Activities calendar

23 August 2018

21:27 - August 23, 2018

విశాఖపట్నం : ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీలో జరిగిన జ్ఞానభేరి సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం 147 జయంతి సందర్భంగా ఆ మహానీయునికి చంద్రబాబు నివాళులర్పించారు. జ్ఞానభేరి సదస్సులో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కళా ప్రదర్శలను తిలకించారు. జీవిత లక్ష్యాలపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, వారి అభిప్రాయాలు తెలుసుకున్న చంద్రబాబు.. ప్రతి ఒక్కరూ ఒక్కో శాస్త్రవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. కేంద్రం సహకరించకపోయినా స్వశక్తితో ముందుకుసాగుతామని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి వృథాగా సముద్రంలోకి పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకుని ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలని విశాఖలో జరిగిన జ్ఞానభేరి సదస్సులో చంద్రబాబు ఆకాంక్షించారు.

విభజనతో ఏపీకి జరిగిన నష్ట్రాన్ని జ్ఞానభేరి సదస్సులో చంద్రబాబు వివరించారు. ఆదాయం తెలంగాణకు వెళ్లి, అప్పులు ఏపీకి రావడంతో తలెత్తిన ఇబ్బందులను ప్రస్తావించారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో ఏపీ వెనుకబడి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. విభజన ఇబ్బందులను అధిగమించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ పాటిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని మరో 11 యూనివర్సిటీల్లో జ్ఞానభేరి సదస్సులు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఏపీని విజ్ఞానఖనిగా మార్చి నూతన ఆవిష్కరణలకు చిరునామాగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

21:07 - August 23, 2018

అనంతపురం : సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. మరోపక్క మానవ విలువలు, మానవ సంబంధాలు అడుగంటిపోతున్నాయి. వావి వరుసలు మరచిపోయి పశువుల్లా ప్రవర్తిస్తున్న సందర్భాలు సమాజంలో వెలుగు చూస్తున్నాయి. కన్న కుమార్తెలపై..స్వంత అక్క చెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడి కామాంధులు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నతల్లిలా భావించాల్సిన వదినపై మరిది అత్యాచారానికి యత్నించాడు. దీంతో షాక్ తిన్న ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ విషయం బైటకు చెబుతుందనే భయంతో వదిన గొంతు కోసాడు. ఆపై తాను కూడా మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా వుండటంతో స్థానికి ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటన ఆదర్శనగర్ లో చోటుచేసుకుంది.

20:49 - August 23, 2018

హైదరాబాద్ : కొన్ని నెల‌లుగా కంటి స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఈరోజు మ‌రోసారి శస్త్ర చికిత్స జ‌రిగింది. హైద‌రాబాద్ లోని బంజారాహిల్స్ లోని ‘సెంట‌ర్ ఫ‌ర్ ఐ’ కంటి ఆస్ప‌త్రిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కంటికి శస్త్ర చికిత్స నిర్వహించినట్టు జనసేన మీడియా హెడ్ పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. పవన్ కల్యాణ్ కు డాక్ట‌ర్ సంతోష్ జి.హోనావ‌ర్ ఈ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారని, డాక్ట‌ర్ జి.వి.ఎస్.ప్ర‌సాద్ ప‌ర్య‌వేక్షించారని తెలిపారు. గ‌త‌ నాలుగు నెలలుగా కంటి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న పవన్ కల్యాణ్ కు నెల రోజుల కింద‌ట ఓ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారని, అయితే త‌గినంత విశ్రాంతి తీసుకోక‌పోవ‌డంతో కంటికి ఇన్ఫెక్షన్ సోకిందని అన్నారు. దీంతో, పవన్ కు మ‌రోసారి ఆప‌రేష‌న్ నిర్వహించారని, త‌గినంత విశ్రాంతి తీసుకోవాల‌ని ఆయనకు వైద్యులు సూచించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

పవన్ కు రెండవసారి కంటి ఆపరేషన్..

హైదరాబాద్ : కొన్ని నెల‌లుగా కంటి స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఈరోజు మ‌రోసారి శస్త్ర చికిత్స జ‌రిగింది. హైద‌రాబాద్ లోని బంజారాహిల్స్ లోని ‘సెంట‌ర్ ఫ‌ర్ సైట్’ కంటి ఆస్ప‌త్రిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కంటికి శస్త్ర చికిత్స నిర్వహించినట్టు జనసేన మీడియా హెడ్ పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. పవన్ కల్యాణ్ కు డాక్ట‌ర్ సంతోష్ జి.హోనావ‌ర్ ఈ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారని, డాక్ట‌ర్ జి.వి.ఎస్.ప్ర‌సాద్ ప‌ర్య‌వేక్షించారని తెలిపారు.

గవర్నర్ తో కేసీఆర్ భేటీ..ఆసక్తిగా మారిన భేటీ..

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ని తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈరోజు సాయంత్రం రాజ్ భవన్ లో నరసింహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీ-మంత్రులతో నిన్న జరిగిన సమావేశం, ముందస్తు ఎన్నికలు, వచ్చే నెల 2న ప్రగతి నివేదన సభ, రైతుబీమా,కంటి వెలుగు పథకాలు, శాసనసభా నిర్వహణ తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ఢిల్లీలో ముఖ్యనేతలను టీఆర్ఎస్ నేతలు కలిసి ముందస్తు ఎన్నికలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. కాగా వారు తిరిగి వచ్చిన కొద్ది సేపటికే గవర్నర్ ని కలిసేందుకు కేసీఆర్ వెళ్లడం గమనార్హం.

20:44 - August 23, 2018

హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ని తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈరోజు సాయంత్రం రాజ్ భవన్ లో నరసింహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీ-మంత్రులతో నిన్న జరిగిన సమావేశం, ముందస్తు ఎన్నికలు, వచ్చే నెల 2న ప్రగతి నివేదన సభ, ‘రైతుబీమా’,‘కంటి వెలుగు’ పథకాలు, శాసనసభా నిర్వహణ తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.  కాగా, ఈరోజు ఉదయం మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ముఖ్యనేతలను కలిసిన కేటీఆర్ వెంటనే తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. కేటీఆర్ తిరిగొచ్చిన కొద్ది సేపటికే గవర్నర్ ని కలిసేందుకు కేసీఆర్ వెళ్లడం గమనార్హం. కాగా, టీ-మంత్రులతో కేసీఆర్ నిన్న అత్యవసర సమావేశం నిర్వహించారు. ముందస్తు ఎన్నికలపై తమ నేతల అభిప్రాయాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ నరసింహన్  తో  కేసీఆర్ భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.

19:42 - August 23, 2018

2019 ఎన్నికల వేడి రాజుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో విభజన హామీల అమలు..రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్న టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కానీ ఏపీ విషయంలో బీజేపీ అవలంభించిన తీరును సవాల్ చేస్తు ఎన్డీయే ప్రభుత్వం నుండి టీడీపీ విడిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర విభజనకు కారణం కాబట్టి ఏపీని అభివృద్ధి చేసేందుకు..విభజన హామీలు కాంగ్రెస్ తోనే సాధ్యం అని కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు..రాష్ట్ర విభజన తరువాత ఏపీలోనే కాక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో మళ్లీ తిరిగి పార్టీని నిలబెట్టేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ నెరవేరుస్తామని పదే పదే కాంగ్రెస్ చెబుతోంది. అలాగే ఎన్డీయే ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసానాకి కాంగ్రెస్ మద్ధతునిచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ కాంగ్రెస్ తో 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు ఇటీవల హల్ చల్ చేస్తున్నాయి. కానీ ఆయా పార్టీల అధిష్టానం మాత్రం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. మరి ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది? ఎవరి దారెటు? అనే అంశంపై 10టీవీ చర్చా కార్యక్రమం. ఈ చర్చలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు రఘునాథ బాబు, టీడీపీ శాసన సభ్యులు రామకృష్ణ, జీవీ రెడ్డి పాల్గొన్నారు. 

19:05 - August 23, 2018

విజయవాడ : ఏపీలో పునర్‌వైభవం కోసం కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌తోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి అన్నారు. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ను ప్రజలు కోరుకుంటున్నారంటున్న రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తులు పెట్టుకోం-రఘువీరారెడ్డి స్పష్టం చేశారు.సెప్టెంబర్‌ 18న కర్నూల్‌లో రాహుల్‌ గాంధీ పర్యటించనున్నారని రఘువీరా తెలిపారు. 

19:01 - August 23, 2018

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌ విభజన అశాస్త్రీయంగా జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఆదాయం తెలంగాణకు వెళితే, అప్పులు ఏపీకి వచ్చాయని విశాఖపట్నంలో జరిగి జ్ఞానభేరి సదస్సులో చెప్పారు. దీంతో తలసరి ఆదాయంలో వెనుకబడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులు వినూత్న ఆలోచనా విధానాలతో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇచ్చారు. తరగతిగదిలో చదివే చదువును క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలని కోరారు. విశాఖపట్నం ఆంధ్రాయూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీలో నిర్వహించిన జ్ఞానభేరిలో చంద్రబాబు ప్రసంగించారు. విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరైన ఈ సభలో చంద్రబాబు... విద్యార్థులు ప్రతి అంశాన్ని సృజనాత్మకంగా ఆలోచించాలని కోరారు. 

17:54 - August 23, 2018

హైదరాబాద్ : రైతు బీమా, కంటి వెలుగు, స్వచ్చ తెలంగాణ పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన వాణిజ్య ప్రకటనల్లో ఫోటో మార్పిడి వ్యవహారం వివాదాస్పదమవుతోంది. లోన్లు ఇప్పిస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లికి చెందిన పద్మ, నాగరాజు ఫోటోలను అధికారులు తీసుకున్నారు. భూమి లేకపోయినా రైతు భీమా పథకం వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు పత్రికలకు ఇచ్చిన వాణిజ్య ప్రకటనల్లో పద్మ, నాగరాజు ఫోటోలను ప్రచురించారు. ఆంగ్ల పత్రికల వాణిజ్య ప్రకటనల్లో పద్మ ఫోటో పక్కన వేరే వ్యక్తి ఫోటో పెట్టారు. దీంతో తమ కుటుంబం పరువు పోయిందని పద్మ, నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ వీరు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను కలిశారు. ఫోటో మార్పిడి కేసులో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. 

17:38 - August 23, 2018

నెల్లూరు : విశాలమైన భవన సముదాయాలు, కోట్ల రూపాయల విలువ చేసే ఆధునిక పరికరాలు నెల్లూరు జిల్లాకేంద్రంలోని జీజీహెచ్‌ సొంతం. కార్పొరేట్ ఆసుపత్రికి ఏమాత్రం తీసిపోని ఇన్ ఫ్రాస్టెక్చర్ అక్కడున్నా.. రోగులకు మాత్రం అవస్థలు తప్పడంలేదు. ఓ ఎమ్మెల్యే ఏకంగా ఆందోళనకు దిగినా పరిస్థితిలో మార్పురాలేదు.

నెల్లూరులోని ప్రభుత్వ బోధనాసుపత్రిలో అవస్థలు
అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది నెల్లూరులోని ప్రభుత్వ బోధనాసుపత్రి పరిస్థితి. దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో.. 4వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి నిర్మించిన విశాల భవన సముదాయాలు. కోట్ల విలువ చేసే ఆధునిక యంత్ర పరికరాలు ఈ ఆసుపత్రి సొంతం. ఎలాంటి జబ్బులనైనా నిర్ధారించేందుకు అవసరమైన ల్యాబ్‌లు, మిషనరీలు అందుబాటులో ఉంటాయి. అన్నీ ఉన్నా.. వాటిని ఆపరేట్ చేసే టెక్నిషియన్స్ లేకపోవడంతో రోగులు అవస్థపడుతున్నారు. దీనికి తోడు ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యం రోగుల పాలిట శాపంగా మారుతోంది.

