Activities calendar

14 August 2018

22:24 - August 14, 2018

హైదరాబాద్ : ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను దోపిడీ చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో నిరుద్యోగం తాండవిస్తోందని, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంలేదని, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ పథకానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తూట్లు పొడిచిందని రాహుల్‌ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు, విద్యార్థుల స్వప్నాన్ని సాకారం చేస్తామన్నారు. 

రెండు రోజులు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం చివరి రోజు సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన  తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ గర్జన సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరిగారు.

సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని రాహుల్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రీడిజైన్‌ చేసి అంచనాలు భారీగా పెంచి జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో అశువులుబాసిన అమరులను నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించిన రాహుల్‌గాంధీ...  విద్యార్థులు, నిరుద్యోగులను కేసీఆర్‌ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎందరో ఆత్మబలిదానాలతో సిద్ధించిన తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదని రాహుల్‌ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలతోపాటు కాంగ్రెస్‌ కార్యకర్తల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తుందని రాహుల్‌ హామీ ఇచ్చారు. 

రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై కూడా తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. ఏ అనుభవంలేని అనిల్‌ అంబానీ కంపెనీకి రాఫెల్‌ యుద్ధ విమానాల అసెంబ్లింగ్‌ను అప్పగించడాన్ని రాహుల్‌ తప్పుపట్టారు. ఈ కుంబకోణంపై ప్రధాని మోదీతో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమని రాహుల్‌ సవాల్‌ విసిరారు. ప్రపంచంలో ముడి చమురు ధరలు తగ్గుతున్నా... మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెగురుతున్న విషయాన్ని రాహుల్‌ ప్రస్తావించారు. ఈసొమ్ము అంతా 15-20 మంది కార్పొరేట్ల జేబుల్లోకి వెళ్తోందని మండిపడ్డారు. మోదీ అసమర్థపాలనకు అంతం పలకాల్సిన అవసరం ఉందని రాహుల్‌ చెప్పారు. సరూర్‌నగర్‌ సభ అనంతరం రాహుల్‌గాంధీ నేరుగా శంషాబాద్‌ విమానాశ్రం చేరుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

22:14 - August 14, 2018

డీఎంకే నేత..మాజీ సీఎం కరుణానిధి మరణం అంతరం ఆ పార్టీలో అంతర్గత కలహాలు చెలరేగాయి. పార్టీ అధ్యక్ష పదివి నాదంటు నాదని డీఎంకేలో వారసత్వపు పోరు ప్రారంభమయ్యింది. కరుణానిధి జీవించి వున్నంతకాలంగా పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగారు. ఇప్పుడు ఆయన మరణం అనంతం ఆయన కుమారులైన స్టాలిన్, అళగిరిల మధ్య అధ్యక్షపదవికి సంబంధించిన కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కరుణానిధి మరణం అనంతం పార్టీ 750మంది సభ్యులతో కార్యనిర్వాహక కమిటీ తొలిసారి సమావేశమయ్యింది. పార్టీ అధ్యక్ష పదవికి తాను అర్హుడినేనంటు..తండ్రి కరుణానిధికి మిత్రులు తనకే మద్దతునిస్తున్నారంటూ అళగిరి ప్రకటన పార్టీలో అలజడి రేపింది. ఇదే అంశంపై విశ్లేషకులు లక్ష్మీనారాయణ విశ్లేషణ చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

22:00 - August 14, 2018

రాహుల్ రాకతోని కాంగ్రెస్ రాత మారిందా..?..కేసీఆర్ ముందస్తు ఉత్తముచ్చటనేనా..?, బీసీల మీద టీఎంసీల కొద్ది గావురం గార్చిండు..ఓట్ల కోసం బదునాం బదలాయించిన సీఎం, ఆంధ్ర రాష్ట్రంల మంత్రులు ఆడోళ్ల మొగోళ్ల...అనుమానం వ్యక్తం జేస్తున్న ఆర్కే రోజా, జనసేనా పార్టీ గుర్తు పిడికిలన్న పవన్...మెనిఫెస్టోల ఒక్కొక్కటి ఇడిశిపెడ్తున్నడు, ఎన్నికలు దగ్గరికొస్తుంటే కులసంఘాలు...ఎన్నికలు అయిపోయినంక ఏ కులంలేదు, పామును వెంచుకుంటున్న పనిమంతుడు...విషం దీశిండ్రా లేదా అనేది తెలుస్తలేదు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 

21:46 - August 14, 2018
21:42 - August 14, 2018

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దూకుడు పెంచారు. పార్టీ మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ని విడుదల చేశారు. భీమవరంలో పార్టీ సిద్ధాంతాలు, హామీలను ప్రకటించారు. జనసేన అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని అన్నారు. సోమవారం పార్టీ గుర్తును ప్రకటించిన పవన్‌, ఇవాళ జనసేన విజన్‌ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి, టీడీపీ నేత పట్టాభిరామ్, జనసేన అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

21:34 - August 14, 2018

ప.గో : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌ని విడుదల చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌ భీమవరంలో పార్టీ సిద్ధాంతాలు, హామీలను ప్రకటించారు. జనసేన అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దూకుడు పెంచారు. సోమవారం పార్టీ గుర్తును ప్రకటించిన పవన్‌, ఇవాళ జనసేన విజన్‌ మేనిఫెస్టోని విడుదల చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్‌ భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ దేవాలయాన్ని సందర్శించారు. పార్టీ విజన్‌ మేనిఫెస్టోని అమ్మవారి వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం విజన్‌ మేనిఫెస్టోని విడుదల చేశారు.
విజన్‌ డాక్యుమెంట్‌లో 7 సిద్ధాంతాలు, 12 హామీలు 
జనసేన మేనిఫెస్టో విజన్‌ డాక్యుమెంట్‌లో 7 సిద్ధాంతాలు, 12 హామీలను పొందుపర్చారు. కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేనాని సిద్ధాంతాలు. మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు, గృహిణులకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు, రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 మధ్య నగదు జమ, బీసీలకు అవకాశాన్ని బట్టి రాజకీయంగా 5 శాతానికి రిజర్వేషన్ల పెంపు, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కాపులకు 9వ షెడ్యూల్‌ ద్వారా రిజర్వేషన్ల కల్పన, ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పొరేషన్‌, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు, ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు, ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు, వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు కల్పిస్తామని జనసేన హామీలు ఇచ్చింది. జనసేన విజన్‌ డాక్యుమెంట్‌ విడుదల చేసిన పవన్‌ త్వరలోనే పూర్తి మేనిఫెస్టోని విడుదల చేస్తామని తెలిపారు. జనసేన అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. 

 

21:30 - August 14, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సెక్రటరీ, లా సెక్రటరీలకు హైకోర్టు ఫారమ్..01 నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 17న అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ లా సెక్రటరీలు నేరుగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతాలకు సంబంధించిన వివరాలు అసెంబ్లీ రిజిస్ట్రర్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 

 

20:56 - August 14, 2018

కరీంనగర్ : కాంగ్రెస్‌ అనవసర ఆరోపణలు చేయడం మానేసి రుజువు చేయాలన్నారు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి. కాంగ్రెస్‌ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ జిల్లా వేములవాడ రాజన్నను మంత్రి దర్శించుకున్నారు. వేములవాడలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించారు. మరో 15 సంవత్సరాల పాటు టీఆర్ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

 

20:53 - August 14, 2018

హైదరాబాద్‌ : గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద రాహుల్‌ గాంధీ నివాళులు అర్పించారు. రాహుల్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు .. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  

20:48 - August 14, 2018

ఢిల్లీ : బ్రిటన్‌ పార్లమెంట్‌ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఉదయం ఏడున్నర ప్రాంతంలో కారు పార్లమెంట్‌ భవనం వద్ద భద్రత కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్టి పాదచారుల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురు పాదచారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రమాదమా...లేక ఉగ్రవాద చర్యా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్లమెంట్‌ భవన పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. అగ్నిమాపక దళం, అంబులెన్సులు హుటాహుటిన‌ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కారు డ్రైవర్‌ కావాలనే పార్లమెంట్‌ రక్షణ గోడను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

 

20:45 - August 14, 2018

ఢిల్లీ : జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న బిజెపి ప్రతిపాదనకు ఈసీలో చుక్కెదురైంది. పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. జమిలి ఎన్నికల నిర్వహణకు కావలసిన వివిప్యాట్‌లు తమవద్ద లేవని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపి రావత్‌ తెలిపారు. లోక్‌సభతో పాటు11 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటూ 'వన్‌ నేషన్‌...వన్‌ ఎలక్షన్‌' నినాదాన్ని బిజెపి తెరపైకి తెచ్చింది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కనీసం వచ్చే లోక్‌సభ ఎన్నికలతోపాటు 11 రాష్ర్టాల్లో అయినా ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్ ప్లాన్‌ చేస్తోంది. వచ్చే ఏడాది తెలంగాణా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు లోక్‌సభతోపాటు ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికితోడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, హర్యానా, మహారాష్ట్ర, మిజోరం, జార్ఖండ్, బీహార్‌లలోనూ ఎన్నికలు నిర్వహించాలన్నది బీజేపీ ప్లాన్. నిజానికి వీటిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరంలకు ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది.

