్ లో కాంగ్రెస్ బస్ యాత్ర సమన్వయ కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీలో కుంతియా,ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సలీం, శ్రీనివాస్, బోసుబాబు, సీనియర్ నేత వీహెచ్ పాల్గొన్నారు.

 

12:58 - August 11, 2018

హైదరాబాద్‌ : శేరిలింగంపల్లిలో భారీ చోరీ జరిగింది. చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రెండు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏటీఎంలను దుండగులు గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో కట్‌ చేసి చోరీకి పాల్పడ్డారు. సంఘటన స్థలాన్ని మాదాపూర్‌ డీసీపీ పరిశీలించారు. దుండగులను గుర్తించడానికి క్లూస్‌ టీం ప్రయత్నిస్తోంది.

 

వర్షాల పరిస్థితిపై కలెక్టర్లతో మంత్రి తుమ్మల టెలీకాన్ఫరెన్స్..

భద్రాద్రి : జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంపై భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కిన్నెరసాని వాగు వరద నీటి ఉదృతిని కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు కలిగిన నష్ట నివారణ, రహదారి భద్రత, రవాణాకు కలుగుతున్న అసౌకర్యాలు, చెరువు కట్టల పటిష్టతలకు వెంటనే చర్యలు చేపట్టాలని..24గంటు అప్రపమత్తంగా వుండలని కలెక్టర్లను మంత్రి అదేశించారు.  

ముదిరిన డాక్టర్ శిల్ప ఆత్మహత్య వివాదం..

చిత్తూరు : తిరుపతి రుయా ఆస్పత్రిలో పీజీ విద్యార్థి డాక్టర్ శిల్ప ఆత్మహత్య వివాదం మరింత ముదురుతోంది. తాజాగా శిల్ప బలవన్మరణం కేసులో రుయా ప్రిన్సిపాల్ తో పాటు ముగ్గురు ప్రొఫెసర్లపై వేటు వేయడంపై అక్కడి ప్రభుత్వ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం తిరుపతిలో అత్యవసరంగా సమావేశమైన వైద్యులు.. ప్రభుత్వ చర్యలు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోజూ ఓపీ సేవల సందర్భంగా గంట పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్ని బహిష్కరిస్తామని తెలిపారు. శిల్ప మృతికి సంతాపం తెలిపిన రుయా డాక్టర్లు..

మాజీ మేయర్ సంజయ్ పై మరో కేసు..నోటీసులు జారీ..

నిజామాబాద్ : మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పై మరో కేసు నమోదయ్యింది. సంజయ్ పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయ్యింది. రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలంటు సంజయ్ అజ్నాతంలో వుండటంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఈనెల 12వ తేదీ లోపు విచారణకు హాజరు కాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు పేర్కొన్నారు. విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడనీ..మేయర్ సంజయ్ పై 11మంది విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు. కాగా సంజయ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనీ గతంలో హోంమినిష్టర్ ని, డీజీపీని కలిసి విన్నవించుకున్నారు.

12:33 - August 11, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రినుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అశ్వరావుపేట నియోజకవర్గంలోని లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెదవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో నీటిని దిగువకు వదిలారు. వరిచేలు, నారుమళ్ళకు నష్టం వాటిల్లింది. పత్తి చేలు నీట మునిగాయి. రైతాంగం ఆందోళనలో ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

12:25 - August 11, 2018

ఆదిలాబాద్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. కుండపోత వానతో వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోందని రైతులు అంటున్నారు. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

కుప్పకూలిన మరో ఫ్లైఓవర్..ట్రాఫిక్ జామ్

ఉత్తరప్రదేశ్ : బస్తీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ ఈ ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమయంలో అక్కడ మరెవరూ లేకపోవడంతో... ప్రాణ నష్టం తప్పింది. గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల వల్ల... ఫ్లైఓవర్ కు సపోర్ట్ గా ఉంచిన ఐరన్ బీమ్ లు భూమిలోకి కుంగిపోయాయినందువల్లనే ఫ్లైఓవర్ కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లక్నోకు 205 కిలోమీటర్ల దూరంలో 28వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ...

12:18 - August 11, 2018

భద్రాద్రి : బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. పారపాక సమీపంలోని బ్రిడ్జీ పక్కన జరిగిన ప్రమాదంలో.. 10 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. స్థానికులు ప్రయాణీకులను బస్సులోనుంచి బయటకు తీశారు. భద్రచాలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, పినపాక ఎమ్మల్యే ఘటనా స్థలికి చేరుకుని, పరిశీలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

జల దిగ్భంధంలో ఆదివాసీ పల్లెలు..

భద్రాద్రి : గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మణ/గూరులో కోడిపుంజుల వాగు పొంగిపొరలుతుండటంతో కూనవరం రైల్వే గేట్ నుండి పీవీ కాలనీకి రాకపోకలు నిలిచిపోయాయి. గూండాల ఏజెన్సీలో వాగులు పొంగిపొర్లుతుండటంతో కిన్నెరసాని, ఏడు మెలికల వాగు, మల్లన్న వాగులు పొంగుతున్నాయి. దీంతో ఆదివాసీ పల్లెలు జలదిగ్భంధంలో నిలిచిపోయాయి. పినపాక మండలం రాయిగూడెం వద్ద గోదావరి నదిలో ముగ్గురు యువకులు చిక్కుకుపోయారు. వారిని బయ్యారం పోలీసులు బోటు సహాయంతో రక్షించారు.

