Activities calendar

21 August 2018

21:46 - August 21, 2018

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుకు న్యాయపరమరైన అవరోధాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులను వ్యతిరేకిస్తూ హయాతుద్దీన్‌ వేసిన పిటిషన్‌ను జాతీయ హరిత న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్‌లో విచారించడానికి ఏమీ లేదని తేల్చిచెప్పింది. అలాగే విచారణ కమిటీ నియమించాలని వేసిన అప్పీల్‌ను కూడా నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్ కొట్టివేసింది. విచారణ కమిటీ వేసి క్షేత్రస్థాయి పరిశీలన జరపాల్సిన అవసరంలేదని చెప్పింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ, అటవీ అనుమతులను రద్దు చేయాలంటూ దాఖలైన మరో పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది. 

21:42 - August 21, 2018

హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు మరోసారి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ప్రజా చైతన్య బస్సు యాత్ర ద్వారా వచ్చే నెల 1వ తేదీ నుంచి నియోజకవర్గాలు చుట్టొచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. ఈసారి యాత్రలో సోనియా, రాహుల్‌గాంధీ పాల్గొనేలాచేసి, ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించాలని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజల్లో ఎన్నికల వేడి రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. look.

కాంగ్రెస్ బస్ యాత్ర..
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు మరోసారి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి చేపట్టనున్న ప్రజాచైతన్య బస్సు యాత్రకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏడాది ఫిబ్రవరి 26 చేవెళ్ల నుంచి యాత్ర మొదలు
నాల్గవ విడత బస్సు యాత్ర ద్వారా ముందస్తు ఎన్నికల ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలు పెట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర మూడు దశలు పూర్తైంది. రాష్ట్ర వ్యాప్తంగా 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి సభలు, సమావేశాలు ద్వారా ప్రజలను కలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, అధికారంలోకి వస్తే కాంగ్రెస్‌ చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తున్నారు. సంస్థాగత ఎన్ని కల నేపథ్యలో బస్సుయాత్రకు విరామం ప్రకటించిన కాంగ్రెస్‌ నాయకులు..టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు కూడా సమరాంగణంలోకి దిగారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు.. తాము కూడా సిద్ధమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అలాగే సెప్టెంబర్‌లోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్‌ చెప్పడంతో.. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టారు. ఈనెల 13,14 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించిన రాహుల్‌గాంధీ దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లి... అభ్యర్థులు ఎంపికకు కమిటీ ఏర్పాటు చేసేందుకు ఒప్పించారు. ఎన్నికల కసరత్తులో బిసీగా ఉన్నా... బస్సు యాత్రను మాత్రం ఆపకూడదని టీ కాంగ్రెస్‌ నాయకులు నిర్ణయించారు.

పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతన్న కాంగ్రెస్ నేతలు
నాల్గవ విడత ప్రజాచైతన్య బస్సు యాత్రను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు నిర్ణయించారు. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ... వచ్చేనెల 2వ వారంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని మరోసారి రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సోనియాగాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చి బస్సుయాత్రకు ముగింపు పలకాలని భావిస్తున్నారు. నాల్గవ విడత బస్సుయాత్రపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. 

21:38 - August 21, 2018

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులను బిజీగా ఉంచుతున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. సభలు, సమావేశాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుగుదేశం శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ... ఎన్నికల సమరాంగణానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ధర్మపోరాట దీక్షలు, కడప ఉక్కు సంకల్ప సభలు, విశాఖ రైల్వే జోన్‌ కోసం టీడీపీ ప్రజాప్రతినిధుల దీక్షలతో టీడీపీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న చంద్రబాబు.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు.

రాజమండ్రి, ఒంగోలులో ధర్మపోరాట సభలు
వచ్చే ఎన్నికల వరకు టీడీపీ శ్రేణులను బిజీగా ఉంచేందుకు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థి సమస్యలపై విశాఖలో విజ్ఞానభేరి, కర్నూలులో ధర్మపోట దీక్ష, గుంటూరులో మైనారిటీల సభలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ చంద్రబాబు ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి, ఒంగోలులో ధర్మపోట దీక్ష సభలు నిర్వహించారు. ఈనెల 25న కర్నూలులో ధర్మపోరాట సభ నిర్వహించాలని నిర్ణయించారు. మిగిలిన జిల్లాల్లో కూడా ధర్మపోరాట సభలు నిర్వహించి... చివరిగా వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో రాజధాని అమరావతి ప్రాంతలోని గుంటూరు-విజయవాడ మధ్య భారీ సభకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ప్రాంతం చంద్రబాబుకు బాగా కలిసొచ్చిన ప్రదేశం కావడంతో చివరి సభ ద్వారా ఎన్నిక శంఖారావం పూరించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఎన్నికల ముందు గుంటూరు-విజయవాడ మధ్య భారీ బహిరంగ సభ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈనెల 28 గుంటూరులో మైనారిటీల సభ
ఓ వైపు ధర్మపోరాట దీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు సామాజికవర్గాల వారీగా సభలు నిర్వహించాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది. నెల్లూరులో దళిత గర్జన సభ నిర్వహించిన టీడీపీ... ఈనెల 28న గుంటూరులో మైనారిటీలతో భారీ సభ ఏర్పాటు చేసింది. బీజేపీతో తెగతెంపులు చేసున్న తర్వాత మైనారిటీలను ఆకర్షించేందుకు ఈ సభ దోహదం చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబు మంత్రివర్గం ఏర్పాటైనప్పటి నుంచి కేబినెట్‌లో మైనారిటీ వర్గానికి చెందిన మంత్రి లేరు. త్వరలోనే ఈ లోటు భర్తీ చేసే అవకాశం ఉంది. ఈనెల 28లోనే మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చిన ప్రచారం జరుగుతోంది. మొత్తంమీద చంద్రబాబు.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎప్పటికప్పుడు టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సహం నింపడం ద్వారా ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ రేపు తెలంగాణ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రులను ఆదేశించినట్టు సమాచారం. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. రేపు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారని, పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ఈ వారం చివరిలోనే పార్లమెంటరీ, ఎల్పీ సమావేశం జరగనుందని, అలాగే, వచ్చే నెల 4న హైదరాబాద్ శివారులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

21:15 - August 21, 2018

విజయవాడ : సీబీఐ మాజీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ.. రాజకీయరంగ ప్రవేశం ఖరారైందా..? ఎన్నికల సమారంగణంలోకి దూకేందుకు లక్ష్మీనారాయణ వేదికను ఎంచుకున్నారా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. అసలు ఆయన ఏ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి వస్తున్నారు..? అందులో ఆయనకు దక్కనున్న స్థానం ఏంటి..? ఈ వివరాలు తెలుసుకునేముందు.. లక్ష్మీనారాయణ గురించిన కొన్ని వివరాలు...!

డ్యూటీలో హోదానే ఇంటిపేరుగా స్థిరపరచుకున్న లక్ష్మీనారాయణ
జేడీ లక్ష్మీనారాయణ..! సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ హోదాలో... సంచలన కేసుల దర్యాప్తులో తనదైన ముద్ర వేసుకున్న స్ట్రిక్ట్‌ ఐపీఎస్‌ అధికారి. విధుల్లో భాగంగా తాను నిర్వహించిన హోదానే.. ఇంటిపేరుగా స్థిరపడేలా పనిచేసుకున్నారాయన. 2006 నుంచి సీబీఐ హైదరాబాద్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు.. జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసును ఆయనే దర్యాప్తు చేశారు. ఓబుళాపురం గనుల అక్రమ మైనింగ్‌కేసు దర్యాప్తూ లక్ష్మీనారాయణ బృందమే చేసింది.

ఫోక్స్‌ వ్యాగన్‌, ఔటర్‌రింగ్‌రోడ్డు,సత్యం కంప్యూటర్స్‌,ఓఎంసీ జగన్‌ ఆస్తుల కేసుల దర్యాప్తు
లక్ష్మీనారాయణ కర్నూలు జిల్లాకు చెందిన వారు. శ్రీశైలంలో జన్మించారు. మహారాష్ట్ర క్యాడర్‌లో డీఐజీగా కొనసాగుతూ.. సొంత రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు. తొలినాళ్లలో ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు.. ఔటర్‌ రింగ్‌రోడ్డు భూసేకరణలో అక్రమాల కేసులను దర్యాప్తు చేశారాయన. అదే సమయంలో సత్యం కంప్యూటర్స్‌ కేసునూ సమగ్రంగా దర్యాప్తు చేశారు. ఏడువేల కోట్ల రూపాయల స్కామ్‌కు చెందిన ఈ కేసు దర్యాప్తు.. లక్ష్మీనారాయణ పేరును దేశవ్యాప్తంగా మార్మోగేలా చేసింది. ఈ కేసు ఓ కొలిక్కి వచ్చేలోపే.. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ కేసు... జగన్‌ ఆస్తుల కేసు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులు నమోదయ్యాయి. వీటినీ లక్ష్మీనారాయణే దర్యాప్తు చేశారు.

గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ వ్యవహారంపై దర్యాప్తు
ఓఎంసీ కేసులో.. గాలి జనార్దనరెడ్డి న్యాయవ్యవస్థను లోబరచుకునే ప్రయత్నం చేశారన్న విషయాన్నీ లక్ష్మీనారాయణ నేతృత్వంలోనే బయటపెట్టారు. అప్పట్లో సీబీఐ ఇచ్చిన సమాచారంతో రాష్ట్ర ఏసీబీ అధికారులు ఇద్దరు జడ్జీలను, ఒక మాజీ న్యాయమూర్తిని అరెస్టు చేశారు. ఇది కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కర్ణాటకలో రాజకీయంగా దుమారం రేపిన గనుల కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై నమోదయిన కేసు దర్యాప్తు కూడా లక్ష్మీనారాయణే పర్యవేక్షించారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంపైనా ఆయన విచారణ జరిపారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ కేసు కూడా లక్ష్మీనారాయణే దర్యాప్తు జరిపారు

విద్యార్థుల్లో చైతన్యం నింపే కార్యక్రమాలు
విధుల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న లక్ష్మీనారాయణ.. విద్యార్థులను చైతన్యపరిచే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రతిచోటా విద్యార్థులను ఉత్తేజపరిచేవారు. సీబీఐలో డిప్యూటేషన్‌ పూర్తికాగానే.. లక్ష్మీనారాయణ.. మహారాష్ట్రకు తిరిగి వెళ్లిపోయారు. అయితే.. అనూహ్యంగా.. ఈఏడాది మార్చి నెలలో ఆయన వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు. దీంతో... ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై జోరుగా ఊహాగానాలు సాగాయి. కానీ.. ఆయన రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపకుండా.. రాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. ముఖ్యంగా రైతాంగ సమస్యల అధ్యయనంలో ఆయన.. గ్రామగ్రామాన పర్యటించారు.

రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక కోసం సమాయత్తం..!
రాష్ట్ర పర్యటనను దాదాపుగా ముగించుకున్న లక్ష్మీనారాయణ.. ఇప్పుడిక రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు సమాయత్తమైనట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకే చెందిన ఓ ప్రముఖుడు స్థాపించిన పార్టీ తరఫున ఎన్నికల సమరాంగణంలోకి దూకాలని లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ కూడా.. లక్ష్మీనారాయణనే సీఎం అభ్యర్థిగా తెరపైకి తెస్తోందని సమాచారం. 

20:54 - August 21, 2018

తిరుమల : తిరుమలేశుని ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రుత్వికులు.. ఈ ఉత్సవాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇంతకీ ఈ పవిత్రోత్సవాల ఉద్దేశం ఏంటి..? ఈ సందర్భంగా నిర్వహించే విశేష పూజాధికాలు ఏంటి..?

కలియుగ వరదుడు.. శ్రీనివాసుడి సాలకట్ల పవిత్రోత్సవాలు.. ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం శాస్త్రోక్త పవిత్ర ప్రతిష్ఠ అనంతరం.. శ్రీదేవీ..భూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామిని.. పవిత్ర మంటపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాది వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాది పొడవునా.. తిరుమలేశుని ఆలయంలో జరిగే అర్చనలు.. ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ.. సిబ్బంది వల్లగానీ.. తెలిసో, తెలియకో జరిగే దోష నివారణార్థం.. ఆలయ పవిత్రతను పరిరక్షించే ఉద్దేశంతో.. ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ..

తిరుమలేశుని పవిత్రోత్సవం... అత్యంత శుభదం..! అనాదిగా.. వస్తోన్న సంప్రదాయం. 15-16 శతాబ్దాల నుంచే ఈ వేడుక ఉన్నా... మధ్యలో ఆగిపోయి.. 1962లో పునఃప్రారంభమైమనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

శ్రీవారికి వినియోగించే.. పవిత్రాల తయారీకి 20 మూరల పట్టుదారం లేదా 200 మూరల నూలు దారం వినియోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు. పవిత్రాలు చేసేందుకు.. టీటీడీ శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను పెంచుతోంది.

ఆలయ మొదటి ప్రాకారంలో గ డడడల వగపడి వరండాలో ఉత్తరం వైపున రాతి గోడపై పవిత్రోత్సవాల లెక్కలకు సంబంధించిన పురాతన శాసనం లభ్యమైంది. అప్పట్లో ''పవిత్ర తిరునాళ్‌'' పేరిట నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉపయోగించిన వస్తువుల జాబితా, వాటి ధరలు ఈ శాసనంలో పొందుపరిచారు.

పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులూ.. ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు స్నపన తిరుమంజనం.. సాయంత్రం ఆరు నుంచి 8 గంటల వరకూ నాలుగు మాడవీధుల్లో ఉభయదేవేరులతో శ్రీవారి విహారం.. కొనసాగుతుంది. తొలిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు.

పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. పవిత్రోత్సవాల సందర్భంగా.. మూడు రోజుల పాటు అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది. 

20:44 - August 21, 2018

ఏపీలో మెడికల్ ప్రవేశాలపై వివాదం కొనసాగుతోంది. జీవో నంబర్ 550ను ఉల్లంఘిస్తున్నారనీ..550 జీవోను పరిరక్షిస్తు ప్రవేశాలు చేపట్టాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేస్తు ఆందోళన చేపట్టాయి. ఎంబీబీఎస్ సీట్ల కౌన్సిలింగ్ లో జరిగిన అక్రమాలు..రిజర్వేష్ అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయంపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని యువజన, విద్యార్థి సంఘాలు ముట్టడికి యత్నించాయి. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. అసలు జీవో నంబర్ 550లో వున్న అంశాలేమిటి? దీని ఉల్లంఘన వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మెడికల్ అభ్యర్థులకు జరిగే నష్టాలేమిటి? అనే అంశంపై 10టీవీ చర్చా కార్యక్రమం. ఈ చర్చలో డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ అంబటి నాగరాజారత్నం పాల్గొన్నారు.

20:31 - August 21, 2018

విజయవాడ : మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ అరంగ్రేటం సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారు? పదవికి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి వస్తున్న వార్తలు వచ్చింది మొదలు పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. బీజేపీ, టీడీపీ, జనసేన అంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ వాటిన్నింటిని తల్లకిందులు చేస్తు ఇప్పుడు తాజాగా మరో వార్త ఆయన రాజకీయ ఎంట్రీపై పక్కాగా క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. జాతీయ సమ సమాజ పార్టీతో లక్ష్మీ నారాయణ సమాలోచనలు జరుపుతున్నాట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీ తరపు నుండి జేడీ ఏపీ సీఎం అభ్యర్థిగా వార్త తెరపైకి వచ్చింది. దీనిపై మరింత క్లారిటీగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున జాతీయ సమ సమాజ పార్టీ తరపున విజయవాడలో భారీ బహిరింగ సభ జరుగనున్నట్లు..ఆ సభలో మరింత క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లుగా పక్కా సమాచారం.

నిజాయితీ గల అధికారిగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరున్న లక్ష్మీనారాయణ వంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తే బాగుంటుందని పలు పార్టీల అధినేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ స్థానిక పార్టీలకు కాదని జేడీ లక్ష్మీనారాయణ జాతీయ పార్టీవైపు మొగ్గు చూపినట్లుగా సమాచారం. జాతీయ సమ సమాజ పార్టీతో లక్ష్మీ నారాయణ సమాలోచనలు జరుపుతున్నాట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీ తరపు నుండి జేడీ ఏపీ సీఎం అభ్యర్థిగా వార్త తెరపైకి వచ్చింది. దీనిపై మరింత క్లారిటీగా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున జాతీయ సమ సమాజ పార్టీ తరపున విజయవాడలో భారీ బహిరింగ సభ జరుగనున్నట్లు..ఆ సభలో మరింత క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లుగా పక్కా సమాచారం. 

జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంటీ ఖరారు?..

విజయవాడ : మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ అరంగ్రేటం సర్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారు? పదవికి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి వస్తున్న వార్తలు వచ్చింది మొదలు పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. బీజేపీ, టీడీపీ, జనసేన అంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ వాటిన్నింటిని తల్లకిందులు చేస్తు ఇప్పుడు తాజాగా మరో వార్త ఆయన రాజకీయ ఎంట్రీపై పక్కాగా క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. జాతీయ సమ సమాజ పార్టీతో లక్ష్మీ నారాయణ సమాలోచనలు జరుపుతున్నాట్లుగా తెలుస్తోంది.

20:16 - August 21, 2018

పశ్చిమగోదావరి : గోదవరి జిల్లాలో భారీ వర్షాలకు ఎర్రకాలువ పొంగి పొర్లుతోంది. దీంతో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, వారికి భరోసానిచ్చేందుకు మంత్రులు వరద ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు మంత్రులకు ఓ ట్రాక్టర్ ను ఏర్పాటు చేశారు. దీనిపై ప్రయాణిస్తుండగా ట్రాక్టర్ ఓ పక్కకి ఒరిగిపోయింది. దీంతో మంత్రులు పై నుండి మోకాలు లోతులో వున్న వరద నీటిలో పడ్డారు. నల్లజర్ల మండలం చోడవరం లోని ముంపు ప్రాంతాలోని వరద నీటిలోనే మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, జవహర్ తమ పర్యటనను కొనసాగించారు. అనంతరం స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తామని..వరదనీటికి పాడైపోయిన పంటలకు నష్టపరిహారం ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

7 రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం..

