Activities calendar

19 August 2018

22:01 - August 19, 2018

ఢిల్లీ : ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది.  రెజ్లింగ్‌ 65 కేజీల పురుషుల విభాగంలో భజరంగ్‌ పునియా సత్తాచాటి భారత్‌కు పసిడి పతకం అందించాడు. జపాన్‌కు చెందిన డాచీ తకాటాపై 11-8 తేడాతో పునియా ఘన విజయం సాధించాడు. అంతకు ముందు సెమీస్‌లో మంగోలియాకు చెందిన బచులున్‌పై 10-0 తేడాతో అద్భుత విజయం సాధించాడు. పురుషుల రెజ్లింగ్‌లో పునియా ఒక్కడే రాణించగా పవన్‌ కుమార్‌, ఖత్రి మౌసమ్‌ నిరాశ పరిచారు. 
 

21:57 - August 19, 2018

నిజామాబాద్‌ : ప్రియుడి కోసం దేశాలు దాటొచ్చిన ఓ ప్రియురాలు జైలు పాలైన ఘటన.. నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. సౌదీ నుంచి మన దేశానికి వచ్చి ప్రేమవివాహం చేసుకున్న యువతిని.. అక్రమంగా దేశంలోకి వచ్చిన కేసులో నిజామాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. సౌదీ దేశానికి  చెందిన అల్‌హరబీ రజా నసీర్‌ అనే యువతి తమ ఇంట్లో డ్రైవర్‌గా పనిచేసిన.. నిజామాబాద్‌కు చెందిన అజీముద్దీన్‌తో ప్రేమలో పడింది. అతన్నే పెళ్ళి చేసుకోవాలనుకున్న నసీర్‌.. సందర్శక వీజాపై ఈ ఏడాది ఏప్రిల్‌ 26న భారత్‌ చేరుకుంది. అనంతరం అజీముద్దీన్‌ను పెళ్ళి చేసుకుని.. ఎల్లమ్మగుట్టలో నివాసం ఉంటోంది. కాగా..  మన దేశంలోకి  అక్రమంగా చొరబడిన కేసులో పోలీసులు ఈ నెల 7న నసీర్‌ను రిమాండుకి తరలించారు. ఆమె జైలు నుంచి బయటికి రాగానే  తిరిగి సౌదీకి పంపనున్నారు. 

 

21:55 - August 19, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీలో కురుస్తున్న వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంటలను వరదనీరు ముంచెత్తడంతో రైతన్నకు కన్నీరే మిగిలింది. ఇసుక, మట్టి దిబ్బలతో పంటలను వరదనీరు ఆక్రమించేసింది. ఇళ్లల్లోకి, రహదారులపైకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. నాలుగు రోజులుగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. మంచిర్యాల మండలంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్‌ జిల్లా కడెం ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ఆరు గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. 
భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనులకు భారీ నష్టాలు 
భారీ వర్షాలు సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనులకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సింగిరేణి ఉత్పత్తి నిలిచిపోయింది. 4 కోట్ల మేర నష్టం వాటిళ్లినట్లు అధికారులు అంచనావేశారు. భారీ వర్షం కారణగా ఇచ్చోడ మండల కేంద్రంలో వరదలు ముంచెత్తాయి. దీంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారిని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్య పరామర్శించారు. వరదల్లో తన పుస్తకాలు, పెన్సిళ్లు, బట్టలు అన్నీ కొట్టుకుపోయాయంటూ చిన్నారి జ్యోతిక రోదిస్తూ కలెక్టర్‌కు విన్నవించుకుంది. దీంతో కావాల్సిన పుస్తకాలు కొనిస్తామని చిన్నారికి కలెక్టర్‌ హామీ ఇచ్చారు. 
ఖమ్మం జిల్లాలో 
ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వైరా కొణిజర్ల ఏన్కూరు తల్లాడ మండలాల్లో వాగులు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొణిజర్ల మండలం తీగల బంజర వద్ద పగిడేరు వాగు ఏన్కూరు మండలం జన్నారం వాగు పొంగి ప్రవహిస్తుండటంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.   
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పెదవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో వారం రోజుల్లోనే 3 సార్లు గేట్లు ఎత్తి 8500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 
వరంగల్‌ జిల్లాలో 
వరంగల్‌ జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుండి నీరు వచ్చి చేరడంతో గోదావరి పరివాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద ధాటికి రహదారులన్నీ జలమయం అయ్యాయి. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. పంట నష్టాన్ని అంచనావేయాల్సిన అధికారుల్లో చలనం లేకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
భూపాలపల్లిలో 
భూపాలపల్లి ఏరియాలో ఉపరితల గనుల్లో కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గత యేడాది తో పోలిస్తే ఈ ఏడాదిలో ఎక్కువ మొత్తంలో వర్షాలు పడడం వల్ల 78 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
మహబూబాబాద్ జిల్లాలో 
మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో మున్నేరు వాగు స్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
కృష్ణా జిల్లాలో 
కృష్ణా జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని నందిగామ అగ్నిమాపక కార్యాలయం నీట మునిగింది. వర్షం నీరు కార్యాలయంలోకి చేరడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరటి, పసుపు, బొప్పాయి తోటలకు వర్షాలు ఊపిరిలూదాయి. 
కొంత శాంతించిన గోదావరి 
నిన్నటి వరకు ఉధృతంగా ప్రవహించిన గోదావరి కొంత శాంతించింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14.6 అడుగులు నీటి మట్టం నమోదు కాగా... ప్రస్తుతం 12.90అడుగులకు చేరుకుంది. దీంతో బ్యారేజీ నుండి 11లక్షల 44 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి ప్రవహిస్తోంది. వరద పరిస్థితిని ఎప్పటికికప్పుడు పరిశీలిస్తున్నామని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. 
కాకినాడలో గోదావరి ఉగ్రరూపం 
కాకినాడలోని పలు ప్రాంతాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. మోకాళ్ల వరకు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పడవల ద్వారా ఇతర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. 
శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ పరవళ్లు 
శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలాశయం ఎనిమిది గేట్లను 10 అడుగల ఎత్తు మేర ఎత్తి నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. 
భారీ వర్షాలు, వరదలపై చంద్రాబాబు సమీక్ష 
ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రాబాబు సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి ఆహారం, నీటి వసతి కల్పించాలని అధికారులకు ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ, రియల్‌ టైం గవర్నెన్స్‌ల సూచనలకు అనుగుణంగా సమన్వయంతో పని చేయాలని సూచించారు. సహాయక చర్యల్లో స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు భాగస్వామ్యం అవ్వాలని సీఎం అన్నారు.

 

ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు

విజయవాడ : ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో కీసర, మున్నేరు, వైరా, బుడమేరు ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు చేరుతోంది. ప్రకాశం బ్యారేజీకి 45 వేల క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంది. ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టం 12 అడుగుల గరిష్ఠస్థాయికి చేరింది. బ్యారేజీ నుంచి 28,800 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలిరారు. 

ప.గో జిల్లాలో వరదలో చిక్కుకున్న 200 మంది భక్తులు

ప.గో : బుట్టాయిగూడెం మండలం వరదలో 200 మంది భక్తులు చిక్కుకున్నారు. బుట్టాయిగూడెంలో కొండ వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండటంలో ఆలయం వద్ద భక్తులు చిక్కుకున్నారు. గుబ్బలమంగమ్మ ఆలయ దర్శనానికి భక్తులు వెళ్లారు. అటవీప్రాంతంలో ఉధృతంగా కొండవాగులు ప్రవహిస్తున్నాయి. 