రైల్వే ట్రాక్ పై మృతదేహాలు..

విజయనగరం : బొబ్బిలి రైల్వే ట్రాక్ పై రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతులు సాలూరు మండలం నేలపర్తివాసులుగా గుర్తించారు. విశాఖలోని ఓ మొబైల్ షాపులో పనిచేసే ఈ ఇద్దరు యువకులు ఓ విందు కార్యక్రమానికి హాజయ్యేందుకు బొబ్బిలి వచ్చిన ఇద్దరు యువకులు రైల్వే ట్రాక్ పై మృతి చెంది పడి వుండటంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదుచేసుకున్న పోలీసులు వీరిద్దరిది హత్యలా? లేక ఆత్మహత్యలా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ఐసీఐసీఐ ఏటీఎంలో రూ.10లక్షలు చోరీ..

హైదరాబాద్ : ఏటీఎంల దొంగతనాలు పెరుగతున్న నేపథ్యంలో దుండగులు ఏటీఎం మిషన్ నుండి నేరుగా డబ్బులు కొట్టేయటం సాధ్యపడకపోవటంతో డబ్బులను తస్కరించేందుకు దుండగులు పలు ప్రయత్నాలను అవలంభిస్తున్నారు. గ్యాస్ కట్టర్ల సహాయంతో రెండు ఏటీఎం మిషన్ లను దుండగులు కట్ట చేసి భారీ చోరీకి పాల్పడ్డారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శీరిలింగంపల్లి ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో ఈ రూ.10లక్షలను చోరీ చేశారు. సమాచారం అందుకున్న మాదాపూర్ డీసీపీ, క్లూస్ టీంతో సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

11:34 - August 11, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు టీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలుపుతున్నా.... అక్కడి నుంచి ఎలాంటి సపోర్ట్‌ లభించడం లేదు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ బంధం బలపడుతుందని అందరూ భావిస్తున్నా..... కేంద్రం మాత్రం ఏమీ తేల్చడం లేదు. చివరికి బైసన్‌పోలో గ్రౌండ్‌ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణే అవలంభిస్తోంది. 
రూటు మార్చిన టీఆర్‌ఎస్‌  
విభజన హామీల అమలుకు కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీఆర్‌ఎస్‌ రూటు మార్చింది. కేంద్ర ప్రభుత్వంతో దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయినా జాతీయ స్థాయి రాజకీయాలపై ఆసక్తితో సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా వేదిక ఏర్పాటు చేసే ప్రయత్నాలను కూడా చేశారు.  కానీ ఇటీవల కేసీఆర్‌ అనుసరిస్తున్న విధానాలు మాత్రం బీజేపీకి సన్నిహితంగా టీఆర్‌ఎస్‌ ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మొన్న జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో... ఏన్డీఏ మద్దతు ఇచ్చిన అభ్యర్థికే టీఆర్‌ఎస్‌ కూడా సపోర్ట్‌ చేసింది.  దీంతో బీజేపీకి గులాబీ పార్టీ మరింత దగ్గరయ్యిందన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిది.
తెలంగాణ సర్కార్‌ ప్రతిపాదనలకు నో గ్రీన్‌సిగ్నల్‌
టీఆర్‌ఎస్‌ కేద్ర ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి గులాబీ పార్టీ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకపోవడాన్ని  గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చి నాటి నుంచి రక్షణశాఖ భూములను , రా ష్ట్రప్రభుత్వానికి కేటాయించాలని కోరుతోంది.  ఆ భూములలో సచివాలయంతోపాటు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుంది. నాలుగేళ్లుగా ఈ వ్యవహారాన్ని కేంద్రం తేల్చలేకపోతోంది. బెంగళూరులో రక్షణ శాఖ భూములను కర్నాటక ప్రభుత్వానికి కేటాయించడం, తెలంగాణలో కేటాయించకపోవడం దేనికి సంకేతాలన్న ప్రశ్నలు అధికారపార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. కేంద్రంతో సయోధ్యగా వ్యవహరించినా... అనుకున్న స్థాయిలో సహకారం అందడంలేదన్న అభిప్రాయాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా విభజన హామీలు కూడా పూర్తిస్థాయిలో అమలుకాకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్న వాదనను వారు తెరపైకి తీసుకొస్తున్నారు.

