Activities calendar

18 August 2018

21:43 - August 18, 2018

ఢిల్లీ : కేంద్రం చేసిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతల సమావేశంలో రాహుల్‌గాంధీ భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించారని.. క్షేత్రస్థాయిలో పర్యటించి బీజేపీ అవినీతిని ప్రజలకు వివరిస్తామన్నారు. 

21:39 - August 18, 2018

గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు జోరందుకున్నాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునగడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
కృష్ణమ్మ పరుగులు 
భారీ వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. పరుగుపరుగునా నాగార్జున సాగర్‌కు చేరుతోంది. తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుతున్న వరద నీటితో జలాశయం జలకళ సంతరించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులకు నీరు చేరింది. ఎగువ నుంచి మరింత వరద వస్తుండటంతో ముందు జాగ్రత్తగా నీటిని దిగువకు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు కృష్ణమ్మకు పూజాది కార్యక్రమాలు నిర్వహించి సారె సమర్పించారు. అనంతరం జలాశయం 5,6,7,8 గేట్లను ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. కృష్ణమ్మ పరవళ్లుతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి ఉగ్రరూపం 
రాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదిలో వరద పెరగటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరదల్లో చిక్కుకునే వారిని కాపాడటం కోసం సహాయ, పునరావాస చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే పలు చోట్ల వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
గర్భిణిలు అవస్తలు 
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలో వరద నీరు ఎక్కువగా ఉండటంతో గర్భిణిలు అవస్తలు పడుతున్నారు. మోకాళ్లలోతు నీటిలో నడుచుకుంటూ ఆస్పత్రికి వెళ్లారు. తూర్పు గోదావరి జిల్లాలో వరద పరిస్థితిపై కలెక్టర్ కార్తికేయ మిశ్రా... పై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం భద్రాచలం ఎటపాక వద్ద 44.6 అడుగుల వరద నీటి మట్టం వుందని, ఇది మొదటి ప్రమాద హెచ్చరిక స్తాయివద్ద వున్నట్లు కలెక్టర్ తెలిపారు. ధవళేశ్వరం వద్ద 14.6 అడుగు వరద నీరు ప్రవహిస్తోందని, ఇక్కడ రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందన్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలను చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. 
గ్రామాల్లోకి వరద నీరు 
గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అల్లవరం మండలంకు చెందిన బోడసకుర్రు, గోపాయిలంక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. లంకగ్రామాల్లో వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో ఇళ్లు ఖాళీ చేసి రోడ్లపైకి పరుగులు పెడుతున్నారు.
నీట మునిగిన లంక గ్రామాలు 
ముమ్మిడివరం మండలంలో లంక గ్రామాలు నీట మునిగాయి. పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ట్రాక్టర్లతో, ఎద్దుల బండ్లపై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మండలంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వరద ముంపు నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
గిరిజన గ్రామాలకు వరదనీరు 
తూ.గో జిల్లా దేవిపట్నం మండలంలోని పలు గిరిజన గ్రామాలకు వరదనీరు పోటెత్తింది. రంపచోడవరం పీవో నిశాంత్‌ కుమార్‌ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హుటాహుటిన ప్రజలను సహాయక బృందాలను అప్రమత్తం చేశారు. ముంపు గ్రామాలను సహాయక బృందాలను పంపి గ్రామస్థులను అప్రమత్తం చేసి తాత్కాలిక స్ధావరాలను ఏర్పాటు చేశారు. నిత్యావసర వస్తువులు, వైద్యబృందాలను అందుబాటులో ఉంచారు. పలు ప్రాంతాల్లో నీటమునిగిన గ్రామస్థులను పునరావాస కేంద్రాలకు తరలించారు. 
పోలవరం ప్రాజెక్ట్‌లోకి వరద నీరు 
పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరగటంతో పోలవరం ప్రాజెక్ట్‌లోకి వరద నీరు చేరింది. స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ నీటిలో మునిగిపోయాయి. పోలవరంలోకి నీరు చేరటంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు శ్రీకాకుళం మురికిమయంగా మారింది. చెత్తా చెదారం, నీటి నిల్వలతో బెంబేలెత్తిస్తోంది. ఆర్టీసీ కాంప్లెక్సులు జలమయంగా మారిపోయాయి. 

 

21:33 - August 18, 2018

కేరళ : గత వంద ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కేరళలో జల ప్రళయం పెను విధ్వాంసాన్నే సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా వరద తాకిడికి 324 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 48 గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
జలదిగ్బంధంలో కేరళ  
గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ జలదిగ్బంధంలో కూరుకు పోయింది. నదులు, డ్యామ్‌లు ఉప్పొంగి పొర్లుతున్నాయి. డ్యామ్‌లలోకి వరదనీరు పోటెత్తడంతో 80 రిజర్వాయర్ల గేట్లను తెరిచారు. ఎటు చూసినా వరద నీరే కన్పిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
రోడ్లు, జాతీయ రహదారులు ధ్వంసం 
వరద బీభత్సానికి రోడ్లు, జాతీయ రహదారులు ధ్వంసమయ్యాయి. 10 వేల కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయి. రైల్వే మార్గాలకు కూడా నష్టం వాటిల్లింది.  వేలాది ఇళ్లు కూలిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా సగానికి పైగా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కమ్యునికేషన్‌ వ్యవస్థకు అంతరాయం కలిగింది. వరదల కారణంగా కేరళలో ప్రధానమైన రబ్బరు పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లింది. టూరిజం నిలిచిపోయింది. వర్షాల కారణంగా కోచి ఎయిర్‌పోర్టును ఆగస్టు 26 వరకు మూసివేశారు.
హెలిక్యాప్టర్ల ద్వారా సహాయక చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా వరద ప్రాంతాల్లో 320 పడవలు, 30 మిలటరీ హెలిక్యాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. తీర ప్రాంతాల గ్రామాలకు చెందిన వందలాది మత్స్యకారులు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు.
324 మంది మృతి
వర్షాలు, వరదల కారణంగా కేరళలో 324 మంది ప్రాణాలు కోల్పోగా...వందలాది మంది గాయపడ్డారు. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద నీటిలో చిక్కుకున్న 3 లక్షల మందికి పైగా ప్రజలను 2 వేల పునరావస కేంద్రాలకు తరలించారు. 14 జిల్లాలకు గాను 12 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.
శనివారం, ఆదివారం కూడా భారీ వర్షాలు 
శనివారం, ఆదివారం కూడా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జూన్‌లో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేరళలో 321 సెం.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు.

 

21:20 - August 18, 2018

ఇండోనేషియా : జకర్తా వేదికగా ఏసియాడ్‌ గేమ్స్‌ ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ క్రీడా సమరానికి ఇండోనేషియా రెండోసారి ఆతిథ్యమిస్తోంది. 16 రోజుల పాటు ఈ మెగా క్రీడా సంబరాలు జరగనున్నాయి. మొత్తం 45 దేశాల నుండి 11వేల మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 572 మంది అథ్లెట్లతో భారీ అంచనాలతో బరిలోకి దిగనుంది భారత్‌. టాప్‌-5 స్థానమే లక్ష్యంగా క్రీడా సమరంలో పాల్గొనబోతోంది. 
45దేశాల నుంచి 11వేల మంది అథ్లెట్లు  
ఆసియా క్రీడల్లో 45దేశాల నుంచి దాదాపు 11వేల మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. భారత్‌ నుంచి 36 క్రీడాంశాల్లో 572 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఆరంభ వేడుకలో భారత్‌ తరఫున జావెలిన్‌త్రో క్రీడాకారుడు నీరజ్‌ చోప్రా త్రివర్ణ పతాకంతో కవాతు చేశాడు. భారత బృందంలో 311 మంది పురుషులు, 260మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. పోటీలు ఆదివారం మొదలవుతాయి.
భారత అథ్లెట్లపై అభిమానులు గంపెడాశలు 
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెట్లపై అభిమానులు గంపెడాశలు పెట్టుకుంటున్నారు. రెజ్లింగ్, బాడ్మింటన్, షూటింగ్, అథ్లెటిక్స్, టెన్నిస్, బాక్సింగ్, జిమ్నాస్టిక్, టేబుల్ టెన్నిస్ తదితర అంశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గత ఒలింపిక్స్ పోటీల కంటే ఎక్కువగా పతకాలు సాధిస్తారనే గట్టి నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. రెజ్లింగ్ నుంచి బజరంగ్ పూనియా, సుశీల్ కుమార్, మహిళల విభాగం నుంచి వినేష్ ఫొగట్ పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నారు. ఇక బాడ్మింటన్ నుంచి పీవి సింధు, కిదాంబి శ్రీకాంత్‌పై ఆశలు పెట్టుకున్నారు. అటు షూటింగ్ నుంచి మనూ బాకర్, అథ్లెటిక్స్ నుంచి హిమ దాస్, జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, డిస్కస్ త్రోలో సీమా పూనియా, టెన్నిస్‌లో రోహన్ బొపన్న, దివిజ్ శరణ్ జోడీ, బాక్సింగ్ నుంచి వికాస్ కృష్ణన్, జిమ్నాస్టిక్స్‌-దీపా కర్మాకర్‌, టేబుల్ టెన్నిస్‌ నుంచి మనీకా బాత్రా మెడల్స్‌ తెస్తారని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. 
విశేషంగా ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు 
ఆసియా క్రీడల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పాప్‌ సింగర్‌ వియా వాలిన్‌ సాంగ్‌కు వీక్షకులను ఉర్రూతలూగించింది. ఏసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో ఇండోనేషియా కళాకారులు ప్రదర్శించిన యుద్ధరీతులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల్లో ఇండోనేషియా మత్స్యకారుల సాంప్రదాయ నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏసియా క్రీడల్లో ఇండోనేషియా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయగీతాన్ని ఆలపించారు.