 

20:42 - August 14, 2018

హైదరాబాద్ : గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వసిద్ధమయింది. కోటలోని రాణీమహల్‌ వద్ద సీఎం కేసీఆర్‌ జెండా ఎగరవేయనున్నారు. వేడుకలకు పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. 15 వందల మంది పోలీసులతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటతో పాటు పరిసర ప్రాంతాలను నిఘా నీడలో ఉంచారు. 
సీసీ కెమెరా నిఘాలో కోట పరిసరాలు
పంద్రాగస్టు వేడుకులకు పోలీసు భద్రత విభాగం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కోటను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. పరిసర ప్రాంతాలు, రహదారుల పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోటతో పాటు పరిసర ప్రాంతాలను సీసీ కెమెరా నిఘాలో ఉంచారు. ఇప్పటికే ఉన్న ట్రాఫిక్‌, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడుగా మరో 120 తాత్కాలిక కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను కమిషనర్‌ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేశారు. కోటలోని అణువణువు రికార్డ్‌ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక స్వాతంత్ర్య వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరితో పాటు 10 ప్లాటూన్‌లు, ప్రత్యేక దళాలు, గ్రేహౌండ్‌ దళాలు బందోబస్తులో పాల్గొననున్నాయి. 
రాణీమహల్‌ ప్రాంగణంలో కేసీఆర్‌ జెండా ఆవిష్కరణ 
కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాణీమహల్‌ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సోమవారం సీఎం కాన్వాయ్‌కి సంబంధించిన రిహార్సల్స్‌ను అధికారులు నిర్వహించారు. ప్రగతిభవన్‌ నుంచి మెహిదీపట్నం మీదుగా లంగర్‌హౌస్‌, రామ్‌దేవ్‌గుడాల నుంచి సీఎం కాన్వాయ్‌ గోల్కొండ కోటకు చేరుకొనుంది. పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కాన్వాయ్‌ రాణీమహల్‌ ప్రాంగణంలోని జెండా ఆవిష్కరణ ప్రాంతానికి చేరుకుంటుంది.  జెండాను ఆవిష్కరించిన అనంతరం సీఎం మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్కొండలోనే ఉండనున్నారు. కేసీఆర్‌ గోల్కొండ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్‌ జోషి పరిశీలించారు. 
వేడుకలకు హాజరుకానున్న 5 వేల మంది అతిథులు
కోటలో జరిగే వేడుకలను తిలకించేందుకు సుమారు 5 వేల మంది అతిథులు రానున్నారు. వీరికి పోలీసుశాఖ పాసులు జారీ చేసింది. పాసులు ఉన్నవారిని మాత్రమే వేడుకలకు అనుమతించనున్నారు. 6 రంగుల్లోని హోర్డింగ్‌ పాసులను ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్‌ విభాగాలుగా నిర్ణయించారు. అతిథులు కోటకు చేరుకోవాల్సిన మార్గాలను ట్రాఫిక్‌ పోలీసులు సిద్ధం చేశారు. అతిథులకు ఇచ్చే పాసుల వెనక రూటు మ్యాపును ముద్రించారు. గోల్కొండలో వేడుకల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షాలు విధించారు. కోట పరిసరాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ఇక అతిథులు ఎవరు తమ వెంట హ్యాండ్‌ బ్యాంగులు, కెమెరాలు, టిఫిన్‌ బాక్సులు, వాటర్‌ బాటిళ్లు తీసుకురావద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు ముమ్మర తనిఖీలు 
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిఘా వర్గాల హెచ్చరికలతో నగరంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. జనావాస ప్రాంతాలతో పాటు బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, లాడ్జిలలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు మఫ్టీలో మోహరించారు. 

 

20:33 - August 14, 2018

రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలం చింతపట్లలోని సెయింట్‌ స్టీఫెన్‌ హైస్కూల్‌లో దారుణం జరిగింది. బ్లాక్‌ రిబ్బన్‌లు వేసుకురాలేదని టీచర్‌ మనీషా విద్యార్థిని జుట్టు కత్తిరించింది. టీచర్‌ తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఘటనపై విచారణ జరుపుతామని ఎంఈవో అన్నారు. 

 

రంగారెడ్డి జిల్లాలో దారుణం

రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలం చింతపట్లలోని సెయింట్‌ స్టీఫెన్‌ హైస్కూల్‌లో దారుణం జరిగింది. బ్లాక్‌ రిబ్బన్‌లు వేసుకురాలేదని టీచర్‌ మనీషా విద్యార్థిని జుట్టు కత్తిరించింది. టీచర్‌ తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఘటనపై విచారణ జరుపుతామని ఎంఈవో అన్నారు. 

 

నాలుగేళ్లలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య : రాహుల్

హైదరాబాద్ : నాలుగేళ్లలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాహుల్ గాంధీ తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం చేస్తున్నాడని అన్నారు. పెట్టుబడిదారులకు రుణాలు మాఫీ చేస్తున్నారు..కానీ రైతుల రుణాలు మాఫీ చేయడం లేదని విమర్శించారు. దేశంలో డబ్బున్న వారికి రుణాలు మాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. 

తెలంగాణ వచ్చాక కన్న కలలు సాకారం కాలేదు : రాహుల్ గాంధీ

హైదరాబాద్ : నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ పోరాటం సాగిందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకన్నాక నీళ్లు, ఉద్యోగాలు వస్తాయని అనుకున్నామని.. తెలంగాణ వచ్చాక కన్న కలలు సాకారం కాలేదన్నారు. నోటిఫికేషన్ వేయలేదు..వేసిన వాటికి రిక్రూట్ మెంట్ జరగలేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. ఫీజు రియింబర్స్ పథకాన్ని విద్యార్థులకు అందకుండా దూరం చేస్తున్నారని విమర్శించారు. 

18:50 - August 14, 2018
18:49 - August 14, 2018

హైదరాబాద్ : నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ పోరాటం సాగిందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకన్నాక నీళ్లు, ఉద్యోగాలు వస్తాయని అనుకున్నామని.. తెలంగాణ వచ్చాక కన్న కలలు సాకారం కాలేదన్నారు. సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. నోటిఫికేషన్ వేయలేదు..వేసిన వాటికి రిక్రూట్ మెంట్ జరగలేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. ఫీజు రియింబర్స్ పథకాన్ని విద్యార్థులకు అందకుండా దూరం చేస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం చేస్తున్నాడని అన్నారు. పెట్టుబడిదారులకు రుణాలు మాఫీ చేస్తున్నారు..కానీ రైతుల రుణాలు మాఫీ చేయడం లేదని విమర్శించారు. దేశంలో డబ్బున్న వారికి రుణాలు మాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ యువతకు ఉపాధి కల్పిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు..నాలుగేళ్లలో పదివేల మందికి కూడా ఉపాధి కల్పించలేకపోయారని విమర్శించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగాయని అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీకి కట్టబెట్టడం ద్వారా అవినీతి జరిగిందని ఆరోపించారు. రాఫెల్ విమానం ధరను ప్రధాని దేశ ప్రజలకు తెలపడం లేదన్నారు. రాఫెల్ ఒప్పందాన్ని మోడీ రీడిజైన్ కేసి తన మిత్రుడైన అనిల్ అంబానీకి కట్టబెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రీడిజైనింగ్ స్పెషలిస్ట్ అని ఎద్దేవా చేశారు. ప్రాణహిత..చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ చేస్తూ కాళేశ్వరం పేరు పెట్టారని తెలిపారు. రూ.38 వేల కోట్ల ప్రాజెక్టు ప్రతిపాదన లక్ష కోట్లకు చేరిందన్నారు. ఢిల్లీలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ రీడిజైన్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

 

3 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం : ఉత్తమ్

హైదరాబాద్ : ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 10 లక్షల మందికి నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 

 

తెలంగాణ రావడానికి కారణం విద్యార్థులే : ఉత్తమ్

హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ రావడానికి కారణం విద్యార్థులేనని అన్నారు. తెలంగాణ కోసం 1200 మంది అత్మబలిదానం చేసుకున్నారని పేర్కొన్నారు. జీవితాలను ఫణంగా పెట్టి పోరాడారని తెలిపారు.

18:28 - August 14, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ రావడానికి కారణం విద్యార్థులేనని అన్నారు. తెలంగాణ కోసం 1200 మంది అత్మబలిదానం చేసుకున్నారని పేర్కొన్నారు. జీవితాలను ఫణంగా పెట్టి పోరాడారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి, అధికారంలోకి వస్తుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ సకాలంలో జరిగేదన్నారు.  టీసర్కార్ పాలనలో ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాల్సి వుందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను కమిషన్లకు కక్కుర్తిపడి ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగించారని విమర్శించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు కమిషన్లు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి కానీ... విద్యార్థులకు ఫీజు రియింబర్స్ మెంట్ చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు. ఉద్యోగ ఖాళీ పోస్టులు నేటికీ భర్తీ కాలేదన్నారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్...ఊరికొక ఉద్యోగం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కానీ కేసీఆర్ ఇంట్లో మాత్రం నాలుగు ఉద్యోగాలు వచ్చాయన్నారు. టీఎస్ పీఎస్ సీలో 15 లక్షల మంది నిరుద్యోగ యువత రిజిస్టర్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 10 లక్షల మందికి నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 

 

సరూర్ నగర్ సభా ప్రాంగణానికి చేరుకున్న రాహుల్ గాంధీ

హైదరాబాద్ : సరూర్ నగర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ ప్రాంగణానికి రాహుల్ గాంధీ చేరుకున్నారు. సభలో ఆయన ప్రసంగించనున్నారు. 

గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన రాహుల్‌గాంధీ

హైదరాబాద్ : కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్‌ సభలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరిగి పయనమవుతారు. 

17:01 - August 14, 2018

హైదరాబాద్ : మరికాసేపట్లో రాహుల్‌గాంధీ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు రాహుల్‌ నివాళులు అర్పించనున్నారు. రాహుల్ తోపాటు బస్సులో ఆర్.కృష్ణయ్య బయల్దేరారు. రాహుల్‌ తోపాటు ఆర్.కృష్ణయ్య వెళ్లడం రాజకీయంఆ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ లో చేరుతున్నారన్న అనుమానం కలుగుతోంది. సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్‌ సభలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరిగి పయనమవుతారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

16:48 - August 14, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు మరోసారి శృంగభంగం తప్పదని టీఆర్‌ఎస్‌ నేత దానం నాగేందర్‌ హెచ్చరించారు. 2019లో కాంగ్రెస్‌కు అధికారం కల్ల అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకుల్లో చాలా మందికి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృతంలోని టీఆర్‌ఎస్‌కు గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. ప్రజలు టీఆర్‌ఎస్‌కే మళ్లీ పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన విమర్శలను నాగేందర్‌ తిప్పికొట్టారు. రాష్ట్ర ప్రభుత్వంపై రాహుల్‌ అసత్య ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. 
 

జనసేన పార్టీ విజన్‌ మేనిఫెస్టో విడుదల చేసిన పవన్ కళ్యాణ్

పశ్చిమ గోదావరి : జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది. ఇవాళ భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ ఆలయాన్ని పవన్ సందర్శించారు. పార్టీ విజన్‌ మేనిఫెస్టోని అమ్మవారి వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ విజన్‌ మేనిఫెస్టోను పవన్ విడుదల చేశారు. విజన్‌ డాక్యుమెంట్‌లో 12 అంశాలను పొందుపరిచారు. 

గన్‌పార్క్‌ వద్దకు చేరుకున్న రాహుల్...

హైదరాబాద్‌ : హరిత ప్లాజాలో సీనియర్‌ నేతలతో రాహుల్‌గాంధీ భేటీ ముగిసింది. రాహుల్ గన్‌పార్క్‌ వద్దకు చేరుకున్నారు. మరికాసేపట్లో అమరవీరులకు రాహుల్‌ నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్‌ సభలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరిగి పయనమవుతారు. 

మరికాసేపట్లో అమరవీరులకు నివాళులర్పించనున్న రాహుల్‌గాంధీ

హైదరాబాద్‌ : హరిత ప్లాజాలో సీనియర్‌ నేతలతో రాహుల్‌గాంధీ భేటీ ముగిసింది. మరికాసేపట్లో రాహుల్‌గాంధీ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు రాహుల్‌ నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్‌ సభలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరిగి పయనమవుతారు. 

