Activities calendar

17 August 2018

21:58 - August 17, 2018

ఢిల్లీ : ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై మళ్లీ దాడి జరిగింది. మాజీ ప్రధాని వాజ్‌పేయికి శ్రద్ధాంజలి ఘటించడానికి ఢిల్లీలోని బిజెపి కార్యాలయానికి వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. బిజెపి కార్యాలయం ఎదుట కార్యకర్తలు అగ్నివేష్‌ను అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. స్వామి అగ్నివేష్‌ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఓ మహిళ స్వామి అగ్నివేష్‌ను చెప్పుతో కొట్టారు. గత నెల రోజుల్లో స్వామి అగ్నివేష్‌పై దాడి జరగడం ఇది రెండోసారి. ఇంతకు ముందు జులై 17న జార్ఖండ్‌లో బిజెపి కార్యకర్తలు ఆయనపై మూక దాడి చేశారు. వాజ్‌పేయికి శ్రద్ధాంజలి ఘటించేందుకు వెళ్తుండగా బిజెపి కార్యకర్తలు తనను కొట్టారని, తనకు అవమానం జరిగిందని స్వామి అగ్నివేష్‌ స్వయంగా వెల్లడించారు. 

 

21:44 - August 17, 2018

కేరళ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేరళ జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరద బీభత్సానికి మృతుల సంఖ్య 324కి చేరింది. సుమారు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. శనివారం కూడా భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో కేరళలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కేరళను ఆదుకోవాలని దేశ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోది శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించే అవకాశం ఉంది.
కేరళను ముంచెత్తిన వరదలు  
గత వంద ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కేరళను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. వర్షాల కారణంగా ఇప్పటివరకు 324 మంది మృతి చెందినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా వెల్లడించారు. డ్యామ్‌లలోకి వరదనీరు పోటెత్తడంతో 80 రిజర్వాయర్ల గేట్లను తెరిచారు. 2.23 లక్షల మందిని 1500 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు సిఎం కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితిని కేంద్ర రక్షణమంత్రికి వివరించినట్లు సిఎం విజయన్‌ తెలిపారు. సహాయక చర్యల కోసం 11 హెలిక్యాప్టర్లను పంపాలని ఆయన రక్షణ శాఖను కోరారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉందని....వేలాది మంది నీటిలో చిక్కుకున్నారని... వారిని కాపాడేందుకు ఎయిర్‌ లిఫ్టింగ్‌ తప్ప మరో మార్గం లేదని సిఎం చెప్పారు. 
పలు జిల్లాలో ప్రమాద ఘంటికలు 
అలపుజ, ఎర్నాకులం, త్రిస్సూరు, పథన్‌మతిత్తా జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇక్కడ రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. త్రిస్సూరు, చలకుడి పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక్కడ పునరావాస కేంద్రాల్లో కూడా నీరు చేరింది. విపత్తు నిర్వహణ సిబ్బంది  హెలికాప్టర్లు, పడవల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం ఎర్నాకుళం, పతనంతిట్ట జిల్లాల నుంచి 3వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు పంపించారు. 
కేరళకు ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 12 టీమ్‌లు  
కేరళలో వరద పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఎన్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 12 టీమ్‌లు కేరళకు పంపనున్నారు. ఇప్పటికే 35 ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు రాష్ట్రానికి చేరుకున్నాయి. కొచ్చిలో 3 పడవలను సిద్ధం చేశారు. మరోవైపు టెలికాం సంస్థలు కేరళలో వారం రోజుల పాటు ప్రజలకు ఉచిత ఫోన్‌ సౌకర్యం కల్పించాయి. 
విరిగిపడ్డ కొండ చరియలు  
తాజాగా ఇడుక్కి, మలప్పురం, కన్నూరు జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వరదల కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా కోచి ఎయిర్‌పోర్టును ఆగస్టు 26 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు రవాణా స్తంభించింది. పలు రైళ్ల రాకపోకలు కూడా రద్దయ్యాయి. కేరళకు పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో ఇంధన, మందుల కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 
రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ 
కేరళలో ఆగస్టు 8 నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తిరువనంతపురం, కొల్లామ్‌, అలప్పుళా, కొట్టాయం, ఇడుక్కీ, ఎర్నాకుళం, త్రిసూర్‌, పాలక్కడ్‌, మలప్పురం, కొజికొడే, వయనాడ్‌ జిల్లాల్లో నేడు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

 

21:39 - August 17, 2018

ఢిల్లీ : తెలంగాణ బీజేపీ నాయకులు వాజ్‌పేయికి ఘన నివాళులర్పించారు. వాజ్‌పేయి ఆశయసాధనకు కృషి చేస్తామని చెప్పారు. వాజ్‌పేయి మృతి దేశానికి తీరనిలోటని శ్రద్ధాంజలి ఘటించారు. 

21:37 - August 17, 2018

ఢిల్లీ : భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు స్మృతిస్థల్‌లో అధికార లాంఛనాలతో ముగిశాయి. ఆయన అంత్యక్రియలకు భారీ ఎత్తున హాజరైన ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌తో పాటు సార్క్‌ దేశాలకు చెందిన నేతలు వాజ్‌పేయి అంత్యక్రియలకు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు  
మాజీ ప్రధాని, భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు, సన్నిహితులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో వాజ్‌పేయి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత .. ఆయన చితికి నిప్పంటించారు.  హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు. 
వాజ్‌పేయి అంతిమయాత్ర అశేష జనవాహిని 
అంతకు ముందు అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంతిమ యాత్ర ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి మధ్యాహ్నం ప్రారంభమైంది. వాజ్‌పేయి పార్థివ దేహాన్ని రాష్ట్రీయ స్మృతి స్థల్‌కు తరలిస్తున్నపుడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రోటోకాల్‌ నిబంధనలను పక్కనబెట్టి  ఆ వాహనం వెంట నడుచుకుంటూ వెళ్ళారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఎంపి, మహారాష్ట్ర సిఎంలు కూడా మోది వెంట నడిచారు. బిజెపి ప్రధాన కార్యాలయం నుంచి స్మృతి స్థల్‌ వరకు వాజ్‌పేయి అంతిమయాత్ర అశేష జనవాహిని మధ్య నాలుగు కిలోమీటర్ల మేర సాగింది.  దారి పొడవునా 'అటల్ జీ అమర్‌రహే' నినాదాలతో మార్మోగిపోయింది. యమునా నది ఒడ్డున రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో ప్రభుత్వ లాంఛానాలతో వాజ్‌పేయి అంత్యక్రియలు సాయంత్రం 4 గంటలకు నిర్వహించారు. త్రివిద దళాధిపతులు మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. 21 సార్లు గాలిలో తుపాకులు పేర్చి గౌరవవందనం సమర్పించాయి. 
వాజ్‌పేయికి ప్రముఖులు నివాళులు
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ,  లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌,  బిజెపి చీఫ్‌ అమిత్‌షా, సీనియర్‌ నేతలు అడ్వాణీ సహా పలువురు స్మృతి స్థల్‌లో మహానేతకు నివాళులర్పించారు. బూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ స్మృతి స్థల్‌లో వాజ్‌పేయికి నివాళులర్పించారు. నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రులు పీకే గ్యావల్‌, లక్ష్మణ్‌ కిరిల్లా, అబ్దుల్‌ హసన్‌ మహ్మద్‌ అలీ, పాకిస్థాన్‌ న్యాయశాఖ మంత్రి అలీ జఫర్‌లు వాజ్‌పేయి అంత్యక్రియలకు హాజరయ్యారు.
ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు తుది నివాళి 
మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్‌పేయికి స్మృతి స్థల్‌లో జరిగిన అంత్యక్రియల్లో పార్టీలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు హాజరై అశ్రునయనాలతో తుది నివాళులర్పించారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, గులాం నబీ ఆజాద్‌, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌, బిజెపి సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషి, తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

 

కేరళలో భారీ వర్షాలు.. పలు ఇళ్లు నేలమట్టం

తిరువనంతపురం : కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో ఇప్పటికే 324 మందికి పైగా మృతిచెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 13జిల్లాలో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలకు కొడుగు జిల్లాలో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఓ భవంతి నేలకూలుతుండగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. రెండంతస్తుల ఈ భవనం పునాది దెబ్బతినడంతో జారిపడిపోయింది. కేరళలో పొంగి పొర్లుతున్న కాలువలు, నదులను చూస్తే ఒళ్లు గగురుపొడుస్తుంది. అలాంటి నదులను దాటాలంటే సాహసమే. ప్రమాదమని తెలిసినా, కొందరు బ్రిడ్జీ పైనుంచి నీరు వెళ్తున్నా వాహనాలను నిర్లక్ష్యంగా దాటుకుని వెళ్తున్నారు.

కేరళలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు

తిరువనంతపురం : కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో ఇప్పటికే 324 మందికి పైగా మృతిచెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 13జిల్లాలో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. కాలనీలన్నీ జలమయమయ్యాయి. రెండు లక్షలకు పైగా జనం నిరాశ్రయులయ్యారు. జనం ఇళ్లూ.. వాకిలి వదిలి బిక్కుబిక్కుమంటూ పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. 1500 శిబిరాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించారు. అటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళకు సరిహద్దుగా జిల్లాలకు ముప్పు విస్తరిస్తోంది. కొడగుతోపాటు దక్షిణ కన్నడ, హాసన, మైసూరు, చామరాజనగర, ఉడుపి, శివమొగ్గ, చిక్కమగ్‌ళూరు జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది.

21:25 - August 17, 2018

హైదరాబాద్ : నగర శివారు రాజేంద్రనగర్‌లో జరిగిన హత్య, దోపిడీ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇది తెలిసినవారి పనేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి కోసమే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. ఈ కేసును చేధించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
హత్య, దోపిడీ కేసు 
హైదరాబాద్‌ శివారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఉప్పర్‌పల్లి సిరిమల్లె కాలనీలో జరిగిన హత్య, దోపిడీ కేసు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు... ఇది తెలిసివారి పనేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 
50తులాల బంగారం, రూ.50 లక్షలు దోపిడీ 
హత్యకు గురైన రాజేంద్రకుమార్‌ అగర్వాల్,  తారామణి హైదరాబాద్‌ బేగంబజార్‌లో హోల్‌సేల్‌ కిరాణ దుకాణం నిర్వహించేవారు. వృద్ధాప్యం, ఆపై అనారోగ్యంతో షాపు నిర్వహణ బాధ్యతలను చిన్న కుమారుడు రోహిత్‌కు అప్పగించారు. ఇంటికే పరిమితమైన రాజేంద్రకుమార్‌ అగర్వాల్‌, తారామణిని ముగ్గురు దుండగులు చేతులు, కాళ్లు కట్టివేసి, మూతికి ప్లాస్టర్‌ వేసి దోపిడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న 50 తులాల బంగారం, 50 లక్షల నగదు దోచుకెళ్లారని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తమాతో బాధపడుతున్న రాజేంద్రకుమార్‌ అగర్వాల్‌ మూతికి ప్లాస్టర్‌ వేయడంతో ఉపిరాడక మృతిచెంది ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇది తెలిసినవారి పనేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
పక్కా ప్రణాళికతో దోపిడీకి పాల్పడ్డారా ? 
ఓ భూమి కొనుగోలు కోసం అగర్వాల్‌ దంపతులు 50 లక్షల నగదు సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించిన భేటీ శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే అగర్వాల్‌ దంపతులు డబ్బు దాచిన విషయం దోపిడీ దొంగలకు ఎలా తెలిసిందన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. పక్కా ప్రణాళికలతో దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారా... లేక తెలిసినవారే సుపారీ ఇచ్చి దొంగతనానికి పాల్పడే విధంగా చేశారా.. అన్న కోణంలో  కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమావేశాన్ని అగర్వాల్‌ నివాసంలోనే ఏర్పాటు చేయడానికి గల కారణాలపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. యాభై లక్షల రూపాయల డబ్బు దాచిన విషయం అగ్వర్వాల్‌ దంపతులకు మాత్రమే తెలుసు. కుమారుడు డబ్బు కోసం వేధించడం, ఇంతలోనే హత్య జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కట్టేసిన చేతులను ఎలా విడిపించారు ?  
వృద్ధ దంపతులు ఉంటున్న ఇంట్లోకి దుండగులు ప్రవేశించాలంటే తలుపులు లేదా కిటికీలు బద్దలు కొట్టాలి. ఇంటికి తాళంవేసి ఉంటే పగులగొట్టాలి. కానీ అలాంటిదేమీ లేకుండా ఇతరులు ఇంట్లోకి ప్రవేశించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగర్వాల్‌ హత్య జరిగిన సమయంలో హతుడి భార్య తారామణి మెడలోని బంగారం, చేతికి ఉన్న బంగారు గాజులు అలాగే ఉన్నాయి. దొంగలైతే తారామణి ఒంటిపై ఉన్న నగలును ఎందుకు దోచుకోలేదన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎలాంటి పెనుగులాట జరగలేదు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దోపిడీ దొంగలైతే అడ్డొచ్చిన వారిని హత్య చేసి  తమపని పూర్తి చేసుకుంటారు. కానీ అలాంటిదేమీ జరగకపోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధ దంపతుల చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడితే.. చోరీ తర్వాత చేతులు ఎలా విడిపించారన్న అంశంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఈ కేసును తర్వలోనే చేధిస్తామని సైబరాబాద్‌ పోలీసులు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ చెబుతున్నారు. దర్యాప్తు కొలిక్కి వస్తేకానీ... ఈ కేసులో మిస్టరీ వీడే అవకాశం లేదు. త్వరలోనే అన్ని వాస్తవాలూ వెలుగు చూస్తాయని పోలీసులు చెబుతున్నారు. 

