Activities calendar

15 August 2018

21:57 - August 15, 2018

మెదక్ : దేశంలో ఎక్కడా లేని విధంగా 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు. రాష్ట్రంలోని 3 కోట్ల 70 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తామని... అవసరమైన వారికి ఆపరేషన్లు చేయడంతో పాటు.. కళ్లజోళ్లు అందిస్తామన్నారు. మల్కాపూర్‌లో పర్యటించిన కేసీఆర్‌... గ్రామంపై వరాల జల్లు కురిపించారు. గ్రామ అవసరాల కోసం 6 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించారు. 
మల్కాపూర్‌లో కంటి వెలుగు ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు.. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌లో ప్రారంభించారు. కంటి వైద్య శిబిరాన్ని సందర్శించి కొంతమందికి కళ్లద్దాలను అందజేశారు.
3 కోట్ల 70 లక్షల మందికి కంటి పరీక్షలు 
అనంతరం జరిగిన సభలో పాల్గొన్న కేసీఆర్‌... రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం మల్కాపూర్‌నుంచి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కంటి వెలుగు ద్వారా 3 కోట్ల 70 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. అవసరమైన వారిగా ఉచితంగా ఆపరేషన్లు చేయడంతోపాటు... మందులు, కళ్లజోళ్లు ఇస్తామన్నారు. ఇప్పటికే 40 లక్షల కళ్లాద్దాలు సిద్దం చేసినట్లు తెలిపారు. కంటి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 825 టీమ్‌లు ఏర్పాటు చేశామని.. ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు కేసీఆర్‌. 
మహిళలకు అవకాశమిస్తే అద్భుతాలు సృష్టిస్తారు... 
మల్కాపూర్‌కు రావడం తన అదృష్టమన్నారు కేసీఆర్‌. మల్కాపూర్‌ గ్రామం ఎంతో అద్భుత ప్రగతి సాధించిందని... ఈ గ్రామాన్ని చూసి ఎంతో నేర్చుకోవాల్సింది ఉందన్నారు. మహిళలకు అవకాశమిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు సీఎం. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యల తొలిగిపోయిందని.. త్వరలోనే ఇంటింటికి నీళ్లు తెస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించామన్నారు. 
మల్కాపూర్‌ గ్రామంపై వరాల కేసీఆర్‌ జల్లు  
ఇక మల్కాపూర్‌ గ్రామంపై వరాల జల్లు కురిపించిన కేసీఆర్‌... గ్రామ అవసరాల కోసం 6 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఇంటింటికి రెండు పాడి గేదెలు ఇవ్వనున్నట్లు.. గ్రామానికి 100 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. వచ్చే జూన్‌ నాటికి మల్కాపూర్‌కు గోదావరి నీళ్లు వస్తాయన్నారు. మల్కాపూర్‌లో నిర్మించిన రాక్‌ గార్డెన్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. పచ్చదనం పరిశుభ్రతలో మల్కాపూర్‌ ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్‌ ప్రశంసించారు. 
 

 

21:51 - August 15, 2018

శ్రీకాకుళం : స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ మాట తప్పారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. కుంటిసాకులతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని శ్రీకాకుళంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు చెప్పారు. 
శ్రీకాకుళం జిల్లాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు   
రాష్ట్ర విభజన తర్వాత ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుతున్నన్న ఏపీ ప్రభుత్వం ఈసారి శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించింది. శ్రీకాకుళం ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి...  పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వం శాఖలు సాధించిన  ప్రగతిని వివరించే అలంకృత శకటాల ప్రదర్శనను తిలకించారు. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన పోలీసులు, ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పతకాలు, అవార్డులు అందజేశారు.
రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం విఫలం 
ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సందేశమిస్తూ... విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేంద్రం సహకరించి ఉంటే రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెంది ఉండేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా,  విభజన హామీలు అమలు చేయకుండా మోదీ మాట తప్పారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
2019 చివరినాటికి పోలవరం పూర్తి
రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టును 2019 చివరినాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకొంటున్నామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పనులు చేస్తున్నా... కేంద్రం సరిగా నిధులు  ఇవ్వకపోవడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటుకు కేవలం 3,900 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టుపై కేంద్ర ప్రభుత్వం కొర్రీలు వేయడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. విద్యాసంస్థలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ సందేశం తర్వాత బాలబాలికలు ప్రదర్శించిన స్వాతంత్ర్య దినోత్సవ నృత్యరూపకాన్ని చంద్రబాబు తిలకించారు. 
 

 

21:41 - August 15, 2018

హైదరాబాద్ : ప్రజా పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించేందుకు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇచ్చారు. ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొవాలని కోరారు. ప్రగతిపథంలో పయనిస్తున్న తెలంగాణను చూసి ఓర్వలేని స్వార్థ శక్తులు చేస్తున్న విషప్రయోగాలను సమర్థవంతంగా తిప్పికొడతామన్నారు. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్‌ రైతుబంధు, కంటివెలుగు కార్యక్రమాలను ప్రస్థావించారు. 
గొల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో గొల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు దళాలు, ఎన్‌సీసీ కేడెట్లు, స్కౌట్లు, గైడ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన పోలీసులు, ప్రభుత్వ అధికారులకు పతకాలు, అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను కేసీఆర్‌ స్వాతంత్ర్య దినోత్సవ సందేశిమిస్తూ... స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు శ్రద్ధాంజని ఘటించారు. సమైక్య రాష్ట్రంలో కుదేలైన అన్ని రంగాలు ప్రత్యేక రాష్ట్రంలో పునరుత్తేజం పొందాయన్నారు. ఆవిర్భవించిన నాలుగేళ్లలోనే దేశం గర్వించదగిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిన విషయాన్ని కేసీఆర్‌ ప్రస్తావించారు. ఈ క్రమంలో తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించేందుకు స్వార్థశక్తులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి పిలుపు ఇచ్చారు. అనుకున్న సమయం కంటే ముందుగానే మిషన్‌ భగీరథ ద్వారా మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నారమని కేసీఆర్‌ చెప్పారు. ఇప్పటికే 1900 గ్రామాలను మంచినీరు అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. 
హైదరాబాద్‌లో మౌలిక సదుపాలకు 26 వేల కోట్లు  
విశ్వనగరంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో మౌలిక సదుపాలు కల్పించేందుకు 26 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నవిషయాన్నికేసీఆర్‌ గుర్తు చేశారు. అవుటర్‌ రింగ్ రోడ్ వెలుపల 330 కి.మీ. పొడవున ప్రాంతీయ వలయ రహదారి నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అమీర్‌పేట-ఎల్బీనగర్‌ మెట్రో రైలును మార్గాన్ని వచ్చే నెలలో, అమీర్‌పేట-హైటెక్‌  సిటీ మెట్రో మార్గాన్ని ఈ ఏడాది నవంబర్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు 25 వేల కోట్ల రూపాయలు 
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, భూరికార్డులు ప్రక్షాళన, వ్యవసాయ రుణమాఫీ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను కేసీఆర్‌ వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు 25 వేల కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే పూర్తైన ప్రాజెక్టుల ద్వారా 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నామని చెప్పిన కేసీఆర్‌... ఈ ఏడాది మరో 12 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్‌ చెప్పారు. 

 

21:34 - August 15, 2018

ఢిల్లీ : దేశంలోని పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు.  వచ్చే నెల 25 నుంచి దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. తొలిదశలో 10 కోట్ల మందికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ ఎర్రకోటలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మోదీ చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్ర ఎర్రకోటలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సైనిక, పోలీసుదళాల నుంచి గౌరవ వందన స్వీకరించారు. 
మోదీ స్వాతంత్ర్య దినోత్సవ సందేశం 
ఎర్రకోట బురుజల నుంచి ప్రధాని మోదీ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ సందేశమిస్తూ... దేశంలోని పేదలకు ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో ఆయుష్మాన్‌ భారత్‌-జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రకటించారు. పండిట్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వచ్చేనెల 25 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తారు. మొత్తం 50 కోట్ల మందికి ప్రయోజనం చేకూరేలా ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా తొలిదశలో 10 కోట్ల మంది పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. మొత్తం 1354 చికిత్స ప్రక్రియలను దీనిలో చేర్చారు. 
మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు 
2022 నాటికి అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ ప్రపంచంలో నాల్గవ దేశంగా అవతరిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. భారత బాలబాలికలు త్రివర్ణ పతాకాన్ని అంతరిక్షంలోకి సగర్వంగా మోసుకెళ్లే రోజు వస్తుందన్నారు. జమ్ము-కశ్మీర్‌లో స్థానిక సంస్థలను బలోపేతం చేసే కృషిలో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని చెప్పారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాలను సవరిస్తున్నామని మోదీ చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట పరిసరాల్లో 70 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

21:29 - August 15, 2018

రూపాయి.. పతనమైంది... నిజమే.. అయితే.. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వస్తుంది..? అసలు ఈ పతనం ఎవరికైనా మేలు చేస్తుందా..? వాచ్‌ దిస్‌ స్టోరీ.. 72వ స్వాతంత్ర్య దినోత్సవాన.. దేశీయ రూపాయి విలువ దారుణంగా పతనమైపోయింది. ఇన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని రీతిలో డాలర్‌తో మారకం విలువ 70 రూపాయల 09 పైసల స్థాయికి పడిపోయింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆ కోణాన్ని పక్కనుంచితే.. రూపాయి పతనం కావడం.. భారతీయులపై ఎట్లాంటి ప్రభావం చూపబోతోంది అన్నది ప్రశ్న.
మొదటగా దిగుమతులపైనే ప్రభావం  
రూపాయి విలువ పడిపోయిందంటే.. ఎప్పుడైనా ఫస్ట్‌గా దాని ప్రభావం పడేది దిగుమతులపైనే. దేశీయ దిగుమతుల్లో సింహభాగం.. క్రూడాయిల్‌ ఉంటోంది. అంటే పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇక కొండెక్కే అవకాశం ఉంది. అదే జరిగితే.. సరకుల రవాణా ఖర్చు పెరిగి ఆమొత్తాన్ని వినియోగదారులే భరించాల్సి ఉంటుందన్నమాట. దిగుమతి చేసుకుంటున్న యంత్రసామగ్రి, ల్యాప్‌టాప్‌ లాంటి వస్తువుల ధరలూ బాగా పెరుగుతాయి. విదేశీ విద్యకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులకు భారం తడిసి మోపెడు కానుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులూ వెనక్కి వెళ్లొచ్చు. 
రూపాయి పతనం.. కొందరికి మేలు 
రూపాయి ఇలా పతనం కావడం.. కొందరికి మాత్రం మేలు చేయబోతోంది. మన దేశం నుంచి ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేసే వారు బాగా లాభపడతారు. అంతేకాదు.. విదేశాల్లోని తమ పిల్ల నుంచి డబ్బులు పొందే తల్లిదండ్రులకూ లాభమే. మారకం విలువ ప్రకారం అక్కడి వారు  ఓ వెయ్యి డాలర్లు పంపితే గతంలో.. ఓ 65 నుంచి 66 వేలు వచ్చేవి. ఇప్పుడు.. 70వేల వరకూ వస్తుంది. మొత్తానికి డాలర్‌తో రూపాయి విలువ పతనం కావడం.. దేశంలో ఆర్థిక మాంద్యానికీ కారణం కావచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