ఢిల్లీ : ఏడు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకాన్ని కేంద్రం ప్రభుత్వం చేపట్టింది. జమ్ము కశ్మీర్ కు సత్యపాల్ మాలిక్, బీహార్ కు లాల్ టండన్, హర్యానాకు సత్యదేవ్ నారాయణ ఆర్య, ఉత్తరాఖండ్ కు బేబీ రాణి మౌర్య, త్రిపురకు కప్తాన్ సింగ్ పోలంకి, మేఘాలయకు తథగత్ రాయ్, సిక్కింకు గంగా ప్రసాద్ లను కేంద్రం గవర్నర్లగా నియమించింది. 

జీహెచ్ఎంసీలో 85 పోస్టులకు నోటీఫికేషన్..

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో 85 పోస్టులకు నోటీఫికేషన్ ను ప్రకటించింది. 35 శానిటరీ ఇన్పెక్టర్లు, 50 హెల్త్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి జీహెచ్ఎంసీ నోటీఫికేషన్ ను ప్రకటించింది. ఈనెలాఖరు వరకు దరఖాస్తులకు అవకాశమున్నట్లుగా ప్రకటించింది. 

నా పుట్టినరోజు వేడుకలు వద్దు,కేరళను ఆదుకుందాం : పవన్

హైదరాబాద్ : కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 23న తలపెట్టిన పశ్చిమగోదవరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అంతేకాదు సెప్టెంబర్ 2న జరుపుకోవాల్సిన తన పుట్టినరోజు వేడుకలకు కూడా పవన్ దూరంగా వున్నారు. భారతదేశంలోని ఓ రాష్ట్ర వరదలతో అల్లాడుతుంటే తాను పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం సమంజసం కాదని భావించిన జనసేనాని కేరళ కేరళకు సహాయం చేయాలని జనసేన కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పులిపునిచ్చారు.  

మంత్రులు,ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ..

అమరావతి : మంత్రులు,ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాలు, జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ధర్మపోరాట దీక్షలు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై సమాలోచనలను కొనసాగిస్తున్నారు. 

ఎంపీ ఫండ్స్ నుండి కేరళకు బుట్టా రేణుక రూ.5లక్షలు..

ఢిల్లీ : ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఫండ్స్ నుండి కేరలకు విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తన ఎంపీ ఫండ్స్ నుండి వరద బాధితుల సహాయార్థం రూ. 5 లక్షల విరాళాన్ని అందించారు. ఎంపీ లాడ్స్ నుంచి ఈ విరాళాన్నిఆమె ప్రకటించారు. వర్షాలు, వరదల కారణంగా కేరళలో భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పి తన వంతు సహాయంగా ఎంపీ లాడ్స్ నుండి రూ. 5 లక్షల విరాళం పంపినట్టు తెలిపారు.

19:22 - August 21, 2018

కలియుగ వైకుంఠ వాసుడు..శ్రీ తిరుమలేశుడు..శ్రీనివాసుడు. ఆయన సన్నిథిలో ఏడాదంతా ఆనందోత్సవాలే..భక్త జనులకు కన్నుల పండుగలే..వేడుకలే..ఈ నేపథ్యంలో తిరుమలేశుని పవిత్సోవాల నిర్వహణపై 10టీవీ చర్చా కార్యక్రమం..తిరుమలేశుని పవిత్రోత్సవాలను ఎందుకు నిర్వహించాలి? ఈ పవిత్రోత్సవాల వల్ల కలిగే శుభాలేమిటి? అనే అంశాలపై ప్రముఖ పంచాయగ సిద్ధాంతులు..యతేంద్ర ప్రవణాచారి, జ్యోతిష్కులు తేజస్వి శర్మ పాల్గొన్నారు. 

18:40 - August 21, 2018

భద్రాద్రి కొత్తగూడెం : దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందంటు పాలకుల ఢాంబికాల మాటలకు కొదవే లేదు. గత పాలకుల చేతకానితనం వల్లనే తెలంగాణ ప్రాంతం భ్రష్టుపట్టిపోయిందంటు పాలకులు కొత్త పదాలతో తిట్లకు, శాపనార్థాలు కొనసాగుతునే వుంటాయి. కానీ ఇప్పటికీ అటవీ ప్రాంతాలలోని అమాయకులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేనే లేవనే సంగతి పాలకులు మరచిపోయి మాట్లాడుతుంటారు. వేసవి కాలం వచ్చిందంటు గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల కొద్ది నడవాల్సిన దుస్థితి..వర్షాకాలం వచ్చిందంటే భారీ వర్షాలు కురుస్తున్నాయంటే చాలు అవడిబిడ్డలు అల్లాడిపోతుంటారు. ఎటువంటి రవాణా సౌకర్యాలు గానీ..తమ కష్టాల వంక గానీ చూడని..పట్టించుకోని పాలకుల మాటలు వారికి అలవాటైపోయాయి. కానీ కష్టం కాడెత్తుకు వచ్చి గుండెల్ని నలిపేస్తున్నాగానీ..కన్నీటిని కంటిలోనే అదిమిపెట్టి..ఆవేదనను పంటి బిగువులన ఒడిసిపట్టి తమ బాధలు తామే పడుతుంటారు అడవిబిడ్డలు..కానీ ఉద్దరిస్తాడనుకున్న కుమారుడు కళ్లముందే చనిపోతే..ఆ కట్లెను కాడెకు స్వయంగా కట్టుకుని మైళ్లకొద్ది నడుస్తున్న కన్నతండ్రి ఆవేదన..బాధ వర్ణనాతీతం..అటువంటి దుస్థితి..దుర్భర పరిస్థితికి నిలువుటద్దంలా కనిపిస్తోంది ఈ హృదయవిదారక ఘటన..

జిల్లాలోని గుండాలలో హృదయ విదాకర ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న కుమారుడి కోసం ఏడవాలో..లేక భారీ వర్షాలకు తమకు దాపురించిన దుర్భర దుస్థితికి ఏడవాలో తెలీక కుమారుడి మృతికి హృదయ విదారకంగా విలపిస్తున్న వారిని చూస్తే ఎవరికైనా మనసు ద్రవించకమానదు. గుండాలలో పురుగుల మందు తాగి నరేశ్ అనే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో దాదాపు పదులకొద్దీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎటువంటి వాహనాలు కూడా తిరిగే పరిస్థితి గానీ..కమ్యూనికేషన్ సౌకర్యం గానీ లేకుండా పోయింది. ఈ క్రమంలో కుమారుడిని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు దాదాపు 20 కిలో మీటర్ల దూరం కుమారుడి మృతదేహాన్ని కాడెకు కట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో చనిపోయిన కుమారుడి కోసం గుండెలవిసేలా ఏడుస్తునే ప్రభుత్వ ఆసుపత్రికి కాడెకు కట్టి తీసుకెళ్లిన ఘటన గుండాలలో చోటుచేసుకుంది. 

17:48 - August 21, 2018

ఆదిలాబాద్‌ : వరుసగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్‌ జిల్లాలో చాలామంది నిర్వాసితులయ్యారు. పలువురు పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్నారు. బజార్‌హత్నూర్‌ మండలం సొంగుగూడ గ్రామంలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ పర్యటించి.. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ సందర్బంగా తమను ఆదుకోవాలని బాధితులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. 

17:44 - August 21, 2018

వికారాబాద్ : శంషాబాద్‌ మండలం నాగర్‌గూడ వద్ద మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ లీక్‌ అయ్యింది. రోడ్డుపై భారీ ఎత్తున నీళ్లు ఎగిసిపడుతున్నాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

17:42 - August 21, 2018

హైదరాబాద్‌ : తరచూ కిడ్నాప్‌లు చోటు చేసుకుంటున్నాయి. కిడ్నాప్ అనే పదం వినగానే తల్లితండ్రులు కలవరపడుతున్నారు. ముఖ్యంగా స్లమ్ ఏరియాలు, బస్తీలు, రద్దీ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ కిడ్నాపర్లు రెచ్చిపోతున్నారు. సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో కిడ్నాపర్ల బారిన పడకుండా అనేక కార్యక్రమాలు చేపడుతామని పోలీసులు అంటున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర కిడ్నాప్‌నకు గురైన చిన్నారిని... పోలీసులు 24 గంటల్లోనే తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు. అయితే.. తల్లిదండ్రులు తమ చిన్నారుల పట్ల జాగ్రత్త వహించాలని నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి సూచించారు.

17:37 - August 21, 2018

ఢిల్లీ : కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఢిల్లీ నగరవాసులు ముందుకు వస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిచడానికి దాతలు ఢిల్లీలోని కేరళ భవన్‌కు వచ్చిన విరాళాలు ఇస్తున్నారు. మూడు రోజుల్లో నగదు, చెక్కు రూపంలో సుమారు 1.6 కోట్ల రూపాయల విరాళాలు అందజేశారు. ఆహార పదార్ధాలు, మందులు, బిస్కెట్లు, దుప్పట్లు, వంటసామాగ్రి అందిస్తున్నారు. వాటిని వెంటనే ప్యాకింగ్ చేసి కేరళకు తరలిస్తున్నారు. 