21:35 - August 19, 2018

కేరళ : వర్షాలు, వరదలతో అతాలకుతలమైన కేరళకు భారీగా నష్టం జరిగింది. ప్రాథమిక అంచనా ప్రకాశం 20 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఇంది మరింత పెరిగే అవకాశం ఉంది. తక్షణ సహాయ కార్యక్రమాల కోసం రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేరళవాసులను ఆదుకొనేందుకు పలువురు ఆపన్నహస్తం అందిస్తున్నారు.
ప్రకృతి ప్రకోపం కేరళలో విధ్వంసాన్ని మిగిల్చింది..
ప్రకృతి ప్రకోపం కేరళలో విధ్వంసాన్ని మిగిల్చింది. జరిగిన నష్టం నుంచి తేరుకునేందుకు ఆ రాష్ట్రానికి చాలా ఏళ్లు పట్టే అవకాశం కనిపిస్తోంది. ధ్వంసమైన రోడ్లను పునరుద్ధరించేందుకు భారీగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. చిన్నాభిన్నమైన సమాచార వ్యవస్థను చక్కదిద్దేందుకు ఎక్కువ నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. దెబ్బదిన్న మౌలికసదుయాలను కల్పించేందుకు వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర పాలకులు చెబుతున్నారు. 
రూ.20 వేల కోట్ల నష్టం 
వరద నష్టంపై కేరళ ప్రభుత్వం ప్రాథమిక అంచనా నివేదిక తయారు చేసింది. రాష్ట్రానికి దాదాపు 20 వేల కోట్ల నష్టం జరిగినట్టు తేల్చింది. ఇది మరింత పెరగే అవకాశం ఉందని అచనా వేస్తున్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా రెండువేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరదలు తగ్గిన తర్వాత నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపించాలని కోరారు. 
కేరళను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఎస్‌బీఐ 
మరోవైపు కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు వ్యక్తలు, పలు సంస్థలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు భారతీయ స్టేట్‌ బ్యాంకు కేరళను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. దీంతో పాటు కేరళ వ్యాప్తంగా ఎస్‌బీఐ సేవలపై చార్జీలను రద్దు చేసింది. రుణాలు, డూప్లికేట్‌ పాస్‌బుక్‌లు, ఎటీఎం కార్డులు, చెక్‌బుక్‌లు, ఈఎంఐ చెల్లింపులపై చార్జీలు, జరిమానాలను రద్దు చేసింది. పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ వద్ద 2 వేల రూపాయల వరకు నిత్యావసరాలు తీసుకునే సౌకర్యాన్ని ఎస్‌బీఐ కల్పించింది. బ్యాంకు సిబ్బంది కూడా కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చే విధంగా ప్రోత్సహిస్తోంది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు తమ ఒక నెల జీతాన్ని కేరళ వరద బాధితులకు విరాళంగా ప్రకటించారు. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన 20 మంది ఎంపీలు ఈ మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తామన్నారు. 
కేరళ బ్లాస్టర్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ సభ్యులు వస్తుసామాగ్రి పంపిణీ
కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు కేరళ బ్లాస్టర్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ముందుకొచ్చింది. కేరళ బ్లాస్టర్స్‌ ఫుట్‌ బాల్‌ క్లబ్‌ తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డప్రసాద్ 50 లక్షల రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. క్లబ్‌ సభ్యులు బాధితులకు అవసరమైన వస్తుసామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. సహాయక కార్యక్రమాల్లో ప్రతీఒక్కరూ మానవతా దృక్పథంతో పాల్గొనాలని క్లబ్‌ పిలుపునిచ్చింది.
కేరళ వరద మృతులకు కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో సంతాపం 
కేరళ వరద నష్టంపై కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. వదర బాధితులను ఆదుకునేందుకు ప్రజలు  ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్రపరిశ్రమ... టాలీవుడ్‌ ముందుకు వచ్చింది. నాగార్జున రూ.28 లక్షలు, ప్రభాస్‌ 25లక్షలు, ఎన్టీఆర్‌ 25 లక్షలు, మహేశ్‌బాబు 25 లక్షలు సహాయం ప్రకటించారు. అలాగే విక్రమ్‌ 35 లక్షల రూపాయలు, కల్యాణ్‌ రామ్‌ రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. 
కలడిలో వదర బాధితులను పరామర్శించిన సీతారాం ఏచూరి 
కేరళ కలడి ప్రాంతంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పర్యటించారు. కలడి ప్రభుత్వ పాఠశాలతో తలదాచుకున్న బాధితులను పరామర్శించారు. వరదల్లో మృతి చెందినవారికి సంతాపం ప్రకటించి, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. వరదలతో నష్టపోయిన కేళరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 600 కోట్ల సాయం సరిపోదని ఇంకా ఎక్కువ సాయం చేయాలని ఏచూరి డిమాండ్‌ చేశారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా విరాళాలు, వస్తువులు సేకరించాలని సీపీఎం నిర్ణయించింది. ప్రతి ఒక్కరూ కేళరకు అండగా నిలవాలని సీతారాం ఏచూరి విజ్ఞప్తి చేశారు. 

 

21:27 - August 19, 2018

కేరళ : ప్రకృతి సృష్టించిన విలయం నుంచి దైవభూమి కేరళ ఇంకా తేరుకోలేదు. జలప్రళయం  సృష్టించిన విధ్వంసంతో జనం విలవిల్లాడుతున్నారు. ప్రకృతి ప్రకోపం కేరళవాసులు వెంటాడుతూనే ఉంది. భారీ వర్షాలు, వరదలు ఆ రాష్ట్రాన్ని పీడిస్తున్నాయి. ప్రకృతి విపత్తుకు ఇంతవరకు 385 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వర్షాలు, వరదలతో కేరళకు జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న డిమాండ్‌కు ప్రాధాన్యత పెరుగుతోంది. 
కేరళలో వరుణుడి బీభత్సం 
కేరళలో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినా...వరద పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. శతాబ్దకాలంలో కనీవినీ ఎరుగని వరదలను కేరళ చవిచూసింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వరదనీరు నిలిచిపోవడంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. 
ఎనిమిది జిల్లాలో రెడ్ అలెర్ట్‌ ఉపసంహరణ 
వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో కేరళలోని 11 జిల్లాల్లో శనివారం ప్రకటించిన రెడ్‌ అలెర్ట్‌ను ఎనిమిది జిల్లాల్లో ఉపసంహరించుకున్నారు. పాతనంతిట్ట, ఇడుక్కి, ఎర్నాకుళం రెడ్‌ అలెర్ట్‌ కొనసాగుతోంది. మరో రెండు జిల్లాల్లో ఎల్లో, గ్రీన్‌ అలెర్ట్‌ ప్రకటించారు. సోమవారం నాటికి వాతావరణంలో మార్పు రావొచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం కారణంగా మళ్లీ వర్షాలు కురిసే అవకాశంలేకపోలేదన్న వాతావరణ శాఖ హెచ్చరికంలతో అధికారులు అప్రమత్తమయ్యారు. 
వందలాది మంది మృతి
వర్షాలు, వరదలకు కేళరలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. వందలాది మంది  ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగినపడిన ఘటనల్లో ఎక్కువ మంది మృతి చెందారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు ఆరు లక్షల మంది సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. విద్యాసంస్థలు, చర్చిలు, మసీదులు, దేవాలయాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో మరుగుదొడ్లు, స్నానాల గదులు లేకపోవడంతో బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నవారికి  ఆహారం, మంచినీరు అందక అల్లాడుతున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు జారవిడుస్తున్నా... అవి అందరికీ అందడంలేదు. దీంతో ఆకలిదప్పులతో వదర బాధితులు అల్లాడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న చాలా ప్రాంతాలకు ఇంకా సహాయ సిబ్బంది చేరుకోలేని పరిస్థితి నెలకొంది. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సమాచార వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆపదలో ఉన్న ప్రజలను కాపాడేందుకు త్రివిధ దళాలు ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్నాయి. చుట్టూనీరు ఉన్నా తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క కేరళ వరద బాధితులు అల్లాడుతున్నారు. జలవనరులన్నీ కలుషితమైపోయాయి. రక్షిత మంచినీటి కోసం పరితపిస్తున్న కేరళ ప్రజల అవసరార్థం రైల్వేలు 14 లక్షల లీటర్ల మంచినీటిని సరఫరా చేస్తున్నాయి. పాలు దొరక్క వరద బాధితులు ముఖ్యంగా చిన్నపిల్లలు అల్లాడుతున్నారు. 
నాలుగు రోజులుగా చంగన్నూర్‌తో తెగిపోయిన సంబంధాలు 
కొచ్చి విమానాశ్రయం ఇంకా వరదనీటిలోనే  చిక్కుకుని ఉంది. దీంతో సోమవారం నుంచి కొచ్చి నౌకాదళానికి చెందిన ఎయిర్‌స్ట్రిట్‌ నుంచి ప్రయాణికుల విమాన సర్వీసులు నడిపేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. చాలా డ్యాములు పూర్తిగా నిండిపోవడంతో గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో డ్యామ్‌ దిగువ ప్రాంతాల్లోని గ్రామాలు మునిగిపోయాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. కాల్వ గట్లు తెగిపోయాయి. కేరళ రాజధాని తిరువనంతపురంకు 120 కి.మీ. దూరంలో ఉన్న చెంగన్నూర్‌కు నాలుగు రోజులుగా సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో అక్కడ ఉన్నవారి సమాచారం తెలియక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడకుండా ఉంటే మరో రెండు రోజుల తర్వాత కేరళ కొద్దిగా తెరిపినపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

 

21:04 - August 19, 2018

సింగర్ పర్ణికతో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్  నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పాటల ప్రస్థానాన్ని వివరించింది. తన అనుభవాలను తెలిపారు. హీరోయిన్ గా తనకు ఆఫర్స్ వచ్చాయని చెప్పారు. తనకు పాటలు పాడమే ఇష్టమని వివరించారు. బిగ్ బాస్ లో గీతామాధురి విన్ అవుతుంది అని అన్నారు. ఆమె తెలిపిన పలు ఆసక్తికరమైన విషయాలు వివరించారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

భద్రాచలం వద్ద 41.8 అడుగులకు చేరిన వరద నీరు

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం వద్ద వరద నీరు 41.8 అడుగులకు చేరింది. పలు కాలనీలు జలమయం, రోడ్లపై వర్షపు నీరు చేరింది. 8 గ్రామాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. రామాలయం పడమర మెట్ల వద్ద భారీగా వర్షపు నీరు చేరింది. 

 

ఆసియా క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో బజరంగ్ పునియా స్వర్ణం

ఇండోనేషియా : ఆసియా క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో 65 కిలోల విభాగంలో బజరంగ్ పునియా స్వర్ణం సాధించింది. భారత్ కు చెందిన బజరంగ్ పునియా. 