గతఏడాది మరో కాన్పుల విభాగాల ఆసుపత్రి విలీనం
గతేడాది జీజీహెచ్‌లో మరో కాన్పుల విభాగాల ఆసుపత్రిని ఇందులో కలిపేశారు. దాదాపు వందకుపైగా గదులు, అదేస్తాయిలో వైద్యసిబ్బందిని నియమించింది ప్రభుత్వం. కానీ గత కొన్ని రోజులుగా ఇక్కడ నిరుపేద గర్భిణీలు, బాలింతలు నరకం చూస్తున్నారు. ప్రత్యేకించి రేడియాలజీ విభాగంలో వైద్యుల కొరత రోగులను వేధిస్తోంది.

కలెక్టర్ వార్నింగ్ ఇచ్చినా మారని పరిస్థితి
దాదాపు 1500 మందికి పైగా స్టాఫ్‌, 150 మంది వైద్యులు, ప్రొఫెసర్లు, అసోసియేట్లు.. వెరసి మూడువేల మంది వరకు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఏ ఒక్కరూ చిత్తశుద్ధితో రోగులకు చికిత్స చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు వైద్యులు లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నా.. ప్రైవేట్ ప్రాక్టీస్‌ వైపే మొగ్గు చూపుతున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సాక్ష్యాత్తూ.. జిల్లా కలెక్టర్ వార్నింగ్ ఇచ్చినా మార్పు లేదు.జిల్లా కలెక్టర్‌తో పాటు.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసుపత్రిని పరిశీలించి.. ఆగ్రహం వ్యక్తం చేసినా పరిస్థితిలో మార్పులేదు. రోగాలతో ఆసుపత్రికి వస్తే... మానసికంగా కుంగదీస్త్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

 

17:34 - August 23, 2018

హైదరాబాద్ : ఎన్నికల హామీల అమల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలంగాణ టీడీపీ ఆరోపించింది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం నుంచి రైతు రుణమాఫీ వరకు అన్ని వైఫల్యాలేనని టీ టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. వచ్చే నెల 2న కొంగరకలాన్‌ సభలో టీఆర్‌ఎస్‌ విడుదల చేసే ప్రగతి నివేదిక కంటే ముందే ప్రజల నివేదిక విడుదల చేయాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. ప్రజల నివేదికలో టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగడతామని రావుల చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.

17:30 - August 23, 2018

అమరావతి : ఏపీ ప్రభుత్వ పీడీ అకౌంట్లపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేయడాన్ని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తప్పుపట్టారు. ప్రభుత్వ నిర్వహణలో పీడీ అకౌంట్లు ఒక భాగమని, ఇది అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉండే విధానమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా నిధులు ఖర్చు చేస్తోందని... పీడీ అకౌంట్లపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేన్నారు. 

17:14 - August 23, 2018

విజయవాడ : సెప్టెంబర్ 18 నుండి ఏపీలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని దీని నిమిత్తం కర్నూల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని రఘువీరా తెలిపారు. 2019 ఎన్నికలను దృష్టి పెట్టుకున్న ఏపీ కాంగ్రెస్ రాష్ట్రంలో పార్టీకి పునరజ్జీవం కల్పించాలనే ఉద్ధేశ్యంతో రాహుల్ గాంధీ పర్యటనను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పూర్తిగా కాంగ్రెస్ ఛాయలు ఏపీలో కనుమరుగైపోయిన విషయం తెలిసిదే. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల రీతా కాంగ్రెస్ కు పున:ప్రతిష్టకు కాంగ్రెస్ నానా తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షడు రాహుల్ గాంధీ పర్యటన ద్వారా తిరిగి నమ్మకాన్ని పెంచుకునేందుకు ఏపీలో నెలకు ఒకసారి ఏపీలో పర్యటించేలా ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా తెలంగాణలో కూడా రాహుల్ నెలకు ఒకసారి పర్యట నేపథ్యంలో ఇటీవల మూడు రోజుల పాటు తెలంగాణలో రాహుల్ పర్యటించిన విషయం తెలిసిందే.

కేరళ వరద బాధితులకు 1000 ఇళ్లు
కేరళ వరద బాధితులకు పీసీసీ సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ ద్వారా ఏపీ పీసీసీ కేరళ వరద బాధితులకు సహాయం నిధిని పంపిస్తున్నామని పీసీసీ చీఫ్ రఘువీరా తెలిపారు. కేరళలో వరద వల్ల ఇళ్లు కోల్పోయినవారికి 1000 ఇళ్లు నిర్మిస్తామని కేరళ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందని దీని నిమిత్తం ఏపీ పీసీసీ విరాళాలు సేకరించి పంపిస్తున్నామని రఘువీరా తెలిపారు. 

'ముందస్తు' లేదన్న వేణుగోపాల చారి...

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి వెల్లడించారు. వివిధ పనుల నిమిత్తం హస్తినలో ఉన్నతాధికారులను కలవడం జరుగుతుందని, ఈసీని రాజీవ్ శర్మ కలవడం జరిగిన తరువాత ముందస్తు ఎన్నికలపై వార్తలు వస్తున్నాయన్నారు. కానీ ముందస్తు ఎన్నికలు జరిగినా, తరువాత జరిగినా టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. 

కొత్తపల్లి గీత కొత్త పార్టీ..

విశాఖపట్నం : కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రకటించారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 11.30 గంటలకు పార్టీని లాంచ్ చేస్తున్నామని ఆమె తెలిపారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్టు చెప్పారు.

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు...

హైదరాబాద్ : తెలంగాణలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ కావడం...కేంద్ర ఎన్నికల కమిషన్ ను రాజీవ్ శర్మ..ఉన్నతాధికారులు కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికలపై శర్మ ఆరా తీసినట్లు సమాచారం. ముందస్తు ఉండదని మంత్రులకు కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

17:05 - August 23, 2018

విశాఖపట్నం : ఏయూ జ్నానభేరి సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..దేశంలోనే మెరుగైన ర్యాంక్స్ లో ఏయూ వర్శిటీ కాలేజ్ లున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో టాప్ వర్శిటీల్లో ఏయూ వుండాలని..మరింత కాలంలో నెంబర్ వన్ వర్శిటీగా ఏయూ పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దీనికి విద్యార్ధుల చేతిలోనే వుందని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతీ విద్యార్థికి ఒక విజన్ వుండాలని సూచించారు. ప్రతి విద్యార్థి టెక్నాలజీని మెరుగు పరుచుకోవాలన్నారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ వృద్ధి చెందింది అంటే ఐటీ టెక్నాలజీతోనే సాధ్యమైందని దీనికోసం 2020 విజన్ తోనే అది సాధ్యమైందని..అందుకే ప్రతి విద్యార్థి ఓ విజన్ ను టార్గెట్ చేసుకోవాలని సూచించారు. ప్రపంచాన్ని సాసించే శక్తి యువతకు వుందనీ..ప్రపంచంలో ఏ దేశానికి లేని యువ శక్తి భారత్ సొంతమని టెక్నాలజీలోను తెలుగు యువత ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోందన్నారు.

యువతకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు విద్య : చంద్రబాబు
విద్యార్ధులకు కావాల్సిన అన్ని వసతుల్ని, వనరుల్ని అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఏయూ జ్నానభేరి సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. నేటి యువతకు పెద్దవారు ఇవ్వాల్సింది ఆస్తి పాస్తులు కాదనీ..చక్కటి చదవును. సంస్కారాలను ఇవ్వాలన్నారు. ఏపీలో ప్రతీ విద్యార్థిని, విద్యార్ధుల ఉన్నత భవితకు ప్రభుత్వం అండగా వుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

టఫేకు పూర్తి సహకారం - లోకేష్...

విజయవాడ : టఫే ట్రాక్టర్ల కంపెనీ సీవోవో టీఆర్ కేశవన్, కంపెనీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. టఫేకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని, జేపార్క్ లెర్నింగ్ సెంటర్ల ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. 13 జిల్లాలో జే ఫార్మ్ యాప్ అమలుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. 

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు భర్తీ...

హైదరాబాద్ : 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. శాఖపరమైన కమిటీతో భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

కేంద్ర ఎన్నికల కమిషన్ తో రాజీవ్ శర్మ భేటీ...

ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్ ను రాజీవ్ శర్మ కలిశారు. ముందస్తు ఎన్నికల అవకాశాలపై శర్మ ఆరా తీశారు. కేంద్ర ఎన్నికల సంఘం భేటీలో రాజీవ్ శర్మతోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కేఎం సహాని కూడా పాల్గొన్నట్లు సమాచారం. 

గవర్నర్ తో కేసీఆర్...

హైదరాబాద్ : రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అక్కడ ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 

మిషన్ 2019 - రఘువీరా...

విజయవాడ : మిషన్ 2019లో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ రావాలని, ఇందుకు కృషి జరుగుతోందని ఏపీ పిసిసి చీఫ్ రఘువీరా తెలిపారు. తమపైనున్న అపోహాలు తొలగిపోవడం జరిగిందని, ప్రస్తుతం రాహుల్ గాంధీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 49వేల బూత్ స్థాయి నిర్మాణం, ప్రతి ఇంటికి కాంగ్రెస్ వెళ్లడం తదితర కార్యక్రమాలుంటాయన్నారు. ఆయా నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున్న సభలు..సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సభలకు రాహుల్ వస్తారని, కర్నూలులో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 

కేరళకు ఏపీ పిసిసి సాయం - రఘువీరా...

విజయవాడ : కేరళ రాష్ట్రానికి ఏపీ కాంగ్రెస్ నేతలు స్వయంగా విరాళాలను ఉదారంగా ప్రకటిస్తున్నారని ఏపి పిసిసి చీప్ రఘువీరా తెలిపారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు. ఈ డబ్బులను పోగు చేసి కేరళ రాష్ట్రానికి పంపిస్తామన్నారు. నివాసాలు కోల్పోయిన వారికి ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున నిర్మాణం చేయాలని ఏఐసీసీ నిర్ణయించిందని ఇందుకు ఏపి పిసిసి సహాయం చేస్తుందన్నారు. 

సీఎం ప్రత్యేక కార్యదర్శితో ఎంపీ కవిత...

హైదరాబాద్ : సీఎం ప్రత్యేక కార్యదర్శి నర్సింగ్ రావుతో ఎంపీ కవిత భేటీ అయ్యారు. సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ప్రకటించిన 27 శాతం లాభాలపై చర్చించారు. 

16:15 - August 23, 2018

విజయవాడ : కాంగ్రెస్ సమన్వయం కమిటీ సమావేశం రసాభాసగా మారి ఉద్రిక్తంగా మారింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ ఉమెన్ చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఎదుటే శివాచారి ఆత్మహత్యకు యత్నించాడు. ఎంతోకాలం నుండి కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తున్న తనకు పార్టీ టిక్కెట్ ఇవ్వకుండా వేరే వారికి ప్రాధాన్యతనిస్తున్నారనే మనస్తాపంతో శివచారి తాను తెచ్చుకున్న పురుగులు మందు తాగేందుకు యత్నించారు. దీంతో ఆక్కడ వున్నవారు వెంటనే స్పందించి వారించారు.

దీంతో ఉమెన్ చాందీ జోక్యం చేసుకుని శివాచారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సంతృప్తి చెందిన శివాచారి తనకు టిక్కెట్ ఇవ్వకుంటే ఆత్మహత్యకు వెనుకాడనని తేల్చి చెప్పారు. నెల్లూరు జిల్లా రూరల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న శివాచారి సొంత నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలనుకుంటే కొందరు కావాలని చెడగొడుతు..తనను అభాసుపాలు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇప్పిస్తానని నమ్మించి నెల్లూరుకు చెందిన కాంగ్రెస్ నేత పనబాక కృష్ణయ్య తన వద్ద రూ.50 లక్షలు తీసుకున్నారనీ..ఇప్పుడు తనకు ప్రాధాన్యతనివ్వకుండా వేరేవారికి ప్రాధాన్యతనిస్తున్నారని మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించగా ఉమెన్ చాందీ అధిష్టానంతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో శివారెడ్డి సంతృప్తి చెందారు. 

