Activities calendar

22 August 2018

21:47 - August 22, 2018

కేరెక్టర్ ఆర్టిస్టుగా, సెకెండ్ హీరో పాత్రల్లో ఆది పినిశెట్టికి టాలీవుడ్‌లో చాలా హిట్సే ఉన్నాయి. అయితే సోలో హీరోగా మాత్రం ఇంకా సరైన విజయాన్ని అందుకోలేదు. ఆ ముచ్చట ఈ వారంతో అయినా తీరుతుందేమో చూడాల్సి ఉంది. ఈ వారంలోనే ఆది లేటెస్ట్ సినిమా ‘నీవెవరో’ విడుదల కాబోతోంది. ఈ సారి ఒక థ్రిల్లర్‌తో వచ్చాడు ఈ హీరో. ఈ నెల 24వ తేదీన ‘నీవెవరో’ విడుదల కాబోతోంది. కొంత విరామం తర్వాత తెలుగులో నటిస్తున్న తాప్సీ కూడా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్లుగా హరినాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్‌ కార్పొరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నీవెవరో మూవీ టీమ్ తో 10టీవీ స్పెషల్ చిట్ చాట్..

21:41 - August 22, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగరేణి కార్మికులకు నజరానా ప్రకటించారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంస్థ లాభాల్లో 27 శాతం వాటా కార్మికులకు బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన బోనస్‌ కంటే ఇది రెండు శాతం అదనం. అప్పట్లో 25 శాతం బోనస్‌ ఇచ్చారు. సింగరేణి అధికారులకు ఎనిమిదేళ్లు నుంచి చెల్లించాల్సిన ఫెర్ఫార్మెన్స్‌ రిలేటెడ్‌ పే బకాయిలను వెంటనే ఇవ్వాలని సంస్థ ఎండీ శ్రీధర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగరేణి కార్మికల తరహాలోనే అధికారులకు కూడా ఇంటి నిర్మాణం కోసం 10 లక్షల రూపాయల వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పారు. 

21:39 - August 22, 2018

అమరావతి : భారీ వర్షాలు, వరదలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. హెక్టారుకు పాతికవేల రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ పైర్ల సాగుకు సహాయం చేస్తామని తూర్పుగోదావరి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

తూ.గో. జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే
ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎరియల్‌ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. గ్రామాల్లో నిలిచివున్న వరదనీటిని చూసి చలించిపోయారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను అన్ని విధాల ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

తూ.గో.జిల్లాలో 6,600 హెక్టార్లలో పంటనష్టం
తూర్పుగోదావరి జిల్లా 19 మండల్లాలోని 45 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరార్శించిన చంద్రబాబు.. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజమండ్రి విమానాశ్రయంలో వరద నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం 6,600 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్టు నివేదించారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు పాతికవేల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఉభయగోదావరి జిల్లాల్లో 600 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్టు అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎర్రకాల్వ పొంగిపొర్లడంతో ఎక్కువ నష్టం జరిగినట్టు తేల్చారు. ఎర్రకాల్వ ముంపు సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆర్‌ అండ్‌ బీ రోడ్ల మరమ్మతులకు 35 కోట్ల రూపాయాలు కేటాయిస్తున్నట్టు చెప్పారు.

ఇంతవరకు 1500 టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలు
కోస్తా జిల్లాలు వరదలతో తల్లడిల్లుతుంటే.. రాయసీమ నాలుగు జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరవు ఉన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ సీజన్‌లో ఇంతవరకు 1500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంపాలు కావడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో పోలవరం పనులకు ఆటంకం ఏర్పడిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. వచ్చే ఏడాది మే నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంతవరకు 57.5 శాతం పనులు పూర్తైన విషయాన్ని ప్రస్తావించారు. పోలవరం కోసం చేసిన ఖర్చులో కేంద్రం నుంచి ఇంకా 2,600 కోట్ల రూపాయల రావాల్సి ఉందన్నారు. నిర్మాణ బాధ్యతలను పూర్తిగా కేంద్రం తీసుకున్నా అభ్యంతరంలేదని చంద్రబాబు చెప్పారు.

ప్రాజెక్టు నిర్మానానికి ప్రతిపక్షాలు అవరోధాలు : చంద్రబాబు
మరోవైపు ప్రాజెక్టు నిర్మానానికి ప్రతిపక్షాలు అవరోధాలు సృష్టిస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో 57 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని, 16 పూర్తయ్యాయని చంద్రబాబు వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు విపక్షాలకులేదని మండిపడ్డారు.వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే, పంటనష్టంపై సమీక్ష నిర్వహించిన తర్వాత చంద్రబాబు రాజమండ్రి నుంచి అమరావతి బయలుదేరి వెళ్లారు. 

21:35 - August 22, 2018

హైదరాబాద్ : తెలంగాణలో ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతుంటే.. వాటిని పరిష్కరించకుండా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరికాదన్నారు జనసమితి చైర్మన్‌ కోదండరామ్‌. మెదక్‌ జిల్లా చేగుంట, రుక్మాపూర్‌లలో పర్యటించిన కోదండరామ్‌... తెలంగాణ జనసమితి జెండాను ఆవిష్కరించారు. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలని.. మహిళలు, పిల్లలపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఐదేళ్లు పరిపాలన చేయమని ఓట్లు వేస్తే.. ఎందుకు ముందస్తుకు వెళ్తున్నారో చెప్పకుండా ప్రజలను అపహాస్యం చేస్తున్నారన్నారు కోదండరామ్‌. 

21:29 - August 22, 2018

అమరావతి : పశ్చిమగోదావరి జిల్లాలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహించడంతో నిడదవోలులోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. తిమ్మరాజుపాలెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటసత్తెమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. గర్భగుడిలోకి నీరు చేరడంతో ఆలయాన్ని మూసివేశారు. నిడదవోలులోని రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్స్‌పై నీరు ప్రవహించడంతో రైల్వే గేటుతో పాటు నిడదవోలు-తాడేపల్లి గూడెం రహదారిని మూసివేశారు. ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 

21:26 - August 22, 2018

హైదరాబాద్ : జంట నగరాల్లో శిథిలావస్థకు చేరుకున్న భవనాలు ప్రమాదకంగా మారాయి. 2013 జులై 8న సికింద్రాబాద్‌ సిటీలైట్‌ హోటల్‌ భవనం కూలిపోయిన ఘటనలో పదిమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ సమీపంలో మరో పురాతన భవనం కూలిపోయింది. సికింద్రాబాద్‌ చంద్రలోక్‌ కాంప్లెక్స్‌ రెయిలింగ్‌ కూలిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. హైదరాబాద్‌ పాతబస్తీలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. శిథిలావస్థకు చేరుకున్న పురాతన భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నా... ప్రజలను అప్రమత్తం చేయాల్సిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఉదాసీనంగా ఉండిపోవడం ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.

భవనాలు కూలిపోయి ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు
శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి, వీటిలో ఉంటున్నవారిని సురక్షిత భవనాల్లోకి తరలించే బాధ్యత జీహెచ్‌ఎంసీదే. కూలిపోయే దశకు చేరుకున్న భవనాల యజమానులకు నోటీసులు జారీచేసి ఖాళీ చేయించాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీ అధికారులు తీసుకోవాలి. నివాసయోగ్యంగా లేని భవనాలు జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేసి ఇందుకు అయ్యే ఖర్చును ఆ భవన యజమాని నుంచి వసూలు చేయాలని నగరపాలక సంస్థ చట్టం చెబుతోంది. కానీ జీహెచ్‌ఎంసీ అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కొన్ని సందర్భాల్లో ఇలాంటి భవనాలు కూలిపోయి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఏడాది మరో 150 శిథిల భవనాల గుర్తింపు
జంట నగరాల్లో శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, ఇతర నిర్మాణాలు చాలా ఉన్నాయి. గత ఏడాది నాటికి ఇలాంటి కట్టడాలు వెయ్యి వరకు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఏడాది మరో 150 అదనంగా చేరాయి. వీటిలో చాలా వరకు ప్రమాదకరంగా ఉన్నాయని గుర్తించిన అధికారులు.. ఖాళీ చేయాలని యజమానులకు నోటీసులు జారీ చేశారు. స్పందించకపోతే మరోసారి నోటీసులు ఇచ్చి బలవంతంగా ఖాళీ చేయించాలి. కానీ ఈ విషయంలో అధికారులు అంటీముట్టనట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌, అబిడ్స్‌, నాంపల్లి, చార్మినార్‌, బేగంబజార్‌, సుల్తాన్‌ బజార్‌, కోఠి, గోషామహల్‌ ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరుకున్న భవనాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఇలాంటి భవనాల్లో ఎక్కువగా వాణిజ్య కార్యకలాపాలు సాగుతున్నాయి. మలక్‌పేటలో 199 భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. బేగంపేట సర్కిల్‌లో 133, మాసాపేట, కూకట్‌పల్లి, అల్వాల్‌ ప్రాంత్లలో 133 భవనాలు కూలిపోయే దశకు చేరుకున్నాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలు, కాలేజీలు, ఆస్పత్రులు, కార్యాలయాలు కూడా శిథిలావస్థ దశలో ఉన్నాయి.

శిథిలావస్థకు చేరిన 175 కట్టడాలు ఏడాది కూల్చివేసిన జీహెచ్‌ఎంసీ
శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ఏడాది ఇంతవరకు 175 కట్టడాలను కూల్చివేశారు. కూల్చేందుకు అవకాశం లేని 25 కట్టడాలను సీజ్‌ చేశారు. వీటిలో ఉంటున్నవారిని ఖాళీ చేయించారు. అయితే శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో నివాసయోగ్యమైన వాటికి స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌ సమక్షంలో రిపేర్లు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే కూల్చివేతలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

మరో 400 భవనాలకు రిపేర్లు చేయించుకున్న యజమానులు,అధికారులు
ఈ ఏడాది ఇంతవరకు శిథిలావస్థకు చేరిన 200 భవనాలను కూల్చివేశామని అధికారులు చెబుతున్నారు. మరో 400 భవనాలకు వాటి యజమానులు రిపేర్లు చేయించుకున్నారని అంటున్నారు. అధికారులు గుర్తించిన మరో 600 శిథిల భవనాలు జంట నగరాల్లో ఉన్నాయి. వర్షాలతో వీటికి ప్రమాదమేనని భావిస్తున్నారు. శిథిల భవనాల కూల్చివేతకు వాటి జయమానులు ముందుకురాకపోతే... కఠిన చర్యలు తప్పవని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ హెచ్చరిస్తున్నారు.

శిథిల భవనాల కూల్చివేతకు యజమానులు ముందుకురావాలి -మేయర్‌
జంగ నగరాల్లో వర్షాలు కురుస్తున్న తరుణంలో శిథిల భవనాల్లో ఉంటున్న వారితోపాటు జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సిటీలైట్‌ హోటల్‌ లాంటి ప్రమాదాలు పునరావృతం కాకముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రాణం విలువ తెలుసుకుని అందరూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. 

