Activities calendar

20 August 2018

21:58 - August 20, 2018

ఢిల్లీ : ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి సంతాప సభ జరిగింది. పార్టీల కతీతంగా ప్రముఖులంతా పాల్గొని ఆయన స్మృతులను నెమరేసుకుని ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. భారత్‌ను అణుశక్తి దేశంగా మలచిన ఘనత వాజ్‌పేయిదేనని ప్రధాని మోది కొనియాడారు. మన శాస్త్రవేత్తలకు గర్వకారణంగా నిలిచిన అణుపరీక్షల వ్యవహారంలో ప్రపంచ దేశాల ఒత్తిళ్లకు ఆయన లొంగలేదని చెప్పారు. అటల్‌ జీ జీవితమంతా ప్రజాసేవకే వినియోగించారని మోది తెలిపారు. వాజ్‌పేయితో 65 ఏళ్ల పాటు స్నేహం చేసే అదృష్టం తనకు దక్కిందని బిజెపి సీనియర్‌ నేత అద్వాని అన్నారు. తాను ఎన్నో పబ్లిక్ మీటింగ్‌ల్లో ప్రసంగించినప్పటికీ, అటల్‌జీ లేని ఇలాంటి సమావేశంలో ప్రసంగించాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదని అద్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ పార్టీల కతీతంగా అందర్నీ ఒక్కతాటిపైకి తెచ్చిన ఘనత వాజ్‌పేయిదేనని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. పార్లమెంటరీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో...విపక్షనేత వాజ్‌పేయితో కలిసి 22 ఏళ్ల పాటు పనిచేశామని ఆజాద్‌ గుర్తు చేసుకున్నారు.

21:55 - August 20, 2018

అమరావతి : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు ఏపీ ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేరళకు పది కోట్ల రూపాయల విరాళాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల బేసిక్‌ జీతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే ఎంపీ లాడ్స్‌ నిధుల్లో కొంత మొత్తాన్ని ఇవ్వాలని ప్రతిపాదించారు. ఎపీ ఎన్జీవోల సంఘం 22 నుంచి 24 కోట్ల రూపాయల సాయం అందిస్తోంది. పెన్షనర్లు కూడా ఒకరోజు వేతనాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీకి చెందిన అఖిలభారత సర్వీసు అధికారులు ఒక రోజు వేతనాన్ని కేరళ వరది బాధితులకు ఇస్తున్నారు. పోలీసులు కూడా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దీనికి అదనంగా రెండు వేల టన్నుల బియ్యాన్ని పంపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 

21:29 - August 20, 2018

అమరావతి : వరదలతో కేరళకు జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేరళకు కేవలం ఆరు వందల కోట్ల సాయం ప్రకటించి చేతులు దులుపుకున్న ప్రధాని మోదీ వైఖరిని చంద్రబాబు తప్పుపట్టారు. కేరళకు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 600 కోట్లు మాత్రమే ఇచ్చి, చేతులు దులుపుకుందామనుకోవడం సరికాదని అన్నారు. మొక్కుబడిగా ఏదో చేద్దామనుకోవడం కరెక్ట్ కాదని తెలిపారు. ఎంతో ఉదారతతో కేరళకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేరళకు రాష్ట్రాలే సాయం చేస్తున్నప్పుడు.. కేంద్రం ఇంకా ఎక్కువ చేయాలని అన్నారు.

21:28 - August 20, 2018

కేరళ : రాష్ట్రంలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు కొంత ఊరట లభించింది. వర్షాలు తగ్గడంతో ప్రజా రవాణా క్రమంగా పుంజుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో వందలాది మంది ప్రజలు ఇంకా జలదిగ్బంధంలోని చిక్కుకుని ఉన్నారు. త్రివిధ దళాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. కేరళలో వరద విపత్తు కారణంగా 20 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అసోచామ్‌ వెల్లడించింది.

కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద తీవ్రత ఇంకా తగ్గలేదు. రాష్ట్రంలో ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనబడుతున్నాయి. త్రిస్సూరు, చెంగన్నూరులో పరిస్థితి దారుణంగా ఉంది. చాలా గ్రామాలు ఇంకా వరద నీటిలో మునిగి తేలుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 15 అడుగుల మేర వరద నీరు నిలిచి ఉంది.

చెంగనూరు సమీపంలో 5 గ్రామాల్లోని వందలాది మంది ప్రజలు నీటిలో చిక్కుకుపోయారు. ఇళ్లపైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్న 567 మందిని వైమానిక సిబ్బంది కాపాడారని ఎయిర్‌ మార్షల్ సురేష్‌ చెప్పారు. చాలా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వరదల కారణంగా కేరళలో ఇప్పటి వరకు 370కి పైగా మంది మృతి చెందారు. 7 లక్షల 24 వేల 650 మంది ప్రజలు 5,645 పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు త్రివిధ దళాలు, 59 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కేరళలో 1924 తర్వాత ఇంతటి విపత్తు ఎప్పుడూ సంభవించలేదని సిఎం పినరయి విజయన్‌ తెలిపారు. పట్టణాలు, గ్రామాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోందని... ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యత నిచ్చామని సిఎం తెలిపారు.

వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఆర్మీ, నేవీ, కీలక పాత్ర పోషిస్తోంది. ఎయిర్‌ఫోర్స్‌ బృందం చేసిన సహాయానికి గాను ఓ భవనంపై ప్రజలు Thanks అని రాశారు. ఆగస్టు 17న ఇదే భవనం నుంచి ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్ విజయ్‌ వర్మ ఇద్దరు మహిళలను కాపాడారు.

67 హెలిక్యాప్టర్లు, 24 ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, 548 మోటార్‌ బోట్లు రెస్క్యా ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి. త్రిస్సూరులో చిక్కుకున్న మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులను ఆర్మీ కాపాడింది. ఈ ప్రాంతంతో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపడంతో రెడ్‌ అలర్ట్‌ హెచ్చరికను ఎత్తివేశారు.

కేరళలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రజారవాణా క్రమంగా పుంజుకుంటోంది. కొచ్చిలో తొలి కమర్షియల్‌ విమానం ఎయిర్‌బేస్‌లో ల్యాండ్‌ అయింది. ప్రయాణికుల విమానాలను నడిపేందుకు వీలుగా నావికా స్థావరంలో ఏర్పాట్లు చేశారు. ఐఎన్‌ఎస్‌ గరుడ నావల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో ఎటిఆర్‌ ప్లేన్‌ ల్యాండ్‌ అయింది. బెంగళూరుకు వెళ్లిన ఈ విమానంలో 70 సీట్లు నిండిపోయాయి. కొచ్చి విమానాశ్రయం ఆగస్టు 26 వరకు మూసి ఉంటుంది. దెబ్బతిన్న రైలు, బస్సు మార్గాలను కూడా పునరుద్ధరించినా.... ఎర్నాకులం, కొట్టాయం, త్రిస్సూర్, పాల్గాట్, కాలికట్, తిరువనంతపురం ప్రాంతాల్లో మాత్రమే సేవలు అందిస్తున్నాయి. కేరళలో 80 శాతం ప్రాంతాలు విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో అంధకారంలో మగ్గుతున్నాయి.

కేరళలో వరద విపత్తు కారణంగా భారీ ఆస్తినష్టం సంభవించినట్లు అసోచామ్‌ వెల్లడించింది. 15 వేల కోట్ల నుంచి 20 వేల మేర నష్టం ఉండొచ్చని అంచనా వేసింది. వరదల కారణంగా మొత్తం 27 వేల గృహాలు ధ్వంసంకాగా... 45 వేల హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. 134 బ్రిడ్జిలు కొట్టుకు పోగా, 16 వేల కిలోమీటర్ల మేర పీడబ్ల్యూసీ రోడ్లు కోతకు గురయ్యాయనీ, 82 వేల కిలోమీటర్ల స్థానిక రోడ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయని అధికారులు చెబుతున్నారు. 

21:20 - August 20, 2018

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లోనూ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

నిండుకుండల్లా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు వరద నీటితో నిండుకుండను తలపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయం వరద నీటితో నిండిపోయింది. దీంతో 5 గేట్లను 10అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాయశయం ఇన్‌ఫ్లో 2,31,799 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 2,38,953 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.10 అడుగులు ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిలువ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 199.7354 టీఎంసీలు ఉంది.

నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు
నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం నుండి 2 లక్షల 8వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరింది. తాగునీటి అవసరాల కోసం కుడి కాల్వకు, ఏఎమ్మార్పీకి కలిపి సుమారు 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో వారం రోజుల పాటు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరితే డ్యామ్‌ గరిష్ట నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది.

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి ..
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి పెరుగుతోంది. దీంతో బ్యారేజీ 175 కృష్ణ గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. 13 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద ఉధృతి నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లంకవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
నిర్మల్‌ జిల్లా భైంసాలో గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర నుండి భారీగా వదర నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 17వేల 5వందల క్యూసెక్కుల నీటిని సుద్ధవాగులోకి విడుదల చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు
మహబూబ్‌నగర్‌లోని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. 14 గేట్లను తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ
తెలంగాణా వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది మూడు రొజులుగా ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 70 వేల ఇన్లో వస్తుండగా 5 రోజుల వ్యవధిలో 12 టీయంసీల వరద నీరు వచ్చి చేరింది. 

21:17 - August 20, 2018

హైదరాబాద్ తెలంగాణలో వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షానికి జన జీవనం స్తంభించి పోయింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అతలాకుతలమైంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వాస్పత్రిలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో రోగులు ఇబ్బంది పడ్డారు. వర్షం ధాటికి ఏజెన్సీ ప్రాంతంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు.

నిర్మల్ జిల్లాలో రాత్రి నుండి ఎడతరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పరిధిలోని ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో రాష్ట్రీయ రహదారిని అధికారులు మూసేశారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పరిధిలో జిల్లేరు సమీపంలో రోడ్డు కొట్టుకుపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భారీ వర్షాలతో అశ్వారావు పేట నియోజకవర్గం పరిధిలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరుతోంది.

భారీ వర్షాల కారణంగా కొత్తగూడెం పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. సింగరేణిలో భారీగా స్థాయిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 95 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. సింగభూపాలెం చెరువు అలుగుపారింది. ఎదుల్ల, గోదుమ, మొర్రుడు వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. జూలూరుపాడు మండలంలోని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.పాల్వంచ ములకలపల్లి మండలాలు భారీ వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. మండలాల్లో పాలవాగు మొర్రెడు కిన్నెరసాని పాములేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. బంగాళఖాతంలో ఏర్పాడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షలు కురుస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో మోస్తరు వర్షలు నమోదు కాగా...ఆధిలాబాద్ జిల్లాలో మాత్రం భారీ వర్షలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు గోదావరి, ప్రాణహిత, పెన్ గంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరి ఉరకలు వేస్తుంది. మారుమూల పల్లెలకు రాక పోకలు పూర్తిగా నిలిచి పోవడంతో జన జీవనం స్తంబించింది.

సింగరేణి ఉత్పత్తిపై వర్షం ప్రభావం పడింది. వరద నీరు గనుల్లో నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. జగిత్యాల జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని కోరుట్ల, మెట్‌పల్లి, అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కాకతీయ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో.. సుమారు12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 12కోట్ల ఆస్తి నష్టం జరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఎక్కువగా వర్షాలు పడడంతో 78 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని సంబంధిత ఉన్నత అధికారి పేర్కొన్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేశాయి. వర్షం ధాటికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వున్నా చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి. పలు కాలనీలలో ఇళ్లల్లోకి వరదనీరు వచ్చి చేరింది. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో బతుకమ్మ ఘాటు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది.

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో కలెక్టర్‌లతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

21:16 - August 20, 2018

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ప్రభావంతో వివిధ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. వంతెనలు తెగి వరద నీరు రోడ్లపైకి రావడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద బీభత్సానికి ప్రజలు అల్లాడుతున్నారు.

ఎడతెరిపి లేని వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలో రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ఇళ్లల్లోకి ప్రవహించడంతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాపై ప్రకృతి ప్రకోపించింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలలో కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహానికి బయనేరు వాగుపై ఉన్న వంతెన కూలిపోయింది. సంఘటనాస్థలానికి చేరుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు వాహనాలను బైపాస్ మీదుగా మళ్ళించారు. ఈ వంతెనను 1933లో ఖమ్మం-రాజమహేంద్రవరం ప్రధాన రహదారిపై బ్రిటీషర్ల హయాంలో నిర్మించారు.

