Activities calendar

16 August 2018

వాజ్ పేయి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం

గుంటూరు : మాజీ ప్రధాని వాజ్ పేయి మృతి బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన మంచి వాగ్ధాటి, విజనరీ అని చెప్పారు. అయన సెక్యులర్ వాది అని పేర్కొన్నారు.  ఎవ్వరితో వాజ్ పేయికి విరోధం లేదన్నారు. వాజ్ పేయికి ఎప్పుడూ ఒక స్థానం ఉంటుందన్నారు.ఆయన హయాంలో పనులు సజావుగా జరిగాయన్నారు. ప్రధానమంత్రి సడక్ యోచన పథకం తీసుకొచ్చారని పేర్కొన్నారు. వాజ్ పేయి వ్యతిరేకులు కూడా ఆయనను ఇష్టపడతారని తెలిపారు. 

21:46 - August 16, 2018

ఢిల్లీ : వాజపేయి పేరు వినగానే.. అశేష భారతావని మదిలో ఎన్నెన్నో స్మృతులు మెదలుతాయి. ప్రోఖ్రాన్‌ అణు ప్రయోగంతో అమెరికా ఆంక్షలను బేఖాతరు చేసినా.. దాయాది దేశానికి బస్సు సర్వీసును ప్రారంభించి సౌహార్ద్రాన్ని చాటుకున్నా... కార్గిల్‌ యుద్ధంలో దాయాది దేశానికి చుక్కలు చూపించినా.. అది వాజపేయికే సాధ్యమైంది. 

భారతదేశం అణు సంపన్నతను సాధించిన దేశంగా చెరగని యశస్సును సాధించడంలో వాజపేయిది విశేష పాత్ర. 1974లో తొలిసారి ప్రోఖ్రాన్‌లో అణుపరీక్ష చేశాక.. 24 ఏళ్ల తర్వాత.. 1998లో వాజపేయి నేతృత్వంలోనే.. ప్రోఖ్రాన్‌లో ఐదు భూగర్భ అణుపరీక్షలను నిర్వహించారు. దీంతో సమాచారం, వనరులు, సాంకేతికాంశాల్లో సహాయంపై అగ్రదేశాలు ఆంక్షలు విధించాయి. అయితే.. పర్యవసానాలను ముందుగానే పసిగట్టి.. వాజపేయి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించడంతో అగ్రరాజ్యాల ఆంక్షలేమీ చేయలేక పోయాయి.

మతతత్వ పార్టీలోని లౌకిక వాదిగా అన్ని పక్షాలూ వాజపేయిని గుర్తిస్తాయి. పాకిస్తాన్‌తో శాంతి కోసం ఆయన చేసిన ప్రయత్నం చరిత్రలో ప్రత్యేకాధ్యాయాన్ని లిఖించింది. ఢిల్లీ-లాహోర్ మధ్య బస్సు సర్వీసును  1999 ఫిబ్రవరిలో ప్రారంభించారు. కశ్మీర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనుకున్నారు. అయితే.. దాయాది దేశం తన వక్రబుద్ధిని మానుకోలేదు. బస్సు సర్వీసును ప్రారంభించిన మూడు నెలలకే మే-జులై మధ్యలో.. కార్గిల్‌ వద్ద కవ్వింపులకు దిగింది. పాకిస్తాన్‌ సైనికులు, కశ్మీరీ తీవ్రవాదులు వాస్తవాధీన రేఖను దాటి భారత్‌లోకి చొరబడే ప్రయత్నాన్ని .. సైనికులు సమర్థంగా తిప్పికొట్టారు. అణుబాంబులు కలిగివున్న దేశాల మధ్య జరిగిన రెండో యుద్ధంగా కార్గిల్‌ వార్‌ నిలిచింది. 

వాజపేయి హయాంలో అంకురార్పణ జరిగిన ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన, నేషనల్‌ హైవే డెవలప్‌మెంటు ప్రాజెక్టులు దేశ రవాణా, గ్రామీణ రహదారుల రంగంలో విప్లవాత్మక మార్పులను తెచ్చాయనడంలో అతిశయోక్తి లేదు. 32 ఏళ్లలో దేశంలో అభివృద్ధి చెందిన రోడ్లలో సగానికిపైగా.. వాజపేయి నేతృత్వంలో అభివృద్ధి సాధించినవేనని.. అనంతరం వచ్చిన మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం సాక్షాత్తు సుప్రీంకోర్టులోనే అంగీకరించింది. దీన్నిబట్టి గోల్డెన్‌ క్వాట్రయాంగిల్‌ దేశంపై ఎంతటి ప్రభావం చూపిందో అర్థమవుతోంది. 

వాజపేయి ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించి పరిశోధన రంగం అభివృద్ధినీ ప్రోత్సహించారు. 2001 లో వాజపేయి ప్రభుత్వం, ప్రాథమిక మరియు సెకండరీ విద్య యొక్క అభివృద్ధి లక్ష్యంగా సర్వశిక్షా అభియాన్ అనే ప్రసిద్ధ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 

21:39 - August 16, 2018

ఢిల్లీ : అటల్‌ బిహారీ వాజపేయిది సుదీర్ఘ రాజకీయ జీవితం.. దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషించారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందిన ఘనత వాజపేయిది. వాజపేయి వాగ్ధాటిని చూసిన జవహర్‌లాల్‌ నెహ్రూ.. ఎప్పటికైనా ప్రధాని అవుతారని కితాబిచ్చారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు ఆ వ్యాఖ్యలు నిజమయ్యాయి. 

అటల్‌ బిహారీ వాజపేయి.. రెండవ లోక్‌సభకు.. తొలిసారిగా, 1957లో ఎన్నికయ్యారు.  మధ్యలో 3, 9వ లోక్‌సభలకు తప్పించి... 14వ లోక్‌ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. దాదాపు 45 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ జీవితం గడిపారు. 

వాజపేయి క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో.. వాజపేయి తన అన్న ప్రేమ్‌తో కలిసి 23 రోజుల పాటు అరెస్టవడం ద్వారా.. వాజపేయికి తొలిసారిగా రాజకీయాలతో పరిచయమేర్పడింది. అప్పట్లో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొననని, క్విట్ ఇండియా ఉద్యమ నాయకులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోనని రాతపూర్వకంగా హామీ ఇచ్చాకే వాజపేయిని విడిచిపెట్టారు.

1951లో భారతీయ జనసంఘ్‌ ఏర్పడ్డాక.. వాజపేయిని ఆర్‌ఎస్‌ఎస్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయతో కలిసి పనిచేసేందుకు నియమించింది. అతి తక్కువ కాలంలోనే.. జనసంఘ్‌ నాయకుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీకి ముఖ్యుడిగా మారారు వాజపేయి. తన వాగ్ధాటితో జనసంఘ్‌లో ముఖ్యనేతగా ఎదిగారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మరణానంతరం, జనసంఘ్‌ బాధ్యతంతా యువకుడైన వాజపేయిపైనే పడింది. 1968లో సంఘ్‌ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. లాల్‌కృష్ణ అద్వానీ తదితరులతో కలిసి.. సంఘ్‌కు జాతీయ ప్రాతినిథ్యం దక్కేలా కృషి చేశారు. 

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన కాలంలో వాజపేయి కూడా అరెస్టయ్యారు. 1977లో జయప్రకాశ్‌ నారాయణ్‌ పిలుపు మేరకు వాజపేయి జనసంఘ్‌ను సంకీర్ణ కూటమి జనతాపార్టీలో విలీనం చేశారు. 1977లో ఏర్పడ్డ మొరార్జీ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ హోదాలో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తిగా వాజపేయి గుర్తింపు పొందారు. 1979లో జనతా ప్రభుత్వం కూలిపోయాక.. జనతాపార్టీ విచ్ఛినం కావడంతో.. వాజపేయి ఆర్‌ఎస్‌ఎస్‌, జనసంఘ్‌లకు చెందిన అద్వానీ, భైరాన్‌సింగ్‌ షెకావత్‌ తదితర సహచరులతో కలిసి 1980లో భారతీయ జనతాపార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 

1995 నవంబరులో ముంబాయిలో జరిగిన పార్టీ సమావేశంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ.. వాజపేయిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాడు. 1996 మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ గెలిచింది. అలా వాజపేయి 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. అయితే 13 రోజులకే వాజపేయి ప్రభుత్వం కూలిపోయింది.  1998లో రెండో సారి ప్రధానమంత్రి పదవి పొందినా.. 13 నెలలే కొనసాగారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. 

అలుపెరుగని రాజకీయ దురంధరుడు వాజపేయికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. దేశానికి వాజపేయి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం 2014 డిసెంబర్ 24న,  భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. 2009 తర్వాత అనారోగ్య కారణాల వల్ల వాజపేయి క్రియాశీల రాజకీయాలనుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచీ ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. వాజ్‌పేయీకి భారతరత్న పురస్కారాన్ని అందించేందుకు... అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. స్వయంగా వాజపేయి ఇంటికే వెళ్లడం విశేషం. 