17:35 - August 21, 2018

నల్లగొండ : నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ప్రస్తుతం శ్రీశైలంనుంచి 2లక్షల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతోంది. తాగునీటి అవసరాలకోసం కుడికాల్వకు, ఎఎమ్మార్సీకి కలిపి సుమారు 8వేల క్యూసెక్కుల నీరు డ్యామ్‌ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. చాలాకాలం తర్వాత డ్యామ్‌ కళకళలాడుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

17:09 - August 21, 2018

కేరళ : భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆపన్న హస్తం అందించింది. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు 700 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వెల్లడించారు. అబుదాబి యువరాజు ప్రధాని మోదితో ఫోన్లో మాట్లాడి ఈ విషయం చెప్పారని సిఎం తెలిపారు. కేరళకు అండగా నిలుస్తున్న ఆయా దేశాలు, రాష్ట్రాలకు సిఎం కృతజ్ఞతలు తెలిపారు. యూఏఈ విజయంలో కేరళ ప్రజల పాత్ర ఎంతో ఉందని, వారిని ఆదుకునేందుకు సాయం చేస్తామని ఆ దేశ ఉపాధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తామ్‌ ఇటీవల ట్వీట్‌ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన ప్రధాని మోది కేరళకు 500 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళలో వరదల కారణంగా సుమారు 20 వేల కోట్ల నష్టం వాటిల్లింది.

16:51 - August 21, 2018

పెద్దపల్లి : కమాన్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసుల ఓవరాక్షన్‌తో ఓ కుటుంబం ఇబ్బందులు పాలైంది. బెల్లంపల్లి నుండి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ కుటుంబం... టిఫిన్‌ చేసేందుకు కమాన్‌ వద్ద వాహనాన్ని నిలిపింది. అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు వాహనంలోని ముందు టైర్‌లో గాలి తీసేశారు. పిల్లలు ఉన్నారు.. వాహనాన్ని తీస్తామన్నా వినకుండా టైర్లలో గాలి తీశారు. అంతేకాకుండా... మాతో వాగ్వాదానికి దిగుతారా అంటూ పురుషులను పీఎస్‌ తీసుకెళ్లారు. ఎంత బ్రతిమిలాడినా పోలీసులు కనికరించకపోవడంతో మహిళలు కంటతడి పెట్టుకున్నారు. 

16:48 - August 21, 2018

విజయవాడ : అయేషా మీరా హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆమె తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కేసులో సిట్‌ దర్యాప్తు సక్రమంగా జరగడంలేదని ఆరోపించారు. ఆయేషా మీరా తల్లిదండ్రులతోపాటు విజయవాడ బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ఏపీ డీపీజీ ఆర్పీ ఠాగూర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని పరిశీలిస్తాని ఠాగూర్‌ హామీ ఇచ్చారు. 

16:45 - August 21, 2018

గుంటూరు : రైలుపేటలో మతిస్థిమితంలేని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మాణంలోని నాలుగంతస్థుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిందకు దిగిరమ్మని పోలీసులు కోరినా ఆ యువకుడు వినిపించుకోలేదు. పోలీసులు చూస్తుండగానే కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

16:44 - August 21, 2018

హైదరాబాద్ : జంట నగరాలు సహా తెలంగాణలో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ విమర్శించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. చిన్నపాటి వర్షానికే రోడ్లు ధ్వంసమయ్యే దుస్థితి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో దాపురించిందని షబ్బీర్‌ మండిపడ్డారు. కాగా గతంతో కేటీఆర్ మాట్లాడుతు..నగరంలోని రోడ్లపై ఒక్క గుంత కనిపించినా..ఒక్కో గుంతకు రూ.1000లు ఇస్తానని చాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ విమర్శించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 

16:40 - August 21, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో వరదలు పోటెత్తాయి. జల్లేరు, ఎర్రకాలువ పొంగటంతో.. నల్లజర్ల మండలం చోడవరం గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది. అర్ధరాత్రి ఒక్కసారిగా వరద నీరు రావడంతో.. గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు రాత్రిసమయంలోనే సహాయక చర్యలు చేపట్టారు. సుమారు ఐదువేల మంది నిరాశ్రయులయ్యారు. చోడవరం గ్రామంలోని ముంపు ప్రాంతాలను ఎంపీ మురళీమోహన్‌ పరిశీలించారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ తెలిపారు. కేవలం చూసి వెళ్తున్నారు తప్ప ఎలాంటి సాయం చేయడం లేదని గ్రామస్థులు ఎంపీ, ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

భద్రాద్రివాసులకు అధికారుల సూచనలు..

భద్రాచలం : ఎగువన, స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఈరాత్రికి 53 అడుగులకు పెరిగే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. 

అత్యాచారం కేసులో ఇద్దరికి మరణ శిక్ష..

మధ్యప్రదేశ్ : మాండసౌర్ రేప్ కేసు ఘటనలో ఇద్దరు నిందితులకు న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. కేవలం రెండు నెలల్లో కేసును కూలంకషంగా విచారణ పూర్తి చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇద్దరు నిందితులకు మరణ శిక్ష విధించింది. ఏడేళ్ల బాలికపై ఇర్ఫాన్, ఆసిన్ అనే ఇద్దరు వ్యక్తులు అత్యాచారం కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్పు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  

ఉగ్ర గోదావరి..కంట్రోల్ నంబర్ ఏర్పాటు..

భద్రాద్రి : ఎగువన, స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈరోజు రాత్రికి మూడో ప్రమాద హెచ్చరికను దాటే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తహశీల్దార్లు, అధికారులు అప్రమత్తంగా వుండాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో సబ్ కలెక్టరేట్ లో నంబర్ : 08743232444 కంట్రోల్ నంబర్ ను ఏర్పాటు చేసారు. 

కేరళ పట్ల పెద్ద మనసు చాటుకున్న యూఏఈ..

కేరళ : రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని ఆదుకుంటామని గతంలోనే ప్రకటించిన యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రాజు బిన్ రషీద్ మక్తూమ్.. తాజాగా తమ దేశం తరఫున ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించారు. యూఏఈ ఓ దేశంగా విజయం సాధించడంలో కేరళ ప్రజల భాగస్వామ్యం మరచిపోలేమని ఆయన గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కేరళకు సాయం చేసేందుకు ప్రత్యేకంగా జాతీయ ఎమర్జెన్సీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మక్తూమ్ ప్రకటించారు.

లారీ,కారు ఢీ ఐదుగురు మృతి..

చిత్తూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కుప్పం, పలమనేరు జాతీయ రహదారిపై కడపల్లి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు నాటు వైద్యం చేయించుకునేందుకు కుప్పం చేరుకున్నారు. ఈ ఐదుగురు సభ్యుల్లో ఒకరికి పక్షవాతంతో బాధపడుతున్నారు. దీంతో చిత్తూరు విరూపాక్ష పురంలో పక్షవాతానికి నాటు మందు చేస్తారనే సమాచారంతో వైద్యం పొందేందుకు విరూపాక్ష పురం చేరుకున్నారు.

టీ.ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం..

హైదరాబాద్ : తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు ఘోర ప్రమాదం తప్పింది. లోకో పైలెట్ అప్రమత్తంతో తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు ఘోర ప్రమాదం నుండి బైటపడింది. మహారాష్ట్రలోని బాలార్షా వద్ద రైలు పట్టాల లింక్ తొలగిపోయింది. ఈ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది లోకో పైలెట్ ను హెచ్చరించారు. దీంతో లోకో పైలెట్ ట్రైన్ కు సడెన్ బ్రేక్స్ వేయటంతో ఘెర ప్రమాదం తప్పిపోయింది. అనంతరం పట్టాలు రిపేర్ చేసిన అనంతరం బాలార్షా నుండి తెలంగాణ ఎక్స్ ప్రెస్ తిరిగి బయలుదేరింది. 

15:43 - August 21, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారిపై ఉన్న సస్పెన్షన్ వేటుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్టు డివిజన్ బెంచ్ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో, మండలి చైర్ పర్సన్ స్వామిగౌడ్ పై మైకులు విసిరిన ఘటనలో ఆయన కంటికి గాయం అయింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వారిరువురూ హైకోర్టును ఆశ్రయించగా..విచారణ జరిపిన సింగిల్ జడ్జ్, వారిపై అనర్హత వేటు కుదరదని తీర్పిచ్చారు. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తు టీ.సర్కార్ పిటీషన్ దాఖలు చేసింది. దీంతో ఘటనకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించింది. ఈ వీడియో సాక్ష్యాలను కోర్టుకు అందించడంలో అసెంబ్లీ అధికారులు విఫలం కావడంతో..వారు ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చని కోర్టు పేర్కొంది. ఇదే కేసులో అసెంబ్లీ స్పీకర్ కు న్యాయస్థానం నోటీసులు కూడా జారీ చేసంది. దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం..సింగిల్ బెంచ్ తీర్పును రెండు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో తెలంగాణ సర్కార్ కు తాత్కాలికంగా ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్ లకు ఎదురు దెబ్బ తగిలింది. కాగా ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం రెండు నెలలకు వాయిదా వేసింది.