 

విజయవాడలో పంజాబ్ ఆండ్ సింద్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం

విజయవాడ : శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో పంజాబ్ ఆండ్ సింద్ బ్యాంక్ బ్రాంచ్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 

21:15 - August 15, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం విషమించింది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో ఆయన జూన్ లో ఎయిమ్స్ లో చేరారు. 65 రోజులుగా ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. అనారోగ్య కారణంగా 2009 నుంచి వాజ్ పేయి ఇంటికే పరిమితయ్యారు. ఎయిమ్స్ లో వాజ్ పేయిని ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సాయంత్రం ప్రధాని మోడీ వాజ్ పేయిని పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

అగ్రిగోల్డ్ డైరెక్టర్ మణిశర్మ బెయిల్ పై విడుదల

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ డైరెక్టర్ మణిశర్మ బెయిల్ పై విడుదల అయ్యారు. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఏలూరు సబ్ జైల్ నుండి మణిశర్మ విడుదలయ్యారు. ఇంకా ఏలూరు సబ్ జైలులోనే 18 మంది అగ్రిగోల్డు నిందితులు ఉన్నారు. 25 మంది నిందితులకుగానూ 19 మందిని అరెస్టు చేసి సీఐడీ ఏలూరు సబ్ జైలుకు తరలించారు.  

 

20:59 - August 15, 2018

రూపాయి మారకం విలువు పతనమవుతోంది. డాలర్ తో రూపాయి మాకరం విలువ 70.09 పైసలకు పతనం అయింది. దేశంలో ఆర్థికమాద్యం నెలకొనే ప్రమాదం ఉంది. వినియోగదారులపై భారం తప్పదు. విదేశీ విద్య మరింత భారం కానుంది. సరుకు రవాణా ఖర్చు పెరుగునుంది. దిగుమతులపై పెను ప్రభావం పడనుంది. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఎక్కువ ఆదాయం రానుంది. ఇదే అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆర్థికరంగ నిపుణులు రాంబాబు పాల్గొని, విశ్లేషించారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

20:52 - August 15, 2018

దేశమంత స్వాతంత్ర్య దినం సంబురాలు...డెబ్బై రెండేండ్లైనా పేదోనికి అందని ఫలాలు, అమరవీరుల స్థూపంతోని రాజకీయాలు...ఓపెనింగ్ కు నోచుకోని స్థూపంతోని ఆటలు, బీపి వెంచుకున్న మంత్రి సోమిరెడ్డి సారు...ఇర్వైకోట్ల అవినీతి చర్చ పక్కదారి వట్టిచ్చి, కోర్టు తీర్పును గౌరవించరా స్పీకర్ గారు...కోమటి రెడ్డి సంపత్ ముచ్చట్ల హైకోర్టు, దళిత గూడాల పొంట నీళ్ల గోసలు...మెదక్ జిల్లాల రోడ్డెక్కిన అమ్మలక్కలు, వేములవాడ గుడిలె తిర్గిన హోం సారు...
పూలదండ మేయజూశిన రాజన్న ఎద్దు.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

20:43 - August 15, 2018

ఢిల్లీలో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటలో ప్రధాని నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జిల్లాలోని ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఎగరువేసి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రైతాంగం ప్రయోజనాలు రక్షించేందుకు రాజీలేని వైఖరితో ముందుకు పోతామన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు, ది హిందూ మాజీ ఎడిటర్ నగేష్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, టీడీపీ నేత రామకృష్ణ, బీజేపీ నేత రాకేశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మోడీ, కేసీఆర్, చంద్రబాబు ప్రసంగాల్లో పస లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...  

20:25 - August 15, 2018

సోలో, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో యూత్ ఫుల్ కమ్ ఎమోషనల్ కంటెన్ట్ ను అరెస్టింగ్ గా చెప్పగల డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు పరశురాం. అలాంటి డైరక్టర్ తో యంగ్ సెన్సేషన్ విజయ దేవరకొండ టీం అప్ అయ్యాడు అనగానే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఎర్పడ్డాయి.. ఇక దానికి గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ ట్యాగ్ ఆడ్ అవ్వగానే, కన్ఫాం హిట్ అని ఫ్రీ రిలీజ్ టాక్ విపరీతంగా స్ర్పెడ్ అయ్యింది.. ఈ సినిమా నుండి వచ్చిన లిరికల్ వీడియోస్, సినిమా ప్రోమోస్.. గీతగోవిందానికి కావలసినంత హైప్ ను తెచ్చిపెట్టాయి.. మరి అలా భారీ అంచనాల నడుమ  థియేటర్స్ లోకి వచ్చిన గీతగోవిందం తమ  లవ్ స్టోరీతో ఎలా ఆకట్టుకున్నారు.. ఆడియన్స్ ను ఎలా అలరించారో ఇప్పుడు చూద్దాం..
కథ విషయానికి వస్తే.. 
కథ విషయానికి వస్తే.. విజయ్ గోవింద్ చిన్నప్పటి నుండి అమ్మాయిలంటే రెన్పెక్ట్ తో, కుటుంబం అంటే ప్రేమతో పెరిగిన ఓ మంచి కుర్రాడు.. అతను గీతను చూసి, తొలిచూపులోనే ప్రేమలో పడతాడు..కాని ఓ ఇన్సిడెంట్ లో ఆమె దృష్టిలో రాంగ్ గా ప్రొజక్ట్ అవుతాడు. నాటకీయంగా అతని చెల్లిని గీతవాళ్ల అన్నయ్యకు ఇచ్చి నిశ్చితార్థం చేస్తారు.. విజయ్  వల్ల తన చెల్లెలి పెళ్ళికి ఏమైనా ఆటంకాలు ఏర్పడ్డాయా..? గీత దృష్టిలో రాంగ్ యాంగిల్ లో ఉన్న విజయ్, తన ఇన్నోసెన్స్ ఎలా ఫ్రూ చేసుకున్నాడు.. చివరికి గీతగోవింద్ కలిసి గీతగోవిందంగా ఎలా మారారు.. అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే..
నటీనటుల విషయానికి వస్తే.. 
నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు బిగెస్ట్ ఎసెట్ విజయ్ దేవరకొండ.ఒక క్యారక్టర్ కి కమిట్ అయితే అతను చూపించే డెడికేషన్, దాన్ని ఓన్ చేసుకునే తీరు, జనాలకి కనెక్ట్ చేసే విధానంలో.మరోసారి తన బెస్ట్ ఈ సినిమాకోసం ఇచ్చాడు.. సినిమా పూర్తి అయ్యే సరికి గీత మాత్రమే కాదు, థియేటర్ లో ఉన్న ప్రతీ ఒక్కరు విజయ్ గోవింద్ క్యారక్ట్ కు ఎడిక్ట్ అయిపోతారు.. అలాంటి లవర్ తమకూ ఉండాలని ఓ సగటు అమ్మాయి కోరుకుంటే తప్పు లేదు అనిపిస్తుంది.. పరశురాం పేపర్ మీద రాసుకున్న గోవింద్ పాత్రను పదింతలు పెంచి స్ర్కీన్ పై ప్రజంట్ చేశాడు విజయ్ దేవరకొండ. తన విలక్షణ మైన కామెడీ టైమింగ్, తెలంగాణ యాసతో మిక్స్ అయిన డైలాగ్ డెలివరీ, సూపర్బ్ బాడీ లాంగ్వేజ్ తో ఆధ్యాంతం గీతగోవిందాన్ని తన బుజాలపై మోశాడు.. విజయ్ కెరీర్ లో ఇదొక బెస్ట్ పర్ఫామెన్స్.. ఇక ఛలో సినిమాతో యూత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఈ సినిమాతో మరింత పేరు తెచ్చుకోవడం ఖయం.. విజయ్ కి థీటుగా నటించింది. గీత క్యారక్టర్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల.. ఎక్కడా కూడా కన్ఫ్యూజ్డ్ ఎక్స్ ప్రషన్స్ కాని బ్లాంక్ ఎక్స్ ప్రషన్స్ కాని కనిపించలేదు.. ఎమోషనల్ సీన్స్ లోసైతం ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ సినిమా మొత్తాన్ని ఆథ్యాంతం కనువిందుగా నడిపించేయడంతో మిగతా వాళ్లందరికి స్ట్రేయిన్ తో పాటు, స్క్రీన్ స్పెస్ కూడా తగ్గింది. ఇక చివరిలో వచ్చిన వెన్నెల కిషోర్, మరోసారి తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు.. రాహుల్ రామకృష అండ్ గ్యాంగ్ విజయ్ ఫ్రెండ్స్ గా ఫుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ పంచారు.. నిత్యామీనన్, అనూఇమ్మాన్యుయల్ అస్సలు ఊహించని సర్ఫ్రైజస్. నాగబాబు, మౌర్యాని,గిరిబాబు, అన్నపూర్ణమ్మ, రవిప్రకాశ్, అభయ్ తదితరులంతా తమ వరకు డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారు..
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. 
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. పాత కథలను తన రైటింగ్ ఎబిలిటీతో కొత్తగా చూపించి, హిట్స్ అందుకున్న పరశురాం.. మరోసారి గీతగోవిందం ని కూడా తన కంఫర్ట్ జోన్ ను ఎంచుకున్నాడు. కాకపోతే గోవింద్ అండ్ గీత పాత్రలను స్ట్రాంగ్ గా రాసుకోవడం వల్ల, వాటి లోని అన్ని వేరియేషన్స్ ను చూపించడం వల్ల, లీడ్ పెయిర్ మీదనే పూర్తిగా డిపెండ్ అయిపోయి, సగం పైగా సినిమాను నడిపంచేశాడు. ఫస్ట్ ఆఫ్ అంతా ఎక్కడా వంక పెట్టడానికి లేకుండా, వినోదాత్మకంగా సాగిపోయిన గీతగోవిందానికి సెకండ్ హాఫ్ లో మాత్రం రెండు చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఎదురయ్యాయి. అయినా కూడా విజయ్ యాక్టింగ్ టాలెంట్, పరశురాం డైరక్టోరియల్ స్కిల్స్ వలన, స్మూత్ గా క్లైమాక్స్ కి చేరిపోయింది గీతగోవిందం. పరశురాం డైలాగ్స్ సినిమాకు బాగా కలిసొచ్చాయి. కాకపోతే ఎమోషనల్ టచ్ మాత్రం తగ్గింది. ఈ మధ్య తన మ్యూజిక్ తో  కాస్త నిరాశపరిచిన గోపీ సుందర్. మళ్ళీ ఫాంమ్ లోకి వచ్చాడు.. అయితే అతను అందించిన మ్యూజికల్ ట్యూన్స్ కి తెరమీద మాత్రం ఇంపాక్ట్ తగ్గింది.. అందరి నోళ్ళల్లో నానిన ఇంకేంకావాలి సాంగ్, పిక్చరైజేషన్ పరంగా ఇంకాస్తా బెటర్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.. ఆర్ ఆర్ బాగుంది.. సినిమాటోగ్రఫర్ మణికందన్ సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ కు తగ్గట్టు బాగా సెట్అయ్యింది..  నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, సినిమాను రిచ్ గా తీర్చిదిద్దారు.
ఓవర్ ఆల్ గా చెప్పాలంటే.. 
ఓవర్ ఆల్ గా చెప్పాలంటే.. మొదటి నుండి ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చూడబోతున్నారు అంటూ.. క్లియర్ హింట్స్ ఇస్తూ.. పబ్లిసిటీ చేసిన గీతగోవిందం టీం.. ఆ ప్రామిస్ ను సక్సెస్ ఫుల్ గా నెరవేర్చింది.. పాతకథే అయినా.. ఆధ్యాంతం వినోదాన్ని అందిస్తూ.. అక్కడక్కడా.. కొన్నిలోపాలను ఉన్నా.. వాటిని కవర్ చేస్తూ.. ఓ ఫర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ను తీసుకువచ్చింది.. యూత్ కంటెన్ట్ మేజర్ ఎసెట్ గా ఉండటం,  విజయ్ దేవరకొండ క్రేజ్, లాంగ్ వీకెండ్ , ఇలా అన్ని అంశాలు కలిసి రావడంతో, బాక్సాఫీస్ దగ్గర ఊహించిన దానికన్న భారీగా సందడి చేసేలా.. ఉన్నారు గీతగోవిందం.
ప్లస్ పాయింట్స్
విజయ్, రష్మిక నటన
డైలాగ్స్, కామెడీ
డైరెక్షన్, మ్యూజిక్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
గెస్సింగ్ స్ర్కీన్ ప్లే
ఎక్కువైన నాటకీయత
రేటింగ్
3 /  5