నీటిలో మునిగిన చేపలపేట
జంగారెడ్డిగూడెం మండలం చేపలపేట వరద నీటిలో మునిగిపోయింది. అర్ధరాత్రి ఒక్కసారిగా ఎర్రకాలవ, జల్లేరు పొంగటంతో గ్రామం మొత్తం నీట మునిగింది. 100 కుటుంబాలు కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇళ్ళు మొత్తం నీటిలో మునిగిపోవడంతో నిరాశ్రయులైన గ్రామస్తులను చుట్టుపక్క ఉన్న గ్రామ ప్రజలు ఆదుకున్నారు. జిల్లాలోని బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయానికి వచ్చిన భక్తులు వరదలో చిక్కుకున్నారు. కుండపోతగా వాన కురుస్తుండడంతో సుమారు 300 మంది రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. భక్తుల వాహనాలు కూడా నీటిలో మునిగిపోవడంతో వెళ్లడానికి మార్గంలేక భక్తులు వరద నీటిలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, అగ్నిమాకప సిబ్బంది, ఎన్డీ ఆర్‌ ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఆలయం వద్ద చిక్కుకున్న 3 వందల మందిని సురక్షితంగా కాపాడి వారిని స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.

వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లా అతలాకుతలం
భారీ వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లా అతలాకుతలం అవుతోంది. ఏజెన్సీ ప్రాంతం వరదనీటిలో మునిగిపోయింది.తడువాయి ఆంధ్రషుగర్స్‌ వద్ద జల్లేరు వంతెన కూలిపోయింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. వేలాది ఎకరాల పంటపొలాలు వరదనీటిలో మునిగిపోయాయి.  ఏలూరు మండలాన్ని వరద నీరు ముంచెత్తుతోంది. తమ్మిలేరుతోపాటు ఇతర కాలువలనుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తిమ్మారు గూడెంలో ... సుమారు 70ఎకరాల పంటపొలాలు నీటిలో మునిగిపోయాయి. తమ్మిలేరు గేట్లు ఎత్తితే తమ గ్రామం మునిగిపోతుందంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలతో కృష్ణాజిల్లా అతలాకుతలం
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణాజిల్లా అతలాకుతలం అవుతోంది. అనేక ప్రాంతాల్లో కాలనీలోకి వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. విజయవాడ దుర్గ గుడి ఘాట్‌ రోడ్డు ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతున్నాయి.

పన్నేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన రహదారి
కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం వెంకట్రామపురంలో పన్నేరు వాగు ఉధృతికి రహదారి కొట్టుకుపోయింది. దీంతో నాలుగు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. నందిగామకు, చందర్లపాడుకు రాకపోకలు స్తంభించిపోయాయి. చందాపురం నల్లవాగు వద్ద బ్రిడ్జీ మీదకు రెండు అడుగుల మేర వరదనీరు చేరింది.

బిక్కుబిక్కుమంటూన్న విజయవాడ పాతబస్తీ
భారీ వర్షం కారణంగా విజయవాడ పాతబస్తీలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. గణపతి రావు రోడ్డులో డ్రైన్‌లు పొంగిపొర్లుతుంటే కొండ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గొల్లపాలెంగట్టు కొండపై మట్టిపెల్లలు పడడంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కుమ్మరి పాలెం సెంటర్‌, సొరంగం వద్ద కొండరాళ్లు దొర్లిపడ్డాయి. కొండ ప్రాంతాల్లో సమస్యలపై అధికారులు దృష్టి సారించకపోవడంతో తాము భయభ్రాంతులకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తూర్పు గోదావరిజిల్లాలో వరద బీభత్సానికి పడవ మునక
తూర్పు గోదావరిజిల్లాలో వరద బీభత్సానికి పడవ మునిగిపోయింది. ముమ్మిడివరం మండలం గురజాపులంకలో పడవ బోల్తాపడటంతో నల్లాబుచ్చి మహేశ్వరరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. పడవలోని 19మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పశువులను ఒడ్డుకు చేర్చేక్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది.

రాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం
రాజమండ్రిలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. లంక వాసులకు ఊపిరిసలపకుండా చేస్తోంది. లంక గ్రామాల్లో వరద నీరు చేరడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. రాజమహేంద్రవరం, ధవళేశ్వరం వద్ద నదీ ప్రవాహం వేగంగా పెరుగుతోంది.

సచివాలయంలోకి నీరు
అమరావతిలో కురుస్తున్న వర్షాలకు సచివాలయంలోకి నీరు వచ్చి చేరుతోంది. సచివాలయానికి ఎన్నిసార్లు మరమత్తులు చేసినా లీకేజీ మాత్రం ఆగడంలేదు. సచివాలయం 4వ బ్లాక్‌ మంత్రుల షేషిలో వర్షపు నీరుపై నుండి కారుతున్నాయి. 4వ బ్లాక్‌లోని మంత్రులు గంటా శ్రీనివాసరావు, అమర్‌నాథ్‌ రెడ్డి పేషీలో వ ర్షపు నీరు కారుతుండడంతో సిబ్బంది నీటిని తుడిచి శుభ్రం చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుసే అవకాశం ఉండటంతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించింది. 

21:15 - August 20, 2018

తూర్పుగోదావరి : కొత్తపేటలో సబ్‌ ట్రెజరీ కార్యాలయం భవనం కొంత భాగం కుప్పకూలింది. కార్యాలయం వెనక భాగంలో మహిళ ఉద్యోగి ఆదిలక్షపై శిథిలాలు పడడంతో ఆమె మృతి చెందింది. భవనం కూలినప్పుడు ఇతర ఉద్యోగులు పరుగు తీసి ప్రాణాలు దక్కించుకోగా.. వికలాంగురాలైన ఆదిలక్ష్మి శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. బ్రిటీష్‌ కాలం నాటి పురాతన భవనం కావడంతో.. వర్షం నీటికి నానడం వల్లే భవనం కూలినట్లు ఉద్యోగులంటున్నారు. 

కేరళకు ఏపీ సర్కార్ రూ.10కోట్లు : చంద్రబాబు

అమరావతి : కేరళకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్ల విరాళం ప్రకటించిందని, ఏపీ ఎన్జీవోలు రూ. 20 కోట్ల సాయాన్ని ప్రకటించారని చంద్రబాబు చెప్పారు. హుద్ హుద్ తుపాను సమయంలో రాష్ట్రానికి కేంద్రం రూ. 1000 కోట్లను ప్రకటించిందని... కానీ, రూ. 650 కోట్లను మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. ఏపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. రాయలసీమలో వర్షపాతం నమోదు కాలేదని... కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. 

కేరళకు కేంద్రం 600ల కోట్లు మాత్రమేనా : చంద్రబాబు

అమరావతి : కేరళకు కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 600 కోట్లు మాత్రమే ఇచ్చి, చేతులు దులుపుకుందామనుకోవడం సరికాదని అన్నారు. మొక్కుబడిగా ఏదో చేద్దామనుకోవడం కరెక్ట్ కాదని తెలిపారు. ఎంతో ఉదారతతో కేరళకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేరళకు రాష్ట్రాలే సాయం చేస్తున్నప్పుడు.. కేంద్రం ఇంకా ఎక్కువ చేయాలని అన్నారు.

కేరళ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి : చంద్రబాబు

అమరావతి : జల దిగ్బంధంతో అతలాకుతలమైన కేరళను ఆదుకోవడానికి అందరూ ముందుకు వస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమ వంతు సాయం అందించడానికి యూఏఈ లాంటి దేశాలు కూడా ముందుకు వస్తున్నాయని చెప్పారు. కేరళ ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆసియా క్రీడల్లో భారత రెజ్లర్‌ వినీశ్‌ ఫొగాట్‌ కు స్వర్ణం..

ఢిల్లీ : ఆసియా క్రీడలు-2018లో భారత రెజ్లర్‌ వినీశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించింది. 50 కిలోల ఫ్రీస్టైల్‌ విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకొంది. ఆసియా క్రీడల్లో పసిడి సొంతం చేసుకున్న తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా చరిత్రను తిరగరాసింది. ఫైనల్లో జపాన్‌ అమ్మాయి ఇరీ యుకిని 6-2 తేడాతో చిత్తు చేసింది. తొలి రౌండ్‌ నుంచే ఆమె దూకుడుగా ఆడింది. ప్రత్యర్థిపై 4-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో రౌండ్‌లో ఇద్దరూ చెరో రెండు పాయింట్లు సాధించారు. చివరి వరకు వినీశ్‌ అదే ఊపు కొనసాగించి 6-2తో ప్రత్యర్థిని మట్టికరిపించి స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. 

19:41 - August 20, 2018

కేరళ రాష్ట్రం భారీ వర్షాలతో వరదలతో అతలాకుతం అయిపోయింది. జన జీవనం అస్తవ్యస్థంగా తయారయ్యింది. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతితో అలరారే కేరళ ఎక్కడ చూసినా హృదయవికారమైన దృశ్యాలతో భయానకంగా తయారయ్యింది. సుమారు 10లక్షలమంది పునరావాసాల్లో రక్షణ పొందుతున్నారు. మరి ప్రకృతి భూమితో అలరించిన కేరళకు ఇటువంటి దుస్థితి నెలకొనటానికి కారణాలేమిటి? ప్రకృతి ఇంతగా పగబట్టటానికి కారణాలేమిటి? ప్రకృతి అందాలకు నెలవుగా పేరుగాంచిన కేరళ ప్రజల జీవితాన్ని వరదలు చిన్నాభిన్నం చేశాయి. దీనికి కారణమేమిటి? ఇంతటి విలయానికి మానవ తప్పిదమే కారణమంటున్నారు పర్యావరణ వేత్తలు ఈ అంశంపై 10టీవీ బిగ్ డిబేట్..ఈ డిబేట్ లో పర్యావరణవేత్త పురుషోత్తం, ఎన్ ఎండీఏ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. 

పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సమీక్ష..

అమరావతి: పోలవరం సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గేలరీ వాక్ నిర్మాణంలో కొంత జాప్యం జరుగుతోందని, పనులకు ఎడతెరిపి లేని వర్షాలు అడ్డంకిగా ఉన్నాయని పోలవరం అధికారులు సీఎంకు వివరించారు. గేట్ల ఏర్పాటు కూడా స్వల్పంగా వాయిదా పడుతుందని తెలిపారు. సెప్టెంబర్ చివరిలో కేంద్ర బృందం పరిశీలనకు వచ్చే సమయానికి కాఫర్ డ్యాం, స్పిల్ వే పనులు వేగవంతం చేస్తామని సీఎంకు వివరించారు.

19:23 - August 20, 2018

విశాఖపట్నం : వరద ముంపులో చిక్కుకున్న కేరళకు సాయం చేసేందుకు సీపీఎం నడుంబిగించింది. సహాయక చర్యల్లో భాగంగా 10 టన్నుల మెటీరియల్‌ సేకరించినట్లు సీపీఎం నాయకులు నర్సింగరావు తెలిపారు. ఈ మెటీరియల్‌ను కేరళకు పంపేందుకు రైల్వే సహాయం కోరింది. ప్రజా సంఘాలతో కలిసి రైల్వే డీఆర్‌ఎంను కలిసి సేకరించిన మెటీరియల్‌ను కేరళకు పంపడానికి ప్రత్యేక బోగి కావాలని కోరగా దీనికి రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. కేరళకు కావాల్సిన మెటీరియల్‌ను ఉచితంగా రవాణా చేస్తామని హామీ ఇచ్చారు. గాజువాక జగదాంబ సెంటర్‌ వద్ద సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రజలు అక్కడికి వచ్చి తమ వంతు సాయం చేయాలని నర్సింగరావు కోరారు.

19:19 - August 20, 2018

అమరావతి : కేరళ వరద బాధితులకు ఏపీ ఎన్జీవో జేఏసీ 20 కోట్ల విరాళం ప్రకటించింది. ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎన్జీవో నేతలు ఆ మేరకు అంగీకారపత్రం అందజేశారు. కేరళ వరద బాధితులకు 20 కోట్లు ఆర్థికసాయం చేయాలని ఉద్యోగుల సమావేశంలో నిర్ణయించినట్లు జేఏసీ నేతలు చంద్రబాబుకు తెలిపారు. కేరళలో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం కావడంతో... సానుభూతిలో విరాళం ఇచ్చేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పించనుదార్లు ఏకపక్షంగా ముందుకు వచ్చారని తెలిపారు. 