16:33 - August 14, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ లా సెక్రటరీలకు కోర్టు ఫారమ్ 01 నోటీసులు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 17న అసెంబ్లీ సెక్రటరీ, అసెంబ్లీ లా సెక్రటరీ లు నేరుగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. అసెంబ్లీ స్పీకర్ ను కూడా ఇందులో ఇన్ క్లూడ్ చేస్తూ ఆయనకు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గన్ మెన్లను ఎందుకు కల్పించలేదని.. డీజీపీ, గద్వాల ఎస్పీ, నల్గొండ ఎస్పీలను ప్రశ్నిస్తూ...వారికి కూడా నోటీసులు జారీ అయ్యాయి. వీరిని కూడా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అయితే స్పీకర్ ఎలాంటి వివరణ ఇవ్వనున్నారో ఆసక్తి నెలకొంది. 

 

16:32 - August 14, 2018

హైదరాబాద్‌ : హరిత ప్లాజాలో సీనియర్‌ నేతలతో రాహుల్‌గాంధీ భేటీ ముగిసింది. హోటల్‌ హరిత ప్లాజాలో రాహుల్‌ భేటీలో గందరగోళం నెలకొంది. జానారెడ్డి పేరు లేకపోవడంతో గందరగోళం నెలకొంది. అలిగి బయటకు వెళ్లిపోవడానికి జానారెడ్డి, షబ్బీర్‌అలీ సిద్ధమయ్యారు. గూడూరు నారాయణరెడ్డి వారిని బతిమాలి లోనికి పంపారు. సీనియర్ల మీటింగ్‌లో లోపలికి రేవంత్‌రెడ్డికి, సునితా లక్ష్మారెడ్డికి పాస్‌ నిరాకరించారు. మరికాసేపట్లో రాహుల్‌గాంధీ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు రాహుల్‌ నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్‌ సభలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరిగి పయనమవుతారు. 

16:22 - August 14, 2018

హైదరాబాద్‌ : హరిత ప్లాజాలో సీనియర్‌ నేతలతో రాహుల్‌గాంధీ భేటీ ముగిసింది. మరికాసేపట్లో రాహుల్‌గాంధీ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు రాహుల్‌ నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్‌ సభలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరిగి పయనమవుతారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాహుల్ టూర్ సక్సెస్ అయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

 

16:16 - August 14, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది. ఇవాళ భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మ ఆలయాన్ని పవన్ సందర్శించారు. పార్టీ విజన్‌ మేనిఫెస్టోని అమ్మవారి వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ విజన్‌ మేనిఫెస్టోను పవన్ విడుదల చేశారు. విజన్‌ డాక్యుమెంట్‌లో 12 అంశాలను పొందుపరిచారు. మహిళా ఖాతాల్లో నెలకు 2,500 నుంచి 3,500 వరకు జమ... చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు మరో ఐదు శాతం పెంచే ఆలోచన, కాపులకు 9వ షెడ్యూల్‌ కింద రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు చేయడం లాంటి అంశాలను చేర్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 
పశ్చిమగోదావరి జిల్లాలో పవన్‌ ప్రజా పోరాటయాత్ర

 

16:12 - August 14, 2018

హైదరాబాద్‌ : హరిత ప్లాజాలో సీనియర్‌ నేతలతో రాహుల్‌గాంధీ భేటీ ముగిసింది. హోటల్‌ హరిత ప్లాజాలో రాహుల్‌ భేటీలో గందరగోళం నెలకొంది. జానారెడ్డి పేరు లేకపోవడంతో గందరగోళం నెలకొంది. అలిగి బయటకు వెళ్లిపోవడానికి జానారెడ్డి, షబ్బీర్‌అలీ సిద్ధమయ్యారు. గూడూరు నారాయణరెడ్డి వారిని బతిమాలి లోనికి పంపారు. సీనియర్ల మీటింగ్‌లో లోపలికి రేవంత్‌రెడ్డికి, సునితా లక్ష్మారెడ్డికి పాస్‌ నిరాకరించారు. మరికాసేపట్లో రాహుల్‌గాంధీ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు రాహుల్‌ నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 5 గంటలకు సరూర్‌నగర్‌ సభలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీకి తిరిగి పయనమవుతారు. 

 

16:07 - August 14, 2018

మహారాష్ట్ర : పుణెలోని ఓ బ్యాంకులో సైబర్‌ నేరగాళ్లు భారీ దోపిడీకి పాల్పడ్డారు. పుణె ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కాస్మోస్‌ బ్యాంక్‌ కార్యాలయంలోని సర్వర్‌ను హ్యాక్‌ చేసి 94 కోట్ల 42 లక్షలను దోచేశారు. పుణెలోని చతుర్‌శృంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హాంకాంగ్‌, భారత్‌ నుంచి హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో హాంగ్‌కాంగ్‌  ఏఎల్ ఎమ్ ట్రెడింగ్‌ లిమిటెడ్ కంపెనీ హస్తముందని పోలీసులు తెలిపారు. ఈ నెల 11న కాస్మోస్‌ బ్యాంక్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసి వీసా, రూపీ డెబిట్‌ కార్డుల ద్వారా 12 వేల సార్లు లావాదేవీలు జరిపి 78 కోట్లను తమ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు. ఆ తరువాత 2,849 సార్లు ట్రాన్సాక్షన్‌ జరిపి మరో 2.5కోట్లను కొల్లగొట్టారు. ఆగస్టు 13న సర్వర్‌ను మరోసారి హ్యాక్ చేసి 14కోట్లను దోపిడి చేశారు.

 

16:05 - August 14, 2018

విజయవాడ : వన్‌టౌన్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని హోల్ సెల్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ లోని నాలుగు షాపుల్లో దోపిడికి పాల్పడ్డారు. సుమారు 5లక్షల నగదు దోచుకెళ్లారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా 5గురు దొంగలు ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

15:57 - August 14, 2018

హైదరాబాద్ : ప్రజావైద్యాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేటు వైపుకు అడుగులు వేయడం బాధకరమని సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్ ఎన్ జే కాన్సర్ ఆస్పతిని అటానమస్ చేయాలనే ఆలోచన నుంచి తెలంగాణా ప్రభుత్వం బయటకు రావాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లక్‌డీకపూల్ నుంచి ఎమ్ ఎన్ జే ఆస్పత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఆస్పత్రి ఎదుట సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌ బైఠాయించారు. ప్రజా వైద్యాన్ని కాపాడాలంటూ ఆందోళన చేశారు. ప్రభుత్వం ప్రజా వైద్యాన్ని పేదలకు దూరం చేయవద్దన్నారు. సీపీఎం ఆందోళనపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

15:51 - August 14, 2018

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం మూడోరోజుకు చేరుకుంది. మూడవ రోజు గర్భాలయంలో, ఇతర పరివార దేవతల ఆలయాల్లో 8 ద్రవాలతో తయారు చేసిన అష్టబంధనాన్ని సమర్పించారు. గర్భాలయం లోపల, ఆనందనిలయం, ధ్వజస్తంభాలకు అవసరమైన మరమ్మత్తు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంప్రోక్షణకు సంబంధించి మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

15:50 - August 14, 2018

గుంటూరు : ఇప్పటివరకు పనిచేసిన ప్రధానులల్లో అత్యంత వైఫల్యం చెందిన ప్రధానిగా నరేంద్రమోదీ నిలిచిపోతారని మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. నాలుగేళ్ల పాలనలో నరేంద్రమోదీ ప్రజలను అడుగడుగున వంచించారని ఆరోపించారు. ప్రధాని దేశ ప్రజల ఆశలను ఒమ్ముచేశారని... స్వాతంత్ర్య దినోత్సవం నాడైనా సత్యాలను పలకాలన్నారు. 

 

ప.గో జిల్లాలో కొనసాగుతోన్న పవన్ ప్రజా పోరాటయాత్ర

పశ్చిమ గోదావరి : జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటయాత్ర కొనసాగుతోంది. భీమవరంలోని మావుళ్లమ్మ ఆలయాన్ని ఆయన సందర్శించారు. జనసేన పార్టీ విజన్ మేనిఫెస్టోను అమ్మవారి వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సుల అనంతరం పవన్ మ్యానిఫెస్టోను విడుదల చేయనునున్నారు.

మావుళ్లమ్మ ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

పశ్చిమ గోదావరి : జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటయాత్ర కొనసాగుతోంది. భీమవరంలోని మావుళ్లమ్మ ఆలయాన్ని ఆయన సందర్శించారు. జనసేన పార్టీ విజన్ మేనిఫెస్టోను అమ్మవారి వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సుల అనంతరం పవన్ మ్యానిఫెస్టోను విడుదల చేయనునున్నారు. 

15:19 - August 14, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాటయాత్ర కొనసాగుతోంది. భీమవరంలోని మావుళ్లమ్మ ఆలయాన్ని ఆయన సందర్శించారు. జనసేన పార్టీ విజన్ మేనిఫెస్టోను అమ్మవారి వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సుల అనంతరం పవన్ మ్యానిఫెస్టోను విడుదల చేయనునున్నారు. మ్యానిఫెస్టోలో 12 అంశాలను పొందుపరిచారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:43 - August 14, 2018
13:42 - August 14, 2018

ముంబై : డాలర్ తో రూపాయి మారకపు విలువ ఆల్ టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. చరిత్రలో తొలిసారిగా ఒక డాలర్ మారకపు విలువ రూ. 70.08ను తాకింది. టర్కీలో ఆర్థిక సంక్షోభంతో డాలర్ కు డిమాండ్ పెరుగగా, ఆ ప్రభావం రూపాయిపై పడిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. క్రితం ముగింపుతో పోలిస్తే, ఈ ఉదయం ఫారెక్స్ మార్కెట్ లో 69.85 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ, ఆపై కాసేపటికే ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. 2013, సెప్టెంబర్ 3 తరువాత నిన్న రూపాయి విలువ తొలిసారిగా ఒక్కరోజులో 110 పైసల పతనాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. రూపాయి విలువ మరింతగా పడిపోవచ్చని, డాలర్ తో మారకం సమీప భవిష్యత్తులోనే రూ. 71ని దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మావుళ్లమ్మ సన్నిధిలో జనసేన మేనిఫెస్టో!!..

పశ్చిమగోదావరి : జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగుతోంది. ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ భీమవరంలో కొలువై వున్న మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. జనసేన పార్టీ మేనిఫెస్టోను పవన్ కళ్యాణ్ అమ్మవారి పాదాల వద్ద వుంచి పూజలు నిర్వహించారు. అనంతరం మేనిఫెస్టోని పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ గుర్తును ప్రకటించిన పవన్ అందరు సమైక్యంగా వుండాలనే నినాదంతో తన పార్టీ గుర్తును పిడికిలిగా ప్రకటించారు. 'విజన మేనిఫోస్టో' పేరుతో పనవ్ ప్రకటించనున్నారు. దీంట్లో జనసేన పార్టీ ఏడు సిద్దాంతాలతో మేనిఫోస్టోని రూపొందించినట్లుగా తెలుస్తోంది.