 

21:19 - August 17, 2018

కర్నూలు : తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తివేసి.. 1.35 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మంత్రాలయం దగ్గర ప్రమాదస్థాయిలో తుంగభద్ర ప్రవహిస్తుండగా... కర్నూలు నగర శివారులోనూ వరద నీరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. వరద ప్రవాహానికి జోహారాపురం-కర్నూలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జోహారాపురం బ్రిడ్జ్‌పై ఐదు అడుగుల మేర నీరు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తుండడంతో ముంపు ప్రాంత ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. 

 

21:17 - August 17, 2018

కామారెడ్డి : నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

 

21:14 - August 17, 2018

ఖమ్మం : జిల్లాలో గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. గోదావరి ఉధృతితో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరద ఉధృతిని భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ భవేశ్‌ మిశ్ర పరిశీలించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న సబ్‌ కలెక్టర్‌తో టోన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

21:08 - August 17, 2018

రాజమండ్రి : ఎగువన కురుస్తున్న వర్షాలతో రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. నదీ నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. వరద నీటి ప్రవాహం పెరగడంతో ఇప్పటికే అనేక మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ధవళేశ్వరం నుంచి భారీగా మిగులు జలాలు సముద్రంలోకి వదులుతున్నారు. 

 

21:05 - August 17, 2018

ఉమ్మడి కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అతలాకుతలమవుతోంది. ఎగువన మహరాష్ట్రలో కురుస్తున్న వర్షలకు తోడుగా ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగు, వంకలు పోంగిపోర్లుతండడంతో అధికార యంత్రాంగం దిగువ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది.  కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు కడెం, కోమరంభీం, స్వర్ణ, నీల్వయి ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  రెండు జిల్లాలో  పరిధిలోని ఓపెన్ కాస్ట్ బొగ్గుగనుల పై వర్ష ప్రభావం పడడంతో సింగరేణి సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది. 

21:03 - August 17, 2018

తిరువనంతపురం : కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో ఇప్పటికే 324 మందికి పైగా మృతిచెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 13జిల్లాలో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. కాలనీలన్నీ జలమయమయ్యాయి. రెండు లక్షలకు పైగా జనం నిరాశ్రయులయ్యారు. జనం ఇళ్లూ.. వాకిలి వదిలి బిక్కుబిక్కుమంటూ పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. 1500 శిబిరాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించారు. అటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళకు సరిహద్దుగా జిల్లాలకు ముప్పు విస్తరిస్తోంది. కొడగుతోపాటు దక్షిణ కన్నడ, హాసన, మైసూరు, చామరాజనగర, ఉడుపి, శివమొగ్గ, చిక్కమగ్‌ళూరు జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఆదుకోవాలంటూ దేశ ప్రజలకు కేరళ సీఎం పినరయ్ విజయన్ వినతి తెలిపారు. కేరళకు ఢిల్లీ ప్రభుత్వం రూ.10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రధాని మోదీ కేరళకు బయలుదేరారు. రేపు కేరళలో మోదీ ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. 
పలు ఇళ్లు నేలమట్టం 
భారీ వర్షాలకు కొడుగు జిల్లాలో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఓ భవంతి నేలకూలుతుండగా తీసిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. రెండంతస్తుల ఈ భవనం పునాది దెబ్బతినడంతో జారిపడిపోయింది. కేరళలో పొంగి పొర్లుతున్న కాలువలు, నదులను చూస్తే ఒళ్లు గగురుపొడుస్తుంది. అలాంటి నదులను దాటాలంటే సాహసమే. ప్రమాదమని తెలిసినా, కొందరు బ్రిడ్జీ పైనుంచి నీరు వెళ్తున్నా వాహనాలను నిర్లక్ష్యంగా దాటుకుని వెళ్తున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రధాన రహదారులన్నీ జలమయం అకావడంతో.. కొచ్చి విమానాశ్రయంలో రాకపోకలూ నిలిపివేశారు.

 

20:18 - August 17, 2018

మాజీ ప్రధాని వాజ్ పేయి విలువలున్న వ్యక్తి అని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదర్శప్రాయుడని అన్నారు. వాజ్ పేయి దౌత్య నీతి...నైతిక విలువలు అనే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరు వెంకటేశ్వర్ రావు, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ, సీనియర్ పాత్రికేయులు నడింపల్లి సీతారామరాజు పాల్గొని, మాట్లాడారు. వాజ్ పేయి మంచి లౌకికవాదని...ఈ విషయాన్ని ప్రస్తుతం ప్రధాని మోడీ ఆచరిస్తే బాగుంటుందని సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

దేశ రాజకీయాల్లో వాజ్ పేయి ధృవతార : కిషన్ రెడ్డి

ఢిల్లీ : దేశ రాజకీయాల్లో వాజ్ పేయి ధృవతారగా వెలిగారని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంతో వాజ్ పేయికి అవినాభావ సంబంధం ఉందన్నారు. కృష్ణా జలాలను హైదరాబాద్ కు తీసుకురావడంలో వాజ్ పేయి సహాయసహకారాలు ఉన్నాయన్నారు. నగరంలో మెట్రో రైలు ఏర్పాటు చేయడంలో వాజ్ పేయి తోడ్పాటు, సహాయం ఉన్నాయన్నారు. హైదరాబాద్ కు వాజ్ పేయి వచ్చినప్పుడు ఆయనకు టీ నుంచి మొదలుకొని ఫ్లైట్ ఎక్కించేవరకు ఆయనతోపాటు ఉండే అవకాశం దక్కిందన్నారు. వాజ్ పేయి అంతిమసంస్కారంలో పాల్గొన్నామని తెలిపారు.

దేశం ఆదర్శవంతమైన నాయుకుడిని కోల్పోయిందన్న దత్తాత్రేయ

ఢిల్లీ : వాజ్ పేయి.. ఆదర్శవంతమైన నాయుకుడని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం వాజ్ పేయి 45 సం.రాలు నిరంతరం కృషి చేశారని చెప్పారు. మూడుసార్లు ప్రధాని అయ్యారని తెలిపారు. కాంగ్రెసేతర ప్రధానిగా వాజ్ పేయి ముద్రవేసుకున్నారని పేర్కొన్నారు. దేశం ఆదర్శవంతమైన నాయుకుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణలో వారి ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. అంకితభావంతో పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. 

20:07 - August 17, 2018

ఢిల్లీ : వాజ్ పేయి ఆదర్శవంతమైన నాయుకుడని బీజేపీ నేతలు అన్నారు. దేశ రాజకీయాల్లో ధృవతారగా వెలిగారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన వారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బండారు తత్తాత్రేయ మాట్లాడుతూ వాజ్ పేయి పార్టీ కోసం 45 సం.రాలు నిరంతరం కృషి చేశారని చెప్పారు. మూడుసార్లు ప్రధాని అయ్యారని తెలిపారు. కాంగ్రెసేతర ప్రధానిగా వాజ్ పేయి ముద్రవేసుకున్నారని పేర్కొన్నారు. దేశం ఆదర్శవంతమైన నాయుకుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణలో వారి ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. అంకితభావంతో పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. 
దేశ రాజకీయాల్లో వాజ్ పేయి ధృవతార : కిషన్ రెడ్డి
దేశ రాజకీయాల్లో వాజ్ పేయి ధృవతారగా వెలిగారని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంతో వాజ్ పేయికి అవినాభావ సంబంధం ఉందన్నారు. కృష్ణా జలాలను హైదరాబాద్ కు తీసుకురావడంలో వాజ్ పేయి సహాయసహకారాలు ఉన్నాయన్నారు. నగరంలో మెట్రో రైలు ఏర్పాటు చేయడంలో వాజ్ పేయి తోడ్పాటు, సహాయం ఉన్నాయన్నారు. హైదరాబాద్ కు వాజ్ పేయి వచ్చినప్పుడు ఆయనకు టీ నుంచి మొదలుకొని ఫ్లైట్ ఎక్కించేవరకు ఆయనతోపాటు ఉండే అవకాశం దక్కిందన్నారు. వాజ్ పేయి అంతిమసంస్కారంలో పాల్గొన్నామని తెలిపారు.

 

19:51 - August 17, 2018

హైదరాబాద్ : బీఎస్ ఎన్ ఎల్ ఆల్‌ ఇండియా 18వ క్యారమ్స్‌ టోర్నమెంట్‌ హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. గచ్చిబౌలి రీజనల్‌ టెలికం ట్రైనింగ్‌ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఈడీ రాహుల్‌ బరద్వాజ్‌ ఈ కార్యక్రమానికి హాజరై పోటీలను ప్రారంభించారు. ప్రముఖ క్యారమ్స్‌ క్రీడాకారుడు నిస్సార్‌ అహ్మద్‌ ఈ టోర్నమెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 12 రాష్ట్రాల నుండి 170 మంది ఉద్యోగులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నారు. 

 

19:49 - August 17, 2018

హైదరాబాద్ : సెల్‌ఫోన్‌ రిటైల్‌ రంగంలో దూసుకుపోతున్న బిగ్‌ సీ నూతన లోగోలు ఆవిష్కరించుకుంది. బిగ్‌ సీ బ్రాండ్‌ అంబాసిడర్‌ సమంతా అక్కినేని నూతన లోగోలను లాంచనంగా ఆవిష్కరించారు. 2002లో మొదలైన బిగ్‌ సీ ప్రయాణం 16 ఏళ్లలో 225 స్టోర్స్‌ను విజయవంతంగా నడిపిస్తోంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొద్ది రోజుల్లో తమిళనాడులోనూ బిగ్‌ సీ స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బిగ్‌ సీ ఎండీ బాలు చౌదరి తెలిపారు. 

 

19:46 - August 17, 2018

పశ్చిమ గోదావరి : పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది.  తెలంగాణ, ఓడిస్సా, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలలో కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి ఉప నదులైన శబరీ, ఇంద్రావతి, ప్రాణహిత, పెను గంగా నదులు పొంగి ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో గోదావరి నది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లానుండి ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల వరకు వరద నీటితో పోటెత్తి ప్రవహిస్తోంది. తెలంగాణ లోని భద్రాచలం వద్ద గోదావరి నదికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పోలవరం వద్ద గోదావరి నది ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. పోలవరం మండలం కొత్తూరు కాజ్ వే పైకి వరద నీరు చేరడంతో ఏజెన్సీ లోని 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. 

