Activities calendar

13 August 2018

21:08 - August 13, 2018

హైదరాబాద్ : రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీతో బహింగ చర్చకు సిద్ధమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సవాల్‌ విసిరారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని రాహుల్‌ ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల విభజన హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రైతులు, నిరుద్యోగులను మోసం చేశారని శేరిలింగంపల్లి బహిరంగ సభలో రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేస్తున్న రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని రాహుల్‌ ఆరోపించారు. 540 కోట్ల రూపాయల విలువచేసే ఒక్కో రాఫెల్‌ యుద్ధ విమానానికి మోదీ ప్రభుత్వం 1600 కోట్లు చెల్లిస్తోందన్నారు. సాంకేతిక బదిలీలో భాగంగా ప్రభుత్వ రంగంలోని హెచ్‌ఏఎల్‌కు రాఫెల్‌ అసెంబ్లింగ్‌ను అప్పగించకుండా... ఏ అనుభవంలేని అనిల్‌ అంబానీ కంపెనీకి అప్పగించడంపై రాహుల్‌ మండిపడ్డారు. దీనిపై ప్రధాని మోదీతో ఎలాంటి బహిరంగ చర్చకైనా సిద్ధమని రాహుల్‌ సవాల్‌ విసిరారు.

మరోవైపు ఏపీకి, తెలంగాణ విభజన హామీల అమల్లో ప్రధాని మోదీ విఫలమయ్యారని రాహుల్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు తెలంగాణకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌... రైతులు, నిరుద్యోగులను మోసం చేశారని రాహుల్‌ ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేసీఆర్‌ విఫలమయ్యాయరని విమర్శించారు. నాలుగేళ్లలో తెలంగాణలో వందలాది మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని , రెవెన్యూ మిగులుతో అప్పగించిన తెలంగాణను కేసీఆర్‌ నాశనం చేశారని రాహుల్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి, మోసపూరిత విధానాలను ఇంటింటింకి వెళ్లి ప్రచారం చేయాలని రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను ఆదేశించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అకృత్యాలను ఎండగట్టాలని పిలుపు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన అందిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. 

21:06 - August 13, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో కేంద్రంతోపాటు తెలంగాణలోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అభయహస్తం పింఛను పథకం, స్వయం సహాయ సంఘాలకు పావలా వడ్డీకే రుణాల మంజూరును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో స్వయం సహాయ బృందాలు నిర్వీర్యమైపోయాయని రాహుల్‌గాంధీ విమర్శించారు. రుణాలు ఎగవేసి దేశం విడిచిపారిపోయే బడా పారిశ్రామికవేత్తలకే బ్యాంకు లోన్లు ఇస్తున్నాయని మండిపడ్డారు. బ్యాంకుల్లో ప్రజలను దాచుకున్న సొమ్మును బడా పారిశ్రామికవేత్తలు లూటీ చేస్తున్నారని శంషాబాద్‌లో జరిగిన స్వయం సహాయ బృందాల సదస్సులో రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనకు హైదరాబాద్‌ వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలను రాహుల్‌కు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్నాటకలోని బీదర్‌ వెళ్లిన రాహుల్‌ అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం తిరిగి శంషాబాద్‌ చేరుకుని టీపీసీసీ నిర్వహించిన స్వయం సహాయ బృందాల సదస్సులో పాల్గొన్నారు.

సహాయ బృందాల సభ్యులతో రాహుల్‌ ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ పాలనలో తమకు బ్యాంకు రుణాలు అందడంలేదని మహిళలు రాహుల్‌ దృష్టికి తెచ్చారు. స్వయం సహాయ బృందాల సమస్యలపై చలించిపోయిన రాహుల్‌.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తుందని హామీ ఇచ్చారు.
మోదీ పాలనలో దేశంలో మహిళలకు రక్షణలేకుండా పోయిందని రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై బీజేపీ నేతలు లైంగిక దాడులకు పాల్పడుతున్నా... మోదీ నోరు మెదపడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్‌లో బాలికలపై అత్యాచారాలు, అకృత్యాలు జరుగుతున్నా.. ప్రధాని పట్టించుకోపోవడాన్ని రాహుల్‌ తప్పుపట్టారు.

ప్రధాని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్‌టీని గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌తో పోల్చిన రాహుల్‌... కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్‌టీని ఒకే శ్లాబ్‌గా మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. నల్లధనం వెలికితీస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోదీ... అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రాహుల్‌ మండిపడ్డారు. బ్యాంకులను దివాలా తీయించిన ఘనత మోదీదేనని మండిపడ్డారు. రాహుల్‌గాంధీని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. 

21:03 - August 13, 2018

ఒకేసారి రుణమాఫీ సాధ్యం కాదు - కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ నెలసరి ఆదాయం సగటున రూ. 10500 కోట్లు అని, రాష్ట్ర ఆదాయం బట్టే ఖర్చులు..పథకాలు ఉంటాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అన్ని పథకాలకు కేటాయింపులు రద్దు చేస్తేనే ఒకేసారి రుణమాఫీ సాధ్యమని తెలిపారు. నిరుద్యోగులకు భృతి అనేది సాధ్యం కాదని, ఎన్నికలకు ముందు ఎడాపెడా హామీలిచ్చి మోసం చేయడం సరికాదన్నారు. 

కాల్పుల ఘటనపై ఉమర్ స్పందన...

ఢిల్లీ : టీ స్టాల్ లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పిస్టోల్ తో కాల్పులు జరిపారని ఉమర్ ఖాలీద్ పేర్కొన్నారు. అతను ఎవరో తెలియదని, ఈ విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని కోరారు. 

20:13 - August 13, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు విమర్శలు గుప్పించారు. సోమవారం టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం ఆయన సమావేశ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రాహుల్ పర్యటనపై ఆయన స్పందించారు. రాహుల్ కొంత మెచ్యూర్టీ పెంచుకొంటే మంచిదని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ? అని ప్రశ్నించారు. 2.60 వేల డబుల్ బెడ్ రూం నివాసాలు కడుతామని చెప్పడం జరిగిందని, అలాగే చేస్తున్నామని..ఈ విషయంలో రాహుల్ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.

లక్ష ఉద్యోగాల విషయంలో ఇప్పటికే ముందుకొచ్చామని పేర్కొన్నారు. ఢిల్లీ కుటుంబ పాలన కంటే తమ కుటుంబ పాలన బెటర్ అని, బానిస రాజకీయాలను తెలుగు ప్రజలు పటాపంచలు చేశారన్నారు. రాహుల్ వస్తే భయపడుతున్నారని..అంటున్నారు..ఇక్కడ ఎవరూ భయపడరన్నారు.

ఆరు..ఏడు సర్వేలు నిర్వహించడం జరిగిందని...నూటొక్క శాతం వంద పైచిలుకు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. నిరుద్యోగ భృతిపై ప్రకటనలు చేస్తున్నారని, కాంగ్రెస్ దీనిపై సరియైన విధి విధానాలున్నాయా ? అని సూటిగా ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

20:10 - August 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కీలక ప్రకటనలు చేశారు. సోమవారం టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం ఆయన సమావేశ వివరాలు వెల్లడించారు. టీఆర్ఎస్ కార్యవర్గంలో 9 తీర్మానాలు ఆమోదించినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వెల్లడించారు. విభజన చట్టంలోని ఇచ్చిన హామీలను అమలు చేయాలని, విలీన ప్రక్రియ సంపూర్ణం చేయాలని, వరి, మొక్క జొన్నకు రూ. 2 వేల చొప్పున మద్దతు ధర ఇవ్వాలని పేర్కొనడం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 20వేల కోట్లు ప్రకటించాలని...ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ పెంచుతూ శాసనసభ తీర్మానం చేయడం జరిగిందని కేంద్రం దీనిని తాత్సారం చేస్తోందని, ఎస్సీ వర్గీకరణలో కూడా ఇదే విధంగా చేస్తోందన్నారు. ఏపీ రాష్ట్రంలో లెక్కించినప్పుడు ఎస్సీలు పలచబడ్డారని..ఒక రాష్ట్రానికి ఒక నీతి..మరొక రాష్ట్రానికి మరొక నీతి మంచిది కాదన్నారు.

9వ షెడ్యూల్ లో తమిళనాడు రాష్ట్రానికి ఏ విధంగా చేశారో తెలంగాణకు కూడా అదే విధంగా చేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. బీసీలకు మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని మరోసారి తీర్మానం చేసినట్లు, ఎప్పటి నుండో ఉన్న ఈ డిమాండ్ ను కేంద్రం పరిశీలించాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. నీతి ఆయోగ్ లో ఉన్నది పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా ఉందన్నారు. ఒక్క దానిపై సమీక్షించడం లేదని గతంలో తాను పాల్గొన్న సమావేశంలో కుండబద్ధలు కొట్టారని, పార్లమెంట్ స్థానాలు పెంచాలని తీర్మానాలు చేయడం జరిగిందన్నారు.

టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పని తీరు..దేశం..రాష్ట్రంలో వివిధ పరిస్థితులపై చర్చించడం జరిగిందన్నారు. వివిధ పత్రికల్లో పలు కథనాలు వస్తున్నాయని దీనిపై వివరణనిచ్చే అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటిరిగా పోటీ చేస్తుందని..ఏ పార్టీతో పొత్తు ఉండదని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీన హైదరాబాద్ లో టీఆర్ ఎస్ భారీ బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. 'ప్రగతి సభ' పేరిట ఈ బహిరంగసభ ఉంటుందన్నారు. సెప్టెంబర్ నుండి దశల వారీగా టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఎన్నికల అభ్యర్థుల నియామకం అధ్యక్షుడు పూర్తి బాధ్యతలు అప్పచెబుతూ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుందన్నారు. 

రాహుల్ పై కేసీఆర్ విమర్శలు...

హైదరాబాద్ : రాహుల్ కొంత మెచ్యూర్టీ పెంచుకొంటే మంచిదని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ? అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 2.60 వేల డబుల్ బెడ్ రూం నివాసాలు కడుతామని చెప్పడం జరిగిందని, ఈ విషయంలో కూడ రాహుల్ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. లక్ష ఉద్యోగాల విషయంలో ఇప్పటికే ముందుకొచ్చామని పేర్కొన్నారు. ఢిల్లీ కుటుంబ పాలన కంటే తమ కుటుంబ పాలన బెటర్ అని, బానిస రాజకీయాలను తెలుగు ప్రజలు పటాపంచలు చేశారన్నారు. 