13:38 - August 14, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగుతోంది. ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ భీమవరంలో కొలువై వున్న మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. జనసేన పార్టీ మేనిఫెస్టోను పవన్ కళ్యాణ్ అమ్మవారి పాదాల వద్ద వుంచి పూజలు నిర్వహించారు. అనంతరం మేనిఫెస్టోని పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ గుర్తును ప్రకటించిన పవన్ అందరు సమైక్యంగా వుండాలనే నినాదంతో తన పార్టీ గుర్తును పిడికిలిగా ప్రకటించారు. 'విజన మేనిఫోస్టో' పేరుతో పనవ్ ప్రకటించనున్నారు. దీంట్లో జనసేన పార్టీ ఏడు సిద్దాంతాలతో మేనిఫోస్టోని రూపొందించినట్లుగా తెలుస్తోంది. కులాలు లేని రాజకీయం..మతాల ప్రస్తావన లేని రాజీకీయం..భాషలను గౌరవించే సంప్రదాయం.. సంస్కృతులను కాపాడే సమాజం..ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం..అవినీతిపై రాజీ లేని పోరాటం,..పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం..వంటి పన్నెండు అంశాలు..పలు సిద్ధాంతాలతో జనసేన అధినేత జనసేన పార్టీ మేనిఫెస్టోని ప్రకటించనున్నారు. 

13:23 - August 14, 2018
13:20 - August 14, 2018
13:18 - August 14, 2018
13:16 - August 14, 2018

తూర్పుగోదావరి : రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి భారీగా పెరిగింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్‌ నిండుకుండను తలపిస్తుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో దిగువకు 6 లక్షల క్యూసెక్కుల నీరును వదులుతున్నారు. గోదావరి వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం ఈ వీడియోలో చూద్దాం..

13:14 - August 14, 2018

ఢిల్లీ : భారత దేశం 72వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా.. రాష్ర్ట ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. దేశ రాజధానిలోని ఎర్ర కోటలో స్వతంత్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్‌ పూర్తయ్యాయి. ఎన్డీఏ పాలనలో ప్రధాని మోదీ ఐదోసారి ఎర్రకోటపై నుంచి త్రివర్ణపతాకం ఎగురవేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక ప్రసంగం చేయనున్నారు.

72 స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం
దేశ రాజధానిలో 72వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ ఎర్రకోటలో ఐదోసారి త్రివర్ణ పతాకం ఎగరేయనున్నారు. బుధవారం ఉదయం 7గంటలకు ముందుగా ఎర్రకోటపై త్రివర్ణపతాకం రెపరెపలాడబోతోంది. బ్రిటీష్‌ పాలన నుంచి పోరాడి సాధించుకున్న స్వతంత్రానికి గుర్తుగా మన తొలిప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలుకుని ఇప్పటి ప్రధాని మోదీ వరకూ ఎర్రకోటపై జెండా ఎగురేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అలాగే.. షాజహాన్‌ 16వ శతాబ్దంలో నిర్మించిన ఎర్రకోటలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సైతం ఆనవాయితీగానే వస్తోంది. ఈ సారి జరుపుకోనున్న వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు, ప్రజలు కూర్చునేందుకు ఎర్రకోట ప్రాంగణంలో వేలాది కుర్చీలను ఏర్పాటు చేశారు.

ఉగ్రవాద దాడులతో భద్రత కట్టుదిట్టం
గతంలో ఎన్నడూ లేనంత ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. సందర్శకుల కోసం ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. వేడుకల్లో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు.. ముందస్తుగా సోమవారం రిహార్సల్‌ పరేడ్‌ నిర్వహించారు. ఉగ్రవాద దాడులు జరగవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో.. ఎర్రకోటలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే దేశ రాజధానిలోకి అనుమతిస్తున్నారు. పదివేల మందికి పైగా బలగాలు, ఢిల్లీ పోలీసులు సహా కేంద్ర భద్రతా దళాలు సహస్ర్త సీమా బల్, నే,నల్‌ సెక్యూరిటీ గార్డ్స్, సీఐఎస్ఎఫ్, బీఎస్‌ఎఫ్ దళాలు ఎర్రకోట చుట్టూ పహారా కాస్తున్నాయి.

1800 ప్రదేశాలు మూసేవేత
రెండు కోట్ల రూపాయల విలువైన రెండు హై రిజల్యూషన్‌ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. చిన్న గదులు, కిటికీలతో సహా 18వందల ప్రదేశాలను మూసేశారు. మొత్తం 600 సీసీ కెమెరాలతో పర్యవేక్షించిస్తున్నారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోనే 115 కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధాని ఎర్రకోటకు వచ్చే మార్గంలో 50 పీసీఆర్‌ వాహనాలను గస్తీ కాస్తున్నాయి. డాగ్‌స్క్వాడ్‌ బృందాలు కోటలో ప్రతి అంగుళాన్ని తనిఖీ చేస్తున్నారు. అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఎర్రకోటలోకి అనుమతించేలా బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీ యంత్రాలను ఏర్పాటు చేశారు.

పారాగ్లైడింగ్‌ బెలూన్లు ఎగరేయడంపై నిషేధం
ఎర్ర కోట చుట్టుపక్కల నివసించే వారితోపాటు.. కొత్తగా వచ్చిన వారు, అనుమానితుల వివరాలు సేకరించి పర్యవేక్షిస్తున్నారు. పారాగ్లైడింగ్‌ బెలూన్లు ఎగరేయడాన్ని నిషేధించారు. ఎత్తైన భవనాలపైనా సాయుధ దళాలు, స్నైపర్లను ఏర్పాటు చేశారు. 400 షార్ప్‌షూటర్స్‌ ఎత్తైన భవనాల నుంచి నిఘా నేత్రంతో భద్రతను పర్యవేక్షించనున్నారు. ప్రధాని నివాసం నుంచి ఎర్రకోట వరకూ సీసీ కెమెరాలతో ప్రధాని భద్రతను పర్యవేక్షించనున్నారు. ఢిల్లీలోని వివిధ పాఠశాలల నుంచి ఏడు వందల మంది ఎన్‌ సీసీ కేడెట్లు, ప్రభుత్వ పాఠశాలలనుంచి మూడువేల మంది విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. వారిలో ఐదు వందల మంది విద్యార్థినులు జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు.

ఓల్డ్‌ ఢిల్లీలోని రోడ్లపై ఆంక్షలు
దేశ రాజధానిలోని కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు. 14వతేదీ సాయంత్రం 5గంటల నుంచి.. 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకూ మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ రద్దు చేశారు. లుటైన్‌రోడ్డు, చాందినీచౌక్‌ మార్గ్‌, తిలక్‌ మార్గ్, మథుర రో్డు, బదూర్‌ షా జఫర్‌ మార్గ్‌, సుభాష్‌ మార్గ్‌, జవహర్‌ లాల్‌ మార్గ్‌, రింగ్‌రోడ్డు సహా.. ఓల్డ్‌ ఢిల్లీలోని రోడ్లపై ఆంక్షలు విధించారు.

పంద్రాగస్టు వేడుకలను రాజీకీయంగా ఉపయోగించుకోనున్న ప్రధాని మోదీ
ఐదేళ్ళ ఎన్డీయే పాలన చివరి దశలో ఉన్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ ఈ వేడుకలను రాజకీయంగా ఉపయోగించుకోనున్నారు. ఎన్డీయే వైఫల్యాలను మరిపించేందుకు.. కొత్తగా ప్రజాకర్షక పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. నల్లధనం వెలికితీత, ఉద్యోగ కల్పన, విద్య, పేదరిక నిర్మూలన, రైతులను ఆదుకుంటామనడం వంటి అనేక అంశాల గురించి ఎన్ని చెప్పినా.. అవేవీ అమలుకు నోచుకోలేదు. నాలుగేళ్ళ నుంచి ఎర్రకోట వేదికగా ఇచ్చిన హామీలు అమలు కాని నేపథ్యంలో.. ఈ సారి మోదీ మాటలు నమ్ముతారా అన్నది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.

ప్రధాని ప్రసంగంపై ఆసక్తి..
ఎర్రకోటనుంచి చేసే ప్రసంగంలో ప్రధాని ఏఏ అంశాలను ప్రస్తావిస్తారా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఎలాంటి అంశాలు ఉండాలో ఇప్పటికే ప్రజల సలహాలనూ కోరారు మోదీ. కానీ చాలా వరకూ.. దేశంలో దళితులపై జరుగుతున్న మూక దాడులపై మాట్లాడాలని నెటిజన్లు కోరారు. నాలుగేళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చునే ప్రయత్నం చేస్తారా.. లేక మరో సారి అమలు కాని హామీలతో.. రాజకీయ భవిష్యత్తుకు పనికొచ్చే ఉపన్యాసాలిస్తారో చూడాలి.. 

13:08 - August 14, 2018

మెదక్ : నిజాంపేట మండల కేంద్రంలోని పలు వార్డుల్లో త్రాగునీరు కోసం మహిళలు, గ్రామస్తులు రోడ్డెక్కారు. గత కొన్ని ఏళ్లుగా త్రాగునీరు లేక అల్లాడుతున్నామని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మహిళలు ఖాళీ బిందెలతో రామాయంపేట-సిద్ధిపేట రోడ్డుపై బైఠాయించండంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఇప్పటికైనా పాలకులు,అధికారులు త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తుల కోరుతున్నారు.

13:05 - August 14, 2018

అనంతపురం : జిల్లాలో ర్యాగింగ్‌కు ఓ విద్యార్థిని బలైంది. మదనపల్లి గోల్డన్‌వాలీ ఇంజనీరింగ్‌ కాలేజిలో మూడు రోజుల క్రితం తోటి విద్యార్థులు ర్యాగింగ్‌ చేయడంతో మనస్తాపానికి గురైన బీటెక్‌ సెకండియర్‌ విద్యార్థిని ప్రియాంక.. కదిరి మండలం పట్నంలో ఆత్మహత్య చేసుకుంది. సూపర్‌ వాస్‌మోల్‌ తాగిన ప్రియాంక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందింది. ర్యాగింగ్‌ గురించి కాలేజీ యాజమాన్యానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. 