 

19:43 - August 17, 2018

విశాఖ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిశాయి. వాజ్‌పేయి స్మృతులతో యావత్‌దేశం నివాళులు అర్పించింది. వాజ్‌పేయితో తమకున్న అవినాభావ సంబంధాలను గుర్తు చేసుకుంది. అటల్‌ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మంచి అనుబంధం ఉంది. ఆయన జన్‌ సంఘ్‌ నేతగా ఉన్నప్పటి నుండి తరచుగా విశాఖను సందర్శించేవారు. ఏయూతో పాటు అనేక సభలలో వాజ్‌పేయి ప్రసంగించారు. 
ప్రధాని హోదాలో విశాఖను సందర్శించిన వాజ్‌పేయి
ప్రధాని హోదాతో పాటు కేంద్రమంత్రి హోదాలో ఉన్న సమయంలో వాజ్‌పేయి చాలా సార్లు విశాఖను సందర్శించారు. ఇక్కడి కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆయన ప్రధాని అవక ముందు వైజాగ్‌ వచ్చినప్పుడల్లా తోటి నాయకులతో ప్రతి రోజూ బీచ్‌కు వెళ్లేవారు. సాగరతీరం, ప్రకృతి అందాలను చూసి వాజ్‌పేయి ఎంతో మురిసిపోయేవారని ఆయనతో సన్నిహితంగా గడిపిన పీవీ చలపతి రావు తెలిపారు.  
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.13వేల కోట్ల నిధి ఇచ్చిన వాజ్‌పేయి
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు 13వేల కోట్ల నిధిని వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే కేటాయించారు. జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ, విశాఖ పోర్టుకు కనెక్టివిటీ రోడ్లు, నేవీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ అప్‌గ్రేడ్‌, యూనివర్సిటీల పటిష్టతలో భాగంగా ఏయూలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల స్థాపన వంటి వాటికి కృషి చేశారు.
1982లో విశాఖకు వాజ్‌పేయి
1980లో బీజేపీ ఏర్పాటు తర్వాత వాజ్‌పేయి 1982లో విశాఖ వచ్చారు. 1981లో జరిగిన ఎన్నికలలో విశాఖ మున్సిపాలిటీలో 50 వార్డులకు గాను బీజేపీ 25వార్డులలో విజయభేరి మోగించింది. ఈ బీజేపీ మేయర్‌ ఎన్నికల విజయోత్సవ సభలో వాజ్‌పేయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు వన్‌టౌన్‌లోని ప్రస్తుత జీవీఎంసీ స్టేడియం ఉన్న స్థలంలో పౌరసన్మానం చేశారు. 
1983లో మరోసారి విశాఖకు వచ్చిన వాజ్‌పేయి
1983లో వాజ్‌పేయి మరోసారి విశాఖ వచ్చారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ తరపున ప్రచారం చేశారు. 2004 ఎన్నికల సమయంలో కె. హరిబాబు వన్‌టౌన్‌ ఎమ్మెల్యేగా, ఎమ్ వీవీఎస్ మూర్తి ఎంపీగా పోటీ చేశారు. అప్పట్లో టీడీపీ-బీజేపీ పొత్తు కారణంగా ఇరు పార్టీల అభ్యర్థుల తరపున వాజ్‌పేయి ప్రచారం చేశారు. 
వాజ్ పేయికి విశాఖ వాసులు అశ్రు నివాళి 
వాజ్‌పేయి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విశాఖ వాసులు ఆయనకు అశ్రు నివాళి అర్పించారు. ఆర్కేబీచ్‌లో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ వాజ్‌పేయి సైతక శిల్పాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్‌ నేతలు ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌, సీనియర్‌ నేత పీవీ చలపతిరావు తదితరులు వాజ్‌పేయి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. 

 

19:35 - August 17, 2018

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు తెలుగు ప్రముఖులు మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఘన నివాళులర్పించారు. ఆ మహానేతతో తమకు ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి మృతితో దేశం ఒక గొప్ప దార్శనికుడ్ని కోల్పోయిందని సంతాపం ప్రకటించారు. వాజ్‌పేయి పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
వాజ్‌పేయి గొప్ప మానవతావాది : నరసింహన్‌ 
మాజీ ప్రధాని వాజ్‌పేయికి పలువురు తెలుగు ప్రముఖులు పుష్ప నివాళులర్పించారు. వాజ్‌పేయి గొప్ప మానవతావాది అని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ నివాళులర్పించారు. 
వాజ్‌పేయి మరణం భారత్‌కు తీరనిలోటు : సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాజ్‌పేయి భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. దేశానికి దిశానిర్దేశం చేసిన వాజ్‌పేయి మరణం భారత్‌కు తీరనిలోటని సంతాపం ప్రకటించారు. 
వాజ్ పేయి గొప్ప వ్యక్తి : కేశినేని  
భారత రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి వాజ్‌పేయి అని టీడీపీ ఎంపీ కేశినేని నాని సంతాపం ప్రకటించారు. 
దేశాన్ని అభివృద్ధిపథంలో పయనింపచేసిన వాజ్ పేయి : ఎంపీ జితేందర్ రెడ్డి
దేశాన్ని అభివృద్ధి పథంలో పయనింపచేసిన వాజ్‌పేయి మరణం భారత్‌కు తీరనిలోటని టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. 
దేశం మహోన్నత వ్యక్తిని కోల్పోయింది : ఎంపీ విజయసాయిరెడ్డి 
వాజ్‌పేయి మరణంతో దేశం ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. 
దేశాన్ని సంస్కరణల పథంలో నడిపించిన వాజ్‌పేయి : ఇంద్రసేనారెడ్డి
దేశాన్ని సంస్కరణల పథంలో నడిపించిన వాజ్‌పేయి మృతి భారతావనికి తీరనిలోటని బీజేపీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి నివాళులర్పించారు. 
ప్రజల హృదయాల్లో వాజ్‌పేయి నిలిచి ఉంటారు : కేకే, వరప్రసాద్   
వాజ్‌పేయి భౌతికంగా దూరమైనా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారని టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు, వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ సహా పలువురు నివాళులర్పించారు.

19:02 - August 17, 2018

ఢిల్లీ : వాజ్ పేయి మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. వాజ్ పేయికి వైసీపీ మాజీ ఎంపీలు నివాళులర్పించారు. దేశానికి వాజ్ పేయి మృతి తీరని లోటని అన్నారు. నమ్మిన సిద్ధాంతంతో వాజ్ పేయి సుపరిపాలన అందించారని కొనియాడారు.  

కేరళలో 167కు చేరిన మృతుల సంఖ్య

తిరువనంతపురం : కేరళలో మృతుల సంఖ్య 167కు చేరింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. వరదలు సంభవించనున్నాయి. 4 వేల మందిని ఎన్ డీఆర్ ఎఫ్ బృందాలు కాపాడాయి. కేరళ వ్యాప్తంగా 1,568 క్యాంపులు ఏర్పాటు చేశారు. కేరళ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధానికి సీఎం పినరయ్ విజయన్ వివరిస్తున్నారు.
ప్రధాన సహాయనిధి నుంచి కేంద్రం రూ.100 కోట్లు మంజూరు చేసింది. 

ఉధృతంగా ప్రవహిస్తోన్న పెన్ గంగా నది

కుమ్రంభీం : సిర్పూర్ (టి) మండలం వెంకట్రావుపేట సమీపంలో పెన్ గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలను కలుపుతూ ఉన్న బ్రిడ్జీపై అధికారులు రాకపోకలు నిలిపివేశారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 

తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం

తిరుమల : ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం జరిగింది. టెంపోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు అయ్యాయి.

17:13 - August 17, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిశాయి. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అభిమానులు, సన్నిహితుల కన్నీటి వీడ్కోలు పలికారు. అటల్‌ దత్తపుత్రిక నమిత .. వాజ్‌పేయీ చితికి నిప్పంటించగా, హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు. అంతకముందు వాజ్ పేయి పార్థీవదేహానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, స్పీకర్ సుమిత్రా మహాజన్, రక్షణమంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మస్వరాజ్, బీజేపీ సీనియర్ నేత ఎల్ కే.అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ తదితర దేశాల ప్రతినిధులు నివాళులర్పించారు. అంత్యక్రియలకు కేంద్రమంత్రులు, మురళీమనోహర్ జోషీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతోపాటు వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వాజ్ పేయి శవపేటికపై ఉంచిన త్రివర్ణ పతాకాన్ని త్రివిద దళాధిపతులు వాజ్ పేయి దత్తపుత్రిక నమితకు అందజేశారు. త్రివిదదళాలు వాజ్ పేయికి నివాళులర్పించారు. 

 

వాజ్ పేయ్ చితికి నిప్పంటించిన దత్తపుత్రిక నమిత..

ఢిల్లీ : మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ అంత్యక్రియలు అభిమానులు, సన్నిహితుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అటల్‌ దత్తపుత్రిక నమిత .. వాజ్‌పేయీ చితికి నిప్పంటించగా, హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు.

కుప్పకూలిన కండెం ప్రాజెక్ట్ గేట్..

నిర్మల్ : కౌంటర్ వెయిట్ పగిలి..కబెం ప్రాజెక్టు 2వ గేటు కుప్ప కూలిపోయింది. గేటు కూలిపోయి 8 అడుగుల ఎత్తులో నిలిచిపోవటంతో నీరు భారీగా ఎగసిపడుతోంది. దీంతో 10వేల క్యూసెక్కుల నీరు గోదావరిలో కలిసిపోతోంది. 17వ నంబర్ గేటు మోటార్ వైండింగ్ కాలిపోయింది. 

ప్రభుత్వ లాంఛనాలతో పూరైన వాజ్ పేయ్ అంత్యక్రియలు..

ఢిల్లీ : ఢిల్లీలోని దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర సుమారు నాలుగు కిలోమీటర్ల మేర సాగి స్మృతిస్థల్ కు చేరుకుంది. అనంతరం వాజ్ పేయి భౌతిక కాయానికి త్రివిధ దళాదిపతులు, రక్షణశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ , లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు తుది నివాళులర్పించారు. వాజ్ పేయి అంత్యక్రియలకు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

స్మృతిస్థల్ కు చేరుకున్న వాజ్ పేయ్ అంతిమయాత్ర..

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ అంతిమ యాత్ర స్మృతిస్థల్ కు చేరుకుంది. మరికొద్ది పేపట్లో అంతిమ సంస్కారాలు పూర్తి కానున్నాయి. దారి పొడవునా ‘అటల్ జీ అమర్ రహే’ అంటే అభిమానులు నినాదాలు చేశారు. విజయ్ ఘాట్ పక్కన 1.5 ఎకరాల్లో వాజ్ పేయి మెమోరియల్ ఏర్పాటు చేయనున్నారు. అంతకుముందు కేరళ, తమిళనాడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ భద్రత సలహాదారు, నేవీ చీఫ్, ఆర్మీ చీఫ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ తదితరులు నివాళులర్పించారు. కాగా వాజ్ పేయ్ అంతిమ సంస్కార కార్యక్రమానికి విదేశీ మంత్రులు హాజరయ్యారు. పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ మంత్రులు హాజరుకానున్నారు.

15:54 - August 17, 2018

ఢిల్లీ : వాజ్ పేయి అంతిమయాత్ర స్మృతి స్థల్ కు చేరుకుంది. కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనారోగ్యతంతో నిన్న వాజ్ పేయి మృతి చెందారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు. వాజ్ పేయికి శ్రీలంక, బంగ్లాదేశ్ తోపాలు విదేశీ ప్రతినిధులు అంజలి ఘటించారు. వాజ్ పేయికి అమెరికా సంతాపం ప్రకటించింది. 

అగ్నివేశ్ పై దాడి..వాజ్ పేయికి నివాళిలర్పించేదుకు వెళ్తుండగా..

ఢిల్లీ : సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌పై మరోసారి దాడి జరిగింది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు అగ్నివేశ్‌ వెళ్తుండగా కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. దిల్లీలోని దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని భాజపా కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి అగ్నివేశ్‌ వెంటపడ్డారు. ఓ వ్యక్తి అగ్నివేశ్‌ను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి.