 

11:28 - August 11, 2018

ఆదిలాబాద్‌ : పట్టణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తులసీ రెస్టారెంట్‌కు ఎదురుగా ఉన్న పెన్నా స్వామి సీడ్స్‌ దుఖాణంలో శుక్రవారం అర్ధరాత్రి షాట్‌సర్క్యూట్‌తో ప్రమాదం జరిగింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

 

11:21 - August 11, 2018

వరంగల్‌ : వరంగల్‌..ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పబ్లిక్‌, సెమీ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ జోన్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మామునూరు రైతులు ధర్నాకు దిగారు. పోలీసులు నచ్చచెప్పినా వినకుండా గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆవుల్ని చంపడం ఉగ్రవాదం కంటే పెద్ద నేరం : బీజేపీ

రాజస్థాన్ : వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో సిద్ధహస్తులైన బీజేపీ నేతలు మరోసారి వారి నోటికి పనికల్పించారు. ఆవుల్ని చంపడం ఉగ్రవాదం కంటే పెద్ద నేరమనీ, లవ్ జీహాద్ పేరుతో ముస్లింలు బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారని రాజస్థాన బీజేపీ ఎమ్మెల్యే అహూజా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగే సగం అత్యాచారాలకు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులే కారణమని కూడా అహూజా తీవ్రమైన ఆరోపణలను సంధించారు. కాగా భారత మాజీ ప్రధాని నెహ్రూపై కూడా అహూజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పందిమాంసం తిండారనీ..పందిమాంసం తినేవాడు పండిట్ ఎలా అవుతాడని ప్రశ్నించారు.

11:17 - August 11, 2018

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా ధర్మవరంలో  పెనుబోలు విజయ్‌ భాస్కర్‌ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ధర్మవరం రూరల్‌ పీఎస్‌ వద్ద సెల్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏపీకి ప్రత్యేక హోదాకోసం చనిపోతున్నానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ముందస్తు ఎన్నికల కోసమే కేసీఆర్ మోదీని కలిసారా?..

హైదరాబాద్ :  సీఎం కేసీఆర్ ఈ మధ్య ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే..తెలంగాణాలో కొత్త జోన్ల ఏర్పటు విషయంపై ప్రధానితో భేటీ అయ్యాయరనే విషయం ప్రధానం కాదనీ..ముందస్తు ఎన్నికల కోసం ప్రధానిని కేసీఆర్ కలిసారనీ..ఈ విషయంపై ప్రధానితో కేసీఆర్ చర్చించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారా? నవంబరు, డిసెంబరులో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలతోపాటే తెలంగాణలోనూ ఎన్నికల నిర్వహణకు కేసీఆర్ పావులు కదుపుతున్నారా?.. వీటికి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ విషయంలో ఆయన పక్కా ప్రణాళికతో ఉన్నట్టు చెబుతున్నారు.

పందిమాంసం తినే నెహ్రూ పండిట్టా? : బీజేపీ ఎమ్మెల్యే

రాజస్థాన్ : భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూపై రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే గయాన్ దేవ్ అహూజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ ఆవు మాంసం, పందిమాసం తినేవారనీ, ‘నెహ్రూ పండిట్ కాదనీ..బీఫ్, పందిమాసం తినేవారనీ..వీటిని తినేవారిని పండిట్ అని ఎలా అంటారు? కేవలం ఓట్లు పొందేందుకే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ పేరు ముందు పండిట్ అన్న పదాన్ని చేర్చిందని..అహూజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అహూజా వ్యాఖ్యలపై రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ పేరు ముందు పండిట్ అని చేర్చిందని వెల్లడించారు.

14న స్టాలిన్ చేతికి డీఎంకే పగ్గాలు..

తమిళనాడు : డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో డీఎంకే అధ్యక్షుడి స్థానం ఖాళీ అయింది. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ను డీఎంకే అధినేత నియమించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 14న స్టాలిన్ పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించినట్టు సమాచారం. పార్టీలో సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి అన్బళగన్ వయసు 96 ఏళ్లు కావడంతో... తప్పని స్థితిలో కరుణానిధి కుటుంబానికే అధ్యక్ష బాధ్యతలను అప్పగించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు, తన రాజకీయవారసుడు స్టాలినే అంటూ గతంలోనే కరుణ పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.

11:01 - August 11, 2018

చిత్తూరు : ఎస్వీ వైద్య కళాశాల పీజీ విద్యార్థి డాక్టర్‌ శిల్ప మృతిపై సీఎం చంద్రబాబు సీఐడీ విచారణకు ఆదేశించారు. సత్వరమే విచారణ పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. మరోవైపు శిల్ప మృతికి  ప్రొఫెసర్ల వేధింపులే కారణమని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. శిల్ప ఆత్మహత్యకు తాము బాధ్యులం కామని ప్రొఫెసర్లు చెబుతున్నారు. 
శిల్ప ఆత్మహత్య వివరాలను చంద్రబాబుకు వివరించిన కలెక్టర్‌
తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల పీజీ విద్యార్థి డాక్టర్‌ శిల్ప మృతిపై సీఎం చంద్రబాబు సీఐడీ విచారణకు ఆదేశించారు. శిల్పమృతి ఘటనపై విచారణను వేగవంతం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం శిల్ప తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు చిత్తూరు కలెక్టర్‌ పీఎస్‌ ప్రద్యుమ్నను కలిశారు. అనంతరం శిల్ప తల్లిదండ్రులు తమ కుమార్తె ఆత్మహత్యపై కలెక్టర్‌తో చర్చించారు. అటు కలెక్టర్‌ కూడా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు.
దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్‌
ఇక శిల్ప మృతికి గల కారణాలు తెలుసుకోవటం కోసం సీఐడీ చీఫ్‌ ఆమిత్‌ గార్గ్‌ సిట్‌ విచారణకు ఆదేశించారు. చిత్తూరు డీఎస్పీ జి.వి.రమణకుమార్‌, ఇన్‌స్పెక్టర్‌లు హేమచంద్ర, గౌసేబేగ్‌, అన్వర్‌బాషా, హజరత్‌బాబు, కళావతి ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిట్‌ అధికారులు వైద్యురాలి ఆత్మహత్యకు సంబంధించి నమోదైన కేసుల వివరాలను సేకరించారు. ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో దర్యాప్తును ముమ్మరం చేశారు.
శిల్పమృతికి ప్రొఫెసర్ల వేధింపులే కారణమంటున్న విద్యార్థులు
శిల్ప మృతికి ప్రొఫెసర్ల వేధింపులే కారణమని సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. శిల్ప ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ సరిగ్గా జరగకపోవటం వల్లే శిల్ప మృతి చెందిన చెబుతున్నారు. విచారణ చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
ప్రిన్సిపాల్‌ను తప్పించటంపై డాక్టర్ల సంఘం ఆగ్రహం
మరోవైపు ఎస్వీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమణయ్యను బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని డాక్టర్ల సంఘం తప్పుబట్టింది. ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డాక్టర్లు డిమాండ్‌ చేశారు. శిల్ప లైంగింక వేధింపుల ఫిర్యాదుపై జరిగిన విచారణకు సంబంధించిన నివేదిక బయటకు రాకపోవటానికి.. రమణయ్యకు ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ల సంఘం అంటోంది. మొత్తానికి ప్రభుత్వం ఇప్పటికైనా కేసును సీరియస్‌గా తీసుకోవటంతో శిల్పకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని.. తల్లిదండ్రులు, సహచర విద్యార్థులు భావిస్తున్నారు. 