21:29 - August 16, 2018

ఢిల్లీ : అటల్‌ బిహారీ వాజపేయి అనగానే ఆయన మేధోసంపత్తి గుర్తుకొస్తుంది. చిన్ననాటి నుంచే ఆయన పరిణితి.. ప్రజ్ఞను ప్రదర్శిస్తూ సాగారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ.. జీవనాన్ని సాగించారు. 
1924లో జననం 
అటల్‌ బిహారీ వాజపేయి 1924 డిసెంబర్ 25న గ్వాలియర్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి మరియు కృష్ణబిహారీ వాజపేయి. ఆయన తాత పండిట్ శ్యాం లాల్ వాజపేయి. పూర్వీకుల నివాస ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ లోని బటేశ్వర్ నుంచి గ్వాలియర్ లోని మొరీనాకు వలస వెళ్ళారు. వాజపేయి తండ్రి కృష్ణబిహారీ వాజపేయి గ్వాలియర్ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆయన నుంచే వాజపేయి కవిత్వపు గుబాళింపులు అద్దుకున్నారు.  
వాజపేయి గ్వాలియర్ లో విద్యాభ్యాసం
వాజపేయి గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేశారు. గ్వాలియర్ విక్టోరియా కాలేజీలో హిందీ, ఇంగ్లిష్‌, సంస్కృత భాషల్లో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడయ్యారు. కాన్పూరు లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాలనుంచి రాజనీతిశాస్త్రంలో పట్టాను పొందారు. దేశ విభజన తర్వాత జరిగిన అల్లర్ల వల్ల న్యాయశాస్త్ర విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేశాడు.
ఆర్య కుమార్ సభతో సామాజిక కార్యశీలత ప్రారంభం
వాజపేయి గ్వాలియర్‌లో ఆర్య సమాజపు యువ విభాగమైన ఆర్య కుమార్ సభతో తన సామాజిక కార్యశీలతను ప్రారంభించారు. 1944లో ఆ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1939లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-ఆర్ఎస్‌ఎస్‌లో చేరారు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ నడుపుతోన్న రాష్ట్రధర్మ, పాంచజన్య పత్రికల్లోనూ వాజపేయి పనిచేశారు. 
ఆజన్మాంతం బ్రహ్మచారిగానే వాజపేయి 
వాజపేయి ఆజన్మాంతం బ్రహ్మచారిగానే కొనసాగారు. వాజపేయి నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆయనకు భారతీయ సంగీతం మరియు నాట్యం అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికుడైన వాజపేయికి హిమాచల ప్రదేశ్ లోని మనాలీ ప్రాంతమంటే ఎనలేని ఇష్టం. 

 

21:07 - August 16, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఏయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాలు, మూత్ర నాళాల సంబంధిత సమస్యలతో పాటు డెమెన్షియాతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 11వ తేదీన ఎయిమ్స్‌లో చేరారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నేత మీసాల రాజేశ్వర్ రావు, జంగారెడ్డి పాల్గొని, మాట్లాడారు. వాజ్ పేయి మృతి బాధాకరమన్నారు. ఆయన అత్యుత్తమ పార్లమెంటేరియన్ అని కొనియాడారు. విలక్షణమైన, విశిష్టమైన స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

21:01 - August 16, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఏయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాలు, మూత్ర నాళాల సంబంధిత సమస్యలతో పాటు డెమెన్షియాతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 11వ తేదీన ఎయిమ్స్‌లో చేరారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రయోజనం లేకుండాపోయింది. అటల్ బిహారీ వాజ్‌పేయీ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో డిసెంబర్ 25, 1924న... మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజ్‌పేయీ. ఆయన తండ్రి కృష్ణబిహారీ గ్వాలియర్ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. వాజ్‌పేయీ గ్వాలియర్‌లోని సరస్వతి శిశుమందిర్‌‌లో విద్యాభ్యాసం చేశారు. అనంతరం విక్టోరియా కళాశాలలో డిగ్రీ చదివారు. కాన్పూరులోని ఆంగ్లో వైదిక కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. 1957లో వాజ్‌పేయీ బలరామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన జనసంఘ్‌లో ముఖ్యనేతగా ఎదిగారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ బాధ్యత మొత్తం ఆయనపైనే పడింది. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1996లో తొలిసారి 13 రోజులు ప్రధానిగా, తర్వాత 13 నెలల పాటు మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఐదేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. భారత దేశానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. 2005 తర్వాత అనారోగ్య కారణాలతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 10 సార్లు లోక్‌సభ ఎంపీగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా వాజ్‌పేయీ సేవలందించారు.

 

20:58 - August 16, 2018

అసిఫాబాద్ : ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. కుమ్రంబీం అసిఫాబాద్ జిల్లా దహేంగాం మండలం గెర్రే గ్రామం వద్ద ఎర్రవాగు పొంగిపొర్లడంతో ఓ గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జిపైకి గర్బిణిని ఓ మంచానికి తాళ్లు చేర్చాల్సి వచ్చింది. 

20:53 - August 16, 2018

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ బడ్జెట్‌ అంచనాలను విపరీతంగా పెంచి టీఆర్‌ఎస్ ప్రభుత్వం దోపిడికి పాల్పడిందని ఆరోపించారు కాంగ్రెస్‌ నేత భట్టివిక్రమార్క. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ పేరు మార్చి.. కాళేశ్వరం పేరుతో కోట్లు దోచుకున్నారన్నారు. ప్రాజెక్ట్‌ పేరు మార్చి పేరు మార్చలేదని మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు.

20:43 - August 16, 2018

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

20:39 - August 16, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై మంత్రి కేటీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తప్పుపట్టారు. కేటీఆర్‌ హుందా మరిచి రాజకీయాలు చేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. రాజీవ్‌గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కేటీఆర్‌ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. 

20:29 - August 16, 2018

కరీంనగర్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్‌పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. కేటీఆర్‌ సంస్కారంలేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ నోరు అదుపులో పెట్టుకోపోతే తీవ్ర పరిణామాలు తప్పవని పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. 

20:26 - August 16, 2018

 హైదరాబాద్ : రాహుల్‌గాంధీపై మంత్రి కేటీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు తప్పుపట్టారు. కాంగ్రెస్‌ నాయకులపై కేటీఆర్‌ నోరు పారేసుకోవడం తగదన్నారు. కేటీఆర్‌ కుసంస్కారానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు.

20:20 - August 16, 2018

హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో మరో 24 గంటల పాటు వానలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం నిపుణులు చెబుతున్నారు. రానున్న 24 గంటల్లో తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయంటున్న వాతావరణ కేంద్రం నిపుణులతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది.
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:16 - August 16, 2018

సిరిసిల్ల : తాగునీటి వసతి కల్పించాలంటూ ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు నిరసన తెలిపారు. స్కూల్‌లో నీటి వసతిలేక ఇంటి వద్ద నుండి నీళ్లు తీసుకెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్ధితి కొనసాగుతుందని, నీటి వసతిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. ఈ విషయంపై స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా చలనం లేదంటున్నారు. ఇప్పటికైనా, అధికారులు స్పందించి తాగునీటి వసతి కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

20:13 - August 16, 2018

కొమురంభీం ఆసిఫాబాద్ : జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. సిర్పూర్ కాగజ్‌నగర్‌, కౌటాల, బెజ్జూర్‌, దహేగాం, చింతలమానేపల్లి, పెంచికల్ పేట్ మండలాలలో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది, పెనుగంగా నది, పెద్దవాగులలోకి భారీగా  వరదనీరు చేరుతుంది. దీంతో నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలుమండలాల్లోని వాగులు పొంగిపోర్లుతున్నాయి. దీంతో సమీపంలోని గ్రామాలకు రాకపోకలు నిలిపోయాయి. మరికొన్ని గ్రామాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలలోకి వరదనీరు చేరటంతో రైతులు ఆందోళన చెందతున్నారు.

 

20:06 - August 16, 2018

తూర్పుగోదావరి : కాకినాడలో ఈ నెల 7న వేటకు వెళ్లి కనిపించకుండాపోయిన ఫిషింగ్‌ బోటు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. బోటు జాడ కోసం కోస్టుగార్డు రంగంలోకి దిగినట్లు జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్ర తెలిపారు. ఈ నెల 11న ఓడరేవు వైట్‌రిగ్‌కి సమీపంలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని, అదే కేంద్రంగా ఏర్పాటు చేసుకొని గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్‌ తెలిపారు. చెన్నై నుండి పారాదీప్‌ వరకు ఉన్న అన్ని ఓడరేవుల్లోనూ బోట్‌కి సంబంధించి పూర్తి వివరాలు అందజేశామన్నారు. కోస్ట్‌గార్డ్‌తో పాటు మర్చెంట్‌ వెసల్స్‌కు బోట్‌ మిస్సింగ్‌ సమాచారం అందించామన్నారు. సాధ్యమైనంత త్వరలో బోట్ ఆచూకి కనుగొంటామని కలెక్టర్‌ తెలిపారు. 

వాజ్‌పేయి మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి కన్నుమూశారు. వాజ్ పేయి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.

 

వాజ్‌పేయి మృతికి సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. 23 పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడిపిన ఘనత  వాజ్‌పేయిదేనని నివాళులర్పించారు. ప్రధానిగా దేశాన్ని రైలు, రోడ్డు, సమాచార వ్యవస్థలతో అనుసంధానం చేశారంటూ, వాజ్‌పేయితో ఉన్న అనుబంధాన్ని వెంకయ్యనాయుడు గుర్తు చేసుసుకున్నారు

వాజ్‌పేయి మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఏయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు. వాజ్ పేయి మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. 

వాజ్‌పేయి మృతి పట్ల రాష్ట్రపతి సంతాపం

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఏయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. వాజ్ పేయి మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు.  

19:44 - August 16, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. 23 పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడిపిన ఘనత  వాజ్‌పేయిదేనని నివాళులర్పించారు. ప్రధానిగా దేశాన్ని రైలు, రోడ్డు, సమాచార వ్యవస్థలతో అనుసంధానం చేశారంటూ, వాజ్‌పేయితో ఉన్న అనుబంధాన్ని వెంకయ్యనాయుడు గుర్తు చేసుసుకున్నారు. 
 