19:16 - August 20, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ ప్రగతి నివేదిన బహిరంగ సభ వాయిదా పడ్డట్లేనా..? ఈ ప్రశ్నకు అవునన్న సమాధానమే వస్తోంది. సెప్టెంబర్‌ రెండున సభ జరపాలని భావించారు. అయితే.. ఇప్పటికీ ఏర్పాట్లు ప్రారంభం కాకపోవడంతో.. ప్రస్తుతానికి సభ వాయిదా పడ్డట్లేనన్న భావన వ్యక్తమవుతోంది. మరి దీనికి కారణమేంటి..? వాచ్‌ దిస్‌ స్టోరీ

తెలంగాణాలో పొలిటికల్ హీట్ ను ఓ రేంజ్‌కు తీసుకువెళ్లేందుకు సిద్ధమైన గులాబీ దళపతి కేసిఆర్, వాతావరణ పరిస్థితులతో చల్లబడ్డట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్‌ రెండో తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో.. ఆగస్టు 17న శాసనసభాపక్షం, పార్లమెంటరీ పక్షాలతో పాటు.. రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాలని కేసీఆర్‌ భావించారు. అదే ఊపులో.. సెప్టెంబర్‌ రెండున భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని, ఆ సభలో.. పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలనీ కేసీఆర్‌ నిర్ణయించారు. అయితే.. భారీ వర్షాల నేపథ్యంలో.. రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కేసీఆర్‌ వాయిదా వేశారు. బహిరంగ సభపై మాత్రం ఎలాంటి నిర్ణయాన్నీ ప్రకటించలేదు.

బహిరంగ సభ నిర్వహణకు హైదరాబాద్‌ శివారుల్లోని కొంగరకలాన్‌లోని 1500 ఎకరాల స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. అయితే.. జనసమీకరణ, సభ ఏర్పాట్లకు గడువు చాలదని పార్టీ నేతల అభిప్రాయంతో కేసీఆర్‌ ఏకీభవించినట్లు పార్టీ శ్రేణుల్లో సమాచారం జరుగుతోంది. మరోవైపు కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్న తరుణంలో.. భారీ బహిరంగ సభ నిర్వహిస్తే రాజకీయంగా కూడా విమర్శలు ఎదుర్కోక తప్పదన్న భావనా పార్టీ నేతల్లో వ్యక్తమైనట్లు సమాచారం. వీటన్నింటికీ తోడు.. రాష్ట్రంలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండడం కూడా.. బహిరంగ సభ నిర్వహణపై కేసీఆర్‌ పునరాలోచనలో పడడానికి కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

భారీ బహిరంగ సభకు బదులుగా.. ప్రాంతీయ సభలు నిర్వహించే ప్రతిపాదన కూడా అధికార పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపాదికన మూడు లేదా నాలుగు బహిరంగ సభలను నిర్వహించే అవకాశాలను పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టి సారించడంతో తెలంగాణాలో తమకు ఉన్న ప్రజాదరణను తెలియజెప్పేందుకు భారీ సభ నిర్వహించాలని అధికార పార్టీ భావించింది. కాని తాజా పరిణామాలతో.. సభ నిర్వహణను తాత్కాలికంగా వాయిదా వేసినట్లే అన్న అభిప్రాయం టీఆర్ఎస్‌ నేతల్లో వ్యక్తం అవుతోంది. 

డీఎస్ కుమారుడి బెయిల్ కొట్టివేసిన కోర్టు..

హైదరాబాద్ : తెలంగాణలో సీనియర్ రాజకీయవేత్త అయిన డి.శ్రీనివాస్ కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ డి.సంజయ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను నిజామాబాద్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. తన నర్సింగ్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నెల 12న ఆయనను అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. దీంతో, ఆయన తరపు న్యాయవాదులు ఈ నెల 14న బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సంజయ్ విచారణ ఇంకా పూర్తి కాలేదని...

17:43 - August 20, 2018

పాకిస్థాన్ : ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రధాని నరేంద్రమోదీ లేఖ రాసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ లేఖలో ఇరుదేశాల చర్చలకు సంబంధించి మోది ప్రస్తావించలేదు. పొరుగు దేశాలతో మంచి సంబంధాలనే కోరుకుంటామని మోది లేఖలో తెలిపారు. ఇమ్రాన్‌ఖాన్‌కు మోదీ లేఖ రాసినట్లు పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎమ్ ఖురేషి తెలిపారు. ఇమ్రాన్‌ఖాన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు మోదీ మర్యాదపూర్వకంగానే లేఖ రాసినట్లు సమాచారం. పాకిస్తాన్‌కు 22వ ప్రధానిగా పిటిఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

17:42 - August 20, 2018

ఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోది ఆచూకి లభించింది. అతను బ్రిటన్‌లో ఉన్నట్లు సిబిఐ అధికారులు ధృవీకరించారు. నీరవ్‌ మోదిని తమకు అప్పగించాలని హోంమంత్రిత్వ శాఖకు సిబిఐ విజ్ఞప్తి చేసింది. నీరవ్‌ మోదిని స్వదేశానికి రప్పించేందుకు విదేశాంగ శాఖ సహకారంతో తన ప్రతినిధులను బ్రిటన్‌కు పంపనుంది. ఇంటర్‌పోల్‌ ద్వారా జారీ చేసిన రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ ఆధారంగా నీరవ్‌ మోదిని అదుపులోకి తీసుకునేందుకు అనుమతించాలని సిబిఐ బ్రిటన్‌ అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది జూన్‌లో నీరవ్‌మోదీకి రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేశారు. నీరవ్‌మోది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు 14,600 కోట్లకు కుచ్చుటోపి పెట్టారు. ఈ స్కామ్‌లో మరో నిందితుడు నీరవ్‌ మోది మామ మెహుల్‌ చోక్సీ ఆంటిగ్వాలో పౌరసత్వం పొందాడు.

17:40 - August 20, 2018

విజయవాడ : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడ నగరంలో బుడమేరు వాగు పొంగిపొర్లడంతో పలు కాలనీలు నీటమునిగాయి. విజయదుర్గకాలనీలో వరద నీరు చేరడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సహాయక చర్యలు చేపట్టాల్సిన అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడంతో కాలనీవాసులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. విజయదుర్గకాలనీలో తాజా పరిస్థితి నెలకొంది. మోకాల్లోతుగా నిండిపోయిన నీటిలో స్థానికులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. సహాయక చర్యల్ని చేపట్టాల్సిన అధికారులు నిద్రమత్తుల్లో వున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఒకపక్క వరద నీరు..సురక్షిత ప్రాంతంలోకి వెళ్లాంటే కూడా ఎటూకాని పరిస్థితుల్లో చిక్కుకుపోయామనీ..అధికారుల వద్దకు ఉదయం సమయంలో వెళ్లి వారిని నిద్రలేపి సహాయం చేయమని అడిగినావారు పట్టించుకోవటంలేదని బుడమేరు ముంపు ప్రాంత వాసులు వాపోతున్నారు. 

17:40 - August 20, 2018

తూర్పుగోదావరి : రాజమండ్రి గోదావరి తీరంలో వరద తాకిడి కొనసాగుతోంది. వారం రోజులుగా వరదలతో నదీ తీరం తల్లడిల్లుతోంది. అనేక ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రాజమహేంద్రవరం, ధవళేశ్వరం వద్ద నదీ ప్రవాహం వేగంగా పెరుగుతోంది. గోదావరిలో వరద ఉధృతిపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

17:39 - August 20, 2018

నిజామాబాద్ : గత రెండు రోజుల నుండి నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఆ ప్రాంతపు రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

17:37 - August 20, 2018

పాకిస్తాన్‌ : ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని అధికారిక నివాసంలో తాను ఉండబోనని... మిలటరీ సెక్రటరీలో ఓ మూడు పడకల గదుల ఇంట్లో ఉంటానని తెలిపారు. తన సొంత ఇల్లు బెనిగలాలోనే ఉండాలనుకున్నప్పటికీ భద్రతా కారణాల వల్ల సెక్యూరిటీ ఏజెన్సీ ఒప్పుకోవడం లేదన్నారు. ప్రధాని అధికార నివాసంలో 524 మంది పనివాళ్లు, 80 కార్లు, 33 బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లతో పాటు హెలిక్యాప్టర్లు, విమానాలు, విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దారుణమైన పరిస్థితిలో ఉన్న ప్రజలకు వెచ్చించేందుకే నిధులు లేవన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తాను కేవలం ఇద్దరు సర్వెంట్లను మాత్రమే తనతో ఉంచుకుంటానని వెల్లడించారు. ప్రధాని అధికారిక నివాసాన్ని రీసెర్చి యూనివర్సిటీగా మార్చాలని ఆయన ఆదేశించారు. దేశ వ్యాప్తంగా అనవసర ఖర్చులు తగ్గించేందుకు ఇమ్రాన్‌ ఓ కమిటీని వేశారు. గత ప్రధానులు విదేశీ పర్యటనలకు విపరీతంగా ఖర్చు చేశారని ఇమ్రాన్‌ ఆరోపించారు. 650 మిలియన్‌ డాలర్లు ఏం చేశారని ప్రశ్నించారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు వేలంలో పెడతానని వీటిని కొనేందుకు వ్యాపారులు ముందుకు రావాలని ఆహ్వానించారు.

17:35 - August 20, 2018

అవరావతి : రాజధాని అమరావతి బాండ్లపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శించారు. రాజధానిలో మౌలికసదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం సీఆర్‌డీఏ బాండ్లు జారీ చేసిందని కుటుంబరావు చెప్పారు. ఈనెల 27న బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లో లిస్ట్‌ అయినప్పుడు సంస్థాగత మదుపర్ల వివరాలు వెల్లడవుతాయన్నారు. ఎక్కువ బాండ్లు అడిగినవారికి కొద్దిగా తగ్గించామనీ..తక్కువ కాలన్నవారికి సర్దిచెప్పి కొద్దిగా ఎక్కువ ఇచ్చామనీ కేటుంబరావు పేర్కొన్నారు. 

తాలిబన్ల మెరుపుదాడి..100మంది కిడ్నాప్..

అఫ్గానిస్తాన్ : దేశంలో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తఖర్ ప్రావిన్సు నుంచి రాజధాని కాబూల్ కు వెళుతున్న మూడు బస్సులపై మెరుపుదాడి చేశారు. అనంతరం వాటిలోని 100 మంది ప్రయాణికులతో పాటు భద్రతా సిబ్బందిని కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని అఫ్గాన్ ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. కుందుజ్ ప్రావిన్సులో మూడు బస్సుల్లోని ప్రయాణికులను కిడ్నాప్ చేసిన తాలిబన్లు.. వారిని గుర్తుతెలియని రహస్య ప్రాంతానికి తరలించారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కిడ్నాపైన వారిలో ప్రజలతో పాటు అఫ్గాన్ భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

16:28 - August 20, 2018
16:26 - August 20, 2018

తిరుమల : నడకమార్గంలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం సర్వసాధారణంగా జరుగతుంటుంది. టీటీడీ దీనిపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..ఆత్మహత్యలు జరుగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువతి నడకదారిలోని అవ్వాచారి కోనలో నీరజ అనే యువతి కొండపైనుండి దూకినట్లుగా తెలుస్తోంది. జగ్గయ్యపేటకు చెందిన నీరజ ఇంట్లోవారికి చెప్పకుండా తిరుమలకు చేరుకుంది. ఈ క్రమంలో కొండపైనుండి దూకింది. దీంతో అవ్వాచారి కోనలోని లోయలోకి దూకిన నీరజకు స్వల్పగాయాలయ్యాయి. అనంతరం తన మొబైల్ నుండి రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించింది. తాను ప్రమాదంలో వున్నానని రక్షించమని కోరింది. దీంతో 60 అడుగుల లోయలో పడిన నీరజను రెస్య్యూ టీమ్ రక్షించి ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా జగ్గయ్యపేటలో నీరజ అదృశ్యం కావటంతో ఆమె బంధువులు పీఎస్ లో ఫిర్యాదు చేసారు. కాగా నీరజ ఆత్మహత్యకు పాల్పడిన అనంతరం వివరాలు తెలుసుకున్న పోలీసులు జగ్గయ్యపేటలోని ఆమె బంధువులకు సమాచారం అందించారు. 

16:03 - August 20, 2018

ఢిల్లీ : జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ సమావేశలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో గోదావరి నీటిని కావేరి బేసిన్‌కు తరలించే అంశంపై సమీక్ష జరిగింది. ఈ భేటీ అనంతరం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతు.. పోలవరం ప్రాజెక్టు పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ .. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ భేటీకి హాజరైన దేవినేని ఉమ.. పోలవరం నిధుల అంశాన్ని ప్రస్తావించారు. 