15:52 - August 23, 2018

ఢిల్లీ : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ మూడు నెలల విరామం తర్వాత ఇవాళ తిరిగి తన శాఖ బాధ్యతలను చేపట్టారు. కిడ్నీ శస్త్ర చికిత్స కారణంగా ఆయన 3 నెలల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అరుణ్‌జైట్లీ మే 14న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి కోవింద్‌.. అరుణ్ జైట్లీకి ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖలను అప్పగించారు. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఇవాళ విడుదల చేశారు. జైట్లీ స్థానంలో మూడు నెలల పాటు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అదనంగా ఆర్థిక శాఖ బాధ్యతలను చూసిన విషయం తెలిసిందే.

15:49 - August 23, 2018

జమ్మూకశ్మీర్ : నూతన గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్‌ఎన్‌ వోరా స్థానంలో గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌ను కేంద్రం నియమించింది. ఇంతకు ముందు ఆయన బీహార్‌ గవర్నర్‌గా పనిచేశారు. ఎన్‌ఎన్‌ వోహ్రా గవర్నర్‌గా జమ్ముకశ్మీర్‌కు 10 ఏళ్ల పాటు సేవలందించారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్‌లో పీడీపీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. కాగా బీజేపీ,పీడీపీ పార్టీలు కలిసి సంకీర్ణ కూటమితో ఏర్పడిన ప్రభుత్వం బీజేపీ పీడీపికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించంటతో సీఎం అయిన మెహబూమా ముఫ్తీ జమ్ము కశ్మీర్ లో ప్రభ్తువం కుప్పకూలిపోయింది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ ప్రమాణ స్వీకారం చేసి నూతన బాధ్యతలను స్వీకరించారు.

కేరళకు తెలంగాణ కానిస్టేబుల్ విరాళం...

హైదరాబాద్ : వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి తెలంగాణ కానిస్టేబుల్ విరాళం ప్రకటించారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ తుడి రాజు తన ఒక నెల వేతనం రూ. 68వేల వేతనాన్ని విరాళం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ విరాళాన్ని ఉన్నతాధికారికి అందచేశారు. 

15:43 - August 23, 2018

పశ్చిమగోదావరి : భీమవరంలో జివిఎన్‌ కాలువకు గండి పడింది. యనమదుర్రు డ్రైవ్‌ నుంచి వరద నీరు జివిఎన్‌ పం టకా లు వలోకి ప్రవహించడంతో భారీ గండి పడింది. దీంతో పంటకాలువకు సమీపంలోని సుమారు 200 ఎకరాలు నీటమునిగాయి. ప్రస్తుతం వరద నీరు భీమవరంలోని బ్యాంక్‌ కాలనీవైపు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గండి పడ్డ ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గ్రంధి శ్రీనివాస్‌ సహాయక చర్యలుచేపట్టాలని కోరారు. 

ఆ పార్టీతో చేతులు కలిపితే ఒప్పుకోమన్న అయ్యన్న...

విశాఖపట్టణం : కాంగ్రెస్ ను అణగదొక్కాలనే టిడిపి పుట్టిందని, ఆ పార్టీతో చేతులు కలిపితే ఒప్పుకోమని మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. 

ఏఐసీసీ కార్యదర్శులుగా కొత్తగా 8 మంది...

ఢిల్లీ : ఏఐసీసీ కార్యదర్శులుగా కొత్తగా 8మందిని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఉత్తర్వులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ జారీ చేశారు. బీహార్ : ఠాకూర్, మహారాష్ట్ర : చల్లా వంశీచంద్ రెడ్డి, బీఎం సందీప్, జమ్మూ కాశ్మీర్ : షకీల్ అహ్మద్ ఖాన్, ఉత్తరాఖండ్ : రాజేష్ దమానీ, వెస్ట్ బెంగాల్ : బీపీ సింగ్, మహ్మద్ జావేద్, శరత్ రౌత్ లున్నారు. 

15:40 - August 23, 2018

హైదరాబాద్ : ఇంజనీరింగ్ కాలేజీలలో అధిక ఫీజుల దోపిడీ అంతకంతకు పెరుగుతోంది. ఒకపక్క అధిక ఫీజలు మరోపక్క ప్రాజెక్టుల పేరుతో ఇతరత్రా కారణాలు చూపుతూ విద్యార్ధుల వద్ద నుండి దోపిడీ దందాను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐటీ ఇంజనీరింగ్ కళాశాల అధిక ఫీజలు దోపిడిని ప్రశ్నించిన విద్యార్ధులపై యాజమాన్యం దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఇప్పటికే ఒకో విద్యార్థి రూ.2లక్షలు ఫీజులు కట్టామని ఇప్పుడు అదనంగా మరో రూ.86 లక్షలు కట్టమంటున్నారని ...ఇదేమని అడిగితే తమను దుర్భాషలాడుతు చేయి చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరి షర్టులు కూడా చినిగి పోయాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యానికి విద్యార్ధులకు మద్య వాగ్వాదం జరగటంతో సీబీఐటీ కాలేజ్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

పెంచిన ఫీజులు తగ్గించాలంటూ విద్యార్థులు సీబీఐటీ ముందు ధర్నాకు దిగి తరగతులు, పరీక్షలు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. కాగా అధిక ఫీజులు కట్టాల్సి వస్తే నాలుగు సంవత్సరాలకు గానూ 4 లక్షల వరకు డబ్బులు కట్టాల్సివస్తుందని.. ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేమని విద్యార్థులు వాపోతున్నారు. కాలేజ్ లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారటంతో కవరేజ్ కు వెళ్లిన మీడియాను కాలేజ్ యాజమాన్యం మీడియాను అడ్డుకుంది. 

జైపాల్ రెడ్డికి సీటు ఇవ్వొద్దన్న డీకే అరుణ...

హైదరాబాద్ : జైపాల్ రెడ్డికి మహబూబ్ నగర్ సీటు ఇవ్వొద్దని కాంగ్రెస్ నేత డీకే అరుణ పేర్కొన్నారు. బీసీలకు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని, తమ అమ్మాయికి మహబూబ్ నగర్ సీటు అడుగుతామన్నారు. 

విశాఖ మెట్రోపై కొరియాతో చర్చలు - మంత్రి నారాయణ...

విజయవాడ : విశాఖ మెట్రోపై కొరియా బృందంతో చర్చించడం జరిగిందని మంత్రి నారాయణ వెల్లడించారు. రూ. 8వేల కోట్లతో మెట్రో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, అమరావతిలో టిటిడి ఆలయ నమూనాలపై చర్చించినట్లు తెలిపారు. 

ఆవుకు సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంపై...

కర్నూలు : ఆవుకు సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. 9,950 లంచం తీసుకుంటూ ఏసీబీకి జూనియర్ అసిస్టెంట్ కిరణ్ కుమార్ రెడ్డి చిక్కాడు. 

టిడిపిలో కాంగ్రెస్ మాజీ నేతలు ?

విజయవాడ : టిడిపిలో కాంగ్రెస్ మాజీ నేతలు చేరనున్నట్లు తెలుస్తోంది. టిడిపిలో చేరేందుకు కొందరు నేతలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహరెడ్డి కలిశారు. టిడిపిలో చేరే అంశంపై మంతనాలు జరుపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కదిరి బాబురావుతో టిడిపి అధినాయకత్వం సంప్రదింపులు జరుతోంది. ఇప్పటికే మంత్రి కళా వెంకట్రావును కొండ్రు మురళీ కలిశారు. 

15:12 - August 23, 2018

హమాచల్ ప్రదేశ్ : మంచు ప్రదేశం పైగా వర్షాలు కురుస్తున్నాయి. ఆపై ఘాట్ రోడ్లు ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రోడ్ల వెంట వాహనాలు బహు జాగరూకతతో నడపాల్సి వుంటుంది. ఏమాత్రం ఏమరుపాటుతో వ్యవహరించినా ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు అదే జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లా రాణీనల్లా వద్ద ఓ కారు ప్రమాదవశాత్తు లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో 11మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు వున్నారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న హిమాచల్ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా డ్రైవర్ తప్పిదం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. సహాయక కార్యక్రమాలను పోలిసులు కొనసాగిస్తున్నారు. కాగా మృతులు ఏ ప్రాంతవాసులు అనే విషయంపైనా...ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు విచారణ చేపట్టారు. 

14:48 - August 23, 2018

విజయవాడ : దుర్గమ్మ గుడిలో చీర దొంగిలించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఈవో సూర్యలత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనపై వచ్చిన చీర దొంగతనం ఆరోపణలపై తీవ్రంగా మనస్తాపానికి గురైన సూర్యలత న్యాయ కోసం కోర్టు మెట్లు ఎక్కారు. తనపై వచ్చిన ఆరోపణలపై సమగ్రంగా వచారించకుండా తనను బోర్డు నుండి తొలగించటాన్ని సవాల్ చేస్తు హైకోర్టులో సూర్యలత పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను స్వీకరించిన కోర్టు..దుర్గగుడి ఈవో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోన్మెంట్, ట్రస్ట్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై నాలుగు వారాలలో పూర్తి నివేదిక సమర్పించాలని ధర్మాసనం నోటీసులో పేర్కొంది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా ఆషాఢమాసం సందర్భంగా ఆనవాయితీగా అమ్మవారికి చీర సమర్పించే కార్యక్రమంలో కొందరు భక్తులు సమర్పించిన చీర మాయమైంది.ఈ ఘటనలో పాలకమండలి సభ్యురాలు సూర్యలతపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. 

14:32 - August 23, 2018

విజయవాడ : పాఠశాలలో పామలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ప్రైమరి పాఠశాల విద్యార్ధులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ముంపుకు గురైన గన్నవరం మండలం బీబీగూడెం పాఠశాలలో విషసర్పాలు సంచరిస్తున్నట్లుగా సర్పాల జాడలు కనిపిస్తున్నాయి. కేవలం జాడలే కాదు పాఠశాల కిటికీల నుండి పాములు యదేచ్ఛగా సంచరిస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. వారం రోజుల క్రితం లైబ్రరీ వద్ద ఓ తాచుపాము కుబుసం విడిచినట్లుగా విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని టీచర్స్ కు తెలిపినా పట్టించుకోవటంలేదని చెబుతున్నారు. కాగా పాఠశాల లోతట్టులో వుండటంతో చిన్నపాటి వర్షాలకు కూడా పాఠశాల ఆవరణలోకి నీరు చేరుతుండటంతో పాములు, తేళ్లు వంటి విషపు కీటకాలు వంటివాటి సమస్యల మధ్య విద్యార్థులు చదువులను కొనసాగించటం బాధాకరం..మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏ సమయంలో తమ పిల్లలకు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాగా వర్షాలు ప్రారంభం అయినప్పటి నుండి కృష్ణాజిల్లాలో పాములు జనాలపై పగబట్టినట్లుగా కాలు వేయటం ఆందోళన కలిగిస్తోంది. గత 22 రోజుల్లో 85 మంది పాము కాటు బాధితులు ఆసుపత్రిలో చేరారు. ఇద్దరు పాము కాటుతో మృతి చెందారు. రెండు రోజల క్రితం గన్నవరంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. 

పీజీ కోర్సుల పెంపు జీవోపై స్టే...

హైదరాబాద్ : తెలంగాణలో సూపర్ స్పెషాల్టీ మెడికల్ పీజీ కోర్సుల ఫీజు పెంపు జీవోపై హైకోర్టు స్టే విధించింది. గతంలో సూపర్ స్పెషాల్టీ కోర్సుల యాజమాన్య కోటాకు రూ. 5 లక్షలు, 2018-19 నుండి రూ. 25 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫీజుల పెంపుపై హెల్త్ కేర్ రిఫామ్స్ డాక్టర్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లింది. హైకోర్టు స్టేపై హెల్త్ కేర్ రిఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. 