20:32 - August 19, 2018

హైదరాబాద్ : మరోసారి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెలుగుదేశం పార్టీ తెర‌దీస్తోందా...? పార్టీ అవ‌స‌రాల మేర‌కు చేరిక‌ల‌కు అధినేత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా...? టీడీపీ తీర్ధం పుచ్చుక‌నేందుకు ఆస‌క్తి చూపుతొన్న నేత‌లెవ‌రు...? ఎవ‌రి రాక‌కై తెగుగుదేశం ఎదురుచూస్తొంది..? మ‌రి ప్ర‌స్తుతం పార్టీలొఉన్ నేత‌ల ప‌రిస్తితేంటి..? ఎన్నిక‌లు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేలా బాబు మార్కు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2 మాస్ట‌ర్ ప్లాన్ పై స్పెషల్ ఫొక‌స్ ఇప్పుడు చూద్దాం....!!!
ఆపరేషన్‌ ఆకర్ష్‌ 2 జాబితాలో ప‌లువురు సీనియ‌ర్లు
సార్వత్రిక ఎన్నిక‌లు సమీపిస్తుండడంతో..  చేరికలతో తనదైన వ్యూహాలకు పదునుపెడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ చేపట్టనున్న ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్-2 జాబితాలో ప‌లువురు సీనియ‌ర్లు ఉన్నట్లు స‌మాచారం. శ్రీకాకుళం జిల్లానుంచి కొండ్రుముర‌ళీని  చేర్చుకోవాలని భావిస్తుండగా.. విశాఖ‌ నుంచి స‌బ్బం హ‌రితోపాటు.. కొణ‌తాల రామకృష్ణ టార్గెట్‌గా ఉన్నట్లు సమాచారం. స‌బ్బం హ‌రికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే సీటు, కొణ‌తాలకు అన‌కాప‌ల్లి పార్లమెంట్ సీటు ఇచ్చే అవ‌కాశం కనిపిస్తోంది. ఇక తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్‌ను సైకిలెక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఆయనకు రాజ‌మండ్రి ఎంపీ, లేదా  ఎమ్మెల్యే సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈమ‌ధ్య ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చంద్రబాబుతో బేటీ కావ‌డం ఈ వాద‌న‌కు బ‌లాన్నిస్తోంది. 
క‌డ‌ప జిల్లాలో పాగా వేసేయోచనలో టీడీపీ
వైసీపీకి కంచుకోట వంటి క‌డ‌ప జిల్లాలో పాగా వేయాల‌నీ చూస్తోంది. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డిని పార్టీలొ చేర్చుకొని మంత్రి పదవి కూడా బట్టబెట్టింది.  అలాగే ప్రజాద‌ర‌ణగల మాజీ మంత్రి డిఎల్ ర‌వీంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాల‌ని బావిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్గ రాజ‌కీయ‌ అనుభ‌వంతోపాటు.. వైఎస్ వ్యతిరేఖిగా  గుర్తింపు ఉన్న  డీఎల్‌తో పార్టీకి కలిస కలిసొస్తుందని టీడీపీ భావిస్తోంది. సైకిలెక్కేందుకు డీఎల్‌ సైతం సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం.   మైనారిటీ వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా కూడా టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికోసం టీడీపీ ఎదురుచూపులు
ఇక మాజీ సీఎం కోట్ల విజ‌య‌భాస్కర్‌ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికోసం  టీడీపీ ఎప్పట్నుంచో ఎదురుచూస్తోంది. కాగా డిప్యూటీ సీఎం కేఈ వ్యతిరేకించడంతో వెన‌క్కి త‌గ్గిన‌ట్లు సమాచారం. అనంత జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న  యామిని బాల‌పై ప్రజల్లో వ్యతిరేకత దృష్ట్యా.. మాజీ మంత్రి శైలజా నాథ్‌ను  చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయనకు సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే సీటు కేటాయించే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం.  ప్రకాశం జిల్లా లో క‌నిగిరి ఎమ్మెల్యే క‌దిరి బాబూరావుప‌ట్ల ప్రజ‌ల్లో తీవ్ర అసంతృప్తి ఉన్న నేరథ్యంలో... ఉగ్రన‌ర‌సింహారెడ్డిని చేర్చుకునేందుకు సిద్దమౌవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీనుంచి వెళ్లిన దాడి వీర‌భ‌ద్రరావు లాంటి నేత‌ల‌ను కూడా తిరిగి చేర్చుకునేందుకు టీడీపీ సిద్దంగా ఉంది.  ఈ మేరకు దాడి వీరభద్రరావు టీడీపీలోని తన స‌న్నిహితుల‌తో సంప్రదింపులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. 
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2 ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో?  
పరిమితంగానే ఉండబోయే చేరికలతో.. సొంత‌పార్టీ నేత‌ల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని టీడీపీ సీనియ‌ర్లు బావిస్తున్నారు. బలమైన నేతలను చేర్చుకుని.. ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టాలని చూస్తున్నారు టీడీపీ అధినేత. చంద్రబాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2 ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. 

 

వరద ప్రభావంతో 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

విజయవాడ : తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెంలో కట్లెరు వాగుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రభావంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు పికెట్‌ పెట్టారు. వరద ఉధృతితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 

20:23 - August 19, 2018

విజయవాడ : తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెంలో కట్లెరు వాగుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రభావంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు పికెట్‌ పెట్టారు. వరద ఉధృతితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:21 - August 19, 2018

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలోని పారిశ్రామిక వాడలో పేలుడు సంభవించింది. స్టీల్‌ ప్లాంట్‌లో బట్టీ పేలడంతో 9 మందికి గాయాలయ్యాయి. వీరిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

స్టీల్‌ ప్లాంట్‌లో పేలుడు... 9 మందికి గాయాలు

అనంతపురం : జిల్లాలోని హిందూపురంలోని పారిశ్రామిక వాడలో పేలుడు సంభవించింది. స్టీల్‌ ప్లాంట్‌లో బట్టీ పేలడంతో 9 మందికి గాయాలయ్యాయి. వీరిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

20:16 - August 19, 2018

కడప : జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాట ఉద్రిక్తంగా మారింది. గత నాలుగేళ్ళుగా.. ఇంటి స్థలాలకోసం కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా.. స్పందించకపోవడంతో.. పేదలు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేశారు. దీంతో పక్కనే ఉన్న స్థలం యజమానులు పేదలపై  విరుచుకుపడ్డారు. పేదలు సైతం తిరగబడ్డంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు సొమ్మసిల్లిపడిపోయింది.  విషయం తెలుసుకున్నపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. 

20:10 - August 19, 2018

పద్నాలుగేళ్ళ కుర్రాడే కానీ.. చదరంగంలో చిచ్చరపిడుగు.. అద్భుతమైన ఆటతీరు.. ఒత్తిడికి చెదరని ఏకాగ్రత.. అనితర సాధ్యమైన వేగం ఈ ఆటగాడి సొంతం. గ్రాండ్‌మాస్టర్ హోదా దేశవ్యాప్తంగా ప్రశంలందుకున్న ఓరుగల్లు బిడ్డ అర్జున్‌. ఎనిమిది నెలల వ్యవధిలోనే మూడు ఇంటర్నేషనల్ నార్మ్స్.. మరో మూడు గ్రాండ్‌మాస్టర్ నార్మ్స్ అందుకున్న ఘనుడు మన అర్జునుడు.  2500 ఎలో రేటింగ్ పాయింట్ల మార్కును అధిగమించి. టీనేజ్‌లోనే చెస్ గ్రాండ్‌ మాస్టర్ హోదా పొందాడు. రాష్ట్ర తొలి .. దేశంలో 54వ గ్రాండ్‌మాస్టర్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు మన ఓరుగల్లు బిడ్డ అర్జున్. 
ఈమేరకు అర్జున్, అతని తల్లిదండ్రులతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

20:05 - August 19, 2018

వరంగల్‌ : జిల్లాలోని హన్మకొండ ఆశోక్‌ థియేటర్‌ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి తల్లి, కొడుకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

20:04 - August 19, 2018

విజయవాడ : అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది విజయవాడ రైల్వేస్టేషన్‌. ట్రాఫిక్‌ ఇబ్బందుల వల్ల బస్సులు ఆలస్యమవుతుండడం మనం ఎక్కువగా చూస్తుంటాం. కాని ఇక్కడ రైళ్లే ఆలస్యంగా వస్తుంటాయి. దీంతో ప్రయాణికుల విలువైన సమయం వృధా అవుతోంది. ఈ తీరు మారకపోతే మున్ముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్వయంగా కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. 
రైల్వేస్టేషన్‌ తీరుపై నివేదిక సిద్ధం చేసిన కాగ్‌
దేశంలోనే రైల్వేలకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న విజయవాడ రైల్వే జంక్షన్‌ అభివృద్ధిలో మాత్రం పట్టాలెక్కడంలేదు. స్టేషన్‌ అభివృద్ధి ఎలా ఉన్నా రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడం ప్రయాణికులను విస్మయానికి గురి చేస్తుంది. ఈ తీరు మారకపోతే ఇబ్బందులు తప్పవని కాగ్‌ తన నివేదికలో పేర్కొనడం రైల్వేశాఖలో హాట్‌ టాపిక్‌గా మారింది. 
స్టేషన్‌లో నిత్యం 750కి పైగా రైళ్ల రాకపోకలు
స్టేషన్‌లో నిత్యం 750కి పైగా రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణ రోజుల్లో లక్ష మంది, పండగ సమయాల్లో 1.50 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ఇంత మంది ప్రయాణికులకు అనుగుణంగా మౌలిక వసతులు, రైల్వే సమాచారం చేరివేయడం, రైళ్ల రాకపోకల సమయాల్లో ఉన్న పూర్తి వైఫల్యాలను కాగ్‌ ఎండగట్టింది. ప్రతి రోజూ గంటల కొద్దీ ఆసల్యం కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్లు కాగ్‌ పరిశీలనలో తేలింది. సగటున 18 నిమిషాల చొప్పున ప్రయాణికుల టైమ్‌ వేస్ట్‌ అవుతున్నట్లు కాగ్‌ లెక్కలతో సహా నివేదికల్లో పొందుపర్చింది. 
రైల్వే ఇంటర్‌ లింకింగ్‌ సిగ్నల్‌ వ్యవస్థ ఆధునికీకరణ
ఇటేవలే రైల్వే రూట్‌ ఇంటర్‌ లింకింగ్‌ సిగ్నల్‌ వ్యవస్థను ఆధునీకరించారు. వారం రోజుల పాటు 241 రైళ్లను రద్దు చేయగా 361 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 215 రైళ్లను దారి మళ్లించారు. 50 కోట్ల వ్యయంతో లాకింగ్‌ సిగ్నల్‌ వ్యవస్థను ఆధునీకరించినా ప్రయోజనం లేదు. కేవలం సిగ్నల్‌ వ్యవస్థ ఆధునికీకరణ సరిగా లేకపోవడం, ప్లాట్‌ ఫారంల సంఖ్యను పెంచకపోవడం, యార్డు ఆధునికీకరణ చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. తక్షణం ప్లాట్‌ ఫామ్‌ల విస్తరణ పెంచి, యార్డు పునరుద్ధరించి, ఆటోమేటిక్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను త్వరితగతిన పూర్తి చేయాలని కాగ్‌ అధికారులకు తెలిపింది. ఇక రైల్వే స్టేషన్‌ పరిస్థితిపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రయాణికుల సమస్య తలెత్తకుండా చూడాలని, త్వరిత గతిన సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. 
లోపాలను సరిదిద్దుకునేందుకు దృష్టిసారించిన అధికారులు  
కాగ్‌ ఎత్తి చూపిన లోపాలను సరిదిద్దుకునేందుకు రైల్వేశాఖ అధికారులు దృష్టిసారించారు. స్టేషన్‌లో నెలకొన్న ఇబ్బందులను తొలగించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ప్రయాణికులకు కావాల్సిన రైల్వే సమాచారాన్ని తెలిపేందుకు 450 పేజీలతో దక్షిణ జోన్‌ రైళ్ల వివరాలతో పుస్తకాన్ని విడుదల చేశారు. స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌ బయట రైళ్లు ఎక్కువసేపు నిలిచిపోకుండా ప్లాన్‌ చేస్తున్నారు. 