 

వంతెనపై నుండి బస్ బోల్తా..

భద్రాద్రి కొత్తగూడెం : బూర్గంపాడు మండలం నాగినిప్రోలు వద్ద ఆర్టీసీ బస్ బోల్తా పడింది. రెడ్డిపాలెం వాగు వద్ద అదుపు తప్పిన బస్ వంతెనపై నుండి బోల్తా పడింది. భద్రాచలం నుండి బస్ విజయవాడ వెళ్తుండగా..బస్ ఒక్కసారిగా అదుపు తప్పటంతో వంతెనపై నుండి బోల్తాపడి..పారపాక సమీపంలోని బ్రిడ్జీ పక్కన బోల్తాపడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్ లో 40మంది ప్రయాణీకులుండగా..పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాదంపై వెంటనే స్పందించిన స్థానికులు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 

దుర్గ గుడి వివాదాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దేవాలయంలో రోజు రోజుకీ కొత్త కొత్త వివాదాలు ఏర్పడటంతో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిలో జరుగుతున్న అవినీతిని..వివాదాలను ప్రక్షాళన చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేశారు. అమ్మవారి చీర మాయం కావటంలో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పాలకమండలి, ఈవో, అర్చకుల మధ్య తరచే విభేదాలు రావటం..అధికారుల నిర్లక్ష్యం వారి పనితీరుతో దేవాలయం ప్రతిష్ట మసకబారుతుందని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు.

వర్షాలకు చిక్కుకుపోయిన 29మందిని రక్షించిన ఆర్మీ..

కేరళ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇడుక్కిలోని మున్నార్ హిల్ స్టేషనన్ లో రిసార్డ్స్ వద్ద చిక్కుకుపోయిన 20మంది విదేశీయులతో సహా 29మందిని ఆర్మీ సిబ్బంది రక్షించింది. వర్షాలకు నివాసాలు కోల్పోయినవారికి 500 ల పునారావాసాలను కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15.600 మందిని పునరావాసాల కేంద్రాలకు తరలించారు. ఇడుక్కి, వాయినాడ్, ఎర్నాకుళం,పతనమ్మిట్ట జిల్లాల్లో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక రర్యల్ని ముమ్మరం చేశాయి. రాష్ట్ర పరిస్థితిపై కేరళ సీఎం పినరాయి విజయన్ తో కేంద్రం హోంమత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు.

26 ఏళ్ల తరువాత ఇడుక్కి రిజర్వాయర్ 24 గేట్లు ఎత్తివేత..

కేరళ : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఈ క్రమంలో 26 ఏళ్ల తరువాత ఇడుక్కి రిజర్వాయర్ గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తివేశారు. ఇడుక్కి, వాయినాడ్, ఎర్నాకుళం,పతనమ్మిట్ట జిల్లాల్లో వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇడుక్కిలో మూడో రెడ్ అలర్డ్ ను అధికారులు జారీ చేశారు. అనంతరం 26 ఏళ్ల తరువాత ఇడుక్కి రిజర్వాయర్ 24 గేట్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తివేశారు. కాగా ఈ భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి మృతి చెందినవారి సంఖ్య 29కి చేరింది. 

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..

విశాఖపట్నం : దక్షిణకోస్తాను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలో 13న బంగాళాఖాతంలో అల్లపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో కోస్తాంధ్రా లో ఓ మోస్తరు వర్షాలు..ఒకటి రెండు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుసే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో సముద్రం అల్లకల్లోలంగా వుంటుందనీ..మత్స్యకారులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. 

లారీ ఢీకొని వ్యక్తి సజీవదహనం..