16:02 - August 20, 2018

మెగాస్టార్ 'చిరంజీవి'...ఆయన తాజా చిత్రం కోసం అభిమానులతో పాటు ఇతరులు ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తరువాత 150 సినిమా 'ఖైదీ నెంబర్ 150' ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం 151సినిమాకు చాలా రోజుల గ్యాప్ తీసుకున్నారు. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' జీవిత చరిత్ర ఆధారంగా 'సైరా నరసింహారెడ్డి' చిత్రం తెరకెక్కుతోంది. 'కొణిదెల ప్రొడక్షన్స్' పతాకంపై మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'సురేందర్ రెడ్డి' దర్శకత్వం వహిస్తుండగా.. 'నయనతార' 'చిరు' జోడీ కడుతోంది. బాలీవుడ్ నుండి 'అమితాబ్ బచ్చన్', కోలీవుడ్ నుండి 'విజయ్ సేతుపతి', శాండిల్ ఉడ్ నుండి 'కిచ్చా సుదీప్'లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేగాకుండా నటిస్తుండగా.. 'జగపతిబాబు' కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్.

ఇదిలా ఉంటే ఆగస్టు 22వ తేదీ 'చిరంజీవి' జన్మదినం సందర్భంగా 'సైరా' సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయబోతోంది. ఆగస్టు 15వ తేదీన ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆగష్టు 21 ఉదయం 11:30 గంటలకు 'సైరా' సందడి చేయనుంది. 

15:56 - August 20, 2018

ఢిల్లీ : గోదావరి పరీవాహక ప్రాంత రాష్ట్రాల నీటి అవసరాలు తీరిన తర్వాత ఈ నదీ జలాలను కావేరి బేసిన్‌కు తరలిస్తే అభ్యంతరంలేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన ఎన్‌డబ్ల్యూడీఏ భేటీలో తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ సమావేశలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో గోదావరి నీటిని కావేరి బేసిన్‌కు తరలించే అంశంపై సమీక్ష జరిగింది. ఈ భేటీ అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతు..గోదావరిలో తెలంగాణ వాటా 954 టీఎంసీల నీటిని వాడుకున్న తర్వాత మిగులు జలాలు ఉంటే కావేరి బేసిన్‌కు తరలించవచ్చని తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ సమావేశానికి హాజరైన హరీశ్‌... ఈ విషయం స్పష్టం చేశారు. 

15:53 - August 20, 2018

కేరళ: దేవభూమిగా పిలుచుకునే కేరళ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద తీవ్రత ఇంకా తగ్గలేదు. చాలా గ్రామాలు ఇంకా వరద నీటిలో మునిగి ఉన్నాయి. చెంగనూరు సమీపంలో 5 గ్రామాల్లోని 1000 మంది ప్రజలు నీటిలో చిక్కుకుపోయారు. రాష్ట్రంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. వరదల కారణంగా కేరళలో ఇప్పటి వరకు 400 మంది మృతి చెందారు. ఏడు లక్షలకు పైగా ప్రజలు 5,645 పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు త్రివిధ దళాలు, 59 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఆర్మీ జవాన్లు వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎయిర్‌ఫోర్స్‌ బృందం చేసిన సహాయానికి గాను ఓ భవనంపై ప్రజలు థాంక్స్ అని రాశారు. ఆగస్టు 17న ఇదే భవనం నుంచి ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్ విజయ్‌ వర్మ ఇద్దరు మహిళలను కాపాడారు. వరదల్లో చిక్కుకున్న మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులను ఆర్మీ కాపాడింది. ఈ ప్రాంతంతో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రవ్యాప్తంగా 3,700 మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేసింది. మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. 

15:51 - August 20, 2018

కేరళ : వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రజారవాణా క్రమంగా పుంజుకుంటోంది. కొచ్చిలో తొలి కమర్షియల్‌ విమానం ఎయిర్‌బేస్‌లో ల్యాండ్‌ అయింది. ప్రయాణికుల విమానాలను నడిపేందుకు వీలుగా నావికా స్థావరంలో ఏర్పాట్లు చేశారు. ఐఎన్‌ఎస్‌ గరుడ నావల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో ఎటిఆర్‌ ప్లేన్‌ ల్యాండ్‌ ఇవాళ ఉదయం అయింది. 70 సీట్లు గల ఈ విమానం తిరిగి బెంగళూరు వెళ్తోంది. ఇందులో సీట్లన్ని నిండిపోయాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా గత కొన్ని రోజులుగా మూసివున్న కొచ్చి విమానాశ్రయం మూసివున్న విషయం తెలిసిందే. కొచ్చి విమానాశ్రయం ఆగస్టు 26 వరకు మూసి ఉంటుంది. కోయంబత్తూర్‌, మధురై తదితర ప్రాంతాలకు వెళ్లే విమానాలను త్వరలో తిరిగి ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు ట్వీట్‌ చేశారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేరళ సీఎం పినరయి విజయన్‌ కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. వరదల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం 25కోట్లు ఆర్ధికసాయం చేయడంతో కేసీఆర్‌కు... విజయన్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

15:45 - August 20, 2018

కృష్ణా : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణాజిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక కాలనీలోకి వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. కృష్ణా జిల్లాలో వరద పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. 

15:43 - August 20, 2018

పశ్చిమ గోదావరి : జంగారెడ్డిగూడెం మండలం చేపలపేట వరదల్లో మునిగిపోయింది. అర్ధరాత్రి ఒక్కసారిగా ఎర్రకాలవ, జల్లేరు పొంగటంతో గ్రామం మొత్తం నీట మునిగింది. 100 కుటుంబాలు కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇళ్ళు మొత్తం నీటిలో మునిగిపోవడంతో నిరాశ్రయులైన గ్రామస్తులను చుట్టుపక్క ఉన్న గ్రామ ప్రజలు ఆదుకున్నారు. చేపలపేటలో వరద పరిస్థితితో ఆల్లాడిపోతున్నారు. కట్టుబట్టలతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బైటపడ్డారు. 

15:36 - August 20, 2018

హైదరాబాద్ : నగరంలో దొంగల హల్ చల్ చేశారు. బ్యాంక్ వెనక వున్న గోడను పగులగొట్టి బ్యాంక్ లోకి ప్రవేశించారు. ఈ ఘటన నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్ ఎస్బీఐ బ్యాంక్ లో చోటుచేసుకుంది. బ్యాంక్ వెనక గోడకు పెద్ద కన్నం పెట్టిన దాంట్లోంచి బ్యాంక్ లోకి ప్రవేశించారు. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ పుటేజీ అధారంతో పోలీసులు దొంగల కోసం గాలింపును ముమ్మరం చేశారు. కన్నంగుండా లోపలికి ప్రవేశించిన దొంగలు లాకర్ ను పగులగొట్టేందుకు యత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో వెనుదిరిగి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.  

బసవతారకం కిట్ల పథకంపై హైకోర్టు స్టే..

హైదరాబాద్ : బసవతారకం కిట్ల పథకంపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ పైవిచారణ చేపట్టిన న్యాయస్థానం పథకం అమలుపై మరో మూడు రోజులు స్టే పొడిగిస్తు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా బసవతారకం కిట్ల పథకం టెండర్లలో అవకతవకలు జరిగాయని..అర్హతన లేనివారికి కంపెనీలకు అక్రమంగా టెండర్లను కట్టపెట్టారని పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం బసవతారకం కిట్ల పథకంపై స్టే విధించింది. తరుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదావ వేసింది. కాగా ఈ పథకం ఆగస్టు 15న ప్రభుత్వం ప్రారంభించాలనుకున్న విషయం తెలిసిందే.

15:19 - August 20, 2018

ఓ స్టార్ హీరో.. స్టార్ డైరక్టర్..ఇంత వరకు మనం చూడని క్రేజీ కాంబినేషన్ ఎప్పుడూ తను టచ్ చేయని కొత్త ఎలిమెంట్ ను టచ్ చేశాడు దర్శకుడు. తనకు అలవాటు అయిన సబ్టెక్స్ ను ఇంకా కొత్తగా చూపించడానికి రెడీ అయ్యాడు హీరో.. రీసెంట్ టీజర్ తో అందరికి క్లారిటీ కూడా ఇచ్చారు. యంగ్ టైగర్ 'ఎన్టీఆర్', మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్'.. వీరిద్దరి కాంబినేషన్ లో 'అరవింద సమేత' మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతకు మందు కొరటాల శివ డైరక్షన్ లో జనతా గ్యారేజ్ లో సాఫ్ట్ గా చెప్పి.. వినకపోతే హార్డ్ వేరు పరితనం చూపించాడు తారక్.. తరువాత కిందటి ఏడాది బాబి దర్శకత్వంలో వచ్చిన 'జై లవకుశ'లోమూడు పాత్రలలో మూడు వేరియేషన్స్ చూపించి అభిమానుల మతిపోగొట్టాడు యంగ్ టైగర్. దాంతో త్వరలో రాబోయే సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

త్రివిక్రమ్, తారక్ కలయికలో 'అరవింద సమేత' టైటిల్ తో వస్తున్న మూవీ టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకొంటోంది. త్రివిక్రం మొదటిసారిగా యాక్షన్ సెగ్మెంట్ ను టచ్ చేశాడు. జూనియర్ కు ఈ మూవీస్ కొత్త కాకపోయినా.. త్రివిక్రం డైరక్షన్ లో ఈమూవీ సరికొత్తగా ఉండబోతోందంట. టీజర్ లో ఎన్టీఆర్ చాలా కొత్తగా, హ్యాండ్ సమ్ లుక్ తో ఉన్నారు. స్ట్రాంగ్ సీమ డైలాగ్స్ ను న్యూ మాడిలేషన్ తో చెప్పాడు ఎన్టీఆర్. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ 15నిముషాల పాటు సిక్స్ ప్యాక్ ఎక్స్ పోజ్ చేస్తాడని టాక్ వినిపిస్తుంది. 'టెంపర్' మూవీకి అప్పుడే సిక్స్ ప్యాక్ చేసిన తారక్ ఆ మూవీలో సరిగ్గా ఎక్స్ పోజ్ చేయలేకపోయాడు. ఇక 'అరవింద సమేత'లో యాక్షన్ ఎపిసోడ్స్ ఈ మూవీకి హైలెట్స్ అవ్వనున్నాయట. ఇక చాలా రోజుల తరువాత ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు , జగపతి బాబులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి త్రివిక్రమ్ కు ఈ సినిమా కలిసి వస్తుందా ? లేదా ? అనేది చూడాలి. 

15:14 - August 20, 2018

ఎన్నో అంచనాలతో వచ్చిన 'గీత గోవిందం'..అనుకున్న దానికొంటే ఎక్కువ ఫలితాన్నే చూపిస్తోంది. దగ్గరగా పెద్ద సినిమాలు లేకపోవడం ఈ మూవీకంటే యూత్ ఫుల్ అండ్ ఇంట్రస్టింగ్ మూవీ లేకపోవడం 'గీత గోవిందాని'కి కలిసి వచ్చింది. 'గీత గోవిందం' మూవీ థీయేటర్స్ లో సూపర్ ఫాస్ట్ గా పరుగులు పెడుతోంది. ఈ వీక్ లో మిడిల్ లో రిలీజ్ అయిన 'గీత గోవిందం' మూడు రోజులకే తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కలిపి 13 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇవి పక్కన పెడితే తమిళనాడు, కర్ణాటక, కేరళ కలిపి నాలుగుకోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఈ రేంజ్ లో దూసుకుపోతుంది.. అంతే కాదు ఈ శని, ఆది వారాలు 60 పర్సంట్ అడ్వాన్స్ బుక్కింగ్స్ కూడా అయిపోయాయట.

'విజయ్ దేవరకొండ', 'రష్మిక మండన్న' హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో... వచ్చిన గీతాఆర్ట్స్ పతాకంపై బన్నీ వాస్ నిర్మించారు. అదరిపోయే నటనతో అంతకంతకు ఇమేజ్ పెంచుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. రెండు రోజులు డొమెస్టిక్ మార్కెట్ లో మంచి కలెక్షన్లు సాధించే దిశగా పరుగులు పెట్టింది. అయిదు రోజులకు వరల్డ్ వైడ్ కలెక్షన్లు 23 కోట్ల షేర్ ను దాటిందని అంచనా. మరి రానున్న రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. 

15:10 - August 20, 2018

కొత్త హీరో.. పెద్ద బ్యాగ్రౌండ్.. భారీ సినిమాలు..స్టార్ హీరోయిన్లు.. కాదు లేదు అనకుండా బడ్జెట్.. ఇలా ఎంట్రీతోనే మూడు నాలుగు భారీ సినిమాలు చేసిన టాలీవుడ్ హీరో.. ఇప్పుడు కరెక్ట్ రూటులోకి వచ్చాడంట..చిన్న సినిమా అయినా పర్లేదు, కథ బాగుంటే చాలు అని దిగొచ్చాడుంట. త్వరలో మంచి కథతో రావాలనుకుంటున్న ఆ స్టార్ ఎవరు ? 