 

హన్మకొండలో రోడ్డు ప్రమాదం...

వరంగల్‌ : జిల్లాలో హన్మకొండ ఆశోక్‌ థియేటర్‌ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి తల్లి, కొడుకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

19:58 - August 19, 2018

హైదరాబాద్ : రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికల్లో  తెలంగాణలోని సెటిలర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. సెటిలర్లకు పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించడంతో... అధికారపార్టీ కూడా ఆవైపు దృష్టి సారించింది. గ్రేటర్‌ ఎన్నికల్లోనే సెటిలర్లకు తాము పెద్దపీట వేశామని... వచ్చే ఎన్నికల్లోనూ వారికి అవకాశం కలిపిస్తామని చెబుతోంది. సెటిలర్ల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.
గ్రేటర్‌లో సెటిలర్ల ఓట్లు కీలకం
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎవరు గెలవాలన్న సెటిలర్ల ఓట్లు కీలకం కానున్నాయి.  మెజార్టీ నియోజకవర్గాల్లో వారి మద్దతు ఉంటేనే ఎవరికైనా విజయం సులువు.  నగర శివారు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది కూడా.  సాధారణ ఎన్నికల్లో సెటిలర్లు టీడీపీవైపు మొగ్గుచూపడంతో.. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌, కుత్బుల్లాపూర్‌, ఎల్‌బీ నగర్‌, రాజేంద్రనగర్‌, మహేశ్వరంలాంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అంతేకాదు.. టీడీపీ మద్దతిచ్చిన బీజేపీ అభ్యర్థులు కూడా గ్రేటర్‌ పరిధిలో 5చోట్ల విజయం సాధించారు. టీడీపీ తరపున గెలిచిన వారిలో ఆర్‌. కృష్ణయ్య తప్ప మిగిలిన నేతలంతా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.
మరికొన్ని నెలల్లో సార్వత్రిక సమరం
సార్వత్రిక సమరం మరికొన్ని నెలల్లోనే జరుగనుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో గెలవాలంటే సెటిలర్ల ఓట్లు కీలకంగా మారాయి. ఇది గుర్తించిన కాంగ్రెస్‌.... రానున్న ఎన్నికల్లో సీమాంధ్ర నేతలకూ పోటీచేసే అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. దీంతో గ్రేటర్‌ రాజకీయాలు మరోసారి సెటిలర్ల చుట్టూ తిరగడం మొదలయ్యాయి. అయితే అధికారపార్టీ కూడా సెటిలర్ల ఓట్లను రాబట్టుకునేందుకు పావులు కదుపుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనే తాము సెటిలర్లకు 10చోట్ల అవకాశం కల్పించామని.. రానున్న ఎన్నికల్లోనూ వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. దీనికితోడు ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నవారంతా తెలంగాణ వారేనని... వారిని తామెప్పుడూ చిన్నచూపు చూడలేదన్న సంకేతాలను సీఎం కేసీఆర్‌ ఇస్తున్నారు.
సెటిలర్లు మద్దతు కూడగట్టే బాధ్యత కీలక నేతలకు అప్పగింత 
మొత్తానికి రానున్న సార్వత్రిక సమరంలో గ్రేటర్‌ పరిధిలో సెటిలర్ల ఓట్లు కీలకం కానున్నాయి. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అటు అధికారపక్షం, ఇటు విపక్షం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. సెటిలర్లు మద్దతు కూడగట్టే బాధ్యత కీలక నేతలకు కేసీఆర్‌ అప్పగించారు. మరి సెటిలర్లు ఎవరివైపు ఉంటారో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. 

 

19:53 - August 19, 2018

కృష్ణా : వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. నిన్న మొన్నటి వరకు వర్షాలు లేక సతమతమైన రైతాంగానికి ప్రస్తుతం వర్షాలతో వ్యవసాయసాగుకు అనుకూలంగా మారాయి. 
స్తంభించిన జనజీవనం
కృష్ణాజిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో జనజీవనం స్తంభించింది. రోడ్లపైకి రావాలంటే జనం జంకుతున్నారు. ఏడు రోజులుగా విరామం లేకుండా పడుతున్న వర్షం దెబ్బకు లోతట్టు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణాజిల్లా అంతటా కుండపోత వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
జిల్లా వ్యాప్తంగా 70శాతం వరినాట్లు
కొద్దిరోజుల క్రితమే ఖరీఫ్‌ సీజన్‌ను ప్రారంభించారు రైతులు. జిల్లా వ్యాప్తంగా రైతులు 70 శాతం పైగా వరినాట్లు వేశారు. దీంతో జిల్లాలో ఖరీఫ్ లో 3 లక్షల 23 వేల హెక్టార్లు సాగులో ఉంది. అయితే ఇందులో 2.30 లక్షల హెక్టార్లలో వరి సాగుచేయగా... 80 వేల హెక్టార్లలో పత్తి, మినప, పసుపు, కంది, మొక్కజొన్న, మినుము, వేరుశనగ, పెసర వంటి పంటలను సాగు చేస్తున్నారు. 13 వేల హెక్టార్లలో చెరకు పంట వేశారు. వెద పద్ధతిలో సాగుచేసిన వారికి కూడా ఈ వర్షాలు మేలు చేకూరుస్తాయని అధికారులు తెలిపారు. దీంతో పశ్చిమ కృష్ణాలో సాగులో ఉన్న పత్తి, మిర్చి, వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలకు వర్షాలు లాభదాయకమని అధికారులు అంటున్నారు.
కృష్ణా జిల్లాకు 32.25 టీఎంసీలు కేటాయింపు
నాగార్జునసాగర్ కుడికాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే కుడికాలువకు అధికారులు 132 టీఎంసీల నీటి కేటాయించారు. దీంతో ఎడమ కాలువకు కేటాయించిన 132 టీఎంసీలలో..కృష్ణాజిల్లాకు 32.25 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంది. దీంతో సాగర్ ఎడమ కాలువ కింద కృష్ణాజిల్లాకు 3.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. మొత్తం మీద నిన్న మొన్నటి వరకు వర్షాలు లేక సతమతమైన రైతాంగానికి ప్రస్తుతం వర్షాలతో వ్యవసాయసాగుకు అనుకూలంగా మారాయని రైతలు ఆనందన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

19:45 - August 19, 2018

విజయవాడ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమాయమయ్యాయి.దీంతో గణపతిరావురోడ్డు, కబేళా, సత్యనారాయణపురం, పాతబస్తీ, ప్రాంతాల్లో డ్రైనేజీలు మోకాళ్లలోతుల్లో ప్రవహిస్తున్నాయి.దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. కృష్ణా జిల్లాలో కురుస్తున్న వర్షాల పరిస్థితిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

19:40 - August 19, 2018

వనపర్తి : జిల్లా  పెబ్బేరులో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది.  తోమాలపల్లి జాతీయరహదారిపై అగి ఉన్న లారీని బస్సు ఢీకొనడంతో  ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..ఆరుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

 

19:38 - August 19, 2018

హైదరాబాద్‌ : అమరావతి బాండ్ల కోసం ప్రభుత్వం విధించిన షరతులను బహిర్గతం చేయాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. పదిన్నర శాతం వడ్డీ హామీతో జారీ చేసిన ఈ బాండ్ల రాష్ట్ర ప్రభుత్వానికి గుడిబండగా మారే అవకాశం ఉందని వైసీపీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం బాండ్లు తీసుకున్న తొమ్మిదిమంది మదుపర్లు ఎవరో వెల్లడించాలి డిమాండ్‌ చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా పదిన్నర శాతం వడ్డీకి బాండ్లు జారీచేయలేదని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. 

19:34 - August 19, 2018

కర్నూలు : శ్రీశైలం దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలాశయం ఎనిమిది గేట్లను 10 అడుగల ఎత్తు మేర ఎత్తి నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం కుడి ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 2,52,560 క్యూసెక్కులుగా ఉండగా అవుట్‌ఫ్లో 3,17,573 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

19:32 - August 19, 2018

ఆదిలాబాద్‌ : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇచ్చోడ మండల కేంద్రంలో వరదలు ముంచెత్తగా వీరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారిని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్య పరామర్శించారు. వరదల్లో తన పుస్తకాలు, పెన్సిళ్లు, బట్టలు అన్నీ కొట్టుకుపోయాయంటూ చిన్నారి జ్యోతిక రోదిస్తూ కలెక్టర్‌కు విన్నవించుకుంది. దీంతో కావాల్సిన పుస్తకాలు కొనిస్తామని కలెక్టర్‌ చిన్నారికి హామీ ఇచ్చింది. 

 

19:30 - August 19, 2018

హైదరాబాద్ : కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆపన్నహస్తం అందించారు. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన 20 మంది ఎంపీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి సాహాయ నిధికి ఈ మొత్తాన్ని ఇస్తారు. 

 

నీట మునిగిన నందిగామ అగ్నిమాపక కార్యాలయం

కృష్ణా : జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని నందిగామ అగ్నిమాపక కార్యాలయం నీట మునిగింది. వర్షం నీరు కార్యాలయంలోకి చేరడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. 

 

కృష్ణా జిల్లాలో వర్షాలు

కృష్ణా : జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని నందిగామ అగ్నిమాపక కార్యాలయం నీట మునిగింది. వర్షం నీరు కార్యాలయంలోకి చేరడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. 