సెప్టెంబర్ నుండి అభ్యర్థుల ప్రకటన – కేసీఆర్...

హైదరాబాద్ : సెప్టెంబర్ మూడో తేదీన హైదరాబాద్ లో టీఆర్ ఎస్ భారీ బహిరంగసభ నిర్వహిస్తామని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించారు. 'ప్రగతి సభ' పేరిట ఈ బహిరంగసభ ఉంటుందన్నారు. ఏ పార్టీతో పొత్తులుండని కేసీఆర్ ప్రకటించారు. సెప్టెంబర్ నుండి దశల వారీగా టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. 

టీఆర్ఎస్ కార్యవర్గంలో 9 తీర్మానాలు - కేసీఆర్...

హైదరాబాద్ : టీఆర్ఎస్ కార్యవర్గంలో 9 తీర్మానాలు ఆమోదించినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వెల్లడించారు. విభజన చట్టంలోని ఇచ్చిన హామీలను అమలు చేయాలని, విలీన ప్రక్రియ సంపూర్ణం చేయాలని, వరి, మొక్క జొన్నకు రూ. 2 వేల చొప్పున మద్దతు ధర ఇవ్వాలని పేర్కొనడం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 20వేల కోట్లు ప్రకటించాలని తీర్మానించినట్లు తెలిపారు. 

 

కేరళకు 'అల్లు అర్జున్‌' సాయం...

హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి నటులు విరాళాలు ప్రకటిస్తున్నారు. తన వంతు సహాయంగా రూ. 25 లక్షల రూపాయలను సాయం అందిస్తున్నట్టు హీరో అల్లు అర్జున్‌ ప్రకటించారు. ప్రజల నష్టాన్ని పూడ్చలేనిదని, కేరళ ప్రజలు కురిపించే ప్రేమాభిమానాలకు తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని బన్నీ వెల్లడించారు. 

19:36 - August 13, 2018

పశ్చిమగోదావరి : 'జనసేన' పార్టీ గుర్తును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిడదవోలులో నిర్వహించిన బహిరంగసభలో పార్టీ గుర్తు 'పిడికిలి' అంటూ ప్రకటన చేశారు. అందరి ఐక్యత చిహ్నంగా ఉంటుందని పవన్ తెలిపారు. అన్ని ప్రాంతాలు కలిసికట్టుగా ఉండి బలాన్ని 'పిడికిలి' ద్వారా చూపించాలన్నారు. కులాల సమైక్యత..అందరి కృషి..అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలి..అన్నదే లక్ష్యమన్నారు.

 

ముగిసిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం...

హైదరాబాద్ : హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్రకార్యవర్గ సమావేశం ముగిసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయడంతో పాటు పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల నిర్వహణ, విస్తృత స్థాయి ప్రచారం లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు సమాచారం. 

19:34 - August 13, 2018

జనసేన పార్టీ గుర్తు...

పశ్చిమగోదావరి : 'జనసేన' పార్టీ గుర్తును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిడదవోలులో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ఈ ప్రకటన చేశారు. అందరి ఐక్యత చిహ్నంగా ఉంటుందని పవన్ తెలిపారు. అన్ని ప్రాంతాలు కలిసికట్టుగా ఉండి బలాన్ని పిడికిలి ద్వారా చూపించాలన్నారు. 

19:12 - August 13, 2018

హైదరాబాద్ : జిల్లా బైంసా మండలంలోని కుంభి గ్రామం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం నీటితో బురదమయమయ్యింది. దాదాపు పది సంవత్సరాలు అయినా వసతులు మాత్రం కల్పించలేదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని ఏళ్లు అయిన గ్రామంలో అభివృద్ధి మాత్రం జరగడం లేదని గ్రామంలో యువకులు వాపోతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురువడంతో.. ఏజెన్సీలో వాగులు పొంగుతున్నాయి. జంగారెడ్డిగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, టీ. నరసాపురం ప్రాంతాల్లో కొండవాగులు పొంగిప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోదావరి వరద నీరు కొత్తూరు కాజ్‌వే పైకి చేరటంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

పశ్చిమగోదావరిలో....
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఎర్రకాలువ పొంగిపొర్లుతుంది. దీంతో జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించింది. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శిలాఫలకానికే పరిమితమైంది. దీంతో రోజువారి కూలీలు పనులకు వెళ్లడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

గోదావరిలో...
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుకుంది. వరద తాకిడి పెరగడంతో 28 గేట్ల ద్వారా దిగువకు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

19:08 - August 13, 2018

హైదరాబాద్ : ఢిల్లీలోని కేంద్ర పాలన..తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఒక్క విధంగానే ఉన్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శంషాబాద్ లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించారు. రూ. 15 లక్షల నగదు జమ చేస్తామని అక్కడ అంటే ఇక్కడ డబుల్ బెడ్ రూంలు ఇస్తామని కేసీఆర్ చెబుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతోందని..మోడీ..కేసీఆర్ లవి మోసపూరితమైన హామీలేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సమావేశంలో పేర్కొన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందన్నారు. జనాన్నీ మోసం చేయడంలో ఇద్దరు ఇద్దరేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క కుటుంబం లబ్ధి పొందిందని, ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ అమలు చేయలేదన్నారు.

దేశానికి తాను ప్రధాన మంత్రి కాదని..చౌకీదార్ అని మోడీ పేర్కొన్నారని తెలిపారు. నోట్ల రద్దుతో మోడీ మోసం చేశారని, రాఫెల్ విమానాల కొనుగోళ్లలో మోడీ భారీ మోసం చేశారని, యుద్ధ విమానాలు తయారు చేసే పరిజ్ఞానం ఇక్కడున్నా ఫ్రాన్స్ తో రహస్య ఒప్పందాలు చేసుకుంటారని ఆరోపించారు. యుద్ధ విమానాల రేట్లు మూడు రెట్లు పెంచారని, రాఫెల్ అవినీతిపై మాట్లాడితే మోడీ తన కళ్లలోకి చూడలేకపోయారన్నారు. అనీల్ అంబానీకి లబ్ది చేకూర్చేందుకు కేంద్రం కుట్ర చేసిందని తెలిపారు. పార్లమెంట్ లో రాఫెల్ విషయంలో చర్చ పెట్టాలని..తాను చర్చలో పాల్గొంటానని..మోడీ కూడా పాల్గొనాలని..ఇందులో ఎవరు మోసం చేశారో తెలుస్తుందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు న్యాయం చేస్తుందని..ఇది ఆయా రాష్ట్రాల హక్కు అని పేర్కొన్నారు. 2004 నుండి తన రికార్డు చూడాలని..పార్లమెంట్ లో ప్రసంగం...చూడాలని పేర్కొన్నారు. ఒక్క అబద్ధమైన హామీనివ్వలేదన్నారు. రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందని, మద్దతు ధర పెంచడం జరిగిందన్నారు. దేశంలో ఎన్నో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఎన్ని జరుగుతున్నా ప్రధాన మంత్రి మోడీ మౌనంగా ఉంటున్నారని విమర్శించారు.

తెలంగాణలో కుటుంబ పాలన - రాహుల్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాహుల్ గాంధీ శేరిలింగంపల్లి సమావేశంలో పేర్కొన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందన్నారు. జనాన్నీ మోసం చేయడంలో మోడీ..కేసీఆర్ సమానమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క కుటుంబం లబ్ధి పొందిందని, ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ అమలు చేయలేదన్నారు.  

ఫ్రాన్స్ తో రహస్య ఒప్పందాలు - రాహుల్...

హైదరాబాద్ : రాఫెల్ విమానాల కొనుగోళ్లలో మోడీ భారీం మోసం చేశారని, రాఫెల్ అవినీతిపై మాట్లాడితే మోడీ తన కళ్లలోకి చూడలేకపోయారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలో ఆయన మాట్లాడారు. యుద్ధ విమానాలు తయారు చేసే పరిజ్ఞానం ఇక్కడున్నా ఫ్రాన్స్ తో రహస్య ఒప్పందాలు చేసుకుంటారని ఆరోపించారు. 

18:44 - August 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 'కారు' స్టీరింగ్ అదుపు తప్పిందని...టైర్లు పంక్చర్ అయాయ్యని..చేతి గుర్తు ఒక్కటే న్యాయం చేస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా వ్యాఖ్యానించారు. శంషాబాద్ లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో రఘువీరా పాల్గొని ప్రసంగించారు. అన్నదమ్ముల్లా మాత్రమే విడిపోయామే కానీ అందరం ఒక్కటేనని తెలిపారు. తల్లిదండ్రుల దగ్గర సమానమేనని పేర్కొన్నారు. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు కొన్ని హామీలు..చట్టాలు చేయడం జరిగిందన్నారు. రెండు రాష్ట్రాలు పీఎం మోడీకి ఊడిగం చేయడానికి సరిపోతుందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం వస్తుందని కొత్తగా టీఆర్ఎస్ విమర్శలు చేస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమలు జరపాలని డిమాండ్ చేశారు. 2019 ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై రాహుల్ జెండా ఎగురవేస్తారని రఘువీరా పేర్కొన్నారు. 

18:40 - August 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ పేర్కొన్న విధంగా విభజన హామీల్లో ఏ ఒక్కటి అయినా అమలు చేశారా అని టి.కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ ఆలీ ప్రశ్నించారు. శంషాబాద్ లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో షబ్బీర్ ఆలీ మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ నియమితులైన అనంతరం శేరిలింగం పల్లిలో మొదటి సభ నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని..కేసీఆర్ ను కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసింది..తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ లో ఉన్న ఎంపీలను, ఎమ్మెల్యేలను లాక్కొన్నారని విమర్శించారు. విభజన హామీల్లో పేర్కొన్న విధంగా ఏ ఒక్కటి అమలు చేయలేకపోయారని తెలిపారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. 

కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది - షబ్బీర్...

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ నియమితులైన అనంతరం శేరిలింగం పల్లిలో మొదటి సభ నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని టి కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని..కేసీఆర్ ను కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసింది..తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ లో ఉన్న ఎంపీలను, ఎమ్మెల్యేలను లాక్కొన్నారని విమర్శించారు. విభజన హామీల్లో పేర్కొన్న విధంగా ఏ ఒక్కటి అమలు చేయలేకపోయారని తెలిపారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. 