13:02 - August 14, 2018

హైదరాబాద్‌ : అనుమానంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హతమార్చాడు ఓ భర్త. ఈ ఘాతుకం హైదరాబాద్‌లోని హబీబ్‌నగర్‌లో చోటు చేసుకుంది. నిందితుడు ఇమ్రాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హబీబ్‌నగర్‌ సుబాన్‌పురకు చెందిన ఇమ్రాన్‌ నాలుగేళ్ల కిందట షరీఫాబేగంను ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆరు నెలల నుంచి భార్యను అనుమానిస్తూ ఇమ్రాన్‌ తరుచు గొడవకు దిగేవాడన్నారు. గొడవలు భరించలేక భార్య తల్లి ఇంటికి వెళ్లిందన్నారు. అత్తగారి ఇంటికి సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న ఇమ్రాన్‌ భార్యను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడన్నారు. ఎప్పటిలాగే భార్యతో గొడవకు దిగిన ఇమ్రాన్‌ షరీఫా గొంతు నులిమి.. తలను బలంగా గొడకు కొట్టాడని పోలీసులు తెలిపారు. దీంతో షరీఫా అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. ప్రమాదవశాత్తు మరణించిందని ఇమ్రాన్‌ పోలీసులను, బంధువులను నమ్మించాడని చెప్పారు. గొడపై ఉన్న రక్తపు మరకలు చూసి క్లూస్‌ టీంతో ఆధారాలను సేకరించామని పోలీసులు తెలిపారు. 

తాజ్ కృష్ణ లో రాహుల్ గాంధీతో నారా బ్రాహ్మణి భేటీ..

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కోడలు, మంత్రి లోకేశ్ సతీమణి, యువ మహిళా పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న నారా బ్రాహ్మణి, ఈ ఉదయం హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణాలో రాహుల్ గాంధీని కలిశారు. దాదాపు 200 మందికి పైగా తెలుగు పారిశ్రామికవేత్తలతో రాహుల్ సమావేశం కావాలని నిర్ణయించుకోగా, బ్రాహ్మణి సైతం ఈ సమావేశానికి వచ్చారు. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఉన్న బ్రాహ్మణిని ఈ సమావేశానికి ఆహ్వానిస్తూ, కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వెళ్లినట్టు సమాచారం.

12:21 - August 14, 2018

హైదరాబాద్ : మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. మ.12గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోడలు..మంత్రి నారా లోకేశ్ భార్య అయిన నారా బ్రాహ్మణి వ్యాపారవేత్తగా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో రాహుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో విడివిడిగా మాట్లాడి వారికి పార్టీ బలోపేతంపై దిశానిర్ధేశం చేశారు. పార్టీ నేతల మధ్య తలెత్తిన విభేదాలు వీడి పార్టీ గెలుపుకోసం పనిచేయాలని నేతలకు రాహుల్ సూచించారు. కాగా అనంతరం 3.45గంటకు గన్ పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమ అమరవీరులకు రాహుల్ నివాళులర్పించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్ సభలో పాల్గొని రాత్రి 7.30గంటలకు రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. 

మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్దితో వున్నాం : రాహుల్

హైదరాబాద్ : రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఈరోజు ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. నేతలంతా విభేదాలు వీడి పార్టీ గెలుపుకోసం పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు. సమావేశం ముగిసిన అనంతరం రాహుల్ మాట్లాడుతు..33శాతం మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కట్టుబడి వుందని తెలిపారు. బీజేపీ హయాంలో మీడియాపైనా, జర్నలిస్టులపై దాడులు పెరిగాయన్నారు. తాను అన్ని మతాలను ప్రేమిస్తాననీ..గౌరవిస్తానని..కానీ ప్రధాని మోదీని..ఆయన సిద్ధాంతాలను మాత్రం వ్యతిరేకిస్తానని తెలిపారు.

11:39 - August 14, 2018

హైదరాబాద్ : యువతలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలపై నగర బహిష్కరణకు గురైన శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణపై స్టే విధిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం హైకోర్టు ప్రకటించింది. తనపై బహిష్కరణ వేటు సరికాదని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు అది భంగం కలిగిస్తోందని ఆరోపిస్తూ, పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వాదోపవాదాలు విన్న తరువాత, ఆయన ఎక్కడైనా తిరగవచ్చని చెబుతూ, తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ బహిష్కరణ ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొంది. కాగా నెల రోజుల క్రితం పరిపూర్ణానంతపై నగర బహిష్కరణ విధిస్తు..హైదరాబాద్, రాజకొండ, సైబరాబాద్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

11:32 - August 14, 2018

తమిళనాడు : డీఎంకే నేత..మాజీ సీఎం కరుణానిధి మరణం అంతరం ఆ పార్టీలో అంతర్గత కలహాలు చెలరేగాయి. పార్టీ అధ్యక్ష పదివి నాదంటు నాదని డీఎంకేలో వారసత్వపు పోరు ప్రారంభమయ్యింది. కరుణానిధి జీవించి వున్నంతకాలంగా పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగారు. ఇప్పుడు ఆయన మరణం అనంతం ఆయన కుమారులైన స్టాలిన్, అళగిరిల మధ్య అధ్యక్షపదవికి సంబంధించిన కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కరుణానిధి మరణం అనంతం పార్టీ 750మంది సభ్యులతో కార్యనిర్వాహక కమిటీ తొలిసారి సమావేశమయ్యింది. పార్టీ అధ్యక్ష పదవికి తాను అర్హుడినేనంటు..తండ్రి కరుణానిధికి మిత్రులు తనకే మద్దతునిస్తున్నారంటు అళగిరి అళగిరి ప్రకటన పార్టీలో అలజడి రేపింది. అధ్యక్ష పదవి రేసులోకి దూసుకొచ్చి అళగిరి స్టాలిన్ కు..ఆయన అనుచరులకు ఝలక్ ఇచ్చారు. దీంతో స్టాలిన్ కు అధ్యక్ష పదవి కేవలం లాంఛనమేననుకున్న నేపథ్యంలో అళగిరి ఝలక్ తో కమిటీ కార్యనిర్వాహణ కమటీ కరుణానిధి మరణానంతరం తొలిసారి భేటీ అయ్యింది. పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టాలా అనే అంశంపై పార్టీ తీవ్రంగా చర్చిస్తోంది. డిఎంకె కార్యవర్గం అత్యవసర సమావేశం కాగా సమావేశంలో స్టాలిన్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశాలున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

పార్టీ సీనియర్ నేతలకు రాహుల్ దిశానిర్ధేశం..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో 40 మంది పార్టీ సీనియర్ నేతలతో రాహుల్ సమావేశమయ్యారు. ఒక్కో నేతతో రాహుల్ గాంధీ విడి విడిగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో పార్టీ పెద్దలకు దిశానిర్ధేశం చేశారు. ఒకరిపై ఒకరు విభేదాలు వీడి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ..పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు. పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేసిన ఎన్నికలకు సిద్ధపడాలనీ..పార్టీ గెలుపుకోసం అందరు కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు.

11:13 - August 14, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో 40 మంది పార్టీ సీనియర్ నేతలతో రాహుల్ సమావేశమయ్యారు. ఒక్కో నేతతో రాహుల్ గాంధీ విడి విడిగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో పార్టీ పెద్దలకు దిశానిర్ధేశం చేశారు. ఒకరిపై ఒకరు విభేదాలు వీడి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ..పార్టీ గెలుపు కోసం పని చేయాలని సూచించారు. పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేసిన ఎన్నికలకు సిద్ధపడాలనీ..పార్టీ గెలుపుకోసం అందరు కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అంతర్గత పోరు సర్వసాధారణంగా మారిపోయిన నేపథ్యంలో రాహుల్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా తెలంగాణలో పార్టీని బలోపేతంపై దృష్టి పెట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక సమావేశాలు..సభలు..సమావేశాలతో రాహుల్ బిజీ బిజీగా గడుతున్నారు. 

పండగలా గోదావరి ధవళేశ్వరం 175 గేట్లు ఎత్తివేత..

పశ్చిమగోదావరి : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది మరింత ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలసిపోతోంది. ధవళేశ్వరానికి భారీ ఎత్తున వరద వస్తుండటంతో బ్యారేజ్ కి ఉన్న 175 గేట్లనూ అధికారులు ఎత్తివేశారు. ధవళేశ్వరం నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. నీటి మట్టం 8.6 అడుగులుగా నమోదైంది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సాయంత్రానికి మరింత వరద రావచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద ఈ ఉదయం 10 గంటల సమయంలో గోదావరి 38.3 అడుగుల ఎత్తున ప్రవహిస్తోంది.

పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట..

హైదరాబాద్ : యువతలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలపై నగర బహిష్కరణకు గురైన శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణపై స్టే విధిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం హైకోర్టు ప్రకటించింది. తనపై బహిష్కరణ వేటు సరికాదని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు అది భంగం కలిగిస్తోందని ఆరోపిస్తూ, పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

10:54 - August 14, 2018

సూర్యాపేట : పెన్ పహాడ్ మండలం మాచారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బావిలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా.. క్లీనర్‌కు తీవ్రగాయాలైయ్యాయి. గాయపడిన క్లీనర్‌ను స్థానికులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

10:52 - August 14, 2018

అమరావతి : ఒకప్పుడు ఆయన నుంచి సహాయం పొందాలంటే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. ఆయనను కలిసి సహాయం పొందాలంటే ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. అంత చేసినా వారికి అరకొర సాయమే దక్కేంది. కానీ నేడు ఆ వ్యక్తిలో పూర్తిగా మార్పు వచ్చింది. అడిగిందే తడవుగా సాయం అందిస్తున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఏమా సాయం.. లెట్స్‌ వాచ్‌దిస్‌ స్టోరీ...

పేదల బాధలను తీర్చడమే లక్ష్యంగా సీఎంఆర్‌ ఏర్పాటు
ప్రజలు అన్నాక కష్టాలు వస్తూ ఉంటాయి. పెద్ద కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వ సాయం కోరుతారు. ఇందుకోసమే ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధిని ఏర్పాటు చేశాయి. సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి సాయం చేస్తారు. చంద్రబాబు హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ తొలిసారి ఏర్పాటైంది. నాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సాయం పొందాలంటే ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వచ్చేది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సచివాలయానికి వచ్చినా వారికి అరకొర సాయమే దక్కేది. ఎమ్మెల్యేలు సైతం ఒకటికి పదిసార్లు కలిసి కోరితేనే పది వేల నుంచి 20వేల సాయం అందేది.