19:26 - August 19, 2018

కృష్ణా : జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని నందిగామ అగ్నిమాపక కార్యాలయం నీట మునిగింది. వర్షం నీరు కార్యాలయంలోకి చేరడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. 

 

19:23 - August 19, 2018

నిర్మల్‌ : జిల్లాలోని కడెం పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకుంది. కానిస్టేబుల్‌ మధురేఖ పోలీస్‌ క్వార్టర్స్‌లోనే పురుగుల మందు తాగింది. గమనించిన సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా మర్గమధ్యంలోనే మధురేఖ మరణించింది. అయితే మధురేఖ ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

కడెంలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

నిర్మల్ : కడెంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీస్ క్వార్టర్స్ లో పురుగుల మందు తాగి మధురేఖ ఆత్మహత్య చేసుకున్నారు. కడెం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తోంది. 

16:13 - August 19, 2018

తిరువనంతపురం : కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. మృతుల సంఖ్య 385కి చేరింది. ఇళ్లల్లోకి వర్షపు నీటితో పాములు, కప్పలు చేరుతున్నాయి. వరద బాధితులకు ఆహార పదార్థాలు, తాగునీరు, మందులను సహాయక బృందాలు అందజేస్తున్నాయి. రేపు, ఎల్లుండి కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశముంది. ఆదివారం పరిస్థితి కాస్తా కుదటపడడంతో 8 జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ఉపసంహరించుకున్నారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. కేరళలో సామాన్యస్థితికి చేరుకోవాలంటే దాదాపు 6 నెలలు పట్టే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

రాగల 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

తూర్పుగోదావరి : రాగల 24 గంటల్లో తూర్పుగోదావరి, పశ్చిమగోదాదరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వాతావరణ సూచించింది. ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. 

 

15:32 - August 19, 2018

రాజమండ్రి : ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. 14.6 అడుగులు నీటి మట్టం నమోదు అయింది. ప్రస్తుతం 12.90 అడుగుల నీటి మట్టం నమోదు అయింది. 11లక్షల 44 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. 11.75 అడుగుల నీటి మట్టానికి చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరికను ఉప సంహరించుకుంటారు. ఇరిగేషన్ అధికారులు వరద పరిస్థితిని పరిశీలిస్తున్నారు.   

15:20 - August 19, 2018

అనంతపురం : కేరళ తుఫాన్ బాధితుల కోసం హిందూపురంలో ప్రభుత్వ అధికారులు విరాళాలు సేకరిస్తున్నారు. అధికారులు ఇచ్చిన పిలుపుకు నగర ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రజలు ముందుకొచ్చి వస్తురూపంలో విరాళం అందించి తమ ఉదారతను చాటుకుంటున్నారు. 

కేరళలో వరదలు...385కు చేరిన మృతుల సంఖ్య

తిరువనంతపురం : కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. మృతుల సంఖ్య 385కి చేరింది. ఇళ్లల్లోకి వర్షపు నీటితో పాములు, కప్పలు చేరుతున్నాయి. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

15:03 - August 19, 2018

తిరువనంతపురం : వరదలతో కేరళ పోరాడుతోంది. 11 జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. సహాయక శిబిరాల్లో ఆరు లక్షల మందికి పసైగా వరద బాధితులు ఉన్నారు. వరద బాధితులకు ఆహార పదార్థాలు, తాగునీరు, మందులను సహాయక బృందాలు అందజేస్తున్నారు. కేరళలో 280 పెట్రోల్ బంకులు నీటి మునిగాయి. రేపు, ఎల్లుండి కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కేరళకు సహాయపడాలని ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ పిలుపిచ్చారు. కేరళ సీఎంని కలిసి 25 కోట్ల ఆర్థిక సాయం చెక్ ను హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అందించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేరళకు రూ.10 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

కేరళకు రూ.10 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించిన బెంగాల్ సీఎం

తిరువనంతపురం : వరదలతో కేరళ పోరాడుతోంది. 11 జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. సహాయక శిబిరాల్లో ఆరు లక్షల మందికి పసైగా వరద బాధితులు ఉన్నారు. వరద బాధితులకు ఆహార పదార్థాలు, తాగునీరు, మందులను సహాయక బృందాలు అందజేస్తున్నారు. కేరళలో 280 పెట్రోల్ బంకులు నీటి మునిగాయి. రేపు, ఎల్లుండి కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేరళకు రూ.10 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

కేరళ సీఎంకు 25 కోట్ల చెక్ అందజేసిన హోంమంత్రి నాయిని

తిరువనంతపురం : వరదలతో కేరళ పోరాడుతోంది. 11 జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. సహాయక శిబిరాల్లో ఆరు లక్షల మందికి పసైగా వరద బాధితులు ఉన్నారు. వరద బాధితులకు ఆహార పదార్థాలు, తాగునీరు, మందులను సహాయక బృందాలు అందజేస్తున్నారు. కేరళలో 280 పెట్రోల్ బంకులు నీటి మునిగాయి. రేపు, ఎల్లుండి కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కేరళకు సహాయపడాలని ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ పిలుపిచ్చారు. కేరళ సీఎంని కలిసి 25 కోట్ల ఆర్థిక సాయం చెక్ ను హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అందించారు.

 

కేరళకు సహాయపడాలని ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ పిలుపు

తిరువనంతపురం : వరదలతో కేరళ పోరాడుతోంది. 11 జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. సహాయక శిబిరాల్లో ఆరు లక్షల మందికి పసైగా వరద బాధితులు ఉన్నారు. వరద బాధితులకు ఆహార పదార్థాలు, తాగునీరు, మందులను సహాయక బృందాలు అందజేస్తున్నారు. కేరళలో 280 పెట్రోల్ బంకులు నీటి మునిగాయి. రేపు, ఎల్లుండి కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కేరళకు సహాయపడాలని ఢిల్లీ ప్రజలకు సీఎం కేజ్రీవాల్ పిలుపిచ్చారు. 

కేరళలో ఆగని వర్షాలు

తిరువనంతపురం : వరదలతో కేరళ పోరాడుతోంది. 11 జిల్లాలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. సహాయక శిబిరాల్లో ఆరు లక్షల మందికి పసైగా వరద బాధితులు ఉన్నారు. వరద బాధితులకు ఆహార పదార్థాలు, తాగునీరు, మందులను సహాయక బృందాలు అందజేస్తున్నారు. కేరళలో 280 పెట్రోల్ బంకులు నీటి మునిగాయి. రేపు, ఎల్లుండి కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. 

13:30 - August 19, 2018

ప్రభాస్ రూ. 25 లక్షలు..విక్రమ్ రూ. 35 లక్షలు విరాళం..

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు సినీ నటులు విరాళాలను ప్రకటించారు. ప్రభాస్ రూ. 25 లక్షలు, అక్కినేని నాగార్జున, అక్కినేని అమలలు రూ. 28 లక్షలు, జూ.ఎన్టీఆర్ రూ. 25 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 10 లక్షలు, విక్రమ్ రూ. 35 లక్షలను విరాళం ప్రకటించారు. 

ఏషియన్ గేమ్స్ లో భారత్ బోణి...

ఇండోనేషియా : ఏషియన్ గేమ్స్ లో భారత్ బోణి కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో భారత్ కు కాంస్య పతకం లభించింది. అపూర్వి చండేలా, రవికుమార్ జోడిలు పతకం సాధించారు. 

12:31 - August 19, 2018

జగన్ అలా అనడం హాస్యాస్పదం - మంత్రి అయ్యన్న...

తూర్పుగోదావరి : ఏపీలో రాజకీయ వ్యవస్థ చెడిపోయిందని వైసీపీ అధ్యక్షుడు జగన్ అనడం హాస్యాస్పదమని మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. జగన్ రాజకీయాలను భ్రష్టుపట్టించి 16 నెలలు జైల్లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లను అవినీతి పరులనడం ఏంటీ ? అని, చంద్రబాబు ఏం అవినీతి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ధవళేశ్వరం వద్ద మంత్రి దేవినేని...

తూర్పుగోదావరి : ధవళేశ్వరం బ్యారేజీని మంత్రి దేవినేని ఉమ పరిశీలించారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 1140 టీఎంసీ మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేయడం జరిగిందని దేవినేని వెల్లడించారు. కోస్తా జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయైందని, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 40 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నారు. 

12:14 - August 19, 2018

కేరళకు ఛత్తీస్ గఢ్ సాయం...

ఛత్తీస్ గడ్ : కేరళలో నెలకొన్న పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడడం జరిగిందని సీఎం రమన్ సింగ్ పేర్కొన్నారు. సోమవారం ఒక రైలులో రూ. 7 కోట్ల 50 లక్షల విలువైన బియ్యం.. తరలిస్తున్నట్లు, మూడు కోట్ల నగదును సీఎం రిలీఫ్ ఫండ్ కు అందివ్వనున్నట్లు వెల్లడించారు. అంతేగాకుండా రాష్ట్రానికి చెందిన వైద్యులు, సైన్యం సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

12:08 - August 19, 2018
11:34 - August 19, 2018
11:34 - August 19, 2018

హైదరాబాద్ : కేరళలోని వరద బాధితులను ఆదుకొనేందుకు పలు రాష్ట్రాలు, పారిశ్రామిక వేత్తలు, ఇతరులు ముందుకొస్తున్నారు. వీరిని ఆదుకొనేందుకు కేరళ బ్లాస్టర్స్ పుట్ బాల్ క్లబ్ ముందుకొచ్చింది. క్లబ్ తరపున పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ రూ. 50లక్షల విరాళాన్ని ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపిస్తున్నట్లు వెల్లడించారు. వరద బాధితులకు వస్తు సామాగ్రీని క్లబ్ సభ్యులు పంపిణీ చేస్తున్టన్లు తెలిపారు. సహాయక కార్యక్రమాల్లో ప్రతొక్కరూ మానవతాదృక్పథంతో పాల్గొనాలని క్లబ్ పిలుపునిచ్చింది...