రేపు జరగాల్సిన ఏపీ బీజేపీ ఆఫీస్ శంకుస్థాపన వాయిదా

గుంటూరు : మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం మరింత క్షీణించింది. మూత్రనాళ పిండాల వ్యాధితో ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. మూత్ర నాళాల ఇన్ ఫెక్షన్ తో జూన్ లో ఆయన ఎయిమ్స్ లో చేరారు. రేపు జరగాల్సిన ఏపీ బీజేపీ ఆఫీస్ శంకుస్థాపన, బీజేపీ అధికార కార్యక్రమాలు వాయిదా వేశారు.

 

మరింత క్షీణించిన వాజ్ పేయి ఆరోగ్యం

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం మరింత క్షీణించింది. మూత్రనాళ పిండాల వ్యాధితో ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. మూత్ర నాళాల ఇన్ ఫెక్షన్ తో జూన్ లో ఆయన ఎయిమ్స్ లో చేరారు. 

 

వాజ్ పేయిని పరామర్శించిన ప్రధాని మోడీ

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న వాజ్ పేయిని ప్రధాని మోడీ పరామర్శించారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో జూన్ లో వాజ్ పేయి ఎయిమ్స్ లో చేరారు. 65 రోజులుగా ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. 

మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం విషమం

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి విషమించింది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో జూన్ లో ఎయిమ్స్ లో ఆయన చేరారు. 65 రోజులుగా ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. 2009 నుంచి అనారోగ్య కారణంగా వాజ్ పేయి ఇంటికే పరిమితయ్యారు. 

 

19:51 - August 15, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి విషమించింది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ తో జూన్ లో ఎయిమ్స్ లో ఆయన చేరారు. 65 రోజులుగా ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. 2009 నుంచి అనారోగ్య కారణంగా వాజ్ పేయి ఇంటికే పరిమితయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఎమ్మెల్యే సుగుణమ్మకు అవమానం

తిరుమల : ఎమ్మెల్యే సుగుణమ్మకు అవమానం జరిగింది. మహాసంప్రోక్షణలో భాగంగా శ్రీవారి ఆలయంలో మహాశాంతియాగం చేశారు. మహాశాంతి యాగంలో పాల్గొనేందుకు వచ్చి సుగుణమ్మకు టీటీడీ సిబ్బంది అనుమతి లేదనడంతో సుగుణమ్మ వెనుదిరిగారు. 

టీటీడీ బోర్డ్ సభ్యులు మేడా రామకృష్ణారెడ్డి కారులో చోరీ

కర్నూలు : టీటీడీ బోర్డ్ సభ్యులు మేడా రామకృష్ణారెడ్డి కారులో చోరీ జరిగింది. ఓ డాబా వద్ద కారులో ఉన్న రూ.50 లక్షల బ్యాగును డ్రైవర్ మళ్లికార్జున ఎత్తుకెళ్లారు. రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

19:39 - August 15, 2018

హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ తేనేటి విందు కార్యక్రమానికి సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్, ఏపీ ప్రభుత్వం తరపున హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. 

19:38 - August 15, 2018

బిగ్గర్ బాస్ బాబు గోగినేనితో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆయన మాటల్లోనే...
నేను కంటిస్టెంట్ గా బిగ్ బాస్ షోకు వెళ్ల లేదు. నేను ఇంటిలో ఉండటానికి వెళ్లాను. మన లైఫ్ పెద్ద గేమ్. ఆటలు ఆడుతుంటే దెబ్బలు తగలడం సహజం..కానీ బిగ్ బాస్ షోలో దెబ్బలు తగిలే ఆటలు పెడుతున్నారు. వేడినీళ్లు కావాలంటే కెమెరాను అడగాలి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

19:31 - August 15, 2018

కరీంనగర్ : కాంగ్రెస్‌ పార్టీపై మరోసారి మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి కొత్త బిచ్చగాళ్లు వచ్చారంటూ ధ్వజమెత్తారు. కరీంనగర్ వేములవాడ 4 లైన్ల రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు వస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో రాని వాళ్లు ఇప్పుడు ఓట్ల కోసం మళ్లీ తెలంగాణకు వస్తున్నారన్నారు. 

 

కర్నూలులో మద్యం మత్తులో వ్యక్తులు వీరంగం

కర్నూలు : జిల్లాలో అటవీశాఖ అధికారిపై వ్యక్తులు దాడి చేశారు. మద్యం మత్తులో వీరంగం చేశారు. అటవీ ప్రాంతంలో మద్యం సేవించడమే కాకుండా.. శ్రీశైలం వెళ్లే భక్తులను ఇబ్బందులకు గురి చేశారు. దీంతో అటవీశాఖ అధికారి స్వరూప్‌సాగర్‌ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన వ్యక్తులు... ఎమ్మెల్సీ రంగారెడ్డి కొడుకునే ప్రశ్నిస్తావా అంటూ.. ఆ అధికారిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా తమను ప్రశ్నించినందుకు క్షమించాలంటే కాళ్లు పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆ అధికారి కాళ్లపై పడి క్షమాపణలు చెప్పాడు. 

19:27 - August 15, 2018

కర్నూలు : జిల్లాలో అటవీశాఖ అధికారిపై వ్యక్తులు దాడి చేశారు. మద్యం మత్తులో వీరంగం చేశారు. అటవీ ప్రాంతంలో మద్యం సేవించడమే కాకుండా.. శ్రీశైలం వెళ్లే భక్తులను ఇబ్బందులకు గురి చేశారు. దీంతో అటవీశాఖ అధికారి స్వరూప్‌సాగర్‌ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రెచ్చిపోయిన వ్యక్తులు... ఎమ్మెల్సీ రంగారెడ్డి కొడుకునే ప్రశ్నిస్తావా అంటూ.. ఆ అధికారిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా తమను ప్రశ్నించినందుకు క్షమించాలంటే కాళ్లు పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆ అధికారి కాళ్లపై పడి క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐదుగురిని శ్రీశైలం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

రాజ్ భవన్ లో గవర్నర్ తేనేటి విందు ఏర్పాటు

హైదరాబాద్ : రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ తేనేటి విందు కార్యక్రమానికి సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్, ఏపీ ప్రభుత్వం తరపున హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. 

అడవారికి అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు : సీఎం కేసీఆర్

మెదక్ : ఒక్క భారతదేశంలోనే ఆడ, మగ అనే వ్యత్యాసం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. అడవారికి అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు. మల్కాపూర్ లో కంటి వెలుగు పథకాన్ని ఆయన ప్రారంభించారు. 

 

ఇప్పటికీ 40 లక్షల కళ్లద్దాలు తీసుకొచ్చాం : సీఎం కేసీఆర్

మెదక్ : ఇప్పటికీ 40 లక్షల కళ్లద్దాలు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ చెప్పారు. కంటి ఆపరేషన్లు చేయించుకోవడానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. 3.7 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 

17:54 - August 15, 2018

మెదక్ : రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అవసరమైతే ఉచితంగా కంటి ఆపరేషన్ లు చేయిస్తామన్నారు. ఉచితంగా మందులు, కళ్ల అద్దాలు పంపిణీ చేస్తామని చెప్పారు. మల్కాపూర్ లో కంటి వెలుగు పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ మల్కాపూర్ లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం సంతోషకరమన్నారు. ఇప్పటికీ 40 లక్షల కళ్లద్దాలు తీసుకొచ్చామని చెప్పారు. కంటి ఆపరేషన్లు చేయించుకోవడానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. 3.7 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. 825 టీమ్ లు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
అవకాశాలు ఇస్తే మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు
ఒక్క భారతదేశంలోనే ఆడ, మగ అనే వ్యత్యాసం ఉందన్నారు. అవకాశాలు ఇస్తే మహిళలు కూడా అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు.  జిల్లా ఎస్పీ మహిళ,
ఆరోగ్య సెక్రటరీ మహిళ, జెడ్ పీటీసీ చైర్ పర్సన్ మహిళ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మహిళ అని అన్నారు. ఆడవారు మగవారి కంటే ఎందులోనూ తీసిపోరన్నారు. మగవాళ్లలో కొందరు సన్నాసులున్నారని అన్నారు. వంట మన మగవారు చేయొద్దా అని అన్నారు. గొప్ప సమాజాలు, గొప్ప దేశాలు తెలివిగా ఆలోచన చేస్తాయన్నారు. ఉత్పాదక రంగం, అనుత్పాదక రంగం అని రెండు ఉంటాయని తెలిపారు. రష్యాలో విమానాలు నడిపేవారిలో 92 శాతం మంది మహిళలున్నారు. ఐక్యూ ఎక్కువగా ఉన్నవారిని ఉత్పాదక రంగంలో తక్కువగా ఉన్నవారిని అనుత్పాదక రంగంలో నియమిస్తారని తెలిపారు. రష్యాలో విమానాలు నడిపేవారిలో 92 శాతం మంది మహిళలున్నారు.
విద్యుత్, నీటి సమస్యలను అధిగమించాం 
విద్యుత్, నీటి సమస్యలను అధిగమించామని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేశామని తెలిపారు. చెరువులన్నీ ఏడాదంతా నీళ్లతో కళకళలాడేలా చేస్తామన్నారు.
మల్కాపూర్ కు రూ.6 కోట్లు మంజూరు
మల్కాపూర్ గ్రామ అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే గ్రామానికి 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ప్రతి ఇంటికి రెండు పాడి గేదెలు ఇస్తామని చెప్పారు. 