20:27 - August 22, 2018

ఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీకి సీనియర్‌ నేతలు షాక్‌ ఇస్తున్నారు. తాజాగా ఆప్‌ సీనియర్‌ నేత ఆశిష్‌ కేతాన్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను ఆగస్టు 15న ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌కు పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఆప్‌ సీనియర్‌ నేత అశుతోష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆప్‌-కేంద్రం మధ్య విభేదాల నేపథ్యంలో ఆశిష్‌ కేతాన్ ఢిల్లీ ప్రభుత్వ సలహా మండలి డిడిసి నుంచి తప్పుకున్నారు. తాను తిరిగి న్యాయవాద వృత్తిలోకి అడుగు పెట్టానని కేతాన్‌ ట్వీట్‌ చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేతాన్‌కు టికెట్‌ ఇవ్వడానికి పార్టీ నిరాకరించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

20:25 - August 22, 2018

ఢిల్లీ : మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి 'అస్థి కలశ యాత్ర'ను ప్రధాని మోది ప్రారంభించారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వాజ్‌పేయి అస్తి కలశాలను వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులకు మోదీ అందజేశారు. దేశంలోని 100 నదుల్లో ఈ అస్థికలను నిమజ్జనం చేసేందుకు 'అస్థి కలశ యాత్ర'ను బీజేపీ చేపడుతోంది. రాష్ట్ర రాజధానుల్లో ఈ యాత్రలు ప్రారంభమై అన్ని బ్లాక్‌లకూ చేరుకుంటాయి. ఈ కార్యక్రమంలో బిజెపి చీఫ్ అమిత్‌షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, వాజ్‌పేయి దత్తపుత్రిక నమిత భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘ అస్వస్థతతో ఈనెల 16న వాజ్‌పేయి తుదిశ్వాస విడిచారు.

20:23 - August 22, 2018

భూపాలపల్లి : ఇంటింటికీ నీరందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం నీరుగారిపోతుంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ముంజురనగర్‌లో భగీరథ పైపులైన్‌ లీక్‌ అవడంతో నీరు పైకి ఎగిసి పడుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో రోజుకో చోట పైప్‌లైన్‌లు లీక్‌ అవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

20:21 - August 22, 2018

విశాఖపట్నం : ఆవిష్కరణ, సాంకేతిక, సాంస్కృతిక, ప్రతిభ, ఆధ్యాత్మికతల మేళవింపుగా... జ్ఞానభేరి మోగించేందుకు ఆంధ్రా విశ్వవిద్యాలయం సిద్దమైంది. విశాఖ వేదికగా జరగబోయే రెండో జ్ఞానభేరిలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు ఏయూకి రానున్నారు. .. ముఖ్యమంత్రి చంద్రబాబుతో వీరంతా ముఖాముఖి మాట్లాడనున్నారు.

విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం రెండో జ్ఞానభేరికి వేదిక కానుంది. గురువారం ఉదయం పది గంటలకు జ్ఞానభేరి ప్రారంభం అవుతుంది. జ్ఞానభేరి నిర్వహణకు సంబంధించి... మంత్రి గంటా శ్రీనివాసరావు.. వివిధ యూనివర్సిటీల వీసీలతో సమీక్ష నిర్వహించారు. ఇదే సందర్భంలో జ్ఞానభేరి ట్రోఫీని ఆవిష్కరించారు.

జ్ఞానభేరికి హాజరయ్యే విద్యార్థులతో యోగా నిర్వహింపజేసి.. పన్నెండు గంటల ప్రాంతంలో పోలవరంపై డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు.. ముఖ్యమంత్రి చంద్రబాబు.. జ్ఞానభేరికి హాజరవుతారు. కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించే డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. జ్ఞానభేరికి హాజరయ్యే విద్యార్థులతో.. నాలుగు గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి సంభాషిస్తారు.

జ్ఞానభేరి కార్యక్రమానికి సుమారు 20 వేల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ సభలోట్రోఫీలు బహూకరించనున్నారు. మొత్తం 35 స్థాయుల్లో బహుమతులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కాలేజీల విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు.

జ్ఞానభేరి కార్యక్రమానికి విశాఖ ఏయూలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా వాటర్‌ప్రూఫ్‌ టెంట్‌లు ఏర్పాటు చేశారు. జ్ఞానభేరి కార్యక్రమానంతరం.. ముఖ్యమంత్రి చంద్రబాబు.. విశాఖ మ్యూజియంలో వైజాగ్‌ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌కు హాజరవుతారు. 

20:18 - August 22, 2018

తూర్పుగోదావరి : వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. హెక్టారుకు పాతిక వేల రూపాయల పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన చంద్రబాబు... ముంపును పరిశీలించారు. మొత్తం 6,600 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్టు అధికారులు నివేదించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులను ముఖ్యమంత్రి పరామర్శించారు. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎర్రకాల్వ ప్రాజెక్టు పొంగిపొర్లడంతో ఎక్కువ నష్టం జరిగిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, కాజ్‌వేలు మరమ్మతులుకు నిధుల కేటాయిస్తామని చెప్పారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి విపక్షాలు సృష్టిస్తున్న అడ్డంకులను అధిగమించి... ముందుకుసాగుతున్నామని చంద్రబాబు చెప్పారు. 

20:16 - August 22, 2018

హైదరాబాద్ : మెగాస్టార్‌ చిరంజీవికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా చిరంజీవి నివాసానికి వచ్చి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తో ఆయన సతీమణి అన్నా లెజినోవా, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అన్నదమ్ములిద్దరూ కలిసి ఉన్న ఈ ఫొటోలను అభిమానులు లైక్‌ చేసి తెగ కామెంట్లు పెడుతున్నారు. అటు సోషల్‌ మీడియాలోనూ చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు... సినీ ప్రముఖులు కూడా మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసేందుకు వస్తున్న అభిమానులను చిరంజీవి ఆప్యాయంగా పలకరించారు. 

20:13 - August 22, 2018

తిరుమల : తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు ఇతర సుగంధద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీవారి మూలవర్లు, ఉత్సవమూర్తులు, పరివారదేవతలు, ఆనందనిలయం విమానం, ధ్వజస్తంభం, వరాహస్వామి, బేడి ఆజంనేయస్వామికి పవిత్రమాల సమర్పించారు. గురువారం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. 

20:09 - August 22, 2018

నిజామాబాద్ : శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోవడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలతోపాటు ఇతర జిల్లా నుంచి సందర్శకులు ప్రాజెక్టును చూసేందుకు వస్తున్నారు. నిండుకుండలా తొణికిసలాడుతున్న ఎస్‌ఆర్‌ఎస్‌పీని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

20:06 - August 22, 2018

హైదరాబాద్ : అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుయుక్తులు పన్నుతున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌తో, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో మైనారీటులు, మజ్లిస్‌ అప్రమత్తంగా ఉండాలని రేవంత్‌రెడ్డి సూచించారు. 

ప్రగతి నివేదన సభకు టీ.కేబినెట్ అమోదం..

హైదరాబాద్ : కొంగరకలాన్ లో టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు టీ.కేబినెట్ అమోదం పలికింది. సెప్టెంబర్ 2న కొంగరకలాన్ లో టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ జరపాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ సభకు రేపటి నుండి ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుండి 25 లక్షల మంది హాజరయ్యే అవకాశమున్నట్లుగా కూడా తెలుస్తోంది. 

19:45 - August 22, 2018

ఢిల్లీ : భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రకటించిన 700 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేరళను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తామని కేంద్రం చెబుతోంది. భారత్‌ గత కొన్నేళ్లుగా విపత్తుల సమయంలో ఎలాంటి విదేశీ సాయాన్ని తీసుకోవడం లేదు. అదే విధానాన్ని కేంద్రం అనుసరించాలని భావిస్తోంది. విదేశీ సాయం తీసుకునే అంశంపై విదేశాంగ మంత్రిత్వ శాఖనే నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఉత్తరాఖండ్‌, కశ్మీర్‌లో సంభవించిన వరదల సమయంలో కూడా కేంద్రం విదేశాల నుంచి సహాయాన్ని తీసుకోలేదు. 2013లో ఉత్తరాఖండ్‌లో సంభవించిన వరదల సమయంలో రష్యా సాయం చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ భారత్‌ అంగీకరించలేదని విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎలాంటి విపత్తులైనా తట్టుకుని నిలబడగల సామర్థ్యం భారత్‌కు ఉందనే చెప్పడమే దీని ఉద్దేశం. విదేశాల్లో ఉండేవారు విరాళాలలను కేరళ సిఎం రిలీఫ్‌ ఫండ్‌ పేరిట పంపవచ్చని హోంశాఖ సూచించింది.

భారీ వర్షాలకు కుంగిన 4అంతస్తుల భవనం..

వరంగల్ : గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో చోటు చేసుకుంది. కాజీపేట పట్టణంలోని 35వ డివిజన్‌ భవానీనగర్‌ కాలనీలో నిర్మాణంలో ఉన్న జీ ప్లస్‌–4 బిల్డింగ్ మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ శబ్దంతో ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. సెల్లార్, గ్రౌండ్‌ ఫ్లోర్‌ పూర్తిగా భూమిలోకి దిగబడిపోయాయి.  

తొలి భారత మహిళా షూటర్ సర్నోబత్..స్వర్ణంతో రికార్డు..

ఢిల్లీ : ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా షూటర్ గా రహీ జీవన్ సర్నోబత్ రికార్డు సృష్టించింది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణ పతకం దక్కింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రహీ జీవన్ బంగారు పతకం సాధించింది. ఫైనల్లో రహీ జీవన్, యంగ్ పైబూన్ హోరాహోరీగా తలపడ్డారు. స్టేజ్-1లో మూడు రౌండ్లలో జీవన్ 15 పాయింట్లకు గాను 14 సాధించింది. స్టేజ్-2లో జరిగిన 7 రౌండ్లలో 20 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.ఇదిలా ఉండగా, ఆసియా క్రీడల్లో భారత్ కు ఇది నాలుగవ పసిడి పతకం కాగా, షూటింగ్ లో రెండోది.

వరదలకు రూ.600 కోట్లు నష్టం : చంద్రబాబు

అమరావతి : 2006 తర్వాత ఇప్పుడు పెద్ద వరదలు వచ్చాయని, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన విహంగవీక్షణం చేసి, జిల్లాల్లో జరిగిన నష్టంపై అంచనా వేశారు. అనంతరం, రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఉభయగోదావరి జిల్లాల్లో రూ.600 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన పరిహారం చెల్లిస్తామని, హెక్టార్ కు రూ.25 వేలు నష్టపరిహారంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

టీమిండియా ఘన విజయం..

ఢిల్లీ : ఇంగ్లండ్ గడ్డపై వరుసగా రెండు టెస్టులు ఓడిపోయేసరికి ఎన్నో విమర్శలు, దెప్పిపొడుపులు. అయినా, ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. గెలవాలనే ఏకైక లక్ష్యంతో మూడో టెస్టులో బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లు... తొలి రోజు నుంచే ఇంగ్లండ్ పై పైచేయి సాధించి... చివరకు మూడో టెస్టును కైవసం చేసుకున్నారు. తద్వారా ఏ గడ్డపై అయినా సరే గెలిచే సత్తా తమకుందని చాటి చెప్పారు. నాటింగ్ హామ్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 203 పరుగులతో ఘన విజయం సాధించింది. దీంతో, ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.

వాజే పేయ్ అస్థికల యాత్ర..100నదుల్లో..

ఢిల్లీ : మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ఆస్థి కలశ యాత్ర చేపట్టి దేశంలోని 100 నదుల్లో ఆయన అస్థికలను నిమజ్జనం చేయాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు వాజ్‌పేయి అస్థి కలశాలను ఆయా నదుల్లో నిమజ్జనం చేసేందుకు ఈ రోజు అందజేశారు. ప్రతి రాష్ట్రంలోనూ ఆస్థి కలశ యాత్ర నిర్వహించి నిమజ్జనం చేయాలని సూచించారు. రాష్ట్ర రాజధానులలో ఈ యాత్రలు ప్రారంభమై అన్ని బ్లాకులకు చేరుకుంటాయి.