గుంటూరు : తాడేపల్లి మండలం బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని ఓ ఆయల్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ సజీవదహనమయ్యాడు. క్లీనర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. 

తాగారు..దొరకారు..బుక్ అయ్యారు..

హైదరాబాద్ : మద్యం తాగటం మానని మందుబాబులు తాగి వాహనాలు నడపవద్దని ప్రభుత్వం ఎంతగా చెప్పినా..ఎన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నా..ప్రతీ రోజు వందలాది మంది మందుబాలు తాగి వాహనాలు నడిపి పట్టుబడుతునే వున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాలలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో 107 మంది పట్టుబడ్డారు. దీంతో పోలీసలు వారిపై కేసు నమోదు చేసి 52 కార్లు, 75 బైకులను సీజ్ చేశారు.  

భారీ వర్షాలు..నిలిచిన బొగ్గు ఉత్పత్తి..

భూపాలపల్లి : మహదేవపూర్, కాటారం, మల్హర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం భారీగా పెరుగుతోంది. కాగా వర్షం కారణంగో మంచిర్యాల మండలంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అలాగే పెద్దపల్లి జిల్లాలో రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు రామగుండంలో 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. 

ట్రాఫిక్ ను స్థంభింపజేసిన రైతులు..

వరంగల్ : వరంగల్,ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పబ్లిక్, సెమీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ జోన్ల రద్దును డిమాండ్ చేస్తు రహదారిపై మామునూరు రైతులు బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని వారించినా వినని రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలని తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్థంభించిపోయింది. 

ఏపీ ప్రత్యేక హోదా కోసం చనిపోతా..

అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠం డిమాండ్ చేస్తున్నారు. అయినా కనికరించన కేంద్రం ఏపీపై పక్షపాత ధోరణిని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవటంలేదనీ..అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోటు రాసి ధర్మవరం రూరల్ పీఎస్ వద్ద వున్న ఓ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డాడు ఓ యువకుడు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, పోలీసులు అతడిని కిందకు దింపేందుకు చర్యలు తీసుకోగా..మీరు పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే..

మాజీ ప్రధాని రాజీవ్ హంతకులను విడుదల చేయం : కేంద్రం

ఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేయమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజీవ్ హంతకులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో కేంద్రం తన వైఖరిని కోర్టుకు తెలియజేసింది. కేంద్రం అనుమతి లేకుండా నిందితులను విడుదల చేయొద్దని సుప్రీంకోర్టు ఇదివరకే తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కేంద్రం రాజీవ్‌ హంతకులను వదిలేది లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది.

నేటి నుండి శ్రీవారి అష్టబంధన బాలాలయం మహా సంప్రోక్షణ..

తిరుమల : నేటి నుంచే తిరుమలలో మహాక్రతువు ప్రారంభంకానుంది. మహా సంప్రోక్షణకు నేడు అంకురార్పణ జరుగనుంది. ఇంతకీ ఈ కార్యక్రమం ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? ఆ సమయంలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారా? లేదా? ఒక వేళ అనుమతిస్తే ఏ ఏ సమయాలలో స్వామివారి దర్శనాన్ని కల్పించనున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు వచ్చినట్లే తిరుమల శ్రీవారికి కూడా అష్టబంధన బాలాలయం మహా సంప్రోక్షణ అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి దీనిని నిర్వహిస్తారు.

పంద్రాగస్టునుండి ప్రాంభం కానున్న రైతుబీమా పథకం..

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుభీమా పథకం ఆగష్టు 15 నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అధికారులతో ప్రగతిభవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు భీమా అందే క్రమంలో దశల వారీగా తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాటు చేసుకోవాల్సిన యంత్రాంగం గురించి వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద భీమా పథకంగా ప్రారంభం కానున్న రైతు భీమా పథకం తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసాగా పేర్కొన్నారు.

భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం..29మంది మృతి..

కేరళ : రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య 29కి పెరిగింది. మరికొందరు గల్లంతయ్యారు. మున్నార్‌లోని ఓ రిస్టార్ట్‌లో చిక్కుకున్న సుమారు 60 మంది పర్యాటకులను ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కాపాడింది. ఇందులో 20 మంది విదేశీ పర్యాటకులున్నారు. కేరళకు వెళ్లవద్దని అమెరికా తమ టూరిస్టులకు నిషేధ ఆదేశాలు జారీ చేసింది. కన్నూర్, ఇడుక్కి, వాయినాద్‌, కోజికోడ్, మల్లాపురం జిల్లాలపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. ఎర్నాకులం, అలపుజా, పలక్కడ్‌ జిల్లాలను కూడా వరదలు ప్రభావితం చేశాయి.

కేంద్రానికి ఝలక్ ఇచ్చిన డిప్యూటీ చైర్మన్ హరివంశ్..

ఢిల్లీ : ఎన్డీయే అభ్యర్థిగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఓ ప్రైవేటు తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతినిచ్చి కేంద్రాన్ని ఇరకాటంలోకి నెట్టేశారు. ఆ సమయంలో విపక్ష సభ్యులు ఎక్కువమంది సభలో లేకపోవడంతో ప్రభుత్వం బయటపడగలిగే అవకాశం దక్కింది. సమాజ్‌వాదీ సభ్యుడు విశ్వంభర్ ప్రసాద్ నిషాద్ సభలో ప్రైవేటు తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ఓ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు మరో రాష్ట్రంలో కూడా అవే ఫలాలను అనుభవించేలా రాజ్యాంగాన్ని సవరించాలని తీర్మానంలో పేర్కొన్నారు. స్పందించిన సామాజిక న్యాయ శాఖా మంత్రి థవర్ చంద్ గెహ్లట్ దీనిని తిరస్కరించారు.