 

 

 

17:47 - August 15, 2018

మెదక్ : 100 శాతం మరుగుదొడ్లున్న గ్రామం మల్కాపూర్ అని మంత్రి హరీష్ రావు కొనియాడారు. మల్కాపూర్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రతీ ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను సేకరించి పరిశుభ్రతను చాటారని అభినందించారు. 400 మంది యువత మిషన్ భగీరథ పనుల్లో పాల్గొన్నారని తెలిపారు. హరితహారంలో నాటిన 90శాతం మొక్కలను రక్షించారని పేర్కొన్నారు. హైదరాబాద్ ను తలదన్నే విధంగా మల్కాపూర్ లో రాక్ గార్డెన్ నిర్మించుకున్నామని తెలిపారు. ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామమని. ఇంటికి రెండు పాడి పశువులు కావాలని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. నర్సాపూర్ నుంచి మాచారం వరకు తార్ రోడ్డు, విలేజ్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారని పేర్కొన్నారు. చెనగా చెరువును అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ప్రజలు కోర్కెలను సీఎం నెరవేర్చాలని కోరారు. గ్రామంలో ఉన్న 7 చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. 

17:16 - August 15, 2018

శ్రీకాకుళం : జాతి పునర్‌ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. జిల్లాలోని ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఎగరువేసి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధే తన లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. 

 

విజయవాడలో వ్యభిచారం పేరుతో ఆన్ లైన్ మోసం

కృష్ణా : విజయవాడలో వ్యభిచారం పేరిట ఆన్ లైన్ మోసం బట్టబయలు అయింది. సోషల్ మీడియాలో యువతుల ఫేక్ ఫొటోలు పెట్టి ముఠా మోసాలకు పాల్పడుతోంది. ఫేక్ అకౌంట్లతో ముఠా దోచుకుంటోంది. రాజేశ్వరి, ఆమె అల్లుడు రూ.20లక్షలు వసూలు చేశారు. సోషల్ మీడియాలో విజయవాడకు చెందిన ఓ యువతి ఫొటో పెట్టారు. ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేశ్వరీతోపాటు ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

16:57 - August 15, 2018

కృష్ణా : విజయవాడలో వ్యభిచారం పేరిట ఆన్ లైన్ మోసం బట్టబయలు అయింది. సోషల్ మీడియాలో యువతుల ఫేక్ ఫొటోలు పెట్టి ముఠా మోసాలకు పాల్పడుతోంది. ఫేక్ అకౌంట్లతో ముఠా దోచుకుంటోంది. రాజేశ్వరి, ఆమె అల్లుడు రూ.20లక్షలు వసూలు చేశారు. సోషల్ మీడియాలో విజయవాడకు చెందిన ఓ యువతి ఫొటో పెట్టారు. ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేశ్వరీతోపాటు ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
 

16:50 - August 15, 2018

మహిళలకు సంబంధించి ఎన్ని చట్టాలున్నాయి ? మహిళలకు సంబంధించి అనేక చట్టాలున్నాయి. మహిళలకు ఉన్న చట్టాలను పలు రకాలుగా వర్గీకరించారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి మైరైట్ కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను ఆమె మాటల్లోనే..
నాటి కాలం నుంచి మన సమాజంలో అనేక సాంఘీక దురాచారాలు ఉన్నాయి. సతీసహాగమనం, కన్యాశుల్కం, వరకట్నం వంటి సాంఘీక దురాచారాలు ఉన్నాయి. మహిళలకు అనేక చట్టాలు ఉన్నాయి. సాంఘీక దురాచారాల నుంచి మహిళలను కాపాడేందుకు, మహిళ రక్షణ... భద్రత కోసం చట్టాలు ఉన్నాయి. మొదటగా 1929 లో బాల్య వివాహ నిరోధక చట్టం వచ్చింది. 1937 లో హిందూ మహిళలకు ఆస్తి హక్కు చట్టం వచ్చింది. 1956 లో సవరణలతో కూడిన మహిళలకు ఆస్తి హక్కు చట్టం వచ్చింది. 1961లో వరకట్నం నిషేధ చట్టం వచ్చింది. 2006 లో సవరణలతో కూడిన బాల్య వివాహాల చట్టం వచ్చింది. మహిళలపై అత్యాచారాలు...లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, లైంగిక వేధింపుల నిరోధానికి నిర్భయ చట్టం వచ్చింది. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

16:42 - August 15, 2018

హైదరాబాద్ : గోల్కొండ కోటలో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రైతాంగం ప్రయోజనాలు రక్షించేందుకు రాజీలేని వైఖరితో ముందుకు పోతామన్నారు సీఎం కేసీఆర్‌. రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కల్తీ ఎరువులు, విత్తనాలు తయారు చేస్తున్న కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు భీమా పథకాన్ని నేటి నుండే అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 
చేనేత రంగంపై ప్రత్యేక శ్రద్ధ : సీఎం కేసీఆర్  
చేనేత రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. చేనేత కార్మికులకు మార్కెట్‌లో ప్రతిఫలం దక్కేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చేనేత ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నామని తెలిపారు. చేనేత రంగ అభివృద్ధి కోసం వరంగల్‌లో టెక్స్‌టైల్స్‌ పార్కు నిర్మాణం చేపట్టామన్నారు. 

16:37 - August 15, 2018

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటలో ప్రధాని నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అణగారిన వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. దేశం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోందన్నారు. డిజిటల్‌ ఇండియా దిశగా దేశం నడుస్తోందన్నారు.
అత్యాచారాలు జరిపే వారికి కఠిన శిక్షలు : మోడీ
దేశంలో మహిళలపై అత్యాచారాలాకు పాల్పడుతున్న వారికి భయం మొదలైందని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లో అత్యాచారం జరిగిన 5 రోజుల్లో ఆదోషులకు శిక్ష పడిందని తెలిపారు. అత్యాచారాలు జరిపే వారికి కఠిన శిక్షలు అమలు చేస్తున్నామని తెలిపారు. 
సెప్టెంబర్‌ 25 నుండి ప్రధానమంత్రి జన్‌ అరోగ్య అభియాన్ పథకం : మోడీ
దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య అభియాన్‌ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. సెప్టెంబర్‌ 25 నుండి ఈ పథకం ప్రారంభిస్తామని... మొదటివిడతగా దేశంలోని 10 కోట్ల మందికి ఈ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. ఆరోగ్య భారత్‌ లక్ష్యంగా పథకం పని చేస్తుందన్నారు.

16:30 - August 15, 2018

హైదరాబాద్ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల హీట్‌ పెంచుతున్నారు. నేతలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు పావులు కదుపుతున్నారు. వచ్చే నెల నిర్వహించే బహిరంగ సభ, ఎన్నికలపై గులాబీబాస్‌ నేతలకు ఈనెల 17న దిశానిర్దేశం చేయనున్నారు.
బహిరంగ సభతో బలప్రదర్శన చేసేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధం
బహిరంగ సభ, జన సమీకరణ, ఏర్పాట్లపై సమీక్ష
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ వేడిని మరింత పెంచుతున్నారు. ఎన్నికలు ఎంతోదూరం లేవన్న సంకేతాలు ఇస్తున్నారు. భారీ బహిరంగ సభ ద్వారా బలప్రదర్శన చేసేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌లో జరిగే సభపై ఇప్పటి నుంచే దృష్టి సారించింది.  ఔటర్‌ రింగ్‌రోడ్‌ సమీపంలో దాదాపు 1500 ఎకరాల స్థలంలో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభకు కనీసం 20 లక్షల జనసమీకరణ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.  అందుకు పార్టీ నేతలను కూడా సిద్ధం చేసేందుకు కేసీఆర్‌ ఈనెల 17న పార్టీ కార్యవర్గ సమావేశంతోపాటు శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.
బహిరంగ సభ కోసం స్థలాల పరిశీలన
బహిరంగ సభ కోసం పార్టీ నేతలు ఇప్పటికే రెండుమూడు స్థలాలను పరిశీలించారు. సీనియర్‌నేత కేకే ఆధ్వర్యంలో మరోసారి గులాబీనేతలు బహిరంగ సభ నిర్వహించేందుకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలను పరిశీలించనుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బౌరంపేట, ఇబ్రహీంపట్నం సమీపంలోని కొంగరకాల్‌ పరిసరాల్లో సభ నిర్వహించే అవకాశాన్ని పార్టీ పరిశీలిస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలను ఈ సభకు తీసుకొచ్చేందుకు అధికారపార్టీ సమాయాత్తం అవుతోంది.
కేసీఆర్‌ ప్రకటనతో నేతల్లో ఉత్కంఠ 
ఈనెల 17న నిర్వహించే పార్టీ నేతల సమావేశంలోనే ఎన్నికలపై పార్టీ ముందస్తు వ్యూహంపై అధినేత కేసీఆర్‌ నేతలకు సూచనలు చేసే అవకాశముంది. సెప్టెంబర్‌ నెలలోనే అభ్యర్థులను కూడా ప్రకటిస్తానని కేసీఆర్‌ చేసిన ప్రకటన నేతల్లో ఉత్కంఠ రేపుతోంది.

 

మల్కాపూర్ లో కంటి వెలుగు ప్రారంభించడం సంతోషం : సీఎం కేసీఆర్

మెదక్ : రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అవసరమైతే ఉచితంగా కంటి ఆపరేషన్ లు చేయిస్తామన్నారు. ఉచితంగా మందులు, కళ్ల అద్దాలు పంపిణీ చేస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మల్కాపూర్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. 

కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం

మెదక్ : కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అయింది. మల్కాపూర్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.  

సెప్టెంబర్ లో అభ్యర్థులను ప్రకటిస్తాం : ఉత్తమ్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. కేసీఆర్ వ్యాఖ్యలను టీకాంగ్రెస్ నేతలు సవాలుగా తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమని టీ.కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ లో అభ్యర్థులను ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అభ్యర్థుల ప్రకటన కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

 

14:52 - August 15, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను టీకాంగ్రెస్ నేతలు సవాలుగా తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమని టీ.కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ లో తాము కూడా అభ్యర్థులను ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అభ్యర్థుల ప్రకటన కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

14:36 - August 15, 2018

హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని వ్యక్తి నిప్పంటించుకున్నాడు. పోలీసులు మంటలను ఆర్పి అతన్ని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి

హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని వ్యక్తి నిప్పంటించుకున్నాడు. పోలీసులు మంటలను ఆర్పి అతన్ని ఆస్పత్రికి తరలించారు. 