19:36 - August 16, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఏయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ వైద్యులు ధ్రువీకరించారు. మధుమేహం, ఛాతీలో అసౌకర్యం, మూత్రపిండాలు, మూత్ర నాళాల సంబంధిత సమస్యలతో పాటు డెమెన్షియాతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 11వ తేదీన ఎయిమ్స్‌లో చేరారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రయోజనం లేకుండాపోయింది. అటల్ బిహారీ వాజ్‌పేయీ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో డిసెంబర్ 25, 1924న... మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజ్‌పేయీ. ఆయన తండ్రి కృష్ణబిహారీ గ్వాలియర్ ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పని చేశారు. వాజ్‌పేయీ గ్వాలియర్‌లోని సరస్వతి శిశుమందిర్‌‌లో విద్యాభ్యాసం చేశారు. అనంతరం విక్టోరియా కళాశాలలో డిగ్రీ చదివారు. కాన్పూరులోని ఆంగ్లో వైదిక కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. 1957లో వాజ్‌పేయీ బలరామ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన జనసంఘ్‌లో ముఖ్యనేతగా ఎదిగారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ బాధ్యత మొత్తం ఆయనపైనే పడింది. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1996లో తొలిసారి 13 రోజులు ప్రధానిగా, తర్వాత 13 నెలల పాటు మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1999లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఐదేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. భారత దేశానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. 2005 తర్వాత అనారోగ్య కారణాలతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 10 సార్లు లోక్‌సభ ఎంపీగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా వాజ్‌పేయీ సేవలందించారు.

 

మాజీ ప్రధాని వాజ్ పేయి మృతి

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి కన్నుమూశారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 

కత్తి మహేశ్ బహిష్కరణ కేసు వాయిదా..

హైదరాబాద్ : శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో నగర బహిష్కరణకు గురైన సినీ విమర్శకుడు కత్తి మహేశ్, తనపై నగర బహిష్కరణ ఎత్తివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే వివాదంలో నగర బహిష్కరణకు గురైన పరిపూర్ణానందపై విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ ఇటీవల హైకోర్టు ఆదేశించిన నేపధ్యంలో కత్తి మహేశ్ కూడా నగర బహిష్కరణ ఎత్తివేయాలని హైకోర్టును కోరారు.

వాజ్ పేజ్ ఆరోగ్యంపై మోదీ ఆవేదన..

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజపేయి ఆరోగ్యం విషమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చిన ప్రధాని మోదీ, ఈరోజు మళ్లీ కాసేపటి క్రితం ఆసుపత్రికి వచ్చారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. అనంతరం ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మోదీ ముఖం ఎంతో ఆవేదనాభరితంగా కనిపించింది. మోదీ వెళ్లి పోయిన నేపథ్యంలో, కాసేపట్లో ఎయిమ్స్ వైద్యులు అత్యంత కీలకమైన వాజపేయి హెల్త్ బులెటిన్ ను విడుదల చేయనున్నారు. ఈ బులెటిన్ లో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. 

15:30 - August 16, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమించింది. ఈమేరకు ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వాజ్‌పేయికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వాజ్‌పేయిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరామర్శించారు. వాజ్ పేయి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఆయన ఆరోగ్యం నిన్నటి మాదిరిగానే ఉందని..ఎలాంటి మార్పు లేదన్నారు. ఇక అమిత్‌షా, జేపీ నడ్డా ఆస్పత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్న వాజ్‌పేయిని పరామర్శించిన ప్రధాని మోదీ... ఇవాళ మరోసారి ఎయిమ్స్ కు వచ్చి వైద్యులను అడిగి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోడీ మరోసారి ఎయిమ్స్ కు వచ్చి గంటపాటు గడిపి వెళ్లారు. ఎల్ కే అద్వానీతోపాటు బీజేపీ కీలక నేతలు, ఆర్ఎస్ ఎస్ నేతలు ఎయిమ్స్ కు వచ్చి వాజ్ పేయిని పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్‌పేయిని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు వస్తున్నారు. కాసేపట్లో వాజ్‌పేయిని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రానున్నారు. ఇక వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బీజేపీ నేతలు పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు అత్యవసరంగా ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు. మరోవైపు వాజ్ పేయి ఇంటి వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని బీజేపీ, ఆర్ఎస్ ఎస్ కార్యాలయాల వద్ద విషాధ చాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

15:16 - August 16, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో బారీ వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాల్లోనే ఉండాలని కేసీఆర్ సూచించారు. రేపు జరగాల్సిన టీఆర్ ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశాన్ని వాయిదా వేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

15:09 - August 16, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమించింది. ఈమేరకు ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వాజ్‌పేయికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వాజ్‌పేయిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరామర్శించారు. ఇక అమిత్‌షా, జేపీ నడ్డా ఆస్పత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్న వాజ్‌పేయిని పరామర్శించిన ప్రధాని మోదీ... ఇవాళ మరోసారి ఎయిమ్స్ కు వచ్చి వైద్యులను అడిగి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్‌పేయిని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు వస్తున్నారు. కాసేపట్లో వాజ్‌పేయిని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రానున్నారు. ఇక వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బీజేపీ నేతలు పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు అత్యవసరంగా ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు. మరోవైపు వాజ్ పేయి ఇంటి వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

15:02 - August 16, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వాజ్‌పేయికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వాజ్‌పేయిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరామర్శించారు. ఇక అమిత్‌షా, జేపీ నడ్డా ఆస్పత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్న వాజ్‌పేయిని పరామర్శించిన ప్రధాని మోదీ... ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్‌పేయిని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు వస్తున్నారు. కాసేపట్లో వాజ్‌పేయిని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రానున్నారు. ఇక వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బీజేపీ నేతలు పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు అత్యవసరంగా ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

14:54 - August 16, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వాజ్‌పేయికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వాజ్‌పేయిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరామర్శించారు. ఇక అమిత్‌షా, జేపీ నడ్డా ఆస్పత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్న వాజ్‌పేయిని పరామర్శించిన ప్రధాని మోదీ... ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్‌పేయిని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు వస్తున్నారు. కాసేపట్లో వాజ్‌పేయిని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రానున్నారు. ఇక వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బీజేపీ నేతలు పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు అత్యవసరంగా ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

14:50 - August 16, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వాజ్‌పేయికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వాజ్‌పేయిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరామర్శించారు. ఇక అమిత్‌షా, జేపీ నడ్డా ఆస్పత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్న వాజ్‌పేయిని పరామర్శించిన ప్రధాని మోదీ... ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్‌పేయిని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు వస్తున్నారు. కాసేపట్లో వాజ్‌పేయిని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రానున్నారు. ఇక వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బీజేపీ నేతలు పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు అత్యవసరంగా ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

ఎయిమ్స్ లోనే బీజేపీ అగ్రనేతలు..

ఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు ఎయిమ్స్ కు వెళ్లి వాజ్ పేయిని పరామర్శించారు. అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, సుస్మాస్వరాజ్ లు ఆసుపత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం వాజ్ పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. బీజేపీ ముఖ్యమంత్రులంతా ఢిల్లీకి రావాలని ఇప్పటికే పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ కార్యకలాపాలన్నింటినీ రద్దు చేయాలని ఆదేశించింది.

13:27 - August 16, 2018

కేరళ : రాష్ట్రంలో వరద ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు 87 మంది మృతి చెందారు. ముల్ల పెరియార్, చెరుతోని, ఇడుక్కి, ఇదమలయార్ ల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 14 జిల్లాల్లో అత్యంత ప్రమాదకరస్థాయి హెచ్చరికలు జారీ చేశారు. పెరియార్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన జలాశయాల గేట్లన్నీ ఎత్తివేశారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటి వరకు 1.5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సీఎం విజయన్ కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రక్షణ శాఖకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. కొచ్చిన్ విమానాశ్రయంలోకి నీరు చేరడంతో ఎయిర్ పోర్టును మూసివేశారు. ప్రజా రవాణా వ్యవస్థ..బస్సులు..మైట్రో..రైళ్ల సేవలను కూడా రద్దు చేశారు. 

13:22 - August 16, 2018

చిత్తూరు : తమిళనాడు రాష్ట్రాన్ని వర్షం భయపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన నాలుగు రోజుల నుండి వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. సముద్ర తీరం వెంబడి ఉన్న ప్రాంతాలు విలవిలలాడుతున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కావేరీ నది పరివాహక తీరం వెంబడి ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. కావేరీ పరివాహక ప్రాంతం, దక్షిణ తమిళనాడులో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కన్యాకుమారి, తేని, నమక్కల్ జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. 

13:20 - August 16, 2018

ఢిల్లీ : భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా క్షీణించిందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. దీనితో పలువురు రాజకీయ నేతలు ఎయిమ్స్ లో వాజ్ పేయిని పరామార్శిస్తున్నారు. వాజ్ పేయి ఆరోగ్యం కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. పలు చోట్ల హోమాలు చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్టానం సూచించింది. దీనితో పలువురు ముఖ్యమంత్రులు ఎయిమ్స్ బాట పట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:19 - August 16, 2018

తారక్ తన స్వశక్తితో స్టార్ హీరోగా ఎదిగాడు. ఎమోషన్, యాక్షన్, డాన్స్, డైలాగ్ వంటి పలు షేడ్స్ లో అద్భుతమైన నటుడుగా పేరు సాధించుకున్నాడు. ఇండ్రస్ట్రీలో కసిగా ఎదిగి స్టార్ హీరోల స్థాయికి ఎదిగాడు. నందమూరి వంశం నుండి వచ్చినా..తనకంటు ఓ బ్రాండ్ ఇమేజ్ ను సాధించుకున్న యువ స్టార్ హీరో తారక్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. మరి తారక్ రాబోయే సినిమా కోసం కూడా తారక్ అభిమానులు త్వరపడుతున్నారు. ఈ క్రమంలో కొరటాలతో తారక్ సినిమా ఖరారైనట్లుగా సమాచారం..వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' వసూళ్లతో సరికొత్త రికార్డులను కొల్లగొట్టింది. ఎమోషన్..యాక్షన్ తో కూడిన ఈ సినిమా, ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అలాంటి ఈ కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు ఓకే అయిపోయినట్టేననేది తాజా సమాచారం. ఇటీవల కొరటాల .. ఎన్టీఆర్ ను కలిసి ఒక లైన్ చెప్పారట. వినోదానికి సందేశాన్ని జోడించి కొరటాల చెప్పిన లైన్ నచ్చడంతో, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఇంతవరకూ తాను చెయ్యని పాత్ర కావడంతో ఎన్టీఆర్ చాలా హ్యాపీగా వున్నాడని చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కంటే ముందుగా చిరంజీవితో కొరటాల ఒక సినిమా చేయవలసి వుంది. డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్ మొదలై .. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాతనే ఎన్టీఆర్ .. కొరటాల కాంబినేషన్ సెట్స్ పైకి వెళుతుంది.  