 

21:08 - August 18, 2018

ప్రకాశం : వాళ్లంతా అనాథలు... చదువుకోవాలన్న ఆశ, ఆర్ధిక ఇబ్బందుల ఉన్న చిన్నారులను ఓ మత ప్రబోధకుడు తాను నడిపిస్తున్న సంస్థలోకి తీసుకువచ్చాడు. వారంతా అతను నిర్వహిస్తున్న ఎయిడెడ్‌ పాఠశాలలో విద్యనభ్యసిస్తూ.. హాస్టల్‌లో ఉంటున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది.  కానీ... తాజాగా ఆ హాస్టల్‌లో జరుగుతున్న ఆకృత్యాలు వింటూంటే... సేవ ముసుగులో పాస్టర్‌ చేసిన అరాచకాలు బయటపడ్డాయి. 
బాలికలపై జోసఫ్‌ నిత్యం లైంగిక వేధింపులు 
ప్రకాశం జిల్లా ఒంగోలులోని క్లౌపేటలో ఇండియా ఎవాంజిలకల్‌ రిలీఫ్‌ ఫెలోషిప్‌ పేరుతో కొడవటికంటి జోసఫ్‌ గత మూడున్నర దశాబ్ధాలుగా ఓ సంస్థను నడుపుతున్నాడు. ఇక్కడే ఎయిడెడ్‌ పాఠశాల, వసతి గృహం కూడా నిర్వహిస్తున్నారు. సేవ పేరుతో విదేశీ నిధులు సమీకరించి... కోట్ల రూపాయలు కూడబెట్టాడు. అతిపెద్ద భవనంలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఈ పాఠశాలకు ఆయన కుటుంబ సభ్యులే... కరస్పాండెంట్‌, హెడ్‌మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వీరు నిర్వహిస్తున్న హాస్టల్‌లో 156 మంది ఉండగా వారిలో 46 మంది బాలికలున్నారు. అయితే... బాలికలపై జోసఫ్‌ నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాలల సంరక్షణ కమిటీ సభ్యుల తనిఖీల్లో బయటపడింది. విద్యార్ధినులతో కమిటీ సభ్యులు చర్చించడంతో అనేక ఆకృత్యాలు వెలుగుచూశాయి. కన్నీళ్లు పెట్టుకుంటూ విద్యార్థినులు జోసఫ్‌ గురించి అనేక వాస్తవాలు బహిర్గతంగా చేయడంతో... కమిటీ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జోసఫ్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు జోసఫ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించింది. 
46 మంది విద్యార్థినులను ఐసీడీఎస్‌ కేంద్రానికి తరలింపు 
ఇక కలెక్టర్‌ ఆదేశాల మేరకు హాస్టల్‌లోని 46 మంది విద్యార్థినులను ఐసీడీఎస్‌ కేంద్రానికి తరలించారు. మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఏదో ఒకచోట ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉన్నాయని మహిళా కమిషన్‌ సభ్యులంటున్నారు. ఇలాంటి కీచకులు... చిన్నారులను కూడా వదిలిపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. సేవ ముసుగులో చిన్నారులపై వికృత చేష్టలకు పాల్పడిన జోసఫ్‌ను కఠినంగా శిక్షించాలని సమాజంలోని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. అదేసమయంలో... ఇలాంటి అంశాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 

 

21:00 - August 18, 2018

హైదరాబాద్‌ : మెట్రో రైలుకు రోజురోజుకు విశేష ఆదరణ పెరుగుతోంది. ట్రాఫిక్‌ నేపథ్యంలో మెట్రోలో ప్రయాణించేందుకు నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. హైదరాబాద్‌కు మెట్రో ఓ వరంలాంటిదని ప్రయాణికులు భావిస్తున్నారు. మియాపూర్‌-అమీర్‌పేట్‌-నాగోల్‌ వరకు 30 కిలోమీటర్ల మెట్రో ప్రయాణం అందుబాటులోకి రావడంతో ఆ మార్గంలో అనేకమంది మెట్రోలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. మెట్రో ప్రారంభంలో ప్రయాణికుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉన్నా... ఆ తర్వాత పెరుగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో సగటున 80 వేల నుండి 90 వేల మధ్య ఉన్న ప్రయాణికుల సంఖ్య తాజాగా లక్ష మార్కును దాటింది. 
ప్రజలకు అందుబాటులోకి మెట్రో రైలు 
గ్రేటర్‌లో ఉన్న ఆర్టీసీకి ఎంఎంటీఎస్‌లకు తోడుగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో ప్రయాణించి విసుగు చెందిన ప్రజలు మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే.. తొలిదశలో 30 కిలోమీటర్లు మాత్రమే అందుబాటులోకి తేవడంతో ప్రయాణికుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉండగా... ఇప్పుడిప్పుడే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు త్వరలోనే అమీర్‌పేట్‌-ఎల్బీనగర్‌ మార్గంలోని 17 కిలోమీటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.  
ప్రతిరోజు అనేకమంది మెట్రో రైళ్లలో ప్రయాణం 
ప్రతిరోజు అనేకమంది నగరవాసులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. మెట్రో రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని స్టూడెంట్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లతో  పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు. మెట్రో రైలు ద్వారా గమ్యస్థానానికి అనుకున్న సమయానికి చేరుకుంటున్నామని దీనివల్ల ఎంతో సమయం ఆదా అవుతుందని.. ఎలాంటి ప్రమాదాలు లేకుండా సురక్షితంగా ప్రయాణిస్తున్నామని నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
మెట్రోలో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి 
మొదట్లో ప్రయాణికులకు మెట్రోలో ప్రయాణించేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అధికారులు వాటికి పరిష్కారాలు చూపిస్తున్నారు. దీంతో మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రయాణికుల వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యంతో పాటు... మెట్రో స్టేషన్‌ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి సైకిళ్లు, బైక్‌లు ఏర్పాటు చేయడంతో మెట్రోలో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఆసక్తి కనబరుస్తున్నారు. 
మెట్రోలో ప్రయాణం బాగానే ఉన్నా.. 
మెట్రోలో ప్రయాణం బాగానే ఉన్నా.. సాధారణ ప్రజలకు చార్జీలు అందుబాటులో లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారులు మెట్రో చార్జీలు తగ్గిస్తే ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు 17 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభిస్తే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని మెట్రో అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా ఈ ఏడాది చివరినాటికి ఐటీ కారిడార్‌కు మెట్రోను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రెండు మార్గాలు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరగనుంది. నగరవాసులకు ట్రాఫిక్‌ కష్టాలు తొలిగిపోవడమే కాకుండా సుఖవంతమైన ప్రయాణం చేయవచ్చు. 
మెట్రోరైలు రాకతో తప్పిన ట్రాఫిక్‌ తిప్పలు 
మెట్రోరైలు రాకతో నాగోల్‌ అమీర్‌పేట మార్గంలో ప్రయాణికులు కాస్త ట్రాఫిక్‌ తిప్పలు తప్పాయి. అమీర్‌పేట్‌-ఎల్బీనగర్‌ రూట్‌ అందుబాటులోకి వస్తే... ఎంతోమంది నగరవాసులు సౌకర్యవంతమైన ప్రయాణం చేసేందుకు అనువుగా ఉంటుంది. అయితే... చార్జీలు అధికంగా ఉన్నాయన్న అభిప్రాయం ప్రయాణికుల నుంచి  వినిపిస్తోంది. మెట్రో అధికారులు దీనిపై దృష్టి సారిస్తే మెట్రో ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరిగి అవకాశం ఉంది. 
దూసుకుపోతోన్న మెట్రో రైలు  
మొత్తానికి భాగ్యనగరానికి మరో మణిహారమైన మెట్రో రైలు దూసుకుపోతోంది. మరో రెండు మార్గాల్లో మెట్రోరైలు రాకపోకలు ప్రారంభమైతే... మరింత ఆదరణ పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా చార్జీలను తగ్గిస్తే నగరవాసుల మరింత ఆసక్తి కనబరుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

 

కేరళ వరద బాధితులకు విరాళం ప్రకటించిన చిరంజీవి కుటుంబం

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు చిరంజీవి కుటుంబం విరాళం ప్రకటించింది. చిరంజీవి, రామ్ చరణ్ రూ. 25 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. చిరంజీవి తల్లి అంజనాదేవి రూ.లక్ష విరాళం ప్రకటించింది. రామ్ చరణ్ భార్య ఉపాసన 10లక్షల రూపాయల విలువైన మందులు విరాళంగా ఇచ్చారు. 

20:40 - August 18, 2018

ఢిల్లీ : ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కోఫీ అన్నన్‌ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా కోఫీ అన్నన్‌ మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చివరి రోజుల్లో భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఆయనతోనే ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం అస్వస్థతకు గురైన కోఫి అన్నన్‌ను స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఓ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గొప్ప వ్యక్తిని, నాయకుడిని, ముందుచూపు గల వ్యక్తిని కోల్పోయామని ఐక్యరాజ్యసమితి వలసల విభాగం ట్విటర్‌ ద్వారా నివాళులర్పించింది. ఆఫ్రికా నుంచి ఐక్యరాజ్యసమితికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు అన్నన్‌. జనవరి 1, 1997 నుంచి డిసెంబరు 31, 2006 వరకూ పదేళ్ళపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 2001లో ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ఘనాలోని కుమాసిలో జన్మించిన అన్నన్‌ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఐక్యరాజ్యసమితిలో ప్రధాన కార్యదర్శిగా ప్రపంచ శాంతి కోసం కోఫీ అన్నన్‌ ఎంతగానో కృషి చేశారు. సమగ్రాభివృద్ధి, మానవ హక్కుల కోసం కూడా ఆయన పాటుపడ్డారు. 

20:38 - August 18, 2018

విశాఖ : చంద్రబాబునాయుడు, అయ్యన్నపాత్రుడులు నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని వైఎస్‌ జగన్‌ అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్‌... చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయకపోయినా... భూములను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు-చెట్టు పేరుతో చెరువుల్లో తవ్వకాలు జరిపి మట్టితో పాటు... ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్నారంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయంతో గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. చంద్రబాబు పాలన అంతా మోసం, అవినీతి, అన్యాయమే అన్నారు. 

 

జకర్తా వేదికగా 18వ ఏసియాడ్ గేమ్స్ ప్రారంభం

ఇండోనేషియా : జకర్తా వేదికగా 18వ ఏసియాడ్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. ఇండోనేషియా రెండోసారి ఏసియాడ్ గేమ్స్ కు అతిథ్యమిస్తోంది. 16 రోజులు పాటు ఏసియాడ్ గేమ్స్ జరుగనున్నాయి. 45 దేశాల నుండి 11 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 572 మంది అథ్లెట్లతో భారీ అంచనాలతో భారత్ బరిలోకి దిగనుంది. భారత్ 5వ స్థానం లక్ష్యంగా పెట్టుకుంది.