కిన్నెరసాని ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత...

భద్రాచలం : జిల్లాలోని పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టుకు చెందిన 5గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. 

11:17 - August 19, 2018

ఢిల్లీ : 'కేరళ రాష్ట్రానికి సహాయ పడుదాం రండి..తోచిన విధంగా ఆ రాష్ట్రానికి విరాళాలు ఇవ్వండి..వరద బాధితులను ఆదుకోండి' అంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వినతులు వైరల్ అవుతున్నాయి. కేరళ...గడిచిన 12 రోజులుగా వరదలతో కొట్టుమిట్లాడుతోంది. భారీ వర్షాలు..వరదలతో రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. ఇప్పటి వరకు 358 మంది మృతి చెందినట్లు సమాచారం. ఆరు లక్షల మంది సహాయక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, జాతీయ విపత్తు, రాష్ట్ర పోలీసులు సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. వరద బాధితులకు ఆహార పదార్థాలు..తాగునీరు..మందులను సహాయక బృందాలు అందచేస్తున్నాయి. రాష్ట్రంలోని 280 పెట్రోల్ బంకులు నీట మునిగిపోయాయి.

ఇంకా పదివేల మందిని సురక్షితంగా కాపాడాల్సి ఉందని తెలుస్తోంది. 38 హెలికాప్టర్ ల సహాయంతో ప్రజలను కాపాడుతున్నారు. మూడు జిల్లాల మినహా మిగతా అన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంపై వాతావరణ శాఖ కొంత ఊరట ఇచ్చే ప్రకటన చేసింది. రెండు..మూడు రోజుల్లో వర్షాలు..వరదలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. దీనితో సహాయక చర్యలు ముమ్మరం చేపట్టే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పదార్థాల కోసం ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు. కొచ్చి ఎయిర్ పోర్టు సోమవారం నుండి విమాన రాకపోకలకు సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలోని వరద బాధితులకు సహాయం చేయాల్సిందిగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రతొక్కరూ ముందుకు రావాలని సీఎం కేజ్రీవాల్ పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. కేరళ సీఎం అకౌంట్ నెంబర్ తో విడుదల చేసింది. ఆప్ పార్టీకి చెందిన ఎంపీలు తమ నేల వేతనాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. 

కేరళకు సహాయ పడండి - కేజ్రీవాల్...

కేరళ : రాష్ట్రంలోని వరద బాధితులకు సహాయం చేయాల్సిందిగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రతొక్కరూ ముందుకు రావాలని ఓ ప్రకటన విడుదల చేసింది. కేరళ సీఎం అకౌంట్ నెంబర్ తో విడుదల చేసింది. 

10:20 - August 19, 2018

కర్నూలు : శ్రీశైలం డ్యాంలో కృష్ణమ్మ నీటితో కళకళలాడుతోంది. ఎగువున కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీనితో డ్యామ్ గేట్లను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించి శనివారం నాలుగు గేట్లను ఎత్తివేసింది. కానీ వరద ప్రవాహం అధిక మౌతుండడంతో ఆదివారం మరో నాలుగు గేట్లను పది అడుగుల మేర అధికారులు ఎత్తివేశారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుకుంటూ నాగార్జున సాగర్ వైపుకు దూసుకెళుతోంది. అవుట్ ఫ్లో 3,15,573 క్యూసెక్కులు ఉండగా ఇన్ ఫ్లో 2.52,560గా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

10:12 - August 19, 2018

ఢిల్లీ : ఎప్పటి నుండో చిక్కకుండా ఉంటున్న అండర్ వరల్ డాన్..దావూద్ ఇబ్రహిం భారత్ కు రప్పించేందుకు యత్నాలు జరుగుతున్నాయా ? అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే దావూద్ కు కీలక అనుచరుడు, ఆర్థిక మేనేజర్ జబిన్ మోతీని లండన్ పోలీసులు అరెస్టు చేశారు. విల్సన్ హోటల్ లో ఉన్న జబీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దావూద్ కు ఆర్థిక మేనేజర్ గా ఉంటున్న జబీర్ ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు..ఇతరత్రా చీకటి వ్యాపారాలను పర్యవేక్షిస్తుంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. దావూద్ కు కుడి భుజంగా వ్యవహరిస్తుంటాడని..అరెస్టు ద్వారా విచారణలో దావూద్ గురించి చాలా వివరాలు చెప్పే అవకాశం ఉంటుందని అంచనా. తద్వారా దావూద్ ను భారత్ కు రప్పించేందుకు యత్నాలు చేయవచ్చని తెలుస్తోంది. 

డాన్ దావూద్ ఆర్థిక మేనేజర్ అరెస్టు...

ఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం కీలక అనుచరుడు జబిన్ మోతిని లండన్ పోలీసులు అరెస్టు చేశారు. దావూద్ కు ఆర్థిక మేనేజర్ గా జబిన్ వ్యవహరిస్తున్నాడు. చీకటి వ్యవహారాలన్నీ అతని తెలుసని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. జబిన్ అరెస్టు ద్వారా దావూద్ ఇబ్రహింను భారత్ కు రప్పించే యత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 

మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి కన్నుమూత...

మెదక్ : మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం డాకూర్ లో మాణిక్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. మాణిక్ రెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలియచేశారు. 

నరసాపురం వద్ద గోదావరి ఉధృతి...

పశ్చిమగోదావరి : నరసాపురం వద్ద గోదావరి ఉధృతి క్రమ క్రమంగా పెరుగుతోంది. సముద్రంలోకి 12 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల మధ్య పడవల రాకపోకలను నిలిపివేశారు. 

తూ.గో.లో విస్తారంగా వర్షాలు...

తూర్పుగోదావరి : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

09:08 - August 19, 2018

కర్ణాటక : రాష్ట్రంలోని కొడుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వరదలు జిల్లాను ముంచెత్తాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కుమార స్వామి ఏరియల్ సర్వే నిర్వహించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రూ. 200 కోట్ల సాయాన్ని సీఎం కుమార స్వామి ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. కొడుగు జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండ ప్రాంతాలపై నివాసం ఉంటున్న దాదాపు 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్ట్రెచర్ల సహాయంతో వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రోడ్లన్నీ చిత్తడిగా మారిపోయాయి. కొడుగు, మైసూరు తదితర జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీగానే ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం. వర్షాకాల ప్రారంభమైనప్పటి నుండి 150 మంది వరకు మృత్యువాత పడినట్లు సమాచారం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

కర్ణాటకలో భారీ వర్షాలు...

కర్ణాటక : రాష్ట్రంలోని కొడుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వరదలు జిల్లాను ముంచెత్తాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కుమార స్వామి ఏరియల్ సర్వే నిర్వహించారు. 

ఏపీ వాటర్ షెడ్లపై కేంద్రం షాక్...

విజయవాడ : ఏపీ రాష్ట్రానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. వాటర్ షెడ్ పథకానికి నిధులను నిలిపివేసింది. కొత్తగా మంజూరైన ఆరో బ్యాచ్ వాటర్ షెడ్లకు సొంత నిధులు వినియోగించుకోవాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది. దీనితో 790 మంది కాంట్రాక్టు ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. రూ. 120 కోట్ల వేతనాల చెల్లింపుపై అయోమయం నెలకొంది. ఇప్పటి వరకు కేంద్రం ఈ మొత్తాన్ని చెల్లిస్తూ వస్తోంది. వాటర్ షెడ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

08:56 - August 19, 2018

చిత్తూరు : మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి...మానవ సంబంధాలను..విలువను ఎవరూ గుర్తించడం లేదని పలు ఘటనలు చూస్తే తెలుస్తుంది. ఆ తల్లిదండ్రులకు చేతులు ఎలా వచ్చాయో...బొడ్డు కూడా తీయని ఐదు రోజుల పసికందును వదిలేసి వెళ్లారు. ఈ ఘటన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై చోటు చేసుకుంది. కళ్యాణ కట్ట దగ్గరున్న షెడ్ వద్ద పసికందు ఏడుపులు వినిపియడంతో అక్కడున్న వారు..టిటిడి సిబ్బంది వెళ్లగా పసికందు కనిపించింది. దీనితో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. పాపను వదిలిపెట్టింది ఎవరనేది తెలియరావడం లేదు. 

08:30 - August 19, 2018

అనంతపురం : రాప్తాడులో దారుణం చోటు చేసుకుంది. అంగన్ వాడీ ఉపాధ్యాయురాలిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేయబోయాడు. ఇతను టిడిపి నేత అని తెలుస్తోంది. తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఆ టీచర్ ను నాగరాజు చెప్పుతో కొట్టాడు. దీనితో గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీనితో నాగరాజు పరారయ్యాడు. నాగరాజును కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలు డిమాండ్ చేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

08:26 - August 19, 2018

హైదరాబాద్ : పశుసంవర్థక శాఖ కార్యకలాపాలపై తెలంగాణ రాష్ట్ర సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వెటర్నరీ డిపార్ట్ మెంట్ పరిధిలోని జిల్లా ఆసుపత్రులతో పాటు అన్ని రకాల వెటర్నరీ సెంటర్లు..అందుతున్న సౌకర్యాల వివరాలను అందచేయాలని సీఎస్ ఆదేశించారు. పశుసంవర్థ శాఖకు రూ. 933 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగిందని అధికారులకు తెలియచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.68 లక్షల లీటర్ల పాలు సేకరించడం జరుగుతోందని, దీనిని 5 లక్షల లీటర్లకు పెంచే ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు సమావేశంలో సీఎస్ పేర్కొన్నారు. 

