Activities calendar

12 August 2018

21:22 - August 12, 2018

కేరళ : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అయింది. అనేక ప్రాంతాల్లో వరద ముంపు ఇంకా వీడలేదు. ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టినా అనేక ప్రాంతాలను వరద ముప్పు వీడలేదు. ఇడుక్కి డ్యాంకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో డ్యాం పరిసర ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. కేరళలో వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా కేరళలో ఇప్పటికే 37 మంది మృతి చెందారు. అనేక ఇళ్లు దెబ్బతినడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 35,874 మంది ప్రజలు కేరళ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 341 సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

కేరళ బాధితుల కోసం ఇప్పటికే నటులు విశాల్‌, సూర్య, కార్తి తదితరులు విరాళాలిచ్చి తమ వంతు సహాయం చేశారు. విశాల్‌ కేరళ రెస్క్యూ పేరుతో అత్యవసర వస్తువులను సేకరిస్తున్నారు. తాజాగా విజయ్‌ దేవరకొండ కూడా తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కేరళ వాసుల కోసం 5 లక్షల విరాళం ఇచ్చారు. కేరళ ముఖ్యమంత్రి విపత్తు నిర్వహణ సంస్థకు విజయవంతంగా డబ్బులు వెళ్లాయని వచ్చిన సందేశాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

21:21 - August 12, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ తడిసి ముద్దైంది. వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్‌ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ దివ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఖానాపూర్‌‌ చెరువు సమీప నివాస ప్రాంతాలను కలెక్టర్ సందర్శించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం స్తంభించింది. పలు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి, జన్నారం సమీపంలో నిర్మిస్తున్న నూతన వంతెనల వద్ద రాకపోకల కొరకు నిర్మించిన అప్రోచ్ రోడ్లు వరద ఉధృతికి తెగిపోయి రవాణా వ్యవస్థ స్తంభించింది. వర్షం ధాటికి నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు చేరుతోంది. ఇప్పటికే 13 గేట్లు ఎత్తి వరద నీటిని గోదావరిలోకి వదిలారు అధికారులు.

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని లింగంపల్లి గ్రామంలో వర్షం ధాటికి 104 గొర్రెలు మృతి చెందాయి. ఇవి తెలంగాణ ప్రభుత్వం సబ్సీడీ కింద అంజేసిన గొర్రెలు కావడంతో గొర్రెల కాపరులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 5 లక్షల నష్టం వాటిళ్లిందని ఆవేదన చెందుతున్నారు.

కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి పనులకు ఆటంకం ఏర్పడింది. గనుల్లో భారీగా వర్షం నీరు వచ్చి చేరడంతో మోటార్ల సాయంతో నీటిని తోడేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా భద్రాద్రిలో క్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. చత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపెరు ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి పెరిగింది. దీంతో 15 గేట్లు ఎత్తి 51వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రామగుండంలో అత్యధికంగా 13.8 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. రామగుండంలోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనులపై వర్షం ప్రభావం పడింది. దీంతో నాలుగు ఓపెన్‌ కాస్ట్‌లలో లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో 10 గేట్లను ఎత్తి 519 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షం నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లిలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షం కారణంగా కాకతీయ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం చండ్రుపల్లి వాగు టూరిస్టుల బస్సు చిక్కుకుంది. అన్నారం బ్యారేజీ చూసేందుకు వెళ్తున్న టూరిస్టుల బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. స్థానికులు స్పందించి బస్సును వరద నీటి నుండి బయటకు తీసుకువచ్చారు. భారీ వర్షాలకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంలోని వాగులు, కుంటలు, చెరువులు వర్షపు నీటితో నిండిపోయాయి. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భారీ వర్షాలతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితోపాటు మూడు రోజులుగా కురుస్తున్న వర్షం ధాటికి కృష్ణానది నిండుకుండలా మారింది. వరద నీరు ప్రవాహంతో బ్యారేజీ పోటెత్తడంతో అధికారులు 40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా విలీన మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో విలీన మండలాల్లోని వాగులు, వంకలు పొంగి రహదారులపై ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ ఒరిస్సా ఉత్తర కోస్తాను ఆనుకొని కొనసాగుతోన్న ఉపరితలం ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 

21:19 - August 12, 2018

విజయవాడ : కేసుల నుండి తప్పించుకునేందుకే జగన్‌ పాదయాత్రల పేరుతో జనం మధ్య తిరుగుతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. జగన్‌పై ఈడీ కేసులు నమోదు చేస్తుంటే దానిని కూడా వైసీపీ రాజకీయం చేస్తుందన్నారు. విజయవాడ కృష్ణలంక పరిధిలోని నెహ్రూనగర్‌లో ఓ రేషన్‌ దుకాణాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్‌ సరఫరాలో డీలర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

21:18 - August 12, 2018

నిజామాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో నిజామామాద్‌ మాజీ మేయర్‌, టీఆర్‌ఎస్‌ ఎంపీ డీఎస్‌ తనయుడు సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సంజయ్‌పై నిర్భయ చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు విచారించే కోర్టులో సంజయ్‌ని హాజరుపరుస్తారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన సంజయ్‌, అజ్ఞాతం వీడి ఏసీపీ కార్యాయంలో విచారణకు హారజయ్యారు. సంజయ్‌ని మూడు గంటలపాటు వించారించిన పోలీసులు... లైగింక వేధింపుల ఆరోపణలపై ప్రశ్నించారు. సంజయ్‌ తమను లైంగికంగా వేధించారలని శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినులు ఇటీవల హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. నాయిని సూచనతో నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తీకేయశర్మను కలిసి, సంజయ్‌ లైంగిక వేధింపులను ఆయన దృష్టికి తెచ్చారు. సంజయ్‌పై రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో... అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈనెల 12వ తేదీలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ ఆగస్టు 10న సంజయ్‌ ఇంటికి నోటీసు అంటించారు. దీంతో అజ్ఞాతం వీడిన సంజయ్‌... తన న్యాయవాదులతో కలిసి ఏసీపీ ముందు విచారణకు హాజరయ్యారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు సంజయ్‌ని మూడు గంటపాటు ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అయితే రిమాండ్‌ విధించకుండా సోమవారం ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు విచారించే కోర్టులో హాజరుపరిచే వరకు పోలీసులు అదుపులోనే ఉంచుతూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్‌పై నిర్భయ చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపు నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. 342,354, 354ఏ, 506, 509 సెక్షన్లు పెట్టారు. సోమవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు విచారించే కోర్టులో సంజయ్‌ను హాజరుపరచనున్నారు. 

కేరళకు విజయ్ దేవరకొండ సాయం...

కేరళ : వరద బాధితుల కోసం ఇప్పటికే నటులు విశాల్‌, సూర్య, కార్తి తదితరులు విరాళాలిచ్చి తమ వంతు సహాయం చేశారు. విశాల్‌ కేరళ రెస్క్యూ పేరుతో అత్యవసర వస్తువులను సేకరిస్తున్నారు. తాజాగా విజయ్‌ దేవరకొండ కూడా తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కేరళ వాసుల కోసం 5 లక్షల విరాళం ఇచ్చారు.

ఆదుకుంటామన్న పినరయి విజయన్...

కేరళ : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అయింది. అనేక ప్రాంతాల్లో వరద ముంపు ఇంకా వీడలేదు. ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ బాధితుల కోసం సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం...

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

21:04 - August 12, 2018

చిత్తూరు : ఎస్వీ మెడికల్‌ కాలేజీలో మరో మెడికో ఆత్మహత్య చేసుకుంది. ఎంబీబీఎస్‌ సెంకడ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థిని గీతిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శిల్ప వ్యవహారం సద్దుమనగక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్విమ్స్‌లో ప్రొఫెసర్ల వేధింపులపై గత కొన్నిరోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

పశ్చిమగోదావరి జిల్లా కాలుష్యం పట్టదా - పవన్...

పశ్చిమగోదావరి : జిల్లా కాలుష్యం బారిన పడుతుంటే ఎవరికీ పట్టదా ? అని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వ్యవసాయం, ఆక్వా సాగు జాగ్రత్తగా చేయాల్సి ఉందని..గోదావరి జలాలను జాగ్రత్తగా ఉపయోగించుకోకపోతే నీళ్లకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. 

అవినీతి లేదా ? సిగ్గుండాలి - పవన్...

పశ్చిమగోదావరి : ఏపీ రాష్ట్రంలో అవినీతి లేదా ? సిగ్గుండాలి అని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తణుకులో ఆయన పర్యటిస్తున్నారు. వీధి దీపాలు వెలుగుతున్నాయా ? లేదా అని సచివాలయంలో కూర్చొని చూస్తానని అంటున్నారని..కానీ ఇరగవరంలో జరుగుతున్న దోపిడి ఎందుకు తెలియడం లేదని పవన్ ప్రశ్నించారు. ఇరగవరంలో కల్వపాడు గ్రామంలో డ్వాక్రా గ్రూపు వారివి ఫోర్జరీ చేసి 250 ఖాతాలు ఓపెన్ చేసి రూ. 4 కోట్లను టిడిపి నేతలే దోచేశారని ఆరోపించారు. 

20:23 - August 12, 2018

జనసేన అండతోనే 15 సీట్లు - పవన్...

పశ్చిమగోదావరి : జిల్లాలో ఎటు చూసినీ నీళ్లే ఉన్నాయని...జనసేన అండగా ఉండబట్టే 15 సీట్లు వచ్చాయని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ నాలుగేళ్లు అయిపోయిన తరువాత తణుకులో రోడ్లు ఎలా ఉన్నాయి ? అని ప్రశ్నించారు. 

తణుకు ఎమ్మెల్యేపై పవన్ విమర్శలు...

పశ్చిమగోదావరి : తణుకు ఎమ్మెల్యేపై సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. పోలీసుల కాలర్ ను పట్టుకుంటారని..ఎమ్మెల్యేలు చట్టానికి అతీతులా ? అని ప్రశ్నించారు. దోపిడి..దౌర్జన్యం రాజ్యం వైసీపీ చేస్తుందని టిడిపికి సపోర్టు ఇవ్వడం జరిగిందన్నారు. 

బాబు ఎప్పుడూ రెండు వేళ్లు చూపిస్తారు - పవన్...