19:52 - August 18, 2018

ఇండోనేషియా : జకర్తా వేదికగా 18వ ఏసియాడ్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. ఇండోనేషియా రెండోసారి ఏసియాడ్ గేమ్స్ కు అతిథ్యమిస్తోంది. 16 రోజులు పాటు ఏసియాడ్ గేమ్స్ జరుగనున్నాయి. 45 దేశాల నుండి 11 వేల మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 572 మంది అథ్లెట్లతో భారీ అంచనాలతో భారత్ బరిలోకి దిగనుంది. భారత్ 5వ స్థానం లక్ష్యంగా పెట్టుకుంది.

శ్రీశైలం ప్రాజెక్టు మరో రెండు గేట్లు ఎత్తిన అధికారులు

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టు మరో రెండు గేట్లను అధికారులు ఎత్తారు. 6 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 881.9 అడుగులు ఉంది. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

 

 

సీఎం చంద్రబాబుపై జగన్ మండిపాటు

విశాఖ : వైసీపీ అధినేత వైస్ ఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపట్టారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనంతా మోసం, అబద్ధాలు, అవినీతిమయమని విమర్శించారు. లంచాలు తీసుకునేది చంద్రబాబేనని ఆరోపించారు. జగన్ ప్రజా సంకల్పయాత్ర 239 రోజుకు చేరింది. నర్సీపట్నంలో ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

18:50 - August 18, 2018

విశాఖ : వైసీపీ అధినేత వైస్ ఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపట్టారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనంతా మోసం, అబద్ధాలు, అవినీతిమయమని విమర్శించారు. లంచాలు తీసుకునేది చంద్రబాబేనని ఆరోపించారు. జగన్ ప్రజా సంకల్పయాత్ర 239 రోజుకు చేరింది. నర్సీపట్నంలో ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మూడులక్షలు విలువ ఉన్న ప్లాట్ ను పేదవాడికి 6లక్షలకు అమ్ముతున్నాడని పేర్కొన్నారు. 20 సం.రాలు నెలకు మూడు వేల రూపాయల చొప్పున పేదవాడు కట్టాలని సీఎం చంద్రబాబు చెప్పారని తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయి...కనుక అపార్ట్ మెంట్లు ఇస్తాని చంద్రబాబు అంటున్నారని...ప్లాట్లు ఇస్తే తీసుకోండన్నారు. తాము అధికారంలోకి వస్తే.. ప్లాట్ కు కట్టాల్సిన మూడు లక్షల రూపాయలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 
మధ్యాహ్నం భోజన కార్మికుల తొలగింపు
ఐదు నెలల నుంచి మిడ్ డే మీల్స్ కు చంద్రబాబు డబ్బులు ఇవ్వడం లేదన్నారు. మధ్యాహ్నం భోజన పథకంలో పనిచేస్తున్న వెయ్యి మందిని తీసేశారని తెలిపారు. ఈ పథకాన్ని ప్రయివేట్ వ్యక్తులకు కాంట్రాక్టుకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. జాబు రావలంటే.. బాబు రావాలన్నారు.. బాబు వచ్చాడు.. కానీ జాబు రాలేదని ఎద్దేవా చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో అన్యాయ పాలన సాగుతుందన్నారు. బాబు నాలుగేళ్ల పాలనలో మోసం, అబద్ధాలు, అవినీతి జరిగిందని విమర్శించారు. 'అబద్ధాలు చేప్పేవాడు మీకు నాయకుడు కావాలా?' 'మోసం చేసేవాడు మీకు నాయకుడు కావాలా?'.. 'మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచించుకోవాలి' అని అన్నారు. చెడిపోయిన రాజకీయాల్లోకి నిజాయితీ, విశ్వసనీయత రావాలన్నారు. తనకు అందరి ఆశీస్సులు కావాలని కోరారు.

 

18:35 - August 18, 2018

హైదరాబాద్‌ : ఫిలింనగర్‌లోని  హైదరాబాద్ వైన్ మార్ట్‌లో భారీ చోరీ జరిగింది. వైన్ మార్ట్ షెటర్స్ తొలగించి దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. షాపులో గల నగదును దొచుకెళ్లారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

 

18:32 - August 18, 2018

మేడ్చల్ : జిల్లాలోని జవహర్ నగర్ లో దారుణం జరిగింది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం చెరువులో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు శాంతినగర్ కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

18:26 - August 18, 2018

పెద్దపల్లి : జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 39 ప్రసవాలను విజయవంతగా నిర్వహించారు వైద్యులు. ఉమ్మడి కరీంనగర్  జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగాయి. గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి ప్రసవాలతో పాటు సాధారణ రోగుల సంఖ్య పెరుగుతోందని వైద్యశాల సూపరింటెండెంట్ సూర్యశ్రీ తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నామన్నారు.  

 

18:24 - August 18, 2018

ఆదిలాబాద్ : జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రి వద్ద మెడికోలు ధర్నాకు దిగారు. రిమ్స్ కళాశాలలో రెగ్యులర్ సిబ్బంది నియమించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది లేక చాలా ఇబ్బందులకు గురువుతన్నామని..ప్రభుత్వం వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ పై దృష్టి పెట్టాలని మెడికోలు కోరుతున్నారు. 

 

18:18 - August 18, 2018

ఢిల్లీ : వరదలతో అస్తవ్యస్తమైన కేరళను ఆదుకోవాలంటూ ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ స్ట్రీట్‌లో ఆందోళన చేపట్టారు. అనంతరం హోంశాఖ కార్యాలయానికి వెళ్తుండగా విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థులు ఆందోళన

ఢిల్లీ : వరదలతో అస్తవ్యస్తమైన కేరళను ఆదుకోవాలంటూ ఢిల్లీలో జేఎన్ యూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ స్ట్రీట్‌లో ఆందోళన చేపట్టారు. అనంతరం హోంశాఖ కార్యాలయానికి వెళ్తుండగా విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. 

18:02 - August 18, 2018

రాజమండ్రి : గోదావరి వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

17:58 - August 18, 2018

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని కంటి వెలుగు వికటించింది. కంటి వెలుగుకు పోతే ప్రాణాలు తీశారు. షాద్‌నగర్‌లో కంటి వెలుగు ఆపరేషన్‌ వికటించి ఓ వృద్ధురాలు మృతి చెందింది. కేశంపేట మండలం దత్తాయిపల్లి చెందిన వృద్ధురాలు చెన్నమ్మను కంటి ఆపరేషన్‌ కోసం కొత్తూరు సమీపంలోని ఎల్వీప్రసాద్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆపరేషన్‌ కోసం మత్తుమందు మోతాదుకు మించి ఇవ్వడంతో చెన్నమ్మ కోమాలోకి వెళ్లి మృతి చెందింది. దీంతో వైద్యులు హుటాహుటిన మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. చెన్నమ్మ మృతితో బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'కంటి వెలుగు కోసం వెళ్తే.. మా ఇంటి వెలుగు పోయింది' అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కంటి వెలుగు ఆపరేషన్‌ వికటించి వృద్ధురాలు మృతి

మహబూబ్‌నగర్‌ : జిల్లాలోని షాద్‌నగర్‌లో కంటి వెలుగు ఆపరేషన్‌ వికటించి ఓ వృద్ధురాలు మృతి చెందింది. కేశంపేట మండలం దత్తాయిపల్లి చెందిన వృద్ధురాలు చెన్నమ్మను కంటి ఆపరేషన్‌ కోసం కొత్తూరు సమీపంలోని ఎల్వీప్రసాద్‌ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆపరేషన్‌ కోసం మత్తుమందు మోతాదుకు మించి ఇవ్వడంతో చెన్నమ్మ కోమాలోకి వెళ్లి మృతి చెందింది. 

 

17:46 - August 18, 2018

ఢిల్లీ : భారత మాజీ క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్ జనరల్‌ కమర్‌ జావేద్‌ బాజ్వాను సిద్దూ ఆలింగనం చేసుకోవడం వివాదానికి దారి తీసింది. పాకిస్తాన్‌ నూతన ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిద్దూ హాజరైన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అంతేకాదు...ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాక్‌ ఆక్రమిత్ కశ్మీర్‌ ప్రెసిడెంట్ మసూద్‌ ఖాన్‌ పక్క సీటులో సిద్ధూను కూర్చోబెట్టారు. సిద్ధూ పాకిస్తాన్‌ వెళ్లడంపై ఇప్పటికే బిజెపి విమర్శించింది. సిద్ధూ పాకిస్తాన్‌ వెళ్లడాన్ని కాంగ్రెస్‌ ప్రతినిధి రషీద్‌ అల్వీ కూడా తప్పు పట్టారు. సరిహద్దులో మన జవాన్లు ప్రాణాలు కోల్పోతుంటే పాక్‌ ఆర్మీచీఫ్‌ని ఆలింగనం చేసుకోవడం తప్పుడు సంకేతాలు ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల మనసులను కలిపేందుకే పాకిస్తాన్‌ వెళ్లినట్లు సిద్ధూ స్పష్టం చేశారు. ఆటగాళ్లు, కళాకారులు మాత్రమే ఇరుదేశాల మధ్య విభేదాలను తొలగించగలరని చెప్పారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌తో దిగిన ఫొటోను సిద్ధూ ట్విట్టర్‌లో స్వయంగా పోస్ట్‌ చేశారు. సిద్ధూతో పాటు సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌దేవ్‌లకు కూడా ఆహ్వానం లభించినప్పటికీ... వ్యక్తిగత కారణాల వల్ల వారు వెళ్లలేదు.

 

17:44 - August 18, 2018

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం మరో సహాయం అందించింది. వరదల్లో చిక్కుకున్న చిన్నారుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం బాలామృతం పంపించింది. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్‌ సంస్థ తయారు చేసిన 100 మెట్రిక్‌ టన్నుల బాలామృతాన్ని.. అధికారులు ప్రత్యేక విమానంలో కేరళకు తరలించారు. దాదాపు 52.5 లక్షల విలువగల బాలామృతాన్ని అధికారులు తరలించారు. 

 

17:39 - August 18, 2018

విజయవాడ : పాశ్చాత్య దేశాలలో మొదలైన కికి ఛాలెంజ్‌ తెలుగు రాష్ట్రాలకు పాకింది. కికి డాన్స్‌ చేస్తూ ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం దానిని నిషేధించింది. అయితే కికి ఛాలెంజ్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కట్టడి చేయడంలేదని ఆరోపిస్తూ కికి డాన్స్‌ చేసి పోలీసులకు సవాల్‌ విసిరారు ట్రాన్స్‌ జెండర్‌ తమన్నా సింహాద్రి. ఏపీ పోలీసులు కికి ఛాలెంజ్‌ను కట్టడి చేయాలని డిమాండ్‌ చేస్తున్న తమన్నా సింహాద్రితో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. 