హమాలీల ఛార్జీలు పెరిగాయి...

హైదరాబాద్ : హమాలీల ఛార్జీలు పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. క్వింటాలుకు రూ. 15.50 ఉన్న హమాలీ ఛార్జీలను రూ. 18.50 కి పెంచుతూ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

ఉస్మానియాకు కేసీఆర్ వెళ్లే దమ్ముందా - జైపాల్ రెడ్డి...

రంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో రామరావరణ యుద్ధం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని, దమ్ముంటే కేసీఆర్ ఉస్మానియాకు వెళ్లాలి..కొట్టి పంపిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకి వెళ్లి మాట్లాడే దమ్ముందా ? అని ప్రశ్నించారు. 

'కంటి వెలుగు'పై కేసీఆర్ సమీక్ష...

హైదరాబాద్ : 'కంటి వెలుగు' పై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15వ తేదీ నుండి కార్యక్రమంలో అమలు కానుంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. మెదక్ జిల్లా మల్కాపురంలో 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. 

శేరిలింగంపల్లిలో రాహుల్...

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శేరిలింగంపల్లికి చేరుకున్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా టిపిసిసి నిర్వహిస్తున్న భారీ బహిరంగసభలో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు. 

18:06 - August 13, 2018

ఢిల్లీ : కర్నాటక, కేరళలో ప్రమాదస్థాయిలో పెరుగుతున్న వరదలతో తమిళనాడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, ధర్మపురి, తంజావూరు, తిరుచ్చి, నామక్కల్‌, ఈరోడ్‌ జిల్లాలకు వరద ప్రమాదం ఏర్పడటంతో ప్రభుత్వం అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రంగం సిద్దం చేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.

17:58 - August 13, 2018

హైదరాబాద్ : కుషాయిగూడలో బేటి బచావో అనే వినూత్న కార్యక్రమాన్ని పల్లవి మోడల్‌ స్కూల్‌ యాజమాన్యం నిర్వహించింది. సమాజంలో జరుగుతున్న సంఘటనల పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే సంఘటలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో విద్యార్థులకు సూచించారు. ఇందులో భాగంగా మేడ్చల్‌ జిల్లా కాప్రా మండలం రాధిక చౌరస్తాలో ఆట, పాటలతో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. 

17:57 - August 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్రకార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయడంతో పాటు పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల నిర్వహణ, విస్తృత స్థాయి ప్రచారం లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. రెండు రోజుల పర్యటనకు హైదరాబాద్‌ వచ్చిన రాహుల్‌కు ఎన్నికల సవాలు విసిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి ఏడు గంటలకు సమావేశం వివరాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియాకు వివరించనున్నారు.

 

17:34 - August 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గబ్బర్ సింగ్ ట్యాక్స్ తీసేసి గూడ్స్ అండ్ ట్యాక్స్ గా ఏర్పాటు చేస్తామని, ఐదు రకాల పన్నుల శ్లాబులు ఉండవని ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. ప్రతి నెలా జీఎస్టీ కోసం అనేక రకాలుగా దరఖాస్తులు నింపే అవకాశం లేదన్నారు. మహిళలు లేని దేశం ముందుకెళ్లలేదని..రాజకీయం..ఆర్థికం..ఇలాంటి ఏ రంగమైనా మహిళలను ముందుండాలని కాంగ్రెస్ అభిప్రాయమన్నారు. ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సాధించిందంటే మహిళ శక్తి ప్రధానమన్నారు. మహిళా సంఘాలు చాలా ప్రధానమైనవని..వీటి అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన జరుగుతోందని...లాభమంతా ఆ కుటుంబానికి చెందుతోందన్నారు. భూములను లాక్కొంటున్నారని..మద్దతు ధర ఇవ్వడం లేదని..మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయడం లేదన్నారు. తెలంగాణలో ఉన్న పరిస్థితులు మోడీ పాలనలో కూడా కనిపిస్తున్నాయన్నారు. కేసీఆర్...మోడీ ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు కావడం లేదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని, లక్షలాదిర రూపాయలు విద్య..వైద్యం కోసం నిరుపేదలు ఖర్చు పెట్టాల్సి వస్తోందన్నారు. 

17:30 - August 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలపై తనకు అపారమైన నమ్మకం ఉందని ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రశ్నించారు. శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ లో డ్వాక్రా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. తనకు మహిళా సంఘాలతో అనుభవం ఉందని, పది సంవత్సరాల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లో మహిళా సంఘాలని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ఓ వ్యక్తి పేర్కొనడం జరిగిందన్నారు. అమేథీ, రాయబేరీలో మహిళా సంఘాల ఏర్పాటు చేయాలని కృషి చేయడం జరిగిందని, కానీ సంఘాలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని పెద్ద పెద్ద అధికారులు కూడా చెప్పారని, దేశంలో మహిళా సంఘాలు ఎక్కడున్నాయి ? అని ప్రశ్నించడం జరిగిందన్నారు.

ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న సమయంలో మహిళా సంఘాలు మంచిగా పనిచేస్తున్నాయని పేర్కొనడం జరిగిందన్నారు. తాను తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి మహిళా సంఘాలను యూపీకి తీసుకెళ్లడం జరిగిందని..అక్కడ వారితో మాట్లాడించడం జరిగిందన్నారు. 15 లక్షల మంది మహిళలు సంఘాల్లో ఉన్నారని, తెలంగాణ మహిళా సంఘాలు కృషి చేయకపోతే అక్కడ సంఘాలు ఏర్పాటయ్యేది కాదన్నారు. ఎలాంటి క్షిష్ట పరిస్థితులు ఎదురైనా..మహిళలు పనిచేయడానికి సిద్ధంగా ఉంటారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా సంఘాలకు న్యాయం చేస్తామని మరోసారి హామీనిచ్చారు.

17:22 - August 13, 2018

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రశ్నించారు. శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ లో డ్వాక్రా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.మహిళా సంఘాల గ్రూపులకు బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తుందని...సరిగ్గా రుణాలు అందిస్తే వ్యాపారం..ఉద్యోగాలు చేసే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం, ఎన్డీయే సర్కార్...బ్యాంకుల్లో ఉన్న డబ్బులు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు మాత్రమే లోన్లు మాత్రమే ఇవ్వడానికి అనుమతినిస్తోందన్నారు.

చిన్న వ్యాపారులు, రైతులు, మహిళా సంఘాలు రుణాలు కావాలని కోరితే వీరికి రుణాలు ఇవ్వద్దని చెబుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బ్యాంకు రుణాలు అందించేందుకు కృషి చేస్తామని, నేరుగా అకౌంట్ లో డబ్బులు జమ చేస్తామన్నారు. రైతులకు మద్దతు ధర ఎక్కువ చేస్తామని ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారని, దేశం మొత్తంలో రూ. 10వేల కోట్ల రూపాయలు పెంచబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయా పర్యటనల్లో మోడీ వెల్లడించారన్నారు. కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూ. 30వేల కోట్ల రూపాయల రుణం మాఫీ చేసిందని, మోడీ చెప్పిన దానికంటే మూడొంతుల అధికంగా ఒక్క రాష్ట్రంలోనే కాంగ్రెస్ చేసిందని తెలిపారు.

నవంబర్ 8వ తేదీన నోట్ల రద్దు చేసిందని..ఈ విషయం అందరికీ తెలిసిందేన్నారు. బ్యాంకుల్లో ఎంతో మంది క్యూ లైన్ లో వేచి ఉన్నారని..ఈ క్యూ లైన్ లో ఒక్క ధనవంతుడు నిలబడ్డాడా ? అని నిలదీశారు. వారి దగ్గర డబ్బులు లేవా ? వారు ఎందుకు క్యూ లైన్ లో ఎందుకు నిలబడలేదు ?..క్యూ లైన్ లో పేద వారు మాత్రమే ఎందుకు నిలబడ్డారని ప్రశ్నించారు. దేశం మొత్తం మీద ఉన్న అవినీతి వ్యక్తులు బ్యాంకుల వెనుక ద్వారం నుండి వెళ్లి మొత్తం డబ్బులు వేశారని తెలిపారు. బ్యాంకుల్లో 12 లక్షల కోట్ల రూపాయలు నాన్ ఫెర్మామింగ్ ఉన్నాయన్నారు. నల్లధనం మీద పోరాటం చేస్తామన్న మోడీ..ప్రజల జేబుల్లో ఉన్న డబ్బులు తీసుకుని బ్యాంకుల్లో వేయించారరని..ఈ డబ్బులను అధిక ధనవంతులు..పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేయాలని మహిళా సంఘాలు కోరుతుంటే...ప్రధాన మంత్రి మోడీ..కేసీఆర్ లు సాధ్యం కాదని చెబుతున్నారని పేర్కొన్నారు. 

17:14 - August 13, 2018

హైదరాబాద్ : పారిశ్రామిక వేత్తలకు మాత్రం రుణాలు మాఫీ చేస్తారని..కానీ రైతులు..మహిళా సంఘాలకు మాత్రం రుణాలు అందివ్వడం లేదని ఏఐసీసీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ పేర్కొన్నారు. శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ లో డ్వాక్రా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. కర్నాటక రాష్ట్రంలో కార్యక్రమం ఆలస్యంగా జరిగిందని..ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. గత రెండేళ్లుగా ఢిల్లీలో ఉన్న ఎన్డీయే సర్కార్ 15 మంది పారిశ్రామిక వేత్తలకు ఎంత రుణం మాఫీ చేసిందో తెలుసా ? అని సమావేశాన్ని ఉద్ధేశించి ప్రశ్నించారు. రూ. 2.50 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని గుర్తు చేశారు. ఎన్డీయే పాలనలో రైతులు..మహిళలు..డ్వాక్రా సంఘాలకు మాత్రమే రుణం మాఫీ కాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు చెందిన వడ్డీ భారం...అభయ హస్తం పథకాన్ని పునరుద్దరిస్తామన్నారు. దేశం ముందుకు పోవాలంటే మహిళలు..రాజకీయంగా..ఆర్థికంగా ముందుకు వెళ్లాలని..దీనికి కాంగ్రెస్ ప్రోత్సాహిస్తుందన్నారు. 

నల్లధనం పోరాటం ఏమైంది - రాహుల్...