08:21 - August 19, 2018

హైదరాబాద్ : నగరంలో మందుబాబులు మారడం లేదు. ఫుల్ గా మద్యం సేవిస్తూ రయ్యి మంటూ దూసుకెళుతున్నారు. వీరికి బ్రేక్ లు వేయడానికి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. వందల సంఖ్యల్లో పట్టుబడుతున్నా...ఇతరుల్లో కూడా మార్పు రావడం లేదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఎన్నిసార్లు తనిఖీలు చేసినా మద్యం సేవించిన మందుబాబులు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా శనివారం రాత్రి ఈ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 148 మందిపై కేసులు నమోదు చేశారు. 65 కార్లు, 105 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

08:17 - August 19, 2018

నల్గొండ : కళాశాల యాజమాన్యం వేధింపులు..చదువు ఒత్తిడి..కుటుంబ కలహాలు..ప్రేమ వ్యవహారం..ఇతరత్రా కారణాలతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతూ ఆ కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిలిస్తున్నారు. తాజాగా మరో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన మఠంపల్లి గురుకుల కళాశాలలో చోటు చేసుకుంది. మఠంపల్లి పెదవీడుకు చెందిన నోముల మౌనిక గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. శనివారం రాత్రి ఈమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు గమనించి హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. కుటుంబంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకొనే ముందు సూసైడ్ నోట్ రాసినట్లు తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు. కానీ సూసైడ్ నోట్ లో మౌనిక ఏం రాసిందనేది పోలీసులు పేర్కొనడం లేదు. దర్యాప్తు జరిపిన అనంతరం వివరాలు తెలియచేస్తామని పోలీసులు తెలియచేస్తున్నారు. ఘటన జరిగిన అనంతరం ఇతర వ్యక్తులతో ఎవరూ మాట్లాడవద్దని పోలీసులు సూచించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూసైడ్ నోట్ ఎందుకు చూపించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

గురుకుల కళాశాలలో విషాదం...

సూర్యాపేట : జిల్లా మఠంపల్లి గురుకుల కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న నోముల మౌనిక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మఠంపల్లి మండలం పెదవీడుకు చెందిన మౌనిక ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. 

కళ్యాణకట్టపై అమానుష ఘటన...

చిత్తూరు : తిరుమల కొండపై అమానుష ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఐదు రోజుల పసికందును వదిలేసి వెళ్లారు. ఈ ఘటన కళ్యాణ కట్ట దగ్గర జరిగింది. పాప గుక్క పట్టి ఏడుస్తుడడంతో టిటిడి అధికారులు గుర్తించారు. వెంటనే పాపను ఆసుపత్రికి తరలించారు. పాప ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 

ఎస్ కే వర్సిటీలో ర్యాగింగ్ కలకలం...

అనంతపురం : ఎస్ కే వర్సిటీలో ర్యాగింగ్ కలకం సృష్టించింది. ఎంబీఏ ఫస్టియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. 20 మంది సీనియర్లపై వేటు పడింది. ఏడాది పాటు హాస్టల్ నుండి బహిష్కరించారు.  

అంగన్ వాడి ఉపాధ్యాయురాలిపై టిడిపి నేత అత్యాచారయత్నం...

అనంతపురం : రాప్తాడు నియోజకవర్గం తూమచర్లలో దారుణం చోటు చేసుకుంది. అంగన్ వాడీ ఉపాధ్యాయురాలిపై నాగరాజు అనే టిడిపి నేత అత్యాచార యత్నం చేయబోయాడు. ఉపాధ్యాయురాలిని నాగరాజు చెప్పుతో కొట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో నాగరాజు పారిపోయాడు. 

బంగాళాఖాతంలో అల్పపీడనం...?

ఢిల్లీ : నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

07:23 - August 19, 2018
07:17 - August 19, 2018

ఖమ్మం / భద్రాద్రి : వర్షాలు, పారిశుధ్య నిర్వహణ లోపంతో పల్లెలు మంచాన పడుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో ఇంటికి ఇద్దరు చొప్పున జ్వర పీడితులున్నారు. కుక్కల తండా, అప్పలనర్సింహాపురంలో వందలాది మంది రోగాలతో బాధపడుతున్నారు. గ్రామాలపై విరుచుకుపడుతున్న విషజ్వరాలపై 10టీవీ ప్రత్యేక కథనం...ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామాలకు గ్రామాలే మంచానపడుతున్నాయి. కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, తల నొప్పులతో జనం అల్లాడుతు న్నారు. కొద్దిరోజులుగా పంచాయతీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో.. పారిశుద్ధ్యం అటకెక్కింది. మరోవైపు ఈనెల 2 నుంచి గ్రామాలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లడంతో.. సమస్య మరింత జఠిలమైంది. కొన్నిచోట్ల తాగునీరు సరఫరా చేసే ట్యాంకులు శుభ్రం చేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఖమ్మం జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటికి 54,409 మందికి జ్వరాలు సోకాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంఖ్య సుమారు 65 వేల వరకు ఉంది. ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం భారీ సంఖ్యలో వస్తున్నారు. ఆస్పత్రిలోని జ్వరాల వార్డులో మంచాలు లేక పోవటంతో కింద పడుకోబెడుతున్నారు. తిరుమలాయపాలెం మండలంలోని కుక్కలతండాలో గిరిజనులు విషజ్వరాలతో అల్లాడిపోతున్నారు. పదిరోజులుగా తీవ్ర పరిస్థితి నెలకొన్నా అధికారులు కన్నెత్తి చూడలేదని ఆరోపిస్తున్నారు. సుమారు 180 గిరిజన కుటుంబాలు ఉండగా.. మూడు వందల మంది దాకా జ్వరాలతో బాధపడుతున్నారు. నేలకొండపల్లి మండల పరిధిలోని అప్పల నర్సింహాపురం జ్వరాలతో పడకేసింది. దాదాపు 60 శాతం మంది జ్వరపీడితులున్నారు.కొందరు ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తుంటే.. మరికొందరు ఖమ్మంలోని ప్రైవేటు వైద్యశాలలకు వెళ్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షల పేరుతో వేలకు వేలు గుంజుతున్నారంటూ పేషెంట్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. చర్ల మండలం, చింతకుంట, భూంపల్లి, వీరాపురం, దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం, పర్ణశాల, తొగనాళ్లపల్లి ప్రజలు వాంతులు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. సుజాతనగర్‌ మండలం నిమ్మలగూడెం, శర్వారం, కోయగూడెం, మేడెపల్లి, రూప్లాతండా గ్రామాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. నిమ్మలగూడెం, లక్ష్మీదేవీపల్లి మండలం గట్టుమల్లలో ఇద్దరు మృతి చెందారు. పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో సుమారు 500 మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. బూర్గంపాడు మండలం టేకులచెరువు, ఉప్పుసాక, ఇల్లెందు మండలం చర్లసముద్రం పాతపంచాయతీలోని ఒడ్డుగూడెం, ముకుందాపురం, బాలాజీతండా, నిజాంపేటలో జ్వరాలు విపరీతంగా ఉన్నాయి. పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నామని ఖమ్మం జిల్లా వైద్యాధికారి కొండల్‌రావు అంటున్నారు. చాలాచోట్ల పారిశుద్ధ్య పనులతో రోగాలు నియంత్రించామంటున్నారు. 

07:14 - August 19, 2018

విజయవాడ : దుర్గగుడికి ఈవోని నియమించాలంటేనే ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. వివాదాల్లోకి ఎక్కని అధికారులను వెతికి మరీ ఈవోగా నియమించినా... పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అందరూ ఏదో ఒక వివాదం, అవినీతితో బదిలీ అవుతున్నారు. అసలు ఇంతకీ ఇంద్రకీలాద్రిపై ఏం జరుగుతోంది? కొత్త ఈవో పదవీకాలం ఎంత?

బెజవాడ అంటేనే వెంటనే గుర్తొచ్చేది కనకదుర్గ ఆలయం. దేశంలోని శక్తి పీఠాలలో ఇది 52వది. ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన దుర్గమ్మ దర్శనం కోసం ప్రతిరోజూ భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లో అయితే 25 వేల మంది దర్శించుకుంటుగా...శనివారం, ఆదివారాల్లో ఈ సంఖ్య 45 వేలకు చేరుకుంటుంది. అయితే ఇప్పుడు మాత్రం అధికారుల తీరుతో 15వేల మంది మాత్రమే దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. కనకదుర్గమ్మ చరిత్ర తెలుసుకుని వందల్లో భవానీ భక్తులు మాల వేసుకునేవారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు అమ్మవారు ఎంత మహిన్వతిరాలో అర్థః చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై అవినీతి విలయతాండవం చేస్తోంది. నువ్వా నేనా అన్నట్టు అధికారులు, పాలకమండలి సభ్యులు భక్తులు నుంచి దోచుకోవడానికే పెద్దపీట వేస్తున్నారు. దీంతో దుర్గగుడి తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. వివాదాలకు చెక్‌ పెట్టాలని ఐఏఎస్‌ స్థాయి అధికారిని నియమించాలని భావించిన ప్రభుత్వం సూర్యకుమారిని ఈవోగా నియమించింది. టీడీపీ తరహాలో అభివృద్ధి అంటూ కొండపై దర్శనాలు, పూజల రేట్లను పెంచి భక్తుల ఆగ్రహాన్ని చవిచూశారు. ఆ తర్వాత క్షుద్రపూజల ఆరోపణలతో ఆమెను పౌరసరఫరాల శాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ తర్వాత ఇంచార్జీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనురాధ పదవి కూడా రెండు నెలల ముచ్చటగానే చెప్పవచ్చు. ఆ తర్వాత మరో ఐఏఎస్‌ అధికారిణి పద్మను నియమించినా.. అదీ మూడునాళ్ల ముచ్చటగానే సాగింది. తాజాగా పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత చీరమాయం చేసిందన్న ఆరోపణలతో ప్రభుత్వం ఆమెపై బదిలీ వేటు వేసింది. ప్రభుత్వం ప్రస్తుతం ఐఆర్‌ఎస్‌ అధికారిణి కోటేశ్వరమ్మను ఈవోగా నియమించింది. బాధ్యతలు స్వీకరించిన ఆమె... దుర్గగుడిలో నెలకొన్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో అన్న సందేహం వ్యక్తమవుతోంది. అయితే ఆమెమాత్రం సవాళ్లను అధిగమిస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కోటేశ్వరమ్మ స్వస్థలం విజయవాడే. ఇక్కడి పరిస్థితులను ఆమె చిన్నప్పటి నుంచీ చూస్తున్నారు. గతంలో క్షుద్రపూజలు జరిగిన ఉదంతం..తాజాగా చీర మాయం కావడం, పాలకమండలి సభ్యుల మధ్య నెలకొంటున్న వివాదాలు, కాంట్రాక్టర్ల బెదిరింపులు, అర్చకుల ప్లేట్‌ కలెక్షన్‌, దర్శనాలపై భక్తుల ఆగ్రహం ఇలా సమస్యలైతే కోకొల్లలుగా ఉన్నాయి. వీటన్నిటిని కోటేశ్వరమ్మ ఎలా నెట్టుకొస్తారన్నదే ప్రశ్న. అయితే అందరినీ కలుపుకొని వెళ్తానని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని ఇంద్రకీలాద్రిపైకి వచ్చిన ప్రతి ఈవో చెప్పడం సర్వసాధారణమే. కోటేశ్వరమ్మ కూడా అదే చెప్తున్నారు. మరి ఆమె భవిష్యత్‌లో ఏం చేస్తారన్నది సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. 

