Activities calendar

24 August 2018

బీజేపీ ఎంపీ జీవీఎల్ కారు ఢీకొని మహిళ మృతి..

గుంటూరు : తాడేపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ జీవీఎల్ కారు ఢీకొన్ని ఓ మహిళ మృతి చెందింది. మరో మహిళకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా వుండటంతో చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ఇమామ్, మౌజమ్ లకు భృతికి కేసీఆర్ నిర్ణయం..

హైదరాబాద్ : మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజమ్ లకు నెలకు రూ.5,000 భృతి ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి పెరిగిన భృతి చెల్లించనున్నట్లు వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మౌజమ్, ఇమామ్ లకు మొదట నెలకు వెయ్యి రూపాయల భృతి అందించారు. ఆ తర్వాత దాన్ని రూ.1500 కు పెంచారు. 2018 సెప్టెంబర్ 1 నుంచి ఆ భృతిని రూ.5 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే దాదాపు 9,000 వేల మందికి ప్రభుత్వ నిర్ణయం వల్ల మేలు కలుగుతుందని సీఎం అన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతం చేయాలి : చంద్రబాబు

అమరావతి : ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..రాఊంలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంవైపు మారాలన్నారు. ప్రయాణీకుడికి సౌకర్యవంతంగా..వినియోగదారుడికి ఆర్థిక భారం తగ్గాలన్నారు.ఈ వాహనాల వినియోగంతో కాలుష్యాన్ని నివారించాలని..ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. అనుకూలంగా వున్న ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వెంటనే ప్రవేశపెట్టాలని..ఈ కార్యక్రమం త్వరితగతిన రాష్ట్రంలో చేపట్టటానికి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలన్నారు.

మినీ గురుకుల ఉద్యోగులకు వేతనాల పెంపు..

హైదరాబాద్ : 29 మినీ గురుకులాల ఉద్యోగులకు వేతనాలు పెంచుతు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. హెచ్ ఎం, వార్డెన్ కు రూ.5వేల నుండి 21వేలకు పెంచారు. సీఆర్డీలకు రూ.4 వేల నుండి రూ.15వేలు, పీఈటీలకు రూ.4 వేల నుండి రూ.11వేలు, అకౌంటెంట్ కు రూ.3,5000ల నుండి రూ.10వేలు,ఏఎన్ఎంలకు రూ.4వేల నుండి రూ.9వేలు, వంట మనిషి, ఆయా, హెల్పర్స్, స్పీపర్స్, వాచ్ మెన్ లకు రూ.2.500 నుండి రూ.7.500లకు పెంచుతు ఉత్తర్వులను జారీ చేశారు. 

50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో పర్యటిస్తా: కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఎన్నికల విషయంలో తుది నిర్ణయం నాదేనన్న సీఎం కేసీఆర్‌ ఎవరూ ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. సెప్టెంబర్‌ 2న జరిగే సభపై నేతలతో చర్చించిన కేసీఆర్‌ సభ విజయవంతం అయ్యేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానన్న కేసీఆర్‌.. 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు.

లాభసాటి వ్యవసాయానికి పరిశోధనలు జరగాలి : వెంకయ్యనాయుడు

విశాఖపట్నం : వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం దేశ ఆహార భద్రతకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో రైతుల సాగును విడనాడి ఇతర వృత్తుల్లోకి వెళ్తుతున్నారి ఆవేదన వెలిబుచ్చారు. బాబా అణు పరిశోధనా కేంద్రం, హోమీ బాబా కేన్సర్‌ ఆస్పత్రి పరిశోధనా కేంద్రం విశాఖలో నిర్వహించిన సదస్సుకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు విస్తృతం చేయాలని కోరారు. 

18:47 - August 24, 2018

విశాఖపట్నం : వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం దేశ ఆహార భద్రతకు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో రైతుల సాగును విడనాడి ఇతర వృత్తుల్లోకి వెళ్తుతున్నారి ఆవేదన వెలిబుచ్చారు. బాబా అణు పరిశోధనా కేంద్రం, హోమీ బాబా కేన్సర్‌ ఆస్పత్రి పరిశోధనా కేంద్రం విశాఖలో నిర్వహించిన సదస్సుకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు విస్తృతం చేయాలని కోరారు. 

18:43 - August 24, 2018

విజయవాడ : అరకు ఎంపీ కొత్తపల్లి గీత కొత్త పార్టీని స్థాపించారు. జనజాగృతిగా పార్టీకి నామకరణం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయాల్లో మహిళలకు 3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. అన్ని కులాల వారికి సమానంగా టికెట్లు ఇస్తామని, ప్రతి ఎమ్మెల్యే మీదా ఆరు నెలలకు ఒక సారి సోషల్‌ ఆడిట్‌ చేయిస్తామని తెలిపారు. పార్టీ స్థాపించిన సందర్భంగా ఎంపీ కొత్తపల్లి గీత సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లపై విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విరుచుకుపడటం తప్పితే రాష్ట్రానికి ఎలాంటి మేలు చేసింది లేదని ఆరోపించారు. 

18:39 - August 24, 2018

ప్రకాశం : అధికారం కోసం టీడీపీ... కాంగ్రెస్ పంచన చేరుతోందని బీజేపీ ఆరోపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే ధైర్యంలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల చరిత్ర అంతా పొత్తులేని వ్యాఖ్యనించారు. ఏపీలో కాంగ్రెస్‌తో పెత్తుకు సిద్ధమవుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ విమర్శించారు. 

18:36 - August 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఎన్నికల విషయంలో తుది నిర్ణయం నాదేనన్న సీఎం కేసీఆర్‌ ఎవరూ ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. సెప్టెంబర్‌ 2న జరిగే సభపై నేతలతో చర్చించిన కేసీఆర్‌ సభ విజయవంతం అయ్యేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానన్న కేసీఆర్‌.. 50 రోజుల్లో 100 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు. కాగా సెప్టెంబర్‌ 2న హైదరాబాద్‌ శివారు కొంగర కలాన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించనున్న ప్రగతి నివేదన సభ ఏర్పాట్లకు సంబంధించి పలువురికి పలు కీలక బాధ్యతలను  సీఎం కేసీఆర్‌ అప్పగించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు చేస్తున్న ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పరిశీలించిన కేసీఆర్‌.. పలు సూచనలు కూడా చేశారు. 

18:22 - August 24, 2018

జమ్ముకశ్మీర్‌ : అనంత్‌నాగ్‌లోని కొకేర్‌నాగ్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉదయం నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కోకేర్‌నాగ్‌లో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతాబలగాలు అర్ధరాత్రి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఆర్మీ ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఇరు వర్గాల మధ్య కాల్పుల నేపథ్యంలో అనంత్‌నాగ్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

18:20 - August 24, 2018

కేరళ : వరదలతో అతలాకుతలమైన కేరళకు యూఏఈ 700 కోట్ల సహాయంపై చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో భారత్‌లో ఆ దేశ రాయబారి అహమద్‌ అలబానా స్పందించారు. ఇప్పటివరకు అధికారికంగా ఎన్ని కోట్లు ఇవ్వాలన్నది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. దీనిపై తమ ప్రభుత్వం అంచనా వేస్తోందని అలబానా పేర్కొన్నారు. విదేశీ ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహకారాన్ని తీసుకునేది లేదని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కేరళలో సహాయక చర్యలు, పురరావాసానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే సహకారం అందిస్తాయని విదేశాంగ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ వెల్లడించారు. కేరళకు సహాయం అందించేందుకు యూఏఈ 700 కోట్లు, కతార్‌ 35 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం యూఏఈ సహాయం స్వీకరించడానికి శ్రద్ధ చూపుతోంది. కేరళ ప్రజలు యూఏఈ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని ఆ దేశ పాలకులు గుర్తించిన క్రమంలో యుఏఈని ఇతర దేశంగా పరిగణించలేమని చెబుతోంది. 

18:15 - August 24, 2018

మధ్యప్రదేశ్‌ : రాష్ట్రంలో సిఎం పేరు చెప్పుకుని ఫ్యామిలితో ఉన్న ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. భోపాల్‌ అసెంబ్లీ ముందు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారును పోలీసులు ఆపారు. తాను ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ బావమర్దిని అంటు కారు డ్రైవర్‌ హంగామా సృష్టించాడు. తనకే జరిమానా విధిస్తారా...అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనపై స్పందించిన సిఎం- రాష్ట్రంలో తనకు కోట్లాది మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారని... వాళ్ల భర్తలంతా తనకు బావమర్దులే అంటూ నవ్వుతూ చెప్పారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని శివరాజ్‌సింగ్‌ తెలిపారు.

18:13 - August 24, 2018

కడప : పెద్ద ముడియం మండలంలో కందు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు నీరు విడుదల చేశారు. ఈ నీరు కుందు నదిలోకి చేరుతోంది. దీంతో కుందు నదికి వరద ఉధృతి పెరిగింది. ఈ కారణంగా పెద్ద ముడియం మండలంలోని బలపనగూడూరు, చిన్నముడియం, బలిశనూరు, నిమ్మలదిన్నె గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ గ్రామాల్లో ఐదు అడుగుల మేర నీరు చేరడంతో రాకపోకలను నిషేధించారు. కుందు నది వరదలపై రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 

18:12 - August 24, 2018

హైదరాబాద్ : వచ్చే నెల 2వ తేదీన రంగా రెడ్డి జిల్లా ఇంబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో నిర్వహించే బహిరంగ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రగతి నివేదికను ఈ సభలో విడుదల చేస్తారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతోనే ఈ సభ నిర్వహిస్తున్నామంటున్న రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. 