కేరళకు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు..

కేరళ : కేరళలో వరదలు బీభత్సరం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ పరిస్థితిపై మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. కేరళకు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను తరలించి సహాయక చర్యల్ని చేపట్టాలని ఆదేశించారు. కేరళలో తుపానుకు ఇప్పటి వరకూ 73మందిమంది మృతి చెందారు. దీంతో ప్రభుత్వం 12 జిల్లాల్లో హై ఎలర్ట్ ను ప్రకటించింది. 

వాజ్ పేయ్ ఆరోగ్యం విషమం..బీజేపీ అత్యవసర సమావేశం..

ఢిల్లీ : ముఖ్య నేతలతో బీజేపీ అత్యవసరంగా సమావేశమయ్యింది. ఈ సమావేశానికి అమిత్ షా, భూపేంద్ర యాదవ్, మురళీ ధర్రావు, ధర్మేంద్ర ప్రదాన్, జితేంద్రసింగ్ వంటి ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. మాజీ ప్రధాని వాజ్ పేజ్ ఆరోగ్యం అంతకంతకు విషమిస్తుండటంతో చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాజ్ పేయ్ ఆరోగ్యం విషమించటంతో బీజేపీ పాలిత సీఎంలకు ఢిల్లీ రావాలని ఢిల్లీ పెద్దలు ఆదేశాలు జారీచేశారు. కాగా ఎయిమ్స్ వద్దనే బీజేపీ నేతలంతా వున్నారు. కాగా ఇప్పటికే గ్వాలియర్ నుండి వాజ్ పేజ్ బంధువులకు సమాచారం అందటంతో వారు ఇప్పటికే బయలుదేరారు.

12:49 - August 16, 2018

సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెటర్ దిగ్గజాల్లో ఒకరు. కేవలం 16 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ లో అడుగు పెట్టి సెంచరీల రారాజుగా పేరు తెచ్చుకుని మాస్టర్ బ్లాస్టర్ గా పేరొందాడు. ఇప్పుడు ఆయన కుమారుడు అర్జున్ కూడా క్రికెట్ లో రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచ క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ లో 18 సంవత్సరాల అర్జున్ టెండూల్కర్ హల్ చల్ చేశాడు. ఎంసీసీ యంగ్ క్రికెటర్స్ శిక్షణలో భాగంగా లండన్ కు వచ్చిన అర్జున్ శుక్రవారం లార్డ్స్ ముందు పాకెట్ రేడియోలు అమ్మే అబ్బాయిగా అవతారం ఎత్తాడు. ఈ క్రమంలో అర్జున్ తో ఫోటో తీయించుకున్న ఈ ఫొటోలను టర్బొనేటర్ హర్బజన్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

తన ట్విట్టర్ ఖాతాలో ‘క్రికెట్ కు పుట్టినిల్లు అయిన లార్డ్స్ లో రేడియోను ఎవరు అమ్ముతున్నారో చూడండి . ఇప్పటికే 50 రేడియోలను అమ్మేశాం. ఇంకొన్ని మాత్రమే మిగిలాయి. జూనియర్ సచిన్. గుడ్ బాయ్‘ అని బజ్జీ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

12:29 - August 16, 2018

జనగాం : జిల్లాలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. గుండాల మండలం కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 15వ తేదీన విద్యాధికారి కార్యాలయంలో జాతీయ జెండాను అధికారులు ఎగురవేశారు. కానీ జెండాను దించాలన్న విషయాన్ని అధికారులు మరిచిపోయారు. గురువారం కూడా జాతీయ జెండా ఎగురుతూ కనిపించింది. 

గ్వాలియర్ నుండి బయలుదేరిని వాజ్ పేయ్ బంధువులు..

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యం మరింతగా క్షీణించిందని ఈ ఉదయం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ లో వెల్లడించడంతో, గ్వాలియర్ లోని వాజ్ పేయి బంధువులు హుటాహుటిన న్యూఢిల్లీకి బయలుదేరారు. వారిని తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్టు వార్తలు వెలువడటంతో, బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి వద్దకు రాగా, మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ, మరోసారి ఆసుపత్రికి రానున్నారని అధికారులు వెల్లడించారు.

12:19 - August 16, 2018

విశాఖపట్టణం : ఒరిస్సా కేంద్రంగా భువనేశ్వర్ కు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని విశాఖ వాతావరణ శాఖ పేర్కొంది. దీనికారణంగా పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఒక వైపు అల్పపీడనం..మరో వైపు వాయుగుండం ఏర్పడిందని..దీనితో పాటు రుతుపవనాలు చురుగ్గా కదులుతండడంతో వర్షాలు కురుస్తున్నాయన్నారు. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అధికార యంత్రాంగం అప్రమతమంది. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ జిల్లాల్లో అరకు, పాడేరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఎయిమ్స్, వాజ్ పేయ్ నివాసం వద్ద ఉత్కంఠ..భద్రత పెంపు..

ఢిల్లీ : ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ ముందు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యంపై ఏం ఉంటుందోనని బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎయిమ్స్ వద్ద, వాజ్ పేయ్ నివాసం వవ్ద పోలీసు సెక్యూరిటీని కట్టుదిట్టం చేయడం, ఆసుపత్రిలోని సాధారణ రోగుల బంధువులను లోనికి అనుమతించక పోవడంతో కార్యకర్తల్లో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. కాగా ఎయిమ్స్ వద్ద వాహనాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. గ్వాలియర్ నుండి వాజ్ పేయ్ బంధువులను కూడా పిలుపిస్తున్నారు.

12:13 - August 16, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం విషమంగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి మాదిరిగానే ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వాజ్‌పేయికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వాజ్‌పేయిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పరామర్శించారు. ఇక అమిత్‌షా, జేపీ నడ్డా ఆస్పత్రిలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిన్న వాజ్‌పేయిని పరామర్శించిన ప్రధాని మోదీ... ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వాజ్‌పేయిని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు వస్తున్నారు. కాసేపట్లో వాజ్‌పేయిని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రానున్నారు. ఇక వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బీజేపీ నేతలు పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మరోవైపు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు అత్యవసరంగా ఢిల్లీ రావాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:09 - August 16, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు ఎందుకు సిద్ధమవుతున్నారన్న చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలకు దాదాపు ఇంకా 8 నెలలు గడువున్నా... నాలుగు నెలల్లోనే ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుండడం భిన్నవాదనలకు తెరతీస్తోంది. దీంతో అధికార పార్టీ ముందస్తుకు వెళ్లడానికి కారణాలేమిటన్న ఉత్కంఠ అందరిలోనూ రేపుతోంది. కేసీఆర్‌ ముందస్తు వ్యూహంపై ప్రత్యేక కథనం..

జమిలీ ఎన్నికలకు సై అన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కసారిగా గేర్‌ మార్చారు. దేశంలో జమిలీ ఎన్నికలు రావన్న స్పష్టత ఇస్తూనే తాము అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. రాజకీయంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకున్న గులాబీ దళపతి.. ఎన్నికలకు వెళ్లడానికే ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పార్టీల బలాబలాలను కూడా అంచనా వేసుకుంటున్న గులాబీబాస్‌... ఎన్నికలకు ఇదే అసలైన సమయం అన్న భావనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో ఐక్యత లోపించడం తమకు కలిసి వస్తుందన్న యోచనలో కేసీఆర్‌ ఉన్నారు. ఎన్నికల గడువు నాటికి అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేలోపే ఎన్నికలను పూర్తి చేస్తే సంపూర్ణ మెజార్టీతో మరోసారి అధికార పగ్గాలు దక్కించుకోవచ్చన్న ధీమా గులాబీ దళపతిలో కనిపిస్తోంది.

అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీగా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్న అనుమానాలు టీఆర్‌ఎస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. జాతీయ అంశాలు, జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ ప్రభావం ఓటర్లను ప్రభావితం చేసే చాన్స్‌ కూడా ఉంటుందనే ఆందోళన గులాబీ నేతల్లో ఉంది. అసెంబ్లీకి మాత్రమే ఎన్నికలు ఎదుర్కొంటే ఆ తర్వాత వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతుబంధు, రైతు బీమాలాంటి పథకాలు పార్టీకి లబ్ది చేకూర్చే అవకాశం ఉందన్న ధీమా టీఆర్‌ఎస్‌ నేతల్లో కనిపిస్తోంది. ఎన్నికల నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తూ... మిషన్‌ భగీరథను అమలు చేసేందుకు గులాబీబాస్‌ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గడువుకంటే ముందే వెళితే తమదే అధికారమని కేసీఆర్‌ భావిస్తున్నారు.

12:07 - August 16, 2018

దివంగత నేత ఎన్.టి.రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". ఈ చిత్రంలో అన్ని విశేషాలే.ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న విషయం..ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ లో పలు అంశాలు చిత్రీకరణ జరిగింది. చిత్రంలో పలు కీలక పాత్రలకు పలువురు సీనియర్ నటీనటులతో పాటు తాజా ఎంట్రీ ఇచ్చిన నటీమణులను కూడా ఎంపిక చేస్తున్నారు.

ఇందులోభాగంగా, ఎన్టీఆర్ అల్లుడు, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి నటించనున్నారు. అలాగే, చంద్రబాబు భార్యగా మంజిమా మోహన్ నటించనుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన చిత్రం "సాహసం శ్వాసగా సాగిపో" అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈమెను చంద్రబాబు భార్య భువనేశ్వరి పాత్రకు ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

అలాగే, అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో ఆయన మనుమడు సుమంత్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్, సావిత్రిగా కీర్తి సురేష్‌లను ఎంపిక చేశారు. అంతేకాకుండా, మరికొన్ని కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, కైకాల సత్యనారాయణ, రవి కిషన్, మురళీ శర్మ, సచిన్ ఖేదేకర్‌లు నటిస్తుంటే, ఈ చిత్రాన్ని బాలకృష్ణ, విష్ణు ఇందూరిలు కలిసి నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఈ సినిమా 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. 