15:36 - August 17, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమయాత్ర కొనసాగుతోంది. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ అగ్రనేతలు భూటాన్ రాజు, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ విదేశాంగమంత్రులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనారోగ్యతంతో నిన్న వాజ్ పేయి మృతి చెందారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు. వాజ్ పేయికి శ్రీలంక, బంగ్లాదేశ్ తోపాలు విదేశీ ప్రతినిధులు అంజలి ఘటించారు. వాజ్ పేయికి అమెరికా సంతాపం ప్రకటించింది. అంజలి ఘటించేందుకు దేశ, విదేశాల ప్రతినిధులు తరలివస్తున్నారు. అంతిమయాత్రకు పార్టీలకతీతంగా అశేప్రజానీకం తరలివస్తున్నారు. సాయంత్ర 4 గంటలకు స్మృతి స్థల్ లో వాజ్ పేయి అంత్యక్రియలు జరుగనున్నాయి. ప్రభుత్వ లాంచనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...   

 

వాజ్ పేయ్ అంతిమ సంస్కారాలకు విదేశీ మంత్రులు రాక..

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయ్ అంతిమ సంస్కార కార్యక్రమానికి విదేశీ మంత్రులు హాజరకానున్నారు. పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ మంత్రులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి భూటాన్ రాజు జిగ్నే ఖస్త్రసర్ వాంగ్ చుక్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే వాజ్ పేయ్ అంతిమ యాత్ర ప్రారంభం కాగా..రాజ్ ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్ లో సాయంత్రం 4గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. విజయ్ ఘాట్ పక్కన 1.5 ఎకరాల్లో వాజ్ పేయి మెమోరియల్ ఏర్పాటు చేయనున్నారు.

జనసంద్రమైన ఢిల్లీ వీధులు..

ఢిల్లీ : అభిమాన నేత కడసారి చూపు కోసం అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దారి పొడవునా ‘అటల్ జీ అమర్ రహే’ అంటే అభిమానులు నినాదాలు చేస్తున్నారు. వాజ్ పేయి అంతిమయాత్ర వెంట ప్రధాని మోదీ, అమిత్ షా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు తదితర నేతలు నడుస్తున్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీలోని దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ అంతిమయాత్రలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు నేతలు పాల్గొన్నారు.

ప్రారంభమైన వాజ్ పేయ్ అంతిమయాత్ర..

ఢిల్లీ : బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి మాజీ ప్రధాని వాజ్ పేయ్ అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. రాజ్ ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్ లో సాయంత్రం 4గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. విజయ్ ఘాట్ పక్కన 1.5 ఎకరాల్లో వాజ్ పేయి మెమోరియల్ ఏర్పాటు చేయనున్నారు. అంతకుముందు కేరళ, తమిళనాడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ భద్రత సలహాదారు, నేవీ చీఫ్, ఆర్మీ చీఫ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ తదితరులు నివాళులర్పించారు. 

14:44 - August 17, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమయాత్ర కొనసాగుతోంది. నిన్న అనారోగ్యతంతో ఆయన మృతి చెందారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. వాజ్ పేయికి అంజలి ఘటించేందుకు దేశ, విదేశాల ప్రతినిధులు తరలివస్తున్నారు. వాజ్ పేయికి అమెరికా సంతాపం ప్రకటించింది. అంతిమయాత్రకు పార్టీలకతీతంగా అశేష ప్రజానీకం తరలివస్తున్నారు. సాయంత్ర 4 గంటలకు స్మృతి స్థల్ లో వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...   

 

14:23 - August 17, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమయాత్ర ప్రారంభం అయింది. నిన్న అనారోగ్యతంతో ఆయన మృతి చెందారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. వాజ్ పేయికి అంజలి ఘటించేందుకు దేశ, విదేశాల ప్రతినిధులు తరలివస్తున్నారు. వాజ్ పేయికి అమెరికా సంతాపం ప్రకటించింది. అంతిమయాత్రకు పార్టీలకతీతంగా అశేష ప్రజానీకం తరలివస్తున్నారు. సాయంత్ర 4 గంటలకు స్మృతి స్థల్ లో వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

వరదలను సమీక్షించేందుకు కేరళ వెళ్తున్నా : ప్రధాని మోడీ

ఢిల్లీ : భారీ వర్షాలతో అట్టుడుకుతున్న కేరళలో పర్యటించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వరద బీభత్సాన్ని ప్రత్యక్షంగా తిలకించి, సమీక్ష జరిపేందుకు తాను కేరళ వెళ్లనున్నట్టు ప్రధాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. "కేరళలో ఈ స్థాయి వరదలు రావడం అత్యంత దురదృష్టకరం. పరిస్థితిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో ఫోన్ లో మాట్లాడాను. రాష్ట్ర పరిస్థితులు, జరుగుతున్న సహాయక చర్యల గురించి మాట్లాడాను. పరిస్థితిని సమీక్షించేందుకు నేటి సాయంత్రం కేరళకు వెళుతున్నా" అని ఆయన ట్వీట్ చేశారు. 

కేరళలో పెరిగిన వరద మృతులు..13 జిల్లాల్లో రెడ్ అలర్ట్..

కేరళ : రాష్ట్రాన్ని భారీ వర్షాలతో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో 13 జిల్లాల్లో అధికారలు రెడ్ అలర్ట్ ను ప్రకటించారు. ఇప్పటికే మృతుల సంఖ్య 167కు పెరిగింది. ఈనెల 26 వరకు కొచ్చి ఎయిర్ పోర్టును మూసి వేశారు. అలాగే కొచ్చి మెట్రో సర్వీసులను కూడా నిలిపివేశారు. సహాయక చర్యల్లో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. దీంతో కేరళలోని వరద ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించేందుకు వెళ్లనున్నారు. కాగా ఉపరిత ఆవర్తనం కొనసాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.

వివాదాలు లేకుండా..అభివృద్ధిలో పారదర్శకత : కోటేశ్వరమ్మ

విజయవాడ : కనకదుర్గమ్మ దేవాలయానికి కొత్త ఈవోగా కోటేశ్వరమ్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కోటేశ్వరమ్మ మాట్లాడుతు..వివాదాలు లేకుండా అందరిని కలుపుకుపోతు ఆలయ అభివృద్ధిలో పారదర్శకతకు కృషి చేస్తానని తెలిపారు. నిఘా వ్యవస్థను పట్టిష్టపరిచి ప్రతీ ఒక్క భక్తునికి అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తు..భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు. భక్తులు అమ్మవారికి సమర్పించే చీరలు, నగలు, కానుకలను రిజిస్టర్ చేయించేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటానన్నారు. సిబ్బందిని సమన్వయపరిచి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. 

13:26 - August 17, 2018
13:24 - August 17, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి వాజ్ పాయి మృతిపై బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన భావోద్వేగపు లేఖను ట్విట్టర్ లో పోస్టు చేశారు. దేశం గొప్ప తండ్రిని..నేతను కోల్పోయిందని...వాజ్ పేయితో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. అందరూ వాజ్ పాయి అంటే తాను మాత్రం బాప్ జీని సంభోదించేవాడినని, ఢిల్లీలో వాజ్ పాయి ప్రసంగాలను వినేందుకు తన తండ్రి తీసుకెళ్లే వారని వెల్లడించారు. పెద్దవాడినయ్యాక వాజ్ పాయితో కలిసిగడిపే అవకాశం వచ్చిందని, కలుసుకున్న సందర్భంలో సినిమాలు..కవితలు..రాజకీయాలు..గురించి మాట్లాడుకొనే వారమన్నారు. ఆయన రాసిన పద్యాల్లోని ఓ పాటలో తనకు నటించే గౌరవం దక్కిందని...పేర్కొంటూ షారూఖ్ ఓ వీడియోను పోస్టు చేశారు. 

దొంగల నుండి భారీగా వాహనాలు స్వాధీనం..

గుంటూరు : అంతర్ రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు దొంగలను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుండి 6 కార్లు, 13 మోటార్ సైకిళ్లు, 400 గ్రామలు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా పలు పట్టణాల్లో సంచరిస్తున్న అంతర్ రాష్ట్ర దొంగలు వాహనాలే కాకుండా పలు చోరీలకు పాల్పడతు భారీగా బంగారాన్ని దోచుకుంటున్న వీరు గత కొంతకాలంగా రాష్ట్రంలో సంచరిస్తు పలు దోపిడీలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో వీరివద్ద వున్న పలు వాహనాలు, బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

పొంగుతున్న శబరి..వరదలో చింతూరు మండలం..

తూర్పుగోదావరి : భారీ వర్షాలకు శబరి నది పొంగి పొర్లుతోంది. దీంతో చింతూరు మండలం వరద గుప్పిట్లో చిక్కుకుంది. జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరుకోవటంతో ఛత్తీస్ ఘడ్ కు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటి మట్టం భారీగా పెరుగుతుండటంతో దేవి పట్నం మండల కేంద్రాన్ని వరద నీరు చుట్టుముడుతోంది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లోని ఆరు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రానికి తరలింపుకు ఏర్పాటు చేశారు. వరద నీటితో చింతూరు మండలంలోని దాదాపు 31 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాలలో నిత్యావసర వస్తువులను అధికారులు పంపిణీ చేశారు. 

కేరళను ఆదుకుందాం రండి చంద్రబాబు పిలుపు..

ఢిల్లీ : భారీ వర్షాలు, వరదలకు అల్లాడుతున్న కేరళకు అన్ని వర్గాల నుంచి సాయం లభిస్తోంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్కడ నెలకొన్న విపత్కర పరిస్థితిపై స్పందించిన చంద్రబాబు కేరళ ప్రభుత్వానికి రూ.5 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా భారీ వరదలకు కేరళలో నిన్న రాత్రి వరకూ 97 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో తమను ఆదుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో కేరళ విపత్తు నిర్వహణ సంస్థకు విరివిగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ట్విట్టర్ లో డొనేషన్లు ఇవ్వాల్సిన వెబ్ సైట్ లింక్ ను కూడా పోస్ట్ చేశారు.

13:11 - August 17, 2018

ఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మూత్రపిండ నాళాల ఇన్ఫెక్షన్‌, మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌, ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం 5.05 గంటలకు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పార్థివదేహాన్ని దిల్లీలోని కృష్ణమీనన్‌ మార్గ్‌కు తరలించారు. కృష్ణ మీనన్ మార్గ్ నుండి దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి వాజ్ పాయి పార్థీవ దేహాన్ని తరలించారు. వాజ్ పాయికి నివాళి అర్పించేందుకు గ్వాలియర్ నుండి ప్రజలు వచ్చారు. కానీ లోనికి వెళ్లడానికి ప్రయత్నించినా వీలు కాలేదదని..దీనితో ఇక్కడి నుండే నివాళులర్పిస్తున్నామన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

వాజ్ పేయ్ కు నివాళులర్పించిన బీజేపీ దిగ్గజాలు..

ఢిల్లీ : బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా ,అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, యోగీ అదిత్యానాథ్, మనోహర్ లాల్ ఖట్టర్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు వాజ్ పేయ్ కు నివాళులర్పించారు. అలాగే బీజేపీ ఎంపీలు, ఆయా రాష్ట్రాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు మాజీ ప్రధాని వాజ్ పేయ్ కు నివాళులర్పించేందుకు కేంద్ర బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. కాగా మ.1గంట వరకూ ప్రజల సందర్శనార్థం వాజ్ పేయ్ పార్థివదేహాన్ని వుంచుతారు. అనంతరం 1.30గంటలకు అంతిమ యాత్ర కొనసాగుతుంది.

13:05 - August 17, 2018

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ హీరో సాయి శ్రీనివాస్‌. తొలి సినిమా అల్లుడు శీనుతోనే వినాయక్‌ లాంటి స్టార్ డైరెక్టర్‌, సమంత లాంటి టాప్ హీరోయిన్‌తో ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమాలో తమన్నాతో స్పెషల్ సాంగ్‌ లో ఆడిపాడాడు. మరో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో జయ జానకి నాయక సినిమా చేశాడు. తొలి సినిమాకంటే రెండవ సినిమా కొంచెం మెరుగ్గా ఆడింది. మూడవ సినిమా సాక్ష్యం సినిమాలో శ్రీనివాస్ పూజా హెగ్డే హీరోయిన్‌గా వచ్చింది మంచి పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్స్ తో జోడీ కడుతూ .. ఫారిన్ లొకేషన్స్ లో డ్యూయెట్స్ పాడుతూ వస్తున్నాడు. ఒక స్టార్ హీరో సినిమాను ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో .. ఆ స్థాయిలో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు తెరకెక్కుతూ వస్తున్నాయి.