పాఠశాలలో సర్పాలు...

కృష్ణా : జిల్లాలోని గన్నవరం (మం) బీబీగూడెంలో పాఠశాలలో విష సర్పాలు సంచరిస్తున్నాయి. వారం రోజుల క్రితం లైబ్రరీ వద్ద కుబుసాన్ని తాచుపాము వదిలి పెట్టి వెళ్లిందని, తరగతి గదిలోకి పాములు రావడంతో భయాందోళనకు గురయ్యామని విద్యార్థులు పేర్కొంటున్నారు. 

నకిలీ ఓటర్ల విషయంలో పిటిషన్...

హైదరాబాద్ : నకిలీ ఓటర్ల విషయంలో కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ విచారణపై పిటిషన్ ను ఆగస్టు 31కి వాయిదా వేసింది. 

ఆగని 'పాము కాట్లు'...

కృష్ణా : జిల్లాలోని పలు ప్రాంతాల్లో 'పాము కాటు'లు ఆగడం లేదు. 22 రోజుల్లో 85 మంది పాము కాటు బాధితులు ఆసుపత్రిలో చేరారు. ఇద్దరు పాము కాటుతో మృతి చెందారు. రెండు రోజల క్రితం గన్నవరంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. 

13:51 - August 23, 2018

చిత్తూరు : జిల్లాను నకిలీ విత్తనాలు ముంచెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అన్నదాతలకు నకిలీవిత్తనాలు సులువుగా అంటగడుతున్నారు. లక్షలు ఖర్చుచేసి విత్తనాలను విత్తిన రైతులు... చివరకు పంట చేతికి అందక లబోదిబోమంటున్నారు. చంద్రబాబు సొంత జిల్లానేకాదు... ఆయన సొంత నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఈ నకిలీ విత్తనాలు దందా జోరుగా సాగుతోంది.
రైతులకు నాసిరకం విత్తనాలు సప్లై
చిత్తూరు జిల్లాలో నకిలీ విత్తనాల దందా యథేచ్చగా సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పానికి కూతవేటు దూరంలోనే ఈ దందా నడుస్తోంది. వి. కోట మండలంలో నకిలీ విత్తన మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తోంది. వి. కోట ఇటు ఏపీ, అటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల కూడలిలోఉంది. విత్తనాల కోసం అన్ని ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి వస్తారు.  ఇదే అదనుగా భావించిన ఇక్కడి విత్తన వ్యాపారులు నకిలీ, నాసిరకం విత్తనాలకు లెరలేపారు. రైతులకు మాయమాటలు చెప్పి వాటిని అంటగడుతున్నారు.  ఎక్కువ ధరంటూ నమ్మబలికి రైతుల నుంచి అందినకాడికీ దోచుకుంటున్నారు.
నకిలీ విత్తనాలు అంటగట్టిన మాఫియా
వి.కోట మండలం భౌగోళికంగా ఎత్తైన ప్రాంతం కావడంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బీట్‌రూట్‌ పంట ఎక్కువగా రైతులు సాగు చేస్తున్నారు. నాణ్యమైన దిగుబడి కోసం ఈ పంటను నమ్ముకొని రైతులు లక్షలు ఖర్చు పెడతారు. ఇదే అదనుగా భావించిన విత్తన మాఫియా... రైతులను నిలువునా ముంచుతోంది.  అన్నదాతలకు మాయమాటలు చెప్పి నకిలీ విత్తనాలను అంటగడ్టారు. తీసుకెళ్లిన విత్తనాలను రైతులు ఎంతో నమ్మకంగా చల్లారు. మొక్క ఏపుగా పెరిగింది. చివరి దశలో మొక్కలు భూమి నుంచి తీయగా వేర్లు మాత్రమే బయటపడ్డాయి. దీంతో రైతుల గుండెలు జారిపోయాయి. తమ కష్టం మట్టిపాలైందని రైతులు బోరుమంటున్నారు. పంటపండక పోవడానికి నాసిరకం విత్తనాలే కారణమని ఆరోపిస్తున్నారు.
ఎకరాకు లక్ష రూపాయల ఖర్చు
కొత్తూరు గ్రామానికి చెందిన శంకరప్ప తనకున్న మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో బీట్‌రూట్‌ వేశాడు. వి. కోట మండల కేంద్రంలోని చందన ట్రేడర్స్‌ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేశాడు. ఒక్కో బాక్సు మూడు వందలు చొప్పున సోలార్‌ కంపెనీకి చెందిన బీట్‌రూట్‌ విత్తనాలను 20 బాక్సులు కొనుగోలు చేశాడు.  ఇందుకుగాను ఎకరాకు లక్ష రూపాయల చొప్పున ఖర్చు చేశాడు. పంట అయితే ఏపుగా పెరిగింది.  కానీ మొక్కను బయటకు లాగితేనే బీట్‌రూట్‌కు బదులు వేర్లు మాత్రమే దర్శనమిచ్చాయి. దీంతో ఖంగు తినడం శంకరప్ప వంతైంది.  నాసిరకం విత్తనాలతో నష్టపోయానని గుర్తించి బోరుమన్నాడు.  ముళబాగిలు సమీపంలోని కదిరిపురానికి చెందిన ముని వెంకటప్పకు ఇదే అనుభవం ఎదురైంది.
తనకు సంబంధం లేదంటున్న దుకాణదారుడు
విత్తనాలు ఇచ్చిన దుకాణదారుడిని ప్రశ్నిస్తే తనకు సంబంధం లేదంటూ చేతులెత్తేశాడు. దీంతో ఆగ్రహించిన రైతులు విత్తన దుకాణాన్ని ముట్టడించారు. నాసిరకం విత్తనాలతో నట్టేట ముంచారని నిలదీశారు.  కోల్పోయిన నష్టాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కంపెనీవారితో మాట్లాడి న్యాయం చేస్తామంటూ విక్రయదారులు వారిని తిప్పించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాసిరకం విత్తనాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. తమకు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. 

 

13:44 - August 23, 2018

పశ్చిమగోదావరి : జిల్లాలోని నిడదవోలును ఇంకా వరద ముంపు వదల్లేదు. అనేక గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. రెండు రోజులుగా నిడదవోలు.. తాడెపల్లి గూడెం రహదారిని పూర్తిగా మూసివేశారు. నిడదవోలు రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జ్‌ నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....  

 

13:40 - August 23, 2018

హైదరాబాద్ : సీబీఐటీ కాలేజ్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పెంచిన ఫీజులు తగ్గించాలంటూ విద్యార్థులు సీబీఐటీ ముందు ధర్నాకు దిగారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఒక్క సంవత్సరానికి ఒక్కో విద్యార్థి అదనంగా 86 వేలకు పైగా చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విధంగా చూస్తే నాలుగు సంవత్సరాలకు గానూ 4 లక్షల వరకు డబ్బులు కట్టాల్సివస్తుందని.. ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేమని విద్యార్థులు అంటున్నారు. ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో విద్యార్థులపై కాలేజీ ప్రిన్సిపల్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ప్రిన్సిపాల్‌ విద్యార్థుల చొక్కాలు చించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కాలేజీ యాజమాన్యం మీడియాను అడ్డుకుంది. 

13:30 - August 23, 2018

చిత్తూరు : తిరుపతి టీటీడీకి చెందిన శ్రీనివాస మంగాపురం ఆలయ ఏఈవోపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. శ్రీనివాసులు తనను లైంగిక వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. శ్రీనివాస మంగాపురం ఆలయంలో గతకొంతకాలంగా బాధితురాలి తల్లి పని చేస్తోంది. అయితే తల్లిని కలిసేందుకు వెళ్లినప్పుడు ఆ మహిళపై ఏఈవో శ్రీనివాసులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాను చెప్పినట్లు వినాలని, చెప్పిన చోటుకు రావాలని శ్రీనివాసులు వేధిస్తున్నాడని మహిళ పేర్కొంది. టీటీడీ ఏఈవో, విజిలెన్స్ అధికారులకు యువతి ఫిర్యాదు చేసింది. చంద్రగిరి పీఎస్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈమేరకు శ్రీనివాసులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

 

కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న కేఈ...

విజయవాడ : కాంగ్రెస్ తో పొత్తు ఉండదని డిప్యూటి సీఎం కేఈ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, పవన్, జగన్, లు తమ ప్రత్యర్థులేనని పేర్కొన్నారు. 

నాగరికతకు అద్దం పట్టేది ఆర్కిటెక్చర్ - గవర్నర్...

విజయవాడ : నాగరికతకు అద్దం పట్టేది ఆర్కిటెక్చర్ అని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. వేద, పురాణాల్లోనూ ఆర్కిటెక్చర్ కు అత్యంత ప్రాధాన్యత ఉందని, నగరాల్లో నిర్మిస్తున్న బహుళంతస్తుల్లో భద్రతా చర్యలు ఉండేలా ఆర్కిటెక్చర్లదే బాధ్యత అని తెలిపారు. 

ఆర్థిక మంత్రిగా జైట్లీ బాధ్యతలు...

ఢిల్లీ : ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు చేపట్టారు. కిడ్నీ మార్పిడి కారణంగా కొన్ని నెలలు జైట్లీ విధులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. జైట్లీకి ఆర్థిక శాఖతో పాటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ చూడనున్నారు. పీయూష్ గోయల్ ను తాత్కాలిక బాధ్యతల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

భారత్ ఖాతాలో 15 పతకాలు...

ఆసియా గేమ్స్ లో భారత్ కు మరో పతకం ఖాయమైంది. టెన్నిస్ పురుషుల డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న - శరణ్ జోడీలు ప్రవేశించారు. జపాన్ జోడి ఉసుంగ్ - షమాబుకురోపై గెలుపొందారు. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 15 పతకాలు చేరాయి. 4 స్వర్ణాలు, 3 రజతాలు, 8 కాంస్య పతాకాలను సాధించారు. 

ఏపీ కాంగ్రెస్ కమిటీ మిషన్ - 2019 సమావేశం...

విజయవాడ : ఏపీ కాంగ్రెస్ కమిటీ మిషన్ - 2019 సమావేశం జరిగింది. బూత్ స్థాయి కమిటీల నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. ఊమెన్ చాందీ, రఘువీరా, కొప్పుల రాజులు పాల్గొన్నారు. అక్టోబర్ 2 నుండి ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం జరుగుతుందని జేడీ శీలం పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని, ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు. 

12:54 - August 23, 2018

ఢిల్లీ : భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రకటించిన 700 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేరళను తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తామని కేంద్రం చెబుతోంది.  భారత్‌ గత కొన్నేళ్లుగా విపత్తుల సమయంలో ఎలాంటి విదేశీ సాయాన్ని తీసుకోవడం లేదు. అదే విధానాన్ని కేంద్రం అనుసరించాలని భావిస్తోంది. విదేశీ సాయం తీసుకునే అంశంపై విదేశాంగ మంత్రిత్వ శాఖనే నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఉత్తరాఖండ్‌, కశ్మీర్‌లో సంభవించిన వరదల సమయంలో కూడా కేంద్రం విదేశాల నుంచి సహాయాన్ని తీసుకోలేదని విదేశాంగ శాఖ పేర్కొంది. యూఏఈ 700 కోట్ల సాయాన్ని భారత్‌ నిరాకరించిందన్న వార్తలపై కేరళ సిఎం పినరయి విజయన్ స్పందించారు. కేరళ ప్రజలు దుబాయ్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని ఆ దేశ పాలకులు గుర్తించిన క్రమంలో యుఏఈని ఇతర దేశంగా పరిగణించలేమన్నారు.

 

ఉండవల్లి ప్రజా వేదికలో సీఆర్డీఏ సమీక్షా సమావేశం...