పశ్చిమగోదావరి : ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు ఎప్పుడూ రెండు వేళ్లు చూపిస్తారని, జనసేన పిడికిలి చూపిస్తుందని జనసేన అధినేత పవన్ తెలిపారు. తణుకులో ఆయన ప్రసంగిస్తున్నారు. రెండు వేళ్లతో అన్నం తినమని ఎద్దేవా చేశారు. పార పట్టుకోవాలంటే పిడికిలితో పట్టుకోవాలన్నారు. టిడిపి పార్టీ అంటే ఒకవేలు బాబు..రెండో వేలు లోకేష్ దన్నారు. 

తణుకులో ప్రసంగిస్తున్న పవన్...

పశ్చిమగోదావరి : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తణుకులో పర్యటిస్తున్నారు. ఆదివారం సాయంత్రం బహిరంగలో మాట్లాడుతున్నారు. 

ఆదిలాబాద్ లో భారీ వర్షాలు...

ఆదిలాబాద్ : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, ప్రాజెక్టులతో పాటు, ప్రాణహిత, పెనుగంగ నదుల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి.

పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నాం - సీపీఐ...

రాజమండ్రి : సీఎం చంద్రబాబు నాయుడు కాలంలో అభివృద్ధి కంటే అప్పులు పెరిగాయని సీపీఐ నేత రామకృష్ణ వెల్లడించారు. జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబు తరహ పాలననే వస్తుందని, పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. జనసేన..వామపక్షాల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ ప్రకటిస్తున్నామని తెలిపారు. 

19:46 - August 12, 2018

చిత్తూరు : ఎస్వీ మెడికల్ కాలేజీలో ఏం జరుగుతోంది ? మెడికల్ స్టూడెంట్స్ ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ? ఇటీవలే శిల్ప ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఈ వ్యవహారం సద్దుమణగకముందే మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న గీతిక విద్యార్థిని ఆదివారం హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్విమ్స్ లో ప్రొఫెసర్ల వేధింపులపై గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి.

రుయా ఆసుపత్రికి గీతిక మృతదేహాన్ని తరలించారు. విషయం తెలుసుకున్న గీతిక తల్లి ఆసుపత్రికి చేరుకుంది. అసలు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో తెలియరావడం లేదు. ఇదిలా ఉంటే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి వెనుక కుటుంబ తగదాలు...ప్రేమ వ్యవహరమే కారణమని తెలుస్తోంది. 

మరో మెడికో స్టూడెంట్ బలవన్మరణం...

చిత్తూరు : ఎస్వీ మెడికల్ కాలేజీలో మరో మెడికో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనంగా మారింది. ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న గీతిక విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శిల్ప వ్యవహారం సద్దుమణగకముందే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. స్విమ్స్ లో ప్రొఫెసర్ల వేధింపులపై గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. 

19:20 - August 12, 2018

మెడికల్ కాలేజీలో గత కొంతకాలంగా అనేక ఆత్మహత్యలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే తిరుపతిలో మెడికల్ విద్యార్థి శిల్ప ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఆత్మహత్యకు ప్రొఫెసర్ల వేధింపులే కారణమని విద్యార్థులు..కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న ఆత్మహత్యలకు గల కారణాలు ఏంటీ ? తదితర విషయాలపై టెన్ టివి ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో అనంతపురం మెడికల్ కాలేజీ అసొసియేట్ ప్రొఫెసర్ ఆదిశేషమ్మ, నిమ్స్ న్యూరో సర్జెన్ రెసిడెంట్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివానందం, ఉమెన్ యాక్టివిస్ట్ వనజ పాల్గొని అభిప్రాయాలు తెలియచేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

ఇవ్వని హామీలు అమలు - హరీష్ రావు...

హైదరాబాద్ : రాష్ట్రంలో నిరంత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం ప్రభుత్వం వినూత్నరీతిలో అమలు చేస్తున్నామని, ఇతర రాష్ట్రాల ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. 

నగరంలో మహిళపై సామూహిక అత్యాచారం...

హైదరాబాద్ : ఎస్సార్ నగర్ పరిధిలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బాధితురాలు ఆరోపిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత మహిళ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. 

టీఆర్ఎస్ విధానాలను ఎండగడుతాం - ఉత్తమ్...

హైదరాబాద్ : రాహుల్ టూర్ లో టీఆర్ఎస్ విధానాలను ఎండగడుతామని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ వేవ్ లో టీఆర్ఎస్ కొట్టుకపోవడం ఖాయమని స్పష్టం చేశారు. 

18:57 - August 12, 2018

చెన్నై : హీరో విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ కారుతో బీభత్సం సృష్టించాడు. వేగంగా కారు నడుపుతూ ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆటో డ్రైవర్‌ కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్న పాండి బంజార్‌ పోలీసులు.. ధృవ్‌ను విచారిస్తున్నారు. 

18:56 - August 12, 2018

హైదరాబాద్ : మెట్రో రైల్ ఫస్ట్ మైల్ - లాస్ట్ మైల్ కనేక్టివిటి నగర రూపురేఖలు మారుస్తుందా? ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రయాణికులకు సరికోత్త అనుభూతి తీసుకురానుందా?.. అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు మెట్రో అధికారులు. నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించే దిశగా మెట్రో రైల్ స్టాటరఫ్ లతో సరికొత్త కాన్సెప్ట్ లను ప్రయాణికులకు పరిచయం చేయబోతుంది. ఇందుకోసం స్మార్ట్ మెబైలిటీ స్టాటరఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మెట్రో అధికారుల అంటున్నారు.

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభం అయి దాదాపు 8 నెలలు పూర్తి కావస్తోంది.అయినా ఇప్పటి వరకు మెట్రో స్టేషన్ నుండి పలు కాలనీలకు ఎలాంటి రవాణ సదుపాయం లేదు. దీంతో ప్రయాణికులు మెట్రో ఎక్కాలంటే పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. అందుకు ప్రధాన కారణం రవాణ సదుపాయం లేకపోవడమే.అయితే మెట్రో కనెక్టివిటీ కోసం ఆర్టీసీ 100 బస్సులను కేటాయిస్తామని ప్రకటించినా అచరణలో మాత్రం అది జరగలేదు.

కనెక్టివిటీ కష్టాల నుండి గట్టెక్కడానికి మెట్రో అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికి పలు స్టేషన్ లో బైకులు, సైకిళ్లు, కార్లు ఏర్పాట్లు చేసినా అంత పెద్దగా రెస్పాండ్ రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం అధిక ధరలు ఉండడంతో ప్రయాణికులు వాటిపై మొగ్గు చూపడం లేదు.దీంతో హెచ్ఎంఆర్ తక్కువ ధర భద్రతతో కూడిన ప్రయాణం అందించే సంస్థల ఎంపిక కోసం ప్రయత్నిస్తోంది. దీంతో ఆయావిభాగాల్లో స్టార్టఫ్‌తో స్మార్ట్ మెబైలిటీ ఫెస్టివల్ నిర్వహించింది.వీటిలో మెట్రో ప్రయాణికులకు మంచి సేవలు ఇచ్చేవారందరికి అవకాశం కల్పిస్తామంటున్నారు మెట్రో అధికారులు.

స్మార్ట్ మెబైలిటీ స్టాటరఫ్ ఫెస్టివల్ లో పాల్గొన్న వివిధ సంస్ధలు తమ తమ సేవలను ప్రదర్శనకు పెట్టారు. కమ్యూనిటీ షేరింగ్ కోసం ప్రత్యేక యాప్ రూపొందించారు మెట్రో అధికారులు. ఒకే ప్రాంతంలో ఉన్న వారు కార్లను షేర్ చేసుకోనేలా ఫ్లాన్ చేశారు.దీంతో తక్కువ ఖర్చులో వెళ్లాడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు. ఒకే వాహనంలో ఎక్కువ మంది ప్రయాణించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయని అంటున్నారు. ఇప్పటికి వరకు వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన బైకులకు అధిక ధరలు ఉన్నాయి. నూతన అవిష్కరణదారుల మధ్య పోటీ పెట్టి తక్కువ ఖర్చుతో ప్రయాణికులకు అందుబాటులో వచ్చేందుకు ఫ్లాన్ చేస్తున్నారు మెట్రో అధికారులు. ఈ సారైనా హెచ్ఎంఆర్ సక్సేస్ అవుతుందా లేక ఎప్పటిలాగే మెట్రో కనెక్టివిటి కష్టాలు తప్పవా అనేది వేచి చేడాల్సిందే.

18:55 - August 12, 2018

విజయవాడ : ఒకప్పుడు వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను మట్టి కరిపించిన నేతలు... పదునైన మాటలతో ఎదుటి వారికి చెమటలు పట్టించిన నాయకులు.... వారు మైక్‌ పట్టుకుంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. కానీ అదంతా గతం... ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయ్యింది. మాటలు మరాఠీలు మూగబోయారు. ఇంతకీ ఎవరా నాయకులు ? ఏంటా స్టోరీ. దృఢమైన దేహం కాదు... పదునైన మాట కలిగినవాడే నిజమైన నాయకుడు అంటారు. ఎంత వాక్చాతుర్యం ఉంటే అంత పవర్‌ఫుల్‌ లీడర్‌ అవుతారన్నది జగమెరిగిన సత్యం. ఆనాడు నందమూరి తారక రామారావు ఢిల్లీ మెడలు వంచాలి అన్న పిలుపు... ప్రజల్ని ఎంతగానో ప్రభావితం చేసింది. యువత రాజకీయాల్లోకి రావాలంటూ ఆయనిచ్చిన సందేశం తెలుగు నేలపై ఎంతో బలమైన వాగ్ధాటి కలిగిన నాయకులకు రూపునిచ్చింది.

ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించిన తొలినాళ్లలో యువతను పెద్ద ఎత్తున టీడీపీలోకి ఆహ్వానించారు. బలమైన నాయకత్వ లక్షణాలున్న యువనేతల్ని పార్టీలోకి చేర్చుకున్నారు. వాగ్ధాటి కలిగిన వారిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కోటగిరి విద్యాధరరావు, మోత్కుపల్లి, నాగం, ఉమ్మారెడ్డి, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంటి ఎంతో పదునైన మాటతీరు కలిగిన నేతలంతా రూపుదిద్దుకున్నారు. ఫలితంగా టీడీపీ స్థాపించిన తొలినాళ్లలోనే అనేక విజయాలను సొంతం చేసుకుంది.