 

రిలయన్స్‌ కంపెనీకి డబ్బును దోచిపెడుతున్న మోదీ : రాహుల్

ఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో జరిగిన అవినీతిని ప్రజలకు వివరించాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సూచించారు. రూ.500లకు పైగా విలువ చేసే విమానాలను బీజేపీ ప్రభుత్వం రూ.1600 కోట్లకు కొనుగోలు చేసిందిని రాహుల్‌ ఆరోపించారు. మోదీ ప్రజాధనాన్ని దోచుకుంటూ... రిలయన్స్‌ కంపెనీకి డబ్బును దోచిపెడుతున్నారని ఆరోపించారు. 

3 గ్రాముల కొకైన్‌ స్వాధీనం

హైదరాబాద్ : నగరంలో మరో డ్రగ్స్ రాకెట్  కలకలం సృష్టించింది. పబ్స్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇమ్మనియేల్‌ను ఎక్సైజ్‌ శాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

17:10 - August 18, 2018

హైదరాబాద్ : నగరంలో మరో డ్రగ్స్ రాకెట్  కలకలం సృష్టించింది. పబ్స్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇమ్మనియేల్‌ను ఎక్సైజ్‌ శాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

17:07 - August 18, 2018

నిజామాబాద్ : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది.  ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కేవలం 5 రోజుల వ్యవధిలోనే 12 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

17:04 - August 18, 2018

కర్నూలు : మంత్రి దేవినేని శ్రీశైలం గేట్లు ఎత్తి సాగర్‌కు నీరు విడుదల చేశారు. శ్రీశైలం డ్యాంకు భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 కాగా..  ప్రస్తుతం జలాశయం 880 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలో 192.09 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. గేట్ల ఎత్తివేత సందర్భంగా డ్యాం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సందర్శకులకు అధికారులు ఇవ్వటం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

16:59 - August 18, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో రాహుల్‌ గాంధీ కీలక సమావేశం ముగిసింది. రాఫెల్‌ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేరళ ప్రజలను ఆదుకోవడంపై కాంగ్రెస్‌ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో జరిగిన అవినీతిని ప్రజలకు వివరించాలని సూచించారు. రూ.500లకు పైగా విలువ చేసే విమానాలను బీజేపీ ప్రభుత్వం రూ.1600 కోట్లకు కొనుగోలు చేసిందిని రాహుల్‌ ఆరోపించారు. మోదీ ప్రజాధనాన్ని దోచుకుంటూ... రిలయన్స్‌ కంపెనీకి డబ్బును దోచిపెడుతున్నారని ఆరోపించారు. 

 

ముగిసిన రాహుల్‌ గాంధీ కీలక సమావేశం

ఢిల్లీ : కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో రాహుల్‌ గాంధీ కీలక సమావేశం ముగిసింది. రాఫెల్‌ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, కేరళ ప్రజలను ఆదుకోవడంపై కాంగ్రెస్‌ నేతలకు దిశానిర్దేశం చేశారు రాహుల్‌. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో జరిగిన అవినీతిని ప్రజలకు వివరించాలని సూచించారు. 

'రాఫెల్ లో బీజేపీ కోట్ల రూపాయలు దోచుకొంది'...

ఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయల దోచుకొంటోందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా ఆరోపించారు. రాహుల్ అధ్యక్షతన వార్ రూంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

'రాఫెల్' లో భారీ స్కాం - ఉత్తమ్...

ఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో రూ. 41వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఏపీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపించారు. రాహుల్ అధ్యక్షతన వార్ రూంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...రెండు సమావేశాలు జరుగుతున్నాయని, మొదటి సమావేశంలో రాఫెల్ విమానాల కొనుగోలు..కేరళ విపత్తుపై చర్చించడం జరిగిందన్నారు. 

ఆగిన పోలవరం పనులు...

పశ్చిమగోదావరి : పోలవరం పనులకు ఆంటకం ఎదురైంది. ఎగువున ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరదనీరు పోటెత్తింది. దీనితో గోదావరి నదికి ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. దీని కారణంగా పోలవరం ప్రాజెక్టుల్లోకి గోదారి నీరు వచ్చి చేరింది. స్పిల్ వే, అప్రోచ్ ఛానెల్ లు నీట మునిగిపోయాయి. 

13:33 - August 18, 2018

నల్గొండ : శ్రీశైలం డ్యామ్ నిండుకుండలా ఉండడంతో ఏపీ ప్రభుత్వం శనివారం నాలుగు గేట్లను ఎత్తివేసింది. దీనితో కృష్ణమ్మ పరుగులు తీసుకుంటూ నాగార్జున సాగర్ వైపుకు దూసుకొచ్చింది. గంట గంటకు సాగర్ డ్యాం నీటి మట్టం పెరుగుతోంది. ప్రస్తుత నీటి మట్టం 530.20 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 1,78,372 క్యూ క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 8438 క్యూ క్యూసెక్కులుగా ఉంది. సాగర్ నీటి సామర్థ్యం 312.05 టీంఎసీలుగా ఉంది. ప్రస్తుత నీటి సామర్థ్యం 168.34 టీఎంసీలుగా ఉంది. 

13:30 - August 18, 2018

పశ్చిమగోదావరి : పోలవరం పనులకు ఆంటకం ఎదురైంది. ఎగువున ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరదనీరు పోటెత్తింది. దీనితో గోదావరి నదికి ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. దీని కారణంగా పోలవరం ప్రాజెక్టుల్లోకి గోదారి నీరు వచ్చి చేరింది. స్పిల్ వే, అప్రోచ్ ఛానెల్ లు నీట మునిగిపోయాయి. ఒకవైపు భారీ వర్షాలు..గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పనులను ఆపివేశారు. 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:28 - August 18, 2018

ఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో రూ. 41వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఏపీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపించారు. రాహుల్ అధ్యక్షతన వార్ రూంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...రెండు సమావేశాలు జరుగుతున్నాయని, మొదటి సమావేశంలో రాఫెల్ విమానాల కొనుగోలు..కేరళ విపత్తుపై చర్చించడం జరిగిందన్నారు. గతంలో రూ. 526 కోట్లకు ఒప్పందం జరిగిందని, మోడీ పీఎం అయిన తరువాత ఫ్రాన్స్ కు వెళ్లి అదే విమానాన్ని రూ. 1600 కోట్లకు కొన్నారని, 36 విమానాలను కొనుగోలు చేసిందన్నారు. దీని వెనుక భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రూ. 30వేల కోట్ల కాంట్రాక్టు అనీల్ అంబానీకి ఇవ్వడం సిగ్గు చేటన్నారు. కేరళలో జరిగిన విపత్తుపై కూడా చర్చించడం జరిగిందని, పార్టీకి చెందని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల జీతం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని నిర్ణయం జరిగిందన్నారు. తెలంగాణ పీసీసీ తరపున కేరళ రాష్ట్రానికి సాయం అందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. జాతీయ విపత్తు ప్రకటించాలని సమావేశం నిర్ణయం తీసుకుందన్నారు. రెండో సమావేశంలో అన్ని రాష్ట్రాల్లో 'శక్తి' ప్రాజెక్టుపై రాహుల్ సమీక్ష జరుపుతారని తెలిపారు.

13:23 - August 18, 2018

ఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయల దోచుకొంటోందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా ఆరోపించారు. రాహుల్ అధ్యక్షతన వార్ రూంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ సమావేశంలో రాఫెల్ యుద్ధ విమానాల అవినీతిపై...కేరళలో జరిగిన విపత్తుపై చర్చిండం జరిగిందన్నారు. కాంగ్రెస్ హాయాంలో ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని రూ. 500 కోట్లకు కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ విమానాన్ని రూ. 1600 కోట్లకు కొనుగోలు చేసిందన్నారు. ఒక్కో యుద్ధ విమానంపై రూ. 1100 కోట్లు దోచుకొంటోందని ఆరోపించారు. కేరళను విపత్తు నుండి ఆదుకోవడంలో కేంద్రం విఫలం చెందిందన్నారు. 

13:19 - August 18, 2018

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ వార్ రూంలో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీలు హాజరయ్యారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. రాఫెల్ కుంభకోణం విషయంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని..కేరళపై కేంద్రం చిన్న చూపు చూడడంపై చర్చించారు. కేరళ రాష్ట్రాన్ని ఆదుకొనేందుకు ముందుకు రావాలని రాహుల్ సూచించారు.

కేరళ రాష్ట్రానికి పార్టీ తోచిన విధంగా సహాయం చేయాలని నిర్ణయించగా దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది కేరళ ప్రజల భవిష్యత్ ప్రమాదంలో ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అందుకుని కేరళ విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ట్విట్టర్ ద్వారా ప్రధాన మంత్రిని ఆయన కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక విధంగా...కేరళ రాష్ట్రాన్ని మరొక విధంగా చూస్తోందని కాంగ్రెస్ పేర్కొంటోంది. 

కేరళ వరదలు..కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల జీతం విరాళం...

ఢిల్లీ : కేరళ వరదలపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది కేరళ ప్రజల భవిష్యత్ ప్రమాదంలో ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అందుకుని కేరళ విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ట్విట్టర్ ద్వారా ప్రధాన మంత్రిని ఆయన కోరారు.

108 కిలోల వెండి...

విజయవాడ : 108 కిలోల వెండిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం నుండి సేలంకు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 50లక్షల విలువైన వెండి దిమ్మెలు, రూ. 6 లక్షలు, కారును సీజ్ చేశారు. నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు...

విజయవాడ : దుర్గగుడి మాజీ పాలక మండలి సభ్యురాలు కోడెల సూర్యలత సంచలన ఆరోపణలు చేశారు. భక్తులు అమ్మవారికి ఇచ్చే విరాళాలపై రికార్డులు లేవని, సెక్యూర్టీ టెండర్ల విషయంలో ఛైర్మన్ సొంత అజెండాగా వెళితే అడ్డుకోవడం తప్పా అని ప్రశ్నించారు. ఈవో, పాలక మండలి సభ్యురాలిని తొలగిస్తే అవినీతి పోతుందా ? అని ప్రశ్నించారు. ఇంద్రకీలాద్రిపై అవినీతిని అడ్డుకుంటున్నాననే తనపై ఆరోపణలతో పంపిచేశారని, చీర తీశానని ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు చేయకుండా దోషినని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. 

'కేరళ విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి'...