విజయవాడ : ఉండవల్లి ప్రజా వేదికలో సీఆర్డీఏ సమీక్షా సమావేశం జరిగింది. అమరావతిలో టిటిడి నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆలయ నమూనా చిత్రాలను ప్రదర్శించారు. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా పవిత్రతకు అత్యంత ప్రాధాన్యత నిస్తూనే భవ్యమైన నిర్మాణం జరగాలని సీఎం బాబు సూచించారు. 

స్కూల్ ఆప్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనం ప్రారంభం...

విజయవాడ : ఏపీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ స్నాతకోత్సవ సభ జరిగింది. స్కూల్ ఆప్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనాన్ని ఉప రాష్ట్రపతి, గవర్నర్ లు ప్రారంభించారు. 

12:49 - August 23, 2018

రాజమండ్రి : గోదావరిలో వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి దగ్గర బుధవారం 14.80 అడుగుల నీటి మట్టం నమోదైంది. కాగా.. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారిజీ నుంచి 14 లక్షలా 55 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరిలో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. భద్రాచలం వద్ద 43.80 అడుగల వరద నీటి మట్టం నమోదైంది. గోదావరిలోకి వివిధ మార్గాల ద్వారా వచ్చే వరదనీరు తగ్గి.. నీటి మట్టం నిలకడగా కొనసాగుతోంది. కానీ ధవళేశ్వరం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో కొంతమేర అధికంగా ఉంది. 

12:47 - August 23, 2018

నల్లగొండ : జిల్లాలోని నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ నుండి ఖరీఫ్‌ పంటకు నీరు విడుదల చేశారు మంత్రి జగదీశ్‌ రెడ్డి. ఈ నీటి ద్వారా  నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. సాగర్‌ ఎడమ కాలువ పరిధిలో గల ఆయకట్టు రైతులకు ఖరీఫ్‌ పంట పండించుకోవడం కోసం ఆన్‌ ఆఫ్‌ విధానం ద్వారా సుమారు 6 లక్షల 24వేల హెక్టార్లకు నీటిని విడుదల చేశామన్నారు మంత్రి. చిట్ట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 

 

12:45 - August 23, 2018

మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ కురుస్తున్న వర్షం నీరు ప్రాజెక్టుకు చేరుకోవడంతో నిండుకుండలా మారింది. పూర్తిస్తాయి నీటి మట్టం 318.51 టీఎంసీలు కాగా ప్రస్తుత స్థాయి నీటి మట్టం 317.600లుగా ఉంది.

 

12:41 - August 23, 2018

హైదరాబాద్ : తెలంగాణ సెక్రటేరియెట్‌లో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. రేషన్‌ డీలర్ల కమిషన్‌ను 20 పైసల నుండి 70 పైసలకు పెంచుతున్నట్లు భేటీలో పాల్గొన్న మంత్రి ఈటల వెల్లడించారు. ఈ పెంపు సెప్టెంబర్‌ 1 నుండి అమలు చేస్తామన్నారు. అలాగే 2015 అక్టోబర్‌ నుండి ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రేషన్‌ డీలర్ల కమిషన్‌ బకాయిలు చెల్లిస్తామని మంత్రి తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ డీలర్ల సమస్యలను అధ్యయనం చేయాలని మంత్రి ఈటెల ఆధ్వర్యంలో సబ్ కమిటీ నియమితులైన సంగతి తెలిసిందే. ఆ కమిటీలో సీనియర్ మంత్రులు హరీష్ రావు, జోగు రామన్న, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, కమిషనర్ అకున్ సబర్వాలున్నారు. గత కొన్ని రోజులుగా ఈ కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవాంటే వివిధ రాష్ట్రాల్లో సివిల్ సప్లై విధానాన్ని అధ్యయనం చేయాలని ఇందుకు సివిల్ సప్లై అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించాలని కమిటీ సూచించింది. దీనితో సివిల్ సప్లై అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక తయారు చేసిందని, ఈ నివేదికను సీఎం కేసీఆర్ అందచేసిందని మంత్రి ఈటెల పేర్కొన్నారు. కమిషన్ పెంచాలని పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని, విడుదల చేస్తే వారి సమస్యలు తీరే అవకాశం ఉందని కమిటీ నిర్ణయించింది. 

'పీడీ అకౌంట్లపై విచారణకు ఎందుకంత భయం'...

విజయవాడ : పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణకు సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోతే సీబీఐ విచారణకు సిద్ధం కావాలని సూచించారు. 

కొత్త స్కాంకు తెరలేపిన టిడిపి సర్కార్ - సోము వీర్రాజు...

విజయవాడ : భోగాపురం ఎయిర్ పోర్టును టెండర్లను రద్దు చేసి టిడిపి ప్రభుత్వం కొత్త స్కాంకు తెరలేపిందని బీజేపీ నేత సోము వీర్రాజు పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ముందుకొచ్చిందని, టెండర్లలో ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనరాదని ఆంక్షలు పెడుతున్నారని తెలిపారు. 

గోదావరిలో వాజ్ పేయి ఆస్తికల నిమజ్జనం...

హైదరాబాద్ : మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయి అస్థికలను నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో నిమజ్జనం చేయనున్నారు. బాసర గోదావరి నది పుష్కరఘాట్ 1లో నిమజ్జనం చేయనున్నారు. 

సహాయక శిబిరాల్లో సీఎం పినరయి...

కేరళ : రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పలు సహాయక శిబిరాలను సందర్శించారు. అక్కడ తల దాచుకుంటున్న వరద బాధితులను ఆయన పరామర్శించారు. అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. 

11:52 - August 23, 2018

హైదరాబాద్ : గులాబీపార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్‌ఆర్‌ఐలు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఎన్నికల వేడి రాజుకోవడంతో నియోజకవర్గాల్లో ఇప్పటికే గులాబీపార్టీలో  ఎన్‌ఆర్‌ఐలు రంగంలోకి దిగారు. మరికొంత మంది పార్టీ హైకమాండ్‌కు దగ్గరగా ఉంటూ టిక్కెట్లు పొందాలని ప్రయత్నిస్తున్నారు.
టీఆర్‌ఎస్‌లో మొదలైన టిక్కెట్ల కుస్తీ
టీఆర్‌ఎస్‌లో అప్పుడే టిక్కెట్ల కుస్తీ మొదలైంది.  వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు  నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని కేసీఆర్‌ ప్రకటించినా... తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇతర నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరు చాలదన్నట్టు ఇప్పుడు ఎన్‌ఆర్‌ఐలు కూడా పోటీకి సై అంటున్నారు. కొంతమందైతే ఏకంగా ప్రజాక్షేత్రంలో పర్యటనలు జరుపుతున్నారు.  గులాబీపార్టీ టిక్కెట్‌ దక్కితే చట్టసభల్లో కాలుపెట్టడం సులువవుతుందని  అధికారపార్టీపై భారీగా ఆశలు పెంచుకున్నట్టు తెలుస్తోంది. 
ఈసారి ఎన్నికల రంగంలోకి ఎన్ ఆర్ఐలు
తెలంగాణకు చెందిన ఎన్‌ఆర్‌ఐ శాఖలు దాదాపు 15 దేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ శాఖలు ఉన్న దేశాల్లో తెలంగాణ వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాయి.  ఉద్యమ సమయం నుంచి విదేశీశాఖలు అధికారపార్టీకి అండగా ఉంటూ వస్తున్నాయి. ఈసారి ఎన్‌ఆర్‌ఐలు కూడా ఎన్నికల రంగంలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.
నల్లగొండ జిల్లాలో ఎన్ ఆర్ ఐల ప్రభావం ఎక్కువ
తెలంగాణలో కనీసం 10మంది ఎన్‌ఆర్‌ఐలు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.  ప్రజలతో సంబంధాలు ఉన్న కొంతమంది ఎన్‌ఆర్‌ఐలు ఇప్పటికే నియోజకవర్గాల్లో  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  నల్లగొండ జిల్లాలో ఎన్‌ఆర్‌ఐల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వారు రెడీగా ఉన్నామన్న సంకేతాలు ఇస్తున్నారు.  హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో సైదిరెడ్డిపేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  నాగార్జునసాగర్‌లో గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, ఖమ్మం నుంచి తాతా మధు పోటీచేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు.  ఎన్‌ఆర్‌ఐ విభాగానని సమన్వయం చేసే మహేష్‌ బిగాల కూడా పోటీచేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం.  మొత్తంమీద రాబోయే ఎన్నికల్లో గులాబీపార్టీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్‌ఆర్‌ఐలు తహతహలాడుతున్నారు.

11:48 - August 23, 2018

వరంగల్‌ : కాజీపేటలో కూలిన బహుళ అంతస్తుల భవనం శిథిలాల కింద మృత దేహం లభ్యమైంది. కాజీపేట డిజిటల్‌ కాలనీలో మంగళవారం అర్ధరాత్రి నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కూలింది. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వాచ్‌ మెన్‌ భిక్షపతి మృతదేహాన్ని వెలికి తీశారు. 20గంటలపాటు శ్రమించిన రెస్క్కూ టీమ్‌ వాచ్‌ మెన్‌ భిక్షపతి మృతదేహాన్ని కనిపెట్టారు. మృతుడి స్వగ్రామం శాయంపేట. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇంకా బిల్డింగ్‌ కూల్చివేత కొనసాగుతోంది.

 

11:47 - August 23, 2018

గుంటూరు : జిల్లాలో పాడి రైతు పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది..కానీ నిర్వాహణ ఖర్చులు అధికమవుతుండడంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా డైరీ నిర్వాహకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనితో గురువారం పాడి రైతులు వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. తాడేపల్లి బైపాస్‌ వద్ద తమ పాలను రోడ్లపై పారబోసి తమ నిరసనను వ్యక్తం చేశారు. పాడి పరిశ్రమ నిర్వాహణ ఖర్చుతో కూడుకున్నదని..అనేక నష్టాలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ధరల విషయంలో డైరీ నిర్వాహకులు ఏమీ ఆలోచించడం లేదని పాల సేకరణ కేంద్రాల్లో ప్రస్తుత ధరకు అదనంగా రూ.10 చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పాలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘం డిమాండ్‌ చేస్తోంది. 