అప్పట్లో మెడికల్‌ కాలేజీల కేటాయింపులో జరిగిన అవినీతిపై పెద్ద ఎత్తున పోరాటం చేసి నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి ప్రభుత్వాన్నే మార్చిన చరిత్ర నాటి తెలుగుదేశం నేతలది. కోడెల, యనమల, విద్యాధర్‌ రావు, అశోక్‌గజపతిరాజు, మోత్కుపల్లి, ఇంద్రారెడ్డి, కరణం బలరాం, దేవినేని లాంటి నేతలు అసెంబ్లీలో బలమైన వానిని వినిపించగా... తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నాగం జనార్ధన్‌ రెడ్డి, దేవేందర్‌ గైడ్‌ లాంటి నేతలు అసెంబ్లీ బయట ప్రజాక్షేత్రంలో తమ వాగ్ధాటితో నాటి అధికార పార్టీని ఎండగట్టేవారు.
2004 సంవత్సరం తర్వాత పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, దూళిపాళ్ల నరేందర్, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎర్రబెల్లి, రేవంత్‌ రెడ్డి వంటి నేతలు తమ వాగ్ధాటిని ప్రదర్శించేవారు. నన్నపనేని రాజకుమారి లాంటి నేతలు సైతం తమ వంతుగా ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేలుస్తూ.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై పోరాటం చేశారు.

అయితే ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణలో బలమైన నాయకులు పార్టీకి దూరం కాగా.. ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ స్పందించే నేతల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంది. అధికారం వచ్చిన తొలినాళ్లలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పినప్పటికీ... ప్రస్తుతం నాయకులంతా మూగబోయారు. దీంతో ప్రతిపక్షాలకు సరైన సమాధానం చెప్పే వాగ్దాటి లేమి టీడీపీలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అటు రాజ్యసభలోనూ టీడీపీ ఎంపీల పేలవమైన ప్రదర్శన పార్టీకి మైనస్‌గా మారింది.

టీడీపీకి స్పీకర్‌ల లేమిపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సమస్యలను అధిగమించేందుకు యువతను ప్రోత్సహించాలని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యువ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, గల్లా జయదేవ్‌ లాంటి నేతలకు అవకాశం ఇవ్వడంతో పార్లమెంట్‌లో టీడీపీ సత్తా చాటారు. ఈ నేపథ్యంలో లోక్‌సభలో యువనేతలను ప్రోత్సహించి సక్సెస్‌ సాధించడంతో ఇటు రాష్ట్రంలోనూ ఇదే తరహా ఫార్ములా వర్కవుట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు చంద్రబాబు. పదునైన వాయిస్‌ ఉన్న నేతలకు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

18:51 - August 12, 2018

విజయవాడ : విజయవాడ : వెట్టిచాకిరి నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని పాలకులు చెబుతున్నా.. అది అందని ద్రాక్షగానే కనిపిస్తోంది. చట్టాలను పరిరక్షించాల్సిన చోటే... కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా సర్కార్‌ కళ్లులేని కబోదిలా వ్యవహరిస్తోంది. ఈ శ్రమదోపిడీ ఎక్కడో కాదు... సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోనే జరగడం దారుణం.

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో దాదాపు 130 మంది కార్మికులు హౌజ్‌ కీపింగ్‌ పనులు చేస్తున్నారు. అయితే వీరిలో చాలా వరకు రాజధాని అమరావతి నిర్మాణానికి పంటపొలాలు కోల్పోయిన రైతులు, రైతు కూలీలు ఉన్నారు. దీంతో రైతు కూలీలలో కొందరికి సచివాలయంలో హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగాలు ఇచ్చారు. అయితే సచివాలయంలో హౌస్‌కీపింగ్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఎస్‌కె ఎంటర్‌ప్రైజేస్‌ సంస్థ.. వీరితో పనులు చేయిస్తోంది. కూలీ పనులు లేకపోవడంతో ఈ పనులు చేసేందుకు వచ్చిన కార్మికులతో ఆ సంస్థ వెట్టిచాకిరి చేయిస్తోంది. లేబర్‌యాక్ట్‌ ప్రకారం కార్మికులతో రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేయించాల్సిన సంస్థ.. వారితో 10 గంటలు శ్రమదోపిడీ చేస్తోంది. అంతేగాక నెలకు ఎనిమిది వేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి.. ఫీఎఫ్‌ కటింగ్‌ పేరుతో 6,400 రూపాయలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంటోంది. పీఎఫ్‌ నెంబర్‌ చెప్పమని ఎవరైనా కార్మికులు అడిగితే వారిని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. మరోవైపు ఇచ్చే జీతం కూడా సరిగ్గా ఇవ్వకుండా రెండు, మూడు నెలలకోసారి ఇస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాక ఎస్‌.కె. ఎంటర్‌ ప్రైజెస్‌ ఉద్యోగులు మహిళలపై వేధింపులకు పాల్పడిన ఘటనలు కూడా కోకొల్లలు ఉన్నాయి. వారి వేధింపులు తట్టుకోలేక బాధిత మహిళలు జర్నలిస్టుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్టులు ఈ అంశాన్ని... ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్‌ దృష్టికి వెళ్లటంతో... ఇంటెలిజెన్స్‌ రిపోర్టు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. నివేదికలోనూ మహిళలపై ఆరోపణలు నిజమేనని తేలడంతో... ఎస్‌కే ఎంటర్‌ప్రైజెస్‌ ఇన్‌చార్జ్‌ రావ్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.
పేదవాడి కోసం పెదవికి చేటు అన్నట్టు రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చి ఉపాధి కోల్పోయిన వారిని మాత్రమే సచివాలయంలో హౌస్‌కీపింగ్‌లో నియమించాలి. కానీ... కాంట్రాక్ట్‌ సంస్థ మాత్రం వారితో రోడ్లను సైతం ఊడిపిస్తున్నారు. చేసే పనులు అలవాటు లేక.. మరోవైపు ఉపాధి లేకపోవడంతో... వారు చీపుర్లు పట్టుకుని కిలోమీటర్ల రోడ్లను ఊడుస్తున్నారు. ఇదిలావుంటే.. మరోవైపు హౌస్‌కీపింగ్‌ కార్మికులకు సచివాలయ క్యాంటీన్‌లో వివక్ష కొనసాగుతోంది. ఉద్యోగులకు ఇచ్చే సబ్సిడీ భోజనం సైతం వీరికి పెట్టడం లేదు. పాలకులు ఉండే సచివాలయంలోనే కార్మికులను దోపిడీ గురి చేస్తుంటే... మరి ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువురంటున్నారు. 

తణుకులో పవన్...

పశ్చిమగోదావరి : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర కొనసాగిస్తున్నారు. కాసేపట్లో తణుకులోని నరేంద్ర చౌరస్తాలోబహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. వర్షం పడుతున్నా భారీగా పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు. 

17:30 - August 12, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు వణుకు పుడుతోందని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. రాహుల్ పర్యటనతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతుందన్నారు. ఈనెల 13, 14వ తేదీల్లో రాహుల్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. జంటనగరాల్లో వివిధ కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ తో టెన్ టివితో ముచ్చటించింది. నాలుగేళ్ల తరువాత మోడీ..కేసీఆర్ లు మోసం చేశారనే భావన తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో నెలకొందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తరువాత కాంగ్రెస్ ఏం చేయబోతుందనే దానిపై వివరిస్తామన్నారు. కేసీఆర్ విధానాలను. మోడీ విధాపాలపే రాహుల్ ఎండగట్టనున్నారని ఉత్తమ్ తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

17:22 - August 12, 2018

హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం వెల్లడించారు. గో సంక్షరణ కోసం తాను రాజీనామా చేసినట్లు మీడియాకు తెలిపారు. రాజీనామాను పార్టీ అధ్యక్షుడికి పంపించడం జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా ఎద్దులు..గోవులను వధిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ఒక చట్టం ఉందని..ఆ చట్టం ప్రకారం ఒక ఆవు..ఎద్దును అక్రమంగా వధిస్తే అరెస్టు చేయాల్సి ఉందన్నారు. కానీ తెలంగాణలో ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయని..కేసీఆర్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని..ఎక్కడ తిప్పితే అక్కడకు వెళుతుందని ఎద్దేవా చేశారు. 

17:10 - August 12, 2018

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు డివిజన్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బ్యారేజీలకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీనితో వాగులు..వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనితో పలు ప్రాజెక్టులను సందర్శించేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర వాటిని చూసేందుకు సంగారెడ్డి జిల్లాకు చెందిన కొంతమంది టూరిస్టు బస్సుల్లో ప్రయాణమయ్యారు. మహాదేవపూర్ మండలం చండ్రుపల్లి వద్దకు రాగానే వాగు ఉధృతి ఎక్కువ కావడంతో బస్సు ముందుకెళ్లలేక మధ్యలో చిక్కుకపోయింది. దీనితో బస్సులో ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు గమనించి అతి కష్టం మీద ప్రయాణీకులను బయటకు సురక్షితంగా తీసుకొచ్చారు. అనంతరం తాడుల సహాయంతో బస్సును బయటకు లాగారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు..వంకలు పొర్లుతుండడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిత్యావసర సరుకులు తీసుకరావడానికి..ఆసుపత్రికి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం..అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

వాగులో చిక్కుక్కున్న టూరిస్టు బస్సు...

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహాదేవ్ పూర్ మండలం చండ్రుపల్లి వాగులో ఓ టూరిస్టు బస్సు చిక్కుకపోయింది. స్థానికుల సహకారంతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. 

16:40 - August 12, 2018
16:34 - August 12, 2018

ప్రకాశం / విశాఖపట్టణం : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ నుండి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ జలకళను సంతరించుకుంది. పాలేరు, వైరా, మధిర ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రకాశం బ్యారేజీలో వరద నీరు ఎక్కువ కావడంతో నీటిని అధికారులు కిందకు వదిలారు. మధ్యాహ్నం వరకు 20 గేట్లను ఎత్తి 30వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

విశాఖపట్టణం : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తన ప్రభావంతో రానున్న 24గంటల్లో కోస్తాంధ్రలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే రానున్న 24గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి 50-55 కి.మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. 

16:28 - August 12, 2018

ఖమ్మం : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించడంతో లోతట్టు ప్రాంతాల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. భద్రాద్రిలో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. తాలిపేరు ప్రాజెక్టుగా వరద నీరు భారీగా చేరుతోంది. 15 గేట్లు ఎత్తివేసి 51వేల క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు వదిలేశారు. కిన్నెరసాని ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేసి 4500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేశారు. 