 

13:39 - August 15, 2018

నెల్లూరు : అదో మారుమూల ప‌ల్లె.. క‌నీసం బ‌స్సు సౌక‌ర్యం కూడా స‌రిగా ఉండ‌ని గ్రామం.. కానీ ఆ ఊరిపేరు దేశభక్తికి మారు పేరుగా అనిపిస్తుంది. అక్కడి యువ‌త దేశం కోస‌మే పుట్టారా అనిపిస్తుంది. ఆ ఊర్లో తిరిగితే.. ఇంటికో సైనికుడు తార‌స‌ప‌డతాడు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండ‌లంలో దేశభక్తి పల్లెగా పేరుపొందిన దేవిశెట్టిప‌ల్లెపై ప్రత్యేక కథనం..

దేశభక్తికి మారు పేరు... దేవిశెట్టిప‌ల్లె
నెల్లూరు జిల్లా సీతారామపురం మండ‌లంలోని దేవిశెట్టిప‌ల్లెను.. ముద్దుగా దేశ‌భ‌క్తి ప‌ల్లె అని పిలుచుకుంటారు ఈ ప్రాంత వాసులు. ఈ మారుమూల గ్రామంలో ఇంటికో సైనికుడు ఉన్నాడంటే ఆశ్చర్యమేస్తుంది. ప‌దో త‌ర‌గ‌తి పాసైతే చాలు జై జ‌వాన్ అంటూ దేశ‌సేవ‌కు వెళ్ల్తారు ఇక్కడి యువత. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌.. ఇలా త్రివిద ద‌ళాల్లోనూ ఆ ఊరి యువకులు క‌నిపిస్తారు. 120 కుటుంబాలున్న ఈ గ్రామంలో.. ఒక్కో ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గురు యువ‌కులు సైన్యంలో ఉండటం ఈ ఊరి ప్రత్యేక‌త‌.
55 మంది వ‌ర‌కు ఆర్మీలో జ‌వాన్లు,సుబేదార్లు, నాయ‌క్ సుబేదార్‌..
ఈ గ్రామస్థులు 55 మంది వ‌ర‌కు ఆర్మీలో జ‌వాన్లుగా ప‌నిచేస్తున్నారు. సుబేదార్లుగా, నాయ‌క్ సుబేదారుగా, హ‌వ‌ల్ధార్లుగా మరికొందరు ప‌నిచేస్తున్నారు. వీరిలో ఒక‌రు మేజ‌ర్‌గా కూడా ఉన్నారు. మ‌రో 50 మందికి పైగా ఆర్మీలో సివిలియ‌న్ ఉద్యోగాల్లో ఉన్నారు. నేవీలో ఇద్దరు, ఎయిర్ ఫోర్స్‌లో ఆరుమంది, గోవా పోలీసులుగా న‌లుగురు, ఆంధ్రా పోలీసుగా ఒక‌రు, అగ్నిమాప‌క శాఖ‌లో ఒక‌రు విదులు నిర్వర్తిస్తున్నారు. అలాగే గోవాలో పీడ‌బ్య్లుడీ విభాగంలో ఏడు మంది ఉద్యోగాలు చేస్తుండ‌గా, మ‌రొకొంద‌రు ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నారు.
వెంకటసుబ్బయ్యతో ఆర్మీ ప్రస్థానం ప్రారంభం
1976-77లో ఆర్మీకి ఎంపికైన వెంకటసుబ్బయ్యతోనే ఈ ఊరినుంచి ఆర్మీ ప్రస్థానం మొదలైందని చెప్పొచ్చు. ఆయన్ను ఆర్మీ దుస్తుల్లో చూసిన యువతకు దేశ‌ర‌క్షణ‌పై ఆస‌క్తి పెరిగిందని గ్రామస్థులు చెబుతారు. ఒక‌రిద్దరితో మొద‌లై నేడు 160 మంది వ‌ర‌కు చేరారు. త్రివిద ద‌ళాల్లో ఉన్న త‌మ గ్రామ యువ‌త‌ను చూసి గ్రామస్థులు మురిసిపోతుంటారు.
మే నెలలో ఆ గ్రామంలో సందడే సందడి..
మే నెల వస్తే.. ఈగ్రామంలో సంద‌డి మొద‌ల‌వుతుంది. ఉద్యోగ రిత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండే వారంతా సొంత ఊరికి చేరుకుంటారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మూడు నుంచి నాలుగు వారాల పాటు సంద‌డి చేస్తారు. ఇదే సమయంలో కొందరు పెళ్లి కూడా చేసుకుని వెళ్తుంటారు. మొత్తానికి దేవిశెట్టిపల్లి యువత దేశభక్తిలో ఆద‌ర్శంగా నిలుస్తోంది. 

13:32 - August 15, 2018

హైదరాబాద్‌ : రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పీ అండ్‌ టీ కాలనీలో దారుణం జరిగింది. సుడాన్‌ దేశానికి చెందిన రాషెష్‌ అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. రాత్రి భోజనం చేసిన తర్వాత ముగ్గురి మధ్య చిన్న వివాదం చోటుచేసుకుంది. దీంతో క్షణికవేశానికి లోనైనా తోటి విద్యార్ధులే రాషెష్ ను కత్తితో పోడిచి గాయపరిచారు. తీవ్రగాయాలపాలైన రాషెష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

13:30 - August 15, 2018

వికారాబాద్ : పూడూరు మండలం చీలాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయం పొలం వద్ద స్తంభానికి ఉన్న ఎర్తింగ్ వైర్ తగిలి విద్యుత్ షాక్ తో కృష్ణయ్య అనే రైతు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

13:29 - August 15, 2018

ప్రకాశం : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఒంగోలు మండలం పెళ్లూరులోని ఎన్ సీసీ కార్యాలయం వద్ద జాతీయ జెండా దిమ్మె ఏర్పాటు చేస్తుండగా పై నున్న విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతి చెందారు. దీంతో అక్కడ విషాదం నెలకొంది.

13:26 - August 15, 2018

మేడ్చల్ : షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టాటాఏసీ ఆటో ఢీకొనడంతో ..ముందుకు వెళ్తున్న లారీ కిందపడి ఇద్దరు మృతి చెందారు. జాతీయ రహదారి తుకుంటా గ్రామంలోని అలంకృత రిసార్ట్స్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

13:24 - August 15, 2018

అమరావతి : కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జాతీయ జెండాను ఎగురవేసిన ఎంపీ కేశినేని నాని
విజయవాడలోని ఎంపీ కేశినేని భవన్ లో పంద్రాగష్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నేతలు నాగుల్ మీరా, పట్టాభి, డిప్యూటీ మేయర్ గోగుల రమణ, పలువురు పార్టీ నేతలు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఎంపీ కేశినేని నాని జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రజలకు, నేతలకు స్వీట్లు పంపిణీ చేశారు.

జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి సోమిరెడ్డి
స్వతంత్ర దినోత్సవం వేడుకలు కడప పోలీసు పేరెడ్ గ్రౌండ్స్ లో అత్యంత వైభవంగా జగిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కడప జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందని, వ్యవసాయ, ఉపాధి హామీ పనులలో ముందంజలో ఉందన్నారు. 

12:32 - August 15, 2018

ఎంతమంది అడ్డుకున్నా అభివృద్ధి ఆగదు : చంద్రబాబు

శ్రీకాకుళం : విభజన కష్టాలు వెంటాడుతున్నాయని..కేంద్రం సహకరించడం లేదని అన్నారు. ప్రాజెక్ట్‌లు ముందుకు సాగకుండా విపక్షాలు అడ్డుపతున్నాయని మండిపడ్డారు. నాలుగేళ్లలో రెండు అంకెల అభివృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రం ఏపీ అని సీఎం తెలిపారు. ఎవరు సహకరించినా..సహకరించకపోయినా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ఉపాధి కూలీని రూ. 140 నుంచి రూ. 205కు పెంచామన్నారు. నిరుద్యోగ యువతకు వెయ్యి చొప్పున భృతి ఇస్తున్నామని, చంద్రన్న బీమా, ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకాలతో పేదలకు ఆసరా కల్పించామన్నారు.

అభివృద్ధితో పాటు ఆనందంలో ముందుండాలి : చంద్రబాబు

శ్రీకాకుళం : వ్యవసాయంపై శ్రద్ధ పెట్టామని తెలిపారు. మహిళా సాధికారిత కోసం డ్వాక్రా సంఘాలు పెట్టామని స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ .. విద్యా, వైద్య రంగాల్లో సంస్కరణలు తెచ్చామని సీఎం అన్నారు. ముందుచూపుతో రాష్ట్రానికి ఒక విజన్‌ తయారు చేశామని తెలిపారు. అభివృద్ధితో పాటు ఆనందంలో కూడా ఏపీ ముందుండాలని ఆకాంక్షించారు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు.

వీరులకు జన్మనించిన గడ్డ శ్రీకాకుళం : చంద్రబాబు

శ్రీకాకుళం : ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయజెండాను ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ వీరులకు జన్మనిచ్చిన భూమి ఇదని...ఎందరో రాజకీయ, సాహిత్య రంగాల ప్రముఖులు శ్రీకాకుం జిల్లా బిడ్డలే అని అన్నారు. ఎందరో మహానుభావులు తెలుగుజాతి ఖ్యాతిని పెంచారని తెలిపారు. జాతిపునర్‌నిర్మాణానికి తామంతా పునరంకితం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, అన్ని ప్రాంతాలు, జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని చంద్రబాబు పేర్కొన్నారు.

11:01 - August 15, 2018

కష్టాలు వున్నా..అభివృద్ధిలో రాజీ లేదు : చంద్రబాబు

శ్రీకాకుళం : రాష్ట్ర విభజన అనంతరం ఎంతటి లోటు బడ్జెట్ లో వున్నాగానీ..పలు సంక్షేమ పథకాలను అమలు చేయటంలో ఏమాత్రం రాజీ లేకుండా కొనసాగిస్తున్నామని సిక్కోలులో స్వాతంత్ర్య వేడుకల్లో చంద్రబాబు తెలిపారు. పుట్టుకనుండి చనిపోయేంతవరకు మనిషి కావాల్సిన అన్ని పథకాలను సంక్షేమాలలో అందిస్తున్నామన్నారు. పేదవారి స్వంత ఇంటికల నెరవేర్చామని ఎన్ని కష్టాలు వున్నా అభివృద్ధి చేయటంలో ఏమాత్రం రాజీ పడకుండా ముందుకు సాగిపోతున్నామనీ..దీనికి సహకరిస్తున్న అధికారులకు..ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