12:07 - August 16, 2018

ఆదిలాబాద్‌ : జిల్లాలో గిరి పల్లెలు మంచం పట్టాయి. గిరిపుత్రులకు సరైన వైద్యం అందక పిట్టల్లా రాలిపోతున్నారు. విషజ్వరాలు, సీజనల్‌ వ్యాధులు ఆదివాసీ పల్లెలను వణికిస్తున్నాయి. పది రోజులుగా తీవ్రమైన చలి జ్వరాలు, డయేరియా, మలేరియా, టైఫాయిడ్‌లాంటి జ్వరాలతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీ పల్లెల్లో విజృంభిస్తున్న విష జ్వరాలపై 10టీవీ ప్రత్యేక కథనం....కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని మారుమూల పల్లెలను మాయదారి జ్వరాలు పట్టిపీడిసతున్నాయి. వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో కనీస వైద్యసౌకర్యాలు లేకపోవడంతో విష జ్వరాలతో గిరిపుత్రులు విలవిల్లాడుతున్నారు. జైనూరు, కెరమెరి ఏజెన్సీ ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలాయి. జ్వరాల బారిన పడిన గిరిజనులు వైద్యం కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం జైనూరు మండలంలోని ఊషేగాంలో విషజ్వరాల బారినపడి ఇద్దరు ఆదిలాబాద్‌ రిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు.

జిల్లా కేంద్రంలోని ధర్మాసుపత్రి విషజ్వరాల బాధితులతో నిండిపోతోంది. రోగుల తాకిడి రోజురోజుకు ఎక్కువవుతోంది. సిర్పూర్‌ సామాజిక సివిల్‌ హాస్పిటల్‌ జ్వరాలతో వచ్చిన బాధితులతో నిండిపోయింది. బెజ్జూర్‌ మండలం కొత్తగూడ, రెబ్బెన గ్రామాలలో రెండు వారాలుగా ప్రతిఇంట్లో ఒక్కరు చొప్పున విష జ్వరంతో బాధపడుతున్నారు. వారికి సరైన వైద్యం అందకపోవడంతో మంచానికే పరిమితం అవుతున్నారు. బెజ్జూర్‌, దహేగాం మండలాల్లోని మారుమూల పల్లెల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వ వైద్యం అందకపోవడంతో స్థానిక ఆర్‌ఎంపీలతో చికిత్స చేయించుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన ఆర్‌ఎంపీలు వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు.

గిరిజన గ్రామాల్లో పారిశుద్యం పడకేసింది. ఇది ప్రజలకు శాపంగా మారింది. ఎక్కడ చూసినా దుర్గంధం వెదజల్లుతోంది. మురికి గుంటల్లో దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. మరోవైపు గ్రామాల్లో ఎక్కడ వేసిన చెత్త అక్కడే కుప్పలుతెప్పలుగా ఉంటోంది. దీంతోనూ ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు. మండల కేంద్రాల్లో పీహెచ్‌సీలు ఉన్నా అందులో వైద్యులు, మందుల కొరత వెక్కిరిస్తోంది. వైద్యం చేసేవారు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం మందుబిళ్ల వేసేవారే కరువయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు కూడా సరైన సమయంలోరాక... రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా వైద్యాధికారులు, ఉన్నతాధికారులు మేలుకొని ఏజెన్సీలో ప్రబలుతున్న విషజ్వరాలపై దృష్టి సారించాలి. ప్రతి గ్రామంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

అమెరికాకు వందలాదిమంది బాలికల అక్రమ రవాణా!..

ముంబై : మానవ అక్రమ రవాణా విషయంలో భారత్ కడు గడ్డు పరిస్థితుల్లో వుంది. ఈ నేపథ్యంలో చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధించిన మరో దారుణం వెలుగు చూసింది. ఓ అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణ ముఠా ముంబై నుంచి అమెరికాకు ఏకంగా 300 మంది చిన్నారులను విక్రయించినట్టు బయటపడడం సంచలనంగా మారింది. గుజరాత్‌కు చెందిన రాజుభాయ్ గమ్లేవాలా నేతృత్వంలోని ముఠా ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

కాసేపట్లో పెండ్లి..పెండ్లి కుమారుడు అదృశ్యం!..

విజయవాడ : పెండ్లి పీటలు ఎక్సాల్సిన సమయంలో పెండ్లి కుమారుడు హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. దీంతో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె కుటుంబాలలో తీవ్ర ఆందోళన నెలకొంది. విజయవాడ గొల్లపాలెంగట్టుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రెండవ కుమారుడు నాగేంద్రబాబుకు ఈరోజు వివాహం జరగాల్సివుంది. ఈ నేపథ్యంలో వివాహ శుభలేఖలు ఇచ్చేందుకు 14వ తేదీన ఇంటినుండి బయలుదేరిన నాగేంద్రబాబు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనలో పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా నాగేంద్ర అదృశ్యంపై పోలీసులు ప్రేమ కారణాలు ఏమైనా వున్నాయా? లేక శతృవులున్నారా?

11:48 - August 16, 2018

విజయవాడ : పాతబస్తీలో పెళ్లికొడుకు అదృశ్యమన ఘటన చోటు చేసుకుంది. ఈనెల 14వ తేదీన బంధువులకు శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లాడు. కానీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. గొపాలపాలెం గట్టుపాడుకు చెందిన నాగేంద్రకు పాత రాజేశ్వరిపేటకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. 16వ తేదీన వివాహాన్ని నిశ్చయించారు. కానీ నాగేంద్ర అదృశ్యం కావడంతో వివాహం రద్దయ్యింది. తమ కుమారుడు ఎక్కడున్నాడో సమాచారం తెలియక కుటుంబసభ్యులు, అమ్మాయి తరపు వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 

11:42 - August 16, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రామాలపై దృష్టి సారించారు. గ్రామాల్లో పర్యటించి అక్కడున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. గురువారం 'గ్రామదర్శిని' కార్యక్రమంపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నోడల్ అధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు. గురు, శుక్రవారాల్లో అందరూ గ్రామాలు సందర్శించాలని, అందరీ సహకారం తీసుకోవాలన్నారు. డిసెంబర్ కల్లా ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీఎం బాబు ఆదేశించారు. ప్రతి ఇంటికి సెన్సార్ ఏర్పాట్లు చేయాలని, డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి శాంతిభద్రతలను కాపాడాలని సూచించారు. 

గ్రామాల్లో సమస్యలు డిసెంబర్ కి పరిష్కారం కావాలి : చంద్రబాబు

అమరావతి : తరచు టెలీకాన్ఫరెన్స్ లతో నేతలకు, అధికారులకు దిశానిర్ధేశం చ ఏసే సీఎం చంద్రబాబు నాయడు ఈరోజు తాజాగా గ్రామదర్శిని పేరుతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. గురు, శుక్రవారాల్లో అందరూ గ్రామాలను సందర్శించి..గ్రామస్థుల సహసకారంతో సమస్యల సాధన దిశగా పనిచేయాలని ఆదేశించారు. డిసెంబర్ కల్లా గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావాలని చంద్రబాబు ఆదేశించారు. 

ఇంకా కొనసాగుతున్న కోమటి, సంపత్ లొల్లి..

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల సభ్యత్వ అప్పీల్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం తరపున వేసిన పిటీషన్ పై విచారణను 21కి కోర్టు వాయిదా వేసింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత కోర్టు తీర్పు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు అనుకూలంగా వచ్చింది. కోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వ తీరు మారుతుందని అంతా ఊహించారు. కానీ ప్రభుత్వం కోర్టు తీర్పును అమలు చేయడంతో తీవ్ర నిర్లక్ష్యం వహించింది.

11:19 - August 16, 2018

తారక్ తన స్వశక్తితో స్టార్ హీరోగా ఎదిగాడు. ఎమోషన్, యాక్షన్, డాన్స్, డైలాగ్ వంటి పలు షేడ్స్ లో అద్భుతమైన నటుడుగా పేరు సాధించుకున్నాడు. ఇండ్రస్ట్రీలో కసిగా ఎదిగి స్టార్ హీరోల స్థాయికి ఎదిగాడు. నందమూరి వంశం నుండి వచ్చినా..తనకంటు ఓ బ్రాండ్ ఇమేజ్ ను సాధించుకున్న యువ స్టార్ హీరో తారక్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. మరి తారక్ రాబోయే సినిమా కోసం కూడా తారక్ అభిమానులు త్వరపడుతున్నారు. ఈ క్రమంలో కొరటాలతో తారక్ సినిమా ఖరారైనట్లుగా సమాచారం..వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' వసూళ్లతో సరికొత్త రికార్డులను కొల్లగొట్టింది. ఎమోషన్..యాక్షన్ తో కూడిన ఈ సినిమా, ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అలాంటి ఈ కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు ఓకే అయిపోయినట్టేననేది తాజా సమాచారం.

ఇటీవల కొరటాల .. ఎన్టీఆర్ ను కలిసి ఒక లైన్ చెప్పారట. వినోదానికి సందేశాన్ని జోడించి కొరటాల చెప్పిన లైన్ నచ్చడంతో, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఇంతవరకూ తాను చెయ్యని పాత్ర కావడంతో ఎన్టీఆర్ చాలా హ్యాపీగా వున్నాడని చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కంటే ముందుగా చిరంజీవితో కొరటాల ఒక సినిమా చేయవలసి వుంది. డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్ మొదలై .. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాతనే ఎన్టీఆర్ .. కొరటాల కాంబినేషన్ సెట్స్ పైకి వెళుతుంది.