07:10 - August 19, 2018

విజయవాడ : పార్లమెంట్ మాజీ సభ్యురాలు చెన్నుపాటి విద్య శనివారం గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడ నుండి రెండు సార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. చెన్నుపాటి మృతికి ఏపీ సీఎం చంద్రబాబు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామోహన్, వివిధ పార్టీ నేతలు నివాళులర్పించారు. ఆదివారం విజయవాడలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

07:08 - August 19, 2018

హైదరాబాద్ : తెలంగాణలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో 7.6 ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా పంట నష్టం జరిగింది. పత్తి, సోయా, కంది, జొన్న పంటలు నీట మునిగాయి. 1.23 లక్షల ఎకరాల్లో 32 కోట్ల మేర పంట నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా వరద ముంపు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించారు. 17 ముంపు మండలాలకు ప్రత్యేక అధికారులను కలెక్టర్‌ నియమించారు.

నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టును మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టు పూర్తిగా నిండడం రైతుల అదృష్టమని మంత్రి అన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రాజెక్టు గేట్లు ఎత్తి దశల వారిగా నీరు విడుదల చేస్తామని తెలిపారు.

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పెనుగంగా ఉగ్రరూపం దాల్చుతోంది. పెనుగంగా బ్యాక్ వాటర్ రావడంతో మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపోయాయి. సిర్పూర్ నుండి ఇతర గ్రామాలకు వెళ్ళే గ్రామస్థులు మెయిన్ రోడ్డుపై వరద నీటిలో నాటుపడవల ద్వారా ప్రయాణాలు చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లోతట్టు ప్రాంతాల్లో మంత్రి జోగు రామన్న పర్యటించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షానికి సర్వం కోల్పోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 15వ వార్డు నెంబర్‌లోని ప్రధాన కాలువను పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి బాధితులకు కావాల్సిన సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు.

భద్రాచలంలో గోదావరి పొంగిపొర్లుతుంది. ఒక్క రోజులోనే ఏడు అడుగుల నీటి మట్టం పెరిగి ప్రస్తుతం 48 అడుగులకు చేరుకుంది. దీంతో రెండు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే తాలిపేరు ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు.

తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్‌ జిల్లా కోటగిరి, వర్ని మండలాల్లోని పలు గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో భూపాలపల్లి కాకతీయ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సుమారు12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో 12కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌కు వరద ఉధృతి పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుండి 4 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేయడంతో ప్రస్తుతం నీటి మట్టం 590 అడుగులకు చేరింది. 

07:04 - August 19, 2018

ఢిల్లీ : కేరళలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోది ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కేరళకు 500 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మోది ప్రకటించారు. వరదలతో అల్లాడి పోతున్న కేరళవాసులకు పలువురు ఆపన్నహస్తం అందిస్తున్నారు. కేరళలో వరదల పరిస్థితి సమీక్షించేందుకు ప్రధాని మోది కొచ్చి నావెల్‌ బేస్‌ నుంచి బయల్దేరి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. వాతావరణం అనుకూలించక పోవడంతో కొంత సేపు అంతరాయం కలిగింది. దీంతో సిఎం, అధికారులతో మోది సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టారు. ప్రధాని వెంట కేరళ సిఎం పినరయి విజయన్‌ కూడా ఉన్నారు.

కేరళలో సంభవించిన విపత్తుపై 500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రధాని ప్రకటించారు. వరద బాధితులకు నష్ట పరిహారం కూడా ప్రకటించారు. ప్రధాని విపత్తు నిధి నుంచి మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు 50 వేల నష్టపరిహారం చెల్లించనున్నట్లు మోది వెల్లడించారు. ఈ సమయంలో కేరళకు జాతి మొత్తం అండగా నిలవాలని మోది ట్వీట్‌ చేశారు.

కేరళలో వరదల కారణంగా 19 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని సిఎం ప్రధానికి వివరించారు. వరద సహాయం కింద 2 వేల కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేరళ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళను ఆదుకునేందుకు తెలంగాణ సిఎం కేసీఆర్‌ 25 కోట్లు ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌ కేరళకు 20కోట్ల సాయం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 15 వేల కోట్ల సహాయాన్ని ప్రకటించగా...ఏపి సిఎం చంద్రబాబు నాయుడు, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌, బిహార్‌ సిఎం నితీష్‌కుమార్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ 10 కోట్ల చొప్పున సహాయాన్ని ప్రకటించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ 5కోట్ల సాయం ప్రకటించారు. కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక రోజు జీతాన్ని కేరళకు సాయంగా ఇవ్వనున్నారని ఏఐసీసీ తెలిపింది.

ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కేరళకు 2 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. కేరళ వ్యాప్తంగా బ్యాంకు సేవలపై పన్ను రద్దు చేసింది. సన్‌టీవీ నెటవర్క్‌ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. సినీ ప్రముఖులు, క్రీడాకారులు కూడా విరాళాలు ప్రకటించారు. మోహన్‌లాల్, మమ్ముట్టి, కమల్‌హసన్, సూర్య, కార్తి, విజయ్‌ సేతుపతి, అల్లు అర్జున్ 25 లక్షలు చొప్పున సాయం చేశారు. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ 50 లక్షలు విరాళం ప్రకటించింది. యువ నటుడు తొవినో థామస్‌ ఇరింజలక్కుడ లోని తన ఇంట్లో బాధితులకు ఆశ్రయం కల్పించారు. ధనుష్‌ 15 లక్షలు... సిద్ధార్థ్, విశాల్‌, శివకార్తికేయన్‌ 10 లక్షల చొప్పున, విజయ్‌ దేవర కొండ 5 లక్షలు కేరళ సిఎం సహాయ నిధికి విరాళం ఇచ్చారు. యువ క్రికెటర్‌ సంజు శాంసన్‌ 15 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.

కేరళలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ముందుకు వచ్చింది. యూఏఈ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా నేషనల్‌ ఎమర్జెన్సీ కమిటి ఏర్పాటు చేసి సహాయం అందించాలని నిర్ణయించారు. తమ దేశ అభివృద్ధిలో కేరళ ప్రజల పాత్ర మరువలేనిదన్నారు.

కేరళలోని చిన్నారుల కోసం.. వంద టన్నుల ఆహార పొట్లాలను పంపిస్తున్నట్లు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనక గాంధీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వంద మెట్రిక్‌ టన్నుల పౌష్టికాహారం బాలామృతాన్ని కేరళకు పంపిస్తోంది. కేరళ వరద బాధితుల కోసం ఆహారం, మంచి నీరు సరఫరా చేసేందుకు ప్రత్యేక రైలు పుణె నుంచి బయలుదేరుతోంది.

ధవళేశ్వరం వద్ద శాంతిస్తున్న గోదావరి...

తూర్పుగోదావరి : ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి శాంతిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.1 అడుగులకు నీటి మట్టం చేరింది. 11.49 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విలీన మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 

'ముందస్తు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం'...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్ కుమార్ వెల్లడించారు. ఓటర్ల జాబితా ఖరారుకు 2019 జనవరి 1వ తేదీ గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు. 

18వ ఆసియా క్రీడలు ప్రారంభం...

ఢిల్లీ : జకార్తాలో 18వ ఆసియా క్రీడలు ప్రారంభమయ్యాయి. 45 దేశాల నుండి 10వేల అథ్లెట్లు పాల్గొంటున్నారు. భారత్ నుండి 36 క్రీడాంశాల్లో 572 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత బృందంలో 311 మంది పురుషులు, 260 మంది మహిళా క్రీడాకారులు పాల్గొంటున్నారు. 

ముగిసిన తొలి రోజు ఆట...

ఢిల్లీ : నాటింగ్ హోమ్ టెస్ట్ లో తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేసింది. కోహ్లీ 97, రహానే 81, ధావన్ 35, పంత్ 22 నాటౌట్ గా నిలిచాడు. వోక్స్ కు 3, అండర్సన్, బ్రాడ్ రషీద్ లకు తలో వికెట్ దక్కింది. 

జగన్ 240వ రోజు...

విశాఖపట్టణం : జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర కొనసాగుతోంది. 240వ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర జరుగనుంది. సుబ్బరాయుడుపాలెం, చంద్రయ్యపాలెం, వజ్రగడ్డ క్రాస్, తుమ్మయ్యపాలెం, జోగినిపాలెం క్రాస్ మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. 

కొనసాగుతున్న జల విలయం...

ఢిల్లీ : కేరళలో జల విలయం కొనసాగుతోంది. మొత్తం మృతుల సంఖ్య 357కి చేరింది. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2లక్షల పరిహారం అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేరళ రాష్ట్రంలో రూ. 19వేల కోట్ల నష్టమని ప్రాథమికంగా అంచనా వేసింది. 

Don't Miss