 

11:44 - August 23, 2018

చిత్తూరు : శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల విక్రయం స్కాంలో నిందితుడిని విజిలెన్స్‌ వింగ్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగి శ్రీనివాస్‌గా గుర్తించారు. నకిలీ ఓటరు కార్డుతో ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను విక్రయించాడు. ఇప్పటికే కొన్ని వేల ఆర్జిత సేవ టికెట్లను శ్రీనివాస్‌ బుక్‌ చేశాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:35 - August 23, 2018

కర్నూలు : నగరంలో దారుణం చోటుచేసుకుంది. రామలింగేశ్వర నగర్‌లో  14ఏళ్ళ బాలికపై  కానిస్టేబుల్‌ భర్త అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యాభై ఒక్క ఏళ్ళ శివరామిరెడ్డి మత్తు మందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. మానవత్వం మరచిన కామాంధుడి అఘాయిత్యంతో... బాధితురాలు 2నెలల గర్భవతి అయింది. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

11:34 - August 23, 2018

కర్నూలు : జూరాల నుంచి వరద ఉధృతి పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. 8గేట్లు ఎత్తి 10అడుగుల మేర నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు.  వరద నీరు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. శ్రీశైలం జలాశయంలో  2,71011 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా 3,20068 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 883.30 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిలువ 206.0068 టీఎంసీలు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో  విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

 

11:23 - August 23, 2018

ఢిల్లీ : బ్రిటన్‌ మాజీ హైకమిషనర్‌ కులదీప్‌ నయ్యర్‌ కన్నుమూశారు. 95ఏళ్ల నయ్యర్‌ అనారోగ్య సమస్యలతో దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 12.30 సమయంలో తుదిశ్వాస విడిచారు. కులదీప్‌ నయ్యర్‌ అంతిమ సంస్కారాలు నగరంలోని లోధి స్మశానవాటికలో జరుగుతాయని నయ్యర్‌ పెద్ద కుమారుడు సుధీర్‌ నయ్యర్‌ వెల్లడించారు. కులదీప్‌ నయ్యర్‌ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. కులదీప్‌ నయ్యర్‌ మా కాలంలోని మేధో దిగ్గజం. ఆయన అభిప్రాయాలు నిజాయితీగా, నిర్భయంగా ఉంటాయి. ఆయన కొన్ని దశాబ్దాల పాటు సేవలందించారు. ఎమర్జెన్సీని బలంగా వ్యతిరేకించిన వ్యక్తిగా, దేశంలో పబ్లిక్‌ సర్వీసులు, కమింట్‌మెంట్స్‌ మరింత మెరుగుపడాలని తీవ్రంగా కోరుకున్న వ్యక్తిగా ప్రజలు ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆయన మరణం ఎంతో బాధ కలిగించింది. సంతాపం తెలియజేస్తున్నా అని మోదీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

 

11:21 - August 23, 2018

హైదరాబాద్‌ : అబ్ధుల్లాపూర్‌మెట్‌ పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. కన్నతండ్రే కూతురిని దారుణంగా హతమార్చారు. బాబాయ్‌ వరసైన వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని కూతురి గొంతుకోసి చంపాడు తండ్రి. నాలుగు సంవత్సరాల క్రితం బాబాయ్‌ని పెళ్లిచేసుకొని వెళ్లిపోయిన విజయ.. అత్తయ్య వరసైన వ్యక్తి చనిపోవడంతో అబ్ధుల్లాపూర్‌మెట్‌కు వచ్చింది. బాబాయ్‌ని పెళ్లిచేసుకొని పరువు తీసిందన్న కోపంతో తండ్రి ఆమె గొంతు కోసి హత్య చేశాడు. పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. కూతురు విజయ హత్యతో తల్లి షాక్ కు గురైంది. మృతదేహాన్ని ఆస్మానియా ఆస్పత్రికి తరలించారు. విజయకు నాలుగు సంవత్సరాల బాబు ఉన్నాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

ప్రకృతి వ్యవసాయం రైతులతో వెంకయ్య ముఖాముఖి...

ఉంగటూరు : వ్యవసాయాన్ని లాభసాటి చేయడంపై దేశ వ్యాప్తంగా సమగ్ర చర్చ జరగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ఉంగుటూరు మండలం ఎస్.ఎన్.పాలెంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వెంకయ్య నాయుడు పాల్గొని ప్రసంగించారు. 

కేరళలో పెట్రోల్ కోసం బారులు...

కేరళ : రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతోంది. గత కొన్ని రోజులుగా వర్షాలు..వరదలతో రాష్ట్రం అతాలకుతలమైన సంగతి తెలిసిందే. గురువారం పెట్రోల్ కోసం వాహనాలు బారులు తీరాయి. 

సాగర్ నీటిని విడుదల చేసిన మంత్రి జగదీష్ రెడ్డి...

నల్గొండ : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుండి వెయ్యి క్యూసెక్కుల నీటిని మంత్రి జగదీష్ రెడ్డి విడుదల చేశారు. సాగర్ ఆయుకట్టులో చివరి భూములకు నీరందే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఆరున్నర లక్షళ ఎకరాలకు సాగునీరందుతుందని పేర్కొన్నారు. 

11:03 - August 23, 2018

కర్నూలు : కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి వరసలు మరవడం..మానవత్వం లేకుండా ప్రవర్తించడం చేస్తున్నారు. ఏమి తెలియని బాలికలపై మృగాళ్లు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ 51 ఏళ్ల వ్యక్తి బాలిక (14) పై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఫలితంగా ఆమె గర్భవతి కావడంతో వ్యవహారం బయటకొచ్చింది. ఆ వ్యక్తి కానిస్టేబుల్ భర్త కావడం ఇక్కడ గమనార్హం. రామలింగేశ్వర్ నగర్ లో కానిస్టేబుల్ భర్త శివరామిరెడ్డి నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంట్లో ఓ బాలిక పని చేస్తోంది. ఈమెపై కన్నేసిన శివరామిరెడ్డి తరచూ అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. మత్తు మందు కలిపిన బిస్కెట్లు ఇచ్చి అత్యాచారం చేశాడు. మృగంలా ప్రవర్తించాడు. బాలిక ప్రస్తుతం రెండు నెలల గర్భవతి. మత్తు బిస్కెట్లు ఇచ్చి శారీరకంగా..మానసికంగా.. హింసిస్తున్నాడని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేస్తున్నారు. గత ఐదారు నెలలుగా ఈ ఘోరం జరుగుతోందని...విషయం బయటకు చెబితే ఏమవుతుందోనని బాలిక తల్లిదండ్రులు యోచించినట్లు సమాచారం. చివరకు డీసీపిని తల్లిదండ్రులు ఆశ్రయించారు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. 

 

శ్రీకాళహస్తిలో 'అన్నా' క్యాంటీన్ లో ఉద్రిక్తత...

శ్రీకాళహస్తి 'అన్నా' క్యాంటీన్ లో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. తనకు ఆహ్వానం పంపలేదని శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణను మోహన్ అడ్డుకున్నట్లు సమాచారం. 

10:56 - August 23, 2018

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ డెడ్ రూం ఇళ్ల జాతకం తేలిపోయింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో డొల్లతనం తేటతెల్లమైంది. ఇటీవల కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకే పూరి గుడిసెల మాదిరిగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కురుస్తున్నాయి. జిల్లాలోని పువ్వాడ ఉదయ్ నగర్ లో గృహ ప్రవేశాలు చేసి... 4 నెలలు కూడా గడవకముందే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కారుతున్నాయి. కొద్దిపాటే వర్షాలకే ఇళ్లు కురుస్తున్నాయి. వర్షాలకు తడవడంతో గోడలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతాలోపం బయటపడడంతో లబ్ధిదారులు అందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 9న పువ్వాడ ఉదయ్ నగర్ లో పది డబుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇక్కడ 216 కుటుంబాలు నివసిస్తున్నాయి. అదే విధంగా మంత్రి తుమ్మల నాగేశర్వర్ రావు నియోజకవర్గం పాలేరులోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి ఇలానే ఉంది. 10 నియోజకవర్గాల్లో ప్రారంభించిన ప్రతి ఇల్లు పరిస్థితి ఈ విధంగానే ఉంది. బాధ్యత లేకుండా ఇల్లు నిర్మించారని బాధితులు మండిపడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

తెలంగాణ రేషన్ డీలర్ల కమిషన్..ఈటెల ప్రకటన...

హైదరాబాద్ : వచ్చే నెల నుండి కమిషన్ అమలు చేయడం జరుగుతుందని, 2015 అక్టోబర్ నుండి ఉన్న బకాయిలను చెల్లిస్తామని మంత్రి ఈటెల వెల్లడించారు. కాసేపటి క్రితం రేషన్ డీలర్ల కమిషన్ పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయిన సంగతి తెలిసిందే. 

10:51 - August 23, 2018

తూర్పుగోదావరి : జిల్లాలో కురుస్తున్న భారీ వార్షలకు గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. నాలుగు రోజులుగా లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటున్నారు. ధవళేశ్వం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 14 లక్షల 79 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ఇదిలా ఉంటే శబరి నది శాంతించింది. కానీ గోదావరి నది మాత్రం ఉధృతంగా ప్రవహిస్తోంది. వారం రోజులుగా పలు గ్రామాలు వరద జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. కోనసీమలోని సుమారు 45 గ్రామాలకు వరద తాకిడి ఉందని అధికారులు గుర్తించారు. అందులో 32 గ్రామాల్లో వరద నీరు చేరిందని..25 గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు పాల్పవుతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో కూడా ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ధవళేశ్వరం వద్ద 15.2 అడుగులకు చేరిన నీటి మట్టం సాయంత్రానికి నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉందని అధికారులు ఆలోచిస్తున్నారు.

వరదల్లో చిక్కుకున్న లంక గ్రామాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదనే విమర్శలున్నాయి. పడవ ప్రయాణాలు వద్దని చెబుతున్న అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో ప్రజలు నిత్యావసర సరుకులు..ఇతరత్రా వాటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అవసరమైన చర్యలు తీసుకుంటామని..పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్న సంగతి తెలిసిందే. పునరావస కేంద్రాల్లోకి రావడానికి పలువురు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. 

వాజ్ పేయి అస్తి కలశ యాత్ర...

ఒడిశా : భారత మాజీ ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తి కలశ యాత్ర పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఈ యాత్రలో పాల్గొన్నారు. 

రేషన్ డీలర్ల కమీషన్ పెంచారు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్ల కమిషన్ పెంపుకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. కమిషన్ 70 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. 

10:45 - August 23, 2018

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ డెడ్ రూం ఇళ్ల జాతకం తేలిపోయింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో డొల్లతనం తేటతెల్లమైంది. ఇటీవల కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకే పూరి గుడిసెల మాదిరిగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కురుస్తున్నాయి. జిల్లాలోని పువ్వాడ ఉదయ్ నగర్ లో గృహ ప్రవేశాలు చేసి... 4 నెలలు కూడా గడవకముందే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కారుతున్నాయి. కొద్దిపాటే వర్షాలకే ఇళ్లు కురుస్తున్నాయి. వర్షాలకు తడవడంతో గోడలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. భయం గుప్పిట్లో జీవిస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతాలోపం బయటపడడంతో లబ్ధిదారులు అందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 9న పువ్వాడ ఉదయ్ నగర్ లో పది డబుల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇక్కడ 216 కుటుంబాలు నివసిస్తున్నాయి. అదే విధంగా మంత్రి తుమ్మల నాగేశర్వర్ నియోజకవర్గం పాలేరులోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిస్థితి ఇలానే ఉంది. 10 నియోజకవర్గాల్లో ప్రారంభించిన ప్రతి ఇల్లు పరిస్థితి ఈ విధంగానే ఉంది. బాధ్యత లేకుండా ఇల్లు నిర్మించారని బాధితులు మండిపడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతాలోపం

ఖమ్మం : డబుల్ డెడ్ రూం ఇళ్ల జాతకం తేలిపోయింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో డొల్లతనం బయటపడింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతాలోపం బయటపడింది. ఇటీవల కురుస్తున్న కొద్దిపాటి వర్షాలకే పూరి గుడిసెల మాదిరిగా డబుల్ బెడ్ రూం ఇళ్లు కురుస్తున్నాయి. గృహ ప్రవేశాలు చేసి... 4 నెలలు కూడా గడవకముందే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కారుతున్నాయి. 

శ్రీవారి సేవా టికెట్ల స్కాం...

తిరుమల : శ్రీవారి సేవా టికెట్ల స్కాంలో ఇంటి దొంగను పోలీసులు అరెస్టు చేశారు. షోలాపూర్ దళారీ తరహాలో కాల్ సెంటర్ ఉద్యోగి అక్రమాలకు పాల్పడ్డారు. శ్రీవారి సుప్రభాత సేవా టికెట్లను లక్కీ డీప్ లో పొందిన ఉద్యోగి శ్రీనివాసులు ఇతరులకు విక్రయించాడు. ఒక్కో టికెట్ ను రూ. 3 వేలకు విక్రయించాడు. 

సీనియర్ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ ఇకలేరు...

ఢిల్లీ : సీనియర్ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ (95) కన్నుమూశారు. గత కొంతకాలంగా నయ్యర్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. పలు పత్రికలకు నయ్యర్ వ్యాసాలు రాశారు. 1990లో బ్రిటన్ లో భారత రాయబారిగా పనిచేసిన ఈయన 1923 ఆగస్టు 14వ తేదీన పాక్ లోని సియోల్ కోట్ లో కుల్దీప్ నయ్యర్ జన్మించారు. 