ఢిల్లీ : లక్షలాది కేరళ ప్రజల భవిష్యత్ ప్రమాదంలో ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అందుకుని కేరళ విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ట్విట్టర్ ద్వారా ప్రధాన మంత్రిని ఆయన కోరారు.  

12:46 - August 18, 2018

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌ 22వ ప్రధానిగా మాజీ క్రికెటర్‌, పాకిస్తాన్‌ తెహ్రిక్‌-ఎ ఇన్సాఫ్‌ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్‌ హౌస్‌లోనే నిరాడంబరంగా ఇమ్రాన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి నవజ్యోత్‌సింగ్‌ సిద్దు హాజరయ్యారు.

ప్రధాని పదవి కోసం ఇమ్రాన్‌ఖాన్‌, నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షాహబాజ్‌ షరీఫ్‌ పోటీ పడ్డారు. పాకిస్తాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో ఇమ్రాన్‌కు 176 ఓట్లు రాగా...షాహబాజ్‌ షరీఫ్‌కు 96 ఓట్లు వచ్చాయి. ప్రధాని పదవికి ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నికైనట్లు నేషనల్‌ అసెంబ్లీ ప్రకటించింది. పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీకి జూలై 25న జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పిటిఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నవాజ్‌షరీఫ్‌ పార్టీ ముస్లిం లీగ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇతర పార్టీల సహకారంతో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్‌లకు కూడా ఇమ్రాన్ నుంచి ఆహ్వానాలు అందినప్పటికీ వ్యక్తిగత కారణాలతో వారు హాజరు కాలేకపోతున్నారు.

12:43 - August 18, 2018

హైదరాబాద్ : రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని సెటిలర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. సెటిలర్లకు పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించడంతో... అధికారపార్టీ కూడా ఆవైపు దృష్టి సారించింది. గ్రేటర్‌ ఎన్నికల్లోనే సెటిలర్లకు తాము పెద్దపీట వేశామని... వచ్చే ఎన్నికల్లోనూ వారికి అవకాశం కలిపిస్తామని చెబుతోంది. సెటిలర్ల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎవరు గెలవాలన్న సెటిలర్ల ఓట్లు కీలకం కానున్నాయి. మెజార్టీ నియోజకవర్గాల్లో వారి మద్దతు ఉంటేనే ఎవరికైనా విజయం సులువు. నగర శివారు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది కూడా. సాధారణ ఎన్నికల్లో సెటిలర్లు టీడీపీవైపు మొగ్గుచూపడంతో.. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌, కుత్బుల్లాపూర్‌, ఎల్‌బీ నగర్‌, రాజేంద్రనగర్‌, మహేశ్వరంలాంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అంతేకాదు.. టీడీపీ మద్దతిచ్చిన బీజేపీ అభ్యర్థులు కూడా గ్రేటర్‌ పరిధిలో 5చోట్ల విజయం సాధించారు. టీడీపీ తరపున గెలిచిన వారిలో ఆర్‌. కృష్ణయ్య తప్ప మిగిలిన నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.

సార్వత్రిక సమరం మరికొన్ని నెలల్లోనే జరుగనుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో గెలవాలంటే సెటిలర్ల ఓట్లు కీలకంగా మారాయి. ఇది గుర్తించిన కాంగ్రెస్‌.... రానున్న ఎన్నికల్లో సీమాంధ్ర నేతలకూ పోటీచేసే అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. దీంతో గ్రేటర్‌ రాజకీయాలు మరోసారి సెటిలర్ల చుట్టూ తిరగడం మొదలయ్యాయి. అయితే అధికారపార్టీ కూడా సెటిలర్ల ఓట్లను రాబట్టుకునేందుకు పావులు కదుపుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనే తాము సెటిలర్లకు 10చోట్ల అవకాశం కల్పించామని.. రానున్న ఎన్నికల్లోనూ వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. దీనికితోడు ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నవారంతా తెలంగాణ వారేనని... వారిని తామెప్పుడూ చిన్నచూపు చూడలేదన్న సంకేతాలను సీఎం కేసీఆర్‌ ఇస్తున్నారు. మొత్తానికి రానున్న సార్వత్రిక సమరంలో గ్రేటర్‌ పరిధిలో సెటిలర్ల ఓట్లు కీలకం కానున్నాయి. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అటు అధికారపక్షం, ఇటు విపక్షం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. సెటిలర్లు మద్దతు కూడగట్టే బాధ్యత కీలక నేతలకు కేసీఆర్‌ అప్పగించారు. మరి సెటిలర్లు ఎవరివైపు ఉంటారో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. 

12:41 - August 18, 2018

హైదరాబాద్ : సీజనల్‌ ఫీవర్స్ స్పీడ్ పెంచాయి..జ్వరాలతో నగరం వణికిపోతోంది. మలేరియా, టైఫాయిడ్‌తో పాటు డెంగ్యూ జ్వరాలు గల్లికి ఒకరిని పీడిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఫీవర్ హాస్పటల్ లో రోగులు సంఖ్య నానాటికి పెరుగుతోంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జలుబు, దగ్గులతో మొదలయ్యి తీవ్ర జ్వరాలకు దారితీస్తుండటంతో జనాలు భయాందోళనలకు గురవుతున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌, చికెన్‌గున్యా, డెంగ్యూ లాంటి విష జ్వరాలతో ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా జ్వరాలతో అల్లాడుతున్నారు. హైద్రాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. గత నెలలో 17వేలా 658మంది ఔట్ పేషెంట్లు రాగా.. ఈ నెలలో ఇప్పటికే ఆసంఖ్య పదివేలకు చేరింది. సీజనల్‌ వ్యాధులు ప్రబలడంతో జిల్లాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొన్నిచోట్ల మంచాలు ఖాళీ లేక రోగులను తిప్పిపంపుతున్న పరిస్థితి నెలకొంది. ఖర్చు భరించలేని నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కాగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు తగ్గ సిబ్బంది లేరని రోగులంటున్నారు.

దోమలను నివారించేందుకు సరిగా ఫాగింగ్‌ చేయకపోవడంతో.. రోగాలు పెరిగిపోతున్నాయి. క్షేత్ర స్థాయిలో బస్తీ దవాఖానాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మూడు రోజులకు మించి జ్వరంతో బాధపడుతుంటే.. రక్త పరీక్షలు చేయించుకుని.. వైద్య చికిత్సలు చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. వర్షాల్లో ఏమాత్రం జలుబు, దగ్గు కనిపించినా చిన్న పిల్లల్ని బడికి పంపవద్దని అంటున్నారు. దీంతో జబ్బులు ఇతరులకు అంటకుండా అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

12:18 - August 18, 2018

రాజమండ్రి : గోదావరి ఉప్పొంగుతోంది. ఉప నదుల నుండి వరద ప్రవాహంతో గోదావరి ఉరకలెత్తుతోంది. రాజమండ్రి వద్ద గోదావరి నీటి ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం 50 అడుగుల వరకున్న నీటి మట్టం 56 అడుగులకు చేరింది.

ధవళేశ్వరం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 16.5 అడుగులకు వరకు చేరింది. 14 లక్షల 20వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. దీనితో లంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వీరందరినీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎగువున ఉన్న విలీన మండలాల్లో కూడా వరద ముప్పు ఏర్పడింది. వీరిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

గంగారంలో ఉద్రిక్తత...

జయశంకర్ భూపాలపల్లి : గంగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫారెస్టు అధికారులపై ఆదివాసీలు తిరగబడ్డారు. పోడు రైతుల భూములను ధ్వంసం చేసేందుకు ఫారెస్టు అధికారులు పెద్ద ఎత్తున వచ్చారు. అధికారులను ఆదివాసీలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. 

ఏపీ సెట్ పరీక్షా ఫలితాలు...

విశాఖపట్టణం : ఏపీ సెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. 7.45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 

11:21 - August 18, 2018

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయింది. ఎగువున కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి ఎక్కువైంది. దీనితో శ్రీశైలం డ్యామ్ జలకళను సంతరించుకుంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ కు ప్రయాణిస్తోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 881 అడులుగా ఉంది. మరింత వరద వస్తుండడంతో దిగువకు నీరు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఏపీ జలవనరుల మంత్రి దేవినేని కృష్ణమ్మకు పూజలు చేసి సారెను సమర్పించి నాలుగు గేట్లను ఎత్తివేశారు. గేట్లను ఎత్తివేస్తున్నారన్న సమాచారంతో భారీగా ప్రజలు తరలివస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొంటున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం...

ఇస్లామాబాద్ : పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇమ్రాన్ 22వ ప్రధాని. ప్రమాణ స్వీకారోత్సవానికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. 

మైనర్ బాలిక ప్రసవం...

పెద్దపల్లి : గోదావరిఖనిలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో మైనర్ బాలిక ప్రసవించింది. పెళ్లి చేసుకుంటానని బాలికను ఆటో డ్రైవర్ మోసం చేసినట్లు తెలుస్తోంది. 

మోడీ ఏరియల్ సర్వే...

తిరువనంతపురం : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేరళ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం పినరయి విజయన్ తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.  

11:11 - August 18, 2018

ఢిల్లీ : వరదలు..వర్షాలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి రూ. 500 కోట్ల ఆర్థిక సహాయం చేయనున్నట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. కొచ్చిలో ఆయన సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి కె.జె.అల్ఫోన్స్..కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి..ఇతర కీలక శాఖ ఉన్నతాధికారులు, త్రివిద దళాధిపతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న చర్యలపై ఆయన ఆరా తీశారు. చనిపోయిన..గాయపడిన వారికి నష్టపరిహారం కూడా అందించనున్నట్లు మోడీ వెల్లడించినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

10:56 - August 18, 2018

పశ్చిమగోదావరి / భద్రాద్రి : గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. పశ్చిమగోదావరి..ఖమ్మం జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కొవ్వూరు గోపాద క్షేత్రాన్ని గోదారి మంచెత్తింది. గోదావరి నీటి మట్టం 47.5 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయాల్సి ఉండగా ఆ విధంగా అధికారులు చేయలేదు. దీనితో ముంపు ప్రాంతాల వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 24గంటల్లోనే 18 అడుగులకు నీటి మట్టం పెరిగిందని తెలుస్తోంది. తూతు మంత్రంగా సహాయక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక భద్రాద్రిలో పర్ణశాల వరకు నీరు చేరుకుంది. పంట పొలాలు కూడా నీట మునిగాయి. గోదావరి నీటి మట్టం 53 అడుగులకు నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తూర్పుగోదావరి : ఉభయ గోదావరి జిల్లాల్లో లంక గ్రామాల ప్రజలు, ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14.6 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. 14.8 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సుమారు వేయి మందిని ఆయా కేంద్రాలకు తరలించారు. దిగువన కోనసీమ లంకల్లో పడవ ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. పలు లంకల్లో వరదనీరు చేరింది. అనేక మంది అవస్థలు పడుతున్నారు. 