ఏపీలో నేడు పూర్తిగా పరిస్థితి మార్పు..సీఎంఆర్‌ఎఫ్‌ కింది లక్షల్లో సాయం
ఏపీలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సహాయం అర్ధించిన వారికి ఇప్పుడు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి లక్షలు అందుతున్నాయి. ఒకప్పుడు కఠినంగా వ్యవహరించిన చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా మారారు. నాడు అరకొర సాయం అందించిన చంద్రబాబు.. ఇప్పుడు ఎవరు దరఖాస్తు చేసుకున్నా ఎక్కువ మొత్తంలో సాయం అందిస్తున్నారు. కాలయాపన చేయకుండా కొన్ని సమస్యలు 24 గంటల్లోనే పరిష్కారం అవుతున్నాయి. రోగం వచ్చిందంటే చాలు ముందస్తు లేఖలు ఎల్‌ఓసీ రూపంలో ఇస్తుంటే... గంటల వ్యవధిలోనే అవి పరిష్కారం అవుతున్నాయి. లక్షలు రూపాయలు వెచ్చింది వైద్యం చేయించుకుంటున్నామని వేడుకుంటుంటే వారికి ఎంతో కొంత రీఎంబర్స్‌మెంట్‌ చేస్తున్నారు. చంద్రబాబులో ఇంతమార్పా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు సీఎంగా పనిచేసిన దానికి... నేటికీ చంద్రబాబులో ఎంతో మార్పు వచ్చిందని, చాలా తేడా కనిపిస్తోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రిలో వచ్చిన మార్పు ప్రభుత్వ ప్రతిష్టను కూడా పెంచుతోంది. ఇప్పటి వరకు దాదాపు లక్షన్నర కుటుంబాలకు వెయ్యికోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేశారు. ఒక్క వైద్యానికే సంబంధంలేకుండా ఆర్థికంగా వివిధ కారణాలతో చికితిపోయిన కుటుంబాలకు తన చేయూత అందించారు. ఇవేకాదు.. రాష్ట్రంలో వివిధ వర్గాల ఉద్యోగులకు గణనీయంగా జీతాలు పెంచారు. గతంలో ఎంతమొరపెట్టుకున్నా స్పందించని చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తున్న మార్పును చూసి అంతా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు.

10:39 - August 14, 2018

కడప : జమ్మలమడుగులో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఫెర్టిలైజర్స్ షాప్ కు వెళ్లి క్రిమిసంహారక మందు ఇవ్వమని అడిగాడు. సదరు వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించటంతో పురుగుల మందు ఇవ్వమని షాపు యజమానులు చెప్పారు. దీంతో సదరు వ్యక్తి అటుగా వస్తున్న బస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఖంగుతిన్న షాపు యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి వివరాలను సేకరించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. కాగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకే ఆ వ్యక్తి కొనుగోలు చేసేందుకు యత్నించగా..అనుమానంతో పురుగుల మందు విక్రయించేందుకువ వారు నిరాకరించటంతో అటుగా వస్తున్న బస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

డీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశం..

తమిళనాడు : డీఎంకే నేత..మాజీ సీఎం కరుణానిధి మరణం అంతరం ఆ పార్టీలో అంతర్గత కలహాలు చెలరేగాయి. పార్టీ అధ్యక్ష పదివి నాదంటు నాదని డీఎంకేలో వారసత్వపు పోరు ప్రారంభమయ్యింది. కరుణానిధి జీవించి వున్నంతకాలంగా పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగారు. ఇప్పుడు ఆయన మరణం అనంతం ఆయన కుమారులైన స్టాలిన్, అళగిరిల మధ్య అధ్యక్షపదవికి సంబంధించిన కలహా మొదలైంది. ఈ నేపథ్యంలో కరుణానిధి మరణం అనంతం పార్టీ కార్యనిర్వాహక కమిటీ తొలిసారి సమావేశమయ్యింది. ఈ సమావేశానికి కుమార్తె కనిమొళి, స్టాలిన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న అళగిరి వర్గం..ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఆయా ప్రజలు, అధికారులకు ఇది గర్వకారణం : చంద్రబాబు

అమరావతి : సుఖమయ జీవన నగరాల్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణానికి ర్యాంకులు రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. జాతీయస్థాయిలో ఏపీ నగరాలు ముందు వరుసలో నిలవడం ఆయా నగరాల ప్రజలకు, అధికారులకు గర్వకారణమన్నారు. సరళతర వాణిజ్యానికి దేశంలోనే నంబర్ వన్‌గా ఇటీవల వార్తల్లోకి ఎక్కిన ఏపీ ఇప్పుడు సుఖమయ జీవనానికి కూడా తనే బెస్ట్ అని తేలింది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లోని టాప్-10 నగరాల్లో ఏపీ నుంచి రెండు నగరాలు తిరుపతి, విజయవాడలకు స్థానం లభించింది. ఈ సందర్భంగా స్పందించిన సీఎం చంద్రబాబు మాట్లాడుతు..ఆయా నగరాల ప్రజలు, అధికారులకు ఇది గర్వకారణమని పేర్కొన్నారు.

క్రమంగా పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి..

అమరావతి : జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి క్రమంగా పెరుగుతూ పోతోంది. సరళతర వాణిజ్యానికి దేశంలోనే నంబర్ వన్‌గా ఇటీవల వార్తల్లోకి ఎక్కిన ఏపీ ఇప్పుడు సుఖమయ జీవనానికి కూడా తనే బెస్ట్ అని తేలింది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లోని టాప్-10 నగరాల్లో ఏపీ నుంచి రెండు నగరాలు తిరుపతి, విజయవాడలకు స్థానం లభించింది. ఈ ఎంపిక కోసం మొత్తం నాలుగు సూచీలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఒక సూచీలో తిరుపతికి మరో విశిష్ట నగరంగానూ గుర్తింపు లభించింది. దేశంలోనే అత్యున్నత నగరంగా ఎంపికైంది. రెండు సూచీల్లో విశాఖపట్టణానికి పదో స్థానం దక్కింది. ఓవరాల్‌గా 64వ స్థానంలో నిలిచింది.

తిరుమలలో మరో కీలక ఘట్టం!!..

తిరుమల : తిరుమలలో జరుగుతున్న అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణంలో భాగంగా నేడు కీలకఘట్టం జరగనుంది. ఎనిమిది రకాల ద్రవ్యాలను కలిపి, పాకంగా తయారు చేసిన అష్టబంధనాన్ని నేడు స్వామివారి పద్మపీఠానికి, పాద పీఠానికీ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు సమక్షంలో సమర్పించనున్నారు. 5 తులాల చొప్పున తీసుకున్న ఎనిమిది ద్రవ్యాలనూ రోటిలో వేసి గంటసేపు దంచగా, తయారైన పాకాన్ని ఓ పాత్రలోకి తీసుకుని దాన్ని దారంలా పెనవేసి, పాద, పద్మ పీఠాల మధ్యలో మెత్తిస్తారు. ఇలా చేయడం వల్ల మరో 12 సంవత్సరాల పాటు స్వామివారి విగ్రహం అణువంతైనా కదలకుండా నిలిచివుంటుంది.

మరోసారి ప్రజలపై వంటగ్యాస్ భారం..

ఢిల్లీ : వంట గ్యాస్‌ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధరలకు అనుగుణంగా 'పెట్రో', సహజవాయు ఉత్పత్తుల ధరలను సవరిస్తున్న ఆయిల్ కంపెనీలు, ఈ దఫా ఏకంగా రూ. 36 వడ్డించేశాయి. దీంతో సిలిండర్ ధర రూ. 847కు చేరింది. హైదరాబాద్ పరిధిలో జూన్ నెలలో రూ. 753గా ఉన్న సిలిండర్ ధర, జూలైలో రూ. 811కు చేరిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే పేదలకు అందే సబ్సిడీని కూడా పెంచినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలపై మధ్య తరగతి ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణమ్మ పరవళ్లు,ప్రకాశం 70 గేట్లు ఎత్తివేత..

విజయవాడ : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా మారగా, గడచిన కొన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా బ్యారేజ్ 70 గేట్లనూ ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు విద్యుద్దీప కాంతుల మధ్య అద్భుత జలదృశ్యాన్ని సాక్షాత్కరింపజేస్తుండగా, దాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. కృష్ణా నదీ తీరం ఒక్కసారిగా నీటితో నిండిపోగా, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

09:58 - August 14, 2018

సూర్యుడిపై మిస్టరీలను ఛేదించేందుకు నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ నింగికెగిసింది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రయోగం ఒకరోజు ముందే జరగాల్సి ఉన్నప్పటికీ…చివరి నిమిషంలో వాయిదా పడింది. లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రయోగాన్ని ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టారు. డెల్టా -4 హెవీ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పార్కర్‌ చేరుకుంటుంది. కానీ నేరుగా సూర్యుడి వద్దకు వెళ్లదు. బుధుడి చుట్టూ కనీసం ఏడు చక్కర్లు కొట్టిన తర్వాత 2024 డిసెంబర్‌ 19 నాటికి తొలిసారి సూర్యుడికి అత్యంత సమీపంలోకి అంటే.. కేవలం 40 లక్షల కిలోమీటర్ల దూరానికి చేరుతుంది. సూర్యుడిపై ఏర్పడే తుపాన్లతో పాటూ రసాయనిక చర్యలపై పార్కర్ సోలార్ ప్రోబ్ పరిశోధనలు చేయనుంది. ఈ అంశంపై ప్లానిటోరి సొసైటీ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ విశ్లేషణలో వింతలు..విశేషాలను తెలుసుకుందాం...

రెండవరోజు కూడా రాహుల్ బిజీ బిజీ..

హైదరాబాద్ : తెలంగాణలో పార్టీనీ బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించేదుకు వచ్చిన రాహుల్ గాంధీ రెండవరోజు పర్యటన కొనసాగనుంది. ఈ క్రమంలో కాసేపట్లో బూత్ కమిటీ అధ్యక్షులతో రాహుల్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 9.30గంటలకు పార్టీ సీనియర్ నేతలలతో రాహుల్ చర్చలు జరపనున్నారు. అనంతరం 10.30గంటలకు మీడియా ఎడిటర్లతో సమావేశం..మధ్యాహ్నాం 12 గంటలకు తాజ్ కృష్ణాలో పారిశ్రామితక వేత్తలతో భేటీ కానున్నారు. 3.45గంటకు గన్ పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమ అమరవీరులకు రాహుల్ నివాళులర్పించనున్నారు.

09:21 - August 14, 2018

హైదరాబాద్ : తెలంగాణలో పార్టీనీ బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించేదుకు వచ్చిన రాహుల్ గాంధీ రెండవరోజు పర్యటన కొనసాగనుంది. ఈ క్రమంలో కాసేపట్లో బూత్ కమిటీ అధ్యక్షులతో రాహుల్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 9.30గంటలకు పార్టీ సీనియర్ నేతలలతో రాహుల్ చర్చలు జరపనున్నారు. అనంతరం 10.30గంటలకు మీడియా ఎడిటర్లతో సమావేశం..మధ్యాహ్నాం 12 గంటలకు తాజ్ కృష్ణాలో పారిశ్రామితక వేత్తలతో భేటీ కానున్నారు. 3.45గంటకు గన్ పార్క్ వద్ద తెలంగాణ ఉద్యమ అమరవీరులకు రాహుల్ నివాళులర్పించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్ సభలో పాల్గొని రాత్రి 7.30గంటలకు రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.  