18:08 - August 24, 2018

అమరావతి : ఏపీలోని పన్నెండు పర్యాటక ప్రాంతాలపై రూపొందించిన పోస్టల్‌ స్టాంపులను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధిలో తపాలా శాఖ భాగస్వామ్యం కావడం పట్ల చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. పర్యాటకుల ఆకర్షణలో మూడో స్థానంలో ఉన్న ఏపీని మొదటి స్థానంలోకి తీసుకెళ్లడమే లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. ఉపాధి కల్పనలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తోంది, దీన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 

తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు..

హైదరాబాద్ : తెలంగాణలో ఐఏఎస్ లను బదిలీలయ్యారు. జీహెచ్ ఎంసీ కమిషనర్ గా దాన కిషోర్, హెచ్ ఎండీ కమిషన్ గా జనార్థన్ రెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ గా చిరంజీవులు, రెడ్డి బదిలీలయ్యారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా దేవర మల్లప్ప, రాష్ట్ర కో ఆపరేటివ్ కర్స్యూమర్స్ ఫెడరేషన్ డైరెక్టర్ గా గట్టు తిమ్మప్ప, సంగీ నాటక అకాడమీ చైర్మన్ గా బాద్మి శివకుమార్ లను బదిలీ చేస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అర్చకులపై కేసీఆర్ వరాలు...

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో అర్చకులకు నేరుగా వేతనాలకు అందజేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. సెప్టెంబర్ 1 నుండి ప్రభుత్వ ఖరాజా నుండి వేతనాలను అందజేస్తామన్నారు. అర్చకుల పదవీ విరమణ వయోపరిమితి 58 నుండి 65 ఏళ్ళకు పెంచుతున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. జీతాల చెల్లింపులు, పరదవీ విరమణపై సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. 

ఏ కులానికి ఎంత స్థలం..ఎంత డబ్బు...?

హైదరాబాద్ : ఆరు సంచార కులాలకు కలిపి పది ఎకరాల్లో రూ. 10కోట్ల వ్యయంతో హైదరాబాద్ సంచార ఆత్మగౌరవ భవన్ నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మున్నూరు కాపులకు 5 ఎకరాలు రూ. కోట్లు, దూదేకుల కులానికి 3 ఎకరాలు - రూ. 3 కోట్లు, గంగ పుత్రులకు రూ. 2 ఎకరాలు- రూ. 2 కోట్లు, విశ్వకర్మలకు 2 ఎకరాలు - రూ. 2 కోట్లు, మిగతా కులస్తులకు ఒక్కో ఎకరం - ఒక్కో కోటి, బట్రాజులకు అర ఎకరం - అర కోటి కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. వెంటనే భవనాల నిర్మాణాల ప్రక్రియను ప్రారంభించాలని మంత్రులకు, ఆయా అధికారులకు, కుల సంఘాలకు సూచించారు. 

'అన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనాలు'...

హైదరాబాద్ : రాజధానిలో అన్ని కులాల వారు ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయించామని సీఎం కేసీఆర్ తెలిపారు. కోకాపేట, ఘట్ కేసర్, మేడిపల్లి, మేడ్చల్, అబ్దుల్లాపూర్ మెట్, ఇంజాపూర్ ప్రాంతాల్లో స్థలాలు గుర్తించడం జరిగిందన్నారు. 

ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ - కేసీఆర్...

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్లు ఉచిత విద్యుత్ గా ఉంది. తెలంగాణలో విద్యుత్ పరిస్థితి మెరుగు పడిందన్నారు. 

అన్ని కులాలవారికీ ఆత్మగౌరవ భవనాలు : కేసీఆర్

హైదరాబాద్ : దేశంలో మరే రాష్ట్రంలోను లేని విధంగా తెలంగాణలో అన్ని కులాలవారికి రాజధానిలో ఆత్మగౌవర భవనాలు నిర్మించుకోవటానికి స్థలాలు, నిధులు కేటాయించామని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో 36 సంచార కులాలకు కలిపి 10 ఎకరాల్లో..రూ.10 కోట్ల వ్యవయంతో సంచార ఆత్మగౌరవ భవన్ నిర్మించామన్నారు.

ఆంధ్రులకు ఇచ్చిన మాట నిలుపుకుంటాం : రాహుల్

ఢిల్లీ : ఆంధ్రులకు రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను ముమ్మాటి నిలబెట్టుకుంటామని..ఆంధ్రులకు ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరతామని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రులకు మాట ఇచ్చామనీ, దాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చింది.

ప్రారంభమైన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం..

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్షం విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. వచ్చే నెల 2న జరగనున్న ప్రగతి నివేదన సభ నిర్వహణ, ఈ సభ విజయవంతానికి కమిటీల ఏర్పాటు, బాధ్యతలు అప్పగించడం..ప్రభుత్వ పథకాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

బీజేపీ, కాంగ్రెస్ లతో ఎప్పటికీ పొత్తు లేదు : నారాయణ

అమరావతి : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 25 పార్లమెంట్ సీట్లు గెలవటం కోసం ప్రాంతీయ పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. అంతే తప్ప రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించిన కాంగ్రెస్ తోను, రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ అన్యాయం చేసిన బీజేపీతోను పొత్తులు ఎప్పటికీ పెట్టుకోబోమని మంత్రి నారాయణ తెలిపారు. 

టూరిజంలోని ఉపాధిని సద్వినియోగం చేసుకోవాలి : చంద్రబాబు

అమరావతి : పర్యాటక రంగంలో ఉపాధిని యువత సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ పర్యాటక రంగంపై తపాలా బిళ్లలను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. రాష్ట్రంలో 12 పర్యాటక స్థలాలపై రూపొందించిన తపాలాబిళ్లలకు చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..దేశంలోనే ఏపీ పర్యాటకం రంగం ప్రస్తుతం మూడవ స్థానంలో వుందని దాన్ని మొదటిస్థానంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలు భారీగా వున్నాయని ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.  

16:11 - August 24, 2018

తూర్పుగోదావరి : అక్కడ ఓఎన్ జీసీ గ్యాస్ పైప్ లైన్స్ లీక్ అవ్వటం సాధారణంగా మారిపోయింది, ఎన్నిసార్లు గ్యాస్ లీక్ ప్రమాదాలు జరిగినా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. ఈ క్రమం జిల్లాలోని మకిలిపురం మండలంలోని గొల్లపాలెంలో ఓఎన్ జీసీ పైప్ లైన్ మరోసారి స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఓఎన్ జీసీ బావి నుండి గ్యాస్ లీస్ అయి 30 అడుగుల ఎత్తువరకు ఎగజిమ్మింది. దీంతో పదే పదే గ్యాస్ పైప్ లైన్స్ లీక్స్ జరగటంతో అధికారులు ఏ మాత్రం పట్టించుకోవటంలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

15:59 - August 24, 2018

శ్రీకాకుళం : వారంతా అనాథలు. అంతకు మించి మానసిక దివ్యాంగులు. ఓ సంస్థ వారిని చేరదీసింది. అనాథ శరణాలయంలో కాలమెల్లదీస్తున్న వారికి ఆధార్‌కార్డుల ధృవీకరణ పెద్ద సమస్యగా తయారైంది. వారి దగ్గర ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ఆధార్‌ నమోదు చేయడం లేదు. దీంతో వారు ప్రభుత్వం అందించే పెన్షన్‌, స్కాలర్‌షిప్‌ను పొందలేకపోతున్నారు.

అనాథలను అక్కున చేర్చుకుంటోన్న సుమిత్ర శరణ్య మనోవికాస కేంద్రం
శ్రీకాకుళం నగరంలోని అఫీషియల్‌కాలనీలోని సుమిత్ర శరణ్య మనోవికాస కేంద్రమిది. ఈ కేంద్ర నిర్వాహకులు అనాథలకు ఇందులో అవకాశం కల్పిస్తున్నారు. ఈ సుమిత్ర ఆర్గనైజేషన్‌లో ప్రస్తుతం 70 మంది వరకు బాల బాలికలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది మానసిక వికలాంగులే. వినికిడి, దృష్టి సమస్యలతో సతమతవుతున్నారు. అంతేకాదు.. మరికొంత మంది దివ్యాంగులు కూడా ఉన్నారు.

22 మంది దివ్యాంగులకు లేని ఆధార్‌కార్డు
మానసిక దివ్యాంగులకు ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తోంది. అంతేకాదు.. వీరంతా చదువుకుంటున్న వారే కనుక వారికి స్కాలర్‌షిప్‌ అవసరం కూడా ఉంటుంది. ఈ రెండూ కావాలంటే ముందు వారికి ఆధార్‌కార్డు ఉండాలి. సుమిత్ర ఆర్గనైజేషన్‌లో 70 మంది బాలబాలికలు ఉంటే... వారిలో 22 మందికి ఆధార్‌ కార్డులు లేవు. దీంతో వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు.

అనాథల దగ్గర లేని ధృవీకరణ పత్రాలు
సాధారణంగా ఎవరికైనా ఆధార్‌ పొందాలంటే... ప్రభుత్వ ఆదేశాల మేరకు జనన ధృవీకరణ పత్రంతోపాటు రేషన్‌కార్డు, అడ్రస్‌ ప్రూఫ్‌ అవసరం అవుతాయి. ఈ బాలబాలికలు అంతా అనాథలే. వారిలో కొంతమందికి తండ్రో, తల్లో ఉంటే.. మిగతా వారికి తల్లిదండ్రి ఇద్దరూలేని వారు. ఇప్పుడు వారికే ఈ సమస్య వచ్చిపడింది. తల్లిదండ్రులు ఎవరో తెలియని బాలబాలికలకు జనన ధృవీకరణ పత్రంకానీ... ఇతర ధృవీకరణ పత్రాలుకానీ లేవు. తల్లిదండ్రి కూడా ఎవరో తెలియదు. ఆధార్‌ కేంద్రానికి వెళితే అన్ని పత్రాలు ఉంటేనే రిజిస్టర్‌ చేస్తామని చెప్తున్నారు. దీంతో వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ప్రభుత్వం నుంచి పొందే పెన్షన్‌కానీ.. స్కాలర్‌షిప్‌కానీ ఆధార్‌లేని కారణంగా అందడం లేదు. బైట్స్‌: శ్రీదేవి, శరణ్య మనోవికాస కేంద్రం నిర్వాహకురాలు. ఇలాంటి బాధితులు ఒక్క శ్రీకాకుళం నగరంలోనేకాదు... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వారికి ఎలాంటి ధృవీకరణ పత్రాలులేని కారణంగా ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలేమీ పొందడం లేదు. వీరిపట్ల ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టి... ఆధార్‌కార్డులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకుంటే సమాజంలో నిరాదరణకు గురవుతున్న ఈ నిర్బాగ్యులు మరింత నిరాదరణకుగురయ్యే అవకాశం ఉంది.