రూటు మార్చిన అల్లుడు శ్రీను..
పెద్ద బడ్జెట్ తో పెద్ద డైరెక్టర్లతో పెద్దగా వర్క్ అవుట్ కాలేదనే ఆలోచనలో వున్న ఈ యంగ్ హీరో రూట్ మార్చాడు..చిన్న సినిమాలు చేసుకుంటు కొత్త దర్శకులతో ముందుకు వెళ్లాలనుకుంటున్నాడు. పెద్ద బడ్జెట్ తో పెట్టుబడి పెట్టినంత స్థాయిలో బెల్లంకొండ శ్రీనివాస్ కి మార్కెట్ లేకపోవడం వలన, సహజంగానే నష్టాలు వస్తున్నాయి. అందుకే పెద్ద సినిమాలు చేయించకుండా, కంటెంట్ వున్న చిన్న సినిమాలు చేయించాలనే నిర్ణయానికి నిర్మాత బెల్లంకొండ వచ్చినట్టు సమాచారం. కొత్త దర్శకుల దగ్గర సిద్ధంగా వున్న కథలను వరుసబెట్టి బెల్లంకొండ వింటున్నాడట. కంటెంట్ కొత్తగా వుందనిపిస్తే సెట్స్ పైకి పంపించేస్తాడన్న మాట. దీనిని బట్టి బెల్లంకొండ శ్రీనివాస్ కొంతకాలం పాటు కొత్త దర్శకులతో చిన్న సినిమాలు చేయనున్నట్టు స్పష్టమవుతోంది.  

13:02 - August 17, 2018

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. హైదర్ గూడ సిరిమల్ల కాలనీలోని ఓ ఇంట్లోకి అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. అడొచ్చిన వారిపై దొంగలు దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలైన ఓ వ్యక్తి మృతి చెందాడు. రూ. 40 లక్షల నగదు, బంగారాన్ని అపహరించారు. 

12:59 - August 17, 2018

అనంతపురం : జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. నగరంలోని కస్తూరిబా నగర పాలక బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భవతి కావడం కలకలం రేపుతోంది. ఓ కామాంధుడి చేతిలో మోసపోయిన విద్యార్థిని గర్భం దాల్చింది. ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చింది. కానీ కాసేపటికే పసికందు మృతి చెందింది. ఇంత జరిగినా పాఠశాల వార్డెన్, ప్రిన్స్ పాల్ ఏమీ పట్టనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. 

12:55 - August 17, 2018

ప్రకాశం : ఒంగోలులోని ఓ బాలసదన్ లో బాలికలపై లైంగిక వేధింపులు కలకలం రేపింది. ఒంగోలుకు చెందిన ప్రముఖ పాస్టర్ జోసెఫ్ నడుపుతున్న బాలికల గృహంలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణ చేపట్టింది. దీంతో బాలిక నుంచి సమాచారం సేకరించిన అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు సంస్థ పై దాడి చేసి పాస్టర్ జోసెఫ్‌ను అరెస్ట్ చేశారు. బాలికలను బాలసదన్ కు తరలించారు.

12:48 - August 17, 2018

జీవితా రాజశేఖర్. వీరిద్దరిని విడి విడిగా చూడలేం. సినిమా పరిశ్రమలో ఏ జంటకు లేని ప్రత్యేకత వీరిద్దరికి వుంది. హీరోగా రాజశేఖర్, నటిగా..దర్శకురాలిగా పలు విభిన్న పాత్రల్లో జీవిత రాజశేఖర్ కు అన్నీ తానై అండగా వుంటుంది. సినిమా పరిశ్రమే మా జీవితం అంటున్న ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు..ఇప్పటికే పెద్ద కుమార్తె శివానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా వుంది. ఈ క్రమంలో అక్క బాటలోనే రెండో కుమార్తె శివాత్మిక కూడా పయనిస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా పరిశ్రలోకి ఎంట్రీ ఇచ్చేందుకు శివాత్మిక కూడా వచ్చేస్తున్నట్లుగా సినీ వర్గాల సమాచారం.

అడవి శేష్ జోడీగా శివాని ..
తెలుగులో అడవి శేష్ జోడీగా శివాని ఒక సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ఇక తమిళంలోను శివాని కథానాయికగా పరిచయం కానుంది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక కూడా నటన వైపే ఆసక్తిని చూపుతోందట. ఈ విషయాన్ని జీవిత రాజశేఖర్ స్వయంగా చెప్పారు. అక్క మాదిరిగానే శివాత్మిక కూడా నటనపట్ల ఆసక్తిని చూపుతుండటంతో, ఆ దిశగానే ఆమెను ప్రోత్సహించేందుకు జీవిత రాజశేఖర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

12:44 - August 17, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత గోల్డెన్‌ బాబా వాజ్‌పేయికి నివాళులర్పించారు. ప్రధాని ఉన్నప్పుడు వాజ్‌పేయి దేశాన్ని ప్రగతిపథంలో నడిపారని గోల్డెన్‌బాబా తెలిపారు. 

12:32 - August 17, 2018

తూర్పుగోదావరి : గోదావరి నదిలో నీటి మట్టం క్రమ క్రమంగా ఎక్కువ అవుతోంది. దీనితో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 44 అడుగులకు చేరుకుంది. దీనితో దిగువ ప్రాంతాలకు ప్రమాదం ఉన్న నేపథ్యంలో వారిని అధికారులు హెచ్చరించారు. దేవీపట్నం వద్ద గిరిజన గ్రామాలను అధికారులు ఖాళీ చేయించారు. విలీన మండలాలైన వీఆర్ పురం, చింతూరులో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో 50 గ్రామాల్లో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:27 - August 17, 2018
12:04 - August 17, 2018

యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా పేరు తెచ్చుకున్న వినాయక్..ఇటీవల మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 సినిమాకు డైరెక్షన్ చేసిన విషయం తెలిసిందే. ఎంతోమంది స్టార్ డైరెక్టర్లలో వినాయక్ ను చిరు ఎంచుకోవటంతో ఆయనపై వున్న నమ్మకమేనన్నారు మెగాస్టార్. మరి మెగాస్టార్ నమ్మకాన్ని పొందిన వినాయక్ ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అటువంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించేందుకు మంచువారబ్బాయి రెడీ అయ్యాడు.

ప్రస్తుతం మంచు విష్ణు ప్రస్తుతం 'ఓటర్' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పరశురామ్ వేరే నిర్మాతల దగ్గర ముందుగానే అడ్వాన్స్ తీసుకోవడం వలన, ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది చెప్పలేం. అందువలన వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మంచు విష్ణు ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు. బాలకృష్ణ తదుపరి సినిమా చేయడం కోసం అందుకు సంబంధించిన సన్నాహాలను వినాయక్ సిద్ధం చేసుకుంటున్నా..'ఎన్టీఆర్' బయోపిక్ ను పూర్తి కావటానికి చాలా సమయం పట్టే అవకాశాలుండటంతో ఈలోగా ఒక సినిమా చేయాలనుకుంటే వినాయక్ చేసేయొచ్చు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

11:57 - August 17, 2018

విజయవాడ : తొలి శ్రావణ శుక్రవారం కావడంతో ఏపీలోని అన్ని అమ్మవారి దేవాలయాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆలయాల వద్ద పండుగ శోభ నెలకొంది. దీంతో విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:56 - August 17, 2018

శ్రీకాకుళం : జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నాగావళి, వంశధార, మహేంద్రతనయ నదులతో పాటు పలు కాలువలు వరద నీటి ప్రవాహంతో నిండిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు, పరివాహక ప్రాంతాలైన సోంపేట, కవిటి, కంచలి, ఇచ్ఛాపురం, నందిగాం, టెక్కలి, ఆముదాలవలస, సురబుజ్జిలి తదితర మండలాల్లోని పంట పొలాలు వరద ముంపుకు గురైయ్యాయి. కొద్ది రోజుల క్రితమే ఖరీఫ్ సీజన్ ను ప్రారంభించిన సిక్కోలు రైతులు పెట్టుబడి రూపంలో భారీగా నష్టపోయారు. నాట్లు ప్రాధమిక దశలోనే వరద ముంపునకు గురవడంతో ఇబ్బందులు పాలయ్యామని రైతులు అవేదన వ్యక్తం చేశారు.

11:52 - August 17, 2018
11:35 - August 17, 2018

భారతీయ వంటకాలలో   ప్రధాన పాత్ర పచ్చిమిర్చిదే. కూర, పచ్చడి, చారు, సూప్, స్నాక్స్, బజ్జీ ఇలా పచ్చిమిర్చి ఉపయోగాలు ఎన్నో. అసలు పచ్చిమిర్చి లేనిదే స్పైసీ రాదు. స్పైసీ కావాలంటే ఇది వుండాల్సిందే. ఒక్కోసారి కేవలం రూ.10లకే దొరికే మిర్చి మరోసారి 100 అమ్మినా సరే మిర్చి కొనకుండా మానలేం..అసలు మార్కెట్ మిర్చి కొనుగోలు లేని పూర్తవ్వదంటే అతిశయోక్తి కాదు. ఒక విధంగా ఆహార పదార్థాల్లో ఎందెందు చూసినా అందందే పచ్చిమిరప ఉండును అనేంతగా పచ్చిమిర్చి ప్రత్యేకత. ఇది కేవలం స్పైసీని ఇవ్వటమే కాదు..పచ్చిమిర్చిలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని న్యూట్రిషన్ నిపుణులు కూడా చెబుతున్న మాటలు.

ప్రకృతి మనిషికి ఇచ్చే అన్ని రుచులు..
ప్రకృతి ఇచ్చే వన్నీ మనిషి ఉపయోగపడేవే. అలా లభించేవాటిలో అన్ని రుచులు వుంటాయి. ఒక్కోదానిలో ఒక్కోరుచి వుంటుంది. తీపి, వగరు, చేదు,పులుపు వంటి పలు రుచులలో కారం కూడా ఒకటి. మరి కారం అనగానే మనకు ఏం గుర్తుకొస్తుంది. అంటే మిర్చి అని ఠక్కున చెప్పేస్తాం. అన్ని రుచులు శరీరానికి ఉపయోగపడతాయని అందరికీ తెలుసు. అందుకే మనం ఉగాది పచ్చడిలో షడ్రుచులను మేళవించి తింటుంటాం. మరి అన్ని రుచుల్లో అన్ని వున్నప్పుడు కారంలో కూడా శరీరానికి ఉపయోగపడేవి వుంటాయన్నమాటేకదా!..మరి పచ్చిమిర్చి ఘాటులో మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

సున్నా కేలరీల మిర్చి..శక్తినిచ్చే మిర్చి ఘాటు..
తింటే నషాళానికి అంటే మిర్చి ఘాటుకు కళ్లు, నోరు జలపాతాలైపోతాయి. ఆ ఘాటుకు శరీరం కొంతసేపు ఆగమాగం అయిపోతుంది. ఊపిరాడనట్లుగా వుంటుంది. కానీ ఈ ఘాటు శరీరానికి మాత్రం మంచి శక్తినిస్తుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే రసాయనాలు మన జీవక్రియలను 50 శాతం వేగవంతం చేస్తాయి. దీంతో పచ్చిమిరపకాయలను తిన్న మూడు గంటల పాటు ఈ ప్రభావం ఉంటుంది. మిర్చి తింటే మంట వల్ల చాలావరకూ ఇబ్బంది వుంటుంది. కానీ ఈ మంట శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. పచ్చి మిరపకాయల్లో కేలరీలు సున్నా అనే విషయం అందరికీ తెలియదు. కానీ ఇది మాత్రం నిజం.

మంటలోనే ఉంది మందు..
మిరపకాయలు మంట ఎత్తిస్తాయన్న విషయం తెలుసు కదా. ఈ మంట ఎత్తించే రసాయనమే క్యాప్సేసియన్. ఇది బ్రెయిన్ లోని హైపోదాలమస్ అనే చల్లబరిచే కేంద్రాన్ని ప్రేరేపించడం ద్వారా బాడీ ఉష్ణోగ్రతను పెంచుతుంది.