నెహ్రూపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన దలైలామా..

ఢిల్లీ : భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కారణంగానే భారత్-పాక్‌లు విడిపోయాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా వెనక్కి తగ్గారు. తాను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలని వేడుకున్నారు. ‘నా వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. నేను తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి’ అని పేర్కొన్నారు. కాగా మహమ్మద్ జిన్నాను మహాత్మాగాంధీ ప్రధానిని చేయాలని అనుకున్నారని అన్నారు. అదే జరిగి ఉంటే భారత్-పాక్‌లు రెండుగా విడిపోయి ఉండేవి కావని గతంలో దలైలామా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిన్నాను ప్రధాని చేసేందుకు నెహ్రూ అంగీకరించలేదని పేర్కొన్నారు.

09:52 - August 11, 2018

హైదరాబాద్ : పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో మరో రెండ్రోజుల్లో  అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో తేలకపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కోస్తాంధ్రాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కరువనున్నాయి. రాయలసీమలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

కేరళలో సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం

తిరువనంతపురం : కేరళను భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కన్నూర్, వాయినాద్, కోజికోడ్, ఇడుక్కి, ఎర్నాకులం, పతనమిట్ట, మల్లాపురం తదితర జిల్లాపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. నదులు ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగుతున్నాయి. ఇడుక్కి రిజర్వాయర్ ఐదు గేట్లను ఎత్తివేశారు. ఇడుక్కిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది.

ఇడుక్కి రిజర్వాయర్ ఐదు గేట్లను ఎత్తివేత

తిరువనంతపురం : కేరళను భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కన్నూర్, వాయినాద్, కోజికోడ్, ఇడుక్కి, ఎర్నాకులం, పతనమిట్ట, మల్లాపురం తదితర జిల్లాపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. నదులు ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగుతున్నాయి. ఇడుక్కి రిజర్వాయర్ ఐదు గేట్లను ఎత్తివేశారు. ఇడుక్కిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

కేరళలో భారీ వర్షాలు 29 మంది మృతి

తిరువనంతపురం : కేరళను వానలు ముంచెత్తాయి. భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి 29 మంది మృతి చెందారు. కన్నూర్, వాయినాద్, కోజికోడ్, ఇడుక్కి, ఎర్నాకులం, పతనమిట్ట, మల్లాపురం తదితర జిల్లాపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి.  
నదులు ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగుతున్నాయి. 50వేల మంది నిర్వాసితులు అయ్యారు. 

09:44 - August 11, 2018

తిరువనంతపురం : కేరళను వానలు ముంచెత్తాయి. భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి 29 మంది మృతి చెందారు. కన్నూర్, వాయినాద్, కోజికోడ్, ఇడుక్కి, ఎర్నాకులం, పతనమిట్ట, మల్లాపురం తదితర జిల్లాపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. నదులు ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగుతున్నాయి. 50వేల మంది నిర్వాసితులు అయ్యారు. ఇడుక్కి రిజర్వాయర్ ఐదు గేట్లను ఎత్తివేశారు. ఇడుక్కిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. కేరళ సీఎంతో కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

మరో రెండురోజుల్లో మరో అల్పపీడనం

హైదరాబాద్ : పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో రెండురోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో తేలకపాటి వర్షాలు పడనున్నాయి. కోస్తాంధ్రాలో ఒకటి రెండు రోజుల్లో భారీ వర్షాలు కరువనున్నాయి. రాయలసీమలో మోస్తారు వర్షాలు పడనున్నాయి. 

 

కేరళలో భారీ వర్షాలు

తిరువనంతపురం : కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 26 మంది మృతి చెందారు. కన్నూర్, ఇడుక్కి, వాయినాద్, కోజికోడ్, మల్లాపురం తదితర జిల్లాపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. 

08:52 - August 11, 2018

తిరువనంతపురం : కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య 26కి పెరిగింది. మరికొందరు గల్లంతయ్యారు. మున్నార్‌లోని ఓ రిస్టార్ట్‌లో చిక్కుకున్న సుమారు 60 మంది పర్యాటకులను ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కాపాడింది. ఇందులో 20 మంది విదేశీ పర్యాటకులున్నారు. కేరళకు వెళ్లవద్దని అమెరికా తమ టూరిస్టులకు నిషేధ ఆదేశాలు జారీ చేసింది. కన్నూర్, ఇడుక్కి, వాయినాద్‌, కోజికోడ్, మల్లాపురం జిల్లాలపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. ఎర్నాకులం, అలపుజా, పలక్కడ్‌ జిల్లాలను కూడా వరదలు ప్రభావితం చేశాయి. రాష్ట్రంలోని 22 రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగడంతో గేట్లను తెరచారు. కేరళలో 3 రోజుల పాటు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 6 బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆర్మీ, నేవీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి. వరదల కారణంగా రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఫోన్‌ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 50 ఏళ్ల చరిత్రలో కేరళలో ఇంత భారీ వర్షం ఎప్పుడూ కురియలేదని అధికారులు చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:44 - August 11, 2018

గుంటూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం అయ్యారు. తాడేపల్లి మండలంలో బైపాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ డ్రైవర్ సజీవదహనమయ్యారు. క్లీనర్ కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ క్లీనర్ ను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరు : తాడేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ట్యాంకర్ డ్రైవర్ సజీవదహనమయ్యారు. క్లీనర్ కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ క్లీనర్ ను ఆస్పత్రికి తరలించారు.