కేరళకు రూ. 500 కోట్లు - ప్రధాని...

కేరళ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీఎం పినరయి విజయన్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కె.జె.అల్ఫోన్స్ హాజరయ్యారు. వరదలపై ఆయన సమీక్ష నిర్వహించారు. కేరళకు రూ. 500 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నట్లు మోడీ వెల్లడించారు. 

కాంగ్రెస్ వార్ రూం..కీలక సమావేశం...

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతనలో కాంగ్రెస్ వార్ రూమలో కీలక సమావేశం జరుగుతోంది. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీలు హాజరయ్యారు. 

10:35 - August 18, 2018

కర్నూలు : సీఎం చంద్రబాబు నాయుడు కృషి..దేవుడి కరుణతో నీళ్లు వచ్చాయని, రాష్ట్రంలో కరువును ప్రారదోలుతామని ఏపీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. శనివారం శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లను మంత్రి దేవినేని ఎత్తివేశారు. అంతకంటే ముందు కృష్ణమ్మకు పూజలు..సారె సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేనితో టెన్ టివి ముచ్చటించింది. రికార్డు స్థాయిలో ఎప్పుడూ లేని విధంగా ప్రాజెక్టు నిండిందని తెలిపారు. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాయలసీమ ప్రాంతాల వాసులకు, ఇతర ప్రాంతాలకు నీళ్లు వెళుతున్నాయన్నారు. రాయలసీమలో వర్షం కురవలేదని..ఇతర రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో రాయలసీమకు నీళ్లు వచ్చాయన్నారు. జులై..ఆగస్టు నెలల్లో కృష్ణమ్మ ఆదుకోవాలని కోరుకుంటున్నట్లు, తప్పకుండా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. నాలుగేళ్లలో రూ. 59వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. చివరి ఆయుకట్టుకు తాగు..సాగునీరందిస్తామన్నారు. రాయలసీమలో నెలకొన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతందని, హంద్రీనీవా..తెలుగు గంగ..ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసి చెరువులకు నీళ్లు మళ్లిస్తామన్నారు.

10:32 - August 18, 2018

తిరువనంతపురం : కేరళ..సుందరమైన రాష్ట్రం..కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా దెబ్బతిన్న ఇళ్లు..కొట్టుకపోయిన నివాసాలు...ఆకలి కోసం అలమటిస్తున్న ప్రజలు..ఆసుపత్రిలో ఆక్సిజన్ కోసం అల్లాడుతున్న జనం...పొంగిపొర్లుతున్న నదులు..దెబ్బతిన్న రోడ్లు..రవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతినడం..ఒక గ్రామానికి మరొక గ్రామానికి సౌకర్యం లేకపోవడం..పెట్రోల్..డీజిల్ దొరకకపోవడం...ఇలాంటి ఎన్నో కన్నీళ్లు తెప్పించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. వందేళ్ల తరువాత కేరళ రాష్ట్రం అతాలకుతలమైంది. భారీ వర్షాలు..వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తింది. 80 శాతం కేరళ రాష్ట్రం వరదల్లో ఉండడంతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. సాయం కోసం ఎంతో మంది నిరాశ్రయులు ఎదురు చూస్తున్నారు. వరద నీటిలో వన్యప్రాణులు కొట్టుకపోతున్నాయి. కేరళ కోలుకోవాలంటే కొన్ని నెలలు పడుతుందని..సుమారు మూడు వేల కోట్ల రూపాయల సాయం అందిస్తే కాని రాష్ట్రం కోలుకోదని అంచనాలు వేస్తున్నారు. ఎన్టీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ..తదితర బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఇదిలా ఉంటే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించాలని తలపెట్టారు. కానీ ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సర్వే రద్దు అయినట్లు సమాచారం. దానికంటే ముందు రాష్ట్రంలోని మంత్రులు..ఉన్నతాధికారులు..త్రివిద దళాధిపతులు, కీలక శాఖలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. మరి ప్రధాని భారీ సహాయం ప్రకటిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

10:15 - August 18, 2018

కర్నూలు : శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారిపోయింది. దీనితో గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు వదలాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం కృష్ణమ్మకు ఏపీ మంత్రి దేవినేని ఉమ పూజలు నిర్వహించి..సారె సమర్పించి నాలుగు గేట్లను ఎత్తివేశారు. 5, 6, 7, 8 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదిలేశారు.

4లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్ కు వదిలారు. శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీలమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక నెల ముందుగానే గేట్లను ఎత్తివేయడం..వరద ప్రవాహం ఇంకా వస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న రైతులకు ఎలాంటి కష్టాలు కలుగకూడదని, గేట్లను ఎత్తివేసినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఏపీ మంత్రి మాట్లాడుతూ...కృష్ణమ్మ ఆగస్టులో రావాల్సి ఉందని...కానీ ముందుగానే గేట్లను ఎత్తివేసినట్లు పేర్కొన్నారు. జూన్ 20వ తేదీన కృష్ణా, డెల్టాకు నీళ్లు విడుదల చేయడం జరిగిందన్నారు. రాయలసీమ నాలుగు జిల్లాలకు నీళ్లు ఇవ్వడం జరిగిందని, 3.60 క్యూసెక్కుల నీరు వస్తోందని, ఈ ప్రవాహం ఇంకా కొన్ని రోజులు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలుగా డిపార్ట్ మెంట్ అధికారులు...ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు.

 • పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 881 అడుగులు.
 • 4వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
 • జలాశయం ఇన్ ఫ్లో 3,62,098 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 1,03,857 క్యూసెక్కులు. 

తాలిపేరు గేట్ల ఎత్తివేత...

ఖమ్మం : తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగిపోవడంతో ఆరు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 18వేలు ఉండగా ఔట్ ఫ్లో 14,200గా ఉంది. 

భద్రాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం...

భద్రాద్రి : భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. 47.5 అడుగకు నీటిమట్టం పెరిగింది. వరద ఉధృతి తగ్గుముఖం పడుతుందని రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయలేదు. దీనితో ముంపు మండలాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

మోడీ ఏరియల్ సర్వే రద్దు ?

తిరువనంతపురం : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేరళలో నిర్వహించాలిస్న ఏరియల్ సర్వే రద్దయినట్లు సమాచారం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏరియల్ సర్వేను వాయిదా వేసినట్లు సమాచారం. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

09:31 - August 18, 2018

తిరువనంతపురం : గత వందేళ్లలో ఎన్నడూ లేనంతంగా కేరళను వరదలు ముంచెత్తాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటి వరకు 385 మంది మృత్యువాత పడ్డారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తిరువనంతపురంకు చేరుకున్నారు. శనివారం ఏరియల్ సర్వే నిర్వహించాలని యోచించారు. కానీ ఏరియల్ సర్వే రద్దయినట్లు సమాచారం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏరియల్ సర్వేను వాయిదా వేసినట్లు సమాచారం. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనితో కేరళ సీఎం పినరయి విజయన్, ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ చర్చించనున్నట్లు సమాచారం. కేంద్రం భారీ సాయం ప్రకటిస్తుందా ? లేదా ? అనేది చూడాల్సి ఉంది.

 • రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 13 వరదలోనే ఉన్నాయి.
 • 70వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 • రాష్ట్ర వ్యాప్తంగా 1500 శిబిరాలు ఏర్పాటు.
 • 80 డ్యామ్‌ల గేట్లను తెరిచారు. 1500 సహాయ శిబిరాల్లో దాదాపు 2,23,140 మంది తలదాచుకున్నారు.
 • అలపుజ, ఎర్నాకులం, త్రిస్సూరు, పథన్‌మతిత్తా జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
 • రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. త్రిస్సూరు, చలకుడి పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
 • కోచి ఎయిర్‌పోర్టు జలదిగ్బంధంలో చిక్కుకున్న కారణంగా 26 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు.
 • వరద బాధితుల పునరావాసానికి సాయం చేయాలని సీఎం పినరయి విజయన్ పిలుపునిచ్చారు.
 • తెలంగాణ సర్కార్‌ 25 కోట్ల రూపాయల తక్షణ సహాయం ప్రకటించింది. ఈ మొత్తాన్ని వెంటనే కేరళకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
 • ఏపీ సర్కార్‌ కేరళ బాధితులకు 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది.
 • టాలీవుడ్, ఇతర తారాగణం విరాళం ప్రకటిస్తున్నారు. 

మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్ రాజీనామా...

తూర్పుగోదావరి : వైసీపీకి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్ రాజీనామా చేశారు. జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. 

09:16 - August 18, 2018

ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పంట పొలాలు నీట మునిగిపోయాయి. దీనితో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 1.23 లక్షల ఎకరాల్లో రూ. 32 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా. పత్తి, సోయా కంది, జొన్న పంటలు నీట మునిగాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు..ఎగువున కురుస్తున్న వర్షాలతో వాగులు..వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెన్ గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా వంతెనపై పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. 17 ముంపు మండలాలకు అధికారులను కలెక్టర్ నియమించారు. ఆదిలాబాద్, వరద ముంపు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించారు. 

09:15 - August 18, 2018

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీనితో ఏపీ మంత్రి దేవినేని ఉమ కాసేపటి క్రితం గేట్లను ఎత్తివేశారు. 4గేట్లను ఎత్తివేసి సాగర్ కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుత జలాశయంలో నీటిమట్టం 880 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. కానీ దీనిపై రైతులు నిరుత్సాహానికి గురవుతున్నట్లు సమాచారం. జిల్లాకు సాగు, తాగు నీరందించాలని రైతులు కోరుతున్నారు. నిండు కుండలా ఉన్న శ్రీశైలం డ్యామ్ ను చూడటానికి సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. కానీ పోలీసులు వారిని అనుమతినించడం లేదు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో భారీగా ఉండడం వల్ల అనుమతినించడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. 