హైదరాబాద్ : నల్లధనం మీద పోరాటం చేస్తామన్న మోడీ..ప్రజల జేబుల్లో ఉన్న డబ్బులు తీసుకుని బ్యాంకుల్లో వేయించారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ డబ్బులను అధిక ధనవంతులు..పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్నారని పేర్కొన్నారు. రుణాలు మాఫీ చేయాలని మహిళా సంఘాలు కోరుతుంటే...ప్రధాన మంత్రి మోడీ..కేసీఆర్ లు సాధ్యం కాదని చెబుతున్నారని పేర్కొన్నారు. 

మద్దతు ధర పెంచారా - రాహుల్...

హైదరాబాద్ : రైతులకు మద్దతు ధర ఎక్కువ చేస్తామని ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారని, దేశం మొత్తంలో రూ. 10వేల కోట్ల రూపాయలు పెంచబోతున్నట్లు వెల్లడించారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయా పర్యటనల్లో మోడీ వెల్లడించారన్నారు. కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూ. 30వేల కోట్ల రూపాయల రుణం మాఫీ చేసిందని, మోడీ చెప్పిన దానికంటే మూడొంతుల అధికంగా ఒక్క రాష్ట్రంలోనే కాంగ్రెస్ చేసిందని తెలిపారు. 

రుణాలు ఇవ్వొద్దని చెబుతున్నారు - రాహుల్...

హైదరాబాద్ : మహిళా సంఘాల గ్రూపులకు బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తుందని...సరిగ్గా రుణాలు అందిస్తే వ్యాపారం..ఉద్యోగాలు చేసే అవకాశం ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం, ఎన్డీయే సర్కార్...బ్యాంకుల్లో ఉన్న డబ్బులు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు మాత్రమే లోన్లు మాత్రమే ఇవ్వడానికి అనుమతినిస్తోందన్నారు. చిన్న వ్యాపారులు, రైతులు, మహిళా సంఘాలు రుణాలు కావాలని కోరితే వీరికి రుణాలు ఇవ్వద్దని చెబుతోందన్నారు.

రెండేళ్లలో రూ. 2.50 లక్షల కోట్ల రుణాలు మాఫీ - రాహుల్...

ఢిల్లీ : గత రెండేళ్లుగా ఢిల్లీలో ఉన్న ఎన్డీయే సర్కార్ 15 మంది పారిశ్రామిక వేత్తలకు ఎంత రుణం మాఫీ చేసిందో తెలుసా ? అని డ్వాక్రా సంఘాల సమావేశాన్ని ఉద్ధేశించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ ప్రశ్నించారు. రూ. 2.50 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని గుర్తు చేశారు. ఎన్డీయే పాలనలో రైతులు..మహిళలు..డ్వాక్రా సంఘాలకు మాత్రమే రుణం మాఫీ కాదన్నారు. 

16:06 - August 13, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మహిళలకు..అన్ని రంగాల వారికి అన్యాయం జరిగిందని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ పేర్కొన్నారు. శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ లో డ్వాక్రా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మంత్రివర్గంలతో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ హాయంలో ఏర్పడిన మహిళా సంఘాలను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. మహిళా శక్తి ద్వారా కేసీఆర్...కుటుంబాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

అభయహస్తం..బ్యాంకు రుణాలపై వడ్డీ..మహిళా సంఘాలకు భవనాలు నిర్మించడం..తదితర మౌలిక సదుపాయాలు ఏవీ కల్పించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా సంఘాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్నారు. అభయ హస్తం పెన్షన్ పథకం గతంలో కాంగ్రెస్ హాయంలో ఏ విధంగా ఉన్నదో..ప్రస్తుతం ఏ విధంగా ఉన్నదో గుర్తు చేసుకోవాలన్నారు. సెర్ప్ ఉద్యోగులకు చాలాకాలం నుండి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారని..కాంగ్రెస్ వచ్చిన తరువాత వీరిని రెగ్యులర్ చేస్తామన్నారు. 

మంత్రివర్గంలతో మహిళకు స్థానం ఎక్కడ ? - ఉత్తమ్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మంత్రివర్గంలతో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ విమర్శించారు. కాంగ్రెస్ హాయంలో ఏర్పడిన మహిళా సంఘాలను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. మహిళా శక్తి ద్వారా కేసీఆర్...కుటుంబాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 

టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం...

హైదరాబాద్ : టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. అనంతరం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. 

రాహుల్ మీటింగ్ లో ఏవూరి సోమన్న సాంగ్...

హైదరాబాద్ : డ్వాక్రా మహిళా సంఘాలతో నిర్వహిస్తున్న సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలకోపన్యాసం చేయనున్నారు. గాయకుడు ఏవూరి సోమన్న గీతాన్ని ఆలపించారు. 

15:55 - August 13, 2018

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ నేరుగా శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. డ్వాక్రా మహిళా సంఘాలతో నిర్వహిస్తున్న సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. గాయకుడు ఏవూరి సోమన్న గీతాన్ని ఆలపించారు. పాట వినడానికి వీడియో క్లిక్ చేయండి. 

రాహుల్ కు మహిళా ప్రతినిధుల సన్మానం...

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ నేరుగా శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. 

క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ కు రాహుల్...

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ నేరుగా శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకున్నారు. 

టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం...

హైదరాబాద్ : టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం కాసేపట్లో జరుగనుంది. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. 

15:39 - August 13, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటనపై అందరి దృష్టి నెలకొంది. రెండు రోజుల పాటు ఆయన హైదరాబాద్ లో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని బీదర్ కు వెళ్లారు. అక్కడి నుండి మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కాస్లిక్ కన్వెన్షన్ హోటల్ లో డ్వాక్రా మహిళలతో రాహుల్ ముఖాముఖి నిర్వహించనున్నారు.

కానీ రాహుల్ నిర్వహించాలని తలపెట్టిన మూడు కార్యక్రమాలు మాత్రం నెరవేరలేదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ అయి ప్రసంగించాలని అనుకున్న రాహుల్ ఆశ నెరవేరలేదు. ముస్లిం ఓట్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించడం..అందులో భాగంగా హాకీ స్టేడియంలో మైనార్టీ పెద్దలతో సమావేశం కావాలని అనుకున్నారు. దీనికి కూడా అనుమతిని నిరాకరించారు. ఇక చిన్న వ్యాపారులు..ఆయా వర్గాలతో సమావేశమై జీఎస్టీ, ఇతర పన్నుల విషయంలో సమస్యలు తెలుసుకొనేందుకు ఎగ్జిబీష్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ఓ కార్యక్రమం ఏర్పాటు చేయడం..ఈ కార్యక్రమానికి కూడా అనుమతించలేదు. 

కోమటిరెడ్డి, సంపత్ ల పిటిషన్ పై విచారణ...

హైదరాబాద్ : ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ల ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. వ్యక్తిగత విచారణకు నోటీసులు ఇవ్వొద్దని అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు కోరారు. నిర్ణయాన్ని మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. 

15:30 - August 13, 2018
15:28 - August 13, 2018

విజయవాడ : వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడిపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని వైసీపీ నేత భూమన వెల్లడించారు. నిష్ఫక్షపాత విచారణ అనంతరం బాబు జైలుకు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు.

వైసీపీ నేత జగన్ టిడిపిపై దుష్ర్పాచారం చేస్తున్నారని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్..బిజెపితో టిడిపికి సంబంధాలు అంటకట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ టిడిపి అని వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి జవహార్ వ్యంగ్యాస్రాలు విసిరారు. పవన్ అంటే గాలి..అని గాలి వార్తలు పొగేసుకుని వస్తారని..ఆయన చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పి తన స్థాయిని తగ్గించుకోవాలని అనుకోవడం లేదన్నారు. తన కమ్యూనిటీకి పవన్ కంటే గొప్ప నేతను తాను అని తెలిపారు. 

శంషాబాద్ కు రాహుల్...

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీదర్ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాహుల్ కు సీనియర్లు ఘన స్వాగతం పలికారు. 

15:08 - August 13, 2018

చిత్తూరు : డీఎంకేలో ఆధిపత్య పోరు ప్రారంభమయ్యిందా ? ఆళగిరిపై సస్పెండ్ ఎత్తివేస్తారా ? ఆయనకు కీలక బాధ్యతలు అప్పచెబుతారా ? అనే చర్చ కొనసాగుతోంది. కరుణ మరణంకంటే ముందే తనయులు స్టాలిన్..ఆళగిరిల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఆళగిరిని కరుణ పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఆళగిరి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. కానీ తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణానంతరం పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. సోమవారం కరుణా సమాధి వద్ద ఆళగిరి నివాళులర్పించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమైన డీఎంకే కార్యకర్తలు తనవెంటే ఉన్నారని, బంధువులు..మద్దతు దారులు తన వెంట ఉన్నారని పేర్కొన్నారు. దీనికంతటికి కాలమే సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు. మంగళవారం డీఎంకే సర్వసభ్య సమావేశం జరుగనుండడం..ఈ సమావేశానికి కంటే ఒక రోజు ముందే ఆళగిరి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. డీఎంకే సర్వసభ్య సమావేశంలో ఆళగిరిపై సస్పెండ్ ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

డీఎంకేలో ఆధిపత్య పోరు...

చెన్నై : తమిళనాడు డీఎంకేలో అధిపత్య పోరు మొదలైంది. స్టాలిన్ నాయకత్వాన్ని కరుణానిధి పెద్ద కుమారుడు ఆళగిరి వ్యతిరేకిస్తున్నారు. బంధువులు...మద్దతుదారులు తన వెంటే ఉన్నారని కాలమే అన్నింటికీ సమాధానమిస్తుందని ఆళగిరి వెల్లడించారు. 

రోజాపై మంత్రి జవహార్ విమర్శలు...

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా నీటి దురుసు తగ్గించుకోవాలని, రాష్ట్రంలో రోజా శూర్పణక పాత్ర పోషిస్తున్నారని మంత్రి జవహార్ వ్యాఖ్యానించారు. జగన్ భార్య ఈడీ కేసులతో బాబుకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. బాబుపై రోజా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

కాసేపట్లో శంషాబాద్ కు రాహుల్...

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీదర్ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాహుల్ కు స్వాగతం పలికేందుకు కేవలం పది మంది సీనియర్లకు మాత్రమే పోలీసులు అనుమతినిస్తున్నారు. 

14:33 - August 13, 2018

బాబు విజయనగరం జిల్లా పర్యటన రద్దు...