16:17 - August 12, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓయూలో పర్యటనకు అనుమతిని నిరాకరించడంపై రగడ కొనసాగుతోంది. భద్రత కల్పించలేనప్పుడు సీఎంగా కొనసాగే అర్హత కేసీఆర్ కు లేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై ఆయనతో టెన్ టివి మాట్లాడింది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓయూ విద్యార్థులు నిషేధించారని, ఈ నిషేధాన్ని జీర్ణించుకోలేక రాహుల్ కు భద్రతను సీఎం కేసీఆర్ నిరాకరించారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ దే విజయమన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:05 - August 12, 2018

ముస్లింలకు అండగా జనసేన...

విజయవాడ : ముస్లింకు అండగా జనసేనే ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ ప్రకటించారు. ముస్లింకుల సచ్చార్ కమిటీ రిపోర్టుని బలంగా అమలు చేస్తామని మానిఫెస్టోలో పెట్టబోతున్నట్లు వెల్లడించారు. 

15:19 - August 12, 2018

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ లోని భాష్యం స్కూల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు ఉవ్వెతున్న ఎగిసిపడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అప్పటికే ఆ స్కూల్ బస్సు మంటల్లో కాలిపోయింది. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. 

15:18 - August 12, 2018

హైదరాబాద్ : ప్రముఖ షట్లర్ పీవీ సింధు ఆదివారం లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మహంకాళీ అమ్మవారికి మారు బోనం సమర్పించారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందచేశారు. అనంతరం సింధు మీడియాతో మాట్లాడారు. బోనాల పండుగకు రాలేదని..మ్యాచ్ కారణంగా రాలేకపోయానన్నారు. ఏషియన్ గేమ్స్ లో బాగా ఆడాలని కోరుకున్నట్లు, అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. ఒలింపిక్స్ అనంతరం బోనాల పండుగ సందర్భంగా ఈ ఆలయానికి వస్తున్నానని తెలిపారు.

కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం...

హైదరాబాద్ : కూకట్ పల్లిలో భాష్యం స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. 

కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం...

హైదరాబాద్ : కూకట్ పల్లిలో భాష్యం స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. 

15:09 - August 12, 2018

ప్రకాశం : ఈడీ ఛార్జీషీట్ లో వైఎస్ భారతి పేరు చేర్చడం...దానిపై తీవ్రస్థాయిలో స్పందించిన వైసీసీ అధ్యక్షుడు జగన్ బహిరంగంగా ప్రజలకు లేఖ రాయడం..దీనిపై ఏపీ టిడిపి మంత్రులు విమర్శలు చేయడం..ప్రతిగా వైసీపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. తాజాగా రోజా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై దుమ్మెత్తిపోశారు. టిడిపి మంత్రులు దిగజారి వైఎస్ భారతిపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఏడేళ్లుగా సీబీఐ విచారణలో లేని భారతి పేరు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. జగన్ సతీమణి భారతిని రాజకీయ వివాదాల్లోకి లాగడం సరికాదని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా కుటుంబసభ్యులున్నారని పేర్కొన్నారు. కుటుంబసభ్యులను వివాదలోకి లాగడం నీచమని, తప్పు చేయని కుటుంబాన్ని రాజకీయంగా కుంగదీయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. ఒక రోజు వస్తుందని రోజా పేర్కొన్నారు.

టిడిపి మంత్రులు దిగజారుతున్నారు - రోజా...

ప్రకాశం : టిడిపి మంత్రులు దిగజారి వైఎస్ భారతిపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఏడేళ్లుగా సీబీఐ విచారణలో లేని భారతి పేరు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు.

 

రాహుల్ కు టూర్ కు భద్రత కల్పించలేరా - రేవంత్...

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టూర్ కు భద్రత కల్పించలేమని కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమని కాంగ్రెస్ నేత రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వం రక్షణ కల్పించలేమన్నందుకే వీసీ నో చెప్పారని, ఒక ఎంపీకి భధ్రత కల్పించలేని కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. 

ఈడీ కేసులు నమోదు చేస్తే రాజకీయాలా ? - ప్రత్తిపాటి...

విజయవాడ : జగన్ అవినీతిపై ఈడీ కేసులు నమోదు చేస్తే దానిని కూడా రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి విమర్శించారు. ప్రజల మీద ప్రేమ ఉంటే దోచుకున్న ప్రజాధనాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలని సూచించారు.

ఈడీ కేసులు నమోదు చేస్తే రాజకీయాలా ? - ప్రత్తిపాటి...

విజయవాడ : జగన్ అవినీతిపై ఈడీ కేసులు నమోదు చేస్తే దానిని కూడా రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి విమర్శించారు. ప్రజల మీద ప్రేమ ఉంటే దోచుకున్న ప్రజాధనాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పాలని సూచించారు.

14:44 - August 12, 2018

ఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ త్వరలో బీసీసీఐ ప్రెసిడెంట్‌ కానున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్‌ వర్గాలు. బీసీసీఐ కొత్త రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ఆమోదించటంతో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాల పరిమితి కారణంగా బోర్డులోని సీనియర్లు ప్రెసిడెంట్‌ పదవికి దూరం కానున్నారు. దీంతో వీరంతా గంగూలీపై దృష్టిపెట్టారు.

ఒకప్పటి టీమిండియా కెప్టెన్‌, క్రికెట్‌ అసోయేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ త్వరలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోధా సంస్కరణల్లో కొన్నింటికి సవరణలు చేసిన సుప్రీంకోర్టు.. బోర్డు నూతన రాజ్యాంగాన్ని ఇటీవలే ఆమోదించింది. దీంతో బోర్డుకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే పదవీ కాలంపై నిబంధన కారణంగా ప్రస్తుత, గత పాలకుల్లో ఎక్కువమంది పోటీ పడేందుకు అవకాశం లేదు. గతంలో ఒక పర్యాయం.. తర్వాత మూడేళ్ల విరామం ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సవరించింది. దీని స్థానంలో వరుసగా రెండు పర్యాయాలు పదవిలో ఉండే అవకాశాన్ని సభ్యులకు కల్పించింది.

ఐతే రాష్ట్ర సంఘం, బీసీసీఐ పదవులు కలిపి పదవీ కాలం వరుసగా ఆరేళ్లకు మించకూడదని సుప్రీంకోర్టు నిబంధన పెట్టింది. దీని ప్రకారం ప్రస్తుతం బోర్డులోని చాలామంది సీనియర్లు పదవులకు దూరం కావాల్సి వస్తుంది. దీంతో సీనియర్లు గంగూలీపై దృష్టిసారించారు. బోర్డు అధ్యక్ష పదవి ఎన్నికల్లో పలువురు మాజీ క్రికెటర్లకు చాన్స్‌ ఉన్నా.. ఎక్కువ అవకాశాలు గంగూలీకే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక కెప్టెన్‌గా టీమ్‌ఇండియాకు కొత్త రూపు తెచ్చిన సౌరభ్‌ గంగూలీ.. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బీసీసీఐని బలమైన శక్తిగా మార్చగలడా అనే సందేహాలు క్రికెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే మెజారిటీ సభ్యులు గంగూలీ మాత్రమే ప్రెసిడెంట్‌ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించగలడని భావిస్తున్నారు. పలు నిర్ణయాలతో వివాదాస్పదం అవుతున్న బీసీసీఐని గాడిలో పెట్టడం గంగూలీకి సాధ్యమవుతోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తున్నాడో చూపిస్తున్నారు. క్రికెట్‌ అసోయేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలను సరిగ్గా నిర్వహిస్తుండటంతోనే గంగూలీ బీసీసీఐ పదవికి నామినేట్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

అయితే సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఎన్నికైతే రెండేళ్ల తర్వాత అతను ఆ పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. రాష్ట్ర సంఘం, బీసీసీఐ పదవులు కలిపి పదవీ కాలం ఆరేళ్లకు మించకూడదనే సుప్రీంకోర్టు నిబంధన నేపథ్యంలో.. గంగూలీ రెండేళ్ల తర్వాత వైదొలుగుతారు. ఇప్పటికే క్యాబ్‌ అధ్యక్షుడిగా గంగూలీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అయితే గూంగూలీ రెండేళ్లు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నా బోర్డు శక్తిమంతంగా మారుతుందని సీనియర్లు భావిస్తున్నారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడి పదవి గంగూలీని వరిస్తే... ఎంతమేరకు సమర్థవంతంగా నిర్వహించగలడో వేచి చూడాలి. 

14:37 - August 12, 2018

పెద్దపల్లి : చుట్టూ నీళ్లు..మధ్యలో కార్మికులు..బిక్కు బిక్కుమంటూ గంటలు గడిపారు. చివరకు వారిని అధికారులు రక్షించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన మంథని మండలం సిరిపురంలో చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిమిత్తం పని చేస్తున్నారు. వారు రాత్రి ఇసుక దిబ్బలపై పడుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆదివారం ఉదయం పది గేట్లను అధికారులు ఎత్తివేశారు. 80 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. గోదావరి నదికి భారీగా వరద నీరు చేరడం...దీనితో ఇసుక దిబ్బలపై పడుకున్న వారు కొట్టుకపోయారు. రక్షించాలని వారు కేకలు వేశారు. దీనిని గమనించిన ప్రాజెక్టుకు సంబంధించిన యాజమాన్యం, పోలీసులు వారిని కాపాడేందుకు ఆపరేషన్ నిర్వహించారు. పడవతో వారిని రక్షించేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఎదురు గాలి వీయడంతో ఆ ప్రయత్నం విఫలం చెందింది. చివరకు ఎట్టకేలకు వారిని రక్షించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

గోదావరిలో చిక్కుక్కున్న ఇద్దరు కార్మికులు...

పెద్దపల్లి : జిల్లా మంథని మండలం సిరిపురం గోదావరిలో ఇద్దరు కార్మికులు చిక్కుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని విడుదల చేయడంతో ఉధృతి పెరగడంతో కార్మికులు వరదలో చిక్కుకుపోయారు. పడవతో కార్మికులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు జాలరులు. వరదలో కార్మికులు బిక్కుబిక్కుమంటూ రక్షించేవారి కోసం ఎదురుచూస్తున్నారు. 