ప్రొస్టేట్ గ్రంధి సమస్యలకు పచ్చిమిర్చితో..
కేవలం వంటకాలకు మాత్రమే కాక శరీరంలో మిర్చి ఘాటులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు ఎంతోమేలు చేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను ఎప్పటికప్పుడు బయటకు పంపించేస్తాయి. దీంతో రక్షణ లభిస్తుంది. ప్రొస్టేట్ గ్రంధి సమస్యలకు పచ్చిమిరపకాయలు మంచి పరిష్కారం.

మిర్చితో గుండె పదిలం..
గుండెకు పచ్చిమిరప సెక్యూరిటీగా పనిచేస్తుందంటే మీరు నమ్ముతారా...? కానీ నమ్మి తీరాల్సిందే. ప్రమాదకర అథెరోస్కెల్ రోసిస్ ను పచ్చిమిర్చి నివారిస్తుంది. రక్తంలో చెడు కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయులను తగ్గించడం ద్వారా ధమనుల లోపల కొవ్వు ఏర్పడకుండా పచ్చిమిరపలోని రసాయనాలు అడ్డుకుంటాయి. అంతేకాదు చాలామందికి చిన్న దెబ్బ తగిలినా..లేదా ఒత్తిడి కలిగినా రక్తం గడ్డ కడుతుంటుంది. ఈ రక్తం గడ్డకట్టేందుకు దారితీసే ప్లేట్ లెట్ల సమూహం ఏర్పడకుండా పచ్చిమిర్చి నివారిస్తుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.

సైనస్ కు మిర్చి ఉపయోగం..
ఆయా కాలాలలో వచ్చే పలు సమస్యల్లో జలుబు ప్రధానంగా వుంటుంది. కొందరు సైనస్ తో బాధపడుతుంటారు. జలుబు, సైనస్ ఉన్న వారికి పచ్చిమిరప మంచి సహజ ఔషధం అంటారు నిపుణులు. మిర్చిలో వుండే క్యాప్సేసియన్ ముక్కు లోపలి శ్లేష్మం మెంబ్రేన్లలను ఉత్తేజపరిచి మెంబ్రేన్లకు రక్త సరఫరా జరిగేలా చూస్తుంది. మెంబ్రేన్ అనే టిష్యూలో శ్లేష్మం ఏర్పడంతో సైనస్ అంటారు. క్యాప్సేసియన్ వల్ల రక్త సరఫరా మంచిగా జరిగి మెంబ్రేన్లలో శ్లేష్మం పల్చబడటంతో సైనస్ సమస్యకు ఉపశమనం కలుగుతుంది. మరి దీన్ని బట్టి చూస్తే..పచ్చిమిర్చి కారాన్నే కాదు ఆరోగ్యంలో కూడా మెండు అని ఒప్పుకుని తీరాల్సిందే కదా!..

బీజేపీ కార్యాలయంలో భారీగా..కాషాయ నేతలు..

ఢిల్లీ : మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత వాజ్ పేయ్ పార్థివ దేహం ఆయన నివాసం నుండి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆయనకు తుది నివాళులర్పించేందుకు బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా ,అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, యోగీ అదిత్యానాథ్, మనోహర్ లాల్ ఖట్టర్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఆయా రాష్ట్రాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు మాజీ ప్రధాని వాజ్ పేయ్ కు నివాళులర్పించేందుకు కేంద్ర బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.

11:12 - August 17, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని, భారతరత్న వాజ్ పేయికి పలువురు తుది నివాళులర్పిస్తున్నారు. వాజ్ పేయి నివాసం కృష్ణ మీనన్ మార్గ్ నుండి దీన్ దయాళ్ మార్గ్ లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి వాజ్ పాయి పార్థీవ దేహాన్ని తరలించారు. ఆర్మీ వాహనంలో వాజ్ పేయి పార్థీవ దేహాన్ని తరలించారు. కాసేపటి క్రితం కార్యాలయానికి చేరుకున్న వాజ్ పాయి భౌతికకాయానికి పలువురు నేతలు నివాళులర్పిస్తున్నారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితర కీలక నేతలు కార్యాలయానికి చేరుకున్నారు. తుది నివాళుర్పించేందుకు పార్టీలకతీతంగా నేతలు, అభిమానులు, ప్రజలు తరలివస్తున్నారు. మధ్యాహ్నం 1గంట వరకు సందర్శకులకు అనుమతినివ్వనున్నారు. అనంతరం అటల్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. రాజ్ ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్ లో సాయంత్రం 4గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. విజయ్ ఘాట్ పక్కన 1.5 ఎకరాల్లో వాజ్ పేయి మెమోరియల్ ఏర్పాటు చేయనున్నారు. అంతకుముందు కేరళ, తమిళనాడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ భద్రత సలహాదారు, నేవీ చీఫ్, ఆర్మీ చీఫ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ తదితరులు నివాళులర్పించారు. 

11:03 - August 17, 2018

వాజ్ పేయ్ ప్రధానిగా..వాంబే పథకం ఏపీ నుండే : చంద్రబాబు

ఢిల్లీ : మాజీ ప్రధాని, దివంగత వాజ్ పేయితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. వాజ్ పేయి నివాసానికి వచ్చి పార్థివదేహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు అనంతరం మాట్లాడుతు..వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే తాను సీఎంగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. 1998లో తాను హైటెక్ సిటీ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానిస్తే ఆయన వచ్చారని, వాంబే పథకానికి ఏపీ నుంచే అంకురార్పణ జరిగిందని చెప్పారు. తాను అడగ్గానే ఎంఎంటీఎస్, శంషాబాద్ ఎయిర్ పోర్టులను మంజూరు చేశారని అన్నారు.

క్రమశిక్షణ, నిబద్ధతకు మారుపేరు వాజ్ పేయ్ : సచిన్

ఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతిపై ఇండియా క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన, నిబద్ధత కలిగిన నాయకుడు అటల్ బిహారి వాజ్‌పేయి అనీ వాజ్‌పేయి మృతితో భారతదేశం ఎంతో నష్టపోయిందని ఆయన అన్నారు. ఈరోజు భారత్ చాలా నష్టపోయింది. భారత దేశానికి అటల్ బిహారీ వాజ్‌పేయి జీ ఎన్నో అసంఖ్యాకమైన సేవలు అందించారనీ.. ఆయన కుటుంబసభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.

పీడితుల పోరాటం గొంతు మూగబోయింది : అమిత్ షా

ఢిల్లీ : చట్టసభల్లో పీడితుల పక్షాన పోరాటం చేసిన గొంతు మూగబోయిందని వాజ్ పేయి పార్థివదేహాన్ని సందర్శించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. వాజ్ పేయి మృతితో కోట్లాది మంది యువకులు తమ ప్రేరణను కోల్పోయారని, ఆయన లేని లోటు ఎవ్వరు, ఎప్పటికీ తీర్చలేనిదన్నారు. జనసంఘ్, బీజేపీ అభివృద్ధిలో వాజ్ పేయి ఎంతో కృషి చేశారని, తమకు ఆయన మార్గ నిర్దేశం చేశారని, అటల్ ఏం చెప్పినా..ఏం చేసినా దేశ హితం కోసమే ఉండేదని అమిత్ షా కొనియాడారు.

రాజకీయ ధృవతార,సాహితీ శిఖరం నేలకొరిగింది : అమిత్ షా

ఢిల్లీ : ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి నేరుగా వాజ్ పేయి నివాసానికి పార్థివదేహం చేరుకుంది. వాజ్ పేయి పార్థివదేహాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సందర్శించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత రాజకీయాల్లో ఓ ధృవతార రాలిపోయిందని విచారం వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకొరిగిందని, గొప్ప జర్నలిస్టును కోల్పోయామని అమిత్ షా పేర్కొన్నారు. 

నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన నేత వాజ్ పేయ్ : కేసీఆర్

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వాజ్ పేయి తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన వాజ్ పేయి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ కోరారు. ఆయన మృతి తీరని లోటన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా, ప్రధానిగా విలువలతో కూడిన రాజకీయాలను నడిపి దేశానికే కాక యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వాజ్ పేయి అని కేసీఆర్ నివాళులు అర్పించారు.  

మరణం గురించి వాజ్ పేయ్ స్ఫూర్తినిచ్చే కవిత..

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయ్ గురించి బైట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువనే చెప్పాలి. రాజకీయాలలో అందె వేసిన చేయిగా అనే విషయం తెలిసిందే. కానీ ఆయన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచారు. గెలిచారు. పలుమార్లు మృత్యువుతో పోరాడిన వాజ్ పేయ్ ఆయనకుండే విల్ పవర్ తో మృత్యువుపై విజయం సాధించారు. 1988లో వాజ్‌పేయి తన మరణం ఖాయమని భావించారు. పలుమార్లు మృత్యువు సమీపం వరకూ వెళ్లి గత తొమ్మిదేళ్లుగా దానితో పోరాటం చేసిన ఆయన చివరికి 93 ఏళ్ల వయసులో మృత్యువుతో స్నేహం చేసి వెళ్లిపోయారు.

09:38 - August 17, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని, భారత రత్న వాజ్ పేయి పార్థివ దేహాన్ని సందర్శించి పలువురు నివాళులర్పిస్తున్నారు. గురువారం ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. వాజ్‌పేయి పార్థివ దేహాన్ని ఢిల్లీలోని కృష్ణమీనన్‌ మార్గ్‌లో ఆయన ఇంటికి తరలించారు. అక్కడకు నేతలు, కార్యకర్తలు, ప్రజలు నివాళులర్పించేందుకు బారులు తీరారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నివాళులర్పించిన వారిలో ఉన్నారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని, ఆయన మృతి తీరని లోటు అని వెల్లడిస్తున్నారు. ఆయన చేసిన పనులను గుర్తు చేసుకుంటున్నారు.

బీజేపీ కేంద్ర కార్యాలయానికి వాజ్ పేయి పార్థీవ దేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మీ వాహనంలో తరలించనున్నారు. మధ్యాహ్నం వరకు నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు యమునా నదీ తీరాన అధికార లాంఛనాలతో జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి వాజ్‌పేయి అంతిమ యాత్ర మొదలవుతుంది. 

ఉప ఖండంలోనే గొప్ప నేత వాజ్‌పేయి : ఇమ్రాన్ ఖాన్

ఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతికి పాక్ కాబోయే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం తెలిపారు. భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాల బలోపేతానికి వాజ్‌పేయి చేసిన కృషి, పడిన తపన ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. వాజ్‌పేయి ఉప ఖండంలోనే గొప్ప నేత అని ఇమ్రాన్ కొనియాడారు. పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ విజయం సాధించింది. కాగా శనివారం ఇమ్రాన్ పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

వాజ్‌పేయి మృతికి సంతాపంగా 16 రాష్ట్రాల్లో సెలవు..

ఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతికి సంతాప సూచకంగా 16 రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవని ప్రకటించాయి. రాజకీయ దురంధురుడు వాజ్ పేయ్ మృతికి సంతాపంగా మొత్తం 16 రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. వాటిలో గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, హరియాణా, గోవా, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాలున్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించింది.

సంస్కరణలకు ఆద్యుడు వాజ్ పేయ్ : చంద్రబాబు

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయ్ మృతికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..భారతదేశంలో సంస్కరణలకు ఆద్యుడు వాజ్ పేయ్ అని పేర్కొన్నారు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. కాగా వాజ్ పేయ్ గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతు చికిత్స నిమిత్తం జైన్ 11న ఎయిమ్స ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటు ఆగస్టు 16 సాయంత్రం 5.05 గంటలకు మృతి చెందిన విషయం తెలిసిందే.

వాజ్ పేయ్ మృతికి ఆయా ప్రభుత్వాల గౌరవార్థం..