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రొడ్యూసర్ 'బెల్లంకొండ సురేష్' సినిమా వారసత్వంతో, టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..ప్రొడ్యూసర్ కొడుకుగా మొదటి సినిమానే భారీ స్థాయిలో ప్లాన్ చేసుకున్నారు. వివి వినాయక్ డైరక్షన్, తమన్నా హీరోయిన్.. ఇలా అన్నింటిలో బడ్జెట్ కు లోటు లేకుండా 'అల్లుడు శీను' మూవీని తెరకెక్కించారు. సినిమాఎట్లున్నా అన్ని రకాలుగా నష్టం మాత్రం పలకరించిందట. సెకండ్ మూవీ 'స్పీడున్నోడు' ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. ఆ తరువాత, బోయపాటి డైరక్షన్ లో 'జయ జానకీ నాయక' వచ్చింది. ఈ సినిమా తరువాత మరో సినిమా చేస్తానని మాట ఇచ్చిన బోయపాటి ఇప్పుడు ఆ పరిస్థితిలో లేరంట. ఆ మూవీ పరిస్థితి కూడా అలానే అయ్యింది.

ఇక రీసెంట్ గా శ్రీవాస్ డైరక్షన్ లో వచ్చిన 'సాక్ష్యం' కొంచెం పర్వాలేదు అనిపించింది. కాని అనుకున్నంత రిజల్ట్స్ మాత్రం లేదు. 'అల్లుడు శీను' నుండి సురేష్ సినిమాలు మానేశాడు. బోయపాటి సినిమా తర్వాత ప్రొడ్యూసర్ మిరియాల రవీందర్ రెడ్డి బాగా దెబ్బతిన్నాడట. ఇక 'సాక్ష్యం' మూవీ విషయంలో అభిషేక్ నామా పరిస్థితి కొంచెంలో కొంచెం పర్వాలేదట. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో 'బెల్లంకొండ శ్రీనివాస్' ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు బడ్జెట్ కంటే సినిమా కథ మంచిగా ఉంటే చాలు అనుకుంటున్నాడట. కొత్త దర్శకుడితో ఒక మూవీ.. తేజతో మరో మూవీ చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మరి ఇవన్నా హిట్స్ సాధిస్తాయా ? లేదా ? అనేది చూడాలి. 

15:06 - August 20, 2018

లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తమ సత్తా చాటుతున్నాయి. పెద్ద పెద్ద స్టార్ల మూవీస్ కి మేమేమి తక్కువ కాదు అని నిరూపిస్తున్నాయి. రీసెంట్ గా ఓ హీరోయిన్ మూవీ కోలీవుడ్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. త్వరలో టాలీవుడ్ ను పలుకరించబోతోంది. ఎంటా సినిమా ? 

హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాదించి ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ కథలతో దుమ్ము దులుపుతున్న లేడీ సూపర్ స్టార్ 'నయనతార'. ఈ మధ్య నయన్ తమిళ్ లాంగ్వేజ్ లో నటించిన చిత్రం 'కొలమావు కోకిల'. ఈ మూవీ ఆగస్టు 17న విడుదలై మంచి రివ్యూస్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ డేనే ఈ మూవీ కోలీవుడ్ లో 3.47కోట్లు కలెక్ట్ చేసిందట. అంతే కాదు రెండో రోజు కూడా 3.61కోట్లు వసూలు చేసి అందరిని షాక్ కి గురి చేసింది.

లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ మూవీ సక్సెస్ కి 'నయన్' నటన మెయిన్ రీజన్. దానితో నాటు అనురుథ్ అద్భుతమైన సంగీతం.. సినిమా సక్సెస్ లో కీ రోల్ అని చెప్పొచ్చు. ఈ మధ్య స్త్ర్రీ ప్రధాన పాత్రలతో సినిమాలు వస్తున్నా. ఒక దానిని మించి ఒకటి దూసుకుపోతున్నాయి. నెల్సన్ డైరక్షన్ లో వచ్చిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. శరణ్య, యోగిబాబు లాంటి సీనియర్ నటీనటులు నటించిన ఈ మూవీని తెలుగులో 'కోకో కోకిల' పేరుతో విడుదల చేయబోతున్నారు. 

15:00 - August 20, 2018

మన స్టార్ హీరోల సినిమాలు ఇతర భాషల్లోకి డబ్బింగ్ అవ్వడం కామన్.. కథ నచ్చితే అప్పుడుప్పుడు రీమేక్ లు కూడా అవుతాయి.. అయితే టాలీవుడ్ స్టార్ హీరో మూవీ హిందీలో రీమేక్ అవుతుంది.. ఈ కథకు తగ్గ హీరోతో షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా వెళ్తుందట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' టాలీవుడ్ లో మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీలో ఎన్టీఆర్ డిఫరెంట్ రోల్ చేశారు.. పోలీస్ ఆఫీసర్ గా, విలన్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ నుండి పాజిటీవ్ క్యారక్టర్ కు కన్వర్ట్ అయిన పాత్రకు ప్రాణం పోశాడు ఎన్టీఆర్. ఆయన విలక్షణమైన నటనతో 'టెంపర్' మూవీని సక్సెస్ వైపు నడిపించాడు తారక్. సరికొత్త కథాంశంతో రూపొందిన ఈ మూవీలో జూనియర్ సరసన 'కాజల్' ఆడిపాడింది.

'టెంపర్' మూవీ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడ ఎట్రాక్ట్ చేసింది. ప్రజంట్ ఈ మూవీని బాలీవుడ్ లో 'సింబా' పేరుతో రీమేక్ చేస్తున్నారు. టెంపర్ మూవీలో ఎన్టీఆర్ పాత్రను సింబా మూవీలో 'రణవీర్ సింగ్' నటిస్తున్నాడు. 'ఎన్టీఆర్' పాత్రలో 'రణవీర్ సింగ్' అద్భుతంగా నటిస్తున్నాడట. టెంపర్ ఫస్ట్ హాఫ్ లో వెటకారం ఎక్కువ ఉన్నా పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఆ నటన రణవీర్ సింగ్ బాడీ లాంగ్వేజ్ కరక్ట్ గా సరిపోయిందని టాక్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో 'సారా అలీ ఖాన్' హీరోయిన్ గా నటిస్తోంది. 

14:55 - August 20, 2018

ఇప్పుడు మల్టీస్టార్ మూవీస్ కామన్ అయ్యాయి.. లేదా ఓ పెద్ద సినిమాలో పెద్ద స్టార్ గెస్ట్ రోల్ చేయడం కూడా చూస్తున్నాం. ఓ కోలీవుడ్ స్టార్ హీరో టాలీవుడ్ స్టార్ మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఎవరా స్టార్ ? విక్టరీ వెంకటేశ్ వరుస సినిమాలు చేస్తున్నాడు. మల్టీస్టార్ మూవీస్ ను ఓకే చేస్తూ బిజిబిజీ అయిపోయాడు. వరుసగా రెండు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. వరుణ్ తేజ్ తో కలిసి 'ఎఫ్2' చేస్తున్న వెంకటేశ్. తన మేనల్లుడు నాగచైతన్యతో 'వెంకీ మామ' కూడా చేస్తున్నాడు. ఈ రెండు మల్టీస్టార్ మూవీసే.. ఈ రెండు మూవీస్ ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటూ, నెక్ట్స్ సీజన్ కి రెడీ అవుతున్నాయి.

త్వరలోనే వెంకీతో త్రినాధరావుతో ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట వెంకీ. ఈ మూవీకి ఓ విశేషం ఉంది. వరుసగా మల్టీ స్టార్ మూవీస్ చేస్తున్న వెంకీ, ఈ మూవీలో కూడా ఓ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. అవును తమిళ స్టార్ హీరో సూర్య ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడని సమాచారం. ఈ మూవీలో ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఆ ఫ్లాష్ బ్యాక్ లో 'సూర్య' 20 నిమిషాల పాటు కనిపిస్తాడట. ఈ ప్రాజెక్టు కనుక ఓకే అయితే సూర్యకు తెలుగులో ఇదే తొలి స్ట్రయిట్ సినిమా అవుతుంది. 

గుబ్బల మంగమ్మ భక్తుల్ని కాపాడిన సహాయక సిబ్బంది..

పశ్చిమ గోదావరి : భారీ వర్షాల కారణంగా జిల్లాలో నదులన్నీ పొంగిపొర్లడంతో జంగారెడ్డి గూడెంలోని గుబ్బల మంగమ్మగుడికి వెళ్లిన 700 మంది భక్తులు ఆలయం వద్దే చిక్కుకుపోయారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వీరిని సురక్షితంగా కొండపైకి తీసుకెళ్లారు. పోలీసుల సమాచారంతో అక్కడకు చేరుకున్న విపత్తు నిర్వహణ అధికారులు.. ఇప్పటివరకూ దాదాపు 200 మందిని కాపాడారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ అందజేశారు. సహాయ చర్యలను ముమ్మరం చేసి బాధితులను ఆదుకోవాలని సీఎం కలెక్టర్ ను ఆదేశించారు.

తెరుచుకోని రిజర్వాయర్ గేట్లు..ప్రమాదంలో కరకట్ట..

పశ్చిమ గోదావరి : వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో జంగారెడ్డిగూడెం సమీపంలోని ఎర్ర కాల్వ రిజర్వాయర్ కు నీటిమట్టం పోటెత్తింది. నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో 27,000 క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు విడుదల చేశారు. అయితే కొంగవారిగూడెం వద్ద ఉన్న ఎర్రకాల్వ రిజర్వాయర్ మూడో గేటు తెరుచుకోకపోవడంతో జలాశయం ఎడమవైపు కరకట్ట బీటలు వారుతోంది. దీంతో దిగువ గ్రామాలైన లక్కవరం, దేవులపల్లి, పుట్లగట్లగూడెం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రకటించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

వర్షాలకు కూలిపోయిన 8దశాబ్దాల వంతెన..

పశ్చిమగోదావరి : గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు వంతెనలు కూలిపోతున్ న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఓ వంతెన కూలిపోయింది. ఖమ్మం, రాజమహేంద్రవరం ప్రదాన రహదారిపై బ్రిటషర్లు 1933లో బయనేరు వాగులపై నిర్మించిన ఈ పురాతన వంతెన జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయింది. 8 దశాబ్దాల సుదీర్ఘకాలంగా బ్రిటీషర్లు నిర్మించిన బయనేరు వాగు వంతెన ఆ ప్రాంత ప్రజలకు సేవలందించింది. తమ్మిలేని, ఎర్రకాలువలు పొంగి పొర్లుతుండటంతొ గేట్లు ఎత్తివేయటంతో ఈ వంతెనకు ప్రమాదం వాటిల్లినట్లుగా తెలుస్తోంది.

14:14 - August 20, 2018

పశ్చిమగోదావరి : గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు వంతెనలు కూలిపోతున్ న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఓ వంతెన కూలిపోయింది. ఖమ్మం, రాజమహేంద్రవరం ప్రదాన రహదారిపై బ్రిటషర్లు 1933లో బయనేరు వాగులపై నిర్మించిన ఈ పురాతన వంతెన జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయింది. 8 దశాబ్దాల సుదీర్ఘకాలంగా బ్రిటీషర్లు నిర్మించిన బయనేరు వాగు వంతెన ఆ ప్రాంత ప్రజలకు సేవలందించింది. తమ్మిలేని, ఎర్రకాలువలు పొంగి పొర్లుతుండటంతొ గేట్లు ఎత్తివేయటంతో ఈ వంతెనకు ప్రమాదం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. కాగా వంతెన కూలిపోతున్న సమయంలో ఓ వ్యక్తి వంతెన దాటిన మరుక్షణం వంతెన కూలిపోయవటంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బైటపడటం విశేషంగా చెప్పుకోవచ్చు..కాగా జంగారెడ్డి గూడెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన గుబ్బల మంగమ్మ గుడి ప్రాంతంలో దాదాపు 500 వందలమంది భక్తులు చిక్కుకుపోయినవారిని సహాయక సిబ్బంది కాపాడారు. 

కూలిన బ్రిడ్జీని పరిశీలించిన ఎస్పీ...

పశ్చిమగోదావరి : తాడ్వాయి వద్ద కూలిపోయిన బ్రిడ్జీని జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ పరిశీలించారు. గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద చిక్కుకున్న భక్తులను 500 మందిని క్షేమంగా రక్షించామని టెన్ టివితో ఎస్పీ వెల్లడించారు. రాష్ట్రీయ రహదారుల బ్రిడ్జీలు కూలిపోతున్నాయన్నారు. 