విజయనగరం : సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం జిల్లా పర్యటన రద్దు అయ్యింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడింది. ఈనెల 25న సీఎం బాబు పర్యటించనున్నారు. 

14:26 - August 13, 2018

విజయవాడ : సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు కార్మికులు మహా ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు భారీగా తరలివచ్చారు.రైల్వే స్టేషన్ నుండి ధర్నా చౌక్ వరకు కార్మికులు కదం తొక్కారు. ఈ సందర్భంగా పలువురు నేతలు టెన్ టివితో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

14:24 - August 13, 2018

ఢిల్లీ : లోక్ సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ ఛటర్జీ మృతిపై పలువురు సంతాపం తెలియచేస్తున్నారు. కోల్ కతాలోని ఆస్పత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతూ చికిత్స పొందుతున్న చటర్జీ (89) సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...లోక్ సభ స్పీకర్ గా ఛటర్జీ పార్లమెంట్ విధులను సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య విలువల కోసం పరితపించిన ఓ ఛాంపియన్ ను కోల్పోయామన్నారు. సోమ్ నాథ్ ఛటర్జీ కుటుంసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. 

పాక్ జైల్లో భారతీయ ఖైదీల విడుదల...

ఢిల్లీ : పాక్ జైళ్లలో మగ్గుతున్న కొందరికి ఆ దేశ ప్రభుత్వం విముక్తి కల్పించింది. సోమవారం 30 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. ఇందులో 27 మంది జాలర్లు ఉన్నారు. 

14:10 - August 13, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నగరంలో అడుగు పెట్టారు. రెండు రోజుల పాటు ఆయన ఉండనున్నారు. సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఇక్కడి నుండి ప్రత్యేక విమానంలో బీదర్ కు రాహుల్ వెళ్లారు. అక్కడ నిర్వహించే బహిరంగసభలో పాల్గొననున్నారు. అనంతరం బీదర్ నుండి మధ్యాహ్నం 2.45గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని నేరుగా కాస్లిక్ కన్వెన్షన్ హోటల్ లో డ్వాక్రా మహిళలతో రాహుల్ ముఖాముఖి నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు..మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇతరత్రా వాటిపై రాహుల్ ఆరా తీయనున్నట్లు సమాచారం.

సాయంత్రం శేరిలింగంపల్లిలో నిర్వహించే బహిరంగసభలో రాహుల్ ప్రసంగించనున్నారు. శేరిలింగంపల్లిలో సెటిలర్లు ఎక్కువగా ఉండడంతో అక్కడ కాంగ్రెస్ బహిరంగసభ నిర్వహిస్తుండడం విశేషం. ఈ బహిరంగసభలో ఆయన ఎలాంటి ప్రసంగం చేయనున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అనంతరం రాత్రి ఖైరతబాద్ లోని హరిత ప్లాజ్ లో రాహుల్ బస చేయనున్నారు. 

బీదర్ లో రాహుల్...

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఉదయం దిగిన రాహుల్ అక్కడి నుండి నేరుగా బీదర్ కు చేరుకున్నార. అక్కడ నిర్వహిస్తున్న బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తున్నారు. 

13:58 - August 13, 2018

ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఈరోజు తమ సమస్యలు పరిష్కరించాలని చలో విజయవాడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్రమబద్దీకరణ, సమాన పనికి సమాన వేతనం.. శ్రమదోపిడి రద్దు తదితర డిమాండ్లతో వాళ్లు ఆందోళన చేస్తున్నారు. వారి సమస్యలు వారు ఆందోళనకు దారితీసిన పరిస్థితులు.. ప్రభుత్వ విధానంపై జనపథంలో సీఐటీయూ నాయకులు ఏవీ నాగేశ్వర్‌రావు పాల్గొని, మాట్లాడారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్, ఐఆర్ చెల్లించాలని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

13:54 - August 13, 2018

నిజామాబాద్ : క్రమ శిక్షణకు ఆయన మారుపేరు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి స్పీకర్‌గా మెప్పించారు. అయినా గత రెండు ఎన్నికల్లో ఆయన ఓటమిచెందారు. లోకల్‌ నియోజకవర్గాన్ని కాదని వెళ్లిన ఆయనకు గడ్డు పరిస్థితి ఎదురైంది. దీంతో మరోసారి లోకల్‌ నియోజకవర్గంపై దృష్టి సారించారు.  బాల్కొండ నుంచి మరోసారి బరిలోకి దిగాలని యోచిస్తున్న సురేష్‌రెడ్డి పాలిటిక్స్‌పై కథనం..
సురేష్‌రెడ్డి ఎన్నికల పోటీపై ఆసక్తి 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన సురేష్‌రెడ్డి ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన ఆయన.. అదే నియోజకవర్గం నుంచి వరుసగా 1989, 1994,1999,2004 ఎన్నికల్లో గెలుపొందారు.నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో స్పీకర్‌గా పనిచేసి మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అనిపించుకున్నారు. 2009 ఎన్నికల్లో సురేష్‌రెడ్డి బాల్కొండ నియోజకవర్గాన్ని వదిలి ఆర్మూర్‌ నియోజకవర్గానికి షిఫ్ట్‌ అయ్యారు. అంతే  అప్పటి వరకు కొనసాగిన ఆయన జైత్రయాత్ర అక్కడితో ఫుల్‌స్టాఫ్‌ పడింది. 2009,2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓడిపోయారు.  9ఏళ్లుగా ఆర్మూర్‌ నియోజకవర్గ ఇంచార్జీగా కొనసగుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోకీలకనేతగా ఉంటూ... జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాలపై కన్నేసిన ఆయన... రెండు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏ నియోజకవరగం నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఫలితంగా కాంగ్రెస్‌ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. నాలుగుసార్లు గెలిచిన బాల్కొండ సేఫ్‌ జోన్‌గా ఉంటుందా.. లేక రెండుసార్లు ఓడిపోయిన ఆర్మూర్‌ లో సానుభూతి వర్కవుట్‌ అవుతుందా అన్నది ఆయన తేల్చుకోలేక సతమతమవుతున్నారు. 
బాల్కొండపై కన్నేసిన ఈరపతి అనిల్‌
సురేష్‌రెడ్డి ఆర్మూర్‌కు షిఫ్ట్‌కాగానే... బాల్కొండ నియోజకవర్గంలో ఈరపతి అనిల్‌ జెండా పాతారు. నియోజకవర్గ ఇంచార్జీగా కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గం ఇంచార్జీగా ఉన్న సురేష్‌రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని తన అనుచరులకు పదవుల ఇప్పించుకోవడం, సొంత నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం, బాల్కొండ నుంచే  సురేష్‌రెడ్డి పోటీ చేస్తారన్న  ప్రచారం జోరుగా సాగుతోంది. సురేష్‌రెడ్డి ఆర్మూర్‌లో కాకుండా బాల్కొండపై ఫోకస్‌ పెట్టడంతో నియోజకవర్గ ఇంచార్జీ అనిల్‌ అతనిపై గుర్రుగా ఉన్నారు. తన నియోజకవర్గంలో ఆయన పెత్తనం ఏంటంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ మధ్యే కాంగ్రెస్‌లోచేరిన రాజారాం యాదవ్‌ సైతం బాల్కొండ టికెట్‌ ఆశిస్తున్నారు.  అనిల్‌, సురేష్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.  మరోవై
ఆర్మూర్‌పై దృష్టిపెట్టిన ఆకుల లలిత
ఆర్మూర్‌ నుంచి బాల్కొండకు సురేష్‌రెడ్డి షిఫ్ట్‌ అవుతారనే  సమాచారంతో ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆర్మూర్‌పై కన్నేసింది. మరో సీనియర్‌ నాయకురాలు తన వారసుడిని నిలబెట్టి ఎమ్మెల్యే చేయడానికి టిక్కెట్టు కోసం పట్టుబడుతున్నారు. మొత్తానికి సురేష్‌రెడ్డి ఏ నియోజకవర్గం నుంచి సార్వత్రిక సమరంలో పోటీ చేస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.

 

13:51 - August 13, 2018

గుంటూరు : లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ ఛటర్జీ మృతిపై ఆయన అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పలువురితో ఛటర్జీకి పరిచయాలు ఉన్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ 2009లో తన 30వ కాన్వకేషన్‌లో సోమ్‌నాథ్‌ ఛటర్జీకి గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. రాజకీయాల్లోకి క్రిమినల్స్‌ ప్రవేశిస్తున్నారని.. పౌరులు అప్రమత్తంగా ఉండాలని డాక్టరేట్‌ అందుకున్న సందర్భంలో సోమ్‌నాథ్‌ తెలిపారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని వేదిక ద్వారా సోమ్‌నాథ్‌ కొనియాడారు. 

డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న వ్యక్తి అరెస్టు

హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న అబ్దుల్ హమీద్ ను అరెస్టు చేశారు. హమీద్ ను ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. 31 గ్రాముల కొకైన్, రూ.7 లక్షలు, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.  హమీద్.. గోవా నుంచి హైదరాద్ కు డ్రగ్స్ తరలిస్తున్నారు. గోవాలో మాక్స్ అనే వ్యక్తి నుంచి హమీద్ డ్రగ్స్ సేకరిస్తున్నారు. హైదరాబాద్ లో హామీద్ 20 మంది కస్టమర్లు ఉన్నట్లు గుర్తించారు.

13:40 - August 13, 2018

హైదరాబాద్ : నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న అబ్దుల్ హమీద్ ను అరెస్టు చేశారు. హమీద్ ను ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. 31 గ్రాముల కొకైన్, రూ.7 లక్షలు, రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.  హమీద్.. గోవా నుంచి హైదరాద్ కు డ్రగ్స్ తరలిస్తున్నారు. గోవాలో మాక్స్ అనే వ్యక్తి నుంచి హమీద్ డ్రగ్స్ సేకరిస్తున్నారు. హైదరాబాద్ లో హామీద్ 20 మంది కస్టమర్లు ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

13:30 - August 13, 2018

హైదరాబాద్ : కాంగ్రస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇవాళ, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండున్నరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాహుల్‌గాంధీ చేరుకోనున్నారు. మూడున్నరకు మహిళా సంఘాలతో భేటీ కానున్నారు. అలాగే జంట నగరాల్లో వివిధ కార్యక్రమాల్లో రాహుల్‌ పాల్గొననున్నారు. హరిత ప్లాజాలో బస చేయనున్నారు. తెలంగాణలో రాహుల్‌ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగసభకు భారీ ఏర్పాట్లు
చేశారు. రాహుల్‌ పర్యటించే ప్రాంతాల్లో ఎస్‌పీజీ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. నిర్బంధకాండ కొనసాగుతుందని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులుపెట్టినా రాహుల్ పర్యటన జరిగి తీరుతుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

13:20 - August 13, 2018

కరీంనగర్ : ప్రజలే కేంద్రంగా.. రాజకీయాల్లో మార్పులు రావాలని.. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి భూములను కాజేయడంపైనే తప్ప.. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించడంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఏపార్టీతోనూ ఎన్నికల పొత్తు ఉండదన్నారు. అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం కోసం త్వరలో హైదరాబాద్ లో దీక్ష చేపడతామని కోదండరామ్ తెలిపారు.