15:33 - August 21, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు ఘోర ప్రమాదం తప్పింది. లోకో పైలెట్ అప్రమత్తంతో తెలంగాణ ఎక్స్ ప్రెస్ కు ఘోర ప్రమాదం నుండి బైటపడింది. మహారాష్ట్రలోని బాలార్షా వద్ద రైలు పట్టాల లింక్ తొలగిపోయింది. ఈ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది లోకో పైలెట్ ను హెచ్చరించారు. దీంతో లోకో పైలెట్ ట్రైన్ కు సడెన్ బ్రేక్స్ వేయటంతో ఘెర ప్రమాదం తప్పిపోయింది. అనంతరం పట్టాలు రిపేర్ చేసిన అనంతరం బాలార్షా నుండి తెలంగాణ ఎక్స్ ప్రెస్ తిరిగి బయలుదేరింది. 

15:22 - August 21, 2018

చిత్తూరు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కుప్పం, పలమనేరు జాతీయ రహదారిపై కడపల్లి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు నాటు వైద్యం చేయించుకునేందుకు కుప్పం చేరుకున్నారు. ఈ ఐదుగురు సభ్యుల్లో ఒకరికి పక్షవాతంతో బాధపడుతున్నారు. దీంతో చిత్తూరు విరూపాక్ష పురంలో పక్షవాతానికి నాటు మందు చేస్తారనే సమాచారంతో వైద్యం పొందేందుకు విరూపాక్ష పురం చేరుకున్నారు. అనంతరం వైద్యం చేయించుకున్న అనతరం తమ పొంది తిరిగి తమ స్వగ్రామం ధర్మపురి తిరుగు ప్రయాణంలో పలమనేరు జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదానికి గురయ్యారు. కాగా మృతుల్లో నలుగురు పురుషులు అక్కడిక్కడే మృతి చెందగా..ఒక మాత్రం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటు మరనించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి..గాయాలపాలైన మహిళలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయిన ఫలితం లేకుండా ఆసుపత్రిలో ఆమె మృతి చెందింది. 

టీ.సర్రార్ కు ఊరట..కోమటి, సంపత్ లకు ఎదురు దెబ్బ..

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారిపై ఉన్న సస్పెన్షన్ వేటుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్టు డివిజన్ బెంచ్ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో, మండలి చైర్ పర్సన్ స్వామిగౌడ్ పై మైకులు విసిరి, ఆయన కంటికి గాయం కావడానికి కారణమయ్యారంటూ, కోమటిరెడ్డి, సంపత్ ల శాసన సభ సభ్యత్వాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వారిరువురూ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన సింగిల్ జడ్జ్, వారిపై అనర్హత వేటు కుదరదని తీర్పిచ్చారు.

పోలవరం ప్రాజెక్టులో నిలిచిన పనులు

పశ్చిమగోదావరి : గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు అధికారులు ఆందోళన చెందుతున్నారు. స్పిల్‌వేలోకి నీరు చేరకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ప్రాజెక్టు ప్రధాన నిర్మాణమైన స్పిల్‌వే, స్పిల్‌ వే ఛానల్‌లోకి వరద నీరు రాకుండా అడ్డుకట్టలు వేస్తున్నారు. ఇప్పటికే స్పిల్‌ ఛానల్‌లోకి నీరు చేరడం, త్రివేణి సంస్థ క్యాంపు,  కార్మికుల క్యాంపుల్లోకి నీరు చేరింది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో పనులన్నీ పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. 

14:03 - August 21, 2018

విజయనగరం : డెంగ్యూ మరణాలతో విజయనగరం జిల్లాలో ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. ఎక్కడ చూసినా విష జ్వర బాధితులే కనిపిస్తున్నారు. పట్టణాలు, గ్రామాలన్న తేడా లేకుండా విష జ్వరాలు ప్రబలుతున్నాయి. విజయనగరం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా విష జ్వరాలు విజృభించాయి. దీంతో డెంగ్యూ మరణాలు అమాంతం పెరిగిపోయాయి. డెంగ్యూ మరణాలతో జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

జిల్లాలో వందలాది మంది రోగులు.. దాదాపు అందరిలోనూ డెంగ్యూ లక్షణాలు.. దీంతో ఇప్పటి వరకు సుమారు 50మందికి పైగా మృతిచెందారు. డెంగ్యూ రోగులతో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. సరైన వైద్యం అందక చాలా మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గరివిడి, చీపురుపల్లి, ఎస్.కోట, గజపతినగరం, జామి మండలాల్లో విష జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇదే అదునుగా భావించిన ప్రయివేటు ఆస్పత్రులు పరీక్షల పేర్లు చెప్పి రోగుల నుంచి వేలకు వేలు పిండేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీ కేంద్రాల్లో వైద్యుల కొరత ఉండటంతో రోగులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విజయనగరంలో పరిస్థితి దారుణంగా తయారైంది. పారిశుద్ద్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో పట్టణమంతా చెత్త చెదారంతో పేరుకు పోయింది. దీనికి వర్షం తోడు కావటంతో రోగాలు ప్రబలుతున్నాయి. 

ఇక జనం రోగాలతో బెంబేలెత్తిపోతుంటే అధికారులు మాత్రం జిల్లాలో ఎలాంటి రోగాలు లేవంటున్నారు. ఎవ్వరూ డెంగ్యూతో చనిపోలేదని చెబుతున్నారు. అధికారికంగా జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 30 వరకు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు చెబుతున్నప్పటికీ.. వాస్తవంగా ఈ సంఖ్య రెట్టింపు ఉంటుందని తెలుస్తోంది. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చిన వారిని మాత్రమే వైద్య అధికారులు లెక్క గడుతున్నారు. 

మరోవైపు అధికారులపై ప్రజా సంఘాలు, విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆందోళన చేపట్టాయి. మరణాలు కనిపిస్తుంటే ఎలాంటి రోగాలు లేవని అధికారులు చెప్పటంపై మండిపడుతున్నారు. తక్షణమే రోగాల నివారణ చర్యలు తీసుకోవాలని.. జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక ప్రజా ప్రతినిధులు కూడా విష జ్వరాలపై స్పందించకపోవటంపై ప్రజా సంఘాల నేతలు, విపక్షాలు మండిపడుతున్నాయి. వెంటనే ప్రజా ప్రతినిధులు డెంగ్యూ రోగులను ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డెంగ్యూ నివారణకు చర్యలు తీసుకుని రోగులను కాపాడుతారో లేదో వేచి చూడాలి. 

14:01 - August 21, 2018

విజయవాడ : అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. రైతులకు ప్రతి ఏటా కౌలు చెక్కులు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఈ ఏటా ఇవ్వాల్సిన  చెక్కులను ఇంకా ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం మే1 నాటికే చెక్కులు అందజేయాల్సి ఉన్న ఆగస్టు వచ్చిన చెక్కులు ఇవ్వకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు చెక్కుల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలు వర్ణనాతీతంగా మారాయి. భూములు ఇచ్చిన రైతులకు ప్రతి సంవత్సరం కౌలు చెక్కులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ ఏటా ఇంతవరకు చెక్కులు ఇవ్వకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

రాష్ట్ర రాజధానిగా ప్రభుత్వం అమరావతిని ప్రకటించడంతో చుట్టుప్రక్కల ఉన్న పంట భూములను రైతులు సర్కార్‌కు అప్పగించారు. ఇచ్చిన భూములకు పరిహారంగా కౌలు చెక్కులను ఇస్తామని ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చింది. ప్రతి ఏడాది మే1 నాటికి చెక్కులు అందుతాయని ప్రభుత్వం రైతులకు తెలిపింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అధికారులు సక్రమంగా అమలు చేయకపోవటంతో భూములు ఇచ్చిన రైతులు నానా పాట్లు పడాల్సి వస్తోంది. ప్రతి ఏడాది మే1 నాటికే చెక్కులు ఇవ్వవల్సిన అధికారులు పంపిణీ విషయంలో తాత్సరం చేస్తున్నారు.

తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో.. 27,715 మంది రైతుల సుమారు 34 వేల ఎకరాలను భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. పరిహారంగా కౌలు చెక్కులు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఎకర జరీబు భూమికి 50 వేల రూపాయలు, మెట్ట భూమికి 30 వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అలాగే ఈ మొత్తంపై 10 శాతం అదనంగా ఇస్తామని అధికారులు ప్రకటించారు. తొలి ఏడాది సీఆర్డీఏ అధికారులు రైతుల నివాసాలకు వెళ్లి కౌలు చెక్కులు సకాలంలో అందించారు. 2017లో జూన్-ఆగస్టు మధ్యలో చెక్కులు పంపిణీ చేశారు. కాలం గడుస్తున్న కొద్ది అధికారులు చెక్కుల పంపిణీ ఆలస్యం చేస్తున్నారు. 