 

11:17 - August 16, 2018

ఢిల్లీ : భారత మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గం మొత్తం ఏయిమ్స్ ఆసుపత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. వాజ్ పేయి కుటుంబసభ్యులతో మాట్లాడారు. ప్రధాని మోడీ కాసేపట్లో ఎయిమ్స్ కు రానున్నారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీలు రానున్నారు. ఉదయం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాజ్ పేయిని పరామర్శించారు.

మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌, శ్వాస తీసుకోవడం కష్టం కావడంలాంటి సమస్యలతో బాధపడుతున్న వాజ్‌పేయిని జూన్‌ 11న ఎయిమ్స్‌లో చేర్చారు. నాటి నుంచి అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి మంగళవారం నుంచి దిగజారింది. బుధవారం మరింత క్షీణించడంతో ఆయనను ఎయిమ్స్‌ వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన మూత్రపిండాల్లో ఒకటే పనిచేస్తుండడం, బలహీనమైన ఊపిరితిత్తులు, మధుమేహం కారణంగా ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:54 - August 16, 2018

నేచ్యురల్ స్టార్ నాని కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో తెరగ్రేటం చేసిన మెహ్రీన్ అందరినీ ఆకట్టుకుంది. శర్వాతో మహానుభావుడు..ఎనర్జీ స్టార్ రవితేజ సరసన రాజా ది గ్రేట్ తో మెప్పించిన మెహ్రీన్ ఫిల్లౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన ఎంట్రీనిచ్చింది. ఇప్పుడు తాజాగా సుధీర్ బాబుతో జతకట్టనుంది. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి వచ్చిన సుధీర్ బాబు కూడా తనకంటు ఓ ప్రత్యేకతతో సినిమాలను చేస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరు జంటగా వస్తున్నారు. నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు 17న ప్రారంభంకానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ దీనికి బాణీలను అందించనున్నారు.

మలయాళంలో గూఢాచారి సినిమా..
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న 'గూఢచారి' విజయంతో దూసుకుపోతోంది. గూఢాచారి సినిమా టేకింగ్, క్వాలిటీ చూస్తే అది తెలుగు సినిమాయేనా? అనేంత గొప్పగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ కష్టానికి తగిన ఫలితం సినిమా ప్రేక్షకులు ఇచ్చేసారు కూడా. కెరీర్ స్టార్టింగ్‌లో విలన్స్ రోల్స్ చేస్తు మంచి నటుడిగా పేరు సంపాదించిన అడవి శేష్‌ లో ఇన్ని షేడ్స్ వున్నాయా? అంటు అటు సినిమా పరిశ్రమ ఇటు ప్రేక్షకులు గూఢాచారి చిత్రంతో ఆశ్యర్చపోయారు. క్షణం సినిమాతో హీరోగా మారి మంచి విజయం సాధించిన అడవి శేష్ ఆ సినిమా తరువాత అతను పెద్దగా ఆకట్టుకోలేకపోయినా..గూడచారి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించాడు.ఈ సినిమా రిలీజ్ రోజు నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అడవి శేష్ స్వయంగా కథను అందించడంతో అందరు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో అడవి శేష్ హాట్ టాపిక్ గా మారాడు. 

క్లాస్ రూమ్ లో ఆత్మాహుతి దాడి..48 విద్యార్థులు మృతి..

ఆఫ్ఘనిస్థాన్ : రాజధాని కాబూల్‌లో దారుణం జరిగింది. క్లాస్ రూములో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏకంగా 48 విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. రక్తపు మడుగులో మాంసం ముద్దలు, తెగిపడిన అవయవాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. కాబూల్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 67 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేయలేదు. బాధితుల ఆర్తనాదాలతో హృదయవిదారకంగా మారింది. కొందరు ఏం జరుగుతోందో తెలియక ప్రాణభయంతో పరుగులు తీశారు.

శ్రీవారి భక్తులకు శుభవార్త...దివ్యదర్శనం..

తిరుమల : శ్రీవారి భక్తులకు శుభవార్త. నేటి అర్ధరాత్రి నుంచి దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను తిరిగి విక్రయించనున్నారు. నేటి ఉదయం 10:16 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య తులాలగ్నంలో శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యాగశాల నుంచి కుంభాలను ఆయా దేవతలు, గోపురాల వద్దకు తీసుకెళ్లి కళావాహనం చేయనున్నారు. రాత్రి పెద్ద శేష వాహనసేవ నిర్వహిస్తారు. దీంతో ఈ క్రతువు ముగుస్తుంది. రేపటి నుంచి యథావిధిగా శ్రీవారి ఆర్జిత సేవలు కొనసాగుతాయి. వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు ప్రవేశపెట్టనున్నారు. 

పారిశుద్ధ్య కార్మికురాలిని ఢీకొన్న పోలీస్ వాహనం,మృతి..

హైదరాబాద్ : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు తమ వాహనంతో ఓ మహిళను ఢీకొన్నారు. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది. పాతబస్తీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న సాయమ్మ ఈరోజు రెయిన్ బాజర్ ఆసుపత్రి పరిధిలో రోడ్లు ఊడస్తుండా ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయమ్మను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయినా తీవ్రంగా గాయపడిన సామమ్మ ఆసుపత్రిలో మృతి చెందింది. 

10:29 - August 16, 2018

హైదరాబాద్ : రెయిన్ బజార్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పోలీసు రక్షక్ వాహనం ఢీకొని పారిశుధ్య కార్మికురాలు సాయమ్మ మృతి చెందింది. రోడ్డు ఊడుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సాయమ్మ గత కొంతకాలంగా జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తోంది. విషయం తెలుసుకున్న పారిశుధ్య కార్మికులు పీఎస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఘటనకు కారణమైన వాహన డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

వెంటిలేటర్ పై వాజ్ పేయ్..ప్రముఖుల పరామర్శ..

ఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి, బీజేపీ కీలక నేత వాజ్ పెయ్ ఆరోగ్యం అత్యంత విషమంగా వున్నట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో ఆయనను పరామర్శించేందుకు ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మూత్ర పిండాలు, మూత్ర నాళాల ఇన్ ఫెక్షన్లతో బాధపడుతున్న వాజ్ పేజ్ ఎయిమ్స్ లో తొమ్మిది వారాలుగుఆ చికిత్స పొందుతున్నారు. కాగా ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా వుండటంతో వెంటిలేటర్ పైనే చికిత్సను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రి నడ్డా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు పరామర్శించారు.

10:21 - August 16, 2018

దేవాలయంలో సాధువులు దారుణ హత్య!..

ఉత్తరప్రదేశ్ : గోవధను వ్యతిరేకించిన ఇద్దరు సాధువులు ఆలయంలోనే దారుణ హత్యకు గురయ్యారు. మరో సాధువు పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో మరోమారు చర్చనీయాంశమైంది. బుధవారం తెల్లవారుజామున ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు నిద్రిస్తున్న ముగ్గురు సాధువులను మంచానికి కట్టివేసి విచక్షణ రహితంగా కొట్టారు. ఆపై కత్తితో పొడిచి మెడను కోశారు. ఈ ఘటలో ఇద్దరు సాధువులు ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన సాధువును వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

భువనేశ్వర్ కు 30 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం..

విశాఖపట్నం : బంగాళాఖాతంలో నిన్న భువనేశ్వర్ కు 30 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం నిదానంగా కదులుతూ ఉండటంతో, నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నేటి మధ్యాహ్నానికి ఇది పశ్చిమ వాయవ్య దిశకు మారుతుందని భావిస్తున్న అధికారులు, దీని ప్రభావంతో శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకూ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయని, తీరంలో గాలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు.

09:29 - August 16, 2018

ఎయిమ్స్ కు వెళ్లనున్న రాహుల్...

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎయిమ్స్ కు రానున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్ పేయ్ ను ఆయన పరమార్శించనున్నారు. 

బంగాళాఖాతంలో వాయిగుండం...

వాయువ్య బంగాళాఖాతంలో వాయిగుండం ఏర్పడింది. వాయు గండం ప్రభావంతో భువనేశ్వర్ కు 30 కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులవచ్చని అంచనా వేస్తున్నారు. వాయుగండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపారు. 

09:08 - August 16, 2018
09:06 - August 16, 2018

అఫ్ఘానిస్థాన్‌ : రాజధాని కాబుల్‌లో ఓ సూసైడ్‌ బాంబర్‌ తనను తాను పేల్చుకోవటంతో 48 మంది మరణించారు. మరో 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాబుల్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పీజీ ప్రవేశ పరీక్షకు కోచింగ్‌ తీసుకునేందుకు పెద్ద సంఖ్యల్లో విద్యార్థులు వచ్చారు. అంతలోనే.. ఓ సూసైడ్‌ బాంబర్‌ భవనం లోపలికి చొచ్చుకొచ్చి తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో క్షణాల్లో ఆ ప్రాంతం శ్మశానంలా మారింది. రక్తపు మడుగులో మృతదేహాల కాళ్లు, చేతులు చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదం అలుముకుంది. మృతులంతా షియాలే కావడంతో వారినే లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. నరహంతక ఐఎస్‌ ఈ మారణకాండకు పాల్పడివుంటుందని పోలీసులు భావిస్తున్నారు.

09:05 - August 16, 2018

ఢిల్లీ : భారత మాజీ టెస్ట్‌ కెప్టెన్‌ , చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ వాడేకర్‌ కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబైలోని జస్‌లోక్‌ ఆస్పత్రిలో రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ అయిన అజిత్‌ వాడేకర్‌ సారథ్యంలో 1971లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను గెలవడం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తన ఎనిమిదేళ్ల టెస్ట్‌ కెరీర్‌లో ఆడిన 37 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 14 అర్థశతకాలు, ఒక శతకంతో మొత్తం 2113 పరుగులు చేశారు. అజారుద్దీన్‌ కెప్టెన్సీలో భారత జట్టుకు మేనేజర్‌గానూ సేవలందించారు. క్రీడారంగంలో ఆయన ప్రతిభకుగానూ భారత ప్రభుత్వం 1967లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీలతో గౌరవించింది. సీకె నాయుడు జీవిత సాఫల్య పురస్కారం కూడా అజిత్‌ వాడేకర్‌ అందుకున్నారు.