జగన్‌కు.. కళా వెంకట్రావు రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే : అంబటి

హైదరాబాద్ : కాంగ్రెస్‌, బీజేపీలతో టీడీపీ లాలూచీ పడిందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. జగన్‌పై బురద జల్లి ఓట్లు సంపాదించాలనే ఆలోచనతోనే సీఎం చంద్రబాబు ఉన్నారన్నారు. చంద్రబాబు.. ప్రధానిని కలిసిన ప్రతిసారి జగన్‌ను ఎప్పుడు జైలుకు పంపుతారని అడిగేవారని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారన్నారు. జగన్‌కు.. కళా వెంకట్రావు రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయన్నారు.

హైదరాబాద్ లో ఇద్దరు ఐసిస్ సానూభూతిపరుల అరెస్టు

 హైదరాబాద్ : నగరంలో ఇద్దరు ఐసిస్ సానూభూతి పరులను ఎన్ ఐఏ అధికారులు అరెస్టు చేశారు. అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖదీర్ ల అరెస్టును ఎన్ ఐఏ ధృవీకరించారు. ఇటీవల బాలాపూర్ లోని షాయిన్ నగర్ లో సోదాలు చేసి 20 మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. మూడురోజులపాటు బేగంపేట ఎన్ ఐఏ కార్యాలయంలో వారిని విచారించారు. ఐసిస్ సిద్ధాంతాన్ని హైదరాబాద్ లో కొనసాగించేందుకు కీలకపాత్ర పోషించినట్లు విచారణలో బయపడడంతో వారిని అరెస్టు చేశారు.

13:52 - August 12, 2018

హైదరాబాద్ : నగరంలో ఇద్దరు ఐసిస్ సానూభూతి పరులను ఎన్ ఐఏ అధికారులు అరెస్టు చేశారు. అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖదీర్ ల అరెస్టును ఎన్ ఐఏ ధృవీకరించారు. ఇటీవల బాలాపూర్ లోని షాయిన్ నగర్ లో సోదాలు చేసి, 20 మందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. మూడురోజులపాటు బేగంపేట ఎన్ ఐఏ కార్యాలయంలో వారిని విచారించారు. విచారణలో బాసిత్, ఖదీర్ తీవ్రవాద చర్యలు బయటపెట్టారు. ఐసిస్ సిద్ధాంతాన్ని హైదరాబాద్ లో కొనసాగించేందుకు కీలకపాత్ర పోషించినట్లు విచారణలో బయపడడంతో వారిని అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 
 

13:42 - August 12, 2018

ఆదిలాబాద్ : జిల్లాలోని ఇచ్చోడ మండలం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై అడగామ్ వాగు పొంగిపొర్లుతోంది. సమీపంలోని పోలీసు స్టేషన్, కాలనీలోకి ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

 

13:29 - August 12, 2018

నిజామాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న సంజయ్‌.. ఈరోజు ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సంజయ్‌పై నర్సింగ్‌ విద్యార్థినులు అనేక ఆరోపణలు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంజయ్‌పై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

విచారణకు హాజరైన సంజయ్‌

నిజామాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న సంజయ్‌.. ఈరోజు ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సంజయ్‌పై నర్సింగ్‌ విద్యార్థినులు అనేక ఆరోపణలు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంజయ్‌పై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 

13:17 - August 12, 2018

హైదరాబాద్ : మెట్రో రైల్ ఫస్ట్ మైల్... లాస్ట్ మైల్ కనేక్టివిటి నగర రూపురేఖలు మారుస్తుందా? ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రయాణికులకు సరికోత్త అనుభూతి తీసుకురానుందా?.. అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు మెట్రో అధికారులు. నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించే దిశగా మెట్రో రైల్ స్టాటరఫ్ లతో సరికొత్త కాన్సెప్ట్ లను ప్రయాణికులకు పరిచయం చేయబోతుంది. ఇందుకోసం స్మార్ట్ మెబైలిటీ స్టాటరఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మెట్రో అధికారుల అంటున్నారు.
మెట్రో రైల్ ప్రారంభమై 8 నెలలు పూర్తి 
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభం అయి దాదాపు 8 నెలలు పూర్తి కావస్తోంది. అయినా ఇప్పటి వరకు మెట్రో స్టేషన్ నుండి పలు కాలనీలకు ఎలాంటి రవాణ సదుపాయం లేదు. దీంతో ప్రయాణికులు మెట్రో ఎక్కాలంటే పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. అందుకు ప్రధాన కారణం రవాణ సదుపాయం లేకపోవడమే. అయితే మెట్రో కనెక్టివిటీ కోసం ఆర్టీసీ 100 బస్సులను కేటాయిస్తామని ప్రకటించినా అచరణలో మాత్రం అది జరగలేదు.
కనెక్టివిటీ కష్టాల నుండి గట్టెక్కడానికి మెట్రో ప్రయత్నాలు 
కనెక్టివిటీ కష్టాల నుండి గట్టెక్కడానికి మెట్రో అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికి పలు స్టేషన్ లో బైకులు, సైకిళ్లు, కార్లు ఏర్పాట్లు చేసినా అంత పెద్దగా రెస్పాండ్ రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం అధిక ధరలు ఉండడంతో  ప్రయాణికులు వాటిపై మొగ్గు చూపడం లేదు.దీంతో హెచ్ఎంఆర్ తక్కువ ధర భద్రతతో కూడిన ప్రయాణం అందించే సంస్థల ఎంపిక కోసం ప్రయత్నిస్తోంది. దీంతో ఆయావిభాగాల్లో స్టార్టఫ్‌తో స్మార్ట్ మెబైలిటీ ఫెస్టివల్ నిర్వహించింది.వీటిలో మెట్రో ప్రయాణికులకు మంచి సేవలు ఇచ్చేవారందరికి అవకాశం కల్పిస్తామంటున్నారు మెట్రో అధికారులు.
ప్రతి మెట్రో స్టేషన్ లో బైకులు, కార్లు, ఆటో రిక్షాలు
స్మార్ట్ మెబైలిటీ స్టాటరఫ్ ఫెస్టివల్ లో పాల్గొన్న వివిధ సంస్ధలు తమ తమ సేవలను ప్రదర్శనకు పెట్టారు. కమ్యూనిటీ షేరింగ్ కోసం ప్రత్యేక యాప్ రూపొందించారు మెట్రో అధికారులు. ఒకే ప్రాంతంలో ఉన్న వారు కార్లను షేర్ చేసుకోనేలా ఫ్లాన్ చేశారు.దీంతో తక్కువ ఖర్చులో వెళ్లాడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు. ఒకే వాహనంలో ఎక్కువ మంది ప్రయాణించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయని  అంటున్నారు.
ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేందుకు ఫ్లాన్ 
ఇప్పటికి వరకు వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన బైకులకు అధిక ధరలు ఉన్నాయి. నూతన అవిష్కరణదారుల మధ్య పోటీ పెట్టి తక్కువ ఖర్చుతో ప్రయాణికులకు అందుబాటులో వచ్చేందుకు ఫ్లాన్ చేస్తున్నారు మెట్రో అధికారులు. ఈ సారైనా హెచ్ఎంఆర్ సక్సేస్ అవుతుందా లేక ఎప్పటిలాగే మెట్రో కనెక్టివిటి కష్టాలు తప్పవా అనేది వేచి చేడాల్సిందే.

 

13:06 - August 12, 2018

ఆసిఫాబాద్ : ప్రపంచంలో అంతరించిపోతున్న జీవజాతులలో ముందవరుసలో ఉన్న పక్షిజాతి రాబందులు అంతరించిపోతున్నాయి. ఈ అరుదైన రాబందుల ఉనికి తెలంగాణ ప్రాంతంలోని పాలరాపుగుట్ట పై ఉండటంతో వాటి సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతాన్ని "వన్యప్రాణి సంరక్షణ కేంద్రం"గా ప్రకటించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది తెలంగాణ ఆటవీ శాఖ. "జటాయు" పేరుతో ఇక్కడ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే త్వరలో "జటాయు" ఆవాస కేంద్ర ప్రారంభం కానుంది.
పాలరాపుగుట్ట పై రాబందుల ఉనికి 
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని పెంచికల్ పేట్ మండలం నందిగామ గ్రామ సమీపంలోని పాలరాపుగుట్ట పై పొడుగు ముక్కు రాబందుల ఉనికి ఉన్నట్లు నాలుగేళ్ళ క్రితం అటవీఅధికారులు గుర్తించారు. అంతరించిపోయాయనుకున్న రాబందులు రెండు తెలుగు రాష్ట్రాలలో తిరిగి ఇక్కడ కనిపించడం శుభపరిణామంగా నిపుణులు చెప్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్రపోషిస్తూ మానవ మనుగడకు దోహదపడే రాబందుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాబందుల సంరక్షణ కోసం కొన్ని నిధులను కేటాయించి, ప్రత్యేకంగా వాటి కోసం సిబ్బందిని పెట్టి, ఆ ప్రాంతంలో బేస్ క్యాంప్ పెట్టి వాటికి ఆహారం ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి ఆహారం కోసం మేకలు ఇతర జంతువులను పెంచుతున్నారు. నిత్యం సిబ్బంది వాటి దినచర్యలను కెమెరాలో ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంటారు. గుట్ట పై ఐదు ఎకరాలలో ఫెన్సింగ్ వేసారు.
ప్రాణహిత నది, పెద్దవాగు నదులు వద్ద నివాసం ఏర్పర్చుకున్న రాబందువులు
" నివాసానికి అనువుగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని అనువుగా ఎంచుకున్నాయి రాబందులు " పాలరాపు గుట్ట ప్రాంతంలో దట్టమైన అటవిలో ప్రాణహిత నది పెద్దవాగు నదులు కలయిక, పెద్దవాగును ఆనుకోని భూమి నుండి మూడు వందల మీటర్ల కు పైగా ఎత్తులో ఏటవాలుగా గుట్ట ఉంది, గుట్టలో చిన్న చిన్న రంద్రాలు ఉండటంతో ఈ గుట్టను అరుదైన "లాంగ్ బిల్ట్ వల్చర్" జాతి రాబందులు ఆవాసాలు ఏర్పరచుకుని ఉంటున్నాయి. నాలుగేళ్ళ క్రితం పది ఉన్న  రాబందులు...  ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 33కు పెరిగింది.  ఈ గుట్టలో వందకు పైగా రాబందులు నివసించే విధంగా సౌకర్యాలు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
రాబందుల అభయారణ్యం ఏర్పాటు  
అటవీ శాఖ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో రాష్ట్ర వన్యప్రాణి మండలి సర్వసభ్య సమావేశంలో పాలరాపుగుట్ట లోని రాబందుల అభయారణ్యం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. అదే క్రమంలో ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా మార్చాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఫారెస్ట్ ఉన్నతాధికారులు తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు ఆమోదిస్తే రాబందుల సంరక్షణ కు ప్రత్యేకంగా గ్రాంట్లు విడుదల కానున్నాయి.త్వరలో " జటాయు అభయారణ్యం ఏర్పాటు కానుంది.