 

13:17 - August 13, 2018

హైదరాబాద్ : కాంగ్రస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇవాళ, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండున్నరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రాహుల్‌గాంధీ చేరుకోనున్నారు. మూడున్నరకు మహిళా సంఘాలతో భేటీ కానున్నారు. అలాగే జంట నగరాల్లో వివిధ కార్యక్రమాల్లో రాహుల్‌ పాల్గొననున్నారు. హరిత ప్లాజాలో బస చేయనున్నారు. తెలంగాణలో రాహుల్‌ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాహుల్‌ పర్యటించే ప్రాంతాల్లో ఎస్‌పీజీ తనిఖీలు చేశారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ టీఆర్ ఎస్ కు రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాహుల్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణలో రాహుల్ పర్యటన జరిగి తీరుతుందన్నారు. 

 

13:05 - August 13, 2018

రాజమండ్రి : ఛత్తీస్‌ఘడ్‌తో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు మండలాల్లో వాగులు వంకలు పొంగి రహదారులపై ప్రవహిస్తున్నాయి. వీఆర్ పురం మండలంలోని అన్నవరంవాగు ఉధృతంగా ప్రవహిస్తుండంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటు సోకులేరువాగు, చీకటివాగు, అత్తాకోడళ్లు వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని శబరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మరో పక్క భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 33 అడుగులకు చేరుకుంది. కూనవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

12:54 - August 13, 2018

గుంటూరు : పల్నాడులో ఉద్రిక్త  వాతావరణం నెలకొంది. అక్రమ మైనింగ్‌ను సందర్శించేందుకు సిద్ధమైన వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్ చేశారు. నర్సారావుపేటలో కాసు మహేష్‌రెడ్డి, మాచర్లలో రామకృష్ణారెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పల్నాడు, దాచేపల్లి, గురజాలలో 144 సెక్షన్‌ను విధించారు.

 

12:51 - August 13, 2018

హైదరాబాద్ : గచ్చిబౌలిలోని కొండాపూర్ పోలీస్ బెటాలియన్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఆర్ఎస్ఐ అంజయ్య తన భార్యను అతిదారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆంజనేయరెడ్డి, లక్ష్మీ దంపతులు గచ్చిబౌలి కోడాపూర్ లోని గౌతమి ఎన్ క్లేవ్ 101 ఫ్లాట్ నెంబర్ సెకండ్ ప్లర్ లో ఉంటున్నారు. కొండాపూర్ బెటాలియన్ లో ఆంజనేయరెడ్డి ఆర్ ఎస్ ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనేపథ్యంలో ఆంజనేయరెడ్డికి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఇటీవలే ఆంజనేయరెడ్డి రిటైర్డ్ అయ్యారు. అయితే రిటైర్డ్ అయినప్పుడు వచ్చిన డబ్బులను భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న వేరే మహిళకు ఇచ్చిన నేపథ్యంలో ఆంజనేయరెడ్డి, భార్య లక్ష్మీకి గొడవ జరిగింది. ఈక్రమంలో అసహనం కోల్పోయిన ఆంజనేయరెడ్డి భార్య లక్ష్మీని కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత మార్చాడు. ఆ తర్వాత గచ్చిబౌలి పీఎస్ లో లొంగిపోయాడు. గచ్చిబౌలీ పోలీసులు అంజయ్యను ఘటనాస్థలికి తీసుకొచ్చారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 302, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలతోనే భార్య లక్ష్మీని హత్య చేసినట్లు అంజనేయరెడ్డి, కుటుంబీకులు విచారణలో ఒప్పుకున్నారు. నిద్రిస్తున్న భార్యను తానే హత్యచేసినట్లు ఆంజనేయరెడ్డి ఒప్పుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈఘటనతో గౌతమి ఎన్ క్లేవ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

12:44 - August 13, 2018

హైదరాబాద్ : శేరిలింగంపల్లిలో రాహుల్ బహిరంగసభకు ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. 500 మంది సివిల్‌, 200 మంది ఏఆర్‌ పోలీసులను భద్రత కోసం మోహరించారు. అలాగే వన్‌ ప్లస్‌ టూ బెటాలియన్‌, కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచారు. సభ ప్రాంగణం, రూట్‌ మ్యాప్‌లలో డాగ్‌ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:41 - August 13, 2018

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ తన ఆపరేషన్‌ను కొనసాగిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. నిందితులను అబ్దుల్‌ బాసిత్‌, అబ్దుల్‌ ఖాదర్‌లుగా గుర్తించారు. రాత్రి నిందితులను అధికారులు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అనంతరం నిందితులను ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇవాళ పటియాల  కోర్టులో నిందితులను ఎన్‌ఐఏ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు. అలాగే కేసును హైదరాబాద్‌కు బదిలీ చేయటానికి ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ను ఎన్ ఐఏ అధికారులు వేయనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

కొండాపూర్ పోలీస్ బెటాలియన్ లో దారుణం

హైదరాబాద్ : గచ్చిబౌలిలోని కొండాపూర్ పోలీస్ బెటాలియన్ లో దారుణం జరిగింది. రిటైర్డ్ ఆర్ఎస్ఐ అంజయ్య తన భార్యను అతిదారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

12:37 - August 13, 2018

హైదరాబాద్ : గచ్చిబౌలిలోని కొండాపూర్ పోలీస్ బెటాలియన్ లో దారుణం జరిగింది. జీవితాంతం తోడుండాల్సిన భర్తే భార్యను హతమార్చారు. రిటైర్డ్ ఆర్ఎస్ఐ అంజయ్య తన భార్యను అతిదారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంజనేయరెడ్డి, లక్ష్మీ దంపతులు గచ్చిబౌలి కోడాపూర్ లోని గౌతమి ఎన్ క్లేవ్ 101 ఫ్లాట్ నెంబర్ సెకండ్ ప్లర్ లో ఉంటున్నారు. కొండాపూర్ బెటాలియన్ లో ఆంజనేయరెడ్డి ఆర్ ఎస్ ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనేపథ్యంలో ఆంజనేయరెడ్డికి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఇటీవలే ఆంజనేయరెడ్డి రిటైర్డ్ అయ్యారు. అయితే రిటైర్డ్ అయినప్పుడు వచ్చిన డబ్బులను భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న వేరే మహిళకు ఇచ్చిన నేపథ్యంలో ఆంజనేయరెడ్డి, భార్య లక్ష్మీకి గొడవ జరిగింది. ఈక్రమంలో అసహనం కోల్పోయిన ఆంజనేయరెడ్డి భార్య లక్ష్మీని కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత మార్చాడు. ఆ తర్వాత గచ్చిబౌలి పీఎస్ లో లొంగిపోయాడు. గచ్చిబౌలీ పోలీసులు అంజయ్యను ఘటనాస్థలికి తీసుకొచ్చారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 302, 506 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలతోనే భార్య లక్ష్మీని హత్య చేసినట్లు అంజనేయరెడ్డి, కుటుంబీకులు విచారణలో ఒప్పుకున్నారు. నిద్రిస్తున్న భార్యను తానే హత్యచేసినట్లు ఆంజనేయరెడ్డి ఒప్పుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈఘటనతో గౌతమి ఎన్ క్లేవ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

12:34 - August 13, 2018

గుంటూరు : పల్నాడులో ఉద్రిక్త  వాతావరణం నెలకొంది. అక్రమ మైనింగ్‌ను సందర్శించేందుకు సిద్ధమైన వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్ చేశారు. నర్సారావుపేటలో కాసు మహేష్‌రెడ్డి, మాచర్లలో రామకృష్ణారెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పల్నాడు, దాచేపల్లి, గురజాలలో 144 సెక్షన్‌ను విధించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

12:19 - August 13, 2018

భూపాలపల్లి : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలం ఏటూరునాగరం లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జంపన్నవాగు, దయ్యాలవాగు,జీడివాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటి వరకు ఏజెన్సీలో 15 శాతం వర్షపాతం నమోదైంది. దీంతో చుట్టు పక్కల గ్రామాల రహదారులు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలచిపోవడంతో ప్రజలకు నిత్యవసర సరకులు, వైద్యం అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి నది తీరంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది. దీంతో వరి,పత్తి,మిర్చి లాంటి పంట పొలాల్లొకి వరద నీరు చేరడంతో  రైతాంగం తీరని నష్టానికి గురైందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు ఏజెన్సీ ప్రాంతవాసులు.

 

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా నీరు

పెద్దపల్లి : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుకుంది. వరద తాకిడి పెరగడంతో 28 గేట్ల ద్వారా దిగువకు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దా.... 

 

12:10 - August 13, 2018

పెద్దపల్లి : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుకుంది. వరద తాకిడి పెరగడంతో 28 గేట్ల ద్వారా దిగువకు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.... 

12:01 - August 13, 2018

అమెరికా : అంతరిక్ష ప్రయోగాల్లో అందని ద్రాక్షలా ఊరిస్తున్న అద్భుత ప్రయోగాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విజయవంతంగా ఆవిష్కరించింది. కలగా మిగిలిపోతున్న సూర్యుడిపై ప్రయోగాన్ని పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ వ్యోమనౌక సుసాధ్యం చేసింది. కేప్‌ కెనెవెరాల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి డెల్టా-4 హెవీ రాకెట్‌ నిప్పులు విరజిమ్ముతూ సూర్యుడిని ముద్దాడేందుకు బయలుదేరింది. సుమారు లక్ష కోట్ల ఖర్చుతో చేపట్టిన ఈ మిషన్‌ విజయవంతం కావటం పట్ల శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. సూర్యుడి వాతావరణాన్ని స్పృశించి అక్కడి రహస్యాల గుట్టు విప్పేందుకు శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేపట్టారు. 