10:41 - August 15, 2018

శ్రీకాకుళం : సిక్కోలులో జిల్లాలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో స్వాతంత్ర్య వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశిష్ట సేవలందించిన పలువురు పోలీసు అధికారులను సత్కరించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగిస్తు..శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రసిద్ధిని కొనియాడారు. సిక్కోలు పర్యాటక రంగానికి పట్టుకొమ్మగా శ్రీకాకుళం జిల్లా వుందనీ..ఎన్టీఆర్ గుండె చప్పుడు శ్రీకాకుళం జిల్లా అన్నారు. బాపూజీ మహాత్మాగాంధీ మెచ్చిన పొందూరు ఖద్దరుకు ప్రసిద్ధ మన పొందూరు ఖద్దరు పేరుగాంచిందన్నారు. పట్టుదలకు మారుపేరు తెలుగు జాతి అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఎంతటి లోటు బడ్జెట్ లో వున్నాగానీ..పలు సంక్షేమ పథకాలను అమలు చేయటంలో ఏమాత్రం రాజీ లేకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు. పుట్టుకనుండి చనిపోయేంతవరకు మనిషి కావాల్సిన అన్ని పథకాలను సంక్షేమాలలో అందిస్తున్నామన్నారు. పేదవారి స్వంత ఇంటికల నెరవేర్చామని ఎన్ని కష్టాలు వున్నా అభివృద్ధి చేయటంలో ఏమాత్రం రాజీ పడకుండా ముందుకు సాగిపోతున్నామనీ..దీనికి సహకరిస్తున్న అధికారులకు..ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

ఐదవసారి శ్రీకాకుళంలో స్వాతంత్ర్య వేడుకలు: చంద్రబాబు
రాష్ట్ర ఏర్పడిన అనంతరం  అన్ని జిల్లాలు, ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోను..ఉద్ధేశ్యంతోనే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో స్వాతంత్ర్య దినోతవ్స వేడుకలు జరుపుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటి వరకూ కర్నూలు, విశాఖ, అనంతపురం,తిరుపతిలలో నిర్వహించామనీ..ఐదవసారిగా శ్రీకాకుళంలో నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ అమరవీరుల త్యాగాలను మనమంతా మరిచిపోకూడదన్నారు. జాతీ పునర్నిర్మాణానికి అందరు కృషి చేయాలన్నారు.

వీరులకు జన్మనించి గడ్డ శ్రీకాకుళం : చంద్రబాబు
వీరులకు జన్మనించిన జన్మభూమి మనదనీ..ఆయా రంగాల్లోని సుప్రసిద్ధుల్లో పలువురు శ్రీకాకుళం జిల్లా బిడ్డలేననీ..శ్రీకాకుళం జిల్లాకు ఎనలేని సేవలందించిన ఎర్రంనాయుడు ఈ జిల్లా వ్యక్తేనన్నారు. ఉత్తరాంధ్రా అభివృద్ధికి కట్టుబడి వున్నామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సంకల్పబలం వుంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చన్నారు. 

మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు..

శ్రీకాకుళం: జిల్లాలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర్యదినోత్సవ వేడకల్లో మంత్రులు, అధికారులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు. 

10:28 - August 15, 2018

హైదరాబాద్ : గోల్కొండలో ఏర్పాటు చేసిన 72వ స్వాతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కోటలోని రాణీమహల్‌ వద్ద సీఎం కేసీఆర్‌ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ దినోతవ్స శుభాకాంక్షలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తు.. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఐదవసారి జాతీయ జెండాను ఎగురవేయటం సంతోషంగాను..గర్వంగాను వుందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా వున్నారని..అణగారిన ప్రజలకు సంక్షేమ పథకాలు అండగా నిలిచాయన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే దేశానికి ఆదర్శవంతమైన అభివృద్ది నమూనాను తెలంగాణ అందించిందనీ..సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలన్నింటినీ పునరుత్తేజం కల్పించామని..అనూహ్యమైన ప్రగతి సాధించామని తెలిపారు.

దేశానికి ఆదర్శంగా రైతుబంధు : కేసీఆర్
రైతుబంధు పథకం ద్వారా రైతన్నలకు పంటలపై బీమాను కల్పించి రైతులకు ధీమాను కల్పించామని..ఇది దేశ చరిత్రలోనే తొలిసారి అని..ఇది దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించటమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం భారీ బడ్జెట్ ను ప్రభుత్వం కేటాయించిందన్నారు. వివిధ ప్రాజెక్టులు నిర్మాణాలు కొనసాగుతున్నాయనీ..వాటిని త్వరలోనే పూర్తి చేసి సాగునీటికి కొరతలేకుండా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయంతోపాటు వివిధ రంగాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని..త్వరలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. 

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్ : గోల్కొండలో ఏర్పాటు చేసిన 72వ స్వాతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కోటలోని రాణీమహల్‌ వద్ద సీఎం కేసీఆర్‌ జెండా ఎగరవేశారు. అనంతరం పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు. 

పేదవాడు జబ్బు చేస్తే బాధపడకూడదు : ప్రధాని మోదీ

ఢిల్లీ : ఎర్రకోటలో స్వాతంత్ర్య వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం దేశంలోని పేదలకు ఉచితంగా వైద్యసాయం అందించే లక్ష్యంతో చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌-జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతు..సెప్టెంబర్‌ 25న దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని ప్రధాని వెల్లడించారు. ఈ పథకం ద్వారా దేశంలోని పేదలందరికీ ఉచిత వైద్య సాయం అందిస్తామన్నారు. తొలి విడతలో 10కోట్ల మందికి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రోగమొస్తే ఏం చేయాలన్న భయం పేదల్లో ఉండకూడదని మోదీ అన్నారు.

ఆయుష్మాన్‌ పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ..

ఢిల్లీ: దేశంలోని పేదలకు ఉచితంగా వైద్యసాయం అందించే లక్ష్యంతో చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌-జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. భారత 72వ స్వాతంత్య వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ఆయన జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్‌ పథకాన్ని మోదీ ప్రకటించారు.

09:29 - August 15, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ కేసులో హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఏకంగా అసెంబ్లీ స్పీకర్‌కే షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు కోర్టు తీర్పును అమలు పర్చని అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికీ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు గన్‌మెన్‌లను కేటాయించమని హైకోర్టు చెప్పినా కోర్టు తీర్పును పట్టించుకోని డీజీపీ, నల్లగొండ ఎస్పీ, జోగుళాంబ ఎస్పీకీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం మంచిదికాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే హైకోర్టులో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ వ్యవహారంలో ప్రతిఅంశంలో కోర్టు తీర్పుకు ఎదురెళ్లిన ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసింది. అంతేకాదు... ఏకంగా అసెంబ్లీ స్పీకర్‌కే షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కోర్టు తీర్పును పట్టించుకోని అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి ఫారం-1 నోటీసులు పంపింది. కోర్టు తీర్పుతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కపడింది.

శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై కోర్టు కెళ్లిన కోమటిరెడ్డి, సంపత్‌
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత కోర్టు తీర్పు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు అనుకూలంగా వచ్చింది. కోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వ తీరు మారుతుందని అంతా ఊహించారు. కానీ ప్రభుత్వం కోర్టు తీర్పును అమలు చేయడంతో తీవ్ర నిర్లక్ష్యం వహించింది. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శి కోర్టు తీర్పును ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యేలిద్దరూ వారిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు తీర్పుతో తమను ఎమ్మెల్యేలుగా పరిగణించాలని, తమకు గన్‌మెన్‌లను కేటాయించాలని రాష్ట్ర డీజీపీని కలిసి విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో మరోమారు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఆరు వారాలపాటు ఇరువురి వాదనలు విన్నది. కోర్టు ఆదేశాలు పాటించని కారణంగా అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి ఫారం 1 నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో సెప్టెంబర్‌ 17న న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావ్‌తోపాటు అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహా చార్యులు ఇద్దరూ నేరుగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

కోర్టు తీర్పు వెలువడినా ఎందుకు పట్టించుకోలేదని ఆగ్రహం
హైకోర్టు ఇచ్చిన తీర్పులో మరో సంచలన అంశం అసెంబ్లీ స్పీకర్‌కే నోటీసులు ఇవ్వడం. గన్‌మెన్‌లను ఇవ్వడానికి స్పీకర్‌ నుంచి మాకు వాళ్లను శాసనసభ్యులుగా పరిగణించే అనుమతి రాలేదని జోగులాంబ, నల్లగొండ జిల్లా ఎస్పీలు గతంలో అఫిడవిట్‌ దాఖలు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యేలుగా పరిగణించాలని కోర్టు చెప్పిన తర్వాత కూడా ధిక్కారానికి పాల్పడ్డారంటూ అసెంబ్లీ స్పీకర్‌కు షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. స్పీకర్‌కు షోకాజ్‌ నోటీసులిచ్చి కోర్టుకు హాజరుకావాలని చెప్పడం చాలా అరుదు. మరి కోర్టు ఇచ్చిన నోటీసులను స్పీకర్‌ పరిగణిస్తారా లేదా చూడాలి.

ఏ అకౌంట్‌లో జమచేశారో చెప్పాలన్న న్యాయస్థానం
జనవరి 2018 నుంచి ఇప్పటి వరకు ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు జీతాలు ఇచ్చారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ ఇచ్చి ఉంటే ఎంత ఇచ్చారని నిలదీసింది. ఏ అకౌంట్‌లో డిపాజిట్‌ చేశారో పూర్తి వివరాలు అసెంబ్లీ రిజిస్టర్‌ తెలుపాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తానికి కోర్టు ధిక్కరణకు పాల్పడితే ఎంతటివారైనా శిక్షార్హులే అని హైకోర్టువ్యాఖ్యానించడం కొసమెరుపు.

09:25 - August 15, 2018

శ్రీకాకుళం : స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సిక్కోలు పట్టణం ముస్తాబైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ట్స్‌ కాలేజీ మైదానం నుంచి ప్ర సం గిం చ ను న్నారు. ఉదయం 8.50 గంటలకు ఆర్ట్స్‌ కళాశాల మైదానానికి చేరుకుని.. 9 గంటలకు జెండా ఎగురవేయనున్నారు. 11 గంటల వరకు పోలీస్‌ పరేడ్‌, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, పోలీసులకు పతకాలు, అవార్డులు అందజేస్తారు. 11.15 గంటల నుంచి 11.45 గంటల వరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో హై టీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ వేడుకలకోసం శ్రీకాకుళం పట్టణాన్ని 10 కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

09:22 - August 15, 2018

ఢిల్లీ : 72వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో అభివృద్ధి, మార్పు వేగంగా జరుగుతోందని, దీనిపై నలువైపులా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని రాష్ట్రపతి అన్నారు. అందరికి విద్యుత్తు, ఇంటింటికి టాయ్‌లెట్లు, నీడ లేని పేదలకు ఇళ్లు లాంటి లక్ష్యాన్ని చేరువైనట్లు కోవింద్‌ వెల్లడించారు. ప్రభుత్వం కోట్ల సంఖ్యలో ఎల్‌పిజి కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. సమాజంలో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయడంతో పాటు, శాంతి భద్రతలను కాపాడడంలో భద్రతా బలగాలు, పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.

09:19 - August 15, 2018

హైదరాబాద్ : రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ధీటుగా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది. కాంగ్రెస్‌ పార్టీ స్కాంగ్రెస్‌ పార్టీగా మారిందని ఆరోపణలు చేసింది. ప్రజాస్వామ్య గొంతుక, విలువలను కాలరాసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని విమర్శించింది.