 

12:57 - August 12, 2018

నిజామాబాద్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న సంజయ్‌.. ఈరోజు ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సంజయ్‌పై నర్సింగ్‌ విద్యార్థినులు అనేక ఆరోపణలు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంజయ్‌పై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 

 

12:54 - August 12, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌, బీజేపీలతో టీడీపీ లాలూచీ పడిందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. జగన్‌పై బురద జల్లి ఓట్లు సంపాదించాలనే ఆలోచనతోనే సీఎం చంద్రబాబు ఉన్నారన్నారు. చంద్రబాబు.. ప్రధానిని కలిసిన ప్రతిసారి జగన్‌ను ఎప్పుడు జైలుకు పంపుతారని అడిగేవారని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారన్నారు. జగన్‌కు.. కళా వెంకట్రావు రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే ఉన్నాయన్నారు. 

 

12:43 - August 12, 2018

కాకినాడ : ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి ఊపు వస్తున్నట్టు కనిపిస్తోంది. పలువురు నేతలు జనసేనలో చేరేందుక సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అధఙకార టీడీపీ నుంచి కీలక నేతలు కొందరు జనసేన వైపు మొగ్గగా.. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదేబాట పడుతున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్‌ పార్టీకి కొత్త ఊపు ఖాయంగా కనిపిస్తోంది.
జనసేనలో కొంతమంది టీడీపీ ముఖ్యనేతలు  
తూర్పుగోదావరి జిల్లాలో జనసేనలోకి వలసలు మొదలయ్యాయి. టీడీపీ నుంచి కొంతమంది ముఖ్యనేతలు జనసేనలో చేరిపోయారు. కాకినాడ మేయర్‌ పీఠం కోసం పోటీపడిన మాకినీడు శేషుకుమారి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. వెంటనే జనసేన కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు బంధువులు కూడా అదేబాట పట్టారు. ఇక తాజాగా మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణణ్‌తో పాటు ఆయన తనయుడు  ముత్తా శశిధర్‌ కూడా వైసీపీని వీడి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆయన పవన్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే జనసేనలో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. 
జనసేనలో చేరేందుకు లైన్‌లో ఉన్న కందుల దుర్గేష్‌
జనసేనలో చేరేందుకు వైసీపీ గ్రేటర్‌ రాజమంత్రి అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ కూడా లైన్‌లో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ అయిన దుర్గేష్‌  మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ఎంపీగా బరిలోకి దిగారు.  సుదీర్ఘకాలంపాటు ఆయన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అనుచరుడిగా కూడా కొనసాగారు.  అయితే ఏడాదిన్నర క్రితం వైసీపీలో చేరి... రాజమహేంద్రవరం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. కానీ వచ్చే ఎన్నికల్లో టికెట్‌ దక్కుతుందన్న ధీమా కనిపించడం లేదు. దీంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. ఈ వారంలోనే కార్యకర్తలతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.
త్వరలోనే వైసీపీని వీడనున్న దుర్గేష్‌
వాస్తవానికి దుర్గేష్‌ వైసీపీని వీడడం ఖాయం అయిపోయింది. ఇక నుంచి  ఆయన పయనం జనసేనతోనేనని సన్నిహితులు కూడా చెప్తున్నారు. త్వరలో పవన్‌ రాజమహేంద్రవరంలో అడుగుపెట్టగానే ఆ పార్టీ కండువా కప్పుకునే అవకాశముంది.  అదే సమయంలో రాజమహేంద్రవరం రూరల్‌ స్థానం కోసం ఆయన పోటీపడతారని అందరూ భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసిన దుర్గేష్‌ రాకతో రాజమహేంద్రవరంలో జనసేన పుంజుకునే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. ఆయనకు తోడుగా మరికొంతమంది నేతలు కూడా జనసేనలోకి జంప్‌ అయ్యే అవకాశాలు స్పష్టం ఉన్నాయి. మొత్తంగా గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి నేతల లోటు లేకుండా పోతోంది. పలువురు వరుసగా కండువాలు కప్పుకునేందుకు సిద్దపడుతున్న తరుణంలో ఆ పార్టీ తన శ్రేణులను ఎలా సమాయాత్రం చేస్తుందననేది ఆసక్తిగా మారింది. కొత్త నేతల విషయంలో పవన్‌ ఎలాంటి వైఖరితో సాగుతారో చూడాలి.

 

12:37 - August 12, 2018

చెన్నై : తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

 

ఆటోను ఢీకొట్టిన హీరో విక్రమ్ కుమారుడి కారు

తమిళనాడు : చెన్నైలో హీరో విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ కారుతో బీభత్సం సృష్టించాడు. వేగంగా కారు నడుపుతూ ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆటోడ్రైవర్‌ కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్న పాండి బంజార్‌ పోలీసులు.. ధృవ్‌ను విచారిస్తున్నారు. 

12:30 - August 12, 2018

తమిళనాడు : చెన్నైలో హీరో విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ కారుతో బీభత్సం సృష్టించాడు. వేగంగా కారు నడుపుతూ ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆటోడ్రైవర్‌ కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్న పాండి బంజార్‌ పోలీసులు.. ధృవ్‌ను విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

12:16 - August 12, 2018

హైదరాబాద్ : గులాబీ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఎన్నికల ఏర్పాట్లకు ఆ పార్టీ శ్రీకారం చుడుతోంది. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధం అయ్యేలోపే.... పార్టీ ప్రచార వ్యూహాలకు కేసీఆర్‌ పదును పెడుతున్నారు. ప్రచార సామాగ్రిని సిద్ధం చేసే పనిలో గులాబీపార్టీ దృష్టి సారించింది.
ఎన్నికలకు సిద్ధమవుతున్న గులాబీ పార్టీ
తెలంగాణ రాష్ట్ర సమితి సార్వత్రిక సమరానికి సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడువచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. సాధారణ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇంకా 8 నెలల సమయం ఉన్నా... ఈ ఏడాది చివరినాటికి లేదంటే కొత్త ఏడాది మొదట్లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆపార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. జమిలి ఎన్నికల కంటే శాసనసభ ఎన్నికలను ముందుగానే ఎదుర్కోవాలనే యోచనలో గులాబీ బాస్‌ ఉన్నట్టు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్‌ ద్విముఖ వ్యూహం
ఎన్నికల్లో విజయం అందుకోవడానికి ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాలు... మరోవైపు పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేసేలా వ్యూహం రచించారు.  ఇప్పటికే రైతు బంధు పథకంతో మొదటి విడత చెక్కులు పంపిణీ చేయగా... ఈ నెలలో మరో మూడు ముఖ్యమైన పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రైతులందరికీ బీమాతోపాటు కంటివెలుగు, మిషన్‌ భగీరథను మొదలు పెట్టాలని నిర్ణయించింది.  ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి కొన్ని ప్రాంతాలకైనా సాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది.  ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉండేలా గులాబీ బాస్‌ చర్యలు తీసుకుంటున్నారు.  ఎన్నికల ప్రచార సామాగ్రిని  కూడా త్వరలో సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా మొదలుపెట్టిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాటలను సైతం రూపొందించింది. ప్రతిపక్ష్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధం అయ్యేలోపు  అన్ని హంగులతో ఎన్నికల ప్రచారానికి తెరలేపేందుకు గులాబి బాస్  ఇప్పటి నుంచే ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గెలుపే లక్ష్యంగా వ్యూహరచనలు చేస్తున్నారు. 
-----------

12:06 - August 12, 2018

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పినపాక మండలం ఐలాపురంలో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద ధాటికి గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలో వాటర్‌ ట్యాంక్‌ కుప్పకూలి.. కొట్టుకుపోయింది. ఇక భారీ వర్షాలతో కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. సుజాతనగర్‌లోని సింగభూపాలెం చెరువు అలుగు మీద ప్రవహిస్తోంది. ముర్రేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం కారణంగా సింగరేణి గౌతంఖని ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

 

11:59 - August 12, 2018

అసిఫాబాద్ : ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్‌ జిల్లాలో  వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కొమురం భీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆసిఫాబాద్‌ మండలం తుంపెల్లి వాగు వద్ద భారీగా వరద వచ్చి చేరడంతో రాకపోకలు స్తంభించాయి. డొర్లి, చీరకుంటా, తిర్యాని, దంపూర్‌పడిగా, మదరం గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక భూపాలపల్లిలో భారీ వర్షాలతో తాడిచెర్ల ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మంచిర్యాల జిల్లాలోనూ ఓపెన్‌కాస్ట్‌లో వర్ష ప్రభావం పడింది. మందమర్రి కల్యాణిఖని, రామకృష్ణాపూర్‌ ఓపెన్‌కాస్ట్‌, శ్రీరాంపూర్‌ ఓపెన్‌కాస్ట్‌లో వర్షానికి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

విడుదలకు ముందే మార్కెట్ లోకి గీత గోవిందం సినిమా

గుంటూరు : విడుదలకు ముందే గీత గోవిందం సినిమా మార్కెట్ లోకి వచ్చింది. పెన్ డ్రైవ్, సిడిలలో ఇంజనీరింగ్ విద్యార్థులు సినిమాను సర్క్యులేట్ చేస్తున్నారు. నంబూరులో ఇద్దరు వీవీఐటీ కాలేజీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గీతాఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫిర్యాదు మేరకు పెదకాకాని పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. 