కౌలు చెల్లింపు కోసం ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక గ్రామ కమిటీని, సీఆర్డీఏ అధికారిని నియమించింది. ఒక్క కమిటీలో 8 నుంచి 12 మంది సభ్యులు ఉంటారు. కమిటీ సభ్యులు రైతుల సమస్యలను సీఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. అయితే కమిటీ సభ్యుల తీరుతో తాము ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు చెక్కులు పంపిణీలో కమిటీ సభ్యులదే పైచెయ్యి ఉంటుందని.. వారి చెప్పిన వారికే కౌలు చెక్కులు అందుతున్నాయని ఆరోపించారు. జాప్యంతో విసుగు చెందిన ఓ రైతు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 

మరోవైపు చెక్కుల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చిందని అధికారులు చెబుతున్నారు. 160 కోట్ల మేర కౌలు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 150 కోట్లు రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.అటు రైతులు చేస్తున్న ఆరోపణలకు, ఇటు అధికారులు చెబుతున్న లెక్కలు పొంతనలేకుండా పోతుంది. ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చి.. ఈ వివాదానికి తెరదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

13:58 - August 21, 2018

ప.గో : ప్రేమించి పెళ్ళికి నిరాకరించిన ప్రియుడిపై ప్రియురాలు దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం.. ఏనుగువాని లంకలో  జరిగింది.  ఏడేళ్ళుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మించిన మురళీ కృష్ణ మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడ్డాడు దీంతో.. గత పదిరోజులుగా మేరీమాత  తన ప్రియుడి ఇంటిముందు దీక్షకు దిగింది. బాధితురాలికి కుటుంబ సభ్యులతోపాటు.. మహిళా సంఘాలు, గ్రామస్థులు అండగా నిలిచారు. ఎట్టకేలకు మేరీమాత బంధువులు.. మురళీ కృష్ణను అంతర్వేది లాడ్జీలో  పట్టుకున్నారు. మేరీమాతతోపాటు.. మహిళా సంఘాల వారు మురళీకృష్ణను పట్టుకుని చితక్కొట్టారు. మురళీకృష్ణను శిక్షించి తనకు న్యాయం చేయాలనికోరుతోంది.

13:53 - August 21, 2018

నిజామాబాద్‌ : జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మల్కాపూర్, గుండారం చెరువుల్లో వరద పోటెత్తుతోంది. మల్కాపూర్‌ చెరువు అందాలు చూసేందుకు గ్రామస్థులు బారులు తీరుతున్నారు. పెద్దసంఖ్యలో కొట్టుకొస్తున్న చేపలను పట్టుకునేందుకు పోటీపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

13:51 - August 21, 2018

పశ్చిమగోదావరి : గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు అధికారులు ఆందోళన చెందుతున్నారు. స్పిల్‌వేలోకి నీరు చేరకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ప్రాజెక్టు ప్రధాన నిర్మాణమైన స్పిల్‌వే, స్పిల్‌ వే ఛానల్‌లోకి వరద నీరు రాకుండా అడ్డుకట్టలు వేస్తున్నారు. ఇప్పటికే స్పిల్‌ ఛానల్‌లోకి నీరు చేరడం, త్రివేణి సంస్థ క్యాంపు,  కార్మికుల క్యాంపుల్లోకి నీరు చేరింది.  ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో పనులన్నీ పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. 

 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ కేసులో సింగిల్‌ బెంచ్‌ తీర్పు సస్పెన్షన్‌

హైదరాబాద్ : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌  కేసులో సింగిల్‌ బెంచ్‌ తీర్పును రెండు నెలల పాటు సస్పెన్షన్‌ చేసింది డివిజన్‌ బెంచ్‌. ప్రభుత్వ అప్పీల్‌ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు సింగిల్‌ జడ్జ్‌ ఉత్తర్వులను నిలిపివేసింది. తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది.

 

తుంగభద్ర నదికి భారీగా వరద నీరు

మహబూబ్‌నగర్‌ : ఆ గ్రామాలకు  వెళ్ళాలంటే నాటు పడవే దిక్కు.. బడికెళ్ళే పిల్లలైనా.. ఆసుపత్రికి వెళ్ళాల్సిన గర్భిణీ స్ర్తీలైనా.. ఊరు దాటాలంటే పడవ ఎక్కాల్సిందే. దాదాపు పదేళ్ళ క్రితం ర్యాలంపాడు తుంగభద్ర బ్రిడ్జికి శంకుస్థాపన చేసినా.. నేటికీ పనులు పూర్తి కాలేదు. తెలంగాణ రాష్ట్రంలోని ర్యాలంపాడు, సుల్తానపురం, జిల్లెలపాడు గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. తుంగభద్ర నదికి భారీగా వరద నీరు రావడంతో ఈ మూడు గ్రామాల ప్రజలు బయటకు రాలేకపోతున్నారు.  

భారీ వర్షాలతో రాబందుల అవస్తలు

అసిఫాబాద్ : ఐదురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాబందులు సైతం విలవిల్లాడుతున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా  పెంచికల్‌ మండలం మేరిగూడ అటవీ ప్రాంతంలో వర్షానికి ఓ రాబందు అస్వస్థతకు గురైంది. ఇది గమనించి ఫారెస్ట్‌ అధికారులు పెంచికల్‌పేట్‌ మండల కేంద్రంలో చికిత్స చేయించారు.  

భూపాలపల్లి జిల్లాలో 5 రోజులుగా భారీ వర్షాలు

భూపాలపల్లి : జిల్లాలో 5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కాకతీయ కట్టడాలు దెబ్బతింటున్నాయి. చారిత్రక రామప్ప ఆలయానికి ముంపు పొంచి ఉంది. రామప్ప ఆలయంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. 800 ఏళ్లనాటి ప్రాచీన ఆలయం వర్షానికి తడిసింది. శివలింగం పక్కకు ఒరిగిపోయింది. జోరువానకు ముఖ మండపం, గర్భాలయం, కాటేశ్వరాలయం కారుతోంది. గత వర్షాలకే తూర్పు ముఖ ద్వారం కుప్పకూలింది. 

13:43 - August 21, 2018

హైదరాబాద్ : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌  కేసులో సింగిల్‌ బెంచ్‌ తీర్పును రెండు నెలల పాటు సస్పెన్షన్‌ చేసింది డివిజన్‌ బెంచ్‌. ప్రభుత్వ అప్పీల్‌ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు సింగిల్‌ జడ్జ్‌ ఉత్తర్వులను నిలిపివేసింది. తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది.

 

13:41 - August 21, 2018

మహబూబ్‌నగర్‌ : ఆ గ్రామాలకు  వెళ్ళాలంటే నాటు పడవే దిక్కు.. బడికెళ్ళే పిల్లలైనా.. ఆసుపత్రికి వెళ్ళాల్సిన గర్భిణీ స్ర్తీలైనా.. ఊరు దాటాలంటే పడవ ఎక్కాల్సిందే. దాదాపు పదేళ్ళ క్రితం ర్యాలంపాడు తుంగభద్ర బ్రిడ్జికి శంకుస్థాపన చేసినా.. నేటికీ పనులు పూర్తి కాలేదు. తెలంగాణ రాష్ట్రంలోని ర్యాలంపాడు, సుల్తానపురం, జిల్లెలపాడు గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. తుంగభద్ర నదికి భారీగా వరద నీరు రావడంతో ఈ మూడు గ్రామాల ప్రజలు బయటకు రాలేకపోతున్నారు.  దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

13:37 - August 21, 2018

అసిఫాబాద్ : ఐదురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాబందులు సైతం విలవిల్లాడుతున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా  పెంచికల్‌ మండలం మేరిగూడ అటవీ ప్రాంతంలో వర్షానికి ఓ రాబందు అస్వస్థతకు గురైంది. ఇది గమనించి ఫారెస్ట్‌ అధికారులు పెంచికల్‌పేట్‌ మండల కేంద్రంలో చికిత్స చేయించారు.  నందిగామ గ్రామ సమీపంలోని పాలరాపుగుట్టలోని రాబందుల ఆవాసం ఉంది. అక్కడి రాబందులు వర్షాలకు తట్టుకోలేక చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి అస్వస్థతకు గురవుతున్నాయని ఫారెస్ట్‌  అధికారులు చెబుతున్నారు. 

 

సైరా నరసింహారెడ్డి టీజర్ ను విడుదల చేసిన అంజనాదేవి

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి టీజర్ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. టీజర్ ను చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ రామచరణ్, శ్రీజ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నారు.

13:25 - August 21, 2018

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి టీజర్ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. టీజర్ ను చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ రామచరణ్, శ్రీజ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ 'ఈ సినిమా నాన్న డ్రీమ్ ప్రాజెక్టు అని అన్నారు. సినిమా బడ్జెట్ ఎంత అనేది చెప్పలేను...కానీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఖర్చుకు ఏ మాత్రం వెనకాడబోమని చెప్పారు. ప్రాఫిట్ వస్తే బోనస్..రాకుంటే సంతోషం అన్నారు. సినిమాను వచ్చే సంవత్సరం విడుదల చేస్తామన్నారు. అన్ని సౌత్ ఇండియా ల్యాంగ్వేజ్ లలో సినిమా విడుదల చేస్తున్నామని తెలిపారు. 