 

08:35 - August 11, 2018

చిత్తూరు : శ్రీవారి ఆలయంలో నేడు మహాసంప్రోక్షణకు అంకురార్పణ చేయనున్నారు. ఈనెల 16 వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలతో పాటు ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. నేటి నుంచి పరిమిత సంఖ్యలో శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం 7 గంటల నుంచి 10గంటల వరకు శ్రీవారి దర్శనం ఉంటుంది. ఉదయం 10.45 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 వరకు శ్రీవారి దర్శించుకోవచ్చు.

 

తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు మహాసంప్రోక్షణకు అంకురార్పణ

చిత్తూరు : శ్రీవారి ఆలయంలో నేడు మహాసంప్రోక్షణకు అంకురార్పణ చేయనున్నారు. ఈనెల 16 వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు. అన్ని ప్రత్యేక దర్శనాలతో పాటు ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. నేటి నుంచి పరిమిత సంఖ్యలో శ్రీవారి దర్శనానికి అనుమతించారు.

08:25 - August 11, 2018

ఈడీ ఛార్జీషీట్ లో భారతి పేరుందని వచ్చిన కథనాలపై వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. రఘురాం సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదులో జగన్ సతీమణి వైఎస్ భారతిని 5వ నిందితురాలిగా పేర్కొంది. దీనిపై శుక్రవారం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఛార్జీషీట్ ను సీబీఐ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకముందే పత్రికల్లో వార్తలు ఎలా ప్రచురిస్తారని ప్రశ్నించారు. సీబీఐ విచారణలో లేని అంశాలు ఇన్నేళ్ల తరువాత ఈడీ ఛార్జీషీట్ లోకి ఎందుకొచ్చాయని, వైఎస్ భారతికి ఈ కేసులతో సంబంధం ఏంటీ ? ప్రశ్నించారు. ఇదే అంశంపై నిర్వహించిన 
చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత కొండారాఘవరెడ్డి, టీడీపీ నేత పట్టాభి రామ్ పాల్గొని, మాట్లాడారు. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

234వ రోజుకు చేరిన జగన్ ప్రజా సంకల్పయాత్ర

ప.గో : వైఎస్ అధినేత జగన్ ప్రజా సంకల్పయాత్ర 234వ రోజుకు చేరుకుంది. నేడు తుని నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర కొనసాగనుంది. రైతులపూడి మండలం డీజేపురం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. కొత్తవెలంపేట, సీతయ్యపేట, తల్లూరు జంక్షన్, లోవకొత్తూరు, జగన్నాథగిరి మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. 

నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి పోచారం పర్యటన

కామారెడ్డి : నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పోచారం పాల్గొననున్నారు. 

07:53 - August 11, 2018

జీవాల పెంపకం ఎలా చేసుకోవాలి ? మార్కెట్ ఎలా చేసుకోవాలి ? సబ్సిడీలు, ఖర్చులకు సంబంధించిన వివరాలను ఇవాళ్టి మట్టిమనిషి కార్యక్రమంలో వై.పూర్ణచంద్రారెడ్డి వివరించారు. ఆయన తెలిపిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...  

07:27 - August 11, 2018

ఢిల్లీ : పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టీఆర్‌ఎస్‌ ఎంపీలు కలిశారు. తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణానికి రక్షణ భూములు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌ అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చారు. లోక్‌సభ ఫ్లోర్‌ లీడర్‌ జితేందర్‌ రెడ్డి, రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌ కే.కేశవరావు నాయకత్వాన పార్లమెంట్‌లో టీఆర్ఎస్‌ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 3 ఏళ్లుగా సీఎం కేసీఆర్‌ ఆశిస్తోన్న కొత్త సచివాలయ నిర్మాణానికి బైసన్‌ పోలో, జింఖానా మైదానం, రక్షణ భూములు రాష్ట్రానికి ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరినట్లు టీఆర్‌ఎస్‌ ఎంపీలు తెలిపారు. కేంద్రం ఇచ్చే భూములకు ఎక్స్‌చేంజ్‌గా ఇవ్వాల్సిన భూములపై కూడా ప్రధానికి వివరించామన్నారు. 
భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఎంపీలు
కేంద్రం ఇచ్చే భూములకు బదులుగా ఇవ్వాల్సిన భూములను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానికి వివరించామన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు. రోడ్ల విస్తరణకు ఇవ్వాల్సిన భూముల వలన తాము నష్టపోయే 31 కోట్ల రూపాయలను ప్రతి ఏటా ఇవ్వాలని రక్షణ శాఖ కోరిందని మోదీకి తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం అడిగిన వెంటనే 210 ఎకరాల భూమిని ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన రక్షణ శాఖ తెలంగాణకు మాత్రం భూమిని బదలాయించడంలో ఆసల్యం చేస్తోందన్నారు. రాష్ట్ర సమస్యలను త్వరగా పరిష్కారం చేయాలని ప్రధానిని కోరినట్లు టీఆర్ఎస్‌ ఎంపీలు తెలిపారు. ఈ సమస్యలపై ప్రధాని సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