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయ్ పార్థివదేహానికి పలువురు నివాళులర్పించారు. ఆయన మృతి సందర్భంగా కేంద్రం ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. నేడు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కారాలయాలు, విద్యాసంస్థలకు కేంద్రం సెలవు ప్రకటించింది. కాగా వాజ్ పేయ్ పై వున్న గౌవరంతో ఏపీ ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించగా..తెలంగాణ ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. కాగా మ.1గంటల వరకూ సందర్శకులకు 1.30గంటలకు అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటలకు రాజ్ ఘాట్ సమీపంలో రాష్ట్రీయ స్మృతిస్థల్ లో వాజ్ పేయ్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

09:19 - August 17, 2018

ఢిల్లీ : వాజ్ పేయికి వాజ్ పేయి సాటి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. శుక్రవారం ఆయన ఢిల్లీకి చేరుకుని వాజ్ పేయి పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రిఫామ్స్ కు ఆద్యుడని, టెలీకమ్యూనికేషన్, నేషనల్ హైవే, మైక్రో ఇరిగేషన్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇతరత్రా వాటిని ముందుకు తీసుకొచ్చారన్నారు. ఆయన చనిపోవడం దేశానికి పెద్ద లోటు అని, ఆయన అందరికీ ఆదర్శమన్నారు. ఒక ప్రధానిగా, ఒక ప్రతిపక్ష నేతగా, ఒక పార్లమెంటేరీయన్ గా వ్యవహరించారని తెలిపారు. తాను చేపట్టిన హైటెక్ సిటీని వాజ్ పాయి ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. ఒక కలుపుగోలుతనం..దేశ భవిష్యత్ కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం వెళ్లారన్నారు.

తాను ఢిల్లీకి వస్తుంటే నిధుల కోసమే వస్తున్నారని కొందరు అనుకొనే వారని పేర్కొన్నారు. మలేషియాలో కొన్ని రోడ్లు చూసి దేశంలో ఉన్న రోడ్ల విషయాన్ని వాజ్ పేయికి తెలియచేయడం జరిగిందని, చెన్నై - నెల్లూరు రోడ్ ను మలేషియా కంపెనీ వేసిందన్నారు. ఆయన ఉన్న సమయంలో గవర్నమెంట్ ని ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా పాలన కొనసాగించారని తెలిపారు. 1998లో బలపరీక్ష సమయంలో ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయిందన్నారు. 

వామపక్ష విద్యార్థిగా వాజ్ పేయ్..

ఢిల్లీ : మాజీ ప్రధాని, భారతరత్న వాజ్‌పేయి జీవితం గురించి బయటకు తెలిసింది కొంతే. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా కొంత మిగిలే ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులు, సన్నిహితుల ఉవాచ. 1942లో అన్నయ్య ప్రేమ్‌తో కలిసి వాజ్‌పేయి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. తమ ప్రసంగాలతో ప్రజలను చైతన్య పరిచారు. దీంతో కన్నుకుట్టిన బ్రిటిష్ ప్రభుత్వం ఇద్దరినీ 23 రోజులపాటు జైలులో నిర్బంధించింది. ఇక, ఆరెస్సెస్‌కు వాజ్‌పేయి వీరాభిమాని అయినప్పటికీ తొలినాళ్లలో ఆయన కమ్యూనిస్టు అనేది చాలామందికి తెలియని విషయం.

బీహార్ మంత్రి నివాసంలో సీబీఐ సోదాలు...

బీహార్ : రాష్ట్ర వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ మంత్రి మంజు ఇంటిపై సీబీఐ దాడి చేసింది. పాట్నా, మరో ప్రాంతంలో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ముజఫర్ షెల్టర్ హోం కేసుకు సంబంధించిన సీబీఐ తనిఖీలు చేసినట్లు సమాచారం. 

వాజ్ పాయికి బాబు నివాళి...

ఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న వాజ్ పాయి పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం ఆయన ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. 

తాలిపేరు గేట్లు ఎత్తివేత...

ఖమ్మం : తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇన్ ఫ్లో 2974 క్యూసెక్కులుగా ఉంది. 22 గేట్లను ఎత్తివేసి 31480 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. 

08:27 - August 17, 2018

ఢిల్లీ : భారత మాజీ ప్రధాని వాజ్ పేయి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. ఏయిమ్స్ ఆసుపత్రి నుండి ఆయన నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. శుక్రవారం వాజ్ పేయి నివాసం వద్దకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. నివాళి అర్పించేందుకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. వాజ్ పేయి చేసిన పనులను పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

శుక్రవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. వాజ్‌పేయి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు యమునా నదీ తీరాన అధికార లాంఛనాలతో జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి వాజ్‌పేయి అంతిమ యాత్ర మొదలవుతుంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

ఢిల్లీకి బాబు...

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు. మాజీ ప్రధాని వాజ్ పేయి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించేందుకు ఆయన హస్తినకు బయలుదేరారు. 

గొప్ప నేత వాజ్ పేయి - టీఆర్ఎస్ ఎంపీలు...

ఢిల్లీ : గొప్ప మనస్సున్న నాయకుడు వాజ్ పేయి అని, అందరి హృదయాల్లో నిలిచిపోయారని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మృతి తీరని లేటని..భారతదేశం గొప్ప నేతను కోల్పోయిందని తెలిపారు. ఆయన గొప్ప మహానుభావుడని..అజాతశత్రువని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు తెలిపారు. ఆయన మృతి తీరని లోటని, తనకు ఎంతో బాధగా ఉందన్నారు. ఎవరినీ శత్రువులుగా భావించలేదని..అందర్నీ కలుపుకుని పాలించారని తెలిపారు. 

08:18 - August 17, 2018

ఢిల్లీ : భారత మాజీ ప్రధాని వాజ్ పేయి భౌతికకాయాన్ని పలువురు నేతలు సందర్శించి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇకలేరు. గత కొంతకాలంగా మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం కన్నుమూశారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్, నేతలు నివాళులర్పించారు.

ప్రపంచంలో ఆదర్శవంతమైన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్ధడంలో ఆయన ఎనలేని కృషి చేశారని అలాంటి వ్యక్తి మన మధ్యలో లేరని పలువురు తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గొప్ప మహామనిషి, భారత రత్న వాజ్ పేయి మృతి తీరని లోటని వైసీపీ ఎంపీ పేర్కొన్నారు. కులాలకు..మతలాకతీతంగా దేశాన్ని నడిపించారని, ప్రజాస్వామ్యాన్ని ఆయన రక్షించారని పేర్కొన్నారు. పాక్ విషయంలో స్నేహ హస్తం అందించారని తెలిపారు.

అందరి హృదయాల్లో వాజ్ పేయి ఉంటారని..గొప్ప మహా పురుషుడని తెలుగు రాష్ట్రాల గవర్నర్ తెలిపారు. అంతటి గొప్ప నేత కోల్పోవడం బాధగా ఉందన్నారు.

గొప్ప మనస్సున్న నాయకుడని, అందరి హృదయాల్లో నిలిచిపోయారని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మృతి తీరని లేటని..భారతదేశం గొప్ప నేతను కోల్పోయిందని తెలిపారు. ఆయన గొప్ప మహానుభావుడని..అజాతశత్రువని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు తెలిపారు. ఆయన మృతి తీరని లోటని, తనకు ఎంతో బాధగా ఉందన్నారు. ఎవరినీ శత్రువులుగా భావించలేదని..అందర్నీ కలుపుకుని పాలించారని తెలిపారు. 

వాజ్ పేయికి గవర్నర్ నరసింహన్ నివాళి...

ఢిల్లీ : అందరి హృదయాల్లో వాజ్ పేయి ఉంటారని..గొప్ప మహా పురుషుడని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ త తెలిపారు. వాజ్ పాయి పార్థివ దేహానికి ఆయన నివాళి అర్పించారు. అంతటి గొప్ప నేత కోల్పోవడం బాధగా ఉందన్నారు. 

07:31 - August 17, 2018

దొంగల బీభత్సం..వ్యక్తి మృతి...

రంగారెడ్డి : రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. హైదర్ గూడ సిరిమల్ల కాలనీలో ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. అడొచ్చిన వారిపై దాడి చేయడంతో వ్యక్తి మృతి చెందాడు. రూ. 40 లక్షల నగదు, బంగారాన్ని అపహరించారు. 

గోదావరి నీటిమట్టం పెరుగుతోంది...

విజయవాడ : గోదావరి నీటి మట్టం క్రమ క్రమంగా పెరుగుతోంది. దేవీపట్నం మండల కేంద్రాన్ని వరద చుట్టుముడుతోంది. ఆరు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

పొంగిపొర్లుతున్న శబరి నది...

తూర్పుగోదావరి : శబరి నది పొంగిపొర్లుతోంది. చింతూరు మండలం వరద గుప్పిట్లో చిక్కుకపోయింది. జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో ఛత్తీస్ గడ్ కు రాకపోకలు నిలిచిపోయాయి. 

06:41 - August 17, 2018

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయపరపతి సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనపట్టారు. తమకు వెంటనే వేతన సవరణ చేసి వేతనాలు పెంచాలని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో.. కేంద్ర సహకార బ్యాంకుల్లో ఉన్న ఖాళీలను నింపాలని తదితర డిమాండ్లతో.. వారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనకు గల కారణాలు, వీరి పట్ల ప్రభుత్వ విధానంపై సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్‌ గౌరవ అధ్యక్షులు అజయ్‌కుమార్‌ టెన్ టివి 'జనపథం'లో విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:39 - August 17, 2018

చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకోసారి ఆగమోక్తంగా నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం వైభవంగా ముగిసింది. ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకు ఆలయ అర్చకులు శ్రీ ఖాద్రి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఆనందనిలయ విమాన గోపురానికి మహాసంప్రోక్షణ జరిగింది. యాగశాల కార్యక్రమాల తర్వాత భోగశ్రీనివాసమూర్తి, ఉగ్రశ్రీనివాసమూర్తితో పాటు ఇతర దేవతామూర్తులను పూర్వస్థానాల్లోకి వేంచేపు చేయించారు. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా 27 హోమగుండాల్లో పూర్ణాహుతి నిర్వహించారు. గర్భాలయంలో శ్రీవారి మూలమూర్తికి, ఉపాలయాల్లోని స్వామి వారి విగ్రహాలకు ఆగమోక్తంగా కళావాహనం నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యేక ఆరాధనలు, విశేష నైవేద్యాలు సమర్పించాక, అక్షతారోపణంతో మహాసంప్రోక్షణ కార్యక్రమం పూర్తయింది. శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుంచి భక్తులకు యథావిధిగా శ్రీవారి దర్శనాన్ని కల్పించనున్నారు. మహాసంప్రోక్షణ వేళ సహకరించిన భక్తులకు టీటీడీ ధన్యవాదాలు తెలిపింది. 

06:37 - August 17, 2018

హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలపై మంత్రి కేటీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. కేటీఆర్‌ వ్యవహారశైలిపై టీ కాంగ్రెస్‌ నాయకులు మండిపడుతున్నారు. మంత్రి పై ముప్పేట దాడి ప్రారంభించారు. కేటీఆర్‌ కుసంస్కారానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి కొత్త బిచ్చగాళ్లు వచ్చారంటూ, సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్టు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వస్తున్నారని మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లలో ప్రజల ముఖం చూడని కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం మళ్లీ తెలంగాణకు వస్తున్నారన్నారని విమర్శించారు.

మంత్రి కేటీఆర్‌ చేసిన ఈ విపరీత వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. స్థాయి మరిచి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. కాంగ్రెస్‌ నాయకులపై కేటీఆర్‌ నోరు పారేసుకోవడం తగదన్నారు ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్‌. కేటీఆర్‌ కుసంస్కారానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శించారు. కేటీఆర్‌ హుందా మరిచి రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. రాజీవ్‌గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కేటీఆర్‌ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ సంస్కారంలేకుండా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ నోరు అదుపులో పెట్టుకోపోతే తీవ్ర పరిణామాలు తప్పవని పొన్నం ప్రభాకర్‌ హెచ్చరించారు. కేటీఆర్‌ స్థాయిని మరిచి విమర్శలు చేస్తున్నారని మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి ఓర్వలేక అక్కసుతోనే కేటీఆర్‌ విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని టీ కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. 

06:34 - August 17, 2018

విజయవాడ : రాజధాని అమరావతి నిర్మాణంలో వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. అమరావతి బాండ్లకు మదుపర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చిన నేపథ్యలో రెట్టించిన ఉత్సాహంతో రాజధాని పనులు పూర్తి చేయాలని సీఎం కోరారు. ప్రకాశం బ్యారేజీ పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సీఆర్‌డీఏ సమీక్షలో చంద్రబాబు ఆదేశించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ప్రతి గురు, శుక్రవారాల్లో అధికారులందరూ గ్రామాలను సందర్శించాలని చంద్రబాబు కోరారు.