15:57 - August 24, 2018

అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఆగమశాస్త్రయుక్తంగా రూపొందించిన ఆలయ నమూనాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. కృష్ణానది అభిముఖంగా 25 ఎకరాల్లో టీటీడీ దివ్యధామం నిర్మిస్తారు. ఇందుకు 140 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈనెల 29న జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. అమరావతి వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పూర్తి రాతికట్టడంగా ఆలయ నిర్మాణం చేపడతారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తవడానికి రెండేళ్లు పడుతుంది. 

15:57 - August 24, 2018

ఉత్తరాఖండ్ : రానున్న రెండు రోజుల్లో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో హిమాచల్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌, ఉత్తర కాశి, ఉధమ్‌సింగ్‌ నగర్‌ జిల్లాలలో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డెహ్రాడూన్‌, హరిద్వార్‌, పౌరి, నైనిటాల్‌, ఉధామ్‌ సింగ్‌ నగర్‌, చంపావత్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం కంగ్లా, మండి జిల్లాల్లో విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

15:55 - August 24, 2018

ఢిల్లీ : గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊరట లభించింది. 20,158 సీట్లకు మళ్లీ ఎన్నికలు జరిపించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మేలో జరిగిన పశ్చిమ బెంగాల్‌ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 20,178 స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఎన్నికల్లో అధికార టిఎంసి బెదిరింపులు, హింసాత్మక ఘటనలకు పాల్పడిందని, నామినేషన్లు వేయనీయ లేదని విపక్షాలు ఆరోపించాయి. 20,158 సీట్ల ఫలితాలపై ఉన్న స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ స్థానాలకు మళ్లీ ఎన్నికలు జరిపించాలని విపక్షాలు చేసిన డిమాండ్‌ను పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. 

15:51 - August 24, 2018

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కాంట్రాక్టర్ల నుంచి పాలకులు కమీషన్లు తీసుకుంటున్నారన్న విపక్షాల విమర్శలను మున్సిపల్‌ మంత్రి నారాయణ తిప్పికొట్టారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇస్తూ కమీషన్లు దండుకుంటున్నారి విపక్షాల నాయకులు ఆరోపించడాన్ని మంత్రి తప్పుపట్టారు. 2003 నుంచి 2018 వరకు అమల్లో ఉన్న జీవోల ప్రకారమే మొబిలైజేషన్‌ అడ్వాన్లులు చెలిస్తున్నామన్నారు. ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ విధానం 2003 నుంచి అమల్లో ఉందని నారాయణ చెప్పారు.

15:49 - August 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధాని సహా కేంద్ర మంత్రులను సీఎం కలువనున్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థ, సచివాలయ నిర్మాణం, రెండు రహదారుల విస్తరణ కోసం రక్షణశాఖ భూములు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున గతంలోనే కోరారు. దీంతో పాటు వెనుకబడి జిల్లాల అభివృద్ధి నిధులు 450 కోట్లు, అదనపు ఎఫ్‌ఆర్‌బీఎం నిధుల విడుదల అంశాలను ప్రస్థావించనున్నారు. జోనల్‌ వ్యవస్థకు తక్షణం ఆమోదముద్ర వేయించే విషయంలో ప్రధాని చొరవ చూపాలని కేసీఆర్‌ కోరనున్నారు. 

'ప్రగతి నివేదన' సభ..కేసీఆర్ సూచనలు...

హైదరాబాద్ : ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు. వేదిక, పార్కింగ్ ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్ 2న జరిగే సభకు పనులు వేగంగా చేయాలని...లక్షలాది మంది ప్రజలు వస్తున్నందున పకడ్బంది ఏర్పాట్లను చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఓఆర్ఆర్ నుండి సభా వేదికకు రావడానికి అనుగుణంగా 15-20వరకు రోడ్లను నిర్మించాలని...కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వ శాఖల అనుమతి తీసుకోవాలని...ఇందుకు పోరాట నిధులను ఖర్చు చేయాలని సూచించారు. 

15:31 - August 24, 2018

విజయవాడ : ఏపీలో వారసత్వ రాజకీయాలకు చెక్‌ పెట్టేందుకే సమసమాజ్‌ పార్టీని ఏపీలో స్థాపించామన్నారు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామయ్యయాదవ్‌. ఆర్థికంగా బలంగా ఉన్న పార్టీలను మేధావి వర్గంతో ఢీ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తామంటామని సమసమాజ్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామయ్యయాదవ్‌ తెలిపారు. ఐఎఎస్‌లు, ఐపీఎస్‌లు, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌తో పార్టీ క్యాడర్ బలంగా వుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామనీ..ఎన్నికల్లో గెలిచిన తర్వాత మెజార్టీ పార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం-రామయ్య తెలిపారు. ప్రజలకు నిజమైన సేవ చేసేందుకు మా సమ సమాజ్ పార్టీ ఉద్భవించింది-సమసమాజ్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామయ్యయాదవ్‌ తెలిపారు. 

జీవో 550 ప్రకారం ప్రవేశాలు...

ఢిల్లీ : జీవో 550పై హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. రిజర్వేషన్ కోటా మించకుండా యదావిధిగా ప్రవేశాలు కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొంది. వైద్య విద్య సీట్ల భర్తీలో రిజర్వేషన్ కోటా మించకుండా ప్రవేశాలు చేయనుంది. జీవో 550 ప్రకారం ప్రవేశాలు ఉండనున్నాయి. 

కేరళకు టి. ఎమ్మెల్సీల విరాళాలు...

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు ఎమ్మెల్సీలు విరాళాన్ని ప్రకటించారు. ఒక రోజు వేతనాన్ని 34 మంది ఎమ్మెల్సీలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ కు చీప్ విప్ సుధాకర్ రెడ్డి చెక్కును అందచేశారు. 

15:24 - August 24, 2018

ఢిల్లీ : మరోసారి ఎయిరిండియా సిబ్బంది నిర్వాకంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ఇటాలియన్‌ డీజేపై ఎయిరిండియా సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. చేయి చేసుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మెర్సీ కుజ్‌.. విమానం ఆలస్యంపై సిబ్బందిని ప్రశ్నించగా ఆమెపై దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తన బాధను వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్ట్‌ చేసింది. 

కోటి విరాళం ప్రకటించిన మేకపాటి...

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు మేకపాటి గౌతంరెడ్డి రూ. కోటి విరాళం ప్రకటించారు. కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసి గౌతంరెడ్డి సంబంధిత చెక్కును అందచేయనున్నారు.

 

సింగరేణి లాభాల్లో ఉద్యోగులకు వాటా...

హైదరాబాద్ : ఈనెల 29వ తేదీన సింగరేణి లాభాల్లో ఉద్యోగులకు యాజమాన్యం వాటా చెల్లించనుంది. 27 శాతం వాటా రూ. 327.44 కోట్లను చెల్లించనుంది. 

15:19 - August 24, 2018

హైదరాబాద్ : కేసీఆర్‌ ముందస్తుకు వేసిన బ్రేకులు కాంగ్రెస్‌లో కొత్త కుంపట్లను రాజేయనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి హస్తంపార్టీ వర్గాలు. అదేంటీ? కేసీఆర్‌ ముందస్తు ఫుల్‌స్టాప్‌కు కాంగ్రెస్‌ రాజకీయాలకు సంబంధం ఏమిటీ అనుకుంటున్నారా? అయితే వాచ్‌ దిస్‌ స్టోరీ...

ముందస్తు బ్రేక్‌తో కాంగ్రెస్‌లో కొత్త కష్టాలు
తెలంగాణలో కేసీఆర్‌ సృష్టించిన ముందస్తు హడావిడితో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికల హడావుడి ఎక్కువైంది. నేతలూ బిజీబిజీ అయ్యారు. నిన్నమొన్నటి వరకు ఉన్న గ్రూపు తగాదాలు... పోటాపోటీ బల ప్రదర్శనలకు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఎన్నికల మూడ్‌లోకి వెళ్లారు. నేతలంతా తమ తమ మధ్య నెలకొన్న కోల్డ్‌వార్‌కు స్వస్తి పలికి ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి మళ్లించడంతో పీసీసీ చీప్‌ ఉత్తమ్‌కు కొంత ఊరట లభించింది. దీంతో నేతల గొడవలతో కొంత ఇబ్బందుల్లో ఉన్న ఉత్తమ్‌... క్యాడర్‌ను ఎన్నికలకు సిద్ధంచేసే పనిలో బిజీ అయ్యారు.