09:09 - August 18, 2018
08:14 - August 18, 2018

ఢిల్లీ : కేరళలో వరదలు మంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 3లక్షల మందికిపైగా నిరాశ్రలుయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది. 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, నేవీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. భారత ప్రధాన మంత్రి శుక్రవారం సాయంత్రం తిరువంతపురంకు చేరుకున్నారు. మోడీ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో ఈ పర్యటన కొనసాగనుంది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. తీవ్రత తెలుసుకున్న కేంద్రం రూ. 100 కోట్లను ప్రకటించింది. కానీ ఈ సహాయం సరిపోదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతంగా కేరళను వరదలు ముంచెత్తాయని, కేరళను ఆదుకోవాలని సీఎం పినరయి విజయన్ పిలుపునిచ్చారు. దీనితో పలు రాష్ట్రాలు విరాళాలు ప్రకటించాయి. తెలంగాణ సర్కార్‌ 25 కోట్ల రూపాయల తక్షణ సహాయం ప్రకటించింది. ఈ మొత్తాన్ని వెంటనే కేరళకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు సీఎం కేసీఆర్. నీటిని శుద్ధి చేసేందుకు రెండున్నర కోట్ల విలువైన ఆర్వో యంత్రాలను కూడా పంపాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏపీ సర్కార్‌ కేరళ బాధితులకు 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది.

07:56 - August 18, 2018

మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య కన్నుమూత...

విజయవాడ : మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య (84) కన్నుమూవారు. తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1934 జూన్ 5వ తేదీన విద్య జన్మించారు. విద్యకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. విజయవాడ పార్లమెంట్ స్థానం నుండి 2 సార్లు ఎంపీగా గెలిచారు. 1980-89 వరకు లోక్ సభకు ఎంపికయ్యారు. ప్రముఖ హేతువాది గోరా కుమార్తె విద్య. 

కేరళలో పెరుగుతున్న మృతుల సంఖ్య...

తిరువనంతపురం : కేరళలో వరదలు మంచెత్తుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. 24గంటల్లోనే 106 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 385కి చేరింది. 

తిరుమలలో రాబర్ట్ వాద్రా...

చిత్తూరు : తిరుమలకు రాబర్ట్ వాద్రా చేరుకున్నారు. ప్రజలు కోరుకుంటే మార్పు వస్తుందని, రాహుల్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, త్వరలో రాజకీయంగా పెద్దమార్పు వస్తుందన్నారు. 

ధవళేశ్వరం బ్యారేజీ...14.6 అడుగులు...

తూర్పుగోదావరి : గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14.6 అడుగులకు నీటి మట్టం చేరింది. 14.8 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు. విలీన మండలాల్లో వరద ఉధృతి చేరింది. 

పోలవరంలోకి గోదావరి వరద...

పశ్చిమగోదావరి : గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. స్పిల్ వే, స్పిల్ ఛానల్ నీట మునిగింది. కొవ్వూరు గోపాద క్షేత్రాన్ని గోదావరి ముంచెత్తింది. కుక్కునూరు, వేలేరుపాడులో వరదనీరు చేరడంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. 

కేరళకు తెలంగాణ పౌష్టికాహారం...

హైదరాబాద్ : వంద మెట్రిక్ టన్నుల పౌష్టికాహారాన్ని కేరళను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించనుంది. ప్రత్యేక హెలికాప్టర్ లో ఆహారాన్ని తరలించనున్నారు. 

06:54 - August 18, 2018
06:50 - August 18, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, రైతు బీమా పథకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణలో ఒకమాట... ఢిల్లీలో ఒకమాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమంటున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో టెన్ టివి ముచ్చటించింది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

06:49 - August 18, 2018

హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. గోదావరి, పెనుగంగా, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద నీటిమట్టం 46 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక కడెం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద చేరడంతో.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణలోనూ భారీగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లా అతలాకుతలమవుతున్నాయి. గోదావరి, పెనుగంగా, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో పెరుగుతున్న నీటి ప్రవాహాన్ని అధికారులు పరిశీలించారు.

భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 46.2 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలంలోని స్నానఘట్టాలు మునిగిపోయాయి. ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇక వరద ఉధృతితో విలీన మండలాల్లో శబరి నదికి వరద పోటెత్తింది. చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాల్లో రహదారులు నీటి మునిగాయి. దేవీపట్నం మండలంలోని సీతపల్లి వాగు పొంగిపొర్లుతోంది. వరద ఉధృతికి పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునిగాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద ఉధృతిని తెలుసుకునేందుకు భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 08743-232444 నెంబర్‌కు ఫోన్‌ చేసి వరద పరిస్థితిని తెలుసుకోవచ్చని... సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో గురువారం 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. పెద్దవాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనల నుంచి నీరు ప్రవహిస్తున్నది. సుమారు 10వేల ఎకరాల్లో పంట నీటి మునిగింది. దహెగాం మండలంలో ఎర్రవాగు ఉప్పొంగడంతో గిరివెల్లి గ్రామానికి చెందిన గర్బిణీని తరలించేందుకు అవస్థలు పడ్డారు.

ఇక వర్షంతో కామారెడ్డి, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిర్మల్‌ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షానికి నాని ఇళ్లు కూలిపోయాయి. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచిస్తున్నారు.

హైద్రాబాద్‌లో కురిసిన వర్షానికి మూసీనదిలో నీటి ప్రవాహం పెరిగింది. భువనగిరి నుంచి భూదాన్‌ పోచంపల్లి వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దపల్లి జిల్లాలో భారీవర్షాలకు పలుచోట్ల వాగు, వంకలు పొంగాయి. జగిత్యాల జిల్లాలో సరాసరి వర్షపాతం 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని రెండు ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటివరకు 21,660 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఉత్పత్తి రూపేణా రూ.5.41 కోట్ల నష్టం సింగరేణి సంస్థకు వాటిల్లినట్లు సింగరేణి అధికారులు తెలిపారు.

ఇక భారీగా కురుస్తున్న వర్షాలపై ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం జరిగినప్పటికీ... ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని జిల్లాల్లోనూ అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో.... స్పెషల్‌ ఆఫీసర్లు వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలావుంటే మరోవైపు మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ సూచించడంతో... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

06:43 - August 18, 2018

విజయవాడ : భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలుచోట్ల రహదారులు నీటమునిగాయి. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరడంతో.. దిగువకు 10లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. మరోవైపు వరద ఉధృతితో లంక గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దాపురం మండలంలో చెరువులో పడి గేదెల కాపరి మృతి చెందాడు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ధవళేశ్వరం ప్రాజెక్ట్‌ వద్ద నీటిమట్టం 11.75 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

సముద్రంలోకి 10లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో... కోనసీమలో గౌతమి, వశిష్ట, వైనతేయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఇంకా వరద పెరిగే అవకాశం ఉండడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు ముమ్మడివరం మండలం అయినాపురం, కొత్తలంక, సోమిదేవరపాలెం గ్రామాల్లో 400 ఎకరాల వరి పంట ముంపునకు గురైంది. ఇక పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం తోట చెరువులో పడి గేదెల కాపరి పిల్లి నారాయణరావు మృతి చెందాడు.

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం పోలవరంలో 13 మీటర్ల మేర వరద కొనసాగుతోంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. వరద నీరు పోటెత్తడంతో పోలవరం ప్రాజెక్ట్‌ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మరోవైపు గోదావరికి వరద గణనీయంగా పెరిగే అవకాశం ఉండడంతో కోనసీమలో లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే గత వారం రోజులుగా గోదావరి ఉద్ధృతితో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న లంక గ్రామాల ప్రజలు రానున్న వరద ముప్పుతో భయపడుతున్నారు. చాకలిపాలెం వద్ద కాజ్‌వే వరదనీటిలో మునిగిపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా కనకాయలంక ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు కోనసీమపై ప్రత్యేక దృష్టి నిలిపిన యంత్రాంగం ముందస్తు సహాయ చర్యలను వేగవంతం చేసింది. ప్రజలకు నిత్యావసర వస్తువులు పడవల ద్వారా అందజేస్తున్నారు.

ఇక భారీ వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్ట్‌కు భారీ వరద కొనసాగుతోది. గడిచిన దశాబ్ధ కాలంలో ఎప్పుడూ లేనంతగా 2.10 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరింది. భారీగా వరద నీరు చేరడంతో.. 33 గేట్ల ద్వారా 2.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి భారీ వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్‌లోకి 3.11 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా... ఔట్‌ఫ్లో లక్ష క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 877 అడుగులకు చేరుకుంది. భారీగా వరద చేరుతుండడంతో.... కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కులు, హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు 2,025 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఇక పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి 2300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా హిరమండలం వద్ద వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌లో జలకళ తొణికిసలాడుతోంది. గొట్టా బ్యారేజి వద్ద 39 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. మరోవైపు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నాగావళి, వంశధార, మహేంద్రతనయ నదులతోపాటు అన్ని కాలువలు వరద నీటితో నిండిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాలతో పాటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది సకాలంలో నాట్లు వేయడంతో.. పరిస్థితి బాగుంటుందని భావించిన రైతులు వరద ముంపు బారినపడ్డారు. భారీ వర్షాలతో సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం, నందిగాం, టెక్కలి, ఆముదాలవలస, సరుబుజ్జిలి మండలాల పరిధిలో పంటపొలాలు వరద ముంపునకు గురయ్యాయి. కొద్దిరోజుల క్రితమే ఖరీఫ్‌ సీజన్‌ను ప్రారంభించిన రైతులు.. భారీగా నష్టపోయారు. నాట్లు, ఇతర పనులకు భారీగా ఖర్చు చేశామని... నాట్లు వరద ముంపునకు గురి కావడంతో ఇబ్బందుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి భారీ వర్షాలతో పలు ప్రాజెక్టులను నిండుకుండను తలపిస్తుండగా.. లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం... ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా సహాయచర్యలు చేపట్టింది. 

06:38 - August 18, 2018

తిరువనంతపురం : వందేళ్ళలో ఎన్నడూ లేనంతగా వరదలు పోటెత్తడంతో కేరళ తడిసిముద్దయింది. జనజీవనం స్తంభించింది. కేరళ పునర్నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని సీఎం పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా స్పందించారు. పలు రాష్ట్రాలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. పలువురు సిసీనటులు కూడా ఆర్థిక సాయానికి ముందుకొచ్చారు. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా వరదలు కేరళను ముంచెత్తాయి. 80 డ్యాములు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు.. పోటెత్తిన వరదలకు 324 మంది మృత్యువాత పడ్డారు. 2,23,139 మంది నిరాశ్రయులయ్యారు. బాధితులకోసం 1500 పైగా శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు సీఎం పినరయి విజయన్‌. వరద బాధితుల పునరావాసానికి సాయం చేయాలని పిలుపునిచ్చారు. కేరళ పునర్నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు.