09:04 - August 16, 2018

తూర్పుగోదావరి : నాలుగు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా వరదముప్పును ఎదుర్కొంటోంది. సీలేరు, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహించడంతో విలీన మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల వంతెనలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. లంక గ్రామాల్లోని రహదారులపై నీరు వచ్చి చేరింది. మరో 24గంటలపాటు వర్షసూచన ఉండడంతో.. అప్రమత్తమైన అధికారులు లంకగ్రామాల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో వరదొచ్చి నెలరోజులు కూడా కాలేదు. ఇప్పుడు మరో వరదను ఆ జిల్లా ఎదుర్కొంటోంది. ఒకవైపు నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు... మరోవైపు శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహించడంతో విలీన మండలాల ప్రజల జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అన్నవరం వాగు, అత్తాకోడళ్ల వాగు, చీకటివాగు, సోకులేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కూనవరం, వీఆర్‌ పురం మండలాల్లో రహదారులు జలదిగ్భందమయ్యాయి. దీంతో ఏజెన్సీ ప్రజలను భద్రతా సిబ్బంది జాగ్రత్తగా రహదారి దాటిస్తున్నారు. వర్షం కారణంగా ఏజెన్సీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వీఆర్‌ పురం మండలం కుంజవారిగూడెంలో నీటి ప్రవాహానికి బ్రిడ్జి తెగిపోయింది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.

భద్రాచలం దగ్గర నీటి మట్టం బుధవారం 34 అడుగులకు చేరింది. వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో విలీన మండలాల వాసులకు కష్టాలు తప్పడం లేదు. ధవళేశ్వరం దగ్గర క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. బుధవారం ఆరున్నర లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. పెద్దమొత్తంలోనీటిని వదలడంతో దిగువ ప్రాంతాలైన లంక గ్రామాలు ముంపును ఎదుర్కొంటున్నాయి. కాజ్‌వేలు మునిగిపోతుండగా.. వరద తీవ్రత ఎక్కువ ఉండడంతో లంకగ్రామాల్లో రాకపోకలు నిలిపివేశారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. స్థానిక ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరో 24 గంటలు వర్షసూచన ఉండడంతో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. లంక గ్రామాల్లో సహాయక చర్యల కోసం బృందాలను పంపించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను కలిపే పి.గన్నవరం మండలం చాకలిపాలెం కనకాయిలంక కాజే వే మునిగిపోయింది. గంటిపెదపూడి, బూరుగులంక, అరిగెలవారిపేట లంకగ్రామాల్లోని రహదారులపై నీరు ప్రవహిస్తోంది. ఐ.పోలవరం మండలం పశువుల్లంక రేవు నిలిపివేయడంతో నాలుగు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో పాటు జిల్లాలో నాలుగురోజులుగా కురుస్తున్న వర్షం వరదముంపుకు కారణమయ్యింది. వాతావరణ శాఖ హెచ్చరించినట్టు మరో 24 గంటలు వర్షపాతం ఎక్కువ నమోదయితే దిగువ ప్రాంతాల్లో కొంచెం ఆందోళనకర పరిస్థితులుండే అవకాశముంది.

08:27 - August 16, 2018

హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతంలో వాయిగుండం ఏర్పడింది. వాయు గండం ప్రభావంతో భువనేశ్వర్ కు 30 కి.మీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ వాయువ్య దిశగా కదులవచ్చని అంచనా వేస్తున్నారు. వాయుగండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపారు. తీర ప్రాంతాల్లో గాలులు వేగంగా వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. 18న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాలకొండలో 13 సెంమీ., రణస్థలంలో 11 సెం.మీ, వేర్పాడు, కళింగపట్నంలో 10 సెంమీ., మందసలో 8 సెంమీ., గరివిడి, పాతపట్నం, చీపురుపల్లిలో 8 సెం.మీ., వర్షపాతం నమోదైంది. 

08:10 - August 16, 2018

ఢిల్లీ : బీజేపీ అగ్రనేత, దేశ మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. కిడ్నీ, వృద్ధాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్న సంగతి తెలిసిదే. కొన్నాళ్ల క్రితం వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరిన వాజ్‌పేయ ఆరోగ్యం బుధవారం మరింత క్షీణించింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ప్రధాని మోదీసహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు వాజ్‌పేయిని ఎయిమ్స్‌లో పరామర్శించారు. కాసేపటి క్రితం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎయిమ్స్ కు వెళ్లి పరామర్శించారు. గురువారం అధికారిక కార్యక్రమాలు వాయిదా వేసుకున్నారు. 93 ఏళ్ల వాజపేయి.. తొమ్మిది వారాలుగా ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ...ఎయిమ్స్‌లో మంచానికే పరిమితమై మృత్యువుతో పోరాడుతున్నారు. 

07:42 - August 16, 2018

ఎయిమ్స్ లో ఉప రాష్ట్రపతి...

ఢిల్లీ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎయిమ్స్ కు చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్ పేయ్ ను ఆయన పరామార్శించారు. 

06:44 - August 16, 2018

తెలంగాణలో ఇందిరా క్రాంతి పథకం-విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్స్‌ ఆందోళన బాట పట్టారు. రేపు మహాధర్నా కార్యక్రమానికి సిద్ధమయ్యారు. తమను సెర్ప్‌ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం 18 వేలు కల్పించాలని, ప్రభుత్వమే తమకు గుర్తిపు కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వారు ఆందోళన బాట పట్టారు. వారి డిమాండ్లకు గల కారణాలు.. వారి పట్ల ప్రభుత్వ విధానాలపై మనతో చర్చించేందుకు ఐకేపీవీవోఎస్‌ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జె.వెంకటేష్‌ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:42 - August 16, 2018

కేరళ : వరద పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఎడతెరిపిలేని వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇంతవరకు 72 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఒక్కరోజే 29 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. లక్ష మందికిపైగా నిరాశ్రయులయ్యారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కేరళ చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా 35 డ్యామ్‌ల గేట్లు ఎత్తివేశారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో అప్రమత్తత ప్రకటించారు. ప్రధాని మోదీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఫోన్‌చేసి వరదలపై ఆరా తీశారు. కేంద్రం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

06:40 - August 16, 2018

భూపాలపల్లి : చదువుకోవాల్సిన చిన్నారుల చేతుల్లో చీపుర్లు పెట్టారు. విద్యాభ్యాసానికి బదులు పారిశుధ్యం పనులు చేయిస్తున్నారు. వీరిని చూస్తే.. స్కూలుకొచ్చారా.. కూలీకొచ్చారా.. బడిపిల్లలా.. బాలకార్మికులా అన్న అనుమానం కలగుతుంది. 72ఏళ్ళ స్వతంత్ర భారతావనిలో నడుస్తున్న విద్యావ్యవస్థకు నిలువుటద్దం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఓ గిరిజన బాలికల పాఠశాల. బడిలో బాలకార్మికులపై 10టీవీ ప్రత్యేక కథనం..

డెబ్బై రెండేళ్ళ స్వతంత్ర భారతదేశంలో.. రేపటి పౌరులు.. నేటి కూలీలుగా దర్శనమిస్తున్నారు. చదువు నేర్పాల్సిన టీచర్లే.. బడిపిల్లలను బాలకార్మికులుగా తీర్చిదిద్దుతున్నారు. పలకా బలపం పట్టాల్సిన చిట్టి చేతుల్లో చీపుర్లు పెడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం.. జాకారం గ్రామంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో చెత్త ఊడుస్తున్న విద్యార్థులను చూస్తే.. గుండె తరుక్కు పోతుంది.

తరగతి గదిలోని బండలే పలకలు, చీపుర్లే బలపాలు.. చిన్నారులు చెత్త ఊడ్చటాన్నే విద్యాభ్యాసంగా భావించాలి. టీచర్లు పిల్లల చేతుల్లో చీపుర్లు పెట్టి గదులన్నీ ఊడ్చమంటారు. ఎవరైనా వచ్చి అడిగితే అమ్మమ్మ రాలేదనీ... అందుకే తాము ఊడుస్తున్నామని చెప్పాలంటూ.. పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చారు పాఠశాల సిబ్బంది.  ఈ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఇద్దరు ఆయాలు, ఒక స్వీపర్, ఒక ఏ ఎన్ఎం, ఐదుగురు టీచర్లు, వార్డన్‌ ఉండాలి. కానీ ఇద్దరు ఆయాలే వంట మనుషులు.. ఉన్న ఒక ఏఎన్ఎం అన్నీ తానై బడిని నడిపిస్తూ ఉంటుంది. మిగతా ఐదుగురు టీచర్లు అసలే రారు.. వచ్చినా సమయపాలన ఉండదు. ఇక వార్డన్ మేడం.. ఎప్పుడైనా రావొచ్చు.. ఎప్పుడైనా పోవచ్చు. ఇదేమని అడిగితే.. వార్డన్ మేడం కదా ఏదో ఒక పనిమీద బయటకు వెళ్తూనే ఉంటారన్న సమాధానం వినిపిస్తుంది.