07:20 - August 11, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్‌.. రోజుకో మలుపు తిరుగుతోంది. సోమవారం నాటికి చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే చెప్పాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేరోజు.. లా సెక్రెటరీతో పాటు.. అసెంబ్లీ సెక్రెటరీకి ఫారం 1 నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు సిద్ధమవుతోంది. 
ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం 
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం పునరుద్ధరణ విషయంలో.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరినీ ఎమ్మెల్యేలుగా పరిగణించాలంటూ.. సింగిల్‌బెంచ్‌ తీర్పునిచ్చిన 61 రోజులకు.. ప్రభుత్వం అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈలోపే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ శివశంకర్‌ నేతృత్వంలో విచారణ సాగుతోంది. తాము దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ విచారణ ఈనెల 16న ఉన్నందున.. కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కూడా వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది.. కోర్టును కోరారు. అయితే న్యాయస్థానం దీన్ని తోసిపుచ్చింది. కోర్టు ధిక్కరణకు.. అప్పీల్‌ పిటిషన్‌కు సంబంధం లేదని తేల్చి చెప్పింది. పిటిషన్‌ వేయడానికి సోమవారం వరకు గడువిచ్చింది.
సర్వత్రా ఆసక్తి 
సోమవారం నాడు అసెంబ్లీ కార్యదర్శితో పాటు.. న్యాయశాఖ కార్యదర్శికి ఫారమ్‌ వన్‌ నోటీసులు ఇవ్వనున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. మరోసారి గడువు కోరిన ప్రభుత్వం తరఫు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందించనుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. 

 

07:14 - August 11, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో చేనేతలకు అవసరమైన చేయూత, ప్రోత్సాహం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. చేనేతల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నామని... వారి అభ్యున్నతికి బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, పద్మశాలి సంక్షేమ సంఘం కలిసి పని చేయాల్సిన అవసరముందన్నారు. ప్రగతిభవన్‌లో వివిధ పద్మాశాలీ, చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైన కేసీఆర్‌... పలు అంశాలపై చర్చించారు. చేనేత వృత్తిని వదిలిపెట్టిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. వస్తున్న సాంకేతిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అవసరమైన వృత్తిపరమైన మార్పులు తీసుకురావాలన్నారు. హైదరాబాద్‌లో పద్మశాలీ భవనం నిర్మాణానికి రెండున్నర ఎకరాల స్థలం.. 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. చేనేత సంక్షేమం కోసం ఏర్పాటు చేయబోయే నిధికి తమ పార్టీ తరపున 50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. 

 

తెలంగాణలో నేటి నుంచి పాడిరైతులకు గేదెల పంపిణీ

వరంగల్ అర్బన్ : తెలంగాణలో నేటి నుంచి పాడిరైతులకు గేదెల పంపిణీ జరుగనుంది. వరంగల్ అర్బన్ జిల్లా ముల్కనూరు నుంచి పథకాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు.  

 

నేడు ఆలయంలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ

తిరుమల : నేడు ఆలయంలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ చేయనున్నారు. ఈరోజు నుంచి 16 వరకు శ్రీవారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ జరుగనుంది. అన్ని ప్రత్యేక దర్శనాలతోపాటు అర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈరోజు నుంచి పరిమిత సంఖ్యలో శ్రీవారి దర్శనానికి అనుమతిచ్చారు. 

 

ధర్మపురి సంజయ్ కు 41 సీఆర్పీసీ నోటీస్ జారీ

నిజామాబాద్ : ధర్మపురి సంజయ్ కు పోలీసులు 41 సీఆర్పీసీ నోటీస్ ఇచ్చారు. నేడు విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో నిజామాబాద్ నోటీసులు నోటీసులు జారీ చేశారు.

ఈనెల 13, 14 తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన

హైదరాబాద్ : తెలంగాణలో ఈనెల 13, 14 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. 13న మహిళ సంఘాల సమావేశంలో రాహుల్ పాల్గొననున్నారు. సరూర్ నగర్ లోవిద్యార్థి నిరుద్యోగ గర్జనలో పాల్గొననున్నారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు వీసీ అనుమతివ్వలేదు. 

ఈనెల 13, 14 తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన

హైదరాబాద్ : తెలంగాణలో ఈనెల 13, 14 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. 13న మహిళ సంఘాల సమావేశంలో రాహుల్ పాల్గొననున్నారు. సరూర్ నగర్ లోవిద్యార్థి నిరుద్యోగ గర్జనలో పాల్గొననున్నారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు వీసీ అనుమతివ్వలేదు. 

నేడు ప.గో జిల్లాలో మంత్రి గంటా పర్యటన

ఏలూరు : నేడు ప.గో జిల్లాలో మంత్రి గంటా శ్రీనివాస్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

Don't Miss