ముందస్తు బ్రేక్‌తో కాంగ్రెస్‌లో సీన్‌రివర్స్‌
కాంగ్రెస్‌లో ఇప్పుడు మళ్లీ సీన్‌ రివర్స్‌ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనను విరమించుకున్నారన్న వార్తలు.. ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త గుబులు రాజేస్తోంది. నిన్నటి వరకు ఎన్నికలొచ్చేశాయని నియోజకవర్గాల్లో బిజీబిజీగా గడిపిన అసంతృప్త నేతలు... ఇప్పుడు తమ పాత అసంతృప్తికి రెక్కలు తొడగనున్నారు. దీంతో సైలెంట్‌ అయ్యాయనుకున్న సవాళ్లు.... మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

యాక్టివ్‌ అవుతోన్న ఉత్తమ్‌ వ్యతిరేక వర్గం
టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వ్యతిరేకవర్గం మళ్లీ యాక్టివ్‌ అవుతుందన్న చర్చ నేతల్లో జరుగుతోంది. నిన్నటిదాకా ఎన్నికలు వస్తున్నాయన్న బిజీతో హైకమాండ్‌కు ఇచ్చే ఫిర్యాదులకు బ్రేకులు వేసిన ఆ నేతలు.. ఇప్పుడు మళ్లీ తమ వ్యూహాలకు పదును పెట్టబోతున్నారు. కోమటిరెడ్డి, డీకె అరుణ, రేవంత్‌, భట్టి విక్రమార్క ఉత్తమ్‌తో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలంతా మళ్లీ ఢిల్లీ బాట పట్టబోతున్నట్టు తెలుస్తోంది.

పదవుల కోసం లాబీయింగ్‌ మొదలుపెట్టనునన సీనియర్లు
నిన్నటి వరకు ఏఐసీసీ పదవులు ఆశించిన నేతలు కూడా మళ్లీ తమ లాబీయింగ్‌కు పదునుపెట్టబోతున్నారు. ముందస్తుతో అంతా మరచి ఎలక్షన్‌ మూడ్‌లోకి వెళ్లిన నేతలు.. అవి రావని తేలడంతో వారంతా ఇప్పుడు ఢిల్లీలో పదవుల కోసం లాబీయింగ్‌ చేసుకునే ఏర్పాట్లలో ఉన్నారు.హస్తినతలో పెద్దలను ప్రసన్నం చేసుకోవడంలో, పోటీపడటం ఖాయమన్న చర్చ ఇప్పుడు పార్టీలో హీటెక్కిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్‌లో నేతల కలహాలకు బ్రేకులు వేసిన ముందస్తు ఎన్నికల ప్రచారం.. ఇప్పుడు రివర్స్‌రూట్‌లో సవాళ్లతో స్వాగతం పలుకుతోంది. దీంతో నిన్నటి వరకు ఖుషీగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, ఢిల్లీ పెద్దల సంతోషంపై ముందస్తు బ్రేక్‌ నీళ్లు జల్లినట్లైంది. మరి అసంతృప్త నేతలకు హస్తిన పెద్దలు ఎలా బ్రేక్‌ వేస్తారో చూడాలి.

రాష్ట్ర పర్యాటక ప్రమోషన్ బోర్డుతో బాబు భేటీ...

విజయవాడ : రాష్ట్ర పర్యాటక ప్రమోషన్ బోర్డుతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి అఖిల ప్రియ పాల్గొన్నారు. ఏపీ పర్యాటకంపై ప్రత్యేక తపాల బిళ్లలను సీఎం బాబు విడుదల చేశారు. 

పగిలిన మిషన్ భగీరథ పైపులైన్...

ఆదిలాబాద్ : ఇచ్చోడ (మం) కుమరం భీం చౌక్ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ పగిలింది. నీరంతా వృథాగా పోతోంది. దీనితో వాహనాలు నిలిచిపోయాయి. 

15:15 - August 24, 2018

తూర్పుగోదావరి : కో ఆర్డినేటర్లు, జాయింట్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ కన్వీనర్‌ పార్థసారధి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో జరుగుతున్న పార్టీ నిర్మాణ ప్రక్రియపై చర్చిస్తామన్నారు. జనసేన పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలనే దానిపై చర్చించనున్నట్లు పార్ధసారధి తెలిపారు. 

భారత్ కు రజతం...

హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో మహిళ కబడ్డీ విభాగంలో భారత్ కు రజత పతకం లభించింది. ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై 27-24 తేడాతో ఇరాన్ జట్టుపై గెలుపొందింది. 

లాలూ లొంగిపోవాలన్న కోర్టు...

బీహార్ : ఈ నెల 30వ తేదలోగా లాలూ ప్రసాద్ యాదవ్ కోర్టులో లొంగిపోవాలని జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ గడువు 3 నెలలు పొడిగించాలన్న లాలూ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దాణా స్కాం కేసులో లాలూ జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. 

14:19 - August 24, 2018

హైదరాబాద్‌ : నగర శివారులోని కొంగర్‌కలాన్‌లో సెప్టెంబర్‌ 2న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభ నిర్వహించే ప్రాంతాన్ని సీఎం కేసీఆర్‌ పర్యవేక్షించనున్నారు.

 

14:17 - August 24, 2018

రంగారెడ్డి : జిల్లాలోని గండిపేట సీబీఐటీ కాలేజ్‌ ముందు విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఫీజులు తగ్గించాలన్న డిమాండ్‌తో విద్యార్థులు చేపట్టిన ఆందోళన నాలుగవరోజుకు చేరుకుంది. కాలేజీ ఆవరణలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఏ కేటగిరీ విద్యార్థులకు మాత్రమే ఫీజులు తగ్గించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.   విద్యార్థులను మేనేజ్‌మెంట్‌ బెదిరిస్తోందని ఆరోపిస్తున్నారు. వీరి ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్ధతు తెలిపాయి. మీడియాను కాలేజీ యాజమాన్యం లోనికి అనుమతించలేదు. అంతేకాకుండా ఓ విద్యార్థినిపై కాలేజీ యాజమాన్యం చేయి చేసుకోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

14:16 - August 24, 2018

నెల్లూరు : నాయుడుపేట విషాదం చోటు చేసుకుంది. గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థి శివప్రతాప్‌ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివప్రతాప్‌ సరిగా చదవడంలేదంటూ నాలుగురోజుల క్రితం ఉపాధ్యాయులు ఇంటికి పంపించారు. తిరిగి నిన్న సాయంత్రం పాఠశాలకు వచ్చిన శివ ప్రతాప్‌ ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

14:11 - August 24, 2018

హైదరాబాద్‌ : బాలానగర్‌లో టీచర్‌ యూకేజీ స్టూడెంట్‌ని చితక బాదింది. దీంతో చిన్నారి చేతిపై గాయాలయ్యాయి. బాలానగర్‌లోని టాలెంట్‌ స్కూల్‌లో సునీత మ్యాథ్స్ టీచర్ గా పని చేస్తోంది. పాఠాలు చెబుతున్నప్పుడు బ్లాక్ బోర్డు వైపు చూడలేదని రత్నవర్దన్‌ అనే యూకేజీ స్టూడెంట్ కుడి, ఎడమ భజాలతోపాటు రెండు చేతులపై చితకబాదింది. బాలానగర్‌ పీఎస్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. టీచర్, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేర్ ఆండ్ చిల్డ్రన్ ప్రొటెక్ట్ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. టీచర్‌, పాఠశాలపై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేస్తున్నారు. టీచర్ ను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

13:56 - August 24, 2018

విజయవాడ : కౌన్సిలర్‌గా గెలవలేని బీజేపీ నేతలు కూడా మాట్లాడ్డం దురదృష్టకరమన్నారు మంత్రి నక్కా ఆనందబాబు. తగులబెట్టి మీదవేసి.. తుడిచుకోండి అన్నచందంగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి లబ్ది చేకూర్చేందుకే బీజేపీ నేతలు టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారంటున్న మంత్రి నక్కా ఆనందబాబుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

ఓఎన్జీసీ వెల్లో గ్యాస్ లీక్...

తూర్పుగోదావరి : మలికిపురం మండలం గొల్లపాలెంలో ఓఎన్జీసీ వెల్ నెంబర్ 11లో గ్యాస్ లీకేజీ అయ్యింది. ఓఎన్జీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. 

ఎంపీ కొత్తపల్లి గీత పార్టీ ఏర్పాటు...

విజయవాడ : మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భావం జరిగింది. 'జన జాగృతి' పేరిట పార్టీని ఎంపీ కొత్తపల్లి గీత ఏర్పాటు చేశారు. మార్పు కోసం ముందడుగు నినాదంతో ప్రజల్లోకి వెళ్లనుంది.  

విద్యార్థినిలకు హెల్త్ కిట్స్ పంపిణీ...

మెదక్ : సిద్దిపేట బాలికల పాఠశాలలో విద్యార్థినిలకు హెల్త్ కిట్స్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. విద్యార్థినిల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ మరో అద్భుతమైన పథకాన్ని ప్రారంభించారని, విద్యార్థినిలు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో హెల్త్ కిట్స్ పథకం అమలు చేయడం జరుగుతోందన్నారు. 

13:50 - August 24, 2018

హైదరాబాద్‌ : నగర శివారులోని కొంగర్‌కలాన్‌లో సెప్టెంబర్‌ 2న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో సభ నిర్వహించే ప్రాంతాన్ని సీఎం కేసీఆర్‌ పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సభకు ప్రజలు భారీగా తరలొస్తారని చెప్పారు.

 

ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి హాజరు కావాలి - కోడెల...

గుంటూరు : నాగార్జున సాగర్ కుడి కాల్వ నుండి త్వరలోనే వరి సాగుకు నీరందిస్తామని స్పీకర్ కోడెల వెల్లడించారు. సెప్టెంబర్ 6 నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, 10-15- రోజులు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి హాజరయితే ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. 

తిరుపతిలో ఇంకా లభించని బాలిక ఆచూకి...

చిత్తూరు : తిరుపతిలో నాలుగు రోజులైనా బాలిక ఆచూకి లభ్యం కాలేదు. బాలిక ఆచూకి కనుక్కోవడానికి పోలీసులు గాలిస్తున్నారు. ముగ్గురు యువకులను పోలీసులు విచారిస్తున్నారు. బీటీఆర్ కాలనీలో బాలిక మిస్సింగ్ అయిన సంగతి తెలిసిందే. 

అమరావతి బాండ్ల పేరిట అవినీతి - జీవీఎల్...