లండన్ లో నీరవ్ మోడీ...

ఢిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త నీరవ్ మోడీ లండన్ లో తలదాచుకున్నాడు. మోడీ తమ దేశంలో ఉన్నట్లు బ్రిటన్ ప్రకటించింది. మోడీని అప్పగించాలని సీబీఐ కోరనుంది. పీఎన్ బీ స్కాంలో నీరవ్ మోడీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. 

కృష్ణా జిల్లాలో 24 శాతం అధిక వర్షపాతం...

కృష్ణా : జిల్లాలో ఆదివారం 24 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు సాధారణంగా 447 మిల్లిమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 552 మిల్లీమీటర్లు నమోదైందని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం వెల్లడించారు. విస్సన్నపేట, తిరువూరు, గన్నవరం మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు.  

ఐదు జిల్లాల కలెక్టర్లతో కడియం సమీక్ష...

నిజామాబాద్ : ఐదు జిల్లాల కలెక్టర్లతో మంత్రి కడియం సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు, ముంపునకు గురయ్యే ప్రాంతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 

13:42 - August 20, 2018

విజయవాడ : పటమటలోని లాట్ మొబైల్‌ షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మొబైల్స్ షోరూంను ఆనుకొని ఉన్న ఇన్వెర్టర్స్ గోడౌన్ నుంచి ఒఖ్కసారిగా చెలరేగిన మంటలు మొబైల్స్ షోరూంకు వ్యాపించాయి. దాదాపు 20 లక్షల పైన నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:41 - August 20, 2018

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కాకతీయ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో.. సుమారు12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 12కోట్ల ఆస్తి నష్టం జరిగింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఎక్కువగా వర్షాలు పడడంతో 78 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని సంబంధిత ఉన్నత అధికారి పేర్కొన్నారు. 

13:40 - August 20, 2018

హైదరాబాద్ : నాగార్జున సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం నుండి 2 లక్షల 8వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరింది. తాగునీటి అవసరాల కోసం కుడి కాల్వకు, ఏ ఎమ్మార్పీకి కలిపి సుమారు 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో వారం రోజుల పాటు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరితే డ్యామ్‌ గరిష్ట నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది.

జూరాల ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. 14 గేట్లను తెరిచి దిగువకు నీటిని వదులుతున్నారు.

నిర్మల్‌ జిల్లా భైంసాలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర నుండి భారీగా వదర నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరిడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 17వేల 5వందల క్యూసెక్కుల నీటిని సుద్ధవాగులోకి విడుదల చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

చిన్న నదుల అనుసంధానం కోసం కృషి - దేవినేని...

ఢిల్లీ : ఏపీలో నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఏపీ మంత్రి దేవినేని వివరించారు. బాబు నాయకత్వంలో రికార్డు సమయంలో కృష్ణా - గోదావరి నదులను అనుసంధానించడం జరిగిందన్నారు. ఏపీలో ప్రవహిస్తున్న చిన్న నదులను అనుసంధానించే ప్రయత్నం జరుగుతోందని, నీటి సంరక్షణ కోసం వినూత్న పథకాలు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 

13:14 - August 20, 2018

విజయవాడ : ఏపీ రాజధాని...సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. సింగపూర్ ప్రభుత్వంతో పలు ఒప్పందాలు కుదుర్చుకుని రైతుల నుండి తీసుకున్న వేలాది ఎకరాల భూముల్లో రాజధాని భవనాలు నిర్మితమౌతున్నాయి. అంతకంటే ముందు ఏపీ సచివాలయాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంలో పలు విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ప్రధానంగా వర్షాకాలంలో సచివాలయంలో వర్షపు నీరు రావడంపై నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా సోమవారం కురుస్తున్న వర్షానికి సచివాలయంలో పై కప్పు నుండి వర్షపు నీరు వస్తోంది. 4వ బ్లాక్ లోని మంత్రుల పేషీ పై నుండి వర్షపు నీరు కారుతోంది. నీటిని సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఏపీ సచివాలయంలో వర్షపు నీరు...

విజయవాడ : ఏపీ సచివాలయంలో మళ్లీ వర్షపు నీరు కురుస్తోంది. 4వ బ్లాక్ లోని మంత్రుల పేషీ పై నుండి వర్షపు నీరు కారుతోంది. నీటిని సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. 

13:09 - August 20, 2018

హైదరాబాద్ : ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌.. ఆక్రమణల తొలగింపులతో రికార్డ్‌ సృష్టించింది. గడిచిన ఆరు వారాలుగా పదివేలకు పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. పాదచారులకు రైట్‌ టు వాక్‌ కల్పించడమే తమ లక్ష్యం అంటోంది బల్దియా. కొన్నేళ్ళుగా ఆక్రమణలతో నిండిపోయిన ఫుట్‌పాత్‌లను క్లియర్‌ చేస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.ఈ మేరకు కార్పొరేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది చర్యలు తీసుకుంటోంది. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ విభాగాలు రికార్డ్‌ స్థాయిలో పదివేల ఆక్రమణలను తొలగించాయి. దేశంలో ఎక్కడా ఇంత భారీగా ఆక్రమణలు తొలగించలేదని బల్దియా అంటోంది.

శనివారం చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో 412 ఆక్రమణలను తొలగించింది జీహెచ్‌ఎంసీ టీమ్‌. ఖైరతాబాద్‌ క్రాస్ రోడ్‌ నుంచి పంజాగుట్ట క్రాస్‌ రోడ్‌ వరకూ, పంజాగుట్ట క్రాస్‌ రోడ్‌ నుంచి ఎస్సార్‌ నగర్‌ మెట్రో స్టేషన్‌ వరకూ ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించారు. ఖైరతాబాద్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి పంజాగుట్ట ఫ్లై ఓవర్‌ వరకూ 71 శాశ్వత అక్రమ నిర్మాణాలు, 65 తాత్కాలిక ఆక్రమణలను, 18 మూవబుల్‌ అక్రమ నిర్మాణాలను తొలగించారు. మొదటి డ్రైవ్‌లో 4,669, ఆ తర్వాత ప్రతి వారం వెయ్యి నుంచి 1500 అక్రమ నిర్మాణాలను తొలగించారు. బడాబాబుల ఆక్రమణలతోపాటు.. ప్రభుత్వ ఏజెన్సీల డబ్బాలను సైతం తొలగించింది బల్దియా. 

13:07 - August 20, 2018

అనంతపురం : కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని మందాకిని, పినాకిని హాస్టల్లో ఆహారం కలుషితమైంది. కలుషిత ఆహారం తినడంతో 60 మంది సైన్స్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. రాత్రి లెమన్ రైస్ తిన్నప్పటి నుంచి వాంతులు విరేచనాలు అయ్యాయని విద్యార్థులు తెలుపారు. హాస్టల్‌ వార్డన్‌ విజయ్‌కుమార్‌ మీడియాపై దురుసుగా ప్రవర్తించాడు. తనతప్పేమీ లేదన్న వార్డన్‌.. వంటవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

13:06 - August 20, 2018

విజయవాడ : మొబైల్‌ షోరూమ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హై స్కూల్‌రోడ్‌ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 20లక్షల రూపాయల నష్టం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

 

 

12:34 - August 20, 2018

కేరళ : రాష్ట్రంలో జరిగిన వరద బాధితులకు అండగా నిలువనున్నట్లు టిపిసిసి ప్రకటించింది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు..వరదలతో కేరళ రాష్ట్రం అతాలకుతలమైన సంగతి తెలిసిందే. దీనితో ఆ రాష్ట్రానికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. టిపిసిసి కూడా విరాళం ప్రకటించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నేల వేతనం అందివ్వనున్టన్లు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళలో జరిగిన వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జరిగిన నష్టాన్ని కేంద్రమే భరించాలని కోరారు. కేరళలో జరిగిన వరద బీభత్సానికి తెలంగాణ కాంగ్రెస్ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు, మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నామన్నారు. కేరళ రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తునట్లు పేర్కొన్నారు.

మొబైల్ షోరూంలో ఫైర్ ఆక్సిడెంట్...

విజయవాడ : మొబైల్ షోరూంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సుమారు రూ. 20లక్షల మేర నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. హైస్కూల్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 

ప్రకాశం బ్యారేజీలో గరిష్టస్థాయికి నీటిమట్టం...

విజయవాడ : ప్రకాశం బ్యారేజీలో గరిష్టస్థాయికి నీటి మట్టం చేరింది. 1.16 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి నీటిని విడుదల చేశారు. 70 గేట్లను 2-3 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 

ఏపీ ఎన్జీవో జేఏసీ రూ. 20 కోట్లు విరాళం...

విజయవాడ : కేరళ వరద బాధితులకు రూ. 20 కోట్ల విరాళాన్ని ఏపీ ఎన్జీవో జేఏసీ ప్రకటించింది. సీఎం చంద్రబాబును కలిసిన నేతలు అంగీకారపత్రాన్ని అందచేశారు.

 

 

12:17 - August 20, 2018

తూర్పుగోదావరి : 'లంక' వాసులకు ఊపిరిసలపడం లేదు. గోదావరి నది ఉధృతితో వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గోదావరి నది సుడులు తిరుగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక సమాంతరంగా నది ప్రవహిస్తోంది. ఎగువన భద్రాచలంలో నీటి మట్టం క్రమ క్రమంగా పెరుగుతోంది. వారం రోజులుగా గ్రామాలు నీటిలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. లంక వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద తాకిడి ఎక్కువయితే మాత్రం భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. భారీగా పంటలు నీట మునగడం..పలు నివాసాలు నీటిలో ఉండిపోయాయి.

పునరావాస కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్న అధికార యంత్రాంగం రవాణా సౌకర్యాలు కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముమ్మిడివరంలో గోదావరి నదిలో పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి రవాణా సౌకర్యాలు కల్పించడంలో నిమగ్నమయ్యారు. ఏటుగట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అధికారులను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:09 - August 20, 2018

విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వుడ్‌ కేటగిరీ అభ్యర్థులకు కౌన్సిలింగ్‌లో అన్యాయం జరిగిందని పలు రాజకీయ పార్టీలు, సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కౌన్సెలింగ్‌ ఆపాలని ప్రభుత్వం ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీని ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ కౌన్సెలింగ్ తిరిగి నిర్వహించడం పట్ల విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు పొరపాటు చేయడం వల్ల బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం విద్యార్థి జేఏసీ నాయకులు యూనివర్సిటీ ముట్టడికి బయలుదేరారు. కానీ అప్పటికే మోహరించిన విద్యార్థులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీనితో విద్యార్థులపై లాఠీఛార్జీ ఝులిపించారు. ఈడ్చుకుంటూ వ్యాన్ లో పడేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఓ విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తం...

విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ లో రిజర్వేషన్ అన్యాయం జరిగిందంటూ పలువురు విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

11:21 - August 20, 2018

కృష్ణా : గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు చుట్టుముట్టాయి. వర్షాలకు వాగులు..వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీనితో జనజీవనం..రవాణా వ్యవస్థ స్తంభించింది. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు తదితర ప్రాంతాల్లో రహదారులు కొట్టుకపోయాయి. దాదాపు 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మున్నలేరు, తమ్మిలేరులలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లపైకి వరదనీరు ప్రవహిస్తోంది. ఉంగుటూరు మండలంలో ఒక వాగు తీవ్రత వల్ల రోడ్డు కొట్టుకపోడంతో 8 గ్రామాలకు సంబంధాలు కట్ అయ్యాయి. వాగులు..వంకలు పొంగి పొర్లుతుండడంతో పాములు కొట్టుకొస్తున్నాయి. దీనితో పలు గ్రామాల ప్రజలు పాము కాటుకు గురవుతున్నారు. ఇప్పటి వరకు 40 మంది పాము కాటు బాధితులు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. 

జగ్గయ్యపేట నియోజకవర్గంలో మున్నెరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చందర్లపాడు, వీర్లపాడు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పలు గ్రామాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. పన్నేరువాగు ఉధృతికి నాలుగు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. విజయవాడ దుర్గగుడి ఘాట్ వద్ద కొండచరియలు విరిగిపడుతున్నాయి. మొదట విరిగిన కొండచరియకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ తాజాగా మరో కొండచరియ విరిగిపడడంతో నలుగురికి గాయాలయాయ్యాయని తెలుస్తోంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

పెరుగుతున్న 'పాము కాటు' కేసులు...

కృష్ణా : జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు..వంకలు పొంగి పొర్లుతుండడంతో పాములు కొట్టుకొస్తున్నాయి. దీనితో పలు గ్రామాల ప్రజలు పాము కాటుకు గురవుతున్నారు. ఇప్పటి వరకు 26 మంది పాము కాటు బాధితులు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. 