 

11:39 - August 13, 2018

చిత్తూరు : తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ ఇంటర్నల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. గీతికరెడ్డి మృతి దృష్ట్యా పరీక్షలను వాయిదా వేశారు. గీతిక ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకున్నట్లు గీతిక సూసైడ్ నోట్ రాసింది. వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. 

 

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద నీరు

విజయవాడ : కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. బ్యారేజీ 40 గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు

విజయవాడ : కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా కుండపోత వానలు పడుతున్నాయి. 

11:32 - August 13, 2018

విజయవాడ : కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  48 గంటలుగా కుండపోత వానలు పడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. బ్యారేజీ 40 గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:39 - August 13, 2018

హైదరాబాద్ : లోక్ సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ (89) కన్నుమూశారు. కోల్ కతాలోని ఆస్పత్రిలో అనారోగ్యంతో మృతి చెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో చటర్జీ బాధపడుతున్నారు. ఈనెల 7వ తేదీ నుంచి ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 2004 నుంచి 2009 వరకు లోక్ సభ స్పీకర్ గా పని చేశారు. 10సార్లు లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1968లో సోమ్ నాథ్ సీపీఎంలో చేరారు.

10:32 - August 13, 2018

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేడు, రేపు దీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్‌ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో రాహుల్‌ పర్యటించే ప్రాంతాలను రాష్ట్ర పోలీసులతో కలిసి ప్రత్యేక భద్రతాదళం అధికారులు పరిశీలించారు. ఓయూలో రాహుల్ సభకు ప్రభుత్వం, వీసీ అనుమతివ్వలేదు. దీంతో కొంత దుమారం రేగింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, టీఆర్ఎస్ నేత శేఖర్ రెడ్డి, టీడీపీ నేత మల్లయ్యయాదవ్ పాల్గొని, మాట్లాడారు. రాహుల్ పర్యటన అడ్డుకోవడం అప్రజాస్వామ్యమని వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..  

 

పల్నాడులో వైసీపీ నేతల గృహ నిర్బంధం

గుంటూరు : పల్నాడులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్రమ మైనింగ్ ను సందర్శించేందుకు వైసీపీ శ్రేణలు సిద్ధమయ్యారు. వైసీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నర్సారావుపేటలో మహేష్ రెడ్డి, మాచర్లలో పిన్నెల్లి హౌస్ అరోస్టు చేశారు. దాచేపల్లిలో, గురజాలలో 144 సెక్షన్ విధించారు.

 

పల్నాడులో ఉద్రిక్తత వాతావరణం

గుంటూరు : పల్నాడులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్రమ మైనింగ్ ను సందర్శించేందుకు వైసీపీ శ్రేణలు సిద్ధమయ్యారు. వైసీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. నర్సారావుపేటలో మహేష్ రెడ్డి, మాచర్లలో పిన్నెల్లి హౌస్ అరోస్టు చేశారు. దాచేపల్లిలో, గురజాలలో 144 సెక్షన్ విధించారు.

 

లోక్ సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ కన్నుమూత

హైదరాబాద్ : లోక్ సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ (89) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో చటర్జీ బాధపడుతున్నారు.

09:12 - August 13, 2018

లండన్ : క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో విజయం సాధించాలనుకున్న కోహ్లీసేన పరాజయంపాలైంది. 159 పరుగుల ఇన్సింగ్స్‌ తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లాండ్‌  2-0తో  ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్యాట్స్‌మెన్స్‌ వైఫల్యం కారణంగా.. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఓటమి చవిచూసింది. దీంతో మిగతా మూడు టెస్టులను గెలవక తప్పని పరిస్థితి ఏర్పడింది.. రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌, హార్దిక్‌ పాండ్య మినహా ఏ ఒక్కరూ 20 పరుగుల స్కోరుకు కూడా చేరుకోలేదు.  వెన్నునొప్పితో బాధపడుతున్న విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. మూడో టెస్టులోనూ ఆడటం అనుమానంగానే తోస్తోంది. జేమ్స్‌ అండర్సన్‌ , స్టువర్ట్‌ బ్రాడ్‌, క్రిస్‌వోక్స్‌, కోహ్లీసేన పతనాన్ని నిర్దేశించారు. 

 

09:10 - August 13, 2018

ఉమ్మడి కరీంనగర్‌ : మారిన వాతావరణ పరిస్థితులు, కలుషిత నీరు. పారిశుధ్యం లోపించడంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పల్లె వాసులు మంచం పడుతున్నారు. జ్వరాల భారిన పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగి పోతుండటంతో ప్రభుత్వ ప్రైవేట్‌ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇంటికిద్దరు ముగ్గురి చొప్పున విషజ్వరాలతో అల్లాడిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఆ పల్లె వాసులను అధికారులుగానీ.. ప్రజాప్రతినిధులుగానీ పట్టించుకోవడం లేదు.
పెద్దపల్లి జిల్లాలో విషజ్వరాలు
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా జ్వర పీడితుల సంఖ్య పెరిగి పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. కలుషితమైన నీటిని తాగడం.. పారిశుధ్యం లోపించడం కారణంగా దోమలు వ్యాప్తి చెంది ప్రజలు అంతుచిక్కని రోగాల భారిన పడుతున్నారు. ఇక మారుమూల పల్లెల పరిస్థితి మరి దారుణంగా ఉంది. 
మంథని నియోజక వర్గంలో జ్వరాల భారిన పడ్డ ప్రజలు  
ముఖ్యంగా మంథని నియోజక వర్గంలో పల్లెలతో పాటు తూర్పు డివిజన్‌లో జ్వరాల భారిన పడే వారి సంఖ్యపెరుగుతున్నప్పటికీ వైద్య శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. మంథని, సూరయ్య పల్లి, గోపాల్‌ పూర్‌, ఎగ్లాస్‌ పూర్ తో పాటు తాడిచర్లలో జ్వర పీడితుల సంఖ్య అధికంగా ఉంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 
పల్లెల్లో ఎక్కడ చూసిన విషాదఛాయలు
మంథని ఎమ్మెల్యే పుట్ట మధు దత్తత గ్రామం అయిన ముత్తారం గ్రామంలో ఏ ఇంట్లో చూసినా ఇంటికి ఒక్కరిద్దరు చొప్పున జ్వరాలతో మంచాన పడి ఉన్నారు. సుమారు 500 మంది దాకా వైరల్‌ ఫీవర్‌ బాధితులు ఉన్నారు. ప్రతి ఇంట్లో విషజ్వరాలతో వచ్చే కాళ్లనొప్పులు ఒళ్లునొప్పులతో.. నడవలేని స్థితిలో తలుపు తీసేవారే కనిపిస్తున్నారు. ఇది కేవలం ఈ మండల కేంద్రానికే పరిమితం కాలేదు చుట్టుపక్కల కేశనపల్లి, ఓడేడు ఇలా పలు పల్లెలూ విషజ్వరాలతో పడకేశాయి. ఇప్పటికే ఐదారుగురి దాకా విషజ్వరాలతో మృత్యువాత పడగా ఇటీవల కూర్మ పూజిత అనే 14 ఏళ్ల బాలిక డెంగ్యూతో చనిపోయింది. దీంతో పల్లెల్లో ఎక్కడ చూసినా విషాదఛాయలే దర్శనమిస్తున్నాయి. 
స్పందించని అధికారులు  
ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం స్పందించటం లేదు. మంథని ముత్తారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం ఏడు బెడ్స్‌ మాత్రమే ఉండటం ఇబ్బందికరంగా మారింది. అంటు వ్యాధులు ప్రబలుతున్నా ఈ ప్రాంతాల్లో డాక్టర్లు కూడా కరువయ్యారు. వరంగల్‌ నుంచి డిప్యూటేషన్‌ మీద మెడికల్‌ ఆఫీసర్‌ అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు. అలాగే  ఆరేడుగురు నర్సులు ఉండాల్సిన చోట.. స్టాప్‌ నర్సులు కూడా లేరు. ఇక వైద్య పరికరాలు, ల్యాబ్‌ ఫెసిలిటీస్‌ అయితే అడిగే నాథుడే లేడు. దత్తత తీసుకున్న ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
గ్రామాల్లో విష జ్వరాలు 
వర్షకాలంలో కలుషిత నీటి ప్రభావంతో గ్రామాల్లో విష జ్వరాలు ప్రభలుతున్నాయి. శుద్ద జలలాలు అందించాల్సిన పాలకులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మంథనిలో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందిచాలని రోగులు కోరుతున్నారు.