19:18 - August 22, 2018

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుందా? సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నారా? దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారా? ఈ ముందస్తు ఎన్నికలకు టీఆర్ నేతలు సిద్ధంగా వున్నారా? ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు వస్తే..టీఆర్ఎస్ కు కలిసి వస్తుందా. తిరిగి అధికారంలోకి గులాబీ దళం చక్రం తిప్పేనా? ప్రస్తుతం ఇదే చర్చ కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతను నేడు ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం ముందస్తుకు సంకేతం అన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ అంశంపై 10టీవీ బిగ్ డిబేట్..ఈ డిబేట్ లో శాసనమండలి చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిథి ప్రకాశ్ రెడ్డి, టీడీపీ నేత పెద్దిరెడ్డి పాల్గొన్నారు. 

17:51 - August 22, 2018

కర్నూలు : నంద్యాలలో మనసు ద్రవించే ఘటన చోటుచేసుకుంది. మిడి మిడి జ్నానంతో ఓ ఆర్ ఎంపీ వైద్యుడు ఓచిన్నారి చావుకు కారణమయ్యాడు. చిన్నారికి జలుబు, దగ్గు చేసిందని ఆర్ఎంపీ వైద్యుడ్ని తల్లిదండ్రులు సంప్రదించాడు. దీంతో ఓ సిరప్ ఇచ్చి చిన్నారి పట్టించమని చెప్పగా వారు అదే చేశారు. దీంతో సిరప్ తాగిన నెలల బాలుడు జగన్ మృతి చెందాడు. దీంతో కాలం చెల్లిన మందు ఇచ్చాడనీ..ఆర్ ఎంపీ వైద్యుడు దస్తగిరిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా ఆర్ ఎంపీ వైద్యులతో చికిత్సలు చేయించుకోరాదని ఎంతగా చెప్పినా వారి హవా మాత్రం తగ్గటంలోలేదు. ఇటువంటి ఘటనలు కూడా పరిపాటిగా జరుగుతునే వున్నాయి. ప్రభుత్వం కూడా ఆర్ఎంపీ వైద్యుల విషయంలో తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. 

17:48 - August 22, 2018

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్ లో విషాదం చోటు చేసుకుంది. భవనంపై నుండి ఇద్దరు చిన్నారులు పడి మృతి చెందారు. మూడంతస్తుల భవనం పై ఆడుకుంటున్న 18 నెలల శ్రేయ అనే చిన్నారి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది. పడిపోతున్న చిన్నారిని కాపాడబోయి 13 సంవత్సరాల పల్లవి అనే బాలిక కూడా జారి భవనంపైనుండి కింద పడి మృతి చెందింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసలు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం చిన్నారుల మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి పూర్తయిన అనతరం వారి తల్లిదండ్రులకు అందజేశారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. చిన్నారులు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

17:12 - August 22, 2018
17:07 - August 22, 2018

ఢిల్లీ : ఏషియన్‌ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు రికార్డ్‌ సృష్టించింది. ఇవాళ జరిగిన పూల్‌ మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌ను 26-0 తేడాతో భారత్‌ ఓడించింది. ఈ మ్యాచ్‌ నలుగురు భారత క్రీడాకారులు హ్యాట్రిక్స్‌ గోల్స్‌ చేశారు. ఈ భారీ విజయం ద్వారా భారత్‌ ఒలెంపిక్స్‌ గేమ్స్‌లో స్థాపించిన 86 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టింది. 1932 ఒలెంపిక్స్‌ గేమ్స్‌లో భారత్‌ యూఎస్‌ను 24-1 తేడాతో ఓడించింది. ఇపుడు ఆ రికార్డ్‌ను అధిగమించింది.

17:05 - August 22, 2018

విజయనగరం : ఇటీవల కురిసిన వర్షాలతో విజయనగరం జిల్లాలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వర్షాలు లేక వరినాట్లు పడకపోవడంతో బెంగపెట్టుకున్న రైతన్న...తాజాగా కురిసిన వర్షాలతో ఊరట చెందుతున్నాడు. ఈపాటికే వరినాట్లు పూర్తికావాల్సి ఉండగా వర్షాలు లేకపోవడంతో ఆలస్యమైంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వరదలతో ఇబ్బంది పడుతుంటే...విజయనగరం జిల్లాలో మాత్రం ఖరీఫ్ పనులు ఊపందుకున్నాయి. 

17:03 - August 22, 2018

అమరావతి : వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డిపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. జగన్‌కు సిద్ధాంతాలు తెలియవని...స్వార్థ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో అంతరంగికంగా ఎం చర్చలు జరిపారో జగన్‌ వివరించాలన్నారు. జగన్‌ ఇప్పటికైనా పెళ్లిళ్ల మాట పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలన్నారు. జగన్ పెళ్లిళ్ల మాట పక్కన పెట్టి ప్రధాని మోదీతో నీ అక్రమ సంబంధం మాటేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ కు తన స్వార్థ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని మంత్రి సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. కాగా గత కొద్ది రోజుల క్రితం జగన్ మాట్లాడుతు..సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీతో పెళ్లి చేసుకుని విడాకులిచ్చేసాడనీ..తరువాత జవన్ కళ్యాణ్ తో పెళ్లి చేసుకుని విడాకులిచ్చేశాడని పలు పార్టీలతో పెళ్లిళ్లు చేసుకోవటం విడాకులిచ్చేయటం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంతో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతు..జగన్ పెళ్లిళ్ల మాట పక్కన పెట్టి ప్రధాని మోదీతో నీ అక్రమ సంబంధం మాటేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

16:57 - August 22, 2018

ఢిల్లీ : ఆసియాడ్‌లో భారత్‌ బుధవారం మరో స్వర్ణ పతకం ఖాతాలో వేసుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో షూటర్‌ రహీ జీవన్‌ సర్నోబత్‌ పసిడిని గురిచూసి కొట్టింది. ఈ పోరు ఆద్యంతం ఉత్కంఠకరంగా జరగడం గమనార్హం. బంగారాన్ని ముద్దాడేందుకు రహీ రెండు సార్లు షూటాఫ్‌‌లో పోటీ పడటం విశేషం. థాయ్‌ షూటర్‌ యంగ్‌పైబూన్‌, కొరియా అమ్మాయి కిమ్‌ మిన్‌జుంగ్‌ రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. దీంతో ఆసియా గేమ్స్‌లో షూటింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన మొదటి మహిళగా సర్నోబత్‌ నిలిచింది. కాగా ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది నాల్గవ స్వర్ణం. 

16:53 - August 22, 2018

ఢిల్లీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో 203 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. చివరిరోజు 2.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్‌ 317 పరుగుల వద్ద చివరి వికెట్‌ కోల్పోయింది. 9 వికెట్లకు 311 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌.. మరో ఆరు పరుగులు మాత్రమే చేసింది. 11 పరుగులు చేసిన అండర్సన్‌... అశ్విన్‌ బౌలింగ్‌ ఔటయ్యాడు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది కోహ్లీ సేన. రెండో ఇన్నింగ్స్‌ బుమ్రా 5, ఇషాంత్‌ 2, షమి, అశ్విన్‌, పాండ్యా తలా ఒక వికెట్‌ తీసుకున్నారు. బట్లర్‌ సెంచరీ, స్టోక్స్‌ హాఫ్‌ సెంచరీ చేసినా ఇంగ్లండ్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయారు. 

16:50 - August 22, 2018

విజయనగరం : కన్న బిడ్డల్ని కడుపులో దాచుకునే తల్లి ఓ దారుణ ఘటనకు పూనుకుంది. కన్న పెంచి విద్యాబుద్ధులు చెప్పాల్సిన తల్లి తన క్షణిక సుఖం కోసం చెట్టంత కొడుకుని దారుణంగా చంపేసే కసాయిగా మారిపోయింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి తన 17ఏళ్ల కుమారుడు హరి భగవాన్ న్ని తల్లి వెంకటపద్మావతి విజయనగరం పట్టణంలోని గాయత్రినగర్‌లో చోటుచేసుకుంది. ఆకలితో ఇంటికి వచ్చిన కొడుకుని ఆప్యాయంగా అన్నం పెట్టాల్సి తల్లి కుమారుడు తినే భోజనంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది. దీంతో మత్తులోకి జారుకున్న కుమారుడిని చీరతో ఉరి వేసి చంపేసింది.

భర్తతో దాదాపు 15 సంవత్సరాల క్రితం విడిపోయిన తల్లి వెంకటపద్మావతి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో దీంతో కుమారుడు తల్లిని ప్రశ్నించటంతో ఇద్దరి మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. కాగా పద్మావతి వ్యవహార శైలిన నచ్చని కొండల్ రావు విడిపోయినట్లుగా తెలుస్తోంది. భర్తతో విడిపోయిన వెంకట పద్మావతి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి దగ్గరయింది. రోజూ గోవింద్‌ ఇంటికి వచ్చి వెళ్లడం కుమారుడు హరిభగవాన్‌కు నచ్చలేదు. ఈ విషయంలో పలుమార్లు తల్లితో ఘర్షణ పడ్డాడు. దీంతో కొడుకుని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని తల్లి నిర్ణయించుకుంది. దీంతో హరి భగవాన్ తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. హరిభగవాన్‌ నిద్రలోకి జారుకున్న తర్వాత చీరతో ఉరివేసి చంపేసింది. అనంతరం తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని బయట ప్రచారం చేసింది. పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను విచారించడంతో నిజం అంగీకరించిందని పోలీసులు తెలిపారు. కాగా దీనిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

16:36 - August 22, 2018

నెల్లూరు : అధికారం వంటబడితే మనుషులు మానవత్వాన్ని మరచిపోతారా? వారి దర్పం చూపించుకునేందుకు తమ కింద పనిచేసేవారితో ఎటువంటి పనులు చేయించుకోవటానికైనా వెనుకడరా? ప్రజాప్రతినిధులు కూడా దీనికి అతీతంకాదా? ప్రజల ఓట్లతో గెలిచి సాటి వ్యక్తులను కూడా మనిషిగా చూడకుండా వారితో చెప్పులు మోయించుకునేవారు ప్రజాప్రతినిధులవుతారా? వీరు ప్రజలకు సేవలు చేస్తారా? అంటే ఆలోచించాల్సిన సందర్భం ఇప్పుడు కనిపిస్తోంది. ఓ నగరానికి మేయర్ గా పనిచేస్తు..కింద ఉద్యోగితో అందునా దర్గాలో అబ్దుల్‌ అజీజ్‌ అనే మేయర్ అత్యుత్సాహం చూస్తే ఇవన్నీ నిజం అనిపించకమానవు. బక్రీదు వేడుకల్లో పాల్గొనటానికి వచ్చిన మేయర్ తన దఫేదారుతో బూట్లు మోయించాడు. బక్రీద్‌ సందర్భంగా దర్గాలో ముస్లిం సోదరుల ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రార్థనలు ముగించుకొని వచ్చిన మేయర్ తన దఫేదారుని బూట్లు తీసుకురమ్మని చెప్పగా బూట్లు వేసుకొని దర్జాగా వెళ్లిపోయాడు. కాగా మేయర్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

16:34 - August 22, 2018

గుంటూరు : తాడేపల్లి మండలం చినరావూరులో విషాదం జరిగింది. కృష్ణానది తీరం శోక సముంద్రంగా మారిపోయింది. నదిలో లో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సెలవు దినం కావడంతో నదిలో ఈత కోసం వెళ్లిన ఏడుగురు విద్యార్థుల్లో నలుగురు గల్లంతవగా మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. విద్యార్థులు చిర్రావురు వాసులుగా గుర్తించారు. నదిలో గల్లంతైన నలుగురు విద్యార్థుల్లో ఒక మృతదేహాన్ని వెలికితీశారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన గుంటూ ఎంపి గల్లా జయదేవ్‌ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరిహారం అందజేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడుతానన్నారు. కాగా ఈ ఘటనతో ఆ ప్రాంత చుట్టు పక్కల వాసులంతా ఆ ప్రాంతానికి చేరుకోవటంతో మృతుల కుటుంబ సభ్యుల రోదనలకు కృష్ణానది తీరం శోకసంద్రంగా మారిపోయింది. 