 

13:21 - August 21, 2018

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి టీజర్ రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. టీజర్ ను చిరంజీవి తల్లి అంజనాదేవి విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ రామచరణ్, శ్రీజ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నారు. 
బుర్రా సాయిమాధవ్.. 
'చిరంజీవి సినిమాకు మాటలు రాసే అవకాశం వస్తుందన్న ఆలోచన నాకెప్పుడు రాలేదు. ఖైదీనెంబర్ 150 సినిమాకు పిలిపిస్తే సినిమాలో నేను రాసిన ఒక్క డైలాగ్ వస్తే సరిపోందనుకున్నాను. కానీ ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డిలకు మాటలు రాసే అవకాశం వచ్చింది. నా జీవితం తరలించి పోయింది. రెండు సినిమాలు మైల్ స్టోన్స్. సైరా నరసింహారెడ్డితో అద్భుతాన్నిచూడబోతున్నారు. టీజరే ఇలా ఉంటే... ఇంక సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి.. మాతృమూర్తుల ఆశీస్సుల కంటే మంచింది ఏదీ లేదు' అని అన్నారు. ఇది టీమ్ వర్క్. అనంతరం పరుచూరి వెంకటేశ్వర్ రావు మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:15 - August 21, 2018

భూపాలపల్లి : జిల్లాలో 5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కాకతీయ కట్టడాలు దెబ్బతింటున్నాయి. చారిత్రక రామప్ప ఆలయానికి ముంపు పొంచి ఉంది. రామప్ప ఆలయంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. 800 ఏళ్లనాటి ప్రాచీన ఆలయం వర్షానికి తడిసింది. శివలింగం పక్కకు ఒరిగిపోయింది. జోరువానకు ముఖ మండపం, గర్భాలయ కాటేశ్వరాలయం కారుతోంది. గత వర్షాలకే తూర్పు ముఖ ద్వారం కుప్పకూలింది. రామలింగేశ్వర ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. పురవాస్తు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:01 - August 21, 2018

హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్టు చేశారు. కమిషనర్ ఆఫీసు ముందు దీక్ష చేసేందుకు రాజాసింగ్ సిద్ధమయ్యారు. ఆవులు, దూడలను వధించడం ఆపాలన్నారు మా కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తేయాలి రాజాసింగ్ కమిషనర్ ఆఫీసు ముందు దీక్షకు బయల్దేరిన రాజాసింగ్ అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు

 పశ్చిమ గోదావరి : జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎక్కడికక్కడ వంతెనలు కూలిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రైవేటు స్కూళ్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటు రాజమహేంద్రవరంలోను ఇవాళ  పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏలూరు వరద ప్రాంతాల్లో ఇవాళ మంత్రులు పర్యటించనున్నారు. 

 

11:55 - August 21, 2018

పశ్చిమగోదావరి : జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎక్కడికక్కడ వంతెనలు కూలిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రైవేటు స్కూళ్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటు రాజమహేంద్రవరంలోను ఇవాళ  పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏలూరు వరద ప్రాంతాల్లో ఇవాళ మంత్రులు పర్యటించనున్నారు. 

 

11:32 - August 21, 2018

మంచిర్యాల : నెన్నెల మండలంలో ఎర్రవాగు ఉప్పొంగడంతో.. ఖర్జిగ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. కాసర్ల సౌందర్య అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో.. అతికష్టం మీద స్థానికులు వాగు దాటించారు. సకాలంలో స్పందించడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

 

గర్భిణీని వాగు దాటించిన స్థానికులు...

మంచిర్యాల : వెన్నెల మండలంలో ఎర్రవాగు ఉప్పొంగుతోంది. ఎర్రవాగు ఉప్పొంగుతుండడంతో పజలు అవస్తలు పడుతున్నారు. స్థానికులు మానవత్వం చాటుకున్నారు. నొప్పులతో బాధపడుతున్న సౌందర్య అనే గర్భిణీని వాగు స్థానికులు దాటించి, ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సకాలంలో స్పందించడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.

 

ఉప్పొంగుతున్న ఎర్రవాగు..

మంచిర్యాల : వెన్నెల మండలంలో ఎర్రవాగు ఉప్పొంగుతోంది. ఎర్రవాగు ఉప్పొంగుతుండడంతో పజలు అవస్తలు పడుతున్నారు. నొప్పులతో బాధపడుతున్న సౌందర్య అనే గర్భిణీని వాగు స్థానికులు దాటించి, ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సకాలంలో స్పందించడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. 

ఏనుగువానిలంకలో యువకుడికి దేహశుద్ధి

ప.గో : యలమంచిలి మండలం ఏనుగువానిలంకలో ప్రేమించి మోసం చేశాడంటూ యువకుడికి దేహశుద్ధి చేశారు. ఏడేళ్లుగా ఒక అమ్మాయిన ప్రేమించి..మరో అమ్మాయిని పెళ్లి చేసుకుందుకు మురళీకృష్ణ సిద్ధమయ్యారు. మహిళా సంఘాలు, గ్రామస్తులతో కలిసి యువతి ప్రియుడు మరళీకృష్ణను చితకబాదింది.  

శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేత

కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లను అధికారులు ఎత్తివేశారు. నీటిని నాగార్జునసాగర్ లోకి విడుదల చేశారు.

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 14.7 అడుగులు

తూ.గో : ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 14.7 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రాజమహేంద్రవరం రూరల్, సీతానగరం సహా గోదావరి తీర ప్రాంతాల్లో స్కూళ్ల సెలవు ప్రకటించారు. ఏజెన్సీలోని చింతూరు, వీఆర్ పురం, కూనవరంలో వరద ఉధృతి కొనసాగుతోంది. 40 గ్రామాలు నీటితో మునిగాయి. దేవీపట్నం వద్ద  నీటిమట్టం 48.4 అడుగులకు చేరింది. 36 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కోనసీమ లంకల్లో వరద ఉధృతి నెలకొంది. 8 మండలాల పరిధిలో 37 గ్రామాలకు వరద తాకిడి ఉంది. జిల్లా వ్యాప్తంగా 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

 

కేరళలో వర్షాలు, వరదలతో 400 మందికి పైగా మృతి

తిరువనంతపురం : కేరళ ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. ఎడతెరిపి లేని వర్షాలతో కేరళ అతాలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదలతో 400 మందికి పైగా మృతి చెందారు. పది లక్షల మంది బాధితులు శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ ఎఫ్, కోస్ట్ గార్డు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

 

తాళిపేరు ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తివేత

భదాద్రి కొత్తగూడెం : తాళిపేరు ప్రాజెక్టు 13 గేట్లను అధికారులు ఎత్తివేశారు. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి వరద నీటి ఇన్ ఫ్లో 39,000 క్యూసెక్కులుగా ఉంది. 

 

09:50 - August 21, 2018

టాంజానియా : టాంజానియాలో గుంటూరు వాసి అనుమానాస్పదంగా మృతి చెందారు. గుంటూరు వాసులైన వెంకటేశ్వరమ్మ, రామారావు దంపతుల కుమారుడు లక్ష్మణ్ (32). తండ్రి రామారావు మృతి చెందారు. తల్లి వెంకటేశ్వరమ్మ కష్టపడి లక్ష్మణ్ ను ఉన్నత చదువులు చదివించింది. లక్ష్మణ్ కు భార్య 
ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్య హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ గా పని చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసిన లక్ష్మణ్... బదిలీపై వెళ్లి టాంజానియాలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. ఈనేపథ్యంలో లక్ష్మణ్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి లక్ష్మణ్ మృతి చెందారని తల్లిదండ్రులకు సంస్థ నిర్వహకులు సమాచారం ఇచ్చారు. అయితే సహోద్యోగులకు భారతీయులంటే పడదంటూ గతంలో లక్ష్మణ్ పలుస్తార్లు చెప్పినట్లు బంధువులు చెబుతున్నారు. సహోద్యోగులే హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇవాళ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తికానుంది. అనంతరం మృతదేహాన్ని భారతదేశానికి పంపనున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

కడెం ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేత

నిర్మల్ : కడెం ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 74, 494 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 68,650 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 698.700 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. 

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద ఉధృతి

నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2,08,128 క్యూసెక్కులు కాగా ఔటో ఫ్లో 9,238 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 549 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. 

08:27 - August 21, 2018

హైదరాబాద్ : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కొనసాగుతోంది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రానున్న 24గంటల్లో తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు పడుతాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:26 - August 21, 2018

కేరళలో వరదల ఘటన, ఆర్థికసాయంపై రాజకీయాలు చేయడం తగదని వక్తలు హితవుపలికారు. విపత్తు నుంచి కేరళను అదుకోవాలని పిలుపిచ్చారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నేత క్రిశాంక్, టీఆర్ ఎస్ నేత శేఖర్ రెడ్డి, టీడీపీ నేత పట్టాభీరామ్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి పాల్గొని, మాట్లాడారు. కేరళలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. కేరళకు కేంద్రం ప్రకటించిన రూ.500 కోట్లు సరిపోవని...అవసరమైన ఆర్థికసాయం అందించాలని కోరారు. దేశ ప్రజలు మానవతా దృక్పథంలో ఆలోచించి..కేరళను ఆదుకోవాలన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

08:16 - August 21, 2018

వర్షాకాలం అంటేనే వర్షాలతో పాటు సీజనల్‌ వ్యాధులు వచ్చేస్తుంటాయి. ప్రతి ఏడాది ఈ సీజనల్‌ వ్యాధులతో ఎంతో మంది ఇబ్బంది పడుతుండడం చూస్తుంటాం. ఈ సంవత్సరం కూడా సీజనల్‌ వ్యాధులు, జ్వరాలు మన తెలుగు రాష్ట్రాల్లోని అనేక గ్రామాలను పట్టిపీడిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో వీటి బెడద మరీ ఎక్కువగా ఉంది. అసలు ఈ వ్యాధులు, జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే ఈ కాలంలో ఎలాంట జాగ్రత్తలు అవసరం. ఎవరికి వారుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ప్రభుత్వాల వైపుగా ఉండాల్సిన చర్యలేంటి. అనే అంశాలపై ప్రముఖ వైద్యురాలు రమాదేవి మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ఎలా వస్తాయి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. పలు సలహాలు, సూచనలు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

హైదరాబాద్ : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కొనసాగుతోంది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రానున్న 24గంటల్లో తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు పడుతాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. 