 

10:38 - August 12, 2018

నిర్మల్ : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. అధికారులు 13 గేట్లు ఎత్తి వరద నీటిని వదులుతున్నారు. కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700అడుగులు కాగా... ప్రస్తుతం 698.37 అడుగులకు చేరింది. లక్ష క్యూసెక్కులు నీరు ప్రాజెక్టులోకి చేరుతుంగా... లక్షా 25వేల క్యూసెక్కుల నీరు అధికారులు కిందకు వదులుతున్నారు. 13 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

10:31 - August 12, 2018

ఆదిలాబాద్‌ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్‌ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. అనుకుంట, బంగారిగూడ గ్రామాల్లో వరద పోటెత్తుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

కడెం ప్రాజెక్ట్‌ నుంచి వరద నీరు విడుదల

నిర్మల్ : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. అధికారులు 13  గేట్లు ఎత్తి వరద నీటిని వదులుతున్నారు. కడెం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700అడుగులు కాగా... ప్రస్తుతం 698.37 అడుగులకు చేరింది. 

10:22 - August 12, 2018

ప్రకాశం : బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజి జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండుకుండలా మారింది. పాలేరు, మధిర, వైరా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 17 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 5 వేల క్యూసెక్కులుగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:04 - August 12, 2018

గుంటూరు : వాసవినగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పత్తి గోడౌన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున పత్తి బేళ్లు తగలబడుతున్నాయి. మంటలార్పేందుకు ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. ఆరు ఫైరింజన్లతో సిబ్బంది మంటలార్పాతున్నారు. ఆస్తినష్టం పది కోట్ల వరకు ఉంటుందని అంచనా. 

 

09:59 - August 12, 2018

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నందు వల్ల అధికారులు స్థానికంగానే ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వర్ష ప్రభావం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని, 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏడుగురు సీనియర్ అధికారులను జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమించారు. 

 

భారీ వర్షాల కారణంగా కేరళలో హైఅలర్ట్

కేరళ : భారీ వర్లా కారణంగా కేరళలో హైఅలర్ట్ ప్రకటించారు. 14 జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మృతుల సంఖ్య 37కి చేరింది. 31 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆగస్టు 15 వరకు అలర్ట్ కొనసాగించారు. భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడడంతో 1031 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. ప్రధాన రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాల్లో వర్షం కురవ లేదు. నేడు కేరళ కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించే అవకాశం ఉంది.

 

ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు

ఆదిలాబాద్‌ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్‌ జిల్లాలో  వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ప్రకాశం బ్యారేజికి జలకళ

ప్రకాశం : బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజి జలకళను సంతరించుకుంది. పాలేరు, మధిర, వైరా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు చేరుతోంది.  దీంతో అధికారులు ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. 

గుంటూరు వాసవినగర్ లో భారీ అగ్నిప్రమాదం

గుంటూరు : వాసవినగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పత్తి గోడౌన్ లో మంటలు ఎగిపిపడుతున్నాయి. పత్తి బేళ్లు తగలబడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. 

ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు మృతి

జమ్మూకాశ్మీర్ : బటమాలా ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీసు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

08:36 - August 12, 2018

ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. రాజకీయాలు వేడుకుతున్నాయి. అన్ని పార్టీలు 2019 ఎన్నికలకు సిద్ధమవుతన్నాయి. టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ నేత మండలం హనుమంతురావు, బీజేపీ నేత ఉమామహేశ్వరరాజు, టీడీపీ నేత గొట్టిముక్కల రామకృష్ణప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:29 - August 12, 2018

ఉత్తరప్రదేశ్‌ : ఓ బిజెపి నేత అంబేద్కర్‌ విగ్రహాన్ని తాకినందుకు పాలతో శుద్ధి చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి సునీల్‌ భన్సాల్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత రాకేశ్‌ సిన్హా మీరట్‌లోని జిల్లా కోర్టు సమీపంలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాల వేశారు. బిజెపి నేత తాకడం వల్ల భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ మైల పడ్డారంటూ దళిత న్యాయవాదులు పాలు, గంగాజలంతో శుద్ధి చేశారు. దళితుల కోసం బీజేపీ చేసిందేమీ లేదని..దళితులను ఆకర్షించడానికి అంబేద్కర్‌ పేరును వాడుకుంటున్నారని లాయర్లు విమర్శించారు.

08:26 - August 12, 2018

కోల్ కతా : అసోం ఎన్‌ఆర్‌సి జాబితా అంశంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా-పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని టార్గెట్‌ చేశారు. కోల్‌కతాలోని మెయో రోడ్‌లో జరిగిన బిజెపి యువమోర్చ స్వాభిమాన్‌ సభలో ఆయన ప్రసంగించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు మమత వోట్ బ్యాంక్‌గా మారారని షా ధ్వజమెత్తారు. బెంగాలీలకు తాము వ్యతిరేకం కాదు...మమతా బెనర్జీకి మాత్రమే తాము వ్యతిరేకులమన్నారు. బంగ్లాదేశ్ వలసదారులు మమత ఓటు బ్యాంకుగా మారారని... అందుకే వాళ్లను చేరదీస్తూ తన వోటు బ్యాంకును పదిలం చేసుకుంటున్నరని షా ఆరోపించారు. మమత ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకించడానికి ఇదే కారణమన్నారు. అసోంలో అక్రమంగా ఉంటున్న విదేశీ చొరబాటుదారులను గుర్తించి బయటకు పంపించే పని ఎన్‌ఆర్‌సి చేస్తోందని... ఇందులో తాము జోక్యం చేసుకోమని అమిత్‌ షా స్పష్టం చేశారు. బెంగాల్‌లో మమత అధికారంలోకి వచ్చాక శారద, రోజ్‌ వ్యాలీ లాంటి ఎన్నో కుంభకోణాలు వెలుగు చూశాయని ఆయన ధ్వజమెత్తారు.

 

08:23 - August 12, 2018

కేరళ : భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైంది. వరదల కారణంగా ఇప్పటివరకు 29 మంది మృతి చెందారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఆగస్టు 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
స్తంభించిన జనజీవనం  
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళలో జనజీవనం స్తంభించింది. నదులు పొంగి పొర్లుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని డ్యామ్‌లన్నీ నిండిపోయాయి. మొత్తం 58 రిజర్వాయర్లుండగా.. 24 డ్యామ్‌లలో గేట్లను తెరచి నీటిని బయటకు వదులుతున్నారు. 26 ఏళ్ల తర్వాత ఇడుక్కి రిజర్వాయర్‌ మొత్తం గేట్లను తెరిచారు.
వరద ప్రభావిత ప్రాంతాలలో పినరయి విజయన్‌ ఏరియల్‌ సర్వే 
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితాల, అధికారులు కూడా ఏరియల్‌ సర్వేలో పాల్గొని పరిస్థితిని సమీక్షించారు.
కొండచరియలు విరిగి పడి 25 మంది మృతి 
భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగి పడడడంతో 25 మంది మృతి చెందారు. మరో నలుగురు వరద నీటిలో కొట్టుకుపోయారు. వందల సంఖ్యలో ఇళ్లు కుప్పకూలాయి. 54 వేల మందిని 5 వందల పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
రెడ్‌ అలర్ట్‌ 
ఇడుక్కీ, వయనాడ్, మలప్పురం, కోజికొడె, పాలక్కడ్‌, కొట్టాయం, అలప్పుళా జిల్లాల్లో నాల్గవ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ సహాయక చర్యలు చేపట్టింది. వేల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాయుసేనకు చెందిన 5 ఎన్‌-32 విమానాలు, 2 ఎమ్‌ఐ-17 వి5 హెలిక్యాప్టర్లు ఎఎల్‌హెచ్‌ హెలిక్యాప్టర్‌ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్‌, విజయవాడ నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పించారు. మున్నార్‌లోని ఓ రిస్టార్ట్‌లో చిక్కుకున్న సుమారు 54 మంది పర్యాటకులను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కాపాడింది. వరదల నేపథ్యంలో కేరళ పర్యటనకు వెళ్లవద్దని అమెరికా తమ టూరిస్టులకు నిషేధ ఆదేశాలు జారీ చేసింది. ఎర్నాకుళం, పాలక్కాడ్‌, మలప్పురం, కాలికట్‌, ఇడుక్కి, వయానాద్‌, కన్నూర్‌ జిల్లాల్లో ఈనెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.
కేరళ సిఎంకి ఫోన్‌ చేసి మాట్లాడిన ప్రధాని, రాజ్‌నాథ్‌ సింగ్‌  
ప్రధాని నరేంద్రమోది, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కేరళ సిఎంకి ఫోన్‌ చేసి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. సహాయక చర్యలకు భరోసా ఇచ్చారు. కేరళలో సంభవించిన వరదలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదికి లేఖ రాశారు. కేరళ ప్రభుత్వం తక్షణ సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు వీలుగా తగినన్ని నిధులు విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

 

07:52 - August 12, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించి పోయింది. వర్షాల ధాటికి చెరువులు, వాగులు నిండి జలకళను సంతరించుకున్నాయి. 
ఉపరితల ఆవర్తనం..విస్తారంగా వర్షాలు  
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 
హైదరాబాద్‌లో 
హైదరాబాద్‌లో రాత్రి నుండి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వర్షపు నీరు రోడ్లపై నిలిచి ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అయితే మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. 
ఉమ్మడి ఆదిలాబాద్‌ లో 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. కుండపోత వర్షాలతో వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోందని రైతులు అంటున్నారు. 
కుమ్రంభీం ఆసిఫాబాద్ లో 
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్, కాగజ్‌నగర్‌, పెంచికల్ పేట్, వాంకిడి, జైనూరు మండలాల్లో తెల్లవారుజామునుండి మొస్తారు వర్షం కురిసింది. 
మంచిర్యాలలో 
మంచిర్యాల జిల్లా చెన్నూరు కోటపల్లి వేమనపల్లి మండలాల్లో రాత్రి నుండి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. కోటపల్లి మండలంలోని తుంతుంగా వాగు, కొండె వాగు ఉప్పొంగి వంతెనపై నుండి నీరు ప్రవహిస్తుండడంతో చుట్టు పక్కల ఉన్న 30 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షంతో గోదావరిలో ప్రాణహిత నది నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. 
భద్రాద్రి కొత్తగూడెంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఏజెన్సీలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి కిన్నెరసాని, ఏడు మెలికల మల్లన్న వాగులు పొంగి పొర్లుతున్నాయి. 
ఖమ్మంలో 
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో చెరువులు అలుగు పోస్తుండడంతో వదర వలన పంట నష్టం ఏర్పడింది. ఖమ్మం, మణుగూరు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.  
ఓపెన్‌ కాస్ట్‌లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి 
ఖమ్మం జిల్లాలో ఉన్న ఓపెన్‌ కాస్ట్‌ ఏరియాలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అశ్వారావు పేటలోని పెదవాగులోకి భారీగా నీరు వచ్చి చేరడంతో 2820 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 
ఉధృతంగా ప్రవహిస్తోన్న కిన్నెరసాని   
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాలలో గత రాత్రి నుండి కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. నాగారంకు చెందిన శిరీష అనే గర్భిణికి కాన్పు కోసం ఆస్పత్రికి తరలించేందుకు రాకపోకలు స్తంభించడంతో 108 సిబ్బంది, గ్రామస్తులు వాగు దాటించారు. 
కోస్తా జిల్లాల్లో మోస్తారు వర్షాలు 
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రెండు రోజులుగా ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాతీరానికి అతి సమీపంలో ఉపరితలం కొనసాగడంతో కోస్తాంధ్రలో వర్షాలు భారీగా నమోదు అవుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఉపరితల అవర్తనం ప్రభావంతో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడటంతో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. 