రాహుల్‌ వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్‌ కౌంటర్‌
కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు కౌంటర్‌ ఇచ్చారు. ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో రాహుల్‌గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్‌తోపాటు వేదికపై కూర్చున్న వారిలో సగంమంది బెయిల్‌పై ఉన్నవారేనని , భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ గురించి రాహుల్‌గాంధీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య గొంతుక, విలువలను కాలరాసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని కేటీఆర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ స్కాంగ్రెస్‌ పార్టీగా మారిందని.. ఏ అంటే ఆదర్శ్‌, బీ అంటే బోఫోర్స్, సీ అంటే కామన్వెల్త్‌ ... ఇంకా మీ కుంభకోణాల గురించి చెప్పాలా రాహుల్‌ అని నిలదీశారు. 1969 ఉద్యమ సమయంలో 369 మంది యువకులపై కాల్పులు జరిపిన చరిత్ర కాంగ్రెస్‌దని... మలిదశ ఉద్యమంలో కూడా వందలాది మందిని పొట్టనపెట్టుకున్నది కాంగ్రెసేనని ఆరోపించారు. కాంగ్రెస్‌ బలితీసుకున్న అమాయకులకే నివాళులు అర్పించిన సంగతి రాహుల్‌గాంధీకి తెలుసా అని కేటీఆర్‌ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

రాహుల్‌ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎదురుదాడి..
రాహుల్‌గాంధీ పర్యటన అట్టర్‌ ఫ్లాప్‌ అయిందని టీఆర్‌ఎస్‌ నేత దానం నాగేందర్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌ నేతల ముఖం చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా అని దానం ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అనవసర ఆరోపణలు చేయడం మానేసి.. రుజువులు చూపించాలని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులేనని ఎద్దేవా చేశారు. మరో 15 సంవత్సరాలపాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

09:14 - August 15, 2018

యాదాద్రి : రాష్ర్టంలోనే అతి పెద్ద జాతీయ జెండా అవిష్కరణకు వేదికగా నిలిచింది యాదాద్రి భువనగిరి జిల్లా. 2వేల అడుగుల జాతీయ జెండాను ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. పట్టణంలో 3500మంది విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన జాతీయతా భావాన్ని రెట్టింపు చేసింది. భారత్ మాతాకి జై, జై జవాన్ జై కాసాన్ నినాదాలతో పట్టణం మార్మోగింది. ఈ సందర్బంగా పలువురు స్వతంత్ర సమరయోదులను సన్మానించారు. తెలంగాణలో జాతీయ సమైఖ్యతను చాటేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు ఆర్యవైశ్య మహాసభ అద్యక్షుడు ఇరుకుల రామక్రిష్ణ.

09:13 - August 15, 2018

నెల్లూరు : 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలో సైకత శిల్పి చెక్కిన జాతీయ నాయకుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. చిల్లకూరు మండలం ఏరూరుకు చెందిన మంచాల సనత్‌కుమార్‌.. సముద్ర తీరంలో దేశ నాయకుల చిత్రాలను సైకతంతో ఏర్పాటు చేశారు. ఐ ల్‌ ఇండియా అంటూ సైకతం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇది ప్రజలు ఎంతగానో ఆకట్టుకుంటోంది.

09:10 - August 15, 2018

కామారెడ్డి : గణతంత్ర, స్వతంత్ర దినోత్సవాలకు భరత మాతను స్మరించుకోవడం అందరికీ తెలిసిందే. కానీ.. భరత మాతకు గుడికట్టి.. నిత్యం పూజలు చేస్తున్నారంటే కొంత ఆశ్చర్యంతోపాటు.. మరికొంత గర్వంగానూ ఉంటుంది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో దీపారాధన, భజనలు, జేజేల నినాదాలతో మార్మోగుతున్న భరత మాత ఆలయంపై 10టీవీ ప్రత్యేక కథనం..

బిచ్కుందలో విశేషంగా ఆకట్టుకుంటున్న భరతమాత ఆలయం
దేశంలోనే అరుదైన భరత మాత ఆలయం కామారెడ్డి జిల్లా బిచ్కుందలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలన్న మహోన్నత లక్ష్యంతో 1949లో భరతమాత ఆలయానికి అంకురార్పణ జరిగింది. స్వతంత్ర సమరయోధులు కర్రతో రూపొందించిన భరతమాత విగ్రహాన్ని.. గ్రామ నడిబొడ్డులోని చెట్టుగట్టుకు ప్రతిష్టించారు. తర్వాత మార్కండేయ వంశస్థులు భరతమాతకు ఆలయాన్ని నిర్మించారు. అప్పటినుంచి నిత్య పూజలతో భక్తిగా భరతమాతను ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం, సాయంత్రం భజనలు చేస్తూ.. భరత మాతకు జేజేలు పలుకుతున్నారు.

మహారాష్ర్ట, కర్ణాటక నుంచి భారీగా భక్తుల హాజరు
దేశంలోనే కాశీ తర్వాత బిచ్కుందలో మాత్రమే భరతమాత విగ్రహం ఉందని గ్రామస్థులు గర్వంగా చెబుతున్నారు. దశాబ్దాలుగా భరతమాతను నిత్యం పూజలతో స్మరిస్తున్నట్లు ఆలయ పూజారి తెలిపారు. యేటా మాగశుద్ధి షష్టి రోజున భరతమాత జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకలకు మహారాష్ర్ట, కర్ణాటక రాష్ట్రాలనుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని వారు తెలిపారు.

నవరాత్రి వేడుకల్లో బంగారు నగలతో అలంకారం
దేశభక్తిని పెంపొందించడానికి ప్రతిష్టించిన భరతమాత.. గ్రామస్థుల పాలిట అమ్మవారిగా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంలా మారిందంటున్నారు. భరత మాతను.. దుర్గాదేవిగా భావించి పూజిస్తామని వారంటున్నారు. అంతేకాదు.. నవరాత్రి వేడుకల్లో బంగారు నగలతో అలంకరిస్తారు. భరతమాత మహిమగల దేవత అని భక్తుల విశ్వాసం. భరతమాతకు ఆలయంకట్టి అంతు లేని తమ దేశభక్తిని చాటుకుంటున్నారు బిచ్కుంద గ్రామస్ధులు. వారి స్పూర్తిని దేశవ్యాప్తంగా ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిద్దాం. 

సబ్ కా సాథ్..సబ్ కా వికాస్ మా లక్ష్యం : ప్రధాని మోదీ

ఢిల్లీ : సబ్ కా సాథ్..సబ్ కా వికాస్ మా మంత్ర మని ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్ర్య వేడుకల ప్రసంగంలో పేర్కొన్నారు. అందరికీ ఇళ్లు, ఇంటింటికి వెలుగు ఇవ్వటమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతీ ఇంటికీ గ్యాస్ కనెక్షన్, నీరు, మరుగుదొడ్లు..హెల్ఫ్ ఫర్ ఆల్ అందరికీ బీమా, అందరికీ సురక్షా పథకాల లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నామని మోదీ తెలిపారు.  

దేశ యువత ప్రగతికి కొత్త అర్థాన్నిచ్చారు : ప్రధాని

ఢిల్లీ : భారత దేశపు యువత ప్రగతికి కొత్త అర్థాని నిర్వచిస్తున్నారని ప్రధాని మోదీ ఎర్రకోటలో జాతీయ జెండా అవి
ష్కరించిన సందర్భంగా ప్రసంగించారు. దేశ యువత దేశౄన్నితమ బాహువుల్లోకి తీసుకుని సమున్నత తీరాలకు తీసుకువెళుతున్నారని ప్రశంసించారు. యువత నేడు బిపి ఓలను ప్రారంభిస్తున్నారన్నారు. అభివృద్ధిలో భాగంగా దేశంలోని 3 లక్షల గ్రామాలకు పైగా డిజిటల్ ఇండియా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఈశాన్య భారతం ఢిల్లీకి దూరం అనే భానను చెరివేసి అభివృద్ధితో ఈశాన్య రాష్ట్రాలలో హింస తగ్గేలా చేశామని మోదీ తెలిపారు. 

సుబ్రమణ్య భారతి కలగన్న భారత్ కావాలి : ప్రధాని మోదీ

ఢిల్లీ : తమిళ కవి సుబ్రమణ్య భారతి స్వప్నించిన భారతాన్ని ఆవిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని ర్రకోటలో ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం దేశ ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తు పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ముందడుగు వేసేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్నాం. గిరిజనులు, దళితులు దేశ ప్రగతిలో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

125 కోట్ల భారతీయులను ఒక్కటి చేసేందుకు కృషి : మోదీ

ఢిల్లీ : ఎర్రకోటలో ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం దేశ ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తు..125 కోట్ల భారతీయులను ఒక్కటి చేసేందుకు కృషి చేస్తున్నాం. టీమిండియా స్వప్నం సాకారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నాం. ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించాలన్న స్వప్నాన్ని సాకారం చేశాం. ప్రతి ఇంటికీ గ్యాస్‌ కనెక్షన్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ లక్ష్యాలు నెరువేరుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. 

08:40 - August 15, 2018

ఢిల్లీ : భారతదేశం ఓ సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఎర్రకోటపై నిర్వహించిన 72వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలకు ఉద్ధేశించి ప్రధాని ప్రసంగించారు. భారతదేశం ఒక ఆత్మవిశ్వసంతో ముందుకెళ్తోంది. స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం పరిశ్రమిస్తోంది.

నీలగిరి పుష్పంలా భారత్ వికసిస్తోంది : మోదీ
నవ చైతన్యం, నూతనోత్తేజంతో దేశం పురోగమిస్తోంది. 12 ఏళ్లకోసారి పుష్పించే నీలగిరి పుష్పాల మాదిరిగా దేశం వికసిస్తోంది. ఏపీ, తెలంగాణ, మిజోరాం, ఉత్తరాఖండ్‌ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ఎవరెస్టుపై మన బాలికలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆత్మవిశ్వాసాన్ని చాటారు. పార్లమెంటు సమావేశాలు అత్యంత ఫలప్రదమయ్యాయి. పేదలు, దళితులు, వెనుకబడి వర్గాల సమస్యలపై సుదీర్ఘ చర్చ సాగింది. సామాజిక న్యాయం దిశగానూ సమావేశాలు ఫలప్రదమయ్యాయి. దేశ రక్షణలో త్రవిధ దళాలు ఆత్మార్పణ చేస్తున్నాయి. త్యాగధనులందరికీ దేశ ప్రజల పక్షాన ప్రణామం చేస్తున్నానన్నారు.

ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యం : మోదీ
పూజ్య బాపూజీ నేతృత్వంలో ఎందరో దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని ప్రధాని గుర్తు చేశారు. వారి త్యాగాల ఫలితంగా దేశంలో పన్నెండేళ్లకోసారి నీలగిరి పుష్పంలా దేశం వికసిస్తోంని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి పథంలో భారత్ దూసుకుపోతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ట పెరుగుతోందన్నారు.