ప్రకాశం : అమరావతి బాండ్ల పేరిట అవినీతి జరిగిందని ఎంపీ జీవీఎల్ మరోసారి ఆరోపించారు. యనమల పంటి చికిత్సకు రూ. 3 లక్షలు ఖర్చు చేశారంటే ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుందో తెలుస్తోందన్నారు. ఏపీలో కాంగ్రెస్ వంచనే టిడిపి నడుస్తోందని, రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. 

13:43 - August 24, 2018

కృష్ణా : జిల్లాలో పాము కాట్ల కలకలం కొనసాగుతోంది. పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. బాపులపాడులో ఇంట్లో పుష్పవతి (56) నిద్రిస్తుండగా కిటికీలో నుంచి వచ్చిన పాము కాటేసింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పాము ఎలుకల కోసం వచ్చి కాటు వేసినట్లు తెలుస్తోంది. 14 రోజుల్లో పాముకాటు వల్ల ముగ్గురు మృతి చెందారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు గ్రామంలోని ప్రాథమిక వైద్య కేంద్రంలో వైద్యులు లేరు. మందుల కొరత ఉంది. ప్రాథమిక చికిత్స అందించి ఉంటే పుష్పవతి బతికేదని స్థానికులు అంటున్నారు. చేళ్లు ఏపుగా పెరగడం...ఎలుకల కోసం పాములు వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పంటకు పురుగుల మందు చల్లడంతో పాములు చనిపోయేవి. కానీ ఇటీవల పంటలకు పరుగు మందులు వాడకుండా ఎరువులతోటి సాగు చేస్తున్నారు. దీంతో పాములు విస్తృతంగా సంచరిస్తున్నట్లు చెబుతున్నారు.
22 వ తేదీన పాము కాటుకు ఇద్దరు మృతి
22 వ తేదీన పాము కాటుకు ఇద్దరు మృతి చెందారు. గన్నవరం మండలం అజ్జంపూడికి చెందిన దొడ్ల సంసోను అనే యువకుడికి పాము కాటేయడంతో ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో పొలంలో పని చేసుకుంటున్న రైతును విష సర్పం కాటేయడంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇలా వరుస ఘటనలు జరగడంతో ఇంటి నుండి బయటకు రావాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  

 

 

 

కాంగ్రెస్ పొత్తుపై చిన రాజప్ప స్పందన...

తూర్పుగోదావరి : కాంగ్రెస్ తో పొత్తు విషయంలో చిన రాజప్ప స్పందించారు. బీజేపీ - కాంగ్రెస్ కు సమాన దూరంలో ఉన్నామని, సీఎం చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. 

కేరళ సాయంపై యూఏఈ ప్రకటన...

ఢిల్లీ : కేరళకు రూ. 700 కోట్ల సాయం ప్రకటనను యూఏఈ ఖండించింది. కేరళ రాష్ట్రానికి నిర్దిష్టమైన సాయం చేస్తామని తాము ప్రకటించలేదని ప్రకటించింది. ఎంత సాయం అనేది ఇంకా నిర్ణయించలేదని, అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని యూఏఈ పేర్కొంది.

 

యూపీ సీఎం ఏరియల్ సర్వే...

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. లక్ష్మీపూర్ ఖేరీ జిల్లాలోని వరద ప్రాంతాల్లో ఆయన పరిశీలించారు. 

కేరళకు గుంటూరు అధికార యంత్రాంగం విరాళం...

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు గుంటూరు జిల్లా అధికార యంత్రాంగం విరాళాన్ని ప్రకటించింది. 30 రకాల వస్తువులతో 10500 ఫ్యామిలీ కిట్లు, 12వేల లీటర్ల పాలను సంగం డెయిరీ పంపించింది. 8 లారీల ఆహార సరుకులను సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల, మంత్రి ఆనంద బాబు పాల్గొన్నారు. 

కొంగర్ కలాన్ కేసీఆర్...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొంగరకలాన్ కు చేరుకున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన టీఆర్ఎస్ ప్రగతి నివేదిక సభను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 

13:17 - August 24, 2018

చిత్తూరు : జిల్లాలోని దారుణం జరిగింది. మద్యం తాగి వేధిస్తున్నాడని ఓ కూతురు తండ్రిని హత్య చేసింది. పుంగనూరు మండలం మేలుపట్లలో షేక్‌ బాబు కుటుంబం నివాసముంటుంది. కూతురు నగీన డీఎడ్‌ చదువుతోంది. షేక్‌ బాబు నిత్యం మద్యం తాగి భార్య, కూతురు నగీనను వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేని నగీన... తండ్రి తలపై బండరాయితో కొట్టిచంపింది. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

13:00 - August 24, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి శోభ సందరించుకుంది. ఇవాళ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలకు భక్తులు పొటెత్తుతున్నారు. అన్ని ఆలయాలకు ఉదయం నుంచే మహిళలు భారీగా తరలివచ్చి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అన్ని అమ్మవారి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం శోభ నెలకొంది. నగరంలోని కొత్తపేట అష్టలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు
రెండో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. వరలక్ష్మిదేవి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

 

12:57 - August 24, 2018

హైదరాబాద్‌ : నగర శివారులోని కొంగర కలాన్‌లో సెప్టెంబర్‌ 2న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రగతి నివేదన సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో సభ నిర్వహించే ప్రాంతాన్ని సీఎం కేసీఆర్‌ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. 
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది : మధు
బహిరంగ సభ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని టీఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. 1600 ఎకరాల్లో సభ ఏర్పాట్లు అవుతున్నాయని చెప్పారు. కొన్ని వేల బస్సుల్లో వేలలో ప్రజలు తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 119 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, ప్రజలు తరలివస్తారని చెప్పారు. 20 వేల నుంచి 30వేల మందిని సమీకరించాలని పిలుపునిచ్చారని తెలిపారు. ఎన్నికలు అనేది తమకు ఇష్యూ కాదన్నారు. 

12:49 - August 24, 2018

గుంటూరు : ఈనెల 28 తర్వాత ఏపీ కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈసారి కేబినెట్‌ విస్తరణలో మైనార్టీలకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో మైనార్టీలకు స్థానం కల్పిస్తామని గతంలో చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పడంతో ఈసారి ఖచ్చితంగా మైనారిటీలకు ఛాన్స్‌ దక్కే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్‌కు దాదాపు కెబినెట్‌లో బెర్త్‌ ఖరారైనట్లు తెలిసింది. ఈ అంశంపై ఇప్పటికే గవర్నర్‌ నరసింహన్‌తో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. 

 

12:43 - August 24, 2018

విజయవాడ : రెండో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీ దేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. వరలక్ష్మిదేవి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని వీడియోలో చూద్దాం... 

పదో తరగతి స్టూడెంట్ సూసైడ్...

నెల్లూరు : నాయుడుపేట గురుకుల పాఠశాల వసతి గృహంలో పదో తరగతి విద్యార్థి శివప్రతాప్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతని స్వస్థలం చిట్టమూరు (మం) తాడిపేడు. 

పాములు కాటేస్తున్నాయి..బాబోయ్...

కృష్ణా : జిల్లాలో పాము కాటుల భయం వెంటాడుతూనే ఉంది. 14 రోజుల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. బాపులపాడులో పాము కాటుతో మహిళ మృతి చెందింది. దీనితో ప్రజలు తీవ్రభయాందోళనలకు గురవుతున్నారు. 

12:08 - August 24, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి శోభ సందరించుకుంది. ఇవాళ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలకు భక్తులు పొటెత్తుతున్నారు. అన్ని ఆలయాలకు ఉదయం నుంచే మహిళలు భారీగా తరలివచ్చి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అన్ని అమ్మవారి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం శోభ నెలకొంది. నగరంలోని కొత్తపేట అష్టలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

తండ్రిని చంపేసిన కూతురు...

చిత్తూరు : నిత్యం తాగి వస్తూ వేధిస్తున్నాడని తండ్రి షేక్ బాబును కూతురు నగీన తలపై బండరాయితో మోది హత్య చేసింది. పుంగనూరు మండలం మేలుపట్లలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

విద్యార్థినిని కొట్టిన టీచర్..తల్లిదండ్రుల ఫిర్యాదు...

హైదరాబాద్ : చింతల్ బాలానగర్ ఎన్ఆర్ఐ టాలెంట్ స్కూల్ లో యూకేజీ విద్యార్థి రత్నవర్ధన్ ను టీచర్ సునీత కొట్టింది. బాలానగర్ పీఎస్ లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. టీచర్ పై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. 

నిధుల రాకుండా బీజేపీ అడ్డుకొంటోంది - పుల్లారావు...

విజయవాడ : రాష్ట్రానికి నిధులు రాకుండా బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని మంత్రి పుల్లారావు పేర్కొన్నారు. పీడీ అకౌంట్లను తప్పుగా చూపడం దుర్మార్గమని, టీడీపీ ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. 

అనంతలో యాక్సిడెంట్..మృతుల వివరాలు...

అనంతపురం : జిల్లాలోని పెనుకొండ మండలం సత్తారుపల్లి గ్రామం దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. గోపాల్‌రెడ్డి, అంజినప్ప, రవీంద్రారెడ్డి, వెంకటప్ప, వడ్డె అంజి, వెంకటస్వామిలు మృతి చెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. 

ఆంధ్రా బ్యాంకు మేనేజర్ కు జైలు శిక్ష...

విశాఖపట్టణం : ఓ లంచం కేసులో సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది. ఆంధ్రా బ్యాంకు మేనేజర్ అక్షయ్ కు ఏడాది పాటు జైలు శిక్ష విధించినట్లు తీర్పును వెలువరించింది. రైతు నుండి లంచం తీసుకుంటుండగా అక్షయ్ పట్టుబడ్డాడు. 

కేరళ ప్రభుత్వ వ్యాఖ్యలను ఖండించిన తమిళనాడు...