రేషన్ డీలర్ల సమస్యలపై సబ్ కమిటీ నివేదిక...

హైదరాబాద్ : రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సీఎం కేసీఆర్ కు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. 

టిటిడిలో లైంగిక వేధింపులు...

చిత్తూరు : టిటిడిలో లైంగిక వేధింపుల కలకలం సృష్టిస్తోంది. శ్రీనివాస మంగాపురం ఆలయంలో పనిచేస్తున్న ఏఈవో వేధిస్తున్నాడని చంద్రగిరి పీఎస్ లో మహిళ ఫిర్యాదు చేసింది. 

రాజుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్ల కొరత

భూపాలపల్లి : జిల్లాలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. టీచర్లు లేక సర్కార్ బడులు వెలవెలబోతున్నాయి. మంగపేట మండలం రాజుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఐదుగురు టీచర్లతో నడుస్తోంది. పాఠశాలలో 240 మంది విద్యార్థులు ఉన్నారు. 18 మంది ఉపాధ్యాయులు ఉండాల్సిన స్కూల్ లో కేవలం ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. కీలకమైన సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ టీచర్స్ లేకపోవడంతో పాఠాలు ఇంతరవకూ కాలేదు. సరిపడు టీచర్లు లేకపోవడంతో టీసీలు తీసుకుని విద్యార్థులు ఇతర ప్రైవేట్ పాఠశాలలో చేరుతున్నారు. 

09:55 - August 23, 2018

భూపాలపల్లి : జిల్లాలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. టీచర్లు లేక సర్కార్ బడులు వెలవెలబోతున్నాయి. మంగపేట మండలం రాజుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదుగురు టీచర్లతో ఉన్నత పాఠశాల నడుస్తోంది. పాఠశాలలో 240 మంది విద్యార్థులు ఉన్నారు. 18 మంది ఉపాధ్యాయులు ఉండాల్సిన స్కూల్ లో కేవలం ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. కీలకమైన సైన్స్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్ టీచర్స్ లేకపోవడంతో పాఠాలు ఇంతరవకూ కాలేదు. సరిపడు టీచర్లు లేకపోవడంతో టీసీలు తీసుకుని విద్యార్థులు ఇతర ప్రైవేట్ పాఠశాలలో చేరుతున్నారు. మిగిలిన విద్యార్థులు తమ టీసీలు ఇస్తే ఇతర పాఠశాలలో చేరుతామని అంటున్నారు. 10 వ తరగతిలో గ్రేడులు ఎలా వస్తాయని విద్యార్థులు నిలదీస్తున్నారు. తమ చదువులు అటకెక్కుతున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి

తూర్పుగోదావరి : గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. నాలుగు రోజులుగా లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ధవళేశ్వం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

 

09:11 - August 23, 2018

తెలంగాణ మంత్రివర్గ ఇష్టాగోష్టి సుదీర్ఘంగా సాగింది. సాయంత్రం 4 గంటలకు మొదలైన ఈ భేటీ.. రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలు, ప్రగతి నివేదన సభపైనే ప్రధాన చర్చ జరిగింది.  ఎన్నికలకు సన్నద్దులను చేస్తూనే.. మంత్రులు పోషించాల్సిన కీలక పాత్రను కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై కేసీఆర్‌ సహచర మంత్రుల అభిప్రాయాలను స్వీకరించారు. వారు క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు. ఎన్నికల సన్నద్ధత ఎంతవరకు వచ్చిందీ చెప్పారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు నంద్యాల నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ నేత శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నేత ఎన్ వీ శుభాష్, టీఆర్ ఎస్ నేత మంద జగన్నాథం పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ మంత్రివర్గ భేటీపై భిన్నవాదనలు వినిపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:48 - August 23, 2018

గుంటూరు : ప్రభుత్వ ఆస్పత్రిని వెంటిలేటర్ల సమస్య వెంటాడుతోంది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్జరీలు చేయలేక వైద్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వెంటిలేటర్లకు మరమ్మత్తులు నిర్వహించే సంస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
వెంటిలేటర్ల సమస్యతో ఇబ్బందుల్లో రోగులు
గుంటూరులో చికిత్సకు మారుపేరు అయిన సర్వజనాసుపత్రిలో వెంటిలేటర్ల సమస్య నెలకొంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు సర్వజనాసుపత్రిలో కోటి రూపాయలతో పది వెంటిలేటర్లలను అధికారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ వెంటలేటర్లు పనిచేయటం లేదు. దీంతో అత్యవసర సేవల నిమిత్తం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటిలేటర్లు లేక వైద్యులు క్లిష్టమైన సర్జరీలు నిలిపివేశారు. ఆస్పత్రిలో వెంటలేటర్లు పనిచేయకపోవటంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి
వెంటిలేటర్లు పనిచేయకపోవటంతో అందని చికిత్స
చికిత్స చేయటంలో ఆస్పత్రికి మంచి పేరు ఉండటంతో గుంటూరుతో పాటు ఇతర జిల్లాల ప్రజలు ఆస్పత్రికి వస్తుంటారు. చిన్నారులకు చికిత్స అందించటంలో ఆస్పత్రి మంచి గుర్తింపు సాధించింది. దీంతో చిన్నారులకు సంబంధించి అత్యవసర కేసులు ఏమి ఉన్నా ముందుగా ఈ ఆస్పత్రికి వస్తుంటారు. అయితే వెంటిలేటర్లు పనిచేయకపోవటంతో వైద్యులు చిన్నారులకు చికిత్స అందించటం లేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులతో పాటు సామాన్య ప్రజలు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరికరాలు సరిగ్గా లేనప్పడు ఆస్పత్రిని ఎలా నడుపుతున్నారని నిలదీస్తున్నారు. పరికరాలు సరిగ్గా లేకపోతే ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటంపై ప్రజలు మండిపడుతున్నారు. 
పరికరాల మరమ్మతులు టీబీఎస్‌ సంస్థకు అప్పగింత
వెంటిలేటర్ల సమస్య గురించి వైద్యులు మరోలా చెబుతున్నారు. పరికరాలు పనిచేయకపోతే టెలి మ్యాట్రిక్‌ అండ్‌ బయోమెడికల్ సర్వీస్‌ సంస్థ పరికరాలకు మరమ్మత్తులు చేస్తుందని.. ఈ మేరకు ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని వైద్యులు చెబుతున్నారు. వెంటిలేటర్లు పనిచేయటం లేదని.. వెంటనే మరమ్మత్తులు చేయాలని గత కొంత కాలంగా సంస్థకు మొరపెట్టుకున్నా...  సంస్థ ప్రతినిధులు పట్టించుకోవటం లేదని తెలిపారు. టీబీఎస్‌ ప్రతినిధులు స్పందించకపోవటంతో సుమారు 6 వేల రూపాయలు ఖర్చు చేసి.. స్థానిక నిపుణుల చేత మూడు వెంటిలేటర్లు బాగు చేయించామని వైద్యులు చెబుతున్నారు. వెంటిలేటర్లకు మరమ్మత్తులు నిర్వహించాలని టీబీఎస్‌ ప్రతినిధులను ఎన్ని సార్లు అడిగినా స్పందన కరువైందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సకాలంలో వైద్య సేవలు అందించలేకపోతున్నామని అంటున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటిలేరట్లకు మర్మతులు నిర్వహించి.. గుత్తేదారు సంస్థపై చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. 

 

08:44 - August 23, 2018

గుంటూరు : ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులను...  రెండుకళ్ల సిద్దాంతంతో చూస్తోందని అసైన్డ్‌ భూముల రైతులు ఆరోపిస్తున్నారు. అగ్రవర్ణాలను ఒక కంటితో.. అణగారిన వర్ణాలను మరో కంటితో చూస్తోందని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమపై వివక్ష చూపడంమాని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజారాజధానిలో ప్రజలందరినీ సమానంగా చూడాలని కోరుతున్నారు.
నిండా మునిగిన అసైన్డ్‌ భూముల రైతులు
నవ్యాంధ్రప్రదేశ్‌ కలల రాజధాని అమరావతికి 29 గ్రామాల రైతులు భూములు ఇచ్చారు. దాదాపు 34 వేల ఎకరాలకుపైగా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారు. మోతుబరీ రైతులు పెద్ద ఎత్తున తమ భూములు పోవడంతో బాగుపడ్డారు. ఉన్నపట్టాన కోటీశ్వరులు అయిపోయారు. చిన్న,సన్నకారు రైతులు కొద్దోగొప్పో బాగుపడ్డారు. ఇక ఎటొచ్చీ అసైన్డ్‌ భూములు ఉన్న దళిత రైతులు మాత్రం నిండా మునిగిపోయారు. పట్టాభూములు ఉన్న జరీబు భూముల రైతులకు ఎకరానికి 1450 గజాల ప్లాట్లు, మెట్ట భూముల రైతులకు ఎకరానికి 1250 గజాల ప్లాట్లు సీఆర్‌డీఏ పరిధిలో ఇచ్చారు. రెసిడెన్సియల్‌, కమర్షియల్‌ ప్లాట్లను ఉదార బుద్దితో ప్రభుత్వం ఇచ్చి వారిని సంతృప్తిపరచింది. అంతేకాదు.. జరీబు భూముల రైతులకు పదేళ్లపాటు ఎకరానికి 50వేల రూపాయలు కౌలు ఇవ్వడంతోపాటు ప్రతి సంవత్సరం ఐదువేల రూపాయాలు పెంచుతూ పదేళ్లపాటు కౌలు కొనసాగిస్తారు. అదేవిధంగా మెట్ట భూముల రైతులకు ఎకరానికి 30వేల రూపాయలు కౌలు ఇస్తూ... ప్రతి సంవత్సరం మూడువేలు పెంచుతూ పదేళ్లు కౌలు కొనసాగిస్తారు. అయితే అసైన్డ్‌ భూములు ఉన్న నిరుపేద రైతుల పట్ల ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోంది వారికి ఎకరానికి కేవలం వెయ్యి గజాలు మాత్రమే ఇస్తామంటున్నారు.  అసైన్డ్‌ భూములు ఇచ్చిన కొందరు రైతులకు మాత్రమే కౌలు ఇస్తున్నారు. మరికొందరికి రిక్త హస్తాలు చూపుతున్నారు.  కౌలు రైతుల్లో కొందరికి ఎకరం కూడా లేని పరిస్థితి ఉంది. దీంతో డికెటి పట్టాలు ఉన్న రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దళితులకు ఆంగ్లేయుల కాలం నుంచి అసైన్డ్‌ భూమి
ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, తాళ్లాయపాలెం, రాయపూడి, లింగాయపాలెం, దొండపాడు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, శరిశ్చంద్రపాలెం గ్రామాల్లోని దళితులకు ఎక్కువగా అసైన్డ్‌ భూమి ఉంది. ఆంగ్లేయుల కాలం నుంచి వీరు ఈ భూములను నమ్ముకొని జీవిస్తున్నారు. లంక భూములు కూడా వీరి ఆధీనంలోనే ఉన్నాయి. అంతేకాదు.... అసైన్డ్‌ భూముల క్రయవిక్రయాలు జరిగినా వాటిని క్రమబద్దీకరించలేదు. దీంతో వీరి పరిస్థితి అయోమయంలో పడింది. అసైన్డ్‌ భూములకు ఎకరానికి కేవలం వెయ్యి గజాల రెసిడెన్షియల్‌ ప్లాటు మాత్రమే ఇస్తామంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.
న్యాయం చేయాలని కోరుతున్న అసైన్డ్‌ భూముల రైతులు
మొదట వీరికి ఎకరానికి కేవలం ఆరువందల గజాలు, ఏడు వందల గజాల ప్లాటు ఇస్తామని సీఆర్‌డీఏ అధికారులు బేరం పెట్టారు. అందుకు అంగీకరించని అసైన్డ్‌ భూముల రైతులు ఆందోళనకు దిగారు. వామపక్షాలు, జనసేన వీరికి మద్దతుగా నిలిచాయి. పలు ఆందోళనల అనంతరం వెయ్యి గజాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే తమకు కూడా పట్టాభూముల రైతులకు ఇచ్చిన పపరిహారం ఇవ్వాలని వీరు కోరుతున్నారు. అందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. దీంతో తాము భూములను ఇవ్వబోమని తెగేసి చెబుతున్నారు. వీరి భూములకు పంటనష్టం జరిగినప్పుడు నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. దళితులమైన తమ పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని వీరు ఆరోపిస్తున్నారు. ఏళ్లు గడిచిపోతున్నాయని అని విధాలా తాము నష్టపోతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఎడల కూడా కనికరం చూపి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

 

నేడు ఏపీలో జిల్లాల, నియోజకవర్గాల కాంగ్రెస్ సమన్వయ కమిటీల సమావేశం

కృష్ణా : నేడు ఏపీలోని అన్ని జిల్లాల, నియోజకవర్గాల కాంగ్రెస్ సమన్వయ కమిటీల సమావేశం జరుగనుంది. విజయవాడలో సమన్వయ కమిటీల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఊమెన్ చాందీ, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు హాజరుకానున్నారు.  