08:15 - August 14, 2018
08:11 - August 14, 2018
07:45 - August 14, 2018

తెలంగాణాలో అధికార పార్టీ అడుగులు ఎన్నికల వైపు పడుతున్నాయా? అనే సంకేతాలను సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లుగా సంకేతాలిస్తున్నారు. ఆర్నెళ్లు ముందుగా జరిగేవి ముందుస్తు ఎన్నికలు కాదన్నారు. కేంద్రం ముందు ఉంచాల్సిన డిమాండ్లను మరోసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించారు. సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో 9 తీర్మానాలను ఆమోదించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తేల్చేశారు. సెప్టెంబర్‌ 2న ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో 20 లక్షలమందితో.. ప్రగతి నివేదన పేరిట బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లలో ఏం చేసిందీ అక్కడే చెబుతామన్నారు. పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లు సైతం సెప్టెంబర్‌లోనే ప్రకటిస్తామన్నారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పార్టీ అధ్యక్షుడికి కట్టబెడుతూ సమావేశం నిర్ణయించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం దక్కుతుందంటూ మరోసారి భరోసా కల్పించే యత్నం చేశారు కేసీఆర్. దీన్ని బట్టి చూస్తే గులాబీ బాస్ ముందస్తు ఎన్నికలకు సంకేతమిస్తున్నట్లే కనిపిస్తోంది. ఇదే అంశంపై 10టీవీ న్యూస్ మార్నింగ్ లో చర్చ, ఈ చర్చలో కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి, టీఆర్ఎస్ నేత రాజమోహన్, బీజేపీ నేత కుమార్, నవ తెలంగాణ దినపత్రిక ఎడిటర్ వీరయ్య పాల్గొన్నారు. 

07:31 - August 14, 2018

తెలంగాణలో 108 కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. 108ను ప్రభుత్వ-ప్రైవేటు పార్టనర్‌షిప్‌ పద్దతిలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని 8 గంటల పనిదినాన్ని అమలు చేయాలని పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని తమను కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగభద్రత కల్పించాలని, తదితర డిమాండ్లతో వారు ఆందోళన చేస్తున్నారు. వారి డిమాండ్లకు గల కారణాలు వారి పట్ల ప్రభుత్వ విధానం ఏమిటి? ఈ సమ్మెకు కారణమేంటి? వంటి అంశాలపై వారి విధివిధానాలను, డిమాండ్లను 108 ఉద్యోగుల సంఘం నాయకులు అశోక్‌ మాటల్లో తెలుసుకుందాం..

07:26 - August 14, 2018

తమిళనాడు : డిఎంకెలో వారసత్వ రాజకీయాలు రచ్చకెక్కాయి. కరుణానిధి కన్ను మూసి వారం రోజులు గడవక ముందే పార్టీ పదవి కోసం వారసత్వ పోరు మొదలైంది. ఓవైపు డిఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌కు పగ్గాలు అప్పగించేందుకు పార్టీ సమాయత్త మవుతుండగా... కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి పెద్ద బాంబే పేల్చాడు. పార్టీ అధ్యక్ష పదవికి తాను కూడా అర్హుడనని ప్రకటించడం ద్వారా తమ్ముడు స్టాలిన్‌కు షాకిచ్చారు. అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు పార్టీని ఏ దిశవైపు తీసుకెళ్తుందన్నది ఆసక్తిగా మారింది.

సడెన్ గా తెరపైకి వచ్చిన అళగిరి..
డిఎంకే అధినేత కరుణానిధి మృతితో పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. కరుణానిధి రాజకీయ వారసత్వం కోసం ఆయన పెద్ద కుమారుడు అళగిరి కూడా రంగంలోకి దిగారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో తండ్రి సమాధికి నివాళులర్పించిన తర్వాత తన మనసులోని మాటను ఆయన బయట పెట్టారు. డిఎంకె పార్టీ అధ్యక్ష పదవికి తానే అర్హుడనంటూ అళగిరి ప్రకటించారు. తండ్రికి నిజమైన సన్నిహితులంతా నావైపే ఉన్నారని.. కాలమే దీనికి సరైన సమాధానం చెబుతుందని ఆయన చెప్పారు.

పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న కరుణానిధి చిన్నకొడుకు స్టాలిన్
మరోవైపు కరుణానిధి రాజకీయ వారసుడిగా ఆయన కోరిక మేరకు చిన్నకుమారుడు డిఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంట్ స్టాలిన్‌కు పగ్గాలు అందించేందుకు పార్టీ సమాయత్తమవుతోంది. మంగళవారం డిఎంకె కార్యవర్గం అత్యవసర సమావేశం జరగనున్న నేపథ్యంలో అళగిరి ప్రకటన పార్టీలో అలజడి రేపింది. ఈ సమావేశంలో స్టాలిన్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశాలున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

తండ్రికి నిజమైన సన్నిహితులంతా నావైపే ఉన్నారన్న అళగిరి
కరుణానిధి పెద్దకుమారుడు అళగిరిని నాలుగేళ్ల క్రితమే పార్టీ నుంచి బహిష్కరించారు. స్టాలిన్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించిన తర్వాత అళగిరి పార్టీకి దూరమయ్యారు. డిఎంకె స్ట్రాంగ్‌మెన్‌గా కార్యకర్తలో అళగిరికి పేరుంది. మధురై కార్యకర్తల్లో ఆయనకు మంచి పట్టుంది. అళగిరి పార్టీలో లేకపోవడం వల్లే 2016 శాసనసభ ఎన్నికల్లో డిఎంకె అధికారంలోకి రాలేదన్న అభిప్రాయం కూడా ఉంది. కరుణానిధి మరణానంతరం ఏర్పడ్డ సానుభూతి పవనాలను అనుకూలంగా మలచుకునేందుకు పార్టీ ప్రయత్నిస్తుండగా... డిఎంకెలో నెలకొన్న వారసత్వ విభేదాలు కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తోంది. అన్నదమ్ముల మధ్య విభేదాలు సమసిపోతాయా...? లేక రచ్చకెక్కుతాయా...? అన్నది తమిళనాట చర్చనీయాంశంగా మారింది.

 

07:17 - August 14, 2018

హైదరాబాద్‌ : మళ్లీ డ్రగ్స్‌ ఆనవాళ్లు కలకలం సృష్టించాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కేసులు విచ్చలవిడిగా నమోదైన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. కీలక సమాచారం సేకరించి గోవా నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

విద్యార్థులు, టాలీవుడ్‌ను టార్గెట్‌ చేసిన డ్రగ్స్‌ మాఫియా..
హైదరాబాద్‌లో డ్రగ్స్‌ మాఫియా చెలరేగిపోతోంది. దీన్ని అరికట్టేందుకు పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా డ్రగ్స్‌ ఆనవాళ్లు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. గతంలో విద్యార్థులు, టాలీవుడ్‌ను డ్రగ్స్‌ మాఫియా టార్గెట్‌ చేసుకున్న నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రగ్స్‌ కదలికలపై నిఘా పెట్టి కీలక సమాచారంతో గోవా నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న అబ్దుల్‌ హమీద్‌ను అరెస్ట్ చేశారు. ఇతను బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్‌ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.

వారం రోజలు నిఘా పెట్టి డ్రగ్‌ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు..
వారం రోజుల నిఘా అనంతరం డ్రగ్స్‌ గుట్టును రట్టు చేశారు పోలీసులు. గోవాలో మాక్స్‌ అనే వ్యక్తి వద్ద నుండి హమీద్‌ డ్రగ్స్‌ సేకరిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో ఇతనికి 20 మంది వరకు కష్టమర్లు ఉన్నారని గుర్తించారు. హమీద్‌ వద్ద నుంచి 31 గ్రాముల కొకైన్‌, 7 లక్షల నగదు, రెండు మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. గోవా నుండి మాక్స్‌ పంపిన డ్రగ్స్‌ను 2వేలకు కొని హైదరాబాద్‌లో 6 వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆగని డ్రగ్స్‌ ముఠాల ఆగడాలు..
గోవాకు చెందిన మ్యాక్స్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు ఎంత నిఘాపెట్టినా డ్రగ్స్ ముఠాల ఆగడాలు మాత్రం ఆగడంలేదు. కీలక నిందితులు విదేశాల్లో ఉండి కార్యకలాపాలు సాగిస్తుండటంతో స్థానిక పోలీసులకు తలనొప్పిగా మారింది.

 

07:12 - August 14, 2018

గుంటూరు : గురజాలలో అక్రమ గనుల పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్‌ జరుగుతున్నా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌ అడ్డుకోలేక అమాయకులపై కేసులు పెట్టి టీడీపీ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

భారీగా మోహరించిన పోలీసులు..
గుంటూరు జిల్లా నరసరావు పేటలో ఉద్రిక్తత నెలకొంది. గురజాలలో అక్రమ మైనింగ్‌ పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేత కాసు మహేశ్‌ రెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై హై కోర్టు మైనింగ్‌ ఆరోపణలు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్‌ అధికారులు గురజాలలో ఉన్న మైనింగ్‌ విలువను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే మైనింగ్‌ ప్రాంతాన్ని వైసీపీ నిజనిర్దారణ కమిటీ సందర్శించి బహిరంగ సభను నిర్వహించాలని వైసీపీ నిర్ణయించుకుంది. దీనికి పోలీసులు అనుమతి కోరగా వారు నిరాకరించారు.

వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మర్రి రాజశేఖర్‌లు దాచేపల్లికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా పోలీసులు లోపలికి దూసుకు రావడంతో కాసు మహేష్ రెడ్డి పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలను అడ్డుకోవాల్సింది పోయి అక్రమాలను అడ్డుకుంటున్నవారిని రాష్ట్ర ప్రభుత్వం అణచివేస్తుందని కాసు మహేశ్‌ రెడ్డి ఆరోపించారు.

బొత్స సత్యనారాయణ అరెస్ట్
అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో నిజాలునిగ్గు తేల్చేందుకు గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ మైనింగ్‌ వెనుక సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ప్రమేయం ఉందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నాలుగున్నరేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అక్రమ మైనింగ్‌ ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే అడ్డుకోవడం ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఇప్పటికైనా అక్రమ మైనింగ్‌ను ఆపకపోతే భవిష్యత్‌లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

07:07 - August 14, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 2 కోట్ల ఎకరాలకు నీరందించడమే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇందుకోసం భూగర్భ జలాలు, జలాశయాలు, చెరువులలో ఉన్న నీటిని సమర్ధవంతంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు.

అందుబాటులో ఉన్న జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి :చంద్రబాబు
రాష్ట్రంలోని వివిధ దశల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటు పోలవరం ప్రాజెక్టు పని తీరుని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ వనరుల కింద అందుబాటులో ఉన్న జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో అధికారులు వ్యూహాలను రూపొందించుకోవాలని సీఎం సూచించారు.