చెన్నై : కేరళ సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యలకు చెన్నై సీఎం పళనీ స్వామి స్పందించారు. ముళ్ల పెరియార్ డ్యామ్ నీటి విడుదల వల్లే వరదలు వచ్చాయని కేరళ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తమిళనాడు ఖండించింది. 

ఇటాలియన్ మహిళా డీజేకు అవమానం ?

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇటాలియన్ మహిళా డీజేకు అవమానం ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా సిబ్బంది చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

11:13 - August 24, 2018

రంగారెడ్డి : తెలంగాణా రాష్ట్ర సమితి  నిర్వహించనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు మొదలయ్యాయి. నగర శివారుల్లోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సభా ఏర్పాట్లను మంత్రులు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ప్రగతి నివేదన సభ జరిగే ప్రాంతం నుంచి వివరాలను వీడియోలో చూద్దాం...

 

ఆజాద్ వస్తున్నారు...

ఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆజాద్ హైదరాబాద్ కు శనివారం రానున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల స్కాంపై ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. 

మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు...

హైదరాబాద్ : మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసింది. నగదు, కారు, ల్యాప్ టాప్స్ లను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై గతంలో పలు పీఎస్ లలో కేసులు నమోదయినట్లు సమాచారం. 

సీఎం బంధువునంటూ హల్ చల్...

మధ్యప్రదేశ్ : తాను సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బంధువునంటూ ఓ కుటుంబం రోడ్డుపై హల్ చల్ చేసింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ట్రాఫిక్ పోలీసులు వారి కారును ఆపడంతో ఈ వివాదం చెలరేగింది. దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ ?

విజయవాడ : ఏపీ కేబినెట్ విస్తరణ జరుగబోతోందని ప్రచారం జరుగుతోంది. 28న గుంటూరులో మైనార్టీ సదస్సులో కేబినెట్ విస్తరణ ప్రకటనను సీఎం చంద్రబాబు నాయుడు చేయనున్నారని తెలుస్తోంది. కేబినెట్ లో మైనార్టీలకు అవకాశం కల్పించనున్నారని సమాచారం. గతంలో మైనార్టీలకే కేబినెట్ లో చోటు కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నో సార్లు చెప్పిన సంగతి తెలిసిందే. 

కర్నాటకలో డిఫెన్స్ మినిస్టర్...

కర్నాటక : డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కర్నాటకకు చేరుకున్నారు. కొడుగు ప్రాంతంలో కొండచరియలు విరిగి పడి...వరదలతో నష్టపోయిన వారిని ఆమె పరామర్శించారు. 

10:57 - August 24, 2018

రంగారెడ్డి : మానవత్వం మంటగలిసిపోతుంది. వావివరసలు లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రక్షించే తండ్రే భక్షించాడు. కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. కన్నతండ్రే కామాంధుడయ్యాడు. స్వంత కూతుళ్లపై కన్నేశాడు. జిల్లాలోని శంషాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. ఏడాదిగా ఇద్దరు కూతుళ్లపై తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. హైమద్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న తండ్రి రాజ్‌బహదూర్‌.. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తల్లి చెబుతోంది. దీనిపై ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

10:49 - August 24, 2018

రాజమండ్రి : గోదావరిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. కాగా.. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీవద్ద ప్రస్తుతం 12.50 అడుగుల మేర వరద ఉధృతి తగ్గింది.  11లక్షలా ఆరువేల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి కొనసాగుతోంది. గౌతమి, వశిష్ట,  వైనతేయ ఉపనదుల మధ్య, కోనసీమ లంక ప్రాంతాల్లో వరద క్రమేణా సాగుతోంది. 

 

10:44 - August 24, 2018

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలు అంటున్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యేలతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తమకు శ్రీరామరక్ష అన్నారు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

10:39 - August 24, 2018

హైదరాబాద్ : ఇవాళ మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌ విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలు, ప్రగతి నివేదనసభపై చర్చించనున్నారు. సమావేశం ముగిసిన వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్‌  సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధాని సహా కేంద్ర మంత్రులను సీఎం కలువనున్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థ, సచివాలయ నిర్మాణం, రెండు రహదారుల విస్తరణ కోసం రక్షణశాఖ భూములు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున గతంలోనే కోరారు. దీంతో పాటు వెనుకబడి జిల్లాల అభివృద్ధి నిధులు 450 కోట్లు, అదనపు ఎఫ్‌ఆర్‌బీఎం నిధుల విడుదల అంశాలను ప్రస్థావించనున్నారు. జోనల్‌ వ్యవస్థకు తక్షణం ఆమోదముద్ర వేయించే విషయంలో ప్రధాని చొరవ చూపాలని కేసీఆర్‌ కోరనున్నారు. 

 

'బాబును విమర్శించే స్థాయి వారికి లేదు'...

విజయవాడ : సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి బీజేపీ నాయకులకు లేదని మంత్రి ఆనందబాబు తెలిపారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని చూసి బీజేపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. 

నక్కిన ఉగ్రవాదులు..కాల్పులు...

జమ్మూ కాశ్మీర్ : అనంతనాగ్ లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఓ భవనంలో ముగ్గురు ఉగ్రవాదులు నక్కారు. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ ఉగ్రవాదిని భారత బలగాలు హతమార్చాయి. పౌరుడికి గాయాలు కాగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. 

ఇద్దరు కూతుళ్లపై తండ్రి అత్యాచారం...

రంగారెడ్డి : శంషాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు కూతుళ్లపై ఏడాదిగా తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఎయిర్ పోర్టు పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. నేపాల్ నుండి ఈ కుటుంబం ఇక్కడకు వచ్చింది. 

10:28 - August 24, 2018

హైదరాబాద్ : ఇవాళ శ్రావణ శుక్రవారం. తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మి శోభ సంతరించుకుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయాలకు భక్తులు పొటెత్తుతున్నారు. అన్ని ఆలయాలకు ఉదయం నుంచే మహిళలు భారీగా తరలివచ్చి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అన్ని అమ్మవారి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం శోభ నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

రోయింగ్ లో భారత్ కు స్వర్ణం..కాంస్యం...

ఢిల్లీ : ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. రోయింగ్ క్వాడ్రుపుల్ పురుషల స్కల్స్ లో భారత క్రీడాకారులు స్వర్ణ పతకం సాధించారు. మరోవైపు రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ లో భారత్ కు కాంస్య పతకం లభించింది. 

గోరగనముడిలో దారుణం

ప.గో : పాలకోడేరు మండలం గోరగనముడిలో దారుణం జరిగింది. భర్తను కత్తితో పొడిచి భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించారు. 

10:14 - August 24, 2018

హైదరాబాద్ : నేడు శ్రావణ శుక్రవారం. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నగరంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

ఇవాళ శ్రావణ శుక్రవారం..

హైదరాబాద్ : నేడు శ్రావణ శుక్రవారం. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నగరంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు.

10:02 - August 24, 2018

అనంతపురం : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఆరుగరు మృతి చెందారు. పెనుగొండ మండలం సత్తారుపల్లి వద్ద ఉదయం 7.30 సయమంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బొలెరో వాహనాలు ఢీ కొన్నాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఐదుమంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పెనుగొండ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని అనంతపురం లేదా బెంగళూరు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందా ? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:49 - August 24, 2018

కేరళకు యూఏఈ 700 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం సరికాదని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, బీజేపీ నేత రఘునందన్,  కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, టీఆర్ ఎస్ నేత రాకేష్ పాల్గొని, మాట్లాడారు. కేంద్రం కేరళకు అవసరమైన ఆర్థిక సాయం చేయకుండా సహాయం చేసేవారిని కూడా ఆపడం భావ్యం కాదన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి, ప్రచారంపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

09:44 - August 24, 2018

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఆగష్టు 29న ఛలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దశలవారీగా తమను క్రమబద్దీకరణ చేయాలని విద్యుత్‌ సంస్థల్లో దలారీ వ్యవస్థను రద్దు చేసి సంస్థ నేరుగా వేతనాలు చెల్లిచాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని తదితర డిమాండ్లతో గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనకు గల కారణాలు, వారి పట్ల ప్రభుత్వ వైఖరిపై ఇవాళ్టి జనపథంలో ఏపీ విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల ఐక్య వేదిక కన్వీనర్‌ బాలకాశి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

08:52 - August 24, 2018

పశ్చిమ బెంగాల్‌ : మిడ్నాపూర్‌ జిల్లాలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యాలయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో టిఎంసి కార్యకర్త ఒకరు మృతి చెందగా...మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి టిఎంసి కార్యాలయంలో ఫర్నీచర్, తదితర వస్తువులు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. ఉదయం 10 గంటలకు పేలుడు సంభవించిందని పోలీసులు చెప్పారు. టిఎంసి కార్యాలయంలో క్రూడ్‌ బాంబ్‌ పేలిందా...లేక గ్యాస్‌ సిలెండరా...అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  

 

08:50 - August 24, 2018

రాజస్థాన్ : నీటిలో సగానికిపైగా మునిగిపోయిన స్కూలు బస్సు నుంచి 50 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డ ఘటన రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దౌసా జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఓ గ్రామం నుంచి అండర్‌ పాస్‌ ద్వారా నగరానికి వెళ్లే దారిలో నీరు చేరింది. దీన్ని గుర్తించని డ్రైవర్‌ బస్సును నీటిలోకి తీసుకెళ్లాడు. బస్సు నీటిలో మునుగుతుందని గ్రహించిన విద్యార్థులు కిటికీల్లోంచి పైకి ఎక్కడంతో వారి ప్రాణాలకు ముప్పు తప్పింది. ఘటనా స్థలానికి భారీగా చేరుకున్న స్థానికులు ఓ గోడపై నుంచి తాడు వదిలినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఈతగాళ్లు నీళ్లలోకి దూకి పిల్లలను ఒడ్డుకు చేర్చారు. పిల్లలంతా సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

08:48 - August 24, 2018

ఢిల్లీ : ప్రముఖ జర్నలిస్ట్‌, బ్రిటన్‌ మాజీ హైకమిషనర్‌ కులదీప్‌ నయ్యర్‌ కన్నుమూశారు. 95ఏళ్ల నయ్యర్‌ అనారోగ్య సమస్యలతో దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కులదీప్‌ నయ్యర్‌ అంతిమ సంస్కారాలు నగరంలోని లోధి స్మశానవాటికలో జరుగుతాయని నయ్యర్‌ పెద్ద కుమారుడు సుధీర్‌ నయ్యర్‌ వెల్లడించారు.1923, ఆగస్టు 14న పాక్‌లోని సియోల్‌కోట్‌లో జన్మించిన కుల్‌దీప్‌ నయ్యర్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌, రచయితగా విశేష సేవలందించారు. 'బియాండ్ ‌ద లైన్స్', 'ఇండియా ఆఫ్టర్‌ నెహ్రూ' సహా తదితర ఎన్నో ప్రముఖ పుస్తకాలను రచించారు. మానవ హక్కుల కార్యకర్తగానూ పనిచేశారు. 1990లో బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌గా సేవలందించారు. 1997లో రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. కులదీప్‌ నయ్యర్‌ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. 