పెద్ద మేడం గారు.. అదేనండీ వార్డన్‌.. వరంగల్ హన్మకొండ నుంచి ఈ పాఠశాలకు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడూ విధులకు అలా వచ్చి కాలక్షేపం చేసే మేడం గారు.. ప్రతి నెలా జీతాలు తీసుకునే సమయానికి మాత్రం ఖచ్చితంగా దర్శనమిస్తారన్న ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ తతంగంపై టెన్టీవీ వార్డన్‌ మేడమ్‌ను వివరణ కోరగా.. మాకు ప్రేయర్ ఉందంటూ తప్పుకున్నారు. భద్రాచలం కొత్తగూడెం ఇల్లందు ఏజెన్సీ ప్రాంతాల నుంచి పిల్లలు బాగా చదువుకుంటారన్న ఆశతో వారి తల్లిదండ్రులు ఇక్కడ చేర్పించారు. కానీ చదువుకోవాల్సిన వారి చేతుల్లో చీపుర్లు పెట్టి చెత్త పనులు చేయిస్తున్నారు. పాఠశాలలను పనితీరును పర్యవేక్షించాల్సిన అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది ఈ పాఠశాల. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

06:36 - August 16, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకుంది. అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను వచ్చే నెలలోనే ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించిన తరుణంలో... టీ కాంగ్రెస్‌ కూడా ఇదే విధానాన్ని అవలంభించబోతోంది. ఈసారి అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న టీ కాంగ్రెస్‌ నేతలు.. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు జనాకర్షణ పథకకాలతో ఎన్నికల ప్రణాళిక రూపొందిస్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల రాజకీయాలు ఊపందుకున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ముందస్తు ఎన్నికల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీని ఎప్పుడైనా రద్దు చేసే అవకాశం ఉందని భావిస్తున్న టీ కాంగ్రెస్‌ నేతలు.. ఇందుకు అనుగుణంగా తమ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈసారి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెలలోనే అభ్యర్థులను ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించిన తరుణంలో... టీ కాంగ్రెస్‌ నేతలు కూడా అప్రమత్తమయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన ముగించుకుని మంగళవారం ఢిల్లీ బయలుదేరే ముందు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు... ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. అభ్యర్థులను కూడా వచ్చే నెలలోనే ప్రకటిస్తామని కేసీఆర్‌ చేసిన ప్రకటనను రాహుల్‌కు వివరించారు. దీనిపై స్పందించిన రాహుల్‌గాంధీ.. అభ్యర్థుల ఎంపికకు కమిటీ వేయాలని ఆదేశించడంతో ఈ దిశగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చర్యలు చేపట్టారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టుల రీడిజైనింగ్, గత ఎన్నికల్లో ఇచ్చిన డబుల్‌ బెడ్‌ రూము ఇళ్ల నిర్మాణం వంటి పథకాలపై ఒంటికాలిపై లేస్తున్న టీ కాంగ్రెస్‌ నేతలు... ఎన్నికల ప్రణాళిక రూపకల్పనకు కూడా సిద్ధమవుతున్నారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ, పంటలకు మద్దతు ధరలు, డ్వాక్రా మహిళలకు పది లక్షల రూపాయాల వడ్డీలేని రుణాలు, లక్ష రూపాయల గ్రాంటు వంటి అంశాలను మ్యానిఫెస్టోలో చేర్చనున్నారు. అభయ హస్తం పింఛను పథకాన్ని పునరుద్ధరించడంతోపాటు పెన్షన్‌ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి 1500 రూపాయలకు పెంచుతామని హమీ ఇచ్చింది. వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న సామాజిక పెన్షన్లను వెయ్యి రూపాయాల నుంచి రెండు వేల రూపాయలకు పెంచే అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చబోతున్నారు. పెన్షన్‌ పొందేందుకు ప్రస్తుతం ఉన్న 65 ఏళ్ల వయస్సును 58కి తగ్గిస్తామని టీ కాంగ్రెస్‌ హామీ ఇస్తోంది. వికలాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను 1500 నుంచి మూడు వేల రూపాయలకు పెంచుతామని పార్టీ నాయకులు ప్రకటించారు. నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల భృతి ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఈ అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

మొత్తం మీద ఇటు టీఆర్‌ఎస్‌, అటు కాంగ్రెస్‌ ముందస్తు ఎన్నికలకు సిద్ధంకావడంతో... ఇకపై విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేందుకు రెండు పార్టీల నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాజకీయాలను రక్తి కట్టించేందుకు వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. ముందస్తు ఎన్నిక క్రీడలో అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. 

06:33 - August 16, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాలను ఎగురవేసి... ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ భవన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి.. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని... తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారన్నారు.

గాంధీ భవన్‌లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. బీజేపీ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ నేత లక్ష్మణ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో బిఎల్‌ఎఫ్‌ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బిఎల్‌ఎఫ్‌ కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం జాతీయ జెండాను ఎగరవేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలకు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ది చెబుతారన్నారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడం దారుణమన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మగ్దూమ్ భవన్‌లో జాతీయ జెండాను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్లు గడుస్తున్నా.. దేశంలో మతతత్వ శక్తులు రాజ్యమేలుతున్నాయని, మహిళలపై ఆత్యాచారాలు అధికమైయ్యాయని ఆయన అవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జన సమితి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కోదండరాం జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి.. పాదయాత్ర శిబిరం వద్దే స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకున్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం డి.ఎర్రవరంలో.. జెండా పండుగలో జగన్‌ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 72వ స్వాతంత్ర్య దినోత్సవాలను బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ ఘనంగా నిర్వహించింది. విజయవాడ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

06:29 - August 16, 2018

ఢిల్లీ : బీజేపీ అగ్రనేత, దేశ మాజీ ప్రదాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. కిడ్నీ, వృద్ధాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. కొన్నాళ్ల క్రితం వైద్యం కోసం ఎయిమ్స్‌లో చేరిన వాజ్‌పేయ ఆరోగ్యం బుధవారం మరింత క్షీణించింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ప్రధాని మోదీసహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు వాజ్‌పేయిని ఎయిమ్స్‌లో పరామర్శించారు. నేటి అధికారిక కార్యక్రమాలు వాయిదా వేసుకున్నారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమించింది. తొమ్మిదేళ్లుగా అనారోగ్యంతో ఉన్న 93 ఏళ్ల వాజపేయి.. తొమ్మిది వారాలుగా ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ...ఎయిమ్స్‌లో మంచానికే పరిమితమై మృత్యువుతో పోరాడుతున్నారు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌, శ్వాస తీసుకోవడం కష్టం కావడంలాంటి సమస్యలతో బాధపడుతున్న వాజ్‌పేయిని జూన్‌ 11న ఎయిమ్స్‌లో చేర్చారు. నాటి నుంచి అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు.

ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి మంగళవారం నుంచి దిగజారింది. బుధవారం మరింత క్షీణించడంతో ఆయనను ఎయిమ్స్‌ వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన మూత్రపిండాల్లో ఒకటే పనిచేస్తుండడం, బలహీనమైన ఊపిరితిత్తులు, మధుమేహం కారణంగా ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వాజ్‌పేయిది గట్టి మనోబలం. ఇంతకాలం ఆయన అనారోగ్యంతో పోరాడుతున్న తీరుకు మేమే ఆశ్చర్యపోతున్నామని ఎయిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యుడు ఒకరు చెప్పారు.

వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా బుధవారం సాయంత్రం ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అంతకుముందు.. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా మోదీని కలుసుకుని వాజపేయి పరిస్థితి గురించి వివరించారు. దీంతో వాజపేయిని చూసేందుకు ప్రధాని ప్రోటోకాల్‌ నిబంధనల్నీ పక్కనబెట్టారు. పీయూష్‌ గోయల్‌, స్మృతి ఇరానీతోపాటు మరికొంత మంది కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు వాజ్‌పేయ్‌ను ఆస్పత్రిలో పరామర్శించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాజపేయి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. వాజ్‌పేయి ఆరోగ్యం విషమించడంతో బీజేపీ ముఖ్యనేతలంతా నేటి తమ అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. విజయవాడలో నేడు జరగాల్సిన బీజేపీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం కూడా వాయిదా పడింది.

వాజ్‌పేయి 2005 డిసెంబరులో క్రియాశీల రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించారు. 2009 ఎన్నికల్లో తాను పోటీచేయబోనని ముందే చెప్పారు. అప్పటిదాకా తాను ప్రాతినిధ్యం వహించిన లక్నో నుంచి ఆ ఎన్నికల్లోపోటీ చేసిన లాల్‌జీ టాండన్‌ను బలపరుస్తూ నియోజక ప్రజలకు లేఖ రాశారు. అనారోగ్య కారణాల వల్ల ప్రచారానికి కూడా రాలేకపోతున్నానని తెలిపారు. అనంతరం 2009 ఫిబ్రవరి 6న వాజ్‌పేయికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ రావడంతో ఎయిమ్స్‌లో చేరి కొంతకాలానికి డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన గుండెపోటు , పక్షవాతం రావడంతో మాట దెబ్బతిన్నది. ఆ తర్వాత జ్ఞాపకశక్తి కోల్పోయారు. క్రమంగా మధుమేహం తీవ్రతరమైంది. మూత్రపిండాల ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆయన కిడ్నీల్లో ఒక దానిని గతంలోనే తొలగించారు. మూత్ర పిండాలు దెబ్బతినడంతోనే జూన్‌ 11న ఆయన మళ్లీ ఎయిమ్స్‌లో చేరారు. 

జగన్ 238వ రోజు...

విశాఖపట్టణం : నేడు 238వ రోజు జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగనుంది. నాతవరం (మం) ఎర్రవారం జంక్షన్ నుండి పాదయాత్ర జరుగనుంది. ఎరకంపేట, ముల్లపూడిలో పాదయాత్ర కొనసాగనుంది. 

తిరుమలలో అష్టంబంధన బాలాలయ మహా సంప్రోక్షణ...

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టంబంధన బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 10.16గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య తులాలగ్నంతో మహా సంప్రోక్షణ జరుగనుంది. 

వాజ్ పేయి హెల్త్ బులెటిన్...

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 24గంటలుగా వాజ్ పేయి ఆరోగ్యం విషమించిందని, ఆయన వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్నారని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. 

అజిత్ వాడేకర్ కన్నుమూత...

ఢిల్లీ : మాజీ కెప్టెన్, టీమిండియా కోచ్ అజిత్ వాడేకర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని జన్‌లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వాడేకర్ ఇండియా తరఫున 37 టెస్ట్ మ్యాచ్‌లు, 2 వన్డే మ్యాచ్‌లు ఆడారు. భారత జట్టుకు మేనేజర్‌గా, కోచ్‌గానూ సేవలందించారు. 

Don't Miss