బాంబే స్టాక్‌ ఎక్సేంజిలో అమరావతి బాండ్లకు మదుపర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. గంట వ్యవధిలోనే రెండువేల కోట్ల రూపాయలను సమీకరించిన నేపథ్యంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులను రెట్టించిన ఉత్సాహంతో పూర్తి చేయాలని ఆదేశించారు. జరుగుతున్న అన్ని పనులు జాప్యం లేకుండా, త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు.

ప్రకాశం బ్యారేజి పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. కృష్ణానది అభిముఖంగా ఉన్న చిన్న చిన్న కొండలను సుందరీకరించాలని కోరారు. కొండ ప్రాంతాల్లో పూల తోటలు, హరిత వనాలు పెంచాలని చంద్రబాబు సూచించారు. విజయవాడలోని మూడు కాల్వలను సుందరీకరించాలని ఆదేశించారు. కృష్ణానది మధ్యలో ఉన్న రెండు దీవులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు యూఏఈకి చెందిన బీఎల్‌ఎఫ్‌, సీఆర్‌డీఏ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదరింది.

మరోవైపు గ్రామదర్శిని చేపట్టి నెల రోజులు పూర్తైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. జిల్లా కలెక్టర్లు, నోడల్‌ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ ఏడాది డిసెంబర్‌ వరకు కొనసాగే గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రజా సమస్యలన్నీ పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి గురు, శుక్రవారాల్లో అధికారులందరూ గ్రామాలను దర్శించాలని చంద్రబాబు కోరారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అంతర్గత ప్రక్షాళన జరగాలని సూచించిన చంద్రబాబు.. మూడు నెలల్లో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి డోర్‌ నంబర్‌తోపాటు ప్రతివీధికి సెన్సార్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు ప్రధాన్యత ఇస్తూ.. సీసీ కెమెరాలు, డ్రోన్లతో పోలీసు వ్యవస్థను పటిష్టిం చేయాలని కోరారు. ఇప్పటికే 5 వేల కెమెరాలు ఉన్నాయని, మరో 23 వేలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని కోరారు. రోడ్లపై మురుగునీరు ప్రవహించకుండా డ్రెయిన్ల నిర్మాణాన్ని ముమ్మరం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకున్న అంశంపై కూడా చంద్రబాబు సమీక్షించారు. వ్యవసాయ పనులు మమ్మరం కావడంతో రైతుల్లో ఆనందం నెలకొన్న విషయాన్ని ప్రస్తావించారు. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని చంద్రబాబు అధికారుల దృష్టికి తెచ్చారు. 

06:33 - August 17, 2018

హైదరాబాద్ : కంటివెలుగు కార్యక్రమం ప్రజావైద్యంలో చారిత్రకమైన ముందడుగు అన్నారు మంత్రి కేటీఆర్. శేరిలింగంపల్లి, చందానగర్‌, హఫీజ్‌పేట్‌లో కంటివెలుగు కార్యక్రమం సెంటర్లను పరిశీలించారు మంత్రి కేటీఆర్‌. ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు చేయించాలన్న సదుద్దేశంతోనే కంటివెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. 

06:31 - August 17, 2018

విజయవాడ : వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్షించారు. వైద్యసేవల్లో నూతన పరిశోధనలకు ఏపీ మార్గదర్శకం కావాలని ఆకాంక్షించారు. విశాఖలోని మెడ్‌టెక్‌ వంటి సంస్థలతో నూతన ఆవిష్కరణలకు నాందీ పలకాలన్నారు సీఎం. ఈ సమావేశంలో వైద్యఆరోగ్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, సీఎంఓ కార్యదర్శి గిరిజా శంకర్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

06:29 - August 17, 2018

విజయవాడ / హైదరాబాద్ : మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. దేశం ఒక గొప్ప నేతను కోల్పోయిందని కీర్తించారు. వాజ్‌పేయి మృతి దేశానికి తీరని లోటని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి మృతితో భారతదేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేశారని... నమ్మిన ఆదర్శాలను నిజ జీవితంలో ఆచరించి చూపారన్నారు. ఆయన పరిపాలన, రాజకీయ అనుభవాలు వాజ్‌ పేయి శకంగా భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందన్నారు సీఎం.

వాజ్ పేయి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియ‌న్‌గా, ప్రధానిగా విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌ను న‌డిపి దేశానికే కాక యావ‌త్ ప్రపంచానికే ఆద‌ర్శంగా నిలిచిన వాజ్ పేయి మృతి తీర‌ని లోట‌ని కేసీఆర్‌ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.

నీతికి నిజాయితీకి ప్రతిరూపంగా నిలిచిన ఉత్తమ రాజకీయ నితిజ్ఞుడు వాజ్‌పేయి అని కీర్తించారు బీజేపీ నేత కిషన్‌ రెడ్డి. కులాలకతీతంగా, భాషలకతీతంగా పనిచేసి ఆజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న దార్శనికుడన్నారు.

ప్రధానిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా వాజ్‌పేయి మంచి పేరుతెచ్చుకున్నారని కీర్తించారు బీజేపీ నేత లక్ష్మణ్‌. బీజేపీ ఎంపీ హరిబాబు వాజపేయి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

భారతదేశ అభివృద్ధి కొరకు వాజ్‌పేయి అనేక రకాలుగా కృషి చేశారన్నారు కాంగ్రెస్‌ నేత జానారెడ్డి. అనేక ఆర్థిక సంస్కరణలకు ఆయన ఆద్యుడన్నారు. మానవతావాది, కవిగా ఈ రోజు కూడా పార్లమెంట్‌లో వాజపేయిని గుర్తు చేసుకుంటున్నారన్నారు టీడీపీ ఎంపీ తోట నరసింహం. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన నాంది పలికారన్నారు. కవి, సిద్ధాంతకర్త, వక్త, నిరాడంబరుడు, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేసిన వాజ్‌పేయిని నేతలు తలచుకున్నారు. వాజ్‌పేయితో కలిసి పనిచేసిన అనుభవాలను స్మరించుకున్నారు.  

06:27 - August 17, 2018

ఢిల్లీ : భారతరత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దేశం మహానేతను కోల్పోయిందని శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న ఏబీ వాజ్‌పేయి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. దేశం మహానేతను కోల్పోయిందని.. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. ప్రధాన మంత్రి మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు, ఏఐసీసీ అధ్యక్షుడు, యూపీఏ చైర్‌పర్సన్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పాటు పలురాష్ర్టాల ముఖ్యమంత్రులు నివాళి అర్పించారు. 

దేశాన్ని సంస్కరణల పథంలో నడిపిన మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతి తీరనిలోటన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. వాజ్‌పేయితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకుని నివాళి అర్పించారు. మాజీ ప్రధాని అటల్‌ జీ దూరం కావడం చాలా బాధాకరం అన్నారు ప్రధాని మోదీ. ఆయన స్ఫూర్తి, ప్రేరణ, మార్గదర్శనం ప్రతి భారత పౌరుడు స్మరించుకుంటూ ముందుకు సాగాలన్నారు. వాజ్‌పేయి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా అన్నారు.

భారత రత్న ఏబీ వాజ్‌పేయి మృతితో గొప్ప రాజనీతిజ్ఞుడ్ని కోల్పోయామన్నారు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు నివాళి అర్పించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతి పట్ల బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషి సంతాపం ప్రకటించారు. వాజ్‌పేయి దేశాభివృద్ధికి ఎంతో శ్రమించారని నివాళులర్పించారు. వాజ్‌పేయి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన మురళీమనోహర్‌ జోషి... ఆయన మరణ దేశానికి తీరని లోటన్నారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతిపట్ల ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఆయనలేని లోటు తీర్చలేనిదన్నారు. వాజ్‌పేయి పాలనాకాలంలోనే ఛత్తీస్‌గఢ్‌ ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలు ఏర్పడ్డాయని గుర్తుచేసుకున్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ప్రధానిగా వాజ్‌పేయి ప్రజల జీవితాల్లో చెరగనిముద్ర వేసుకున్నారని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ నివాళులర్పించారు. సంకీర్ణ ప్రభుత్వాన్నిసుస్థిరంగా నడిపిన ప్రధానిగా వాజ్‌పేయి దేశ రాజకీయాలను మలుపుతిప్పారని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నివాళులర్పించారు. ప్రజలు ఎంతగానో ప్రేమించిన ప్రధానమంత్రుల్లో ఒకరు, గొప్ప కవి అయిన మహానేత మృతి దేశానికి తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఈ ఆయన రాజనీతిని, ప్రతిభను కొనియాడుతూ నివాళి అర్పించారు. 

బీజేపీ కేంద్ర కార్యాలయానికి వాజ్ పేయి పార్థీవ దేహం...

ఢిల్లీ : భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి పార్థివ దేహాన్ని ఢిల్లీలోని కృష్ణమీనన్‌ మార్గ్‌లో ఆయన ఇంటికి తరలించారు. ప్రధాని మోది వాజ్‌పేయికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని శుక్రవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. 

06:22 - August 17, 2018

ఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇకలేరు. గత కొంతకాలంగా మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన నిన్న కన్నుమూశారు. వాజ్‌పేయి మృతికి సంతాపంగా కేంద్రం శుక్రవారం జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ఏడు రోజులు సంతాప దినాలు పాటిస్తున్నట్లు వెల్లడించింది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని యమునా నదీ తీరాన వాజ్‌పేయి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరగనున్నాయి. గత 9 వారాలుగా ఎయిమ్స్‌లో మృత్యువుతో పోరాడుతున్న భారత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి కన్ను మూశారు. గురువారం సాయంత్రం 5 గంటల 5 నిముషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్‌ వైద్యులు హెల్త్‌బులెటిన్‌ ద్వారా ప్రకటించారు.

వాజ్‌పేయి పార్థివ దేహాన్ని ఢిల్లీలోని కృష్ణమీనన్‌ మార్గ్‌లో ఆయన ఇంటికి తరలించారు. ప్రధాని మోది వాజ్‌పేయికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని శుక్రవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. వాజ్‌పేయి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు యమునా నదీ తీరాన అధికార లాంఛనాలతో జరగనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి వాజ్‌పేయి అంతిమ యాత్ర మొదలవుతుంది.

కిడ్నీ ఇన్ఫెక్షన్‌, శ్వాస తీసుకోవడం కష్టం కావడం, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్న 93 ఏళ్ల వాజ్‌పేయిని జూన్‌ 11న ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. మంగళవారం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ప్రధాని నరేంద్రమోది, బిజెపి చీఫ్‌ అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత ముఖ్యమంత్రులు ఎయిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

వాజపేయి 2005 డిసెంబరులో క్రియాశీల రాజకీయాలకు స్వస్తి చెప్పారు. 2009 ఫిబ్రవరి 6న వాజ్‌పేయికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ రావడంతో ఎయిమ్స్‌లో చేరి డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయనకు గుండెపోటు, పక్షవాతం రావడంతో మాట దెబ్బతిన్నది. ఆపై ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయారు. మధుమేహం, మూత్రపిండాల ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆయన కిడ్నీల్లో ఒకదానిని గతంలోనే తొలగించారు. వాజ్‌పేయి మృతికి సంతాపంగా శుక్రవారం దేశవ్యాప్తంగా జాతీయ సెలవు దినంగా కేంద్రం ప్రకటించింది. ఆయన మృతికి వారం రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏడు రోజులపాటు జాతీయ జెండాను అవనతం చేయనున్నారు.

వాజ్ పేయి అంతిమ యాత్ర...

ఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్ పేయి అంతిమయాత్ర నేడు మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కానుంది. సాయంత్రం 5గంటలకు రాజ్ ఘాట్ సమీపంలో రాష్ట్రీయ స్మృతిస్థల్ లో అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం వాయిదా...

ఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం వాయిదా పడింది. ఈనెల 18, 19వ తేదీల్లో నిర్వహించాల్సిన సమావేశం వాయిదా వేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. 

వారం రోజులు సంతాప దినాలు...

ఢిల్లీ : వాజ్ పేయి మృతికి వారం రోజులు కేంద్రం సంతాప దినాలు ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం సమచారం చేరవేసింది. 

Don't Miss