కేరళ ఆదుకోవాలన్న సీఎం పిలుపునివ్వడంతో.. దేశవ్యాప్తంగా అనూహ్యస్పందన వచ్చింది. పలు రాష్ర్ట ప్రభుత్వాలు ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. వరదలతో అతలాకుతలమైన కేరళలో పర్యటించేందుకు ప్రధాని మోదీ తిరువనంతపురం చేరుకున్నారు. శనివారం విజయన్‌తో కలిసి ప్రధాని మోదీ ఏరియల్ సర్వే చేయనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి. సహాయక చర్యలు సమీక్షించనున్నారు. కేంద్రం ఇప్పటికే వంద కోట్ల రూపాయలను సాయంగా ప్రకటించింది.

తెలంగాణ సర్కార్‌ 25 కోట్ల రూపాయల తక్షణ సహాయం ప్రకటించింది. ఈ మొత్తాన్ని వెంటనే కేరళకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు సీఎం కేసీఆర్. నీటిని శుద్ధి చేసేందుకు రెండున్నర కోట్ల విలువైన ఆర్వో యంత్రాలను కూడా పంపాలని అధికారులకు స్పష్టం చేశారు. ఏపీ సర్కార్‌ కేరళ బాధితులకు 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. వరదలతో జరిగిన ప్రాణ, ఆస్థి నష్టం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేరళ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన పాత్రికేయుడు.. మానవత్వాన్ని చాటి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. మనోజ్‌ అనే విలేకరి తన కూతురి నిశ్చితార్థానికి దాచిన డబ్బును సీఎం సహాయ నిధికి అందించారు. కేరళ వరద బాధితుల ఆకలి తీర్చేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. కేరళకు సహాయం అందిస్తున్నట్లు ఆ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యగౌరచంద్ర దాస్ ప్రకటించారు. కేరళలోని ఏడుతువు, అలపూజ జిల్లాల్లో కొంత మంది సిబ్బందితో ఈ నెల 13వ తేదీ నుంచి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చింది. సీఎం సహాయ నిధికి 10కోట్లు విరాళంగా ప్రకటించింది. ఆగస్టు నెలకు సంబంధించిన లేట్‌ ఫీజులన్నీ రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. వాహన, వ్యక్తిగత రుణాల నెలవారీ వాయిదాల చెల్లింపుల లేట్‌ ఫీజు, క్రెడిట్‌కార్డు బిల్లులపై చెల్లింపులపై లేట్‌ ఫీజు రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

టాలీవుడ్‌ సైతం తనవంతు సహాయానికి ముందుకొచ్చింది. 'గీత గోవిందం' చిత్రానికి కేరళలో వచ్చిన మొత్తం షేర్‌ని వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ప్రకటించారు. హీరోలు అల్లు అర్జున్‌, విజయ్‌ దేవర్‌ కొండ, సింగర్ చిన్మయి విరాళం ప్రకటించారు. డైరెక్టర్ కొరటాల శివ కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కి 3 లక్షలు అందించారు. ''కేరళ ప్రజలు తమ జీవితాలను.. తమ అందమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు మనం అండగా నిలబడదాం'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు కొరటాల శివ.

తమిళనాట సినీనటులు, మీడియా సంస్థలు వరద బాధితులపై తమ ఔదార్యాన్ని చూపాయి. సన్‌టీవీ కోటి రూపాయలు, విజయ్‌ టీవీ 25లక్షలు ప్రకటించింది. సినీహీరో విశాల్‌ భారీ విరాళం ఇవ్వనున‍్నట్టు ప్రకటించగా.. సిద్దార్థ్‌ ట్విటర్‌లో కేరళ డొనేషన్‌ చాలెంజ్‌ను ప్రారంభించారు. కమల్‌హాసన్‌ రూ. 25లక్షలు, సూర్య, కార్తీ 25లక్షలు విరాళమిచ్చారు. మరోవైపు మలయాళ నటుడు మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, దుల్కర్‌ సాల్మన్‌ తమ వంతు సహాయాన్ని ప్రకటించారు. దీంతోపాటు అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాల మూవీ ఆర్టిస్ట్స్‌ 10కోట్లు సీఎం సహాయ నిధికి ప్రకటించింది. వరదలతో స్తంభించిపోయిన కేరళను ఆదుకునేందుకు యావద్దేశం కదిలింది. దేశవ్యాప్తంగా బాధితులను ఆదుకునేందుకు తారతమ్యంలేకుండా మానవత్వాన్ని చాటారు. 

06:33 - August 18, 2018

తిరువనంతపురం : వరదలతో అతలాకుతలం అవుతోన్న కేరళలో.. 324 మంది మృత్యవాతపడ్డారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎయిర్‌ఫోర్స్, నేవీ సిబ్బంది సహాయ చర్యలు అందిస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న నిండు చూలాలిని నేవీ సిబ్బంది రక్షించారు. హెలికాఫ్టర్ సాయంతో ఆవిడను ఆసుపత్రికి చేర్చి తల్లీ, బిడ్డల ప్రాణాలు నిలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో... అధికారులకు అభినందనలు వెల్లువెత్తాయి. కొచ్చి ఎయిర్‌ పోర్ట్‌ సమీపంలో నివసించే.. సాజితా జబీల్‌ అనే మహిళకు శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. తన ఇంటి చుట్టూ ఎటు చూసినా వరద నీరే. ఆస్పత్రికి తీసుకెళ్ళేందుకు అవకాశమేలేదు. ఈ సమాచారం తెలుసుకున్న సహాయక బృందాలు సుమారు అరగంటపాటు శ్రమించి ఆ గర్భవతిని రక్షించాయి.

ప్రతికూల వాతావరణంలోనూ పైలట్‌ విజయ్‌ వర్మ అత్యంత చాకచక్యంగా వ్యవహరించాడు. సమయస్పూర్తిని ప్రదర్శించి.. ఎయిర్‌లిఫ్ట్ ద్వారా గర్భిణీని రక్షించాడు. వెంటనే ఆమెను సంజీవని ఆసుపత్రిలో చేర్పించారు. కొద్ది సేపటికే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆరోగ్యంగా ఉన్న తల్లీ, బిడ్డల ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు. తల్లీబిడ్డ ప్రాణాలు నిలిపిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందితోపాటు వైద్యులకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

06:31 - August 18, 2018

తిరువనంతపురం : కేరళపై ప్రకృతి ప్రకోపించింది. జలఖడ్గం వీరవిహారం చేస్తోంది. కేరళలో ఇప్పుడు ఏ గ్రామాన్ని చూసినా దీవిని తలపిస్తోంది. ఊళ్లకు ఊళ్లే తుడిచి పెట్టుకుపోతున్నాయి. కేరళ జనాభా నాలుగు కోట్లైతే... రెండు కోట్ల మంది వరద బారిన పడ్డారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 13 వరదలోనే ఉన్నాయి. బాధితులను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌తోపాటు త్రివిద దళాలూ రంగంలోకి దిగాయి. ఇక కేరళలోని పరిస్థితిని సమీక్షించేందుకు మోదీ అక్కడికి చేరుకున్నారు. ఇవాళ సీఎంతో కలిసి ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు.

కేరళలో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. తొమ్మిది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతంగా కేరళను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమైంది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 324 మంది చనిపోయినట్టు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. 80 డ్యామ్‌ల గేట్లను తెరిచారు. 1500 సహాయ శిబిరాల్లో దాదాపు 2,23,140 మంది తలదాచుకున్నారు. కేరళలోని 14 జిల్లాలో 13 జిల్లాలు వరదగుప్పిట్లో చిక్కుకున్నాయి. ఈ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. అలపుజ, ఎర్నాకులం, త్రిస్సూరు, పథన్‌మతిత్తా జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. త్రిస్సూరు, చలకుడి పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ఇడుక్కి, మలప్పురం, కన్నూరు జి్లాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ వర్షపునీటితో చెరువులను తలపిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పలు జిల్లాలో వరదల కారణంగా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోచి ఎయిర్‌పోర్టు జలదిగ్బంధంలో చిక్కుకున్న కారణంగా 26 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. రైళ్ల రాకపోకలు కూడా స్తంభించాయి. కేరళకు పొరుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో ఇంధన, మందుల కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని 80శాతం అంధకారంలో మగ్గుతోంది.

ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తిరువనంతపురం, కొల్లామ్‌, అలప్పుళా, కొట్టాయం, ఇడుక్కీ, ఎర్నాకుళం, త్రిసూర్‌, పాలక్కడ్‌, మలప్పురం, కొజికొడే, వయనాడ్‌ జిల్లాల్లో నేడు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసిన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మిలటరీ, కేంద్ర సహాయ బృందాలు రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాత్రి కేరళకు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ ఆయనకు స్వాగతం పలికారు. కేరళలో వరద పరిస్థితిని ప్రధానమంత్రి ఇవాళ ఏరియల్‌ సర్వేతో సమీక్షించనున్నారు.

భారత్ - ఇంగ్లండ్ మూడో టెస్టు...

ఢిల్లీ : శనివారం భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. నాటింగ్‌హామ్‌లో జరిగే ఈ మ్యాచ్‌కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి, రెండవ టెస్టులను ఓడిన భారత్‌కు ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. మూడో టెస్టులో గెలిస్తేనే భారత్‌కు ఆశలు సజీవంగా ఉంటాయి. 

కేరళలో ప్రధాని మోడీ...

తిరువనంతపురం : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేరళ రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రధాని మోడీకి సీఎం పినరయి విజయన్ స్వాగతం పలికారు. శనివారం వారు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. 

ఇండోనేషియాలో 18వ ఆసియా క్రీడలు...

ఢిల్లీ : నేటి నుండి ఇండోనేషియాలో 18వ ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. 45 దేశాల నుండి 11వేల మంది అథ్లెట్లు ఇందులో పాల్గొననున్నారు. 

శ్రీశైలం గేట్ల ఎత్తివేత...

విజయవాడ : నేడు శ్రీశైలం గేట్లను అధికారులు ఎత్తివేయనున్నారు. ఉదయం 7-9 గంటల మధ్య మంత్రి దేవినేని ఉమ గేట్లను ఎత్తనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 878.9 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. 

Don't Miss