09:07 - August 13, 2018

కడప : ఎవరైనా మరుగుదొడ్లు, మంచినీళ్ళ కోసం ధర్నాలు చేయడం మామూలే.. కానీ మమ్మల్ని మా గ్రామాలనుంచి తరలించి.. మా ప్రాణాలు కాపడండి మహా ప్రభో అని అంటుంటే.. వారెంత ధీన పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. కడపజిల్లా ఓబులవారిపల్లె మండలం పరిసర గ్రామాల ప్రజలు పదేళ్ళుగా ప్రాధేయపడుతున్నా పట్టించుకున్న నాథుడేలేడు.  అరణ్య రోదనను తలపిస్తున్న వారి ఆవేదనపై 10టీవీ ప్రత్యేక కథనం.
1978నుంచి మైనింగ్‌ పనులు 
కడప జిల్లా ఓబులవారి పల్లె మండలం మంగంపేటలోని ముగ్గురాయి ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. 1978నుంచి ఇక్కడ మైనింగ్‌ పనులు నడుస్తున్నాయి. కానీ  కపుపల్లి, అరుంధతీవాడ, హరిజన వాడ, అగ్రహారం ప్రజల జీవితాలు ఏపీఎండీసి స్వార్థానికి బలైపోతున్నాయి. లాభాలను వెనుకేసుకుంటున్న ఏపీ ఎండీసి ప్రజల బాగోగులను గాలికి వదిలేసింది.  మైనింగ్‌లో చేసే పేలుళ్ళకు ఆయా గ్రామాల్లో ఇళ్ళు నెర్రెలు చీలి, కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. బాంబులు పేల్చిన ప్రతిసారి వస్తున్నశబ్దాలు, రాళ్ళు, దుమ్ము వల్ల ఆ గ్రామాల  ప్రజలు యాతన అనుభవిస్తున్నారు. రాత్రి వేళ ఇళ్ళలో పడుకోవాలంటేనే హడలిపోతున్నారు.
ప్రాణాంతక జబ్బుల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన 
ముగ్గురాయి తీసుకెళ్ళే లారీలతో రేగుతున్న దుమ్ము, ధూళి వల్ల శ్వాసకోశ వ్యాధులతోపాటు.. పలు ప్రాణాంతక జబ్బుల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్ళుగా ప్రభుత్వాలు, అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నా ఏ ఒక్కరూ తమపై కనికరం చూపలేదని తమ గోడు వెళ్ళబోస్తున్నారు..  తమను సురక్షిత ప్రాంతాలకు తరలించి.. తమ ప్రాణాలను కాపాడాలంటూ ఏపీఎండీసీ ఎండీ వెంకయ్యచౌదరిని ధీనంగా వేడుకున్నారు ప్రజలు. దీంతో వారిని ఖచ్చితంగా వేరే ప్రాంతానికి తరలిస్తామని ఏపీఎండీసీ ఎండీ హామీ ఇచ్చారు.  ఆమేరకు ఆయా గ్రామాల్లోని ఇళ్ళకు నెంబర్లు వేసి మార్కింగ్‌ చేశారు. కానీ నెలలు గడుస్తున్నా తరలింపు చర్యలు ఊసులేదు.. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. దుమ్ము, ధూళితోపాటు.. శబ్ధ కాలుష్యంతో వచ్చే ప్రాణాంతక వ్యాధుల వల్ల యాతన అనుభవిస్తున్నామంటూ ఆవేద వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు. లేదంటు ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

09:03 - August 13, 2018

వనపర్తి : చారిత్రక నేపథ్యమున్న వనపర్తి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడి నుంచి గెలుపొందిన నేతలు జాతీయస్థాయిలో చక్రం తిప్పారన్న పేరుంది. కానీ వనపర్తి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. త్రిముఖపోరుతో ఇక్కడి రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వనపర్తి నేతల ఎత్తులు పైఎత్తులపై కథనం..
వనపర్తిలో త్రిముఖ పోటీ 
వనపర్తిలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికలకు సిద్ధపడుతున్న నేతలు ముగ్గురూ ముగ్గురే. కాంగ్రెస్‌నుంచి చిన్నారెడ్డి, టీఆర్ఎస్ నుంచి నిరంజన్ రెడ్డి, టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డి తలపడనున్నారు. వీరికి చాలా విషయాల్లో సారూప్యం కూడా కనిపిస్తుంది.  వ‌య‌సులో దాదాపు స‌మానులే.  అంతేకాదు.. ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కూడానూ. ఒక‌రు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా కొన‌సాగుతుంటే.. మరొక‌రు తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యులు.. ఇంకొక‌రు ఏఐసీసీ కార్యద‌ర్శిగానూ ఉన్నారు. 
ఎలాగైనా పార్టీ జెండా ఎగుర‌వేయాల‌ని నేతల ప్రయత్నం 
ఈసారి ఎలాగైనా తమ పార్టీ జెండా ఎగుర‌వేయాల‌ని ఎవరికి వారే ఉవ్విళ్లూరుతున్నారు. 2014లో కారుకు బ్రేకులేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు చిన్నారెడ్డి. ఉద్యమనేత కేసీఆర్‌తో సభ ఏర్పాటు చేసినా..  నిరంజ‌న్ రెడ్డి ఓట‌మి పాల‌య్యారు. దీంతో ఈ సారి  ఎలాగైనా గులాబీ జెండా ఎగరేయాల‌ని శ‌తావిధాల ప్రయ‌త్నిస్తున్నారు నిరంజన్ రెడ్డి.  అందుకోసమే ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రజ‌ల్లోకి  తీసుకెళ్లే ప్రయ‌త్నం చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ బ‌ల‌ప‌డుతుంద‌న్న భావనతో చిన్నారెడ్డి త‌న స్టాండ్ ను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా టీఆర్ఎస్‌ను నిలువారించాల‌ని యోచిస్తున్నాడు.  ఈ ఎన్నిక‌ల్లో కారుకు ఏమాత్రం అవకాశం ఇవ్వద్దనన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే రావుల‌కు అవకాశం ఇచ్చేందుకు సైతం  చిన్నారెడ్డి సిద్దమైనట్లు సమాచారం. అందుకే టీడీపీలో ఉన్న రావులను కాంగ్రెస్‌లోకి తెచ్చే ప్రయ‌త్నం చేస్తున్నట్లు సమాచారం.
టీడీపీతోనే ఉంటాన‌ని రావుల స్పష్టం 
రావుల మాత్రం చివరిదాకా టీడీపీతోనే ఉంటాన‌ని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఏర్పాటుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ‌ పొత్తు కుదురితే  చిన్నారెడ్డి.. రావుల‌కు అవకాశం ఇస్తాడా  లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.  కాగా.. కేసీఆర్ స‌న్నిహితుడుగా పేరున్న నిరంజ‌న్ రెడ్డి విజ‌య‌మే ల‌క్ష్యంగా  ఉన్నట్లు తెలుస్తోంది.. గ‌త ఎన్నిక‌ల్లో భంగ‌ప‌డ్డ ఆయ‌న వ‌న‌ప‌ర్తి ఖిల్లాలో గులాబీ జెండా రెప‌రెప‌లాడించాల‌ని  చూస్తున్నారు.  పైగా ఇచ్చిన హామీ ప్రకారం వనపర్తిని జిల్లాగా చేసిన క్రెడిట్‌తో  ఓట్లు పడతాయన్న ఆశాభావం కూడా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే..  రావుల పోటీపడితే ఓట్లు చీలి తాను ఓడిపోతానన్న నిర్ణయానికి చిన్నారెడ్డి వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే తాను తప్పుకొని రావులను పోటీలో దించాలన్న ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కానీ కాంగ్రెస్‌లో చేరితేనే అంటూ మెలికపెట్టినట్లు తెలుస్తోంది. కానీ.. దీనికి రావుల ఒప్పుకోలేదని తెలుస్తోంది. మొత్తానికి వనపర్తి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇంతకూ ఇక్కడ ఎన్నికల బరిలో ఎవరు నిలుస్తారో.. చివరికి ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే. 

 

09:01 - August 13, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేడు, రేపు దీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్‌ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో రాహుల్‌ పర్యటించే ప్రాంతాలను రాష్ట్ర పోలీసులతో కలిసి ప్రత్యేక భద్రతాదళం అధికారులు పరిశీలించారు.
పర్యటనకు ఏర్పాట్లు పూర్తి
రాహుల్‌గాంధీ హైదరాబాద్‌ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లో  రాహుల్‌ పర్యటనకు భద్రత కట్టుదిట్టం చేశారు. రాహుల్ పర్యటించే అన్ని ప్రాంతాలను ఎస్‌పీజీ అధికారులు పరిశీలించారు. రాష్ట్ర పోలీసులకు తగిన సూచనలు చేశారు. 
అడుగడునా నిఘా 
హైరాబాద్‌లో ఇద్దరు ఐసిస్‌ సానుభూతిపరులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో... రాహుల్‌ పర్యటించే ప్రాంతాల్లో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం రాహుల్‌ శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడకు సమీపంలోని  కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో రాహుల్‌ పాల్గొంటారు. దీంతో శంషాబాద్‌ పరిధిలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలను నిషేధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. శంషాబాద్‌ నుంచి శేరిలింగంపల్లిలో జరిగే సభకు రాహుల్‌ హాజరవుతారు. 
ఓయూలో రాహుల్‌ సభకు అనుమతి నికారణ 
ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌ సభకు విశ్వవిద్యాలయం అధికారులు అనుమతి నికారించారు. భదత్రా కారణాలను దృష్టిలో పెట్టుకుని అనుమతి  ఇవ్వకపోవడం వివాదాస్పదంగా మారింది. ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని కాంగ్రెస్‌ నాయకులు విమర్శిస్తున్నారు. 
కార్యకర్తల భేటీలో ఎన్నికలపై రాహుల్ దిశానిర్దేశం 
రాష్ట్ర పర్యటనలో భాగంగా రాహుల్‌ మంగళవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంగ్రెస్‌ కార్యకర్తలతో భేటీ అవుతారు. ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. సమాచార, ప్రసారమాధ్యమాల సంపాదకులతో సమావేశం అవుతారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో వ్యాపారులతో నిర్వహించే సమావేశం భద్రతా కారణాలతో రద్దు అయ్యింది. యువపారిశ్రామికవేత్తలు, ముఖ్యకార్యనిర్వహణాధికారంలో భేటీ అవుతారు. చివరిగా సరూర్‌నగర్‌ స్టేడియలో జరిగే నిరుద్యోగ గర్జన సభలో రాహుల్‌ పాల్గొంటారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగే నిరుద్యోగ గర్జన తర్వాత రాహుల్‌ శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. 

 

వైభవంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ

తిరుమల : అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైభవంగా జరుగుతోంది. ఐదు రోజులపాటు అష్టబందన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు కొనసాగనుంది. రెండవ రోజు మహాసంప్రోక్షణలో భాగంగా నేడు అష్టబంధన జరుగనుంది. 8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనం తయారీ చేస్తారు. పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద చుట్టుపక్కలా అష్టబంధన సమర్పణ జరుగనుంది. ఉప ఆలయాల్లో అష్టబంధన సమర్పణ జరుగనుంది. నేడు 35,400 మంది భక్తులకు దర్శనం కల్పించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేశారు. 

నేడు 236వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర

తూర్పుగోదావరి : నేడు 236వ రోజు వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర జరుగనుంది. తుని నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర కొనసాగనుంది.

 

నేడు, రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన

హైదరాబాద్ : నేడు, రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. మ.2.30 శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రాహుల్ చేరుకోనున్నారు. మ.3.30 గంటలకు మహిళా సంఘాలతో రాహుల్ భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్ లో జరిగే సభలో రాహుల్ పాల్గొననున్నారు. 

 

నిజామాబాద్ లో నేడూ 144 సెక్షన్ అమలు

నిజామాబాద్ : పట్టణంలో నేడూ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీ కార్తికేయ తెలిపారు. రాత్రి 7 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. 

Don't Miss