భారత వీరుల బలిదానానికి జలియన్ ఘటన నిదర్శనం: మోదీ
మన దేశ వీరుల బలిదానానికి బలియన్ వాలా బాగ్ ఘటన నిదర్శనంగా నిలుస్తోందనీ..జలియన్ వాలా బాగ్ ఘటనకు వందేళ్లు కావస్తోందని ఎర్రకోటలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధాని ప్రసంగంలో తెలిపారు. దేశ రక్షణలో మన సైనికులు అనునిత్యం ప్రాణాలకు తెగించి పరిరక్షిస్తున్నారని వారందరికి..దేశానికి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నామన్నారు.

టీమిండియా స్వప్నం సాకారమే లక్ష్యంగా నిరంతరం కృషి..
పేద, మధ్య తరగతి ప్రజలు ముందడుగు వేసేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్నాం. గిరిజనులు, దళితులు దేశ ప్రగతిలో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నాం. 125 కోట్ల భారతీయులను ఒక్కటి చేసేందుకు కృషి చేస్తున్నాం. టీమిండియా స్వప్నం సాకారమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నాం. ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించాలన్న స్వప్నాన్ని సాకారం చేశాం. ప్రతి ఇంటికీ గ్యాస్‌ కనెక్షన్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ లక్ష్యాలు నెరువేరుతున్నాయి.

నవ చైతన్యం, ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోంది : మోదీ
నవ చైతన్యం, ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోందన్నారు. సాహసాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం శ్రమిస్తోందన్నారు. 12 ఏళ్లకు ఓసారి పుష్పించే నీలగిరి పూలలా దేశం వికసిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరం, ఉత్తరాఖండ్ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని ప్రశంసించారు. మన బాలికలు ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆత్మవిశ్వాసాన్ని నలుదిశలా చాటారన్నారు.

దేశం సానుకూల దృక్పథంతో సాగుతోంది : మోదీ

ఢిల్లీ : ఎర్రకోటలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధాని ప్రసంగిస్తు..ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాలు ఫల ప్రదమయ్యాయన్న మోదీ.. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. దేశం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందన్నారు. అణగారి వర్గాల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి వుందని ప్రధాని హామీ ఇచ్చారు. త్రివర్ణ పతాయం స్ఫూర్తినిస్తుందనీ..మన భారతీయులు ఎందరో ఎవరెస్ట్ శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాండించారన్నారు.

భారత వీరుల బలిదానానికి జలియన్ ఘటన నిదర్శనం: మోదీ

ఢిల్లీ : మన దేశ వీరుల బలిదానానికి బలియన్ వాలా బాగ్ ఘటన నిదర్శనంగా నిలుస్తోందనీ..జలియన్ వాలా బాగ్ ఘటనకు వందేళ్లు కావస్తోందని ఎర్రకోటలో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధాని ప్రసంగంలో తెలిపారు. దేశ రక్షణలో మన సైనికులు అనునిత్యం ప్రాణాలకు తెగించి పరిరక్షిస్తున్నారని వారందరికి..దేశానికి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నామన్నారు.

అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యం : మోదీ

ఢిల్లీ : ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగిస్తు..అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా..వారిని సమున్నత స్థాయికి తీసుకెళ్లమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించేందుకు కృషి చేశామనీ..ఇంటింటికీ వెలుగులు పంచటంలో లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. ఫైబర్ నెట్ వర్క్ విషయంలో ఎంతో పురోగతి సాధించామనీ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు సాగుతు పురోభివృద్ధి సాధించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 2013 జనాభా లెక్కలతో పోలిస్తే నాలుగేళ్లలో మా ప్రగతి అనూహ్యంగా వుందన్నారు. 

ఏపీ, తెలంగాణ పిల్లలు దేశ ప్రతిష్టను పెంచారు : ప్రధాని మోదీ

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికలు దేశ గౌరవాన్నిఇనుమడింపజేశారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం దేశప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. నవ చైతన్యం, ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోందన్నారు. సాహసాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం శ్రమిస్తోందన్నారు. 12 ఏళ్లకు ఓసారి పుష్పించే నీలగిరి పూలలా దేశం వికసిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరం, ఉత్తరాఖండ్ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని ప్రశంసించారు.

08:21 - August 15, 2018

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికలు దేశ గౌరవాన్నిఇనుమడింపజేశారని ప్రధాని నరేంద్రమోదీ 72వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం తన ప్రసంగంలో పేర్కొన్నారు. నవ చైతన్యం, ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోందన్నారు. సాహసాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం శ్రమిస్తోందన్నారు. 12 ఏళ్లకు ఓసారి పుష్పించే నీలగిరి పూలలా దేశం వికసిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మిజోరం, ఉత్తరాఖండ్ బాలికలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారని ప్రశంసించారు. మన బాలికలు ఎవరెస్ట్‌ను అధిరోహించి ఆత్మవిశ్వాసాన్ని నలుదిశలా చాటారని ప్రధాని మోదీ ప్రశంసించారు.

స్వంత్ర్య వేడుకల్లో ప్రముఖులు..
ఎర్రకోటలో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కేంద్రం ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధాని మోదీ ఐదవసారి జాతీయ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు మంత్రులు, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, ప్రముఖులు పాల్గొన్నారు. జెండాను ఆవిష్కరించిన అనంతరం దేశ ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతికవితను ప్రస్తావించారు. 

ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ..

ఢిల్లీ : ఎర్రకోటలో 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కేంద్రం ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధాని మోదీ ఐదవసారి జాతీయ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. 

జిల్లాల్లో జాతీయ జెండాను ఎగురవేయనున్న మంత్రులు..

అమరావతి : నేడు భారతదేశపు 72 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీలో ఆయా జిల్లాల్లో మంత్రులు జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు. విజయనగరంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖలో మంత్రి చినరాజప్ప, తూర్పుగోదావరిలో మంత్రి కాల్వ శ్రీనివాసులు, పశ్చిమగోదావరిలో మంత్రి ప్రత్తిపాటి, కృష్నా..మంత్రి పరిటాల సునీత, గుంటూరు అయ్యన్న పాత్రుడు, ప్రకాశం మంత్రి నారాయణ, నెల్లూరు అమర్ నాథ్ రెడ్డి, కడప సోమిరెడ్డి, కర్నూలు కేఈ కృష్ణమూర్తి, అనంతపురం దేవినేని, చిత్తూరు మంత్రి ఆనంద్ బాబు ఆయా జిల్లాలో జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు.  

నేడు బసవ తారకం మదర్ కిట్ల పంపిణీ..

అమరావతి : నేడు భారతదేశపు 72 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు దేశ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుండి బసవతారకం మదర్ కిట్ల పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా నేటి నుండి ఈ పథకం ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించే తల్లులకు రూ.1038 విలువగల మదర్ కిట్లను పంపిణీ జరగనుంది. ఈ కిట్ లో ఒక చీర, 2 స్కార్ఫ్ లు , బ్లాంకెట్, 10 శానిటరీ నాప్కిన్స్, ఫ్లాస్క్ వంటి వస్తువులను ఈ మదర్ కిట్ లో పంపిణీ చేయనున్నారు. 

జిల్లాలో జెండాలు ఎగురవేసే మంత్రులు..

మెదక్ : నేడు పంద్రాగస్టు సందర్భంగా గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోతవ్స వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. జిల్లాల వారీగా మంత్రులు కూడా ఆయా జిల్లాలలో జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు.

అమరవీరుల త్యాగాలను దేశం మరచిపోదు : రాష్ట్రపతి

ఢిల్లీ: దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 72వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని, త్రివిధ దళాలు, పోలీసులు అన్ని సమయాల్లో బాగా పనిచేస్తున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. రైతులకు సాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలన్నారు. సరిహద్దుల్లో జవాన్లు ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్నారు. దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తున్నమన్నారు.

నేడే కంటి వెలుగు ప్రారంభం..

మెదక్ : నేడు పంద్రాగస్టు సందర్భంగా గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోతవ్స వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.  

నేడే కంటి వెలుగు ప్రారంభం..

మెదక్ : మల్కాపూర్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికి ఉచితంగా ప్రభుత్వం కంటి పరీక్షలను చేయనుంది. దృష్టి లోపాలు వున్నవారందరికీ కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు అవసరమైనవారందరికీ ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలను కూడా చేయనుంది. 

భారతీయులందరికీ 10టీవీ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు..

హైదరాబాద్ : నేడు భారతదేశం 72వ స్వాతంత్ర్య దినోత్సవం..ఈ సందర్భంగా 10టీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోతవ్స శుభాకాంక్షలు..ఎందరో మహానుభావులు చేసిన త్యాగంతో భారతమాత దాస్య శృంఖలాలను తెంచుకుని స్వేచ్చా వాయువులు పీల్చుకుంది. నేడు దేశ ప్రజలు ఇంత స్వేచ్ఛగా వున్నామంటే ఆనాటి దేశభక్తుల త్యాగాల ఫలమే అన్న సంగతి భారతీయులెవరు మరచిపోకూడదు..ఆనాడు వారి త్యాగం..ఈనాటికి మన భారత సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..సరిహద్దుల్లో మన స్వేచ్ఛ కోసం అహర్నిశలు పహారా కాస్తున్న మన జవానుల వీరోచిత పోరాటం కూడా మన భద్రకు కారణం.

ఖమ్మంలో కంపించిన భూమి..

ఖమ్మం : వాసులను భూకంపం భయభ్రాంతులకు గురిచేసింది. 5 సెకన్లపాటు భూమి కంపించడంతో జనాలు ఇళ్ల నుంచి భయంతో బయటు వచ్చారు. భద్రాచలం, పాల్వంచ, బూర్గంపాడు, సుజాత నగర్, లక్ష్మీదేవిపల్లిలో భూమి స్వయంగా కంపించినట్టు స్థానికులు తెలిపారు. ఇళ్ల లోంచి బయటకు వచ్చి చాలాసేపు రోడ్లపైనే గడిపారు. భూకంపానికి సంబంధించి అధికారుల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే, స్థానికులు మాత్రం మంగళవారం రాత్రి 3 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు.

డిసెంబరు 31 నుండి ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు పనిచేయవట!..

ఢిల్లీ : ఈ ఏడాది డిసెంబరు 31 తర్వాత మ్యాగ్నెటిక్ స్ట్రిప్ కలిగిన ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు పనిచేయవని భారతీయ స్టేట్ బ్యాంకు తెలిపింది. అటువంటి కార్డులు కలిగిన ఖాతాదారులు వెంటనే వాటిని మార్చుకుని చిప్ కార్డులు తీసుకోవాలని సూచించింది. ఏటీఎం లావాదేవీలను మరింత సురక్షితం చేయడంలో భాగంగా రిజర్వు బ్యాంకు నిబంధనలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగానే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ కలిగిన కార్డులను రద్దు చేసి ఈఎంవీ చిప్ కార్డులను ప్రవేశపెట్టబోతున్నట్టు పేర్కొంది.

Don't Miss