11:10 - August 20, 2018

కేరళ : వరద ఉధృతి..వర్షాలు తగ్గుముఖం పడుతుండడంతో 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉపసంహరించారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవవని వాతావరణ శాఖ పేర్కొనడంతో కేరళ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు..ఇతరత్రా వస్తువులు కొచ్చి, తిరువనంతపురంకు చేరుకున్నాయి. ఇక్కడి నుండి వరద బాధితులకు అందచేసేందుకు సహాయక బృందాలు చర్యలు తీసుకుంటున్నాయి. నేవికా దళానికి చెందిన విమాన సేవలను ప్రారంభించారు. 9 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కేరళలో అనారోగ్యాలు చుట్టుముట్టనున్నాయని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు హెల్త్ టీంలను సిద్ధం చేస్తోంది. ముంబై, పుణెల నుండి వైద్యు బృందం అక్కడకు చేరుకుంది. నదుల్లో ఉన్న నీటిని బయటకు పంపించేందుకు ఇరిగేషన్ శాఖ కృషి చేస్తోంది. ఎన్జీవోలు, స్వచ్చంద సంస్థలు, పారిశ్రామిక వేత్తలు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. 

రామాలయం పడమర మెట్ల వరకు నీరు...

భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం విపరీతంగా కరుస్తోంది. దీనితో భద్రాచలం రామాలయం వద్ద పడమర మెట్ల వరకు చేరిన వర్షపునీరు

కొచ్చిన్ లో విమానాల రాకపోకలు...

కేరళ : కొచ్చిన్ ఎయిర్ పోర్టులో విమాన సర్వీసులను పునరుద్ధరించారు. ఓల్డ్ కొచ్చిన్ ఎయిర్ పోర్టు నుండి బెంగళూరుకు విమాన సర్వీసు కొనసాగుతోంది. 

జల దిగ్భందంలో 300 గ్రామాలు ?

మహారాష్ట్ర : గడ్చిరౌలిలో వర్షం బీభత్సం కారణంగా ప్లరకోట, ఇంద్రావతి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పాములగౌతం, పిరిమిలి వాగు, బాండియా వాగులకు వరద ఉధృతి పెరుగుతోంది. 300 గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నట్లు సమాచారం. 

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు...

విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. బ్యారేజీ 70 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. పశ్చిమ కృష్ణా కాల్వకు 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

జలదిగ్భందంలో లంక..ముంపు గ్రామాలు...

తూర్పుగోదావరి : ఐదు రోజులుగా లంక..ముంపు గ్రామాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. పడవలపైనే లంక గ్రామాల ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

10:35 - August 20, 2018

ఖమ్మం : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు..వంకలు పొంగి పొర్లుతున్నాయి. సింగభూపాలెం చెరువు అలుగుపారింది. ఎదుల్ల, గోదుమ, మొర్రుడు వాగులు ప్రమాదస్థాయిలో ప్రవాహిస్తున్నాయి. జూలూరు పాడు మండలం గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొత్తగూడెం పరిసర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీనితో పలు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మొత్తంగా 95వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. వైరా రిజర్వాయర్ పొంగి పొర్లడంతో పలు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీనితో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాలిపేడు ప్రాజెక్టు 14 గేట్లు, కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి కిందకు నీటిని వదిలారు. 

నిలిచిపోయిన మట్టి వెలికితీత పనులు...

మంచిర్యాల : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి శ్రీరాంపూర్, కళ్యానిఖని, రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. 

10:22 - August 20, 2018

విజయవాడ : గత మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దుర్గగుడి వద్దనున్న కొండచరియలు నానిపోయాయి. ఆదివారం రాత్రి ఒక కొండ చరియ విరిగిపడింది. రాత్రి సమయం కావడం...జనసంచారం లేకపోవడంతో ప్రాణనష్టం కలుగలేదు. దీనితో దుర్గగుడికి వెళ్లే భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కానీ ఒక ప్రాంతంలో కొండచరియలు ఇంటిపై విరిగిపడడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. కొండచరియలు విరిగిపడుతాయని..ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించడం లేదని తెలుస్తోంది. విరిగిపడిన కొండచరియలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

10:16 - August 20, 2018

తూర్పుగోదావరి : భారీ వర్షాలు...వరదలు వస్తాయని ముందే తెలుసు. కానీ అధికార యంత్రాంగం ఎలాంటి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోకపోవడంతో పలు విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. దీనితో నిత్యావసర వస్తువులు..తమ జీవనాధరమైన పశువులు..ఇతరత్రా వాటిని తరలించడం కోసం నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. ముమ్మిడివరం మండలం గురజాపులంకలో పశువులను ఒడ్డుకు చేర్చాలనే ఉద్ధేశ్యంతో సోమవారం పలువురు పడవలో ప్రయాణమయ్యారు. కానీ గోదావరి ఉధృతి ఎక్కువ కావడంతో పడవ బోల్తా పడింది. దీనితో మహేష్ వ్యక్తి గల్లంతు కాగా 19 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మహేష్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రత్యామ్నాయం చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం ఏర్పడిందని..గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

10:14 - August 20, 2018

కృష్ణా : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉంగుటూరు మండలం వెంటక్రామపురంలో పన్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీని ఉధృతికి రహదారి కొట్టుకపోయింది. నాలుగు గ్రామాల ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకపోయాయి. తాగునీటి సరఫరా గ్రామాలకు నిలిచిపోయింది. నందిగామ మండలంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చందాపురం నల్లవాగు వద్ద వరదనీరు బ్రిడ్జీ మీదకు వచ్చి చేరింది. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తిరువూరు, ఛాత్రాయి మండలాల్లో రహదారులు కొట్టుకపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. విజయవాడలోని దొగ్గుగొడలో కొండచరియలు విరిగిపడిపోవడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. కృష్ణా నదికి వరద ఉధృతి పెరగడంతో గేట్లను ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాల వాసులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. కృష్ణా..పశ్చిమగోదావరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

09:26 - August 20, 2018

తిరువనంతపురం : కేరళ రాష్ట్ర కొంత ఊరటనిచ్చే వార్త. గత కొన్ని రోజులుగా వర్షాలు..వరదలతో భీతిల్లిన రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడవని వాతావరణ శాఖ పేర్కొంది. ఇడుక్కి, కొజికోడ్, కన్నూరులో మాత్రం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సహాయక శిబిరాల్లో సుమారు 9 లక్షల మంది నిరాశ్రయులున్నారు.

40 హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యకారులు ముందుకు రావాలని సీఎం పినరయి విజయన్ కోరారు. సహాయక చర్యల్లో పాల్గొంటే ఒక్క బోటుకు రోజుకు రూ. 3000వేలు అందిస్తామని, బోట్ల రిపర్లకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని సీఎం వెల్లడించారు. కానీ డబ్బుకు ఆశపడకుండానే మత్స్యకారులు ఇప్పటికే సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ వారికి చేయూతనివ్వాలని భావించి సీఎం ఆ ప్రకటన చేశారని తెలుస్తోంది. 22వేల మందిని సురక్షిత ప్రాంతాలకు మత్స్యకారులు తరలించారు. 

శ్రీశైలం ఐదు గేట్ల ఎత్తివేత...

కర్నూలు : శ్రీశైలం డ్యామ్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. 5గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. 

09:13 - August 20, 2018

పశ్చిమగోదావరి : జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో జిల్లాలో వాగులు..వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి జల్లెరు వాగు ప్రవాహం ఉధృతి ఎక్కువ కావడంతో తడువాయి ఆంధ్రా షుగర్స్ వద్ద వంతెన ఒక్కసారిగా కొట్టుకపోయింది. దీనితో రాకపోకలు స్తంభించిపోయాయి. రోడ్డుకిరువైపులా ఉన్న పంట పొలాలు మొత్తం మునిగిపోయాయి. చెరుకు తోటలు...ఇతర పంటలు మొత్తం నీటి పాలు కావడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండడం..ధవళేశ్వరం వద్ద నీటిని వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

కూలిన తడువాయి ఆంధ్రాషుగర్స్ వంతెన...

పశ్చిమగోదావరి : జల్లెరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో తడువాయి ఆంధ్రషుగర్స్ వంతెన కుప్పకూలిపోయింది. దీనితో వేలాది ఎకరాల పంట నీట మునగగా రాకపోకలు నిలిచిపోయాయి. 

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వివరాలు...

నిజామాబాద్ : శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుతోంది. ఇన్ ఫ్లో 9847 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటి మట్టం 1091 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 1072 అడుగులు. 

ఎల్లంపల్లి ప్రాజెక్టు వివరాలు...

పెద్దపల్లి : ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 24,648 క్యూసెక్కులు ఉండగా 6 గేట్లు ఎత్తి 32,370 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రస్తుతం 19,0084గా ఉంది. 

కడెం ప్రాజెక్టు వివరాలు...

నిర్మల్ : కడెం ప్రాజెక్టు వద్ద ప్రస్తుత నీటి మట్టం 692.870 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 1135 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో 5169 క్యూసెక్కులుగా ఉంది. 

రాజీవ్ గాంధీ జయంతి...

ఢిల్లీ : రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పలువురు నివాళులర్పిస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాలు రాజీవ్ సమాధి వద్ద నివాళులర్పించారు. 

స్కూళ్లకు సెలవు..ఇక్కడ కాదు...

విజయవాడ : భారీ వర్షాల కారణంగా కృష్ణా...పశ్చిమగోదావరి జిల్లాల్లో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు రెండు జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు. 

తిరుమలలో పవిత్రోత్సవాలకు అంకుర్పారణ...

చిత్తూరు : తిరుమలలో నేడు శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకుర్పారణ జరుగనుంది. మంగళవారం నుండి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. 

06:59 - August 20, 2018

ఆంధ్రప్రదేశ్‌లో వైద్యప్రవేశాలు వివాదాస్పదంగా మారాయి. జీవో నెం. 550 ను పరిరక్షించి ప్రతిసంవత్సరంలాగా దాని ప్రకారమే వైద్య ప్రవేశాలు నిర్వహించాలని విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రస్తుతం నిర్వహించిన మొదటి విడత కౌన్సిలింగ్‌ రద్దు చేసి.. రెండోవిడద కౌన్సిలింగ్‌ నిలుపదల చేసి సుప్రీంకోర్టులో 550 జీవోపై అటార్నీ జనరల్‌తో రాష్ట్రప్రభుత్వమే వాదనలు వినిపించి ఆ జీవో ద్వారానే వైద్య ప్రవేశాలు జరిగేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ వివాదం.. వారి ఆందోళకు గల కారణాలు వారి డిమాండ్లపై టెన్ టివి జనపథంలో డీవైఎఫ్‌ఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యారావు విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:55 - August 20, 2018

నిజామాబాద్ : దేశ రక్షణ కోసం మేముసైతం అంటూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఓ గ్రామానికి చెందిన యువకులు. అందరూ ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు చేయటం కోసం ఆస్తకి చూపిస్తుంటే.. వారు మాత్రం సైనికులు కావాటానికి ఆసక్తి చూపుతున్నారు. వారి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించటంతో ఆ గ్రామంలో ఇంటికో సైనికుడు ఉన్నాడు. నిజామాబాద్‌ జిల్లాలోని అడవిమామిడిపల్లి యువతపై స్పెషల్ స్టోరీ.

ఇది నిజామాబాద్‌ జిల్లాలోని అడవి మామిడిపల్లి గ్రామం. జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో దాదాపు 1500 జనాభా ఉంది. నేటి యువత ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు చేయటం కోసం ఆసక్తి చూపిస్తుంటే.. తాము మాత్రం అలా కాదని గ్రామ యువత అంటుంది. ఇక్కడ 16 ఏళ్లు వచ్చాయంటే చాలు.. వారిలో సైన్యంలో చేరాలనే ధృడ సంకల్పంతో ఉంటారు. తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహిస్తూ సైన్యంలో చేర్పించాలనే ఆలోచనతో ఉంటారు. ఇప్పటి వరకు గ్రామానికి చెందిన 45 మందికి పైగా యువకులు సైన్యం ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఇప్పటి వరకు సైన్యంలో పనిచేసి రిటైర్‌ అయినవారున్నారని చెప్పారు. వీరంతా ప్రస్తుతం వారి సొంత పనులు చూసుకుంటున్నారని చెబుతున్నారు.