16:32 - August 22, 2018

హైదరాబాద్ : సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ కేబినెట్ అత్యవసరంగా సమావేశం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ముందస్తు ఎన్నికల వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నారనే వాదనలను బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు కేసీఆర్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో భారీ బహిరంగ సభ దీనికి మరింతగా నమ్మకాన్ని పెంచుతోంది. దీంతో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఏకంగా ప్రభుత్వాన్నే రద్దు చేసేందుకు సిద్ధపడుతున్నారా? అనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. కాగా కేసీఆర్ నిర్వహించాలనుకుంటున్న ఎటువంటి కారణాలతోనైనా నిర్వహణ జరగకుంటే..ప్రత్యామ్నాయంగా ఎటువంటి నిర్ణయాలను సీఎం తీసుకుంటారోననే ఆలోచన పలువురిలో నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా ఈ నాలేగేళ్లలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఆదేశించారు. దీంతో ప్రజా ప్రతినిథులు తమ తమ నియోజకవర్గాలలోనే వుంటున్నారు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పలు కీలక అంశాలపై ప్రత్యేక దృష్టితో ముందుకెళుతోంది. వీటికి ఒక తుది రూపు వస్తే ప్రజల్లో ఓట్లు అడిగేందుకు మరింత నమ్మకంతో ముందకెళ్లేందుకు టీఆర్ఎస్ సర్కార్ పనులను వేగవంతం చేస్తోంది. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ కేబినెట్ పైనే అందరి దృష్టి వుంది. మరి కేబినెట్ భేటీ అనతరం అందే సమాచారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కాగా ఈరోజు సాయంత్రం సాయంత్రం 4.00గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. కాగా సాధారణంగా జరిగే కేబినెట్ సమావేశానికి లేని ఉత్కంఠ ఈ భేటీకి మాత్రం నెలకొనటం విశేషం.

సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్ లో విషాదం...

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే క్వార్టర్స్ లో విషాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ పై నుండి ఇద్దరు చిన్నారులు పడి మృతి చెందారు. 18 నెలల చిన్నారిని కాపాడబోయి కాలు జారి బాలిక పడిపోయింది. మూడంతస్తుల భవనం పై నుండి చిన్నారి కింద పడిపోతుండగా బాలిక కాపాడబోయింది. 

ఒక వికెట్ దూరంలో భారత్...

నాటింగ్ హోమ్ టెస్టులో విజయానికి భారత్ ఒక వికెట్ దూరంలో నిలిచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోర్స్ 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. మూడో టెస్టు ఐదో రోజు ఆట ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.

 

మంత్రులతో కేసీఆర్...

ఢిల్లీ : మంత్రులతో సీఎం కేసీఆర్ కాసేపట్లో సమావేశం కానున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన, ప్రగతి నివేదన సభపై చర్చించనున్నారు. ఫించన్ల పెంపు, నిరుద్యోగ భృతి, రెండు లక్షల రుణమాఫీ అంశావలపై మంత్రివర్గం చర్చించనుంది.

 

భారత్ కు మరో పతకం ఖాయం...

హైదరాబాద్ : ఆసియన్ గేమ్స్ లో భారత్ కు మరో పతకం ఖాయమైంది. మహిళల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో సెమీస్ కు అంకిత్ రైనా దూసుకెళ్లారు. హాంకాంగ్ క్రీడాకారిణి యుడీస్ చాంగ్ పై 6-4, 6-1 తేడాతో అంకిత్ రైనా విజయం సాధించారు. 

16:23 - August 22, 2018

హైదరాబాద్ : సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. సాయంత్రం 4.00గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. కాగా సాధారణంగా జరిగే కేబినెట్ సమావేశానికి లేని ఉత్కంఠ ఈ సమావేశానికి మాత్రమే ఎందుకు అనేది ప్రధాన అంశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ముందస్తు ఎన్నికల వార్తలు హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో పది రోజుల క్రితం కేబినెట్ సమావేశం జరుగగా మరోసారి అత్యవసరంగా సీఎం ఈ కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయటంపై ఉత్కంఠ నెలకొన్నట్లుగా సమాచారం. ముందుస్తు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అధికార పార్టీ ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి? తీసుకోవాల్సిన తక్షణ కర్తవ్యాలేమిటి? వంటి కీలక అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. కాగా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా వున్న గులాబీ బాస్ దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నాలుగున్నరేళ్ళ కాలంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లో ఇప్పటికే విస్తృతంగా తీసుకెళ్లిన నేతలు ఇక గులాబీ బాస్ ఇచ్చే ఆదేశాలకు కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపత్యంలో ముందస్తు ఎన్నికలు, రాజకీయ పరిణామాలపైనే ప్రధానంగా ఈ సమావేశం చర్చింనున్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగుల ఐఆర్, సీఆర్సీపైనా చర్చించి కేబినెట్ నిర్ణయం..ప్రగతి నివేదన సభ, అభ్యర్థుల ప్రకటన, వర్షాలు, వరదలు, పాడి గేదెల పంపిణీ, రైతు జీవిత బీమా, కంటి వెలుగు వంటి పలు సంక్షేమ పథకాలపై కేబినెట్ చర్చించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ కేబినెట్ భేటీపై మాత్రం ఉత్కంట కొనసాగుతోంది. 

13:59 - August 22, 2018

హైదరాబాద్ : టెన్‌ టీవీలో ఆదివారం రాత్రి ప్రసారమయ్యే ఫేస్‌ టు ఫేస్‌ విత్‌ సతీష్‌ కార్యక్రమానికి పద్మ మోహన అవార్డు దక్కింది. టీవీ డివిజన్‌లో బెస్ట్‌ ఇంటర్వ్యు కేటగిరిలో ఈ అవార్డు వరించింది. 2018 సంవత్సరానికిగాను కార్యక్రమ వ్యాఖ్యాత, టెన్‌ టీవీ అసిస్టెంట్ ఎడిటర్‌ సతీష్‌ అవార్డును అందుకున్నారు.  బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పద్మమోహన ట్రస్ట్‌ ఛైర్మన్ యాదగిరి గౌడ్‌లు సతీష్‌ను అవార్డుతో సత్కరించారు.

 

13:56 - August 22, 2018

కృష్ణా  : జిల్లా రైతులకు సర్పభయం పట్టుకుంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం తాకిడితో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. వరద నీటిలో తేళ్లు, పాముల్లాంటి విషసర్పాలు ఇళ్లలోకి , పంటపొలాల్లోకి చొచ్చుకు వస్తున్నాయి. వీటిని గుర్తించని రైతులు, ప్రజలు విషసర్పాల కాటుకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు.  రెండు రోజుల వ్యవధిలో 46 మంది పాముకాటుకు గురవడంతో అందరిలో భయం పట్టుకుంది.
పాముకాటుకు గురైన 275 మంది
కృష్ణా జిల్లాలోని ప్రజలకు పాము భయం పట్టుకుంది. దివిసీమలో పాములు రెచ్చిపోతున్నాయి. పాముకాట్లకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 275 మందికిపైగా పాముకాటుకు గురయ్యారు.  ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో విషసర్పాలు ఏ స్థాయిలో సంచరిస్తున్నాయో అర్థంచేసుకోవచ్చు.
బయట సంచరిస్తున్న పాములు
వ్యవసాయ పనులు ప్రారంభంకావడం, కృష్ణానదికి వరద తాకిడి పెరగడంతో ఇన్నాళ్లూ కలుగుల్లో ఉన్న పాములు, తేళ్లు, ఇతర విషసర్పాలు బయటకు వస్తున్నాయి. అవి రాత్రిపగలూ సంచరిస్తూ కాటేస్తున్నాయి. అవనిగడ్డలో ఏరియాలో ఒక్కరోజే 11మంది పాముకాటుకు గురయ్యారు. ఏరియా వైద్యశాలలో గతంతో వైద్యం తీసుకుంటున్న వారితో కలిపితే ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నారు. పాముకాటుకు గురైన వారిలో ఇద్దరు మహిళలు ఉండగా.. మిగిలిన వారంతా పురుషులే.  సోమవారం ఇద్దరు పాముకాటుకు గురవడంతో వారిని కోడూరు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.  
పాముకాట్లతో జిల్లాలో కలకలం
వరుస పాముకాట్లతో జిల్లాలో కలకలం మొదలైంది. శాసనసభ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్‌ అవనిగడ్డ ఏరియా వైద్యశాలతోపాటు కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి మండలాల్లోని పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాముకాటుకుగురై చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.  అన్ని పీహెచ్‌సీల్లో యాంటిస్నేక్‌ వీనం మందును అందుబాటులో ఉంచాలని, పాములను నివారించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
బయట తిరగాలంటే హడలిపోతున్న ప్రజలు
కృష్ణా జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రజలు పాముకాటుకు గురవుతున్నారు. అర్ధరాత్రి బయట తిరగాలంటేనే హడలిపోతున్నారు. పొలానికి వెళ్లాలంటే రైతులకు వణుకుపుడుతోంది.  ఇప్పటికైనా పాముకాటుకు గురికాకుండా అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

 

కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం...

తిరువనంతపురం : కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.21 కోట్ల విరాళం అందజేసింది. దాంతో పాటు రూ.50 కోట్ల విలువైన వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేయనుంది.

13:53 - August 22, 2018

హైదరాబాద్ : దేవ భూమిగా వర్దిళ్లిన కేరళలో సంభవించిన వరదలు దురదృష్టకరమన్నారు  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖా మంత్రి ఈటెల రాజేందర్. కేరళ వరద భాదితుల సహాయార్దం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున 500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లారీల ద్వారా కేరళకు పంపారు. ఈ లారీలను నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వద్ద మంత్రి ఈటెల జెండా ఊపి ప్రారంభించారు. కేరళలో సంభవించిన వరదల వలన భారీ నష్టం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ 25 కోట్లు ఆర్థిక సహాయం చేశారన్నారు. మానవత్వం వున్న ప్రతి ఒక్కరు కేరళను ఆదుకోవాలని సూచించారు మంత్రి. 

 

కేరళకు ఆహారం, నీళ్లు - సీఎం యోగి...

ఉత్తర్ ప్రదేశ్ : కేరళ రాష్ట్రానికి ఆహార పదార్థాలు..నీళ్లతో కూడిన 25 ట్రక్కులను పంపింనట్లు సీఎం యోగి ఆదిత్య నాథ్ వెల్లడించారు. ఇంకా కేరళకు సహాయం చేస్తామని తెలిపారు. 

13:51 - August 22, 2018

తిరువనంతపురం : కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదనీరు మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. నడుములోతు వరకు నీరు నిలిచిపోయింది. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ పరిస్థితి ఎదుర్కోవడం కేరళ సర్కార్‌కు సవాల్‌గా మారింది. 