07:45 - August 12, 2018

పశ్చిమ గోదావరి : జిల్లా పర్యటనలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ టీడీపీపై విరుచుకుపడ్డారు. జిల్లాలోని 16 మంది ఎమ్మెల్యేల సీట్లలో టీడీపీని గెలిపించినా... చేసిందేమీ లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మరోసారి ఎన్నుకుంటే రాష్ట్రానికి జరిగేది ద్రోహమేనన్నారు. మోసపూరిత ప్రకటనలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అధికారం కోసం కుయుక్తులు పన్నుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీతో రాష్ట్రానికి మేలు జరగలేదన్నారు. కాపులు, ఎస్సీ, బీసీలను బాబు, జగన్‌ మోసం చేశారని విమర్మించారు. నరసాపురానికి డంపింగ్ యార్డు లేక చెత్త అంతా గోదావరిలో కలుస్తోందని అవేదన వ్యక్తం చేశారు. చుట్టూ గోదావరి ఉన్నా పంటలకు, త్రాగటానికి నీరు దొరకని దుస్థితిలో పశ్చిమగోదావరి జిల్లా ఉందన్నారు.  నరసాపురాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్ది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.
 

 

07:39 - August 12, 2018

విజయవాడ : దుర్గగుడిలో నెలకొన్న వివాదాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆలయంలో అమ్మవారి చీర మాయం కావడం వివాదాస్పదంగా మారింది. చీర మాయం వెనుక ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్ట్ బోర్డు సభ్యురాలు సూర్యలతపై వేటుగా పడగా, తాజాగా ఆలయ ఈవో పద్మను తప్పించి ఆమె స్థానంలో ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను ఈవోగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. 
ఆలయంలో తగువులు, వివాదాలపై సీఎం చంద్రబాబు సీరియస్ 
రాష్ట్రంలోనే టీటీడీ తర్వాత రెండో అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందిన  విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో తరచూ వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ వివాదాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్‌ పెట్టింది. వాటిని  చక్కదిద్దేందుకు  ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆలయంలో ఈ తగువులు, వివాదాలు ఏమిటని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దుర్గగుడి కమిటీ సభ్యులు దేవస్థానంలో ఇష్టారాజ్యంగా వ్యవహారించడంతో ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.  ఇంద్రకీలాద్రిలో పరిణామాలను ఎప్పటికప్పుడు సాక్షాత్తు సీఎం చంద్రబాబు తెలుసుకుంటూ ప్రక్షాళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 
చీర మాయం కావడంపై వివాదం
ఆలయంలో భక్తురాలు సమర్పించిన చీర మాయం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో గత వారం రోజులుగా ఈ వివాదం పెద్దది కావడంతో సీఎం చంద్రబాబు పాలకవర్గంపై, ఆలయ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. అసలు ఆలయంలో ఈ తగాదా ఏంటని ప్రశ్నించారు. ఈవోగా ఉన్న పద్మ ఆలయంలో పాలనపరమైన  పనుల్లో లేకపోవడంతో  ఆమెను ఈవో పదవి నుంచి  తప్పించారు. చీర మాయం వెనుక ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యలతతోపాటు..  ఈవో పద్మపై వేటు వేయాల్సి వచ్చింది. 
ఈవోగా ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ నియామకం 
కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్ పై రాష్ట్రానికి వచ్చిన ఐఆర్ఎస్ అధికారిణి వలనుకొండ కోటేశ్వరమ్మను ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా దుర్గగుడి ఈవో పోస్టింగ్ కోసం ఈమె ఎదురుచూస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఆలయంలో పాలకవర్గాన్ని నియమించింది. పాలకవర్గం నియమించిన నాటినుంచి దేవాలయంలో వివాదాలు, వివాదాస్పద నిర్ణయాలు, అరాచకాలు పెరిగాయన్న ఆరోపణలున్నాయి. గతంలో దేవాలయంలో అంతర్గత విభేదాలతో అధికారులు, అర్చకులు, సిబ్బంది మధ్య చిన్నపాటి మనస్పర్థలు ఉండేవి.
ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన దుర్గగుడి వివాదాలు
టీటీడీ, దుర్గగుడి ఆలయాలు వివాదాలమయం కావడంతో తెలుగుదేశం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆలయాల చుట్టూ రాజకీయాలు చోటుచేసుకోవడంతో సీఎం చంద్రబాబు స్వయంగా తలదూర్చాల్సి వస్తోంది.  టీడీపీ సర్కార్ పై విమర్శలు తారస్థాయికి చేరడంతో ఐఏఎస్ అధికారిని అయిన ఈవో సూర్యకుమారిని బదిలీ చేశారు.  చిల్లర వివాదాలు, సీసీ కెమెరాల రగడ, ఖరీదైన చీర మాయం కావడం వంటి ఘటనలు టీడీపీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చాయి.  కోటేశ్వరమ్మ హయాంలోనైనా ఆలయ పరిస్థితి మెరుగు పడుతుందా లేదో చూడాలి.

 

07:33 - August 12, 2018

హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల్లో బట్టలుతికే పనులను రజకులకే అప్పగిస్తామన్నారు సీఎం కేసీఆర్‌. ప్రగతి భవన్‌లో రజకసంఘం ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు సీఎం. రజక యువకులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందిస్తామన్నారు. రజక వృత్తిలో ఉండి 50 ఏండ్లు దాటిన వారికి ఆసరా పెన్షన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. 
రజక యువకులకు రుణాలు
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ రజకసంఘం ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, కొండూరు సత్యనారాయణతో పాటు సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని కులవృత్తులకు ప్రోత్సాహం కరువైందని.. ఇప్పుడు ఆ కులవృత్తులను నిలబెట్టేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల్లో బట్టలుతికే పనులను.. రజకులకే అప్పగించేలా విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. రజక యువకులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందిస్తామని చెప్పారు. రజక వృత్తిలో పనిచేస్తూ.. 50 ఏండ్లు దాటిన వారికి ఆసరా పెన్షన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. 
హైదరాబాద్‌లో చాకలి అయిలమ్మ విగ్రహాన్ని స్థాపిస్తాం : కేసీఆర్‌ 
హైదరాబాద్‌లో ఎకరం స్థలంలో 5 కోట్ల వ్యయంతో రజకుల కోసం హాస్టల్, కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని చెప్పారు. రజకులకు ఆర్థిక చేయూత అందించే కార్యక్రమాలు అమలు చేయటం కోసం బడ్జెట్లో 250 కోట్లు కేటాయించామని.. అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నామని కేసీఆర్‌ చెప్పారు. ప్రభుత్వం కేటాయించే నిధులతో రజకుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో రజక సంఘం ప్రతినిధులే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌లో చాకలి అయిలమ్మ విగ్రహాన్ని స్థాపిస్తామని కేసీఆర్‌ రజకులకు హామీ ఇచ్చారు. ప్రజలకు సేవచేస్తున్న కులాల అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన సామాజిక బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని కేసీఆర్‌ అన్నారు
హైదరాబాద్‌లో ఎరుకుల కులస్థులకు భవనం నిర్మిస్తాం : కేసీఆర్‌
ఇక ఎరుకల సంఘం ప్రతినిధులు కూడా సీఎం కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణ ఎరుకల సంఘం అధ్యక్షుడు కూతాడి రాములు, ప్రధాన కార్యదర్శి లోకిని రాజు తదితరులు కేసీఆర్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో ఎరుకుల కులస్థుల సామాజిక, విద్యా ప్రగతికి దోహదపడే విధంగా భవనం నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు. భవనానికి  అవసరమైన స్థలం కేటాయించడంతో పాటు, నిర్మాణానికి అవసరమయ్యే వ్యయం కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఎరుకుల కులస్తుల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తామని కేసీఆర్‌ చెప్పారు.
 

 

తిరుమలలో నేటి నుంచి 16 వరకు మహాసంప్రోక్షణ

చిత్తూరు : తిరుమలలో నేటి నుంచి 16 వరకు మహాసంప్రోక్షణ కొనసాగనుంది. నిన్న శాస్రోక్తంగా మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరిగింది. సర్వదర్శనం క్యూలైన్ ద్వారానే భక్తులకు అనుమతించారు. ప్రతిరోజు 18 వేల నుంచి 35 వేల మంది భక్తులకు దర్శనం జరుగనుంది. 

 

నేడు పార్కర్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న నాసా

అమెరికా : నేడు పార్కర్ ఉపగ్రహాన్ని నాసా ప్రయోగించనుంది. సాంకేతిక కారణాలతో ప్రయోగం నేటికి వాయిదా పడింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రయోగించనున్నారు. 2024 నాటికి సూర్యుడికి అత్యంత సమీపంలోకి పార్కర్ చేరనుంది. సూర్యుడి నుంచి వెలువడే రేడియోధార్మిక కిరణాలను పార్కర్ గుర్తించనుంది. 

 

నోబెల్ సాహిత్య అవార్డు గ్రహీత వీఎస్ నైపాల్ కన్నుమూత

లండన్ : నోబెల్ సాహిత్య అవార్డు గ్రహీత వీఎస్ నైపాల్ (84) కన్నుమూశారు. లండన్ లోని తన నివాసంలో ఆయన మృతి చెందారు. నైపాల్ మరణాన్ని ఆయన కుటుంబం ధృవీకరించింది. 

 

Don't Miss