 

07:55 - August 21, 2018

ఢిల్లీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెలరేగి ఆడాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తృటిలో చేజార్చుకున్న సెంచరీని రెండో ఇన్నింగ్స్‌లో సాధించి తన సత్తా సాధించుకున్నాడు. 191 బంతుల్లో 10 ఫోర్లతో టెస్టుల్లో 23వ సెంచరీ సాధించాడు. అనంతరం 103 పరుగుల వద్ద క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్లూ రూపంలో పెవిలియన్‌ బాటపట్టాడు. ఈ సెంచరీతో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 58వ సెంచరీ... 2018లో 6వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో అత్యధిక సెంచరీలు చేసిన టెస్ట్‌ కెప్టెన్ల జాబితాలో కోహ్లీ చేరాడు.  భారత్‌ ఇంగ్లాండ్‌ ముందు 521 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. సోమవారం ఆట చివర్లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ వికెట్‌ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజ్‌లో కుక్‌, జెన్సింగ్స్‌ ఉన్నారు.  

 

07:52 - August 21, 2018

రంగారెడ్డి : జిల్లాలోని ముచ్చింతల్‌లో జిమ్స్‌ ఆస్పత్రిలో హోమియో పరిశోధాన కేంద్రం ప్రారంభమైంది. త్రిదండి చినజీయర్‌ స్వామి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. జిమ్స్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇజ్రాయిల్‌ భాగస్వామ్యంతో ఈ హోమియో పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. హోమియో వైద్యం ఎంతో సురక్షితమని, దీనిని బాగా ప్రాచుర్యంలోకి తీసురావాలని వక్తలు కోరారు. 
ఇజ్రాయిల్‌ భాగస్వామ్యంతో హోమియో రీసెర్చ్‌ సెంటర్‌ 
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని జిమ్స్‌ ఆస్పత్రిలో హోమియో పరిశోధనా కేంద్రం ప్రారంభమైంది. హోమియో రీసెర్చ్‌ యూనిట్‌ను త్రిదండి చినజీయర్‌ స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. భారత కేంద్ర ఆయుష్‌ విభాగంతో కలిసి ఇజ్రాయిల్‌ భాగస్వామ్యంతో హోమియో రీసెర్చ్‌ సెంటర్‌ను జిమ్స్‌ ఆస్పత్రి ఏర్పాటు చేసింది. 6 నుంచి 18 నెలలు ఉండే చిన్నారులకు హోమియోపతి వైద్య విధానం ఏవిధంగా సరిపోతుందో పరిశోధన జరుగనుంది. అంతేకాదు.... చిన్నారులు ఆరోగ్యంగా ఉండటానికి వైజ్ఞానిక పరిశోధనను జిమ్స్‌ ఆస్పత్రి ప్రారంభింది. హోమియోపతి వైద్యానికి ప్రజాదరణ ఉందని చినజీయర్‌ స్వామి అన్నారు. గ్లోబలైజేషన్‌తో ఆరోగ్య సమస్యలు అధికమై... వైద్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టవలసి వస్తోందన్నారు. అయితే తక్కువ ఖర్చుతో హోమియోపతి వైద్యం అందించేందుకు జిమ్స్‌ హాస్పత్రి కృషి చేస్తుందని అభినందించారు. 
హోమియో వైద్యవిద్యలో విద్యార్థుల సామర్థ్యం దేశానికి ఆదర్శం 
హోయిమో రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, జిమ్స్‌ ఆస్పత్రి చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో హోమియో వైద్య విద్యలో విద్యార్థుల సామర్థ్యం దేశానికి ఆదర్శంగా చాటుతున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో 92 వైద్య విద్యార్థులు  ఏ ర్యాంక్‌లు సాధిస్తే.. అందులో  52 మంది జిమ్స్‌ విద్యార్థులు ఉండడం గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో 100 కేంద్రాలను తమ వైద్య విద్యార్థులతో నెలకొల్పడమే తమ లక్ష్యమని జిమ్స్‌ ఆస్పత్రి చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు అన్నారు.  జిమ్స్‌ హోమియో కాలేజీలో విద్యను అభ్యసించిన వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు

 

07:43 - August 21, 2018

హైదరాబాద్ : బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో మేకల, గొర్రెల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.  పాతబస్తీలోని జియాగూడలో విక్రయాలు ఊపందుకున్నాయి. అమ్మకందారులు వివిధ రాష్ట్రాల నుంచి వెరైటీ మేకలు, గొర్రెలను అమ్మకానికి తీసుకువస్తున్నారు.
ఊపందుకున్న మేకల, గొర్రెల విక్రయాలు
ముస్లింలు పవిత్రంగా జరుపుకునే బక్రీద్‌ పండుగకు నగరమంతా సిద్ధమైంది. ఇక పండుగ మాంసం కోసం మేకల, గొర్రెల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మాంసం విక్రయాలకు ప్రసిద్ధి చెందిన పాతబస్తీలోని జియాగూడలో పండుగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, జమ్ముకాశ్మీర్‌, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుంచి విక్రయదారులు మేకలు, గొర్రెలు నగారానికి తీసుకొస్తున్నారు. 
మేకల, గొర్రెల మాంసాన్ని పలువురికి పంపకం 
ముస్లింలు సోదరులు బక్రీద్‌ పండుగ సందర్భంగా మేకల, గొర్రెల మాంసాన్ని పలువురికి పంచిపెడుతుంటారు. పండుగ సందర్భంగా మాంసాన్ని పంచటం వల్ల మంచి జరుగుతుందని ముస్లింలు నమ్ముతారు. ఈ నమ్మకంతో పెద్ద మొత్తంలో మాంసాన్ని కొనుగోలు చేస్తుంటారు. దీన్ని ఆసరగా చేసుకుని అమ్మకందారులు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆకర్షణీయమైన మేకలను, గొర్రెలను తీసుకొస్తారు. 
ఒక్కో మేకపోట్టెలు, గొర్రె పోట్టెలు రూ.5 వేల నుంచి 50 వేలు అమ్మకం  
ఒక్కో మేకపోట్టెలును, గొర్రె పోట్టెలును 5 వేల నుంచి 50 వేల రూపాయలకు అమ్ముతామని అమ్మకందారులు అంటున్నారు. అయితే ఈ సారి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అమ్మకాలు తగ్గాయని అమ్మకందారులు చెబుతున్నారు. వర్షాలతో వివిధ రోగాలతో మేకలు, గొర్రెలు ఉంటాయని.. ప్రజలు కొనుగోలు ఎక్కువ చేయటం లేదని తెలిపారు. ఇక రేట్లు పెరగటం మరో కారణమని అమ్మకందారులు చెబుతున్నారు.
ఈ సారి మేకల, గొర్రెల రేట్లు అధికం
మరోవైపు గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ సారి మేకల, గొర్రెల రేట్లు అధికంగా ఉన్నాయని కొనుగోలుదారులు అంటున్నారు. పండుగ నేపథ్యంలో మాంసం విక్రయాలకు సంబంధించి ఖచ్చితమైన రేట్లను నిర్దేశిస్తే బాగుంటుందని కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రేట్లను కంట్రోల్ చేస్తుందో లేదో చూడాలి.

 

07:35 - August 21, 2018

గుంటూరు : భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సహాయం కోసం కేంద్రానికి నివేదికలు పంపాలని కోరారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పారు. 
 

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరదనీరు

నిజామాబాద్ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుగా ఉంది.  

ప.గో జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

ప.గో : జిల్లాలో వర్షాల కారణంగా నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ప్రైవేట్ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా రాజమహేంద్రవరంలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. సీతానగరం, కడియం మండలాల్లో డీఈవో సెలవు ప్రకటించారు. 

 

తిరుమలలో నేటి నుంచి పవిత్రోత్సవాలు

చిత్తూరు : తిరుమలలో నేటి నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. పవిత్రోత్సవాల నేపథ్యంలో మూడు రోజులపాటు పలు ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 

నేడు ఆర్టీసీ నిపుణుల కమిటీతో టీఎంయూ నేతల భేటీ

హైదరాబాద్ : నేడు ఆర్టీసీ నిపుణుల కమిటీతో టీఎంయూ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

 

Don't Miss