13:49 - August 22, 2018

గుంటూరు : తాడేపల్లి మండలం చినరావూరులో విషాదం జరిగింది. కృష్ణానదిలో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సెలవు దినం కావడంతో నదిలో ఈత కోసం వెళ్లిన ఏడుగురు విద్యార్థుల్లో నలుగురు గల్లంతవగా మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. విద్యార్థులు చిర్రావురు వాసులుగా గుర్తించారు. ఘటనాస్థలిని ఎంపీ గల్లా జయదేవ్ సందర్శించారు. బాధితుల కుటుంబసభ్యులను పరామర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:46 - August 22, 2018

కృష్ణా : జిల్లాలోని కబడ్డీ మాజీ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. ఏపీ కబడ్డీ ప్రెసిడెంట్‌ వీర్ల లంకయ్య కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. తనపై కక్షతో తన టీం సభ్యులను కబడ్డీ క్రీడకు దూరం చేస్తున్నారని మనస్థాపం చెందిన శ్రీకాంత్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 

 

13:44 - August 22, 2018

హైదరాబాద్ : నేడు తెలంగాణ మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అవుతోంది. సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం జరుగనుంది. పది రోజులుకూడా కాకుండానే తిరిగి సమావేశం అవుతోంది. దీంతో కేబినెట్‌లో ఏం చర్చిస్తారన్న ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికలు, రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వర్షాలు, వరదలు, పంటనష్టంపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. పాడి గేదెల పంపిణీ, రైతు జీవిత బీమా, కంటి వెలుగుపై చర్చించనున్నట్లు కనిపిస్తోంది. ప్రగతి నివేదన సభ, అభ్యర్థుల ప్రకటనపైనా చర్చించే అవకాశం 
ఉంది. ఉద్యోగుల ఐఆర్, పీఆర్సీపైనా చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. 

13:30 - August 22, 2018

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి చేసింది భార్య. ప్రభుత్వ పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సత్యనారాయణ వెంకంపేటలో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మహిళా సంఘాలతో కలిసి వచ్చిన భార్య భర్తను, మహిళను చితకబాదింది.

 

13:16 - August 22, 2018

ఉమ్మడి మెదక్‌ : జిల్లాలో ఉన్న ఏకైక సాగునీటి ప్రాజెక్ట్‌ సింగూర్‌ ప్రాజెక్ట్‌. ప్రతి ఏడాది రైతులకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్‌ ఈ సారి రైతులకు కన్నీళ్లను మిగిల్చింది. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్‌లు జలకళ సంతరించుకుంటే.. ఈ ప్రాజెక్ట్‌ మాత్రం నీళ్లు లేక బోసిపోయింది. 
ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం ఉన్న నీరు 7.5 టీఎంసీలు
సింగూర్‌ ప్రాజెక్టు నీరులేక వెలవెలబోతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అన్ని జలాశయాలు నిండుకుండలా మారితే... సింగూర్‌ జలాశయం మాత్రం నీరులేక వెలవెలబోతోంది. 29.9 టీఎంసీ నీటి సామర్థ్యం గల ఈ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం ఏడున్నర టీఎంసీల నీరు మాత్రమే ఉంది.ఎగువనున్న  మహారాష్ట్రలో వర్షాలు పడితే ఈ ప్రాజెక్ట్‌లోకి నీరు వచ్చేది. కానీ మహారాష్ట్రలో వర్షాలు పడకపోవటంతో ప్రాజెక్ట్‌ డెత్‌స్టోరేకి చేరువవుతోంది. 
70 ఎకరాల భూమి బీడువారే పరిస్థితి 
ఇక ప్రాజెక్ట్‌ డెత్‌స్టోరేజికి చేరువవుతుండటంతో ప్రాజెక్ట్‌ కింద భూములున్న రైతన్నల ఆశలు గల్లంతయ్యాయి. ప్రాజెక్ట్‌లో సరిపడ నీరు లేకపోవటంతో ఖరీఫ్‌ నీళ్లు వదలలేమని అధికారులు తేల్చిచెప్పారు. 12 టీఎంసీలకు పైగా నీరు ఉంటేనే సాగునీరు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. వర్షాలు పడినా పడకున్నా.. సాగునీరుకు ఇబ్బంది లేకుండేదని.. కానీ ఈ ఏడాది సాగునీళ్ల కోసం ఇబ్బంది పడాల్సి వస్తోందని ఊహించలేదని రైతులు చెబుతున్నారు. సాగునీరు ఇబ్బందితో 70 ఎకరాలకు పైగా భూమి బీడువారే పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. జూలైలో అధికారులు నీరు విడుదల చేస్తామన్నారు.. కానీ నీళ్లు రాకపోవటంతో విడుదల చేయలేమని అధికారులు చెప్పారని రైతులు తెలిపారు. అధికారులు చెప్పటంతో చాలా వరకు వరినాట్లు వేయలేదని రైతులు అంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రాజెక్ట్‌ కింద ఉన్న రైతుల కోరుతున్నారు. ఇప్పుటికైనా వర్షాలు పడి ప్రాజెక్ట్‌కు నీరు రావాలని.. పంటలు పండాలని రైతులు కోరుకుంటున్నారు. మరి రైతుల ఆవేదన చూసి వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి. 

 

13:09 - August 22, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో వరద ఉధృతితో చోడవరం గ్రామం మునిగిపోయింది.. రెండు రోజులుగా గ్రామస్తులు వరద నీటిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం చోడవరంలో ఉన్న పరిస్థితిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం.. 

 

13:06 - August 22, 2018

ప్రకాశం : వేధింపులుతో పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ వేధింపులు ప్రభుత్వ శాఖల్లో చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనితో పలువురు ఆ వేధింపులు భరించలేక 'ఆత్మహత్యే' శరణ్యం అనుకుంటున్నారు. తాజాగా జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా కొల్లు విష్ణువర్దన్‌ పని చేస్తున్నాడు. బుధవారం తన మిత్రులకు సెల్ఫీ వీడియో పంపించాడు. ఇది చూసిన ఫ్రెండ్స్ హతాశులయ్యారు. సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. సూసైడ్ గల కారణాలను అందులో పేర్కొన్నాడు. గతంలో తెనాలిలో తాను అమ్మిన ఓ స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని వీడియోలో తెలిపాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విష్ణువర్దన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

13:02 - August 22, 2018

గుంటూరు : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనితో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభింస్తోంది. నదుల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ పలువురు విద్యార్థులు ఈతకని వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన తాడేపల్లి తాడేపల్లి మండలం చినరావూరులో చోటు చేసుకుంది....వివరాల్లోకి వెళితే....బక్రీద్ పండుగ సందర్భంగా సెలవు రావడంతో చిర్రావురు గ్రామానికి చెందిన కొంతమంది విద్యార్థులు ఈతకని కృష్ణానదికి వెళ్లారు. అందులో వెళ్లిన నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు వెళ్లినట్లు సమాచారం. అందులో ముగ్గురిని స్థానికులు కాపాడారు. దీనితో సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఇప్పటికైనా విద్యార్థులు నదుల్లోకి వెళ్లవద్దని..పలువురు సూచిస్తున్నారు....

 

కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే రాజీనామ...

హైదరాబాద్ : కాంగ్రెస్ కు మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు రాజీనామా చేయనున్నారు. ఈనెల 24వ తేదీన జనసేన పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 

కాంగ్రెస్ తో పొత్తు చర్చకు రాలేదన్న సోమిరెడ్డి...

విజయవాడ : ప్రధాన మంత్రి మోడీతో జరిగిన 45 నిమిషాల భేటీలో జగన్ ఏం మాట్లాడారని మంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. జగన్ ఇకనైనా పెళ్లిళ్ల మాట పక్కన పెట్టి రాష్ట్రం గురించి ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం చర్చకు రాలేదన్నారు. పొత్తుల చర్చలు ఎన్నికల సమయంలో ఉంటాయని వెల్లడించారు. 

12:59 - August 22, 2018

నెల్లూరు : జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెం మండలం రెడ్డిపాలెంలో విషాదం జరిగింది. కుటుంబకలహాలతో ఇద్దరు చిన్నారులను బావిలోకి తోసి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా తల్లి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. బుచ్చిలోని ఆస్పత్రిలో ప్రస్తుతం తల్లి చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

12:57 - August 22, 2018

కృష్ణా : జిల్లాలో పాముకాటు మృతుల సంఖ్య పెరుగుతోంది. 10 రోజుల వ్యవధిలోనే విషసర్పాల బారిన ఇద్దరు మృతి చెందారు. గన్నవరం మండలం అజ్జంపూడికి చెందిన దొడ్ల సంసోను అనే యువకుడికి పాము కాటేయడంతో ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో పొలంలో పని చేసుకుంటున్న రైతును విష సర్పం కాటేయడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇలా వరుస ఘటనలు జరగడంతో ఇంటి నుండి బయటకు రావాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  

 

రాజమండ్రికి బాబు...

తూర్పుగోదావరి : రాజమండ్రి ఏయిర్ పోర్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. డిప్యూటి సీఎం చిన రాజప్ప ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో బాబు, చిన రాజప్పలు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. 

కరీంనగర్ కు ఎమ్మెల్యే గంగుల...

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ కు బయలుదేరారు. ఆయన సోదరుడు ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనితో ఎమ్మెల్యే గంగుల హైదరాబాద్ నుండి కరీంనగర్ కు బయలుదేరారు. 

12:53 - August 22, 2018

హైదరాబాద్ : న్యూ ఢిల్లీలోని బ్రిటీష్‌ హై కమిషనర్‌ రాజకీయ, మీడియా విభాగాధిపతి కిరణ్‌ డ్రాకె, డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రా ఫ్లెమింగ్‌, రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్‌లు హైదరాబాద్‌లోని ఎంపీ నివాసంలో ఎంపీ కవితను కలిశారు. ఈ సందర్భంగా వారికి కాకతీయ తోరణం, సిద్ధిపేట ప్రాంతానికి చెందిన గొల్లభామ చీరలు, భారతదేశ కోహినూర్‌ వజ్రం-తెలంగాణ అనే పుస్తకాన్ని బహుకరించారు కవిత. అనంతరం తెలంగాణలో అమలవుతోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. నిజామాబాద్‌ దశాబ్దాల కల అయిన పసుపుబోర్డు ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలను ఎంపీ కవిత వివరించారు.

 

దుర్గగుడిలో నూతన వైదిక కమిటీ ఏర్పాటు...

విజయవాడ : దుర్గగుడిలో నూతన వైదిక కమిటీ ఏర్పాటుకు ఈవో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చీర వివాదం, ఇతరత్రా వివాదాల నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కొత్త కమిటీలో శాండిల్యకు చోటు దక్కలేదు. 

12:51 - August 22, 2018

హైదరాబాద్ : నేడు తెలంగాణ మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అవుతోంది. సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం జరుగనుంది. పది రోజులుకూడా కాకుండానే తిరిగి సమావేశం అవుతోంది. దీంతో కేబినెట్‌లో ఏం చర్చిస్తారన్న ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికలు, రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వర్షాలు, వరదలు, పంటనష్టంపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. పాడి గేదెల పంపిణీ, రైతు జీవిత బీమా, కంటి వెలుగుపై చర్చించనున్నట్లు కనిపిస్తోంది. ప్రగతి నివేదన సభ, అభ్యర్థుల ప్రకటనపైనా చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగుల ఐఆర్, పీఆర్సీపైనా చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. 

 

ముంబైలో అగ్నిప్రమాదం...పెరుగుతున్న మృతులు...

ముంబై : దేశ వాణిజ్య కేంద్రమైన ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పారిల్ ఏరియాలోని క్రిస్టల్ టవర్స్ లో మంటలు చెలరేగాయి. 12వ అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. సుమారు 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. 14 మందికి గాయాలయ్యాయి. 