 

08:46 - August 24, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జర్మనీలోని హాంబర్గ్‌లో చేసిన ప్రసంగంపై బిజెపి మండిపడింది. 23 దేశాల ప్రతినిధుల ముందు రాహుల్‌ దేశాన్ని చులకన చేసి మాట్లాడారని బిజెపి అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర విమర్శించారు. ఎన్డీయే పాలనలో భారత్‌లో నిరుద్యోగం, అసమానతలు, మూక హత్యలు, దళితులపై దాడులు అధికమవుతున్నాయని రాహుల్‌ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల వల్లే ఐఎస్‌ఐఎస్‌ వంటివి ఏర్పడుతాయని చెప్పారు. మైనారిటీలకు ఉద్యోగాలు రాకపోతే ఐఎస్‌ఐఎస్‌ వైపు మళ్లుతారని చెప్పడం ద్వారా రాహుల్‌  భయోత్పాతం సృష్టిస్తున్నారని ... ఉగ్రవాదానికి ఊతమిచ్చే ఈ ప్రకటనపై రాహుల్‌ సమాధానం చెప్పాలని సంబిత్‌పాత్ర డిమాండ్ చేశారు.

 

08:26 - August 24, 2018

హైదరాబాద్ : సీబీఐటీ కాలేజీలో విద్యార్థులు కదం తొక్కారు. ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా కాలేజీ ఆవరణలో నిరసనకు దిగారు. మూడు రోజుల నుండి ఆందోళన చేస్తున్నా పట్టించుకోని కాలేజీ యాజమాన్యం.. తమపై భౌతిక దాడులకు దిగడంతో విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేశారు. 
రూ.86 వేలు అదనంగా చెల్లించాలన్న యాజమాన్యం
హైదరాబాద్‌లోని సీబీఐటీ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది. ఇంజనీరింగ్‌లో ఎ, బి కేటగిరి విద్యార్థులను టీఎఫ్ ఆర్సీ నిర్ణయించిన ఫీజుల కంటె ఒక్కో విద్యార్థి 86 వేల రూపాయలు అదనంగా చెల్లించాలంటూ యాజమాన్యం సర్క్యూలర్ జారీ చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పెంచిన ఫీజు కట్టేది లేదని స్పష్టం చేయడంతో ఈ నెల 31 వరకు యాజమాన్యం గడువు విధించింది. ఆ లోపు ఫీజు కట్టకపోతే పరీక్షలకు అనుమతి లేదని తెగేసి చెప్పింది. యాజమాన్యం నిర్ణయంతో విద్యార్థులు క్లాసులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. 
విద్యార్థులపై చేయి చేసుకున్న ప్రిన్సిపాల్‌ 
ఉదయం నుండి క్లాసులు బాయ్‌కాట్‌ చేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కాలేజీ ప్రిన్సిపాల్‌ చేయి చేసుకోవడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన ఉధృతం చేశారు. కోర్టులో ఫీజులు పెంచుకునే వెసులుబాటు ఇచ్చారని అందుకే కాలేజీ యాజమాన్యం ఫీజులు పెంచిందని పోలీసులు అంటున్నారు. మరోవైపు పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీని పోలీసు అకాడమీగా మార్చేస్తున్నారని.. న్యాయం అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. 
ఆందోళన చేస్తున్న విద్యార్థులను టార్గెట్‌ చేస్తున్నారు : విద్యార్థులు
ఫీజుల భారం మోయలేమంటూ ఆందోళన చేస్తున్న విద్యార్థులను టార్గెట్‌ చేసి డిటైన్‌ చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మీడియాతో మాట్లాడినా కాలేజీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడలేదన్న పోలీసులు  
విద్యార్థులపై ఎలాంటి భౌతిక దాడులకు పాల్పడలేదని... కేవలం డిటైన్‌ అయిన విద్యార్థులే కావాలని ఆందోళన చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. 
ఫీజుల పెంపు తగ్గించే వరకు ఆందోళన
ఫీజుల పెంపు తగ్గించే వరకు ఆందోళన ఆపేది లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెంచిన ఫీజు కట్టేదిలేదని...పాత ఫీజులనే కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 

 

రెండు మినీ వాహనాలు ఢీ..ఆరుగురి మృతి

అనంతపురం : జిల్లాలో రెండు మినీ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయలయ్యాయి. పెనుకొండ మండలం సత్తూరుపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది.   

హయత్ నగర్ లోని వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ : హయత్ నగర్ లోని ఓ వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది.  భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. 

జమ్మూకాశ్మీర్ లో ఎదురుకాల్పులు

జమ్మూకాశ్మీర్ : అనంతనాగ్ లో ఎదురుకాల్పులు జరిగాయి. ఓ భవనంలో ముగ్గురు ఉగ్రవాదులు నక్కారు. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. 

నేడు 244 వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర

విశాఖ : నేడు 244 వ రోజు జగన్ ప్రజా సంకల్పయాత్ర జరుగనుంది. ఇవాళ యలమంచిలి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర చేయనున్నారు. 

 

07:46 - August 24, 2018

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరదలు మాత్రం వదల్లేదు. వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పంటలను వరద నీరు ముంచేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలతో పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
గోదావరి ఉధృతి  
పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి ఉధృతి కొనసాగుతోంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నిడదవోలులోని అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. రెండు రోజులుగా నిడదవోలు తాడేపల్లి గూడెం రహదారిని పూర్తిగా మూసివేశారు. వేల ఎకరాల్లో పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదల వల్ల నష్టపోయిన పంటలకు హెక్టారుకు 25వేల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి రైతులను ఆదుకుంటుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నెల రోజుల పాటు రేషన్‌, నిత్యావసర సరుకులు అందజేస్తామన్నారు. 
గోదావరిలో రెండో ప్రమాద హెచ్చరిక 
గోదావరిలో వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర బుధవారం 14.80 అడుగుల నీటి మట్టం నమోదైంది. కాగా.. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారిజీ నుంచి 14 లక్షల 55 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరిలో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది.  
జలదిగ్బంధంలోనే లంక గ్రామాలు 
గోదావరి వరద ఉధృతితో తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామాలు నాలుగు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.  ప్రస్తుతం ఇళ్ళల్లోకి నీరు చేరడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరి నదికి ఇంకా వరద ఉధృతి కొనసాగుతుండడంతో ధవళేశ్వరం వద్ద నది నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. 14 లక్షల 79 వేల క్యూసెక్కుల నీటిని  సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల 
జూరాల నుంచి వరద ఉధృతి పెరుగుతుండటంతో శ్రీశైలం జలాశయం 8 గేట్లు ఎత్తి సాగర్‌కు నీటిని విడుదల చేశారు. వరద నీరు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత నీటి మట్టం 883.30 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిలువ 206.0068 టీఎంసీలుగా ఉంది. 
ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి తగ్గుముఖం 
భారీ వర్షాలు.. వరదతో జలకళను సంతరించుకున్న ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి కాస్త తగ్గుముఖం పట్టింది. ఎగువ ప్రాంతాల నుండి బ్యారేజీకి 75 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా 64 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 
భారీ వర్షాలతో అన్నదాతలకు అపార నష్టం
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు అన్నదాతను అపార నష్టాన్ని మిగిల్చాయి. జిల్లా వ్యాప్తంగా 1.23 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిళ్లింది. వేల ఎకరాల్లో పంట భూములు కోతకు గురికావడంతో పాటు ఇసుక మేటలు వేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపాడ్‌ మండలంలోని అధికారులు వరద నష్టంపై సమీక్షించారు. నీట మునిగిన పంట, రహదారుల సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
జూరాల ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మ పరవళ్లు  
జూరాల ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ కురుస్తున్న  వర్షం నీరు ప్రాజెక్టుకు చేరుకోవడంతో నిండుకుండలా మారింది. పూర్తిస్తాయి నీటి మట్టం 318.51 టీఎంసీలు కాగా ప్రస్తుత స్థాయి నీటి మట్టం 317.600లుగా ఉంది. 