నేడు రేషన్ డీలర్లతో మంత్రి ఈటల భేటీ

హైదరాబాద్ : నేడు రేషన్ డీలర్లతో మంత్రి ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. సచివాలయంలో రేషన్ డీలర్లతో ఆయన సమావేశం కానున్నారు.

తిరుమలలో నేటితో ముగియనున్న పవిత్రోత్సవాలు

తిరుమల : శ్రీవారి ఆలయంలో నేటితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. మహా పూర్ణాహుతితో పవిత్రోత్సవాలను ముగించనున్నారు. 

07:36 - August 23, 2018

గుంటూరు : జిల్లాలో విషాదం నెలకొంది. కృష్ణానదిలో ప్రమాదవశాత్తూ మునిగి నలుగురు చిన్నారులు చనిపోయారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందినవాళ్లు కావడం... వారిలోనూ ఇద్దరు అన్నదమ్ములు ఉండడం అందరినీ కలచివేసింది. కృష్ణమ్మ వరద ఉధృతిని చూద్దామని అనుకోవడమే వారికి శాపమైంది. బక్రీద్‌ పర్వదినాన స్కూల్‌కు సెలవు రావడం.. వాళ్ల జీవితాలకు శాశ్వత సెలవుగా మారింది. సరదాగా కృష్ణమ్మ పరవళ్లు చూద్దామనుకున్న బాలురు విగత జీవులుగా మారారు. విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారడంతో కన్నవాళ్లకు పుట్టెడు శోకం మిగిలింది.
కృష్ణా ప్రవాహంలో కొట్టుకుపోయిన నలుగురు 
గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన ఏడుగురు విద్యార్థులు పరవళ్లు తొక్కుతున్న కృష్ణానదిని చూసేందుకు గ్రామానికే చెందిన ఓ ఆటోలో బయలుదేరి వెళ్లారు. అందులో ఆటోడ్రైవర్‌ కుమారులిద్దరు కూడా ఉన్నారు. కృష్ణానది ఉధృతిని గమనించిన ఆటోడ్రైవర్‌ చిన్నవారైన తన కుమారులతోపాటు మరో బాలుడిని ఆటోలోనే ఉంచాడు. మిగతా నలుగురు కృష్ణానది ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లారు. అయితే ఆటోడ్రైవర్‌ కాలకృత్యాలు తిర్చుకోవడానికి వెళ్తున్నానని.. తను వచ్చే వరకు ఎక్కడికి వెళ్లొద్దని ఆటోలో ఉన్న ముగ్గురికి చెప్పాడు. తిరిగి వచ్చే సరికి ఆటోలో ఉన్న ముగ్గురితోపాటు మరో బాలుడు నదిలో కొట్టుకుపోవడం గమనించారు. వెంటనే లుంగీ అందించి వాళ్లను పైకిలాగేందుకు ప్రయత్నించాడు. కానీ నలుగురూ కృష్ణా ప్రవాహంలో కొట్టుకుపోయారు.
నాలుగు మృతదేహాలు లభ్యం
ఆటోడ్రైవర్‌ నలుగురు చిన్నారులు కొట్టుకుపోయిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుననారు. గజ ఈతగాళ్లతో వెతికించారు. ప్రమాదం జరిగిన మూడున్నర గంటల తర్వాత రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వారిని నీలం క్రాంతికుమార్‌, నీలం శశిగా గుర్తించారు. ఆతర్వాత ఎన్డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌, ఏపీ రిస్క్‌ఫక్షర్స్‌ బలగాలు కృష్ణానదిలో గల్లంతైన మరో ఇద్దరి కోసం వెదికాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మిగిలిన ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని తేడేకోరు శివ, దినేశ్‌గా గుర్తించారు.  సరదాగా కృష్ణా ఉధృతిని చూసేందుకు వెళ్లిన బాలురు విగతజీవులుగా మారడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నీలం క్రాంతి, శశి అన్నదమ్ములే కావడంతో ఆ ఇంట్లో విషాదాన్ని మిగిల్చింది. 
సహాయక చర్యలు పర్యవేక్షించిన గల్లా జయదేవ్‌
విషాదం గురించి తెలియగానే టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్‌ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇచ్చారు. రెస్క్యూటీమ్‌లు వీలైనంత తొందరగా వచ్చేలా చర్యలు తీసుకున్నారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీనారాయణ చెప్పారు.మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా చూస్తామని మంగళగిరి టీడీపీ ఇంచార్జీ గంజి చిరంజీవి తెలిపారు. 

 

07:28 - August 23, 2018

కర్నూలు : కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 2,03,473 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంటే....  లక్షా 87వేల 679 క్యూసెక్కుల నీటీని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా...  ప్రస్తుతం ప్రాజెక్టులో 883.40 అడుగుల మేర నీరు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వసామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 206 టీఎంసీలకు పైగా నీరు చేరింది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటీ విడుదల కొనసాగుతోంది. 

 

07:27 - August 23, 2018

కృష్ణా : విజయవాడలో గవర్నర్‌ నరసింహన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నరసింహన్‌తో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గవర్నర్‌ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు.  కేంద్ర సహకారంలేక రాష్ట్రం నష్టపోతున్న తీరును సీఎం వివరించారు. రాష్ట్రానికి న్యాయం చేసే విషయంలో కీలకంగా వ్యవహరించాలని గవర్నర్‌ను కోరినట్టు తెలుస్తోంది.  ఈ భేటీ నేపథ్యంలో త్వరలోనే కేబినెట్‌ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గంలో మైనారిటీలకు ఛాన్స్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. 

 

07:23 - August 23, 2018

హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఎవరితోనూ పొత్తులుండబోవని తెలిపారు. అభ్యర్థులు ఖరారు అయ్యారని.. వారికి అండదండలు ఇవ్వాలని మంత్రులను కోరారు. సెప్టెంబర్‌ 2నే ప్రగతి నివేదన సభ నిర్వహించాలని.. 25 లక్షల మందిని దానికి సమీకరించాలని ఆదేశించారు. నిన్న జరిగిన మంత్రివర్గ ఇష్టాగోష్టిలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్‌.... అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు పిలుపునిచ్చారు. 
సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ ఇష్టగోష్టి
తెలంగాణ మంత్రివర్గ ఇష్టాగోష్టి సుదీర్ఘంగా సాగింది. సాయంత్రం 4 గంటలకు మొదలైన ఈ భేటీ.. రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలు, ప్రగతి నివేదన సభపైనే ప్రధాన చర్చ జరిగింది.  ఎన్నికలకు సన్నద్దులను చేస్తూనే.. మంత్రులు పోషించాల్సిన కీలక పాత్రను కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై కేసీఆర్‌ సహచర మంత్రుల అభిప్రాయాలను స్వీకరించారు. వారు క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు. ఎన్నికల సన్నద్ధత ఎంతవరకు వచ్చిందీ చెప్పారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 
కొంగర్‌కలాన్‌లో సభకు కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌
సెప్టెంబర్‌ 2న ప్రగతి నివేదన సభ జరుగుతున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. సభా వేదికగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌ ప్రాంతాన్ని ఈ సమావేశంలో ఖరారు చేశారు. 25 లక్షల మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు.  నేటి నుంచే సభ నిర్వహణ ఏర్పాట్లు ప్రారంభించాలని ఆదేశించారు. 1600 ఎకరాల్లో సభ నిర్వహించనున్నారు. ఇందులో 600 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తుండగా.. మిగతా వెయ్యి ఎకరాలను వాహనాల పార్కింగ్‌ కోసం వినియోగించనున్నారు.
రేపు టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం
కొంగరకలాన్‌ సభకు సన్నాహకంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, రాష్ట్ర కమిటీ సంయుక్త సమావేశం నిర్వహించబోతున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు.  పార్టీ రాష్ట్ర కమిటీలోచేసిన 9 తీర్మానాలను సీఎం మంత్రులకు వివరించారు. వాటి అమలుకు తగిన కార్యాచరణ ఉండాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపార్టీతోనూ పొత్తులు ఉండబోవని , ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు మంత్రులకు కేసీఆర్‌ స్పష్టం చేశారు.  కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పథకాలపై శాఖల వారీగా మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలని, ఢీల్లీకి వెళ్లి కేంద్రమంత్రులపై ఒత్తిడి పెంచాలని నిర్దేశించారు. నాలుగేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలను సభావేదికగా ప్రజలకు వివరించనున్నట్టు తెలిపారు.
పార్టీశ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయాలన్న కేసీఆర్‌
సెప్టెంబర్‌ 2న సభ ముగిసిన తర్వాత గడప గడపకు టీఆర్‌ఎస్‌ పథకాలను తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టాలని, ఇందుకోసం పార్టీ శ్రేణులను సమాయాత్రం చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న  రైతుబంధు, రైతు జీవితబీమా, పాడిగేదెల పంపిణీ, కంటి వెలుగులాంటి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా ఇబ్బంది ఉన్న ప్రాంతాలను గుర్తించి స్థానికంగా సర్దుబాటు యత్నాలు చేయాలని మంత్రులను ఆదేశించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థులని అనుకుంటున్న వారికి నియోజకవర్గంలో సంస్థాగతంగా ఎదురులేకుండా చూసే బాధ్యత మంత్రులదేనని చెప్పారు. టికెట్‌ దక్కని వారికి అధికారంలోకి వస్తే.. వారికి స్థాయికి తగిన విధంగా పదవులు ఇస్తామనే హామీలు ఇవ్వాలని సూచించారు. 
 

నేడు, రేపు తెలంగాణలోని నదుల్లో వాజ్ పేయి చితాభస్మం నిమజ్జనం

హైదరాబాద్ : నేడు, రేపు తెలంగాణలోని నదుల్లో వాజ్ పేయి చితాభస్మం నిమజ్జనం చేయనున్నారు. ఇవాళ అనంతగిరి వద్ద మూసీ నదిలో వాజ్ పేయి చితాభస్మాన్ని నిమజ్జనం చేయనున్నారు. దత్తాత్రేయ, రామచంద్రారెడ్డి నేతృత్వంలో కార్యక్రమం జరుగనుంది. నేడు మురళీధర్ రావు నేతృత్వంలో వాడేపల్లి వద్ద చితాభస్మం నిమజ్జనం చేయనున్నారు.

 

నేడు గుజరాత్ లో లక్ష సామూహిక గృహప్రవేశాలు

గుజరాత్ : నేడు గుజరాత్ లో లక్ష సామూహిక గృహప్రవేశాలు జరుగనున్నాయి. లక్ష ఇళ్లను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

Don't Miss