12:25 - August 22, 2018

హైదరాబాద్ : మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం సైరా నర్సింహారెడ్డి టీజర్‌ సోషల్ మీడియాలో హల్‌చల్‌ సృష్టిస్తోంది.  కేవలం 22 గంటల్లోనే 80 లక్షల హిట్స్‌ సాధించి రికార్డు సృష్టిస్తోంది. దీంతో సైరా సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

12:22 - August 22, 2018

విజయవాడ : బక్రీద్‌ పర్వదినం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన నమాజ్‌లో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు బక్రీద్‌ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఒకే వేదికగా ముస్లింలందరూ బక్రీద్‌ వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీలను టీడీపీ ప్రభుత్వం ఆదుకుంటుందని కేశినేని నాని అన్నారు. 

 

జగన్ పై యనమల ధ్వజం...

జగన్ పై యనమల ధ్వజం... వైఎస్ జగన్ పై మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల తరువాత జగన్, ఆయన మీడియా కనిపించవని జోస్యం చెప్పారు. ప్రజల్లో అపోహలు సృష్టించాలనే జగన్ కుట్ర ఫలించదని, బీజేపీ వంచన చేరి టిడిపిపై దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే శక్తి టిడిపికి ఉందన్నారు. నేషనల్ ఫ్రంట్, యునెటైడ్ ఫ్రంట్ ల ఏర్పాటు వెనుక కీలక భూమిక టిడిపిదేనన్నారు. 

సెల్ఫీ సూసైడ్ కలకలం...

ప్రకాశం : జిల్లాలో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగిగా కొల్లు విష్ణువర్ధన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థల విషయంలో రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని వీడియోలో విష్ణువర్ధన్ పేర్కొన్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో విష్ణువర్ధన్ పోలీసులు గాలిస్తున్నారు. 

12:13 - August 22, 2018

హైదరాబాద్ : బక్రీద్‌ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు పహారా కాస్తున్నారు. పాతబస్తీలోని మిరాలం ఇద్గా వద్ద పట్టిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రార్థన స్థలాల వద్ద 250 అదనపు సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. సౌత్‌జోన్‌ పరిధిలో 2000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మిరాలం ఇద్గలో జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనలకు సిపీ హాజరయ్యారు.

11:57 - August 22, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరద ఉధృతి మరింతగా పెరిగింది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది.  రెండో ప్రమాద హెచ్చరికనూ సైతం దాటి ప్రవహిస్తోంది.  ప్రస్తుతం గోదావరిలో 53 అడుగులకు వరద ఉధృతి చేరింది. దీనిపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం...  

ముంబైలో అగ్నిప్రమాదం...ఇద్దరు మృతి...

ముంబై : దేశ వాణిజ్య కేంద్రమైన ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పారిల్ ఏరియాలోని క్రిస్టల్ టవర్స్ లో మంటలు చెలరేగాయి. 12వ అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. సుమారు 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇందులో ఒకరు సీనియర్ సిటిజన్ కాగా, మరొకరు పురుషుడున్నాడు. 

కేరళలో ఊపందుకున్న సహాయక చర్యలు...

కేరళ : వరదలు..వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. సహాయక చర్యల్లో పాల్గొంటున్న బీఎస్ఎఫ్ బృందం రహదారులపై పడిపోయిన భారీ వృక్షాలను తొలగిస్తున్నారు. రోడ్లకు మరమ్మత్తులు చేపడుతున్నారు. 

కామత్ కు సోనియా నివాళి...

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత గురుదాస్ కామత్ పార్థివ దేహానికి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ నివాళులర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురుదాస్ కామత్ బుధవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీనితో ఆసుపత్రికి సోనియా వెళ్లి కామత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. 

పాములు కాటేస్తున్నాయి...పలువురు మృతి...

కృష్ణా : జిల్లాలో పాము కాటు బాధితులు పెరుగుతున్నారు. బాధితుల సంఖ్య 60కి చేరింది. ముగ్గురు మృతి చెందారు. నాగాయలంక, ఆవనగడ్డ, కోడూరు, మోపిదేవి, మొవ్వ, గన్నవరం మండలాల్లో పాము కాటు బాధితులున్నారు. గన్నవరంలో ఇద్దరు, కోడూరులో ఒకరు మృతి చెందారు. 

బాబు ఏరియల్ సర్వే...

రాజమండ్రి : సీఎం చంద్రబాబు నాయుడు గోదావరి ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు డిప్యూటి సీఎం నిమ్మకాయల చినరాజప్ప కూడా ఏరియల్ సర్వేలో పాల్గొననున్నారు. 

10:46 - August 22, 2018

తూర్పుగోదావరి : రాజమండ్రిలోని గోదావరి ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారు. అనంతరం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులతో వరద సాయంపై రివ్యూ చేయనున్నారు. 

 

10:42 - August 22, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహించడంతో నిడదవోలులోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. తిమ్మరాజుపాలెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటసత్తెమ్మ ఆలయం పూర్తిగా నీట మునిగింది. గర్భగుడిలోకి నీరు చేరడంతో ఆలయాన్ని మూసివేశారు. నిడదవోలు - తాడేపల్లి గూడెం రహదారిని మూసివేశారు. రోడ్ కమ్ రైల్వే బిడ్రిలోకి వరద నీరు వచ్చి చేరింది. దీనితో రైల్వే గేటును మూసివేశారు. నిడదవోలు కోటసత్తెమ ఆలయ గర్భగుడిలోకి వరద నీరు చేరింది. గోదావరి వరద ఉధృతి పెరగడంతో కుక్కునూరుర, వేలేరుపాడు మండలాలు, 29గ్రామాలు ముంపుకు గురయ్యాయి. కొత్తూరు కాజ్ వైపై నీరు ప్రవహిస్తోంది. 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ముంపులో యలమంచిలి, ఆచంట మండలంలోని లంక గ్రామాలున్నాయి. ఐదు ఆర్డీవో కార్యాలయాలల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు. యానాంలో టైడల్ లాక్ గేట్లు విరిగిపోయాయి. దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. వరద ఉధృతికి మత్స్యకారుల 5 ఇంజన్ బోట్లు కొట్టుకపోయాయి. గేట్ల మరమ్మత్తులను అధికారులు చేపట్టారు. 

 

10:27 - August 22, 2018

హైదరాబాద్ : పాతబస్తీలో దారుణం జరిగింది. పరువు హత్యకు పాల్పడ్డారు. ప్రియురాలి కుటుంబ సభ్యులు ప్రియుడిపై దాడి చేయడంతో అతను మృతి చెందారు. గౌలిపురకు చెందిన యువతిని రాజేష్ ప్రేమిస్తున్నాడు. అయితే మాట్లాడుకుందామని రాజేష్ ను పిలిచి యువతి కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేశారు. తమ కూతురుని ప్రేమిస్తున్నాడంటూ రాజేష్ పై యువతి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో రాజేష్ ను అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందారు. యువతి తల్లిదండ్రులు, సోదరులపై మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

'ముందస్తు'పై అభిప్రాయాలు తీసుకోనున్న కేసీఆర్...?

హైదరాబాద్ : ముందస్తు యోచనపై నేడు పార్టీ నేతల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అవుతోంది. పది రోజులు కూడా కాకుండానే తిరిగి సమావేశం అవుతోంది. 

ఏఐసీసీ కోశాధికారిగా...

ఢిల్లీ : ఏఐసీసీ కోశాధికారిగా అహమద్ పటేల్ ను నియమితులయ్యారు. 90వయేట పార్టీ ప్రధాన కార్యదర్శిగా మోతీలాల్ ఓరాను బదిలీ చేశారు. గత 18 ఏళ్లుగా ఓరా కోశాధికారిగా ఉన్న సంగతి తెలిసిందే. 

ముంబైలో భారీ అగ్నిప్రమాదం...

ముంబై : దేశ వాణిజ్య కేంద్రమైన ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పారిల్ ఏరియాలోని క్రిస్టల్ టవర్స్ లో మంటలు చెలరేగాయి. 12వ అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. సుమారు 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టవర్స్ లో ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీని గురించి పూర్తి వివరావలు తెలియాల్సి ఉంది. 

కేరళకు తెలంగాణ బియ్యం...

హైదరాబాద్ : కేరళ వరద బాధితుల సహాయార్థం 500 టన్నుల బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపుతోంది. కాసేపటి క్రితం నెక్లెస్ రోడ్డులో బియ్యం లారీలను మంత్రి ఈటెల రాజేందర్ జెండా ఊపి ప్రారంభించారు. 

జమ్మూలో మళ్లీ ఆందోళనలు...

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్రంలో మళ్లీ ఆందోళనలు చెలరేగాయి. శ్రీనగర్, ఆనంతనాగ్, కుల్గామ్ లో పోలీసులపైకి రాళ్లు విసిరారు. పాక్, ఐసీస్ జెండాలను వేర్పాటు వాదులు ప్రదర్శించారు. ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. పోలీసుల వాహనాల అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. 

పిల్లలతో కలిసి బావిలో దూకిన తల్లి...

నెల్లూరు : బుచ్చిరెడ్డిపాలెం (మం) రెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో పిల్లలతో కలిసి ఓ తల్లిబావిలోకి దూకింది. తల్లి అపస్మారక స్థితిలో ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

బక్రీద్..పాతబస్తీలో పోలీసులు...

హైదరాబాద్ : బక్రీద్ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు. ప్రార్థనా స్థలాల వద్ద 250 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సౌత్ జోన్ పరిధిలో 2వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. రెండు ఆర్ఏఎఫ్ బలగాలను అందుబాటులో ఉంచారు. 

ఎర్రకాల్వ ఉధృతి...అతలాకుతలం...

పశ్చిమగోదావరి : ఎర్రకాల్వకు వరద ఉధృతి పెరిగింది. నిడదవోలు - తాడేపల్లి గూడెం రహదారిని మూసివేశారు. రోడ్ కమ్ రైల్వే బిడ్రిలోకి వరద నీరు వచ్చి చేరింది. దీనితో రైల్వే గేటును మూసివేశారు. నిడదవోలు కోటసత్తెమ ఆలయ గర్భగుడిలోకి వరద నీరు చేరింది. గర్భగుడిలోకి నీరు ప్రవేశించడంతో ఆలయాన్ని మూసివేశారు. గోదావరి వరద ఉధృతి పెరగడంతో కుక్కునూరుర, వేలేరుపాడు మండలాలు, 29గ్రామాలు ముంపుకు గురయ్యాయి. కొత్తూరు కాజ్ వైపై నీరు ప్రవహిస్తోంది. 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ముంపులో యలమంచిలి, ఆచంట మండలంలోని లంక గ్రామాలున్నాయి. ఐదు ఆర్డీవో కార్యాలయాలల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.

10:05 - August 22, 2018

కరీంనగర్ : ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు గంగుల ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెందారు. కొత్తపల్లి మండలం రేకుర్తి రోడ్డు పక్కన ప్రభాకర్ మృతదేహాన్ని గుర్తించారు. ఉదయం ప్రభాకర్ వాకింగ్ కు వెళ్లారు. వాకింగ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఆయన గుండెపోటుతో మృతి చెందారు. మొదటగా అనుమానాస్పద మృతిగా పేర్కొనగా.. గుండెపోటుతో మృతి చెందారని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. ప్రభాకర్ కుటుంబం, బంధువులు శోకసంద్రం అయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద ఉధృతి

నల్గొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 76,392, ఔట్ ఫ్లో 9,998 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 551 అడుగులు ఉంది. 
 