 

07:33 - August 24, 2018

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి సహచరుల మంత్రులతో జరిపిన మంత్రివర్గ ఇష్టాగోష్టిలో ఏం ఉపదేశం చేశారు? వచ్చే ఎన్నికల్లోనూ అధికారం కైవసం చేసుకోవాలంటే టీఆర్‌ఎస్‌ ఏం చేయబోతోంది ? ఎన్నికల్లో గెలవడానికి టీఆర్‌ఎస్‌ అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలేంటి? రాష్ట్రంలో బలపడుతున్న ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడానికి ఏం చేయబోతోంది? ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను నిలువరించడానికి ఎలాంటి వ్యూహాలు ఖరారు చేయబోతోంది?. వాచ్‌ దిస్‌ 10టీవీ స్పెషల్‌ స్టోరీ..
మంత్రులకు ఎన్నికలపై కేసీఆర్‌ దిశానిర్దేశం
బుధవారం జరిగిన తెలంగాణ మంత్రివర్గ ఇష్టాగోష్టిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలు,  ప్రగతి నివేదన సభపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఏం చేయాలన్నదానిపై వారికి ఓ స్పష్టత ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా... వాటిని ఎదుర్కొని పవర్‌లోకి రావడమే ముఖ్యమని హితబోధ చేశారు. ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా సరే ప్రజలు తలచుకుంటే ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం ఖాయమని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ అందుకు మినహాయింపు కాబోదననే అంశంపై ఆయన సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ముందస్తుకు పోయినా.. సకాలంలో ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌కు పెద్దగా ప్రయోజనం లేదని.. ముందుగా పోవడం వలన టీఆర్‌ఎస్‌ ఒంటరిగానే విజయం సాధించిందని చెప్పడంతోపాటు కేంద్రంపై ఉన్న వ్యతిరేకతను తప్పించుకోవచ్చని తెలిపారు.   తెలంగాణలో ముస్లింల జనాభా గణనీయంగా ఉన్నందున ఇది సానుకూలంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంట్‌కు వేరే పార్టీకి ఓటు వేయలేరని, అక్కడి అభివృద్ధి అంశాలు గుర్తుకు వస్తాయని స్పష్టం చేశారు. అందుకే రెండు రకాలుగా ప్రయోజనం చేకూరుతుందని మంత్రివర్గ సహచరులకు కేసీఆర్‌ వివరించారు.
శాఖల వారీగా సమాచారం తెలుసుకున్న సీఎం
ఒకవైపు మంత్రులతో శాఖలవారీగా సమాచారం తెలుసుకుంటూనే... మరోవైపు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, జిల్లాల వారీగా కూడా చర్చించారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా ఉన్నప్పటి రాజకీయ పరిణామాలు, కొత్త జిల్లాల తర్వాత పరిస్థితిపై వివరంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. జిల్లాల ప్రాతిపదికలో కాస్తా ఇబ్బందులు వచ్చినప్పటికీ.. వాటన్నింటినీ జోనల్‌ విధానంతో సద్దుమణిగేలా చూస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తనతో చాలా మంది ఉద్యోగులు, ప్రజా, కుల సంఘాల నేతలు వివిధ దశల్లో కలిసి పనిచేశారని.. వారందరినీ తాను కలవలేకపోయానని గుర్తు చేశారు. జిల్లాల పర్యటనల సందర్భంగా మంత్రులంతా వారిని కలుపుకొని పోవాలని ఆదేశించారు.
అధిక నిధులు ఖర్చు చేశాం: కేసీఆర్‌
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యధికంగా నిధులు ఖర్చు చేశామని, అనేక సంక్షేమ - అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టామన్నారు.  అన్ని వర్గాలను ఏదో ఒక కోణంలో సంతృప్తి పర్చామన్నారు. బీసీలకు, ఎస్సీలకు ఇతరులకు కూడా సబ్సిడీ రుణాలు ఇస్తున్నామని.. రైతులకు బీమాను అమలుచేస్తోంది తెలంగాణ ఒక్కటేనని గుర్తు చేశారు. అనేక కార్యక్రమాలు చేపట్టినా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం ప్రభుత్వానికి మైనస్‌ అవుతుందని స్పష్టం చేశారు.  పార్టీకి క్షేత్రస్థాయి నిర్మాణం, కమిటీ లేకపోవడం కారణమన్నారు. వీటిని కవర్‌ చేయాలంటే మంత్రులు కిందిస్థాయి కార్యకర్తలను కలిసే కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను వివరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రగతినివేదన సభ ఒక్కటేకాదు.. ఈ ఆరు నెలలూ ప్రభుత్వానికి చాలా కీలకమన్నారు. 
మేకపోతు గాంభీర్యమేనా ? 
మొత్తానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వంద స్థానాలు మావే అంటూ ఢంకా బజాయించే ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించిన అంశాలను బట్టి చూస్తే అంతా మేకపోతు గాంభీర్యమేనని తెలుస్తోంది. పైకి అంతా సేఫ్‌ అనుకున్నా.... ప్రతిపక్షాలు పుంజుకుంటున్నాయన్న భయం మాత్రం వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ, నోట్లరద్దు ఇంఫాక్ట్‌ భరించకతప్పదనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

 

07:22 - August 24, 2018

రంగారెడ్డి : వచ్చే నెల 2వ తేదీన రంగారెడ్డి జిల్లా ఇంబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో నిర్వహించే బహిరంగ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రగతి నివేదికను ఈ సభలో విడుదల చేస్తారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతోనే ఈ సభ నిర్వహిస్తున్నామంటున్న రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 
 

 

07:18 - August 24, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ విస్తృత సమావేశం ముగిసిన వెంటనే తెలంగాణ సీఎం కేసీఆర్‌  సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధాని సహా కేంద్ర మంత్రులను సీఎం కలువనున్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థ, సచివాలయ నిర్మాణం, రెండు రహదారుల విస్తరణ కోసం రక్షణశాఖ భూములు ఇవ్వాలని ప్రభుత్వం తరఫున గతంలోనే కోరారు. దీంతో పాటు వెనుకబడి జిల్లాల అభివృద్ధి నిధులు 450 కోట్లు, అదనపు ఎఫ్‌ఆర్‌బీఎం నిధుల విడుదల అంశాలను ప్రస్థావించనున్నారు. జోనల్‌ వ్యవస్థకు తక్షణం ఆమోదముద్ర వేయించే విషయంలో ప్రధాని చొరవ చూపాలని కేసీఆర్‌ కోరనున్నారు. 

07:15 - August 24, 2018

హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. ముందస్తు ఎన్నికలపై అన్ని పార్టీల్లోనూ చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో అధికారపార్టీ మరో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ఇవాళ జరుగనుంది. సెప్టెంబర్‌ 2న నిర్వహించే ప్రగతి నివేదన సభపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
భారీ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ సిద్ధం
ముందస్తు ఎన్నికల ఊహాగానాలపై తీవ్ర చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ బహిరంగ సభ నిర్వహణకు సిద్ధమవుతున్నారు. బహిరంగ సభకు 25 లక్షల మంది జనాన్ని తరలించి తమ బలాన్ని తెలియజెప్పాలని అధికారపార్టీ భావిస్తోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించే బహిరంగ సభకు బదులుగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో మరింత భారీగా నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లోనే ఎన్నికల అంశం రాజకీయంగా హాట్‌టాఫిక్‌గా మారింది. పొలిటికల్‌ హీట్‌ పెంచేందుకు గులాబీబాస్‌ భారీ సభను నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం అధికారపార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
ముందస్తు ఎన్నికలు, ప్రగతి నివేదన సభపై చర్చ
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం తెలంగాణ భవన్‌లో జరుగనుంది. ముందస్తు ఎన్నికలు, ప్రగతి నివేదన సభ ఏర్పాట్లపై ఇందులో పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ముందస్తుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని టీఆర్‌ఎస్‌ శ్రేణులు భావిస్తున్నాయి.  డిసెంబర్ 15వ తేదీలోపు ఎన్నికలు జరుగనున్నాయని... ఇందుకు పూర్తిస్థాయిలో సిద్ధంకావాలని శ్రేణులకు కేసీఆర్‌ దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం 
ప్రగతి నివేదన సభ నిర్వహణపైనా కేసీఆర్‌ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. గురువారం నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టాలన్న కేసీఆర్‌.. వాటిని వేగవంతంగా పూర్తిచేయాలని సూచించే అవకాశముంది. భారత దేశంలోనే ఇంతకు ముందెప్పుడూ నిర్వహించని విధంగా ప్రగతి నివేదన సభ నిర్వహించాలని... ఇందుకు జనసమీకరణపై దృష్టి సారించేలా ఆదేశాలు ఇవ్వనున్నారు. మొత్తానికి రాష్ట్రంలో రాజుకున్న ముందస్తు వేడితో... ఇవాళ జరిగే టీఆర్‌ఎస్‌ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశం ముగిస్తేకానీ... ముందస్తుపై ఓ అంచనా అందరిలో రానుంది.

 

నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ : నేడు సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. పెండింగ్‌ అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. 

నేడు టీఆర్ ఎస్ విస్తృతస్థాయి సమావేశం

 హైదరాబాద్ : నేడు టీఆర్ ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం తెలంగాణ భవన్‌లో జరుగనుంది. ముందస్తు ఎన్నికలు, ప్రగతి నివేదన సభ ఏర్పాట్లపై ఇందులో పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ముందస్తుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముందని టీఆర్‌ఎస్‌ శ్రేణులు భావిస్తున్నాయి.  డిసెంబర్ 15వ తేదీలోపు ఎన్నికలు జరుగనున్నాయని... ఇందుకు పూర్తిస్థాయిలో సిద్ధంకావాలని శ్రేణులకు కేసీఆర్‌ దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

నేడు మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భావం

విజయవాడ : నేడు మరో ప్రాంతీయ పార్టీ ఆవిర్భావం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఎంపీ కొత్తపల్లి గీత కొత్త పార్టీని ప్రకటించనుంది.

 

నేడు టీఆర్ ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం

హైదరాబాద్ : నేడు టీఆర్ ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. 

 

నేడు, రేపు సీపీఐ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు

హైదరాబాద్ : నేడు, రేపు సీపీఐ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు జరుగనున్నాయి. జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ ముఖ్య అతిథిగా హాజరుకున్నారు. 

 

Don't Miss