25 సాగునీటి ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశం..
వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మొత్తం రాష్ట్రంలో 86 జలాశయాల్లో 380.68 టీఎంసీలు, మిగిలిన చెరువులు భూగర్భ జలాలు ఇతర వనరులలో మొత్తం 867 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని ముఖ్యమంత్రి వివరించారు. 2 కోట్ల ఎకరాలకు, పరిశ్రమలకు అందించేందుకు నీటిని ఎలా వినియోగించాలన్న దానిపై లోతుగా పరిశీలన చేయాలన్నారు. వివిధ దశల్లో ఉన్న 25 సాగునీటి ప్రాజెక్టులను డిసెంబర్‌ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న కట్టడాలు, నిర్మాణాలు జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులకు సూచించారు సీఎం.

జెట్ గ్రౌటింగ్ పనులు 94.20 శాతం, కాంక్రీట్ పనులు 33.70 శాతం పూర్తి..
పోలవరానికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 57.41 శాతం పనులు పూర్తయ్యాయని, వర్షాలు పడుతున్నప్పటికీ పనులు అనుకున్న మేర పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధాన డ్యామ్ పనులు 44.23 శాతం, ఎడమ కాలువ పనులు 62.74 శాతం, కుడి కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయని... గేలరీ వాక్‌కి స్పిల్ వే సిద్ధం అవుతోందని అధికారులు వివరించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఇతర తవ్వకం పనులు 77 శాతం పూర్తయ్యాయన్నారు. జెట్ గ్రౌటింగ్ పనులు 94.20 శాతం పూర్తయ్యాయని, కాంక్రీట్ పనులు 33.70 శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించారు.

ప్రాజెక్టు సందర్శనకు ప్రజలను ప్రోత్సహించాలన్న సీఎం
ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టును లక్ష మంది సందర్శించారని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే అన్ని జిల్లాల నుంచి ప్రాజెక్టు సందర్శనకు ప్రజలను ప్రోత్సహించాలని, వారికి పూర్తి వివరాలు తెలియజేసి అవహగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పునరావాస పనులు వచ్చే డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు నిర్ణీత గడువులో పూర్తికావాలన్నారు. వచ్చే వారం సమావేశానికి పూర్తి కార్యాచరణతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ పనులకు చెల్లించే బిల్లులపై జీఎస్టీ గురించి కూడా చీఫ్ ఇంజినీర్ల బోర్డు సమావేశం అవుతోందని, ఆ అంశాలను కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.

విశాఖలోకి అడుగిడనున్న జగన్ పాదయాత్ర..

విశాఖపట్నం : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర నేడు విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది. దాదాపు 50 రోజులపాటు విశాఖ జిల్లాలో జగన్‌ పాదయాత్ర నిర్వహించనున్నారు. 400 కిలోమీటర్ల మేర జగన్‌ జిల్లాలో నడువనున్నారు.జగన్‌ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లన్నీ జిల్లా పార్టీనేతలు పూర్తి చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం గన్నవరం మెట్టు దగ్గర జగన్‌ విశాఖ జిల్లాలోకి ప్రవేశించనున్నారు. జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

07:01 - August 14, 2018

విశాఖపట్నం : వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర నేడు విశాఖ జిల్లాలోకి ప్రవేశించనుంది. దాదాపు 50 రోజులపాటు విశాఖ జిల్లాలో జగన్‌ పాదయాత్ర నిర్వహించనున్నారు. 400 కిలోమీటర్ల మేర జగన్‌ జిల్లాలో నడువనున్నారు.జగన్‌ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లన్నీ జిల్లా పార్టీనేతలు పూర్తి చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలం గన్నవరం మెట్టు దగ్గర జగన్‌ విశాఖ జిల్లాలోకి ప్రవేశించనున్నారు. జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ఏజెన్సీప్రాంతం మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుంది.

06:58 - August 14, 2018

అమరావతి : ఏపీలో వామపక్ష, జనసేన పార్టీల కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై మూడు పార్టీల అగ్రనేతలు సమాలోచనలు చేస్తున్నారు. విజయవాడ వేదికగా ఈ పార్టీల నేతలు భేటీ అయ్యి చర్చించారు. టీడీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించాలని నిర్ణయించారు.

ఏపీలో దూకుడు పెంచిన లెఫ్ట్‌, జనసేన కూటమి..
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, వామపక్షాల కూటమి దూకుడు పెంచింది. రాజకీయంగా వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని సమస్యలపై ఉద్యమించేందుకు మూడు పార్టీలు రెడీ అవుతున్నాయి. ప్రజా సమస్యలే ఎజెండాగా మూడు పార్టీలు ఉమ్మడి ఉద్యమాలకు శ్రీకారం చుట్టనున్నాయి.

యాత్రల పేరుతో జనానికి దగ్గరవుతున్న జనసేనాని..
ఇప్పటికే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ యాత్రల పేరుతో ప్రజలకు దగ్గరవుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు వామపక్షాలు సైతం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్నాయి. ఆయా రంగాల్లోని ప్రజలను ఐక్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు ఐక్యంగా ముందుకు సాగేందుకు విజయవాడలో సమావేశం అయ్యారు. భవిష్యత్‌ ఉద్యమానికి రూపకల్పన చేశారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ప్రత్యేకహోదా, పోలవరం నిర్వాసితులు, నిరుద్యోగం, సీపీఎస్‌ రద్దుతోపాటు మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణపై చర్చించారు. రానున్న రోజుల్లో ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటాలను మూడు పార్టీలు కలిసి చేపడుతాయని సమావేశానంతరం నేతలు స్పష్టం చేశారు. మొత్తానికి మూడు పార్టీల నేతల భేటీ నేపథ్యంలో త్వరలో ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అధికార టీడీపీతోపాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీని టార్గెట్‌ చేస్తూ , వారి వైఫల్యాలను ఎత్తిచూపేలా మూడూ పార్టీలో జనంలోకి వెళ్తనున్నాయి.

06:52 - August 14, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. స్వతంత్ర దినోత్సవం నాడు.. మెదక్ జిల్లా మల్కాపూర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉచితంగా కళ్ళజోడు పంపిణీతోపాటు.. శస్త్ర చికిత్సకయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించనుంది.

ఆగస్టు 15 నుండి కంటి వెలుగు..
సీఎం కేసీఆర్‌ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుడుతున్నారు. మెదక్‌ జిల్లానుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. కంటి సమస్యలతో బాధపడే వారికి వైద్య పరీక్షలతోపాటు.. కళ్ళద్దాలు, శస్త్ర చికిత్సల వంటి సేవలు ఉచితంగా అందించనుంది సర్కార్. దీనిపై ప్రగతిభవన్‌లో సీఎం ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్, డైరక్టర్‌తో సమీక్షించారు. చేపట్టిన ఏర్పాట్లు, జాగ్రత్తల గురించి అధికారులు వివరించారు.

ప్రతి జిల్లాకు నలుగురు వైద్య అధికారులు..
ఒక మెడికల్ ఆఫీసర్, కంటి వైద్యుడు, ఎఎన్ఎం, సూపర్ వైజర్లు, ఆశా వర్కర్లతో కూడిన బృందాలు సేవలందించనున్నాయి. ఒక్కో క్యాంపులోని వైద్య బృందం రోజుకో గ్రామీణ ప్రాంతంలోని 250 మందికి, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అత్యవసర సేవలకోసం ప్రతి జిల్లాకు ఇద్దరు నుంచి నలుగురు వైద్య అధికారులు, కంటి వైద్య నిపుణులను అందుబాటులో వుంచనున్నట్లు తెలిపారు.

కంటివెలుగు కార్యక్రమాన్ని పరిశీలించిన మంత్రి హరీష్‌రావు
ఐదునెలల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు సీఎం. తదుపరి పరీక్షలు, వైద్యంకోసం స్థానికం ప్రైవేటు, ప్రభుత్వ, ఎన్జీవో సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమానికి కావాల్సిన ఉద్యోగులను తాత్కాలికపద్ధతిలో నియమించుకోవాలని సిఎం సూచించారు. కంటివెలుగు కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు. రాష్ర్ట స్థాయిలో గుర్తింపున్న మల్కాపూర్‌కు ఈ కార్యక్రమంతో జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు మంత్రి హరీష్‌రావు. కంటివెలుగు కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కోరారు.

ఏ ఒక్కరూ కంటి చూపు సమస్యతో బాధపడకూడదు : కేసీఆర్
రాష్ర్టంలో ఏ ఒక్కరూ కంటి చూపు సమస్యతో బాధపడకూడదన్న ఉద్దేశంతోనే ఈ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టామన్నారు.దీన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులను వివిధ స్థాయిల్లోని సామాజిక కార్యకర్తలను, బాధ్యతగల పౌరులను కలుపుకుని పోవాలని, సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

ఆగస్టు 15 నుండి కంటి వెలుగు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుడుతున్నారు. మెదక్‌ జిల్లానుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. కంటి సమస్యలతో బాధపడే వారికి వైద్య పరీక్షలతోపాటు.. కళ్ళద్దాలు, శస్త్ర చికిత్సల వంటి సేవలు ఉచితంగా అందించనుంది సర్కార్. దీనిపై ప్రగతిభవన్‌లో సీఎం ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్, డైరక్టర్‌తో సమీక్షించారు. చేపట్టిన ఏర్పాట్లు, జాగ్రత్తల గురించి అధికారులు వివరించారు.  

ఉగ్రవాద కాల్పుల్లో జవాన్ మృతి..

జమ్ము కశ్మీర్ : కుప్వారా జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు పరిపాటిగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో కుప్వారా జిల్లాలో టాంగ్ ధర సెక్టార్ లో మరోసారి ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు సంభవించాయి. ఈ ఘటనలో ఓ జవాను మృతి చెందారు. 

ఆత్మకూరు ఎస్సై వెంకట సుబ్బయ్య సస్పెండ్..

కర్నూలు : ఆత్మకూరు ఎస్సై వెంకట సుబ్బయ్యపై అధికారులు సస్పెండ్ చేశారు. ఓ మహిళలను లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై ఎస్సై వెంకట సుబ్బయ్యను డీఐజీ ఘటమనేని శ్రీనివాస్ సస్పెండ్ వేటు వేశారు. 

వందకు పైగా సీట్లు మావే : కేసీఆర్

హైదరాబాద్ : ఎన్నికల గురించి ఇప్పటికే ఆరు సర్వేలు చేయించానని, వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం, ప్రగతిభవన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ముందస్తు ఎన్నికలు అవ్వదని, ఇప్పటికే ఎన్నికల సమయంలోకి వచ్చామని అన్నారు. నిర్ణీత సమయానికి ఆర్నెల్ల ముందు జరిగే ఎన్నికలు ముందస్తు ఎన్నికలు అవవని అభిప్రాయపడ్డారు.

Don't Miss