వరద గుప్పిట్లోనే కేరళ

తిరువనంతపురం : కేరళ ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో 10లక్షల మంది బాధితులు ఉన్నారు. 3,757 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆర్మీ, ఎన్ డీఆర్ ఎఫ్, కోస్ట్ గార్డ్ సహాయక చర్యల్లో ఉన్నారు.  

 

ఏలూరులో దారుణం

పశ్చిమగోదావరి : జిల్లాలోని ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ కీచక టీచర్‌ను బాధితురాలి బంధువులు నడిరోడ్డుపై నగ్నంగా నడిపించారు. ఏలూరు శర్వాణీ స్కూల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థినిని రాంబాబు అనే టీచర్‌ శారీరకంగా లోబరుచుకున్నాడు. విద్యార్థిని గర్భవతి కావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినికి అబార్షన్‌ కావటానికి టాబ్లెట్స్‌ ఇవ్వటంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని బంధువులు కీచక టీచర్‌ రాంబాబును నడిరోడ్డుపై నగ్నంగా నడిపించుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు రాంబాబును అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. 

కుమురంభీం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేత

అసిఫాబాద్ : కుమురంభీం ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తివేశారు. అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6 వేల క్యూసెక్కులుగా ఉంది. 

08:43 - August 22, 2018

నేడు తెలంగాణ మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అవుతోంది. పది రోజులుకూడా కాకుండానే తిరిగి సమావేశం అవుతోంది. దీంతో కేబినెట్‌లో ఏం చర్చిస్తారన్న ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికలు, రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, కాంగ్రెస్ నేత రామచంద్రమూర్తి, బీజేపీ నేత ఎస్.కుమార్, టీఆర్ ఎస్ నేత పీఎల్ శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. ముందస్తు ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వమే తెరతీసిందన్నారు. కేరళకు ఆర్ధికసాయంపై రాజకీయాలు చేయడం తగదని హితవుపలికారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోదరుడు ప్రభాకర్ అనుమానాస్పద మృతి

కరీంనగర్ : కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పోదరుడు ప్రభాకర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. కొత్తపల్లి మండలం రేకుర్తిలో రోడ్డు పక్కన ప్రభాకర్ మృతదేహాన్ని గుర్తించారు. 

08:36 - August 22, 2018

ఢిల్లీ : భారత్‌; ఇంగ్లండ్‌ మూడో టెస్ట్‌ ఆసక్తికర ముగింపునకు చేరింది. నాలుగోరోజే భారత్‌ గెలిచేందుకు బాగా చేరువైనా... ఆదిల్‌ రషీద్‌ పట్టుదలగా ఆడటంతో మరో రోజు ఆట కొనసాగక తప్పలేదు. 521 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మంగళవారం జరిగిన ఆటలో  ఇంగ్లాండ్‌ 9 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. మరో వికెట్‌ మిగిలి ఉంది. 210 రన్స్‌ చేయాల్సి ఉంది. 

 

08:34 - August 22, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ కీచక టీచర్‌ను బాధితురాలి బంధువులు నడిరోడ్డుపై నగ్నంగా నడిపించారు. ఏలూరు శర్వాణీ స్కూల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థినిని రాంబాబు అనే టీచర్‌ శారీరకంగా లోబరుచుకున్నాడు. విద్యార్థిని గర్భవతి కావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినికి అబార్షన్‌ కావటానికి టాబ్లెట్స్‌ ఇవ్వటంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని బంధువులు కీచక టీచర్‌ రాంబాబును నడిరోడ్డుపై నగ్నంగా నడిపించుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు రాంబాబును అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. 

 

08:32 - August 22, 2018

తెలుగు రాష్ట్రల్లో కురుస్తున్న భారీవర్షాలకు కొన్ని చోట్ల రైతాంగం లబోదిబోమంటుంది. వేసిన నాట్లు కొట్టుకోపోవటం, మొక్కజోన్న, పత్తి పంటలు మునిగిపోవడం, నిల్వ ఉంచిన ధాన్యం వర్షపు నీరుతో తడవటం, ఇలాంటి సమస్యలను..కొన్ని తీవ్ర వర్షభావం పడిన ప్రాంతా రైతులు ఎదురుకుంటున్నారు. అ రైతులను గుర్తించి వారిని అదుకోవాలని రైతుసంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో రైతుసంఘం కేంద్ర కమిటీ సభ్యులు టీ.సాగర్ మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

08:24 - August 22, 2018

ఉత్తరప్రదేశ్‌ : అలహాబాద్‌లోని ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతదేహాలు కలకలం సృష్టించాయి. మృతుల్లో భార్యా, భర్త, ముగ్గురు ఆడ పిల్లలున్నారు. భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా....భార్య శవం ఫ్రిజ్‌లో, అల్మారాలో పెద్ద కూతురు శవం, ఓ పెట్టె, సూటుకేసులో ఇద్దరు కూతుళ్ల శవాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. ధూమన్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన మనోజ్‌ కుశ్వా భార్యా ముగ్గురు కూతుళ్లతో కలిసి ఆ ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం 11 గంటలకు మూసి ఉంచిన తలుపులు అర్థరాత్రి దాటాక కూడా తెరచుకోలేదు. పైగా ఆ ఇంట్లో పెద్ద సౌండ్‌తో మ్యూజిక్‌ రావడంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లేసరికి కుటుంబంలోని ఐదుగురి మృతదేహాలు బయటపడ్డాయి. మనోజ్‌ కుశ్వా భార్యా పిల్లలను చంపి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అలహాబాద్‌ ఎస్‌ఎస్‌పి నితిన్‌ తివారి వెల్లడించారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే మనోజ్‌ కుశ్వా ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. 

 

07:58 - August 22, 2018

అనంతపురం : శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. బాధిత విద్యార్థులు ఢిల్లీ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయటంతో ఈ ర్యాగింగ్‌ భూతం బయటపడింది. ఎంబీఏ విభాగానికి చెందిన చిత్రావతి హాస్టల్లో సీనియర్లు, జూనియర్లను ర్యాగింగ్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ర్యాగింగ్‌కు బాధ్యులను చేస్తూ.. 20 మంది విద్యార్థులను అధికారులు ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. 
ర్యాగింగ్‌కు అడ్డగా చిత్రావతి బ్లాక్‌
నిత్యం వివాదాలు, అవినీతి అక్రమాల సుడిగుండంలో ముందుండే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాయలంలో ర్యాగింగ్‌ భూతం కలకలం రేపింది. ఇప్పటికే వివాదాల్లో కొట్టుమిట్టాడుతున్న యూనివర్శిటీలో ఈ ర్యాగింగ్‌ భూతం సంచలనం సృష్టిస్తోంది. ర్యాగింగ్‌ భాదిత విద్యార్థులు ఢిల్లీలోని నేషనల్ ర్యాగింగ్ కాల్ సెంటర్‌కు ఫోన్‌ చేయటంతో ఈ ర్యాగింగ్‌ భూతం బయటపడింది. విద్యార్థుల ఫిర్యాదుతో ఢిల్లీలోని యాంటీ ర్యాగింగ్ విభాగం రంగంలో దిగింది. యాంటీ ర్యాగింగ్‌ విభాగంతో పాటు జిల్లా ఎస్పీ, యూనివర్శిటీ అధికారులు ర్యాగింగ్‌పై సంయుక్త విచారణ చేపట్టారు. విద్యార్థులు ర్యాగింగ్‌ పాల్పడినట్లు విచారణలో తేలింది. యూనివర్శిటిలోని ఎంబీఏ సీనియర్‌ విద్యార్థులు జూనియర్‌ విద్యార్థులను ర్యాగింగ్‌ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ర్యాగింగ్‌కు అడ్డగా యూనివర్శిటీలోని చిత్రావతి బ్లాక్‌ను ఎంచుకున్నారని గుర్తించారు. రాత్రి భోజనం అనంతరం సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను పిలిచి ర్యాగింగ్‌ చేస్తున్నట్లు విచారణలో తేలింది. దీంతో ర్యాగింగ్‌కు ప్రాథమికంగా 20 మంది విద్యార్థులను బాధ్యులను చేస్తూ.. వారిని హాస్టల్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. విద్యార్థుల సస్పెండ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు అధికారులు తెలిపారు. యూనివర్శిటీలో ఇంతవరకు ర్యాగింగ్‌ జరగలేదని.. ఇదే ప్రధమమని అధికారులు అన్నారు. 
ర్యాగింగ్‌పై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు
ఇక ర్యాగింగ్‌పై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. యూనివర్శిటీ అధికారులు ర్యాగింగ్ పై అవగాహన కల్పించకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. ర్యాగింగ్‌పై అధికారులు ముందే స్పందించి ఉంటే ఇవాళ ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కావంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదని.. పెద్ద ఎత్తున ర్యాగింగ్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఘటనకు కారణమైనా విద్యార్థులను ఏ విధంగా సస్పెండ్‌ చేశారో.. ఘటనకు కారకులైనా అధికారులనూ సస్పెండ్‌ చేయాలనివారు డిమాండ్‌ చేశారు.   
చర్చనీయాంశమైన ర్యాగింగ్‌
మరోవైపు ఈ ర్యాగింగ్‌ అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయమైంది. త్వరలో జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ అంశంపై ఎలా స్పందిస్తారోనని జిల్లా ప్రజలు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. గతంలో సీఎం పర్యటించినప్పడు విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా, మేధావులుగా తీర్చిదిద్దాలని.. సమాజం పట్ల విద్యార్థులు బాధ్యతగా వ్యహరించేలా చూడాలని చంద్రబాబు యూనివర్శిటీ అధికారులను ఆదేశించారు. ఈ సారి జ్జానభేరీ కార్యక్రమానికి సీఎం త్వరలోనే రానున్నారు. అందుకు తగ్గట్లు యూనివర్శిటీ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.  ఇలాంటి తరుణంలో ర్యాగింగ్ వ్యవహారం వెలుగుచూడటం వర్శిటీ అధికారుల పర్యవేక్షణ, పనితీరుకు అద్దంపడుతోంది. మరి సీఎం చంద్రబాబు ఈ అంశంపై ఎలా స్పందిస్తారో.. అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. 

 

07:49 - August 22, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ కీచక టీచర్‌ను బాధితురాలి బంధువులు నడిరోడ్డుపై నగ్నంగా నడిపించారు. ఏలూరు శర్వాణీ స్కూల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థినిని రాంబాబు అనే టీచర్‌ శారీరకంగా లోబరుచుకున్నాడు. విద్యార్థిని గర్భవతి కావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినికి అబార్షన్‌ కావటానికి టాబ్లెట్స్‌ ఇవ్వటంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని బంధువులు కీచక టీచర్‌ రాంబాబును నడిరోడ్డుపై నగ్నంగా నడిపించుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు రాంబాబును అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. 

 

07:35 - August 22, 2018

పెద్దపల్లి : జిల్లాలోని ధర్మారం మండల కేంద్రంలో ఓ మహిళ ఓ వ్యక్తికి చెప్పుతో దేహశుద్ధి చేసింది. కూరగాయల మార్కెట్‌కు వచ్చిన మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన మహిళ అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై చెప్పుతో దాడికి దిగింది.