గ్రామంలోని యువత సైనికులు అవ్వటానికి కారణం వారికున్న క్రమశిక్షణ, సంకల్పమని తెలుస్తోంది. దేశ సేవ చేయాలనే ఆలోచన ఈ గ్రామంలోని ప్రతి యువకునికి ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు. అందుకు తగట్లుగా ఇప్పటికే సైనికులుగా పనిచేస్తున్న వారి సలహాలు, సూచనలు తీసుకుంటారని తెలిపారు. ప్రతినిత్యం ఆర్మీలో చేరేందుకు కసరత్తు చేస్తు ఉంటారని తెలిపారు. ఏ రిక్రూట్‌మెంట్ అయిన గ్రామం నుంచి కనీసం 10 మంది యువకులు పోటీలకు వెళతారని చెబుతున్నారు.

ఇక ఇక్కడి యువతకు తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కూడా సహకారం అందిస్తారని గ్రామస్థులు తెలిపారు. తన భర్త సైన్యంలో పనిచేయటం తనకు ఆనందంగా ఉందని ఓ సైనికుడి భార్య తెలిపారు. తన కొడుకు సైన్యంలో చేరి 17 ఏళ్లు అవుతుందని.. దేశానికి నా కొడుకు సేవ చేయటం ఎంతో

ఆనందంగా ఉందని ఓ తల్లి చెబుతోంది. తన ఇద్దరు కొడుకులు సైన్యంలో పనిచేయటంతో తనకు ఎంతో గౌరవంగా ఉందని ఓ తండ్రి చెబుతున్నారు. ఇక యువత ఉత్సాహాన్ని చూసి గ్రామంలో ఇంటికో సైనికుడు ఉండాలనే లక్ష్యాన్ని గ్రామస్థులు పెట్టకున్నారు. దీనికి అనుగుణంగానే దేశ సేవ పట్ల పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. దేశం సేవకోసం యువతకు ముందుకు రావాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

06:52 - August 20, 2018

విజయవాడ : కోట్లాది రూపాయలు రాబడి.. వేలాది సంఖ్యలో బస్సులు.. లక్షలాది మంది ప్రయాణికులతో నిత్యం కళకళలాడే విజయవాడ బస్టాండ్‌లో భద్రత కరువైంది. పండిట్ నెహ్రూ బస్టేషన్‌లో చోరీలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పేరుకు సీసీ కెమెరాలు ఉన్నా.. అవి అలంకార ప్రాయంగా మారాయి. భద్రత కరువైన విజయవాడ బస్టాండ్‌పై టెన్‌టీవీ స్పెషల్‌ స్టోరీ.

రాష్ట్ర విభజన అనంతరం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ రూపురేఖలే ఆసాంతం మారిపోయాయి. కోట్లాది రూపాయలు వెచ్చించిన అధికారులు బస్టాండ్‌లో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వేలాది సంఖ్యలో బస్సులు నడుపుతుండటంతో రాబడి కూడా అధికంగానే వస్తుంది. అయితే ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన అధికారులు భద్రతను ఏర్పాటు చేయటం మర్చిపోయారు. దీంతో బస్టాప్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు తెచ్చుకున్న లగేజీకి, ఒంటిమీద ఉన్న బంగారానికి, వారి ప్రాణాలకే భరోసా లేకుండాపోతుంది. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన 58 సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా మారాయి. సీసీ కెమెరాలు కంట్రోల్ చేసే గదిలో పర్యవేక్షణ కొరవడటంతో అవి ఎప్పుడు ఎలా పనిచేస్తున్నాయో తెలియటం లేదు. సీసీ కెమెరాలు పర్యవేక్షించాల్సిన పోలీసులు, టెక్నీషియన్స్‌ అందుబాటులో లేకపోవటంతో వాటి పర్యవేక్షణ కరువైంది. మరోవైపు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీతో చోరీలు, నేరాలు పెరుగుతున్నాయి. రెండ్రోజుల క్రితం బస్టాండ్‌లో ఓ వృద్ధ మహిళ మెడలోని నాలుగు కాసుల బంగారాన్ని మరో మహిళ దోచుకుని అక్కడ్నుంచి ఉడాయించింది.

అవనిగడ్డ బస్సెక్కేందుకు వేచి ఉన్న నాంచారమ్మకు అపరిచిత మహిళ మత్తు పదార్థాలతో కూడిన తినుబండారం ఇచ్చింది. ఇది తిన్న వృద్ధురాలు అస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమె మెడలోని బంగారు గొలుసును మహిళ ఎత్తుకుపోయింది. చోరీ జరిగిన చాలాసేపటి తరువాత పోలీసులు సీసీ టీవీని పరిశీలించి.. నిందితురాలని పట్టుకుంటామని చెప్పుకొచ్చారు. అయితే ఇంతవరకు ఆ మహిళను పట్టుకొలేకపోయారు. ఇది కేవలం మచ్చుకే అని.. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద బస్టేషన్‌గా పేరొందిన విజయవాడ బస్టాండ్‌లో ఇలాంటి చోరీలు జరగటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. వెంటనే భద్రతను కట్టుదిట్టం చేయాలని.. సీసీ కెమెరాలు పనిచేసేలా చేసి ప్రమాదాలు నివారించాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు, పోలీసులు భద్రతను ఏర్పాటు చేసి ప్రమాదాలు నివారిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. 

06:49 - August 20, 2018

సూర్యాపేట : తెలంగాణ ప్రభుత్వ అధికారుల నిర్వాకంతో ఓ కుటుంబం అభాసుపాలైంది. లోన్లు ఇస్తామని మాయమాటలు చెప్పి ఫోటోలు తీసుకున్న అధికారులు... తమను నవ్వులపాలు చేశారని ఆ కుటుంబం బాధపడుతోంది. రైతు బీమా, కంటి వెలుగు వాణిజ్య ప్రకటనల్లో భార్య ఫోటో పక్కన భర్త కాకుండా వేరే వ్యక్తి ఫోటో పెట్టి తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంట భూమి లేకపోయినా.. రైతు బీమా పథకం ఇస్తామని అధికారులు చెప్పడంపై ఆ కుటుంబం మండిపడుతోంది. బిడ్డకు స్నానం చేయిస్తుండగా.. ఫోటోలు తీసుకుని... వాటి స్థానంలో వేరే ఫోటో పెట్టడంపై కాపురంలో చిచ్చురేగుతోంది. ఫోటోలో కనిపిస్తున్న వీరి పేర్ల పద్మ, నాగరాజు. వీరిది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి గ్రామం. మూడేళ్ల క్రితం యాదాద్రి సమీపంలోని వంగపల్లిలో పాత బొంతలు కుట్టుకుని బతుకుతుండగా.. లోన్లు ఇప్పిస్తామని ఫోటోలు తీసుకున్నారని వీరు చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా, కంటి వెలుగు పథకాల కోసం ఇచ్చిన వాణిజ్య ప్రకటనల్లో పద్మ ఫోటో పక్కన వేరే వ్యక్తి ఫోటో పెట్టి ప్రచురించారు. ఇప్పుడు ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. తెలుగు పత్రికలకు ఇచ్చిన వాణిజ్య ప్రకటనల్లో పద్మ, నాగరాజు ఫోటోలే ఉన్నాయి. ఆంగ్ల ప్రతికలు ఇచ్చిన వాణిజ్య ప్రకటనల్లో పద్మ ఫోటో పక్కన వేరే వ్యక్తి ఫోటో పెట్టారు. రెండు వాణిజ్య ప్రకటనల్లో పద్మఎత్తుకున్న బిడ్డ ఒక్కరే. కానీ ఆంగ్ల వాణిజ్య ప్రకటనల్లో భర్త ఫోటో పక్కన వేరే వ్యక్తి ఫోటో పెట్టడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. అయితే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దీన్ని సమర్థించుకుంటున్నారు. వివాదంపై ఎదురుదాడికి దిగుతున్నారు. వాణిజ్య ప్రకటనల్లో నటించే నటించేవారు ఎవరైనా కావొచ్చన్న వాదాన్ని లేవనెత్తున్నారు. సోషల్‌ మీడియా దీన్ని వివాదం చేయడం తగదని వారిస్తున్నారు.

ఫోటో మార్పిడిపై పద్మ స్పందించడంతో వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. వాణిజ్య ప్రకటనల్లో తన భర్త ఫోటో పక్కన వేరే వ్యక్తి ఫోటో పెట్టడాన్ని పద్మ తప్పు పడుతున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్వాకంతో తమ కుటుంబ పరువు బజారుపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపకు స్నానం చేయిస్తుండగా తీసుకున్న ఫోటోలను ఇలా మారుస్తారా.. అని పద్మ ప్రశ్నించడంతో ప్రభుత్వ అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయపడినట్టు అయింది. లోన్లు ఇస్తామంటే ఫోటోలు దిగామని, భర్త ఫోటో మార్చి కుటుంబ పరువును వీధిపాలు చేశారని పద్మ మండిపడుతోన్నారు. ఫోటోలు మార్చి తమ సంసారంలో నిప్పులు పోస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంగ్ల పత్రికల్లో ఫోటో మార్చి వాణిజ్య ప్రకటన ప్రచురించిననాటి నుంచి తమ ఇంట్లో గొడవలు అవుతున్నాయని పద్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకుంటే.. దీని నుంచి ఎలా బయటపడాలా.. అన్న అంశంపై ఇటు పాలకులు, అటు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. 

చాదర్ ఘాట్ లో కార్డన్ సెర్చ్...

హైదరాబాద్‌ : చాదర్‌ఘాట్‌ పీఎస్‌ పరిధిలో పోలీసులు రాత్రి కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. 100 మంది పోలీసులతో కమలానగర్‌, చాదర్‌ఘాట్‌ పరిసరాల్లో ఈ కార్డన్‌సెర్చ్‌ కొనసాగింది. సరైన పత్రాలులేని 30 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను పోలీసులు సీజ్‌ చేశారు.  

06:46 - August 20, 2018

హైదరాబాద్‌ : చాదర్‌ఘాట్‌ పీఎస్‌ పరిధిలో పోలీసులు రాత్రి కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. 100 మంది పోలీసులతో కమలానగర్‌, చాదర్‌ఘాట్‌ పరిసరాల్లో ఈ కార్డన్‌సెర్చ్‌ కొనసాగింది. సరైన పత్రాలులేని 30 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను పోలీసులు సీజ్‌ చేశారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని వాహనదారుల నుంచి 10వేల పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేశారు. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్డన్‌సెర్చ్‌లో సుల్తాన్‌బజార్‌ ఏసీసీ చేతన, ఈస్ట్‌జోన్‌ డీసీపీ ఎం. రమేష్‌తోపాటు పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.

 

06:44 - August 20, 2018

హైదరాబాద్ : యూఏఈ ప్రకటించిన అమ్నెస్టీ అవకాశాన్ని ప్రవాస భారతీయులు ఉపయోగించుకోవాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. అమ్నెస్టీ గడువు ఆగస్టు 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుందని తెలిపారు. వివిధ కారణాల వల్ల అక్రమంగా నివాసముంటున్న వారు నిబంధనలకు అనుగుణంగా నివాసాన్ని రెగ్యులరైజ్ చేసుకోవచ్చని చెప్పారు. పాస్‌పోర్ట్‌ లేనివాళ్లు ఎలాంటి పత్రాలు లేకుండా తెలంగాణకు రావొచ్చని చెప్పారు. రెండేళ్ల తర్వాత తిరిగి యూఏఈకి వెళ్లవచ్చని అన్నారు. 

06:40 - August 20, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో దైవ దర్శనానికి వెళ్లిన భక్తులు వరదల్లో చిక్కుకున్నారు. గుబ్బల మంగమ్మ దేవాలయానికి వెళ్లిన సుమారు 3 వందల పైగా మంది భక్తులు వరదల్లో చిక్కుకున్నారు. సెలవు రోజు కావటంతో భారీగా భక్తులు దర్శనానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో అకస్మాత్తుగా వాగులు పొంగాయి. దీంతో భక్తులు వరదల్లో చిక్కుకున్నారు. కరెంట్‌ సదుపాయం, సెల్‌ సిగ్నల్స్‌ లేకపోవటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 

కేరళలో తగ్గనున్న వర్షాలు...

తిరువనంతపురం : వరదల బీభత్సంతో కేరళ రాష్ట్రం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో సహాయక చర్యలకు ఆంటకం ఏర్పడుతోంది. కానీ రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం...

హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీనివల్ల రానున్న 48గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతాయని, తెలంగాణ, కోస్తాంధ్ర తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 

సాగర్ కు పెరుగుతున్న ఉధృతి...

నల్గొండ : నాగార్జున సాగర్ కు వరద ఉధృతి పెరుగుతోంది. ఇన్ ఫ్లో 2,340 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 12,996 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 539.90 అడుగులు.

 

Don't Miss