 

07:31 - August 22, 2018

హైదరాబాద్ : రెండు రోజుల క్రితం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. 24 గంటల్లోనే పోలీసులు బాలుడిని తల్లి ఒడికి చేర్చారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు ఛేదించారు. ఇద్దరు మహిళా కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆయుష్‌తోపాటు మరో ఇద్దరు చిన్నారులనూ పోలీసులు రక్షించారు. బాలుడిని బెగ్గింగ్‌ ముఠాలకు విక్రయించడానికే కిడ్నాప్‌చేసినట్టు మహిళలు అంగీకరించారు.
రెచ్చిపోతున్న చిన్నారుల కిడ్నాప్‌ ముఠాలు
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అంటేనే వేలాది మంది ప్రయాణికులు వస్తుంటారు.. పోతుంటారు. రైళ్లు వచ్చాయంటే చాలు... జనం ఎగబడి మరీ ఎక్కేస్తుంటారు. ఇదే అదనుగా భావించి కొన్ని ముఠాలు చిన్నారులను టార్గెట్‌ చేస్తున్నాయి. ఒంటరిగా ఉన్న చిన్నారులు, తల్లిదండ్రులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, చిన్నారులను పట్టించుకోకున్నా.. చిన్నారులు విడిచి రెండు నిమిషాలు ఏదైనా కొనడానికి వెళ్లినా... ఈ ముఠాలను  పసి పిల్లలను  కిడ్నాప్‌ చేస్తున్నాయి. ఇలాంటి ఉదంతమే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో వెలుగు చూసింది
రెండు రోజుల క్రితం ఆయుష్‌ను కిడ్నాప్‌ చేసిన మహిళలు
రెండు రోజుల క్రితం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నాలుగేళ్ల బాలుడు ఆయుష్‌ కిడ్నాప్‌కు గురయ్యాడు. తల్లి తన పిల్లలకు ఏదైనా ఆహారం తీసుకొద్దామని వెళ్లివచ్చే లోపే.. బాలుడిని కిడ్నాప్‌ముఠా మాయం చేసింది. తన కుమారుడు స్టేషన్‌ మొత్తం వెదికినా కనిపించకపోవడంతో రైల్లే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా బాలుడిని, కిడ్నాప్‌చేసిన వారిని గుర్తించారు. 24 గంటల్లోనే బాలుడిని సురక్షితంగా గోపాలపురం పోలీసులు కన్నతల్లికి అప్పగించారు. 
చాక్లెట్స్‌ ఇస్తామంటూ బాలుడి కిడ్నాప్‌
తల్లిలేని సమయంలో ఇద్దరు మహిళలు ఆయుష్‌కు చాక్లెట్స్‌ ఇస్తామంటూ ఆశచూపి బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌ చుట్టూరా ఉన్న గల్లీలన్నీ తిప్పారు.  ఈ దశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులు రివర్స్‌ ఎంక్వైరీ మొదలు పెట్టారు. అసలు కిడ్నాపర్‌లు ఎక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కు వచ్చారో క్యూ లాగారు. చివరికి సుచిత్ర నుంచి వచ్చిన బస్సులో దిగినట్టు దశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు డ్రైవర్‌ను, కండక్టర్‌ను విచారణ చేయగా.. వారు సుచిత్ర దగ్గర బస్సులోఎక్కారని.. తమది అంబేద్కర్‌ కాలనీగా చెప్పినట్టు పోలీసులకు వివరించారు. బస్సులో టికెట్‌ తీసుకోవడానికి ఇద్దరు మహిళలు గొడవ పడ్డట్టు డ్రైవర్‌ పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు అంబేద్కర్‌ కాలనీలో రహస్యంగా తనిఖీలు నిర్వహించగా.. ఇద్దరు మహిళలు దొరికారు. వారితోపాటు కిడ్నాప్‌కు గురైన ఆయుష్‌.. అంతుకు ముందు కిడ్నాప్‌ చేసిన మరో ఇద్దరిని పోలీసులు కాపాడారు. బాలుడిని విక్రయించడానికే కిడ్నాప్‌ చేసినట్టు నిందితులైన మహిళలు అంగీకరించారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. 

 

07:27 - August 22, 2018

హైదరాబాద్ : ముస్లింలు ఇవాళ బక్రీద్‌ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు గవర్నర్‌ నరసింహన్‌ , తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ వారికి శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ పండుగ త్యాగనిరతికి, భక్తికి నిదర్శనమన్నారు. కష్టసుఖాలను పంచుకుని పేదలపట్ల దయార్థ హృదయంలో ఉండాలని పండుగ చాటిచెబుతోందన్నారు.  ఓపిక, ఇతరులపట్ల సహనం, తోటి వ్యక్తులను ఆదుకునే త్యాగానికి బక్రీద్‌ ప్రతీక అని కొనియాడారు. ముస్లింలంతా ఆనందోత్సాహాల మధ్య బక్రీద్‌ను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. 

 

07:23 - August 22, 2018

గుంటూరు : రాయలసీమకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. జలాశయాల్లోకి నీరు చేరిన నేపథ్యంలో రాయసీమలోని  కాల్వలకు నీరు ఇవ్వాలని చెప్పారు. తుంగభద్ర ఎగువ కాల్వ పనులను ప్రస్తుతానికి నిలిపివేసి సాగునీరు విడుదల చేయాలని కోరారు. హంద్రీ-నీవాతోపాటు కేసీ కెనాల్‌కు కూడా సాగునీరు ఇవ్వాలని శాఖాధిపతులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఆదేశించారు. 
ప్రభుత్వ శాఖల విభాగాధిపతులతో సీఎం చంద్రబాబు భేటీ 
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ శాఖల విభాగాధిపతులతో భేటీ అయ్యారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. వరదలతో జరిగిన పంటనష్టం,  సహాయ కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. పంటలసాగుపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో సంతృప్తి ఎలా ఉందన్న అంశంపై  అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. పౌరసరఫరాలు సహా కొన్ని శాఖల్లో ప్రజల సంతృప్తి ఆశించిన మేరకు లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. 
నీటి వివరాలపై చంద్రబాబు సమీక్ష  
రాష్ట్రంలోని జలాశయాల్లోకి చేరిన నీటి వివరాలపై చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం 961.58 టీఎంసీలు. ఇంతవరకు 515.41 టీఎంసీ నీరు రిజర్వాయర్లలోకి చేరింది. ఇంకా 446 టీఎంసీ నీరు చేరితేకానీ  ప్రాజెక్టులు పూర్తిగా నిండవు. శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండాలంటే ఇంకా 13 టీఎంసీ నీరు రావాలి. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ నిండేందుకు ఇంకా 103 టీఎంసీ నీరు చేరాల్సి ఉంటుంది. పులిచింతల ప్రాజెక్టులో 41 టీఎంసీల నీరు చేరాల్సి ఉంది. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, వర్షపు నీటి సంరక్షణ చర్యల ద్వారా 420 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని చెప్పిన చంద్రబాబు... తుంగభద్ర ఎగువ కాల్వ, కేసీ కాల్వ, హంద్రీ-నీవా కాల్వలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి ముఖ్యమంత్రి ఆదేశించారు. 
కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టాలి : సీఎం చంద్రబాబు 
మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు రాబట్టేందుకు అన్ని శాఖాధిపతులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన చంద్రబాబు... గ్రామదర్శిని కార్యక్రమంలో వచ్చిన  ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖలు కంప్యూటరీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. విద్యాశాఖ, ఎన్టీఆర్‌ గృహ నిర్మాణం, చంద్రన్న బీమా పథకాల అమలుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 

07:17 - August 22, 2018

హైదరాబాద్ : నేడు తెలంగాణ మంత్రివర్గం అత్యవసరంగా భేటీ అవుతోంది. పది రోజులుకూడా కాకుండానే తిరిగి సమావేశం అవుతోంది. దీంతో కేబినెట్‌లో ఏం చర్చిస్తారన్న ఆసక్తి నెలకొంది. ముందస్తు ఎన్నికలు, రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పది రోజుల్లో రెండోసారి కేబినెట్‌ భేటీ
తెలంగాణ మంత్రివర్గ సమావేశం నెలల తరబడి జరగని రోజులు చాలానే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం పది రోజుల వ్యవధిలోనే కేబినెట్‌ రెండో సారి భేటీ అవుతుంది.  ఈనెల 13నే కేబినెట్‌ సమావేశం అయ్యింది. అంతలోనే మళ్లీ ఇవాళ సమావేశం అవుతుంది. సాధారణంగా కేబినెట్‌ భేటీపై మంత్రులకు అధికారికంగా అజెండా, సమాచారం ఇస్తారు. కానీ ఇవాళ జరిగే కేబినెట్‌ భేటీకి అలాంటిదేమీ ఇవ్వలేదు. ఎజెండా ఏంటో కూడా మంత్రులకు తెలియదు. కానీ మంత్రులంతా  అందుబాటులో ఉండాలని సమాచారం మాత్రం వెళ్లింది. దీంతో ఈ అనధికారిక, ఆకస్మిక కేబినెట్‌ భేటీ ఎందుకు , ఏమిటనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
అప్రమత్తమైన పలువురు మంత్రులు
వాస్తవానికి ఇవాళ బక్రీద్‌ ఉండడంతో తమ జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రులు ముందే పర్యటన ఖరారు చేసుకున్నారు. కానీ సీఎం పేషీ నుంచి అందిన అత్యవసర ఆదేశాలతో పలువురు మంత్రులు అప్రమత్తమయ్యారు.  హైదరాబాద్‌లోనే ఉన్న దూర ప్రాంతాల మంత్రులు జిల్లా పర్యటనలను రద్దుచేసుకున్నారు.  హైదరాబాద్‌ సమీప జిల్లాల మంత్రులు మాత్రం ఇవాళ నియోజకవర్గాలకు వెళ్లినా... సాయంత్రానికి తిరిగి వచ్చేలా షెడ్యూల్‌ను కుదించుకున్నారు. 
ముందస్తు ఎన్నికలు, రాజకీయ పరిణామాలపైనే ప్రధాన చర్చ
కేసీఆర్‌ ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సహచరులతో సమావేశం కానున్నారు.  సీఎం అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ముందస్తు ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ భేటీలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టం, దెబ్బతిన్న రోడ్లు, గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె, సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పాడి గేదెల పంపిణీ, రైతు జీవిత బీమా, కంటి వెలుగు కార్యక్రమంపై చర్చించనున్నారు. అంతేకాదు.. ఉద్యోగుల మధ్యంతర భృతి, పీఆర్సీపైనా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. ప్రగతి నివేదన సభ, అభ్యర్థుల ప్రకటనపైనా ఈ భేటీలో చర్చ జరగవచ్చని భావిస్తున్నారు.

 

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50అడుగులు

భద్రాద్రి : గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం గోదావరి వద్ద నీటిమట్టం 50 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

ఆసియా క్రీడల్లో నేటి మ్యాచులు

ఢిల్లీ : ఆసియా క్రీడల్లో నేడు హాకీ (పురుషులు) మధ్యాహ్నం 12.30 భారత్, హాంకాంగ్ తలపడనున్నాయి. జిమ్నాస్టిక్ మహిళల టీమ్ ఫైనల్ లో సాయంత్రం 5 గంటలకు ఆర్చరీ (మహిళల కాంపౌండ్ ) జ్యోతి సురేఖ, త్రిష, మధుమిత, ముస్కాన్ ఉదయం 8 నుంచి ఆర్చరీ (పురుషుల కాంపౌండ్) సంగ్రామ్, అభిషేక్, రజిత్. 

నేడు మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

హైదరాబాద్ : నేడు మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రగతి నివేదన సభ, రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 

 

నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

అమరావతి : నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. 

 

నేడు హైదరాబాద్ కు వాజ్ పేయి చితాభస్మం

హైదరాబాద్ : నేడు హైదరాబాద్ కు వాజ్ పేయి చితాభస్మం తీసుకురానున్నారు. ఈనెల 23న గోదావరి, మూసీలో కలిపేందుకు ఏర్పాట్లు చేశారు. 

 

Don't Miss